Smart Pulse Survey
-
స్మార్ట్ చెక్!
ఒంగోలు టౌన్: స్మార్ట్ పల్స్ సర్వేను రాష్ట్ర ప్రభుత్వం మరోమారు తెరపైకి తీసుకొచ్చింది. దాదాపు ఏడాదిన్నర క్రితం స్మార్ట్ పల్స్ సర్వే పేరుతో ప్రభుత్వం హడావుడి చేసింది. ప్రతి ఇంటికి సంబంధించిన సమగ్ర సమాచారం కోసమంటూ ఆరు నెలలకు పైగా సర్వే చేయించింది. ఆ సర్వే ప్రక్రియ పూర్తయి ప్రజ లు కూడా మర్చిపోతున్న తరుణంలో ప్రభుత్వం స్మార్ట్ సర్వేను చెక్ చేయాలని అన్ని జిల్లాలకు ఆదేశాలు జారీ చేసింది. స్మార్ట్ పల్స్ సర్వేలో పేర్లు ఉంటేనే ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయంటూ ప్రభుత్వం సరికొత్త పల్లవి అందుకొంది. ఈ నేపథ్యంలో జిల్లాలో గతంలో నిర్వహించిన స్మార్ట్ పల్స్ సర్వే డేటాను ఆధారం చేసుకొని ప్రజల వివరాలను తిరిగి చెక్ చేసేం దుకు యంత్రాంగం సన్నద్ధమైంది.స్మార్ట్ పల్స్ సర్వేలో వివరాలు పొందుపరచుకుంటేనే కార్మికులకు చంద్రన్న బీమా పథకం వర్తిస్తుం డటంతో అనేక మంది ఈ బీమాను కోల్పోతున్నారు. చంద్రన్న బీమా పొందే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో తిరిగి స్మార్ట్ పల్స్ సర్వే చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో జిల్లా యంత్రాంగం స్మార్ట్ పల్స్ సర్వేకు సిద్ధమవుతోంది. 4 లక్షల మంది వివరాలు పెండింగ్ 2016 జూన్‌లో స్మార్ట్ పల్స్ సర్వేను జిల్లాలో ప్రారంభించారు. 2011 జనాభా లెక్కల ప్రకా రం జిల్లాలో 33 లక్షల 97 వేల 448 మంది ఉన్నారు. ఇటీవల కాలంలో వివిధ రకాలుగా నిర్వహించిన సర్వేలో ఆ సంఖ్య మరికొంత పెరిగింది. ప్రస్తుతం జిల్లాలో 34 లక్షల 9 వేల 28 మంది జనాభా ఉన్నట్లు యంత్రాంగం లెక్క కట్టింది. ఆరు నెలల పాటు ఏకధాటిగా నిర్వహించిన స్మార్ట్ పల్స్ సర్వేలో మొత్తం 14 లక్షల 2 వేల 284 ఇళ్లను ఎన్యూమరేటర్లు సందర్శించారు. ఆ ఇళ్లల్లో నివాసం ఉంటున్న 30 లక్షల 5 వేల 658 మంది వివరాలను సేకరించగలిగారు. ఆ సమయంలోనే 4 లక్షల ఒక వెయ్యి 370 మంది వివరాలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో ఎక్కువ శాతం పనుల కోసం ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు వలసలు వెళ్లిన వారు ఉన్నారు. అంతేగాకుండా ఆధార్‌లో తమ వివరాలు పొందుపరచుకోనివారు కూడా ఉన్నారు. అదే విధంగా కొంతమంది మరణించారు. ఈ నేపథ్యంలో స్మార్ట్ పల్స్ సర్వేలో నమోదుకాని వివరాలు తిరిగి నమోదు చేయాలంటూ గతేడాది సెప్టెంబర్‌లో హడావుడి చేసినా ప్రభుత్వానికి సంబం« దింంచిన మిగిలిన కార్యక్రమాల్లో జిల్లా యం త్రాంగం బిజీ కావడంతో పెండింగ్‌లో ఉన్న స్మార్ట్ పల్స్ సర్వే వివరాలు అటకెక్కాయి. సర్వే అంటేనే హడల్ స్మార్ట్ పల్స్ సర్వే పేరు వింటేనే ఎన్యూమరేటర్లు హడలిపోతున్నారు. ఈ సర్వేలో ఒక్కో కుటుంబానికి 50కి పైగా వివరాలు సేకరించాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఎన్యూమరేటర్లుగా అంగన్వాడీ కార్యకర్తలు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ రెవెన్యూ అధికారులు, బిల్ కలెక్టర్లను నియమించారు. వారితో పాటు ఆ సమయంలో ఉపాధ్యాయులుగా ఎంపికై పోస్టింగ్‌ల కోసం ఎదురు చూస్తున్న వారిని కూడా స్మార్ట్ పల్స్ సర్వేకు వినియోగించారు. ఒకవైపు రెగ్యులర్ విధులు నిర్వహిస్తూ ఇంకోవైపు స్మార్ట్ పల్స్ సర్వే చేపట్టాల్సి రావడంతో ఎన్యూమరేటర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఆరు నెలల పాటు తమతో అదనపు చాకిరీ చేయించుకొని సకాలంలో తమకు పారితోషికం చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేయడంతో ఎన్యూమరేటర్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. జిల్లా యంత్రాంగం వారికి దశలవారీగా పారితోషికాన్ని చెల్లించి వారిలోని ఆవేశాన్ని కొంతమేర చల్లార్చింది. తాజాగా మరోమారు స్మార్ట్ పల్స్ సర్వే చేయాల్సి రావడంతో ఎన్యూమరేటర్లుగా గతంలో విధులు నిర్వర్తించిన వారికి బలవంతంగా తిరిగి బాధ్యతలు అప్పగించే యోచనలో జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది. అంతర్గత ఆరా? తాజాగా నిర్వహించనున్న స్మార్ట్ పల్స్ చెక్ పేరుతో ప్రభుత్వ పథకాలపై ఆరా తీయనున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ రకాల సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారా అనేదానిపై అంతర్గతంగా ఆరా తీయనున్నట్లు తెలిసింది. సార్వత్రిక ఎన్నికలె వస్తుండటంతో ప్రజల నాడి తెలుసుకునేందుకు కూడా ఈ సర్వే ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. -
సర్వే ఆధారంగా సంక్షేమ పథకాలు అందించాలి
ఒంగోలు టౌన్: ప్రజాసాధికార సర్వే (స్మార్ట్ పల్స్ సర్వే) ఆధారంగా ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలని కలెక్టర్ వి.వినయ్‌చంద్ ఆదేశించారు. ఇటీవల రెండు రోజుల పాటు సీఎం నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఈ విషయమై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. సోమవారం స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా అధికారులతో పలు కార్యక్రమాల గురించి ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, మైనార్టీ, మహిళా శిశు సంక్షేమం, వ్యవసాయ, కార్మిక, పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్లు తదితర సంక్షేమ పథకాలకు ప్రజాసాధికార సర్వే వివరాలు అనుసంధానం చేయాలని సూచించారు. ప్రజాసాధికార సర్వేకు సంబంధించి ఎక్కడైనా పెండింగ్‌లో ఉంటే స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 15 రోజుల్లోపు నమోదు పూర్తి చేయాలని, దీనిపై జాయింట్ కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. వచ్చే మార్చి నాటికి జిల్లా కేంద్రం మొదలుకొని క్షేత్ర స్థాయి వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ–ఆఫీసు విధానం తప్పనిసరిగా అమలులోకి రావాలని ఆదేశించారు. ఇందుకు నోడల్ అధికారిగా జాయింట్ కలెక్టర్ వ్యవహరిస్తూ ప్రతివారం సమీక్షిస్తూ ఉండాలని పేర్కొన్నారు. రానున్న రెండు నెలల్లో నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున నైపుణ్యాభివృద్ధిలో ప్రత్యేక శిక్షణ ఇచ్చి భారీగా జాబ్ మేళాలు నిర్వహించి ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆదేశించారు. అన్ని గ్రామ పంచాయతీల్లో తారు రోడ్లు నిర్మించాలని చెప్పారు. గ్రామాల నుంచి ప్రధాన రహదారులకు రోడ్లు వేయాలని ఆదేశించారు. రానున్న రెండు నెలల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర కార్పొరేషన్ల ద్వారా ఇచ్చే పాడి పశువులను స్థానికంగా కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేయాలన్నారు. ఆక్వా రంగంలో రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలన్నారు. చేనేత క్లస్టర్లు, ప్రయోగశాలలకు స్థలాలను జాయింట్ కలెక్టర్, ఆర్డీఓలు, తహసీల్దార్లతో కలిసి 15రోజుల్లోపు ఎంపిక చేయాలన్నారు. గురుకుల పాఠశాలలు, కాపు, ఉర్దూ, బీసీ, క్రిస్టియన్, మైనార్టీ భవనాలకు స్థలాలు గుర్తించాలని ఆదేశించారు. జిల్లాలో ఖాళీగా ఉన్న రేషన్ దుకాణాల డీలర్లను భర్తీ చేయకుంటే చార్జ్‌మెమో జారీ చేస్తానని హెచ్చరించారు. జన్మభూమి–మాఊరులో వచ్చిన అర్జీలన్నింటినీ నెలాఖరులోగా పరిష్కరించాలని సూచించారు. గణతంత్ర వేడుకలు నిర్వహించాలి స్థానిక పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో ఈ నెల 26న గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ వినయ్‌చంద్ ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర సంక్షేమ శాఖల ద్వారా ఆరువేల మందికి తగ్గకుండా యూనిట్లు ఇచ్చేందుకు మెగా రుణమేళా నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. స్వాతంత్య్ర సమరయోధులను మర్యాద పూర్వకంగా ఆహ్వానించాలన్నారు. ఈ నెల 25వ తేదీ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా జరపాలన్నారు. ఈ నెల 27వ తేదీన దేశంలోనే తొలిసారిగా చీరాలలో మహిళల అక్రమ రవాణాపై జరగనున్న అవగాహన సదస్సులో సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, పలువురు న్యాయమూర్తులు పాల్గొంటారని పేర్కొన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్–2 మార్కండేయులు, డీఆర్ఓ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి పాల్గొన్నారు. -
ఒక్క రూపాయిస్తే ఒట్టు..!
► స్మార్ట్ పల్స్ సర్వే సిబ్బందికి అందని రెమ్యునరేషన్ ►సర్వే పూర్తయి ఐదునెలలైనా పట్టించుకోని ప్రభుత్వం ►జిల్లాలో ఐదువేల మంది ఎదురుచూపు ఒంగోలు టౌన్: స్మార్ట్ పల్స్ సర్వే. గతేడాదంతా ముఖ్యమంత్రి చంద్రబాబు నోట ఎక్కువగా వచ్చిన మాట. జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ప్రతి సందర్భంలోనూ స్మార్ట్ పల్స్ సర్వే గురించి ప్రస్తావిస్తూ జిల్లా అధికారులు మొదలుకుని క్షేత్ర స్థాయి సిబ్బంది వరకు పరుగులు పెట్టించారు. ప్రభుత్వ ఉద్యోగులకే అదనంగా పల్స్ సర్వే బాధ్యతలు అప్పగించడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో వారంతా సర్వే కోసం ఇంటింటికీ తిరిగారు. ఊపిరాడనీయకుండా వారితో సర్వే చేయించిన ప్రభుత్వం.. ఆ తరువాత వారికి ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ గురించి పట్టించుకోలేదు. సర్వే పూర్తయి ఐదు నెలలు అవుతున్నా ఇంతవరకు ఒక్క రూపాయి కూడా వారికి ఇవ్వలేదు. సర్వేలో తమను తరిమినట్లుగా పనిచేయించిన ప్రభుత్వం.. తమ కష్టానికి తగినట్లుగా రెమ్యునరేషన్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసమని ఎన్యుమరేటర్లు, అసిస్టెంట్ ఎన్యుమరేటర్లు ప్రశ్నిస్తున్నారు. పల్స్ సర్వేకు సంబంధించి తమకు ఎప్పుడు రెమ్యునరేషన్ ఇస్తారంటూ వారితో దగ్గరుండి సర్వే చేయించిన సూపర్వైజర్లను ప్రశ్నిస్తున్నారు. వారికి సమాధానం చెప్పుకోలేక అనేకమంది సూపర్వైజర్లు సతమతమవుతున్నారు . ఒక్కో రికార్డుకు ఒక్కో రేటు... స్మార్ట్ పల్స్ సర్వేలో పాల్గొన్న సిబ్బందికి ఒక్కో రికార్డుకు ఒక్కో రేటును ప్రభుత్వం నిర్ణయించింది. ఒక వ్యక్తికిç సంబంధించిన పూర్తి వివరాలను ఒక రికార్డు కింద నిర్ణయించి ఆ వివరాలను సేకరించిన ఎన్యుమరేటర్‌కు రూ.4, అసిస్టెంట్ ఎన్యుమరేటర్‌కు రూ.3, సూపర్వైజర్కు రూ.2 చొప్పున ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో 2,400 మంది ఎన్యుమరేటర్లు, 2,400 మంది అసిస్టెంట్ ఎన్యుమరేటర్లు ఈ ప్రక్రియ చేపట్టారు. వారి పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సకాలంలో సర్సే పూర్తి చేయించేందుకు వీలుగా దాదాపు 280 మంది సూపర్వైజర్లను నియమించారు. 2016 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 36,11,518 మంది ఉన్నారు. 90 శాతానికిపైగా స్మార్ట్ పల్స్ సర్వేలో వివరాలు సేకరించారు. మిగిలిన వారిలో కొంతమంది వలసలు వెళ్లడం, ఇంకొంతమంది చనిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో స్మార్ట్ పల్స్ సర్వే ప్రక్రియ పూర్తయినప్పటికీ రెమ్యునరేషన్ ఎప్పుడు ఇస్తారా అని సర్వేలో పాల్గొన్న సిబ్బంది ఎదురుచూసూ్తనే ఉన్నారు. చుక్కలు చూపించిన ప్రభుత్వం... స్మార్ట్ పల్స్ సర్వే పేరుతో అందులో పాల్గొన్న సిబ్బందికి ప్రభుత్వం చుక్కలు చూపించింది. జిల్లాలోని ప్రతి ఒక్కరికీ దాదాపుగా ఆధార్ కార్డులు ఉన్నాయి. ఆధార్ నంబర్ కొడితే సంబంధిత వ్యక్తికి సంబంధించిన సమగ్ర సమాచారమంతా క్షణాల్లో ప్రత్యక్షమవుతోంది. అయితే స్మార్ట్ పల్స్ సర్వే పేరుతో దాదాపు అరవై రకాల అంశాలను అందులో పొందుపరిచి తిరిగి ఎన్యుమరేటర్లు, అసిసెంట్ ఎన్యుమరేటర్లతో సర్వే చేయించింది. దానికితోడు స్మార్ట్ పల్స్ సర్వే ప్రారంభమైన తరువాత రోజుల వ్యవధిలో సాఫ్ట్వేర్ మారుస్తూ ప్రభుత్వం వారిని ముప్పతిప్పలు పెట్టింది. ఒకే వ్యక్తికి సంబంధించి అనేకమార్లు సర్వే చేయించింది. దీంతో అనేకమంది ఎన్యుమరేటర్లు, అసిస్టెంట్ ఎన్యుమరేటర్లు అదనపు విధుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. కానీ, ప్రభుత్వ ఆదేశాలు తప్పకుండా పాటించాలి్సందేనంటూ ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సర్వేలో సిబ్బంది తలమునకలయ్యారు. సర్వే నిర్వహించే సమయంలో ప్రజలు కూడా వారికి పూర్తి స్థాయిలో సహకరించకపోవడంతో అనేక మంది తీవ్ర అసహనానికి గురయ్యారు. ప్రభుత్వం తమకు సంబంధించిన అన్నిరకాల వివరాలు సేకరిస్తున్న నేపథ్యంలో భవిష్యత్‌లో తమను ఏమైనా ఇబ్బందికి గురిచేస్తుందేమోనని అనేక మంది భయపడి వాస్తవ వివరాలు కూడా చెప్పలేదు. సిబ్బంది వచ్చే సమయంలో మరికొంతమంది ఇళ్లలో అందుబాటులో లేకుండా పోయారు. స్మార్ట్ పల్స్ సర్వే నమోదు శాతం తక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ తప్పనిసరిగా తమ వివరాలు నమోదు చేయించుకోకుంటే భవిష్యత్‌లో ప్రభుత్వ పథకాలను పొందే అర్హత కోల్పోతారంటూ ప్రకటనలు రావడంతో ఎట్టకేలకు ప్రజలు ముందుకు వచ్చి తమ వివరాలను తెలియజేశారు. రూ.1.70 కోట్లు విడుదల : జిల్లాలో నిర్వహించిన స్మార్ట్ పల్స్ సర్వేకు సంబంధించి ప్రభుత్వం ఇటీవల కోటీ 70 లక్షల రూపాయలు విడుదల చేసింది. దశలవారీగా నిధులు విడుదల చేయడం వల్ల కొంత గ్యాప్ వచ్చింది. ప్రస్తుతం పూర్తి స్థాయిలో నిధులు విడుదల కావడంతో సిబ్బందికి రెమ్యునరేషన్ అందించేందుకు వారి బ్యాంకు ఖాతా నంబర్లను తీసుకుంటున్నాం. త్వరితగతిన వారికి రెమ్యునరేషన్ అందిస్తాం. – నోడల్ అధికారి ఉదయభాస్కర్ -
సర్వేల భారతం!
ఒంగోలు టౌన్: సర్వేల దెబ్బకు సిబ్బందే కాదు.. ప్రజలు కూడా బిత్తరపోతున్నారు. స్మార్ట్ పల్స్ సర్వే, ఓటర్ల సర్వేకు తోడు ఇప్పుడు ఉద్యోగ, నిరుద్యోగులకు సంబంధించిన సర్వే కూత మోగనుంది. ఎంపిక చేసిన 32 మండలాల్లో ఆదివారం నుంచి సర్వే ప్రక్రియ సాగనుంది. తహసీల్దార్ కార్యాలయాల్లోని సహాయ గణాంకాధికారుల ఆధ్వర్యంలో ముఖ్య ప్రణాళిక విభాగం అధికారులు పర్యవేక్షిస్తారు. గణన ఇలా.. ప్రతి గ్రామంలో 300 గృహాల్లో సర్వే చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఒక్కో కుటుంబంలో ఎంతమంది సభ్యులున్నారు, వారిలో 15 సంవత్సరాలకు పైబడినవారు ఎంతమంది, అందులో ఉద్యోగులు, నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారనే వివరాలు సేకరించనున్నారు. కార్మికుల్లో అయితే స్కిల్డ్ ఎంతమంది, అన్ స్కిల్డ్ ఎంతమంది అనే వివరాలను కూడా సేకరించనున్నారు. జనవరి నాటికి సర్వే ప్రక్రియను పూర్తిచేసి సంబంధిత వివరాలను ఛండీగడ్‌లోని లేబర్ బ్యూరోకు నివేదిస్తారు. దీనిని ఆధారం చేసుకొని జిల్లాల వారీగా ఎంతమంది నిరుద్యోగులున్నారు, వారిలో నైపుణ్యం కలిగినవారు ఎంత మంది ఉన్నారు, ఏరకమైన ఉపాధి కల్పించాలన్న దానిపై చర్చించి నిరుద్యోగ సమస్యను నిర్మూలించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మండలాలివే.. ఒంగోలు, పుల్లలచెరువు, పీసీపల్లి, దొనకొండ, సింగరాయకొండ, మార్టూరు, అద్దంకి, పొదిలి, జే పంగులూరు, మార్కాపురం, నాగులుప్పలపాడు, మర్రిపూడి, కొమరోలు, చినగంజాం, చీరాల, వేటపాలెం, కందుకూరు, కంభం, లింగసముద్రం, ఇంకొల్లు, పెద్దారవీడు, తర్లుపాడు, దర్శి, చీమకుర్తి, జరుగుమల్లి, సంతనూతలపాడు, గిద్దలూరు, యర్రగొండపాలెం, వలేటివారిపాలెం, బల్లికురవ, ఉలవపాడు, కనిగిరి మండలాలను సర్వే కోసం ఎంపిక చేశారు. పకడ్బందీగా నిర్వహించాలి: డిప్యూటీ డైరెక్టర్ జిల్లాలో ఉద్యోగ, నిరుద్యోగులకు సంబంధించిన సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని ప్రణాళిక విభాగం డిప్యూటీ డైరెక్టర్ జి. భరత్‌కుమార్ ఆదేశించారు. సర్వేకు సంబంధించి ఎంపిక చేసిన మండలాల సహాయ గణాంకాధికారులతో శనివారం స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో సమావేశం నిర్వహించారు. ఈ సర్వే ద్వారా జిల్లాలో ఎంతమంది ఉద్యోగులున్నారు? ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో తెలుస్తుంది. అలాగే ఉపాధి కల్పించే విషయమై ప్రత్యేక చర్యలు తీసుకోవచ్చని చెప్పారు. డిప్యూటీ ఎస్ఓ సీహెచ్ ఆదిశేషు, ప్రణాళిక విభాగం ఏడీ ఉమాదేవి, ఎస్ఓ రఘు పాల్గొన్నారు. -
ముగింపునకు వచ్చిన ప్రజాసాధికార సర్వే
కర్నూలు(అగ్రికల్చర్): దాదాపు ఆరు నెలలుగా సాగుతున్న ప్రజాసాధికార సర్వే ముగింపు దశకు వచ్చింది. సర్వే పరిధిలోకి రాని వారి గురించి తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు కారణాలు వివరిస్తున్నారు. జనాభా లెక్కల(2011) ప్రకారం జిల్లాలో 40,33,180 మంది ఉన్నారు. అయితే 35,46,235 మందిని సర్వే చేశారు. సర్వేకు 4,86,945 మంది దూరంగా ఉన్నారు. వీరిని సర్వే చేయకపోవడానికి తహసీల్దార్లు, మున్సిపల్ కమీషనర్లు కారణాలు తెలుపుతున్నారు. 25072 మంది మరణించినట్లు, 1,99,716 మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినట్లు.. 33456 మంది మహిళలు వివాహాలు చేసుకొని అత్తింటికి వెళ్లినట్లు.. ప్రజాసాధికార సర్వేకు 6959 మంది ఇష్టం చూపనటున్ల.. 21,713 ఇళ్లకు తాళం వేసి నట్లు.. 14,258 మందికి ఆధార్ నంబర్లు లేవని స్పష్టం చేస్తున్నారు. అలాగే 12,460 మందికి సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి. ఇంకా 173041 మందికి సంబందించిన వివరాలు రాలేదు. -
12 నాటికి 22 వేల మంది వివరాలు సేకరించాలి
వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ ఆదేశం ఒంగోలు టౌన్ : స్మార్ట్ పల్స్ సర్వేకు సంబంధించి జిల్లాలో పెండింగ్‌లో ఉన్న 22 వేల మంది వివరాలు ఈ నెల 12వ తేదీ నాటికి సేకరించాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్ ఆదేశించారు. రెవెన్యూ డివిజనల్ అధికారులు, మునిసిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో గురువారం స్థానిక సీపీఓ వీడియో కాన్ఫరెన్స హాలు నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో చిన్న పిల్లల వివరాలు స్మార్ట్ పల్స్ సర్వేలో నమోదు కావడం లేదని తన దృష్టికి వచ్చిందన్నారు. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారుల్లో కొంతమంది వివరాలు స్మార్ట్ పల్స్ సర్వేలో నమోదు కానట్లు తెలిసిందని చెప్పారు. ఆధార్ నంబర్లు లేని కారణంగా మరి కొంతమంది వివరాలు నమోదు కాలేదన్నారు. ఆధార్ కార్డులు లేని వారి కోసం గ్రామాల వారీగా మేళాలు నిర్వహించి యుద్ధప్రాతిపదికన వాటిని అందించాలని ఆదేశించారు. ఆధార్ నంబర్లు పొందిన వెంటనే వారి వివరాలు స్మార్ట్ పల్స్ సర్వేలో నమోదు చేయాలని సూచించారు. అదేవిధంగా చనిపోయినవారి వివరాలు సర్వే నుంచి తొలగించాలని ఆదేశించారు. గ్రామాలు, వార్డుల వారీగా స్మార్ట్ పల్స్ సర్వేకు సంబంధించిన జాబితాలను క్రాస్ చెక్ చేసుకోవాలని సూచించారు. జిల్లాలో వందశాతం స్మార్ట్ పల్స్ సర్వే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్మార్ట్ పల్స్ సర్వే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని జారుుంట్ కలెక్టర్ హరిజవహర్‌లాల్ హెచ్చరించారు. వీడియో కాన్ఫరెన్సలో ఇన్చార్జి జిల్లా రెవెన్యూ అధికారి భక్తవత్సలరెడ్డి, స్మార్ట్ పల్స్ సర్వే జిల్లా నోడల్ అధికారి ఉదయభాస్కర్, ఒంగోలు ఆర్డీఓ శ్రీనివాసరావు, ఒంగోలు మునిసిపల్ కార్పొరేషన్ అసిస్టెంట్ కమిషనర్ ప్రమీల పాల్గొన్నారు. -
ప్రజాసాధికార సర్వేను నేటితో ముగించండి
కర్నూలు(అగ్రికల్చర్): ప్రజాసాధికార సర్వేను ఎట్టి పరిస్థితుల్లోను నేటితో(30వ తేదీ) ముగించాలని రాష్ట్ర భూ పరిపాలన శాఖ ముఖ్య కమిషనర్ అనిల్‌చంద్ర పునీత తెలిపారు. మంగళవారం విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీసీఎల్ఏ మాట్లాడుతూ.. ప్రజా సాధికార సర్వేలోకి రాని వారు ఏఏ కారణాలతో దూరంగా ఉన్నారో రాతపూర్వకంగా తెలపాలన్నారు. ఎన్యూమరేటర్ల నుంచి తహశీల్దార్లు, తహసీల్దార్ల నుంచి జిల్లా కలెక్టర్లు సర్వే పరిధిలోకి రాని వారి పూర్తి సమాచారం సేకరించాలన్నారు. సర్టిఫికెట్లు తీసుకోవడంతో సర్వే ముగిసినట్లు అవుతుందన్నారు. సర్వే విభాగానికి సంబంధించి ఎఫ్‌ఎంబీల డిజిటలైజేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇందులో తగిన నాణ్యత ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. తహసీల్దార్ కార్యాలయ భవనాల నిర్మాణాలకు నిధులు విడుదల చేశామని.. వీటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కర్నూలు నుంచి జేసీ హరికిరణ్ మాట్లాడుతూ... భూసేకరణకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో అప్పిలేట్ అథారిటీని ఏర్పాటు చేయాలని, అప్పుడే రైతులు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. సీసీఎల్ఏ స్పందిస్తూ అప్పిలేట్ అథారిటీ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్ఓ గంగాధర్‌గౌడు, సర్వే ఏడీ చిన్నయ్య, సెక్షన్ సూపరింటెండెంట్లు ఈరన్న, భాగ్యలక్ష్మి, రామాంజనమ్మ, ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు. -
స్మార్ట్ పల్స్ సర్వే పూర్తి చేయాలి
కలెక్టర్ ముత్యాలరాజు నెల్లూరు(అర్బన్): ఈ నెలాఖరు నాటికి జిల్లాలో స్మార్ట్ పల్స్ సర్వేను పూర్తి చేయాలని కలెక్టర్ ముత్యాలరాజు అధికారులను ఆదేశించారు. సర్వేకి సంబంధించిన విషయాలపై ఆయన కలెక్టర్ బంగ్లాలో అధికారులతో సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 2011 జనాభ లెక్కల ప్రకారం జిల్లాలో 29.52 లక్షల మందికి సర్వే చేయాల్సి ఉండగా 23.86లక్షల మందికి సంబంధించి సర్వే పూర్తి చేసినట్లు తెలిపారు. నెల్లూరు కార్పొరేషన్లో 5.84 లక్షలమందికి గాను 3.34 లక్షల మందికి సర్వే పూర్తి చేశామన్నారు. రూరల్‌లో 90 శాతం అర్బన్‌లో 60శాతం సర్వే పూర్తి చేశామన్నారు. ఎన్యూమరేటర్లు సర్వే కోసం వచ్చినప్పుడు ఆధార్, రేషన్ కార్డు, ఆస్తిపన్ను, ఓటరు కార్డు, కరెంటు బిల్లు, డ్రైవింగ్ లైసెన్సు, వాహన రిజిస్ట్రేషన్, గ్యాసు, పట్టాదారుపాసు పుస్తకాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఎన్యూమరేటర్లు రాని పక్షంలో టోల్ ఫ్రీ 1800 425 2499కు ఫోన్ చేయాలని సూచించారు. సర్వే పూర్తయితే సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. -
మూడు రోజుల్లో ‘సర్వే’ పూర్తిచేయాలి
300మంది రెవెన్యూ సిబ్బందితో స్పెషల్ టీం ఏర్పాటు పల్స్సర్వేపై కలెక్టర్ అసహనం నెల్లూరు, సిటీ: నగర పాలక సంస్థ పరిధిలో జరుగుతున్న ప్రజాసాధికారిక సర్వే పై కలెక్టర్ మత్యాలరాజు అసహనం వ్యక్తం చేశారు. మూడు రోజుల్లో సర్వేను పూర్తిచేయాలని, అధనంగా 46మండలాల నుంచి 300 మంది స్పెషల్ టీంలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్పొరేషన్ కార్యాలయంలో బుధవారం పల్స్‌సర్వే అధికారులు, సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జాయింట్‌కలెక్టర్ ఇంతియాజ్, ఆత్మకూరు ఆర్డీఓ వెంకటేశ్వరరావు, కమిషనర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ముత్యాలరాజు మాట్లాడుతూ ఇప్పటి వరకు 4లక్షల మందికి సర్వే చేపట్టడం జరిగిందని, మరో 3లక్షలు మంది సర్వేలో నమోదు చేయాల్సి ఉందన్నారు. అందుకుగాను స్పెషల్ టీంను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కమిషనర్ వెంకటేశ్వర్లును ఎక్కడికి వెళ్లకుండా అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో పల్స్‌సర్వే అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
స్మార్ట్ పల్స్ సర్వే పూర్తి చేయండి
నెల్లూరు(పొగతోట): స్మార్ట్ పల్స్ సర్వే త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని సీసీఎల్ఏ అనిల్‌చంద్రపునేఠ జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం విజయవాడ నుంచి జిల్లా అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీసీఎల్ఏ మాట్లాడారు. వంద శాతం సర్వే పూర్తి చేసి వివరాలు అప్లోడ్ చేయాలన్నారు. ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకోవాలని తెలిపారు. ఈ కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ మహమ్మద్‌ఇంతియాజ్, డీఆర్ఓ మార్కండేయులు, ఆత్మకూరు ఆర్డీఓ ఎంవీ రమణ పాల్గొన్నారు. -
స్మార్ట్ పల్స్ సర్వేను పూర్తి చేయండి
నెల్లూరు(పొగతోట): స్మార్ట్ పల్స్ సర్వేను నిర్దేశించిన సమయంలో పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని సీసీఎల్ఏ అనిల్‌చంద్రపునేట జిల్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం విజయవాడ నుంచి జిల్లా అ«ధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. పేర్లు నమోదు చేసుకోని ప్రజలకు అవగాహన కలిగేలా ప్రచారం నిర్వహించాలన్నారు. ఇప్పటి వరకు 72 శాతం మాత్రమే సర్వే పూర్తి అయిందన్నారు. గ్రామాల్లో లేని వారి పేర్లు నమోదు చేసుకుని, వారి కోసం ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రత్యేక ప్రాంతాల్లో ఎన్యూమరేటర్లను అందుబాటులో ఉంచి పేర్లు నమోదు చేయాలని తెలిపారు. ఈ కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ ఏ మహమ్మద్‌ఇంతియాజ్, డీఆర్ఓ మార్కండేయులు, ఆత్మకూరు ఆర్డీఓ ఎంవీ రమణ పాల్గొన్నారు. -
31లోపు సర్వే పూర్తి చేయండి
జేసీ ఇంతియాజ్ నెల్లూరు(పొగతోట): ప్రజా సాధికార సర్వే (స్మార్ట్ పల్స్ సర్వే)ను ఈ నెల 31వ తేదీలోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం తన చాంబర్లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో జేసీ మాట్లాడారు. ప్రజలందరూ 31వ తేదీలోపు తమ పేర్లను సర్వేలో నమోదు చేయించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్మార్ట్ పల్స్ సర్వేలో పేర్లు నమోదు చేయించుకున్నందు వలన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సమగ్రంగా పొందవచ్చునని తెలిపారు. 31వ తేదీలోపు పేర్లు నమోదు చేసుకోని వారి కోసం ప్రత్యేక ప్రాంతాలను ఏర్పాటు చేస్తామన్నారు. నవంబర్ 1, 2 తేదీల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెంటర్లలో వారు పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. పేర్లు నమోదు కాని వారు కేంద్రాలకు వచ్చి కుటుంబ సభ్యుల వివరాలు అందజేయాలని తెలిపారు. అంతకుముందు ప్రజా సాధికార సర్వే, భూ సమస్యలు, ప్రభుత్వ భూముల పరిరక్షణ తదితర అంశాలపై సీసీఎల్ఏ అనిల్‌చంద్రపునేట జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. -
వేగవంతంగా స్మార్ట్ పల్స్ సర్వే
జేసీ ఇంతియాజ్ నెల్లూరు(పొగతోట): స్మార్ట్ పల్స్ సర్వేను వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ ఆదేశించారు. కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాల్లో వివిధ శాఖల అధికారులు, సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి నెలాఖరులోపు సర్వేను పూర్తి చేయాలని సూచించారు. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో 2.6 లక్షల మందికి సంబంధించిన సర్వేను పూర్తి చేయాల్సి ఉందని, సర్వేపై నిత్యం సీఎం టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించి సమాచారాన్ని తెలుసుకుంటున్నారన్నారు. సర్వేను పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సర్వేలో ఈకేవైసీ సమాచారాన్ని సేకరించాలని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో 95 శాతం సర్వే పూర్తయిందని, పట్టణ ప్రాంతాల్లో వంద శాతం పూర్తి చేయాలని సూచించారు. సర్వే పూర్తయ్యేంత వరకే సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లను రిలీవ్ చేశామని, సంబంధిత శాఖ అధికారులు దృష్టిలో ఉంచుకొని సిబ్బందిని ఒత్తిడి పెట్టవద్దని తెలిపారు. కార్పొరేషన్ కమిషనర్ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. పోలింగ్ కేంద్రాల వివరాలు ఆన్లైన్లో.. పోలింగ్ కేంద్రాల వివరాలను ఆన్లైన్లో పొందుపర్చేలా చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. గోల్డెన్ జూబ్లీ హాల్లో తహశీల్దార్లు, డీటీలు, కంప్యూటర్ ఆపరేటర్లకు నిర్వహించిన శిక్షణలో ఆయన మాట్లాడారు. పోలింగ్ కేంద్రానికి వెళ్లే దారి, కేంద్రంలో సిబ్బంది ఉండే తీరు, పోలింగ్ ప్రక్రియ, తదితర వివరాలను మ్యాప్‌ల ద్వారా ఆన్లైన్లో పొందుపర్చాలని సూచించారు. ఫొటోలతో ఓటర్ల జాబితాలను నియోజకవర్గాల వారీగా సిద్ధం చేయాలన్నారు. జాబితాలను సిద్ధం చేసి పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచురించాలని తెలిపారు. అనంతరం పోలింగ్ కేంద్రాల మ్యాప్‌ల అప్లోడింగ్పై శిక్షణ ఇచ్చారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయ ప్రాజెక్ట్ మేనేజర్ చిరంజీవి, వివిధ మండలాల తహశీల్దార్లు, డీటీలు, కంప్యూటర్ ఆపరేటర్లు పాల్గొన్నారు. -
స్మార్ట్ సర్వే త్వరితగతిన పూర్తిచేయాలి
నెల్లూరు (పొగతోట) : ప్రజాసాధికర సర్వే (స్మార్ట్ పల్స్ సర్వే)ను త్వరితగతిన పూర్తిచేఽయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్ జిల్లా అధికారులను ఆదేశించారు. గురువారం విజయవాడ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో సర్వే జాప్యం జరుగుతోందన్నారు. నెల్లూరు జిల్లాలో గత నెలలో మూడుశాతం మాత్రమే సర్వే జరిగిందన్నారు. నీరు–చెట్టు, వనం–మనం, ప్రకృతి పిలుస్తోంది తదితర కార్యక్రమాలను పటిష్టంగా అమలుజేయాలని సూచించారు. దోమలపై దండయాత్ర కార్యక్రమాన్ని కొనసాగించాలన్నారు. కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు గుంటూరు కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఏ మహమ్మద్ ఇంతియాజ్, కార్పొరేషన్ కమిషనర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
పల్స్ సర్వే నెలాఖరులోపు పూర్తి చేయండి
నెల్లూరు(పొగతోట): స్మార్ట్ పల్స్ సర్వే(ప్రజా సాధికార సర్వే) ఈ నెలాఖరులోపు పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం విజయవాడ నుంచి జిల్లా అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం మాట్లాడారు. సర్వేలో ప్రజల ఫింగర్ ఫ్రింట్స్ సేకరించాలన్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సర్వే సక్రమంగా నిర్వహించాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందుతున్న లబ్ధిదారుల వివరాలు సర్వేలో నమోదు చేయాలన్నారు. చంద్రన్న బీమా పథకం పక్కగా అమలు చేయాలన్నారు. కలెక్టర్ ముత్యాలరాజు మాట్లాడుతూ జిల్లాలో 46 మండలాలు ఉన్నాయని, 32 మండలాల్లో వంద శాతం సర్వే పూర్తి చేసినట్లు తెలిపారు. కాన్ఫరెన్స్‌లో విక్రమ సింహపురి వైస్ చాన్స్‌లర్ వీరయ్య, జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్, ఆర్డీఓలు పాల్గొన్నారు. అధికారులతో జేసీ సమావేశం ప్రజా సాధికార సర్వే పై వివిధ శాఖల అధికారులతో జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ తన చాంబర్లో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ నెల 24వ తేదీలోపు సర్వే వంద శాతం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో సీపీఓ పీబీకే మూర్తి, గూడూరు సబ్ కలెక్టర్ వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు. -
ప్రజాసాధికార సర్వేపై జేసీ అసంతృప్తి
అనంతపురం న్యూసిటీ : జిల్లాలో ప్రజాసాధికార సర్వే 50 శాతం మాత్రమే పూర్తి చేయడంపై జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెల 10లోపు పూర్తిచేయాలని రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహశీల్దార్లను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులతో ఆయన మాట్లాడారు. సర్వేలో తప్పులు సరిచేసిన వారిలో కదిరి మొదటి స్థానంలో, అనంతపురం చివరి స్థానంలో ఉందన్నారు. చంద్రన్న బీమా 87 శాతం పూర్తి అయ్యిందన్నారు. బీమా చేయడంలో ధర్మవరం మొదటి స్థానంలో ఉందన్నారు. జిల్లాలోని 126 గ్రా మాలను ఓడీఎఫ్‌గా ప్రకటించాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. -
పల్స్ సర్వేపై లెక్క తేల్చండి!
ఒంగోలు టౌన్: ‘జిల్లాలో స్మార్ట్ పల్స్ సర్వేకు సంబంధించి ఐదు లక్షల జనాభా లెక్కలు తేలడం లేదు. ఒక్క ఒంగోలు నగరం, ఒంగోలు రూరల్æ ప్రాంతంలోనే 94 వేల మంది లెక్కతేలాల్సి ఉంది. వీరంతా ఎక్కడ తప్పిపోయారో గుర్తించండి. ఈనెల 15వ తేదీలోపు స్మార్ట్ పల్స్ సర్వే పూర్తి చేయాలి’ అని జిల్లా కలెక్టర్ సుజాతశర్మ ఆదేశించారు. సోమవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు నియోజకవర్గ సమన్వయ అధికారులు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, మునిసిపల్ కమిషనర్లు,మండల అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 70 శాతం మాత్రమే స్మార్ట్ పల్స్ సర్వే పూర్తయిందని అసంతృ ప్తి వ్యక్తం చేశారు. సీఎస్‌పురం, దోర్నాలతో కలుపుకొని మొత్తం 20 మండలాల్లో 60 నుంచి 70శాతం వెనుకబడి ఉన్నాయన్నా రు. కొన్ని ఇళ్లు పూర్తి స్థాయిలో సర్వే చేయలేదని, కొంతమంది సభ్యులనే సర్వే చేసినట్లు తెలుస్తోందన్నారు. సర్వేలో వెనుకబడిన 20 మండలాలకు చెందిన అధికారులు, నియోజకవర్గ సమన్వయ అధికారులకు ఈనెల 4వ తేదీ ప్రత్యేక సమావేశం నిర్వహించి సమస్యలు లోతుగా విశ్లేషించి పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్‌కు సూచించారు. సమన్వయంతో సమస్య పరిష్కరించండి.. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉన్న జనాభా కంటే సర్వే తక్కువ చేయడానికి వీలులేదని కలెక్టర్ స్పష్టం చేశారు. కొన్ని ఇళ్లు మూతవేయడం వల్ల సర్వే చేయలేకపోయి ఉండవచ్చని, అంతా కలిసి సమన్వయంతో లెక్కల తేడాను పరిష్కరించాలని ఆదేశించారు. 2011 తరువాత జన్మించిన పిల్లల వివరాలు కూడా సర్వే ద్వారా నమోదు చేయాల్సి ఉందన్నారు. అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రా లు, వసతి గృహాల్లోని పిల్లల వివరాలు సర్వేలో నమోదు కావాలని ఆదేశించారు. 2011తరువాత కొత్తగా ఏర్పాటైన మురికివాడలు, కాలనీలకు వెళ్లి సర్వే నమోదు చేయాలన్నారు. ప్రతిరోజూ సర్వేపై సమీక్షించాలని, ఈనెల 6,10,13తేదీల్లో ప్రత్యేకంగా సర్వేపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పురోగతి సమీక్షించనున్నట్లు స్పష్టం చేశారు. గృహ నిర్మాణం వేగవంతం చేయాలి.. ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణం కింద నియోజకవర్గానికి 1250 గృహాలు మంజూరు చేయాల్సి ఉందని కలెక్టర్ వెల్లడించారు. ఇప్పటివరకు 6,372 మంది లబ్ధిదారులను గుర్తించామన్నారు. ఎస్టీ, ఎస్టీ, మైనార్టీ రిజర్వేషన్‌ను పాటిస్తూ మిగిలిన ప్రతిపాదనలను జన్మభూమి కమిటీల ద్వారా గ్రామసభలు నిర్వహించి పంపాలని సూచించారు. గృహ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇందుకోసం నియోజకవర్గం, డివిజన్ల వారీగా సమగ్ర డేటా సేకరించాలన్నారు. జిల్లాలో 5వేల ఎకరాల్లో మొక్కలు నాటాల్సి ఉండగా, ఇప్పటివరకు 1207 ఎకరాల్లో గుంతలు తవ్వి 527 ఎకరాల్లో నాటడం జరిగిందన్నారు. ఈనెల 15వ తేదీలోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. గుంతలు తవ్విన వాటికి వెంటనే బిల్లులు చెల్లించాలని, ఎలాంటి జాప్యం చేయరాదని స్పష్టం చేశారు. జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాల్లో వేటపాలెం, బల్లికురవ మండలాలు చాలా వెనుకబడి ఉన్నాయని, ప్రత్యేక శ్రద్ధ వహించి పురోగతి సాధించాలని ఆదేశించారు. ఈనెల 10వ తేదీ మరలా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తానని, ఆలోపు మంచి ప్రగతి కనబరచాలన్నారు. జిల్లాలో బోరు బావుల్లో రీ చార్జింVŠ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్, జాయింట్ కలెక్టర్–2 ఐ ప్రకాష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
154 మంది ఎన్యూమరేటర్ల షోకాజ్ నోటీసులు
కర్నూలు(అగ్రికల్చర్): ప్రజాసాధికార సర్వే పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న పలువురు ఎన్యూమరేటర్లకు జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కర్నూలు జిల్లా సర్వేలో రాష్ట్రంలోనే వెనుకబడి ఉండటంతో కలెక్టర్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వివిధ జిల్లాల్లో 80 శాతంపైగా సర్వే పూర్తయింది. జిల్లాలో మాత్రం 60 శాతం మాత్రమే ఉంది. దీంతో తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్ల నుంచి సర్వేను నిర్లక్ష్యం చేస్తున్న ఎన్యూమరేటర్ల వివరాలను తీసుకున్నారు. ఏకంగా 154 మంది ఎన్యూమరేటర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వీరిలో పలువురు సర్వేకు గైర్హాజర్ కాగా మరికొందరు తూతూ మంత్రంగా సర్వేకు హాజరువుతున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమం అయిన ప్రజా సాధికార సర్వేను నిర్లక్ష్యం చేస్తున్నందుకు ఎందుకు చర్యలు తీసుకోరాదో తెలుపాలని షోకాజ్ నోటీసులు ఇచ్చారు. తొలుత నంద్యాల మున్సిపాలిటీలో 18 మందికి, ఆత్మకూరు నగరపంచాయతీలో 6 మంది, వివిధ మండలాల్లో 13 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తాజాగా కర్నూలు నగరపాలక సంస్థలో 31 మంది షోకాజ్ నోటీసులు ఇచ్చారు. కర్నూలు రెవెన్యూ డివిజన్లో 40 మందికి, నంద్యాల డివిజన్లో 8 మంది, ఆదోని రెవెన్యూ డివిజన్లో 38 మందికి షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. -
ఎన్యూమరేటర్లపై దాడి
నెల్లూరు(పొగతోట): ప్రజా సాధికార సర్వే నిర్వహిస్తున్న ఎన్యూమరేటర్లపై నెల్లూరు బాలాజీనగర్ ప్రజలు కొందరు దాడి చేశారని, దీంతో సర్వే నిలిపివేశామని బాధితులు శుక్రవారం జేసీ ఇంతియాజ్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఏపీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌వీఆర్‌సీ శేఖర్‌రావు మాట్లాడుతూ ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన లేని కారణంగా ఎన్యూమరేటర్లు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారని తెలిపారను. బాలజీనగర్‌లో సర్వేకు వెళ్లిన ఎన్యూమరేటర్లు ఐడీ పత్రాలు చూపించండని, కులం చెప్పమని స్థానికులను అడిగితే మీకేందుకు చెప్పాలని ప్రజలు సిబ్బందిని ఎదురు ప్రశ్నిస్తున్నారన్నారు. దీంతో సర్వే చేయడానికి ఎన్యూమరేటర్ల భయపడుతున్నారన్నారు. సర్వేపై ప్రజల్లో ఉన్న అపోహలను పొగోట్టేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కోరారు. ఆటోలో ప్రచారం నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటామని జేసీ ఎన్యూమరేటర్లకు తెలిపారు. సర్వే నిలిపివేయకుండా కొనసాగించాలని ఎన్యూమరేటర్లకు సూచించారు. -
స్మార్ట్ పల్స్ సర్వే 60 శాతం పూర్తి
జేసీ ఇంతియాజ్ నెల్లూరు(పొగతోట): ప్రజా సాధికార సర్వే(స్మార్ట్ పల్స్ సర్వే) ఇప్పటి వరకు జిల్లాలో 60 శాతం పూర్తయిందని జేసీ ఇంతియాజ్ పేర్కొన్నారు. శుక్రవారం తన చాంబర్లో స్మార్ట్ పల్స్ సర్వేపై వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో జేసీ మాట్లాడారు. జిల్లాలో 30 లక్షలకు పైగా జనాభా ఉన్నారన్నారు. 1976 మంది ఎన్యూమరేటర్ల ద్వారా ఇప్పటి వరకు 16.59 లక్షల జనాభాకు సంబంధించి సర్వే పూర్తి చేసినట్లు తెలిపారు. సర్వేపై ఆటోల ద్వారా ప్రచారం కల్పించి ఈ నెలఖారుకు వంద శాతం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సర్వే వలన ప్రజలకు ఎటువంటి నష్టం జరగదన్నారు. -
పల్స్ సర్వేపై అసంతృప్తి
సమస్యలు పరిష్కరించడంలేదని బాయ్‌కాట్ నెల్లూరు సిటీ : పల్స్ సర్వేలో ఎదురవుతున్న పలు ఇబ్బందులను ఉన్నతాధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా ఫలితం లేదని, సర్వే ఎన్యూమరేటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. నెల్లూరులోని కార్పొరేషన్ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఎన్యూమరేటర్లతో మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ చిరంజీవి, రెవెన్యూ ఆఫీసర్ గిరిజలు సమావేశం నిర్వహించారు. కొందరు ఎన్యూమరేటర్లు ఫీల్డ్‌లో ఎదురవుతున్న సమస్యలను వారికి చెప్పారు. అధికారులు జేసీ దృష్టికి తీసుకెళ్తామన్నారు. దీంతో ఎన్యూమనేటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికే తాము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, సమస్యలను పరిష్కరించడంలేదని మండిపడ్డారు. సర్వేకి వెళ్లిన సమయంలో సంబంధిత కుటుంబసభ్యులు అందుబాటులో లేకపోవడం, పత్రాలు సరిగా లేకపోవడంతో ఆలస్యమవుతుందన్నారు. అయితే ఉన్నతాధికారులు మాత్రం ఏ మాత్రం పట్టించుకోకుండా ఒత్తిళ్లు చేయడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. అనంతరం సమావేశాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు. -
స్మార్ట్ సర్వేలో జిల్లాకు ప్రథమస్థానం
తణుకు టౌన్ : స్మార్ట్ పల్స్ సర్వేలో రాష్ట్రం మొత్తంలో జిల్లా ప్రథమస్థానంలో నిలుస్తుందని జిల్లా జాయింట్ కలెక్టర్ పి.కోటేశ్వరరావు చెప్పారు. మంగళవారం తణుకు తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాసాధికారిత సర్వే సమీక్ష సమావేశంలో ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఇప్పటివరకూ 85 శాతం పూర్తి చేసినట్టు తెలిపారు. ఈ నెలాఖరు నాటికి సర్వేను పూర్తి చేస్తున్నట్టు లె లిపారు. సర్వే సిబ్బంది దర్శించిన గృహాల నుంచి ఇంటి నివాసితుల బయోమెట్రిక్ వివరాలను సేకరిస్తున్నట్టు తెలిపారు. కుటుంబంలో అందుబాటులో ఉన్న వారి వివరాలు సేకరించి, అనంతరం అందుబాటులో లేని వారి వివరాలను కూడా సేకరిస్తామన్నారు. జిలాల్లో మొత్తం 40 లక్షల జనాభా నుంచి 26 లక్షల నుంచి బయోమెట్రిక్ వివరాలు తీసుకున్నట్టు తెలిపారు. జిల్లాలో 2 లక్షల రేషన్ కార్డులకు గ్యాస్ కనెక్షన్లు అందించాల్సిందిగా గుర్తించినట్టు చెప్పారు. వాటిలో రేషన్ షాపుల ద్వారా కిరోసిన్ తీసుకునే వారిని బట్టి షాపుల నుంచి వారికి దరఖాస్తులను అందజేసినట్టు తెలిపారు. -
సాధికార సర్వే 40 శాతం పూర్తి
జేసీ ఇంతియాజ్ అహ్మద్ మనుబోలు: జిల్లాలో సాధికార సర్వే ఇప్పటి వరకు 40 శాతమే పూర్తయిందని జేసీ ఇంతయాజ్ అహ్మద్ తెలిపారు. ఆదివారం మనుబోలు దళితవాడలో జరుతున్న స్మార్ట్ పల్స్ సర్వేను ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ జూలై 12 నుంచి జిల్లాలో సర్వే నిర్వహిస్తున్నామన్నారు. మొదట్లో చాలా ఇబ్బందులు తలెత్తినప్పటికీ ప్రస్తుతం అన్ని సర్ధుకున్నాయన్నారు. జిల్లా వ్యాప్తంగా పల్స్ సర్వేలో 2,198 మంది ఎన్యూమరేటర్లు పని చేస్తున్నారని తెలిపారు. ఇప్పటి వరకు 28 వేల కుటుంబాలను సర్వే చేసినట్లు తెలిపారు. ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా సర్వేకు ప్రజలు పూర్తిగా సహకరించాలని కోరారు. రోజుకు 30 కుటుంబాలను సర్వే చేస్తున్న పంచాయతీ కార్యదర్శి గరుడయ్య, వీఆర్వో నాగార్జునరెడ్డిలను అభినందించారు. చెట్ల పంపకంతోనే కాలుష్య నివారణ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి చెట్లు పెంచడం ద్వారా వాతావరణ కాలుష్యాన్ని నివారించవచ్చని జేసీ ఇంతయాజ్ అహ్మద్ అన్నారు. కుడితిపల్లిలో వనం–మనం కార్యక్రమంలో భాగంగా ఆయన మొక్కలు నాటారు. ఆయన మాట్లాడుతూ నానాటికి పెరిగిపోతున్న కాలుష్యాన్ని నివారించేందుకు అందరూ మొక్కలు నాటాలన్నారు. ఆయన వెంట ఎంపీడీఓ హేమలత, ఆర్ఐ కవిత ఉన్నారు. -
స్మార్ట్ సర్వేలో 10.52 లక్షల మంది వివరాల సేకరణ
ఏలూరు (మెట్రో) : జిల్లాలో ప్రజాసాధికార సర్వే ద్వారా 10.52 లక్షల మంది ప్రజల వివరాలను సేకరించామని జాయింట్ కలెక్టర్ పి.కోటేశ్వరరావు రాష్ట్ర సీసీఎల్ అనిల్‌చంద్ర పునీత్‌కు తెలిపారు. ప్రజాసాధికారత సర్వే, ప్రభుత్వ ఫైల్స్ పరిష్కారం, భూమి కన్వర్షన్ ఛార్జీల వసూళ్లు, ఎల్ఈసీ కార్డుల జారీ తదితర అంశాలపై రాష్ట్ర భూపరిపాలన శాఖ కమిషనర్ అనిల్ చంద్రపునీత్ శుక్రవారం జేసీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ కోటేశ్వరరావు మాట్లాడుతూ స్మార్ట్ సర్వేలో జిల్లా రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలిచిందన్నారు. -
సాంకేతిక సమస్యలు అధిగమించాం
స్మార్ట్ పల్స్ సర్వే జిల్లా ప్రత్యేకాధికారి శ్రీధర్ చంద్రశేఖరపురం(కొడవలూరు): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సాధికార సర్వే ప్రాధమిక దశలో సాంకేతిక సమస్యలు వెన్నాడిన మాట వాస్తవమేనని, అయితే ఆ సమస్యలను అధికమించినట్లు సర్వే జిల్లా ప్రత్యేకాధికారి బి.శ్రీధర్ స్పష్టం చేశారు. చంద్రశేఖరపురంలో జరుగుతున్న ప్రజా సాధికార సర్వేను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ సర్వేకు తొలుత రాష్ట్రమంతా ఒకే సర్వర్ ఉండడం, సిబ్బందికి తగు శిక్షణ లేకపోవడం వల్ల సర్వే మందగించిందన్నారు. అయితే ఈ సమస్యలు ప్రభుత్వం దృష్టికిపోవడంతో జిల్లాకు ఒక సర్వర్ వంతున ఆధునిక పరిజ్ఞానం కలిగిన సర్వర్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీంతో ప్రాధమిక దశలో తలెత్తిన సమస్యలకు కళ్లెం పడి సర్వే ఊపందుకుందని చెప్పారు. సర్వే పూర్తయితే ప్రభుత్వ పాలన సులభతరమవుతుందని చెప్పారు. తొలుత కుటుంబ పూర్తి వివరాలు నమోదయ్యే దాకా సేవ్ కాకపోవడం సమస్యగా ఉండేదని, ఇపుడు ఆ సమస్యను కూడా అధికమించడం జరిగిందన్నారు. సర్వే వల్ల కార్యాలయాల్లో సిబ్బంది అందుబాటులో లేక పాలన స్తంభిస్తుండడం వాస్తవమేనని, కానీ ఒక నెలపాటు ఆ సమస్యను ఎదుర్కోకతప్పదన్నారు. ఆయన వెంట ఆర్డీఓ వెంకటేశ్వర్లు, తహసీల్ధారు రామకృష్ణ, ఏఎస్ఓ శ్రీనివాసులు, వీఆర్వో ఉలవపాటి వెంకటేశ్వర్లు, వీఆర్ఏలు ఉన్నారు.