Tihar jail
-
భారీగా డ్రగ్స్ పట్టివేత.. తిహార్ జైలు వార్డెన్‌తో సహా నలుగురి అరెస్ట్
లక్నో:ఉత్తర ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో డ్రగ్స్ రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ), ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ బృందం చేపట్టిన ఈ ఆపరేషన్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. నోయిడాలోని మెక్సికన్ డ్రగ్ కార్టెల్ నిర్వహిస్తున్న మెథాంఫేటమిన్ తయారీ ల్యాబ్‌లో వందల కోట్ల విలువైన 95 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.ఈ డ్రగ్స్ తయారీ ల్యాబ్‌ను తిహార్ జైలు వార్డెన్, ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త, ముంబై కెమిస్ట్ రహస్యంగా నిర్వహిస్తున్నట్లు తేలింది. భారత్‌తోపాటు విదేశాలకు డ్రగ్స్ సరాఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటి వరకు నలుగురిని ఎన్సీబీ అరెస్ట్ చేసింది.ఈ ల్యాబ్‌లో దేశీయ వినియోగానికి, అంతర్జాతీయ ఎగుమతుల కోసం సింథటిక్ డ్రగ్స్‌ను తయారు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అక్రమంగా డ్రగ్స్ తయారీ చేపడుతున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో దాడులు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఘన, ద్రవ రూపాల్లో ఉన్న సుమారు 95కిలోల మెథాంపేటమిన్(డ్రగ్స్), వివిధ రసాయనాలు, ఆధునాతన తయారీ యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా.. మూడురోజల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది.ఈ ఫ్యాక్టరీలో ముంబయికి చెందిన కెమిస్ట్ మాదక ద్రవ్యాలను తయారు చేయగా.. వాటి నాణ్యతను ఢిల్లీలో ఉండే మెక్సికన్ ముఠా సభ్యుడు పరీక్షించేవాడని ఎన్సీబీ తెలిపింది. ల్యాబ్‌లో పట్టుబడిన ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్తను గతంలో కూడా ఒక ఎన్డీపీఎస్ కేసులో డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అరెస్టు చేసింది. ఆ సమయంలో అతడిని తిహార్ జైల్లో ఉంచగా.. అక్కడ వార్డెన్‌తో పరిచయం పెంచుకొని అతడిని కూడా ఈ మత్తు వ్యాపారంలోకి దించాడు. -
‘వారి కోసం జీవితాన్ని త్యాగం చేస్తా’.. జైలులో లొంగిపోయిన ఎంపీ రషీద్
కశ్మీర్: జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా ఎంపీ షేక్ అబ్దుల్ రషీద్ అలియాస్ ‘ఇంజనీర్ రషీద్’ సోమవారం తీహార్ జైలు అధికారుల ఎదుట లొంగిపోయారు. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో మధ్యంతర బెయిల్ గడువు నేటితో ముగియడంతో జైలులో లొంగిపోయారు. ఈ సందర్భంగా రషీద్ మాట్లాడుతూ.. జమ్ముకశ్మీర్ ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానని బారాముల్లా ఎంపీ షేక్ అబ్దుల్ రషీద్ తెలిపారు. సమస్యలపై ప్రజాస్వామ్యయుతంగా పోరాడతానని పేర్కొన్నారు. తాను కాశ్మీర్ సంక్షేమానికి కట్టుబడి ఉన్నానని, శాంతి, అభివృద్ధి, ప్రజల హక్కుల పునరుద్ధరణ కోసం కృషిచేస్తానని చెప్పారు.‘మా ప్రజల కోసం ప్రాణాలైనా అర్పించేందుకు సిద్ధంగా ఉన్నాం. మేము ఏ తప్పు చేయలేదు. మాకు న్యాయం జరుగుతుంది. మేము జైల్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా ప్రజల సంక్షేమం, కాశ్మీర్ సంక్షేమం, శాంతి గురించి , గౌరవంగా మాట్లాడుతాం. మేము లొంగిపోము. జైలు శిక్ష గురించి భయపడవద్దు. పోరాడి గెలుస్తాం. ‘మేం ఏ నేరం చేయలేదు. నేను జైలుకు వెళ్లడం గురించి చింతించను. నా ప్రజలకు దూరంగా ఉంటానన్న ఒకే ఒక భావన ఉంది’ అని అన్నారు.అయితే తీవ్రవాద నిధుల కేసులో అరెస్టయిన అవామీ ఇత్తెహాద్ పార్టీ వ్యవస్థాపకుడు రషీద్, జమ్మూ కాశ్మీర్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ప్రచారం కోసం సెప్టెంబర్ 10న మధ్యంతర బెయిల్ పొందారు. అనంతరం రెండుసార్లు మధ్యంతర బెయిల్‌ను పొడిగించారు. ఈ కేసులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఆయన ఎంపీగా ఉన్నందున చట్టసభ సభ్యులను విచారించేందుకు ఉద్దేశించిన ప్రత్యేక కోర్టుకు అతని కేసు వెళ్లవచ్చని దనపు సెషన్స్ జడ్జి చందర్ జిత్ సింగ్ తెలిపారు. దీనిపై ఢిల్లీ కోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది. -
కేజ్రీవాల్ విడుదల
న్యూఢిల్లీ, సాక్షి: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. లిక్కర్ స్కాం కేసులో.. ఇవాళ సుప్రీం కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సాయంత్రం ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు.కేజ్రీవాల్‌కు బెయిల్ దక్కడంతో ఆప్ శ్రేణుల్లో కోలాహలం నెలకొంది. భారీగా తీహార్ జైలు వద్దకు చేరుకుని నినాదాలు చేస్తూ ఆయనకు స్వాగతం పలికారు. వాళ్లకు అభివాదం చేసిన అనంతరం ఆయన ప్రసంగించారు. ‘‘వర్షంలోనూ నా కోసం ఎదురు చూస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. నన్ను జైల్లో బంధించి నా మనోస్థైర్యం దెబ్బ తీయాలనుకున్నారు. కానీ, ఇప్పుడు నా బలం, నాలో ధైర్యం వంద రేట్లు పెరిగింది’’ ఆయన పేర్కొన్నారు. నేను నిజాయితీపరుడిని కాబట్టే దేవుడు నాకు మద్దతుగా నిలిచాడునన్ను జైల్లో వేస్తే బలహీనపడతానని అనుకున్నారుజైలు గోడలు నన్ను బలహీనపర్చలేవు దేశాన్ని అమ్మే.. విచ్ఛిన్నం శక్తులకు వ్యతిరేకంగా పోరాడతాదేశానికి నా సేవ కొనసాగిస్తాకేజ్రీవాల్కు స్వాగతం పలికిన వాళ్లలో ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్, మంత్రి అతీషి, సీనియర్ నేత మనీష్ సిసోడియా, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్.. తదితరులు ఉన్నారు. #WATCH | Delhi CM and AAP national convener Arvind Kejriwal greets party workers and leaders outside Tihar Jail in DelhiThe Supreme Court granted him bail in the Delhi excise policy case today pic.twitter.com/Ydwlmu6CLN— ANI (@ANI) September 13, 2024 లిక్కర్ స్కాం కేసులో.. మనీలాండరింగ్ అభియోగాలపై ఈ ఏడాది మార్చి 21న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసింది.లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరుచేయగా.. జైలు నుంచి విడుదలయ్యారు.ఆ గడువు ముగియడంతో జూన్ 2న తిరిగి లొంగిపోయారు.ఈ కేసులో జూన్ 20న రౌస్ అవెన్యూ కోర్టు దిల్లీ సీఎంకు సాధారణ బెయిల్ మంజూరు చేసింది.అయితే.. దీనిపై ఈడీ (ED) అభ్యంతరం వ్యక్తంచేయడంతో మరుసటి రోజే దిల్లీ హైకోర్టు బెయిల్ ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేసింది.అనంతరం జూన్ 25న బెయిల్‌పై స్టే విధిస్తూ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది.దీనిపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో జులైలో ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.ఇక.. ఈడీ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు నుంచి బెయిల్ వచ్చిన వెంటనే సీబీఐ ఆయనను అరెస్టు చేసింది. దీంతో ఈడీ కేసులో ఊరట లభించినప్పటికీ.. ఆయన సీబీఐ జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లో ఉండాల్సి వచ్చింది.దాదాపు ఆరు నెలలపాటు లిక్కర్ స్కాం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న కేజ్రీవాల్.. ఎట్టకేలకు బయటకు వచ్చారు. -
బెయిల్‌పై విడుదలైన ఇంజినీర్ రషీద్.. మోదీపై పోరాటం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా లోక్‌సభ ఎంపీ షేక్ అబ్దుల్ రషీద్ బుధవారం తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో ఢిల్లీ కోర్టు రషీద్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. త్వరలో జరగనున్న జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారం నిర్వహించేందుకు వీలుగా అక్టోబర్ 2 వరకు బెయిల్ అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలోనే ఆయన నేడు జైలు నుంచి బయటకు వచ్చారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ‘నయా కశ్మీర్’ కట్టు కథకు వ్యతిరేకంగా పోరాడతానని శపథం చేశారు. తన రాజకీయ పోరాటాన్ని కొనసాగిస్తానని తెలిపారు. ‘అయిదున్నర సంవత్సరాలు జైలులో ఉన్న తర్వాత.. నన్ను నేను బలంగా భావిస్తున్నాను. అలాగే నా నియోజకవర్గ ప్రజల గురించి గర్వపడుతున్నాను.నా ప్రజలను ఎప్పుడూ నిరాశపరచనని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జమ్మూ కాశ్మీర్లో ఘోరంగా విఫలమైన మోదీ 'నయా కాశ్మీర్' కథనంపై పోరాడతాను. ఆగస్ట్ 5, 2019న ఆయన ఏం చేసినా (ఆర్టికల్ 370 రద్దు) ప్రజలు తిరస్కరించారు’ అని రషీద్ పేర్కొన్నారు.VIDEO | Lok Sabha MP from Jammu and Kashmir's Baramulla Engineer Rashid walks out of Tihar Jail, a day after he was granted interim bail in a terror funding case."After remaining in jail for 5.5 years, I feel myself stronger and proud of my people. I take a pledge that I will… pic.twitter.com/SdsIc9vsu0— Press Trust of India (@PTI_News) September 11, 2024మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా చెప్పినదాని కన్నా తన పోరాటం పెద్దదని రషీద్ తెలిపారు. ‘ఆయన (ఒమర్ అబ్దుల్లా) పోరాటం కుర్చీ కోసం. నా పోరాటం ప్రజల కోసమని అన్నారు. బీజేపీ తనపై అణచివేత వ్యూహాలను ప్రయోగిస్తోందని ఆరోపించారు. తాను బీజేపీ బాధితుడినని, చివరి శ్వాస వరకు ప్రధాని మోదీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పోరాడుతానని అన్నారు.కాగా 2017లో టెర్రర్ ఫండింగ్ కేసులో ఆయనను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. 2019 నుంచి రషీద్ జైలులోనే ఉన్నారు. జైలు నుంచే లోక్‌సభ ఎన్నికల్లో బారాముల్లా స్థానం నుంచి పోటీ చేసిన రషీద్.. ఒమర్ అబ్దుల్లాను ఓడించి ఎంపీగా గెలుపొందారు. -
నేను అసలే మొండిదాన్ని.. జైలుకు పంపి జగమొండిని చేశారు
-
వడ్డీతో సహా తిరిగి ఇస్తా..!
-
కేసీఆర్ బిడ్డను.. తప్పు చేయను: కవిత
మంగళవారం రాత్రి 9.11 గంటలు.. తిహార్ జైలు ప్రాంగణం.. అంతటా ఉద్వేగపూరిత వాతావరణం.. సుమారు ఐదున్నర నెలల తర్వాత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్‌పై విడుదలై.. జైలు నుంచి బయటకు వచ్చారు. ఎన్నడూ ఇంతకాలం పిల్లలను, కుటుంబాన్ని వదిలి ఉండలేదంటూ.. కుమారుడిని, భర్తను, అన్న కేటీఆర్‌ను హత్తుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ‘నేను కేసీఆర్ బిడ్డను. తప్పు చేసే ప్రసక్తే లేదు. ఐదున్నర నెలలు అక్రమంగా జైలులో పెట్టారు. వారికి వడ్డీతో సహా చెల్లిస్తా’నంటూ భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీటితోనే పిడికిలి బిగించి ‘జై తెలంగాణ’ అంటూ నినదించారు..కవితకు బెయిల్‌పై సుప్రీంకోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ఈడీ, సీబీఐల దర్యాప్తు పూర్తయి, చార్జిïÙట్లు దాఖలైనా ఆమెకు బెయిల్ ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించడాన్ని తప్పుపడుతూ.. సుప్రీంకోర్టు కవితకు బెయిల్ మంజూరు చేసింది. అప్పటి నుంచి మాజీ సీఎం కేసీఆర్ పది నిమిషాలకోసారి కేటీఆర్, హరీశ్‌రావులకు ఫోన్ చేస్తూ.. ఆమె బయటికి ఎంతసేపట్లో వస్తుంది, వెంట ఎవరెవరు ఉన్నారంటూ ఆరా తీస్తూనే ఉన్నారు. జైలు బయట భర్తతో కలసి అభివాదం చేస్తున్న కవిత బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తిహార్ జైలు వద్దకు చేరుకుని.. ‘డాటర్ ఆఫ్ ఫైటర్.. కవితమ్మా.. మేమంతా నీకు అండగా ఉన్నాం’ అంటూ ప్లకార్డులతో స్వాగతం పలికారు. జైలు నుంచి విడుదలైన తర్వాత కవిత ఢిల్లీ వసంత్ విహార్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వెళ్లి పార్టీ నేతలతో భేటీ అయ్యారు. నేడు (బుధవారం) మధ్యాహ్నం 2.45 గంటలకు కవిత ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరనున్నారు. ఆమెకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి 500 కార్లతో భారీ ర్యాలీగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు బీఆర్ఎస్ నేతలు తెలిపారు. సాక్షి, న్యూఢిల్లీ: ‘‘నేను 18 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. ఎన్నో ఎత్తు పల్లాలు చూశా. ఇన్ని రోజులు ఒక తల్లిగా పిల్లలకు ఏనాడూ దూరంగా ఉండలేదు. నన్ను ఈ పరిస్థితికి తెచ్చిన వారికి కచ్చితంగా వడ్డీతో సహా సమాధానం చెబుతాను’’ అంటూ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర భావోద్వేగంతో అన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలను ఎదుర్కొంటూ 166 రోజులపాటు ఢిల్లీ తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవితకు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరుచేసింది. రాత్రి సరిగ్గా 9.11 గంటలకు తీహార్ జైలు నుంచి పిడికిలి బిగించి, జై తెలంగాణ అంటూ బయటకు వచ్చిన కవితకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. గేటు బయటకు రాగానే పెద్ద కుమారుడు ఆదిత్యను చూసిన కవిత భావోద్వేగానికి గురై ఆలింగనం చేసుకున్నారు. పక్కనే ఉన్న సోదరుడు కేటీఆర్‌ను ఆత్మీయ ఆలింగనం చేసుకోగా, కేటీఆర్ కవిత నుదిటిపై ముద్దుపెట్టారు. భర్త అనిల్, హరీశ్‌రావులతో ఆలింగనం అనంతరం అక్కడున్న బీఆర్ఎస్ నేతలు సునీత లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ప్రశాంత్‌రెడ్డి, మాలోతు కవిత తదితరులను ఆప్యాయంగా పలకరించారు. కవిత విడుదల అవుతున్నారని తెలుసుకున్న ఢిల్లీలోని తెలంగాణ ప్రజలు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ‘డాటర్ ఆఫ్ ఫైటర్, కవిత కడిగిన ముత్యం, కవితమ్మా.. మేమంతా నీకు అండగా ఉన్నాం’ అనే ప్లకార్డులతో స్వాగతం పలికారు. నన్ను జగమొండిని చేశారు కవిత జైలు బయట ఉన్న మీడియా, కార్యకర్తలనుద్దేశించి రెండు నిమిషాలు ప్రసంగించారు. ‘ఐదున్నర నెలల తర్వాత కుటుంబ సభ్యులను, కార్యకర్తల్ని, మీడియాను కలవడం ఎంతో సంతోషంగా ఉంది. ఒక తల్లిగా పిల్లల్ని వదిలేసి ఐదున్నర నెలలు ఏనాడూ ఉండలేదు. ఇది చాలా ఇబ్బందికరమైన విషయం. నన్ను, నా కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేసిన వారికి తప్పకుండా వడ్డీతో సహా చెల్లిస్తాం, సరైన సమయానికి సరైన సమాధానం చెబుతాను. కష్టకాలంలో తోడుగా నిలిచిన ప్రతి ఒక్క కార్యకర్తకూ నా కృతజ్ఞతలు. ఎవరి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నేను కేసీఆర్ బిడ్డను. తెలంగాణ బిడ్డను. కమిట్మెంట్తో పనిచేస్తాను, న్యాయపరంగా ఎదుర్కొంటాను, రాజకీయంగా కొట్లాడతాను. నేను మాములుగా కాస్త మొండిదానిని, మంచిదానిని, నన్ను అనవసరంగా జైలుకు పంపి ఇప్పుడు జగమొండిని చేశారు’ అంటూ వ్యాఖ్యానించారు. తనను అక్రమంగా జైలుకు పంపారని, బీఆర్ఎస్, కేసీఆర్‌ను విచ్ఛిన్నం చేయడానికే ఇలా చేశారని మండిపడ్డారు. నేడు 500 కార్లతో భారీ ర్యాలీ కవిత బుధవారం మధ్యాహ్నం 2.45 గంటలకు ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్లనున్నారు. జైలు నుంచి విడుదలై రాష్ట్రానికి వస్తున్న కవితకు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం పలకనున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి సుమారు 500 కార్లతో భారీ ర్యాలీ ఏర్పాటు చేస్తున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఆటోలో కేటీఆర్: కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన వెంటనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావులు కోర్టు బయటకు వచ్చారు. అప్పటికే అక్కడ భారీ సంఖ్యలో మీడియా ప్రతినిధులు వేచి ఉన్నారు. తమతో మాట్లాడాలని మీడియా ప్రతినిధులు వెంటపడుతున్న సమయంలో.. అందరికీ అభివాదం చేస్తూ బయటకు వచ్చారు. ఆ సమయంలో కారు అందుబాటులో లేకపోవడంతో ఓ ఆటో మాట్లాడుకుని దీన్‌దయాల్ మార్గంలోని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఇంటికి చేరుకున్నారు. పది నిమిషాలకోసారి కేసీఆర్ ఫోన్ బెయిల్ మంజూరు అని తెలిసినప్పటి నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి పది నిమిషాలకోసారి కేటీఆర్, హరీశ్, కవిత భర్త అనిల్‌లకు ఫోన్ చేస్తూనే ఉన్నారు. ఎప్పటిలోగా బయటకు తెస్తారు, కవితమ్మ వెంట ఎవరెవరు ఉంటారు, జైలు వద్దకు ఎప్పుడు వెళతారంటూ కేసీఆర్ ఆరా తీస్తూనే ఉన్నారు. అక్రమంగా జైలులో పెట్టారు కవిత జైలు నుంచి నేరుగా వసంత్‌విహార్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వెళ్లారు. కవిత వెంట కారులో కేటీఆర్, కుమారుడు ఆదిత్య, భర్త అనిల్, పార్టీ నేతలు సునీత లక్ష్మారెడ్డి, మాలోతు కవిత ఉన్నారు. పార్టీ కార్యాలయానికి చేరుకున్న పది నిమిషాలకే పార్టీ నేతలతో కవిత సమావేశమయ్యారు. ఢిల్లీ లిక్కర్ కేసు బోగస్ అని, కేసీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక తనను టార్గెట్ చేసుకుని జైలుకు పంపారంటూ ఆమె నేతలతో చర్చించారు.నోటీసులు, అరెస్టు నుంచి విడుదల దాకా..⇒ 08–03–2023న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కవితకు సమన్లు జారీ చేసింది ⇒ 11–03–2023న ఢిల్లీలో ఈడీ విచారణకు కవిత హాజరు ⇒ 15–03–2023న ఈడీ సమన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కవిత ⇒ 21–03–2023న తన ఫోన్లను ఈడీకి సమర్పించిన కవిత ⇒ 14–09–2023న కవితకు మళ్లీ నోటీసులు జారీ చేసిన ఈడీ ⇒ 15–09–2023న సమన్ల జారీని పదిరోజులు వాయిదా వేసిన సుప్రీంకోర్టు ⇒ 15–03–2024న లిక్కర్ స్కామ్‌లో కవితను అరెస్టు చేసిన ఈడీ ⇒ 16–03–2024న ఢిల్లీలోని కోర్టులో హాజరు, రిమాండ్ ⇒ 05–04–2024న కవి తను విచారించేందుకు సీబీఐ పిటిషన్ ⇒ 08–04–2024న కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన ట్రయల్ కోర్టు ⇒ 11–04–2024న తీహార్ జైల్లో కవితను అరెస్టు చేసిన సీబీఐ ⇒ 12–04–2024న సీబీఐ కోర్టును ఆశ్రయించిన కవిత.. ఆ పిటిషన్‌పై తీర్పు రిజర్వు ⇒ 15–04–2024న కవితకు 9 రోజులు జ్యుడీషియల్ కస్టడీ ⇒ 16–04–2024న బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా ⇒ 23–04–2024న మే 7 వరకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు ⇒ 14–05–2024న జ్యుడీషియల్ కస్టడీ మే 20 వరకు పొడిగింపు ⇒ 03–06–2024న జూలై 3 వరకు రిమాండ్ కొనసాగింపునకు ఆదేశం ⇒ 01–07–2024న కవిత బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు ⇒ 03–07–2024న జ్యుడీషియల్ కస్టడీ జూలై 25 వరకు పొడిగింపు ⇒ 22–07–2024న బెయిల్ పిటిషన్‌పై ట్రయల్ కోర్టు విచారణ వాయిదా ⇒ 05–08–2024న బెయిల్ పిటిషన్‌పై ట్రయల్ కోర్టు విచారణ మళ్లీ వాయిదా ⇒ 07–08–2024న సుప్రీంకోర్టును ఆశ్రయించిన కవిత ⇒ 12–08–2024న బెయిల్ పిటిషన్‌పై సుప్రీంలో విచారణ వాయిదా ⇒ 20–08–2024న బెయిల్ పిటిషన్ వి చారణ మళ్లీ వాయిదా ⇒ 22–08–2024న కవితకు అస్వస్థత.. తీహార్ జైలు నుంచి ఆస్పత్రికి తరలింపు ⇒ 27–08–2024న కవితకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు. -
కేసీఆర్ బిడ్డ తప్పు చేయదు : కవిత
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆమెకు భర్త, కుమారుడు ,బీఆర్ఎస్ నేతలు కేటీఆర్,హరీష్ రావుతో పాటు పలు సీనియర్ నేతలు తీహార్ జైలు బయట స్వాగతం పలికారు. అనంతరం కుటుంబ సభ్యులను చూసిన కవిత భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను తెలంగాణ బిడ్డను, కేసీఆర్ బిడ్డను. కేసీఆర్ బిడ్డ ఎలాంటి తప్పు చేయదు. తప్పు చేసే ప్రసక్తే లేదు అంటూ కవిత భావోద్వేగానికి గురయ్యారు.Delhi: BRS leader K Kavitha walks out of Tihar Jail.She was granted bail in the Delhi excise policy case by the Supreme Court today. pic.twitter.com/s3OQOJ1gqH— ANI (@ANI) August 27, 2024 చాలా రోజుల తర్వాత మీ అందరిని కలవడం సంతోషం. 18 ఏళ్లుగా నేను రాజకీయాల్లో ఉన్నా. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కున్నా. నేను మొండిదాన్ని.. నన్ను అనవసరంగా జైలుకు పంపి జగమొండిదాన్ని చేశారు. ఒక తల్లిగా ఐదున్న నెలల పిల్లల్ని వదిలి ఉండటం చాలా బాధాకరం. ఈ ఐదు నెలలు కుటుంబానికి దూరంగా ఉండడం ఇబ్బందికరమైన విషయం. నన్ను,నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన వాళ్లకు తప్పకుండా వడ్డీతో సహా చెల్లిస్తాం. ఆ సమయం అతి త్వరలోనే రాబోతుంది. చట్టబద్ధంగా నా పోరాటం కొనసాగిస్తా. క్షేత్ర స్థాయిలో మరింత నిబద్ధతగా పనిచేస్తాం’ అని కవిత అన్నారు. కష్ట సమయంలో తన కుటుంబానికి తోడుగా ఉన్నవారికి ధన్యవాదాలు తెలిపారు.#WATCH | Delhi: BRS leader K Kavitha says "I want to thank all of you. I became emotional after meeting my son, brother and husband today after almost 5 months. Only politics is responsible for this situation. The country knows that I was put in jail only because of politics, I… pic.twitter.com/VVbunxb9qk— ANI (@ANI) August 27, 2024 -
తీహార్ జైలు నుంచి కవిత విడుదల
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. విడుదల సందర్భంగా ఆమె భర్త, కుమారుడు ,బీఆర్ఎస్ నేతలు కేటీఆర్,హరీష్ రావుతో పాటు పలు సీనియర్ నేతలు కవితకు తీహార్ జైలు బయట స్వాగతం పలికారు ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సుప్రీం కోర్టులో కవితకు బెయిల్ ఇచ్చింది. దీంతో ఆమె మంగళవారం(ఆగస్ట్27) తీహార్ జైలు నుంచి బయటకు వచ్చారు.దాదాపూ 165 రోజులు జైలులో ఉన్న ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఇవాళ సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. సుదీర్ఘంగా సాగిన విచారణ అనంతరం ఈడీ,సీబీఐ కేసుల్లో బెయిల్ మంజూరు చేసింది. సుప్రీం కోర్టు తీర్పుతో కవిత తీహార్ జైలు నుంచి విడుదల కావడం సుగమమైంది. #WATCH | Delhi: Supreme Court grants bail to BRS leader K Kavitha in the excise policy irregularities case.BRS MP Ravi Chandra says, "Today is a very good day for us...A wrong case was filed against her and they have no proof against her...Our party believes in judiciary and… pic.twitter.com/d0UjoFQ8Fn— ANI (@ANI) August 27, 2024 తీహార్ జైలు నుంచి విడుదల చేసేందుకు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కోర్టుకు కవిత భర్త అని ష్యూరిటీ పత్రాలు సమర్పించారు. కోర్టు ఉత్తర్వులు ఇవ్వడంతో రిలీజ్ వారెంట్‌తో తీహార్ జైలుకు కవిత తరుఫు న్యాయవాదులు వెళ్లారు. తీహార్ జైల్లో కవితను విడుదల చేసేందుకు సంబంధిత పత్రాలను సమర్పించారు. కాగా, మద్యం పాలసీ కేసులో ఈ ఏడాది మార్చి 15న కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ఈడీ అరెస్ట్ కేసు విచారణ కొనసాగుతుండగానే అదే కేసులో ఏప్రిల్ 15న సీబీఐ ఆమెను అరెస్టు చేసింది. కాగా, దాదాపు ఐదు నెలలుగా రిమాండ్ ఖైదీగా తీహార్ జైలులో ఉన్నారు.తీహార్ జైలు వద్ద బీఆర్ఎస్ శ్రేణులుతీహార్ జైలు నుంచి విడుదలతో కవితను పరామర్శించేందుకు తిహార్ జైలు వద్దకు చేరుకున్న మాజీ మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, ముత్తిరెడ్డి మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు, ఎమ్మెల్యే వివేక్ గౌడ్ వచ్చారు. -
ఎమ్మెల్సీ కవితకు మరోసారి అస్వస్థత
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్లై, తిహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి అస్వస్థకు గురయ్యారు. దీంతో జైలు డాక్టర్ల సిఫార్సు మేరకు ఆమెను వెంటనే ఢిల్లీ ఎయిమ్స్‌కు అధికారులు తరలించారు. అక్కడ కవితకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే కవిత గైనిక్ సమస్యలు, వైరల్ జ్వరంతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు.కాగా ఢిల్లీ మధ్యం కుంభకోణం కేసులో ఆమె తిహార్ జైలులో శిక్షననుభవిస్తున్న విషయం తెలిసిందే. లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీలాండరిగ్ నేరారోపణలతో సీబీఐ, ఈడీ కేసుల్లో మార్చి 15న హైదరాబాద్‌లో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత.. దాదాపు 5 నెలలగా జైలులో ఉన్నారు.ఇక గతంలోనూ ఒకసారి కవిత అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఆమె తీవ్ర జ్వరం ,నీరసంతో బాధపడ్డారు. కవిత కళ్లు తిరిగి పడిపోవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కోలుకున్న తర్వాత కవితను మళ్లీ తీహార్ జైలుకు తరలించారు.మరోవైపు అనారోగ్యం కారణంగా ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.ఈ విషయంలో వచ్చే గురువారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది. తదుపరి విచారణను 27కు వాయిదా వేసింది. -
ఇన్ని నెలలు జైల్లో ఉంటానని ఊహించలేదు: మనీష్ సిసోడియా
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టైన ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియా ఇటీవల తిహార్ జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. గతేడాది ఫిబ్రవరిలో అరెస్ట్ అయిన సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో దాదాపు 17 నెలల అనంతరం ఆగష్టు 9న జైలు నుంచి బయటకు వచ్చారు. ఈ సందర్భంగా తాజాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.. ఇంత కాలం తాను జైలులో ఉంటానని ఎప్పుడూ అనుకోలేదని తెలిపారు. విచారణను పొడిగించాలనే ఉద్ధేశ్యంతోనే తనపై ఆరోపణలు చేశారని అన్నారు. కొన్ని నెలల ముందు కూడా తాను జైలుకు వెళ్తానని ఊహించలేదని తెలిపారు. ‘రాజకీయాల్లో ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడం మామూలే. కాబట్టి నాకు లోపల నుంచి నమ్మకం ఉండేది. ఒక వ్యక్తిని జైలుకు పంపడం లేదా అరెస్టు చేయడం వెనుక ఏదో ఒక కారణం ఉంటుందని భావించాను.సంస్కరణలు తీసుకురావాలి, అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలి, ప్రజలతో మమేకం అవ్వాలని క్రియాశీల రాజకీయాల్లోకి ఎవరైనా రావాలి అనుకున్నప్పుడు వారికి రెడ్ కార్పెడ్ పరిచి స్వాగతం లభిస్తుందని ఎప్పుడూ ఆశించకూడదు. అదే విధంగా నేను కూడా మానసికంగా సిద్ధమయ్యాను. కానీ మరీ 17 నెలల పాటు మద్యం పాలసీ కేసులో జైలులో నేను ఎప్పుడూ అనుకోలేదుఆరోపణలు కల్పితమే..పీఎంఎల్ చట్టం కింద ఈడీ, సీబీఐ నామీద కేసులు పెట్టింది. ఈ చట్టం ప్రధానంగా ఉగ్రవాదులు, డ్రగ్స్ మాఫియాలకు నిధులను ఆపడానికి ఉద్దేశించిందిది. ఈ చట్టం ప్రకారం బెయిల్ సాధించడం కష్టం. అందుకే నన్ను చాలా కాలం జైలులో ఉంచడమే వారి ఏకైక లక్ష్యం. ముఖ్యంగా నా భార్య అనారోగ్యంతో ఉన్నప్పుడు నేను జైలులో ఉండటం నాకు, నా కుంటుబానికి ఇబ్బందిగా ఉండేది. . అయితే నేను కృంగిపోకూడదని బలంగా నిశ్చయించుకున్నాను.జైలులో ఉన్నప్పుడు, దాదాపు 15 నుంచి 16 గంటలు, సెల్లో ఏకాంతంగా ఉండాల్సి ఉంటుంది. ఎవరితోనూ సంభాషణకు అవకాశం ఉండదు. అందుకే నాతో నేను స్నేహం చేయడం అలవాటు చేసుకున్నాను.’ అని తెలిపారు.మళ్లీ డిప్యూటీ సీఎంగా..కాగా ఢిల్లీ ప్రభుత్వంలో తిరిగి ఉప ముఖ్యమంత్రిగా ఉండాలనుకుంటున్నారా అనే ప్రశ్నకు సిసోడియా స్పందిస్తూ.. ప్రస్తుతానికి, పార్టీ కోసం పని చేయడం గర్వంగా ఉందని, పరిపాలనలో భాగం కావడానికి తొందరపడటం లేదని అన్నారు.‘నేను జైలు నుంచి బయటకు వచ్చి నాలుగు రోజులైంది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ త్వరలో తిరిగి వస్తాడు. ఆయన వచ్చాక నేను పార్టీ ప్రమోషన్లో ఉండాలా లేదా ప్రభుత్వంలో ఉండాలా అని ముఖ్యమంత్రి, పార్టీ సీనియర్ నాయకత్వం నిర్ణయిస్తుంది. ’ అని తెలిపారు. -
కేజ్రీవాల్ జైలు నిబంధనలు ఉల్లంఘన!
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తిహార్ జైలులో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనాకు లేఖ రాయడాన్ని జైలు అధికారులు తప్పు పట్టారు. జైలు నిబంధనలు ఉల్లంఘించటమేని తెలిపారు. వచ్చే ఆగస్టు 15 తేదీన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మంత్రి అతిశీ జాతీయజెండాను ఎగరవేస్తారని తెలుపుతూ సీఎం కేజ్రీవాల్ ఎల్జీకి లేఖ రాసినట్లు తీహార్ జైలు అధికారులు తెలిపారు. దీనిపై తిహార్ జైలు నంబర్ 2, సుపరింటెండెంట్ స్పందించారు. సీఎం కేజ్రీవాల్ ఎల్జీకి లేఖ రాసి ఢిల్లీ జైలు నింబంధనలు-2018ను ఉల్లంఘించారని అన్నారు. ఆయన రాసిన లేఖకు సంబంధించిన సమాచారం మీడియాలో రావటంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఇటువంటి అనుమతిలేని చర్యలు పాల్పడితే.. జైలులో సీఎంకు ఉన్న అధికారాలను కూడా కుదించాల్సి వస్తుందని కేజ్రీవాల్‌కు సూచించారు. కేజ్రీవాల్ ఆగస్టు 6వ తేదీన ఎల్జీకి లేఖ రాసినట్లు జైలు అధికారులు నిర్ధారించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ మార్చి 21న అరెస్ట్ చేసిన విషయం. ఇక. ఈడీ కేసులో ఇటీవల సుప్రీం కోర్టు ఆయను బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇదే కేసులో కేజ్రీవాల్‌ను సీబీఐ ఆరెస్ట్ చేయగా ఆయన ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. మరోవైపు.. అరవింద్ కేజ్రీవాల్ రాసిన లేఖ తమకు చేరలేదని ఎల్జీ కార్యాలయం పేర్కొనటం గమనార్హం. ఇదిలా ఉండగా.. స్వాతంత్ర్య దినోత్సవం (అగస్టు15) సందర్భంగా రాష్ట్ర మంత్రి అతిశీ జాతీయ జెండాను ఎగురవేస్తారని సీఎం కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నారని పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ వెల్లడించారు. ఈ మేరకు ప్రభుత్వం తరఫున ఓ ప్రకటన విడుదల చేశారు. -
Supreme Court: సిసోడియాకు బెయిల్
న్యూఢిల్లీ: ఢిల్లీ మధ్య కుంభకోణం కేసులో 17 నెలల క్రితం అరెస్టయి తిహార్ జైలులో విచారణ ఖైదీగా గడుపుతున్న ఆప్ నేత, నాటి ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు ఎట్టకేలకు సుప్రీంకోర్టులో బెయిల్ దొరికింది. సుదీర్ఘకాలంపాటు కేసు దర్యాప్తును సాగదీసి విచారణ ఖైదీకుండే హక్కులను కాలరాయలేమని శుక్రవారం బెయిల్ ఉత్తర్వులిస్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ మేరకు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌ల ధర్మాసనం సిసోడియాకు బెయిల్‌ను మంజూరుచేస్తూ 38 పేజీల తీర్పు వెలువరించింది. బెయిల్ పిటిషన్‌పై ఆగస్ట్ ఆరో తేదీన వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్‌చేసి ఆగస్ట్ 9వ తేదీన వెలువరించింది.వైకుంఠపాళి ఆడించారు.. ‘‘బెయిల్ అనేది నియమం. బెయిల్‌ను తిరస్కరించి విచారణ ఖైదీగా జైలుకు పరిమితం చేయడం అనేది ఒక మినహాయింపు’’ మాత్రమే అనే సూత్రాన్ని ట్రయల్ కోర్టులు, హైకోర్టులు జ్ఞప్తికి తెచ్చుకోవాల్సిన సమయమిది. బెయిల్ విషయంలో విచారణ కోర్టులు, హైకోర్టులు సేఫ్ గేమ్ ఆడుతున్నాయి. మనీశ్‌పై సీబీఐ, ఈడీలు దర్యాప్తు పూర్తిచేసి జూలై 3 కల్లా చార్జ్షీట్లు సమర్పిస్తాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గతంలో హామీ ఇచ్చారు. కానీ అది జరగలేదు. సిసోడియాను ట్రయల్ కోర్టుకు, అక్కడి నుంచి హైకోర్టుకు, తర్వాత సుప్రీంకోర్టుకు, మళ్లీ ట్రయల్ కోర్టుకు తిప్పుతూ ఆయనతో వైకుంఠపాళి ఆట ఆడించారు. బెయిల్ అనివార్యమైన కేసుల్లోనూ బెయిల్ తిరస్కరించడంతో సంబంధిత పిటిషన్లు సుప్రీంకోర్టుకు వెల్లువలా వస్తున్నాయి. సమాజంతో మమేకమైన సిసోడియా లాంటి వ్యక్తులను శిక్ష ఖరారు కాకుండానే సుదీర్ఘ కాలం నిర్బంధించి ఉంచకూడదు. స్వేచ్ఛగా, వేగవంతమైన విచారణను కోరడం నిందితుడికి రాజ్యాంగం ప్రసాదించిన హక్కు. అయితే కేసు విచారణ నత్తనడకన సాగడానికే సిసోడియానే కారణమన్న కిందికోర్టు అభిప్రాయం వాస్తవదూరంగా ఉంది’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ విషయంలో సిసోడియాకు బెయిల్‌ను తిరస్కరిస్తూ మే 21వ తేదీన ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పక్కనబెట్టింది. ‘‘రూ.10 లక్షల వ్యక్తిగత బాండ్‌తోపాటు అదే మొత్తానికి మరో రెండు షూరిటీలను సమర్పించాలి. పాస్ట్‌పోర్ట్‌ను ప్రత్యేక ట్రయల్ కోర్టులో ఇచ్చేయాలి. సాక్ష్యాధారాలను ధ్వంసంచేయకూడదు. సాక్షులను ప్రభావితం చేయకూడదు. దర్యాప్తు అధికారి ఎదుట ప్రతి సోమ, గురు వారాల్లో ఉదయం 10–11 గంటల మధ్య హాజరు కావాలి’’ అని కోర్టు షరతులు విధించింది. తొలుత సీబీఐ.. ఆ తర్వాత ఈడీడిఫ్యూటీ సీఎంగా ఉన్న సిసోడియాను మద్యం కేసులో 2023 ఫిబ్రవరి 26వ తేదీన సీబీఐ అరెస్ట్‌చేసింది. తర్వాత రెండు రోజులకే ఆయన తన పదవికి రాజీనామా చేశారు. మార్చి 9న మనీలాండరింగ్ కోణంలో కేసు నమోదుచేసి ఈడీ సైతం జ్యుడీషియల్ కస్టడీలో ఉండగానే ఆయనను అరెస్ట్‌చేసింది.అంబేడ్కర్‌కు రుణపడ్డా: సిసోడియాతీర్పు నేపథ్యంలో శుక్రవారం తీహార్ జైలు నుంచి సిసోడియా విడుదలయ్యారు. పెద్దసంఖ్యలో జైలు వద్దకొ చ్చిన ఆప్ కార్యకర్తలు ఆయనపై పూలు చల్లుతూ స్వాగతం పలికారు. ‘‘ నిరంకుశ కేంద్రప్రభుత్వ చెంప చెళ్లు మనిపించేందుకు రాజ్యాంగ అధికారాలను వినియోగించిన కోర్టుకు నా కృతజ్ఞతలు. శక్తివంతమైన రాజ్యాంగం, ప్రజా స్వామ్యం వల్లే బెయిల్ పొందగలిగా. ఈ బెయిల్ ఉత్తర్వు చూశాక జీవితాంతం రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌కు రుణపడిపోయా. ఈ అనైతిక యుద్ధానికి రాజ్యాంగబద్ధంగా తార్కిక ముగింపు పలికాం. ఏదో ఒక రోజు ఈ చెడు సంస్కృతి అంతమవుతుంది. అప్పుడు బెయిల్‌పై కేజ్రీవాల్ కూడా విడుదల అవుతారు’’ అని సిసోడియా అన్నారు.ఆప్ హర్షంసిసోడియాకు బెయిల్‌పై ఆప్ పార్టీ హర్షం వ్యక్తంచేసింది. ‘‘ సత్యమేవ జ యతే. ఢిల్లీలో విద్యా విప్ల వానికి నాంది పలికిన సిసోడియాకు ఇది గొప్ప విజయం. ఇది విద్యా విజయం, విద్యా ర్థుల విజయం’’ అని ఢిల్లీ మహిళా మంత్రి అతిశి వ్యాఖ్యానించారు. -
రేపు ఢిల్లీకి కేటీఆర్, హరీశ్‌రావు.. ఎమ్మెల్సీ కవితతో భేటీ
సాక్షి,న్యూఢిల్లీ: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆదివారం(ఆగస్టు 4) ఢిల్లీ వెళ్లనున్నారు. తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితతో ఇద్దరు భేటీ అయ్యే అవకాశం ఉంది. సుప్రీంకోర్టులో బెయిల్ దరఖాస్తుకు ఏర్పాట్లు చేయనున్నారు.మరోపక్క సుప్రీంకోర్టులో పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ కూడా వేసే అవకాశం ఉంది. ఇరువురు మూడు రోజులు ఢిల్లీలోనే ఉండనున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసలో ఎమ్మెల్సీ కవిత అరెస్టయి తీహార్ జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే. -
కవితకు అస్వస్థత.. నేడు తీహార్ జైలుకు కేటీఆర్
సాక్షి, ఢిల్లీ: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్బంగా నేడు తీహార్ జైలులో ఉన్న తన సోదరి కవితతో కేటీఆర్ ములాఖత్ కానున్నారు. కవిత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోనున్నారు.కాగా, కేటీఆర్ ఢిల్లీలో పర్యటనలో భాగంగా నేడు కవితను కలువనున్నారు. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన కవిత ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవలే కవిత అస్వస్థతకు గురయ్యారు. దీంతో, కవిత ఆరోగ్య పరిస్థితిని కేటీఆర్ అడిగి తెలుసుకోనున్నారు. మరోవైపు.. కొద్దిరోజుల క్రితమే కవితకు ఎయిమ్స్ వైద్య పరీక్షలు చేయాలని కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. -
తక్కువ కేలరీల ఆహారం తీసుకుంటున్నారు
న్యూఢిల్లీ: తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగానే తక్కువ కేలరీలున్న ఆహారం తీసుకుంటున్నారని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆరోపించారు. వైద్యులు సూచించిన మందులను కూడా ఆయన వాడకపోవచ్చని పేర్కొన్నారు. తీహార్ జైలు సూపరింటెండెంట్ నివేదికను ప్రస్తావిస్తూ ఎల్జీ ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేశ్ కుమార్‌కు లేఖ రాసినట్లు రాజ్‌భవన్ వర్గాలు శనివారం తెలిపాయి. కేజ్రీవాల్‌కు ఇంటి వద్ద నుంచి వచ్చిన ఆహారాన్ని సరిపోను అందజేస్తున్నా కూడా ఆయన కావాలనే తక్కువ కేలరీలున్న ఆహారం తింటున్నట్లుగా ఆధారాలున్నాయన్నారు. గ్లూకో మీటర్ టెస్ట్ రీడింగ్‌కు, కంటిన్యువస్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టం రీడింగ్‌కు మధ్య కనిపిస్తున్న భారీ వ్యత్యాసంపై అధికారులు పరిశీలన జరపాలని సూచించారు.ఎల్జీ వైద్యుడనే విషయం తెలియదుఎల్జీ వీకే సక్సేనా రాసిన లేఖపై ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ స్పందిస్తూ.. నాకు తెలిసినంత మటుకు ఆయన గతంలో సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే వారు. వీకే సక్సేనా డాక్టర్ అని, ఆరోగ్య అంశాల్లో మంచి నిపుణుడనే విషయం నాకు తెలియదు. ఎప్పుడైనా ఆయన ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే, ఈసీకి సమర్పించిన అఫిడవిట్‌ను చదివి ఉండేవాళ్లం’ అంటూ ఎద్దేవా చేశారు. తమ నేతను చంపేందుకు బీజేపీ దుర్మార్గపు పథకం పన్నిందని ఆరోపించారు. -
ఎమ్మెల్సీ కవిత డిశ్చార్జి, మళ్లీ తీహార్ జైలుకు..
ఢిల్లీ, సాక్షి: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో ఆమెను అధికారులు తిరిగి తీహార్ జైలుకు తీసుకెళ్లారు. గత రెండు రోజులుగా జ్వరంతో ఆమె బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో.. మంగళవారం ఉదయం ఆమె హఠాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. నీరసంతో కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో అధికారులు ఆమెను దీన్‌దయాళ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు ఆమెకు చికిత్స అందించి.. డిశ్చార్జి చేశారు. లిక్కర్ స్కాం కేసులో ఈడీ ఆమెను అరెస్ట్ చేయగా.. వంద రోజులకు పైగా ఆమె తీహార్ జైల్లో ఉన్నారు. ఆమె కస్టడీని కోర్టు పొడిగిస్తూ వెళ్తుండగా.. మరోవైపు ఆమె బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. -
సీఎం కేజ్రీవాల్ ఆరోగ్యంపై వదంతులు!
న్యూఢిల్లీ: తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం,ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను తీహార్ జైల్లో చంపే కుట్ర జరుగుతోందని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాదు ఆయన జైలుకు వెళ్లినప్పటి నుండి 8.5 కిలోల బరువు తగ్గారని అంటున్నారు. ఆప్ నేతల వ్యాఖ్యలపై తీహార్ జైలు అధికారులు స్పందిస్తూ కేజ్రీవాల్ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై రిపోర్ట్‌ను విడుదల చేశారు. మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌ను ఈడీ మార్చి 21న అరెస్ట్ చేసింది. ఆ తర్వాత మద్యంతర బెయిల్ మీద బయటకొచ్చి లోక్‌సభ ఎన్నికల ప్రచారం చేశారు. ఏప్రిల్ 1వ తేదీన తీహార్ సెంట్రల్ జైలు నెం.2లోకి ప్రవేశించిన రోజు కేజ్రీవాల్ బరువు 65 కిలోలు. లోక్‌సభ ఎన్నికలకు ముందు అంటే మే 10 నుంచి జూన్ 2వరకు సుప్రీం కోర్టు మద్యంతర బెయిల్ ఇచ్చింది. తాత్కాలిక బెయిల్ వచ్చిన సమయంలో కేజ్రీవాల్ బరువు 64 కిలోలు. తాత్కాలిక బెయిల్ గడువు ముగిసిన తర్వాత అంటే జూన్ 2న కేజ్రీవాల్ బరువు 63.5గా ఉంది. ఆయన, ప్రస్తుత బరువు 61.5కిలోలుగా ఉందని వివరణిచ్చింది. తక్కువ పరిమాణంలో ఆహారం తీసుకోవడంకాగా, తక్కువ పరిమాణంలో ఆహారం తీసుకోవడం లేదా తక్కువ కేలరీలు తీసుకోవడం వల్ల బరువు తగ్గడం తగ్గినట్లు అని జైలు వైద్యాధికారి చెప్పినట్లు జైలు నిర్వహాణ విభాగం అధికారులు తెలిపారు. కేజ్రీవాల్‌కు నిరంతరం వైద్యుల పర్యవేక్షణ ఉంటుందని, జైలుకు చెందిన మెడికల్ స్పెషలిస్ట్ డాక్టర్ ఆయనకు మందులు ఇస్తారని అని విడుదల చేసిన అధికారిక నోట్లో పేర్కొంది.గతంలో కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. కేజ్రీవాల్‌ను అరెస్టు చేసినప్పుడు 70 కిలోల బరువు ఉన్నారని, ఆ బరువు 61.5 కిలోలకు తగ్గిందని చెప్పారు.ఇలా బరువు పెరగడం తీవ్రమైన అనారోగ్యానికి సంకేతమని వ్యాఖ్యానించారు.నిరంతరం వైద్యుల పర్య వేక్షణలోజైలులో ఉన్న కేజ్రీవాల్ బ్లడ్ షుగర్ చాలాసార్లు పడిపోయిందన్న ఆప్ నేతల వాదనను తిప్పికొడుతూ ‘ప్రస్తుతం, కేజ్రీవాల్ బ్లడ్ షుగర్‌ను మెడికల్ బోర్డు సలహా మేరకు పర్యవేక్షిస్తున్నాం. బోర్డ్ సలహా మేరకు చికిత్స, ఆహారం అందిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. రక్తపోటు, బ్లడ్ షుగర్, బరువును క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నారని, ఇతర అనారోగ్య సమస్యలకు చికిత్స అందిస్తున్నట్లు చెప్పిన తీహార్ జైలు అధికారులు.. రోజుకు మూడుసార్లు ఇంట్లో వండిన ఆహారాన్ని తింటున్నారని జైలు అధికారులు నివేదించారు.నిరాధార ఆరోపణలు సరికాదుఆప్ నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని జైలు అధికారులు ఆరోపిస్తున్నారు. అటువంటి ఆరోపణలు, తప్పుడు సమాచారంతో ప్రజలను గందరగోళానికి గురిచేస్తుంది. జైలు పరిపాలనను దెబ్బతీయాలనే ఉద్దేశ్యంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. తీహార్ జైలు నివేదికపై స్పందించిన సంజయ్ సింగ్తీహార్ జైలు నివేదికపై స్పందించిన ఆప్ నేత సంజయ్ సింగ్ స్పందిస్తూ.. కేజ్రీవాల్ బరువు తగ్గారని, కేజ్రీవాల్ రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గినట్లు పడిపోయిందని జైలు నివేదిక నిర్ధారిస్తుంది. షుగర్ లెవల్స్ తక్కువగా ఉంటే, నిద్రలో కోమాలోకి జారిపోవచ్చు.బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం కూడా ఉందని అన్నారు. ఆప్ చేస్తున్న ఆరోపణలపై ఢిల్లీ బీజేపీ యూనిట్ ఎదురుదాడి చేసింది. ఢిల్లీలో పార్టీకి నాయకత్వం వహిస్తున్న వీరేంద్ర సచ్‌దేవా, ఆప్ నాయకులు కోర్టును తప్పుదోవ పట్టించడానికి, కేజ్రీవాల్‌కు బెయిల్ వచ్చేలా చేసేందుకు డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. -
సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్
న్యూఢిల్లీ,సాక్షి: ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టులో ఊరట దక్కింది. సుప్రీం కోర్టు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. తన అరెస్టు అక్రమమని కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు జస్టిస్ సంజీవ్ కన్నా నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ కేసులో అనేక అంశాలపై తదుపరి విచారణ కోసం విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు తెలిపింది. కానీ ఇటీవల కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్ట్ చేయడంతో ఆయన ఇంకా జ్యుడిషియల్ కస్టడీలో జైల్లోనే ఉండనున్నారు. ఈ సందర్భంగా పలు ఆసక్తిర వ్యాఖ్యలు చేసింది. పీఎంఎల్ఏ సెక్షన్ 19 ప్రకారం కేజ్రీవాల్ అరెస్టుకు తగిన కారణాలు ఉన్నాయి. అయితే, ఇప్పటికే 90 రోజులపాటు కేజ్రీవాల్ జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నాం. సీఎం పదవికి రాజీనామా చేయాలా లేదా అన్నది ఆయన (కేజ్రీవాల్) నిర్ణయానికే వదిలేస్తున్నాం అని వ్యాఖ్యానించింది. కాగా, ప్రస్తుతం ఈడీ కేసులో సుప్రీం కోర్టులో మధ్యంతర బెయిల్ దక్కినా..ఇటీవల కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. సీబీఐ కేసు పెండింగ్‌లో ఉన్నందున ఆయన జ్యుడిషయల్ కస్టడీ నిమిత్తం జైల్లోనే ఉండనున్నారు. ఈనెల 17న సీబీఐ కేసులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరగనుంది.ఈడీ అరెస్ట్ ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి సీఎం అరవింద్ కేజ్రీవాల్ మనీలాండరింగ్‌కు పాల్పడ్డారంటూ మార్చి 21న ఈడీ అధికారులు ఆయన్ను అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ అక్రమమని ఈడీని సవాల్ చేస్తూ ఏప్రిల్ 9న ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేయడాన్ని సమర్ధించింది. అందులో ఎలాంటి చట్టవిరుద్దం లేదని, కేసు నిమిత్తం దర్యాప్తుకు రావాలని కోరుతూ పదే పదే జారీ చేసిన సమన్లపై స్పందించ లేదు కాబట్టే అరెస్ట్ చేయాల్సి వచ్చిందని సమర్దించింది. ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. కేజ్రీవాల్ పిటిషన్‌పై ఏప్రిల్ 15న సుప్రీం కోర్టు ఈడీ స్పందన కోరింది. విచారణ సందర్భంగా,మనీష్ సిసోడియా అరెస్ట్ తర్వాత, అతనికి బెయిల్ నిరాకరిస్తూ తీర్పు వెలువడిన తర్వాత,కేజ్రీవాల్ అరెస్టుకు ముందు సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించాలని, సంబంధిత ఫైళ్లను సమర్పించాలని ఈడీకి సూచించింది.ఈ పిటిషన్‌పై తీర్పును జస్టిస్ సంజీవ్ ఖన్నా,దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం తీర్పును మే 17న రిజర్వ్ చేసింది. రిజర్వ్ చేసిన తీర్పులు ఇవాళ వెలువరించింది. -
ఇక సీబీఐ వంతు!
న్యూఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను బుధవారం సీబీఐ అరెస్టు చేసే అవకాశం కని్పస్తోంది. సీబీఐ వర్గాలు మంగళవారం తిహార్ జైల్లో ఆయనను విచారించి వాంగ్మూలం నమోదు చేసుకున్నాయి. బుధవారం ట్రయల్ కోర్టులో ప్రవేశపెట్టనున్నాయి. ఈ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో సీబీఐ చర్య ప్రధాని మోదీ కక్షసాధింపులో భాగమేనని ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్ ఆరోపించారు. అందుకే కేజ్రీవాల్‌ను తప్పుడు కేసులో ఇరికించారన్నారు.ఢిల్లీ హైకోర్టులో నిరాశేమనీ లాండరింగ్ కేసులో బెయిల్ విషయంలో కేజ్రీవాల్‌కు మళ్లీ నిరాశే ఎదురయ్యింది. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన రెగ్యులర్ బెయిల్‌పై మధ్యంతర స్టే ఎత్తివేతకు ఢిల్లీ హైకోర్టు మంగళవారం నిరాకరించింది. ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరును సవాలు చేస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ సుధీర్‌కుమార్ జైన్ నేతృత్వంలోని వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టింది. వాదనలకు ఈడీకి ట్రయల్ కోర్టు సమయమివ్వలేదని ఆక్షేపించింది.కేజ్రీవాల్ ప్రమేయంపై సమర్పించిన పత్రాలను, సాక్ష్యాధారాలను పరిగణనలోకి తీసుకోవడంలో, క్షుణ్నంగా పరిశీలించడంలో విఫలమైందని స్పష్టంచేసింది.కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరుపై పూర్తిస్థాయిలో వాదనలు వినిపించడానికి ఈడీకి తగిన సమయమిచ్చి ఉండాల్సిందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో బెయిల్ ఉత్తర్వుపై స్టేను రద్దు చేయడం లేదని తేచ్చిచెప్పారు. కేజ్రీవాల్‌కు ఈ నెల 20న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు రూ.లక్ష వ్యక్తిగత పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.దీన్ని వ్యతిరేకిస్తూ ఈడీ ఆ మర్నాడే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దాంతో బెయిల్‌పై మధ్యంతర స్టే విధిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై కేజ్రీవాల్ సుప్రీంకోర్టుకు వెళ్లినప్పటికీ ఊరట దక్కలేదు. దాంతో ఆయన కనీసం మరిన్ని రోజులపాటు తిహార్ జైలులో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఢిల్లీ హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
MLC Kavitha: తీహార్ జైలులో కవితను కలిసిన సబిత, సత్యవతి రాథోడ్
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌లు కలిశారు. వీరిద్దరూ ఢిల్లీకి వెళ్లి తీహార్ జైలులో ఉన్న కవితలో ములాఖత్ అయ్యారు.మరోవైపు.. ఇటీవలే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తన సోదరుడు కేటీఆర్.. కవితను కలిసిన విషయం తెలిసిందే. అంతేకాదు.. కవితతో కేసీఆర్, కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడుతున్నారు. కవిత యోగ యోగక్షేమాలపై ఆరా తీస్తున్నారు. కవితను ఆమె భర్త అనిల్ వారానికి రెండుసార్లు కలుస్తున్నారు. కుటుంబ సభ్యులు కవితతో రోజూ ఐదు నిమిషాల పాటు ఫోన్లో మాట్లాడుతున్నారని సమాచారం.ఇదిలా ఉండగా.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు కవిత అరెస్ట్ అయి మూడు నెలలు కావస్తోంది. కవిత గత 80 రోజులుగా తీహార్ జైలులోనే ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో కవితను మార్చి 15న ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో 10 రోజుల ఈడీ కస్టడీ తర్వాత, మార్చి 26న, ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కవితను జ్యుడీషియల్ కస్టడీకి ఆదేశించింది. కవిత జ్యుడీషియల్ కస్టడీని కోర్టు 14 రోజులకు ఒకసారి పొడిగించింది.అనంతరం, తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవితను సీబీఐ అధికారులు ఏప్రిల్ 11న అరెస్టు చేశారు. మూడు రోజుల సీబీఐ కస్టడీ తర్వాత, సీబీఐ కేసులో కవితను జ్యుడిషియల్ కస్టడీకి కూడా రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశించింది. ఈడీ కేసులోనూ కవితకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఈ కేసులో ఈడీ దాఖలు చేసిన చార్జిషీటుపై కోర్టులో వాదనలు జరిగాయి. కవిత సహా నలుగురు వ్యక్తులు దామోదర్, ప్రిన్స్ కుమార్, అరవింద్‌సింగ్, చరణ్‌ప్రీత్‌పై చార్జిషీటు దాఖలు చేశామని, వారి పాత్రపై ఆధారాలను పొందుపరిచామని ఈడీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కవిత జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని వాదించారు. కాగా.. చార్జిషీటు దాఖలు చేసిన తర్వాత కస్టడీ అవసరం లేదని, విడుదల చేయాలని కవిత తరఫు న్యాయవాది కోర్టును కోరారు. ఇరువురి వాదనలు విన్న తర్వాత జ్యుడీషియల్ కస్టడీని జూన్ మూడో తేదీ వరకు పొడిగిస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. -
తీహార్ జైలులో కవితతో కేటీఆర్ ములాఖత్
సాక్షి, ఢిల్లీ: లిక్కర్ పాలసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో ఆమె సోదరుడు, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ శుక్రవారం ములాఖత్ అయ్యారు. కవితను కలిసిన కేటీఆర్ ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితకు జ్యుడీషియల్ రిమాండ్‌ను రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి రెండు వారాల పాటు పొడిగించిన విషయం తెలిసిందే. సీబీఐ నమోదు చేసిన కేసులో ఈ నెల 21 వరకు ఆమెకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి విచారణ ఈ నెల 21న జరగనుంది. ఆమెను కలిసిన తర్వాత కేటీఆర్ హైదరాబాద్‌కు తిరుగు పయనం అయ్యారు. -
తీహార్ జైల్లో లొంగిపోయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
సాక్షి, ఢిల్లీ: తీహార్ జైల్లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లొంగిపోయారు. మధ్యంతర బెయిల్ ముగియడంతో జైల్లో ఆయన లొంగిపోయారు. మద్యం పాలసీ కేసుపై దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఏప్రిల్‌లో ఆయనను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం కోసం 21 రోజుల మధ్యంతర బెయిల్‌ను సుప్రీంకోర్టు మే 10న మంజూరు చేసింది. ఆదివారంతో బెయిల్ గడువు ముగిసింది. బెయిల్ పొడిగింపు అభ్యర్థనను కోర్టు నిరాకరించడంతో ఈ క్రమంలో అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం సాయంత్రం తీహార్ జైలులో లొంగిపోయారు.కాగా, అంతకుముందు కేజ్రీవాల్ ఎక్స్(ట్విటర్) వేదికగా పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు సందేశం ఇస్తూ.. ‘‘సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నేను 21 రోజుల పాటు ఎన్నికల ప్రచారానికి వచ్చాను. ఈ అవకాశం ఇచ్చిన న్యాయస్థానానికి కృతజ్ఞతలు. ఈరోజు తిరిగి లొంగిపోతానని తెలిపారు.‘‘మధ్యాహ్నం 3 గంటలకు ఇంటి నుండి బయలుదేరి రాజ్‌ఘాట్‌లోని మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులర్పిస్తాను. అనంతరం హనుమాన్ ఆలయానికి వెళ్లి ఆశీర్వాదం తీసుకుంటాను. అక్కడ నుంచి పార్టీ కార్యాలయానికి వెళ్లి నేతలను, కార్యకర్తలను కలిసి తీహార్‌కు వెళ్తా. మీరు ఇక్కడ సంతోషంగా ఉంటేనే మీ సీఎం జైల్లో ఆనందంగా ఉంటాడు’’ అంటూ ట్వీట్ చేశారు. -
Delhi liquor scam: కేజ్రీవాల్ పిటిషన్‌పై తీర్పు 5కు వాయిదా
న్యూఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ కనీ్వనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట దక్కలేదు. అనారోగ్యంతో బాధపడుతున్న తనకు ఈ కేసులో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును ఈ నెల 5వ తేదీకి రిజర్వ్ చేసింది. దీంతో కేజ్రీవాల్ ఆదివారం తీహార్ జైలులో లొంగిపోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. -
రేపు మళ్లీ జైలుకు కేజ్రీవాల్..కోర్టులో నో రిలీఫ్
న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో మధ్యంతర బెయిల్ పొడిగింపుపై ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ రౌస్ఎవెన్యూ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. జూన్ 5న తీర్పు వెలువరిస్తామని తెలిపింది. దీంతో కేజ్రీవాల్ రేపు(జూన్2) తీహార్ జైలులో లొంగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ ఆలస్యమవుతుండటంతో ఎన్నికల్లో ప్రచారం కోసం అత్యున్నత కోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ఇచ్చింది. జూన్ 2న కేజ్రీవాల్ తిరిగి లొంగిపోవాలని ఆదేశించింది. మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో బరువు తగ్గడం, కిడ్నీ సమస్యలకు సంబంధించి వైద్య పరీక్షలు చేయించుకోవడానికి బెయిల్‌ను మరో ఏడు రోజుల పాటు పొడిగించాలని కేజ్రీవాల్ రౌస్ఎవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శనివారం(జూన్1) విచారణ జరిగింది. విచారణ సమయంలో కేజ్రీవాల్ మధ్యంత బెయిల్ పొడిగింపును ఈడీ వ్యతిరేకించింది.