Tamil Nadu
-
27న ఊటీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
● నాలుగు రోజుల పర్యటన సాక్షి, చైన్నె: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 27న రాష్ట్రానికి రాను న్నారు. నాలుగు రోజు ల పర్యటనలో భాగంగా పర్యాటక ప్రదేశం ఊటీలో జరిగే కార్యక్రమాలకు హాజర కానున్నారు. ఈనెల 27వ తేదీన ఢిల్లీ నుంచి కోయంబత్తూరుకు రాష్ట్రపతి రానున్నారు. ఇక్కడి నుంచి హెలికాప్టర్లో ఊటీ వెళ్లనున్నారు. 28వ తేదీన ఊటీలో ఉన్న రాజ్‌భవన్ నుంచి కున్నూరుకు వెళ్తారు. వెల్లింగ్ టన్ ఆర్మీ శిక్షణ కేంద్రంలో జరిగే కార్యక్రమానికి హాజరవుతారు. 29వ తేదీ అక్కడే జరిగే మరికొన్ని కార్యక్రమాల లో పాల్గొననున్నారు. 30న కోయంబత్తూరుకు చే రుకునే రాష్ట్రపతి, తిరువారూర్ తమిళనాడు వర్సి టీ స్నాతకోత్సవానికి హాజరు కానన్నారు. ఈ ప ర్యటనను ముగించుకుని తిరుపతికి వెళ్లనున్నట్లు సమాచారం. రాష్ట్రపతి రాకతో నీలగిరి జిల్లాలోని ఊటీ, కోయంబత్తూరు పరిసరాలు, తిరువారూర్ వర్సిటీ పరిసరాలలో పోలీసులు భద్రతా పరంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. సంగీత సమ్మేళనంతో కంబరామాయణం ● రేపు చైన్నెలో ప్రదర్శన సాక్షి, చైన్నె: కంబ రామాయణాన్ని తమిళం– ఆంగ్ల తర్జుమాతో పాటు సంగీత సమ్మేళనంతో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. చైన్నె వేదికగా ఈ నెల 23న నారదగాన సభలో ఈ ప్రదర్శన జరగ నుంది. ప్రముఖ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్, రె లా హాస్పిటల్ ఛైర్మన్ ప్రొఫెసర్ మహ్మద్ రేలా, పీ డియాట్రిక్ సర్జరీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ ప్రి యా రామచంద్రన్, ప్రముఖ కర్ణాటిక్ సంగీత కా రుడు సిక్కిల్ గురుచరణ్ సంయుక్తంగా ఈ కొత్త ప్రయోగంపై దృష్టి పెట్టారు. గురువారం స్థానికంగా జరిగిన సమావేశంలో వీరు మాట్లాడుతూ, వా ల్మీకి రామాయణం నుంచే కంబరామాయణం పు ట్టిందని వివరించారు. ఇది వెయ్యి సంవత్సరాల కావ్యం అని 10,500లకు పైగా శ్లోకాలతో కూడిన ఇతిహాసం అని వ్యాఖ్యలు చేశారు. కంబరామయణాన్ని అందరికీ అర్థమయ్యే రీతిలో తెలియజేయ డం లక్ష్యంగా వినూత్న ప్రయోగం మీద దృష్టి పె ట్టామన్నారు. కంబ రామాయణాన్ని కొత్త, వినూ త్న ఆకృతిలో ప్రదర్శించడానికి తాము ముగ్గరం ఒకే వేదిక మీదకు వచ్చామన్నారు. తమిళంలో డా క్టర్ ప్రియా రామచంద్రన్, ఆంగ్లంలతో తర్జుమా రూపంలో తాను, సంగీతం రూపకంతో గురుచర ణ్ అద్భుత ప్రదర్శనకు ఇవ్వబోతున్నారని ఈసందర్భంగా డాక్టర్ రేలా తెలిపారు. కంబ రామాయ ణం – పద్యాలు, పాట(ప్రధాన ఘట్టాలతో) ఈనె ల 23వ తేదీన సాయంత్రం ఆరు గంటలకు నార ద గాన సభలో ఈ ప్రదర్శనకు ఏర్పాట్లు చేశామన్నారు. 90 నిమిషాలకు పైగా సంగీత కళాత్మకతతో కంబన్ తెలిపిన సారంశాన్ని మిళితం చేసే విధంగా కొత్త అనుభూతి ప్రేక్షకులకు కల్పించే రీతిలో ఈ ప్రదర్శన ఉండబోతోందన్నారు. పట్టాభిరాంలో కొత్త టైడల్ పార్క్ సాక్షి, చైన్నె : చైన్నె శివారులోని పట్టాబిరాంలో కొత్త టైడల్పార్కు సిద్ధమైంది. రూ. 330 కో ట్లతో 11.41 ఎకరాల లో 21 అంతస్తులతో ఈ టై డల్ పార్కును రూపొదించారు. దీనిని సీఎం స్టాలిన్ గురువారం ప్రారంభించనుతున్నారు. ఇక్కడ 6 వేల మందికి ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు. అలాగే కాంచీపురం జిల్లా పరిధిలోని తిరుముడి వాక్కంలో ఇంజినీరింగ్, టెక్నాలజీ సెంటర్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. రూ. 18.18 కోట్లతో తొలి విడతగా ఈ సెంటర్ ఏర్పాటు చేశారు. ఇది లా ఉండగా చైన్నెలో బీచ్‌ల అభివృద్ధిలో భాగంగా తిరువొత్తియూరులో బీచ్ సుందరీకరణ పనుల వేగాన్ని పెంచారు. రూ. 272 కోట్లతో ఇక్కడ సుందరీకరణ పనులు ముగింపు దశకు చేరాయి. పర్యాటకులు, సందర్శకులను ఆకర్షించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. అలాగే చైన్నె కొళత్తూరులోని రెట్టేరి సుందరీకరణ పనులు సైతం ముగింపు దశకు చేరాయి. రూ. 10 కోట్ల ఖర్చుతో రెట్టెరి చెరువును పర్యాటకంగా తీర్చిదిద్దారు. తూత్తుకుడి విమానం మదురైలో ల్యాండింగ్ సాక్షి, చైన్నె: తూత్తుకుడిలో వాతావరణం అనుకూలించక పోవడంతో విమానాన్ని మదురైలో ల్యాండింగ్ చేశారు. ఇందులో రహదారుల శాఖమంత్రి ఏవీ వేలుతోపాటు 77మంది ప్రయాణికులు ఉన్నారు. చైన్నె నుంచి తూత్తుకుడికి ఉదయం విమానం టేకాఫ్ తీసుకుంది. తూత్తుకుడి విమానాశ్రయంలో ల్యాండింగ్ చేయాల్సి ఉంది. అయితే, వాతావరణం అనుకూలించక పోవడంతో ల్యాండింగ్ చేయలేని పరిస్థితి. ఈ విమానంలో మంత్రి ఏవీ వేలు తోపాటు 77 మంది ఉన్నారు. గాల్లో చాలాసేపు చక్కర్లు కొట్టిన విమానాన్ని చివరకు ఫైలట్ మదురై విమానాశ్రయం వైపుగా నడిపించారు. తర్వాత అక్కడ సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. -
రామేశ్వరం విలవిల
● పది గంటల్లో 41 సెం.మీ వర్షం ● డెల్టాలో దెబ్బతిన్న 40 వేల ఎకరాల సంబా పంట ● అన్నదాతల గగ్గోలు ● 26, 27 తేదీలలో అతి భారీ వర్షాలకు అవకాశం జాతీయ రహదారిపై ప్రవహిస్తున్న వర్షపు నీరు, నాగపట్నంలో నీటి తొలగింపు పనులను పరిశీలిస్తున్న కలెక్టర్ ఆకాశ్ సాక్షి, చైన్నె: రాష్ట్రంలో అనేక జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రామేశ్వరంలో పది గంటలలో 41 సెం.మీ వర్షం పడడంతో అక్కడి ప్రజల జీవనం స్తంభించింది. డెల్టా జిల్లాలలో కురుస్తున్న వర్షాలకు సంబా వరి పంట మీద ప్రభావం పడింది. 40 వేల ఎకరాల పంట దెబ్బతిన్నట్లు అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాలు.. ఈశాన్య రుతు పవనాలు విస్తరించడంతో దక్షిణ తమిళనాడులోని కన్యాకుమారి, తూత్తుకుడి, తిరునల్వేలి, తెన్కాశి, తేని, రామనాథపురం జిల్లాలో కొన్ని చోట్ల భారీగా, మరికొన్ని చోట్ల విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలు శుక్రవారం కూడా కొనసాగనున్నాయి. రామనాథపురం జిల్లా వ్యాప్తంగా 12 గంటల పాటు నిర్విరామంగా భారీ వర్షం పడింది. ఇందులో రామేశ్వరంలో ఏక దాటిగా 10 గంటల పాటుగా 41 సెం.మీ వర్షం కురిసింది. మిగిలిన ప్రాంతాలలో 16 నుంచి 20 సె.మీ వర్షం పడింది. దీంతో ఈ జిల్లాలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. రామేశ్వరం రామనాథ స్వామి ఆలయంలోకి వర్షపు నీరు చేరింది. కెరటాలు ఎగసి పడతుండడంతో జాలర్ల తమ పడవలను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. రామేశ్వరం, పాంబన్, మండపం మార్గాలో రోడ్లమీద వరదలు పొటెత్తాయి. సాగరం ముందుకు చొచ్చుకు వచ్చినట్టుగా పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడి లోతట్టు ప్రాంతాలలో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. అనేక చోట్ల చెట్లు నేలకు వంగడంతో వాటిని తొలగిస్తున్నారు. ఈదురు గాలులతో వర్షం ఇక్కడ కొనసాగుతోంది. తూత్తుకుడి జిల్లా తిరుచెందూరులో అలల తాకిడి అధికంగా ఉండడంతో సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వద్ద భక్తులను సముద్రం వైపుగా అనుమతించడం లేదు. ఇద్దరు మహిళలకు అలల తాకిడిలో కాళ్లు విరగడంతో అప్రమత్తమయ్యారు. తిరునల్వేలి, కన్యాకుమారి, తెన్‌కాశిలలో కురుస్తున్న వర్షాలకు తామర భరణి, మంజలారు. మణిముత్తారు నదులలోకి నీటి రాక పెరగడంతో తీర వాసులను అప్రమత్తం చేశారు. ఈ జిల్లాలకు ఆరంజ్ అలర్ట్ ప్రకటించారు. డెల్టా జిల్లాల్లో.. గత మూడు రోజులుగా డెల్టా జిల్లాలైన నాగపట్నం, మైలాడుతురై, తంజావూరు, పుదుకోట్టై, తిరువారూర్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు కొనసాగుతుండడంతో పంట పొలాలలోకి నీళ్లు చేరాయి. సంబా వరి పంట మీద ప్రభావం పడే పరిస్థితి నెలకొంది. బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు పంట పొలాలలో నీరు చేరడంతో డెల్టా జిల్లాలలో సుమారు 40 వేల ఎకరాలలో వరి పంట దెబ్బ తిన్నట్టు అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ వర్షాలు కొనసాగుతుండడంతో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. అదే సమయంలో ఇక్కడి అన్నదాతలు తమ పంటలకు బీమా చేసుకునే వెసులు బాటు కల్పిస్తూ అవకాశాన్ని ఈనెల 30వ తేదీ వరకు ప్రభుత్వం పొడిగించింది. శివగంగై జిల్లాలోని మాన మదురై, తిరుపత్తూరు, శింగంపునరి, కారైక్కాడి, దేవకోట్టై,ఇలంయాకుడి పరిసరాలు వర్షం కొనసాగుతోంది. నాగపట్నంలో ఈదురు గాలలు ప్రభావం మరీ ఎక్కువగా ఉండటంతో జాలర్లు గురువారం కూడా చేపల వేటకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఉపరితల ఆవర్తనం.. బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది బలపడి అల్పపీడన ద్రోణిగా ఒకటి రెండు రోజులలో మారనుంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో 26, 27 తేదీలలో అనేక జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం హెచ్చరికలు చేసింది. దక్షిణ తమిళనాడుతో పాటు డెల్టా జిల్లాలో వర్షాలు కొనసాగుతుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మరింతగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆయా జిల్లాల యంత్రాంగాన్ని ప్రభుత్వం ఆదేశించింది. -
‘జాతకం’ పేరిట దూరం పెట్టడంతో చంపేశా!
● మదన్ కుమార్ వాంగ్మూలం ● న్యాయం కోసం ఉపాధ్యాయుల ఆందోళన సాక్షి, చైన్నె: నెలకు రూ. లక్ష జీతం వదిలి.. చిన్ననాటి నుంచి ప్రేమిస్తున్న ప్రియురాలిని పెళ్లి చేసుకునేందుకు వచ్చిన ప్రియుడు ఉన్మాదిగా మారి కటకటాల పాలయ్యాడు. జాతకం పేరిట తనను దూరం పెట్టడంతోనే చంపేశానని టీచర్‌ను మట్టుబెట్టిన ప్రేమోన్మాది మదన్ కుమార్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. వివరాలు.. తంజావూరు జిల్లా పట్టు కోట్టై సమీపంలోని మల్లి పట్టినం గ్రామంలో ప్రభుత్వ మహోన్నత పాఠశాలలో బుధవారం జరిగిన ఘటన యావత్ ఉపాధ్యాయ లోకాన్ని కలవరంలో పడేసిన విషయం తెలిసిందే. మల్లి పట్టినం సమీపంలోని చిన్నమనై గ్రామానికి చెందిన తమిళ టీచర్ రమణి (26)ను అదే ప్రాంతానికి చెందిన మదన్ కుమార్ ప్రేమోన్మాదంతో పొడిచి చంపేశాడు. ఈ ఘటనతో ఉపాధ్యాయులకు భద్రత కల్పించాలన్న నినాదంతో ఆందోళనలు బయలు దేరాయి. ప్రాథమిక, ఉన్నత, మహోన్నత పాఠశాలలకు చెందిన అనేక మంది ఉపాధ్యాయులు గురువారం సాయంత్రం విద్యా శాఖ కార్యాలయాల వద్ద భద్రత కోసం ఆందోళనకు దిగారు. అదే సమయంలో ప్రేమోన్మాది వద్ద పోలీసులు జరిపిన విచారణలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. రమణితో తనది ఒన్ సైడ్ లవ్ కాదని, ఇద్దరం ప్రేమించుకున్నామని, ఎన్నో కలలు కన్నామని అతడు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. రమణి కోసం సింగపూర్‌లో తాను నెలకు రూ. లక్ష జీతంతో చేస్తున్న ఉద్యోగాన్ని సైతం కోల్పోవాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. తమ పెళ్లికి జాతకం అడ్డు వచ్చిందని, ఇదే అదనుగా తనను దూరం పెట్టడంతో మానసిక క్షోభకు గురైనట్లు వాంగ్మూలం ఇవ్వడం గమనార్హం. జాతకంతో పని లేదని, పెళ్లి చేసుకుందామని నచ్చ చెప్పినా వినిపించుకోక పోవడంతో ఉన్మాదిగా మారి పోయి హతమార్చేశానని అతడు కన్నీటి పర్యంతం అవుతూ, తామిద్దరం తీసుకున్న ఫొటోలను పోలీసులకు అందజేయడం గమనార్హం. మదురైలో మరో ఉన్మాది.. టీచర్‌ను ప్రేమోన్మాదంతో హతమార్చిన మదన్‌కుమార్ ఘటన కలకలం సద్దుమనగక ముందే మదురైలో ఒత్తకడైలో మరో ఘటన వెలుగు చూసింది. జెరాక్స్ దుకాణంలో పనిచేస్తున్న లావణ్య అనే యువతి, సిద్ధిక్ రాజా అనే యువకుడు ప్రేమించుకున్నట్టు సమాచారం. వీరి ప్రేమకు హఠాత్తుగా బ్రేక్ పడడంతో సిద్దిక్ రాజా ఉన్మాదిగా మారాడు. జెరాక్స్ దుకాణంలో ఉన్న లావణ్య మీద పిడి గుద్దుల వర్షం కురిపించాడు. దీనిని చూసిన ఆ పరిసర వాసులు ఆమెను చికిత్స నిమిత్తం మదురై రాజాజీ ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయాల పాలైన ఆమెకు మెరుగైన చికిత్సను అందిస్తున్నారు. పరారీలో ఉన్న సిద్ధక్ రాజా కోసం గాలిస్తున్నారు. -
జైలు నుంచి కస్తూరి విడుదల
సాక్షి, చైన్నె: తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టయిన సినీ నటి కస్తూరి బెయిల్ దక్కడంతో జైలు నుంచి గురువారం సాయంత్రం విడుదలయ్యారు. ఈ కేసులో శనివారం హైదరాబాద్‌లో అరెస్టయిన కస్తూరిని చైన్నె పుళల్ జైలులో బంధించారు. తనకు బెయిల్ మంజూరు చేయాలని ఆమె దాఖలు చేసుకున్న విజ్ఞప్తికి ఎగ్మూర్ కోర్టు స్పందించింది. నిబంధనలతో ఆమెకు బెయిల్‌ను బుధవారం మంజూరు చేసింది. అయితే ఇందుకు సంబంధించిన ఉత్తర్వుల డాక్యుమెంట్లు ఆ జైలు వర్గాలకు గురువారం అందాయి. దీంతో జైలు నుంచి ఆమె సాయంత్రం విడుదలయ్యారు. ఆమెకు పలువురు శాలువ కప్పి ఆహ్వానించారు. తనకు సహకారం అందించిన వారందరికి కృతజ్ఞతులు అంటూ, చివరకు ఆంధ్ర, తెలంగాణ ప్రజలకు సైతం కృతజ్ఞతులు తెలిపారు. -
న్యాయవాదుల నిరసన హోరు
● హైకోర్టు ఆవరణలో రాస్తారోకో సాక్షి, చైన్నె : హోసూరులో న్యాయవాదిపై పట్ట పగలు జరిగిన దాడిని ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా గురువారం, శుక్రవారం విధుల బహిష్కరణతో నిరసనలకు న్యాయవాద సంఘాలు నిర్ణయించాయి. న్యాయవాదులపై ఇటీవల కాలంగా పెరుగుతున్న దాడులతో, తమకు రక్షణ కల్పించాలన్న నినాదంతో ఈ పోరుబాట పట్టారు. హోసూరులో న్యాయవాదిని కణ్ణన్‌ను ఆనంద్‌కుమార్ అనే వ్యక్తి బుధవారం విచక్షణా రహితంగా నరికి పడేశాడు. ఆస్పత్రిలో అతడికి తీవ్ర చికిత్స కొనసాగుతోంది. ఈ కేసులో నిందితుడి భార్య, న్యాయవాది సత్యవతిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన వెనుక వివాహేతర సంబంధం ఉందన్న సమాచారం వెలువడ్డప్పటికీ, పట్టపగలు ఓ న్యాయవాదిపై జరిగిన ఈ దాడిని న్యాయ వర్గాలు తీవ్రంగా పరిగణించారు. న్యాయవాద సంఘాలు పోరు బాట పట్టాయి. తమకు రక్షణ కల్పించాలని నినాదిస్తూ అనేక చోట్ల విధులను బహిష్కరించి ఆందోళనకు దిగారు. దీంతో కోర్టు వ్యవహారాలకు ఆటంకం తప్పలేదు. సేలం, మదురై, తిరుచ్చి, తిరునెల్వేలి తదితర నగరాలలోని కోర్టులలో విధులను బహిష్కరించి న్యాయవాదులు ఆందోళనకు దిగారు. మద్రాసు హైకోర్టులో సాయంత్రం పెద్ద ఎత్తున న్యాయవాదులు రోడ్డు మీదకు వచ్చేసి ఆందోళనకు దిగారు. ఆ మార్గంలో రాస్తారోకోకు దిగడంతో వాహనాల రాక పోకలకు ఆటంకం తప్పలేదు. చివరకు పోలీసులు బుజ్జగించడంతో శాంతించారు. సైదా పేట, ఎగ్మూర్ కోర్టు న్యాయవాదులు సైతం ఆందోళన రూపంలో తమ నిరసనను తెలియజేశారు. అలాగే, న్యాయవాదులపై జరుగుతున్న దాడుల వ్యవహారంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బార్ కౌన్సిల్, పోలీసులు, హోం శాఖ ఈ వ్యవహారంపై చర్చించి సమన్వయంతో వివరాలను తెలియజేయాలని కోర్టు ఆదేశించింది. తిరువళ్లూరులో రాస్తారోకో తిరువళ్లూరు: న్యాయవాదుల బద్రతకు కఠిన చట్టాన్ని రూపొందించాలని కోరుతూ తిరుపతి–చైన్నె జాతీయ రహదారిపై న్యాయవాదులు రాస్తారోకో నిర్వహించారు. తమిళనాడు, పాండిచ్చేరి బార్ నిర్వాహకులు పిలుపు మేరకు తిరువళ్లూరు జిల్లాలోని ఊత్తుకోట, తిరువళ్లూరు, అంబత్తూరు, పొన్నేరితో పాటు వేర్వేరు ప్రాంతాల్లోని కోర్టులో విధులను బహిష్కరించి నినాదాలు చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని న్యాయవాదులతో చర్చించి ఆందోళన విరమింపజేశారు. -
హత్యాయత్నం కేసులో రౌడీకి ఏడేళ్ల జైలు
తిరువొత్తియూరు: తిరువేర్కాడులో ముగ్గురుని హత్య చేయడానికి ప్రయత్నించిన కేసులో ప్రముఖ రౌడీకి ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ పూందమల్లి కోర్టు తీర్పు ఇచ్చింది. వివరాలు.. తిరువేర్కాడు సూర్యనారాయణ నగర్‌కు చెందినవారు ఉదయకుమార్ ఇతని సహోదరుడు సెంథిల్ కుమార్ వీరి స్నేహితుడు వినోద్ కుమార్. వీరిని గత 2013వ సంవత్సరము మార్చి నెల తిరువేర్కాడు కస్తూరిబాయ్ అవెన్యూకు చెందిన రౌడీ శక్తివేల్, దుడ్డు కరత్రో హత్య చేయడానికి యత్నించాడు. దీంతో తీవ్ర గాయమైన ముగ్గురు చికిత్స తర్వాత ఇంటికి తిరిగివచ్చారు. దీని గురించి తిరువేర్కాడు పోలీసులు హత్యయత్నం కేసు నమోదు చేసి శక్తి వేల్‌ను అరెస్టు చేసి జైలులో పెట్టారు. ఈ కేసు విచారణ పూందమల్లి అదనపు సెషన్స్ కోర్టులో విచారణ జరుగుతూ వచ్చింది. ఈ క్రమంలో కేసు విచారణ పూర్తి అయిన క్రమంలో న్యాయమూర్తి అలిసియా తీర్పు ఇచ్చారు. నిందితుడికి 7 సంవత్సరాల జైలు శిక్ష , రూ.30 వేలు జరిమానా విధిస్తూ ఆదేశించారు. దీనికి పోలీసు లు రౌడీ శక్తివేల్‌ను పులల్ జైలులో పెట్టారు. వేలం చీటీ పేరుతో మోసం – మహిళ సహా నలుగురి అరెస్టు అన్నానగర్: ఊటీలో వేలం చీటీ పేరుతో రూ.లక్షలు మోసం చేసిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు..నీలగిరి జిల్లా, ఊటీ కీళ్ తలైయాట్టు మందు ప్రాంతానికి చెందిన కుమార్ (51). ఇతను, ఇతని భార్య లత (46), కుమారుడు రాహుల్ (23), కుమార్ తమ్ముడు ఆటో డ్రైవర్ సహా దేవన్ (48) కలిసి వేలం చీటీ నిర్వహించారు. చీటీ పాడిన వారికి డబ్బులు ఇచ్చే పనిని కుమార్ భార్య, కొడుకు చేస్తున్నారు. ఈ క్రమంలో రూ.1.50 లక్షల చీటీలో 50 మంది, రూ.1.35 లక్షల చీటిలో 25 మంది, రూ.1.05 లక్షల చీటిలో 35 మంది చేరారు. అయితే చీటీ డబ్బు సరిగ్గా ఇవ్వకపోవడంతో పలువురు ఊటీ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. క్రైంబ్రాంచ్ విచారణలో 20 మంది ఇచ్చిన ఫిర్యాదులో రూ.36 లక్షల 35 వేలు మోసపోయినట్లు తేలింది. దీంతో నిందితుడు కుమార్, అతని భార్య, కొడుకు, తమ్ముడిని గురువారం పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. రూ.3.5 లక్షల విదేశీ సిగరెట్లు స్వాధీనం అన్నానగర్: మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి ఎయిర్ ఏషియా విమానం తిరుచ్చి విమానాశ్రయానికి బుధవారం రాత్రి చేరుకుంది. ఈ విమానంలోని ప్రయాణికుల వస్తువులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఆ సమయంలో ఓ ప్రయాణికుడు రూ.3 లక్షల 46 వేల విలువైన 34,600 విదేశీ సిగరెట్లను బండిల్స్‌లో తరలిస్తున్నట్లు గుర్తించారు. వీటిని స్వాధీనం చేసుకున్న అధికారులు ప్రయాణికుడి వద్ద విచారణ కొనసాగిస్తున్నారు. -
క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ‘తార’
తమిళసినిమా: ఎంఆర్ ఫిలిం వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై కార్తీకేశన్ కథను రాసి, ముఖ్య పాత్రను పోషించి నిర్మించిన చిత్రం తార. మణి మూర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మురుగా, పిడిచ్చిరుక్కు చిత్రాల ఫేమ్ అశోక్ కుమార్ కథానాయకుడిగానూ, నటి అను ప్రియా రాజన్ నాయకి గానూ నటించారు. మ్యాథ్యూ వర్గీస్, వర్షిణి, వెన్మది తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఆర్ జే.నవీన్ ఛాయాగ్రహణం, రఘు శ్రవణ్ కుమార్ సంగీతాన్ని అందించారు. కాగా చిత్రం ట్రైలర్, ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని మంగళవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడు ఆర్ వి.ఉదయ్ కుమార్, కార్యదర్శి పేరరసు, నటుడు, డిస్ట్రిబ్యూటర్ల సంఘం అధ్యక్షుడు కె.రాజన్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని ఆడియోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ తాను చాలా పొదుపు గల వ్యక్తినని పేర్కొన్నారు. తనతో చిత్రం చేయడం సాధారణ విషయం కాదన్నారు. అలాంటిది ఈ దర్శకుడు తారా చిత్రాన్ని అనుకున్న విధంగా తెరకెక్కించారని చెప్పారు. 25 ఏళ్ల క్రితం ఈ రంగంలో వచ్చి అవకాశాల కోసం ఎక్కిన మెట్టు ఎక్కకుండా కాళ్లు అరిగేలా తిరిగానని, అయినా అవకాశాలు రాకపోవడంతో వేరే రంగంలో వెళ్లి డబ్బు సంపాది ఇప్పుడు ఈ చిత్రం చేశానని చెప్పారు. పలువురి శ్రమే ఈ చిత్రం అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ తాను, నిర్మాత ముందుగా పక్కా ప్లాన్ చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించామన్నారు. కథ ఆయన రాసినా, దర్శకుడిగా తనకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారని చెప్పారు. కారైక్కాల్ ప్రాంతంలో జరిగిన యదార్థ ఘటన ఆధారంగా రూపొందించిన కథా చిత్రం తార అని చెప్పారు. -
మహిళలకు పారిశ్రామిక తోడ్పాటు
సాక్షి, చైన్నె: పారిశ్రామికంగా మహిళలను ముందుకు తీసుకెళ్లే విధంగా, సాధికారతను ప్రోత్సహించే రీతిలో ఫెడరల్ ఎక్స్‌ప్రెస్ కార్పొరేషన్ చర్యలు తీసుకుంది. సాధారణ పొదుపులతో ఆదాయాన్ని పెంపొందించే దిశగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు తోడ్పాటు అందించేందుకు విస్తృత చర్యలు చేపట్టింది. గురువారం మహిళలకు తోడ్పాటు అందించే విధంగా జరిగిన కార్యక్రమంలో ఫెడ్ ఎక్స్ ఇండియా ఆపరేషన్స్ ఉపాధ్యక్షుడు సువేందు చౌదరి మాట్లాడుతూ, చిన్న, మధ్యత రహా పరిశ్రమల ఆర్థికవృద్ధికి, పారిశ్రామికంగా మహిళలను నడిపించడమే లక్ష్యంగా అవసరమైన వనరులను, స్వయం సమృద్ది మార్గాలను కల్పిస్తున్నామని వివరించారు. ఎస్ఎంఈ పర్యావరణ వ్యవస్థలో మహిళు అభివృద్ధి చెందడానికి సమగ్రమైన , దీర్ఘ కాలిక తోడ్పాటు, లక్ష్యాలకు మద్దతు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. -
24న చైన్నె హాఫ్ మారథాన్
సాక్షి, చైన్నె: ఆరు వేల మంది రన్నర్లతో పాటు ఔత్సాహికులతో చైన్నె హాప్ మారథాన్ ఈనెల 24వ తేదీన జరగనుంది. 6వ ఎడిషన్‌గా జరగనున్న ఈ మారథాన్ గురించి నిర్వాహకులు ప్రతాప్ సింగ్, రెముస్ డీ క్రూజ్, నాగరాజ్ అడిగ గురువారం స్థానికంగా జరిగిన సమావేశంలో వివరించారు. ఎన్ఈబీ స్పోర్ట్స్ , అపోలో టైర్స్ ఆధారిత ఈ కార్యక్రమానికి అన్ని రంగాలకు చెందిన రన్నర్లు తమ పేర్లును నమోదు చేసుకున్నారని వివరించారు. బీసెంట్ నగర్ ఓల్కాట్ మెమోరియల్ హైస్కూల్ గ్రౌండ్ నుంచి చైన్నె నగరంలో పలు మార్గాల గుండా ఈ మారథాన్ జరగనున్నట్లు తెలిపారు. ఉదయం 4.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ రన్ 7 గంటల వరకు వివిధ కేటగిరీలలో జరగనున్నట్టు వివరించారు. చైన్నె హాఫ్ మారథాన్‌కు నగరంలోని రన్నింగ్ కమ్యూనిటీలోని వారే కాకుండా కార్పొరేట్ తదితర రంగాలకు చెందిన వారు సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు. ఫిట్నెస్, ఆరోగ్యకరమైన జీవనశైలి, సమాజ హితం కాంక్షించే విధంగా ఈ రన్ ఉంటుందన్నారు. -
సూర్యతో
ముచ్చటగా మూడోసారి? నటుడు సూర్య నటి త్రిష తమిళసినిమా: వైవిధ్య భరిత కథా చిత్రాలకు కేరాఫ్ నటుడు సూర్య. ఇటీవల విడుదలైన కంగువ చిత్రంలో సూర్య నటనకు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు లభించాయి. అంతగా ఆయన శ్రమించి నటించారు. కాగా తాజాగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో నటిస్తున్న తన 44 చిత్రాన్ని పూర్తి చేశారు. పూజా హెగ్డే నాయకిగా నటించినా ఈ చిత్రం పక్కా మాస్ ఎంటర్టైనర్గా రూపొందుతోంది . కాగా తాజాగా సూర్య తన 44వ చిత్రానికి రెడీ అవుతున్నారు. దీనికి నటుడు ఆర్జే బాలాజీ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. డ్రీమ్ వారియర్స్ పతాకంపై ఎస్సార్ ప్రభు, ఎస్సార్ ప్రకాష్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే సెట్ పైకి వెళ్లనుంది. కాగా ఈ చిత్రంలో కథానాయకిగా నటించే నటి ఎవరన్నది చర్చనీయాశంగా మారింది. అయితే ఆ లక్కీ చానన్స్ చైన్నె చిన్నది త్రిషను వరించినట్లు తాజా సమాచారం. సూర్య త్రిష లది హిట్ కాంబినేషన్ అనే ఇంకా చెప్పాలంటే ఈమె ఆరంభ కాల హీరో సూర్యనే అని చెప్పాలి. సూర్య హీరోగా నటించిన మౌనం పేసియదే చిత్రంలో త్రిష కథానాయకిగా నటించారు. ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత కమర్షియల్ దర్శకుడు హరి దర్శకత్వం వహించిన ఆరు చిత్రంలో సూర్య, త్రిష జంటగా నటించారు. ఆ చిత్రం మంచి కమర్షియల్ హిట్ సాధించింది. ఇకపోతే కమలహాసన్ కథానాయకుడిగా నటించిన మన్మఽథ అన్బు చిత్రంలో సూర్యతో త్రిష ఓ స్పెషల్ సాంగ్‌లో నటించడం విశేషం. కాగాఈ హిట్ కాంబినేషన్ రిపీట్ కాబోతున్నట్లు సమాచారం. అయితే ఈ విషయం గురించి చిత్రవర్గాలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదన్నది గమనార్హం. ఏదేమైనా నటి త్రిషకు లేటు వయసులోనూ కథానాయకిగా అవకాశాలు వరుస కడుతుండడం విశేషమే. -
క్లుప్తంగా
మెడికల్ విద్యార్థి ఆత్మహత్య అన్నానగర్: మాంగాడు పద్మావతి నగర్‌కి చెందిన సౌందరరాజన్ నిర్మాణ సంస్థ నిర్వహిస్తున్నాడు. ఇతని కుమారుడు రాజ్‌కుమార్ (25) వెలప్పన్ చావడిలోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. గత కొన్ని రోజులుగా రాజ్ కుమార్ కాలేజీకి వెళ్లడం లేదు. దీంతో తల్లిదండ్రులు మందలించారు. రాజ్‌కుమార్ తల్లి కళాశాలకు వెళ్లి తన కుమారుడికి కౌన్సెలింగ్ ఇవ్వాలని కళాశాల డీన్ ను కోరినట్లు కూడా తెలుస్తుంది. ఆ తర్వాత కాలేజీ డీన్ రాజ్‌కుమార్‌కు ఫోన్ చేసి కౌన్సెలింగ్‌కు రావాలని చెప్పడంతో తల్లిదండ్రులతో వాగ్వాదానికి దిగాడు. ఈనేపథ్యంలో బుధవారం రాత్రి తన గదిలోకి వెళ్లిన రాజ్ కుమార్ ఎంతసేపటికీ బయటకు రాలేదు. తల్లిదండ్రులకు అనుమానం వచ్చి గదిలోకి వెళ్లి చూడగా కొడుకు రాజ్‌కుమార్ ఉరివేసుకుని మృతి చెందడం చూసి షాక్‌కు గురయ్యారు. మాంగాడు పోలీసులు కేసు నమోదు చేసుకున్న విద్యార్థి ఆత్మహత్య నిర్ణయానికి మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అటవీ సరిహద్దు గ్రామంలో గర్భిణి ఇక్కట్లు అన్నానగర్: తిరుపూర్ జిల్లాలోని ఉడుమలై సమీపంలోని ఆనైమలై టైగర్ రిజర్వ్‌లో ఉడుమలై, అ మరావతి అడవులు ఉన్నాయి. ఇక్కడ కోడంటూ రు, పసహారు, అటుమలై, కూలిపట్టి, కురుమలై, మావడపు, తాలింజి, తలింజివాయల్, కారుమూ టి తదితర ప్రాంతాల్లో గిరిజనులు అధిక సంఖ్య లో నివసిస్తున్నారు. ఈ స్థితిలో కురుమలైకి చెందిన సుమతి (20) అనే నిండు గర్భిణి గురువారం అస్వస్థతకు గురైంది. దీంతో గిరిజనులు జోలెకట్టి అందులో సుమతిని ఉంచి ఉడుమలై ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. దీనిపై వారు మాట్లాడుతూ దారి సౌకర్యం లేకపోవడం వల్లే ఇప్పటికీ అవస్థలు పడుతున్నట్లు వాపోయారు. విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన కండక్టర్‌కు దేహశుద్ధి తిరువొత్తియూరు: ప్రభుత్వ బస్సులో పాఠశాల విద్యార్థినికి లైంగిక వేధింపులకు గురిచేసిన బస్ కండక్టర్‌ను ప్రజలు దేహశుద్ధి చేసి పోలీసులు అప్పగించారు. వివరాలు.. కన్యాకుమారి జిల్లా నాగర్ కోయిల్ నుంచి సిరమటంకు రోజు ప్రభుత్వ బస్సు వస్తోంది. ఈ బస్సులో రోజు ఎక్కువ మంది విద్యార్థినిలు, విద్యార్థులు, ప్రజ లు ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో గురువారం ఉదయం ప్రభుత్వ బస్సు కండక్టర్ ఉన్నామలైకి చెందిన శశి (54) ఓ విద్యార్థితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. విద్యార్థిని మరో స్టాపింగ్‌లో బస్సు నుంచి కిందకు దిగి ఇంటికి వెళ్లి జరిగిన సంగతి తల్లిదండ్రులకు చెప్పింది. దిగ్బ్రాంతి చెందిన తల్లిదండ్రులు గ్రామ ప్రజలు కండక్టర్‌కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. -
విలన్‌గా జయం రవి?
తమిళసినిమా: నటుడు, హీరో జయం రవి విలన్‌గా మారనున్నారా? అన్న ప్రశ్నకు అలాంటి అవకాశం కనిపిస్తుందని ప్రచారం జరుగుతోంది. నిజం చెప్పాలంటే ఈయన ఇటీవల నటించిన చిత్రాలేవీ ఆశించిన విజయాలను సాధించలేదు. పొన్నియిన్ సెల్వన్ చిత్రం తర్వాత జయం రవి మంచి సక్సెస్ చూడలేదని చెప్పాలి. ఇకపోతే మరో నటుడు శివకార్తికేయన్ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఇటీవల నటించిన అయిలాన్, మావీరన్, అమరన్ చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. అదేవిధంగా ప్రస్తుతం నాలుగు చిత్రాలతో బిజీగా ఉన్నారు. తాజాగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో పోలీసు అధికారిగా నటిస్తున్నారు. కాగా ఈ చిత్రం తరువాత దర్శకులు సీబీ చక్రవర్తి, నెల్సన్, సుధా కొంగర చిత్రాలలో నటించనున్నారు. వీరిలో సుధాకొంగర దర్శకత్వంలో రూపొందనున్న చిత్రానికి పురనానూరు అనే టైటిల్‌ను ఖరారు చేశారు. వాస్తవానికి ఈ చిత్రంలో నటుడు సూర్య నటించాల్సింది. అదేవిధంగా మరో రెండు ముఖ్య పాత్రల్లో దుల్కర్ సల్మాన్, నటి నజ్రియా నటించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల నటుడు సూర్య ఈ చిత్రం నుంచి వైదొలిగారు. ఆ పాత్రకు నటుడు శివ కార్తికేయన్‌ను ఎంపిక చేశారు. చారిత్రక కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రథమార్థంలో సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ఇకపోతే ఇందులో నటుడు జయం రవిని ప్రతి నాయకుడిగా నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. ఇంతకుముందు దుల్కర్ సల్మాన్ నటించాల్సిన పాత్రలో జయం రవిను ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది ఇది స్టైలిష్ విలన్ పాత్రగా ఉంటుందని సమాచారం. అయితే ఈ చిత్రంలో జయంరవి నటించడానికి అంగీకరిస్తారా? అన్నది ప్రశ్నార్థకరమే. -
సిద్ధం!
సాగర విహారానికి 44వ క్షేత్రం.. ఉత్తర కేశమంగైలో మంగలేశ్వరి సమేత మంగళనాథర్గా శివాలయం ఇక్కడ ప్రసిద్ధి చెందింది. ఏక శిల్పంగా మరగద నటరాజ ఆలయం కనిపిస్తుంటుంది. 108 వైష్ణవ దివ్య దేశాలలో 44వ క్షేత్రంగా తిరుపుల్లాని ఆదిజగన్నాథర్ ఆలయం, దేవీ పట్నం నవపాశానం, ఏర్వాడి దర్గా, ధనుష్కోటి పురాతన చారిత్రక సంపదలు. అరిచల్ మునై బీచ్, కుందుకాల్ వివేకానంద మండపం, గురుసడై తీవు, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం స్మారకంలు ఇక్కడే ఉన్నాయి. మండపం నుంచి పాంబన్ – రామేశ్వరం వరకు చేపల హార్బర్ ఉంది. తయిళపాడేలో సుమారు 1,076 కి.మీ దూరం ఉన్న సముద్ర తీరంలో మూడో వంతు భాగం తీరం ధనుస్కోటి నుంచి కన్యాకమారి వరకు విస్తరించి ఉంది. ధనుస్కోటిని పాక్ జలసంధిగా పిలవడం జరుగుతోంది. నాగపట్నం నుంచి రామనాథపురం సముద్ర తీరం వరకు ఇది వర్తిస్తుంది. ఇక్కడ పాండియ రాజులు, చోళ రాజులు, నాయకర్లు, సేతుపతి మన్నర్ల హయాంలో శ్రీలంక , మలేషియా వంటి దేశాలతో పాటు ఐరోపియన్ దేశాలకు తొండిదేవిపట్నం, పెరియపట్నం, కీలకరై, రామేశ్వరం మీదుగా సముద్ర వర్తకం జరిగేది. సాక్షి, చైన్నె : రామనాథపురం జిల్లాకు ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఆధ్యాత్మిక భూమిగా గుర్తింపు ఉంది. పురా తన చిహ్నాలు, శిల్పాలు సముద్ర సంపదకు ఈ ప్రాంతం నెలవు. భారత దేశంలో చిట్టచివరి భూ భాగమైన రామేశ్వరం ఈ జిల్లాలోనే ఉంది. ఇక్కడికి కూతవేటు దూరంలోనే శ్రీలంక దేశం ఉంది. ఒకప్పుడు రామేశ్వరం నుంచి శ్రీలంకకు నౌకాయానం జరిగేది. ఐదు దశాబ్దాల క్రితం సముద్రం ఉప్పొంగడంతో ఇక్కడి ధనుష్కోటి దీవి గల్లంతైంది. ఇక్కడ ప్రస్తుతం పురాతన శిథిల కట్టడాలు కనిపిస్తుంటాయి. అలాగే రామనాథపురంలోని రామనాథ స్వామివారిని దర్శించుకునేందుకు, ఇక్కడి పుణ్య తీర్థాలలో స్నానం ఆచరించేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాదిగా సందర్శకులు త రలి వస్తుంటారు. అత్యంత పొడవైన సముద్ర తీరాన్ని కలిగి ఈ జిల్లాలో సుందర ప్రదేశాలు ఎన్నో. పాంబన్ రైల్వే వంతెన మీదుగా సముద్రంలో రామేశ్వరానికి రైలు ప్రయాణం ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది. ప్రస్తుతం పురాతన మార్గానికి బదులుగా కొత్త రైల్వే మార్గం ముస్తాబైంది. ఇక్కడికి కూతవేటు దూరంలో గురుసడై దీవులకు పడవ సవారీ, సముద్ర తీరంలో వినోదాన్ని అందించే పార్కు, కోమారీసన్ దీవులకు పడవ సవారి మరింత ఆనందాన్ని కలిగిస్తుంది. నౌకాయానం.. రామనాథపురంలోని దేవీపట్నం పురాతన సముద్ర తీర గ్రామం, ఇక్కడ ముత్యాలు, శంఖం, గవ్వలు వర్తకం ఎక్కువగా జరుగుతుంటుంది. 18,19 శతాబ్దాలలో దేవీ పట్నం ఉత్తమ వర్తక నగరంగా ఉండేది. అప్పట్లో తొండి నాడుగా పిలవబడే మదురైకు సముద్ర ముఖ ద్వారంగా ఈ నగరం ప్రసిద్ధి చెందింది. దేవిపట్నంలో ఉన్న పురాతన హార్బర్ ప్రస్తుతం చేపల హార్బర్‌గా మారింది. ఇక్కడ నవ పాశానం ఉండడం. అది ఆధ్యాత్మిక ప్రదేశంగా ప్రసిద్ధి చెంది ఉండటంతో భక్తులు, పర్యాటకుల కోసం చిన్న చిన్న నౌకలను నడిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. సముద్ర విహారంగా దేవీ పట్నం నుంచి పాంబన్ – రామేశ్వరం కలుపుతూ 100 చిన్న నౌకలను నడి కలిపే విధంగా చర్యలకు సిద్ధమయ్యారు. ఈ మార్గంలో మూడు గంటల సముద్ర విహార సమయం పట్టనుంది. ఇప్పటికే ఈ సముద్ర విహారం నిమిత్తం చిన్న నౌకల సంస్థల నుంచి ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. సముద్ర యానానికి సంబంధించి దేవిపట్నం – పాంబన్ – రామేశ్వరం మధ్య రాడార్లు ,జీపీఎస్‌లతో కూడిన అత్యాధునిక పరికరాలను అమర్చే దిశగా పరిశీలనలు వేగవంతం చేశారు. 2025 మార్చి లేదా ఏప్రిల్నెలలో ఈ మార్గంలో సముద్ర వివాహారానికి కసరత్తుల్లో వేగాన్ని పెంచారు. ఇందుకు వచ్చే స్పందన ఆధారంగా రామనాథపురం దీవులు శాయల్కుడి మీదుగా వేంబార్ (తూత్తుకుడి జిల్లా) వరకు విస్తరణ ప్రణాళికలో ఉన్నట్లు సమాచారం. అలాగే సముద్ర సంపదల సంరక్షణనిలయగా ఉన్న మన్నర్ వలి గుడ దీవులను కలిపే విధంగా ముందుకు సాగే యోచనలో ఉన్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. కాగా రాష్ట్రంలో ప్రస్తుతం నాగపట్నం నుంచి శ్రీలంక కాంగేశం వరకు నౌకాయనం సాగుతోంది. అలాగే కన్యాకుమారి తీరం నుంచి సముద్రంలో కూత వేటు దూరంలో ఉన్న వివేకానంద రాక్ వరకు పూంబుహార్ పడవల విహారం సాగుతోండడం గమనార్హం. ధనుష్కోటి బీచ్ దేవీపట్నం టూ రామేశ్వరం వయా పాంబన్ చిన్న నౌకలను నడిపేందుకు కార్యాచరణ సిద్ధం 2025 మార్చి తర్వాత సేవలు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం -
పార్కింగ్ చిత్ర దర్శకుడితో విక్రమ్?
తమిళసినిమా: నటుడు హరీష్ కల్యాణ్ ఎంఎస్ భాస్కర్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం పార్కింగ్. దర్శకుడు రామ్ కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వం వహించిన ఈగో కాన్సెప్ట్ ప్రధాన ఇతివృత్తంతో రూపొందింది. ఈ చిత్రం గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. దీంతో తొలి చిత్రంతోనే సక్సెస్ సాధించిన ఈ. దర్శకుడి తదుపరి చిత్రం ఏంటన్న ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. కాగా తదుపరి శివ కార్తికేయన్ హీరోగా దర్శకుడు రాంకుమార్ బాలకృష్ణన్ చిత్రం చేయబోతున్నారనే ప్రచారం సామాజిక మాద్యమాలలో జోరుగా సాగింది. అయితే ఆ తర్వాత ఆ చిత్రానికి సంబంధించిన ప్రస్తావనే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రాంకుమార్ బాలకృష్ణన్ నటుడు విక్రమ్‌ను కలిసి కథ చెప్పినట్లు, అది ఆయనకు బాగా నచ్చినట్లు తెలిసింది. దీంతో ఈ చిత్రం త్వరలో పట్టాలేకపోతున్నట్లు తాజా సమాచారం. ఈ చిత్రాన్ని డాన్ ఫిలిమ్స్ సంస్థ ఫస్ట్ కాపీ బేస్‌లో నిర్మించనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో నిలబడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల తంగలాన్ చిత్రంలో నటి విశ్వరూపాన్ని ప్రదర్శించిన నటుడు విక్రమ్ ప్రస్తుతం అరుణ్ కుమార్ దర్శకత్వంలో వీర ధీర సూరన్ చిత్రంలో కధానాయకుడిగా నటిస్తున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రం తరువాత విక్రమ్ దర్శకుడు రామ్ కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వంలో నటించే అవకాశం ఉంది. -
తంజావూరు తమిళ వర్సిటీ వీసీ తొలగింపు
– మరో 22 రోజుల్లో ముగియనున్న పదవీకాలం అన్నానగర్: తంజావూరు తమిళ యూనివర్సిటీ వైస్ చాన్సలర్‌ను గురువారం పదవి నుంచి తొలగించారు. ఆయన పదవీ విరమణ మరో 22 రోజులు మాత్రమే ఉండగా విధుల నుండి తొలగించబడ్డారు. తంజావూరు తమిళ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్‌గా 13 డిసెంబర్ 2021న తిరువళ్లువన్ బాధ్యతలు స్వీకరించారు. మూడేళ్ల ఈ పోస్టు పదవీకాలం వచ్చే నెల(డిసెంబర్) 12వ తేదీతో ముగియాల్సి ఉంది. తిరువళ్లువన్ పదవీ కాలానికి 22 రోజులు మిగిలి ఉండగానే గురువారం పదవి నుంచి తొలగించారు. దిండుగల్ గాంధీ విలేజ్ రూరల్ యూనివర్సిటీలో గురువారం జరిగిన కార్యక్రమంలో పాల్గొనేందుకు తిరువళ్లువన్ వెళ్లారు. తమిళనాడు గవర్నర్ ఆదేశానుసారం జరిగిన విచారణను దృష్టిలో ఉంచుకుని ఆయన్ను తొలగించినట్లు గవర్నర్ కార్యదర్శి కిర్లోష్కుమార్ సంతకంతో కూడిన లేఖను ఆయనకు అందించారు. ఈ లేఖ కాపీని తమిళ విశ్వవిద్యాలయం పరిపాలనా కార్యాలయానికి పంపారు. ఆ తర్వాత తిరువళ్లువన్ తమిళ యూనివర్సిటీకి వచ్చి ఆయన సామగ్రి తీసుకెళ్లాడు. గవర్నర్ హౌస్ ఉత్తర్వులు జారీ చేయడంతో ఆ పదవిని తొలగించడానికి గల కారణాలు వెంటనే తెలియరాలేదని యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి. -
విద్యార్థులకు రుచికరమైన ఆహారం అందించాలి
వేలూరు: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని అందజేయాలని కలెక్టర్ సుబ్బలక్ష్మి హెచ్చరించారు. మీ కోసం మీ గ్రామంలో ఒక్కరోజు అనే పథకం కింద వేలూరు జిల్లా ఒడుగత్తూరు సమీపంలోని రాజపాళ్యం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేశారు. ఆ సమయంలో విద్యార్థులకు అందజేసిన ఉదయం టిఫన్ను పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు. రుచికరంగా ఉందా అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జార్థాన్కొల్లై గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను తనిఖీ చేయడంతో పాటు రేషన్ దుకాణానికి చేరుకొని నిత్వావసర వస్తువులు సక్రమంగా అందుతున్నాయా? రోజూ దుకాణం తెరుస్తున్నారా? లేదా? అనే విషయాలను గ్రామస్తుల వద్ద అడిగి తెలుసుకున్నారు. అనంతరం రేషన్ దుకాణానికి నాణ్యమైన సరుకులు సరఫరా చేస్తున్నారా అనే వాటిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పీంజమందై, అనకట్టు తదితర ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. కలెక్టర్ వెంట పాటు పంచాయతీ అభివృద్ధి అధికారి జ్ఞానసుందరం, అసిస్టెంట్ ఇంజినీర్ హంస, కార్యానిర్వహణ అధికారి జీవానందం, తహసీల్దార్ వేండా తదితరులున్నారు. -
కమనీయం.. సీతారాముల కల్యాణం
కొరుక్కుపేట: చైన్నె వ్యాసార్పాడి ఎంకేబీనగర్లోని వలంపురి వ్యాస వినాయగర్ ఆలయంలో బుధవారం రాత్రి శ్రీసీతారాముల కల్యాణోత్సవం కమనీయంగా సాగింది. వందలాది మంది భక్తులు తరలివచ్చి శ్రీరా మ నామస్మరణ నడుమ శ్రీసీతారాముల కల్యాణాన్ని తిలకించారు. ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పేడూరు గ్రామానికి చెందిన వేదగిరి నరసింహస్వామి ఆలయ ప్రధాన అర్చకులు మాధవగిరి లక్ష్మీనరసింహమూర్తి, ఆయన శిష్య బృందం విచ్చేసి నూతన పంచ లోహ విగ్రహ ప్రాణప్రతిష్ట పూజలు, హోమాధి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బుధవారం శ్రీసీతాలక్ష్మణ హనుమంత సమేత శ్రీకోదండరామ స్వామివారి నూతన పంచలోహ విగ్రహ ప్రాణప్రతిష్ట వైభవోపేతంగా జరిపించారు. నూతన పంచ లోహ విగ్రహ ప్రాణప్రతిష్ట, పూర్వాహుతి, కుంభ ప్రోక్షణ శాంతి కల్యాణం, అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. రాత్రి ఆరు గంటలకు పైగా శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. సీతారాములను విశేషంగా అలంకరించి, కల్యాణ తంతును చేపట్టారు. ఈ వేడుకలకు పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి సీతారాములను కనులారా దర్శించుకున్నారు. శ్రీరామ నామస్మరణలతో ఎంకేబీనగర్ ప్రాంతం ఆధ్యాత్మిక శోభతో నిండిపోయింది. మొలగనూరు విజయకుమార్–సురేఖ, మల్లాపు నారాయణ–సునీత దంపతులు కార్యక్రమం ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
ఆర్యవైశ్యుల కార్తీక వనభోజనాలు
కొరుక్కుపేట: ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ(వామ్) గ్రేటర్ చైన్నె విభాగం ఆధ్వర్యంలో కార్తీక మాసం వనభోజనాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. దాదాపు 400మందితో చైన్నెకి 70 కిలోమీటర్లు దూ రంలో కొత్తగా నిర్మిస్తున్న విమానాశ్రయం దగ్గర జంబోడా గ్రామంలోని ఒన్ యారోలే అవుట్ మామిడి తోటలో భారీ స్థాయిలో వనభోజనాలు నిర్వహించా రు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పరమేశ్వ రుడికి పూజలు, లింగాభిషేకం, ఉసిరి చెట్టుకు పూజ లు, హారతులు, ఉసిరికాయ దీపాలతో మహిళలు భక్తిశ్రద్ధల చేపట్టారు. చిన్నపిల్లలతోపాటు పెద్దవారికి వివిధ పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు. ఆంధ్రా వంటలతో పసందైన భోజనంతోపా టు మహిళలకు పసుపు, కుంకుమలు, బహుమతులు అందజేశారు. వచ్చినవారిని తంగు టూరి రమాదేవి, రాజ్యలక్ష్మి ఘనంగా సత్కరించా రు. రామకృష్ణ, వి.హరినాథ్, శ్రీలత, కేకేత్రినాథ్ నేతృత్వంలో జరిగిన వేడుకల్లో సాయిచందన్ 100 మంది పేదలకు దుప్పట్లు అందజేశారు. తాడేపల్లి రాజశేఖర్, ఎమ్వీ నారాయణ గుప్తా, బిల్డర్ మోతీష్కుమార్, పొన్నూరు రంగనాయకులు, బెల్లంకె.శివ ప్రసాద్, కె.శరత్‌కుమార్ అతిథులుగా పాల్గొన్నారు. -
పంచాయతీ అధ్యక్షురాలిగా పునర్నియమించండి
– జిల్లా కలెక్టర్‌కు హైకోర్టు ఆదేశం తిరువళ్లూరు: పంచాయతీ అద్యక్షురాలి పదవి నుంచి సునీత బాలయోగిని తొలగిస్తూ కలెక్టర్ డాక్టర్ ప్రభుశంకర్ జారీ చేసిన ఉత్తర్వులను కొట్టేసిన హైకోర్టు, 8 వారాల్లో ఆమెకు బాధ్యతలను తిరిగి అప్పగించాలని ఆదేశించింది. దీంతో కోర్టు ఆదేశాలను మాజీ అధ్యక్షురాలు సునీత, పీఎంకే కౌన్సిలర్ దినేష్‌కుమార్ తదితరులు కలెక్టర్ డాక్టర్ ప్రభుశంకర్‌కు అందజేశారు. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ వెంగత్తూరు పంచాయతీ అధ్యక్షురాలిగా సునీత బాలయోగీ గత ఎన్నికల్లో పోటీ చేసి వరుసగా రెండవ సారి విజయం సాధించారు. అయితే పంచాయతీలో నిధులు దుర్వినియోగం చేశారన్న అభియోగంపై విచారణ జరిపి గత జనవరిలో ఆమెను పదవి నుంచి కలెక్టర్ డాక్టర్ ప్రభుశంకర్ తొలగించారు. అయితే కలెక్టర్ నిర్ణయం ఏకపక్షంగా ఉందని, అసలు తాము నిధులను దుర్వినియోగమే చేయలేదని పదవి నుంచి తొలగించబడిన సునీత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణ ముగిసిన క్రమంలో హైకోర్టు ప్రత్యేక ఉత్తర్వులను జారీ చేసింది. సునీత బాలయోగిని పదవి నుంచి తొలగిస్తూ కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులను కోర్టు కొట్టేసింది. దీంతోపాటు 8 వారాల్లోపు ఆమెకు బాధ్యతలను అప్పగించాలని ఆదేశించారు. ఈ క్రమంలో హైకోర్టు ఆదేశాలను సునీత బాలయోగి, పీఎంకే జిల్లా కార్యదర్శి దినేష్‌కుమార్ తదితరులు కలెక్టర్‌కు అందజేశారు. తమకు తక్షణమే భాద్యతలు అప్పగించేలా చూడాలని కోరారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్టు సునీత బాలయోగి వివరించారు. -
తిరుత్తణి బస్టాండ్‌కు కరుణానిధి పేరు
తిరుత్తణి: తిరుత్తణిలో నిర్మిస్తున్న నూతన బస్టాండుకు కరుణానిధి పేరు నామకరణం చేసేందుకు మున్సిపల్ సమావేశంలో తీర్మానించారు. తిరుత్తణి మున్సిపల్ కౌన్సిలర్ల సమావేశం వైస్ చైర్మన్ సామిరాజ్ అధ్యక్షతన గురువారం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ బాలసుబ్రమణ్యం సమక్షంలో నిర్వహించిన సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. సమావేశంలో ఆదాయ, ఖర్చుల పట్టికను అదికారులు ప్రవేశపెట్టారు. అనంతరం 21వ వార్డులో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించి సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా అరక్కోణం రోడ్డులో రూ.15.70 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న నూతన బస్టాండుకు కరుణానిధి శతజయంతి బస్టాండుగా, మపోసీ రోడ్డు మార్గంలో నిర్మాణంలోని నూతన డైలీ మార్కెట్‌కు కరుణానిధి శతజయంతి కూరగాయల మార్కెట్‌గా నామకరణం చేయడానికి సభలో ఆమోదించి తీర్మానం ఆమోదించారు. అలాగే తిరుత్తణి కొండకు రెండో ఘాట్‌రోడ్డు నిర్మాణానికి వీలుగా మున్సిపల్‌కు సొంతమైన భూములను హిందూ దేవదాయ శాఖ పేరిట రిజిస్ట్రేషన్‌కు సభ ఆమోదం తెలిపింది. -
ఇంటి స్థలాల కోసం కలెక్టరేట్ ముట్టడి
తిరువళ్లూరు: 24 సంవత్సరాల క్రితం కేటాయించిన స్థలాన్ని సర్వే చేసి తమకు అప్పగించాలని కోరుతూ ఊత్తుకోట తాలూకా మెయ్యూరు గ్రామానికి చెందిన ప్రజలు కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన చేపట్టారు. తిరువళ్లూరు జిల్లా ఊత్తుకోట తాలూకా మెయ్యూరు గ్రామానికి చెందిన ఎస్సీ, ఎస్టీలు 183 మందికి మూడు సెంట్లు చొప్పున 2000 సంవత్సరంలో ఇళ్ల స్థలాలను కేటాయించారు. ఇందు కోసం సమీపంలోని ప్రభుత్వ భూమిని చూపించారు. అయితే ఇంత వరకు భూమిని సర్వే చేసి లబ్ధిదారులకు అప్పగించలేదు. ఇదే అంశంపై పలుసార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోడీఆర్ఓ రాజ్‌కుమార్‌కు వినతి పత్రం అందించారు. తమ ఇంటి స్థలాలను వెంటనే సర్వే చేయాలని కోరారు. -
నకిలీ పత్రాల ద్వారా భూమి విక్రయం
– రూ.4.75 కోట్ల మోసం చేసిన బీజేపీ నాయకుడు, భార్య అరెస్ట్ అన్నానగర్: తిరుచ్చిలో నకిలీ పత్రాలు తయారు చేసి భూమిని విక్రయించి రూ.4.75 కోట్లు మోసం చేసిన బీజేపీ నాయకుడు, అతడి భార్యను గురువారం అరెస్టు చేశారు. వివరాలు.. తిరుచ్చిలోని శ్రీరంగానికి చెందిన కె.వి. రంగసామి వ్యాపారవేత్త. ఇతనికి ఆ ప్రాంతంలో 17 ఎకరాల తోట ఉంది. చైన్నెలో నివాసం ఉండడంతో తోట నిర్వహణ బాధ్యతను శ్రీరంగానికి చెందిన గోవిందన్ (57)కు అప్పగించాడు. ఇలా గత కొన్నేళ్లుగా గోవిందన్ తోటను నిర్వహిస్తున్నారు. ఈ స్థితిలో శ్రీరంగానికి చెందిన దేవరాజన్ (50) రెండేళ్ల క్రితం గోవిందన్‌ను కలిశాడు. వారు తరచూ కలుసుకుని మాట్లాడుకునేవారు. అప్పుడు గోవిందన్ ఈ ఆస్తి తనదేనని, అమ్మబోతున్నానని, మంచి వ్యక్తి ఉంటే తీసుకురావాలని చెప్పాడు. దీంతో దేవరాజాన్ ఎస్టేట్‌ను తానే కొనుగోలు చేస్తానని చెప్పడంతో గోవిందన్ బేరం కుదుర్చుకుని నకిలీ పత్రాలు ఇచ్చాడు. ఇది నమ్మి దేవరాజన్ రూ.4.75 కోట్లను గోవిందన్‌కు పలు విడతలుగా అందించారు. చివరికి నకిలీ పత్రాలు అని తేలడంతో దేవరాజన్ బుధవారం తిరుచ్చి మున్సిపల్ క్రైం బ్రాంచ్‌లో ఫిర్యాదు చేశారు. దాని ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసి ఈ మోసానికి పాల్పడిన గోవిందన్‌ను, అతని భార్యను గురువారం ఉదయం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అరెస్టయిన గోవిందన్ బీజేపీ స్థానిక విభాగానికి ఉపాధ్యక్షుడిగా ఉన్నాడని, అతడు భూమి యజమాని పేరుతో నకిలీ పత్రాలు సిద్ధం చేశాడని, ఇందుకు తోడుగా ఉన్న అతని భార్య గీతా(30) ఉన్నట్లు తెలిసింది. అనంతరం భార్యాభర్త లిద్దరినీ కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. -
వేగంగా గృహాలు నిర్మించండి
– మంత్రి అన్బరసు తిరువళ్లూరు: తమిళనాడు అర్బన్ డెవలప్మెంట్ బోర్డు ద్వారా జిల్లాలో నిర్మిస్తున్న 8032 ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి అన్బరసు అధికారులను ఆదేశించారు. తిరువళ్లూరు జిల్లాలోని పూచ్చిఅత్తిపేడు, మప్పేడు, అరుంగుళం తదితర ప్రాంతాల్లో తమిళనాడు అర్బన్ డెవలప్మెంట్ బోర్డు ద్వారా 8032 ఇళ్లను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ నివాసాలకు లబ్ధిదారుల ఎంపిక, నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయడంపై అధికారులతో మంత్రి ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని గురువారం ఉదయం కలెక్టర్ డాక్టర్ ప్రభుశంకర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమీక్షకు అన్ని శాఖలకు చెందిన అధికారులు హాజరయ్యారు. మంత్రులు అన్బరసు, నాజర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి అన్బరసు మాట్లాడుతూ పట్టణాల్లో నివశిస్తున్న పేద కుటుంబాల సొంతంటి కలను నెరవేర్చడం, స్లమ్ ప్రాంతాల్లో నివశిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి 1970వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి తమిళనాడు స్లమ్ రీప్లేస్మెంట్ బోర్డును ఏర్పాటు చేశారని వివరించారు. ఈ బోర్డు ద్వారా చైన్నె మహానగరంలోని 209 ప్రాజెక్టుల ద్వారా 1,21,960 నివాసాలు, ఇతర ప్రాంతాల్లో 244 ప్రాజెక్టుల ద్వారా 79,861 నివాసాలతో పాటు మొత్తం 2,01,287 నివాసాలను నిర్మించి గతంలో అప్పగించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఇందు కోసం అప్పట్లోనే 4505 కోట్ల రూపాయలను ఖర్చు చేశామని తెలిపారు. తద్వారా 51,698 మందికి అపార్టెమెంట్లను అందించామన్నారు. ప్రస్తుతం తిరువళ్లూరు జిల్లాలో 1106.73 కోట్ల రూపాయల వ్యయంతో 8032 ఇళ్లనును నిర్మిస్తున్నామని తెలిపారు. తాళవేడులో 520 నివాసాలు, మురుకంబట్టులో 1040, పూచ్చిఅత్తిపేడులో 1152 అపార్ట్మెంట్లు, అరుంగుళంలో పార్ట్–1లో 912, పార్ట్–2 912 నివాసాలు, పార్ట్ –3లో 768 నివాసాలను నిర్మిస్తున్నట్టు తెలిపారు. ఈ పనులు దాదాపు 90 శాతం పూర్తయ్యాయని వివరించారు. మరో మూడు నెలల్లో పనులను పూర్తి చేసి అర్హులైన వారికి అందిస్తామన్నారు. దీంతోపాటు మప్పేడు వద్ద నిర్మిస్తున్న నివాసాలను సైతంగా వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో ప్రభుత్వ అదనపు కార్యదర్శి ఉషా, డైరెక్టర్ విజయ్కార్తికేయన్, ఎమ్మెల్యేలు వీజీ రాజేంద్రన్, చంద్రన్, గోవిందరాజన్, జడ్పీ చైర్పర్సన్ ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ పత్రాల ద్వారా భూమి విక్రయం
– రూ.4.75 కోట్ల మోసం చేసిన బీజేపీ నాయకుడు, భార్య అరెస్ట్ అన్నానగర్: తిరుచ్చిలో నకిలీ పత్రాలు తయారు చేసి భూమిని విక్రయించి రూ.4.75 కోట్లు మోసం చేసిన బీజేపీ నాయకుడు, అతడి భార్యను గురువారం అరెస్టు చేశారు. వివరాలు.. తిరుచ్చిలోని శ్రీరంగానికి చెందిన కె.వి. రంగసామి వ్యాపారవేత్త. ఇతనికి ఆ ప్రాంతంలో 17 ఎకరాల తోట ఉంది. చైన్నెలో నివాసం ఉండడంతో తోట నిర్వహణ బాధ్యతను శ్రీరంగానికి చెందిన గోవిందన్ (57)కు అప్పగించాడు. ఇలా గత కొన్నేళ్లుగా గోవిందన్ తోటను నిర్వహిస్తున్నారు. ఈ స్థితిలో శ్రీరంగానికి చెందిన దేవరాజన్ (50) రెండేళ్ల క్రితం గోవిందన్‌ను కలిశాడు. వారు తరచూ కలుసుకుని మాట్లాడుకునేవారు. అప్పుడు గోవిందన్ ఈ ఆస్తి తనదేనని, అమ్మబోతున్నానని, మంచి వ్యక్తి ఉంటే తీసుకురావాలని చెప్పాడు. దీంతో దేవరాజాన్ ఎస్టేట్‌ను తానే కొనుగోలు చేస్తానని చెప్పడంతో గోవిందన్ బేరం కుదుర్చుకుని నకిలీ పత్రాలు ఇచ్చాడు. ఇది నమ్మి దేవరాజన్ రూ.4.75 కోట్లను గోవిందన్‌కు పలు విడతలుగా అందించారు. చివరికి నకిలీ పత్రాలు అని తేలడంతో దేవరాజన్ బుధవారం తిరుచ్చి మున్సిపల్ క్రైం బ్రాంచ్‌లో ఫిర్యాదు చేశారు. దాని ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసి ఈ మోసానికి పాల్పడిన గోవిందన్‌ను, అతని భార్యను గురువారం ఉదయం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అరెస్టయిన గోవిందన్ బీజేపీ స్థానిక విభాగానికి ఉపాధ్యక్షుడిగా ఉన్నాడని, అతడు భూమి యజమాని పేరుతో నకిలీ పత్రాలు సిద్ధం చేశాడని, ఇందుకు తోడుగా ఉన్న అతని భార్య గీతా(30) ఉన్నట్లు తెలిసింది. అనంతరం భార్యాభర్త లిద్దరినీ కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. -
తిరుత్తణి బస్టాండ్‌కు కరుణానిధి పేరు
తిరుత్తణి: తిరుత్తణిలో నిర్మిస్తున్న నూతన బస్టాండుకు కరుణానిధి పేరు నామకరణం చేసేందుకు మున్సిపల్ సమావేశంలో తీర్మానించారు. తిరుత్తణి మున్సిపల్ కౌన్సిలర్ల సమావేశం వైస్ చైర్మన్ సామిరాజ్ అధ్యక్షతన గురువారం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ బాలసుబ్రమణ్యం సమక్షంలో నిర్వహించిన సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. సమావేశంలో ఆదాయ, ఖర్చుల పట్టికను అదికారులు ప్రవేశపెట్టారు. అనంతరం 21వ వార్డులో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించి సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా అరక్కోణం రోడ్డులో రూ.15.70 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న నూతన బస్టాండుకు కరుణానిధి శతజయంతి బస్టాండుగా, మపోసీ రోడ్డు మార్గంలో నిర్మాణంలోని నూతన డైలీ మార్కెట్‌కు కరుణానిధి శతజయంతి కూరగాయల మార్కెట్‌గా నామకరణం చేయడానికి సభలో ఆమోదించి తీర్మానం ఆమోదించారు. అలాగే తిరుత్తణి కొండకు రెండో ఘాట్‌రోడ్డు నిర్మాణానికి వీలుగా మున్సిపల్‌కు సొంతమైన భూములను హిందూ దేవదాయ శాఖ పేరిట రిజిస్ట్రేషన్‌కు సభ ఆమోదం తెలిపింది.