Visakhapatnam District News
-
ఆక్రమణలకు పాల్పడితే చర్యలు
విశాఖ సిటీ: వీఎంఆర్డీఏకు సంబంధించిన వాణిజ్య సముదాయాలు, ఖాళీ స్థలాలను లీజుకు తీసుకున్న వారు కేటాయించిన స్థలం కంటే ఎక్కువగా ఆక్రమిస్తే చర్యలు తప్పవని వీఎంఆర్డీఏ చైర్పర్సన్ ప్రణవ్‌గోపాల్, మెట్రోపాలిటన్ కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. కై లాసగిరి రోప్ వే ఎదురుగా ఉన్న రాక్పార్క్లో సంస్థ కేటాయించిన స్థలం కంటే ఎక్కువగా ఆక్రమించి వ్యాపారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఆ దుకాణాన్ని సీజ్ చేసినట్లు వెల్లడించారు. వ్యాపారులకు కేటాయించిన స్థలంలోనే కార్యకలాపాలు నిర్వహించుకోవాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవని స్పష్టం చేశారు. -
ఖజానాపై భారం తగ్గించుకోడానికే..
తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్‌ను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచుతామని ఎన్నికల ముందు చంద్రబాబు ప్రకటించారు. దీంతో లబ్ధిదారులు కూటమికి అధికారాన్ని కట్టబెట్టారు. అయితే ఆ హామీ నిలబెట్టుకునేందుకు కూటమి ప్రభుత్వం అడ్డదారులను వెతుకుతోంది. ఈ నేపథ్యంలో ఖజనాపై భారం తగ్గించుకోవడానికి లబ్ధిదారుల సంఖ్యను కుదించాలని నిర్ణయించింది. ఇప్పటికే ప్రతి నెలా పింఛనుదారుల్లో కోత విధిస్తూ వచ్చింది. తాజాగా తనిఖీల పేరుతో భారీ సంఖ్యలో పింఛన్‌దారులను తొలగించాలని నిర్ణయించింది. అయితే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా లేరన్న అక్కసుతో స్థానిక నేతల ఒత్తిళ్లతో కొంత మంది పేరు తప్పిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఎన్నికల ఫలితాల ముందు వరకు పింఛన్లు అందించిన అధికారులు.. ఈ రెండు నెలల్లో కుంటిసాకులు చెప్పి కొంత మంది పేర్లను తొలగించడం గమనార్హం. -
వేచి చూసి.. నిరాశతో వెనుదిరిగి..
సింహాచలం: పంచగ్రామాల భూసమస్య పరిష్కారం కోసం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ని కలిసేందుకు అడవివరంలోని పాత గోశాల వద్ద వేచి ఉన్న సమైక్య ప్రజా రైతు సంక్షేమ సంఘం, జనసేన నాయకులకు నిరాశ ఎదురైంది. శనివారం ఉదయం నగరం నుంచి అడవివరం మీదుగా పెందుర్తి వైపు పవన్ కల్యాణ్ వెళ్తున్నారని తెలిసి.. భూ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లేందుకు వీరంతా అడవివరం పాతగోశాల వద్దకు చేరుకున్నారు. వర్షం పడుతున్నా పవన్ కోసం గొడుగులు వేసుకుని మరీ ఆయన రాక కోసం వేచి చూశారు. ఫ్లకార్డులు పట్టుకుని తమ సమస్య పరిష్కరించాలని నినాదాలు చేశారు. తీరా పవన్ కల్యాణ్ గోశాలకు చేరుకోవడం, కారు నుంచే అభివాదం చేసుకుని వెళ్లిపోవడం క్షణాల్లో జరిగిపోయింది. దీంతో జన సైనికులు, సమైక్య ప్రజా రైతు సంక్షేమ సంఘం నాయకులు నిరాశతో అక్కడి నుంచి వెనుదిరిగారు. -
పగ
పండుటాకులపై ● అనర్హుల పేరుతో పింఛన్ ఏరివేతకు కూటమి ప్రభుత్వం సిద్ధం ● ఆరు దశలలో సర్వే నిర్వహిస్తున్న సిబ్బంది ● పెన్షన్ రూ.4 వేలు చేయడంతో భారాన్ని తగ్గించుకునే కుట్ర ● భారీగా లబ్ధిదారుల్లో కోత పెట్టాలని నిర్ణయం ● ఇందిరానగర్‌లో చేపట్టిన సర్వేలో 5 శాతం తొలగింపునకు చర్యలు మహారాణిపేట: పండుటాకులపై కూటమి ప్రభుత్వం పగబట్టింది. అనర్హుల పేరుతో సామాజిక పింఛన్ల ఏరివేతకు సిద్ధమవుతోంది. పింఛన్ భారాన్ని తగ్గించుకోడానికి భారీ ఎత్తున కోత విధించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఆరు దశల (సిక్స్ స్టెప్ సర్వే) పరిశీలన ప్రక్రియను శరవేగంగా చేపడుతోంది. తద్వారా ఏళ్ల తరబడి పెన్షన్ పొందుతున్న లబ్ధిదారుల సంఖ్యను గణనీయంగా తగ్గించాలని భావిస్తోంది. ఇటీవల ఇందిరానగర్–2లో చేపట్టిన సర్వేలో ఐదు శాతం లబ్ధిదారులను అనర్హులుగా అధికారులు తేల్చారు. దీంతో అన్ని సామాజిక పింఛనుదారుల్లో ఆందోళన నెలకొంది. కూటమి అధికారంలోకి రాగానే2014లో అధికారంలోకి రాగానే జన్మభూమి కమిటీల పేరిట... ఉన్న పెన్షన్లకు టీడీపీ ప్రభుత్వం ఎలా కోత విధించిందో.. ఈసారీ సీన్ రిపీట్ చేసింది. ఈ ఏడాది ఎన్నికల నోటిఫికేషన్ సమయానికి మార్చి నెలలో విశాఖ జిల్లాలో 1,65,891 మంది పింఛనుదారులుండేవారు. కానీ ప్రస్తుతం 1,61,584 మందే ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఇప్పటి వరకు 4,307 మంది లబ్ధిదారులను తొలగించారు. నెల నెలా కోత.. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మొత్తం 1,65,891 మంది లబ్ధిదారులు ఉండేవారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత : జూలైలో 1,64,239 మందికి మాత్రమే పింఛను అందజేశారు. ఆగస్టులో పింఛన్‌దారుల సంఖ్య 1,62,490కి తగ్గిపోయింది. సెప్టెంబర్‌లో 1.62 లక్షలమందికి కుదించారు. అక్టోబర్‌లో లబ్ధిదారుల సంఖ్య 1,61,969, నవంబర్, డిసెంబర్లో 1,61,584 మంది లబ్ధిదారులను కుదించారు. -
దరఖాస్తుల ఆహ్వానం
డాబాగార్డెన్స్: జీవీఎంసీ తరఫున స్టాండింగ్ కౌన్సిల్ నియమించేందుకు న్యాయవాదుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జీవీఎంసీ కమిషనర్ పి.సంపత్‌కుమార్ శనివారం ప్రకటనలో పేర్కొన్నారు. 8 మంది న్యాయవాదుల నియామకం కోసం నోటిఫికేషన్ స్థానిక బార్ కౌన్సిల్ నందు ప్రకటించామన్నారు. ఓపెన్ కేటగిరీ (ఓసీ జనరల్)–4, బీసీ–ఏ–1, బీసీ–బీ–1, ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ 1, ఎస్టీ 1 పోస్టులకు సంబంధించి దరఖాస్తులు కోరుతున్నట్టు చెప్పారు. న్యాయవాదులు బార్ కౌన్సిల్లో కనీసం పదేళ్ల సభ్యుడిగా రిజిస్ట్రేషన్ కల్గి ఉండిన వారు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. దరఖాస్తులు జీవీఎంసీ ప్రధాన కార్యాలయానికి అందజేయాలని, చివరి తేదీ జనవరి 6, 2025గా నిర్ణయించామన్నారు. -
అభివృద్ధి పనులకు ఎక్కువ నిధులు కేటాయించాలి
డాబాగార్డెన్స్: జీవీఎంసీ అభివృద్ధి పనులకు సంబంధించి బడ్జెట్లో అధిక నిధులు కేటాయించాలని, అందుకు తగిన విధంగా బడ్జెట్‌ను సవరించాలని స్థాయీ సంఘం సభ్యులు మేయర్ గొలగాని హరి వెంకటకుమారి అధ్యక్షతన అధికారులను కోరారు. జీవీఎంసీ 2025–26 బడ్జెట్‌పై శనివారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో మేయర్, స్థాయీ సంఘం చైర్పర్సన్ గొలగాని వెంకటకుమారి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. స్థాయీ సభ్యులకు బడ్జెట్లో పొందుపరచిన అంశాలను అధికారులు వివరించారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు జీవీఎంసీకి వస్తాయని, జన్మభూమి–2లో భాగంగా నగరంలో ప్రతిపాదించే వివిధ అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తూ బడ్జెట్లో పెట్టాలన్నారు. గత ప్రభుత్వంలో ఎస్సీ ఉప ప్రణాళిక నిధులు రాలేదని, ఇకపై ఆయా నిధులకు కూడా బడ్జెట్లో కేటాయింపులు చేయాలని కోరారు. సమావేశంలో స్థాయీ సంఘం సభ్యులతో పాటు అదనపు కమిషనర్ ఎస్ఎస్ వర్మ, ప్రధాన ఇంజినీరు శివప్రసాదరాజు, ఎ గ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ వాసుదేవరెడ్డి, అసిస్టెంట్ ఎగ్జామినర్ ఆదినారాయణ, చార్టర్డ్ అకౌంటెంట్ స త్యనారాయణ పలువురు అధికారులు పాల్గొన్నారు. -
సమన్వయంతో నావికాదళ విన్యాసాలు
ఏయూక్యాంపస్: సాగర తీరంలో జనవరి 4వ తేదీన నిర్వహించనున్న నావికాదళ విన్యాసాల నిర్వహణలో అందరూ సమన్వయంతో విజయవంతం చేయాలని కలెక్టర్ ఎం.ఎన్ హరేందిర ప్రసాద్ పిలుపునిచ్చారు. నావికాదళం, జీవీఎంసీ, వీఎంఆర్డీఏ కమిషనర్లతో కలిసి శనివారం ఆయన క్షేత్రస్థాయి పర్యటించారు. విశ్వప్రియ ఫంక్షన్ హాల్, ఆర్.కె బీచ్ పరిసర ప్రాంతాలలో ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రధాన వేదిక నిర్మాణం, ఫైర్ వర్క్, లేజర్ షో, డ్రోన్ షో నిర్వహణ, ఇతర ఏర్పాట్లపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇతర మంత్రులు భాగస్వామ్యం కానున్న నేపథ్యంలో పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా బారికేడింగ్ పూర్తిస్థాయిలో చేయాలని, పబ్లిక్ అడ్రస్ సిస్టం పక్కాగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ చెప్పారు. నేవీ, జిల్లా అధికారులతో క్షేత్రస్థాయిలోసమీక్షించిన కలెక్టర్ హరేందిర ప్రసాద్ -
సేవా సంబరం
జనాభిమానం..పండగలా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలు జన హృదయనేత..మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడువైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలు శనివారం జిల్లా అంతటా వేడుకగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానుల ఆధ్వర్యంలో రక్తదానాలు, అన్నదానాలు, చీరలు పంపిణీ వంటి సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు బర్త్‌డే కేక్‌లు కట్ చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి చల్లగా ఉండాలని మనసారా ఆశీర్వదించారు. పాల్గొన్న మాజీ మంత్రి అమర్నాథ్, పార్టీ నేతలుభీమిలి మండలం చిననాగమయ్యపాలెంలో 40 అడుగులజగన్ ఫ్లెక్సీ రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావుకు కేక్ తినిపిస్తున్న మేయర్ గొలగాని హరి వెంకట కుమారి. చిత్రంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్, ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి,పండుల రవీంద్రబాబు, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్, సమన్వయకర్త కె.కె రాజు. ● గాజువాక నియోజవర్గంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో 66, 67, 72, 68, 70, 72,74, 86, 87వ వార్డుల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ● విశాఖ దక్షిణలో 29, 31, 33, 34, 35, 37, 41వ వార్డుల్లో ఆయా కార్పొరేటర్లు, వార్డు ఇన్చార్జిల అధ్యర్యలో నిర్వహించిన వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే గణేష్‌కుమార్ పాల్గొన్నారు. ● విశాఖ ఉత్తరలో 14, 44, 46,47, 49వ వార్డుల్లో నిర్వహించిన వేడుకల్లో సమన్వయకర్త కె.కె రాజు పాల్గొన్నారు. వృద్ధులకు పండ్లు, మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ● భీమిలి నియోజకవర్గంలో అర్బన్, రూరల్ పరిధిలో జగన్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేశారు. ● విశాఖ తూర్పులో 28వ వార్డులో పల్లా దుర్గారావు ఆధ్వర్యంలో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పాల్గొన్నారు. ● పెందుర్తి నియోజవర్గంలో మాజీ ఎమ్మెల్యే, సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్‌రాజ్ ఆధ్వర్యంలో పెందుర్తి మండలం రాంపురంలో నిర్వహించిన వేడుకల్లో మాజీ మంత్రి బూడి ముత్యాలనాయుడు పాల్గొన్నారు. ● విశాఖ పశ్చిమలో 40,56,52,57,59, 60,62,63,89,90 వార్డుల్లో వేడుకలు నిర్వహించారు. సాక్షి, విశాఖపట్నం: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలంతా ఓ పండగలా నిర్వహించుకున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ కొనియాడారు. కోట్లాది మంది అభిమానులు, వైఎస్సార్ సీపీ శ్రేణులు జగనన్నను ఆశీర్వదించారన్నారన్నారు. శనివారం మద్దిలపాలెం పార్టీ జిల్లా కార్యాలయంలో గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ సీపీ సీనియర్ నేత మారుతి ప్రసాద్ నిర్వహణలో గుడివాడ అమర్నాథ్, రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, పండుల రవీంద్రబాబు, మేయర్ గొలగాని హరివెంకట కుమారి, ఉత్తర సమన్వయకర్త కె.కె రాజు, మాజీ ఎంపీ గొడ్డేటి మాధవి కేక్ కట్ చేశారు. అనంతరం వైఎస్సార్ సీపీ సీనియర్ నేత మొల్లి అప్పారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్తో పాటు బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ పూర్ణానంద శర్మ, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు. జిల్లా ఎస్సీ విభాగం నాయకులు బోని శివరామకృష్ణ ఆధ్వర్యంలో అమర్నాథ్, గొల్ల బాబూరావులు మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో లబ్ధి పొందిన కోట్లాది ప్రజలంతా మళ్లీ సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావాలని కోరుకుంటున్నారన్నారు. రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు మాట్లాడుతూ..వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని, ఈ రాష్ట్రానికి మళ్లీ ముఖ్యమంత్రిగా సంక్షేమ పాలన అందించాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, పండుల రవీంద్ర మాట్లాడుతూ..గత ఐదేళ్లలో పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందజేసి సంక్షేమ పాలన తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డిదేన న్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్‌కుమార్, తైనాల విజయకుమార్, తిప్పలనాగిరెడ్డి, చింతలపూడి వెంకట్రామయ్య, డిప్యూటీ మేయర్ కె. సతీష్, పార్టీ కార్యాలయ పర్యవేక్షకులు రవిరెడ్డి, రాష్ట్ర పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు జాన్‌వెస్లీ, పేర్ల విజయ్‌చందర్, మహంతి, పార్టీ ముఖ్యనాయకులు రొంగలి జగన్నాథం, చొక్కాకుల వెంకంట్రావ్, తిప్పల దేవాన్‌రెడ్డి, జహీర్ అహ్మద్, కొండా రాజీవ్‌గాంధీ, ద్రోణంరాజు శ్రీవాత్సవ్, పేడాడ రమణకుమారి, మాధవీవర్మ, ఐహెచ్ ఫరూకీ, కాళిదాస్‌రెడ్డి, కృష్ణంరాజు, అడ్డాల కృపాజ్యోతి, రామన్నపాత్రుడు, బాజీనాయుడు, వానపల్లి ఈశ్వరరావు, బొండా ఉమామహేశ్వరరావు, పెండ్ర అప్పన్న, తుల్లి చంద్రశేఖర్, రోజారాణి, రాజేశ్వరి,రాధ, జగదీష్, కొల్లి సింహాచలం, కార్పొరేటర్లు కె.సునీత, అనిల్ కుమార్రాజు, మువ్వల లక్ష్మి, సురేష్, పద్మారెడ్డి, బిపిన్‌కుమార్ జైన్, మసిగపోగురాజు, కోడిగుడ్ల పూర్ణిమ, శ్రీధర్, అల్లు శంకర్రావు, రెయ్యి వెంకటరమణ, బర్కత్ అలీ, శశికళ, మహమ్మద్ ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. -
24 నుంచి మళ్లీ వర్ష సూచన
వానలకు తాత్కాలిక విరామం సాక్షి, విశాఖపట్నం: మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు వరుణుడు తాత్కాలిక విరామం ప్రకటించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం విశాఖ జిల్లాపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. గడిచిన మూడు రోజుల్లో పలుచోట్ల దాదాపు 100 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ముసురు వాతావరణం నెలకొనడంతో.. చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రెండు రోజులుగా వర్షాల కారణంగా పాఠశాలలు, కాలేజీలకు వెళ్లేందుకు ఇక్కట్లు పడిన విద్యార్థులకు.. జిల్లా కలెక్టర్ శనివారం సెలవు ప్రకటించడంతో కాస్తా ఉపశమనం పొందారు. పాదచారులు, వాహనదారులు అవస్థలు పడ్డారు. శనివారం మధ్యాహ్నం వరకూ చిరు జల్లులుగా కురిసింది. సాయంత్రం నుంచి వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో.. విశాఖ వాసులు కాస్తా ఉపశమనం పొందారు. ఇదిలావుండగా ఈ నెల 24,25 తేదీల్లో జిల్లాలో మళ్లీ ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ ప్రకటించింది. -
బాలికల రవాణాకు అడ్డుకట్ట
తాటిచెట్లపాలెం: విశాఖపట్నం రైల్వేస్టేషన్ మీదుగా తమిళనాడుకు తరలిస్తున్న 11 మంది బాలికలను ఇటీవల రైల్వే పోలీసులు రక్షించారు. ఇందులో 9 మంది మైనర్లు ఉన్నారు. వీరంతా ఒడిశా రాష్ట్రం నవరంగ్‌పూర్‌కు చెందినవారు. ఒడిశాకు చెందిన రవిబిష్ణోయ్ వీరిని తమిళనాడుకు తరలిస్తుండగా పట్టుబడ్డాడు. విశాఖపట్నం రైల్వే పోలీసులు అతన్ని విచారించి, కేసును ఒడిశా పోలీసులకు బదిలీ చేశారు. బాలికలను ప్రస్తుతం ప్రభుత్వ వసతి గృహంలో ఉంచారు. వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారు వచ్చిన తర్వాత కౌన్సెలింగ్ ఇచ్చి అప్పగించనున్నట్లు తెలిసింది. -
కేజీహెచ్ సీఎస్‌ఆర్‌ఎంవోగా డాక్టర్ శ్రీహరి
మహారాణిపేట: వైద్య ఆరోగ్యశాఖలో పలువురికి పదోన్నతులు కల్పిస్తూ వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.టి.కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతి డీఎంహెచ్‌వో డాక్టర్ యు.శ్రీహరిని కేజీహెచ్ సీఎస్‌ఆర్‌ఎంవోగా నియమించారు. జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి(డీఐవో) ఎస్.జీవన్రాణిని విజయనగరం డీఎంహెచ్‌వోగా పదోన్నతి కల్పించి బదిలీ చేశారు. అనకాపల్లి జిల్లా కె.కోటపాడు సీహెచ్‌సీ వైద్యుడు ఎస్.శ్రీనివాస్‌ను ప్రభుత్వ విక్టోరియా ఆస్పత్రి సీఎస్‌ఆర్‌ఎంవోగా, శ్రీకాకుళం డీఎంహెచ్‌వో డాక్టర్ బి.మీనాక్షిని విశాఖలోని రీజినల్ ట్రైనింగ్ సెంటర్(ఆర్టీసీ) ప్రిన్సిపాల్‌గా నియమించారు. -
బుల్లయ్య విద్యార్థులకు అంతర్జాతీయ గుర్తింపు
సీతంపేట: డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాల లైఫ్ సైన్స్ విద్యార్థుల పరిశోధనకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. బీఎస్సీ లైఫ్ సైన్స్(బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ) ఆఖరి సంవత్సరం చదువుతున్న టి.హర్షిత, ఎ.తేజాంబిక్, జె.కార్తికేయ, ఎం.అశ్విని ఎన్విరాన్మెంటల్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బి.మాధవి, జువాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బి.శైలజ మార్గదర్శకత్వంలో ‘విశాఖపట్నం సముద్ర తీరంలో సముద్రపు గడ్డి, పచ్చిక భూములను పునరుద్ధరించే బ్లూ కార్బన్ ఎకో సిస్టం పయనీరింగ్’అనే అంశంపై పరిశోధన చేశారు. స్టూడెంట్ సొసైటీ ఫర్ కై ్లమేట్ చేంజ్ అవేర్నెస్(ఎస్‌ఎస్‌సీసీఏ), సీడ్స్ ఆఫ్ పీస్(యూఎస్ఏ) సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన పోటీలో ఈ పరిశోధనను ఎంపిక చేశాయి. తదుపరి అధ్యయనాల కోసం విద్యార్థులు 2025 ఫిబ్రవరిలో 10 రోజుల ఫెలోషిప్ ప్రోగ్రాంకు అమెరికా వెళ్లనున్నారు. ఒడిశా రాష్ట్రంలోని చిలికా సరస్సు నుంచి హలోఫిలా ఓవాలిస్, హలోడ్యూల్ ఫినిఫోలియా అనే రెండు రకాల సముద్రపు గడ్డి జాతులను ఎంపిక చేసి, వాటికి అనుకూలమైన వాతావరణం కల్పించారు. తర్వాత ప్రయోగశాలలోనే సాగు చేశారు. సాగు చేసిన గడ్డి జాతులను నగరంలోని సముద్ర తీర ప్రాంతంలో తిరిగి నాటారు. దీంతో పరిశోధనలో తొలి దశ పూర్తి అయిందని వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ వాతావరణంలోని కార్బన్ డయాకై ్సడ్‌ను ఈ గడ్డి జాతులు పీల్చుకుని గ్లోబల్ వార్మింగ్(వేడిని) తగ్గించడంలో సహాయపడటం ఈ పరిశోధన ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమన్నారు. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రెండు జట్లలో ఒకటిగా బుల్లయ్య విద్యార్థులు నిలవడం కళాశాలకు గర్వకారణమని కళాశాల కరస్పాండెంట్ జి.మధుకుమార్ అన్నారు. డిగ్రీ ప్రిన్సిపాల్ జీఎస్కే చక్రవర్తి, అధ్యాపకులు విద్యార్థులను అభినందించారు. -
గ్యాస్ట్రో ఇంటెస్టినల్ క్యాన్సర్ చికిత్సపై సదస్సు
ఏయూక్యాంపస్: మహాత్మా గాంధీ క్యాన్సర్ ఆస్పత్రి, రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో శనివారం నగరంలోని ఓ హోటల్లో ఇండియన్ సొసైటీ ఆఫ్ మెడికల్ అండ్ పీడియాట్రిక్ ఆంకాలజీ 4వ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా వంద మందికి పైగా ప్రతినిధులు పాల్గొనగా.. మహాత్మా గాంధీ క్యాన్సర్ ఆస్పత్రి ఎండీ డాక్టర్ వి.మురళీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్యాస్ట్రో ఇంటెస్టినల్ క్యాన్సర్ చికిత్సలో అపార అనుభవం కలిగిన 30 మంది నిపుణులు పలు అంశాలు వివరించారు. సదస్సులో భాగంగా గ్యాస్ట్రో ఇంటెస్టినల్ క్యాన్సర్ల నిర్ధారణ, చికిత్స, నిర్వహణలో తాజా పురోగతిపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కోర్సులో కేసు–ఆధారిత చర్చలు, ఆసక్తిదాయక ప్రసంగాలు, తాజా పరిశోధనలు, వైద్య రంగంలో జరుగుతున్న మార్పులు, ఆవిష్కరణలపై విస్తృతంగా చర్చించారు. డాక్టర్ పుష్ప బారిక్, డాక్టర్ సదాశివుడు, డాక్టర్ కృపాశంకర్ తదితరులు పాల్గొని విశిష్ట ప్రసంగాలు చేశారు. -
రష్యాలో గాజువాక వాసి మృతి
గాజువాక: రష్యాలో వెల్డర్‌గా పని చేస్తున్న ఒక వ్యక్తి మృతి చెందాడు. మరణానికి కచ్చి తమైన కారణాలు తెలియలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. వివరాలివీ. గాజువాకలోని ఎల్బీఎస్ నగర్‌కు చెందిన ఎం.నారాయణ(35) స్థానిక ప్రజ్ఞా వెల్డింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా ఏడాదిన్నర కిందట వెల్డర్‌గా పని చేసేందుకు రష్యాలోని ఒక కంపెనీకి వెళ్లాడు. ఏడాది అగ్రిమెంట్ ముగిసిన వెంటనే ఇక్కడికి తిరిగి ఇచ్చాడు. ఇక్కడ 20 రోజులు గడిచిన తర్వాత ఆ కంపెనీ నారాయణ అగ్రిమెంట్‌ను రెన్యువల్ చేయడంతో 6నెలల కిందట మళ్లీ రష్యా వెళ్లాడు. అయితే అతడు మృతి చెందినట్టు ఆ కంపెనీ ప్రతినిధులనుంచి ఈ నెల 13న తమకు సమాచారం అందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. నారాయణకు భార్య కుసుమ, ఇద్దరు కుమారులు, తల్లి, తండ్రి ఉన్నారు. మృత దేహం ఢిల్లీ వరకు వచ్చిందని, సోమవారం గాజువాకకు వస్తుందని కుటుంబ సభ్యులు తెలిపారు. -
కళా ప్రపంచం.. కనులకు ఆనందం
విశాఖ విద్య: ఆంధ్ర విశ్వవిద్యాలయం ఫైన్ ఆర్ట్స్ విభాగంలో ఏర్పాటు చేసిన ‘ఫైన్ ఆర్ట్స్ ఫెయిర్–2024’ లో ప్రదర్శించిన చిత్రాలు విద్యార్థుల సృజనాత్మకతకు అద్దం పడుతున్నాయి. ఫైన్ ఆర్ట్స్ కోర్సు అభ్యసిస్తున్న విద్యార్థులు తమ కళా నైపుణ్యంతో అద్భుత కళాఖండాలు సృష్టించారు. తమ ప్రతిభను రంగరించి అపురూప చిత్రాలు గీశారు. వారు కేవలం ఒక మాధ్యమానికే పరిమితం కాకుండా సమకాలీన అంశాలను స్పృశిస్తూ శిల్పాలు, ఇతర విజువల్ ఆర్ట్స్‌ను కూడా ప్రదర్శించగా.. అవి సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ ప్రదర్శనను శనివారం ఏయూ వీసీ ఆచార్య జి. శశిభూషణరావు ప్రారంభించారు. విద్యార్థులు తీర్చిదిద్దిన కళాఖండాలను, అలంకరణ వస్తువులను తిలకించి వారిని ప్రశంసించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏయూ శతాబ్ది ఉత్సవాలకు సంబంధించిన లోగో రూపకల్పనకు త్వరలో పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. విభాగాధిపతి ఆచార్య డి.సింహాచలం మాట్లాడుతూ ఈ ప్రదర్శన ఈ నెల 29 వరకు కొనసాగుతుందన్నారు. ఏయూ రెక్టార్ ఎన్. కిశోర్ బాబు, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఎ. నరసింహారావు, విభాగ బీవోఎస్ చైర్మన్ శిష్ట్లా శ్రీనివాస్, మయూక దేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విభాగం ఆధ్వర్యంలో నూతనంగా ప్రారంభించిన ప్రత్యేక సంచిక ‘కాన్వాస్’ను వీసీ ఆవిష్కరించారు. ఆకట్టుకుంటున్న ఫైన్ ఆర్ట్స్ ఫెయిర్–2024 -
నమ్మిదొడ్డిలో కుళ్లిన మృతదేహం లభ్యం
అగనంపూడి: పెదగంట్యాడ మండలం నమ్మిదొడ్డి లక్ష్మీనగర్‌లోని ఒక రేకుల షెడ్డులో కుళ్లిపోయిన మృతదేహాన్ని గుర్తించారు. దువ్వాడ సీఐ మల్లేశ్వరరావు తెలిపిన వివరాలివీ.. హిందూజా పవర్ ప్లాంట్‌లో మెయింటెనెన్స్ పనులు నిర్వహించే కాంట్రాక్టర్ మద్ది వెంకటరావు వివిధ రాష్ట్రాలకు చెందిన కూలీలను ఇక్కడికి రప్పించి, లక్ష్మీనగర్‌లోని రేకుల షెడ్లలో వారికి వసతి కల్పించారు. అక్కడి నుంచి రోజూ కూలీలను పనుల కోసం హిందూజా పవర్‌ప్లాంట్‌కు తీసుకువెళ్లేవారు. కాంట్రాక్ట్ పనులు ముగియడంతో కూలీలు మార్చిలో వారి స్వస్థలాలకు వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఈ రేకుల షెడ్లు ఖాళీగా ఉన్నాయి. మళ్లీ పనులు మొదలు కావడంతో కూలీలకు వసతి కల్పించేందుకు షెడ్లు, పరిసర ప్రాంతాలను శనివారం శుభ్రం చేయడానికి ఉపక్రమించారు. అయితే ప్రహరీకి, షెడ్డుకు మధ్యలో కుళ్లిన మృతదేహాన్ని కూలీలు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఉండడంతో ఎలాంటి వివరాలు లభ్యం కాలేదు. మృతదేహంపై నీలి రంగు ట్రాక్ ప్యాంట్ మాత్రమే ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్ తరలించారు. -
రసవత్తరంగా నృత్యరూపకం
మద్దిలపాలెం: కళాభారతి ఆడిటోరియంలో వార్షిక నృత్యోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండవ రోజు శనివారం శ్రీకృష్ణ పారిజాతం నృత్య రూపకం నయనానందకరం సాగింది. సెంట్రల్ సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత, కళారత్న బాలకొండలరావు శిష్య బృందం ఈ నృత్య రూపకాన్ని అద్భుతంగా ప్రదర్శించి ఆకట్టుకుంది. ముందుగా ఈ కార్యక్రమాన్ని కళాభారతి ట్రస్ట్ కార్యదర్శి గుమ్మూలూరి రాంబాబు, ముఖ్య అతిథి ఎ.మధుకుమార్, బాలకొండలరావు, టేకుముళ్ల శ్యామల జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం నృత్య కళాకారుల పదర్శించిన శ్రీకృష్ణ పారిజాతం నృత్యరూపకం ప్రేక్షకుల హృదయాలను కట్టిపడేసింది. ప్రతి సన్నివేశాన్ని చక్కని నాట్య భంగిమలతో రక్తికట్టించారు. -
అవకాశాలను అందిపుచ్చుకోవాలి
నెల్లిమర్ల రూరల్: అవకాశాలను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని నయంత విశ్వ విద్యాలయం సీఈవో ప్రొఫెసర్ రంజన్ బెనర్జీ పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని టెక్కలి సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో వర్సిటీ 4వ స్నాతకోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన రంజన్ బెనర్జీ మాట్లాడుతూ ఏ రంగంలోనైనా విద్యార్థులు తమ అభిరుచులకు అనుగుణంగా కృషి చేసినప్పుడే గొప్ప విజయాలు సొంతమవుతాయన్నారు. ఉన్నత స్థాయికి వెళుతూనే ఇతరులకు చేయూతనివ్వాలన్నారు. ఇతరుల జీవితాల్లో చిరునవ్వులు చూడగలిగినప్పుడే మంచి విజయాలు సాధించినవారమవుతామన్నారు. సెంచూరియన్ వర్సిటీ అధ్యక్షుడు ప్రొఫెసర్ ముక్తికాంత మిశ్రా, ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ డీఎన్‌రావు విద్యార్థులు సాధించిన విజయాలను ప్రశంసించారు. వర్సిటీ చాన్సలర్ జీఎస్ఎన్ రాజు మాట్లాడుతూ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నాణ్యమైన విద్యను అందిస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. ఏడేళ్ల వ్యవధిలోనే దేశంలో అగ్రశ్రేణి విశ్వ విద్యాలయాల్లో ఒకటిగా సెంచూరియన్ అవతరించిందన్నారు. వైస్ చాన్సలర్ ప్రశాంత కుమార్ మహంతి మాట్లాడుతూ వర్సిటీను వ్యాపారం కోసం స్థాపించబడలేదని, శక్తివంతమైన విద్యార్థులను సమాజానికి అందించేందుకు నిరంతర కృషి చేస్తున్నామన్నారు. అనంతరం 201 మంది విద్యార్థులకు డిగ్రీలు, మరో ఐదుగురు విద్యార్థులకు పీహెచ్‌డీలు, 16 మందికి బంగారు పతకాలు, 8 మందికి నగదు ప్రొత్సాహకాలను వక్తలు అందజేశారు. కార్యక్రమంలో భువనేశ్వర్ వర్సిటీ వీసీ సుప్రియా పట్నాయక్, రిజిస్ట్రార్ పల్లవి, పాలకమండలి సభ్యుడు, పారిశ్రామికవేత్త కుమార్ రాజా, డాక్టర్ పి.ఎస్.ఠాగూర్, ప్రొఫెసర్ కె.సి.బి.రావు, పీఎన్ఎస్వీ నరసింహం, ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. నయంత యూనివర్సిటీ సీఈఓ రంజన్ బెనర్జీ సెంచూరియన్‌లో ఘనంగా స్నాతకోత్సవం -
పారిశుధ్య కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలి
మహారాణిపేట: కార్మిక చట్టాల ప్రకారం జిల్లాలో సఫాయి కర్మచారి(పారిశుధ్య కార్మికులు)లకు కనీస వేతనం చెల్లించాలని జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ సభ్యుడు డాక్టర్ పి.పి. వావా అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. సఫాయి కర్మచారుల సామాజిక, ఆర్థిక, విద్యా స్థితిగతులను అధ్యయనం చేసి, సమాజంలో గౌరవంగా జీవించే అవకాశం కల్పించాలన్నారు. వారికి ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని, బ్యాంకు రుణాలు మంజూరు చేయాలన్నారు. కార్మికులకు గుర్తింపు కార్డులు జారీ చేయాలన్నారు. పారిశుధ్య కార్మికులకు ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేయాలన్నారు. కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్, జీవీఎంసీ కమిషనర్ పి.సంపత్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో పారిశుధ్య కార్మికులకు అందజేస్తున్న ప్రభుత్వ పథకాలు, వారి సంక్షేమానికి అందజేస్తున్న ఇతర సదుపాయాలను వివరించారు. అనంతరం పారిశుధ్య కార్మికులతో స్వయంగా కమిషన్ సభ్యులు డాక్టర్ పి.పి. వావా మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రామారావు, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సత్య పద్మ, కమిషన్ అడ్వైజర్ మెంబర్ సురేంద్ర నాథ్, డీసీపీ–1 అజిత, జిల్లా రెవెన్యూ అధికారి భవాని శంకర్, జిల్లా అధికారులు, పలువురు పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు. -
ప్రగతి విహారం
విమానయానం...విశాఖ నుంచి ప్రతి నెలా పెరుగుతున్న సర్వీసులుకొత్తగా రెండు అంతర్జాతీయ సర్వీసులు ఈ ఏడాది కొత్తగా రెండు అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభమయ్యాయి. విశాఖ నుంచి బ్యాంకాక్‌కు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. విశాఖ నుంచి కౌలాలంపూర్‌కు ఏప్రిల్ 26వ తేదీ నుంచి వారానికి 3 విమానాలు నడుస్తున్నాయి. భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రారంభించేందుకు విమానయాన సంస్థలతో చర్చలు జరుపుతున్నారు. విదేశీ విమాన ప్రయాణికులు రికార్డు స్థాయిలో పెరిగారు. 2023 నవంబర్‌లో 5,165 మంది రాకపోకలు సాగించగా.. ఈ ఏడాది నవంబర్‌లో 83.45 శాతం అధికంగా 9,475 మంది ప్రయాణించారు. అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా గతేడాది 35 ఉండగా తాజాగా 77కు పెరిగి 120 శాతం వృద్ధిని సాధించాయి. విశాఖ సిటీ : శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నుంచి విమానాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. రాష్ట్ర ఆర్థిక రాజధానిగా ఎదుగుతున్న విశాఖ నుంచి విమానయానానికి ప్రాధాన్యం పెరుగుతోంది. దేశీయంగానే కాకుండా విదేశీ ప్రయాణికుల సంఖ్య కూడా నానాటికి రెట్టింపు అవుతోంది. ఉత్తరాంధ్ర వాసులే కాకుండా ఒడిశా నుంచి ప్రయాణికులు పెద్ద సంఖ్యలో విశాఖ విమానాశ్రయం నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో ప్రతి ఏడాది ప్రయాణికుల సంఖ్య పెరుగుతూ పోతోంది. ఇందుకు తగ్గట్టుగానే ఎయిర్‌పోర్టులో సౌకర్యాలతో పాటు దేశయ, విదేశీ విమాన సర్వీసులు పెరుగుతుండడంతో గత ఏడాది కాలంలో మరింత అద్భుతమైన అభివృద్ధి, పురోగతి సాధించింది. ప్రతి రోజు 9 వేల మంది రాకపోకలు కోవిడ్ కారణంగా తగ్గిన విమాన సర్వీసులు, ప్రయాణికుల రాకపోకల్లో వృద్ధి నమోదవుతోంది. 2023 నవంబర్‌లో 2,06,213 మంది దేశీయ ప్రయాణికులు రాకపోకలు సాగించగా.. ఈ ఏడాది అదే నెలలో ఆ సంఖ్య 16.62 శాతం వృద్ధితో 2,40,494కు చేరుకుంది. అలాగే దేశీయ విమాన సర్వీసులు 2023 కంటే ఇప్పుడు 17.94 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ప్రయాణికుల సంఖ్య కూడా విస్తృతంగా పెరగడంతో అందుకు తగ్గట్టుగానే విమాన సర్వీసులు పెరిగాయి. ఒకవైపు దేశీయంగానే కాకుండా విదేశీ విమాన సర్వీసులు కూడా క్రమేపీ పెరుగుతున్నాయి. ప్రస్తుతం విశాఖ విమానాశ్రయం నుంచి రోజుకు 9 వేల మంది దేశ, విదేశీ ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. పెరిగిన విమాన సర్వీసులు విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు ప్రాధాన్యత పెరుగుతుండడంతో కొత్త విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. కోవిడ్‌కు ముందు రోజుకు 23 నుంచి 25 సర్వీసులు ఉండగా ప్రస్తుతం 30 నుంచి 35 సర్వీసులు నడుస్తున్నాయి. ఇందులో ప్రధానంగా ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చైన్నె, హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, తిరుపతి, కర్నూల్, జైపూర్, పోర్ట్ బ్లెయిర్లకు ఇండిగో, ఎయిర్ ఇండియా సర్వీసులు ఉన్నాయి. అలాగే విదేశీ ప్రయాణికుల సంఖ్య కూడా పెరుగుతుండడంతో ఇండియా వన్ ఎయిర్, స్కూట్, థాయ్ ఎయిర్ ఏషియా, ఎయిర్ ఏషియా బెర్హాద్ ఎయిర్‌లైన్స్ సింగపూర్, బ్యాంకాక్, కౌలాలంపూర్‌లకు సర్వీసులు నడుపుతున్నాయి. ఈ ఏడాది అక్టోబర్ వరకు విశాఖ నుంచి విజయవాడకు ఒక విమానం మాత్రమే ఉండేది. ఇప్పుడు ఆ సంఖ్య మూడుకు చేరుకుంది. అలాగే ఒడిశా రాష్ట్రంలోని మల్కన్‌గిరి నుంచి విశాఖకు విమానాన్ని ప్రారంభించేందుకు ఇండియా వన్ ఎయిర్ సిద్ధంగా ఉంది. ఇందుకు ఒడిశా ప్రభుత్వం కూడా ఆమోదించింది. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఇలా అన్ని సర్వీసుల ఆక్యుపెన్సీ కూడా 80 నుంచి 95 శాతం నమోదవుతుండడం విశేషం. సంవత్సరం దేశీయ ఇంటర్నేషనల్ ప్రయాణికులు ప్రయాణికులు 2018–19 27,03,261 1,50,370 2019–20 25,47,992 1,43,580 2020–21 11,06,451 8,192 2021–22 16,28,317 2981 2022–23 24,35,618 65,171 2023–24 27,22,722 66,192 2024–25 (నవంబర్) 18,22,202 81,760 -
బైజూస్ పాఠాలకు బూజు
ప్రభుత్వ బడుల్లో చదువుకునే విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడాలనే సంకల్పంతో ఎనిమిదో తరగతి విద్యార్థులకు బైజూస్ ట్యాబ్‌లను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అందజేసింది. 2022–23లో జిల్లాలోని 11,223 మంది విద్యార్థులకు బైజూస్ ట్యాబ్‌లను అందజేశారు. అలాగే ఎనిమిదో తరగతికి బోధన చేసే 1,116 మంది ఉపాధ్యాయులకు సైతం వీటిని పంపిణీ చేశారు. అలాగే 2023–24 విద్యా సంవత్సరంలో 10,562 మంది విద్యార్థులకు ట్యాబ్‌లను పంపిణీ చే శారు. ప్రస్తుతం వీటన్నింటినీ మూలనపడేశారు. ఇంగ్లిష్ మీడియంకు ప్రాధాన్యమిస్తూ డిజిటల్ విద్యాబోధనకు వైఎస్పార్ సీపీ ప్రభుత్వంలో తగిన శ్రద్ధ చూపారు. జిల్లాలోని 132 ఉన్నత పాఠశాలల్లో 1,185 ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్(ఐఎఫ్‌పీ) ఏర్పాటు చేశారు. ప్రాథమిక పాఠశాలల్లో 146 స్మార్ట్ టీవీలను అమర్చారు. కానీ ప్రస్తుతం పాఠశాలల్లో వీటి వినియోగంపై ఏమాత్రం దృష్టి సారించడం లేదు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముద్రను పూర్తిగా చెరిపేయాలనే అక్కసుతో కూటమి ప్రభుత్వ పెద్దలు విద్యార్థులకు తీవ్ర నష్టం చేస్తున్నారు. -
తక్కువ చార్జీలతో పార్సిల్ డోర్ డెలివరీ
● మంత్రి రాంప్రసాద్‌రెడ్డి ● కార్గో డోర్ డెలివరీ మాసోత్సవాలు ప్రారంభం డాబాగార్డెన్స్: అతి తక్కువ డోర్ డెలివరీ చార్జీలతో వేగంగా పార్సిల్ ఇంటికే చేరవేసేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ద్వారకా బస్టేషన్లో ఏపీఎస్ఆర్టీసీలో కార్గో డోర్ డెలివరీ మాసోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే నెల 19వరకు మాసోత్సవాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. 2024–25 ఏడాదికి గాను రాష్ట్రం మొత్తం మీద పార్సిల్ ఆదాయం టార్గెట్ రూ.500 కోట్లు కాగా, ఇప్పటి వరకు 70 శాతం అందుకున్నామని తెలిపారు. అనంతరం మంత్రి ద్వారకాబస్టేషనల్లో అన్ని విభాగాలు తనిఖీ చేశారు. ప్రయాణికులతో ముచ్చటించారు. కార్యక్రమంలో ఆర్టీసీ జోనల్ చైర్మన్ దొన్ను దొర, విజయనగరం జోనల్ ఈడీ విజయ్‌కుమార్, జిల్లా ప్రజా రవాణా అధికారి బి.అప్పలనాయుడు, డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ సత్యనారాయణ, డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజనీర్ కె.రాజశేఖర్, వీఅండ్ ఎస్ఓ ఐవీవీపీ దుర్గాప్రసాద్, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ పీబీఎంకే రాజు, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ బాపిరాజు పాల్గొన్నారు. -
చదువులపై ప్రభావం చూపకూడదు
ప్రభుత్వం ఏదైనా పిల్లల చదువుల కోసం కార్యక్రమాలు అమలు చేయాల్సిందే. పాలకుల చర్యలు పిల్లల చదువులపై ప్రభావం చూపకూడదు. కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే డీఎస్సీ ప్రకటించి, ఉపాధ్యాయ నియామకాలు చేస్తామన్నారు. కానీ దీనిపై కాలయాపన కనిపిస్తోంది. ఉపాధ్యాయులను బోధనేతర పనులకు వినియోగిస్తుండటంతో స్కూళ్లలో విద్యా బోధన కుంటుపడుతోంది. అకడమిక్ కార్యకాలపాలను నిర్వీర్యం చేయడం వల్ల విద్యావ్యవస్థకు నష్టం వాటిల్లుతోంది. – టీఆర్ అంబేడ్కర్, జిల్లా కార్యదర్శి, యూటీఎఫ్ -
అందుబాటులోకి డిజిటల్ విద్య
పాఠశాలలో పూర్తిస్థాయి వసతులు విద్యారంగాన్ని విస్మరించిన నేటి కూటమి ప్రభుత్వంవిప్లవాత్మక మార్పులతో సత్ఫలితాలు విద్యారంగంపై పెట్టే ఖర్చు జాతి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తుందని నమ్మిన దార్శనికుడు.. సామాన్యులకు సైతం కార్పొరేట్ చదువులను అందుబాటులోకి తెచ్చిన విద్యాప్రదాత.. తన పుట్టిన రోజైన డిసెంబరు 21న ప్రతి ఏటా 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేసి అత్యున్నత ప్రమాణాలను అందుబాటులోకి తెచ్చిన క్రాంతిదర్శి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లు విద్యారంగానికి స్వర్ణయుగం.. ఆనాడు చదువులకే అగ్రతాంబూలం.. మరి నేటి కూటమి ప్రభుత్వంలో ఒక్క పైసా కూడా విదల్చని నిర్లక్ష్యం.. భవిష్యత్తు అగమ్యగోచరం. -
చతికిలబడి
వెలుగుల జడినాడునేడుజగనన్న పాలనలో పేద పిల్లల చదువులకు పెద్దపీటరుచీపచీ లేని మధ్యాహ్న భోజనం 2024–25 విద్యా సంవత్సరంలో నమోదైన గణాంకాల మేరకు 581 పాఠశాలల్లోని 72,892 మంది విద్యార్థులకు బడిలో మధ్యాహ్న భోజనం అందించేలా ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులు చేస్తోంది. వీటిలో 338 స్కూళ్లలోని సుమారు 47 వేల మంది విద్యార్థులకు అక్షయ పాత్ర ఫౌండేషన్ ద్వారా భోజనం సరఫరా చేస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు పెద్ద పీట వేసేలా వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో మెనూ రూపొందించగా.. ప్రస్తుతం ఇదే కొనసాగుతోంది. వారంలో ఐదు రోజులు కోడిగుడ్లు, రోజుకో రకమైన వంటకం, వేరుశనగ చిక్కీ,రాగి జావ రుచిగా, శుచిగా అందించడంతో విద్యార్థులు ఎంతో ఇష్టపడి తినేవారు. కూటమి ప్రభుత్వం మెనూ మార్పు చేస్తామని ప్రకటన చేయడంతో.. ప్రస్తుతం విద్యార్థులకు అందించే భోజనంలో నాణ్యత లోపించింది. జిల్లా విద్యాశాఖాధికారులు సరైన పర్యవేక్షణ చేయకపోవడంతో బడి భోజనం అధ్వానంగా తయారైంది. వండిన పదార్థాలు రుచిగా లేక.. చాలా పాఠశాలల్లో విద్యార్థులు ఇళ్ల నుంచే క్యారేజీలు తెచ్చుకుని తింటున్న దుస్థితి నెలకొంది. ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చేదెప్పుడో.? ఉన్నత విద్యనభ్యసించే పేద విద్యార్థులకు 2019కు ముందు చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి కోర్సుకై నా ఏడాదికి రూ.35వేలు మాత్రమే ఇచ్చేది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయటంతో పాటు ఠంఛన్‌గా నిధులు మంజూరు చేశారు. కానీ కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్మెంట్ అమలుకు ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదు. ఫలితంగా కాలేజీల యాజమాన్యాలు ఫీజు కట్టాలని విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నాయి. దీంతో పేద విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఫీజుల కట్టలేక సతమతమవుతున్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో వసతి దీవెన, విద్యాదీవెన అమలు ఇలా.. సంవత్సరం విద్యార్థులు మంజూరైన డబ్బులు విద్యార్థులు మంజూరైన డబ్బులు (వసతి దీవెన) (విద్యా దీవెన) 2019–20 41,913 110,48,84,249 39,549 36,87,92,500 2020–21 49,205 97,52,68,301 49,332 46,10,22,500 2021–22 49,090 120,25,51,441 49,427 44,90,82,500 2022–23 45,326 93,41,66,638 45,267 41,11,35,000