Tech Jobs
-
కొత్తగా 27.3 లక్షల టెక్ జాబ్స్.. సాఫ్ట్వేర్ కంపెనీ నివేదిక
ముంబై: వర్ధమాన సాంకేతికతల తోడ్పాటుతో కొత్తగా కోట్ల సంఖ్యలో కొలువులు అందుబాటులోకి రానున్నాయి. దీంతో 2023లో 42.37 కోట్లుగా ఉన్న వర్కర్ల సంఖ్య 2028 నాటికి 45.76 కోట్లకు పెరగనుంది. వెరసి అయిదేళ్ల వ్యవధిలో వర్కర్ల సంఖ్య 3.38 కోట్ల స్థాయిలో వృద్ధి చెందనుంది. వినూత్న టెక్నాలజీల దన్నుతో కీలక రంగాల్లో కొత్తగా 27.3 లక్షల టెక్ కొలువులు రానున్నాయి.అమెరికన్ సాఫ్ట్వేర్ కంపెనీ సర్వీస్‌నౌ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ఆర్థిక, సాంకేతిక పరివర్తన కారణంగా తయారీ రంగంలో 15 లక్షలు, విద్యారంగంలో 8.4 లక్షలు, ఆరోగ్య సంరక్షణ రంగంలో 80 లక్షల మేర ఉద్యోగాలు పెరగనున్నాయి. అధునాతన నైపుణ్యాలు అవసరమయ్యే హై–వేల్యూ ఉద్యోగాల కల్పనలో కృత్రిమ మేథ కీలక పాత్ర పోషించనుంది.ఇదీ చదవండి: ఐటీలో కొత్త ట్రెండ్.. మీరొస్తామంటే మేమొద్దంటామా?జనరేటివ్ ఏఐ విభాగం పురోగమించే కొద్దీ ఏఐ సిస్టమ్స్ ఇంజినీర్లు, ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్లు, ప్లాట్‌ఫాం ఓనర్లకు గణనీయంగా ప్రయోజనం చేకూరనుంది. రిటైల్ ప్రొఫెషనల్స్ మెరుగైన అవకాశాలు దక్కించుకునేందుకు సాఫ్ట్వేర్ అప్లికేషన్ డెవలప్మెంట్, డేటా ఇంజినీరింగ్ వంటి విభాగాలకు సంబంధించి తమ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాల్సి ఉంటుంది. -
‘ఎక్స్’లో ఉద్యోగాల కోత.. ఇంజినీర్లు ఇంటికి..!
ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ కంపెనీల్లో లేఆఫ్‌లు కొనసాగుతున్నాయి. తాజాగా ఎలాన్ మస్క్‌కు చెందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (ట్విటర్) భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం.‘ఎక్స్’ అమలు చేస్తున్న లేఆఫ్‌ల ప్రభావం ప్రధానంగా దాని ఇంజనీరింగ్ విభాగం ఉద్యోగులపై పడిందని సంస్థ వర్గాలు, వర్క్‌ప్లేస్ ఫోరమ్ బ్లైండ్‌లోని పోస్ట్‌లను ఉటంకిస్తూ ‘ది వెర్జ్’ నివేదిక పేర్కొంది. తొలగింపునకు గురైన ఉద్యోగుల సంఖ్య ఖచ్చితంగా తెలియరాలేదు. కంపెనీ కోసం మీరు చేసేందేంటో ఒక పేజీ సారాంశాన్ని సమర్పించాలని ఉద్యోగులను కోరిన రెండు నెలల తర్వాత లేఆఫ్‌లు వచ్చాయి.దీనిపై మస్క్ కానీ, ‘ఎక్స్’ అధికారులు గానీ ఇంకా వ్యాఖ్యానించలేదు. స్టాక్ గ్రాంట్ల గురించి ఎంతగానో ఎదురుచూస్తున్న సిబ్బందికి ఇటీవల ఎలాన్ మస్క్ ఈమెయిల్ పంపినట్లు వార్తా నివేదికలు వచ్చాయి. ఉద్యోగుల పనితీరు, ప్రభావం ఆధారంగా వారికి స్టాక్ ఆప్షన్స్ కేటాయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అంటే స్టాక్‌ను పొందడానికి కంపెనీకి తాము చేశామో తెలియజేస్తూ నాయకత్వానికి ఒక పేజీ సారాంశాన్ని సమర్పించాలని సిబ్బందిని ఆదేశించిట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: సాఫ్ట్వేర్ ఇంజినీర్ల పరిస్థితేంటి? కలవరపెడుతున్న గూగుల్ సీఈవో ప్రకటన!ఎలాన్ మస్క్ యాజమాన్యంలో ఎంకెన్ని లేఆఫ్‌లు ఉంటాయోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. 2022లో ట్విటర్‌ను కొనుగోలు చేసిన మస్క్ దాదాపు 80 శాతం అంటే 6,000 మందికిపైగా ఉద్యోగులను తొలగించారు. డైవర్సిటీ, ఇన్‌క్లూషన్, ప్రొడక్ట్ డెవలప్మెంట్, డిజైన్ వంటి అన్ని విభాగాల్లోనూ లేఆఫ్‌లు అమలు చేశారు. కంటెంట్ మోడరేషన్ టీమ్‌ను కూడా విడిచిపెట్టలేదు. -
ఉద్యోగులను తొలగిస్తున్న మెటా
టెక్నాలజీ పరిశ్రమలో ఉద్యోగాల తొలగింపునకు అంతం లేకుండా పోతోంది. ఓ వైపు వేలాదిగా ప్రకటిత కోతలు కొనసాగుతుండగా మరోవైపు అప్రకటిత లేఆఫ్‌ల వార్తలు సైతం వినిపిస్తున్నాయి. తాజాగా టెక్నాలజీ దిగ్గజం మెటా కూడా ఇలాంటి తొలగింపులు చేపట్టింది. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, రియాలిటీ ల్యాబ్‌లతో సహా పలు యూనిట్లలో ఉద్యోగులను తొలగిస్తోందని ఈ విషయం తెలిసిన వ్యక్తులను ఉటంకిస్తూ వెర్జ్ నివేదించింది.దీనిని మెటా ప్రతినిధి ధ్రువీకరించారు. రాయిటర్స్‌కు ఇచ్చిన ప్రకటనలో కంపెనీ దీర్ఘకాలిక వ్యూహాత్మక లక్ష్యాలు, ప్రాంతీయ వ్యూహాలకు అనుగుణంగా సర్దుబాటు చేయడానికి తమ బృందాల్లో మార్పులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. "ఇందులో కొన్ని బృందాలను వేర్వేరు ప్రదేశాలకు తరలించడం, కొంతమంది ఉద్యోగులను ఇతర పాత్రలకు మార్చడం వంటివి ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభావితమైన ఉద్యోగులకు ఇతర అవకాశాలను కనుగొనడానికి మేము కృషి చేస్తాం" అని కంపనీ ప్రతినిధి చెప్పారు.ఇదీ చదవండి: టీసీఎస్.. ఇన్ఫోసిస్‌కు ప్రత్యర్థి కాదా?కాగా వెర్జ్ రిపోర్టులో తొలగిస్తున్న ఉద్యోగాల సంఖ్యను కచ్చితంగా పేర్కొనలేదు కానీ అవి తక్కువ సంఖ్యలోనే ఉన్నట్లు వెల్లడించింది. తొలగింపు సంఖ్యపై మెటా కూడా వ్యాఖ్యానించలేదు. మరో వైపు, తమ రోజువారీ 25 డాలర్ల భోజన క్రెడిట్లను ఉపయోగించి వైన్ గ్లాసులు, లాండ్రీ డిటర్జెంట్, ఇతర గృహోపకరణాలను కొనుగోలు చేశారనే ఆరోపణలపై లాస్ ఏంజిల్స్‌లోని మరో రెండు డజన్ల మంది సిబ్బందిని మెటా తొలగించిందని ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించింది. ఈ నివేదికపై వ్యాఖ్యానించడానికి మెటా నిరాకరించింది. -
ఈ టెక్ కంపెనీ మొదలెట్టేసింది.. 5,600 మంది తొలగింపు!
టెక్ దిగ్గజం సిస్కో చెప్పినట్టే ఉద్యోగుల తొలగింపులు మొదలెట్టేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ సిబ్బందిలో 7 శాతం అంటే సుమారు 5,600 మంది ఉద్యోగులపై ప్రభావం చూపుతూ మరో రౌండ్ తొలగింపులను ప్రకటించింది.సిబ్బందిని తగ్గించే ప్రణాళికలను గత ఆగస్ట్ లోనే సిస్కో సూచించింది. అయితే ఏ వ్యక్తులు లేదా విభాగాలు ప్రభావితం అవుతాయో కంపెనీ పేర్కొనలేదు. స్పష్టత లేకపోవడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. తొలగింపుల గురించి ఉద్యోగులకు సెప్టెంబరు మధ్యలోనే సమాచారం అందింది.టెక్ క్రంచ్ నుండి వచ్చిన నివేదిక సిస్కోలో పని వాతావరణం అధ్వాన్నంగా ఉందని వెల్లడించింది. ఇక్కడి పని వాతావరణాన్ని చాలా మంది ఉద్యోగులు విషపూరితంగా అభివర్ణించారు. తొలగింపులు సిస్కో థ్రెట్ ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ రీసెర్చ్ డివిజన్ అయిన టాలోస్ సెక్యూరిటీపై ప్రభావం చూపాయని నివేదిక పేర్కొంది.ఇదీ చదవండి: ఆర్నెళ్లు ఆలస్యం.. యాక్సెంచర్ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్ఓ వైపు ఉద్యోగాల కోత ఉన్నప్పటికీ కంపెనీ రికార్డ్‌స్థాయి లాభాల్లో కొనసాగుతోంది. సుమారు 54 బిలియన్ డాలర్ల వార్షిక ఆదాయంతో 2024 "రికార్డులో రెండవ బలమైన సంవత్సరం" అని కంపెనీ నివేదించింది. లేఆఫ్ ప్రకటన వెలువడిన రోజునే ఈ ఆర్థిక నివేదిక విడుదలైంది. ఈ సంవత్సరం ప్రారంభంలో ఫిబ్రవరిలోనూ సిస్కో 4,000 మంది ఉద్యోగులను తొలగించింది. -
ఆగష్టులో 27000 మంది!.. ఇలా అయితే ఎలా?
కరోనా మహమ్మారి వ్యాపించిన తరువాత.. ఉద్యోగాలు నీటిమీద బుడగల్లా మారిపోయాయి. ఇప్పటికే లక్షలమంది ఉద్యోగాలు కోల్పోయారు. 2024లో కూడా ఈ సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. ఆగష్టు నెలలో సుమారు 27,000 మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు సమాచారం. ఇందులో ఇంటెల్, సిస్కో, ఐబీఎమ్ వంటి దిగ్గజ కంపెనీలు ఉన్నాయి.కంపెనీలు ఎదుర్కుంటున్న ఆర్థిక మాంద్యం.. ఉద్యోగులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఎప్పుడు ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుందో తెలియక బిక్కుబిక్కుమంటున్నారు. 2024లో ఇప్పటి వరకు సుమారు 422 కంపెనీలు 1.36 లక్షల మంది ఉద్యోగులను తొలగించాయి.సెమీకండక్టర్ లీడర్.. 'ఇంటెల్' ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకోవడానికి 15000 ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం. ఖర్చుల పెరుగుదల.. ఆదాయ వృద్ధి తగ్గడం వంటి కారణాల వల్ల ఉద్యోగుల సంఖ్యను తగ్గించాల్సి వస్తోందని కంపెనీ సీఈఓ పాట్ గెల్సింగర్ పేర్కొన్నారు.సిస్కో కంపెనీ సుమారు 6000 మంది ఉద్యోగులను తొలగించే పనిలో ఉంది. ఈ సంఖ్య కంపెనీ మొత్తం ఉద్యోగులలో 7శాతంగా ఉంది. కంపెనీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), సైబర్ సెక్యూరిటీ మీద దృష్టిపెట్టాలని యోచిస్తోంది. ఇది కంపెనీని అభివృద్ధి మార్గంలో నడిపించడానికి సహాయపడుతుందని సంస్థ సీఈఓ చక్ రాబిన్స్ వెల్లడించారు.ఇదీ చదవండి: వేలకోట్ల సామ్రాజ్యం స్థాపించిన టీచర్ఐబీఎం కంపెనీ రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ కార్యకలాపాలను చైనా నుంచి ఉపసంహరించుకున్న తరువాత సుమారు 1000 మంది కంటే ఎక్కువ ఉద్యోగాలు కోల్పోయారు. జర్మన్ చిప్ తయారీ సంస్థ ఇన్ఫినియన్ కూడా 14000 మందిని తొలగించనున్నట్లు సమాచారం. ఇదే బాటలు డెల్, షేర్‌చాట్ వంటి దిగ్గజాలు కూడా అడుగులు వేస్తున్నాయి. -
397 కంపెనీలు.. 1.3 లక్షల మంది బయటకు
2023 ప్రారంభంలో భారీ ఉద్యోగుల తొలగింపులతో కుదేలైన టెక్ పరిశ్రమ.. 2024లో కూడా కోలుకోవడం లేదు. సంస్థల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకోవడానికి ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు ఏకంగా 130000 మందికి పైగా ఉద్యోగాలను కోల్పోయినట్లు 'లేఆఫ్స్.ఎఫ్‌వైఐ' (Layoffs.fyi) వెల్లడించింది.ఈ సంవత్సరం ఇప్పటి వరకు 397 కంపెనీలలో 130482 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఇటీవలే సిస్కో కంపెనీ మరోసారి ఉద్యోగుల తొలగింపులకు శ్రీకారం చుట్టింది. 2024 ఫిబ్రవరిలో సుమారు 4000 మందిని సిస్కో.. ఈ సారి ఎంతమందిని ఉద్యోగులను తొలగిస్తుందనే విషయాన్ని నాల్గవ త్రైమాసిక ఫలితాలతో వెల్లడించే సమయంలోనే వెల్లడించనుంది.ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఇంటెల్ కూడా ఈ ఏడాదిలోనే ఏకంగా 15000 కంటే ఎక్కువమంది ఉద్యోగులను తొలగించింది. ఇది మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 15 శాతానికి పైనే అని తెలుస్తోంది. డెల్ టెక్నాలజీస్ కూడా ఈసారి దాదాపు 12,500 మంది ఉద్యోగులను తొలగించింది. ఇది దాని మొత్తం వర్క్ ఫోర్స్‌లో దాదాపు 10 శాతం.మైక్రోసాఫ్ట్ గత రెండు నెలల్లో దాదాపు 1,000 మంది ఉద్యోగులను తగ్గించింది. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం కంపెనీ వెల్లడించనప్పటికీ కంపెనీ నుంచి బయటకు వచ్చిన ఉద్యోగులు సోషల్ మీడియాల ద్వారా పేర్కొన్నారు. అదేవిధంగా, సాఫ్ట్వేర్ సంస్థ UKG దాని మొత్తం శ్రామిక శక్తిలో 14 శాతం లేదా 2,200 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇలా వివిధ సంస్థలు ఈ ఏడాది ప్రారంభం నుంచి సుమారు 1.3 లక్షల కంటే ఎక్కువమందిని తొలగించాయి. -
ప్రముఖ కంపెనీ లేఆఫ్స్.. వేలాదిమంది టెకీలు బయటకు
2024లో కూడా ఐటీ ఉద్యోగుల పరిస్థితి గాల్లో దీపంలాగా అయిపోయింది. కరోనా సమయంలో ఉద్యోగాలు పోయి ఇబ్బందులు పడిన సంఘటనలు మరువకముందే.. దిగ్గజ కంపెనీలు సైతం ఇప్పటికే అదే బాటలో నడుస్తున్నాయి. ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నాయి. తాజాగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ప్రొఫెషనల్ సర్వీసెస్ సంస్థ 'కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్' ఏప్రిల్ - జూన్ త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. ఇందులో ఏకంగా 8వేలకంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించినట్లు స్పష్టమవుతోంది.అమెరికా ప్రధాన కేంద్రంగా పనిచేసే కాగ్నిజెంట్ సంస్థలో ఎక్కువమంది భారతీయ ఉద్యోగులు ఉన్నారు. ఈ కంపెనీ జూన్ 2024తో ముగిసిన రెండవ త్రైమాసికంలో 566 మిలియన్ డాలర్ల నికర లాభం పొందింది. ఇది అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే సుమారు 22.2 శాతం ఎక్కువని తెలుస్తోంది.కంపెనీ రాబోయే రోజుల్లో మరిన్ని లాభాలను ఆర్జించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. అయితే కంపెనీ ఎప్పటికప్పుడు తన ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటూనే ఉంది. ఇందులో భాగంగానే.. సంస్థ ఏప్రిల్ - జూన్ త్రైమాసికంలో దాపు 8100 మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది. ఈ సంఖ్య 2024 మొదటి త్రైమాసికం కంటే ఎక్కువే.ఇప్పుడు కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 336300గా ఉన్నట్లు తెలుస్తోంది. 2024 ప్రారంభం నుంచి పెద్ద పెద్ద కంపెనీలు కూడా తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటూ వస్తున్నాయి. అయితే టీసీఎస్, విప్రో, టెక్ మహీంద్రా కంపెనీలో మాత్రం ఉద్యోగులు సంఖ్య కొంత పెరిగింది. కాగా హెచ్‌సీఎల్, ఇన్ఫోసిస్ సంస్థల్లో ఉద్యోగుల సంఖ్య తగ్గింది. -
ఇదే జరిగితే.. టెకీల పరిస్థితి ఏంటి?
ఐటీ ఉద్యోగుల పని వేళలను రోజుకు 10 గంటల నుంచి 14 గంటలకు పొడిగించాలని కర్ణాటక ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీని కోసం కర్ణాటక షాప్స్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, 1961ని సవరించాలని చూస్తోంది. ఇది ఐటీ రంగ సంఘాల నుంచి వ్యతిరేకతను రేకెత్తించింది.రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన సరికాదని.. కర్ణాటక రాష్ట్ర ఐటీ/ఐటీఈఎస్ ఎంప్లాయీస్ యూనియన్ (కేఐటీయూ) సభ్యులు ఇప్పటికే కార్మిక మంత్రి సంతోష్ లాడ్‌తో సమావేశమై ఈ పరిణామానికి సంబంధించి తమ సమస్యలను వినిపించారు. ఈ ప్రభావం రాష్ట్రంలోని 20 లక్షల మంది కార్మికులపై ఉంటుందని అన్నారు.కొత్త ప్రతిపాదన ప్రకారం.. ఐటీ, ఐటీఈఎస్, బీపీఓ సెక్టార్లో పనిచేసే ఉద్యోగి ఒక రోజులో 12 గంటల కంటే ఎక్కువ పని చేయవలసి ఉంటుంది. ప్రస్తుతం కంపెనీలలో ఓవర్టైమ్తో కలిపి గరిష్టంగా 10 గంటలు మాత్రమే పనిచేయడానికి అనుమతి ఉంది. ఒక ఉద్యోగి చేత మూడు నెలల్లో 125 గంటలకు మించి అదనపు పనిగంటలు చేయించకూడదు.ప్రస్తుతం ఈ పనిగంటలు పెంపుకు సంబంధించిన ప్రతిపాదలన మీద చర్చలు మాత్రమే జరుగుతున్నాయి. దీనిపైన తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని రాష్ట్ర కార్మకశాఖ మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదనను ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.ఒక ఉద్యోగి రోజుకు గరిష్టంగా పని చేసే పని గంటలపై ఎటువంటి కట్ ఆఫ్ లేదని కేఐటీయూ సెక్రటరీ సూరజ్ నిడియంగ అన్నారు. వారంలో 48 గంటలకు మించి ఉద్యోగుల చేత పనిచేయించుకోకూడదని కార్మక చట్టాలు చెబుతున్నాయి. పనిగంటలు పెరిగితే.. ఉద్యోగి మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. -
వచ్చే 2-3 ఏళ్లలో 10 లక్షల ఉద్యోగాలు!
భారతదేశ సాంకేతిక రంగంలో రానున్న 2-3 ఏళ్లకుగాను 10 లక్షల మంది టెక్నాలజీ ఇంజినీర్ల అవసరం ఉందని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంగీతా గుప్తా అంచనా వేశారు. విద్యార్థుల్లో కంపెనీలకు అవసరమయ్యే నైపుణ్యాలను పెంచితే తప్పా ఈ డిమాండ్‌ను పూడ్చలేమని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా సంగీతా గుప్తా మాట్లాడుతూ..‘రాబోయే 2-3 ఏళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పాటు ఇతర రంగాల్లో అధునాతన నైపుణ్యాలు కలిగిన దాదాపు 10 లక్షల మంది టెక్ ఇంజినీర్ల అవసరం ఉంది. దురదృష్టవశాత్తు కళాశాలలు విద్యార్థులకు తగినంత ప్రాక్టికల్ నైపుణ్యాలను అందించడం లేదు. దేశవ్యాప్తంగా నెలకొనే ఇంజినీర్ల కొరతను తీర్చాలంటే విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించేలా ప్రభుత్వం శిక్షణ అందించాలి. ఏఐ, బిగ్ డేటా అనలిటిక్స్, సైబర్-సెక్యూరిటీ వంటి రంగాల్లో భారీ ఉద్యోగాలు రానున్నాయి. ప్రస్తుతం ఆయా రంగాల్లో పని చేస్తున్నవారు కూడా అధునాతన నైపుణ్యాలు పెంచుకోవాలి. వేగంగా మారుతున్న డిజిటల్ టెక్నాలజీలో కొలువులు సాధించాలంటే నిత్యం కొత్త సాంకేతికతనే నేర్చుకోవాల్సిందే’నని చెప్పారు.కంపెనీ అవసరాలకు తగిన నైపుణ్యాలు లేకపోవడం వల్ల 80,000 ఉద్యోగాలను భర్తీ చేయలేకపోయామని గత నెలలో టీసీఎస్ తెలిపింది. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఏఐపై శిక్షణ పొందిన ఉద్యోగుల సంఖ్యను కూడా రెట్టింపు చేసినట్లు చెప్పింది. ప్రముఖ ఇంజినీరింగ్, నిర్మాణ సంస్థగా పేరున్న లార్సెన్ అండ్ టూబ్రో లిమిటెడ్ జూన్‌లో తమ ఐటీ, ఐటీ ఆధారిత సేవల యూనిట్లో 20,000 ఇంజినీర్ల కొరత ఉందని పేర్కొంది. 2028లో డిజిటల్ నైపుణ్యాలకు సంబంధించిన డిమాండ్ సరఫరా అంతరం 25 శాతం నుంచి 29 శాతానికి పెరుగుతుందని నాస్కామ్ అంచనా వేసింది. మార్కెట్లో ఉద్యోగ ఖాళీలు ఉన్నప్పటికీ సరైన నైపుణ్యాలు లేక కంపెనీలు కొంత ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తుంది.ఇదీ చదవండి: అసౌకర్యంగా ఉండేందుకు ఎవరూ లగ్జరీ కార్లు కొనరుదేశ టెక్నాలజీ రంగ ఆర్థిక వ్యవస్థ 250 బిలియన్ల డాలర్లు(సుమారు రూ.20 లక్షల కోట్లు)గా ఉంటుందని అంచనా. ప్రస్తుతం ఈ రంగంలో దాదాపు 5.4 మిలియన్ల(54 లక్షల) మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. దేశ స్థూల జాతీయోత్పత్తిలో టెక్నాలజీ సేవలు 7.5 శాతంగా నమోదవుతున్నాయి. -
ఒక్క కంపెనీలోనే త్వరలో 8 వేల మందికి ఉద్యోగాలు!
ప్రముఖ ఐటీ సంస్థ హెక్సావేర్ టెక్నాలజీస్ 2024లో సుమారు 6000 నుంచి 8000 మందికి ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధమైంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతిభావంతులను ఆకర్షించేందుకు కంపెనీ రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తుందని సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ బాలసుబ్రమణియన్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘ప్రపంచవ్యాప్తంగా కంపెనీ వర్క్‌ఫోర్స్‌ను విస్తరించాలని భావిస్తున్నాం. ప్రతిభావంతులైన వ్యక్తులను ఆకర్షించడానికి కంపెనీ స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్‌ను నిర్వహిస్తుంది. ఇండియా, యూఎస్, కెనడా, మెక్సికో, యూకేతో సహా వివిధ దేశాలలో 2024లో 6,000 నుంచి 8,000 మంది ఉద్యోగులను నియమిస్తాం. భారత్‌లో హైదరాబాద్, నోయిడా, కోయంబత్తూర్, దెహ్రాదూన్, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లోని కంపెనీ కార్యాలయాల్లో ఉద్యోగులను నియమించాలని నిర్ణయించాం. టెక్ లీడ్స్, ఆటోమేషన్ టెస్టింగ్ స్పెషలిస్ట్‌లు, ఏఈఎం ఆర్కిటెక్ట్‌లు, బిగ్ డేటా లీడ్స్, వర్క్‌డే ఫైనాన్షియల్ కన్సల్టెంట్లకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది’ అన్నారు.‘నగరాల వారీగా నిర్దిష్ట నియామకాలు ఉంటాయి. హైదరాబాద్, నోయిడా కార్యాలయాల్లో ఐసీఎస్ఎం, హెచ్ఆర్ఎస్డీ, ఫ్రంట్‌ఎండ్, ఎంఎస్డీ, జావా ఎఫ్ఎస్డీ, డాట్నెట్ ఎఫ్ఎస్డీ విభాగాల్లో ఉద్యోగులను నియమిస్తాం. కోయంబత్తూర్, బెంగళూరులో అజూర్ డేటాబ్రిక్స్, పైథాన్ ఏడీఎఫ్ వంటి టెక్నాలజీ నిపుణులకు ప్రాధాన్యం ఇస్తాం. యూఎస్‌లో ఆటోమేషన్ నైపుణ్యం కలిగిన క్లౌడ్ అప్లికేషన్ ఆర్కిటెక్ట్‌లు అవసరం. జావా ఫుల్-స్టాక్ ఇంజినీర్లు, టెస్ట్ అనలిస్ట్‌లు (ఎస్‌డీఈటీ), సీనియర్ జావా ఫుల్-స్టాక్ డెవలపర్లను నియమించాలని యోచిస్తున్నాం. యూకేలో టెస్ట్ మేనేజర్లను (మాన్యువల్, ఆటోమేషన్), డెవొప్స్(అజూర్), సర్వీస్ డెస్క్ ప్రొఫెషనల్స్, ఫుల్-స్టాక్ డెవలపర్లకు (జావా, డాట్నెట్) అవకాశం ఇస్తాం’ అని బాలసుబ్రమణియన్ తెలిపారు.ఇదీ చదవండి: ఫోన్ పే, జీపే, పేటీఎం.. ద్వారా విద్యుత్తు బిల్లు చెల్లించకూడదుఅంతర్జాతీయంగా ప్రముఖ ఐటీ సంస్థలు కాస్ట్‌కటింగ్ పేరిట ఉద్యోగులను తొలగిస్తున్న నేపథ్యంలో కొన్ని కంపెనీలు మాత్రం కొత్తవారికి అవకాశం కల్పిస్తుండడం మంచి పరిణామమని ఐటీ నిపుణులు చెబుతున్నారు. ఫెడ్ రానున్న సమావేశాల్లో కీలక వడ్డీరేట్లను తగ్గిస్తే ఐటీ రంగం ఊపందుకుంటుందని అభిప్రాయ పడుతున్నారు. -
టెకీలకు శుభవార్త.. ‘ఉద్యోగులను తొలగించం’
ఇన్ఫోసిస్ కంపెనీలో ఉద్యోగులను తొలగించే ఆలోచన లేదని సంస్థ సీఈఓ సలీల్‌ఫరేఖ్ స్పష్టం చేశారు. ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. జనరేటివ్‌ఏఐ వల్ల టెక్ కంపెనీలు లేఆఫ్స్ ప్రకటిస్తున్నప్పటికీ ఇకపై తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించబోమని తేల్చి చెప్పారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘సంస్థలో జనరేటివ్‌ఏఐతో సహా వివిధ టెక్నాలజీలను ఏకీకృతం చేస్తున్నాం. ప్రస్తుతం ఉన్న ఉద్యోగులను తొలగించే బదులు సాంకేతిక పురోగతి కొత్త అవకాశాలను సృష్టిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీ క్లయింట్లకు మెరుగైన సేవలందించేందుకు జనరేటివ్ ఏఐలో నియామకాలు కొనసాగిస్తాం. ఇతర కంపెనీల్లాగా ఉద్యోగులను తొలగించాలనే ఆలోచన లేదు. సమీప భవిష్యత్తులో జనరేటివ్‌ఏఐ విభాగానికి భారీ డిమాండ్ ఏర్పడుతుంది. అప్పటివరకు కంపెనీలో నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులు తయారవుతారు. దాంతో ప్రపంచంలోని మరిన్ని పెద్ద సంస్థలకు సేవలందిస్తాం’ అన్నారు.ఇన్ఫోసిస్ ఇటీవల ఉద్యోగుల పనితీరుపై బోనస్ ప్రకటించింది. బ్యాండ్ సిక్స్, అంతకంటే తక్కువ స్థాయి ఉద్యోగులు జనవరి-మార్చి త్రైమాసిక పనితీరుపై బోనస్‌ను అందుకున్నారు. అయితే, బోనస్ రూపంలో ఇచ్చిన సగటు చెల్లింపులు మునుపటి త్రైమాసికంలోని 73 శాతంతో పోలిస్తే 60 శాతానికి పడిపోయాయి.టెక్ కంపెనీలు ఇటీవల ప్రకటించిన త్రైమాసిక ఫలితాల్లో భవిష్యత్తు అంచనాలపై ఆశించిన వ్యాఖ్యలు చేయలేదు. వచ్చే ఒకటి-రెండు త్రైమాసికాల్లోనూ కంపెనీలకు పెద్దగా లాభాలు రావని తేల్చిచెప్పాయి. కొన్ని నివేదికల ప్రకారం..ఈ ఏడాది కూడా గతేడాది మాదిరిగానే టెక్ ఉద్యోగాల్లో కోత తప్పదని తెలిసింది. కాస్టకటింగ్ పేరిట లేఆఫ్స్ ప్రకటిస్తున్న కంపెనీల్లో తిరిగి కొలువులు పుంజుకోవడానికి మరింత సమయం పడుతుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఇన్ఫోసిస్ మాత్రం ఇకపై ఉద్యోగులను తొలగించమని ప్రకటించడం నిరుద్యోగ టెకీలకు కొంత ఊరట కలిగించే అంశమని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
ఇంకా తగ్గని లేఆప్స్ బెడద.. నాలుగు నెలల్లో 80 వేలమంది
కరోనా మహమ్మారి విజృంభించినప్పటి నుంచి.. ఉద్యోగులకు కష్టంకాలం మొదలైపోయింది. కరోనా వైరస్ ప్రభావం తగ్గినా.. లేఆప్స్ మాత్రం తగ్గడమే లేదు. 2024 మొదటి నాలుగు నెలల్లోనే ఏకంగా 80,000 మంది ఉద్యోగాలను కోల్పోయారు.సుమారు 279 టెక్ కంపెనీలు ఇప్పటి వరకు (మే 3 వరకు) 80,230 మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. ఆర్ధిక అనిశ్చితుల కారణంగా.. లాభాలు తగ్గుతున్నాయి. దీంతో టెక్ కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. దీనికి తోడు కొత్తగా పుట్టుకొస్తున్న టెక్నాలజీలు కూడా ఉద్యోగుల మీద తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి.2024లో కూడా ఉద్యోగులను తొలగించిన కంపెనీల జాబితాలో టెస్లా, గూగుల్, యాపిల్ వంటి దిగ్గజ కంపెనీలు ఉన్నాయి.ఏప్రిల్ నెలలో మాత్రమే దిగ్గజ కంపెనీలు 20000 కంటే ఎక్కువమందిని తొలగించాయి. టెకీల పరిస్థితి ప్రస్తుతం గాల్లో దీపం లాగా మారిపోతున్నాయి.యాపిల్ కంపెనీలో స్మార్ట్ కారు, స్మార్ట్ వాచ్ డిస్ప్లే వంటి ప్రత్యేక ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న 600 ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇ-కామర్స్ ప్లాట్ ఫామ్ అమెజాన్ కూడా ఈ బాటలోనే అడుగులు వేసింది.అమెరికన్ కార్ల తయారీ సంస్థ టెస్లా కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో.. ఏకంగా 10 శాతం మందిని విధుల నుంచి తప్పించింది. ఓలా క్యాబ్స్ కూడా 10 శాతం ఉద్యోగులను ఇంటికి పంపించింది. హెల్త్ టెక్ స్టార్టప్ కంపెనీ, వర్ల్ పూల్, టెలినార్ మొదలైన కంపెనీలు కూడా తమ ఉద్యోగులను తొలగించింది. -
టెకీలకు శుభవార్త.. ఈ ఏడాది 10వేల మందికి ఉద్యోగాలు
టెక్ కంపెనీలు జనరేటివ్ ఏఐపై దూకుడుగా పనిచేస్తున్నాయి. సమీప భవిష్యత్తులో వీటిలో అపార అవకాశాలున్నట్లు గుర్తించి ఆదిశగా ముందుకుసాగుతున్నాయి. తాజాగా జనరేటివ్ ఏఐలో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి తమ కంపెనీ సిద్ధమని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సీఈఓ విజయ్ కుమార్ తెలిపారు. మార్చి త్రైమాసిక ఫలితాల సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.కృత్రిమమేధ రంగంలో కంపెనీ చాలా మందికి శిక్షణ ఇచ్చిందని చెప్పారు. ఇప్పటికే సుమారు 25,000 మందికి శిక్షణ ఇవ్వగా, మరో 50,000 మందికి ఈ ఏడాదిలో ట్రెయినింగ్ పూర్తి చేస్తామన్నారు. గడిచిన త్రైమాసికంలో కొత్తగా 2700 మంది ఉద్యోగులను చేర్చుకున్నట్లు తెలిపారు. 2024-25లో పరిస్థితులను బట్టి నియామకాలుంటాయన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఇలాగే కొనసాగిగే కనీసం 10,000 మంది ఫ్రెషర్లకు ఉద్యోగాలిస్తామన్నారు. భవిష్యత్తులో ఏదైనా మార్పులు ఏదురైతే నియామకాల సంఖ్యలోనూ తేడాలుండవచ్చని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: ఏఐ టూల్స్ తయారీ సంస్థల్లో పెట్టుబడి పెంచనున్న ప్రముఖ సంస్థకంపనీ మార్చి త్రైమాసికంలో ఆదాయ వృద్ధి రేటు 5.4%గా నమోదైంది. టెక్ కంపెనీలకు అడ్వాన్స్డ్ టెక్నాలజీలపై క్లౌడ్, జనరేటివ్‌ఏఐ ప్రాజెక్టులు పెరుగుతాయని విజయ్ అంచనా వేశారు. అయితే ఆర్థిక సేవల విభాగంలో మాత్రం కంపెనీలకు ఇబ్బందులు ఎదురుకావొచ్చన్నారు. రానున్న రోజుల్లో జనరేటివ్ ఏఐ ఆధారిత సైబర్ భద్రత, డేటా, క్లౌడ్ ఇమిగ్రేషన్, ప్రైవేటు ఏఐ స్టాక్‌ల నిర్మాణం తదితర విభాగాల్లో ఆర్డర్లు పెరిగే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది. -
ఐటీ జాబ్ కోసం వేచిచూస్తున్నారా.. టెకీలకు శుభవార్త
కాస్ట్‌కటింగ్ పేరిట, అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో గత కొంతకాలంగా ఐటీ కంపెనీలు ఆశించినమేర నియామకాలు చేపట్టలేదు. అయితే క్రమంగా ఈ పరిస్థితులు మారుతున్నాయని యూఎస్‌లోని కంప్యూటింగ్ టెక్నాలజీ ఇండస్ట్రీ అసోసియేషన్ డేటా ద్వారా తెలుస్తుంది. ఇకపై యూఎస్‌లో టెక్ కంపెనీల నియామకాలు పుంజుకోనున్నాయని ఈ డేటా నివేదించింది. సమీప భవిష్యత్తులో ఐటీ కంపెనీలకు ప్రాజెక్ట్‌ల సంఖ్య పెరుగబోతున్నట్లు డేటా విశ్లేషించింది. అమెరికాలో కార్యాకలాపాలు సాగిస్తున్న భారత టెక్ కంపెనీలకు ఇది శుభపరిణామమని నిపుణులు చెబుతున్నారు. ఆయా కంపెనీల్లో త్వరలో నియామకాలు ఊపందుకోనున్నట్లు అంచనా వేస్తున్నారు. అమెరికాలోని టెక్ కంపెనీలు గత నెలలో 6,000 మంది ఉద్యోగులను కొత్తగా చేర్చుకున్నాయని డేటా ద్వారా తెలిసింది. యూఎస్‌లోని భారత కంపెనీల్లో ప్రధానంగా టీసీఎస్‌లో 50,000 మంది, ఇన్ఫోసిస్‌లో 35,000, హెచ్‌సీఎల్ టెక్‌లో 24,000, విప్రోలో 20,000, ఎల్ అండ్ టీ మైండ్‌ట్రీలో 6,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. త్వరలో ఈ సంఖ్య మరింత పెరుగబోతున్నట్లు తెలిసింది. ఐటీ కంపెనీల్లో ప్రధానంగా సాంకేతిక సేవలు, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగాల్లో భారీ నియామకాలు ఉండబోతాయని సమాచారం. యూఎస్‌లో వివిధ పోజిషన్‌ల్లో పనిచేయడానికి మార్చిలో తమకు దాదాపు 1,91,000 కొత్త టెక్ ఉద్యోగులు అవసరమని కంపెనీలు పోస్ట్ చేశాయి. అంతకుముందు నెల కంటే ఈ సంఖ్య 8,000 అధికంగా ఉండడం గమనార్హం. మొత్తంగా మార్చిలో 4,38,000 యాక్టివ్ టెక్ జాబ్స్ ఉన్నాయని అంచనా. సాఫ్ట్వేర్ డెవలపర్లు, ఐటీ సపోర్ట్ స్పెషలిస్ట్‌ల నియామకాల్లో ఫిబ్రవరి-మార్చి మధ్య కాలంలో పెరుగుదల కనిపించింది. న్యూయార్క్, వాషింగ్టన్, డల్లాస్, చికాగో, లాస్ ఏంజిల్స్, శాన్ ఫ్రాన్సిస్కోలోని కంపెనీలు మార్చిలో అత్యధిక నియామకాలు చేపట్టినట్లు నివేదిక పేర్కొంది. ఇదీ చదవండి: పాతబడేకొద్దీ మరింత ప్రమాదం యూఎస్‌లోని భారత కంపెనీల ఉద్యోగులకు సంబంధించి హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ ఆసక్తికర నివేదిక వెల్లడించింది. దాని ప్రకారం.. యుఎస్ టెక్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న మొత్తం శ్రామికశక్తిలో భారత కంపెనీలు 2 శాతం వాటాను కలిగి ఉన్నాయి. 2023లో యుఎస్‌లో టెక్ ఉద్యోగుల ఉపాధి 1.2% పెరిగింది. 2023 వరకు టెక్ కంపెనీలు దాదాపు 5 లక్షల ఉద్యోగులను తొలగించాయని అంచనా. అప్పటి నుంచి తొలగింపుల పర్వం కాస్త నెమ్మదించిందని నివేదిక తెలిపింది. ప్రస్తుతం కంపనీలు నియామకాల ప్రక్రియ ప్రారంభించడంతో ఉద్యోగులకు డిమాండ్ ఏర్పడి కంపెనీల రాబడి సైతం పెరుగబోతుందని తెలిసింది. రాబోయే క్యూ4 ఫలితాల్లో కంపెనీలు మెరుగైన ఫలితాలు పోస్ట్ చేస్తాయని, ఇక నుంచి కంపెనీల్లో వృద్ధి కనిపిస్తుందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ అంచనా వేసింది. -
చైనాకు యాపిల్ షాక్.. 5 లక్షల జాబ్స్ మనకే..!
ప్రీమియం ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు తయారు చేసే ప్రముఖ కంపెనీ యాపిల్ చైనాకు షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. తమ చైనా ఆధారిత సప్లయి చైన్‌లో సగభాగాన్ని భారత్‌కు తరలించి వచ్చే మూడు సంవత్సరాలలో తమ భారతీయ ఉద్యోగుల సంఖ్యను 5 లక్షలకు పెంచాలని యోచిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. స్థానిక విలువ జోడింపుపై దృష్టి సారించిన యాపిల్.. దేశీయ విలువ జోడింపును 11-12 శాతం నుంచి 15-18 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌గా, ఆర్అండ్డీ హబ్‌గా ఎదుగుతున్న భారత్ ప్రాముఖ్యతకు అనుగుణంగా యాపిల్ ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం, దేశంలో స్థానిక విలువ జోడింపు 14 శాతంగా ఉంది. ఇది చైనాకు చెందిన 41 శాతం కంటే చాలా తక్కువ. యాపిల్ గత రెండు సంవత్సరాలుగా భారతదేశంలో తన ఉనికిని గణనీయంగా పెంచుకుంది. తయారీ, రిటైల్ రెండింటిపైనా దృష్టి సారించింది. దేశంలో మొదట్లో పాత ఐఫోన్ మోడల్‌లు అసెంబుల్ చేయగా, ఇప్పుడు ఐఫోన్ 15 మోడళ్లను కూడా తయారు చేస్తోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో యాపిల్ భారతదేశంలో 14 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్లను అసెంబుల్ చేసిందని నివేదికలు సూచిస్తున్నాయి. యాపిల్ కంపెనీ ఫాక్స్‌కాన్, పెగాట్రాన్ అనే రెండు ప్రధాన తయారీ భాగస్వాములను కలిగి ఉంది. వీటి ద్వారా వరుసగా 67 శాతం, 17 శాతం ఐఫోన్లు అసెంబుల్ అవుతున్నాయి. అదనంగా కర్ణాటకలోని విస్ట్రాన్ ప్లాంట్‌ను నిర్వహిస్తున్న టాట్ గ్రూప్ 6 శాతం ఐఫోన్లను అసెంబుల్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అసెంబుల్ చేస్తున్న ఏడు ఐఫోన్లలో ఒకటి ఇప్పుడు భారతదేశంలోనే అసెంబుల్ అవుతోంది. -
లే ఆఫ్స్.. 32000 మంది టెకీలు ఇంటికి - అసలేం జరుగుతోంది?
2024లో కూడా టెక్ పరిశ్రమలో ఉద్యోగాల కోతలు భారీగానే ఉన్నాయి. ఇప్పటి వరకు ఏకంగా 32,000 మంది టెకీలు తమ ఉద్యోగాలను కోల్పోయినట్లు Layoffs.fyi డేటాలో వెల్లడించింది. తాజాగా Snap Inc కంపెనీ 10 శాతం మంది ఉద్యోగులను (540 మంది) తగ్గించినట్లు ప్రకటించింది. దీనితో పాటు Okta Inc సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఈ నెల ప్రారంభంలోనే.. ఖర్చులను తగ్గించుకోవడానికి సిబ్బందిలో ఏకంగా 7 శాతం మంది ఉద్యోగులను (400 మంది) తగ్గించింది. అమెజాన్, సేల్స్ ఫోర్స్, మెటా వంటి దిగ్గజ కంపెనీలు సైతం 2024లో ప్రారంభం నుంచి సిబ్బందిని తొలగిస్తూనే ఉన్నాయి. ఉద్యోగులను తొలగించడానికి ప్రధాన కారణం పెరుగుతున్న ఖర్చులను తగ్గించుకోవడం మాత్రమే కాదు, ఏఐ వంటి టెక్నాలజీలను ఉపయోగించుకోవడానికి కూడా.. అని స్పష్టమవుతోంది. ప్రస్తుతం చాలా కంపెనీలు 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (AI) ఉపయోగించుకోవడానికి.. ఇందులో నైపుణ్యం కలిగిన ఉద్యోగులను నియమించుకోవడానే సుముఖత చూపుతున్నాయి. దీంతో కొత్త నియమాల సంఖ్య తగ్గడమే కాకుండా.. ఉన్న ఉద్యోగులను కూడా ఇంటికి పంపిస్తోంది. ఇదీ చదవండి: ఒకటే రీజన్.. 3500 మంది ఉద్యోగులు బయటకు..! ఊదుతున్న ఉద్యోగాల సంగతి పక్కన పెదిర్తే.. ఏఐ టెక్నాలజీలో నైపుణ్య కలిగిన లేదా ప్రస్తుతం వినియోగంలో ఉన్న టెక్నాలజీలలో నైపుణ్యాని కలిగిన ఉద్యోగులకు డిమాండ్ అధికంగా ఉంది. ఈ కారణంగానే గత డిసెంబర్ నుంచి జనవరి వరకు పలు కంపెనీలు 2000 మంది ఉద్యోగులను నియమించుకున్నాయి. దీంతో ఏఐ నైపుణ్యం కలిగిన ఉద్యోగుల సంఖ్య 17479కి చేరినట్లు తెలుస్తోంది. -
టాప్ 10 టెక్నాలజీ కంపెనీలు: అరకోటి మంది టెకీలు వీటిలోనే..
ప్రపంచవ్యాప్తంగా టెక్ జాబ్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. మంచి వేతన ప్యాకేజీలు, మెరుగైన లైఫ్ స్టైల్ కారణంగా చాలా వీటిని డ్రీమ్ జాబ్స్‌గా భావిస్తున్నారు. ఇలాంటి టెక్ జాబ్‌లు కల్పించే టెక్నాలజీ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా అనేకం ఉన్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా కేవలం 10 కంపెనీల్లోనే సుమారు అరకోటి మందికిపైగా టెకీలు పనిచేస్తున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ గ్యాడ్జెట్స్ నౌ నివేదిక ప్రకారం.. అత్యధికంగా ఉద్యోగాలు కల్పిస్తున్న టాప్ 10 టెక్నాలజీ కంపెనీల గురించి ఇక్కడ తెలుసుకుందాం.. ▶ప్రపంచ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) సుమారు 1,461,000 మంది ఉద్యోగులతో అగ్రస్థానంలో ఉంది. కంపెనీకి చెందిన క్లౌడ్ కంప్యూటింగ్, అమెజాన్ వెబ్ సర్వీసెస్‌తో సహా వివిధ విభాగాల్లో ఈ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ▶యాపిల్ (Apple)కు సంబంధించిన అతిపెద్ద ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీదారుగా ప్రసిద్ధి చెందిన ఫాక్స్‌కాన్ (Foxconn) 826,608 మంది ఉద్యోగులతో రెండవ స్థానంలో నిలిచింది. ఐఫోన్ల ఉత్పత్తిలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తోంది. ▶జాబితాలో తర్వాతి స్థానంలో ఐటీ కన్సల్టెన్సీ దిగ్గజం యాక్సెంచర్ (Accenture) సుమారు 738,000 మంది ఉద్యోగులతో ఉంది. ▶భారతదేశపు అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) 614,795 మంది గ్లోబల్ వర్క్‌ఫోర్స్ కలిగి ఉంది. ఇది ప్రపంచ ఐటీ పవర్‌హౌస్‌గా మారింది. ▶ఫ్రాన్స్‌కు చెందిన టెలిఫర్ఫార్మెన్స్ (Teleperformance) ప్రపంచవ్యాప్తంగా 410,000 మంది ఉద్యోగులతో కూడిన గ్లోబల్ డిజిటల్ బిజినెస్ సర్వీస్ ప్రొవైడర్. ▶యునైటెడ్ స్టేట్స్కు చెందిన కాగ్నిజెంట్ (Cognizant)లో దాదాపు 351,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ▶మరొక భారతీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys)లో ప్రపంచవ్యాప్తంగా 336,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులతో కన్సల్టింగ్, ఐటీ సేవలలో ప్రత్యేక కంపెనీగా నిలిచింది. ▶జర్మన్ సమ్మేళనం సిమెన్స్ ప్రపంచవ్యాప్తంగా 190 కేంద్రాల్లో సుమారు 3,16,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది. ▶యూఎస్ కేంద్రంగా ఉన్న ప్రముఖ టెక్నాలజీ సంస్థ ఐబీఎం (IBM)లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 288,300 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ▶సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) ప్రపంచవ్యాప్తంగా సుమారు 2,21,000 మంది ఉద్యోగులతో డ్రీమ్ కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. మైక్రోసాఫ్ట్ వర్క్‌ఫోర్స్‌లో దాదాపు 60 శాతం మంది దాని స్వదేశమైన యునైటెడ్ స్టేట్స్ నుంచే ఉన్నారు. -
టెక్ ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్.. ఇక రానున్నవి మంచి రోజులే..!
ప్రపంచవ్యాప్తంగా గత కొన్ని నెలలుగా టెక్నాలజీ కంపెనీల్లో నియామకాలు మందగించాయి. దీంతో టెక్ ఉద్యోగార్థులు జాబ్‌లు దొరక్క సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి ఊరట కలిగించే అధ్యయనం ఒకటి వెలువడింది. ఇక రానున్నవి మంచిరోజులే అని ఆ అధ్యయనం చెబుతోంది. టాలెంట్ సొల్యూషన్స్ ప్రొవైడర్ ‘సీల్’ గ్రూప్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. చాలా కంపెనీలు టెక్నాలజీ, ఇన్నోవేషన్-లీడ్ ఇనిషియేటివ్‌ల వైపు మొగ్గు చూపుతున్నాయి. ఈ క్రమంలో తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో (జీసీసీ) హెడ్‌కౌంట్‌ను పెంచుకోవాలని చూస్తున్నాయి. ప్రత్యేక డిజిటల్ మెషీన్ లెర్నింగ్ నైపుణ్యాలకు డిమాండ్ పెరుగుతోందని ఈ అధ్యయనం తెలిపింది. ఇలాంటి ఉద్యోగాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అప్లైడ్ మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్‌చెయిన్, ఆగ్మెంటెడ్ రియాలిటీ యాప్స్ డిజైన్, ఇంజినీరింగ్, యూఐ/యూఎక్స్ డిజైన్ వంటి ఉద్యోగులను గ్లోబల్ కేపిబిలిటీ సెంటర్లు నియమించుకుంటున్నాయని ‘సీల్’ అధ్యయనం పేర్కొంది. సాఫ్ట్వేర్, ఆటోమోటివ్, ఫార్మాస్యూటికల్స్, బ్యాంకింగ్ ఫైనాన్స్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) రంగాలలో ఈ ఉద్యోగాలు ఎక్కువగా లభిస్తాయని వివరించింది. 96 కంపెనీల నుంచి ఇన్పుట్స్ గతేడాది ప్రారంభమైన లేదా విస్తరించిన 96 కంపెనీల నుంచి తీసుకున్న ఇన్పుట్స్ ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. ఇవి ఇప్పటికే గ్లోబల్ కేపిబిలిటీ సెంటర్లు కలిగి 57,500 మందికి ఉద్యోగాలు కల్పించిన సంస్థలు. ఈ సెంటర్లలో ఏడాదిగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు డిమాండ్ పెరిగినట్లుగా ఈ అధ్యయనం వెల్లడించింది. క్లౌడ్ ఇంజనీర్లు, డేటా ఇంజనీర్లకు కూడా డిమాండ్ పెరిగిందని పేర్కొంది. గత సంవత్సరంలో, ఆటో రంగంలో కంపెనీలు గణనీయంగా గ్లోబల్ కేపిబిలిటీ సెంటర్లును ఏర్పాటు చేశాయని ‘సీల్’ హెచ్ఆర్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో ఆదిత్య నారాయణ్ మిశ్రా తెలిపారు. అధ్యయనం ప్రకారం, బెంగళూరులో 42 శాతం, హైదరాబాద్‌లో 22 శాతం, పూణేలో 10 శాతం, ఢిల్లీలో 8 శాతం జీసీసీలు ఏర్పాటయ్యాయి. ఆఫీస్ నుంచి పని చేసేవే.. అన్ని జీసీసీ ఉద్యోగ అవకాశాలలో దాదాపు 51 శాతం ఆఫీస్ నుంచి పని చేసేవే. వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగాల పరంగా ఐటీ రంగంతో పోల్చితే ఇది తక్కువే. ఐటీ రంగంలో 77 శాతం వర్క్ ఫ్రమ్ హోం పద్ధతిలో నియామకాలు జరుగుతున్నట్లు ఈ అధ్యయనం పేర్కంది. -
టెక్ ఉద్యోగులకు ఊరట! సానుకూల విషయాన్ని చెప్పిన ఐఎల్వో
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) ప్రపంచంలో చాట్‌జీపీటీ (ChatGPT) రాక సంచలనాన్ని సృష్టించింది. తర్వాత క్రమంగా, మరిన్ని కంపెనీలు తమ సొంత ఏఐ సాధనాలతో ముందుకు వచ్చాయి. ఈ ఏఐ టూల్స్‌తో కొలువుల కోత తప్పదని, వేలాది ఉద్యోగాలు కనుమరుగవుతాయనే ఆందోళన సర్వత్రా నెలకొంది. దీనికి తోడు ఎలాన్ మస్క్ సహా అనేక టెక్ కంపెనీ అధినేతలు, సీఈవోలు సైతం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో ఉద్యోగాలకు ముప్పు తప్పదని హెచ్చరించారు. ఈ భయాందోళనల నేపథ్యంలో టెక్ ఉద్యోగులకు ఊరట కలిగించే విషయాన్ని చెప్పింది ఐక్యరాజ్యసమితి (UN)కి చెందిన అంతర్జాతీయ లేబర్ ఆర్గనైజేషన్ (ILO). ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో ఉద్యోగాలకు ఎలాంటి ఢోకా ఉండదని, ఏఐ టెక్నాలజీ ఉద్యోగులను రీప్లేస్ చేయలేదని ఐఎల్వో తాజా అధ్యయనం వెల్లడించింది. ఐఎల్ఓ ఇటీవలి అధ్యయనం ప్రకారం.. ఏఐ టెక్నాలజీ మనుషులు చేసే పనులను మార్చేస్తుంది తప్ప ఉద్యోగాలకు ముప్పు కాబోదు. అయితే ఏఐ రాకతో చాలా ఉద్యోగాలు, పరిశ్రమలు పాక్షికంగా యాంత్రీకరణకు గురవుతాయని ఐఎల్ఓ స్టడీ పేర్కొంది. చాట్‌జీపీటీ వంటి జనరేటివ్ ఏఐ టూల్స్ వల్ల ప్రయోజనమే తప్ప విధ్వంసం ఉండదని వివరిచింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో ఉద్యోగాలేం ఊడిపోవని, కాకపోతే పనిలో నాణ్యత, ఉద్యోగుల పనితీరు మెరుగు వంటి అంశాలకు దోహదం చేస్తుందని ఐఎల్ఓ అధ్యయనం పేర్కొంది. నూతన టెక్నాలజీ ప్రభావం వివిధ ఉద్యోగాలు, ప్రాంతాలకు వేర్వేరుగా ఉంటాయని, పురుషులతో పోలిస్తే మహిళా ఉద్యోగాలపైనే ఈ ప్రభావం కాస్త ఉండే అవకాశం ఉందని ఐఎల్ఓ స్టడీ అంచనా వేసింది. ఇదీ చదవండి: ఏఐ ముప్పు లేని టెక్ జాబ్‌లు! ఐటీ నవరత్నాలు ఇవే.. -
ఏఐ ముప్పు లేని టెక్ జాబ్‌లు! ఐటీ నవరత్నాలు ఇవే..
డిజిటల్ పరివర్తన వేగవంతంగా జరుగుతున్న ప్రస్తుత యుగంలో సంచలనంగా వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ, డేటా సైన్స్ పట్ల దృక్ఫథాన్ని పూర్తిగా మార్చేసింది. ఇది టెక్ పరిశ్రమలో అనేక ఉద్యోగాలకు ముప్పుగా పరిణమించందన్న ఆందోళనల నేపథ్యంలో పూర్తిగా ఆటోమేషన్‌కు ఆస్కారం లేని కొన్ని కెరియర్ మార్గాలు ఉన్నాయి. మానవ అంతర్దృష్టి, సృజనాత్మక సమస్య-పరిష్కారం, భావోద్వేగ మేధస్సుతో ముడిపడిన కొన్ని జాబ్‌లు ప్రస్తుత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధిపత్య కాలంలో కీలకంగా ఉంటాయి. లెర్న్బే వ్యవస్థాపకుడు, సీఈవో కృష్ణ కుమార్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ముప్పు లేని తొమ్మిది రకాల ఐటీ జాబ్‌ల గురించి తెలియజేశారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.. డేటా సైంటిస్టులు డేటా సైన్స్ అనేది డేటా క్లీనింగ్, ప్రీ-ప్రాసెసింగ్ వంటి అనేక అంశాలను ఏఐ ఆటోమేట్ చేసిన ఒక ఫీల్డ్. అయినప్పటికీ, దాని ప్రధాన భాగంలో డేటా సైన్స్‌కు ప్రోగ్రామ్ చేయలేని మానవ అంతర్ దృష్టి, చాతుర్యం అవసరం. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పనితీరు కేవలం అంకెలు, సంఖ్యల్లో మాత్రమే ఉంటుంది. కానీ డేటా సైంటిస్టులు తమ మేధస్సుతో అర్థవంతవంతమైన ఫలితాలను సాధించగలరు. ఏఐ ఎథిసిస్ట్స్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విస్తృతమవుతున్న నేపథ్యంలో ఏఐ ఎథిక్స్ నిపుణుల అవసరం చాలా కీలకంగా మారింది. ఈ నిపుణులు ఏఐ సిస్టమ్‌ల ఎథిక్స్ అమలుకు మార్గనిర్దేశం చేస్తారు. ఏఐ వ్యవస్థలు పారదర్శకంగా, వినియోగదారు గోప్యతను రక్షించే విధంగా ఉండేలా చూస్తూరు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం నుంచి ఉత్పన్నమయ్యే రిస్కులు, సామాజిక చిక్కులను అంచనా వేస్తారు. ఈ పని చేసేవారికి సామాజిక నిబంధనలు, నైతికత, మానవ హక్కుల గురించి లోతైన అవగాహన అవసరం. సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ అసాధారణ నెట్వర్క్ ప్రవర్తన లేదా పొటెన్షియల్ థ్రెట్స్‌ను గుర్తించడం ద్వారా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సైబర్ సెక్యూరిటీకి సహాయపడుతుంది. అయినప్పటికీ, సైబర్ సెక్యూరిటీ నిపుణుల పాత్ర కీలకమైనది. వ్యూహరచన చేయడం, ఏఐ గుర్తించిన అంశాలను సమీక్షించడం, ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న థ్రెట్స్‌ను గుర్తించి సృజనాత్మకంగా స్పందించడం వీరి ముఖ్యమైన విధులు. మానవ మనస్తత్వం సూక్ష్మ నైపుణ్యాలు, సైబర్ నేరస్థుల ఉద్దేశాలను అర్థం చేసుకోవడం వంటి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చేయలేని పనులను వీరు చేస్తారు. సాఫ్ట్వేర్ డెవలపర్లు, ఇంజనీర్లు కోడ్ రాయడం, డీబగ్గింగ్, టెస్టింగ్ కోసం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విలువైన సాధనంగా మారింది. ఏది ఏమైనప్పటికీ, వినూత్న సాఫ్ట్వేర్ రూపకల్పన, వినియోగదారు అవసరాలను అర్థం చేసుకోవడం, సమస్య-పరిష్కారంలో సృజనాత్మకత వంటివి మానవులకు మాత్రమే సాధ్యమైన ప్రత్యేకమైన లక్షణాలు. సాఫ్ట్వేర్ అభివృద్ధిలో నైతిక పరిగణనలు, మానవ ప్రమేయం ఇప్పటికీ అవసరం. యూఎక్స్ డిజైనర్లు యూజర్ ఎక్స్పీరియన్స్ (UX) డిజైనర్లు సహజమైన, యూజర్లను ఆకర్షించేలా ఇంటర్‌ఫేస్‌లను రూపొందిస్తారు. యూజర్లకు మెరుగైన అనుభవాన్ని అందించడానికి మానవ మనస్తత్వం, సాంస్కృతిక అంశాలను అర్థం చేసుకోవాలి. టెస్టింగ్, డేటా అనాలిసిస్ వంటి కొన్ని అంశాలలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సహాయం చేయగలిగినప్పటికీ సంతృప్తికరమైన యూజర్ ఎక్స్పీరియన్స్ రూపొందించడంలో డిజైన్ థింకింగ్, సృజనాత్మకత వంటివి యూఎక్స్ డిజైనర్లు మాత్రమే చేయగలరు. డెవాప్స్ ఇంజినీర్లు డెవలప్మెంట్ ప్రక్రియను క్రమబద్ధీకరించడం, డెవలప్మెంట్, ఆపరేషన్స్ టీమ్స్ మధ్య సమన్వయాన్ని పెంపొందించడం ప్రధానంగా డెవాప్స్ (DevOps) ఇంజనీర్లు చేసే పని. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్‌సైకిల్‌లోని భాగాలను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆటోమేట్ చేయగలదు. కానీ కమ్యూనికేషన్, సహకారం, నిర్ణయం తీసుకోవడానికి మానవ అవసరం కీలకం. ఏఐ/ ఎంఎల్ రీసెర్చర్స్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ (ML) రీసెర్చర్లు ఏఐ డెవలప్మెంట్లో ముందంజలో ఉంటారు. మోడల్ ఆప్టిమైజేషన్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సహాయపడగలిగినప్పటికీ, ఏఐ, ఎంఎల్ పురోగతిని నడిపించే ప్రాథమిక పరిశోధనకు మానవ ఉత్సుకత, చాతుర్యం, క్రిటికల్ థింకింగ్ అవసరం. మానవ రీసెర్చర్లా ప్రశ్నించడం, ఊహించడం, ఆవిష్కరణలు వంటివి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చేయలేదు. టెక్ ప్రాజెక్ట్ మేనేజర్లు ప్రాజెక్ట్ ట్రాకింగ్, రిస్క్ మేనేజ్మెంట్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సహాయపడుతున్నప్పటికీ ప్రాజెక్ట్ మేనేజర్ల పాత్ర కీలకం. టీమ్ కోఆర్డినేషన్, సమస్యలను పరిష్కరించడం, తమ అనుభవం, అంతర్ దృష్టితో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇటువంటి పనులను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చేయలేదు. డేటా స్టోరీటెల్లర్స్ డేటా స్టోరీటెల్లర్లు సంక్లిష్ట డేటాను ఆకర్షణీయమైన కథనంలోకి మార్చే నిపుణులు. డేటాను అర్థమయ్యేలా ప్రదర్శించడానికి వీక్షకుల గురించి లోతైన అవగాహన, సందర్భ భావం, సృజనాత్మకత అవసరం. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ డేటాను హ్యాండిల్ చేయగలదు కానీ మనుషులను అర్థం చేసుకుని వారికి అర్థమయ్యేలా చెప్పలేదు. ఇదీ చదవండి: Millennials: చాలా మంది అప్పడు పుట్టినవాళ్లే! భారత్‌లో ఉద్యోగులపై ఆసక్తికర రిపోర్ట్ -
గూగుల్ జాబ్ అంత ఈజీ కాదు గురూ.. రెజ్యూమ్ ఇలా ఉంటే మాత్రం..
ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం గూగుల్.. ఈ సంస్థలో పని చేయాలని చాలా మంది కలలు కంటారు. కానీ అక్కడ ఉద్యోగం పొందడం అంత సులభం కాదు. గూగుల్ జాబ్ కోసం ఏటా 20 లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేస్తుంటారు. హార్వర్డ్ యూనివర్సిటీలో సీటు సాధించడం కంటే గూగుల్‌లో జాబ్ కొట్టడం చాలా కష్టమని భావిస్తుంటారు. గూగుల్ జాబ్ కోసం తీవ్రమైన పోటీతో పాటు నియామక ప్రక్రియ కూడా అంత ఆషామాషి కాదు. జాబ్ కోసం దరఖాస్తు చేసే అభ్యర్థుల రెజ్యూమ్‌లోని ప్రతి అంశాన్నీ నిశితంగా పరిశీలిస్తారు. ఈ నేపథ్యంలో గూగుల్ కంపెనీ రిక్రూటింగ్ విభాగంలో పనిచేసిన ఓ మాజీ ఎగ్జిక్యూటివ్ అభ్యర్థులకు కొన్ని కిటుకులను తెలియజేశారు. ఈ రెండు తప్పులు చేయొద్దు.. బిజినెస్ ఇన్సైడర్ రిపోర్ట్ ప్రకారం.. నోలన్ చర్చ్ 2012 నుంచి 2015 వరకు గూగుల్ రిక్రూటర్‌గా పనిచేశారు. గూగుల్‌లో ఉద్యోగం ఆశిస్తున్న అభ్యర్థులకు ఆయన కీలక సూచనలు చేశారు. రెజ్యూమ్‌లో నివారించాల్సిన రెండు పెద్ద తప్పులను తెలియజేశారు. కంపెనీలో ఉద్యోగం పొందే అవకాశాలను ఇవి దెబ్బతీస్తున్నాయని చెప్పారు. వీటిలో మొదటిది సూటిగా లేని సమాచారం. అంటే మీ సామర్థ్యం, నైపుణ్యాల గురించి అర్థం కాకుండా పేరాలు పేరాలు రాయడం. మీ రెజ్యూమ్ ఇలా కనిపిస్తే నియామక ప్రక్రియలో ముందుకు వెళ్లే అవకాశం ఉండదని ఆయన చెప్పారు.వ ఇదీ చదవండి ➤ Advice to Job seekers: ఇలా చేస్తే జాబ్ పక్కా! ఐఐటీయన్, స్టార్టప్ ఫౌండర్ సూచన.. ఇక రెండవది స్పష్టత లేకపోవడం. అంటే మీరు మీ నైపుణ్యాలు, సామర్థ్యాల గురించి స్పష్టంగా, క్లుప్తంగా వ్యక్తీకరించాలి. మీరు మీ రెజ్యూమ్‌లో అలా చేయలేకపోతే, ఆఫీస్‌లో మీరు సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయలేరని ఇది సూచిస్తుంది. వీటిని అధిగమించడానికి చాట్‌జీపీటీ, గ్రామర్లీ వంటి ఏఐ సాధనాలను ఉపయోగించుకోవచ్చని చర్చ్ సూచించారు. కాగా వ్యయ నివారణలో భాగంగా గూగుల్ ఇటీవల 12 వేల మంది ఉద్యోగులను తొలగించింది. ఈ నేపథ్యంలో నియామకాల సంఖ్య తక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంపిక ప్రక్రియలో మరింత కఠినంగా ఉంటుంది. కాబట్టి మీ రెజ్యూమ్‌ను ప్రత్యేకంగా, తప్పులు లేకుండా చూసుకోవడం చాలా అవసరం. -
లేఆఫ్స్ విధ్వంసం: ఆరు నెలల్లోనే 2.12 లక్షల మంది ఇంటికి..
కొనసాగుతున్న ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో ఈ ఏడాది (2023) ప్రథమార్థంలో గ్లోబల్ టెక్ సెక్టార్లో పెద్ద కంపెనీలు మొదలుకుని స్టార్టప్‌ల వరకు 2.12 లక్షల మందికిగా ఉద్యోగాలు కోల్పోయారు. లేఆఫ్స్ ట్రాకింగ్ సైట్ ‘లేఆఫ్స్ డాట్ ఎఫ్‌వైఐ’ గణాంకాల ప్రకారం.. జూన్ 30 వరకు 819 టెక్ కంపెనీలు 212,221 మంది ఉద్యోగులను తొలగించి ఇంటికి పంపాయి. ఏడాదిన్నరలో 3.8 లక్షల మంది.. గతేడాది (2022) 1,046 టెక్ కంపెనీలు 1.61 లక్షల మందికిపైగా ఉద్యోగులను తొలగించాయి. 2022 సంవత్సరంతోపాటు 2023 జూన్ వరకు మొత్తంగా దాదాపు 3.8 లక్షల మంది టెక్ ఉద్యోగులు తమ జాబ్స్ కోల్పోయారు. ఇదిలా ఉంటే మరికొన్ని పెద్ద టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగింపును కొనసాగిస్తున్నాయి. గతంలో లెక్కకు మించి చేపట్టిన నియామకాలు, ప్రపంపవ్యాప్తంగా అనిశ్చిత ఆర్థిక పరిస్థితులు, కోవిడ్ సంక్షోభం నుంచి తగిలిన బలమైన దెబ్బలను ఆయా కంపెనీలు ఉద్యోగుల తొలగింపునకు కారణాలుగా చెబుతున్నాయి. భారత్‌లోనూ దారుణంగానే పరిస్థితి భారతీయ టెక్ పరిశ్రమలోనూ పరిస్థితి దారుణంగానే ఉంది. ఈ సంవత్సరం (2023) జూన్ చివరినాటి వరకు 11,000 మందికి పైగా భారతీయ స్టార్టప్ ఉద్యోగులు జాబ్స్ కోల్పోయారు. 2022 ఇదే కాలంలో పోల్చితే ఇది దాదాపు 40 శాతం ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా స్టార్టప్‌ల తొలగింపులలో 5 శాతం భారత్‌లోనే జరిగాయి. Inc42 డేటా ప్రకారం.. 2022లో ఫండింగ్ మందగమనం స్థిరపడినప్పటి నుంచి ఇప్పటి వరకు 102 భారతీయ స్టార్టప్‌లు 27,000 మందికిపైగా ఉద్యోగులను తొలగించాయి. ఐదు ఎడ్టెక్ యునికార్న్‌లు సహా దాదాపు 22 ఎడ్టెక్ స్టార్టప్‌లు ఇప్పటివరకు దాదాపు 10,000 మంది ఉద్యోగులను తొలగించాయి. ఇదీ చదవండి: మాదేం లేదు! వర్క్ ఫ్రం ఆఫీస్‌పై ఇన్ఫోసిస్ సీఈవో కీలక వ్యాఖ్యలు -
భయం గుప్పెట్లో ఉద్యోగులు.. నీటి బుడగలా ఉద్యోగాలు: భారత్‌లోనూ..
గత కొన్ని రోజులుగా ప్రపంచంలోని చాలా దేశాల్లోని అగ్ర కంపెనీలు తమ ఉద్యోగులను భారీగా తొలగించాయి, ఇప్పటికీ తొలగిస్తూనే ఉన్నాయి. ఈ జాబితాలో భారతదేశం కూడా ఉంది. మన దేశంలో ఇప్పటికే దాదాపు 36,400 మంది టెక్ ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. నిజానికి గడిచిన ఆరు, ఏడు నెలల కాలంలో లిడో లర్నింగ్, సూపర్లర్న్, గోనట్స్ వంటి సంస్థలు వంద శాతం ఉద్యోగులను తొలగించగా.. గోమెకానిక్, ఫబల్కేర్, ఎంఫైన్ వంటి కంపెనీలు 70 నుంచి 75 శాతం ఉద్యోగులను తీసివేశాయి. భారతదేశంలో ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించిన సంస్థల జాబితాలో 'బైజూస్' మొదటి స్థానంలో ఉంది. బైజూస్ ఇప్పటికే 4,000 మంది ఉద్యోగులను తొలగించింది. అదే సమయంలో ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ 'స్విగ్గీ' 2020 మే నుంచి ఇప్పటివరకు సుమారు 2,880 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. దీనితో పాటు ఓలా క్యాబ్ సర్వీస్ కంపెనీ ఇప్పటికి నాలుగు విడతలుగా 1,400 మందికి గుడ్ బై చెప్పింది. (ఇదీ చదవండి: Flipkart Summer Offer: వీటిపై 60 శాతం డిస్కౌంట్! మార్చి 26 వరకే..) భారతదేశంలో మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా సుమారు 503 టెక్ కంపెనీలు ఇప్పటికే లక్షకంటే ఎక్కువమంది ఉద్యోగులను తొలగించాయి. ఇందులో అత్యధికంగా ఉద్యోగులను తొలగించిన కంపెనీలలో 'అమెజాన్' కంపెనీ మొదటి స్థానంలో ఉంది. రానున్న రోజుల్లో మరింతమంది ఉద్యోగులు తమ ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
నిరుద్యోగులకు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తీపికబురు
ప్రముఖ టెక్ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ టెక్ నిరుద్యోగులకు దీపావళి పండుగ సందర్భంగా శుభవార్త తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలు క్లౌడ్‌లోకి మారేందుకు సిద్ద పడుతున్న ఈ సమయంలో దానికి సంబంధించిన సేవలను వేగంగా అందించేందుకు అమెజాన్ వెబ్ సర్వీసెస్ బిజినెస్ యూనిట్(ఏడబ్ల్యూఎస్ బీయూ)ను బుధవారం (నవంబర్ 3)న ప్రారంభించింది. ఈ ప్రత్యేక వ్యాపార యూనిట్ కోసం ఏడబ్ల్యుఎస్ ఇంజనీరింగ్, సొల్యూషన్స్, బిజినెస్ టీమ్‌లు సహకరిస్తాయని ఒక ప్రకటన తెలిపింది. "ప్రస్తుతం ఏడబ్ల్యుఎస్ టెక్నాలజీ కోసం దాదాపు 10వేల మంది సిబ్బందికి హెచ్‌సీఎల్ శిక్షణ ఇచ్చింది. భవిష్యత్తులో ఈ సంఖ్యను 20,000 మందికి పైగా నిపుణులకు పెంచాలని యోచిస్తున్నట్లు" సంస్థ తెలిపింది. కొత్త వ్యాపార యూనిట్ మెయిన్ ఫ్రేమ్ అప్లికేషన్లను ఆధునికీకరించడానికి, క్లౌడ్ టెక్నాలజీ ప్రాజెక్టులను దక్కించుకోవడానికి, లక్ష్యాలను సాధించడానికి నిపుణులు అవసరం అని సంస్థ తెలిపింది. హెచ్‌సీఎల్ అనేది ఎడబ్ల్యుఎస్ ప్రీమియర్ కన్సల్టింగ్ పార్టనర్. ఇది మౌలిక సదుపాయాల కల్పన, అప్లికేషన్లు & డేటాను ఆధునీకరించడంలో, వినియోగదారులకు అత్యుత్తమ సేవలందించడం కోసం తీసుకొచ్చినట్లు పేర్కొంది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ & హెడ్(ఎకోసిస్టమ్స్) కళ్యాణ్ కుమార్ మాట్లాడుతూ.. "కంపెనీ #HCLCloudSmart వ్యూహంలో ఏడబ్ల్యూఎస్ బీయూ ఒక ముఖ్యమైన భాగం. వినియోగదారులకు పోటీదారుల కంటే ముందుగా బలమైన క్లౌడ్ వ్యవస్థల నిర్మాణం, సేవలు అందించడంలో ఇది సహాయపడుతుంది" అని అన్నారు. (చదవండి: ప్రతి నెల రూ.1500 పొదుపు చేస్తే.. రూ.35 లక్షలు మీ సొంతం!) -
ఆటోమేషన్.. జాబ్ ఆఫర్లు అపారం!
డిజిటలైజేషన్.. ఆటోమేషన్.. ఇప్పుడు అన్ని రంగాల్లో వినిపిస్తున్న మాట! మానవ ప్రమేయం తగ్గించి ఆటోమేషన్ విధానంలో కార్యకలాపాలు నిర్వహించాలని కంపెనీలు భావిస్తున్నాయి. ఇందుకోసం రోబోటిక్ టెక్నాలజీ వైపు మొగ్గు చూపుతున్నాయి. దాంతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) మొదలు తయారీ వరకు.. అన్ని రంగాల్లో రోబో ఆధారిత సేవలు విస్తరిస్తున్నాయి. ఫలితంగా.. రోబోటిక్స్ రంగం యువతకు కొలువుల వేదికగా మారుతోంది. ఈ నేపథ్యంలో.. రోబోటిక్స్ కొలువులు, తాజా ట్రెండ్స్, అవసరమైన నైపుణ్యాలు, అందుకునేందుకు మార్గాలపై ప్రత్యేక కథనం.. కొన్నేళ్ల క్రితం వరకు మాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో ముఖ్యంగా ఆటోమొబైల్ పరిశ్రమల్లోనే ఇండస్ట్రియల్ రోబోల వినియోగం ఉండేది. క్రమేణా ఇది ఇతర రంగాల్లోకి దూసుకొస్తోంది. ఇప్పుడు ఐటీ, హెల్త్‌కేర్, లాజిస్టిక్స్, హాస్పిటాలిటీ, అగ్రికల్చర్, డిఫెన్స్,స్పేస్ టెక్నాలజీ తదితర విభాగాల్లో సైతం రోబో ఆధారిత కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా భారత్‌లోని ఐటీ సంస్థలు రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్(ఆర్పీఏ) ద్వారా కార్యకలాపాలు నిర్వహించే దిశగా అడుగులు వేస్తున్నాయి. అందుకోసం ఆర్పీఏ నైపుణ్యాలున్న వారిని నియమించుకునే ప్రయత్నంలో ఉన్నాయి. అందుకే ఆటోమేషన్ డిజిటలైజేషన్, ఆటోమేషన్‌ను వేగవంతం చేయడం ద్వారా మానవ ప్రమేయం తగ్గించొచ్చని సంస్థలు భావిస్తున్నాయి. అందుకోసం రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లను వినియోగించాలనే ఆలోచన చేస్తున్నాయి. అంటే.. వ్యక్తులు చేయాల్సిన అనేక కార్యకలాపాలు రోబోల ద్వారా నిర్వహిస్తారు. నాస్కామ్, బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి సంస్థల తాజా నివేదికల ప్రకారం–పది మంది చేసే పనిని ఒక్క రోబో ద్వారా వేగంగా పూర్తిచేయొచ్చు. ఖర్చు కూడా తగ్గుతుంది. అందుకే సంస్థలు రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ వైపు దృష్టిపెడుతున్నాయి. కొత్త కొలువులు ► ముఖ్యంగా ఇటీవల కాలంలో ఐటీ విభాగంలో ఆటోమేషన్ ప్రక్రియ వేగవంతం అవుతోంది. ఐటీ అనుబంధ విభాగంగా పేర్కొనే బీపీఓలో చాట్ బోట్స్, వర్చువల్ అసిస్టెంట్స్ పేరుతో రోబో ఆధారిత సేవలు అందించాలని సాఫ్ట్వేర్ సంస్థలు భావిస్తున్నాయి. ► సంస్థలు నిర్దిష్టంగా ఏదైనా ఒక విభాగంలో రోబోటిక్ సేవలు అందించాలని భావిస్తే.. దానికి సరితూగే విధంగా ప్రోగ్రామింగ్, కోడింగ్ వంటివి సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం రోబోల తయారీ, నిర్వహణ, నియంత్రణకు మానవ నైపుణ్యం తప్పనిసరి. పది లక్షల ఉద్యోగాలు ► నాస్కామ్,బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి సంస్థల తాజా నివేదికల ప్రకారం–2022నాటికి రోబోటిక్స్ విభాగంలో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు పది లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. ► ఐటీ బీపీఓ రంగంలో 2022 నాటికి రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్(ఆర్పీఏ) ఆధారిత సేవలు 70శాతం మేర పెరగనున్నాయి. దీనికి తగ్గట్టుగా 2022 చివరి నాటికి లక్షల ఉద్యోగాలు ఆర్పీఏ, రోబోటిక్స్ విభాగాల్లో లభించనున్నాయని అంచనా. nఒక్క భారత్‌లోనే 2022 నాటికి ఆటోమేషన్ విభాగంలో దాదాపు మూడు లక్షల కొలువులు అందుబాటులోకి రానున్నాయి. నైపుణ్యాలు రోబోటిక్స్ విభాగంలో కొలువులు అందుకోవాలంటే.. నిర్దిష్టంగా కొన్ని నైపుణ్యాలు ఉండాలి. ముఖ్యంగా ప్రోగ్రామింగ్, కోడింగ్ స్కిల్స్; నానో టెక్నాలజీ; డిజైన్ అండ్ టెక్నాలజీ; సంబంధిత కోర్ స్కిల్స్ సొంతం చేసుకోవాలి. ఉదాహరణకు సాఫ్ట్వేర్ రంగంలో రోబోటిక్స్ విభాగంలో రాణించాలంటే.. రోబోల రూపకల్పనకు అవసరమైన స్పీచ్ రికగ్నిషన్, వాయిస్ రికగ్నిషన్ వంటి వాటిపై అవగాహన ఉండాలి. అదే విధంగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మెషీన్ లెర్నింగ్ నైపుణ్యాలు కూడా రోబోటిక్ రంగంలో రాణించేందుకు ఉపయోగపడతాయి. కారణం..రోబోల రూపకల్పన, నిర్వహణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారితంగా ఉండటమే. ఈ రోబోలకు డిమాండ్ ఇండస్ట్రియల్ రోబోట్స్, మెడికల్ రోబోట్స్; హెల్త్‌కేర్ రోబోట్స్, హాస్పిటాలిటీ రోబోట్స్, లాజిస్టిక్స్ రోబోట్స్‌కు డిమాండ్ పెరుగుతోంది. వీటిలోనూ సిగ్నల్ ప్రాసెసింగ్, రోబోటిక్ మోషన్ ప్లానింగ్, ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్,ఏఐ అండ్ రోబోటిక్స్ విభాగాలు మరింత కీలకంగా మారుతున్నాయి. జాబ్ ప్రొఫైల్స్ రోబోటిక్స్ ఇంజనీరింగ్ లేదా రోబోటిక్స్ స్పెషలైజేషన్ చేసిన అభ్యర్థులకు.. రోబోటిక్స్ టెక్నీషియన్స్, రోబోట్ డిజైన్ ఇంజనీర్, రోబోటిక్స్ టెస్ట్ ఇంజనీర్స్, సీనియర్ రోబోటిక్స్ ఇంజనీర్స్, ఆటోమేటెడ్ ప్రొడక్ట్ డిజైన్ ఇంజనీర్, అగ్రికల్చర్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీర్, రోబోటిక్ సిస్టమ్ ఇంజనీర్ వంటి జాబ్ ప్రొఫైల్స్ లభిస్తున్నాయి. ఈ ఉద్యోగాల్లో నియమితులైన వారికి సంస్థ స్థాయి, కార్యకలాపాల ఆధారంగా రూ.మూడు లక్షల నుంచి రూ. పది లక్షల వరకూ వార్షిక వేతనం లభిస్తోంది. స్కిల్స్‌కు మార్గం ► ఇప్పుడు అకడమిక్ స్థాయి నుంచే రోబోటిక్స్ నైపుణ్యాలు పొందే వీలుంది. ► ఐఐటీలు, ఎన్ఐటీలు, ఇతర ప్రముఖ ఇన్స్టిట్యూట్లు.. బీటెక్ స్థాయిలోనే రోబోటిక్స్‌ను మైనర్‌గా అందిస్తున్నాయి. ► ఎంటెక్ స్థాయిలో రోబోటిక్స్ స్పెషలైజేషన్‌తో పూర్తి స్థాయి ప్రోగ్రామ్‌లను సైతం పలు ఇన్స్టిట్యూట్లు అందిస్తున్నాయి. ► ఎంటెక్‌లో మెడికల్ రోబోటిక్స్; సిగ్నల్ ప్రాసెసింగ్; రోబోట్ మోషన్ ప్లానింగ్; ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్; ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ స్పెషలైజేషన్లు అభ్యసించడం ద్వారా ఆర్పీఏ నైపుణ్యాలు సొంతం చేసుకోవచ్చు. ► ఏఐసీటీఈ సైతం రోబోటిక్స్, ఏఐ విభాగాలకు సంబంధించిన స్కిల్స్ అందించేలా కరిక్యులం రూపొందించాలని అనుబంధ కళాశాలలకు మార్గనిర్దేశం చేసింది. ► వీటితోపాటు సీమెన్స్, రోబోటిక్స్ ఆన్లైన్, సర్టిఫైడ్ ఆటోమేషన్ ప్రొఫెషనల్, రోబోటిక్స్ టెక్నీషియన్ అండ్ ఆటోమేషన్ ట్రైనింగ్ వంటి పలు సర్టిఫికేషన్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. సర్టిఫికేషన్ కోర్సులు ► రోబోటిక్స్‌లో పూర్తి స్థాయి కోర్సులు అభ్యసించే అవకాశం లేని విద్యార్థులకు మూక్స్ విధానంలో పలు సర్టిఫికేషన్స్ అందుబాటులోకి వచ్చాయి. వీటిని పూర్తి చేసుకుని నిర్ణీత పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం ద్వారా జాబ్ మార్కెట్లో పోటీ పడే అవకాశం లభిస్తుంది. పలు సంస్థలు రోబోటిక్స్ సర్టిఫికేషన్స్ అందిస్తున్నాయి. అవి.. ► రోబోటిక్స్ టెక్నీషియన్ అండ్ ఆటోమేషన్ ట్రైనింగ్: వెబ్సైట్: www.onlinerobotics.com ► రోబో జీనియస్ అకాడమీ: వెబ్సైట్: www.robogenious.in ► రోబోటిక్స్ ఆన్లైన్: వెబ్సైట్: www.robotics.org ► సర్టిఫైడ్ ఆటోమేషన్ ప్రొఫెషనల్: వెబ్సైట్: www.isa.org రోబోటిక్స్.. ముఖ్యాంశాలు ► రోబోటిక్ ఇంజనీరింగ్ విభాగంలో.. వచ్చే ఏడాది చివరికి ప్రపంచ వ్యాప్తంగా 20 శాతం మేర పెరగనున్న నియామకాలు. ► పీడబ్ల్యూసీ, నాస్కామ్, బ్యాంక్ ఆఫ్ అమెరికా నివేదికల ప్రకారం–వచ్చే ఏడాది చివరికి పది లక్షల ఉద్యోగాలు. ► అంతర్జాతీయంగా లక్షల కొలువులు లభిస్తాయని పలు సర్వేల అంచనా. ► రోబోటిక్ జాబ్స్ అందించడంలో మూడో స్థానంలో భారత్. ► ఈ విభాగాల్లో కనిష్టంగా రూ.మూడు లక్షలు, గరిష్టంగా రూ.10–12 లక్షల వార్షిక వేతనం. ► రోబోటిక్ ఇంజనీర్లు, డెవలపర్స్‌కు సగటున నెలకు రూ.50వేల నుంచి రూ.80వేల వేతనం లభిస్తోంది. ► బ్యాంకింగ్, హెల్త్‌కేర్ వంటి సర్వీస్ సెక్టార్లలో నెలకు రూ.60వేల వరకు వేతనం ఖాయం. n సాఫ్ట్వేర్, ప్రొడక్షన్, మెకానికల్, హెల్త్‌కేర్, ఎలక్ట్రానిక్స్,ఎలక్ట్రికల్, మాన్యుఫ్యాక్చరింగ్ సంస్థల్లో అధిక శాతం నియామకాలు. ఇదే మంచి అవకాశం రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ కార్యకలాపాలు పెరుగుతూ..దానికి సంబంధించిన విభాగాల్లో కొలువులు అందుబాటులోకి వస్తున్నాయి. యువత దీన్ని తమకు అనుకూలంగా మలచుకోవాలి. సంబంధిత నైపుణ్యాలను నేర్చుకునే ప్రయత్నం చేయాలి. రోబోలతో ఉద్యోగాలు తగ్గుతాయన్న మాటలో కొంత వాస్తవం ఉన్నప్పటికీ.. వేల సంఖ్యలో కొత్త ఉద్యోగాలు లభిస్తున్నాయన్న విషయాన్ని గుర్తించాలి. – ప్రొ.కె.మాధవ కృష్ణ, అసోసియేట్ ప్రొఫెసర్, రోబోటిక్స్ రీసెర్చ్ సెంటర్, ఐఐఐటీ–హైదరాబాద్