Rishab pant
-
చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్..
బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ అరుదైన ఘనత నమోదు చేశాడు. టెస్టు క్రికెట్లో 150 ఔట్లు సాధించిన మూడో భారత వికెట్ కీపర్‌గా పంత్ నిలిచాడు.ఈ మ్యాచ్‌లో ఉస్మాన్ ఖవాజా క్యాచ్ అందుకున్న పంత్.. ఈ రేర్ ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. పంత్ ఇప్పటివరకు 41 టెస్టు మ్యాచ్‌ల్లో వికెట్‌కీపర్‌గా 135 క్యాచ్‌లు, 15 స్టంపింగ్‌లు చేశాడు. పంత్ కంటే ముందు ఎంఎస్ ధోనీ, సయ్యద్ కిర్మాణి మాత్రమే ఈ ఘనత అందుకున్నారు. మిస్టర్ కూల్ 256 క్యాచ్‌లు, 36 స్టంపింగ్‌లతో 294 ఔట్లలో భాగస్వామ్యమయ్యాడు.అదే విధంగా రెండో స్ధానంలో ఉన్న సయ్యద్ కిర్మాణి 160 క్యాచ్‌లు, 38 స్టంపింగ్‌లతో మొత్తంగా 198 ఔట్ల్లో పాలుపంచుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రెండో రోజు వరుణుడు కరుణించాడు. తొలిసెషన్లో ఆస్ట్రేలియాకు భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా చుక్కలు చూపించాడు.28/0 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట ఆరంభించిన ఆస్ట్రేలియా ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. అయితే తొలి సెషన్లో భారత్ ఆధిపత్యం చెలాయించినప్పటకీ.. తర్వాత ఆస్ట్రేలియా తిరిగి పుంజుకుంది. 53 ఓవర్లకు ఆసీస్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది.చదవండి: IND vs AUS: కోహ్లితో అట్లుంటది మరి.. దెబ్బకు నోరు మూసుకున్న ఆసీస్ ఫ్యాన్స్! వీడియో -
సంపాదనలో టాప్.. విరాట్ కోహ్లిని దాటేసిన రిషబ్ పంత్
ఐపీఎల్-2025 మెగా వేలం భారత క్రికెటర్లను ఓవర్‌నైట్‌లో కోటీశ్వరులగా మార్చేసింది. ఇటీవల జెడ్డా వేదికగా జరిగిన ఈ క్యాష్‌రిచ్ మెగా వేలంలో టీమిండియా క్రికెటర్లపై కాసుల వర్షం కురిసింది. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ రూ. 27 కోట్లకు అమ్ముడుపోయి ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు.ఈ వేలంలో రిషబ్‌ను లక్నో సూపర్ జెయింట్స్ సొంతం చేసుకుంది. పంత్ తర్వాత అత్యంత ఎక్కువ ధర పలికిన ఆటగాళ్లగా శ్రేయస్ అయ్యర్(రూ. 26.75 కోట్లు), వెంకటేష్ అయ్యర్(రూ.23.75) నిలిచారు. మరోవైపు రిటెన్షన్ జాబితాలో అత్యధిక ధర దక్కించుకున్న భారత ఆటగాడిగా కోహ్లి నిలిచాడు. అతడిని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ. 21 కోట్లకు రిటైన్ చేసుకుంది.కోహ్లిని దాటేసిన పంత్.. అయితే ఆటగాళ్ల ఐపీఎల్ జీతాలు ఖారారు కావడంతో రిషబ్ పంత్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. క్రికెట్ ఒప్పందాల ద్వారా అత్యధికంగా సంపాదిస్తున్న భారత ఆటగాడిగా పంత్ నిలిచాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లిని పంత్ అధిగమించాడు. ఇండియన్ ప్లేయర్లకు బీసీసీఐ, ఐపీఎల్ కాంట్రాక్ట్‌ల ద్వారా వార్షిక అదాయం లభిస్తోంది. పంత్ క్రికెట్ కమిట్మెంట్లతో ఇప్పుడు ఏడాదికి రూ. 32 కోట్లు అందుకోన్నాడు. పంత్ ప్రస్తుతం బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ఎ కేటగిరీలో ఉన్నాడు.బీసీసీఐ కాంట్రాక్ట్ ద్వారా రిషబ్ ఏడాదికి రూ. 5 కోట్లు అందుకుంటున్నాడు. అదేవిధంగా ఈ ఏడాది నుంచి అతడికి ఐపీఎల్ కాంట్రక్ట్ ద్వారా రూ.27 కోట్లు లభించనున్నాయి. మొత్తంగా ఏడాదికి రూ. 32 కోట్లను ఈ ఢిల్లీ చిచ్చరపిడుగు అందుకోనున్నాడు.మరోవైపు విరాట్ కోహ్లి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ఎ ప్లస్ కేటగిరీలో ఉన్నాడు. బీసీసీఐ కాంట్రాక్ట్ వల్ల కోహ్లికి ఏడాదికి రూ. 7 కోట్లు అందుతున్నాయి. ఐపీఎల్లో ఆర్సీబీ రిటెన్షన్తోతో కోహ్లికి రూ. 21 కోట్లు అందనున్నాయి. మొత్తంగా కోహ్లి ఏడాదికి రూ.28 కోట్లు తీసుకుంటున్నాడు. అంటే పంత్ కంటే రూ. 4 కోట్లు కోహ్లి వెనకబడి ఉన్నాడు.చదవండి: -
రూ.27 కోట్లలో రిషబ్ పంత్ చేతికి వచ్చేది ఎంతంటే..
ఇటీవల జెడ్డాలో జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో టీమిండియా క్రికెటర్ 'రిషబ్ పంత్' ఏకంగా రూ.27 కోట్ల ధరకు పలికాడు. వికెట్ కీపర్, బ్యాటర్ అయిన పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్ (LSG) సొంతం చేసుకుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండూ కూడా పంత్ కోసం పోటీపడి ఊరుకున్నాయి.ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచిన రిషబ్ పంత్.. 27 కోట్ల రూపాయలకు పలికినప్పటికీ, పన్నులు వంటివి పోగా అతని చేతికి వచ్చే డబ్బు చాలా తగ్గుతుంది. పంత్ ఐపీఎల్ వేతనంలో కొంత శాతం ట్యాక్స్ రూపంలో పొందుతుంది. భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం ట్యాక్స్ రూపంలో ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.8.1 కోట్లు చేరుతుంది. అంటే పంత్ చేతికి వచ్చే డబ్బు రూ. 18.9 కోట్లన్నమాట.డిసెంబర్ 2022లో రోడ్డుప్రమాదం నుంచి బయటపడిన పంత్‌కు మోకాలి సర్జరీ జరిగింది. ఆ తరువాత పంత్ క్రికెట్ ఆడలేడేమో అని అందరూ భావించారు. కానీ పట్టువదలని విక్రమార్కునిలా మళ్ళీ బ్యాట్ చేతపట్టుకున్నాడు. టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. ఇప్పుడు ఐపీల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డ్ క్రియేట్ చేసుకున్నాడు. -
వేలంలో భారత క్రికెటర్లకు కాసుల పంట.. తొలి రోజు ఎవరు ఎంత ధర పలికారంటే..?
-
ఐపీఎల్-2025 మెగా వేలం లైవ్ అప్డేట్స్..
-
రిషబ్ పంత్ కి 30 కోట్లు?
-
రిషబ్ పంత్‌కు రూ.33 కోట్లు.. సొంతం చేసుకున్న పంజాబ్ కింగ్స్!?
ఐపీఎల్-2025 సీజన్ మెగా వేలానికి సర్వం సిద్దమైంది. నవంబర్ 24, 25వ తేదీల్లో సౌథీ అరేబియాలోని జెడ్డా నగరంలో ఈ క్యాష్ రిచ్ లీగ్ మెగా వేలం జరగనుంది. ఈ మెగా వేలం కోసం మొత్తం అన్ని ఫ్రాంచైజీలు ఇప్పటికే జెడ్డాకు చేరుకున్నాయి. ఈ ఆక్షన్‌లో అనుసరించాల్సిన వ్యూహాలను ఆయా ఫ్రాంచైజీలు సిద్దం చేసుకున్నాయి. మరోవైపు రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, జోస్ బట్లర్, శ్రేయస్ అయ్యర్ వంటి స్టార్ క్రికెటర్లు ఈ వేలంలో భాగం కావడంతో అభిమానులు సైతం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ మెగా వేలానికి ఒక్క రోజు ముందు అధికారిక బ్రాడ్‌కాస్టర్ జియో సినిమా "మెగా వేలం వార్ రూమ్" పేరిట ఓ కార్యక్రమం నిర్వహించింది. "మెగా వేలం వార్ రూమ్‌లో క్రికెట్ ఎక్స్పర్ట్స్ సంజయ్ బంగర్, ఆకాష్ చోప్రా, సురేష్ రైనా, రాబిన్ ఉతప్ప, ఇయాన్ మోర్గాన్, దీప్ దాస్ గుప్తా, ఎస్ బద్రీనాథ్, హనుమా విహారీ, అభినవ్ ముకుంద్,మైక్ హెస్సన్‌లు మొత్తం పాల్గోనున్నారు. ఒక్కొక్కరు ఒక్కో ఫ్రాంచైజీ ప్రతినిధులగా వ్యవహరించారు.రిషబ్ పంత్‌కు రూ.33 కోట్లు!ఇక "మెగా వేలం వార్ రూమ్"లో టీమిండియా స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ భారీ ధర పలికాడు. పంత్‌ను పంజాబ్ కింగ్స్ ఏకంగా రూ.33 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకుంది. పంత్ కోసం కేకేఆర్, పంజాబ్ కింగ్స్ ఆఖరి వరకు తీవ్రంగా పోటీ పడ్డాయి. కానీ పంజాబ్‌కు ప్రతినిథిగా వ్యహరించిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఏ మాత్రం వెనక్కుతగ్గలేదు. చివరికి కేకేఆర్ పోటీ నుంచి తప్పుకోవడంతో పంత్ పంజాబ్ సొంతమయ్యాడు. కాగా రియల్ వేలంలో పంత్ తన కనీస ధరను రూ. 2 కోట్లగా నమోదు చేసుకున్నాడు. అయితే పంత్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉండడంతో ఈ వేలంలో కాసుల వర్షం కురిసే అవకాశముంది. పంత్‌కు ఐపీఎల్లో మెరుగైన రికార్డు ఉంది. ఐపీఎల్లో ఇప్పటివరకు 111 మ్యాచ్‌లు ఆడిన ఈ ఢిల్లీ చిచ్చర పిడుగు 148.93 స్ట్రైక్ రేట్‌తో 3284 పరుగులు చేశాడు. ఈ ఏడాది సీజన్లో కూడా పంత్ సత్తాచాటాడు. 13 మ్యాచ్‌ల్లో 40 సగటుతో 446 పరుగులు చేశాడు.చదవండి: IND vs AUS: చరిత్ర సృష్టించిన జైశ్వాల్.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా -
వారెవ్వా పంత్.. ఆ షాట్ ఎలా కొట్టావు భయ్యా! వీడియో వైరల్
టెస్టు క్రికెట్లో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌లపై అదరగొట్టిన పంత్.. ఇప్పుడు ఆస్ట్రేలియా గడ్డపై కూడా అదే దూకుడును కనబరిచాడు. పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టెస్టులో రిషబ్ పంత్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఓ వైపు క్రమం తప్పకుండా వికెట్లు పడతున్నప్పటికీ ఈ ఢిల్లీ చిచ్చరపిడుగు మాత్రం ప్రత్యర్ధి బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. నితీష్ కుమార్ రెడ్డితో కలిసి స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. ఓవరాల్‌గా 78 బంతులు ఎదుర్కొన్న పంత్.. 3 ఫోర్లు, 1 సిక్సర్‌తో 37 పరుగులు చేసి ఔటయ్యాడు.పంత్ స్టన్నింగ్ షాట్..కాగా రిషబ్ తన ఇన్నింగ్స్‌లో సంచలన షాట్‌తో మెరిశాడు. అతడు కొట్టిన షాట్ మ్యాచ్ మొత్తానికే హైలెట్‌గా నిలుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. భారత ఇన్నింగ్స్ 41 ఓవర్ వేసిన పాట్ కమ్మిన్స్.. చివరి బంతిని రౌండ్ ది వికెట్ నుండి ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా సంధించాడు. వెంటనే పంత్ తన బ్యాటింగ్ పొజిషన్ మార్చుకుని ఎడమవైపునకు వచ్చి డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ మీదుగా స్కూప్ షాట్ ఆడాడు.అయితే ఈ షాట్ ఆడే క్రమంలో పంత్ బ్యాలెన్స్ కోల్పోయి కిందపడిపోయాడు. అయినప్పటకి అతడి పవర్‌కు బంతి బౌండరీ లైన్ అవతల పడింది. పంత్ షాట్ చూసి ప్రత్యర్ధి ఆటగాళ్లు సైతం ఫిదా అయిపోయారు.కామెంటేర్లు కూడా రిషబ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను క్రికెట్ ఆస్ట్రేలియా ఎక్స్‌లో షేర్ చేసింది. రిషబ్ పంత్ ఒక్కడే ఈ షాట్ ఆడగలడు అంటూ క్యాప్షన్‌గా ఇచ్చింది.150@ భారత్..ఇక మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 150 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో నితీష్ కుమార్ రెడ్డి(41) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో హాజిల్ వుడ్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. స్టార్క్, కమ్మిన్స్, మిచెల్ మార్ష్ తలా రెండు వికెట్లు సాధించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టిన ఆసీస్‌కు భారత బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు కోల్పోయి కేవలం 67 పరుగులు మాత్రమే చేసింది. ప్రస్తుతం క్రీజులో అలెక్స్ క్యారీ(19), మిచెల్ స్టార్క్(6) పరుగులతో ఉన్నారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్ రెండు, హర్షిత్ ఒక్క వికెట్ సాధించారు. As only Rishabh Pant can do! 6️⃣#AUSvIND | #PlayOfTheDay | @nrmainsurance pic.twitter.com/vupPuWA8GG— cricket.com.au (@cricketcomau) November 22, 2024 -
నన్ను రిటైన్ చేసుకోకపోవడానికి అది కారణం కాదు: రిషబ్ పంత్
ఐపీఎల్-2025 మెగా వేలంలో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ తనను రిటైన్ చేసుకోకపోవడంతో రిషబ్ వేలంలోకి వచ్చాడు.ఈ వేలంలో రూ. 2 కోట్ల కనీస ధరగా పంత్ తన పేరును నమోదు చేసుకున్నాడు. రిషబ్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉండడంతో ఈ మెగా వేలంలో కాసుల వర్షం కురిసే అవకాశముంది.క్లారిటీ ఇచ్చిన పంత్..అయితే ఈ ఏడాది సీజన్లో పంత్ అద్బుతంగా రాణించినప్పటికి ఢిల్లీ ఎందుకు వేలంలోకి విడిచిపెట్టిందో ఎవరికి ఆర్ధం కావడం లేదు. ఢిల్లీ మేనెజ్మెంట్తో విభేదాల కారణంగానే పంత్ బయటకు వచ్చాడని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.అతడు ఎక్కువ డబ్బు అడిగిన కారణంగానే ఢిల్లీ విడిచిపెట్టిందని మరి కొన్ని రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. తాజాగా ఇదే విషయంపై రిషబ్ పంత్ క్లారిటీ ఇచ్చాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తనను జట్టులో ఉంచుకోకపోవడానికి డబ్బు కారణం కాదని కచ్చితంగా నేను చెప్పగలను అని ఎక్స్‌లో రిషబ్ పోస్ట్ చేశాడు.కాగా ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ తమ సపోర్ట్ స్టాప్‌లో సమూల మార్పులు చేసింది. ఢిల్లీ తమ హెడ్‌కోచ్‌గా రికీ పాంటింగ్ స్థానంలో హేమంగ్ బదానీని, సౌరవ్ గంగూలీ ప్లేస్‌లో వేణుగోపాల్ రావును క్రికెట్ డైరెక్టర్‌గా నియమించింది. ఇక ఐపీఎల్ మెగా వేలం నవంబర్ 24, 25వ తేదీల్లో జెడ్డా వేదికగా జరగనుంది.చదవండి: BGT 2024: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్‌దే పైచేయి.. ఆసీస్‌కు మరోసారి సవాల్? The curious case of Rishabh Pant & Delhi! 🧐🗣 Hear it from #SunilGavaskar as he talks about the possibility of @RishabhPant17 returning to the Delhi Capitals!📺 Watch #IPLAuction 👉 NOV 24th & 25th, 2:30 PM onwards on Star Sports Network & JioCinema! pic.twitter.com/ugrlilKj96— Star Sports (@StarSportsIndia) November 19, 2024 -
'వేలంలో అతడికి రూ. 25 కోట్లు పైనే.. స్టార్క్ రికార్డు బద్దలవ్వాల్సిందే'
ఐపీఎల్-2025 సీజన్ మెగా వేలం నవంబర్ 24, 25 తేదీల్లో సౌథీ అరేబియాలోని జెడ్డా నగరంలో జరగనుంది. ఇందుకు అన్నిరకాల ఏర్పాట్లు బీసీసీఐ చేస్తోంది. ఈ మెగా వేలంలో మొత్తం 574 మంది క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. భారత్ నుంచి రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ వంటి స్టార్ క్రికెటర్లు సైతం ఉన్నారు.దీంతో ఫ్యాన్స్ కూడా ఈ వేలం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ క్యాష్ రిచ్ మెగా వేలానికి ముందు రిషబ్ పంత్‌పై భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా పంత్ నిలుస్తాడని పఠాన్ జోస్యం చెప్పాడు. కాగా గతేడాది జరిగిన ఐపీఎల్-2024 మినీ వేలంలో స్టార్క్‌ను రూ.24.75 కోట్లకు భారీ ధరకు కేకేఆర్ కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక అమ్ముడుపోయిన ఆటగాడిగా స్టార్క్ నిలిచాడు. కానీ ఇప్పుడు అతడి రికార్డు డేంజర్లో ఉందని, పంత్ కచ్చితంగా బ్రేక్ చేస్తాడని పఠాన్ ఎక్స్‌లో రాసుకొచ్చాడు.విడిచిపెట్టిన ఢిల్లీ..ఇక ఈ మెగా వేలానికి ముందు పంత్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసుకోలేదు. దీంతో పంత్ వేలంలో తన పేరును రూ.2 కోట్ల కనీస ధరగా నమోదు చేసుకున్నాడు. పంత్ తన రీ ఎంట్రీలో అదరగొడుతుండడంతో వేలంలో అతడిపై కాసుల వర్షం కురిసే అవకాశముంది.అతడి కోసం పంజాబ్ కింగ్స్, కేకేఆర్ పోటీ పడే ఛాన్స్ ఉన్నట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. 2016లో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన రిషబ్.. ఎనిమిది సీజన్ల పాటు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఇప్పుడు తొలిసారి అతడిని వేలంలోకి ఢిల్లీ ఫ్రాంచైజీ విడిచిపెట్టింది. దీంతో అందరి కళ్లు పంత్‌పైనే ఉన్నాయి.చదవండి: న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్‌పై నిషేధం.. -
అతడు క్రీజులో ఉన్నంతవరకూ మేము భయపడ్డాము: అజాజ్ పటేల్
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో 3-0 తేడాతో టీమిండియా వైట్‌వాష్ అయినప్పటికి స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తన అద్బుత ఇన్నింగ్స్‌లతో అందరని ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ముంబై వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో రిషబ్ విరోచిత పోరాటం కనబరిచాడు.బంతి గింగరాల తిరుగుతున్న చోట కివీస్ స్పిన్నర్లను పంత్ సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. విరాట్ కోహ్లి, గిల్, జైశ్వాల్ వంటి స్టార్ ప్లేయర్లు విఫలమైన చోట పంత్ బౌండరీల వర్షం కురిపించాడు. ఓ దశలో భారత్‌ను గెలిపించేలా కన్పించిన పంత్.. ఓ వివాదస్పద నిర్ణయంతో పెవిలియన్‌కు చేరాల్సి వచ్చింది. దీంతో 25 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి చవిచూసింది. అయితే మ్యాచ్ ముగిసి రెండు రోజులు అవుతున్నప్పటికి పంత్‌పై ప్రశంసల వర్షం కురుస్తునే ఉంది. అతడి సాహసోపేత ఇన్నింగ్స్‌కు న్యూజిలాండ్ ఆటగాళ్లు సైతం ఫిదా అయిపోయారు. పంత్ క్రీజులో ఉన్నప్పుడు ప్రత్యర్ధి జట్టు ఆటగాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయంట. ఈ విషయాన్ని స్వయంగా ముంబై టెస్టు హీరో అజాజ్ పటేల్ చెప్పుకోచ్చాడు.అజాజ్ పటేల్ తాజాగా ఎన్డీటీవీకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ క్రమంలో రిషబ్ పంత్ హాఫ్ సెంచరీ సాధించినప్పుడు న్యూజిలాండ్ జట్టు భయపడిందా అన్న ప్రశ్న అజాజ్‌కు ఎదురైంది. అవును రిషబ్ క్రీజులో ఉన్నప్పుడు మేముంతా చాలా భయపడ్డాము అని అజాజ్ పటేల్ బదులిచ్చాడు.ఈ సిరీస్‌లో రిషబ్ పంత్‌ను ఎక్కువగా టార్గెట్ చేశాం. అతడు క్రీజులో ఉన్నప్పుడు ఏ బౌలర్‌కు భయపడడు. ఏది ఏమైనా తన ఆట ఆడుతుంటాడు. క్రీజులో ఉన్నంతసేపు పరుగులు రాబట్టడానికే ప్రయత్నిస్తాడు. అతడు త్వరగా ఔట్ అయితే ఏ సమస్య లేదని అజాజ్ పటేల్ అదే ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.చదవండి: బీసీసీఐ మాస్టర్ ప్లాన్.. ముందుగానే ఆస్ట్రేలియాకు ఆ ఇద్దరు స్టార్ ప్లేయర్లు? -
'బుమ్రా, గిల్ కాదు.. టీమిండియా నెక్ట్స్ కెప్టెన్ అతడే'
స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను 3-0 తేడాతో టీమిండియా కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ తన మార్క్‌ను చూపించలేకపోయాడు. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు.ఫలితంగా తొలిసారి సొంతగడ్డపై మూడు లేదా అంతకంటే ఎక్కువ టెస్టుల సిరీస్‌లో భారత్ వైట్‌వాష్ గురైంది. దీంతో రోహిత్ శర్మ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. టెస్టులకు గుడ్‌బై చెప్పాల్సిన సమయం అసన్నమైంది అని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.అయితే రోహిత్ శర్మ భవితవ్యం త్వరలో జరగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫలితంపై ఆధారపడి ఉంది. ఒకవేళ భారత జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఆర్హత సాధించికపోతే హిట్‌మ్యాన్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశముంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బీజీటీ తర్వాత ఒకవేళ రోహిత్ రిటైర్మెంట్ ప్రకటిస్తే తదుపరి భారత టెస్టు కెప్టెన్‌గా రిషబ్ పంత్ బాధ్యతలు చేపడతాడని కైఫ్ జోస్యం చెప్పాడు."ప్రస్తుత భారత జట్టులో రిషబ్ పంత్ మాత్రమే టెస్ట్ కెప్టెన్‌గా పోటీలో ఉన్నాడు. భారత టెస్టు కెప్టెన్ అయ్యే అన్ని రకాల ఆర్హతలు పంత్‌కు ఉన్నాయి. అతడు ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ జట్టుకు తన వంతు న్యాయం చేస్తున్నాడు. ఏ స్ధానంలోనైనా బ్యాటింగ్ చేయగల సత్తా పంత్‌కు ఉంది.ఇప్పటికే ఎన్నో మ్యాచ్ విన్నింగ్ నాక్‌లు ఆడాడు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా,దక్షిణాఫ్రికా వంటి విదేశీ పిచ్‌లపై కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. అది స్పిన్ ట్రాక్, పేస్ ట్రాక్ అయినా పంత్ ఒకేలా బ్యాటింగ్ చేస్తాడు" అని తన ఇనాస్టా లైవ్‌లో పేర్కొన్నాడు.కాగా ప్రస్తుతం టెస్టుల్లో రోహిత్ శర్మ డిప్యూటీగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వ్యవహరిస్తున్నాడు. గతంలో ఓసారి రోహిత్ గైర్హజరీలో జట్టును కూడా బుమ్రా నడిపించాడు. ఈ క్రమంలో బుమ్రాను కాదని పంత్‌ను రోహిత్ వారసుడిగా కైఫ్ ఎంచుకోవడం అందరిని విస్మయానికి గురిచేస్తోంది.చదవండి: Paris Olympics 2024: ఆమె మగాడే.. సంచలన విషయాలు వెలుగులోకి!.. భజ్జీ రియాక్షన్ -
ఐపీఎల్ వేలంలో రిషబ్ పంత్‌కు రూ. 50 కోట్లు!?
ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టెస్టులో 25 పరుగుల తేడాతో టీమిండియా పరాజయం పాలైన విషయం విధితమే. అయితే ఈ మ్యాచ్‌లో భారత ఓటమి చవిచూసినప్పటకి.. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ మాత్రం తన విరోచిత పోరాటంతో ఆకట్టుకున్నాడు. విరాట్ కోహ్లి, గిల్, జైశ్వాల్ వంటి స్టార్ ప్లేయర్లు కివీస్ స్పిన్నర్ల వలలో చిక్కుకున్న విలవిల్లాడిన చోట రిషబ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తనదైన శైలిలో బ్యాటింగ్ చేస్తూ భారత్ డగౌట్లో ఆశలు రేకెత్తించాడు. కానీ అనూహ్యంగా పంత్ ఔట్ కావడంతో మ్యాచ్ భారత్ చేజారిపోయింది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 57 బంతులు ఎదుర్కొన్న పంత్ 9 ఫోర్లు, 1 సిక్సర్‌తో 64 పరుగులు చేసి ఔటయ్యాడు. కివీస్ సిరీస్ అసాంతం పంత్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 89.38 స్ట్రైక్ రేటుతో పంత్ 261 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో రిషబ్ పంత్‌పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ ప్రశంసల వర్షం కురిపించాడు. పంత్ బ్యాటింగ్ టెక్నిక్‌ను బాసిత్ అలీ మెచ్చుకున్నాడు. అదేవిధంగా ఐపీఎల్-2025 మెగా వేలంలో పంత్ రూ. 50 కోట్ల భారీ ధరకు అమ్ముడుపోతాడని అలీ జోస్యం చెప్పాడు.రూ. 50 కోట్లు ఇవ్వాలి.."రిషబ్ పంత్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ వికెట్‌పై మిగితా ప్లేయర్లంతా ఇబ్బంది పడితే పంత్ ఒక్కడే ప్రత్యర్ధి బౌలర్లను ఎటాక్ చేశాడు. అతడు ప్లాట్ పిచ్‌పై ఆడుతున్నట్లు బ్యాటింగ్ చేశాడు. అతడి షాట్ సెలక్షన్ గురుంచి ఎంతచెప్పుకున్న తక్కువే.అతడు ఎటువైపు ఆడాలనుకుంటే ఆటువైపు ఈజీగా షాట్లు ఆడాడు. మిగితా ఆటగాళ్లు పంత్‌లా ఆడలేకపోయారు. రిషబ్ తొలి ఇన్నింగ్స్‌లో 60, రెండో ఇన్నింగ్స్‌లో 64 పరుగులు చేశాడు. అతడు ఐపీఎల్ వేలంలో భారీ ధరకు అమ్ముడుపోతాడు. పంత్ రూ.25 కోట్లకు అమ్ముడుపోతాడని అంతా అనుకుంటున్నారు.కానీ నావరకు అయితే పంత్‌కు రూ. 50 కోట్లు ఇచ్చి తీసుకున్నా తప్పులేదు అని తన యూట్యూబ్ ఛానల్లో అలీ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు రిషబ్ పంత్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ విడిచిపెట్టిన సంగతి తెలిసిందే.చదవండి: IND vs NZ: టీమిండియాపై సచిన్ సీరియస్.. అసలు తప్పు ఎక్కడ జరిగింది? -
'ధోని వారసుడు అతడే.. వేలంలోకి వస్తే రికార్డులు బద్దలవ్వాల్సిందే'
ఐపీఎల్-2025కు సంబంధించిన ఆటగాళ్ల రిటైన్షన్స్ జాబితాను సమర్పించేందుకు సమయం దగ్గర పడుతోంది. అక్టోబర్ 31 సాయంత్రం ఐదు గంటల లోపు ఆయా ఫ్రాంచైజీలు వాళ్లు అట్టిపెట్టుకునే ప్లేయర్ల లిస్ట్‌ను బీసీసీఐకు అందజేయాల్సి ఉంది.అయితే ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీలు తమ రిటైన్ చేసుకునే ఆటగాళ్లు లిస్ట్‌ను ఖారారు చేసుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని ఫ్రాంచైజీలు సంచలన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అందులో ఒక ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం తమ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్‌ను మెగా వేలంలోకి విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. పంత్ కూడా ఇటీవలే చేసిన ఓ పోస్ట్ ఈ వార్తలకు మరింత ఊతమిచ్చాయి. ఐపీఎల్ వేలంలోకి వస్తే నేను అమ్ముడుపోతానా లేదా? ఒకవేళ తీసుకుంటే ఎంతకు అమ్ముడవుతాను’’ అని ఎక్స్‌లో పంత్ పోస్టు చేశాడు. దీంతో పంత్ ఢిల్లీని వీడేందుకు సిద్దమయ్యాడని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. తాజాగా ఇదే విషయంపై న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ సైమన్ డౌల్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు."రిషబ్ పంత్ వేలంలోకి వస్తే రికార్డులు బ్రేక్ అవ్వాల్సిందే. చెన్నై సూపర్ కింగ్స్ అతడి కోసం ఎన్ని కోట్లనైనా వెచ్చిస్తోంది. పంత్‌ను మనం ఎల్లో జెర్సీలో చూడబోతున్నాం. అదే విధంగా ధోని ఒక్క ఈ సీజన్లో ఆడే అవకాశముంది.ఆ తర్వాత ధోని నుంచి వికెట్ కీపింగ్ బాధ్యతలు పంత్ స్వీకరిస్తాడు అని సైమన్ డౌల్ జోస్యం చెప్పాడు. కాగా ఎప్పటి నుంచో సీఎస్కేలోకి పంత్ వెళ్లనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. ఏదమైనప్పటికి పంత్ ఢిల్లీలో కొనసాగుతాడా లేదా తెలియాలంటే అక్టోబర్ 31 వరకు వేచి ఉండాల్సిందే.చదవండి: ఇదేం కెప్టెన్సీ రోహిత్?.. మాజీ హెడ్‌కోచ్ ఘాటు విమర్శలు -
టీమిండియాకు భారీ షాక్.. రెండో టెస్టుకు డేంజరస్ ప్లేయర్ దూరం!?
బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో 8 వికెట్ల తేడాతో భారత్ ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. దీంతో మూడు టెస్టుల సిరీస్‌లో టీమిండియా 1-0 వెనకంజలో నిలిచింది. ఈ క్రమంలో ఆక్టోబర్ 24 నుంచి పుణే వేదికగా జరగనున్న రెండో టెస్టులో ఎలాగైనా గెలిచి సిరీస్ సమం చేయాలని భారత జట్టు భావిస్తోంది. అందుకు తగ్గట్టే టీమిండియా మెనెజ్‌మెంట్ వ్యూహాలు రచిస్తోంది. రెండో టెస్టుకు భారత జట్టులో ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను సెలక్టర్లు చేర్చారు. అంతేకాకుండా పేసర్ ఆకాష్ దీప్‌ను కూడా ఫుణే టెస్టులో ఆడించాలని భారత జట్టు మెనెజ్‌మెంట్ భావిస్తుందంట.రిషబ్ పంత్ దూరం?ఇక కివీస్ రెండో టెస్టుకు ముందు భారత్‌కు భారీ షాక్ తగిలే అవకాశముంది. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ గాయం కారణంగా పుణే టెస్టుకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. మొదటి టెస్టులో పంత్ మోకాలికి గాయమైంది. దీంతో తొలి టెస్టు నాలుగో రోజు ఆట మొత్తానికి పంత్ దూరమయ్యాడు.ఆ తర్వాత భారత సెకెండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన పంత్(99) అద్భుతమైన ప్రదర్శన చేశాడు. కానీ పంత్ బ్యాటింగ్‌కు వచ్చినప్పటకి ఇంకా పూర్తి ఫిట్నెస్ మాత్రం సాధించినట్లు కన్పించలేదు. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం బ్యాటింగ్ మాత్రమే చేసిన పంత్ ఫీల్డింగ్‌కు మాత్రం రాలేదు. అతడి స్ధానంలో ధ్రువ్ జురెల్ వికెట్ కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. ఈ క్రమంలోనే రెండో టెస్టుకు పంత్‌కు విశ్రాంతి ఇవ్వాలని గంభీర్ ఎండ్ కో యోచిస్తున్నట్లు సమాచారం. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు అతడిని ఆడించి ఎటువంటి రిస్క్ తీసుకోడదని జట్టు మెనెజ్‌మెంట్ నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.చదవండి: T20 WC 2024: వరల్డ్ ఛాంపియన్స్‌గా న్యూజిలాండ్.. ప్రైజ్ మనీ ఎన్ని కోట్లంటే? -
వారెవ్వా పంత్.. దెబ్బకు ధోని రికార్డు బద్దలు
బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఫైటింగ్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఓ వైపు గాయం బాధపడుతూనే సెకెండ్ ఇన్నింగ్స్‌లో తన 12వ టెస్ట్ హాఫ్ సెంచరీని సాధించాడు. గాయం కారణంగా మూడో రోజు ఆటకు దూరమైన పంత్.. కీలకమైన నాలుగో రోజు ఆటలో తిరిగి మైదానంలో మళ్లీ అడుగుపెట్టాడు. ఈ క్రమంలో సర్ఫరాజ్ ఖాన్‌తో కలిసి భారత స్కోర్ బోర్డును పంత్ పరుగులు పెట్టిస్తున్నాడు. తొలుత కాస్త ఆచితూచి ఆడిన రిషబ్.. నెమ్మదిగా తన బ్యాటింగ్‌లో స్పీడ్‌ను పెంచాడు. 54 పరుగులతో పంత్ ఆజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు 5 ఫోర్లు, 3 సిక్స్‌లు ఉన్నాయి.ధోని రికార్డు బద్దలుఇక ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో మెరిసిన పంత్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 2,500 పరుగుల మైలు రాయిని అందుకున్న భారత వికెట్ కీపర్‌గా పంత్ రికార్డులకెక్కాడు. ఇంతకు ముందు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పేరిట ఉండేది. ధోని ఈ మైలు రాయిని 69 ఇన్నింగ్స్‌లలో అందుకోగా.. రిషబ్ కేవలం 62 ఇన్నింగ్స్‌లలోనే సాధించాడు. చదవండి: IND vs NZ: చరిత్ర సృష్టించిన టీమిండియా.. 147 ఏళ్లలో తొలిసారి! -
టీమిండియాకు గుడ్ న్యూస్.. విధ్వంసకర వీరుడు వచ్చేశాడు
బెంగుళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియాకు గుడ్ న్యూస్. గాయం కారణంగా మూడో రోజు ఆటకు దూరమైన భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తిరిగి మైదానంలో అడుగు పెట్టాడు. భారత రెండో ఇన్నింగ్స్‌లో నాలుగో రోజు ఆట సందర్భంగా పంత్ బ్యాటింగ్‌కు వచ్చాడు. సర్ఫరాజ్ ఖాన్‌తో కలిసి నాలుగో రోజును పంత్ ప్రారంభించాడు. నిజంగా ఇది భారత్‌కు ఆదిరిపోయే వార్త అనే చెప్పుకోవాలి. పంత్ గాయం తీవ్రమైనది కావడంతో మళ్లీ మైదానంలో అడుగుపెట్టడని చాలా మంది భావించారు. కానీ పంత్ మాత్రం ఫిజియోల సాయంతో ఫిట్నెస్ సాధించి బ్యాటింగ్‌కు దిగాడు. ప్రస్తుతం భారత్ 53 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. క్రీజులో సర్ఫరాజ్ ఖాన్(88), పంత్(1) ఉన్నారు. భారత్ ఇంకా 103 పరుగుల వెనకంజలో ఉంది. -
IND vs NZ: భారత్‌కు భారీ షాక్! కివీస్ సిరీస్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్?
బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియాకు భారీ షాక్ తగిలింది. రెండో రోజు ఆటలో గాయపడ్డ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్.. మూడో రోజు ఆటకు దూరమయ్యాడు.అతడి గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మూడో రోజు ఆటకు పంత్ మైదానంలో అడుగుపెట్టలేదు. అతడి స్ధానంలో ధ్రువ్ జురెల్ సబస్ట్యూట్ వికెట్ కీపర్‌గా కొనసాగుతున్నాడు.ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. "పంత్ ప్రస్తుతం మా వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. మూడో రోజు అతడు వికెట్ కీపింగ్‌కు దూరంగా ఉండనున్నాడని" బీసీసీఐ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.అసలేం జరిగిందంటే?కివీస్ ఇన్నింగ్స్ 37వ ఓవర్లో రవీంద్ర జడేజా వేసిన బంతిని కివీస్ బ్యాటర్ డెవాన్ కాన్వే షాట్ ఆడేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఈ క్రమంలో బాల్ ఆఫ్ స్టంప్ మీదుగా వచ్చి పంత్ మెకాలికి బలంగా తాకింది. దీంతో అతడు నొప్పితో విలవిల్లాడుతూ మైదానాన్ని వీడాడు. అయితే తొలి రోజు ఆట అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ పంత్ గాయంపై అప్డేట్ ఇచ్చాడు. ఇటీవల సర్జరీ చేయించుకున్న మోకాలికే గాయం అయిందని, మేం ఎలాంటి రిస్క్ తీసుకోలేమని అన్నాడు. పంత్ ఈ మ్యాచ్‌లో పునరాగమనం చేస్తాడని ఆశిస్తున్నాం అంటూ రోహిత్ చెప్పుకొచ్చాడు. కాగా వచ్చే నెలలో కీలకమైన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరగనుండంతో ముందు జాగ్రత్తగా పంత్‌ను కివీస్ సిరీస్ నుంచి తప్పించే అవకాశముంది. ఈ మ్యాచ్‌లో కూడా పంత్ తిరిగి మైదానంలో అడుగుపెట్టే అవకాశాలు తక్కువగా కన్పిస్తున్నాయి. ఒకవేళ పంత్ దూరమైతే ధ్రువ్ జురెల్ తుది జట్టులోకి రానున్నాడు. జురెల్ ఇప్పటికే తనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకున్నాడు. UPDATE: Mr Rishabh Pant will not keep wickets on Day 3. The BCCI Medical Team is monitoring his progress.Follow the match - https://t.co/FS97Llv5uq#TeamIndia | #INDvNZ | @IDFCFIRSTBank— BCCI (@BCCI) October 18, 2024 -
రిషబ్ పంత్‌కు బిగ్ షాక్.. ఢిల్లీ కెప్టెన్‌గా స్టార్ ప్లేయర్?
ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాంఛైజీ బిగ్ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తమ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు నుంచి పంత్‌ను తప్పించాలని ఢిల్లీ క్యాపిటల్స్ భావిస్తున్నట్లు సమాచారం. అతడి స్ధానంలో స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు తమ జట్టు పగ్గాల అప్పగించాలని సదరు ఫ్రాంచైజీ నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అక్షర్ గత కొన్ని సీజన్లగా ఢిల్లీ జట్టులో కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. ప్రతీ సీజన్లోనూ అక్షర్ తన మార్క్‌ను చూపిస్తున్నాడు. ఈ ఏడాది సీజన్లోనూ అక్షర్ పటేల్ అదరగొట్టాడు.14 మ్యాచ్‌లు ఆడి 11 వికెట్లతో పాటు 235 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే అతడిని తమ కెప్టెన్‌గా నియమించాలని ఢిల్లీ ఫ్రాంచైజీ ఫిక్స్ అయినట్లు పేర్కొంటున్నాయి. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ పంత్‌ను మాత్రం తమ టాప్ రిటెన్షన్ ప్లేయర్‌గా అంటిపెట్టుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అతడిని రూ. 18 కోట్లు వెచ్చించి రిటైన్ చేసుకోవడానికి ఢిల్లీ సిద్దంగా ఉందంట. పంత్‌తో పాటు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్‌ను ఢిల్లీ రిటైన్ చేసుకున్నట్లు వినికిడి.ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్ కోసం వెతుకుతోంది. భారత స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఢిల్లీ న్యూ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశముంది. పంత్‌ను ఢిల్లీ టాప్ రిటెన్షన్‌గా అంటిపెట్టుకోనుంది. అతడి కెప్టెన్సీ ఒత్తడి లేకుండా పూర్తిగా తన ఆటపై దృష్టిపెడతాడని మెనెజ్‌మెంట్ భావిస్తోంది అని ఐపీఎల్ మూలాలు వెల్లడించాయి.చదవండి: IPL 2025: డేల్ స్టెయిన్ సంచలన నిర్ణయం.. ఎస్ఆర్హెచ్కు గుడ్ బై -
రిషబ్ పంత్‌కు ఢిల్లీ షాక్ ఇవ్వనుందా? ట్వీట్ వైరల్
ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ తమ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్‌ను విడిచిపెట్టనుందా? చెన్నైసూపర్ కింగ్స్‌కు పంత్ వెళ్లనున్నాడా? అంటే అవుననే సమాధనామే ఎక్కువగా వినిపిస్తోంది. తాజాగా రిషబ్ పంత్ చేసిన ట్వీట్ కూడా ఈ వార్తలకు మరింత ఊతమిస్తుంది. ఒకవేళ నేను ఐపీఎల్ వేలంలో పాల్గొంటే ఎవరైనా కొనుగోలు చేస్తారా లేదా? ఎంత ధరకు అమ్ముడు పోతాను? అంటూ రిషబ్ ఎక్స్లోక్రిప్టిక్ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇదే విషయం క్రీడా వర్గాల్లో చర్చానీయంశమైంది. ఈ క్రమంలో కొంతమంది ఢిల్లీ ఫ్రాంచైజీని పంత్ వీడనున్నాడని అభిప్రాయపడుతుంటే, మరి కొంత మంది అతడు ఏదో ఫన్నీగా పోస్ట్ చేసి ఉంటాడని చెప్పుకొస్తున్నారు.ఢిల్లీ విడిచిపెట్టనుందా?కాగా ఢిల్లీ క్యాపిటల్స్‌కు కీలకమైన ఆటగాళ్లలో రిషబ్ పంత్ ఒకడనడంలో ఎలాంటి సందేహం లేదు. గత కొన్ని సీజన్ల నుంచి కెప్టెన్‌గానే కాకుండా వ్యక్తిగత ప్రదర్శన పరంగా కూడా పంత్ అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు.ఈ ఏడాది సీజన్లో కూడా పంత్ అదరగొట్టాడు. ఐపీఎల్-2024లో 446 పరుగులు చేసిన పంత్.. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే ఇటువంటి అద్భుత ఆటగాడిని ఢిల్లీ విడిచిపెట్టే సాహాసోపేత నిర్ణయం తీసకుంటుందో లేదో వేచి చూడాలి. ఒకవేళ అతడు వేలంలోకి వస్తే భారీ ధర పలకడం ఖాయం. -
కోహ్లికి సారీ చెప్పిన పంత్.. హగ్ చేసుకుని మరి(వీడియో)
బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఎట్టకేలకు తన బ్యాట్‌ను ఝళిపించాడు. కాన్పూర్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో కోహ్లి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 35 బంతుల్లోనే 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 47 పరుగులు చేశాడు.అయితే ఈ మ్యాచ్‌లో కూడా కోహ్లి సింగిల్ డిజిట్ స్కోర్ పరిమితమయ్యే వాడు. రెండు పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బంగ్లా బౌలర్ తెలివి తక్కువ పనికి కోహ్లి ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.అసలేం జరిగిందంటే?భారత ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన ఖాలీద్ ఆహ్మద్ బౌలింగ్‌లో తొలి బంతిని కోహ్లి కవర్ డ్రైవ్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని తన ఫ్రంట్ప్యాడ్కు తాకుతూ పిచ్ దగ్గరలోనే ఉండిపోయింది. అయితే నాన్‌స్ట్రైక్‌లో ఉన్న పంత్ రన్‌కు కాల్ ఇవ్వడంతో విరాట్ ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. కానీ పంత్ మాత్రం కాస్త ముందుకు వచ్చి మధ్యలోనే ఆగిపోయాడు. ఈ క్రమంలో బంగ్లా బౌలర్ ఖాలీద్ ఆహ్మద్ వికెట్ కీపర్ ఎండ్‌కు పరిగెత్తి బంతిని అందుకుని స్టంప్స్‌కు త్రో చేశాడు. కానీ బంతి మాత్రం స్టంప్స్‌కు తాకలేదు. అయితే కోహ్లి మాత్రం తన రనౌట్ అని భావించి వెనక్కి వచ్చే ప్రయత్నం చేయలేదు. ఎప్పుడైతే బంతి స్టంప్స్‌కు తాకలేదో వెంటనే కోహ్లి సేఫ్‌గా క్రీజులోకి వచ్చేచాడు. కాగా బంగ్లా బౌలర్ ఏ మాత్రం సమయస్పూర్తి ఉపయెగించలేదు.స్టంప్స్ దగ్గరకు వెళ్లి పడగొట్టే అంతసమయం ఉన్నప్పటకి దూరం నుంచి త్రో చేసి కోహ్లికి లైఫ్ ఇచ్చేశాడు. దీంతో బంగ్లా ఆటగాళ్లు మొత్తం నిరాశలో కూరుకుపోయారు. పంత్ మాత్రం కోహ్లి దగ్గరకు వచ్చి హాగ్ చేసుకుని మరీ సారీ చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. Luck favours the brave🫨Kohli survives to hug it out with Pant in the middle! 😍#IDFCFirstBankTestSeries #JioCinemaSports #INDvBAN pic.twitter.com/XVDyR0ffD3— JioCinema (@JioCinema) September 30, 2024 -
'గిల్, బుమ్రా, రాహుల్ కాదు.. అతడే టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్'
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తన రీ ఎంట్రీలో సత్తాచాటుతున్నాడు. దాదాపు 600 రోజుల తర్వాత టెస్టు క్రికెట్లో పునరాగమనం చేసిన రిషబ్.. తన తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. చెపాక్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో అద్భుతమైన సెంచరీతో మెరిశాడు.టెస్టుల్లో 6వ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా రిషబ్ పంత్ 2022 డిసెంబర్లో ఘోరమైన కారు ప్రమాదానికి గురయ్యాడు. దాదాపు ప్రాణాలు పోగొట్టుకునే స్థితి నుంచి అతను కోలుకున్న తీరు నమ్మలేనిది. కేవలం రెండేళ్లలోనే పూర్తి ఫిట్నెస్ సాధించి దుమ్ములేపుతున్న పంత్‌పై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది.వసీం అక్రమ్ వంటి దిగ్గజాలు సైతం ఈ ఢిల్లీ ఆటగాడిని పొగడ్తలతో ముంచెత్తాడు. పంత్‌ను మిరాకిల్ కిడ్ అని వసీం కొనియాడాడు. తాజాగా ఈ జాబితాలోకి మరో పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా చేరాడు. భారత జట్టులో వరల్డ్‌క్లాస్ ప్లేయర్లు ఉన్నారని, భవిష్యత్తులో భారత టెస్టు జట్టును పంత్ లీడ్ చేస్తాడని కనేరియా జోస్యం చెప్పాడు."ప్రస్తుత భారత జట్టును చూస్తుంటే ముచ్చటేస్తోంది. జట్టు విజయాల్లో ప్రతీ ప్లేయర్ తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్ వంటి అద్భతమైన ప్రదర్శన కనబరుస్తున్నారు. అందుకే భారత్ ప్రపంచ స్థాయి జట్టుగా నిలిచింది. రిషబ్ పంత్ భవిష్యత్తులో టెస్టుల్లో భారత జట్టుకు కచ్చితంగా సారథ్యం వహిస్తాడు. అతడు పునరాగమనం తర్వాత చాలా బాగా రాణిస్తున్నాడు. వికెట్ కీపర్‌గా అతడు ఎప్పుడూ బౌలర్లు, ఫీల్డర్లతో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు. అలా చేయడంతో మైదానంలో అందరూ చురుగ్గా ఉంటారు. నిజంగా భారత క్రికెట్ నుంచి బుల్లెట్ వంటి చురుకైన ఆటగాళ్లు పుట్టుకొస్తున్నారు" అని ఐఎఎన్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కనేరియా పేర్కొన్నాడు. -
పంత్‌కు అలా జరిగినప్పుడు.. పాక్‌లోనూ భయపడ్డాము: వసీం అక్రమ్
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తన టెస్టు క్రికెట్ రీ ఎంట్రీని ఘనంగా చాటుకున్న సంగతి తెలిసిందే. చెపాక్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో పంత్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. తనదైన స్టైల్లో బంగ్లా బౌలర్లను ఊచకోత కోశాడు. టెస్టుల్లో తనొక బ్రాండ్ అని మరోసారి రిషబ్ నిరూపించుకున్నాడు. 128 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్స్‌లతో 109 పరుగులు చేశాడు. ఈ క్రమంలో భయంకరమైన కారు ప్రమాదం నుంచి కోలుకుని మళ్లీ తన మార్క్ చూపించిన పంత్‌పై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా ఈ జాబితాలో పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్ చేరాడు. పంత్ తిరిగి రావడంతో ఆస్ట్రేలియా జట్టు జాగ్రత్తగా ఉండాలని అక్రమ్ హెచ్చరించాడు."రిషబ్ పంత్ ఆటను చూస్తుంటే సూపర్ మ్యాన్‌లా అద్భుతం చేశాడన్పిస్తోంది. అంతటి ప్రమాదం నుంచి కోలుకుని అతడు రీ ఎంట్రీ ఇవ్వడం చాలా గ్రేట్. అతడి కారు ప్రమాదం జరిగిన తీరును చూసి పాకిస్తాన్లో మేమంతా ఆందోళన చెందాము. అందులో నేను కూడా ఉన్నాను.అతడు త్వరగా కోలుకోవాలని ట్వీట్ కూడా చేశాను. టెస్టుల్లో పంత్ ఆట గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఆస్ట్రేలియా గడ్డపై అతడి సెంచరీ, ఇంగ్లండ్‌పై బ్యాటింగ్ చేసిన విధానం నిజంగా ఒక అద్భుతం. ముఖ్యంగా జేమ్స్ ఆండర్సన్, ప్యాట్ కమ్మిన్స్ వంటి వరల్డ్‌క్లాస్ బౌలర్లను సైతం పంత్ రివర్స్ స్వీప్ ఆడాడు. ఇందులో అతడిని మించినవారే లేరు.రోడ్డు ప్రమాదం తర్వాత ఎవరైనా సరే కోలుకోవడానికి చాలా రోజుల సమయం పడుతోంది. మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టాలంటే మానసికంగా చాలా దృఢంగా ఉండాలి. కానీ అందుకు భిన్నంగా పంత్ మాత్రం చాలా తక్కువ వ్యవధిలోనే తన ఫిట్నెస్ను సాధించాడు. పంత్ కథను తరతరాలు గుర్తు పెట్టుకుంటాయి. యువ క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలుస్తాడు. ఐపీఎల్ రీఎంట్రీలోనూ సత్తాచాటాడు. 40కి పైగా సగటుతో పరుగులు చేశాడు. ఆ తర్వాత టీ20 వరల్డ్‌కప్‌లోనూ రాణించాడు. అనంతరం తనకు ఇష్టమైన రెడ్‌బాల్ క్రికెట్లోనూ మెరిశాడు. పంత్ కమ్‌బ్యాక్ ఇవ్వడంతో ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్ మరింత రసవత్తరంగా మారడం ఖాయమనిపిస్తోంది. అతడిని ఆపేందుకు ఆసీస్ ఇప్పటి నుంచే వ్యూహాలను రచించాలని " అని స్పోర్ట్స్ కీడాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్రమ్ పేర్కొన్నాడు.చదవండి: IND vs BAN: అగార్కర్ కీలక నిర్ణయం.. జట్టు నుంచి స్టార్ ప్లేయర్ అవుట్? -
చరిత్ర సృష్టించిన పంత్.. ఎంఎస్ ధోని రికార్డు సమం
టీమిండియా కీపర్ రిషబ్ పంత్ తన టెస్టు క్రికెట్ రీఎంట్రీని ఘనంగా చాటుకున్నాడు. చెపాక్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో పంత్ అద్భుతమైన శతకంతో మెరిశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 39 పరుగులతో రాణించిన పంత్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం సూపర్ సెంచరీతో చెలరేగాడు. టీ20 క్రికెట్‌ను తలపిస్తూ బంగ్లా బౌలర్లను ఊతికారేశాడు. యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్‌తో కలిసి భారత స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 128 బంతులు ఎదుర్కొన్న రిషబ్.. 13 ఫోర్లు, 4 సిక్స్‌లతో 109 పరుగులు చేశాడు. పంత్‌కు ఇది ఆరువ టెస్టు సెంచరీ కావడం గమనార్హం. ఈ క్రమంలో పంత్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.ఎంఎస్ ధోని రికార్డు సమం..టెస్ట్ క్రికెట్లో అత్యధిక సెంచరీలు సెంచరీలు చేసిన భారత వికెట్ కీపర్‌గా లెజెండరీ ఆటగాడు ఎంఎస్ ధోని రికార్డును పంత్ సమం చేశాడు. ధోనీ 90 టెస్టుల్లో ఈ మైలురాయిని చేరుకోగా, పంత్ కేవలం 34 మ్యాచ్‌ల్లోనే ఈ రికార్డును అందుకున్నాడు. మరో సెంచరీ చేస్తే ధోనిని పంత్ అధిగమిస్తాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. బంగ్లాదేశ్ ముందు భారత్ 515 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది. మూడో రోజు ఆట ముగిసే సరికి బంగ్లా.. 37.2 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ విజయం సాధించాలంటే ఇంకో 357 పరుగులు అవసరం.చదవండి: 53 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి!WELCOME BACK TO TEST CRICKET, RISHABH PANT! 🙌🏻💯#RishabhPant #INDvBAN #IDFCFirstBankTestSeries #JioCinemaSports pic.twitter.com/C4gJuv29Y1— JioCinema (@JioCinema) September 21, 2024 -
స్టార్టప్ కంపెనీలో క్రికెటర్ రూ.7.4 కోట్లు పెట్టుబడి
భారత క్రికెటర్ రిషబ్ పంత్ సాఫ్ట్వేర్ సేవలందించే కంపెనీలో రూ.7.4 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు ప్రకటించారు. టెక్‌జాకీ అనే సాఫ్ట్వేర్ విక్రేతలకు సాయం చేసే కంపెనీ రూ.370 కోట్ల మూలధనాన్ని సమీకరించాలని నిర్ణయించింది. కంపెనీ ప్రణాళికలపై ఆసక్తి ఉన్నవారు ఇందులో ఇన్వెస్ట్ చేశారు. అందులో భాగంగా ప్రముఖ క్రికెటర్ రిషబ్ పంత్ కంపెనీ సమీకరించాలనుకునే మొత్తంలో రెండు శాతం వాటాను సమకూర్చారు.ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఫోర్స్పాయింట్ గ్లోబల్ సీఈఓ మానీ రివెలో కూడా ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టినట్లు కంపెనీ వ్యవస్థాపకులు ఆకాష్ నంగియా తెలిపారు. అయితే మానీ ఎంత ఇన్వెస్ట్ చేశారోమాత్రం వెల్లడించలేదు. ఈ సందర్భంగా నంగియా మాట్లాడుతూ..‘కంపెనీ భవిష్యత్తు కార్యకలాపాలకు మూలధనాన్ని సేకరించాలని నిర్ణయించాం. ముందుగా రూ.410 కోట్లు సేకరించాలనుకున్నాం. కానీ కొన్ని కారణాల వల్ల 10 శాతం తగ్గించి రూ.370 కోట్ల పెట్టుబడికి ప్రణాళికలు సిద్ధం చేశాం. తాజాగా సమకూరిన నిధులతో మార్కెటింగ్ ప్రయత్నాలను ముమ్మరం చేస్తాం. యూఎస్‌లో కంపెనీని విస్తరించడానికి ఈ నిధులు తోడ్పడుతాయి’ అని చెప్పారు.ఆకాష్ నంగియా గతంలో జొమాటో ఎగ్జిక్యూటివ్‌గా పని చేశారు. మెకిన్సేలో పని చేసిన అర్జున్ మిట్టల్ సాయంతో 2017లో టెక్‌జాకీ సాఫ్ట్వేర్ అగ్రిగేటర్ స్టార్టప్ కంపెనీను స్థాపించారు. ఇది దేశంలోని చిన్న వ్యాపారాల కోసం సాఫ్ట్‌వేర్‌ను విక్రయించేందుకు సాయపడుతుంది. ఈ ఏడాది ప్రారంభంలో అమెరికాలో తన కార్యకలాపాలు ప్రారంభించింది. టెక్‌జాకీ మైక్రోసాఫ్ట్, అడాబ్, ఏడబ్ల్యూఎస్, కెక, ఫ్రెష్‌వర్క్స్, మైబిల్ బుక్ వంటి కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ సుమారు రూ.125 కోట్లు ఆదాయాన్ని సంపాదించినట్లు అధికారులు తెలిపారు. 2024-25లో ఇది రూ.170-180 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఆర్బీఐ వడ్డీరేట్లు తగ్గిస్తుందా..?ఇటీవల కేఎల్ రాహుల్ మెటామ్యాన్ స్టార్టప్ కంపెనీలో పెట్టుబడి పెట్టారు. దక్షిణాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్ జులైలో భారత్‌కు చెందిన న్యూట్రిషన్ సప్లిమెంట్ బ్రాండ్ ‘సప్లై6’లో ఇన్వెస్ట్ చేశారు. ఏప్రిల్‌లో శ్రేయాస్ అయ్యర్ హెల్త్‌టెక్ ప్లాట్‌ఫామ్ ‘క్యూర్లో’లో పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు.