విశాఖపట్నం: ఇన్‌స్టాగ్రామ్‌లో యువతి ఫొటోను డౌన్‌లోడ్ చేసి పిక్స్ ఆర్ట్ యాప్‌లో న్యూడ్‌గా మార్ఫింగ్ చేసి బ్లాక్‌మెయిల్ చేస్తున్న యువకుడిని సైబర్ క్రైం పోలీసులు శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హెచ్‌బీ కాలనీకి చెందిన అవివాహిత యువతికి ఫేక్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా న్యూడ్ ఫొటో వచ్చింది.
పోర్న్ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసిన న్యూడ్ ఫొటోతో.. ఆ యువతి ముఖాన్ని పిక్స్ ఆర్ట్ యాప్ సాయంతో మార్ఫింగ్ చేసిన ఆ ఫొటోను ఇంటర్నెట్‌లో పెడతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. అలాగే తన ఫ్యామిలీ మెంబర్స్ అందరి ఫొటోలు ఇదే మాదిరిగా మార్ఫింగ్ చేస్తానని బెదిరించాడు. దీంతో షాక్‌కు గురైన యువతి సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సైబర్ క్రైం సి.భవానీ ప్రసాద్ సాంకేతికత సహాయంతో ఆ మార్ఫింగ్ ఫొటో పంపించింది తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేటకు చెందిన మన్నే మధుగా గుర్తించారు. దీంతో నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ సి.ఎం.త్రివిక్రమ్‌వర్మ ఆదేశాలతో డీసీపీ–1 విద్యాసాగర్‌నాయుడు సూచనలతో ఒక బృందాన్ని సిద్దిపేటకు పంపించారు. అక్కడ మధును చాకచక్యంగా పట్టుకొని విశాఖకు తీసుకువచ్చి అరెస్టు చేశారు. శనివారం కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment