vijaya kumar
-
నెల్లూరు జిల్లా మినహా.. 'పునర్విభజన' అభ్యంతరాల స్వీకరణ పూర్తి
సాక్షి, విశాఖపట్నం: పునర్విభజనకు సంబంధించి నెల్లూరు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియను పూర్తిచేశామని జిల్లాల పునర్విభజన కమిటీ చైర్మన్, రాష్ట్ర ప్రణాళిక విభాగం కార్యదర్శి విజయకుమార్ తెలిపారు. మార్చి 3న ఈ ప్రక్రియ మొత్తాన్ని పూర్తిచేసి అదే రోజు మొత్తం నివేదికను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. విశాఖ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరితో కలిపి నాలుగు జిల్లాల నుంచి వచ్చిన అభ్యంతరాలు, సూచనలు, సలహాలను ఆయన పరిశీలించారు. ఈ జిల్లాల కలెక్టర్లతో పాటు రాష్ట్ర సర్వే, సెటిల్మెంట్ అండ్ రికార్డ్స్ కమిషనర్ సిద్ధార్ధ్ జైన్‌తో కలిసి వాటిని స్క్రూటినీ చేశారు. అనంతరం విజయకుమార్ మీడియాతో మాట్లాడారు. ప్రజల ఆకాంక్షలు, అభీష్టం మేరకే జిల్లాల విభజన ప్రక్రియ శాస్త్రీయంగా జరుగుతోందని స్పష్టంచేశారు. ఈ ప్రక్రియ తర్వాత రాష్ట్రంలో ప్రతీ జిల్లాలో సగటున 18 నుంచి 20 లక్షల జనాభా ఉంటుందన్నారు. దీంతో పరిపాలన సౌలభ్యం కలగడంతోపాటు మారుమూల గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి జిల్లాల ప్రజల నుంచి వచ్చిన సూచనలు, సలహాలు, అభ్యంతరాలపై చర్చించామని ఆయన చెప్పారు. వీటి నుంచి మొత్తం 4,590 అభ్యంతరాలు వచ్చాయని, వాటిలో ఒక్క శ్రీకాకుళం జిల్లా నుంచే 4,000 వచ్చాయన్నారు. విజయనగరం 40, విశాఖపట్నం 250, తూర్పు గోదావరి జిల్లా నుంచి 300 అభ్యంతరాలు వచ్చాయని విజయకుమార్ చెప్పారు. ఇక కొత్తగా ఏర్పడనున్న జిల్లాల్లో 90 శాతం కార్యాలయాలను ప్రభుత్వ భవనాల్లోనే ఏర్పాటుచేసేలా చర్యలు చేపడుతున్నామని.. అవిలేని చోట ప్రైవేట్ భవనాల్లో ఏర్పాటుచేస్తామని ఆయన తెలిపారు. నాలుగు జిల్లాల్లో ప్రధాన అభ్యంతరాలివే.. ఇక ఈ 4 జిల్లాల్లో గుర్తించిన ప్రధాన అభ్యంతరాలను విజయకుమార్ వివరించారు. అవేమిటంటే.. ► తూర్పు గోదావరి జిల్లాలో రంపచోడవరం నియోజకవర్గాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లాలో కాకుండా రాజమండ్రి జిల్లాలోనే చేర్చాలి. ► అమలాపురం జిల్లాలో ఉండే మండపేట, జగ్గంపేట నియోజకవర్గంలో గోకవరం మండలాన్ని రాజమండ్రిలోనే కొనసాగించాలి. ► అలాగే, విజయనగరం జిల్లాలో ఉన్న ఎస్.కోట నియోజకవర్గాన్ని విశాఖలో కలపాలి. ► పార్వతీపురం పేరును జిల్లాగా ఉంచాలి. ► పెందుర్తి నియోజకవర్గాన్ని విశాఖలో కలపాలి. ► అనకాపల్లి జిల్లాకు నర్సీపట్నం కేంద్రం చేయాలి. ఈ కార్యక్రమంలో నాలుగు జిల్లాల కలెక్టర్లు డాక్టర్ మల్లికార్జున, సి. హరికిరణ్, ఎ. సూర్యకుమారి, శ్రీకేష్ లాఠకర్‌లు పాల్గొన్నారు. జనగణనకు ఇబ్బంది ఉండదు 2020–21లో జరగాల్సిన జనగణన కరోనా కారణంగా జరగలేదని విజయకుమార్ తెలిపారు. కేంద్రం ఇచ్చిన నివేదిక ఆధారంగా జూన్ నెలాఖరు నాటికి జిల్లా సరిహద్దులను మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చని చెప్పారని.. కానీ, అంతకన్నా ముందే ఏప్రిల్ 2 నాటికే ఏపీలో జిల్లాల పునర్విభజన పూర్తికానుందన్నారు. కాబట్టి జనగణనకు ఎలాంటి ఇబ్బంది కలగదన్నారు. -
కథ: అమ్మమ్మని పంపించెయ్యాలి!
శేఖరం మావగారు వుత్తరం రాశారు. ‘అమ్మాయి పురుడోసుకుని ఇంటికొచ్చేసిందన్నమాట. సంతోషం. ఇంతకీ పాపెవరి పోలికో. రెండో కాన్పు కదా, పెద్దాడితో పాటు, చంటిదాన్ని చూసుకోడం కష్టమేనోయ్. రేపు దశమినాడు సర్కారుకి బయల్దేరుతుంది మీ అత్తగారు. స్టేషన్లో దింపుకో. కొన్నాళ్ళు సాయం మీకు. పొలం పనులు అవీ అయాక మనవరాలిని చూడ్డానికొస్తాను’ చదువుకొని ‘అమ్మయ్యా’ అనుకుంటూ భార్యా భర్తలిద్దరూ అప్పుడే బరువు తీరినట్టు నిట్టూర్చారు. ‘ఒరేయ్ సుబ్బిగా, రేపు అమ్మమ్మోస్తోందిరా ’ ఆరేళ్ళ సుబ్బిగాడు అమ్మ మాటలకి తెగ సంతోష పడిపోయాడు. వాడికి అమ్మమ్మంటే మహాయిష్టం. సెలవల్లో అమ్మమ్మ ఎంతమంచిదో. ఊరెళ్తే ఒళ్ళో కూర్చోపెట్టుకుని బుగ్గలు నిముర్తుంది. తాతయ్య పోలికే అంటూ. ‘పోలికంటే..’ సుబ్బిగాడికి తెలీదు. అలా ఒళ్ళో కూర్చోబెట్టుకొని ముద్దులిచ్చే అమ్మమ్మ బాగుంటుంది. వెధవకి రేపు తెల్లారేదేమో! ∙∙ అమ్మమ్మ రైలు దిగింది. నాన్న బెడ్డింగు దింపాడు. ‘ఆరి భడవా నువ్వూ వచ్చావ్..!’ సుబ్బిగాడి తల నిమిరింది అమ్మమ్మ. రిక్షాలో అమ్మమ్మతో మాటలే మాటలు.. ‘అమ్మమ్మా, మాయింట్లో ఓ చెల్లాయుంది. చూపిస్తా రా. అదెప్పుడూ నిద్దరే అమ్మమ్మా..’ అంటూ! ∙∙ అమ్మమ్మ యింట్లోకి రావడం, గబగబా స్నానం చేసేయడం, కాఫీ కూడా తాగకుండా చంటిదాన్ని ఎత్తేసుకోడం.. ‘చిన్నది ఎంత బావుందో’ అంటూ! అమ్మమ్మ ముద్దులు దానికెళిపోతున్నాయ్. వాడికి లేకుండా ఎక్కడైపోతాయో అని భయం సుబ్బిగాడికి. ’అమ్మమ్మా.. ’ చెయ్యి పట్టుకు లాగబోతే, ‘అబ్బా ఉండొరేయ్..’ అమ్మమ్మ. లెఖ్ఖ చెయ్యదే ! ∙∙ ‘లక్ష్మీ మీరు భోంచెయ్యండి తాపీగా! నేను చంటిదాని దగ్గర ఉంటాను. నాకిప్పుడు ఆకల్లేదు. తరవాత తింటాలేవే!’ అమ్మమ్మ. చంటిది ఏడుస్తుంటే అమ్మమ్మే అన్నీను. అసలు అమ్మనే దగ్గరికి రానివ్వట్లే! పాలకి తప్ప! సుబ్బిగాడికంతా కొత్తే మరి. ఆ రాత్రి అమ్మమ్మ పక్కలోకి దూరాడా.. చెల్లాయ్ కుయ్ మన్నా కయ్ మన్నా ముసలమ్మ లేచిపోవడం.. ‘హాయి రావే హాయి.. ఆపదలు గాయీ’ అంటూ జోకొట్టేడం! యెక్కడా, మనవడిని సరిగ్గా పట్టించుకోదే! చదవండి: Wonder of Science: బాప్రే.. ఒక్క చెట్టుకే 40 రకాల పండ్లా..!! ∙∙ సుబ్బిగాడు లేచేసరికి అమ్మమ్మ కనపడలేదు. బాత్రుంలోంచి చెల్లాయ్ యేడుపూ, వెళ్లిచూస్తే ఇంకేముంది.. అమ్మమ్మ పీట మీద కూర్చుని, కాళ్ళ మధ్య చెల్లాయిని పడుకోపెట్టేసింది. ఒళ్ళంతా యేదో రాసేసి, కాళ్ళూ చేతులూ కొట్టుకుంటున్నా వినకుండా వేడి వేడి నీళ్లు పోసేయడమే! ఎప్పుడూ చూడని సుబ్బిగాడికి భయం వెయ్యదూ! వాడు చూసిందల్లా.. అమ్మ పాపని టబ్బులో కూర్చోపెట్టి, చక్కగా నీళ్లతో తుడిచేది, యిలా ఎప్పుడూ ఏడిపించలేదు. ‘అమ్మా.. చూడు.. అమ్మమ్మ చెల్లాయిని ఏడిపింస్తోది వేన్నీళ్ళు పోసేసి..’ అమ్మకి వంటింట్లో కాఫీలు కలపడమే పని! ‘నీళ్లు పోస్తోంది.. ఏంకాదులేరా’ నవ్వుతోంది పైపెచ్చు. సుబ్బిగాడికిదేం నచ్చలేదు ∙∙ ‘మాచమ్మా.. ఎప్పుడొచ్చావ్?’ పక్కింటి పిన్నిగారు పిలవకుండానే వచ్చేస్తుంది. నిద్ర పోతున్నా చెల్లాయిని లేపేసి, ఏడిపించీడమే! తాను ఎత్తుకుంటానంటే ఒప్పుకోదు.. ‘వెధవయ్యా పడేస్తావ్, మట్టి చేతులూ నువ్వునూ’ అంటుంది. ఎప్పుడో ఎవరూ చూడకుండా ఎత్తేసుకోవాలి ‘అన్నట్టు మాచమ్మా, సుబ్బిగాడు.. చంటిదాని కాళ్ళావేళ్ళా పడిపోడమేనేవ్! వాళ్ళమ్మని యేపనీ చెయ్యనీయడే వీడు చూశావా!’ ‘సుబ్బాయిని ఇక్కడుంచేసి, చంటిదాన్ని మీ ఊరు తీసుకుపోతావేంటి!’ ఉలిక్కిపడ్డాడు సుబ్బిగాడు. ఇదా వీళ్ళ ప్లాను, అమ్మమ్మ ఇందుకా వచ్చింది? పాపం నాన్నకి తెలీక స్టేషన్ నుంచి అమ్మమ్మని ఇంటికి తెచ్చేశాడు.. నాన్నొస్తే చెప్పాలి!’ ∙∙ అమ్మమ్మ తెచ్చిన చేగోడీలు కరకరలాడుతున్నాయ్. ఉయ్యాల్లో చెల్లాయ్ ‘ఊ.. ఊ’ అంటోంది. పాపం దానికెవరు పెడతారు? చిన్నముక్క నోట్లో పెడితే సంతోషిస్తుంది. సుబ్బిగాడు.. అలా ముక్కవిరవడం, చెల్లాయ్ దగ్గరికెళ్ళడం.. ‘ఇందా తింటావా’ అంటూ.. ఎక్కడనించి వచ్చిందో అమ్మమ్మ.. సుడిగాలిలా, ‘ఒరే ఒరే’ అంటూ ఠక్కుమని లాగేసుకుంది. ‘చిన్న వెధవ..∙వీడితో ప్రమాదమే సుమీ.. ఇద్దరినీ కనిపెట్టుకునుండాలి!’ మొదటిసారి సుబ్బిగాడు కోపంగా చూశాడు అమ్మమ్మని! ∙∙ ‘నాన్నా..ఇవాళేం, పక్కింటి పిన్నిగారూ..’ అంటూ జరిగిందంతా చెప్పేశాడు సుబ్బయ్య రహస్యంగా చెవులో. కష్టపడి చెబితే, నాన్న నవ్వడం.. ‘అత్తయ్యగారూ విన్నారా..’ అంటూ అంతా చెప్పేశాడు కదా. ఇంకా అంటాడూ, ‘మీరు చంటిదాన్ని పట్టుకెళ్ళకండీ ’ అమ్మమ్మ నవ్వింది.. ‘అంతా వాడిష్టమే! మీరు కావాలంటే ఇంకో పిల్లని తెచ్చుకోండి. అక్కడ తాతయ్యకి కూడా దీంతో తోస్తుంది. సమయానికి గ్యాపకం చేశావ్!’ సుబ్బాయ్‌కి ఏం అర్థం కావట్లేదు. ‘అమ్మమ్మా, పాపాయికి రైల్లో టికెట్టుకొనాలి తెల్సా?’ వాడి ధీమా నాన్న కొనడని. అమ్మ నవ్వుతూ, సుబ్బాయ్ని దగ్గరకి తీసుకుంది.. ‘మన అమ్మమ్మే కదరా, వాళ్ళింట్లో పిల్లల్లేరుగా!’ ∙∙ ‘అన్నట్టు పాపాయికి ఎంపేరు పెడతావు లక్ష్మీ...?’ అందరూ ఉండగా అడిగింది అమ్మమ్మ. ‘మీ అత్తగారి పేరా? ఆడపడుచు పేరా?’ ‘అలాటి ఆనవాయితీ అయితే లేదులే అమ్మా. మీ అల్లుడు ‘నిష్క’ అని అంటారు, నేనేమో ‘కృతి’ అనుకుంటున్నా’ అంది అమ్మ. సుబ్బాయ్‌కి సలహా ఇవ్వాలనిపించింది. రోజూ కథలు చెబుతూ బడికి తీసుకెళ్లే వెంకాయమ్మ అంటే మనవాడికిష్టం. వెంకాయమ్మ ఎవరూ చూడకండా పుల్లైస్ కొనిపెడుతుంది మరి. ‘అమ్మమ్మా.. నే చెప్పనా?’ ఉత్సహంగా సుబ్బిగాడు. ‘వెంకాయమ్మ పేరు బెస్టు కదా!’ ‘ఏడిశావ్ బోడి వెధవా.. కావాలంటే నీ పిల్లకి వెంకాయమ్మా అని పెట్టుకుంటావో, పిచ్చమ్మా అనిపెట్టు కుంటావో నీఇష్టం!’ అమ్మమ్మ మాటలకి పిన్నిగారూ, నాన్నా అంతా నవ్వడమే. ‘లక్ష్మీ.. ఇంకో కూతుర్ని కనవే, నీ కొడుకు కోరిక తీర్చు’ అంది. సుబ్బిగాడు బుంగమూతి పెట్టాడని చెప్పాలా ఇంకా. ∙∙ సుబ్బాయ్‌కి అమ్మమ్మ ముచ్చట దాదాపు తీరిపోయింది. అమ్మమ్మ వచ్చిందగ్గర నుంచీ ఇదే వరుస. వేన్నీళ్లు పోసి పొద్దున్నే చెల్లాయిని ఏడిపించేడం, కంట్లో వేలు పెట్టి యేదో నల్లగా రాసీడం, పాపం కుంపటి కింద పొగపెట్టడం, ఎత్తుకుంటాను మొర్రో అంటే పడేస్తావ్ దూరం నుంచి ఆడించారా..అని కేకలేయడం.. పాపం, చెల్లాయ్ పుట్టేవరకు అమ్మమ్మ మంచిదే. అయితే ఇప్పుడు మారిపోయింది. చెల్లాయ్ని ఊరికి తీసుకుపోతుందేమో! ఆఖరికి వెంకాయమ్మా అని కూడా పిలవకూడదట. ఒక్కటే మార్గం తోచింది వాడి బుల్లి బుర్రకి. రాత్రి.. మెల్లిగా నాన్న దగ్గరకు చేరాడు. ‘నాన్నా .. ’ ‘ఎట్రా సుబ్బుడూ’ ‘అమ్మమ్మని పంపించేద్దాం నాన్నా.. ఎప్పుడూ చెల్లినొదలట్లేదు. మనం పడుకున్నాక మెల్లిగా ఊరికి పట్టుకుపోతుందేమో!’ ‘ఎలారా.. నేను టికెట్టు కొనాలిగా! పర్వాలేదు పడుకో. మన అమ్మమ్మ మంచిదిరా!’ ‘పక్కింటి పిన్నిగారు కొంటుందేమో నాన్నా టికెట్టు!’ ‘ఆవిడ దగ్గర డబ్బులెక్కడివిరా? పోయి అమ్మమ్మ దగ్గరే పడుకో గట్టిగా పట్టుకుని!’ సుబ్బాయ్ గొణుగుతూ, మళ్ళి అమ్మమ్మ పక్కకే చేరాడు. అమ్మమ్మ సుబ్బాయ్ని దగ్గరకి తీసుకుంది ప్రేమగా. సుబ్బాయ్‌కి నిద్దట్లో కల.. రైలొచ్చేసింది. అమ్మా, నాన్నా.. అమ్మమ్మని రైలెక్కించేసున్నారు.. రైలు కూత కూ.. ‘అమ్మమ్మా.. నువ్వెళ్ళకమ్మమ్మా.. వెళ్ళకు.. నేనూ నీతో వస్తా..’ ‘వెధవకి కలవరింతలు కూడాను. ఎక్కడికి వెళ్లనోరెయ్! బజ్జో..’ అమ్మమ్మ మరింత దగ్గరకు తీసుకుంది. అమ్మమ్మ పక్కలో వెచ్చగా, భద్రంగా సుబ్బిగాడు! - వల్లూరి విజయకుమార్ చదవండి: రెస్టారెంట్ విచిత్ర షరతు.. ఫైర్ అవుతున్న నెటిజన్లు! -
ప్రతి యూనివర్సిటీ ఓ స్టార్టప్ హబ్!
-
ప్రతి యూనివర్సిటీ ఓ స్టార్టప్ హబ్!
- సృజనాత్మక పరిశోధనలకు ప్రాధాన్యమిస్తామన్న కేంద్రం - పరిశ్రమలతో లింకేజీపై కసరత్తు చేయాలని యూనివర్సిటీలకు ఆదేశం సాక్షి, హైదరాబాద్: దేశంలోని ప్రతి యూనివర్సిటీ కూడా ఓ స్టార్టప్, ఇన్నోవేషన్ హబ్‌గా మారేందుకు సిద్ధం కావాలని కేంద్ర మానవ వనరుల శాఖ ఆదేశించింది. యూనివర్సిటీలు పరిశోధనలకు ప్రాధాన్యమివ్వడంతోపాటు పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా కోర్సులు ప్రవేశపెట్టాలని సూచిం చింది. పారిశ్రామిక సమస్యలకు పరిష్కారాలు కనుగొనేలా, ఉత్తమ ఉత్పత్తులకు తోడ్పడేలా పరిశోధనలు చేపట్టాలని స్పష్టం చేసింది. ఇందుకోసం పరిశ్రమలతో యూనివర్సిటీలను అనుసంధానం చేయడం (లింకేజీ) వంటి చర్యలు చేపట్టాలని.. అలాంటి యూనివర్సిటీలకు రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (రూసా) కింద నిధులు ఇస్తామని తెలిపింది. రూసాలోని ‘రీసెర్చ్ ఇన్నోవేషన్ అండ్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్, మేనేజ్మెంట్ మానిటరింగ్ ఎవాల్యుయేషన్ అండ్ రీసెర్చ్’ కింద ఒక్కో రాష్ట్రానికి రూ.120 కోట్లు ఇస్తామని పేర్కొంది. కానీ ఈ కేటగిరీ కింద మన రాష్ట్రం నుంచి రూసాకు ఒక్క ప్రతిపాదన కూడా అందలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని యూనివర్సిటీలు ఆ దిశగా కృషి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. అన్ని వర్సిటీలకు ఆదేశాలు ఈనెల 21న ఢిల్లీలో రూసా నేషనల్ మిషన్ డైరెక్టర్ (ఎన్ఎండీ) సమావేశం జరిగింది. దానికి రాష్ట్రం నుంచి కళాశాల విద్య కమిషనర్, ఉన్నత విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి విజయ్‌కుమార్ హాజరయ్యారు. ఈ సమావేశంలో మహారాష్ట్ర, ఏపీ, తమిళనాడు, గుజరాత్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల అధికారులు స్టార్టప్స్ అండ్ ఇన్నోవేషన్ హబ్ కింద తమ ప్రతిపాదనలు అందజేశారు కూడా. అయితే తెలంగాణ నుంచి కూడా అలాంటి ప్రతిపాదనలను అందజేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు విజయ్‌కుమార్ వెల్లడించారు. పరిశోధనలకు ప్రాధాన్యమివ్వడం ద్వారా వర్సిటీలకు కొత్త రూపు రావడంతోపాటు, పరిశ్రమలతో లింకేజీతో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ దిశగా కృషి చేయాలని రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు రూసా కింద ప్రతి రాష్ట్రంలో 8 నుంచి 10 ప్రాజెక్టులను ఈనెల 28లోగా ప్రారంభించేందుకు ప్రతిపాదనలు అందజేయాలని ఎన్ఎండీ స్పష్టం చేసింది. ఇక రూసా నిధులు ఇవ్వాలంటే యూనివర్సిటీలు, కాలేజీలకు న్యాక్ ఎ లేదా బి అక్రిడిటేషన్ ఉండాలి. దీంతో న్యాక్ అక్రిడిటేషన్ పొందేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని యూనివర్సిటీలను ఉన్నత విద్యాశాఖ ఆదేశించింది. -
సుష్మాజీ! నాకూ పాస్‌పోర్టు ఇప్పించండి ప్లీజ్!
న్యూఢిల్లీ: ఐపీఎల్ ఫిక్సింగ్ కుంభకోణంలో దేశం విడిచి పారిపోయిన లలిత్ మోదీకి బ్రిటన్ ప్రభుత్వం నుంచి ట్రావెల్ డాక్యుమెంట్లను ఇప్పించడంలో మానవతా హృదయంతో సహాయం చేసిన కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, తన పాస్‌పోర్టును పునరుద్ధరించడంలో కూడా అదే మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కూడంకుళం అణు విద్యుత్ వ్యతిరేక ఆందోళనకారుడు ఎస్పీ విజయ్‌కుమార్ వేడుకుంటున్నారు. ఈ మేరకు సుష్మను ఉద్దేశించిన ఆయన రాసిన లేఖను ఆయన తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు. ‘సుష్మాజీ! అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాల్లో పని చేస్తూ జీవిస్తున్న నేను 2011లో తమిళనాడుకు వచ్చి కూడంకుళం వచ్చి అణు విద్యుత్ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నాను. నాతోపాటు 500 మందిపై తమిళనాడు ప్రభుత్వం కేసులు పెట్టింది. నాతోపాటు వారందరిని పాస్‌పోర్టులను భారత ప్రభుత్వం రద్దు చేసింది. కూడంకుళం పనులను జయలలిత నిలిపివేయడంతో మా ఉద్యమం కూడా నిలిచిపోయింది. అప్పటి నుంచి మాపై కేసులు ఎత్తివేయలేదు. అలాగని విచారణ జరపడం లేదు. మా పాస్‌పోర్టులూ పునరుద్ధరించలేదు. నేను ఇప్పుడు అమెరికా వెళ్లి నా ఆకాడమిక్ కెరీర్‌ను మళ్లీ ప్రారంభించాలనుకుంటున్నాను. నేను వృద్ధాప్యంతో బాధ పడుతున్న తల్లిదండ్రులను, భార్య, ఇద్దరు పిల్లలను పోషించాల్సిన బాధ్యత నామీద ఉంది. మోదీపై చూపినంత మానవతా దృక్పథమంతా కాకపోయినా, కాస్త కరుణతోనైనా నా పాస్‌పోర్టును పునరుద్ధరించండి. ప్లీజ్!’ అని ఆ లేఖలో విజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. అమెరికాలోని హవాయ్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్‌లో పీహెచ్డీ చేసిన ఆయన అమెరికాలో టీచింగ్ కెరీర్‌ను వదిలేసుకొని ఉద్యమం కోసమే భారత్ వచ్చారు. 2011 నుంచి ఆయనే తమిళనాడులో అణు వ్యతిరేక ఉద్యమానికి కోఆర్డినేటర్‌గా పనిచేస్తూ వచ్చారు. ఆ ఉద్యమం కారణంగానే అదే ఏడాది కూడంకుళం ప్లాంట్ నిర్మాణం ఆగిపోయింది. ఉద్యమం కూడా చల్లబడింది. 2012లో మళ్లీ ఆ ప్లాంట్‌లోని ఓ యూనిట్ నిర్మాణం ప్రారంభమైంది. ఉద్యమాన్ని తిరిగి ప్రారంభించిన అది ముందున్నంత ఉధృతంగా సాగలేదు. ఫలితంగా కూడంకుళంలోని తొలి విద్యుత్ యూనిట్ ఉత్పత్తి కూడా ప్రారంభమైంది. ఈలోగా బ్రిటన్‌లో తలదాచుకున్న లలిత్ మోదీకి పోర్చుగల్ వెళ్లేందుకు మానవతా హృదయంతో సుష్మా స్వరాజ్ సహాయం చేశారని తెలిసి ఆయన సుష్మ పేరిట ఫేస్బుక్ పేజీలో లేఖ రాశారు. నిజంగా ఆయన అమెరికా పోవాలని కోరుకుంటున్నారా లేక కేంద్ర రాజకీయలను దృష్టిలో ఉంచుకొని వ్యూహాత్మకంగా ఈ లేఖ రాశారా ? అన్నది స్పష్టం కావడం లేదు. -
మా ఇసుకతో మీ వ్యాపారమా?
మోటుమాల (కొత్తపట్నం): మండలంలో ఇసుక రీచ్‌లు వివాదంగా మారుతున్నాయి. తీర ప్రాంతంలో ఇసుక తవ్వకంలో ఐదు గ్రామాలకు ముప్పు పొంచి ఉందని కొద్దికాలంగా ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. వారి ఆందోళనను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం ఆదాయం కోసం ఇసుక రీచ్‌ను ఏర్పాటు చేయాలని భావించడంపై ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో మండలంలోని మోటుమాలలో ఇసుక రీచ్‌ను కలెక్టర్ విజయకుమార్, స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ శనివారం ప్రారంభించారు. ఇసుక తవ్వకంతో ఐదు గ్రామాలకు ముప్పు ఉందని కలెక్టర్‌కు అర్జీలు ఇచ్చేందుకు ఆ ప్రాంత గ్రామాల ప్రజలు తరలి వచ్చారు. కలెక్టర్‌ను కలవనీయకుండా ప్రజలను పోలీసులు అడ్డుకున్నారు. ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలు పోలీసులకు జత కలిశారు. అర్జీలిచ్చేందుకు వెళ్తుంటే పోలీసులు ప్రజలను నెట్టి బయటకు పంపారు. దీనికి ముందు మహిళలు, గ్రామస్తులు ఎవరూ సభకు రావొద్దని ఎస్సై బి.నరసింహారావు హెచ్చరించారు. ఒకరినో, ఇద్దరినో అనుమతిస్తానని చెప్పారు. దీంతో వారికి కలెక్టర్‌ను కలిసే అవకాశం లేకుండా పోయింది. కలెక్టర్ రీచ్‌ను ప్రారంభించి వెళ్లిన తర్వాత ఇసుక లోడ్ చేసిన ట్రాక్టర్‌ను అడ్డుకుని స్థానిక మహిళలు దాని డోర్లు ఊడదీసి ఇసుకను పారబోసారు. ఈ సందర్భంగా మోటుమాల సర్పంచ్ పురిణి బ్రహ్మారెడ్డి, మోటుమాల ఎంపీటీసీ కోడూరి సులోచన మాట్లాడుతూ 1996కు ముందు పాదర్తి, మోటుమాల గ్రామాలు ఒకే పంచాయతీలో కొనసాగాయని, 1996 తర్వాత సర్వే నం.465లో 115 ఎకరాలు మోటుమాల పంచాయతీకి అప్పటి కలెక్టర్ శర్మ అప్పగించారని వివరించారు. రహస్యంగా ఐకేపీ అధికారుల కమిటీ రహస్యంగా అధికార పార్టీ అండతో పాదర్తి గ్రూపు సంఘాలతో కమిటీ వేశారని ప్రజలు వాపోతున్నారు. పాదర్తి గ్రామానికి 26 గ్రూపులు, మోటుమాల 68 గ్రూపులున్నాయి. ఈ భూమి 1996లో అప్పటి కలెక్టర్ శర్మ మోటుమాలకు ఇచ్చినట్లు ఉత్తర్వులన్నాయి. తమ గ్రామాన్ని పక్కనబెట్టి పాదర్తికి అనుమతి ఇవ్వడం ఎంత వరకు సమంజసమని డీఆర్డీఏ పీడీని మహిళలు ప్రశ్నించారు. తవ్వకాలు ఆపకుంటే ట్రాక్టర్లను అడ్డుకుంటామని గ్రామస్తులు, మహిళలు హెచ్చరించారు. -
హీరో, హీరోయిన్ లేని సినిమా
హీరో హీరోయిన్లు లేకుండా తెరకెక్కిన చిత్రాలు అరుదే. అలాంటి కోవలో పాది ఉనక్కు పాది ఎనక్కు చిత్రం చేరనుంది. ఈ చిత్రంలో హీరో హీరోయిన్లే కాదు ప్రేమ సన్నివేశాలు ఉండవంటున్నారు ఆ చిత్ర దర్శకుడు ఎంఏ విజయకుమార్. లైట్‌బాక్స్ ప్రొడక్షన్స్, ప్రియా మినీ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం నటుడు ఆర్యన్ అలెక్స్, ఆనంద, శరవణన్, స్వాతి, దివ్యశ్రీ, రీతు బేబి నిఖిత, మణిమారన్, విజయ్ గణేశ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ తల్లిదండ్రుల హిత వ్యాఖ్యల్ని పెడ చెవిన పెట్టిన ఒక యువతి జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? ధనబలం, అంగబలంతో విచ్చలవిడిగా ప్రవర్తించే వారి చివరి జీవితం ఎలాంటి స్థితికి చేరుకుంటుందన్న అంశాలతో తెరకెక్కిస్తున్న చిత్రం పాది ఉనక్కు పాది ఎనక్కు అని తెలిపారు. ఇది ఒక సరికొత్త ప్రయోగాత్మక చిత్రం అన్నారు. చిత్రంలో హీరో హీరోయిన్లు, ప్రేమ సన్నివేశాలు లేకపోయినా ప్రేక్షకులను అలరించే, ఆలోచింప చేసే అంశాలు చాలా ఉన్నాయన్నారు. చిత్ర షూటింగ్‌ను చెన్నై, సెంజి, అరక్కోణం, దిండివనం, ఊటి తదితరప్రాంతాల్లో నిర్వహించి పూర్తి చేసినట్టు వెల్లడించారు. ఎస్పీఎల్ సెల్వదాసన్, ఎం ఆర్ బాలన్, హెచ్.గణేష్ మొదలగు ముగ్గురు సంగీత దర్శకులు పని చేస్తున్న ఈ చిత్రంలో ఆరు పాటలు ఉంటాయని చెప్పారు. వి ఎస్ బాలాజి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం స్థానికవడపళనిలో గల ఆర్ కె వి స్టూడియోలో జరిగింది. -
హత్యా రాజకీయాలొద్దు
కంచికచర్ల : నిత్యం ప్రజలతో సంబంధాలు కొనసాగించే రాజకీయ నాయకులు హత్యలను ప్రోత్సహించవద్దని, ప్రజల అభివృద్ధి కోసం పాటుపడాలని వైఎస్సార్సీపీ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ నాయకులు కోనేరు రాజేంద్రప్రసాద్ సూచించారు. మండలంలోని గొట్టుముక్కలలో ఆదివారం అర్థరాత్రి హత్యకు గురయిన ఆలోకం కృష్ణారావు కుటుంబ సభ్యులను గురువారం కలుసుకుని ప్రగాడ సానుభూతి తెలిపారు. హత్య జరిగిన తీరుపై కుటుంబ సభ్యుల నుంచి వివరాలడిగి తెలుసుకున్నారు. నిద్రపోతున్న కృష్ణారావును లేపి రాడ్లతో, కర్రలతో కొట్టి రెండు పెడరెక్కలు విరిచి లాక్కుంటూ కాళ్లతో తన్నుకుంటూ బయటకు తీసుకువెళ్లి చంపి రోడ్డుపై పడేశారని కృష్ణారావు భార్య ముత్తమ్మ, కుమార్తె వాసిరెడ్డి నాగమణి చెప్పారు. కుంటుంబానికి పెద్దదిక్కు పోయిందని కోనేరు ముందు బోరున విలపించారు. తమను దిక్కులేని వారిని చేసిన హత్యను ప్రోత్సహించిన వారిని శిక్షించాలని అన్నారు. కోనేరు మాట్లాడుతూ ఈ విషయాలన్నీ జిల్లా ఎస్పీ విజయకుమార్ దృష్టికి తీసుకెళ్లి హత్యకు సహకరించిన వారిపై చర్యలు తీసుకునేలా చేస్తానని అన్నారు. పచ్చని గ్రామాల్లో జీవించే వారిపై రాజకీయాల కోసం దాడులు చేసి హత్యలు చేయడం సరికాదని హితవు పలికారు. గ్రామాల్లో అందరూ ఐక్యంగా ఉండి అభివృద్ధికోసం పాటుపడాలని, కక్షలు పెంచుకుంటూపోతే ప్రజలు గ్రామాల్లో ఎవరూ మిగలరని అన్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, అధికారంలో ఉన్నంత మాత్రాన హత్యలు చేస్తే చట్టం ఊరుకోదని తెలిపారు. అనంతరం మాజీ ఎంపీటీసీ సభ్యుడు గుదే అక్కారావు ఇంటిపై రాళ్లు రువ్వి కిటికీ అద్దాలను పగులకొట్టారని, బయటకు వస్తే చంపుతామని నానా దుర్భాషలాడుతూ వెళ్లిపోయారని కోనేరుకు తెలిపారు. గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సమయం నుంచి టీడీపీ వర్గీయులు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని అయినా ఊరుకుంటున్నామని దీంతో పోలీసు వర్గాలన్నీ అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని కోనేరుతో పార్టీ నేతలు వాపోయారు. కోవెలమూడి వెంకటనారాయణ, డాక్టర్ మొండితోక అరుణ్‌కుమార్, జగ్గయ్యపేట మున్సిపల్‌చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు షేక్ షహనాజ్‌బేగం, మహ్మద్ గౌస్, గుదే రంగారావు, అక్కారావు, తాటుకూరి గంగాధరరావు, కోటేరు సూర్యనారాయణరెడ్డి, ములకలపల్లి శేషగిరిరావు, వాసిరెడ్డి విజయకుమార్, జొన్నలగడ్డ సుబ్బారావు, ఆలోకం శ్రీనివాసరావు, గుదే సాంబశివరావు, తాటుకూరి అమ్మారావు, బండి వెంకట్రావుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. -
ఈదర అవుట్
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జెడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు పదవి పోయింది. పార్టీ విప్ ధిక్కరించిన కేసులో ఆయనపై అనర్హత వేటు వేస్తూ సోమవారం సాయంత్రం ప్రిసైడింగ్ అధికారి హోదాలో కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ నిర్ణయం తీసుకున్నారు. జిల్లా పరిషత్‌కు చైర్మన్, వైస్ చైర్మన్‌తో పాటు కో-ఆప్షన్ మెంబర్ల ఎంపికకు గత నెల 13న ప్రత్యేక సమావేశం జరిగింది. ఎన్నికల ప్రిసైడింగ్ అధికారిగా కలెక్టర్ విజయకుమార్ వ్యవహరించారు. చైర్మన్ ఎన్నిక సందర్భంలో పొన్నలూరు జెడ్పీటీసీ ఈదర హరిబాబు ఇండిపెండెంట్ అభ్యర్థికి, వైస్ చైర్మన్ ఎన్నికలో మరో ఇండిపెండెంట్ అభ్యర్థికి విప్ ధిక్కరించి చేతులు ఎత్తినందున పార్టీ విప్ ధిక్కరించినట్లు భావించి పంచాయతీరాజ్ చట్టం 2006 ప్రకారంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఎలక్షన్ రూల్స్ జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వు నం.173, తేదీ 10.5.2006 మేరకు విప్ ధిక్కరించినందున జెడ్పీటీసీ పొన్నలూరు అభ్యర్థి హరిబాబుపై కలెక్టర్ అనర్హత ఉత్తర్వులు జారీ చేశారు.’ అంటూ అధికారిక ప్రకటన వెలువడింది. వేటు పడిందిలా... పార్టీ విప్ ధిక్కరించి ఓటు వేసిన అంశంలో తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు మేరకు కలెక్టర్ విచారణ చేపట్టారు. దీనిపై నోటీసులు జారీ చేసినపుడు తాను పార్టీ విప్ తీసుకోలేదని, అందువల్ల విప్ ధిక్కరించే అవకాశం లేదంటూ ఈదర హరిబాబు, ఆయన తరఫు న్యాయవాది వాదించారు. అయితే విప్ జారీ చేసిన సమయంలో పెట్టిన సంతకం, గత నెల 13వ తేదీన జరిగిన ప్రత్యేక సమావేశం హాజరు రిజిస్టర్లో సంతకం సరిచూడగా రెండు సంతకాలు ఒక్కటే కావడంతో కలెక్టర్ విప్ ధిక్కరించినట్లు భావించి వేటు వేశారు. కిం కర్తవ్యం... జెడ్పీ చైర్మన్‌పై వేటు పడటంతో తర్వాత ఏం చేయాలనే దానిపై కలెక్టర్ దృష్టి పెట్టారు. చట్ట ప్రకారం వైస్ చైర్మన్‌ను ఇన్చార్జిగా నియమించాల్సి ఉంటుంది. దీని కోసం ఎన్నికల సంఘాన్ని స్పష్టత ఇవ్వాల్సిందిగా లేఖ రాశారు. మంగళవారానికి దీనిపై ఆదేశాలు వచ్చే అవకాశం ఉంది. ఈ ఆదేశాలు రాగానే వైస్ చైర్మన్‌గా ఉన్న నూకసాని బాలాజీకి చైర్మన్ బాధ్యతలు అప్పగిస్తారు. మళ్లీ ఎన్నిక ఎప్పుడు? జెడ్పీ చైర్మన్‌పై వేటు పడటంతో ఆయనకు కోర్టు నుంచి ఎటువంటి ఊరట లభించని పక్షంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మళ్లీ చైర్మన్ ఎన్నిక జరిగే అవకాశం ఉంది. హరిబాబు జెడ్పీటీసీ సభ్యత్వం రద్దు కావడంతో పొన్నలూరు జెడ్పీటీసీకి ఎన్నిక జరగాల్సి ఉంది. ఈ ఎన్నికను ఆరు నెలల్లోపు ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. అప్పటి వరకూ నూకసాని బాలాజీ చైర్మన్‌గా కొనసాగుతారు. పొన్నలూరు జెడ్పీటీసీ ఎన్నిక జరగకముందే చైర్మన్ ఎన్నిక జరిపించాలని తెలుగుదేశం నాయకులు తెరవెనక ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం. అయితే ఎన్నికల సంఘందే తుది నిర్ణయం కావడంతో అక్కడి నుంచి ఆదేశాలు వచ్చే వరకూ చైర్మన్ ఎన్నిక ఉండకపోవచ్చు. -
నకిలీ విత్తనాలు అమ్మితే క్రిమినల్ కేసులు
ఒంగోలు టౌన్ : జిల్లాలో నకిలీ విత్తనాలు అమ్మితే క్రిమినల్ కేసులు పెడతామని కలెక్టర్ విజయకుమార్ హెచ్చరించారు. రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయన్నారు. స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వ్యవసాయ శాఖ, ఇతర అనుబంధ శాఖల 100 రోజుల ప్రణాళికను విడుదల చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జన్యుపరంగా నాణ్యమైన విత్తనాలను సరఫరా చేసేందుకు గ్రామ విత్తన పథకాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ పథకం కింద 50 శాతం సబ్సిడీపై రైతులకు నెలాఖరులోగా విత్తనాలు అందించేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించామన్నారు. జాతీయ ఆహార భద్రతా పథకం కింద పప్పుదినుసుల పంటల్లో దిగుబడులు పెంచేందుకు 250ఎకరాల విస్తీర్ణంలో సమూహ ప్రదర్శనా క్షేత్రాలు వేయనున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించిన రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కలుపు మందు, జీవ సంబంధ ఎరువులను 50శాతం సబ్సిడీపై సరఫరా చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలోని 16మండలాల్లో 1815 హెక్టార్లలో కంది నమూనా ప్రదర్శనా క్షేత్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. సేంద్రియ వ్యవసాయానికి ప్రోత్సాహం వ్యవసాయ రంగంలో రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకం నియంత్రించి నాణ్యమైన పంట ఉత్పత్తులు పెంచేందుకు సేంద్రియ వ్యవసాయ విధానాన్ని అమలు చేస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. ఈ పథకం కింద వానపాముల పెంపకానికి 50శాతం సబ్సిడీపై 500 పోర్టబుల్ బెడ్స్ సరఫరా చేసేందుకు జిల్లాకు 25 లక్షల రూపాయలు కేటాయించారన్నారు. అదేవిధంగా లక్ష రూపాయల సబ్సిడీతో 5వర్మీ హేచరీలు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఆర్కేవీవై కింద రూ 35.96 లక్షలతో పథకాల అమలు రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (ఆర్కేవీవై) పథకం కింద ఉద్యానశాఖ ద్వారా రూ.35.96లక్షలతో వివిధ రకాల పథకాలు అమలు చేయనున్నట్లు కలెక్టర్ వివరించారు. 50శాతం సబ్సిడీతో హైబ్రీడ్ కూరగాయ విత్తనాలు 420 హెక్టార్లలో సరఫరా చేయనున్నట్లు తెలిపారు. అదే విధంగా 50శాతం సబ్సిడీపై తీగ జాతి కూరగాయల పెంపకం కోసం 8హెక్టార్లలో రూ.20లక్షలతో పర్మినెంట్ పందిర్లు ఏర్పాటు చేస్తామన్నారు. సమగ్ర ఉద్యాన పంటల అభివృద్ధి మిషన్ కింద రూ.1250.13లక్షలతో వివిధ రకాల పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. రొయ్యల చెరువులను క్రమబద్ధీకరించుకోవాలి ఉప్పునీటి కయ్యల్లోని రొయ్యల చెరువులను సంబంధిత రైతులు విధిగా క్రమబద్ధీకరించుకోవాలని కలెక్టర్ కోరారు. జిల్లాలోని 40మండలాల్లో 1600 ఎకరాల్లో మల్బరీ తోటలు సాగవుతున్నట్లు తెలిపారు. పశుసంవర్ధకశాఖ ద్వారా జూలై 15 నుంచి 30వ తేదీ వరకు జిల్లాలోని 4లక్షల 53వేల గొర్రెలు, మేకలకు పీపీఆర్ వ్యాధి నివారణకు వ్యాక్సిన్ వేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ మోహన్, వ్యవసాయశాఖ జాయింట్ డెరైక్టర్ మురళీకృష్ణ, పశుసంవర్ధకశాఖ జాయింట్ డెరైక్టర్ ఎన్ రజనీకుమారి పాల్గొన్నారు. -
కలెక్టర్ బదిలీ తప్పదా?
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : కలెక్టర్ విజయకుమార్‌పై బదిలీ వేటు పడనుందా..? జెడ్పీ చైర్మన్ ఎన్నిక విషయంలో నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవడంపై విజయకుమార్ పట్ల ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. మెజారిటీ లేకపోయినా ఏదో విధంగా జెడ్పీ పీఠాన్ని దక్కించుకునేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రయత్నాలు చేశారు. స్వయంగా మంత్రి శిద్దా రాఘవరావు, ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రి, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఒత్తిడి చేసినా నిబంధనల మేరకే తాను నడుచుకుంటానని కలెక్టర్ స్పష్టం చేయడం తెలుగుదేశం పార్టీ నేతలకు నచ్చలేదు. విజయకుమార్‌ను పంపించి వేయాలని టీడీపీ నేతలు ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కోరారు. జెడ్పీ ఎన్నికల విషయంలో అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గకుండా వ్యవహరించడం వారికి కంటగింపుగా మారింది. ఒకదశలో పోడియం ఎదుట బైఠాయించిన టీడీపీ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులను పోలీసుల సాయంతో పక్కకు తొలగించేందుకు చేసిన ప్రయత్నంతో అధికార పార్టీ నేతలు ఆగ్రహంగా ఉన్నారు. పైనుంచి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా సాయంత్రం 5.45 గంటల వరకూ సభను వాయిదా వేయకుండా ఎన్నిక జరిపేందుకు ఎన్నికల అధికారి హోదాలో విజయకుమార్ చేసిన ప్రయత్నాలను వారు అవమానంగా భావిస్తున్నారు. దీంతో ఈ నెల 13న జరిగే జెడ్పీ ఎన్నికల్లోగా కలెక్టర్‌ను బదిలీ చేయాలంటూ చంద్రబాబును కోరినట్లు సమాచారం. మరోవైపు అధికార పార్టీ దౌర్జన్యాలపై ఎన్నికల సంఘం స్పందించింది. జిల్లాలో ఎక్కడెక్కడ అక్రమాలు జరిగాయో గుర్తించి.. తక్షణమే విచారణ చేపట్టి చట్టప్రకారం చర్యలకు ఆదేశాలిచ్చింది. ఆ మేరకు కలెక్టర్ విజయకుమార్, ఎస్పీ పి. ప్రమోద్‌కుమార్‌కు ఈసీ ఆదేశాలందాయి. కనిగిరి, అద్దంకి నియోజకవర్గంలోని బల్లికురవ ఎంపీపీ ఎన్నికలకు సంబంధించి వైఎస్సార్సీపీ సభ్యులను బలవంతంగా టీడీపీ నేతలు లాక్కెళ్లడంపై ఈసీకి ఫిర్యాదులు వెళ్లాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్‌ను ప్రభుత్వం బదిలీ చేస్తుందా.. లేకుంటే జెడ్పీ చైర్మన్ ఎన్నిక జరిగే వరకూ వేచిచూస్తుందా అనేది జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. -
నీటి ఎద్దడి నివారణకు ప్రణాళిక
ఒంగోలు కలెక్టరేట్ : గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు కలెక్టర్ విజయకుమార్ వెల్లడించారు. మండల స్థాయిలో అధికారులతో కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఒంగోలు డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, వైద్యాధికారులతో స్థానిక అంబేద్కర్ భవన్లో బుధవారం సాయంత్రం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో నీటి ఎద్దడి నివారణకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి అధ్యక్షతన ఏర్పాటు చేసే కమిటీలో తహసీల్దార్, ఆర్డబ్ల్యూఎస్ అసిస్టెంట్ ఇంజినీర్లు సభ్యులుగా ఉంటారన్నారు. స్థానిక సంస్థల ప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ రెవెన్యూ అధికారులతో సమావేశం ఏర్పాటుచేసి గ్రామాల వారీగా సమీక్షించుకుని అందుబాటులో ఉన్న నిధులతో మంచినీటి పథకాలకు మరమ్మతులు చేయించుకోవాలని కమిటీలను ఆదేశించారు. మూడు నెలలకు సరిపడా మందులు ఉండాలి... వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పుల వల్ల వ్యాధులు ప్రబలే అవకాశాలున్నాయని వైద్యారోగ్య శాఖాధికారులను కలెక్టర్ హెచ్చరించారు. రానున్న మూడు నెలలకు సరిపడా మందులను ఆస్పత్రుల్లో సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. వ్యాధుల నివారణకు తహసీల్దార్ అధ్యక్షతన మండల పరిషత్ అభివృద్ధి అధికారి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి సభ్యులుగా కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామ పరిశుభ్రతకు ప్రజలను భాగస్వాములను చేయాలని కోరారు. వరదలు, తుఫాన్లు, కరువులు వచ్చినప్పుడు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు. 15 రోజుల్లో స్థలాలు సేకరించాలి... జిల్లాలో ప్రభుత్వ శాఖల భవనాల నిర్మాణాలకు భూసేకరణ చేపట్టాలని తహసీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు. 15 రోజుల్లో స్థలాలను సేకరించి ప్రతిపాదనలు పంపించాలన్నారు. పెద్దఎత్తున మొక్కల పెంపకం చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. అందుకోసం వెయ్యి ట్రీ గార్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గ్రామస్థాయి నుంచి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాలన్నారు. అందుకు అనువైన స్థలాల కోసం తహసీల్దార్లంతా గ్రామాల్లో పర్యటించి సేకరించాలని సూచించారు. ఇందిరమ్మ పచ్చతోరణం పథకం కింద ఒక్కో మండలంలో వెయ్యి ఎకరాల్లో మొక్కలు పెంచనున్నట్లు తెలిపారు. నియోజకవర్గానికి సీనియర్ అధికారి... రెండోవిడత అక్షర విజయం కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేసేందుకు అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక సీనియర్ అధికారిని నియమించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. డివిజన్లో 1.82 లక్షల మంది నిరక్షరాస్యులుండగా, మొదటి విడతలో లక్షా 2వేల మందిని అక్షరాస్యులను చేసినట్లు చెప్పారు. మిగి లిన వారిని రెండో విడతలో అక్షరాస్యులను చేయాలని సూచించారు. స్వయం సహాయక సంఘాలు, ఉపాధి హామీ పథకంలోని జాబ్ కార్డుదారులందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్ది జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని కలెక్టర్ కోరారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జీ గంగాదర్‌గౌడ్, డీఆర్డీఏ పీడీ పద్మజ, జిల్లా పరిషత్ సీఈవో ప్రసాద్, ముఖ్య ప్రణాళికాధికారి పీబీకే మూర్తి, డ్వామా పీడీ పోలప్ప, హౌసింగ్ పీడీ ధనుంజయుడు తదితరులు పాల్గొన్నారు. -
మద్యం..@ ఆదాయం
ఒంగోలు టౌన్ : జిల్లాలో ఎక్సైజ్ శాఖకు ఈ ఏడాది రూ.120 కోట్ల ఆదాయం సమకూరనుంది. శుక్రవారంతో టెండర్ల ప్రక్రియ పూర్తయింది. శనివారం లాటరీ ద్వారా లెసైన్స్‌దారులను ఎంపిక చేశారు. లాటరీని స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని బచ్చల బాలయ్య కల్యాణ మండపంలో కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ ప్రారంభించారు. జిల్లాలో మొత్తం 321 మద్యం షాపులున్నాయి. వాటిలో 276 షాపులకు మాత్రమే టెండర్లు వేశారు. మొత్తం మీద 2014-15 సంవత్సరానికిగాను ఎక్సైజ్ శాఖకు మొత్తం రూ. 120 కోట్ల మేర ఆదాయం రానుంది. 276 షాపులకు 6,194 టెండర్లు దాఖలయ్యాయి. టెండర్ ఫారాల ద్వారా 15.38 కోట్ల ఆదాయం వచ్చింది. 45 షాపులకు ఒక టెండర్ కూడా దాఖలు కాలేదు. చీమకుర్తి మండలం మర్రిచెట్లపాలెం మద్యం దుకాణానికి జిల్లాలోనే అత్యధికంగా 300 టెండర్లు దాఖలయ్యాయి. మొత్తం 42 మద్యం షాపులకు సింగిల్ టెండర్లు మాత్రమే వచ్చాయి. మధ్యాహ్నం 3 గంటలకు లాటరీ విధానం ద్వారా మద్యం షాపులు కేటాయిస్తామని అధికారులు ప్రకటించినా టెండర్‌దారులకు టోకెన్లు ఇచ్చే ప్రక్రియ వద్ద ఇబ్బందులు తలెత్తడంతో 2 గంటలు ఆలస్యంగా ప్రారంభించాల్సి వచ్చింది. సాయంత్రం 4 గంటల నుంచి లాటరీ ప్రక్రియను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎక్సైజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్ ఎం.దేవకుమార్, ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఎన్వీఎస్ ప్రసాద్, ఒంగోలు, మార్కాపురం ఎక్సైజ్ సూపరింటెండెంట్లు ఎం.భాస్కరరావు, ఆర్.కిషన్, ఏఈఎస్ చంద్రశేఖరరెడ్డి, ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్ ఆనాల ఆవులయ్యతో పాటు జిల్లాలోని 14 సర్కిళ్ల ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు పాల్గొన్నారు. ఆ మద్యం షాపు రూటే సప‘రేటు’ చీమకుర్తి మండలం మర్రిచెట్లపాలెం మద్యం షాపునకు గుర్తింపు వచ్చింది. మద్యం షాపుల కేటాయింపులో భాగంగా వాటిని మూడు రకాలుగా విభజించారు. 5 వేల లోపు జనాభా ఉన్న మర్రిచెట్లపాలెం షాపునకు లెసైన్సు ఫీజు కింద ఏడాదికి రూ.32.50 లక్షలు కేటాయించారు. 300 మంది ఈ ఒక్క షాపుకే టెండర్లు వేయటంతో ఎక్సైజ్ శాఖకు రూ.75 లక్షల ఆదాయం సమకూరినట్లయింది. ఒక్కో టెండర్‌కు రూ.25 వేలు చొప్పున చెల్లించారు. లాటరీ పద్ధతి ద్వారా కలెక్టర్ సీలు తీసినప్పుడు ఆ 300 మందిలో నిప్పట్లపాడు గ్రామానికి చెందిన మువ్వా మాలకొండరాయుడును అదృష్టం వరించింది. -
ఖర్చుల వివరాలు అందించకుంటే నోటీసులు
ఒంగోలు కలెక్టరేట్ : ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు నిర్ణీత కాలవ్యవధిలో ఎన్నికల ఖర్చుల వివరాలు సమర్పించకుంటే నోటీసులు జారీ చేయాలని భారత ఎన్నికల సంఘం డెరైక్టర్ జనరల్(వ్యయం) పీకే దాస్ ఆదేశించారు. ఎన్నికల వ్యయంపై న్యూఢిల్లీలోని నిర్వచన్ భవన్ నుంచి బుధవారం కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత 45 రోజుల్లోగా ఖర్చుల వివరాలు అందించని అభ్యర్థులపై ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. పెయిడ్ న్యూస్ ఖర్చులను కూడా ఎన్నికల ఖర్చులో చూపించాలన్నారు. నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల ఖర్చుల వివరాలను వెబ్సైట్లో అప్లోడ్ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. నోటీసులు జారీ చేశాం : కలెక్టర్ విజయకుమార్ జిల్లాలో సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసి ఎన్నికల వ్యయ వివరాలు అందించని అభ్యర్థులకు నోటీసులు జారీ చేసినట్లు పీకే దాస్‌కు కలెక్టర్ విజయకుమార్ తెలిపారు. 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు 187 మంది అభ్యర్థులు పోటీచేయగా 181 మంది అభ్యర్థులు ఎన్నికల వ్యయ వివరాలు అందించారన్నారు. ఒంగోలు, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గాలకు 29 మంది అభ్యర్థులు పోటీచేయగా, 25 మంది అభ్యర్థులు ఎన్నికల వ్యయ వివరాలు అందించినట్లు చెప్పారు. ఎన్నికల వ్యయ వివరాలను ఎన్నికల సంఘం వెబ్సైట్లో అప్లోడ్ చేసే ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ కే యాకూబ్‌నాయక్, జిల్లా రెవెన్యూ అధికారి జీ గంగాధర్‌గౌడ్, భూసేకరణ స్పెషల్ కలెక్టర్ నాగరాజారావు, ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల వ్యయ పరిశీలకుడు అజయ్‌కుమార్, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల వ్యయ పరిశీలకుడు రాజన్, యర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, దర్శి అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల వ్యయ పరిశీలకులు మోహిత్‌విశ్వ, సంతనూతలపాడు, అద్దంకి, పర్చూరు, చీరాల అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల వ్యయ పరిశీలకుడు రోహిత్‌రాజ్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు. -
ప్రైవేట్ పాఠశాలలపై కొరడా ఝులిపిస్తారా ?
నగరంలో ప్రైవేటు పాఠశాలల తనిఖీకి కమిటీలు 8 ప్రత్యేక బృందాల ఏర్పాటు కలెక్టర్ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం విద్యారణ్యపురి : విద్యాసంవత్సరం ప్రారంభం కాగానే జిల్లావ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలలు, కార్పొరేట్ కళాశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఈ సమస్యను వివిధ విద్యార్థి సంఘాలతోపాటు, ప్రజాసంఘాలు, తల్లిదండ్రులు కూడా జిల్లా విద్యాశాఖాధికారుల దృష్టికి తీసుకొస్తున్నారు. ఎల్కేజీ మొదలుకుని టెన్త్ క్లాస్ వరకు కూడా పలుపాఠశాలల యాజమాన్యాలు అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. అంతేగాక విద్యాహక్కు చట్టానికి తూట్లు పొడుస్తూ డొనేషన్లు కూడా వసూలు చేస్తున్నారు. మరోవైపు కొన్నింట్లో యూనీఫామ్‌లు, పుస్తకాలు, షూలు మొదలుకొని ఇతర వస్తువులు కూడా విక్రయిస్తున్నారు. విధిగా పాఠశాలలోనే వాటిని కొనుగోలు చేయాలని షరతు విధిస్తుండడంతో తల్లిదండ్రులు విధిలేక వేలల్లో డబ్బులు వెచ్చించాల్సి వస్తోంది. వరంగల్ నగరంలోని వివిధ పాఠశాలల్లో ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. టెన్త్ అడ్మిషన్కైతే రూ. 50 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేసే పాఠశాలలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. అధిక ఫీజులను నియంత్రించాలని కలెక్టర్ కిషన్ కూడా జిల్లా విద్యాశాఖాధికారులను ఇటీవల ఆదేశించారు. ్రైపైవేట్ పాఠశాలలు విద్యాహక్కు చట్టాన్ని అమలుచేస్తున్నాయా ? లేదా ? ఫీజుల స్ట్రక్చర్ ఎలా ఉంది ? వసతులు ఏమేరకు ఉన్నాయో తదితర అన్ని అంశాలను పరిశీలించాల్సింది కలెక్టర్ ఆదేశాలతో డీఈఓ డాక్టర్ ఎస్. విజయకుమార్ ప్రైవేట్ పాఠశాలలను తనిఖీలు చేయించాలని నిర్ణయించారు. ఈ మేరకు మొదట వరంగల్ డి విజన్ పరిధిలోని పలు ప్రైవేటు పాఠశాలల్లో తనిఖీ చేయాలని అందుకు 8 కమిటీ బృందాలను నియమించారు. మూడు హైస్కూళ్లను తనిఖీ చేసిన డీఈఓ విద్యాసంవత్సరం ప్రారంభమయ్యాక డీఈఓ ఎస్. విజయకుమార్ సోమవారం తనిఖీలు ప్రారంభించారు. వర్ధన్నపేట, రాయపర్తి మండలంలోని మైలారం, తొర్రూరులోని జెడ్పీ సూళ్లను డీఈఓ విజయకుమార్ తనిఖీచేశారు. ఆయా ఉన్నతపాఠశాలల హెచ్ఎంలకు పలు సూచనలు చేసినట్లు డీఈఓ వెల్లడించారు. గత విద్యాసంవత్సరం తనిఖీలతో హడలెత్తించిన డీఈఓ మళ్లీ ఈ విద్యాసంవత్సరం కూడా తానే స్వయంగా మళ్లీ పర్యవేక్షణ మొదలెట్టారు. తనిఖీ కమిటీల బృందాలు ఇవే.. వరంగల్ డిప్యూటీ డీఈఓ డి.వాసంతి, తరాలపల్లి పీజీహెచ్ఎం రాంధన్, జిల్లాపరిషత్ డిప్యూటీ డీఈఓ నరేందర్‌రెడ్డి, మర్కజీ హైస్కూల్ పీజీ హెచ్ఎం ఇ దేవేందర్‌రెడ్డి, మహబూబాబాద్ డిప్యూటీ డీఈఓ డాక్టర్ రవీందర్‌రెడ్డి పీజీహెచ్ఎం జి.లింగారెడ్డి, జనగామ డిప్యూటీ డీఈఓ రేణుక, పీజీహెచ్ఎం రఘునందన్‌రెడ్డి, ఆర్‌ఎంఎస్‌ఏ డిప్యూటీ డీఈఓ ఎండీ అబ్దుల్‌హై, హెచ్ఎం ఎల్.వెంకట్‌రెడ్డి, ములుగు డిప్యూటీ డీఈఓ కృష్ణమూర్తి, హెచ్ఎం రాంచంద్రారెడ్డి ,డైట్ లెక్చరర్లు ఎం సోమయ్య, సోమశేఖర్‌రెడ్డి, సీటీఈ ప్రభుత్వ లెక్చరర్ వేణుగోపాల్, పీజీహెచ్ఎం సుబ్బారావు ఉన్నారు. ఒక్కో కమిటీలో ఇద్దరు చొప్పున ఉండి తనిఖీ చేయబోతున్నారు. అయితే ఏ మేరకు ఫీజులను నియంత్రిస్తారోననేది చర్చగా ఉంది. -
అక్రమ కేసుకు ఎస్సై వత్తాసు
విచారణ జరిపి న్యాయం చేయాలి కలెక్టర్‌కు దైవాలరావూరు గ్రామస్తుల వేడుకోలు ఒంగోలు కలెక్టరేట్ : కొరిశపాడు మండలం దైవాలరావూరులో చిన్న పిల్లల మధ్య జరిగిన గొడవ పెద్దల వరకు వెళ్లి ఘర్షణకు దారితీసిన నేపథ్యంలో ఆ సంఘటనతో సంబంధంలేనివారిపై అక్రమంగా కేసు నమోదు చేశారని, దానికి అక్కడి ఎస్సై వత్తాసు పలుకుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాధితులు వాపోయారు. ఆదివారం కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్‌ను క్యాంపు కార్యాలయంలో కలిసి గ్రామంలో చోటుచేసుకున్న పరిస్థితులను వారు వివరించారు. ఈ నెల 4వ తేదీన చిన్నపిల్లల మధ్య జరిగిన గొడవ, పెద్దల ఘర్షణకు బాధ్యులను చేస్తూ 12 మందిపై పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేశారని, వాస్తవానికి సంఘటనలో లేనివారిపై కూడా కేసులు నమోదు చేశారని తెలిపారు. శేఖర్‌బాబు అనే ఉపాధ్యాయుడిని కూడా ఇందులో ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సై శివకుమార్ సంఘటన స్థలానికి చేరుకొని విచారణ జరపకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు పోలీసుస్టేషన్‌కు పిలిపించి సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని రాత్రి 9గంటలకు ఇళ్లకు పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమలో ఎక్కువ మంది కూలీనాలీ చేసుకొని జీవించేవారమని, తమను ప్రతిరోజూ విచారణ పేరుతో పోలీసుస్టేషన్లో ఉంచడం వల్ల జీవనాధారం కోల్పోతున్నామని వాపోయారు. ఈ సంఘటనపై విచారణ జరిపించాలని కలెక్టర్‌ను వేడుకున్నారు. విచారణ జరిపిస్తానని కలెక్టర్ విజయకుమార్ వారికి హామీ ఇచ్చారు. కలెక్టర్‌ను కలిసి గోడు వెళ్లబుచ్చుకున్న వారిలో పార్వతి, లక్ష్మీదేవి, కుమారి, శేఖర్‌బాబుతో పాటు మరికొందరు ఉన్నారు. -
ప్రభుత్వ స్కూళ్లలో బోధన మెరుగుపర్చాలి
విద్యాశాఖ అధికారులకు కలెక్టర్ ఆదేశం ఒంగోలు కలెక్టరేట్ : ప్రభుత్వ పాఠశాలల్లో బోధన పద్ధతులను మెరుగుపరచి విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఆకర్షించేందుకు విద్యాశాఖ అధికారులు ప్రయత్నించాలని కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ ఆదేశించారు. బడి ఈడు పిల్లలంతా బడుల్లోనే ఉండాలని, బడి బయట ఉండటానికి వీల్లేదని స్పష్టం చేశారు. స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం మధ్యాహ్నం విద్యాశాఖ అధికారులకు నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. హ్యాబిటేషన్ల వారీగా ఇంటింటికీ తిరిగి తల్లిదండ్రులను చైతన్యపరచి ప్రభుత్వ పాఠశాలల్లో నూరు శాతం అడ్మిషన్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఎంఈఓలు పాలనాపరమైన వ్యవహారాలే కాకుండా విద్యాబోధనపై శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. గత ఏడాది జిల్లాలో ప్రకటించిన పదో తరగతి పరీక్షల్లో 87 శాతం ఉత్తీర్ణత సాధించడం, చీరాల, చినగంజాం మండలాల్లో 74 శాతం మాత్రమే ఉండటంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వెనుకబడిన, మారుమూల ప్రాంతాలైన సీఎస్‌పురం, వెలిగండ్ల, గుడ్లూరు మండలాల్లో 90 శాతానికిపైగా ఫలితాలు సాధిస్తే.. అభివృద్ధి చెందిన చీరాల, చినగంజాం మండలాల్లో ఉత్తీర్ణత శాతం తగ్గడం ఏమిటని ఎంఈఓలను ప్రశ్నించారు. మనసుపెట్టి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. డబ్బున్న వారు ఎక్కడైనా చదువుకుంటారని, డబ్బు లేని పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ ఆదర్శ పాఠశాలల్లో అన్ని తరగతుల్లో నూరు శాతం అడ్మిషన్లు జరగాలన్నారు. అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు ప్రైవేట్ పాఠశాలల్లో ప్రభుత్వం అనుమతించిన మేరకు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయాలని, అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఏ తరగతికి ఎంత ఫీజు వసూలు చేయాలన్న వివరాలు అన్ని పాఠశాలల్లో అందరికీ కనిపించే విధంగా నోటీసు బోర్డుల్లో ఉంచాలని ఆదేశించారు. ప్రైవేట్ పాఠశాలల్లో ప్రభుత్వం నిర్ధేశించిన విధంగా సౌకర్యాలు ఉండాలన్నారు. అగ్ని ప్రమాదాలు జరిగితే విద్యార్థులు సురక్షితంగా బయట పడేందుకు అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. తగిన వసతులు లేని పాఠశాలలకు నోటీసులిచ్చి 15 రోజుల్లో వసతులు ఏర్పాటు చేసుకునేందుకు గడువు ఇవ్వాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. నిర్ణీత గడువులోగా స్పందించకుంటే ఆ పాఠశాల గుర్తింపును రద్దు చేసి మూతవేయాలని ఆదేశించారు. సమావేశంలో ఇన్చార్జి డీఈఓ విజయభాస్కర్, రాజీవ్ విద్యామిషన్ పీఓ శ్రీనివాసరావు, ఒంగోలు, మార్కాపురం ఉప విద్యాశాఖాధికారులు సాల్మన్, రామమోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
ఆర్అండ్బీ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం
ఒంగోలు కలెక్టరేట్ : ‘పీసీపల్లి మండలం అలవలపాడు వద్ద సిమెంట్ రోడ్డుకు అప్రోచ్ వేయమని మూడు నెలల క్రితం చెప్పా. ఇంతవరకూ వేయలేదు. అక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలు జరిగి జనాలు చనిపోయిన తర్వాత అప్రోచ్ వేస్తారా? మీకు సొంత జ్ఞానం ఉండదా? ఇంజినీరింగ్ చదివే వచ్చారా’ అని ఆర్అండ్బీ ఇంజినీరింగ్ అధికారులపై కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశం గురువారం స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో జరిగింది. జిల్లాలో రోజురోజుకూ పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాల పట్ల కలెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదాల సంఖ్యను సాధ్యమైనంత మేరకు తగ్గించేందుకు సంబంధిత శాఖల అధికారులు కృషి చేయాలని సూచించారు. జాతీయ రహదారితో పాటు రాష్ట్ర రహదారులన్నింటిపైనా ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రమాదాలన్నీ ఎక్కువ శాతం తెల్లవారు జామున రెండు నుంచి నాలుగు గంటల మధ్యలో జరుగుతున్నాయని, ఆ సమయాల్లో వాహనాలు తిరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలోని వల్లూరు, మార్టూరు ప్రాంతాల్లో పార్కింగ్ ప్రదేశాలను అభివృద్ధి చేసి దూర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాల డ్రైవర్లు అక్కడ విశ్రాంతి తీసుకునేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని జాతీయ రహదారి అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారితో కలిపే ప్రాంతాల్లో అన్ని రహదారులపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసి వాహనాలు వేగంగా రోడ్డుపైకి రాకుండా నివారించాలని కలెక్టర్ చెప్పారు. వంద మీటర్ల పరిధిలో మద్యం దుకాణాలు ఉండొద్దు జాతీయ రహదారికి ఇరువైపులా వంద మీటర్ల పరిధిలో మద్యం దుకాణాలు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ, రాష్ట్రీయ రహదారులన్నింటిపై ఆక్రమణలు తొలగించాలన్నారు. రోడ్లపై వాహనాలు పార్కు చేయకుండా చర్యలు చేపట్టాలన్నారు. రోడ్లపై అడ్డంగా ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించాలని సూచించారు. ఒంగోలు నగరంలోని ఫ్లయిఓవర్ బ్రిడ్జి కింద ఆక్రమణలు తొలగించి ఫెన్సింగ్ ఏర్పాటు చేసి గ్రీనరీ పెంచాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ విజయకుమార్ సూచించారు. కార్పొరేషన్ కమిషనర్‌కు చార్జి మెమో: ఒంగోలు నగర పాలక సంస్థ కమిషనర్ విజయలక్ష్మికి కలెక్టర్ విజయకుమార్ చార్జి మెమో జారీ చేశారు. నగరంలోని తొమ్మిది ప్రాంతాల్లో సిగ్నల్ లైట్లు ఏర్పాటు చేయాలని గతేడాది మే 23వ తేదీన నిర్ణయం తీసుకున్నా ఇంతవరకు అమలు చేయకపోవడంతో ఆమెపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నగర పాలక సంస్థ పరిధిలో అప్రోచ్ రోడ్ల వివరాలు అడిగినా సకాలంలో స్పందించకపోవడంతో కమిషనర్‌పై కలెక్టర్ మండిపడ్డారు. -
విన్నపాలు వినవలె..
ఒంగోలు కలెక్టరేట్ : అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో 24 గంటల్లోపు ఫీజు బోర్డులు ఉంచాలని కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ ఆదేశించారు. జిల్లాలోని ప్రైవేట్ స్కూల్స్ అధిక ఫీజుల పేరిట పేద, మధ్య తరగతి ప్రజల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్న విషయమై బీసీ సంక్షేమ సాధన సమితి నాయకులు, పీపుల్స్ అవేర్నెస్ అసోసియేషన్ ప్రతినిధులు సోమవారం స్థానిక ప్రకాశం భవనంలోని ఓపెన్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో కలెక్టర్ విజయకుమార్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ జిల్లాలోని అన్ని ప్రైవేట్ స్కూల్స్‌లో జీఓ నం- 42 ప్రకారం తమ విద్యా సంస్థల ప్రాంగణంలో మూడు ప్రధాన చోట్ల ఫీజుల వివరాలు తెలియజేసే బోర్డులు ఏర్పాటు చేసేలా చూడాలన్నారు. ఎక్కడైనా బోర్డులు ఏర్పాటు చేయకుంటే సంబంధిత స్కూల్స్‌కు నోటీసులు ఇవ్వాలని జిల్లా విద్యాశాఖాధికారిని కలెక్టర్‌ను ఆదేశించారు. ఉద్యోగం ఇవ్వాలి తాను విధి నిర్వహణలో ఉండగా పక్షవాతం వచ్చి మంచానికే పరిమిత మ య్యానని, ఈ నేపథ్యంలో తన కుటుం బం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొం టోందని, తన ఉద్యోగాన్ని తన కుమారునికి ఇవ్వాలని హెడ్ కానిస్టేబుల్ బోడిపోగు అంకయ్య వేడుకున్నాడు. కుటుంబ సభ్యులు ఆయన్ను భుజాలపై కలెక్టర్ వద్దకు మోసుకువచ్చారు. ఎస్పీ కార్యాలయంలో అడిగితే తిప్పుకుంటున్నారని వాపోయాడు. ఎన్నికల ‘నగదు’ ఇప్పించాలి ఎన్నికల విధులు నిర్వర్తించిన తమకు నగదు ఇప్పించాలని కనిగిరి నియోజకవర్గ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ నాయకులు కోరారు. ఇటీవల జరిగిన మునిసిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సార్వత్రిక ఎన్నికల్లో 14 మంది వీడియోగ్రాఫర్లుగా సేవలు అందించారన్నారు. ఈవీఎంల తరలింపు, కౌంటింగ్ నిర్వహణ తదితర విధులు కూడా నిర్వర్తించామన్నారు. నగదు గురించి నియోజకవర్గ ఏఆర్ఓ, కనిగిరి తహశీల్దార్ మల్లికార్జునరావు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారన్నారు. పింఛన్ల కోసం పండుటాకులు నెలనెలా వచ్చే రెండు వందల రూపాయల పింఛన్‌ను ఆ వృద్ధులు మహాభాగ్యంగా భావిం చారు. నాలుగు నెలల నుంచి పింఛన్లు నిలిచిపోయాయి. అదేమని అడిగితే ఏమేమో చెబుతున్నారు. ఏమిచేయాలో పాలుపోని ఆ పండుటాకులు సోమవారం ప్రకాశం భవనంలోని ఓపెన్ ఆడిటోరియంలో జరిగిన ప్రజా దర్బార్‌కు అతి కష్టం మీద వచ్చారు. అధికారులు వారి ప్రయత్నాలను అడ్డుకున్నారు. సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లనీయకుండా తాము పరిష్కరిస్తామని రాజకీయ నాయకుల మాదిరిగా హామీ గుప్పించి వెనక్కు పంపించేశారు. అంతకు ముందు ఆ పండుటాకులు విలేకరుల వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. శ్రీకారంకాలనీ, అన్నవరప్పాడు, కమ్మపాలెంతో పాటు మరికొన్ని కాలనీలకు చెందిన ఇరవైమంది వృద్ధ మహిళలు చేతుల్లో పింఛన్ పాస్ పుస్తకాలను పట్టుకొని వచ్చారు. ఆ లిస్ట్ నడిచి రావాలా? వృద్ధాప్య పింఛన్ల కోసం వచ్చిన వారిని తెలివిగా పంపించామన్న ఆనందం అధికారులకు లేకుండా పోయింది. పెద్ద సంఖ్యలో వచ్చిన వృద్ధ మహిళలను వెనక్కు పంపించామని సంబరపడిపోతున్న తరుణంలో ఒకరిద్దరు కలెక్టర్‌ను కలిసి పింఛన్లు ఆగిపోయిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన కలెక్టర్ పింఛన్లు ఆగిపోతే ఏమి చేస్తున్నారని డీఆర్డీఏ పీడీ పద్మజ, నగర పాలక సంస్థ కమిషనర్‌ను నిలదీశారు. బ్యాంకు నుంచి లిస్ట్ రావాల్సి ఉందని కమిషనర్ విజయలక్ష్మి చెప్పడంపై కలెక్టర్ మండిపడ్డారు. ఆ లిస్ట్ నడిచి రావాలా, తెప్పించుకోవాల్సిన బాధ్యత మీపైలేదా.. అని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
జంప్ జిలానీలకు ఝలక్!
ఒంగోలు వన్‌టౌన్, న్యూస్‌లైన్: జిల్లాలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు విలక్షణమైన తీర్పునిచ్చారు. ఆఖరు నిముషంలో పార్టీలు మారిన జంప్ జిలానీలకు ప్రజలు తమ ఓటుతో గట్టి గుణపాఠమే చెప్పారు. జిల్లాలో ముగ్గురు శాసనసభ్యులు, ఒక శాసనమండలి సభ్యుడు, ఒక పార్లమెంట్ సభ్యుడు ఆఖరు నిముషంలో పార్టీలు మారి ఎన్నికల్లో పోటీ చేశారు. వీరిలో ఒక శాసనసభ్యుడు, ఒక శాసనమండలి సభ్యుడిని ఓటర్లు ఆదరించారు. మిగిలిన ముగ్గురిని తిరస్కరించారు. కాంగ్రెస్ పార్టీలో శాసనసభ్యులుగా, పార్లమెంట్ సభ్యుడిగా దీర్ఘకాలం పదవులు అనుభవించి ఆఖరు నిముషంలో పార్టీ ఫిరాయించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసిన ముగ్గురిని ఓటర్లు తిరస్కరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి శాసనసభ్యులుగా పోటీ చేసిన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీని ఓటర్లు ఆదరించారు. తమ ఓట్లతో వారిని ఆశీర్వదించి అందలం ఎక్కించారు. దేశవ్యాప్తంగా బలంగా వీచిన నరేంద్రమోడీ గాలి కానీ, చంద్రబాబునాయుడు ప్రకటించిన రైతులకు రుణమాఫీ, ఇతర వర్గాలకు రకరకాల తాయిలాలు కానీ పార్టీ ఫిరాయించి తెలుగుదేశం అభ్యర్థులుగా పోటీ చేసిన వారిని గట్టెక్కించలేదు. జిల్లాలో 2009లో కాంగ్రెస్ శాసనసభ్యునిగా ఎన్నికైన ఆదిమూలపు సురేష్ (యర్రగొండపాలెం రిజర్వుడు), బీఎన్ విజయకుమార్ (సంతనూతలపాడు రిజర్వుడు)లు ప్రస్తుత ఎన్నికల్లో తాము ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్‌ను వీడారు. యర్రగొండపాలెం ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరగా, సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్ విజయకుమార్ తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరిద్దరూ ప్రత్యర్థులుగా సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గంలో తలపడ్డారు. ఎమ్మెల్యే విజయకుమార్ మూడేళ్లుగా నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. భవిష్యత్ వ్యూహంతో ముందుగానే విజయకుమార్ తెలుగుదేశం నాయకులను మచ్చిక చేసుకొని తమ వైపు తిప్పుకున్నారు. యర్రగొండపాలెం ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ ఆఖరు నిముషంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నామినేషన్ల ప్రక్రియ చివరి రోజు ఆయనకు పార్టీ టికెట్ ఖరారైంది. అయితే అప్పటినుంచి అవిశ్రాంతంగా ప్రచారంలో పాల్గొని ఓటర్ల మనుసుదోచారు. విజయతీరాలు చేరారు. వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా ఎవరూ గెలవని ఆనవాయితీని కొనసాగించారు. సంతనూతలపాడు నియోజకవర్గ ఆనవాయితీని పటాపంచాలు చేయాలన్న విజయకుమార్ కలలు కల్లలుగా మిగిలాయి. కాంగ్రెస్ ఎమ్మెల్సీ పోతుల రామారావు ఆఖరు నిముషంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. సౌమ్యుడిగా మంచి వ్యక్తిగా పేరున్న పోతుల రామారావును నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలు అక్కున చేర్చుకున్నారు. నియోజకవర్గానికి కొత్త అయినప్పటి కీ పోతుల రామారావుకు అక్కడి ప్రజలు పట్టం కట్టారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ దివి శివరాం నోటి దురుసుతనం ఆయనకు చేటు తెచ్చింది. శివరాం 2004, 2009లో మాజీ మంత్రి మానుగుంట మహీధరరెడ్డి చేతిలో, ప్రస్తుతం పోతుల రామారావు చేతిలో పరాజయం పాలై ఓటమిలో హ్యాట్రిక్ సాధించారు. ఒంగోలు పార్లమెంట్ సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ నుంచి మూడుసార్లు ఎన్నికైన మాగుంట శ్రీనివాసులరెడ్డి ఆ పార్టీ ఫిరాయించి తెలుగుదేశంలో చేరారు. ఒంగోలు లోక్‌సభ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ప్రత్యక్ష రాజకీయాల్లో తొలిసారి పోటీ చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైవీ.సుబ్బారెడ్డి ఒంగోలు ఎంపీగా ఘనవిజయం సాధించారు. గతంలో నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయకపోయినా ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ప్రజలు, నాయకులతో సుబ్బారెడ్డికి సత్సంబంధాలున్నాయి. దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా పని చేసిన కాలంలో జిల్లా నుంచి వివిధ పనుల కోసం ఎవరు హైదరాబాద్ వెళ్లినా వారందరికీ ప్రథమ ప్రాధాన్యతనిచ్చి వారి పనులు చేసి పంపి అందరి హృదయాల్లో సుబ్బారెడ్డి స్థానం సంపాదించారు. ఇవన్నీ ఆయనకు ఎన్నికల్లో బాగా కలిసొచ్చాయి. ప్రజారాజ్యం పార్టీ తర ఫున గిద్దలూరు ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేగా చలామణి అయిన అన్నా రాంబాబు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గిద్దలూరు నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఈ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి ముత్తుముల అశోక్‌రెడ్డి గెలుపొందారు. కారణాలు ఏవైనప్పటికీ కాంగ్రెస్‌ను వీడి తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించి పోటీ చేసిన వారందరినీ జిల్లా ఓటర్లు తిరస్కరించటం విశేషం. -
నేడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు
ఒంగోలు, న్యూస్‌లైన్: పల్లె పాలకులు ఎవరో నేడు తేలనుంది. ఏప్రిల్ 6, 11 తేదీల్లో రెండు దశలుగా జరిగిన ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. మండల పరిషత్, జిల్లా పరిషత్ పాలకవర్గాల గడువు ముగిసి మూడేళ్లు గడిచిన తరువాత జరిగిన ఎన్నికలు కావడంతో పల్లె తీర్పుపై ప్రజలతో పాటు, రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. మొత్తం 769 ఎంపీటీసీ స్థానాలకు 2025 మంది అభ్యర్థులు, 56 జెడ్పీటీసీ స్థానాలకు 211 మంది బరిలో ఉన్నారు. బ్యాలెట్ ప్రక్రియ కావడంతో లెక్కింపులో జాప్యం జరిగే అవకాశాలున్నాయి. బ్యాలెట్లు సరిచూసుకోవడం, వాటిని కట్టలుగా కట్టడంతో పాటు ఏజెంట్లకు బ్యాలెట్లు అందకుండా చూసుకోవడంలోనూ అధికారులు పూర్తిస్థాయిలో శ్రద్ధతో పనిచేయాల్సి ఉంటుంది. ఏ ఒక్క ఓటు అదృశ్యమైనా..అది పోలింగ్‌బూత్ మొత్తం మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు, ఆ తరువాత ఎంపీటీసీ స్థానాల కౌంటింగ్ జరుగుతుంది. ఇవి రెండూ పూర్తయ్యాక జెడ్పీటీసీ స్థానాల కౌంటింగ్ ప్రారంభిస్తారు. గతంలో సర్పంచ్ ఎన్నికల సందర్భంగా అర్ధరాత్రి వరకు కౌంటింగ్ జరిగిన దృష్ట్యా ఈ దఫా కూడా దాదాపు రాత్రి పదిగంటల వరకు కౌంటింగ్ జరగొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఒంగోలు రెవెన్యూ డివిజన్‌కు సంబంధించి 25 మండలాల ఎన్నికల ఓట్ల లెక్కింపును రెండు ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. సంతనూతలపాడు మండలం ఎండ్లూరు డొంక సమీపంలోని ఎస్ఎస్ఎన్ ఇంజినీరింగ్ కాలేజీ ఆవరణలోని సౌత్కార్నర్ బిల్డింగ్‌లో 11 మండలాలు, పీజీ బ్లాక్‌లో ఒకటి, ‘ఒ’ బ్లాక్‌లో 8 మండలాలు, రావ్ అండ్ నాయుడు ఇంజినీరింగ్ కాలేజీ ఆవరణలో 5 మండలాల కౌంటింగ్ జరుగుతుంది. కందుకూరు రెవెన్యూ డివిజన్‌కు సంబంధించి కందుకూరు టీఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో ఒకటి, ప్రకాాశం ఇంజినీరింగ్ కాలేజీలోని మెయిన్బ్లాక్లో 5 మండలాలు, పీజీ బ్లాక్‌లో 5 మండలాలు, పాలిటెక్నిక్ బ్లాక్‌లో 5 మండలాలకు కౌంటింగ్ జరుగుతుంది. మార్కాపురం సమీపంలోని దరిమడుగు వద్ద ఉన్న ఇందిరా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో ఏడు మండలాలు, అదే ప్రాంతంలోని శామ్యూల్‌జార్జి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మరో 8 మండలాలకు ఎన్నికల కౌంటింగ్ నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రాదేశిక ఎన్నికల కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు కలెక్టర్ విజయకుమార్ తెలిపారు. భారీ బందోబస్తు ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్ : మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా భారీ బందోబస్తు నిర్వహించనున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద బందోబస్తును డీఎస్పీలు పర్యవేక్షిస్తారని ఎస్పీ పి.ప్రమోద్‌కుమార్ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఒంగోలు రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఐదు మండలాల కౌంటింగ్ స్థానిక రావ్ అండ్ నాయుడు ఇంజినీరింగ్ కళాశాలలో, ఎస్ఎస్ఎన్ ఇంజినీరింగ్ కళాశాలలో 23 మండలాల కౌంటింగ్ జరుగుతుందన్నారు. రావ్ అండ్ నాయుడు ఇంజినీరింగ్ కళాశాల వద్ద చీరాల డీఎస్పీ నరహర బందోబస్తు పర్యవేక్షిస్తారు. ఎస్ఎస్ఎన్ ఇంజినీరింగ్ కళాశాలలోని కౌంటింగ్ కేంద్రాల వద్ద ఒంగోలు డీఎస్పీ పి.జాషువా బందోబస్తు పర్యవేక్షిస్తారు. కందుకూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని మండలాల కౌంటింగ్‌ను కందుకూరులో నిర్వహిస్తున్నారు. అక్కడ కందుకూరు డీఎస్పీ శంకర్ బందోబస్తు పర్యవేక్షిస్తారు. మార్కాపురం రెవెన్యూ డివిజన్ పరిధిలోని కౌంటింగ్‌ను మార్కాపురం డీఎస్పీ పర్యవేక్షణలో బందోబస్తు నిర్వహిస్తారు. వీరితో పాటు ప్రతి కౌంటింగ్ కేంద్రంలో ఐదుగురు సీఐలు, 10 మంది ఎస్సైలు, 35 మంది ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు విధులు నిర్వహిస్తారు. సోమవారం సాయంత్రమే ఏయే ప్రాంతాల్లో విధులు నిర్వహించాలో చార్టు తయారు చేసి బాధ్యతలు ఆయా డీఎస్పీలకు అప్పగించారు. ప్రతి కౌంటింగ్ కేంద్రంలో వీరితో పాటు ఏఆర్ పోలీసు బలగాలు ఉంటాయి. వీరంతా మంగళవారం ఉదయం 6 గంటల నుంచే కౌంటింగ్ కేంద్రాల వద్ద విధుల్లో ఉంటారు. జిల్లాలోని తీవ్ర సమస్యాత్మక గ్రామాలను గుర్తించి కౌంటింగ్ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఎలాంటి గొడవలకు తావు లేకుండా పోలీస్ పికెట్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ వివరించారు. -
‘పుర’ ఫలితం నేడే
సాక్షి, ఒంగోలు: మున్సిపల్.. స్థానికం.. సార్వత్రికం.. వరుస ఎన్నికల నిర్వహణ ప్రక్రియ సజావుగా పూర్తవడంతో.. ఇక ఓట్ల లెక్కింపును కూడా ప్రశాంతంగా ముగించాలని జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. తొలుత సోమవారం మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఆ మేరకు ఒంగోలులోని రావ్ అండ్ నాయుడు ఇంజినీరింగ్ కళాశాలలో కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. జిల్లాలో ఒంగోలు కార్పొరేషన్, కందుకూరు మున్సిపాలిటీల ఎన్నికలు కోర్టు వ్యాజ్యాల నేపథ్యంలో వాయిదా పడగా, మార్కాపురం, చీరాల మున్సిపాలిటీలతో పాటు అద్దంకి, చీమకుర్తి, గిద్దలూరు, కనిగిరి నగర పంచాయతీలకు మార్చి నెల 30వ తేదీ పోలింగ్ జరిగింది. మున్సిపల్ ఎన్నికలకు ఈవీఎంలు వినియోగించడంతో ఓట్ల లెక్కింపు సైతం సులువుగా, వేగంగా పూర్తికానుంది. ఉదయం 8 గంటలకే ప్రారంభం కానున్న లెక్కింపు ప్రక్రియలో తొలుత పోస్టల్ బ్యాలెట్లను పార్టీలవారీగా లెక్కించి.. అనంతరం ఈవీఎంలను వార్డుల వారీగా లెక్కించనున్నారు. మొత్తం 14 టేబుళ్లు ఏర్పాటు చేసిన క్రమంలో ఒక్కోరౌండ్‌కు 14 వార్డుల ఓట్లను లెక్కించవచ్చు. ప్రతీ రౌండ్‌కు అర్ధగంట నుంచి ముప్పావుగంట సమయం పడుతుంది. కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాట్లపై కలెక్టర్ విజయకుమార్ ఇప్పటికే అధికారులతో సమావేశం నిర్వహించి సూచనలు, సలహాలు అందజేశారు. కౌంటింగ్ జరిగే ప్రాంతాల్లో ఆదివారం ఆయన పర్యటించారు. టేబుళ్ల సంఖ్యకు అనుగుణంగా సిబ్బందిని కూడా అదనంగానే నియమించి ఓట్ల లెక్కింపును ప్రశాంతంగా వేగవంతంగా పూర్తిచేయాలని కసరత్తు చేస్తున్నారు. మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు ఇలా.. ఆరు మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపుపై మున్సిపల్ కమిషనర్లు ఇతర అధికారులతో ఇప్పటికే కలెక్టర్ విజయకుమార్ సమీక్ష నిర్వహించారు. ఆయా కౌంటింగ్ కేంద్రాల్లో ఒక్కోరౌండ్‌కు 14 టేబుళ్లు ఏర్పాటు చేయనున్నారు. అంటే, ఒక్కోవిడత 14 వార్డుల్లో ఓట్లను లెక్కించవచ్చు. జిల్లాలో ఎన్నికలు జరిగిన మున్సిపాలిటీల్లో 20 నుంచి 30 వార్డులున్నాయి. అంటే, 20 వార్డులున్న మున్సిపాలిటీల ఓట్లలెక్కింపు రెండు రౌండ్లలోనూ, 30 వార్డులుంటే వాటి లెక్కింపు మూడు రౌండ్లలోనూ పూర్తికానుంది. ప్రతీ అర్ధగంట నుంచి ముప్పావుగంటకో రౌండ్ ముగియనుంది. ఆమేరకు ఉదయం 8 గంటలకే ప్రారంభం కానున్న ఓట్ల లెక్కింపు ఉదయం 10.30 నిముషాలకల్లా పూర్తికానుంది. 11 గంటలకల్లా తుది ఫలితాలు వెల్లడించి.. విజేతలకు ధ్రువీకరణలు అందజేయనున్నారు. అభ్యర్థుల ఉత్కంఠ.. మున్సిపల్ కౌంటింగ్ కేంద్రం వద్ద లెక్కింపు సమయాన పోటీచేసిన అభ్యర్థులతో పాటు ఆయా పార్టీల ఏజెంట్లను కూడా అనుమతించనున్నారు. పార్టీలవారీగా రౌండ్ ఫలితాలను ఏజెంట్ల సమక్షంలోనే లెక్కించనున్నారు. మొట్టమొదటి సారిగా మున్సిపల్ ఎన్నికలు ఎదుర్కొన్న నాలుగు నగర పంచాయతీలతో పాటు రెండు మున్సిపాలిటీల పరిధిలో బరిలో నిల్చిన అభ్యర్థుల్లో సోమవారం కౌంటింగ్‌పై ఉత్కంఠ నెలకొంది. అన్నిచోట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్, టీడీపీ మధ్యనే ప్రధాన పోటీ నెలకొనగా.. చీరాల, గిద్దలూరులో స్వతంత్ర అభ్యర్థులూ గట్టిపోటీనే ఇచ్చారు. పట్టణ ఓటర్ల నాడి మున్సిపాలిటీల్లో ఎలా పనిచేసింది.. ఆ ప్రభావం సార్వత్రిక ఎన్నికలపైనా ఉంటుందా..? అనే భావనలో రాజకీయ పార్టీల నేతలంతా ఉత్కంఠతో ఉన్నారు. -
ఓటు వేయడం బాధ్యత
ఒంగోలు కలెక్టరేట్/సెంట్రల్, న్యూస్‌లైన్ : ఓటర్లంతా ఓటు వేయడాన్ని బాధ్యతగా భావించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయకుమార్ సూచించారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును అర్హులంతా వినియోగించుకోవాలని, నూరుశాతం ఓటింగ్ జరిపి సమర్థులైన పాలకులను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. స్వీప్ ఆధ్వర్యంలో స్థానిక చర్చిసెంటర్లో పొదుపు సంఘాల సభ్యులతో శనివారం ఓటుహక్కుపై చైతన్య కార్యక్రమం నిర్వహించారు. ముందుగా పొదుపు సంఘాల మహిళలు స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నుంచి ప్రదర్శనగా బయలుదేరి చర్చి సెంటర్‌కు చేరుకున్నారు. జిల్లా ఎన్నికల అధికారి విజయకుమార్ వారిచేత ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పొదుపు సంఘాల సభ్యులంతా మానవహారంగా ఏర్పడి ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటుహక్కు వినియోగించుకోవాలంటూ నినాదాలు చేశారు. నగరంలోని వీధుల్లో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీ సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని ఓటర్లంతా ఓటుహక్కు వినియోగించుకోవాలని కోరారు. ఓటు హక్కుపై ఓటర్లలో చైతన్యం కోసం జిల్లావ్యాప్తంగా గ్రామస్థాయిలో కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వాలే పాలన సాగించాలన్నారు. అలాంటి పరిపాలన కోసం అర్హులంతా ఓటువేసి ప్రపంచ వ్యాప్తంగా దేశానికి వన్నె తీసుకురావాలని విజయకుమార్ కోరారు. కార్యక్రమంలో స్వీప్ నోడల్ అధికారి, స్టెప్ సీఈఓ బీ రవి, ఒంగోలు ఆర్డీవో ఎంఎస్ మురళి, ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సీహెచ్ విజయలక్ష్మి, సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డెరైక్టర్ సరస్వతి, మెప్మా పీడీ కమలకుమారి పాల్గొన్నారు. -
భగ్గు..భగ్గు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: తెలుగుదేశం పార్టీ జిల్లాలో అభ్యర్థులను ప్రకటించినప్పటి నుంచి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. అభ్యర్థులపై అసమ్మతి పెరిగిపోతోంది. ఐవీఆర్ఎస్ విధానం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తామని పేర్కొన్న పార్టీ అధిష్టానం హామీ ఏమైందని కార్యకర్తలు నిలదీస్తుండటంతో ఏం చెప్పాలో తెలియక నాయకులు నీళ్లు నములుతున్నారు. ఐవీఆర్ఎస్ విధానంలో తాము సూచించిన పేర్లు కాకుండా..అధిష్టానం నిర్ణయం మేరకే అభ్యర్థులను ప్రకటిస్తున్నారని అంటున్నారు. అంతమాత్రానికి ఐవీఆర్ఎస్ విధానంలో తమ సూచనలు తీసుకోవడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. వీటిలో దర్శి, పర్చూరు నియోజకవర్గాలు తప్ప మిగిలిన అభ్యర్థులందరిపైనా ఆపార్టీ నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకా రెండు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. సంతనూతలపాడును బీజేపీకి కేటాయించడంతో ఆ నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. శనివారం కూడా సమావేశమై, ఇటీవల తెలుగుదేశంలో చేరిన కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే విజయకుమార్‌ను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయించడానికి తీర్మానం ఆమోదించారు. అద్దంకి నియోజకవర్గానికి తాము కరణం బలరాం పేరును సూచించగా కరణం వెంకటేష్‌ను అభ్యర్థిగా ప్రకటించారని కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చీరాల అభ్యర్థిగా పోతుల సునీత పేరును తాము వ్యతిరేకించామని అక్కడి కార్యకర్తలు చెబుతున్నారు. స్థానికేతరురాలైన సునీత తెలంగాణ ప్రాంతానికి చెందిన మహిళని, దీంతో ఆమె పేరును తాము సూచించకపోయినా..ఆమెనే అభ్యర్థిగా ఖరారు చేశారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒంగోలు అభ్యర్థిత్వంపై దామచర్ల కినుక: టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ కందుకూరు సీటు ఇవ్వాలని చంద్రబాబును కోరారు. అయితే ఆయనకు ఒంగోలు సీటు కేటాయించడంతో ఆయన అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఒంగోలులో గెలిచే అవకాశాలు తక్కువని..అయినా పార్టీ తనకు ఈ సీటు కేటాయించిందని వాపోతున్నారు. ఒంగోలులో పోటీ చేయడం కన్నా ..పోటీ నుంచి విరమించుకోవడం ఉత్తమమనే భావనలో ఉన్నట్లు సమాచారం. కనిగిరిలో కదిరి బాబూరావును అభ్యర్థిగా ప్రకటించడంపై కూడా కార్యకర్తలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేయడం కూడా సరిగ్గా రాని వ్యక్తిని తిరిగి అదే స్థానం నుంచి ఎందుకు పోటీ చేయిస్తున్నారని, ఆయన తప్ప ఆ నియోజకవర్గంలో అభ్యర్థులే కరువయ్యారా అని ప్రశ్నిస్తున్నారు. మార్కాపురంలో సిట్టింగ్ ఎమ్మెల్యే పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని తెలిసి కూడా కందుల నారాయణరెడ్డికి సీటును కేటాయించడంపై కేడర్ అసంతృప్తితో ఉంది. -
రాష్ట్రపతి పాలనలో కీలకంగా సలహాదారులు
హైదరాబాద్: రాష్ట్రపతి పాలన సమయంలో గవర్నర్ సలహాదారులు కీలకంగా ఉంటారు. గవర్నర్ సలహాదారుల కోసం పలువురి పేర్లను పరిశీలిస్తున్నారు. ఆంధ్రా క్యాడర్ 1969 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అనుగ్రహ నారాయణ్ తివారి పేరును పరిశీలిస్తున్నారు. కృష్ణకాంత్ మన రాష్ట్రానికి గవర్నర్‌గా ఉన్న సమయంలో తివారి సెక్రటరీగా పనిచేశారు. ఆయన గతంలో డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ సెక్రటరీగా కూడా పనిచేశారు. గవర్నర్ మరో సలహాదారుగా మాజీ ఐపీఎస్ విజయ్‌కుమార్ పేరును కూడా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర అంతర్గత భద్రత సలహాదారుగా ఆయన ఉన్నారు. విభజన విషయంలోనూ ఆయన సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. ఆపరేషన్ వీరప్పన్ కేసుతో విజయ్‌కుమార్ వెలుగులోకి వచ్చారు. మాజీ ఐఏఎస్ అధికారి పి.సి.పరేఖ్ పేరును కూడా పరిశీలిస్తున్నారు.