Treatment
-
ఆర్థరైటిస్ వృద్ధులకే వస్తుందనుకోవద్దు! ఇప్పుడు అందరిలోనూ..
చిన్నా పెద్దా తేడా లేకుండా ఇప్పుడు అందరూ కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. దీనికి కారణం ఆర్థరైటిస్. దీన్నే కీళ్ళవాపు వ్యాధి అంటారు. మీదపడే వయస్సుతో మరింత తీవ్రమయ్యే ఈ వ్యాధి, పూర్వం ఎక్కువగా వృద్ధాప్యంలో అంటే 65 ఏళ్లు పైబడిన వారిలో ఎక్కువగా వచ్చేది. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా ముందే వచ్చేస్తోంది. అనారోగ్య జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పుల వల్ల ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ఈ వ్యాధికి గురవుతున్నారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 12ను ప్రపంచ ఆర్థరైటిస్ డేగా పాటిస్తారు. ఈ సందర్భంగా ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ తేతలి దశరథరామారెడ్డిని ‘సాక్షి’ ఇంటర్వ్యూ చేసింది. వివరాలు ఆయన మాటల్లోనే.. లక్షణాలు కన్పిస్తే నిర్లక్ష్యం చేయకండి ఆర్థరైటిస్ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి. అసాధారణమైన కీళ్ళ వాపు, నొప్పి లేక కీళ్ళు బిగుసుకుపోవడం వంటివి రోజుల తరబడి ఉన్నా, అకస్మాత్తుగా తీవ్రమైన వెన్నునొప్పి వచ్చినా, కీళ్లను తాకడం బాధాకరంగా మారినా ఆర్థోపెడిక్ సర్జన్‌ను సంప్రదించాలి. 65 ఏళ్ల మహిళలు 70 ఏళ్ల పురుషులు ఎముక సాంద్రత (బోన్ డెన్సిటీ) పరీక్ష చేయించుకోవాలి. ఆర్థరైటిస్‌లో అనేక రకాలు ఆర్థరైటిస్‌లో అనేక రకాలు ఉన్నాయి. ప్రతిదానికి వేర్వేరు చికిత్సలు కూడా ఉన్నాయి. ఆస్టియో ఆర్థరైటిస్ (ఓఏ): వృద్ధులలో ఎక్కువగా ఉంటుంది. విశ్రాంతి తీసుకున్న తర్వాత నడిస్తే కీళ్ళు గట్టిగా అనిపించవచ్చు. అయితే ఒకసారి కదలడం మొదలుపెడితే నొప్పి త్వరగా తగ్గిపోతుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ (ఆర్ఏ): రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను మందులతో, కీళ్ళపై ఒత్తిడిని తగ్గించడం ద్వారా వ్యాయామంతో తగ్గించవచ్చు. సోరియాటిక్ ఆర్థరైటిస్: ఆర్ఏ లాగే ఇది ఆటో ఇమ్యూన్ ఇన్ఫ్లమేటరీ వ్యాధి. సాధారణంగా సోరియాసిస్ ఉన్నవారిలో సంభవిస్తుంది. గౌట్: శరీరంలో యూరిక్ యాసిడ్ అధిక స్థాయిలో ఉండటం ఈ సమస్యకు కారణం. లూపస్: లూపస్ అనేది చర్మం, అవయవాలు శరీరంలోని అనేక ఇతర ప్రదేశాలలో మంటను కలిగించే దీర్ఘకాలిక వ్యాధి. స్పైనల్ ఆస్టియో ఆర్థరైటిస్ (వెన్నెముక ఆస్టియో ఆర్థరైటిస్): కొన్నిసార్లు ఆస్టియో ఆర్థరైటిస్ వెన్నెముక వద్ద నుండే నరాలపై ఒత్తిడి తెచ్చే ’స్పర్స్’ (ఎముక ఎదుగుదల)కు కారణమవు తుంది. దీనివల్ల ఉత్పన్న మయ్యే సమస్యలను స్పైనల్ ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ఎలా నియంత్రించాలి? బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. ఎక్కువ బరువుంటే తగ్గించుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించాలి. క్రమం తప్పకుండా నడకవంటి వ్యాయా మం చేయడంవల్ల కీళ్ల ఫ్లెక్సిబిలిటీ (సరళంగా వంగే గుణం) పెరుగుతుంది. ఈత కొట్టాలని, బరువులు ఎత్తడం లాంటి కసరత్తులు చేయాలని కొందరు వైద్యులు సిఫారసు చేస్తారు. పండ్లు, మూలికలు, చేపలు, కూరగాయలతో సహా అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు కలిగిన ఆహారం తినాలి. ధూమపానం, మద్యపానం మానాలి. ఎముకలు చిట్లకుండా చూసుకోవాలి. (చదవండి: ఆరేళ్ల చిన్నారి బ్రెయిన్లో సగభాగం స్విచ్ఆఫ్ అయ్యింది? ఐనా..) -
కొంగొత్త ఆవిష్కరణలు..తక్కువ ఖర్చుతో సమస్యకు ఈజీగా చెక్!
భారత స్టార్టప్‌ల హబ్‌గా ఎన్నో కొత్త ఆవిష్కరణలతో ప్రగతి పథంలో ముందుకుపోతుంది. ప్రభుత్వం సైతం వీటికి మంచి ప్రోత్సహం ఇస్తుంది. అందుకు తగ్గట్లుగానే సరికొత్త టెక్నాలజీతో కొంగొత్త ఆవిష్కరణలు మన ముందుకొస్తున్నాయి. అలాంటి కొంగొత్త ఆవిష్కరణలతో జఠిలమైన సమస్యలను చెక్ పెట్టిన హైదరాబాద్‌కి చెందిన మూడు కంపెనీలు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ 2023 సంవత్సరానికి ఇచ్చే ఆరోహన్ సోషల్ ఇన్నోవేషన్ ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకున్నాయి. ఆ స్థార్టప్ కంపెనీలు కనుగొన్న ఆవిష్కరణలు, వాటి ప్రత్యేకత గురించే ఈ కథనం.! కామెర్లకు ఏఐ nLite 360తో చికిత్స అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సైతం ఆరోగ్య సంరక్షణకు సంబంధించి అనేక సవాళ్లు ఉన్నాయి. అందులో నవజాత శిశువుల్లో వచ్చే నియోనాటల్ కామెర్ల సమస్య మరీ ప్రముఖమైనది. దీని కారణంగా నిత్యం వేలాది చిన్నారులు అంగవైకల్యం బారిన పడటం లేదా మరణించడం జరుగుతోంది. దీనికి చెక్ పెట్లేలా ఐఐటీ హైదరాబాద్ ఆధారిత మెడ్‌టెక్ స్టార్టప్ హీమ్యాక్ ఏఐ సాంకేతికతో కూడిన ఫోటోథెరపీ పరికరం 'nLite 360'తో ముందుకు వచ్చింది. ఇది శిశువుల్లో వచ్చే కామెర్ల వ్యాధికి సమర్థవంతంగా చికిత్స అందించగలదు. ఇతర సాధారణ ఫోటోథెరపీ పరికరాల కంటే మెరుగ్గా తక్కువ సమయంలోనే నవజాత శిశువులకు చికిత్స అందించగలదు అని ఈ హీమాక్ సహ వ్యవస్థాపకురాలు అంకిత కొల్లోజు చెప్పారు. సాధారణంగా శిశువుల్లో కామెర్ల వ్యాధి రాగానే వైద్యులు బిడ్డను ఇంక్యుబేటర్‌లో పెడతారు. ప్రతి నిమిషం ఆ బిడ్డను పర్యవేక్షించాలా ఓ నిపుణుడు ఉంటారు. కానీ ఈ సాంకేతికతో కూడిన పరికరానికి ఆ అవసరం ఉండదు. ఎందుకంటే ఆ పరికరానికి నిర్ధిష్ట సెన్సార్లు ఉంటాయి. అలాగే చికిత్సకు ఎలాంటి ఆటంకం లేకుండా బిడ్డకు తల్లి పాలిచ్చేలా పోర్టబుల్ యూనిట్ ఉంటుంది. ఈ వైద్య పరికరం తక్కువ ఖర్చుతో కూడుకున్నది. పైగా పోర్టబిలిటీ యాక్సిస్ ఉంది. సరైన విద్యుత్ సరఫరాల లేని కుగ్రామాల్లో సైతం సమర్థవంతంగా పనిచేసే విధంగా బ్యాటరీతో నడిచేలా డిజైన్ చేసిన వైద్య పరికరం. చేనేత కష్టాన్ని తీర్చే ఆవిష్కరణ భారతదేశంలో చేనేత రంగం సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వం. తరతరాలుగా వస్తున్న ఓ సంప్రదాయ కళ. సృజనాత్మక కళకు చెందిన జీవనోపాధి. ఈ వృత్తి చాలా శ్రమతో కూడిన పని. మగ్గం నేయాలంటే సుమారు 20 నుంచి 45 కిలోల బరువులు ఉండే మగ్గం యంత్రాల్ని ఎత్తాల్సి ఉంటుంది. ఇక నెయ్యాలంటే దాదాపు ఐదు వేల నుంచి ఎనిమిది వేల సార్లు తొక్కాలి. ముఖ్యంగా మనదేశంలో సుమారు 19 లక్షల మందికి పైగా మహిళలకు చేనేత వృత్తే ఆధారం. ఈ వృత్తి అత్యంత కష్టమైనది గాక దీని కారణంగా మోకాళ్లు నొప్పులు, వెన్నునొప్పి వంటి ఇతరత్ర అనారోగ్య సమస్యల బారినపడుతున్నారు చేనేత కార్మికులు. పలువురు ఈ వృత్తి కారణంగా కాళ్లు పోగొట్టుకున్నావారు ఉన్నారు. అంతేగాదు వికలాంగులు లేదా చేనేత కార్మికుడే ప్రమాదవశాత్తు వికలాంగుడైతే ఈ చేనేత వృత్తి కొనసాగించడం మరింత కష్టం. ఆ సమస్యను నివారించేలా శివకుమార్ మోదా స్థాపించిన మోదా టెక్నాలజీస్ ఓ సరికొత్త ఆవిష్కరణతో ముందుకు వచ్చింది. శివకుమార్ ఆయన బృందం చేనెత కార్మికుడి కష్టాన్ని తీర్చేలా మోధా పెడల్ ఆపరేటింగ్ మెషీన్‌ను తీసుకొచ్చింది. మగ్గాలకు ఎలాంటి మార్పులు చేయకుండా ఈ యంత్రాన్ని మగ్గానికి బిగిస్తే సరిపోతుంది. యంత్రానికి అమర్చిన మోటారు బరువులును ఎత్తక్కర్లేకుండా అదే ఆటోమేటిక్‌గా పైకి లేస్తుంది. దానికుండే పెడల్ స్విచ్ నొక్కితే చాలు తొక్కాల్సిన పని ఉండదు. దీంతో చేనేత కార్మికుడి మోకాళ్లు, వీపుపై ఎలాంటి భారం పడదు. పైగా హయిగా ఈ వృత్తిని చేసుకోగలుగుతారు. ఈ మిషన్‌తో చేనేత పని ఈజీ అవ్వడమే గాక మన దేశ వారసత్వ వృత్తి కనుమరగవ్వకుండా కాపాడుకోగలుగుతాం. వికలాంగులకు ఈ మిషన్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అందుబాటు ధరలోనే ఈ మిషన్ లభించేలా వినూత్నంగా తీసుకొచ్చారు శివ కుమార్, అతడి బృందం. ఊపిరితిత్తుల అనారోగ్యాన్ని గుర్తించే ఏఐ టూల్ లక్షలాది మంది శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. సాధారణ దగ్గుకి, ఊపిరితిత్తుల్లో సమస్య ఉంటే వచ్చే దగ్గుకు తేడా ఉంటుంది. కేవలం దగ్గు ఆధారంగా ఊరితిత్తుల సమస్య గుర్తించడం ఎలా అన్న ఆలోచనే ఆ ఆవిష్కరణకు నాంది అయ్యింది. ఈ మేరకు సాల్సిట్ వ్యవస్థాపకుడు నారాయణరావు శ్రీపాద ఐదేళ్ల క్రితం ఎయిమ్స్‌లో ఒక ప్రొఫెసర్‌తో దీనిపై జరిపిన చర్చే ఈ ఆవిష్కరణకు మూలం. ఆయన వైద్య రంగంలో ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని నిర్ధారించే పరికరాల అవసరాన్ని గ్రహించారు. అంతేగాదు ఆయన దగ్గు అనేది శ్వాసకోశ వ్యాధికి సంబంధించిన సాధారణ లక్షణం అయినప్పుడూ ఆ దగ్గులో అంతర్తీనంగా ఉండే తేడాల బట్టి అది ఉబ్బసం, టీబీ, క్షయం లేక కోరింత దగ్గు అనేది గుర్తించేలా సాంకేతికతను ఎందుకు అభివృద్ధి చేయకూడదు అనుకున్నారు. ఆ క్రమంలోనే శ్వాశ ఏఐ సాఫ్టేవేర్ టూల్ మన ముందుకు వచ్చింది. ఈ టూల్‌ని మన ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ అభ్యర్థి దగ్గును పది సెకన్లలో రికార్డు చేసి దేని వల్ల దగ్గు వచ్చిందనేది విశ్లేషిస్తుంది. దీని అనుగుణంగా ప్రజలు తదుపరి టెస్ట్ చేయించుకుని సకాలంలో వైద్యం పొందొచ్చు. పైగా ల్యాబ్ టెస్ట్‌లు చేయించుకోవాలనే భయం తప్పుతుంది. పైగా గ్రామీణ ప్రాంతాల్లోని వారికి కూడా ఈ వైద్య పరికరం చక్కగా ఉపయోగపడుతుంది. ఊపిరితిత్తుల పరీక్షల కోసం డయాగ్నోస్టిక్ సెంటర్ల్‌కు వెళ్లక్కర్లేకుండా ప్రజలే ఇంటి వద్దే సులభంగా చెక్ చేసుకోగలుగుతారు. దీని వల్ల సమయం, ఖర్చు ఆదా అవుతుంది. ముఖ్యంగా ఆరోగ్య సౌకర్యాలు లేని ప్రాంతాల ప్రజలకు ఎంతగానో ఈ ఏఐ టూల్ ఉపయోగపడుతుంది. (చదవండి: రుచికి చూపెందుకు? చూపులేకపోయిన వంట అదుర్స్) -
ఆరేళ్ల చిన్నారి బ్రెయిన్లో సగభాగం స్విచ్ఆఫ్ అయ్యింది? ఐనా..
మెదడులో సగభాగాన్ని స్విచ్ఆఫ్ చేయడం గురించి విన్నారా?. అదేంటి అని ఆశ్చర్యపోకండి. నిజంగానే ఏదో ఎలక్ట్రిక్ స్విచ్ని ఆఫ్ చేసినట్లుగా ఓ ఆరేళ్ల చిన్నారి మెదడుల సగభాగాన్ని స్విచ్ఆఫ్ చేశారు. ఎందుకిలా? ఏం జరిగింది ఆ చిన్నారికి తదితరాల గురించే ఈ కథనం.! వివరాల్లోకెళ్తే.. యూఎస్‌లోని ఆరేళ్ల చిన్నారి బ్రియానా బోడ్లీ అరుదైన మెదడువాపు వ్యాధి బారిన పడింది. ఆ వ్యాధి పేరు రాస్ముస్సేన్కి సంబంధించిన మెదడువాపు వ్యాధి. వైద్య పరిభాషలో చెప్పాలంటే దీన్ని రాస్ముస్సేన్స్ ఎన్సెఫాలిటిస్ అనే మెదడు వాపు వ్యాధి. దీని కారణంగా ఆమె పక్షవాతానికి గురయ్యి నడవలేనంత దయనీయ స్థితిలో ఉంది. కనీసం మాటలు కూడా పలకలేదు. ఈ వ్యాధి కారణంగా ఆమె మెదడులోని ఒక వైపు భాగం కుచించుకుపోవడం మొదలైంది. నెమ్మది నెమ్మదిగా ఆ వ్యాధి ఆమెపై ఓ రేంజ్లో విజృంభించడం ప్రారంభించింది. దీంతో వైద్యలు ఆమె పరిస్థితి విషమించకూడదనే ఉద్దేశంతో యాంటీ సీజర్, స్టెరాయిడ్లు ఇచ్చారు. అంతేగాదు ఆ వ్యాధిని నయం చేసేందుకు మెదడులో ఒకవైపు భాగాన్ని పనిచేయకుండా డిస్కనెక్ట్ చేశారు. అంటే ఒకరకంగా ఒకవైపు మెదడుని స్విచ్ఆఫ్ చేశారు. ఆ చిన్నారి ఎదుర్కొంటున్న వ్యాధిని నయం చేసేందుకు ఇలా ఒకవైపు మెదడుని పూర్తిగా డిస్కనెక్ట్ చేసినట్లు లోమాలిండా యూనివర్సిటీ డాక్టర్ ఆరోన్ రాబిసన్ చెప్పారు. ఈ మేరకు వైద్యులు రాబిసన్ మాట్లాడుతూ..మెదడులో పనిచేయని భాగాన్ని సిల్వియన్ షిషర్ అనే పిలిచే బ్రెయిన్ ఓపెన్ సర్జరీ ద్వారా బ్రెయిన్‌ని ఆఫ్ చేయొచ్చని చెప్పారు. ఈ చికిత్సలో తాము మెదడులోని థాలమస్ ప్రాంతం నుంచి తెల్లటి పదార్థాన్ని రీమూవ్ చేస్తామని చెప్పారు. సగం మెదడుతో రోజూవారి సాధారణ జీవితాన్ని గడపగలమని చెప్పారు వైద్యులు. దీని గురించి ఆ చిన్నారి బ్రియానాకి దాదాపు 10 గంటలకు పైగా శస్త్ర చికిత్స చేసి మరీ మెదడులోని సగ భాగాన్ని డిస్కనెక్డ్ చేసినట్లు తెలిపారు. ఈ సర్జరీ కారణంగా ఆమె ఎడమ చేతిని కదపలేకపోవడం, కొంత మేర దృష్టిని సైతం కోల్పోయినప్పటికీ వివిధ ఫిజికల్ థెరఫీలతో మళ్లీ ఆమెను యథాస్థితికి తీసుకొచ్చేలా చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ చిన్నారి కొత్తగా నడవడం, బ్యాలెన్సింగ్ చేసుకోవడం వంటి నెపుణ్యాలను మళ్లీ అభ్యసిస్తోందని చెప్పారు రాబిసన్. ఇంతకీ రాస్ముస్సేన్ మెదడు వాపు వ్యాధి అంటే.. మెదడులో సగభాగంలో మంటతో కూడిన దీర్ఘకాలిక నొప్పి ఉంటుంది. ఈ వ్యాధి ముదిరితే సగభాగం పూర్తిగా పనితీరుని కోల్పోతుంది. దీంతో ఒక వైపు శరీరం చచ్చుబడి క్రమంగా క్షీణించిపోవడం జరుగుతుంది. ఈ పరిస్థితిని 1958లో తొలిసారిగా వైద్యుడు థియోడర్ రాస్ముస్సేన్ వివరించారు. అందువల్ల ఆ వైద్యుడి పేరు మీదనే ఈ వ్యాధికి ఈ పేరు పెట్టారు. ఈ వ్యాధి ప్రతి పదిమిలియన్ల మందిలో ఇద్దర్ని ప్రభావితం చేస్తుందని, సాధారణంగా సుమారు 2 నుంచి 10 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలు, కౌమారదశలో ఉన్నవారు, ఆఖరికి పెద్దలను కూడా ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు: రాస్ముస్సేన్ ఎన్సెఫాలిటిస్ అత్యంత సాధారణ మూర్చలాంటి లక్షణాలనే చూపిస్తుంది. ఇది శరీరంలోని బలమైన కండరాల కదలికలను నియంత్రిస్తుంది. ఒక చేయి, కాలు మెలితిప్పినట్లుగా వంకరగా మారతాయి. మెదడులో ఒకవైపు నుంచి తీవ్ర స్థాయిలో నొప్పి ప్రారంభమవుతుంది (చదవండి: కంటి రెప్పపై కురుపులు లేదా గడ్డలు ఇబ్బంది పెడుతున్నాయా?) -
మానసిక అనారోగ్యమే అని లైట్ తీసుకోవద్దు! బీ కేర్ ఫుల్!
మానసికంగా బాగుంటేనే మనం పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు లెక్క. మెంటల్‌గా బాగుంటేనే మన రోజూవారీ లైఫ్‌కి ఎలాంటి ఢోకా ఉండదు. అలాంటి మనసే స్ట్రగులైతే సమస్యలన్నీ చుట్టుముట్టేస్తాయి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా నిన్ను నిలువునా పతనం దిశగా తీసుకువెళ్లి మట్టుబెట్టేంత వరకు వదలదు ఆ మానసిక వ్యాధి. దీన్ని జోక్‌గా తీసుకోవద్దు. ప్రతిమనిషి మానసికంగా బలంగా ఉంటే దేన్నేనా అవలీలగా జయించగలడు అన్నది సత్యం. అక్టోబర్ 10 ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మానసిక అనారోగ్యం ఎందుకొస్తుంది? ఎలా బయటపడాలి? తదితరాల గురించే ఈ కథనం.! మానసిక అనారోగ్యామే అని కొట్టి పారేయొద్దు. అది ఓ భయానకమైన వ్యాధి మనిషిని నిలువునా కుంగదీసి చనిపోయేలా ప్రేరేపిస్తుంది. ముందుగానే మేల్కొని బయటపడేందుకు ప్రయత్నించకపోతే పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంటుంది. ఇటీవల కాలంలో ఈ మానసికంగా బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజూకి అనూహ్యంగా పెరుగుతుంది. అరచేతిలో ప్రపంచాన్ని చూపించేంత టెక్నాలజీ మన వద్ద ఉంది. టెక్నాలజీ పరంగా ఆర్థిక పరంగా మనిషి అభివృద్ధి శరవేగంగా దూసుకు వెళ్తోంది. అయినా మానసిక రుగ్మత బారిన పడి మనిషి ఎందుకు విలవిల్లాడుతున్నాడు. ఒక్కసారిగా పాతాళానికి పడిపోయి ఏం చేయలేను అనేంత స్థాయికి దిగజారి నిరాశ నిస్ప్రుహలోకి వెళ్లిపోతున్నాడు. ఎక్కడ ఉంది ఈ లోపం. వ్యవస్థలోనా? మనిషిలోనా ?అంటే.. మనిషి టెక్నాలజీ, అభివృద్ధి పేరుతో పెడుతున్న పరుగులు తనకు తెలియకుండానే మనసుపై ఒత్తిడిని పెంచేస్తున్నాయి. ఎదుటి వాడు తనకన్న బెటర్‌గా ఉన్నాడనే అక్కసు, తాను ఎక్కువ సంపాదించలేకపోతున్నాను అన్న నిరాశ, తాను అనుకున్నవి సాధించలేకపోయాను అన్న నిట్టూర్పుతో.. ఢీలా పడి ఈ మానసిక రుగ్మత బారిన ఈజీగా పడి పోతున్నాడు. ఆ తర్వాత దీన్నుంచి బయటపడలేక గుంజుకుపోతున్నాడు. చివరికి తనను తాను అంతం చేసుకునేంత స్థితికి దిగజారిపోతున్నాడు. ఎలా బయటపడాలి..? ముందుకు కెరీర్ పరంగా లేదా ఆర్థిక పరంగానో,కుటుంబ పరంగానో మీరు ఉన్నతంగా లేదా మంచి స్థాయిలో లేకపోయామనే నిరాశ ఉంటే..దాన్ని వెంటనే మనసులోంచి తీసేయండి. అందరూ అన్ని సాధించలేకపోవచ్చు. కానీ ఎవరి ప్రత్యేకత వారిదే అది గుర్తించుకోండి. మొక్కలన్నింటి పువ్వులు ఉండవు. పుష్పించిన పూలన్నీ సుగంధాలు వెదజల్లవు. కానీ వాటికి ఉండే ప్రత్యేకత విభిన్నం, పోల్చదగినది కాదు. ఔనా!. సుగంధ భరితం కానీ పువ్వు ఔషధం అవుతుంది. సుగంధం వెద్దజల్లే పువ్వు అత్తరుగా మారతుంది. అలాగే మనుషులు కూడా అంతే. ఒక్కొక్కరిది ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ముఖ్యంగా మనం కోల్పోయినవి, సాధించలేనివి తలుచుకుని.. వాటితో నిన్ను నువ్వు తక్కువ చేసుకుని ఆత్యనూన్యతకు గురై బాధపడటం మానేయండి. మొదట మీరు సాధించిన చిన్న చిన్న విజయాలు గుర్తు తెచ్చుకోండి. రికార్డు స్థాయి విజయాలు కాకపోయినా పర్వాలేదు. మీదైనా చిన్ని ప్రపంచంలో మీరు సాధించింది ఎంత చిన్నవైనా అవి గొప్పవే. మీలా మీ స్థాయిలో ఉన్నవాళ్లు ఎవ్వరూ సాధించలేకపోయారు లేదా చేరుకోలేకపోయారు. కనీసం మీరు ప్రయత్నించారు, కొంత అయినా సాధించారు అని మనస్సు పూర్తిగా ఫీలవ్వండి, సంతోషపడండి. పరాజయం పెద్దదైన చిన్నదైనా ఐ డోంటే కేర్ అనే పదం స్మరించండి. అది అన్నింటికీ అసలైన మందు. ఏ రోజుకైన ఎప్పటికైనా మీకంటూ ఓ రోజు వస్తుంది. మీరు సాధించగలుగుతారు అనేది సత్యం అని చాలా బలంగా మిమ్మల్ని మీరు విశ్వసించండి. ఇలా అనుకుంటే ఎలాంటి మానసిక వ్యాధైనా పరారే. వియోగం వల్ల వచ్చే మానసిక బాధ.. మనకు నచ్చిన వ్యక్తి లేదా ఆత్మీయుడు మన సొంతం అనే వ్యక్తి కాలవశాత్తు లేదా ప్రమాదవశాత్తు దూరం అయినా మానసికంగ కుంగిపోవద్దు. ఇది సర్వసాధారణం. అందరి జీవితాల్లో జరిగేదే. కొందరికి చిన్నతనంలోనే నా అనేవాళ్లు దూరం అయితే మరికొందరికీ ఓ స్టేజ్‌లో దూరం అవ్వచ్చు దీన్ని మనస్ఫూర్తిగా అంగీకరించి ముందుకు సాగిపోండి. అదే ప్రేమికులు/భార్యభర్తలు విడిపోయినా లేదా చనిపోయినా మీ బాధ వర్ణనాతీతం. ఎవ్వరూ తీర్చలేనిది తట్టుకోలేనిది ఒప్పుకుంటాం. కొందరూ మన జీవిత ప్రయాణంలో కొంత వరకే. వారి జ్ఞాపకాలు మన వెంట పదిలంగా ఉంటాయి. గుండె నిండా శ్వాస పీల్చుకుని వారిని గుర్తు చేసుకోండి అలానే ఎందుకు దూరం అయ్యారని బాధపడొద్దు. మీకు తీరని ద్రోహం చేసి నిలువునా మోసం చేసి వెళ్లిపోయారని అస్సలు చింతించొద్దు. నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోవద్దు. ఇదొక గుణపాఠంగా తీసుకో. నీ స్థాయికి సరిపోని వాడు అని గడ్డిపరకను తీసిపడేసినట్టు పడేయి. నీ మనసు పట్టి పీడుస్తున్న వేదన దూదిపింజలా తేలిక అయిపోతుంది. మనిషి ఎంతో తెలివైన వాడు. అసాధ్యలన్నింటిని సాధించగలుగుతాడు. తనలాంటి సాటి మనుషుల చేతిలో మోసపోయిన, ధగ పడితే మాత్రం తిరిగి లేచి నిలబడలేక విలవిలలాడతాడు. ఎందుకిలా? 'ఓ మనిషి' నీకు మహాశక్తి ఉంది. మెలి పెడుతున్న మనుసును మధించి సరైన మార్గంలో పెట్టి దూసుకుపోవాలి. గమ్మతైన మనసు కథ.. మనల్ని ఎంతో ప్రేమించి మనమే సర్వస్వం అనుకునే వాళ్లని ప్రతి క్షణం స్మరించం. కానీ మనల్ని బాధపెట్టిన వాడిన మన మనసు పదే పదే గుర్తు తెచ్చుకుని ఏడుస్తుంది. నీలో నీవే తిట్టుకుంటూ, భోంచేసినా, కూర్చొన్నా, అతడినే గుర్తు తెచ్చుకుంటావు. మనకు ఇష్టం లేకపోతే మనకు నచ్చిన స్వీట్ అయినా పక్కన పెడతాం. అలాంటిది మనకు నచ్చని వ్యక్తి, వేదన పాలు చేసిన వాళ్లను, వాళ్ల తాలుకా గాయాలను ఎందుకు తలుచుకుంటున్నాను అని ఎప్పుడైనా ఆలోచించారా?. కనీసం ఛీ! వీడు నన్ను ఇంతలా బాధపెట్టాడు గుర్తు తెచ్చుకోవడమే పాపం అని గట్టిగా మీరు అనుకున్నట్లయితే. ఏ మానసిక సమస్య మీ దరిదాపుల్లోకి రాగలదు. జీవితం సాఫీగా సాగితే నీ గొప్పదనం ఉండదు. ఆటుపోట్లు ఉంటేనా మంచి కిక్కు ఉంటుంది. అదే నీ గొప్పతనన్ని బయటపెట్టుకునే ఓ గొప్ప అవకాశం. దురదృష్టవంతుడివి కాబట్టి కష్టాలు రాలేదు. నువ్వు తట్టుకోగల సమర్థుడువి కాబట్టే నీకు వచ్చాయి. అవే రాకపోతే నీ సామర్థ్యం ఏంటో నీకు తెలియదు. పైగా నువ్వు గొప్పోడివి అని చూపించుకునే అవకాశం ఉండదు. మిత్రమా! సాధించలేకపోవడంలోనే సాధన ఉంది. కోల్పోవడంలోనే పొందడం ఉంది. ఇదే నిజం! కూల్‌గా ఆలోచించి.. మనో చిత్తాన్ని పట్టిపీడించే చింతను చిత్తుచేసి మానసికంగా ధృఢం ఉండేలా మనసుకి శిక్షణ ఇవ్వండి. సులభంగా మానసిక అనారోగ్యం నుంచి బయటపడగలుగుతారు. (చదవండి: స్టెరాయిడ్స్ ఇంత ప్రమాదమా? ఇమ్రాన్ ఖాన్ సైతం..) -
శ్రీదేవి గ్లామర్ కోసం చేసిన ఆ డైట్ అంత డేంజరా?
శ్రీదేవి అందం కాపాడుకోవడం కోసం ఫాలో అయిన డ్రైట్ అత్యంత ప్రమాదకరమైంది. వైద్యలు సైతం వద్దని వారించిన ఆమె చనిపోయేంత వరుకు ఆ డైట్ ఫాలో కావడం వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయిందని ఆమె భర్త, బాలీవుడ్ నిర్మాత బోని కపూర్ సైతం చెబుతున్నారు. ఆమె అందం కోసం చేసిన డైట్ ఏంటీ? అంత ప్రమాదకరమైందా? వైద్యులు ఏం చెబుతున్నారు? తదితరాల గురించే ఈ కథనం. టాలీవుడ్ నటి శ్రీదేవి అందంగా కనిపించడం కోసం ఉప్పు తక్కువుగా ఉండే డైట్ ఫాలో అయ్యేది. అదే ఆమె ప్రాణాలు కోల్పోయేందుకు ఒక రకంగా కారణమైంది. డాక్టర్లు సైతం ఇలా ఉప్పు తక్కవుగా ఉండే ఆహారం తీసుకోవద్దని హెచ్చరించారు కూడా. అయినా ఆమె చనిపోయేంత వరకు కూడా అలా ఉప్పులేకుండానే తినడంతో అదికాస్తా లో బీపీకి దారితీసిందని, ఆమె ఆకస్మిక మరణానికి అది కూడా ఒక కారణమని ఆమె భర్త బోనీ కపూర్ సైతం చెబుతున్నారు. ఇలా అస్సలు వద్దు.. మనిషి వయసు, బాడీ మాస్ ఇండెక్స్, ఆరోగ్యం, తదితరాల ఆధారంగా మనిషి, మనిషికి సోడియం తీసుకునే విధానం మారుతుంది. మనిషి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారం నుంచి ఉప్పును పూర్తిగా స్కిప్ చేయకూడదు. ఉప్పులో ఉండే సోడియం శరీరానికి అవసరమయ్యే అత్యంత ప్రధానమైన ఖనిజాల్లో ఒకటి. ఇది సెల్యూలార్ ఫంక్షన్లను నిర్వహిస్తుంది. శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతను నిర్వహిస్తుంది. ఒకవేళ ఉప్పుని ఆహారంలో పూర్తిగా స్కిప్ చేస్తే ఎలక్టోలైట్ బ్యాలెన్స్‌లో తేడా వచ్చి ఒక్కసారిగా మైకం కమ్మి స్ప్రుహ కోల్పోయే ప్రమాదం ఉంది. ఫలితంగా లోబీపీ రావడమే గాక అనే రకాల దుష్ప్రభావాలను ఎదర్కొనక తప్పదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఎదురయ్యే దుష్ప్రభావాలు.. శరీరానికి సరిపడ సోడియం అందనట్లయితే నీరు చేరి ఉబ్బినట్లుగా అయిపోతారు. ఒక మనిషి శరీరంలో ఉండవల్సిన సోడియం సాధారణంగా పర్ లీటర్‌కి 135 మిల్లీక్వివలెంట్స్(ఎంఈక్యూ/ఎల్) కంటే తక్కువుగా ఉంటే దాన్ని హైపోనాట్రేమియా అంటారు. దీంతో కండరాలు, కణాలు ఉబ్బడం తోపాటు రక్తపోటును కూడా ప్రభావితం చేస్తుంది. రోజుకు కేవలం 2.4 గ్రాముల కంటే తక్కువ ఉప్పు తీసుకున్నట్లయితే మూత్రపిండాలపై ఒత్తిడి ఎక్కువ అవుతుంది. దీంతో తలనొప్పి, అలసట, మైకం కమ్మడం, కళ్లు తిరిగడం వంటివి ఎదర్కొంటారు. ఈ హైపోనాట్రేమియా కూడా మూడు రకాలుగా ఉంటుంది. కొందరికి అంత త్రీవ స్థాయిలో ఉండకపోవచ్చు. మందులతోనే క్యూర్ అవ్వొచ్చు. కొందరికి ఇది తీవ్ర స్థాయిలో ఉండి..మూర్ఛ లేదా కోమాలోకి వెళ్లడం జరుగుతుంది. ఒక్కొసారి మెదడులో నరాలు చిట్లిపోయే పరిస్థితి ఏర్పడి చనిపోవచ్చని వైద్యలు విక్రమ్‌జిత్ సింగ్ చెబుతున్నారు. మధుమేహం, బీపీ ఉన్నవారు ఉప్పు తగ్గిస్తే ఎటువంటి సమస్య లేదుగానీ ఏదో అందం కోసం అని ఉప్పు లేకుండా ఆహరా పదార్థాలు తీసుకోవడం అనేది చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) సైతం ప్రతి రోజు ఐదు గ్రాములు ఉప్పు వినియోగించొచ్చని నొక్కి చెబుతోంది. ఇంతకు మించి తక్కువగా వాడితే కోమాలోకి వెళ్లిపోయి తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొంది. అందువల్ల దయచేసి సినీతారలు దగ్గర నుంచి సామాన్యుల వరకు మన శరీరానికి కావాల్సినంత ఉప్పుని తీసుకోవడమే సర్వవిధాల మంచిది. (చదవండి: ఓ మహిళకి క్యాన్సర్ థర్డ్ స్టేజ్!ఎలాంటి సర్జరీ లేకుండానే..) -
క్యాన్సర్ థర్డ్ స్టేజ్! కానీ ఎలాంటి సర్జరీ లేకుండానే..
క్యాన్సర్ స్టేజ్‌లను బట్టి రోగులకు చికిత్స అందించడం అనేది సర్వసాధారణం. కానీ కొన్ని క్యాన్సర్లు మొదటి స్టేజ్ల్లో చికిత్స తీసుకుంటేనే సులభంగా బయటపడగలుగుతారు. కొన్ని క్యాన్సర్లు మాత్రం ఏ స్టేజ్ అయినా పరిస్థితి సీరియస్ తప్ప క్యూర్ అవ్వడం అనేది ఉండదు. కానీ ఇక్కడొక మహిళ విషయంలో ఓ డ్రగ్ మిరాకిల్ చేసింది. ప్రాణాంత క్యాన్సర్ వ్యాధి నుంచి ఎలాంటి కీమో థెరఫీ, సర్జరీ వంటివి చేయంచుకోకుండానే సులభంగా నయం కావడమే కాదు పూర్తి స్థాయిలో క్యాన్సర్ సమస్య నుంచి బయటపడింది. వైద్యులను సైతం నివ్వెరపరిచింది ఈ డ్రగ్. ఇంతకీ ఏంటా మెడిసన్? ఆమెకు క్యాన్సర్ ఎలా క్యూర్ అయ్యిందంటే.. వివరాల్లోకెళ్తే..యూకేలోని వేల్స్‌కు చెందిన క్యారీ డౌనీ అనే మహిళకి ప్రేగు క్యాన్సర్ వచ్చింది. అది కూడా థర్డ్ స్టేజ్. ఆమెకు వైద్యులు వండర్ మెడిసిన్‌ని ఇచ్చారు అంతే జస్ట్ ఆరు నెలల్లో పూర్తిగా నయం అయిపోయింది. వైద్యుల కూడా ఇది మిరాకిల్ అంటూ ఆశ్చర్యపోయారు. ఆమెకు దోస్టార్లిమాబ్ అనే డ్రగ్‌ని ఇంజక్షన్ రూపంలో ఇచ్చారు. ఇది యాంటీబాడీస్కి సంబంధించిన ఔషధం. ఇది క్యాన్సర్ కణాలలో నిర్దిష్ట ప్రోటీన్ చర్యను నిరోధిస్తుంది. అంతేగాదు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను క్యాన్సర్కణాలకు వ్యతిరేకంగా పోరాడేల క్యాన్సర్ కణితి పెరుగుదలను నియంత్రిస్తుంది. ఈ డ్రగ్ కారణంగా పెద్దగా ఎలాంటి దుష్పరిణామాలను సదరు మహిళ ఎదుర్కొనలేదు. కొద్దిగా శరీరంపై అక్కడక్కడ దద్దుర్లు వచ్చినా.. అవి కూడా త్వరితగతిన తగ్గిపోయాయి. ఈ మేరకు వైద్యులు మాట్లాడుతూ..ఇది క్లినికల్ ట్రయల్ డ్రగ్ అయినప్పటికీ సానుకూల ఫతితాలని ఇచ్చింది. ఒకరకంగా క్యాన్సర్‌కి ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు పేషెంట్స్ చాలా రకాల దుష్పరిణామాలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా కీమోథెరపీ, రేడియోథెరపీ వల్ల ఎదుర్కొనే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. అలాంటిది అవేమీ చేయించుకోనక్కర్లేకుండా నయం కావడం నిజంగా అద్భుతం అని వైద్యులు అంటున్నారు. పైగా ప్రేగ్లుల్లో క్యాన్సర్ కణితి థర్డ్ స్టేజ్(మూడో దశ)లో ఉంది. ఈ స్టేజ్‌లో ఉండగా నయం కావడం కాస్త రిస్క్‌తో కూడినదే. కానీ ఈ వండర్ డ్రగ్ అద్భుతంగా పనిచేయడమే కాక భవిష్యత్తులో రోగులు ఎలాంటి సర్జరీల జోలికి వెళ్లాల్సిన పనిలేదనే కొత్త ఆశని రేకెత్తించింది. సదరు మహిళకు కేవలం ఆరు నెలల్లోనే క్యాన్సర్ కణితి తగ్గిపోయిందని వైద్యులు చెబుతున్నారు. దీన్ని ప్రేగు క్యాన్సర్ ఉన్న రోగులకు వారానికి మూడుసార్లు చొప్పున ఇంట్రావీనస్గా ఇవ్వడం జరగుతుందన్నారు. ప్రతిసారి ఇంజక్షన్ ఇచ్చేటప్పుడూ కనీసం అరగంట సమయం పడుతుంది. పైగా పేషెంట్‌ని పూర్తి వైద్యుల అబ్జర్వేషన్లో ఉంచి స్కాన్లు నిర్వహిస్తూ.. ఆ డ్రగ్ పనితీరుని అంచనా వేయాల్సి ఉంటుందని డాక్టర్ బారిటన్ తెలిపారు. సదరు మహిళ తనకు జీవించేలా మరో అవకాశాన్ని ఇచ్చినందుకు డాక్టర్ బారిటన్ వైద్య బృందానికి ఎంతగానో రుణపడి ఉంటానని ఉద్వేగంగా చెప్పింది. గతేడాది బారిటన్ వైద్య బృందం ఇదే డ్రగ్‌ని మల క్యాన్సర్‌తో బాధపడుతున్న 18 రోగులపై క్లినికల్ ట్రయల్ నిర్వహించి పూర్తి స్థాయిలో విజయవంతం అయ్యారు. నిజంగా క్యాన్సుర్ రోగుల పాలిట ఈ మెడిసిన్ ఓ గొప్ప అద్భుత వరం!. (చదవండి: ఫైబ్రాయిడ్స్ వల్ల హిస్టరెక్టమీ వస్తుందా?) -
ఫైబ్రాయిడ్స్ వల్ల హిస్టరెక్టమీ వస్తుందా?
నా వయస్సిప్పుడు 28 సంవత్సరాలు. రొటీన్ స్కాన్‌లో ఫైబ్రాయిడ్స్ ఉన్నట్టు తేలింది. 1–2 సెం.మీ సైజ్ అన్నారు. ఇప్పటికైతే నాకే ఇబ్బందీ లేదు. అయితే కొందరికి దీని వల్ల హిస్టరెక్టమీ అయిందని విన్నాను. అలా అవుతుందా? నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – ఎన్. శుభదా, చంద్రపూర్ ఫైబ్రాయిడ్స్ అనేవి గర్భసంచిలో ఉండే మజిల్ ఓవర్గ్రోత్తో ఏర్పడే గడ్డలు. ఇవి కొంతమందికి చిన్న వయస్సులోనే అంటే 20–30 ఏళ్ల మధ్య హార్మోన్స్ ప్రాబ్లమ్‌తో ఏర్పడవచ్చు. 5 సెం.మీ లోపు ఉండే ఫైబ్రాయిడ్స్ చాలావరకు ఇబ్బంది పెట్టవు. స్కాన్‌లో మాత్రమే తెలుస్తాయి. వాటికి ఎటువంటి సర్జరీ అవసరం లేదు. కానీ కొన్ని పరిమాణంలో చిన్నవే అయినా ప్రాబ్లమ్‌ను క్రియేట్ చేస్తాయి. అలాంటి ఫైబ్రాయిడ్స్ గనుక గర్భసంచి లోపలి పొరల్లో గనుక ఫామ్ అయి ఉంటే పీరియడ్స్ టైమ్‌లో పెయిన్ ఎక్కువగా ఉంటుంది. గర్భస్రావం అయ్యే చాన్సెస్ను కూడా పెంచుతాయి. సింప్టమ్స్ ఏమైనా ఉన్నప్పుడు 3డీ అల్ట్రాసౌండ్ చేసి ఫైబ్రాయిడ్ సైజ్, లొకేషన్, నంబర్, మీ వయసు, ప్రెగ్నెన్సీ చాన్సెస్ మొదలైనవాటిపై డిస్కస్ చేస్తారు. ఫైబ్రాయిడ్స్ వల్ల అధిక రక్తస్రావం, రక్తహీనత, మూత్రం రావడం, మలబద్ధకం, ప్రెజర్ ఫీలింగ్ లాంటివి ఉండొచ్చు. భవిష్యత్‌లో ప్రెగ్నెన్సీ ప్లాన్ పైనే డిస్కషన్స్ ఆధారపడి ఉంటాయి. 3 సెం.మీ లోపు ఉంటే చాలామందికి ఏ ఇంటర్వెన్షన్ చెప్పరు. సంవత్సరం తర్వాత మళ్లీ స్కాన్ చేసి సైజ్ చెక్ చేస్తారు. మీరు డాక్టర్ని కలసినప్పుడు మీ స్కానింగ్ రిపోర్ట్స్, బ్లడ్ రిపోర్ట్స్, మీ ఫ్యూచర్ ప్రెగ్నెన్సీ ప్లాన్ గురించి డిటేయిల్డ్‌గా డిస్కస్ చేయండి. ఫాలో అప్ స్కాన్స్‌లో ఏమైనా సడెన్ గ్రోత్ ఉంటే ఫైబ్రాయిడ్స్‌కి మెడికల్, సర్జికల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి అని సజెస్ట్ చేస్తారు. ఫైబ్రాయిడ్స్ సైజ్, లొకేషన్ని బట్టి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. అధిక రక్తస్రావాన్ని నియంత్రించడానికి పిల్స్, ప్యాచెస్, ఇంప్లాంట్స్, మిరేనా కాయిల్ లాంటివి ఉన్నాయి. ఇవి ప్రెగ్నెన్సీని కూడా నిరోధిస్తాయి. అంటే కాంట్రాసెప్టివ్‌గా పనిచేస్తాయి. కొన్నిసార్లు ఫైబ్రాయిడ్స్‌తో గర్భస్రావం లేదా నెలలు నిండకుండానే ప్రసవం జరగొచ్చు. అలాంటివారిలో మయోమెక్టమీ అంటే ఫైబ్రాయిడ్స్ని లాపరోస్కోíపీ ద్వారా తీస్తారు. తర్వాత ప్రెగ్నెన్సీకి ఏ ఇబ్బంది ఉండదు. యూటరైన్ ఆర్టరీ ఎంబలైజేషన్ అనే ప్రక్రియ ద్వారా శరీరం మీద ఏ కోత లేకుండా బీడ్స్ ద్వారా ఫైబ్రాయిడ్స్‌కి రక్తప్రసరణను అందించే రక్తనాళాలను బ్లాక్ చేస్తారు. ఇది ఇక పిల్లలు వద్దు అనుకునే వాళ్లకు ఉపయుక్తమైనది. కొంతమందికి యూటరస్ లైనింగ్‌ని పూర్తిగా తగ్గించే ఎండోమెట్రియల్ అబ్లేషన్ అనే ప్రక్రియ ద్వారా కూడా ఈ ఫైబ్రాయిడ్స్ సమస్యను ట్రీట్ చేస్తారు. హిస్టరెక్టమీ అనేది చివరి ఆప్షన్. మీకు ఏ చికిత్స మంచిది అనేది మీ పర్సనల్ హిస్టరీ తీసుకొని నిర్ణయించాల్సి ఉంటుంది. అందుకే మీరు డాక్టర్ని సంప్రదించాలి. సంప్రదిస్తే అసలు మీకు ట్రీట్మెంట్ అవసరమా? ఎలాంటి ఫాలో అప్ కావాలి? వంటి విషయాలు నిర్ధారణవుతాయి. డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: కీళ్ల నొప్పుల నివారణ మన చేతుల్లోనే..) -
మానసిక సమస్య ఉందని గుర్తించడమెలా?
‘గుడ్ మార్నింగ్ సర్. నా పేరు సురేష్. సాక్షి ఫన్ డే లో వస్తున్న ‘సై కాలం’ రెగ్యులర్‌గా ఫాలో అవుతున్నా. రకరకాల మానసిక సమస్యలు, వాటి లక్షణాలు, వాటినెలా పరిష్కరించుకోవాలి అనే విషయాల మీద చాలా బాగా ఎడ్యుకేట్ చేస్తున్నారు. అసలు ఒక మనిషికి మానసిక సమస్య ఉందో లేదో గుర్తించడం ఎలా? అనే టాపిక్ కూడా రాస్తే బాగుంటుంది సర్’ అంటూ మొన్నా మధ్య ఒక కాల్ వచ్చింది. ఆ సూచన విలువైందిగా తోచింది. అందుకే ఈ వారం ఆ అంశం గురించే తెలుసుకుందాం! సమస్య, రుగ్మత వేర్వేరు సురేష్లానే చాలామందికి మానసిక సమస్యల గురించి ప్రాథమిక అవగాహన కూడా ఉండదు. ఎవరి ప్రవర్తనైనా కొంచెం తేడాగా కనిపించగానే గుళ్లూ, గోపురాలకు తిప్పేస్తారు. యజ్ఞాలూ,యాగాలూ, శాంతి పూజలూ చేయిస్తారు. లేదా మంత్రగాళ్ల దగ్గరకు తీసుకువెళ్తారు. వాటివల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోగా సమస్య మరింత తీవ్రమవుతుంది. అందుకే మానసిక సమస్యలు, రుగ్మతల మధ్య తేడా అర్థం చేసుకోవాలి. రోజువారీ ఎదురయ్యే మానసిక ఒత్తిళ్లు, సర్దుబాటులో సమస్యలు, కోపం, విచారం, చదువులో, ఉద్యోగంలో ఇబ్బందులు లాంటివి మానసిక సమస్యలు. ఇవి తాత్కాలికం. యాంగ్జయిటీ, డిప్రెషన్, బైపోలార్, ఫోబియా, స్కిజోఫ్రీనియా లాంటివి మానసిక రుగ్మతలు. ఇవి దీర్ఘకాలం ఉంటాయి. సహానుభూతి ఉంటే చాలు.. మానసిక వ్యాధి ఉందా లేదా అని అంచనా వెయ్యడానికి సరిపడా మానసిక నిపుణులు మన దేశంలో అందుబాటులో లేరు. అందువల్ల సహానుభూతి, మంచిగా వినే నైపుణ్యం ఉన్నవారెవరైనా ప్రాథమిక అంచనా వేయవచ్చు. అయితే మానసిక వ్యాధి ఉన్నవారితో మాట్లాడాలంటే చాలామంది జంకుతారు. కారణం.. మానసిక వ్యాధి ఉన్న వ్యక్తి అనగానే చాలామందికి ఒకదానికొకటి సంబంధం లేకుండా మాట్లాడే, శుభ్రత లేని వ్యక్తి గుర్తొస్తాడు. అతనితో మాట్లాడితే తిడతాడేమో, కొడతాడేమో అని భయపడతారు. కానీ మానసిక అనారోగ్యం ఉన్నవారు కూడా మామూలు వ్యక్తులే. వారితో మాట్లాడినందువల్ల ఎలాంటి ప్రమాదమూ ఉండదని గుర్తించండి. ఎలా మాట్లాడాలి? ‘మీకేదో మానసిక సమస్య ఉన్నట్లుంది’ అని మొదలుపెడితే ఎవరైనా నొచ్చుకుంటారు. కాబట్టి వారితో మాట కలిపేందుకు.. ఈ మధ్య పత్రికల్లో వచ్చిన వార్త లాంటి మామూలు విషయంతో మొదలు పెట్టండి. ఆ తర్వాత అతని స్థానంలో మిమ్మల్ని ఊహించుకుని, అతని బాధను, సామాజిక, కుటుంబ పరిస్థితులను అర్థం చేసుకోండి. దీన్నే సహానుభూతి అంటారు. వీలైనంత వరకు ఆ వ్యక్తి బంధువులెవరూ అక్కడ లేకుండా చూసుకోండి. కొంతమంది తమకు మానసిక సమస్య ఉందని ఒప్పుకోకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో కుటుంబ సభ్యులు, స్నేహితులతో మాట్లాడి సమాచారం సేకరించండి. శారీరక జబ్బుతో ఉన్న వ్యక్తితో ఎంత సహానుభూతితో మాట్లాడతామో, మానసిక వ్యాధి ఉన్న వ్యక్తితో కూడా అంతే సహానుభూతితో వ్యవహరించాలి. ఏం చెయ్యాలి? మానసిక సమస్య లక్షణాలు కనిపించగానే మానసిక వ్యాధి ఉందని నిర్ధారణకు రాకూడదు. ఆ వ్యక్తితో మాట్లాడి లక్షణాలు ఎన్నాళ్ల నుంచి ఉన్నాయి, జీవితంపై ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయో తెలుసుకోవాలి. అతని సామాజిక, ఆర్థిక, సంబంధ బాంధవ్యాల వివరాలు, సమస్యల గురించి ఆరా తీయాలి. వీటి ద్వారా ఆ వ్యక్తి ఎందుకు మానసిక సమస్యతో బాధపడుతున్నాడో అర్థం చేసుకోగలుగుతారు. ఆ వ్యక్తి మానసిక సమస్యతో బాధపడుతున్నాడని మీకు అనిపిస్తే వెంటనే దగ్గర్లోని సైకాలజిస్ట్ దగ్గరకు తీసుకువెళ్లండి. వారు అతనితో మరింత లోతుగా మాట్లాడి, సైకో డయాగ్నసిస్ ద్వారా రుగ్మతను నిర్ధారిస్తారు. అవసరమైన సహాయం అందిస్తారు. అడగాల్సిన ప్రశ్నలు.. రాత్రిపూట నిద్ర పట్టడంలో ఏదైనా సమస్య ఉందా? · రోజువారీ పనులు చేయడంలో ఆసక్తి తగ్గినట్లు అనిపిస్తోందా? కొద్దికాలంగా విచారంగా, జీవితంలో సంతోషమే లేనట్లుగా అనిపిస్తోందా? · దేని గురించైనా భయభ్రాంతులకు లోనవుతున్నారా? మరీ ఎక్కువగా మద్యం తాగుతున్నారని బాధపడుతున్నారా? · మద్యం లేదా మాదక ద్రవ్యాల కోసం ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు? వీటిలో ఏ ప్రశ్నకైనా ‘అవును’ అని సమాధానం చెప్తే, మరింత సమయం వెచ్చించి మరింత లోతుగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రుగ్మతను గుర్తించే లక్షణాలు.. ఏ శారీరక వ్యాధికీ సంబంధంలేని బాధల్ని చెప్పడం · మానసిక వ్యాధికి సంబంధించిన వ్యక్తిగత లేదా కుటుంబ చరిత్ర ఉండటం డిప్రెషన్ లేదా మద్యపాన సంబంధమైన మానసిక సమస్య ఉందని నేరుగా చెప్పడం మద్యపాన వ్యసనం లేదా గృహహింస లాంటి ప్రత్యేక కారణాలు వైవాహిక, లైంగిక సమస్యలు · దీర్ఘకాల నిరుద్యోగం, సన్నిహిత వ్యక్తి మరణం, జీవితం సమస్యలమయం కావడం అతీంద్రీయ శక్తులు ఉన్నాయని అనుమానించడం. --సైకాలజిస్ట్ విశేష్ (చదవండి: స్టెరాయిడ్స్ ఇంత ప్రమాదమా? ఇమ్రాన్ ఖాన్ సైతం..) -
కీళ్ల నొప్పుల నివారణ మన చేతుల్లోనే..
ఆర్థరైటిస్ అంటే కీళ్లనొప్పులు లేదా కీళ్ల వాతంగా చెప్పవచ్చు. ఇందులో చాలా రకాలు ఉంటాయి. ఈ నెల 12వ తేదీ ‘ప్రపంచ ఆర్థరైటిస్ డే’. ‘‘దీన్ని ఎదుర్కోవడం మీ చేతుల్లోనే, అందుకే దీనిపై చర్యకు ఉపక్రమించండి’’ (ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్స్, టేక్ యాక్షన్) అన్నది ఈ ఏడాది థీమ్. ఈ నేపథ్యంలో దీని నివారణకూ, మేనేజ్మెంట్కూ బాధితుల చేతుల్లో ఏ మేరకు అవకాశం ఉందనే అనేక విషయాలపై అవగాహన కోసం ఈ కథనం. వయసు పెరుగుతున్న కొద్దీ కీళ్లు అరిగిపోతుంటాయనీ, దాంతో కీళ్లు ఒరుసుకుపోయి నొప్పి వస్తుంటుందనీ, ఇది వయసు పెరగడం వల్ల వచ్చే సమస్య కాబట్టి సర్దుకుపోక తప్పదనే అభిప్రాయం చాలామందిలో ఉంది. ఇది కొంతవరకే వాస్తవం. నిజానికి కీళ్లనొప్పులు / కీళ్లవాతం అనేక కారణాలతో వస్తుంటాయి. వీటిల్లో వందకు పైగా రకాలున్నాయి. అన్నింటినీ కలుపుకుని ఆర్థరైటిస్ లేదా కీళ్లవాతం అనే ఒక పదంతో సూచిస్తుంటారు. పైగా వయసు పెరిగిన వారిలోనే వస్తుంటాయన్నది కూడా పూర్తిగా నిజం కాదు. చాలామంది మధ్యవయస్కుల్లోనూ, కొంతమంది యువకుల్లోనూ కనిపిస్తుంటాయి. కారణాలు కొన్ని వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల కారణంగా, హార్మోన్ల అసమతౌల్యతలూ, విటమిన్ల లోపాలు, వాతావరణ కాలుష్యాలూ... ఇలా అనేక కారణాలతో వస్తుంటాయి. అరుగుదలతో వచ్చే వాటిని మినహాయిస్తే... సొంత కణాలపైనే తమ సొంత వ్యాధి నిరోధక వ్యవస్థ ప్రతికూలంగా పనిచేసి, కణాలను దెబ్బతీయడం వల్ల వచ్చే కీళ్ల వాతాలూ ఉన్నాయి. ఇలా వచ్చేవాటిని ఆటో ఇమ్యూన్ సమస్యలుగా పేర్కొంటారు. శరీరంలోకి ప్రవేశించే శత్రుకణాలను దెబ్బతీయడానికి పుట్టే యాంటీబాడీస్... తమ సొంత కణాలే పరాయివిగా భావించి దెబ్బతీయడంతో కొందరిలో ఎముకలు, కీళ్లు, కండరాలతో పాటు... కొన్ని సందర్భాల్లో కీలకమైన అవయవాలు, వ్యవస్థలూ దెబ్బతినవచ్చు. ఆర్థరైటిస్‌లలో ప్రధాన ఆటోఇమ్యూన్ వ్యాధులు... ఆటోఇమ్యూన్ సమస్యలతో మహిళల్లో కనిపించే వ్యాధుల్లో లూపస్ (ఎస్‌ఎల్‌ఈ), రుమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, సిస్టమిక్ స్కీ›్లరోసిస్, ఏపియన్ వంటివి ముఖ్యమైనవి. ఎస్‌ఎల్‌ఈ మహిళల్లో ఎక్కువగా కనిపించే ఓ ముఖ్యమైన వ్యాధి. ఇది కిడ్నీలు, కీళ్లు, చర్మం, మెదడు, కండరాల వంటి అనేక అవయవాలను దెబ్బతీస్తుంది. అది చూపే ప్రభావాన్ని బట్టి కొందరిలో తేలికపాటి నుంచి తీవ్రమైన సమస్యగానూ ఉండవచ్చు. కొందరిలో ప్రాణాపాయానికీ దారితీయవచ్చు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ (ఆర్ఏ) కీళ్ల మీద ప్రభావం చూపే వ్యాధి. సరైన చికిత్స తీసుకోకపోతే కీళ్లు వంకర్లుపోయి, శాశ్వత వైకల్యానికీ దారితీయవచ్చు. ఇది కీళ్లను మాత్రమే కాకుండా లంగ్స్, రక్తనాళాలు, కళ్లు, నాడీవ్యవస్థతో సహా శరీరంలోని ఇతర అవయవాలను లక్ష్యంగా చేసుకుని, ఇతర వ్యవస్థలనూ ధ్వంసం చేసే అవకాశమూ ఉంది. ఈ సమస్యతో బాధపడేవారిలో కొలెస్ట్రాల్ పెరుగుదలకు ఆస్కారం ఎక్కువ. అలాగే నాడీ వ్యవస్థ దెబ్బతినవచ్చు. ఈ కారణాలతో మరణాలకూ అవకాశం ఉంది. స్కిర్లోడెర్మా అనే కీళ్లవాతంలో చర్మం గట్టిపడటంతో పాటు జీర్ణవ్యవస్థ, గుండె, లంగ్స్, కిడ్నీల వంటి అవయవాలు ప్రభావితం కావచ్చు. యాంటీ ఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ సిండ్రోమ్ అనే కీళ్లవ్యాధిలో రక్తం తరచూ గడ్డకడుతుంది. మహిళల్లో గర్భస్రావాలూ జరుగుతుంటాయి. ఇవిగాక ఇతర వ్యాధులు చాలానే ఉంటాయి. లక్షణాలు: కీళ్లవాతాలకు దాని రకాన్ని బట్టి కొన్ని ప్రత్యేక లక్షణాలుంటాయి. ఈ లక్షణాలు అందరిలోనూ ఒకేలా బయటపడకపోవచ్చు. వ్యాధి రకాన్ని బట్టి, తీవ్రతను బట్టి, బాధితుల వయసు, వారి ఇతర వ్యాధులను బట్టి లక్షణాల తీరు మారుతూ ఉంటుంది. అయితే దాదాపు అన్ని రకాల కీళ్లవ్యాధుల్లో కనిపించే సాధారణ లక్షణాలను క్రోడీకరిస్తే... సాయంత్రానికి జ్వరం రావడం, నీరసం, నిస్సత్తువ, అలసట, క్రమంగా బరువు తగ్గడం, ఆకలి మందగించడం లాంటి లక్షణాలు తొలిదశలో కనిపిస్తాయి. ఇవే లక్షణాలు ఇతర వ్యాధుల్లోనూ కనిపిస్తుండటం వల్ల వీటిని ఆర్థరైటిస్‌గా గుర్తించడం కొంచెం కష్టమైన పని. నిర్దిష్టంగా కీళ్ల విషయానికి వస్తే కీళ్లలో విపరీతమైన నొప్పి, వాపు, అక్కడ ఎర్రగా కందిపోయినట్లుగా అవుతుంది. ఈ లక్షణాలు కనిపించేనాటికి బాధితులు తమ సొంత పనుల్ని కూడా చేసుకోలేని స్థితి వస్తుంది. ఇతర జాగ్రత్తలు... వీటిలో చాలావాటికి నివారణ ఉండదు. ఎందుకంటే ఇవి జన్యుపరమైనవీ, జన్యులోపాలతో వచ్చేవి. ఈ కారణంతో ఈ పరిమితి ఉంటుంది. ఈ జన్యులోపాలకు పర్యావరణ కారణాలూ, జీవనశైలీ తోడైనప్పుడు ఇవి బయటపడతాయి. అందుకే ఈ ఏడాది థీమ్‌ను బట్టి మన చేతుల్లో ఉండే అంశాలేమిటో తెలుసుకుని, ఆ మేరకు చర్యలు తీసుకోవడం చాలావరకు మేలు చేయడంతో పాటు... కొంతమేర నివారణకూ తోడ్పడేందుకు అవకాశం ఉంది. ఆ జాగ్రత్తలివి... బరువును తగ్గించుకోవాలి. దీనివల్ల మందులు సమర్థంగా పనిచేయడమే కాకుండా గుండె మీద ఒత్తిడి తగ్గుతుంది. ఆరోగ్యకరమైన జీవనశైలి పాటిస్తూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇదీ చికిత్సలో భాగమే. దీనివల్ల కీళ్లు వంకర్లు పోవు. ∙పొగతాగడం, మద్యపానం అలవాటును పూర్తిగా మానేయాలి. క్యాల్షియమ్ సమృద్ధిగా ఉండే ఆహారాల్ని తీసుకోవాలి. విశ్రాంతి వల్ల కీళ్లవాతాన్ని నివారించవచ్చునని కొందరు అపోహపడతారు. ఇది పూర్తిగా అవాస్తవం. కీళ్లవాతం వచ్చినవారిలో ఒంటి కదలికలు చురుగ్గా ఉండేలా నడక వంటి వ్యాయామాలు చేయాలి. దాంపత్య జీవితానికి దూరంగా ఉండాలన్నది మరో అపోహ. ఇదీ వాస్తవం కాదు. ఈ అపోహలకు దూరంగా ఉండటమూ బాధితుల చేతుల్లో ఉన్న పనే. ఈ ఏడాది థీమ్‌ను అనుసరిస్తూ... బాధితులు తగిన జాగ్రత్తల్ని పాటించడం, రుమటాలజిస్టులను సంప్రదించి, వ్యాధిని తొలిదశలోనే గుర్తించి, జీవనశైలిని మెరుగుపరచుకుంటే కీళ్లవ్యాధుల బాధల నుంచి దూరంగా ఉండవచ్చు. చికిత్స: ఆర్థరైటిస్‌కి కారణమైన కీళ్లవాతాన్ని బట్టి చికిత్స ఉంటుంది. చాలావాటికి కొన్ని యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులతోపాటు, చిన్న మోతాదుల్లో స్టెరాయిడ్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది. జబ్బు తీవ్రత ఎక్కువగా ఉంటే తగు మోతాదులో స్టెరాయిడ్స్‌తో పాటు ‘డిసీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్’ని మొదలుపెట్టాలి. జబ్బు తీవ్రతను అదుపు చేయడం కష్టమైన సందర్భాల్లో కొందరిలో ‘బయలాజిక్స్’ అనే మందుల్ని ఇవ్వాల్సి ఉంటుంది. అయితే అన్ని రకాల కీళ్లవాతాలకూ ఒకేరకం బయలాజిక్స్ పనిచేయవు. వ్యాధి తీవ్రత, ప్రభావితమైన అవయవం, బాధితులు స్త్రీ లేదా పురుషుడా అన్న అంశంతో పాటు ఒకవేళ బాధితులు మహిళలైతే వారు గర్భవతా లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని మందుల్నీ, వాటి మోతాదుల్ని రుమటాలజిస్టులు నిర్ణయించి, సూచిస్తుంటారు. డా‘‘ విజయ ప్రసన్న పరిమి, సీనియర్ రుమటాలజిస్ట్ (చదవండి: స్టెరాయిడ్స్ ఇంత ప్రమాదమా? ఇమ్రాన్ ఖాన్ సైతం..) -
పిల్లల ఎముకలు బలంగా పెరగాలంటే..
పిల్లల ఎదుగుదల విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎందుకంటే పెద్దవారితో పోల్చితే పిల్లల ఎముకలు బలహీనంగా ఉంటాయి. దీనివల్ల చిన్న చిన్న దెబ్బలు తాకినా తొందరగా విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. బాల్యంలోని బలమైన ఎముకలు వారి జీవితకాల ఆరోగ్యానికి అద్భుతమైన పునాదిని అందిస్తాయి. అందువల్ల వారి ఎముకలు దృఢంగా ఉండేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలు, పాటించవలసిన ఆహార నియమాలపై అవగాహన కోసం... కాల్షియం గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి, కండరాలను బలోపేతం చేయడానికి, ఎముకలను అభివృద్ధి చేయడానికి కాల్షియం అవసరం అని తెలుసు కాబట్టి పిల్లలు రోజుకు కనీసం రెండు గ్లాసుల పాలను తాగేట్టు చూడాలి. అలాగే ఆహారంలో బచ్చలికూర, పాలకూర వంటి ఆకుకూరలు, బెండ, పొట్ల వంటి కూరగాయలు ఉండేట్టు చూడండి. అలాగే రోజుకు ఒకసారైనా పెరుగును తినేట్టు చూడండి. సోయా పాలు, సోయా పెరుగు వంటి సోయాబీన్ ఉత్పత్తుల్లో కూడా కాల్షియం పుష్కలంగా ఉంటుంది. విటమిన్ డి శరీరానికి కావలసిన కాల్షియంను గ్రహించేందుకు విటమిన్ డి సహాయపడుతుంది. విటమిన్ డి సూర్యరశ్మి ద్వారా, కొన్ని రకాల ఆహారాల ద్వారా పొందవచ్చు. పిల్లల ఆహారంలో తగినంత విటమిన్ డి లేకపోతే విటమిన్ డి సప్లిమెంట్‌ను తీసుకోవాలి. నవజాత శిశువులకు కూడా విటమిన్ డి సప్లిమెంట్స్ అవసరం. కానీ డాక్టర్లను సంప్రదించిన తర్వాతే ఇవ్వాలి. మెగ్నీషియం, విటమిన్ కె శరీరంలో విటమిన్ కె, మెగ్నీషియం స్థాయిలు ఎక్కువగా ఉంటే ఎముకలు బలంగా ఉంటాయి. అలాగే రికెట్స్, బోలు ఎముకల వ్యాధితో సహా ఎన్నో ఎముకల సమస్యలను తగ్గించడానికి ఇవి సహాయపడతాయి. కాల్షియంతో పాటుగా ఈ విటమిన్లు కూడా మీ పిల్లల ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. బచ్చలికూర, Mక్యాబేజీ, మొలకలు వంటి వాటిల్లో విటమిన్ కె, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. పిల్లలకు తృణధాన్యాలను పెట్టండి. కార్బోనేటేడ్ పానీయాలు వద్దే వద్దు కార్బోనేటేడ్ పానీయాలలో సాధారణంగా కొన్ని ఫాస్పోరిక్ ఆమ్లాలు ఉంటాయి. ఇది శరీరం కాల్షియాన్ని గ్రహించకుండా నిరోధిస్తుంది. ఈ ఆమ్లం ఎముకల ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. కార్భోనేటెడ్ పానీయాలకు బదులుగా నారింజ రసం వంటి హెల్తీ పానీయాలను తాగించండి. ఎముకలను బలోపేతం చేసేవాటిలో ముఖ్యమైనది శారీరక శ్రమ. అందుకే పిల్లలు బాగా ఆటలు ఆడేలా చూడండి. వీలైతే చిన్న చిన్న వ్యాయామాలను చేయించండి. (చదవండి: వాస్తవికతకే రూపం ఇస్తే..పాజిటివ్ ఎమోషన్..) -
కార్ డిజైనర్ థార్ డిజైనర్!
మహింద్రా థార్‌ను చూసి భలే ఉందే అనుకున్నారా? దానిని డిజైన్ చేసింది ఒక స్త్రీ అని చాలామంది అనుకోరు. ఎందుకంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మగవారి ప్రాబల్యం ఎక్కువ. కాని క్రిపా అనంతన్ గొప్ప కార్ డిజైనర్‌గా ఈ రంగంలో తన ప్రభావం చూపుతోంది. మహింద్రాలో హిట్ అయిన అనేక ఎస్‌యువీలను ఆమే డిజైన్ చేసింది. ఇపుడు ఓలాకు డిజైన్ హెడ్‌గా పని చేస్తూ ఉంది. మహింద్రా సంస్థకు గొప్ప పేరు తెచ్చిన ‘థార్’ను క్రిపా అనంతన్ డిజైన్ చేసింది. ఆమె వయసు 53. పూర్తి పేరు రామ్క్రిపా అనంతన్ అయితే అందరూ క్రిపా అని పిలుస్తారు. ‘ఆటోమొబైల్ డిజైనర్ కూడా చిత్రకారుడే. కాకపోతే చిత్రకారుడు కాగితం మీద రంగులతో గీస్తే మేము లోహాలకు రూపం ఇస్తాం... శక్తి కూడా ఇచ్చి కదలిక తెస్తాం’ అంటుంది క్రిపా. బిట్స్ పిలానీలో మెకానికల్ ఇంజినీరింగ్ చేసిన క్రిపా ఆ తర్వాత ఐ.ఐ.టి ముంబైలో ఇండస్ట్రియల్ డిజైన్ చదివి 1997లో మహింద్రాలో ఇంటీరియర్ డిజైనర్‌గా చేరింది. ఆ సమయంలో తయారైన వాహనాలు– బొలెరో, స్కార్పియోలకు ఇంటీరియర్ డిజైన్ పర్యవేక్షించింది. ఆమె ప్రతిభను గుర్తించిన సంస్థ కొత్త ఎస్‌యువిని తేదలిచి దాని డిజైనింగ్ బాధ్యతలు అప్పజెప్పింది. సాధారణంగా ప్రయాణాలంటే ఇష్టపడే క్రిపా తన టూ వీలర్– బజాజ్ అవెంజర్ మీద మనాలి నుంచి శ్రీనగర్ వరకూ ఒక్కతే ప్రయాణిస్తూ వాహనం ఎలా ఉండాలో ఆలోచించింది. అంతేకాదు దాదాపు 1500 మందిని సర్వే చేయించి ఎస్యువి ఎలా ఉంటే బాగుంటుందో సూచనలు తీసుకుంది. ‘మహింద్రా ఏ బండి తయారు చేసినా దాని రూపం ఘనంగా ఉండాలి. చిన్నబండి అయినా తన ముద్ర వేయాలి. నేను సాధారణంగా ప్రకృతి నుంచి అటవీ జంతువుల నుంచి వాహనాల డిజైన్లు చూసి ఇన్‌స్పయిర్ అవుతాను. చీటాను దృష్టిలో పెట్టుకుని నేను అనుకున్న డిజైన్ తయారు చేశాను’ అందామె. ఆ విధంగా ఆమె పూర్తిస్థాయి డిజైన్‌తో మహింద్రా ఎస్యువి 500 మార్కెట్లోకి వచ్చింది. పెద్ద హిట్ అయ్యింది. దాంతో ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మహిళా డిజైనర్‌గా క్రిపా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఇతర వాహనాల డిజైన్ల బాధ్యత కూడా ఆమెకే అప్పజెప్పారు. ‘ప్రతి మనిషికీ ఒక కథ ఉన్నట్టే ప్రతి వాహనానికీ ఒక కథ ఉండాలి. అప్పుడే జనానికి కనెక్ట్ అవుతుంది’ అంటుంది క్రిపా. ఆమె తయారు చేసిన ‘ఎస్యువి 300’ మరో మంచి డిజైన్‌గా ఆదరణ పొందింది. ఇక ‘థార్’ అయితే అందరూ ఆశపడే బండి అయ్యింది. ఇప్పుడు థార్ అమ్మకాలు భారీగా ఉన్నాయి. మహింద్రా సంస్థ ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ఉపక్రమిస్తుండగా 2021లో తన సొంత ఆటోమొబైల్ డిజైన్ స్టూడియో ఏర్పాటు కోసం సంస్థ నుంచి బయటకు వచ్చింది క్రిపా. అయితే ఇప్పుడు ఓలా గ్రూప్‌కు డిజైన్హెడ్గా పని చేస్తోంది. అంటే ఇకపై ఓలా గ్రూప్ నుంచి వెలువడే వాహనాలు ఆమె రూపకల్పన చేసేవన్న మాట. ఇరవైమంది డిజైనర్లతో కొత్త ఆలోచనలకు పదును పెట్టే క్రిపా తన బృందంలో కనీసం 5గురు మహిళలు ఉండేలా చూసుకుంటుంది. మహిళల ప్రతిభకు ఎప్పుడూ చోటు కల్పించాలనేది ఆమె నియమం. క్రిపాకు ఏ మాత్రం సమయం దొరికినా పారిస్కో లండన్‌కో వెళ్లిపోతుంది. అక్కడ ఏదైనా కేఫ్‌లో కూచుని రోడ్డు మీద వెళ్లే స్పోర్ట్స్ కార్లను పరిశీలిస్తూ ఉండటం ఆమెకు సరదా. ‘2050 నాటికి ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఎలా ఉంటుందో ఊహించుకుంటూ ఇవాళ్టి నుంచి మన పనిని తీర్చిదిద్దుకోవాలి’ అంటుందామె.ఇంత దార్శనికత ఉన్న డిజైనర్ కనుక విజయం ఆమెకు డోర్ తెరిచి నిలబడుతోంది. (చదవండి: దేశంలోనే తొలి బధిర మహిళా అడ్వకేట్ సారా! చివరికి సుప్రీం కోర్టు..) -
వ్యాయామం, డైటింగ్లు చేసినా.. బరువు తగ్గకపోవడానికి కారణం..!
కొంతమంది మంచిగా వ్యాయామం, డైటింగ్ చేసిన ఒళ్లు తగ్గదు. పైగా వారికి కూడా ఎందుకిది దండగా అనే నిరాశ వచ్చేస్తుంది. కొందరూ భలే తగ్గుతారు. మరికొందరికి మాత్రం శరీరంలో కొంచెం కూడా మార్పు రానట్లు అనిపిస్తుంది. దీనికి ఆయుర్వేద నిపుణులు నవీన్ నడిమింటి కొన్ని సలహలు సూచనలు ఇచ్చారు. అవేంటంటే.. ఒళ్లు తగ్గకపోవడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. వాటిలో కొన్ని హర్మోన్ల తేడా లేదా పీసీడీఓ సమస్య జన్యు పరమైన కారణాలు, అధికంగా ఆహారం తీసుకోవడం వ్యాయామం చేయకపోవడం సరైన శారీరక శ్రమ లేక పోవడం నూనెలో బాగా వేగిన పదార్ధాలను తినడం, మెత్తని పదార్ధాలను తినడం, కార్బో హైడ్రేట్లు ( పిండి పదార్ధాలు) ఎక్కువగా తీసుకోవడం. ఆహార విహారాలతో బాటు మధ్యాహ్నం నిద్ర పోవడం శరీరంలోని వ్యాధులు, హైపో థైరాయిడ్, కొవ్వు బాగా పెరిగిపోవడం, రక్త నాళాల్లో కొవ్వు పేరుకు పోవడం, గుండె సమస్యలు తదితరాలు ఉన్నా. సరిగా నడవలేక పోవడం సంతాన లేమి మొదలైనవి. ఒళ్లడు తగ్గడం లేదని బాధపడేవాళ్లు.. ⇒ ప్రతిరోజు ఉదయం, సాయంత్రం కపాలభాతి ప్రాణాయామం చేయండి.ఇది బరువును తగ్గించడమే కాకుండా ముఖం మీద కాంతిని కూడా పెంచుతుంది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ⇒ మీరు తినే ఆహారంలో ఎక్కువ శాతం పచ్చి కాయగూరలు మరియు పండ్లు ఉండేలా చూసుకోండి. కనీసం 30% శాతం ఇవి ఉండాలి. ⇒ ఒక తమలపాకులో 5 నుంచి ఆరు మిరియాలు కలిపి చుట్టి రోజూ ఉదయం టిఫిన్‌కి ముందు తిని, ఒక గ్లాసు మంచినీళ్ళు తాగండి. ఇది ఒంట్లో ఉన్న కొవ్వును కరిగిస్తుంది. ⇒ కొద్దిగా కొత్తిమీర, 3 నుండి 4 చిన్న అల్లం ముక్కలు కలిపి నీళ్ళు వేసి మిక్సీకి వేసుకొని జ్యూస్ చేసుకోండి. అందులో 1 స్పూన్ తేనె మరియు సగం నిమ్మకాయ బద్దను పిండండి. ఇది రోజూ పరగడపున సేవించండి. సులువుగా బరువును తగ్గిస్తుంది. ⇒ రోజుకి కనీసం 25 నుండి 30 నిమిషాల వరకు చమట కక్కేలా గుంజీలు తీయడం, స్కిప్పింగ్ చేయడం, నడవడం లాంటివి చేయండి. ఇది అన్నిటికన్నా ఎంతో ముఖ్యం. ⇒ లావు తగ్గడానికి ఆయుర్వేదంలో చింత గింజలను ఒక రోజంతా నీటిలో నానబెట్టాలి. పొద్దున బాగా పిసికి పొట్టు పోయిన తరువాత కొంచం నెయ్యి వేసి వేయించి, పొడి చేసి పెట్టుకోవాలి. అర స్పూను పొడిని పాలలో వేసి, చక్కర కలిపి తాగాలి. 40 రోజుల నుంచి100 రోజులు వాడాలి . ⇒ నేరుగా పట్టిన వాన నీటిని నిల్వ చేసుకోవాలి. ప్రతి రోజు ఒక గ్లాసు నీటిలో ఒక స్పూను పసుపు కలిపి తాగితే లావు తగ్గుతారు. స్థూలకాయులైతే.. ►తేనె 25 గ్రాములు గోరువెచ్చని నీళ్ళులో వేసుకుని ఒక గ్లాసు ఉదయం, సాయంత్రం పరగడుపున తాగాలి. ►వాయువిడంగాల పొడిని 2,3 గ్రాముల చొప్పున ఉదయం, సాయంత్రం వేడి నీటితో తీసుకోవాలి. ►త్రిఫల చూర్ణము త్రికటు చూర్ణము రెండింటిని సమాన భాగాలుగా తీసుకోవాలి. పూటకు ఒకటిన్నర స్పూను చొప్పున ఉదయం, సాయంత్రం తీసుకోవాలి. ►ప్రతి రోజు అరస్పూను నుంచి ఒక స్పూను వరకు కరక్కాయ పొడిని రెండు పూటలా క్రమం తప్పకుండా తీసుకుంటే తగ్గిపోతుంది. పీసీఓడీ సమస్య ఉన్నవాళ్లు.. ప్రతి రోజు ఒక తిప్ప తీగ ఆకును తింటూ వుంటే లావు తగ్గడమే గాక శరీరంలోని భాగాలు, చర్మం లాంటివి వేలాడుతూ వుంటే ఒక సంవత్సరానికి గట్టి పడతాయి భోజనానికి అరగంట ముందు వేరుశనగ పప్పులకు చక్కెర కలిపి తింటే భోజనం తక్కువగా తింటారు. ఆహారానికి బదులుగా కేవలం ఆపిల్ పండ్లు మాత్రమే తింటే రోజులలో లావు తగ్గుతారు. (చదవండి: డయాబెటిస్ మందుల వల్ల ఇన్ని సైడ్ ఎఫెక్ట్సా! ఏకంగా చర్మం ఊడి..) -
దీర్ఘకాలికంగా డయాబెటిస్ మందులు వాడుతున్నారా?
దీర్ఘకాలికి వ్యాధుల కోసం వాడే మందులు సైడ్ ఎఫెక్ట్ ఇస్తాయని అందరికీ తెలిసిందే. అయినప్పటికీ వాడక తప్పదు. కొన్ని వ్యాధులైతే జీవితాంతం మందులు వాడాల్సిందే. ఓ పట్టాన తగ్గవు. అలా వాడటంతో ఆ సమస్యలకు మరికొన్ని సమస్యలు యాడ్ అవుతుంటాయి. కానీ కొన్ని వ్యాధులకు వాడిన మందులు మాత్రం విపరీతమైన దుష్పరిణామాలు చూపించి మనిషిని చావు అంచులదాక తీసుకువెళ్తాయి. యూఎస్‌లోని ఓ మహిళ అలాంటి ఘోర అనుభవమే ఎదుర్కొంది. డయాబిటిస్ కోసం వాడే మందులు ఇంతటి చేటు తెచ్చిపెడతాయిన అస్సలు ఊహిచలేదని వాపోయింది. వివరాల్లోకెళ్తే..టెక్సాస్‌కు చెందిన అమెరికన్ ప్రొఫెసర్ టైప్ 2 డయాబెటిస్‌కి డ్రగ్ ఓజెంపిక్ మందులను వాడుతుంది. దీని వల్ల ఆమె విపరీతమైన దుష్పరిణామాలను ఎదుర్కొంది. ఒక్కసారిగా ఆకలిని తగ్గించేసింది. దీంతో బరువు తగ్గిపోయింది. ఆ తర్వాత ఆమె బాడీలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గిపోయాయి. జీర్ణక్రియను నెమ్మదించడంతో ఇతరత్ర దుష్పరిణామాలు ఎదుర్కోవల్సి వచ్చింది. ఇదికాస్త డిప్రెషన్ యాంగ్జయిటీలో పెట్టింది. ఆ తర్వాత ఆమె టాయిలెట్‌కి వెళ్లినప్పుడల్లా ఆమె చర్మం పొలుసులుగా ఊడిపోవడం ప్రారంభమైంది. మూత్ర విజర్జనకు వెళ్తున్న ప్రతిసారి విపరీతమైన నొప్పి బాధ తాళలేకపోయింది. ఇంతలా ఈ మందు నా శరీరంపై ప్రభావం చూపిస్తుందని అనుకోలేదని బోరున విలపించింది. దీంతో ఆమె వైద్యుడు ఆ మందులను సిఫార్సు చేయడం ఆపేశాడు. ఆ మందుని వాడటం ఆపేసినప్పటికీ ఇంకా ఆ డ్రగ్ తాలుకా దురద, మూత్ర విసర్జన నొప్పి ఇంకా పోలేదని చెబుతోంది. ఇంతకీ ఓజెంపిక్ దుష్పరిణామాలను ఎందుకు కలిగిస్తుందంటే.. సెమాగ్లుటైడ్ అని పిలిచే ఓజెంపిక్ ఊబకాయం, ఇతర బరువు సంబంధిత వైద్య సమస్యలతో జీవిస్తున్న వ్యక్తులకు చికిత్స చేయడానికి యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినస్ట్రేషన్ దీని సిఫార్సు చేయమని ఆమోదించింది. ఇది గ్లూకాగాన్లాంటి పెప్టైడ్-1 లేదా జీఎల్పీ-1 రిసెప్టర్ అగోనిస్ట్లను సక్రియం చేసి సహజంగా సంభవించే హర్మోన్ జీఎల్పీ-1 ప్రభావాన్ని పెంచుతుంది. ఈ జీఎల్పీ -1 శరీరంలో బహుళ విధులను నిర్వర్తిస్తుంది. రక్తంలో గ్లూకోజ్‌ను పెంచే హార్మోన్ అయిన గ్లూకాగాన్ విడుదలను తగ్గిస్తుంది. జీఎల్పీ-1 గ్రాహకం మెదడులోని ఆకలి కేంద్రాలను ప్రభావితం చేస్తుంది. ఆకలి కోరికను తగ్గిస్తుంది. కడుపు ఖాళీ అయ్యే రేటును పెంచి బరువు తగ్గేలా చేస్తుంది. ఈ డ్రగ్ వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం.. జంతువులలో ఈ డ్రగ్‌ని ప్రయోగిస్తే థైరాయిడ్ క్యాన్సర్ ప్రమాద హెచ్చరికను ఇచ్చింది. ఐతే ఈ ఔషధం మానవులలో థైరాయిడ్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందా లేదా అన్నది క్లారిటీ లేదు. కానీ యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినస్ట్రేషన్ మాత్రం అరుదైన జన్యు పరిస్థితి ఉన్నవారు, లేదా కుటుంబసభ్యులకు థైరాయిడ్ క్యాన్సర్ ఉన్న వ్యక్తులకు ఈ మందుని సిఫార్సు చేయకూడదని పేర్కొంది. (చదవండి: భారత సంతతి విద్యార్థికి.. ఒకేరోజు ఏకంగా ఆరుసార్లు గుండె ఆగిపోడమా!..) -
ఒకేరోజు ఏకంగా ఆరుసార్లు గుండె ఆగిపోవడమా..! పాపం ఆ వ్యక్తి..
సాధారణంగా గుండెపోటు వస్తేనే మనుషులు గిలగిల లాడిపోతారు. అలాంటిది ఒకేరోజు ఆరుసార్లు గుండె ఆగిపోతే ఆ మనిషి ఉంటాడా? అని డౌటు వస్తుంది కదా!. ఒకవేళ బతికినా పూర్తిస్థాయిలో కోలుకుంటాడా అన్నది అనుమానమే. అచ్చం అలానే భారత సంతతి విద్యార్థి కార్డియాక్ అరెస్ట్‌కి గురయ్యాడు. అయితే అతను ఏమయ్యాడు? బతికాడా? అనే కదా!. నిజానికి ఇలా ఆరుసార్లు గుండె ఆగిపోవడం జరుగుతుందా? ఎందుకిలా? తదితరాల గురించే ఈ కథనం. యూకేలోని 21 ఏళ్ల భారత సంతతి అమెరికన్ విద్యార్థి అతుల్ రావు ఒకే రోజు ఆరుసార్లు గుండె ఆకస్మాత్తుగా ఆగిపోయింది. దీంతో అతను ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతడి స్నేహితులు సమీపంలోని ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు అంబులెన్స్‌ని పిలిపించారు. ఇంతలో సెక్యూరిటీ గార్డు అతని ఛాతీకి కంప్రెషన్ ఇచ్చేలా సీపీఆర్ చేశాడు. ప్రయోజనం లేకపోయింది. ఆస్పత్రిలో చేరేటప్పటికీ తీవ్ర అస్వస్థతతో ఉన్నాడు. ఎక్స్ట్రాకార్పోరియల్ మెమ్బ్రేన్ ఆక్సిజనేషన్(ఈసీఎంవో)కి యాక్సిస్ చేశారు. గుండె, ఊపిరితిత్తుల పనిని పూర్తిగా భర్తీ చేసేలా లైఫ్ సపోర్ట్ సిస్టమ్‌ని అమర్చారు వైద్యులు. ఇంతలో క్లాట్ బస్టింగ్ డ్రగ్స్ పనిచేయం ప్రారంభించాయి. దీంతో అతను లైఫ్ సపోర్ట్ మెషీన్లు, ఈసీఎంఓ తదితరాలు లేకుండానే పూర్తి స్థాయిలో కోలుకున్నాడు. అతుల్ ఇప్పుడు యూఎస్‌కి తిరిగి వెళ్లాడు. పూర్తిగా కోలుకున్నాడు కూడా. స్టూడెంట్ అతుల్ రావు ఎదుర్కొన్న ఈ పరిస్థితిని వైద్యపరిభాషలో పల్మనరీ ఎంబోలిజం అంటారు పల్మనరీ ఎంబోలిజం అంటే.. నిపుణుల అభిప్రాయం ప్రకారం..పల్మోనరీ ఎంబోలిజం చాలా సందర్భాల్లో కాలులోని లోతైన సిరల్లో రక్తం గడ్డకట్టడం మొదలై ఊపిరితిత్తులకు వెళ్తుంది. అరుదుగా శరీరంలోని వేరే ఏదైనా భాగంలోని సిరల్లో రక్తం గడ్డకట్టడం జరుగుతుంది. ఫలితంగా ఊపిరితిత్తులకు రక్తప్రవాహాన్ని పరిమితం చేసి, ఆక్సిజన్ స్థాయిలను తగ్గిస్తుంది. ఫలితంగా పల్మనరీ ధమనుల్లో రక్తపోటు పెరిగిపోతుంది. దీన్నే పల్మనరీ ఎంబోలిజం అంటారు. ఈ పల్మోనరీ ఎంబోలిజంలో గుండె లేదా ఊపిరితిత్తులకి రక్తప్రవాహం ఆగిపోయి పనితీరుకి ఆటకం ఏర్పడుతుంది. ఫలితంగా గుండె లేదా ఊపిరితిత్తులు ఆకస్మికంగా వైఫల్యం చెంది మరణానికి దారితీస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత సాధారణంగా ఉన్న గుండె, రక్తనాళాల వ్యాధులకు సంబంధించిన వాటిల్లో ఇదొకటి. లక్షణాలు శ్వాస ఆడకపోవడం మరియు ఛాతీ నొప్పులు కాలక్రమేణా పెరుగుతాయని నిపుణులు అంటున్నారు. అలాగే, చాలా మంది రోగులు శ్లేష్మంతో దగ్గినా. విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కూడా శ్వాస ఆడకపోవడం ఛాతీ, చేయి, భుజం, మెడ లేదా దవడలో పదునైన నొప్పి దగ్గు పాలిపోయిన చర్మం వేగవంతమైన హృదయ స్పందన విపరీతమైన చెమట ఆత్రుత మూర్ఛపోవడం లేదా స్ప్రుహతప్పిపోవడం గురక ఎవరికి ప్రమాదం అంటే.. కాలులో రక్తం గడ్డకట్టిన వారు కూర్చొని పనిచేసేవారు సిరకు గాయం లేదా గాయం కలిగిన వారు చాలా కాలం పాటు గర్భనిరోధక మాత్రలు తీసుకోవడం లేదా హార్మోన్ పునఃస్థాపన చికిత్స చేయించుకోవడం పొగ స్ట్రోక్ వంటి గుండె జబ్బుల చరిత్రను కలిగి ఉండటం అధిక బరువు లేదా ఊబకాయంతో ఉన్నారు (చదవండి: అరుదైన అలెర్జీ..! సాక్షాత్తు వైద్యురాలే ఐనా..) -
అరుదైన చర్మ వ్యాధి..ఒకేసారి వందలాది చీమలు
చర్మ వ్యాధులకు సంబంధించి చాలా భయనకమైనవి చూశాం. మరికొన్ని చర్మ వ్యాధులు పుండ్లు, గాయాలుగా మారి ప్రాణాలు కోల్పోయేలా చేయడం గురించి కూడా విన్నాం. ఈ చిన్నారికి వచ్చిన వ్యాధి అత్యంత అరుదైనది, వర్ణించలేనంత బాధకరమైనది. తీవ్రమైన దురద తోపాటు బహిరంగ గాయంలా మారి తట్టుకోలేని నరకయాతన అనుభవిస్తున్నాడు ఆ తొమ్మిదేళ్ల చిన్నారి. వివరాల్లోకెళ్తే..యూకేలోని నార్తాంప్టన్కి చెందిన థియోడర్ మోరార్ అనే తొమ్మిదేళ్ల చిన్నారి అరుదైన చర్మ పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. దీని కారణంగా అతని చర్మం కింద వందలాది చీమలు పాకినంత దురదగా ఉండి, చర్మం పగిలి రక్తస్రావం అవుతుంది. ఆ తర్వాత విపరీతమైన దురద. ఒక పక్క రక్తంకారడంతో దాన్ని గోకలేనంత దారుణమైన స్థితి. ఆ యాతన అనుభవించలేక ఆ చిన్నారి చనిపోతాను నా వల్ల కాదు అంటుంటే.. ఆ తల్లిదండ్రుల ఆ ఆవేదన వర్ణానాతీతం. కళ్లముందే కన్న కొడుకు పడుతున్న బాధను చూసి తట్టుకోలేక తల్లడిల్లిపోతున్నారు ఆ తల్లిదండ్రులు. ఆ చిన్నారి పుట్టుకతోనే ఈ పరిస్థతితో జన్మించాడు. అది క్రమంగా పెరిగిపోడం జరిగింది. కొంతకాలం తగ్గినట్లు తగ్గి మళ్లీ విజృంభించింది. దీంతో ఆ చిన్నారి శరీరం గాయాలతో రక్తం కారి పగుళ్లుగా ఉంటుంది. ఈ పరిస్థితి కారణంగా చేతులు కాళ్లు కదిలించలేదు. తట్టుకోలేని దురదను భరించలేక ఎన్నో రాత్రుళ్లు ఏడుస్తూనే ఉంటాడు. ఈ పరిస్థితిని న్యూరోడెర్మాటిటిస్ అని అంటారు. ఏంటీ న్యూరోడెర్మాటిటిస్ అంటే.. వైద్య పరిభాషలో దీర్ఘకాలికంగా వచ్చే దురద లేదా స్కేలింగ్ ద్వారా వచ్చే ఒక విధమైన చర్మ పరిస్థితి. చర్మంపై వచ్చే దురద ప్రాంతాలను గమనిస్తే.. సాధారణంగా మెడ, మణికట్టు, ముంజేతులు, కాళ్లు లేదా గజ్జలపై ఎక్కువగా ఇలా ఉంటుంది. అయితే న్యూరోడెర్మాటిటిస్కి అసలు ప్రధాన కచ్చితమైన కారణం ఏంటన్నది నిపుణులకు కూడ తెలియదు. కొందరి నిపుణుల అభిప్రాయం ప్రకారం తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన, భావోద్వేగాలు లేదా నిరాశ కారణంగా ఈ దురద వస్తుంటుందని చెబుతుంటారు. ఇతర కారణాలు .. నరాలలో గాయాలు పురుగు కాట్లు బిగుతైన దుస్తులు ధరించటం సోరియాసిస్ వంటి ఇతర చర్మ వ్యాధులు లక్షణాలు చర్మంపై విపరీతమైన దురద, పొడిగా మారడం విపరీతమైన నొప్పి జుట్టు ఊడిపోవటం బహిరంగ గాయాలు, రక్తస్రావం ఇన్ఫెక్షన్లు, పసుపు రంగు చీము కారడం చికిత్స దీన్ని దీర్ఘకాలిక చికిత్స ద్వారానే నయం చేయగలం చర్మ లేపనాలతో ఎరుపు రంగులోని వాపు, దురద, సున్నితత్వాన్ని తగ్గించడంలో సహయపడతాయి అలెర్జీని పెంచకుండా యాంటీహిస్టామైన్లు ఇస్తారు పొడిబారటం, దురద లేకుండా ఉండేలా మాయిశ్చరైజ్ క్రీములు కూల్ కంప్రెస్తో చర్మాన్ని మృదువుగాచేసి, మాయిశ్చరైజర్ క్రీములు చొచ్చుకునిపోయేలా చేసి త్వరిత గతిన కోలుకునేలా చేస్తారు. (చదవండి: ఆల్కహాల్ మోతాదుకు మించితే చనిపోతారా? పాయిజిన్‌గా ఎలా మారుతుంది?) -
ఆల్కహాల్ మోతాదుకు మించితే చనిపోతారా?
మోతాదుకు మించి ఆల్కహాల్ తాగితే చనిపోతారా?..అంటే పలు ఉదంతాల్లో అది నిజమనే ప్రూవ్ అయ్యింది కూడా. ఎందువల్ల ఇలా జరుగుతుంది?. ఒక్కసారిగా అది మన శరీరానికి హని కలిగించే విషంలా ఎలా మారుతోంది తదితారాల గురించే ఈ కథనం. ఈ ఆల్కహాల్‌కి చెందిన ఛాలెంజింగ్లను తీసుకుని చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇటీవలే చైనాలో ఓ వ్యక్తి రెండు లక్షలు గెలుచుకోవడం కోసం ఆఫీస్ పార్టీలో ఏకంగా ఒక లీటరు ఆల్కహాల్‌ని కేవలం పది నిమిష్లాల్లో హాంఫట్ చేశాడు. ఇక అంతే కాసేపటికే ప్రాణం పోయింది. ఆ వ్యక్తి పేరు జాంగ్. ఆస్ప్రతికి తరలించగా గుండెపోటు, ఆస్పిరేషన్ న్యూమోనియా తదతరాలతో బాధపడుతున్నట్లు తేలింది. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయినట్లు అతడి సన్నిహితులు తెలిపారు. ఆల్కహాల్ తాగేంతవరకు బాగానే ఉన్న వ్యక్తి వెంటనే ఎలా పాయిజన్ అయ్యి ప్రాణాంతకంగా మారింది...?. తక్కువ సమయంలో ఎక్కువ ఆల్కహాల్ తాగితే.. ఓ వ్యక్తి ఛాలెంజ్ పరంగా, లేదా ఏ కారణం చేతనైనా తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో ఆల్కహాల్ తాగితే అది ఒక్కసారిగా పాయిజన్‌గా మారిపోతుంది. అమాంతం రక్తంలో ఆల్కహాల్ స్థాయిలు పెంచేందుకు దారితీస్తుంది. రక్తంలో ఎప్పుడైతే ఆల్కహాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయో..అప్పుడూ కాలేయం దాన్ని విచ్ఛిన్నం చేయలేక ఇబ్బంది పడుతుంది. రక్తప్రవాహంలో అదనపు ఆల్కహాల్ సాధారణ పనితీరును దెబ్బతీసి శ్వాస, హృదయస్పందన రేటు, రక్తపోటు పడిపోయేలా చేస్తుంది. దీంతోపాటు శరీర విధులను నియంత్రించే మెదుడలోని భాగాలను కూడా ప్రభావితం చేస్తుంది. రక్తంలో ఆల్కహాల్ పెరుగుతూనే ఉన్నందున అతడు బతికే అవకాశాలు నెమ్మదిగా నెమ్మదిగా తగ్గిపోతుంది. సంకేతాలు లక్షణాలు.. ఆల్కహాల్‌తో ఇలాంటి ఛాలెంజ్‌లు ప్రమాదకరమైనవి. అత్యవసరంగా చికిత్స అందించకపోతే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఆ వ్యక్తులు ప్రమాదకరంలో ఉన్నారని ఎలా గుర్తించాలంటే.. వారి గోళ్లు, పెదవులు నీలం రంగులో మారి తేమగా లేదా చల్లగా అవుతున్నా.. నడవలేకపోతున్నా హృదయస్పందన సరిగా లేకపోయినా మూత్రశయం లేదా ప్రేగు నియంత్రణ కదలికలను నియంత్రించడం వాంతులు లేదా ఉక్కిరిబిక్కిరి చికిత్స! నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆల్కహాల్ పాయిజనింగ్ అనేది చాలా తీవ్రమైన పరిస్థితి. తక్షణమే ప్రాణాలను రక్షించేలా చికిత్స అందించాలి. నిర్జలీకరణానికి ఇంట్రావీనస్ ద్రవాలు ఇస్తారు. ఆ తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతారు అలాగే ఆల్కహాల్ పాయిజనింగ్తో బాధపడుతున్న వ్యక్తి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండొచ్చు. కాబట్టి కాన్యులాను ఉపయోగించి వారికి ఆక్సిజన్ని అందించడం చికిత్సలో అత్యంత ముఖ్యం పొట్టని ఒక పంపు సాయంతో టాక్సిన్లు లేకుండా శుభ్రం చేయడం రక్తంలోఇన ఆల్కహాల్ స్థాయిలను తగ్గించేలా రక్తాన్ని ఫిల్టర్ చేసేందుకు డయాలసిస్ చేయడం చేసి. ఆ వ్యక్తి ప్రాణాలను కాపాడతారు వైద్యులు. (చదవండి: అరుదైన అలెర్జీ..! సాక్షాత్తు వైద్యురాలే ఐనా..) -
ఐఫోన్ నుంచి కాళ్లకి వేసుకునే షూ వరకు అప్‌గ్రేడ్..ఇదేమైనా వ్యాధా?
ఇటీవల యువత గాడ్జెట్ల వ్యామోహం ఓ రేంజ్లో ఉంది. మార్కెట్లోకి ఏ కొత్త ఫీచర్ వచ్చినా క్షణం కూడా ఆగరు. రిలీజ్ చేస్తున్న డేట్ ఇవ్వంగానే కొనేసేందుకు రెడీ. ఇంట్లో తల్లింద్రండ్రుల వద్ద డబ్బు ఉందా లేదా అనేది మేటర్ కాదు. ఆరు నూరైనా..కేవలం ఆ కొత్త ఫీచర్ మనం వద్ద ఉండాల్సిందే అన్నంతగా ఉన్నారు యువత. ఇది అసలు మంచిదేనా?..ఒకవేళ్ల అలా కొత్త టెక్నాలజీ కొత్త ఫ్యాషన్‌కి అప్‌గ్రేడ్ కాకపోతే ఏదో పెద్ద నష్టం జరిగనట్టు లేదా భయానక అవమానం జరిగిన రేంజ్లో యువత ఇచ్చే బిల్డప్ మాములుగా ఉండదు. ఏంటిదీ? దీని వల్ల ఏం వస్తుంది? ఎవరికీ లాభం? నిజానికి యువత ముఖ్యంగా కాలేజ్‌కి వెళ్లే టీనేజ్‌ల దగ్గర నుంచి ఉద్యోగాలు చేస్తున్న పెద్దవాళ్ల వరకు అందరికి అప్‌గ్రేడ్ అనే జబ్బు పట్టుకుంది. మార్కెట్లోకి వచ్చే కొత్త ఫీచర్ లేదా టెక్నాలజీకి అప్‌గ్రేడ్ అయిపోవాల్సిందే!. లేదంటే ఓర్నీ..! ఎక్కడ ఉన్నవురా? అంటూ ఎగతాళి. పైగా నిన్న మొన్నటి టెక్నాలజీని కూడా తాతాల కాలం నాటిది అంటూ తేలిగ్గా తీసిపడేస్తాం. ఇలా ధరించే దుస్తులు దగ్గర నుంచి కాలికి వేసుకునే చెప్పుల వరకు మార్కెట్లోకి వచ్చే ప్రతీ కొత్త బ్రాండ్లతో అప్‌గ్రేడ్ అవ్వడం నాగరికత లేక ఓ గొప్ప ట్రెండ్‌గా ఫీలవుతున్నారా? అంటే..ఇక్కడ ఇలా అప్‌గ్రేడ్ పేరుతో మార్కెట్లోకి వచ్చే ప్రతిది కొంటున్న యువతకు కూడా ఇలా ఎందుకు అనేది వారికే స్పష్టత లేదు. కానీ ఓ ఆందోళనకరమైన విషవృక్షంలా మనుషుల్లో ఈ విధానం విజృంభిస్తుంది. మన పక్కోడు ఆ కొత్త టెక్నాలజీకి వెళ్లపోయినంత మాత్రనా వాడు ఏదో సాధించినట్లు కాదు. ముందు మనం దేన్ని ఎంతవరకు కొనాలి. దేనికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలి అనే ధోరణిని మర్చిపోయేలా మాయాజాలం సృష్టిస్తున్నాయి ఈ కార్పొరేట్ కంపెనీలు. ఉదహారణకి ఐఫోన్ పరంగా చూస్తే 4జీ నుంచి 5జీ అప్‌గ్రేడ్ అవ్వాలని నీ వద్ద ఉన్న ఫోర్జీ ఫోన్‌ని వదిలేసి కొత్తదానికి వెళ్లాల్సినంత పనిలేదు. మహా అయితే వీడియో లేదా స్టోరేజ్‌కి సంబంధించి కాస్త బెటర్ ఫీచర్ ఉండొచ్చు. దానికోసం ఇలా వేలవేలకు వేలు దుబారా చేయడం సరియైనది కాదు. ఇక్కడ ఉన్న చిన్న లాజిక్‌ని మర్చిపోతున్నాం. మనం ఓ ఫోన్ లేదా ఏ వస్తువైన కొనుక్కుంటున్నాం. దానికి కంపెనీ ఇన్ని ఏళ్లు అని వ్యారెంటీ ఇచ్చేది. మనం కొనుక్కుని వెళ్లిపోతే వాడివద్దకు మళ్లా కస్టమర్లు రారు. వాళ్ల బ్రాండ్‌ని మర్చిపోతారు. నిరంతరం కస్టమర్లతో టచ్‌లో ఉండేలా తన బ్రాండ్‌ని ప్రమోట్ చేసుకునే దృష్ట్యా కంపెనీలు చేసే ఇంద్రజాలం ఇది. దీన్ని గమనించక మన జేబులు గుల్లచేసుకుంటూ అప్‌గ్రేడ్ అంటూ మార్కెట్లోకి వచ్చే ప్రతి కొత్త బ్రాండ్‌ని కొనేస్తున్నాం. అప్పటి వరకు మనతో ఉన్న వాటిని పక్కన పడేస్తున్నాం. కొందరి యువతలో ఇదొక మానసిక రుగ్మతలా తయారయ్యిందని మానసిక నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా టీనేజ్ పిల్లలు కొత్త టెక్నాలజీకి చెందిన వస్తువు లేదా మార్కెట్లోకి వచ్చిన ట్రెండీ ఫ్యాషన్ తన వద్ద లేనంత మాత్రన ఆత్మనూన్యతకు గురయ్యిపోతున్నారు. మనుషులకు వారి భావాలకు వాల్యూ ఇవ్వండి. నిజానికి అదేమీ స్టాటస్ కాదు. అది అందరూ గమనించాలి. తల్లిదండ్రులు ఇలాంటి ధోరణి గల పిల్లలను గమనించి కౌన్సిలింగ్ ఇప్పించడం లేదా మీరే చొరవ తీసుకుని ఫ్రెండ్లీగా మాట్లాడి సరైన గాఢీలో పెట్టాలి లేదంటే ఆ మోజులో జీవితాలు అల్లకల్లోలం అయిపోతాయి. ఎందుకంటే ప్రతీది కొనేయ్యలేం. అలాగే ప్రతి అప్‌గ్రేడ్‌ని ప్రతిసారి అందుకోవడం సర్వత్రా సాధ్యం కాదు. ముందు యువత సానుకూల దృక్పథంతో ఈ వస్తువు లేదా దుస్తులు కొనడం వల్ల ఎవరికీ లాభం, దీన్ని ఎందుకు మార్కెట్లో సొమ్ము చేసుకునేలా ఎందుకు ప్రచారం చేస్తారు అనే దానిపై దృష్టిపెట్టండి. మీ పరిజ్ఞానం ఇలాంటి చిన్న చితక వస్తువులకు బానిసైపోకూడదు. ఏదైనా మనకు ఉపయోగపడేది, మన స్థాయికి, ఉన్న పరిస్థితులకు అనుగుణమైనవి మన వద్ద ఉంటే చాలు. ఈ పిచ్చి విధానం మీ ఉనికిని, మీ వైఖరిని కోల్పోయేలా చేస్తుంది. నువ్వు కొత్త టెక్నాలజీకి అడాప్ట్ అవ్వడం కాదు. టెక్నాలజీనే నువ్వు సృష్టించగలిగే దిశగా నాలెడ్జ్‌ని పెంచుకునేలా అడుగులు వేస్తే మీ భవిష్యత్తు బంగారు పూలబాట అవుతుందని అంటున్నారు మానసికి నిపుణులు. (చదవండి: తినదగిన ప్లేట్లు! ఔను! భోజనం చేసి పారేయకుండా..) -
నవజాత శిశువులకు తేనె ఇవ్వకూడదా? సోనమ్ కపూర్ సైతం..
అప్పుడే పుట్టిన పిల్లలకు కొందరు తేనె పెడుతుంటారు. మాటలు తెనె పలుకుల్లా ఉంటాయని మన పెద్దవాళ్ల ఆలోచన. చెప్పాలంటే తరతరాలుగా వస్తున్న సంప్రదాయంలో భాగంగా మన పెద్దలు అప్పుడే పుట్టిన పిల్లలకు తేనె పెడుతుంటారు. ఇలా పెట్టడంతో పిల్లలు చనిపోయిను ఉదంతాలు కూడా ఉన్నాయి. ఐతే అసలు తేనె పిల్లలకు పెట్టొచ్చా? ఆయుర్వేద పరంగా ఎన్నో ఔషధా గుణాలు కలిగిన తేనె చిన్నారుల పాలిట విషమా? తదితరాల గురించే ఈ కథనం. ఏదీఏమైనా అప్పుడే పుట్టిన నవజాత శిశువులకు తేనె అస్సలు పెట్టొదనే అంటున్నారు ఆరోగ్య నిపుణలు. బాలీవుడ్ నటి, అనిల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్ సైతం ఇదే చెబుతుంది. ఎన్నో ఏళ్లుగా ఇలా చేసినప్పటికీ నిర్మొహమాటంగా మీ ముక్కు పచ్చలారని చిన్నారులకు తేనెను ఇవ్వనని గట్టిగా చెప్పండి అని అంటోంది సోనమ్. అది వారి ప్రాణాలను హరించే విషం అంటూ హితవు పలుకుతుంది. తాను కూడా తన కొడుకు వాయు కపూర్‌కి ఇవ్వలేదని. ఇది మన ఆచారమే అయినా..దాన్ని తను స్కిప్ చేశానని. అలాగే మీరు కూడా చేయండి అని సోషల్ మీడియా వేదికగా చెబుతుంది. అప్పుడే పుట్టిన శిశువుల్లో పూర్తిస్థాయి జీర్ణవ్యవస్థ ఉండదు. దీంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు ప్రాణాంతకం కూడా కావచ్చు. దయచేసి ఇలాంటి పనులు మానుకుండి. కోరి కోరి గర్భశోకాన్ని అనుభవించొద్దు ఓ తల్లిగా చెబుతున్నా అని సోనమ్ స్ట్రాంగ్‌గా వార్నింగ్ ఇస్తోంది. “had an argument with Pandit ji for feeding Honey to newly born child because i don’t believe in these traditions”, like seriously ??? Wokeism at its peak!! pic.twitter.com/fBbQ7TVGVL — Moana (@ladynationalist) September 27, 2023 శిశువులకు తేనె ఎందుకు సురకక్షితం కాదంటే... శిశువులకు తేనె ఎందుకు సురక్షితం కాదని తెలుసుకోవడానికి తాను ఆరోగ్య నిపుణులను కూడా సంప్రదించినట్లు తెలిపింది సోనమ్. అంతేగాదు ఆమె శిశువులకు తేనె ఎందుకు ఇవ్వకూడదో వివరిస్తూ, సికె బిర్లా హాస్పిటల్ గురుగ్రామ్‌లోని నియోనాటాలజీ అండ్ పీడియాట్రిక్స్ డాక్టర్ శ్రేయా దూబే చెప్పిన విషయాలను కూడా పంచుకుంది. తేనెలో క్లోస్ట్రిడియం అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది 12 నెలల కంటే తక్కువ వయస్సు ఉన్న శిశువుల ప్రేగులలో విషాన్ని ఉత్పత్తి చేస్తుంది. అదికాస్త శిశు బోటులిజం అనే తీవ్రమైన వ్యాధికి దారితీస్తుంది. ఈ బొటులిజంలో చాలా రకాలు ఉన్నాయి. వాటిలో.. ఒకటి ఆహారం ద్వారా వచ్చేవి, రెండు గాయం ద్వారా వచ్చే శిశు బొటులిజం. ఈ బ్యాక్టీరియా శిశువుల నరాలపై దాడి చేసి ప్రాణాలు కోల్పోయేలా చేస్తుంది. అందువల్ల, తేనెనూ ఏ విధంగానూ శిశువులకు తినిపించకపోవడమే మంచిదిని సోనమ్ గట్టిగా నొక్కి చెబుతోంది. వైద్యులు ఏం చెబుతున్నారంటే.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం తేనెలో "క్లోస్ట్రిడియం బోటులినమ్ అనే తక్కువ ఆక్సిజన్ పరిస్థితులలో ప్రమాదకరమైన టాక్సిన్లను (బోటులినమ్ టాక్సిన్స్) ఉత్పత్తి చేసే బాక్టీరియం ఉంటుందని పేర్కొంది. శిశు వైద్యురాలు డాక్టర్ మీనా జే మాట్లాడుతూ..వడకట్టలేని లేదా ప్రాసెస్ చేయని తేనె శిశువులకు ఇవ్వడం వల్ల న్యూరోటాక్సిసిటీకి గురై కండరాల పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇది శిశువుని మరణం అంచులదాక తీసుకువెళ్తుందని తెలిపారు. తొలుత మలబద్దకం, హైసోటోనియాతో మొదలవుతుంది. క్రమేణ పక్షవాతానికి దారితీసి శ్వాస తీసుకోలేని స్థితికి చేరుకుంటారు. చివరికి మరణం సంభవిస్తుందని చెబుతున్నారు. అలాగే హైదరాబాద్‌లోని యశోద ఆస్పతత్రిలోని శిశు వైద్యుడు డాక్టర్ సురేష్ కుమార్ పానుగంటి మాట్లాడుతూ.. తేనె వల్ల శిశు బొటులిజంకి గురవ్వుతారని అన్నారు. దీనివల్ల కండరాల బలహీనతకు దారితీసి కనీసం పాలను కూడా ఫీడ్ చేయలేనంత బలహీనంగా మారిపోయి విరేచనలు అయ్యే అవకాశం ఉందని అన్నారు. నవజాత శిశువుల్లో అప్పుడే రోగ నిరోధక వ్యవస్థ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందదు. దీని ఫలితంగా మనం ఆచారం పేరుతో శిశువులకు తేనెను ఇచ్చేస్తాం. వారి ప్రేగుల్లో తేనెలో ఉన్న టాక్సిన్స్‌తో పోరాడే రక్షణ పూర్తిగా ఉండదు. జీర్ణసమస్యలు ఏర్పడి వివిధ అనారోగ్య సమస్యలకు దారితీసస్తుందని హెచ్చరిస్తున్నారు. ఏడాదిలోపు చిన్నారులకు తేనె ఇవ్వకపోవడమే మంచిదని సూచిస్తున్నారు డాక్టర్ సురేష్ కుమార్ పానుగంటి. ఇక ఇండియన్ పీడియాట్రిక్ ప్రకారం అప్పుడే పుట్టిన శిశువులకు జంతువులకు సంబంధించిన పాలు, పాల పొడి, టీ, నీరు, గ్లూకోజ్ నీరు లేదా ఇతర ఏ ద్రవాలు ఆహారంగా వ్వకూడదని హానికరం అని పేర్కొంది. ప్రజలు తేనెని శిశువులోని ప్రేగు కార్యకలాపాలను ఉత్తేజపరిచి విరేచనం సాఫీగా అయ్యేలా చేస్తుందని భావిస్తారు. వాస్తవానికి తేనె శరీరంలో చాలా నీటిని తీసుకుంటుంది. ఫలితంగా వదులుగా ఉండే మలం వస్తుంది .కానీ అప్పుడే ఉండే శిశువు శరీరంలో ఆ స్థాయిలో నీరు ఉండదు, పైగా అరిగించుకునేంత జీర్ణవ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో ఉండదు. అందువల్ల ఇలాంటి ఆచారాన్ని మానుకోవాలని డాక్టర్ అమిత్ గుప్తా చెబుతున్నారు. భారతదేశంలో అనేక ప్రాంతాల్లో నవజాత శిశువుల తొలి ఆహారంగా ఆవుపాలు లేదా తేనె వంటివి ఇస్తుంటారు. ఇది చాలా పెద్ద తప్పుని గట్టిగా నొక్కి చెబుతున్నారు. తల్లిపాలు తప్ప మిగతావన్నీ శిశువుకు లేనిపోని ఆరోగ్య సమస్యలను కలిగించేవేనని అధ్యయనంలో వెల్లడైంది. కావునా మనం ఆ సంస్కృతులు, ఆచారాలు అనేవి ఆయా పరిస్థితులు దృష్ట్యా వచ్చినవి. కానీ ప్రస్తుతం పరిస్థితులు అంతటి స్థాయిలో లేవు అనేదాన్ని కూడా మనం గమనించి విచక్షణతో వ్యవహరించాల్సి ఉంది. (చదవండి: ఆరోగ్యం గురించి.. ఆనాడే గాంధీ పుస్తకం రాసి మరీ..) -
గ్యాస్ ట్రబుల్ కంట్రోల్ కావాలంటే.. ఇలా చేయండి!
గ్యాస్ కడుపులోకి చేరాక పొట్టఉబ్బరంగా అనిపించడం... కొన్నిసార్లు అది ఛాతీలోనొప్పి కలిగించడం, ఒక్కోసారి గుండెపోటుగా పొరబడటం... ఇలాంటి ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తుంది. ఈ సమస్యకు తేలికపాటి పరిష్కారాలివి... ∙ ఆహారాన్ని మెల్లమెల్లగా తినాలి. తినే సమయంలో గాలి మింగకుండా ఉండటం కోసం పెదవులు మూసి ఆహారాన్ని నమలాలి. తక్కువ తక్కువ మోతాదుల్లో ఎక్కువ సార్లు తినడం మంచిది. కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలు, బాగా వేయించిన పదార్థాలకూ దూరంగా ఉండాలి. పొగ, మద్యం అలవాట్లను మానేయాలి. రోజూ కనీసం రెండు లీటర్ల కంటే ఎక్కువగా మంచినీళ్లు తాగాలి. గ్యాస్ ఎక్కువగా ఉండే కూల్‌డ్రింక్స్, సోడాలు, కార్బొనేటెడ్ డ్రింక్స్ వంటి బీవరేజెస్‌కు దూరంగా ఉండాలి. గ్యాస్‌ను పెంచే వెజిటబుల్స్నూ, సిట్రస్ జాతికి చెందిన పండ్లను పరిమితంగా తీసుకోవాలి. పాలు, పాల ఉత్పాదనలతో కడుపు ఉబ్బరమై, పొట్టలో గ్యాస్ పెరిగితే ల్యాక్టోజ్ రహిత పాలు, పాల ఉత్పాదనలను తీసుకోవడం. బరువు పెరగకుండా చూసుకోవాలి. చురుగ్గా ఉంటూ, రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. (చదవండి: ఆరోగ్యవంతమైన వ్యక్తికి రోజూకి..అది జస్ట్ ఐదు గ్రాములే చాలట!) -
ఆరోగ్యవంతమైన వ్యక్తికి రోజూకి..అది జస్ట్ ఐదు గ్రాములేనా..?
రోడ్డు పక్కన వేడివేడి పకోడీ, మిరపకాయ బజ్జీ, సమోసా మొదలుకుని మంట కింద మసాలా దాకా. ఇలా బయట ఏం తిన్నా మనలో చాలామందికి కాస్త ఉప్పు గట్టిగా పడాల్సిందే. ఇంట్లో కూడా కూరలు మొదలుకుని తెలుగు వారికే ప్రత్యేకమైన నానా రకాల పచ్చళ్ల దాకా అన్నింట్లోనూ ఉప్పు కాస్త ఎక్కువగా వేయనిదే ముద్ద దిగని వాళ్లు చాలామందే ఉన్నారు. ఇలా సగటు భారతీయుడు రోజూ ఎడాపెడా ఉప్పు తినేస్తున్నాడట. ఈ క్రమంలో నిర్ధారిత మోతాదును ఎప్పుడో దాటేశాడని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది...ఆరోగ్యవంతుడైన వ్యక్తి ఆహారంలో రోజుకు 5 గ్రాములు, అంతకంటే తక్కువ ఉప్పు తీసుకోవాలి. కానీ భారతీయులు మాత్రం రోజుకు ఏకంగా 8 గ్రాములు లాగించేస్తున్నారు! జర్నల్ నేచర్ పోర్టుఫోలియో తాజాగా జరిపిన అధ్యయనంలో ఈ మేరకు తేలింది. ఇలా చేశారు... జాతీయ అంటేతర వ్యాధుల పర్యవేక్షణ సర్వేకు సేకరించిన శాంపిల్‌నే ఈ సర్వేకు ఆధారంగా తీసుకున్నారు. వారిలో 3,000 మంది వయోజనులను రాండమ్‌గా ఎంచుకున్నారు. ఉప్పులో కీలకంగా ఉండే సోడియం మోతాదు వారి మూత్రంలో ఏ మేరకు ఉందో పరిశీలించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో దాన్ని పోల్చి చూశారు. వారందరూ మోతాదుకు మించి చాలా ఎక్కువగా ఉప్పు తీసుకుంటున్నట్టు తేలింది! సర్వేలో చాలా ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి... అన్ని సామాజిక వర్గాల వారూ ఉప్పు చాలా ఎక్కువగా తింటున్నారు. అయితే ఈ విషయంలో మహిళలతో పోలిస్తే పురుషులదే పైచేయి. మహిళలు రోజుకు 7.9 గ్రాముల ఉప్పు తింటుంటే పురుషులు 8.9 గ్రాములు లాగిస్తున్నారు! ఉద్యోగులు 8.6 గ్రాములు, పొగ తాగేవారు 8.3 గ్రాములు, హై బీపీ ఉన్నవారు 8.5 గ్రాముల ఉప్పు తింటున్నారని తేలింది. ఇక ఊబకాయులైతే ఏకంగా రోజుకు 9.3 గ్రాముల ఉప్పు తినేస్తున్నారు. వీరితో పోలిస్తే నిరుద్యోగులు, పొగ తాగని వారు, బీపీ, ఊబకాయం లేనివారు ఉప్పు తక్కువ తీసుకుంటున్నట్టు తేలడం విశేషం! సోడియం కథా కమామిషు... నరాలు, కండరాల పనితీరుకు సోడియం చాలా అవసరం. అలాగని ఒంట్లో దాని స్థాయి మితిమీరకూడదు కూడా. ఒక వ్యక్తి రోజుకు 5 గ్రాముల కంటే తక్కువ సోడియం తీసుకోవాలి. అంతకంటే ఎక్కువైతే హైబీపీ, హైపర్ టెన్షన్ వంటివాటికి దారితీస్తుంది. సోడియం పరిమాణం తక్కువగా ఉన్న ఉప్పు తినడం ఆరోగ్యవంతులకు మంచిదే. కానీ షుగర్ పేషెంట్లు, హృద్రోగులు తదితరులకు రక్తంలో హెచ్చు పొటాషియం హైపర్ కలేమియాకు దారి తీస్తుంది. దానివల్ల కండరాలు బలహీనపడతాయి. అంతేగాక పల్స్, గుండె కొట్టుకునే వేగం కూడా పడిపోతాయి! సోడియం ఎక్కువగా ఉండే తిండి హై బీపీ, హైపర్ టెన్షన్ రిస్కును బాగా పెంచుతుందని ఈ అధ్యయనం మరోసారి తేల్చింది. అవి చివరికి గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటివాటికి దారితీసి ప్రాణాంతకంగా మారతాయి. అందుకే ఆరోగ్యవంతులైనా, మరొకరైనా ఆహారంలో ఉప్పు మోతాదు వీలైనంత తగ్గించడమే మంచిది.ళీ ‘మనమంతా ఆహారంలో ఉప్పును రోజుకు కనీసం 1.2 గ్రాముల మేరకు తగ్గిస్తే చాలు. హైబీపీ కేసులు సగానికి సగం తగ్గిపోతాయి! కనుక ఆహారంలో ఉప్పును తగ్గించుకోవాల్సిన ఆవశ్యకతపై అందరిలోనూ, ముఖ్యంగా భారతీయుల్లో అవగాహన పెరిగేలా ప్రచార తదితర కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం చాలా ఉంది’ – డాక్టర్ ప్రశాంత్ మాథుర్, అధ్యయనకర్త, డైరెక్టర్, ఐసీఎంఆర్– నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్, ఇన్ఫర్మాటిక్స్ అండ్ రీసెర్చ్ – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఏం టాలెంట్ సామీ నీది? బెర్త్ అదుర్స్!
‘నిదుర పోరా తమ్ముడా’ అని పాడింది లతా మంగేష్కర్. ‘కునుకు పడితే మనసు కాస్త కుదుట పడతది’ అన్నాడు ఆత్రేయ. ‘నిదర ముదర పోయాక పాడె వొక్కటే వల్లకాడు ఒక్కటే’ అన్నాడు జాలాది. నిజమే. నిద్ర పట్టాక, గాఢంగా నిద్ర కమ్ముకున్నాక మనం ఎక్కడ పడుకున్నామో ఎక్కడ తెలుస్తుంది? అందుకే నిద్ర సుఖమెరగదు అన్నారు పెద్దలు. అదేం ఖర్మోగాని రైలెక్కితే నిద్ర పోవాలనిపిస్తుంది. బెర్తులున్నవారు చక్కా తొమ్మిది దాటగానే దుప్పట్లు పరుచుకుని, కప్పుకుని గుర్రుపెడతారు. మరి జనరల్‌లో ఉన్నవారో?పుష్పక విమానంలో ఎంతమంది ఎక్కినా మరొకరికి చోటుంటుంది. మన రైల్వే వారు జనరల్ కంపార్ట్‌మెంట్‌కు ఇదే సూత్రం అప్లై చేస్తారు. ఎంతమందెక్కినా ఏదో ఒక మూల కూలబడతారని టికెట్లు తెగ ఇస్తారు. ఎక్కాక బాత్రూమ్కు వెళ్లడానికి కూడా వీల్లేని తాకిడి. జనరల్‌లో ఎవరెక్కుతారు? బీదసాదలు. కాయకష్టం చేసి సొంత ఊరికో, ఏదో కొంపలంటుకు పోయే వర్తమానం అందినందుకో అప్పటికప్పుడు టికెట్ కొనుక్కుని ఎక్కుతారు. లేకపోయినా ఎక్కుతారు. నిద్రకు టికెట్‌తో పని లేదు. కిటికీల్లో నుంచి చల్లగాలి తగులుతుంటే, వెళ్లే రైలు ఊయల వలే ఊగుతుంటే ఎలాగైనా చోటు చూసుకుని పడుకో అంటుంది.రెండు బెర్తుల మధ్య కింద పడుకునేవారు ఎప్పుడూ కనపడతారు. లగేజ్ స్టాండ్ ఎక్కి నిద్రపోయేవారు కూడా మన దేశంలో విరివిగా విస్తృతంగా ఉన్నారు. అయితే ఈ కుర్రవాడు మాత్రం అసాధ్యుడు. పైన ఉన్న రెండు బెర్తులకు దుప్పటి కట్టి ఒక బెర్తు సృష్టించాడు. ఆ తర్వాత దానిలోకి జారి ఒళ్లెరగని నిద్రపోయాడు. హాతిమ్ ఇస్మాయిల్ అనే కేరళ ట్రావెలర్ ఈ వీడియో తీసి పోయిన నెల ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తే ఇప్పటికి 10 లక్షల లైక్స్ వచ్చాయి. అంత మంచి సెటప్ చేసుకుని నిద్రపోతున్నవాణ్ణి చూసి కొందరు కుళ్లుకున్నారు. కొందరు దుప్పటి నాణ్యతను శ్లాఘించారు. మరికొందరు ఇకపైన స్లీపర్ బుక్ చేసుకోకుండా ఇదే ఫార్ములా వాడుతానని అన్నారు. ఆగ్రా రైలు ఇలాగే ఉంటుందని మరొకరు అన్నారు.ఈ మధ్య జనరల్ కంపార్ట్మెంట్లు పెరగాలనే డిమాండ్ వినిపిస్తోంది. జనరల్ కంపార్ట్మెంట్లు ఎందుకు తక్కువ ఉంటాయో రైల్వేవారు ఎప్పుడూ చెప్పరు. ప్రభుత్వాలకు ఓట్లు కావాలి. వారి మాటలకు పగటి కలలు చూసే జనం బోగీల్లో ఇలాంటి నిద్రకే ఉపక్రమించాలి. (చదవండి: కళ్లు మూసుకొని... కళ్లు చెదిరే విజయం) -
పొరుగునే స్క్రబ్ టైఫస్ ఇన్ఫెక్షన్! మన దగ్గరా అప్రమత్తత అవసరం!!
ఆంధ్రప్రదేశ్‌కు ΄పొరుగునే ఉన్న ఒడిశాలో కొంతకాలంగా ‘స్క్రబ్ టైఫస్’ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ స్వైరవిహారం చేస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి అక్కడ కనిపిస్తున్న ఈ కేసులు గత రెండు మూడు వారాలుగా ఒక్కసారిగా పెరిగాయి. ఇటీవల ఒక్క సుందర్ఘర్ జిల్లాలోనే దాదాపుగా 200కు పైగా కేసులు రావడంతో పాటు, కొన్ని మరణాలు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలూ అప్రమత్తం కావాల్సిన అవసరమున్న ఈ తరుణంలో స్క్రబ్ టైఫస్ ఇన్ఫెక్షన్పై అవగాహన కోసం ఈ కథనం. స్క్రబ్ టైఫస్’ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ను ‘బుష్ టైఫస్’ అని కూడా అంటారు. ఈ ఇన్ఫెక్షన్ కలిగించే బ్యాక్టీరియమ్ పేరు ‘ఓరియెంటియా సుసుగాముషి’. ఇది చిమ్మటలా కనిపించే చిగ్గర్ అనే ఒక రకం కీటకం ద్వారా ఒకరినుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ఈ కీటకం కుట్టినప్పుడు చర్మం ఎర్రబారడం, దురదరావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి కుట్టడం వల్ల ‘ఓరియెంటియా సుసుగాముషి’ అనే బ్యాక్టీరియమ్ దేహంలోకి ప్రవేశించడంతో ఈ స్క్రబ్ టైఫస్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఒకసారి చిగ్గర్ కుట్టాక... బ్యాక్టీరియమ్ బాధితుల రక్తంలోకి చేరితే... దాదాపు పది రోజుల తర్వాత లక్షణాలు కనిపించడం మొదలవుతుంది. చాలావరకు లక్షణాలు నిర΄ాయకరంగా ఉండవచ్చు. కానీ మొదటివారంలో దీన్ని గుర్తించకపోవడం లేదా సరైన చికిత్స ఇవ్వకపోవడం జరిగితే రెండోవారం నుంచి కొన్ని దుష్ప్రభావాలు వస్తాయి. ఊపిరితిత్తులు, కిడ్నీ, గుండె, కొన్ని సందర్భాల్లో మెదడు కూడా ప్రభావితమై మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌కు దారితీయవచ్చు. నిర్ధారణ ఈ వ్యాధి నిర్ధారణకు చాలా పరీక్షలే అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు వెయిల్ ఫెలిక్స్ పరీక్ష, ఇన్‌డైరెక్ట్ ఇమ్యూనోఫ్లోరోసెంట్ యాంటీబాడీ (ఐఎఫ్ఏ) పరీక్ష, ఇన్‌డైరెక్ట్ ఇమ్యూనో పెరాక్సైడేజ్ (ఐపీపీ) పరీక్ష, ఎలీజా, ఇమ్యూనో క్రొమాటోగ్రాఫిక్ టెస్ట్ (ఐసీటీ), పీసీఆర్ పరీక్షల ద్వారా దీన్ని నివారణ చేయవచ్చు. అయితే చాలా రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లలో కూడా దాదాపుగా ఇవే లక్షణాలు కనిపిస్తాయి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లో తగిన మోతాదులో యాంటీబయాటిక్ చికిత్స చేసి, బాధితుల పరిస్థితిని నార్మల్ చేయవచ్చు. అందుకే అన్నన్ని ఖరీదైన పరీక్షలకు బదులు కాస్తంత అనుభవజ్ఞులైన డాక్టర్లు కొన్ని లక్షణాల ఆధారంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ను గుర్తిస్తారు. ఉదాహరణకు మలేరియాలో ప్రోటోజోవన్ పారసైట్ రకాన్ని బట్టి కొన్ని రోజుల వ్యవధిలో జ్వరం మాటిమాటికీ వస్తుంటుంది. అదే వైరల్ జ్వరాలు చాలా తీవ్రంగా, ఎక్కువ ఉష్ణోగ్రతతో వస్తుంటాయి. ఈ లక్షణాలను బట్టి ఆయా జ్వరాలను గుర్తుబట్టి చికిత్స అందిస్తారు. దీనికి జ్వరం వచ్చిన తొలిదశలోనే సింపుల్‌గా ఇచ్చే యాంటీబయాటిక్స్‌తో చికిత్స అందిస్తే చాలు. ఒకవేళ చికిత్స అందించకపోతే కొన్నిసార్లు ఇది లంగ్స్, గుండె, నాడీ వ్యవస్థ, జీర్ణవ్యవస్థతోపాటు కిడ్నీలపై దుష్ప్రభావం చూపే అవకాశం ఉంది. నివారణ దీనికి టీకా ఏదీ అందుబాటులో లేదు. చిగ్గర్ కీటకాల కాటుకు గురికాకుండా జాగ్రత్త తీసుకోవడం మంచిది. ఇవి పొలాల్లో, మట్టిలో నివసిస్తూ, అక్కడే గుడ్లు పెడతాయి. కాబట్టి చేలూ, పొలాల్లో నడిచే సమయాల్లో చెప్పులు వాడటం వంటి జాగ్రత్తలతో దీన్ని చాలావరకు నివారించవచ్చు. ఫుల్ స్లీవ్ దుస్తులు, కాళ్లు పూర్తిగా కప్పేలాంటి దుస్తులు ధరించడం మేలు. ట్రెకింగ్ వంటి సాహసక్రీడల్లో పాల్గొనేవారు చిగ్గర్స్ ఉండే ప్రాంతాల్లోనే నడిచే అవకాశాలు ఎక్కువ. అందుకే... ట్రెక్కింగ్ చేసేవారు ఇప్పుడీ వ్యాధి విస్తరిస్తున్న ప్రాంతాలకు కొన్నాళ్లు ట్రెక్కింగ్‌కు వెళ్లకవడమే మంచిది. చికిత్స కొన్ని అరుదైన సందర్భాల్లో (అంటే కాంప్లికేషన్ వచ్చిన కేసుల్లో) మినహా... టెట్రాసైక్లిన్ వంటి యాంటీబయాటిక్ మందులతోనే ఇది అదుపులోకి వస్తుంది. కీమోప్రోఫిలాక్టిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే... అది కొంతవరకు దీని నివారణకు ఉపయోగపడే అవకాశం ఉంది. ఇప్పుడు మన రాష్ట్రాల నుంచి ఒడిశా వెళ్లాల్సినవారు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కిమో ప్రోఫిలాక్టిక్ తీసుకోవడం కొంత మేలు చేస్తుందని చెప్పవచ్చు. డా.. శివరాజు, సీనియర్ ఫిజీషియన్ (చదవండి: డీజే మ్యూజిక్ వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందా?) -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాల్సిందే..జాగ్రత్తలే రక్ష!
ఆసిఫాబాద్‌అర్బన్: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి తుకారాం సూచించారు. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, సబ్ సెంటర్లలో పూర్తి స్థాయిలో వైద్య సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో వైద్యశాఖ తీసుకుంటున్న చర్యలు, ప్రజల్లో ఉన్న సందేహాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘సాక్షి’ ఇంటర్వూలో వివరించారు. సాక్షి: సీజనల్ వ్యాధులపై ప్రజలను ఎలా అప్రమత్తం చేస్తున్నారు? డీఎంహెచ్‌వో: డిస్ట్రిక్ కోఆర్డినేషన్ కమిటీ (డీసీసీ) ద్వారా అన్ని గ్రామాలు, పట్టణాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. వ్యాధులను గుర్తించేందుకు జిల్లా వ్యాప్తంగా మూడు సబ్ యూనిట్ అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. 20 మంది మెడికల్ ఆఫీసర్లు పర్యవేక్షిస్తున్నారు. ప్రతీ శుక్రవారం డ్రైడే నిర్వహిస్తున్నాం. ప్రతీ కుటుంబానికి దోమతెరలు అందించాం. ఐటీడీఏ, పంచాయతీరాజ్, ఎంపీడీవోల సహకారంతో వ్యాధుల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. ఐదేళ్ల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాం. సాక్షి: వ్యాధుల కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి? డీఎంహెచ్‌వో: ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలి. నీటిని వేడిచేసి చల్లార్చి వడబోసిన తర్వాత మాత్రమే తాగాలి. ఆహారం వేడిగా ఉండగానే భుజించాలి. అన్ని పీహెచ్‌సీల్లో వ్యాధుల నివారణ మందులు అందుబాటులో ఉంచాం. సాక్షి: డెంగీ, టైఫాయిడ్ నిర్ధారణ ఎలా? డీఎంహెచ్‌వో: జిల్లాలోని అన్ని పీహెచ్‌సీల్లో సీబీపీ (బ్లడ్ పిక్చర్, ప్లేట్లెట్స్, కౌంటింగ్) యంత్రాలు ఉన్నాయి. ప్రజలకు ఉచితంగా రోగ నిర్ధారణ పరీక్షలు అందుతున్నాయి. జిల్లా కేంద్రంలోని టీహబ్ ద్వారా 53 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకునే అవకాశం ఉంది. డెంగీ ఎలిజ టెస్టు ద్వారానే కచ్చితమైన ఫలితం వస్తుంది. సాక్షి: వైద్యశాఖ అందించే చికిత్సలు ఏమిటి? డీఎంహెచ్‌వో: అన్ని పీహెచ్‌సీల్లో యాంటిబయాటిక్స్, క్లోరోక్విన్, ప్రైమ్ ఆక్సిజన్, ఆర్టిపీసీటి, అన్ని రకాల విటమిన్స్, నొప్పులు, సిప్రోప్లోక్సిన్, మెట్రోజిల్, ప్లురోక్సిన్, స్పోర్లాక్, సీసీఎం, డెరిఫిల్లిన్, దగ్గు మందులు, మాత్రలు, ఐవీ ప్లూయిడ్స్ అందుబాటులో ఉన్నాయి. జిల్లాలోని 20 పీహెచ్‌సీలు, 2 అర్బన్ సెంటర్లు, 118 సబ్ సెంటర్ల ద్వారా ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్నాం. సాక్షి: గ్రామీణులకు అత్యవసర వైద్యం అందేదెలా? డీఎంహెచ్‌వో: రోగిని ఇంటి నుంచి ఆస్పత్రులకు తీసుకువచ్చేందుకు 8 అవ్వాల్, 12 (108) వాహనాలు, 15 (102) వాహనాలు, 1 ఎఫ్హెచ్ఎస్ వాహనం అందుబాటులో ఉంచాం. సాక్షి: సీజనల్ వ్యాధుల వివరాలు తెలపండి? డీఎంహెచ్‌వో: ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో డెంగీ–81, మలేరియా–69, టైఫాయిడ్–231 కేసులు నమోదయ్యాయి. (చదవండి: డీజే మ్యూజిక్ వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందా?) -
గర్బవతులకు మైగ్రేన్ వస్తే..
నాకు మైగ్రేన్ ఉంది. తరచుగా వస్తుంటుంది. ఎన్ని మందులు వాడినా పూర్తిగా తగ్గలేదు. ఇప్పుడు నాకు మూడో నెల. ఎలాంటి మందులు వేసుకోవాలి? ఈ టైమ్‌లో మైగ్రేన్ బాధించకుండా ఏం చేయాలి? – టి. స్రవంతి, నాగ్‌పూర్ మైగ్రేన్ సర్వసాధారణమైన తలనొప్పి. మైగ్రేన్ నొప్పి మొదలవడానికి ముందు కొంతమందికి వాంతులు, వికారం, తల తిప్పినట్టవడం వంటివి ఉంటాయి. మీకు అలాంటి లక్షణాలు ఉంటాయా? ఉండవా? మీ మైగ్రేన్ లక్షణాలు ఎలా ఉంటాయి అన్నది ముందు మీరు మీ గైనకాలజిస్ట్‌తో చర్చించండి. దాదాపుగా సగం మందిలో ప్రెగ్నెన్సీలో సమయంలో మైగ్రేన్ తగ్గుతుంది. మందుల అవసరం కూడా తగ్గుతుంది. కానీ ఆల్రెడీ మైగ్రేన్ ఉన్న కొందరిలో హై బీపీ, Pre eclampsia చాన్సెస్ పెరుగుతాయి. ప్రెగ్నెన్సీలో తగినంత విశ్రాంతి, లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవడం, టైమ్‌కి తినడం, యోగా, ధ్యానం లాంటివాటితో తలనొప్పిని తగ్గించుకోవచ్చు. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో ఎప్పుడైనా తలనొప్పి మరీ ఎక్కువగా ఉంటే పారసిటమాల్ మాత్రను వేసుకోవచ్చు. రిలాక్సేషన్ టెక్నిక్స్ అయిన మైండ్‌ఫుల్‌నెస్ లాంటివీ తలనొప్పి తగ్గేందుకు దోహదపడతాయి. ప్రెగ్నెన్సీ తొలినాళ్లలో క్రమం తప్పకుండా మెడిటేషన్ చేస్తే ఒత్తిడి తగ్గుతుంది. ముందుగా.. మీకు దేనివల్ల మైగ్రేన్ పెరుగుతుందో చెక్ చేసుకోండి. ఆ ట్రిగర్ని మేనేజ్ చేస్తే ఎపిసోడ్స్ తగ్గుతాయి. కంటి నిండా నిద్ర చాలా అవసరం. ఎండలో తిరగటం, చీజ్, చాకోలేట్స్ మొదలైనవి కొందరిలో మైగ్రేన్‌ను ట్రిగర్ చేస్తాయి. మైగ్రేన్ ఎక్కువసార్లు వస్తూంటే ఒకసారి న్యూరాలజిస్ట్ ఒపీనియన్ తీసుకోవాలి. సురక్షితమైన మందుబిళ్లలను అదీ తక్కువ మోతాదులో అదీ తక్కువసార్లు మాత్రమే తీసుకోమని సజెస్ట్ చేస్తారు. కొన్ని మందులు గర్భంలోని శిశువు ఎదుగుదల మీద ప్రభావం చూపిస్తాయి. అందుకే స్పెషలైజ్డ్ కేర్ టీమ్ పర్యవేక్షణలో ఉండాలి. ప్రెగ్నెన్సీ సమయంలో Ergotamine, Ibuprofen లాంటివి అస్సలు ప్రిస్క్రైబ్ చేయరు. తెలియకుండా మందులు వాడకూడదు. హైరిస్క్ కేర్ టీమ్‌ని సంప్రదించాలి. కొన్ని మందుల వల్ల బిడ్డకు పుట్టుకతో లోపాలు ఏర్పడవచ్చు. కొంతమంది ప్రెగ్నెన్సీ కంటే ముందే అధిక మోతాదులో కొన్ని మందులను తీసుకుంటూ ఉండి ఉంటే గర్భం నిర్ధారణ అయిన తర్వాత వాటిని మారుస్తారు. డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: పంపాతీరంలో హనుమంతునిచే త్రిశూలరోముడి హతం.. మునులకు ప్రశాంతత) -
అమ్మకు మానని గాయం!
బిడ్డకు జన్మనిచ్చి మాతృత్వం పొందడం మహిళ అదృష్టంగా భావిస్తోంది. ప్రసవం ఆమెకు పునర్జన్మతో సమానం. ఒకప్పుడు అత్యధిక ప్రసవాలు సాధారణ పద్ధతిలోనే జరిగేవి. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పలు కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రులు దోపిడీకి సిజేరియన్లను మార్గంగా చూడటం.. తల్లీబిడ్డా క్షేమంగా ఉండాలని కొందరు కుటుంబీకులు ఆపరేషన్లకు సరే అనడం.. మరి కొందరు శుభఘడియలు అంటూ కడుపు కోతకు ఒత్తిడి తేవడం.. ఇలా కారణాలు ఏవైనా అమ్మ కడుపుపై మానని గాయం ఏర్పడుతోంది. సిజేరియన్లతో భవిష్యత్‌లో అనారోగ్య సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుందని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నా పరిస్థితి మారడం లేదు. సాక్షి, నంద్యాల: దనార్జనే లక్ష్యంగా పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో గర్భిణులకు ఇష్టానుసారంగా సిజేరియన్లు చేసి దోపిడీకి పాల్పడుతున్నారు. సాధారణ ప్రసవాలకు అవకాశం ఇవ్వకుండా సిజేరియన్లు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. గర్భంలో బిడ్డ అడ్డం తిరగడం వంటి అత్యవసర సమయాల్లో చేయాల్సిన ఆపరేషన్లను కాసుల కోసం అమ్మకు కడుపు కోత పెడుతున్నారు. సిజేరియన్లతో ప్రసవాలు జరగడంతో చిన్న వయస్సులోనే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నా పట్టించుకోవడం లేదు. గర్భం దాలిస్తే సిజేరియన్ తప్పనిసరి అన్నట్లు పరిస్థితి మార్చేశారు. గర్భం దాల్చిన రెండో నెల నుంచే అవసరం లేకపోయినా స్కానింగ్‌లు, టెస్టులు, మందులు, టానిక్‌ల పేరుతో రూ.వేలకు వేలు దోపిడీ చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. నంద్యాల జిల్లా వ్యాప్తంగా దాదాపు 79 ప్రైవేటు ఆస్పత్రులున్నాయి. వీటిలో శస్త్రచికిత్సలు చేసే హాస్పిటళ్లు సుమారు 35 వరకు ఉన్నాయి. అలాగే కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ (సీహె చ్‌సీ)లు 11, డోన్, బనగానపల్లెలో ఏరియా ఆస్పత్రి, నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నాయి. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో నెలకు సుమారు 2 వేలకు పైగా ప్రసవాలు జరుగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం ఏ ప్రాంతంలోనైనా ప్రసవాల్లో సిజేరియన్లు గరిష్టంగా 15 శాతం మించకూడదు. కాన్పు కష్టమైన సమయాల్లో, తల్లీబిడ్డల్లో ఎవరికై నా ప్రాణహాని ఉండే సందర్భాల్లోనే సిజేరియన్ చేయాలి. రక్తహీనత, అధిక రక్తస్రావం జరిగే అవకాశం ఉన్నప్పుడే ఆపరేషన్‌కు మొగ్గు చూపాలి. అయితే ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీ, కొందరు కుటుంబీకులు మూఢనమ్మకాలు వెరిసి సిజేరియన్లు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాల్లో 50 శాతానికి పైగా కడుపు కోత ఉంటున్నాయి. విస్తుగొల్పుతున్న గణాంకాలు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఏప్రిల్ నుంచి ఈనెల 21వ తేదీ వరకు మొత్తం 10,086 ప్రసవాలు జరిగాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 4,034, ప్రైవేటు ఆస్పత్రుల్లో 6,052 ప్రసవాలు నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తంగా జరిగిన ప్రసవాల్లో దాదాపు 45 శాతం ప్రసవాలు సిజేరియన్ ద్వారానే జరిగాయి. ఇందులోనూ ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇష్టారాజ్యంగా ఆపరేషన్లు జరుగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో 6,052 ప్రసవాలు జరిగితే వీటిలో 50 శాతం అంటే 3 వేలకు పైగా ప్రసవాలు సిజేరియన్ ద్వారా చేయడం విస్తుపోయే వాస్తవం. గర్భం దాల్చినప్పుటి నుంచి సాధారణ ప్రసవం కావాలని ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లే సరికే ఏదో కారణంతో భయపెట్టి సిజేరియన్ చేయిస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. ఒక్కో ఆపరేషన్‌కు వేలల్లో ఖర్చు..! సాధారణ ప్రసవం జరిగితే ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ.10 వేలకు మించి బిల్లు కాదు. అదే సిజేరియన్ అయితే పేషంట్ పరిస్థితిని బట్టి, ఆస్పత్రిని బట్టి రేట్లు నిర్ణయిస్తున్నారు. సిజేరియన్‌కు కనిష్టంగా రూ.40 వేల నుంచి గరిష్టంగా రూ. 80 వేల వరకు కూడా బిల్లులు వేస్తున్నారు. నంద్యాల పట్టణంలోని ఐదు ప్రముఖ ఆస్పత్రుల్లో, ఆళ్లగడ్డలోని రెండు ఆస్పత్రుల్లో సిజేరియన్లు యథేచ్ఛగా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ప్రభుత్వ ఆసుపత్రులోని వైద్య సిబ్బంది సాధారణ ప్రసవాలు చేసేందుకు చొరవ చూపుతున్నారు. ఈ క్రమంలో అవగాహన ఉన్న పలువురు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తున్నారు. ప్యాపిలి, పాములపాడు, చాగలమర్రి, అహోబిలం.. తదితర మండలాల్లో సాధారణ ప్రసవాలు అధికంగా జరుగుతున్నాయి. ముహూర్తాలు చూసుకుని మరీ.. ఇటీవల కాలంలో ముహూర్తం, శుభ ఘడియలు చూసుకుని మరీ ప్రసవాలు చేయించుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇలాంటి వారంతా ప్రైవేటు ఆస్పత్రులనే ఆశ్రయిస్తున్నారు. ఫలానా రోజు, తేదీ, గంటలు, నిమిషాలను కూడా పాటిస్తూ పిల్లల్ని కనడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. మరికొందరైతే బిడ్డ ఎన్ని సెకండ్లకు బయటకు రావాలో కూడా నిర్ణయించేస్తున్నారు. మరికొందరు గర్భిణులు పురిటి నొప్పులు భరించలేక సిజేరియన్ల వైపు వెళ్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల వివరాలు నెల ప్రభుత్వ ప్రైవేటు ఏప్రిల్ 762 1,121 మే 814 1,051 జూన్ 800 1,064 జులై 798 1,057 ఆగస్ట్ 860 1,108 సెప్టెంబర్ 716 651 (21 తేదీ వరకు) పరీక్షలు చేయించుకోవాలి గర్భందాల్చినప్పటి నుంచి పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ప్రతి నెల బేబీ గ్రోత్ ఎలా ఉందో తెలుసుకుంటూ ఉండాలి. సాధారణ ప్రసవమైతే రెండు వారాలు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. సిజేరియన్ అయితే కనీసం మూడు నెలల విశ్రాంతి అవసరం. జీవనశైలిలో వచ్చే మార్పుల వల్లే ఆపరేషన్లు పెరిగిపోతున్నాయి. – డాక్టర్ అనూష గింజుపల్లి, గైనకాలజిస్ట్ అవగాహన కల్పిస్తున్నాం సిజేరియన్ల శాతం తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధ్యమైనంత వరకు సాధారణ ప్రసవాలు జరిగేలా చేస్తున్నాం. కేవలం హై రిస్క్ ఉన్న వారిని మాత్రమే సిజేరియన్లకు రెఫర్ చేస్తున్నారు. బిడ్డ పుట్టిన సమయమే శుభ ఘడియలు. ప్రత్యేక తేదీలు, ప్రముఖల జన్మదిన రోజులు అంటూ డాక్టర్లపై ఒత్తిడి చేయకూడదు. – డాక్టర్ వెంకటరమణ, జిల్లా వైద్యాధికారి (చదవండి: గర్భం రాకుండా పరికరం ఇంప్లాంట్ చేస్తే..నేరుగా గుండెల్లోకి దూసుకుపోయి..)