Treatment
-
సమీరా ఆ సమస్యతోనే బాధపడింది..అదేదో జన్మహక్కు అన్నట్లు..
తెలుగు తమిళ, బాలీవుడ్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న సమీరా రెడ్డి సైతం ఆ సమస్యతో బాధపడిందట. జనాలంతా అదేదో తమ జన్మహక్కు అన్నట్లు కామెంట్లు చేస్తూ ఆ సమస్య గురించి తెగ మాట్లాడతారని మండిపడుతోంది. ఇలాంటి సందర్భాల్లో మనం ఎలా ఆ సమస్యను ధైర్యంగా ఫేస్ చేస్తూ ఆరోగ్యంగా ఉండాలో చూద్దాం! ఇంతకీ సమీరా ఏ సమస్యతో బాధపడిందంట?..అధిక బరువు. ఆమె ప్రసవానంతరం బయటకి రావడానికే ఇబ్బంది పడిందట. అనుకోకుండా ఓ రోజు తన బాబుతో ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లితే అక్కడ సెక్యూరిటీ గార్డు ఆమె ఆధార్ కార్డుని తనిఖీ చేస్తూ చేసిన కామెంట్‌ని తానస్సలు మర్చిపోలేనని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఏంటి మేడం మరీ ఇంత లావయ్యి పోయారు అంటూ జాలిగా చూసిన చూపు గుర్తొస్తే ఒళ్ల మండిపోతుందంటూ వాపోయింది. మహిళ శరీరాల గురించి కొందరూ అదెదో తమ జన్మహక్కు అన్నట్లు కామెంట్లు చేస్తారు. ఇది ప్రకృతిసహజంగా జరిగే మార్పులు కొన్ని ఉంటాయని అర్థం చేసుకోరు, తెలుసుకోరు అని తిట్టిపోసింది. ముఖ్యంగా మన సమాజంలో ఇలాంటివి మరి ఎక్కువ అని చెప్పుకొచ్చింది. ఇలాంటప్పుడూ మన ఆత్మవిశ్వాసం దెబ్బతినకుండా వాటన్నింటిని ధైర్యంగా ఫేస్ చేయాలి. జన్మనిచ్చే తల్లుల పట్ల గౌరవం లేకపోయిన పర్లేదు కానీ సహజంగా స్త్రీ తల్లి అయ్యాక వచ్చే శరీర మార్పులను ఎగతాళి చేయొద్దని చెబుతోంది. అదేసమయంలో అందరూ ఒకేలా ఉండరు. కొందరూ తల్లి అయ్యాక కూడా స్లిమ్‌గా ఉండొచ్చు కానీ అలా అందరికీ సాధ్యం కాదని, అందరీ శరీర నిర్మాణాలు ఒకే రీతిలో ఉండవని గుర్తించాలని చెప్పింది. సమీరా 2014లో అక్షయ్ వర్దేని వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పేసింది. ఈ జంటకు 2015లో కొడుకు హన్స్, 2019లో కూతురు నైరా జన్మించారు. ఇక ఇలాంటి సమస్యలు సమీరా లాంటి సెలబ్రెటీల దగ్గర నుంచి సామాన్యుల వరకు అందరూ ఫేస్ చేసేదే. అయితే ఈ సమస్యకు చెక్‌పెట్టాలంటే.. మన అమ్మమ్మ, నానమ్మల కాలం నాటి చిట్కాలు ఫాలో అయితే ఈజీగా బయటపడొచ్చు. ప్రసవం తర్వాత బరువు తగ్గేందుకు.. సాధారణంగా ప్రసవించిన మహిళలు సాధారణంగా లావుగా కనిపిస్తారు. తగ్గడం కూడా అంత ఈజీగా ఉండదు. ఓ పక్క పిల్లలను చూసుకోవడంతో బిజీగా ఉండటంతో శరీరంపై దృష్టిపెట్టలేక ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి మహిళలు ఒళ్లు తగ్గించుకోవాలంటే వాము నీళ్లే చక్కటి పరిష్కారం. గర్భధారణ సమయంలో కూడా వీటిని తాగొచ్చు. ఎందుకంటే ఇది జీర్ణ సమస్యల్ని అధిగమిస్తుంది. అతిసారం, మలబద్దకాన్ని ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. అంతే కాదు గర్భధారణ సమయంలో ఏర్పడిన అదనపు కొవ్వుని కరిగించడంలో సాయం చేస్తుంది. ప్రతిరోజు మీ డైట్ లో వామ్ము నీళ్ళు తాగడం అలవాటు చేసుకుంటే నాజూకైన అందం మీ సొంతం అవుతుంది. ఈ నీళ్ళు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. యాలకులు, సోంపుతో కలిసి చేసే కషాయం ప్రసవం తర్వాత వచ్చే పొట్టను తగ్గించుకునేందుకు దోహదపడుతుంది. ఇందుకోసం ఒక గిన్నెలో 2 కప్పుల నీరు, 4 యాలకులు, 1 స్పూన్ సోంపు వేసి మరిగించాలి. ఈ నీటిని వడగట్టి పరగడుపున గోరువెచ్చగా ఉన్నప్పుడు త్రాగాలి. ఈ విధంగా పరగడుపున త్రాగటం వలన జీవక్రియ రేటు పెరిగి పొట్టలో కొవ్వు కరుగుతుంది. జాజికాయ పాలు శరీర బరువును తగ్గించడంలో ఎంతగానో ఉపకరిస్తుంది. ఒక కప్పు పాలల్లో పావు టీస్పూన్ జాజికాయ పొడి కలిపి మరిగించి, గోరు వెచ్చగా తాగాలి. ఇలా చేస్తే చాలా సులభంగా ప్రసవానంతరం వచ్చిన అధిక బరువు సమస్యకు చెక్ పెట్టొచ్చు. (చదవండి: ఇవాళే 'నేషనల్ హ్యాండ్ సర్జరీ డే'!వర్క్‌ప్లేస్‌లో చేతులకు వచ్చే సమస్యలు!) -
వృద్ధులను వేదించే గొంతులోని కఫం సమస్యకు..ఇలా చెక్ పెట్టండి!
వయసు మళ్లాక వచ్చే సమస్యలు అన్నిఇన్ని కావు. ఏది తినాలన్న భయం. పైగా ఏది అంత తొందరగా జీర్ణం కాదు. దీంతో అన్ని జావా, సూప్ మాదిరిగా తీసుకుంటుంటారు. ఘన పదార్థాలు తీసుకోనే అవకాశం లేకపోవడం, ఇతరత్ర సమస్యలు కారణంగా గొంతులో కఫం పేరుకుని ఇబ్బంది పెడుతుంది. దీని నుంచి ఉపశమనం పొందాలంటే ఈ చిట్కాలు పాటిస్తే చాలంటున్నారు ఆయుర్వేద నిపుణుల నవీన్ నడిమింటి. వీటిని వృద్ధులే కాక ఎవ్వరైనా వాడొచ్చని అంటున్నారు. గొంతు కఫాన్ని నివారించే మార్గం.. ఆయుర్వేదిక్ షాప్ లో మాసికాయ అని ఉంటుంది. అది తీసుకువచ్చి బుగ్గని పెట్టి చప్పరిస్తూ ఉంటే ఆ రసం మన కడుపులో దిగి కఫం అనేది పూర్తిగా తొలిగిపోతుంది ఈ మాసికాయ చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఒక్కసారి వాడి చూడండి వామాకు, తులసాకు,తమలపాకుని రోజు తిన్న మంచి ఫలితం ఉంటుంది. మెత్తగా దంచి జల్లించిన కరక్కాయ పొడి, తేనెలో కలిపి రెండు పూటలా చప్పరించాలి. ఉదయం లేవగానే గోరు వెచ్చని మంచినీరు రెండు గ్లాసులు త్రాగాలి. రాత్రి పడుక్కోడానికి అరగంట ముందు రెండు చిటికెల పసుపు, నాలుగు మిరియాలు ( దంచిన ముక్కలు) పంచదార కొంచెం ( షుగరు లేకపోతే ఉంటే మెత్తని ఎండు ఖర్జూరం పొడి) ఒక గ్లాసు పాలు లో మరిగించి, వడకట్టి త్రాగాలి. ఐతే వృద్ధులుకి ఏది ఇచ్చినా అది ద్రవ రూపంలో లేదా మెత్తని పౌడర్ రూపంలో ఉండాలి. --ఆయుర్వేద నిపుణులు నవీన్ నడిమింటి (చదవండి: మీనియర్స్ డిసీజ్ అంటే..!) -
మీనియర్స్ డిసీజ్ అంటే..!
మన లోపలి చెవి (ఇన్నర్ ఇయర్) వినికిడి సామర్థ్యానికీ, నిటారుగా ఉండేందుకు దోహదం చేస్తుంది. ఇక్కడ సమస్య వస్తే వినికిడి శక్తి తగ్గడంతో పాటు, నిటారుగా నిలబడి ఉండే సామర్థ్యం కూడా తగ్గిపోయి ఒళ్లంతా గిర్రున తిరుగుతూ, తూలి కిందికి పడిపోతామేమోనన్న ఫీలింగ్ కలుగుతుంది. అంతేకాదు... ఏదో ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర నిలబడిప్పుడు వినిపించే హోరు లాంటిది చెవిలోంచి వినబడుతుంటుంది. ఇలా వినికిడి తగ్గడం, తూలి కిందపడిపోయేలా బ్యాలెన్స్ కోల్పోవడం, చెవిలోంచి హోరు వినిపించడం వంటి లక్షణాలతో వ్యక్తమయ్యే మీనియర్స్ డిసీజ్‌పై అవగాహన కోసం ఈ కథనం. మీనియర్స్ డిసీజ్‌ను ‘ఇడియోపథిక్ ఎండోలింఫాటిక్ హైడ్రాప్స్’ అని కూడా అంటారు. అది ప్రాణాంతకం కాదుగానీ... చికిత్స అందరకపోతే క్రమంగా వినికిడి శక్తి కోల్పోయే అవకాశమూ ఉంది. గతంలో కాస్త అరుదుగా కనిపించే ఈ సమస్య... ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తుండటం వైద్యవర్గాల్లో ఆందోళనను కలిగిస్తోంది. లక్షణాలు: మీనియర్స్ డిసీజ్‌లో వర్టిగో, టినైటస్, వినికిడిలోపం (డెఫ్నెస్) ఈ మూడు లక్షణాలూ కలగలసి ఉంటాయి. వర్టిగో లక్షణాలు: పిల్లలు గిరగిరా తిరిగీ, తిరిగీ అకస్మాత్తుగా ఆగినప్పుడు బ్యాలెన్స్ కోల్పోయి తూలికింద పడిపోతామేమో అనిపించినట్లుగా లేదా రంగుల రాట్నంపై నుంచి విసిరివేసినట్లుగా అనుభూతి చెందుతూ ఆందోళన పడుతుంటారు. వర్టిగోలో కనిపించే ఇదే లక్షణం మీనియర్లోనూ కనిపిస్తుంది. టినైటస్ లక్షణాలు : ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్ల దగ్గరి గుయ్ అనే శబ్దమే కొందరికి చెవుల్లోంచి వినిపిస్తూ, చికాకు కలిగిస్తుంది. టినైటస్లోని ఇదే లక్షణం... మీనియర్స్ డిసీజ్‌లోనూ కనిపిస్తుంది. వినికిడి తగ్గడం : లక్షణాలను నిర్లక్ష్యం చేయడం, చికిత్స తీసుకోకపోవడం వల్ల శాశ్వతంగా వినికిడి కోల్పోయి... పర్మనెంట్ డెఫ్నెస్ వచ్చే అవకాశం ఉంది. వినికిడి లోపం అన్నది ఒక్కోసారి పెరుగుతూ ఒక్కోసారి తగ్గుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఒకేరోజులోనే ఈ పెరగడం తగ్గడం జరుగుతూ ఉంటుంది. చెవి నిండిపోయినట్లుగా ఉండే ఫీలింగ్ చికాకు కలిగిస్తూ ఉంటుంది. నిర్ధారణ పరీక్షలు: బాధితులు చెప్పే లక్షణాలతో ఆడియాలజిస్టుల ఆధ్వర్యంలో వినికిడి సామర్థ్యం పరీక్షలు (ఆడియోమెట్రీ టెస్ట్) , వెస్టిబ్యులార్ టెస్ట్ బ్యాటరీ పరీక్షలతో పాటు డాక్టర్ల ఆధ్వర్యంలో మెదడు ఎమ్మారై, ‘ఎలక్ట్రో కాక్లియోగ్రఫీ’, ‘ఎలక్ట్రో నిస్టాగ్మోగ్రఫీ’ వంటి పరీక్షలు మీనియర్స్ డిసీజ్ నిర్ధారణకు తోడ్పడతాయి. ఇతర పరీక్షలు: మెదడులో గడ్డలు, కొన్ని రకాల మెదడు సమస్యలు ఉన్నప్పుడూ ఈ లక్షణాలే కనిపిస్తాయి కాబట్టి... ‘మీనియర్స్ ప్రోటోకాల్’ కూడా చేసి... సమస్య మెదడుకు సంబంధించింది కాదని రూల్ అవుట్ చేసుకుంటారు. నివారణ / వ్యాధి ఉన్నవారికి చెప్పే జాగ్రత్తలు : మీనియర్స్ డిసీజ్ ఉన్నవారిలో కొన్ని రకాల ఆహార నియంత్రణలను సూచిస్తారు. ఇవి కొంతమేరకు నివారణకూ తోడ్పడతాయి ఆహారంలో ఉప్పు తగ్గించడం చాక్లెట్లు, కెఫిన్ ఎక్కువగా ఉండే కాఫీ, కోలాడ్రింక్స్ వంటి పానీయాలను పరిమితంగా తీసుకోవడం ∙ఆల్కహాల్, పొగ అలవాట్లకు దూరంగా ఉండటం చైనా సాల్ట్‌కు దూరంగా ఉండటం. చికిత్స : ►వికారం, వాంతుల వంటి లక్షణాలను తగ్గించేందుకు యాంటీ–నాసియా (యాంటీ–ఎమిటిక్) మెడిసిన్స్ ఇస్తారు ∙ చెవిలోని ఒక రకం ద్రవం పెరగడం వల్ల మీనియర్స్ డిసీజ్ ►వచ్చే అవకాశం ఉన్నందున దేహంలోని ద్రవాలను బయటకు పంపించేందుకు మూత్రం ఎక్కువగా వచ్చే మందులైన ‘డై–యూరెటిక్స్’ అనే మందుల్ని వాడతారు ►వర్టిగోలో కనిపించే కళ్లు తిరగడం, పడిపోవడం లాంటి లక్షణాలను తగ్గించేందుకు ‘వెస్టిబ్యులార్ రీ–హ్యాబిలిటీషన్’ అని పిలిచే ఫిజియోథెరపీ లాంటి చికిత్సలను అందిస్తారు. ఇందులో బాధితులతో కొన్ని రకాల వ్యాయామాలు చేయిస్తారు ►వినికిడి సామర్థ్యం కోల్పోయిన వారిలో... వారు ఏ మేరకు కోల్పోయారో దాన్ని బట్టి హియరింగ్ ఎయిడ్ మెషిన్‌నూ అమర్చవచ్చు. ►పై చికిత్సలేవీ పనిచేయనప్పుడు చాలా అరుదుగా కొందరిలో శస్త్రచికిత్స చేయాల్సి రావచ్చు. ఇందులో ‘ఎండోలింఫాటిక్ శాక్’ అనే ప్రొసీజర్ ద్వారా చెవిలో అత్యధికంగా స్రవించే ద్రవాన్ని డ్రైయిన్ చేస్తారు∙ ఈ మధ్య అందుబాటులోకి వచ్చిన ‘ఇంట్రాటింపానిక్ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్’ థెరపీ కూడా ఉపయోగపడుతుంది. డాక్టర్ ఈ.సీ. వినయ కుమార్ సీనియర్ ఈఎన్టి సర్జన్ (చదవండి: అకస్మాత్తుగా ప్రమాదాన్ని తెచ్చిపెట్టే..అన్యురిజమ్ నుంచి బయటపడాలంటే..?) -
అకస్మాత్తుగా ప్రమాదాన్ని తెచ్చిపెట్టే..అన్యురిజమ్ నుంచి బయటపడాలంటే..?
దేహంలోని రక్తనాళాలు కొన్ని చోట్ల బలహీనంగా ఉండవచ్చు. మెదడులో అలా జరిగినప్పుడు బలహీనమైన చోట రక్తనాళం ఉబ్బి...ఒక్కోసారి ఆ ఉబ్బిన రక్తనాళంలోని లోపలి పొర మీద ఒత్తిడి పెరిగిపోయి, అది మరింత పలచబారి అకస్మాత్తుగాచిట్లిపోవచ్చు. ఈ పరిణామం మెదడులో జరిగితే అక్కడ జరిగే రక్తస్రావంతో మరిన్ని దుష్పరిణామాలు చోటు చేసుకునే ప్రమాదం ఉంది. ఒక్కోసారి ప్రాణాంతకమూ కావచ్చు. ఇలా మెదడులోని రక్తనాళాల్లో బలహీనమైన చోట రక్తం పేరుకుని, అది బుడగలా మారడాన్ని ‘అన్యురిజమ్స్’ అంటారు. అప్పటివరకూ అంతా బాగున్నట్టే అనిపిస్తూ... అకస్మాత్తుగా ప్రమాదాన్ని తెచ్చిపెట్టే ఈ కండిషన్‌పై అవగాహన కోసం ఈ కథనం. మెదడు చుట్టూరా ఆవరించుకుని ఉండే స్థలాన్ని సబర్కనాయిడ్ ప్రాంతంగా చెబుతారు. అన్యురిజమ్ కేసుల్లో దాదాపు 90 శాతం మందిలో ఆ ప్రాంతంలో రక్తస్రావం అవుతుంది కాబట్టి దాన్ని ‘సబర్కనాయిడ్ హేమరేజ్’ (ఎస్ఏహెచ్) అంటారు. రక్తనాళాలు చిట్లిన ప్రతి ఏడుగురిలోనూ నలుగురిలో ఏదో ఒకరకమైన వైకల్యం చోటు చేసుకునే అవకాశం ఉంది. రక్తస్రావం కాగానే పక్షవాతం (స్ట్రోక్), కోమాలోకి వెళ్లే అవకాశాలెక్కువ. అన్యురిజమ్స్ ఉన్న చాలామందిలో మెదడులో రక్తనాళాలు బలహీనంగా ఉన్నప్పటికీ అదృష్టవశాత్తు వారి జీవితకాలంలో అవి చిట్లకపోవచ్చు. కొందరిలో ఉబ్బు చాలా చిన్నగా ఉండవచ్చు. కానీ మరికొందరిలో ఇది ఎక్కువగా ఉన్నప్పుడు వాటిని ‘జెయింట్ అన్యురిజమ్స్’ అంటారు. ఇలాంటివి అకస్మాత్తుగా చిట్లే అవకాశాలుంటాయి. దాంతో బాధితుల్లో అకస్మాత్తుగా పక్షవాతం కనిపించవచ్చు. హార్ట్ ఎటాక్స్లోలాగే ‘సబర్కనాయిడ్ హ్యామరేజ్’ అకస్మాత్తుగా సంభవిస్తుంది. గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లో పూడిక చేరడం వల్ల అడ్డంకులతో గుండెపోటు వస్తే... అప్పటికే అన్యురిజమ్స్కు గురైన రక్తనాళాలు చిట్లడం వల్ల సబర్కనాయిడ్ హ్యామరేజ్ వస్తుంది. కారణాలు ►పొగాకు వాడకం, అనియంత్రితమైన రక్తపోటు, డయాబెటిస్ వంటివి ►రక్తానికి వచ్చే ఇన్ఫెక్షన్ కారణంగా కలిగే దుష్పరిణామాలు (కాంప్లికేషన్స్) ►చాలావరకు పుట్టుకతో వచ్చే (కంజెనిటల్), అలాగే జన్యుపరమైన కారణాలు. ఫ్యామిలీ హిస్టరీలో ఈ సమస్య ఉన్నప్పుడు ముప్పు ఎక్కువ ∙క్రమబద్ధంగా / ఆరోగ్యకరంగా లేని ►జీవనశైలి ∙ ►ఏదైనా ప్రమాదం కారణంగా రక్తనాళాలు గాయపడటం. ►కొన్ని అరుదైన కేసుల్లో... ఫైబ్రో మస్క్యులార్ డిస్ప్లేసియా వంటి కండరాల జబ్బు, మూత్రపిండాల్లో నీటితిత్తుల్లా ఉండే పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్... అన్యురిజమ్‌కు దారితీసే అంశాలు. చిట్లినప్పుడు కనిపించే లక్షణాలు∙ జీవితంలో ఎప్పుడూ రానంత అత్యంత బాధతో కూడిన తలనొప్పి స్పృహ కోల్పోవడం పక్షవాతం / ఫిట్స్ కూడా మాట్లాడలేకపోవడం, మూతి వంకరపోవడం చికిత్సా ప్రత్యామ్నాయాలు శస్త్రచికిత్స కాకుండా మందులిస్తూ చేసే చికిత్స (నాన్ సర్జికల్ మెడికల్ థెరపీ) ∙శస్త్రచికిత్స లేదా క్లిప్పింగ్ ∙ఎండోవాస్క్యులార్ థెరపీ లేదా కాయిలింగ్ (అడ్జంక్టివ్ డివైస్ లేకుండా చేసే చికిత్స / వీలునుబట్టి డివైస్ వాడటం). వీటి గురించి వివరంగా... మెడికల్ థెరపీ: రక్తనాళాలు చిట్లకముందు చేసే చికిత్స ఇది. రక్తపోటును అదుపులో ఉంచేందుకు మందులిస్తూ, కొని ఆహారాలు, వ్యాయామాలు సూచిస్తారు. అన్యురిజమ్స్ సైజు తెలుసుకోడానికి నిర్ణీత వ్యవధుల్లో తరచూ ఎమ్మారై / సీటీ స్కాన్/యాంజియోగ్రఫీ) చేయించడం అవసరం. శస్త్రచికిత్స / క్లిప్పింగ్: పుర్రె తెరవడం ద్వారా చేసే శస్త్రచికిత్స (క్రేనియాటమీ) ద్వారా ఉబ్బిన రక్తనాళాల్ని నేరుగా పరిశీలిస్తూ, పరిస్థితిని అంచనా వేస్తారు. అన్యురిజమ్లను గుర్తించి, శస్త్రచికిత్సతో వాటిని జాగ్రత్తగా వేరుచేస్తారు. ఉబ్బిన చోట క్లిప్పింగ్ జరిపాక మళ్లీ మునపటిలా రక్తప్రసరణ జరిగేలా జాగ్రత్త తీసుకుంటారు. ఎండోవాస్క్యులార్ కాయిలింగ్ : తొడ ప్రాంతంలోని రక్తనాళం నుంచి ఒక పైప్ (క్యాథెటర్)ను ప్రవేశపెట్టి... అందులోంచి మరింత చిన్నపైప్లతో మెదడులోని అన్యురిజమ్స్కు చేరి, అక్కడ రక్తనాళాన్ని చుట్టలుచుట్టలుగా చుట్టుకుపోయేలా చేస్తారు. దాంతో ఉబ్బిన ప్రాంతానికి రక్తసరఫరా ఆగుతుంది. ఫలితంగా చిట్లడం నివారితమవుతుంది. ప్రస్తుతం ఉన్నవాటిల్లో దీన్ని మేలైన చికిత్సగా పరిగణిస్తున్నారు. ఇందులోనే బెలూన్ కాయిలింగ్ అనే ప్రక్రియలో అన్యురిజమ్ ఉన్న ప్రాంతానికి దగ్గర్లో బెలూన్ లాంటి దాన్ని ఉబ్బేలా చేసి, అటు తర్వాత కాయిలింగ్ చేస్తారు. ఇలా పెద్ద రక్తనాళాల దగ్గరున్న ఉబ్బును చిట్లకుండా రక్షిస్తారు. ఇవిగాక... దాదాపు ఏడేళ్ల నుంచి రక్తప్రవాహపు దిశ మళ్లించడానికి ‘ఫ్లో డైవర్టర్ స్టెంట్స్’ ఉపయోగిస్తున్నారు. వీటితో అన్యురిజమ్లోని రక్తపు దిశను మళ్లించి క్రమంగా ఉబ్బు తగ్గిపోయేలా చేస్తారు. బాధితుల పరిస్థితిని బట్టి చికిత్సా ప్రత్యామ్నాయాలను డాక్టర్లు ఎంచుకుంటారు. ముందే తెలిస్తే ముప్పు నివారణకు అవకాశం... అన్యురిజమ్స్ ప్రాణాంతకమే అయినా ముందే తెలిస్తే బాధితుల్ని రక్షించుకునేందుకు అవకాశాలు పెరుగుతాయి. మెదడు సీటీ స్కాన్, మెదడు ఎమ్మారై పరీక్షల ద్వారా తలలోని రక్తనాళాలను పరిశీలించినప్పుడు ఈ సమస్య బయటపడే అవకాశం ఉంది. అందుకే ఫ్యామిలీ హిస్టరీలో ఈ ముప్పు ఉన్నవారు సీటీ, ఎమ్మారై పరీక్షలు చేయించడం ఒకరకంగా నివారణ చర్యలాంటిదే అనుకోవచ్చు. ఈ పరీక్షల్లో సెరిబ్రల్ అన్యురిజమ్స్ ఎక్కువగా ఉన్నట్లు తేలితే... గుండెకు చేసినట్టే మెదడుకూ యాంజియోగ్రామ్ చేస్తారు. ‘సెరిబ్రల్ యాంజియో’ అనే ఈ పరీక్షతో అన్యురిజమ్స్ను ముందుగానే నిర్ధారణ చేయడం ద్వారా ప్రాణాపాయ ప్రమాదాల్ని చాలావరకు నివారించవచ్చు. డాక్టర్ పవన్ కుమార్ పెళ్లూరు కన్సల్టెంట్ న్యూరో సర్జన్ (చదవండి: గాయాలే! అని కొట్టిపారేయొద్దు! అదే ఒక్కోసారి ప్రాణాంతకం కావొచ్చు!) -
గాయాలే! అని కొట్టిపారేయొద్దు! అదే ఒక్కోసారి ప్రాణాంతకం కావొచ్చు!
గాయాలే కదా అని తేలిగ్గా తీసుకోవద్దు. ఒక్కోసారి అవే ప్రాణాంతకంగా మారవచ్చు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు నవీన్ నడిమింటి. దెబ్బల తగిలిన వెంటనే సత్వరమే తగిన చికిత్స తీసుకుంటే సులభంగా బయటపడొచ్చు అంటున్నారు. దెబ్బల రకాలు, ఎలాంటి చికిత్స తీసుకోవాలి తదితరాలు నవీన్ మాటల్లోనే చూద్దాం!. మనిషికి గాయాలు రెండు రకాలుగా జరుగుతాయి. అవి 1,మానసిక గాయాలు . 2.శారీరక గాయాలు. మానసిక గాయాలు : మనిషికి గాయమైనచో కాలక్రమమున గాయము మానుతుంది. అదే మనసుకు గాయమైనచో ఆ గాయము జీవితాంతము మర్చిపోలేం. మానవుడు మాటలతో చేయు గాయములు అస్త్రములకన్న పరుషములు. ప్రియంగా మాట్లాడుట చేతకనివారు మౌనం వహించుట ముఖ్యము. అని మన పెద్దలు చెబుతుంటారు శారీరక గాయము: శరీరానికి బయట వస్తువుల నుంచి తగిలే దెబ్బలు వలన చర్మము చిట్లడమో, కమిలిపోవడమో, వాయడమో, గీక్కుపోవడమో జరిగితే దాన్ని గాయం అంటాం. ఒకవేళ గాయము కర్రతో కొట్టినందువలన, ముళ్ళు గుచ్చునందువలన, పళ్ళతో కొరికినందువలన, నిప్పుతో కాలినందువలన, సల్ఫూరిక్ ఆమ్లము, జిల్లేడు పాలు వంటి రసాయనాలు వలన, ఇలా ఎన్నో విదములుగా జరుగవచ్చును. గాయమైనచోట ఇన్ఫెక్షన్కి గురయ్యి 1. వాపు , 2. ఎరుపెక్కడం , 3. ఉష్ణోగ్రత పెరగడం , 4. నొప్పి గా ఉండడం , 5. ఆ భాగము పనిచేయకపోవడం అనేవి జరుగుతాయి. చిన్న గాయాలైనప్పుడు సబ్బు నీటితో కడగాలి. రక్తస్రావం తగ్గడానికి గాయంపై పరిశుభ్రమైన గుడ్డతో బాగా బిగించి ఒత్తిడి ఇవ్వాలి. ఎలాంటి ఆయింట్మెంట్, పౌడర్ ఉపయోగించకూడదు. ప్రథమ చికిత్స చేస్తూ అవసరం అనుకుంటే వైద్య సలహా పొందాలి. చెట్లు, మొక్కల వల్ల చర్మానికి దురద వస్తే చర్మాన్ని సబ్బునీటితో బాగా కడగాలి. పరిశుభ్రమైన నీటితో ఎక్కువసేపు కంటిని శుభ్రపరచాలి. కళ్లు నలపకూడదు. గుడ్డతో నలుసు తీయడానికి ప్రయత్నం చేయకూడదు. అవసరమైతే వైద్యుల సలహా తీసుకోవాలి. శారీరక గాయాల రకాలు : బ్రూయీ - : చర్మము క్రింద రక్తము గడ్డకట్టి గీక్కు పోయేలా ఉండే గాయము . గంటు : పదునైన కత్తి, బ్లేడు వంటి వాటితో కోసుకుపోవడము. రక్తము ఎక్కువగా కారును . బొబ్బలు : మండే వస్తువు వలన కాలిపోయి చర్మము ఉబ్బి నీరుచేరడము. బెణుకు : కొన్ని సమయాలలో నడిచేటపుడు ఒడుదుడుకులు గా అడుగులు వేయడము వలన కీళ్ళలోని లిగమెంట్స్ సాగిపోవడము జరిగి వాపు , నొప్పి వచ్చుట. ఒక్కొక్కసారి గాయము వలన ప్రాణాపాయము కలుగవచ్చును. మనిషికి గాయాలు మనుషులు, జంతువులు, పక్షులు, ప్రమాదాలు, వలన కలుగును. అలాంటి సమయంలో ఆయా వ్యక్తులకు ఉపశమనం పొందేలా చికిత్స అందించడం అత్యంత ముఖ్యం అంటున్నారు ఆయుర్వేద నిపుణులు నవీన్ నడిమింటి. కింద పడటం లేదా రోడ్డుపైన కలిగే గాయాలకు ప్రధమ చికిత్స తల, వెన్నుముక్కకు ముఖ్యంగా మెడకు తగిలే గాయాలు చాలా అపాయం తెస్తాయి. ఎందుకంటే, ఈ గాయాలు జీవితాంతం పక్షవాతం కలిగిస్తాయి లేదా ప్రాణాలకు ముప్పు తెస్తాయి. తల, వెన్నుముక్క, కదలికలను తగ్గించండి. తద్వారా వెన్నుముక్క మెలి తిరగకుండా, గాయం తీవ్రం కాకుండా నివారించవచ్చు. కదలలేని లేదా భరించలేని తీవ్రమైన నొప్పి కలిగిన పిల్లవాడికి ఎముక విరిగి ఉండవచ్చు. గాయపడిన ఆ ప్రదేశాన్ని కదపకండి. దానికి ఆధారం ఇచ్చి వెనువెంటనే వైద్య సహాయం పొందండి. ఒకవేళ స్పృహకోల్పోతే, వారిని వెచ్చగా ఉంచి, వెనువెంటనే వైద్య సహాయం తీసుకోండి. బెణిగిన లేదా నలిగిన గాయలకు ప్రథమ చికిత్స.. ►నలిగిన లేదా బెణికిన వాటిపై మంచు ముక్కలు పెట్టండి లేదా గాయలపై భాగాన్ని చల్లని నీటితో ముంచండి. ఇలా 15 నిముషాలు చేయండి. అయితే మంచు ముక్కను నేరుగా చర్మంపైన పెట్టరాదు. చర్మానికి - మంచు ముక్కకు మధ్య ఒక పొర బట్ట ఉండేలా చూడండి. మంచు ముక్కను లేదా నీటిని తొలగించి ఓ పావుగంట సేపు వేచి చూడండి. అవసరమనిపిస్తే, ఈ ప్రక్రియను మరోసారి చేయండి. ఈ చల్ల దనం వల్ల నొప్పి, వాపు తగ్గుతుంది. ►తెగిన గాయాలకు, పుండ్లకు ప్రధమచికిత్స ►తెగిన గాయం లేదా పుండ్లు చిన్న వాటికి అయితే- గాయం లేదా పుండును శుభ్రమైన నీరు, సబ్బుతో కడగండి. ►గాయం పుండు చుట్టు పక్కల చర్మాన్ని ఆరనీయాలి. ►పుండు గాయంపై శుభ్రమైన బట్ట ఉంచి, బ్యాండేజీ కట్టాలి. తెగిన గాయం పుండ్లు పెద్దవి తీవ్రమైనవి అయితే గాజు ముక్క లేదా ఇతర ముక్క లేవైనా గాయానికి అతుక్కొని ఉంటే దాన్ని తొలిగించరాదు. అలా అతుక్కొని ఉన్న ముక్క గాయం నుంచి రక్తం కారకుండా అడ్డుపడి ఉండవచ్చు. ఆ ముక్కను తొలిగిస్తే, గాయం తీవ్రంగా మారవచ్చు. ►గాయం నుంచి ఒకవేళ రక్తం ధారగా ఎక్కువగా కారుతూ ఉంటే, గాయపడిన ప్రదేశాన్ని ఛాతీకన్నా ఎక్కువ ఎత్తులో లేపి ఉంచాలి. శుభ్రమైన బట్టను మడతలుగా పెట్టి ►గాయంపైన ఉంచి గట్టిగా నొక్కాలి. ఒకవేళ గాయంలో ఏదైనా తట్టుకొని ఉంటే, దాని పక్కన మడతల బట్టను పెట్టి నొక్కాలి. రక్తం కారటం ఆగిపోయే దాకా ఇలా చేస్తూనే ఉండండి. ►ఏదైనా మొక్కను గానీ, జంతుసంబంధ వస్తువులను గానీ గాయం పెట్టరాదు. వాటివల్ల ఇన్ ఫెక్షన్ కలుగుతుంది. ►గాయం పైన బ్యాండేజీ కట్టండి. అయితే గట్టిగా కట్టరాదు. గాయానికి వాపు రావటానికి వీలుగా బ్యాడేజీని కొంచెం వదులుగానే కట్టాలి. వ్యక్తికి వెంటనే వైద్య సహాయం అందించాలి లేదా ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్ళాలి. బిడ్డకు టెట్నస్ (ధనుర్వాతం) ఇంజక్షన్ ఇప్పించాలా అని ఆరోగ్య కార్యకర్తను అడగండి. నొప్పినివారణ మందులు : నొప్పి తగ్గించడానికి అనగా tab. Dolomed (ibuprofe+paracetamol) రోజుకి 2-3 మాత్రలు 4 నుంచి 5 రోజులు వాడాలి. యాంటిబయోటిక్స్ : అనగా tab . ciprobid TZ (ciprofloxacin + Tinidazole) రోజుకి 2-3 మాత్రలు చొ. 4-5 రోజులు. పైపూత మందులు : Ointment MEGADIN-M 1 tube . గాయము బాగా సబ్బునీటితో కడిగి రోజుకు రెండు పూటలు రాయాలి గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసమే, పైన పేర్కొన్న మందతుల మీకు తగిలన గాయం తీవ్రత, మీకు అంతకుముందున్న వ్యాధుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని వైద్యుని పర్యవేక్షణలోనే ఆయా మందులు వాడాలి. --ఆయుర్వేద నిపుణులు నవీన్ నడిమింటి (చదవండి: తేనె మంచిదని ఎక్కువగా తీసుకుంటున్నారా? ఐతే దుష్ప్రభావాలు తప్పవు) -
తుమ్ము వస్తే.. ఆపుకుంటున్నారా!ఇక అంతే సంగతులు
తుమ్ములు రావడం సర్వసాధారణం. కొంతమంది త్ముమ్మడానికి సిగ్గుపడి ఆపుకుంటుంటారు. మీటింగ్ సమయంలో లేదా ఏదైనా సీరియస్ కార్యక్రమంలో చాలామంది తుమ్ము వస్తున్నా ఏదోలా ఆపేస్తారు. ఇలా ఆపడం వల్ల ఒక్కొసారి ప్రాణాంతకం అవుతుంది. ముక్కు నరాలు చిట్లడం వంటివి జరగుతాయి కూడా. ఇక్కడొక వ్యక్తి కూడా అలానే చేసి ఏకంగా గొంతునే కోల్పోయాడు. అసలు తమ్మును ఆపొచ్చా! ఆపితే ఇక అంతేనా!..దాని గురించే ఈ కథనం. 34 ఏళ్ల బ్రిటీష్ వ్యక్తి బహిరంగ ప్రదేశంలో తుమ్మేందుకు సిగ్గుపడి నాసికా రంధ్రాలను గట్టిగా అదిమి, నోటిని కూడా మూసేశాడు. దీంతో ఒక్కసారిగా ముక్కు లేదా నోటి నుంచి గాలి వెళ్లే మార్గం లేక గాలి బుడగల రూపంలో ఛాతిపై ఒత్తిడి చూపడంతో మెడ చుట్టు ఉన్న నరాలు పొంగి పగలిపోయే స్థితికి వచ్చేశాయి. ఆ తర్వాత గొంతులో రంధ్రం ఏర్పడి ఇక మింగే అవకాశం లేకుండా పోయింది. ఇక నెమ్మది నెమ్మదిగా స్వరాన్ని కూడా కోల్పోయాడు. గొంతులో రంధ్రం ఎలా ఏర్పడిందంటే.. గొంతులో ఉండే ఫారింక్స్ అంత సులభంగా చీలిపోదు. పదేపదే వాంతులు, దగ్గు లేదా బాహ్య గాయం కారణంగా మాత్రమే చీలీపోయే అవకాశం ఉంటుంది. కానీ ఈ వ్యక్తి విషయంలో గాలి బయటకు వెళ్లే మార్గం లేక గాలి బుడగలు అతని ఛాతీలోని కణజాలం, కండరాలలో స్థిరపడటం ప్రారంభించాయి. దీంతో మెడ అంతటా పాపింగ్, పగుళ్లు ఏర్పడ్డాయని చెప్పారు వైద్యులు. ఇది తమకే చాలా షాకింగ్ అనిపించిందన్నారు. గొంతులోని పక్కటెముక నొప్పితో పాటు అతని గొంతు ప్రాంతంలో ఇన్ఫెక్షన్ కూడా ఉందని చెప్పారు. ప్రస్తుతం అతనికి ఫీడింగ్ ట్యూబ్ ఏర్పాటు చేశామని, దాని సాయంతో ఆహారం తీసుకుంటున్నాడని చెప్పుకొచ్చారు. యాంటీబయోటిక్స్ మందులతో ఇప్పుడిప్పుడే నెమ్మదిగా కోలుకుంటున్నాడని అన్నారు వైద్యులు. Em caso raro, homem rompe garganta e tem dificuldade para falar após segurar espirro https://t.co/KyYpmX91A0 #G1 pic.twitter.com/7h9ApBJUvW — g1 (@g1) January 16, 2018 అసలు ఎందుకు తుమ్ము వస్తుందంటే.. ధూళి, పుప్పొడి, పోగ వంటి ఇతరత్ర కణాలు నాసికా రంధ్రంలోకి ప్రవేశించి చికాకు కలిగించడంతో తుమ్ము రావడం జరుగుతుంది. ముక్కులోని డెస్ట్ క్లియర్ చేసేందుకు శరీర ధర్మంగా వచ్చేదే ఈ తుమ్ము అని వైద్యులు చెబుతున్నారు. ఇది ముక్కుకి బాక్టీరియా, బగ్‌ల దాడి నుంచి రక్షణ ఇచ్చే ఒక సాధనం లాంటిది. మనం తుమ్మగానే కొద్దిపాటి తేమతో కూడిని గాలి బయటకు బలంగా వస్తుంది. దీని వల్ల గాల్లోకి సూక్ష్మ జీవులు ఈజీగా రిలీజ్ అవుతాయి. దీని కారణంగానే ఫ్లూ వంటి కొన్ని రకాల అంటువ్యాధులు ఈజీగా వ్యాప్తి చెందుతాయి. అందుకే కాస్త చేయి అడ్డుపెట్టుకుని తుమ్మండి అని చెబుతుంటారు. అదేపనిగా వచ్చే తుమ్ములతో చాలా ఇబ్బంది ఉంటుంది. కొన్ని రకాల సీజన్లలో మరి ఎక్కువగా ఉంటుంది. గట్టిగా తుమ్మితే ఒక్కొసారి ముక్కు నుంచి రక్తం కారడం కూడా జరగుతుంది. చాలావరకు తుమ్ములు ఆందోళన కలిగించేవి కాకపోయిన తుమ్మును ఆపుకోకుండా ఉంటేనే మంచిదంటున్నారు వైద్యులు. తుమ్ము అనేది మానవ శరీర ధర్మం. గనుక పదిమందిలో తుమ్మేందుకు సిగ్గుపడి, లేనిపోని సమస్యలు కొనితెచ్చుకోవద్దు అని అంటున్నారు వైద్యులు. ఇది అందరికీ కామన్ కాబట్టి లేనిపోని రిస్క్‌లు కొని తెచ్చుకోకండి అని హెచ్చరిస్తున్నారు వైద్యులు. (చదవండి: కడుపులో కణితి.. ఇలాంటివి ప్రాణాంతకమా? కాదా?) -
కడుపులో కణితి..ప్రాణాంతకమా? కాదా?
ఇండోర్‌కి చెందిన ఓ 40 ఏళ్ల మహిళ కడుపులో ఏకంగా 15 కిలోల భారీ కణితిని గుర్తించారు వైద్యులు. రెండు గంటలకు పైగా క్లిష్టమైన శస్త్ర చికిత్స చేసి మరీ ఆ కణితిని తొలగించారు ఇండెక్స్ ఆస్పత్రి వైద్యబృందం. ఆ మహిళ ఆ భారీ కణితితో చాలా ఇబ్బంది పడింది. తినాలన్నా నడవాలన్న చాలా ఆయాసపడేది. గత కొంతకాలంగా ఆ ఇబ్బంది పడలేక చివరికి ఇండెక్స్ ఆస్పత్రి వైద్యులను ఆశ్రయించగా ఈకణితికి గురించి తెలిసింది. చాలా పెద్ద సైజులో ఉందని తొలగించకపోతే ఏ క్షణమైన పగిలిపోయే అవకాశం ఉందని చెప్పడంతో శస్త్ర చికిత్స చేయించకుందామె. ప్రస్తుతం ఆమె నెమ్మది నెమ్మదిగా కోలుకుంటోందని వైద్యులు తెలిపారు. ఇటీవల కాలంలో ఎక్కువగా వింటున్నాం ఈ కణుతులు గురించి. చాలామంది మహిళలు ఎదుర్కొనే సమస్య. అసలు ఎందువల్ల వస్తుంది? ఇది ప్రాణాంతకమా? తదితరాల గురించే ఈ కథనం. ఈ కణితి ఎందుకు ఏర్పడుతుందంటే.. శరీరం కొత్త కణాలను తయారు చేసేటప్పుడూ ఆటోమెటిక్‌గా పాత కణాలు చనిపోతాయి. కానీ ఒక్కొసారి ఆ కణాలు చనిపోకుండా పాతవాటి కంటే వేగంగా పెరగడం జరగుతుంది. అవన్నీ పోగులు మాదిరిగా ఏర్పడి పెరిగి కణితిలా ఏర్పడుతాయి. ఇది చిన్న పిల్లల నుంచి అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తాయి. కణితులు రావడానకి గల కారణాలు శరీరంలో పరివర్తన చెందిన బీఆర్సీఏ జన్యువుల వంటి జన్యు ఉత్పరివర్తనలు లించ్ సిండ్రోమ్ వంటి వారసత్వ పరిస్థితులు రొమ్ము క్యాన్సర్ వంటి కొన్ని రకాల క్యాన్సర్ల కుటుంబ చరిత్రలో ఉన్నా ధూమపానం బెంజీన్ వంటి టాక్సిన్స్‌కు గురికావడం హెచ్‌పీవీ వంటి వైరస్లుస ఊబకాయం సంకేతాలు లేదా లక్షణాలు కణితులు సంకేతాలు లేదా లక్షణాలు ⇒త్వరితగతిన అలసటకు గురవ్వడం ⇒జ్వరం ⇒తొందరగా బరువు తగ్గడం ⇒ఆకలి లేకపోవడం ⇒రాత్రిపూట సడెన్‌గా చెమటలు పట్టడం ⇒భరించలేని ఒకవిధమైన కడుపు నొప్పి అన్ని రకాల కణితులు ప్రమాదకరమా? ►నిపుణుల అభిప్రాయం ప్రకారం, గడ్డలు లేదా పెరుగుదలలను ఏర్పరిచే అసాధారణ కణాల సమూహాలు. అవి మన శరీరంలోని ట్రిలియన్ల కణాలలో దేనిలోనైనా ప్రారంభమవుతాయి. ►కణితులు పెరుగుతాయి. కానీ కొన్ని భిన్నంగా ప్రవర్తిస్తాయి. అవి ఒక్కోసారి క్యాన్సర్ లేదా ప్రాణాంతకమైనవిగా కూడా ఉంటాయి. మరికొన్ని క్యాన్సర్ కానివి లేదా అపాయకరం కానివి అనే విధానాలపై ఉధారపడి ఉంటాయి కణితులు ►ఈ కణితులు శరీరంపై ఎముకలు, చర్మం, గ్రంథులు, ఇతర అవయవాలతో సహ శరీరం అంతటా ఎక్కడైనా రావచ్చు. ఐతే అది ఎక్కడ ఏర్పడింది అనే దానిపై క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఆధారపడి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ►ఇలాంటి కణితుల సమస్యను ఎదుర్కొనకూడదంటే మంచి ఆరోగ్యకరమైన జీవన శైలిని పాటిస్తూ తగినంతగా వ్యాయామం కూడా చేసి ఫిట్నెస్గా ఉంటే ఈ సమస్య తలెత్తకుండా చూడొచ్చు లేదా ఈజీగా బయటపడొచ్చు. (చదవండి: పెదవులు ఆరోగ్యంగా అందంగా కనిపించాలంటే ఇలా చేయండి!) -
గోధుమపిండితో చేసిన వంటకాలు తింటున్నారా..?
గోధుమపిండి, విదేశాలలోనైతే బార్లీ, రై వంటి ధాన్యాల పిండితో చేసే వంటల్లో... ఉదా: మన రోటీలూ, పూరీలతో పాటు పాశ్చాత్యపద్ధతుల్లో చేసే బ్రెడ్, పాస్తా, కేకులు, బిస్కెట్ల వంటివి తిన్నప్పుడు ‘సీలియాక్ డిసీజ్’ కారణంగా కొంతమందిలో కడుపునకు సంబంధించిన సమస్యలు కనిపిస్తాయి. ఆ ధాన్యాల పిండిలో ఉండే గ్లూటెన్ కారణంగా ఇలా జరుగుతుంది. గ్లూటెన్ అంటే...? పిండి కలపడానికి ముందుగా దాన్ని రాశిలా పోసి మధ్యలో గుంట చేసి అందులో కాసిన్ని నీళ్లు పోస్తాం కదా... ఆ పిండిని కలపడం మొదలుపెట్టగానే కాసేపట్లో అది ముద్దగా మారుతుంది. పిండిలో స్వాభావికంగా ఉండే జిగురులాంటి స్వభావాన్నిచ్చే ఓ ప్రోటీనే ఇలా పిండిముద్దలా మార్చేందుకు దోహదం చేస్తుంది. అదే ‘గ్లూటెన్’. కొందరికి ఇది సరిపడదు. గ్లూటెన్ సరిపడని స్వభావాన్నే ‘గ్లూటెన్ ఇన్ టాలరెన్స్’ అంటారు. (ఇలాంటివారి కోసం... గ్లూటెన్ను వేరుచేసి పిండిని తయారు చేస్తుంటారు. దీన్ని ‘గ్లూటెన్ ఫ్రీ’ పిండి అని అంటుంటారు. మరికొన్ని రకాల పిండి లో స్వాభావికంగానే గ్లూటెన్ ఉండదు. దాంతో వారికి ఏ ఇబ్బందీ ఉండదు). ఆ ‘పిండి’వంటలు తింటే ఏమవుతుందంటే... గ్లూటెన్ ఉన్న పిండితో చేసిన పదార్థాలను తిన్నప్పుడు... అది సరిపడని కారణంగా చిన్నపేగుల కణాలు తీవ్రమైన రియాక్షన్‌ను చూపుతాయి. దాంతో చిన్నపేగుల్లోని ‘మైక్రోవిల్లై’ అనే భాగాలు దెబ్బతింటాయి. జీర్ణమైన ఆహారాన్ని పీల్చుకునే అవి దెబ్బతినడంతో... తిన్నవి ఒంటబట్టకపోవడం, దేహానికి శక్తి సమకూరకపోవడం, ఎముకలకు కావల్సినంత బలం దొరకకపోవడం, మహిళల్లో సంతానలేమి, గర్భస్రావాలు, కొన్ని నరాలకు సంబంధించిన సమస్యలు కనిపిస్తాయి. మొదట్లో సరిపడకపోయినా ఆ తర్వాత్తర్వాత నెమ్మదిగా జీర్ణవ్యవస్థ దానికి అలవాటు కావడం మొదలుపెడుతుంది. అలా జరగకపోతే చిన్నపేగులు/జీర్ణవ్యవస్థ దెబ్బతినడం మొదలై క్రమక్రమంగా అది సీలియాక్ డిసీజ్‌గా మారుతుంది. జీర్ణవ్యవస్థ గ్లూటెన్‌కు అలవాటు కాకపోవడంతో వచ్చే సమస్యను ‘రిఫ్రాక్టరీ లేదా నాన్ రెస్పాన్సివ్ సీలియాక్ డిసీజ్’గా చెబుతారు. లక్షణాలు: సీలియాక్ డిసీజ్ కూడా ఒకరకమైన ఫుడ్ అలర్జీ లాంటిదే. అయితే దీని లక్షణాలు వేర్వేరు వ్యక్తుల్లో వేర్వేరుగా ఉంటాయి. అవి... ►కడుపులో నొప్పి, గ్యాస్ నిండటంతో కడుపు ఉబ్బరం. దాంతో ఛాతీనొప్పి, ఛాతీలో / గుండెల్లో మంట ∙వికారం ►తలనొప్పి, ఒంటి మీద దురదతో కూడిన ర్యాష్ (దీన్ని డాక్టర్లు డెర్మటైటిస్ హెర్పెటోఫార్మిస్ అంటారు) ►కొందరిలో నోట్లో పుండ్లు ►రక్తహీనత ►కొందరిలో నీళ్ల విరేచనాలు / మరికొందరిలో మలబద్ధకం / దుర్వాసనతో కూడిన మలవిసర్జన ►తిన్నది ఒంటబట్టకపోవడంతో బరువు తగ్గడం. దుష్ప్రభావాలు... ఆహారం సరిగా ఒంటబట్టకపోవడంతో మరికొన్ని దుష్ప్రభావాలూ కనిపించవచ్చు. అవి... కొందరిలో దంతాలపై ఎనామెల్ దెబ్బతినడం ∙చిన్న పిల్లల్లో (అబ్బాయిలూ, అమ్మాయిల్లో) పెరుగుదల కాస్త మందగించడం ∙కొందరిలో పాలు సరిపడకపోవడం (లాక్టోజ్ ఇన్టాలరెన్స్) ∙ఎముకలు బలహీనంగా మారడం ∙అరుదుగా కొందరిలో నరాల సమస్య రావడంతో చేతులు, కాళ్లలో తిమ్మిర్లు, స్పర్శ సరిగా తెలియకపోవడం, కాళ్లలో సమస్య తీవ్రంగా ఉంటే సరిగ్గా నిలబడలేకపోవడం వంటి సమస్యలు. నిర్ధారణ: ఆటో ఇమ్యూన్ రుగ్మతలను తెలుసుకునే కొన్ని రకాల రక్తపరీక్షల (యాంటీబాడీస్ అన్వేషించే సీరాలజీ పరీక్షల)తో పాటు ఎర్ర రక్తకణాల సంఖ్యను తెలుసుకునేందుకు చేసే రక్తపరీక్షలు దేహంలో ఇన్ఫ్లమేషన్ ఉందని తేలినప్పుడు చేసే సీ–రియాక్టివ్ ప్రోటీన్ పరీక్ష కాలేయం పనితీరు కోసం ‘లివర్ ఫంక్షన్ టెస్ట్’ పేగుల్లోని ఫ్యాటీ యాసిడ్స్ తెలుసుకునేందుకు కొన్ని పరీక్షలు ∙విటమిన్–డి, విటమిన్ బి–12 ల మోతాదును తెలుసుకునే పరీక్షలు అవసరాన్ని బట్టి ఎండోస్కోపీ పేగుల పరిస్థితిని తెలుసుకునే కొన్ని ఇమేజింగ్ పరీక్షలతో పాటు అవసరాన్ని బట్టి కొన్ని జన్యుపరీక్షలతో సమస్యను నిర్ధారణ చేస్తారు. డాక్టర్ ధీరజ్ కుమార్ అనుప, మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ (చదవండి: హషిమోటో థైరాయిడైటిస్ గురించి విన్నారా? ఎందువల్ల వస్తుందంటే..) -
హషిమోటో థైరాయిడైటిస్ గురించి విన్నారా? ఎందువల్ల వస్తుందంటే..
థైరాయిడ్ సమస్య అనగానే హైపర్ థైరాయిడిజమ్, హైపో థైరాయిడిజమ్లు గుర్తుకొస్తాయి. హషిమోటో థైరాయిడైటిస్ అనేది హైపో థైరాయిడిజమ్లోని ఒక సమస్య. ఇది తమ సొంత వ్యాధి నిరోధక వ్యవస్థే తమపై ప్రతికూలంగా పని చేయడం వల్ల వచ్చే ఒక రకం ఆటో ఇమ్యూన్ డిసీజ్. అందుకే దీన్ని ‘ఆటోఇమ్యూన్ హైపో థైరాయిడిజమ్’ అని కూడా అంటారు. ఈ సమస్యపై అవగాహన కోసం ఈ కథనం. మన దేహంలో మెడ దగ్గర సీతాకోకచిలుక ఆకృతిలో ఓ కీలకమైన థైరాయిడ్ గ్రంథి ఉంటుంది. ఇది దేహంలోని అనేక రకాల జీవక్రియలకు అవసరమైన థైరాక్సిన్ అనే హార్మోన్‌ను స్రవిస్తూ ఉంటుంది. తమ సొంత వ్యాధి నిరోధక వ్యవస్థ థైరాయిడ్ గ్రంథిపై వ్యతిరేకంగా పనిచేయడం వల్ల ‘థైరాక్సిన్’ హార్మోన్ స్రావాలు తగ్గుతాయి. దాంతో అది హైపో థైరాయిడిజమ్‌కు దారితీస్తుంది. ఫలితంగా సరిపోయినంత థైరాక్సిన్ దొరకక దేహానికి అవసరమైన జీవక్రియలు జరగవు. ఈ హైపోథైరాయిడిజమ్లోని ఒకానొక కండిషన్ పేరే ‘హషిమోటో థైరాయిడైటిస్’. కారణాలు: ‘హషిమోటో థైరాయిడైటిస్’కు కారణాలు ఇంకా తెలియదు. కానీ కొన్ని జన్యుపరమైన కారణాలతో, అలాగే హార్మోన్ స్రావాల లోపాలతో ఇలా జరుగుతుందని పరిశోధకులు గుర్తించారు. అదీగాక థైరాయిడ్ సమస్య వచ్చే మహిళల్లోని 20% మందిలో తర్వాత్తర్వాత ఈ సమస్య వచ్చే అవకాశాలూ ఎక్కువని కూడా తెలుసుకున్నారు. గతంలోనైతే ఆహారంలో అయోడిన్ లేని ఉప్పు కారణంగా ఈ సమస్య వచ్చేది. ఎందుకంటే థైరాయిడ్ బాగా పని చేయాలంటే అయోడిన్ అవసరం. పిండదశలోనే ఈ సమస్యతో మానసిక, శారీరక ఎదుగుదల లోపాలు కనిపిస్తాయి. దాన్ని ‘క్రెటినిజమ్’ అని అంటారు. అయితే ఇటీవల ఐయోడైజ్డ్ ఉప్పు లభ్యతతో... వ్యాధి రావడం తగ్గింది. కొన్ని రకాల రేడియేషన్లకు గురికావడమూ ఈ సమస్యకు దారితీస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. కొంతమందిలో థైరాయిడ్‌లో గడ్డ లేదా క్యాన్సర్ కణితి రావడంతో, దాన్ని తొలగించడంతోనూ హైపోథైరాయిడిజమ్ రావచ్చు. అయితే... ‘హషిమోటో థైరాయిడైటిస్’లో థైరాయిడ్ గ్రంథి అలాగే ఉంటుందిగానీ... దాని పనితీరు తగ్గుతూపోతుంది. పురుషులతో పోలిస్తే మహిళల్లో దీని విస్తృతి ఎక్కువ. లక్షణాలు: దీని లక్షణాలు వేర్వేరు వయసువాళ్లలో వేర్వేరుగా కనిపిస్తాయి. స్థూలంగా ఈ కింద పేర్కొన్న విధంగా ఉంటాయి. మెడదగ్గర ఉండే థైరాయిడ్ గ్రంథిలో వాపు రావడంతో మెడ ముందుభాగం ఉబ్బినట్లుగా కనిపించడం ప్రధానమైన / కీలకమైన లక్షణం హైపోథైరాయిడిజమ్‌లో థైరాయిడ్ గ్రంథి పనితీరు లోపించినప్పుడు స్థూలకాయం సాధారణం. అందువల్ల ఈ సమస్య బాధితులు బాగా బరువు పెరుగుతుంటారు నీరసం, నిస్సత్తువ, తీవ్రమైన అలసట పాలిపోయినట్లుగా కాస్త ఉబ్బినట్లుగా కనిపించే ముఖం కండరాల, కీళ్ల నొప్పులు మలబద్ధకం మహిళల్లో గర్భధారణ సమస్యలు, సంతానలేమి, యువతుల్లో ఆలస్యంగా రజస్వల కావడం, అయ్యాక నెలసరి సక్రమంగా రాకపోవడం, రుతుసమయంలో రక్తం ఎక్కువగా పోవడం వంటి ఇబ్బందులు జుట్టు రాలిపోవడం, పలచబడటం గుండె స్పందనల వేగం తగ్గడం కుంగుబాటు (డిప్రెషన్)కు గురికావడం వంటి మానసిక సమస్యలు కనిపిస్తాయి పుట్టిన పిల్లల్లో పుట్టుకతోనే (కంజెనిటల్గా) హైపోథైరాయిడిజమ్ ఉంటే వాళ్ల మెదడు పెరుగుదల మందగిస్తుంది. పిల్లల దశలోనే వస్తే వాళ్ల ఎదుగుదల దెబ్బతింటుంది. స్కూల్ చదువుల్లో పర్ఫార్మెన్స్ తక్కువగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నిర్ధారణ: టీ3, టీ4, టీఎస్‌హెచ్ పరీక్ష చేయించినప్పుడు టీ3, టీ4 మోతాదులు నార్మల్‌గా లేదా తక్కువగానే ఉన్నప్పటికీ టీఎస్‌హెచ్ మోతాదులు ఎక్కువగా ఉంటాయి. యాంటీ–టీపీవో యాంటీబాడీస్ పరీక్షలు చేసినప్పుడు టీఎస్‌హెచ్ మోతాదులతో పాటు యాంటీ–టీపీవో యాంటీబాడీస్, యాంటీ థైరోగ్లోబ్లు్యలిన్ యాంటీబాడీస్ పరీక్షల్లో వాటి మోతాదుల్లో పెరుగుదల కనిపిస్తే దాన్ని ‘హాషిమోటో థైరాయిడైటిస్ / ఆటోఇమ్యూన్ హైపోథైరాయిడిజమ్’గా నిర్ధారణ చేయవచ్చు. డా‘‘ శ్రీనివాస్ కందుల కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్ (చదవండి: సున్నపు రాయి ఇంత ప్రమాదమా? అదే ఆ తల్లికి తీరని కడుపు కోత మిగిల్చింది!) -
బిపాసా కూతురికి గుండెల్లో రంధ్రాలు..శిశువులకు ఎందుకొస్తుంది..?
పుట్టుకతో గుండె లోపం గురించి విని ఉంటాం. ఇటీవల కాలంలో ఇది ఎక్కువగా వినిపిస్తుంది. మునపటి రోజుల్లో ఎక్కడో గానీ కనిపించేది కాదు. అదీగాక పోషకాహార లోపం కారణంగా వచ్చేదని భావించేవారు. కానీ ఇప్పుడూ స్టార్ హోదాలో చెలామణి అవుతున్న సినీతారల పిల్లలు కూడా ఈ వ్యాధిని బారినపడటం ఒకింత బాధకరం, ఆశ్చర్యం కలిగించే అంశం ఇది. ఇటీవల సినీ తార బిపాషా సైతం తన కూతురు గుండెల్లో రంధ్రాలు ఉన్నాయని సోషల్ మీడియా వేదిక వెల్లడించింది. పుట్టిన మూడు నెలల వయసులోనే చికిత్స చేయించినట్లు తెలిపింది. అలాగే మన టాలీవుడ్ హిరో మహేష్ బాబు కూడా హృద్రోగంతో బాధపడే చిన్నారులకు తన ఫౌండేషన్ సహకారంతో ఉచితంగా వైద్యం చేయించి తన గొప్ప మనసును చాటుకున్న సంగతి తెలిసిందే. ఆయన కూడా ఒక సందర్భంలో తన కొడుకు కూడా పుట్టిన వెంటనే ఇలాంటి సమస్యతో బాధపడ్డాడని చెప్పిన సంగతి తెలిసిందే. పుట్టుకతో గుండెలోపం స్టార్ పిల్లలు దగ్గర నుంచి కామన్ మ్యాన్ పిల్లలు వరకు అందరూ ఫేస్ చేస్తున్న సమస్య. ఈ నేపథ్యంలో అసలు ఎందుకు పుట్టుకతోనే చిన్నారుల్లో గుండె సమస్యల బారినపడుతున్నారు. ఎందువల్ల వస్తుంది ఎలా గుర్తించగలరు అనేదాని గురించే ఈ కథనం!. పుట్టుకతో వచ్చే గుండె సమస్యను వైద్య పరిభాషలో 'వెంట్రిక్యులర్ సెప్ట్ డిఫెక్ట్(వీఎస్డీ)'గా పిలుస్తారు. దీనివల్ల పుట్టినప్పుడే గుండెల్లో రంధ్రాలతో శిశువులు జన్మించడం జరుగుతుంది. కొందరూ చిన్నారులకు పెద్ద అవ్వడంతో పూడుకుపోయే అవకాశాలు ఉంటాయి. మరి కొందరికి ఆ ఛాన్స్ తక్కువగా ఉండటమే గాక పిల్లలు కూడా సమస్యను గట్టిగా ఫేస్ చేస్తుంటారు. ఇది సాధారణంగా బిడ్డ పుట్టిన మొదట కొన్ని రోజులు, వారాలు లేదా నెలలో ఈ సమస్య బయటపడుతుంది. గుండెల్లో ఏర్పడిన రంధ్ర పరిమాణాన్ని బట్టి లక్షణాలు వేరుగా ఉంటాయి. ఈ సమస్యతో ఉన్న చిన్నారుల్లో కనిపించే లక్షణాలు సరిగా తినలేకపోవడం శారీరక ఎదుగుదల సక్రమంగా లేకపోవడం వేగంగా శ్వాస తీసుకోవడం లేదా శ్వాస ఆడకపోవడం త్వరితగతిన అలసిపోవడం స్టెతస్కోప్‌తో హృదయాన్ని వింటున్నప్పుడు హూషింగ్ శబ్దం తదితర లక్షణాలు శిశువుల్లో కనిపిస్తాయి. ఎందువల్ల వస్తుందంటే.. గర్భధారణ సమయంలో శిశువు గుండె ఏర్పడినప్పుడే ఈ సమస్య వస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. గుండె ఎడమ, కుడివైపు వేరుచేసే కండరాల గోడ పూర్తిగాఏర్పడకపోవడంతో ఈ రంధ్రాలు ఏర్పడతాయి. రంధ్రాల పరిమాణం కూడా వేరుగా ఉంటుంది. ఇకి ఇది ఎందువల్ల వస్తుందనేదిచెప్పలేం అన్నారు వైద్యులు. ఇందుకు జన్యులోపం, పర్యావరణ కారకాలు రెండు కావొచ్చని చెబుతున్నారు. చాలామంది శిశువులకు ప్రధానంగా పుట్టకతోనే గుండెల్లో రంధ్రాలు లేదా ఇతర హృద్రోగ సమస్యలకు ఎదురయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అందువల్ల గర్భంతో ఉన్న మహిళలో మొదటి మూడు నుంచి ఆరు నెలలు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉండక పౌష్టికరమైన ఆహారం తీసుకుంటే ఇలాంటి సమస్య ఎదురవ్వదు. శిశువు అవయవాలు ఏర్పడే క్రమంలో వీలైనంత మంచి ప్రోటీన్లతో కూడిన ఆహారం తీసుకోవడం అనేది అత్యంత ముఖ్యం. (చదవండి: గర్భధారణ సమయంలో గుండెల్లో వచ్చే మంట ప్రమాదమా..?) -
గర్భధారణ సమయంలో గుండెల్లో వచ్చే మంట ప్రమాదమా..?
గర్భవతుల్లో గుండెల్లో లేదా ఛాతీలో మంటగా ఉండటం, తేన్పులు, అజీర్తి ఫీలింగ్... ఇవన్నీ చాలా సాధారణంగా కనిపించే సమస్యలు. అయితే స్త్రీ, పురుషులు అనే భేదం లేకుండా చాలామందిలో ఈ సమస్య కనిపించినప్పటికీ గర్భవతుల్లో... మరీ ముఖ్యంగా ఐదారు నెలల గర్భిణిగా ఉన్నప్పుడు ఈ లక్షణాలు ఎక్కువ. ఎందుకు వస్తుందంటే.. కారణాలివి... గర్భవతుల్లో ప్లాసెంటా నుంచి ప్రోజెస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంటుంది. నెలలు నిండుతూ గర్భసంచిలో పిండం పెరుగుతున్న కొద్దీ... దానికి మరింతగా చోటు కల్పించడానికి గర్భసంచి కండరాలు వదులయ్యేలా చేయడం కోసం ప్రకృతిపరమైన ఏర్పాటిది. ఈ హార్మోన్ కేవలం గర్భసంచినే కాకుండా జీర్ణాశయం–అన్నవాహిక మధ్యన ఉండే ‘లోవర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్’పైనా ప్రభావం చూపుతుంది. దాంతో ఆ స్ఫింక్టర్ వదులై, జీర్ణరసాలు పైకి ఎగజిమ్మడంతో గర్భవతుల్లో ఈ సమస్య కనిపిస్తుంది. నివారణ: ఆహారంలో కారం, మసాలాలూ, వేపుళ్లు పరిమితంగా తీసుకోవాలి. మజ్జిగ, పెరుగు వంటివి తీసుకోవాలి ఒకేసారి ఎక్కువ మోతాదుల్లో కాకుండా చిన్న చిన్న మోతాదుల్లో ఎక్కువసార్లు తినాలి భోజనం పూర్తికాగానే పడుకోకూడదు. కాసేపు అటూ ఇటూ తిరగాలి∙ పడుకునే సమయంలో తలగడ పెట్టుకుని, తల కాస్త ఎత్తుగా ఉండేలా చూసుకోవాలి అప్పటికీ సమస్య తగ్గకపోతే డాక్టర్ల పర్యవేక్షణలో మాత్రమే యాంటాసిడ్స్ వాడాలి. (చదవండి: కరోనా తెచ్చిన తంటా! పిల్లల్ని ఫోన్లకు అడిక్ట్ కాకుండా ఏం చేయాలి?) -
కరోనా తెచ్చిన తంటా! పిల్లల్ని ఫోన్లకు అడిక్ట్ కాకుండా ఏం చేయాలి?
ఎప్పుడెప్పుడు స్కూల్ లాంగ్ బెల్ కొడతారా ? ఇంటికెళుదామా ? అని చూస్తుంటారు " "క్లాసు రూమ్ లో పాఠాలు వినడం లేదు . పక్క వారిని గిల్లడం, గిచ్చడం లాంటి పనులు చేస్తున్నారు " " చిరాకు, కోపం, అసహనం ఎక్కువయ్యింది . ఏకాగ్రత లోపించింది " " టీచర్ల పై తిరుగుబాటు, తల్లితండ్రుల్ని ఎదిరించడం ఎక్కువయ్యింది. రాగ్గింగ్ , బుల్లియింగ్ , ఘర్షణలు ఎక్కువయ్యాయి " " చెడు వ్యసనాల బారిన పడుతున్నారు " ఒక్కో సారి మనం ఫ్లోలో వెళ్ళిపోతాం. మనకు కనిపించిందే లోకం అనుకొంటాము. మనసులో ఉన్నదే నిజంగా జరుగుతోంది అనుకొంటాము . అలాంటప్పుడు మనకు రియాలిటీ చెక్ అవసరం . నేను మొన్న ఆదివారం అదే పని చేశాను. ఆ రోజు జరిగిన ఇంటర్వ్యూ కు దాదాపు డెబ్భై మంది హాజరయ్యారు . వారిలో అత్యధిక శాతం ఇదివరకే ఏదో ఒక స్కూల్లో పనిచేస్తున్నారు. కరోనా ముందు కాలం తో పోలిస్తే , ఇప్పుడు... అంటే కరోనా తరువాత కాలం లో , పిల్లల ప్రవర్తనలో ఏదైనా మార్పు చూసారా ? అయితే ఏంటది ? ఇది నేను ఆ ఇంటర్వ్యూలో చాల మందిని అడిగిన ప్రశ్న . పైన ఇచ్చినవి వారి సమాధానాలు. ఒక్కరంటే ఒక్కరు పాజిటివ్ చేంజ్ ఉందని చెప్పలేదు . సమస్య తీవ్రంగా ఉందని చాలా మంది చెప్పారు . కారణం ఏంటని అడిగితే అందరూ ఆన్లైన్ క్లాసు లు . మొబైల్ వ్యసనం అని సమాధానం చెప్పారు . "ఈ కాలం పిలల్లు సెల్ ఫోన్ వాడక పొతే ఎట్టా ? " "టెక్నాలజీ మార్పు తెస్తుంది . ఇది సహజం " "టెక్ సావీ పిల్లలు " "మార్పు సహజం . మారుతున్న సమాజంతో పాటే మనం మారాలి " అని ఇంకా పలవరిస్తున్న అజ్ఞానులు కోకొల్లలు. ఏది మార్పు ? టెక్నాలజీని ఎలా వాడుకోవాలి అనే సింపుల్ విషయం అర్థం కాని అమాయకత్వం అది. ఫ్లో లో వెళ్ళాలి అనుకొనే వారు .. ఇదే ట్రెండ్ అనుకొనే వారు .. మన పిల్లలు ఏదో సాధిస్తున్నారు అనుకొనే వారు .. ఇంకా కోట్లలో . ఈ లోగా యునెస్కో కుండబద్దలు కొట్టేసింది . మొబైల్ అడిక్షన్ వల్ల కలిగే నష్టాన్ని అధికారికంగా తేల్చేసింది. కమిషన్ల ఆశతో హోమ్ వర్క్ ను మొబైల్ డివైసెస్తో ముడిపెట్టే పాఠశాల యాజమాన్యాలకు పచ్చి వెలక్కాయ గొంతుకు అడ్డుపడట్టయ్యింది. కరోనా కాలం లో ఆన్లైన్ క్లాసులను నేను సెలైన్ పెట్టుకోవడంతో పోల్చా. తీవ్ర రోగముండి ఐసీయూ లో ఉంటే తప్పదు . కానీ టిఫిన్ బాక్స్ కు బదులు సెలైన్ పెట్టుకొని రోజూ ఇంటినుంచి బయటకు వెళుతామా? వారం రోజులు వానపడితే (వాన పడింది గట్టిగా రెండు రోజులే ) ఆన్లైన్ క్లాసులు షురూ చేసిన స్కూల్స్ . "పక్కన ఉన్న అన్ని స్కూల్స్ ఆన్లైన్ క్లాసులు నడుపుతుంటే మీరెందుకు చేయరు?" అని మొన్న ఒక పేరెంట్ మెసేజ్ . "వెంటనే వారు కట్టిన ఫీజు వాపసు ఇచ్చేయండి .. ఆన్లైన్ క్లాసులు పెడుతున్న స్కూల్ లో అబ్బాయి ని చదివించడానికి వీలుగా టీసీ ఇచ్చేయండి " నా ఆర్డర్ . చివరకు పేరెంట్ కు తత్త్వం బోధపడింది. సారీ చెప్పారు "మాకు సెల్ ఫోన్ వల్ల కలిగే నష్టం అర్థం అయ్యింది. కానీ ఏమి చెయ్యాలి ?"... అని ఇంకా చాలా మంది ఇంట్లో బాంబు పెట్టుకొంటే పేలుతుంది . ఏమి చేస్తాము ? ఇంట్లో బాంబు పెట్టుకోము . ఇదీ అంతే. "పెద్దాళ్ళకు తప్పని సరి. ఆఫీస్ వర్క్ కోసం సెల్ ఫోన్. ఇది అట వస్తువు కాదు. మీ మెదళ్ళు సెల్ ఫోన్ వల్ల వంద రెట్లు అధికంగా ప్రభావితం అవుతాయి , కాబట్టి వద్దు" అని పిల్లలకు నచ్చ చెప్పి వారు సెల్ ఫోన్ వాడకుండా చూడాలి . మాట వినకపోతే కౌన్సిలింగ్ చేయించాలి . సమస్య జటిలం. పరిష్కారం అంత సులభం కాదు. సంవత్సరాల తరబడి అధిక తిండి తిని ఒంట్లో కిలోల కొద్దీ అధిక కొవ్వును పేరపెట్టుకొన్న వారు ఏమి చెయ్యాలి ? తిన్నప్పుడు పొందిన సుఖాన్ని గుర్తు చేసుకొంటూ దానికి ప్రాయచ్చితం అన్నట్టు సరైన తిండి తినాలి . వ్యాయామం చెయ్యాలి. అబ్బే ఇంత కష్టం మేము పడలేము. ఏదైనా సింపుల్ మార్గం ఉంటే చెప్పండి అని లక్షల్లో అనుకొంటున్నారు. అలాంటి బకరాల కోసం డబ్బాల్లో మూలికా మందులు వచ్చాయి. అవి జస్ట్ ఒక స్పూన్ తింటే సరిపోతుంది అని ప్రచారం. ఈజీ మార్గం కదా అని లక్షల మంది. దాన్ని తిని కిడ్నీలు నాశనం చేసుకొన్న వారు వేలమంది. అయినా ఆగదు. ఆగితే వారి బిజినెస్ సాగదు బలహీనతల్ని కాష్ చేసుకోవడంలో ఫార్మసురులకు మించిన వారెవరూ ఉండరు. నువ్వు అధిక తిండి తింటే వాడికి డయాబెటిస్ బిజినెస్. కనీస ఆహార నియమాలు లేకుండా టెన్షన్ పెంచుకొని నువ్వు ఇమ్మ్యూనిటిని కుళ్ళపొడుచుకొంటే ... తుమ్ముకు.. దగ్గుకు... కాన్సర్‌కు.. జ్వరానికి.. ఒంటి నొప్పులకు ... చివరాఖరికి దురద కూడా వాక్సిన్లు .తిరుగు లేని బిజినెస్. అవి వేసుకొని సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకొంటే బోనస్ బిజినెస్ . ఇంతకీ కరోనా వాక్సిన్లు ఏమయ్యాబ్బా ? ముక్కు నోరు . చెవి.. ఇలా నవ రంద్రాల్లో వేసే వాక్సిన్లు .. వాటి మార్కెటింగ్ కోసం అదిగో చైనాలో కేసులు .. లాంగ్ కరోనా .. తొక్క... అంటూ విషపు రాతలు .. మరో పక్క కరోనా వాక్సిన్ వేసుకంటే కండ పుష్టి .. అంటూ మార్కెటింగ్ చేసే బ్రోకర్లు ... అరెరే .. ఎక్కడ పోయారబ్బా ? పిల్లి వచ్చే ఎలుక భద్రం అంటూ ఒక్క సారిగా మొత్తం మాయం అయిపోయారే. అన్నట్టు వారి ప్రకారం సంవత్సరానికి రెండు సార్లు వేసుకోవాలిగా . ఆ లెక్కన ఇప్పుడు.. అయిదోదో ఆరోదో పొడుస్తుండాలిగా ? ఏంటి ఆగిపోయింది. ఇక ఇప్పుడు సెల్ ఫోన్ కు పిల్లలు బానిసలు అయిపోతుంటే... వాడిది రెహబ్ సెంటర్ బిజినెస్ . వాడిదేనా ? తిలాపాపం తలా పిడికెడు.. పిల్లలు సెల్ ఫోన్ వాడడం మానేస్తే వాటి అమ్మకాలు సగానికి పడిపోతాయి. సెల్ ఫోన్ బిజినెస్ దెబ్బ తింటుంది. దానితో పత్రికలకు ప్రకటనలు తగ్గిపోతాయి. ఓయో హోటళ్ల బిజినెస్ డల్ అయిపోతుంది. గంజాయి దందా తగ్గిపోతుంది. చెప్పుకొంటూ పొతే లిస్ట్ కొండ వీటి చేంతాడంత. ఒకటి నిజం. తమ చుట్టూరా ఉన్న పిల్లలు సెల్ ఫోన్ వాడుతుంటే మన పిల్లలు అదే పని చెయ్యాలని చూస్తారు. అందుకే మేము రివర్స్ ఎటాక్ మొదలెట్టాము. మా పిల్లలు సెల్ ఫోన్ వాడరు. మీ ఇరుగు పొరుగు పిల్లలో చైతన్యం తెండి అని చెప్పాము . ఒక్కోక్కరూ కనీసం అయిదు మందికి .. ఈ వారం రోజుల వానల్లో అందరూ కలిసి కొన్ని వేల మంది పిల్లలకు కౌన్సిలింగ్ ఇచ్చారు . "సెల్ ఫోన్ వద్దు. ఆటలు ఆడుకోండి. బాల్యాన్ని ఎంజాయ్ చెయ్యండి. జంక్ ఫుడ్ వద్దు . ఆరోగ్య కరమయిన ఆహారం తీసుకోండి" అని ఎలుగెత్తి చాటారు. మార్పు వస్తుందా ? వస్తుంది. అవతలి వారికి చెప్పడమంటే తమకు తాము చెప్పుకోవడం. ఈ విధంగా మా పిల్లల్లో ఆ భావన మరింత దృడంగా .. పక్కింటి పిల్లలో .. ముఖ్యంగా వారి తల్లితండ్రుల్లో అవగాహన. వారు ఇప్పుడైనా నిద్ర లేస్తే బయటపడతారు . లేకుంటే రేపు దారుణాలకు మూగ సాక్ష్యంగా మిగిలి పోతారు. ఒక స్కూల్ ఇలా చేస్తోంది . మీరు ఇలా ఎందుకు చెయ్యరు అని ప్రతి ఒక్కరు తమ పిల్లలు చదువుతున్న స్కూల్ యాజమాన్యాలను ప్రశ్నిస్తే ? ఎన్నికలు రాబోతున్నాయి. మీ డ్రామాలు, గోవా ఫైటింగ్‌లు ఆపండి. బాల లోకాన్ని పీడిస్తున్న ఈ వ్యసనం పై మీ స్టాండ్ ఏంటి ? యునెస్కో చెప్పాక కూడా నిద్ర నటిస్తారా ?" అని ప్రతి రాజకీయనాయకుడ్ని, పార్టీని ప్రశ్నిస్తే .. మార్పు రాదా ? ప్రశ్నించడం ఆంటే వీధుల్లోకి పోనక్కర లేదు. జస్ట్ సోషల్ మీడియాను వేదికగా చేసుకొంటే చాలు. ఇంకా... స్వచ్చంద సేవ సంఘాలు .. ప్రజా సంఘాలు .. సినిమా హీరోలు .. అబ్బో సమాజం శక్తి కొంచమయ్యిందా ? ముందుకు రావాలి. రావాలి... బాబూ... రావాలి . రాక పొతే చరిత్ర హీనులయి పోతారు . ఎవరో వస్తారని .. ఏదో చేస్తారని .. నిజం మరిచితే నిదురోతే? కరోనా రెండో వేవ్ .. అటు పై వాక్ సీన్ సైడ్ ఎఫెక్ట్స్ కంటే... దారుణాలు ఖాయం . ఇది శాపనార్థం కాదు . హెచ్చరిక దండోరా ! మార్పు మనింటి నుంచే మొదలు కావాలి . వాసిరెడ్డి అమర్ నాథ్, మానసిక నిపుణులు, విద్యావేత్త (చదవండి: మీకు మీరే నిజమైన స్నేహితుడు, మీరే అసలైన శత్రువు) -
పాదాల వాపు ప్రమాదమా! ఆ వ్యాధులకు సంకేతమా!
సాధారణంగా ఏ బస్సులోనో చాలాసేపు కూర్చుని ప్రయాణం చేశాక... పాదాల్లో వాపురావడం చాలామందిలో కనిపించేదే. ఇది నిరపాయకరమైన వాపు. కానీ కొన్నిసార్లు అలా ఏ కారణం చేత ఆ వాపు వచ్చిందో తెలుసుకోడానికి డాక్టర్‌ను సంప్రదించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ వాపు కొన్నిసార్లు ప్రమాదకరం కావచ్చు, అప్రమత్తంగా ఉండాల్సి రావచ్చు. పాదాలవాపు కనిపించినప్పుడు ఏయే అంశాలపై దృష్టిపెట్టాలన్న అవగాహన కోసమే ఈ కథనం. కాళ్లలో/పాదాల్లో వాపు కనిపించడాన్ని ‘ఎడిమా’ అంటారు. దీనికి చాలా కారణాలు ఉంటాయి. ముఖ్యంగా సెల్యులైటిస్, డీప్‌వీన్ థ్రాంబోసిస్ అనే కండిషన్లతో పాటు హార్ట్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్యూర్... ఈ మూడు కీలక అవయవాల పనితీరు తగ్గడం వల్ల ఇలా జరిగిందేమో చూడాలి. హైపోథైరాయిడిజమ్ వల్ల కూడా ఇలా జరగవచ్చు. దాంతోపాటు కొన్ని మందుల వాడకంతో పాటు, అసలు ఏ కారణమూ తెలియకుండా కూడా పాదాల్లో వాపు రావచ్చు. కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల... కిడ్నీ ఫెయిల్యూర్లో ముఖం మాత్రమే ఉబ్బుతుందని చాలామంది అనుకుంటారు. కానీ కాళ్లవాపూ కనిపిస్తుంది. ఇలాంటప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్ నిర్ధారణకు రీనల్ ఫంక్షన్ టెస్ట్ అనే పరీక్ష చేయించి, దానికి అనుగుణంగా చికిత్స అందించాల్సి ఉంటుంది. లివర్ ఫెయిల్యూర్ వల్ల... కాలేయ వైఫల్యంలోనూ కాళ్ల వాపు కనిపిస్తుంది. దీని నిర్ధారణ కోసం ‘లివర్ ఫంక్షన్ టెస్ట్ – ఎల్ఎఫ్టీ’ పరీక్ష చేయించి, సమస్య నిర్ధారణ అయినప్పుడు దానికి అనుగుణంగా చికిత్స అందించాల్సి ఉంటుంది. కాలి సిరల్లో లోపంతో... కొన్నిసార్లు కాళ్లలోని సిరలు చక్కగా పనిచేయకపోవడం వల్ల రక్తంలోని నీరు అక్కడే ఉండిపోయి, పాదాల వాపు రూపంలో బయటపడుతుంది. ఎక్కువసేపు నిల్చుని పనిచేసే వృత్తుల్లో ఉన్నవారిలో, ఊబకాయం ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువ. పిక్కల్లో నొప్పి, కాళ్లు బరువుగా అనిపించడం, అటు తర్వాత క్రమంగా కాళ్లపైనా, మడమ లోపలి వైపున నల్లటి మచ్చలు, కొంతకాలానికి కాలి సిరలు ఉబ్బి మెలికలు తిరిగి ఉన్నట్లుగా చర్మంలోంచి బయటికి కనిపించడంతో పాటు, అవి పచ్చగా లేక నల్లగా కనిపిస్తే, అది ‘వేరికోస్ వెయిన్స్’ లేదా ‘‘వీనస్ ఇన్సిఫిషియెన్సీ’ అనే కండిషన్ కావచ్చు. తొలిదశలో సాయంత్రం మాత్రమే ఉండే కాళ్లవాపు ఆ తర్వాత రోజంతా ఉంటుంది ∙ఇది కాకుండా సెల్యులైటిస్ అనే కండిషన్‌లోనూ కాళ్ల వాపు కనిపిస్తుంది. అంతేకాదు.. ఇలా వాపు వచ్చిన కారణంగా కాలు కాస్త మెరుపుతో కనిపిస్తుంది ∙దీనితో పాటు కాలి సిరల్లో రక్తం గడ్డకట్టడం వల్లకనిపించే ‘డీప్ వీన్ థ్రాంబోసిస్ – (డీవీటీ)’ అనే కండిషన్లో కూడా కాలివాపు కనిపిస్తుంది ∙ఈ కండిషన్స్ అన్నింటి నిర్ధారణ కోసం కాలి సిరలకు వీనస్ డాప్లర్ టెస్ట్ అనే పరీక్ష చేయించాలి. ఇవేగాక... ఇతర సమస్యల్లో కూడా... ఇక్కడ పేర్కొన్న సమస్యలతో పాటు అనేక ఇతర సమస్యల వల్ల కూడా కాళ్ల/పాదాల వాపు రావచ్చు. కొన్ని ప్రోటీన్ల లోపం, మహిళల్లో కటి భాగంలో వచ్చే క్యాన్సర్లలో కూడా కాళ్ల వాపు రావచ్చు. కొందరు గర్భవతుల్లో కాలి సిరలు సామర్థ్యం తగ్గడం, కొన్నిసార్లు థైరాయిడ్ హార్మోన్ లోపించినప్పుడూ వాపు రావచ్చు. ఇలాంటి సందర్భాల్లో జనరల్ ఫిజీషియన్‌ను సంప్రదించి, తగిన పరీక్షలు చేయించడం, తదనుగుణంగా చికిత్సలు అవసరం. గుండె పంపింగ్ తగ్గడం వల్ల... గుండె పంపింగ్ సామర్థ్యం తగ్గినప్పుడు పాదాల వాపు కనిపిస్తుంది. ఒక్కోసారి రక్తపోటు పెరగడమూ జరుగుతుంది. గుండెజబ్బు కారణంగా రెండు కాళ్లలోనూ వాపు కనిపిస్తుంది. ముందుగా కాలి ముందు భాగంలోనూ... ఆ తర్వాత మడమ భాగంలో వాపు వస్తుంది. మొదట్లో నొప్పి ఉండదు. ఆయాసం, నడవలేకపోవడం జరగవచ్చు. ఈ లక్షణాలు కనిపిస్తే తక్షణం మెడికల్ స్పెషలిస్ట్ / గుండె వైద్య నిపుణులను కలవాలి. గుండెజబ్బు వల్లనే పాదాల వాపు వచ్చిందా అన్న విషయం తెలుసుకోవడం కోసం బీఎన్పీ అనే రక్తపరీక్ష చేయించి, ఈ విలువ 100 కంటే ఎక్కువగా ఉంటే గుండె సమస్య ఉందేమోనని అనుమానించాలి. అప్పుడు గుండె నిపుణుల ఆధ్వర్యంలో ఈసీజీ, ఎకోకార్డియోగ్రఫీ వంటి పరీక్షలు చేయించుకోవాలి. చికిత్స : ఇది గుండెజబ్బు కారణంగానే జరిగితే డైయూరెటిక్స్ అనే మందులు వాడాల్సి ఉంటుంది. ఇవి మూత్రం రూపంలో దేహంలోంచి నీటిని బయటకు పంపిస్తాయి. అయితే గుండెజబ్బు ఉన్నప్పుడు మాత్రమే ఈ డైయూరెటిక్స్ వాడాలి, లేకపోతే అవి ప్రమాదకరంగా పరిణమించవచ్చు. అంతేకాదు... గుండెజబ్బు కాకుండా ఇతర కారణాల వల్ల కాలి వాపు వచ్చి ఉంటే... ఆ మూల కారణాన్ని కనుగొనే అవకాశం ఉండక, ఇతరత్రా సమస్యలు రావచ్చు. ఊపిరితిత్తుల్లో రక్తపోటు పెరగడం... ఊపిరితిత్తుల్లో రక్తపోటు పెరగడం వల్ల కూడా పాదాలకు వాపు వస్తుంది. ఊబకాయం ఉన్నవారిలో ఇది ఎక్కువ. ఈ కారణంగా సమస్య వస్తే... నిద్రలో పెద్దగా గురకపెట్టడం, నిద్రనుంచి అకస్మాత్తుగా లేవడం, నిద్రలో ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడం కనిపిస్తాయి. వీరు తక్షణం డాక్టర్‌ను సంప్రదించాలి. లంగ్స్‌లో రక్తపోటు పెరగడాన్ని తెలుసుకోవడం కోసం డాక్టర్లు ఎకో పరీక్ష చేయిస్తారు. వయసు 40 దాటి, కాళ్ల వాపులు ఉన్నవారు ఒకసారి తప్పనిసరిగా ఎకో పరీక్ష చేయించడం మంచిది. చికిత్స : ఊపిరితిత్తుల్లో రక్తపోటు కారణంగా వచ్చే స్లీప్ ఆప్నియాకు తప్పనిసరిగా చికిత్స చేయించాలి. దాంతో స్లీప్ ఆప్నియా సమస్య తగ్గి, కాళ్ల వాపూ తగ్గుతుంది. జాగ్రత్తలు / ఫస్ట్‌లైన్ చికిత్స : చాలాసేపు నిలబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి వాపు ఉన్న కాళ్లపై ఎలాస్టిక్ స్టాకింగ్స్ తొడగాలి. ఈ జాగ్రత్తలతో కాలివాపును నివారించవచ్చు. స్టాకింగ్ సిరలకు అది మంచి సపోర్ట్ ఇవ్వడం వల్ల క్రమేణా రక్తం సజావుగా ప్రవహిస్తుంటుంది. ఈ దశలో నిర్లక్ష్యం చేసి, సమస్య ముదిరి ‘వేరికోస్ వెయిన్స్’గా పరిణమిస్తే, కాళ్లకు పుండ్లు వంటి దుష్ప్రభావాలు (కాంప్లికేషన్లు) రావచ్చు. ఆయా కండిషన్లకు అనుగుణంగా రేడియాలజీ చికిత్స, శస్త్రచికిత్సలు అవసరం కావచ్చు. కారణం తెలియకుండా... కొందరిలో, ముఖ్యంగా 40 ఏళ్ల మహిళల్లో కాళ్ల వాపుతో పాటు మరికొందరిలో ముఖం, చేతులు కూడా ఉబ్బడం జరగవచ్చు. ఇలా ఎందుకు జరుగుతుందన్న కారణం కొన్నిసార్లు తక్షణం తెలియకపోవచ్చు. వీరికి అన్ని పరీక్షలూ చేసి... నిర్దిష్టంగా ఎలాంటి కారణం లేదని తెలుసుకున్న తర్వాత డైయూరెటిక్స్ వాడాలి. ఆహారంలో ఉప్పు తక్కువగా తీసుకోవాలనీ డాక్టర్లు సూచిస్తారు. (చదవండి: మీకు మీరే నిజమైన స్నేహితుడు, మీరే అసలైన శత్రువు) -
మళ్లీ విరుచుకుపడుతున్న మహమ్మారి..డబ్ల్యూహెచ్ఓ వార్నింగ్!
మహమ్మారి సృష్టించిన కల్లోలం నుంచి పూర్తిగా బయటపడ్డాం అని అనుకుంటున్న సమయంలో మరో వేరియంటే చాపకింద నీరులా వచ్చేస్తుంది. ఇంకా నేను ఉన్నానంటూ..మరో కొత్త వేరియంట్ రూపంలో భయబ్రాంతులకు గురిచేస్తుంది. ఆ మహమ్మారి మొదలైన సమయంలో ఎదుర్కొన్న కష్టాలు అంత ఈజీగా మర్చిపోలేం. అందర్నీ ఇంట్లో బందీలుగా చేసింది. ఇప్పుడూ మళ్లీ మరో రూపంలో ఆ మహమ్మారి విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ సైతం అన్ని దేశాలు అప్రమత్తంగా ఉండాల్సిందేనని గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఏంటీ కొత్త వేరియంటే..ఎక్కడ వ్యాపించింది? ఇంతవరకు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ గురించి, దాని తాలుకా కేసులు చూశాం. ఇప్పుడు అది ఒమిక్రాన్ నుంచి మరో కొత్త వేరియంట్ 'ఈజీ.5.1'గా రూపాంతరం చెంది యూకేలో వేగంగా విజృంభిచడం ప్రారంభించింది. యూకేలో కరోనా కొత్త వేరియంట్ 'ఎరిస్' అనే పేరుతో రూపాంతరం చెంది వేగంగా వ్యాపిస్తోందని ఇంగ్లాండ్‌లోని హెల్త్ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి దేశంలో దాదాపు 14.6% కేసులు ఉన్నాయని వెల్లడించింది. ఈ మహమ్మారికి సంబంధించి..ఇప్పటి వరకు గుర్తించిన ఏడు కొత్త వేరియంట్లలో ఇది ఒకటని యూకే ఆరోగ్య అధికారులు పేర్కొన్నారు. ఈ వారంలో ఆ కొత్త వేరియంట్‌కి సంబంధించి..సుమారు నాలుగువేల కేసు వచ్చాయిని చెప్పారు. ఈ కేసులు పెరుగుతున్న నేపథ్యంలోనే ఈ కొత్త వేరియంట్‌కి జులై 31న "ఎరిస్" అనే పేరుతో వేరియంట్‌గా వర్గీకరించారు. తొలిసారిగా జూలై 3, 2023న దీని తాలుకా కేసులను గుర్తించారు. అది కాస్త నెమ్మదిగగా పెరగడంతో ఆరోగ్య అధికారులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా వృద్ధులు ఆస్పత్రిలో చేరే రేటు పెరగుతున్నట్లు తెలిపారు. మొత్తంగా చూస్తే ఆస్పత్రిలో చేరే పరిస్థితులు తక్కువుగానే ఉన్నాయని, అలాగే ఐసీయూలో అడ్మిట్ అవుతున్న కేసులు పెద్దగా పెరగలేదని యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ(యూకేహెచ్ఎస్ఏ) పేర్కొంది. ఏది ఏమైనా ఈ మహామ్మారీ కేసులు పెరగక ముందే జాగ్రత్తలు తీసుకోవడం మంచిదన్నారు ఇయూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ హెడ్ డాక్టర్ మేరి రామ్సే. ప్రజలంతా ఈ వైరస్ల బారిన పడకుండా ఉండేందుకు క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవాలని, అలానే శ్వాసకోస సంబంధ సమస్యలు ఉన్నవారికి దూరంగా ఉండాలని సూచించారు. ఇదిలా ఉండగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సైతం ఈ కొత్త వేరింట్ కేసులను ట్రాక్ చేయడం ప్రారంభించింది. ఈ మేరకు డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ మాట్లాడుతూ..ప్రజలంతా ముందస్తు జాగ్రత్తగా వ్యాక్సిన్లు, సంరక్షణ పద్దతులను అవలంబించాలని సూచించారు. అలాగే అన్ని దేశాలు అప్రమత్తంగా ఉండటమేగాక తమ రక్షణను వదులుకోవద్దని చెప్పారు. కాగా యూకేలో నెమ్మదిగా పెరుగుతున్న ఈ కొత్త వేరియంట్ కేసులపై నిపుణలు, అధికారలు పరిశోధనలు చేయడం ప్రారంభించారు. అదే సమయంలో ప్రజలు ఈ మహమ్మారి వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని గట్టిగా హెచ్చరించారు అధికారులు. (చదవండి: అప్పుడే జుట్టు తెల్లబడుతుందా? ఐతే ఇలా చేసి చూడండి!) -
అప్పుడే జుట్టు తెల్లబడుతుందా? ఐతే ఇలా చేసి చూడండి!
ఒకప్పుడు యాభైఏళ్లు దాటిన వారికే తెల్లజుట్టు వచ్చేది కానీ ఇప్పుడు చాలామందికి పాతికేళ్లకంటే ముందే తెల్లజుట్టు వచ్చేస్తోంది. దాంతో ఉన్న వయసు కంటే పెద్దగా కనిపించడం, దానిని కప్పి పుచ్చుకోవడానికి తలకు రకరకాల హెయిర్ డైలు, షాంపూలు వాడటం... వాటిలోని రసాయనాల ప్రభావంతో సైడ్ ఎఫెక్టులు రావడం... వీటన్నింటి బదులు అసలు చిన్న వయసులోనే తెల్లజుట్టు ఎందుకు వస్తుందో చెబుతూ...దానిని నివారించడానికి తగిన సూచనలు, సలహాలతో కూడిన కథనం ఇది. చిన్న వయసులోనే తెల్లజుట్టు రావడానికి గల అనేక కారణాలలో అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, జన్యుపరమైన కారణాలు ప్రధానం. డైట్లో పోషకాల కొరత ఉండకూడదు. తెల్లజుట్టు రాకుండా ఉండాలంటే విటమిన్ బి ఉండే ఆహారాలని పుష్కలంగా తినాలి. డైట్లో ఇవి కచ్చితంగా ఉండేవిధంగా చూసుకోవాలి. జుట్టు తెల్లగా మారుతుందంటే విటమిన్ బి లోపం ఉందని అర్థం చేసుకోండి. అంతేకాదు దీనివల్ల జుట్టు రాలడం, పొడి జుట్టు సమస్యలు కూడా ఎదురవుతాయి. రోజువారీ ఆహారంలో విటమిన్ బి ఉందా లేదా అన్నదానిపై శ్రద్ధ వహించాలి. ఎందుకంటే హెల్తీ ఫుడ్స్ ద్వారా జుట్టుకు పోషణ లభిస్తుంది. తెల్ల జుట్టును సహజంగా నల్లగా సరైన సమయంలో ఆహారంలో మార్పులు చేయకపోతే అది జుట్టుకు హాని కలిగిస్తుంది. విటమిన్ బి సమృద్ధిగా లభించే పాల ఉత్పత్తులను ఎక్కువగా తీసుకోవాలి. దీనితో పాటు విటమిన్ బి6, విటమిన్ బి12 కూడా ఉండే ఆహారాలని తినాలి. శరీరంలో విటమిన్ బి లోపం ఉంటే జుట్టుకు ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది. బయోటిన్, ఫోలిక్ యాసిడ్ లోపం వల్ల కూడా చిన్న వయస్సులోనే జుట్టు నెరుస్తుంది. కాయధాన్యాలు, తృణధాన్యాలు, గింజలు, పాలు, పెరుగు, జున్ను, గుడ్డు, ఆకుకూరలు, గోధుమలు, పుట్టగొడుగులు, బఠానీ, పొద్దుతిరుగుడు గింజలు, అవకాడో, చేపలు, మాంసం, చిలగడదుంప, సోయాబీన్, బంగాళదుంప, బచ్చలికూర, అరటి, బ్రకోలీ, బీన్స్ ప్రతిరోజు డైట్లో ఉండేలా చూసువడం వల్ల తెల్లజుట్టు సమస్యను వాయిదా వేయచ్చు. గుడ్డులోని తెల్లసొన లేదా మజ్జిగతో కలిపి రుబ్బిన కరివేపాకు లేదా మెంతి ఆకు పేస్ట్‌ని తలకు ప్యాక్‌గా వేసుకోవాలి. రెండు గంటల తర్వాత గోరువెచ్చని నీటితో వాష్ చేసుకోవాలి. తలస్నానానికి తక్కువ గాఢత ఉన్న షాంపూలనే ఉపయోగించాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వల్ల తెల్లజుట్టు రాదు. వచ్చిన తెల్ల జుట్టు కాలక్రమేణా నల్లగా మారుతుంది. తెల్ల జుట్టు సమస్యను అద్భుతంగా పారదోలే వాటిలో కాఫీ పొడి ఒకటి. ఓ గ్లాసుడు నీళ్లలో ఒకటిన్నర చెంచాల కాఫీ పొడిని మరిగించి చల్లారిన తర్వాత జుట్టు కుదుళ్లకు పట్టించాలి. వేళ్లను జుట్టు కుదుళ్లకు తగిలేలా మసాజ్ చేస్తుండాలి. ఇలా చేసిన 30 నిమిషాల తర్వాత తల స్నానం చేయాలి. మీ తలకు సరిపడేటన్ని మందార ఆకులు తీసుకుని పేస్ట్ లా చేసుకుని అందులో కొబ్బరి నూనె కలిపి జుట్టుకి అప్లయ్ చేసి 2 గంటల తర్వాత గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల తెల్లజుట్టు సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. హెర్బల్ హెన్నాలో బీట్ రూట్ రసం కలిపి ప్యాక్ వేసుకున్నా జుట్టుకు మంచి రంగు వస్తుంది.హెన్నా పౌడర్ ను ఆముదంలో మరిగించాలి. ఆ తర్వాత స్టవ్ పై నుంచి దించి చల్లారిన తర్వాత దానిని జుట్టు కుదుళ్లకు అంటుకునేలా రాయాలి. ఆ తర్వాత కుంకుడు కాయ లేదా శీకాయతో తలస్నానం చేయాలి. తెల్లజుట్టు ఉన్న వారు పెనంపై రెండు చెంచాల పసుపును వేసి వేడి చేసి నల్లగా మారేంత వరకు మాడ్చాలి. చల్లారిన తర్వాత దీనికి సరిపోయేంత కొబ్బరినూనె లేదా నువ్వులనూనెలో కలిపి తలకు పట్టించాలి. ఆ తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు ఎక్కువ కాలం నల్లగా ఉంటుంది. తల స్నానానికి గోరు వెచ్చని నీళ్లు మాత్రమే వాడాలి. (చదవండి: కొంబుచా హెల్త్ డ్రింక్! దీని ప్రయోజనాలకు ఫిదా అవ్వాల్సిందే!) -
ఆ అలవాటే కరోనా అటాక్ అవ్వడానికి ప్రధాన కారణమా?
కొందరికి ముక్కుని టచ్ చేయడం, లోపల పట్టి ఉన్నవాటిని తీయడం అనే బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది. అలవాటుగా అలా చేస్తూనే ఉంటారు. అవసరం ఉన్న లేకపోయినా అదే పనిగాముక్కుని టచ్ చేస్తూ లోపలి వేళ్లు పెట్టి క్లీన్ చేయడం వంటివి చేస్తారు. ఇది మంచిది కాదని ఇదే కరోనా ఈజీగా అటాక్ అయ్యేందుకు ప్రధాన కారణమని చెబుతున్నారు శాస్తవేత్తలు. ఈ మేరకు నెదర్లాండ్స్‌లోని శాస్త్రవేత్తల బృందం తాజాగా జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఇదే సమయంలో మనం కూడా కోవిడ్ సంబంధిత రోగులతో సన్నిహితంగా ఉంటే కరోనా అటాక్ అయ్యే అవకాశాలు మరింతగా ఉంటుందని చెబుతున్నారు. ఈ మేరకు శాస్త్రవేత్తలు ఆమ్స్టర్డామ్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్స్‌లోని దాదాపు 219 మంది ఆరోగ్య కార్యకర్తలపై సర్వే చేయగా..సుమారు 84 శాతం మంది యాదృచ్ఛికంగానే ముక్కుని టచ్ చేయగా మిగిలినవారు అదే పనిగా ముక్కుని ముట్టుకుంటున్నట్లు తెలిపారు. ఇలా ముక్కుని టచ్ చేస్తూ లోపల వేలు పెట్టి తిప్పే వారికే ఈజీగా కరోనా సోకినట్లు తేలింది. అలాగే గోర్లు కొరకడం, కళ్లకు ధరించే అద్దాలను శుభ్రపరచకపోవడం, గడ్డంతో ఉండట తదితరాలే కరోనా అటాక్ కావడానికి ప్రధాన కారణం అని చెప్పడం లేదని చెప్పారు శాస్త్రవేత్తలు. నిజానికి ఇలాంటి అలవాట్ల వల్ల క్రిములు, బ్యాక్టిరియా మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువని పేర్కొన్నారు. ఇక ముక్కుని చేతితో ముట్టుకోవడం, రంధ్రాల్లో పెట్టడం వల్ల సున్నితంగా ఉండే ముక్కు గోడలు దెబ్బతింటాయి. ఫలితంగా కోవిడ్ -19 సోకే అవకాశం పొంచి ఉంటుందని సూచించారు. ఇలాంటి అలావాట్లను దూరం చేసుకుంటే కరోనా మాత్రమే కాకుండా కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు అటాక్ అవ్వకుండా ఆరోగ్యాన్ని సంరక్షించుకోగలుగుతారని పేర్కొంది శాస్త్రవేత్తల బృందం. (చదవండి: ఆకాశ పండు గురించి విన్నారా! ఎన్ని వ్యాధులకు దివ్యౌషధమో తెలుసా!) -
ఆకాశ పండు గురించి విన్నారా? ఎన్ని వ్యాధులకు దివ్యౌషధమో తెలుసా!
స్కై ఫ్రూట్ మహిళలలో వచ్చే పీఓసీడీ సమస్యలకు ఊబకాయం మధుమేహం వ్యాధికి చక్కనిపరిష్కారం. ఈ స్కై ఫ్రూట్ (ఆకాశపండు) గొప్పతనం గురించి ఆయర్వేద నిపుణులు నవీన్ నడిమింటి ఏం చెబుతున్నారో ఆయన మాటల్లోనే చూద్దాం. ఆధునిక వైద్య శాస్త్రంలో, స్కై ఫ్రూట్స్ ఖ్యాతి చాలా పాతది కానప్పటికీ, ఆగ్నేయాసియా దేశాలలో, అధిక రక్తపోటు పీసీఓడీ సమస్యలకు మధుమేహం వంటి వివిధ ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడానికి సాంప్రదాయకంగా ఆకాశ పండ్ల విత్తనాలను ఉపయోగిస్తారు. స్కైఫ్రూట్ ఎలా ఉపయోగించాలి? మీకు స్కై ఫ్రూట్ మొత్తం దొరికితే, దాన్ని పగలగొట్టి దాని గింజను బయటకు తీయండి. వెచ్చని నీటితో లోపలి విత్తనాన్ని నమలవచ్చు లేదా మింగవచ్చు. రుచి పరంగా, ఇది చాలా చేదుగా ఉంటుంది. మీ చక్కెర స్థాయి 200 కంటే ఎక్కువ ఉంటే, పూర్తి విత్తనాన్ని తీసుకోండి. మీ చక్కెర స్థాయి 200 కంటే తక్కువగా ఉంటే, సగం గింజను తినండి. ఇది టాబ్లెట్‌గానూ లేదా పౌడర్ రూపంలో లభిస్తుంది. “ఉదయం, పళ్ళు తోముకున్న వెంటనే తీసుకోవాలని చెబుతున్నారు. గరిష్ట ప్రయోజనాల కోసం, స్కై ఫ్రూట్ తీసుకున్న తర్వాత కనీసం ఒక గంట పాటు టీ, కాఫీ, పాలు ఏదైనా ఇతర ఆహార పదార్థాలను తాగకుండా ఉండండి. స్కైఫ్రూట్ ప్రయోజనాలు.. “స్కై ఫ్రూట్" అందించే ప్రయోజనాలకు సంబంధించి సుదీర్ఘ జాబితానే ఉంది. బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గించడంతోపాటు వివిధ సమస్యలకు చెక్ పెడుతుంది కూడా. వాటిలో కొన్ని: చర్మ అలెర్జీకి చికిత్సలా పని చేస్తుంది. గుండెపోటు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. ఋతుస్రావం నొప్పిని అరికడుతుంది. దుర్వాసన వదిలించుకోవడానికి సహాయపడుతుంది మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది అల్జీమర్స్‌కు చికిత్స చేస్తుంది నపుంసకత్వానికి చికిత్స చేస్తుంది శరీర బలాన్ని మెరుగుపరుస్తుంది రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది ఆస్తమా చికిత్సలో సహాయపడుతుంది నిద్రలేమికి చికిత్స చేస్తుంది ఆకలిని పెంచుతుంది మహిళల్లో గర్భం దాల్చే అవకాశాలను పెంచుతుంది మలేరియాకు చికిత్స చేస్తుంది కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది కణితులతో పోరాడడంలో సహాయపడుతుంది ఆస్తమా చికిత్సలో ఉపయోగపడుతుంది హృదయనాళ వ్యవస్థను మెరుగుపరిచి, రక్త నాళాలు మూసుకుపోకుండా నిరోధిస్తుంది కరోనరీ వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది ఆర్టెరియోస్క్లెరోసిస్ ఫలకాన్ని నివారిస్తుంది. ఈ పండులో ఉండే విటమిన్లు.. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉన్నాయి. అదనంగా, స్కై ఫ్రూట్ విటమిన్లు, కొవ్వులు, మినరల్స్, ఫోలిక్ యాసిడ్, కార్బోహైడ్రేట్లు, డైటరీ ఫైబర్, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, సహజ ప్రోటీన్లు, ఎంజైమ్‌లు తోపాటు వివిధ ముఖ్యమైన పోషకాల విలువైన మిశ్రమాన్ని అందిస్తుంది. ఈ ముఖ్యమైన పోషకాలన్నీ ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. స్కైఫ్రూట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్లు.. స్కై ఫ్రూట్ తీసుకోవడం వల్ల కాలేయం దెబ్బతిన్నట్లు కొన్ని కేసులు వచ్చాయి. ఎవరైనా అనారోగ్యంగా భావిస్తే.. బద్ధకం, వికారం, ఆకలి లేకపోవడం, చీకటి మూత్రం వంటి కాలేయ గాయం వంటి లక్షణాలు కనిపిస్తే..అలాంటి వారు వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రదించాలి. అలాగే కళ్లలోని తెల్లసొన పసుపు రంగులోకి మారడం లేదా చర్మం పసుపు రంగులోకి మారడం, కామెర్లు వచ్చినా, స్కై ఫ్రూట్ తీసుకోవడం మానేసి వెంటనే మీ వైద్యుడిని సంప్రదించండి. అలాగే ఏదైనా వాడేముందు సంబంధిత నిపుణుల పర్యవేక్షణలో వారి సూచనలు సలహాల మేరకు వాడి మంచి ప్రయోజనాలను పొందండి. (చదవండి: చూపు లేదు కానీ క్యాన్సర్‌ని గుర్తిస్తారు) -
చూపు లేదు కాని క్యాన్సర్‌ని గుర్తిస్తారు!
స్త్రీలలో బ్రెస్ట్ కేన్సర్ ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంటుంది. రేడియేషన్‌తో కూడిన మామోగ్రఫీ కన్నా స్పర్శతో బ్రెస్ట్ కేన్సర్‌ను గుర్తించడాన్ని ‘టెక్టయిల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్’ అంటారు. స్పర్శ మీద ఎక్కువగా ఆధారపడ్డ అంధ మహిళలకు ఒక ఉపాధిగా. స్పర్శతో కేన్సర్‌ను గుర్తించడంలో శిక్షణ ఇస్తున్నారు. ఢిల్లీలో ఇప్పటికే 18 మంది అంధ మహిళలు ఈ శిక్షణ పొందారు. ఇతర అంధ మహిళలను ఈ రంగంలోకి ఆహ్వానిస్తున్నారు. స్త్రీలు పరస్పరం మేలు పొందే ఈ విశేష కార్యక్రమాన్ని ‘లైఫ్ సేవింగ్ హ్యాండ్స్’ అంటున్నారు. న్యూఢిల్లీకి చెందిన 31 ఏళ్ల మీనాక్షి గుప్తా ప్రతి ఉదయం మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు అందరూ ఆమెను సాధారణ అంధురాలు అనుకుంటారు. కాని తాను పనిచేసే హాస్పిటల్‌కు ఆమె చేరుకున్నాక ఆ అంధురాలిలోని అసామాన్య నైపుణ్యం తెలిసి ఆశ్చర్యపోతారు. ఆమె ‘టెక్టయిల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్’ నిపుణురాలు. ఇలాంటి నిపుణులను ‘మెడికల్ టెక్టయిల్ ఎగ్జామినర్’ (ఎం.టి.ఇ) అంటారు. వీరు చేతి స్పర్శతో స్త్రీల వక్షోజాలలో వచ్చిన అతి చిన్న లంప్స్‌ను కూడా గుర్తించి కేన్సర్ బారిన పడకుండా కాపాడుతారు. బ్రెస్ట్ కేన్సర్‌ను స్త్రీలు ఎవరికి వారు స్పర్శ ద్వారా చెక్ చేసుకుంటూ లంప్స్‌ను గుర్తించవచ్చు. కాని అందరూ సరిగ్గా గుర్తించలేరు. చిన్న లంప్స్‌ను అసలు గుర్తించలేరు. కాని ‘టెక్టయిల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్’ నిపుణులు మాత్రం అతి చిన్న లంప్స్‌ను కూడా గుర్తించడంలో శిక్షణ పొందుతారు. అంధ మహిళలే ఎందుకు? ‘టెక్టయిల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్’ను జర్మనీకి చెందిన గైనకాలజిస్ట్ ఫ్రేన్ హాఫ్‌మేన్ కనుగొన్నాడు. బ్రెస్ట్ కేన్సర్‌ను గుర్తించే మామోగ్రఫీలో రేడియేషన్ ఉంటుంది. ఖర్చు కూడా. కాని చేతులతో గుర్తించడంలో ఎటువంటి రేడియేషన్ ఉండదు. ఖర్చు కూడా ఉండదు. అందుకే చేతి స్పర్శ ద్వారా ఎలా బ్రెస్ట్ కేన్సర్‌ను గుర్తించవచ్చో అతను కొన్ని పద్ధతులను ప్రతిపాదించాడు. ఇందులో శిక్షణకు అంధ మహిళలను ఎంచుకున్నాడు. ఎందుకంటే చూపు లేకపోవడం వల్ల అంధులు స్పర్శ మీద ఎక్కువగా ఆధారపడతారు. వారు తమ స్పర్శతో కచ్చితంగా లంప్స్‌ను గుర్తించగలరని ఊహించాడు. అతని ఊహ నిజమైంది. అంధ మహిళల స్క్రీనింగ్‌లో కేవలం 1 శాతం మాత్రమే తప్పు అంచనా వచ్చి మిగిలిన 99 శాతం నిర్థారిత అంచనా వచ్చింది. దాంతో అతను ఒక సేవాకార్యక్రమంగా ‘లైఫ్ సేవింగ్ హ్యాండ్స్’ పేరుతో ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, కొలంబియా, మెక్సికో, ఇండియాలలోని ఆయా ప్రభుత్వ అంధుల పర్యవేక్షణ సంస్థలను కోరారు. మన దేశంలో 2017 నుంచి ఈ శిక్షణ జరుగుతోంది. ఇప్పటికి 18 మంది ఎం.టి.ఇలు శిక్షణ పొందారు. మరో 8 మంది ఇప్పుడు శిక్షణ పొందుతున్నారు. 9 నెలల శిక్షణ ఢిల్లీలోని ‘బ్లైండ్ ఇండియా సెంటర్ ఫర్ బ్లైండ్ విమెన్ అండ్ డిజేబిలిటీ స్టడీస్’ (ఎన్.ఏ.బి.సి.బి.డబ్లు్య)లో మెడికల్ టెక్టయిల్ ఎగ్జామినర్ (ఎం.టి.ఇ)లుగా శిక్షణను ఇస్తున్నారు. అంధ మహిళలు, చూపు లోపం పాక్షికంగా ఉన్నవారు ఈ శిక్షణను పొందవచ్చు. 9 నెలలు ట్రైనింగ్ ఉంటుంది. ఆరు నెలలు సెంటర్లో, మూడు నెలలు ఆస్పత్రిలో పని చేయాలి. ఈ ట్రయినింగ్లో ఇంగ్లిష్, కంప్యూటర్ను ఆపరేట్ చేయడం, మానవ శరీర నిర్మాణంలో ప్రాథమిక అవగాహన తదితరాలు నేర్పిస్తారు. ‘అంధులు బ్రెస్ట్ కేన్సర్‌ను స్పర్శతో ఎలా గుర్తించగలరా అని ముందు సందేహించాను. కాని జర్మనీకి వెళ్లి చూశాక మన దేశంలో అంధ మహిళలకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను’ అన్నారు బ్లైండ్ ఇండియా సెంటర్ డైరెక్టర్ షాలినీ ఖన్నా. క్యాంపులలో సేవలు బ్లైండ్ ఇండియా సెంటర్ తరచూ బ్రెస్ట్ కేన్సర్ అవేర్నెస్ క్యాంపులను నిర్వహిస్తోంది. ఈ క్యాంపుల్లో ఎం.టి.ఇలు తమ స్పర్శతో స్క్రీనింగ్ సేవలు అందిస్తున్నారు. ‘4 మిల్లీమీటర్ల చిన్న లంప్‌ను కూడా ఎం.టి.ఇలు గుర్తిస్తున్నారు’ అని క్యాంప్ నిర్వాహకులు తెలియచేస్తున్నారు. వీరి నిర్థారణ తప్పడం లేదు కనుక అంధ మహిళలు ఈ శిక్షణ తీసుకుని ఈ సేవలను కొనసాగిస్తూ ఉపాధి పొందాలని బ్లైండ్ ఇండియా సెంటర్ తెలియచేసింది. (చదవండి: వెన్నునొప్పే కదా! అని తేలిగ్గా తీసుకోకండి! ఆ వ్యాధికి సంకేతం కావోచ్చు) -
వెన్నునొప్పి..క్యాన్సర్‌కి సంకేతమా?..!
వెన్ను నొప్పి అనేది అందరికి తెలుస్తుంది. ఇటీవల కాలంలో తరుచుగా వింటున్నాం కూడా. వెన్నునొప్పిగా అనిపిస్తే మూవ్ లేదా ఇతరత్రా రిలీఫ్ బామ్‌లు రాసుకుని రిలాక్స్ అవుతుంటాం. చాలా మంది దీన్ని సాధారణ సమస్యగానే భావిస్తారు. తట్టుకోలేనంత స్థితి ఎదురైతే గానీ వైద్యులు దగ్గరకు వెళ్లరు. ఔనా! కానీ ఆరోగ్య నిపుణులు అలా చేయొద్దు అంటున్నారు. కొన్ని రకాల క్యాన్సర్లు.. వెన్నునొప్పి సంకేతం చూపిస్తాయట. శరీరంలో ఏదైనా భాగం నుంచి క్యాన్సర్ కణాలు ఎముకల ద్వారా వెన్నుకి స్ప్రెడ్ అయితే వెన్ను నొప్పి ద్వారా ఇండికేట్ చేసే అవకాశం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. అలా అని వెన్ను నొప్పి అనేది క్యాన్సర్‌కి సంబంధించిన లక్షణం కూడా కాదు. ఆరోగ్య నిపుణుల ప్రకారం రోమ్ము, ఊపిరితిత్తులు, వృషణాలు, పెద్దప్రేగు, అనే నాలుగు సాధారణ క్యాన్సర్లు వెన్నునొప్పి ద్వారా సంకేతం చూపిస్తాయట. ఆయా భాగాలు అన్నీ శరీరీ నిర్మాణ పరంగా వెనుముకకు దగ్గరగా ఉన్నందున వెన్ను వరకు వ్యాపించే అవకాశం ఉంటుదని చెబుతున్నారు నిపుణులు. అంతేగాదు ఊపిరితిత్తు క్యాన్సర్‌ని ఫేస్ చేస్తున్న 25 శాతం మంది రోగులు తమకు మొదట వెన్ను నొప్పి వచ్చిందని చెప్పినట్లు వెల్లడించారు. యూకే అధ్యయనంలో కూడా ఇది వెల్లడైంది. ఇలాంటి వెన్నునొప్పి..బరువు తగ్గిపోవడం, రాత్రిపూట చెమటలు, చలి జ్వరం వంటి లక్షణాలను ఫేస్చేస్తున్న క్యాన్సర్ పేషెంట్లలో ఎక్కువగా కనిపిస్తుందని చెప్పారు. ఇలాంటి క్యాన్సర్‌తో బాధపడుతున్న పేషెంట్లు వాళ్లు ఎలాంటి శారీరక శ్రమ చేయకుండా బరువు తగ్గిపోతారట. వాళ్లలోని శక్తి తొందరగా బర్న్ అయిపోతుందట. పైగా ఇలా క్యాన్సర్ సంకేతంగా వచ్చే వెన్నునొప్పి అత్యంత అసౌకర్యంగా ఉంటుందని, చాలా పెయిన్‌తో కూడినదని చెబుతున్నారు. అందువల్ల దయచేసి వెన్నునొప్పి వస్తే సరైన భంగిమ వల్లన లేక మరేదైన కారణంతోనే గమనించండి. అవసరం అనుకుంటే వైద్యులని సంప్రదించండి. నిర్లక్షంతో జీవితాన్ని కోల్పోకండి. (చదవండి: సెలూన్‌కి వెళ్లే పనిలేకుండా..మీ హెయిర్‌ని స్ట్రయిట్ చేసుకోండిలా..) -
పెద్దవయసు వారిని వణికించే పార్కిన్సన్స్ వ్యాధి!
పార్కిన్సన్స్ వ్యాధి కాస్త వయసు పెరిగిన వారిలో అంటే 60 ఏళ్లు పైబడిన వారిలో కనిపించే వ్యాధి. ఇందులో బాధితుల వేళ్లు, చేతులు వణుకుతుంటాయి. ఈ వ్యాధిని డాక్టర్ జేమ్స్ పార్కిన్సన్ అనే వైద్యనిపుణుడు 1817లో గుర్తిం, ‘షేకింగ్ పాల్సీ’ అని పేరు పెట్టినప్పటికీ... కనిపెట్టినవారి పేరుతోనే ఇది ప్రాచుర్యం పొందింది. ఈ వ్యాధి గురిం ప్రాథమిక అవగాహన కోసం ఈ కథనం. పార్కిన్సన్స్ వ్యాధి మహిళల్లో కంటే పురుషుల్లో దాదాపు ఒకటిన్నర రెట్లు ఎక్కువ. కొందరిలో యుక్తవయసులో అంటే 30 ఏళ్ల వారిలోనూ కనిపిస్తుండటంతో దీన్ని అనువంశీకంగా కనిపించే పార్కిన్సనిజమ్ (హెరిడిటరీ పార్కిన్సనిజమ్) అంటున్నారు. లక్షణాలు: కదలికలు నెమ్మదిస్తాయి (దీన్ని బ్రాడీకైనేసియా అంటారు). దాంతో నడక, స్నానం, దుస్తులు ధరించడం కష్టమవుతుంది. ముందుకు పడిపోతున్నట్లు అనిపిస్తుంటుంది. బ్యాలెన్స్ కోల్పోతారు. కాళ్ల, చేతుల్లోని కండరాలు బిగుసుకుపోవడం, వణకడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రమైన అలసట (ఫెటీగ్)కనిపిస్త, తరచూ నిద్రాభంగమవుతుంది. ఈ పరిణామాలతో పాటు మెదడులోని కొన్ని రసాయనాల అసమతౌల్యత వల్ల కుంగుబాటు (డిప్రెషన్), నిద్రసమస్యలు కనిపిస్తాయి. పీడకలల, రాత్రి నిద్రలేమితో అకస్మాత్తుగా పగటినిద్ర రావచ్చు. కొందరిలో మింగడం కష్టంకావడం, మింగలేకపోవడంతో ఆహారం గొంతులో పట్టేయడం /ఇరుక్కుపోవడం. కొందరిలో కండరాల నొప్పులు / కీళ్ల నొప్పులు. మొదట్లో కనిపించే ఈ లక్షణాల్ని నిర్లక్ష్యం చేస్తే, అవి మరింత ముదిరి బాధితులు తమ రోజువారీ పనులు చేసుకోలేనంతగా ఇబ్బంది పడతారు. ∙కొన్ని చర్మ సమస్యలతో పాటు నాడీ వ్యవస్థ దెబ్బతినడం వల్ల మూత్ర విసర్జన సమస్యల అలాగే మలబద్దకం వంటి లక్షణాలూ కనిపించవచ్చు. నిర్ధారణ ఇలా... పార్కిన్సన్స్ వ్యాధిని పసిగట్టడం అన్నది ప్రధానంగా వ్యాధి లక్షణాల్ని బట్టి, క్లినికల్ పరీక్షల సహాయంతో జరుగుతుంది. నిర్ధారణ కోసం ఈ కింది పరీక్షలు అవసరమవుతాయి. మెదడు ఎమ్మారై పరీక్ష, స్పెక్ట్ అనే పరీక్ష. దీన్నే డాట్ స్కాన్ అని కూడా అంటారు. పెట్ స్కాన్ పరీక్ష. చికిత్స : వయసు పెరగడంతో మెదడులోని డోపమైన్ తగ్గడం, దాంతో కదలికలను నియంత్రించే మెదడు కణాలు నశించడం వల్ల పార్కిన్సన్స్ వ్యాధి వస్తుంది. డోపమైన్ ఉత్పత్తిని పెంచే మందులతో లక్షణాల్ని అదుపులోకి తేవచ్చు. అయితే పెరిగే వయసుతో పాటు డోపమైన్ ఉత్పాదన / మెదడులో దాని మోతాదు తగ్గుతూ వస్తుండటంతో మందుల మోతాదును పెంచుతూ పోవాల్సి ఉంటుంది. లెవోడోపా / కార్బిడోపా అనే మందులు దేహంలోకి వెళ్లగానే డోపమైన్‌గా మారతాయి. మావో–బి ఇన్హిబిటార్స్ మందులు మరింత డోపమైన్ లభ్యమయ్యేలా చేస్తాయి. ∙యాంటీ కొలెనెర్జిక్ మందులు లక్షణాల తీవ్రతను తగ్గిం, ఉపశమనాన్నిస్తాయి. శస్త్రచికిత్స : మందుల మోతాదు పెరుగుతున్న కొద్దీ ఓ దశలో దుష్ప్రభావాలు మొదలవుతాయి. అందుకే మాత్రలు వేసుకున్నా ప్రయోజనం లేని సందర్భాల్లో ఇక చివరి యత్నంగా ‘డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ’ అనే శస్త్రచికిత్స అవసరం పడవచ్చు. నివారణతో పాటు అవసరమయ్యే ఇతర పద్ధతులు: ∙వ్యాయామం పార్కిన్సన్ వ్యాధిని కొంతమేరకు నివారిస్తుంది. ఫిజియోథెరపీ, రీ–హ్యాబిలిటేషన్, మింగలేని సమయాల్లో పోషకాహార లోపాలను అధిగమించడానికి విటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవడం. అలాగే పార్కిన్సన్ వ్యాధి వల్ల కుంగుబాటు (డిప్రెషన్) వంటి వనసిక సమస్యలు పార్కిన్సన్ వ్యాధికి దారితీసే ప్రమాదమూ ఉంది. అందుకే సైకియాట్రిక్ ఇవాల్యుయేషన్ అవసరం కావచ్చు. డాక్టర్ ఎం సాయి శ్రవంతి, కన్సల్టెంట్ న్యూరోఫిజిషియన్ (చదవండి: షిజెల్లోసిస్..! పిల్లల్ని బంకలా పట్టేస్తాయి!) -
షిజెల్లోసిస్..! పిల్లల్ని బంకలా పట్టేస్తాయి!
వర్షాలు కొన్ని ఆరోగ్య సమస్యల్ని వెంటబెట్టుకొస్తాయి. మరికొన్ని వ్యాధుల్ని మరింతగా పెచ్చరిల్లేలా చేస్తాయి. మరీ ముఖ్యంగా పిల్లల్లో! వాళ్లతో పాటు పెద్దల్లో కూడా. ఇది చిన్నదిగా కనిపించే పెద్ద సమస్యే. సామాన్యజనం పరిభాషలో ‘నెత్తుటిబంక విరేచనాలు’ అంటారు. విరేచనాలవుతూ ఉండగా అందులో కొద్దిగా రక్తం, మరికొద్దిగా చీములా పడుతుండటంతో ఈ పేరు. షిజెల్లా అనే ప్రజాతికి చెందిన ఓ బ్యాక్టీరియాతో వచ్చే సమస్య ఇది. కలుషితమైన నీటి వల్ల ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే వ్యాధి. నీరు కలుషితం అవ్వడానికి అనువుగా ఉండే ఈ సీజన్లో మరింత ఎక్కువగా కనిపిస్తుంది. షిజెల్లోసిస్ వ్యాధిపై అవగాహన కోసం ఈ కథనం. మానవ విసర్జకాలతో కలుషితమైన నీరు తాగడం వల్ల, ఆ నీటితో చేసిన వంటల వల్ల షిజెల్లా బ్యాక్టీరియా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిం, మానవ జీర్ణవ్యవస్థలోకి చేరి, విరేచనాలు మొదలవుతాయి. ఈ విరేచనాలు కాస్త జిగటగా, నెత్తురుతో ఉండటంతో మామూలు వాటికంటే ఎక్కువగా ఆందోళన కలిగిస్తాయి. పిల్లల్లో అందునా ఐదేళ్లలోపు వారిలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. కాబట్టి వారి విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూస్తుంటారు. లక్షణాలు: విరేచనాల్లో బంక (మ్యూకస్), నెత్తురు కనిపించడం. కడుపు పట్టేసినట్లుగా అనిపించడం (స్టమక్ క్రాంప్స్), కడుపు నొప్పి జ్వరం (జ్వరతీవ్రత 101 ఫారెన్‌హీట్ వరకు ఉండవచ్చు) వికారం, కొన్నిసార్లు వాంతులు. వ్యాప్తి ఇలా... ∙కలుషితాహారంతో : షిజెల్లా బ్యాక్టీరియాతో కలుషితమైన నీటితో తయారు చేసిన ఆహారంతో లేదా ఆ నీళ్లు తాగడం వల్ల; లేదా ఆ నీటిలో ఈదినప్పుడు నోట్లోకి వెళ్లినప్పుడు మింగడం వల్ల. వ్యక్తి నుంచి వ్యక్తికి: ఈ బ్యాక్టీరియా కలిగి ఉన్న వ్యక్తి తన పెదవుల్ని చేతులతో తాకాక అవే చేతుల్ని ఇతరులు ముట్టుకున్నప్పుడు. ఇది పిల్లల డే కేర్ సెంటర్లలో, పిల్లలను ఆడిపించే క్రష్‌లు, స్విమ్మింగ్‌పూల్స్ ద్వారా... అలాగే హైజీన్ తక్కువగా ఉండే విద్యార్థుల హాస్టల్స్, మెస్‌లు, క్యాంపస్‌లలో వ్యాపించే అవకావం ఎక్కువ. ఇక ప్రయాణాల్లో అంతగా పరిశుభ్రత పాటించని హోటళ్ల వల్ల కూడా ఒకరినుంచి మరొకరికి పాకవచ్చు. కొన్నిసార్లు కాంప్లికేషన్లు... డీ–హైడ్రేషన్‌తో : విరేచనాల కారణంగా దేహంలోని ద్రవాలను కోల్పోవడంతో డీ–హైడ్రేషన్‌కు గురికావచ్చు. ఫలితంగా తల తిరగడం (డిజ్జీనెస్); తేలిగ్గా అనిపించడం (లైట్ హెడెడ్నెస్); పిల్లల్లో కన్నీళ్లు కూడా కనిపించకపోవడం, కళ్లు లోతుకుపోయినట్లుగా కనిపించడం... మరీ చిన్నపిల్లల్లో ఈ పరిస్థితులు తీవ్రమైతే ఒక్కోసారి షాక్కూ... అటు తర్వాత ప్రాణాపాయానికి కూడా దారితీయవచ్చు. మూర్ఛ (సీజర్స్) : కొంతమంది పిల్లల్లో మూర్ఛ (సీజర్స్) కనిపించవచ్చు. జ్వర తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా జరిగే అవకావాలు ఎక్కువ. ∙మలద్వారం చివరి భాగం బయటికి జారడం (రెక్టల్ ప్రొలాప్స్) : జిగురుతో కూడిన మ్యూకస్ బంకలా పడటం వల్ల మలద్వారం చివరి భాగం బయటకు జారే అవకాశం ఉంటుంది. దీన్నే రెక్టల్ ప్రొలాప్స్ అంటారు. హీమోలైటిక్ అనీమియా : ఇది చాలా అరుదుగా మాత్రమే కనిపించే ముప్పు అయినప్పటికీ కొట్టి పారేయలేని సమస్య. నెత్తుటి విరేచనాలు అవుతుండటంవల్ల ఎర్రరక్తకణాల సంఖ్య తగ్గడం (హీమోలైటిక్ అనీమియా), ప్లేట్లెట్స్ తగ్గడం (థ్రాంబోసైటోపీనియా)... చాలా అరుదుగా ఒక్కోసారి మూత్రపిండాల వైఫల్యం కనిపించవచ్చు. టాక్సిక్ మెగాకోలన్: ఇది కూడా చాలా అరుదుగా మాత్రమే కనిపించే ముప్పు. ఇందులో పేగుల కదలిక (బవెల్ మూవ్మెంట్) మందగించి మలం ముందుకు కదలడం ఆగిపోవచ్చు. దాంతో గ్యాస్‌గానీ, మలవిసర్జన గానీ జరగకపోవచ్చు. ఇలాంటి వైఫల్యం కనిపింనప్పుడు దీన్ని మెడికల్ ఎమర్జెన్సీగా పరిగణిం వెంటనే చికిత్స తీసుకోకపోతే పెద్దపేగు గాయపడటంతో పాటు ఒక్కోసారి ప్రాణాపాయానికీ దారితీసే ప్రవదం ఉంటుంది. బ్యాక్టీరిమియా : షిజెల్లా ఇన్ఫెక్షన్తో పేగుల లోపలి లైనింగ్ దెబ్బతినవచ్చు. దాంతో ఇలా దెబ్బతిన్న ప్రాంతం నుంచి ఇన్ఫెక్షన్ రక్తంలోకి వ్యాపిస్తుంది. ఇది కాస్త అరుదు. నివారణ కేర్‌ఫుల్ డిస్పోజల్ ఆఫ్ డయపర్స్ : చిన్న పిల్లల డయపర్స్ను జాగ్రత్తగా పారేయాలి. వీటిని నీటివనరు (వాటర్ సోర్స్)తో కలవనివ్వకుండా జాగ్రత్తపడాలి. అప్పటికే విరేచనాల, నీళ్ల విరేచనాల, నెత్తుటిబంక విరేచనాలతో బాధపడుతున్నవారు... వంట చేయడం సరికాదు. వాళ్లు కిచెన్ నుంచి దూరంగా ఉండాలి. భోజనానికి ముందు, మల విసర్జన తర్వాత తప్పనిసరిగా కనీసం 20 సెకండ్ల పాటు సబ్బుతో రుద్దుతూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. గుడ్ టాయెలెట్ హ్యాబిట్స్: పిల్లలకూ చేతులు కడుక్కునే అలవాటు నేర్పాలి. స్ల్స్కూ, పిల్లల కేర్ సెంటర్స్, ఆటస్థలాలు, పిల్లలు ఆడుకునే ప్రదేశాలు, వాళ్ల టాయిలెట్స్ పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలు స్విమ్మింగ్ పూల్స్‌లో లేదా పల్లెల్లో చెరువులు, బావుల్లో ఈదుతున్నప్పుడు ఆ నీటిని మింగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చెరువులు, వాగుల వంటి నీటి వనరు నుంచి తెచ్చిన నీటిని కాచి వడబోయకుండా తాగవద్దు. అలాగే పట్టణాల్లోన కొళాయి/నల్లా నీటిని శుభ్రం చేయడం, వడబోయడం వంటివి చేయకుండా వాడకూడదు. --డాక్టర్ శివనారాయణ రెడ్డి, సీనియర్ పీడియాట్రీషియన్ (చదవండి: కీళ్లనొప్పులా?.. ఈ ఆహారం తీసుకోండి!) -
ఏదో ఒక కారణంతో..ఆ పిల్స్‌ని అదేపనిగా వాడుతున్నారా?!
నిద్రపట్టడం లేదు.. ఆందోళనగా ఉంది. మూడ్ బాగోలేదు.. స్ట్రెస్‌గా ఉంది. వీటన్నింటికీ మనవాళ్లు ఎంచుకుంటున్న మార్గం ‘పిల్’. ఒక మోతాదులో టాబ్లెట్ వాడితే సమస్య తగ్గిపోతుంది కదా! అనుకుంటారు. ఇది చెడు అలవాటు కాదనుకుంటారు. కానీ, ప్రతి చిన్న అనారోగ్య సమస్యకు టాబ్లెట్ వేసుకోవడం కూడా వ్యసనమే. నేటి రోజుల్లో చాలామంది వర్క్ టెన్షన్ అనో, స్ట్రెస్ అవుతున్నామనో స్లీపింగ్ పిల్స్‌కు అలవాటు పడిపోయేవారు పెరుగుతున్నారు. వీటిని ముందుగా డాక్టర్ని కలిసి వారి సలహాతో తీసుకోవడం మొదలుపెడతారు. ఆ టాబ్లెట్ వేసుకున్న కొన్ని రోజులు బాగా అనిపించి, ఆ పాత ప్రిస్క్రిప్షన్ పైన ఆ టాబ్లెట్లను అలాగే కంటిన్యూ చేస్తుంటారు. యాంగ్జైటీ పిల్స్, స్ట్రెస్ పిల్స్, మూడ్ ఎలివేటర్స్.. ఇలా విభిన్న రకాలుగా ఉండే ఈ పిల్స్‌ను ఆందోళనగా అనిపింనప్పుడల్లా వాడతారు, క్రమేణా వాటికి అలవాటు పడిపోయి మరిన్ని సమస్యల్లోకి కూరుకుపోతున్నారు. ∙∙ వసుధ సాఫ్ట్వేర్ ఇంజినీర్. ప్రాజెక్ట్ టీమ్ లీడర్‌గా బిజీ షెడ్యూల్ తనది. ఓ వైపు కుటుంబం, మరోవైపు ఒత్తిడితో కూడుకున్న ఉద్యోగం. కొన్నాళ్లు బాగానే మేనేజ్ చేసినా ఎదురయ్యే సమస్యలు టెన్షన్ పెట్టేవి. దీంతో ఆందోళన పెరిగిపోయేది. ఒత్తిడిని తగ్గించుకోవాలంటే బాగా నిద్రపోవాలని చెబుతుండేవారు స్నేహితులు. కానీ, ఆ ఒత్తిడి వల్లే నిద్ర పట్టడం లేదనేది వసుధ కంప్లైంట్. ఫ్రెండ్ సలహా మేరకు డాక్టర్ని కలిసింది. కొన్ని రోజులు ఆందోళన తగ్గడానికి ఒక మెడికల్ కోర్సును వాడమని చెప్పాడు డాక్టర్. ఆ కోర్స్ వాడాక తనకు చాలా రిలీఫ్‌గా అనిపింంది. ఆందోళనగా అనిపించినా, పనిభారంతో తల బరువుగా అనిపించినా అవే టాబ్లెట్స్ తెచ్చుకొని వాడటం మొదలుపెట్టింది. ప్రతి చిన్న ఆరోగ్య సమస్యకు టాబ్లెట్ లేనిదే పరిష్కారం కాదు అనేంత స్థాయికి వచ్చేసింది. నిద్ర పట్టడం లేదని రాత్రిళ్లు స్లీపింగ్ పిల్స్ వేసుకునేది. కానీ, ఆఫీసుకు వెళ్లినా ఆ మత్తు ఆమెను వదిలేది కాదు. దీంతో తీసుకున్న ప్రాజెక్ట్ వర్క్స్ చేయడంలో ఆలస్యం అవుతూ ఉండేది. రోజులో ఎక్కువ సమయం మత్తుగా ఉండటంతో జాబ్ పోయే పరిస్థితి ఎదురైంది. లాయర్, డాక్టర్, ఇంజినీర్.. ప్రతీ వృత్తి, ఉద్యోగం చేస్తున్నవారిలో ఎన్నో ఆందోళనలు ఎదుర్కోవడం చూస్తున్నాం. ఈ ఆందోళన స్థాయి వారి శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో సమస్యను సాల్వ్ చేసుకోవడానికి టాబ్లెట్స్‌ను ఆశ్రయించేవారు పెరుగుతున్నారు. శరీరానికి ఏ కొద్దిగా కెమికల్‌ను బయట నుంచి అలవాటు చేసినా మైండ్ మరికొంత మోతాదు పెంచేలా ప్రేరేపిస్తుంది. ఫలితంగా కెమికల్ మోతాదు శరీరంపై చెడు ప్రభావం చూపడానికి దోహదం చేస్తాయి. సహజమే కానీ.. ఈ సమస్యను ఎదుర్కొనేవారిలో అధిక శాతం చదువుకున్నవారే. ‘ఇదేమీ చెడు అలవాటు కాదు కదా! నేను సరైన విధంగా మానేజ్ చేసుకోగలుగుతున్నాను కదా’ అనుకుంటారు. బయటి వాళ్లకు కూడా వీళ్లు ‘పిల్స్’వాడుతున్నారనే విషయం తెలియదు. కొంత కాలం బాగానే గడిచిపోతుంది. కానీ, సమస్య మాత్రం పెరుగుతూనే ఉంటుంది. ఏ వ్యక్తిలో అయినా భావోద్వేగాలు మారిపోతుండటం సహజంగా జరుగుతుంది. కొందరు మాత్రం ప్రతిదానికి ఆందోళన పడే వారుంటారు. మన వ్యక్తిత్వం ఇలాంటిది అని అర్థం చేసుకొని, ఈ సమస్యనుం బయటకు రావడానికి నిపుణులు సాయం తీసుకోవాలి. కొందరికి రకరకాల ఫోబియాలు ఉంటాయి. వీటిని అధిగమించడానికి కూడా టాబ్లెట్స్‌ని ఆశ్రయిస్తుంటారు. ఇవీ వనసిక సమస్యలే అని గుర్తించాలి. బయటపడాలంటే టెక్నిక్స్: మనకు తెలియదు కానీ, చాలామంది మహిళల పర్సులలో కొన్ని టాబ్లెట్లు ఉంటాయి. అవి, పెయిన్ కిల్లర్స్, మూడ్ స్టెబిలైజర్స్, స్ట్రెస్ పిల్స్, స్లీపింగ్ పిల్స్... వంటి వాటిలో ఏవైనా ఉండచ్చు. ముందుగా వాటిని బయట పడేయాలి. ఏ సమస్య బాధిస్తోందో దానిని కుటుంబ సభ్యుల మధ్య లేదా నిపుణుల ముందు వ్యక్తం చేయాలి. ఆ సమస్యకు సంబంధించిన బ్లాక్స్‌ను క్లియర్ చేసుకుంటే సులువుగా బయటపడచ్చు. ప్రతి ఒక్కరిలోనూ సాధారణ ఆందోళనలు ఉంటాయి. కానీ, కొంతమంది మాత్రం ప్రతి చిన్న విషయానికీ ఆందోళన పడిపోతుంటారు. ఇది కొన్నిరోజులకు పెద్ద ఆందోళనగా వరుతుంటుంది. ఆందోళన తగ్గించుకోవడానికి పిల్స్ వాడకం బదులు, దానిని అధిగమించేలా మానసిక స్థైర్యాన్ని పెంచుకోవాలి. శరీరం కెమికల్ మీద ఎంతవరకు డిపెండ్ అయిందో గుర్తించి దానిని బ్రేక్ చేస్తాం. మైండ్‌ను రిలాక్స్‌గా ఉంచే యోగా, ధ్యానంతోపాటు సరైన పోషకాహారం మీదా దృష్టి పెట్టాలి. శరీరం బయట నుంచి తీసుకునే కెమికల్ కాకుండా సహజసిద్ధంగా మార్పులకు లోనయ్యేలా అలవాటు చేసుకున్నప్పుడు ఇంటర్నల్ సిస్టమ్ రీ యాక్టివేట్ అవుతుంది. – డాక్టర్ గిడియన్, డి–అడిక్షన్ థెరపిస్ట్ లివింగ్ సోబర్, హైదరాబాద్ (చదవండి: కీళ్లనొప్పులా?.. ఈ ఆహారం తీసుకోండి!) -
దెబ్బ తగిలిన ప్రతీసారీ టీటీ ఇంజెక్షన్ తీసుకోవాల్సిందేనా..?
దెబ్బ తగిలిందని టీటీ ఇంజెక్షన్ తీసుకుకున్నాను. అయినా నొప్పి తగ్గట్లేదు. టీటీ ఇంజెక్షన్ తీసుకున్నాక కూడా చీము పట్టింది. ఇనుప రేకు గీసుకుపోయింది..టీటీ ఇంజెక్షన్ ఇవ్వండి". దెబ్బ తగిలింది ఇనుముతో కాదు కదా.. టీటీ ఇంజెక్షన్ ఎందుకు? దెబ్బ తగిలింది.. టీటీ ఇంజెక్షన్ తీసుకొని ఆరు నెలలకు పైనే అయింది. మరో ఇంజెక్షన్ ఇవ్వండి. ప్రజలు నంచి సాధారణంగా వినే మాటలే ఇవీ.. దీన్నిబట్టి చూస్తే.. టీటీ ఇంజెక్షన్ గురించి సామాన్య ప్రజలకు చాలా అపోహలే ఉన్నట్లు తెలుస్తోంది. ఆ అపోహాలకు చెక్‌పెట్టి..అసలుఎప్పుడెప్పుడూ తీసుకోవాలి? అలసెందుకు తీసుకోవాలో చూద్దా!. ధనుర్వాతం.. టెటనస్.. లాక్ జా.. టెటనస్ అనేది మనుషులకు కలిగే ఎన్నో ఇన్ఫెక్షన్స్లో ఒకటి. దీని గురించిన మొదటి ప్రస్తావన క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలోనే హిప్పోక్రేట్స్ (Hippocrates) రచనల్లో కనిపిస్తుంది. ఇది ఒక ప్రాణాంతక వ్యాధి. ఈ రోజుకీ ధనుర్వాతం అంటే టెటనస్ బారిన పడిన వారిలో 70 నుంచి 80% మరణాలు నమోదు అవుతున్నాయి. కాబట్టి, చిన్న పిల్లలకు తప్పనిసరిగా ఇచ్చే టీకాలలో ఇది కూడా ఉంటుంది. గర్భిణులకు కూడా టీటీ ఇంజెక్షన్ ఇస్తారు. కాన్పు సమయంలో తల్లికి, బిడ్డకు ఇది రక్షణ ఇస్తుంది. ఈ ఇన్ఫెక్షన్కు కారణం క్లస్ట్రీడియమ్ టెటానీ(Clostridium Tetani) అనే ఒక సూక్ష్మ జీవి (బ్యాక్టీరియా). ఇవి మట్టిలో, నేలలో, దుమ్ములో, ఇలా ప్రతి చోటా ఉంటాయి. అవి శరీరంలోకి చేరుకున్నప్పుడు వ్యాధికి కారణం అవుతాయి. అయితే ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందదు. టీటీ ఇంజెక్షన్ కేవలం టెటనస్ వ్యాధి నుంచి రక్షణను ఇస్తుంది. అది కూడా దెబ్బ తగిలిన ఒక్క రోజు లోపు దీన్ని తీసుకోవాలి. ఇది శరీరంలోకి ఎలా చేరతుందంటే? శరీరానికి అయిన పుండ్లు, లేక తగిలిన దెబ్బల ద్వారా ఇవి శరీరంలోకి చేరగలవు. మొల, లేక ఏదైనా పదునైన వస్తువులు గుచ్చుకోడం వల్ల, శరీరానికి గాయం అయినప్పుడు చేరవచ్చు. కాలిన గాయాల నుంచి జరగొచ్చు. కాన్పు సమయంలో తల్లికి లేక పుట్టిన శిశువుకి బొడ్డు కోయడానికి వాడిన పరికరం సరిగ్గా లేకపోతే ఆ శిశువుకి ధనుర్వాతం కలిగే అవకాశం ఉంది. ఏదైన ప్రమాదం జరిగినప్పుడు, తగిలిన గాయాల ద్వారా వ్యాధి కారకాలు శరీరంలోకి చేరగలవు. ఆసుపత్రుల్లో శస్త్ర చికిత్సలు జరిగినప్పుడు, లేక ఏదైనా పట్టీ కట్టినప్పుడు లేదా మార్చినప్పుడు చేరే అవకాశం ఉంటుంది. కుక్క లేక ఇతర జంతువులు కరిచినప్పుడు ఆ గాయాల ద్వారా సంభవించవచ్చు. ఎముకలు విరగడం, లేక దీర్ఘ కాలిక పుండ్లు, గాయాలు ఉన్న వారికి వచ్చే అవకాశం ఉంది. లక్షణాలు.. ►వ్యాప్తి ఎలా జరిగింది అనే దాన్ని బట్టి, ఎన్ని రోజులకు లక్షణాలు కనిపిస్తాయి అనేది ఆధారపడి ఉంటుంది. ►ఎక్కువ శాతం రెండు వారాలలోపు వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రమైన గాయాలలో, లక్షణాలు కొన్ని గంటల నుంచి, ఒకటి రెండు రోజుల్లోనే కనిపిస్తాయి. చిన్న గాయాలతో కొన్ని నెలల తరవాత కూడా లక్షణాలు కనిపించే అవకాశం ఉంది. ►ఎక్కువ శాతం కేసుల్లో మొదట నోటి కండరాలు పట్టేస్తుంటాయి. తర్వాత ఒకొక్కటిగా అన్ని కండరాలు బిగుసుకుపోవడంతో, నొప్పి ఎక్కువవుతుంది. క్రమేణా, అన్ని కండరాలు బిగించినట్టు పట్టేస్తాయి. ఆహారం మింగడం కష్టంగా మారుతుంది. ►తీవ్రమైన తలనొప్పి, అదుపు లేకుండా జ్వరం, చెమటలు కూడా కనిపిస్తాయి. అదుపు లేకుండా శరీర భాగాలలో కదలికలతో మూర్ఛ, ఫిట్స్ తరవాత దశలో కనిపిస్తాయి. ►గుండె వేగంగా కొట్టుకుంటుంది, రక్త పోటు పెరిగి క్రమేణా ప్రాణాపాయ స్థితి వస్తుంది. చికిత్స విధానం: ⇒ఈ వ్యాధిని తొలి దశల్లో కచ్చితంగా నిర్ధారించడం కష్టం. లక్షణాల ఆధారంగా, ఎక్కువ శాతం దీనిని గుర్తిస్తారు. ⇒వ్యాధి లక్షణాలు కనిపించిన తరవాత చికిత్స చాలా వేగంగా అందించాలి. వెంటనే పెద్ద ఆసుపత్రిలో చేరి, గాయం అయిన చోటును పూర్తిగా శుభ్రపరిచి, యాంటీబయోటిక్ ⇒ఇంజెక్షన్లు, కండరాల నొప్పులకు, పట్టేయడాన్ని తగ్గించే (muscle relaxant) మందులు వాడుతూ, ఒంట్లో నీరు తగ్గకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ⇒ఇమ్యునోగ్లోబిన్ ఇంజెక్షన్లు ఇవ్వాల్సిన పరిస్థితి రావొచ్చు. అవసరాన్ని బట్టి, కృత్రిమ శ్వాస అందిస్తూ, మందుల ప్రభావం కోసం ఎదురు చూడాలి. నివారణ: ధనుర్వాతాన్ని నివారించే సులువైన, ఏకైక మార్గం టీకా తీసుకోవడం. అందుకే చిన్న పిల్లలకు ప్రభుత్వం అందించే టీకాలల్లో డిఫ్తీరియా( కంఠవాతము), కోరింత దగ్గు టీకాలతో పాటు ధనుర్వాతం టీకా కూడా ఉంటుంది. అలాగే అయిదు సంవత్సరాలు, పది సంవత్సరాల వయసులో బూస్టర్ డోస్ ఇస్తారు. ఆ తరవాత పెద్ద వాళ్ళల్లో, ప్రతి పది సంవత్సరాలకు ఒక డోస్ టీకా తీసుకోవాలి. కాన్పు సమయంలో బిడ్డకు వ్యాధి సోకకుండా, గర్భిణులు తప్పకుండా టీటీ ఇంజెక్షన్ తీసుకోవాలి. ఏదైన దెబ్బ తగిలినా, కాలిన గాయాలు, లేక పుండ్లు ఉన్నా, వాటిని శుభ్రం ఉంచుకోవాలి. అవి మానేవరకు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. టీటీ ఇంజెక్షన్‌పై కొన్ని అపోహలు/ నిజాలు ఇవే... దెబ్బ వల్ల కలిగే నొప్పిని టీటీ ఇంజెక్షన్ తగ్గించలేదు. టీటీ ఇంజెక్షన్ తీసుకున్నాక కూడా ఇతర క్రిముల వల్ల ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంది. పుండు తగ్గే వరకు జాగ్రత్తగా ఇతర మందులు వాడాలి. ఆ ఇన్ఫెక్షన్ కేవలం తుప్పు పట్టిన వాటి నుంచే కాదు.. ఏ గాయం వల్ల అయినా కలగవచ్చు. ఒకసారి టీటీ ఇంజెక్షన్ తీసుకుంటే పది సంవత్సరాల వరకు అది ధనుర్వాతం రాకుండా రక్షణ ఇస్తుంది. ప్రతి ఆరు నెలలకు మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రాణాంతక వ్యాధి అయిన టెటనస్ రాకుండా ఉండడానికి టీటీ ఇంజెక్షన్ తీసుకోవడం చాలా ముఖ్యం. డాక్టర్ నవీన్ రోయ్, ఆయుర్వేద వైద్యులు, ఆరోగ్య నిపుణులు (చదవండి: చీమల తేనె గురించి విన్నారా! ఇది జలుబు, గొంతు నొప్పి ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుందట!) -
వర్షాకాలంలో వేధించే చర్మవ్యాధులకు చెక్ పెట్టండి ఇలా..
వర్షాకాలంలో దురదలు ఇన్ఫెక్షన్లుకు ఎందుకొస్తాయని అందరి మదిలో ఎదురై ప్రశ్నే..మరీ ముఖ్యంగా కాలి వేళ్లు, చర్మం మడతలలో దురద, తామర, గజ్జి వంటి వాటితో ఒకరకమైన ఇబ్బంది ఉంటుంది. అందుకు కారణంలో వేడి తేమతో కూడిన పరిస్థితులు. ఈ కాలంలో గాల్లో ఉండే తేమ కారణంగా బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది. మనం ఈ కాలంలో కురిసే వాన కారణంగా కాళ్లకు వేసుకునే సాక్స్ దగ్గర్నుంచి, వివిధ చెప్పులు తడచిపోవటం లేదా చాల సేపటి వరకు నీటిలో నానిపోయి ఉండటం జరుగుతుంది. పైగా ఈ కాలంలో తడిగా అయిన వస్తువు డ్రైగా ఉండే అవకాశమే తక్కువ. పూర్తి స్తాయిలో ్రడైగా ఉండదు ఆ దుస్తులు లేదా సాక్స్‌లు వేసుకున్నా బ్యాక్టీరియా చేసి ఈ దురద, తామర వంటి ఇన్షెక్షన్లు వస్తాయి. ఎలాంటి సైడ్ ఎఫ్టెక్టులు లేని ఆయుర్వేదంలోని ఈ చిట్కాలు ఫాలోయితో ఈజీగా బయటపడొచ్చు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. అవేమిటో చూద్దామా!జ ఇన్ఫెక్షన్లకు చెక్ పెట్టండి ఇలా.. హైడ్రోకార్టిసోన్ క్రీమ్: ఈ క్రీమ్ తామర, దురద, గజ్జితో సంబంధం ఉన్నవాపులను తగ్గించడంలో సహాయపడుతుంది. కాలమైన్ ఔషదం: కాలమైన్ లోషన్ చర్మం దురదను ఉపశమనం చేస్తుంది. అలాగే తామర, దురద, గజ్జి వల్ల కలిగే దద్దుర్లు నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. యాంటిహిస్టామైన్లు: బెనాడ్రిల్ వంటి కొన్ని యాంటిహిస్టామైన్లు, తామర, దురద మరియు గజ్జితో సంబంధం ఉన్న దురద నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి. టీట్రీఆయిల్: టీ ట్రీ ఆయిల్లో యాంటీమైక్రోబయల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి గజ్జి, తామర దురదతో, సంబంధం ఉన్న లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి. కలబంద: ఇది ఒక అద్భుత మూలిక, ఇది దాదాపు ఏ చర్మ పరిస్థితికైనా చాలా ప్రభావవంతంగా ఉంటుంది. కలబంద ఆకును చూర్ణం చేసి, దానిలోని జెల్‌ను ప్రభావిత ప్రాంతంలో పూయండి. ముందుగా ఆ ప్రాంతాన్ని క్రిమిసంహారక మందుతో కడగాలని నిర్ధారించుకోండి. కొబ్బరి నూనె: దీనిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి, ఇది బాక్టీరియా, శిలీంధ్రాల వల్ల కలిగే చర్మ వ్యాధులకు చక్కటి ఔషధంలా పనిచేస్తుంది. దాల్చినచెక్క సారాంశాన్ని జోడించడం వల్ల సూక్ష్మజీవుల పెరుగుదలను అరికట్టడంలో మీ చర్మాన్ని వ్యాధి రహితంగా ఉంచడంలో ఇది మరింత ప్రభావవంతంగా ఉంటుంది. వెల్లుల్లి: తాజా వెల్లుల్లి యొక్క కొన్ని లవంగాలను చూర్ణం చేసి, ఆ పేస్ట్‌ను దురద ఉన్న ప్రదేశంలో రోజుకు రెండు లేదా మూడు సార్లు రాయండి. వెల్లుల్లిని నమలడం కూడా రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడుతుంది. గమనిక: కొందరికి పడకపోవచ్చు అది ఎలా తెలుస్తుందంటే..మీరు వెల్లులి పేస్ట్ చర్మంపై రానివెంటనే ఎర్రగా మారి దురద ఇంకాస్తా ఎక్కువై రక్తం కారేంత బాధగా ఉంటుంది. అలా అనిపిస్తే..ఉపయోగించకండి. వేప, పసుపుల పేస్ట్: కొన్ని తాజా వేప ఆకులను తీసుకుని, తాజా పసుపు ముక్కను వేసి మెత్తగా పేస్ట్ చేయండి. ఈ పేస్ట్‌ని దురద ఉన్న చోట అప్లై చేయడం వల్ల ఉపశమనం కలుగుతుంది. పుదీనా రసాం: ఇది కూడా బ్యాక్టీరియా, ఈస్ట్ మరియు శిలీంధ్రాల పెరుగుదలను నిరోధిస్తుంది. దురదలు దద్దుర్లు నిరోధించడంలో మంచి సహాయకారిగా ఉంటుంది. అలాగే వీటన్నింటి తోపాటు మనం నిత్యం తీసుకునే డైట్ కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. తీపి ఆహారపదార్థాలకు దూరంగా ఉండండి. ఎందకంటే ఇవి మీ శరీరంలోని ఈస్ట్ పెరుగుదలను పెంచి ఇన్ఫెక్షన్లను తీవ్రతరం చేస్తాయి. (చదవండి: ఈ వర్షాకాలంలో ఈ పండ్లు తీసుకుంటే..ఇమ్యూనిటీ ఫుల్!) -
పిల్లల చేత ఇలా చేయిస్తే.. మెడనొప్పిని నివారించొచ్చు..
పిల్లల్లో మెడనొప్పి అంతగా కనిపించకపోయినా అరుదేమీ కాదు. వాళ్ల రోజువారీ అలవాట్లవల్ల కొద్దిమందిలో అప్పుడప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. ఉదాహరణకు వీపు వెనక పుస్తకాల బ్యాగ్ తాలూకు బరువు మోస్తూ... మెడను ముందుకు చాపి నడుస్తూ ఉండటం, స్కూళ్లలో బెంచీల మీద కూర్చుని... చాలాసేపు మెడ నిటారుగా ఉంచడం, కంప్యూటర్ మీద ఆటలాడుతూ చాలాసేపు మెడను కదిలించకుండా ఉంచడం వంటి అనేక అంశాలతో మెడనొప్పి రావచ్చు. ఇలాంటి పిల్లల చేత తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు పాటించేలా చేయడం వల్ల మెడనొప్పిని నివారించవచ్చు. స్కూల్లో తమ బెంచీ నుంచి డెస్క్కూ / ఇంట్లో తమ రీడింగ్ టేబుల్ నుంచి తమ కుర్చీకీ తగినంత దూరంలో ఉందా, పిల్లల ఎత్తుకు తగినట్లుగా ఉందా అన్నది చూసుకోవాలి. లేదంటే తల్లిదండ్రులు ఆ రీడింగ్ టేబుల్ ఎత్తును అడ్జెస్ట్ చేయాలి. వాటికి తగినట్లుగా తమ కూర్చునే భంగిమ (పోష్చర్) సరిగా ఉందా అన్నది కూడా తల్లిదండ్రులు పరిశీలించాలి. ∙స్కూల్లో లేదా ఇంట్లో... చదివే సమయాల్లో వెన్నును కంఫర్టబుల్‌గా ఉంచుకోవాలి. వెన్ను ఏదో ఒక వైపునకు ఒంగిపోయేలా కూర్చోకూడదు. అదే పనిగా చదవకుండా మధ్య మధ్య గ్యాప్ ఇస్తుండాలి. ∙పిల్లలు వీడియో గేమ్స్ ఆడుతూ... మెడను చాలాసేపు నిటారుగా ఉంచడం సరికాదు. మధ్యమధ్యన మెడకు విశ్రాంతినిస్తూ ఉండాలి. ∙పిల్లలు వీడియోగేమ్స్ మాత్రమే కాదు... గ్రౌండ్లోనూ ఆటలాడేలా పేరెంట్స్ ప్రోత్సహించాలి. ∙ఊబకాయం ఉన్న పిల్లల్లో మెడనొప్పి వచ్చే అవకాశాలెక్కువ. అందుకే వారు తినే తినుబండారాలు ఆరోగ్యకరంగా ఉండాలి. వీలైనంతవరకు జంక్‌ఫుడ్ /బేకరీ ఐటమ్స్‌కు దూరంగా ఉంచాలి. ఈ జాగ్రత్తలు మెడనొప్పిని నివారిస్తాయి. అప్పటికే మెడనొప్పి ఉంటే తగ్గిస్తాయి. ఇవి పాటించాక కూడా తగ్గకపోతే ఒకసారి డాక్టర్‌ను సంప్రదించాలి.