Street food
-
మయోన్నీస్తో ముప్పే..హెల్దీ ఆల్టర్నేటివ్స్ ఇవిగో!
కలుషితమైన మయోన్నీస్ తెలంగాణాలో విషాదాన్ని నింపింది. ఒకరు మరణం, 15మంది అస్వస్థతకు దారి తీసిన ఉదంతంలో మయోన్నీస్ ఉత్పత్తి, నిల్వ, అమ్మకాలపై తక్షణమే ఒక సంవత్సరం (2025 అక్టోబర్ వరకు) నిషేధం విధించింది. మయోన్నీస్ ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యానికి మేలు కంటే హాని జరిగే అవకాశాలే ఎక్కువ అంటున్నారు ఆహార నిపుణులు. ఈ నేపథ్యంలో మయోన్నీస్ లేదా ‘మాయో’కి ప్రత్యామ్నాయాలు ఏమిటో చూద్దాం రండి!క్రీమీ పాస్తా , ఫ్రెంచ్ ఫ్రైస్, సలాడ్లు, మోమోస్, సాండ్విచ్లు, బ్రెడ్ ఇలా జంక్‌ఫుడ్‌లలో ఈ క్రిమ్ను వేసుకొని రెడీమేడ్‌గా తినేస్తారు. అయితే రోజూ తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు. ఆరోగ్య పరంగా చాలా నష్టాలను తీసుకొస్తుంది. మరీ ముఖ్యంగా శుభ్రత, ఆహార ప్రమాణాలను సరిగ్గా పాటించకపోతే ఒక్కోసారి ప్రాణాలకు ముప్పు తెస్తుంది.మయోన్నీస్ ఎలా తయారు చేస్తారు?మయోన్నీస్ లేదా మాయో క్రీమ్ లా ఉండే సాస్. గుడ్డులోని పచ్చసొనను నూనెతో ఎమల్సిఫై చేయడం ద్వారా తయారు చేస్తారు. దీంట్లో వెనిగర్, నిమ్మరసంకూడా కలుపుతారు.మాయోతో నష్టాలుమయోన్నీస్రోజు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇందులో క్యాలరీలు, కొవ్వు ఎక్కువ. దీన్ని అధికంగా తింటే ఊబకాయం, బెల్లీ ఫ్యాట్ ఖాయం. మయోన్నీస్లో ఒమేగా 6 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. శరీరంలో పేరుకుపోయి కొలెస్ట్రాల్ లెవల్స్ పెరుగుతాయి. దీని వల్ల గుండెపోటు, స్ట్రోక్ వంటి వ్యాధులొచ్చే ప్రమాదం కూడా ఉంది. తలనొప్పి, శరీరం బలహీనంగా అనిపించడం, వికారం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. టేస్టీ అండ్ హెల్దీ ఆల్టర్నేటివ్స్ఆరోగ్యకరమైన, రుచికరమైన కొన్ని ప్రత్యామ్నాయాలను సూచిస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా ప్రోబయోటిక్స్‌లో పుష్కలంగా ఉండే చిక్కటి పెరుగుతో దీన్న తయారు చేసుకోవచ్చు. ఇది గట్ ఆరోగ్యాన్ని మెరుగు పర్చుకోవచ్చు. ఇది కడుపు ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచుతుంది. ప్రోటీన్ , కాల్షియం, గొప్ప మూలం పెరుగు.క్రీమీ టేస్ట్ వచ్చేలా పెరుగుతో పాటు దోసకాయ, పుదీనా, నిమ్మ, వెల్లుల్లి, జీలకర్ర కలుపుకొని వాడుకోవచ్చు. పెరుగు, పుదీనాలో రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలున్నాయి. దోసకాయ, పుదీనాతో అజీర్తికి గుడ్ బై చెప్పవచ్చు. కమ్మటి చిక్కటి పెరుగులోవెల్లుల్లి, నిమ్మ కలుపుకోవచ్చు. వెల్లుల్లి గట్-ఫ్రెండ్లీ ప్రోబయోటిక్స్, రోగనిరోధక శక్తిని పెంచుతుంది అలాగే పెరుగులో వేయించిన జీలకర్ర పొడిని కలుపుకొని కూడా వాడవచ్చు. -
ఫీల్ గుడ్.. స్ట్రీట్ ఫుడ్!
స్ట్రీట్ ఫుడ్ అనగానే ఠక్కున గుర్తొచ్చే ప్లేస్ చార్మినార్. ఎంత రాత్రి అయినా సరే చార్మినార్ దగ్గరికి వెళ్తే చాలు ఎలాంటి ఫుడ్ కావాలంటే అలాంటి ఫుడ్ లాగించేయొచ్చు. మొఘల్ నుంచి నిజాం కాలం వరకూ ఏ రకం ఫుడ్ కావాలన్నా ఇక్కడ దొరుకుతుంది. పత్తర్ కా ఘోష్ చాలా ఫేమస్. ఒక్కసారైనా ఈ వంటకాన్ని టేస్ట్ చేయాలని అనుకుంటారు. హైదరాబాద్ కా ఫేమస్ హలీమ్, షావర్మా, కోవా జిలేబీ, కోవా గులాబ్‌జామ్, షాదూద్ మలాయ్, మాషా అల్లా ఫలూదా, టర్కిష్ మరగ్, సీక్ కబాబ్, ఫిర్నీ, హోటల్ షాబాద్‌లో నాస్టా, ఖట్టి కిచిడీ, కీమా, భాజీ గుర్డా, ఇరానీ చాయ్ ఇలా చెప్పుకొంటూ పోతే జాబితాకు ముగింపే ఉండదు. తెల్లవారుజాము వరకూ ఇక్కడి ఫుడ్ స్టాల్స్ కిటకిటలాడుతుంటాయి. నైట్ లైఫ్‌కి ఐకాన్..నైట్ లైఫ్‌కు హైదరాబాద్ ఐకాన్‌గా మారుతోంది. చాలా ప్రాంతాల్లో లేట్ నైట్ వరకూ ఫుడ్ స్టాళ్లకు అనుమతులు ఇస్తుండటంతో యూత్ కూడా వీకెండ్స్‌లో నైట్ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. నలుగురైదుగురు ఫ్రెండ్స్ కలిసి బైక్‌లు, కార్లలో నగరాన్ని రాత్రి వేళల్లో చుట్టేస్తున్నారు. ఉదయం సమయంలో ట్రాఫిక్‌తో విసిగిపోయిన వారు.. అర్ధరాత్రి ప్రశాంతమైన నగరాన్ని చూస్తూ మైమరిచిపోతున్నారు. మొజంజాహీ మార్కెట్, రాంకీబండి, సికింద్రాబాద్, లోయర్ ట్యాంక్‌బండ్, ఉప్పల్ భగా యత్.. నైట్‌లైఫ్‌కు కేంద్రాలుగా ఉంటున్నాయి. ఇక్కడ దొరికే స్ట్రీట్ ఫుడ్‌ను లొట్టలేసుకుంటూ తింటూ.. ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ లైఫ్‌టైం మెమరీస్ దాచిపెట్టుకుంటున్నారు.ఫుడ్ హబ్‌గా సచివాలయం.. స్ట్రీట్ ఫుడ్ అనగానే ఇప్పటికీ చారి్మనార్ పేరే గుర్తొస్తుంది. కానీ ఇటీవల కాలంలో సచివాలయం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు స్ట్రీట్ ఫుడ్ హబ్‌గా మారాయి. రాత్రి పొద్దుపోయే వరకూ ఇక్కడ ఫుడ్ లవర్స్ రోడ్డు పక్కన దొరికే తినుబండారాలను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో.. విద్యుత్ కాంతుల్లోని సచివాలయం, అమరవీరుల జ్యోతి చుట్టు పక్కల ప్రదేశాలు సందర్శకులతో రద్దీగా మారతాయి. చాట్ నుంచి చాక్లెట్ కేక్ వరకూ.. వెనీలా, చాక్లెట్ కప్ కేక్స్, మల్బరీ, స్ట్రాబెర్రీ చాక్లెట్, పానీపూరీ, చాట్, బ్రెడ్ ఆమ్లెట్, కారం, ఉప్పు చల్లిన మామిడి, స్వీట్ కార్న్, మసాలా కార్న్, ఉడకబెట్టిన మొక్కజొన్న, ట్విస్టెడ్ పొటాటో, వెజ్, చికెన్, ఫ్రైడ్ మోమూస్, స్టీమ్ మోమూస్, చైనీస్ ఫుడ్ ఇలా ఒక్కటేంటి.. నగరంలో వివిధ ప్రాంతాల్లో దొరికే అన్ని రకాల ఆహారం ఇక్కడ అందుబాటులో ఉంటుంది. స్మైలీ, ఎగ్ దోశ, ఎగ్ ఆమ్లెట్ షావర్మా, చికెన్ కబాబ్స్, క్రిస్పీ స్పైసీ చికెన్, సమోలీ, కుబూస్, రుమాలీ షావర్మా, చాట్, పానీపూరీ చాలా తక్కువ ధరకే దొరుకుతుంది. హుస్సేన్ సాగర్ అందాలను చూసుకుంటూ ఎంచక్కా ఫుడ్‌ను ఎంజాయ్ చేయొచ్చు.అదిరే ఫుడ్ నెక్లెస్ రోడ్..! నెక్లెస్ రోడ్డులో అలా కారులో, బైక్‌పై వెళ్తుంటే అక్కడక్కడా వచ్చే సువాసనలు చూస్తుంటేనే ఆ ఫుడ్ లాగించేయాలని అనిపిస్తుంది. ఎంచక్కా కారు లేదా బైక్ ఆపి చక్కగా ఆర్డర్ చేసుకుని, తింటుంటే ఆ మజానే వేరు. ఇక, నెక్లెస్ రోడ్డులోని ఈట్ స్ట్రీట్ ఫుడ్ గురించి వేరే చెప్పాల్సిన పనే లేదు. అక్కడ దొరకని ఫుడ్ అంటూ లేదంటే అతిశయోక్తి లేదు. ఫుడ్‌తో పాటు చిన్న పిల్లలు, పెద్దలు ఆడుకునేందుకు అనేక రకాలా ఆటవస్తువులు, మంచి ఎంటర్టైన్మెంట్ అందుబాటులో ఉంటుంది.హైటెక్ సిటీ–మాదాపూర్.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల అడ్డా అయిన హైటెక్ సిటీ, మాదాపూర్‌లో ఇటీవల స్ట్రీట్ ఫుడ్ కల్చర్ విపరీ తంగా పెరిగిపోయింది. చాలా మంది ఐటీ ఉద్యోగులకు నైట్ డ్యూటీలు ఉంటాయి. అర్ధరాత్రి ఆకలిగా అనిపించినా.. కాస్త బోర్ కొట్టినా కొలీగ్స్‌తో కలిసి ఎంచక్కా స్ట్రీట్ ఫుడ్ స్టాళ్ల దగ్గరికి వచ్చి డిఫరెంట్ ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారు. రెగ్యులర్ టిఫిన్లయిన ఇడ్లీ, దోశతో పాటు స్నాక్ ఐటెమ్స్ అయిన సమోసా, మిర్చీ, కట్లెట్, పానీపూరీ ఆహారం ఏదైనా అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా దొరుకుతుంది. హైదరాబాద్ యువతకు మాదాపూర్ స్ట్రీట్ ఫుడ్ ఫేవరెట్‌గా మారాయి. -
టెక్ మొగల్ మెచ్చిన స్ట్రీట్ ఫుడ్ : ఫ్యాన్స్‌ను కట్టిపడేస్తూ వీడియో వైరల్
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, బిలియనీర్ బిల్ గేట్స్ మరోసారి వార్తల్లో నిలిచారు. న్యూయార్క్‌లోని ఐకానిక్ టైమ్స్ స్క్వేర్‌లో ఒక వీధి వ్యాపారి వద్ద హాట్ డాగ్‌ను ఆస్వాదిస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్నెట్లో సందడి చేస్తోంది.స్ట్రీట్ ఫుడ్ పట్ల తనకున్న ప్రేమను చాటుకుంటూ బిల్‌గేట్స్ సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు. న్యూయార్క్‌లో స్ట్రీట్ ఫుడ్ హాట్ డాగ్‌ను ఆస్వాదిస్తున్న తాజా వీడియో ణాల్లో ఇది వైరల్ అయ్యింది. "మీరు హాట్‌డాగ్ తినలేదూ అంటు న్యూయార్క్ వెళ్లనట్టే" అని క్యాప్షన్‌తో ఆయన షేర్ చేసిన వీడియో ఇప్పటికే 20 లక్షలకు పైగా వ్యూస్ లక్షల లైక్స్‌ను సొంతం చేసుకుంది. నెటిజనులు రకరకాల కమెంట్లతోపాటు, టెక్ మొగల్ను ప్రశంసల్లో ముంచెత్తారు. వావ్, బిలియనీర్లు కూడా మంచి హాట్ డాగ్‌ని ఇష్టపడతారు!, ఆయనకూడా మనలాగే! గేట్స్ హాట్ డాగ్ అభిమాని అని కొందరు వ్యాఖ్యానించగా, మరికొందరు హాస్య భరితంగా, "బిల్ మస్టర్డ్ లేదా కెచప్‌ను ఇష్టపడతారా?"అంటూ కమెంట్ చేశారు. View this post on Instagram A post shared by Bill Gates (@thisisbillgates)కాగా స్ట్రీట్ ఫుడ్ ఆస్వాదించడం బిల్‌గేట్స్‌కు ఇదే తొలిసారి కాదు తాను ఏ నగరంలో ఉన్నాడో ప్రపంచానికి తెలియజేయడానికి ఆహారాన్ని ఒక మాధ్యమంగా ఎంచుకోవడం బిల్ గేట్స్‌కు బాగా అలవాటు. ఆ నగరానికి అత్యంత ప్రజాదరణ పొందిన ఆహారాన్ని గుర్తించి, దాన్ని సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ చేస్తారు.. ఈ సంవత్సరం ప్రారంభంలో, భారతదేశ పర్యటన సందర్భంగా, సోషల్ మీడియాఇన్ఫ్లుయెన్సర్ చాయ్‌వాలా చాయ్ సిప్ చేస్తూ అభిమానులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: సోయా ఆకుతో బరువు తగ్గొచ్చు.. ఇంకా ఆశ్చర్యకర ప్రయోజనాలు -
స్ట్రీట్ ఫుడ్ విక్రేతగా పీహెచ్డీ విద్యార్థి..నెటిజన్లు ఫిదా!
పెద్ద పెద్ద చదువులు చదవి కూడా తన అర్హతకు సరిపోని ఉద్యోగాల్లో పార్ట్‌టైం చేస్తూ తమ భవిష్యత్తు బాటలు వేసుకుంటారు. అలాగే నామోషీగా వంటి ఫీలింగ్స్ ఏం లేకుండా చాలా హుందాగా ప్రవర్తిస్తారు. పొరపాటున కూడా తామెంటనేది పెదవివిప్పరు. అలాంటి వ్యక్తిని చూసి అమెరికా వ్లాగర్ ఆశ్చర్యపోయాడు. ఓ గొప్ప వ్యక్తిని కలిశానన్న భావంతో అతడితో సంభాషించిన వీడియోని షేర్ చేస్తూ అతడి గొప్పతనం గురించి వివరించాడు.ఏం చెప్పాడంటే..అమెరికన్ వ్లాగర్ క్రిస్టోఫర్ లూయిస్ ఇటీవల అనుకోని విధంగా బయోటెక్నాలజీలో పీహెచ్‌డి చేసిన విద్యార్థిని కలుసుకుంటాడు. అతడు గూగుల్ మ్యాప్స్ సాయంతో తమిళనాడులో చెన్నైలో ప్రయాణిస్తుండగా సమీపంలో ఉన్న స్ట్రీట్ ఫుడ్ బండి అతడిని ఎందుకో ఆకర్షించింది. అక్కడకువెళ్లి ఒక ప్లేట్ చికెన్ 65 ఆర్డర్ ఇచ్చాడు. ఇంతలో తాను చెప్పే ఆర్డర్ సర్వ్ చేసేలోపల ఆ ఫుడ్ విక్రేతతో మాటలు కలిపాడు. అతడితో జరిపిన సంభాషలో ఫుడ్ విక్రేత పీహెచ్డీ చేసిన విద్యార్థి అని తెలిసి విస్తుపోతాడు. అంతేగాదు సదరు వ్యక్తి తన పేరు, తన పరిశోధన పత్రాన్ని ఆన్లైన్లో సర్చ్ చేయమని చెబుతాడు. ఇంత ఉన్నత చదువులు చదివి కూడా ఏ మాత్రం సిగ్గుపడకుండా ఖర్చులకోసం ఇలా కష్టపడుతున్న ఆ విద్యార్థిని చూసి అబ్బురపడ్డాడు. వెంటనే పట్టరాని ఆనందంతో అతడితో ముచ్చటించిన వీడియోని నెట్టింట షేర్ చేయడమే గాక 100 డాలర్లు(మన కరెన్సీలో రూ. 8000లు) గిఫ్ట్‌గా ఇచ్చాడు. అంతేగాదు ఇలా ఓ విద్యార్థి ఇలా తన విద్యా లక్ష్యాల కోసం స్ట్రీట్ ఫుడ్ కార్ట్‌ని నడుపుతుండటం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. అతడి హార్డ్‌వర్క్‌కి ఫిదా అవ్వుతూ ఇలా అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్నత చదువుతున్న విద్యార్థులు ఇలానే కష్టపడుతున్నారంటూ చర్చకలకు దారితీసింది. కాగా, క్రిస్ బుహారి హోటల్‌కి చేరుకోవాలి. ఇది చికెన్ 65కి పేరుగాంచింది. ఈ రుచకరమైన వంటకం తమిళనాడు ఏఎం బుహరీ హోటల్ రూపొందించింది. ఆ తర్వాత కాలక్రమేణ చికెన్ 78, చికెన్ 82, చికెన్ 90 వంటి వైవిధ్యకరమైన వంటకాలు వచ్చాయి.Respect 🔥🔥🔥 Such Stories Need to be Shared Widely. Have an Inspiring Day Ahead...#FI pic.twitter.com/i9vOBZqGJS— Fundamental Investor ™ 🇮🇳 (@FI_InvestIndia) September 3, 2024 (చదవండి: హాట్‌టాపిక్‌గా సల్మాన్ ఖాన్ బాడీ గార్డ్ హెల్తీ డైట్..!) -
ఇలా కూడా మురమురాలు చేయొచ్చా?
-
పానీపూరి.. రోగాల దారి!
భాగ్యనగరంలో నిత్యం చిన్నారులు మొదలు విద్యార్థులు, పెద్దల దాకా లాగించే స్ట్రీట్ ఫుడ్ గోల్గప్పా. అదేనండి.. పానీపూరీ లేదా గప్‌చుప్. పానీపూరీలకు మధ్యలో చిల్లు పెట్టి.. ఉడికించిన ఆలూ, కాబూలీ చెనా దట్టించి.. ఆపై పుదీనా, చింతపండు, మసాలా కలగలిపిన నీటిలో ముంచి ఇస్తుంటే మనోళ్లు గుటుక్కుమనిపిస్తుంటారు. దాని రుచికి ఫిదా అవుతూ వహ్వా అంటుంటారు. గల్లీగల్లీలో కనిపించే పానీపూరీ బండ్ల వద్ద ఈ టేస్టీ ఎక్స్పీరియన్స్ కోసం క్యూలు కూడా కడుతుంటారు.కానీ కొందరు పుదీనా నీటిలో కలిపేకృత్రిమ రంగులు, పూరీల తయారీకి వాడే నూనెల వల్ల అనారోగ్యం పాలవుతారని వైద్యులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరిస్తున్నా ఎవరూ పెద్దగా పట్టించుకోవట్లేదు. అయితే ఇటీవల తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో పానీపూరీ నమూనాలను పరీక్షించగా వాటిల్లో కేన్సర్కారక పదార్థాలు ఉన్నట్లు తేలింది. దీంతో పానీపూరీల వినియోగంపై నిషేధం విధించాలని ఆ రాష్ట్రాలు యోచిస్తున్నాయి.సాక్షి, హైదరాబాద్పానీపూరీల తయారీలో వాడే పదార్థాలు ఎలా ఉన్నా.. చాలా మంది పరిశుభ్రమైన వాతావరణంలో వాటిని తయారు చేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన కొన్ని వీడియోలు సైతం అప్పుడప్పుడూ చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా కలుషితమైన నీటినే కొందరు చిరువ్యాపారులు వినియోగిస్తున్నారు. అలాంటి నీటిలో ఈ–కొలి వంటి బ్యాక్టీరియా, సూక్ష్మక్రిములు, ఇతర రోగకారకాలు ఉంటాయి. అలాంటి నీటిని పానీపూరిలో వాడితే ఇక మన ఆరోగ్యం అంతే సంగతులు.ఎసిడిటీ.. అల్సర్లు..!పానీపూరీ అంటే ఎంత ఇష్టమైనా అతిగా తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే తరచూ పానీపూరీ లాగించే వారిలో గ్యాస్ట్రిక్ ట్రబుల్, ఎసిడిటీ, అల్సర్ వంటి జబ్బులు చిన్న, పెద్ద అనే తేడా లేకుండా వస్తున్నట్లు చెబుతున్నారు. దీనివల్ల టైఫాయిడ్, కలరా వంటి వ్యాధులు కూడా ప్రబలే ప్రమాదం ఉందని వైద్యులు అంటున్నారు.వర్షాకాలంలో జాగ్రత్త..అసలే వర్షాకాలం.. ఇంట్లో తాగే నీటి విషయంలోనే చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే కలరా, డయేరియా వంటి అనారోగ్యాలు చుట్టుముడతాయి. అలాంటిది ఏ నీటిని వాడారో తెలియని పానీపూరీ బండ్ల వద్ద తిని ఏరికోరి అనారోగ్య సమస్యలు తెచ్చుకోవడం ఎందుకని వైద్యులు ప్రశి్నస్తున్నారు. ఎందుకంటే.. సాధారణంగా చిరువ్యాపారులు ఎక్కడా చేతులకు గ్లౌజులు తొడుక్కోరు. ఒక చేత్తో పొయ్యిపై ఆలూ, శనగలను ఉడకబెడుతూనే అదే చేత్తో ఉప్పు, కారం, మసాలాలు చల్లుతూ పక్కనుండే ఓ నీటి గిన్నెలో చేతులు కడుగుతుంటారు. ఆపై అదే చేత్తో పానీపూరీలను మసాలా నీటిలో ముంచి అందిస్తుంటారు. టీబీ వచ్చే చాన్స్..అపరిశుభ్ర వాతావరణంలో తయారైన ఆçహార పదార్థాలు, పరిసరాల వల్ల క్షయ వ్యాధి వచ్చే ప్రమాదమూ ఉంది. ఇదే విషయాన్ని అంతర్జాతీయ జర్నల్స్‌లో పరిశోధకులు కూడా చెబుతున్నారు. అపరిశుభ్ర ప్రదేశాల్లో ఉండే బ్యాక్టీరియాలు శోషరస గ్రంథుల్లోకి (లింఫ్ ఎడినైటిస్) చేరితే క్షయ వ్యాధి (ఎక్స్ట్రా పల్మొనరీ) సోకే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. మెనింజైటిస్ వచ్చే ప్రమాదంపానీపూరీలో ఎలాంటి నీళ్లు వాడుతారో తెలియదు. కలుషితమైన నీటిలో బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఉండే అవకాశం ఉంది. ఇటీవల కేరళలో ఇలాంటి కేసులు నమోదయ్యాయి. దీంతో మెనింజైటిస్ అనే వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. ఎక్కువగా చిన్న పిల్లల్లో వస్తుంది. ఇది చాలా ప్రాణాంతక వ్యాధి. – డాక్టర్ నాజ్నీన్ తబస్సుమ్ఇంట్లో చేసుకుంటే మేలు.. పానీపూరీ అంటే ఇష్టమున్నా బయట తింటే అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయని బాధపడుతున్నారా? అయితే ఎంచక్కా ఇంట్లోనే రుచిగా, శుచిగా తయారు చేసుకోండి. ఇందుకు అవసరమయ్యే పదార్థాలన్నీ దుకాణాల్లో దొరుకుతాయి. వాటిని ఎలా తయారు చేయాలో యూట్యూబ్ వీడియోల్లో చూసి నేర్చుకొని ఇంట్లోనే ఎంచక్కా తయారు చేసుకుంటే చాలు. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. మార్కెట్లోకి ఆటోమేటిక్ పానీపూరి డిస్పెన్సర్లు.. ఇటీవల కాలంలో చాలా ప్రాంతాల్లో ఆటోమేటిక్ పానీపూరి డిస్పెన్సర్లు అందుబాటులోకి వచ్చాయి. వెండింగ్ మెషీన్ లాంటి ఈ డిస్పెన్సర్లలో మనం డబ్బు చెల్లిస్తే చాలు పానీపూరి ఆటోమేటిక్‌గా మనం తీసుకుని ఎంజాయ్ చేయొచ్చు. దీనివల్ల కొంతలో కొంత కలుíÙతం కాకుండా ఉంటుంది. కాకపోతే అందులో డిస్టిల్డ్ వాటర్ వాడితే ఎలాంటి సమస్యలు రావని చెబుతున్నారు. గోబీ మంచూరియాపై నిషేధం.. గోబీ మంచూరియాపై ఇప్పటికే దక్షిణాదిలోని నాలుగు రాష్ట్రాలు నిషేధం విధించాయి. గోబీ మంచూరియాను గోవా, పుదుచ్చేరి, తమిళనాడు, కర్ణాటక బ్యాన్ చేశాయి. టార్ట్రజైన్, కార్మోసిన్, సన్‌సెట్ యెల్లో, రోడమైన్ అనే రసాయనాలను గోబీ మంచూరియా తయారీలో వాడుతున్నారని, అవి తీవ్ర అనారోగ్య సమస్యలు తీసుకొస్తాయని గుర్తించారు. గోబీ మంచూరియాతోపాటు పీచు మిఠాయిని కూడా ఆయా రాష్ట్రాలు నిషేధించాయి. వాటిల్లో వాడే రసాయనాలు చిన్నారుల్లో అనారోగ్య సమస్యలకు కారణం అవుతాయని చెబుతున్నారు. రుచి కాదు.. శుచి ముఖ్యం.. పానీపూరి బండ్లు కొన్ని చోట్ల అపరిశుభ్రమైన వాతావరణంలో ఉంటాయి. చేతులు కడగకుండానే ఇస్తుంటారు. వాటినే చాలామంది రుచిగా తింటారు. అయితే రుచి కాదు.. శుచి ముఖ్యం.. ఈ మధ్య చిన్నపిల్లలు, కాలేజీ విద్యార్థులు ఇష్టంగా తినే మెనూలో పానీపూరి ఉండటం బాధాకరం. – వేణుగోపాల్, బ్యాంకు ఉద్యోగి, ఉప్పల్దుమ్ము, ధూళి వాటిపైనే..పానీపూరీ చాలామంది తింటుంటారు. అందులో వాడే నీరు ఎలాంటిదో ఎవ్వరికీ తెలియదు. పైగా.. ప్లాస్టిక్ ఫోమ్ ప్లేట్లు వాడుతుంటారు. వాటి మీద వేడి పదార్థాలు వేస్తే.. రసాయనాలు కరిగి.. ఆరోగ్య సమస్యలు తెస్తుంటాయి. ఆ బళ్లు కూడా రోడ్ల పక్కనే ఉంటాయి. దుమ్ము, ధూళి వాటిపై పడి కలుషితం చేస్తాయి. – సురేశ్ బొల్లేపల్లి, అంబర్‌పేట -
కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్‌ను సందర్శించిన సోనూసూద్
-
మినిమం 30.. తగ్గేదేలే..! ఇది కదా పానీ పూరీ మజా....వీడియో వైరల్
భారతదేశంలో అత్యంత ఇష్టమైన,అత్యంత ప్రజాదరణ పొందిన స్ట్రీట్ ఫుడ్ అనగానే ఠక్కున గుర్తొచ్చేది పానీ పూరీ. ఖట్టా-మీఠా ఇలా వివిధ రకాల రుచులు, స్టఫ్ఫింగ్స్‌తో .. అసలు ఈ పేరు వింటేనే నోట్లో నీళ్లు ఊరాల్సిందే. ఇది కేవలం స్ట్రీట్ ఫుడ్ మాత్రమే కాదు. అదొక ఎమోషన్ చాలామందికి. అలాంటి పానీ పూరీ తాజాగా, అమెరికావాసులను కూడా ఫిదా చేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. View this post on Instagram A post shared by Curry Corner (@currycornermn) మిన్నియాపాలిస్ వాసులు అక్కడి భారతీయ రెస్టారెంట్ , కర్రీ కార్నర్ వద్ద పానీ పూరీ తెగ లాగించేస్తూ మురిసిపోతున్నారు. ‘ఆహా తినరా మై మైరచి అంటున్నారు. మరికొందరైతే మాటల్లేవు.. అంటూ పానీ పూరీని ఆస్వాదించే పనిలో బిజీగా ఉన్నారు. పానీపూరి ప్యూర్ లవ్ అని అని ఒక ఇన్‌స్టా యూజర్ కామెంట్ చేశాడు. మినిమం 30 పూరీలు ఏగబిగిన లాగించేయాల్సిందే.. 20కి పైగా పానీ పూరీలు తింటూ ఉంటే.. అలా కళ్లవెంబడి నీళ్లు జలజలా రాలిపోతే ఉంటే అప్పుడు గానీ పానీ పూరీ తినడంలోని మజా అర్థం కాదు.. ఇలా పలు కామెంట్లు సందడి చేస్తున్నాయి. పాపులర్ పానీ పూరీని మిన్నియాపాలిస్ వాసులకు పరిచయం చేశాము అంటూ సదరు రెస్టారెంట్ ఇన్‌స్టాలో రీల్ పోస్ట్ చేసింది. ఇటీవల పోస్ట్ చేసిన ఈ రీల్ ఏకంగా 3.9 మిలియన్ల వీక్షణలు, 90వేలకు పైగా లైక్స్ సాధించింది. -
ఖరీదైన కారులో వడా పావ్ : ఢిల్లీ ‘కుమారాంటీ’ మరో సంచలనం
హైదరాబాద్ కుమారాంటీ తరహాలో సంచలనం రేపిన వడా పావ్ గర్ల్ మరోసారి సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఖరీదైన కారుతో కనిపించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. లగ్జరీ, దాదాపు కోటి రూపాయల అద్భుతమైన ఫోర్డ్ మస్టాంగ్లో వడా పావ్ అమ్ముతూ కనిపించిన వీడియో వైరల్‌గా మారింది.ఢిల్లీకి చెందిన "వడా పావ్ గర్ల్" చంద్రికా దీక్షిత్ మంగోల్‌పురి ప్రాంతంలో ఒక ఫాస్ట్ ఫుడ్ స్టాల్‌ను నిర్వహిస్తుంది. రోజూ వందల మందికి వడ పావ్‌ను విక్రయిస్తుంది. అలా వడా పావ్ గర్ల్‌గా బాగా ఫేమస్ అయింది. ఇన్‌స్టాలో 31 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారంటే ఆమె క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు.తాజాగా ఫోర్డ్ ముస్టాంగ్ కారులో వడాపావ్ అమ్ముతానంటూ ఇన్‌స్టాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది. "వడ పావ్ అమ్మాయి ముస్తాంగ్ కారులో వడా పావ్ అమ్మడం ప్రారంభించింది." అని ప్రకటించింది. అంతేకాదు వెయట్ చేయండి.. వడాపావ్‌తో పాటు త్వరలో ఒక పెద్ద ప్రకటన రాబోతోంది అని కామెంట్ చేసింది. దీంతో చుట్టుపక్కల ఉన్నవారంతా చప్పట్ల మోత మోగించారు. అమెరికన్ కార్ కంపెనీ ఫోర్డ్ ఇండియాలో ఉత్పత్తిని నిలిపివేసింది. భారత మార్కెట్లో ఈ కారులే టెస్ట్ వెర్షన్ ధర సుమారు 75 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. View this post on Instagram A post shared by Chandrika Gera Dixit official (@chandrika.dixit) కాగా ఇటీవల తనను పోలీసులు అరెస్ట్ చేశారంటూ ఒకవీడియో వైరల్ అయింది. అయితే ఆమెను అరెస్ట్ చేయలేదని ఎటువంటి కేసు నమోదు చేయలేదని పోలీసులు వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం పోస్ట్ చేసిన వీడియోలో, ముస్తాంగ్ కారు నుండి బయటికి రావడం, సరికొత్త ఐఫోన్, ఐవాచ్, ఎయిర్పాడ్లను కొనుగోలు చేయడానికి దుకాణంలోకి వెళ్లిన రీల్స్ చేసింది. అలాగే పోర్స్చేతో సహా ఖరీదైన కార్లతో పోజులిచ్చింది. -
ధైర్యమున్నంత వరకూ పోరాడతా..జస్ప్రీత్ వీడియో వైరల్ : ఆనంద్ మహీంద్ర ఫిదా
నాన్న (బ్రెయిన్ టీబీ) అనారోగ్యంతో కన్నుమూశాడు. తల్లి ఇక్కడ ఉండలేనంటూ సొంత ఊరికి (పంజాబ్) వెళ్లిపోయింది. దీంతో ఒంటరి అయిపోయాడు. అయినా ధైర్యం కోల్పోలేదు. నాన్న చనిపోయి నెలరోజులైనా కాకుండానే బాధ్యతను భుజానకెత్తు కున్నాడు. నాన్న నేర్పిన విద్యనే ఎంచుకున్నాడు. కేవలం పదేళ్లకే స్ట్రీట్ ఫుడ్ సెంటర్‌ని నడుపుతూ దైర్యంగా జీవిస్తున్నాడు. తన 14 ఏళ్ల అక్కకు కూడా కొండంత అండగా నిలుస్తున్నాడు. ఆ దైర్యం పేరే జస్ప్రీత్. చదువుకుంటూనే, ఈ సెంటర్ నడుపుతూ ఉండటం విశేషం. ‘‘జబ్‌తక్ హిమ్మత్ హై.. తబ్ తక్ లడూంగా’’ అంటున్న ఆ కుర్రవాడి కళ్లలో కనిపిస్తున్న ఆత్మవిశ్వాసం నెటిజనులకు ఆకట్టుకుంటోంది. After Kids Video Went Viral On Different SM Platforms, Help And Support For Kid Is Pouring Out Huge...Y'day @JarnailSinghAAP Reached The Kid And Assured Eveey Possible Help And Support For Him.Thank You Everyone For Sharing Such Videos, You Friends Are A Huge Support.🙏❤️ https://t.co/8DKP3G7QlF pic.twitter.com/Rs3sCnM5al— ਹਤਿੰਦਰ ਸਿੰਘ (@Hatindersinghr3) May 3, 2024 పశ్చిమ ఢిల్లీలోని తిలక్ నగర్లో ఈ సెంటర్ నడుపుతున్న జస్ప్రీత్ వీడియోను ఫుడ్ వ్లాగర్ సరబ్జీత్ సింగ్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. చికెన్ ఎగ్ రోల్, కబాబ్ రోల్, పన్నీర్ రోల్...ఇలా రుచికరమైన పదార్థాలను అలవోకగా చేసి కస్టమర్లకు అందిస్తాడు. జస్ప్రీత్కు సంబంధించిన వీడియో నెట్టింట్ వైరలవుతోంది.ఈ వీడియో పారిశ్రామిక వేత్త, ఎం అండ్ ఎం అధినేత ఆనంద్ మహీంద్ర వరకూ చేరింది. దీంతో వెంటనే ఆయన స్పందించారు. ఆ బాలుడి ధైర్యానికి దృఢ సంకల్పానికి ఫిదా అయిపోయారు. అతని కాంటాక్ట్ నంబరు తెలిస్తే జస్ప్రీత్కు సాయం చేస్తానంటూ ప్రకటించారు. అతని చదువు దెబ్బ తినకూడదు. మహీంద్రా ఫౌండేషన్ బృందం, అతని విద్యకు ఎలా మద్దతు ఇవ్వగలదో ఆలోచిస్తుంది. దయచేసి జస్ప్రీత్ వివరాలను అందింగచలరు అంటూ ఎక్స్ లో పోస్ట్(ట్వీట్) చేశారు.Courage, thy name is Jaspreet. But his education shouldn’t suffer. I believe, he’s in Tilak Nagar, Delhi. If anyone has access to his contact number please do share it. The Mahindra foundation team will explore how we can support his education.pic.twitter.com/MkYpJmvlPG— anand mahindra (@anandmahindra) May 6, 2024మరోవైపు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జస్ప్రీత్ భారీ మద్దతు లభిస్తోంది. ఆప్ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్ కూడా స్పందించారు. తగిన సాయం అందిస్తానని ప్రకటించారు. -
గ్రిల్డ్ కోకోనట్ ఎపుడైనా ట్రై చేశారా? ధర ఎంతో తెలుసా?
వేసవిలో కొబ్బరి బొండాంకున్న ప్రాధాన్యతే వేరు.సహజసిద్ధంగా ఏర్పడిన కొబ్బరి నీళ్లలో పోషకాలు కూడా మెండుగా ఉంటాయి. అయితే మీరెపుడైనా స్పైసీ గ్రిల్డ్ లేదా రోస్టెడ్ కొబ్బరిని టేస్ట్ చేశారా? ఇండోనేషియాలో ఈ స్ట్రీట్ డ్రింక్ చాలా ఫ్యామస్. అంతేకాదు ఆక్రమణదారులనుంచి దేశాన్ని కాపాడేందుకు, శారీరక బలం కోసం దీన్ని అక్కడి రాజులు దీన్ని ఎక్కువగా తాగేవారట. ఇండోనేషియాలో స్పైస్ గ్రిల్డ్ కోకోనట్ చాలా ఖరీదైంది కూడా. ఒక్కో బోండాం ధర 10వేలకు పైమాటేనట. Roast coconut street food , Indonesia pic.twitter.com/ZaJcxt7h8g — Science girl (@gunsnrosesgirl3) April 14, 2024 పచ్చి కొబ్బరి కాయను సుమారు 1-2 గంటల పాటు కాల్చుతారు. స్పెషల్‌గా ఏర్పాటు చేసిన గ్రిల్మీద జాగ్రత్తగా కాల్చుతారు. ఆతరువాత పైన పీచు వలిచేసి,లోపల ఉన్న లేత కొబ్బరితో సహా నీళ్లను సేవిస్తారు. దీన్ని వేడి వేడిగా, లేదా చల్లగా ఎలాగైన తినవచ్చు. ఇలా కాల్చడం వల్ల కొబ్బరి టేస్ట్‌తోపాటు పోషక విలువలుకూడా మరింత పెరుగుతాయని ఇక్కడి వారి నమ్మకం. కాల్చిన కొబ్బరి నీళ్లు, స్థానిక సుగంధ ద్రవ్యాలతోపాటు కొద్దిగా షుగర్‌ను కలిపి తాగుతారు. ఒక రోజులో కనీసం 30 కొబ్బరికాయలు అమ్ముడవుతాయి. -
డోల్మా ఆంటీతోనే మజాకులా? ఎవరీ డోల్మా? ఏమా కథ?
ఢిల్లీకి చెందిన డోల్మా ఆంటీ మరోసారి వార్తల్లో నిలిచింది. ట్రేడ్‌మార్క్ వివాదంలో డోల్మా ఆంటీకి ఢిల్లీ హైకోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ‘‘డోల్మా ఆంటీ మోమోస్" ట్రేడ్‌మార్క్‌ను ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించి విజయం సాధించింది. ఇంతకీ ఎవరీ డోల్మా అంటీ... తెలుసుకుందాం రండి! దేశ రాజధాని నగరం ఢిల్లీలో డోల్మా ఆంటీ మోమో బాగా పాపులర్. ఢిల్లీలోని లజ్‌పత్‌నగర్ ప్రాంతంలో డోల్మా ఆంటీ మోమోస్ కోసం ఆహార ప్రియులు బారులు తీరతారు. కేవలం స్థానికులు మాత్రమే కాదు అక్కడికి వచ్చిన వారంతా ఒక్కసారి డోల్మా ఆంటీ మోమోస్ టేస్ట్ చేస్తే.. ఆహా..ఏమి రుచి.. తినరా మళ్లీ...మళ్లీ అంటారు. అలా ఈ మోమోలు బాగా పాపులర్ అయ్యాయి. లజ్‌పత్ నగర్‌కి వెళ్లి డోల్మా ఆంటీ మోమోలు తినకపోతే ఎలా? అనుకునేంతగా పేరు సంపాదించుకుంది. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మొహమ్మద్ అక్రం ఖాన్ ‘డోల్మా ఆంటీ మోమో’ పేరుతో 2018లో ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన డోల్మా ట్సేరింగ్ ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసింది. డోల్మా 1994లో లజ్‌పత్ నగర్లో మొట్టమొదటి మోమో స్టాల్‌ను ప్రారంభించిందన్న వాదనను సమర్థించింది. దీంతో ఢిల్లీ హైకోర్ట్ మొహమ్మద్ అక్రం ఖాన్ ట్రేడ్‌మార్క్ చెల్లదని తీర్పునిచ్చింది. 30 ఏండ్లుగా వ్యాపారం నిర్వహిస్తున్న డోల్మా కూడా 2023లో తన మోమోలకు ట్రేడ్‌మార్క్ తీసుకోవడం విశేషం. కాగా డోల్మా ట్సేరింగ్ కుటుంబం 1950లో బౌద్ధ గురువు దలైలామా తోపాటు టిబెట్ నుంచి భారత్ తరలి వచ్చిందట. బతుకు దెరువు కోసం టిబెట్‌కు చెందిన స్ట్రీట్ ఫుడ్‌ను ఢిల్లీవాసులకు రుచి చూపించింది. 1994లో లజ్‌పత్‌నగర్‌లో తొలి మోమో స్టాల్ ప్రారంభించింది. 90వ దశకంలో అంతగా ఆదరన లభించలేదు. అయితే ఎట్టకేలకు ఢిల్లీ ప్రజల పల్స్ పట్టేసిందిడోల్మా. స్థానిక టేస్ట్‌కు అనుగుణంగా మోమోలకు స్పైసీ మసాలా చట్నీ జోడించి విక్రయించడం మొదలు పెట్టింది. అంతే...అప్పటినుంచి ఆమె వెనుదిరిగి చూసింది లేదు. రూ.15 కి ఆరు మోమోల ప్లేట్‌తో ప్రారంభించి, ఇపుడు 8 మోమోలు రూ. 60కి విక్రయిస్తోంది. లజ్‌పత్ నగర్‌లోని ప్రధాన స్టాల్‌తో పాటు, డోల్మా ఆంటీకి మరో రెండు చోట్ల మోమోస్ స్టాల్స్ ఉన్నాయి. -
'కుమారి ఆంటీ' లాంటి ఇన్సిడెంట్..మరీ ఇదేమవుతుందో..!
హైదరాబాద్‌లో రెండు లిఫర్లు ఎక్స్ట్రా అనే డైలాగ్‌తో ఫేమస్ అయ్యిన స్ట్రీ ఫుడ్ వ్యాపారి కుమారీ ఆంటీ పేరు తెలియని వారు ఉండరని చెప్పొచ్చు. అంతలా సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన వీడియోలు వచ్చాయి. అయితే ట్రాఫిక్‌కి అంతరాయం ఏర్పడుతుందని ఆమె షాపు తీసేయాలంటూ.. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేయడంతో ఒక్కసారిగా ఆమె పేరు వార్తల్లో నిలిచిపోయింది. దీంతో కుమారీ ఆంటీ నా పొట్టమీద కొట్టొద్దని విలపించటం, మరోవైపు సోషల్ మీడీయా ఆమెపై పలు సింపతీ కథనాలతో ఊదరగొట్టడంతో దెబ్బకి అధికారులే బిజినెస్ చేసుకోమని వదలిలేయడం చకచక జరిగిపోయాయి. చెప్పాలంటే ఈ ఘటన ఓ సెన్సెషన్లా మారీ కుమారీ ఆంటీ పేరు మారుమ్రోగిపోయింది. అచ్చం అలాంటి ఇన్సిడెంటే వడాపావ్ గర్ల్‌కి ఎదురయ్యింది. వివరాల్లోకెళ్తే..ఢిల్లీలో వడపావ్ చాలా ఫేమస్ స్ట్రీట్ ఫుడ్. అయితే ఢిల్లీ రోడ్లలో వడపావ్ గర్ల్‌గా చంద్రికా గేరా దీక్షిత్ ఎంతో ఫేమస్. ఆమె తయారు చేసే వడపావ్ చాలా మంచి ప్రజాధరణ ఉంది.దీంతో ఆమె స్టాల్ జనాలతో కిటకిటలాడిపోతుంది. ఆమె వద్ద తినాంటే గంటల తరబడి వెయిట్ చేసి ఉండాల్సిందే. అంత క్రేజ్ ఆమె చేసే వడపావ్కి. అందుకు సంబంధించిన సోషల్ మీడియా వీడియోల కథనాలే నిదర్శనం. ఇక ఈ చంద్రిక ఇంతలా ఫేమస్ కావడానికి ఆమె గతంలో హల్దీ రామ్‌లో ఉద్యోగం చేయడం. ఆమె సొంతంగా బిజినెస్ చేయాలనే ఆసక్తితో ఇలా స్ట్రీట్ వడపావ్ ఫుడ్ వ్యాపారం ప్రారంభించింది. బీటెక్ పానీపూరి వాలీ తర్వాత ఈ చంద్రికాదే ఇంతలా ఫేమస్ అయ్యింది. అయితే తాజాగా ఆమెకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో ఆమె ఏడుస్తూ ఫోన్మాటడుతూ.. మరోవైపు కస్టమర్లకు సర్వ్ చేస్తోంది. ఆమె తన వ్యాపారానికి సంబంధించిన ఏదో సమస్య ఎదుర్కొన్నట్లు సమాచారం. ఢిల్లో మున్సిపల్ కార్పిరేషన్ అధికారులు ఫుడ్‌స్టాల్ మూసి వేయాలని చంద్రికాపై ఒత్తడి తెస్తున్నారట. గతంలో పర్మిషన్ కోసం రూ. 30 వేలు చెల్లించిందట. అయితే అధికారులు ఇంకా డబ్బు ఇవ్వాలని లేదంటే బిజినెస్ క్లోజ్ చేస్తామని బెదిరిస్తున్నట్లు ఆమె వీడియోలో పేర్కొంది. అయితే తనను ఎవరు బెదిరిస్తున్నారనే వివరాలు చెప్పలేదు. ఈ వీడియోను ఓ కస్టమర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.ఈ వీడియోని చూసిన నెటిజన్లు బిజినెస్ నడపాలంటే మున్సిపాలిటీ నిబంధనలు పాటించాల్సిందేనని ఒకరు, లైసెన్స్ లేకుండా స్టాల్ ఎలా నడుపుతారని మరోకరు ప్రశ్నిస్తూ.. పోస్టులు పెట్టారు. ఏదీఏమైన చంద్రికా ఏడవడానికి కారణం ఇదేనా లేక మరేదైనా సమస్య అనేది పూర్తిగా తెలియాల్సి ఉంది. కానీ చూడటానికి కుమారీ ఆంటీ లాంటి కథని తలపిస్తోంది. #chandrikavadapav#Delhi pic.twitter.com/F1aiMmpz2u — viral videos (@video71692) March 14, 2024 (చదవండి: వీధుల్లో కూరగాయలు అమ్మినట్లు మ్యాగీని అమ్మేస్తున్నాడు!) -
స్ట్రీట్ కేఫ్‌లో సర్వ్ చేస్తున్న రోబో వెయిటర్! నెటిజన్లు ఫిదా
రోబోలను పలు రంగాల్లో తీసుకొచ్చి పనిచేయించడాన్ని చూశాం. వాటిని మాల్స్, ఆస్పత్రి, పోలీస్, తదితర శాఖల్లో ప్రవేశ పెట్టి చూపించారు. అలాగే ఇటీవల బెంగుళూరు, నోయిడా, చెన్నె కోయింబత్తూర్ రోబోట్ నేఫథ్య రెస్టారెంట్లను ప్రారంభించి కస్టమర్లను ఆకర్షించింది. పైగా ఇవి అత్యంత ప్రజాధరణ పొందాయి కూడా. ఇప్పుడూ ఏకంగా స్ట్రీట్ కేఫ్ సెంటర్ల్లోకి కూడా ఆ సాంకేతికత వచ్చేసింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఆ వీడియోలో అహ్మదాబాద్‌లోని స్ట్రీట్ కేఫ్ పాప్ అప్ ట్రక్ వినియోగదారులకు రోబోట్ వెయిటర్ ఐస్ గోలాను సర్వ్ చేస్తూ కనిపిస్తుంది. ఇది వినియోగదారులకు రుచిగల ఐస్ గోలాలను చక్కగా సర్వ్ చేస్తుంది. ఈ రోబో పేరు ఐషా, ధర రూ. 1,35,000/-. అందుకు సంబంధించిన వీడియోని ఫుడ్ బ్లాగర్ కార్తీక్ మహేశ్వరి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఈ సాంకేతిక ఆవిష్కరణను చూసి నెటిజన్లు వాహ్! అంటూ ప్రశంసిస్తూ పోస్టలు పెట్టారు. కాగా, నిజం చెప్పాలంటే ఈ రోబోటిక్ సాంకేతికతపై మహమ్మారి సమయంలో చైనా ఎక్కువగా ఆధారపడింది. అఖరికి భద్రతా ప్రోటోకాల్‌లను నిర్వహించడానికి కూడా రోబోట్లతోనే మోహరించింది. View this post on Instagram A post shared by Kartik Maheshwari (@real_shutterup) (చదవండి: ఆస్కార్ వేడుకల్లో హైలెట్‌గా మెస్సీ డాగ్! ఏం చేసిందంటే..!) -
స్ట్రీట్ ఫుడ్.. ఆ ‘పాత’ మధురమే..
కుమారి ఆంటీ ఒక్కసారి మన చూపులన్నీ స్ట్రీట్ ఫుడ్ వైపు మరోసారి లాగేసింది కానీ, వీధిలో నిలబడి ఓ కప్పు చాయ్, ఓ సాయంత్రం నాలుగు ప్లేట్ల పానీపూరీ విత్ ప్యాజ్, కాసింత చాట్ .. బాగా వేయించిన ఫిష్ ఫ్రై.. గరం గరం మిర్చి బజ్జీలు, వేడివేడి ఇడ్లీలు, వావ్ అనిపించే వడాపావ్‌లు.. తినని సగటు జీవి ఉంటాడా..∙మన రోడ్లన్నీ ఘుమ ఘుమలాడే రెస్టారెంట్లే కదా.. మన కడుపు నింపే వారి కడుపు నింపుకొని నలభీములు తిరుగాడే ప్లేస్లే కదా.. పల్లె, పట్నం తేడా లేదు. వెజ్ నాన్ వెజ్ తేడాల్లేవు. ఎక్కడికివెళ్లినా రోడ్డు టిఫిన్ సెంటర్ల నుంచి మినీ ‘స్ట్రీట్ హోటళ్ల’ దాకా ఎన్నో .. ధరలు తక్కువ.. ఉన్నంతలో రుచీ ఎక్కువే. అయితే స్ట్రీట్ ఫుడ్‌కు.. రామాయణ, మహాభారతాలకు ఉన్నంత చరిత్ర ఉంది. ఆనాటి నుంచే నగరాల్లోని వీధుల్లో ‘వేయించిన గింజలు, రొట్టెలు’ వంటివి అమ్మేవారట. పాత రుచులపై మొహం మొత్తిన కొద్దీ, జనం పెరిగిన కొద్దీ.. మెల్లగా కొత్త కొత్త రుచులు పుట్టుకొచ్చాయి. స్థానిక ఆచారాలు, ఆహార అలవాట్లను బట్టి ఎక్కడికక్కడ కొత్త వెరైటీలు మొదలయ్యాయి. షాజహాన్ చాట్ ... మొఘలుల కాలం నాటికి స్ట్రీట్ ఫుడ్ బాగా ప్రాచుర్యంలోకి వచ్చిందట. షాజహాన్ ఆగ్రా నుంచి ఢిల్లీకి రాజధానిని మార్చినప్పుడు.. వర్తకులు, రోజువారీ పనిచేసుకునేవారు మధ్యాహ్నం కడుపు నింపుకోవడానికి వీలుగా ‘చాట్’ స్టాల్స్‌ను ఏర్పాటు చేయించాడని అంటారు. అలా మొదలైన ‘చాట్’ ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా కనిపిస్తోంది. గ్రీస్ .. ఫ్రై ఫిష్.. ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. గ్రీస్ సామ్రాజ్యంలో పది వేల ఏళ్ల కిందే ‘స్ట్రీట్ ఫుడ్’ అమ్మకాలు మొదలయ్యాయట. ప్రధాన రహదారుల పక్కన ్రౖఫై చేసిన చేప ముక్కలను అమ్మేవారట. తర్వాత ఇది రోమ్కు విస్తరించిందని పురాతత్వ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే నాడు ‘స్ట్రీట్ ఫుడ్’ ధనవంతులకేనని, వారు ఇళ్లలో వండుకోకుండా తెప్పించుకుని తినేవారని అంటున్నారు. తర్వాత నగరాలు విస్తరించి, జనాభా పెరిగే కొద్దీ.. ‘స్టాల్స్’ పెరిగిపోయి పేదల ఫుడ్‌గా మారింది. ఈజిప్ట్ బ్రెడ్.. ► క్రీస్తుపూర్వం 1200వ సంవత్సరం సమయంలోనే ఈజిప్ట్‌లోని సిర్సా నగర వీధుల్లో గోధుమ రొట్టెలను అమ్మినట్టు పురాతత్వ తవ్వకాల్లో గుర్తించారు. స్టూడెంట్స్‌కు నంబర్ వన్ స్ట్రీట్ ఫుడ్ ఏనాడో భారత సంస్కృతిలో, చరిత్రలో ఓ భాగమైపోయింది. మెల్లగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలకూ విస్తరించింది. కాలేజీ స్టూడెంట్లు, ఉద్యోగులు, రోజువారీ పనిచేసుకునేవారు, ఏదో ఓ పనిపై బయటికి వెళ్లేవారు.. ఇలా అందరికీ ‘స్ట్రీట్ స్టాల్స్’తోనే కడుపు నిండేది. ఇలాంటి వారు ఎక్కువగా ఎక్కడెక్కడ ఉంటారో.. అలాంటి ప్రాంతాలన్నీ స్ట్రీట్ ఫుడ్‌కు అడ్డాలే. ► ఇటీవల వారణాసిలో నిర్వహించిన అధ్యయనంలోనూ ఈ విషయం స్పష్టమైంది. 25–45 ఏళ్ల మధ్య వయసువారిలో 42 శాతం, 14–21 ఏళ్ల మధ్య వయసువారిలో 61 శాతం మంది ఉద్యోగులు, విద్యార్థులు మధ్యాహ్నం పూట ‘స్ట్రీట్ ఫుడ్’తోనే బండి లాగించేస్తామని చెప్పడం గమనార్హం. ► రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న మహారాణా ప్రతాప్ వ్యవసాయ, సాంకేతిక వర్సిటీ విద్యార్థుల ‘స్ట్రీట్ ఫుడ్’ అలవాటుపై ఇటీవల ఓ సర్వే జరిగింది. రుచిగా, ధర తక్కువగా ఉండ టం, త్వరగా తినేయగలగడం, స్నేహితులతో కలసి సరదాగా వెళ్లి తినడం వల్ల ‘స్ట్రీట్ ఫుడ్’కు ప్రాధాన్యత ఇస్తామని 88.3 శాతం మంది యువకులు, 90 శాతం మంది యువతులు వెల్లడించారు. ఫుడ్ పెట్టే... స్ట్రీట్ స్ట్రీట్‌ఫుడ్ విక్రయించేవారు.. అందరి కడుపు నింపుతూ, తామూ పొట్టపోసుకుంటున్నారు. మన దేశంలో స్ట్రీట్ ఫుడ్‌తో ఉపాధి పొందుతున్నవారు కోటి మంది వరకు ఉంటారని అంచనా. ఇందులో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి పెద్ద నగరాల్లోనే 60 లక్షల మంది దాకా ఉన్నారు. ఈ నగరాల్లో రోజూ ఓ పూట బయటే తిని బతుకు వెళ్లదీస్తున్నవారూ లక్షల మంది ఉన్నారు. ► ఇలా అమ్మేవాళ్లు, తినేవాళ్లు కలసి దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికీ ఓ చెయ్యి వేస్తున్నారు. దేశంలో స్ట్రీట్‌ఫుడ్ రోజువారీ వ్యాపారం విలువ రూ.8 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా. అంటే ఏడాదికి రూ.30 లక్షల కోట్లపైమాటే. ► దేశంలో ప్రాంతాన్ని బట్టి 2 శాతం నుంచి 10 శాతం మంది జనాభా స్ట్రీట్ ఫుడ్, దానిపై ఆధారపడిన పనులతోనే ఉపాధి పొందుతున్నారు. సాటి లేని వెరైటీ.. దేశంలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాలనే తేడా లేదు.. సమోసాలు, మిర్చీలు, బజ్జీలు, పానీపూరీ, చాట్, ఇడ్లీ, దోశ వంటివాటితోపాటు కబాబ్‌లు, ఫ్రైడ్ రైస్‌లు, బిర్యానీల దాకా ‘స్ట్రీట్ స్టాల్స్’లో దొరకని వెరైటీలంటూ లేవు. జిలేబీ వంటి స్వీట్లనూ అలా రోడ్డుపక్కన నిలబడి లాగించేయొచ్చు. స్ట్రీట్ ఫుడ్‌లో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం.. ఏ నగరానికి ఆ నగరమే ప్రత్యేకం. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో పోహా, జిలేబీ కాంబినేషన్ ఊరిస్తే.. ముంబైలో వడాపావ్ నోరూరిస్తుంటుంది. యూపీలో ఆలూ టిక్కీ ఆకర్షిస్తే.. కోల్‌కతా నగర వీధుల్లో చేపల ఫ్రై, కబాబ్ రోల్స్ రారమ్మని పిలుస్తుంటాయి. ► ఒక అంచనా ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోకెల్లా ఇండియాలో ఫుడ్ వెరైటీలు ఎక్కువ. పదో, ఇరవయ్యో కాదు.. స్ట్రీట్‌ఫుడ్‌లోనే వందల రకాలు ఉన్నాయి మరి. స్ట్రీట్ ఫుడ్ పండుగే.. ‘నోయిడా ఉత్సవ్’.. ఇక్కడ అన్ని స్ట్రీట్ ఫుడ్లు దొరకబడును! ఢిల్లీ శివార్లలోని నోయిడాలో ఏటా ఫిబ్రవరి 2 నుంచి 4 వరకు జరిగే ‘నోయిడా ఉత్సవ్’ స్ట్రీట్‌ఫుడ్‌కు వెరీ స్పెషల్. ‘నేషనల్ అసోసియేషన్ ఆఫ్ స్ట్రీట్ వెండార్స్ ఆఫ్ ఇండియా (నస్వీ) ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ఉత్సవంలో.. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు చెందిన విభిన్నమైన స్ట్రీట్ ఫుడ్‌లన్నీ అందుబాటులో ఉంటాయి. ఆహా.. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా..! -
TROLLS పై కుమారి ఆంటీ ఫస్ట్ రియాక్షన్
-
స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీ షాపుపై స్పందించిన సీఎంవో
-
HYD: స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీ షాపుపై స్పందించిన సీఎంవో
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియాలో ఫేమస్ అయిన స్ట్రీట్ ఫుడ్ ఆంటీ కుమారికి షాక్ ఇచ్చిన పోలీసులు.. ఆమె ఫుడ్ కోర్టును బంద్ చేయించిన విషయం తెలిసిందే. ఏ సోషల్ మీడియా అయితే ఆమెను ఫేమస్ చేసిందో.. అదే ఆమెను ఇబ్బందులకు గురిచేసింది. ఆమె వీడియోలు వైరల్ అయ్యాక ఆ ఫుడ్ కోర్టుకు జనాలు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో భారీ సంఖ్యలో జనం వస్తుండడం.. వాహనాల పార్కింగ్తో ఈ మధ్య మాదాపూర్‌లోని ఆమె ఫుడ్ కోర్టు వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీంతో మంగళవారం నాడు పోలీసులు రంగంలోకి దిగారు. ఆమె ఫుడ్‌కోర్టును అక్కడి నుంచి తరలించారని ఆదేశించారు. ఈ క్రమంలో కుమారి ఆంటీ షాపుపై సీఎంవో స్పందించింది. కుమారి ఆంటీ షాపును మార్చాలనే నిర్ణయాన్ని తెలంగాణ సర్కార్ వెనక్కి తీసుకుంది. యథావిధిగా కొనసాగించాలని డీజీపీ, ఎంఏయూడీ అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. ప్రజాపాలనకు ప్రాధాన్యత ఇస్తామంటూ సీఎంవో ట్వీట్ చేసింది. ఇదీ చదవండి: జనం గుండెల్లో జగన్.. కుమారిపై ప్రతిపక్షాల టార్గెట్ అందుకేనా? -
బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? ఇండియాలోనే నెం1 ప్లేస్
స్ట్రీట్ఫుడ్స్కి ఇప్పుడు ప్రాధాన్యత బాగా పెరిగింది. వెరైటీ స్టైల్లో, రుచికరమైన టేస్ట్‌తో స్ట్రీట్‌ఫుడ్ బిజినెస్ బాగా ఫేమస్ అవుతుంది. ఇటీవలె Borzo గ్లోబల్ ఇంట్రా-సిటీ డెలివరీ సర్వీస్ స్ట్రీట్ ఫుడ్స్‌పై సర్వేను నిర్వహించింది. దేశ వ్యాప్తంగా నిర్వహించిన ఈ సర్వేలో ఏయే ప్రాంతాల్లో ఏ స్ట్రీట్‌ఫుడ్ ఫేమస్, టాప్10 స్ట్రీట్ ఫుడ్స్ ఏంటన్నదానిపై ఆసక్తికరమైన వివరాలు ఇప్పుడు చూద్దాం. టాప్-10 స్ట్రీట్ ఫుడ్స్.. 1. బిర్యానీ 2. వడపావ్ 3. మోమోస్ 4. చోలేబతురే 5. సమోసా 6. పావ్‌భాజీ 7. మసాలా దోశ 8. టుండే కబాబ్ 9. పోహ జలేబి 10. కచోరి టాప్10 స్ట్రీట్ జ్యూస్‌లు, షేక్స్: 1. మ్యాంగో మిల్క్ షేక్ 2. కోల్డ్ కాఫీ 3. మోసంబి జ్యూస్ 4. ఫలూదా 5. లస్సీ 6. నిమ్మరసం 7. ఆపిల్ జ్యూస్ 8. బాదం షేక్ 9. కాలా ఖట్టా 10. చెరకు రసం -
మీరు తప్పకుండా టేస్ట్ చేయాల్సిన టాప్15 స్ట్రీట్‌ఫుడ్స్ ఇవే
మన దేశంలో స్ట్రీట్‌ఫుడ్‌కి ఉన్న డిమాండ్ అంతాఇంతా కాదు. ఎందుకంటే వీటిలో దొరికే రుచి పెద్దపెద్ద ఫైవ్‌స్టార్ హోటల్స్‌లోనూ లభించదు కాబట్టి. ఒక్కో ప్రాంతాన్ని బట్టి ఆహార పద్ధతులు మారుతూ ఉంటాయి. ఇక మన దేశంలో ఎన్నో రకాల ప్రత్యేకమైన, విభిన్నమైన వంటకాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా స్ట్రీట్ ఫుడ్స్ వద్ద కనిపించే జససందోహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే ఈ మధ్య బీటెక్ చాయ్వాలీ దగ్గర్నుంచి, గ్రాడ్యుయేట్ పానీపూరీ వరకు.. ఎంతోమంది యువత సైతం స్ట్రీట్ ఫుడ్ అమ్ముతూ తమకంటూ సొంత గుర్తింపును సంపాదించుకుంటున్నారు. ఏ వీధి చూసినా స్ట్రీట్‌ఫుడ్ వద్ద జనం కిటకిటలాడుతుంటారు. మరి మన దేశంలో తప్పకుండా రుచి చూడాల్సిన స్ట్రీట్‌ఫుడ్స్ ఏంటన్నది చూసేద్దామా.. ఫేమస్ స్ట్రీట్ ఫుడ్స్, అవి ఎక్కడ దొరుకుయన్నది ఓసారి పరిశీలిస్తే.. 1. ముంబైలోని జోగేశ్వరిలో- ఫరీద్ సీఖ్పరాట 2. అర్సలన్ బిర్యానీ- పార్క్ స్ట్రీట్, కోల్‌కతా 3. అంబర్ వడాపావ్- కల్యాణ్, ముంబై 4. బటర్ చికెన్- రాజీందర్ దా డాబా- సఫ్దర్‌జంగ్, ఢిల్లీ 5. మిసల్ పావ్ బేడ్కర్- మిసల్, ఫూణె 6. ప్యాజ్ కచోరి రావత్ మిస్తాన్ బాంఢర్- జైపూర్ 7. మూల్‌చంద్ పరాటా- లాజ్‌పత్ నగర్, ఢిల్లీ 8. షాదాబ్ బిర్యానీ- హైదరాబాద్ 9. సర్దార్ పావ్ భాజీ- ముంబై 10. సౌత్ ఇండియా బెస్ట్ ఉడిపి శ్రీ దర్శిని- ఎల్లిస్ బ్రిడ్జ్, అహ్మదాబాద్ 11. రసగంగా మీల్స్- బెల్లందూర్, బెంగళూరు 12. కొరియన్ వ్రాప్- బెంగళూరు 13. నటరాజ్దహీ భల్లే - చాందిని చౌక్, ఢిల్లీ 14. తండా కబాబ్- లక్నో 15. జోషి దహి వడ- ఇండోర్ ఢిల్లీ, ముంబై ప్రాంతాల్లో స్ట్రీట్‌ఫుడ్‌కి ప్రత్యేకమైన ఫ్యాన్‌బేస్ ఉందనే చెప్పాలి. అక్కడ చాట్, చట్పటా, పావ్‌బాజీ లాంటి ఎన్నో రెసిపిలు బాగా ఫేమస్. దేశంలో టాప్ 10 స్ట్రీట్ ఫుడ్స్ ఎక్కడ దొరుకుతాయంటే.. ఢిల్లీ: రోహిణి, చాందిని చౌక్, రాజౌరు గార్డెన్, లాజ్పుట్ నగర్. ముంబై: మహమ్మద్ అలీ రోడ్, బాంద్రా, అంధేరీ, మలద్, ఘట్కోపర్ హైదరాబాద్: కూకట్పల్లి, ఓల్డ్‌సిటీ, టోలిచోకి పూణె: శివాజీ నగర్, జేఎమ్ రోడ్ -
జీ20 నేతలకు మెనూ సిద్ధం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 9, 10వ తేదీల్లో జరిగే జీ20 శిఖరాగ్ర సదస్సుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా పలువురు ప్రపంచ దేశాల నేతలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఎన్నో పోషకాలతో నోరూరించే భారతీయ తృణధాన్యాల వంటకాల రుచిని వీరికి చూపించనున్నారు. భారత్ మంటపంలో జరుగుతున్న శిఖరాగ్రం ఏర్పాట్లను జీ20 స్పెషల్ సెక్రటరీ ముక్తేశ్ పర్దేశి ఆదివారం పీటీఐకి వివరించారు. ‘మన దేశ స్ట్రీట్ ఫుడ్, ప్రాంతీయ, స్థానిక వంటకాలను వారికి సరికొత్త రీతిలో పరిచయం చేయనున్నాం. ఢిల్లీలోని చాందినీ చౌక్ తదితర ప్రాంతాల్లోని స్ట్రీట్ ఫుడ్‌కు ఎంతో పేరుంది. ఇక్కడ ఏర్పాటు చేయనున్న మీడియా సెంటర్లో భారతీయ స్ట్రీట్ ఫుడ్ రుచిని ఆస్వాదించొచ్చు’అని పర్దేశి వివరించారు. ప్రపంచదేశాల నేతల సతీమణుల కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఆయన చెప్పారు. ‘నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్‌లో షాపింగ్ అనుభవంతో కూడిన భారతీయ ప్రసిద్ధ హస్తకళల వారసత్వంపై లైవ్ షోలు ఏర్పాటుచేశాం. నేతలు, ప్రతినిధులకిచ్చే బహుమతుల ఎంపికలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం’అని చెప్పారు. ‘ప్రపంచ నాయకులకిచ్చే బహుమతులు గౌరవభావాన్ని పెంచేలా, వారి మనస్సును ఆకట్టుకునేలా ఉండాలని ప్రధాని చెప్పారు. ఆ మేరకు తివాచీలు, హస్తకళల వస్తువులు, పెయింటింగ్‌ల వంటి వాటితో జాగ్రత్తగా తయారు చేసిన జాబితాను అందజేశాం’అని తెలిపారు. శిఖరాగ్రానికి వివిధ దేశాల నుంచి 10 వేల మందికి పైగా తరలిరానున్నారని పర్దేశి చెప్పారు. ‘శిఖరాగ్రంలో చివరి సెషన్లో జీ20 తదుపరి అధ్యక్ష హోదాలో బ్రెజిల్ లాంఛనప్రాయంగా బాధ్యతలను చేపడుతుంది. నవంబర్ 30వ తేదీన ప్రధాని బ్రెజిల్‌కు వెళ్లి బాధ్యతలను అప్పగించే అవకాశం లేకపోవడంతో ఈ మేరకు నిర్ణయించారు’అని పర్దేశి చెప్పారు. -
వేడి వేడి ఉల్లి పుష్పము
పకోడీలు, బజ్జీలు తెలుసు. కాని ఉల్లిపాయను తామరపువ్వులా ఒలిచి శనగపిండిలో కలిపి నూనెలో వేయించి ఉల్లి పుష్పంగా తయారు చేసి సర్వ్ చేస్తే 11 లక్షల వ్యూస్ లొట్టలేశాయి. వడోదర స్ట్రీట్‌ఫుడ్‌లో తాజా హల్చల్ ఇది. స్ట్రీట్‌ఫుడ్ ఎంత నోరూరించేదిగా ఉన్నా శుభ్రత పాటించరనే కంప్లయింట్‌తో కొందరు తినరు. కాని వడోదరలోని ఈ తాజా చిరుతిండి హల్చల్ చేయడమే కాక అందరి మన్ననా పొందింది. ‘చేస్తే ఇంత శుభ్రంగా చేయాలి’ అనే మెచ్చుకోలు అందుకుంది. వడోదర (గుజరాత్)లోని ఇద్దరు వ్యక్తులు ప్రత్యేకమైన స్టాల్ పెట్టి ఈ ‘ఉల్లి పుష్పం’ (ఉల్లి బజ్జీ) అమ్ముతున్నారు. ఇందుకు పెద్దసైజు ఉల్లిగడ్డలను వాడుతున్నారు. వాటిని పువ్వులా కట్ చేసే మిషన్‌ను తయారు చేయించుకున్నారు. శుభ్రంగా వొలిచిన ఉల్లిపాయను ఈ మిషన్ కింద పెడితే పువ్వులా రెక్కలు వచ్చేలా కట్ చేస్తుంది. దానిని శనగపిండిలో ముంచి వేడి వేడి నూనెలో వేయిస్తే ఉల్లిపువ్వు ఆకారంలో బజ్జీలు తయారవుతున్నాయి. ఇవి చూడటానికి ఆకర్షణీయంగా ఉండటంతో జనం ఎగబడుతున్నారు. అంతే కాదు చేస్తున్న పద్ధతి శుభ్రంగా ఉండటంతో సంకోచం లేకుండా తింటున్నారు. ఒక వ్లోగర్ ఈ ఉల్లిపువ్వు బజ్జీ తయారీని వీడియో తీసి ఇన్‌స్టాలో పెడితే క్షణాల్లో 11 లక్షల వ్యూస్ వచ్చాయి. ‘కొత్త కొత్త ఆలోచనలే వ్యాపారాన్ని నిలబెడతాయి’ అంటున్నారు. అందరి దగ్గరా ఉల్లిపాయలు ఉంటాయి. అందరూ బజ్జీలు వేస్తారు. కాని ‘ఉల్లిపువ్వు బజ్జీ’ అనే ఐడియా వీరికే వచ్చింది. ఆ ‘ఎక్స్’ ఫ్యాక్టర్ ఉన్నవాళ్లనే విజయం వరిస్తుంది. కొత్తగా ఆలోచించండి... పెద్ద విజయం సాధించండి... అని ఈ ఉల్లిపువ్వు కరకరలాడుతూ సందేశం ఇస్తోంది. -
క్రిస్పీ..క్రిస్పీ పానీ పూరీ లవ్: గూగుల్ డూడుల్ ఇంటరాక్టివ్ గేమ్
పానీ పూరీ, గోల్ గప్పా, ఫుచ్కాస్ పేరేదైనా ఈ మాట వివగానే నోట్లో ‘పానీ’ ఊరాల్సిందే కదా? దేశ వ్యాప్తంగా అంత పాపులారిటీ ఉంది పానీ పూరీకి. భారతదేశం అంతటా పలు ప్రాంతాల్లో రకరకాలుగా పిలుచుకున్నప్పటికీ స్ట్రీట్ ఫుడ్‌లో ఇదే రారాణి. అందుకే సెర్చి ఇంజీన్ దిగ్గజం గూగుల్ కూడా ప్రాధాన్యత ఇచ్చింది. ఇంటరాక్టివ్ గేమ్ డూడుల్ పానీ పూరీని వేడుక జరుపుతోంది.ఇంటరాక్టివ్ గేమ్ డూడుల్‌లో, ప్రత్యేకమైన గేమ్‌తో 'పానీ పూరీ' వేడుక జరుపుతోంది. 2015, జూలై 12న మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని ఒక రెస్టారెంట్ 51 రకాల పానీ పూరీ రుచులను అందించి ప్రపంచ రికార్డ్‌ను సాధించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని, ఎనిమిదో వార్షికోత్సవంగా ఈ విశేషమైన రికార్డును సెలబ్రేట్ చేస్తోంది. ఇందుకోసం ఇంటరాక్టివ్ గేమ్‌ను ఆడే అవకాశాన్ని వినియోగదారులకు అందిస్తోంది. ఇంటరాక్టివ్ గేమ్ డూడుల్‌లో పానీ పూరీ ఆర్డర్ ఇవ్వొచ్చు. తద్వారా వీధి వ్యాపారులకు సాయం చేయడంతోపాటు, ప్రతి కస్టమర్‌ను సంతోషంగా ఉంచాలనేది ప్రధాన లక్ష్యంమని గూగుల్ తెలిపింది. వినియోగదారులు వారి రుచి , పరిమాణం ప్రాధాన్యతకు సరిపోయే పూరీలను ఎంచుకోవాల్సి ఉంది. ఈ ఇంటర్యాక్టివ్ గేమ్ ఆడాలంటే గూగుల్ డాట్ కామ్‌కు లాగిన్ చేయండి పైన ఉన్నడూడుల్పై క్లిక్ చేయండి టైమ్, లేదా రిలాక్స్డ్ తింటారా అనే మోడ్ ఎంచుకోవాలి? సరైన పానీ పూరీ ఫ్లేవర్‌పై క్లిక్ చేయడమే.. ద్రౌపది క్రియేటివిటీకి ప్రతి రూపమే పానీ పూరీ అంతేకాదు ఈ పానీ పూరీకి పెద్ద చరిత్రే ఉందట, పురాణ మహాభారత కాలంలో కొత్తగా పెళ్లయిన ద్రౌపదికి తన ఐదుగురు భర్తలకు ఉన్న కొద్ది వస్తువులతోనే ఏదైనా కొత్తగా వండి పెట్టాలనే చాలెంజ్ వచ్చిందంట. ముఖ్యంగా కొద్దిగా మిగిలిన బంగాళదుంపలు, ఇతర కూరగాయలు, చాలా కొంచెం గోధుమ పిండితోనే చేయాలి. ఇక్కడే ద్రౌపది తన క్రియేటివిటీని ప్రదర్శించింద. ఆలూ,ఇతర కూరలతో స్టఫింగ్ తయారు చేసి, ఉన్న కొద్దిపాటి పిండితోనే పూరీలు చేసి పెట్టిందట. అలా పానీ పూరీ తయారైందని గూగుల్ పేర్కొంది. ఆహా అనరా మైమరచి కాగా మహారాష్ట్ర , ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉడికించిన ఆలూ, చిక్పీస్ మిశ్రమాన్ని పూరీలో స్టఫ్ చేసి, పుదీనా, చాట్ మలాసా యాడ్ చేసి, కారం కారంగా, వేడి వేడిగా ఉండే పానీలో ముంచి, పైన అలా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని క్రిస్పీ పూరీని అలా అమాంతం నోట్లో వేసుకుని, కర కర మంటూ నమిలి మింగుతూ ఉంటే ఆహా.. అనరా మైమరచి అంటారు. ఉత్తర భారతంలో పంజాబ్, జమ్మూ అండ్ కశ్మీర్, న్యూ ఢిల్లీలలో, బంగాళాదుంపలు చిక్‌పీలను మిశ్రమం, జల్జీర నీటిలో ముంచిన ట్రీట్‌నే గోల్ గప్పే లేదా గోల్ గప్పా అంటారు. దీన్నే పుచ్‌కాస్ లేదా ఫుచ్కాస్ అని పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్ ప్రాంతాలలో పిలుస్తారు. అన్నట్టు దీనికి చింతపండు గుజ్జు, బెల్లంతో చేసిన ‘స్వీట్’ కొసమెరుపు. -
జపాన్ జంట మెచ్చిన వంట.. ప్రధాని ట్వీట్ వైరల్
పూణే: భారతదేశంలోని జపాన్ అంబాసిడర్ హిరోషి సుజుకి తన భార్యతో కలిసి పూణే వీధుల్లో విహరించి అక్కడి వీధుల్లో వడాపావ్, మిసాల్ పావ్ తిన్నారు. ఆ రుచికి ఫిదా అయిపోయిన సుజుకి ట్విట్టర్లో నాకు భారతీయ స్ట్రీట్ ఫుడ్ అంటే చాలా ఇష్టం.. కానీ పోటీలో నా భార్య నన్ను ఓడించింది. చాలామంది మిసాల్ పావ్ తినమని నన్ను రికమెండ్ చేశారు. చాలా రుచిగా ఉంది కానీ కొద్దిగా ఘాటు తగ్గించాలని రాసి వీడియోని కూడా జతపరిచారు. దీనికి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ తనదైన శైలిలో చమత్కరించారు. జపాన్ రాయబారి చేసిన ట్వీట్ కు సమాధానమిస్తూ ప్రధాని.. ఓడిపోయినా పర్వాలేదనిపించే పోటీ ఏదైనా ఉందంటే, అది ఇదొక్కటే.. అంబాసిడర్ గారు. భారతదేశ పాక వైవిధ్యాన్ని ఆస్వాదిస్తూ, దాన్ని వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నందుకు సంతోషం. మరిన్ని వీడియోలు చెయ్యండి. అని రాశారు. భారతీయ వంటకాలకు ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలోనే అభిమానులున్నారు. అందులోనూ వడాపావ్ అంటే ఇష్టపడే వాళ్ళు చాలామందే ఉన్నారు. వారిలో ఇప్పుడు జపాన్ అంబాసిడర్ హిరోషి సుజుకి జంట కూడా చేరిపోయారు. I love street food of India🇮🇳 ...but thoda teekha kam please!🌶️#Pune #Maharashtra #VadaPav pic.twitter.com/3GurNcwVyV — Hiroshi Suzuki, Ambassador of Japan (@HiroSuzukiAmbJP) June 9, 2023 This is one contest you may not mind losing, Mr. Ambassador. Good to see you enjoying India’s culinary diversity and also presenting it in such an innovative manner. Keep the videos coming! https://t.co/TSwXqH1BYJ — Narendra Modi (@narendramodi) June 11, 2023 ఇది కూడా చదవండి: అలిగిన అజిత్ పవార్.. మరోసారి అసంతృప్తి? -
డ్యాన్సింగ్ భేల్ పూరీ.. నెటిజన్స్ ఫిదా.. వీడియో వైరల్
'భేల్ పూరీ' భారతదేశంలో స్ట్రీట్ ఫుడ్ స్నాక్స్‌లో ప్రధానమైనది. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఈ వంటకాన్ని తెగ ఇష్టపడతారు. ఒక్కో చోట ఒక్కో ప్రత్యేకత ఉంటుందీ భేల్ పూరీకి. తాజాగా దీనికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన ఓ వీడియో ఫుడ్ లవర్స్‌ను ఆకర్షించింది. ఈ కొత్త వంటకం పేరే డ్యాన్సింగ్ భేల్ పూరీ. ఇందులో ఉపయోగించే 60 రకాల పదార్థాలు మాత్రమే కాదు అది చేసే విధానంలోనే కొత్తదనం ఉంటుంది. దీన్ని తయారు చేసేప్పుడు దుకాణదారుడి ఉత్సాహం, లయబద్దమైన డ్యాన్స్‌తో దీనికి మరింత రుచిని తెచ్చిపెడతాయి. ఈ వీడియోలో దుకాణదారుడు భేల్ పూరీని తయారు చేయడానికి సిద్ధపడినప్పుడు దానికి కావల్సిన అన్ని పదార్థాలను ఓ పాత్రలోకి తీసుకుంటాడు. అనంతరం ఓ ప్రత్యేకమైన విధానంలో లయబద్ధంగా డ్యాన్స్ చేస్తూ ఆ పదార్థాలన్నింటిని కలియబెడతాడు. కిందికి మీదికి తిప్పుతూ అతడు చేసే గారడి చూస్తే.. 'అరె..! భలే తిప్పుతున్నాడే' అనిపించక మానదు. చిటికెలోనే భేల్ పూరీని ప్లేట్లో వేసేస్తాడు. View this post on Instagram A post shared by Rajanmishra (@aapkabhai_foody) ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నెటిజన్స్ స్పందనలతో కామెంట్ బాక్స్ నిండిపోయింది. అతని ఎనర్జీ భేల్ పూరీకి మరింత టేస్టును తీసుకువచ్చిందని కొందరు కామెంట్ చేశారు. అతడు డ్యాన్స్ చేసే క్రమంలో చాలా ఫుడ్ కిందపడిపోతుందని మరికొంతమంది స్పందించారు. ఇదీ చదవండి: ఔరంగజేబును కీర్తిస్తూ సోషల్ మీడియా పోస్టు.. మిన్నంటిన ఆందోళనలు