SCR
-
మిచౌంగ్ తుపాను : దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్
సాక్షి, హైదరాబాద్: మిచౌంగ్ తుపాన్ కారణంగా 300 రైళ్లు రద్దయ్యాయని దక్షిణ మధ్య రైల్వే(ఎస్సీఆర్) ముఖ్య ప్రజా సంబంధాల అధికారి(సీపీఆర్వో) తెలిపారు. ఎస్సీఆర్ పరిధిలో రైళ్లపై తుపాన్ ఎఫెక్ట్ మీద ఒక ప్రకటన విడుదల చేశారు. రద్దైన రైళ్లు కాకుండా మరో 10 రైళ్లు గూడూరు చెన్నై- రూట్లో కాకుండా ఇతర రూట్లలో దారి మళ్లిస్తున్నట్లు వెల్లడించారు. ‘ప్రస్తుతం రైల్వే ట్రాక్ లపై ఎక్కడా నీళ్ళు నిలవలేదు. వరద నిలిచే ప్రాంతాలను ప్రత్యేకంగా గుర్తించాం. ఇప్పటికే రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు రైళ్ల రద్దు సమచారం అందించాం. ఎస్ఎంఎస్లు, సామాజిక మాధ్యమాల్లోనూ అందించాం. ప్రయాణికుల రిజర్వేషన్ ఛార్జీలు రీఫండ్ చేశాం. తుపాను తీరం దాటాక వీలైనంత త్వరగా రైళ్లు పునరుద్ధరిస్తాం’ అని సీపీఆర్వో తెలిపారు. ఇదీచదవండి..మిచౌంగ్ తుపాను హెచ్చరిక.. అప్డేట్స్ -
ఉత్తరాంధ్రకు ద.మ.రైల్వే ఉత్తచేయి.. పత్తాలేని సంక్రాంతి ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: అసలే పండుగ సీజన్.. జనం సొంతూళ్లకు వెళ్లడానికి సిద్ధమవుతున్న వేళ.. ఉత్తరాంధ్రవాసులకు దక్షిణ మధ్య రైల్వే ఉత్తచేయి చూపింది. సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నుంచి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం వంటి ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు కనీసం ఒక్క ప్రత్యేక రైలూలేదు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లల్లో విశాఖ మీదుగా ఒక్కటి కూడా వెళ్లడంలేదు. ఆరేడు రెగ్యులర్ రైళ్లు తప్ప ప్రత్యేక రైళ్లు లేకపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు. విశాఖ వైపుగా నడిచే రెగ్యులర్ రైళ్లన్నీ వచ్చే ఫిబ్రవరి వరకు కూడా వెయిటింగ్ జాబితాతో దర్శనమిస్తున్నాయి. దక్షిణ మధ్య రైల్వే సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు 30 రైళ్లను అదనంగా నడిపేందుకు చర్యలు చేపట్టింది. వాటిలో కాకినాడ, తిరుపతి, బెంగళూరు, విజయవాడ వంటి ప్రాంతాలకే ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి. కానీ, విశాఖ, చుట్టుపక్కలప్రాంతాలకు వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లు లేవని కూకట్పల్లి హౌసింగ్ బోర్డుకు చెందిన వినయ్ అనే ప్రయాణికుడు విస్మయం వ్యక్తం చేశారు. సమన్వయలేమి... దక్షిణ మధ్య రైల్వే, ఈస్ట్‌కోస్ట్ రైల్వేల మధ్య సమన్వయం కొరవడటం వల్లే ప్రత్యేక రైళ్ల ఏర్పాటులో నిర్లక్ష్యం నెలకొందని ప్రయాణికులు చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి దువ్వాడ వరకు దక్షిణ మధ్య రైల్వే పరిధి కాగా, దువ్వాడ నుంచి విశాఖ తదితర ప్రాంతాలు ఈస్ట్‌కోస్ట్ రైల్వే జోన్లోకి వస్తాయి. దీంతో హైదరాబాద్ నుంచి కాకినాడకు ప్రత్యేక రైళ్లపై చూపిన శ్రద్ధ విశాఖ వైపు కనిపించడంలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ఈస్ట్‌కోస్ట్ రైల్వే కూడా సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. ‘హైదరాబాద్ నుంచి సామర్లకోట వరకు, అక్కడి నుంచి కాకినాడకు రైళ్లు అందుబాటులో ఉన్నాయి. కానీ, విశాఖకు వెళ్లాలంటే మరో 150 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. సామర్లకోట నుంచి విశాఖకు వెళ్లడం ఎలా సాధ్యం’’అని ఫణీంద్ర అనే ప్రయాణికుడు చెప్పారు. రెగ్యులర్ రైళ్లు ఇప్పటికే భర్తీ కావడం, ప్రత్యేక రైళ్లు లేకపోవడంతో ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులపై ఆధారపడాల్సి వస్తోంది. కానీ, గంటల తరబడి కూర్చొని ప్రయాణంచేయడం మహిళలు, పిల్లలు, వయోధికులకు చాలా కష్టం. మరోవైపు బస్సుల కంటే రైళ్లలో చార్జీలు కూడా తక్కువ. పదిలక్షల మంది వరకు ప్రయాణం ఏపీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే సంక్రాంతి వేడుకలకు హైదరాబాద్ నుంచి 25 లక్షల మందికిపైగా నగరవాసులు సొంతూళ్లకు వెళ్లే అవకాశం ఉంది. అందులో కనీసం 10 లక్షల మంది విశాఖ, చుట్టుపక్కల ప్రాంతాలకు చెందినవాళ్లే ఉంటారని అంచనా. మరికొద్దిరోజుల్లో విద్యార్థులకు సెలవులు ప్రకటించనుండటంతో రైళ్లలో ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉంది. ఇదీ చదవండి: Andhra Pradesh: సామాన్యుడికి ఆధునిక వైద్యం -
పలు మార్గాల్లో దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు రూట్లలో ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు విశాఖ–సికింద్రాబాద్ (08579/08580) స్పెషల్ ట్రైన్ ఈనెల 24 నుంచి సెప్టెబర్ 28 వరకు ప్రతి బుధవారం సాయంత్రం 7 గంటలకు విశాఖ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8.20 గంటలకి సికింద్రాబాద్‌కు చేరుకోనుంది. తిరుగు ప్రయాణంలో ఈనెల 25 నుంచి సెప్టెంబర్ 29 వరకు ప్రతి గురువారం సాయంత్రం 7.40 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 6.40 గంటలకి విశాఖ చేరుకోనుంది. విశాఖపట్నం–మహబూబ్‌నగర్ (08585/08586) స్పెషల్ ట్రైన్ ఈనెల 23 నుంచి సెప్టెంబర్ 27 వరకు ప్రతి మంగళవారం సాయంత్రం 5.35 గంటలకు విశాఖ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు మహబూబ్‌నగర్ చేరుకోనుంది. తిరుగు ప్రయాణంలో ఈనెల 24 నుంచి 28 వరకు ప్రతి బుధవారం సాయంత్రం 6.20 గంటలకి మహబూబ్‌నగర్ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9.50 గంటలకి విశాఖ చేరుకుంటుంది. విశాఖపట్నం–తిరుపతి (08583/08584) స్పెషల్ ట్రైన్ ఈనెల 29 నుంచి సెప్టెంబర్ 26 వరకు ప్రతి సోమవారం సాయంత్రం 7 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9.15 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈనెల 30 నుంచి సెప్టెంబర్ 27 వరకు ప్రతి మంగళవారం రాత్రి 9.55 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 10.15 గంటలకు విశాఖ చేరుకుంటుంది. (క్లిక్: మంకీపాక్స్ నిర్ధారణ కిట్ విడుదల) -
పలు రైళ్లు రద్దు, దారి మళ్లింపు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): చెన్నై–గూడూరు సెక్షన్లో ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా ఆ మార్గంలో నడిచే పలు రైళ్లను పూర్తిగా రద్దు చేయడంతో పాటు మరి కొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు, దారి మళ్లించి నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. నెల్లూరు–సూళ్లూరుపేట మధ్య నడిచే మెమూ రైళ్లను (06746/06745) ఈ నెల 22న పూర్తిగా రద్దు చేశారు. విజయవాడ–చెన్నై సెంట్రల్ (12711/12712) రైళ్లను ఈ నెల 22న గూడూరు–చెన్నై సెంట్రల్ మధ్య, హైదరాబాద్–తాంబరం (12760) రైలును ఈ నెల 26న చెన్నైబీచ్–తాంబరం మధ్య పాక్షికంగా రద్దు చేశారు. దారి మళ్లించిన రైళ్లు.. ► పుదుచ్చేరి–న్యూఢిల్లీ (22403) ఎక్స్‌ప్రెస్‌ను ఈ నెల 16న చెంగల్పట్టు, అరక్కోణం, పెరంబూర్, కొరుక్కుపేట స్టేషన్ల మీదుగా దారి మళ్లింపు. ► ఇండోర్–కొచువేలి ఎక్స్‌ప్రెస్ (22645) ఈ నెల 21న గూడూరు, రేణిగుంట, మేల్పాక్కం, కాట్పాడి స్టేషన్ మీదుగా మళ్లింపు. ► ధన్‌బాద్–అలప్పుజ ఎక్స్‌ప్రెస్ (13351) ఈ నెల 21న గూడూరు, రేణిగుంట, మేల్పాక్కం మీదుగా దారి మళ్లింపు. ► కాకినాడ–చెంగల్పట్టు ఎక్స్‌ప్రెస్ (17644) ఈ నెల 26న పెరంబూర్, అరక్కోణం మీదుగా మళ్లింపు. ► కాకినాడ–చెంగల్పట్టు ఎక్స్‌ప్రెస్ (17652) ఈ నెల 26న అరక్కోణం, కాంచీపురం మీదుగా దారి మళ్లింపు. ► చెన్నై ఎగ్మోర్–ముంబై సీఎస్టీ ఎక్స్‌ప్రెస్ (22158) ఈ నెల 27న తాంబరం, చెంగల్పట్టు మీదుగా దారి మళ్లింపు. -
ప్లాట్‌ఫాం టిక్కెట్ చార్జీ పెంపు
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి రద్దీ నియంత్రణ దృష్ట్యా దక్షిణమధ్య రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ల ధరలను తాత్కాలికంగా పెంచింది. ఈ నెల 8వ తేదీ నుంచి 20 వరకు కాచిగూడ రైల్వేస్టేషన్లో ప్లాట్‌ఫాం టికెట్ చార్జీలను రూ.10 నుంచి రూ.20కి పెంచినట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్.రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. కాచిగూడ నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికుల కోసం వచ్చే బంధుమిత్రుల రద్దీని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పండుగ సీజన్లో పెద్ద ఎత్తున జన సమూహం ప్లాట్‌ఫారంపై ప్రవేశించకుండా నియంత్రించేందుకు, రద్దీ వల్ల ప్రయాణికులకు కలిగే అసౌకర్యాన్ని నివారించడానికి చార్జీలను పెంచినట్లు పేర్కొన్నారు. కోవిడ్ నియంత్రణ దృష్ట్యా కూడా అనవసరమైన వ్యక్తులు ప్లాట్‌ఫాంలపైకి రాకుండా నియంత్రించాల్సి ఉందన్నారు. -
ఇదేం బాదుడు బాబోయ్! సికింద్రాబాద్ స్టేషన్లో ఓవర్ స్టే పార్కింగ్ ఛార్జ్ రూ.500
పూర్తి స్థాయిలో రైళ్లు ఇంకా పట్టాలు మీద పరుగులు పెట్టడం లేదు.. అప్పుడే పార్కింగ్ ఛార్జీల పేరుతో దక్షిణ మధ్య రైల్వే ప్రజల మీద మోయలేని భారాన్ని మోపుతోంది. ముఖ్యంగా జంటనగరాల్లో రైలు ప్రయాణాలకు గుండెకాయలాంటి సికింద్రాబాద్ స్టేషన్‌కు సొంత వాహనంలో రావాలంటే వెన్నులో వణుకుపుట్టే రేంజ్లో ఛార్జీలను విధిస్తోంది. ఇదేమంటే స్టేషన్లో రద్దీని నియంత్రించేందుకే అంటూ వితండవాదం ఎత్తుకుంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అత్యంత రద్దీగా ఉండే స్టేషన్లలో ప్రధానమైంది సికింద్రాబాద్ జంక్షన్. ఈ స్టేషన్ మీదుగా నిత్యం వందలాది రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. లక్ష మందికి పైగా ప్రయాణికులు ఈ స్టేషన్‌ను వినియోగించుకుంటారు. రద్దీ తగ్గట్టుగా స్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నామని, పీపీపీ మోడ్‌లో పనులు చేపట్టబోతున్నట్టు ఇన్నాళ్లు ప్రకటిస్తూ వస్తోన్న రైల్వేశాఖ.. ఆచరణలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. సామాన్యుల నడ్డీ విరిచేలా పార్కింగ్ ఫీజుల పేరుతో భయభ్రాంతులకు గురి చేస్తోంది. కేవలం రెండు గంటలే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కి ఇరువైపులా పార్కింగ్ ప్లేస్‌లు ఉన్నాయి. ఇక్కడ టూవీలర్, ఫోర్ వీలర్ వాహనాలను ప్రయాణికులు నిలిపి ఉంచుతున్నారు. దక్షిణ మధ్య తాజా నిబంధనల ప్రకారం ఇక్కడ రెండు గంటల పాటు టూ వీలర్ నిలిపి ఉంచితే రూ.15 , ఫోర్ వీలర్ అయితే రూ.50 వంతున పార్కింగ్ ఛార్జీగా విధించింది. ఆలస్యమయితే ఎవరైనా రెండు గంటలకు మించి పార్కింగ్ ప్లేస్‌లో వాహనం నిలిచి ఉంచినట్టయితే గుండె గుబిల్లుమనేలా జరిమానాలు విధిస్తోంది రైల్వేశాఖ. రెండు గంటల తర్వాత మొదటి ఎనిమిది నిమిషాలకు ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జ్ లేదు. కానీ ఆ తర్వాత గడిచే ఒక్కో నిమిషానికి ఒక్కొ రేటు విధించింది. అవి చూస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం. - తొలి రెండు గంటల తర్వాత 8 నుంచి 15 నిమిషాల ఆలస్యానికి ఓవర్ స్టే పార్కింగ్ ఛార్జ్ రూ.100 - తొలి రెండు గంటల తర్వాత 16 నుంచి 30 నిమిషాల ఆలస్యానికి ఓవర్ స్టే పార్కింగ్ ఛార్జ్ రూ.200 - తొలి రెండు గంటల తర్వాత 30 నిమిషాలు దాటి ఆలస్యమయితే ఓవర్ స్టే పార్కింగ్ ఛార్జ్ రూ.500 ఇప్పటికే పెరిగిన ధరలతో సతమతం అవుతున్న సామాన్యులకు ఈ ఎక్స్ట్రా పార్కింగ్ ఛార్జీలు శరాఘాతంగా మారాయి. పండగ వేళ స్టేషన్‌కి వెళ్లి ఓవర్ స్టే పార్కింగ్ ఛార్జీల కాటుకు గురైన ఎందరో సోషల్ మీడియా వేదికగా రైల్వేపై విమర్శలు గుప్పిస్తున్నారు. Privatisation Shows its Colour. Parking a car for 31 minutes at a railway station now costs Rs.500 as parking charges. Whose Vikas? pic.twitter.com/EyFNS4rdPl — Brigadier A K Jairath, Retd (@KWecare) November 9, 2021 కవరింగ్ ఎక్స్ట్రా పార్కింగ్ ఛార్జీల విషయంలో నలువైపులా విమర్శలు పెరిగినా రైల్వే అధికారుల్లో మార్పు రాలేదు. పైగా స్టేషన్లో అనవసర రద్దీని నియంత్రించేందుకు స్టేషన్‌కు వచ్చే ప్రయాణికుల సౌకర్యంగా ఉండేందుకే ఈ ఓవర్ స్టే ఛార్జీలు పెట్టామంటూ కవరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. Clarification about the messages circulating in the socialmedia regarding parking charges @Secunderabad Stn. These are only Overstay charges introduced to avoid unnecessary crowding of Station premises and provide hassle free movement facility for rail passengers @KTRTRS @KWecare pic.twitter.com/KNEhUcHBZq — South Central Railway (@SCRailwayIndia) November 10, 2021 ఇలాగైతే ఎలా రెండు గంటలు దాటితే రైల్వేశాఖ అమలు చేస్తోన్న ఓవర్ స్టే ఛార్జీలు తమకు భారంగా మారాయని ప్రయాణికులు అంటున్నారు. ఉదయం వెళ్లి సాయంత్రం వచ్చేలా ప్రయాణం చేయడం కష్టంగా అవుతోంది అంటున్నారు. మరోవైపు చాలా రైళ్లు సమయానికి రావు. ఒక వేళ రైలు ఆలస్యం కావడం వల్ల స్టేషన్లో ఎక్కువ సేపు ఉండాల్సి వస్తే.. అది రైల్వేశాఖ తప్పు అవుతుంది. అందుకు వాళ్లే పరిహారం ఇవ్వాల్సింది పోయి.. తిరిగి ప్రజల నుంచి ఓవర్ స్టే ఛార్జీలు వసూలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అక్కడ స్పెషల్.. ఇక్కడ ఓవర్‌స్టే కోవిడ్ తర్వాత సాధారణ రైళ్లను క్రమంగా పట్టాలెక్కుతున్నాయి. అయితే వాటిని సాధారణ రైళ్లుగా కాకుండా స్పెషల్ రైళ్లుగా పేర్కొంటూ అదనపు ఛార్జీలు వసూలు చేస్తోంది రైల్వేశాఖ. కొన్ని ప్యాసింజర్ రైళ్లను ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చి.. అక్కడ కూడా సొమ్ము చేసుకుంటోంది. వీటిపైనే చాలా విమర్శలు ఉండగా తాజాగా పార్కింగ్ ఓవర్‌స్టే ఛార్జీలు తెర మీదకు వచ్చాయి. -
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్
కరోనా ప్రభావం రైల్వే శాఖపై అధికంగా పడిన సంగతి తెలిసిందే. దేశంలో లాక్ డౌన్ విధించే సమయంలో రైళ్ల రాక పోకలను పూర్తిగా నిలిపివేశారు. అయితే, అన్ లాక్ అనంతరం కొన్ని ప్రత్యేక రైళ్లను మాత్రమే అధికారులు నడుపుతున్నారు. మొదట కేవలం కొన్ని రైళ్లకు మాత్రమే అనుమతి ఇచ్చిన అధికారులు క్రమంగా వాటి సంఖ్యను పెంచుతూ పోతున్నారు. తాజాగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు మరో కీలక ప్రకటన చేశారు. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో మరో రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించారు. సోమ, శుక్రవారాల్లో నడిచే కొల్హాపూర్-నాగ్‌పూర్ రైలు ఈ నెల 12 నుంచి ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ రైలు కొల్హాపూర్ నుంచి మధ్యాహ్నం 12.45 గంటలకు బయలుదేరుతుందని వివరించారు. మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు నాగ్‌పూర్‌కు చేరుకుంటుందని తెలిపారు. గురు, శనివారాల్లో నడిచే నాగ్‌పూర్-కొల్హాపూర్ రైలును ఈ నెల 13న ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రత్యేక రైలు నాగ్‌పూర్ నుంచి మధ్యాహ్నం 3.15 గంటలకు బయలుదేరుతుందని వివరించారు. ఈ రైలు కొల్హాపూర్‌కు మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటలకు చేరుకుంటుందని అధికారులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. చదవండి: ప్రపంచ తొలి 10 మంది కుబేరుల్లో అంబానీ! భారీగా పడిపోయిన బంగారం ధరలు -
రన్నరప్ దక్షిణ మధ్య రైల్వే
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా రైల్వే మహిళల బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) జట్టు రాణించింది. దక్షిణ మధ్య రైల్వే స్పోర్ట్స్ సంఘం (ఎస్‌సీఆర్‌ఎస్‌ఏ) ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లోని రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్ లో జరిగిన ఈ టోర్నీలో రన్నరప్‌గా నిలిచింది. సోమవారం జరిగిన ఫైనల్లో సౌత్ వెస్ట్రన్ రైల్వే 69–64తో దక్షిణ మధ్య రైల్వేపై గెలుపొందింది. సదరన్ రైల్వే జట్టుకు మూడోస్థానం దక్కింది. జోనల్ రైల్వేస్, ప్రొడక్షన్ యూనిట్స్‌కు చెందిన మొత్తం 12 జట్లు టైటిల్కోసం తలపడ్డాయి. బహుమతి ప్రదాన కార్యక్రమంలో ఎస్సీఆర్ అదనపు జనరల్ మేనేజర్ జాన్ థామస్ ముఖ్య అతి థిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. -
ఆలిండియా రైల్వేస్ వాలీబాల్ టోర్నీ షురూ
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా రైల్వేస్ వాలీబాల్ చాంపియన్‌షిప్ సోమవారం ప్రారంభమైంది. సికింద్రాబాద్‌లోని రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) జనరల్ మేనేజర్ జాన్ థామస్ ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభించారు. ఈనెల 22 వరకు జరుగనున్న ఈ టోర్నీలో జోనల్ రైల్వేస్, ప్రొడక్షన్ యూనిట్స్, రైల్వే ప్రొటెక్టింగ్ ఫోర్స్‌లకు చెందిన 20 జట్లు టైటిల్ కోసం తలపడుతున్నాయి. జట్లను నాలుగు గ్రూపులుగా వర్గీకరించి లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌సీఆర్‌ఎస్‌ఏ అధ్యక్షులు అర్జున్ ముండియా, కార్యదర్శి ఈవీ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దక్షిణ మధ్య రైల్వే జట్టుకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా రైల్వే మహిళల కబడ్డీ టోర్నమెంట్లో ఆతిథ్య దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) జట్టు సత్తా చాటింది. సికింద్రాబాద్ లోని రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన ఈ టోర్నీ లో టైటిల్‌ను కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన ఫైనల్లో ఎస్సీఆర్ 37–17తో సెంట్రల్ రైల్వేపై గెలిచి చాంపియన్‌గా నిలిచింది. మొత్తం 8 జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో వెస్ట్రన్ రైల్వే, నార్తర్న్ రైల్వే వరుసగా 3, 4 స్థానాలను సాధించాయి. బహుమతి ప్రధానోత్సవంలో ఎస్సీఆర్ జీఎం వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ అమిత్ వరదన్, హైదరాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ అరుణ్ కుమార్ జైన్, ఎస్‌సీఆర్‌ఎస్‌ఏ కార్యదర్శి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సికింద్రాబాద్-మచిలీపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: దసరా రద్దీని దృష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్-మచిలీపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సోమవారం పేర్కొంది. మచిలీపట్నం-సికింద్రాబాద్(07049/07050) రైలు ఈ నెల 21న మచిలీపట్నంలో మధ్యాహ్నం 3.05కు బయలు దేరి రాత్రి 10.45కు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరిగి అదేరోజు రాత్రి 11.55కు సికింద్రాబాద్‌లో బయలుదేరి మర్నాడు ఉదయం 9.35కు మచిలీపట్నం చేరుకుంటుంది. సికింద్రాబాద్- నర్సాపూర్(07260) రైలు ఈ నెల 19న రాత్రి 9.40కు సికింద్రాబాద్‌లో బయలుదేరి మర్నాడు ఉదయం 7కు నర్సాపూర్ చేరుకుంటుంది. విజయవాడ-సికింద్రాబాద్ రైలు(07207) 18న రాత్రి 10కి విజయవాడలో బయలుదేరుతుంది. పలు రైళ్లు రద్దు: విజయవాడ-తిరుపతి (07047) ప్రత్యేక రైలు ఈ నెల 18వ తేదీన, తిరుపతి-అనకాపల్లి(07145) ప్రత్యేక రైలు ఈ నెల 19న రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ‘పెరిగిన ప్లాట్‌ఫామ్ టికెట్ చార్జీలు’ సాక్షి, హైదరాబాద్: దసరా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణమధ్య రైల్వే ప్లాట్‌ఫామ్ టికెట్ చార్జీలను తాత్కాలికంగా పెంచింది. సాధారణ రోజుల్లో టిక్కెట్ ధర రూ.10 ఉండగా, ప్రస్తుతం రూ.20 కి పెంచారు. పెరిగిన చార్జీలు ఈ నెల 21వ తేదీ వరకు అమల్లో ఉంటాయి. సికింద్రాబాద్, కాచిగూడ, విజయవాడ వంటి ప్రధాన రైల్వేస్టేషన్లలో మాత్రమే చార్జీలు పెంచినట్లు అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ స్టేషన్లో సాధారణంగా ప్రతి రోజు 1.8 లక్షల మంది రాకపోకలు సాగిస్తుండగా దసరా రద్దీ దృష్ట్యా ప్రతిరోజు మరో 30 వేల మంది అదనంగా రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో ప్లాట్ఫారాలపైన ఒత్తిడి పెరుగుతోందని, దీన్ని నియంత్రించేందుకు తాత్కాలికంగా చార్జీలను పెంచాల్సి వచ్చిందని అధికారులు చెప్పారు. మిగతా స్టేషన్లలోనూ రద్దీని నియంత్రించేందుకే ఈ నిర్ణయం తీసుకొన్నట్లు పేర్కొన్నారు. భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి :దక్షిణ మధ్య రైల్వే జీఎం సూచన సాక్షి, హైదరాబాద్: సరుకు లోడింగ్ విషయా ల్లో భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్‌యాదవ్ అధికారు లకు సూచించారు. ఈ మేరకు సోమవారం రైల్ నిలయంలో సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంతకల్, గుంటూరు, నాందేడ్ రైల్వే డివిజన్ల డీఆర్ఎంలతో సమీక్ష నిర్వహించారు. భద్రతా పరమైన విషయాల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదని, బొగ్గు, సిమెంట్, లైమ్ స్టోన్ తదితర సరుకు లోడింగ్‌లపై ప్రణాళికతో పని చేయాలని అధికారులకు సూచించారు. రైల్వే ట్రాక్ మరమ్మతులు, రైల్వే స్టేషన్ రీ డెవలప్మెంట్, కాపలాలేని లెవల్ క్రాసింగ్‌ల వద్ద పనుల వేగం పెంచాలన్నారు. సమావేశంలో ఏజీఎం థామస్, ప్రిన్సిపల్ చీఫ్ ఇంజినీర్ శివప్రసాద్, ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ రమణారెడ్డి పాల్గొన్నారు. -
విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): వేసవిలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు విజయవాడ రైల్వే డివిజన్ ఇన్చార్జి పీఆర్వో జేవీఆర్కే రాజశేఖర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాకినాడటౌన్–తిరుపతి ప్రత్యేక రైలు (07210) మే 11, 13, 18, 20, 25, 27, జూన్ 1, 3, 8, 10, 15, 17, 22, 24, 29వ తేదీల్లో రాత్రి 6.45కు కాకినాడటౌన్‌లో బయలుదేరుతుంది. తిరుపతి–కాకినాడ టౌన్ రైలు (07209) మే 12, 14, 19, 21, 26, 28, జూన్ 2, 4, 9, 11, 16, 18, 23, 25, 30 తేదీల్లో రాత్రి 7.00 గంటలకు తిరుపతిలో బయలుదేరుతుంది. నర్సాపూర్–హైదరాబాద్ ప్రత్యేక రైలు (07258) మే 6, 13, 20, 27, జూన్ 3, 10, 17, 24 తేదీల్లో సాయంత్రం 6.00 గంటలకు నర్సాపూర్‌లో బయలుదేరుతుంది. హైదరాబాద్–విజయవాడ రైలు (07257) మే 7, 14, 21, 28, జూన్ 4, 11, 18, 25 తేదీల్లో రాత్రి 10.20కు హైదరాబాద్‌లో బయలుదేరుతుంది. ఈ ప్రత్యేక రైళ్లు విజయవాడ మీదుగా రాక పోకలు సాగిస్తాయని రాజశేఖర్ తెలిపారు. -
చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో ఘటన.. రైల్వే యాక్షన్..
సాక్షి, హైదరాబాద్ : రైలులో అమ్మే టీలో బాత్ రూం నీళ్లను కలిపిన వీడియోపై భారతీయ రైల్వే చర్యలకు ఉపక్రమించింది. బాత్రూం నీళ్లను టీ క్యాన్‌లో కలిపిన కాంట్రాక్టర్‌కు లక్ష రూపాయలు జరిమానా విధించింది. గతేడాది డిసెంబర్లో చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఉదంతం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. చెన్నై సెంట్రల్ నుంచి హైదరాబాద్ వస్తోన్న చార్మినార్ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆగింది. ఇద్దరు టీ అమ్మే వ్యక్తులు మూడు టీ క్యాన్లు తీసుకొని రైలులోని ఓ బోగీలోకి ఎక్కారు. ఒక వ్యక్తి ఆ మూడు క్యాన్లను టాయిలెట్లోకి తీసుకెళ్లగా.. మరో వ్యక్తి బయట కాపలాగా నిలుచున్నాడు. టీ క్యాన్లలో నీళ్లు నింపుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ సమయంలో బోగీ తలుపు వద్ద నిలుచున్న ఓ వ్యక్తి తన స్మార్ట్‌ఫోన్‌తో ఈ ఘటనను చిత్రీకరించారు. అనంతరం దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కొద్ది రోజులుగా వైరల్‌గా మారిన ఈ వీడియోపై రైల్వే శాఖ ఎట్టకేలకు స్పందించింది. రంగంలోకి దిగిన దక్షిణ మధ్య రైల్వే విజిలెన్స్ అధికారులు వీడియోలోని టీ అమ్మే వ్యక్తులను గుర్తించారు. సికింద్రాబాద్-ఖాజీపేట జంక్షన్ల మధ్య రైళ్లలో ఆహార విక్రయ కాంట్రాక్టును సొంతం చేసుకున్న పి.శివప్రసాద్ అనే కాంట్రాక్టర్‌కి చెందిన ఉద్యోగులే ఇందుకు పాల్పడినట్లు అధికారుల విచారణలో తేలింది. దీంతో శివప్రసాద్‌కు దక్షిణ మధ్య రైల్వే లక్ష రూపాయల జరినామా విధించింది. శివప్రసాద్‌కు ఉన్న ఐఆర్సీటీసీ లైసెన్స్‌ను కూడా రద్దు చేసింది. -
దక్షిణ మధ్య రైల్వేకు మూడో స్థానం
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత రైల్వేస్ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) రాణించింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో ఎస్సీఆర్ 39 పరుగుల తేడాతో నార్త్ వెస్ట్రన్ రైల్వేస్, జైపూర్ జట్టుపై విజయం సాధించింది. క్వార్టర్స్‌లో వెస్ట్రన్ రైల్వేస్‌పై గెలుపొందిన ఎస్సీఆర్ జట్టు...సెమీస్‌లో సెంట్రల్ రైల్వే చేతిలో పరాజయం పాలై మూడోస్థానం కోసం నార్త్ వెస్ట్రన్ జట్టుతో తలపడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్సీఆర్ 49.5 ఓవర్లలో 206 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ ఎం. సురేశ్ (95 బంతుల్లో 51; 2 ఫోర్లు) అర్ధసెంచరీ చేశాడు. జగదీశ్ కుమార్ (44 బంతుల్లో 49; 5 ఫోర్లు, 1 సిక్స్), కపిల్ (33) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో వినీత్ 4 వికెట్లతో చెలరేగగా... గజేంద్ర సింగ్, మధుర్ ఖత్రి చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం 207 పరుగుల సాధారణ లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన నార్త్ వెస్ట్రన్ జట్టును ఎస్సీఆర్ బౌలర్లు సురేశ్ (5/45), సుధాకర్ (4/64) కట్టడి చేశారు. వీరిద్దరి ధాటికి ఆ జట్టు 42.4 ఓవర్లలో 167 పరుగులకే కుప్పకూలింది. వినీత్ (52), నిఖిల్ (43) పోరాడారు. శరత్ బాబు ఒక వికెట్ తీశాడు. -
లెవెల్ క్రాసింగ్‌ల వద్ద వంతెనల నిర్మాణం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్న 460 రైల్వే లెవెల్ క్రాసింగుల వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబీ)లను నిర్మించాలని రాష్ట్ర రోడ్లు–భవనాలు, రైల్వే శాఖలు నిర్ణయించాయి. ఈ ఏడాది 52 ఆర్వోబీలను నిర్మించాలని ప్రతిపాదించాయి. వీటికి అయ్యే రూ.2,700 కోట్ల ఖర్చును రెండు శాఖలు చెరి సగం భరించనున్నాయి. బుధవారం ఇక్కడ రోడ్లు, భవనాల మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు, రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్ యాదవ్‌తో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో నాలుగు వరుసల రోడ్ల నిర్మాణం ముమ్మరంగా సాగుతున్నందున ఆర్వోబీలు కూడా నాలుగు వరుసలుగా ఉండేవిధంగా చూడాలని మంత్రులు కోరగా రైల్వే జీఎం అంగీకరించారు. గతంలో నాలుగు వరుసల రోడ్లపై రెండు వరుసల ఆర్‌వోబీలనే నిర్మించారు. వంతెనల్లో పట్టాల మీదుగా నిర్మించే భాగాన్ని ఇప్పటిదాకా రైల్వే శాఖ చేపడుతోంది. ఇక్కడ సమన్వయలోపం కారణంగా ఆ పనులు పెండింగ్‌లో ఉండటంతో సమస్యలు తలెత్తుతున్నాయి. ఇక నుంచి ఆ భాగాన్ని రాష్ట్రప్రభుత్వం చేపట్టాలని నిర్ణయించారు. రైల్వేవాటా నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లిస్తే పనులను రాష్ట్ర యంత్రాంగమే చేపడుతుంది. పాత ఆర్వోబీలను తొలగించి కొత్తవాటిని నిర్మించేందుకు రైల్వే జీఎం అంగీకరించారు. మియాపూర్– పటాన్చెరు మధ్య రైల్వే టెర్మినల్ నిర్మించాలని ప్రతిపాదిస్తున్నట్టు తుమ్మల తెలిపారు. మెదక్– అక్కంపల్లి రైల్వేలైన్ నిర్మాణం ఈ సంవత్సరాంతానికి పూర్తి అవుతుందని హరీశ్ ప్రకటించారు. -
రైల్వే కేటాయింపుల్లో తీవ్ర నిరాశ..
సాక్షి, హైదరాబాద్ ఒక్క కొత్త రైలు రాలేదు.. కీలక మార్గాల్లో కొత్త్త లైన్ ఒక్కటీ లేదు.. భారీ ప్రాజెక్టులూ లేవు.. వెరసి మోదీ రైలు తెలంగాణలో ఆగకుండానే దూసుకుపోయింది! కోటి ఆశలతో కేంద్రం వైపు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న రాష్ట్రానికి తీవ్ర నిరాశే మిగిల్చింది. రైల్వే లైన్లు పరిమితంగా ఉన్న తెలంగాణ ప్రతిసారీ రైల్వే బడ్జెట్ అనగానే కేంద్రం వైపు ఎంతో ఆశతో చూస్తోంది. ప్రతిసారీ ఎంతో కొంత విదిల్చి నిరుత్సాహపరిచే కేంద్రం ఈసారి మరింత పిసినారితనాన్ని ప్రదర్శించింది. బడ్జెట్లో రైల్వేకు తొలిసారి రూ.లక్ష కోట్లను మించి (రూ.1,46,500 కోట్లు) నిధులు కేటాయించినా.. అందులో రాష్ట్రానికి విదిల్చింది కేవలం రూ.1,813 కోట్లు. మొత్తం కేటాయింపులో ఇది కేవలం 1.23 శాతం! బడ్జెట్ విధానాన్ని మార్చినందున కచ్చితంగా కొత్త ప్రాజెక్టులు మంజూరు చేయాలన్న నిర్ణయం ఉండదని, సంవత్సరంలో ఎప్పుడైనా మంజూరు చేయొచ్చంటున్న కేంద్రం.. ఇప్పటికే పనులు జరుగుతున్న ప్రాజెక్టులకన్నా భారీగా నిధులు ఇచ్చిందా అంటే అదీ లేదు. అత్తెసరు నిధులు విదిల్చి ఆ పనులు ఇప్పట్లో పూర్తి కావనే సంకేతాలనిచ్చింది. పండుగల సమయంలో లక్షల మంది ప్రయాణికులు పోటెత్తినా చాలినన్ని ప్రత్యేక రైళ్లు నడిపే శక్తి దక్షిణ మధ్య రైల్వేకు లేదు. డిమాండ్‌ను తట్టుకునే స్థాయిలో రైల్వే లైన్లు లేకపోవటమే ఇందుకు కారణమని రైల్వేనే చెబుతోంది. రెండు, మూడో లైన్ల నిర్మాణం, కీలక మార్గాల్లో కొత్త లైన్లకు నిధులిస్తే ఈ సమస్య తీరేంది. కానీ ఆ ప్రయత్నం కూడా జరగలేదని బడ్జెట్ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తంగా సాధారణ కేటాయింపులతో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ రాష్ట్రానికి మొండిచేయి చూపారు. ఇలాగైతే పదేళ్లయినా పూర్తి కావు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రస్తుతం 2,623 కి.మీ. మేర కొత్త రైల్వే లైన్లకు ఉద్దేశించిన 22 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. వీటి మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.19,983 కోట్లు. కానీ రాష్ట్రం ఆవిర్భవించినప్పట్నుంచీ ఇప్పటి వరకు వీటిపై చేసిన ఖర్చు రూ.3,026 కోట్లు మాత్రమే. వాటికి తాజా బడ్జెట్లో కేటాయించిన మొత్తం రూ.1,757 కోట్లు. అందులో తెలంగాణ వాటా కేవలం రూ.675 కోట్లు. ఇదేరకంగా నిధులు కేటాయిస్తూ పోతే ఆ ప్రాజెక్టులు పూర్తయ్యేందుకు పదేళ్ల కాలం పడుతుంది. ఇక కొత్త లైన్ల సంగతి చెప్పేదేముంది. జరిగిన పనులు 8.2 శాతమే.. పెరుగుతున్న డిమాండ్, రైళ్ల ట్రాఫిక్ నేపథ్యంలో ప్రస్తుతం రెండు, మూడో లైన్ నిర్మాణం ఎంతో అవసరం. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 2,268 కి.మీ. మేర ఈ పనులు సాగుతున్నాయి. వీటి అంచనా వ్యయం రూ.19,647 కోట్లు. కానీ 2014 నుంచి ఇప్పటివరకు రూ.1,626 కోట్లు మాత్రమే వ్యయం చేశారు. అంటే.. 8.2 శాతం పనులే జరిగాయని ఈ లెక్కలు చెబుతున్నాయి. తాజాగా అందుకు ఇచ్చిన మొత్తం రూ.611 కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు కొత్త లైన్లకు సంబంధించి 113 కి.మీ., డబ్లింగ్, ట్రిప్లింగ్‌కు సంబంధించి 24.50 కి.మీ. మాత్రమే పూర్తి చేయగలిగారు. నిధుల కేటాయింపుల్లో పెరుగుదల ఏది? రైల్వే వసతి అతి తక్కువ ఉన్న రాష్ట్రంలో ఆది నుంచి బడ్జెట్ కేటాయింపులు అత్తెసరే. కానీ 2014లో మోదీ ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత కాస్త ఆశలు పెరిగాయి. అప్పటి వరకు ఉన్న నామమాత్రపు కేటాయింపులను కొంత పెంచటమే ఇందుకు కారణం. వరుసగా మూడేళ్లపాటు ఆ పెంపు ఓ మోస్తరుగా ఉండటంతో.. ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన ఈ చివరి బడ్జెట్లో అది మరింత ఆశాజనకంగా ఉంటుందని ఆశించారు. కానీ నామమాత్రపు పెంపుతో నీళ్లు చల్లారు. బడ్జెట్లో కేటాయింపులివీ.. ఇక అన్నీ ఎలక్ట్రిక్.. : దక్షిణ మధ్య రైల్వేను పూర్తిగా కరెంటు మార్గంగా చేయబోతున్నారు. ఈ జోన్ పరిధిలోని బీదర్–గుల్బర్గా మార్గం మినహా యావత్తు ద.మ. రైల్వేను ఎలక్ట్రికల్ మార్గంగా చేయబోతున్నట్టు బడ్జెట్లో ప్రకటించారు. ఇందుకు తాజా బడ్జెట్లో 1,261 కి.మీ. మార్గాన్ని విద్యుద్దీకరించేందుకు రూ.1,172 కోట్లు ఖర్చు చేయనున్నట్టు ప్రకటించారు. ఈ ఏడాది మాత్రం ఇందుకు రూ.72 కోట్లు మంజూరు చేశారు. ఇందులో తెలంగాణ వాటా మార్గాలు... లింగంపేట–జగిత్యాల–నిజామాబాద్– 95 కి.మీ.(రూ.80.29 కోట్లు) వికారాబాద్–పర్లివైజ్నాథ్–269 కి.మీ.(రూ.262.12 కోట్లు) పింపల్‌కుట్టి–ముద్ఖేడ్–పర్లి– 246 కి.మీ.(రూ.224.17 కోట్లు) సికింద్రాబాద్ ‘జిగేల్’.. రెండేళ్ల తర్వాతే.. దేశంలోని ప్రధాన స్టేషన్లను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసే ప్రాజెక్టుకు కేంద్రం గత బడ్జెట్లో శ్రీకారం చుట్టింది. తొలిదశలో 25 స్టేషన్లను ఎంచుకోగా అందులో సికింద్రాబాద్ చోటు దక్కించుకుంది. పీపీపీ పద్ధతిలో వాటిని అభివృద్ధి చేస్తారు. గత సంవత్సరమే రైల్వే టెండర్లు పిలిచింది. కానీ నిబంధనలు చూసిన తర్వాత బిడ్డర్లు వెనకడుగు వేశారు. ఈ ప్రాజెక్టులో లీజు గడువు 40 ఏళ్లుగా రైల్వే నిర్ధారించింది. దాన్ని మారిస్తేనే ముందుకొస్తామని బిడ్డర్లు తేల్చి చెప్పారు. ఫలితంగా ఆ ప్రాజెక్టు దాదాపు ఆగిపోయింది. దీంతో తాజాగా కేంద్రం లీజు సమయాన్ని 99 ఏళ్లకు పెంచాలని నిర్ణయించింది. బిడ్ల తంతు పూర్తి చేసి వచ్చే సంవత్సరం పనులు ప్రారంభించే అవకాశం ఉందని ద.మ. రైల్వే జీఎం వినోద్‌కుమార్ యాదవ్ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరితోనే ‘కాజీపేట’ జాప్యం కొంతకాలం నడిచిన తర్వాత బోగీలను తిరిగి కండీషన్లోకి తెచ్చేందుకు ఉద్దేశించిన వ్యాగన్ ఓవర్‌హాలింగ్ వర్క్‌షాపు ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో పనుల్లో జాప్యం జరుగుతోంది. దీనికి కావాల్సిన 150 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. కానీ అది దేవాదాయశాఖ భూమి కావటంతో కోర్టుల్లో కేసులు దాఖలయ్యాయి. దీంతో గత బడ్జెట్లో రైల్వే శాఖ నిధులు కేటాయించినా పనులు చేపట్టలేకపోయింది. ఇప్పటికీ ఆ భూమి మధ్యలో ఓ బిట్‌పై ఇంకా కేసు కొనసాగుతుండటంతో దాన్ని రైల్వేకు స్వాధీనం చేయలేకపోయారు. తాజా బడ్జెట్లో కేంద్రం దానికి రూ.200 కోట్లు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం భూమిని అప్పగించిన 18 నెలల్లో వర్క్‌షాపు పూర్తి చేస్తామని దక్షిణ మధ్య రైల్వే జీఎం తెలిపారు. మరిన్ని విశేషాలు.. ⇒ నిత్యం 25 వేల మంది వరకు ప్రయాణికుల తాకిడి ఉండే అన్ని రైల్వే స్టేషన్లలో ఎస్కలేటర్లు ఏర్పాటు చేయబోతున్నారు. ఈ సంవత్సరం హఫీజ్‌పేట, ఖమ్మంలలో ఏర్పాటు చేస్తారు. ⇒ అన్ని రైల్వే స్టేషన్లలో ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేస్తారు. స్టేషన్ భవనాలపైన సౌరఫలకాలు ఏర్పాటు చేసి సౌర విద్యుత్‌ను అందిపుచ్చుకుంటారు. ⇒ కొత్తగా 2 ఆర్ఓబీలు, 9 ఆర్‌యూబీలను రూ.195 కోట్ల వ్యయంతో నిర్మిస్తారు. ఇందులో రైల్వే రూ.73.14 కోట్లు భరించనుండగా మిగతా మొత్తాన్ని రాష్ట్రప్రభుత్వం కేటాయించాల్సి ఉంది. ⇒ సికింద్రాబాద్–కరీంనగర్‌ను రైల్వేతో అనుసంధానించేందుకు ఉద్దేశించిన మనోహరాబాద్–కొత్తపల్లి ప్రాజెక్టుకు ఈసారి రూ.125 కోట్లు కేటాయించారు. వీటితో మనోహరాబాద్–గజ్వేల్ మధ్య రైల్వే లైన్ ఏర్పాటు చేస్తారు. చర్లపల్లి శాటిలైట్ స్టేషన్‌కు భూమి ఏది? సికింద్రాబాద్ స్టేషన్లో కొత్త ప్లాట్‌ఫామ్స్ నిర్మించేందుకు స్థలం లేక రైళ్లను శివార్లలో నిలపాల్సి రావటం ప్రయాణికులకు శాపంగా మారడంతో చర్లపల్లిలో ఆ«ధునిక శాటిలైట్ టెర్మినల్ నిర్మించాలని రైల్వే శాఖ రెండేళ్ల క్రితం నిర్ణయించింది. దీనికి 150 ఎకరాల స్థలం కావాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని లిఖితపూర్వకంగా కోరింది. కానీ స్థలం లభించక పనులు మొదలు పెట్టలేకపోయింది. ఎన్నిసార్లు రాష్ట్రప్రభుత్వాన్ని కోరినా స్పందన లేకపోవటంతో ఇక అక్కడ తనకు ఉన్న 50 ఎకరాల స్థలంలోనే పనులు చేపట్టాలని రైల్వే నిర్ణయించింది. ఉన్న నిధులతో పనులు వేగంగా చేస్తాం గత నాలుగేళ్ల క్రితంతో పోలిస్తే దక్షిణ మధ్య రైల్వేకు మెరుగ్గానే నిధుల కేటాయింపు జరిగింది. వీటితో కొత్త లైన్లు, రెండు, మూడో లైన్ల నిర్మాణంపై దృష్టి పెడతాం. ముఖ్యంగా ఆర్ఓబీ, ఆర్యూబీల నిర్మాణం, కాపలా లేని లెవల్ క్రాసింగ్స్ తొలగింపు, హైలెవల్ ప్లాట్‌ఫామ్‌ల నిర్మాణాలకు ప్రాధాన్యమిస్తున్నాం. జోన్‌కు కేటాయించిన నిధులను అవసరమైతే మంజూరైన ఇతర పనులకు సర్దుబాటు చేసే అధికారాన్ని జీఎంలకు కల్పించటం శుభపరిణామం. దీంతో ఏదైనా సమస్య వల్ల నిర్ధారిత పనులు ఆగిపోతే ఆ నిధులు వెనక్కు పోకుండా అవసరమైన ఇతర పనులకు ఖర్చు చేసే వెసులుబాటు కలుగుతుంది. ఈ సంవత్సరం సెప్టెంబర్ నాటికి కాపలాదారులేని లెవల్ క్రాసింగ్స్ లేకుండా చేస్తాం. అలాంటివి 214 ఉన్నట్టు గుర్తించాం. యాదాద్రి ఎంఎంటీఎస్‌కు ఈ నెలలోనే టెండర్లను ఆహ్వానిస్తాం. –వినోద్‌కుమార్ యాదవ్. జీఎం, దక్షిణ మధ్య రైల్వే -
ఎస్సీ రైల్వే చెస్ టోర్నీ షురూ
సాక్షి, హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) గోల్డెన్ జూబ్లీ జనరల్ మేనేజర్ చెస్ కప్ సోమవారం ప్రారంభమైంది. సికింద్రాబాద్‌లోని బోయిగూడ రైల్ కళారంగ్‌లో దక్షిణ మధ్య రైల్వే క్రీడా సంఘం (ఎస్‌సీఆర్‌ఎస్‌ఏ) ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతాయి. టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎస్సీఆర్ జనరల్ మేనేజర్ (జీఎం) వినోద్ కుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ టోర్నీకి 200మందికి పైగా చెస్ క్రీడాకారులు హాజరయ్యారు. ఎస్సీఆర్కు చెందిన విక్రమ్‌జీత్ సింగ్ టాప్ సీడ్‌గా, తెలంగాణకు చెందిన వి. వరుణ్ రెండో సీడ్‌గా బరిలోకి దిగారు. టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ రూ. 2.38 లక్షలని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌సీఆర్‌ఎస్‌ఏ అధ్యక్షులు అర్జున్ ముండియా, కార్యదర్శి ఈవీ కృష్ణారెడ్డి, తెలంగాణ చెస్ సంఘం అధ్యక్షులు ఎ. నరసింహారెడ్డి, కార్యదర్శి కేఎస్ ప్రసాద్, ఎస్సీఆర్ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఎం. ఉమాశంకర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు విజయవాడ డివిజన్ ఇన్చార్జ్ పీఆర్వో జేవీ ఆర్కే రాజశేఖర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. ⇔కాచిగూడ– కాకినాడ పోర్ట్ రైలు (07425) డిసెంబర్ 8, 15, 22, 29 తేదీల్లో సాయంత్రం 6.45కు కాచిగూడలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.00కు కాకినాడ పోర్ట్ చేరుకుంటుంది. ⇔కాకినాడ పోర్ట్ – కాచిగూడ రైలు (07426) డిసెంబర్ 9, 16, 23, 30 తేదీల్లో సాయంత్రం 5.50కు కాకినాడ పోర్ట్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.10కు కాచిగూడ చేరుకుంటుంది. ⇔కాచిగూడ–కృష్ణరాజపురం రైలు (07603) డిసెంబర్ 10, 17, 24, 31, జనవరి 7, 14, 21, 28, ఫిబ్రవరి 4, 11, 18, 25 తేదీల్లో సాయంత్రం 6.00కు కాచిగూడలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.00 గంటలకు కృష్ణరాజపురం చేరుకుంటుంది. ⇔కృష్ణరాజపు రం–కాచిగూడ రైలు (07604) డిసెంబర్ 11, 18, 25, జనవరి 1,8,15,22,29, ఫిబ్రవరి 5,12,19,26 తేదీల్లో మధ్యాహ్నాం 3.25కు కృష్ణరాజపురంలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.55కు కాచిగూడ చేరుకుంటుంది. ⇔కాచిగూడ–విశాఖపట్నం రైలు (07016) డిసెంబర్ 12,19,26 తేదీల్లో సాయం త్రం 6.45కు కాచిగూడలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.50కు విశాఖ చేరుకుంటుంది. ⇔విశాఖపట్నం–తిరుపతి రైలు (07488) డిసెంబర్ 13,20,27 తేదీల్లో రాత్రి 7.05కు విశాఖలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.25కు తిరుపతి చేరుకుంటుంది. ⇔తిరుపతి–కాచిగూడ రైలు (07146) డిసెంబర్ 14,21,28 తేదీల్లో తిరుపతిలో సాయంత్రం 5.00 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.30కు కాచిగూడ చేరుకుంటుంది. -
విజయవాడ-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైలు
సాక్షి, విజయవాడ : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ–సికింద్రాబాద్–విజయవాడ మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు విజయవాడ రైల్వే డివిజనల్ ఇన్చార్జ్ పీఆర్వో జె.వి.ఆర్కే రాజశేఖర్ తెలిపారు. విజయవాడ-సికింద్రాబాద్ ప్రత్యేక రైలు (నెంబరు 07207) అక్టోబర్ 1 తేదీ రాత్రి 10 గంటలకు విజయవాడలో బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 4 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. రైలు నెంబరు 07208 సికింద్రాబాద్–విజయవాడ ప్రత్యేక రైలు అక్టోబర్ 2వ తేదీ సికింద్రాబాద్‌లో రాత్రి 11.55కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.30 గంటలకు విజయవాడ చేరుతుందని, ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని పీఆర్వో కోరారు. -
ద.మ.రైల్వేలో పలు రైళ్లు రద్దు
సాక్షి, హైదరాబాద్: సాంకేతిక కారణాలతో పలు రైళ్లను రద్దు చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 13, 16 తేదీల్లో సికింద్రాబాద్–దర్బంగా (17007/17008) ఎక్స్‌ప్రెస్, 15, 18 తేదీల్లో హైదరాబాద్–రెక్సాల్ (17005/17006) ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేశామని ఆయన వెల్లడించారు. -
సరుకు రవాణాలో ద.మ.రైల్వే ముందంజ
- రూ.7934.7 కోట్ల ఆదాయం సాక్షి, హైదరాబాద్: సరుకు రవాణా రంగంలో దక్షిణమధ్య రైల్వే గతేడాది రికార్డును అధిగమించింది. ఈ ఏడాది మార్చి నాటికి 96.83 మిలియన్ టన్నుల సరుకు రవాణాపై రూ.7934.7 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. గత సంవత్సరం కంటే ఈ ఏడాది 8.36 శాతం అదనంగా సరుకు రవాణా చేసినట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఉమాశంకర్ కుమార్ తెలిపారు. శంకర్పల్లి, నర్సింగపల్లి, బనగానపల్లి, జన్పహాడ్, తాండూరులలో 6 సరుకు రవాణా టర్మినళ్లను అదనంగా ఏర్పాటు చేయడం ద్వారా ఆదాయం పెరిగినట్లు తెలిపారు. ఈ ఏడాది కొత్తగా నాందేడ్ నుంచి ఉల్లి, జగిత్యాల నుంచి రంపపుపొట్టు, కాకినాడ నుంచి ఎరువులు, పశుగ్రాసం, ఏలూరు నుంచి కంటైనర్లు, చిత్తాపూర్ నుంచి సిమెంట్ రవాణా చేపట్టినట్లు పేర్కొన్నారు. అలాగే రైళ్ల సగటు వేగం 20శాతం పెరగడం ద్వారా వ్యాగన్ ట్రిప్పులు కూడా పెరిగాయి. జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ రవాణా విభాగం అధికారులతో కలసి సమగ్ర ప్రణాళికలను రూపొందించడం వల్ల చక్కటి ఫలితాలను సాధించినట్లు పేర్కొన్నారు. -
ఎడమ కుడైతే ప్రాణాంతకమే..!
- రైల్వేలో సిగ్నళ్ల తారుమారుతో ప్రమాద ఘంటికలు - ముందే గుర్తించే సూచిక బోర్డులు కనిపించవు.. - గుర్తించకుండా ముందుకెళ్తున్న లోకో పైలట్లు - ట్రాఫిక్ రద్దీతో ప్రయాణ నిడివి పెరిగి తగ్గుతున్న విశ్రాంతి సమయం - దక్షిణ మధ్య రైల్వే జీఎంకు లోకో పైలట్ల ఫిర్యాదు - సిగ్నళ్ల సమస్యల పరిష్కారానికి చర్యలు.. సాక్షి, హైదరాబాద్: రెడ్ సిగ్నల్ పడ్డా సిగ్నళ్లను చూసుకోకుండా లోకోపైలట్లు రైలును ముందుకు పోనిస్తే.. వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లో దీపం కావాల్సిందే.. ఇటీవల వరంగల్‌లో రెడ్ సిగ్నల్ పడినా రైలు ముందుకు వెళ్లిన విషయం ఇప్పుడు రైల్వే శాఖలో కలకలం సృష్టిస్తోంది. అయితే దీని వెనుక కారణాలు అన్వేషించేందుకు రైల్వే అధికారులు విచారణ చేపట్టారు. అలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఉండేందుకు చర్యలు చేపడుతున్నారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ నేరుగా లోకోపైలట్‌తో నేరుగా మాట్లాడారు. ఈ సందర్భంగా లోకోపైలట్లు వారి ఇబ్బందులు, సమస్యలను జీఎంతో చెప్పుకొన్నారు. లోకోపైలట్లు చెప్పిన అంశాలను రైల్వే బోర్డు దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 40 మంది లోకోపైలట్లతో భేటీ అయ్యారు. లోకోపైలట్లు చెప్పిన అంశాలు.. సాధారణంగా పట్టాలకు ఎడమవైపు సిగ్నల్ స్తంభాలు ఉంటా యి. సిగ్నళ్లను గమనిస్తూ లోకోపైలట్లు రైళ్లను నడుపుతారు. అయితే కొన్నిచోట్ల ఎడమవైపు స్థలం లేదనో, మరే ఇతర సమస్యలతోనో వాటిని కుడివైపు ఏర్పాటు చేశారు. కుడివైపు సిగ్నళ్లుండే విషయం ముందుగానే పైలట్లు గమనించేలా సూచికలను ఏర్పాటు చేయాలి. ఆ సూచికలు కనిపించట్లేదని లోకోపైలట్లు చెప్పారు. అవి సులభంగా కనిపించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కోరారు. సూచికలు కనిపించకపోవడంతో కుడివైపు సిగ్నళ్లు ఉన్న విషయం ఆలస్యంగా గుర్తిస్తున్నట్లు కొందరు జూనియర్ లోకోపైలట్లు పేర్కొన్నారు. ట్రాఫిక్‌తో విశ్రాంతి కొరవ.. రెండో లైన్ అందుబాటులో లేని చోట్ల రైళ్ల ట్రాఫిక్ ఎక్కువగా ఉండి గమ్యం చేరటంలో జాప్యం జరుగుతోంది. దీంతో డ్యూటీకి డ్యూటీకి మధ్య విరామం తగ్గి విశ్రాంతి సమయం సరిపోవట్లేదని లోకోపైలట్లు పేర్కొన్నారు. లోకోపైలట్లు కొరత వల్ల కూడా కొన్ని చోట్ల విశ్రాంతి లేకుండానే వెంటనే డ్యూటీలకు రావాల్సిన పరిస్థితులు అప్పుడప్పుడు ఉంటున్నాయని కొందరు వాపోయారు. వీటితోపాటు సెలవులు, ఆరోగ్య సమస్యలు, క్యాబిన్లో వేడిమి, చలిలాంటి వాతావరణాలను తట్టుకునే ఏర్పాటు లేకపోవటం చాలా ఇబ్బందులకు గురిచేస్తోందని చెప్పారు. సిగ్నలింగ్ విభాగంతో సమన్వయ లోపం వంటి అంశాలను జీఎం దృష్టికి తెచ్చారు. దీంతో తన పరిధిలో ఉన్న అంశాలను వెంటనే పరిష్కరించేందుకు ఆయా విభాగాధిపతులతో జీఎం భేటీ అయి ఆదేశాలు జారీ చేశారు. పెద్ద సమస్యల పరిష్కారంపై రైల్వేబోర్డును ఆశ్రయించాలని నిర్ణయించారు. -
దక్షిణ మధ్య రైల్వేకు రజతం
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత రైల్వే టెన్నిస్ టోర్నమెంట్లో దక్షిణ మధ్య రైల్వే జట్టు (ఎస్సీఆర్) ఆకట్టుకుంది. లక్నోలోని రీసెర్చ్ డిజైన్, స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (ఆర్డీఎస్ఓ)లో జరిగిన ఈ టోర్నీలో ఎస్సీఆర్ జట్టు రజత పతకాన్ని సాధించింది. ఇందులో మొత్తం 12 జట్లు పాల్గొనగా దక్షిణ మధ్య రైల్వే జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో ఈస్ట్రన్ రైల్వే జట్టు 2-1తో ఎస్సీఆర్పై గెలిచి టైటిల్‌ను దక్కించుకుంది. అంతకుముందు జరిగిన సెమీస్ మ్యాచ్‌లో ఎస్సీఆర్ జట్టు 2-1తో సౌత్ ఈస్ట్రన్ రైల్వేపై, 2-0తో ఆర్డీఎస్ఓ జట్టుపై గెలుపొందింది. స్నూకర్ రన్నరప్ పాండురంగయ్య జాతీయ సీనియర్ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో రైల్వే స్పోర్ట్స ప్రమోషన్ బోర్డ్ (ఆర్ఎస్పీబీ)కి చెందిన పాండురంగయ్య అద్భుత ప్రదర్శన కనబరిచాడు. మొత్తం 24 రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు తలపడిన ఈ టోర్నీలో రంగయ్య రన్నరప్‌గా నిలిచాడు. టోర్నీ ఆరంభం నుంచి మెరుగ్గా రాణించిన పాండురంగయ్య ఫైనల్ మ్యాచ్‌లో పంకజ్ అడ్వానీ (పీఎస్‌పీబీ)చేతిలో ఓడిపోరుు రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్ కుమార్... రైల్వే పురుషుల టెన్నిస్ జట్టును, పాండు రంగయ్యను అభినందించారు. -
ఎస్సీఆర్ జట్టుకే టైటిల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రస్థాయి వార్షిక ఎ-లీగ్ ఇంటర్ డిపార్ట్మెంటల్ కబడ్డీ చాంపియన్‌షిప్‌లో సౌత్ సెంట్రల్ రైల్వే (ఎస్సీఆర్) జట్టు టైటిల్‌ను కై వసం చేసుకుంది. తెలంగాణ కబడ్డీ సంఘం ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో శనివారం జరిగిన ఫైనల్లో ఎస్సీఆర్ జట్టు 20-12తో ఇన్కమ్ టాక్స్ జట్టుపై అవలీలగా విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో ఎస్సీఆర్ తరఫున ప్రదీప్, అంకిరెడ్డి రాణించగా... ఇన్కమ్ టాక్స్ జట్టులో శ్రీకృష్ణ, మల్లేశ్ ఆకట్టుకున్నారు. అంతకుముందు జరిగిన తొలి సెమీఫైనల్లో ఇన్కమ్ టాక్స్ జట్టు 16-8తో ఆంధ్రా బ్యాంక్‌పై గెలుపొందగా... రెండో సెమీస్‌లో ఎస్సీఆర్ జట్టు 16-6తో ‘సాయ్’ ఎసీటీసీ జట్టును ఓడించింది. అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో శాట్స్ ఎండీ దినకర్‌బాబు పాల్గొని విజేతలకు ట్రోఫీలను అందజేశారు. -
సెమీస్‌లో ఎస్సీఆర్, ఎస్బీఐ
ఇంటర్ డిపార్ట్మెంటల్ కబడ్డీ టోర్నమెంట్ సాక్షి, హైదరాబాద్: వార్షిక ఎ- లీగ్ ఇంటర్ డిపార్ట్మెంటల్ కబడ్డీ చాంపియన్‌షిప్‌లో ఎస్సీఆర్, ఎస్బీఐ, ఇన్కమ్ ట్యాక్స్, ‘సాయ్’ ఎస్టీసీ జట్లు సెమీస్‌లోకి ప్రవేశించాయి. ఎల్బీ స్టేడియంలోని కబడ్డీ గ్రౌండ్సలో శుక్రవారం జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో ఎస్సీఆర్ జట్టు 25-9 తో ఇన్కమ్ ట్యాక్స్ జట్టుపై అలవోకగా విజయాన్ని సాధించి సెమీఫైనల్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో ఎస్సీఆర్ జట్టు తరఫున రైడింగ్‌లో మల్లికార్జున, ఎస్కే అమీర్ రైడింగ్‌లో సత్తా చాటగా... ఇన్కమ్ ట్యాక్స్ జట్టులో మల్లేశ్ రాణించాడు. ఇతర మ్యాచ్‌ల్లో ఎస్బీఐ జట్టు 18-14తో ఆర్టిలరీ సెంటర్‌పై, ఇన్కమ్ ట్యాక్స్ జట్టు 40-15తో హెచ్ఏఎల్ జట్టుపై విజయం సాధించాయి.