Mob Lynching
-
మహారాష్ట్రలో మరో మూక దాడి.. యువకుడు మృతి
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. దొంగ అనే అనుమానంతో 23 ఏళ్లు యువకుడిని సామూహికంగా కొట్టి చంపారు. ఈ ఉదంతం స్థానికంగా కలకలం రేపింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు.వివరాల్లోకి వెళితే నలసోపారాలోని వెలై పాడా ప్రాంతంలో 10 మంది గుంపుగా చేరి విజయ్ అలియాస్ అభిషేక్ జోగిందర్ సోనీ బంధించారు. దొంగతనం చేయాలనే ఉద్దేశ్యంతో విజయ్ అక్కడ సంచరిస్తున్నాడని ఆరోపిస్తూ, కర్రలతో విజయ్‌పై నిర్దాక్షిణ్యంగా దాడి చేశారు. ఈ దాడిలో విజయ్ అక్కడికక్కడే మృతి చెందాడని పోలీసు అధికారి మీడియాకు తెలిపారు.ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని, విచారణ కొనసాగుతున్నదని పోలీసులు తెలిపారు. గతంలో కూడా పాల్ఘర్లో మూక హత్యల ఉదంతం వెలుగు చూసింది. నాటి ఘటనలో ఇద్దరు సాధువులు, ఒక డ్రైవర్ హతమయ్యారు. 2020, ఏప్రిల్ 16న పాల్ఘర్ జిల్లాలోని గడ్చించలేలో ఇద్దరు సాధువులను, వారి కారు డ్రైవర్‌ను దొంగలుగా అనుమానించిన స్థానికులు మూకుమ్మడిగా వారిపై దాడి చేసి హత్య చేశారు. ఈ కేసులో పోలీసులు 201 మందిని అరెస్టు చేశారు. -
Pak: దుస్తులపై వివాదం.. మహిళపై మూక దాడికి యత్నం
ఇస్లామాబాద్: దుస్తులపై అరబిక్ భాషలో ఖురాన్‌ను కించపరిచే రాతలున్నాయన్న ఆరోపణలపై పాకిస్థాన్‌లోని లాహోర్‌లో ఓ యువతిని కొందరు చుట్టుముట్టారు. వెంటనే ఓ మహిళా పోలీసు ఆ యువతిని ఆ మూక నుంచి రక్షించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గుంపు చుట్టుముట్టినపుడు యువతి తన ముఖం కనిపించకుండా చేతులు అడ్డం పెట్టుకుంది. ఈ సమయంలో ఓ మహిళా పోలీసు వచ్చి ధైర్యంగా ఆమెను రక్షించి అక్కడి నుంచి తీసుకెళ్లడం వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియెను ఆ మహిళా పోలీసును ఉద్దేశించి పాకిస్థాన్ పంజాబ్ పోలీసులు ఎక్స్(ట్విటర్)లో పోస్ట్ చేశారు. ఆమె పేరును ప్రతిష్టాత్మక క్వాడ్ ఈ అజామ్ పోలీస్ మెడల్‌కు రిఫర్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై ఆ మహిళా పోలీసు మాట్లాడుతూ ‘అరబిక్‌లో ఏవో పదాలు రాసి ఉన్న దుస్తులు వేసుకున్న మహిళ ఆమె భర్తతో కలిసి షాపింగ్‌కు వచ్చింది. ఆమె ధరించిన కుర్తాపై అరబిక్‌లో ఏదో రాసి ఉంది. వెంటనే ఆ మహిళ దగ్గరకు కొందరు వచ్చి కుర్తాను తీసేయాలని కోరారు. దీనికి స్పందించిన ఆ మహిళ డిజైన్ బాగున్నందునే వాటిని కొన్నాననని సమాధానమిచ్చింది. తనకు ఖురాన్‌ను కించపరిచే ఉద్దేశమేమీ లేదని స్పష్టం చేసింది’ అని మహిళా పోలీసు తెలిపింది. అయితే మరికొందరు మాత్రం మహిళ ధరించిన దుస్తులపై ఖురాన్‌పై ఎలాంటి కించపరిచే రాతలు లేవని సోషల్ మీడియలో పోస్టులు చేశారు. ఇటీవలి కాలంలో దేశంలో మతం పేరు మీద మాబ్ లించింగ్ పెరిగిపోయిందని, రాజకీయాల కోసమే కొందరు వీటిని ప్రోత్సహిస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. This woman police officer is a star. Doing exactly what the state should do when citizens are harassed and attacked for alleged blasphemy. Pakistan’s blasphemy laws, their daily abuse, violent mobs & extremist groups with state patronage have led the country to this madness. pic.twitter.com/o96vhTsIhJ — Raza Ahmad Rumi (@Razarumi) February 25, 2024 ఇదీ చదవండి.. చైనాలో 24 కోట్ల ఏళ్ల డ్రాగన్ శిలాజం -
ఇస్లాంకు వచ్చిన ముప్పేమీ లేదు: ఆరెస్సెస్ ఛీఫ్
భారత్‌లో ఇస్లాం మతం ప్రమాదంలో పడిందన్న కొందరి అసత్య ప్రచారాలను నమ్మొద్దని, భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, అసలు అలాంటి ప్రచారాల వలలో చిక్కుకోవద్దని ముస్లింలను కోరాడు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధినేత మోహన్ భగవత్. ఘజియాబాద్: ఆ గడ్డపై హిందూ-ముస్లిం తేడాలేవీ లేవని.. భారతీయులందరి డీఎన్ఏ ఒక్కటేనని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) అధినేత మోహన్ భగవత్ పునరుద్ఘాటించారు. ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ముస్లిం రాష్ట్రీయ మంచ్(ఆరెస్సెస్ ముస్లిం విభాగం) ఏర్పాటు చేసిన ‘హిందుస్తానీ ఫస్ట్.. హిందుస్తాన్ ఫస్ట్’ అనే కార్యక్రమంలో భగవత్ ప్రసంగించారు. ప్రజలు చేసే ఆరాధనలను బట్టి వారిని వర్గాలుగా విభజించలేమని అన్నారు. మూక దాడులకు పాల్పడే వాళ్లు హిందుత్వానికి వ్యతిరేకులేనని తేల్చిచెప్పిన ఆయన.. మూకదాడులపై కొన్ని సందర్భాల్లో తప్పుడు కేసులు నమోదవుతున్నాయని ఆక్షేపించారు. ఏ ఒక్క మతమో కాదు దేశంలో ప్రజల మధ్య ఐక్యత లేకుండా అభివృద్ధి సాధ్యం కాదని మోహన్ భగవత్ స్పష్టం చేశారు. ‘‘హిందు, ముస్లిం వర్గాలు వేర్వేరు కాదు. మతాలతో సంబంధం లేకుండా భారతీయులందరి డీఎన్ఏ ఒక్కటే. జాతీయవాదం, మన పూర్వీకులు సాధించిన కీర్తి ప్రజల మధ్య ఐక్యతకు ఆధారం కావాలి. హిందు–ముస్లిం వర్గాల మధ్య ఘర్షణలకు పరిష్కార మార్గం చర్చలే. ఈ రెండు వర్గాల ఐక్యతపై తప్పుడు ప్రచారం సాగుతోంది. మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం, దేశంలో ఏ ఒక్క మతమో ఆధిపత్యం చెలాయించలేదు. కేవలం భారతీయులు మాత్రమే ఆధిపత్యం చెలాయించగలర’’ని మోహన్ భాగవత్ వ్యాఖ్యానించారు. కాగా, తాను ఓటు బ్యాంకు రాజకీయాల కోసమో, వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకోవడానికో ఈ కార్యక్రమానికి రాలేదని, దేశాన్ని బలోపేతం చేయడానికి.. సమాజంలో అందరి బాగు కోసం ఆరెస్సెస్ పని చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. అది అభివృద్ధికి ముప్పే! వివిధ రంగాలకు చెందిన 150 మంది ముస్లిం ప్రముఖులతో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆదివారం భేటీ అయ్యారు. రాష్ట్రంలో మైనార్టీలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై చర్చించారు. జనాభా విపరీతంగా పెరగడం రాష్ట్ర అభివృద్ధికి ముప్పేనని ముస్లిం ప్రముఖులు అంగీకరించారని సమావేశం అనంతరం సీఎం కామెంట్ చేశారు. ఈ మేరకు అభివృద్ధి కోసం సూచనలు చేయడానికి వారితో 8 ఉపవర్గాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. -
సాధువుల హత్యకేసు; లాయర్ మృతి
ముంబై : పాల్గర్ జిల్లా మూకదాడి కేసులో హత్యకు గురైన సాధువుల తరపున వాదిస్తున్న జూనియర్ న్యాయవాది దిగ్విజయ్ త్రివేది బుధవారం రోడ్డు ప్రమదంలో మరణించారు. ఈ కేసు విషయమై కోర్టుకు వెళుతున్న ఆయన ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. ఆ సమయంలో దిగ్విజయ్‌తో పాటు ఓ మహిళ కూడా ఉంది. అయితే లాయర్ త్రివేది అక్కడికక్కడే మరణించగా, తీవ్ర గాయాలతో ఆమెను ఆసుపత్రిలో చేర్చించారు. (దొంగల ముఠా అనుమానంతో ముగ్గురి హత్య ) కారు ప్రమాదంపై బీజేపీ నాయకుడు సంబిత్ పత్రా అనుమనాలు వ్యక్తం చేశారు. పాల్గర్ మూకదాడి కేసులో సాధువుల తరుపున వాదిస్తున్న లాయర్‌పై ఎవరైనా కుట్ర పన్ని ఈ ఘాతానికి తెగ బడ్డారా లేక ఇది యాదృచ్ఛికమా? అని ప్రశ్నించారు. అంతేకాకుండా ఇది వరకే ఫాల్గర్ కేసును లేవనెత్తిన వారిపై కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అయితే ప్రమాదంపై ఆర్టీఓ నుంచి నివేదిక వచ్చాకే నిజనిజాలు వెలుగులోకి వస్తాయని పాల్గర్ కేసులో త్రివేదితో పాటు వాదిస్తున్న మరో లాయర్ పిఎన్ ఓజా పేర్కొన్నారు. (101 మంది అరెస్ట్.. ఒక్క ముస్లిం కూడా లేడు ) ఏప్రిల్ 16న మహారాష్ట్రలోని పాల్గర్ జిల్లాలో ముగ్గురు సాధువులు హత్యకు గురవ్వడం దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. పాల్గార్ జిల్లాలోని దబాధి ఖన్వేల్ రహదారిని ఆనుకుని ఉన్న ఓ గ్రామం మీదుగా కారులో సూరత్ వెళ్తున్న ముగ్గురు సాధువులను ఆపి గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. వీరిని దొంగలుగా భావించి కారు నుంచి కిందకు దింపి రాళ్లు, ఇనుపరాడ్లతో చితకబాదారు. ఈ ఘటనలో సాధువులను ఉద్దేశ పూర్వకంగానే చంపేసినట్లు బీజేపీ ఆరోపించిన సంగతి తెలిసిందే. (సాధువుల హత్యకేసు: నిందితుడికి కరోనా ) -
సాధువుల హత్యకేసు: నిందితుడికి కరోనా
సాక్షి, ముంబై : మహారాష్ట్రలోని పాల్గాడ్ జిల్లాలో ఇద్దరు సాధవులు హత్యకు గురవ్వడం దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. కల్పవృక్ష గిరిరాజ్(70), సుశీల్ గిరిరాజ్(35)లతో పాటు మరో డ్రైవర్‌ను ఓ గుంపు కర్రలతో, రాళ్లతో కొట్టి దారుణంగా హతమార్చారు. ఈ కేసులో మహారాష్ట్ర క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్(సీఐడీ) ఇప్పటికే వందమందిని అదుపులోకి తీసుకోగా తాజాగా మరో 15 మందిని కస్టడీలోకి తీసుకుని వాడా పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. అయితే నిందుతుల్లో ఒకరు అస్వస్థతకు గురవ్వడంతో పాల్గర్ రూరల్ అస్పత్రికి తరలించి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో వెంటనే అతడిని జేజే ఆస్పత్రిలోని ప్రత్యేక జైల్ వార్డ్‌కు తరలించి ఐసోలేషన్‌లో ఉంచారు. అయితే వాడా పోలీస్‌స్టేషన్‌లో ఈ నిందుతుడితో పాటు మరో 20 మందిని పోలీసులు ఒకే గదిలో ఉంచారు. దీంతో ఆ గదిలో ఉన్న మిగతా 20 మందికి కూడా కరోనా పరీక్షలు నిర్వహించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. సాధువులను హత్య చేసిన అనంతరం నిందితులు అడువుల్లోకి పారిపోయారు. అయితే వారి కోసం మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక డ్రోన్లను ఉపయోగించి వారి జాడ కనిపెట్టారు. ఇక ఇప్పటివరకు అదుపులోకి తీసుకున్న నిందితుల్లో 9 మంది మైనర్లు, ఇద్దరు సీనియర్ సిటిజన్స్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: 101 మంది అరెస్ట్.. ఒక్క ముస్లిం కూడా లేడు ఠాక్రే ఎన్నికకు ముహూర్తం ఖరారు -
కరోనాను మించిన వైరస్
ఊహించని ఉపద్రవం కరోనా మహమ్మారి రూపంలో చుట్టుముట్టడంతో సామాన్యుల బతుకులు అగమ్యగోచరమయ్యాయి. వలస కూలీలు, చిన్నా చితకా పనులు చేసుకునేవారు, చిరు వ్యాపారులు కష్టాల్లో కూరుకుపోయారు. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఎంత చేస్తున్నా, అందరికీ సాయం అందడం అసాధ్యమవుతున్నది. ఈ క్లిష్ట సమయంలో కూడా వదంతులు వ్యాపింపజేసేవారు, విద్వేషపూరిత ప్రచారం చేసేవారు, తప్పుడు ఆరోపణలకు దిగేవారు తమ వికృత క్రీడను యథావిధిగా కొనసాగిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా ఒక మతానికి చెందినవారు కరోనా వ్యాప్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆమధ్య సామాజిక మాధ్యమాల్లో వీడియోలు ప్రచారంలో పెట్టారు. ఇందులో ఏమాత్రం నిజం లేదని అటు తర్వాత ధ్రువపడింది. అది సద్దుమణి గిందనుకుంటుండగా మహారాష్ట్రలోని పాల్ఘర్లో గతవారం ఇద్దరు సాధువులను, వారి డ్రైవర్‌ను ఒక గుంపు కొట్టి చంపిన ఉదంతం చుట్టూ రకరకాల కథనాలు ప్రచారంలోకొస్తున్నాయి. దాడికి దిగిన ఆదివాసీ గ్రామస్తులు కొన్ని వదంతులను విశ్వసించి, ఆ సాధువులను దొంగల ముఠాకు చెందిన వారిగా అనుమానించి, ఆవేశంతో ఈ దుండగానికి పాల్పడ్డారని ప్రభుత్వం చెబుతోంది. ఈ ఉదంతం నిజానిజాలు మరికొన్ని రోజుల్లో బయటికొస్తాయి. కానీ ఒక ఘటన జరిగినప్పుడు దానికి సంబంధించిన పూర్తి సమాచారం లేకుండా ఏదో ఒకటి వూహించుకుని దాన్నే ప్రచారం చేయడం ప్రమాదకర పర్యవసానాలకు దారితీస్తుంది. తమకు ఎలాంటి హానీ తలపెట్టని వ్యక్తులపై దాడికి దిగడం, దూషించడం, కొట్టి చంపడం అత్యంత దారుణం. దుండగులెవరు, బాధితులెవరు అన్న దానితో నిమిత్తం లేకుండా మనిషన్న ప్రతి ఒక్కరూ ఇలాంటి దుర్మార్గాలను ఖండిస్తారు. దోషులకు కఠిన శిక్ష పడాలని కోరుకుంటారు. పాల్ఘర్ ఉదంతంలో ప్రాణాలు కోల్పోయిన సాధువులిద్దరిలో ఒకరు 70 ఏళ్లవారైతే, మరొకరు 35 ఏళ్ల వ్యక్తి. వీరిద్దరూ జునా అఖాడాకు చెందిన సాధువులు. ఎనిమిదో శతాబ్దంలో హిందూ మత పరిరక్షణ కోసం ఆది శంకరాచార్యులు నెలకొల్పిన ఏడు అఖాడాలు అనంతర కాలంలో 13కి చేరుకున్నాయి. ఈ అఖాడాల్లో వారణాసి కేంద్రంగా పనిచేస్తున్న జునా అఖాడా ఉన్నతమైనదని చెబుతారు. సూరత్‌లో తమ గురువు శ్రీ మహంత్ రామ్‌గిరి అంత్యక్రియల్లో పాల్గొనడానికి వెళ్తున్న సాధువులను లాక్డౌన్ కారణంగా అనుమతించలేమని దాద్రా నాగర్ హవేలీ వద్ద స్థానిక పోలీసులు ఆపి, వెనక్కు పంపించారు. అలా వెళ్తుండగా గుంపు దాడికి దిగింది. సాధువులపై ఉన్మాద గుంపు చేసిన దాడికి సంబంధించిన వీడియో గమనిస్తే ఇద్దరు కానిస్టేబుళ్లు నెత్తురోడుతున్న వృద్ధ సాధువును, మరో ఇద్దరినీ ఆ ఉన్మాదులకు అప్పగించినట్టు అర్థమవుతుంది. కర్రలతో, కత్తులతో, గొడ్డళ్లతో వారిపై దాడి చేస్తుంటే కానిస్టేబుళ్లు నిర్లిప్తంగా ఉండిపోయారు. అంతమంది గుంపును ఒకరో, ఇద్దరో నియంత్రించడం అసాధ్యమే. కానీ కనీసం పై అధికారులకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించి, అదనపు బలగాలు రప్పించి వారి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేయలేదు. కొన్ని రోజులక్రితం ఇంటింటికీ ఆహారధాన్యాలు పంపిణీ చేసి, ఆదివాసీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి తిరిగివస్తున్న వైద్యుడి కారుపై సైతం దాదాపు 250మంది వేరే గ్రామంలో ఇదే మాదిరి దాడి చేశారు. అప్పుడు కూడా కారులో వెళ్తున్నవారు దొంగలన్న అనుమానంతోనే గుంపు దాడికి దిగింది. వీటన్నిటిపైనా ప్రభుత్వాన్ని నిలదీయడం, దాడులకు కారకులెవరో, వారిని ప్రేరే పించినవారెవరో వెలికి తీయాలని కోరడం సమంజసమే. దాన్నెవరూ తప్పుబట్టరు. కానీ మరణించినవారు అఖాడాకు చెందినవారు గనుక, దాడి చేసిన వారు అన్యమతస్తులైవుంటారని తమకు తామే ఒక నిర్ణయానికొచ్చి, అదే నిజమని ప్రజలందరినీ నమ్మించడానికి ప్రయత్నించడం, ఇష్టాను సారం వ్యాఖ్యలకు దిగడం దారుణం. దాడి జరిగిన ప్రాంతం సీపీఎం శాసనసభ్యుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం పరిధిలోనిది. కనుక దాడి వెనక ఆ పార్టీ హస్తం వుందని మరికొందరు ఆరోపించారు. ఇలా తమకు తోచినట్టు ఆరోపణలు గుప్పించేవారికీ, అకారణంగా సాధువులపై దాడిచేసిన ఉన్మాదులకూ వ్యత్యాసం ఏమైనా ఉందా? జరిగిన ఉదంతంపై వెనకా ముందూ చూడ కుండా మతం రంగు పులమడానికి, వేరే పార్టీలను తప్పుబట్టడానికి సామాజిక మాధ్యమాల్లో మాత్రమే కాదు... కొన్ని చానళ్లలో సైతం ప్రయత్నించడం ఆందోళన కలిగిస్తుంది. ఇది చివరకు మత ఘర్షణలకు దారితీస్తుందన్న అనుమానంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ కేసులో అరెస్టయిన నిందితుల పేర్లను కూడా వెల్లడించింది. ప్రధాన మీడియా అయినా, సామాజిక మాధ్యమాలైనా బాధ్యతాయుతంగా మెలగకపోతే సమా జంలో పరస్పర అపోహలు, అనుమానాలు బయల్దేరతాయి. విద్వేషాలు బలపడతాయి. సామాజిక మాధ్యమాల్లో ఇష్టానుసారం ప్రచారం చేసేవారికి ఏ బాధ్యతా వుండదు. జరిగిందేమిటో తెలుసు కోవడానికి అవసరమైన ఉపకరణాలూ ఉండవు. కానీ ప్రధాన మీడియాకు సమాచారం సేకరిం చడానికి విస్తృతమైన యంత్రాంగం ఉంటుంది. నేరుగా ఉన్నతాధికారులతో మాట్లాడే అవకాశం ఉంటుంది. చుట్టూ ఉన్న సమాజం ఎలాంటిదో, చిన్న పొరపాటు దొర్లితే ఎలాంటి పరిణామాలు ఏర్పడతాయో అవగాహన ఉంటుంది. కానీ బాధ్యతారహితంగా తమకు తోచిందే నిజమని విశ్వసించి, దాన్నే ప్రచారం చేయడానికి పూనుకొనే ధోరణి ప్రధాన మీడియాకు కూడా సోకడం ఆందోళన కలిగిస్తుంది. వదంతుల వ్యాప్తిని అడ్డుకోవడానికి, మూకదాడులపై చర్యలు తీసుకోవ డానికి ఒక సమగ్రమైన చట్టం తీసుకురావాలని రెండేళ్లక్రితం కేంద్రం సంకల్పించింది. కానీ ఇంత వరకూ అది సాకారం కాలేదు. సాధ్యమైనంత త్వరలో ఆ చట్టం తీసుకురావడం, మూకదాడుల వంటి ఉదంతాల సమయంలో ఎలా మెలగాలో పోలీసులకు తగిన శిక్షణ ఇవ్వడం అవసరం. -
101 మంది అరెస్ట్.. ఒక్క ముస్లిం కూడా లేడు
-
101 మంది అరెస్ట్.. ఒక్క ముస్లిం కూడా లేడు
ముంబై: మహారాష్ట్రలో గతవారం పాల్గాడ్ జిల్లాలో చోటుచేసుకున్న మూకహత్యకు సంబంధించి ఇప్పటివరకు 101మందిని అరెస్ట్ చేశామని రాష్ట్ర హోంమంత్రి అనిల్ దినేష్‌ముఖ్ బుధవారం తెలిపారు. ఈ మూకహత్యను బీజేపీ నేతలు మతకల్లోలానికి చెందినదిగా ఆరోపణలు చేయటాన్ని ఆయన ఖండించారు. హత్యకేసులో భాగంగా అరెస్ట్‌చేసిన 101 మందిలో ఒక్కరు కూడా ముస్లిం కాదని ఆయన వెల్లడించారు. బీజేపీ నాయకులు ఈ మూకహత్యకు మతం రంగు పులమడం సరికాదన్నారు. (మూకహత్య: ఉద్ధవ్ ఠాక్రేకు అమిత్ షా ఫోన్) ఇక భయంకరమైన కారోనా వైరస్‌ను అరికట్టాలంటే ప్రజలు తప్పనిసరిగా సామాజిక దూరాన్ని పాటించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. కొంతమంది కరోనా వైరస్ విస్తరిస్తున్న ఇటువంటి క్లిష్ట సమయంలో రాజకీయాలు చేస్తున్నారని వాటిని మానుకోవాలని ఆయన హితవు పలికారు. పాల్గాడ్ జిల్లాలోని దబాధి ఖన్వేల్ రహదారిని ఆనుకుని ఉన్న ఓ గ్రామం గుండా కారులో సూరత్ వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను ఆపి గ్రామస్తులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. వీరిని దొంగలుగా భావించి కారు నుంచి కిందకు దింపి రాళ్లు, ఇనుపరాడ్లతో చితకబాదారు. ఈ ఘటనలో ఆ ముగ్గురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. మృతులను చిక్నే మహరాజ్ కల్పవృక్షగిరి(70), సుశీల్‌గిరి మహరాజ్(35), వారి డ్రైవర్ నీలేశ్ తెల్గాడే(30)గా పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. ఈ ఘటనను పోలీసులు అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించినప్పటికీ ఆ గ్రామస్తులు వారిపై కూడా దాడికి తెగపడ్డారు. (దొంగల ముఠా అనుమానంతో ముగ్గురి హత్య) -
ఉద్ధవ్ ఠాక్రేకు అమిత్ షా ఫోన్
న్యూఢిల్లీ: కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా సోమవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు ఫోన్ చేశారు. గత వారం రాష్ట్రంలోని పాల్గాఢ్ జిల్లాలో చోటుచేసుకున్న మూక హత్య గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై అత్యున్నత స్థాయి అధికారులతో దర్యాప్తు జరిపిస్తున్నామని సీఎం ఈ సందర్భంగా అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే 100 మందిని అరెస్టు చేశారని తెలిపారు. ‘‘ఇద్దరు సాధువులు, వారి డ్రైవర్‌పై దాడికి పాల్పడిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటన జరిగిన సమయంలో కొంత మంది పోలీసులు కూడా అక్కడే ఉన్నారు’’అని హోం మంత్రితో పేర్కొన్నారు. (దొంగల ముఠా అనుమానంతో ముగ్గురి హత్య) కాగా పాల్గాడ్ జిల్లాలోని దబాధి ఖన్వేల్ రహదారిని ఆనుకుని ఉన్న ఓ గ్రామం గుండా కారులో సూరత్ వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను ఆపి గ్రామస్తులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. వీరిని దొంగలుగా భావించి కారు నుంచి కిందకు దింపి రాళ్లు, ఇనుపరాడ్లతో చితకబాదారు. ఈ ఘటనలో ఆ ముగ్గురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. మృతులను చిక్నే మహరాజ్ కల్పవృక్షగిరి(70), సుశీల్‌గిరి మహరాజ్(35), వారి డ్రైవర్ నీలేశ్ తెల్గాడే(30)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనతో రాష్ట్రమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ నేపథ్యంలో బాధితులకు తప్పక న్యాయం చేస్తామంటూ సీఎం ఉద్ధవ్ ఠాక్రే ట్విటర్లో పేర్కొన్నారు. ఇక ఈ ఘటనపై స్పందించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని శివసేన అధినేతకు విజ్ఞప్తి చేశారు.(మా నాన్న మరణ వార్త విని బాధపడ్డా..: యోగి) -
దోపిడీ ముఠా అనే అనుమానంతో మూక హత్య
ముంబై : మహారాష్ట్రలోని పాల్గార్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని దబాధి ఖన్వేల్ రహదారిని ఆనుకుని ఉన్న ఓ గ్రామంలో గురువారం తెల్లవారుజామున దోపిడీ ముఠా అనుకుని గ్రామస్తులు ముగ్గురిని దారుణంగా హతమార్చారు. మృతులను సుశీల్‌గిరి మహరాజ్, నీలేష్ తెల్గాడె, జయేష్ తెల్గాడెలుగా గుర్తించారు. ముంబైకి చెందిన వీరు నాసిక్‌కు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఆపిన 200 మందికి పైగా గ్రామస్తులు వీరిని దోపిడీ ముఠాగా అనుమానించి దాడికి తెగబడ్డారు. తొలుత రాళ్లతో దాడిచేయగా వాహనాన్ని ఆపిన వెంటనే ముగ్గురు వ్యక్తులను బయటకు లాగి రాళ్లు, ఇనుపరాడ్లతో చితకబాదారు. కాగా తమ వాహనాన్ని గ్రామస్తులు అడ్డుకుని దాడికి పాల్పడుతున్నారని డ్రైవర్ పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు గ్రామస్తులను వారించారు. పోలీసులు చెప్పినా వినకుండా గ్రామస్తులు పోలీసు వాహనాలపైనా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో నలుగురు పోలీసులు, ఓ జిల్లా పోలీస్ ఉన్నతాధికారి గాయపడ్డారు. కాగా మూడు రోజుల కిందట దొంగలుగా అనుమానిస్తూ ఏసీపీ ఆనంద్ కాలే సహా ముగ్గురు పోలీసు అధికారులు, ఓ వైద్యుడిపైనా ఈ ప్రాంతంలో దాడి జరిగింది. ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠినచర్యలు చేపడతామని జిల్లాకు చెందిన సీనియర్ పోలీస్ అధికారి పేర్కొన్నారు. చదవండి : లాక్డౌన్ ఉల్లంఘన: సెల్ఫీ దిగండి -
రైతులను దారుణంగా చితకబాదారు..
-
రైతులను దారుణంగా చితకబాదారు..
సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో ఆరుగురు రైతులను గ్రామస్తులు దారుణంగా చితకబాదారు. కర్రలు, దుంగలతో కొట్టడమే కాకుండా వారిపైకి పెద్ద పెద్ద బండరాళ్లను విసిరారు. రైతులు వచ్చిన రెండు కార్లను ధ్వంసం చేశారు. వారిని 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న బోర్లాయ్ వరకు తరిమి తరిమి కొట్టారు. వారిలో ఒక రైతు అక్కడికక్కడే మరణించగా, మిగతా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఖిరికియా గ్రామంలో బుధవారం ఈ దారుణ సంఘటన జరగ్గా పోలీసులు గురువారం 15 మంది నిందితులను అరెస్ట్ చేసి వారిపై హత్యానేరం మోపారు. ఈ సంఘటనను స్థానిక జర్నలిస్ట్ ఒకరు వీడియో తీసి ఆన్లైన్లో పోస్ట్ చేయగా, ఇప్పుడది వైరల్ అవుతోంది. పోలీసుల కథనం ప్రకారం పొరుగూరికి చెందిన రైతులు వ్యవసాయ పనుల నిమిత్తం ఖిరికియా గ్రామానికి చెందిన ముగ్గురు కూలీలకు అడ్వాన్స్ కింద లక్షా యాభై వేల రూపాయలు ఇచ్చారు. డబ్బులు తీసుకొని పనికి రాకుండా ఎగ్గొడుతున్న ఆ కూలీలను డబ్బులన్నా ఇవ్వాల్సిందిగా రైతులు కోరారు. తమ ఊరికొస్తే డబ్బులిస్తామని కూలీలు వారికి నచ్చ చెప్పారు. వారి మాటలు నమ్మి గ్రామానికి వచ్చిన ఆరుగురు రైతులను ఊరు శివారున ముగ్గురు కూలీలు మరికొందరితో కలిసి అడ్డుకొని కొట్టడం ప్రారంభించారు. ఇదేమిటని అక్కడికొచ్చిన గ్రామస్తులు అడగ్గా, పిల్లలను ఎత్తుకుపోవడానికి వచ్చిన దొంగలంటూ కూలీలు అబద్ధమాడారు. దాంతో మరికొంత మంది గ్రామస్తులు ఆ కూలీలతో చేతులు కలిపి రైతులను చితకబాదారు. అక్కడ గుమికూడిన ప్రజలంతా చోద్యం చూస్తున్నట్టుగా చూస్తూ తమ తమ సెల్ఫోన్లలో వీడియోలు తీసుకున్నారు. యూనిఫామ్‌లో ఉన్న ఓ పోలీసు అధికారి మాత్రం ముక దాడిని అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. మరోవైపు ఈ సంఘటనకు సంబంధించిన మొత్తం 40మందిపై కేసు నమోదు కాగా, ఆరుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. -
పుకారు వార్తలతో చనిపోయిన వారి సంగతేంటి..
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో అనేక రకాల మూక హత్యలు జరుగుతున్నా, మతపరమైన హత్యలనే ఎక్కువ ప్రచారం చేస్తున్నారని కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ వ్యాఖ్యానించారు. ఉత్తర భారత దేశంలో గోమాంసం పేరిట జరిగిన హత్యలకు మీడియా ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి.. ఇతర కారణాలతో జరిగే మూక హత్యలపై మౌనం వహిస్తోందని ఆరోపించారు. నకిలీ వార్తల వ్యాప్తితో.. చిన్న పిల్లలను ఎత్తుకెళ్తున్నారనే పుకార్లను నమ్మి ప్రజలు అనుమానితులను హత్య చేసిన ఘటనలు యూపీఏ హయాంలో జరిగాయని గుర్తు చేశారు. ఇలాంటి ఘటనలు 2012లో 16, 2013లో 14 జరిగాయనీ.. వీటిపై ఏ మీడియా సంస్థ కూడా డిబేట్ పెట్టలేదని విమర్శించారు. ‘నకిలీ వార్తల కారణంగా మూక హత్యలు జరిగినప్పుడు స్థానికంగా అప్పటికప్పుడు హడావుడి చేస్తారు. ఆతర్వాత మరచిపోతారు. కానీ ప్రజల చేతిలో హతమైన వారి గురించి మాత్రం ఎవరూ పట్టించుకోరు’అని మంత్రి అన్నారు. ఇలాంటి హత్యలను గుర్తించి టీవీలలో చర్చించడం ద్వారా ప్రజల్లో అవగాహన పెంచాలని ఆయన మీడియాకు సూచించారు. కాగా, గతేడాది తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పుకార్లు వ్యాపించిన సంగతి తెలిసిందే. దీని వల్ల చాలా మంది బిచ్చగాళ్లు, వేరే రాష్ట్రాల వారు ప్రజల చేతిలో దాడికి గురయ్యారు. కొందరు ప్రాణాలు కోల్పోయారు. -
పెహ్లూ ఖాన్: రాజస్థాన్ హైకోర్టు కీలక ఉత్తర్వులు
జైపూర్: గోరక్షకుల కిరాకత మూకదాడిలో మృతి చెందిన పెహ్లూ ఖాన్, అతని ఇద్దరు కుమారులపై నమోదైన ఆవుల స్మగ్లింగ్ కేసును రాజస్థాన్ హైకోర్టు బుధవారం కొట్టివేసింది. మూకదాడిలో చనిపోయిన పెహ్లూ ఖాన్, అతని కొడుకులపై గత మే నెలలో రాజస్థాన్ పోలీసులు చార్జ్‌షీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. జంతువధ, జంతు తరలింపు నిషేధ చట్టంలోని సెక్షన్ 5,8, 9ల కింద ఆవులను స్మగ్లింగ్ చేస్తున్నారంటూ అభియోగాలు మోపారు. దీనిపై హైకోర్టును ఆశ్రయించిన పెహ్లూ ఖాన్ కొడుకులకు తాజాగా ఊరట లభించింది. 2017 ఏప్రిల్ 1వ తేదీన అల్వార్‌లో పెహ్లూ ఖాన్, అతని కొడుకులు ఓ వాహనంలో ఆవులను తరలిస్తుండగా.. అతను ఆవులను స్మగ్లింగ్ చేస్తున్నాడనే అనుమానంతో గోరక్షకులు కిరాతక చర్యకు దిగారు. వారి వాహనాన్ని అడ్డుకొని.. వారిపై దాడి చేశారు. వృద్ధుడు అన్న కనికరం చూపకుండా గోరక్షకులు అతన్ని చితకబాదడంతో.. రెండురోజుల తర్వాత పెహ్లూ ఖాన్ ప్రాణాలు విడిచారు. ఈ నేపథ్యంలో బాధితుడు, మృతుడైన పెహ్లూ ఖాన్‌కు వ్యతిరేకంగానే చార్జిషీట్ పోలీసులు దాఖలు చేయడంతో అప్పట్లో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే, గత బీజేపీ ప్రభుత్వం హయాంలో ఈ కేసు విచారణ జరిగిందని, ఆ విచారణ అనుగుణంగానే ఇప్పుడు చార్జిషీట్ వేశారని, . కేసు విచారణలో ఏమైనా వివక్షలు, అవకతవకలు ఉంటే.. కేసును మళ్లీ పునర్విచారణ జరిపిస్తామని అప్పట్లో సీఎం అశోక్ గెహ్లాట్ హామీ ఇచ్చారు. మూకదాడిలో తండ్రిని కోల్పోయానని, అయినా తమపైనే కేసులు పెట్టి వేధిస్తున్నారని అప్పట్లో పెహ్లూ ఖాన్ కొడుకు ఇర్షాద్ (25) ఆవేదన వ్యక్తంచేశాడు. -
ఎన్సీఆర్బీ నివేదికలో ‘డేటా’ గల్లంతు!
సాక్షి, న్యూఢిల్లీ : 2017లో దేశంలో జరిగిన వివిధ రకాల నేరాల గురించి సమాచారాన్ని సేకరించి, వాటిని విశ్లేషించిన ‘నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ)’ సోమవారం ఆ డేటాకు సంబంధించిన నివేదికను విడుదల చేసింది. 2018లోనే విడుదల చేయాల్సిన ఈ డేటాను ఏడాది ఆలస్యంగా విడుదల చేయడానికి కారణం ఏమిటో వివరించలేదు. విడుదల చేసిన డేటాలో కూడా అనేక లోపాలు ఉన్నాయి. దేశంలో చోటు చేసుకున్న మూక హత్యలు, సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులు చేసిన లేదా చేయించిన హత్యల వివరాలు, కాపు పంచాయతీల ఆదేశాల మేరకు జరిగిన హత్యలు, మత ఘర్షణల్లో చనిపోయిన వారి డేటాను విడుదల చేయలేదు. ఈ నేరాలకు సంబంధించి సమాచారాన్ని సేకరించి, విశ్లేషించినప్పటికీ డేటాను ప్రచురించక పోవడం ఆశ్చర్యంగా ఉందని, దీన్ని చివరి నిమిషంలో ప్రచురించకుండా ఎందుకు నిలిపివేశారో ఉన్నతాధికారులకే తెలియాలని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఓ అధికారి తెలిపారు. దేశంలో 2017లో గోరక్షణ పేరిట మూక హత్యలు, మత విద్వేష సంఘటనలు ఎక్కువగా జరిగాయి. ‘పిల్లలను ఎత్తుకుపోయే కిడ్నాపర్లు వచ్చారు’ అంటూ సోషల్ మీడియా ప్రచారం వల్ల జరిగిన హత్యల వివరాలు కూడా డేటా నుంచి పూర్తిగా మాయమయ్యాయి. పైగా ఈ సారి నివేదికలో ముడుపెన్నడూ లేనిది ‘జాతి వ్యతిరేక శక్తుల’ పేరిట మూడు కొత్త కేటగిరీలను చేర్చారు. వాటిలో ఒకటి ఈశాన్య రాష్ట్రాల తిరుగుబాటుదారులు, రెండు నక్సలైట్లు లేదా వామపక్ష తీవ్రవాదుల, మూడు జిహాది టెర్రరిస్టులు సహా టెర్రరిస్టులు. ఈ మూడు వర్గీకరణల కిందకు వచ్చే వారంతా జాతి వ్యతిరేక శక్తులంటూ వారు ఇంత వరకు భారతీయ శిక్షా స్మతి, ఆయుధాల చట్టం, చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద చేసిన నేరాల గురించి వెల్లడించారు. టెర్రరిస్టు దాడుల్లో చనిపోయిన హిందువుల గురించి ఇచ్చారు. హిందువుల దాడుల్లో మరణించిన ముస్లింల గురించి ఎక్కడా, ఏ కేటగిరీ కింద కూడా ఇవ్వలేదు. డేటాలో పలు నేరాలకు సంబంధించిన వివరాలు గల్లంతవడం వెనక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రభావం ఉంటుందనడంలో సందేహం లేదు. ఇలా జరగడం ఇదే కొత్త కాదు. బీజీపీ ప్రభుత్వం తన రాజకీయ లక్ష్యాల కోసం గత కొన్ని ఏళ్లుగా ఇలాంటి సమాచారాన్ని దాస్తున్న విషయం బహిరంగ రహస్యమే. ఒక్క నేరాలకు సంబంధించిన సమాచారాన్ని మాత్రమే కాకుండా ప్రభుత్వానికి సంబంధించిన అనేక గణాంకాల వివరాలను తొక్కిపెట్టింది. దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న నిరుద్యోగుల శాతం వివరాలను దాచేయడమే కాకుండా మూడు నెలలకోపారి నిరుద్యోగంపై జరిగే సర్వేలను నిలిపి వేసింది. 2011 జనాభా లెక్కలకు సంబంధించి కులాల విశ్లేషణా వివరాలను కూడా 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం తొక్కి పెట్టింది. దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ముఖ్యమైన వివరాలను కూడా బీజేపీ ప్రభుత్వం తొక్కి పెడుతూ వస్తోంది. ఇలా చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమే కాదు. ఇలాంటి నేరాలు, ఆర్థిక గణాంకాలు విడుదల చేయకపోతే భవిష్యత్తుతో నేరాలను అరికట్టేందుకు, దిగజారుతున్న ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు విధాన నిర్ణయాలు తీసుకోవడం ఎలా సాధ్యం అవుతుందని మేథావులు ప్రశ్నిస్తున్నారు. -
దుమారం రేపుతున్న ట్రంప్ ట్వీట్!
వాషింగ్టన్ : తనను అధికారం నుంచి తొలగించడానికి ప్రతిపక్ష డెమొక్రాట్లు తీసుకువచ్చిన అభిశంసన తీర్మానాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మూక దాడితో పోల్చారు. డెమొక్రటిక్ పార్టీ నాయకుడు అధ్యక్షుడైన నేపథ్యంలో... వారి తరహాలోనే తాము కూడా ఎలాంటి న్యాయ పరమైన ప్రక్రియ లేకుండానే వారిని గద్దె దింపుతామని పేర్కొన్నారు. ఈ మేరకు...‘ఏదో ఒకరోజు డెమొక్రాట్ అధ్యక్షుడు అయి... స్వల్ప తేడాతో రిపబ్లికన్లు హౌజ్‌ను సొంతం చేసుకున్నట్లయితే.... అప్పుడు వాళ్లు ఎలాంటి న్యాయ ప్రక్రియ లేకుండానే అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టగలరు. కాబట్టి ఇప్పుడు డెమొక్రాట్లు చేస్తున్న మూకదాడిని(మూక దాడులకు శిక్షలు పడవు అన్న ఉద్దేశంతో) ప్రతీ ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. అయితే మనమే గెలవబోతున్నాం’ అని ట్రంప్ ట్వీట్ చేశారు. ఈ క్రమంలో ప్రతిపక్షాలు, సామాజికవేత్తలతో పాటు సొంత పార్టీ నేతలు సైతం ట్రంప్ తీరును విమర్శిస్తున్నారు. అత్యంత హేయమైన మూక దాడులను అభిశంసనతో పోల్చడం ఆయన మూర్ఖత్వం, భాషా పరిఙ్ఞానానికి అద్దం పడుతోందని మండిపడుతున్నారు. కాగా అమెరికా చరిత్రలో 1882 నుంచి 1968 మధ్య దాదాపు 4700 మూక హత్యలు జరిగాయి. వీరిలో ఎక్కువ మంది బాధితులు శ్వేతజాతీయేతర వారు అందులోనూ ముఖ్యంగా ఆఫ్రికా నుంచి వలసవచ్చిన వారు. ఇక అనధికారికంగా మరెన్నో మూక హత్యలు జరిగాయని ఈ మేరకు నాప్(ది నేషనల్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ కలర్్డ పీపుల్) పేర్కొంది. ఇక సోషల్ మీడియాలో సైతం ట్రంప్ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘అసలు మూక హత్య అంటే అర్థం ఏమిటో మీకు తెలుసా ట్రంప్? 14 ఏళ్ల నల్లజాతి బాలుడిపై ఓ శ్వేతజాతి మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు మోపి అతడి దారుణ హత్యకు కారణమైంది. అమెరికన్ల జాత్యహంకారాన్ని ప్రపంచాన్ని చూపించేందుకు వాళ్ల అమ్మ... అతడిని శవపేటికలో నుంచి బయటకు తీసి అంత్యక్రియలు నిర్వహించింది. మీరేమో అభిశంసనను మూక హత్య అంటున్నారు’ అని నెటిజన్లు ట్రంప్‌పై విరుచుకుపడుతున్నారు. మరికొంత మంది మాత్రం ఆయనకు మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు. కాగా ట్రంప్‌ను గద్దె దించడానికి డెమొక్రాట్లు మరోసారి అభిశంసన తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ప్రక్రియ మొదలైందని స్పీకర్ నాన్సీ పెలోసీ ప్రతినిధుల సభలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ తాజా ట్వీట్‌తో మరోసారి తన వైఖరి బయటపెట్టారు. ఇక 2020 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ నాయకుడు జోయ్ బైడన్ నుంచి ట్రంప్‌కి గట్టి పోటీ నెలకొని ఉందన్న వార్తల నేపథ్యంలో... బైడన్‌ను రాజకీయంగా దెబ్బ తీయడానికి ట్రంప్ ఉక్రెయిన్ సహకారాన్ని తీసుకోవడానికి సిద్ధమైనట్టుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఉక్రెయిన్‌లో బైడన్ కుమారుడు హంటర్ బైడన్‌కు భారీగా వ్యాపారాలున్నాయి. ఈ క్రమంలో ఆ దేశానికి ఆర్థిక సాయాన్ని ప్రకటించిన ట్రంప్ దీనిని రాజకీయంగా వాడుకోవాలని చూశారని, బైడన్ ఆయన కుమారుడిపై అవినీతి కేసుల విచారణ వేగవంతం చేయాలంటూ ఉక్రెయిన్‌పై ఒత్తిడి తీసుకువస్తున్నట్టు డెమొక్రాట్లు ఆరోపిస్తున్నారు. అయితే ట్రంప్ మాత్రం వీటిని కొట్టిపడేశారు. అభిశంసన అంటే..? తీవ్రమైన నేరాలకు పాల్పడిన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు గద్ద దింపే ప్రక్రియే అభిశంసన. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ఇతర అధికారులు దేశద్రోహం, లంచాలు ఇవ్వడం, అధికార దుర్వినియోగం వంటి నేరాలకు పాల్పడితే అభిశంసించే అధికారం అమెరికా కాంగ్రెస్‌కు ఉంది. ప్రక్రియ ఎలా ? అధ్యక్షుడిని అభిశంసించి గద్దె దింపడం సులభమేమీ కాదు. దీనికి సుదీర్ఘమైన న్యాయప్రక్రియ జరగాల్సి ఉంటుంది. అధ్యక్షుడిపై నమోదైన అభియోగాలను సాక్ష్యాధారాలతో స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన హౌస్ జ్యుడీషియరీ కమిటీ విచారిస్తుంది. అక్కడ ఆరోపణలు రుజువైతే 435 మంది సభ్యులు కలిగిన ప్రతినిధుల సభ సాధారణ మెజారీటీతో అభిశంసన తీర్మానాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. So some day, if a Democrat becomes President and the Republicans win the House, even by a tiny margin, they can impeach the President, without due process or fairness or any legal rights. All Republicans must remember what they are witnessing here - a lynching. But we will WIN! — Donald J. Trump (@realDonaldTrump) October 22, 2019 -
భారత్‌లో ఇలాంటి ఘటనలు విచారకరం: అమెరికా
వాషింగ్టన్ : పలు అంశాల్లో భారత్ తమ భాగస్వామిగా ఉండటం గర్వంగా ఉందని.. అయితే అక్కడ మైనార్టీలపై జరుగుతున్న అకృత్యాలకు అడ్డుకట్ట వేసి ప్రభుత్వం వారి హక్కులను పరిరక్షించాలని అమెరికా సూచించింది. ఇటీవల కాలంలో మైనార్టీలు, దళితులపై మూక దాడులు జరుగుతున్నాయని.. ఇవి భారత న్యాయ చట్టాల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నాయని పేర్కొంది. ఈ మేరకు.. ‘హ్యూమన్ రైట్స్ ఇన్ సౌత్ ఏషియా: వ్యూస్ ఫ్రం ది స్టేట్ డిపార్ట్మెంట్ అండ్ రీజియన్’ అనే అంశంపై కాంగ్రెస్ కమిటీ సమావేశంలో అమెరికా దక్షిణ-మధ్య ఆసియా వ్యవహారాల తాత్కాలిక సహాయక కార్యదర్శి అలైస్ వెల్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ భారత్‌లో మైనార్టీలపై హింసాత్మక ఘటనలు పెరిగిపోతున్నాయి. గో రక్షకుల పేరిట దళితులు, ముస్లింలపై దాడులు జరుగుతున్నాయి. దాదాపు తొమ్మిది రాష్ట్రాల్లో ఉన్న యాంటీ కన్వెర్షన్ చట్టాలు(మత మార్పిడి నిరోధక చట్టాలు) భారత్‌లో మైనార్టీలకై చట్టం కల్పిస్తున్న హక్కులకు విఘాతం కలిగిస్తున్నాయి. భారత్‌లో ఉన్న బలహీన వర్గాలు మత స్వేచ్చ హక్కును పూర్తిగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలి అని విఙ్ఞప్తి చేస్తున్నాం. అసోంలోని దాదాపు 1.9 మిలియన్ల ప్రజల పౌరసత్వ విషయం ప్రశ్నార్థకం అయింది. ఇలాంటి చర్యలను మేము ఖండిస్తున్నాం. ఇందులో జవాబుదారీతనం లోపిస్తోంది’ అని ఆమె పేర్కొన్నారు. ఇక అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారత్‌లో 68 శాతం మంది ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారని వెల్స్ అన్నారు. వీరంతా కుల, మత, వర్గ, సామాజిక, ఆర్థిక, ప్రాంతాలకు అతీతంగా ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో కీలక పాత్ర పోషించారని.. ముఖ్యంగా మహిళలు ఓటు హక్కును వినియోగించుకోవడంలో ముందున్నారని తెలిపారు. భారత్‌లోని మూడో వంతు జనాభా పేదరికానికి దిగువన నివసిస్తున్నారని... ఆర్థిక అసమానతలు అధిగమించడానికి రాష్ట్రాలు ఎంతగానో ప్రయత్నిస్తున్నప్పటికీ లక్ష్యాలను చేరుకోలేకపోతున్నాయని అభిప్రాయపడ్డారు. ‘ హిందూయిజం, సిక్కిం, బుద్ధిజం, జైనిజం వంటి ప్రపంచలోని నాలుగు ప్రధాన మతాలు భారత్‌లో ఉద్భవించాయి. ప్రపంచంలోని మూడో వంతు ముస్లిం జనాభాకు భారత్ జన్మస్థానం. ఇందులో సూఫీలు, షియాలు, బోహ్రాలు ఉన్నారు. దాదాపు మూడు వంతుల మంది క్రిస్టియన్లు కూడా భారత పౌరుల్లో ఉన్నారు. భారత్‌లోని 29 రాష్ట్రాల్లోనూ వీరి జనాభా ఉంది. అయితే భిన్నత్వంలో ఏకత్వం ఉన్న భారత్‌లో మైనార్టీలపై దాడులు జరగడం విచారకరం’ అని వెల్స్ పేర్కొన్నారు. -
ఇది కచ్చితంగా హత్యే; అమితమైన ప్రేమ వల్లే..
లక్నో : రాష్ట్రంలో నడిచేది రామరాజ్యం కాదని.. నాథూరాం రాజ్యం అంటూ ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ యోగి సర్కారుపై విమర్శలు గుప్పించారు. మూక హత్యలతో పాటు ఇప్పుడు పోలీసుల చేతిలో పౌరుల హత్యలు కూడా సాధారణం అయిపోయాయంటూ మండిపడ్డారు. వారం రోజుల క్రితం పోలీసుల కాల్పుల్లో మరణించిన ఇసుక వ్యాపారి పుష్పేంద్ర యాదవ్ కుటుంబాన్ని బుధవారం అఖిలేశ్ యాదవ్ పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ‘ ఉన్నావ్ అత్యాచార బాధితురాలి విషయంలో ఏం జరిగింది. చిన్మయానంద్ చేతిలో బలైన బాధితురాలికి ఏం న్యాయం జరిగింది. ఆమెకు ప్రమాదం జరిగితే.. ఏకంగా ఈమెను జైలుకు పంపించారు. ఇదెక్కడి న్యాయం. యూపీలో రామరాజ్యం కాదు.. నాథూరాం రాజ్యం నడుస్తోంది. పోలీసులు కూడా హత్యలు చేయడం ప్రారంభించారు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పుష్పేంద్ర యాదవ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కాగా ఇసుక వ్యాపారం చేసే పుష్పేంద్ర యాదవ్‌ను ఆదివారం పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఇసుక మాఫియాకు పాల్పడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో పోలీసులు పుష్పేంద్ర కార్యకలాపాలపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఆదివారం ఆయనకు సంబంధించిన ట్రక్కును సీజ్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో తనపై ట్రక్కు ఎక్కించి చంపేందుకు కుట్ర చేయడంతో ప్రాణరక్షణ కోసం పుష్పేంద్రపై కాల్పులు జరిపానని పోలీసు ఇన్స్పెక్టర్ మీడియాకు తెలిపారు. అయితే సదరు పోలీసు అధికారి పుష్పేంద్రను లక్షా యాభై వేల రూపాయలు లంచం ఇవ్వాల్సిందిగా బెదిరించారని.. ఈ నేపథ్యంలో తన బండారం బట్టబయలు చేస్తానంటూ పుష్పేంద్ర వార్నింగ్ ఇవ్వడంతో తనను కాల్చి చంపేశారని అతడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. కానీ పోలీసు ఉన్నతాధికారులు వీటిని కొట్టిపారేశారు. ఇక ఈ విషయం గురించి అఖిలేశ్ మాట్లాడుతూ.. పోలీసులు చెప్పేదంతా కట్టుకథ.. పుష్పేంద్ర యాదవ్‌ది కచ్చితంగా హత్యేనని వ్యాఖ్యానించారు. యూపీ పోలీసు వ్యవస్థ మీద, ప్రభుత్వం మీద తనకు ఏమాత్రం నమ్మకం లేదని.. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో ఈ కేసు విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కాగా అఖిలేశ్ వ్యాఖ్యలను అధికార బీజేపీ ఖండించింది. ఓటు బ్యాంకు కోసం అఖిలేశ్ ఇసుక మాఫియాను ప్రోత్సహిస్తున్నారంటూ విమర్శల దాడికి దిగింది. ‘ ఆయనకు ఇసుక మాఫియా, తన కులం వారి మీద అమితమైన ప్రేమ ఉంది. అందుకే ఎన్‌కౌంటర్‌ను హత్య అంటున్నారు. ఎన్నికల్లో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పినా తీరు మార్చుకోవడం లేదు’ అంటూ బీజేపీ నేత సిద్దార్థ్ సింగ్ విమర్శించారు. -
సెలబ్రిటీలపై దేశద్రోహం కేసు; ట్విస్ట్
ముజఫర్‌పూర్: దేశంలో పెరుగుతున్న మూక దాడులను నిరసిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసిన 50 మంది ప్రముఖులపై నమోదైన దేశద్రోహం కేసు ఉపసంహరణకు ఆదేశాలు జారీ అయ్యాయి. వారిపై బిహార్‌లోని సర్దార్ పోలీస్ స్టేషన్లో నమోదైన దేశద్రోహం కేసును మూసివేయాలని ముజఫర్‌పూర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మనోజ్‌కుమార్ సిన్హా బుధవారం ఆదేశాలిచ్చారు. నిరాధార ఆరోపణలు చేసిన ఈ ఫిర్యాదుదారుపై విచారణ సాగుతుందని ఓ పోలీసు అధికారి తెలిపారు. వేర్పాటు ధోరణులను బలపరిచేలా బహిరంగ లేఖ రాశారంటూ ముజఫర్‌పూర్‌కు చెందిన సుధీర్ కుమార్ ఓఝా అనే న్యాయవాది 50 మంది ప్రముఖులపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దేశంలో మూక దాడులు పెరుగుతుండటాన్ని నిరసిస్తూ మణిరత్నం, అపర్ణాసేన్, కొంకణాసేన్, ఆదూర్ గోపాలకృష్ణన్, రామచంద్ర గుహ, రేవతి, అనురాగ్ కశ్యప్, శ్యామ్‌బెనగల్ వంటి 50 మంది వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు మోదీకి జూలైలో లేఖ రాసిన విషయం తెలిసిందే. కాగా, మోదీకి బహిరంగ లేఖ రాసిన 49 మంది ప్రముఖులపై దేశద్రోహం కేసు పెట్టడంపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కేసును ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్, వామపక్షాలు, డీఎంకే, ఆర్జేడీ సహా పలు పార్టీలు డిమాండ్ చేశాయి. దీంతో బిహార్ పోలీసులు వెనక్కుతగ్గారు. అయితే, ఈ కేసుతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రకటించారు. (చదవండి: ప్రముఖులపై రాజద్రోహం కేసు) -
ప్రభుత్వ తీరుపై మరో 180 మంది ప్రముఖులు లేఖ
-
మూకదాడులు దేశ ప్రతిష్టకు భంగం: భగవత్
సాక్షి, నాగపూర్: మూకదాడులు దేశంలో ఏ మాత్రం సరైనవి కావని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. భారతదేశం భారతీయులందరిదీనని, ఇక్కడ అందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పారు. దసరా సందర్భంగా మంగళవారం నాగపూర్‌లో ఆర్ఎస్ఎస్ నిర్వహించిన కార్యక్రమంలో భగవత్ పాల్గొని ఆయుధపూజ నిర్వహించారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, భిన్నత్వం అనేది మన దేశానికి అంతర్గత శక్తి అని అన్నారు. ‘మూకదాడులు, సామాజిక హింసా ఘటనల వల్ల దేశానికి, హిందూ సమాజం ప్రతిష్టకు భంగం వాటిల్లుతుంది. కొన్ని మతాల మధ్య భయాందోళనలకు దారితీస్తుంది. మూకదాడులు భారత సంస్కృతి కాదు, పరాయి సంస్కృతి' అని భగవత్ అన్నారు. పరస్పర సహకారం, కలిసి చర్చించుకునే వాతావరణాన్ని పాదుకొలిపేందుకు సంఘ్ స్వయంసేవక్‌లు కృషిచేయాలని మోహన్ భగవత్ పిలుపునిచ్చారు. -
సెలబ్రిటీలపై దేశద్రోహం కేసుపై నిరసనలు
న్యూఢిల్లీ: మూక దాడులపై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాసిన 49 మంది ప్రముఖులపై దేశద్రోహం కేసు పెట్టడాన్ని పలు పార్టీలు, సంఘాలు ఖండించాయి. కేసును వెనక్కు తీసుకోవాలని కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, డీఎంకే, ఆర్జేడీ, కేరళ రాష్ట్ర చలనచిత్ర అకాడెమీ డిమాండ్ చేశాయి. అయితే, ఈ కేసుతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని శనివారం కేంద్రమంత్రి ప్రకాశ్ జవడేకర్ స్పష్టం చేశారు. -
మణిరత్నంపై రాజద్రోహం కేసు
ముజఫర్‌పూర్/వయనాడ్: మూకదాడులపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఇందుకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాసిన 50 మంది ప్రముఖులపై రాజద్రోహం కింద కేసు నమోదైంది. ప్రధాని మోదీకి రాసిన జూలైలో రాసిన ఆ లేఖపై ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహతోపాటు, సినీ దర్శకులు మణిరత్నం, అదూర్ గోపాలకృష్ణన్, అపర్ణసేన్ తదితర యాభైమంది ప్రము ఖులు సంత కాలు న్నాయి. ము స్లింలు, దళితులు, మైనారిటీలపై మూకదాడులను ఆపాలని వారు తమ లేఖలో కోరారు. అయితే, ‘ఆ లేఖ కారణంగా దేశం ప్రతిష్ట దెబ్బతింది. వేర్పాటు ధోరణులను బలపరచడంతోపాటు ప్రధాని అద్భుత పనితీరును అందులో చులకన చేశారు’అని ఆరోపిస్తూ బిహార్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన సుధీర్ కుమార్ ఓఝా అనే న్యాయవాది చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టుకు ఆగస్టులో ఫిర్యాదు చేశారు. దీనిపై మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు రాజద్రోహం వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయని సదర్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. -
మణిరత్నం సహా 50మందిపై కేసు నమోదు
ముజఫర్‌పూర్: దేశ రాజకీయాల్లో ఆసక్తిరేపిన 50మంది సెలబ్రిటీల లేఖ అంశంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. దిగ్గజ దర్శకుడు మణిరత్నం సహా పలువురు మేధావులపై దేశద్రోహం కేసు నమోదయింది. మూకుమ్మడి దాడులు, హత్యలపై ఆందోళన వ్యక్తం చేస్తూ దేశంలోని వివిధ రంగాల్లో నిష్ణాతులైన 50 మంది సెలెబ్రెటీలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాసినందుకుగాను రామచంద్ర గుహ, మణిరత్నం, అపర్ణా సేన్ తదితరులపై దేశద్రోహం కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. న్యాయవాది సుధీర్ కుమార్ ఓజా దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ సూర్యకాంత్ తివారీ ఆదేశాల మేరకు ఈ ఎఫ్ఐఆర్ నమోదయింది. దాదాపు మూడు నెలల క్రితం దేశంలో అసహనం పెరిగిపోతుందని, మాబ్ లించింగ్ మితిమీరు తున్నాయంటూ అదూర్ గోపాల కృష్ణన్, మణిరత్నం, అనురాగ్ కశ్యప్, శ్యాం బెనగల్ అపర్ణాసేన్, కొంకణ్ సేన్ శర్మ, సౌమిత్రా చటర్జీ, రామచంద్ర గుహ, శుభ ముద్గల్ సహా పలువురు సెలెబ్రిటీలు ప్రధాని మోదీనుద్దేశించి బహిరంగ లేఖ రాశారు. అయితే దీనికి నిరసనగా సుధీర్‌కుమార్ ఓజీ బీహార్ లోని బీహార్ లోని ముజఫర్ నగర్ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దేశ ప్రతిష్టను మంటకలిపారని, ప్రధాని అద్భుత పనితీరును నాశనం చేసే విధంగా రాసిన లేఖపై 50 మంది ప్రముఖులు సంతకాలు చేశారని ఆరోపిస్తూ ఓజా కోర్టును ఆశ్రయించారు. తన పిటిషన్‌ను అంగీకరించిన చీఫ్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ సూర్యకాంత్ తివారీ వీరిపై కేసు నమోదు చేయాల్సిందిగా ఆగస్టు 20న ఈ ఉత్తర్వులిచ్చారనీ, ఈ మేరకు సదర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైందని ఓజా చెప్పారు. ప్రధాని మోదీ హయాంలో దేశంలో అసహనం పెరిగిపోతుందంటూ ఏకంగా ప్రధాన మంత్రినుద్దేశించి బహిరంగ లేఖ రాసిన 50 మంది లేఖ రాయడం, ఈ లేఖ వెనుక వామపక్ష భావజాల ప్రభావం వుందని, కమ్యూనిస్టు భావజాలంతోనే వారంతా మోదీని అప్రతిష్ట పాలు చేసేందుకు యత్నించారని కాషాయదళం, దానికి అనుబంధంగా మరో 62 మంది సెలెబ్రిటీలు ఎదురు దాడి లాంటి పరిణామాలు తెలిసిందే. ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకులు శ్యాంబెనగల్, అనురాగ్ కశ్యప్ -
ఆ మూక హత్యలో ‘న్యాయం’ గల్లంతు!
సాక్షి, న్యూఢిల్లీ : 22 ఏళ్ల తబ్రేజ్ అన్సారీ మూక హత్య కేసులో 11 మంది నిందితులపై హత్యారోపణలను జార్ఖండ్ పోలీసులు మంగళవారం అనూహ్యంగా కొట్టివేసిన విషయం తెల్సిందే. అన్సారీ దెబ్బల మూలంగా కాకుండా గుండెపోటుతో మరణించినట్లు ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. అప్పట్లో వెలువడిన వార్తల ప్రకారం సెరాయ్‌కెలా–ఖర్సావన్ జిల్లా ధక్తీదీహ్ గ్రామంలో జూన్ నెలలో తబ్రేజ్ అన్సారీపై అల్లరి మూక దాడి చేసింది. ‘జై శ్రీరామ్’ అనాలంటూ ఆ యువకుడిపై ఒత్తిడి తీసుకొచ్చింది. అందుకు అతడు నిరాకరించడంతో ... ఓ చెట్టుకు కట్టేసి చితక్కొట్టారు. ‘జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేసినప్పటికీ అల్లరి మూక వదిలి పెట్టకపోవడంతో అన్సారీ తీవ్రంగా గాయపడ్డారు. మొదటి నుంచి ఈ కేసు దర్యాప్తులో పోలీసుల అలసత్వం ఎక్కువగా కనిపిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తీవ్రంగా గాయపడిన అన్సారీని తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించకపోగా ఆయనపైనే చోరీ కేసును దాఖలు చేసి జుడీషియల్ కస్టడీకి తరలించారు. నాలుగు రోజుల తర్వాత అన్సారీని ఆస్పత్రికి తరలించగా ఆక్కడ ఆయన చనిపోయారు. ‘తలకు బలమైన దెబ్బ తగలడం వల్ల మెదడులోని రక్తనాళాలు చిట్లి (బెయిన్ హెమరేజ్) అన్సారీ మరణించారు’ అంటూ ఆరోజు అటాప్సీ నిర్వహించిన వైద్యులు మీడియాకు స్పష్టంగా చెప్పారు. ఈ నేపథ్యంలో అన్సారీని కట్టేసి చితకబాదిన 11 మంది నిందితులపై పోలీసులు ఐపీసీ 302 సెక్షన్ కింద హత్య కేసును నమోదు చేశారు. ఆ తర్వాత అన్సారీని హత్య చేయాలనే ఉద్దేశం నిందితులకు ఏ కోశానా లేదని, అనుకోని పరిస్థితులు ఆయన హత్యకు దారి తీశాయంటూ పోలీసులు, నిందితులపై 302 సెక్షన్‌ను తొలగించి 304 సెక్షన్‌ను నమోదు చేశారు. ఆ తర్వాత దాదాపు మూడు నెలలపాటు కేసు దర్యాప్తులో ఎలాంటి పురోగతి కనిపించ లేదు. మెడికల్ బోర్డు తుది ఫోరెన్సిక్ నివేదికలో గుండెపోటు కారణంగా అన్సారీ మరణించారని ధ్రువీకరించినందున నిందితులపై 304 సెక్షన్‌ను కూడా కొట్టి వేస్తున్నామని జార్ఖండ్ పోలీసులు మంగళవారం ప్రకటించారు. మూకుమ్మడిగా బాధితుడిపై దాడి చేసిన నిందితులపై కేసు దాఖలు చేయాల్సిన పోలీసులు, బాధితుడిపైనే చోరీ కేసును నమోదు చేయడం, తలకు బలమైన దెబ్బతగలడం వల్ల మెదడులో రక్తస్రావంతో అన్సారీ మరణించారని తొలుత వైద్యులు మీడియాకు చెప్పడం, అది ప్రాథమిక నివేదిక మాత్రమేనని, తుది నివేదిక వెలువడాల్సి ఉందని మెడికల్ బోర్డు ఆ తర్వాత ప్రకటించడం, తుది నివేదిక మూడు నెలల ఆలస్యంగా రావడం, వచ్చీ రాగానే నిందితులపై 304 సెక్షన్ కింద హత్యా (దారితీసిన) ఆరోపణలను కొట్టివేస్తున్నట్లు పోలీసులు వెంటనే ప్రకటించడంలో ఆంతర్యం ఏమిటీ ? ఇందులో అనుమానాలకు ఎలాంటి అవకాశం లేదా ? పోలీసులు, మెడికల్ బోర్డు చెబుతున్నట్లుగా బాధితుడు గుండెపోటుతోనే మరణించాడని అనుకుందాం. అయితే అన్సారీని చెట్టుకు కట్టేసి కొట్టినందుకు వారిని ఐపీసీలోని ఏ సెక్షన్ కింద విచారించలేరా ? ఎలాంటి శిక్ష విధించలేరా ? అల్లరి మూక కొట్టడం వల్ల మానసిక ఒత్తిడికి గురై అన్సారీ గుండెపోటు వచ్చి మరణించి ఉండవచ్చుగదా! ఆ దిశగా కూడా దర్యాప్తు జరపొచ్చుగదా! లేదా గుండెపోటును స్వయంకతాపరాధం కింద పరిగణించి ఏ శిక్ష విధించకుండా నిందితులను వదిలేస్తారా ? ఇలాంటి మూక హత్య కేసులకు సంబంధించి సుప్రీం కోర్టు 2018, జూలై 17వ తేదీన 11 స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. మూక హత్యలపై ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసి విచారణను త్వరితగతిన ముగించడంతోపాటు ఇలాంటి మూక హత్యలు జరుగకుండా ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలను కూడా సుప్రీం కోర్టు సూచించింది. మూక హత్యలకు అవకాశం ఉన్న ప్రతి జిల్లాకు ఓ నోడల్ అధికారిని నియమించాలని, ఆ అధికారి జిల్లా, తాలూకా, గ్రామస్థాయి పరిస్థితులను రాష్ట్ర డిజీపీకి ఎప్పటికప్పడు పరిస్థితి వివరించాలని, రాష్ట్ర డీజీపీ మూక హత్యల నిరోధానికి తగిన చర్యలు తీసుకోవాలని మార్గదర్శకాలను సూచించింది. మరి, జార్ఖండ్‌లో ఇలాంటి ముందస్తు నిరోధక చర్యలు తీసుకున్నారా ? సుప్రీం కోర్టు మార్గదర్శకాల గురించి అక్కడి పోలీసులకు తెలుసునా ? తెలిసినా రాష్ట్ర ప్రభుత్వం మనోగతానికి విరుద్ధంగా వ్యవహరించలేమంటూ వదిలేశారా ? 302 సెక్షన్ కింద నిందితులకు మరణ శిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉండింది. అదే 304 సెక్షన్ కింది నిందితులకు పదేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉండింది. మరి నిందితులను ఇప్పుడు ఏ సెక్షన్ కింద విచారిస్తారు? మూక హత్యల నివారణకు మణిపూర్లోలాగా ‘ప్రత్యేక చట్టం’ ఉండి ఉంటే ఆ చట్టం కింద విచారించే అవకాశం ఉండేది. ఒకే వేళ ఉన్న పాలకపక్షానికి విరుద్ధంగా కేసులను దర్యాప్తు చేసే దమ్మూ ధైర్యం జార్ఖండ్ పోలీసులకు ఉందో, లేదో!? -
డాక్టర్‌పై దాడికి పాల్పడ్డ 21 మంది
-
డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో దారుణం..!
గువాహటి : అసోంలోని టియోక్ టీ ఎస్టేట్‌లో డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో సోమ్రా మాఝి (33) అనే మహిళా కార్మికురాలు మృతి చెందింది. దాంతో ఆమె కుటుంబ సభ్యులు, తోటి కార్మికులు సదరు మహిళ మృతికి డాక్టరే కారణమంటూ ఆగ్రహావేశాలకు లోనయ్యారు. డాక్టర్ దేవెన్ దత్తా (73) ఆస్పత్రికి చేరుకోగానే దాదాపు 250 మంది మూకుమ్మడిగా దాడికి తెగబడ్డారు. అయితే, టీతోటలో ఘర్షణపూరిత వాతావరణం నెలకొందని తెలుసుకున్న పోలీసులు ఆయనకు రక్షణ కల్పించారు. కానీ, అప్పటికే సమయం మించిపోయింది. మూక దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తరలిస్తుండగా డాక్టర్ దేవెన్ దత్తా మార్గమధ్యంలో మృతి చెందారు. ఈ ఘటన గత శనివారం జోర్హాత్ జిల్లాలో చోటుచేసుకుంది. డాక్టర్‌పై దాడికి పాల్పడ్డ 21 మందిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. డాక్టర్ దేవెన్ దత్తాపై జరిగిన అమానుష దాడితో వైద్య సంఘాలు భగ్గుమన్నాయి. రిటైర్ అయ్యాక కూడా ప్రజలకు సేవ చేస్తున్న సీనియర్ డాక్టర్‌కు ఇలాంటి గతి పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఘటనను తీవ్రంగా ఖండిస్తూ ఇండియన్ మెడికల్ అసోషియేషన్ మంగళవారం బంద్‌కు పిలుపునిచ్చింది. అత్యవసర సేవల్ని కూడా నిలుపుదల చేస్తున్నామని ప్రకటించింది. -
మూకదాడిలో వ్యక్తి మృతి: 32 మంది అరెస్ట్
పట్నా: దేశంలో మూకదాడులు రోజురోజకీ పెరిగిపోతున్నాయి. తాజాగా బిహార్‌లో మరో మూకదాడి చోటుచేసుకుంది. రాష్ట్ర రాజధాని ప్రాంతమైన పట్నాకి సమీపంలోని దానాపూర్‌లో శనివారం జరిగింది. చిన్న పిల్లలను ఎత్తుకు పోతున్నారనే అనుమానంతో ముగ్గురు వ్యక్తులపై స్థానికులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒక వ్యక్తి తీవ్ర గాయాలపాలు కావడంతో అక్కడిక్కడికే మృతి చెందాడు. మరో ఇద్దరు గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు దాడికి పాల్పడిన 32 మందిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. అనంతరం మృత దేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఘటనపై చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా శాంతి భద్రతల సమస్యను అదుపులో ఉంచుతామని సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ తెలిపారు. దీనిపై అధికార జేడీయూ నేత స్పందిస్తూ.. పోలీసులు ఇటువంటి దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయితే ఇదే ప్రాంతంలో గత జూలై 30న సైతం ఒక వ్యక్తి మూకదాడిలో మరణించిన విషయం తెలిసిందే. -
కాంగ్రెస్ నాయకులపై మూకదాడి!
భోపాల్ : మూకహత్యలు, జై శ్రీరాం నినాదాల పేరిట హింసాత్మక ఘటనలు పెరిగిపోతున్నాయంటూ దేశవ్యాప్తంగా ఆందోళన వెల్లువెత్తుతున్న వేళ మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ నాయకులపై మూకదాడి కలకలం రేపింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు వ్యక్తులను కిడ్నాపర్లుగా భావించిన నవలాసిన్హా గ్రామస్తులు వారి కారు ధ్వంసం చేసి దాడికి పాల్పడ్డారు. బేతుల్ జిల్లాలో గురువారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు... తమ గ్రామంలోని చిన్న పిల్లలను ఎత్తుకెళ్లే ముఠా దిగిందని నవలాసిన్హా గ్రామంలో వదంతులు వ్యాపించాయి. ఈ క్రమంలో తమ గ్రామంలోకి వాహనాలు ప్రవేశించకుండా చెట్లు కొట్టి రోడ్డుకు అడ్డంగా పడేశారు. అయితే అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన బేతుల్ జిల్లా నాయకులు ధర్మేంద్ర శుక్లా, ధర్ము సింగ్, లలిత్ బరాస్కర్ కారులో అక్కడికి చేరుకున్నారు. వీరిని కిడ్నాపర్లుగా పొరబడ్డ గ్రామస్తులు.. కారు నుంచి వారిని బయటికి లాగి దాడి చేశారు. అనంతరం కారును కూడా ధ్వంసం చేశారు. ఈ క్రమంలో వీరిని బందిపోట్లుగా భావించిన కాంగ్రెస్ నాయకులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలతో చర్చించి శాంతింపజేశారు. అనంతరం కాంగ్రెస్ కార్యకర్తల ఫిర్యాదు మేరకు గ్రామస్తులపై కేసు నమోదు చేశారు. -
మూకహత్య : మరో దారుణం
సాక్షి, న్యూఢిల్లీ: మూకహత్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కొనసాగుతుండగానే దేశ రాజధాని నగరంలో మరో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. దొంగతనం చేశాడనే అనుమానంతో ఒక మైనర్‌ను తీవ్రంగా కొట్టి చంపిన ఘటన ఉద్రిక్తత రేపింది. నార్త్-వెస్ట్ ఢిల్లీ, ఆదర్శ్ నగర్లో శుక్రవారం ఉదయం ఈ అమానుషం చోటు చేసుకుంది. ఆదర్శ్ నగర్లో మైనర్ హత్య శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో మైనర్‌బాలుడు సాహిల్ (16) పొరుగువారి నివాసంలోకి వచ్చాడు. అదే సమయంలో నిద్రనుంచి మొల్కొన్న ఇంటి యజమాని ముఖేష్ ..అతను దొంగతనానికి వచ్చాడని భావించాడు. అతణ్ని పట్టుకొని చుట్టుపక్కల వారినందర్నీ పిలిచాడు. దీంతో అందరూ గుమిగూడి సాహిల్‌ను తీవ్రంగా కొట్టం ప్రారంభించారు. అయితే కొంతమంది స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్నపోలీసులు గాయపడిన సాహిల్‌ను జగ్జీవన్ రామ్ ఆసుపత్రిలో చేర్పించారు. కానీ తీవ్ర గాయాలతో సాహిల్ ప్రాణాలొదిలాడు. ఈ ఘటనలో ముఖేష్‌తోపాటు మరో ఆరుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. సాహిల్ హత్యపై అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. దొంగతనం చేసే అలవాటు తమ పిల్లవాడికి లేదనీ, ఏదో ఒక పని చేసి కుటుంబానికి ఆసరాగా వుండేవాడని నానమ్మ వాపోయింది. -
‘బీజేపీ ఆఫర్ బాగా నచ్చింది’
తిరువనంతపురం : చంద్రుడిపై హోటల్ రూం బుక్ చేస్తే తాను తప్పక అక్కడికి వెళ్తానంటూ మలయాళ దర్శకుడు అదూర్ గోపాలకృష్ణన్ బీజేపీ అధికార ప్రతినిధి గోపాలకృష్ణన్‌కు కౌంటర్ ఇచ్చారు. దేశంలో ముస్లింలు, దళితులు, ఇతర మైనారిటీలపై మతం ఆధారంగా జరుగుతున్న మూకహత్యలు, హింసాత్మక ఘటనలపై సినీ ఇండస్ట్రీతో పాటు వివిధ రంగాలకు చెందిన 49 మంది ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. జై శ్రీరాం నినాదం పేరిట దాడులు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. వీరిలో అదూర్ గోపాలకృష్ణన్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో లేఖ విషయంపై స్పందించిన బీజేపీ నేత బి.గోపాలకృష్ణన్... జై శ్రీరాం అనే పదం వినపడకూడదని భావిస్తే చంద్రుడిపైకి వెళ్లి జీవించాలంటూ అదూర్ గోపాలకృష్ణన్‌కు సూచించారు. వెంటనే శ్రీహరికోటకు వెళ్లి చంద్రయాత్రకు తన పేరు నమోదు చేసుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో ఆయన వ్యాఖ్యలపై స్పందించిన అదూర్ గోపాలకృష్ణన్...‘ బీజేపీ వాళ్లు ఇచ్చిన ఆఫర్ నాకు బాగా నచ్చింది. ప్రపంచం మొత్తం చుట్టివచ్చాను. చంద్రుడిపైకి వెళ్లాలని ఉవ్విళ్లూరుతున్నాను. నాకోసం ఒక టికెట్ బుక్ చేయండి. అదే చేత్తో హోటల్ రూం కూడా’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాగా మూకహత్యలపై ప్రధానికి ప్రముఖులు రాసిన లేఖపై కంగనా రనౌత్, ప్రసూన్ జోషి తదితర 62 మంది సినీ ప్రముఖులు ఘాటుగా స్పందించారు. రాజకీయ దురుద్దేశంతోనే వారు లేఖ రాశారంటూ విమర్శించారు. ఈ మేరకు వాళ్లు కూడా ఓ లేఖ విడుదల చేశారు. -
‘నన్ను చంపుతామని బెదిరించారు’
దేశంలో ముస్లింలు, దళితులు, ఇతర మైనారిటీలపై మతం ఆధారంగా జరుగుతున్న మూకహత్యలు, దాడులపై సినీపరిశ్రమతో పాటు వేర్వేరు రంగాలకు చెందిన 49 మంది ప్రముఖులు గళమెత్తిన సంగతి తెలిసిందే. ఇలా సంతకం చేసిన వారిలో నటుడు కౌషిక్ సేన్ కూడా ఉన్నారు. అయితే మూక హత్యల గురించి మాట్లాడిన తనను చంపుతామంటూ బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయన్నారు కౌశిక్ సేన్. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ.. ‘ఎవరో గుర్తు తెలియని వ్యక్తి నాకు ఫోన్ చేశాడు. మూక హత్యల గురించి మరోసారి మాట్లాడితే.. చాలా తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి వస్తుంది అంటూ బెదిరించడం ప్రారంభించాడు. అప్పుడు అతనితో నేను ‘చావడానికి కూడా సిద్ధమే కానీ నా ఆలోచనను మార్చుకోను. ఇలాంటి కాల్స్ నన్ను భయపెట్టలేవు’ అని స్పష్టం చేశాను’ అన్నాడు కౌశిక్ సేన్. అంతేకాక ఆ నంబర్‌ను పోలీసులకు ఇచ్చినట్లు తెలిపాడు. ‘అధిక వర్గాలకు జై శ్రీరాం పవిత్రమైనది.. దానిని అపవిత్రం చేయడం మానేయండి. దళితులు, క్రైస్తవులు, ముస్లింలపై జరుగుతున్న అమానుష ఘటనలను, ఊచకోతలను వెంటనే అరికట్టాలి. 2016లో ఇలాంటివి దాదాపు 840 కేసులు నమోదయిన విషయాన్ని నేర గణాంక సంస్థ(ఎన్సీఆర్బీ) తెలిపింది. ఇది చూసి మేము చాలా అశ్చర్యపోయాము. జై శ్రీరాం నినాదం ఇప్పుడు దేశంలో హింసాత్మకంగా మారింది. ఈ దీన స్థితికి మేము చింతిస్తున్నాము’ అని లేఖలో పేర్కొన్నారు. -
మూక హత్యలపై స్పందించిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పెరుగుతున్న మూక హత్యలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. వివిధ రాష్ట్రాల్లో వివిధ పార్టీల ప్రభుత్వాలు నడుస్తున్న క్రమంలో చోటుచేసుకుంటున్న ఘటనలో ఎలాంటి సారూప్య అంశాలు లేవని బుధవారం రాజ్యసభలో ప్రభుత్వం పేర్కొంది. మూకదాడులపై బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తుందని, ప్రధాని ఇప్పటికే ఈ దాడుల పట్ల ఆందోళన వ్యక్తం చేశారని హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సభలో ప్రశ్నోత్తరాల సమయంలో పేర్కొన్నారు. వివిధ రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న వివిధ రాష్ట్రాల్లో ఈ తరహా ఘటనలు చోటుచేసుకున్నాయని వీటిలో సారూప్యత ఏమీ లేదని చెప్పారు. మూక దాడులు త్రిపుర, పశ్చిమ బెంగాల్, కేరళలో కూడా వెలుగుచూశాయని, గతంలోనూ ఇలాంటి ఉదంతాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. మరోవైపు గత ఐదేళ్లుగా మైనారిటీలు, దళితులపై మూక హత్యలు, మూకదాడులు పరిపాటిగా మారాయని రాజ్యసభలో విపక్ష నేత గులాం నబీ ఆజాద్ ఆందోళన వ్యక్తం చేశారు. -
బిహార్‌లో మూకదాడి.. ముగ్గురి మృతి
చప్రా: బిహార్‌లో మరో మూకదాడి జరిగింది. శుక్రవారం సరాన్ జిల్లాలో గేదెను దొంగిలించబోయారన్న కారణంతో జరిగిన ఈ దాడిలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన రెండు వర్గాలు ఈ దాడిలో పాల్గొన్నాయని పోలీసులు చెప్పారు. సంఘటనా స్థలంలోనే ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో వ్యక్తి ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించారని ఎస్పీ హర్కిషోర్ తెలిపారు. ఇద్దరుముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించామని తెలిపారు. అయితే అంతకు మించి వివరాలు ఇవ్వడానికి పోలీసులు నిరాకరించారు. మరోవైపు దొంగిలించే ప్రయత్నం చేయకపోయినా, కావాలనే కొట్టి చంపారని మృతుల బంధువులు ఆరోపించారు. -
మూక హత్యలపై కేంద్రం రియాక్షన్ ఇదే..
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో పెరుగుతున్న మూక హత్యలను నిరోధించేందుకు కఠిన చట్టం అవసరమనే చర్చ ఊపందుకున్న క్రమంలో శాంతిభద్రతల నిర్వహణ రాష్ట్రాల పరిధిలోని అంశమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బుధవారం రాజ్యసభలో హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ మాట్లాడుతూ పోలీసులు, శాంతి భద్రతల పర్యవేక్షణ రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్ ప్రకారం రాష్ట్ర అంశాలని పేర్కొన్నారు. గత ఆరు నెలల కాలంలో మూక హత్యలు, సామూహిక దాడులు పెరిగాయా అని సభ్యులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. నేరాలను నియంత్రించడం, వాటిని గుర్తించడం, తమ యంత్రాంగం ద్వారా నేరస్తులను ప్రాసిక్యూట్ చేయడం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతని చెప్పుకొచ్చారు. దేశంలో మూకదాడులు, హత్యలకు సంబంధించి జాతీయ నేర రికార్డుల బ్యూరో నిర్ధిష్ట సమాచారం నిర్వహించడం లేదని తెలిపారు. -
విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పై మూకదాడి..!
జైపూర్ : రాజస్థాన్‌లోమరో మూక హత్య జరిగింది. విధుల్లో ఉన్న ఓ పోలీస్ హెడ్‌కానిస్టేబుల్‌పై కొందరు దాడిచేసి చంపేశారు. రాజ్‌సమంద్ జిల్లాలోని ఓ భూవివాదంలో విచారణ జరుపుతున్న హెడ్ కానిస్టేబుల్ అబ్దుల్ ఘనీ (48)పై కొందరు శనివారం మూకుమ్మడి దాడిచేశారు. తీవ్రగాయాలతో ఘనీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. భూ ఆక్రమణకు పాల్పడిన వ్యక్తులే ఈ దాడికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను పట్టుకోవడానికి పోలీస్ అధికారులు రంగంలోకి దిగారు. మూకహత్యలతో రాజస్తాన్‌లో కలకలం రేగుతున్న సంగతి తెలిసిందే. పశువులను దొంగిలించాడనే కారణంగా గతేడాది రక్బార్‌ఖాన్ (28) అనే వ్యక్తిపై మూకదాడి జరిగింది. తీవ్ర గాయాలతో ఆయన ప్రాణాలు విడిచాడు. ఇక 2017లోనూ పెహ్లుఖాన్ అనే మరో వ్యక్తిని కొందరు వ్యక్తులు కొట్టిచంపారు. మాంసం కోసం పశువులను తరలిస్తున్నాడనే అనుమానంతో అతనిపై దాడిచేయడంతో ప్రాణాలు కోల్పోయాడు. -
‘మూక దాడులకు పాల్పడితే సహించం’
రాంచీ : మూక దాడులకు పాల్పడే వారు ఏ కులం, మతానికి చెందిన వారైనా ఉపేక్షించబోమని జార్ఖండ్ సీఎం రఘువర్ దాస్ స్పష్టం చేశారు. బైక్‌ను చోరీ చేశాడనే ఆరోపణలపై ముస్లిం యువకుడిపై ఇటీవల జరిగిన మూక దాడిని ప్రస్తావిస్తూ ఈ ఘటనను తమ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోందని, నేరగాళ్లను కఠినంగా శిక్షించడంలో రాజీపడే ప్రసక్తే లేదని చెప్పారు. ఈ తరహా కేసులను ఫాస్ట్‌ట్రాక్ విచారణ చేపట్టి చర్యలు తీసుకోవడం జార్ఖండ్ దేశంలోనే తొలి రాష్ట్రమని చెప్పుకొచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ జార్ఖండ్ ఘటనపై రాజ్యసభలో స్పందిస్తూ ఈ తరహా చర్యలు తనను బాధించాయని, బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని పేర్కొన్న సంగతి తెలిసిందే. తబ్రేజ్ అన్సారీ అనే వ్యక్తిని అల్లరి మూకలు చుట్టుముట్టి జై శ్రీరాం, జై హనుమాన్ అని నినదించాలని కోరుతూ దాడికి పాల్పడిన వీడియో కలకలం రేపింది. మూక దాడికి గురైన అన్సారీ ఆ తర్వాత మరణించారు. ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోరాదని తమ ప్రభుత్వం నేరగాళ్లపై చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉందని జార్ఖండ్ సీఎం దాస్ కోరారు. -
మూక దాడుల భయంతో ఆ అధికారి ఏం చేశాడంటే..
భోపాల్ : దేశంలో అల్లరి మూకలు మూక దాడులతో చెలరేగుతున్న ఘటనలతో వీటి బారిన పడకుండా తన పేరును మార్చుకోవాలని భావిస్తున్నానని మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ ముస్లిం అధికారి పేర్కొన్నారు. దేశంలో ముస్లింల భద్రత పట్ల భయాందోళనలు నెలకొన్నాయని సీనియర్ అధికారి నియాజ్ ఖాన్ వరుస ట్వీట్లలో ఆవేదన వ్యక్తం చేశారు. తన ముస్లిం గుర్తింపును దాచేందుకు తన పేరును మార్చుకోవాలని అనుకుంటున్నానని చెప్పుకొచ్చారు. అల్లరి మూకల దాడుల నుంచి తనను కొత్త పేరు కాపాడుతుందని చెప్పారు. తాను కుర్తా వేసుకోనని, గడ్డం పెంచుకోనని తన వేషధారణ కారణంగా తాను విద్వేష మూకల హింస నుంచి సులభంగా తప్పించుకోగలుగుతానని ఆ అధికారి పేర్కొనడం గమనార్హం. తన సోదరుడు సంప్రదాయ దుస్తులు ధరించి, గడ్డం పెంచుకోవడంతో అతనికి ప్రమాదం పొంచి ఉందని వ్యాఖ్యానించారు. అల్లరి మూకల నుంచి ఏ వ్యవస్థ ముస్లింలను కాపాడలేదని, అందుకే వారు తమ పేర్లను మార్చుకోవాలని సలహా ఇచ్చారు. ముస్లిం నటులు సైతం వారి సినిమాలను కాపాడుకోవాలంటే పేర్లు మార్చుకోవాలని సూచించారు. టాప్ స్టార్ల సినిమాలు సైతం మంచి బిజినెస్ చేయడం లేదని, దీనికి కారణం వారు గుర్తించాలని కోరారు. నవలలు కూడా రాసే ఈ అధికారి తన నూతన నవలలో తన ఆందోళనలకు అక్షరం రూపం ఇచ్చానని చెప్పడం గమనార్హం. -
అతని మీదే ఉల్టా చార్జ్‌షీట్ వేశారు!
న్యూఢిల్లీ: గో రక్షకుల కిరాకత మూక దాడిలో మృతి చెందిన పెహ్లూ ఖాన్‌కు వ్యతిరేకంగా రాజస్థాన్ పోలీసులు గురువారం చార్జ్‌షీట్ దాఖలు చేశారు. జంతువధ, జంతు తరలింపు నిషేధ చట్టంలోని సెక్షన్ 5,8, 9ల కింద పెహ్లూ ఖాన్, అతని కొడుకులపై ఆవులను స్మగ్లింగ్ చేస్తున్నారంటూ అభియోగాలు నమోదు చేశారు. 2017 ఏప్రిల్ 1వ తేదీన అల్వార్‌లో పెహ్లూ ఖాన్, అతని కొడుకులు ఓ వాహనంలో ఆవులను తరలిస్తుండగా.. అతను ఆవులను స్మగ్లింగ్ చేస్తున్నాడనే అనుమానంతో గోరక్షకులు కిరాతక చర్యకు దిగారు. వారి వాహనాన్ని అడ్డుకొని.. వారిపై దాడి చేశారు. వృద్ధుడు అన్న కనికరం చూపకుండా గోరక్షకులు అతన్ని చితకబాదడంతో.. రెండురోజుల తర్వాత పెహ్లూ ఖాన్ ప్రాణలు విడిచారు. ఈ నేపథ్యంలో బాధితుడు, మృతుడైన పెహ్లూ ఖాన్‌కు వ్యతిరేకంగానే చార్జిషీట్ దాఖలు చేయడంతో పోలీసులు యూటర్న్ తీసుకున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈ వ్యవహారంపై రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ స్పందించారు. ‘గత బీజేపీ ప్రభుత్వం హయాంలో ఈ కేసు విచారణ జరిగింది. ఆ విచారణ అనుగుణంగానే ఇప్పుడు చార్జిషీట్ వేశారు. కేసు విచారణలో ఏమైనా వివక్షలు, అవకతవకలు ఉంటే.. కేసును మళ్లీ పునర్విచారణ జరిపిస్తాం’ అని తెలిపారు. పెహ్లూ ఖాన్ కొడుకు ఇర్షాద్ (25) మాట్లాడుతూ..‘గో రక్షకుల దాడిలో మా నాన్నను కోల్పోయాం. ఇప్పుడు మామీదే స్మగ్లర్లుగా చార్జ్‌షీట్ వేశారు. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఈ కేసును సమీక్షించి.. మాపై కేసును ఎత్తివేస్తారని భావించాం. ప్రభుత్వం మారడంతో న్యాయం జరుగుతుందని ఆశించాం. కానీ అలా జరగడం లేదు’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. -
‘మూకదాడుల’ బిల్లు జాడేది?
ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటు ఉభయసభల్లోనూ మంగళ, బుధవారాల్లో చేసిన ప్రసంగాల్లో ప్రధానంగా కాంగ్రెస్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. అందరి అంచనాలనూ తలకిందులు చేస్తూ గత సార్వత్రిక ఎన్నికలకు మించి భారీ మెజారిటీ సాధించాక జరిగిన తొలి సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు సమాధానంగా మోదీ మాట్లాడారు. ఇందులో సహజంగానే జార్ఖండ్‌లో ఇటీవల ఒక ఉన్మాద మూక ముస్లిం యువకుణ్ణి హతమార్చడం, ఉత్తరప్రదేశ్‌లో పసివాళ్ల ఉసురు తీస్తున్న మెదడువాపు వ్యాధి ప్రస్తావన తదితరాలున్నాయి. మూకదాడి ఉదంతంపై ప్రధాని మాట్లాడాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తోపాటు వివిధ పార్టీలు డిమాండ్ చేశాయి. మోదీ మాట్లాడటం అవసరమనడంలో సందేహం లేదు గానీ... అంతకన్నా ముఖ్యంగా దేశానికి అప్రదిష్ట తెస్తున్న ఈ తరహా దాడులకు పూర్తిగా అడ్డుకట్ట వేయడం ప్రధానం. ఇలాంటి ఘటనలు జరిగిన సందర్భాల్లో మోదీ గతంలో మాట్లాడారు. కానీ ప్రభుత్వాల్లో కదలిక ఉన్న దాఖలా లేదు. నిందితులను సత్వరం అరెస్టు చేయడంలోనూ, కఠినంగా వ్యవహ రించడంలోనూ అవి చొరవ చూపడం లేదు. ఈ కేసుల్లో నిందితులుగా ఉన్నవారు కాస్త వెనకో, ముందో బెయిల్‌పై విడుదలవుతున్నారు. విచారణ పూర్తయిన కొన్ని కేసుల్లో సరైన సాక్ష్యాధారాలు లభించక నిందితులు నిర్దోషులుగా విడుదలయ్యారు. మూకదాడుల విషయంలో పార్టీలు, పౌర సమాజ కార్యకర్తలు, వివిధ సంఘాలు మాత్రమే కాదు... సుప్రీంకోర్టు సైతం ఏడాదిక్రితం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి కేసుల్లో నిందితులను శిక్షించడానికి కఠినమైన చట్టం తీసుకురావాలని పార్లమెంటును కోరింది. అది వచ్చేలోగా ఆ మాదిరి దాడుల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలనూ ఆదేశించింది. ముసాయిదా బిల్లు రూపకల్పనకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉన్నతాధికారుల కమిటీని, మంత్రుల బృందాన్నీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. అయితే ఆ పని ఎంతవరకూ వచ్చిందో ఎవరికీ తెలియదు. మూకదాడులు మాత్రం యధావిధిగా సాగుతూనే ఉన్నాయి. ఇవన్నీ ఒకే తీరుగా జరుగుతున్నాయి. పశువుల్ని తీసుకెళ్తున్న వాహనాలను గమనించి కొంతమంది వాటిని అడ్డగించడం, డ్రైవర్‌తోపాటు ఇతరుల్ని పట్టుకుని నెత్తురోడేలా కొట్టడం వీటన్నిటా కనిపిస్తుంది. ఈ ఉదంతాల్లోని బాధితుల్లో అత్యధికులు ముస్లింలే. తాజా ఉదంతంలో యువకుడు మోటార్ సైకిల్ అపహరించాడని మూక ఆరోపించింది. కానీ అతను అది నిజం కాదని ప్రాధేయపడుతున్నట్టు సామాజిక మాధ్యమాల్లో వచ్చిన దృశ్యాలు చెబుతున్నాయి. చావుబతుకుల్లో ఉన్న అతనితో ఆ గుంపు బలవంతంగా ‘జైశ్రీరాం’, ‘జై హనుమాన్’ అనిపించింది. బుధవారం మధ్యప్రదేశ్ రాజ ధాని భోపాల్‌లో జరిగిన ఘటనా ఇటువంటిదే. బీజేపీ ప్రధాన కార్యదర్శి విజయ్‌వర్గియా కుమారుడు గుంపును వెంటేసుకుని అక్రమ నిర్మాణాలను కూలగొట్టిస్తున్న పనిలో ఉన్న మున్సిపల్ అధికారిపై గూండాగిరీకి దిగాడు. క్రికెట్ బ్యాట్‌తో చావబాదాడు. విజయ్‌వర్గియా అతగాణ్ణి సమర్ధించడమే కాదు...‘అడగడానికి నువ్వెవరు, నువ్వేమైనా జడ్జీవా’ అంటూ ఒక పాత్రికేయుణ్ణి దబాయించారు. పశువుల్ని తరలిస్తున్నారని లేదా గోమాంసం దగ్గరుంచుకున్నారని దాడులు చేయడంతో మొదలై, ఇప్పుడు ఇతర కారణాలతో దాడులు చేయడం వరకూ ఇవి పెరిగిపోయాయని, ఒక సంస్కృతిగా మారాయని అర్ధమవుతోంది. వ్యక్తుల మధ్య ఘర్షణలు తలెత్తినప్పుడు ఆవేశాలు పెరుగుతాయి. వాటి తీవ్రతనుబట్టి ఒక్కోసారి అవి హత్యలకు కూడా దారితీస్తాయి. కానీ మూక దాడులకు కారణమవుతున్న ఉదంతాలు అటువంటివి కాదు. పట్టుబడినవారు బతిమాలుతు న్నారు. చేతులెత్తి మొక్కుతున్నారు. కానీ ఉన్మాద మూకలకు అవేమీ పట్టడంలేదు. అవతలినుంచి కనీస ప్రతిఘటన కూడా లేనప్పుడు తోటి మనిషిని అంతమంది ఏకమై చంపడానికి ఎలా సిద్ధ పడతారో అనూహ్యం. ఈ అమానుషమైన ఉదంతాలు పునరావృతం కాకుండా నిరోధించడంలో విఫలమవుతున్నందుకు సహజంగానే జార్ఖండ్ ప్రభుత్వాన్ని ఎవరైనా విమర్శిస్తారు. దాన్ని ఆ రాష్ట్రాన్ని నిందించడంగా, అవమానించడంగా మోదీ భావించనవసరం లేదు. పశ్చిమబెంగాల్, కేరళ రాష్ట్రాల్లో జరుగుతున్న హత్యలనూ, వీటినీ ఒకేలా పరిగణించాలనడం కూడా సరికాదు. రెండు రకాల దాడుల్లోనూ హత్యలు చోటుచేసుకుంటున్నా స్వభావరీత్యా మూకదాడులకూ, రాజకీయ కార ణాలతో పరస్పరం చేసుకునే దాడులకూ మధ్య వ్యత్యాసం ఉంది. కాంగ్రెస్‌పై మోదీ చేసిన రాజకీయ విమర్శలకు ఆ పార్టీ జవాబు చెప్పుకునే స్థితిలో లేదు. ఆ పార్టీ ఏలుబడిలో దేశానికి సేవలందించిన పీవీ నరసింహారావు, మన్మోహన్సింగ్ల ఘనత గురించి ఏరోజైనా మాట్లాడారా అని ఆయన వేసిన ప్రశ్నకు కాంగ్రెస్ వద్ద సమాధానం లేదు. వారి వరకూ అవసరం లేదు... స్వతంత్రంగా ఆలోచించగలిగే కింది స్థాయి నాయకులను సైతం సంశయించడం, వారిని అవమానించడం, చివరకు వెళ్లగొట్టడం కాంగ్రెస్‌లో ఒక సంస్కృతిగా మారింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో దెబ్బతిన్నాక ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలు దీని పర్యవసానమే. కాంగ్రెస్ పార్టీ అటు విజయాన్నయినా, ఇటు అపజయాన్నయినా స్వీకరించే స్థితిలో లేదని మోదీ చేసిన విమర్శలోనూ వాస్తవం ఉంది. అపజయానికి కారణాలేమిటో సమీక్షించుకుని, అవసరమైన దిద్దుబాటు చర్యలకు దిగకపోగా రాహుల్‌గాంధీ పార్టీ అధ్యక్ష పదవినుంచి తప్పుకుంటానని భీష్మిం చుకుని కూర్చున్నారు. మరోపక్క ఈవీఎంల వల్లే బీజేపీ నెగ్గిందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తు న్నారు. దేశం మరింతగా ఎదిగేందుకు పార్టీలకతీతంగా కలిసిరావాలని ప్రధాని అనడం స్వాగతించదగ్గదే. కానీ అందుకవసరమైన వాతావరణాన్ని కల్పించవలసిన ప్రధాన బాధ్యత అధికార పక్షానిదే. ఆ దిశగా మోదీ ప్రభుత్వం ఏమేరకు కృషి చేస్తుందో మున్ముందు చూడాలి. -
‘నా పేరుతో ఇలాంటి దాడులు చేయకండి’
న్యూఢిల్లీ : గత ఐదేళ్లలో దేశ వ్యాప్తంగా మూక దాడులు పెరిగాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. గత ఏడాది వరకూ గో రక్షకులు పేరిట మూక దాడులు జరగ్గా.. ప్రస్తుతం జై శ్రీరాం నినాదం తెర మీదకు వచ్చింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ముఖ్యంగా ముస్లింలను లక్ష్యంగా చేసుకుని కొందరు వ్యక్తులు జై శ్రీరాం నినాదాలు చేయాలంటూ దాడులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం తెగ వైరవల్వడమే కాక ఆలోచింపజేసే విధంగా ఉంది. కార్టునిస్ట్ సతీష్ వేసిన ఈ కార్టున్‌ని శశి థరూర్ తన ట్విటర్లో షేర్ చేశారు. దీనిలో కొందరు వ్యక్తులు ఓ యువకుడిని చెట్టుకు కట్టేసి కొడుతూ.. జై శ్రీరాం నినాదాలు చేయాలంటూ హింసిస్తున్నారు. ఆ పక్కనే వారికి కొద్ది దూరంలో శ్రీ రాముడు నా పేరు చెప్పి ఇలాంటి అకృత్యాలు చేయకండి అంటూ విలపిస్తున్నాడు. చూడ్డానికి సాధరణంగా ఉన్న ఈ కార్టూన్.. ఆలోచింపజేసే విధంగా ఉందంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం జార్ఖండ్‌లో దొంగతనం చేశాడనే నేపంతో ఓ ముస్లిం యువకుడిని కొందరు వ్యక్తులు దారుణంగా హింసించి అతని చేత బలవంతంగా జై శ్రీ రాం నినాదాలు చేయించిన సంగతి తెలిసిందే. Jai Shri Ram! pic.twitter.com/GHhdU4ZJmM — Shashi Tharoor (@ShashiTharoor) June 25, 2019 దాడిలో తీవ్రంగా గాయపడిన సదరు యువకుడు మృతి చెందాడు. ప్రస్తుతం ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుండగా.. బాధితుడి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు మరింత దారుణంగా ఉంది. గాయాలతో ఆస్పత్రిలో చేరిన బాధితుడిని పోలీసులు ఏ మాత్రం కనికరం లేకుండా కాలర్ పట్టుకుని లాక్కొస్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. -
యూఎస్‌పై భారత్ ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత దేశవ్యాప్తంగా దళితులు, ముస్లింలపై దాడులు విపరీతంగా పెరిగాయని అమెరికాకు చెందిన ఓ సంస్థ విడుదల చేసిన నివేదికను భారత ప్రభుత్వం ఖండించింది. బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వంలో మైనార్టీల మత స్వేచ్ఛకు తీవ్ర భంగం ఏర్పడిందని అమెరికాకు చెందిన ఇంటర్నేషనల్ రిలీజియన్ ఫ్రీడమ్ అనే స్థంస్థ తన నివేదనలో పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సంస్థ సర్వేపై భారత విదేశాంగ శాఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రధాని మోదీ నేతృత్వంలోని భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలు క్షేమంగా జీవిస్తున్నారని స్పష్టం చేసింది. మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయన్న వార్తలను ఖండించింది. ఈ మేరకు భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రావీష్ కుమార్ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులన్నీ ప్రజలకు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. దేశంలో ఎక్కడా కూడా అశాంతి లేదని, దళితులు, మైనార్టీలకు తమ ప్రభుత్వంపై పూర్తి స్థాయి విశ్వాసం ఉందని స్పష్టం చేశారు. యూఎస్ రిపోర్టుపై పలువురు బీజేపీ నేతలు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అభిప్రాయాలను సేకరించిన ఈ సంస్థ.. తన నివేదికలో పలు విషయాలను పొందుపరిచింది. హిందుమత వ్యాప్తి కోసం ఇతర మతాలపై హిందుత్వ సంస్థలు దాడులకు పాల్పడుతున్నాయని పేర్కొంది. దాడులను అరికట్టడంలో బీజేపీ విఫలం ముఖ్యంగా భారత రాజ్యాంగం దేశ ప్రజలకు, అన్ని మతాలకు ఇచ్చిన హక్కులను కాలరాసే విధంగా కొన్ని సంస్థలు వ్యవహరిస్తున్నాయని అభిప్రాయపడింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మైనార్టీలపై దాడులకు అరికట్టడంలో తీవ్రంగా విఫలమైందని, మూక దాడుల పేరుతో ఓ వర్గాన్ని తీవ్రంగా హింసిస్తున్నారని నివేదికలో పేర్కొంది. దక్షిణ భారతదేశంతో పోలిస్తే.. ఉత్తరంలో మూకదాడులు విపరీతంగా పెరిగాయని, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో దళితులపై దాడులు ఎక్కువగా ఉన్నాయని ఇంటర్నేషనల్ రిలీజియన్ ప్రీడమ్ రిపోర్టు తెలిపింది. -
దాడులను అరికట్టడంలో బీజేపీ విఫలం: యూఎస్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత దేశవ్యాప్తంగా దళితులపై, ముస్లింలపై దాడులు విపరీతంగా పెరిగాయని అమెరికాకు చెందిన ఓ సంస్థ తన నివేదికలో పేర్కొంది. 2019 ఇంటర్నేషనల్ రిలీజియన్ ఫ్రీడమ్ రిపోర్టు (అంతర్జాతీయ మతస్వేచ్ఛ నివేదిక) అనే యూఎస్ సంస్థ చేపట్టిన ఓ సర్వేలో పలు అంశాలను వెల్లడించింది. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అభిప్రాయాలను సేకరించిన ఈ సంస్థ.. తన నివేదికలో పలు విషయాలను పొందుపరిచింది. హిందుమత వ్యాప్తి కోసం ఇతర మతాలపై హిందుత్వ సంస్థలు దాడులకు పాల్పడుతున్నాయని పేర్కొంది. ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి మైనార్టీల మత స్వేచ్ఛకు తీవ్ర భంగం ఏర్పడిందని తెలిపింది. భారత రాజ్యాంగం దేశ ప్రజలకు, అన్ని మతాలకు ఇచ్చిన హక్కులను కాలరాసే విధంగా కొన్ని సంస్థలు వ్యవహరిస్తున్నాయని అభిప్రాయపడింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మైనార్టీలపై దాడులకు అరికట్టడంలో తీవ్రంగా విఫలమైందని, మూక దాడుల పేరుతో ఓ వర్గాన్ని తీవ్రంగా హింసిస్తున్నారని నివేదికలో పేర్కొంది. దక్షిణ భారతదేశంతో పోలిస్తే.. ఉత్తరంలో మూకదాడులు విపరీతంగా పెరిగాయని, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో దళితులపై దాడులు ఎక్కువగా ఉన్నాయని ఇంటర్నేషనల్ రిలీజియన్ ప్రీడమ్ రిపోర్టు తెలిపింది. దీనితో పాటు అగ్రరాజ్యం అమెరికాకు పలు సూచనలు కూడా చేసింది. అమెరికాతో పోలిస్తే భారత్‌తో మతస్వేచ్ఛను మరింత విస్తరించాలని పేర్కొంది. గత నవంబర్ నుంచి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 18 ఘటనలు జరగగా.. వీటిలో ఎనిమిది మంది మృతి చెందినట్లు సర్వే రిపోర్టు తెలిపింది. మతస్వేచ్ఛపై ప్రచారం కల్పించాల్సిన ప్రభుత్వాలు ఆ విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని వెల్లడించింది. హిందుత్వ సంస్థలు, గోసంరక్షణ దళాలు దళితులు, మైనార్టీలపై దాడులకు మూలకారణం అవుతున్నాయని పేర్కొంది. -
ఇక మూక దాడులు ఆగిపోవాల్సిందే!
సాక్షి, న్యూఢిల్లీ : పాలకపక్ష భారతీయ జనతా పార్టీ విజయం సాధించిన మే 23వ తేదీనే, ఓ మహిళతో సహా ముస్లింలను ఓ హిందువుల బృందం చితకబాదుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఆవు మాంసం కలిగి ఉన్నారన్న కారణంగా వారిని కొట్టడమే కాకుండా వారితో హిందూ నినాదాలు చేయించారు. ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే మధ్యప్రదేశ్‌లోని సియోనిలో ఈ సంఘటన జరిగిందని, ఇందులో ఐదుగురు అనుమానితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఫలితాలు వచ్చిన మూడు రోజుల అనంతరం బీహార్‌లోని బెగుసరాయ్‌లో సబ్బులు అమ్ముకునే మొహమ్మద్ ఖాసిం అనే వ్యక్తిని రాజీవ్ యాదవ్ అనే పాత నేరస్థుడు పిస్టల్‌తో కాల్చాడు. పేరేమిటని తనను అడిగాడని, పేరు చెప్పగానే పాకిస్థాన్ వెళ్లకుండా ఇక్కడెందుకున్నావంటూ కాల్చాడని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. (హరియాణా, బిహార్‌ల్లో ముస్లింలపై దాడులు) ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో బీజేపీ గతంలోకన్నా ఎక్కువ మెజారిటీ సీట్లలో అఖండ విజయం సాధించిన అనంతరం ముస్లింలపై, దళితులపై ఐదు దాడుల సంఘటనలు చోటు చేసుకున్నాయి. మే 26వ తేదీన మోదీ కొత్తగా ఎన్నికైన ఎన్డీయే పార్లమెంట్ సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ ‘సబ్ కా విశ్వాస్’ నినాదంతో ముందుకు పోదాం అని సూచించారు. ‘మనకు ఓటు వేసిన వారు మన మిత్రులే, మనకు ఓటు వేయని వారు కూడా మిత్రులే’ అంటూ మైనారిటీలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దేశ ఆర్థికాభివద్ధి కోసం కషి చేయడం, దారిద్య్రాన్ని నిర్మూలించడం, నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం, ఇతర సామాజిక సమస్యలను పరిష్కరించడం తమ ముందున్న ఎజెండాగా మోదీ చెప్పుకున్నారు. అందుకు ప్రతిబంధకాలైన సామాజక దాడులు తక్షణం ఆగిపోవాలి. మోదీ మొదటి విడత పాలనలా కాకుండా రెండో విడత పాలనంతా దేశాభివద్ధిపైనే కేంద్రీకతం కావాలని సామాజిక శాస్త్రవేత్తలు కోరుతున్నారు. మోదీ ప్రభుత్వం నుంచి ఆశిస్తున్నారు. -
‘నా ఓటు ఒక్క రక్బార్ ఖాన్‌ను అయినా కాపాడుతుందా?’
చంఢీగడ్ : ప్రంపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో సార్వత్రిక ఎన్నికలు జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. మోదీ హయాంలో ఉగ్రవాదం, నక్సలిజం తగ్గింది అంటూ బీజేపీ శ్రేణులు ప్రచారం చేసుకుంటున్నాయి. మరి దేశం లోపల పెరిగిన హింస, అసంతృప్తి మాటేంటి అంటున్నాయి ప్రతిపక్షాలు. ముఖ్యంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దేశ వ్యాప్తంగా మూక దాడులు పెరిగిపోయాయి. గో రక్షణ పేరిట దేశ వ్యాప్తంగా ముస్లింల మీద లెక్కలేనన్ని దాడులు జరిగాయి. ఫలితంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. గో రక్షణ పేరిట జరిగే మూక దాడుల గురించి తలచుకోగానే టక్కున గుర్తుకు వచ్చేది ఉత్తరప్రదేశ్ దాద్రీలో జరిగిన సంఘటన. మహ్మద్ అఖ్లాక్ అనే వ్యక్తి ఆవును చంపి.. మాంసాన్ని విక్రయిస్తున్నారనే అనుమానంతో కొందరు హిందూ కార్యకర్తలు అతని మీద దాడి చేసి చంపేశారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఇలాంటిదే మరో సంఘటన రాజస్తాన్ ఆల్వార్‌లో కూడా చోటు చేసుకుంది. ఈ దాడిలో 9మంది మరణించారు. ఈ దాడిలో కుటుంబ పెద్దలను కోల్పోయిన రెండు హరియాణా కుటుంబాల ప్రస్తుత పరిస్థితి గురించి.. ఈ ఎన్నికల్లో వారు ఎవరికి ఓటు వేయాలని భావిస్తున్నారు వంటి అంశాల గురించి వారి మాటల్లోనే.. హరియాణాలోని నూహ్ జిల్లాకు 20 కిలోమీటర్ల దూరంలో రక్బార్, పిహ్లూ కుటుంబాలు జీవిస్తున్నాయి. వీరి ప్రధాన జీవనాధారం పశుపోషణ. ఆవులను పెంచి.. తద్వారా లభించే పాడిని అమ్ముకుని కుటుంబాన్ని నెట్టుకొస్తుంటారు. ఈ క్రమంలో పశువులను కొనుగోలు చేసేందుకు మరి కొందరితో కలిసి రాజస్తాన్‌కు వెళ్లారు. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు గో మాంసాన్ని అమ్ముతున్నారనే అనుమానంతో వీరి మీద దాడి చేశారు. ఈ దాడిలో రక్బార్, పిహ్లూలు కూడా మరణించారు. దాంతో ఈ రెండు కుటుంబాలు కుప్పకూలిపోయాయి. రక్బార్కు ఏకంగా ఏడుగురు సంతానం. వారి పోషణ భారం అంతా రక్బార్ భార్య ఆమినా మీద పడింది. ఓ వైపు భర్త చనిపోయిన దుఃఖం.. మరోవైపు కుటుంబ పోషణ ఆమినాను ఉక్కిరిబిక్కిరి చేశాయి. అయితే విధికి ఆ కుటుంబం మీద ఇంకా పగ తీరినట్టు లేదు. 7మంది సంతానం.. భార్య మంచానికే పరిమితం... రక్బార్ మరణించిన నాలుగు నెలలకే దురదృష్టం యాక్సిడెంట్ రూపంలో ఆమినాను వెంటాడింది. ఈ ప్రమాదంలో ఆమినా వెన్నెముక పూర్తిగా దెబ్బతింది. దాంతో ఆమె పూర్తిగా మంచానికే పరిమితమయ్యింది. ఆఖరుకి మలమూత్ర విసర్జనకు కూడా లేవలేని పరిస్థితి ఆమినాది. ప్రస్తుతం ఆమినా అమ్మగారింట్లో ఉంది. ఈ విషయం గురించి ఆమినా తల్లి కరిమాన్ మాట్లాడుతూ.. ‘ఆ రోజు జరిగిన దారుణంలో నా అల్లుడితో పాటు మరో ఎనిమిది మంది చనిపోయారు. నా కూతురు సగం చచ్చిపోయింది. అంటే ఈ దాడిలో మొత్తం మృతుల సంఖ్య తొమ్మిదిన్నర. వైద్యం కోసం ఆమినాను ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తీసుకెళ్లడం చాలా ఇబ్బందిగా మారింది. ప్రస్తుతం రెండు పూటలా తినడానికే గతి లేదు.. ఇక వైద్యులు చెప్పిన మందులు, ఆహారం ఇవ్వడం మా తరం కాదంటు’న్నారు కరీమాన్. ఈ మూక హత్యలపై ప్రస్తుతం ఆల్వార్ కోర్టులో కేసు నడుస్తుంది. అయితే ఎన్ని ఇబ్బందుల తలెత్తిప్పటికి కూడా కేసును మాత్రం వాపసు తీసుకోమంటున్నారు ఆమినా, ఆమె తల్లి కరిమాన్. ఈ క్రమంలో కొందరు సామాజిక కార్యకర్తలు ఆమినా కుటుంబానికి అండగా నిలబడ్డారు. ఆమినాకు పెన్షన్‌తో పాటు ఈ కుటుంబానికి బీపీఎల్ కార్డ్ ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం కుటుంబ పోషణ భారం అంతా పెద్ద కుమార్తె మీదనే పడిందంటున్నారు ఆమినా. ఆమె పేరు షాహిలా అని.. ప్రస్తుతం తమ అమ్మగారింటికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామంలో పశువులను మేపుతూ కుటుంబానికి ఆధారంగా నిలిచిందన్నారు. తనను ఇక్కడకు పిలవాలని అనుకుంటాము. కానీ రక్షణ గురించి ఆలోచించి ఆ నిర్ణయాన్ని తీసుకోలేకపోతున్నాం అన్నారు. ముస్లిం అనే మా నాన్నను చంపారు.. రక్బార్ ఖాన్‌తో పాటు మరో ఎనిమిది మంది మీద దాడి చేశారని చెప్పుకున్నాం కదా. ఆనాటి దాడిలో గాయపడి మరణించిన వారిలో పిహ్లూ కూడా ఉన్నాడు. ఈ విషయం గురించి పిహ్లూ కొడుకు మాట్లాడుతూ.. ‘మా నాన్న, నేను మరి కొందరం రాజస్తాన్‌లోని సంతకు వెళ్లి పశువులు బేరం చేశాము. అందుకు సంబంధించిన రశీదులు కూడా మా దగ్గర ఉన్నాయి. పని ముగించుకుని తిరుగు ప్రయాణమయ్యాం. ఆ సమయంలో కొందరు వ్యక్తులు వచ్చి మా మీద దాడి చేశారు. మా దగ్గర ఉన్న రశీదులను చింపి వేశారు. మేం ఆవులను చంపుతున్నామనే అనుమానంతో మా మీద దాడి చేయలేదు. మేం ముస్లింలం కాబట్టే దాడి చేశారు. ఎందుకంటే ఈ ఘటనలలో వారు మేం ప్రయాణిస్తున్న వాహనం డ్రైవర్ని ఏం చేయలేదు. కారణం అతడు హిందువు.. అతని పేరు అర్జున్’ అని చెప్పుకొచ్చాడు. అంతేకాక ‘ప్రస్తుతం కోర్టు ఖర్చులకు, కుటుంబ పోషణకు నెలకు దాదాపు రూ. 30 వేలు ఖర్చవతున్నాయి. కానీ నా సోదరుడు నెలంతా కూలి పనికి వెళ్తే మాకు దక్కుతుంది కేవలం ఏడు వేల రూపాయలే. ఈ సొమ్మును కూడా అధికభాగం కేసు కోసమే వినియోగిస్తున్నామ’ని చెప్పుకొచ్చారు. అంతేకాక ‘ప్రస్తుతం మా ప్రాంతంలో చాలా మంది ఆవులను పెంచాలంటనే భయపడుతున్నారు. దాని బదులు గొర్రెల్ని, మేకల్ని మేపడం మంచిదని భావిస్తున్నారు. ఆవుల్ని మేపితే ఏదో ఒక రోజు మేం కూడా చనిపోతాం అనే భయం ప్రస్తుతం ప్రతి ముస్లింలో ఉందన్నా’డు. ఏ పార్టీకి ఓటు వేయ్యాలి... ఈ దాడికి పాల్పడిన వ్యక్తులు అప్పుడప్పుడు మా ఇళ్లకు వస్తుంటారు. ఈ కేసులో మేం తప్పక విజయం సాధిస్తామని చాలా ధైర్యంగా చెబుతారు. ఎందుకంటే వారి తరఫున బీజేపీ ఎమ్మెల్యే జ్ఞాన్ దేవ్ అహుజా ఉన్నారు. వారికి మద్దతు కూడా తెలిపాడు. కోర్టులోనే తేల్చుకుంటామని పేర్కొన్నాడు అని తెలిపారు. మరి ఈ ఎన్నికల్లో మీరు ఎవరికి ఓటు వేస్తారని ప్రశ్నించగా.. ‘మా ఓటు ఎంతమంది రక్బార్ ఖాన్, పిహ్లూలను కాపాడగల్గుతుందని ప్రశ్నించారు. ఆవులను, గెదేలను పెంచే వారి మీద ఎలాంటి దాడులు జరగనివ్వం అని హామీ ఇచ్చేవారికే మా ఓటు. కానీ ఇంతవరకూ ఎవరు మాకు అలాంటి హామీ ఇవ్వలేకపోయార’ని ఇరు కుటుంబ సభ్యులు వాపోయారు. -
‘నీ జాతి ఏమిటి.. పందిమాంసం తిను’
గువాహటి : అసోంలో దారుణం చోటుచేసుకుంది. బీఫ్ అమ్ముతున్నాడనే కారణంగా ఓ ముస్లిం వ్యక్తిపై మూకదాడి జరిగింది. అతడిపై దాడికి పాల్పడ్డ కొంతమంది వ్యక్తులు పందిమాంసం తినాలంటూ ఒత్తిడి చేశారు. ‘నీ జాతి ఏమిటి. నువ్వు బంగ్లాదేశీవా. భారత పౌరులను గుర్తించే ‘నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్(ఎన్ఆర్సీ)’ లో నీ పేరు ఉందా’ అని అతడిని నిలదీశారు. ఏప్రిల్ 7న అసోంలోని బిస్వంత్ చరియాలిలో జరిగిన ఈ హేయమైన చర్యకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో బాధితుడి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇందుకు సంబంధించి విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు. షౌకత్ అలీ(68) గత 35 ఏళ్లుగా స్థానిక మార్కెట్లో ఈటరీ నడుపుతున్నాడని, ఈ క్రమంలో వారాంతాల్లో బీఫ్ అమ్ముతాడనే కారణంగా ఆదివారం అతడిపై దాడి జరిగిందని పేర్కొన్నారు. అలీతో పాటు మార్కెట్ మేనేజర్‌పై మూక దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. త్వరలోనే వారిని పట్టుకుంటామని పేర్కొన్నారు. ఈ ఘటనపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ మేరకు.. ‘ గత ఐదేళ్లలో మూకదాడులు విపరీతంగా పెరిగాయి. ఇలాంటి ప్రతీ వీడియో నాకు బాధ కలిగిస్తోంది. అసోంలో బీఫ్ లీగలే.. కానీ అమాయక వ్యక్తులపై దాడికి పాల్పడటం ఇండియాలో ఇల్లీగల్’ అంటూ ట్వీట్ చేశారు. ఇక లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ వెలువరించిన మేనిఫెస్టోలో ఎన్ఆర్సీపై త్వరితగతిన నిర్ణయం తీసుకుంటామంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. చదవండి : ‘అసోం’లో అసలు ఏం జరుగుతోంది? కాగా భారత పౌరులను గుర్తించే ‘నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్’ కారణంగా గత కొంతకాలంగా అసోంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యావకాశాలు వలసవచ్చిన విదేశీయులకు వెళుతున్నాయని, స్థానికులైన తమకు రావడం లేదని 1950వ దశకం నుంచే ‘సన్స్ ఆఫ్ సాయిల్’గా పిలుచుకునే 34 శాతం జనాభా కలిగిన అస్సామీ భాష మాట్లాడే అస్సామీలు ఆందోళన చేస్తున్నారు. తమ వెనకబాటుతనాన్ని ఆసరాగా చేసుకొని వలసదారులు తమ విలువైన భూములను కొల్లగొడుతున్నారంటూ 1960వ దశకం నుంచి ఆందోళన తీవ్రం చేశారు. ఇరుగు పొరుగు రాష్ట్రాల ప్రజలతోపాటు బంగ్లాదేశ్ యుద్ధానంతరం ఆ దేశీయులు అసోంలోకి వలస వచ్చారు. వాస్తవానికి బంగ్లా దేశీయులకన్నా పశ్చిమ బెంగాల్‌కు చెందిన ముస్లింలే అసోంలో ఎక్కువ ఉన్నారని పలు స్వచ్ఛంద సంస్థలు తమ అధ్యయనాల్లో తెలిపాయి. మణిపూర్ నుంచి వలసవచ్చిన వారు కూడా స్థానికంగా భూములు కొనుక్కొని స్థిరపడ్డారని ఆ సంస్థలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో పలు మూకదాడులు జరుగుతున్నాయి. I know many people who feel they’re desensitized because of the number of lynchings in the last 5 years. I am not, each video infuriates me & saddens me It’s irrelevant that beef is legal in Assam, lynching an innocent old man is illegal in every part of India https://t.co/aqx8LqQjki — Asaduddin Owaisi (@asadowaisi) April 8, 2019 -
‘చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నా.. ఏం కాదు’
ఓ పోలీసు అధికారి చావు కన్నా.. ఆవు మరణానికే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నాం. అసలు దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తలచుకుంటే భయంగా ఉందంటున్నారు బాలీవుడ్ ప్రముఖ నటుడు నసీరుద్దిన్ షా. రెండు వారాల క్రితం బులందషహర్ మూక దాడిలో.. జనాలు ఇద్దరు పోలీసు అధికారులపై దాడి చేసి చంపడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నసీరుద్దీన్ షా మాట్లాడుతూ.. ‘దేశంలో చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునేవారికి పూర్తిగా రక్షణ లభిస్తోంది. ఇప్పటికి అనేక ప్రాంతాల్లో పోలీసు అధికారి చావు కంటే కూడా ఆవు మరణం గురించే ఎక్కువ మాట్లాడుకుంటున్నారు.. దానికే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నారు. నిజంగా ఇది చాలా విచారకరం’ అన్నారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులను చూస్తే చాలా భయంగా ఉంది.. ఇలాంటి సమాజంలో నా పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందోనని నాకు ఆందోళనగా ఉందని తెలిపారు. -
‘21 గోవులు మరణించాయి.. అది కనిపంచడం లేదా’
లక్నో : మీకు ఇద్దరు మనుషులు చనిపోవడం మాత్రమే కనిపిస్తోంది.. కానీ అక్కడ మరో 21 ఆవులు కూడా చనిపోయాయి.. అది మీకు కనిపించడం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే సంజయ్ శర్మ. కొన్ని రోజుల క్రితం బులందషహర్ ప్రాంతంలో జరిగిన మూక దాడిలో ఇద్దరూ పోలీసు అధికారులు మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడి వెనక వేరే ఉద్దేశాలున్నట్లు వార్తలు వినిపించాయి. ఈ సంఘటనల గురించి యూపీ సీఎం ఆదిత్యనాథ్ మౌనంగా ఉన్నారు. దాంతో ఆగ్రహించిన మాజీ సివిల్ సర్వీస్ అధికారులు కొందరు ఈ విషయం గురించి పూర్తిగా విచారణ చెపట్టాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సంజయ్ శర్మ ‘కేవలం ఇద్దరు మనుషులు చనిపోయారని ఇంత రాద్ధంతం చేస్తున్నారు. కానీ అక్కడ 21 గోవులు కూడా చనిపోయాయి. ఆవులను చంపేవారే నిజమైన నేరస్తులు. గోమాతను చంపుతున్నారనే ఆగ్రహంతోనే ఈ మూక దాడి చర్యలు పుట్టుకొచ్చాయం’టూ సంజయ్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూక దాడిలో ఇద్దరూ పోలీస్ అధికారులు మరణించినప్పటికి ఆదిత్యనాథ్ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దాంతో ‘ఆదిత్యనాథ్‌కు మనుషుల ప్రాణాలకంటే గోవుల గురించి చింతే ఎక్కువైంది. గో రక్షణ పేరిట మనుషుల ప్రాణాలు తీస్తున్న చలించడం లేద’ని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇప్పుడు సంజయ్ శర్మ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసి మరిన్ని విమర్శలకు అవకాశం కల్పించారు. -
‘బులంద్‌షహర్ ఘటన ఓ ప్రమాదం మాత్రమే’
లక్నో : బులందషహర్‌లో జరిగింది మూక దాడి కాదు.. అది ఒక ప్రమాదం అంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజుల కిత్రం బులంద్‌షహర్‌లో జరిగిన మూక దాడి ఘటనలో ఓ పోలీస్ అధికారి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ దాడి వెనక రాజకీయ కుట్ర ఉందనే ఆరోపణలు వినిపిస్తోన్న నేపథ్యంలో.. యోగి ఈ దాడిని ఒక ప్రమాదంగా ప్రకటించడమే కాక.. సరైన సమయంలో స్పందిచంలేదంటూ ఇద్దరు పోలీసు అధికారులను ట్రాన్సఫ్ర్ చేశారు. అడిషనల్ డీజీపీ ఎస్బీ షిరాద్కర్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం యోగి ప్రభుత్వం సర్కిల్ ఆఫీసర్ సత్య ప్రకాష్ శర్మ, ఇన్ చార్జ్ ఆఫ్ ద పోలీస్ పోస్ట్ సురేష్ కుమార్‌లను ట్రాన్సఫర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొన్ని రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో గోరక్షక ముఠా రెచ్చిపోయింది. ఓ మతానికి చెందిన ప్రజలు ఆవును చంపేశారని ఆరోపిస్తూ రోడ్డును దిగ్బంధించి ఆందోళనకు దిగింది. ట్రాఫిక్‌ను పునరుద్ధరించడానికి అక్కడకు చేరుకున్న పోలీసులపై రాళ్ల వర్షం కురిపించింది. అంతేకాకుండా స్థానిక పోలీస్ ఔట్‌పోస్ట్‌తో పాటు పలు వాహనాలకు నిప్పంటించింది. ఈ ఘటనలో పోలీస్ ఇన్స్పెక్టర్తో పాటు మరో పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. అయితే గతంలో ఈ దాడిని భారీ కుట్రగా పేర్కొన్న యోగి.. మాట మార్చి ఇది కేవలం యాక్సిడెంట్ అని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే ఈ దాడికి కారకులుగా భావిస్తూ పోలీసు అధికారులు 9 మందిని అరెస్ట్ చేశారు. కానీ ముఖ్యమైన కుట్రదారు యోగేష్ రాజా పరారీలో ఉండగా తాజాగా ఓ జవాను పేరు తెరమీదకు వచ్చింది. -
‘నా కొడుకు తప్పు చేసి ఉంటే.. తప్పకుండా శిక్షించాలి’
లక్నో : ఉత్తర్‌ప్రదేశ్‌లో బులంద్‌షహర్‌లో చెలరేగిన అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అధికారి సుబోధ్‌కుమార్ సింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఇప్పటి వరకు ప్రధాన నిందితుడు యోగేశ్ రాజ్, సుబోధ్‌పై కాల్పులు జరిపినట్లు పోలీసులు అనుమానించారు. తాజాగా.. జమ్ముకశ్మీర్‌కు చెందిన జవాను జీతు ఫ్యూజి ఈ కేసులో ప్రధాన నిందితుడిగా మారాడు. శ్రీనగర్‌కు చెందిన జీతు ఇన్స్పెక్టర్ సుబోధ్‌పై కాల్పులు జరిపినట్లు సమాచారం. ఘటన జరిగిన రోజు ఫ్యూజి అక్కడే ఉన్నట్లు.. అనంతరం అదే రోజు సాయంత్రమే శ్రీనగర్ వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అతడిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. బులందషహర్ ఘటనలకు సంబంధించి బయటకు వచ్చిన వీడియోల్లో జీతు ఫ్యూజి స్పష్టంగా కనిపించాడు. అతడిని పట్టుకునేందుకు రెండు పోలీసు బృందాలు జమ్ముకశ్మీర్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సుబోధ్ హత్య వెనుక కుట్ర కోణం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందుకు బలం చేకూర్చేలా అల్లర్ల సమయంలో సుబోధ్‌ను చంపేయ్యండి అంటూ కొందరు ఆందోళనకారులు అరుస్తున్న వీడియో ఒకటి తాజాగా బయటకొచ్చింది. ఈ ఘర్షణలో మరో యువకుడు సుమిత్ కూడా చనిపోయాడు. సుమిత్ మృతికి ప్రతీకారంగానే సుబోధ్‌పై దాడి చేసినట్లు ఈ వీడియో ద్వారా తెలుస్తోంది. కొందరు ఆందోళన కారులు పోలీసులను వెంబడిస్తూ ‘వారి దగ్గర నుంచి తుపాకీలు లాక్కొని వారిని చంపేయండి’ అని అరుస్తున్నట్లు వీడియోలో స్పష్టంగా ఉంది. (జవాన్ జీతు ఫ్యూజీ తల్లిదండ్రులు) పదునైన ఆయుధంతో సుబోధ్‌పై దాడి చేసి ఆ తర్వాత తలపై కాల్చి చంపారు. సుబోధ్ చనిపోయిన సమయంలో జీతు అతని ఎదురుగానే ఉన్నట్లు ఓ వీడియోలో కనిపిస్తోంది. అయితే అతన్ని గుర్తు పట్టడంలో జీతు తల్లి తడబుతున్నట్లు తెలుస్తోంది. వీడియోల్లో తన కొడుకును స్పష్టంగా గుర్తించలేకపోయానని తెలిపింది. ఒకవేళ పోలీసులు చెప్పినట్లు తన కొడుకే సుభోద్‌ను హత్య చేసి ఉంటే.. ఢ. మరో కుటుంబ సభ్యుడు మాట్లాడుతూ.. సుభోద్ సింగ్ మరణించిన రోజున జీతు ఘర్షణ జరిగిన ప్రాంతంలోనే ఉన్నాడని తెలిపారు. అక్కడి నుంచి ఇంటికి వచ్చి ‘డ్రామా చూశారా’ అంటూ ప్రశ్నించాడని గుర్తు చేసుకున్నారు. అనంతరం సాయంత్రం కార్గిల్ వెళ్లాడని తెలిపారు. -
‘చరిత్ర గురించి అడిగితే భూగోళ శాస్త్రం గురించి చెప్తున్నారు’
ముంబై : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నగరాల పేర్లు మారుస్తూ బిజీగా ఉన్నారు. రాష్ట్రంలో జరిగే సంఘటనల గురించి ఆయనకు పెద్దగా పట్టదంటూ శివసేన పార్టీ విమర్శలు చేసింది. రాష్ట్రంలోని బులందషహర్ పట్టణంలో జరిగిన దాడులను ఉద్దేశిస్తూ శివసేన అధికార పత్రిక ‘సామ్నా’లో.. ‘జవాన్లు, పోలీసులకు మతం ఉండదు. అలాగే, అధికారంలో ఉన్నవారు మతాలకతీతంగా తమ బాధ్యతలను నిర్వర్తించడంపై దృష్టి పెట్టాలి. యోగి పాలనలో అల్లర్లు చెలరేగుతున్నాయి. బులందషహర్ ఘటనలో ఓ పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇప్పటి వరకూ ఆ కుటుంబాన్ని పరామర్శించేంత తీరిక యోగికి చిక్కలేదు. ఎందుకంటే ఆయన నగరాల పేర్లు మార్చడంలోనే తీరిక లేకుండా ఉన్నారంటూ’ శివసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ బీజేపీ తరఫున రాష్ట్రంలో ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా యోగి తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరును భాగ్యనగర్‌గా మారుస్తామని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై శివసేన మండిపడింది. ‘యోగి హైదరాబాద్ పేరు మారుస్తానని చెప్పుకొంటున్నారు.. కానీ, తన సొంత రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి మాత్రం ఆయన నోరువిప్పడం లేదు. యోగి ముందు చరిత్రకు సంబంధించిన ఓ ప్రశ్న ఉంది. కానీ, ఆయన భౌగోళిక అంశాలకు సమాధానాలు ఇస్తున్నారు. హైదరాబాద్ పేరును భాగ్యనగర్‌గా ఎప్పుడు మారుస్తారు? అన్నది ఇప్పుడు ఆయన ముందున్న ప్రశ్న కాదు. అయోధ్యలో రామ మందిరం ఎప్పుడు నిర్మిస్తారన్నదే ప్రశ్న. ఇది చరిత్రకు సంబంధించిన ప్రశ్న’ అని శివసేన విమర్శించింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేబినెట్ దుకాణం మూసేసిందని ఆ పార్టీ విమర్శించింది. ‘కేంద్ర మంత్రులందరూ తమ దుకాణాన్ని మూసేసి, ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటూ హామీలు ఇవ్వడంలో బిజీ అయిపోయారు’ అని ఎద్దేవా చేసింది. -
తల్లిదండ్రుల ముందే కొట్టి చంపేశారు
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. ఆటో డ్రైవర్‌ను దొంగగా భావించిన గుంపు అతడిని దారుణంగా కొట్టి చంపేశారు. ఈ మూక హత్య దక్షిణ ఢిల్లీలోని ఉత్తమ్‌నగర్‌లో జరిగింది. వివరాలు... ఢిల్లీకి చెందిన అవినాష్ కుమార్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఇద్దరు వ్యక్తులను తన ఆటోలో ఎక్కించుకున్నాడు. ఉత్తమ్‌నగర్ చేరుకోగానే మూత్ర విసర్జన కోసం అవినాష్ ఆటో దిగాడు. ఈలోగా దాదాపు 300 మంది అతడి ఆటో దగ్గర గుమిగూడారు. బ్యాటరీలు దొంగిలించారంటూ ఆటోలో ఉన్న వ్యక్తులను తీవ్రంగా కొట్టసాగారు. అయితే వారిద్దరు నిజంగానే దొంగలు అన్న విషయం తెలియక అవినాష్ అక్కడున్న వాళ్లకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అవినాష్‌ను దొంగల ముఠా నాయకుడిగా భావించిన గుంపు అతడిని కరెంటు స్తంభానికి కట్టేసి రాడ్లు, కర్రలతో తీవ్రంగా కొట్టారు. ఆటో పత్రాలన్నీ తెప్పించినా వినకుండా.. తను దొంగను కాదని ఎంత చెప్పినా వినకుండా తీవ్రంగా హింసిస్తుండటంతో తన తల్లిదండ్రులకు ఫోన్ చేయాల్సిందిగా అవినాష్ అక్కడున్న వాళ్లను కోరాడు. ఈ క్రమంలో ఆటో పత్రాలు, గుర్తింపు కార్డులతో సహా అతడి తల్లిదండ్రులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. తమ కొడుకుకు దొంగలతో ఎటువంటి సంబంధం లేదని చెప్పినా వినకపోవడంతో పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని అవినాష్‌ను ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు పేర్కొన్నారు. దీంతో మూక హత్యగా నమోదు చేసిన ఈ కేసులో ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
పాన్ మసాలా ఇవ్వలేదని కొట్టిచంపారు..
లక్నో: దేశవ్యాప్తంగా మూక దాడులు కొనసాగుతున్నాయి. పాన్ మసాలా ఇచ్చేందుకు నిరాకరించిన 60 ఏళ్ల సీనియర్ సిటిజన్‌పై స్ధానికులు మూకుమ్మడి దాడికి తెగబడ్డారు. అప్పుపై పాన్ మసాలా ఇవ్వలేదనే కోపంతో వారు వృద్ధుడిని కొట్టి చంపారు. యూపీలోని హర్దోయ్ జిల్లాలో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది. మూక దాడిలో బాధితుడు ఘటనా ప్రదేశంలోనే మరణించాడని, నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టామని డీఎస్పీ శైలేంద్ర సింగ్ తెలిపారు. మరోవైపు దేశరాజధాని ఢిల్లీలో జనసమ్మర్ధ కన్నాట్‌ప్లేస్‌లో సిగరెట్లు ఇవ్వలేదని ఇద్దరు యువకులపై అల్లరి మూకలు దాడికి తెగబడ్డాయి. మూక దాడిలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా, మరో వ్యక్తి స్వల్పగాయాలతో బయటపడ్డాడని పోలీసులు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకునేందుకు ఢిల్లీ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
మత ఘర్షణలకు దారితీసిన మూకహత్య
ఇంఫాల్: దేశంలో మూక హత్యలు ఆగడం లేదు. తాజగా మణిపూర్‌లో చోటుచేసుకున్న మూకహత్య ఆ ప్రాంతంలో మతఘర్షణలకు దారితీసింది. వివరాల్లోకి వెళ్తే.. తౌబాల్ జిల్లాలో లిలాంగ్కు చెందిన 26 ఏళ్ల ఫరూఖ్ ఖాన్, మరో ఇద్దరు స్నేహితులతో కలిసి కారులో బయటకు వెళ్లాడు. ఫరూఖ్ ప్రయాణిస్తున్న వాహనం గురువారం తెల్లవారుజామున పశ్చిమ ఇంఫాల్ జిల్లాలోని థరోజమ్ గ్రామానికి చేరుకోంది. అయితే ఫరూఖ్‌ను, అతని స్నేహితులను వాహనాల దొంగలుగా భావించిన ఆ గ్రామ ప్రజలు వారిపై దాడికి దిగారు. అంతేకాకుండా వారి కారును కూడా ధ్వంసం చేశారు. ఈ దాడిలో ఫరూఖ్‌తో పాటు ఉన్న ఇద్దరు వ్యక్తులు తప్పించుకోగా.. తీవ్రంగా గాయపడిన ఫరూఖ్ మృతి చెందాడు. ఈ ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు మూకహత్యతో సంబంధం ఉన్న ఐదుగురిని అరెస్ట్ చేశారు. కాగా, ఈ ఘటనలో అరెస్ట్ చేసినవారిని వెంటనే విడుదల చేయాలని థరోజమ్ గ్రామస్తులు పోలీస్ స్టేషన్‌పై దాడికి దిగారు. వారు స్టేషన్‌పై రాళ్లు విసరడంతో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. మరోవైపు ఫరూఖ్ అతని స్నేహితులు వాహనాన్ని దొంగతనం చేసేందుకు ప్రయత్నించడంతోనే తాము దాడికి దిగినట్టు ఆ గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులు స్పందిస్తూ.. ఈ ఘటనతో సంబంధం ఉన్న పదమూడు మందిని గుర్తించామని, మిగిలిన వారిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలిపారు. థరోజమ్ గ్రామస్తుల వాదనను కూడా పరిగణలోకి తీసుకుని దర్యాప్తు చేపడతామని పేర్కొన్నారు. ఫరూఖ్ సామాజిక వర్గానికి చెందిన నేతలు మాట్లాడుతూ.. ఫరూఖ్ చాలా అమాయకుడినని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన మణిపూర్ మానవ హక్కుల సంఘం.. సెప్టెంబర్ 22లోపు ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాల్సిందిగా రాష్ట్ర డీజేపీని ఆదేశించింది. -
వాహనాల దొంగలుగా భావించి..
-
మూకహత్యలు; బాధిత కుటుంబాలకు రూ. 3 లక్షలు!
పట్నా : మూక హత్యల బాధిత కుటుంబాలకు 3 లక్షల రూపాయల సాయం అందించాలని బిహార్ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు తక్షణ సాయంగా లక్ష రూపాయలు చెల్లించనున్న ప్రభుత్వం.. కేసు విచారణ పూర్తైన తర్వాత మరో రెండు లక్షల రూపాయలు అందజేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకి మూక హత్యలు పెరిగిపోతున్న నేపథ్యంలో బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం నితీశ్ కుమార్ తెలిపారు. అలాగే ఇలాంటి ఘటనలకు సంబంధించిన కేసు విచారణ త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రోజువారీగా విచారణ చేపట్టి ఆరు నెలల్లోగా నిందితులకు శిక్ష పడేలా చేస్తామని హామీ ఇచ్చారు. కాగా పిల్లల్ని కిడ్నాప్ చేసే ముఠాలు దిగాయంటూ వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల్లో వదంతులు ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవలి కాలంలో మూకహత్యలు పెరిగిపోతున్నాయి. వీటితో పాటుగా ఆవులను అక్రమంగా రవాణా చేస్తున్నారనే కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో ఇటువంటి హత్య కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. -
డబ్బు దొంగిలించాడంటూ చావబాదారు..
పట్నా : దేశంలో మూకహత్యలు కొనసాగుతున్నాయి. డబ్బులు గుంజుకెళ్లాడనే ఆరోపణలపై ఓ వ్యక్తిని చితకబాదడంతో బాధితుడు మరణించిన ఘటన బిహార్‌లోని సీతామరి జిల్లాలో వెలుగుచూసింది. తన వద్ద డబ్బును లాక్కునాడని ఓ వ్యాన్ డ్రైవర్ చెప్పడంతో రూపేష్ అనే వ్యక్తిని స్ధానికులు చుట్టుముట్టి తీవ్రంగా గాయపరిచారని పోలీసులు చెప్పారు. మూక దాడిలో గాయపడిన బాధితుడిని తొలుత సదర్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అనంతరం పట్నా మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాధితుడు మరణించాడని పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించి 150 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని పోలీసులు తెలిపారు. కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నామని డిప్యూటీ ఎస్పీ వీర్ ధీరేంద్ర చెప్పారు. కాగా నేరస్తుడనే ముద్ర వేసి నడిరోడ్డుపై వ్యక్తులను చావబాదడానికి ఏ చట్టం అనుమతించిందని బాధితుడి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూక దాడులు, హత్యలతో న్యాయవ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మీరు జాతీయవాదులా?
న్యూఢిల్లీ: దేశంలో ఆందోళనలు సృష్టిస్తున్న మూకోన్మాద ఘటనలకు పాల్పడుతున్నవారెవరూ తమను తాము జాతీయవాదులుగా చెప్పుకోవద్దని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ఇలాంటి ఘటనల్లో చట్టాల ద్వారా మాత్రమే మార్పు సాధ్యం కాదని.. సమాజ ప్రవర్తనలోనూ మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. మూకోన్మాద ఘటనలపై రాజకీయాలు చేయాలనుకుంటున్న వారిపైనా వెంకయ్య మండిపడ్డారు. ఈ ఘటనలకు రాజకీయ పార్టీలతో ముడిపెట్టాల్సిన అవసరం లేదన్నారు. పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఉపరాష్ట్రపతి ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మూక దాడుల ఘటనలను ఆపేందుకు చట్టం మాత్రమే సరిపోదు. సామాజిక మార్పు అవసరం. మీరు జాతీయవాదులుగా చెప్పుకుంటున్నట్లయితే.. ఓ మనిషిని ఎలా చంపుతారు? ఓ వ్యక్తి మతం, కులం, వర్ణం, లింగం ఆధారంగా వివక్ష చూపిస్తారా? జాతీయవాదం, భారత్ మాతాకీ జై అనే పదాలకు విశాలమైన అర్థం ఉంది. మూకదాడుల ఘటనలు ఓ పార్టీ పని కాదు. మీరు ఈ వివాదాన్ని పార్టీలకు ఆపాదిస్తున్నారంటే విషయాన్ని పలుచన చేస్తున్నట్లే. ఇదే జరుగుతోందని స్పష్టంగా చెప్పగలను’ అని వెంకయ్య పేర్కొన్నారు. ‘నిర్భయ ఘటన తర్వాత నిర్భయ చట్టం వచ్చింది. అత్యాచారాలు ఆగిపోయాయా? నేను ఈ అంశంపై రాజకీయాలు మాట్లాడటం లేదు. పార్టీలు కొన్ని అంశాలపై అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయి. ఒక బిల్లు ద్వారా, రాజకీయ తీర్మా నం, పాలనాపరమైన నిర్ణయంతోపాటుగా ఈ దుర్మార్గపు ఆలోచనను సమాజం నుంచి పూర్తిగా తొలగించేలా మార్పు తీసుకురాగలగాలి. ఇదే విషయాన్ని నేను పార్లమెంటులో కూ డా చెప్పాను’ అని వెంకయ్య స్పష్టం చేశారు. -
హిందువుపైనే గోరక్షకుల దాడి!
లక్నో: ఒక వైపు మూక దాడుల పట్ల కఠినంగా వ్యవహరించాలని సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించినా అలాంటి ఘటనలు ఆగడం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఓ హిందువుపైనే మూక దాడి చోటు చేసుకుంది. బ్రాహ్మణుడైన ఓ వృద్ధుడు తన ఆవును ముస్లింలకు అమ్ముతున్నాడనే అనుమానంతో గోరక్షకులు అతనిపై దాడి చేశారు. ఈ ఘటన బల్రాంపుర్ జిల్లాలోని లక్ష్మణ్పూర్లో గత ఆగస్టు 31న చోటు చేసుకుంది. ఇదే గ్రామానికి చెందిన కైలాష్ నాథ్ శుక్లా(70) అనే బ్రాహ్మణ వృద్దుడు ఆనారోగ్యంతో బాధపడుతున్న తన ఆవును సమీప గ్రామంలోని వెటర్నరీ డాక్టర్ తీసుకెళ్తున్నాడు. దారి మధ్యలో గోరక్షకుల పేరిట ఓ మూక అతన్ని చుట్టుముట్టింది. తాను హిందువునని, బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడనని చెప్పినా పట్టించుకోకుండా కొంత మంది అతనిపై దాడి చేశారు. అంతేకాకుండా అతని మొహానికి మసి పూసి కొట్టుకుంటూ ఉరేగించారు. ఎవరైనా ఆవులను అమ్మినా, వాటిని బాధపెట్టినా వారికి ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. అనంతరం ఆ వృద్ధుడు పోలీసులను ఆశ్రయించాడు. తొలుత అతని ఫిర్యాదును పోలీసులు తీసుకోలేదు. అనంతరం ఈ ఘటన గురించి స్వయంగా తెలుసుకున్న జిల్లా ఎస్పీ రాజేశ్ కుమార్ విచారణకు ఆదేశించారు. దీంతో పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఫిర్యాదు తీసుకోని అధికారిపై కూడా చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. ప్రస్తుతం ఆ వృద్ధుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు. -
మూక హత్యల నిరోధంపై నివేదిక
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో పెరుగుతున్న మూక హత్యల నిరోధానికి నూతన చట్టం తీసుకువచ్చే ప్రతిపాదనపై హోం శాఖ కార్యదర్శి రాజీవ్ గుబ నేతృత్వంలోని కమిటీ మంత్రుల బృందానికి నివేదిక సమర్పించింది. సోషల్ మీడియా వేదికలపై విద్వేష ప్రచారం, వదంతులు వ్యాప్తి చేయడాన్ని నివారించేందుకూ ఈ కమిటీ పలు మార్గదర్శకాలు జారీచేసింది. హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సారథ్యంలోని మంత్రుల బృందం కమిటీ సూచించిన మార్గదర్శకాలను పరిశీలిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. కాగా ఈ కమిటీ పలు సోషల్ మీడియా వేదికల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపి, అభ్యంతరకర కంటెంట్‌పై ప్రజలు ఫిర్యాదులు నమోదు చేసేందుకు ప్రత్యేక పోర్టల్‌ను ఏర్పాటు చేయాలని కోరింది. కంటెంట్ పర్యవేక్షణ, సైబర్ పోలీసింగ్‌కు ప్రత్యేక చర్యలు అవసరమని స్పష్టం చేసింది. మూక హత్యలను నివారించేందుకు నూతన చట్టం తీసుకువచ్చే ప్రతిపాదన పరిశీలించాలని సుప్రీం కోర్టు ఇటీవల పార్లమెంట్‌ను కోరిన క్రమంలో ఈ అంశంపై మంత్రుల బృందం, కార్యదర్శుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కమిటీ మార్గదర్శకాలను మంత్రుల బృందం పరిశీలించి తుదినిర్ణయం కోసం ప్రదాని నరేంద్ర మోదీకి తమ సిఫార్సులను నివేదిస్తుందని హోంమంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. -
వారిని చెట్టుకు కట్టేసి ఆపై..
జైపూర్ : ఆవులను స్మగ్లింగ్ చేసే వారు పట్టుబడితే మూడు చెంపదెబ్బలు కొట్టి చెట్టుకు కట్టేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యే జ్ఞాన్దేవ్ అహుజా అన్నారు. అల్వార్‌లో ఆవును తరలిస్తున్నారనే అనుమానంతో రక్బర్ ఖాన్ అనే వ్యక్తి మూక హత్యకు గురైన నేపథ్యంలో ఘటనా ప్రాంతాన్ని సందర్శించిన ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేశారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని తాను ప్రజలను కోరుతున్నానన్నారు. గోవులను తరలించేవారని విపరీతంగా కొట్టే బదులు రెండు మూడు దెబ్బలు తగిలించాక వారిని పారిపోనీయకుండా చెట్టుకు కట్టేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నదే తన ఉద్దేశమని చెప్పుకొచ్చారు. పోలీసులు వచ్చిన అనంతరం వారిని అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు చేపడతారని, ఏ ఒక్కరూ చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోవద్దని ఎమ్మెల్యే కోరారు. కాగా రక్బర్ ఖాన్ హత్య కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన ముగ్గురు వ్యక్తులు అమాయకులని, వారిపై పోలీసులు అభియోగాలు మోపారని ఆయన ఆరోపంచారు. అరెస్ట్ చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఘటనా స్థలానికి వారిని పిలిపించిన పోలీసులు రక్బర్ ఖాన్ హత్య కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన అవసరం ఉందని అంటూ వారిపై అభియోగాలు మోపారని అన్నారు. పోలీస్ స్టేషన్లో వేధింపులు తాళలేక రక్బర్ ఖాన్ మరణించారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. -
మూక హత్యలపై సీఎం సంచలన వ్యాఖ్యలు
జైపూర్ : మూక దాడులు రాజస్తాన్‌కే పరిమితం కాదని, ప్రపంచమంతటా ఈ ధోరణి ఉందని రాజస్తాన్ సీఎం వసుంధరా రాజె పేర్కొన్నారు. ఈనెల 20న అల్వార్‌లో గోరక్షకులుగా చెప్పుకునే మూక దాడిలో రక్బర్ ఖాన్ మరణించిన నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘ఇలాంటి ఘటనలు రాజస్తాన్‌లోనే కాదు ప్రపంచమంతటా జరుగుతున్నవే. రాజస్తాన్‌లో మాత్రమే జరుగుతున్నవి కాద’ని ఓ న్యూస్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చెప్పుకొచ్చారు. రక్బర్ ఖాన్ హత్యోదంతంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించడం ద్వారా కఠినంగా వ్యవహరించామన్నారు. అల్వార్ మూకహత్యలో బాధితుడిని ఆస్పత్రికి తరలించడంలో జాప్యం చేసిన ఏసీపీ మోహన్ సింగ్‌ను పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఆవును తరలిస్తున్నాడనే అనుమానంతో రక్బర్ ఖాన్ (29)ను అల్వార్‌లో కొందరు దారుణంగా కొట్టిచంపిన సంగతి తెలిసిందే. కాగా, రక్బర్ ఖాన్ చేతులు, కాళ్ల ఎముకలు ఫ్రాక్చర్ అయినట్టు, మృతుడి శరీరంపై 12 గాయాలున్నట్టు రక్బర్ ఖాన్ పోస్ట్ మార్టం నివేదిక వెల్లడించింది. -
సీఎం ఉన్నా.. మోదీ పాలనే
సాక్షి, న్యూఢిల్లీ : త్రిపురలో పాతికేళ్ల వామపక్ష ప్రభుత్వంలో ఎప్పుడూ మూక దాడులు జరిగిన ఘటనలు చోటుచేసుకోలేదని త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్ పేర్కొన్నారు. కనీసం ఏడాది కూడా ముగియకముందే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం దాడులకు పాల్పడి, ప్రజలను భయాందోళనకు గురిచేస్తోందని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేయడంలో బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, తన వైఫల్యాల నుంచి తప్పించుకునేందుకే ఈ దాడులకు పాల్పడుతోందని మాణిక్ ఆరోపించారు. ఢిల్లీలో వామపక్షల ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజాస్వామ్య హత్య’ నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘దేశ వ్యాప్తంగా బీజేపీ గోరక్షణ పేరుతో అమాయక ప్రజలపై దాడులకు పాల్పడుతోంది. పాతికేళ్ల వామపక్ష ప్రభుత్వంలో త్రిపురలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. హిందుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి ఒక్కరిని ప్రభుత్వం టార్గెట్ చేస్తోంది. మైనార్టీ, దళితులకు దేశంలో రక్షణ లేదు. ప్రతీక్షణం భయం, భయంగా బతుకుతున్నారు. మూక దాడులు అనేవి ప్రభుత్వం చేస్తున్న గొప్ప కుట్ర. త్రిపురలో సీఎం ఉన్నా.. అక్కడ సాగేది మోదీ పాలనే’ అని అన్నారు. -
100 మంది ఒక్కసారిగా దాడి చేయడంతో!
గాంధీనగర్ : మూక దాడులను నిరోధించడడానికి ప్రత్యేక చట్టాలు రూపొందించాలని కోర్టులు ఆదేశించినప్పటికి ప్రభుత్వాలు మాత్రం దాడులను అరికట్టలేకపోతున్నాయి. తాజాగా గుజరాత్‌లోని దాహోడ్ జిల్లాలో ఇద్దరు గిరిజన యువకులపై స్థానికులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఒక యువకుడు మరణించగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సమాచారం ప్రకారం అజ్మల్ వహోనియా (22), భారు మాతూర్ అనే ఇద్దరు యువకులను దొంగలుగా భావించిన గ్రామస్తులు దాదాపు 100 మంది వారిపై శనివారం రాత్రి దాడి చేయడంతో అజ్మల్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పలు కేసుల్లో నిందితులుగా ఉన్న అజ్మల్, భారు మాతూర్ రెండు రోజుల క్రితమే జైలు నుంచి విడుదలై బయటకువచ్చారు. బాధితులతో పాటు, దాడికి పాల్పడిన వారందరూ తూర్పు గుజరాత్‌కి చెందిన గిరిజనులు కావడం గమనార్హం. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని విచారణ ప్రారంభించారు. శనివారం రాత్రి సుమారు 20 మంది గ్రామంలోకి ప్రవేశించారని, ఇందులో ఇద్దరిపై దాడి జరగగా మిగతా 18 మంది పరారైనట్లు పోలీసులు తెలిపారు. కాగా ఇప్పటివరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. గాయపడ్డ వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
48 ఆవుల మృతి; సర్కారు సీరియస్
సాక్షి, న్యూఢిల్లీ : ఆవుల స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారంటూ మూక దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఢిల్లీలోని ఓ గోశాలలో రెండు రోజుల వ్యవధిలో పదుల సంఖ్యలో ఆవులు మృత్యువాత పడటం చర్చనీయాంశమైంది. వివరాలు.. ఢిల్లీలోని గున్మెహరా గ్రామంలో ఆచార్య సుశీల్ గోశధాన్ ట్రస్ట్ గోశాలను నిర్వహిస్తోంది. సుమారు 20 మంది కార్మికులు పని చేస్తోన్న ఈ గోశాలలో వందల సంఖ్యలో ఆవులు ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో గత రెండు రోజులుగా ఆవులు మృత్యువాత పడుతున్నాయి. సుమారు 32 నుంచి 48 ఆవులు చనిపోవడంతో ఆందోళన చెందిన ట్రస్టు సభ్యులు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. ఆవుల మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కాగా ఈ గోశాలను శుభ్రం చేసేందుకు ఢిల్లీ మున్సిపల్ కార్మికులు తరచుగా ఇక్కడికి వస్తూ ఉండటం.. ఢిల్లీ వాటర్ బోర్డు నీటిని సరఫరా చేస్తుండటంతో ఢిల్లీ సర్కారు ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ నేపథ్యంలో వెటర్నరీ డాక్టర్ల బృందాన్ని గోశాలకు పంపించింది. ఆవుల మృతికి గల కారణాలపై విచారణ జరపాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. 20 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ గోశాలను 1995లోప్రారంభించినట్లు ట్రస్టు సభ్యులు తెలిపారు. -
‘మూకదాడులపై నిర్లక్ష్యం’
న్యూఢిల్లీ: దేశంలో వరసగా వెలుగుచూస్తున్న మూకదాడులపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో బూటకపు వార్తలు, విద్వేషపూరిత సందేశాలతో ప్రభావితులై వ్యక్తులను కొట్టి చంపుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదని ఆక్షేపించింది. లైంగిక నేరాల వీడియోలు సోషల్ మీడియాలో వ్యాప్తి చెందకుండా నిరోధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారిస్తూ జస్టిస్ మదన్ బి.లోకూర్, జస్టిస్ యూయూ లలిత్‌ల బెంచ్ శుక్రవారం పైవిధంగా స్పందించింది. ‘ఈ మధ్య సోషల్ మీడియా వేదికగా చాలా జరుగుతున్నాయి. ప్రజలు చనిపోతున్నా ఎవరూ పట్టించుకున్నట్లు కనిపించడంలేదు. కోర్టు ఉత్తర్వులకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉండాలి. ప్రజలు కూడా ఇదే ఆశిస్తున్నారు’ అని కోర్టు వ్యాఖ్యానించింది. -
ఆ దెబ్బలకు పోలీసులకు సంబంధం లేదు..!
ఆల్వార్/రాజస్థాన్: ఆళ్వార్ జిల్లాలో శనివారం చోటుచేసుకున్న మూకహత్యపై దేశవ్యాప్తంగా విమర్శలు, ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతుండగా.. గోరక్షకుల దాడిలో చనిపోయిన రక్బార్‌ఖాన్ పోస్టుమార్టం రిపోర్టు విడుదలైంది. మూకదాడిలో చనిపోయిన వ్యక్తి మృతికి పోలీసులు కారణం కాదని ఈ నివేదిక వెల్లడించింది. పోస్టుమార్టం జరిగే సమయానికి 12 గంటల క్రితం తగిలిన గాయాల వల్లే బాధితుడు కన్నుమూసినట్టు నివేదిక చెప్తోంది. అంటే రక్బార్ఖాన్పై శనివారం అర్ధరాత్రి దాడి జరిగినట్టు లెక్క. కానీ, అది అవాస్తవమనీ రక్బార్‌ఖాన్‌ను పోలీసులు చితకొట్టడం వల్లే చనిపోయారని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. మొత్తం మీద దాడి జరిగిన తర్వాతే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నట్టు, మృతదేహంపై ఉన్న గాయాలకూ పోలీసులకు సంబంధం లేనట్టు నివేదిక పేర్కొంది. వివరాలు.. రక్బార్‌ఖాన్, అతని మిత్రుడు అస్లాంలు రెండు ఆవులను కొనుగోలు చేసి తమ స్వగ్రామానికి తీసుకెళ్తుండగా కాపుకాసిన కొందరు దుండగులు ఆళ్వార్ పట్టణ సమీపంలో వారిపై మూకదాడిచేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రక్బార్‌ఖాన్‌ను ఆస్పత్రికి తరలించడంలో పోలీసులు తీవ్ర జాప్యం చేయడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. క్షతగాత్రున్ని అయిదు కిలోమీటర్ల దూరంలో గల ఆస్పత్రికి చేర్చడానికి వారికి నాలుగు గంటల సమయం పట్టింది. ప్రాణాలు పోతున్నా పట్టించుకోకుండా తీరిగ్గా టీ, కాఫీలు తాగి ఆస్పత్రికి చేరుకోవడంతో రక్బార్‌ఖాన్ అప్పటికే మృతి చెందాడనీ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్ హోంమంత్రి గులాబ్‌చంద్ కటారియా విచారణ నిమిత్తం నలుగురు సభ్యులతో కమిటీ వేశారు. అయితే, పోస్టుమార్టం రిపోర్టు మాత్రం పోలీసులకు అనుకూలంగా రావడం పలు అనుమానాలకు తావిస్తోంది. మొత్తానికి పోలీసులు నాలుగు గంటల పాటు టీ, కాఫీలే తాగారా..! లేదా అమాయకున్ని చూసి ఆడుకున్నారా అనే విషయం మరుగున పడినట్టయింది. -
మూక హత్యలపై యోగి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, లక్నో : దేశవ్యాప్తంగా మూక హత్యలు, దాడులు పెరుగుతున్న క్రమంలో బుధవారం యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ స్పందించారు. ఇలాంటి ఘటనలకు అనవసర ప్రాధాన్యత ఇస్తున్నారని, గోవులు కూడా విలువైనవేనని వ్యాఖ్యానించారు. ఆవును స్మగ్లింగ్ చేస్తున్నారనే అనుమానంతో రాజస్తాన్‌లోని అల్వార్ సమీపంలో ఓ వ్యక్తిని కొందరు హతమార్చిన నేపథ్యంలో యోగి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మూక హత్యలపై మాట్లాడితే మరి 1984లో జరిగిందేమిటని యోగి ప్రశ్నించారు. శాంతిభద్రతల అంశం రాష్ట్ర పరిధిలోనిదని స్పష్టం చేశారు. ప్రభుత్వం పౌరులందరికీ భద్రత కల్పిస్తుందని చెప్పారు. ‘అందరి మనోభావాలను గౌరవించడం ప్రతి వ్యక్తి, మతం, వర్గం బాధ్యత..మనుషులు ఎంత ముఖ్యమో గోవులూ అంతే ముఖ్యం..ప్రకృతిలో ఇద్దరికీ వారికి నిర్ధేశించన పాత్ర ఉంది..ప్రతి ఒక్కరినీ కాపాడుకోవా’లని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి అంశాలను రాజకీయ ప్రయోజనాల కోసం పెద్దవిగా చేయాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కాగా రాజస్తాన్‌లో మూక హత్యకు సంబంధించి ఇప్పటివరకూ ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు సంబంధించి ఓ ఏఎస్ఐ, ముగ్గురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. -
ఆ పోలికేమిటో ఆయనకే తెలియాలి?
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో గోరక్షణ పేరిట జరుగుతున్న మూక హత్యలపై కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం నాడు పార్లమెంట్లో మాట్లాడుతూ ఈ మూక హత్యలు ఇప్పుడు కొత్తగా ప్రారంభం అయినవి కావని, 1984లోనే భారీ ఎత్తున మూక హత్యలు జరిగాయని ఆరోపించారు. ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ హత్యానంతరం సిక్కులకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన అల్లర్లకు గోరక్షకుల పేరిట నేడు ముస్లింలపై జరుగుతున్న మూక హత్యలకు పోలికేమిటో ఆయనకే తెలియాలి. బీజేపీ పాలిత రాష్ట్రంలోగానీ, బీజేపీ పాలిత కేంద్రంలోగానీ ఎలాంటి దారుణాలు జరిగినా 1984 నాటి అల్లర్లనే బీజేపీ నాయకులు ప్రస్థావిస్తారు. 2002లో గుజరాత్లో జరిగిన ముస్లింల ఊచకోతను సమర్థించుకోవడానికి 1984లో కాంగ్రెస్ హయాంలో జరిగిన అల్లర్ల గురించే మాట్లాడారు. మళ్లీ ఇప్పుడు అదే మాట మాట్లాడుతున్నారు. 2014లో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఒకటి, అర తప్పించి గోరక్షణ దాడులు పెద్దగా లేవని, మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే పెరిగాయని ‘ఇండియాస్పెండ్ (డేటా జర్నలిజం సంస్థ)’ సేకరించిన డేటానే తెలియజేస్తోంది. 2010 నుంచి 2017 వరకు గోరక్షణ పేరిట జరిగిన దాడుల్లో 97 శాతం దాడులు మోదీ ప్రభుత్వం వచ్చాకే జరిగాయని, వాటిలో యాభై శాతం దాడులు బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే జరిగాయని ఇండియాస్పెండ్ ఓ నివేదికలో పేర్కొంది. దాడుల్లో కూడా 90 శాతం దాడులు కేవలం గోవులను కబేళాలకు తరలిస్తున్నారనే అనుమానంపైనే జరిగాయి. పిల్లల కిడ్నాపర్లనుకొని ప్రస్తుతం మూక హత్యలు ఎలా జరుగుతున్నాయో అలాగే. ఈ అమానుష దాడులను ఎలా అరికట్టాలో, అందుకు తీసుకోవల్సిన చర్యలేమిటో ఆలోచించకుండా ముస్లింలు గోమాంసం మానేసే వరకు ఇలాంటి దాడులు జరుగుతాయని ఓ రాజస్థాన్ మంత్రి వ్యాఖ్యానించడం, అవునంటూ ఆరెస్సెస్ నాయకులు ఆయన్ని సమర్థించడం ఏ మేరకు సబబు? దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి కూడా ముస్లింలు గోమాంసం తింటున్నారుకదా, ఇన్నేళ్లు ఎందుకు జరగలేదు? జార్ఖండ్‌లో పశువుల వ్యాపారిని హత్య చేసిన కేసులో శిక్ష పడిన ఎనిమిది మంది దోషులకు లీగల్ ఫీజులు చెల్లించడమే కాకుండా వారు ఇటీవల బెయిల్‌పై విడుదలయితే ఇంటికి పిలిపించి వారిని కేంద్ర మంత్రి సత్కరించడం, జూన్ నెలలో మూక హత్య కేసులోనే నలుగురు నిందితులకు అవసరమైన లీగల్ ఫీజులను జార్ఖండ్‌కు చెందిన మరో బీజేపీ ఎంపీ చెల్లించడం లాంటి అంశాలు దాడులు ఎందుకు జరుగుతున్నాయో సూచిస్తున్నాయి. -
భయపడి గోవును వెనక్కి ఇచ్చేశారు!
రామ్‌పూర్ : రోజురోజుకు మూకదాడులు.. హత్యలు పెరుగుతున్న నేపథ్యంలో ముస్లిం నేతలు ఆవులను పెంచుకునేందుకు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) నేత అజాంఖాన్ భార్య, రాజ్యసభ సభ్యురాలు తంజీమ్ ఫాతిమా తన ఇంట్లో ఆవుపై అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల తనకు ఓ సాధువు నుంచి కానుకగా వచ్చిన ఆవును తిరిగిచ్చేశారు. ఇటీవల రాజస్థాన్‌లోని అల్వార్‌లో ముస్లిం యువకుడు రగ్బర్ ఖాన్‌ను కొట్టి చంపిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ‘గోవధ విషయంలో వివాదాలు కొనసాగుతున్నాయి. రోజురోజుకు దేశంలో మూకదాడులు పెరిగిపోతున్నాయి. మాకు చాలా బాధగా ఉంది. అందుకే ఇటీవల ఓ సాధువు ఎంతో ప్రేమతో మాకు కానుకగా ఇచ్చిన గోవును గోశాలకే తిరిగి ఇచ్చేస్తున్నాం. మేం ముస్లింలం అయిన కారణంగా ఎవరైనా ఆ గోవును చంపేసి మా కుటుంబంపై నింద మోపుతారన్న భయంతోనే ఈ పని చేయాల్సి వచ్చిందని’ తంజీమ్ ఫాతిమా వివరించారు. గోశాలలకు రూ.25లక్షలు విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఎన్డీఏ హాయాంలోనే మైనార్టీలపై దారుణాలు జరుగుతున్నాయని, ముస్లింలకు రక్షణ కరువైందని విమర్శించారు. గోశాలలకు ముస్లింలు దూరంగా ఉండాలని, ముస్లింలు ఆవులను పెంచుకోవద్దని, పాల వ్యాపారం లాంటి వాటికి దూరంగా ఉండటం ఉత్తమమని అజాంఖాన్ పిలుపునిచ్చారు. మనం ఆవులను తాకితే ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని ప్రస్తుత పరిస్థితులు అందుకు అనుగుణంగా ఉన్నాయని పేర్కొన్న విషయం తెలిసిందే. -
ముస్లింను ప్రేమించాడని కొట్టి చంపారు!
జైపూర్ : ఆవులను స్మగ్లింగ్ చేస్తున్నాడని ఓ ముస్లింను కొట్టి చంపిన ఘటన మరవక ముందే రాజస్తాన్‌లో మరో మూక హత్య చోటుచేసుకుంది. బార్మర్‌లో ఓ దళిత యువకుడు ముస్లిం యువతిని ప్రేమిస్తున్నాడని ఆమె కుటుంబ సభ్యులు దారుణంగా కొట్టి చంపారు. కేత్‌రామ్ బీమ్(22) అనే యువకుడు మెహబూబ్ ఖాన్ ఇంట్లో కొద్ది రోజులుగా పనిచేస్తున్నాడు. ఈ తరుణంలో ఆ కుటుంబంలో ఉన్న ఓ యువతితో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. ఇది కాస్త ప్రేమకు దారితీయడంతో ఆ యువతి కుటుంబ సభ్యులు అతన్ని పలుమార్లు హెచ్చరించారు. అయినా వినకపోవడంతో దారుణంగా కొట్టి చంపారు. గత శుక్రవారం హయత్‌ఖాన్, సదామ్ ఖాన్లు వారి పోలానికి రావాలని తన సోదరున్ని పిలిచినట్లు కేత్‌రామ్ సోదరుడు హరిరామ్ మీడియాకు తెలిపారు. అప్పటికే అక్కడ ఉన్న మరికొందరు అతని చేతులు కట్టేసి చచ్చే వరకు తన తమ్ముడిని చితకబాదారని ఆరోపించారు. శవాన్ని కొంత దూరం తీసుకెళ్లి పడేయడంతో మూడు రోజులనంతరం అతని డెడ్‌బాడీ దొరికిందన్నారు. ఇక పోస్ట్‌మార్టమ్ రిపోర్టులో సైతం కేత్‌రామ్ కొట్టడం వల్లనే చనిపోయాడని తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఓ వైపు దేశవ్యాప్తంగా మూకదాడులపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేత్‌రామ్ మృతి ఈ ఆందోళనలకు అగ్గిరాజేసినట్లైంది. మరోవైపు అల్వార్ జిల్లాలో చోటు చేసుకున్న మూక దాడిలో పోలీసుల నిర్లక్ష్యమే వల్లే బాధితుడు రక్బర్ ఖాన్ మృతి చెందినట్లు తీవ్ర ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. -
‘ఆ వ్యాపారానికి దూరంగా ఉంటే మంచిది’
రాంపూర్, ఉత్తరప్రదేశ్ : ప్రాణాలు కోల్పోకుండా ఉండాలంటే ఆవులకు దూరంగా ఉండాల్సిందేనంటూ సమాజ్ వాదీ పార్టీ నేత ఆజం ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్‌లోని అల్వార్‌లో జరిగిన మూక హత్యను ఉటంకిస్తూ.. ఎప్పుడైతే గోవధను పూర్తి స్థాయిలో నిషేధిస్తారో అప్పుడే మూకదాడులు, హత్యాకాండ, అనిశ్చితికి తావుండదంటూ ఆరెస్సెస్ నేత ఇంద్రేశ్ కుమార్ అభిప్రాయం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఆజం ఖాన్.. భవిష్యత్ తరాల బాగుకోసమైనా మనం(ముస్లింలు) ఆవులు, పాల వ్యాపారానికి దూరంగా ఉంటే మంచిదని వ్యాఖ్యానించారు. ‘గోమాతగా పిలుచుకునే ఆవులను తాకితే చాలు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందంటూ కొంత మంది నేతలు హెచ్చరిస్తున్నారు. అలాగే ఆవులతో వ్యాపారం చేసిన వాళ్లని చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు. మరి అలాంటప్పుడు వాటికి దూరంగా ఉండి ప్రాణాలు కాపాడుకోవడమే మంచిది కదా. భవిష్యత్ తరాలకు ఈ విషయం గురించి సవివరంగా చెప్పాల్సి ఉంటుందంటూ’ ఆజం ఖాన్ వ్యాఖ్యానించారు. కాగా ఆవులను స్మగ్లింగ్ చేస్తున్నాడన్న అనుమానంతో శుక్రవారం రాజస్థాన్‌లో అక్బర్ ఖాన్ (28), అతని స్నేహితుడు అస్లాంల పై ఐదుగురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో అక్బర్ ఖాన్ ప్రాణాలు కోల్పోయాడు. -
గోవధపై ఆరెస్సెస్ నేత సంచలన వ్యాఖ్యలు
రాంచీ : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) కీలక నేత ఇంద్రేష్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌లోని లాహోర్‌లోకి భారత ఆర్మీ తమకు కావల్సినప్పుడు ప్రవేశిస్తుందని ఇటీవల పేర్కొన్న ఆయన.. తాజాగా రాజస్థాన్‌లోని అల్వార్‌లో జరిగిన దారుణంపై స్పందించారు. జార్ఖండ్ రాజధాని రాంచీలో జగ్రాన్ హిందూ మంచ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఇంద్రేష్ మంగళవారం జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ఆవును చంపాలని ఏ మతం బోధించద లేదన్నారు. ఎప్పుడైతే ఆవులను చంపడం (గోవధ) ఆపేస్తారో అప్పుడే దేశంలో కొనసాగుతోన్న మారణహోమానికి ఫుల్స్టాప్ పడుతుందని పేర్కొన్నారు. మూక దాడులు, హత్యలపై ఇంద్రేష్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. మీ ఇంట్లో వాళ్లపైగానీ, పక్కింటి వారిపైగానీ.. ఎవ్వరిపైనైనా సరే దాడులు అనేది హేయమైన చర్య. అయితే ఆవులను చంపాలని చెప్పే మతం ఏదైనా ఉంటే చెప్పండంటూ ఆయన ప్రశ్నించారు. ‘క్రైస్తవులు ఆవును గోమాతగా పిలుస్తారు. యేసుక్రీస్తు పశువుల పాకలో జన్మించడమే అందుకు కారణం. మక్కా-మదీనాలో ఆవులను చంపడంపై నిషేధం ఉందన్న విషయం తెలిసిందే. అందుకే ఎప్పుడైతే గోవధను నిషేధించి, పూర్తిస్థాయిలో పాటిస్తారో అప్పుడే మూకదాడులు, హత్యాకాండ, అనిశ్చితికి తావుండని’ఆరెస్సెస్ నేత ఇంద్రేష్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఈ జూలై 17న అగ్నివేష్‌పై జరిగిన దాడిని ఇంద్రేష్ ఖండించారు. హిందువులకు వ్యతిరేకంగా కామెంట్లు చేశారన్న కారణంగా జార్ఖండ్‌లోని పాకుర్లో అగ్నివేష్‌పై బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఇతర మతస్తుల మనోభావాలు దెబ్బతియడానికి యత్నించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆవులను చంపుతున్న కారణంగానే మెజార్టీ వర్గాల్లో అనిచ్చితి నెలకొని దాడులకు ప్రేరేపిస్తోందని, గోవధకు స్వస్తి చెబితే అంతా శాంతి నెలకొంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
మూకోన్మాదం, కథువాపై రచ్చ
న్యూఢిల్లీ: రాజస్తాన్‌లోని అల్వార్‌లో ఇటీవల జరిగిన మూకోన్మాద ఘటనపై సోమవారం లోక్‌సభ దద్దరిల్లింది. జీరో అవర్‌లో ఈ అంశాన్ని లేవనెత్తిన కాంగ్రెస్ఎంపీ కరణ్ సింగ్ రాజస్తాన్‌లో ఇటీవలి కాలంలో జరిగిన నాలుగో మూక హత్య ఇదని పేర్కొన్నారు. దీని వెనక గోరక్షకుల హస్తముందన్నారు. దీనిపై బీజేపీ మండిపడింది. పలువురు బీజేపీ ఎంపీలు వెల్‌లోకి దూసుకొచ్చి కాంగ్రెస్ ఎంపీ ప్రసంగానికి అడ్డుతగలడంతో వాగ్వాదం జరిగింది. అంతకుముందు, కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా కథువా ఘటనను, దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ప్రస్తావించారు. బీజేపీ ఎమ్మెల్యే ఉన్నావ్‌లో మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారన్నారు. రాహుల్‌పై హక్కుల ఉల్లంఘన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా సభలో రాఫెల్ ఒప్పందంపై రాహుల్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవాలంటూ బీజేపీ ఎంపీలు పెట్టిన సభా హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని ఇచ్చారు. రాఫెల్ ఒప్పందంలో బూటకపు జాతీయవాదం చాటున నక్కేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని మాజీ రక్షణ మంత్రి ఆంటోనీ విమర్శించారు. కాగా, యూపీఏ హయాంలో కోట్ చేసిన దానికంటే 9 శాతం తక్కువకే తమ ప్రభుత్వం కొనుగోలు చేసిందని న్యాయశాఖ మంత్రి చెప్పారు. గృహ కొనుగోలుదారులకు సాధికారత కల్పించేలా దివాళా చట్టం – 2018లో ప్రభుత్వం తీసుకురానున్న సవరణలను ఆర్థిక మంత్రి సభలో ప్రవేశపెట్టారు. రాజ్యసభలో ఎంపీలు ఆన్లైన్లోనే ప్రశ్నలు అడిగేలా, నోటీసులిచ్చేలా ‘ఈ–నోటీసెస్’ యాప్‌ను ప్రారంభించారు. అటు, చెక్ బౌన్సుల కేసులో త్వరగా విచారణ జరిగే నెగోషియేబుల్ ఇన్స్ట్రుమెంట్ (సవరణ) బిల్లుకు లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. ఇలాంటి కేసుల విచారణలో చెక్ ఇచ్చిన వ్యక్తి ముందుగా చెక్ మొత్తంలో 20శాతాన్ని పరిహారంగా చెక్ తీసుకున్న వ్యక్తికి ఇవ్వాలి. -
మూకహత్యలపై హైలెవల్ కమిటీ
న్యూఢిల్లీ/జైపూర్: దేశంలో పెరిగిపోతున్న మూకహత్యలను నియంత్రించేందుకు కేంద్రం నడుం బిగించింది. ఇందులోభాగంగా ఈ హత్యల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై తగిన సలహాలిచ్చేందుకు హోంశాఖ కార్యదర్శి రాజీవ్ నేతృత్వంలో ఓ ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ఈ కమిటీ సిఫార్సుల్ని పరిశీలించేందుకు హోంమంత్రి రాజ్‌నాథ్ ఆధ్వర్యంలో మంత్రుల బృందం(జీవోఎం)ను ఏర్పాటు చేసింది. రాజీవ్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీలో న్యాయశాఖ, శాసన విభాగం, సామాజిక న్యాయం–సాధికారత విభాగాల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. జీవోఎంలో విదేశాంగ శాఖ, న్యాయ శాఖ, రవాణా శాఖ, జలవనరుల శాఖ మంత్రులు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ 15 రోజుల్లోగా తన నివేదికను జీవోఎంకు సమర్పిస్తుంది. మూకహత్యల నియంత్రణపై ఉన్నత స్థాయి కమిటీ చేసిన సిఫార్సుల్ని జీవోఎం అధ్యయనం చేసి తుది నివేదికను ప్రధానికి అందజేస్తుంది. శాంతిభద్రతలు రాష్ట్రాల పరిధిలోని అంశమనీ, కాబట్టి నేరాలను అదుపు చేయాల్సిన బాధ్యత రాష్ట్రాలదేనని కేంద్రం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా జరుగుతున్న మూకహత్యల ఘటనలపై ఆందోళన వ్యక్తం చేసింది. జూలై 20న ఆవులను స్మగ్లింగ్ చేస్తున్నాడన్న అనుమానంతో రాజస్తాన్‌లోని ఆల్వార్‌లో అక్బర్(28) అనే ముస్లిం యువకుడ్ని గోరక్షక ముఠా కొట్టింది. ఈ దాడి తర్వాత కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న అక్బర్‌ను 6 కి.మీ దూరంలోని ఆస్పత్రికి పోలీసులు మూడు గంటల తర్వాత తీసుకెళ్లారనీ, మార్గమధ్యంలో టీ తాగారనీ వార్తలొచ్చాయి. దీంతో ఈ ఘటనపై నివేదిక అందజేయాలని రాజస్తాన్ ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. కాగా, ఆల్వార్ మూకహత్య విషయాన్ని కాంగ్రెస్ ఎంపీ ఒకరు లోక్‌సభలో ప్రస్తావించగా, బీజేపీ ఎంపీలందరూ తీవ్ర నిరసన వ్యక్తం చేయడం గమనార్హం. మరోవైపు ఆళ్వార్ పోలీసుల అలసత్వం విషయమై విచారణ జరిపేందుకు రాజస్తాన్ ప్రభుత్వం ప్రత్యేక డీజీపీ ఎన్ఆర్కే రెడ్డి నేతృత్వంలో నలుగురు సీనియర్ అధికారులతో ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకూ ముగ్గురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. గోరక్షక ముఠాల ఆగడాలను అరికట్టడానికి అన్నిరాష్ట్రాలకు ఇప్పటికే మార్గదర్శకాలను జారీచేశామని హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. మానవత్వం స్థానంలో విద్వేషం.. ఆల్వార్ మూకహత్యపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ప్రధాని లక్ష్యంగా విరుచుకుపడ్డారు. మోదీ క్రూర భారత్‌లో మానవత్వం స్థానాన్ని విద్వేషం ఆక్రమించుకుందని విమర్శించారు. ‘గోరక్షక ముఠా బాధితుడు అక్బర్ అలియాస్ రక్బర్ ఖాన్‌ను ఆరు కి.మీ దూరంలో ఉన్న ఆస్పత్రికి తరలించడానికి ఆల్వార్ పోలీసులకు 3 గంటలు ఎందుకు పట్టింది? వాళ్లు బాధితుడ్ని ఆస్పత్రికి తరలించకుండా టీ తాగుతూ కూర్చున్నారు. మానవత్వం స్థానాన్ని విద్వేషం ఆక్రమించుకున్న మోదీ సరికొత్త క్రూర భారతం ఇదే’ అని ట్విట్టర్లో మండిపడ్డారు. మరోవైపు కేంద్ర మంత్రి గోయల్ రాహుల్ వ్యాఖ్యలపై స్పందిస్తూ..‘నేరం జరిగిన ప్రతిసారీ ఆనందంతో గంతులు వేయడం ఆపు రాహుల్. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాజస్తాన్ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. రాజకీయ లబ్ధి కోసం సమాజాన్ని ఇష్టానుసారం విభజించే మీరు.. ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారు. మీరొక విద్వేష వ్యాపారి’ అని ఘాటుగా విమర్శించారు. పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే: కమిటీ పోలీసుల నిర్లక్ష్యం కారణంగా అక్బర్ చనిపోయినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని రాజస్తాన్ ప్రభుత్వం నియమించిన హైలెవల్ కమిటీ మీడియాకు తెలిపింది. బాధితుడి గాయాల తీవ్రతను అంచనా వేయడంలో విఫలమైన పోలీసులు తొలుత ఆస్పత్రికి తరలించకుండా, పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లడంతో అతను చనిపోయినట్లు ఈ కమిటీకి నేతృత్వం వహిస్తున్న ప్రత్యేక డీజీపీ ఎన్ఆర్కే రెడ్డి వెల్లడించారు. పోలీసుల కస్టడీలో దెబ్బల కారణంగా చనిపోయాడన్న ఆరోపణల్ని ఖండించారు. అల్వార్‌లో జరిగిందిదీ హరియాణాకు చెందిన అక్బర్, అస్లామ్‌లు రాజస్తాన్‌లో ఆవుల్ని కొనుగోలు చేసి తమ గ్రామానికి జూలై 20న తీసుకెళ్తున్నారు. ఆల్వార్‌లోని లాలావండి గ్రామ సమీపానికి రాగానే వీరిని ఆవుల స్మగ్లర్లుగా భావించిన గోరక్షక ముఠా విచక్షణారహితంగా దాడికి పాల్పడింది. ఈ ఘటనలో అక్బర్(28) దుండగుల చేతిలో చిక్కుకోగా, అస్లామ్ తప్పించుకున్నాడు. విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) రామ్‌గఢ్ గోరక్ష విభాగం చీఫ్ కిశోర్ పోలీసులకు ఈ ఘటనపై సమాచారమిచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న అక్బర్‌ను తొలుత ఆస్పత్రికి తరలించకుండా గోవుల్ని గోశాలకు తరలించడంపై దృష్టి పెట్టారు. ఆ తర్వాత బాధితుడ్ని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి వాంగ్మూలం నమోదుచేసి ఆస్పత్రికి తరలించారు. బాధితుడ్ని ఆస్పత్రికి తీసుకెళ్లే దారిలో పోలీస్ అధికారులు జీప్ నిలిపివేసి టీ కూడా తాగారు. చివరికి 6 కి.మీ దూరంలో ఉన్న ఆస్పత్రికి మూడు గంటలు ఆలస్యంగా జూలై 21న ఉదయం 4 గంటలకు తీసుకెళ్లడంతో బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. కాగా, అక్బర్‌ను గోరక్షక ముఠా హత్యచేసిందో, పోలీసులు కొట్టిచంపారో జ్యుడీషియల్ విచారణ జరపాలని రామ్‌గఢ్ ఎమ్మెల్యే జ్ఞాన్దేవ్ అహుజా డిమాండ్ చేశారు. -
మూక హత్యలపై కీలక కమిటీ
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెరుగుతున్న సామూహిక దాడులు, మూక హత్యలను నిరోధించేందుకు అవసరమైన సూచనలు అందించేందుకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో నలుగురు సభ్యులతో కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గుబ అధ్యక్షతన పనిచేసే ఈ కమిటీ నాలుగు వారాల్లోగా తన నివేదికను సమర్పిస్తుంది. మూక హత్యలను నియంత్రించేందుకు ప్రత్యేక చట్టంతో ముందుకు రావాలని సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. శాంతిభద్రతలను అల్లరి మూకలు తమ చేతుల్లోకి తీసుకోవడాన్ని అనుమతించరాదని సర్వోన్నత న్యాయస్ధానం తేల్చిచెప్పింది. మరోవైపు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన మూక హత్యలపై మంత్రుల బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ బృందం ప్రధాని నరేంద్ర మోదీకి తమ సిఫార్సులను సమర్పించనుంది. సామూహిక దాడులు, మూక హత్యలపై సుప్రీం కోర్టు ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులను గౌరవిస్తామని, రాష్ట్రాలకూ ఈ తరహా దాడులను నిరోధించేలా మార్గదర్శకాలు జారీ చేశామని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. -
ఆ టైమ్‌లో టీ బ్రేక్ అవసరమా..?
సాక్షి, న్యూఢిల్లీ : ఆవులను స్మగ్లింగ్ చేస్తున్నారనే అనుమానంతో అల్వార్‌లో 28 ఏళ్ల అక్రం ఖాన్‌పై అల్లరి మూకల దాడిపై పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే విమర్శలు ఎదురవుతున్నాయి. మూకల దాడిలో తీవ్రంగా గాయపడ్డ బాధితుడిని ఆస్పత్రికి తీసుకెళ్లడంలో చోటుచేసుకున్న జాప్యంపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది. ఆపద సమయంలో పోలీసులు టీ విరామం తీసుకోవడంపై విచారణకు ఆదేశించింది. మరోవైపు బాధితుడిని ఆస్పత్రికి తరలించడంలో జాప్యంపై రాజస్తాన్ పోలీసులు సైతం విచారణకు అత్యున్నత కమిటీని ఏర్పాటు చేశారు. ఘటన జరిగిన లాలావండి గ్రామానికి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న రాంఘర్ కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్‌కు బాధితుడిని తీసుకువెళ్లేందుకు పోలీసులకు మూడు గంటలు పైగా సమయం పట్టడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చావుబతుకుల్లో ఉన్న బాధితుడిని ఆలస్యంగా ఆస్పత్రికి తీసుకెళ్లడంతో.. అక్రం ఖాన్ ప్రాణాలు విడిచాడు. ఖాన్ తన స్నేహితుడు అస్లాంతో కలిసి హర్యానాలోని తమ గ్రామానికి రెండు ఆవులను తీసుకువెళుతుండగా, రాజస్తాన్‌లోని అల్వార్ జిల్లా లాలావండి గ్రామం సమీపంలోని అటవీ ప్రాంతం వద్ద వీరిపై మూక దాడి జరిగింది. ఈ ఘటనలో అక్రం ఖాన్ ప్రాణాలు విడువడంతో మూక హత్యలపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. -
వాట్సాప్ వదంతులు: దివ్యాంగురాలిని కొట్టి చంపారు!
భోపాల్ : సుప్రీం కోర్టు ఎన్ని హెచ్చరికలు చేసినా, ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా మూక హత్యలకు అడ్డుకట్ట పడటం లేదు. కర్ణాటకలోని బీదర్‌లో నలుగురు హైదరాబాదీలను పిల్లల కిడ్నాపర్లుగా పొరబడి స్థానికులు చేసిన దాడిలో ఒకరు మృతిచెందిన ఘటన మరవక ముందే మధ్యప్రదేశ్‌లో అలాంటి సంఘటనే చోటుచేసుకుంది. పిల్లల కిడ్నాపర్ అంటూ ఓ మానసిక దివ్యాంగురాలని గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి చంపారు. ఈ దారుణ ఘటన సింగ్రాలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోర్వా ప్రాంతంలో చోటుచేసుకుంది. నిర్మానుష్య ప్రాంతంలో గుర్తు తెలియని మృత దేహం ఉన్నట్లు ఆదివారం పోలీసులకు సమాచారం అందింది. ఘటనాస్థలికి చేరిన పోలీసులు మానసిక స్థితి సరిగ్గా లేని మహిళ మృత దేహంగా గుర్తించారు. ఆమె గత ఆరు నెలలుగా ఈ ప్రాంతంలోనే తిరుగుతున్నట్లు స్థానికులు పేర్కొన్నారు. అయితే ఆమె శరీరంపై ఉన్న గాయాలను బట్టి ఎవరో కొట్టి చంపినట్లు పోలీసులు భావిస్తున్నారు. పిల్లల కిడ్నాపర్లు తిరుగుతున్నారనే వాట్సాప్ వదంతులతోనే ఆమెను చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు హత్యచేసినట్లుగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. స్థానికుల సమాచారం మేరకు ఆరుగురు నిందితులను గుర్తించారు. ఇదే తరహాలో అటవీ అధికారుపై దాడిచేసిన మరో ఘటనలో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక రాజస్తాన్‌లో ఆవుల స్మగ్లింగ్‌కు చేస్తున్నారని ఒకరిని కొట్టి చంపిన విషయం తెలిసిందే. చదవండి : వెంటాడి...వేటాడారు! మూక హత్య కేసులో మరో ట్విస్ట్ -
మూక హింస