title logo
-
హీరోగా ఎంట్రీ ఇస్తున్న ముక్కు అవినాష్
‘జబర్దస్త్’, ‘బిగ్ బాస్’ షోలతో బుల్లితెర ప్రేక్షకులను అలరించిన అవినాష్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ప్రీ వెడ్డింగ్ ప్రసాద్’. రాకేష్ దుబాసి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయికుమార్, సంగీత, రియాజ్, రూప ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. డెక్కన్ డ్రీమ్ వర్క్స్‌పై నబీ షేక్ నిర్మిస్తున్న ‘ప్రీ వెడ్డింగ్ ప్రసాద్’ మూవీ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి రచయిత కోన వెంకట్ కెమెరా స్విచ్చాన్ చేయగా, డైరెక్టర్ కోదండ రామిరెడ్డి క్లాప్ ఇచ్చారు. రాకేష్ దుబాసి దర్శకత్వం వహించారు. దర్శకుడు సాయి రాజేష్ ఈ సినిమా టైటిల్ లోగోని లాంచ్ చేయగా, దర్శకుడు వీరభద్రం చౌదరి, నిర్మాత బెక్కం వేణుగోపాల్ అతిథులుగా పాల్గొన్నారు. నబీ షేక్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రకథ, స్క్రీన్ ప్లే చాలా వైవిధ్యంగా ఉంటాయి’’ అన్నారు. ‘‘మా సినిమా చూసి ప్రేక్షకులు నవ్వుకుంటారు.. భయపడతారు.. థ్రిల్ అవుతారు’’ అన్నారు అవినాష్. ‘‘నబీ షేక్గారి లాంటి నిర్మాత ఉంటే యువ ప్రతిభ పరిశ్రమలోకి వస్తుంది’’ అన్నారు రాకేష్ దుబాసి. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: శ్యామ్ కె. నాయుడు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మహాదేవ్. -
ఫన్ పార్టీ
వీజే సన్నీ, హ్రితికా శ్రీనివాస్ జంటగా సంజయ్ శేరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సౌండ్ పార్టీ’. దర్శకుడు వి. జయశంకర్ సమర్పణలో రవిపొలిశెట్టి నిర్మించిన ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా టైటిల్ లోగో విడుదల పాత్రికేయుల చేతుల మీదగా జరిగింది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో వీజే సన్నీ మాట్లాడుతూ– ‘‘సౌండ్ పార్టీ’ చిత్రం థియేటర్స్‌లో గట్టిగా సౌండ్ చేస్తుంది’’ అన్నారు. ‘‘ఫుల్ ఫన్ రైడ్ చిత్రం’’ అన్నారు సంజయ్ శేరి. ‘‘పాతిక రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేశాం. ఇది మా యూనిట్‌కు, వృత్తి నైపుణ్యానికి నిదర్శనం. ఆగస్టులో సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు రవి పొలిశెట్టి. -
ప్రత్యేకమైన కాన్సెప్ట్‌తో వస్తున్న 'స్క్రీన్ ప్లే'.. టైటిల్ లోగో రిలీజ్
పల్లె ఫిల్మ్స్, లయన్ టీమ్ క్రెడిట్స్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్న చిత్రం 'స్క్రీన్ ప్లే'. అంకుర్ కసగోని దర్శకత్వంలో పల్లె అనిల్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా చిత్ర యూనిట్ టైటిల్ లోగోను విడుదల చేసింది. ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరూ తీయని ఒక ప్రత్యేకమైన కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. భారతీయ సినిమా రంగానికి ఆస్కార్ అందించడంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించింది. ఈ తరుణంలో ఒక వినూత్న యూనివర్సల్ కాన్సెప్ట్ ఎంచుకున్నట్లు దర్శకుడు అంకుర్ కసగోని తెలిపారు. ఈ నెల చివరి వారంలో మొదటి షెడ్యూల్ ప్రారంభించి ఏప్రిల్ చివరినాటి కల్లా షూటింగ్ పూర్తి చేసుకోనున్నట్లు పేర్కొన్నారు. గ్లోబల్ ఇండియా బుల్స్ మార్కెటింగ్ మేనేజర్ ఉమామహేష్ కప్పల, కవితాలయ స్టూడియోస్ ఈ చిత్ర నిర్మాణానికి సహకారం అందిస్తున్నట్లు నిర్మాత తెలిపారు. -
నారాయణ మూర్తి ప్రజా దర్శకుడు
‘‘ఇండస్ట్రీలో కళా దర్శకులు, వ్యాపారాత్మక దర్శకులు ఉన్నారు. కానీ, ప్రజా దర్శకుడు అంటే ఆర్. నారాయణ మూర్తి ఒక్కరే. నమ్ముకున్న సిద్ధాంతం కోసం పాటు పడే వ్యక్తి ఆయన’’ అన్నారు ప్రముఖ నటుడు బ్రహ్మానందం. ఆర్. నారాయణ మూర్తి లీడ్ రోల్లో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘యూనివర్సిటీ’. ఈ సినిమా టైటిల్ లోగోని బ్రహ్మానందం రిలీజ్ చేసి, మాట్లాడుతూ– ‘‘ఎడ్యుకేషన్ మాఫియా, విద్యా వ్యవస్థ లోని లోపాలతో నారాయణ మూర్తిగారు తీసిన ఈ చిత్రాన్ని ఆదరించాలని ప్రేక్షకులను, నా ఫ్యాన్స్‌ని కోరుతున్నాను’’ అన్నారు. ఆర్. నారాయణ మూర్తి మాట్లాడుతూ– ‘‘వైజాగ్ సత్యానంద్ గారి శిష్యులు ఈ సినిమాలో నటించారు. భారతదేశంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలతో ‘యూనివర్సిటీ’ తీశాను. విద్య, వైద్యం ప్రైవేట్ పరం కాకుండా ప్రభుత్వమే నిర్వహించాలి. విజయనగరం పార్లకిమిడి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశాను.. నాకు సహకరించిన మంత్రి బొత్స సత్యనారాయణగారికి, ఇతరులకు థ్యాంక్స్’’ అన్నారు. -
'ఇంగ సెప్పేదేం లేదో.. చేసేదే..' ఆకట్టుకుంటున్న సుధీర్ బాబు టైటిల్
యంగ్ హీరో సుధీర్‌బాబు తాజా చిత్రంపై క్రేజీ అప్డేట్ వచ్చింది. జ్ఞానసాగర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీకి 'హరోం హర’ అనే టైటిల్‌ను ఖరారు చేసింది. ది రివోల్ట్ అనేది క్యాప్షన్. చిత్రబృందం. దీనికి సంబంధించిన వీడియోను ఇవాళ చిత్ర యూనిట్ విడుదల చేసింది. వైవిధ్య కథలతో మంచి గుర్తింపు సాధించిన నటుడు సుధీర్‌బాబు. ఇటీవలే 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' మూవీతో ప్రేక్షకులను అలరించారు. (చదవండి: ప్రముఖ బుల్లితెర నటి మృతి.. సీఎం సంతాపం) తాజాగా మరో ఆసక్తికరమైన కథతో ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణ పనులు లాంఛనంగా ప్రారంభించారు. ఇవాళ విడుదలైన వీడియోలో ‘ఇక చెప్పేదేం లేదో.. చేసేదే’ అనే డైలాగ్ అభిమానులను ఆకట్టుకునేలా ఉంది. ఆ వీడియోను చూస్తే ఈ సినిమాలో ఆధ్యాత్మిక అంశాలు ఉన్నట్లు కనిపిస్తోంది. చిత్తూరు జిల్లా కుప్పంలో సాగే కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సుధీర్ మాస్ లుక్‌లో కనిపించనున్నారు. -
బాలయ్య ఎన్బీకే107 మూవీ.. సమరసింహారెడ్డిని మించిపోయేలా టైటిల్
బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర చేస్తున్నారు.ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఏపీలోని కర్నూలు పట్టణంలో ఉన్న చారిత్రక కట్టడం కొండారెడ్డి బురుజు వేదికగా చరిత్రలోనే తొలిసారిగా టైటిల్ లోగోను విడుదల చేశారు. ఈ సినిమాకు సమరసింహారెడ్డి రేంజ్లో 'వీరసింహారెడ్డి' అనే టైటిల్‌తో టైటిల్ లోగో పోస్టర్ రిలీజ్ చేశారు. గాడ్ ఆఫ్ మాసెస్ అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. టైటిల్ లోగో చూస్తే పక్కా మాస్ యాక్షన్ ఖాయంగా కనిపిస్తోంది. పోస్టర్లో నలుపు రంగు షర్ట్ ధరించి.. కిలోమీటర్ రాయిపై ఒంటికాలితో నిలబడిన పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. బాలయ్య యంగ్ అండ్ డాషింగ్ కనిపిస్తున్నాడు. హై ఇంటెన్స్ మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ దునియా విజయ్ విలన్‌గా నటిస్తున్నాడు. బాలకృష్ణ కెరీర్లో 107వ చిత్రంగా నిలవనుంది. ఎక్కడా రాజీపడకుండా భారీ బాడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. NATASIMHAM #NandamuriBalakrishna in and as 'VEERA SIMHA REDDY' ❤️🔥 Meet the GOD OF MASSES in theatres this Sankranthi 🔥🤙#VeeraSimhaReddy@megopichand @shrutihaasan @OfficialViji @varusarath5 @RishiPunjabi5 @MusicThaman @SonyMusicSouth pic.twitter.com/ndAC0dvkhd — Mythri Movie Makers (@MythriOfficial) October 21, 2022 -
యథార్థ ఘటనల ఆధారంగా వస్తున్న 'చెంచల'.. ఆసక్తికరంగా టైటిల్ లోగో
యథార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'చెంచల'. ఈ సినిమాలో ఓ ప్రముఖ కథానాయిక కనిపించబోతున్నారు. తాజాగా విజయ దశమి సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ లోగోను విడుదల చేసింది చిత్రబృందం. ఈ మూవీకి జగదీష్ అచార్ దర్శకత్వం వహిస్తుండగా.. కేజీయఫ్ ఫేమ్ రవి బస్రూర్, సుజిత్ శెట్టిలు సంగీతాన్ని అందిస్తున్నారు. శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత ఏఎన్ బాలాజీ నిర్మిస్తున్నారు. 'చెంచల' మూవీ కూర్గ్ ప్రాంతంలో పాము చుట్టూ జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ సినిమా కథ చెంచల పాత్రకు, ఓ పాముకు మధ్య సాగుతుంది. చెంచల కుటుంబం ఎలా హత్యకు గురైంది? తన గతం ఏంటి? పాముతో తనకున్న సంబంధం ఏంటి? అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ చిత్రం రూపొందుతోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడిస్తామని నిర్మాత ఏఎన్ బాలాజీ తెలిపారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున నిర్మిస్తున్నామని.. నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారభిస్తామని ఆయన ప్రకటించారు. -
రాకింగ్ రాకేష్ హీరోగా 'ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ'..
Oo Antava Mava Oo Oo Antava Mava Movie Title Launch: యశ్వంత్, రాకింగ్ రాకేష్, అనన్య, హిందోలా చక్రవర్తి, పూజ, సిమ్రాన్ ముఖ్య తారలుగా రేలంగి నరసింహా రావు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ’. తుమ్మల ప్రసన్న కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. ‘ఫిల్మ్ ఛాంబర్’ అధ్యక్షుడు కొల్లి రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి దామోదర్ ప్రసాద్‌లు ఈ చిత్రం టైటిల్‌ను అనౌన్స్ చేశారు. రేలంగి నరసింహారావు మాట్లాడుతూ–‘‘కామెడీతో కూడుకున్న హారర్ సినిమా ఇది. జూలై చివరి వారంలో సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘76 సూపర్ హిట్స్ ఇచ్చిన రేలంగి నరసింహారావు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కూడా హిట్ అవుతుంది’’ అన్నారు తుమ్మల ప్రసన్నకుమార్. చిత్రానికి సంగీతం: సాబు వర్గీస్, కెమెరా: కంతేటి శంకర్. చదవండి:👇 నెట్టింట రకుల్ డ్యాన్స్ వీడియో వైరల్.. బాయ్‌ఫ్రెండ్ కామెంట్ ఏంటంటే ? వెనక్కి తగ్గిన నాగ చైతన్య.. 'థ్యాంక్యూ' రిలీజ్లో మార్పు అనసూయ కొత్త చిత్రం 'అరి'.. టైటిల్ లోగో ఆవిష్కరణ.. ఓటీటీలోనూ రికార్డులు క్రియేట్ చేస్తున్న 'ఆర్ఆర్ఆర్'.. -
రావణలంక ఫేమ్ క్రిష్ లవ్వాట
‘రావణలంక’ ఫేమ్ క్రిష్ బండిపల్లి హీరోగా, మీరా కన్నన్, దీక్ష హీరోయిన్లుగా నటించనున్న చిత్రం ‘లవ్వాట’. ఆర్.కె. గాంధీ దర్శకుడు. నిడిగంటి సాయి రాజేష్ మూవీస్ పతాకంపై ఎన్. వెంకటేశ్వర్లు, బొట్టా శంకర్రావు, వెంకటగిరి శ్రీనివాస్ నిర్మించనున్నారు. టైటిల్ కాంటెస్ట్‌లో విజేతగా నిలిచిన మానే రామారావు ‘లవ్వాట’ టైటిల్ లోగోని విడుదల చేశారు. ఆర్.కె. గాంధీ మాట్లాడుతూ– ‘‘నా తొలి, మలి సినిమాలు ‘ప్రేమభిక్ష, రుద్రాక్షపురం’ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్నాయి. మూడో చిత్రం ‘లవ్వాట’ టైటిల్ లాంచ్ జరుపుకోవడం ఆనందంగా ఉంది. ప్రేమ పట్ల నేటి తరం ధృక్పథం ఎలా ఉందో వినోదాత్మకంగా ‘లవ్వాట’లో చెప్పనున్నాం. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ సినిమా రూపొందిస్తాం’’ అన్నారు. ‘‘జూన్ 22 నుంచి రెగ్యులర్ షూటింగ్‌ని ప్రారంభిస్తాం’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి కెమెరా: ఎమ్. నాగేంద్ర, సంగీతం: జీకే. చదవండి: సీక్రెట్ స్మోకింగ్‌పై స్పందించిన బిందుమాధవి కుంభకర్ణుడిలా పడుకుంది చాలు, ముందు అప్డేట్ ఇవ్వు -
నిర్మాతగా మారిన రచయిత, బారసాల టైటిల్ పోస్టర్ రిలీజ్
రచయిత శ్రీనివాస్ నిర్మాతగా మారారు. శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో శ్రీ సేవాలాల్ క్రియేషన్స్ పతాకంపై శ్రీనివాస్ నిర్మించనున్న చిత్రానికి ‘బారసాల’ అని టైటిల్ నిర్ణయించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్, నిర్మాత సాయి వెంకట్ ‘బారసాల’ టైటిల్ లోగో ఆవిష్కరించారు. ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ– ‘‘శ్రీనివాసరెడ్డి నా వద్ద దర్శకత్వ శాఖలో చేశారు. ప్రతిభ ఉన్న టెక్నీషియన్. చిన్న సినిమాలకు ఓటీటీ మంచి సపోర్ట్‌గా నిలుస్తోంది’’ అన్నారు. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ– ‘‘ఇండస్ట్రీలో వివిధ విభాగాల్లో పని చేసిన అనుభవంతో ‘బారసాల’ తెరకెక్కించబోతున్నాను. శ్రీనివాస్‌గారు మంచి రచయిత కావడం మా సినిమాకు హెల్ప్ అవుతుంది’’ అన్నారు. ‘‘త్వరలోనే మా సినిమా షూటింగ్ ప్రారంభిస్తాం. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు అతి త్వరలో చెబుతాం. ‘ది టైటిల్స్ ఫ్యాక్టరీ’ని స్థాపించాను.. మంచి టైటిల్స్ కోసం సంప్రదిస్తే సహాయం చేస్తాం’’ అన్నారు శ్రీనివాస్. నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడారు. చదవండి: రాజమౌళి, ఎన్టీఆర్‌లపై హిందీ నటుడి ఆసక్తికర వ్యాఖ్యలు -
రామ్ గోపాల్ వర్మ లాంటి మేధావి బాబాగా మారితే?
The Boss- Never Dies Movies: బొమ్మకు క్రియేషన్స్ పతాకంపై షకలక శంకర్ టైటిల్ పాత్రలో యువ నిర్మాత బొమ్మకు మురళి నిర్మిస్తున్న సంచలన చిత్రం "ది బాస్". నెవర్ డైస్ అన్నది ఉపశీర్షిక. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రాంగోపాల్ వర్మ వంటి ఓ అపర మేధావి బాబాగా మారితే అనే ఊహాజనిత కథాంశం ఆధారంగా... బహుముఖ ప్రతిభాశాలి ఈశ్వర్ బాబు ధూళిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న అత్యంత వివాదాస్పద చిత్రం 'ది బాస్-నెవర్ డైస్" టైటిల్ లోగోను ప్రముఖ నటుడు సునీల్ విడుదల చేశారు. "ది బాస్-నెవర్ డైస్" సమాజంలోని పలు రుగ్మతలను ప్రశ్నిస్తుందని.... రామ్ గోపాల్ వర్మను పోలిన వ్యక్తిగా షకలక శంకర్ అత్యద్భుతంగా చేసి ఉంటాడని సునీల్ పేర్కొన్నారు. తమ చిత్రం "ది బాస్-నెవర్ డైస్" టైటిల్ లోగో ఆల్ రౌండర్ సునీల్ లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు నిర్మాత బొమ్మకు మురళి, దర్శకుడు ఈశ్వర్ బాబు. షూటింగ్ తోపాటు పోస్ట్ ప్రొడక్షన్ దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని వారు తెలిపారు. -
సినీ చరిత్రలో కొత్త అధ్యాయానికి సుదీప్ శ్రీకారం
కన్నడ నటుడు సుదీప్ తన కెరీర్‌ను స్టార్ట్ చేసి 25 వసంతాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన నటించిన తాజా చిత్రం ‘విక్రాంత్ రోణ’ టైటిల్ లోగో, స్నీక్‌పీక్‌ను ప్రపంచంలోనే ఎత్తయిన భవనం దుబాయ్‌లోని బూర్జ్ ఖలీఫాలో విడుదల చేశారు. అనూప్ భండారి దర్శకత్వంలో జాన్ మంజునాథ్, శాలినీ మంజునాథ్ నిర్మించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘సినీ పరిశ్రమలో సిల్వర్ జూబ్లీని పూర్తి చేసుకుని తనదైన మార్క్ క్రియేట్ చేసిన సుదీప్ ‘విక్రాంత్ రోణ’తో సరికొత్తగా పరిచయం అవుతున్నారు. బూర్జ్ ఖలీఫాలో ‘విక్రాంత్ రోణ’ టైటిల్ లోగో, స్నీక్ పీక్‌ను విడుదల చేయడం ద్వారా సినీ చరిత్రలో కొత్త అధ్యాయానికి సుదీప్ శ్రీకారం చుట్టారు. ఇండియన్ సినిమా స్థాయిని, గౌరవాన్ని ప్రపంచానికి చాటిన ఘట్టమిది. ఈ వేడుక కోసం 2000 అడుగుల ఎత్తున్న సుదీప్ భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ఇంత భారీ కటౌట్‌తో సుదీప్ ఓ రికార్డ్ క్రియేట్ చేశారు. కన్నడ, తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషలు సహా ఐదు విదేశీ భాషల్లో 50 దేశాల్లో ‘విక్రాంత్ రోణ’ చిత్రం విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: అలంకార్ పాండియన్, సంగీతం: బి.అజనీష్ లోక్‌నాథ్, కెమెరా: విలియమ్ డేవిడ్. -
గాడ్సే యాక్షన్
హీరో సత్యదేవ్, డైరెక్టర్ గోపీ గణేష్ పట్టాభి కాంబినేషన్లో వచ్చిన ‘బ్లఫ్ మాస్టర్’ మంచి సినిమా అనిపించుకుంది. ఈ కాంబినేషన్లో తెరకెక్కనున్న మరో చిత్రం ‘గాడ్సే’. సీకే స్క్రీన్స్ బ్యానర్‌పై సి. కల్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్ని విడుదల చేశారు. ఇందులో సత్యదేవ్ చాలా పవర్ఫుల్ రోల్ చేస్తున్నట్లు పోస్టర్ ద్వారా తెలుస్తోంది. ‘‘యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందనున్న చిత్రమిది. విభిన్నమైన పాత్రలో సత్యదేవ్ కనిపిస్తారు’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. నాజర్, బ్రహ్మాజీ, ఆదిత్యా మీనన్, కిశోర్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి సహ నిర్మాత: సీవీ రావు. -
హిమజ
బిగ్ బాస్ ఫేమ్ హిమజ, ప్రతాప్ రాజ్ ప్రధాన పాత్రల్లో రూపొందిన హారర్ థ్రిల్లర్ ‘జ’. జై దుర్గా ఆర్ట్స్ పతాకంపై సైదిరెడ్డి చిట్టెపుని దర్శకుడిగా పరిచయం చేస్తూ గోవర్థన్ రెడ్డి కందుకూరి నిర్మించారు. హిమజ పుట్టినరోజు సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ ముఖ్య అతిథిగా హాజరై ‘జ’ మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ లోగోను విడుదల చేశారు. సైదిరెడ్డి చిట్టెపు మాట్లాడుతూ – ‘‘జ’ అంటే జన్మ లేదా పుట్టుక అని అర్థం. ఈ టైటిల్ ఎందుకు పెట్టాం? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి’’ అన్నారు. ‘‘నేను డాక్టర్ని. దర్శకుడు సైదిరెడ్డి చెప్పిన కాన్సెప్ట్ నచ్చి ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించాను’’ అన్నారు ఉపేందర్. ‘‘సైదిరెడ్డి నాలుగేళ్లు కష్టపడి మంచి సబ్జెక్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు గోవర్థన్ రెడ్డి. ‘‘ఇందులో నాది నటనకు బాగా స్కోప్ ఉన్న పాత్ర. నటిగా మరో మెట్టు ఎక్కించే చిత్రం అవుతుంది’’ అన్నారు హిమజ. ‘‘ఈ చిత్రంలో నాలుగు డిఫరెంట్ పాటలు ఉన్నాయి’’ అన్నారు సంగీత దర్శకుడు వెంగీ. -
నాలుగు జంటల కథ
శ్రీజిత్ హీరోగా, శిల్పా దాస్, నిష్కల హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘చెరసాల’. రాంప్రకాష్ గుణ్ణం దర్శకత్వంలో మాదినేని సురేష్, సుధారాయ్ గుణ్ణం నిర్మించిన ఈ సినిమా మోషన్ పోస్టర్ని నిర్మాత రాజ్ కందుకూరి, టైటిల్ లోగోని దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేశారు. రాంప్రకాష్ గుణ్ణం మాట్లాడుతూ– ‘‘లవ్, కామెడీ, ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాకి హారర్ ఎలిమెంట్‌ని మిళితం చేసి ఈ చిత్రాన్ని రూపొందించాం. నాలుగు జంటల మధ్య సాగే కథ ఇది’’ అన్నారు. ‘‘మా సినిమా రష్ చూసుకున్నాక చెప్పిన దానికంటే దర్శకుడు చాలా బాగా తీశాడని అర్థమైంది. మొదటి ప్రాజెక్ట్‌తోనే మంచి విజయం సాధిస్తామన్న నమ్మకం ఉంది’’ అన్నారు మాదినేని సురేష్. ఈ చిత్రానికి సంగీతం: శంకర్ తమిరి. -
అఖిల కథ
జయసింహా, అక్ష జంటగా నటించనున్న చిత్రం ‘అఖిల’. మోహన్ రావ్ దర్శకత్వం వహించనున్నారు. జై చిరంజీవ ఫిలింస్ పతాకంపై శెట్టి చిరంజీవి నిర్మించనున్న ఈ చిత్రం టైటిల్‌ని నిర్మాతలు ప్రతాని రామకృష్ణ గౌడ్, ప్రసన్న కుమార్ విడుదల చేశారు. మోహన్ రావ్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. హీరో జయసింహ, హీరోయిన్ అక్ష పాత్రలు ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటాయి. త్వరలో షూటింగ్ స్టార్ట్ కానున్న ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా నిర్మించనున్నారు శెట్టి చిరంజీవిగారు’’ అన్నారు. ‘‘మోహన్ రావుగారు చెప్పిన పాయింట్ బాగుంది. ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు శెట్టి చిరంజీవి. ‘‘వైవిధ్యమైన కథాంశంతో రాబోతున్న ‘అఖిల’ సినిమాతో నాకు మంచి పేరు లభిస్తుందని భావిస్తున్నా’’ అన్నారు అక్ష. ‘‘అఖిల’ సినిమాతో తెలుగులో తొలిసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. అందరి సహకారం నాకు కావాలి’’ అన్నారు జయసింహా. ఈ చిత్రానికి సంగీతం: రాజ్ కిరణ్, కెమెరా: శేఖర్. -
సన్ ఆఫ్ ఇండియా
మంచు మోహన్ బాబు కథానాయకునిగా తెరకెక్కనున్న చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’. ఈ చిత్రానికి పాపులర్ స్క్రిప్ట్, డైలాగ్ రైటర్ డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించనున్నారు. శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థలు ఈ సినిమా నిర్మించనున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం ‘సన్ ఆఫ్ ఇండియా’ టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్లో తీక్షణంగా చూస్తున్న మోహన్ బాబు కనిపిస్తున్నారు. ‘‘ఇంతవరకు తెలుగుతెరపై కనిపించని కథ, జానర్‌ని ఈ సినిమాలో చూడబోతున్నాం. ఇదివరకెన్నడూ మనం చూడని పవర్ఫుల్ పాత్రను మోహన్ బాబు పోషిస్తున్నారు. ఈ సినిమాకు పని చేసే సాంకేతిక నిపుణులు, నటీనటుల వివరాలను త్వరలోనే చెబుతాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. కాగా కొత్త సినిమాలు ఒప్పుకొనే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు మోహన్‌బాబు. నటునిగా తనను ఉత్తేజపరిచే సినిమాలే చేయాలని నిర్ణయించుకున్నారు. 560కి పైగా చిత్రాల్లో నటించిన ఆయన ‘ఆకాశమే నీ హద్దురా’ కథ నచ్చి, ఈ చిత్రంలో కీలక పాత్ర చేశారు. సూర్య హీరోగా రూపొందిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. -
బిచ్చగాడు 2
‘బిచ్చగాడు’ సినిమాతో తమిళంలోనే కాదు.. తెలుగులోనూ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు విజయ్ ఆంటోని. 2016లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించింది. తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతున్న విషయం తెలిసిందే. జాతీయ అవార్డుగ్రహీత ప్రియ కృష్ణస్వామి దర్శకత్వం వహించనున్నారు. ఓ వైపు మ్యూజిక్ డైరెక్టర్‌గా, మరోవైపు హీరోగా రాణిస్తోన్న విజయ్ ఆంటోని పుట్టినరోజు జూలై 24 (శుక్రవారం). ఈ సందర్భంగా తెలుగు, తమిళ భాషల్లో ‘బిచ్చగాడు 2’ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ లోగోను విడుదల చే శారు. -
లోఫర్ ప్రేమ కథ
ఎమ్.ఎన్.వి. సాగర్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘కొంటె కుర్రాడు’. ‘ఓ లోఫర్‌గాడి ప్రేమ కథ’ ట్యాగ్‌లైన్. ఎస్. ఎమ్. ఫోర్ ఫిలిమ్స్ పతాకంపై రూపొందుతోన్న ఈ సినిమా బ్యానర్, టైటిల్ లోగో విడుదల చేశారు. ‘‘గ్రామీణ నేపథ్యంతో పాటు పునర్జన్మల కథాంశంతో మాస్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న చిత్రమిది’’ అన్నారు ఎమ్.ఎన్.వి. సాగర్. ఈ చిత్రానికి కెమెరా: సీఎస్ చంద్ర, సంగీతం అరమాన్ మెరుగు. -
ఆర్జీవీ... ఓ రామబాణం
ప్రముఖ సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు దర్శకునిగా పరిచయమవుతున్న చిత్రం ‘ఆర్జీవీ’. ‘కార్తికేయ’ చిత్రనిర్మాత వెంకట శ్రీనివాస్ బొగ్గరం, టారస్ సినీకార్ప్ సమర్పణలో మాగ్నస్ సినీప్రైమ్ పతాకంపై బాల కుటుంబరావు పొన్నూరి ఈ సినిమా నిర్మించనున్నారు. నేడు శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ‘ఆర్జీవీ’ చిత్రం టైటిల్ లోగో విడుదల చేసి, నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మాట్లాడుతూ– ‘‘తా చెడ్డకోతి వనమెల్లా చెరిచినట్లు’ తన పిచ్చి ఇజంతో యువతను పెడదోవ పట్టిస్తున్న ఒక వ్యక్తి ఫిలాసఫీ మీద సంధించిన రామబాణమే ఈ సినిమా. అందుకే శ్రీరామనవమిని పురస్కరించుకుని ఈ చిత్రం టైటిల్ లోగో విడుదల చేశాం’’ అన్నారు. ‘‘కరోనా వైరస్ ప్రభావం పూర్తిగా తగ్గిన వెంటనే చిత్రీకరణ ప్రారంభిస్తాం’’ అన్నారు వెంకట శ్రీనివాస్ బొగ్గరం. సురేష్, రాశి, శ్రద్ధా దాస్, అమిత్, పునర్నవి భూపాలం, తేజ తదితరులు నటించనున్న ఈ చిత్రానికి కెమెరా: వేదాంత్ మల్లాది, సంగీతం: వీణాపాణి. -
‘ఆర్ఆర్ఆర్’ టైటిల్ ఇదే..
టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్‌చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న పీరియాడికల్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాకు సంబంధించిన ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ టైటిల్‌కు సంబంధించి ఎన్నో వార్తలు ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ ఉగాది కానుకగా బుధవారం చిత్రబృందం ఆన్లైన్లో విడుదల చేసింది. ఈ చిత్రానికి ఆర్ఆర్ఆర్- ‘రౌద్రం రణం రుధిరం’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. మోషన్ పోస్ట్‌ర్‌లో ఎన్టీఆర్ నీటిలో నుంచి, రామ్‌చరణ్ నిప్పులో నుంచి నడుచుకుంటూ వస్తున్న సన్నివేశాల్ని చూపించారు. కాగా, ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, కొమరం భీమ్‌గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరీస్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 2021 సంక్రాంతి కానుకగా జనవరి 8న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
స్వర్ణయుగం మొదట్లో..
ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తోన్న మల్టీస్టారర్ చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’. మదరాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ పతాకాలపై మణిరత్నం, సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ తమిళ రచయిత కల్కి కృష్ణమూర్తి రచించిన పొన్నియిన్ సెల్వన్ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. చోళ సామ్రాజ్యం నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుంది. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన గురువారం వెల్లడైంది. ‘స్వర్ణయుగం మొదట్లో..’ అంటూ ఈ సినిమా టైటిల్‌ను, సాంకేతిక నిపుణుల వివరాలను అధికారికంగా వెల్లడించారు. మణిరత్నం చేసే అన్ని సినిమాలకు దాదాపు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుంటారు. ఈ చిత్రానికి కూడా ఆయనే స్వరకర్త. జయమోహన్ మాటల రచయిత. మణిరత్నం, కుమారవేల్ సంయుక్తంగా ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రానికి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ఇందులో ప్రధాన పాత్రల్లో ఐశ్వర్యారాయ్, త్రిష, విక్రమ్, కార్తీ, ‘జయం’రవి నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ థాయ్‌ల్యాండ్‌లో జరుగుతోంది. కార్తీ, ‘జయం’ రవిలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రం రెండు భాగాలుగా విడుదలవుతుందనే ప్రచారం జరుగుతోంది. -
మళ్లీ నిన్నే పెళ్లాడతా
నాగార్జున–కృష్ణవంశీ కాంబినేషన్లో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘నిన్నే పెళ్లాడతా’. ప్రస్తుతం ఈ టైటిల్‌తోనే ఓ చిత్రం తెరకెక్కుతోంది. రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ హీరోగా వైకుంఠ బోను దర్శకత్వం వహిస్తున్నారు. బొల్లినేని రాజశేఖర్ చౌదరి, వెలుగోడు శ్రీధర్‌బాబు నిర్మాతలు. ఈ చిత్రం టైటిల్ లోగోను నాగార్జున రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు వైకుంఠ బోను మాట్లాడుతూ – ‘‘లోగో రిలీజ్ చేసిన నాగార్జునగారికి కృతజ్ఞతలు. మంచి కథాంశంతో ఈ చిత్రం చేస్తున్నాం. ఇప్పటికి 50 శాతం షూటింగ్ పూర్తయింది. ఆగస్ట్‌లో కొత్త షెడ్యూల్ ప్రారంభిస్తాం. అక్టోబర్‌లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘కథ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. వైజాగ్, కులుమనాలిలో ఓ షెడ్యూల్ చేస్తాం’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి కెమెరా: ఈదర ప్రసాద్, సంగీతం: నవనీత. -
పాతికేళ్ల తర్వాత...!
రాబోయే రెండేళ్లకు సరిపడ సినిమాలు బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ బ్యాంకులో ఉన్నాయి. వరుసగా సినిమాలకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ ౖడైరీని ఫుల్‌గా ఉంచుతున్నారు. తాజాగా మరో మరాఠి సినిమాలో నటించడానికి ఒప్పుకున్నారు అమితాబ్ బచ్చన్. ఈ చిత్రానికి మిలింద్ లేలేస్ అనే దర్శకుడు తెరకెక్కిస్తున్నాడట. ఈ సినిమా షూటింగ్ ముంబైలో ఇటీవల మొదలైంది. విక్రమ్ ఘోఖలే ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఫ్యామిలీ డ్రామా అండ్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కనున్న సినిమాకు ‘ఏబీ అండ్ సీడీ’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారట. అయితే దాదాపు పాతికేళ్ల తర్వాత మరాఠి సినిమాలో నటిస్తున్నారు అమితాబ్. 1994లో వచ్చిన ‘అకా’ సినిమాలో ఓ గెస్ట్ రోల్ చేసిన అమితాబ్, 2006లో ఓ మరాఠి సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చారు. 2010 ‘విహిర్’ చిత్రానికి ఒక నిర్మాతగా వ్యవహరించారు. అంతేకానీ నటించలేదు. ఇప్పుడు పాతికేళ్ల తర్వాత ఓ ఫుల్‌లెంగ్త్ రోల్‌తో మళ్లీ మరాఠి వెండితెరపై కనిపించబోతున్నారు అమితాబ్. -
తెలంగాణ తెస్తనంటే నవ్విండ్రు
సంచలనానికి కేరాఫ్ అడ్రస్ రామ్‌గోపాల్ వర్మ. తీసే సినిమా, చేసే ట్వీట్, మాట్లాడే మాట... ఇలా ఆయన ఏం చేసినా సెన్సేషనే. ‘రక్తచరిత్ర’, ‘వంగవీటి’, లేటెస్ట్గా ‘లక్ష్మీస్: ఎన్టీఆర్’ సినిమాతో రియలిస్టిక్ స్టోరీస్ చెప్పడంలో వర్మ ది బెస్ట్ అని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. ఇటీవల ఓ రౌడీషీటర్ బయోపిక్ (కోబ్రా) ద్వారా ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇవడానికి రెడీ అయ్యారు. ఇప్పుడు ‘కేసీఆర్’ బయోపిక్‌ను అనౌన్స్ చేశారు వర్మ. ‘టైగర్ కేసీఆర్: ది అగ్రెసివ్ గాంధీ’ అనేది టైటిల్. ‘ఆడు తెలంగాణ తెస్తనంటే అందరూ నవ్విండ్రు’ అనేది ట్యాగ్‌లైన్. టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసి, వర్మ ట్వీటర్లో – ‘‘ఆంధ్రా వాళ్లు తెలంగాణ వాళ్లను థర్డ్ క్లాస్‌గా ట్రీట్ చేయడం తట్టుకోలేక ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు. పక్క రాష్ట్రంలోని నాయకుల్లా కాకుండా కేసీఆర్, వైఎస్ఆర్ మాత్రమే వాళ్ల పిల్లలను వాళ్లలాంటి నాయకులుగా తయారుచేయగలిగారు. ట్యాగ్‌లైన్‌లో ‘ఆడు’ అనే పదాన్ని ప్రాబ్లమ్‌గా భావిస్తున్న వాళ్లకు కేసీఆర్ ఏం సాధించకముందు అతన్ని చిన్నచూపు చూసినవాళ్ల కోణంలోంచి పెట్టాను. కేసీఆర్, కేటీఆర్ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.