Treatment
-
గర్భం రాకుండా పరికరం ఇంప్లాంట్ చేస్తే..నేరుగా గుండెల్లోకి ..
ఇటీవల చాలామంది స్త్రీలు గర్భం రాకుండా ప్లానే చేసుకునేలా అందుబాటులోకి వచ్చిన సరికొత్త వైద్య విధానాలు సద్వినియోగం చేసుకుంటున్నారు. టాబ్లెట్ల దగ్గర నుంచి వివిధ రకాల వైద్య విధానాలను అనుసరిస్తున్నారు. కాకపోతే అవన్నీ వైద్యుల సూచనలు సలహాల మేరకే వినియోగించాల్సి ఉంటుంది. అలానే ఇక్కడొక మహిళ కూడా గర్భం రాకుండా ఉండేలా అత్యాధునిక వైద్యం చేయించుకుంది. అందులో భాగంగా ఓ పరికరాన్ని ఇంప్లాంట్ చేస్తే అది కాస్త నేరుగా ఆమె గుండెల్లోకి చొచ్చుకుపోయింది. ఈ దిగ్బ్రాంతికర ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. ఆస్ట్రేలియన్‌కి చెందిన 22 ఏళ్ల క్లో వెస్టర్వే తన చేతికి రెండేళ్ల క్రితం గర్భ నిరోధక పరికరాన్ని ఇంప్లాంట్ చేశారు. ఈ వైద్య విధానంలో భాగంగా ఓ ఫ్లైక్సిబుల్ రాడ్‌ని ఆమె చేతికి ఇంప్లాంట్ చేశారు. నిజానికి ఈ రాడ్ ప్రతినెల అండోత్సర్గాన్ని ఆపేలా ప్రొజెస్టెరాన్‌ను రక్తప్రవాహంలో విడుదల చేస్తుంది. ఈ రాడ్ మూడు సంవత్సరాల వరకు గర్భరాకుండా చేస్తుంది. పైగా చాలా ప్రభావంతంగా పనిచేస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే రోజు గర్భం రాకుండా మాత్ర వేసుకునే ఇబ్బందకి చెక్ పెడుతుంది. ఆరోగ్య పరంగా మంచిది. అందుకనే ఎక్కువ మంది మహిళలు గర్భం రాకుండా ఉండేలా ఈ ఇంప్లాంట్కే ఎక్కువ మక్కువ చూపించడానికి ప్రధాన కారణం. అయితే ఏం జరిగిందో ఏమో! సడెన్‌గా ఈ ఇంప్లాంట్ జరిగిన కొద్ది రోజుల తర్వాత నుంచి క్లో గుండెల్లో మంట, వాంతులు, అధిక రక్తస్రావం, దడ వంటి సమస్యలను ఎదుర్కొంది. పరిస్థితి సీరియస్ అవ్వడంతో ఆస్పత్రికి వెళ్లి చెకప్చేయగా ఆమెకు ఇంప్లాంట్ చేసిన రాడ్ చేతి వద్ద కనపించలేదు. ఎంత ప్రయత్నించిన వైద్యులుఆ రాడ్ ఎక్కడుందనేది కనుగొనలేకపోయారు. చివరికి ఆ రాడ్ ఆమె గుండెలోని పల్మనరీ ధమనుల్లోకి వెళ్లిపోయిందని గుర్తించి షాక్‌కి గురయ్యారు వైద్యులు. అది సుమారు నాలుగు సెంటిమీటర్ల పరికరం. నిజానికి ఇది వైద్యులు గర్భం రాకుండా ఉండేలా ఆమె చేతిపై చర్మం వద్ద ఉంచిన ఒక ఫ్లెక్సిబుల్ ప్లాస్టిక్ రాడ్. దీని కారణంగా ఆమె తీవ్రమైన నరాల నొప్పి, గుండెల్లో మంట, వికారం వంటి సమస్యలను చవిచూసింది. ఇప్పుడూ ఆ ఫ్లెక్సిబుల్ రాడ్‌ని తొలగించేందుకు సదరు బాధిత మహిళకు మొదటగా ఊపిరితిత్తుల ఆపరేషన్, ఓపెన్ హార్ట్ సర్జరీ, తదితర శస్త్ర చికిత్సలు చేయాల్సి ఉందని వైద్యులు ఆమెకు తెలిపారు. ఆమె కోలుకోవడానికే దగ్గర దగ్గర ఆరు నుంచి ఎనిమిది వారాలు పడుతుంది. దీని కారణంగా ఆమె జీవితంలో ఆమె ఏ బరువైనా వస్తువుని పైకి ఎత్తలేదు, తనంతట తాను స్వయంగా లేవలేదు. కాగా యూకే మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ ప్రకారం గర్భనిరోధక ఇంప్లాంట్ వికటించిన కేసులు 18 ఉన్నాయి. అలాగే ఆమెలా గుండె పల్మనరీ ధమనుల్లోకి పరికరం చేరిన కేసులు 107 ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వాస్తవానికి ఆ పరికరం పనిచేయకపోతే ఇలా గుండెల్లోకి నేరుగా చొచ్చుకుపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ పరికరాలు గర్భధారణను నివారించడంలో 99% సమర్థవంతంగా పనిచేస్తుందని, పైగా ఎన్నో ప్రయోజనాలున్నాయని అంటున్నారు వైద్యులు. ఐతే ఇలా కొన్ని కేసుల్లో ఈ పరికరం ఎందుకు వికటిస్తోందో తెలియాల్సి ఉందన్నారు. దీని గురించి మరింత లోతుగా అధ్యయనాలు చేయాల్సి ఉందన్నారు ఆరోగ్య నిపుణులు. (చదవండి: క్యాన్సర్‌కు సంబంధించి భారత్ ఎన్ని మందులు ఫ్రీగా ఇస్తోందంటే..) -
క్యాన్సర్‌కు సంబంధించి భారత్ ఎన్ని మందులు ఫ్రీగా ఇస్తోందంటే..
క్యాన్సర్ వ్యాధి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సైలెంట్‌గా వచ్చి ఒక్కసారిగా మనిషిని మానసికంగా, ఆర్థికంగా కుంగదీసే భయానక వ్యాధి అనే చెప్పాలి. ఇంతవరకు డబ్బున్న వాళ్లకు, చెడువ్యసనాలు ఉన్నవాళ్లకు మాత్రమే వచ్చేది ఈ వ్యాధి. ఇప్పుడు ఇది కూడా పెద్ద చిన్న అనే తేడా లేకుండా అందర్నీ అటాక్ చేసి భయబ్రాంతులకు గురిచేస్తోంది. చాలావరకు కొన్ని క్యాన్సర్లను దశాల రీత్యా మందులతోనే నయం చేయొచ్చు. కానీ కొన్నింటికి కీమో థెరఫీ వంటి చికిత్సలు మరికొన్నింటికి అత్యంత ఖరీదైన శస్త్ర చికిత్సల ద్వారా నయం చేస్తారు వైద్యులు. ఒకరకంగా చెప్పాలంటే ఈ వ్యాధికి సంబంధించి వైద్యం మాత్రమే గాక మెడిసిన్ సైతం అత్యంత ఖరీదే. అలాంటి మందులను సైతం భారత్ ఫ్రీగా ఇస్తోంది. ఎన్ని రకాల మందులను ఉచితంగా ఇస్తుంది ఆరోగ్య సంరక్షణలో భారత్ తీసుకుంటున్న చర్యలు గురించే ఈ కథనం.! భారత్ క్యాన్సర్‌కి సంబంధించి సుమారు 90 మందులలో 42 మందులను ఫ్రీగానే రోగులకు అందిస్తోంది. ఈ విషయాన్ని సాక్షాత్తు ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ సంజీవని: యునైటెడ్ ఎగైనెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ ప్రారంభోత్సవంలో చెప్పారు. ఆరోగ్యానికే పెద్ద పీట వేస్తూ కళాశాలలో ఎంబీబీఎస్ సీట్లు పెంచామననారు. ఆరోగ్యం ఎప్పుడూ రాజీకీయ అంశం కాదని అదొక గొప్ప సేవ అని చెప్పారు. కాలక్రమేణ వ్యాధుల తీరు మారుతోంది. దీనిపై సమగ్ర దృక్పథం కలిగి ఉండటం చాలా ముఖ్యం అని నొక్కి చెప్పారు మాండవీయ. అంతేగాదు భారత ప్రభుత్వం ప్రజా ఆరోగ్యాన్ని కూడా అభివృద్ధిలోకి విలీనం చేసిందన్నారు. దేశ అభివృద్ధిలో ప్రజల ఆరోగ్యమే అత్యంత కీలక పాత్ర అని చెప్పారు. అందువల్లే ప్రభుత్వం ఆరోగ్య సేవలు పేద, బలహీన వర్గాల ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చేలా దృష్టిసారించిందన్నారు. కోవిడ్ 19 తర్వాత భారత్ ఎన్నో సవాళ్లను ప్రజలందరి సమిష్టి భాగస్వామ్యంతో అధిగమించింది. అలాగే మాండవియా తాను ప్రారంభించిన సంజీవని ఫౌండేషన్ గురించి కూడా వివరించారు. ఇది నిశబ్దంగా కబళించే క్యాన్సర్‌పై అవగాహన కల్పించడం, వ్యాధికి సంబంధించిన భయాలను పోగొట్టడం తదితర అవగాహన కార్యక్రమాలు చేపడుతుందని చెప్పారు. అలాగే ఇంటి ఇంటికి వెళ్లి ప్రజల ఆరోగ్య సమాచారాన్ని సేకరిస్తూ వారిక తగిన సలహాలు సూచనలు ఇస్తున్న 'ఆశా బెహన్' సామాజకి కార్యకర్తల పాత్ర చాలా గొప్పదని అన్నారు. అంతేగాదు క్యాన్సర్ సంరక్షణలో భారత విధానం గురించి కూడా విపులీకరించారు. జిల్లా స్థాయి ఆస్పత్రుల్లో పేద రోగులకు ఫీజులు మినహాయింపు ఇవ్వడమేగాక లాభప్రేక్షలేని ధరల్లోనే మందులను అందిస్తున్నామని అన్నారు. అనివార్య కారణాల వల్ల భారత్ కొంతమేర ఆరోగ్య సంరక్షణను తక్కువ ధరలోనే అందిస్తోంది. రానున్న రోజుల్లో ఈ ఆరోగ్య సంరక్షణను మరింత సరసమైన ధరల్లో ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా దృష్టిసారించనున్నట్లు తెలిపారు ఆరోగ్య మంత్రి మాండవీయ. (చదవండి: గుండె జబ్బు హఠాత్తుగా వచ్చేది కాదు! చిట్టి గుండె ఘోష..) -
గుండె జబ్బు హఠాత్తుగా వచ్చేది కాదు!
నెల రోజుల క్రితం కదిరికి చెందిన డిగ్రీ చదువుతున్న ఓ యువకుడు ఇంట్లో కుప్పకూలి పోయాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళితే హార్ట్ఎటాక్ అని తేలింది. ఇంత చిన్న వయసులో గుండెపోటు రావడమేమిటని వైద్యులే ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. వారం రోజుల క్రితం అనంతపురానికి చెందిన 33 ఏళ్ల ఐటీ ఉద్యోగి గుండె నొప్పిగా ఉందని ఓ ఆస్పత్రికి వెళ్లారు. ఇంతలోనే సమస్య తీవ్రమైంది. చికిత్స చేసినా ఫలితం లేకపోయింది. కారణమేమంటే తీవ్రమైన గుండె పోటు అని వైద్యులు చెప్పారు. ఎందుకిలా? నేడు వరల్డ్ హార్ట్ డే నేపథ్యంలో హృదయం గురించి సవివరంగా తెలుసుకుందాం! సాక్షి ప్రతినిధి, అనంతపురం: జీవన శైలి మార్పులు, ఆహార సమతుల్యత పాటించకపోవడం వెరసి గుండెకు పెనుముప్పు తెచ్చిపెడుతున్నాయి. గుండె జబ్బు ఒక్కసారే వచ్చి పడేది కాదు. అంతకుముందు ఎన్నో సంకేతాలు చిట్టి గుండె నుంచి వస్తూ ఉంటాయి. జాగ్రత్త పడమని సూచిస్తుంటాయి. అయితే, వాటిని పెద్దగా పట్టించుకోకపోవడం చేటు తెస్తోంది. చివరికి ప్రాణాలూ తోడేస్తోంది. ఒక్క అనంతపురం రాష్ట్రంలో గడిచిన నాలుగేళ్లలో 3 వేల పైగా జబ్బులకు రూ. 450 కోట్లు ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం ఖర్చు చేస్తే, అందులో రూ.129 కోట్లు పైగా గుండెజబ్బులకే కేటాయించడం చూస్తే పరిస్థితి తీవ్రతను అంచనా వేయచ్చు. ప్రభుత్వాలు సైతం ఏటా సెప్టంబర్ 29న ప్రపంచ గుండె దినోత్సవం ఏర్పాటు చేసి గుండె గురించి ప్రజల్లో అవగాహన కల్పించేలా యత్నం చేస్తోంది కూడా. ఈ ఏడాది థీమ్ "హృదయాన్ని ఉపయోగించండి గుండె గురించి తెలుసుకోండి". అనే నినాదంతో మరింతగా ప్రజల్లో దీనిపై అవగాహన కల్పించే కార్యక్రమాలను పెద్ద ఎత్తున్న నిర్వహిస్తోంది కూడా. పల్లెలకూ పాకిన మాయదారి జబ్బు.. ఒకప్పుడు పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా గుండెపోటు కేసులు వచ్చేవి. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకూ జీవనశైలి జబ్బులు ఎగబాకడం విస్మయం కలిగిస్తోంది. ప్రస్తుతం ప్రతి పది మందిలో ఒకరు గుండె సంబంధిత సమస్యను ఎదుర్కొంటున్నట్టు ఇండియన్ కార్డియాలజీ సొసైటీ ఇటీవల హెచ్చరించింది. జాగ్రత్తలు పాటించడంలో కనబరిచే నిర్లక్ష్యమే శాపమవుతోందని స్పష్టం చేసింది. యువకుల్లోనూ.. ఒకప్పుడు 55 ఏళ్లు దాటితేగానీ గుండె సంబంధిత జబ్బులొచ్చేవి కావు. కానీ నేడు 35 ఏళ్లకే గుండెపోటు కేసులు నమోదవుతున్నాయి. గుండెపోటును సైలెంట్ కిల్లర్‌గా వైద్యులు అభివర్ణిస్తున్నారు. గుండె పోటుకు రకరకాల కారణాలు చుట్టుముడుతున్నాయి. మధుమేహం, రక్తపోటు వంటివి కూడా ఆజ్యం పోస్తున్నట్టు హృద్రోగ నిపుణులు పేర్కొంటున్నారు. గుండె జబ్బులకు ప్రధాన కారణం.. పొగాకు, ఆల్కహాల్ విపరీతంగా తీసుకోవడం అధిక రక్తపోటు ఉంటే, నియంత్రణలో ఉంచుకోలేకపోవడం చెడు కొలె్రస్టాల్ అంటే ఎల్డీఎల్ (లో డెన్సిటీ లిపిడ్స్) ఉండటం శరీరంలో ఉండాల్సిన దానికంటే ఎక్కువ నూనెల (ట్రైగ్లిజరాయిడ్స్) శాతం వయసుకు, ఎత్తుకు మించి బరువు(ఊబకాయం) మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవడంలో నిర్లక్ష్యం కుటుంబ చరిత్ర ప్రభావం కాపాడుకోవాలి ఇలా రోజూ 40 నిముషాలకు తగ్గకుండా వ్యాయామం. కొవ్వులున్న ఆహారం తగ్గించి పీచు ఆహారం ఎక్కువగా తీసుకోవడం (కూరగాయలు, ఆకుకూరలు, పళ్లు, చిరు ధాన్యాలు) బరువును అదుపులో ఉంచుకోవడం. ఒత్తిడి తగ్గించుకోవడం ఆరుమాసాలకోసారి 2డీ ఎకో వంటివి చేయించడం చెడు కొలెస్ట్రాల్‌ను గుర్తించేందుకు ఎప్పటికప్పుడు రక్త పరీక్షలు చేయించడం బీపీ, షుగర్ అదుపులో ఉంచుకోవడం వ్యాయామమే శ్రీరామరక్ష గుండెజబ్బుల రాకుండా ఉండాలంటే రోజూ 40 నిముషాల నడక లేదా జాగింగ్, స్విమ్మింగ్ చేయాలి. కూల్‌డ్రింక్స్ తీసుకోకూడదు. రోజుకు 3 గ్రాములకు మించి ఉప్పు, నెలకు 500 మిల్లీ లీటర్ల మించి ఆయిల్ వాడకూడదు. ముఖ్యంగా పదే పదే మరిగించిన నూనెతో చేసినవి తింటే గుండెకు ఎక్కువ ముప్పు ఉంటుంది. పొగతాగడం, మద్యం అనేవి ఎప్పుడూ గుండెకు శత్రువులే. –డాక్టర్ వంశీకృష్ణ, హృద్రోగ నిపుణులు, అనంతపురం ఉచితంగా కార్పొరేట్ స్థాయి వెద్యం ప్రస్తుత రోజుల్లో చిన్న వయసు వారికీ గుండె సమస్యలు తలెత్తుతున్నాయి. జంక్ ఫుడ్, మద్యం, ధూమపానంతోనే సమస్యలు తెచ్చుకుంటున్నారు. సూపర్ స్పెషాలిటీలో కార్పొరేట్ స్థాయిలో హృద్రోగులకు సేవలు అందిస్తున్నాం. అటువంటి శస్త్రచికిత్సలు ప్రైవేట్‌గా చేసుకోవాలంటే రూ.లక్షలు వెచ్చించాలి. ఇప్పటి వరకూ దాదాపు 400 వరకు ఆంజియోప్లాస్టీ,యాంజోగ్రామ్ ఆపరేషన్లు విజయవంతంగా చేశాం. – డాక్టర్ సుభాష్‌చంద్రబోస్, కార్డియాలజిస్టు (చదవండి: జ్వరం వస్తే చాలు!.. పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకుంటున్నారా? అలా వాడితే..) -
జ్వరం వస్తే చాలు!.. పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకుంటున్నారా?
జ్వరం వచ్చిందంటే చాలు పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా దాదాపు అందరూ మొదట వేసుకునే టాబ్లెట్ ఇదే. పైగా మొన్నటివరకు కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో దాదాపు అందరి ఇళ్లల్లోనూ ఏం ఉన్నా లేకపోయినా పారాసెటమాల్ టాబ్లెట్ షీట్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటున్నాయి. జ్వరానికే కాకుండా దగ్గు, తలనొప్పి, ఒళ్లు నొప్పులు వంటి సమస్యలకు సైతం పారాసెటమాల్ టాబ్లెట్లను విరి విరిగా వాడేస్తున్నారు. అయితే పారాసెటమాల్ టాబ్లెట్లను అలా విచ్చలవిడిగా వేసుకోవడం ఏ మాత్రం మంచిది కాదని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు డాక్టర్ నవీన్ నడిమింటి. ఆ టాబ్లెట్లను అధికంగా వాడటం వల్లే కలిగే దుష్పరిణామాలు గురించి ఆయుర్వేద నిపుణులు నవీన్ నడిమింటి మాటల్లో చూద్దాం.! పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకున్న వెంటనే జ్వరం తగ్గకుంటే మళ్లీ మరో టాబ్లెట్ వేసుకోవడం చేయరాదు. అలాగే జ్వరం వచ్చిన నాలుగు నుంచి ఆరు గంటల మధ్య వ్యవధిలో పెద్దలకైతే 650 మిల్లీ గ్రాములు, పన్నెండు సంవత్సరాలు వయస్సు అంత కన్నా లోపు ఉన్న పిల్లలకైతే 15 మిల్లీ గ్రాముల పారాసెటమాల్ మోతాదును ఇవ్వాలి. ఇవేమి పాటించకుండా వీటిని ఎలా పడితే అలా వాడితే అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పారాసెటమాల్ టాబ్లెట్లను పరిమితికి మించి తీసుకోవడం వల్ల అధిక చెమటలు, మోషన్స్, కళ్లు తిరగడం, వాంతులు, చర్మ సంబంధిత సమస్యలు, ఆకలి తగ్గిపోవడం, కడుపు నొప్పి, అలర్జీలు వంటివి తీవ్రంగా ఇబ్బంది పెడతాయి. అలాగే పారాసెటమాల్ లాంటి టాబ్లెట్లలో స్టెరాయిడ్స్ ఉంటాయి.అందువల్ల వీటిని అధికంగా తీసుకుంటే మూత్ర పిండాలు, కాలేయం వంటి అవయవాలు ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మూత్ర పిండాలు, కాలేయం సంబంధిత వ్యాధులతో బాధ పడుతున్న వారైతే వైద్యులను సంప్రదించకుండా పారాసెటమాల్, డోలో, క్రోసిన్ వంటి టాబ్లెట్లను పొరపాటున కూడా వేసుకోరాదు. కాబట్టి ఇకపై పారాసెటమాల్ టాబ్లెట్ల విషయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించకండి అని గట్టిగా హెచ్చరిస్తున్నారు ఆయుర్వేద నిపుణులు డాక్టర్ నవీన్ నడిమింటి. ఆయుర్వేద నిపుణులు డాక్టర్ నవీన్ నడిమింటి (చదవండి: తెర వెనుక వైద్యుడు! వ్యాధులను నివారించడంలో వారిదే కీలక పాత్ర!) -
కొడుకు హఠాన్మరణం ఆ తండ్రిని..ఏకంగా..
ఒక్కో ఘటన లేదా పరిస్థితులు మనిషిని తనకే తెలియని తనలోని ఓ కొత్త కోణాన్ని పరిచయం చేస్తుంది. అవి కొందర్నీ మహనీయుడిని చేస్తే మరికొంర్ని వక్రమార్గంలో పయనించేలా చేస్తాయి. ఇక్కడొక తండ్రి కొడుకుని కోల్పోడమే జీర్ణించుకోలేని సతతమవుతున్న స్థితిలో తన కొడుకులా మరెవరూ అలా చనిపోకూడదనే గొప్ప ఆలోచనకు తెరతీసింది. ఇంకొన్నాళ్లు ఉండాల్సిన కొడుకు ఎలా అకాల మరణం చెందాడన్న ఆ సందేహమే అతడిని ఓ సరికొత్త చైతన్యం వైపుకి తీసుకెళ్లింది. అసలేం జరిగిందంటే..బ్రిటన్‌లోని భారత సంతతి చెందిన జే పటేల్‌కి 30 ఏళ్ల బలరామ్ అనే కొడుకు ఉన్నాడు. అతను లండన్‌లో చికిత్స పొందుతూ ఆస్పత్రిలో అనూహ్యంగా మరణించాడు. దీంతో జీర్జించుకోలేని బలరామ్ తండ్రి తన కొడుకు ఎలా చనిపోయాడన్న సందేహంతో విచారించడం ప్రారంభించాడు. తన కొడుకు సరైన చికిత్స సకాలంలో అందలేదని, సరైన సంరక్షణ లేకపోవడం తదితర కారణాల వల్లే చనిపోయినట్లు వెల్లడైంది. దీంతో అతను ఆస్పత్రిలోని పేషెంట్స్ సమస్యల పూర్వాపరాలు, జీవన వ్యవధిని నమోదు చేయడం ప్రారంభించాడు. అంతేగాదు చికిత్సలో తలెత్తుతున్న వైద్యుల తప్పుల తడకల గురించి కొత్త ఛారిటీ ఫౌండేషన్‌ని కూడా ప్రారంభించి రోగుల హక్కుల కోసం ప్రచారం చేస్తున్నాడు. తాను ఏర్పాటు చేసిన ఫౌండేషన్‌లో తన కొడుకు ఆస్పత్రి కన్సల్టెంట్, మిగతా సిబ్బంది చికిత్స సంరక్షణ వైఫల్యం కారణంగానే తీవ్ర నొప్పి, అసౌకర్యంతో ముందుగానే చనిపోయినట్లు అందరికీ తెలియజేశాడు. తాను చేసే ఈ కార్యక్రమాల ద్వారా అయిన తన కొడుకు బలరాం ట్రీట్మెంట్లో ఎలాంటి తప్పులు జరిగాయి అనే దానిపై ప్రభుత్వం స్పందించి..సత్వరమే దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటుందని నమ్ముతున్నాని అన్నారు. ఆస్పత్రుల్లో పేషెంట్ బంధువు, స్నేహితుడు, మరెవరైనా.. వారి ఆత్రతను ఆవేదనను ఆస్పత్రి యాజమాన్యం అస్సలు పట్టించుకోదని, అక్కడ తతెత్తుతున్న లోపాలను సరిదిద్దే యత్నం కూడా చేయదని ఆవేదనగా చెబున్నారు పటేల్. బ్రిటన్ పార్లమెంటు ఈ విషయంపై మార్పు తీసుకురావాలని ఆశిస్తున్నట్లు తెలిపాడు. చివరి నిమిషంలో తన కొడుకు ఆరు ప్రాణాపాయ సంకట పరిస్థితులతో పోరాడడని చెప్పారు. తన కొడుకు చిన్నతనంలో కూడా ఎనిమిది నుంచి 10 ఏళ్ల వరకు మానసికి వయసు సంబంధించిన పెరుగదల సమస్యతో ఇబ్బంది పడ్డాడని కన్నీటి పర్యంతమయ్యారు. అలా.. అలా నెమ్మదిగా మానసిక వికాసం కలుగుతుందనేలోపు ఇలాంటి ఘోరంగా జరిగిందని అన్నారు. అతను అందర్నీ ఆప్యాయంగా పలకరించేవాడు, ప్రేమగా ఉండేవాడంటూ కొడుకుని గుర్తుచేసుకున్నారు. ఇది పీడకలలా తనను వెంటాడుతూనే ఉంటుందని కన్నీళ్లు పెట్టుకున్నారు పటేల్. తన కొడుకు ఇంకొన్నాళ్లు జీవించాల్సిన వాడని, తగిన చికిత్స అందించడంలో జాప్యం, మంచి వైద్యం లేకపోవడం తదితర కారణాల వల్లే మరణించాడన్నారు. అందుకే తాను ఈ ఛారిటీ ద్వారా రోగులకు చికిత్సకు సంబంధించిన వివరాలు సేకరించి అకాల మరణాలను నివారించేలా చేయడమే గాక వారికి మంచి వైద్యం అందేలా ప్రత్యామ్నాయం మార్గాన్ని(వైద్యానికి సంబంధించిన సెకండ్ ఓపినియన్) ఎలా ఎంచుకువాలో అనే దానిపై అవగాహన కల్పిస్తున్నాడు. దీనికి యూకే ప్రభుత్వం, యూకే ఆరోగ్య కార్యదర్శి స్టీవ్ బార్క్లే మద్దతు ఇవ్వడంతోనే ఈ ప్రచారానికి పిలుపు ఇచ్చినట్లు పటేల్ తెలిపారు. ఇక 2021లో సెప్సితో మరణించి 13 ఏళ్ల మార్తా తల్లి కూడా ఇలానే "మార్తాస్ రూల్" అనే పేరుతో వైద్య చికిత్సకు సంబంధించిన సెకండ్ ఓపెనియన్ కోసం విస్తృతంగా ప్రచారం చేసింది. (చదవండి: భారత సంతతి చిన్నారికి అత్యంత అరుదైన కిడ్నీ మార్పిడి..! బ్రిటన్‌లోనే తొలిసారిగా..) -
ఆత్మహత్య ధోరణి జన్యుపరంగా సంక్రమిస్తుందా?
ఆత్మహత్య ధోరణి కొంతవరకు జన్యు పరంగా వస్తుందంటున్నారు ఆయుర్వే నిపుణులు నీవీన్ నడిమింటి. నేడు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది పిల్లలు ఇదే మానసిక స్థితిలో ఉంటున్నారు. తమిళనటుడు సినీ హిరో విజయ్ ఆంటోనీ కుటుంబంలో అతడి చిన్నతనంలోనే తండ్రి ఆత్మహత్య చేసుకొన్నారు. ఇప్పుడు అతని 16 ఏళ్ళ కూతురు కూడా అలానే... దీన్ని బట్టి చూస్తే ఆత్మహత్య ధోరణి అనేది కొంతవరకు జన్యుపరంగా వస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ల వచ్చాక పిల్లల్లో ఆ ధోరణి మరింత ఎక్కువైంది. చాలా మంది తల్లిందండ్రులు పిల్లల చేత ఫోన్లు ఎలా మానిపించాలని మొత్తుకుంటున్నారు. ముఖ్యంగా వారిని ఈ ఆత్మహత్యధోరణి దరిదాపుల్లోకి వెళ్లకుండా ఉండేలా ఫోన్ అడిక్షన్ మానిపించాలంటే ఏం చేయాలో ఆయుర్వేద నిపుణులు నవీన్ నడిమింటి మాటల్లో చూద్దాం!. చీకటి గదుల్లో పిల్లలను ఉంచొద్దు.. సెల్‌ఫోన్‌కు ( టీన్ ఏజ్ పిల్లల్లో ) అడిక్ట్ అయిపోతే డిప్రెషన్ ( మానసిక కుంగుబాటు ) అగ్రేషన్ ( కోపం చిరాకు హింసాత్మక ధోరణి ) వచ్చేస్తాయి. రెండేళ్ల పిల్లలు కూడా సెల్ ఫోన్ చేతికి ఇవ్వకపోతే అన్నం తినరు. అరిచి గోల చేస్తారు “ - నేడు తల్లితండ్రుల నోట తరచూ వినిపించే మాట కూడా ఇదే! పిల్లలు ఆరుబయట ఎంత ఆడుకుంటారో అంత పాజిటివ్ వ్యక్తిత్వం అలవడుతుంది... పిల్లలతో పేరెంట్స్ క్వాలిటి టైం మెయింటేన్ చేయాలి. ఇంకోటి చీకటి గదుల్లో ఎక్కువగా పిల్లలను ఉంచొద్దు పిల్లల ముందు ఎప్పుడు గాసిప్స్ మాట్లాడొద్దు. సెల్‌ఫోన్ లేకుండా పిల్లలు ఫుడ్ తినాలంటే.. పిల్లల పెరుగుదలలో అతి కీలకమైన వయసు ఏడాది నుంచి 5 ఏళ్లు. అంటే ప్రీ స్కూలు పిల్లల్లో పెరుగుదల అన్నది వారు తినే ఆహారంపైనే ఆధారపడి ఉంటుంది. మా బాబు ఏదీ తినడు ఆకలవడానికి ఏదైనా మంచి టానిక్ రాసివ్వండి. లేదా మా పిల్లవానికి పెరుగు వాసన గిట్టదండి, పెరుగన్నం తినకపోతే వేడి చేస్తుంది కదా అని చాలామంది తల్లిదండ్రులు అడుగుతుంటారు. ఏడాది నిండేటప్పటికి పిల్లలకు దాదాపు నడక వచ్చేస్తుంది. అక్కడి నుండి తనంతట తానుగా తిరుగుతూ, ఎక్కడేమేమి ఉన్నా చక్కబెడుతూ, ఆటలలో మునిగిపోయే పిల్లలు తిండి విషయంలో పేచీ పెట్టడం సహజమే. ఓ పట్టాన దేనికీ లొంగరు. మూడేళ్ల వయసులో పిల్లల్లో ప్రీస్కూల్లో చేర్చడంతో అక్కడ తోటి పిల్లల అలవాట్లను అనుకరించడం, వాళ్లు తినేవి బాగున్నట్లు, తనకి పెట్టినవి బాగోలేదని అనిపించడం ప్రారంభమవుతుంది. ఇవన్నీ ఏయే ఏడాదికి ఆ ఏడాది మారే అలవాట్లే. కాబట్టి దీని గురించి అంతగా చెందనక్కరలేదు. ఇక కొన్ని రుచులు, వాసనలు పడకపోవడమన్నది పిల్లలకైనా, పెద్దవారికైనా అది సహజం అని గుర్తించాలి. అవి, ఇవి తినేలా ఒత్తిడి చేసే బదులు వారు ఇష్టపడే రీతిలో అదే సమయంలో పోషకాలు కూడా అందేలా ఆహారాన్ని తయారు చేసి పెట్టాలి. తినిపిస్తే ఎక్కువ తింటాడని, బిడ్డ తింటానని మొరాయిస్తున్నా బలవంతంగా నోటిలో కుక్కే ప్రయత్నం అస్సలు చేయరాదు. కొంత ఆహారం వేస్ట్ అయినా వాళ్లంతట వాళ్లు తింటామంటే ప్రోత్సహించాలి. అలాంటప్పుడే కొత్త కొత్తవి రకరకాల ఆహార పదార్థాలను పెట్టి తినమంటే వాళ్లు ఓ ఆటలాగా తింటారు. తినే ఆహారంలో శక్తినిచ్చే పదార్థాలు తగినంతగా లేకపోతే పెరుగుదల సరిగా వుండదు. పిల్లలు అంత చలాకీగా ఉండరు. పిల్లలకు పాలు, పండ్ల రసాలు చాలా ఎక్కువగా ఇస్తూ, ఘనాహారాన్ని చాలా పరిమితంగా పెట్టాలి. వివిధ రకాల ఆహార పదార్థాలు లేకుండా ఒకే మూసలో ఉండే ఆహారం పెట్టడం వల్ల పిల్లలకు ఎ విటమిన్, ఐరన్, డి విటమిన్, బి- కాంప్లెక్స్ విటమిన్ లోపాలు ఏర్పడతాయి. వాళ్లు బయటికి వెళ్లి ఆటలాడుకుంటారు. పైగా ఇది మంచిది, మంచిది కాదు అని తెలియదు దీంతో వారు తరుచుగా తరచుగా జబ్బు పడుతుంటారు. తేలికగా అంటువ్యాధులు సోకుతుంటాయి. అందువల్ల పరిశుభ్రమైన రకరకాల ఆహార పదార్థాలను పిల్లలకు పెట్టాలి. ఇవీ మార్గదర్శకాలు.. ప్రీ స్కూల్ పిల్లలకు తిండి కూడా ఓ ఆట వస్తువులానే వుంటుంది. అలాగే ఊహ తెలియకపోయినా ఇష్టం, అయిష్టం ఉంటాయని గుర్తించాలి. వయస్సుకు ఉండాల్సిన ఎత్తు (సెం.మీలలో) ఉండవలసిన బరువు (కిలోల్లో) వారిగా వివరాలు.. పుట్టినప్పుడు 50 - 3 ఏడాదికి 74 - 8.5 రెండేళ్లకు 81.5 - 10 మూడేళ్లకు 89 - 12 నాలుగేళ్లకు 96 - 13.5 అయిదేళ్లకు 102 - 15 అమ్మాయిలు వయస్సు ఉండాల్సిన ఎత్తు (సెం.మీలలో) ఉండవలసిన బరువు (కిలోల్లో) పుట్టినప్పుడు 50 - 3 ఏడాదికి 72.5 - 8 రెండేళ్లకు 80 - 9.5 మూడేళ్లకు 87 - 11 నాలుగేళ్లకు 94.5 - 13 అయిదేళ్లకు 101 - 14.5 కేలరీలు: ఏడాది వయసులో బిడ్డ బరువు కిలోకు వంద కిలో క్యాలరీలు అవసరం కాగా ఐదేళ్ల వయసులో 80 కిలో క్యాలరీలు కావాలి. ఏడాది వయసు వచ్చేటప్పటికి బిడ్డ రోజుకు మూడు పూట్ల భోజనంతో పాటు ఉదయం పూట అల్పాహారం, సాయంత్రం స్నాక్స్ తినేలా చూడాలి. ఆ వయసులో తల్లి పాలు కానీ పోత పాలు కానీ వారికి అవసరమైన శక్తిలో పావు వంతు మాత్రమే అందించగలవు. అంటే అంత వరకు అనుబంధ ఆహారంగా ఉన్నది ఇక ముఖ్య ఆహారం కావాలి. పాలు, పండ్లు కూరగాయలు, చిక్కుడు జాతి గింజలు, గుడ్లు, మాంసం, చేపలు తదితరాలు తగు మొత్తాలతో ఉన్న సమతులాహారం బిడ్డకు అందేలా చూడాలి. పిల్లలకు ఏమాత్రం ఖాళీ దొరికినా సెల్ ఫోన్ కే పరిమితమైపోతున్నారు. ఆండ్రాయిడ్ ఫోన్లలో గేములు, వీడియోలుకే బయట పిల్లలతో ఆడుకోవడానికి వెళ్లేందుకు ఇష్టపడడం లేదు. స్నేహితులు కంటే ఫోనునే అంతలా ఇష్టపడుతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఫోనుకు ఎడిక్ట్ అయిపోతున్నారు. ఫోను నిత్యవసరమైపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో ఆ ఫోనేను వాడడం మానుకోలేక, పిల్లలు అంతలా ఇష్టపడే ఫోను కేవలం పిల్లల మనో వికాసానికి అవసరమైన సలహాలు, ఆటలు ఆడేలా భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిదిగా ఉంటే ఎంతబావుంటుందో కదా..! ముఖ్యంగా పిల్లలు టీనేజ్ వయసు వచ్చేంత వరకు కూడా తల్లిదండ్రుల వారితో ఏదో రకంగా సమయాన్ని కేటాయించాలి. అది వారికి అమూల్యమైన సమయంగా ఫీలయ్యేలా మీరు గనుక మీకున్న బిజీ షెడ్యూల్లో కనీసం ఓ అరగంట అయినా కేటాయించే యత్నం చేస్తే.. పిల్లలు సెల్ఫోన్లు లాంటి విష సంస్కృతికి అడిక్ట్ కారు. డిప్రెషన్‌కి గురయ్యి ఆత్మహత్య ధోరణి దరిదాపుల్లోకి వెళ్లరు. తల్లిదండ్రల గురించి ఆలోచించాలనే బాధ్యతయుతమైన వ్యక్తితత్వం తల్లిదండ్రుల సాన్నిహిత్యం ద్వారానే సాధ్యం. పిల్లలు బాగుపడాలన్నా, భవిష్యత్తు బాగుండాలన్ని అది తల్లిదండ్రల చేతుల్లోనే ఉందనేది గ్రహించండి అంటున్నారు ఆయుర్వేద నిపుణులు నవీన్ నడిమింటి. పిల్లలకు తల్లిదండ్రలు మించిన స్నేహితులు, శ్రేయోభిలాషులు ఉండరు. తల్లిదండ్రలంటే భయం కాదు.. ప్రేమ, గౌరవం పిల్లల్లో కలిగేలా చేయాల్సింది తల్లిదండ్రులే కాబట్టి ముందు మీరే మారండి. --ఆయుర్వేద నిపుణులు, నవీన్ నడిమింటి (చదవండి: నాకిప్పుడు మూడోనెల, ఆ రిస్క్ ఉండకూడదంటే ఏం చేయాలి?) -
గుండెకు చేటు తెచ్చే ట్రైగ్లిజరైడ్స్‌ను తగ్గించుకోండి! లేదంటే..
ట్రైగ్లిజరైడ్స్ అన్నవి కొలెస్ట్రాల్‌లాగానే రక్తంలోని ఒక రకం కొవ్వులని చెప్పవచ్చు. ఇవి ఉండాల్సిన మోతాదు పెరిగితే ఆ కండిషన్‌ను ‘హైపర్ట్రైగ్లిజరైడెమియా’ అంటారు. వీటి మోతాదులు పెరగడం గుండె జబ్బులకు దారితీయవచ్చు. ట్రైగ్లిజరైడ్స్ తగ్గించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు రక్తంలో ట్రైగ్లిజరైడ్ మోతాదులు ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని ఆహార నియమాలు పాటించడం ద్వారా వాటిని తగ్గించుకోవచ్చు. రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ ఉన్నప్పుడు జీవనశైలిలో మార్పులు తప్పనిసరిగా పాటించాలి. బరువు ఎక్కువగా ఉన్నవారు దాన్ని అదుపు చేసుకునేలా ఆహారంలో మార్పులు చేసుకోవాలి. అంటే తీసుకునే క్యాలరీల (క్యాలరీ ఇన్‌టేక్)ను తగ్గించుకోవాలి. ఆహారంలో కొవ్వుల్ని... అంటే శాచ్యురేటెడ్ ఫ్యాట్‌ను, కొలెస్ట్రాల్ మోతాదులను బాగా తగ్గించాలి. ఉదాహరణకు... నెయ్యి, వెన్న, వూంసాహారం (రొయ్యలు, చికెన్ స్కిన్), వేపుళ్లను బాగా తగ్గించాలి. తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. డ్రైఫ్రూట్స్‌లో పీచు ఎక్కువగా ఉంటుంది. అవి ట్రైగ్లిజరైడ్స్‌ను తగ్గించడంలో బాగా తోడ్పడతాయి. వాటితో పాటు వెజిటబుల్ సలాడ్స్, తేలిగ్గా ఉడికించిన కాయగూరలు తీసుకోవడమూ మంచిదే. స్వీట్స్, బేకరీ ఐటమ్స్ బాగా తగ్గించాలి. పొట్టు తీయని ధాన్యాలు (అంటే... దంపుడు బియ్యం, మెుక్కజొన్న, పొట్టుతీయని రాగులు, గోధువులు, ఓట్స్), పొట్టుతీయని పప్పుధాన్యాలు, మొలకెత్తిన గింజలు (స్ప్రోట్స్) తీసుకోవాలి. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు శారీరక శ్రవు / వాకింగ్ వంటి వ్యాయావూలు చేయాలి. కొవ్వులు ఎక్కువగా ఉండే రెడ్మీట్ను పూర్తిగా మానేయాలి. అయితే మాంసాహారాన్ని ఇష్టపడే వారు వారంలో వుూడుసార్లు చేపలు తీసుకోవచ్చు. అది కూడా కేవలం ఉడికించి వండినవీ, గ్రిల్డ్ ఫిష్ వూత్రమే తీసుకోవాలి. డీప్ ఫ్రై చేసినవి తీసుకోకూడదు∙ పొగతాగే అలవాటునూ, ఆల్కహాల్‌ను పూర్తిగా వూనేయాలి. (చదవండి: రక్తంలో ట్రైగ్జిజరైడ్స్‌ను తగ్గించుకోవాలంటే..ఇలా చేయండి!) -
గుండె పదిలంగా ఉండాలంటే..ఈ జాగ్రత్తలు తప్పవు!
ప్రపంచంలోని ఏ దేశంలో లేనంతమంది గుండెజబ్బు బాధితులు మన దేశంలోనే ఉన్నారు. మన దేశంలో ఏటా కోటీ 79 లక్షలమంది గుండెజబ్బులతో చనిపోతున్నారు. కొన్ని జీవనశైలి మార్పుల ద్వారా గుండె జబ్బుల్ని చాలావరకు నివారించవచ్చు. గుండెకు చేటు తెచ్చిపెట్టే ఆరు ముఖ్యమైన అంశాలు... అధిక రక్తపోటు (హై–బీపీ) : ఇది ఓ సైలెంట్ కిల్లర్. దాదాపు 75% గుండెపోట్లకు కారణం. స్థూలకాయులు తమ బరువులో 10 శాతం తగ్గించుకున్నా ఏ మందులూ లేకుండానే హైబీపీని చాలావరకు అదుపు చేయవచ్చు. మధుమేహం: డయాబెటిస్ ఉన్నవారు చాలావరకు గుండెజబ్బుల బారిన పడుతుంటారు. అందుకే 40 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ హెచ్‌బీఏ1సీ వంటి పరీక్షలను ఏడాదిలో కనీసం రెండుమూడుసార్లు చేయించుకోవాలి. ఒంట్లో కొవ్వులూ, కొలెస్ట్రాల్ : ఆహారంలో కొవ్వులతో చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్) పెరిగి, గుండెకు చేటు తెచ్చిపెడుతుంది. దేహంలో దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్ : చాలాకాలం పాటు ఒత్తిడికీ, ఇతర దీర్ఘకాలపు ఇన్ఫెక్షన్లకూ గురవుతూ ఉండటం, నిద్రలేమి, పొగతాగే అలవాట్లు రోగనిరోధక వ్యవస్థ దెబ్బతినేందుకు దోహదపడతాయి. దాంతో రక్తంలోకి విషపూరితమైన రసాయనాలు విడుదలై రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడతాయి. గుండెను దృఢంగా ఉంచుకోడానికి చేయాల్సినవి... లిఫ్ట్‌కు బదులు మెట్లు వాడటం. ఒకేచోట కూర్చోకుండా నడక... సామర్థ్యం మేరకు పరుగు లేదా జాగింగ్. కార్లూ, బైకులకు బదులు సైకిల్ వాడటం. ∙ఈత, తోటపని చేస్తూ ఉండటం. ∙పొగతాగడం, నిద్రలేమికి దూరంగా ఉండటం... ఇవన్నీ దేహానికీ, దాంతోపాటు గుండెకూ ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. డా‘‘ ప్రదీప్ కె. రాచకొండ, సీనియర్ కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ సర్జరీ. (చదవండి: భార్య సిజేరియన్ వల్లే..అనారోగ్యానికి గురయ్యానంటూ ఓ భర్త) -
పిల్లల్లో టాన్సిల్స్ సమస్య ఎందుకొస్తుందంటే..!
పిల్లల్లని వేధించే వాటిలో టాన్సిల్స్ సమస్య ఒకటి. చాలామంది పిల్లలు దీనిబారినపడి పెద్దల్ని నానా ఇబ్బందులు పెడుతుంటారు. ఆఖరికి సర్జరీ చేయించి తీసేయడం జరుగుతుంది. అసలు ఎందుకొస్తుంది. దీన్ని నివారించాలంటే ఏం చేయాలి తదితరాల గురంఇచ ఆయుర్వేద నిపుణులు నవీన్ నడిమింటి మాటల్లో చూద్దాం. కొన్ని సార్లు ఇబ్బంది పెట్టినా కూడా టాన్సిల్స్ మంచివి. మనం తీసుకున్న ఆహారంలో ఉండే బాక్టీరియా లాంటి కొన్ని రకాల క్రిములని ఈ టాన్సిల్స్ అడ్డుకుంటాయి. ఒంట్లో బాగా వేడి చేస్తే ఈ టాన్సిల్స్ వాపు చేసి నొప్పి పెడతాయి. టాన్సిల్స్ రావడానికి ప్రధాన కారణం వేడి చేసే పదార్దాలు తినడం (ఫ్రిడ్జ్‌లో నీరు తాగడం,. కూల్ డ్రింక్స్, మసాలాలు, కారం, పచ్చళ్ళు లాంటివి అన్నమాట). వాతావరణానికి తగ్గట్లు ఆహారపు అలవాట్లలో కొంచెం మార్పు చేసుకుంటే టాన్సిల్స్ పెద్దగా ఇబ్బంది పెట్టవు. ఒకవేళ మీరు నొప్పితో బాధపడుతుంటే డాక్టరు దగ్గరకి వెళ్లేముందు ఒక్కసారి ఇది చేసి చూడండి. రాళ్ళ ఉప్పు వేసిన వేడి నీరు గొంతు వరకు పోసుకుని పుక్కిలించండి. ఇలా రోజుకి 4 సార్లు చొప్పున 2 రోజులు చేయండి. 90% వరకు నొప్పి మాయం అవుతుంది. అలానే తాగే నీరు కూడా వేడి గా ఉండేలా చూసుకోండి. అదే వృద్దులకు గొంతులో నొప్పి కఫాన్ని తగ్గాలంటే..మెత్తగా దంచి జల్లించి న కరక్కాయ పొడి, తేనెలో కలిపి రెండు పూటలా చప్పరించాలి. ఉదయం లేవగానే గోరు వెచ్చని మంచినీరు రెండు గ్లాసులు త్రాగాలి.రాత్రి పడుక్కోడానికి అరగంట ముందు రెండు చిటికెల పసుపు, నాలుగు మిరియాలు ( దంచిన ముక్కలు) పంచదార కొంచెం ( షుగరు లేకపోతే ఉంటే మెత్తని ఎండు ఖర్జూరం పొడి) ఒక గ్లాసు పాలు లో మరిగించి, వడకట్టి త్రాగాలి. వృద్ధులుకి ఏది ఇచ్చినా అది ద్రవ రూపంలో లేదా మెత్తని పౌడర్ రూపంలో ఉండాలి అయినా కూడా నొప్పి తగ్గకపోతే అప్పుడు హాస్పిటల్‌కి వెళ్లండి. టాన్సిల్స్‌కి చిన్నపాటి సర్జరీ ఉంటుంది. ఆయుర్వేద నిపుణులు, నవీన్ నడిమింటి (చదవండి: బొమ్మలు వేస్తూ ఆ ఫోబియాను పోగొట్టకుంది! ఏకంగా గొప్ప ఆర్టిస్ట్‌గా..) -
భార్య సిజేరియన్ వల్లే..అనారోగ్యానికి గురయ్యానంటూ ఓ భర్త..
చాలా విచిత్రమైన కేసులు చూసుంటాం. ఇలాంటి విచిత్రమైన కేసు చూసే అవకాశం లేదు. అవకాశం దొరకాలే కానీ చిన్న కారణంతో అవతల వాళ్లని ఇబ్బంది పెట్టి డబ్బులు గుంజాలని చూస్తుంటారు కొందరూ. అలాంటి కోవకు చెందని వాడే భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియన్ వ్యక్తి. ఎంత విచిత్రమైన ఆరోపణలతో కోర్టు మెట్లు ఎక్కాడో వింటే ఆశ్చర్యపోతారు. కేసు నిలబడుతుందనుకున్నాడో, తన వాదన నెగ్గుతుందనో తెలియదు చాలా హాస్యస్పదమైన ఆరోపణలతో కేసు వేశాడు. చివరికీ ఏమైందంటే.. ఆస్ట్రేలియాకు చెందిన భారత సంతతి వ్యక్తి అనిల్ కొప్పుల అనే వ్యక్తి భార్యకు 2018లో రాయల్ ఉమెన్స్ హాస్పటల్స్ సీజేరియన్ ఆపరేషన్ చేసి బిడ్డను తీశారు. అక్కడ ఆస్పత్రి నిబంధనల ప్రకారం భార్య ఆపరేషన్ టైంలో భర్త పక్కనే ఉండి ధైర్యం చెప్పేలా ప్రోత్సహిస్తారు. అతడు కూడా ఆపరేషన్ థియోటర్లో వైద్యుల తోపాటే ఉన్నాడు. అప్పటి నుంచి మెంటల్‌గా డిస్ట్రబ్ అయ్యాను. మానసిక అనారోగ్యానకి గురయ్యాను. ఆ ఆపరేషన్‌లో నా భార్య అంతర్గత అవయవాలు, బ్లీడింగ్ చూడటం కారణంగా తన వైవాహిక జీవితం కూడా సరిగా లేదని ఆరోపణలు చేస్తూ కోర్టు మెట్లు ఎక్కాడు అనిల్ కొప్పుల. తన మానసికా ఆరోగ్యం, వైవాహిక జీవితం దెబ్బతినడానికి కారణమైన సదరు ఆస్పత్రిపై చర్యలు తీసుకోవడమే గాక అందుకు ప్రతిగా రూ. 5వేల కోట్లు నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా కేసు పెట్టాడు. సోమవారం విక్టోరియాలోని సుప్రీం కోర్టు వాదోపవాదనలు విన్నాక తల్లి బిడ్డల సంరక్షణ విషయమై వైద్యులు సీజేరియన్ ఆప్షన్ ఎంచుకుంటారు. తల్లి, బిడ్డల సంరక్షణ కోసం భర్తను థియెటర్లోని అనుమతించడం అనేది కూడా సర్వసాధారణ విషయం. దీని వల్ల అతను ఎలాంటి ఆర్థిక నష్టాన్ని చవిచూడలేదు. పైగా అతను ఆరోపిస్తున్న మానసికి అనారోగ్యం అనేది తీవ్రమైన గాయం కింద పరిగణించేది కాదని తేల్చి చెప్పింది. అందువల్ల అతనికి ఎలాంటి నష్ట పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంటూ..కోర్టు అతడి కేసుని తోసిపుచ్చింది. (చదవండి: బొప్పాయి గింజలు పడేస్తున్నారా..? తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటంటే..) -
అనుమానం అనేది వ్యాధా? నయం చేయలేమా?
డాక్టర్ మాధవ్ యూనివర్సిటీలో మాథ్స్ ప్రొఫెసర్. ఇల్లు, కాలేజీ, లైబ్రరీ తప్ప మరో లోకం తెలియదు. ఎలాంటి దురలవాట్లు లేవు. కానీ తన భార్యను నిరంతరం అనుమానిస్తుంటాడు. ఆమె మొబైల్ ఫోన్, మెయిల్స్, వాట్సప్ చాట్స్ ఎప్పటికప్పుడు చెక్ చేస్తుంటాడు. దాంతో ఇంట్లో రోజూ గొడవలే. ఇరువైపుల పెద్దలు సర్దిచెప్పినా ఫలితం లేకపోయింది. అతను తన ప్రవర్తనను మార్చుకోవాలని ప్రయత్నించినా సఫలం కాలేదు. దాంతో మాధవ్ భార్య విడాకులు కోరుకుంటోంది. యూనివర్సిటీలో మాధవ్ టాలెంట్‌పై అందరికీ అపారమైన గౌరవం. క్లాస్ మొదలుపెట్టాడంటే స్టూడెంట్స్ అందరూ మొబైల్ చూడకుండా వింటారు. తన ఆధ్వర్యంలో పదిమంది పీహెచ్డీ అందుకున్నారు. ప్రస్తుతం రెండు ప్రతిష్ఠాత్మకమైన అంతర్జాతీయ ప్రాజెక్టుల్లో పదిమంది రీసెర్చ్ స్కాలర్స్‌తో పనిచేయిస్తున్నాడు. కానీ అతనితో పనిచేయడమంటే నరకమని అందరూ భయపడుతుంటారు. ఎందుకంటే అతను ఎవ్వరినీ నమ్మడు. రీసెర్చ్ పేపర్స్ తీసుకెళ్తారేమోనని నిత్యం అనుమానిస్తుంటాడు. ఆయన ఎవ్వరితో కలవడని, రీసెర్చ్ స్కాలర్స్నే కాదు సహోద్యోగులను కూడా ఏ మాత్రం నమ్మడని చెప్పారు. అందరినీ అనుమానించే మాధవ్ తన కారు డ్రైవర్‌ను మాత్రం గుడ్డిగా నమ్మేస్తాడు. అదెందుకో ఎవ్వరికీ అర్థం కాలేదు. వ్యక్తిత్వంలోనూ రుగ్మతలుంటాయి ప్రొఫెసర్ మాధవ్ లాంటి వ్యక్తులు జీవితంలో ఎదురైనప్పుడు ‘అనుమానపు పక్షి’ అని ముద్ర వేసి అందరూ తప్పుకుంటారు. కానీ అలా అనుమానించడం కూడా ఒక మానసిక రుగ్మతేనని, దానికి చికిత్స ఉందని గుర్తించరు. మాధవ్‌కు ఉన్న సమస్యను పారనాయిడ్ పర్సనాలిటీ డిజార్డర్ (పీపీడీ) అంటారు. అయితే ఇది డిప్రెషన్, యాంగ్జయిటీ లాంటి మానసిక రుగ్మత కాదు, వ్యక్తిత్వ రుగ్మత. అంటే అనుమానించడం అతని మనస్తత్వంలో భాగంగా ఉంటుంది. అందువల్లనే దీన్ని గుర్తించడం కష్టం. ప్రతి వ్యక్తికీ ఒక వ్యక్తిత్వం ఉంటుంది. జీన్స్‌తో పాటు, పుట్టి పెరిగిన పరిసరాలు, ఎదురైన అనుభవాలు, ఎదుర్కొన్న కష్టాలు, స్నేహాలు వ్యక్తిత్వ నిర్మాణంలో ప్రధానపాత్ర పోషిస్తాయి. ఈ క్రమంలో కొందరికి ఎదురైన అనుభవాలు వారి వ్యక్తిత్వంలో లోపాలు తీసుకొస్తాయి. (చదవడం: ఆ వ్యక్తిత్వ లోపాలు తీవ్రమైనప్పుడు వ్యక్తిత్వ రుగ్మతలుగా మారతాయి. అలాంటి వ్యక్తిత్వ రుగ్మతలు పది రకాలున్నట్లు గుర్తించారు. అందులో పీపీడీ ఒకటి. అందరినీ అనుమానించడం దీని ప్రధాన లక్షణం. బాల్యంలో ఏర్పడిన గాయాలే కారణం పీపీడీ ఎందుకు వస్తుందనేది తెలియదు. ఆనువంశింకంగా వచ్చే జీన్స్‌తో పాటు, పుట్టి పెరిగిన పరిసరాలు ఇందుకు కారణమవుతాయని గుర్తించారు. ముఖ్యంగా బాల్యంలో తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయడం, నిరంతరం అనుమానించడం లేదా శారీరక, లైంగిక వేధింపులకు గురవ్వడం, తన భావోద్వేగాలను ఎవ్వరూ పట్టించుకోకపోవడం, ఒంటరిగా ఉండాల్సి రావడం, సోషల్ యాంగ్జయిటీ, హైపర్ సెన్సిటివిటీ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని పరిశోధకులు గుర్తించారు. ఇలా బాల్యంలో ఎదురైన అనుభవాలు, ఏర్పరచిన గాయాలు మనస్తత్వంలో లోపాలుగా మారి 18 ఏళ్ల వయస్సు తర్వాత వ్యక్తిత్వ రుగ్మతలుగా బయటపడతాయి. దాదాపు 0.5 నుంచి 4.5 శాతం మందిలో ఈ రుగ్మత ఉంటుంది. స్కిజోఫ్రీనియా లేదా డెల్యూజనల్ డిజార్డర్ ఉన్నవారి బంధువుల్లో పీపీడీ కనిపిస్తుందని ఆధారాలున్నాయి. పారనాయిడ్ పర్సనాలిటీ డిజార్డర్ లక్షణాలు.. అందరూ తనకు ద్రోహం చేయడానికి ప్రయత్నిస్తుంటారని భావించడం, అందరినీ అనుమానించడం ఎవ్వరినీ తేలిగ్గా నమ్మరు. స్నేహితులు, సహచరులు, భాగస్వామి... ప్రతివారినీ అనుమానంగా చూస్తారు ఎలాంటి ఆధారాలు లేకుండానే, జీవిత భాగస్వామి నమ్మకద్రోహం చేస్తున్నారని అనుమానిస్తుంటారు వారి అనుమానాస్పద ధోరణిని సమర్థించుకునేందుకు ఆధారాలను వెతుకుతూ ఉంటారు. ఈ తరహా వ్యక్తిత్వం ఉన్నవారు రిలేషన్‌షిప్‌ను సరిగా నెరపలేరు ఏదైనా అంశంలో ఫెయిల్ అయినప్పుడు చాలా సెన్సెటివ్‌గా ఫీలవుతూ తాము అవమానానికి గురైనట్లు భావిస్తుంటారు. తీవ్రంగా పగబడతారు తాను ఏదైనా చెప్తే తనకు వ్యతిరేకంగా ఉపయోగిస్తారనే భయంతో ఇతరులతో సమాచారం పంచుకోవడాన్ని ఇష్టపడరు విశ్రాంతి తీసుకోవడం కష్టంగా ఉంటుంది శత్రుత్వం, మొండితనం, వాగ్వివాదం కలిగి ఉంటారు కుటుంబ సభ్యులే బాధ్యత తీసుకోవాలి పీపీడీని నిరోధించడం సాధ్యం కానప్పటికీ, దాన్ని గుర్తించి చికిత్స తీసుకోవడం ద్వారా ఆలోచనలను నియంత్రించుకుని సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు పీపీడీ ఉన్నవారు సాధారణంగా చికిత్సకు అంగీకరించరు. కాబట్టి కుటుంబసభ్యులే ఒప్పించి చికిత్స ఇప్పించాల్సి ఉంటుంది ∙ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ లేదా డయలెక్టిక్ బిహేవియర్ థెరపీ వంటివి కమ్యూనికేషన్, కాన్ఫిడెన్స్‌ను పెంచుకోవడానికి సహాయపడతాయి సైకోథెరపీ ద్వారా ఇతరులను అర్థం చేసుకోవడం, నమ్మకం పెంచుకోవడం, సరైన సంబంధాలను పెంచుకోవడం సాధ్యమవుతుంది పీపీడీకి దీర్ఘకాలిక చికిత్స అవసరం ఉంటుంది. అదంతా ఫీజు కోసమేనని థెరపిస్ట్ ఉద్దేశాలను కూడా అనుమానించే అవకాశం ఉంది. కాబట్టి కుటుంబ సభ్యులే బాధ్యత తీసుకుని థెరపీకి తీసుకురావాల్సి ఉంటుంది. (చదవండి: చిన్నారుల్లో బ్రాంకియోలైటిస్ వస్తే...? ముఖ్యంగా అలాంటి పిల్లలు..) -
మతిమరుపు అనేది వ్యాధా! ఇది వస్తే అంతేనా పరిస్థితి!!
వయసు పెరుగుతున్న కొద్దీ మతిమరపు వస్తుండటం సహజం. మతిమరపును ఇంగ్లిష్‌లో ‘డిమెన్షియా’ అంటారు. డిమెన్షియాకు కారణాల్లో అత్యంత సాధారణమైంది ‘అల్జైమర్స్’ అయితే... దానితో పోలిస్తే... దానికంటే కొద్దిగా అరుదైనది వాస్క్యులార్ డిమెన్షియా. ఈ సందర్భంగా మతిమరపునకు కారణమయ్యే అల్జైమర్స్ డిమెన్షియా, వాస్క్యులార్ డిమెన్షియాలపై అవగాహన కోసం ఈ కథనం. డిమెన్షియా, అల్జైమర్స్ని ఓ వ్యాధిగా కాకుండా ఓ సిండ్రోమ్‌గా చెప్పవచ్చు. అంటే... నిర్దిష్టంగా ఓ వ్యాధి లక్షణంతో కాకుండా... అనేక లక్షణాల సమాహారంతో కనిపించే ఆరోగ్య సమస్యను సిండ్రోమ్ అనవచ్చు. డిమెన్షియా ఉన్నప్పుడు అది కొత్త అంశాల్ని నేర్చుకునేందుకు దోహదపడే (కాగ్నిటివ్) నైపుణ్యాల్లోని జ్ఞాపకశక్తి (మెమరీ)పైనా, తార్కికంగా ఆలోచించే సామర్థ్యం (రీజనింగ్)పైనా ప్రతికూలంగా ప్రభావం చూపుతుంది. అల్జైమర్స్ విషయానికి వస్తే ఇది కూడా డిమెన్షియాలో ఒక రకం. అందుకే దీన్ని అల్జైమర్స్ డిమెన్షియా (ఏడీ) అనవచ్చు. గతంతో పోలిస్తే ఇప్పుడిది చాలా సాధారణంగా కనిపిస్తోంది. ముఖ్యంగా కోవిడ్ తర్వాత నలుగురితో కలవకపోవడం, ఒంటరితనం, మానసిక ఒత్తిడి లాంటి అంశాల కారణంగా అల్జైమర్స్ పెరిగింది. అల్జైమర్స్ డిమెన్షియా: కొన్ని నెలలు మొదలుకొని ఏళ్ల వ్యవధిలో క్రమంగా పెరుగుతూ పోతుంటుంది. ఒకసారి అల్జైమర్స్ మొదలయ్యాక బాధితుల్ని మునపటిలా అయ్యేలా చికిత్స సాధ్యం కాదు. కాకపోతే దీనిలో మరపు అన్నది మొదట్లో తాజా తాజా విషయాలు మొదలుకొని... క్రమంగా పాత విషయాల్ని మరచిపోతుంటారు. తాము ఎంతోకాలంగా నివాసమున్న ప్రదేశాల్నీ, కాలాన్నీ (అది పగలా, రాత్రా అన్నదానితో సహా) మరచిపోతారు. ప్రశ్నలకు సమాధానాలివ్వలేకపోవడం, కుటుంబ సభ్యుల్ని అడిగిన ప్రశ్నల్నే మళ్లీ మళ్లీ అడగడం, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ప్రవర్తనలో మార్పు రావడం... చివరకు సొంత కుటుంబ సభ్యుల్ని సైతం గుర్తుపట్టలేనంతగా మరచిపోతారు. వాస్క్యులార్ డిమెన్షియా మతిమరపులకు ‘వాస్క్యులార్ డిమెన్షియా’ అనేది ‘అల్జైమర్స్ డిమెన్షియా’ కంటే రెండో అతి ముఖ్యమైన కారణం. మెదడుకు క్రమంగా రక్త సరఫరా తగ్గిపోవడం వల్ల వస్తుంది కాబట్టి దీన్ని ‘వాస్క్యులార్ డిమెన్షియా’గా చెబుతారు. ఇది కొందరిలో అకస్మాత్తుగా కనిపిస్తుంది. ఫలితంగా అభ్యాస, అధ్యయన, నేర్చుకునే ప్రక్రియలు... ఇలా ఇవన్నీ మరుస్తూపోవడం వల్ల పరిస్థితి అకస్మాత్తుగా దిగజారిపోతుంది. మతిమరుపు, అల్జైమర్స్ తెచ్చి పెట్టే అంశాల్లో కొన్ని... జన్యుపరమైనవి: మతిమరపులో జన్యుపరమైన అంశాలు కీలకమైన భూమిక పోషిస్తాయి. కొందరి కుటుంబాల్లో వంశపారం పర్యంగా కనిపిస్తుంటాయి. ఏపీఓఈ 4 ఎల్లీల్ వంటి కొన్ని నిర్దిష్టమైన జన్యువులు ఈ ముప్పులను పెంచుతాయి. వయసు : పెరిగే వయసు మతిమరపును తెచ్చిపెట్టే అల్జైమర్స్, వాస్క్యులార్ డిమెన్షియాలకు ప్రధానమైన రిస్క్ ఫ్యాక్టర్. పైగా ఇది నిరోధించలేని అంశం. జీవనశైలి (లైఫ్ స్టైల్) : ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించని వాళ్లలో అంటే... ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడం, కొవ్వులు, చక్కెరలు ఎక్కువగా తీసుకోవడం, వ్యాయామం లేకపోవడం, పొగ, ఆల్కహాల్ అలవాట్ల వంటì అనారోగ్యకరమైన జీవనశైలి ఉన్నవారిలో ఈ ముప్పులు ఎక్కువ. దేహంలోని ఇతర సమస్యలు : దీర్ఘకాలికంగా ఉండే డయాబెటిస్, హైబీపీ, గుండెజబ్బులు మెదడు పనితీరుపై ప్రతికూలం ప్రభావం చూపి, పరోక్షంగా అల్జైమర్స్, వాస్క్యులార్ అల్జైమర్స్కూ, గురకను కల్పించే స్లీప్ ఆప్నియాకు కారణమవుతాయి. వాతావరణ అంశాలు : వాతావరణ కాలుష్యాలూ, విషపూరిత వ్యర్థాలూ చాలావరకు మతిమరపునకు కారణమవుతాయి. అందుకే వీలైనంతవరకు పరిశుభ్రమైన ప్రదేశాలూ, కాలుష్యాలు లేని వాతావరణాలూ వీటి నివారణకు చాలావరకు తోడ్పడతాయి. ఆహారం : పోషకాలన్నీ ఉండే సమతులాహారం తీసుకోవడం మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ముఖ్యంగా భారతీయ వంటల్లో ఉపయోగించే పసుపు, మెడిటేరియన్ డైట్ (ఆల్మండ్స్, వాల్నట్, డార్క్ చాక్లెట్స్, ఆలివ్ ఆయిల్, క్రాన్బెర్రీ) వంటివి మతిమరపు నివారణకు తోడ్పడతాయి. నివారణ... పై అంశాలలో పెరిగే వయసు, జన్యుపరమైన అంశాలు నిరోధించలేనివి. ఇవి మినహా మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్‌ను ప్రయత్నపూర్వకంగా అదుపులో ఉంచడం ద్వారా వీటిని చాలావరకు నివారించవచ్చు. ఈ కింది అంశాలు నివారణకు చాలావరకు తోడ్పడతాయి. వ్యాయామం : దేహాన్ని చురుగ్గా ఉంచే వ్యాయామాలు చేయాలి. ఫలితంగా మెదడుకు రక్తప్రసరణ పెరిగి, న్యూరాన్లూ వాటి న్యూరల్ కనెక్షన్లు, జీవక్రియల కోసం మెదడు స్రవించే రసాయనాలన్నీ ఆరోగ్యకరంగా ఉంటాయి. దాంతో జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. మెదడుకు మేత : కొత్త భాషలు నేర్చుకోవడం, పుస్తక పఠనం, పజిల్స్ సాధించడం, మెదడుకు మేత కల్పించే పొడుపుకథలు, ఉల్లాసంగా ఉంచే హాబీలు, మానసిక వ్యాయామాలు మెదడును ఆరోగ్యంగా ఉంచి మతిమరపు నివారణకు తోడ్పడతాయి. దీర్ఘకాలిక వ్యాధుల అదుపు : డయాబెటిస్, హైబీపీ వంటి వ్యాధులను అదుపులో పెట్టుకోవాలి. నలుగురిలో ఒకరిగా : వేడుకలు, పుట్టినరోజులూ, పెళ్లిళ్ల వంటి ఫంక్షన్లలో పదిమందినీ కలవడం వంటివి మతిమరపును దూరం చేస్తుంది. చికిత్స : అలై్జమర్స్ డిమెన్షియానూ, వాస్క్యులార్ డిమెన్షియానూ పూర్తిగా తగ్గించే మందులు లేకపోయినప్పటికీ... వాటి పురోగతిని ఆలస్యం చేయడానికి మందులు అందుబాటులో ఉన్నాయి. లక్షణాల తీవ్రత ఆధారంగా డోనెపెజిల్, రివాస్టిగ్మిన్, మెమాంటిన్, గ్యాలంటమైన్ వంటి మందులు ఇవ్వాల్సి ఉంటుంది. ‘లెకానిమ్యాబ్’ అనే సరికొత్త మందును ఈ ఏడాదే ఎఫ్‌డీఏ ఆమోదించింది. పైవన్నీ నోటిద్వారా తీసుకునే మందులు కాగా... లెకానిమ్యాబ్ను రెండోవారాలకు ఒకసారి సూది మందు రూపంలో ఇస్తారు. (చదవండి: మానవుడికి పంది కిడ్నీ..ప్రయోగం విజయవంతం) -
చిన్నారుల్లో బ్రాంకియోలైటిస్ వస్తే...? ముఖ్యంగా అలాంటి పిల్లలు..
చిన్నారుల ఊపిరితిత్తులకు గాలిని తీసుకెళ్లే చిన్న గాలిగొట్టాల్ని బ్రాంకియోల్స్ అంటారు. ఇన్ఫెక్షన్లు లేదా ఇతర కారణాలతో వీటిల్లో వాపు వస్తే దాన్నిబ్రాంకియోలైటిస్గా చెప్పవచ్చు. సాధారణంగా ఇది నెలల వయసుగల పిల్లలు మొదలుకొని రెండేళ్ల వరకు చాలా తరచుగా కనిపిస్తుంది. పిల్లల్లో బ్రాంకియోలైటిస్కు చాలా కారణాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ప్రధాన గాలిగొట్టం (ట్రాకియా) లేదా నోరు, ముక్కు, గొంతుల్లో వచ్చే ఇన్ఫెక్షన్లు కిందికి వ్యాపించడం వల్ల ఈ సమస్య రావచ్చు. వైరస్లలో రెస్పిరేటరీ సిన్సీషియల్ వైరస్, రైనో వైరస్, ఎడినో వైరస్, ఇన్ఫ్లుయెంజా, కరోనా లాంటి వైరస్లు, కొన్నిసార్లు కొన్ని రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు కూడా బ్రాంకియోలైటిస్కు కారణం కావచ్చు. ముప్పు ఎవరిలో ఎక్కువ? నెలలు నిండకముందే పుట్టిన చిన్నారులు తల్లిపాలపై పెరగని పిల్లల్లో ఇంతకుమునుపే ఇతరత్రా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పిల్లలు డే కేర్ సెంటర్లోని పిల్లలు... మొదలైనవారిలో. లక్షణాలు... బ్రాంకియోలైటిస్ లక్షణాలు దాదాపు ఓ వారం పాటు పిల్లలను బాధిస్తాయి. ఇవి ఫ్లూ లక్షణాలను పోలి ఉంటాయి. కొన్నిసార్లు తీవ్రమైన దగ్గుతో శ్వాస సరిగా అందక పిల్లలు బాధపడుతుంటారు. సాధారణంగా కనిపించే లక్షణాలివి... దగ్గు, పిల్లికూతలు ముక్కు కారడం ఊపిరి సాఫీగా అందకపోవడం పిల్లలు ఛాతీ పట్టేసినట్లుగా బాధపడటం జ్వరం, ఆకలి తగ్గడం చిరాకు / చికాకు కొన్నిసార్లు వాంతులు కావడం ∙ఆరు నెలల కంటే తక్కువ వయసున్న పిల్లలు పాలు సరిగా తాగలేకపోవడం, ఎక్కువగా ఏడవటం లాంటివి. నిర్ధారణ... ∙ ఛాతీ ఎక్స్–రే కొన్ని రకాల రక్తపరీక్షలు ముక్కు, గొంతు నుంచి సేకరించిన స్వాబ్‌ను పరీక్షించడం ద్వారా వైరలా లేక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా అన్నది చాలావరకు నిర్ధారణ చేయవచ్చు. నివారణ: ∙పిల్లలు తమ చేతుల్ని తరచూ శుభ్రంగా కడుక్కునేలా చూడటం పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోవడం అవసరాన్ని బట్టి కొందరికి ఫ్లూ టీకాలు ఇప్పించడం చల్లగాలికి ఎక్స్పోజ్ కాకుండా చూడటం ∙చల్లటి పదార్థాలు, కూల్‌డ్రింక్స్ తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చికిత్స: చాలావరకు వైరల్ ఇన్ఫెక్షన్లే బ్రాంకియోలైటిస్కి కారణం కాబట్టి లక్షణాల ఆధారంగా సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇస్తారు. అంటే... తగినన్ని నీళ్లు తాగించడం, కాస్త పెద్ద పిల్లలైతే ద్రవాహారాలు ఇవ్వడం, పాలు పట్టేముందర వారి నోరు, ముక్కుల్లో ఉండే చిక్కటి స్రావాలను ‘బల్బ్ సిరంజీ’తో బయటకు తొలగించడం, నిద్రపోతున్నప్పుడు బాగా శ్వాస అందేలా తలను కాస్త ఎత్తుగా ఉంచడం, జ్వరం ఉంటే టెంపరేచర్ తగ్గించే మందులు, యాంటిహిస్టమైన్స్, కాఫ్ సిరప్, నెబ్యులైజేషన్ వంటివి కొంతవరకు ఉపయోగపడతాయి. బ్లడ్ రిపోర్టులు, ఎక్స్–రే బట్టి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మాత్రమే యాంటీబయాటిక్స్ ఇస్తారు. పిల్లలు బాగా డల్‌గా ఉండటం, పాలు, ఆహారం తీసుకోవడం బాగా తగ్గడం, పిల్లలకు ఊపిరి అందనప్పుడు / తమంతట తామే శ్వాస తీసుకోలేనప్పుడు ఇది కాస్త ప్రమాదకరమైన పరిస్థితి అని గ్రహించి, వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి. అక్కడ డాక్టర్లు వారికి... ∙రక్తనాళం ద్వారా ఫ్లూయిడ్స్ ఎక్కించడం ఆక్సిజన్ అందకపోతే ఆక్సిజన్ పైప్‌తో ఆక్సిజన్ అందించడం ∙పిల్లల ఊపిరితిత్తుల్లో, ముక్కులోని చిక్కటి స్రావాలను (సక్షన్ ద్వారా) బయటకు పంపడం వంటి ప్రక్రియలతో చికిత్స అందిస్తారు.ఆక్సిజన్ అందకపోతే వెంటిలేటర్ మీద ఉంచాల్సి వస్తుంది. డాక్టర్ సత్యనారాయణ కావలి, కన్సల్టెంట్ పీడియాట్రీషియన్. (చదవండి: చీలమండ నొప్పి తగ్గాలంటే...) -
అలా జరిగితే.. మూత్రపిండాలు దెబ్బతిన్నట్లా?
ఇటీవల కాలంలో చాలామంది ఫేస్ చేస్తున్న సమస్యే మూత్రపిండాల వ్యాధి. ఇది ఒక్కటి పాడవ్వతే మొత్తం జీవన గమనమే మారిపోతుంది. దీని విషయంలో ఎంత జాగ్రత్తగా తీసుకుంటే అంత సుఖవంతమైన జీవితాన్ని గడపవచ్చు. అయితే మూత్రపిండాలు దెబ్బతింటున్నాయని మన శరీరం ముందుగానే కొన్ని సంకేతాలిస్తుందని ఆయుర్వేద నిపుణులు నవీన్ నడిమింటి చెబుతున్నారు. దీన్ని గమనించినట్లయితే సత్వరమే ఈ సమస్య నుంచి సులభంగా బయటపడొచ్చని అంటున్నారు. ఏవిధమైన సంకేతాలిస్తుంది. ఆ తదుపరి కిడ్నీలు మెరుగుపడేలా ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే మంచిది తదితర విషయాలు ఆయన మాటట్లోనే చూద్దాం. రక్తంలో ప్రోటీన్ కోల్పోవడాన్ని ప్రొటీనురియా అంటారు. ఈ స్థితిలో ప్రోటీన్, గణనీయమైన మొత్తంలో మూత్రం ద్వారా బయటకు పోవడం ప్రారంభమవుతుంది. ప్రోటీన్ నష్టం మూత్రపిండ దెబ్బతింటున్నాయని చెప్పేందుకు తొలి సంకేతం. మూత్రపిండాలు దెబ్బతినడం ప్రారంభించినప్పుడు రోగులు చూసే మొదటి లక్షణం ప్రోటీన్యూరియా. ప్రోటీన్యూరియా కారణాలు: డీహైడ్రేషన్ మీ శరీరం శరీరం నుంచి చాలా ద్రవాన్ని కోల్పోయినప్పుడు, అది నిర్జలీకరణానికి కారణమవుతుంది. మనందరికీ తెలిసినట్లుగా, ప్రోటీన్లు, అనేక ఇతర ముఖ్యమైన పోషకాలు వంటి పోషకాలను మూత్రపిండాలకు అందించడానికి నీరు సహాయపడుతుంది, కానీ తగినంత నీరు లేకుండా, ఇది రక్తం యొక్క సంక్లిష్ట పనితీరును కలిగి ఉంటుంది. క్రమంగా, మూత్రపిండాలు సరిగ్గా ప్రోటీన్లను తిరిగి పొందలేవు. బదులుగా ప్రోటీన్ మూత్రంలో చేరుతుంది . అధిక రక్తపోటు: అధిక రక్తపోటు ప్రోటీన్ నష్టానికి ప్రధాన కారణం, ఎందుకంటే పెరిగిన రక్తపోటు కారణంగా మూత్రపిండాలపై పొర ఒత్తిడిని తట్టుకోలేకపోతుంది. ఫలితంగా అధిక మొత్తంలో ప్రోటీన్ మూత్రం ద్వారా వెళ్లిపోవడం ప్రారంభమవుతుంది. డయాబెటిస్ మెల్లిటస్: మధుమేహం మూత్రపిండ కణం పొరను దెబ్బతీస్తుంది. మూత్రపిండాల పనితీరు దెబ్బతినడం వల్ల ఇది మూత్రపిండాల పనితీరును ప్రభావితం చేస్తుంది. మూత్రం ద్వారా విపరీతమైన ప్రోటీన్ బయటకు వస్తుంది. నెఫ్రోపతీ ఐజీఐ నెఫ్రోపతిలో, ఇమ్యునోగ్లోబులిన్ శరీరంలో పేరుకుపోతుంది, మూత్రపిండాల కణజాలంలో వాపును కలిగిస్తుంది. ఇది కిడ్నీ పనితీరును కూడా ప్రభావితం చేస్తుంది. అధిక మొత్తంలో ప్రోటీన్ ఫిల్టర్ అయ్యి బయటకు వస్తుంది. పాలిసిస్టిక్ వ్యాధులు పాలిసిస్టిక్ వ్యాధిలో, మూత్రపిండము ఉపరితలంపై తిత్తుల సర్వర్ పెరుగుదల అభివృద్ధి చెందుతుంది. ఇది మూత్రపిండాల కణాల పొరను ప్రభావితం చేస్తుంది. పాలిసిస్టిక్ కిడ్నీ వ్యాధిలో తిత్తులు ఏర్పడటం వల్ల ప్రొటీనురియా ఏర్పడుతుంది. లక్షణాలు: బలహీనంగా మారడం ప్రొటీన్లను కోల్పోవడం రోగులను రోజురోజుకు బలహీనపరుస్తుంది. రోగులకు, వారిని ఆరోగ్యంగా చురుకుగా ఉంచడానికి ప్రోటీన్ కీలకం. నురుగు మూత్రం నురుగు లేదా ముదురు రంగు మూత్రం మూత్రపిండ వైఫల్యం కారణంగా పెద్ద మొత్తంలో ప్రోటీన్ బయటకు వస్తుందని చూపిస్తుంది. మీ మూత్రంలోని ప్రోటీన్ గాలితో చర్య జరిపి నురుగును సృష్టిస్తుంది. మూత్రవిసర్జనలో ఫ్రీక్వెన్సీ ప్రతి 24 గంటలకు 6 నుంచి 8 సార్లు మూత్ర విసర్జన చేయడం సాధారణం. దాని కంటే ఎక్కువగా ఉంటుంది. అదికూడా రాత్రిపూట ఎక్కువగా మూత్ర విసర్జన చేయడం (ఒకసారి కంటే ఎక్కువ) లేదా తరచుగా మూత్రవిసర్జన. ఇది రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసి చాలా అసౌకర్యంగా ఉంటుంది. వికారం వాంతులు అవయవాలు సరిగా పనిచేయకపోవడం వల్ల వాంతులు మరియు వికారం ఏర్పడవచ్చు. ఆకలి లేకపోవడం: శరీరంలో తగినంత ప్రోటీన్ లేకపోవడం వల్ల రోగులు ఆకలి లేకపోవడం అనుభూతి చెందుతారు. కళ్ల చుట్టూ ఉబ్బడం: కిడ్నీ ఫెయిల్యూర్‌తో బాధపడుతున్న రోగులు ముఖ్యంగా ఉదయాన్నే కళ్ల చుట్టూ ఉబ్బినట్లు కనిపిస్తారు. వ్యర్థ పదార్థాల సేకరణ ఈ ప్రాంతాల్లో మంటను కలిగించవచ్చు. నివారణ: ప్రోటీన్ రహిత ఆహారం కిడ్నీ రోగికి ప్రొటీనురియా ఉంటే వారి ఆహారంలో 15 నుంచి 20% ప్రోటీన్ ఉండాలి. అధిక క్రియాటినిన్ స్థాయిలు ఉన్న రోగులు ప్రోటీన్ తీసుకోవడం పరిమితం చేయాలని సూచించారు. మూత్రపిండ రోగులకు సిఫార్సు చేయబడిన ఏకైక ప్రోటీన్ మూంగ్ కి దాల్. ఒక కప్పు పండు ఆహారంలో ఒక కప్పు పండు (ఏదైనా) కిడ్నీకి తగినంత మొత్తం. మీ సీరం బైకార్బోనేట్ స్థాయి సగటు ఉంటే, మీరు ఏదైనా పండు తీసుకోవచ్చు. కాకపోతే, వైద్యులు తమ రోగులకు ప్రతి ఆమ్ల పండును నివారించాలని సూచిస్తున్నారు. అధిక రక్తపోటును నియంత్రించండి మూత్రపిండ వైఫల్యంతో బాధపడుతున్న రోగులు వారి అధిక రక్తపోటును ఎలాగైనా నియంత్రించాలి. ఎందుకంటే పైన చెప్పాన సాధారణ కారణాలు మీ మూత్రపిండాలను దెబ్బతీస్తే, చెప్పిన వాటిని మెరుగుపరచడం ద్వారా మీ మూత్రపిండాలను మెరుగుపరుచుకోవచ్చు. ఆయుర్వేద కిడ్నీ చికిత్సలో మొదట కారణానికి చికిత్స చేస్తారు, ఆపై వ్యాధిని దశలవారీగా నయం చేస్తారు. మధుమేహాన్ని నియంత్రించండి మనకు ఇప్పటికే తెలిసినట్లుగా, అధిక చక్కెర స్థాయి మూత్రపిండాలకు హాని కలిగించే మూత్రపిండాల కణాల పొరను ప్రభావితం చేస్తుంది. రెగ్యులర్ యోగ రెగ్యులర్ యోగా శ్వాస వ్యాయామాలు మీ అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి ఎందుకంటే అధిక రక్తపోటు కణాల పొరను దెబ్బతీస్తుంది. మూత్రపిండాల బలహీనమైన కణాలు ఖచ్చితంగా పని చేయలేవు. బరువు తగ్గడం మూత్రం నుంచి అధిక మొత్తంలో ప్రోటీన్ విడుదల కారణంగా, రోగి బలహీనంగా మారి బరువు తగ్గుతారు. తగినంత నీరు త్రాగాలి ప్రతి వైద్యుడికి, రోగి ఎంత నీరు త్రాగాలి అని లెక్కించడం అసాధ్యం. రోగికి రోగికి అవసరమైన నీటి పరిమాణం మారుతూ ఉంటుంది. మనకు ఇప్పుడు నీరు అవసరమా అని తనిఖీ చేయడానికి దేవుడు మనకు నాలుక, నోటిని సెన్సార్‌గా ఇచ్చాడు. కాబట్టి మీ నోరు పొడిబారినట్లు అనిపించినప్పుడు, ఒక సిప్ నీరు తీసుకోండి ఒకేసారి చాలా నీరు తాగొద్దు. యూరిక్ యాసిడ్ పూర్తిగా తగ్గేవరకు తీసుకోవాల్సినజాగ్రత్తలు: 1. కొన్ని వారాల పాటు అన్ని రకాల నాన్ వెజ్ ఆహారాలు (చికెన్, మటన్, లివర్, చేప, రొయ్యలు మొదలైనవి) పూర్తిగా ఆపివెయ్యండి. రోజుకు 1 లేదా 2 గుడ్లు వరకు పరవాలేదు. రోజుకు కనీసం 4 నుంచి 5 లీటర్ల నీటిని కచ్చితంగా త్రాగండి. తరచుగా నిమ్మకాయలు తీసుకోండి. పీచు పదార్థం అధికంగా ఉండే బీరకాయ, సొరకాయ, బెండ, బ్రోకలీ, ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. కాలీఫ్లవర్, పాలకూర, పన్నీర్, పుట్టగొడుగులు వంటి కూరగాయలను కొన్నాళ్లు నివారించాలి. ---నవీన్ నడిమింటి, ఆయుర్వేద వైద్యులు (చదవండి: సంతానోత్పత్తి తగ్గుముఖం..! తొలిస్థానంలో భారత్..!!) -
ఎంతపనైపాయే! పొరపాటున నాలుక కరుచుకుంది..అంతే ఊపిరాడక..
మాట్లాడుతూ లేదా భోజనం చేస్తూ నాలుక కరుచుకోవడం అనేది సర్వసాధారణం. కరచుకున్న వెంటనే బాధగా ఉంటుంది. ఆ తర్వాత కాసేపటికి లేదా మరుసటి రోజుకి తగ్గిపోతుంది. అంత సీరియస్ అయిన ఘటనలు ఇంతవరకు జరగలేదు కూడా. కానీ ఇక్కడొక మహిళకు ఎదురైన విపత్కర స్థితిని చూస్తే మాత్రం వామ్మో!నాలిక కరచుకుంటే ఇంతలా జరుగుతుందా? అని ఆశ్చర్యపోవడం ఖాయం. ఆ మహిళ భోజనం చేస్తూనే అనుకోకుండా నాలిక కరుచుకుంది. అదే ఏకంగా ఆమె ప్రాణాలను కోల్పోయే స్థితికి దారితీసింది. ఈ అనుహ్య ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..27 ఏళ్ల ఆస్ట్రేలియన్ మహిళ కైట్లిన్ అల్సోప్ తన స్నేహితులతో కలిసి భోజనం చేస్తుండగా నాలుక కరుచుకుంది. ఆ టైంలో ఆమెకు కాస్త నొప్పిగా అసౌకర్యంగా అనిపించింది. సర్వసాధారణంగా జరిగేదే కదా అని తేలిగ్గా తీసుకుంది. అంతే కొన్ని గంటలకే ఊపిరి ఆడటం, శ్వాస తీసుకోవటం కష్టమై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఒక్కసారిగా స్నేహితులంతా ఆమె పరిస్థితిని చూసి కంగుతిన్నారు. వెంటనే ఆమెను హుటాహుటినా ఆస్పత్రికి తరలించి ఎమర్జెన్సీ కేసు అంటూ టెస్ట్‌లు చేయడం ప్రారంభించారు వైద్యులు. ఆమె ఒక విధమైన అనాఫిలాక్సిస్ అనే ఎలర్జీకి గురయ్యిందని చెప్పారు. తక్షణమే కొన్ని మందులు ఇచ్చి పరిస్థితి నార్మల్‌కి వచ్చేలా యత్నించారు వైద్యులు. ఐతే అనూహ్యంగా ఆమె పరిస్థితి విషమంగా మారడం ప్రారంభమైంది. చూస్తుండగానే చర్మం ఎరుపు నుంచి నీలం రంగులోకి వచ్చేసింది. ఆమె నాలుకు నల్లగా అయిపోవడం జరిగింది. ఇక ఆమె నాలుకను తీసేయాల్సి వస్తుందని భావించి వెంటనే అప్రమత్తమయ్యి వివిధ వైద్య పరీక్షలు నిర్వహించారు వైద్యులు. చివరికి ఆమె అరుదైన లుడ్విగ్స్ ఆంజినా అనే ప్రాణాంతక ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. ఇది నోరు, మెడ వరుకు ఉన్న మృదుకణజాలంపై ప్రభావం చూపే ప్రాణాంతక సెల్యూటైటిస్గా పేర్కొన్నారు. ఈ ఇన్ఫెక్షన్ ఆమె నోటిలో ఉండే జ్ఞాన దంతాల కారణంగా వచ్చిందని, ఇది ఆమె నోటిలోకి వేగంగా వ్యాపించడం ప్రారంభించిందని అన్నారు. ఇదికాస్త సెప్సిస్‌కి గురయ్యి అవయవాన్ని తీసేయాల్సిన ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందన్నారు వైద్యలు. తక్షణమే చికిత్స అందించేందుకు ఆమెకు మత్తు ఇచ్చి ట్రీట్మెంట్ చేయడం ప్రారంభించారు. ఆక్సిజన్ సరఫరా తక్కువగా ఉన్నందున్న ఇతర అవయవాలు మూసుకుపోకుండా చూసుకోవాల్సి ఉందని ఇది చాలా క్రిటికల్ ఆపరేషన్ అని చెప్పారు. సూమారు గంటపాటు వైద్యలు శ్రమించి కొద్దిపాటి శస్త్ర చికిత్స చేశారు. ఇప్పుడిప్పుడే క్లైటిన్ కోలుకుంటోంది. లుడ్విగ్ ఆంజినా అంటే.. ఇటీవల జరిగిన గాయం ఇన్ఫెక్షన్కి గురయ్యినా లేదా మధుమేహం, మద్యపానం, పోషకాహారలోపం తదితరాల కారణంగా గాయలైతే అది లుడ్విగ్ ఆంజినా అనే ఎలర్జీకి గురయ్యి రోగి పరిస్థితిని దిగజారస్తుంది. ఇది సాధారణంగా దంతాల ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందట. దాదాపు 10 నుంచి 9 కేసుల్లో దవడలోని రెండవ లేదా మూడవ దంతాల నుంచి మొదలవుతుందని వైద్యులు చెబుతున్నారు. దీని లక్షణాలు మాట్లాడటం కష్టం అధిక జ్వరం, చలి దవడలో నొప్పి మెడ నొప్పి వాపు వాచిపోయిన నాలుక నోరు సున్నితత్వం మారడం తీవ్రమైన పంటి నొప్పి నివారణ: లుడ్విగ్ ఆంజినాను నివారించాలంటే నోటి పరిశుభ్రత పాటించాలని చెబుతున్నారు వైద్యులు. దంతాలు పుచ్చిపోకుండా చూసుకోవాలని చెప్పారు. దంతాల ఇన్ఫెక్షన్ కారణంగానే వస్తుందని అన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది దంతాలు ఇన్ఫెక్ట్ కాకుండా ఉండేలా చేస్తుందని కూడా చెప్పొచ్చు అంటున్నారు వైద్యులు. (చదవండి: ఆ వ్యాధి క్యాన్సర్ కంటే ప్రాణాంతకం! చికిత్స కూడా లేదు!) -
ఆ వ్యాధి క్యాన్సర్ కంటే ప్రాణాంతకం! చికిత్స కూడా లేదు!
క్యాన్సర్ అంటే అందరూ హడలిపోతారు. అలాంటిది దానికి మించి ప్రాణాంతకమైన మరొక వ్యాధా అని నోరెళ్లబెట్టకండి. ఎందుకంటే కనీసం క్యాన్సర్‌కి స్టేజ్‌లను బట్టి చికిత్స దొరకుతుంది. ఇదొచ్చిదంటే బతకడం కష్టం. పైగా చికిత్స చేయడం కూడా కష్టం. ఈ వ్యాధికి పూర్తి స్థాయిలో చికిత్స కూడా లేదంట. క్యాన్సర్ కంటే ఈ వ్యాధి వల్లే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని వైద్యులు చెబుతున్నారు. ఇంతకీ ఆ వ్యాధి ఏంటి? ఎందువల్ల వస్తుంది?.. తదితరాల గురించే ఈ కథనం.! ఇవాళ ప్రపంచ సెప్సిస్ దినోత్సవం. ఇది క్యాన్సర్ కంటే ప్రాణాంతకమైంది. ప్రతి ఏడాది సెప్టంబర్ 19 సెప్సిస్ దినోత్సవాన్ని జరుపుతూ..ఆ వ్యాధి ప్రజల్లో అవగాహన కల్సిస్తున్నారు అధికారులు. అసలు సెప్సిస్ అంటే ఏంటీ.. ఎలా ప్రాణాంతకం అంటే..ఇది ఏమి ఇన్ఫెక్షన్ కాదు. శరీరలో కలిగే ప్రాణాంతక పరిస్థితిని సెప్సిస్ అంటారు. అధిక రోగనిరోధక ప్రతిస్పందన, బ్యాక్టీరియల్, ఫంగల్, వైరల్ ఇన్ఫెక్షన్లు ఈ సెప్టిక్ షాక్‌కి కారణం కావొచ్చు. రక్తంలో, ఎముకల్లో, పిత్తాశయం, కాలేయం, ఉదరకుహరం, అపెండిక్స్, ఊపిరితిత్తుల్లో న్యూమోనియా, తదితర భాగాలు కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు సెప్సిస్ షాక్‌కి కారణం కావొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో మెదడు, వెన్నుపాము ఇన్ఫెక్షన్లు కూడా సెప్సిస్ ప్రమాదానికి కారణం కావొచ్చని చెబుతున్నారు. లక్షణాలు తీవ్ర జ్వరం అధిక రక్తపోటు హృదయ స్పందనల్లో క్రమరాహిత్యం శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు హృదయ స్పందనలలో క్రమరాహిత్యం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు మూత్రవిసర్జనలో ఇబ్బందులు మానసిక స్థితిలో ఆకస్మిక మార్పులు వ్యాధి సోకిన ప్రాంతాల్లో చర్మం రంగు మారడం ప్లేట్లెట్ కౌంట్‌లో తగ్గుదల చెప్పలేనంత చలి స్పృహ కోల్పోవడం ఎలాంటి వారు ఈ వ్యాధిబారిన పడతారంటే.. 65 ఏళ్లు పైబడిన పెద్దలు, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారు, మధుమేహం, ఊపిరితిత్తుల వ్యాధి, క్యాన్సర్, మూత్రపిండాలు వంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నవారికి ఈ సెప్సిస్ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. కొన్నివిపత్కర పరిస్థితుల్లో గర్భిణీ స్త్రీలు, నవజాత శిశువులు, పరిమిత వనురులు ఉన్న ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఈ వ్యాధి భారిన పడే అవకాశం ఉంటుంది. ఇంతవరకు అధికా ఆదాయ దేశాల్లోని ఆస్పత్రుల్లో ఈ కేసులు వచ్చినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. ఇది లెక్కలేనన్ని మరణాలకు దారి తీసినట్లు పేర్కొంది. సెప్సిస్ కారణంగా వచ్చే సమస్యలు... తగిన సమయంలో చికిత్స తీసుకోనట్లయితే మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, గుండె, మెదడు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. రక్తగడ్డకట్టడం, అవయవాలు, వేళ్లు, కాలివేళ్లు చచ్చుపడిపోయి ప్రాణాంతకంగా మారే ప్రమాదం లేకపోలేదు. నిర్ధారణ దీని కారణంగా గడ్డకట్టే సమస్యల, అసాధారణంగా కాలేయం, మూత్రపిండాల పనితీరు ఉండటం, ఆక్సిజన్ స్థాయిలు తగ్గడం, ఎలక్ట్రోలైట్ అసమతుల్యత, రక్తంలో ఆమ్లత్వం పెరిగిపోవటం తదితరాలను బట్టి ఈ వ్యాధిని గుర్తిస్తారు వైద్యులు. చికిత్స: రోగుల వైద్య చరిత్ర ఆధారంగా చికిత్స ఇవ్వడం జరుగుతుంది. ప్రారంభంలో మాత్రం యాంటీబయాటిక్స్ని ఇస్తారు. రోగి పరిస్థితి విషమంగా ఉంటే వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఈ వ్యాధి సోకిన కణజాలాన్ని తీసేయాల్సి ఉంటుందని వైద్యుల చెబుతున్నారు. ముందుగా ఈ వ్యాధిని గుర్తిస్తే మందులతో నయం చేయొచ్చని అంటున్నారు. ఈ వ్యాధి పూర్తి స్థాయిలో ఎలాంటి చికిత్స లేదని వెల్లడించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. వ్యక్తిగ శుభ్రత పాటించాలి. అలాగే ఆహారాన్ని స్వీకరించటంలో నిర్లక్ష ధోరణి పనికిరాదు. నిల్వ ఆహారం కలుషితమైనవి తీసుకోకూడదు. ముఖ్యంగా చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈ వ్యాధి వచ్చినప్పుడైనా రోగులు ఇలాంటి పరిశుభ్రతను పాటించినా సులభంగా బయటపడే అవకాశాలు మెండుగా ఉంటాయి. క్యాన్సర్ కంటే సెప్సిస్ ఎందుకు ప్రమాదకరం? ఈ వ్యాధి వేగవంతంగా ఇతర అవయవాలకు సంక్రమిస్తుంది. ఈ వ్యాధి కారణంగా అన్ని అవయవాలు ప్రభావితమవుతాయి. శరీరం పని తీరు సామర్థ్యం క్షీణిస్తుంది. రోగ నిర్థారణ ఆలస్యం కారణంగా మరణాలు సంభవించే రేటు 30% నుంచి 50% ఉంటుంది. సంక్రమణకు కారణమయ్యే బ్యాక్టీరియాలను గుర్తించి త్వరితగతిన యాంటీబయోటిక్ మందులు ఇవ్వడంపై వ్యాధి తగ్గుదల ఉంటుంది. ఈ వ్యాధి లక్షణాలు ఇతర సాధారణ అనారోగ్యాల మాదిరిగా ఉండటంతో అంత సులభంగా వైద్యులు గుర్తించడంలో విఫలమవుతుంటారు. అందువల్ల ఈ కేసులు ఎక్కువగా ప్రాణాంతకంగా మారినట్లు నివేదికలు పేర్కొన్నాయి. మరొకటి ఆ వ్యాధికి తగ్గ స్థాయిలో యాంటీ బయోటిక్స్ మోతాదు ఇవ్వాల్సి ఉంటుంది. సెప్సిస్ ఇప్పటికి క్యాన్సర్, గుండెజబ్బులు వంటి దీర్ఘకాలికి వ్యాధులతో పోల్చితే తీవ్రమైన వ్యాధిగా ప్రపంచ ఆరోగ్యానకి సవాలు విసురుతోంది. మరణాలు సంభవించకుండా ఉండేలా వినూత్న రీతిలో వ్యాధికారక వేగాన్ని తగ్గించి నయం చేసేలా చికిత్స విధానాలు అభివృద్ధి చేయాల్సి ఉంది. (చదవండి: క్యాన్సర్ రోగులకు ఉపయోగపడే సౌకర్యాల వేర్!) -
వానల వేళ వణుకు తెప్పించే వ్యాధి..తేలిగ్గా తీసుకుంటే అంతే సంగతి!
చాలారకాల వైరల్ జ్వరాల్లాగే డెంగీ కూడా తనంతట తానే తగ్గిపోయే (సెల్ఫ్ లిమిటింగ్) వ్యాధి. అయితే కొంతమందిలో మాత్రం ప్లేట్లెట్లు ప్రమాద స్థాయి కంటే కిందికి పడిపోతాయి. అది మినహా చాలావరకు డెంగీ నుంచి దాదాపుగా అందరూ కోలుకుంటారు. పైగా ఇది వైరల్ జ్వరం కావడంతో కేవలం లక్షణాలకు మాత్రమే చికిత్స చేస్తూ... ప్లేట్లెట్ కౌంట్‌ను జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఇటీవల పెద్దసంఖ్యలో ఈ కేసులు వస్తున్న నేపథ్యంలో డెంగీపై అవగాహన కోసం ఈ కథనం. డెంగీలో రకాలు ఏ హెచ్చరికలూ లేకుండా వచ్చే డెంగీ (డెంగీ విదవుట్ వార్నింగ్ సైన్స్) ; కొన్ని హెచ్చరికలతో వచ్చే డెంగీ (డెంగీ విత్ వార్నింగ్ సైన్స్) ; తీవ్రమైన డెంగీ (సివియర్ డెంగీ) లక్షణాలు హెచ్చరికలు లేకుండా అకస్మాత్తుగా వచ్చే డెంగీ: డెంగీ ఎండెమిక్ ప్రాంతాల్లో... అంటే డెంగీ ఎక్కువగా వస్తున్న ప్రాంతంలో ఇది కనిపిస్తుంటుంది. వీళ్లలో జ్వరం, వికారం/వాంతులు, ఒళ్లు నొప్పులు, ఒంటి మీద ర్యాష్ వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని హెచ్చరికలతో కనిపించే డెంగీ: పైన చెప్పిన లక్షణాలతో పాటు పొట్టనొప్పి, ఊపిరితిత్తుల చూట్టూ ఉండే ప్లూరా అనే పొరలో లేదా పొట్టలో నీరు చేరడం. కొందరిలో పొట్ట లోపలి పొరల్లో రక్తస్రావం అవుతుండటం, బాధితులు అస్థిమితంగా ఉండటం, రక్తపరీక్ష చేయించినప్పుడు ఎర్ర రక్త కణాలకూ, మొత్తం రక్తం పరిమాణానికి ఉన్న నిష్పత్తి కౌంట్ పెరగడంతో పాటు ప్లేట్లెట్స్ సంఖ్య పడిపోతుంది. తీవ్రమైన డెంగీ (సివియర్ డెంగీ) కేసుల్లో : అంతర్గత అవయవాల్లో రక్తస్రావం కారణంగా బాధితుడు తీవ్రమైన షాక్‌కు గురవుతాడు. ఊపిరితిత్తుల్లో నీరు చేరి శ్వాసప్రక్రియకు అంతరాయం ఏర్పడుతుంది. తీవ్ర రక్తస్రావంతో బాధితుడు స్పృహకోల్పోవచ్చు లేదా పాక్షిక స్పృహలో ఉండవచ్చు. మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో కీలకమైన అవయవాలు పనిచేయకుండా పోవచ్చు. నిర్ధారణ పరీక్షలు : సీబీపీ ప్రతి 24 గంటలకు ఒకసారి చేయాలి. ∙నిర్ధారణ కోసం డెంగీ ఎన్ఎస్1 యాంటీజెన్ పరీక్ష అవసరం కావచ్చు. డెంగీ ఐజీఎమ్ అనే పరీక్ష కూడా చేయాలి. కొన్ని అడ్వాన్స్డ్ పరీక్షల్లో వ్యాధి నిర్ధారణ రిపోర్టులు వచ్చేందుకు పట్టే సమయం కూడా ఎక్కువే కాబట్టి డాక్టర్లు అవి వచ్చే వరకు ఆగకుండా... లక్షణాలను బట్టి చికిత్స అందించడం ప్రారంభిస్తారు. ∙పై పరీక్షలతో పాటు ఇప్పుడు ఐపీఎఫ్ (ఇమ్మెచ్యూర్ ప్లేట్లెట్ ఫ్రాక్షన్) అనే అత్యాధునిక పరీక్ష అందుబాటులో ఉంది. ఇది ప్లేట్లెట్లను ఎప్పుడు, ఎంత పరిమాణంలో ఎక్కించాలో తెలుసుకోవడంతో పాటు మరెన్నో అంశాలు తెలుసుకోడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. నివారణ ఇలా... అన్ని వ్యాధుల్లోలాగే డెంగీలోనూ చికిత్స కంటే నివారణ ఎంతో మేలు. డెంగీని కలిగించే టైగర్‌దోమ పగటిపూటే కుడుతుంది. దీని సంతానోత్పత్తి మంచి నీటిలోనే. ఈ ప్రక్రియకు పదిరోజుల వ్యవధి పడుతుంది. కాబట్టి వారంలోని ఏదో ఒకరోజు ఇంటిలోని నీటిని పూర్తిగా ఖాళీ చేసి డ్రై డే గా పాటిస్తే, దీని జీవితచక్రానికి విఘాతం కలిగి ప్రత్యుత్పత్తికి అంతరాయం ఏర్పడుతుంది. ఇళ్ల మూలలూ, చీకటి, చల్లటి ప్రదేశాలే టైగర్ దోమల ఆవాసం. ఇల్లంతా వెలుతురు, సూర్యరశ్మి ధారాళంగా వచ్చేలా చూసుకోవడంతో పాటు, దోమలు రాకుండా తలుపులకు, కిటికీలకు మెష్ అమర్చుకుంటే...ఒక్క డెంగీ దోమలే కాకుండా...మలేరియా, ఇతర వ్యాధులకు గురి చేసే దోమల్నీ నివారించినట్లు అవుతుంది. టైగర్ దోమ పెద్దగా ఎత్తుకు ఎగరలేదు. అందువల్ల కాళ్లు పూర్తిగా కప్పి ఉంచే దుస్తులతో, ఫుల్స్లీవ్తో చాలావరకు రక్షణ కలుగుతుంది. ∙నిల్వ నీటిలోనే దోమ గుడ్లు పెడ్తుంది కాబట్టి కొబ్బరి చిప్పలు, డ్రమ్ములు, బ్యారెల్స్, టైర్లు, కూలర్లు, పూలకుండీల కింద పెట్టే ప్లేట్లు మొదలైన వాటిల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. అలాగే వాడని డ్రమ్ముల్ని బోర్లించి ఉంచాలి. దోమలను తరిమివేసేందుకు మస్కిటో రిపలెంట్స్ వాడవచ్చు. డెంగీ వస్తే ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. కొందరిలో మినహాయించి అది అందరిలోనూ ప్రమాదకరం కాదు. కాకపోతే గర్భిణులు, చిన్నారులు, పెద్దవయసు వారికి డెంగీ సోకినప్పుడు అది తగ్గేవరకు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. చికిత్స: డెంగీ అన్నది వైరస్ కారణంగా వచ్చేది కాబట్టి దీనికి నిర్దిష్టంగా మందులేమీ ఉండవు. అందువల్ల లక్షణాలకు మాత్రమే చికిత్స (సింప్టమాటిక్ ట్రీట్మెంట్) ఇస్తారు. అంటే... అవసరమైనప్పుడు రక్తనాళం ద్వారా ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించడం, అవసరాన్ని బట్టి రక్తాన్ని, ప్లేట్‌లెట్స్‌ను, ప్లాస్మా ఎఫ్ఎఫ్పి (ఫ్రెష్ ఫ్రోజెన్ ప్లాస్మా) ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ప్లేట్లెట్స్ కౌంట్ 20 వేల నుంచి 15 వేలు లేదా అంతకంటే తక్కువకు పడిపోతేనే ప్లేట్లెట్స్ ఎక్కించాలి. (చదవండి: అదొక మిస్టీరియస్ వ్యాధి!..ఎలా వస్తుందో తెలియదు..గుర్తించినా.. చనిపోవడం ఖాయం) -
అదొక మిస్టీరియస్ వ్యాధి!..ఎలా వస్తుందో తెలియదు..గుర్తించినా చనిపోవడం ఖాయం
ఎన్నో రకాల వ్యాధులు గురించి విన్నాం. కానీ ఇలాంటి అరుదైన వ్యాధిని గురించి వినే అవకాశమే లేదు. ఎందుకంటే ఈ వ్యాధి ఎంతమందికి వచ్చిందన్నది కూడా తెలియదు. ఎందుకంటే సాధారణ రోగి ఉండే లక్షణాలు సాధారణ వ్యాధులకు ఉండేవిగానే ఉంటాయి. నిజానికి అతడికి కూడా తెలియదు ఆ వ్యాధి ఉందని, ప్రాణాంతకమని. పేషెంట్ తాను ఫేస్ చేస్తున్న వాటిని వైద్యుడికి క్లియర్‌గా చెప్పినప్పటికీ కూడా గుర్తించడం కష్టం. చికిత్స కూడా లేదు. ఇంతకీ ఏంటా వ్యాధి అంటే.. ఈ భయానక వ్యాధి పేరు ఎహ్లర్స్ డాన్లోస్ సిండ్రోమ్(ఈడీఎస్) ఈ వ్యాధి జన్యుపరమైన రుగ్మత లేదా అరుదైన వారసత్వ రుగ్మతగా పేర్కొంటారు. ఎందుకంటే ఈ వ్యాధి ఏ ఏజ్‌లో వస్తుందని చెప్పలేం. ఎలా అటాక్ అవుతోందో తెలియదు సడెన్‌గా వచ్చేస్తుంది. కానీ లక్షణాలు చాలా రోజులకు గానీ బయటపడవు. ఆయా వ్యక్తలు నిర్లక్ష్యం వహించకుండా చెకప్‌కి వెళ్లి..అదృష్టవశాత్తు వైద్యులు ఆ వ్యాధి ఏంటో గుర్తించగలిగితే మందులతో ప్రాణాలను నిలబెట్టి.. ఆయుష్షుని పొడిగించుకోవచ్చు. అంతే తప్ప చికిత్స మాత్రం లేదు. అంత విచిత్రంగా ఉంటుంది ఆ వ్యాధి. అచ్చం అలాంటి వ్యాధి బారినే న్యూజిలాండ్‌కి చెందిన 33 ఏళ్ల మహిళ పడింది. పాపం ఆమె తెలుసుకోలేకపోయిందో ఏమో గానీ మానసిక సమస్యలు ఉన్నట్లు పొరబడి అలానే వైద్యలకు తెలిపింది. ఒంట్లో ఒకటే నీరసంగా ఉంటుదని ఆస్పత్రికి వెళ్లింది. వారు చూసి నార్మల్ ఫీవర్ అనే అనుకున్నారు. తన సమస్యలు గురించి కూడా ఏం సరిగా వివరించలేకపోయింది. దీంతో వాళ్లు కొన్ని టెస్ట్‌లు చేసి ఏదో వ్యాధి అనే ఫీలింగ్‌లో ఉంటుంది కాబోలు ఇది మానసిక సమస్యకు సంబంధించిందిగా భావించి మానసిక రోగుల వార్డుకి తరలించారు. ఐతే కానీ ఆమె అనుహ్యంగా చికిత్స తీసుకుంటూ సడెన్‌గా ప్రాణాలు కోల్పోయింది. దీంతో అనుమానం వచ్చిన వైద్యులు అసలు ఏ కారణంతో చనిపోయిందని పరీక్షలు చేయగా ఈ విషయం అంతా బయటపడింది. ఆమెకు ఎహర్స్ డాన్లోస్ సిండ్రోమ్(ఈడీఎస్) ఉందని. ఆ వ్యాధి ఆమెకు 25 ఏళ్లు వయసు ఉన్నప్పుడే వచ్చిందని, ఆమె దీన్ని గమనించలేకపోయిందని అన్నారు వైద్యులు. సాధారణ సమస్యలుగానే ఫీలయ్యింది ఇదే ఇంతటి ఘోరం జరగడానికి కారణమైందన్నారు. ఆమె ఈ వ్యాధిని వారసత్వంగా పొందినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. ఇది చర్మంలోని టిష్యులకు ఎముకలు, రక్తనాళాలు, ఇతర అవయవాలకు మద్దతు ఇచ్చే ప్రోటీన్ల డెఫిషియన్సీ అని పేర్కొన్నారు వైద్యులు. దీనికారణంగా చర్మం సాగదీయబడినట్లుగా ఉండి, కీళ్లు వదులుగా ఉంటాయి. చిన్న రక్తనాళాలు పెళుసుగా మారి మచ్చలు ఏర్పడతాయి. శరీరం అంతా ఒకవిధమైన గాయాలు వచ్చి ఎన్నటికి నయం కాకుండా ఇబ్బంది పెడతుంటాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం ఈ సిండ్రోమ్ కేసుల్లో కొన్ని తేలికపాటి సమస్యలే ఉంటాయి. కొన్ని మాత్రం ప్రాణాంతకంగా మారతాయని చెప్పుకొచ్చారు. ప్రతి 5 వేలమందిలో ఒకరు ఈ వ్యాధి బారినపడతారట. దీనికి వైద్యం లేదు. ఈడీఎస్తో బాధపడుతున్న వ్యక్తులు తరుచుగా మందులతో ప్రాణాలను నిలబెట్టుకుని ఎదురయ్యే సమస్యలను అధిగమించడమే మార్గం అని చెబుతున్నారు. ఈ సిండ్రోమ్ లక్షణాలు.. తీవ్రమైన మైగ్రేన్ నొప్పి. పొత్తి కడుపు నొప్పి, కీళ్లు తప్పటం, సులభంగా గాయాలు అవ్వటం, ఇనుము లోపం, తదితర లక్షణాలను చూపిస్తాయి. దీంతో వైద్యులు చెక్ చేసి ఎలాంటి సమస్య లేదని తేల్చేస్తారు. ఇలాంటి మిస్టీరియస్ వ్యాధులను క్షుణ్ణంగా స్టడీ చేయాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ వ్యాధి మూర్చ, దగ్గు, జ్వరం వంటి సాధారణ లక్షణాలనే చూపిస్తుంది. కాబట్టి వైద్యుడు ఆ తరహాలో చూసి చికిత్స అందిస్తాడు. ఇలాంటి కేసుల్లో ఈ సిండ్రోమ్కి సంబంధించిన లక్షణాలను దృష్టిలో ఉంచుకుని బేరీజు వేసుకుని ఆ తర్వాత మందులు ఇవ్వాలి. లేదంటే ఆ వ్యాధి అని గుర్తించక ఇచ్చిన మందులు రియాక్షన్ చెంది రోగి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేసే అవకాశం లేకపోలేదని గట్టిగా హెచ్చరిస్తున్నారు. అంతేగాదు వైద్యలు కొన్ని కేసులు మమ్మల్ని కదిలించాయని, అందులో ఈ న్యూజిలాండ్ మహిళ కేసు కూడా ఒకటని అన్నారు. అలాంటి రోగుల సమస్యలను గుర్తించడంలో వైద్యలకు శిక్షణ ఇవ్వడమే గాక రోగి వైద్య హిస్టరీని కూడా స్టడీ చేసేలా సూచనలిస్తున్నట్లు తెలిపారు ఆరోగ్య నిపుణులు. (చదవండి: అత్యంత అరుదైన వ్యాధి!సల్మాన్ ఖాన్ సైతం ఫేస్ చేశాడు! ఆ వ్యాధి ఏంటంటే..) -
బీర్‌ని బేషుగ్గా తాగొచ్చట! అందులో ప్రోటీన్, విటమిన్ బీ..
బీర్‌ని ఎలాంటి సందేహం లేకుండా హాయిగా తాగొచ్చట. దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. పైగా ఎన్నో రకాల వ్యాధుల నుంచి రక్షిస్తుందని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. ఆరోగ్య నిపుణులు ఎలాంటి ఆందోళన లేకుండా బీర్‌ని బేషుగ్గా తాగండి అని ధీమాగా చెప్పేస్తున్నారు. ఇంతకీ బీర్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటంటే.. బీర్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు రోజు 1.5 నుంచి రెండు గ్లాసుల బీర్లు తీసుకుంటే గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఒకవేళ ఇప్పటికే గుండె సమస్యలతో బాధపడుతుంటే వాళ్లు బీర్ తాగాలని నిర్ణయించుకోవడం అనేది చాలా మంచి ఆప్షన్ అంటున్నారు. ఇంతకు మునుపు గుండె పోటుకి గురైనవారు క్రమం తప్పకుండా బీర్ తాగితే ఇరవై ఏళ్లకు పైగా జీవిస్తారని, వారి ఆయుః ప్రమాణం కూడా పెరుగుతుందని చెబుతున్నారు బీర్లో వైన్ కంటే పోషకమైనది. ఎందుకంటే వైన్‌లో ఉండే ఆల్కహాలిక్ ద్రాక్ష రసం కంటే బీర్లో ఎక్కువ ప్రోటీన్లు, విటమిన్ బీ రెండూ ఉంటాయని అమెరికన్ జర్నల్ ఆఫ్ మెడికల్ సైన్స్ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. బీర్లో యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇది వివిధ రకాల వ్యాధుల నుంచి రక్షిస్తుంది. మధుమేహం వచ్చే ప్రమాదం కూడా తక్కువే. వారానికి 14 గ్లాస్లుల బీర్ తాగితే టైప్2 డయాబెటిస్‌కు గురయ్యే అవకాశం తక్కువగా ఉందని, ఏడువేల మందికి పైగా వ్యక్తులపై జరిపిన అధ్యయనంలో తేలింది. బలమైన ఎముకల కోసం పాలు ఎలా అయితే మంచిదే బీర్ కూడా మంచిదే. పాలు ఎముకలకు ఏ విధమైన శక్తిని అందిస్తాయో అలానే బీర్ కూడా ఇస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పచ్చి బఠానీలు, తృణధాన్యాల్లో ఎలాంటి విటమిన్లు ఉంటాయో అవే బీర్లో కూడా ఉంటాయిన చెబుతున్నారు. దంతాలు కూడా బాగుంటాయట. ఇది తాగితే పెదాలపై చిరునవ్వు తగ్గదని దంత వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే బీర్ దంతాలపై ప్రభావంతంగా పనిచేస్తుందట. ముఖ్యంగా కావిటీస్, ఇన్ఫెక్షన్కు కారణమయ్యే బ్యాక్టీరియాను తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తుందట. (గమనిక: ఒక గ్లాసు బీరు ఎలాంటి హాని ఉండదన్నారు. అదికూడా వారానికి ఒక్కసారి చొప్పున తీసుకుంటుంటే ఎలాంటి సమస్య ఉండదని చెబుతున్నారు) (చదవండి: అత్యంత అరుదైన వ్యాధి!సల్మాన్ ఖాన్ సైతం ఫేస్ చేశాడు! ఆ వ్యాధి ఏంటంటే) -
అత్యంత అరుదైన వ్యాధి!సల్మాన్ ఖాన్ సైతం బాధితుడే!
అత్యంత అరుదైన వ్యాధి. దీని బారినపడితే ఆ వ్యక్తి అత్యంత నరకయాతన అనుభవిస్తాడు. చివరికి ఆ నొప్పిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని చనిపోతారట. అందుకే దీన్ని "ఆత్మహత్య వ్యాధి" అని కూడా పిలుస్తారని వైద్యులు చెబుతున్నారు. ఇంతకీ ఏంటా ఆ వ్యాధి? ఎలా సోకుతుంది తదితరాల గురించే ఈ కథనం.! ఈ వ్యాధి పేరు ట్రిజెమినల్ న్యూరల్జియా లేదా ట్రైఫేషియల్ న్యూరల్జియా అంటారు. వ్యవహారికంలో ఫాంటమ్ ఫేస్ పెయిన్ అని పిలుస్తారు. ఇది ముఖంలోని నరాలకు సంబంధించిన వ్యాధి. కపాలం నుంచి ముఖానికి వెళ్లే ట్రెజిమినల్ నాడిని ప్రభావితం చేస్తుందట. దీంతో ఆ వ్యక్తి ముఖంలో ఎడమ లేదా కుడివైపు విపరితమైన నొప్పి వస్తుంది. అది ఒక తిమ్మిరి మాదిరిగా, ఎవ్వరైన కొడితే దిమ్మతిరిగినట్లుగా పెయిన్ వస్తుందట. అలా అరగంట నుంచి గంట వరకు విపరీతమైన నొప్పి ఉంటుందట. దీంతో నోరు లేదా దవడలను కదపడం చాలా ఇబ్బందిగా ఉంటుందట. ఎంతసేపు ఉంటుందనేది చెప్పలేం. తగ్గాక కూడా మళ్లీ ఎప్పుడూ వస్తుందో కూడా చెప్పలేం. దీని ప్రభావం దైనందిన జీవితంపై ఎక్కువగా ఉంటుంది. ఈ నొప్పి వచ్చినప్పుడూ కనీసం బ్రెష్ కూడా చేయలేరు. ఆ నొప్పికి తాళలేక ముఖాన్ని మాటి మాటికి రాపిడికి గురి చేస్తారు రోగులు. దీంతో ముఖం పుండ్లుగా ఏర్పడి ఒక విధమైన చర్మవ్యాధికి దాదితీస్తుంది. ఇది 50 ఏళ్ల వయసు నుంచి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. కొన్ని వ్యక్తిగత కారణాల రీత్యా కూడా ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ఈ సమస్యను క్రికెటర్ల దగ్గర నుంచి ఎందరో ప్రముఖ సెలబ్రెటీలు కూడా ఫేస్ చేశారట. అలాగే బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కూడా ఈ వ్యాధి బారినే పడ్డారు. దీని కోసం యూఎస్ వెళ్లి మరీ శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఐతే ఈ చికిత్స అత్యంత ఖర్చుతో కూడినది. పైగా ఎక్కడ పడితే అక్కడ అందుబాటులో ఉండదు. ఎలా వస్తుందంటే.. ట్రిజెమినల్ న్యూరల్జియా లేదా ట్రిజెమినల్ డిఫెరెంటేషన్ నొప్పి అనేది కపాలం నుంచి ముఖానికి వెళ్లే త్రిభుజాకారంలోని నరాలు దెబ్బతినడంతో ఈ సమస్య ఉత్ఫన్నమవుతుంది. ఈ నొప్పి తొమ్మిరితో కూడిన ఒక విధమైన భరించేలేనిదిగా ఉంటుంది. మైగ్రైన్ నొప్పిలా అనిపిస్తుంది. దీనికి చికిత్స కూడా చాల కష్టం. ప్రస్తుతం తాజాగా పోలాండ్‌కి చెందిన 70 ఏళ్ల మహిళ కూడా ఇదే వ్యాధిని బారినపడింది. దీని కారణంగా ఆమె కుడివైపు నాసికా రంధ్రం గాయమవ్వటమే కాకుండా కన్ను కుడవైపు ముఖ ప్రాంతమంతా పుండుగా మారిపోయింది. ఆ నొప్పికి తాళ్లలేక ముఖాన్ని రుద్దడంతో పుండ్లు వచ్చి చర్మవ్యాధికి దారితీసింది. దీంతో ఆమెను హుటాహుటినా ఆస్పత్రితో జాయిన్ చేశారు. వైద్యులు ఆమె ట్రైజెమినల్ ట్రోఫిక్ సిండ్రోమ్(టీటీస్)తో బాధపడుతున్నట్లు గుర్తించి చికిత్స అందించారు. ఎదురయ్యే సమస్యలు.. దీని కారణంగా దవడ, దంతాలు లేదా చిగుళ్ళలో విద్యుత్ షాక్‌గా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. దీన్ని ముఖంలో ఆకస్మిక నొప్పికి కారణమయ్యే నరాల నష్టం అని అన్నారు. దీన్ని శస్త్ర చికిత్స ద్వారా నయం చేయవచ్చు గానీ కొన్ని దుష్పరిణామాలు కూడా ఉంటాయని అంటున్నారు. దాదాపు నూరు కేసుల్లో 70 శాతం సక్సెస్ అయితే 30 శాతం ఫెయిల్ అయ్యే ఛాన్స్‌లు ఉన్నాయని అన్నారు. దీనికి పవర్ఫుల్ యాంటి బయోటిక్ మందులు వినియోగించాల్సి ఉంటుందన్నారు. వృద్ధులు వాటిని తట్టుకునే స్థితిలో ఉండలేరు కాబట్టి వారికి చికిత్స చేయడం కష్టమేనని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఇలాంటి వ్యాధి భారినపడ్డవారు చేతికి గ్లౌజ్‌లు ధరించి ముఖాన్ని రాపిడికి గురిచేయకుండా ఉండేలా క్లాత్‌ని చుట్టి ఉంచుకుంటే..కొద్ది మోతాదు మందులతోనే నయం చేసే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు. (చదవండి: రక్తంలో ట్రైగ్జిజరైడ్స్‌ను తగ్గించుకోవాలంటే..ఇలా చేయండి!) -
రక్తంలో ట్రైగ్లిజరైడ్స్‌ను తగ్గించుకోవాలంటే..!
ఆయుర్వేదం ప్రకారం, ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ రెండూ మన ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. పైగా అవి ముఖ్యమైన విధులను నిర్వహిస్తాయి. ట్రైగ్లిజరైడ్ పెరుగుదల చెడు కొలెస్ట్రాల్‌కి సంబంధించిన ప్రధాన కారణాలలో ఒకటిగా ఊబకాయం, కదలిక లేకపోవడం, చెడు ఆహారాల వినియోగం, చెడు అలవాట్లు, ఇవన్నీ శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోవడానికి దారితీస్తాయి (బాగా). ట్రైగ్లిజరైడ్లను తగ్గించడానికి మొదటి అడుగు ఆయుర్వేదం. జీవనశైలి ఆహారంలో మార్పులతో ఈ సమస్యను సులభంగా బయటపడవచ్చు అటున్నారు నవీన్ నడిమింటి. ముందుగా సాధారణ కార్బోహైడ్రేట్ల వినియోగాన్ని తగ్గించండి. డెజర్ట్‌లు, చక్కెర, శుద్ధి చేసిన లేదాప్రాసెస్ చేసిన ఆహారాలు వంటి సాధారణ కార్బోహైడ్రేట్ల వినియోగం ద్వారా ట్రైగ్లిజరైడ్ల పరిమాణం పెరుగుతుంది. ఈ ఆహారాలకు బదులుగా, తృణధాన్యాలు, చిక్కుళ్ళు తీసుకోవడం పెంచాలని ఆయుర్వేదం సలహా ఇస్తుంది. వ్యాయామం రోజుకు కనీసం 30 నిమిషాలు నడక, పరుగు, యోగా లేదా శ్వాస వ్యాయామాలు చేయాలి. ఇలా చేస్తే రక్తప్రవాహంలో ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. శరీరంలోని అదనపు కేలరీలను బర్న్ చేస్తుంది. ఇది బరువు తగ్గేందుకి దారితీస్తుంది. కేలరీలను తీసుకోవడం తగ్గించండి. మాంసం, ప్రాసెస్ చేసిన ఆహారాలు, పాస్తా, సోడాలు, ఆల్కహాల్ ఇతర ఆహారాలు తోపాటు అధిక కొలెస్ట్రాల్ ఉన్న ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించండి, బరువుపై ట్రైగ్లిజరైడ్స్ ప్రభావం బరువుపై ట్రైగ్లిజరైడ్లు అధికంగా ప్రభావం చూపుతాయి. వీటి స్థాయిలు పెరిగిన వ్యక్తుల పొత్తికడుపులో కొవ్వు పేరుకుపోతుంది. తినడం, నిద్రించడం వంఇ వాటి వల్ల టాక్సిన్లు పేరుకుపోతాయి. ఇది కాస్త చెడు కొలస్ట్రాల్‌కి దారితీస్తుంది. ఆహారాన్ని తయారు చేసే విధానంలో ఉపయోగించే నూనెల విషయంలో కూడా శ్రద్ధ వహించాలి. లేదంటే ట్రైగ్లిజరైడ్స్ పెరిగే ప్రమాదం ఉందంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ట్రైగ్లిజరైడ్లను తగ్గించే ఆహారాలు, ఆయుర్వేద మూలికలు తేనె తేనె ఎలివేటెడ్ ట్రైగ్లిజరైడ్స్ చెడు కొలెస్ట్రాల్‌తో విజయవంతంగా పోరాడుతుంది. ఒక చెంచా తేనెను ఒక గ్లాసు వేడి నీటిలో కరిగించి, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను సాధారణీకరించి చెడు కొలెస్ట్రాల్ ఫామ్ కాకుండా ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే నీటిలో 8 నుంచి 10 చుక్కల ఆపిల్ సైడర్ వెనిగర్ లేదా ½ టీస్పూన్ నిమ్మరసాన్ని కూడా జోడించవచ్చు. వెల్లుల్లి: ట్రైగ్లిజరైడ్స్ తగ్గించడానికి, ఆయుర్వేదం వెల్లుల్లి వినియోగాన్ని గట్టిగా సిఫార్సు చేస్తుంది. వెల్లుల్లిలో అమైనో ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజాలు, అలిసిన్, అజోయిక్ ఇతర సల్ఫర్ సమ్మేళనాలు వంటి సేంద్రీయ సల్ఫేట్ సమ్మేళనాలు పుష్కలంగా ఉన్నాయి. తురిమి లేదా ఒలిచిన, వెల్లుల్లిని వంటలలో చేర్చమని అంటున్నారు నిపుణులు. వెల్లుల్లి పాలు కూడా మంచిదే అని చెబుతున్నారు. ఇది ఎలా చేయాలంటే..వెల్లుల్లి 5 నుంచి ఆరు తీసుకుని, రెండు లవంగాలు చూర్ణం చేసి 50 మి.ల్లీ లీటర్ల దేశీయా ఆవు పాలల్లో కలిపి వేడి చేయండి. సగం అయ్యేంత వరకు మరగినిచ్చి ఫిల్టర్ చేసి వేడిగా తాగండి చక్కటి ఫలితం ఉంటుంది. ఆమ్లా ఉసిరికాయలో విటమిన్ సి వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది చాలా మంచి యాంటీఆక్సిడెంట్. ఒక టేబుల్ స్పూన్ ఉసిరి పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకోవడం వల్ల ధమనులను శుభ్రం అవ్వడమే గాక ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. అర్జునుడు ఇది చాలా శక్తివంతమైన ఆయుర్వేద మూలిక, ఇది కొలెస్ట్రాల్‌ను కరిగించి ధమనులను శుభ్రంగా ఉంచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అర్జునుడిని తెల్లవారుజామునే నీటిలో కరిగించి తీసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది. గుగ్గులు ఆయుర్వేదంతో ట్రైగ్లిజరైడ్లను తగ్గించడంలో సహాయపడే మరొక మూలిక. గుగ్గులు. గుగ్గుల్ స్టెరోన్లను కలిగి ఉంటాయి. ఇవి రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను చురుకుగా నిరోధిస్థాయి. ఈ ఆయుర్వేద మూలికను ప్రతిసారి భోజనం తర్వాత తీసుకోవచ్చు కూడా. మీ ట్రైగ్లిజరైడ్లను సాధారణంగా ఉంచడానికి 25 మిల్లీగ్రాం సరిపోతుంది. సెలెరీ ఈ కూరగాయలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలతో సంబంధం ఉన్న గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. సెలెరీని సలాడ్‌గా తినవచ్చు, వంటలలో చేర్చవచ్చు లేదా రసంగా త్రాగవచ్చు. రోజుకు 2 కాడల ఆకుకూరల వినియోగం చెడు కొలెస్ట్రాల్‌ను 7 పాయింట్లు తగ్గిస్తుందని ఆధారాలు ఉన్నాయి . అవకాడో అవోకాడోస్‌లో గణనీయమైన మొత్తంలో ఫైబర్, ఒలేయిక్ యాసిడ్ వంటి మంచి కొవ్వులు ఉంటాయి, ఇది అనారోగ్యకరమైన కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అవోకాడో సాధారణ ట్రైగ్లిజరైడ్ స్థాయిలను నిర్వహించడానికి చాలా ఉపయోగకరంగా ఉన్నప్పటికీ, దీనిలో కొవ్వులు అధికం అనే విషయం గుర్తుంచుకోవాలి. గ్రీన్_టీ గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించగలవు, రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించగలవు. ఒక గ్లాసు గ్రీన్ టీలో కూరగాయలు, పండ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్ల కంటే చాలా ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కాబట్టి ఆయుర్వేదం గ్రీన్ టీని రోజుకు మూడు సార్లు తాగాలని సిఫార్సు చేస్తోంది. బ్రౌన్‌రైస్ మీరు మీ సాధారణ ట్రైగ్లిజరైడ్లను జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటే, బ్రౌన్‌తో కూడిన వైట్ రైస్ తీసుకోండి. బ్రౌన్ రైస్‌లో అనేక ఖనిజాలు, విటమిన్లు ఉన్నాయి అనే వాస్తవం పక్కన పెడితే, ఇందులో ఫైబర్, సంతృప్త కొవ్వులు కూడా ఉన్నాయి. ఇది శరీరాన్ని టాక్సిన్స్ నుంచి శుద్ధి చేయడానికి, బరువును తగ్గించడానికి ముఖ్యంగా శరీరంలోని కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది . యాపిల్స్ ఈ రుచికరమైన పండ్లలో పెక్టిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది సహజ యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. వీటిని ఫ్లేవనాయిడ్స్ అని పిలుస్తారు. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గించి ఊపిరితిత్తులు, గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. సగటు యాపిల్‌లో పెద్ద మొత్తంలో విటమిన్లు ఏ, సీ ఉంటాయి. సుమారు 4 గ్రాముల ఫైబర్‌లో కేలరీలు కేవలం 100 మాత్రమే. యాపిల్స్ తోపాటు, ఆయుర్వేదం బేరి, దానిమ్మ, ద్రాక్షపండ్లు, నారింజలను తీసుకోవడం ద్వారా ట్రైగ్లిజరైడ్లను తగ్గించడానికి సిఫార్సు చేస్తుంది. ఇది కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తుంది. . బ్రోకలీ బ్రోకలీలో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ సి, ఫైబర్ వంటి అనేక రకాల పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అదనంగా, అవి యాంటీఆక్సిడెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. బ్రోకలీతో కలిపి తీసుకుంటే, అందులో ఉండే ఫైబర్లు జీర్ణవ్యవస్థలో పేరుకుపోయిన పిత్త ఆమ్లాలతో బంధించి వాటిని సహజంగా శరీరం నుంచి బయటకు తీస్తాయి. బ్రోకలీ సాధారణ ట్రైగ్లిజరైడ్, కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది. బార్లీ బార్లీ ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడానికి రక్తంలో చక్కెరను సాధారణీకరించే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందింది. తృణధాన్యంలో బీటా -గ్లూకాన్ అనే ఫైబర్ ఉంటుంది, ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను 4-10% తగ్గిస్తుంది. అదనంగా, బార్లీ గోధుమలకు చాలా మంచి ప్రత్యామ్నాయం. మీరు దీన్ని బ్రెడ్‌కు ప్రత్యామ్నాయంగా క్రమం తప్పకుండా తినవచ్చు. చేప చేప నూనె, చేప ట్యూనా, మాకేరెల్, ట్రౌట్, సాల్మన్, హెర్రింగ్, సార్డినెస్ వంటి చేపలు ఒమేగా 3 యాసిడ్లతో నిండి ఉంటాయి, ఇవి ట్రైగ్లిజరైడ్లను తగ్గించి గుండె జబ్బులను నివారించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఆయుర్వేదం వారానికి కనీసం రెండుసార్లు చేపలను తినాలని అలాగే ప్రతిరోజూ 1 నుంచి 4 గ్రాముల చేప నూనెను తీసుకోవాలని సిఫార్సు చేస్తోంది. దుంప దీని ఆకులలో సినారైన్ ఉంటుంది. ఇది కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది పేరుకుపోయిన టాక్సిన్ని వేగవంతంగా తొలగిస్తుంది. తత్ఫలితంగా కొలెస్ట్రాల్ తగ్గి ధమనులను శుభ్రం అవుతాయి . పాలకూర బచ్చలికూర వీటిలో ల్యూటిన్ ఉంటుంది. ఇది ట్రైగ్లిజరైడ్స్‌ని ధమనుల గోడలకు అంటుకోకుండా, మూసుకుపోకుండా నిరోధిస్తుంది. బచ్చలికూరలో ఉండే విటమిన్ ఇ, ఫలకం తొలగింపుపై శ్రద్ధ చూపుతుంది తద్వారా గుండె జబ్బుల నుంచి రక్షిస్తుంది. అలాగే బీన్స్, బఠానీలు, చిక్పీస్, కాయధాన్యాలు మరియు ఇతర ఫైబర్ అధికంగా ఉండే చిక్కుళ్ళు రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ట్రైగ్లిజరైడ్స్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఫ్లాక్స్ సీడ్లో లిగ్నన్లు ఉంటాయి, ఇవి రక్తంలో కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. జీర్ణవ్యవస్థను ఉత్తేజపరుస్తాయి. గుండె సమస్యలను దూరంగా ఉంచుతాయి. ఫ్లాక్స్ సీడ్లో ఫైబర్ ఒమేగా 3 యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ ఉత్పత్తి, శోషణను నియంత్రిస్తాయి. (చదవండి: ఈ పొరపాటు చేస్తే.. మీరు ఏజ్డ్ పర్సన్‌లా కనిపించడం ఖాయం!) -
చిన్నారుల్ని ఇబ్బంది పెట్టే హ్యాండ్ ఫుట్ అండ్ మౌత్ డిసీజ్!
హ్యాండ్ ఫుడ్ అండ్ మౌత్ డిసీజ్ చిన్నారుల్లో కనిపిస్తుంటుంది. ఈ వ్యాధిలో పిల్లల చేతులు, కాళ్లు, నోటి మీద ర్యాష్, పొక్కులు, పుండ్ల లాంటివి వచ్చి బాధపెడతాయి. ఈ వైరస్ వ్యాప్తి విస్తృతంగా ఉన్నప్పుడు... ఔట్‌బ్రేక్స్ మాదిరిగా అకస్మాత్తుగా పిల్లల్లో అంటువ్యాధిలా వ్యాపిస్తుంది. ఏడాది పొడవునా ఎప్పుడైనా వ్యాప్తి చెందే ఈ వ్యాధి వాతావరణంలో వేడిమీ, తేమ ఎక్కువగా ఉన్నప్పుడు వస్తుంటుంది. అందుకే మనలాంటి ఉష్ణమండలపు ప్రాంతాల్లో దీని వ్యాప్తి ఎక్కువ. రోజుల వయసు పిల్లలు మొదలుకొని, పదేళ్ల చిన్నారుల వరకు కనిపించే ఈ సమస్య తల్లిదండ్రుల ఆందోళనకూ కారణమయ్యే అవకాశం ఉంది. ఈ వ్యాధిపై అవగాహన కోసం ఈ కథనం. హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్లోని ర్యాష్, పుండ్లు, కురుపుల్లో నొప్పి ఓ మోస్తరుగా, కాస్త ఎక్కువగానే ఉండవచ్చు. దేహం రంగు (స్కిన్ టోన్)ను బట్టి ఈ కురుపులు, పుండ్లు పిల్లలందరిలో ఒకేలా కాకుండా కాస్త వేర్వేరుగా కనిపించవచ్చు. అంటే ఎరుపు, గ్రే కలర్, కొన్నిసార్లు తెలుపు రంగులో కనిపిస్తాయి. ఇవి మూడు నుంచి ఆరు రోజుల వరకు కనిపించి, ఆ తర్వాత వాటంతట అవే తగ్గిపోతాయి. కొంతమంది పిల్లల్లో పిరుదుల మీదా కనిపించే అవకాశం ఉంది. పుండ్లు పిల్లల్లో నోటి వెనకా, గొంతులోనూ వచ్చి బాధిస్తాయి. ఇలా జరగడాన్ని ‘హెర్పాంజియా’ అంటారు. కొంతమందితో మెదడువాపు లక్షణాలు కనిపిస్తాయి. వ్యాప్తి ఇలా... ‘కాక్సాకీ’ అనే వైరస్ కారణంగా ఈ వ్యాధి వ్యాప్తిచెందుతుంది. ఇది ఎంటరోవైరస్ జాతికి చెందిన వైరస్. పిల్లల ముక్కు నుంచి స్రవించే స్రావాలు, లాలాజలం, పుండ్ల నుంచి స్రవించే తడితో పాటు పిల్లలు తుమ్మడం, దగ్గడం చేసినప్పుడు వ్యాపించే తుంపర్ల (డ్రాప్లెట్స్) వల్ల ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంటుంది. వ్యాధి నయమై, లక్షణాలు తగ్గిపోయాక కూడా వైరస్ చాలాకాలం పాటు దేహంలోపలే ఉండి, వ్యాధి వ్యాప్తికి కారణమయ్యే అవకాశం ఉంది. ఒక్కోసారి పిల్లలతో ఉండే పెద్దల ద్వారా ఇతర పిల్లలకు ఇది వ్యాప్తి చెందవచ్చు. అరుదుగా ముప్పు... చాలావరకు దానంతట అదే తగ్గిపోయే ఈ వ్యాధి అరుదుగా కొంతమంది పిల్లల్లో ముప్పు తెచ్చిపెట్టవచ్చు. పిల్లల వయసు అనే అంశమే ఈ ముప్పునకు కారణం. అంటే సాధారణంగా ఐదేళ్లలోపు పిల్లల్లో ఇది ఒకింత ప్రమాదకరం అయ్యే అవకాశం ఉంది. వయసు పెరుగుతున్న కొద్దీ పిల్లల్లో వ్యాధి నిరోధకత (ఇమ్యూనిటీ) కూడా పెరుగుతుంది కాబట్టి పెద్ద వయసు పిల్లల్లో ఇది ప్రమాదకరం కాబోదు. కొద్దిమంది పిల్లల్లో మెదడు, ఊపిరితిత్తులు, గుండె కూడా దుష్ప్రభావాలకు లోనవుతాయి. ఒక్కోసారి ఈ వ్యాధి తెచ్చిపెట్టే ముప్పులు ఈ కింది విధంగా ఉండవచ్చు. వైరల్ మెనింజైటిస్ : మెదడు పొరల్లో వాపుతో పాటు, మెదడు చుట్టూ ఉండే సెరిబ్రో స్పినల్ ఫ్లుయిడ్లో ఇన్ఫ్లమేషన్ కలగడం. ఎన్సెఫలైటిస్ : మెదడువాపునకు కారణమై ఒక్కోసారి ప్రాణాపాయం వరకు వెళ్లే పరిస్థితి రావచ్చు. అయితే ఇది చాలా చాలా అరుదు. చికిత్స ఇది వైరల్ జ్వరం కాబట్టి నిర్దిష్టంగా చికిత్స ఏదీ లేదు. కాకపోతే లక్షణాల ఆధారంగా చికిత్స (సింప్టమేటిక్ ట్రీట్మెంట్) అందించాల్సి ఉంటుంది. అంటే జ్వరం తగ్గడానికి పారాసిటమాల్, డీ–హైడ్రేషన్ సమయంలో ఐవీ ఫ్లుయిడ్స్, సీజర్స్వంటి కాంప్లికేషన్లతో పాటు వైరల్ మెనింజైటిస్, ఎన్కెఫలైటిస్ కనిపించినప్పుడు వాటికి అనుగుణంగా చికిత్స అందించడం అవసరం. ఈ వ్యాధి నివారణకు టీకా రూపొందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నివారణ: కనీసం 20 సెకండ్ల పాటు సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. హ్యాండ్ శానిటైజర్ వాడాలి. ∙నేరుగా దగ్గడం తుమ్మడం చేయకుండా, చేతిగుడ్డ /రుమాలు అడ్డుపెట్టుకోవాలి. ∙వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ, పరిశుభ్రమైన (కాచి, వడబోసిన లేదా క్లోరిన్‌తో బ్లీచ్ చేసిన) నీటిని తాగాలి. ∙పిల్లల వ్యక్తిగత వస్తువుల్నీ పరిశుభ్రంగా ఉంచాలి. వారి డయపర్ వంటి వాటిని జాగ్రత్తగా పారేయాలి (డిస్పోజ్ చేయాలి). పిల్లల వస్తువులు, బొమ్మల వంటివి... ఇతరులు వాడకుండా జాగ్రత్తపడాలి. లక్షణాలు తగ్గే వరకు స్కూల్‌కు పంపకపోవడమే మంచిది. వ్యాధి వ్యాప్తి చెందుతున్నప్పుడు ఇల్లు, తలుపులు, డోన్ నాబ్స్ వంటి వాటితో పాటు పరిసరాలనూ డిస్–ఇన్ఫెక్టెంట్ల సహాయంతో శుభ్రం చేయడం మేలు. వైరస్ కారణంగా 24 నుంచి 48 గంటల పాటు జ్వరం. ∙తీవ్రమైన నీరసం, నిస్సత్తువ. ∙ఆకలి లేకపోవడం, ఆకలి బాగా మందగించడం. ∙గొంతు బొంగురుపోవడం, ఇబ్బందికరంగా మారడం. ∙కొన్నిసార్లు ర్యాష్, పొక్కులు, కురుపులు చిగుర్లు, నాలుక, చెంపల లోపలివైపున కూడా కని పించవచ్చు. కొన్నిసార్లు పొక్కులు, కురుపులు లేకుండా ఎర్రబడిన భాగం కాస్త ఉబ్బెత్తుగా అయినట్లుగానూ కనిపించవచ్చు. డాక్టర్ రమేశ్ బాబు దాసరి, సీనియర్ పీడియాట్రీషియన్ (చదవండి: మరణం తర్వాత జీవితం ఉంటుందటా! షాకింగ్ విషయాలు వెల్లడించిన వైద్యులు) -
సరోగసీలో బిడ్డకు పాలివ్వలేం!..మరీ బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందా?
బిడ్డకు పాలు ఇవ్వకపోతే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని చదివాను. నిజమేనా? నా ఫ్రెండ్ కెరీర్ ఒత్తిడి వల్ల పిల్లల కోసం సరోగసీకి వెళదామనుకుంటోంది. దీనివల్ల బ్రెస్ట్ ఫీడ్ కుదరదు కదా! అందుకే బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదం ఉంటుందని చెప్పాను. అలా ఏమీ ఉడదు.. బిడ్డను కన్నా పాలు పడకపోతే కూడా అంతే రిస్క్ ఉంటుంది కదా అని వాదిస్తోంది. నా డౌట్ క్లియర్ చేయగలరు. – కె. పృథ్వీ దీప్తి, పుణె సరోగసీ ద్వారా పిల్లలను ప్లాన్ చేసినా.. కొంతమందికి మందుల సహాయంతో బ్రెస్ట్ ఫీడింగ్‌కి ట్రై చేయొచ్చు. దీన్ని లాక్టేషన్ ఇండక్షన్ అంటారు. సరోగసీ బేబీ డెలివరీ కన్నా ముందు నుంచి బ్రెస్ట్ ఫీడింగ్‌కి ట్రై చెయ్యడానికి ప్రిపరేషన్ చేసుకోవాలి. ఇది అందరిలోనూ విజయవంతం కావచ్చు. బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల ఉన్న ఉపయోగాలు దాదాపు అందరికీ తెలిసే ఉంటాయి. ఏడాది పాటు బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల 4 నుంచి 5 శాతం వరకు బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అనేది హార్మోన్స్, జన్యుపరమైన, జీవనశైలి వంటివాటి వల్ల పెరుగుతుంది. హార్మోన్స్ చేంజెస్ వల్ల 50 శాతం రిస్క్ పెరుగుతుంది. 5 నుంచి 10 శాతం జన్యుపరమైన కారణాలు ఉంటాయి. బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వనందు వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ స్వల్పమే. ఆరోగ్యకరమైన జీవనశైలి.. అంటే అధిక బరువు లేకుండా సరైన బీఎమ్ఐ (బాడీ మాస్ ఇండెక్స్)ని మెయిన్టేన్ చేస్తూ .. పోషకాహారం తీసుకుంటూంటే క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. జన్యుపరమైన కారణాలతో హైరిస్క్‌లో ఉన్నవారికి స్క్రీనింగ్‌లో బీఆర్సీఏ జీన్ పాజిటివ్ అని తేలిన వారికి ప్రాఫిలాక్టిక్ సర్జరీల ద్వారా ఆ రిస్క్‌ని తగ్గించవచ్చు. బ్రెస్ట్ అల్ట్రాసౌండ్ లేదా మామోగ్రఫీ ద్వారా తేలిగ్గానే క్యాన్సర్ చేంజెస్‌ను కనిపెట్టవచ్చు. ఈరోజుల్లో కొన్ని మెడికేషన్స్ ద్వారా .. సరోగసీ ద్వారా పిల్లలు కన్న తల్లులతో కూడా బ్రెస్ట్ఫీడింగ్కి, బిడ్డతో స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్‌ని చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. (చదవండి: చర్మం ఆరోగ్యంగా కాంతివంతంగా కనిపించాలంటే..ఇలా చేయండి!) -
ఆ పరాన్నజీవి గుడ్లు నేరుగా నోట్లోకి వెళ్లడంతో..ఆ ముప్పు తప్పదు!
హుక్ వార్మ్ అనే పరాన్నజీవి ప్రధానంగా చిన్నపేగుల్లో ఉంటుంది. మనం తీసుకునే ఆహారాన్ని అది సంగ్రహిస్తూ ఉండటం వల్ల నీరసం, నిస్సత్తువ, పొషకాల లోపంతో పాటు ప్రధానంగా ఐరన్ లోపం కనిపిస్తుంది. చాలామందిలో ఇది ప్రధానంగా చిన్నపేగులనే ఆశ్రయించినా కొందరిలో మాత్రం ఊపిరితిత్తులు, చర్మం వంటి ఇతర అవయవాలపైనా ప్రభావం చూపవచ్చు. పోలాలకు వెళ్లే పెద్దలూ, మట్టిలో ఆడుకునే పిల్లల్లో ఇది ఎక్కువ. ఈ ఇన్ఫెక్షన్ గురించి అవగాహన కోసం ఈ కథనం. హుక్వార్మ్ ఇన్ఫెక్షన్ అనేది పోలాల్లో నడిచేవారిలో... అది కూడా చెప్పులు, ΄ాదరక్షలు లేకుండా నడిచేవారిలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇప్పటికీ కొన్ని మారుమూల పల్లెల్లో ఆరుబయలు మలవిసర్జన చేసే అలవాటు ఉంటుంది. మలంతో పాటు విసర్జితమైన హుక్వార్మ్ గుడ్లు ఏదో రూపంలో మనుషుల నోటి ద్వారా మళ్లీ లోనికి ప్రవేశించడం అన్నది దీని జీవితచక్రం (లైఫ్‌సైకిల్)లో భాగం. నేల/మట్టి ద్వారా ఇన్ఫెక్షన్ వస్తుంటుంది కాబట్టి దీన్ని ‘సాయిల్ ట్రాన్స్మిటెడ్ హెల్మింథిస్’ అంటారు. మనుషులు నేల మీద నడవక తప్పదు కాబట్టి దీని విస్తృతి ఎంతంటే... ప్రపంచవ్యాప్త జనాభాలో దాదాపు 10% మందిలో ఈ ఇన్ఫెక్షన్ ఏదో ఒక దశలో వచ్చే ఉంటుందనేది ఒక అంచనా. లక్షణాలు: కొద్దిపాటి నుంచి ఓ మోస్తరు జ్వరం పొట్టలో నొప్పి ఆకలి మందగించడం ∙నీళ్ల విరేచనాలు బరువు తగ్గడం ∙రక్తహీనత ∙కొందరిలో దగ్గు / పిల్లికూతలు (ఊపిరితిత్తులు ప్రభావితమైనప్పుడు) ∙చర్మంపై ర్యాష్ (చర్మం ప్రభావితమైనప్పుడు). ఇదీ ముప్పు... తీసుకున్న ఆహారం, దాంతో సమకూరే శక్తి, సారం అంతా హుక్వార్మ్స్ గ్రహించడంతో తీవ్రమైన రక్తహీనత, ΄ోషకాల లోపం, ్ర΄ోటీన్స్ లోపం వంటి పరిణామాలతో తలతిరగడం, తీవ్రమైన అలసట, కండరాలు పట్టేయడం, ఊపిరి అందక΄ోవడం, ఛాతీలో నొప్పి వంటి అనేక పరిణామాలు తరచూ చోటు చేసుకుంటూ ఉంటాయి. దాంతో క్రమంగా భౌతికంగా, మానసికంగా బలహీనమయ్యే అవకాశం ఉంది. నిర్ధారణ: మల, రక్త (సీబీపీ) పరీక్షలతో నిర్ధారణ చేయవచ్చు. రక్తపరీక్షలో ఈసినోఫిలియా (తెల్లరక్తకణాల్లో ఒక రకం) కౌంట్ నార్మల్ కంటే ఎక్కువగా ఉంటుంది. అలాగే మల పరీక్షలో హుక్వార్మ్ గుడ్లు కనిపిస్తాయి. నివారణ: కాచివడబోసిన నీళ్లు తాగాలి. వేడిగా ఉన్నప్పుడే ఆహారం తినేయాలి. తినేముందు చేతులు కడుక్కవాలి ఆరుబయట మలవిసర్జనను పూర్తిగా నిలిపివేయాలి. (పల్లెల్లో సైతం ఇది జరగాలి) మల విసర్జన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి పెద్దలు పొలాల్లో తిరిగి వచ్చాక, పిల్లలు మట్టిలో ఆడుకున్న తర్వాత చేతులు, కాళ్లు శుభ్రంగా కడుక్కోవాలి పెంపుడు జంతువులకు క్రమం తప్పకుండా డీ–వార్మింగ్ చేయిస్తుండాలి. చికిత్స: కాళ్లకు లేదా ఒంటి మీద ఎక్కడైనా ర్యాష్ కనిపించినా, లేదా ఆకలి / బరువు తగ్గినట్లుగా ఉన్నా, తీవ్రమైన అలసట, నీరసం, నిస్సత్తువ ఉన్నా డాక్టర్‌ను సంప్రదించాలి. అవసరమైన పరీక్షల తర్వాత వ్యాధి నిర్ధారణ జరి΄ాక వారు మిబెండిజోల్, ఆల్బెండిజోల్ వంటి మందుల్ని సూచిస్తారు. --డాక్టర్ కె. శివరాజు, సీనియర్ ఫిజీషియన్ (చదవండి: తుంటి ఎముక కీలు సర్జరీ..ఆ పద్ధతి ఎంత వరకు బెస్ట్! లాభాలేమిటంటే?) -
తుంటి ఎముక కీలు సర్జరీ..ఆ పద్ధతి ఎంత వరకు బెస్ట్!
మనిషి నిటారుగా నిలబడటానికి, కూర్చోడానికి, పరుగెత్తడానికి... ఒక్కమాటలో చెప్పాలంటే రోజులో చేయాల్సిన చాలా పనులకు తోడ్పడేది తుంటి ఎముక కీలు. తుంటి ఎముకలో సాకెట్ లాంటి గుండ్రటి ఖాళీ స్థలం ఉంటుంది. సరిగ్గా ఆ ఖాళీలో అమరిపోయేలా తొడ ఎముక చివరన బంతిలాంటి భాగం ఉండి, ఈ రెండింటి కలయితో కీలు (జాయింట్) ఏర్పడుతుంది. ఈ కీలు వల్లనే రోజువారీ చేసే అనేక పనులు సాధ్యమవుతాయి. ఇటీవల అనేక కారణాలతో... అంటే... వయసు పెరగడం వల్ల వచ్చే ఆర్థరైటిస్‌తో, తుంటి ఎముకలో అరుగుదల వల్ల, యాంకలైజింగ్ ఆర్థరైటిస్‌తో, మరీ ముఖ్యంగా ఇటీవల కరోనా తర్వాత పాతికేళ్ల లోపు యువతలో సైతం అవాస్క్యులార్ నెక్రోసిస్ కారణంగా తుంటి ఎముక అరగడం, విరగడం చాలా సాధరణమయ్యింది. ఇలాంటప్పుడు తుంటి ఎముక మార్పిడి సర్జరీ చేయడం అవసరమవుతుంది. అయితే ఇదే శస్త్రచికిత్సను ‘యాంటీరియర్ హిప్ రీప్లేస్మెంట్’ పద్ధతిలో కాస్త వైవిధ్యంగా నిర్వహిస్తున్నారు డాక్టర్ నితీశ్ భాన్. ఈ పద్ధతి అంటే ఏమిటో, దాని వల్ల ప్రయోజనాలేమిటో ఆయన మాటల్లోనే... ప్రశ్న : యాంటీరియర్ హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ అంటే ఏమిటి, దాని వల్ల ప్రయోజనాలేమిటి? నితీశ్ భాన్ : ‘యాంటీరియర్ హిప్ రీప్లేస్మెంట్’ అంటే ఏమిటో తెలుసుకునే ముందర, అసలు సంప్రదాయబద్ధంగా (కన్వెన్షనల్గా) చేసే ‘΄ోస్టీరియర్ హిప్ జాయింట్ రీప్లేస్మెంట్’ అంటే ఏమిటో తెలియాలి. అప్పుడు దానికీ దీనికీ తేడాలేమిటి అనేవి తెలుస్తాయి. నిజానికి హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీని మూడు రకాలుగా చేస్తారు. అవి... మొదటిది పిరుదు వెనకభాగం నుంచీ, రెండోది కాస్త పక్కగా చేసేవి. వీటినే పోస్టీరియర్ హిప్ జాయింట్ రీప్లేస్‌మెంట్‌గా చెప్పవచ్చు. ఇందులో మూడోది... మనం యాంటీరియర్గా చెప్పే...కాలి ముందు వైపు నుంచి చేసే శస్త్రచికిత్స. సాధారణంగా ‘΄ోస్టీరియర్ హిప్ జాయింట్ రీప్లేస్మెంట్’లో పిరుదు దగ్గర ఉండే మూడు కండరాల సముదాయంలో పెద్దదైన ‘గ్లుటియస్ మాక్సిమస్’ అనే పెద్ద కండరాన్నీ, మరికొన్ని కీలకమైన కండరాల్ని కట్ చేయాల్సి వస్తుంది. ఇలా కండరాలను కట్ చేసి, తుంటి కీలు వరకు వెళ్లాక కీలు మార్పిడి ప్రక్రియ అంతా ఒకేలా ఉంటుంది. కానీ... అతి పెద్దవీ, కీలకమైన కండరాలను కట్ చేయడం వల్ల గాయం తగ్గి, అంతా నయం కావడానికి కనీసం ఐదారు నెలలు పట్టవచ్చు. అయితే ‘యాంటీరియర్ హిప్ జాయింట్ రీప్లేస్మెంట్’లో ఇలా కీలకమైన కండరాల కోత అవసరముండదు కాబట్టి ఇది తగ్గడానికి 12 రోజులు చాలు. ప్రశ్న : శస్త్రచికిత్స ఏదైనప్పటికీ... ఆర్నెల్ల తర్వాతైనా అంతా మునపటిలా ఉంటుందా? నితీశ్ భాన్ : అదే చెప్పబోతున్నా. గ్లుటియస్ మాక్సిమస్ లాంటి అతి పెద్ద కండరం కట్ చేయడం వల్ల ‘΄ోస్టీరియర్ హిప్ జాయింట్ రీప్లేస్మెంట్’ శస్త్రచికిత్స తర్వాత అనేక ప్రతిబంధకాలూ, ప్రతికూలతలు ఉంటాయి. మనం నిలబడటానికి, కూర్చోడానికి, కూర్చున్న తర్వాత లేవడానికి, కదలడానికి, నడవడానికి, పరుగెత్తడానికి... ఇలా చాలా కదలికలకు తోడ్పడే కండరం కావడంతో... హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ తర్వాత అనేక ఆంక్షల్ని పాటించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒకవైపు ఒరిగి పడుకున్నప్పుడు కాళ్లు రెండూ దగ్గరగా తీసుకురాకూడదు. కూర్చున్నప్పుడు పాదాలు లోపలివైపునకు ఉండేలా కాళ్లు దగ్గరగా పెట్టుకోకూడదు. కూర్చుని ముందుకు వంగ కూడదు. కూర్చుని కాళ్లు ముడిచినప్పుడు 90 డిగ్రీల నుంచి 100 డిగ్రీలు లోపలికి ముడవలేం. కూర్చుని ముందుకు వంగి సాక్స్ తొడగలేము, షూలేసులు కట్టుకోలేం. అంతెందుకు... సోఫాలో నిర్భయంగా, నిశ్చింతగా, సౌకర్యంగా కూర్చోడానికీ జాగ్రత్త ΄ాటించాలి. ఎందుకంటే ΄ోస్టీరియర్ పద్ధతిలో కీలు మార్పిడి తర్వాత... ప్రతి కదలికలోనూ కీలు తన స్థానం నుంచి తొలగి ΄ోయేందుకు (డిస్‌లొకేషన్‌కు) అవకాశం ఉంటుంది. ΄ోస్టీరియర్లో గాయం తగ్గేందుకు ఆర్నెల్లు పట్టడం, ప్రతి కదలికలోనూ జాగ్రత్త వహించాల్సిరావడం, డిస్లొకేషన్ రిస్క్ ఉండటంతో చికిత్స తర్వాతా నిశ్చింతగా ఉండటం సాధ్యం కాదు. ఇది క్వాలిటీ ఆఫ్ లైఫ్‌పై ప్రభావం చూపుతుంది. ప్రశ్న : మరి యాంటీరియర్తో ప్రయోజనం ఏమిటి? నితీశ్ భాన్ : ఇంతకుమునుపు చెప్పుకున్న ప్రతి బంధకాలేమీ ఉండవు. ΄ాటించాల్సిన ఆంక్షలు ఒక్కటి కూడా ఉండవు. అంటే జీరో రిస్ట్రిక్షన్స్ అన్నమాట. ఎందుకంటే.... యాంటీరియర్ శస్త్రచికిత్సలో చిన్న గాటు తప్ప పెద్ద లేదా కీలకమైన కండరాలు వేటినీ కోయనక్కర్లేదు. దీంతో కండరాలు దెబ్బతినడం చాలా చాలా తక్కువ (లెస్ టీష్యూ డ్యామేజ్); కోలుకునే వేగమూ చాలా ఎక్కువ. అక్కడ కోత గాయం మానడానికి ఆర్నెల్లు పడితే, ఇక్కడ కేవలం 10, 12 రోజులు చాలు. నేను చేసిన కొన్ని శస్త్రచికిత్సల్లో రెండో రోజే పరుగెత్తడం, కొన్ని రోజుల వ్యవధిలోనే వాహనాలు నడపడం జరిగింది. వైద్య గణాంకాల ప్రకారం... యాంటీరియర్లో ఇలాంటి డిస్‌లొకేషన్‌కు అవకాశాలు కేవలం 1 శాతం లోపే. ఆస్ట్రేలియన్ జాయింట్ రిజిస్ట్రీ ప్రకారం ΄ోస్టీరియర్ పద్ధతిలో డిస్లొకేషన్ రిస్క్ 21.1 శాతం కాగా... యాంటీరియర్లో ఇది కేవలం ఒక శాతం కంటే కూడా తక్కువే. ఇవి ప్రపంచవ్యాప్తంగా ఉన్న గణాంకాలైతే, ఇప్పటివరకు నేను నిర్వహించిన దాదాపు 450 పైగా సర్జరీల్లో హిప్ డిస్లొకేషన్ అయిన కేసు, ఫెయిలైన కేసు ఒక్కటి కూడా లేనే లేదు. ప్రశ్న : మరి అందరూ యాంటీరియర్ పద్ధతిలోనే చేయవచ్చుగా? నితీశ్ భాన్ : ఇది సాంకేతికంగా, సునిశితత్వం çపరంగా చాలా ఎక్కువ నైపుణ్యాలు అవసరమైన శస్త్రచికిత్స. దీనికి చాలా నేర్పు కావాలి. సర్జరీ నిర్వహణను ఒక గ్రాఫ్‌లా గీస్తే సునిశితత్వం, నేర్పూ, నైపుణ్యాలూ ఇవన్నీ ఒక నిటారైన గీతలా ఉంటాయి. అంటే... యాంటీరియర్ హిప్ జాయింట్ రీప్లేస్మెంట్లో అంత సక్లిష్టత ఉంటుందన్నమాట. అందుకే దాదాపు ఈ పద్ధతిలో శస్త్రచికిత్స చేసేవారిలో పన్నెండేళ్ల కిందట దేశంలో ఆరేడుగురి కంటే ఎక్కువ లేరు. ఇప్పటికీ నా అంచనా ప్రకారం మహా అయితే తొమ్మిది మది ఉండి ఉంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నేనే సీనియర్. అంతెందుకు విదేశాల నుంచి కూడా వచ్చి... ముంబైలో కుదరక΄ోవడంతో... అక్కడున్నవారితో వాకబు చేసుకుని... అక్కడ్నుంచి ఇక్కడికి వస్తుంటారు. ప్రశ్న : ఈ యాంటీరియర్ హిప్ రీ–ప్లేస్మెంట్ సర్జీరీకి ఫీజులెలా ఉంటాయి? నితీశ్ భాన్ : హిప్ రీప్లేస్మెంట్లో ఏ రకమైనా ఒకేలాంటి ఫీజు ఉంటుంది. అయితే శస్త్రచికిత్స తర్వాత రీప్లేస్మెంట్ కోసం ఉపయోగించే కృత్రిమ కీలు (ప్రోస్థటిక్ జాయింట్)కే వేర్వేరు ధరలుంటాయి. డాక్టర్ నితీశ్ భాన్ సీనియర్ ఆర్థోపెడిక్ అండ్ నీ – హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ (చదవండి: శ్వాసకోశ సమస్యలకు.. శస్త్ర చికిత్స ఒక్కటే మార్గమా?)