x.com
-
టాప్ న్యూస్ యాప్‌గా ఎక్స్: మస్క్
న్యూఢిల్లీ: భారత్‌లోని యాప్ స్టోర్‌లో సామాజిక మాధ్యమం ఎక్స్ (గతంలో ట్విటర్) ప్రస్తుతం టాప్ న్యూస్ యాప్ అని ఎలాన్ మస్క్ తెలిపారు. భారత్‌లో యాపిల్ యాప్‌స్టోర్‌లో ఎక్స్ మొదటి స్థానంలో నిలిచిన న్యూస్ యాప్ అని డోజ్‌డిజైనర్ అనే ఒక వినియోగదారు ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన తర్వాత.. భారత్‌లో వార్తల కోసం ప్లాట్‌ఫామ్ నిజంగా నంబర్ వన్ అయిందని బిలియనీర్ ఎలాన్ మస్క్ అన్నారు.మస్క్ 2022 అక్టోబర్‌లో ఎక్స్‌ను (గతంలో ట్విటర్) 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. స్టాటిస్టా (Statista.com) ప్రకారం, దేశం వారీగా అత్యధిక ట్విటర్ యూజర్ల సంఖ్యలో సుమారుగా 25 మిలియన్లకు పైగా వినియోగదారులతో భారత్ మూడవ స్థానంలో ఉంది. మస్క్ ప్రకటన తరువాత అభినందనలు వెల్లువెత్తాయి.𝕏 is now #1 for news in India! https://t.co/beLobq1Dfo— Elon Musk (@elonmusk) November 22, 2024 -
కూటమి ప్రభుత్వంపై మా పోరాటం ఆగదు: తాటిపర్తి
సాక్షి,ప్రకాశం జిల్లా : యర్రగొండపాలెం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌కి పోలీసులు నోటీసులు అందించారు. ఎక్స్ వేదికగా నారా లోకేష్‌పై పెట్టిన పోస్టింగ్‌తో పాటు ఎన్నికల సమయంలో పెట్టిన నాలుగు కేసులకు సంబంధించి ఎర్రగొండపాలెం ఎస్సై చౌడయ్య నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులపై ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా.. ఎన్నికుట్రలు చేసినా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులను నొక్కేయాలనే కుట్రతోనే వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై విచ్చలవిడిగా కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. అయినప్పటికీ కూటమి ప్రభుత్వంపై తమ పోరాటం ఆగదని అన్నారు. -
తడిగుడ్డతో గొంతు కోయడం అంటే ఇదేనేమో.. రేవంత్ పాలనపై కేటీఆర్ సెటైర్లు
సాక్షి, తెలంగాణ భవన్: సుఖం వస్తే ముఖం కడగడానికి తీరిక లేదంటే ఏమో అనుకున్నాం పది నెలల పాలనలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల 25కు పైగా ఢిల్లీ, 26కు పైగా విదేశీ పర్యటనలు చూస్తే అర్దం అవుతుంది’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ప్రభుత్వ పాలనపై సెటైర్లు వేశారు. ఈ మేరకు కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. తడిగుడ్డతో గొంతు కోయడం అంటే ఏంటో అనుకున్నాం కొనుగోళ్లు లేక తడుస్తున్న ఈ ధాన్యం చూస్తుంటే తెలుస్తుంది. కళ్లు కాయలు కాసేలా ఎదురుచూడడం అంటే ఏంటో అనుకున్నాం కల్లాల వద్ద 20 రోజులుగా రైతన్నలు పడుతున్న బాధలు చూస్తే తెలుస్తుంది.మీసాలెందుకు రాలేదురా అంటే మేనత్త సాలు అని, గడ్డం ఎందుకు వచ్చిందిరా అంటే మేనమామ పోలిక అంటే ఏంటో అనుకున్నాం రుణమాఫీ, రైతుభరోసా, ఆడబిడ్డలకు కళ్యాణలక్ష్మి కింద రూ.లక్ష 116, తులం బంగారం అడిగితే కాంగ్రెస్ నేతలు చెబుతున్న సాకులు చూస్తుంటే అర్దం అవుతుంది. అందితే జుట్టు అందకపొతే కాళ్ళు ఏమో అనుకున్నాం ఓట్ల కోసం నాడు నిరుద్యోగుల కాళ్లు పట్టుకుని, నేడు వారి మీద నిర్దాక్షిణ్యంగా లాఠీఛార్జ్ చేస్తుంటే అర్దం అవుతుందిసుఖం వస్తే ముఖం కడగడానికి తీరిక లేదంటే ఏమో అనుకున్నాం పది నెలల పాలనలో సీఎం, మంత్రుల 25కు పైగా ఢిల్లీ, 26కు పైగా విదేశీ పర్యటనలు చూస్తే అర్దం అవుతుంది. తేలుకు పెత్తనం ఇస్తే తెల్లవార్లు కుట్టిందంటే ఏమో అనుకున్నాం హైడ్రా,మూసీ సుందరీకరణ పేరుతో పేదలపై ప్రభుత్వ ప్రతాపం చూస్తుంటే అర్దం అవుతుందిఏరు దాటే వరకు ఓడ మల్లన్న ఏరు దాటిన తరువాత బోడ మల్లన్న అంటే ఏమో అనుకున్నాం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తే అర్దం అవుతుంది తడిగుడ్డతో గొంతు కోయడం అంటే ఏంటో అనుకున్నాం కొనుగోళ్లు లేక తడుస్తున్న ఈ ధాన్యం చూస్తుంటే తెలుస్తుంది కళ్లు కాయలు కాసేలా ఎదురుచూడడం అంటే ఏంటో అనుకున్నాం కల్లాల వద్ద 20 రోజులుగా రైతన్నలు పడుతున్న బాధలు చూస్తే తెలుస్తుంది మీసాలెందుకు రాలేదురా అంటే మేనత్త సాలు అని, గడ్డం ఎందుకు…— KTR (@KTRBRS) November 7, 2024 -
సమస్యల్ని గాలికి వదిలేసి ఊరేగుతున్న సీఎం, మంత్రులు : కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలోని సమస్యలు గాలికి వదిలేసి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఊరేగుతున్నారని మండిపడ్డారు.పెండింగ్ బిల్లులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని తాజా మాజీ సర్పంచ్‌లు ఇవాళ పిలుపు నిచ్చిన ‘చలో హైదరాబాద్ పోరుబాట’ ఉద్రిక్తతలకు దారి తీసింది. హైదరాబాద్ పెద్దమ్మ గుడి నుంచి ఇవాళ సర్పంచుల పోరుబాట కార్యక్రమం ప్రారంభం కానుంది.అయితే, చలో హైదరాబాద్ పోరుబాటపై పోలీసులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వస్తున్న మాజీ సర్పంచులను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ పెద్దమ్మ గుడి పిలుపుపై అప్రమత్తమైన పోలీసులు మాజీ సర్పంచులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. వారి అరెస్ట్‌పై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు.రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సర్పంచులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాంపెండింగ్ బిల్లులు ఇవ్వాలని ఏడాది కాలంగా అడిగినా ఇవ్వకపోవడంసిగ్గుచేటురాష్ట్రంలో నిత్యం అరెస్టుల పర్వమే కొనసాగుతోంది- పోలీసులతో సమస్యలను అణగదొక్కాలని చూస్తుంది ప్రభుత్వంరాష్ట్రంలోని సమస్యలు గాలికి…— KTR (@KTRBRS) November 4, 2024 రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సర్పంచులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పెండింగ్ బిల్లులు ఇవ్వాలని ఏడాది కాలంగా అడిగినా ఇవ్వకపోవడం సిగ్గుచేటు. రాష్ట్రంలో నిత్యం అరెస్టుల పర్వమే కొనసాగుతోంది. పోలీసులతో సమస్యలను అణగదొక్కాలని ప్రభుత్వం చూస్తుంది. రాష్ట్రంలోని సమస్యలు గాలికి వదిలి ముఖ్యమంత్రి, మంత్రులు ఊరేగుతున్నారు.సర్పంచుల కుంటుంబాలు రోడ్డున పడే దాకా ప్రభుత్వం స్పందించదా. శాంతియుత నిరసనకు పిలుపునిచ్చిన సర్పంచులను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు. పల్లె ప్రగతి పేరిట మేము చేపట్టిన కార్యక్రమాననికి తూట్లు పొడిచి నిధులు విడుదల చేయకుండా ఆపుతున్నారు. అరెస్ట్ చేసిన సర్పంచ్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం’ అని కేటీఆర్ ఎక్స్ వేదకగా ట్వీట్ చేశారు. -
‘ఎక్స్’లో ఉద్యోగాల కోత.. ఇంజినీర్లు ఇంటికి..!
ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ కంపెనీల్లో లేఆఫ్‌లు కొనసాగుతున్నాయి. తాజాగా ఎలాన్ మస్క్‌కు చెందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (ట్విటర్) భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం.‘ఎక్స్’ అమలు చేస్తున్న లేఆఫ్‌ల ప్రభావం ప్రధానంగా దాని ఇంజనీరింగ్ విభాగం ఉద్యోగులపై పడిందని సంస్థ వర్గాలు, వర్క్‌ప్లేస్ ఫోరమ్ బ్లైండ్‌లోని పోస్ట్‌లను ఉటంకిస్తూ ‘ది వెర్జ్’ నివేదిక పేర్కొంది. తొలగింపునకు గురైన ఉద్యోగుల సంఖ్య ఖచ్చితంగా తెలియరాలేదు. కంపెనీ కోసం మీరు చేసేందేంటో ఒక పేజీ సారాంశాన్ని సమర్పించాలని ఉద్యోగులను కోరిన రెండు నెలల తర్వాత లేఆఫ్‌లు వచ్చాయి.దీనిపై మస్క్ కానీ, ‘ఎక్స్’ అధికారులు గానీ ఇంకా వ్యాఖ్యానించలేదు. స్టాక్ గ్రాంట్ల గురించి ఎంతగానో ఎదురుచూస్తున్న సిబ్బందికి ఇటీవల ఎలాన్ మస్క్ ఈమెయిల్ పంపినట్లు వార్తా నివేదికలు వచ్చాయి. ఉద్యోగుల పనితీరు, ప్రభావం ఆధారంగా వారికి స్టాక్ ఆప్షన్స్ కేటాయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అంటే స్టాక్‌ను పొందడానికి కంపెనీకి తాము చేశామో తెలియజేస్తూ నాయకత్వానికి ఒక పేజీ సారాంశాన్ని సమర్పించాలని సిబ్బందిని ఆదేశించిట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: సాఫ్ట్వేర్ ఇంజినీర్ల పరిస్థితేంటి? కలవరపెడుతున్న గూగుల్ సీఈవో ప్రకటన!ఎలాన్ మస్క్ యాజమాన్యంలో ఎంకెన్ని లేఆఫ్‌లు ఉంటాయోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. 2022లో ట్విటర్‌ను కొనుగోలు చేసిన మస్క్ దాదాపు 80 శాతం అంటే 6,000 మందికిపైగా ఉద్యోగులను తొలగించారు. డైవర్సిటీ, ఇన్‌క్లూషన్, ప్రొడక్ట్ డెవలప్మెంట్, డిజైన్ వంటి అన్ని విభాగాల్లోనూ లేఆఫ్‌లు అమలు చేశారు. కంటెంట్ మోడరేషన్ టీమ్‌ను కూడా విడిచిపెట్టలేదు. -
ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు: ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి,అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభ సందర్భంగా ప్రజలకు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎంపీ విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణార్పణ చేసిన మహనీయుడు శ్రీ పొట్టి శ్రీరాములు. ఆయన అంకితభావం రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది’ అని పొట్టి శ్రీరాములు త్యాగాన్ని ఎంపీ విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. On Andhra Pradesh Formation Day, my warm greetings to the resilient and talented people of this remarkable state. Remembering the immense sacrifice of ‘Amarajeevi’ Potti Sriramulu Garu, whose dedication paved the way for the state’s formation. May Andhra Pradesh continue to…— Vijayasai Reddy V (@VSReddy_MP) November 1, 2024 -
ఇదేం రాజ్యం చంద్రబాబూ.. బద్వేల్ ఘటనపై వైఎస్ జగన్ ఆవేదన
సాక్షి,తాడేపల్లి : బద్వేల్లో కాలేజీ విద్యార్థినిని హత్యాచారం చేసిన ఘటనపై వైఎఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేమి రాజ్యం చంద్రబాబు అంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.బద్వేల్ కాలేజీ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడి ఆపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన రాష్ట్రంలో సంచలన రేకెత్తించింది. వరుసగా రాష్ట్రంలో అరాచక శక్తుల అగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోవడాన్ని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఈ మేరకు ట్వీట్ చేసిన వైఎస్ జగన్.. కూటమి ప్రభుత్వాన్ని కడిగిపారేశారు.రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్‌ను కాపాడలేకపోతున్నారు. కూటమి ప్రభుత్వంలో మహిళలలకు, బాలికలకు రక్షణ లేకుండా పోయింది. నిత్యం ప్రతి రోజు ఎక్కడో ఒక చోట హత్యలు,అత్యాచారాలు, వేధింపులు జరుతూనే ఉన్నాయి. బద్వేల్లో కాలేజీ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారని, ఈ దారుణ ఘటన హేయం, అత్యంత దుర్మార్గమన్నారు. ఈ ఘటన వెనుక ప్రభుత్వం, పోలీసుల వైఫల్యం ఉందన్నారు. ఒక పాలకుడు ఉన్నాడంటే ప్రజలు ధైర్యంగా ఉండాల్సింది పోయి నిరంతరం భయపడే స్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్లారని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.లా అండ్ ఆర్డర్‌ను కాపాడలేకపోతున్నారు.. ఇదేమి రాజ్యం @ncbn గారూ? మహిళలకు, బాలికలకు రక్షణకూడా ఇవ్వలేకపోతున్నారు… ఇదేమి రాజ్యం? ప్రతిరోజూ ఏదోచోట హత్యాచారాలు, హత్యలు, వేధింపులు సర్వసాధారణమైపోయాయి. బద్వేలులో కాలేజీ విద్యార్థినిపై పెట్రోలుపోసి, నిప్పుపెట్టి ప్రాణాలు తీసిన ఘటన అత్యంత…— YS Jagan Mohan Reddy (@ysjagan) October 20, 2024 ‘చంద్రబాబు మీరు వైఎస్సార్సీపీమీద కక్షకొద్దీ, మా పథకాలను, కార్యక్రమాలను ఎత్తివేస్తూ రాష్ట్రంమీద, రాష్ట్ర ప్రజలమీద కక్ష సాధిస్తున్నారు. ఇది అన్యాయం కాదా? వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో బాలికలు, మహిళల భద్రతకు పూర్తి భరోసానిస్తూ తీసుకొచ్చిన విప్లవాత్మక “దిశ’’ కార్యక్రమాన్ని ఉద్దేశపూర్వకంగా నీరుగార్చడం దీనికి నిదర్శనం కాదా? దీనివల్ల మహిళలు, బాలికల భద్రతను ప్రశ్నార్థకం చేసిన మాట వాస్తవం కాదా? “దిశ’’ యాప్‌లో SOS బటన్ నొక్కినా, చేతిలో ఉన్న ఫోన్‌ను 5సార్లు అటూ, ఇటూ ఊపినా వెంటనే కమాండ్ కంట్రోల్ రూంకు, అక్కడినుంచి దగ్గర లోనే ఉన్న పోలీసులకు సమాచారం వెళ్తుంది. వెంటనే పోలీసులు వారికి ఫోన్ చేస్తారు. వారు ఫోన్ ఎత్తకపోయినా లేదా ఆపదలో ఉన్నట్టు ఫోన్లో చెప్పినా ఘటన స్థలానికి నిమిషాల్లో చేరుకుని రక్షణ కల్పించే పటిష్ట వ్యవస్థను మీరు ఉద్దేశపూర్వకంగా నీరుగార్చలేదా? “దిశ’’ ప్రారంభం మొదలు 31,607 మహిళలు, బాలికలు రక్షణ పొందితే దాన్ని ఎందుకు దెబ్బతీశారు చంద్రబాబుగారూ? 1.56కోట్ల మంది డౌన్లోడ్ చేసుకుని భరోసా పొందుతున్న “దిశ’ ’పై రాజకీయ కక్ష ఎందుకు?దిశ కార్యక్రమాన్ని బలోపేతం చేయడానికి ప్రత్యేకంగా 13 పోక్సో కోర్టులు, 12 మహిళా కోర్టులు, ఫొరెన్సిక్ ల్యాబులు ఏర్పాటు చేశాం. ప్రత్యేకంగా ప్రతి జిల్లాలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించాం. 900 బైక్‌లు, 163 బొలేరో వాహనాలను “దిశ’’ కార్యక్రమం కోసమే పోలీసులకు అందించి పెట్రోలింగ్‌ను పటిష్ట పరిచాం. 18 “దిశ’’ పోలీస్స్టేషన్లను పెట్టి, 18 క్రైమ్ మేనేజ్మెంట్ వాహనాలను సమకూర్చాం. వీటిని పోలీస్ కమాండ్ కంట్రోల్‌రూమ్‌కు అనుసంధానం చేశాం. మా హయాంలో శాంతిభద్రతలపై నేను చేసిన సమీక్ష సమావేశాలలో “దిశ’’ కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే వాళ్లం. దీంతో పోలీసులు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండేవారు.వీటన్నిటినీ నిర్వీర్యం చేసి ఏం సాధించాలనుకుంటున్నారు చంద్రబాబు? మీరు చేస్తున్నదల్లా మహిళల రక్షణ, సాధికారతకోసం అమలవుతున్న కార్యక్రమాలను, స్కీంలను ఎత్తివేసి, ఇప్పుడు ఇసుక, లిక్కర్ లాంటి స్కాంలకు పాల్పడుతూ పేకాట క్లబ్బులు నిర్వహించడం లాంటివి చేస్తున్నారు. ఇటు పోలీసు వ్యవస్థ కూడా అధికారపార్టీ అడుగులకు మడుగులొత్తుతూ ప్రతిపక్షంపై తప్పుడు కేసులు పెడుతూ వేధింపులకు దిగడమే పనిగా పెట్టుకుంది తప్ప మహిళలు, బాలికలు, చిన్నారుల రక్షణ బాధ్యతలను పట్టించుకోవడంలేదు. ఇదేమి రాజ్యం చంద్రబాబు?’అంటూ నిలదీశారు వైఎస్ జగన్.AP: మరో ప్రేమోన్మాది ఘాతుకం.. గాయపడిన విద్యార్థిని మృతి -
ఖర్గే ప్రసంగంపై అమిత్ షా సెటైర్లు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని అధికారం నుంచి తప్పించేంత వరకు తాను బతికే ఉంటానని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన ప్రసంగంపై కేంద్ర హోమంత్రి అమిత్‌షా స్పందించారు. ఖర్గే ప్రసంగం అసహ్యకరమైన, అవమానకరమైనది’గా అభివర్ణించారు.ఖర్గే ప్రసంగం ఆద్యంతం ప్రధాని మోదీ పట్ల కాంగ్రెస్‌కు ఉన్న ద్వేషం,భయం స్పష్టంగా తెలుస్తుంది. ఆయన తన ప్రసంగంతో కాంగ్రెస్, ఆ పార్టీ నేతలను మించిపోయారు’ అని అన్నారు. మోదీని అధికారం నుండి తొలగించిన తర్వాత మాత్రమే చనిపోతానని చెప్పి అనవసరంగా తన వ్యక్తిగత ఆరోగ్య విషయాలలోకి ప్రధాని మోదీని లాగారు’అని వ్యాఖ్యానించారు.Yesterday, the Congress President Shri Mallikarjun Kharge Ji has outperformed himself, his leaders and his party in being absolutely distasteful and disgraceful in his speech.In a bitter display of spite, he unnecessarily dragged PM Modi into his personal health matters by…— Amit Shah (@AmitShah) September 30, 2024 ఈ సందర్భంగా కాంగ్రెస్‌కు ప్రధాని మోదీ పట్ల ఎంత ద్వేషం,భయం ఉందో చూడండి. అందుకే కాంగ్రెస్ నేతలు మోదీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఖర్గే జీ మీరు ఆరోగ్యంగా ఉండాలని.. ప్రధాని మోదీ, నేను ఆ దేవుణ్ని ప్రార్థిస్తున్నాం. 2047 నాటికి విక్షిత్ భారత్‌ను రూపొందించే వరకు ఆయన జీవించాలని కోరుకుంటున్నా అని హోంమంత్రి అమిత్‌షా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. जब तक मोदी को नहीं हटाएँगे ...तब तक मैं ज़िंदा रहूँगा, आपकी बात सुनूँगा... आपके के लिए लड़ूँगा !! pic.twitter.com/M58zGxVNuX— Mallikarjun Kharge (@kharge) September 29, 2024మోదీ గురించి ఖర్గే ఏమన్నారంటేజమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం జమ్మూ సమీపంలోని జస్‌రోటీ గ్రామంలో నిర్వహించిన సభలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మాట్లాడారు. ప్రసంగం మధ్యలో కాస్త అస్వస్థతకు గురయ్యారు. తూలిపడబోతుండగా సీనియర్ నేగలు పట్టుకున్నారు. వారి సాయంతోనే ఖర్గే ప్రసంగాన్ని కొనసాగించారు. ‘‘జమ్మూకశ్మీర్‌కు పూర్తి రాష్ట్ర హోదా దక్కేదాకా పోరాటం కొనసాగిస్తా. దీన్ని వదలను. నాకు 83 ఏళ్లు. నేను ఇంత తొందరగా చనిపోను. (ప్రధాని) మోదీని అధికారం నుండి తొలగించే వరకు నేను బతికే ఉంటాను. కశ్మీరీల బాధలు వింటా. వవారి సమస్యల పరిష్కారానికి పోరాడుతా. ఇంకా మాట్లాడాలనుంది.కానీ కళ్లు తిరగడంతో నేను మట్లాడలేకపోతున్నా.నన్ను క్షమించాలి ’’ అని అన్నారు. -
జోడో పోయే.. డోజో వచ్చే
ఢిల్లీ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరో యాత్రకు సిద్ధమయ్యారు. గతేడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు భారత్ జోడో న్యాయ యాత్ర చేసిన రాహుల్..త్వరలో భారత్ డోజో యాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణనిచ్చే కేంద్రాలను డోజో అని పిలుస్తారు.ఈ సందర్భంగా..‘గత ఏడాది భారత్ జోడో న్యాయ యాత్ర పేరిట వేల కిలోమీటర్లు ప్రయాణించా.ఆ యాత్రలో ఫిట్‌గా ఉండేందుకు ప్రతి రోజు సాయంత్రం మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నారు. యాత్రలో భాగంగా నేను బస చేసే ప్రాంతంలో యువ మార్షల్ ఆర్ట్స్ విద్యార్థుల్ని కలిశాను’ అని రాహుల్ గాంధీ ట్వీట్లో పేర్కొన్నారు. ఈ మార్షల్ ఆర్ట్స్‌ని యువతకు పరిచయం చేయాలన్నదే మా లక్ష్యం. మార్షల్ ఆర్ట్స్ ద్వారా ఎలాంటి హింస లేకుండానే సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవచ్చు. సమాజంలో అందరూ సేఫ్‌గా ఉండాలంటే ఇలాంటి టెక్నిక్స్ కచ్చితంగా నేర్చుకోవాలి’ అని ట్వీట్లో పేర్కొన్నారు.During the Bharat Jodo Nyay Yatra, as we journeyed across thousands of kilometers, we had a daily routine of practicing jiu-jitsu every evening at our campsite. What began as a simple way to stay fit quickly evolved into a community activity, bringing together fellow yatris and… pic.twitter.com/Zvmw78ShDX— Rahul Gandhi (@RahulGandhi) August 29, 2024 -
కంగనా రనౌత్ నోటి దురుసు వ్యాఖ్యలు.. సొంత ఎంపీపై బీజేపీ ఆగ్రహం
ధర్మశాల : రైతుల నిరసనలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన హిమాచల్ ప్రదేశ్ మండి నియోజకవర్గ బీజేపీ ఎంపీ కంగన రౌనత్‌పై సొంత పార్టీ నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నోరు అదుపులో పెట్టుకోవాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేసింది.2020 మోదీ ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చింది. రైతులు మాత్రం కేంద్రం తెచ్చిన చట్టాల్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో కేంద్రం రైతు చట్టాల్ని వెనక్కి తీసుకుంది. అయినప్పటికీ దేశంలో ఈ సాగు చట్టాలపై నిరసనలు కొనసాగేలా కుట్ర జరిగే అవకాశం ఉందని, రైతుల నిరసనలను మోదీ ప్రభుత్వం కట్టడి చేయాలని, లేదంటే భారత్ మరో బంగ్లాదేశ్ తరహా అశాంతి పరిస్థితులకు దారితీసే అవకాశం ఉందని కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పైగా అల్లర్లు సృష్టించే వారికి దేశం కుక్కలపాలైనా వారికేం పట్టదని విమర్శించారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన పోరాటంలో మృతదేహాలు వేలాడుతూ కనిపించాయని, లైంగిక దాడులు చోటుచేసుకున్నాయని ఎక్స్ వేదికగా షేర్ చేసిన వీడియోలో ఆరోపించారు. బాలీవుడ్ క్వీన్ వ్యాఖ్యలు సొంత పార్టీలోనే దుమారం రేపాయి.కంగనా రౌనత్‌కు ఆ అధికారం లేదురైతుల నిరసన గురించి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ అధికారికంగా స్పందించింది. భవిష్యత్తులో అలాంటి ప్రకటనలు ఇవ్వకూడదని హెచ్చరించింది. రైతుల నిరసనపై కంగనా రౌనత్ వ్యాఖ్యల్ని మేం ఖండిస్తున్నాం.‘కంగనా రనౌత్‌కు పార్టీ తరపున విధానపరమైన విషయాలపై మాట్లాడే అధికారం లేదు. ఆమెకు అనుమతి కూడా ఇవ్వలేదు. భవిష్యత్తులో అలాంటి ప్రకటనలు చేయొద్దని బీజేపీ ట్వీట్ చేసింది. తప్పు.. ఇలా మాట్లాడకూడదుమరోవైపు కంగనా రనౌత్ వ్యాఖ్యలపై బీజేపీ పంజాబ్ యూనిట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాంటి ఉద్రేకపూరిత ప్రకటనలు చేయడం మానుకోవాలని సూచించింది. ‘రైతులపై మాట్లాడటం కంగనా వ్యాఖ్యలకు పార్టీకి సంబంధం లేదు. ఆ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం. ప్రధాని మోదీ, బీజేపీ రైతు పక్షపాతి. ఆమె సున్నిత, మతపరమైన వ్యాఖ్యలు చేయకూడదు’ అని పంజాబ్ బీజేపీ నేత నాయకుడు హర్జిత్ గరేవాల్ అన్నారు. BJP expressed disagreement with its MP Kangna Ranaut's comments on farmers agitation, says she is not authorised to speak on policy issues. pic.twitter.com/xJ878F5pWK— Press Trust of India (@PTI_News) August 26, 2024 -
ddos attack : మస్క్ - ట్రంప్ ఇంటర్వ్యూ.. ఎక్స్ వేదికపై సైబర్ దాడి
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌పై డీడీఓఎస్ అటాక్ జరిగింది. దీంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడుతున్న డొనాల్డ్ ట్రంప్‌ను ఎక్స్ అధినేత ఎలోన్ మస్క్ ఆడియో ఇంటర్వ్యూ చేశారు. ఆ సమయంలో ఎక్స్‌పై డీడీఓఎస్ అటాక్ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో చాలా మంది వినియోగదారులకు ఆ ఇంటర్వ్యూ అందుబాటులోకి రాలేదని మస్క్ తెలిపారు. సమస్యను పరిష్కరిస్తామని ఆడియో ఇంటర్వ్యూని అందరికి అందిస్తామని చెప్పారు. డీడీఓఎస్ దాడి అంటే ఏమిటి?డీడీఓస్‘డిస్ట్రిబ్యూటెడ్ డినియల్ ఆఫ్ సర్వీస్ అటాక్’. సైబర్ నేరస్తులు డీడీఓఎస్ అటాక్‌ను ఎంపిక చేసిన సర్వర్,నెట్వర్క్ లపై దాడి చేస్తారు. తద్వారా టెక్నాలజీ సంబంధిత కార్యకలాపాలు స్తంభించి పోతాయి. సైబర్ సెక్యూరిటీ సంస్థ ఫోర్టినెట్ దీనిని సైబర్ క్రైమ్‌గా పరిగణలోకి తీసుకుంది. డీడీఓఎస్తో నిర్ధిష్ట వ్యక్తుల్ని,సంస్థల్ని టార్గెట్ చేస్తారు.ఉదాహరణకు ఎలోన్ మస్క్ - ట్రంప్ మధ్య ఆడియో ఇంటర్వ్యూ జరిగింది. ఆ ఇంటర్వ్యూని యూజర్లు యాక్సెస్ చేయకుండా అడ్డుకున్నట్లు చెప్పింది. We tested the system with 8 million concurrent listeners earlier today https://t.co/ymqGBFEJX0— Elon Musk (@elonmusk) August 13, 2024 -
వయనాడ్ విషాదం.. వివాదంలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్
తిరువనంతపురం : కేరళ రాష్ట్రం వయనాడ్ జిల్లాలో ప్రకృతి ప్రకోపించింది. దీంతో దైవ భూమి కేరళ ఇప్పుడు మరుభూమిలా మారింది. అటవీ, కొండ ప్రాంతమైన వయనాడ్‌లో కొండ చరియలు విరిగి పడ్డాయి. ఈ దుర్ఘటనలో తాజా మరణాలు ఆదివారం (ఆగస్ట్4) ఉదయం 10.30 గంటల సమయానికి 357కి చేరుకున్నాయి. 200 మందికి పైగా ఆచూకీ తెలియాల్సి ఉంది.మరోవైపు కొండ చరియలు విరుచుకుపడడంతో సర్వం కోల్పోయి, తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్న బాధితులకు వైద్య సహాయం కొనసాగుతుంది. వారికి అండగా నిలిచేందుకు పలువురు ప్రముఖులు నేరుగా సహాయ కేంద్రాలను సందర్శిస్తున్నారు. మీకు మేం అండగా ఉన్నామంటూ వారిలో మనోధైర్యాన్ని నింపుతున్నారు. కావాల్సిన నిత్య సరాల్ని తీరుస్తున్నారు.మండక్కై జంక్షన్, చూరాల్మల ప్రాంతాలు భవనాలు, బురద నిందిన వీధులు, రాళ్లతో మృత్యు దిబ్బులుగా మారాయి. ఆ రెండు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడిపోక ముందు సుమారు 450 నుంచి 500 పైగా ఇళ్లుండేవి. కానీ ఇప్పుడు అవేమీ కనిపించడం లేదు. భారీ రాళ్లే దర్శనమిస్తున్నాయి. భద్రతా బలగాలు సహాయక చర్యల్ని ముమ్మురం చేస్తున్నాయి. 1300 మందికి పైగా ఆర్మీ జవానులు జాడ తెలియని వారికోసం అన్వేషిస్తున్నారు. ఈ తరుణంలో కేరళ రాజధాని తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ శశీ థరూర్ వయనాడ్ బాధితుల్ని పరామర్శించారు. బాధితుల పరిస్థితి, ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తాత్కాలికంగా వారికి కావాల్సిన బెడ్ షీట్లు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. దేశంలోని ప్రజా ప్రతినిధులందరూ వయనాడ్‌కు సహాయం చేయాలని ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇదే అంశంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా లేఖ రాసినట్లు మీడియాకు వెల్లడించారు.ఇదే విషయంపై ఎక్స్ వేదికగా స్పందించారు. వయనాడ్ విషాదంపై మరపురాని రోజు కొన్ని జ్ఞాపకాలు అంటూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌పై వివాదం నెలకొంది.Some memories of a memorable day in Wayanad pic.twitter.com/h4XEmQo66WFor all the trolls: definition of “memorable”: Something that is memorable is worth remembering or likely to be remembered, because it is special or unforgettable. Thats all i meant. https://t.co/63gkYvEohv— Shashi Tharoor (@ShashiTharoor) August 3, 2024— Shashi Tharoor (@ShashiTharoor) August 3, 2024 ఇలాంటి విషాదాన్ని వివరించినందుకు ఆయన మెమరబుల్ అనే పదాన్ని ఎలా వినియోగిస్తారని బీజేపీ నేతలతో సహా పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు.కొండచరియలు విరిగిపడి 300 మందికి పైగా మరణిస్తే జ్ఞాపకం ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు.శశి థరూర్‌కి విపత్తులు, మరణాలు చిరస్మరణీయం చెప్పడం సిగ్గుగా ఉందని మరో యూజర్ ట్వీట్ చేశారు. బీజేపీ ఐటి సెల్ చీఫ్ ,బీజేపీ సీనియర్ నేత అమిత్ మాల్వియా..‘శశి థరూర్ మరణాలు, విపత్తులు చిరస్మరణీయం’ అని ట్వీట్ చేశారు.Deaths and disaster are memorable for Shashi Tharoor. https://t.co/40zjGW6c0b— Amit Malviya (@amitmalviya) August 3, 2024ఈ ట్వీట్ వివాదంపై శశిథరూర్ మరో ట్వీట్ చేశారు. ట్రోలర్స్ అందరికి అంటూ మెమొరిబుల్‌పై నా ఉద్ద్యేశ్యం వేరే ఉంది. పలు సందర్భాలలో ఊహించని సంఘటనల్ని, విషాదాల్ని గుర్తుచేసుకునే విధంగా నిలుస్తుందని అర్థం అంటూ వివరణిచ్చారు. -
ఢిల్లీ హైకోర్టుకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె.. అంజలి బిర్లా
ఢిల్లీ : లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె, ఐఆర్పీఎస్ అధికారిణి అంజలి బిర్లా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. యూపీఎస్సీ పరీక్షల్లో తొలి ప్రయత్నంలో ఉత్తీర్ణత సాధించారు. అయితే ఈ అంశంపై పలువురు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ అంజలి బిర్లా తన తండ్రి ఓం బిర్లా అధికారాన్ని అడ్డం పెట్టుకొని యూపీఎస్సీ పరీక్షల్ని తొలి ప్రయత్నంలో పాసయ్యారంటూ పోస్టులు పెట్టారు. ఆ పోస్ట్‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ పోస్టులపై ఆగ్రహం వ్యక్తం చేసిన అంజలి బిర్లా.. తన పరువు భంగం కలిగించేలా ఉన్నాయని, వాటిపై పరువు నష్టం దావా వేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆమె వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు కోర్టు అంగీకరించింది. Anjali Birla, who is an IRPS officer and the daughter of Lok Sabha Speaker Om Birla, has filed a defamation suit in the Delhi High Court. She seeks the removal of social media posts that falsely allege she passed UPSC exams on her first attempt due to her father's influence.…— ANI (@ANI) July 23, 2024అయితే సోషల్ మీడియాలో తనపై వస్తున్న ఆరోపణల్ని అంజలి బిర్లా ఖండించారు. సోషల్ మీడియాలో తమపై ఉద్దేశ పూర్వకంగా జరుగుతున్న కుట్రగా అభివర్ణించారు. తనపై, తండ్రి ఓం బిర్లా పరువుకు భంగం కలిగించేలా పలువురు సోషల్ మీడియా పోస్టులు షేర్లు చేస్తున్నారని, తనకు న్యాయం చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. పరువు నష్టం కలిగించే రీతిలో తప్పుడు, నిరాధారమైన ఆరోపణలను వ్యాప్తి చేయడం తమకు హాని కలిగించే స్పష్టమైన ఉద్దేశాలు ఉన్నాయని చెప్పారు.సోషల్ మీడియాలో పోస్టుల్లో అంజలి బిర్లా తన మొదటి ప్రయత్నంలోనే యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. ఎటువంటి పరీక్షలు, ఇంటర్వ్యూలలో పాల్గొనలేదు. ఆమె తండ్రి ఓం బిర్లా ద్వారా అంజలి బిర్లా ప్రయోజనం పొందారు అని అర్ధం వచ్చేలా పలు సోషల్ మీడియాలో పోస్టులు ఉన్నాయని ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో అంజలి బిర్లా ఆధారాల్ని జత చేశారు.యూపీఎస్సీ 2019 మెరిట్‌లిస్ట్‌లో అంజలి బిర్లాఆరోపణల నేపథ్యంలో పలు జాతీయ మీడియా సంస్థలకు అంజలి బిర్లా తన అడ్మిట్ కార్డ్ కాపీని ఇచ్చారు. సదరు మీడియా సంస్థలు సైతం యూపీఎస్సీ 2019 ఫలితాల మెరిట్ లిస్ట్‌లలో ఆమె రోల్ నంబర్ కూడా ఉంది. ఆమె నిజంగానే ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలకు హాజరైనట్లు తేలింది. -
ఉద్యోగులు ఇంటికెళ్లాక.. మస్క్ గురించి ఆసక్తికర విషయం!
ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరు, టెస్లా, స్పేస్ ఎక్స్‌ల బిగ్ బాస్ ఎలాన్ మస్క్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆటోమొబైల్, అంతరిక్షం, అంతర్జాలం (ఇంటర్నెట్, సోషల్ మీడియా) రంగాల్లో విజయవంతమైన కంపెనీలను ఆయన నడుపుతున్నారు.అయితే ఎలాన్ మస్క్ గురించి తాజాగా ఓ ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (ట్విటర్)లో ఓ యూజర్ మస్క్ శ్రద్ధగా పనిచేస్తున్న త్రోబ్యాక్ ఫోటోను పంచుకున్నాడు. "జిప్2 (మస్క్ స్థాపించిన సాఫ్ట్వేర్ కంపెనీ)లో పనిచేసే ఇంజనీర్లు ఇళ్లకు వెళ్లగానే వారు రాసిన కోడ్‌ను తిరిగి రాసేవాడు. అలా వారానికి 120 గంటలు పనిచేసేవాడు. ఒక సీఈఓలా ఉండాలని ఆయన ఎప్పుడూ అనుకోలేదు" అని రాసుకొచ్చారు. నిజమే..ఎక్స్ యూజర్ తన గురించి పెట్టిన పోస్టుపై ఎలాన్ మస్క్ స్పందించారు. 'నిజమే' అంటూ ఆ విషయాన్ని ధ్రువీకరించారు. ఈ పోస్ట్‌కు 2.3 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. విపరీతంగా కామెంట్లు, రీ పోస్టులు, లైక్‌లతో ప్రస్తుతం వైరల్‌గా మారింది. Elon Musk used to rewrite code of engineers working at Zip2 after they went home, and used to work 120 hours a week. He never really wanted to be a CEO. pic.twitter.com/fQOyNRM0QD— DogeDesigner (@cb_doge) May 30, 2024 -
ట్విటర్ రీ బ్రాండింగ్‌పై మస్క్ ట్వీట్
ట్విటర్ పూర్తిగా ఎక్స్.కామ్‌గా రీబ్రాండ్ అయ్యింది. ఎక్స్.కామ్‌లో పలు కార్యకలాపాలు ట్విటర్ పేరు మీదే జరిగేవి. అయితే ఇప్పుడు పూర్తి ఎక్స్.కామ్ నుంచే జరుగుతున్నాయని ఆ సంస్థ అధినేత ఎలోన్ మస్క్ శుక్రవారం తెలిపారు.ఎలోన్ మస్క్ 2022 చివరిలో 44 బిలియన్ల డాలర్లు వెచ్చించి ట్విటర్‌ను కొనుగోలు చేశారు. ఆ తర్వాత జరిగిన పలు పరిణామాల అనంతరం గత ఏడాది జులైలో ట్విటర్‌ను ఎక్స్. కామ్‌గా రీ బ్రాండ్ చేస్తున్నట్లు మస్క్ వెల్లడించారు. అయితే నిన్నటి వరకు ట్విటర్ లోగో, బ్రాండింగ్ మారింది. కానీ డొమైన్ పేరు ట్విటర్‌గా కొనసాగుతూ వచ్చింది. తాజాగా ట్విటర్.కామ్ డొమైన్ స్థానంలో ఇప్పుడు ఎక్స్.కామ్ వచ్చి చేరినట్లు మస్క్ ట్వీట్లో పేర్కొన్నారు. పోస్ట్ పోస్ట్ చేయడం, లైక్ చేయడం, బుక్‌మార్క్ చేయడం లేదా రీట్వీట్ చేసేందుకు గాను యూజర్లు కొద్ది మొత్తంలో చెల్లింపులు చేయాల్సి ఉంటుందని గత నెలలో మస్క్ ప్రకటించారు. ఆ మొత్తం సబ్స్క్రిప్షన్ ఏడాదికి రూ.100లోపు ఉంటుందని అంచనా. ప్రస్తుతానికి ఈ సబ్స్క్రిప్షన్ పద్దతి న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్‌లో పరీక్షిస్తున్నారు. త్వరలో దీనిని ప్రపంచ వ్యాప్తంగా అమలు చేసేందుకు మస్క్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 2,500 కంటే ఎక్కువమంది ఫాలోవర్స్ కలిగి ఉన్న యూజర్ అకౌంట్లు ఎక్స్.కామ్‌లో ప్రీమియం ఫీచర్లను ఉచితంగా అందిస్తున్నట్లు మస్క్ ప్రకటించారు. 5000 కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న అకౌంట్లకు ప్రీమియం ప్లస్ ఉచితంగా లభిస్తుంది అని మస్క్ ట్వీట్లో పేర్కొన్నారు. -
ఏలియన్స్ ఉన్నట్లా? లేనట్లా?.. ఇంతకీ మస్క్ ఏమన్నారంటే?
ఏలియన్స్.. ఎప్పుడైనా.. ఎవరికైనా ఇంట్రెస్ట్ కలిగించే టాపిక్. ఎలియన్స్ ఉన్నాయా..? లేవా అనేది ఎప్పటికీ తేలని ప్రశ్నే..! అయితే.. ఇప్పుడు ఇదే విషయంపై స్పందించారు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. ఎలియన్స్ లేవని తేల్చేశారు. ఏలియన్స్ నిజంగానే ఉన్నాయా..? అవి భూమ్మిదకు వచ్చాయా..? అప్పుడప్పుడు ఆకాశంలో కనిపించే UFOలు ఏలియన్స్‌వేనా..? ఇవి ప్రశ్నలు కాదు..! కొన్ని దశాబ్దాలుగా అందరినీ వేధిస్తున్న అనుమానాలు..! ఏలియన్స్ ఉన్నాయని.. మనుషులతో కాంటాక్ట్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయని.. ఏదో ఒక సమయంలో కచ్చితంగా భూమిపైకి వస్తాయని నమ్మేవారు కొందరైతే.. అసలు ఏలియన్సే లేవని ఈజీగా కొట్టిపారేసేవారు మరికొందరు. ఇప్పుడు ఈ సెకండ్ లిస్ట్‌లోకి యాడ్ అయ్యారు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. ఏలియన్స్ ఉన్నాయనేందుకు అసలు ఆధారాలే లేవని తేల్చిపారేశారు.ఎలాన్ మస్క్..! ఈ జనరేషన్‌కు పరిచయం అవసరం లేని పేరు..! తన మాటలు.. తన చేతలు.. తన ప్రయోగాలు.. అన్ని సెన్సేషనే..! ఎప్పుడూ వార్తల్లో ఉండే ఎలాన్ మస్క్.. కొత్త ప్రయోగాలు చేస్తూ.. కొత్త కొత్త టెక్నాలజీలను ప్రపంచానికి పరిచయం చేసేందుకు ఎప్పుడూ ఏదో ఒక ప్రాజెక్టును చేపడుతూనే ఉంటారు. ఈ టెక్నాలజీలో కచ్చితంగా తన మార్క్‌ను చూపించిన ఘనత ఎలాన్ మస్క్‌కే దక్కింది. టెస్లా పేరుతో తయారు చేసిన కార్లు ఎంత పెద్ద హిట్టో.. మనిషి బ్రెయిన్లో చిప్ పెట్టేందుకు చేసిన ప్రయోగమూ అంతే సెన్సేషన్‌గా నిలిచింది. ఇదొక్కటే కాదు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో..! స్పేస్ ఎక్స్ పేరుతో శాటిలైట్లు లాంచ్ చేసినా.. సోషల్ మీడియా సెన్సేషన్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసి ఎక్స్ అని పేరు మార్చినా అది.. ఎలాన్ మస్క్‌కే సాధ్యం.అలాంటి ఇలాన్ మస్క్.. ఏలియన్స్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేపుతున్నాయి.. ఏలియన్స్ లేవని మస్క్ తేల్చిపారేశారు. ఏలియన్స్ ఉనికిపై తనకు ఎలాంటి ఆధారాలు లభించలేదని స్పష్టం చేశారు. HOW TO SAVE THE HUMANS పేరుతో జరిగిన డిబేట్లో పాల్గొన్న మస్క్.. ఏలియన్స్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఏలియన్స్ అనే జీవులు ఏవీ భూమిపై కాలు పెట్టలేదని తేల్చేశారు. కక్షలో స్పేస్ ఎక్స్‌కు చెందిన వేలాది బ్రాడ్ బ్యాండ్ స్పేస్ క్రాఫ్ట్‌లు ఉన్నాయని.. కానీ ఎప్పుడూ ఏలియన్స్ ఉనికి కనిపించలేదని తన వాదనలు వినిపించారు. అయితే.. ఎవరైనా ఆధారాలు చూపిస్తే మాత్రం ఏలియన్స్‌పై ప్రయోగాలు చేసేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. అయితే.. ఆషామాషీగా కాకుండా.. సీరియస్ ఆధారాలతోనే రావాలని చెప్పారు. కానీ.. ఎవరూ అలాంటి ఆధారాలు తీసుకురాలేరని.. ఏలియన్స్ ఉనికే లేదని చెప్పేశారు.మరి నిజంగానే ఏలియన్స్ లేవా..? లేక మనషులకు దూరంగా ఉన్నాయా..? ఏలియన్స్ ఉంటే.. ఎప్పటికైనా భూమిపైకి వచ్చి మనుషులకు కనిపిస్తాయా..? ఎలన్ మస్క్ అవన్నీ ఉత్తమాటలే అని కొట్టిపారేసినా మిలియన్ డాలర్ ప్రశ్నలుగానే మిగిలిపోయాయి..! -
ఇండియాలో 2.12 లక్షల మందికి షాకిచ్చిన ఎలాన్ మస్క్!
ఎలాన్ మస్క్ (Elon Musk) నేతృత్వంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్ కార్ప్' (ట్విటర్) భారత్‌లోని 2 లక్షల మందికి పైగా యూజర్లకు పైగా షాకిచ్చింది. పిల్లలపై లైంగిక దాడులు, అశ్లీలతను, ఉద్రిక్తతలను ప్రోత్సహించే కంటెంట్ కట్టడిలో భాగంగా ఒక నెల వ్యవధిలో ఏకంగా 2,12,627 ఖాతాలను నిషేధించింది. ఫిబ్రవరి 26 నుండి మార్చి 25 వరకు భారతీయ సైబర్‌స్పేస్‌లో ఉగ్రవాదాన్ని ప్రచారం చేసినందుకు 1,235 ఖాతాలను కూడా తొలగించినట్లు ఈ సోషల్ మీడియా దిగ్గజం వెల్లడించింది. 2021 కొత్త ఐటీ నిబంధనలకు కట్టుబడి ఎక్స్ కార్ప్ తన నెలవారీ నివేదికలో ఈ చర్యలను వెల్లడించింది. మొత్తంగా ఈ రిపోర్టింగ్ సైకిల్లో దేశవ్యాప్తంగా 213,862 ఖాతాలపై ఎక్స్ నిషేధం విధించింది. ఎక్స్ కార్ప్ ప్రకారం, ఫిబ్రవరి 26 నుండి మార్చి 25 వరకు భారతీయ వినియోగదారుల నుండి 5,158 ఫిర్యాదులు అందాయి. తమ గ్రీవెన్స్ రెడ్రెసల్ మెకానిజం ద్వారా వీటిదని కంపెనీ పరిష్కరించింది. అంతేకాకుండా, ఖాతా సస్పెన్షన్లకు వ్యతిరేకంగా అప్పీళ్లకు సంబంధించిన 86 ఫిర్యాదులను కంపెనీ ప్రాసెస్ చేసింది. -
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ బీజేపీలో చేరుతున్నారా?
న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల తరుణంలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రకాష్ రాజ్ బీజేపీలో చేరుతున్నారని సోషల్ ప్రచారం జోరందుకుంది. అయితే, తాను బీజేపీలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై విలక్షణ నటుడు కొట్టిపారేశారు. దిస్కిన్ డాక్టర్ అనే ఎక్స్ అకౌంట్ యూజర్.. ప్రకాష్ రాజ్ బీజేపీలోకి చేరుతున్నారంటూ ట్వీట్ చేశారు. నిమిషాల వ్యవధిలో వైరల్‌గా మారింది. ప్రకాష్ రాజ్ స్పందన కంటే ముందే దాదాపు మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇక ఆ ట్వీట్‌కు విలక్షణ నటుడు స్పందించారు. ‘నన్ను కొనేంత సైద్ధాంతిక బలం బీజేపీకి లేదని’ వ్యంగ్యంగా స్పందించాడు ప్రకాష్ రాజ్. I guess they tried 😂😂😂 must have realised they were not rich enough (ideologically) to buy me.. 😝😝😝.. what do you think friends #justasking pic.twitter.com/CCwz5J6pOU — Prakash Raj (@prakashraaj) April 4, 2024 ఈ ఏడాది జనవరిలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు రాజకీయ పార్టీలు టికెట్ ఆఫర్ చేస్తున్నాయని అన్నారు. తాను మోదీని విమర్శిస్తున్నాను కాబట్టే టికెట్ ఇచ్చేందుకు ముందుకు వచ్చాయని, తన సిద్ధాంతాలు నచ్చి కాదని పేర్కొన్నారు.అలాంటి ట్రాప్‌లో తాను పడబోనన్న ప్రకాశ్ రాజ్.. తనను సంప్రదించిన పార్టీలేవో చెప్పలేదు. కాగా, 2019 సార్వత్రిక ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రకాశ్ రాజ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. -
యూట్యూబ్ టీవీకి పోటీగా ఎక్స్ టీవీ యాప్!
ఎక్స్.కామ్ బాస్ ఎలోన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. యూట్యూబ్ టీవీకి పోటీగా త్వరలో అమెజాన్, శామ్సంగ్ వినియోగదారుల కోసం టీవీ యాప్‌ను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు ఫార్చ్యూన్ మ్యాగజైన్ రిపోర్ట్ వెలుగులోకి వచ్చాయి. దీనిపై స్పందించిన మస్క్ స్మార్ట్ టీవీల్లో లాంగ్ ఫార్మ్ వీడియోలు త్వరలో అందుబాటులో తెస్తామని ప్రకటించారు. గతంలో ఎక్స్.కామ్‌ను ఎవ్రీథింగ్ యాప్ మార్చే యోచనలో ఉన్నట్లు మస్క్ వెల్లడించారు. అందుకు అనుగుణంగా యాప్‌లో నగదు లావాదేవీల సేవల్ని అందుబాటులోకి తెచ్చారు. ఆ తర్వాత గత అక్టోబర్‌లో ఎంపిక చేసిన వినియోగదారుల కోసం వీడియో, ఆడియో కాలింగ్ ప్రారంభ వెర్షన్‌ను విడుదల చేశారు. Coming soon https://t.co/JlnlSL7eS9 — Elon Musk (@elonmusk) March 9, 2024 ఇప్పుడు టీవీల్లో ఎక్స్.కామ్ టీవీ యాప్‌ను తెచ్చే పనిలో ఉన్నారు. ఇదే విషయంపై ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు మస్క్ క్లారిటీ ఇచ్చారు. త్వరలో వచ్చేస్తుంది. ఎక్స్.కామ్‌లోని లాంగ్ వీడియోలు టీవీల్లో చూసే వెసలు బాటు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. -
భారత ప్రభుత్వంపై మస్క్ కంపెనీ వ్యతిరేక స్వరం
తమ ప్లాట్‌ఫామ్‌లోని కొన్ని ఖాతాలు, పోస్ట్‌లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని ఎలాన్ మస్క్‌కు చెందిన సోషల్ మీడియా దిగ్గజం ‘ఎక్స్’ (గతంలో ట్విటర్) పేర్కొంది. ప్రభుత్వ ఆదేశాలను తాము పాటిస్తాం కానీ, వారి చర్యలతో ఏకీభవించబోమని ప్రకటించింది. అయితే కంపెనీ ఆరోపణలపై ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. ‘ఎక్స్’కు సంబంధించిన గ్లోబల్ గవర్నమెంట్ అఫైర్స్ హ్యాండిల్లో ఈ మేరకు పోస్ట్‌లో వివరాలను కంపెనీ వెల్లడించింది. భారత ప్రభుత్వ చర్యలతో తాము ఏకీభవించడం లేదని, భావప్రకటనా స్వేచ్ఛను హరిస్తూ పోస్ట్‌లను తొలగించడం సరికాదని అభిప్రాయపడింది. అయితే భారత ప్రభుత్వ ఆదేశాలకు కట్టుబడి ఉంటామని తెలిపింది. "ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా భారత్‌లో మాత్రమే ఈ ఖాతాలు, పోస్ట్‌లను నిలిపివేస్తాం. అయినప్పటికీ మేము ఈ చర్యలతో విభేదిస్తున్నాం. ఈ పోస్ట్‌లకు భావప్రకటనా స్వేచ్ఛను కొనసాగిస్తున్నాం" అని పేర్కొంది. ప్రభుత్వ ఉత్తర్వును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ ఇంకా పెండింగ్‌లో ఉందని ‘ఎక్స్’ తెలిపింది. ప్రభావిత యూజర్లకు కూడా ఈ చర్యల నోటీసును అందించినట్లు పేర్కొంది. గత ఏడాది జూన్‌లో నిర్దిష్ట సోషల్ మీడియా ఖాతాలు, ట్వీట్లను బ్లాక్ చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలకు వ్యతిరేకంగా ‘ఎక్స్’ వేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. భారత ప్రభుత్వ ఆదేశాలను పాటించనందుకు కంపెనీకి హైకోర్టు రూ.50 లక్షల జరిమానా విధించింది. ఈ విషయంలో ప్రభుత్వ వైఖరిని హైకోర్టు సమర్థించిందని, దేశ చట్టాన్ని కంపెనీ తప్పక పాటించాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. -
Elon Musk: మూడు లక్షల కోట్లు తగలెట్టేశాడు
అపర కుబేరుడు ఎలోన్ మస్క్ 21 ఏళ్ల కుర్రాడిపై ప్రతికారం తీర్చుకోవాలని అనుకున్నారు. ఇందుకోసం ఏకంగా రూ.3.50లక్షల కోట్లు తగలేశాడు. ఇప్పుడు ఇదే ప్రపంచ టెక్ వర్గాల్లో చర్చాంశనీయంగా మారింది. మస్క్ 2022లో ‘వాక్ స్వాతంత్ర్యం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ’. ట్విటర్ (ఇప్పుడు ఎక్స్.కామ్‌గా మారింది) ను కొనుగోలు చేయాలన్న ఆలోచన వచ్చినప్పటి నుంచి ఎలోన్ మస్క్ చెబుతున్న మాటలివి. అత్యంత ప్రభావంతమైన సామాజిక మాధ్యమాల్లో ఒకటైన ట్విటర్లో దీనిపై నియంత్రణ ఉండటం సరికాదన్నది ఆయన అభిప్రాయం. అందుకే ట్విటర్ కొనుగోలు ఒప్పందం పూర్తయిన తర్వాత తొలి సందేశంలోనూ ఈ విషయాన్ని ప్రస్తావించారు. వాక్ స్వాతంత్ర్యం కాదు.. 21 ఏళ్ల కుర్రాడిపై అయితే మస్క్ ట్విటర్ కొనుగోలు చేయడానికి వాక్ స్వాతంత్ర్యం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కాదని, 21 ఏళ్ల కుర్రాడిపై ఆగ్రహంతో తీసుకున్న నిర్ణయం అంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. వినడానికి వింతగా ఉన్నా.. అక్షరాల ఇదే నిజం అంటూ అమెరికాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ బ్లూమ్‌బెర్గ్ జర్నలిస్ట్ కర్ట్ వాగ్నెర్ (Kurt Wagner) పలు సంచలన విషయాల గురించి ప్రస్తావిస్తూ ఆయనే స్వయంగా ఓ పుస్తకాన్ని రాశారు. ‘బ్యాటిల్ ఫర్ ద బర్డ్’ బుక్‌లో ట్విటర్ కొనుగోలుకు ముందు అప్పటి సీఈఓ పరాగ్ అగర్వాల్‌కు, ఎలోన్ మస్క్ ఏం జరిగిందో కులంకషంగా వివరించారు. అది 2022 జనవరి నెల. ఆ నెలలో స్పేస్ఎక్స్, టెస్లా కంపెనీలతో యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ‘ఎలోన్ జెట్’ అనే ట్విటర్ అకౌంట్‌ను బ్లాక్ చేయాలని అప్పటి ట్విటర్ సీఈఓ పరాగ్ అగర్వాల్‌ను కోరారు. అందుకు ఆయన సున్నితంగా తిరస్కరించారు. ఇదే విషయాన్ని బ్యాటిల్ ఫర్ ద బర్డ్‌లో ప్రస్తావించినట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదిక సైతం పేర్కొంది. ఎలోన్ జెట్ అకౌంట్ ఎవరిది ఎలోన్ జెట్ ట్విటర్ అకౌంట్ 19 ఏళ్ల కుర్రాడు జాక్ స్వీనీ (Jack Sweeney)ది. అప్పట్లో జాక్ స్వీనీ తన టెక్నాలజీలో తనకున్న అపారమైన తెలివితేటలతో ఎలోన్ మస్క్‌ను బయపెట్టాడు. తన సొంత నైపుణ్యంతో విమానాల కదలికల్ని ఎప్పటికప్పుడు తెలుసుకునే ఓ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించాడు. అలా ప్రైవేటు వ్యక్తుల విమానాలు ఎప్పుడు.. ఎక్కడ.. ఉన్నాయో ఇట్టే చెప్పేస్తున్నాడు. అందుకోసం ట్విటర్‌ను వేదికగా చేసుకున్నాడు. స్వీనీ ట్రాక్ చేస్తున్న విమానాల్లో ఎలోన్ మస్క్‌తో పాటు ఇతర ప్రముఖులు సైతం ఉన్నారు. 3లక్షలు వద్దు 37లక్షలు కావాలి ఇదే విషయం తెలుసుకున్న మస్క్.. స్వీనీని ట్విటర్లోనే (ఆ ట్వీట్‌ను కింద ఫోటోలో చూడొచ్చు) సంప్రదించారు. తన విమానాల్ని ట్రాక్ చేయడం ఆపాలని కోరారు. స్వీనీ విమానాల్ని ట్రాక్ చేయడం వల్లే తాను ఎంత నష్టపోతున్నానో వివరించారు మస్క్. అందుకు 5,000 (రూ.3.75 లక్షలు) డాలర్లు ఇస్తానని ఆఫర్ చేశారు. కానీ, స్వీనీ అందుకు నిరాకరించాడు. తనకు 50,000 డాలర్లు (దాదాపు రూ.37.55 లక్షలు) కావాలని డిమాండ్ చేశాడు. ఈ మొత్తంతో తాను స్కూల్ ఫీజు చెల్లించడంతో పాటు టెస్లా కారు కొనుక్కుంటానని తెలిపాడు. ‘బ్యాటిల్ ఫర్ ది బర్డ్’ ఈ ఘటన తర్వాత జరిగిన పరిణామాలపై ఈ నెల 20న విడుదల కానున్న బ్యాటిల్ ఫర్ ది బర్డ్‌లో “మస్క్ తన ప్రైవేట్ విమానాన్ని ట్రాక్ చేస్తున్న ట్విటర్ ఖాతాను తొలగించమని అగర్వాల్‌కు విజ్ఞప్తి చేశారు. అగర్వాల్ మస్క్ అభ్యర్థనను తిరస్కరించారు. ఇలా కొద్దిసేపటికే మస్క్ ట్విటర్ షేర్లను కొనుగోలు చేయడం ప్రారంభించారని కర్ట్ వాగ్నెర్ హైలెట్ చేశారు. 2022 అక్టోబర్‌లో ఎలోన్ మస్క్ ట్విటర్‌ని 44 బిలియన్ల డాలర్లకు కొనుగోలు చేశారు. అనంతరం ట్విటర్లో సిబ్బంది తొలగించారు. సగం కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించడమే కాకుండా, పలువురు జర్నలిస్టులతో పాటు జాక్ స్వీనీ ట్విటర్ అకౌంట్ ఎలోన్ జెట్‌ను సస్పెండ్ చేశారు. మస్క్ ట్విటర్‌ను ఎప్పుడు కొనుగోలు చేశారు? ►ఎలోన్ మస్క్ ఏప్రిల్ 14,2022 ఒక్క షేరును 54.20 చొప్పున మొత్తం షేర్లను 44 బిలియన్ డాలర్లకు అంటే (సుమారు రూ.3.50లక్షల కోట్లు) ట్విటర్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటన ►ఏప్రిల్ 25న ట్విటర్ సైతం తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విటర్‌ను మస్క్‌కు అమ్ముతున్నట్లు ధృవీకరించింది. ►మస్క్- ట్విటర్ మధ్య ఫేక్ ట్విటర్ అకౌంట్లపై వివాదం నెలకొంది. పలు దఫాలుగా జరిగిన చర్చల అనంతరం జులై 8న మస్క్ మరో ప్రకటన చేశారు. ట్విటర్‌ను కొనుగోలు చేయడం లేదని, ఫేక్ అకౌంట్లకు సంబంధించి తాను అడిగిన సమాచారాన్ని ఇవ్వడంలో ట్విటర్ విఫలమైందన్న ఆరోపణలతో ఒప్పందాన్ని రద్దు చేసుకోనున్నట్లు వెల్లడించారు. ►ఎట్టకేలకు మస్క్-ట్విటర్ మధ్య కొనుగోలు ఒప్పందం పూర్తయింది. 3.50లక్షల కోట్లు వెచ్చించిన ఈ అపరకుబేరుడు ట్విటర్ బాస్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ట్విటర్‌ను ఎక్స్.కామ్‌గా మార్చారు. ఇప్పుడు దానిని ఎవ్రిథింగ్ యాప్‌గా మార్చే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు మస్క్. -
‘ఈ జీవితానికి ఇది చాలు’ : ఆనంద్ మహీంద్రా
ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా నెటిజన్లు హృదయాల్ని హత్తుకునేలా ఓ వీడియోని షేర్ చేశారు. వీడియో పాతదే. కానీ అందులో ఓ పదేళ్ల బాలుడు ఉన్నట్లు తన మనవళ్లు కూడా ఉంటే ఈ జీవితానికి ఇది చాలు అని అర్ధం వచ్చేలా ట్వీట్లో పేర్కొన్నారు. ఇంతకీ ఆ వీడియో ఏంటి? హృదయాల్ని హద్దుకునేలా ఆ వీడియోలో ఏముంది? ఈ సంఘటన 2022లో జరిగిన అర్జెంటీనా ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లోనిది. ఈ మ్యాచ్‌లో బోకా జూనియర్స్తో ఓడిపోయిన తర్వాత డిఫెన్సా వై జస్టిసియా టీం గోల్ కీపర్ ఎజెక్వియెల్ అన్‌సైన్ ఓటమి తట్టుకోలేక తన రెండు చేతుల్ని మైదానానికి వేసి గుద్దుతున్నాడు. అది చూసిన ఓ పదేళ్లు బాలుడు అయ్యో పాపం అనుకుంటూ తనని ఓదార్చేందుకు గ్రౌండ్లోకి దూసుకు వచ్చాడు. అనంతరం ఎజెక్వియెల్ను హత్తుకుని ఓదార్చాడు. ఆ వీడియోనే ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. అలాగే ‘నా ఇద్దరు మనవలూ నన్ను చూసేందుకు త్వరలో వస్తున్నారు. ఈ వీడియోలో కుర్రాడికి ఉన్నట్టే వాళ్లకి కూడా మంచి మనసు ఉంటే చాలు. అంతకుమించి ఇంకేమీ కోరుకోను’ అని కామెంట్ చేశారు. ఆనంద్ మహీంద్రా రీపోస్ట్ చేసిన ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. This little boy apparently ran on to the pitch after a match to console the losing goalkeeper. My 2 young grandsons will soon be visiting us & I would wish for nothing more than for them to have hearts as empathetic & large as this kid’s.. pic.twitter.com/fQ3uLbHo97 — anand mahindra (@anandmahindra) February 11, 2024 -
‘ఏం చేయనున్నారు’..ఫోన్‌కు దూరంగా ఎలోన్ మస్క్!
టెక్ మొఘల్ ఎలోన్ మస్క్ ఇకపై తాను కొన్ని నెలల పాటు ఫోన్‌ను వినియోగించడం లేదని ఎక్స్.కామ్‌లో పోస్ట్ చేశారు. ఆడియో, వీడియో కాల్స్ కోసం ఎక్స్.కామ్‌ను వినియోగిస్తున్నట్లు చెప్పారు. మస్క్ ట్విట్లో ఏమన్నారంటే.. ‘నేను కొన్ని నెలల పాటు ఫోన్‌ను వినియోగించడం మానేస్తున్నాను. బదులుగా ఆడియో, వీడియో కాల్స్ కోసం ఎక్స్.కామ్‌ను ఉపయోగిస్తున్నా’ అని ట్వీట్లో పేర్కొన్నారు. In a few months, I will discontinue my phone number and only use X for texts and audio/video calls — Elon Musk (@elonmusk) February 9, 2024 మస్క్ ఎక్స్.కామ్‌ను ఎవ్రిథింగ్ యాప్‌గా మారుస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగా ఎక్స్.కామ్‌లో ట్వీట్లు మాత్రమే కాకుండా ఆడియో, వీడియో కాల్స్ మాట్లాడుకునేందుకు గత ఏడాది అక్టోబర్ కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చారు. అయితే మస్క్ ఎక్స్.కామ్‌ను ప్రమోట్ చేసేందుకు ఫోన్‌కు దూరంగా ఉంటున్నారంటూ పలు నివేదికకు వెలుగులోకి వచ్చాయి. 2023లో ఎక్స్.కామ్‌లో ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే ‘ఎర్లీ వెర్షన్ ఆఫ్ వీడియో అండ్ ఆడియో కాలింగ్ ఆన్ ఎక్స్’ ఫీచర్‌ను అందించడం ప్రారంభించారు. ఎక్స్.కామ్ వెబ్సైట్ ప్రకారం.. ఎక్స్.కామ్ యూజర్లందరికి కాల్స్ చేసుకునే సదుపాయం లేదు. కేవలం ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకున్న యూజర్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది అని వెల్లడించింది. -
‘క్లిక్ చేస్తే ఖల్లాస్’.. ప్రపంచంలోనే భారీ డేటా చోరీ!
ఇంటర్నెట్ యూజర్లకు, అమెరికాతో పాటు పలు దేశాల ప్రభుత్వాలకు సైబర్ నేరస్తులు షాకిచ్చారు. అమెరికా ప్రభుత్వ కార్యాలయాలకు చెందిన డేటాను చోరీ చేశారు. దీంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా 26 బిలియన్ల యూజర్ల డేటా చోరీకి గురైనట్లు డిస్కవరీ, సైబర్ న్యూస్ సంస్థలకు చెందిన రీసెర్చర్లు నిర్ధారించారు. సైబర్ నేరస్తులు సేకరించిన డేటా మొత్తం ‘మదర్ ఆఫ్ ఆల్ బ్రీచెస్’ అనే అన్ సెక్యూర్ పేజీలో ఉందని తెలిపారు. ఈ సందర్భంగా లీకైన ఈ డేటాను చైనా మెసేజింగ్ జెయింట్ టెన్సెంట్, వైబో, అడోబ్, కాన్వా, లింక్డిన్, ఎక్స్.కామ్, టెలిగ్రాం ద్వారా సేకరించినట్లు తమ పరిశోధనల్లో గుర్తించినట్లు రీసెర్చర్లు అన్నారు. ఇక యూజర్ల డేటాతో పాటు అమెరికా, ప్రపంచంలోని ఆయా దేశాల ప్రభుత్వ డేటా సైతం సైబర్ నేరస్తుల చేతుల్లోకి వెళ్లినట్లు తేల్చారు. డేటాతో ఏం చేస్తారంటే? ఇక సైబర్ నేరస్తులు( థ్రెట్ యాక్టర్స్) తస్కరించిన డేటాను ఉపయోగించి భారీ మొత్తంలో సైబర్ దాడులు, యూజర్ల బ్యాంక్ అకౌంట్లతో పాటు ఇతర వ్యక్తిగత సమాచారం, ఫిషింగ్ స్కామ్స్, కొన్ని సంస్థల్ని లేదంటే, కంప్యూటర్లను లక్ష్యంగా చేసుకుని వాటిపై సైబర్ దాడులు చేసేందుకు వీలుగా ఉపయోగిస్తారని రీసెర్చర్లు వెల్లడించారు. ఆ ధీమా వద్దు అయితే, డేటా చోరీతో సైబర్ నేరగాళ్లు ఏమి చేస్తారులే’ అనే ధీమాతో కాకుండా దొంగిలించిన డేటాతో ఏం చేయొచ్చు? ఒకవేళ వినియోగిస్తే వాటి పర్యవసనాలు ఏ విధంగా ఉంటాయో గుర్తించి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఈఎస్ఈటీ గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ అడ్వైజర్ జేక్మూర్ అన్నారు. ఫోన్, మెయిల్స్, వాట్సాప్ ఆడియోకాల్స్ తో పాటు ఇతర అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయొద్దని, అలాంటి లింక్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేశారు. గతాన్ని గుర్తు చేసిన రీసెర్చర్లు ఈ సందర్భంగా ఇదే తరహాలో సైబర్ నేరస్తులు 2019లో వెరిఫికేషన్.ఐఓ తయారు చేసిన ఎలాంటి భద్రత లేని డేటాబేస్ నుంచి దాదాపు వన్ బిలియన్ రికార్డులు డేటా లీకైన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఆ సమయంలో, ఇదే అతిపెద్ద, అత్యంత హానికరమైన లీకేజీల్లో ఒకటిగా పేరొందింది. ఈ డేటా చౌర్యం మైస్పేస్ (360 మిలియన్లు), ట్విటర్ (281 మిలియన్లు), లింక్డిన్ (251 మిలియన్లు), అడల్ట్ఫ్రెండ్ఫైండర్ (220 మిలియన్లు) వంటి సోషల్ నెట్ వర్క్ యూజర్లదని డిస్కవరీ, సైబర్ న్యూస్ రీసెర్చర్లు స్పష్టం చేశారు. -
3 లక్షల కోట్లు పెట్టి కొంటే ఎలాన్ మస్క్‌ను నట్టేటా ముంచేస్తోందా?
అపర కుబేరుడు ఎలాన్ మస్క్‌కు తన సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఎక్స్.కామ్ ఊహించని షాక్ ఇచ్చింది. ఆ సంస్థను కొనుగోలు చేసిన నాటి నుంచి అంటే అక్టోబర్ 2022 నుంచి డిసెంబర్ 20,2023 వరకు ఎక్స్. కామ్ విలువ 71.5 శాతం కోల్పోయింది. తాజాగా మస్క్ సెక్యూరిటీ ఫైలింగ్‌లో ఇదే విషయాన్ని తెలిపారు. ఎలాన్ మస్క్.. ట్విటర్ కొనుగోలు టెక్ ప్రపంచంలో అతిపెద్ద డీల్. ఈ కొనుగోలు విలువ అక్షరాల 44 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 3.37 లక్షల కోట్లు). అయితే మస్క్ ట్విటర్‌ను సొంతం చేసుకున్న తర్వాత అందులో చేసిన మార్పులు, కొత్తగా తెచ్చిన సబ్స్క్రిప్షన్ సేవలతో పాటు ఇతర కారణాల వల్ల యూజర్లు భారీగా తగ్గారు. 12.5 బిలియన్ డాలర్లు ఎక్స్.కామ్ విలువ పైగా స్టార్టప్స్‌తో పాటు పలు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలు ఎక్స్.కామ్‌లో యాడ్స్‌ను ఇవ్వడాన్ని నిషేధించాయి. కంటెంట్ నియంత్రణపై ఆందోళనలు వంటి అంశాలు తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఫలితంగా సంస్థ విలువ 12.5 బిలియన్ డాలర్లకు చేజారింది. 15 శాతం తగ్గిన నెలవారి యూజర్లు ఫిడిలిటీ ఇన్వెస్ట్మెంట్స్ నివేదిక ప్రకారం.. మస్క్ ట్విటర్‌ను అక్టోబర్ 2022లో కొనుగోలు చేయగా.. జులై,2023న దాని పేరును ఎక్స్.కామ్‌గా మార్చారు. అదే సమయంలో ట్విటర్‌ను కొనుగోలు అనంతరం ప్రారంభ దశలో నెలవారి యూజర్లు 15 శాతం తగ్గినట్లు ఫిడిలిటీ పేర్కొంది. ట్విటర్ సంస్థలోకి బాస్‌గా అడుగుపెట్టిన మస్క్.. వచ్చీరాగానే 50 శాతం ఉంది ఉద్యోగుల్ని ఫైర్ చేశారు. అదే సమయంలో అన్నీ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లలో కంటే ట్విటర్లో సమాచారం అంతా నిరాధారమైనవి అంటూ యురోపియన్ యూనియన్ మస్క్‌కు వార్నింగ్ ఇచ్చాయి. యాక్సియోస్ రిపోర్ట్ ఆధారంగా.. నవంబర్ 2023 వరకు ఎక్స్. కామ్ నష్టాల్ని పరిణామాలను పరిగణనలోకి తీసుకకుంది. నవంబర్‌లో ప్రకటనలు ఆగిపోవడంతో ఎక్స్.కామ్ విలువ 10.7 శాతం నష్టపోయింది. నవంబర్‌లో డిస్నీ, యాపిల్, కోకా కోలాతో సహా ప్రధాన ప్రకటనదారులు ఎలాన్ మస్క్ యాంటిసెమిటిక్ పోస్ట్‌లకు ఆమోదించడం ఆగ్నికి ఆజ్యం తోడైనట్లు.. దిగ్గజ కంపెనీలు ఎక్స్. కామ్‌లో యాడ్స్ ఇవ్వడాన్ని నిలిపివేశారు.