sangameswaram
-
తేలిన సంగమేశ్వర గోపురం
దోమలపెంట (అచ్చంపేట): శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం తగ్గుముఖం పట్టడంతో సంగమేశ్వర ఆలయ శిఖరం (గోపురం) తేలింది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా పరిధిలో ఉన్న సంగమేశ్వరాలయం కృష్ణానదిలో నాలుగు నెలల కిందట మునిగిపోయింది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం 862.8 అడుగులకు చేరుకోవడంతో ఆలయ గోపురం పూర్తిగా తేలింది. దీంతో ఆలయ పూజారి రఘురామశర్మ బోటులో వెళ్లి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి శిఖరంపై జెండాను ఎగురవేశారు. జలాశయంలో మరో 24 అడుగుల నీటిమట్టం తగ్గితే సంగమేశ్వర ఆలయం పూర్తిగా బయటపడుతుంది. అందుకోసం ఫిబ్రవరి రెండో వారం వరకు వేచి చూడాలి. -
గాల్లో తేలుతున్నట్లు.. నీటిపై నడయాడుతున్నట్లు..
నంద్యాల: ఆంధ్రప్రదేశ్ పర్యాటకసిగలో మరో కలికితురాయి చేరనుంది. పర్యాటక ప్రియులకు గాల్లో తేలుతున్నట్లు..నీటిలో నడయాడుతున్నట్లనిపించేలా.. అద్భుత అనుభూతిని కలిగించే ‘గాజు వంతెన’ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఎంతో ఎత్తైన ప్రదేశంలో నిర్మించే ఈ గాజువంతెనపై నడుసూ్త..కింద నీటి ప్రవాహాన్ని చూస్తూ ప్రకృతి అందాలను వీక్షించడం అంటే ఆ మజానే వేరు. చదవండి: అయ్యో.. మొబైల్ పోయిందా? ఇలా చేయండి నంద్యాల జిల్లా సంగమేశ్వరం వద్ద కృష్ణానదిపై ఈ గాజు వంతెన నిర్మితం కానుంది. రూ.703.68 కోట్లతో తెలంగాణ రాష్ట్రంలోని కల్వకుర్తి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల వరకు 167కేఏ జాతీయ రహదారి నిర్మించనున్నారు. ఈ రహదారి నిర్మాణంలో భాగంగా నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గ కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంగమేశ్వరం వద్ద కృష్ణా నదిపై గాజు వంతెనను నిర్మించనున్నారు. 800 మీటర్ల పొడవుతో నేషనల్ హైవేస్ ఆధ్వర్యంలో నిర్మించనున్న ఈ వంతెనకు కేంద్ర ప్రభుత్వం సైతం ఆమోదం తెలిపింది. దేశంలోనే తొలి రెండు అంతస్తుల కేబుల్ బ్రిడ్జి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా సంగమేశ్వరం వద్ద రెండు అంతస్తుల కేబుల్ బ్రిడ్జి నిర్మించనున్నారు. నదులపై వాహనాలు వెళ్లేందుకు రోడ్డు మార్గం, రైళ్లు వెళ్లేందుకు మరో మార్గం నిర్మిస్తారు. పర్యాటకులు అక్కడి ప్రకృతి సౌందర్యాన్ని వీక్షించేందుకు ప్రత్యేక కారిడార్‌తో కూడిన గాజు వంతెన నిర్మిస్తారు. స్తంభాలు లేని వంతెన ఏపీలోని సంగమేశ్వరం, తెలంగాణలోని మల్లేశ్వరం తీర ప్రాంతాలను అనుసంధానిస్తూ రెండు భారీ పైలాన్లను నిర్మిస్తారు. తీరం నుంచి 160 మీటర్ల తర్వాత పైలాన్లు ఉంటాయి. రెండు పైలాన్ల మధ్య 460 మీటర్ల దూరం ఉంటుంది. ఒక్కో పైలాన్‌కు రెండు వైపులా 15+15 చొప్పున 90 జతల భారీ కేబుల్స్ ఏర్పాటు చేసి వాటి ఆలంబనగా వంతెన నిలిచేలా నిర్మిస్తారు. ఇందులో సెంట్రల్ మీడియన్ భాగంలో గాజు ప్యానల్ కారిడార్ ఉంటుంది. దానికి రెండు వైపులా వాక్‌వేస్ ఉంటాయి. ఆ చివర, ఈ చివర గాజు ప్యానల్స్ ఉంటాయి. వీటి నుంచి దిగువన కృష్ణానది సోయగాలను చూడవచ్చు. గాజువంతెనపై నడుస్తూ నదిలో నడుస్తున్న అనుభూతినీ పొందవచ్చు. -
Photo Story: ‘నీళ్ల’కంఠుడు.. పూర్తిగా మునిగిన శివాలయం
చుట్టూ గుట్టలు.. పచ్చని పొలాలు.. మధ్యలో అలుగు పారుతున్న ఊకచెట్టు వాగు.. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పామాపురం సమీపంలో కనువిందు చేస్తున్న జలదృశ్యమిది. వాగు మధ్యలోని శివుడి విగ్రహం చుట్టూ నీళ్లు పారుతున్న చిత్రం ఆహ్లాదాన్ని కలిగిస్తోంది. – కొత్తకోట రూరల్ (వనపర్తి జిల్లా) నిజామాబాద్ జిల్లా కందకుర్తిలోని గోదావరి నదిలో గల పురాతన శివాలయం వరదనీటిలో పూర్తిగా మునిగింది. నిజామాబాద్ జిల్లాతో పాటు ఎగువన మహారాష్ట్రలో విస్తారంగా వర్షాలు కురవడంతో కందకుర్తి త్రివేణి సంగమ ప్రాంతం గోదావరి, మంజీర, హరిద్ర నదుల వరద నీటితో జలకళను సంతరించుకుంది. – రెంజల్(బోధన్) సోమశిల సమీపంలోని కృష్ణానదికి ఆవలి ఒడ్డున ఏపీలోని కర్నూలు జిల్లా సరిహద్దులో గల సంగమేశ్వరాలయం నీట మునిగింది. జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వదులుతుండడంతో నది నీళ్లు గుడిని తాకాయి. మంగళవారం రాత్రి నుంచి నదిలో వరద ఉధృతి పెరగడంతో బుధవారం సాయంత్రం దాదాపు 4 అడుగుల మేర గుడి నీటిలో మునిగింది. సోమశిల, మంచాలకట్ట, అమరగిరి ప్రాంతాల్లో నీటిమట్టం పెరగడంతో మత్స్యకారులు చేపల వేటను నిలిపివేశారు. – కొల్లాపూర్ (నాగర్‌కర్నూల్ జిల్లా) -
అల్లదిగో సంగమేశ్వరాలయం
కొత్తపల్లి: ఎగువ నుంచి భారీగా వరద నీరు రావడంతో సంగమేశ్వర క్షేత్రం పూర్తిగా జలగర్భానికి వెళ్లిపోయింది. మంగళవారం హధ్యాహ్నం 3 గంటల సమయానికి సంగమేశ్వరాలయ శిఖరం మినహా గుడి పూర్తిగా మునిగిపోయింది. దీంతో భక్తులు ఎగువన ఘాట్ వద్ద వెలసిన ఉమామహేశ్వరస్వామిని దర్శించుకుని వెళ్తున్నారు. -
కమనీయం..సంగమేశ్వరుని కల్యాణం
కొత్తపల్లి: సంగమేశ్వర క్షేత్రంలో సోమవారం శ్రీలలితా సంగమేశ్వరుని కల్యాణం.. కనులపండువగా నిర్వహించారు. ఉదయం ఏడుగంటల ప్రాంతంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు సప్తనదీజలాలతో వేదమంత్రాల మధ్య అభిషేకం నిర్వహించారు. నూతన పట్టువస్త్రాలతో స్వామి, అమ్మవార్లను వధూవరులుగా ముస్తాబు చేశారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కల్యాణ మండపం వద్దకు మేళతాళాలతో స్వామి, అమ్మవార్లను తీసుకొని వచ్చారు. బ్రాహ్మణులు వేదమంత్రాలను పఠిస్తుండగా అర్చకులు తెల్కపల్లి రఘురామశర్మ .. కల్యాణ వేడుకలను ప్రారంభించారు. ఉదయం 11గంటలకు స్వామివారి తరఫున అర్చకులు అమ్మవారి మెడలో మాంగల్యధారణ గావించారు. శ్రీలలితా సంగమేశ్వరస్వామివార్ల కల్యాణ వేడుకలను తిలకించిన భక్తులు తన్మయత్వానికి లోనయ్యారు. మహిళా భక్తులు.. పసుపు, కుంకుమ, గాజులు, చీర, సారెలతో అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించారు. వేడుకలను తిలకించేందుకు కర్నూలు, ఆత్మకూరు, నందికొట్కూరు ప్రాంతాలకు చెందిన భక్తులు వేలాదిగా తరలివచ్చారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వేడుకల్లో కలెక్టర్ సతీమణి: శ్రీలలితా సంగమేశ్వరుని కల్యాణ వేడుకలను తిలకించేందుకు జిల్లా కలెక్టర్ సత్యనారాయణ సతీమణి స్వర్ణశ్రీ, ఆయన కుమారులు వచ్చారు. వారు స్వామివారి వేపదారు శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కలెక్టర్ సతీమణి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించారు. వేడుకల్లో రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి, తహసీల్దారు రామకృష్ణ, ఇన్చార్జి ఎస్సై వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు. -
జలదిగ్భందం నుంచి బయటకు!
ఒకప్పుడు జలదిగ్భందంలో ఉన్న సంగమేశ్వర క్షేత్రం..నేడు పూర్తిగా బయటపడి మైదాన ప్రాంతంగా మారింది. క్షేత్ర సమీపంలో సిద్ధేశ్వరం వద్ద రెండు కొండల నడుమ మాత్రమే 12 అడుగుల నీరు మాత్రమే నిల్వ ఉంది. దీంతో కృష్ణానదికి ఆవల, ఈవల ఉన్న గ్రామాల ప్రజలు పుట్టి, ఇంజన్బోటుల ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. ప్రస్తుం శ్రీశైలం నుంచి ఉన్న కొద్దిపాటి నీటిని కూడా సాగర్‌కు వదిలితే సిద్ధేశ్వరం నుంచి సోమశిల, కొల్లాపూర్, జెడ్పోల్.. తదితరప్రాంతాలకు కాలినడకన వెళ్లవచ్చు. మళ్లీ భారీ వర్షాలు కురిసి వరద పోటు వస్తే మినహా ఇప్పట్లో సంగమేశ్వర క్షేత్రం వద్ద కృష్ణమ్మ పరవళ్లు కనించే అవకాశం లేదు. - ఆత్మకూరు -
సోమశిల- సంగమేశ్వరం వారధికి సిద్ధం
- ఏపీ ప్రభుత్వం వద్ద ఫైల్ పెండింగ్ - టీఎస్ మంత్రి జూపల్లె కృష్ణారావు ఆత్మకూరురూరల్ : ఆంధ్రప్రదేశ్ ఓకే అంటే ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలకు అతిముఖ్యమైన సోమశిల-సంగమేశ్వరం అంతరరాష్ట్ర వారధి నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆ రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి జూపల్లె కృష్ణారావు తెలిపారు. ఆత్మకూరు మండలం కరివేనలో ఆదివారం ఒక శుభకార్యానికి హాజరైన ఆయన పలు అంశాలపై సాక్షితో ముచ్చటించారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్ హయాంలో ఈ ప్రాజెక్ట్‌కు రూపకల్పన జరిగిందన్నారు. సుమారు రూ. 150 కోట్ల వ్యయంతో టెండర్లు కూడా పిలిచారన్నారు. టెండర్ దక్కించుకున్న ఆదాల ప్రభాకరరెడ్డి కంపెనీ అగ్రిమెంట్ చేసుకోకుండా అందులోని కొన్ని షరతులపై కోర్టుకు పోయిందన్నారు. రోశయ్య హయాంలో ఆ కంపెనీ డిపాజిట్ సొమ్ము వాపస్ చేసి ప్రాజెక్ట్ టెండర్లు రద్దుచేశారన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో రాయలసీమ, తెలంగాణ ఎమ్మెల్యేలు ప్రయత్నించినా కుదరలేదన్నారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్‌ను కలిసి విజ్ఞప్తి చేయగా ఆయన ఆదేశాల మేరకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సంసిద్ధత కోసం ఫైల్ పంపినట్లు తెలిపారు. ఇది ఏపీ ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉందన్నారు. ఓకే చేస్తే వెంటనే టెండర్లు పిలుస్తామన్నారు. -
సంగమేశ్వరంలో భక్తల సందడి
కొత్తపల్లి: ఏడు శివరాత్రి పర్వదినాల తర్వాత ఈ ఏడాది మొదటిసారి పండుగ రోజున భక్తులకు సంగమేశ్వరుని దర్శనభాగ్యం లభించింది. ఏటా శివరాత్రి పండగ నాటికి సప్తనదీజలాల్లో నీటి మట్టం తగ్గకపోవడంతో స్వామివారు జల గర్భంలోనే ఉండేవారు. ఏడేళ్ల తర్వాత ఈ ఏడాది నదిలో నీరు తగ్గడంతో శివరాత్రి సందర్భంగా శుక్రవారం జిల్లా నలుమూలల నుంచే కాకుండా మహబూబ్‌నగర్ నుంచి వేలాదిగా భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకొన్నారు. ముందుగా దిగువఘాట్‌కు చేరుకొని సప్తనదీ జలాల్లో పుణ్యస్నానాలు ఆచరించారు. శివనామస్మరణ పఠిస్తూ కాయ, కర్పూరాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. -
కృష్ణా తీరంలో వలస పక్షుల కోలాహలం
ఆత్మకూరురూరల్: సంగమేశ్వర క్షేత్రం విదేశీ పక్షుల వలసకు ప్రధాన కేంద్రంగా మారుతోంది. సాధారణంగా సముద్ర తీరంలో కనిపించే సీగుల్ పక్షులు గత పది సంవత్సరాలుగా శీతాకాల ఆరంభంలో కృష్ణాతీరానికి గుడ్లు పెట్టి పొదిగి వేసవి మొదలు కాగానే తన పిల్లలతో కలసి తిరిగి ఆర్కిటిక్ తీరానికి పయనమై పోతాయి. డాబ్ చిక్, పెయింటెడ్ స్టార్క్‌లు, పెలికాన్లు, సహజంగానే ఇక్కడకు దేశీయ అంతర్గత వలసల్ల భాగంగా వస్తున్నాయి. కాగా ఈ ఏడాది విచిత్రంగా టెర్న్ పక్షులు కూడా కృష్ణా తీరంలో ఽకనిపించడం పక్షి ప్రేమికులకు ఆహ్లాదాన్ని కలిగిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో టెర్న్ పక్షులు కనిపిస్తున్నప్పటికీ ఇవి ప్రధానంగా అంటార్కిటికా, ఆర్కిటికా ధృవ ప్రాంతాల్లో అధికంగా నివసిస్తాయి. ఈ పక్షులు చూడడానికి కాస్త సైజ్‌లో పెద్ద పిచుకలా ఉన్నప్పటికి వలస కోసం కనీసం 30 వేల కి.మీ. దూరాన్ని ఏకధాటిగా ఎగరగలుగుతుంది. గుంపులు గుంపులుగా ఇవి విశాల జలాశయాల వద్ద, సముద్ర తీరాల్లో కనిపిస్తాయి. -
20 ఏళ్లలో ఏడోసారి
- శివరాత్రి పూజకు సంగమేశ్వరుడు సిద్ధం ఆత్మకూరు: మరోసారి శ్రీ సంగమేశ్వర క్షేత్రం కృష్ణా జలాల దిగ్బంధం నుంచి బయటపడుతోంది. గత ఏడాది ఆగస్టు నెలలో కర్ణాటక రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో కృష్ణానదికి వరద నీరు వచ్చి చేరడంతో సంగమేశ్వర క్షేత్రం నీట మునిగింది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 839 అడుగులకు నీటి మట్టం చేరడంతో సంగమేశ్వర దేవాలయంలో బయటపడింది. ఏడాది మహాశివరాత్రి వేళ పూజలు నిర్వహించే అవకాశం ఏర్పడింది. మరో ఐదు అడుగుల నీరు తగ్గితే గర్భాలయంలో శివ లింగం కూడా బయటపడనుంది. భక్తులు నేరుగా ఆలయానికి చేరుకోవచ్చు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినప్పటి నుంచి సంగమేశ్వరం క్షేత్రం బ్యాక్‌వాటర్‌లో నీట మునుగుతోంది. దాదాపు 20 ఏళ్లలో ఇప్పటి వరకు శివరాత్రి సమయానికి ఆరు సార్లు బయటపడగా.. ఏడో సారి కూడా సంగమేశ్వరుడు పూజలకు సిద్ధమవుతున్నాడు. 2003 నుంచి ఈ క్షేత్రం మహాశివరాత్రి పర్వదినం నాటికి పూర్తిగా బయటపడడం ప్రారంభమైంది. 2004, 2005 వరుసగా శివరాత్రి వేడుకలు నిర్వహించారు. 2006 నుంచి 2010 వరకు ఽవర్షాలు సంవృద్ధిగా కురవడంతో ఐదేళ్లు పూర్తి స్థాయిలో బయటపడ లేదు. 2011లో నాలుగో సారి ఈ క్షేత్రం జలదిగ్బంధం వీడింది. 2012 నుంచి వరుసగా మరో మూడేళ్లు శ్రీశైలం జలాశయాలు తగ్గక పోవడంతో శివరాత్రి వేడుకలు జరగలేదు. అనంతరం 2015, 2016లో వరుసగా సంగమేశ్వరుడు దర్శనమచ్చారు. ఈ ఏడాది జనవరి నెలాఖరు వరకు క్షేత్రం గోపురం కూడా కనిపించలేదు. స్వామి శివరాత్రి పూజలు నిర్వహించడం సాధ్యం కాదని భక్తులు అనుకున్నారు. అయితే 20 రోజుల్లో డ్యామ్‌లో నీటిని దిగువకు విడుదల చేయడంతో అనతి కాలంలోనే క్షేత్రం జలదిగ్బంధం నుంచి బయటపడింది. శ్రీ సంగమేశ్వర కల్యాణానికి ఏర్పాట్లు: ఎట్టకేలకు కృష్ణా జలాల దిగ్బంధం నుంచి బయటపడిన సంగమేశ్వరుడు కల్యాణ మహోత్సవానికి సిద్ధమవుతున్నాడు. 24న శివరాత్రి సందర్భంగా శుక్రవారం స్వామివారికి రుద్రాభిషేకం, పంచామృతాభిషేకం, విశేషపూజలు, అర్ధరాత్రి స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించనున్నారు. 25న స్వామివార్ల కల్యాణానికి తగిన ఏర్పాట్లు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆలయ అర్చకులు తెలకపల్లి రఘురామశర్మ పేర్కొన్నారు. -
సంగమేశ్వరం వద్ద పోటెత్తిన కృష్ణాజలాలు
కొత్తపల్లి: నెలన్నర క్రితం కృష్ణాపుష్కరాలను పురష్కరించుకుని నిర్మించిన ఘాట్లు (ఐదుమెట్లుమినహా)మునకకు గురయ్యాయి. ఎగువ నుంచి వస్తున్న భారీ వరదనీటితో శ్రీశైలం జలాశయం 882.7 అడుగులకు చేరింది. ఇదే ప్రవాహం కొనసాగితే నేడు రేపటిలోపు సంఘమేశ్వరం ఎగువఘాటులోని ఉమామహేశ్వరుని పాదాల చెంతకు కృష్ణాజలాలు చేరే అవకాశం ఉంది. ఏపీటూరిజం టెంట్‌హౌస్‌లు కూడా మునిగే ప్రమాదం ఉంది. ఇప్పటికే పిండప్రదాన పుష్కరఘాటు కృష్ణమ్మ అలల తాకిడికి ఛిద్రమైంది. సంగమేశ్వర క్షేత్రాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతానని హామీచ్చిన జిల్లా కలెక్టర్ పుష్కరాల తరా్వత ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో ప్రస్తుతం ఈ క్షేత్రం పరిసరప్రాంతాలు బోసిపోతున్నాయి. -
జలసోయగం..మది పరవశం
ఆహ్లాదాన్ని పంచుతున్న సంగమేశ్వర పడవ ప్రయాణం పాపికొండలు బలాదూర్ దాల్ సరస్సును మరిపించే అందాలు కనువిందు చేసే జలపాతాలు డాల్పిన్నోస్ల ఆవిష్కారం వినూత్నమైన రాతి అమరికలు సహజ జలపాతాలు..అరుదైన వన్యప్రాణులు.. ఎత్తయిన కొండలు... ప్రకృతి సోయగాలను తిలకిస్తూ పడవలో సాగే ప్రయాణం మాటల్లో ఎంత చెప్పినా తక్కువే. హŸయలొలికే నీటి అలలు..రయ్యిన ఎగురుతూ విన్యాసాలు చేసే పక్షులు.. నీళ్లలో జలతారు మీనాల నృత్య సోయగాలు...చిక్కటి అడవులు.. ప్రకృతి చెక్కిన రాతి శిల్పాలు.. ఆ వాతావరణం చూపరులకు ఎంతో ఆహ్లాదాన్నిస్తుంది. ఓ గొప్ప అనుభూతిని మిగులుస్తుంది. మదినిండా ఆనందాన్ని పంచుతుంది. ఇలాంటి అనుభవమే మీకూ కావాలంటే సంగమేశ్వరం వెళ్లాల్సిందే. అక్కడ బోటింగ్‌లో షికారు కొట్టాల్సిందే. ఆత్మకూరు రూరల్ నల్లమల పర్వత ్రÔó ణి రెండు వరసల్లో ఆంధ్ర – తెలంగాణా రాష్ట్రాలను వేరు చేస్తూ లోతైన లోయల గుండా కృష్ణమ్మ బంగాళాఖాతాన్ని చేరుకునేందుకు పరుగులు తీస్తూ ఉంటుంది. శ్రీశైలం వద్ద ప్రాజెక్ట్ నిర్మించడంతో రిజర్వాయర్ వెనుకతట్టు జలాలు 60 కిమీ మేర విస్తరించి మైదాన ప్రాంతంలో విశాలమైన కృత్రిమ సరస్సును తలపిస్తున్నాయి. ఈ సరస్సు నల్లమల కొండల్లో అద్భుత ప్రాకృతిక శోభకు మెరుగులు దిద్దింది. ఒకప్పుడు మావోలు వారి కోసం వెళ్లే పోలీసులు, చేపలవేటలో నిమగ్నమయ్యే జాలర్లు తప్ప అంతదూరం నల్లమల కొండల నడుమ కృష్ణమ్మతో కలిసి ప్రయాణించే అవకాశం ఉండేది కాదు. దీంతో అద్భుతమైన ప్రకృతి శోభ బయటి ప్రపంచానికి ఆవిష్కృతం కాలేదు. కృష్ణా నది నల్లమల కొండలను ఒరుసుకుంటూ ఒక చోట నాతి నడుముకంటే సన్నగానూ మరో చోట కశ్మీర్ లోని దాల్ సరస్సు కంటే విశాలంగానూ ప్రవహిస్తూ సందర్శకులకు అలౌకికానందం కలిగిస్తోంది. మహారాష్ట్రలో పుట్టి కర్ణాటక, తెలంగాణా రాష్ట్రలగుండా మైదాన ప్రాంతాన్ని అధిగమించి కర్నూలు – మహబూబ్ నగర్ జిల్లలాల సరిహద్దుల్లో సోమశిల, సంగమేశ్వరం మధ్యనుంచి బిళ్వం కామాక్షమ్మ కొండ వద్ద నల్లమల పర్వత శ్రేణుల్లోకి ప్రవేశిస్తు్తంది. ఇక్కడ నుంచి రెండు రాష్ట్రాలలోని సిద్దేశ్వరం, జానాల, బలపాల తిప్ప, అమరగిరి, లింగమయ్యపెంట, మిరపకాయల పెంట, గుండ్లపెంట తదితర అటవీ గ్రామాలను స్పర్శిస్తు కృష్ణమ్మ నడక కొనసాగుతుంది. ఇలా 20 కి.మీ దూరం వెళ్లిన తరువాత నదిలో పచ్చదనం కుప్పపోసినట్లుగా చీమలతిప్ప కనపడుతుంది. విశాలమైన నదీ ప్రవాహంలో సహజంగా ఏర్పడ్డ చిరునదీ ద్వీపమే చీమల తిప్ప. ఇంకా సరిగా చెప్పాలంటే ఇది ఒక కొండ లంక. ఈ చీమలతిప్పపై బతుకు పోరులో వలసవచ్చిన విశాఖ జాలర్ల కుటుంబాలు నివాసముంటాయి. ఇక్కడ నివాసముండే జాలర్ల పిల్లలు చిన్న పడవల్లో నదిలో సరదాగా తిరుగుతూ ఆటలాడుకునే దృశ్యాలు సందర్శకులకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. చీమల తిప్పను దాటిన తరువాత నల్లమల కొండలు కాస్త దూరంగా ఉండడంతో ఈ ప్రాంతంలో సహజంగానే విశాలమైన ప్రాంతంలో అందమైన సరస్సు ఏర్పడింది. ఇక్కడ చీమలతిప్ప చుట్టు లంగరు వేసిన పడవలను చూస్తే ఇది మనకు కశ్మీర్‌లోని దాల్ సరస్సును స్ఫురణకు తెస్తుంది. పచ్చటి తీవాచీల నడుమ.. నల్లమల కొండల నడుమ ప్రవహించే కృష్ణమ్మ ఒడిలోంచి మనం తలెత్తి చూస్తే ఎల్తైన కొండలను ఎవరో ఆకుపచ్చ తివాచీతో కప్పి ఉంచారేమో అన్నట్లుగా అనిపిస్తుంది. కొండలపై పెరిగిన సిరిమాను, నారయేపి, నల్లమద్ది, సోమి..తదితర వృక్షాలు మనకు పచ్చందాలను పరిచయం చేస్తాయి. నదిలోకి వాలి ఉండే పచ్చటి చెట్లు వనదేవతలు కృష్ణమ్మతో కరచాలనం చేస్తున్నట్లుగా కనిపిస్తాయి. డాల్ఫిన్హౌస్లు మనకూ ఉన్నాయి.. విశాఖ సముద్ర తీరంలో డాల్ఫిన్ ముక్కును పోలిన కొండ పర్యాటక ప్రాముఖ్యాన్ని పొందిన సంగతి తెలిసిందే. అలాంటి డాల్ఫిన్‌నోస్‌ను తలపించే కొండలు కష్ణమ్మను ఒరుసుకుంటూ నదీమార్గంలో ఎన్నో చోట్ల కనిపిస్తాయి. ఇలా కృష్ణానది శ్రీశైలం ప్రాజెక్ట్ వరకు ఎన్నో అందాలను ఆవిష్కరిస్తూ తన పయనాన్ని సాగిస్తుంది. ఈ దారిలో ప్రసిద్ధి చెందిన అంకాళమ్మ కోట ఉండే పర్వతం కనిపిస్తుంది. పూర్వం దివిటీ దొంగలకు ఈ కోట ఆశ్రయదుర్గంలా ఉండేదని అంటారు. రాళ్ల అమరిక అదుర్స్ నదిలో ప్రయాణిస్తూ చుట్టు కనిపించే నల్లమల పర్వత శ్రేణిని పరిశీలిస్తూ వెళుతుంటే ఎన్నో అద్భుతమైన రాతి అమరికలు కనిపిస్తాయి. కోట గోడలు, వాటి మధ్య బురుజులు ఉన్నట్లుగాను, మరొక చోట ఏనుగు కాళ్లు పైకెత్తి తొండం లేపి ఘీంకరిస్తున్నట్లుగాను, మరో చోట ఇరువురు వ్యక్తులు ఆలింగనం చేపుకున్నట్లుగా రాళ్లు కనిపిస్తాయి. జలపాతాల సోయగం.. నల్లమల అడవుల్లోంచి పప్రవహించే కొండవాగులు, ఎల్తైన కొండల మీదనుంచి కృష్ణా నదిలోకి దూకుతూ ఏర్పరచే జలపాతాలు చూడముచ్చటగా కనిపిస్తాయి. ఇలాంటి జలపాతాలు కృష్ణమ్మ నల్లమల కొండల్లో ప్రవహించినంత మేర చాలా చోట్ల కనిపిస్తాయి. పులుల అభయారణ్యం.. కృష్ణానది నల్లమలలో ప్రవహించే ప్రాంతమంతా నాగార్జున సాగర్ – శ్రీశైలం పెద్దపులుల అభయారణ్యంలోనే ఉంది. దీంతో కృష్ణానదిలో ప్రయాణించే వారికి నది ఒడ్డున సంచరించే పెద్ద పులులు కనిపించే అవకాశం ఉంది. అంతే కాకుండా పొడదుప్పి, కణితి, కొండ గొర్రె వంటి గడ్డతినే జంతువులు కనిపిస్తాయి. ప్రయాణమెలా.. నిజానికి ఇంతటి అందమైన ప్రదేశాలు రాష్ట్రంలో అరుదుగానే ఉన్నాయి. కృష్ణానదిలో ప్రయాణం కొంత సాహసంతో కూడుకొన్నదే అయినా ఎంతో ఆహ్లాదాన్ని మిగులుస్తుంది. నదిలో జాలర్ల నుంచి చేపలు సేకరించేందుకు ఉపయోగించే ఇంజన్బోట్లు ఈ సాహసయాత్రకు ఉపకరిస్తాయి. తెలంగాణా రాçష్ట్ర పర్యాటక శాఖ మహబూబ్‌నగర్ జిల్లాలోని కొల్లాపురం సమీపంలో ఉన్న సోమశిల వద్ద నుంచి నదిలో ప్రయాణించేందుకు బోటును అందుబాటులో ఉంచింది. ఇక్కడ ఆ శాఖకు చెందిన హోటల్ కూడా ఉంది. అలాగే కృష్ణా పుష్కరాల సంధర్భంగా సంగమేశ్వరంలో ఏర్పాటు చేసిన పర్యాటక శాఖ రెస్టారెంట్‌ను నడుపుతున్నారు. ఇక్కడ నాలుగు వీఐపీ ఏసి లాంజ్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఏపి టూరిజానికి చెందిన ఆరు సీట్లు, ఎనిమిది సీట్ల రెండు స్పీడ్ బోట్లు కూడా సంగమేశ్వరంలో పర్యాటకుల సౌకర్యార్థం ఉన్నాయి. ఇలా వెళ్లాలి.. కర్నూలు నగరం నుంచి ఆత్మకూరుకు 70 కిమీ దూరం ఉంది. ఆర్టీసీ ప్రతి పది నిముషాలకు ఒక బస్సును తిప్పుతోంది. ఆత్మకూరు నుంచి ఆర్టీసీ బస్సుల్లోకాని ప్రయివేటు వాహనాల్లో కాని 40 కిమీ దూరంలోని కొత్తపల్లె మండలంలోని సంగమేశ్వరం చేరుకోవచ్చు. స్వంత వాహనాలు ఉన్న వారు పాములపాడు మండలంలోని కంబాలపల్లె నుంచి నేరుగా కొత్తపల్లె మండలం లింగాపురం గ్రామం గుండా సంగమేశ్వరం చేరుకోవచ్చు. త్వరలో సంగమేశ్వరం నుంచి సంగమేశ్వరం నుంచి కూడా శ్రీశైలానికి పడవ ప్రయాణం త్వరలో ప్రారంభమవుతుంది. ఈ విషయమై ఉన్నతాధికారులకు అనుమతి కోసం ప్రతిపాదనలు పంపాం. సంగమేశ్వరాన్ని పర్యాటక కేంద్రంగా మార్చేందుకు టూరిజం శాఖ కసరత్తు చేస్తోంది. – సుదర్శనరావు, డివిజనల్ మేనేజరు, ఏపీ టూరిజం, కర్నూలు ప్రయాణికుల ఆసక్తిని బట్టి శ్రీశైలానికి బోటు మహబూబ్ నగర జిల్లా సోమశిల నుంచి తెలంగాణా టూరిజం శాఖ ఒక బోటును శ్రీశైలానికి నడుపుతోంది. ఇందుకు రానుపోను టిక్కెట్ ధర రూ.800 నిర్ణయించాము. పిల్లలకు రూ.600 తీసుకుంటున్నాము. సింగిల్ వే ప్రయాణానికి రూ.500 నిర్ణయించాము. సోమశిల నుంచి శ్రీశైలం సుమారు 120 కి.మీ. దూరం నదిలో ప్రయాణించాల్సి వస్తుంది. ఇందుకోసం టూరిజం బోటుకు 300 లీటర్ల డీజిల్ వినియోగమవుతోంది. ప్రయాణికులు కనీసం 30 మంది ఉంటే రూ. 25 వేలు వస్తోంది. ఈ మేరకు ప్రయాణికులు బుక్ అయితే శ్రీశైలానికి బోటును ఏర్పాటు చేస్తున్నాం. ఈ ప్రయాణంలో అక్కమహాదేవి గుహలను కూడా చూపిస్తున్నాం. అంతే కాకుండా సమీపంలో ఉన్న చీమల తిప్ప, అంకాలమ్మ కోట వంటి ప్రాంతాలకు కూడా బోటు నడుపుతున్నాం. ఇందుకోసం ప్రయాణ దూరం గంటల బట్టి రూ. 1000 వరకు చార్జ్ చేస్తున్నాం.. – సైదులు, జిల్లా మేనేజర్, తెలంగాణా టూరిజం, మహబూబ్‌నగర్ -
కిలకిల.. కళకళ!
-
సంగమేశ్వరం..భక్తిపారవశ్యం
కనుల పండువగా పుష్కర హారతి క్షేత్రానికి పోటెత్తిన భక్తులు 12 రోజుల్లో 3లక్షమంది పుణ్యస్నానాలు ఆత్మకూరు: కృష్ణానది చెంత సప్తనదుల సంగమేశ్వర క్షేత్రంలో 12 రోజులుగా సాగిన పుష్కరాలు హారతులతో మంగళవారం ఘనంగా ముగిశాయి. వేకువజాము నుంచే క్షేత్రానికి భక్తులు తరలివచ్చారు. పుణ్యస్నానమనంతరం పితృదేవతలకు పిండప్రదానాలు చేసి ఉమామహేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ క్షేత్రంలో 12 రోజులపాటు 3లక్షల మందికి పైగా భక్తులు పుష్కర స్నానమాచరించారు. తొలి రోజు స్వల్పంగా పుష్కర స్నానాలకు వచ్చిన భక్తులు మూడో రోజు నుంచి పోటెత్తారు. పదో రోజు 59,049 మంది, 11 వ రోజు కూడా 42,162 మంది భక్తులు పుష్కరస్నాన మాచరించారు. భక్తుల సందడి చివరి రోజు సంగమేశ్వర క్షేత్రంలో భక్తుల సందడి జోరుగా కనిపించింది. ఉదయం నుంచి భక్తులు రాక ప్రారంభమై మధ్యాహ్నానికి కిక్కిరిసింది. సాయంత్రం వరకు భక్తులు పుణ్య స్నానమాచరించారు. స్థానిక ప్రాంత వాసులే కాకుండా కడప, అనంతపురం జిల్లాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో సంగమేశ్వరం క్షేత్రంలో పుష్కరస్నానమాచరించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. చాలినన్ని వస్త్ర మార్పిడి గదుల్లేకపోవడంతో మహిళలు ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ సమస్య అధికారులకు కునుకు లేకుండా చేసింది. పారిశుద్ధ్య సిబ్బంది, వలంటీర్లు, పోలీస్ సేవలతో ఇబ్బందుల్లేకుండా భక్తులు పుష్కర స్నానమాచరించేందుకు వీలు కలిగింది. పుష్కరాలు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. బోటు షికారుతో ఆదాయం పుష్కరాల సందర్భంగా బ్యాక్ వాటర్‌లో బోటు షికారు చేసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆసక్తి చూపారు. ఫలితంగా ఏపీ టూరిజం సంస్థకు రూ. 5 లక్షలు ఆదాయం చేకూరింది. ఈనెల 20న ఒక్కరోజే రూ.2లక్షలు ఆదాయం వచ్చింది. స్పీడు బోట్లు చాలకపోవడంతో శ్రీశైలం నుంచి పెద్ద పడవను రప్పించడంతో మరింత ఆదాయం సమకూరినటై ్లంది. తెలంగాణ భక్తులు ఇంజన్బోటుల ద్వారా సంగమేశ్వర క్షేత్రానికి చేరుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా వాసులు స్వామి సన్నిధిలో పుష్కర స్నానమాచరించి పునీతులయ్యారు. మరో రెండు పుష్కరాలు.. క్షేత్రంలో ఆది పుష్కరాలు మంగళవారంతో ముగియగా.. మరో ఆరు నెలలకు మధ్య పుష్కరాలు నిర్వహించనున్నారు. ఏడాది చివరిలో అంతిమ పుష్కరాలు కూడా జరుగనున్నాయి. సప్త నదులు కలిసే సంగమం కావడం వల్ల ఇక్కడ స్నాన మాచరిస్తే ఎంతో పుణ్య ఫలం దక్కుతుందనే నమ్మకంతో భక్తులు ఇక్కడికి వేలాదిగా తరలివచ్చారు. పుష్కరస్నానమాచరించి పునీతులయ్యారు. -
సంగమేశ్వరం ఘాట్‌లో మహా మంగళ హారతి
కర్నూలు(న్యూసిటీ): సంగమేశ్వరస్వామి ఘాట్‌లో మంగళవారం దేవదాయ ధర్మదాయశాక ఆధ్వర్యంలో కృష్ణానదికి ఆదిపుష్కర ముగింపు మహా మంగళ హారతి మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆశాఖ సహాయ కమిషనర్ సి. వెంకటే శ్వర్లు తెలిపారు. సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమంలో ముందుగా లలిత సంగమేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలకు అవభదస్నానం చేయిస్తామని పేర్కొన్నారు. కృష్ణ పుష్కర బృహస్పతి గాయత్రి యాగం పూర్ణహాతి ముగింపు కార్యక్రమం దేవాలయం ప్రధానఅర్చకులు తెలకపల్లి రఘురామశర్మ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా జాయింట్ కలెక్టర్ సి. హరికిరణ్ ఆధ్వర్యంలో సాయం సంధ్యాసమయ సంధ్యాహారతి నిర్వహిస్తామన్నారు. పుష్కర విధులను నిర్వహించిన అ«ధికారులు, సిబ్బంది, భక్తులు ఈకార్యక్రమంలో పాల్గొనాలని కార్యనిర్వహణాధికారి కె.కమలాకర్ తెలిపారు. -
సంగమేశ్వరాన్ని పర్యాటకేంద్రంగా తీర్చిదిద్దుతాం
– త్వరలో గెస్టుహౌస్నిర్మాణం – శ్రీశైలానికి టూరిజం బోటు ఏర్పాటు శ్రీశైలం(జూపాడుబంగ్లా): సంగమేశ్వర క్షేత్రాన్ని పర్యాటకేంద్రంగా తీర్చిదిద్దుతామని జిల్లా కలెక్టర్ విజయమోహన్ తెలిపారు. ఆదివారం ఆయన లింగాలగట్టు దిగువఘాటులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో కృష్ణాపుష్కరాల నిర్వహణలో కర్నూలు జిల్లాప్రథమస్థానంలో నిలవటం హర్షించదగిన విషయమన్నారు. సంగమేశ్వరం పుష్కరఘాటు, లింగాల ఘాట్‌కు అత్యధిక భక్తుల రద్దీ ఉన్నా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా, ఇబ్బందులు పడకుండా పటిష్టమైన చర్యలు చేపట్టడంతో జిల్లాకు ప్రథమ స్థానం లభించిందన్నారు. సంగమేశ్వరం క్షేత్రంలో ప్రస్తుతం ఏర్పాటు చేసిన ఏపీ టూరిజం హోటల్‌ను అలాగే కొనసాగిస్తామన్నారు. త్వరలో ఓ గెస్టుహౌస్ను నిర్మించటంతోపాటు సంగమేశ్వరం నుంచి శ్రీశైలానికి టూరిజం బోటు ప్రయాణాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. మార్గమధ్యంలో అనువైన ప్రాంతాన్ని చూసుకొని భక్తులు సేదతీరేందుకు ఓ హోటల్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్సీ శిల్పాచక్రపాణిరెడ్డి మాట్లాడుతూ అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పుష్కరాల విజయవంతానికి కషిచేయటంతో జిల్లాకు మంచి పేరొంచిదన్నారు. పుష్కరాల చివరి రోజున లింగాలగట్టులో ఆడపడచులకు సారె ఇవ్వనున్నట్లు తెలిపారు. -
సంగమేశ్వరం.. పుష్కర ప్రభంజనం
– ఎండ తీవ్రతతో అవస్థలు – 4 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు – ఉచిత బస్సులు చాలక కాలినడక సంగమేశ్వరం(ఆత్మకూరు): కృష్ణా పుష్కరాల్లో భాగంగా పదవ రోజు ఆదివారం సంగమేశ్వర క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. మరో రెండు రోజులే సమయం ఉండటం.. సెలవు దినం కావడంతో సుమారు అరలక్షకు పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్లు అధికారుల అంచనా. వేకువజామున 6 గంటల నుంచే సంగమేశ్వరం, లలితాదేవి పుష్కర ఘాట్ల వద్ద రద్దీ కనిపించింది. ఘాట్ల వద్ద నీటి మట్టం తగ్గుముఖం పట్టినా.. భక్తుల రాకతో ఆ ప్రాంతం సందడిగా మారింది. భక్తులు పెద్ద ఎత్తున వాహనాల్లో తరలి రావడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. ఈ నేపథ్యంలో సంగమేశ్వరం, కపిలేశ్వరం, పాతమాడుగుల వరకు కృష్ణా బ్యాక్ వాటర్‌లో భక్తులు ఎక్కడపడితే అక్కడ పుణ్యస్నానం చేశారు. సంగమేశ్వరం చేరుకోవాలంటే వందల సంఖ్యలో నిలిచిపోయిన వాహనాలను దాటుకొని వెళ్లడం అసాధ్యం కావడంతో ఇలా కానిచ్చేశారు. ఎలాంటి భద్రత లేని చోట్ల భక్తులు పుణ్య స్నానం ఆచరించడం కాస్త ఆందోళనకు కారణమయింది. అదేవిధంగా ట్రాఫిక్ సమస్య కారణంగా భక్తులు సంగమేశ్వర క్షేత్రంలో ఉమామహేశ్వర స్వామిని దర్శించుకోకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. భారీగా స్తంభించిన ట్రాఫిక్ పుష్కర స్నానం ఆచరించేందుకు భక్తులు పెద్ద ఎత్తున వాహనాల్లో తరలిరావడంతో ట్రాఫిక్ స్తంభించింది. పార్కింగ్ స్థలం చాలకపోవడంతో రహదారి వెంట ఎక్కడికక్కడ వాహనాలు నిలిపివేయడం సమస్యకు దారితీసింది. అధికారులు లింగాపురం, మాడుగుల గ్రామాల వద్దే పలు వాహనాలను నిలిపివేయించినా ఫలితం లేకపోయింది. కపిలేశ్వరం నుంచి పాత మాడుగుల గ్రామ సమీపంలోని లింగమయ్య ఆలయం వరకు దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఆత్మకూరు నుంచి సంగమేశ్వరానికి 45 కిలోమీటర్ల దూరం కాగా.. గంటర్నర సమయంలో క్షేత్రం చేరుకోవాల్సి ఉంది. అయితే ట్రాఫిక్ సమస్య కారణంగా భక్తులు క్షేత్రం చేరుకునేందుకు 4 గంటల పాటు ప్రయాణించాల్సి వచ్చింది. భక్తుల ఇక్కట్లు ట్రాఫిక్ సమస్యకు తోడు ఎండ తీవ్రతతో భక్తులు చుక్కలు చూడాల్సి వచ్చింది. ఉచిత భస్సులు సరిపడక.. కపిలేశ్వరం నుంచి చాలా మంది భక్తులు నాలుగు కిలోమీటర్ల దూరం నడవాల్సి రావడంతో ఇబ్బంది పడ్డారు. ఓవైపు లగేజీ.. చిన్న పిల్లలను చంకనెత్తుకొని దారి పొడవునా నానా అవస్థలు పడ్డారు. -
కృష్ణమ్మా.. సీఎంకు సద్బుద్ధి ప్రసాదించూ..
– సిద్ధేశ్వరం అలుగు సాధనకోసం రైతుల సంకల్పం ఆత్మకూరురూరల్(సంగమేశ్వరం): రాయలసీమపట్ల వివక్ష చూపుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృష్ణవేణి మాత సద్బుద్ధి ప్రసాదించాలని కోరుతూ సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం కోసం సంకల్ప దీక్షలో భాగంగా పలువురు రైతులు సంగమేశ్వరం ఘాట్‌లో పుష్కర స్నానాలాచరించారు. సిద్ధేశ్వరం అలుగు సాధన కమిటీ నాయకులు బొజ్జా దశరథరామిరెడ్డి, కన్వీనర్ ఏర్వ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో శనివారం రైతులు సంకల్ప దీక్ష పూనారు. ఈ సంధర్భంగా బొజ్జా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ కన్నుల పండుగగా శ్రీశైలం ప్రాజెక్ట్ రిజర్వాయర్ దరిదాపుగా నిండుకుండలా ఉన్నప్పటికి ఇంకా రాయలసీమ జలాశయాలను పూర్తి స్థాయిలో నింపక పోవడం విచారకరమన్నారు. ప్రభుత్వం సీమకు సాగునీటి జలాలను విడుదల చేస్తున్నట్లు తప్పుడు ప్రకటనలిస్తు నిప్పుల వాగుద్వారా నెల్లూరుకు శ్రీశైలం నీటిని తరలిస్తున్నారన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు రాయలసీమ పట్ల కపట విధానం విడిచి సిద్ధేశ్వరం అలుగునిర్మాణానికి పూనుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు వైఎన్ రెడ్డి, మహేశ్వర రెడ్డి, శ్రీనివాస రెడ్డి, కామని వేణుగోపాల్ రెడ్డి, వెంకట సుబ్బయ్య, శివరాం రెడ్డి, జ్యోతిర్మయి, పద్మావతి, నిత్యలక్ష్మి, సీపీఎం నాయకులు ఏసురత్నం, స్వాములు పాల్గొన్నారు -
భక్తజన ప్రవాహం
సంగమేశ్వరంలో కొనసాగుతున్న రద్దీ – ఘాట్ల వద్ద తగ్గిన నీటి మట్టం – ఏపీ టూరిజం రెస్టారెంట్ ప్రారంభం సంగమేశ్వరం(ఆత్మకూరు): కృష్ణా తీరంలో భక్తజన ప్రవాహం పరవళ్లు తొక్కుతోంది. సంగమేశ్వర క్షేత్రం వద్ద పుణ్య స్నానాలతో భక్తులు తరిస్తున్నారు. కృష్ణా పుష్కరాల్లో భాగంగా 8వ రోజు శుక్రవారం కడప, అనంతపురం, చిత్తూరు, ప్రకాశం, మహబూబ్‌నగర్ జిల్లాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వందలాది కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్న భక్తులు నదీ ప్రవాహం చూసి తమను తాము మైమరిచిపోతున్నారు. పుష్కర స్నానం ఆచరించిన తర్వాత ఉమామహేశ్వర స్వామిని దర్శించుకొని పరవశిస్తున్నారు. క్షేత్ర పరిధిలో ఏపీ టూరిజం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బోటు షికారు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇకపోతే సంగమేశ్వరం వద్ద కృష్ణా జలాలు తగ్గుముఖం పడుతున్నాయి. ఘాట్ల వద్ద శుక్రవారం మూడు అడుగుల మేర నీరు తగ్గింది. లలితాదేవి ఘాట్ వద్ద మెట్లపై కూర్చొని స్నానం చేసేందుకు భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఘాట్ల వద్ద రద్దీ కనిపించింది. అయితే రెండు రోజులుగా వీఐపీల తాకిడి తగ్గింది. ఈ ఘాట్‌కు సమీపంలో 4 కిలోమీటర్ల దూరంలోని తెలంగాణ రాష్ట్రంలో కొలువైన సోమశిల క్షేత్రం వద్ద వీఐపీలు, సినీ తారల సందడి అధికంగా ఉంది. ప్రారంభమైన ఏపీ టూరిజం రెస్టారెంట్ సంగమేశ్వరం ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన ఏపీ టూరిజం రెస్టారెంట్‌ను జేసీ హరికిరణ్ ప్రారంభించారు. పుష్కరాలు ప్రారంభమైనప్పటి నుంచి గురువారం రోజు వరకు ఇక్కడ ఎలాంటి క్యాంటీన్లు లేకపోవడంతో భక్తులు ఇబ్బందిపడ్డారు. దారి వెంట తెచ్చుకున్న తినుబండారాలతోనే కడుపు నింపుకోవాల్సి వచ్చింది. తాజాగా ఏర్పాటు చేసిన రెస్టారెంట్ క్షేత్రానికి వచ్చే భక్తులతో పాటు సోమశిల ప్రయాణికులకు ఉపయుక్తం కానుంది. ప్రస్తుతం టీ, టిఫెన్‌కే పరిమితమైనా.. త్వరలో శాఖాహార భోజన సదుపాయం కల్పించనున్నారు. ట్రాఫిక్ క్రమబ్ధకరణ భక్తుల రద్దీ దృష్ట్యా పార్కింగ్ ప్రాంతంతో పాటు రహదారులు వాహనాలతో కిక్కిరిశాయి. పోలీసులతో పాటు వాలంటీర్లు ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు శ్రమించారు. కపిలేశ్వరం గ్రామ సమీపంలో ఆటోలు, ట్రాక్టర్లు, మినీ వ్యాన్లు, మోటార్ సైకిళ్లను నిలిపేసి పార్కింగ్ చేయించారు. అన్ని ప్రాంతాలకు చెందిన బస్సులను పుష్కరనగర్‌కు అనుమతించారు. ఇక్కడి నుంచి భక్తులు ఉచిత బస్సుల్లో సంగమేశ్వరం చేరుకుంటున్నారు. -
కృష్ణమ్మ వాకిట్లో.. పున్నమి పరవళ్లు
వారం రోజుల్లో 5.90 లక్షల భక్తులు – సంగమేశ్వరం ఘాట్‌కు పెరిగిన తాకిడి – ఉచిత భక్తుల కోసం తప్పని నిరీక్షణ – శ్రీశైలంలోని పాతాళగంగ వద్ద సాధారణం – లింగాలగట్టులో రద్దీ – ఘాట్లను పరిశీలించిన కలెక్టర్, ఐజీ, డీఐజీ, ఎస్పీలు శ్రీశైలం: శ్రావణ మాసం రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని గురువారం పుష్కర ఘాట్ల వద్ద భక్తుల రద్దీ కనిపించింది. శ్రీశైలంలోని పాతాళగంగ, లింగాలగట్టుతో పాటు సంగమేశ్వరం, నెహ్రూనగర్, ముచ్చుమర్రి ఘాట్లలో పుష్కర స్నానం చేసి భక్తులు తరించారు. గత వారం రోజుల్లో సుమారు 5.90 లక్షలకు పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్లు అంచనా. శ్రీశైలంలోని పాతాళగంగ వద్ద భక్తుల రద్దీ సాధారణం కాగా.. లింగాలగట్టు వద్ద సందడి కనిపించింది. ఇదే ప్రాంతంలో పిండ ప్రదానాలు అధిక సంఖ్యలో నిర్వహించారు. ఇక సంగమేశ్వరం వద్ద ఉదయం నుంచే భక్తుల రాక మొదలయింది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో రద్దీ అధికం కాగా.. సుమారు 2 గంటల పాటు ఉచిత బస్సుల కోసం క్యూలలో నిరీక్షించాల్సి వచ్చింది. జాయింట్ కలెక్టర్ హరికిరణ్ ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టారు. ఒకానొక దశలో ఆయనే స్వయంగా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా మారడం విశేషం. ఘాట్లను పరిశీలించిన కలెక్టర్, ఐజీ, ఎస్పీ శ్రీశైలంలోని లింగాలగట్టు పుష్కరఘాట్‌ను జిల్లా కలెక్టర్ విజయమోహన్, రాయలసీమ జోన్ ఐజీ శ్రీధర్‌రావు, ఎస్పీ రవికృష్ణలు పరిశీలించారు. ఏర్పాట్లను ప్రత్యక్ష పరిశీలన చేసి భక్తుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. వృద్ధులు, పిల్లల సౌకర్యార్థం లింగాలగట్టు పుష్కర ఘాట్ చాలా సౌకర్యవంతంగా ఉందని, వాలంటీర్లు కూడా సేవా దక్పథంతో వ్యవహరిస్తున్నారని భక్తులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. శానిటేషన్ పరంగా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని, ఘాట్ల వద్ద ఎలాంటి పారిశుద్ధ్య సమస్య తలెత్తినా ఆ ఘాట్ల వద్ద విధులు నిర్వహించే సిబ్బంది బాధ్యత వహించాల్సి ఉంటుందని కలెక్టర్, ఐజీ హెచ్చరించారు. శ్రీశైలంలోని మల్లికార్జున ఘాట్ వద్ద నీటి నమూనాలను పరిశీలించిన కలెక్టర్ కలుషితమయినట్లు గుర్తించారు. వెంటనే ఆ నీటిని పంపింగ్ చేయాలని ఆదేశించారు. ఘాట్లలో వీఐపీల పుష్కర స్నానాలు కృష్ణా పుష్కరాల్లో భాగంగా 7వ రోజు గురువారం జిల్లా వ్యాప్త పుష్కర ఘాట్లలో పలువురు వీఐపీలు పుణ్య స్నానాలను ఆచరించారు. శ్రీశైలం పాతాళగంగ వద్ద రాయలసీమ జోన్ ఐజీ శ్రీధర్‌రావు, ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ సభ్యుడు రవిబాబు, రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు అంబటి లక్ష్మణ్‌రావులు పుష్కర స్నానాలు ఆచరించిన వారిలో ఉన్నారు. అదేవిధంగా లింగాలగట్టు పుష్కర ఘాట్‌లో మాజీ ఎంఎల్ఏ లబ్బి వెంకటస్వామి, సంగమేశ్వరం వద్ద నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి పుష్కర జలాలను తలపై చల్లుకున్నారు. ఇక్కడే బనగానపల్లె వైఎస్ఆర్సీపీ ఇన్చార్జి కాటసాని రామిరెడ్డి దంపతులు పుష్కర స్నానం చేశారు. నెహ్రూనగర్ వద్ద వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి పుష్కర స్నానం ఆచరించారు. -
పులకిస్తున్న పుష్కర ఘాట్లు
-
మది కేరింత.. మనస్సు పులకరింత
– ఆరవ రోజు కొనసాగిన భక్తుల రద్దీ – సంగమేశ్వరానికి పెరిగిన తాకిడి – శ్రీశైలంలో లింగాలగట్టు వద్ద భక్తిపారవశ్యం – వలంటీర్లు, పోలీసుల సేవలకు ప్రశంసలు – ఉన్నతాధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణ సాక్షి, కర్నూలు: కృష్ణా పుష్కరాల నేపథ్యంలో పుష్కర ఘాట్ల వద్ద పండగ వాతావరణం నెలకొంటోంది. శ్రీశైలంతో పోలిస్తే.. సంగమేశ్వరంలో బుధవారం భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఇక లింగాలగట్టు లోలెవల్ ఘాట్ భక్తజన సంద్రంగా మారింది. పిండ ప్రదానాల అనంతరం భక్తులు పుణ్య స్నానాలతో తరించిపోయారు. ఉదయం 9 గంటల వరకు ఘాట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. ఆ తర్వాత కొంత పలుచపడినా.. సాయంత్రం రద్దీ కాస్త పెరిగింది. జిల్లాలోని ప్రధాన ఘాట్ల వద్ద స్నానమాచరించిన భక్తులు.. సమీప ఆలయాలను దర్శించుకుంటూ భక్తిపారవశ్యంలో మునుగుతున్నారు. శ్రీశైలానికి అధికంగా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతో పాటు ప్రకాశం జిల్లా మార్కాపురం వాసులు వస్తున్నారు. సంగమేశ్వరంలో జిల్లా భక్తులతో పాటు చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల ప్రజలు పెద్ద ఎత్తున పుష్కర స్నానం ఆచరిస్తున్నారు. కాస్త తగ్గిన నీళ్లు శ్రీశైలంలో పాతాళాగంగ పుష్కర ఘాట్‌కు వెళ్లాలంటే రోప్‌వే వద్ద వేచి ఉండాల్సిన పరిస్థితి. మెట్లమార్గంలో అయితే 600 మెట్లు ఎక్కి దిగాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వృద్ధులు, వికలాంగులు, చంటి పిల్లల తల్లులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. వీరంతా లింగాలగట్టు వైపు చూస్తున్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర రాజధాని నుంచి వచ్చే భక్తులు నేరుగా లింగాలగట్టులోని లోలెవల్ ఘాట్ వద్ద పుణ్యస్నానాలు చేస్తున్నారు. నాలుగు, ఐదవ రోజు ఈ ఘాట్‌లో నీరు వెనక్కు వెళ్లడంతో.. అధికారులు స్పందించి జనరేటర్ల ద్వారా విద్యుత్తు ఉత్పత్తి చేయించి ఆ నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. ఫలితం పుష్కర స్నానం సాఫీగా జరిగిపోతోంది. పటిష్ట భద్రతా చర్యలు గుంటూరు జిల్లాలో కృష్ణా నదిలో పుష్కర స్నానానికి వెళ్లిన ఐదుగురు విద్యార్థులు నీట మునిగి మృత్యువాతపడిన ఘటనతో జిల్లాలోనూ ఘాట్ల భక్తుల భద్రతకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అనధికార ఘాట్ల వద్ద ఎవ్వరినీ స్నానాలు చేయించకుండా పోలీసుల బందోబస్తు ముమ్మరం చేశారు. శ్రీశైలం, సంగమేశ్వరంతో పాటు నెహ్రూనగర్, ముచ్చుమర్రి ఘాట్ల వద్ద కూడా పోలీసు బలగాలను మోహరించారు. అదేవిధంగా ఘాట్ల వద్ద నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎన్డీఆర్ఎఫ్)కు చెందిన 49 మంది సిబ్బందిని నిరంతరం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్, కర్నూలు రేంజ్ డీఐజీ రమణకుమార్, ఎస్పీ ఆకె రవికృష్ణలు శ్రీశైలంలోని ఘాట్ల వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తుండగా.. సంగమేశ్వరంలో జాయింట్ కలెక్టర్ సి.హరికిరణ్, అదనపు ఎస్పీ చంద్రశేఖర్రెడ్డిలు పర్యవేక్షిస్తున్నారు. సేవలు భేష్ పుష్కర ఘాట్ల వద్ద వలంటీర్లు అందిస్తున్న సేవలను భక్తులు కీర్తిస్తున్నారు. వృద్ధులు, వికలాంగులకు వలంటీర్లతో పాటు పోలీసులు దగ్గరుండి సేవలందిస్తున్నారు. అదేవిధంగా ఉచిత అన్నదానాలతో నీళ్ల ప్యాకెట్లు, మజ్జిగ పంపిణీ చేస్తుండటం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. -
సంగమేశ్వరం.. భక్తి పారవశ్యం
సంగమేశ్వరం(సాక్షి, కర్నూలు): కృష్ణా పుష్కరాల సందర్భంగా సంగమేశ్వర క్షేత్రం భక్తజన సంద్రమైంది. మూడవ రోజు ఆదివారం భక్తుల రద్దీ అధికం కాగా.. ఉమామహేశ్వర ఆలయ ప్రాంగణం పోటెత్తింది. సప్తనదుల సంగమంలో వెలసిన సంగమేశ్వరం పుష్కర ఘాట్‌లో ఉదయం నుంచే సందడి మొదలయింది. చిత్తూరు, కడప, నంద్యాల, డోన్, ఆదోని, బళ్లారి ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. రద్దీ నేపథ్యంలో పార్కింగ్ స్థలాలన్నీ వాహనాలతో కిక్కిరిశాయి. పుష్కరనగర్ నుంచి ఘాట్ వరకు భక్తుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత బస్సుల్లో సైతం రద్దీ కనిపించింది. ఇదే అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శించిన ఘటనలు రెండు మూడు చోటు చేసుకున్నాయి. విషయాన్ని జేసీ హరికిరణ్ పోలీసుల దష్టికి తీసుకెళ్లగా.. అదనపు ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి సిబ్బందిని అప్రమత్తం చేశారు. జేసీ హరికిరణ్ కుటుంబ సమేతంగా లలితాదేవి ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. కమ్యూనికేషన్స్ ఎస్పీ విజయలక్ష్మి కుటుంబసమేతంగా పుష్కర స్నానం ఆచరించారు. నంద్యాల జడ్జి ప్రియదర్శిని సైతం పుష్కర స్నానం ఆచరించి.. ఉమామహేశ్వరస్వామిని దర్శించుకున్నారు. సంగమేశ్వరాన్ని సందర్శించిన ఉప ముఖ్యమంత్రి.. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సంగమేశ్వర క్షేత్రాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం సందర్శించారు. ఉదయం 9.30 గంటలకు క్షేత్రానికి చేరుకున్న ఆయన పుష్కర ఘాట్‌కు వెళ్లి పుణ్యస్నానం ఆచరించి.. పితృదేవతలకు పిండ ప్రదానం చేశారు. ఎగువనున్న ఉమా మహేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జేసీ హరికిరణ్ ఆలయ మర్యాదలతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అంతకు ముందు ఆయన పుష్కర భక్తులతో మాట్లాడుతూ ఏర్పాట్లపై ఆరా తీశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ గోదావరి పుష్కరాల చేదు అనుభవం నేపథ్యంలో కృష్ణా పుష్కరాలు పటిష్ట చర్యలు చేపట్టామన్నారు. ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. పుష్కర అనుభూతిపై భక్తుల నుంచి 20 అంశాలపై అభిప్రాయ సేకరణ జరుగుతోందన్నారు. వీటిని క్రోడీకరించి జాయింట్ కలెక్టర్, అదనపు ఎస్పీలు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇదే స్ఫూర్తితో 2020లో తుంగభద్ర పుష్కరాలను నిర్వహిద్దామన్నారు. అక్కడి నుంచి టూరిజం బోటు ద్వారా నందికొట్కూరు టీడీపీ ఇన్చార్జి శివానంద్రెడ్డితో కలిసి నెహ్రూనగర్ పుష్కర ఘాట్‌కు బయలుదేరి వెళ్లారు. బోటులో విహరించిన కలెక్టర్ సాయంత్రం సంగమేశ్వరానికి చేరుకున్న జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఏర్పాట్లపై జేసీ హరికిరణ్‌తో చర్చించారు. అనంతరం ఆయన కుటుంబసమేతంగా బోటులో షికారు చేసి కృష్ణమ్మ అందాలను వీక్షించారు. -
పెరుగుతున్న కృష్ణా జలాలు
సప్తనదుల సంగమేశ్వర క్షేత్రం వద్ద కృష్ణా జలాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి వరద జలాలు భారీగా వస్తున్నాయి. దీంతో సంగమేశ్వరం వద్ద నీటి మట్టం పెరుగుతోంది. శనివారం వీఐపీలకు కేటాయించిన శిబిరం వద్దకు కృష్ణా జలాలు చేరుకున్నాయి. అధికారులు హుటాహుటిన ఈ శిబిరాన్ని తొలగించారు. భక్తుల అటువైపు వెళ్లకుండా బ్యారికేట్లు ఏర్పాటు చేశారు. -
ఉత్సవ ‘జలధి’ తరంగ