tv anchor
-
Nikita Porwal: టీవీ యాంకర్ టు మిస్ ఇండియా
మధ్యప్రదేశ్ ఉజ్జయినికి చెందిన నికిత పొర్వాల్ మిస్ ఇండియా కిరీటం దక్కించుకుంది. టీవీ యాంకర్‌గా, నటిగా కెరీర్ మొదలుపెట్టి ఒక సామాన్య కుటుంబం నుంచి ఆమె ఈ గుర్తింపు పొందింది. ‘మన జీవితానికి ఒక విలువ ఉండాలి. మనం లేకపోతే నష్టాన్ని అనుభూతి చెందాలి’ అంటుంది నికిత పొర్వాల్. అక్టోబర్ 16 (బుధవారం) ముంబైలో జరిగిన ‘ఫెమినా మిస్ ఇండియా 2024’ ఫైనల్స్‌లో నికిత పొర్వాల్ కిరీటధారిగా నిలిచింది. 27 రాష్ట్రాల నుంచి మొత్తం 30 మంది పోటీ పడితే నికిత మొదటి స్థానంలో నిలిచింది. దాద్రా నాగర్ హవేలీకి చెందిన రేఖాపాండే రెండో స్థానంలో, గుజరాత్‌కు చెందిన ఆయూషీ ఢోలాకియా మూడో స్థానంలో నిలిచింది. సంగీతా బిజిలానీ, నేహా ధూపియా తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. మరో నెల రోజులలో జరగనున్న ‘మిస్ వరల్డ్ 2024’ పోటీల్లో మన దేశం తరఫున నికిత ప్రపంచ దేశాల సుందరీమణులతో పోటీ పడనుంది. మిస్ వరల్డ్ కిరీటం కూడా దక్కించుకోవాలని ఆశిస్తోంది.తండ్రి ్రపోత్సాహంతో ...మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి చెందిన నికిత హైస్కూల్ రోజుల నుంచే మోడలింగ్‌లోకి రావాలని భావించింది. ఆమె తండ్రి అశోక్ పొర్వాల్ ఇందుకు ప్రోత్సహించాడు. కూతురి ప్రతిభ గమనించి మోడలింగ్ రంగంలోకి చిన్న వయసులోనే ప్రవేశ పెట్టాడు. తల్లి రాజ్‌కుమారి కూడా వెన్నంటే ఉంటే నికితను నడిపించింది. ‘మోడల్‌గా పని చేసి మరుసటి రోజు స్కూల్‌కి వెళితే ఆ ప్రపంచం ఈ ప్రపంచం చాలా వేరేగా ఉండేవి. అడ్జస్ట్ కావడం కష్టమయ్యేది. కాని మా స్కూల్ వాళ్లు నాకు సపోర్ట్ నిలిచారు. కాలేజీలో చదువుకుంటూ ఫ్యాషన్ ప్రదర్శనలకు వెళ్లేదాన్ని. రాత్రుళ్లు మేలుకొని సిలబస్ చదవడం, రికార్డులు పూర్తి చేయడంలో నిమగ్న మయ్యేదాన్ని. ఆ హార్డ్‌వర్క్ వృథా పోలేదు’ అంటుంది నికిత.లోపలి సౌందర్యం‘అందాల పోటీలో రాణించాలంటే లోపలి సౌందర్యాన్ని బయటకు తేవాలి. ఆ సౌందర్యానికి రూపమే మన దేహం. ముందుగా ఆ సౌందర్యాన్ని నమ్మాలి. అందుకు ధ్యానం చేయడం లాంటి ఎన్నో విధానాలు అవలంబించాను. నా మాటను, నడకను రోజుల తరబడి సాధన చేశాను. ఎదుటివారు మనలో చూసేది నిజాయితీని... మనం మనలా ఉన్నామా లేదా అనే విషయాన్ని. దాన్ని పోగొట్టుకోకూడదు’ అంటుంది నికిత. నాటకాల మీద మక్కువతో థియేటర్లో పని చేసిందామె. ‘కృష్ణలీల’ అనే నాటకాన్ని స్వయంగా రాసింది కూడా!టీవీ యాంకర్‌గా...కుటుంబానికి మద్దతుగా నిలవడం కోసం టీవ యాంకర్‌గా కూడా పనిచేసింది నికిత. అలాగే సీరియల్స్‌లో, సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రలు పోషించింది. తుదకు ‘మిస్ ఇండియా’ అయ్యింది. ‘ఈ గుర్తింపును ఎలా ఉపయోగిస్తారు’ అనంటే ‘యువతను మోటివేట్ చేయడానికి ఉపయోగిస్తాను. మన దేశంలోని యువతకు చాలా స్కిల్స్ ఉన్నాయి. కాని కమ్యూనికేషన్లో వెనుకబడుతున్నారు. మీ మాటే మిమ్మల్ని ముందుకు తీసుకెళుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ధ్యాస పెట్టండి అని చెబుతాను’ అంటోంది నికిత. మిస్ ఇండియా అయ్యాక సంజయ్ లీలా భన్సాలీ వంటి దర్శకుల నుంచి పిలుపు వింటోందామె. త్వరలో వెండి తెర మీద చూడొచ్చు. -
ఇష్టపడితే దూరం పెట్టాడని...
ఉప్పల్ (హైదరాబాద్): ఓ యువతి టీవీ యాంకర్‌ను ఇష్టపడింది. అయితే అతను నో చెప్పడంతో కిడ్నాప్‌నకు పథకరచన వేసింది. అది కాస్త ఫెయిల్ కావడంతో కటకటాలపాలైంది. ఉప్పల్ పీఎస్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం దీనికి సంబంధించిన వివరాలు మల్కాజిగిరి ఏసీపీ పురుషోత్తంరెడ్డి విలేకరులకు వెల్లడించారు. మాదాపూర్ అరుణోదయకాలనీకి చెందిన బోగిరెడ్డి త్రిష్ణ ఓ డిజిటల్ మార్కెటింగ్ సంస్థకు సీఈఓ. భారత్ మ్యాట్రిమోని పేరుతో ఇన్‌స్ర్ట్రాగాంలో చైతన్యరెడ్డి త్రిష్ణకు పరిచయమయ్యాడు. అయితే చైతన్యరెడ్డి ఉప్పల్‌కు చెందిన టీవియాంకర్ ప్రణవ్సిస్టా ఫొటోను తన ఇన్‌స్ట్రాగామ్ ప్రొఫైల్‌కు వాడుకున్నాడు. ప్రణవ్ ఫొటో చూసి త్రిష్ణ ఇష్టం పెంచుకుంది. వాట్సాప్ ద్వారా మెసేజ్‌లు పంపుతూ దగ్గరైంది. దీనిని అదనుగా భావించిన చైతన్యరెడ్డి తన వ్యాపారంలో పెట్టుబడి పెట్టమని త్రిష్ణను కోరాడు. దీంతో ఆమె పెద్ద మొత్తంలో ఫోన్‌పే ద్వారా పంపింది. తిరిగి డబ్బు చెల్లించమని అడగ్గా కాలయాపన చేస్తున్నాడు. దీంతో అప్రమత్తమైన త్రిష్ణ కూపీ లాగగా, చైతన్యరెడ్డి ఫేక్ ఐడీ ద్వారా ప్రణవ్ సిస్టా ఫొటో వాడుకొని మోసం చేసినట్టు నిర్థారణకు వచి్చంది. వెంటనే ప్రణవ్ను మెసేజ్‌ల ద్వారా అలర్ట్ చేసింది. దీంతో ఆయన సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేశాడు. తర్వాత మెసేజ్‌ల ద్వారా పరిచయం పెంచుకొని ప్రణవ్ను మరింతగా ఇష్టపడింది. ఎలాగైనా అతడిని వశం చేసుకోవాలని ప్రయత్నించింది. ఆ ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో తన కార్యాలయంలో పనిచేసే నలుగురి ద్వారా ప్రణవ్ వివరాలు తెలుసుకుంది. ఉప్పల్‌లో పార్కు చేసిన ప్రణవ్ కారుకు వారు జీపీఎస్(యాపిల్ ఎయిర్ ట్యాగ్) బిగించారు. దీని ద్వారా ప్రణవ్ కదలికలను గుర్తిస్తూ అతన్ని బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించింది. అయినా ప్రణవ్ దారికి రాలేదు. దీంతో కిడ్నాప్‌నకు ప్లాన్ వేసింది. రూ.50,000 సుపారీ ఇచ్చింది. దీంతో కిడ్నాపర్లు రంగంలోకి దిగి ఈ నెల 11న అర్ధరాత్రి ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ కళాశాల వెనుక రోడ్డులో ప్రణవ్ను అడ్డగించారు. తమ కారులో ఎక్కించుకొని కిడ్నాప్ చేసి చితకబాదుతూ త్రిష్ణ కార్యాలయానికి తీసుకొచ్చారు. వారి నుంచి ఎలాగో అలా తప్పించుకొని వచ్చిన ప్రణవ్ ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన ఉప్పల్ పోలీసులు కేసులో ప్రధాన నిందితురాలైన త్రిష్ణను అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. మిగిలిన కిడ్నాపర్ల కోసం వేట ప్రారంభించినట్టు ఏసీపీ తెలిపారు. నిందితుల్లో ఇద్దరు గతంలో పలు నేరాలకు పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. నిందితురాలి సెల్‌ఫోన్, కారుకు వాడిన జీపీఎస్ ట్యాగ్ స్వాధీనం చేసుకున్నారు. -
'ఏ యాసతో అవమానాలు పడ్డదో.. ఇప్పుడదే ఆమెను స్టార్‌ను చేసింది'
ఏ యాస మాట్లాడి అవమానపడ్డదో.. ఆ యాసతోనే పాపులర్ అయిన నటి.. జోర్దార్ సుజాత. కయ్యకయ్య అరుస్తూనే కమ్మని పదాలతో.. శనార్తులంటూ వరుస బుల్లితెర అవకాశాలతో పాటు, వెబ్ ప్రపంచంలోకీ అడుగుపెట్టిన ఆమె గురించి కొన్ని వివరాలు..! సుజాత అసలు పేరు శ్రుతి. స్వగ్రామం వరంగల్ జిల్లా.. ఉప్పర్ పల్లి. అమ్మ అంగన్వాడీ టీచర్. నాన్న ప్రైవేట్ టూరిస్ట్ బస్ డ్రైవర్. ముగ్గురు అక్కాచెల్లెళ్లలోకి తనే చిన్నది. ఇద్దరు అక్కలకు ఇంటరైపోయిన వెంటనే పెళ్లి చేశారు. తన వంతు వచ్చేసరికి పోలీసు ఉద్యోగం సాధిస్తానని తల్లిదండ్రులను ఒప్పించి డిగ్రీ పూర్తి చేసింది. ఉద్యోగంతోనే ఇంటికి తిరిగి వస్తానని హైదరాబాద్ వచ్చింది. మొదట ఆన్లైన్ మార్కెటింగ్ జాబ్‌లో చేరింది. అయితే తన యాస, తీరు వల్ల అక్కడ ఇమడలేకపోయింది. (ఇది చదవండి: నాపై 8 నెలలు విషప్రయోగం చేశారు: జేడీ చక్రవర్తి ఎమోషనల్) ఆ తర్వాత టీవీ చానళ్లలో తెలంగాణ యాసకు ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిసి.. అక్కడ ప్రయత్నించింది. తెలంగాణ యాసలో వార్తలు చదువుతూ ‘జోర్దార్ సుజాత’గా మారి మంచి గుర్తింపు పొందింది. అదే.. ఆమెకు బుల్లితెర అవకాశాలనూ తెచ్చిపెట్టింది. ఇక బిగ్‌బాస్ షోలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇప్పుడిప్పుడే సినిమాలకు కూడా అడుగుతుండ్రు. సిస్టర్ రోల్స్, ఫ్రెండ్ రోల్స్ చాలానే వస్తున్నయి. ఇంకేదీ ఫైనల్ చేయలేదు. మనమేదైనా చేస్తే టర్నింగ్ పాయింట్ లెక్క ఉండాలేగనీ, ఏదో చేస్నున్నవా అంటే చేస్తున్న అన్నట్లు ఉండొద్దు కదా? – సుజాత పలు టీవీ షోలు, సీరియల్స్‌లో నటిస్తూ బిజీగా మారింది. తర్వాత తన పేరు మీదనే సొంతంగా ఓ యూట్యూబ్ చానెల్ ప్రారంభించి మరింత పాపులర్ అయింది. ఈ మధ్యనే జబర్దస్త్ కమేడియన్ రాకింగ్ రాకేశ్‌ను ప్రేమ వివాహం చేసుకొని, జీవితంలో మరో అడుగు ముందుకు వేసింది. ‘సేవ్ ది టైగర్స్’ సిరీస్‌తో వెబ్ దునియాలోనూ తన జోరు సాగిస్తోంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతోన్న ఈ సిరీస్‌లో.. తెలంగాణ యాసలో సుజాత అందంగా తిట్టిన తిట్లు.. సోషల్ మీడియాలో రీల్స్‌గా మారి తెగ వైరల్ అవుతున్నాయి. (ఇది చదవండి: టాలీవుడ్ యాంకర్‌తో పెళ్లి.. మా బంధం అలాంటిది: జేడీ చక్రవర్తి) -
క్రికెటర్‌తో ప్రేమలో యాంకర్ వర్షిణి? బహుత్ 'సుందర్' హై!
బుల్లితెర యాంకర్ వర్షిణి ఈ మధ్య వార్తల్లో బాగా హైలైట్ అవుతోంది. కారణం తను ఉప్పల్ స్టేడియంకు వెళ్లడం.. వెళ్లిన ప్రతిసారి ఎస్ఆర్హెచ్ ఓడిపోవడం. దీంతో ఎస్ఆర్హెచ్ అభిమానులు ఇదివరకే ఆమెను ఓ ఆటాడేసుకున్నారనుకోండి అది వేరే విషయం. అయితే ఆమె అలా పదేపదే మ్యాచ్‌కు వెళ్లడానికి ఓ బలమైన కారణం ఉందట. సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కోసమే తను పదేపదే స్టేడియంకు వెళ్లిందంటూ ఓ వార్త వైరల్ అవుతోంది. వీరిద్దరూ ప్రేమలో పడ్డారని, ఛాన్స్ దొరికితే చాలు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనిపై అటు సుందర్, ఇటు వర్షిణి ఎవరూ ఇంతవరకు స్పందించలేదు. అయితే వర్షిణిని మాత్రం మళ్లీ చెడుగుడు ఆడేసుకుంటున్నారు నెటిజన్లు. సోషల్ మీడియాలో ఏ ఫోటో పోస్ట్ చేసినా క్రికెటర్ గురించే గుచ్చి గుచ్చి అడుగుతున్నారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో వర్షిణి గ్లామర్ ఫోటోలు షేర్ చేయగా దాని కింద అందరూ వాషింగ్టన్ సుందర్ గురించే ఆరా తీస్తున్నారు. 'ఏంటి, సుందర్‌తో డేటింగ్ అంటగా..', 'బహుత్ సుందర్ హై', 'నీ డ్రెస్ చాలా బాగా వాషింగ్ చేసుకున్నావ్.. బహుత్ సుందర్ హై' అంటూ కామెంట్లతో చెలరేగిపోతున్నారు. కొందరైతే ఏకంగా క్రికెటర్‌ను పెళ్లి చేసుకోమని సలహా ఇస్తున్నారు. బుల్లితెరపై ఎంత అందాలు ఆరబోసినా రాని గుర్తింపు క్రికెటర్ భార్య అయితే వస్తుందని సలహా ఇస్తున్నారు. క్రికెటర్లను పెళ్లి చేసుకున్న సినీతారల జాబితాలో చేరిపోమని సూచిస్తున్నారు. View this post on Instagram A post shared by Varshini Sounderajan (@varshini_sounderajan) View this post on Instagram A post shared by Varshini Sounderajan (@varshini_sounderajan) చదవండి: గ్రాండ్‌గా ఆర్ఆర్ఆర్ నిర్మాత దానయ్య ఇంట పెళ్లి -
ఆ దేవుడు నన్ను కరుణించలేదు: జబర్దస్త్ యాంకర్ ఎమోషనల్
సీరియల్స్‌తో నటిగా కెరీర్ ఆరంభించిన సౌమ్య రావు జబర్దస్త్‌తో యాంకర్‌గా మారింది. షోలో నవ్వుతూ, చలాకీగా ఉంటూ, కంటెస్టెంట్లపై పంచులు విసిరే ఆమె వ్యక్తిగతంగా మాత్రం ఎంతో బాధను అనుభవిస్తున్నట్లు తెలుస్తోంది. సౌమ్య తల్లి క్యాన్సర్‌తో పోరాడి కన్నుమూశారు. చివరి రోజుల్లో తన తల్లి ఎదుర్కొన్న నరకం గురించి వివరిస్తూ ఇటీవల ఓ వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలో సౌమ్య రావు ఆస్పత్రి బెడ్ మీద ఉన్న తల్లిని కంటికి రెప్పలా చూసుకుంటూ తనను నవ్వించేందుకు ప్రయత్నించింది. తన తల్లి అనుభవించిన నరకం ఏ తల్లికీ రాకూడదని ఎమోషనలైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'అంబులెన్స్, డాక్టర్స్.. ట్రీట్మెంట్.. మందులు.. ఎంతో బాధ అనుభవించావు. నీ కోసం ఆ భగవంతుడికి ఎన్నో పూజలు చేశాను. ఉపవాసాలు ఉన్నాను. అయినా ఆ దేవుడు కరుణించలేదు. ఆ భగవంతుడు నాకెందుకిలా చేశాడని బాధేస్తోంది. అందరూ అమ్మ ఫోటో షేర్ చేసి మదర్స్ డే శుభాకాంక్షలు చెప్తుంటే నాకు మాత్రం చివరి రోజుల్లో నువ్వు పడ్డ బాధే గుర్తొస్తోంది. దాన్ని మర్చిపోలేకపోతున్నాను. రేయిపగలు నీకు సేవ చేసినా, భగవంతుడికి పూజ చేసినా అన్నీ వృథా అయ్యాయి. నువ్వు లేకుండా నా జీవితం అసంపూర్తిగా మిగిలింది. ప్రతిరోజు, ప్రతిక్షణం నిన్ను మిస్ అవుతూనే ఉన్నాను. అమ్మా, నాకోసం మళ్లీ పుడతావని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నాను. దేవుడా.. మా అమ్మానాన్నలను మళ్లీ నాకివ్వు. నిన్ను చాలా మిస్ అవుతున్నా అమ్మా.. లవ్ యూ సోమచ్' అని రాసుకొచ్చింది. చదవండి: పొద్దున ఆరు గంటలకే చికెన్ తిన్న ఎన్టీఆర్.. నాక్కూడా : రామ్ చరణ్ -
రూ.20 లక్షలు గెలిచా.. ఒక్క పూటలో ఖతం చేశా: యాంకర్
ఫ్రెండ్స్‌తో డిన్నర్‌కు వెళ్తే ఎంత అవుతుంది? వందల్లో, లేదంటే వేలల్లో! కానీ ఓ యాంకర్ మాత్రం జస్ట్ డిన్నర్‌కే రూ.20 లక్షలు ఖర్చు పెట్టిందట! హిందీ బుల్లితెర యాంకర్ మిని మాథుర్ తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో ఈ విషయాన్ని బయటపెట్టింది. 'ఓ క్విజ్ షోలో నేను రూ.20 లక్షలు గెలుచుకున్నాను. ఇంకేముందీ, ఈ సంతోషంలో నా ఫ్రెండ్స్, దగ్గరివాళ్లు అందరినీ కలుపుకుని దాదాపు 22 మందిని డిన్నర్‌కు తీసుకెళ్లాను. ఓ పెద్ద ఫైవ్‌స్టార్ హోటల్‌కు వెళ్లి తిన్నాం. అలా నాకు వచ్చిన డబ్బంతా ఒక్కపూటలో ఖర్చైపోయింది. నేను ఎమ్టీవీలో పనిచేసిన తొలినాళ్లలో రూ.50,000 జీతం వచ్చేది. మిగతావాటితో పోలిస్తే అది కొంత తక్కువే! మోడలింగ్ విషయానికి వస్తే ఓ అనూహ్య ఘటన వల్ల మోడల్‌గా మారాల్సి వచ్చింది. ఓసారి ఏమైందంటే.. ఓ యాడ్ కోసం సుష్మితా సేన్ రావాల్సి ఉంది. ఆ ప్రకటనలో ఆమె ఓ పైలట్‌గా నటించాలి. టైం అవుతున్నా తను రాలేదు. ఆలస్యమవుతుండటంతో ఆమె స్థానంలో నన్ను పెట్టి చేశారు' అని చెప్పుకొచ్చింది. కాగా మిని మాథుర్.. ఇండియన్ ఐడల్ షో మొదటి మూడు సీజన్లకు, అలాగే ఆరో సీజన్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఇదే కాకుండా మిస్ ఇండియా పేజెంట్, దిల్సే దిల్సే ఆజ్‌తక్, బాంబే బ్లష్, పాప్‌కార్న్ జూమ్, సిర్ఫ్ ఏక్ మినిట్ మె సహారా వన్ వంటి పలు షోలకు హోస్టింగ్ చేసింది. దిల్ విల్ ప్యార్ వార్, ఐ మే ఔర్ మే చిత్రాల్లో మైండ్ ద మల్హోత్రాస్ అనే వెబ్ సిరీస్‌లోనూ నటించింది. -
నటి మృతి.. మరణానికి కారణమదేనా? వైరలవుతున్న వీడియో!
ప్రముఖ మలయాళ నటి, యాంకర్ కమెడియన్ సుబి సురేశ్ మరణంతో మాలీవుడ్‌లో విషాదం నెలకొంది. గతకొంతకాలంగా కాలేయ సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూనే తుదిశ్వాస విడిచారు. అయితే సమయానికి తినకపోవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం వల్లే ఆమె అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. ఆరు నెలల క్రితం ఆమె తన అనారోగ్యం గురించి మాట్లాడిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్‌గా మారింది. సుబి సురేశ్ యూట్యూబ్ ఛానల్లో ఉన్న ఆ వీడియోలో తను ఏమందంటే.. 'సమయానికి తినడం, మందులు వేసుకోవడం వంటి మంచి అలవాటు నాకు లేదు. దీనివల్ల ఓసారి షూటింగ్‌కు ముందు రోజు ఛాతీలో నొప్పి వచ్చింది, దీనికి గ్యాస్ట్రిక్ సమస్య కూడా తోడైంది. ఆ మరుసటి రోజు నేను ఏదీ తినలేకపోయాను. ఒకటే వాంతులు.. కొబ్బరి నీళ్లు తాగినా కూడా దాన్ని బయటకు కక్కేశాను. రెండు రోజులు ఏమీ తినలేదు. డాక్టర్ దగ్గరకు వెళ్తే పొటాషియం చాలా తక్కువగా ఉంది. సరిగా తినాలని చెప్పారు. నిజానికి చాలామంది నాకు డబ్బు పిచ్చి అనుకుంటారు. ఫుడ్ కూడా తినకుండా డబ్బు వెంట పరుగెడుతుందనుకుంటారు. కానీ అది నిజం కాదు. చాలాకాలం తర్వాత వరుస ప్రాజెక్టులు వస్తుండటంతో కొత్త ఉత్సాహంతో వాటిని చేసుకుంటూ పోయాను. నా ఫోకస్ డబ్బు మీద కాకుండా పని మీదే ఉంది. ఈ క్రమంలో సరైన ఫుడ్ తీసుకోవడాన్ని నిర్లక్ష్యం చేశాను. ఈ విషయంలో అమ్మ, సోదరుడు నన్ను పదేపదే తిట్టేవారు. నాకు నచ్చినవి పట్టుకొచ్చినా వాటివైపు కన్నెత్తి చూసేదాన్నే కాదు. చెప్పాలంటే నాకు ఆకలిగా ఉన్నా కూడా ఏమీ తినకపోయేదాన్ని. అదే నాకున్న అత్యంత చెడ్డ లక్షణం. రానురానూ నా శరీరంలో మాగ్నీషియం, పొటాషియం, సోడియం లెవల్స్ పడిపోవడంతో నా పరిస్థితి కొంత సీరియస్‌గా మారింది. ముందునుంచే కరెక్ట్‌గా తిని ఉండుంటే పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదు కదా అనుకున్నా. షూటింగ్‌కు వెళ్లి ఆలస్యంగా వచ్చినప్పుడు డైరెక్ట్‌గా బెడ్రూమ్కు వెళ్లి పడుకునేదాన్ని. ఏ సాయంత్రానికో లేచేదాన్ని. అప్పుడు కూడా బద్ధకంతో కేవలం నీళ్లు తాగి మళ్లీ నిద్రపోయేదాన్ని. ఇది తరచూ రిపీట్ అవడంతో హాస్పిటల్లో 10 రోజులు ఉండాల్సింది. కొన్నేళ్లుగా నిర్లక్ష్యంగా ఉన్న నేను ఇప్పుడు రోజుకు మూడు సార్లు తింటున్నాను. కాబట్టి అందరికీ అనుభవంతో చెప్తున్నా.. సమయానికి తినడం అలవాటు చేసుకోండి' అని చెప్పుకొచ్చింది సుబి సురేశ్. ఇది చూసిన నెటిజన్లు మీ నిర్లక్ష్యంతో ప్రాణాలే పోగొట్టుకునారు అని కామెంట్లు చేస్తున్నారు. -
కోరిక తీర్చకుంటే మార్ఫింగ్ ఫోటోలను అప్లోడ్ చేస్తా.. యాంకర్‌కు వేధింపులు
సాక్షి, హైదరాబాద్: కోరిక తీర్చకుంటే మార్ఫింగ్ చేసిన అశ్లీల చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేస్తానని బెదిరిస్తున్న వ్యక్తిపై ఎస్ఆర్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ సైదులు తెలిపిన వివరాల మేరకు.. మధురానగర్‌లోని ఓ హాస్టల్లో ఉంటున్న 27 ఏళ్ల యువతి ఓ టీవీ చానెల్లో యాంకర్‌గా పనిచేస్తుంది. కళాశాలలో ఆమెతో కలిసి చదువుకున్న క్లాస్మేట్ కూకట్పల్లి నివాసి కె.సామ్రాట్ ఆమెను వేధిస్తున్నాడు. ప్రేమించాలని వెంట పడటంతో అందుకు నిరాకరించగా స్నేహితుల్లా ఉందామని నమ్మించాడు. ఓసారి తన కారులో ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించగా తిరిగి హాస్టల్ వద్ద విడిచివెళ్లాడు. యువతిపై కోపం పెంచుకున్న సామ్రాట్ ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేశాడు. కోరిక తీర్చకుంటే వాటిని సామాజిక మాధ్యమాల్లో పెట్టి పరువు తీస్తానని బెదిరింపులకు దిగడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమపేరుతో టీవీ యాంకర్‌కు దగ్గర.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, హోటల్‌కు తీసుకెళ్లి..
సాక్షి, చెన్నై: ఓ టీవీ యాంకర్‌ను వివాహం చేసుకుంటానని నమ్మించి లైంగికదాడికి పాల్పడిన ఓ యువకుడికి పది సంవత్సరాలు జైలు శిక్ష, రూ. 5,000 జరిమానా విధిస్తూ ఈరోడ్ మహిళా కోర్టు తీర్పు ఇచ్చింది. వివరాలు.. ఈరోడ్‌కు చెందిన 26 ఏళ్ల యువతి లోకల్ టీవీలో యాంకర్‌గా పనిచేస్తోంది. ఈమెకు ఈరోడ్ ముత్తంపాలయానికి చెందిన రాహుల్ (29)తో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నట్లు తెలిసింది. 2018 కోవైలో ఓ ప్రోగ్రాంకి వెళ్లిన సమయంలో హోటల్‌కు తీసుకెళ్లిన రాహుల్ తనను వివాహం చేసుకుంటానని చెప్పి బలాత్కారం చేశాడని, అలాగే తన వద్ద 750 గ్రాముల సవర్ల బంగారు నగలు మోసం చేశాడని ఆరోపించింది. ఈ మేరకు ఆగస్టులో ఈరోడ్ మహిళాపోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దర్యాప్తులో రాహుల్ మోసానికి పాల్పడినట్లు తేలడంతో పదేళ్ల జైలు శిక్ష, రూ.5 వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి మాలతి తీర్పు ఇచ్చారు. చదవండి: (పచ్చని సంసారంలో వివాహేతర సంబంధం చిచ్చు.. పిల్లలకు విషమిచ్చి..) -
బీజేపీ నేత సోనాలి ఫోగట్ హఠాన్మరణం
ఛండీగఢ్: టీవీ యాంకర్, బీజేపీ నేత సోనాలి ఫోగట్(43) గుండె పోటుతో హఠాన్మరణం చెందారు. తోటి ఉద్యోగులతో కలిసి గోవాకు వెళ్లిన ఆమె.. సోమవారం రాత్రి గుండె పోటుతో అక్కడే కన్నుమూసినట్లు సమాచారం. 2006లో టీవీ యాంకర్‌గా, టీవీ నటిగా కెరీర్‌ను ప్రారంభించి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సోనాలి ఫోగట్.. రెండేళ్ల తర్వాత బీజేపీలో చేరారు. టిక్ టాక్ ద్వారా ఆమె పాపులారిటీ మరింత పుంజుకుంది. దీంతో బీజేపీ ఆమెను స్టార్ క్యాంపెయినర్‌గా మార్చేసుకుంది. సోషల్ మీడియాలో సోనాలికి ఫాలోయింగ్ ఎక్కువే. 2019 హర్యానా ఎన్నికల్లో ఆమె అదాంపూర్ నుంచి బీజేపీ తరపున పోటీ చేసి.. కాంగ్రెస్ నేత కుల్దీప్ బిష్ణోయ్ చేతిలో ఓడిపోయారు. అయితే.. అనూహ్యంగా కిందటి నెలలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన బిష్ణోయ్.. బీజేపీలో చేరారు. పోయినవారం సోనాలి ఫోగట్‌తో బిష్ణోయ్ భేటీ కావడంతో.. అదాంపూర్ ఉపఎన్నికలో సోనాలినే అభ్యర్థిగా నిలబడతారనే ప్రచారం ఊపందుకుంది. ఈలోపే ఆమె కన్నుమూయడం గమనార్హం. సోనాలి ఫోగట్ భర్త 2016లో హిస్సార్‌లోని ఓ ఫామ్‌హౌజ్‌లో అనుమానాస్పద రీతిలో మృతి చెందగా.. 2020లో ఓ అధికారిని చెప్పుతో కొట్టి ఆమె వివాదంలో నిలిచారు. ఇదీ చదవండి: చంటిబిడ్డతో ఫుడ్ డెలివరీ.. ఆ తల్లికి అంతా ఫిదా -
విశ్వక్సేన్పై మంత్రికి ఫిర్యాదు చేసిన ప్రముఖ యాంకర్
యంగ్ హీరో విశ్వక్సేన్- టీవీ యాంకర్‌కు మధ్య జరిగిన మాటల యుద్దంపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరగుతుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విశ్వక్ సేన్, ఆయన టీం చేసిన ప్రాంక్ వీడియో విమర్శల పాలైన సంగతి తెలిసిందే. ఇదే అంశంపై ఓ టీవీ ఛానెల్లో జరిగిన డిబెట్లో విశ్వక్ సేన్, సదరు యాంకర్‌కి మధ్య వాడివాడి చర్చ జరిగింది. స్టూడియో నుంచి 'గెట్ అవుట్' అంటూ యాంకర్ గట్టిగా అరవడం, దానికి విశ్వక్ సేన్ అభ్యంతరకర ఎఫ్.. పదాన్ని వాడటం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఇదే అంశంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కి యాంకర్ దేవి నాగవల్లి ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన మంత్రి ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'విశ్వక్ సేన్ ప్రవర్తన బాగాలేదు. కశ్చితంగా చర్యలు ఉంటాయి. రోడ్డుపై న్యూసెన్స్ చేస్తా.. ప్రశ్నిస్తే ఇష్టమొచ్చినట్లు మాట్లాడతానంటే ఎవరూ ఊరుకోరు. ఆయన సారీ చెప్పిన పద్దతి కూడా సరిగా లేదు.ఈ విషయాన్ని మా అసోసియేషన్ దృష్టికి కూడా తీసుకెళ్తాం' అని పేర్కొన్నారు. -
విశ్వక్ సేన్-టీవీ యాంకర్ వీడియోపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్..
Ram Gopal Varma Reacts To Vishwak Sen TV Anchor Video: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా రుక్సార్ దిల్లాన్ హీరోయిన్గా నటించిన చిత్రం అశోకవనంలో అర్జున కల్యాణం. విద్యాసాగర్ చింత దర్శకత్వం వహించిన ఈ మూవీ మే 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో సినిమా ప్రమోషన్స్ స్పీడ్ చేసిన చిత్ర బృందం ఓ ప్రాంక్ వీడియోతో విమర్శల పాలైంది. ఈ క్రమంలోనే విశ్వక్ సేన్, చిత్ర పరిశ్రమకు చెందిన త్రిపురనేని చిట్టితో డిబెట్ నిర్వహించింది ప్రముఖ టీవీ ఛానెల్. అయితే ఈ డిబెట్లో యాంకర్‌కు విశ్వక్ సేన్ మధ్య మాటల యుద్ధం జరిగింది. విశ్వక్ సేన్‌ను స్టూడియో నుంచి 'గెట్ అవుట్' అంటూ యాంకర్ గట్టిగా అరిచిన వీడియో ప్రస్తుతం నెట్టింట షేక్ చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ వీడియోపై తాజాగా సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ ట్విటర్ వేదికగా స్పందించారు. 'ఒక పురుషుడి కన్నా పవర్‌ఫుల్‌గా ఒక మహిళ కనిపించడం నేను ఇంతవరకు చూల్లేదు. ఆమె సర్కార్ కన్నా తక్కువేం కాదు' అంటూ ఆ యాంకర్‌ను ట్యాగ్ చేశాడు ఆర్జీవీ. కాగా ప్రాంక్ వీడియో కారణంగా ఇప్పటికే హీరో విశ్వక్ సేన్‌పై అరుణ్ కుమార్ అనే లాయర్ హ్యుమన్ రైట్స్ కౌన్సిల్లో (హెచ్ఆర్సీ) ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. చదవండి: ‘గెట్ అవుట్’ అంటూ విశ్వక్ సేన్‌పై టీవీ యాంకర్ ఫైర్ హీరో విశ్వక్ సేన్‌పై హెచ్ఆర్సీలో ఫిర్యాదు I never saw a woman looking so much more powerful than a man 💪😍💪 @Devi_Nagavalli is no less than SARKAR 🙏🙏🙏 pic.twitter.com/QbJIMTbR0K — Ram Gopal Varma (@RGVzoomin) May 2, 2022 -
‘గెట్ అవుట్’ అంటూ విశ్వక్ సేన్‌పై టీవీ యాంకర్ ఫైర్
Argument Between TV Anchor And Hero Vishwak Sen: హీరో విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’. విద్యాసాగర్ చింత దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే6న విడుదల కానుంది. దీంతో ప్రమోషన్స్ స్పీడు పెంచిన చిత్ర బృందం ఓ ప్రాంక్ వీడియో చేసిన సంగతి తెలిసిందే. ఫిలింనగర్‌లోని రోడ్డులో ఓ అభిమాని చేత సూసైడ్ చేయిస్తున్నట్టుగా వీడియో చేయించి రోడ్డుపై న్యూసెన్స్ క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. దీనిపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే హీరో విశ్వక్ సేన్‌పై అరుణ్ కుమార్ అనే అడ్వకేట్ హ్యుమన్ రైట్స్ కౌన్సిల్లో(హెచ్ఆర్సీ) ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. చదవండి: హీరో విశ్వక్ సేన్‌పై హెచ్ఆర్సీలో ఫిర్యాదు తాజాగా ఈ వీడియో కాస్తా కాంట్రవర్సి కావడంతో ప్రముఖ టీవీ చానల్ హీరో విశ్వక్ సేన్, సినీ ఇండస్ట్రీకి చెందిన త్రిపురనేని చిట్టితో డిబెట్ నిర్వహించింది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్ కోసం ఇలా ప్రాంక్ వీడియోలు చేయడం ఏంటని, హీరో మెంటల్ స్టేటస్‌పై ప్రశ్నించింది యాంకర్. ఈ నేపథ్యంలో విశ్వక్‌ను డిప్రెషన్ పర్సన్, పాగల్ శ్రీను వంటి పదాలు వాడారు. దీంతో విశ్వక్ యాంకర్‌పై ఫైర్ అయ్యాడు. ‘నేను డిప్రెషన్‌కి వెళ్లిపోయానని మీరు స్టేట్మెంట్ పాస్ చేయడం కరెక్ట్ కాదు. అలా ఏ డాక్టర్ చెప్పాడో అతడి నెంబర్ ఇవ్వండి నేను మట్లాడుతాను. నా పర్సనల్ లైఫ్ గురించి మీకు తెలియదు. దాని గురించి మాట్లాడే హక్కు మీకు లేదు’ అన్నాడు. చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలివే.. అలాగే ‘నాకు పాగల్ శీను అనే పేరు పెట్టారు. నేను కూడా మీపై పరువు నష్టం దావా వేయొచ్చు. కానీ నేను అలా చేయను. మీరు మీ నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడండి. డిప్రెషన్ పర్సన్, పాగల్ శీను అని అనడం సరికాదు’ అంటూ అసహనం వ్యక్తం చేశాడు. దీంతో యాంకర్ విశ్వక్ సేన్‌ను నువ్వు ముందు స్టూడియో నుంచి బయటకు వెళ్లిపోమ్మంటూ గట్టిగా అరించింది. దీంతో యాంకర్‌పై విశ్వక్ విరుచుకుపడుతు అభ్యంతరకర(ఎఫ్.. అనే పదం) పదాన్ని వాడాడు. దీంతో సహనం కోల్పోయిన యాంకర్ ‘యు గెటవుట్ ఫస్ట్ ఫ్రమ్ స్టూడియో’ అంటూ పదే పదే చెప్పడంతో ‘నేను బయటకు పోతే నా గురించి ఇష్టమొచ్చినట్లు చెబుతారు. యు జస్ట్ షటప్’ అనేసి విశ్వక్ స్టూడియో నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి ఈ వివాదం ఎంతవరకు వెళుతుందో చూడాలి. -
గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లాడిన ప్రముఖ యాంకర్, ఫొటోలు వైరల్
ప్రముఖ యాంకర్, నటుడు సైరస్ సహుకర్ ఓ ఇంటివాడయ్యాడు. ప్రియురాలు వైశాలి మాలహరను పెళ్లాడాడు. శుక్రవారం నాడు (ఏప్రిల్ 15న) మహారాష్ట్రలోని అలీబాగ్‌లో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ వివాహ కార్యక్రమానికి ఇరు కుటుంబాలతో పాటు బంధుమిత్రులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కాగా ఈ పెళ్లి వేడుకకు హాజరైన పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ఫొటోలు షేర్ చేయగా అవి కాస్తా వైరల్‌గా మారాయి. కాగా సైరస్ సహుకర్ బుల్లితెరమీద ప్రసారమయ్యే పలు టీవీ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ఎమ్‌టీవీ బాక్రా గాగ్, చిల్ అవుట్, స్పెల్లింగ్ బీ, ఇండియా గాట్ టాలెంట్ సహా తదితర కార్యక్రమాలకు హోస్టింగ్ చేశాడు. అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారమైన మౌండ్ ద మల్హోత్రాస్ అనే వెబ్ సిరీస్‌లోనూ ముఖ్య పాత్రలో నటించాడు. అలాగే కౌన్ బనేగి షిఖర్వాతి, పాట్లక్ వంటి షోలలనూ పాల్గొన్నాడు. సినిమాల విషయానికి వస్తే అతడు ఢిల్లీ 6, ఐషా, రంగ్ దే బసంతి, ఖుబ్సూరత్ సహా పలు చిత్రాల్లో నటించాడు. ఆయన చివరిసారిగా అప్‌స్టార్ట్స్ మూవీలో కనిపించాడు. View this post on Instagram A post shared by 𝙎𝙖𝙢𝙞𝙧 𝙆𝙤𝙘𝙝𝙝𝙖𝙧 (@samirkochhar) View this post on Instagram A post shared by 𝙎𝙖𝙢𝙞𝙧 𝙆𝙤𝙘𝙝𝙝𝙖𝙧 (@samirkochhar) చదవండి: బాలీవుడ్‌కు 'కేజీఎఫ్ 2' ఒక హారర్ మూవీ: రామ్ గోపాల్ వర్మ 'డబ్బు మెషీన్గానే చూశారు'.. పూనమ్ పాండే ఎమోషనల్ -
ఆ ముగ్గురి వల్లే ఇంత బాధ అనుభవిస్తున్నాం: వర్ష ఎమోషనల్
మోడల్‌గా కెరీర్ ఆరంభించిన వర్ష బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి తక్కువ కాలంలోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది. కామెడీ షోలో నవ్వులు పంచే ఈ భామ సోషల్ మీడియాలో వరుస ఫొటోషూట్లతో నిత్యం అభిమానులతో టచ్‌లో ఉంటుంది. కమెడియన్ ఇమ్మాన్యుయేల్‌తో ఆన్‌స్క్రీన్ హిట్ పెయిర్‌గా పేరు గాంచిన వర్ష తాజాగా భావోద్వేనికి లోనైంది. తన సోదరుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడంటూ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న అతడి ఫొటోను షేర్ చేసింది. 'దయచేసి అందరినీ వేడుకుంటున్నాను.. మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ముగ్గురు వ్యక్తులు నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం వల్ల నా బ్రదర్‌కి యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు. మా ఫ్యామిలీ అంతా ఎంతగానో బాధపడ్డాం. అందుకే ఎవరైనా సరే డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉంటే ఎవరు కూడా, ఏ ఫ్యామిలీ కూడా, సఫర్ అవ్వకుండా ఉంటారు. ప్రస్తుతం అతడి పరిస్థితి బాగానే ఉంది' అని వర్ష పేర్కొంది. -
తాళిబొట్టుతో షాకిచ్చిన వర్ష: పెళ్లికి రెడీ అయిందా?
టీవీ యాంకర్ వర్ష... తన అందచందాలతో షోలో సందడి చేసే ఆమె అడపాదడపా సీరియళ్లలోనూ నటిస్తున్న విషయం తెలిసిందే! యాంకరింగ్, నటన రెండింటిలోనూ రాణిస్తున్న ఈ భామ ఫొటోషూట్లతో నిత్యం సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ చేతికి రింగు ధరించిన ఫొటోను షేర్ చేసి ఫ్యాన్స్‌కు షాకిచ్చింది. జూలై 4వ తారీఖున ఓ ముఖ్యమైన విషయం చెప్పబోతున్నానని వెల్లడించింది. దీంతో ఆ ఉంగరం వెనుక ఏదో దాగి ఉందని అభిప్రాయపడుతున్నారు నెటిజన్లు. అంతేకాదు.. చేతిలో మంగళసూత్రాన్ని పట్టుకున్న ఫొటోను కూడా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసింది వర్ష. దీనికి పెళ్లికొడుకు, పెళ్లి కూతురు ఎమోజీలను జత చేసింది. దీంతో వర్ష పెళ్లిపీటలెక్కబోతుందహో.. అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో చాటింపు వేసి మరీ చెప్తున్నారు. చేతికి ఉంగరం ఉంది కాబట్టి ఇప్పటికే నిశ్చితార్థం కూడా జరిగిపోయిందని ఖరారు చేస్తున్నారు. కానీ వర్ష మెడలో మూడు ముళ్లు పడితే ఇమ్మాన్యుయేల్ ఏమైపోవాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి నిజంగానే వర్ష పెళ్లి చేసుకోబోతుందా? లేదా? అనేది తెలియాలంటే జూలై 4 వరకు ఆగాల్సిందే! చదవండి: విజయ్ బర్త్‌డే స్పెషల్ పోస్టర్ రిలీజ్ -
ఘనంగా టీవీ యాంకర్ పెళ్లి
మలయాళ దర్శకుడు, నటుడు మధుపాల్ పెద్ద కూతురు, టీవీ యాంకర్ మాధవి పెళ్లి ఘనంగా జరిగింది. కేరళలోని వాజుత్తకోడ్కు చెందిన అరవింద్‌తో ఆమె ఏడడుగులు వేసింది. శాంతిగిరి ఆశ్రంలో ఈ వివాహ కార్యక్రమం జరగ్గా ఈ విషయాన్ని పెళ్లి కూతురి చెల్లి మీనాక్షి సోమవారం సోషల్ మీడియాలో వెల్లడించింది. "ప్రపంచంలోనే నువ్వు బెస్ట్ అక్కవి. నువ్వు పెళ్లి బంధంలో అడుగు పెట్టినందుకు నాకు ఎంత సంతోషంగా ఉందో చెప్పలేకపోతున్నాను. ఇప్పుడు నువ్వు వేరే ఇంట్లోకి అడుగు పెడుతున్నా మేమంతా నీ వెన్నంటే ఉంటాం. కానీ నిన్ను ఎంత మిస్ అవుతానో చెప్పడం నాకిష్టం లేదు. ఎందుకంటే అది తలుచుకుంటేనే కన్నీళ్లు జలధారలా కారడం ఖాయం. బెస్ట్ ఫ్రెండ్, బెస్ట్ సిస్టర్, బెస్ట్ డాటర్.. ఇలా అన్నీ ఉన్న నువ్వు దొరకడం నా అదృష్టం. నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తూనే ఉంటాను" అని ఎమోషనల్ అవుతూ వాళ్లిద్దరూ కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసింది. (చదవండి: నటిని పెళ్లాడబోతున్న దర్శకుడు) మరోవైపు సన్నిహితులు, స్నేహితుల కోసం రిసెప్షన్ ఏర్పాటు చేయగా టీవీ సెలబ్రిటీలతో పాటు సినిమా వాళ్లు కూడా హాజరై వధూవరును మనసారా ఆశీర్వదించారు. వీరిలో నటులు జగదీష్, మనియన్ పిల్ల రాజు, శ్రీకుమార్, దర్శకులు కమల్, షాజి కైలాస్ తదితరులు ఉన్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతుండగా అభిమానులు కొత్త జంటకు పెళ్లి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా సినీ దర్శకుడు మధుపాల్ - రేఖల మొదటి సంతానమే మాధవి. టీవీ యాంకర్‌గా ఆకట్టుకున్న ఆమె కాస్ట్యూమ్ డిజైనర్‌గానూ పని చేస్తున్నారు. (చదవండి: వైరల్: బుల్లితెర స్టార్లతో ప్రదీప్ డ్యాన్స్) View this post on Instagram A post shared by Meenakshi 💮 (@meenakshi_madhupal) -
యాంకర్లతో రాసలీలలు?
సాక్షి, మచిలీపట్నం: జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో హైటెక్ వ్యభిచారం చాపకింద నీరులా విస్తరిస్తోంది. హోటల్స్, అపార్టుమెంట్లు, నగర శివారుల్లోని ఇండిపెండెంట్ హౌస్‌లలో ఈ వ్యాపారం గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. వాట్సప్‌లలో అమ్మాయిల ఫొటోలు పంపడం.. నచ్చితే కోరుకున్న సమయానికి కోరుకున్న చోటకు వార్ని పంపిస్తూ రెండు చేతూలా ఆర్జిస్తున్నారు. గంటలు.. రోజుల తరబడి కూడా బుకింగ్‌లు జరుగుతున్నాయంటే ఏ స్థాయిలో ఇక్కడ వ్యభిచారం సాగుతుందో అర్థం చేసుకో వచ్చు. కొన్ని హోటల్స్ అందుకు కేంద్ర బిందువుగా మారుతున్నాయి. ముఖ్యంగా నగరం నడిబొడ్డులోని ఓ ప్రముఖ హోటల్లో దర్జాగా ఈ వ్యాపారం సాగుతోంది. అందుకోసం ఈ హోటల్లో కొన్ని రూమ్‌లను రిజిస్ట్రర్ చేయకుండా అన్‌రిజిస్ట్రర్ కోటాలో వదిలివేస్తారు. ఈ హోటల్లో ఐదారుగురు అమ్మాయిలు ఎప్పుడూ ఉంటారని, వారిని బుక్ చేసుకుంటే హోటల్లో రూమ్ కూడా ఫ్రీగా ఇస్తుంటారని వినికిడి. (జూబ్లీహిల్స్ వ్యభిచార గృహంపై దాడి) గంటకు రూ.3వేలు నుంచి.. గంటకు రూ.3వేల నుంచి 5వేలు, ఒక రాత్రికి రూ.5 నుంచి 10 వేల వరకు బుకింగ్‌లు జరుగుతున్నాయని సమాచారం. ఇక హౌసింగ్ బోర్డు కాలనీ, భాస్కరపురం తదితర ప్రాంతాల్లో కొన్ని అపార్టుమెంట్లలో అద్దెకు తీసుకున్న ప్లాట్లలో కూడా ఈ తరహా వ్యభిచారం సాగుతోందని చెబుతున్నారు. ఇక నగర శివారుల్లో ఇండిపెండెంట్ హౌసుల్లో కూడా ఈ తరహా వ్యభిచారం గుట్టుచప్పుడు కాకుండా సాగుతోందని తెలుస్తోంది. ఎక్కువగా 18 నుంచి 25 ఏళ్ల లోపు యువతులను విజయవాడ, గుడివాడ తదితర పట్టణాల నుంచి ఇక్కడకు తీసుకొచ్చి నగరంలో రుచిమరిగిన విటులకు వారి ఫొటోలను పంపి వారి కోరికలు తీరుస్తున్నారు. నగరంలో యువతనే టార్గెట్ చేస్తూ ఈ వ్యాపారం సాగిస్తున్నారు. లాక్‌డౌన్‌కు ముందు కంటే ఇప్పుడు ఎక్కువైందని చెబుతున్నారు. ఈ మధ్య ఓ చానల్లో పనిచేసే సిబ్బంది ఒకరు తన ఇంట్లోనే వ్యభిచారం చేయిస్తూ పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. యాంకర్లతో రాసలీలలు? టీవీల్లో చిన్న చితకా పాత్రల్లో నటించిన నటులు, యాంకర్లను బుక్ చేసుకుని నగరానికి తీసుకొచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. స్థానిక హోటల్స్‌లో వీరికి బస ఏర్పాటు చేసి తమకు కావాల్సినప్పుడు తమకు కావాల్సిన చోటకు తీసుకెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన బీచ్ ఫెస్టివల్స్‌లో నిర్వహించిన ఈవెంట్స్‌లో పాల్గొన్న యాంకర్లలో ఒకర్ని సంబరాల రాంబాబు ఇటీవలే నగరానికి తీసుకొచ్చి బస్టాండ్ సమీపంలోని ఓ హోటల్లో నాలుగురోజుల పాటు ఉంచి ఎంజాయి చేశారని విశ్వసనీయ సమాచారం. ఆ యాంకర్ ఉన్న మాట వాస్తవమేనని, రోజు ఎవరో కారులో వచ్చి ఆమెను తీసుకెళ్లే వారని వారెవరని తమకు తెలియదని ఆ హోటల్లో పనిచేసిన ఓ మాజీ ఉద్యోగి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. నగరంలో జరిగే ఈ హైటెక్ వ్యభిచారం కోసం స్థానిక పోలీస్ స్టేషన్లలో సమాచారం ఉన్న వారు తమకేమి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
యోగా వీడియోలో నగ్నంగా టీవీ యాంకర్!
న్యూయార్క్: ప్రముఖ టీవీ యాంకర్, న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యుమో తమ్ముడు క్రిస్ క్యూమోకు చేదు అనుభవం ఎదురైంది. తన భార్య సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన యోగా వీడియోలో అతను నగ్నంగా కనిపించాడు. న్యూయార్క్‌లోని హాంప్టన్ మాన్షన్ గార్డెన్లో క్రిస్ భార్య క్రిస్టినా గ్రీవెన్ క్యుమో యోగా చేస్తుంది. సరిగ్గా అదే సమయంలో క్రిస్ గార్డెన్‌లోకి నగ్నంగా వచ్చి అటువైపు తిరిగి నిలబడ్డాడు. దీన్ని గమనించని అతని భార్య ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో నేరుగా పోస్ట్ చేసింది. దీంతో ఒక్క క్షణం బిత్తరపోయిన నెటిజన్లు 'నగ్నంగా నిల్చుని ఉంది యాంకర్ క్రిస్ కదూ..' అంటూ అతడిని గుర్తుపట్టడం మొదలుపెట్టారు. (అధ్యక్షుడితో వీడియో కాన్ఫరెన్స్: నగ్నంగా ప్రత్యక్షం) వెంటనే నాలుక్కరుచుకున్న సదరు మహిళ ఆ వీడియోను డిలీట్ చేసింది. కానీ అప్పటికే ఆ వీడియోను స్క్రీన్షాట్లు తీసి పెట్టుకున్న నెటిజన్లు క్రిస్ ఫొటోలను తిరిగి పోస్ట్ చేయడంతో 49 ఏళ్ల యాంకర్ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఇదిలా వుండగా క్రిస్ క్యుమోకు మార్చి 31న కరోనా పాజిటివ్ అని తేలింది. లాక్డౌన్ పుణ్యాన గతంలోనూ ఇలాంటి వింత సంఘటనలు వెలుగుచూశాయి. ఓ రిపోర్టర్ హెయిర్ కట్స్ కోసం చెప్తుండగా ఆ వీడియోలో ఆమె భర్త బట్టలు లేకుండా ప్రత్యక్షమయ్యాడు. గత నెలలో బ్రెజిల్ అధ్యక్షుడు సహా పలు అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమవగా అందులో ఓ వ్యక్తి నగ్నంగా కనిపించాడు. దీంతో వెంటనే అతడిని సమావేశం నుంచి తొలగించారు. (పుట్టగానే ఆ బిడ్డ చేసిన పనికి డాక్టర్లే షాక్) -
టీవీ యాంకర్ అనుమానాస్పద మృతి
సాక్షి, హైదరాబాద్ : టీవీ యాంకర్, సీరియల్ నటి శాంతి( విశ్వశాంతి) అనుమానస్పదంగా మృతి చెందారు. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లారెడ్డి గూడ ఇంజనీర్స్ కాలనీలోని తన నివాసంలో గురువారం ఆమె శవమై కనిపించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆమె ఎలా చనిపోయిందనేదానిపై చుటుపక్కల వారిని విచారిస్తున్నారు. ఇంట్లో తనిఖీలు చేసి ఆమె ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. సీసీ పుటేజీలను పరిశీలించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించామని, నివేదిక ఆధారంగా విచారణ చేపడతామని పోలీసులు పేర్కొన్నారు. విశ్వశాంతి స్వస్థలం విశాఖ జిల్లా అని పోలీసులు తెలిపారు. -
బాలికలతో బాడీ మాసాజ్.. టీవీ యాంకర్‌పై కేసు
సాక్షి, కృష్ణా : ఇద్దరు బాలికలతో వెట్టిచాకిరి చేయించుకుంటున్న ఓ టీవీ యాంకర్‌పై శిశు సంక్షేమ కమిటీ ఫిర్యాదు మేరకు పోలీసులకు కేసు నమోదు చేశారు. శిశు సంక్షేమ కమిటీ తెలిపిన వివరాల ప్రకారం.. నూజివీడులోని చైల్డ్ కేర్‌లో చదువుకుంటున్న ఇద్దరు బాలికల్ని పండుగ సెలవుల పేరుతో తల్లి హైదరాబాద్ తీసుకెళ్లింది. దీనిలో భాగంగానే నగరంలోని ఓ టీవీ యాంకర్ ఇంట్లో బాలికల్ని పనికి కుదిర్చింది. అయితే సెలవులు ముగిసినప్పటికీ.. బాలికలు చైల్డ్ కేర్‌కి తిరిగిరాకపోవడంతో సీసీఐ అధికారులు మిస్సింగ్ కేసు పెట్టారు. అనంతరం బాలికల మిస్సింగ్‌పై దర్యాప్తు చేయగా.. హైదరాబాద్‌లో టీవీ యాంకర్ ఇంట్లో వెట్టిచాకరి చేస్తున్నట్టు శిశు సంక్షేమ కమిటీ గుర్తించింది. ఈ క్రమంలోనే ఇద్దరు బాలికల్ని కమిటీ సభ్యులు అదుపులోకి తీసుకుని విచారించగా పలు విషయాలు బయటపడ్డాయి. ఇంటి పనితో పాటు బాడీ మసాజ్ లాంటి పనులను సైతం వారితో చేయించుకుంటున్నట్లు బాలికలు తెలిపారు. దీంతో సీడబ్ల్యూసీ సభ్యుల ఫిర్యాదు మేరకు నూజివీడు పోలీసులు ఆ యాంకర్‌పై కేసు నమోదు చేశారు. మైనర్లని పనిలో పెట్టుకోవడం, వెట్టిచాకిరి చేయించుకోవడం చట్టరిత్యా నేరంమని వివిధ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు పిల్లల్ని తన ఇంట్లో పనికి పెట్టుకుని.. వివరాలు అడిగితే పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని సీడబ్ల్యూసీ అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారు. -
టీవీ యాంకర్ ఇంట్లో పేలిన కుక్కర్
సాక్షి, అన్నానగర్: చెన్నైలో టీవీ యాంకర్ ఇంట్లో కుక్కర్ పేలింది. ఆ సమయంలో పక్కన ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. టెలివిజన్‌లో సూపర్ హిట్స్ అనే కార్యక్రమానికి యాంకర్ చేసి ప్రసిద్ధి గాంచిన మణిమేఘలై 2017 నటన మాస్టర్ హుసైన్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వివాహం తర్వాత ఒంటరిగానే నివసిస్తూ వస్తోంది. ఈ స్థితిలో మణిమేఘలై ఇంట్లో వంట చేసేతను రాకపోవడం వల్ల కుక్కర్లో మణిమేఘలై వంట చేసింది. కుక్కర్ విజిల్ రాకుండా కొద్ది సేపటికే పేలిపోయింది. చెల్లాచెదురుకావడంతో వంట గది నాశనమైంది. దీనిని మణిమేఘలై ఫొటో తీసి తన ఇన్‌స్ట్రాగామ్‌లో విడుదల చేశారు. కుక్కర్ సమీపంలో ఎవరూ లేకపోవడం వల్ల పెనుప్రమాదం తప్పిందని పేర్కొన్నారు. చదవండి: ఆ ఎమ్మెల్యేల రహస్య భేటీల వెనుక ఆంతర్యమేమిటి? View this post on Instagram Ellam correcta panniyum indha cooker edhuku vedichuthu nu enaku ipo therinjaaganum ☝️ Enna paatha indha cooker ku epdi therithu 🤷♀️ namaku varadha oru vishayatha ini try eh panna kudathu 😕 Kitta nindrundha enna ayirukum 🤯 Athum ivlo kashtathula help pannama video edukara indha Hussain maari aala vachutu onnum panna mudiyathu 🚶♀️ Atleast 1 year ku cooking pakkam pogavey kudathu 🐒 Veedu fulla clean panra kashtam kuda paravaala 🙃 without makeup la indha hussain paiya video record pannadhudhan manavaruthama iruku 😛 @mehussain_7 A post shared by Mani Megalai (@iammanimegalai) on Feb 18, 2020 at 3:57am PST -
టీవీ యాంకర్ అనుమానాస్పద మృతి
తిరువనంతపురం : ప్రముఖ మలయాళ టీవీ యాంకర్, సెలబ్రిటీ చెఫ్ జాగీ జాన్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. కురవాన్ కోణంలోని తన నివాసంలో ఆమె శవమై కనిపించారు. సోమవారం జాగీ ఇంటికి వచ్చిన ఆమె స్నేహితులు ఈ విషయాన్ని పోలీసులు తెలిపారు. దీంతో ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. జాగీ మృతదేహాంపై ఎటువంటి గాయాలు లేవని తెలిపిన పోలీసులు.. అనమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నట్టు వెల్లడించారు. ‘జాగీ తన తల్లితో కలిసి నివాసం ఉంటున్నారు. జాగీ మృతిచెందిన సమయంలో ఆమె తల్లి ఇంట్లోనే ఉన్నారు. అయితే ఆమె తల్లి మానసిక పరిస్థితి బాగా లేకపోవడంతో.. జాగీ ఎలా మృతి చెందారనే అంశంపై సరైన సమాచారం రాబట్టలేకపోయామ’ని పోలీసులు తెలిపారు. కాగా, 38 ఏళ్ల జాగీ ఓ టీవీ చానల్లో వంటల పోగ్రామ్ నిర్వహిస్తున్నారు. బ్యూటీ షోలకు ఆమె జడ్జిగా వ్యవహరిస్తున్నారు. అలాగే ఆమె గాయనిగా, మంచి వక్తగా గుర్తింపు పొందారు. -
సత్తుపల్లి: తెలంగాణ యాసతో మంగ్లీ
సాక్షి, సత్తుపల్లిటౌన్/సత్తుపల్లిరూరల్: రేలా.. రేలా.. రేలారే.. తెలంగాణ, ఉస్మానియా యూనివర్సిటీలో ఉదయించిన కిరణమా.. ఇలా పాటలు ఆలపిస్తూ తెలంగాణ యాసతో టీవీ యాంకర్ మంగ్లీ ఉర్రూతలూగించారు. సత్తుపల్లి జేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభకు ముందుగా యాంకరింగ్ చేయాల్సి ఉంది. కాని ట్రాఫిక్ జామ్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించిన అనంతరం తళుక్కుమని స్టేజీ ఎక్కి.. అందరిని హలో.. హలో.. అక్కలు.. తమ్ముళ్లు.. అన్నలు.. సారీ.. లేటైంది.. అంటూ పలకరించారు. తెలంగాణ యాసతో అలరించింది. ఇంతలోనే జనం చేరుకోవటం.. స్టేజీ పైన కూడా నిండిపోవటంతో అసహనానికి లోనైంది. అనంతం పట్టణంలో టీఆర్ఎస్ అభ్యర్థి పిడమర్తి రవితో కలిసి ప్రచారం చేశారు. -
28 నుంచి బుల్లితెరపై..
సినిమా: ఈ నెల 28 నుంచి శ్రుతిహాసన్ బుల్లితెర ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించడానికి రెడీ అవుతోంది. ఆమె తండ్రి కమలహాసన్ బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో అంటూ బుల్లితెర ప్రేక్షకులను టీవీల ముందు కట్టిపడేస్తే, తాజాగా ఆయన తనయ శ్రుతిహాసన్ హలో సాగో అంటూ బుల్లితెర ప్రేక్షకల ముందుకు రాబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఓటీటీ వీడియో సేవలందిస్తున్న వైవ్ సంస్థ, మోషన్ కంటెంట్ గ్రూప్‌తో కలిసి వైవ్ హలో సాగో పేరుతో చర్చావేదిక కార్యక్రమాన్ని రూపొందిస్తోంది. ఈ కార్యక్రమానికి సంచలన నటి శ్రుతిహాసన్ వ్యాఖ్యాతగా వ్వవహరిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమం తెలుగులో నంబర్‌ఒన్ యారీ పేరుతో ప్రసారం అవుతోంది. దానికి నటుడు రానా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటీనటుల వ్యక్తిగత విషయాలను వెల్లడించి ప్రేక్షకుల ముందు తమ మరో కోణాన్ని ఆవిష్కరిస్తారని నిర్వాహకులు తెలిపారు. తారలు తమ నిజ జీవితాల్లోని రహస్యాలను ప్రేక్షకులతో పంచుకుంటారని చెప్పారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నటి శ్రుతిహాసన్ ఈ సందర్భంగా స్పందిస్తూ సాధారణంగా ఎంటర్టెయిన్మెంట్ రంగానికి చెందిన వారు వారి అంతరంగ విషయాల గురించి బయట ప్రపంచానికి చెప్పుకోవడానికి ఇష్టపడరన్నారు. అయితే ఈ వైవ్ హలో సాగో కార్యక్రమం ద్వారా ప్రేక్షకులు తారల మరో ముఖాన్ని చూడగలరని చెప్పారు. తారలు నిజాయితీగా చెప్పే విషయాలు, వారి అందమైన జీవిత పయనాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో తానూ ఒక భాగం కావడం సంతోషంగా ఉందని అన్నారు. కాగా 13 ఎపిసోడ్స్‌తో కూడిన ఈ కార్యక్రమం ఈ నెల 28 నుంచి ఆదివారం రాత్రి 8.30 గంటలకు వైవ్ యాప్‌తో పాటు సన్ టీవీలోనూ ఏకకాలంలో ప్రసారం అవుతుందని నిర్వాహకులు వెల్లడించారు.