Telugu News
-
రాధాకృష్ణ పవర్ ప్లాంట్ ఏపీకి చేసిన నష్టం రూ.2500 కోట్లు..
-
వామ్మో 1890 సీసీ ఇంజిన్.. రూ.72 లక్షల బైక్ విడుదల
దేశంలో మరో ఖరీదైన బైక్ విడుదలైంది. ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ‘ఇండియన్ మోటార్‌సైకిల్’ తన అల్ట్రా-ప్రీమియం రోడ్‌మాస్టర్ ఎలైట్‌ను భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర రూ. 71.82 లక్షలు (ఎక్స్-షోరూమ్). దీంతో భారత్‌లో అందుబాటులో ఉన్న అత్యంత ఖరీదైన మోటార్‌సైకిళ్లలో ఒకటిగా మారింది.రోడ్‌మాస్టర్ ఎలైట్ అనేది పరిమిత-ఎడిషన్. ప్రపంచవ్యాప్తంగా 350 యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేశారు. దీన్ని తయారు చేసిన ఇండియన్ మోటార్‌సైకిల్ అనేది హై-ఎండ్ మోటార్‌సైకిళ్లకు ప్రసిద్ధి చెందిన ఐకానిక్ అమెరికన్ బ్రాండ్. భారత్‌లో దీని ఉనికి పరిమితమే అయినప్పటికీ ఆకట్టుకునే లైనప్‌తో అందుబాటులో ఉంది. ఇందులో ఇండియన్ స్కౌట్, చీఫ్టైన్, స్ప్రింగ్ఫీల్డ్, చీఫ్ వంటి మోడల్‌లు ఉన్నాయి.రోడ్‌మాస్టర్ ఎలైట్ ప్రత్యేకతలుపూర్తి స్థాయి టూరింగ్ మోటార్‌సైకిల్‌గా రూపొందిన రోడ్‌మాస్టర్ ఎలైట్ బైక్ డీప్ రెడ్, బ్లాక్ రంగులపై గోల్డ్ హైలైట్లతో ప్రత్యేకమైన పెయింట్ స్కీమ్‌ను కలిగి ఉంది.ఈ బైక్‌లో 'ఎలైట్' బ్యాడ్జింగ్, గ్లోస్ బ్లాక్ డాష్, కలర్-మ్యాచ్డ్ సీట్లు ఉన్నాయి. ఇవి హీటింగ్, కూలింగ్ ఫంక్షన్లను అందిస్తాయి. అదనపు సౌకర్యం, లగ్జరీ కోసం ప్యాసింజర్ ఆర్మ్‌రెస్ట్‌లు, బ్యాక్లిట్ స్విచ్ క్యూబ్‌లు ఉన్నాయి.రోడ్‌మాస్టర్ ఎలైట్‌లో ప్రీమియం 12-స్పీకర్ సౌండ్ సిస్టమ్ ఇచ్చారు. 7 అంగుళాల TFT డిస్ప్లే ఇందులో ఉంది. బ్లూటూత్ కనెక్టివిటీ, యాపిల్ కార్ప్లే ఫీచర్లు ఉన్నాయి. సంప్రదాయ స్పీడోమీటర్, రెవ్ కౌంటర్ గేజ్‌లు ఉన్నాయి.హార్డ్‌వేర్ విషయానికి వస్తే ముందు వైపున టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక వైపు మోనోషాక్ ఉన్నాయి. బ్రేకింగ్ సిస్టమ్‌లో డ్యూయల్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌లు, కాన్ఫిడెంట్ స్టాపింగ్ పవర్ కోసం సింగిల్ రియర్ డిస్క్ ఉన్నాయి. ఇందులో 20.8-లీటర్ల భారీ ఫ్యూయల్ ట్యాంక్ ఉంది.ఇందులో అతి ముఖ్యమైనది 1890 సీసీ V-ట్విన్ 'థండర్‌స్ట్రోక్' ఇంజన్. ఆరు-స్పీడ్ గేర్‌బాక్స్‌తో ఈ పవర్ఫుల్ ఇంజన్ 170 Nm టార్క్‌ను అందిస్తుంది. వీటి కలయిక శక్తివంతమైన, సరికొత్త రైడింగ్ అనుభవాన్ని ఇస్తుంది. -
నీరజ్ ‘గోల్డ్’ గెలిస్తే అందరికీ... ఓ సీఈవో అదిరిపోయే ఆఫర్!
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics 2024)లో బంగారు పతకం సాధిస్తే అందరికీ ఉచిత వీసాలు ఇస్తామని ఆన్లైన్ వీసా స్టార్టప్ సంస్థ అట్లీస్ సీఈవో మోహక్ నహ్తా హామీ ఇచ్చారు. ఆయన ప్రకటించిన ఆఫర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.తన లింక్డ్ఇన్ ప్రొఫైల్‌లో ఓ పోస్ట్‌ను పంచుకుంటూ.. "ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా స్వర్ణం గెలిస్తే నేను వ్యక్తిగతంగా అందరికీ ఉచిత వీసా పంపుతాను" అంటూ ప్రకటించారు. జూలై 30న నహ్తా పోస్ట్ పెట్టిన వెంటనే, ఈ ఆఫర్‌కు సంబంధించి యూజర్లు ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో తన ఆఫర్‌ను వివరిస్తూ మరో పోస్ట్‌ను మోహక్ నహ్తా షేర్ చేశారు."నీరజ్ చోప్రా బంగారు పతకం గెలిస్తే అందరికీ ఉచిత వీసా ఇస్తామని జూలై 30న వాగ్దానం చేశాను. చాలా మంది అడిగారు కాబట్టి, ఇవిగో వివరాలు.." అంటూ తాజా పోస్ట్‌లో పూర్తి వివరాలు అందించారు. పారిస్ ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా ఆగస్ట్ 8న పతకాల కోసం పోటీపడతాడు. ఆయన బంగారు పతకం సాధిస్తే, ఒక రోజంతా వినియోగదారులందరికీ ఒక ఉచిత వీసా అందిస్తామన్నారు. ఆ రోజు అన్ని దేశాలకు వీసా ఖర్చును కంపెనీ భరిస్తుందని ఆయన తెలిపారు.వినియోగదారులు తమ ఈమెయిల్ అడ్రస్‌ను కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే కంపెనీ ఉచిత వీసా క్రెడిట్‌తో యూజర్ తరపున ఖాతాను సృష్టిస్తుందన్నారు. సీఈవో మోహక్ నహ్తా పోస్ట్ లింక్డ్ఇన్ ప్లాట్‌ఫారమ్‌లో భాఈగా రీపోస్ట్‌లు, లైక్‌లు, కామెంట్లను పొందింది. యూఎస్‌లోని శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా ఉన్న అట్లీస్ కంపెనీకి భారత్‌లోని ఢిల్లీ, ముంబైలలో శాఖలు ఉన్నాయి. -
ఏపీ పదోతరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల
సాక్షి,విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదోతరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు 2024 విడుదలయ్యాయి. ఈ ఫలితాలను జూన్ 26 తేదీ (బుధవారం) రాత్రి 8:00 గంటలకు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారులు విడుదల చేశారు. మే 24వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు జరిగిన ఈ పరీక్షల్లో మొత్తం 1,61,877 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, వారిలో 96,938 మంది బాలురు, 64,939 మంది బాలికలున్నారని అధికారులు తెలిపారు. ఇక విడుదలైన ఈ పరీక్షా ఫలితాల్లో 62.21 శాతం మంది విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారు.టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల కోసం క్లిక్ చేయండి -
మస్క్‌కు జాక్‌పాట్ తగలింది.. రూ.4.5 లక్షల కోట్ల వేతనం ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్!
న్యూయార్క్: టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ జాక్ పాట్ కొట్టేశారు. రూ.4.5లక్షల కోట్లు (56 బిలియన్ డాలర్లు) పారితోషికం ఇచ్చేందుకు ఆ సంస్థ వాటా దారులు మస్క్‌కు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో ఆనందానికి అవదుల్లేని మస్క్ తన డ్యాన్స్‌తో సందడి చేశారు. టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో జరిగిన టెస్లా వార్షిక సమావేశంలో వాటా దారులు మస్క్‌కు 56 బిలియన్ డాలర్ల భారీ వేతనం ఇవ్వాలా? వద్ద అన్న అంశంపై ఓటింగ్ జరిగింది. ప్రాథమిక ఓట్ల ఫలితాల ఆధారంగా మస్క్‌కు 56 బిలియన్ డాలర్ల పారితోషికం ఇచ్చేలా పెట్టుబడి దారులు మద్దతు ఇచ్చారని కార్పొరేట్ సెక్రటరీ బ్రాండన్ ఎర్హార్ట్ తెలిపారు.ఎలోన్ మస్క్ 2018లో అన్ని రకాల ప్రయోజనాలు కలిపి 55 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.4.5 లక్షల కోట్లు) వార్షిక వేతనం అందుకున్నారు. కార్పొరేట్ చరిత్రలో ఇదే అత్యధిక పారితోషికం. దీంతో ఆయన ప్రపంచ కుబేరుల్లో ఒకడిగా నిలిచారు. అయితే, మస్క్‌కు అధికంగా చెల్లించారంటూ వాటాదారుల్లో ఒకరైన రిచర్డ్ టోర్నెట్టా.. డెలావర్ కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన డెలావర్ కోర్టు ఈ ఏడాది ప్రారంభంలో టెస్లా సీఈవోకి భారీ వేతనాన్ని రద్దు చేస్తూ తీర్పిచ్చారు. తాజాగా, టెస్లా వాటాదారులు మస్క్‌కు అనుకూలంగా ఓటు వేయడంతో ప్రపంచంలో అత్యధిక వేతనం తీసుకుంటున్న సీఈవోల్లో నెంబర్ వన్‌గా కొనసాగుతున్నారు. Elon Musk dance is 🔥. Tesla shareholders have spoken. pic.twitter.com/GiLWOtt8ZI— Tesla Owners Silicon Valley (@teslaownersSV) June 13, 2024 -
మస్క్‌పై మహిళా ఉద్యోగినుల సంచలన ఆరోపణలు
వాషింగ్టన్ డీసీ : స్పేస్ఎక్స్ అధినేత ఎలోన్ మస్క్ మరో వివాదంలో చిక్కుకున్నారు. స్పేక్స్ఎక్స్‌లో ఇద్దరు ఉద్యోగినులతో మస్క్ శృంగారంలో పాల్గొన్నారంటూ పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. వారిలో ఒక ఉద్యోగిని స్పేస్ఎక్స్ ఇంటర్న్ అని తెలుస్తోంది. మరో ఉద్యోగిని పిల్లల్ని కనాలని బలవంతం చేసినట్లు సమాచారం.మస్క్‌పై ఈ తరహా ఆరోపణలు గతంలోనూ వచ్చాయి. వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం.. 2016లో శృంగరంలో పాల్గొనాలని, అందుకు బదులుగా గుర్రాన్ని కొనుగోలు చేయొచ్చని ఆఫర్ చేశారంటూ స్పేస్ఎక్స్ ఫ్లైట్ అటెండెంట్ ఆరోపించారు.2013లో స్పేస్ఎక్స్కు రాజీనామా చేసిన మరో మహిళను పిల్లల్ని కనాలని మస్క్ పలు సందర్భాల్లో కోరినట్లు సదరు మహిళ చెప్పారంటూ వాల్‌స్ట్రీట్ జర్నల్ తన కథనంలో పేర్కొన్నారు. స్పేస్ఎక్స్లో పని చేస్తున్న ఒక మహిళను మస్క్ రాత్రి పూట తన ఇంటికి రావాలని పదే పదే ఆహ్వానించినట్లు నివేదిక పేర్కొంది. అయితే ఆ ఆరోపణలతో చట్టపరమైన చిక్కుల్లో పడ్డారు. ఎలోన్ మస్క్ తన తీరుతో టెస్లా,స్పెస్ఎక్స్లో వాతావారణం పూర్తిగా దెబ్బతింటోందని ఉద్యోగులతో పాటు ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి తాజా, ఆరోపణలపై మస్క్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. -
భారత్‌లో నాలుగేళ్ల చిన్నారికి బర్డ్‌ఫ్లూ
న్యూఢిల్లీ : భారత్‌లో బర్డ్ ఫ్లూ కేసులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)కీలక ప్రకటన చేసింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన నాలుగేళ్ల బాలుడికి బర్డ్ ఫ్లూ సోకినట్లు నిర్ధారించింది. బాలుడిలో h9n2బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాధి లక్షణాలను గుర్తించినట్లు వెల్లడించింది. బర్డ్ ఫ్లూ వైరస్ లక్షణాలు వెలుగులోకి రావడంతో బాలుడిని అత్యవసర చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చేరిన తర్వాత బాలుడికి శ్వాసకోస సంబంధిత సమస్యలు తలెత్తాయని, ప్రస్తుతం ఐసీయూ వార్డ్‌లో ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.భారత్‌లో ఇది రెండో కేసుభారత్లో H9N2 బర్డ్‌ఫ్లూను మనుషుల్లో గుర్తించడం ఇది రెండోసారి. 2019లో ఒకరు దీని బారినపడ్డారని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. రెండున్నరేళ్ల చిన్నారిలో భారత్‌లో పర్యటించిన జూన్7న ఆస్ట్రేలియాలో రెండున్నరేళ్ల చిన్నారిలో h5n2 బర్డ్‌ఫ్లూ లక్షణాలు కనిపించాయి. అంతకుముందే ఆ చిన్నారి భారత్ నుంచి ఆస్ట్రేలియాకు వచ్చినట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. బర్డ్‌ఫ్లూ లక్షణాలు డబ్ల్యూహెచ్ఓ మేరకు..బర్డ్‌ఫ్లూ వైరస్ సోకితే వ్యాధిగ్రస్తుల్లో కండ్లకలక, కడుపులో అసౌకర్యం, పొత్తికడుపు తిమ్మిరి, వికారం, వాంతులు, గుండెల్లో మంట,మెదడు వాపు,అనాక్సిక్ ఎన్సెఫలోపతి : కార్డియాక్ అరెస్ట్ లేదా మెదడుకు ఆక్సిజన్/ప్రసరణ కోల్పోవడంతో పాటు ఇతర లక్షణాలు ఉత్పన్నమై ప్రాణంతంగా మారుతుందని డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది. బర్డ్‌ఫ్లూ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు బర్డ్‌ఫ్లూ సోకకుండా ఉండేందుకు ముందుగా మూగజీవాలకు దూరంగా ఉండాలి. మూగజీవాల ద్వారా వైరస్లు ప్రభావితమయ్యే ప్రాంతాలకు వెళ్లకపోవడం మంచిదని తెలిపింది.ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో మూగజీవాలు ఉన్న ప్రాంతాలను సందర్శించే ముందు, తర్వాత తప్పని సరిగా సబ్బులతో చేతుల్ని శుభ్రం చేసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ సూచిస్తోంది. -
మూడోసారి NDA కూటమి అధికారం చేపట్టబోతుంది: ప్రధాని మోదీ
2024 ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో బీజేపీ ఎన్డీఏ కూటమి 290 స్థానాల్లో విజయం సాధించింది. ఈ సందర్భంగా ఢిల్లీ కేంద్ర కార్యాలయంలో బీజేపీ సంబరాలు నిర్వహించింది. ఈ సంబరాల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు.మోదీ మాట్లాడుతూ దేశం గర్వించేలా ఎన్నికల్ని నిర్వహించిన ఎన్నికల సంఘానికి అభినందనలు తెలిపారు. సబ్కా సాత్ సబ్ కా వికాస్ మంత్రం గెలిచింది. మూడసారి అధికారంలోకి రాబోతున్నామన్న మోదీ.. ఈ విజయం 140 కోట్ల మంది ప్రజలదని అన్నారు. ఎన్డీఏ కూటమిలోని కార్యకర్తలకు అభినందనలు. జమ్మూ కాశ్మీర్ ఓటర్లు కొత్త చరిత్ర సృష్టించారు. భారత ప్రజాస్వామ్యం ప్రపంచానికి ఆదర్శమని ప్రశంసలు కురిపించారు. అరుణాల్ ప్రదేశ్, సిక్కింలో కాంగ్రెస్ తుడిచి పెట్టుకుపోయింది. ఒడిశాలో కూడా అద్భుత ప్రదర్శన చేశాం. మూడో సారి ఎన్డీఏ అధికారం చేపట్టబోతుంది. మధ్య ప్రదేశ్, గుజరాత్, ఛత్తీగడ్,ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్‌లో బీజేపీ క్లీన్ స్వీప్. కేరళలో తొలిసారి బీజేపీ ఒకసీటు గెలిచింది. బీహార్‌లో ఎన్డీయే కూటమి గెలిచిందని మోదీ తెలిపారు. -
లోక్‌సభ ఎన్నికల ఫలితాలు.. కన్ఫ్యూజన్లో ఎగ్జిట్‌పోల్స్
సార్వత్రిక ఎన్నికల్లో ఆరు విడుతల పోలింగ్ పూర్తయ్యేసరికి ఫలితాలపై ఆసక్తికరమైన చర్చ ప్రారంభమైంది. అసలు పోటీలో లేదనుకున్న ఇండియా కూటమి కొన్ని రాష్ట్రాల్లో గట్టిపోటీ ఇస్తోందనే వార్తలొస్తున్నాయి. ప్రతి దశా కీలకమే అన్నట్టుగా పోలింగ్ సరళి కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. దీంతో జూన్ 1న జోస్యం చెప్పబోయే ఎగ్జిట్‌పోల్ సంస్థలు సైతం కన్ఫ్యూజన్లో ఉన్నట్లు తెలుస్తోంది.అబ్కీ బార్ చార్సౌ పార్ నినాదంతోఅబ్కీ బార్ చార్సౌ పార్ నినాదంతో ఈసారి బీజేపీ ప్రచారంలో అందరికంటే ముందు నిలిచింది. మోదీ చరిష్మాతో మరోసారి అధికారం చేజిక్కించుకోవాలనే పక్కా ప్రణాళికతో కమలదళం ఎన్నికల ప్రచారం కొనసాగించింది. ఓ వైపు మోదీ మరోవైపు అమిత్ షా దేశాన్ని చుట్టేశారు. నాలుగు వందల సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అయితే మొదటి రెండు విడతల పోలింగ్ ముగిసిన తరువాత ఇండియా కూటమి సైతం కాస్త పోటీపడినట్లు కనిపించింది. పుంజుకున్న ఇండియా కూటమిబీహార్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కూటమి బలం పుంజుకుందనే వార్తలు వచ్చాయి. దీంతో ఎన్నికలు ఏకపక్షం కాదనే వాదనలు వినిపించాయి. యూపీలో సైతం తాము చాలా సీట్లు గెలుస్తామని విపక్ష కూటమి ప్రకటించడంతో ఫలితాలపై ఆసక్తికరమైన చర్చ ప్రారంభమైంది. ఎలక్షన్ చివరి అంకానికి చేరుకున్న నేపధ్యంలో ఎన్నికలు నువ్వా నేనా అన్నట్లు జరిగాయనే అభిప్రాయమూ వ్యక్తం అవుతోంది. దీంతో అసలు దేశంలో ఏం జరగబోతుందనే కొత్త చర్చ ప్రారంభం అయింది. చాలామంది ఎలక్షన్ పండితులు బీజేపీ సీట్లు తగ్గుతాయనే అభిప్రాయం చెబుతున్నా..ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందా అనే విషయంపై మాత్రం ఏ ఒక్కరూ కాన్ఫిడెంట్‌గా లేరు.400 సీట్ల టార్గెట్.. ఇది నిజంగా భారీ రికార్డే400 సీట్ల టార్గెట్‌తో రంగంలోకి దిగిన బీజేపీ నిజంగా తన లక్ష్యాన్ని సాధిస్తుందా అనే చర్చతో ఈ సారి సార్వత్రిక ఎన్నికలు ప్రారంభమయ్యాయి. 2019లో సింగిల్‌గా 303 సీట్లు సాధించిన బీజేపీ చరిత్రను తిరగరాసింది. ఇందిరాగాంధీ మరణానంతంరం వచ్చిన సానుభూతితో 1984లో కాంగ్రెస్ పార్టీ 300 మార్కును దాటింది. ఆ తర్వాత మళ్లీ ఏ పార్టీ కూడా సింగిల్‌గా 300 సీట్లు దాటలేదు. కూటమిగా ఎన్డీయే 2019లో ఏకంగా 353 స్థానాలు సాధించింది. ఇది నిజంగా భారీ రికార్డు. తన రికార్డుని తానే తిరగరాస్తానంటూ 400 సీట్లు టార్గెట్ సెట్ చేశారు ప్రధాని మోదీ.బీజేపీ ట్రాప్‌లో ఇండియా కూటమిదీంతో కాంగ్రెస్ కూటమి ప్రచారం కంటే ముందే కుదేలైపోయింది. బీజేపీ ట్రాప్‌లో పడిపోయిన ఇండి కూటమి నాయకులు.. బీజేపీ 400 సాధించలేదంటూ ప్రకటనలు చేసేశారు. కాని బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడానికి 272 సీట్లు చాలన్న చిన్న లాజిక్‌ను కాంగ్రెస్ కూటమి మరిచిపోయింది. తప్పును ఆలస్యంగా తెలుసుకున్న విపక్ష నేతలు తరువాతి కాలంలో అసలు బీజేపీ అధికారంలోకి రాలేదంటూ ప్రకటనలు చేయడం ప్రారంభించారు. అయితే అప్పటికే కీలకమైన రెండు విడతల పోలింగ్ పూర్తైపోయింది. ఈ రెండు విడతల్లో జాతీయ స్థాయిలో మోదీ ఉండాలా వద్దా అనే విషయంపై రెఫరెండంగా ఎన్నికలు జరిగినట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అందుకే మొదటి రెండు విడతల్లో.. పోలింగ్ జరిగిన 190 స్థానాల్లో బీజేపీ హవా కొనసాగినట్లు పోల్ పండిట్లు అంచనా వేస్తున్నారు.నేను పక్కా లోకల్మోదీ హాట్రిక్ నినాదంతో ఎన్నికలు ప్రారంభం కావడానికి ముందే బీజేపీ గెలిచేసిందనే వాదనలు ప్రారంభమయ్యాయి. అయితే మూడు నాలుగు విడతల పోలింగ్ జరిగే సరికి లోక్‌సభ ఎన్నికల్లో లోకల్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ప్రభావితం చూపించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 40 స్థానాలున్న బిహార్‌లో తేజస్వీ యాదవ్ తన ప్రచారంలో ఎక్కువగా నిరుద్యోగం అంశాన్ని హైలైట్ చేశారు. 2019లో బీహార్‌లో ఎన్డీయే కూటమి 39 స్థానాలు గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది. ఈసారి ఇక్కడ కాంగ్రెస్ కూటమి కొన్ని స్థానాలు గెలుస్తుందనే వార్తలు వస్తున్నాయి.ఎన్నికల సరళిపై కొత్త చర్చయూపీలో అఖిలేష్ మీటింగ్స్‌కు సైతం భారీగా జనం హాజరవడం ఎన్నికల సరళిపై కొత్త చర్చకు తెరలేపింది. 80 లోక్‌సభ స్థానాలున్న యూపీలో బీఎస్పీ ఈసారి తన ప్రాభవాన్ని కోల్పోతుందని.. దీనివల్ల లాభపడేది ఎవరనే దానిపై యూపీ రిజల్ట్స్ ఆధారపడి ఉంటాయనేది విశ్లేషకుల అంచనా. ఇక యూపీ తరువాత అతిపెద్ద రాష్ట్రం మహారాష్ట్రలో మరాఠా అస్మితా పేరుతో ఉద్ధవ్ ఠాక్రే తీసుకొచ్చిన ఆత్మగౌరవం నినాదంపైనా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అటు కర్ణాటకలోనూ ప్రజ్వల్ రేవన్న అంశం బీజేపీ కూటమికి వ్యతిరేకంగా పనిచేసినట్లు తెలుస్తోంది. దీంతో మూడు నాలుగు విడతల పోలింగ్ పూర్తయ్యేసరికి ఇండియా కూటమి పోటీలోకి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.400 సీట్లు పెద్ద కష్టమేమీ కాదుబీజేపీ 400సీట్ల నినాదం కేవలం ప్రతిపక్షాలను ట్రాప్ చేయడానికే అనేది స్పష్టమైపోయింది. అయితే బీజేపీ మాత్రం ఇప్పటికీ 400 సీట్లు సాధ్యమనే అంటోంది. 2019లో 353 సీట్లు సాధించిన ఎన్డీయే మరో 40సీట్లు సాధించడం కష్టమేమి కాదని కొంతమంది ఎన్నికల విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా ప్రతిపక్షం బలహీనంగా ఉండటం వల్ల బీజేపీకి పోటీలేకుండా పోయిందని కొంతమంది పోల్స్టర్స్ విశ్లేషిస్తున్నారు.మోదీకి ప్రత్యామ్నాయం లేకపోవడంమోదీకి ప్రత్యామ్నాయం లేకపోవడం, విదేశీ విధానం, ఆర్ధిక పురోగతి లాంటి అంశాలు బీజేపీకి కలిసివచ్చే అంశాలనే వీరు వాదిస్తున్నారు. 400ల సీట్లు సాధ్యమే అని ఒకవేళ 400 సాధ్యం కాకపోయినా.. గతం కంటే బీజేపీ సీట్లు పెరుగుతాయంటున్నారు. ఇక బీజేపీ ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని బీజేపీ సొంతంగా 300 సీట్లు గెలుస్తుందని సీఎస్డీఎస్ సంస్థకు చెందిన సంజయ్ కుమార్ అంచనా వేశారు. బీజేపీ మిత్రపక్షాలు మాత్రం చాలా ఘోరంగా ఓడిపోతాయని.. అందుకే NDAకు నాలుగు వందల సీట్లు సాధ్యం కాదని చెబుతున్నారు. ఈసారి పోటీ నువ్వా నేనా అన్నట్టే ఉందని.. అయితే ఇప్పటికీ బీజేపీకే ఎక్కువ అవకాశాలున్నాయని స్పష్టం చేశారు రాక్ఫెల్లర్ ఇంటర్నేషనల్ చైర్మన్ రుచిర్ శర్మ.250 సీట్లకు పరిమితం అవుతుందంటూఇక కాంగ్రెస్ పార్టీకి కాస్త అనుకూలంగా వ్యవహరించే యోగేంద్ర యాదవ్ లాంటి సెఫాలజిస్టులు కాస్త డిఫరెంట్ వాదన ముందుకు తెస్తున్నారు. ముఖ్యంగా యూపీ, బీహార్, కర్ణాటక, మహారాష్ట్రలో బీజేపీ దాని మిత్రపక్షాలు గతంతో పోలిస్తే 60 నుంచి 70స్థానాలు కోల్పోతారని యాదవ్ అంటున్నారు. బీజేపీ సొంతంగా 250 సీట్లకు పరిమితం అవుతుందని బాంబు పేలుస్తున్నారు యోగేంద్ర యాదవ్. ఇదే నిజం అయితే బీజేపీ కూటమి మద్దతు లేకుండా ప్రభుత్వం నడపలేదని స్పష్టం అవుతోంది.కేక్వాక్ కాదు .. కత్తిమీద సామేఎన్నికల చివరి అంకానికి చేరుకున్న నేపధ్యంలో ఇప్పుడు ఎగ్జిట్‌పోల్స్‌పై చాలా సర్వే సంస్థలు గుంభనంగా ఉన్నాయి. డేటాను విశ్లేషించడంలో తలమునకలైన కీలక సంస్థలన్నీ.. ఈ సారి ఎన్నికల సరళిపై ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడం అంత ఆషామాషీ కాదనే అభిప్రాయానికి వచ్చాయి. 2019లో కేక్‌వాక్‌లా అనిపించిన ఎగ్జిట్‌పోల్స్.. ఈసారి మాత్రం కత్తిమీద సామే అంటున్నారు పొలిటికల్ పండిట్స్. సార్వత్రిక ఎన్నికల తుది దశ పోలింగ్ రోజు అంటే జూన్ 1 సాయంత్రం ఎగ్జిట్‌పోల్స్ వెలువడనున్నాయి. -
హెల్త్ ఇన్సూరెన్స్ విభాగంలోకి ఎల్ఐసీ.. కేంద్రం చట్టాన్ని సవరిస్తుందా..?!
ప్రభుత్వం జీవిత బీమా రంగ సంస్థ ఎల్ఐసీ హెల్త్ ఇన్సూరెన్స్ రంగంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో దేశంలో ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ అందించేలా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.అందుకోసం పలు ఇన్సూరెన్స్ సేవల్ని అందిస్తున్న సంస్థల్ని కొనుగోలు చేసే అంశంపై ఎల్ఐసీ ప్రయత్నాలు చేస్తోందంటూ పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.ఎల్ఐసీ క్యూ4 ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీ ఛైర్మన్ సిద్ధార్థ్ మొహంతీ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హెల్త్ ఇన్సూరెన్స్ రంగం పట్ల ఆసక్తిగా ఉన్నట్లు చెప్పారు. అయితే, సాధారణ బీమాలో తమకు పెద్దగా అనుభవం లేదని అందుకే ఈ రంగంలో ఉన్న కంపెనీలను కొనుగోలు చేయాలని యోచిస్తున్నట్టు చెప్పారు.ప్రస్తుతం జీవిత బీమా కంపెనీలకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలను అందించడానికి వీల్లేదు. అయితే, ఈ ఏడాది ఫిబ్రవరిలో పార్లమెంటరీ కమిటీ ఇన్సూరెన్స్ ప్రొవైడర్లకు కాంపోజిట్ లైసెన్స్‌ను మంజూరు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. తద్వారా దీనివల్ల ఆయా సంస్థలకు ఖర్చులు తగ్గడంతో పాటు ఆయా సంస్థలపై నియంత్రణపరమైన భారాలు తగ్గుతాయని సూచించింది. ఇందుకోసం బీమా చట్టానికి సవరణలు చేయాల్సి ఉంది. -
ఢిల్లీ హైకోర్టులో ఎలోన్ మస్క్ పిటిషన్.. ఎందుకంటే
టెస్లా పవర్ ఇండియా కంపెనీకి ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సంస్థ పేరు మీద ఎన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉన్నాయి. ఉంటే వాటి అమ్మకాలతో సహా ఇతర వివరాలతో కూడిన అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది. గురుగావ్ కేంద్రంగా సేవలందిస్తున్న టెస్లా పవర్ ఇండియాపై అపరకుబేరుడు, టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ ట్రేడ్‌మార్క్ ఉల్లంఘన దావాపై పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌కు ప్రతిస్పందనగా ఢిల్లీ హై కోర్టు ఆదేశాలు ఇచ్చింది. టెస్లా పవర్‌పై కేసును హైకోర్టు గురువారం విచారించనుంది.టెస్లా కంపెనీ ట్రేడ్ మార్క్‌తో భారత్‌లోని స్థానిక సంస్థ టెస్లా పవర్ ఇండియా వినియోగిస్తోందని, దీనిపై గందరగోళం నెలకొందని.. వ్యాపార ప్రయోజనాలకు హాని కలిగిస్తోందని వాదించింది. అంతేకాదు టెస్లా పవర్ బ్యాటరీలపై తమకు (టెస్లా-యూఎస్) ఫిర్యాదులు అందుతున్నాయని ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో టెస్లా వెల్లడించింది. టెస్లా పవర్ బ్యాటరీలు ఎలోన్ మస్క్ టెస్లా కంపెనీవేనని ప్రచారం చేయడం, లోగోను వినియోగించుకున్నట్లు హైలెట్ చేసింది. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని మస్క్ తరుపు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేసింది. -
అకౌంట్లపై అదనపు వసూళ్లు.. బ్యాంక్‌లకు ఆర్బీఐ వార్నింగ్..
ఖాతాదారుల నుంచి అదనపు ఛార్జీలు విధిస్తున్న బ్యాంక్‌లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కఠిన చర్యలు తీసుకుంటోంది.బ్యాంకింగ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఎస్ బ్యాంక్‌కు రూ. 91 లక్షల జరిమానా విధించింది. జీరో బ్యాలెన్స్ ఉన్న ఖాతాలపైజీరో బ్యాలెన్స్ ఉన్న ఖాతాలపై ఛార్జీలు విధించడం, ఫండ్స్ పార్కింగ్, రూటింగ్ ట్రాన్సాక్షన్ వంటి అనధికారిక ప్రయోజనాల కోసం బ్యాంక్ ఖాతాదారుల పేరిట ఇంటర్నల్ అకౌంట్లను ఓపెన్ చేసి ఎస్ బ్యాంక్ ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలుస్తోంది. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం..ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం.. కస్టమర్లు జీరో బ్యాంక్ అకౌంట్‌ను ఉపయోగిస్తూ.. మినిమం బ్యాలెన్స్ లేకపోతే బ్యాంకులు అదనపు ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ అకౌంట్ బ్యాలెన్స్ జీరోకి పడిపోయి.. మినిమం బ్యాలెన్స్ మెయింటెనెన్స్ చేయలేదని ఖాతాదారుల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేయకూడదు. సంబంధిత బ్యాంక్‌లు.. బ్యాంక్ అకౌంట్ సేవల్ని నిలిపివేయాలి. ఈ నిబంధనల్ని 2014 నుంచి ఆర్బీఐ అమలు చేస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్‌కు రూ.కోటి జరిమానామరోవైపు ఐసీఐసీఐ బ్యాంక్‌కు సైతం ఆర్బీఐ రూ.కోటి జరిమానా విధించింది. 2022 ఆర్థిక సంవత్సరంలో పలు సంస్థలకు ప్రాజెక్ట్ లోన్స్ పేరిట లాంగ్ టర్మ్ రుణాల మంజూరులో ఐసీఐసీఐ అవకతవకలకు పాల్పడినందుకు భారీ జరిమానా విధించినట్లు తెలుస్తోంది. -
పన్ను చెల్లింపు దారులకు అలెర్ట్.. మరో 3 రోజుల్లో ముగియనున్న గడువు
ట్యాక్స్ పేయర్స్‌ను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అలెర్ట్ చేసింది. మే 31,2024 గడువులోపు పాన్ కార్డ్‌కు ఆధార్ కార్డ్‌ను జత చేయాలని సూచించింది. తద్వారా హైయ్యర్ ట్యాక్స్ డిడక్ట్ నుంచి ఉపశమనం పొందవచ్చని ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది.పన్ను చెల్లింపుదారులు మీ పాన్‌ను మే 31, 2024లోపు ఆధార్‌తో లింక్ చేయండి. మే 31లోపు మీ పాన్‌ను మీ ఆధార్‌తో లింక్ చేయడం వల్ల ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 206ఏఏ, 206సీసీ ప్రకారం మీరు అధిక పన్ను మినహాయింపు/పన్ను వసూలు నుంచి మినహాయింపు పొందవచ్చు. పాన్‌కు ఆధార్ లింక్ చేయకపోతే నిర్ణీత తేదీలోపు పాన్‌కు ఆధార్ జత చేయకపోతే పన్ను చెల్లింపుదారులు గణనీయమైన ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రత్యేకించి, వారు ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్లు 206ఏఏ, 206సీసీ ప్రకారం అధిక పన్ను చెల్లించాల్సి ఉంటుంది. Kind Attention Taxpayers, Please link your PAN with Aadhaar before May 31st, 2024, if you haven’t already, in order to avoid tax deduction at a higher rate.Please refer to CBDT Circular No.6/2024 dtd 23rd April, 2024. pic.twitter.com/L4UfP436aI— Income Tax India (@IncomeTaxIndia) May 28, 2024 -
మరో బిజినెస్‌లోకి అదానీ గ్రూప్.. గూగుల్, అంబానీకి చెక్ పెట్టేనా?
ప్రముఖ డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్లో ఊహించని విధంగా వృద్ది సాధిస్తోన్న ఈ-కామర్స్,పేమెంట్స్ విభాగంలో అడుగుపెట్టనుంది. దీంతో అదే రంగంలో మార్కెట్‌ను శాసిస్తున్న టెక్ దిగ్గజం గూగుల్, మరో దిగ్గజ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీకి గట్టి పోటీ ఇవ్వనుందని ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించింది.ఇప్పటికే అందుకు కావాల్సిన లైసెన్స్ కోసం అప్లయి చేసినట్లు సమాచారం. ఆ లైసెన్స్ యూపీఐ వంటి చెల్లింపులతో పాటు, కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌లను మార్కెట్లోకి విడుదల చేసేందుకు అదానీ గ్రూప్ ప్రతినిధులు పలు బ్యాంక్‌లతో ఒప్పందం కుదుర్చుకున్నారని, ఆ చర్చలు చివరి దశకు వచ్చాయని తెలుస్తోంది.జాతీయ మీడియా కథనాల ప్రకారం..తన సేవలు వినియోగదారులకు మరింత చేరువయ్యేలా అదానీ గ్రూప్ ప్రభుత్వ ఈ-కామర్స్ ఫ్లాట్ ఫాం ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ) చర్చలు జరుపుతోంది.చర్చలు సఫలమైందే అదానీ గ్రూప్‌కు చెందిన అదానీ వన్ యాప్‌లో ఓఎన్డీసీ వినియోగదారులకు సేవలు అందుతాయి. ఓఎన్డీసీలో ఏదైనా కొనుగోలు చేసిన యూజర్లు అదానీ వన్ ద్వారా పలు ఆఫర్లు పొందవచ్చు. ఇప్పటికే ఈ యాప్ యూజర్లకు హోటల్, ఫ్లైట్ రిజర్వేషన్‌తో సహా ఇతర ట్రావెల్ సంబంధిత సేవల్ని వినియోగించడం ద్వారా ప్రత్యేక డిస్కౌంట్లు పొందవచ్చు -
వారెన్ బఫెట్ నుంచి బిల్ గేట్స్ నేర్చుకున్న పాఠం ఏంటంటే?
మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ ప్రతి సెకనును తన షెడ్యూల్ అనుగుణంగా పని చేసేవారు. అలా చేయడం తన విజయానికి కారణమని భావించేవారు. కానీ కొన్నేళ్లకు బిల్‌గేట్స్ తాను చేస్తుందని తప్పని భావించారు. అందుకు బెర్క్‌షైర్ హాత్వే సీఈఓ వారెన్ బఫెట్ కారణం.మైక్రోసాఫ్ట్ సీఈఓగా తన 25 ఏళ్ల పదవీకాలంలో బిల్ గేట్స్ ప్రతి సెకనును షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసేవారు. అయితే 2017లో తన స్నేహితుడు వారెన్ బఫెట్ కలిసి గేట్స్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా వారెన్ బఫెట్ షెడ్యూల్ తనకి చూపించినప్పుడు ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు ఓ సందర్భంలో వెల్లడించారు.ఆ సమయంలో బఫెట్ తన క్యాలెంటర్‌ను చూపించడం నాకు ఇంకా గుర్తింది. అందులో ఏమీ లేదు. కానీ ఆ షెడ్యూల్ నాకు ముఖ్యమైన పాఠాన్ని నేర్పింది. మీ షెడ్యూల్లో ప్రతి నిమిషాన్ని నింపడం మీ సీరియస్‌నెస్‌కు నిదర్శనం కాదు. మీరు చదవడానికి, ఆలోచించడానికి, రాయడానికి సమయం కేటాయించండి. జీవితంలో నిజమైన ప్రాముఖ్యతలేవో వారెన్ బఫెట్ నాకు తెలియజేశారు అని బిల్ గేట్స్ చెప్పుకొచ్చారు. -
అమెరికా రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువతీ మృతి
-
మస్క్ ఏఐ కంపెనీ Xaiకి పెట్టుబడుల వరద..
ప్రముఖ బిలియనీర్ ఎలోన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ ఎక్స్ఏఐ (xAI) సిరీస్ బీ ఫండింగ్ రౌండ్లో 6 బిలియన్లను సేకరించారు. ఇందులో వెంచర్ క్యాప్టలిస్ట్ ఆండ్రీసెన్ హోరోవిట్జ్, సీక్వోయా క్యాపిటల్‌తో సహా పలువురు వ్యాపార వేత్తలు పెట్టుబడులు పెట్టినట్లు ఎక్స్ఏఐ అధికారికంగా తెలిపింది. ఈ నిధుల్ని xAIని మార్కెట్‌కి పరిచయం చేయడానికి, అధునాతన మౌలిక సదుపాయాలను నిర్మించడానికి, భవిష్యత్ టెక్నాలజీలపై పరిశోధన, వాటి అభివృద్ధిని వేగవంతం చేసేందుకు సంస్థ ఉపయోగించనుంది. అయితే మొత్తం ఎంతమొత్తంలో ఇన్వెస్టర్ల నుంచి మస్క్ నిధుల్ని సేకరిస్తున్నారనే అంశంపై స్పష్టత ఇవ్వలేదు. అయినప్పటికీ ఇతర మీడియా నివేదికలు నిధుల మొత్తం 18 బిలియన్ నుంచి 24 బిలియన్ల మధ్య ఉంటుందని సమాచారం. మస్క్ చాట్‌జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐ ఫౌండర్లలో ఒకరిగా ఉన్నారు. కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా పనిచేశారు. అయితే ఏఐ చాట్‌జీపీటీ వల్ల తలెత్తే ప్రమాదాలను గుర్తించారు. ఆ సంస్థ నుంచి వైదొలగారు. టెక్నాలజీ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఓపెన్ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్‌కు సలహా ఇచ్చారు. -
‘మీ జీవితం ఎలా ఉందో చూసుకోండి’.. సీఈఓ గుప్తా ఆసక్తికర వ్యాఖ్యలు
మీ జీవితం ఎలా ఉందో మీరే చూసుకోవాలి. పక్కవారి జీవితాల్లో తొంగి చూడడం ఎందుకు? అంటూ ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ రాధికా గుప్తా నేటి తరం యువత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.గత దశాబ్దం లేదా అంతకంటే ఎక్కువ కాలంగా భారత్‌తో పాటు, ఇతర దేశాల్లో నివసించే వారిలో మానసిక ఆరోగ్యం ఓ కీలక సమస్యగా మారింది. అనేక కారణాల వల్ల డిప్రెషన్, యాంగ్జయిటీ డిజార్డర్స్ వంటి విభిన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య పెరిగింది. ముఖ్యంగా యువతీ యువకులు పక్క వారి జీవితంపై దృష్టిపెట్టడమే అందుకు కారణం. ఎందుకంటే వారి జీవితం ఎలా ఉందో పట్టించుకోవడలేదు. కానీ ఇన్ స్ట్రాగ్రామ్లో ఇతరుల జీవితాలు వారికి మెరుగ్గా కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. మీకు మీరు ఓ ప్రత్యేకమైన వ్యక్తిగా భావించడం లేదు. పైగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఇతరుల జీవితాలు తమకన్నా బాగున్నాయని వారు అభిప్రాయ పడుతున్నారు. కాబట్టే తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారంటూ ఎక్స్ వేదికా ట్వీట్ చేశారు. ప్రస్తుతం, ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ రాధికా గుప్తా ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. -
అదిరిపోయే ఫీచర్లతో.. త్వరలో విడుదల కానున్న మరో రెడ్మీ సిరీస్ ఫోన్
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రెడ్మీ త్వరలో మరో స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెడ్మీ 12 4జీ ఫోన్ యూజర్లను ఆకట్టుకుంటోంది. అదే తరహాలో రెడ్మీ 13 4జీ ఫోన్‌ను మార్కెట్‌కి పరిచయం చేయనుందంటూ పలు మీడియా కథనాలు చెబుతున్నాయి.రెడ్మీ 13 4జీ ధర, కలర్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయంటే?6జీబీ ప్లస్ 128జీబీ ఆప్షన్‌తో రెడ్మీ 13 4జీ ధర రూ.16,500 ఉండనుంది. 8జీబీ ప్లస్ 256జీబీ వేరియంట్ ధర రూ.19,000గా ఉండనుందని తెలుస్తోంది.బ్లాక్,బ్లూ కలర్స్‌తో యూజర్లను అలరించనుంది.వాటికి అదనంగా పింక్, ఎల్లో కలర్స్ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేయనుందని సమాచారం.రెడ్మీ 13 4జీ డిజైన్స్ రెడ్మీ 13 4జీ డిజైన్స్ విషయానికొస్తే ఫోన్ టాప్ లెప్ట్ కార్నర్లో రెండు సర్కిల్ కెమెరా యూనిట్స్, ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్లు ఉన్నాయి.ఫోన్ బాడీ గ్లోసీ ఫినీష్‌తో రానుంది.ఫోన్ ఛార్జర్ యూఎస్బీ టైప్-సీకి సపోర్ట్ చేస్తోంది. ఫోన్ ముందు భాగంలో ఫ్లాట్ డిస్ప్లే, థిక్ బెజెల్స్,ఫోన్ పై భాగంగా సెంటర్డ్ హోల్ పంచ్ కటౌట్, సెల్ఫీ కెమెరా సెన్సార్లు ఉన్నాయి.రెడ్మీ 13 4జీ స్పెసిఫికేషన్స్, ఫీచర్లురెడ్మీ 13 4జీ 6.79 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ ఎల్సీడీ సన్ స్క్రీన్, మీడియా టెక్ హీలియా జీ91 అల్ట్ రా, 8జీబీ ర్యామ్, 256జీబీ వరకు స్టోరేజ్, స్టోరేజ్ 1టీబీ వరకు పొడిగించుకోవచ్చు. మైక్రోఎస్డీ కార్డ్, ఆండ్రాయిడ్ ఐపర్ ఓఎస్,108 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్,2 సెకండరీ సెన్సార్,ఫోన్ ముందు భాగంలో 13 మెగా పిక్సెల్ సెన్సార్‌తో విడుదల కానుందని పలు జాతీయ మీడియా కథనాలు హైలెట్ చేస్తున్నాయి. -
రూ.4.5 లక్షల కోట్లు భారీ వేతన ప్యాకేజీలో.. మస్క్‌కు ఎదురు దెబ్బ
టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్‌కు చెల్లించే భారీ వేతన ప్యాకేజీ అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.టెస్లా బోర్డు డైరెక్టర్లు నిర్ణయించిన 55 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.4.5 లక్షల కోట్లు) భారీ వేతన ప్యాకేజీని ఇవ్వొద్దంటూ టెస్లా షేర్ హోల్డర్లు తమని కోరినట్లు ప్రాక్సీ అడ్వైజరీ సంస్థ గ్లాస్ లూయిస్ తెలిపింది. ప్రాక్సీ అడ్వైజరీ సంస్థ గ్లాస్ లూయిస్ అనేది కార్పొరేట్ కంపెనీల్లో జరిగే కార్యకలాపాల్లో షేర్ హోల్డర్లకు సహాయం చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం టెస్లాలో షేర్ హల్డర్ల తరుపున పనిచేస్తోంది. మార్కెట్ విలువను పెంచిఅయితే, ఎలోన్ మస్క్ తన అసాధారణమైన ప్రతిభతో టెస్లా మార్కెట్ విలువను కేవలం 10 ఏళ్ల కాలంలో అన్యూహ్యంగా పెంచారని, 2018లో తొలిసారి మార్కెట్ విలువ 650 బిలియన్ డాలర్లకు చేర్చారని టెస్లా బోర్డు డైరెక్టర్లు ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాదు టెస్లా బోర్డు డైరెక్టర్లు ఏడాదికి 55 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.4.5 లక్షల కోట్లు) భారీ వేతన ప్యాకేజీ అందిస్తూ ఆమోదం తెలిపారు. వేతనాన్ని అందించారు.రూ.4.5 లక్షల కోట్ల వేతనం దండగదీనిని వ్యతిరేకిస్తూ టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్, ఆ సంస్థ డైరెక్టర్లకు వ్యతిరేకంగా టెస్లా వాటాదార్లలో ఒకరైన రిచర్డ్ టోర్నెట్టా.. డెలావర్ కోర్టును ఆశ్రయించారు. ఇంత వేతనం ఇవ్వడం కార్పొరేట్ ఆస్తులను వృథా చేయడమే అవుతుందని తన పిటిషన్లో పేర్కొన్నారు. ఆ కేసు విచారణ ప్రస్తుతం కొనసాగుతుండగా.. షేర్ హోల్డర్లు మస్క్‌కు అంత ప్యాకేజీ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ గ్లాస్ లూయిస్‌కు ప్రతిపాదనలు పంపారు. తాజా షేర్ హోల్డర్ల నిర్ణయంతో టెస్లాలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది. అంత ప్యాకేజీ.. అందుకు మస్క్ అనర్హుడేగతంలో టెస్లా షేర్ హోల్డర్ రిచర్డ్ టోర్నెట్టా పిటిషన్‌పై డెలావర్ కోర్టు విచారణ చేపట్టింది. టెస్లా బోర్డు డైరెక్టర్లు నిర్ణయించిన భారీ వేతన ప్యాకేజీ అందుకునేందుకు ఎలోన్ మస్క్ అనర్హుడని డెలావేర్ కోర్టు న్యాయమూర్తి కేథలీన్ మెక్కార్మిక్ ఆదేశాలిచ్చారు.అయితే, ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతుడైన పారిశ్రామికవేత్త, తన విలువైన సమయాన్ని కంపెనీ కోసం వెచ్చించాలనే ఉద్దేశంతోనే అంత మొత్తం చెల్లించామని టెస్లా డైరెక్టర్ల తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది. -
బ్యాంక్‌ల్లో ఇబ్బందులా?, ఆర్బీఐకి ఫిర్యాదు చేయండిలా..
మీరు బ్యాంక్ బ్రాంచ్‌లో ఏదైనా సమస్యను ఎదుర్కొంటున్నారా? సమస్య పరిష్కారం కోసం కాళ్లరిగేలా తిరిగినా పట్టించుకోవడం లేదా? అయితే ఇంకెందుకు ఆలస్యం అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేయండి అని అంటోంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ). బ్యాంక్‌లో ఏదైనా సమస్యను ఎదుర్కొంటే, దానిని బ్యాంక్ బ్రాంచ్ అధికారులు లేదా దాని ప్రధాన కార్యాలయం పరిష్కరించలేకపోతే, మీరు ఆర్బీఐలో బ్యాంక్‌పై ఫిర్యాదు చేయడానికి ఈ పద్దతిని ఎంపిక చేసుకోవచ్చు.ఫిర్యాదులను స్వీకరించేందుకుఅటువంటి ఫిర్యాదులను స్వీకరించేందుకు సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ అనే పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం బ్యాంకులు అందించే కొన్ని సేవలకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారం కోసం బ్యాంక్ కస్టమర్ల కోసం ఒక వేగంగా చర్యలు తీసుకునే వేదిక.ఎటువంటి రుసుము లేకుండాబ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ స్కీమ్ 2006లోని క్లాజ్ 8 ప్రకారం (జూలై 1, 2017 వరకు సవరించిన ప్రకారం) ఖాతాదారుల ఫిర్యాదులను దాఖలు చేయడానికి, పరిష్కరించడానికి బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ ఎటువంటి రుసుమును వసూలు చేయరు అని ఆర్బీఐ తరచుగా పేర్కొంది.ఆర్బీఐ అంబుడ్స్‌మన్ బ్యాంక్ ఖాతాదారులు నిబంధనలకు అనుగుణంగా ఉన్నా.. బ్యాంక్ తరుపు లోపాలుంటే ఖచ్చితంగా ఆర్బీఐకి ఫిర్యాదు చేయొచ్చు. సమస్య ఉందని పరిష్కారం కోరినా బ్యాంకులు పట్టించుకోకపోతే, సంబంధిత బ్యాంకు మీ ఫిర్యాదును స్వీకరించిన తర్వాత ఒక నెలలోపు బ్యాంకు నుండి ప్రత్యుత్తరం రాకుంటే, బ్యాంక్ ఫిర్యాదును తిరస్కరించినట్లయితే మీరు బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌కు https://rbi.org.in/Scripts/Complaints.aspx ఈ లింక్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. -
సెబీ కొత్త నిబంధనలు..రియల్ టైం షేర్ వ్యాల్యూ షేరింగ్‌పై
స్టాక్ మార్కెట్ మదపర్లకు ముఖ్యగమనిక. వివిధ ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లతో పాటు థర్డ్ పార్టీ యాప్‌లకు రియల్ టైమ్ షేర్ వ్యాల్యూ సమాచారాన్ని అందించే అంశంపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త నిబంధనల్ని అమల్లోకి తెచ్చింది.ఈ సందర్భంగా నిర్దిష్ట ఆన్లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు, యాప్‌లు, వెబ్సైట్లు మొదలైనవి రియల్ టైం షేర్ వ్యాల్యూ ఆధారంగా వర్చువల్ ట్రేడింగ్ (పేపర్ కరెన్సీ), పలు ట్రేడింగ్ చేయడం ఎలాగో నేర్పించే ఫాంటసీ గేమ్ తయారీ సంస్థలకు అందిస్తున్నట్లు దృష్టికి వచ్చింది. అంతేకాదు కొన్ని లిస్టెడ్ కంపెనీలు సైతం సంబంధిత వర్చువల్ స్టాక్ పోర్ట్‌ఫోలియో పనితీరు ఆధారంగా రివార్డ్స్ లేదంటే డబ్బుల్ని చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విధానంపై పెట్టుబడిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, వారి సమస్యకు పరిష్కార మార్గంగా సెబీ కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. సెబీ ప్రకారం, అనుమతులు లేకుండా రియల్ ట్రైం ట్రేడింగ్ వ్యాల్యూ ఏంటనేది మధ్యవర్తులకు చేరవేయకూడదని తెలిపింది. ఒకవేళ్ల పంపించాల్సి వస్తే వ్రాతపూర్వక ఒప్పందాలపై సంతకం చేయాలి. ఈ బాధ్యతల్ని మార్కెట్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ ఇనిస్టిట్యూషన్లు (ఎంఐఐఎస్)లు పరిశీలించాల్సి ఉంటుందని సెబీ తన మార్గదర్శకాల్లో వెల్లడించింది. సర్క్యులర్ విడుదలైన ముప్పై రోజుల తర్వాత కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా పెట్టుబడిదారులకు అవగాహన కల్పించడం, అవగాహన కల్పించడం కోసం మార్కెట్ ధరల డేటాను పంచుకునేటప్పుడు ఆర్థిక ప్రోత్సాహకాలు అవసరం లేదని సెబీ పేర్కొంది -
‘నేను ఏలియన్ని’..మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు
నేను ఏలియన్ అని చెబుతూనే ఉన్నా కానీ నా మాటల్ని ఎవరూ నమ్మడం లేదని టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. పారిస్ వేదికగా జరిగిన వివా టెక్ ఈవెంట్లో మస్క్ వెబ్‌క్యామ్ ద్వారా రిమోట్‌గా పాల్గొన్నారు. వివా టెక్ ఈవెంట్ ప్రతినిధులు మస్క్‌తో కొంతమంది మీరు ఏలియన్ అని నమ్ముతున్నారు. మస్క్ నవ్వుతూ ‘అవును, నేను గ్రహాంతరవాసిని అని చెబుతూనే ఉంటాను, కానీ ఎవరూ నన్ను నమ్మడం లేదని అన్నారు.’ అంతేకాదు ఏలియన్స్ గురించి సమాచారం ఏదైనా తెలిస్తే నేను వెంటనే ఎక్స్ వేదికగా ఆ విషయాల్ని వెల్లడిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎలోన్ మస్క్ కృత్రిమ మేధస్సు (ఏఐ)పై తన అభిప్రాయాల్ని పంచుకున్నారు. ఏఐ అన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తుందని, అయితే దాని అంతగా భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. 🚨IS ELON AN ALIEN? Host: "Some people believe that you are an alien."Elon: "I am an alien."Host: "Now you've been uncovered."Elon: "Yes, I keep telling people I'm an alien, but nobody believes me."😂Source: Viva Tech https://t.co/9ie5KFn6GE pic.twitter.com/ZDU4ovA82I— Mario Nawfal (@MarioNawfal) May 23, 2024 -
విదేశాలకు పారిపోతారేమో.. అష్నీర్ దంపతులకు ఢిల్లీ హై కోర్టు కీలక ఆదేశాలు
ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ భారత్‌పే కో-ఫౌండర్ అష్నీర్ గ్రోవర్, అతని భార్య మాధురి జైన్ గ్రోవర్‌లకు ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అష్నీర్ దంపతులు త్వరలో అమెరికాకు వెళ్లనున్నారు. అయితే వాళ్లిద్దరూ అమెరికాకు వెళ్లే ముందే సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.80 కోట్లు చెల్లించాలని ఆదేశించింది.దీంతో పాటు అష్నీర్, మాధురీలకు యూఏఈ గోల్డెన్ వీసా ఉంది. ఈ వీసా ఉన్న వారికి యూఏఈ ప్రభుత్వం తమ దేశ పౌరులుగా గుర్తిస్తూ వారికి ఎమిరేట్స్ కార్డ్ అనే ఐడెంటిటీ కార్డ్ ఇస్తుంది. ముందస్తు జాగ్రత్తగా ఎమిరేట్స్ కార్డ్‌ను కోర్టుకు సబ్మిట్ చేయాలని సూచించింది. అర్హులైన ఈ కార్డ్ దారులు 10ఏళ్ల పాటు యూఏఈ దేశ పౌరులుగా గుర్తింపు లభిస్తుంది.కేసేంటిభారత్పేలో విధులు నిర్వహించే సమయంలో అష్నీర్ గ్రోవర్ దంపతులు విలాసాల రుచి మరిగి రూ.81 కోట్ల సంస్థ నిధుల్ని కాజేశారు. ఆ కుంభకోణం వెలుగులోకి రావడంతో భారత్‌పే వారిద్దరిని సంస్థ నుంచి తొలగించింది. ఇదే అంశంపై అష్నీర్ దంపతుల్ని విచారించాలని కోరుతూ భారత్‌పే ఢిల్లీ హైకోర్ట్‌ను ఆశ్రయించింది. ఆ కేసులో వాళ్లిద్దరూ విదేశాలకు పారిపోకుండా గతేడాది నవంబర్‌లో ఎకనమిక్స్ అఫెన్స్ వింగ్ (ఈఓడబ్ల్యూ) లుకౌట్ నోటీసులు జారీ చేసింది.విదేశాలకు వెళ్లేందుకు ఈ తరుణంలో అమెరికాలో ఉన్న కుటుంబసభ్యులను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. జూన్ 17 నుండి జూన్ 25 వరకు బర్కిలీలోని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో సమ్మర్ కోర్సు, నేషనల్ స్టూడెంట్ లీడర్షిప్ కాన్ఫరెన్స్ కోసం తమ కుమారుడికి ఆహ్వానం అందిందని పిటిషన్లో పేర్కొన్నారు. విదేశాలకు పారిపోతేఈఓడబ్ల్యూ తరఫు న్యాయవాది ఈ పిటిషన్లపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అష్నీర్‌కు, అతని భార్య మాధురి జైన్ గ్రోవర్‌లకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతిస్తే, వారు దేశానికి తిరిగి రాకపోయే అవకాశం ఉందనే అనుమానం వ్యక్తం చేశారు. అందుకు అష్నీర్ దంపతుల న్యాయవాది దంపతులు దేశం విడిచి పారిపోరని, కలిసి ప్రయాణించే బదులు విడివిడిగా వెళ్లేందుకు అనుమతించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు విదేశాలకు వెళ్లేందుకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది.షరతులు వర్తిస్తాయ్అయితే వారి ప్రయాణానికి సంబంధించి కొన్ని షరతులు విధించింది. అష్నీర్ గ్రోవర్, మాధురి జైన్ గ్రోవర్లు విదేశాలకు ఎప్పుడు వెళ్లాలన్న వారి ప్రయాణ ప్రణాళికలు, వారి ప్రయాణం, వసతి, ఖర్చులతో ఇలా మొత్తం సమాచారాన్ని కోర్టు, దర్యాప్తు అధికారులకు అందించాలని తీర్పులో వెలువరించింది. విదేశాలకు విడివిడిగానే కోర్టు ఆదేశాలతో అష్నీర్ గ్రోవర్ మే 26న అమెరికాకు వెళ్లి జూన్ 14న తిరిగి రావాల్సి ఉండగా, మాధురీ జైన్ జూన్ 15న ప్రయాణించి జూలై 1న తిరిగి రానున్నట్లు తెలుస్తోంది. -
‘మనెవ్వరికీ ఉద్యోగాలు ఉండకపోవచ్చు’.. AI ముప్పుపై మస్క్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముప్పుపై టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. ఏఐ కారణంగా ఉద్యోగం ఓ వ్యాపకంగా మారుతుందన్నారు. ఆ సంక్షోభం నుంచి బయట పడాలంటే అధిక మొత్తంలో డబ్బు ఉండాల్సిందేనని తెలిపారు.రోజురోజుకు కొత్త పుంతలు తొక్కతున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయని కొందరు అంటుంటే.. ఏఐని సమర్ధిస్తూ కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని అంటున్నారు. ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా.. ప్రపంచం మెచ్చిన వ్యాపార దిగ్గజాలు మాత్రం కృత్తిమ మేధ వినియోగం వల్లే తలెల్తే ముప్పు గురించి ముందే హెచ్చరిస్తున్నారు. ఈ తరుణంలో పారిస్‌లో జరిగిన వివా స్టార్టప్, టెక్ ఈవెంట్లో మస్క్ రిమోట్‌గా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బహుశా మనెవ్వరి ఉద్యోగాలు ఉండకపోవచ్చు. ఉద్యోగం ఓ వ్యాపకంలా మారుతుంది. మీకు కావాల్సిన ఉత్పత్తుల్ని, సేవల్ని రోబోట్లు అందిస్తాయి. ఈ అనిశ్చితి నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా డబ్బులు ఉండాలని అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఏఐ సామర్థ్యాలు వేగంగా అభివృద్ధి చెందాయని, రెగ్యులేటర్లు, కంపెనీలు, వినియోగదారులు సాంకేతికతను బాధ్యతాయుతంగా ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పటికీ తెలుసుకుంటున్నారని ఆయన హైలైట్ చేశారు.ఉద్యోగాలు లేని భవిష్యత్తులో ప్రజలు మానసికంగా సంతృప్తి చెందుతారన్న మస్క్ కంప్యూటర్, రోబోట్లు మీ కంటే మెరుగ్గా ప్రతిదీ చేయగలిగితే మీ జీవితానికి అర్థం ఉందా? అని ప్రశ్నించారు.