Shivam Dube
-
కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్.. అతడిపై వేటు! సూర్యకు చోటు
దేశవాళీ వన్డే టోర్నమెంట్లో విజయ్ హజారే ట్రోఫీ తాజా ఎడిషన్ నేపథ్యంలో ముంబై క్రికెట్ అసోసియేషన్ తమ జట్టును ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఈ టోర్నీ ఆడబోయే పదిహేడు మంది సభ్యుల పేర్ల(తొలి మూడు మ్యాచ్‌లు)ను మంగళవారం వెల్లడించింది. టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో పాటు ఆల్‌రౌండర్ శివం దూబే కూడా ఈ టోర్నీలో పాల్గొనునున్నట్లు తెలిపింది.అతడిపై వేటుఅయితే, ఓపెనర్ పృథ్వీ షాకు మాత్రం ఈ జట్టులో చోటు దక్కలేదు. నిలకడలేమి ఫామ్‌తో సతమవుతున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌పై సెలక్టర్లు వేటు వేశారు. మరోవైపు.. సూపర్ ఫామ్‌లో ఉన్న అజింక్య రహానే వ్యక్తిగత కారణాల దృష్ట్యా సెలక్షన్‌కు అందుబాటులో లేడని తెలుస్తోంది.గత కొంతకాలంగా పృథ్వీ షా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. క్రమశిక్షణా రాహిత్యం, ఫిట్నెస్ లేమి తదితర కారణాలతో రంజీ జట్టుకు అతడు కొన్నాళ్లుపాటు దూరంగా ఉండాల్సి వచ్చింది. తిరిగి వచ్చినా కేవలం 59 పరుగులే చేశాడు.మరోవైపు.. ఐపీఎల్ మెగా వేలం-2025లో రూ. 75 లక్షల కనీస ధరకే అందుబాటులో ఉన్నా ఒక్క ఫ్రాంఛైజీ పృథ్వీ షా వైపు కన్నెత్తి చూడలేదు. ఫలితంగా ఒకప్పటి ఈ స్టార్ బ్యాటర్ అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు.ఇక దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ పృథ్వీ షా స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. ఈ టోర్నీలో 25 ఏళ్ల పృథ్వీ తొమ్మిది మ్యాచ్‌లలో కలిపి.. 197 పరుగులే చేయగలిగాడు. మధ్యప్రదేశ్‌తో ఫైనల్లోనూ పది పరుగులే చేశాడు. ఈ నేపథ్యంలోనే అతడిపై సెలక్టర్లు వేటు వేశారు.రహానే దూరంమరోవైపు.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబైని విజేతగా నిలిపిన టీమిండియా స్టార్ శ్రేయస్ అయ్యర్.. విజయ్ హజారే ట్రోఫీలోనూ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇక పొట్టి ఫార్మాట్లో విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపించి ముంబైని చాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించిన రహానే.. వన్డే టోర్నీలో మాత్రం ఆడటం లేదు. కాగా డిసెంబరు 21 నుంచి విజయ్ హజారే ట్రోఫీ మొదలుకానుంది.తిరుగులేని ముంబైకాగా భారత దేశవాళీ క్రికెట్లో ముంబై జట్టు ఇప్పటికి 63 టైటిల్స్ గెలిచింది. రంజీ ట్రోఫీని 42 సార్లు నెగ్గిన ముంబై జట్టు ఇరానీ కప్‌ను 15 సార్లు దక్కించుకుంది. విజయ్ హజారే వన్డే ట్రోఫీలో 4 సార్లు విజేతగా నిలిచిన ముంబై.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టీ20 టోర్నీ టైటిల్‌ను రెండుసార్లు కైవసం చేసుకుంది. ఇప్పుడు మరో టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగనుంది.విజయ్ హజారే వన్డే టోర్నీ 2024 -25కి తొలి మూడు మ్యాచ్‌లకు ముంబై జట్టుశ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), ఆయుష్ మాత్రే, అంగ్క్రిష్ రఘువంశీ, జే బిస్తా, సూర్యకుమార్ యాదవ్, శివం దూబే, సూర్యాన్ష్ షెడ్గే, సిద్ధేశ్ లాడ్, హార్దిక్ తామోర్, ప్రసాద్ పవార్, అధర్వ అంకోలేకర్, తనూష్ కొటియన్, శార్దూల్ ఠాకూర్, రాయ్స్టన్ డయాస్, జునేద్ ఖాన్, హర్ష్ తనా, వినాయక్ భోయిర్. చదవండి: శెభాష్.. గండం నుంచి గట్టెక్కించారు! మీరే నయం -
హార్దిక్ పాండ్యా విఫలం
దేశవాళీ టీ20 క్రికెట్ టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ముగింపు దశకు చేరుకుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో భాగంగా శుక్రవారం రెండు సెమీఫైనల్ మ్యాచ్‌లకు బెంగళూరు ఆతిథ్యమిస్తోంది. ఈ క్రమంలో తొలి సెమీస్‌లో బరోడాతో ముంబై జట్టు తలపడుతోంది. చిన్నస్వామి స్టేడియంలో టాస్ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్ చేసింది.బరోడా నామమాత్రపు స్కోరుఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన బరోడా నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. ఓపెనర్లలో శశ్వత్ రావత్(33) ఫర్వాలేదనిపించినా.. అభిమన్యు రాజ్‌పుత్(9) విఫలమయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ కృనాల్ పాండ్యా 24 బంతుల్లో నాలుగు ఫోర్ల సాయంతో 30 పరుగులు చేయగా.. నాలుగో నంబర్ బ్యాటర్ భాను పనియా(2) నిరాశపరిచాడు.ఈ దశలో శివాలిక్ శర్మ ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు. మొత్తంగా 24 బంతులు ఎదుర్కొన్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. రెండు ఫోర్లు, రెండు సిక్స్‌ల సాయంతో 36 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇక హార్దిక్ పాండ్యా ఐదు పరుగులకే నిష్క్రమించగా.. ఆల్‌రౌండర్ అతిత్ సేత్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. పద్నాలుగు బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 22 పరుగులతో.. శివాలిక్ శర్మకు సహకారం అందించాడు.పాండ్యాను అవుట్ చేసిన దూబేఇక బరోడా ఇన్నింగ్స్ ఆఖరి బంతికి మహేశ్ పితియా సిక్సర్ బాదాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో బరోడా ఏడు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో సూర్యాంశ్ షెడ్గే రెండు వికెట్లు పడగొట్టగా.. మోహిత్ అవస్థి, శార్దూల్ ఠాకూర్, శివం దూబే, తనుష్ కొటియాన్, అథర్వ అంకోలేకర్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యాను శివం దూబే అవుట్ చేసిన తీరు హైలైట్‌గా నిలిచింది. ఈ ఇద్దరు టీమిండియా పేస్ ఆల్‌రౌండర్ల మధ్య పోరులో దూబే పైచేయి సాధించాడు. దూబే బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇచ్చి హార్దిక్ అవుటయ్యాడు. కాగా ఫామ్‌లో ఉన్న ముంబై బరోడా విధించిన 159 పరుగుల లక్ష్యాన్ని సులువుగానే పూర్తి చేస్తుందని ఆ జట్టు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.ముంబై జట్టులో మ్యాచ్ విన్నర్లకు కొదవలేదుక్వార్టర్ ఫైనల్లో విదర్భ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించి ముంబై సెమీస్‌కు చేరితే... బెంగాల్‌పై గెలిచి బరోడా ముందడుగు వేసిన విషయం తెలిసిందే. ముంబై తరఫున సీనియర్ బ్యాటర్ అజింక్యా రహానే ఫుల్ ఫామ్‌లో ఉండగా... గత మ్యాచ్‌లో ఓపెనర్ పృథ్వీ షా కూడా రాణించాడు. శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, సూర్యాంశ్ షెగ్డె, శార్దూల్ ఠాకూర్ ఇలా ముంబై జట్టులో మ్యాచ్ విన్నర్లకు కొదవలేదు.ఢిల్లీతో మధ్యప్రదేశ్..మరోవైపు బరోడా జట్టుకు హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా రూపంలో కీలక ఆటగాళ్లు అందుబాటులో ఉన్నా బ్యాటింగ్ పరంగా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. ఇక రెండో సెమీఫైనల్లో ఆయుశ్ బదోనీ సారథ్యంలోని ఢిల్లీ జట్టు... మధ్యప్రదేశ్‌తో తలపడనుంది. ఢిల్లీకి అనూజ్ రావత్, యశ్ ధుల్ కీలకం కానుండగా... రజత్ పాటిదార్, వెంకటేశ్ అయ్యర్‌పై మధ్యప్రదేశ్ జట్టు భారీ అంచనాలు పెట్టుకుంది. pic.twitter.com/DrAAm9Ubd1— Sunil Gavaskar (@gavaskar_theman) December 13, 2024 -
విధ్వంసం సృష్టించిన షా, రహానే, దూబే
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ముంబై జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇవాళ (డిసెంబర్ 11) జరిగిన క్వార్టర్ ఫైనల్-4లో ముంబై విదర్భపై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా సెమీస్‌కు చేరుకుంది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విదర్భ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోర్ చేసింది. అథర్వ తైడే (66), వాంఖడే (51) అర్ద సెంచరీలతో రాణించగా.. ఆఖర్లో శుభమ్ దూబే (43 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.THE SIX HITTING MACHINE - SHIVAM DUBE 🥶 pic.twitter.com/Qy2uhlXKBp— Johns. (@CricCrazyJohns) December 11, 2024అనంతరం బరిలోకి దిగిన ముంబై.. 19.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్లు పృథ్వీ షా (26 బంతుల్లో 49; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), అజింక్య రహానే (45 బంతుల్లో 84; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఆరంభాన్ని అందించగా.. ఆఖర్లో శివమ్ దూబే (22 బంతుల్లో 37 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు), సూర్యాంశ్ షేడ్గే (12 బంతుల్లో 36 నాటౌట్; ఫోర్, 4 సిక్సర్లు) బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి విధ్వంసం సృస్టించారు. MUMBAI INTO SEMIS OF SMAT...!!!Suryansh Shedge with another masterclass. 🙇♂️👌 pic.twitter.com/6FxuxENHc4— Mufaddal Vohra (@mufaddal_vohra) December 11, 2024ఈ మ్యాచ్‌లో ముంబై గెలుపుపై ఆశలు వదులుకున్న తరుణంలో శివమ్ దూబే, సూర్యాంశ్ సుడిగాలి ఇన్నింగ్స్‌లు ఆడారు. ముంబై విజయానికి షా, రహానే బీజం వేసినప్పటికీ.. మధ్యలో టీమిండియా స్టార్లు శ్రేయస్ అయ్యర్ (5), సూర్యకుమార్ యాదవ్ (9) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు.సూపర్ ఫామ్‌లో రహానేఈ టోర్నీలో ముంబై కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అజింక్య రహానే సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. రహానే గత ఐదు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 52, 68, 22, 95, 84 పరుగులు స్కోర్ చేశాడు. విదర్భతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో రహానే కేవలం 27 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. -
సూర్యకుమార్ యాదవ్ విధ్వంసం.. శివమ్ దూబే ఊచకోత
సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో టీమిండియా ఆటగాళ్లు, ముంబై ప్లేయర్లు శివమ్ దూబే, సూర్యకుమార్ యాదవ్ రెచ్చిపోయారు. సర్వీసెస్‌తో ఇవాళ (డిసెంబర్ 5) జరిగిన మ్యాచ్‌లో స్కై విధ్వంసం సృష్టిస్తే.. శివమ్ దూబే ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. స్కై 46 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 70 పరుగులు చేయగా.. దూబే 36 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో అజేయమైన 71 పరుగులు చేశాడు. The Surya-Dube show for Mumbai. 🤯pic.twitter.com/wNgwqLA7Cd— Mufaddal Vohra (@mufaddal_vohra) December 3, 2024దూబే సిక్సర్ల వర్షానికి హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం తడిసి ముద్దైంది. గాయం కారణంగా గత మూడు నెలలుగా కాంపిటేటివ్ క్రికెట్‌కు దూరంగా ఉన్న దూబే ఈ మ్యాచ్‌తోనే రీఎంట్రీ ఇచ్చాడు. రీఎంట్రీలోనే దూబే అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో దూబే బంతితోనూ రాణించాడు. 3 ఓవర్లు వేసి 21 పరుగులిచ్చి ఓ వికెట్ తీశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై సూర్యకుమార్ యాదవ్ (70), శివమ్ దూబే (71) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ఓపెనర్ పృథ్వీ షా తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తూ డకౌట్ కాగా.. మరో ఓపెనర్ అజింక్య రహానే 18 బంతుల్లో 3 బౌండరీల సాయంతో 22 పరుగులు చేశాడు. అనంతరం వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 14 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 20 పరుగులు చేశాడు. సర్వీసెస్ బౌలర్లలో పూనియా, విశాల్ గౌర్, వికాస్ యాదవ్, శుక్లా తలో వికెట్ పడగొట్టారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన సర్వీసెస్ 19.3 ఓవర్లలో 153 పరుగులకే ఆలౌటై, 39 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. శార్దూల్ ఠాకూర్ 4 వికెట్లు తీసి సర్వీసెస్ పతనాన్ని శాశించాడు. షమ్స్ ములానీ 3, మోహిత్ అవస్తి, శివమ్ దూబే తలో వికెట్ పడగొట్టారు. సర్వీసెస్ ఇన్నింగ్స్‌లో మోహిత్ అహ్లావత్ (54) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. సర్వీసెస్ ఇన్నింగ్స్‌లో ముగ్గురు డకౌట్ అయ్యారు. ఈ గెలుపుతో ముంబై గ్రూప్-ఈ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. -
IND VS SA T20 Series: శివమ్ దూబే, రియాన్ పరాగ్‌కు ఏమైంది..?
సౌతాఫ్రికాతో నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం భారత జట్టును నిన్న (అక్టోబర్ 25) ఎంపిక చేశారు. అందరి అంచనాలకు తగ్గట్టుగానే ఈ జట్టు ఎంపిక జరిగినప్పటికీ.. ఇద్దరు, ముగ్గురు ఆటగాళ్లకు చోటు దక్కకపోవడం చర్చనీయాంశమైంది. ఇటీవల జరిగిన సిరీస్‌లలో జట్టుతో పాటు ఉన్న శివమ్ దూబే, రియాన్ పరాగ్, మయాంక్ యాదవ్ దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు ఎంపిక కాలేదు. వీరిని ఎంపిక చేయకపోవడంపై బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది.మయాంక్ యాదవ్, శివమ్ దూబే గాయాల బారిన పడటంతో వారిని పరిగణలోకి తీసుకోలేదని చెప్పిన బీసీసీఐ.. రియాన్ పరాగ్ భుజం సమస్య కారణంగా సెలెక్షన్‌కు అందుబాటులో లేడని వివరణ ఇచ్చింది. ప్రస్తుతం రియాన్ బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో రిపోర్ట్ చేసినట్లు తెలిపింది. ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లను ఎంపిక చేయని అంశాన్ని పక్కన పెడితే.. జట్టులో రెండు అనూహ్య ఎంపికలు జరిగాయి.బౌలింగ్ ఆల్‌రౌండర్ రమన్‌దీప్ సింగ్, పేస్ బౌలర్ విజయ్‌కుమార్ వైశాఖ్ ఊహించని విధంగా జట్టులోకి వచ్చారు. వీరిద్దరికి చోటు దక్కుతుందని ఎవరు ఊహించలేదు. ఇవి మినహా మిగతా జట్టు ఎంపిక అంతా ఊహించిన విధంగానే జరిగింది. కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ కొనసాగనుండగా.. వికెట్కీపర్లుగా సంజూ శాంసన్, జితేశ్ శర్మ ఎంపికయ్యారు. కాగా, దక్షిణాఫ్రికా సిరీస్‌తో పాటు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం కూడా భారత జట్టును నిన్ననే ప్రకటించారు.దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు: సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, రింకూ సింగ్, తిలక్ వర్మ, జితేశ్ శర్మ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రమణ్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్ దీప్, విజయ్ కుమార్ వైశాఖ్, అవేశ్ ఖాన్, యశ్ దయాళ్సౌతాఫ్రికాతో టీ20 సిరీస్..తొలి మ్యాచ్- నవంబర్ 8 (డర్బన్)రెండో మ్యాచ్- నవంబర్10 (గ్వెకెర్బా)మూడో మ్యాచ్- నవంబర్ 13 (సెంచూరియన్)నాలుగో మ్యాచ్- నవంబర్ 15 (జోహనెస్బర్గ్)చదవండి: ఆ్రస్టేలియా పర్యటనకు నితీశ్ కుమార్ రెడ్డి -
బంగ్లాతో టీ20 సిరీస్.. టీమిండియాకు బిగ్ షాక్! స్టార్ ప్లేయర్ దూరం
గ్వాలియర్ వేదికగా ఆదివారం బంగ్లాదేశ్‌తో జరగనున్న తొలి టీ20కు టీమిండియా ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే గాయం కారణంగా బంగ్లాతో టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. దూబే ప్రస్తుతం వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు.ఈ క్రమంలోనే అతడు బంగ్లాతో వైట్‌బాల్ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ ధ్రువీకరించింది. వెన్ను గాయం కారణంగా దూబే బంగ్లాతో మూడు టీ20ల సిరీస్ నుంచి తప్పుకున్నాడు. అతడి స్ధానాన్ని తిలక్ వర్మతో సెలక్షన్ కమిటీ భర్తీ చేసింది. ఆదివారం ఉదయం గ్వాలియర్‌లో తిలక్ జట్టుతో చేరనున్నాడని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. తిలక్ వర్మ భారత్ తరపున ఇప్పటివరకు 16 టీ20లు ఆడి 336 పరుగులు చేశాడు. కాగా ఐపీఎల్-2024 తర్వాత ఈ హైదరాబాదీ గాయ పడ్డాడు. దీంతో అతడిని జింబాబ్వే, శ్రీలంకతో టీ20లకు సెలక్టర్లు ఎంపిక చేయలేదు. ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించడంతో మరోసారి అతడికి భారత జట్టులో చోటు దక్కింది.భారత టీ20 జట్టుసూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేష్ శర్మ (వికెట్ కీపర్), అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్, తిలక్ వర్మచదవండి: IPL 2025: రోహిత్, కిషన్‌కు నో ఛాన్స్.. ముంబై రిటెన్షన్ లిస్ట్ ఇదే! -
లంకతో మూడో వన్డే.. రాహల్‌పై వేటు! టీమిండియాలోకి విధ్వంసకర ఆటగాడు?
శ్రీలంకతో టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. వన్డేల్లో మాత్రం తమ మార్క్‌ను చూపించలేకపోతుంది. తొలి వన్డేలో ఈజీగా గెలవాల్సిన మ్యాచ్‌ను చేజేతులా టై చేసుకున్న భారత్.. రెండో వన్డేలో 32 పరుగుల తేడాతో అనుహ్యంగా ఓటమి చవిచూసింది. ఈ క్రమంలో కీలకమైన మూడో వన్డేలో శ్రీలంకతో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. బుధవారం కొలంబో వేదికగా మూడో వన్డేలో ఇరు జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేయాలని రోహిత్ సేన పట్టుదలతో ఉంది. మరోవైపు శ్రీలంక మాత్రం ఆఖరి మ్యాచ్‌లోనూ తమ జోరుని కొనసాగించి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది. కాగా భారత్‌పై శ్రీలంక వన్డే సిరీస్ గెలిచి దాదాపు 27 ఏళ్లు కావస్తోంది. ఇక ఇది ఇలా ఉండగా.. మూడో వన్డేలో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. తొలి రెండు వన్డేల్లో తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయకపోయిన కేఎల్ రాహుల్, శివమ్ దూబేపై జట్టు మెనెజ్‌మెంట్ వేటు వేయనున్నట్లు సమాచారం. వారిద్దరి స్ధానంలో రిషబ్ పంత్, రియాన్ పరాగ్‌లకు చోటు ఇవ్వనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. కేఎల్ రాహుల్ వికెట్ల వెనక కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. రెండో వన్డేలో ఈజీగా క్యాచ్‌లు విడిచి విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలోనే రిషబ్ పంత్‌ను బరిలోకి దించాలని గంభీర్, రోహిత్ శర్మ నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.భారత తుది జట్టు(అంచనా)రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్. -
ఆ ఒక్క పరుగు చేయాల్సింది.. వారి వల్లే: రోహిత్ శర్మ
‘‘మెరుగ్గా బ్యాటింగ్ చేస్తే ఛేదించగల స్కోరే ఇది. నిజానికి మేము బాగానే ఆడాం. అయితే, నిలకడలేమి బ్యాటింగ్ వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. పది ఓవర్ల తర్వాత.. ఒక్కసారి స్పిన్నర్లు బరిలోకి వచ్చారంటే మ్యాచ్ స్వరూపం మారిపోతుందని ముందే ఊహించాం. అందుకే ఆరంభంలో దూకుడుగా ఆడుతూ వీలైనన్ని పరుగులు స్కోరు చేశాం.లక్ష్య ఛేదన మొదలుపెట్టిన సమయంలో మాదే పైచేయి. అయితే, వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడం ప్రభావం చూపింది. కేఎల్ రాహుల్- అక్షర్ పటేల్ వల్ల తిరిగి పుంజుకున్నాం. అయితే, ఆఖర్లో 14 బంతులు ఉండి కూడా ఒక్క పరుగు తీయలేకపోవడం తీవ్ర నిరాశ కలిగించింది.ఆటలో ఇలాంటివన్నీ సహజమే. అయితే, శ్రీలంక ఈరోజు అద్బుతంగా ఆడింది. పిచ్ మొదటి నుంచి ఒకేలా ఉంది. తొలి 25 ఓవర్లలో మేము కూడా బాగా బౌలింగ్ చేశాం. తర్వాత వికెట్.. బ్యాటింగ్‌కు కాస్త అనుకూలంగా మారింది. ఏదేమైనా మేము చివరిదాకా పోరాడిన తీరు పట్ల గర్వంగా ఉంది.రెండు జట్ల మధ్య విజయం దోబూచులాడింది. మేము కనీసం ఒక్కటంటే ఒక్క పరుగు చేయాల్సింది’’ అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. శ్రీలంకతో తొలి వన్డే ‘టై’గా ముగియడం పట్ల విచారం వ్యక్తం చేశాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024 తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తొలిసారిగా లంకతో వన్డే సిరీస్‌లో పాల్గొంటున్నారు.దంచికొట్టిన రోహిత్ఈ క్రమంలో శుక్రవారం కొలంబో వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత జట్టుకు నిరాశే ఎదురైంది. టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన టీమిండియా.. ఆతిథ్య జట్టును 230 పరుగులకు పరిమితం చేయగలిగింది. అయితే, లక్ష్య ఛేదనను ఘనంగా ఆరంభించినా మిడిలార్డర్ విఫలం కావడంతో కష్టాల్లో పడింది.ఓపెనర్ రోహిత్ శర్మ 47 బంతుల్లో 58 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్(35 బంతుల్లో 16 రన్స్) మాత్రం తీవ్రంగా నిరాశపరిచాడు. వన్‌డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఆదుకుంటాడని భావిస్తే.. అతడు కూడా 32 బంతుల్లో కేవలం 24 పరుగులకే పరిమితమయ్యాడు.విజయానికి ఒక పరుగు దూరంలోవాషింగ్టన్ సుందర్(5) తేలిపోగా.. రీఎంట్రీ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ 23 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. ఇక వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్(31), అక్షర్ పటేల్(33) కాసేపు పోరాడగా.. శివం దూబే 25 పరుగులతో గెలుపు ఆశలు రేపాడు.అయితే, కేవలం 14 బంతుల్లో ఒక్క పరుగు అవసరమైన వేళ.. శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక 48వ ఓవర్లో దూబే, అర్ష్‌దీప్ సింగ్(0)ను అవుట్ చేయడంతో టీమిండియా ఆలౌట్ అయింది. విజయానికి ఒక పరుగు దూరంలో నిలిచి.. మ్యాచ్‌ను టై చేసుకుంది. భారత ఓపెనర్ల వికెట్లు తీసిన శ్రీలంక స్పిన్నర్ దునిత్ వెల్లలగే(2/39) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. చదవండి: గురి చెదిరింది.. కాంస్యం చేజారింది -
IND vs SL: 4 ఏళ్ల తర్వాత భారత స్టార్ ప్లేయర్ రీ ఎంట్రీ..! ఎవరంటే?
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే దాదాపు నాలుగేళ్ల తర్వాత తిరిగి వన్డేల్లో పునరాగమనం చేశాడు. కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో భారత తుది జట్టులో చోటు దక్కించుకున్న దూబే.. తన 1670 రోజుల నిరీక్షణకు తెరదించాడు. డిసెంబర్ 15, 2019న వెస్టిండీస్‌పై వన్డే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన దూబే.. తన మొదటి మ్యాచ్‌లో నిరాశపరిచాడు. తన డెబ్యూ మ్యాచ్‌లో 6 బంతులు ఎదుర్కొన్న శివమ్ కేవలం 9 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. దీంతో ఆ తర్వాత అతడికి భారత జట్టులో చోటు దక్కలేదు. అయితే ఐపీఎల్-2024తో పాటు దేశీవాళీ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి భారత టీ20 జట్టులోకి వచ్చిన దూబే.. ఇప్పుడు వన్డేల్లో కూడా రీఎంట్రీ ఇచ్చాడు. ముఖ్యంగా శ్రీలంకతో వన్డే సిరీస్‌కు స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా దూరం కావడంతో దూబేకు రీఎంట్రీ సుగమమైంది. తొలి వన్డేకు పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా భారత తుది జట్టులో ఈ ముంబైకర్ చోటు దక్కించుకున్నాడు. టీ20 వరల్డ్‌కప్-2024లో కూడా దూబే పర్వాలేదన్పించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో 27 పరుగులు చేసిన దూబే.. భారత్ ఛాంపియన్స్‌గా నిలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. దూబే తన లిస్ట్-ఎ కెరీర్లో ఇప్పటివరకు 54 మ్యాచ్‌లు ఆడి 975 పరుగులతో పాటు 40 వికెట్లు పడగొట్టాడు.తుది జట్లు..భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మొహమ్మద్ సిరాజ్శ్రీలంక: చరిత్ అసలంక (కెప్టెన్), పథుమ్ నిస్సంక, అవిష్క ఫెర్నాండో, కశాల్ మెండిస్ (వికెట్‌కీపర్), సధీర సమరవిక్రమ, దునిత్ వెల్లలగే, వనిందు హసరంగ, జనిత్ లియనగే, అఖిల ధనంజయ, అషిత ఫెర్నాండో, మొహ్మద్ సిరాజ్ -
Ind vs Zim: ఆ ముగ్గురిపై వేటు.. దూబేకూ చోటు
జింబాబ్వేతో మూడో టీ20లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. హరారే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌తో ప్రపంచకప్-2024 విజేత జట్టులోని ముగ్గురు స్టార్లు పునరాగమనం చేశారు.ఓపెనర్ యశస్వి జైస్వాల్, వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్, పవర్ హిట్టర్ శివం దూబే తుదిజట్టులో చోటు దక్కించుకున్నారు. వీరి రాకతో సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్‌లపై వేటు పడింది.అదే విధంగా.. పేసర్ ముకేశ్ కుమార్‌కు విశ్రాంతినిచ్చారు. ఈ నేపథ్యంలో టాస్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. వరల్డ్‌కప్ విన్నర్ల రాకతో తమ జట్టు మరింత పటిష్టమైందని పేర్కొన్నాడు.తుది జట్లు..భారత్: యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, శుభమన్ గిల్(కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్(వికెట్‌కీపర్), శివమ్ దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్జింబాబ్వే: తాడివానాషే మారుమణి, వెస్లీ మాధేవేరే, బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, సికందర్ రజా (కెప్టెన్), జోనాథన్ కాంప్‌బెల్, క్లైవ్ మదాండే(వికెట్‌కీపర్), వెల్లింగ్టన్ మసకద్జా, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజరబానీ, టెండై చతారా. -
జింబాబ్వేతో టీ20 సిరీస్.. భారత జట్టులో కీలక మార్పులు! సంజూ, దూబే ఔట్
జింబాబ్వేతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. టీ20 వరల్డ్‌కప్-2024లో భాగమైన ఆటగాళ్లందరికి దాదాపుగా జింబాబ్వే పర్యటనకు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. దీంతో ఈ సిరీస్‌లో భారత జట్టుకు యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ సారథ్యం వహించనున్నాడు. అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్ వంటి యువ ఆటగాళ్లకు తొలిసారి భారత జట్టులో చోటు దక్కింది. ఇక ఈ సిరీస్ కోసం ఇప్పటికే శుబ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు జింబాబ్వేకు పయనమైంది.భారత జట్టులో కీలక మార్పులు..ఇక ఈ సిరీస్‌కు ముందు భారత జట్టులో పలు కీలక మార్పులు బీసీసీఐ చేసింది. టీ20 వరల్డ్‌కప్ 2024 భారత జట్టులో భాగమైన సంజూ శాంసన్, యశస్వీ జైశ్వాల్, శివమ్ దూబేలను జింబాబ్వే సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టు నుంచి బీసీసీఐ రిలీజ్ చేసింది. వారి స్ధానంలో తొలి రెండు టీ20లకు హర్షిత్ రానా, సాయి సుదర్శన్, జితేష్ శర్మలను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. కాగా హర్షిత్ రానా, సాయిసుదర్శన్ తొలిసారి భారత జట్టుకు ఎంపికయ్యారు. కాగా ఈ సిరీస్ జులై 6 నుంచి ప్రారంభం కానుంది. హరారే వేదికగా జులై 6, 7, 10, 13, 14 తేదీల్లో మ్యాచ్‌లు జరుగనున్నాయి.జింబాబ్వేతో తొలి రెండు టీ20లకు భారత జట్టుశుభమాన్ గిల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకు సింగ్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, తుషార్ దేశ్‌పాండే, సాయి సుదర్శన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్) , హర్షిత్ రాణా -
T20 World Cup 2024 Final: శివమ్ దూబేనా..సంజూ శాంసనా..?
మరికొద్ది గంటల్లో టీ20 వరల్డ్‌కప్ 2024 ఫైనల్ ప్రారంభం కానుంది. బార్బడోస్ వేదికగా భారత్-సౌతాఫ్రికా జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఇవాళ (జూన్ 29) రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి టైటిల్ సాధించాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి. ఈ టైటిల్ ఓ జట్టుకేమో (టీమిండియా) 13 ఏళ్ల నిరీక్షణ.. మరో జట్టుకు (సౌతాఫ్రికా) చిరకాల కోరిక. ఈ తుది సమరం కోసం కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్‌కు వరుణుడు అడ్డుతగిలేలా ఉన్నాడు. ఒకవేళ ఇవాళ మ్యాచ్ రద్దైనా రిజర్వ్ డే ఉంది. ఒకవేళ రిజర్వ్ డేలో కూడా మ్యాచ్ సాధ్యపడకపోతే ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. సంయుక్త విజేతలుగా నిలవడం ఇరు జట్ల ఆటగాళ్లుకు, అభిమానులు ఇష్టం ఉండదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మ్యాచ్ జరగాలనే దేవుళ్లను ప్రార్ధిస్తున్నారు.ఇదిలా ఉంటే, ఫైనల్ మ్యాచ్ కోసం భారత తుది జట్టు కూర్పులో ఓ తలనొప్పి ఉంది. వరుసగా విఫలమవుతున్న శివమ్ దూబేను ఫైనల్లో ఆడించాలా వద్దా అని మేనేజ్మెంట్ తలలు పట్టుకు కూర్చుంది. ఫామ్‌లోని లేని దూబేని ఫైనల్లో కూడా కొనసాగిస్తే.. టీమిండియా విజయావకాశాలను దెబ్బతినే ప్రమాదముందని అభిమానులు భావిస్తున్నారు. ఒకవేళ దూబేని తప్పిస్తే జట్టు లయ దెబ్బతీనే ప్రమాదం కూడా లేకపోలేదు.ప్రస్తుతం భారత జట్టు బ్యాటర్లు, ఆల్‌రౌండర్లు, బౌలర్లతో సమతూకంగా ఉంది. ఒకవేళ దూబే స్థానంలో సంజూ శాంసన్ లేదా యశస్వి జైస్వాల్‌ను తుది జట్టులోకి తీసుకుంటే భారత్‌కు ఓ ఆల్‌రౌండర్ తక్కువ అవుతాడు. ఈ టోర్నీలో దూబేతో బౌలింగ్ చేయించనప్పటికీ అతన్ని ఆల్‌రౌండర్‌గానే పరిగణించాలి. బౌలర్‌గా అతనికి ఓ మోస్తరు ట్రాక్ రికార్డు ఉంది. బార్బడోస్ పిచ్ బౌలర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో జట్టు మేనేజ్మెంట్ దూబేని తప్పించే సాహసం చేయకపోవచ్చు. కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ ద్రవిడ్‌కు కూడా దూబేని మార్చడం ఇష్టం ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్‌లో భారత తుది జట్టుపై మీ అంచాలనేమో కామెంట్ చేయండి. శివమ్ దూబేని ఆడిస్తే బాగుంటుందా లేక సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్‌లలో ఒకరికి అవకాశమిస్తే బాగుంటుందా..? -
Shivam Dube: ఐపీఎల్లో హీరో.. ఇండియా తరఫున జీరో
ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్ 2024లో టీమిండియా ఆటగాడు శివమ్ దూబే వరుసగా విఫలమవుతున్నాడు. మెగా టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో కేవలం 106 పరుగులు మాత్రమే చేశాడు. దూబే వరుస వైఫల్యాల నేపథ్యంలో భారత క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దూబేను తక్షణమే జట్టు నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. దూబే స్థానంలో రింకూ సింగ్, సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్‌లలో ఎవరో ఒకరికి అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఆల్‌రౌండర్ కోటాలో జట్టులోకి తీసుకుంటే కనీసం బ్యాటింగ్కైనా న్యాయం చేయలేకపోతున్నాడని మండిపడుతున్నారు. ఐపీఎల్ 2024 ఫామ్‌ను (14 మ్యాచ్‌ల్లో 162.30 స్ట్రయిక్‌రేట్‌తో 396 పరుగులు, 3 అర్దసెంచరీలు) చూసి హార్దిక్‌తో పోల్చి తప్పు చేశామని బాధపడుతున్నారు. ఐపీఎల్లో హీరో ఇండియా తరఫున జీరో అంటూ ధ్వజమెత్తుతున్నారు. తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో గోల్డెన్ డకౌట్ కావడంతో దూబేపై అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కొందరు అభిమానులు దూబేపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. కీలకమైన మ్యాచ్‌లో కీలక సమయంలో బ్యాటింగ్‌కు దిగి తొలి బంతికే ఔట్ కావడాన్ని అభిమానులు సహించలేకున్నారు. వరుసగా విఫలమవుతున్నా దూబేకు అవకాశాలు ఇస్తున్నందుకు కెప్టెన్ రోహిత్ శర్మను తప్పుబడుతున్నారు. ఇచ్చిన అవకాశాలు చాలు ఫైనల్లో దూబేని తప్పించి ఇతరులకు అవకాశం ఇవ్వాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నారు.కాగా, ఇంగ్లండ్‌తో నిన్న (జూన్ 27) జరిగిన సెమీఫైనల్లో టీమిండియా 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్స్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో దూబే విఫలమైనా టీమిండియా తొలుత బ్యాటింగ్ చేస్తూ 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.రోహిత్ శర్మ (39 బంతుల్లో 57; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (13 బంతుల్లో 23, ఫోర్, 2 సిక్సర్లు) రాణించగా.. కోహ్లి (9), దూబే (0), పంత్ (4) నిరాశపరిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డన్ 3 వికెట్లు పడగొట్టగా.. రీస్ టాప్లీ, జోఫ్రా ఆర్చర్, సామ్ కర్రన్, ఆదిల్ రషీద్ తలో దక్కించుకున్నారు.అనంతరం 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. కుల్దీప్ యాదవ్ (4-0-19-3), అక్షర్ పటేల్ (4-0-23-3), బుమ్రా (2.4-0-12-2) ధాటికి 16.4 ఓవర్లలో 103 పరుగులకే చాపచుట్టేసింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జోస్ బట్లర్ (23), హ్యారీ బ్రూక్ (25), జోఫ్రా ఆర్చర్ (21), లివింగ్‌స్టోన్ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. కాగా, భారతకాలమానం రేపు (జూన్ 29) రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఫైనల్లో టీమిండియా.. సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకుంటుంది. -
Ind vs Zim: నితీశ్ రెడ్డికి చేదు అనుభవం.. శివం దూబేకు ఛాన్స్
ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఈ యువ ఆల్‌రౌండర్ గాయం బారిన పడ్డాడు. ఫలితంగా జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. ఈ క్రమంలో తీశ్ రెడ్డి స్థానంలో శివం దూబేను ఎంపిక చేశారు సెలక్టర్లు. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి బుధవారం ప్రకటించింది.వైజాగ్ కుర్రాడుకాగా విశాఖపట్నానికి చెందిన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి జింబాబ్వే పర్యటనకు ఎంపికైన విషయం తెలిసిందే. ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) తరఫున అదరగొట్టిన ఈ 21 ఏళ్ల కుడిచేతి వాటం బ్యాటర్.. ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ 2024’ అవార్డు కూడా అందుకున్నాడు.జింబాబ్వే పర్యటన కోసంఈ సీజన్ ఆసాంతం నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్న నితీశ్ కుమార్ రెడ్డి టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలో సీనియర్లు విశ్రాంతి తీసుకుంటున్న జింబాబ్వే పర్యటన కోసం అతడిని ఎంపిక చేశారు.ఈ క్రమంలో టీమిండియా టీ20 జట్టుకు సెలక్ట్ అయిన తొలి ఆంధ్ర క్రికెటర్‌గా నితీశ్ రెడ్డి చరిత్రకెక్కాడు. అయితే, ప్రస్తుతం అతడు గాయంతో బాధపడుతున్నట్లు బీసీసీఐ వెల్లడించింది.అతడితో భర్తీనితీశ్ రెడ్డి చికిత్స నిమిత్తం ప్రస్తుతం బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నట్లు తెలిపింది. ఈ క్రమంలో నితీశ్ రెడ్డి స్థానాన్ని ముంబై పేస్ ఆల్‌రౌండర్ శివం దూబేతో భర్తీ చేస్తున్నట్లు వెల్లడించింది.కాగా టీ20 ప్రపంచకప్-2024 తర్వాత సీనియర్లంతా విశ్రాంతి తీసుకోనున్న నేపథ్యంలో జింబాబ్వే టూర్‌కు యువ జట్టును ఎంపిక చేశారు. ఈ జట్టుకు శుబ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.ఇక జూలై 6 నుంచి టీమిండియా జింబాబ్వేతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లన్నింటికీ హరారే వేదిక.జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు భారత జట్టు(రివైజ్డ్)శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, తుషార్ దేశ్‌పాండే, శివం దూబే.చదవండి: ఒకే ఓవర్లో 43 రన్స్.. 134 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి!Nitish Kumar Reddy: అప్పుడే నా కల పూర్తిగా నెరవేరుతుంది -
సిక్సర్ల కింగ్ శివమ్ దూబే.. బర్త్‌డే స్పెషల్ (ఫోటోలు)
-
ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం..సెమీస్‌కు టీమిండియా (ఫొటోలు)
-
Ind vs Ban: అతడిపై వేటు.. సంజూకు ఛాన్స్!
టీ20 ప్రపంచకప్-2024 సూపర్-8లో శుభారంభం చేసిన టీమిండియా అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. తమ రెండో మ్యాచ్‌లో భాగంగా బంగ్లాదేశ్‌ను ఓడించి సెమీస్ అవకాశాలను మెరుగుపరచుకోవాలని పట్టుదలగా ఉంది.ఈ నేపథ్యంలో ఇప్పటికే రోహిత్ సేన నెట్స్‌లో తీవ్రంగా చెమటోడ్చింది. అఫ్గనిస్తాన్‌తో గురువారం నాటి మ్యాచ్‌లో విజయానంతరం.. మరుసటి రోజే ప్రాక్టీస్ సెషన్‌తో బిజీగా గడిపింది.ప్రత్యేకంగా ప్రాక్టీస్ఫామ్లేమితో సతమతమవుతున్న కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా కూడా నెట్ సెషన్లో పాల్గొన్నట్లు సమాచారం. సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో శుక్రవారం జరిగిన సెషన్లో సంజూ శాంసన్‌తో రిజర్వ్ బౌలర్ ఖలీల్ అహ్మద్ ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేసినట్లు తెలుస్తోంది.ముఖ్యంగా సంజూ శాంసన్ కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆధ్వర్యంలో దాదాపు రెండు గంటల పాటు నెట్ సెషన్లో పాల్గొన్నట్లు సమాచారం. సంజూ బ్యాటింగ్‌ను వీరిద్దరు పరిశీలించినట్లు రెవ్‌స్పోర్ట్స్ వెల్లడించింది.అతడిపై వేటు?ఈ నేపథ్యంలో... టోర్నీ ఆరంభం నుంచి బెంచ్‌కే పరిమితమైన సంజూ శాంసన్‌కు బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో అవకాశం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శివం దూబే స్థానంలో ఈ కేరళ బ్యాటర్‌ను తుదిజట్టులోకి తీసుకోనున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.హిట్టర్‌గా ఐపీఎల్-2024లో ఇరగదీసిన శివం దూబే వరల్డ్‌కప్-2024లో మాత్రం బ్యాట్ ఝులిపించలేకపోతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో కలిపి 44 పరుగులే చేశాడు. స్ట్రైక్‌రేటు 83.అందుకే సంజూకు లైన్ క్లియర్ఈ నేపథ్యంలో దూబేను తప్పించి సంజూకు మార్గం సుగమం చేయాలని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ తర్వాత టీమిండియా తదుపరి ఆస్ట్రేలియాతో తలపడనుంది.పటిష్ట ఆసీస్‌ను ఢీకొట్టేకంటే ముందే తుదిజట్టులో ఈ మేరకు మార్పులతో ప్రయోగం చేయాలని బోర్డు భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు.. మిడిలార్డర్లో ఉన్న ఒకే ఒక్క లెఫ్టాండర్ బ్యాటర్ శివం దూబే విషయంలో టీమిండియా రిస్క్ చేయకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా అంటిగ్వాలోని వివియన్ రిచర్ట్స్ స్టేడియంలో శనివారం టీమిండియా- బంగ్లాదేశ్‌తో తలపడనుంది. అయితే, ఈ మ్యాచ్‌కు వర్ష సూచన ఉండటం ఆందోళనకరంగా పరిణమించింది.చదవండి: టీమిండియా స్టార్ పేసర్ రీ ఎంట్రీకి సిద్ధం.. ఆ సిరీస్ నాటికి!Barbados ✈️ Antigua #TeamIndia have arrived for today's Super 8 clash against Bangladesh 👌👌#T20WorldCup pic.twitter.com/RM54kEWP3W— BCCI (@BCCI) June 22, 2024 -
ఇక్కడ గెలవడం అంత సులువు కాదు.. క్రెడిట్ వాళ్లకే: రోహిత్ శర్మ
టీ20 ప్రపంచకప్-2024 లీగ్ దశలో తమకు ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా సూపర్-8లో అడుగుపెట్టింది. ఆతిథ్య అమెరికా జట్టుపై బుధవారం నాటి మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది తదుపరి దశకు అర్హత సాధించింది.అయితే, పసికూనే అయినా అమెరికాపై రోహిత్ సేనకు ఈ విజయం అంత సులువుగా రాలేదు. 111 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆరంభంలో తడబడిన భారత జట్టు సూర్యకుమార్ యాదవ్(50), శివం దూబే(31) అద్భుత అజేయ ఇన్నింగ్స్ కారణంగా గట్టెక్కింది.బ్యాటింగ్ అనుకూలించని పిచ్‌పై వీరిద్దరు మెరుగైన భాగస్వామ్యం నెలకొల్పి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ సూర్య, దూబేలపై ప్రశంసలు కురిపించాడు.గెలుపు అంత తేలికగా రాదని తెలుసుఅదే విధంగా.. అమెరికాపై విజయంలో బౌలర్ల పాత్ర కూడా ఎంతో కీలకమని పేర్కొన్నాడు. ‘‘ఈ మ్యాచ్‌లో గెలుపు అంత తేలికగా రాదని తెలుసు. మా వాళ్ల మెరుగైన భాగస్వామ్యం వల్లే ఇది సాధ్యమైంది.బౌలర్లు కూడాసూర్య, దూబే ఆద్యంతం పట్టుదలగా నిలబడి పరిణతితో కూడిన ఇన్నింగ్స్ ఆడారు. అందుకు వాళ్లకు క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఇక మా బౌలర్లు కూడా అద్భుతంగా రాణించారు.ముఖ్యంగా అర్ష్‌దీప్. దూబే రూపంలో మాకు మరో ఆప్షన్ ఉంది కాబట్టి.. ఈ మ్యాచ్‌లో ప్రయత్నించి చూశాం. ఎందుకంటే ఈరోజు పిచ్ సీమర్లకు ఎక్కువగా అనుకూలించింది. కాబట్టి అతడి సేవలను వాడుకున్నాం. అతిపెద్ద ఊరటఇక సూపర్-8కు క్వాలిఫై అవటం అనేది అతిపెద్ద ఊరట. ఇలాంటి పిచ్‌లపై విజయాలు అంత సులువేమీ కాదు. ప్రతి మ్యాచ్‌ను చాలెంజింగ్‌గా తీసుకున్నాం.మూడింట మూడు విజయాలు సాధించాం. ఫలితంగా మా ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. సూర్యకుమార్ యాదవ్ లాంటి అనుభవజ్ఞుడైన ఆటగాడి నుంచి మేము ఏం ఆశిస్తామో.. ఈరోజు అదే అతడు చేసి చూపించాడు.కఠినమైన పిచ్‌పై తనదైన శైలిలో రాణించి విజయాన్ని అందించాడు’’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. సమిష్టి కృషితో సూపర్-8కు అర్హత సాధించడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశాడు.టీ20 ప్రపంచకప్-2024: ఇండియా వర్సెస్ యూఎస్ఏ స్కోర్లు👉వేదిక: న్యూయార్క్👉టాస్: ఇండియా బౌలింగ్👉యూఎస్ఏ స్కోరు- 110/8 (20)👉ఇండియా స్కోరు- 111/3 (18.2)👉ఫలితం- ఏడు వికెట్ల తేడాతో యూఎస్ఏపై ఇండియా విజయం👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: అర్ష్‌దీప్ సింగ్(4/9).చదవండి: రూ. 250 కోట్లు.. బ్యాటర్లకు చుక్కలే! కూల్చేయనున్న ఐసీసీ? View this post on Instagram A post shared by ICC (@icc) -
టి20 వరల్డ్ కప్ : అమెరికాపై గెలుపు..‘సూపర్–8’కు భారత్ (ఫొటోలు)
-
అమెరికాతో మ్యాచ్.. దూబేపై వేటు! శాంసన్‌కు ఛాన్స్
టీ20 వరల్డ్‌కప్-2024లో టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆతిథ్య అమెరికాతో బుధవారం న్యూయర్క్ వేదికగా భారత్ తలపడనుంది. ఇరు జట్లు కూడా తమ చివరి మ్యాచ్‌లో పాకిస్తాన్నే ఓడించడం గమనార్హం. ఆదివారం(జూన్ 9)స్కోరింగ్ థ్రిల్లర్‌లో పాకిస్తాన్‌పై భారత్ సంచలన విజయం సాధించగా.. అమెరికా సూపర్ ఓవర్లో పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. కాగా పాక్‌పై గెలిచి మంచి జోష్‌లో ఉన్న టీమిండియా యూఎస్ఎపై కూడా అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. కానీ అమెరికా జట్టును ఏ మాత్రం తక్కువ అంచనా వేసినా భారత్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.ఈ క్రమంలో టీమిండియా మెనెజ్‌మెంట్ తమ తుది జట్టులో పలు మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మెగా ఈవెంట్లో తొలి రెండు మ్యాచ్‌ల్లో నిరాశపరిచిన ఆల్‌రౌండర్ శివమ్ దూబేపై వేటు వేయాలని మెన్జ్మెంట్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఐపీఎల్లో అదరగొట్టి భారత వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకున్న దూబే.. తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో దూబే నిరాశపరుస్తున్నాడు. ఈ క్రమంలో అతడి స్ధానంలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు ఛాన్స్ ఇవ్వాలని కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.మరోవైపు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు కూడా విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అతడి స్ధానంలో చైనామాన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి రానున్నట్లు వినికిడి. ఇప్పటివరకు జరిగిన ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ జడేజా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.భారత తుది జట్టు(అంచనా)రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్ -
టి20 వరల్డ్ కప్ : తొలి మ్యాచ్‌లో భారత్ ఘన విజయం (ఫొటోలు)
-
శివమ్ దూబేపై వేటు.. వరల్డ్‌కప్ జట్టులో ఫినిషర్‌కు చోటు!
ఐపీఎల్-2024 ఫస్ట్‌హాఫ్‌లో అదరగొట్టిన చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే.. సెకెండ్ హాఫ్‌లో మాత్రం పూర్తిగా తేలిపోయాడు. స్పిన్నర్లు అద్బుతంగా ఎదుర్కొంటాడని పేరొందిన దూబే.. ఇప్పుడు అదే స్పిన్ బౌలింగ్ అతడి వీక్నెస్గా మారింది. మిడిలార్డర్లో బ్యాటింగ్‌కు వచ్చి సీఎస్కేకు అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడడంతో ఏకంగా అతడికి టీ20 వరల్డ్‌కప్ భారత జట్టులో సెలక్టర్లు చోటు ఇచ్చారు. కానీ వరల్డ్‌కప్‌నకు ఎంపికైన తర్వాత అతడి ఆటతీరు పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఆడుతున్నది నిజంగా దూబేనేనా అన్నట్లు ఉంది. తొలి 9 మ్యాచ్ ల్లో 172.4 స్ట్రైక్ రేట్‌తో 350 పరుగులు చేసిన దూబే.. చివరి 5 మ్యాచ్ ల్లో కేవలం 46 పరుగులు మాత్రమే చేశాడు. తొలి 9 మ్యాచ్ ల్లో ఏకంగా 26 సిక్సర్లు బాదిన దూబే.. చివరి 5 మ్యాచ్ ల్లో కేవలం 2 సిక్సర్లు మాత్రమే కొట్టాడు. ఆర్సీబీతో జరిగిన కీలక మ్యాచ్ లో దూబే 15 బంతుల్లో కేవలం 7 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో టీ20 వరల్డ్‌కప్‌నకు ముందు శివమ్ దూబే ఫామ్ భారత జట్టు మెనెజ్‌మెంట్‌కు ఆందోళన కలిగిస్తోంది. అయితే వరల్డ్‌కప్ ప్రకటించిన జట్టులో మే 25లోపు మార్పులు చేసుకోవచ్చు. ఈ క్రమంలో రిజర్వ్ జాబితాలో ఉన్న రింకూకు ప్రధాన జట్టులోకి ప్రమోట్ చేసి.. మెయిన్ జట్టులో ఉన్న దూబేకు స్టాండ్‌బై లిస్ట్‌లోకి డిమోట్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు అయితే బీసీసీఐ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. -
వరల్డ్‌కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్‌లో గోల్డెన్ డక్
ఐపీఎల్-2024లో టీమిండియా ఆల్‌రౌండర్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ శివమ్ దూబే వరుసగా రెండో మ్యాచ్‌లో నిరాశపరిచాడు. ఈ లీగ్ ఫస్ట్‌హాఫ్‌లో అదరగొట్టిన దూబే.. సెకెండ్ హాఫ్‌లో మాత్రం తన మార్క్ చూపించలేకపోతున్నాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఆదివారం ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో దూబే గోల్డన్ డక్‌గా వెనుదిరిగాడు. రుతురాజ్ గైక్వాడ్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన దూబే.. స్పిన్నర్ రాహుల్ చాహర్ బౌలింగ్‌లో తన ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యాడు. దూబే గోల్డెన్ డక్‌గా వెనుదిరగడం వరుసగా ఇది రెండో సారి. అంతకముందు కూడా చెపాక్ వేదికగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ దూబే ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. స్పిన్నర్లను అద్భుతంగా ఆడిగల్గే దూబే.. అదే స్నిన్నర్ల బౌలింగ్‌లో ఔట్ అవుతుండడం సీఎస్కే అభిమానులను కలవరపెడతోంది. అంతేకాకుండా ఐపీఎల్లో అద్భుతమైన ప్రదర్శర కనబరచడంతో దూబేకు టీ20 వరల్డ్‌కప్ భారత జట్టులో చోటు దక్కింది. ఇప్పుడు ఈ మెగా టోర్నీకి ముందు దూబే వరుసగా విఫలం కావడడం జట్టు మెనెజ్‌మెంట్‌ను ఆందోళన కలిగిస్తోంది. Wickets ki aayi bahar, jaise hi aaye Rahul Chahar 🔥#IPLonJioCinema #TATAIPL #PBKSvCSK #IPLinPunjabi pic.twitter.com/urm9eFIDOW— JioCinema (@JioCinema) May 5, 2024 -
హార్దిక్ బదులు అతడిని ఎంపిక చేయాల్సింది: పాక్ మాజీ స్టార్
టీ20 వరల్డ్‌కప్-2024 నేపథ్యంలో బీసీసీఐ ప్రకటించిన జట్టుపై పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. యశస్వి జైస్వాల్ వంటి యంగ్ స్టార్లకు చోటివ్వడం సరైన నిర్ణయమని.. అయితే, రింకూ సింగ్‌కు మాత్రం అనాయ్యం జరిగిందని పేర్కొన్నాడు.లోయర్ ఆర్డర్లో హిట్టింగ్ ఆడగల రింకూను పక్కన పెట్టడం సరికాదని టీమిండియా సెలక్టర్ల తీరును కనేరియా విమర్శించాడు. హార్దిక్ పాండ్యా బదులు రింకూను జట్టుకు ఎంపిక చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు.రింకూ సింగ్‌కు అనాయ్యంకాగా జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా మొదలయ్యే ప్రపంచకప్‌నకు బీసీసీఐ మంగళవారం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ సారథ్యంలోని ఈ టీమ్‌లో రింకూ సింగ్‌కు స్థానం దక్కలేదు. రిజర్వ్ ప్లేయర్‌గా మాత్రమే అతడు ఎంపికయ్యాడు.వీళ్లంతా భేష్‌ఈ నేపథ్యంలో డానిష్ కనేరియా మాట్లాడుతూ.. ‘‘నాణ్యమైన క్రికెటర్లను ఉత్పత్తి చేస్తుందనే పేరు భారత్‌కు ఉంది. ఇటీవలి కాలంలో దుమ్ములేపుతున్న యశస్వి జైస్వాల్, అంగ్క్రిష్ రఘువంశీ ఇందుకు చక్కని ఉదాహరణలు.మయాంక్ యాదవ్ సైతం తన పేస్ నైపుణ్యాలతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇక అభిషేక్ శర్మ పవర్ హిట్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.పాండ్యాకు ఎందుకు చోటిచ్చారు?రింకూ విషయానికొస్తే.. అతడు కచ్చితంగా టీ20 వరల్డ్‌కప్ జట్టులో ఉండాల్సింది. నా అభిప్రాయం ప్రకారం.. ఐపీఎల్ ప్రదర్శనను గనుక పరిగణనలోకి తీసుకుంటే హార్దిక్ పాండ్యాను ప్రపంచకప్‌నకు ఎంపిక చేయకుండా ఉండాల్సింది.ఇప్పటికే జట్టులో శివం దూబే ఉన్నాడు. అందుకే పాండ్యా బదులు రింకూను ఎంపిక చేస్తే డౌన్ ఆర్డర్లో శక్తిమంతమైన కూర్పు కుదిరి ఉండేది’’ అని స్పోర్ట్స్ నౌ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.కాగా ప్రపంచకప్ ఈవెంట్లో కెప్టెన్ రోహిత్ శర్మకు డిప్యూటీగా హార్దిక్ పాండ్యాను ఎంపిక చేసింది బీసీసీఐ. అయితే, డానిష్ కనేరియా మాత్రం వైస్ కెప్టెన్‌నే పక్కనపెట్టాల్సిందని చెప్పడం గమనార్హం.టీ20 ప్రపంచకప్-2024 టోర్నీకి బీసీసీఐ ప్రకటించిన జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజూ శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా.రిజర్వ్ ప్లేయర్లు: శుబ్‌మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్.చదవండి: అమెరికా వరల్డ్‌కప్ జట్టులో ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లు.. -
వరల్డ్‌కప్‌కు సెలక్టయ్యాడు.. తొలిసారి డకౌటయ్యాడు! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే తొలిసారి నిరాశపరిచాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా చెపాక్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శివమ్ దూబే గోల్డన్ డక్‌గా వెనుదిరిగాడు. రహానే ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన దూబే.. తను ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యాడు. స్పిన్‌ను అద్బుతంగా ఆడే దూబే.. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ హార్ప్రీత్ బ్రార్ బౌలింగ్‌లో ఔట్ కావడం గమనార్హం. 9వ ఓవర్ వేసిన హార్ప్రీత్ బ్రార్ బౌలింగ్‌లో దూబే వికెట్ల ముందు దొరికిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఐపీఎల్లో దూబే గోల్డన్ డక్‌గా వెనుదిరిగడం ఇదే మొదటి సారి. కాగా ఈ ఏడాది సీజన్లో దూబే అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రదర్శన కారణంగానే టీ20 వరల్డ్‌కప్-2024 భారత జట్టులో దూబేకు చోటు దక్కింది. అయితే టీ20 వరల్డ్‌కప్‌కు ప్రకటించిన తర్వాత రోజే దూబే డకౌట్ కావడం గమనార్హం. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడిన దూబే.. 171.57 స్ట్రైక్ రేటుతో 350 పరుగులు చేశాడు.Double strike from Harpreet Brar 🔥#TATAIPL #CSKvPBKS #IPLonJioCinema #IPLinHindi pic.twitter.com/O5lVM6nog2— JioCinema (@JioCinema) May 1, 2024