Vishnu Vishal
-
హిట్ సినిమాకు సీక్వెల్.. ఈసారి ఏకంగా ఫాంటసీ కథతో!
విష్ణు విశాల్, దర్శకుడు రామ్ కుమార్ కాంబోలో వచ్చిన హిట్ సినిమా 'రాక్షసన్'. 2018లో ప్రేక్షకుల ముందుకొచ్చి సంచలన విజయాన్ని సాధించింది. తెలుగులోనూ 'రాక్షసుడు' పేరుతో రీమేక్ అయి, హిట్ సొంతం చేసుకున్నారు. ఇప్పుడు దీనికి సీక్వెల్ రెడీ చేస్తున్నారట.(ఇదీ చదవండి: Society Of The Snow Review: కన్నీళ్లు ఆపుకునే శక్తి ఉంటే ఈ సినిమా చూడండి)'రాక్షసన్' సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీతో తీయగా.. ఇప్పుడు దీని సీక్వెల్‌ని ఫాంటసీ జానర్లో తీస్తారట. ఇప్పటికే షూటింగ్ మొదలైంది. ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. విష్ణు విశాల్ రీసెంట్గా ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన 'లాల్ సలామ్'తో వచ్చాడు. కానీ ఇది ఘోరమైన డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో ఇతడికి 'రాక్షసన్ 2' హిట్ కావడం చాలా కీలకం. మరి ఏం చేస్తారో చూడాలి?(ఇదీ చదవండి: నా భర్తతో హోటల్ రూమ్‌లో ఆ హీరోయిన్.. అందుకే విడాకులు: శ్రీదేవి) -
నాలుగేళ్ల గొడవ క్లియర్.. హీరో-కమెడియన్ కలిసిపోయారు!
ఆ ఇద్దరూ సినిమా ఇండస్ట్రీకి చెందినవాళ్లే, కలిసి 7 సినిమాలు చేశారు. ఆ తరువాత ఓ విషయంలో ఒకరిని ఒకరు తీవ్రంగా విమర్శించుకున్నారు. కేసులు పెట్టుకున్నారు. అలాంటిది తాజాగా ఒకే ఫొటోలో నవ్వుతూ కనిపించారు. పైన చెప్పిన నటులెవరో కాదు. తమిళ ఇండస్ట్రీకి చెందిన విష్ణువిశాల్, హాస్య నటుడు సూరి. (ఇదీ చదవండి: సమంత, శ్రుతి హాసన్.. ఇద్దరూ ఆ ప్రాజెక్ట్ నుంచి ఔట్!) విష్ణువిశాల్ హీరోగా, సూరి హాస్య నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కలిసి 7 సినిమాలు చేశారు. కానీ ఓ స్థలం విషయంలో ఇద్దరి మధ్య వివాదం చోటుచేసుకుంది. విష్ణువిశాల్, అతడి తండ్రి తనను మోసం చేశారని 2020లో నటుడు సూరి తీవ్ర ఆరోపణలు చేయడంతో పాటు పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టాడు. ఈ వివాదం చాలాకాలం కొనసాగింది. నటుడు విష్ణువిశాల్ తండ్రి రమేష్.. మాజీ డీజీపీ. ఇటీవల లాల్ సలామ్ చిత్ర ప్రచార వేదికపై కూడా తమ మధ్య నెలకొన్న సమస్య గురించి తానూ, నటుడు సూరి చర్చించుకుంటున్నామని విష్ణు విశాల్ పేర్కొన్నారు. అలాంటిది ఇప్పుడు సడన్‌గా నటుడు విష్ణువిశాల్ ఆయన తండ్రి రమేష్, సూరితో కలిసి ఉన్న ఫొటోను తన ఎక్స్మీడియాలో పోస్ట్ చేశారు. అందులో టైమ్ అన్నింటికీ, అందరికీ బదులిస్తుంది. ఐలవ్ యూ నాన్న హీరో విష్ణు విశాల్ పేర్కొన్నారు. అలాగే నటుడు సూరి కూడా జరిగేవన్నీ మంచికే అని తన ఎక్స్ మీడియాలో పేర్కొన్నారు. దీంతో వీరి మధ్య సమస్య పరిష్కారం అయ్యిందని అందరూ అనుకుంటున్నారు. (ఇదీ చదవండి: స్టెప్పులతో అదరగొట్టిన రాజమౌళి.. వీడియో వైరల్!) TIME is the answer to everything and everyone.. Let the positivity flow @sooriofficial na.. Love u appa ..... pic.twitter.com/Yvn28SR31B — VISHNU VISHAL - VV (@TheVishnuVishal) April 9, 2024 -
మరో ఆఫర్ అందుకున్న మలయాళ సెన్సేషన్
కోలీవుడ్‌లో కథానాయకుడిగా, నిర్మాతగా తనకుంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంసాదించుకున్నాడు హీరో విష్ణువిశాల్. ఈయన ఇంతకు ముందు కథానాయకుడిగా నటించిన రాక్షసన్ చిత్రం సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఆ చిత్ర దర్శకుడు రామ్‌కుమార్.. విష్ణువిశాల్‌తో మరో సినిమా తీసేందుకు రెడీ అయ్యారు. ఇది విష్ణువిశాల్ నటిస్తున్న 21వ చిత్రం అవుతుంది. ఇటీవలే షూటింగ్ మొదలవగా.. హీరోయిన్ ఎవరన్నది వెల్లడించలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం మలయాళ నటి మమితా బైజు నటించనున్నట్లు ఆమె ఫొటో వైరలవుతోంది. ఆల్రెడీ ఆమె షూటింగ్ సెట్స్‌లో అడుగుపెట్టిందని ప్రచారం జరుగుతోంది. ఈమె ఇటీవల వచ్చిన మలయాళ చిత్రం ప్రేమలుతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయింది. ఇప్పటికే ఆమె కోలీవుడ్‌లో జీవీ.ప్రకాశ్‌కుమార్ సరసన రెబల్ చిత్రంలో నటించింది. ఈమె నటించిన తొలి తమిళ చిత్రం ఇదే. ఇది ఈ నెల 15వ తేదీన తెరపైకి రానుంది. తాజాగా ఇప్పుడు విష్ణువిశాల్ సరసన నటించే అవకాశం ఈ భామను వరించిందన్న మాట. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రాన్ని దర్శకుడు రామ్‌కుమార్.. రాక్షసన్ చిత్రానికి భిన్నంగా ప్రేమతో కూడిన ఫాంటసీ కథా చిత్రంగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. చదవండి: ధనుష్ మా కుమారుడే అంటూ పిటిషన్.. తీర్పు ఇచ్చిన కోర్టు -
విష్ణువిశాల్ హీరోయిన్ ఎవరో తెలుసా..?
తమిళసినిమా: ఒక్కొక్కసారి కొన్ని చిత్రాల్లో ముందుగా అనుకున్న నటీనటులు ఆ తరువాత మారే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నటుడు శింబు విషయం లోనూ ఇదే జరిగిందని సమాచారం. వెందు తనిందదు కాడు చిత్రం తరువాత వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మాత ఐసరి గణేశ్ శింబు హీరోగా కరోనా కుమార్ పేరుతో చిత్రం చేయ తలపెట్టారు. దీనికి గోకుల్ దర్శకత్వం వహించనున్నట్లు ప్రకటించారు. అయితే కొన్ని కారణాల వల్ల నటుడు శింబు ఈ చిత్రం నుంచి వైదొలగినట్లు సమాచారం. దీంతో చాలాకాలంగా ఈ చిత్రం సెట్స్‌పైకి రాలేదు. కాగా తాజాగా కరోనా కుమార్ చిత్రం మరోసారి వార్తల్లోకెక్కింది. దీనికి కారణం ఇందులో నటుడు శింబు పోషించాల్సిన పాత్రకు నటుడు విష్ణువిశాల్ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. రజనీకాంత్ అతిథి పాత్రలో నటించిన లాల్ సలామ్ చిత్రంలో ఇద్దరు హీరోల్లో ఒకరిగా నటించిన విష్ణువిశాల్ ప్రస్తుతం తను సొంతంగా నిర్మిస్తున్న చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. కాగా తాజాగా కరోనా కుమార్ చిత్రానికి కమిట్ కావడం విశేషం. మరో విశేషం ఏమిటంటే ఇందులో ఆయనకు జంటగా నటి అదితి శంకర్ నటించబోతున్నట్లు సమాచారం. ఈమె ఇప్పుటికే చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం విష్ణువర్ధన్ దర్శకత్వంలో ఆకాశ్ మురళికి జంటగా నటిస్తున్నారు. దీని తరువాత సూర్య సరసన నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. సూర్య లేని సన్నివేశాలను దర్శకురాలు చిత్రీకరిస్తున్నారు. కాగా ఇందులో నటి అదితి శంకర్ నాయకిగా నటిస్తున్న విషయాన్ని చిత్ర వర్గాలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే కరోనా కుమార్ చిత్రంలో ఈమె నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్ర షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానుందని సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
కలెక్షన్సే లేని సినిమాకు సక్సెస్ పార్టీ.. ఇది మరీ విడ్డూరం!
సూపర్‌స్టార్ రజనీకాంత్ అతిథిగా పవర్ ఫుల్ పాత్రను పోషించిన చిత్రం లాల్ సలామ్. ఆయన పెద్ద కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటించారు. నటి నిరోషా, జీవిత రాజశేఖర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించగా, ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మించిన లాల్ సలామ్ చిత్రం భారీ అంచనాల మధ్య ఈ నెల 9వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి వచ్చింది. ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ చిత్రం అంతంతమాత్రంగానే వసూళ్లు రాబడుతోంది. థియేటర్లలో రిలీజైన ఈ మూవీ వరుసగా మూడవ వారంలోకి అడుగు పెట్టడంతో చిత్ర యూనిట్ శుక్రవారం చైన్నెలో సక్సెస్ పార్టీని జరుపుకుంది. ఈ పార్టీలో రజనీకాంత్‌తో పాటు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ పాల్గొనడం విశేషం. హీరోలు విష్ణు విశాల్, విక్రాంత్ ఇందులో పాల్గొనలేదు. కాగా లాల్ సలామ్ చిత్రం సక్సెస్ పార్టీ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేయగా నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కలెక్షన్సే లేని సినిమాకు సక్సెస్ పార్టీయా? అని ముక్కున వేలేసుకుంటున్నారు. மக்களின் பேரன்பிற்கும், பேராதரவிற்கும் நன்றி!!! 🙏🏻😇 Successful 2 weeks of LAL SALAAM, into the 3rd week today! 📽️✨#LalSalaam 🫡 Running Successfully 💥📽️@rajinikanth @ash_rajinikanth @arrahman @TheVishnuVishal @vikranth_offl @Ananthika108 @LycaProductions #Subaskaran… pic.twitter.com/fcCdDYDmMu — Lyca Productions (@LycaProductions) February 23, 2024 చదవండి: నాన్న వల్లే నా జీవితం నాశనం అయింది: వనితా విజయ్ కుమార్ -
హీరోగా ఎంట్రీ ఇస్తున్న విష్ణు విశాల్ సోదరుడు
చిత్ర పరిశ్రమలో సినీ తారల పిల్లలు, తోబుట్టువులు ఇండస్ట్రీకి పరిచయం కావడం కొత్తేమీ కాదు. ఆ కోవలోనే కోలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్న హీరో విష్ణు విశాల్ తమ్ముడు రుద్ర కూడా వెండి తెరపై ఎంట్రీ ఇస్తున్నాడు. హీరో విష్ణు విశాల్ తమ్ముడు రుద్ర కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం 'ఓహో ఎన్‌దన్ బేబీ'. ఈ సినిమాకు దర్శకనటుడు కృష్ణకుమార్ రామ్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటి మిథిలా పాల్కర్ కథనాయికగా నటిస్తోంది. కోలీవుడ్‌లో ఈమెకు ఇదే తొలి సినిమా కావడం విశేషం. ఎన్నై నోక్కి పాయుమ్ తోట్టా, ముల్ నీ ముడివుమ్ నీ వంటి చిత్రాలకు సంగీతాన్ని సమకూర్చిన తర్పుగ శివ ఓహో ఎన్‌దన్ బేబీ చిత్రానికి సంగీత దర్శకుడిగా బాధ్యతలు వహిస్తున్నారు. ఈ చిత్ర తొలి షెడ్యూల్ పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. మరో రెండు వారాలపాటు ఈ షెడ్యూల్ షూటింగ్ కొనసాగనుంది. తర్వాత గోవా, పాండిచ్చేరి వంటి వివిధ ప్రాంతాలలో మలి విడత షూటింగ్ జరపనున్నట్టు చిత్ర వర్గాలు వెల్లడించాయి. The big day is here for my brother @TheActorRudra ❤️ need all your blessings and support for us.. Thrilled to introduce him in #OhoEnthanBaby - shoot started today.. Producing it at @VVStudioz along with dear #RomeoPictures @mynameisraahul and @DCompanyOffl @DuraiKv.… pic.twitter.com/w9kZoVHgJB — VISHNU VISHAL - VV (@TheVishnuVishal) February 11, 2024 - పోడూరి నాగ ఆంజనేయులు చదవండి: బండ్లగణేశ్‌కు బిగ్ షాక్.. ఆ కేసులో జైలు శిక్ష ఖరారు! -
సూపర్ స్టార్ సినిమాకు షాక్.. ఇంత దారుణంగా ఎప్పుడు చూడలేదు!
సూపర్ స్టార్ రజినీకాంత్ అతిథి పాత్రలో నటించిన తాజా చిత్రం లాల్ సలామ్. గతేడాది జైలర్ సినిమాతో హిట్ కొట్టిన తలైవా ఈ ఏడాది తన కూతురి దర్శకత్వంలో నటించారు. యంగ్ హీరో విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రల్లో ఐశ్వర్య రజినీకాంత్ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ సినిమా అభిమానుల భారీ అంచనాల మధ్య శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రంలో తలైనా మొహిద్దీన్ భాయ్ అనే కీలక పాత్రలో నటించారు. రజినీకాంత్ సినిమాలంటే తెలుగు ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఇక కోలీవుడ్‌లో అయితే చెప్పాల్సిన పనిలిదు. రజినీకాంత్ మూవీ అంటే బాక్సాఫీస్ రికార్డులు బద్దవ్వాల్సిందే. కానీ ఎవరు ఊహించని లాల్ సలామ్ చిత్రానికి బిగ్ షాక్ తగిలింది. కోలీవుడ్‌లో ఫర్వాదలేనిపించినా.. తెలుగు ఆడియన్స్ మాత్రం ఈ మూవీని అస్సలు పట్టించుకోలేదు. స్పోర్ట్స్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా ఏకంగా మార్నింగ్ షోలు రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సూపర్ స్టార్ సినిమా తొలి రోజే చాలా చోట్ల మార్నింగ్ షోలు రద్దయ్యాయి. దీంతో హైదరాబాద్‌లో అయితే మల్టీప్లెక్స్‌ల్లో రజినీ సినిమా చూడాలనుకున్న తెలుగు ఆడియన్స్‌కు నిరాశే మిగిలింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల టికెట్లు కొనేవాళ్లు లేక మార్నింగ్ షోలు రద్దు చేశారు. అయితే ఇప్పటికే కొంత మంది టికెట్స్ బుక్ చేసుకోగా.. థియేటర్ల యాజమాన్యాలు వాళ్లకు డబ్బులు రీఫండ్ చేయడం గమనార్హం. తలైవా నటించిన సినిమాకు ఫస్ట్ డే ఫస్ట్ షోలకే ఇలాంటి పరిస్థితి ఎదురుకావడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే తెలుగులో పెద్దగా ప్రమోషన్స్ చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు టాలీవుడ్ బాక్సాఫీస్ బరిలో రవితేజ ఈగల్, జీవా, మమ్ముట్టి యాత్ర-2 సినిమాలు రిలీజ్ కావడం ఒక కారణమని తెలుస్తోంది. ఏది ఏమైనా రజినీకాంత్ ఉన్న ఇమేజ్ ప్రకారం కనీసం సగం థియేటర్లు అయినా నిండి ఉండాల్సింది. ఏకంగా స్టార్ హీరో సినిమాకు ఫస్ట్ షోలు రద్దు కావడంతో ఆడియన్స్ షాక్‌కు గురవుతున్నారు. మరి వీకెండ్లోనైనా లాల్ సలామ్‌ను ప్రేక్షకులు ఆదరిస్తారో లేదో వేచి చూడాల్సిందే. కాగా.. గతంలో రజనీకాంత్ సినిమాలను తెలుగు ఆడియన్స్ బాగానే ఆదరించారు. గతేడాది వచ్చిన జైలర్ మూవీ టాలీవుడ్లో మంచి వసూళ్లు రాబట్టింది. తెలుగులో అత్యధిక వసూళ్లు సాధించిన డబ్బింగ్ సినిమాల్లో మూడో స్థానంలో నిలిచింది. ఏకంగా రూ.47 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. -
ఓటీటీలో రికార్డు సృష్టించిన తమిళ మూవీ.. మరోసారి కాంబో రిపీట్
హీరో విష్ణువిశాల్ నటించిన హిట్ చిత్రాల్లో కట్టకుస్తీ ఒకటి. ఇది తెలుగులో మట్టి కుస్తీ పేరిట విడుదలైంది. 2022 డిసెంబర్లో విడుదలైన ఈ మూవీ మంచి విజయాన్ని సాధించింది. విష్ణు విశాల్ తన సొంత బ్యానర్లో నిర్మించిన ఈ చిత్రానికి సెల్లా ఆయువు దర్శకత్వం వహించారు. ఐశ్వర్యలక్ష్మి హీరోయిన్గా నటించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతేకాకుండా గత ఏడాది ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధిక ప్రేక్షకులు వీక్షించిన తమిళ చిత్రాలలో మూడవ స్థానంలో నిలిచింది. విష్ణు విశాల్, దర్శకుడు సెల్లా ఆయువు తాజాగా మరో చిత్రానికి కలిసి పనిచేయడానికి సిద్ధమయ్యారు. దీని గురించి విష్ణు విశాల్ వీడియోస్ సంస్థ మంగళవారం మీడియాకు అధికారికంగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. వేలైను వందుట్టా వెళ్లైక్కారన్, కట్ట కుస్తీ, ఎఫ్ఐఆర్ వంటి 10 విజయవంతమైన చిత్రాలను నిర్మించిన తమ సంస్థ నిర్మిస్తున్న 11వ చిత్రం ఇది అని తెలిపారు. ఇది కుటుంబ సపరివార సమేతంగా చూసి ఆనందించే పూర్తి వినోద భరిత కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఇందులో ప్రముఖ తారాగణం, సాంకేతిక వర్గం పని చేయనున్నారని, ప్రస్తుతం చిత్ర ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Vishnu Vishal (@thevishnuvishal) చదవండి: తల్లికి క్యాన్సర్.. బిగ్‌బాస్‌కు వెళ్లకుండా ఉండాల్సిందంటూ బోరున ఏడ్చిన నటి -
రజనీకాంత్ ‘లాల్ సలామ్’ రిలీజ్ డేట్ ఫిక్స్
రజనీకాంత్, లెజెండరీ క్రికెటర్ కపిల్‌దేవ్, జీవితా రాజశేఖర్ కీలక పాత్రల్లో విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటించిన చిత్రం ‘లాల్ సలామ్’. ఐశ్వర్యా రజనీకాంత్ దర్శకత్వంలో సుభాస్కరన్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తామని తొలుత చిత్రం యూనిట్ ప్రకటించింది. తాజాగా ‘లాల్ సలామ్’ సినిమాను ఫిబ్రవరి 9న విడుదల చేస్తామని మంగళవారం కొత్త విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. ‘‘హిందూ, ముస్లిం యువకులు వారెంతగానో ప్రేమించే క్రికెట్ ఆట విషయంలో మతం పేరుతో గొడవలు పడుతూ ఉంటే ఆ గొడవలను మొయిద్దీన్ భాయ్ (సినిమాలో రజనీ పాత్ర) ఎలా సర్దుబాటు చేశాడు? అన్నదే చిత్రకథాంశం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: ఎ.ఆర్. రెహమాన్. -
యంగ్ హీరో కొత్త సినిమా... ఆ స్టార్ డైరెక్టర్‌తో కలిసి
తమిళ యంగ్ హీరో విష్ణు విశాల్ కొత్త సినిమాని ప్రకటించాడు. ప్రస్తుతం ఐశ్వర్యా రజనీకాంత్ దర్శకత్వంలో 'లాల్ సలామ్'లో హీరోగా నటించాడు. ఇది జనవరి చివరి వారంలో థియేటర్లలోకి రానుంది. దీనితో పాటు 'ఆర్యన్' అనే యాక్షన్ ఎంటర్టైనర్ కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడు మరో స్టార్ డైరెక్టర్‌తో కొత్త మూవీ చేయడానికి రెడీ అయిపోయాడు. (ఇదీ చదవండి: ఆ ఫొటో పోస్ట్ చేసి గుడ్‌న్యూస్ చెప్పిన లావణ్య త్రిపాఠి) విష్ణు విశాల్ హీరోగా చేస్తూనే పలు సినిమాలని నిర్మించాడు కూడా. ఇప్పుడు కూడా డైరెక్టర్ గోకుల్‌తో చేయబోయే మూవీలో నటిస్తూ నిర్మిస్తున్నాడు. రౌద్రం, కాష్మోరా లాంటి చిత్రాలతో ఆకట్టుకున్న గోకుల్.. ఇప్పుడు విష్ణు విశాల్‌తో ఎలాంటి మూవీ తీస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభమైంది. త్వరలో ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలని వెల్లడించనున్నారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 29 సినిమాలు) Extremely happy to share the official announcement of my next - joining hands with @DirectorGokul for a BADASS entertainer ❤️ Got really excited on hearing this wacky, high octane action script based on a true story. Can't wait to get started soon. #VVStudioz10#RiseandShine… pic.twitter.com/Row3hgfE74 — VISHNU VISHAL - VV (@TheVishnuVishal) January 8, 2024 -
ఏడేళ్ల తర్వాత తెలుగులో...
విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా, సూపర్ స్టార్ రజనీకాంత్, క్రికెటర్ కపిల్ దేవ్, జీవితా రాజశేఖర్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘లాల్ సలామ్’. క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ సినిమాకు ఐశ్వర్యా రజనీకాంత్ దర్శకురాలు. శనివారం (జనవరి 6) కపిల్ దేవ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా కొత్త స్టిల్‌ను విడుదల చేశారు. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కావాల్సింది. అయితే వాయిదా పడింది. రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తారనే వార్త ఎప్పట్నుంచో ఉంది. శనివారం (జనవరి 6) రెహమాన్ బర్త్ డే సందర్భంగా యూనిట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘‘ఈ పాన్ ఇండియా చిత్రానికి బుచ్చిబాబు పవర్ఫుల్ స్క్రిప్ట్‌ని సిద్ధం చేశారు. యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథ ఇది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఇదిలా ఉంటే నాగచైతన్య హీరోగా రూపొందిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ (2016) తర్వాత ఏడేళ్లకు రెహమాన్ తెలుగులో సంగీతం అందిస్తున్న చిత్రం ఇదే. -
‘కుల్లనారి కూట్టం’ తమిళ మూవీ రివ్యూ
టైటిల్: కుల్లనారి కూట్టం(2011) నటీనటులు: విష్ణు విశాల్, రమ్య నంబీషన్, సూరి తదితరులు దర్శకత్వం: శ్రీబాలాజీ సంగీతం: వి.సెల్వగణేష్ సినిమాటోగ్రఫీ: జే.లక్ష్మణ్ ఎడిటర్: కాశీ విశ్వనాథన్ విడుదల తేది: మార్చి 25, 2011 ఓటీటీ: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ‘కుల్లనారి కూట్టం’ కథేంటంటే.. "సరే! రీచార్జ్ చెయ్యాల్సిన నెంబర్ చెప్పండి" అనడిగింది ఆ మోబైల్ షాపు అమ్మాయి ."9445199205" అన్నాడు ఆ అబ్బాయి. చివరి టూ జీరో పైవ్ అంటే రెండు సున్నాలు ఒక అయిదు అనుకుని ఆ 9445199005 నెంబర్‌కు రూ: 1500 రీచార్జ్ చేసింది ఆ అమ్మాయి . ఆ డబ్బులు సరాసరి ప్రియా నంబియార్ అనే ఎంతో చూడచక్కని అమ్మాయి మోబైల్ కు రీచార్జ్ అయ్యింది. అలా మొదలయ్యింది ఈ సినిమా కథ .ఆ కుర్రవాడి పేరు వెట్రివేళ్(విష్ణువిశాల్). అతని తండ్రి తనను ఒకరోజు పదిహేను వందల రూపాయలు కొడుకు చేతిలో పెట్టి తన మొబైల్ రీచార్జ్ చేయించమన్నాడు. ఆ డబ్బు తన తండ్రి మొబైల్ కి కాకుండా అలా ఊరూ పేరూ తెలియని ఓ ఆందగత్తె పాలయ్యింది. ఉద్యోగం గట్రా ఏవి లేని వెట్రివేళ్ కి ఉన్న ఆదాయమల్లా రోజువారి పాకెట్ మనీ స్కీములో లభించే కేవలం రూ 10 మరి ఎలాగని? ఎక్కడినుంచని? ఇంకో 1500 సంపాదించి తండ్రి పోన్ రీచార్జి భారం తీర్చుకుంటాడు? అదంతా ఆ చావంతా, ఆబ్రతుకంతా ఆ ముచ్చటంతా మీరు ఈ సినిమా చూసి తీర్చుకోదగ్గ ముచ్చట. విశ్లేషణ కొన్ని ప్రయత్నాల అనంతరం వెట్రివేళ్ ఆ అమ్మాయి దగ్గరినుండి డబ్బునూ, ఆ వెనువెంటనే ఆ అమ్మాయి మనసుని కూడా అంది పుచ్చుకుంటాడు. ఈ ప్రయత్నాల్లో ఏ మాత్రం అలుపు సొలుపు బోర్ కు గురిచేయకుండా దర్శకుడు హాయి హాయిగా సినిమాలోకంలో మనల్ని ఊయాలలూపుతూ ఉంటాడు. సర్వసాధారణమయిన సినిమాల్లో పనీ గినీ లేని హీరో పక్కన మరో పనీ గినీ లేని ఒక విదూషక ఫ్రెండ్ పాత్ర పెట్టి మనల్ని అనవసరంగా నవ్వించే ప్రయత్నం దర్శకుడు శ్రీ బాలాజీ అసలు చెయ్యలేదు. ఈ సినిమాలో అనవసరం అనిపించే పాత్ర ఒక్కటీ లేదంటే అదే అశ్చర్యం! పైగా ఉన్న ప్రతి ఒక్కరు ఎంత బాగా నటించారో! హీరో తల్లి ఎంత బాగా నటించిండో కదా అని మనం ఆశ్చర్యపోతూంటే ! మామూలు సినిమ్మా తండ్రి కూడా ఎంత హాయిగా నటించాడో అని ఇంకా నిబిడాశ్చర్య పోతాము ! ఇక వేట్టి అన్నయ్య సంగతి కాదు కానీ తమిళ సినిమాల్లో అన్నపాత్రలు వేసే వారంతా అంత చక్కని నటులేంటో! వదిన మాత్రం తక్కువ నటించిందా ఏమిటి? . సిన్మా చివర్లో వచ్చిన ఆరు మంది మిత్రులు, వారి తోడుగా దూరిన కొంత పోలీసు వారు. వారని వీరని కాదు ఈ సినిమాలో మొహానికి రంగు వేసుకున్న ప్రతి పాత్రధారి మోసం అంటే అద్భుతం అన్నంత బాగా నటించారు . ఒక సీన్ లో తండ్రి చేతిలో స్కూల్ పిల్లల పరిక్ష పత్రాలు ఉంటాయి . ఒక్క సెకను మాత్రమే కనపడే సీన్ అది . సినిమా లో ఒక పాత్ర స్కూలు మాస్టరు అయినంత మాత్రానా ఆయన ఇంటికి ఆ కాగితాలు తీసుకెళ్ళి రాత్రి దిద్ది ఉదయం బడికి పట్టుకెడుతున్నాడనే చిన్న బ్యూటిఫుల్ డిటయిల్ ప్రేక్షకుడికి ఇవ్వాలని ప్రేమకలిగిన దర్శకుడిని ఊరికే ఒట్టి మాటల్తో ఎట్టా ప్రేమించగలం. దేవుడా! ప్రేమించలేకపోవడం ఎంత కష్టం కష్టం!! సరే మళ్ళీ కథలోకి వద్దాం. వెట్రి, ప్రియా ల ప్రేమని హీరోయిన్ తండ్రి ఒకలా ఒప్పుకుంటాడు. నాయనా నీకూ, మా అమ్మాయికి పెళ్ళి కావాలంటే పరమ సింపుల్‌గా నువ్వు మిలట్రీ ఉద్యోగం అయినా సంపాదించు లేదా పోలీసు వాడివయినా అవ్వమనేది షరతు. హీరోయిన్ అమ్మాయి వాళ్ళ ది ఒక విచిత్రమైన ఊరు. ఆ ఊర్లో ప్రతి కుటుంబంలో ఒకరిద్దరు మిలట్రీలో చేరి భారత్ మాతా కి సేవలో తరించే వాళ్ళే. మామూలుగా నిత్యజీవితాల్లో ఉద్యోగం సంపాదించడం అనేది కష్టం కావచ్చు కానీ, భారతీయ సినిమా హీరోకి- అందునా తెలుగు మరియు తమిళ హీరోలకి అసాధ్యం ఐనది ఏది? మీకెవరికయినా ఆడవి దోంగ అనే ఎనభైలనాటి సినిమా గుర్తు ఉందా? మాటలు కూడా రాని బ్బే బ్బే బ్బే అనే కథానాయకుడు . హీరోయిన్ రాధ వడిలో పడుకుని ముప్ఫై రోజుల్లో తెలుగు కామా ఇంగ్లీష్ కామా హిందీ కూడా నేర్చుకుని ఆ పై పుంజీడు రోజుల్లో జిల్లా కలెక్టరో, సుప్రీంకోర్ట్ జడ్జి వంటిది కూడా ఒకటి అయ్యి ప్రేక్షక దేవుళ్లతో చెవులు చిల్లులు పడేంత వీలలు , చిల్లర వేయించుకుంటాడు కదా. అడిగాడా మన సినిమా ఘన చరిత్ర ! మిలటరీలో చేరడానికి మరిక ప్రాబ్లెం ఏవిటి మన హీరోకి? అంటే ఏం చెప్పను? సినిమా చూడరాదు, ప్రాబ్లెమ్ ఏమిటో ! ఎంత బాగుందో ఈ సినిమా . కథ బావుంది, నడిపిన కథనం బావుంది. నటీ నటులు అందరూ బావున్నారు. అంత మంచి సినిమా చివర్లో వచ్చే కాస్త డ్రామా అంతగా ఆకట్టుకోదు! అయినా పర్లా ఆ అయిదు నిముషాల క్లైమాక్స్ అలా కన్నా ఇక మరలాగైనా తీయలేరేమో లే పాపం అని క్షమించేంత బావుంది. -
హీరో రిక్వెస్ట్.. మరో స్టార్ హీరోను రక్షించిన సిబ్బంది!
మిచౌంగ్ తుపాను ధాటికి చెన్నై అతలాకుతులం అవుతోంది. ఇప్పటికే పలు లోతట్లు ప్రాంతాలు జల దిగ్భందంలో చిక్కుకున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ఆపదలో ఉన్నవారి కోసం సహాయక చర్యలు ముమ్మరంగా చేపడుతోంది. ఇప్పటికే తుపాను దెబ్బకు ఇంటి పైకి ఎక్కినట్లు కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ ట్వీట్ చేశారు. హీరో సాయం కోరడంపై స్పందించిన అధికారులు వెంటనే చర్యలకు దిగారు. విశాల్‌ను సురక్షిత ప్రాంతానికి తరలించారు. అయితే విష్ణు విశాల్‌తో పాటు బాలీవుడ్ హీరో అమిర్ ఖాన్ కూడా ఉండటం గమనార్హం. ఈ సందర్భంగా విష్ణు విశాల్ తమిళనాడు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. మాలాంటి వారికి సహాయం చేస్తున్న అగ్నిమాపక, రెస్క్యూ విభాగానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం కరపాక్కంలో సహాయక చర్యలు ప్రారంభమయ్యాయని వెల్లడించారు. నిర్విరామంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి అభినందనలు అంటూ ట్విటర్(ఎక్స్)లో పోస్ట్ చేశారు. అయితే ఇప్పటి వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ.. సడన్‌గా అమిర్ ఖాన్ చెన్నైలో దర్శనమివ్వడంపై నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఉన్నది నిజంగా అమిర్ ఖాన్ యేనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ అమిర్ చెన్నైలో ఏం చేస్తున్నాడంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి వరదలో చిక్కుకున్న స్టార్ హీరోలిద్దరినీ సేఫ్‌గా బయటకు రావడంతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. Thanks to the fire and rescue department in helping people like us who are stranded Rescue operations have started in karapakkam.. Saw 3 boats functioning already Great work by TN govt in such testing times Thanks to all the administrative people who are working relentlessly https://t.co/QdoW7zaBuI pic.twitter.com/qyzX73kHmc — VISHNU VISHAL - VV (@TheVishnuVishal) December 5, 2023 -
సిగ్నల్ లేదు.. సాయం కోసం హీరో ఎదురుచూపులు!
మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో తమిళనాడు, ఏపీ రాష్ట్రాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. సముద్ర తీర ప్రాంతం వద్ద భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే అధికారులు అప్రమత్తమైన సహాయ చర్యలు చేపడుతున్నారు. చెన్నై నగరం నీటి ముంపునకు గురై జనజీవనం స్తంభించింది. అయితే తుపాన్ దెబ్బకు చెన్నైతో పలు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో కోలీవుడ్ స్టార్ నటుడు విష్ణు విశాల్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. (ఇది చదవండి: ఇండస్ట్రీలో విషాదం.. సీఐడీ నటుడు మృతి!) తాను వరదల్లో చిక్కుకున్నట్లు ట్విటర్ ద్వారా వెల్లడించారు. కారప్పాకంలోని తమ ఇంట్లోకి నీరు చేరిందని.. సాయం కోసం వేచి కాల్ చేశానని తెలిపారు. విద్యుత్, ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులో లేవని పేర్కొన్నారు. ఇంటి పైకప్పు పైకి రావడంతో సిగ్నల్ దొరకడంతో పోస్ట్ చేశానన్నారు. నాతో ఎంతోమంది సహాయం కోసం ఎదురు చూస్తున్నట్లు ట్వీట్లో ప్రస్తావించారు. విష్ణు విశాల్ ప్రస్తుతం రజినీకాంత్ లాల్ సలాం, ధనుశ్ డీ50 చిత్రాల్లో నటిస్తున్నారు. (ఇది చదవండి: సలార్‌తో పోటీ పడలేం.. అందుకే డేట్ మార్చాం: టాలీవుడ్ నిర్మాత) Water is entering my house and the level is rising badly in karapakkam I have called for help No electricity no wifi No phone signal Nothing Only on terrace at a particular point i get some signal Lets hope i and so many here get some help❤️ I can feel for people all over chennai… pic.twitter.com/pSHcK2pFNf — VISHNU VISHAL - VV (@TheVishnuVishal) December 5, 2023 -
సంక్రాంతికే సలాం కొట్టిన రజనీకాంత్
సంక్రాంతికి ‘లాల్ సలాం’ అంటున్నారు రజనీకాంత్. విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా రజనీకాంత్, కపిల్ దేవ్, జీవితా రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘లాల్ సలాం’. ఐశ్వర్యా రజనీకాంత్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సుభాస్కరన్ నిర్మించారు. ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించి, కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ‘‘లాల్ సలాం’ చిత్రంలో ముంబై డాన్ మొయిద్దీన్ భాయ్ పాత్రలో కనిపిస్తారు రజనీకాంత్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: ఏఆర్ రెహమాన్. -
ఇండియా పేరు మార్చాలన్న సెహ్వాగ్.. ఏం ఉపయోగమంటూ హీరో కౌంటర్
ఇండియా.. భారత్‌గా మారబోతుందా? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం చూస్తుంటే త్వరలోనే అది నిజం కానున్నట్లు కనిపిస్తోంది. అయితే చాలామంది పేరు మార్పును సమర్థిస్తుంటే మరికొందరు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పేరు మార్పును సమర్థించే లిస్ట్‌లో ప్రముఖ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ ముందు వరుసలో ఉన్నారు. భారత్‌గా పేరు మార్చాలి 'మనకు గర్వకారణంగా అనిపించే పేరు ఒకటి ఉండాలని నేను ఎప్పటినుంచో అనుకుంటున్నాను. మనమంతా భారతీయులం. ఇండియా అనే పేరు బ్రిటీష్ వాళ్లు ఇచ్చారు. దాన్ని త్యజించాల్సిన సమయం వచ్చింది. మన దేశానికి భారత్ అనే పేరును ఖరారు చేయాలి. అలాగే వరల్డ్ కప్‌లో ఆడే క్రికెటర్ల షర్ట్‌లపై కూడా ఇండియాకు బదులు భారత్ అన్న పేరు ఉండేలా చర్యలు తీసుకోవలి' అంటూ బీసీసీఐని కోరారు. ఈ ట్వీట్‌కు కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ కౌంటరిచ్చాడు. 'సర్.. మీకు ఇన్నేళ్లుగా ఇండియా అనే పదం గర్వంగా అనిపించలేదా?' అని ప్రశ్నించాడు. దేనికి ఉపయోగం? మరో ట్వీట్లో షూటింగ్ లొకేషన్లో ఉన్న ఫోటో షేర్ చేస్తూ.. 'అసలు ఈ పేరు మార్పు దేనికి? మన దేశ ఉన్నతికి, ఆర్థిక వ్యవస్థకు ఇది ఏమేరకు ఉపయోగపడుతుంది? ఈ మధ్యకాలంలో నేను చూసిన వింతవార్త ఇదే.. ఇండియా అంటే భారత్.. మన దేశాన్ని ఇండియా, భారత్‌గా.. ఇలా రెండు పేర్లతో పిల్చుకుంటూ వచ్చాం.. కానీ ఉన్నట్లుండి భారత్ అనే పదాన్ని ఎందుకు వదిలించుకోవాలనుకుంటున్నారు?' అని ప్రశ్నించాడు. నీ గట్స్‌కు హ్యాట్సాఫ్ కేరళను కేరళంగా మార్చితే లేనిది.. ఇండియాను భారత్‌గా మార్చితే మాత్రం తప్పవుతుందా? అని నిలదీస్తున్నారు కొందరు నెటిజన్లు. మరికొందరేమో.. ప్రతిపక్షం ఇండియా అనే కూటమిగా ఏర్పడింది కాబట్టే ప్రభుత్వం తట్టుకోలేక భారత్ అని పేరు మారుస్తోందంటున్నారు. ఏదేమైనా ఈ అంశంపై సోషల్ మీడియా వేదికగా గళం వినిపించావంటే నువ్వు గ్రేట్ అని కొనియాడుతున్నారు అభిమానులు. Thinking deep from this shoot location… Wat ?????? name change ???? But why????? How does this help our country’s progress and its economy? This is the strangest news ive come accross in recent times… India was always bharat… We always knew our country as INDIA AND… pic.twitter.com/4X6Y8XbrL6 — VISHNU VISHAL - VV (@TheVishnuVishal) September 5, 2023 Sir with due respect… The name INDIA didn instill pride in you all these years?? https://t.co/ibm68uZ7e8 — VISHNU VISHAL - VV (@TheVishnuVishal) September 5, 2023 చదవండి: అడల్ట్ సినిమాలు చేస్తే తప్పేంటి? టేస్టీ తేజకు షకీలా కౌంటర్ -
రజినీకాంత్ 'లాల్ సలాం'.. పవర్ఫుల్ రోల్‌కు తలైవా బై బై!
ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న లేటెస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ ‘లాల్ సలాం’. విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని ఐశ్వర్య రజినీకాంత్ డైరెక్షన్లో తెరకెక్కిస్తున్నారు. చేస్తున్నారు. ముంబై డాన్ మొయిద్దీన్ భాయ్‌గా సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తుండటం విశేషం. రజినీకాంత్ కీలక పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్, జీవితా రాజశేఖర్, క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాలో రజినీకాంత్ మొయిద్దీన్ అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తయ్యింది. ఈ విషయాన్ని చిత్ర దర్శకురాలు ఐశ్వర్య రజినీకాంత్ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ‘‘మీతో సినిమా చేయటం ఓ అద్భుతం. నాన్నా.. మీరు ఎప్పుడూ నటనతో మ్యాజిక్ చేస్తుంటారు... ‘లాల్ సలాం’లో మొయిద్దీన్ పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి’. అని ఆమె పేర్కొన్నారు. రజినీకాంత్ సహా ఎంటైర్ యూనిట్ కలిసి దిగిన ఫొటోను ఆమె షేర్ చేశారు. లైకా ప్రొడక్షన్స్ ప్రతినిధులు మాట్లాడుతూ.. ‘‘మా బ్యానర్లో రజినీకాంత్ నటించటం మాకెప్పుడూ గర్వకారణంగానే ఉంటుంది. లాల్ సలాం సినిమాలో ఓ కీలక పాత్రలో నటించాలని ఆయన్ని రిక్వెస్ట్ చేయగానే వెంటనే చేస్తానని అన్నారు. ఆయన్ని ఓ పవర్ఫుల్ పాత్రలో చూడబోతున్నారు. ఐశ్వర్యా రజనీకాంత్‌గారు పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో ఈ మూవీలో రజినీకాంత్‌గారి పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేశారు. త్వరలోనే మరిన్ని విషయాలను తెలియజేస్తామన్నారు. భారీ బడ్జెట్ విజువల్ వండర్స్ చిత్రాలతో పాటు డిఫరెంట్ కంటెంట్ చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ చిత్ర నిర్మాణ రంగంలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్. రీసెంట్గా విడుదలైన పాన్ ఇండియా మూవీ పొన్నియిన్ సెల్వన్ 2తో సూపర్ సక్సెస్‌ను సాధించి సంగతి తెలిసిందే. ఈ నిర్మాణ సంస్థ నుంచి రానున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘లాల్ సలాం’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మరో వైపు కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో రూపొందుతోన్న ‘ఇండియన్ 2’, అరుణ్ విజయ్, ఎమీ జాక్సన్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న ‘మిషన్ చాప్టర్ 1’, కోలీవుడ్ అగ్ర కథానాయకుడు అజిత్‌తో చేస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘విడా ముయర్చి’ , 2018 వంటి బ్లాక్ బస్టర్ మూవీని తెరకెక్కించి దర్శకుడు జూడ్ ఆంథోని జోసెఫ్ దర్శకత్వంలోనూ ఓ భారీ చిత్రం.. ఇలా క్రేజీ ప్రాజెక్ట్స్‌ని కూడా లైకా ప్రొడక్షన్స్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. -
రోజురోజుకీ మీపై ప్రేమ రెట్టింపవుతోంది, ఈ రోజు వస్తుందని ఊహించలేదు
‘‘నేను మిమ్మల్ని చూస్తూ పెరిగాను. కానీ మీతో షూటింగ్ చేసే రోజు వస్తుందని ఊహించలేదు. మీరంటే నాకు ఆరాధన.. స్ఫూర్తి... ఒక్కోసారి నేను ప్రపంచాన్ని మీ ద్వారా చూస్తాను. కానీ ఎక్కువసార్లు మీతో పాటు ప్రపంచాన్ని చూస్తాను. ఈ క్రమంలో నేను గ్రహించింది ఏంటంటే.. ‘నేను మీరే’ అని. అప్పా (నాన్న) రోజు రోజుకీ నాకు మీ మీద ఉన్న ప్రేమ రెట్టింపు అవుతోంది’’ అంటూ ‘సూపర్ స్టార్‌తో షూటింగ్’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియా ద్వారా ఓ ఎమోషనల్ పోస్ట్‌ని షేర్ చేశారు రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్యా రజనీకాంత్. విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా ఐశ్వర్యా రజనీకాంత్ దర్శకత్వం వహిస్తున్న ‘లాల్ సలామ్’ చిత్రంలో మొయుద్దీన్ భాయ్‌గా రజనీకాంత్ కీ రోల్ చేస్తున్నారు. సూపర్ స్టార్‌ని డైరెక్ట్ చేయడం ఏ డైరెక్టర్‌కి అయినా ఎగ్జయిటింగ్‌గా ఉంటుంది. ఇక స్వయానా కూతురు అయితే.. ఆ ఫీలింగ్ రెండింతలు ఉంటుంది. ఆ భావాన్నే ఐశ్వర్య సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఇక క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ‘లాల్ సలామ్’లో స్టార్ క్రికెటర్ కపిల్ దేవ్ కీలక ΄పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రంలో రజనీ పాత్ర ముంబై నేపథ్యంలో ఉంటుంది. రజనీ–కపిల్ పాల్గొనగా ఇటీవల ముంబైలో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. View this post on Instagram A post shared by Aishwaryaa Rajinikanth (@aishwaryarajini) -
భాయ్ ముంబైలో అడుగుపెట్టారు!
రజనీకాంత్ కెరీర్లో గుర్తుంచుకోదగ్గ చిత్రాల్లో ‘బాషా’ ఒకటి. పాతికేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా ఫ్లాష్‌బ్యాక్‌లో ముంబైలో ‘మాణిక్ బాషా’గా కనిపించారు రజనీకాంత్. బాషా భాయ్‌గా రజనీ నటన, స్టయిల్ని మరచిపొలేం. ఇప్పుడు మొయుద్దీన్ భాయ్‌గా రజనీ కనిపించనున్న చిత్రం ‘లాల్ సలామ్’. ముంబై బ్యాక్‌డ్రాప్ ఉన్న ఈ చిత్రాన్ని రజనీ పెద్ద కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో రజనీ చేస్తున్న మొయుద్దీన్ భాయ్ పాత్ర కీలకం. ‘అందరి ఫేవరెట్ అయిన భాయ్ మళ్లీ ముంబైలో అడుగుపెట్టారు’ అంటూ ఆయన లుక్‌ని సోమవారం రిలీజ్ చేశారు. ‘‘ఈ చిత్రంలో రజనీకాంత్ రాకింగ్ పెర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను అలరించనున్నారు’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్, కెమెరా: విష్ణు రామస్వామి. -
గుత్తా జ్వాలకు విడాకులు? క్లారిటీ ఇచ్చిన విష్ణు విశాల్
కోలీవుడ్ స్టార్ విష్ణు విశాల్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల విడిపోతున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల విష్ణు చేసిన ట్వీటే అందుకు కారణం.. 'నేను ఎంతో ప్రయత్నించాను, కానీ విఫలమవుతూనే ఉన్నాను. మరేం పర్వాలేదు.. దాని నుంచి గుణపాఠాన్ని నేర్చుకున్నాను. అయినా అది పరాజయం కాదు పూర్తిగా నా తప్పే! అది ఒక మోసపూరిత ద్రోహం..' అంటూ లైఫ్ లెస్సన్స్ హ్యాష్‌ట్యాగ్ జత చేశాడు. ఇది చూసిన నెటిజన్లు.. విష్ణు, జ్వాలకు మధ్య ఏదో జరిగిందని, వీరు విడాకులు తీసుకోబోతున్నారంటూ పుకారు లేపారు. తాజాగా ఈ వ్యవహారంపై విష్ణు విశాల్ క్లారిటీ ఇచ్చాడు. 'కొద్దిరోజుల క్రితం నేను చేసిన ట్వీట్‌ను అతి దారుణంగా అర్థం చేసుకున్నారు. నేను నా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడలేదు. కేవలం వృత్తిగత జీవితం గురించే ట్వీట్ చేశాను. ఇకపోతే మా ఇద్దరికీ ఒకరంటే మరొకరికి ఎంతో నమ్మకం. ఒకరికి మనం ఇవ్వగలిగే గొప్ప బహుమతి ఏమిటంటే నమ్మకం. ఒకవేళ అలా చేయడంలో విఫలమైతే మనల్ని మనమే నిందించుకుంటాం. మన పట్ల మనం మరీ అంత కఠినంగా ఉండకూడదని మాత్రమే దానర్థం' అని చెప్పుకొచ్చాడు. మొత్తానికి ఈ ట్వీట్‌తో విడాకుల రూమర్స్‌కు చెక్ పెట్టాడు హీరో. ఇకపోతే విష్ణు విశాల్ ప్రస్తుతం లాల్ సలాం సినిమా చేస్తున్నాడు. ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో విక్రాంత్ మరో హీరోగా నటిస్తున్నాడు. ఇందులో రజనీకాంత్ ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. Hey all My tweeet few days back has been terribly misinterpreted.. It was on proffessional front n not personal at all.. The biggest gift that we give someone is TRUST And when we fail we always blame ourselves.. We shudn be hard on ourselves THATS ALL I MEANT ALL IS WELL — VISHNU VISHAL (VV) (@TheVishnuVishal) March 26, 2023 -
ప్రత్యేక పాత్రలో రజినీకాంత్.. ప్రారంభమైన షూటింగ్
విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం 'లాల్ సలాం'. ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇటీవలే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హోలీ రోజున ప్రారంభమైంది. ఈ చిత్రంలో సూపర్‌స్టార్ రజినీకాంత్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ విషయాన్ని లైకా ప్రొడక్షన్స్ తన ట్విటర్ ద్వారా వెల్లడించింది. ఈ సందర్భంగా లైకా ప్రతినిధులు మాట్లాడుతూ.. 'విభిన్నమైన సినిమాలు నిర్మించడంలో లైకా ప్రొడక్షన్స్ ముందుంటుంది. అందులో భాగంగా లాల్ సలాం సినిమాను నిర్మిస్తున్నాం. ఇందులో ఓ పవర్ఫుల్ పాత్ర ఉంది. అందుకే సూపర్‌స్టార్ రజినీకాంత్‌గారిని రిక్వెస్ట్ చేశాం. ఆయన ఈ రోల్లో నటించటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎనిమిదేళ్ల తర్వాత ఐశ్వర్య రజినీకాంత్ మళ్లీ మెగా ఫోన్ పట్టారు.'అని అన్నారు. కాగా.. ఈ చిత్రానికి ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. Lights 💡 Camera 🎥 🎬 Action 😎✨#LalSalaam 🫡 Shoot starts today! 😌 Happy #HOLI everyone! 💫 🎬 @ash_rajinikanth 🎶 @arrahman 🌟 @rajinikanth @TheVishnuVishal & @vikranth_offl 🤝 @gkmtamilkumaran 🪙 @LycaProductions #Subaskaran pic.twitter.com/SHYXxnGYod — Lyca Productions (@LycaProductions) March 7, 2023 -
ధనుష్ స్వీయ దర్శకత్వంలో క్రేజీ మూవీ, నలుగురు హీరోలతో..
తమిళసినిమా: ధనుష్ ఈ పేరు ఒక్క తమిళ్ చిత్రం కాదు టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ పరిశ్రమలకు సుపరిచితమే. ఇటీవల ఈయన కథానాయకుడిగా నటించిన నానే వరువేన్ చిత్రం నిరాశపరిచినా, తగ్గేదేలే అన్నట్టుగా ధనుష్ వరుసగా చిత్రాలను చేసుకుంటూ పోతున్నారు. ప్రస్తుతం చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్న నటుల్లో ఈయన ఒకరు. ప్రస్తుతం ఈయన తమిళం, తెలుగు భాషల్లో నటిస్తున్న వాత్తి (తెలుగులో సార్) చిత్రం. నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఫిబ్రవరి 17న విడుదలకు ముస్తాబవుతోంది. కాగా దీంతో పాటు సత్యజ్యోతి ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తున్న కెప్టెన్ మిల్లర్ చిత్రంలో నటిస్తున్నారు. అరుణ్ మాదేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం స్వాతంత్య్రానికి ముందు జరిగిన సంఘటనతో కూడిన కథా చిత్రంగా ఉంటుందని చిత్ర వర్గాలు వెల్లడించారు. వీరితోపాటు తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ ఒక చిత్రంలో నటించనున్నారు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇప్పటికే జరిగాయి. నటుడు ధనుష్ ఇప్పుడు మరో క్రేజీ చిత్రానికి సిద్ధమవుతున్నారనేది తాజా సమాచారం. ఇందులో నలుగురు హీరోలతో కలిసి నటించి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇందులో నటుడు ధనుష్‌తో పాటు విష్ణు, ఎస్.జే.సూర్య, కాళిదాస్ జయరాం నలుగురు హీరోలు నటించనున్నట్లు సమాచారం. ఈ క్రేజీ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి రాయన్ అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు టాక్. ఇది చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే మొదలైనట్లు, త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
ఓటీటీకి 'మట్టి కుస్తీ'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
నటుడు విష్ణు విశాల్, ఐశ్యర్య లక్ష్మీ జంటగా నటించిన చిత్రం మట్టి కుస్తీ. విష్ణు విశాల్ ప్రొడక్షన్స్ పతాకంపై టాలీవుడ్ నటుడు రవితేజతో కలిసి ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి చెల్లా అయ్యావు దర్శకత్వం వహించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. నూతన సంవత్సర కానుకగా జనవరి ఒకటో తేదీన నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. (ఇది చదవండి: Matti Kusthi Review: ‘మట్టి కుస్తీ’మూవీ రివ్యూ) కథేంటంటే.. కేరళకు చెందిని కీర్తి(ఐశ్యర్య లక్ష్మీ)కి రెజ్లింగ్ అంటే చాలా ఇష్టం. ఇంట్లో ఇష్టం లేకపోయినా.. బాబాయ్ సపోర్ట్‌తో కుస్తీ పోటీల్లో పాల్గొని రాష్ట్రస్థాయిలో ఛాంపియన్‌గా నిలుస్తుంది. అయితే ఆడపిల్ల రెజ్లర్ అని తెలిస్తే ఎవరూ పెళ్లి చేసుకోరని పేరెంట్స్ భయపడతారు. ఆటను వదిలేసి పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తారు. ఈ టెన్షన్‌తో నాన్నకు గుండెపోటు వస్తుంది. దీంతో ఫ్యామిలీ కోసం కీర్తి పెళ్లికి ఓకే చెబుతుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వీర(విష్ణు విశాల్) ఊర్లో ఓ పెద్ద ఆసామీ. తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో మామయ్య(కరుణాస్) పెంచి పెద్ద చేస్తాడు. వీర ఎలాంటి లక్ష్యం లేకుండా ఊర్లో బలాదూర్‌గా తిరుగుతుంటాడు. వయసు పెరిగిపోతుండటంతో పెళ్లిచేయాలనుకుంటారు. తను పెళ్లి చేసుకునే అమ్మాయి పెద్దగా చదువుకోవద్దని, తన చెప్పుచేతల్లో ఉండాలని కండీషన్స్ పెట్టుకుంటాడు వీర. తనకంటే ఎక్కువగా చదువుకుందని చాలా సంబంధాలను రిజెక్ట్ చేస్తుంటాడు. మరోవైపు రెజ్లర్ అయిన కారణంగా కీర్తిని పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రారు. ఈ నేపథ్యంలో కీర్తి బాబాయ్‌కి ఓ ఐడియా వస్తుంది. కీర్తికి ఏడో తరగతి వరకే చదువుకుందని, పెద్ద జడ ఉందని అబద్దం చెప్పి వీరాతో పెళ్లి చేస్తాడు. కానీ వీరాకు ఓ రోజు కీర్తి ఓ రెజ్లర్ అనే నిజం తెలుస్తుంది. అలాగే ఆమెకు పెద్ద జడలేదని, అది విగ్ అని వెలుస్తుంది. ఆ తర్వాత వీర పరిస్థితి ఏంటి? నిజం తెలిసిన తర్వాత వీర, కీర్తిల మధ్య ఎలాంటి గొడవలు ఏర్పడ్డాయి? కుస్తీ పోటీలో భార్యతో వీర ఎందుకు పోటీ పడ్డాడు? విడాకుల వరకు వెళ్లిన వీరిద్దరు మళ్లీ ఎలా కలిశారు? అనేదే మిగతా కథ. -
ఫిబ్రవరిలో లాల్ సలామ్లోకి...
‘లాల్ సలామ్’ గ్రౌండ్లోకి రజనీకాంత్ ఎంట్రీ ఫిబ్రవరిలో అని సమాచారం. విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘లాల్‌సలామ్’. క్రికెట్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యా రజనీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆ మధ్య ఓ పది రోజులు షూటింగ్ చేశారు. అయితే రజనీ లేని సీన్స్‌ని చిత్రీకరించారు. ఫిబ్రవరి మొదటివారంలో ఈ సినిమా సెట్స్‌లోకి రజనీ అడుగుపెడతారట. ఇక ‘3’ (2012) చిత్రం ద్వారా దర్శకురాలిగా పరిచయమైన ఐశ్వర్య ఆ తర్వాత ‘వై రాజా వై’ (2015), ‘రాజా రాణి’ (2017) చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఐదేళ్ల గ్యాప్ తర్వాత ఆమె తెరకెక్కిస్తున్న చిత్రం ‘లాల్ సలామ్’. -
థియేటర్స్‌లో దుమ్మురేపుతున్న మట్టి కుస్తీ.. రూ. 30 కోట్లకు పైగా వసూళ్లు
తమిళసినిమా: నటుడు విష్ణు విశాల్ కథానాయకుడిగా నటించి తన విష్ణు విశాల్ ప్రొడక్షన్స్ పతాకంపై టాలీవుడ్ నటుడు రవితేజతో కలిసి నిర్మించిన చిత్రం కట్టా కుస్తీ. మలయాళ కుట్టి ఐశ్వర్య లక్ష్మి నాయకిగా నటించిన ఈ చిత్రానికి సెల్లా అయ్యావు కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. ఈ చిత్రం విడుదల హక్కులను ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ పొందటం విశేషం. ఇటీవల విడుదలైన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణ పొందుతోంది. దీంతో చిత్ర యూనిట్ బుధవారం మధ్యాహ్నం చెన్నై వడపళనిలోని ఓ హోటల్లో సక్సెస్ మీట్ నిర్వహించింది.నటి ఐశ్వర్య లక్ష్మి మాట్లాడుతూ కట్టా కుస్తీ చిత్రం విడుదలైన తొలి రోజు నుంచే పాజిటివ్ రిపోర్ట్ రావడం ఆనందాన్ని కలిగించిందన్నారు. ఇది టీం వర్కుతో రూపొందిన చిత్రమని పేర్కొన్నారు. ఇందులో నటించడం మంచి అనుభవంగా పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని ఆయన నిర్మించడం వల్లనే ఈ విజయం సాధ్యమైందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నటుడు కృష్ణప్రసాద్ మాట్లాడుతూ దీనిని తన సెకండ్ ఇన్నింగ్స్‌గా భావిస్తున్నారన్నారు. ఈ చిత్ర టీం తనకు చాలా స్పెషల్ అని పేర్కొన్నారు.దర్శకుడు చెప్పిన చిత్రంలోని ఆడ మగ సమానం అనే థాట్ నచ్చడంతో చిత్రాన్ని చేయడానికి ముందుకు వచ్చానని చెప్పారు. తన విజయానికి అమ్మ, అక్క, తన భార్య కారణమన్నారు. వారంతా తనకు చాలా సపోర్టుగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. తానే కాదు ప్రతి మగాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందన్నది నిజమన్నారు. నిర్మాతగా మారడానికి కారణం నటుడిగా తన కలలను నిజం చేసుకోవడానికే అని చెప్పారు. కట్టా కుస్తీ చిత్ర తొలి ఆటను తాను మదురైలో ప్రేక్షకుల మధ్య చూశానని, థియేటర్లో మహిళల ఆదరణను చూసి చాలా సంతోషం కలిగిందన్నారు. ఈ చిత్రం ఇప్పటికే రూ.30 కోట్లకు పైగా వసూలు చేసిందని, ఇంకా వసూలు చేస్తుందన్న నమ్మకం ఉందన్నారు. మంచి అనుభూతినిచ్చింది.