punjab
-
By Election Results: యూపీ ఉప ఎన్నికల్లో బీజేపీదే హవా
న్యూఢిల్లీ: దేశంలోని 15 రాష్ట్రాల్లోని 48 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు శనివారం(నవంబర్23) వెలువడ్డాయి. మహారాష్ట్రలో ఒక ఎంపీ సీటు, కేరళలోని వయనాడ్ ఎంపీ సీటుకు ఉప ఎన్నికలు జరగ్గా వయనాడ్‌ను కాంగ్రెస్ గెలుచుకుంది. ఇక్కడ కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ఆ పార్టీ అగ్రనేత ప్రియాంకగాంధీ 4లక్షలకుపైగా రికార్డు మెజారిటీ సాధించారు. మహారాష్ట్రలోని నాందేడ్ ఎంపీ సీటును బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. ఉత్తరప్రదేశ్..48 సీట్లలో యూపీలో కీలకమైన 9 సీట్లున్నాయి. యూపీలో ఆరు అసెంబ్లీ స్థానాలను బీజేపీ తన ఖాతాలో వేసుకోగా రెండు చోట్ల సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) గెలిచింది. వెస్ట్‌బెంగాల్..వెస్ట్‌బెంగాల్‌లో ఆరు అసెంబ్లీ సీట్లకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార టీఎంసీ మళ్లీ సత్తా చాటింది. ఇక్కడ ఆరింటికి ఆరు స్థానాలను మమతా బెనర్జీ పార్టీ కైవసం చేసుకుంది. బీహార్..బీహార్‌లో నాలుగు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో ఎన్డీయే క్లీన్ స్వీప్ చేసింది.ఇక్కడ తరారీ (బీజేపీ ), రామ్‌గఢ్ (బీజేపీ), బేలాగంజ్ (జేడీయూ), ఇమామ్‌గంజ్ (హెచ్ఏఎం(ఎస్))రాజస్థాన్..రాజస్థాన్‌లో ఉప ఎన్నికలు జరిగిన 7 అసెంబ్లీ సీట్లలో బీజేపీ 5 గెలుచుకుంది. ఒక సీటులో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండగా భారత్ ఆదివాసీ పార్టీ(బీఏడీవీపీ) ఒక సీటు గెలుచుకుంది. కర్ణాటక..కర్ణాటకలోని 3 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో మూడింటిని అధికార కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. కర్ణాటకలోకి శిగ్గావ్ ఉప ఎన్నికలో మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై తనయుడు భరత్ బొమ్మై ఓటమి13 వేలకుపైగా ఓట్లతో బొమ్మైపై గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి యాసిర్ అహ్మద్ ఖాన్ పఠాన్పంజాబ్.. పంజాబ్‌లో మొత్తం నాలుగు స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా మూడింటిలో ఆమ్ఆద్మీపార్టీ, ఒక సీటులో కాంగ్రెస్ పార్టీ గెలుపొందాయి. కేరళ..కేరళలో రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నకలు జరగగా ఒక చోట అధికార సీపీఎం మరొకచోట కాంగ్రెస్ విజయం సాధించాయి. 4 లక్షల రికార్డు మెజారిటీతో గెలిచిన ప్రియాంక గాంధీ 👉కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ మరోసారి భారీ విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకా గాంధీ సీపీఐ అభ్యర్థి సత్యన్ మొకేరిపై 4లక్షల 10 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గతంలో రాహుల్‌గాంధీ ఇదే స్థానం నుంచి 3,64,422 ఓట్ల ఆధిక్యత సాధించారు. 👉కేరళలోని పాలక్కాడ్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ మమ్కూతిల్ 18,840 ఓట్ల భారీ తేడాతో బీజేపీ అభ్యర్థి సి కృష్ణకుమార్‌పై విజయం సాధించారు.అస్సాం.. అస్సాంలోని నాలుగు అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికలు జరగగా నాలుగింటిలో రెండింటిని అధికార బీజేపీ ఒకటి కాంగ్రెస్ ఒకటి ఏజీపీ గెలుచుకున్నాయి. సిక్కిం..సిక్కింలోని రెండు అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నిక జరగగా రెండు సీట్లలో ఎస్కేఎం గెలుపొందింది. గుజరాత్..గుజరాత్లో ఒక అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నిక జరగగా ఒక్క సీటులో బీజేపీ గెలుపొందింది. చత్తీస్‌గఢ్..ఛత్తీస్‌గఢ్‌లో ఒక అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నిక జరగగా దానిని బీజేపీ గెలుచుకుంది.ఉత్తరాఖండ్..ఉత్తరాఖండ్‌లోని కేదార్నాథ్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగగా ఇక్కడ బీజేపీ గెలుపొందింది. మేఘాలయ..మేఘాలయాలోని ఒక అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నిక జరగగా ఈ సీటును ఎన్పీపీ పార్టీ తన ఖాతాలో వేసుకుంది.ఇది కూడా చదవండి: Jharkhand Election Result: ఇంటర్నెట్ సేవలు నిలిపివేయాలి: జేఎంఎం -
ఒక్కరోజులో భారీగా పంట వ్యర్థాల కాల్చివేత.. మరింతగా పెరిగిన కాలుష్యం
చండీగఢ్: పంజాబ్‌లో ఆదివారం ఒక్కరోజున 400కి పైగా పంట వ్యర్థాలు తగులబెట్టిన సంఘటనలు నమోదయ్యాయి. ఈ సీజన్లో రాష్ట్రంలో తరహా కేసుల సంఖ్య 8,404కి చేరుకుంది. రిమోట్ సెన్సింగ్ డేటా సాయంతో ఈ సమాచారం వెలుగులోకి వచ్చింది.పంజాబ్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అధికారులు మీడియాతో మాట్లాడుతూ కొత్తగా 404 వరకూ పంట వ్యర్థాలు తగులబెట్టిన ఘటనలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. వాటిలో ఫిరోజ్పూర్లో 74, భటిండాలో 70, ముక్త్సర్లో 56, మోగాలో 45, ఫరీద్‌కోట్‌లో 30 ఘటనలు ఉన్నాయన్నారు. ఫిరోజ్‌లో అత్యధికంగా పంటవ్యర్థాలను తగులబెట్టిన ఘటనలు చోటుచేసుకున్నాయి. కాగా పంజాబ్‌లో 2022లో ఒకేరోజులో 966, 2023లో 1155 పంట వ్యర్థాలు తగులబెట్టిన కేసులు నమోదయ్యాయి.కాగా గత సెప్టెంబరు 15 నుండి నవంబర్ 17 వరకు పంజాబ్‌లో 8,404 పంటవ్యర్థాలు తగులబెట్టారు. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇటువంటి సంఘటనలలో 75 శాతం తగ్గుదల కనిపించింది. పంజాబ్, హర్యానాలలో అక్టోబర్, నవంబర్లలో వరి పంట కోసిన తర్వాత భారీ ఎత్తున పంట వ్యర్థాలు తగులబెడుతుంటారు. ఇదిలో ఢిల్లీలో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వాయు కాలుష్యం పెరగడానికి కారణంగా నిలుస్తోంది.ఇది కూడా చదవండి: మంచు కురిసే వేళలో.. మూడింతలైన కశ్మీర్ అందాలు -
శిరోమణి అకాలీదళ్ అధ్యక్ష పదవికి సుఖ్బీర్ సింగ్ రాజీనామా
చండీగఢ్: శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని పార్టీ అధికార ప్రతినిధి, పంజాబ్ మాజీ విద్యాశాఖ మంత్రి దల్జిత్ ఎస్ చీమా ఎక్స్ ద్వారా వెల్లడించారు. ‘శిరోమణి అకాలీదళ్ అధక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ నేడు పార్టీ వర్కింగ్ కమిటీకి తన రాజీనామాను సమర్పించారని, పార్టీకి కొత్త అధ్యక్షుడిని అందించేందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఇన్నాళ్లు తన నాయకత్వంపై విశ్వాసం ఉంచినందుకు, తనకు మద్దతు, సహాకారాన్ని అందించినందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ సుఖ్బీర్ సింగ్ బాదల్ కృతజ్ఞతలు తెలిపారు.ఇక తదుపరి కార్యాచరణను నిర్ణయించేందుకు అకాలీదళ్ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు బల్వీందర్ సింగ్ భుందార్ సోమవారం అత్యవసర సమావేశం ఏర్పాటుకు పిలుపునిచ్చారు. చండీగఢ్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు భేటీ జరగనుం. కాగా అకాలీదళ్ అధ్యక్ష పదవి, ఆఫీస్ బేరర్లు, కార్యవర్గానికి డిసెంబర్ 14న ఎన్నికలు జరగనున్నాయి. -
కెనడాలో ఖలిస్థానీ ఉగ్రవాది అర్ష్‌దీప్ దల్లా అరెస్ట్!
ఢిల్లీ: ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జార్ సహాయకుడు అర్ష్‌దీప్ దల్లాను కెనడాలో అదుపులోకి తీసుకున్నట్లు సంబంధిత పోలీసు వర్గాలు వెల్లడించాయి.అయితే.. అతను విడుదలయ్యాడా లేదా ఇంకా జైలులో ఉన్నాడా? అనే దానిపై ఎటువంటి సమాచారం తెలియజేయలేదు. ప్రస్తుతం కెనడాతో దౌత్యపరమైన సంబంధాలు క్షీణించిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఎటువంటి సమాచారం పంచుకోకపోవటం గమనార్హం. అతని నిర్బంధంపై అధికారిక ధృవీకరించలేదు. అక్టోబర్ 27-28 తేదీలలో కెనడాలో జరిగిన కాల్పుల తర్వాత డల్లాను అదుపులోకి తీసుకున్నారు. కెనడియన్ ఏజెన్సీల ప్రకారం.. మిల్టన్‌లో జరిగిన కాల్పులపై హాల్టన్ ప్రాంతీయ పోలీసు సర్వీస్ (HRPS) దర్యాప్తు చేస్తోంది. ఈ ఘటనపై హెచ్ఆర్పీఎస్.. గల్ఫ్ పోలీసులను సంప్రదించారు. ఆ రోజు కాల్పుల్లో ఇద్దరు గాయపడి ఆస్పత్రిలో చేరారని, అందులో ఒకరికి డాక్టర్లు చికిత్స అందించి అనంతరం పంపించి వేశారని తెలిపారు.మరోవైపు.. 28 ఏళ్ల డల్లా తన భార్యతో కలిసి కెనడాలోని సర్రేలో నివసిస్తున్నట్లు భారత భద్రతా సంస్థల వర్గాలు తెలిపాయి. అతనికి దోపిడీ, హత్య, తీవ్రవాద సంబంధిత కార్యకలాపాలకు సంబంధించిన అనేక కేసుల్లో ప్రమేయం ఉందని తెలిపారు. అదీకాక.. అతనిపై UAPA కింద కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. అతడిపై ఇప్పటికే పంజాబ్ పోలీసులు లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. పంజాబ్‌లోని జాగ్రావ్‌కు చెందిన ఎలక్ట్రీషియన్ పరమజీత్ సింగ్ హత్యకు డల్లా బాధ్యత వహించాడు. డేరా సచ్చా సౌదా అనుచరుడు మనోహర్ లాల్‌ను అతని సహచరులు నవంబర్ 2020లో కాల్చి హత్య చేశారు. మరో డేరా సచ్చా సౌదా అనుచరుడైన శక్తి సింగ్‌ను కిడ్నాప్ చేసి చంపడానికి కుట్ర పన్నడంలో డల్లా ప్రమేయం ఉందని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో భారత్ డల్లాను మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్స్ జాబితాలో చేర్చింది.#BreakingNews: Wanted Khalistani terrorist Arsh Dalla arrested in Canada@arvindojha joins us for more on this #ArshDalla #Canada #Khalistani (@ahuja_harshit94) pic.twitter.com/pWset1mtnh— IndiaToday (@IndiaToday) November 10, 2024 క్రెడిట్స్: IndiaTodayచదవండి: వివాదంలో బ్రిటన్ ప్రధాని.. భారతీయులకు క్షమాపణలు చెబుతారా? -
బిల్డింగ్ కట్టిన కాంట్రాక్టర్‌కు కోటి రూపాయల వాచ్ గిఫ్ట్
పంజాబ్‌లో నివాస భవనాన్ని నిర్మించిన కాంట్రాక్టర్‌కు కోటి రూపాయల విలువైన రోలెక్స్ వాచ్‌ను బహుమతిగా ఇచ్చాడో వ్యాపారవేత్త. నాణ్యతగా, వేగవంతంగా నిర్మాణాన్ని పూర్తి చేయడంతలో కాంట్రాక్టర్ రాజిందర్ సింగ్ రూప్రా చూపిన ఖచ్చితమైన శ్రద్ధను గుర్తిస్తూ ఆయనకు ఈ బహుమతి అందించినట్లు భవన యజమాని గుర్దీప్ దేవ్‌బత్ చెప్పారు.కాంట్రాక్టర్ రాజిందర్ సింగ్ రూప్రా అందుకున్న ఈ వాచ్ 18-క్యారెట్ల బంగారంతో రూపొందించిన రోలెక్స్ ఓస్టెర్ పెర్పెచ్యువల్ స్కై-డ్వెల్లర్. చూడగానే బంగారు కాంతులతో ధగాధగా మెరిసిపోతున్న ఈ వాచ్‌కి బలమైన బంగారు లింక్‌లతో తయారైన సిగ్నేచర్ ఓస్టెర్ బ్రాస్లెట్ ఉంది. అలాగే ఇందులో షాంపైన్-రంగు డయల్ కూడా ఉంది.200 మందికిపైగా కార్మికులుపంజాబ్లోని జిరాక్పూర్ సమీపంలో 9 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన భవనం విషయానికి వస్తే ఇది ఆధునిక కోటను పోలి ఉంటుంది. పంజాబ్‌లోని షాకోట్‌కు చెందిన రూప్రా అనే కాంట్రాక్టర్ అనుకున్న ప్రకారం రెండు సంవత్సరాల వ్యవధిలో 200 మందికి పైగా కార్మికులతో నిరంతరం పనులు చేసి నిర్మాణం పూర్తి చేశారు.వాస్తుశిల్పి రంజోద్ సింగ్ భవనం డిజైన్‌ను రూపొందించారు. దృఢమైన సరిహద్దు గోడతో ఒక ప్రైవేట్ కోటలా దీన్ని నిర్మించారు. ఇందులో విశాలమైన హాళ్లు, అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన గార్డెన్లు ఉన్నాయి. అంతేకాకుండా నిర్మాణపరంగా విశిష్టమైన ప్రత్యేకతలెన్నో ఈ భవనంలో ఉన్నాయి. -
చరిత్ర సృష్టించిన అందాల రాణి
మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ (MGI) 2024 టైటిల్‌ను సాధించి రాచెల్ గుప్తా (20) చరిత్ర సృష్టించింది. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో జరిగిన పోటీలో ఈ కిరీటాన్నిదక్కించుకున్న తొలి భారతీయురాలిగా నిలిచింది. సుమారు 70కిపైగా దేశాలకు చెందిన అందాల రాణులను వెనక్కి నెట్టి భారతదేశానికి టైటిల్‌ను అందించింది. దీంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా పంజాబ్‌లోని జలంధర్‌లో ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు సంబరాల్లో మునిగిపోయారు. రేచల్ విజయం యవద్దేశం గర్వించేలా చేసిందని కుటుంబ సభ్యుడు తేజస్వి మిన్హాస్ హర్షం వ్యక్తం చేశారు.బ్యాంకాక్ MGI హాల్లో జరిగిన మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ పోటీలో రాచెల్ గ్ర్యాండ్ ఫినాలెలో ఫిలిప్పీన్స్‌కి చెందిన సిజె ఓపియాజాను ఓడించి బంగారు కిరీటాన్ని గెలుచుకున్నారు. ఆగస్టులో మిస్ గ్రాండ్ ఇండియా టైటిల్ గెలుచుకున్న తర్వాత అంతర్జాతీయ పోటీలో చోటు దక్కించుకుంది. అలాగే 2022లో 'మిస్ సూపర్ టాలెంట్ ఆఫ్ ది వరల్డ్' కిరీటాన్ని కూడా గెలుచుకుంది. ఇకపై రాచెల్ ప్రపంచవ్యాప్తంగా శాంతి, స్థిరత్వాన్ని పెంపొందించే ప్రపంచ రాయబారిగా ఉండనుంది. ఈ టైటిల్ దక్కించుకున్న తొలి భారతీయురాలిగా రికార్డ్ సృష్టించడమే కాదు, 'అత్యధిక ప్రపంచ అందాల పోటీల కిరీటాలు గెల్చుకున్న తొలి ఇండియన్ లారాదత్తా సరసన చేరింది. కాగా రాచెల్ ఆమె మాడెల్, నటి వ్యాపారి. ఇన్‌స్టాగ్రామ్‌లో 10లక్షలకు పైగా ఫాలోవర్లు ఆమె సొంతం. -
70 దేశాలను ఓడించి అందాల రాణిగా రాచెల్ గుప్తా : తొలి ఇండియన్‌గా చరిత్ర
-
పంట వ్యర్థాల దహనంపై సుప్రీం కన్నెర్ర
న్యూఢిల్లీ: శీతాకాలంలో దేశ రాజధానిని వాయకాలుష్య కోరల్లోకి నెట్టేస్తున్న పంట వ్యర్థాల దహనం ఘటనలపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. తమ రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టకుండా అడ్డుకోవడంలో పూర్తిగా విఫలమైన పంజాబ్, హరియాణా ప్రభుత్వాలకు కోర్టు తిట్ల తలంటుపోసింది. వ్యర్థాలను తగలబెట్టిన వారికి నామామాత్రపు జరిమానాలు వేస్తూ వదిలేస్తున్న ప్రభుత్వాల తీరును ఎండగట్టింది. ఇలాంటి నిర్లక్ష్య ధోరణిపై అక్టోబర్ 23వ తేదీన తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కోర్టు బుధవారం సమన్లు జారీచేసింది. విధి నిర్వహణలో విఫలమైన ఆయా ప్రభుత్వాధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వాయు నాణ్యతా నిర్వహణ కమిషన్(సీఏక్యూఎం)ను కోర్టు ఆదేశించింది. సంబంధిత కేసును సుప్రీంకోర్టు జడ్జీలు జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లాహ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ల ధర్మాసనం బుధవారం విచారించింది. దహనాలను నివారించేందుకు 2021 జూన్‌లో నేషనల్ క్యాపిటల్ రీజియన్(ఎన్సీఆర్) ప్రాంతంలో అమలుచేయాల్సిన సీఏక్యూఎం నిబంధనలను గాలికొదిలేసిన ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. ఇదేం రాజకీయ అంశం కాదుగా: ‘‘తగలబెట్టడం వల్ల శీతాకాలంలో ఢిల్లీ మొత్తం పొగచూరుతోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులపై అధికారగణం ఒత్తిడి ఉంటే వారికీ మేం సమన్లు జారీచేస్తాం. రాష్ట్రాల వైఖరి ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. పంజాబ్ ప్రభుత్వం గత మూడేళ్లలో నిబంధనలను అతిక్రమించిన వారిలో ఒక్కరిపై కూడా కేసులు నమోదుచేసి దర్యాప్తు చేపట్టలేదు. తప్పుచేసిన వారిని విచారించేందుకు ఎందుకంత భయపడుతున్నారు?. ఇదేం రాజకీయ అంశం కాదు. కమిషన్ నిబంధనలను ఖచి్చతంగా పాటించాల్సిందే. ఇందులో రాజకీయాలకు తావులేదు. మీరే నియమాలను ధిక్కరిస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తున్న రైతులను ప్రోత్సహిస్తున్నారు. నామామాత్రపు జరిమానాలు వేసి వదిలేస్తున్నారు. పంటభూముల్లో ఎక్కడెక్కడ పంటవ్యర్థాలను తగలబెడుతున్నారో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో) మీకు లొకేషన్ పంపుతోంది. మీరే అది ఎక్కడుందో దొరకట్లేదని కుంటి సాకులు చెబుతున్నారు’’అని కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. వాస్తవ పరిస్థితులు వేరుగా ఉన్నాయి: పంజాబ్ కోర్టు ఎదుట పంజాబ్ తరఫున రాష్ట్ర అడ్వకేట్ జనరల్ గురీ్మందర్ సింగ్ వాదించారు. ‘‘పొలాల్లో వ్యర్థాలను కాలి్చన ఘటనలపై అధికారులు నమోదుచేసిన రెవిన్యూ రికార్డులు తప్పులతడకగా ఉంటున్నాయి. దీంతో క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవడం చాలా కష్టమవుతోంది. ఆదేశాలకు, వాస్తవ పరిస్థితికి పూర్తి భిన్నంగా ఉంటున్నాయి’’అని చెప్పారు. కేంద్రప్రభుత్వానికీ చీవాట్లు ‘‘కేంద్రప్రభుత్వం వాయు నాణ్యతా నిర్వహణ కమిషన్‌ను కోరలు పీకిన పాములా మార్చేసింది. ఆదేశాలు ఇవ్వడం తప్ప వాటిని అమలుచేసే బాధ్యత, సర్వాధికారాలు దానికి అప్పజెప్పలేదు. వాయుకాలుష్య సంబంధ నిపుణులను సీఏక్యూఎంలో ఎంపికచేయలేదు. సీఏక్యూఎం సభ్యుల విద్యఅర్హతలు అద్భుతంగా ఉన్నాయిగానీ అవి గాలినాణ్యత రంగానికి ఎందుకూ పనికిరావు’అని వ్యాఖ్యానించింది. దీనిపై కేంద్రప్రభుత్వం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్యా భాటి వాదించారు. సభ్యుల్లో ఒకరు గతంలో మధ్యప్రదేశ్ కాలుష్యనియంత్రణ మండలికి ఆరేళ్లు చైర్మన్‌గా ఉన్నారని గుర్తుచేశారు. ‘‘అక్కడ సారథిగా ఉండటమనేది అసలైన అర్హత కాబోదు. కాలుష్య నియంత్రణ మండలి ఎలా పనిచేస్తుందో మీకు తెలుసా?. వాయుకాలుష్యరంగ నిపుణులతో కమిషన్‌ను పటిష్టంచేయాలి’అని కోర్టు వ్యాఖ్యానించింది. ‘ఢిల్లీ ప్రాంతంలో సీఏక్యూఎం చట్టం, 2021 ప్రకారం సంక్రమించిన అధికారాలను ఉపయోగించటంలో సీఏక్యూఎం పూర్తిగా విఫలమైంది. దహనం ఘటనలను యద్దప్రాతిపదికన అడ్డుకోవాల్సిన బాధ్యత మీదే’అని కమిషన్‌పై కోర్టు ఆగ్రహం వెలిబుచ్చింది. -
హర్యానా, పంజాబ్ ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ: ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతాల్లో క్షీణిస్తున్న వాయు కాలుష్యం కేసులో పంజాబ్, హర్యానా ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పంట వ్యర్ధాల దహనం సమస్యను పరిష్కరించేందుకు ఆ రాష్ట్రాలు ఎలాంటి సమర్థవంతమైన చర్యలు తీసుకోవడం లేదని మండిపడింది. ఈ మేరకు పంజాబ్, హర్యానా రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 23వ తేదీన వ్యక్తిగతంగా హాజరై, పరిస్థితిని వివరించాలని సర్వోన్నత న్యాయస్థానం తమ ఆదేశాల్లో పేర్కొందిఈ మేరకు జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, అసానుద్దీన్ అమానుల్లా, ఆగస్టిన్ జార్జ్ మాషిస్‌లతో కూడిన ధర్మాసనం దేశాలు ఇచ్చింది. కాలుష్య నిరోధక చట్టాలను ఉల్లంఘించిన వ్యక్తులను విచారించాలంటూ జూన్ 2021న తాము జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని రెండు రాష్ట్రాలపై మండిపింది. తమ ఉత్తర్వులను పాటించకపోతే కోర్టు ధిక్కరణగా పరిగణించాల్సి వస్తుందని హె చ్చరించిందికాగా దేశ రాజధాని దిల్లీలో ప్రతీ శీతాకాలం గాలి నాణ్యత దారుణంగా పడిపోతూ ఉంటుంది. దీనికి పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హరియాణాల్లో పంట వ్యర్థాల దహనమే ప్రధాన కారణంగా మారుతోంది. దీనిపై కొంతకాలంగా సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది.అనేకసార్లు చట్టాన్ని ఉల్లంఘించిన నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం తనను తాను ‘నిస్సహాయతగా’ ప్రకటించుకోవాలని కోర్టు చీవాట్లు పెట్టింది. ‘ఇక మేము ఏం చేయలేము... మేము నిస్సహాయులమని వారిని వారే ప్రకటించుకోనివ్వండి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే పంజాబ్, హర్యానా రెండూ గత మూడు సంవత్సరాలుగా చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై, ముఖ్యంగా పంట వ్యర్థాలను కాల్చే రైతులపై చర్యలు తీసుకోలేదని, కేవలం నామమాత్రపు జరిమానాలు మాత్రమే విధించాయని కోర్టు పేర్కొంది.ఢిల్లీ, ఎన్సీఆర్ పరిధిలో వాయు న్యాణ్యతను పర్యవేక్షించి, నియంత్రించాల్సిన కేంద్ర ప్రభుత్వ ప్యానెల్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్‌ను కూడా తీవ్రంగా విరుచుకుపడింది. పంట వ్యర్ధాల కాల్చివేతను నియంత్రించేందుకు ఎటువంటి చర్యలు తీసుకున్నారని సీఏక్యూఎంను సుప్రీం అడిగింది. ఇదేమీ రాజకీయ అంశం కాదని పేర్కొంది. ఉల్లంఘనల కట్టడిలో విఫలమైనందుకు గానూ పంజాబ్, హరియాణా ప్రభుత్వ అధికారులపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. -
పంజాబ్: కట్టుదిట్టమైన భద్రత మధ్య పంచాయతీ ఎన్నికలు
చండీగఢ్: పంజాబ్‌లో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఈరోజు(మంగళవారం) గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. 13 వేలకుపైగా గ్రామ పంచాయతీలకు జరుగుతున్న ఈ ఎన్నికల కోసం 19 వేల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచి ఓటర్ల రద్దీ నెలకొంది. ఈ ఎన్నికల్లో దాదాపు 1.05 లక్షల మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఓటింగ్ పూర్తయిన తర్వాత ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఓట్లను లెక్కించనున్నారు. సర్పంచ్ స్థానానికి మొత్తం 3,798 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పంజాబ్‌లోని సోహల్ సైన్ భగత్ గ్రామంలో ఓటింగ్ సందర్భంగా కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. వారిని చికిత్స కోసం అమృత్‌సర్‌కు తరలించారు.గత నెలలో అసెంబ్లీ ఆమోదించిన పంజాబ్ పంచాయతీరాజ్ (సవరణ) బిల్లు, 2024 ప్రకారం అభ్యర్థులు రాజకీయ పార్టీల చిహ్నాలను ఉపయోగించకుండా నిషేధం విధించారు. రాష్ట్రంలో మొత్తం 1.33 కోట్ల మంది ఓటర్లు ఉండగా, వారిలో 70.51 లక్షల మంది పురుషులు, 63.46 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని డిప్యూటీ కమిషనర్లకు సూచించామని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి ఒకరు తెలిపారు.ఇది కూడా చదవండి: సేంద్రియ/ప్రకృతి సేద్యంలో 3 నెలల కోర్సు -
ఢిల్లీ కాలుష్యం: చర్యలు తీసుకోకపోవటంపై సుప్రీం ఆగ్రహం
ఢిల్లీ: ఢిల్లీ కాలుష్యంపై సరైన చర్యలు తీసుకోకపోవటంలో విఫలమైనందుకు సుప్రీంకోర్టు.. కేంద్ర ప్రభుత్వంతో పాటు హర్యానా, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ కాలుష్యాన్ని తగ్గించటంపై సమావేశాలు జరపటం తప్ప క్షేత్రస్థాయిలో ఎటువంటి చర్యలు తీసుకోవలేదని అసహనం వ్యక్తం చేసింది.పంట వ్యర్థాలను కాల్చుతూ.. కాలుష్యానికి కారణమవుతున్న రైతులపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని సూటిగా ప్రశ్నించింది. ఈ క్రమంలో తమ ఆదేశాలను పాటించటం లేదని కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (సీఎక్యూఎం)పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హర్యానా, పంజాబ్ ప్రభుత్వాలు పంట వ్యర్థాలు కాల్చిన వారి నుంచి నామమాత్రపు జరిమానాలు మాత్రమే వసూలు చేస్తోందని తెలిపింది.‘‘కాలుష్య నియంత్రణ మండలి చివరి సమావేశం ఆగస్టు 29న జరిగింది. అందులో పంట వ్యర్థాల దహనంపై ఎలాంటి చర్చా జరగలేదు. సెప్టెంబర్ నెలలో ఒక్క సమావేశం కూడా జరగలేదు. సమావేశాలకు చాలా మంది కాలుష్య నియంత్రణ మండలి సభ్యులు హాజరు కాలేదు. కాలుష్య నియంత్రణపై నిర్లక్ష్యంగా ఉన్నారు. కాలుష్యాన్ని తగ్గించడానికి నామమాత్రపు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై ఎటువంటి చర్యలు కూడా తీసుకోవటం లేదు’’ అని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. ఇక.. ఈ విషయంపై కేంద్రం ప్రభుత్వం, ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ వారంలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అనంతరం సుప్రీంకోర్టు తదుపరి విచారణ అక్టోబర్ 16కు వాయిదా వేసింది.చదవండి: సుప్రీం కోర్టులో ఈశా ఫౌండేషన్‌కు ఊరట -
ఒంటరిగా ముగ్గురు దొంగలను ఎదుర్కొన్న మహిళ.. చివరికి ఏమైందంటే!
ఓ మహిళా తన ఇంట్లోకి దొంగలు రాకుండా నిలువరించింది. ముగ్గురు వ్యక్తులను ఒంటరిగా ఎదుర్కొని.. వారితో పోరాడింది. దొంగల నుంచి తనను, తన కుటుంబాన్ని రక్షించుకుంది. చివరికి దొంగలు చేసేందేంలేక అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లారు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్‌లో వెలుగుచూసింది. మన్దీప్ కౌర్ అనే మహిళ తన భర్త జగ్గీత్సింగ్, పిల్లలతో నివసిస్తుంది. సోమవారం సాయంత్రం మన్దీప్ కౌర్ బాల్కనీలో బట్టలు ఆరేస్తుండగా ముగ్గురు వ్యక్తులు ముసుగులు ధరించి దొంగతనం చేసేందుకు వచ్చారు.మెల్లమెల్లగా దొంగలు ఆమె ఇంటి వైపు రావడం గమనించింది. వెంటనే లోపలికి వెళ్లి తలుపుకు తాళం వేయడానికి పరుగెత్తింది. అయితే దొంగలు లోపలికి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. డోర్‌ను గట్టిగా నెట్టడం ప్రారంభించారు. కానీ కౌర్ తన శక్తితో వారు లోపలికి రాకుండా అడ్డుకుంది. చివరికి డోర్‌కు తాళం వేసి.. పక్కన ఉన్న సోఫాను తలుపుకు అడ్డంగా పెట్టింది.ఈ దృశ్యాలు అన్నీ ఇంట్లోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. మహిళ దొంగలను ధైర్యవంతంగా ఎదుర్కోవడం, డోర్ పెట్టి, ఇరుగుపొరుగు వారిని అప్రమత్తం చేసేందుకు గట్టిగట్టిగా అరుస్తూ ఉండటం వీడియోలో కనిపిస్తుంది. దొంగలు వెళ్లిపోయారో లేదో కిటికీ ద్వారా చూస్తూ ఎవరికో ఫోన్ కూడా చేసింది. ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కాక.. ఆమె కొడుకు, కూతురు అటు ఇటు కంగారుగా చూడటం కనిపిస్తుంది. చివరికి దొంగలు ఏం చేయలేక అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. सीसीटीवी में कैद हुई मनप्रीत की बहादुरी, तीन चोरों को अकेले ही घर में घुसने से रोका पंजाब के अमृतसर जिले के वेरका इलाके की महिला मनप्रीत की बहादुरी की चर्चा सोशल मीडिया पर सभी कर रहे हैं। मनप्रीत ने अकेले अपने साहस के दम पर तीन चोरों को अपने घर में घुसने से रोक दिया। pic.twitter.com/YKXFgOVDZ0— Sharad Kumar Tripathi (@officesharad) October 2, 2024 మహిళా ధైర్య సాహాసాలపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీస్ అధికారి ఏకే సోహి తెలిపారు. జగ్గీత్ సింగ్ నగల వ్యాపారి కాగా..దొంగలు వారి ఇంటిని టార్గెట్ చేయడానికి ఇదే కారణం కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. -
ఢిల్లీ ప్రభావం.. పంజాబ్ క్యాబినెట్లో మార్పులు
చండీగఢ్: ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంలో మార్పులు చోటుచేసుకున్న దరిమిలా ఆ ప్రభావం పంజాబ్‌పై పడింది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ రాజీనామా చేయడం, అనంతరం కొత్త ముఖ్యమంత్రిగా ఆతిశీ ప్రమాణ స్వీకారం చేసిన దరిమిలా పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వం భారీ పునర్వ్యవస్థీకరణ దిశగా ముందడుగు వేసింది. పంజాబ్ నీటి సరఫరా, పారిశుధ్యం, రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి బ్రహ్మ్ శంకర్ జింపా, సమాచార, పౌరసంబంధాలు, మైనింగ్, భూమి ప్రకటనల శాఖ మంత్రి చేతన్ సింగ్ జోరామజ్రా, పర్యాటక మంత్రి అన్మోల్ గగన్ మాన్‌తో పాటు మరో మంత్రి బాల్కర్ సింగ్ తమ పదవులకు రాజీనామా చేశారు. వీరి రాజీనామాలను పంజాబ్ ప్రభుత్వం ఆమోదించి, వెంటనే గవర్నర్‌కు పంపింది. అనంతరం పంజాబ్ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణను ప్రకటించింది. కొత్తగా బరీందర్ కుమార్ గోయల్, తరణ్‌ప్రీత్ సింగ్ సౌంద్, మహీందర్ భగత్, హర్దీప్ సింగ్ ముండియాలను మంత్రివర్గంలో చేర్చుకోనున్నట్లు ప్రకటించింది.ఈ నలుగురు కొత్త మంత్రుల చేత పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ కటారియా ఈరోజు (సోమవారం) సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. గులాబ్ చంద్ కటారియా పంజాబ్ గవర్నర్ అయిన తర్వాత కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించడం ఇదే తొలిసారి. 30 నెలల భగవంత్ మాన్ ప్రభుత్వంలో ఇది నాల్గవసారి మంత్రివర్గ విస్తరణ. 117 మంది ఎమ్మెల్యేలున్న పంజాబ్ అసెంబ్లీలో సీఎం భగవంత్ మాన్ సహా 15 మంది మంత్రులు కేబినెట్లో ఉన్నారు. మంత్రి మండలిలో మొత్తం 18 మంది మంత్రులు ఉండేందుకు అవకాశముంది. ఇది కూడా చదవండి: Sign Languages Day: ఒకప్పుడు చులకనగా చూసినవాళ్లే నేడు.. -
అమ్మే దిగివస్తే మత్తు దిగదా..
పంజాబ్‌లో హెరాయిన్‌ని ‘చిట్టా’ అంటారు. దీని అడిక్షన్లో పడి యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. డ్రగ్స్‌ను వ్యతిరేకించడానికి నేడు తల్లులే రంగంలోకి దిగారు. పంజాబ్‌లో ‘మదర్స్ ఎగైనెస్ట్ డ్రగ్స్’ మొదలైంది. నిజానికి ఇది ప్రతి రాష్ట్రంలో జరగాలి. డ్రగ్స్ నీడ లేని ఇల్లే సమాజానికి వెలుగు.పంజాబ్‌లో ‘డ్రగ్స్’ మహమ్మారి వ్యాపించి ఉంది. ప్రకృతిలోని మహమ్మారికి మందు ఉంది వాక్సిన్లు ఉన్నాయి... కాని ఈ మహమ్మారికి మందు లేదు. దీనిని నివారించాలంటే మానవశక్తి కావాలి. మహా శక్తి కావాలి. ఆ శక్తి తల్లే తప్ప మరెవరూ కాలేరని పంజాబ్‌లో ‘మదర్స్ ఎగైనెస్ట్ డ్రగ్స్’ ఉద్యమం మొదలైంది. ‘పంజాబ్ లిటరేచర్ ఫౌండేషన్’ అనే సంస్థ సెప్టెంబర్ 15న హోషియార్‌పూర్‌లో ఈ ఉద్యమం మొదలెట్టింది. ఈ కార్యక్రమానికి తల్లులు భారీగా తరలి వచ్చారు. పిల్లలు వ్యసనాల బారిన పడితే కడుపుకోతకు గురయ్యేది మొదట తల్లులే. పిల్లల్ని కాపాడుకోవాల్సింది మొదట వారే.13 నుంచి 18 ఏళ్ల మధ్యలోపిల్లల వయసు 13 నుంచి 18 ఏళ్ల మధ్య వరకు తల్లులు వారిని జాగ్రత్తగా గమనించుకుంటే డ్రగ్స్ నుంచి కాపాడుకోవచ్చని ‘పంజాబ్ లిటరేచర్ ఫౌండేషన్’ స్థాపకుడు, రచయిత కుష్వంత్ సింగ్ అన్నాడు. పంజాబ్‌లోని ప్రభుత్వ విభాగాల సమన్వయంతో ఆయన ‘మదర్స్ ఎగైనెస్ట్ డ్రగ్స్’ ఉద్యమానికి అంకురార్పణ చేశాడు. ‘పంజాబ్‌లో 13 నుంచి 18 ఏళ్ల మధ్యలో పిల్లలు డ్రగ్స్‌కు పరిచయం అవుతున్నారు. 14 నుంచి 24 ఏళ్ల మధ్య వీళ్లు అడిక్ట్స్‌గా మారుతున్నారు. వీరిని తీసుకెళ్లి రీహాబిలిటేషన్ సెంటర్స్‌లో పడేస్తే మారే వారు ఒక శాతం మాత్రమే ఉంటున్నారు. అంటే డ్రగ్స్ బానిసత్వం ఎంత ప్రమాదమో అర్థం చేసుకోవాలి’ అన్నాడాయన. ‘పంజాబ్‌లో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా గత సంవత్సరం చండీగఢ్ నుంచి భగత్ సింగ్ స్వగ్రామమైన ఖట్కర్ కలాన్ వరకూ పాదయాత్ర చేసినప్పుడు దారిలో ఎందరో తల్లులు వచ్చి మా పిల్లలు బాగుపడే మార్గం లేదా అని అడిగేవారు. తల్లులే మొదటి రక్షకులుగా మారితే పిల్లలను డ్రగ్స్‌వైపు వెళ్లకుండా ఆపొచ్చని నాకు అనిపించింది. దాని ఫలితమే ఈ ఉద్యమం’ అని తెలిపాడతడు.మంచాలకు సంకెళ్లుపంజాబ్లో హెరాయిన్ వ్యసనపరులు లెక్కకు మించి ఉన్నారు. దీనిని అక్కడ ‘చిట్టా’ అంటారు. దాని కోసం పిల్లలు ఎంతకైనా తెగిస్తారు. వారిని డ్రగ్స్ కోసం వెళ్లకుండా ఉంచేందుకు తల్లిదండ్రులు మంచాలకు సంకెళ్లు వేసి కట్టేసి ఉంచడం సర్వసాధారణం. పంజాబ్‌లో కొన్ని ఊళ్లు డ్రగ్స్ వల్ల చని΄ోయిన వ్యక్తుల భార్యలతో నిండి ‘వితంతువుల పల్లెలు’గా పేరు పడటం సమస్య తీవ్రతను తెలుపుతుంది.తల్లులకు ట్రైనింగ్ ఇస్తేమదర్స్ ఎగైనెస్ట్ డ్రగ్స్ ఉద్యమంలో తల్లులను ఒకచోట చేర్చి డ్రగ్స్ గురించి అవగాహన కలిగిస్తారు. ఉదాహరణకు ఢిల్లీకి చెందిన గౌరవ్ గిల్ అనే బాడీ లాంగ్వేజ్ ఎక్స్పర్ట్ డ్రగ్స్‌కు అలవాటు పడుతున్నవారి శారీరక కదలికలు ఎలా ఉంటాయి, వారి ప్రవర్తన ఎలా ఉంటుందో ఈ సందర్భంగా తల్లులకు తెలియచేసి పిల్లల్లో ఈ మార్పు చూడగానే అలెర్ట్ అవ్వాలని కోరాడు. ‘తొలి రోజుల్లోనే గమనిస్తే చాలా మేలు జరుగుతుంది. చాలాసార్లు పరిస్థితి చేయి దాటి ΄ోయాకే పిల్లలు డ్రగ్ ఎడిక్ట్స్ అయ్యారని తల్లిదండ్రులు గమనిస్తున్నారు’ అని అక్కడకు వచ్చిన ΄ోలీసు అధికారులు తెలిపారు. అందుకే ఈ ఉద్యమంలో డ్రగ్స్ కార్యకలాపాలు గమనించిన వెంటనే ΄ోలీసుల హెల్ప్‌లైన్‌కు ఎలా తెలపాలి, ΄ోలీసుల సహాయం ఎలా తీసుకోవాలో తెలియచేస్తారు. ‘గ్రామీణ స్త్రీలకు ఈ శిక్షణ ఉంటే గ్రామాల్లో యువకులు డ్రగ్స్ బారిన పడకుండా కాపాడుకోగలరు’ అంటున్నారు ఈ ఉద్యమ బాధ్యులు.ఎన్నో రకాలుమత్తు పదార్థాలంటే హెరాయిన్, గంజాయి మాత్రమే కాదు. వైటెనర్స్తో మొదలు దగ్గుమందు వరకు ఎన్నో ఉన్నాయి. డ్రగ్స్ చలామణి కోసం పంజాబ్‌లో దగ్గుమందు ముసుగులో ఫ్యాక్టరీలు తయారయ్యి ్రపాణాంతకస్థాయిలో దగ్గుమందులోని రసాయనాలను ఇంజెక్షన్లుగా ఎక్కించునే విధంగా తయారు చేస్తున్నారు. అంతేకాదు గ్రాము బరువుకు ఎక్కువ పొడి వచ్చే విధంగా తయారు చేయడంతో ఒక్క గ్రాముతో కూడా రోజు గడపొచ్చనుకుని అలవాటు పడుతున్నారు.ఏం చేయాలి?తల్లిదండ్రులు పిల్లలతో తరచూ సమయం గడపాలి. వారితో విహారాలు చేయాలి. ఆ సమయంలో వారి మనోభావాలు విని స్నేహాలు తెలుసుకోవాలి. చదువుల్లో మార్కులు తెలుసుకోవాలి. ప్రవర్తనను గమనించాలి. ఇవన్నీ ఏమాత్రం తేడా వున్న అనుమానించి ఆదుకోవాలి. ఈ స్పీడు యుగంలో ఎవరూ ఈ పని చేయడం లేదు. తల్లులకు తప్పదు. వారే రక్షకులు. అమ్మ వల్లే మారాను‘మదర్స్ ఎగైనెస్ట్ డ్రగ్స్’ ఉద్యమంలో భాగంగా డ్రగ్స్ నుంచి బయటపడి సామాన్య జీవితం గడుపుతున్న వారి కథనాలు కూడా స్వయంగా వినిపించారు. ‘నేను డ్రగ్స్ నుంచి కేవలం మా అమ్మ వల్ల బయట పడ్డాను. ఒక దశలో హెరాయిన్ డోస్ కోసం 2 లక్షలు కూడా ఖర్చు పెట్టడానికి వెనుకాడలేదు. మా అమ్మ నా కోసం అనేక త్యాగాలు చేసి మామూలు మనిషిని చేసింది’ అని ఒకతను తెలిపాడు. -
Haryana: ఆ 11 స్థానాల్లో పోటాపోటీ
హరియాణాలో అసెంబ్లీ ఎన్నికల వేడి క్రమంగా తారస్థాయికి చేరుతోంది. పాలక బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు దేశమంతటినీ ఆకర్షిస్తోంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బీజేపీ బలహీనపడిందన్న (2019లో మొత్తం పది సీట్లనూ బీజేపీ నెగ్గగా.. 2024లో కాంగ్రెస్ సగం స్థానాలను చేజిక్కించుకుంది) విపక్షాల వాదనకు బలం చేకూర్చేందుకు కాంగ్రెస్‌కు, దాన్ని పూర్వపక్షం చేసేందుకు అధికార పారీ్టకి ఈ ఎన్నికల్లో ఘన విజయం అత్యవసరంగా మారింది. ఢిల్లీ , పంజాబ్ వెలుపల ఉనికి చాటుకోజూస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా ఈ ఎన్నికలు అగి్నపరీక్ష వంటివే. కాంగ్రెస్ సమరోత్సాహంతో కనిపిస్తుండగా, పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ వ్యతిరేకతతో సతమతమవుతోంది. రైతు ఆందోళనల వంటివి ఆ పారీ్టకి మరింత సవాలుగా మారాయి. ఈ నేపథ్యంలో పలు అసెంబ్లీ స్థానాలు ఈ రెండు పారీ్టలతో పాటు జేజేపీ, ఐఎన్ఎల్డీ వంటి ప్రాంతీయ పార్టీల హోరాహోరీ పోరుకు వేదికగా మారాయి. అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న ఆ హాట్ సీట్లపై ఫోకస్... గర్హీ సంప్లా కిలోయీ హుడా కంచుకోట రాష్ట్ర కాంగ్రెస్ దిగ్గజం, మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా కంచుకోట. ఐదు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఇప్పటిదాకా ఓటమే ఎరగని నేత ఆయన. దాంతో ఈ స్థానాన్ని నిలుపుకోవడం కాంగ్రెస్‌కు అత్యవసరం. 25 శాతం జనాభాతో హరియాణాలో ప్రబల శక్తిగా ఉన్న జాట్ల ఓట్లు ఈ స్థానంలో నిర్ణాయకం. వారిలో తమపై తీవ్ర ఆగ్రహం నెలకొని ఉండటం బీజేపీని కలవరపెడుతోంది. హుడాపై గాంగ్స్టర్ రాజేశ్ హుడా భార్య మంజు హుడాను బీజేపీ పోటీకి నిలిపింది. ఆమె తండ్రి మాజీ పోలీసు అధికారి కావడం విశేషం.బద్లీ బీజేపీకి గట్టి పరీక్షబీజేపీ నుంచి రాష్ట్ర పార్టీ మాజీ చీఫ్, జాట్ నేతఓం ప్రకాశ్ ధన్‌ఖడ్ బరిలో ఉన్నారు. గత రెండు ఎన్నికల్లోనూ ఆయనే పోటీ చేశారు. 2014లో నెగ్గగా 2019లో కాంగ్రెస్ ప్రత్యర్థి కుల్దీప్ వత్స్ చేతిలో ఓటమి చవిచూశారు. ఈసారీ ఆయనతోనే అమీతుమీ తేల్చుకుంటున్నారు. హోదాల్ బరిలో పీసీసీ చీఫ్ ఈ ఎస్సీ రిజర్వుడు స్థానంలో కాంగ్రెస్ నుంచి పీసీసీ చీఫ్ ఉదయ్ భాన్ బరిలో ఉన్నారు. దాంతో బీజేపీ గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో గట్టెక్కిన జగదీశ్ నాయర్‌ను పక్కన పెట్టి హరీందర్‌సింగ్ రామ్ రతనన్కు టికెటిచి్చంది.హిస్సార్ బీజేపీకి జిందాల్ సవాల్! అసెంబ్లీ ఎన్నికల్లో ఎప్పుడూ కీలకంగా మారే ఈ స్థానం ఈసారి మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. దేశంలోనే ధనిక మహిళ అయిన పారిశ్రామిక దిగ్గజం సావిత్రి జిందాల్ ఇండిపెండెంట్‌గా బరిలో దిగడమే అందుకు కారణం. ఆమె కుమారుడు నవీన్ జిందాల్ ఇటీవలే బీజేపీలో చేరి లోక్‌సభ ఎన్నికల్లో కురుక్షేత్ర స్థానం నుంచి విజయం సాధించడం తెలిసిందే. అయినా సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి కమల్ గుప్తాకే హిస్సార్ టికెట్ దక్కింది. కాంగ్రెస్ నుంచి మళ్లీ రామ్నివాస్ రారా బరిలో ఉన్నారు.తోశాం వారసత్వ పోరుకాంగ్రెస్ నుంచి పూర్వాశ్రమంలో క్రికెట్ అడ్మిని్రస్టేటర్ అయిన అనిరుధ్ చౌదరి బరిలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి శ్రుతి చౌదరితో ఆయన తలపడుతున్నారు. వీరిద్దరూ దివంగత సీఎం బన్సీలాల్ మనవడు, మనవరాలు కావడం విశేషం. దాంతో అన్నాచెల్లెళ్ల పోరు అందరినీ ఆకర్షిస్తోంది. ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి మారి రాజ్యసభకు ఎన్నికైన కిరణ్ చౌదరి కూతురే శ్రుతి.కైతాల్ బరిలో సుర్జేవాలా జూనియర్ కాంగ్రెస్ సీనియర్ నేత రణదీప్ సుర్జేవాలా 2019లో ఇక్కడ బీజేపీ అభ్యర్థి లీలారామ్ గుర్జర్ చేతిలో ఓటమి చవిచూశారు. ఈసారి గుర్జర్‌పై సుర్జేవాలా కుమారుడు ఆదిత్య బరిలో ఉన్నారు. తండ్రి ఓటమికి ఆయన బదులు తీర్చుకోగలరా అన్నది ఆసక్తికరంగా మారింది. జూలానా హై ప్రొఫైల్ పోరు ఈసారి అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న స్థానం. ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన ఒలింపియన్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఆ పార్టీ తరఫున ఇక్కడి నుంచి ఎన్నికల అరంగేట్రం చేస్తున్నారు. బీజేపీ కెపె్టన్ యోగేశ్ బైరాగికి టికెట్ ఇవ్వగా, ఆప్ నుంచి మరో రెజ్లర్ కవితా దేవి బరిలో దిగడం విశేషం. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల వివాదంలో మోడీ సర్కారు వ్యవహార శైలి బీజేపీకి ఇక్కడ బాగా ప్రతికూలంగా మారవచ్చని అంటున్నారు.అంబాలా కంటోన్మెంట్ కాంగ్రెస్‌కు ఇంటి పోరుబీజేపీ దిగ్గజం అనిల్ విజ్ ఇక్కడ ఆరుసార్లు గెలిచారు. మనోహర్‌లాల్ ఖట్టర్ మంత్రివర్గంలో హోంమంత్రిగా చక్రం తిప్పారు. కానీ నయాబ్ సింగ్ సైనీ మంత్రివర్గంలో చేరకుండా దూరం పాటిస్తున్నారు. గురువారం ఆయన నామినేషన్ దాఖలు వేళ బీజేపీ నేతలేవరూ వెంట లేకపోవడం చర్చకు తావిచ్చింది. కాంగ్రెస్ ఇక్కడ ఇంటి పోరుతో సతమతం అవుతోంది. పరీ్వందర్ సింగ్ పరీని బరిలో దించగా పార్టీ సీనియర్ నేత నిర్మల్‌సింగ్ కుమార్తె చిత్రా శర్వర ఇండిపెండెంట్‌గా పోటీకి దిగారు. గత ఎన్నికల్లో కూడా ఆమె ఇండిపెండెంట్‌గా పోటీ చేసి అనిల్ విజ్ చేతిలో 20 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు.ఉచానా జేజేపీ అడ్డా! మాజీ డిప్యూటీ సీఎం, జేజేపీ చీఫ్ దుష్యంత్ చౌతాలా సిట్టింగ్ స్థానం. రాష్ట్రంపై జేజేపీ పట్టు సడలుతున్న దృష్ట్యా ఈసారి ఇక్కడ ఘన విజయం ఆయనకు అత్యంత కీలకం. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జేజేపీ 10 సీట్లు నెగ్గి కింగ్ మేకర్‌గా ఆవిర్భవించడం, బీజేపీ ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారడం తెలిసిందే. బీజేపీ నుంచి దేవేందర్ అత్రి, కాంగ్రెస్ నుంచి బ్రిజేంద్ర సింగ్ ఆయనకు పోటీ ఇస్తున్నారు. మాజీ ఐఏఎస్ అయిన బ్రిజేంద్ర గత మార్చిలోనే బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి జంప్ చేశారు.లడ్వా సీఎం సైనీకి పరీక్ష! గత మార్చిలో ఖట్టర్ స్థానంలో సీఎంగా పగ్గాలు చేపట్టిన సైనీ ఇక్కడ బరిలో ఉన్నారు. ఉప ఎన్నికల్లో ఖట్టర్ కంచుకోట అయిన కర్నాల్ నుంచి గెలిచిన ఆయన ఈసారీ అక్కడినుంచే పోటీ చేయాలని భావించారు. కానీ బీజేపీ అధిష్టానం ఆదేశం మేరకు పారీ్టకి అత్యంత సురక్షితమైన ఈ స్థానం నుంచి అయిష్టంగానే బరిలో దిగారు. 2019 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ నెగ్గడం విశేషం. సిట్టింగ్ ఎమ్మెల్యే మేవాసింగ్ ఈసారి కూడా బరిలో అన్నారు.ఎలెనాబాద్ ఐఎన్ఎల్డీకి అగి్నపరీక్ష జేజేపీ మాదిరిగానే నానాటికీ ప్రభ తగ్గుతున్న ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (ఐఎన్ఎల్డీ)కు ఇక్కడ విజయం ప్రతిష్టాత్మకంగా మారింది. ఈసారి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే, పార్టీ ప్రధాన కార్యదర్శి అభయ్ సింగ్ చౌతాలా బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి భారత్ సింగ్ బెనివాల్, బీజేపీ నుంచి ఆరెస్సెస్ మూలాలున్న అమర్ చంద్ మెహతా ఆయనకు పోటీ ఇస్తున్నారు. –సాక్షి, నేషనల్ డెస్క్ -
పంజాబ్ ఎఫ్‌సీ బోణీ
కొచ్చి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో పంజాబ్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) జట్టు శుభారంభం చేసింది. కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సీతో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో పంజాబ్ ఎఫ్‌సీ 2–1 గోల్స్ తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో చివరి పది నిమిషాల్లో మూడు గోల్స్ కావడం విశేషం. పంజాబ్ తరఫున 86వ నిమిషంలో లుకా మాజ్సెన్ పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలిచాడు.ఇంజ్యూరీ సమయంలోని 90+2వ నిమిషంలో జిమెనెజ్ గోల్‌తో కేరళ జట్టు స్కోరును 1–1తో సమం చేసింది. 90+5వ నిమిషంలో ఫిలిప్ మిర్జాక్ గోల్‌తో పంజాబ్ అనూహ్య విజయాన్ని దక్కించుకుంది. నేడు జరిగే మ్యాచ్‌లో మొహమ్మదాన్ స్పోరి్టంగ్ క్లబ్‌తో నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఎఫ్‌సీ జట్టు తలపడుతుంది. -
ఆ కూడలికి భగత్ సింగ్ పేరు పెట్టండి: పాక్ కోర్టు
లాహోర్: పాకిస్తాన్‌లోని లాహోర్‌లో ఒక కూడలికి భారత స్వాతంత్ర్య పోరాట వీరుడు భగత్ సింగ్ పేరు పెట్టడంలో జరుగుతున్న జాప్యంపై లాహోర్ హైకోర్టు అక్కడి పంజాబ్ ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలించింది. దీనిపై నోటీసులు జారీ చేస్తూ, సమాధానం చెప్పేందుకు చివరి అవకాశం ఇచ్చింది.లాహోర్‌లోని షాద్మాన్ చౌక్‌కు భగత్ సింగ్ పేరు పెట్టడంపై కోర్టు ఇచ్చిన ఆదేశాల అమలుకు పంజాబ్ ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. దీనికి సమాధానం ఇచ్చేందుకు మరికొంత సమయం కావాలని కోర్టును పంజాబ్ ప్రభుత్వం కోరింది. పాకిస్తాన్‌లోని భగత్ సింగ్ మెమోరియల్ ఫౌండేషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై లాహోర్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ షమ్స్ మహమూద్ మీర్జా విచారణ చేపట్టారు. ఈ అంశంపై స్పందించడానికి పంజాబ్ ప్రభుత్వానికి చివరి అవకాశం ఇచ్చారు. పంజాబ్ ప్రభుత్వ న్యాయవాది సాద్ బిన్ ఘాజీ కోర్టుకు హాజరై, దీనిపై సమాధానం ఇచ్చేందుకు మరింత సమయం కోరారు.పంజాబ్ తరపు న్యాయవాది అభ్యర్థన మేరకు, ఈ అంశంపై స్పందించేందుకు పంజాబ్ ప్రభుత్వానికి చివరి అవకాశం ఇస్తున్నట్లు న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటికే చాలా జాప్యం జరుగుతోందని పిటిషనర్ తరఫు న్యాయవాది ఖలీద్ జమాన్ ఖాన్ కాకర్ కోర్టుకు తెలిపారు. కేసు తదుపరి విచారణను కోర్టు నవంబర్ 8కి వాయిదా వేసింది.షాద్మాన్ చౌక్‌కు భగత్ సింగ్ పేరు పెట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఫౌండేషన్ చైర్మన్ ఇంతియాజ్ రషీద్ ఖురేషీ కోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. 1931లో భగత్‌సింగ్‌ను ఉరితీసిన షాద్మాన్ చౌక్‌కు ఆయన పేరు పెట్టాలని లాహోర్ హైకోర్టు 2018లో ప్రభుత్వాన్ని ఆదేశించిందని ఖురేషీ తెలిపారు. అయితే కోర్టు ఆదేశాలను పంజాబ్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పాటించలేదని ఆయన పేర్కొన్నారు. భగత్ సింగ్ భారతదేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించారు. ఆయనను సిక్కులు, హిందువులే కాకుండా ముస్లింలు కూడా ఎంతగానో గౌరవిస్తారు.ఇది కూడా చదవండి: ఎమర్జెన్సీకన్నా దారుణం -
నా భార్య వల్లే ఇలా: శుభవార్త చెప్పిన క్రికెటర్
ఐర్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ సిమ్రన్‌జిత్ సింగ్ అభిమానులకు శుభవార్త చెప్పాడు. కాలేయ మార్పిడి విజయవంతంగా జరిగిందని.. ప్రస్తుతం తాను కోలుకుంటున్నట్లు వెల్లడించాడు. అదృష్టవశాత్తూ తన భార్యే దాతగా మారిందని.. ఆమె మంచి మనసు, అభిమానుల ప్రార్థన వల్లే ప్రాణాలతో బయటపడ్డాడని కృతజ్ఞతా భావం చాటుకున్నాడు.పంజాబ్‌కు ఆడిన సిమికాగా సిమ్రన్‌జిత్ సింగ్ భారత్‌లోని పంజాబ్‌లో గల మొహాలిలో జన్మించాడు. సిమి సింగ్‌గా ప్రసిద్ధి చెందిన అతడు భారత దేశవాళీ క్రికెట్లో అండర్-14, అండర్-17 స్థాయిలో పంజాబ్ తరఫున ఆడాడు. కానీ ఈ లెగ్ స్పిన్ ఆల్‌రౌండర్‌కు భారత అండర్-19 జట్టులో మాత్రం స్థానం దక్కలేదు. దీంతో మళ్లీ చదువుపై దృష్టి సారించిన సిమి.. 2005లో ఐర్లాండ్‌కు వెళ్లిపోయాడు. అక్కడే హోటల్ మేనేజ్మెంట్ చేశాడు.అవకాశాలు లేక ఐర్లాండ్‌కు వెళ్లిఅయితే, క్రికెట్‌పై మక్కువ తగ్గకపోవడంతో 2006లో డబ్లిన్‌లో ప్రొఫెషనల్ క్రికెటర్ మారిన అతడు.. 2017లో ఐర్లాండ్ తరఫున ఇంటర్నేషనల్ క్రికెట్లో అడుగుపెట్టాడు. ప్రతిభను చాటుకుంటూ జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగిన 37 ఏళ్ల సిమి.. మొత్తంగా ఇప్పటి వరకు 35 వన్డేల్లో 39, 53 టీ20లలో 44 వికెట్లు తీశాడు. అంతేకాదు.. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో సెంచరీ కొట్టి సంచలనం సృష్టించాడు.సెంట్రల్ కాంట్రాక్టు ప్లేయర్గాఈ క్రమంలో... 2020లో సిమికి ఐర్లాండ్ సెంట్రల్ కాంట్రాక్టు దక్కింది. కాగా సిమి సింగ్ లివర్ పూర్తిగా పాడైపోయినట్లు అతడి కుటుంబ సభ్యులు ఇటీవల మీడియాకు తెలిపారు. అతడిని ఇండియాకు తీసుకువచ్చామని.. గురుగ్రామ్‌లో లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేసేందుకు డాక్టర్లు ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో తాజాగా సిమి సింగ్ స్వయంగా తన ఆరోగ్యానికి సంబంధించిన అప్డేట్ అందించాడు.నా భార్య వల్లే ఇదంతా‘‘అందరికీ హాయ్.. నా లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ విజయవంతంగా పూర్తైంది. 12 గంటల పాటు శస్త్ర చికిత్స జరిగింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. తప్పుడు యాంటి బయాటిక్స్, స్టెరాయిడ్స్‌ను కొందరు నాకు ప్రిస్కైబ్ చేశారు. వాటి వల్లే లివర్ పాడయ్యే దుస్థితి తలెత్తింది. నా భార్యే నాకు కాలేయ దాత కావడం నిజంగా నా అదృష్టం. నాకోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్నా’’ అని సిమి సింగ్ ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు.నిపుణులు సూచించిన మందులనే వాడాలని తన ఫాలోవర్లను అప్రమత్తం చేశాడు.చదవండి: Ind vs Aus: ఆ ముగ్గురు బ్యాటర్లు ప్రమాదకరం: ఆసీస్ బౌలర్ -
బోల్తా కొట్టిన బస్సు.. ఒకరు మృతి, 12 మందికి గాయాలు
పఠాన్‌కోట్: పంజాబ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంబా నుంచి అమృత్సర్ వెళ్తున్న హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఆర్టీసీ బస్సు పఠాన్‌కోట్ సమీపంలో శుక్రవారం ప్రమాదానికి గురైంది. ఒక్కసారిగా అదుపుతప్పి బొల్తా కొట్టడంతో బస్సు ముందు అద్దాలు పగిలాయి.ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 12 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.. హిమాచల్ ప్రదేశ్- పంజాబ్ సరిహద్దుల్లోని మమూన్ కాంట్‌లో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పఠాన్‌కోట్-చంబా జాతీయ రహదారిపై బస్సు బోల్తా పడిన సీసీటీవీ ఫుటేజీ వైరల్‌గా మారింది.ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. పఠాన్‌కోట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 41 మంది ప్రయాణికులుఉండగా.. చంబా నుంచి అమృత్‌సర్‌కు వెళుతోంది. -
కేంద్రం అలా.. రాష్ట్రం ఇలా: పెట్రోల్ ధరలు పైపైకి
భారతదేశంలో ఇంధన (పెట్రోల్, డీజిల్) ధరలను తగ్గించాలని కేంద్రం యోచిస్తోంది. ఈ తరుణంలో పంజాబ్ ప్రభుత్వం షాకిస్తూ పెట్రోల్, డీజిల్ ధరలపై ట్యాక్స్ పెంచుతున్నట్లు ప్రకటించింది. కొన్ని రోజులకు ముందు కర్ణాటక, గోవా రాష్ట్రాలు కూడా పెట్రోల్‌పై పన్ను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఇదే బాటలో పంజాబ్ ప్రభుత్వం కూడా అడుగులు వేసింది.పెట్రోల్, డీజిల్‌పై వ్యాల్యూ యాడెడ్ ట్యాక్ (వ్యాట్) పెంచుతూ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి పంజాబ్ క్యాబినెట్ గురువారం ఆమోదం తెలిపింది. ఇదీ చదవండి: ప్రపంచంలోనే అతి చిన్న వాక్యూమ్ క్లీనర్: విశేషాలుక్యాబినెట్ సమావేశం ముగిసిన తరువాత మీడియాతో మాట్లాడిన ఆర్థిక మంత్రి హర్పాల్ సింగ్ చీమా.. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పెట్రోల్‌పై వ్యాట్‌ను లీటర్‌కు 61 పైసలు, డీజిల్‌పై 92 పైసలు పెంచనున్నట్లు ఆయన వెల్లడించారు. వ్యాట్ని పెంచడం వల్ల డీజిల్‌పై రూ. 395 కోట్లు, పెట్రోల్‌పై రూ.150 కోట్ల ఆదాయం పెరుగుతుందని చీమా స్పష్టం చేశారు. -
శంభూ ఉద్యమరైతుల గోడు వినేందుకు కమిటీ
న్యూఢిల్లీ: గత 200 రోజులుగా పంజాబ్, హరియాణా సరిహద్దులోని శంభూ సరిహద్దు వద్ద ఉద్యమం కొనసాగిస్తున్న రైతుల సాధకబాధకాలను పట్టించుకునేందుకు సర్వోన్నత న్యాయస్థానం ముందుకొచి్చంది. ఇందుకోసం పంజాబ్, çహరియాణా హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ నవాబ్ సింగ్ నేతృత్వంలో అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటుచేసింది. నిరసనబాట పట్టిన రైతన్నల సమస్యలను వినాలని, నెలల తరబడి రహదారిపై నిలిపిన వారి ట్రాక్టర్లు, ట్రాలీలు తదితరాలను హైవేల నుంచి తొలగించేందుకు రైతులను ఒప్పించాలని కమిటీకి కోర్టు సూచించింది. కమిటీ వారం రోజుల్లోపు తొలి భేటీ జరపాలని సుప్రీంకోర్టు జడ్జీలు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాల్ల ధర్మాసనం ఆదేశించింది. ఫిబ్రవరి 13వ తేదీ నుంచి శంభూ వద్ద ప్రభుత్వం ఏర్పాటుచేసిన బారీకేడ్లను తొలగించాలంటూ హైకోర్టు ఇచి్చన ఉత్తర్వులను సవాల్ చేస్తూ హరియాణా ప్రభుత్వం వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు పై విధంగా స్పందించింది. ఈ కమిటీకి సలహాలు, సూచనలు చేసేందుకు పంజాబ్, హరియాణా రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నట్లు కోర్టు స్పష్టంచేసింది. పిటిషన్ తదుపరి విచారణను అక్టోబర్ 14వ తేదీకి వాయిదావేసింది. -
రైతు సమస్యలపై కమిటీ ఏర్పాటు: సుప్రీం
ఢిల్లీ: కనీస మద్దతు ధర, రైతుల ఇతర సమస్యల పరిష్కారానికి సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రైతులు సమస్యల పరిష్కారం కోసం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు సోమవారం ప్రకటించింది. శంభు సరిహద్దు వద్ద ఉన్న రైతుల దిగ్బంధాన్ని తొలగించాలన్న పంజాబ్, హర్యానా హైకోర్టు ఆదేశాలపై హర్యానా రాష్ట్రం దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా రైతు సమస్యల పరిష్కారానికి పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నవాబ్ సింగ్ అధ్యక్షతన సుప్రీంకోర్టు కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. వారంలోగా రైతులతో తొలి చర్చలు జరపాలని కమిటీని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. ఇక.. రైతులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఢిల్లీ శివారులోని శంభు సరిహద్దులో ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 13వ తేదీ నుంచి పంటలకు మద్దతు ధర, ఇతర సమస్యలను పరిష్కారించాలని శంభు బోర్డర్లో రైతులు చేపట్టిన నిరసనలు ఇటీవల 200 రోజులను పూర్తి చేసుకున్నాయి. ఈ నిరసనలో స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ పాల్గొని రైతులకు సంఘీభావం తెలిపారు. -
Amritsar: భార్య, పిల్లల ఎదుటే ఎన్నారైపై కాల్పులు..
అమృత్సర్: అమెరికా నుంచి వచ్చిన ఓ ఎన్నారైపై పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. డబుర్జి ప్రాంతంలోని అతని నివాసంలో శనివారం .. భార్య పిల్లల ఎదుటే కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో అతడికి గాయాలవ్వగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.అమెరికా నివాసి అయిన సుఖ్‌చైన్ సింగ్ అనే ఎన్నారై నెల రోజుల క్రితం సొంతూరైన అమృత్‌సర్‌లోని డబుర్జి గ్రామానికి వచ్చాడు. హోటల్, లగ్జరీ కారు కొనుగోలుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం తలపాగా ధరించిన ఇద్దరు సాయుధ వ్యక్తులు బైక్‌పై సుఖ్‌చైన్ సింగ్ ఇంటికి చేరుకున్నారు. లోనికి చొరబడి తుపాకీతో బెదిరించి అతడితో వాగ్వాదానికి దిగారు.ఇంట్లో ఉన్న పిల్లలు, అతడి తల్లి ఏమీ చేయవద్దని వారిని ప్రాథేయపడ్డారు. అయితే సుఖ్‌చైన్ సింగ్‌ను బలవంతంగా బెడ్రూమ్లోకి తీసుకెళ్లేందుకు ఆ ఇద్దరు వ్యక్తులు ప్రయత్నించారు. అతడు ప్రతిఘటించడంతో పాయింట్ బ్లాంక్ రేంజ్లో తల, మెడపై కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు.రెంబు బెల్లెట్లు తగిలి తీవ్రంగా గాయమవ్వడంతో సింగ్‌ను ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలసీఉలు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. దుండగులు కాల్పులు జరపడం ఆ ఇంట్లోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ప్రస్తుతం సుఖ్‌చైన్ సింగ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. అత్త వారింటికి సంబంధించిన ఆస్తి వివాదం వల్ల స్థానిక గ్యాంగ్ సభ్యులు అతడిపై కాల్పులు జరిపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. -
ప్రజలపై ట్యాక్స్ పిడుగు.. భారీగా పెరిగిన వెహికల్స్ ధరలు
కార్లు, బైకుల ధరలను అప్పుడప్పుడు తయారీ సంస్థలే పెంచుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వమే వెహికల్ ట్యాక్స్ పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో అక్కడి వాహనాల ధరలు మరింత పెరుగుతాయి.పంజాబ్ ప్రభుత్వం ప్యాసింజర్ వాహనాలు, టూ వీలర్స్ మీద మోటార్ వెహికల్ ట్యాక్స్‌ను 05 నుంచి 1 శాతానికి పెంచింది. త్వరలో పండుగ సీజన్.. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వాహన అమ్మకాలపైన ప్రభావం చూపే అవకాశం ఉంది.పంజాబ్ రవాణాశాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. రూ. 15 లక్షల విలువైన ప్యాసింజర్ వాహనాలపైన ట్యాక్స్ 9 నుంచి 9.5 శాతానికి పెంచింది. దీంతో వాహనాలపై చెల్లించాల్సిన పన్ను రూ. 7000 నుంచి రూ. 20వేలకు పెరిగింది. అదే సమయంలో రూ. 15 లక్షల నుంచి రూ. 25 లక్షల విలువైన వాహనాలపైన ట్యాక్స్ 11 శాతం నుంచి 12 శాతానికి పెరిగింది. రూ. 25 లక్షల కంటే ఎక్కువ విలువైన వాహనాలపైన ట్యాక్స్ 13 శాతంగా ఉంది.ఇదీ చదవండి: రూ.30 లక్షల జీతం.. ట్రైన్లోనే ప్రయాణం: ఓ టెకీ సమాధానం ఇదేఇక ద్విచక్ర వాహనాల విషయానికి వస్తే.. రూ. 1 లక్ష కంటే తక్కువ ఖరీదైన ద్విచక్ర వాహనాల మీద ట్యాక్స్ 7 శాతం నుంచి రూ. 7.5 శాతానికి పెరిగింది. అలాగే రూ. 1 లక్ష నుంచి రూ. 2 లక్షల ఖరీదైన వాహనాలపైన ట్యాక్స్ 10 శాతంగా ఉంది. రూ. 2 లక్షల కంటే ఎక్కువ ఖరీదైన టూ వీలర్స్ మీద ప్రభుత్వం ట్యాక్స్‌ను 11 శాతానికి చేర్చింది.పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం వాహనాలపైన పెంచిన ట్యాక్స్.. తక్షణమే అమలులోకి వస్తుంది. దీంతో కార్లు, బైకుల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ట్యాక్స్ పెరుగుదల అమ్మకాలపైన ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయం త్వరలోనే తెలుస్తుంది. -
హైవేలు పార్కింగ్ స్థలం కాదు: సుప్రీం కోర్టు
ఢిల్లీ: శంభూ సరిహద్దు రహదారిని పాక్షికంగా తెరవాలని సుప్రీం కోర్టు హర్యానా, పంజాబ్ ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇరు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు శంభూ సరిహద్దు జిల్లాలు పాటియాల, అంబాల ఎస్సీలతో భేటీ అయి వారం రోజుల లోపు శంభూ సరిహద్దు హైవేను తెరవాలని ఆదేశించింది. ఈ విషయంపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు క్రమంలో సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది. హైవేలు ఉన్నది పార్కింగ్ స్థలం కోసం కాదని పేర్కొంది. వెంటనే పంజాబ్ ప్రభుత్వం రైతులతో చర్చలు జరిపి.. హైవే మీద నిలిపిన ట్రాక్టర్లను తొలగించేలా చూడాలని సూచించింది.అత్యవసర సేవలు అంబులెన్స్ రాకపోకలు, వృద్దులు, మహిళలు, విద్యార్థినీలు, స్థానిక ప్రయాణికుల అవసరాల కోసం శంభూసరిహద్దును పాక్షికంగా ఓపెన్ చేయాలని న్యాయమూర్తులు సూర్యకాంత్, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. అదేవిధంగా రాజకీయాలతో సంబంధంలేనివారితో ఓ కమిటీ ఏర్పాటు చేసి రైతులతో చర్చలతో జరపడానికి చేసిన కృషికి ఇరు రాష్ట్రా ప్రభుత్వాలను సుప్రీకోర్టు అభినందించింది. శంభు సరిహద్దులో నిరసన తెలుపుతున్న రైతులతో మాట్లాడేందుకు ఏర్పాటు చేయాల్సిన ప్యానెల్ నిబంధనలపై కూడా ఉత్తర్వులు జారీ చేస్తామని సుప్రీం కోర్టు తెలిపింది. ఇక.. పంటలకు మద్దతు ధర డిమాండ్ చేస్తూ.. పంజాబ్, హర్యానా రైతులు పెద్దఎత్తున దేశ రాజధాని ఢిల్లీ చేరుకొవాలని ప్రయత్నించగా వారిని పోలీసులు శంభుసరిహద్దుల్లో అడ్డుకున్నారు. దీంతో ఫిబ్రవరి 13 నుంచి శంభు సరిహద్దుల్లో రైతులు తమ ట్రాక్టర్లను రహదారికి అడ్డుపెట్టి నిరసన తెలుపుతున్నారు.