Wasim Jaffer
-
కేఎల్ రాహుల్ అవుట్‌పై రగడ.. స్పందించిన స్టార్క్
ఆస్ట్రేలియాతో పెర్త్ టెస్టులో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్(26) అవుటైన తీరుపై మిచెల్ స్టార్క్ స్పందించాడు. థర్డ్ అంపైర్ నిర్ణయంలో తనకు తప్పేమీ కనిపించడం లేదని పరోక్షంగా వ్యాఖ్యానించాడు. కాగా తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ వేసిన 22వ ఓవర్ రెండో బంతికి.. రాహుల్ సందేహాస్పద రీతిలో పెవిలియన్ చేరాడు.రివ్యూల్లో స్పష్టత రాకపోయినా...ఫీల్డ్ అంపైర్ మొదట నాటౌట్‌గా ప్రకటించగా... క్యాచ్ అవుట్ కోసం ఆసీస్ డీఆర్ఎస్కు వెళ్లింది. పలుమార్లు రీప్లేలు పరిశీలించిన థర్డ్ అంపైర్ రాహుల్‌ను అవుట్‌గా ప్రకటించాడు. అయితే రివ్యూల్లో స్పష్టత రాకపోయినా... థర్డ్ అంపైర్ రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని మార్చడం వివాదాస్పదమైంది.తగిన రుజువు లేకుండా ఇలా చేయడం సరికాదుఈ నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్‌కోచ్, కామెంటేటర్ రవిశాస్త్రి స్పందిస్తూ.. ‘బంతి బ్యాట్‌ను సమీపించిన సమయంలో అవుట్ సైడ్ ఎడ్జ్‌పై స్పైక్ కనిపించింది’ అని థర్డ్ అంపైర్ పేర్కొనడం... సరైన నిర్ణయం కాకపోవచ్చు’’ అని అభిప్రాయపడ్డాడు. అంతేకాదు.. నిర్దిష్టమైన రుజువు లేకుండా ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టడం సరైంది కాదని వ్యాఖ్యానించాడు. ‘ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని మార్చే ఆధారాలేవీ రీప్లేలో కనిపించలేదు. నా వరకైతే తగిన రుజువు లేకుండా నిర్ణయాన్ని సమీక్షించడం సరైంది కాదు’ అని అన్నాడు.మరోవైపు.. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మైక్ హస్సీ కూడా ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేశాడు. ‘ఇది వివాదాస్పద నిర్ణయం. స్నికోపై స్పైక్ రావడం వాస్తవమే కానీ అది బంతి బ్యాట్‌ను తాకినప్పుడు వచ్చిందా లేక ప్యాడ్ తాకినప్పుడా అనేది తేలాలి. దీనిపై నాకు కూడా సందేహాలు ఉన్నాయి’ అని హస్సీ అన్నాడు.ఇది చాలా ధైర్యంతో కూడిన నిర్ణయంఅయితే, ఆసీస్ మాజీ సారథి మార్క్‌వా మాట్లాడుతూ... ‘ఇది చాలా ధైర్యంతో కూడిన నిర్ణయం. దీంతో రాహుల్ సంతృప్తిగా ఉండకపోవచ్చు’ అని పేర్కొనడం గమనార్హం. ఇక.. భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘మరో కోణం నుంచి చూడా లని థర్డ్ అంపైర్ కోరినా... అది అందుబాటులో లేకపోయింది. మరి ఇలాంటి సందేహాస్పద పరిస్థితిలో అంపైర్ నిర్ణయాన్ని మార్చడం ఎందుకు’ అని ట్వీట్ చేశాడు. అదే విధంగా.. ‘స్పష్టత లేనప్పుడు అవుట్ ఇవ్వకూడదు’ అని ఇర్ఫాన్ పఠాన్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశాడు.స్టార్క్ స్పందన ఇదేఈ నేపథ్యంలో... శుక్రవారం నాటి తొలి రోజు ఆట ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఫీల్డ్ అంపైర్ నిర్ణయం తారుమారైంది. అయితే, అది సరైందే అనుకుంటున్నా. శబ్దం వచ్చిన మాట నిజం. ఆ వికెట్ సరైందేనని భావిస్తున్నా’’ అని స్టార్క్ పేర్కొన్నాడు.ఇదిలా ఉంటే.. శుక్రవారం మొదలైన తొలి టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసి.. 150 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో శనివారం ఆటలో ఆసీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 104 పరుగులకే కుప్పకూల్చింది. ఫలితంగా 46 పరుగుల స్పల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది.చదవండి: హర్షిత్.. నీ కంటే నేను ఫాస్ట్‌గా బౌల్ చేయగలను: స్టార్క్ వార్నింగ్.. రాణా రియాక్షన్ వైరల్Matthew Hayden explaining the KL Rahul bat-pad scenario. - Unlucky, KL. 💔 pic.twitter.com/lf0UOWwmy8— Mufaddal Vohra (@mufaddal_vohra) November 22, 2024 -
గిల్ స్థానంలో అతడిని ఆడించండి.. ఓపెనర్‌గా కేఎల్ బెస్ట్: భారత మాజీ క్రికెటర్
క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆసక్తికర పోరుకు సమయం ఆసన్నమైంది. టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ శుక్రవారం మొదలుకానుంది. ఇందుకోసం ఇప్పటికే కంగారూ దేశానికి చేరుకున్న భారత జట్టు ప్రాక్టీస్‌లో తలమునకలైంది.అయితే, ఈ ఐదు మ్యాచ్‌ల కీలక టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియా ప్రధాన ఆటగాళ్ల గాయపడటం మేనేజ్మెంట్ను కలవరపెడుతోంది. గాయాల వల్ల శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ తొలి టెస్టుకు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌కు దూరంగా ఉండగా.. గిల్ కూడా అందుబాటులో ఉండకపోవచ్చని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి.శుబ్‌మన్ గిల్ స్థానంలో..ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. శుబ్‌మన్ గిల్ స్థానంలో దేవ్‌దత్ పడిక్కల్‌ను జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. అంతేకాదు తుదిజట్టులోనూ అతడిని ఆడించాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు. అదే విధంగా.. యశస్వి జైస్వాల్‌కు జోడీగా కేఎల్ రాహుల్‌ను పంపితే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.కేరళకు చెందిన దేవ్‌దత్ పడిక్కల్ ఈ ఏడాది మార్చిలో ఇంగ్లండ్‌తో మ్యాచ్ సందర్భంగా టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ధర్మశాల వేదికగా జరిగిన ఐదో టెస్టులో.. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన పడిక్కల్.. 103 బంతులు ఎదుర్కొని 65 పరుగులు సాధించాడు. అయితే, ఆ తర్వాత ఈ లెఫ్టాండర్ బ్యాటర్‌కు మళ్లీ జట్టులో స్థానం దక్కలేదు.ఫస్ట్‌క్లాస్ కెరీర్లోనూఅయితే, ఇటీవల ఆస్ట్రేలియా-‘ఎ’ జట్టుతో జరిగిన రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్‌లో దేవ్‌దత్ పడిక్కల్ భారత్-‘ఎ’ జట్టు తరఫున బరిలోకి దిగాడు. నాలుగు ఇన్నింగ్స్‌లో వరుసగా 36, 88, 26, 1 పరుగులు చేశాడు. ఇక ఫస్ట్‌క్లాస్ కెరీర్లోనూ 24 ఏళ్ల పడిక్కల్‌కు మంచి రికార్డే ఉంది.ఎడమచేతి వాటం బ్యాటర్ కూడా!ఇప్పటి వరకు 40 మ్యాచ్‌లలో కలిపి 2677 పరుగులు సాధించాడు. ఇందులో ఆరు సెంచరీలు, 17 అర్ధ శతకాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పడిక్కల్ గురించి వసీం జాఫర్ ప్రస్తావిస్తూ... ‘‘టీమిండియా తరఫున అతడు ఇంతకుముందు టెస్టు క్రికెట్ ఆడాడు. పరుగులు కూడా రాబట్టాడు.అంతేకాదు.. అతడు ఎడమచేతి వాటం బ్యాటర్ కూడా! కాబట్టి ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో మూడో స్థానంలో పడిక్కల్‌ను ఆడిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది’’ అని పేర్కొన్నాడు. అదే విధంగా.. ధ్రువ్ జురెల్‌ను కూడా మిడిలార్డర్లో ఆడించాలని వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు. పెర్త్ టెస్టులో జైస్వాల్‌కు తోడుగా కేఎల్ రాహుల్‌ను ఓపెనర్‌గా పంపాలని ఈ సందర్భంగా ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో పేర్కొన్నాడు.ఓపెనర్‌గా రాహుల్ బెస్ట్కాగా టీమిండియా తరఫున ఓపెనర్‌గా ఇప్పటి వరకు 49 టెస్టులు ఆడిన కేఎల్ రాహుల్ ఖాతాలో 2551 పరుగులు ఉన్నాయి. ఇందులో ఏడు శతకాలు, 12 హాఫ్ సెంచరీలు. ఇక ఓవరాల్‌గా కేఎల్ రాహుల్ 53 టెస్టుల్లో 2981 రన్స్ సాధించాడు. మరోవైపు.. ధ్రువ్ జురెల్ ఇటీవల ఆసీస్-‘ఎ’తో అనధికారిక టెస్టుల్లో 93, 80, 68 రన్స్ చేశాడు. ఇక టీమిండియా తరఫున నాలుగు ఇన్నింగ్స్‌లో కలిపి జురెల్ 190 పరుగులు సాధించాడు.చదవండి: Hardik Pandya: అన్న సారథ్యంలో తమ్ముడు -
BGT: ఈసారి టీమిండియా గెలవడం కష్టమే.. అతడు లేడు కాబట్టి..
టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఈసారి మరింత రసవత్తరంగా మారనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ చేరాలంటే ఇరుజట్లకు ఈ సిరీస్ అత్యంత కీలకం. ముఖ్యంగా రోహిత్ సేన ఇందులో భాగమైన ఐదు టెస్టుల్లో కనీసం నాలుగు గెలిస్తేనే టైటిల్ పోరుకు అర్హత సాధించే అవకాశం ఉంటుంది.మరోవైపు.. ఇటీవల స్వదేశంలో భారత జట్టు ఘోర ఓటమిని చవిచూసింది. న్యూజిలాండ్ చేతిలో 3-0తో టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైంది. తద్వారా సొంతగడ్డపై ఇలాంటి పరాభవం పొందిన తొలి జట్టుగా రోహిత్ సేన అపఖ్యాతి మూటగట్టుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆస్ట్రేలియా పర్యటన ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈసారి బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(బీజీటీ)లో టీమిండియా నెగ్గడం అంత సులువు కాదని.. ఈ దఫా కంగారూ జట్టు పైచేయి సాధించే అవకాశం ఉందని అంచనా వేశాడు. ప్రస్తుతం ఛతేశ్వర్ పుజారా లాంటి ఆటగాడి అవసరం జట్టుకు ఎంతగానో ఉందని.. అతడి లాంటి ఆటగాడు ఉంటేనే టీమిండియా మరోసారి ఆసీస్‌లో సిరీస్ నెగ్గగలదని పేర్కొన్నాడు.ఈసారి టీమిండియా గెలవడం కష్టమేఈ మేరకు వసీం జాఫర్ మాట్లాడుతూ.. ‘‘ఈసారి టీమిండియా గెలవడం కష్టమే. ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో ఓడించడం అత్యంత కష్టమైన పని. గత రెండు సందర్భాల్లో ఇండియా అద్భుతంగా ఆడి సిరీస్‌లు గెలిచింది.అయితే, అప్పటి కంటే ఇప్పుడు ఇంకాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈసారి పుజారా జట్టుతో లేడు. అప్పటి పర్యటనలో అతడే ప్రధాన ఆటగాడు అని చెప్పవచ్చు. కొత్త బంతితో తొలుత ఫాస్ట్ బౌలర్లను ట్రై చేసి.. ఆ తర్వాత పిచ్ పరిస్థితికి అనుగుణంగా క్రీజులో పాతుకుపోయి.. పరుగులు రాబట్టడం అతడి స్టయిల్.అలా అయితే.. ఆస్ట్రేలియాదే పైచేయి అవుతుందిప్రస్తుతం టీమిండియాకు పుజారా లాంటి ఆటగాడి అవసరం ఎంతగానో ఉంది. వీలైనన్ని ఎక్కువ పరుగులు సాధిస్తేనే ఈసారి భారత్ గెలిచే అవకాశం ఉంటుంది. లేదంటే.. ఆస్ట్రేలియాదే పైచేయి అవుతుంది’’ అని స్పోర్ట్స్‌తక్‌తో పేర్కొన్నాడు.కాగా చివరగా 2018-19 పర్యటనలో పుజారా.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఏడు ఇన్నింగ్స్‌లో కలిపి 74.42 సగటుతో 521 పరుగులు సాధించాడు. నాటి సిరీస్‌లో టీమిండియా 2-1తో గెలిచిన విషయం తెలిసిందే. అయితే, గత కొంతకాలంగా పుజారాకు జట్టులో చోటు కరువైంది. ఇక కివీస్‌తో సిరీస్‌లో ఈ నయా వాల్ లేని లోటు స్పష్టంగా కనిపించగా.. ఆసీస్ టూర్లో ఆ వెలితి మరింత ఎక్కువగా ఉంటుందని మాజీ క్రికెటర్లు పేర్కొంటున్నారు.చదవండి: సౌతాఫ్రికాతో టీ20 సిరీస్.. భారీ రికార్డులపై కన్నేసిన సూర్యకుమార్ -
Ind vs Ban: టీమిండియాకు మాజీ క్రికెటర్ వార్నింగ్
బంగ్లాదేశ్ జట్టును తక్కువ అంచనా వేయొద్దని ఉందని భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ టీమిండియాకు సూచించాడు. అనుభవం గడిస్తున్న కొద్దీ బంగ్లా ప్రమాదకర జట్టుగా మారుతోందని.. ముఖ్యంగా విదేశీ గడ్డపై గెలవడం వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని పేర్కొన్నాడు. కాబట్టి ప్రత్యర్థిని పసికూనగా భావిస్తే మూల్యం చెల్లించే పరిస్థితి రావొచ్చని రోహిత్ సేనను హెచ్చరించాడు.రెండు మ్యాచ్‌ల సిరీస్‌కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఫైనలిస్టులలో ఫేవరెట్‌గా ఉన్న భారత జట్టు.. గురువారం(సెప్టెంబరు 19) నుంచి బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. చెన్నై వేదికగా తొలి టెస్టు జరుగనుండగా.. టీమిండియా ఇప్పటికే అస్తశస్త్రాలతో సిద్ధమైంది. మరోవైపు.. అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న రోహిత్ సేనను ఢీకొట్టేందుకు బంగ్లాదేశ్ కూడా సిద్ధంగానే ఉంది.ఒకప్పుడు సొంతగడ్డపై మాత్రమే.. కానీ ఇప్పుడుముఖ్యంగా పాకిస్తాన్‌ను వారి గడ్డపై టెస్టుల్లో తొలిసారి ఓడించడమే కాదు.. ఏకంగా క్లీన్‌స్వీప్ చేసిన జోష్‌లో ఉన్న నజ్ముల్ షాంటో బృందం.. భారత్‌లోనూ రాణించాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలో వసీం జాఫర్ మాట్లాడుతూ.. ‘‘బంగ్లాదేశ్ జట్టు అనుభవం గడిస్తున్న కొద్దీ మరింత మెరుగ్గా తయారవుతోంది. ఒకప్పుడు సొంతగడ్డపై మాత్రమే ఆడగలరని వారికి పేరు ఉండేది. అయితే, గత కొంతకాలంగా విదేశాల్లోనూ బంగ్లా రాణిస్తోంది.కివీస్ గడ్డపై గెలిచిన ఘనతన్యూజిలాండ్ను న్యూజిలాండ్‌లో(2022, మౌంట్ మౌంగనూయ్), పాకిస్తాన్‌ను పాకిస్తాన్లో ఓడించారు. పరిమిత ఓవర్ల క్రికెట్లోనూ ఇప్పటికే ఇంటా బయటా తమను తాము నిరూపించుకున్నారు. జట్టులోని సీనియర్లు వారికి మార్గదర్శకులుగా ఉంటున్నారు. ముఖ్యంగా షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీం సుదీర్ఘకాలంగా సేవలు అందిస్తూ.. యువకులకు స్ఫూర్తినిస్తున్నారు.నాణ్యమైన ఫాస్ట్ బౌలర్లుగత కొన్నాళ్లుగా అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన కోచ్‌ల ద్వారా కూడా బంగ్లాదేశ్ ఆట మెరుగుపడింది. టస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహమాన్, నషీద్ రాణా, షోరిఫుల్ ఇస్లాం, హసన్ మహమూద్.. రాణిస్తున్నారు. బంగ్లాదేశ్ జట్టు నలుగురైదుగురు ఫాస్ట్ బౌలర్లు గంటకు 140 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేస్తున్నారు’’ అని వసీం జాఫర్ హిందుస్తాన్ టైమ్స్‌తో పేర్కొన్నాడు. టీమిండియా జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా హెచ్చరించాడు. చదవండి: సర్ఫరాజ్ ఖాన్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ -
లెఫ్టాండర్స్ టెస్టు, వన్డే అత్యుత్తమ జట్లు ఇవే!
క్రికెట్లో ఎడమచేతి వాటం ఉన్న ఆటగాళ్లు చాలా తక్కువే మందే ఉంటారు. అందులోనూ అత్యుత్తమంగా రాణించేవాళ్లు ఇంకా తక్కువ. అయితే, ఆ జాబితాలో ఈ 22 మందికి తప్పక చోటు ఉంటుంది అంటున్నాడు టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్! ఒకరోజు ఆలస్యంగానైనా సరే.. లెఫ్టాండర్లకు తాను ఇచ్చే ట్రిబ్యూట్ ఇదేనంటూ బుధవారం ఓ ట్వీట్ చేశాడు.ప్రపంచ టెస్టు, వన్డే అత్యుత్తమ లెఫ్టాండర్లతో కూడిన తన తుదిజట్లను ప్రకటించాడు వసీం జాఫర్. టెస్టు ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆస్ట్రేలియా దిగ్గజం మాథ్యూ హెడెన్, శ్రీలంక లెజెండ్ కుమార్ సంగక్కరకు చోటిచ్చిన ఈ ముంబై బ్యాటర్.. వెస్టిండీస్ ఆల్‌టైమ్ గ్రేట్ బ్రియన్ లారాను వన్‌డౌన్ బ్యాటర్‌గా ఎంచుకున్నాడు.ఇక నాలుగో స్థానంలో సౌతాఫ్రికాకు చెందిన గ్రేమ్ పొలాక్, ఆ తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా అలెన్ బోర్డర్, విండీస్ గ్రేట్ సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్, ఆసీస్ ఆడం గిల్క్రిస్ట్లకు చోటు ఇచ్చాడు వసీం జాఫర్. ఇక బౌలింగ్ విభాగంలో ముగ్గురు సీమర్లు వసీం అక్రం(పాకిస్తాన్), జహీర్ ఖాన్(టీమిండియా)తో పాటు మిచెల్ జాన్సన్/చమిందా వాస్/ట్రెంట్ బౌల్ట్‌లలో ఒకరిని ఎంచుకుంటానని తెలిపాడు. కెప్టెన్‌గా ఆసీస్ లెజెండ్ ఈ జట్టులో ఒకే స్పిన్నర్, టీమిండియా చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌కు కూడా స్థానం ఇచ్చాడు. ఈ జట్టుకు కెప్టెన్‌గా అలెన్ బోర్డర్‌ను ఎంచుకున్న వసీం జాఫర్.. వికెట్ కీపర్‌గా గిల్‌క్రిస్ట్‌కు అవకాశం ఇచ్చాడు. ఇక ఈ జట్టులోని ఓపెనర్లు హెడెన్, సంగక్కర టెస్టుల్లో వరుసగా 8,625, 12, 400 పరుగులు సాధించారు. అదే విధంగా.. లారా 11,953 రన్స్ స్కోరు చేయడంతో పాటు.. ఫస్ల్‌క్లాస్ క్రికెట్లో ఒకే ఇన్నింగ్స్‌లో 501 రన్స్ నాటౌట్, టెస్టుల్లో 400 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ఆల్‌టైమ్ రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. ఇక పొలాక్ ఆడింది కేవలం 23 టెస్టులే అయినా.. అతడి సగటు 60.97. మరోవైపు.. కెప్టెన్ అలెన్ బోర్డర్ టెస్టుల్లో 11,174 పరుగులతో ఓవరాల్‌గా పదకొండవ స్థానంలో ఉన్నాడు. మిగిలిన వాళ్లలో గ్యారీఫీల్డ్ సోబర్స్ ఎనిమిది వేలకు పైగా పరుగులతో పాటు.. 235 వికెట్లు తీసి సత్తా చాటాడు. వికెట్ కీపర్ ఆడం గిల్‌క్రిస్ట్ 47.60 సగటు కలిగి ఉండటంతో పాటు ఏకంగా 416 డిస్మిసల్స్లో భాగమయ్యాడు.వసీం జాఫర్ లెఫ్టాండర్స్ అత్యుత్తమ టెస్టు ప్లేయింగ్ ఎలెవన్మాథ్యూ హెడెన్, కుమార్ సంగక్కర, బ్రియన్ లారా, గ్రేమ్ పొలాక్, అలెన్ బోర్డర్(కెప్టెన్), గ్యారీఫీల్డ్ సోబర్స్, ఆడం గిల్‌క్రిస్ట్, వసీం అక్రం, జహీర్ ఖాన్, మిచెల్ జాన్సన్/చమిందా వాస్/ట్రెంట్ బౌల్ట్, కుల్దీప్ యాదవ్.ఇక వన్డే జట్టు విషయానికొస్తే.. మాథ్యూ హెడెన్(ఆస్ట్రేలియా), సనత్ జయసూర్య(శ్రీలంక), కుమార్ సంగక్కర(శ్రీలంక- వికెట్ కీపర్), బ్రియన్ లారా(కెప్టెన్), యువరాజ్ సింగ్(టీమిండియా ఆల్‌రౌండర్), మైకేల్ బెవాన్(ఆస్ట్రేలియా), వసీం అక్రం(పాకిస్తాన్), జహీర్ ఖాన్(టీమిండియా), కుల్దీప్ యాదవ్(టీమిండియా)లను వసీం జాఫర్ ఎంపిక చేసుకున్నాడు. అన్నట్లు ఆగష్టు 13న లెఫ్టాండర్స్ డే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వసీం జాఫర్ ఈ టీమ్స్‌ను సెలక్ట్ చేశాడన్నమాట!చదవండి: కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించిన రోహిత్ శర్మ -
'టీమిండియా ఓడిపోయినందుకు బాధ లేదు.. కానీ అదొక్కటే సమస్య'
శ్రీలంక పర్యటనలో టీ20 సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమిండియా.. వన్డే సిరీస్‌లో మాత్రం ఘోర పరభావాన్ని మూటగట్టుకుంది. మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 0-2 తేడాతో ఓటమి పాలైంది. శ్రీలంకపై వన్డే సిరీస్‌ను భారత్ కోల్పోవడం 27 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం.తొలి వన్డేను టైగా ముగించిన రోహిత్ సేన.. ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది. భారత హెడ్‌కోచ్‌గా గౌతమ్ గంభీర్‌కు ఇదే తొలి సిరీస్ ఓటమి కాగా.. టీ20 వరల్డ్‌కప్ విజయం తర్వాత రోహిత్ శర్మకు కూడా మొదటి పరాజయం. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025 సన్నాహాకాల్లో భాగంగా జరిగిన ఈ సిరీస్‌లో భారత్ ఓడిపోవడం ఆందోళన కలిగిస్తోందని జాఫర్ అభిప్రాయపడ్డాడు."ఈ సిరీస్‌లో శ్రీలంక అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. కచ్చితంగా ఈ సిరీస్ విజయానికి వారే అర్హులు. అయితే భారత్ సిరీస్ ఓడిపోయినందుకు నాకు ఎటువంటి బాధ లేదు. ఆటలో గెలుపు ఓటములు సహజమే.కానీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్ ఇటువంటి ప్రదర్శన కనబరిచడం కాస్త ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే ఈ మెగా టోర్నీకి ముందు భారత్ కేవలం మూడు వన్డేల మాత్రమే ఆడనుందని" ఎక్స్‌లో జాఫర్ రాసుకొచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025 సన్నాహాకాల్లో భారత్‌కు ఇంకా కేవలం మూడు వన్డేలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ ఏడాది నవంబర్‌లో ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్ భారత్ ఆడనుంది. -
పంజాబ్ హెడ్ కోచ్‌గా టీమిండియా మాజీ ఓపెనర్..
రంజీ ట్రోఫీ 2024-25 సీజన్‌కు ముందు పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు హెడ్‌కోచ్‌గా టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్‌ను పీసీఎ నియమించింది. ఈ విషయాన్ని పీసీఎ అధ్యక్షుడు అమర్జీత్ సింగ్ మెహతా ఆధికారికంగా ధ్రువీకరించారు.కాగా పంజాబ్ హెడ్‌కోచ్ పదవికి ఆస్ట్రేలియా మాజీ స్పీడ్ స్టార్ షాన్ టైట్ కూడా ధరఖాస్తు చేశాడు. కానీ పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ మాత్రం జాఫర్ వైపే మొగ్గు చూపింది.రంజీ ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని గెలవడమే మా లక్ష్యంగా పెట్టుకున్నాము. ఈ క్రమంలోనే జాఫర్‌ను మా జట్టు ప్రధాన కోచ్‌గా నియమించాలని ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నాము. జాఫర్ తన అనుభవంతో జట్టును విజయ పథంలో నడిపిస్తాడని ఆశిస్తున్నాము. భారత్ నుంచి అత్యుత్తమ టెస్టు ప్లేయర్లలో జాఫర్ ఒకడు. కాబట్టి అతడిని మా బోర్డులో చేర్చుకున్నామని పీసీఎ అధ్యక్షుడు అమర్జీత్ సింగ్ మెహతా పేర్కొన్నాడు. జాఫర్ గతంలో ఉత్తరాఖండ్, ఒడిశా జట్లకు హెడ్‌కోచ్ పనిచేశాడు. అంతేకాకుండా ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్‌కు మెంటార్, బ్యాటింగ్ కోచ్‌గా కూడా జాఫర్ తన సేవలను అందించాడు. -
T20 WC: ఓపెనర్‌గా రోహిత్ వద్దు.. వాళ్లిద్దరు రావాలి!
టీ20 ప్రపంచకప్-2024 టోర్నీకి కౌంట్‌డౌన్ మొదలైంది. అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా ఈవెంట్ జూన్ 1న మొదలుకానుంది. ఈ క్రమంలో ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మ సహా మొదటి బ్యాచ్‌లోని కీలక ఆటగాళ్లంతా న్యూయార్క్ చేరుకున్నారు.మిగిలిన వాళ్లలో బ్యాటింగ్ స్టార్ విరాట్ కోహ్లితో పాటు మరికొంత మంది అక్కడికి వెళ్లాల్సి ఉంది. కాగా జూన్ 5న ఐర్లాండ్‌తో టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడనుంది.రోహిత్‌కు జోడీగా కోహ్లి వస్తే బెటర్‌ఈ నేపథ్యంలో తుదిజట్టు కూర్పు గురించి భారత మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్.. వరల్డ్‌కప్ టోర్నీలో భారత ఓపెనింగ్ జోడీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.కాగా మెగా టోర్నీలో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేయడం దాదాపుగా ఖరారైపోగా.. రోహిత్‌కు జోడీగా కోహ్లి వస్తే బాగుంటుందని మెజారిటీ మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఈ నేపథ్యంలో వసీం జాఫర్ మాత్రం భిన్నంగా స్పందించాడు. యశస్వి జైస్వాల్- విరాట్ కోహ్లి భారత ఇన్నింగ్స్ ఆరంభించాలని.. రోహిత్ శర్మ వన్‌డౌన్‌లో వస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.ఓపెనర్‌గా రోహిత్ శర్మ వద్దు.. వాళ్లిద్దరు రావాలి!‘‘వరల్డ్‌కప్ ఈవెంట్లో కోహ్లి- జైస్వాల్ ఓపెనింగ్ చేయాలి. వీరిద్దరి కాంబినేషన్లో ఎలాంటి ఆరంభం లభిస్తుందన్న అంశం ఆధారంగా.. రోహిత్- స్కై(సూర్యకుమార్ యాదవ్) మూడు, నాలుగు స్థానాల్లో రావాలి. నిజానికి రోహిత్ స్పిన్ అద్బుతంగా ఆడగలడు. కాబట్టి నాలుగో నంబర్లో బ్యాటింగ్ చేసే వాళ్లు మిడిల్ ఓవర్ల గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’’అని వసీం జాఫర్ ఎక్స్ వేదికగా తన అభిప్రాయం పంచుకున్నాడు.అయితే, ఐర్లాండ్, పాకిస్తాన్లతో మ్యాచ్‌లకు మాత్రమే ఈ ఓపెనింగ్ జోడీ బాగుంటుందనే సంకేతాలు ఇచ్చాడు. కాగా జూన్ 9న న్యూయార్క్ వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో టీమిండియా తలపడనుంది.టీ20 ప్రపంచకప్-2024కు బీసీసీఐ ప్రకటించిన భారత జట్టు:రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్, అర్ష్‌దీప్ సింగ్ , జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్Kohli & Jaiswal should open in the World Cup imo. Rohit & SKY should bat 3&4 depending on the start we get. Rohit plays spin really well so batting at 4 shouldn't be a concern. #T20WorldCup #INDvPAK #INDvIRE pic.twitter.com/nMgwwaDNXb— Wasim Jaffer (@WasimJaffer14) May 29, 2024 -
టీ20 వరల్డ్‌కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ వరుస ఓటుములతో సతమతమవుతోంది. శుక్రవారం వాంఖడే వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 24 పరుగుల తేడాతో ఓటమి పాలైన ముంబై.. తమ ప్లే ఆఫ్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది.ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన ముంబై ఇండియన్స్ కేవలం మూడింట మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్ధానంలో కొనసాగుతోంది. ఇక ఈ ఏడాది సీజన్లో ముంబై ఇండియన్స్ నిరాశపరుస్తున్నప్పటికి.. ఆ జట్టు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మాత్రం తన వంతు న్యాయం చేస్తున్నాడు.కేకేఆర్‌తో మ్యాచ్‌లోనూ బుమ్రా నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. ఓవరాల్‌గా ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 17 వికెట్లు పడగొట్టిన బుమ్రా.. లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. వరల్డ్‌కప్-2024కు ముందు బుమ్రా సూపర్ ఫామ్‌లో ఉండటం భారత జట్టు కలిసిచ్చే ఆంశం.ఈ క్రమంలో టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశాలు దాదాపు లేకపోవడంతో మిగిలిన మ్యాచ్‌లకు బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని జాఫర్ అభిప్రాయపడ్డాడు.ఈ ఏడాది ఐపీఎల్లో మరో మ్యాచ్ తర్వాత ముంబై భావితవ్యం తేలిపోనుంది. ఆ మ్యాచ్‌లో ముంబై ఓటమి పాలైతే ప్లే ఆఫ్స్ రేసు అధికారికంగా నిష్క్రమిస్తోంది. ఒకవేళ అది జరిగితే మిగిలిన మ్యాచ్‌లకు బుమ్రాకు విశ్రాంతి ఇవ్వడం బెటర్. అది టీమిండియాకు బాగా కలిసిస్తోందని ఈఎస్పీఈన్ క్రిక్ ఈన్ఫోలో జాఫర్ పేర్కొన్నాడు. -
T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
ఐపీఎల్-2024 తర్వాత పొట్టి క్రికెట్ మజాను మరింత పెంచేందుకు వరల్డ్‌కప్ రూపంలో మెగా ఈవెంట్ ముందుకు రానుంది. జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా ఈ ఐసీసీ టోర్నీ ఆరంభం కానుంది.ఇందుకోసం జట్లను ప్రకటించేందుకు మే 1 వరకు సమయం ఇచ్చింది ఐసీసీ. ఈ నేపథ్యంలో టీమిండియా ఎంపిక గురించి భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ‘ఎక్స్’ వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.వికెట్ కీపర్ కోటాలోతన జట్టులో టాపార్డర్‌లో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్‌లకు చోటిచ్చిన జాఫర్.. వికెట్ కీపర్ కోటాలో రిషభ్ పంత్, సంజూ శాంసన్‌లకు స్థానం కల్పించాడు. కేఎల్ రాహుల్‌కు మాత్రం మొండిచేయి చూపాడు.ఇక ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా, శివం దూబే, రవీంద్ర జడేజాలను ఎంచుకున్న వసీం జాఫర్.. నయా ఫినిషర్ రింకూ సింగ్‌ను కూడా ఎంపిక చేసుకున్నాడు.అదే విధంగా.. స్పిన్నర్ల కోటాలో కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్, పేస్ దళంలో నాయకుడు జస్ప్రీత్ బుమ్రాతో పాటు మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్‌లకు ఈ టీమిండియా మాజీ క్రికెటర్ చోటిచ్చాడు. కాగా ప్రపంచకప్ ఈవెంట్లో జూన్ 5న ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో టీమిండియా తమ ప్రయాణం మొదలుపెట్టనుంది.టీ20 ప్రపంచకప్-2024కువసీం జాఫర్ ఎంచుకున్న 15 మంది సభ్యుల భారత జట్టు:రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్(వికెట్ కీపర్), సంజూ శాంసన్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, శివం దూబే, రింకూ సింగ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్. -
ధోని ఆటగాడిగానూ రిటైర్ అయితే బాగుండేది: భారత మాజీ ఓపెనర్
#MSDhoni- IPL 2024: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మార్పుపై టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. మహేంద్ర సింగ్ ధోని ఆటగాడిగానూ తప్పుకొంటేనే కొత్త సారథి పని సులువు అవుతుందని అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్-2024 ఆరంభానికి ఒక్క రోజు ముందు (మార్చి 21).. ధోని కెప్టెన్సీని వదిలేసి.. రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించాడని సీఎస్కే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, తలా ఆటగాడిగా మాత్రం కొనసాగుతాడని సంకేతాలు ఇచ్చింది. What it means! 🗣️💛#WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/WCLqVI4xyU — Chennai Super Kings (@ChennaiIPL) March 22, 2024 అందుకు అనుగుణంగానే సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథ్ సైతం ధోని తాజా సీజన్ మొత్తానికి అందుబాటులో ఉంటాడని స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో మాజీ ఓపెనర్ వసీం జాఫర్ మాట్లాడుతూ.. ధోని ఆటగాడిగా కూడా రిటైర్ ఉంటే బాగుండేదని పేర్కొన్నాడు. ఆటగాడిగానూ రిటైర్ అయితే బాగుండేది. ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో ఇంటర్వ్యూలో భాగంగా.. ధోని సీఎస్కే కెప్టెన్సీ వదిలేయడం గురించి ప్రస్తావించగా.. ‘‘ధోని కెప్టెన్‌గానే కాదు.. ఆటగాడిగానూ రిటైర్ అయితే బాగుండేది. ధోని ప్లేయర్‌గా ఉన్న జట్టును నాయకుడిగా ముందుకు నడిపించడం యువ ఆటగాడికి సాధ్యం కాదు. ఒకవేళ కొత్త కెప్టెన్ ఏదైనా నిర్ణయం తీసుకుంటే.. ధోని దానిని అంగీకరించవచ్చు లేదంటే వద్దని చెప్పవచ్చు. కాబట్టి ధోని మైదానంలో ఉండగా రుతురాజ్ గైక్వాడ్ సొంత నిర్ణయం తీసుకునేందుకు కచ్చితంగా ఇబ్బంది పడతాడు. అలా అయితే కెప్టెన్సీ కష్టం అంతేకాదు కొన్నిసార్లు తన నిర్ణయాలు అమలు చేయలేకపోవచ్చు కూడా! అప్పుడు కెప్టెన్సీ మరింత కష్టతరంగా మారుతుంది. అదే ధోని గనుక జట్టుతో లేకుంటే స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే వీలు ఉంటుంది. ధోని వారసుడిగా రుతురాజ్ తనదైన ముద్ర వేసే అవకాశం ఉంటుంది’’ అని వసీం జాఫర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. కాగా 2022లో ధోని సారథిగా తప్పుకొని టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు సీఎస్కే నాయకత్వ బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే, కెప్టెన్సీ అనుభవం లేని జడ్డూ.. ఆటగాడిగానూ విఫలమై విమర్శలు మూటగట్టుకున్నాడు. మధ్యలోనే లీగ్ నుంచి నిష్క్రమించగా.. అతడి స్థానంలో ధోని మళ్లీ పగ్గాలు చేపట్టాడు. ఆ ఎడిషన్‌లో దారుణ ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచిన సీఎస్కే.. 2023లో అనూహ్య రీతిలో పుంజుకుని చాంపియన్‌గా నిలిచింది. ధోని నాయకత్వంలో ఐదోసారి టైటిల్ విజేతగా అవతరించింది. ఇక శుక్రవారం (మార్చి 22) ఐపీఎల్ పదిహేడో ఎడిషన్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. చెపాక్ వేదికగా చెన్నై.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తొలి మ్యాచ్‌లో తలపడనుంది. చదవండి: IPL 2024: మెరుపులా వచ్చి మాయం!.. ఇకనైనా మారు! -
కిషన్ టీ20లకు పనికిరాడు.. ఆ యువ ఆటగాడికి ఛాన్స్ ఇవ్వండి!
గయానా వేదికగా ఆదివారం వెస్టిండీస్‌తో జరగనున్న రెండో టీ20లో అమీతుమీ తెల్చుకోవడానికి టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో గెలిచి తొలి మ్యాచ్ ఓటమికి బదులు తీర్చుకోవాలని హార్దిక్ సేన భావిస్తోంది. మరోవైపు తొలి టీ20లో విజయం సాధించి మంచి జోష్ మీద ఉన్న విండీస్ మాత్రం.. అదే జోరును కనబరిచి తమ అధిక్యాన్ని పెంచుకోవాలని యోచిస్తోంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు పలు మార్పులతో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. ఇక రెండో టీ20 నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. రెండో టీ20కు ఇషాన్ కిషన్ స్ధానంలో యువ ఆటగాడు యశస్వీ జైశ్వాల్‌కు అవకాశం ఇవ్వాలని జాఫర్ సూచించాడు. కాగా విండీస్‌తో టీ20 సిరీస్‌లో అదరగొట్టిన కిషన్.. ట్రినిడాడ్ వేదికగా జరిగిన మొదటి టీ20లో మాత్రం నిరాశపరిచాడు. అయితే ఈ సిరీస్ మాత్రమే కాకుండా టీ20ల్లో అంత మంచి రికార్డు కిషన్‌కు లేదు. ఇప్పటివరకు 28 టీ20 మ్యాచ్‌లు ఆడిన కిషన్.. 25 కంటే తక్కువ సగటుతో 659 పరుగులు చేశాడు. "విండీస్‌తో రెండో టీ20లో యశస్వి జైస్వాల్‌ని చూడాలనుకుంటున్నాను. అతడు ఓపెనర్‌గా బరిలోకి దిగాలి. ఇషాన్ కిషన్ స్ధానంలో జైశ్వాల్ ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే కిషన్ టీ20ల్లో పేలవ ఫామ్‌ను కనబరుస్తున్నాడు. గత 15 ఇన్నింగ్స్‌లలో అతడు 40 పరుగులు కూడా చేయలేదు. స్ట్రైక్ రేట్ కూడా చాలా తక్కువగా ఉంది. కాబట్టి అతడిని పక్కన పెడితే మంచింది. అయితే అతడు వన్డేల్లో మంచి ఫామ్‌లో ఉన్నాడు. కానీ టీ20 అనేది భిన్నమైన ఫార్మాట్. అతడు ఐపీఎల్లో కూడా అంతగా రాణించలేకపోయాడు. జైశ్వాల్ మాత్రం ఈ ఏడాది ఐపీఎల్లో దుమ్మురేపాడు. అందుకే అతడు కచ్చితంగా టీ20 జట్టులో ఉండాలి" అని జాఫర్ క్రిక్ ఇన్ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాఫర్ పేర్కొన్నాడు. చదవండి: #Alex Steele: 83 ఏళ్ల వయస్సులో వికెట్ కీపింగ్.. ఆక్సిజన్ సిలిండర్ పట్టుకుని మరి! వీడియో వైరల్ -
ఏదో క్లబ్‌గేమ్ ఆడుతున్నట్లు.. రాష్ట్రస్థాయి మ్యాచ్ అన్నట్లు! తిలక్ అలా..
Wasim Jaffer On Tilak Varma’s batting performance on T20I debut: ‘‘అద్భుతంగా ఆడాడు. అతడి ఆటకు వంక పెట్టే అవకాశమే లేకుండా చేశాడు. ఏదో క్లబ్ గేమ్‌లోనో.. రాష్ట్రస్థాయి జట్టుకో ఆడుతున్నట్లు ఇన్నింగ్స్ ఆరంభించాడు. ఒత్తిడిని ఏమాత్రం దరిచేరనివ్వలేదు. తనదైన శైలిలో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. తొలి మ్యాచ్‌లోనే ఇలా బెరుకు లేకుండా ఆడటం చూస్తుంటే మానసికంగా అతడు ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నాడో అర్థమవుతోంది. ఈ పిచ్‌పై మిగతా వాళ్లంతా విఫలమైన వేళ అతడు మాత్రం ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఆడాడు’’ అని టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్.. తిలక్ వర్మపై ప్రశంసలు కురిపించాడు. ఇంకాసేపు తిలక్ క్రీజులో ఉంటే భారత జట్టు తేలికగా మ్యాచ్ గెలిచేదని అభిప్రాయపడ్డాడు. మరో హైదరాబాదీ ఆగమనం ట్రినిడాడ్‌లోని బ్రియన్ లారా స్టేడియంలో టీమిండియా వెస్టిండీస్‌తో తొలి టీ20లో తలపడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ సందర్భంగా.. హైదరాబాదీ యువ సంచలనం తిలక్ వర్మ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. విండీస్ విధించిన ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించలేక ‘స్టార్లు’ విఫలమైన వేళ.. నాలుగో స్థానంలో వచ్చిన తిలక్ 22 బంతుల్లో 39 పరుగులు చేశాడు. ఎదుర్కొన్న తొలి 3 బంతుల్లోనే రెండు సిక్సర్లతో అలరించాడు. జట్టులో అనుభవమున్న సీనియర్ ఆటగాళ్ల కంటే మెరుగైన ప్రదర్శనతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అద్భుతమైన షాట్లు ఈ నేపథ్యంలో.. వసీం జాఫర్ మాట్లాడుతూ.. తిలక్ అద్భుతమైన షాట్లతో ఆకట్టుకున్నాడని కొనియాడాడు. ఒకవేళ ఈ యువ బ్యాటర్ 50- 60 పరుగులు చేసి టీమిండియా గెలిచే అవకాశం ఉండేదని అభిప్రాయపడ్డాడు. ఏదేమైనా తిలక్ అరంగేట్ర మ్యాచ్‌లో ఈ మేరకు రాణించడం జట్టుకు శుభసూచకమని.. అతడికి మంచి భవిష్యత్తు ఉందని వసీం జాఫర్ పేర్కొన్నాడు. ఓటమిపాలై.. కాగా రొమారియో షెఫర్డ్ బౌలింగ్‌లో తిలక్ వర్మ హెట్మెయిర్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఇక విండీస్‌తో తొలి టీ20లో ఓపెనర్లు ఇషాన్ కిషన్(6), శుబ్‌మన్ గిల్(3) సహా.. నంబర్ 1 టీ20 బ్యాటర్ సూర్య(21), కెప్టెన్ హార్దిక్ పాండ్యా(19), సంజూ శాంసన్(12) చేతులెత్తేయడంతో భారత జట్టుకు ఓటమి తప్పలేదు. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో ఆతిథ్య కరేబియన్ జట్టు 4 పరుగుల స్వల్ప తేడాతో గెలిచి.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది. చదవండి: ఓటమి బాధలో ఉన్న టీమిండియాకు షాక్.. విండీస్‌కు కూడా..! Takes a blinder. Hits back to back sixes to kick off his innings. A dashing debut for Tilak Varma 😎#INDvWIAdFreeonFanCode #WIvIND pic.twitter.com/VpcKOyfMSR — FanCode (@FanCode) August 3, 2023 -
రెండ్రోజులు అక్కడే పెట్టిన అరటిపండును శ్రీశాంత్ తిన్నాడు! ఆఖరికి లోదుస్తులు కూడా..
Sreesanth Once Ate Two-Day Old Banana: ‘మానే కాక(రమేశ్ మానే) అప్పట్లో టీమిండియాతో ప్రయాణించేవాడు. మసాజ్ చేయడంతో పాటుగా పూజలు కూడా చేస్తుండేవాడు. నిజానికి శ్రీశాంత్‌కు ‘మూఢనమ్మకాలు’ ఎక్కువ. తనలాంటి ఫాస్ట్బౌలర్ను నేనైతే ఎప్పుడూ చూడలేదు. మానే కాక.. పూజ సమయంలో అగర్బత్తీలను అరటిపండుకు కుచ్చి నిలబెట్టేవాడు. రెండ్రోజులైనా అదే తిన్నాడు అయితే, శ్రీశాంత్ నమ్మకాల గురించి తెలిసిన ఓ క్రికెటర్ అతడిని ఆటపట్టించాలని భావించాడు. శ్రీశాంత్.. నువ్వు గనుక ఇప్పటికిప్పుడు అరటిపండు తింటే ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీస్తావు తెలుసా అని ఊరించాడు. అప్పటికే ఆ అగర్బత్తీలు పెట్టిన అరటిపండు అక్కడ పెట్టి రెండ్రోజులు అయింది. అయినా శ్రీశాంత్ దానిని తిన్నాడు. వికెట్లు తీయాలనే కోరికతో అలా చేశాడు’’ అని టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్.. భారత మాజీ పేసర్ శ్రీశాంత్ గురించి చెప్పుకొచ్చాడు. జియో సినిమా షోలో భాగంగా.. టీమిండియా ఆటగాళ్ల వింత నమ్మకాల గురించి ప్రస్తావన రాగా 2006 నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు. అందుకే అలా చేశాడు కాగా నాడు ఆ అరటిపండు తిన్న శ్రీశాంత్ అప్పటి మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లో కలిపి ఐదు వికెట్లు తీశాడు. జమైకాలో వెస్టిండీస్‌తో టెస్టు సందర్భంగా మొత్తంగా 49 పరుగులు ఇచ్చి ఈ మేరకు వికెట్లు పడగొట్టాడు. వాళ్లైతే ఆఖరికి లోదుస్తులు కూడా ఇక ఇదే షోలో పాల్గొన్న టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ మాట్లాడుతూ.. భారత క్రికెటర్లలో చాలా మందికి ఇలాంటి మూఢనమ్మకాలు ఉంటాయని చెప్పుకొచ్చాడు. రంజీ ఆడే రోజుల్లో కొంతమంది ఏదైనా ఒకరోజు ఐదు వికెట్లు తీస్తే.. ఆ బట్టలు.. ఆఖరికి లోదుస్తులు కూడా ఉతక్కుండా ఉంచుకునే వాళ్లని తెలిపాడు. అదృష్టం తమతో పాటు అలాగే అతుక్కుపోవాలని ఇలా చేసే వాళ్లని చెప్పుకొచ్చాడు. శ్రీశాంత్ ఒక్కడికే కాకుండా చాలా మందికి ఇలాంటి నమ్మకాలు ఉంటాయని జహీర్ ఖాన్ పేర్కొన్నాడు. కాగా కేరళకు చెందిన శ్రీశాంత్ ప్రస్తుతం జింబాబ్వే ఆఫ్రో టీ10లీగ్‌తో బిజీగా ఉన్నాడు. చదవండి: ఆఖరి టెస్టుకు ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. ఇంత మొండితనం పనికిరాదు! -
ప్రయోగంతో మూల్యం చెల్లించుకున్నాడు! పర్లేదు.. అప్పుడప్పుడు ఇలా జరిగితే..
Wasim Jaffer rates Shubman Gill's performances: వెస్టిండీస్‌తో సిరీస్‌లో యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ ఘనంగా తన ఆగమనాన్ని చాటగా.. టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఇషాన్ కిషన్ సైతం తన మార్కు చూపించాడు. డొమినికాలో తొలి టెస్టులో యశస్వి 171 పరుగులతో రాణించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన విషయం తెలిసిందే. యశస్వి అలా.. ఇషాన్ ఇలా ఇక ట్రినిడాడ్ వేదికగా జరిగిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇషాన్ కిషన్ తుపాన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్ 34 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 52 పరుగులతో అజేయంగా నిలిచాడు. గిల్ మాత్రం విఫలం వీరిద్దరు ఇలా తమకు వచ్చిన మొదటి అవకాశాలను ఇలా సద్వినియోగం చేసుకుంటే.. కెప్టెన్ రోహిత్ శర్మకు జోడీగా రెగ్యులర్ ఓపెనర్ అయిన శుబ్‌మన్ గిల్ పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ఏరికోరి మూడో స్థానంలో వచ్చిన అతడు రెండు టెస్టుల్లోనూ విఫలమయ్యాడు. మొదటి మ్యాచ్‌లో 6 పరుగులకే పెవిలియన్ చేరిన గిల్.. రెండో మ్యాచ్‌లో వరుసగా 10, 29(నాటౌట్) పరుగులు సాధించాడు. దీంతో అనవసరంగా మూడో స్థానంలో వచ్చి పిచ్చి ప్రయోగంతో మూల్యం చెల్లించుకున్నాడంటూ శుబ్‌మన్ గిల్‌పై విమర్శలు వస్తున్నాయి. 1-5.. ఎక్కడైనా ఆడగలడు ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్.. గిల్‌కు అండగా నిలిచాడు. బ్యాటింగ్ ఆర్డర్లో 1-5 వరకు ఏ స్థానంలో అయినా ఆడగల సత్తా అతడికి ఉందని పేర్కొన్నాడు. ‘‘గిల్ మంచి బ్యాటర్. తనలాంటి ప్లేయర్ ఓపెనర్‌గా రాణించగలడు. ఐదో స్థానం వరకు ఎక్కడైనా సరే బ్యాటింగ్ చేయగలడు. అండర్-19 వరల్డ్‌కప్ టోర్నీలో అతడు మూడు, నాలుగు స్థానాల్లో బ్యాటింగ్ చేసిన విషయాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టే విండీస్‌లో తను వన్‌డౌన్‌లో రావడం నన్నేమీ ఆశ్చర్యపరచలేదు. ఒక్కోసారి 150 ఓవర్ల పాటు ఫీల్డింగ్ చేసి వెంటనే బ్యాటింగ్ చేయాలంటే ఓపెనర్లకు కాస్త ఇబ్బందిగా ఉంటుంది. పదికి నాలుగు మార్కులు కానీ నంబర్ 3లో ఆడే వారికి కాస్త కుదురుకునే సమయం దొరుకుతుంది’’ అని వసీం జాఫర్ జియో సినిమా షోలో తన అభిప్రాయం పంచుకున్నాడు. కానీ, గిల్‌కు విండీస్ టూర్లో మాత్రం పదికి నాలుగు మార్కులు మాత్రమే వేస్తానని చెప్పడం విశేషం. అయితే, ఇది ఆరంభమే కాబట్టి గిల్ విషయంలో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న జాఫర్.. అతడికి కాస్త సమయం ఇవ్వాలని పేర్కొన్నాడు. చదవండి: క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్.. చూస్తే మైండ్ బ్లాంక్! వీడియో వైరల్ శివాలెత్తిన సికందర్ రజా.. ఫాస్టెప్ట్ హాఫ్ సెంచరీ.. 5 ఫోర్లు, 6 సిక్సర్లతో..! -
'అతడు వరల్డ్‌కప్‌లో అదరగొడతాడు.. కానీ అది ఒక్కటే డౌట్'
గాయం కారణంగా గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి ఆసియాకప్‌తో మైదానంలో అడుగుపెట్టే సూచనలు కన్పిస్తున్నాయి. తాజాగా అతడి ఫిట్‌నెస్‌కు సంబంధించి మెడికిల్ బులెటిన్ బీసీసీఐ విడుదల చేసింది. బుమ్రా పూర్తి ఫిట్నెస్ సాధించడాని, నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడని బీసీసీఐ తెలిపింది. ఈ ఏడాది ఆసియాకప్, వన్డే ప్రపంచకప్ వంటి మెగా ఈవెంట్లు జరగనుండడంతో బుమ్రా తిరిగి రావడం టీమిండియాకు ఎంతో అవసరం. ఇక ఇదే విషయంపై భారత మాజీ ఓపెనర్ వసీం తన అభిప్రాయాలను వెల్లడించాడు. భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో జస్ప్రీత్ బుమ్రా కీలక పాత్ర పోషిస్తాడని జాఫర్ జోస్యం చెప్పాడు. "జస్ప్రీత్ బుమ్రా భారత బౌలింగ్ అటాక్‌లో చాలా కీలకం. అతడు ప్రపంచకప్‌లో ముఖ్య పాత్ర పోషిస్తాడని నేను భావిస్తున్నాను. ప్రస్తుతం డెత్ బౌలింగ్‌లో అతడు లేని లోటు సృష్టంగా కన్పిస్తోంది. అతడి సేవలను ఈ ఏడాది మొత్తం భారత్ కోల్పోయింది. బుమ్రా తిరిగి మైదానంలో అడుగుపెట్టాలి. అయితే అతడు తిరిగి వచ్చిన అదే వేగంతో బౌలింగ్ చేయగలడా అనేది ప్రశ్నర్ధకంగా మారింది. కానీ బుమ్రా అదే స్పీడ్‌ను కొనసాగిస్తే అతడిని మించినవారే ఉండరు" అని జియో సినిమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాఫర్ పేర్కొన్నాడు. చదవండి: IND vs BAN: కొంచెం మర్యాదగా ప్రవర్తించాలి.. అది మంచి పద్దతి కాదు! టీమిండియా కెప్టెన్‌పై సీరియస్ -
'500వ మ్యాచ్.. నిబద్ధతకు సెల్యూట్ కొట్టాల్సిందే'
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ఈతరం ఆల్‌టైమ్ గ్రేట్ బ్యాటర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక వెస్టిండీస్‌తో నేటి నుంచి జరగనున్న రెండో టెస్టు కోహ్లికి అంతర్జాతీయంగా అన్ని ఫార్మాట్లు కలిపి 500వ మ్యాచ్. టీమిండియా తరపున 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న నాలుగో ఆటగాడిగా కోహ్లి రికార్డులకెక్కాడు. ఇక అంతర్జాతీయంగా అన్ని ఫార్మాట్లు కలిపి అత్యధిక పరుగులు చేసిన జాబితాలో కోహ్లి ఆరో స్థానంలో ఉండగా.. సెంచరీల విషయంలో మాత్రం దిగ్గజం సచిన్ తర్వాతి స్థానంలో ఉన్నాడు. విండీస్‌తో జరిగిన తొలి టెస్టులో సెంచరీ చేయడంలో విఫలమైనప్పటికి 76 పరుగులతో మంచి టచ్‌లోనే కనిపించాడు. మరి ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో కోహ్లి సెంచరీతో మెరుస్తాడేమో చూడాలి. ఇక కోహ్లి 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతుండడంపై టీమిండియా మాజీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాజీలు ఆకాశ్ చోప్రా, వసీం జాఫర్, ప్రగ్యాన్ ఓజాలు కోహ్లిపై ప్రశంసల వర్షం కురిపించారు. ''ఆట పట్ల కోహ్లికున్న నిబద్ధత ఇవాళ 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడేలా చేసింది. వచ్చి 16 ఏళ్లు కావొస్తున్నా అదే ఫిట్నెస్ మెయింటేన్ చేయడం అంటే మాములు విషయం కాదు. ఈ 16 ఏళ్లలో కోహ్లి తనకు తానుగా తప్పుకున్నాడే తప్ప ఫిట్నెస్ విషయంలో ఇబ్బంది పడి ఒక్క మ్యాచ్‌కు దూరమైన సందర్భాలు లేవు. ఈతరం క్రికెటర్లలో గొప్ప ఆటగాడని కచ్చితంగా చెప్పగలను. 500వ మ్యాచ్ ఆడుతున్న కోహ్లికి కంగ్రాట్స్'' అంటూ ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. ''500వ అంతర్జాతీయ మ్యాచ్.. కోహ్లి ఖాతాలో మరో కలికితురాయి. ఇది నిజంగా గొప్ప అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. కొందరికే ఇది సాధ్యమవుతుంది.. అందులో కోహ్లి ఒకడు. ఇదే ఫామ్‌ను కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నా'' అంటూ ఓజా పేర్కొన్నాడు. ''క్రికెట్లో 500 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడే అవకాశం అందరికి రాదు. కానీ కోహ్లికి ఆ చాన్స్ వచ్చింది. బ్యాటర్‌గా తనేంటో ఇప్పటికే నిరూపించుకున్నాడు. మంచి ఫిట్నెస్ కలిగి ఉన్న కోహ్లి ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో 75 సెంచరీలు బాదాడు. ఇది అతని క్రమశిక్షణ, అంకితభావం, సంకల్పాన్ని సూచిస్తున్నాయి.'' అంటూ జాఫర్ తెలిపాడు. చదవండి: BAN W Vs IND W 2nd ODI: జెమీమా రోడ్రిగ్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శన..108 పరుగులతో భారీ విజయం -
'30 లక్షలు సంపాదించి రాంచీలో ప్రశాంతంగా బతికేస్తా'
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఇవాళ(జూలై 7న) 42వ పడిలోకి అడుగుపెట్టాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి మూడేళ్లు కావొస్తున్నా అతని క్రేజ్ ఇసుమంతైనా తగ్గలేదు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 16వ సీజన్ చాలు ధోని క్రేజ్ ఏంటో చెప్పడానికి. అందునా సీఎస్కే ఐదోసారి చాంపియన్‌గా నిలవడంతో ధోనిపై ప్రేమ ఆకాశమంత ఎత్తుకు వెళ్లిపోయింది. ఐపీఎల్ ఫైనల్ ముగిసిన రోజున ధోని ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ఇస్తాడని అంతా భావించారు. కానీ మరో తొమ్మిది నెలల తర్వాత తాను ఐపీఎల్ ఆడేది లేనిది చెప్తానంటూ పేర్కొన్నాడు. దీన్నిబట్టి ఫిట్‌గా ఉంటే ధోనిని వచ్చే ఐపీఎల్ సీజన్లో చూసే అవకాశం ఉంది. ఇక ధోని బర్త్‌డే పురస్కరించుకొని టీమిండియా క్రికెటర్లు సహా పలువురు దిగ్గజాలు, మాజీ క్రికెటర్లు ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ధోనితో ఉన్న అనుబంధాన్ని ప్రత్యేకంగా గుర్తుచేసుకున్నాడు. ధోనికి "ముందు నా ప్రియ మిత్రుడు ఎంఎస్ ధోనికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నేను 2005లో టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాను. అప్పుడు ధోనీ టీమ్‌కు కొత్త. 2004 డిసెంబర్ లో జట్టులోకి వచ్చాడు. వన్డే క్రికెట్ ఆడుతున్నాడు. నేను అప్పట్లో టెస్ట్ క్రికెట్ ఆడేవాడిని. మేము వెనుకాల కూర్చునే వాళ్లం. నేను, నా భార్య, దినేష్ కార్తీక్, అతని భార్య, ఆర్పీ సింగ్ వెనుకాల సీట్లలో కూర్చునే వాళ్లం. అప్పట్లో మేమంతా వెనుకాల కూర్చొని చాలా మాట్లాడుకునేవాళ్లం. అతడు రైల్వేస్ లో పని చేసేవాడని మనందరికీ తెలుసు. క్రికెట్ ప్రాక్టీస్ కోసం చాలా తిరిగేవాడు. అంత చేసినా ఆడే అవకాశం మాత్రం వచ్చేది కాదు. అప్పట్లో అతడు ఆ జాబ్ వదిలేశాడనుకుంటా. రూ.30 లక్షలు సంపాదించి తన జీవితం మొత్తం హాయిగా రాంచీలో గడిపేస్తానని.. ఎట్టిపరిస్థితుల్లో రాంచీ వదలనని చెప్పేవాడు. క్రికెట్ లోకి కొత్తగా వచ్చిన వ్యక్తి కావడంతో రూ.30 లక్షలు సంపాదిస్తే చాలు.. నా జీవితం ప్రశాంతంగా గడిపేస్తా అనేవాడు. అంత వినయంగా ఉండేవాడు. ఇప్పటికీ అలాగే ఉన్నాడు. అతడు చాలా చిన్న లక్ష్యాలనే నిర్దేశించుకునేవాడు" అని జాఫర్ వెల్లడించాడు. చదవండి: MS Dhoni: ధోని బర్త్‌డే.. రవీంద్ర జడేజా ఎమోషనల్ ట్వీట్! వైరల్ -
ఆ నలుగురు ఎందుకు? ఓహో.. అందుకే వాళ్లను సెలక్ట్ చేయలేదా?: మాజీ బ్యాటర్
India West Indies tour 2023: వెస్టిండీస్ పర్యటన నేపథ్యంలో టీమిండియా సెలక్టర్ల వ్యవహారశైలిపై భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ మండిపడ్డాడు. ముఖ్యంగా విండీస్‌తో టెస్టు సిరీస్‌కు జట్టును ఎంపిక చేసిన తీరుపై అసహనం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ ఆడనంత మాత్రాన రంజీల్లో అద్భుతంగా ఆడిన ఆటగాళ్లను పక్కన పెడతారా అని జాఫర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. విండీస్‌లో నెల రోజులు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2023 ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి తర్వాత భారత జట్టుకు దాదాపు నెలరోజుల విశ్రాంతి లభించింది. ఈ క్రమంలో జూలై 12- ఆగష్టు 13 వరకు వెస్టిండీస్ పర్యటనతో మరోసారి బిజీ కానుంది. రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ నేపథ్యంలో విండీస్‌తో తలపడే టెస్టు, వన్డే జట్లను బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. అయితే, రంజీల్లో అదరగొట్టిన ఆటగాళ్ల పేర్లను కనీసం పరిశీలనలోకి తీసుకోకపోవడం పట్ల వసీం జాఫర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ముఖ్యంగా టెస్టు జట్టు కూర్పుపై సెలక్టర్లకు అవగాహన లేనట్లు కనిపిస్తోందని విమర్శించాడు. నలుగురు ఓపెనర్లు ఎందుకు? ‘‘నలుగురు ఓపెనింగ్ బ్యాటర్లను ఎంపిక చేయాల్సిన అవసరం ఏమిటి? రోహిత్, శుబ్‌మన్, గైక్వాడ్, జైశ్వాల్ వీళ్లంతా ఓపెనర్లే! ఇలా చేసే బదులు సర్ఫరాజ్ ఖాన్‌ను ఎంపిక చేసి ఉంటే మిడిలార్డర్ పటిష్టమయ్యేది కదా? దేశవాళీ క్రికెట్లో అతడి ప్రదర్శన చూశాం కదా! ఓహో అందుకే వాళ్లను పక్కనపెట్టారా? ఇక అభిమన్యు ఈశ్వరన్, ప్రియాంక్ పాంచాల్ రంజీల్లో, ఇండియా- ఏ జట్టు తరఫున అద్భుతంగా ఆడుతున్నారు. టెస్టు జట్టులో చోటు కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నారు. కేవలం వాళ్లు ఐపీఎల్ ఆడలేదన్న కారణంగా టీమిండియాకు ఎంపిక చేయరా? అకస్మాత్తుగా రుతురాజ్ టెస్టు జట్టులోకి ఎలా వచ్చాడు? దీన్ని బట్టే మీ దృష్టికోణం ఎలా ఉందో అర్థమవుతోంది’’అని వసీం జాఫర్ సెలక్టర్ల తీరును తూర్పారపట్టాడు. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత దాదాపు నెలరోజుల విశ్రాంతి లభించిన తర్వాత కూడా సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి రెస్ట్ ఇవ్వడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. కాగా విండీస్‌తో సిరీస్ నేపథ్యంలో యశస్వి జైశ్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ముకేశ్ కుమార్ సెలక్టర్ల పిలుపు అందుకున్నారు. వెటరన్ బ్యాటర్ అజింక్య రహానే రోహిత్ శర్మ డిప్యూటీగా ఎంపిక కాగా.. నయా వాల్‌గా పేరొందిన ఛతేశ్వర్ పుజారాకు జట్టు నుంచి ఉద్వాసన పలికారు. రంజీ ట్రోఫీ 2022-23లో అభిమన్యు, ప్రియాంక్ ఇలా బెంగాల్ బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్ 8 మ్యాచ్‌లలో 798 పరుగులు చేయగా.. గుజరాత్ క్రికెటర్ ప్రియాంక్ పాంచల్ 5 మ్యాచ్‌లు ఆడి 583 పరుగులు సాధించాడు. ఇక ముంబై ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ 6 మ్యాచ్‌లలో కలిపి 556 పరుగులు చేశాడు. విండీస్‌తో రెండు టెస్టులకు బీసీసీఐ ప్రకటించిన జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్, జయదేవ్ ఉనాద్కట్, నవదీప్ సైనీ. చదవండి: కోహ్లి లేకుంటే జట్టులోకి వచ్చేవాడినే కాదు.. ధోని నా కళ్లు తెరిపించాడు: యువీ లెజండరీ ఓపెనర్ దిల్షాన్.. డీకే మాదిరే! ఉపుల్ తరంగతో భార్య ‘బంధం’.. అతడినే పెళ్లాడి! Thoughts? #WIvIND pic.twitter.com/2YwaMuOwvN — Wasim Jaffer (@WasimJaffer14) June 24, 2023 -
విండీస్ టూర్లో ఫియర్లెస్ క్రికెట్ ఆడే యువకులకు చోటివ్వాలి: జాఫర్
ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత భారత జట్టుకు నెలరోజుల విశ్రాంతి లభించింది. అనంతరం వచ్చె నెలలో వెస్టిండీస్ పర్యటనకు భారత జట్టు వెళ్లనుంది. ఈ పర్యటనలో ఆతిధ్య విండీస్‌తో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు టీమిండియా ఆడనుంది. ఈ సిరీస్‌లకు భారత జట్టును బీసీసీఐ జూన్ 27న ప్రకటించనుంది. ఈ పర్యటనలో భారత జట్టు నుంచి కొంత మంది కొత్తముఖాలను చూసే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ సెలక్టర్లకు కీలక సూచనలు చేశాడు. విండీస్ పర్యటనలో ఫియర్లెస్ క్రికెట్ ఆడే యువకులకు జట్టులో చోటివ్వాలని జాఫర్ అభిప్రాయపడడ్డాడు. "టీమిండియా ఐసీసీ ట్రోఫీలు గెలవాలంటే ఫియర్లెస్ క్రికెట్ ఆడాలి. ముఖ్యంగా వైట్‌బాల్ క్రికెట్లో మరింత దూకుడుగా ఆడాలి. ధైర్యంగా ఆడే యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలి. అప్పుడే మనం విజయాలు సాధిస్తాం. అదే విధంగా టీ20 క్రికెట్ జట్టులో యశస్వి జైస్వాల్ వంటి విధ్వంసకర ఆటగాడికి కచ్చితంగా ఛాన్స్ ఇవ్వాలి. భారత్‌కు రింకూ సింగ్ రూపంలో కూడా మరో ఆప్షన్ ఉంది. అతడు కూడా ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇక రిషబ్ పంత్ ప్రస్తుతం జట్టులో లేడు కాబట్టి అతడి స్ధానంలో జితేష్ శర్మకు అవకాశం ఇవ్వాలి. అతడు ఐదు లేదా ఆరో స్ధానంలో బ్యాటింగ్ చేయగలడు. నా వరకు అయితే విండీస్‌తో వన్డే సిరీస్‌కు సంజు శాంసన్‌కు చోటు దక్కే ఛాన్స్ ఉంది" అని స్పోర్ట్స్ కీడాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాఫర్ పేర్కొన్నాడు. చదవండి: అహ్మదాబాద్‌లో ఆడటానికి ఎందుకంత భయం.. దెయ్యం ఏమైనా ఉందా: పీసీబీపై అఫ్రిది ఫైర్ -
ఎడ్జ్‌బాస్టన్ పిచ్ హైవేలా ఉంది.. జాఫర్ సెటైరికల్ ట్వీట్
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ తొలి టెస్టులో ఇంగ్లండ్ ఆధిపాత్యం చెలాయిస్తోంది. బాజ్‌బాల్ అంటూ దూకుడుగా ఆడి తొలి ఇన్నింగ్స్‌ను 393/8 వద్ద డిక్లెర్ చేసిన ఇంగ్లీష్ జట్టు.. బౌలింగ్‌లో కూడా అదే తీరును కనబరుస్తుంది. ఇంగ్లండ్ బౌలర్ల దెబ్బకు రెండో రోజు లంచ్ సమయానికి మూడు కీలక వికెట్లు కోల్పోయి 78 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్, మార్నస్ లబూషేన్, స్టీవ్ స్మిత్ వంటి స్టార్ ఆటగాళ్లు ఇప్పటికే పెవిలియన్‌కు చేరారు. ఇక ఈ విషయం పక్కన పెడితే.. తొలి టెస్టు జరుగుతున్న ఎడ్జ్‌బాస్టన్ పిచ్‌ను చాలా ఫ్లాట్‌గా తాయారు చేశారని, బౌలర్లకు ఏ మాత్రం అనుకూలించడం లేదని పలువురు మాజీ క్రికెటర్లు విమర్శిస్తున్నారు. ఇదే విషయంపై భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ తనదైన స్టైల్లో స్పందించాడు. ఎడ్జ్‌బాస్టన్ పిచ్‌ను హైవేతో పోలుస్తూ జాఫర్ సెటైరికల్ ట్వీట్ చేశాడు. ఎడ్జ్‌బాస్టన్ పిచ్ ఫోటోను షేర్చేస్తూ.. "పిచ్‌ను దగ్గరగా చూడండి అంటూ" ట్విటర్లో రాసుకొచ్చాడు. కాగా ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో జో రూట్ (118 నాటౌట్) అద్భుతమైన శతకంతో చెలరేగగా.. . జాక్ క్రాలే (61), బెయిర్‌స్టో (78) రాణించారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయోన్ 4, హాజిల్‌వుడ్ 2, బోలండ్, గ్రీన్ తలో వికెట్ పడగొట్టారు. చదవండి: Ashes Series 1st Test: స్మిత్ భరతం పట్టిన స్టోక్స్ Closer look at the Edgbaston pitch #Ashes23 pic.twitter.com/0gNSMWdPim — Wasim Jaffer (@WasimJaffer14) June 16, 2023 -
జాఫర్‌కు దొరికిన ఆణిముత్యం.. ముంబై ట్రంప్‌కార్డ్; భలే దొరికాడు
ఐపీఎల్ 16వ సీజన్లో ముంబై ఇండియన్స్ ఫైనల్‌కు వెళ్లే దారిలో ఎలిమినేటర్‌ను క్లియర్ చేసి క్వాలిఫయర్-2కు చేరుకుంది. మే 26(శుక్రవారం) గుజరాత్ టైటాన్స్‌తో క్వాలిఫయర్-2లో తలపడనుంది. ఆ మ్యాచ్‌లోనూ గెలిచి ఫైనల్లో సీఎస్కేను చిత్తు చేసి ఆరోసారి ఛాంపియన్‌గా నిలవాలని ఉవ్విళ్లూరుతుంది. ఇక బుధవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ముంబై గెలుపుకు ప్రధాన కారణం ఆకాశ్ మధ్వాల్. తన సంచలన బౌలింగ్‌తో కేవలం ఐదు పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీశాడు. రూ.20 లక్షల కనీస ధరకు మాత్రమే ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. అయితే ఆకాశ్ మధ్వాల్‌ను ముంబై తమ ట్రంప్‌కార్డ్‌గా భలే ఉపయోగించుకుంది. అంతకముందు లీగ్ దశలోనూ ప్లేఆఫ్ చేరాలంటే ఎస్ఆర్హెచ్పై కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లనూ ఆకాశ్ నాలుగు వికెట్లతో మెరిశాడు. మొత్తంగా ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ తరపున ఏడు మ్యాచ్‌లాడిన ఆకాశ్ మధ్వాల్ 13 వికెట్లు తీశాడు. యార్కర్ల కింగ్ బుమ్రా లేని లోటును మధ్వాల్ తీరుస్తూ రోహిత్‌కు అత్యంత నమ్మకమైన బౌలర్‌గా ఎదిగాడు. Photo: IPL Twitter ఎలిమినేటర్ లాంటి కీలక మ్యాచ్‌లో సత్తా చాటిన మధ్వాల్ గురించి తెలుసుకోవడానికి క్రికెట్ అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆకాశ్ మధ్వాల్ గురించి ఆసక్తికర విశేషాలు మీకోసం.. జాఫర్ వెలికితీసిన ఆణిముత్యం.. ఆకాశ్ 24 ఏళ్ల వయసు వచ్చే వరకూ టెన్నిస్ బాల్ క్రికెట్ మాత్రమే ఆడటం విశేషం. అతడు ఈ స్థాయికి చేరుకోవడానికి టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ కారణం. 2019లో ఉత్తరాఖండ్ తరఫున ఆడుతున్న సమయంలో మధ్వాల్ ప్రతిభను జాఫరే గుర్తించాడు. యూపీ తరఫున ఆకట్టుకునే ప్రదర్శన చేసిన మధ్వాల్.. 2022-23 దేశవాళీ సీజన్లో తమ రాష్ట్ర జట్టుకు కెప్టెన్ గానూ ఎంపికయ్యాడు. Photo: IPL Twitter ఇంజనీర్ నుంచి క్రికెటర్‌గా.. పంత్ పొరుగింట్లో నివాసం 1993 నవంబర్ 23న ఉత్తరాఖండ్‌లోని రూర్కీలోని జన్మించిన ఆకాశ్ మధ్వాల్ ఇంజినీరింగ్ చదివాడు. అంతే కాదు టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ పొరుగింట్లోనే అతడు నివసిస్తుండటం విశేషం. వీరిద్దరూ అవతార్ సింగ్ అనే కోచ్ దగ్గరే శిక్షణ పొందారు. 2019-20 సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో కోసం.. ఆకాశ్ ఉత్తరాఖండ్ జట్టుకు ఎంపికయ్యాడు. 2019 డిసెంబర్ 25న తొలి రంజీ మ్యాచ్ ఆడాడు. Photo: IPL Twitter ఆర్సీబీ వదిలేసింది.. ముంబై ఒడిసిపట్టింది 2021లోనే ఆకాశ్ ఐపీఎల్‌కు ఎంపికయ్యాడు. ఆర్సీబీ అతన్ని వేలంలో కొనుగోలు చేసినప్పటికీ.. ఆ సీజన్లో ఆడే అవకాశం లభించలేదు. 2022లో అతడు అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. 2022 సీజన్లోనే సూర్యకుమార్ యాదవ్‌కు రీప్లేస్‌మెంట్‌గా ముంబై ఇండియన్స్ జట్టులో చేరాడు. ఐపీఎల్ 2023కి ముందు నిర్వహించిన వేలంలో రూ.20 లక్షలకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. Photo: IPL Twitter ఈ సీజన్లో ఇప్పటి వరకూ 7 మ్యాచ్‌లు ఆడిన మధ్వాల్ 13 వికెట్లు తీశాడు. 2021 సీజన్లోనే ఆర్సీబీ ఆకాశ్‌కు అవకాశం ఇచ్చి ఉండుంటే.. ఆ జట్టులో అతడు బుమ్రాలా ఎదిగేవాడు. కానీ బెంగళూరు అవకాశం ఇవ్వకుండా అతన్ని వదిలేసుకోగా.. ముంబై మాత్రం ఆకాశ్‌ను ఆడించి ప్రయోజనం పొందింది. 🖐️/ 🖐️ Akash Madhwal 🤌with his first 5 wicket haul seals victory for @mipaltan in the #Eliminator 🔥#IPLonJioCinema #TATAIPL #IPL2023 #LSGvMI pic.twitter.com/MlvIYTlKev — JioCinema (@JioCinema) May 24, 2023 Madhwal lays a brick wall 🧱 in #LSG's path!#LSGvMI #IPLonJioCinema #TATAIPL | @mipaltan pic.twitter.com/bdwufzzSeX — JioCinema (@JioCinema) May 24, 2023 చదవండి: #DeepakHooda: ఎవరి కర్మకు వారే బాధ్యులు! పరుగుపై పెట్టాల్సిన దృష్టి బంతిపై.. తగిన మూల్యం -
ఏంటి.. అసలు ఈ మనిషి కనిపించడమే లేదు! ఏమైందబ్బా? కౌంటర్ అదుర్స్
Bangladesh Clean Sweep England T20 Series 2023: ప్రపంచ చాంపియన్ ఇంగ్లండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను బంగ్లాదేశ్ క్లీన్‌స్వీప్ చేసిన విషయం తెలిసిందే. మంగళవారం జరిగిన చివరిదైన మూడో టి20 మ్యాచ్‌లో షకీబ్ అల్ హసన్ కెప్టెన్సీలోని బంగ్లాదేశ్ 16 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించి సిరీస్‌ను 3–0తో సొంతం చేసుకుంది. ఇంగ్లండ్‌కు ఇది రెండోసారి మాత్రమే కాగా మూడు మ్యాచ్‌ల ద్వైపాక్షిక టి20 సిరీస్‌ను బంగ్లాదేశ్ క్లీన్‌స్వీప్ చేయడం ఇది రెండోసారి మాత్రమే. 2012లో ఐర్లాండ్‌పై బంగ్లాదేశ్ తొలిసారి ఈ ఘనత సాధించింది. ఇక బంగ్లాదేశ్–ఇంగ్లండ్ మధ్య ద్వైపాక్షిక టి20 సిరీస్ జరగడం కూడా ఇదే ప్రథమం. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ జట్టు మూడు మ్యాచ్‌ల ద్వైపాక్షిక టి20 సిరీస్‌ను 0–3తో కోల్పోవడం ఇది రెండోసారి మాత్రమే. అసలు ఈ మనిషి కనబడటం లేదే! 2014లో ఆస్ట్రేలియా చేతిలో తొలిసారి ఇంగ్లండ్ 0–3తో చేజార్చుకుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్‌ను ఉద్దేశించి.. ‘‘చాలా రోజులు అవుతోంది.. అసలు ఈ మనిషి కనబడటం లేదే!’’ అన్నట్లు వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. కాగా గతంలో టీమిండియా- ఇంగ్లండ్ టెస్టు సిరీస్ నేపథ్యంలో భారత పిచ్‌లపై అవాకులు చెవాకులు పేలుతూ వాన్ చేసిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే వసీం జాఫర్- మైకేల్ వాన్ మధ్య ఓ రేంజ్లో ట్విటర్ వార్ జరిగింది. భారత జట్టును తక్కువ చేసి మాట్లాడిన ప్రతిసారీ మైకేల్‌కు అదిరిపోయే కౌంటర్లు ఇవ్వడం వసీంకు అలవాటు. వైరల్ ట్వీట్ ఈ నేపథ్యంలో తాజాగా బంగ్లాదేశ్ చేతిలో ఇంగ్లండ్ ఊహించని రీతిలో దారుణంగా పరాభవం పాలుకావడం.. మరోవైపు ఆస్ట్రేలియాతో సిరీస్ గెలిచి టీమిండియా వరుసగా నాలుగోసారి బోర్డర్- గావస్కర్ ట్రోఫీని సొంతం చేసుకోవడంతో ఈ మేరకు వసీం.. వాన్‌కు కౌంటర్ వేశాడు. ‘లాంగ్ టైమ్ నో సీ’ అంటూ #BANvENG హ్యాష్‌ట్యాగ్‌ను జతచేశాడు. ఈ ట్వీట్ నెటిజన్లను ఆకర్షిస్తోంది. సరైన సమయంలో సరైన కౌంటర్ అంటూ వసీం జాఫర్‌ను ప్రశంసిస్తున్నారు టీమిండియా అభిమానులు. ఇక బంగ్లా- ఇంగ్లండ్ టీ20 సిరీస్ మ్యాచ్ విషయంలో ఆఖరిదైన మూడో టి20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 2 వికెట్లకు 158 పరుగులు సాధించింది. ఓపెనర్ లిటన్ దాస్ (57 బంతుల్లో 73; 10 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేయగా... నజ్ముల్ (36 బంతుల్లో 47 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు) రాణించాడు. అనంతరం 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 142 పరుగులు చేసి ఓడిపోయింది. డేవిడ్ మలాన్ (47 బంతుల్లో 53; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), జోస్ బట్లర్ (31 బంతుల్లో 40; 4 ఫోర్లు, 1 సిక్స్) మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. లిటన్ దాస్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’... నజ్ముల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. చదవండి: WTC Final: కేఎస్ భరత్ స్థానానికి ఎసరు పెట్టిన టీమిండియా దిగ్గజం! అతడే సరైనోడు! అవునా.. నిజమా?! ఖరీదైన 6 బెడ్ రూమ్‌ల భవనాన్ని కొనుగోలు చేసిన పాంటింగ్.. ధర ఎంతో తెలుసా..? Hello @MichaelVaughan, long time no see 😏 #BANvENG pic.twitter.com/3nimzfuHOw — Wasim Jaffer (@WasimJaffer14) March 14, 2023 -
ఆస్ట్రేలియాతో రెండో టెస్టు.. రాహుల్, సూర్యకుమార్‌కు నో ఛాన్స్!
తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించి మంచి ఊపు మీద ఉన్న టీమిండియా.. ఇప్పుడు ఢిల్లీ వేదికగా రెండో టెస్టులో అదే జట్టుతో అమీతుమీ తెల్చుకోవడానికి సిద్దమైంది. ఇరు జట్లు మధ్య రెండో టెస్టు శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రెండో టెస్టు కోసం భారత తుది జట్టును టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ అంచనా వేశాడు. తొలి టెస్టులో విఫలమైన ఓపెనర్ కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్‌కు తను ఎంపిక చేసిన జట్టులో జాఫర్ చోటివ్వలేదు. రాహుల్ స్థానంలో యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌కు, సూర్యకుమార్ స్థానంలో శ్రేయస్ అయ్యర్‌కు అవకాశం ఇచ్చాడు. కాగా శ్రేయస్ అయ్యర్ గాయం నుంచి కోలుకుని జట్టుతో చేరాడు. ఈ క్రమంలో అతడు ఢిల్లీ టెస్టు జట్టు సెలక్షన్‌కు అందుబాటులో ఉండనున్నట్లు బీసీసీఐ కూడా దృవీకరించింది. ఇక రాహుల్, సూర్యకుమార్ యాదవ్ తొలి టెస్టులో తీవ్రంగా నిరాశపరిచారు. రాహుల్ 20 పరుగులు చేసి పెవిలియన్ చేరగా.. సూర్య తన అరంగేట్ర టెస్టులో కేవలం 8 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో వీరిద్దరిని ఢిల్లీ టెస్టుకు దూరం పెట్టాలని పలువరు మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో జాఫర్ కూడా తన అంచనా వేసిన జట్టులో వీరిద్దరికి చోటివ్వకపోవడం గమానార్హం. తొలి టెస్ట్ కోసం వసీం జాఫర్ ఎంచుకున్న తుది జట్టు.. రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, శ్రీకర్ భరత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ చదవండి: West Indies: వెస్టిండీస్ టీ20 కెప్టెన్‌గా విధ్వంసకర వీరుడు.. -
ఏక కాలంలో ఒకరిని మెచ్చుకొని.. మరొకరిని తిట్టుకొని
నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీమిండియా స్పిన్నర్లు జడేజా, అశ్విన్‌లు తమ స్పిన్ మాయాజాలంతో ఆసీస్ నడ్డి విరిచారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో జడేజా ఐదు వికెట్లతో చెలరేగితే.. రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్ ఐదు వికెట్ల హాల్ అందుకున్నాడు. ఈ ఇద్దరు కలిసి మొత్తంగా 15 వికెట్లు తీశారు. ఈ విజయంతో టీమిండియా నాలుగు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరుజట్లధ్య రెండోటెస్టు మ్యాచ్ ఫిబ్రవరి 17 నుంచి ఢిల్లీలో జరగనుంది. ఇక టీమిండియా విజయం అనంతరం ఆసీస్ ఆటతీరును విమర్శిస్తూ.. అశ్విన్‌ను మెచ్చుకుంటూ మాజీ క్రికెటర్ వసీం జాఫర్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టర్నింగ్ పిచ్ అంటూ కేవలం రెండు పదాలతో ట్వీట్ చేశాడు. ఒక వ్యక్తి వచ్చి లావుగా ఉన్న మనిషిని లగేజీ మూవింగ్ కన్వేయర్ బెల్ట్‌పై పడేయడం కనిపిస్తుంది. సదరు వ్యక్తి అందులో నుంచి బయటకు రాలేక సతమతమవుతాడు. టర్న్ అవుతున్న పిచ్‌పై టీమిండియా స్పిన్ దెబ్బకు ఆసీస్ పరిస్థితి కూడా ఇదే.. అని అర్థం వచ్చేలా ట్వీట్ ఉంది. ఐదు వికెట్లు తీసిన అశ్విన్‌కు కంగ్రాట్స్ అంటూ పేర్కొన్నాడు. ఈ విషయం పక్కనబెడితే. నాగ్‌పూర్ పిచ్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా సహా అక్కడి మీడియా కోడై కూసింది. పిచ్‌ను టీమిండియా స్పిన్నర్లకు అనుకూలంగా మాత్రమే తయారు చేశారంటూ.. డాక్టర్డ్ పిచ్ అంటూ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు. అయితే మ్యాచ్‌లో టీమిండియా స్పిన్నర్లు ఎంత ప్రభావం చూపించారో.. ఆసీస్ డెబ్యూ బౌలర్ టాడ్ మర్ఫీ కూడా అంతే చూపించాడు. అశ్విన్, జడేజాలు చెరో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో చెలరేగితే.. మర్ఫీ ఏడు వికెట్లతో అదరగొట్టాడు. పిచ్ స్పిన్‌కు అనుకూలమన్న మాట నిజమే కావొచ్చు కానీ ఓపికగా బ్యాటింగ్ చేస్తే పరుగులు వస్తాయని భారత బ్యాటర్లు నిరూపించారు. In short 😅 Congrats on another fifer @ashwinravi99 👏🏽 #INDvAUS pic.twitter.com/Z6bF5zvDZJ — Wasim Jaffer (@WasimJaffer14) February 11, 2023