TS Special
-
పోలీసుల తీరు అమానుషం
సాక్షి, హైదరాబాద్/కరీంనగర్ టౌన్/ ఏజీ వర్సిటీ: హైదరాబాద్ రాజేంద్రనగర్ వ్యవసాయ యూని వర్సిటీలో ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీని జుట్టు పట్టుకుని మహిళా కానిస్టేబుళ్లు ఈడ్చుకెళ్ళిన ఘట నను రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. విద్యార్థినిపై పోలీసుల చర్య అమానుషమని కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటనపై తక్ష ణమే సమగ్ర విచారణ జరిపి కమిషన్‌కు నివేదిక సమర్పించాలని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను ఆదేశించింది. ప్రభుత్వ ప్రోత్సాహం ఉంది: బీజేపీ ఆగ్రహం ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీపై పోలీసుల దాడిని బీజేపీ ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు రాణీ రుద్రమ, బండారు విజయలక్ష్మి తీవ్రంగా ఖండించారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే వారికి ప్రభుత్వ ప్రోత్సాహం ఉన్నట్టు స్పష్టం అవుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వ విధానాన్ని విడనాడి, ఈ ఘటనపై వెంటనే స్పందించాలని వారు డిమాండ్ చేశారు. మహిళా నాయకురాలి జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్ళిన పోలీసులపై ఇప్పటిదాకా సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ధర్నా చౌక్‌ను మూసేసి, ప్రశ్నించే గొంతుకలను నొక్కేసిన దొర పాలనను అంతం చేసి ఒక ప్రత్యా మ్నాయాన్ని కోరుకున్న తెలంగాణ ప్రజల ఆశల మీద నీళ్లు చల్లి రేవంత్‌రెడ్డి మరో కొత్త దొరలా తయారయ్యారని వారు ఆరోపించారు. మహిళా కానిస్టేబుల్స్ వ్యవహరించిన తీరుతో సభ్యసమా జం తలదించుకుంటోందన్నారు. దాడికి పాల్పడిన మహిళా పోలీసులపై చట్టపరంగా చర్యలు తీసుకో వాలని వారు ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. ఇది అత్యంత అమానుషం: సబిత వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా వచ్చిన మహిళా నేత పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు అత్యంత అమానుష చర్య అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తీవ్రంగా ఖండించారు. విద్యార్థినిపై జులుం ప్రదర్శించిన కానిస్టేబుళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర రాజధానికి అత్యంత సమీపంలోనే ఈ ఘటన జరగడం ప్రభుత్వ వైఫల్యాన్ని చాటుతోందన్నారు. కఠిన చర్యలు తీసుకోవాల్సిందే: బండి ఏబీవీపీ మహిళా నాయకురాలిపై పోలీసులు వ్యవహరించిన తీరును సభ్యసమాజం అస హ్యించుకుంటోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. గురువారం కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజల కోసం నిజాయితీగా, శాంతియుతంగా పోరాడుతున్న నాయకురాలిని జుట్టు పట్టుకుని స్కూటీపై ఈడ్చుకుంటూ లాక్కుపోతారా? ఇంతకన్నా హేయమైన చర్య ఉంటుందా అని మండిపడ్డారు. తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని బండి డిమాండ్ చేశారు. -
మూసీ సుందరీకరణే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: మూసీ నది సుందరీక రణ, స్థిరమైన అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ’’రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుస్తుందా? అని ఎన్నికల వేళ మాట్లాడుకున్నారు, గెలిచి చూపించాం. ఇ ప్పుడు ప్రభుత్వం మూసీ ప్రక్షాళన చేస్తుందా? అని హేళనగా మాట్లాడుతున్నారు. మూ సీ పరీవాహక ప్రాంతాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయబోతున్నాం’’ అని ఆయన వెల్లడించారు. కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ఆధ్వర్యంలో గురువారం నగరంలో జరిగిన ఇన్ఫ్రా అండ్ రియల్ ఎస్టే ట్ సమ్మిట్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి మాట్లాడారు. ఔటర్ రింగ్ రోడ్ (ఓ ఆర్ఆర్ఆర్), రీజినల్ రింగ్ రోడ్ (ట్రిపుల్ ఆర్) మధ్య 13 క్లస్టర్ల ఏర్పాటుతో ఆయా ప్రాంతాలలో సాంసృతిక వ్యాపారాలకు అవ కాశం ఉంటుందని వివరించారు. పీపీపీ విధా నంలో టౌన్‌షిప్‌ల నిర్మాణం చేపడతామని చెప్పారు. ప్రభుత్వం అనేది.. కేవలం వ్యాపా రాన్ని సులభతరం చేసే ఒక వేదిక మాత్రమే నని, మౌలిక వసతుల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తల సహకారం అవసరమని ఆయన పునరుద్ఘాటించారు. మూడు దశాబ్దాలుగా స్థిరాస్తి రంగం పుంజుకుందని, సుస్థిరమైన విధానాలతో స్థిరాస్తి రంగంలో మరింత అభివృద్ధి కోసం కృషి చేస్తామని మంత్రి చెప్పారు. గత ప్రభుత్వం చేపట్టిన ప్రగతి పనులను ఆపబోమని స్పష్టం చేశారు. మూసీనదిలో పడవ రవాణా సదుపాయం: దాన కిషోర్ గ్రేటర్ హైదరాబాద్‌కు మూసీ నది చోదక శక్తికి మారనుందని హెచ్ఎండీఏ పిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ తెలిపారు. గ్రేటర్లో దాదాపు 55 కిలోమీటర్లు మేర ఉన్న మూసీ నది వెంట గోల్కొండ, సాలార్జంగ్ మ్యూజి యం, చార్మినార్, హైకోర్టు, ఉస్మానియా వంటి ఎన్నో వారసత్వ ప్రదేశాలు కొలువై ఉన్నాయని, అందుకే మూసీ రివర్ ఫ్రంట్ కోసం ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని తెలిపారు. మూసీ ప్రవాహంలో సగ భాగం మెట్రో, సగం భాగం రోడ్డు మార్గం ఉంటుందని, దీంతో పాటు మూసీలో పడవ రవాణా ప్రయాణ సదుపాయం వచ్చేలా పటిష్టమైన ప్రణాళికలుంటాయని పేర్కొన్నారు. ఇప్పటివరకు పశ్చిమ ప్రాంతంలోనే కేంద్రీకృతమైన అభివృద్ధిని మూసీ రివర్ ఫ్రంట్‌తో నగరం నడిబొడ్డుకు తీసుకొస్తామని దాన కిషోర్ హామీ ఇచ్చారు. ఇందుకోసం మూసీ పరివాహం వెంట వాక్ టు వర్క్ ప్రాజెక్ట్‌లను నిర్మించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని యువతకు నైపుణ్యం పెంపొందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని దాన కిషోర్ తెలిపారు. ఇప్పటివరకు ఉన్న డిప్లమో కోర్సులు నేర్చుకుంటే ఉద్యోగ అవకాశాలు, వేతనాలు తక్కువ అని అందుకే ఈ కోర్సులను గ్రాడ్యుయేషన్ స్థాయికి తీసుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించుకుందని ఆయన వెల్లడించారు. -
టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా మహేందర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీ స్ కమిషన్ చైర్మన్ (టీఎస్పీఎస్సీ)గా రాష్ట్ర మా జీ డీజీపీ మహేందర్‌రెడ్డి నియమితులయ్యా రు. అదేవిధంగా కమిషన్‌లో పది మంది సభ్యు ల నియామకానికి అవకాశం ఉండగా.. ప్రభు త్వం చేసిన ప్రతిపాదనల మేరకు ఐదుగురిని సభ్యులుగా నియమించడానికి గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ఆమోదం తెలిపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగా ని యమితులైన చైర్మన్, సభ్యుల పదవీ కాలం ఆరే ళ్ల పాటు ఉంటుంది. అయితే 62 ఏళ్లు పైబడిన వారు పదవీ విరమణ పొందాల్సి ఉంటుంది. దరఖాస్తులు స్వీకరించి.. సెర్చ్ కమిటీ వేసి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన దిశగా చర్యలు వేగవంతం చేసింది. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం, తదనంతర పరిణామాల నేపథ్యంలో గతంలో కమిషన్ చైర్మన్‌గా వ్యవ హరించిన బి.జనార్ధన్‌రెడ్డి డిసెంబర్లో రాజీ నామా చేశారు. ఆ తర్వాత ఐదుగురు సభ్యులు కూడా రాజీనామా చేయడంతో కొత్తగా చైర్మన్, సభ్యుల నియామకం అనివార్యమైంది. ఈ నేపథ్యంలోనే వివిధ రాష్ట్రాల్లో పీఎస్సీల పనితీరును అధ్యయనం చేయాల్సిందిగా సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తాను స్వయంగా యూపీఎస్సీ చైర్మన్‌తో సమావేశమై టీఎస్పీఎస్సీ నిర్వహణకు సలహాలు సూచనలు కోరారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల ఎంపిక ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి నుంచి దరఖాస్తులు స్వీకరించింది. వాటి పరిశీలనకు సెర్చ్ కమిటీని ఏర్పాటు చేసింది. దరఖాస్తుల వడపోత అనంతరం సెర్చ్ కమిటీ చైర్మన్, సభ్యుల కోసం కొన్ని పేర్లను ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు సమాచారం. కాగా ఈ మేరకు రాష్ట్ర సర్కారు చేసిన ప్రతిపాదనలకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు. 36 ఏళ్ల సుదీర్ఘ అనుభవం టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా నియమితులైన మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. 1962 డిసెంబర్ 3న ఆయన జన్మించారు. దాదాపు 36 సంవత్సరాల పాటు సర్వీసులో కొనసాగిన మహేందర్‌రెడ్డి 2022 డిసెంబర్ నెలాఖరులో పదవీ విరమణ చేశారు. టీఎస్పీఎస్సీ టీమ్ ఇదే చైర్మన్: ఎం.మహేందర్‌రెడ్డి(రిటైర్డ్ ఐపీఎస్) సభ్యులు: అనితా రాజేంద్ర (రిటైర్డ్ ఐఏఎస్), అమిర్ ఉల్లా ఖాన్, (రిటైర్డ్ ఇండియన్ పోస్టల్ సర్వీస్), ప్రొఫెసర్ నర్రి యాదయ్య, యరబడి రామ్మోహన్రావు, పాల్వాయి రజినీకుమారి టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల బయోడేటాలు పేరు: ఎం.మహేందర్ రెడ్డి స్వస్థలం : ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం కిష్టాపురం గ్రామం పుట్టిన తేదీ : 1962 డిసెంబర్ 3 సామాజికవర్గం: రెడ్డి (ఓసీ) విద్యార్హతలు: ఆర్ఈసీ వరంగల్ నుంచి బీటెక్ (సివిల్), ఐఐటీ ఢిల్లీ నుంచి ఎంటెక్ హోదా: రిటైర్డ్ డీజీపీ (2022 డిసెంబర్) (1986 బ్యాచ్ ఐపీఎస్) పేరు: అనితా రాజేంద్ర స్వస్థలం : రంగారెడ్డి జిల్లా కిస్మత్పూర్ పుట్టిన తేదీ : 1963 ఫిబ్రవరి 04, బీసీ–బీ (గౌడ) విద్యార్హతలు: బీకాం, ఎంఏ, ఎల్ఎల్ఎం హోదా: రిటైర్డ్ ఐఏఎస్ పేరు: అమిర్ ఉల్లా ఖాన్ స్వస్థలం : హైదరాబాద్ సామాజికవర్గం : ముస్లిం వయస్సు: 58 ఏళ్లు అనుభవం: యూఎన్‌డీపీలో పనిచేస్తున్నారు. ఉర్దూ వర్సిటీ, నల్సార్, ఐఎస్బీ, ఎంసీఆర్హెచ్ఆర్డీలో విజిటింగ్ ప్రొఫెసర్. హోదా: ఇండియన్ పోస్టల్ ఉద్యోగానికి రాజీనామా పేరు: పాల్వాయి రజనీకుమారి స్వస్థలం : సూర్యాపేట పుట్టిన తేదీ: 06–05–1972, ఎస్సీ మాదిగ విద్యార్హతలు: ఎంఏ, బీఈడీ, ఎల్ఎల్బీ హోదా: టీచర్, వీడీఓ, మున్సిపల్ కమిషనర్ పేరు: వై.రామ్మోహన్రావు స్వస్థలం : హైదరాబాద్ పుట్టిన తేదీ : 1963 ఏప్రిల్ 4 సామాజికవర్గం : ఎస్టీ–ఎరుకల విద్యార్హతలు: బీఈ, ఎంబీఏ హోదా: ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, తెలంగాణ జెన్కో పేరు: డాక్టర్ నర్రి యాదయ్య స్వస్థలం: మల్లారెడ్డిగూడెం, యాద్రాది భువనగిరి జిల్లా పుట్టిన తేదీ : 1964–4–10 సామాజికవర్గం: బీసీ–బీ(కురుమ) విద్యార్హతలు: ఎంటెక్ , పీహెచ్డీ హోదా: సీనియర్ ప్రొఫెసర్, జేఎన్టీయూహెచ్, కూకట్పల్లి -
ఇకపై ఎంసెట్.. టీఎస్ఈఏపీసెట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్ఈఏపీసెట్), టీఎస్ ఈ సెట్, టీఎస్ ఎడ్‌సెట్ సహా మొత్తం ఎనిమిది ప్రవేశపరీక్షల తేదీలను ఖరారు చేస్తూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి షెడ్యూల్‌ను ప్రకటించింది. రాబోయే 2024–25 విద్యాసంవత్సరానికి సంబంధించిన వివిధ కోర్సుల్లో ప్రవేశం నిమిత్తం నిర్వహించే పరీక్షల తేదీలు, వాటిని నిర్వహించే విశ్వవిద్యాలయాల వివరాలను వెల్లడించింది. రాష్ట్రంలో గతంలో టీఎస్ ఎంసెట్‌గా ఉన్న పేరును గత కొంతకాలంగా విడిగా నీట్ ద్వారా మెడిసిన్ ప్రవేశాలను నిర్వహిస్తుండడంతో టీఎస్ఈఏపీసెట్గా మారుస్తూ ఉత్తర్వులిచ్చింది. గురువారం ఈ మేరకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, టీఎస్సీహెచ్ఈ చైర్మన్ ప్రొ. ఆర్, లింబాద్రి షెడ్యూల్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో... టీఎస్సీహెచ్ఈ వైస్ చైర్మన్ ప్రొ. ఎస్కే మహమూద్, జేఎన్టీయూ–హెచ్ వీసీ ప్రొ. కట్టా నర్సింహారెడ్డి, ఉస్మానియా విశ్వవిద్యాలయం వీసీ ప్రొ.డి.రవీందర్, కాకతీయ విశ్వవిద్యాలయం వీసీ ప్రొ.టి.రమేశ్ పాల్గొన్నారు. ఈ ప్రవేశపరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు ..షెడ్యూల్, దరఖాస్తు చేసుకునేందుకు అర్హతలు, చెల్లించాల్సిన రిజిస్ట్రేషన్ పీజు తదితరాల గురించి సంబంధించి సెట్ కన్వీనర్లు ప్రకటిస్తారని ఉన్నత విద్యామండలి కార్యదర్శి డా. ఎన్.శ్రీనివాసరావు తెలిపారు. ఈ ఎనిమిది ప్రవేశపరీక్షలకు సంబంధించిన కంప్యూటర్ ఆధారిత పరీక్షల (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లు) టీఎస్ సెట్ల తేదీలు, నిర్వహించే యూనివర్సిటీల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.... -
బీఆర్ఎస్.. మళ్లీ టీఆర్ఎస్ కానుందా?
\హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ధ్వజమెత్తారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టి 45 రోజులైనా సాధించింది ఏమీ లేదని మండిపడ్డారు. సీఎం రేవంత్ సాధించింది ఏమైనా ఉందంటే అది వారానికి రెండు ఢిల్లీ టూర్లు మాత్రమేనని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలనంతా ఢిల్లీ నుంచే సాగుతుందని కేటీఆర్ విమర్శించారు. దావోస్‌కు వెళ్లి ప్రపంచవేదికపై పచ్చి అబద్ధాలే మాట్లాడారన్నారు. ‘అనేక విషయాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకుంటుంది. కేఆర్ఎంబీ విషయంలో ప్రాజెక్లులు కేంద్రం చేతుల్లోకి వెళ్లాయి. మహబూబ్‌నగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాలు తీవ్రంగా నష్టపోతాయి. రేవంత్‌రెడ్డి, బండి సంజయ్ మాటలు ఒకేలా ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త సచివాలయం కడితే గగ్గోలు పెట్టిన కాంగ్రెస్.. ఇప్పుడు కొత్త క్యాంపు ఆఫీసు, కొత్త హైకోర్టు ఎట్లా కడుతున్నారు?, సీఎం మారినప్పుడల్లా కొత్త క్యాంపు ఆఫీసులు వస్తాయా?, మేము కట్టిన ప్రగతి భవన్‌ను ఈగోతో డిప్యూటీ సీఎం భట్టికి రేవంత్‌రెడ్డి ఇచ్చారు. క్యాబినెట్లో చర్చించకుండానే రేవంత్‌రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారు. భేషజాల వల్లే ప్రగతిభవన్‌ను సీఎం రేవంత్‌రెడ్డి వాడటం లేదు. మేము దావోస్ పర్యటనలకు వెళ్తే బోగస్ అన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. సీఎం రేవంత్‌రెడ్డి దావోస్ పర్యటనపై సమాధానం చెప్పాలి. సీఎం రేవంత్‌రెడ్డి దావోస్ పర్యటనకు ఎందుకు వెళ్లారని భట్టి ప్రశ్నించినట్లు ఉంది. రేవంత్‌రెడ్డిపై భట్టి యుద్ధం చేస్తున్నట్లు అనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం టైంపాస్ ప్రభుత్వంగా మారింది. బెల్టు షాపులు ఎత్తివేస్తామని, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కాళేశ్వరం ద్వారా చుక్క నీరు రాలేదన్నారు. మంత్రి కొండా సురేఖ లక్షా పదివేల ఎకరాలకు రంగనాయక సాగర్ నీళ్లను విడుదల చేసిందుకు ధన్యవాదాలు. తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే వంద రోజుల్లో హామీల అమలును నిలబెట్టుకోవాలి.కోటీ 57 లక్షల మంది మహిళలకు మహాలక్ష్మి ఎప్పటి నుండి ఇస్తారో చెప్పాలి. ఆరు గ్యారెంటీల అమలుకు జీవోలు ఇవ్వండి. ఎన్నికల కోడ్ పేరుతో తప్పించుకోవాలని చూస్తున్నారు’ అని కేటీఆర్ ఆరోపించారు. ఫిబ్రవరి 10లోగా అసెంబ్లీ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ పార్టీ భేటీలు ఉంటాయన్న కేటీఆర్.. కేఆర్ఎంబీపై తెలంగాణ ప్రయోజనాల తాకట్టు, పార్టీ అంతర్గత నిర్మాణంపై దృష్టి కేంద్రీకరించామన్నారు. ఇక బీఆర్ఎస్ పేరు మార్పు అంశంపై చర్చిస్తున్నట్లు కేటీఆర్ స్పష్టం చేశారు.దాంతో బీఆర్ఎస్.. మళ్లీ టీఆర్ఎస్ కానుందా? అనే చర్చ మొదలైంది. -
కేసీఆర్ అధ్యక్షతన రేపు బీఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశం
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 26వ తేదీన (శుక్రవారం) బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో మధ్యాహ్నం 12:30 గంటలకు ఈ భేటీ జరగనుంది. రానున్న పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో పార్టీకి చెందిన లోక్ సభ, రాజ్యసభ సభ్యులతో కేసీఆర్ సమావేశం కానున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ వైఖరిపై చర్చించన్నారు. లోక్ సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న చివరి సమావేశాలు కావడంతో కీలక బిల్లులు సహా ఇతర అంశాల్లో లేవనెత్తానాల్సిన అంశాలపై ఎంపీలకు అధినేత కేసీఆర్ దిశానిర్ధేశం చేయనున్నారు. ఈ సమావేశానికి లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు హాజరు కానున్నారు. చదవండి: TSPSC చైర్మన్‌గా మహేందర్‌రెడ్డి.. గవర్నర్ ఆమోదం -
TSPSC చైర్మన్‌గా మహేందర్‌రెడ్డి.. గవర్నర్ ఆమోదం
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) చైర్మన్‌గా ఎం. మహేందర్‌రెడ్డిని నియామకం ఖరారైంది. మాజీ డీజీపీ అయిన మహేందర్‌రెడ్డి నియామకాన్ని ఆమోదిస్తూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గురువారం నిర్ణయం తీసుకున్నారు. అలాగే టీఎస్పీఎస్సీ సభ్యులుగా రిటైరర్డ్ ఐఏఎస్ అనిత రాజేంద్ర, పాల్వాయి రజనీ కుమారి, అమీర్ ఉల్లా ఖాన్, యాదయ్య, వై రాంమోహన్‌రావు నియమితులయ్యారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ పోస్టింగ్ కోసం మొత్తంగా 370 వరకు దరఖాస్తులు అందాయి. ప్రభుత్వం సెర్చ్ కమిటీని నియమించి.. దరఖాస్తుల పరిశీలన, అర్హులను సూచించే బాధ్యతలను అప్పగించింది. కమిటీ వేగంగా దరఖాస్తుల పరిశీలన చేపట్టింది. చైర్మన్ పదవి కోసం దరఖాస్తు చేసినవారిలోంచి మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి పేరును ప్రభుత్వానికి సూచించింది. ప్రభుత్వం ఆ పేరును గవర్నర్‌కు పరిశీలనకు పంపింది. చివరకు గవర్నర్ ఆయన నియామకానికి ఆమోదం తెలిపారు. ముదిరెడ్డి మహేందర్‌రెడ్డి ఖమ్మం జిల్లా మధిర మండలం కిష్ణాపురంలో జన్మించారు. ఆయన 1968 బ్యాచ్ పోలీస్ సర్వీస్ అధికారి. ఏఎప్పీగా మొదలైన ఆయన కెరీర్ డీజీపీగా పదవీ విరమణ పొందారు. డీజీపీ అనురాగ్ శర్మ పదవీవిరమణ తర్వాత 2017 నవంబర్ 12న ఇన్‌ఛార్జి డీజీపీగా నియమితుడయ్యారు. 2018 ఏప్రిల్10న పూర్తిస్థాయి డీజీపీగా నియమితులయ్యారు. మహేందర్‌రెడ్డి 2022 డిసెంబర్లో డీజీపీగా పదవీ విరమణ పొందారు. మూడేళ్లకు పైగా తన పదవీ కాలంలో ఆయన రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటంలోనూ కీలకంగా వ్యవహరించారు. అందుకే 2020లో ఏప్రిల్ 8న దేశంలోని టాప్ 25 ఐపీఎస్ అధికారులతో జాబితాలో 8వ స్థానాన్ని దక్కించుకున్నారు. మహేందర్‌రెడ్డి టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా నియమితులైనా.. ఈ ఏడాది డిసెంబర్ వరకే కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే.. కమిషన్ నిబంధనల ప్రకారం.. 62 ఏళ్లు దాటితే పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది. -
బాలకృష్ణ అక్రమార్జన.. అధికారులే కంగుతినేలా..!
హైదరాబాద్, సాక్షి: హెచ్ఎండీఏ మాజీ చైర్మన్, తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(రెరా) కార్యదర్శి శివ బాలకృష్ణను అక్రమాస్తుల వ్యవహారంలో దర్యాప్తు చేసే క్రమంలో విస్తూపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వందల కోట్ల ఆస్తుల్ని కూడబెట్టుకునేందుకు బాలకృష్ణ ఎలాంటి మార్గాల్ని అనుసరించాడో తెలిసి అధికారులే కంగుతింటున్నారు. పలు ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థల్లో శివబాలకృష్ణ బారీగా పెట్టుబడులు పెట్టినట్లు ఏసీబీ దర్యాప్తుల్లో వెల్లడైంది. అయితే.. రియల్ ఎస్టేట్ సంస్థలకు అనుమతులు ఇచ్చి.. ఆ లంచాలను పెట్టుబడుల్లోకి ఆయన మార్చుకున్నట్లు తేలింది. ఇందుకోసం హైదరాబాద్ శివారుల్లో వందల కొద్దీ ఆయన అనుమతులు ఇచ్చినట్లు తేలింది. హెచ్ఎండీఏ, రెరాలో పని చేస్తూనే ఆయన ఈ అనుమతులు జారీ చేసినట్లు గుర్తించారు. ఇక.. ఆయన్ని అదుపులోకి తీసుకున్న ఏసీబీ.. బంజారాహిల్స్ స్టేషన్‌ను తరలించి విచారిస్తోంది. ఆయన ఏ కంపెనీలకు, ఎవరెవరికి అనుమతులు ఇచ్చిందో ఆరా తీస్తోంది. మరోవైపు బంధువులు, మిత్రుల పేర్లు మీద కూడా ఎకరాల కొద్దీ ఆయన భూములు కొన్నారు. కొడకండ్లలో 17 ఎకరాలు, కల్వకుర్తిలో 26 ఎకరాలు, యాదాద్రిలో 23 ఎకరాలు, జనగామలో 24 ఎకరాల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 90 ఎకరాల భూములకు సంబంధించిన పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. బాలకృష్ణ ఆస్తుల కేసులో విచారణ కొనసాగుతోంది. కీలకమైన డాక్యుమెంట్లనే అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటిదాకా బయటపడిన పత్రాలు, ఇతరాలను బట్టి.. ఆయన కూడబెట్టిన ఆస్తులు మార్కెట్ విలువ ప్రకారం రూ. 300-400 కోట్లు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. బుధవారం జరిగిన సోదాల్లో.. ఒక్క నానక్‌రామ్‌గూడ లోని బాలకృష్ణ ఇంట్లోనే రూ. 84 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లో ఖరీదైన విల్లాలు, ఫ్లాట్లు.. నగర శివారు ప్రాంతాల్లో ఎకరాల కొద్దీ భూములు ఆయన వెనకేసినట్లు గుర్తించారు. -
ఓటు వేయకుంటే ఆత్మహత్య చేసుకుంటా.. తమిళిసై సీరియస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కౌశిక్ రెడ్డి ప్రచారంలో ఓట్లు అడిగిన విధానంపై తాజాగా తమిళిసై స్పందించారు. ఈ క్రమంలోనే కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈరోజు హైదరాబాద్‌లోని జేఎన్టీయూలో నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఈవో వికాస్‌రాజ్, రాష్ట్ర ఎన్నికల అధికారి పార్థసారధి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్‌రాస్ విచ్చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ..‘ఓటు వేయడం మన హక్కు. స్టేట్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్‌కు మధ్య వారధిగా ఉండటం నా బాధ్యత. జనరల్ ఎన్నికలను విజయవంతంగా జరిపినందుకు శుభాకాంక్షలు. మొదటిసారి ఇంటి నుంచే ఓటు వేయడం అనేది మంచి పరిణామం. ఓటింగ్ రోజు సెలవు అనేది సరదా కోసం కాదని యువత గుర్తుంచుకోవాలి. ఓటు హక్కు వినియోగం అనేది యుద్ధంలో పాల్గొన్నట్టు అనుకోవాలి. ఓటు వేసిన మార్క్ చూసి గర్వంగా ఫీలవ్వాలి. నేను నోటాకు వ్యతిరేకం. ఎన్నికల బరిలో ఉన్న ఎవరో ఒకరిని యువత ఎన్నుకోవాలన్నారు. పాడి కౌశిక్ రెడ్డిపై ఫైర్.. ఇదే సమయంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో ఓ అభ్యర్థి ఓట్లు అడిగిన అంశాన్ని తమిళిసై ప్రస్తావించారు. ఎన్నికల్లో తనకు ఓటు వేయకపోతే ఆత్మహత్య చేసుకుంటా అని ఓ అభ్యర్థి అన్నారు. ఎన్నికల కమిషన్ అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలి. కాగా, సదరు అభ్యర్థి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిగా తెలుస్తోంది. ఓటర్లను ఎవరూ బెదిరించకూడదు, ఇబ్బంది పెట్టకూడదు. ఓటు శాతం పెరగడానికి ప్రకటనలు ఒక్కటే ఉపయోగపడవు అనేది ఈసీ ఆలోచన. ఓటు అనేది మోస్ట్ పవర్ ఫుల్ ఆయుధం. ప్రజాస్వామ్యం బ్రతకాలంటే ఓటు వేయాలి. మంచి అభ్యర్థిని ఓటర్ ఎన్నుకుంటే మంచి పాలన అందుతుంది. ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలి’ అని కామెంట్స్ చేశారు. అనంతరం, 18 ఏళ్లు పూర్తి చేసుకొని కొత్తగా ఓటును పొందిన మనీషా అనే యువతికి గవర్నర్ తమిళిసై ఓటర్ ఐడీని అందించారు. అలాగే, జనరల్ ఎన్నికల్లో మెరుగైన పనితీరు కనబరిచిన పలువురు ఐఏఎస్ , ఐపీఎస్, వలంటీర్లకు గవర్నర్ సర్టిఫికేట్ అందించారు. -
దశాబ్ద కాలం తర్వాత డీఆర్సీ
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా అభివృద్ధిపై బుధవారం సుమారు 4 గంటల పాటు సుదీర్ఘమైన సమీక్ష సమావేశం జరిగింది. దాదాపు దశాబ్ద కాలం తర్వాత డీఆర్సీ సమావేశ దృశ్యం కనిపించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఇన్చార్జి మంత్రి హోదాలో పొన్నం ప్రభాకర్ జిల్లా అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. శాఖల వారీగా పూర్తి స్థాయి వివరాలు, అభివృద్ధి పనుల పురోగతి, మౌలిక సదుపాయాల కల్పన, ప్రస్తుత పరిస్థితిపై అధికారులతో ఆరా తీయడంతోపాటు సమస్యలను ఆయన నోట్ చేసుకున్నారు. అవసరమైన ప్రతిపాదనలు సమర్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. శాఖాపరంగా సమగ్ర అవగాహన, సమాచారం లేనివారిపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. వచ్చే సమావేశానికైనా సమగ్ర సమాచారంతో రావాలని పలు శాఖల అధికారులను స్వల్పంగా మందలించారు. అధికారులు తమ విధులు, బాధ్యతలు విస్మరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గత ప్రభుత్వం మాదిరిగా వన్‌సైడ్ నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. పరీక్షల్లో ఉత్తీర్ణతపై సమ్మతి లేఖ తప్పనిసరి త్వరలో జరగనున్న పదోతరగతి, ఇంటరీ్మడియట్ వార్షిక పరీక్షలకు సంబంధించి ఉత్తీర్ణతపై సమ్మతి లేఖ తప్పనిసరి అని మంత్రి పొన్నం అధికారులను ఆదేశించారు. సంబంధిత హెచ్ఎం, టీచర్, వార్డెన్లను నుంచి సమ్మతి లేఖ తీసుకోవాలని, విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించకుంటే వారినే బాధ్యులు చేయాలని సూచించారు. ఇప్పటి నుంచే సంబంధిత అధికారులు పాఠశాలలపై పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. గురుకులాలు, బీసీ వెల్ఫేర్ హాస్టళ్ల లో సమస్యలు లేకుండా చూసుకోవాలన్నారు. పరిష్కారానికి హామీ.. ప్రభుత్వ విభాగాల్లో పలు పలు సమస్యలు, పెండింగ్ పనులను అధికారులు మంత్రి దృష్టికి తీసుకురావడంతో.. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రెండు మోడ్రన్ ధోబీఘాట్ల పూర్తైనప్పటికీ న్యాయపరమైన సమస్యలు ఉండడంతో మిషన్లు తుప్పుపట్టే అవకాశం ఉందని అధికారులు పేర్కొనడంతో సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని ఉన్న తాధికారులను ఆదేశించారు బీసీ హాస్టళ్లు అధిక శాతం ప్రైవేట్ భవనల్లో ఉన్నాయని వాటి సొంత భవనాల నిర్మాణం, 6 హాస్పిటళ్ల నిర్మాణం కోసం గత ప్రభుత్వం జీఓ ఇచి్చందని, నిధులు విడుదల చేయలేదని అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. అధునాతన చేపల మార్కెట్ ఏర్పాటు నగరంలో అధునాతన చేపల మార్కెట్‌ను ఏర్పాటు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. చేపల మార్కెట్ లేకపోవడంతో వ్యాపారులు రోడ్లపై విక్రయిస్తున్నారని, ప్రత్యేకంగా మార్కెట్ ఏర్పాటు చేసి మత్స్యకారులు, వినియోగదారులకు సౌకర్యం కలి్పస్తామన్నారు. కూరగాయల మార్కెట్లను సైతం రెగ్యులరైజ్ చేస్తామన్నారు. పెండింగ్ అభివృద్ధి పనులు పూర్తి చేస్తామన్నారు. కలెక్టరేట్‌కు కొత్త భవనాన్ని నిర్మిస్తాం.. త్వరలో హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్‌కు నూతన భవన సముదాయాన్ని నిర్మిస్తామని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. విశాలమైన స్థలంలో ఎవరూ ఊహించని విధంగా భారీ సముదాయాన్ని నిర్మిస్తామన్నారు. సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందజేస్తామన్నారు. రేషన్ కార్డులు లేని వారికి సైతం కొత్తవి అందిస్తామని స్పష్టం చేశారు. 58, 59 జీఓకు సంబంధించి పూర్తి స్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ఒక్కో నియోజకవర్గానికి రూ.10 కోట్లు రాబోయే వేసవితో పాటు విద్య, వైద్యానికి సంబంధించి అత్యవసర పనుల కోసం ఒక్కో నియోజక వర్గానికి రూ.10 కోట్ల చొప్పున ఖర్చు చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. బుధవారం హైదరాబాద్ కలెక్టరేట్లో జరిగిన ‘జిల్లా స్థాయి సమీక్ష సమావేశం’ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం ప్రజల అత్యవసర సమస్యల పరిష్కారం కోసం తన కోటా నిధులు కేటాయించినట్లు తెలిపారు. త్వరలో ఎమ్మెల్యే, ఎమెల్సీలు, ఎంపీలతో జిల్లా అభివృద్ధిపై సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. -
మెహిదీపట్నం స్కైవాక్‌కు లైన్ క్లియర్
సాక్షి, హైదరాబాద్: మెహిదీపట్నం చౌరస్తాలో ఏర్పాటు చేయనున్న స్కైవాక్ నిర్మాణానికి మార్గం సుగమమైంది. స్కైవాక్ కోసం అవసరమైన భూమిని అప్పగించేందుకు రక్షణ శాఖ బుధవారం ఆమోదం తెలిపింది. దీంతో త్వరలోనే స్కైవాక్ నిర్మాణ పనులను పునరుద్ధరించనున్నారు. వాహనాల రద్దీ, అత్యధిక జనసమ్మర్థం కలిగిన మెహిదీపట్నం కూడలిలో పాదచారులు నలువైపులా ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకపోకలు సాగించేందుకు అనుగుణంగా స్కైవాక్ నిర్మాణాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. కానీ స్కైవాక్ విస్తరణకు అవసరమైన స్థలం అందుబాటులో లేకపోవడంతో రక్షణ శాఖకు చెందిన స్థలాన్ని ఇవ్వాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలోనూ ఈ మేరకు రక్షణ శాఖతో సంప్రదింపులు జరిపారు. కానీ అప్పట్లో భూమిని ఇచ్చేందుకు రక్షణ శాఖ అధికారులు ససేమిరా అనడంతో పనులు నిలిచిపోయాయి. ఉప్పల్ స్కైవాక్ పూర్తి చేయడంతో పాటు మెహిదీపట్నం స్కైవాక్ నిర్మాణాన్ని కూడా పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చేందుకు అప్పట్లో హెచ్ఎండీఏ ప్రణాళికలను సిద్ధం చేసింది. కానీ స్థలం లభ్యత సవాల్‌గా మారడంతో పనులు ఆగిపోయాయి. ప్రస్తుతం స్కైవాక్‌కు అవసరమైన 3,380 చదరపు గజాల స్థలాన్ని ఇచ్చేందుకు ముందుకు రావడంతో పనులు పరుగులు పెట్టనున్నాయని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. ఫలించిన సీఎం రేవంత్‌రెడ్డి చొరవ.. ట్రాఫిక్ రద్దీ కారణంగా రోడ్లపై నడిచి వెళ్లేవారి భద్రత దృష్ట్యా మెహిదీపట్నంలో స్కైవే నిర్మించాలనే ప్రతిపాదనలు ఎప్పటినుంచే ఉన్నాయి. కానీ.. రైతు బజార్ ప్రాంతంలో ఉన్న తమ భూములను ఇచ్చేందుకు రక్షణ శాఖ అంగీకరించకపోవటంతో పీటముడి పడింది. రక్షణ శాఖ పరిధిలోని 0.51 ఎకరాల స్థలం తమకు బదిలీ చేయాలని గత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో అత్యంత రద్దీ ఉండే మెహిదీపట్నం రైతు బజార్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ పెరిగిపోయింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన వెంటనే సిటీలో ట్రాఫిక్ రద్దీని అధిగమించే చర్యలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఈ నెల 5వ తేదీన ఢిల్లీకి వెళ్లినప్పుడు ప్రత్యేకంగా రక్షణ శాఖ మంత్రిని కలిశారు. మెహిదీపట్నంలో ఉన్న రక్షణ శాఖ భూములను తమకు బదిలీ చేయాలని కోరారు. ఈ మేరకు అక్కడ ఉన్న డిఫెన్స్ జోన్‌కు ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వం సూచించిన మార్పులకు అనుగుణంగా స్కైవే డిజైన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి సూచన మేరకు అధికారులు మార్పులు చేశారు. సవరించిన కొత్త ప్రతిపాదనలను ఇటీవలే కేంద్రానికి పంపించారు. దీంతో స్కైవే నిర్మాణానికి అవసరమైన మేరకు భూముల కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం బుధవారం ఆమోదం తెలిపింది. మొత్తం 3,380 చదరపు గజాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించనుంది. బదిలీ చేసిన భూములకు బదులుగా కేంద్రం డిఫెన్స్ విభాగానికి రూ.15.15 కోట్ల విలువైన మౌలిక వసతులను రాష్ట్ర ప్రభుత్వం కలి్పంచాల్సి ఉంటుంది. మరికొంత స్థలానికి పదేళ్ల పాటు లైసైన్స్ రుసుం చెల్లించాలనే నిబంధన విధించింది. నాలుగు వారాల్లోనే ఈ భూములను అప్పగించేందుకు కేంద్ర రక్షణ శాఖ అంగీకరించింది. దీంతో మెహిదీపట్నం స్కై వాక్ పనులకున్న ప్రధాన అడ్డంకి తొలగిపోయింది. ముంబై హైవేలో అత్యంత కీలకమైన రైతు బజార్ జంక్షన్లో ట్రాఫిక్ సమస్యకు త్వరలోనే పరిష్కారం లభించనుంది. వీలైనంత త్వరగా స్కైవే నిర్మాణం చేపట్టాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. -
అన్నీ కలెక్టర్లే అంటే సరికాదు
సాక్షి, హైదరాబాద్: ధరణి దరఖాస్తుల పరిష్కారంలో అధికారాలను వికేంద్రీకరించడమే మేలని పలు జిల్లాల కలెక్టర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. ధరణి పరిధిలోని ప్రతి మాడ్యూల్ ద్వారా వచ్చే దరఖాస్తులన్నింటినీ జిల్లా కలెక్టర్లే పరిష్కరించే పద్ధతి సరైంది కాదని, ఇందుకు పరిస్థితులు కూడా అనుకూలంగా ఉండవని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ధరణి దర ఖాస్తులు పేరుకుపోయాయని వెల్లడించారు. ధరణి పునర్నిర్మాణ కమిటీ బుధవారం సచివాలయంలో ఐదు జిల్లాల కలెక్టర్లతో సమావేశమైంది. కమిటీ సభ్యులు ఎం.కోదండరెడ్డి, ఎం.సునీల్‌కుమార్, రేమండ్ పీటర్, మధుసూదన్, నవీన్ మిత్తల్‌తో పాటు సీఎంఆర్వో పీడీ వి.లచ్చిరెడ్డి, జిల్లాల కలెక్టర్లు ప్రశాంత్ పాటిల్ (సిద్దిపేట), రాజీవ్‌గాంధీ హనుమంతు (నిజామాబాద్), ప్రావీణ్య (వరంగల్), గౌతమ్ కుమార్ (ఖమ్మం), శశాంక్ (రంగారెడ్డి), రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ధరణి దరఖాస్తుల పరిష్కారంలో ఎదురవుతున్న సమస్యలు, అనుభవాలను కమిటీ సభ్యులకు కలెక్టర్లు వివరించారు. అన్ని సమస్యలకూ తగిన మాడ్యూల్స్ లేవు ధరణి పోర్టల్‌లో అన్ని సమస్యల పరిష్కారానికి అవసరమైన మాడ్యూల్స్ లేవని, తమకు ఉన్న పని ఒత్తిడిలో అన్ని దరఖాస్తులు పరిశీలించి పరిష్కరించేందుకు జాప్యం జరుగుతోందని కలెక్టర్లు తెలిపారు. ఈ మేరకు అవసరమైన సిబ్బంది కూడా క్షేత్రస్థాయిలో లేరని చెప్పినట్టు తెలిసింది. సమస్యల పరిష్కార అధికారాలను కేవలం కలెక్టర్లకే కాకుండా కేటగిరీల వారీగా తహశీల్దార్లకు, ఆర్డీవోలకు కూడా ఇవ్వాలని సూచించారు. సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు లేనందున వాటిని పరిష్కరించలేకపోయామని వివరించినట్టు సమాచారం. టెర్రాసిస్ కాంటెల్లా ప్రతినిధులతోనూ సమావేశం ధరణి పోర్టల్ నిర్వహిస్తోన్న టెర్రాసిస్ కాంటెల్లా కంపెనీ ప్రతినిధులతోనూ కమిటీ సభ్యులు భేటీ అయ్యారు. ధరణి పోర్టల్ పనితీరు, ఇందులో ఇమిడి ఉన్న సాంకేతిక అంశాలు, సమస్యల పరిష్కారానికి ఉన్న మార్గాల గురించి చర్చించారు. ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లు, కంపెనీ ప్రతినిధుల నుంచి అవసరమైన సమాచారాన్ని కమిటీ సభ్యులు సేకరించారు. 27న అటవీ, వ్యవసాయ అధికారులతో భేటీ ఈ నెల 27న మరోమారు భేటీ కావాలని, ఉదయం అటవీ, గిరిజన శాఖలతో, మధ్యాహ్నం వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం కావాలని నిర్ణయించారు. ఆ తర్వాత స్టాంపులు, రిజి్రస్టేషన్లు, సర్వే సెటిల్మెంట్, దేవాదాయ, వక్ఫ్ ఉన్నతాధికారులతో సమావేశం కావాలని, ఆ భేటీ తర్వాతే ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక సమర్పించాలని నిర్ణయించారు. -
చెంచుల చెంతకు అధికారులు
అమ్రాబాద్: నల్లమల అటవీ పరిధిలోని చెంచు పెంటల చెంతకు అధికార యంత్రాంగం తరలివచ్చింది. చెంచులకు విద్య, వైద్యం అందని ద్రాక్షగా మారింది.ఆరు నెలలుగా గిరిపోషణ ముందుకు సాగడం లేదు. చిన్నపిల్లల నుంచి బాలింతల వరకు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. వారి వెతలకు ‘సాక్షి’ అక్షరరూపం ఇస్తూ ‘అడవే చెంచులకు అమ్మ’ శీర్షికన బుధవారం కథనం ప్రచురించింది. దీనిపై నాగర్‌కర్నూల్ కలెక్టర్ ఉదయ్ కుమార్ స్పందించారు. చెంచు పెంటలను క్రమం తప్పకుండా సందర్శించి, వారికి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఇన్చార్జ్ డీఎల్పీఓ వెంకటయ్య, పీఆర్ ఏఈ రుక్మాంగధ అమ్రాబాద్ మండలంలోని కొమ్మెనపెంట, కొల్లంపెంటను çసందర్శించారు. చెంచు కుటుంబాల బాధలను అడిగి తెలుసు కున్నారు. ఈ సందర్భంగా ఇన్చార్జ్ డీఎల్పీఓ వెంకటయ్య మాట్లాడుతూ చెంచు కుటుంబాల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని, వారికి కావాల్సిన వసతులు, వారి అవసరాలను గుర్తించి కలెక్టర్‌కు నివేదిక అందజేస్తామని చెప్పారు. ప్రధాన మంత్రి జన్మన్ కార్యక్రమంలో భాగంగా అటవీ ప్రాంతంలో ఉండే కొల్లంపెంట, కొమ్మెనపెంటలకు కనీస రవాణా సౌకర్యం కోసం 11.30 కిలోమీటర్ల మేర రోడ్డు మర మ్మతులు చేపడతామన్నారు. ఐటీ డీఏ ఆధ్వర్యంలో నిర్మించనున్న అంగన్వాడీ భవన నిర్మాణానికి స్థలం ఖరారు చెప్పారు. వారి వెంట ఎంపీడీఓ రామ్మోహన్, కార్యదర్శి మల్లేష్, ఉపాధి హామీ పథకం ఈసీ రేణయ్య, టీఏ అంజనేయులు తదితరులు ఉన్నారు. -
పెట్టుబడి.. మొక్కుబడి..!
సంగారెడ్డి: జిల్లాలో రైతుబంధు సాయం నత్తనడకన సాగుతోంది. ఇప్పటివరకు రెండెకరాల భూమి ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు జమయ్యాయి. మిగతావారు పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుబడి సాయం విడుదల చేస్తున్నామని నెలరోజుల క్రితం ప్రకటించింది. ఇప్పటివరకు పూర్తిస్థాయిలో రైతుల ఖాతాల్లో దానికి సంబంధించిన డబ్బు జమ కాలేదు. రెండెకరాల భూమి ఉన్న రైతులకు మాత్రమే వారికి మాత్రమే పెట్టుబడి అందిందని రైతాంగం పేర్కొంటోంది. ఈ నెలాఖరు వరకు అర్హులందరికీ రైతు బంధు అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే యాసంగి పనులు మొదలయ్యాయి. సాయం సకాలంలో అందక సాగు కోసం రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తుంది. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు పథకం పేరును రైతు భరోసాగా మార్చింది. ఎకరం భూమికి ఒక్కో సీజన్లో రూ.7,500 వంతున సాయం అందిస్తామని ఎన్నికల ముందు ప్రకటించింది. రైతు భరోసా విధి విధానాలు ఇంకా ఖరారు కాకపోవడంతో ఈ సీజన్‌కు గాను పాత విధానంలోనే ఎకరానికి రూ.5వేల వంతున సాయం అందిస్తోంది. సంగారెడ్డి జిల్లాలో 4,16,210 మంది రైతులు ఉన్నారు. ఈ సీజన్‌కు గాను రూ.393.21 కోట్ల మేర పెట్టుబడి సాయం రైతాంగం ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు రూ.108 కోట్ల మేర రైతుల ఖాతాల్లో జమచేయడం జరిగిందని అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఎకరం లోపు ఉన్న కొంత మంది రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమకాలేదని పేర్కొంటున్నారు. పెట్టుబడి సాయాన్ని ఐదెకరాలకు కుదించడం, ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లించే వారు, బడా వ్యాపారులు, ఆర్థికంగా వృద్ధి చెందిన వారికి ఇవ్వకూడదనే డిమాండ్ ముందు నుంచి వినిపిస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇదేమీ పరిగణనలోకి తీసుకోకుండా భూమి ఉండి.. పట్టాపాసు పుస్తకం పొందిన ప్రతి ఒక్కరికీ రైతుబంధు నిధులు జమ చేసింది. వందల ఎకరాల భూమి ఉన్న రైతులు, వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు, ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులకు కూడా పెట్టుబడి సాయం తీసుకున్నారు. ఈ విధానంతో రాష్ట్ర ఖజానా దివాలా తీసే పరిస్థితి ఏర్పడిందని అప్పట్లో ప్రతిపక్షాలు విమర్శించాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా కింద అందించే సాయం విషయంలో లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా సాగుతుందని ప్రకటించారు. యాసంగి సీజన్ సమయం మొదలు కావడంతో ఇప్పుడు విధి విధానాలు రూపొందించి సాయం జమచేయాలంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుతం పాత పద్ధతిలోనే నిధులు జమచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వర్షాకాలం సీజన్ వరకు కొత్త మార్గదర్శకాలతో పెట్టుబడి సాయం జమచేసే అవకాశం ఉంది. పాత పద్ధతిలోనైనా మెజార్టీ రైతులకు సాయం అందలేదు. ప్రభుత్వ ఖజానాలో నిధుల కొరత కారణంగా జాప్యం జరుగుతోందనే అభిప్రాయం అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి పెట్టుబడి సాయం త్వరగా అందించాలని రైతాంగం కోరుతోంది. నెలాఖరుకు ఖాతాల్లో జమ రైతు బంధు విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ నెలాఖరు వరకు అందరి ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి. ఇప్పటి వరకు రెండున్నర ఎకరాలు ఉన్న రైతుల ఖాతాల్లో జమ చేశాం. ఇప్పటివరకు రూ.108 కోట్ల మేర రైతుల ఖాతాల్లో వేశాం. –నర్సింహారావు, జేడీఏ, సంగారెడ్డి -
వలసొచ్చి.. వరి నాట్లు వేసి
దుబ్బాకటౌన్: జిల్లాలో వరి నాట్లు వేయడానికి రైతులను కొత్త సమస్యలు వేధిస్తున్నాయి. మొత్తం 48 లక్షల ఎకరాల్లో నాట్లు సిద్ధం కావడం వల్ల కూలీల కొరత ఏర్పడింది. ఇప్పటికే సగం వరినాట్లు పూర్తి అయినా మరో 50 శాతం ఉండడంతో ఎకరానికి రోజుకు 8 నుంచి 10 మంది కూలీలు అవసరం పడుతున్నారు. కానీ, నాటు వేయడానికి కూలీలు దొరక్క బిహార్, యూపీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి వలస వచ్చిన పురుష కూలీలతో రైతులు నాట్లు వేయిస్తున్నారు. ఎకరానికి రూ.5,500 వరకు గంపగుత్తగా మాట్లాడుకొని నాట్లు వేస్తున్నారు. ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు కూలి పేరు సిద్దార్థ్. సొంత రాష్ట్రం పశ్చిమ బెంగాల్లో పెద్దగా చేసేందుకు ఉపాధి లేకపోవడంతో 30 రోజుల క్రితం ఆయనతోపాటు మరో 13 మంది కూలీలు వరినాట్లు వేసేందుకు సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రాంతానికి వచ్చారు. ఇందులో ఒక వ్యక్తి వంటలు చేస్తుండగా మిగతా 12 మంది నాట్లు వేస్తారు. ప్రతి రోజూ 5 ఎకరాలకు పైగా నాట్లు వేస్తామని సిదార్ధ్ చెప్పుకొచ్చాడు. గతేడాది ఏపీలో వేశామని, ఈసారి ఆంధ్రాకు చెందిన వ్యక్తి తెలపడంతో ఇక్కడికి వచ్చామని ఇప్పటి వరకు కామారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో 130 ఎకరాల వరకు నాట్లు వేశామని చెప్పుకొచ్చాడు. బెంగాల్‌కు చెందిన 13 మంది కూలీలు వరినాట్లు వేసేందుకు ఇక్కడికి వచ్చారు. రైతుల పొలాల్లో నారు తీసి వారే వేసుకొని రోజు 5 ఎకరాలకు పైగా నాట్లు వేస్తున్నారు. పొలాల్లో సన్నటి తాడుతో మునుములు కట్టుకొని చూస్తుండగానే టకటకా నాట్లు వేస్తున్నారు. ఎకరం నాటుకు వీరిని తీసుకొచ్చిన మధ్య వ్యక్తి రైతుల నుంచి రూ.5,500 తీసుకుంటున్నాడు. ఇందులో నుంచి బెంగాల్ కూలీలకు రూ.3,500 ఇస్తూ మిగతా డబ్బులతో వీరు ఉండడానికి వసతి, భోజనాలు, వాహనం తదితర సౌకర్యాలు చూసుకుంటున్నాడు. సాధారణంగా ఇక్కడ మహిళలు ఎకరం నాటుకు రూ.6 వేల వరకు తీసుకుంటుండగా, నారు వేసేందుకు మరో రూ.2,000 పైగా రైతులకు ఖర్చు అవుతుంది. దీంతో ఎకరం నాటుకు రైతుకు రూ. 8 వేలు ఖర్చు అవుతుంది. అదే బెంగాల్ కూలీలతో నాటు వేయిస్తే రూ.5,500 మాత్రమే అవుతుంది. ఎకరానికి రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు రైతులకు ఆదా అవడంతోపాటు కూలీల బాధ తప్పుతుంది. 1.80 లక్షల ఎకరాల్లో పూర్తి.. జిల్లాలో ఈ యాసంగిలో 3.49 లక్షల ఎకరాల్లో వరినాట్లు వేస్తారని వ్యవసాయాధికారుల అంచనా ఉంది. ఇప్పటి వరకు 1.80 లక్షల ఎకరాల్లో నాట్లు వేయడం పూర్తి అయ్యింది. ప్రస్తుతం జోరుగా వరినాట్లు పడుతుండడంతో ఈ నెలలోపు నాట్లు పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఈసారి నాట్లు పెరిగే అవకాశం.. జిల్లాలో ఇప్పటికే సగంకు పైగా వరినాట్లు పూర్తి అయ్యాయి. ఈ యాసంగిలో 3.48 లక్షల ఎకరాల్లో వరినాట్లు అంచనా ఉండగా ప్రస్తుతం 1.80 లక్షల ఎకరాల వరకు నాట్లు పడ్డాయి. కూలీల కొరతతో రైతులు వెద పద్ధతిలో వేసుకున్నారు. ఇతర రాష్ట్రాల కూలీలు, నాట్లేసే యంత్రాలు రావడంతో రైతులకు చాలా బాధలు తప్పాయి. ఈ సారి రికార్డు స్థాయిలో వరినాట్లు వేసే అవకాశం ఉంది. – శివప్రసాద్, జిల్లా వ్యవసాయాధికారి -
Ayodhya: బియ్యపు గింజలతో సీతారాముడు, అయోధ్య..
సాక్షి, హన్మకొండ: అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరుగుతోంది. దీంతో, దేశమంతా రామనామ స్మరణ వినపడుతోంది. మరోవైపు.. కొందరు కళాకారులు రాముడిపై ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తెలంగాణకు చెందిన ఓ కళాకారుడు బియ్యం గింజలతో సీతారాములు, లక్ష్మణుడు, ఆంజనేయుడి బొమ్మలు వేసి తన భక్తిని చాటుకున్నాడు. వివరాల ప్రకారం.. హన్మకొండ జిల్లా ఎలుకతుర్తి మండలం సూరారం గ్రామానికి చెందిన రాజ్ కుమార్ అనే ఒప్పంద ఉపాధ్యాయుడు బియ్యం గింజలతో శ్రీరాముడు, సీతా, లక్ష్మణుడు, ఆంజనేయుడు, అయోధ్య ఆలయము నిర్మించి చూపర్లను ఆకట్టు కుంటున్నాడు. బియ్యం గింజలతో వారు చిత్రాలను గీసి రంగులు అద్దాడు. దీంతో, స్వామి వారి ఫొటో ఎంతో అందంగా కనిపిస్తోంది. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ.. దేశంలో సుమారు 130 కోట్ల ప్రజలు నివసిస్తున్న శ్రీరామచంద్ర ప్రభు జన్మించిన అయోధ్యలో రాముడి విగ్ర ప్రతిష్ట ప్రారంభ మహోత్సవం జరుగుతోంది. హిందూ ప్రజల కళలు నెరవేరుతున్న సందర్భంగా హిందువుల ఆరాధ్య దైవం రాముడిని స్మరించుకుంటున్నాను. ఉడతా భక్తితో ఈ పేదవాడు బియ్యపు గింజలతో శ్రీరాముడు, సీతా, లక్ష్మణుడు, ఆంజనేయుడు, అయోధ్య ఆలయంను నిర్మించి భగవంతునికి సమర్పిస్తున్నాను అంటూ కామెంట్స్ చేశారు. -
Ayodhya: గర్భిణిల ఎదురుచూపు.. బాలుడైతే..
సాక్షి, మహబూబాబాద్: భవ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ట కోసం అయోధ్య నగరం అందంగా ముస్తాబైంది. గర్భగుడిలో రామ్‌లల్లా కొలువుదీరబోతున్నాడు. ఈ చరిత్రాత్మక ఘట్టాన్ని తిలకించడానికి దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారు. దేశవ్యాప్తంగా రామ నామస్మరణ జరుగుతోంది. మరోవైపు.. తెలంగాణలోని మహబూబాబాద్ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బాల రాముడి ప్రాణ ప్రతిష్ట గడియల కోసం కొందరు గర్భిణీలు ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో వారు ప్రసవించాలని కోరుకుంటున్నారు. ఆ సమయంలో తమ బిడ్డలకు జన్మనివ్వాలని అనుకుంటున్నారు. వివరాల ప్రకారం.. అయోధ్యలో నేడు రాముడి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ప్రసవల కోసం గర్భిణీలు ఎదురుచూస్తున్నారు. మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రిలో శుభ గడియ కోసం గర్భిణీల వేచిచూస్తున్నారు. ఈ సమయంలో ప్రసవంలో పుత్రుడు జన్మిస్తే రాముడిగా.. ఆడపిల్ల జన్మిస్తే సీతమ్మగా పేరుగా పేరు పెట్టుకుంటామని చెబుతున్నారు. కాగా, దేశమంతా ఎదురు చూస్తున్న శుభ ముహూర్తాన సీతారాములకు జన్మనివ్వాలని గర్భిణీలు ఆరాటపడుతున్నారు. ఇక, పురిటి నొప్పులు వస్తున్నప్పటికీ నేడు శుభ ముహూర్తం కోసం వారు ఎదురు చూస్తున్నారు. -
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి
సాక్షి, హైదరాబాద్: పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం అత్యంత అనుకూలమని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పలు బహుళజాతి కంపెనీలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. పెట్టుబడుల సాధనలో భాగంగా సౌదీ అరేబియాలో పర్యటిస్తున్న ఆయన ఆదివారం జెడ్డాలోని పలు సంస్థల ప్రతినిధులతో వరుస సమావేశాల్లో పాల్గొన్నారు. సౌదీ యువరాజు ప్రత్యేక కార్యాలయ జనరల్ డైరెక్టర్ మహమ్మద్ బిన్ అబ్దుల్లా అల్ రాయెస్‌తో జరిగిన భేటీలో శ్రీధర్ బాబు తెలంగాణ విధానాలు, ఐటీ పరిశ్రమకు ప్రభుత్వ సహకారం తదితర అంశాలను వివరించారు. సౌదీ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం రసాయనాలు, ఇంధన రంగాలకు సంబంధించి అంతర్జాతీయంగా దిగ్గజ సంస్థగా పేరుపొందిన ఆరాంకో సంస్థ ప్రతినిధులను కలిసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అంశాలపై చర్చించారు. తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు అన్ని రకాలుగా మద్దతిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఆల్ షరీఫ్ గ్రూప్ హోల్డింగ్స్ సంస్థ సీఈవో ఆల్ షరీఫ్ నవాబ్ బిన్ ఫైజ్ బిన్ అబ్దుల్ హకీమ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ప్రాజెక్ట్స్ ఇంజనీర్ సులైమన్ కేతో మంత్రి శ్రీధర్‌బాబు సమావేశమై పెట్టుబడులపై చర్చించారు. ఈ సంస్థ విద్యుత్, ఆతిథ్య, రియల్ ఎస్టేట్, టెక్నాలజీ, ఆవిష్కరణ రంగంలో అగ్రగామిగా ఉంది. సెడ్కో కేపిటల్స్ ప్రతినిధులతో సహా పలువురితో భేటీ ప్రముఖ ఇన్వెస్ట్ మెంట్ కంపెనీ సెడ్కో కేపిటల్స్ ప్రతినిధులతో, జెడ్డా చాంబర్స్‌తో, ఆహార ఉత్ప త్తుల దిగ్గజ సంస్థ అయిన సవోలా గ్రూప్ సీఈవో వలీద్ ఫతానాతో, సౌదీ బ్రదర్స్ కమర్షియల్ కంపెనీ సీఈవో, బోర్డ్ సభ్యులతో పెట్రోమిన్ కార్పొరేషన్ ప్రతినిధులతో, బెట్టర్జీ హోల్డింగ్ కంపెనీ చైర్మన్ మాజెన్ బెట్టర్జీతోనూ మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. రాష్ట్రంలో అనువైన పరిస్థితులను వివరించారు. పరిశ్రమలు ఏర్పాటు చేసే సంస్థలకు కల్పించే రాయితీలు, ప్రోత్సాహకాలను వారి దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణలో నిరంతర విద్యుత్ సరఫరా, పుష్కలమైన నీటి లభ్యత, నాణ్యమైన మానవ వనరులు, మంచి మౌలిక సదుపాయాలు, మెరుగైన కనెక్టివిటీ ఉన్నాయని మంత్రి వారికి వివరించారు. కాగా, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి కనబర్చినట్టు మంత్రి కార్యాలయం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. పర్యటనలో మంత్రి శ్రీధర్ బాబు వెంట రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి జయేశ్ రంజన్, ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రమోషన్ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు. -
ప్రపంచాన్ని ఆకర్షించేలా ‘మూసీ’
సాక్షి, హైదరాబాద్: మూసీ నదీ తీర అభివృద్ధి ప్రణాళికలే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దుబాయ్‌లో ఆదివారమంతా బిజీబిజీగా గడిపారు. మూసీ రివర్ ఫ్రంట్ డిజైన్లు, అభివృద్ధిపై ప్రపంచ స్థాయి సిటీ ప్లానర్లు, డిజైనర్లు, మెగా మాస్టర్‌ప్లాన్ డెవలపర్లు, ఆర్కిటెక్ట్‌లతో వరుసగా భేటీలు నిర్వహించారు. 56 కిలోమీటర్ల పొడవునా రివర్ ఫ్రంట్, గ్రీన్ అర్బన్ పార్కులు, షాపింగ్ కాంప్లెక్సుల నిర్మాణానికి సంబంధించిన డిజైన్లు, అభివృద్ధి నమూనాలను పరిశీలించడంతో పాటు వాటికి అవసరమైన పెట్టుబడుల గురించి దాదాపు 70 సంస్థలతో ఆయన సంప్రదింపులు జరిపారు. దుబాయ్ వేదికగా ప్రపంచంలో పేరొందిన కంపెనీలు, ఆర్కిటెక్చర్ సంస్థల ప్రతినిధులు, కన్సల్టెన్సీ నిపుణులతో సీఎం భేటీ అయ్యారు. ఈ సమావేశాల్లో భాగంగా దాదాపు అన్ని సంస్థలూ.. రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యానికి, మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టును చేపట్టేందుకు ముందుకొచ్చాయనీ, సంప్రదింపుల కోసం త్వరలోనే రాష్ట్రా నికి వచ్చేందుకు అంగీకరించాయని సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. దుబాయ్‌లో సండే వర్కింగ్ డే ఆదివారం సెలవుదినాన్ని సీఎం రేవంత్ అండ్ టీం దుబాయ్‌లో వర్కింగ్ డే తరహాలో గడిపింది. ముఖ్యమంత్రి నేతృత్వంలోని రాష్ట్ర ప్రతినిధి బృందం అర్ధరాత్రి వరకు వివిధ సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపింది. ఈ సమావేశాల్లో భాగంగా సీఎం రేవం™త్ మాట్లాడుతూ ‘చరిత్రాత్మక నగరాలన్నీ నీటి వనరుల చుట్టే అభివృద్ధి చెందాయి. నదులు, సరస్సులు వాటికి సహజత్వాన్ని తెచ్చిపెట్టాయి. మూసీ పునరుద్ధరణతో హైదరాబాద్ సిటీ ప్రపంచంలోనే అద్భుతమైన నగరంగా మారుతుంది’అని అన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలు, నగరాలతో తాము పోటీ పడడం లేదని ప్రపంచంలోనే అత్యుత్తమమైన బెంచ్‌మార్క్ నెలకొల్పేందుకు ప్రయతి్నస్తున్నామని చెప్పిన రేవంత్ అందుకు అనుగుణంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న మూసీ రివర్ ప్రాజెక్టుకు అపురూపమైన డిజైన్లు, నమూనాలు రూపొందించాలని కోరా రు. సీఎంతో పాటు ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రి, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్, సీఎం ప్రత్యేక కార్యదర్శి బి.అజిత్‌రెడ్డి, హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్, మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ అమ్రాపాలితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. వారం రోజుల తర్వాత రాష్ట్రానికి ఈనెల 15న ప్రారంభమైన సీఎం రేవంత్ దావోస్, లండన్, దుబాయ్ టూర్ ముగిసింది. ఈ మూడు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన బృందం సోమ వారం ఉదయం 8 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటుందని సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. దావోస్ పర్యటనలో భాగంగా ఈనెల 15 నుంచి జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) 54వ వార్షిక సమావేశంలో మంత్రి శ్రీధర్‌బాబు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో కలిసి పాల్గొన్నారు. నాలుగు రోజుల పాటు జరిగిన ఈ సమావేశాల్లో డబ్ల్యూఈఎఫ్ అధ్యక్షుడితో సహా పలు దేశాల పారిశ్రామికవేత్తలు, కంపెనీల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు. తెలంగాణలో పెట్టుబడుల కు అనువైన పరిస్థితులను వ్యాపార వర్గాలకు వివరించడం ద్వారా రూ.40వేల కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన హామీలను రాబట్టగలిగారు. ఆ తర్వాత లండన్ వెళ్లిన సీఎం అక్కడ ఇండియా డయాస్పోరా అసోసియేషన్స్ సమావేశంలో పాల్గొ ని ప్రవాస తెలంగాణీయులనుద్దేశించి మాట్లాడా రు. లండన్‌లోని ప్రముఖ ప్రాంతాలను అధికారుల బృందంతో కలిసి సందర్శించిన రేవంత్ థేమ్స్ నది స్ఫూర్తితో మూసీని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. అక్కడి నుంచి దుబాయ్ చేరుకున్న రేవంత్ టీం మూసీ రివర్‌ఫ్రంట్‌పై ప్రత్యేక దృష్టితో రోజంతా సంప్రదింపులు జరిపారు. అనంతరం తన బృందంతో కలిసి హైదరాబాద్ బయలుదేరారు. దుబాయ్ వాటర్ ఫ్రంట్‌ను సందర్శించిన సీఎం దుబాయ్ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అధికారుల బృందంతో కలిసి దుబాయ్ వాటర్ ఫ్రంట్ ప్రాజెక్టును సందర్శించారు. ఆదివారం మధ్యాహ్నం ఒక ఆకాశ హర్మ్యం మీదికి వెళ్లి ఏరియల్ వ్యూలో కనిపించే వాటర్ ఫ్రంట్ అందాలను తిలకించారు. చుట్టూ నీళ్లు.. పక్కనే ఆకాశాన్ని అంటుతున్నట్లు కనిపించే అందమైన భవంతులు, నీళ్ల చుట్టూ అందమైన రహదారులతో ఒకదానికొకటి అనుబంధంగా రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్టు దుబాయ్‌లో పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఈ ప్రాజెక్టు నిర్వహణ వ్యవహరాలు, దాంతో ముడిపడి ఉన్న సామాజిక ఆర్థిక ప్రభావాలను సీఎం అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి ఎంత సమయం పట్టింది ? ఎంత ఖర్చయింది ? ఏమేం సవాళ్లు ఎదురయ్యాయి..? నిర్వహణకు అనుసరిస్తున్న విధానాలపై చర్చించారు. -
ఒకే ఆధార్, పాన్‌కార్డు.. పాస్పోర్టులెన్నో
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/కోరుట్ల: తీగ లాగితే పాస్‌పోర్టుల డొంకంతా కదులుతోంది. జగిత్యాల జిల్లా కోరుట్లతోపాటు కరీంనగర్, వేములవాడ, సిరిసిల్లలోనే ఈ రాకెట్‌కు ప్రధాన ఏజెంట్లు ఉన్నారు. ఇక్కడి చిరునామాలతో పలువురు రోహింగ్యాలు విదేశాలకు వెళ్లారన్న విషయాన్ని గుర్తించిన సీఐడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో వారికి పలు నిర్ఘాంతపోయే విషయాలు తెలుస్తున్నాయి. స్థానికులు, విదేశీయులు అన్న తేడా లేకుండా.. ఎవరికి పాస్‌పోర్టులు కావాలన్నా.. కేవలం కొన్నిరోజుల్లోనే వచ్చేలా చేయడంలో వీరిది అందెవేసిన చేయి. ఇప్పటివరకూ 92 మందిని దేశం దాటించగలిగారు. ఇలా వెళ్లిన వారిలో విదేశీయులు ఉండటంతో విషయాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. పైగా ఈ దందాకు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సహకరించారన్న విషయాన్నీ ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. నాంపల్లి టు జగిత్యాల ఈ రాకెట్‌కు నాంపల్లికి చెందిన అబ్దుల్ సత్తార్ ఒస్మాన్ అల్ జవహరీ ప్రధాన సూత్రధారి. ఇతను నాంపల్లిలోని బడే మజీదు వద్ద నివసించే ఇతను డీటీపీ గ్రాఫిక్స్‌లో సిద్ధహస్తుడు. ఈ పనితోపాటు పాస్‌పోర్టు బ్రోకర్గాను పనిచేసేవాడు. నకిలీ విద్యార్హతలు, ఆధార్, పాన్‌కార్డు ఇలా కీలక నకిలీ డాక్యుమెంట్లు తయారు చేస్తూ గల్ఫ్ ఏజెంట్ల సర్కిల్లో బాగా పాపులర్ అయ్యాడు. వరంగల్, నిజామాబాద్, హైదరాబాద్ ప్రాంతాల్లోని బ్రోకర్లకు పాస్‌పోర్ట్‌లకు కావాల్సిన సర్టిఫికెట్లు సమకూర్చేవాడు. ఈ గ్యాంగ్ వద్ద దగ్గర దొరకని పత్రం అంటూ ఏదీ ఉండదు. విద్యార్హత, ధ్రువీకరణ పత్రం, ఆధార్, పాన్ ఏది కావాలన్నా నిమిషాల్లో రెడీ చేస్తాడు. కొందరు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు కూడా వీరికి సహకరించడంతో వీరి పని మరింత సులువై, పాస్‌పోర్టులు ఇప్పించి విదేశీయులను భారతీయులుగా దేశం దాటించగలిగారు. వీరు ఇప్పించిన పాస్‌పోర్టుల్లో అత్యధిక పాస్‌పోర్టులకు ఒకే ఆధార్, ఒకే ఫోన్ నంబరు ఉండటంతో విషయం వెలుగుచూసింది. ఈసీఎన్ఆర్ కేటగిరీలోనే.. ఇమిగ్రేషన్‌లో దొరికిపోకుండా తనిఖీలు అవసరం లేని ఈసీఎన్ఆర్ (ఇమిగ్రేషన్ చెక్ నాట్ రిక్వైర్డ్) కేటగిరీలోనే పాస్‌పోర్టులు ఇప్పించారు. ఇందుకు వారి నుంచి రూ.లక్షల్లో వసూలు చేశారు. చాలా పాస్‌పోర్టులకు ఒకే ఆధార్ కార్డు ఉండటం, కస్టమర్లందరికీ ఏజెంట్లు తమ ఫోన్ నంబరునే అటాచ్ చేసి ఉంచడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా సోదాలు చేసిన సీఐడీ అధికారులు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న 12 మంది నిందితులను అరెస్టు చేసి, ఫారినర్స్ యాక్ట్ 1946, పాస్‌పోర్ట్ యాక్ట్‌తోపాటు పలు సెక్షన్ల కింద కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి ఏజెంట్లు రాకెట్ సూత్రధారి అబ్దుల్ సత్తార్ తన నెట్‌వర్క్‌ను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాడు. అబ్దుల్ సత్తార్ ఉస్మాన్ అల్ జవహరీ నాంపల్లి (హైదరాబాద్)కి చెందినవాడు కాగా.. మిగిలిన మహ్మద్ ఖమ్రుద్దీన్, చాంద్‌ఖాన్, దేశోపంతుల అశోక్ రావు (కోరుట్ల), పెద్దూరి శ్రీనివాస్ (తిమ్మాపూర్, కరీంనగర్), గుండేటి ప్రభాకర్ (జగిత్యాల), పోచంపల్లి దేవరాజ్ (వేములవాడ, సిరిసిల్ల), అబ్దుల్ షుకూర్ (రాయికల్, జగిత్యాల). వీరంతా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వారే కావడం గమనార్హం. వీరంతా కలిసి ఎంతమందికి నకిలీ సర్టిఫికెట్లు ఇప్పించారు..? ఎంతమంది విదేశీయులకు పాస్‌పోర్టులు ఇప్పించారు..? అన్న విషయంపై సీఐడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇక్కడి చిరునామాలతో పలువురు కెనడా, మలేసియా, దుబాయ్, గల్ఫ్ దేశాలు, స్పెయిన్, ఫ్రాన్స్, థాయ్‌లాండ్, ఇరాక్ తదితర దేశాలకు వెళ్లినట్టు గుర్తించారు. వారంతా అక్కడ ఏం చేస్తున్నారు..? ఏ కంపెనీలో పనిచేస్తున్నారు..? అన్న విషయాన్ని కనిపెట్టే పనిలో నిమగ్నమయ్యారు. పదేళ్ల తర్వాత మళ్లీ... 2014లోనే డబుల్ పాస్‌పోర్ట్‌లు, వాటికి అవసరమైన నకిలీ ధ్రువీకరణ పత్రాలు తయారు చేస్తున్నారన్న ఆరోపణలతో కోరుట్లకు చెందిన ఖమరోద్దీన్, అశోక్‌రావు, చాంద్‌పాషాపై కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కొంతకాలం ఇక్కడ ఎలాంటి కార్యకలాపాలు జరగలేదు. శుక్రవారం సీఐడీ అధికారుల దాడులతో వీరంతా పాస్‌పోర్ట్ దందా ఆపలేదని రుజువైంది. -
జనవరి కరెంట్ బిల్లులు కట్టకండి: కేటీఆర్
హైదరాబాద్, సాక్షి: బీఆర్ఎస్ను బొందపెట్టి తీరతానంటూ తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ పడింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు, రేవంత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ లాంటోళ్లను చాలామందిని చూశామని వ్యాఖ్యానించిన ఆయన.. ఈ క్రమంలో తీవ్రస్థాయిలోనే విమర్శలు గుప్పించారు. అలాగే జనవరి నెల కరెంట్బిల్లులు ఎవరూ కట్టవద్దంటూ తెలంగాణ ప్రజలకు కేటీఆర్ పిలుపు ఇచ్చారు. బీఆర్ఎస్ను వంద మీటర్ల లోతున బొందపెట్టే సంగతి తర్వాత చూసుకుందాం. ముందు 100 రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేయండి అని కేటీఆర్ సీఎం రేవంత్‌కు చురకలు అంటించారు. అహంకారంతో మాట్లాడిన రవేంత్‌రెడ్డి లాంటి నాయకుల్ని బీఆర్ఎస్ తన ప్రస్థానంలో ఎంతో మందిని చూసిందని.. రెండున్నర దశాబ్దాలు నిలబడి రేవంత్ లాంటోళ్లను మట్టి కరిపించిందని అన్నారాయన. ‘‘తెలంగాణ జెండాను ఎందుకు బొంద పెడుతావ్? తెలంగాణ తెచ్చినందుకా?.. తెలంగాణను అభివృద్ధి చేసినందుకా? లేకుంటే మిమ్మల్ని.. మీ దొంగ హమీల్ని ప్రశ్నిస్తునందుకా?’’ కేటీఆర్ నిలదీశారు. ఇదీ చదవండి: లండన్‌లో సీఎం రేవంత్ ఏమన్నారంటే.. బీజేపీతో బీఆర్ఎస్ కు ఏరోజు పొత్తు లేదని.. భవిష్యత్తులోనూ ఉండబోదని శనివారం తెలంగాణ భవన్లో జరిగిన హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ బీ ఆర్ ఎస్ ఎన్నికల సన్నాహక సమావేశంలో కేటీఆర్ పునరుద్ఘాటించారు. ‘‘రేవంత్ రక్తం అంతా బీజెపీదే. అందుకే ఇక్కడ చోటా మోదీగా రేవంత్ రెడ్డి మారిండు. డబుల్ ఇంజన్ అంటే అదానీ, ప్రధాని అన్న రేవంత్ ఇప్పుడు ట్రిపుల్ ఇంజన్ గా మారిండు. రేవంత్ కాంగ్రెస్ ఏక్నాథ్ షిండేగా మారతాడు’’ అంటూ కేటీఆర్ పంచ్‌లు వేశారు. కరెంట్ బిల్లుల్ని సోనియాకు పంపించండి అలాగే.. ఈ జనవరి నెల కరెంట్ బిల్లులు ఎవరూ కట్టవద్దని.. ఆ బిల్లులను ఢిల్లీలోని కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ ఇంటికి పంపించాలంటూ తెలంగాణ ప్రజలకు పిలుపు ఇచ్చారాయన. ‘‘ఈ జనవరి నెల కరెంటు బిల్లులు ప్రజలు ఎవరూ కట్టొద్దు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉచిత విద్యుత్తు పథకం గృహజ్యోతి హామీని నెరవేర్చే దాకా బిల్లులు కట్టొద్దు. స్వయంగా ముఖ్యమంత్రి.. కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పినట్లుగానే ఉచిత విద్యుత్ కోసం డిమాండ్ చేయాలి. కరెంటు బిల్లులు అడిగితే అధికారులకు ముఖ్యమంత్రి మాటలను చూపించాలి. సోనియా గాంధీ బిల్లు కడుతుందని ముఖ్యమంత్రి ఎన్నికలప్పుడు చెప్పిండు. అందుకే కరెంటు బిల్లు ప్రతులను సోనియా గాంధీ ఇంటికి, 10జన్ పత్ కు పంపించాలి’’ అని కేటీఆర్ అన్నారు. అలాగే.. హైదరాబాద్‌లో ఉన్న ప్రతి ఒక్క మీటర్ కి గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్తు అందించాలని.. గృహ జ్యోతి కార్యక్రమాన్ని వెంటనే అమలు చేయాలి.. ఇందులో కిరాయి ఇండ్లలో ఉండే వాళ్ళకి కూడా ఉచిత విద్యుత్తు ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. -
లండన్ పర్యటనలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: లండన్ పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ లక్ష్యంగా ఘాటు వ్యాఖ్యలు చేశారాయన. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పార్లమెంట్ ఎన్నిల్లోనూ రిపీట్ అవుతాయని.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను వంద మీటర్ల లోతులో పాతిపెడతామని రేవంత్ అన్నారు. కాగా, రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి.. లండన్ పర్యటనలో అసంబద్ధంగా మాట్లాడి రాష్ట్రం పరువు తీశారంటూ మండిపడ్డారు. సీఎం రేవంత్ పాండిత్యాన్ని రాష్ట్ర ప్రజలు గమనించారు. ప్రశ్న ఒకటి అయితే ఆయన చెప్పింది ఒకటి చూసి జనం నవ్వుకుంటున్నారు. కారు పార్టీని బొంద పెడతామంటూ రేవంత్ చౌక బారు మాటలు మాట్లాడారు. కేసీఆర్ సంగతి చూస్తానన్న రేవంత్ గురువు చంద్రబాబు ఏం చేయలేకపోయాడు. తెలంగాణ నుంచి పలాయనం చిత్తగించాడంటూ నిరంజన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. -
TS: ప్రజాభవన్‌లో రిపేర్లకు అంత ఖర్చా?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రగతి భవన్ కాస్త ప్రజా భవన్‌గా మారింది. ప్రజా సందర్శనకు అనుమతి ఇస్తూ.. వాటి ముందు ఉన్న బారికేడ్లను సైతం తొలగించారు. ఆపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు ప్రజా భవన్‌ను కేటాయించారు. అయితే కేసీఆర్ హయాంలో దుబార జరిగిందని.. కాబట్టి హంగులు ఆర్బాటాలకు పోకుండా ఉంటామని ప్రకటించుకుంది రేవంత్ సర్కార్. కానీ, ప్రజా భవన్ రిపేర్ల కోసం చేస్తున్న ఖర్చుపై ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది. ప్రజా భవన్లో టాయిలెట్ల రిపేర్లు కోసం.. అలాగే దోమ తెరల కోసం రూ.35 లక్షలకు టెండర్లను కాంగ్రెస్ ప్రభుత్వం పిలిచినట్లు తెలుస్తోంది. మరో టెండర్లో భాగంగా జిమ్ రూంలో పొడుగు అద్దాలు, గన్‌మెన్ రూముల కోసం రూ.28.70 లక్షలకు టెండర్లను ప్రభుత్వం ఆహ్వానించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ప్రతుల పేరిట సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే వైరల్ అవుతున్న ఈ ప్రచారంపై అధికారుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది. -
భవిష్యత్తులో ఏదైనా జరగొచ్చు.. గంగుల
సాక్షి, కరీంనగర్: పార్లమెంట్ ఎన్నికల ముందు కరీంనగర్లో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలు పెరుగుతుండటంతో ఇక్కడి బీఆర్ఎస్ కార్పొరేటర్లను కాపాడుకునేందుకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ సునీల్‌రావు ముందస్తు ప్రయత్నాలు ప్రారంభించారు. నగరంలోని ఓ ప్రముఖ హోటల్లో బీఆర్ఎస్ కార్పొరేటర్లతో మేయర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ శుక్రవారం అర్ధరాత్రి వరకు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కాంగ్రెస్ కండువా కప్పుకునే ఆలోచనలో ఉన్న కార్పొరేటర్లను ఉద్దేశించి గంగుల కమలాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూడు, నాలుగు నెలల్లో కాంగ్రెస్ దుకాణం బయటపడుతుందంటూ కార్పొరేటర్లకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. తనతో ఉంటే భవిష్యత్తు ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. లేదంటే విజయశాంతి తరహాలో జంప్ జిలానీలుగా మారిపోతారంటూ సున్నితంగా హెచ్చరించారు. ఈనెల 24వ తేదీన కరీంనగర్లో బీఆర్ఎస్ ముఖ్యకార్యకర్తలతో కేటీఆర్ భేటీ అవుతారని గంగుల చెప్పారు. కరీంనగర్ ఎంపీ ఎన్నికల్లోనూ బీజేపీ, బీఆర్ఎస్ మధ్యే పోటీ ఉంటుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఎంఐఎం బీఆర్ఎస్తోనే ఉంటుందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఎమ్మెల్యే సీట్లలో పెద్ద తేడా లేదని, బీజేపీ, ఎంఐఎంను కలుపుకుంటే భవిష్యత్తులో ఎలాంటి రాజకీయ పరిణామాలైనా చోటుచేసుకోవచ్చని గంగుల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదీచదవండి.. కళ్యాణ కానుకేది..? -
పేదింటి పద్దు రూ.25 వేల కోట్లు!
సాక్షి, హైదరాబాద్: నిరుపేదలకు గృహ వసతి కల్పించేందుకు ఈ ఆర్థిక సంవత్స రంలో రూ.25 వేల కోట్లు ప్రతిపాదించా లని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఉమ్మడి రాష్ట్రంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మా ణాన్ని మళ్లీ ప్రారంభించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అప్పట్లో తక్కువ విస్తీర్ణంలో ఆ ఇళ్లను నిర్మించగా, ఇప్పుడు రెండు పడగ్గదులతో నిర్మించాలని నిర్ణయించింది. ఇందుకోసం యూనిట్ కాస్ట్ ను రూ.5 లక్షలుగా ఖరారు చేస్తూ ఆరు గ్యారంటీల్లో భాగంగా ప్రకటించిన విష యం తెలిసిందే. మొత్తంగా ఐదేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 4 లక్షల ఇళ్లను నిర్మించాలని అనుకుంటోంది. దీంతోపాటు గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కూడా పూర్తి చేయా లని నిర్ణయించింది. వీటన్నింటికి కలిపి తొలి ఏడాదిలో రూ.25 వేల కోట్లు అవసరమవుతాయని తాజాగా అంచనాకొచ్చింది. అధికారులతో ఉప ము ఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్షించి ప్రాథ మికంగా నిర్ణయించారు. దావోస్ పర్యటన కు వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌కు తిరిగి రాగానే ఆయనతో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లకే రూ.20 వేల కోట్లు.. తొలి ఏడాది ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.20 వేల కోట్లు అవసరమవుతాయని అంచనాకొచ్చారు. నాలుగు లక్షల ఇందిరమ్మ ఇళ్లను చేపడితే ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు చొప్పున ఇంత బడ్జెట్ అవసరమవుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం హడ్కో తదితర సంస్థల నుంచి తీసుకున్న అప్పు రూ.10 వేల కోట్లు చెల్లించాల్సి ఉంది. అందులో తొలి సంవత్సరం రూ.వేయి కోట్ల నుంచి రూ.2 వేల కోట్లను కేటాయించాలని లెక్కలు వేశారు. అసంపూర్తి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం 2వేల కోట్లు గత ప్రభుత్వంలో మొదలై పూర్తి కాకుండా మిగిలిపోయి ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పూర్తి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఇళ్ల నిర్మాణం కోసం రూ.2 వేల కోట్లను కేటాయించాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. కాగా, త్వరలో కేంద్రప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టబోతోన్న నేపథ్యంలో అందులో గృహనిర్మాణ పద్దు కింద ఎంత కేటాయిస్తుంది, ఏయే పథకాల కింద రాష్ట్రానికి ఎన్ని నిధులు వస్తాయి.. అన్న అంశాలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్న భావనను కూడా మంత్రులు వ్యక్తం చేస్తున్నారు.