AP Special
-
పార్టీ ఆవిర్భావ దినోత్సవం.. సీఎం జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. ఆనాడు వందమంది ఏకమై మనపై యుద్ధానికి వస్తే.. నాకు రక్షణగా నిలిచిన ప్రజల కోసం ప్రారంభమైన పార్టీయే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు. ఇన్నాళ్ళూ తన ప్రతి అడుగులోనూ అండగా నిలిచిన ప్రతి ఒక్క కార్యకర్తకు, అభిమానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజాక్షేత్రంలో మరోసారి మనం గొప్ప విజయం సాధించేందుకు మీరంతా సిద్ధమా? అని సీఎం జగన్ తెలిపారు. నేడు మన @YSRCParty 14వ వ్యవస్థాపక దినోత్సవం. ఆనాడు వందమంది ఏకమై మనపై యుద్ధానికి వస్తే.. అప్పుడు నాకు రక్షణగా నిలిచిన ప్రజల కోసం ప్రారంభమైన పార్టీ మన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇన్నాళ్ళూ నా ప్రతి అడుగులోనూ అండగా నిలిచిన ప్రతి ఒక్క కార్యకర్తకు, అభిమానికి నా హృద… pic.twitter.com/rdk4qXVilV — YS Jagan Mohan Reddy (@ysjagan) March 12, 2024 -
AP: డిఎస్సీ-2024 షెడ్యూల్లో మార్పులు
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో 6100 ఉపాధ్యాయుల నియామకం కోసం ప్రకటించిన డిఎస్సీ-2024 పరీక్షల షెడ్యూల్ లో మార్పులు చేసినట్లు విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. డిఎస్సీ-2024 పరీక్ష కోసం ఫిబ్రవరి 25 వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే. ముందు ప్రకటించిన ప్రకారం ఈ నెల 15 వ తేదీ నుంచి డిఎస్సీ పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ, పలు కారణాల వల్ల ఈ పరీక్షలను మార్చి 30 వ తేదీ నుంచి ఏప్రిల్ 30 వరకు నిర్వహిస్తున్నామని మంగళవారం నాడు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం 14 రోజుల పాటు రెండు సెషన్లలో పరీక్షలను నిర్వహించేలా టైం టేబుల్ ను రూపొందించామన్నారు. డిఎస్పీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న వారు షెడ్యూల్ మార్పును గమనించాలని ఆయన సూచించారు. సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు(ఎస్జీటీ) అర్హతలను మార్చడం, టెట్ పరీక్షకు డిఎస్సీ పరీక్షకు మధ్యన తగిన సమయం ఇవ్వడం తదితర కారణాల వల్ల షెడ్యూల్ లో మార్పులు అనివార్యమయ్యాయని మంత్రి వివరించారు. సెంటర్లను ఎంపిక చేసుకోడానికి మార్చి 20 నుంచి వెబ్ ఆప్షన్లు ద్వారా అభ్యర్ధులకు అవకాశం కల్పిస్తున్నామని, హాల్ టిక్కెట్లను మార్చి 25 వ తేదీ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. నూతన షెడ్యూల్ ద్వారా లభించిన అవకాశాన్ని అభ్యర్ధులందరూ సద్వినియోగం చేసుకుని పరీక్షలకు సిద్ధం కావాలని మంత్రి బొత్స సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. -
గీతాంజలి ఉదంతం: సీఎం జగన్ విచారం.. రూ. 20 లక్షల ఎక్స్‌గ్రేషియా
సాక్షి, అమరావతి: తెనాలి మహిళ గీతాంజలి ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను దిగ్భ్రాంతికి గురించేసిందని అన్నారు. గీతాంజలి కుటుంబాన్ని ఆదుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గీతాంజలి కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆడపిల్లల గౌరవ ప్రతిష్టలకు, మర్యాదలకు భంగం కలిగించే ఏ ఒక్కరినీ కూడా చట్టం వదిలిపెట్టదని సీఎం జగన్ స్పష్టం చేశారు. కాగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల కారణంగా తన కుటుంబానికి ఎంతో మేలు జరిగిందంటూ గీతాంజలి ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూపై ప్రతిపక్షాలకు చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు అనుచిత వ్యాఖ్యలు పోస్టు చేయడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడిందంటూ కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదవండి: టీడీపీ, జనసేన ఆన్లైన్ మృగాల వికృత క్రీడ.. ఓ చెల్లెమ్మను చంపేశారు! -
ప్రతి అడుగులోనూ అభివృద్ధి: సీఎం జగన్
సాక్షి, విజయవాడ: గతానికి ఇప్పటికీ తేడా గమనించమని కోరుతున్నానని, ప్రతి అడుగులోనూ అభివృద్ధి అంటే ఇదీ అంటూ ప్రతి ఇంటికీ మంచి చేస్తూ అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. కనకదుర్గ వారధి వద్ద ఇరిగేషన్ రిటైనింగ్ వాల్, రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్కు సీఎం ప్రారంభోత్సవం చేశారు. విజయవాడ కార్పొరేషన్ పరిధిలో పేదలకు ఇచ్చిన పట్టాలకు శాశ్వత హక్కులు కల్పించి లబ్ధిదారులకు అందజేశారు. సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. ఆయన మాటల్లోనే.. ►ఈ రోజు విజయవాడలో మంచి కార్యక్రమాలు జరిగిస్తూ, మీ అందరి చిక్కటి చిరునవ్వుల మధ్య ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ►ఈ రోజు విజయవాడలోనే 31,866 పట్టాలకు సంబంధించి రకరకాల కేటగిరీల్లో ఉన్న ఈ పట్టాలను రెగ్యులరైజ్ చేసి ప్రజలందరికీ మంచి చేస్తూ వీటికి సంబంధించిన సంపూర్ణ హక్కులు ఆ కుటుంబాలకు ఇచ్చే ఒక మంచి కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుడుతున్నాం. ►ఇందులో 22ఏ కింద పూర్తి హక్కులు లేక, రిజిస్ట్రేషన్ చేయడానికి ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్న దాదాపు 21వేల మంది.. విజయవాడ సెంట్రల్, వెస్ట్, ఈస్ట్.. అన్ని చోట్లకు సంబంధించి 16 కాలనీలకు సంబంధించి ఇవన్నీ మేలు జరిగే కార్యక్రమం జరుగుతోంది. ►అదేరకంగా 9,125 పట్టాలు అనబ్జెక్షబుల్ ల్యాండ్స్ లో ఉన్న పట్టాలను పూర్తిగా ధ్యాస పెట్టి రెగ్యులరైజ్ జరుగుతోంది. ►దీనికి సంబంధించి అవినాశ్ చెబుతున్నాడు.. భ్రమరాంబపురంలో ఏ మాదిరిగా బరియల్ గ్రౌండ్ ఇష్యూ ఉండి ఇబ్బందికర పరిస్థితుల్లో రెగ్యులరైజ్ కాక ఇళ్లు అక్కడే కట్టుకుని, దశాబ్దాలుగా ఉంటున్నపటికీ ఇల్లు అమ్ముకునే స్వేచ్ఛ లేక ఇబ్బందులు పడే పరిస్థితులను చెప్పాడు. ►అవన్నీ ఈరోజు పరిష్కారం చూపుతూ రెగ్యులరైజ్ చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ►మొత్తంగా దాదాపు 31866 పట్టాలకు సంబంధించి రకరకాల రెగ్యులరైజేషన్ ఒకవైపు జరిగిస్తుండగా రూ.239 కోట్లకు సంబంధించిన రకరకాల ప్రాంతాల్లో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్‌కు సంబంధించిన ఫౌండేషన్ స్టోన్ కూడా ఈరోజు వేయడం జరిగింది. ►దీనివల్ల మురికినీళ్లు మన ఇంటి పక్కన రాకుండా వాటిని నీట్‌గా ట్రీట్ చేసేసి సీవేజ్ ట్రట్మెంట్ ప్లాన్స్ ను 5 ప్రాంతాల్లో తీసుకొచ్చి ఫౌండేషన్ స్టోన్స్ రూ.239 కోట్లకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ►ఇప్పుడు ఈ కరకట్ట వాల్‌ను మీరు చూస్తున్నారు. ఇటువైపున, అటువైపున ఈరెండు కరకట్ట గోడలు దాదాపు రూ.500 కోట్లతో గోడలుకట్టడమే కాకుండా కృష్ణలంక ప్రాంతం ఎప్పుడూ కూడా మునిగిపోతున్న పరిస్థితులు.. ►ఎప్పుడు వరదలు వచ్చినా ఇక్కడికి వచ్చి నాలుగు మాటలు చెప్పడమే కానీ, కచ్చితంగా ఈ ఏరియాకు ఈ గోడ కడితే ఇటువంటి పరిస్థితి రాదు, ఈ గోడ కట్టాలని అని ఆలోచన చేసిన పుణ్యం ఏ ఒక్కరూ చేయలేదు. అది ఒక్క మీ బిడ్డ ప్రభుత్వంలోనే జరుగుతోందని చెప్పడానికి సంతోషపడుతున్నా. ►కరకట్ట గోడ కట్టడమే కాకుండా ఇక్కడ మన కృష్ణలంక ప్రాంతంలో ఉన్న మన అక్కచెల్లెమ్మలు, మన పిల్లలు, మన అవ్వలు, తాతలు అందరూ ఆహ్లాదకరంగా సాయంత్రంపూట పార్కులో నడుచుకుని పోయేట్టుగా సుందరీకరణ చేస్తూ మంచి పార్కులు రూపొందించే కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ►ఇదే విజయవాడలో ఎప్పుడూ జరగని విధంగా మీ బిడ్డ ప్రభుత్వంలో రూ.400 కోట్లు పైచిలుకు ఖర్చు పెట్టి అంబేద్కర్ పార్కును కూడా మీ అందరి కళ్ల ఎదుటే ఫౌండేషన్ స్టోన్ వేయడం, ప్రారంభించడం కూడా చూశారు ►ఇంతకు ముందు విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు పోవాలంటే ఒక్క ఫ్లై ఓవర్ కూడా పూర్తి కాని పరిస్థితి నుంచి ఈరోజు ఈ 58 నెలల కాలంలోనే ఆ పెండింగ్‌లో ఉన్న ఫ్లై ఓవర్ పూర్తి చేయడమే కాకుండా మరో రెండు ఫ్లై ఓవర్లు అదే రోడ్డులో కనిపిస్తాయి ►కనకదుర్గమ్మ ఫ్లై ఓవర్ కూడా కలుపుకొంటే ఇంకో ఫ్లై ఓవర్ ►ఇవన్నీ కూడా మన కళ్ల ఎదుటే యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయిపోయిన పరిస్థితులు కూడా కేవలం ఈ 58 నెలల కాలంలోనే కనిపిస్తాయి ►ఔటర్ రింగు రోడ్లు, కాజ నుంచి చిన్న ఔట్లపల్లెకు గుంటూరు ట్రాఫిక్ అంతా విజయవాడ నుంచి పోవాల్సిన అవసరం లేకుండా అటు నుంచి అటే ట్రాఫిక్ పోయేట్టుగా ఆ ప్రాజెక్టు కూడా అయిపోవచ్చింది. రెండు నెలల్లో ఓపెన్ చేసే విధంగా పనులు జరుగుతున్నాయి ►ఇవన్నీ కూడా గతానికి ఇప్పటికీ తేడా గమనించమని కోరుతున్నా ►ప్రతి అడుగులోనూ అభివృద్ధి అంటే ఇదీ అంటూ ప్రతి ఇంటికీ మంచి చేస్తూ అడుగులు వేయిస్తున్నాం ►అటువైపున మన వ్యతిరేకులంతా ఏమీ చేయరుగానీ అభివృద్ధి అభివృద్ధి అంటారు ►ఆలోచన చేయమని అడుగుతున్నా. ఈ 58 నెలల కాలంలోనే మీ స్కూళ్లు, మీ హాస్పటళ్లు బాగుపడ్డాయి ►గ్రామీణ స్థాయిలో అయితే వ్యవసాయం చేసే తీరు కూడా బాగుపడింది. ఎప్పుడూ జరగని విధంగా చూడని విధంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి ►వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ఇంటింటికీ వచ్చి ఆప్యాయంగా పలకరిస్తూ మంచి చేసే కార్యక్రమం, ఏ ఒక్క రూపాయీ లంచం లేకుండా జరిగిస్తున్న పాలన కేవలం ఈ 58 నెలల పాలనలోనే అని గమనించమని కోరుతున్నా ►వీటన్నిటి వల్ల మీ అందరికీ మంచి జరగాలని మనసారా కోరుకుంటూ కాస్త నేను రెండు మూడు పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తాను ►ఆ తర్వాత మీ ప్రాంతాలకు వచ్చి ఎవరెవరు పట్టాలివ్వాలో శ్రీను ఒక ఏరియాలోకి, అవినాశ్ ఒక ఏరియాలోకి, ఆసిఫ్ భాయ్ తన ఏరియాలోకి వచ్చి సచివాలయ పరిధిలో పంపిణీ చేసే కార్యక్రమం వాళ్లు దగ్గరుండి చేస్తారు ►దేవుని దయ, మీ అందరి చల్లని దీవెనలు ఎల్లకాలం ఉండాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా ►పార్కుకు కృష్ణమ్మ జలవిహార్ అని పేరు పెడదాం.. థ్యాంక్యూ ఇదీ చదవండి: రాజకీయ ప్రత్యర్థుల ఊహకందని అడుగే ఇది -
వాళ్లను వదిలిపెట్టొద్దు.. గీతాంజలి భర్త ఆవేదన
సాక్షి, గుంటూరు జిల్లా: తెనాలిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. టీడీపీ, జనసేన ట్రోలింగ్స్ తట్టుకోలేక గీతాంజలి ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె భర్త బాలచందర్, ఇతర కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. గీతాంజలిది చిన్న పిల్ల మనస్తత్వం అని, ఇలా జరుగుతుందని మేము ఊహించలేదన్నారు. వీడియో మాట్లాడినప్పుడు చాలా ఆనంద పడిందని, ఆ వీడియోకి సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్లకు తనలో తానే బాధపడిందని, ఫోన్ చూస్తూ నిత్యం ఏడ్చేదన్నారు. ‘‘తెల్లవారుజామున 3 గంటల వరకు ఫోను చూస్తూ ఏడుస్తూనే ఉంది. ఇంకా ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు ఉండవని చివరగా ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంది. ఒక మహిళ మీద ఇలాంటి ట్రోలింగ్స్ ఎవరైనా చేస్తారా?. ట్రోలింగ్స్ తట్టుకోలేక మా అమ్మాయి దూరమైంది. ఎవరైతే ట్రోలింగ్ చేసారో వాళ్ల మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: టీడీపీ, జనసేన ఆన్లైన్ మృగాల వికృత క్రీడ.. ఓ చెల్లెమ్మను చంపేశారు! -
కొణతాల మదిలో ఓటమి భయం
సాక్షి, అనకాపల్లి: అనకాపల్లి నియోజకవర్గంలో టీడీపీ–జనసేన పొత్తు పాట్లు తారస్థాయికి చేరుకున్నాయి. సోమవారం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ ఆధ్వర్యంలో అనకాపల్లిలో నిర్వహించిన “టీడీపీ–జనసేన’ పార్టీల విస్తృత స్థాయి ఉమ్మడి సమావేశానికి మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, జనసేన నియోజకవర్గ ఇన్చార్జి పరుచూరి భాస్కర్‌రావు డుమ్మా కొట్టారు. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, ఆయన కుమారుడు దాడి రత్నాకర్, వారి వర్గీయులు ఈ సమావేశానికి హాజరవుతారని విస్తృత ప్రచారం చేశారు. సమావేశం చివరి వరకూ అందరూ ఎదురుచూశారు. కానీ వారెవరూ రాలేదు. వీరికి తోడుగా జనసేన నేత పరుచూరి భాస్కర్‌రావు, ఆయన వర్గీయులు కూడా ఈ సమావేశానికి హాజరుకాలేదు. కేవలం 150 నుంచి 200 మందితోనే నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం జరగడం, జనసేన, టీడీపీ కేడర్ రాకపోవడంతో కొణతాల రామకృష్ణ వర్గీయులు డీలా పడ్డారు. కొణతాల మదిలో ఓటమి భయం టీడీపీ–జనసేన పార్టీల తొలి విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించిన మరుక్షణం నుంచి అనకాపల్లి నియోజకవర్గ టీడీపీ, జనసేన శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, జనసేన నాయకుడు పరుచూరి భాస్కర్‌రావు వర్గీయులైతే పదేళ్లుగా నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తే.. నిన్న కాక మొన్న పారీ్టలో చేరిన వారికి టికెట్ ఎలా ఖరారు చేస్తారని ఆందోళనలు, నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. వీరికి తోడుగా మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కూడా టికెట్ ఆశించారు. టీడీపీ–జనసేన పారీ్టల మొదటి జాబితాలో అనూహ్యంగా అనకాపల్లి ఎమ్మెల్యే టికెట్‌ను మాజీ మంత్రి కొణతాలకు ఖరారు చేశారు. దీంతో పీలా, పరుచూరి, దాడి అసంతృప్తి వ్యక్తం చేస్తూనే వచ్చారు. అధిష్టానం ఆదేశాల మేరకు కొణతాలకు మద్దతు ఇస్తామని చెప్పినప్పటికీ.. వారి మదిలో కొణతాలను ఓడించాలనే ఉంది. వ్యతిరేక వర్గంగా ఉన్న పీలా, దాడి వీరభద్రరావులను కొణతాల స్వయంగా కలిసి సయోధ్య కుదుర్చుకున్నారు. అంతేకాకుండా మీడియా ముందు తామంతా కలిసి ఉన్నట్లుగానే చెప్పుకొచ్చారు. ఇదే సరైన సమయంగా భావించిన కొణతాల సోమవారం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి అందరం కలిసి ఉన్నారనే సంకేతాన్ని కేడర్‌కు అందిద్దామని ఆశించారు. కానీ విస్తృత స్థాయి సమావేశానికి కీలకమైన దాడి వీరభద్రరావు, పరుచూరి భాస్కర్‌రావుతో పాటు వారి వర్గీయులు సైతం రాకపోవడంతో కొణతాల మదిలో ఓటమి భయం పట్టుకుంది. అనకాపల్లి నియోజకవర్గం జనసేన కేడర్ కూడా పూర్తిగా హాజరు కాలేదు. అలిగిన నాగ జగదీష్ టీడీపీ–జనసేన పార్టీల విస్తృత స్థాయి సమావేశాన్ని పీలా గోవింద సత్యనారాయణతో కలిసి కొణతాల నడిపించడంతో పీలా వ్యతిరేకవర్గ నాయకుడైన బుద్ధ నాగజగదీష్ అలకబూనారు. విస్తృతస్థాయి సమావేశానికి వచ్చిన జగదీష్ ను, ఆయన వర్గీయులను పట్టించుకోకుండా పీలాకు ప్రాధాన్యం ఇవ్వడంతో చిన్నబుచ్చుకున్నట్టు సమాచారం. మొత్తం మీద అనకాపల్లి నియోజవర్గంలో టీడీపీ–జనసేన పొత్తుతో కేడర్ పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. -
క్షయ.. వ్యాధి నిర్మూలనకై ప్రభుత్వం పటిష్ట చర్యలు!
కాకినాడ: క్షయ.. నోటి తుంపర్ల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రాణం మీదకు తెస్తుంది. ఈ వ్యాధికి కళ్లెం వేసేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రభుత్వం ప్రతి సీహెచ్‌సీలో టీబీ యూనిట్ ఏర్పాటు చేసింది. ఈవిధంగా జిల్లాలో మొత్తం 9 యూనిట్లు ఉన్నాయి. వీటిల్లో ఒక సీనియర్ టీబీ సూపర్వైజర్, ఒక సీనియర్ ల్యాబ్ సూపర్వైజర్ విధులు నిర్వహిస్తున్నారు. వీరితో పాటు 10 మంది సిబ్బందిని ప్రభుత్వం నియమించింది. క్షయ కేసులను గుర్తించేందుకు ప్రతి సీహెచ్‌సీలో ఎక్స్‌రే యూనిట్లు ఏర్పాటు చేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 10 మంది టీబీ హెల్త్ విజిటర్లు పని చేస్తున్నారు. క్షయ వ్యాధిని నిర్ధారించేందుకు కాకినాడ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్)లో రెండు సీబీ నాట్ మెషీన్లు ఏర్పాటు చేశారు. దీంతోపాటు, జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏరియా ఆసుపత్రులు, సీహెచ్‌సీలు, పీహెచ్‌సీల్లో 19 ట్రూనాట్ మెషీన్లు ఏర్పాటు చేశారు. ప్రతి ఆరోగ్య కేంద్రాన్ని మైక్రోస్కోప్ సెంటర్‌గా మార్చి టీబీ లక్షణాలున్న వ్యక్తి నుంచి కళ్లె (ఉమ్ము) సేకరించి పరీక్షలు చేస్తున్నారు. ఆ శాంపిల్‌లో టీబీ క్రిములుంటే ఆ వ్యక్తికి డాట్ ప్రొవైడర్ ద్వారా మందులు ఇస్తూ వ్యాధిని తగ్గించేందుకు 6 నుంచి 8 నెలల పాటు చికిత్స అందిస్తున్నారు. ఉచితంగా మందులు.. టీబీ చికిత్సకు జిల్లాలోని అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగా మందులు అందజేస్తున్నారు. వ్యాధి వచ్చిన తర్వాత వైద్యులు సూచించిన విధంగా నిర్ణీత కాలం మందులు వాడకపోతే అది మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీగా మారుతుంది. దీనికి రెండేళ్ల పాటు మందులు వాడాల్సి ఉంటుంది. టీబీ నిర్మూలనకు రూ.2 లక్షల నుంచి రూ.18 లక్షల విలువ జేసే మందులను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. మందులు మింగించిన పర్యవేక్షకులకు (డాట్ ప్రొవైడర్‌కు) రూ. వెయ్యి నుంచి రూ.5 వేల పారితోషికం అందిస్తున్నా రు. క్షయ వ్యాధిగ్రస్తులకు నెలవారీ వైద్య ఖర్చులకు నిక్షయ పోషణ యోజన ద్వారా రూ.500 చొప్పున అందజేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా క్షయతో బాధ పడుతున్న 1,743 మందికి గత ఏడాది ప్రతి నెలా రూ.500 చొప్పున రూ.4,19,7000 జమ చేశారు. ఆధునిక పరికరాలతో పరీక్షలు.. వ్యాధిని కచ్చితంగా నిర్ధారణ చేసే సీబీ నాట్ మెషీన్లు కాకినాడ జీజీహెచ్‌తో పాటు తాళ్లరేవు, పెద్దాపురం, పండూరుల్లోని ఆసుపత్రుల్లో ఏర్పాటు చేశారు. ఈ మెషీన్ హెచ్ఐవీ రోగులు, ఊపిరితిత్తుల వ్యాధులున్న వారు, చిన్న పిల్లలల్లో క్షయ, ఎండీఆర్ టీబీని గుర్తించడంలో కీలకంగా ఉంటుంది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 1,244 మంది క్షయ బాధితులకు చికిత్స అందిస్తున్నారు. వీరికి నిక్షయ్ మిత్ర ద్వారా, దాతల సహకారంతో పోషకాహార కిట్లు అందజేసేలా చర్యలు చేపట్టారు. ఇందులో 673 మంది నమోదు చేసుకుని రోగులకు పౌష్టికాహారం అందజేస్తున్నారు. వీరిలో కొంతమంది కొందరు రోగులను దత్తత తీసుకుని, మరీ వారికి కావాల్సిన పౌష్టికాహార కిట్లు అందజేస్తూండటం విశేషం. క్షయ నిర్మూలనే లక్ష్యం జిల్లాను క్షయ రహితంగా చేయడ మే లక్ష్యంగా టీబీ రోగులకు చికిత్స అందిస్తున్నాం. అదే సమయంలో నివారణపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు 2030 నాటికి క్షయ ముక్త భారత్ లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నాం. – డాక్టర్ జె.నరసింహ నాయక్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి, కాకినాడ. -
AP Police: ‘దిగులొద్దు.. భయపడొద్దు.. భరతం పడతాం’
టీడీపీ, జనసేన పార్టీల సోషల్ మీడియా విభాగాల వేధింపులు కొన్నాళ్లుగా వెర్రి తలలు వేస్తున్నాయి. సొంత వ్యక్తిత్వం, తమవైన అభిప్రాయాలు కలిగి ఉండటం మహానేరం అన్నట్లు కిరాయి మూకలు దారుణంగా వ్యవహరిస్తున్నాయి. ఈ క్రమంలో.. పచ్చ మూకల కిరాతకానికి తెనాలి మహిళ గీతాంజలి దారుణంగా బలైపోయింది. అయితే ‘సోషల్ మాఫియా’ దాడులపై బాధితులు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలని.. తాము అండగా నిలబడతామని ఏపీ పోలీసులు భరోసా ఇస్తున్నారు. టీడీపీ-జనసేన సోషల్ మీడియా బ్యాచ్ గత కొంతకాలంగా మరీ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. మహిళలు, చిన్నారులని కూడా చూడకుండా అసభ్యకర పదజాలంతో దూషిస్తూ తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నాయి. బెండపూడి స్టూడెంట్ మేఘన, కుమారీ ఆంటీ.. వీళ్లను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో పోస్టలు చేశాయి. తాజాగా తెనాలి గృహిణి గీతాంజలి లక్ష్యంగా చేసుకుని తప్పుడు కామెంట్లు చేశాయి. దీంతో ఆమె ప్రాణం తీసుకుంది. అయితే.. ఆన్లైన్లో ఇలాంటి వేధింపులను ఉపేక్షించొద్దని ఏపీ పోలీసులు అంటున్నారు. వీటికి జంకితే మరింత దారుణంగా తెగబడటం ఖాయమని చెబుతున్నారు. బాధితులకు తక్షణమే రక్షణ కల్పించడం, వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసు శాఖ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసిందని గుర్తు చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా చేసిన చట్టాల్ని ప్రస్తావిస్తున్నారు. బాధితులు ఫిర్యాదు చేస్తే చాలు వెంటనే కేసు నమోదు చేసి నిందితులపై చర్యలు తీసుకుంటామని.. బాధితులు నేరుగానే కాకుండా తమ సన్నిహితులు, స్నేహితుల ద్వారా కూడా బాధితులు ఫిర్యాదు చేసే వీలుందని చెబుతున్నారు. ఫిర్యాదు చేయడం ఇలా... ► ట్రోలింగ్‌కు గురయ్యేవారు, బాధితులు తమ పరిధిలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయవచ్చు. గ్రామ, వార్డు సచివాలయంలోని మహిళా పోలీసు ద్వారా కూడా పోలీసులను ఆశ్రయించవచ్చు. ► సైబర్ నేరాలు, సోషల్ మీడియా వేధింపులపై ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేసేందుకు సంప్రదించాల్సిన వేదికలు.. సైబర్ క్రైమ్ పోర్టల్: https://cybercrime.gov.in/ సైబర్ మిత్ర వాట్సాప్ నంబర్: 9121211100 సైబర్ బుల్లీయింగ్ 4ఎస్4యు: 9071666667 గీతాంజలి కేసులో నిందితుల గుర్తింపు వైఎస్సార్సీపీ సంక్షేమంతో తనకు చేకూరిన లబ్ధి గురించి సంతోషంగా చెప్పి.. ఆనక టీడీపీ-జనసేనల చేతిలో దారుణంగా ట్రోలింగ్‌కు గురైంది గీతాంజలి. అతి జుగుప్సాకరమైన పోస్టులు చేశారు ఆమె మీద. అయితే సున్నిత మనస్కురాలైన గీతాంజలి.. ఆ పోస్టులను భరించలేకపోయింది. తీవ్ర మనోవేదనకు గురైంది. చివరకు రైలు కింద పడి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ క్రమంలో తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ సోమవారం వేకువఝామున కన్నుమూసింది. ఏపీలో సంచలనంగా మారిన ఈ ఆన్లైన్ వేధింపుల కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. భర్త ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. దర్యాప్తును ముమ్మరం చేశారు. ఐటీడీపీ, పలువురు జనసేన నేతల అకౌంట్లను పరిశీలించారు. ఇప్పటికే నిందితుల్ని గుర్తించామని.. పోస్టులు చేసిన కొందరు పరారీలో ఉన్నారని.. వాళ్లందరినీ పట్టుకుని తీరతామని పోలీసులు చెబుతున్నారు. -
జగనన్న సాయంతో నా కుటుంబం ఖుషీ
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. జగనన్న సాయంతో నా కుటుంబం ఖుషీ జగనన్న ప్రభుత్వంలో అందుతున్న సంక్షేమ సాయంతో ఇప్పుడు నా కుటుంబం హ్యాపీగానే ఉంది. మాది డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణం సీతాపతిరావు పేటవీధి. నేను ఇంటి వద్దే స్వయం ఉపాధి పొందుతున్నాను. నా కుటుంబం ప్రభుత్వం అందించే పలు సంక్షేమ పథకాలనుంచి లబ్ధి అందుకుంటున్నారు. స్వయం సహాయక సంఘం సభ్యురాలినైన నేను ప్రస్తుతం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ప్రగతి యూనిట్ ద్వారా ఇచ్చిన రుణంతో పేపర్ ప్లేట్ల యూనిట్‌ను ఏర్పాటు చేసుకుని స్వయం ఉపాధి పొందుతున్నాను. జగనన్న ప్రభుత్వం వచ్చాక మా అబ్బాయిని ఓ దారిలో పెట్టుకునే అవకాశం కూడా వచ్చింది. ప్రస్తుతం మా అబ్బాయి వార్డు సచివాలయం పరిధిలో వలంటీర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ప్రతీ నెలా నేను వితంతు పింఛన్ రూ.3 వేలు అందుకుంటున్నాను. ఆసరా పథకం ద్వారా కూడా లబ్ధి పొందాను. గత ప్రభుత్వంలో సాయం పొందాలంటే ఎన్నో వ్యయప్రయాసలకోర్చాల్సి వచ్చేది. ఇప్పడు జగనన్న ప్రభుత్వంలో అందుతున్న సాయంతో సంతోషంగా ఉంటున్నాం. – కుడుపూడి సుజాత, సీతాపతిరావుపేట వీధి – (పరసా సుబ్బారావు, విలేకరి, అమలాపురం టౌన్) పెద్ద కొడుకులా ఆదుకున్నారు ముప్పై ఏళ్ల నుంచి రోడ్డు మార్జిన్లో పూరిపాకలో నివాసం ఉండేవాళ్లం. బిక్కు బిక్కుమంటూ గడిపాం. సొంతింటి కల సాకారం అవుతుందని అనుకోలేదు. గతంలో ఇంటి కోసం నాయకులు చుట్టూ తిరిగి అలసి పోయాం. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వలంటీర్లు ఇంటికి వచ్చి మా వివరాలు తీసుకుని వెళ్లారు. ఇంటి స్థలం, ఇల్లు మంజూరైంది. జగనన్న కాలనీలో ఇల్లు కట్టుకోగలిగాం. మాకు ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి. అందరికి పెళ్లిళ్లు చేశాం. జగన్మోహన్రెడ్డి నా పెద్ద కొడుకులా ఆదరించారు. నేను మాంసం దుకాణంలో పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకునే వాడిని. అనుకోకుండా రెండేళ్ల క్రితం పక్షవాతం వచ్చింది. మూలన పడ్డాను. ఇప్పుడు ప్రభుత్వం అందిస్తున్న రూ.3 వేలు పింఛనే నా కుటుంబానికి ఆధారమైంది. గత ఏడాది వైఎస్సార్ ఆరోగ్యశ్రీలో గుండె ఆపరేషన్ చేయించుకున్నాను. ఆపరేషన్ అనంతరం ఇంటికి వచ్చే సమయంలో పోషణ నిమిత్తం రూ.30 వేలు ఇచ్చారు.. నా భార్య మదీనా బీబీకి చేయూత పథకం ద్వారా మూడేళ్ల నుంచి ఏటా రూ.18,500 సాయం అందుతోంది. మాది తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం వేములూరు గ్రామం. మాలాంటి వాళ్లం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం. – ఎస్కే వల్లీ మస్తాన్, –జీవీవీ సత్యనారాయణ, విలేకరి, కొవ్వూరు మా కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకున్నారు నాయీ బ్రాహ్మణ కుటుంబం మాది. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం బొంతల వీధి. తెలుగు దేశం హయాంలో ఎటువంటి పథకాలూ వర్తించలేదు. ఇంటి కోసం కాళ్లావేళ్లా పడ్డా ప్రయోజనం లేకపోయింది. జగనన్న ముఖ్యమంత్రి అయిన తరువాత పలు పథకాలు మాకు వర్తిస్తున్నాయి. ఆనందంగా జీవిస్తున్నాం. జమ్ము పంచాయతీ గడ్డెయ్యపేట వద్ద మూడు లక్షల విలువైన ఇంటి స్థలం ఇచ్చారు. ఇళ్లు కట్టుకోవడానికి రూ.1.85 లక్షలు మంజూరు చేశారు. డబ్బు సరిపోకపోతే డ్వాక్రా నుంచి రూ. 50 వేలు వడ్డీలేని రుణం ఇచ్చారు. మా భార్యకు ఆసరా పథకం వర్తించింది. రూ.60 వేలు మాఫీ చేశారు. పాప 8వ తరగతి చదువుతోంది. అమ్మ ఒడి నాలుగేళ్లుగా వస్తోంది. ఈ ఏడాది ట్యాబు కూడా ఇచ్చారు. నాకు మెయిన్ రోడ్డులో సెలూన్ షాపు ఉంది. దీనికి జగనన్న చేదోడు పథకంలో రూ.10 వేలు చొప్పున నాలుగు సంవత్సరాలు ఇచ్చారు. షాపునకు కరెంట్ బిల్లు కూడా ప్రభుత్వమే కడుతోంది. ఇంటిల్లిపాదీ అందరికీ పథకాలు అమలు చేయడంతో మాకు ఎంతో మేలు జరిగింది. – దాసరి శ్రీరాములు, బొంతల వీధి – మామిడి రవి, విలేకరి, నరసన్నపేట -
fact check: కుంభకర్ణ నిద్ర మీదే రామోజీ
సాక్షి, అమరావతి: నిత్యం కుట్రపూరిత ఆలోచనలు, విషపూరిత రాతలు.. అక్షరాలకు అందని ఆక్రోశం.. ఇదీ ఈనాడు రామోజీరావు పరిస్థితి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పదేపదే అబద్ధాలను అచ్చేస్తూ వయోభారానికి తోడు తనకున్న అల్జీమర్స్ వ్యాధి ముదిరి పోయిందని సోమవారం మరోసారి రుజువు చేసుకున్నాడు. దేశవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితుల ప్రభావంతో ఖరీఫ్‌తో పాటు రబీలో పంటల సాగు తగ్గిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేందుకు వీలుగా ఒకే వ్యవసాయ సీజన్లో నాలుగు సార్లు సబ్సిడీపై విత్తనాలు ప్రభుత్వం అందించిన విషయాన్ని తన రాతల్లో మరుగున పరిచారు. 103 కరువు మండలాల పరిధిలో పంటలు నష్టపోయిన రైతులతో పాటు డిసెంబర్లో విరుచుకుపడిన మిచాంగ్ తుపాన్ వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకూ పెట్టుబడి రాయితీని నాలుగు రోజుల క్రితమే విడుదల చేసిన విషయాన్ని మరచిపోయారు. మూడో విడత రైతు భరోసా, సున్నా వడ్డీ రాయితీలు కలిపి ఏకంగా 75.96 లక్షల మందికి రూ.2588.92 కోట్లు లబ్ధి చేకూర్చిన అంశం ఈ కబోదికి కన్పించలేదు. ఆరోపణ: ఖరీఫ్, రబీలో కలిపి 45 లక్షల ఎకరాల్లో బీడు వాస్తవం: ఖరీఫ్, రబీ పంట కాలాల్లో సాధారణ విస్తీర్ణం 140.24 లక్షల ఎకరాలకు గాను 104.94 లక్షల ఎకరాల్లో సాగైంది. బెట్ట పరిస్థితుల వలన 35.30 లక్షల ఎకరాలలో పంటలు వేయలేదు. కానీ ఉద్యాన పంటల విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. పండ్లు, ప్లాంటేషన్ తోటలు, కూరగాయలు, వాణిజ్య పూలు, ఇతర ఉద్యాన పంటల విస్తీర్ణం ఖరీఫ్, రబీల్లో 7,87,621 ఎకరాలకు చేరింది. సాధారణం కన్నా కేవలం 27.42 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు తగ్గింది. కానీ ఈనాడుకు మాత్రం ఏకంగా 45 లక్షల ఎకరాల్లో తగ్గినట్టుగా కని్పంచింది. ఆరోపణ: కరువు, తుపానులతో మరో 43 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాస్తవం: వర్షాభావ పరిస్థితుల వల్ల ఏడు జిల్లాల్లో 103 కరువు మండలాలను ప్రకటించారు. ఈ మండలాల్లో 14,24,245 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టుగా గుర్తించారు. ఇందులో ఉద్యాన, వ్యవసాయ పంటలున్నాయి. రబీ సీజన్ ఆరంభంలో విరుచుకుపడిన మిచాంగ్ తుపాన్ భారీ వర్షాల వలన 6,64,380 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టుగా గుర్తించారు. కరువు, మిచాంగ్ తుపాన్ వల్ల 20,88,625 ఎకరాలు పంటలు దెబ్బతింటే ఈనాడుకు మాత్రం 43 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టుగా కని్పంచింది. ఆరోపణ: వెంటాడిన పొడి వాతావరణం వాస్తవం:దేశ వ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులు ఖరీఫ్‌తో పాటు రబీలోనూ కొనసాగింది. కానీ పొడి వాతావరణం కని్పంచినంత మాత్రాన కరువు ఉన్నట్టు కాదన్న విషయం రామోజీకి తెలియంది కాదు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పుడు ఏదైనా ప్రాంతాన్ని కరువు ప్రాంతంగా గుర్తించాలంటే ఆరు ప్రామాణికాల ఆధారంగా తీసుకుంటారు. తొలుత ప్రాథమిక అంచనా, క్షేత్ర స్థాయి పరిశీలన, తర్వాత నిబంధనల మేరకు 33 శాతానికి పైగా మునిగిపోయి దెబ్బతిన్న పంటలను పరిగణనలోకి తీసుకొని నష్టం తుది అంచనాలను రూపొందిస్తారు. ఆ మేరకు పంటలవారీగా లెక్కించి పరిహారాన్ని (ఇన్పుట్æసబ్సిడీ) అందిస్తారు. ఆరోపణ: పడిపోయిన 3 కోట్ల క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వాస్తవం: కరువు, మిచాంగ్ ప్రభావం ఉన్నప్పటికీ 2023–24లో ఆహార ధాన్యాల దిగుబడి 154.73 లక్షల టన్నులు నమోదవుతున్నట్టు డైరెక్టర్ ఆఫ్ స్టాటస్టిక్స్ (కేంద్ర గణాంక శాఖ) రెండో ముందస్తు అంచనా వేసింది. ఈ దిగుబడులు గడిచిన ఐదేళ్ల సగటు దిగుబడులతో పోలిస్తే తక్కువేమీ కాదు. వరితో సహా జొన్న, సజ్జ, రాగి, పెసలు, మినుము, ఉలవలు వేరుసెనగ, నువ్వులు, పత్తి పంటల ఎకరా దిగుబడి గత ఏడాదితో పోలిస్తే పెరిగింది. 2023–24 సీజన్లో 57.87 లక్షల ఎకరాలకు 48.93లక్షల ఎకరాల్లో వరి సాగైంది. వాస్తవాలు ఇలా ఉంటే ఏకంగా 3 కోట్ల క్వింటాళ్ల ధాన్యం దిగుబడి తగ్గిందంటూ కాకిలెక్కలు అచ్చేశారు. ఆరోపణ: కరువు విజృంభిస్తున్నా ఉపశమన చర్యలేవీ వాస్తవం: ఒకే సీజన్లో నాలుగు సార్లు సబ్సిడీపై విత్తనాలు అందించారు. బెట్ట పరిస్థితులు నెలకొన్న సమయంలో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలకు అనుగుణంగా ఆర్బీకేల ద్వారా 80 శాతం సబ్సిడీపై విత్తనాలను సరఫరా చేశారు. 2023లో జూలై– ఆగస్ట్ నెలల్లో కురిసిన అధిక వర్షాలకు వరి నారుమళ్ళు దెబ్బతిని నష్టపోయిన రైతులు మరలా విత్తుకునేందుకు 1479 క్వింటాళ్ళ స్వల్పకాలిక వరి రకాలు అందించారు. బెట్ట పరిస్థితుల వల్ల ఖరీఫ్ 2023లో పంటలు దెబ్బతిన్న రైతులకు 30వేల క్వింటాళ్ల ఉలవలు, అలసంద, మినుము, పెసర, కంది, రాగి, జొన్న, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు విత్తనాలను రూ.26.02 కోట్ల సబ్సిడీతో 1.14 లక్షల మందికి ఇచ్చారు. 2023 డిసెంబర్లో మిచాంగ్ తుపాను వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు 49,758 క్వింటాళ్ల శనగ, వేరుశనగ, మినుములు, పెసర, నువ్వులు, రాగి, తక్కువ పంట కాల వరి రకాలను రూ. 31.06 కోట్ల సబ్సిడీతో 71415 మందికి పంపిణీ చేశారు. మిచాంగ్ తుపాన్ వేళ రంగుమారిన, తడిసిన 6.79లక్షల టన్నుల ధాన్యాన్ని 1.11లక్షల మంది రైతుల నుంచి కొనుగోలు చేసి వారికి జీఎల్టీతో సహా రూ.1483.61 కోట్లు జమ చేశారు. ఆరోపణ: కరువు, తుపాన్ వేళ సాయమేది? వాస్తవం: కరువు, మిచాంగ్, అకాల వర్షాల వల్ల అందించిన సాయానికి అదనంగా 2023–24 సీజన్లో వైఎస్సార్ రైతు భరోసా కింద రూ.7226.08 కోట్ల పెట్టుబడి సాయంతో పాటు వైఎస్సార్ ఉచిత పంటల బీమా పధకం ద్వారా రూ.1117.21కోట్లు, వై.ఎస్.ఆర్. సున్నావడ్డీ పంట రుణాల పథకం ద్వారా రూ.215.98 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేసింది అంతేకాకుండా ఈ సీజన్లో ఇప్పటి వరకు రూ.326.14 కోట్ల ఖర్చుతో ఆర్బీకేల ద్వారా రైతులకు అందించారు. ఇవేమీ ఈనాడుకు కని్పంచకపోవడం విడ్డూరంగా ఉంది. ఆరోపణ: సాయంపై సర్కార్ మీనమేషాలు వాస్తవం: ఖరీఫ్ 2023 పంటకాలంలో మే–ఆగస్ట్ మధ్య కురిసిన వర్షాలు, వరదల వల్ల 12,198.62 ఎకరాల్లో దెబ్బతిన్న అరటి, కూరగాయలు, బొప్పాయి, తమలపాకు, మామిడి తదితర ఉద్యాన పంటల రైతులు 11,373 మందికి పెట్టుబడి రాయితీగా రూ.11 కోట్లు అందించారు. 2023 మార్చి–మే మధ్య కురిసిన అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న మొక్కొజొన్న, జొన్న పంటలకు సంబంధించి 1892 మంది రైతులకు క్వింటాలుకు రూ. 500 చొప్పున రూ.5 కోట్ల ప్రత్యేక పెట్టుబడి రాయితీ ఇచ్చారు. 2023లో కరువు వల్ల నష్టపోయిన 6.96 లక్షల మంది రైతులకు రూ.847.23 కోట్లు, మిచాంగ్ తుపాన్ వల్ల నష్టపోయిన 4.61 లక్షల మంది రైతులకు రూ.442.36 కోట్లు పెట్టుబడి రాయితీని రైతుల ఖాతాలకు ఇటీవలే విడుదల చేశారు. దీనికోసం జీవో ఎంఎస్ నెం.5 జారీ చేశారు. ఈ జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శించారు. తమ పేరు లేదని కానీ, ఇన్పుట్ సబ్సిడీ రాలేదని ఒక్కరంటే ఒక్క రైతూ ఫిర్యాదు చేసిన దాఖలాలు లేవు. అదే ఈనాడుకు కంటగింపుగా ఉంది. గతంలో ఎన్నడూ లేనంత దుర్భిక్షం చంద్రబాబు పాలనలో ఏటా సగటున 324 మండలాల్లో కరువు తాండవించేది. కరువు మండలాలను సీజన్‌కు అనుగుణంగా ప్రకటించిన దాఖలాలు లేవు. 2014 ఖరీఫ్ కరువు మండలాలను 2015 నవంబర్‌లో, 2015వి 2016 నవంబర్‌లో, 2016వి 2017 జూన్‌లోనూ, 2017వి 2018 ఆగష్టులోనూ ప్రకటించారు. 2018 ఖరీఫ్, 2018–19 రబీ సీజన్లలో ఏర్పడిన కరువు మండలాలను అసలు ప్రకటించనే లేదు. తన ఐదేళ్ల పాలనలో 24,79,985 మంది రైతులకు చెల్లించాల్సిన రూ.2558 కోట్లు ఎగ్గొట్టిన ఘనత చంద్రబాబుదే. -
అభివృద్ధికి నిదర్శనం.. పులివెందుల పట్టణం..!
సాక్షి, పులివెందుల: అభివృద్ధికి నిలువెత్తు నిదర్శనంగా తీర్చిదిద్దిన పులివెందుల పట్టణం రాష్ట్రానికే ఆదర్శనీయం.. అని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సొంత గడ్డపై జనం ముందు సగర్వంగా పేర్కొన్నారు. ఒక్క రోజు వైఎస్సార్ జిల్లా పర్యటనలో భాగంగా వచ్చిన సీఎం జగన్.. సోమవారం పులివెందుల పట్టణ, నియోజకవర్గ పరిధిలో రూ. 861.84 కోట్లతో అభివృద్ధి చేసిన పలు నిర్మాణాలకు ప్రారంభోత్సవం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేసిన పలు నిర్మాణాల వివరాలు.. ► రూ. 500 కోట్ల నాబార్డ్, ఆర్.ఐ.డి.ఎఫ్-37 నిధులు వెచ్చించి.. అధునాతన వసతులతో నూతనంగా నిర్మనించిన డా. వైఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కళాశాల, గవర్నమెంట్ జెనరల్ హాస్పిటల్ (జిజిహెచ్) భవనాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. ఇందులో ప్రతి ఏడాది 150 మంది వైద్య విద్యార్థుల అడ్మిషన్ తో మొత్తం 750 మంది విద్యార్థులు, 627 పడకల కేపాసిటీతో టీచింగ్ హాస్పిటల్, మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల, బాయ్స్, గర్ల్స్ హాస్టల్ భవనాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెడికల్ కళాశాల ప్రాంగణంలో ప్రధానంగా ఓపిడి బ్లాక్, ఐపీడి బ్లాక్, 24/7 అక్యూట్ కేర్ బ్లాక్ భవనాలు ఉన్నాయి. ► పులివెందుల మైన్స్ సమీపంలో బనానా ప్రాసెసింగ్ యూనిట్ వద్ద.. రూ. 20.15 కోట్ల (రాష్ట్ర ప్రభుత్వం, పాడా నిధులతో) వ్యయంతో జిల్లాకే తలమానికంగా, అత్యాధునిక సాంకేతిక, సదుపాయాలతో 5 ఎకరాల్లో నూతనంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ బనానా ప్యాక్ హౌస్ (పులివెందుల మార్కెట్ కమిటీ) భవనాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఇందులో 600 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యమున్న నాలుగు (4×150) కోల్డ్ రూములు, 126 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఆరు (6×21) ప్రీ కూలింగ్ ఛాంబర్లు, లేబర్ క్వార్టర్స్, మిషనరీ రూమ్స్, 60 మెట్రిక్ టన్నుల వేయింగ్ బ్రిడ్జితో పాటు.. బనానా, స్వీట్ లైం కు సంబంధించి వేర్వేరుగా నాలుగు గ్రేడింగ్, క్లినింగ్, ప్యాకింగ్ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ► పులివెందుల పట్టణంలో 2.79 ఎకరాల్లో రూ.38.15 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ (రూ.10కోట్లు), పాడా (రూ.28 కోట్లు) నిధులతో అత్యాధునిక హంగులతో నిర్మించిన డా.వైఎస్ఆర్ మినీ సెక్రెటేరియేట్ కాంప్లెక్స్ భవనాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఇందులో గ్రౌండ్ ఫ్లోర్ లో ఆర్డీవో, స్పందన హాల్, అగ్రికల్చర్, పే&అకౌంట్స్, సబ్ ట్రెజరీ, 3.కాన్ఫరెన్స్ హాళ్లు, రెండు టాయిలెట్ బ్లాక్స్ ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఫ్లోర్ లో పాడా ఆఫీస్, పీఆర్, ఆర్‌డబ్ల్యుఎస్ ఇంజనీరింగ్ కార్యాలయాలు, సీడీపీవో కార్యాలయం, రెండు కాన్ఫరెన్స్ హాళ్లు, రెండు టాయిలెట్ బ్లాకులు ఉన్నాయి. ► పులివెందుల పట్టణ నడిబొడ్డున రూ.70 లక్షల రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన వైఎస్ఆర్ జంక్షన్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఇందులో ప్రధానంగా సర్వాంగ సుందరంగా ఆకర్షనీయంగా ఏర్పాటు చేసిన ల్యాండ్ స్కెప్ మధ్యలో చూపరులను ఆకట్టుకునేలా డా.వైఎస్ఆర్ విగ్రహాన్ని ప్రతిష్టించడం జరిగింది. ► పులివెందుల మోడల్ టౌన్ ప్రాజెక్ట్ లో భాగంగా... రూ. 11.04 కోట్లతో (రాష్ట్ర ప్రభుత్వం+ఏపీఎస్పీడిసిఎల్ నిధులు) అభివృద్ధి చేసిన సెంట్రల్ బౌలే వార్డుకు ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేశారు. వైఎస్ఆర్ జంక్షన్ కు 500 మీటర్ల దూరంలో అభివృద్ధి చేసిన ఈ మార్గంలో.. అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్, రోడ్డుకు ఇరువైపులా 3 మీటర్ల ఫుట్ పాత్, 2.25 మీటర్ల సీటింగ్ ఏరియా, బెంచిలు, 3 మీటర్ల పార్కింగ్ ఏరియా, స్టోన్ బొల్లార్డ్స్, రోడ్డుకు ఇరువైపులా నగిషీలతో తయారైన విద్యుత్ దీపాలు, పూల కుండీల ఏర్పాటుతో.. 6 మీటర్ల బిటి క్యారేజ్ వే వంటి ప్రత్యేకతలు పులివెందుల పట్టణ సరికొత్త జీవనశైలికి నాంది కానున్నాయి. ► పులివెందుల మోడల్ టౌన్ ప్రాజెక్టులో భాగంగా.. రూ. 20.69 కోట్లతో అధునాతన వసతులతో 4595 చదరపు మీటర్లలో అధునాతన వసతులతో నిర్మించిన వైఎస్ జయమ్మ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ భావన సముదాయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఇందులో గ్రౌండ్ ఫ్లోర్ లో 58 షాపులు, మొదటి ఫ్లోర్ లో 32 షాపులతో పాటు.. టాయిలెట్ బ్లాకులను ఏర్పాటు చేశారు. ► పులివెందుల మోడల్ టౌన్ ప్రాజెక్టులో భాగంగా.. పట్టణ నడిబొడ్డున రూ.80 లక్షల రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన గాంధీ జంక్షన్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సర్కిల్ లో అత్యంత సుందరంగా, జీవకళ ఉట్టి పడేలా ఆకర్షనీయంగా ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహం, చుట్టూ పూలమొక్కలతో ల్యాండ్ స్కెప్, లైటింగ్స్ పులివెందుల పట్టణానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ► పులివెందుల మోడల్ టౌన్ ప్రాజెక్టులో భాగంగా.. రూ.65.99 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ నిధులతో 100 ఎకరాల్లో ఏర్పాటు చేసిన డా. వైఎస్ఆర్ ఉలిమెల్ల లేక్ ఫ్రంట్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేశారు. ఇందులో.. ఎంట్రన్స్ ప్లాజా, ఎంట్రన్స్ వాటర్ ఫౌంటెన్, "ఐ లవ్ పులివెందుల" ఎలివేటెడ్ స్టెప్స్, ఓ.ఏ.టి. ఏరియా, బ్రిడ్జి, మ్యూజికల్ లేజర్ ఫౌంటెన్, మేజ్ గార్డెన్, కిడ్స్ ప్లే ఏరియా, కనెక్టింగ్ బ్రిడ్జి, ఐస్ ల్యాండ్ -స్టోన్ గజాబొ, గజాబొ పార్క్, పెర్గోలా, బోటింగ్ జెట్టీ, అర్బన్ ఫారెస్ట్ తదితర ప్రత్యేక సదుపాయాలు పులివెందుల పట్టణ వాసులకు ఆహ్లాదకరమైన అనుభూతిని అందివ్వనున్నాయి. ► పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా.. ప్రయివేట్ పార్ట్నర్ ఆధ్వర్యంలో.. రూ.175 కోట్ల పెట్టుబడితో 16.63 ఎకరాల్లో నిర్మించిన.. రెడీమేడ్ సూట్స్, వస్త్ర ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన, పేరెన్నికగన్న "ఆదిత్య బిర్లా యూనిట్" ను రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారభించారు. ఈ పరిశ్రమ స్థాపనతో 2100 మందికి ఉద్యోగావకాశాలు అందనున్నాయి. ఇప్పటికే 500 మంది ఉద్యోగాలను కూడా పొందారు. ► ఇడుపులపాయ ఎస్టేట్ లో రూ.39.13 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ, పాడా నిధులతో 16 ఎకరాల్లో నిర్మించిన డా. వైఎస్ఆర్ మెమోరియల్ పార్క్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఇప్పటికే పరిసర అందాలు, నెమళ్ల పార్కు, పచ్చదనంతో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఇడుపులపాయ ఎస్టేట్.. నూతనంగా ఏర్పాటు చేసిన డా. వైఎస్ఆర్ మెమోరియల్ పార్క్ తో మరింత పర్యాటక శోభను సంతరించుకుంది. ఇందులో 48 అడుగుల వైఎస్ఆర్ విగ్రహం, ఆడియో విజువల్ బ్లాక్, ఫోటో గ్యాలరీ, ఎంట్రన్స్ బ్లాక్, పెవిలియన్ బ్లాక్ లతో పాటు.. చిల్డ్రన్ పార్క్, డిపేక్షన్స్, ట్రాపికల్ గార్డెన్ లోటస్ పాండ్, స్టెప్పుడ్ గార్డెన్, ఫ్లోరల్ పార్క్, స్టోన్ గాజేబోస్, పాదయాత్రకు సంబందించిన 21 విగ్రహాల సమూహం, 3 టాయిలెట్ బ్లాకులు పర్యాటకులకు సంతృప్తి స్థాయిలో ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని అందివ్వనున్నాయి. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. "ఈ రోజు తన సొంత గడ్డపై ముఖ్యమంత్రిగా మీ అందరిముందు నిలుచున్నానంటే.. మీ అందరి అభిమానం, ఆశీస్సులు, దీవెనలే" అన్నారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి.. పులివెందులలో ఎన్నో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం జరుగుతోందన్నారు. పులివెందుల నియోజకవర్గ అభివృద్ధి అనేది అనంతం అని.. కాలానుగుణంగా అభివృద్ధి కొనసాగుతూనే ఉంటుందన్నారు. సొంతగడ్డపై మమకారం ఎప్పటికీ తీరిపోయేది కాదన్నారు. ముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమాలన్నింటిలోను.. జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు పాల్గొనగా.. జిల్లా ఎస్పి సిద్దార్థ్ కౌశల్, జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్, కడప నగర కమీషనర్ ప్రవీణ్ చంద్, అసిస్టెంట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ఆర్డీవోలు అన్ని కార్యక్రమాలను ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రత్యేక పర్యవేక్షణ చేశారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా, జిల్లా ఇంచార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ అవినాష్ రెడ్డి లతో పాటు.. వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ ఎం. టి.కృష్ణబాబు, పాడ ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డి, పలువురు రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు, స్థానిక నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు. -
తిరుమల: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు
సాక్షి, తిరుమల: టీటీడీ ఉద్యోగులకు మరో తీపి కబురు తెలిపారు పాలకమండలి చైర్మన్ కరుణాకర్ రెడ్డి. నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన కాంట్రాక్ట్ ఉద్యోగులతో సహా బోర్డు తీర్మానం ద్వారా ఎంపికైన వారిని కూడా రెగ్యూలైజ్ చేయాలని నిర్ణయించారు. 2014 ఏడాదిని కట్ ఆఫ్ ఇయర్‌గా పరిగణనలోకి తీసుకొని టీటీడీ పరిధిలో ఉన్న ఉద్యోగులకు కూడా జీఓ వర్తించేలా చేయాలని ప్రభుత్వాన్ని కోరేందుకు తీర్మానం చేశారు. ఈ నిర్ణయం ద్వారా వేలాదిమంది ఉద్యోగుల మేలు జరుగుతుందని పేర్కొన్నారు. టీటీడీ పాలకమండలి సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం నిర్ణయాలను టీటీడీ పాలకమండలి చైర్మన్ కరుణాకర్ రెడ్డి మీడియా ముందు ప్రకటించారు. స్విమ్స్ ఆసుపత్రిలో మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 479 నర్సు పోస్టుల భర్తీకి పాలకమండలి ఆమోదం తెలిపింది. టీటీడీ విద్యాసంస్థల్లో ఎలాంటి సిఫార్సు లేకుండా హాస్టల్ వసతి కల్పించేలా ఏర్పాట్లకు, నూతన హాస్టల్ భవన నిర్మాణాలకు ఆమోదం తెలిపింది. చదవండి: మాటలు కావవి.. ప్రతిపక్షాలకు గుచ్చే బాణాలు రూ. 1.88 కోట్లతో పీఏసీ అభివృద్ధి పనులకు నిధులు కేటాయింపు, యాత్రికుల వసతి సముదాయాలలో లిప్ట్ ఏర్పాటు చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. తిరుమల చుట్టూ రూ. 1.50 కోట్లతో మిగిలిన ఔటర్ ఫెన్సింగ్ ఏర్పాటకు ఆమోదం తెలిపారు. రూ. 14 కోట్లతో ఉద్యోగస్తుల వసతి సముదాయాల అభివృద్ధికి ఆమోదం తెలిపింది. తిరుపతి గోవింద రాజస్వామి ఆలయంలోని భాస్యకారుల సన్నిధిలోని మకర తోరణానికి, పార్థ సారథి స్వామి, కళ్యాణ వెంకటేశ్వర స్వామి బంగారు అభరణాల బంగారు పూతకు ఆమోదించారు. టీటీడీ ఐటీ సేవల కోసం టెక్ రీప్లేస్ మెంట్ కోసం ఐదేళ్ల పాటు నిర్వహణ కోసం రూ. 12 కోట్లు నిధులు కేటాయించారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా టీటీడీ ఆద్వర్యంలో ఉన్న ఆలయాల్లో అభివృద్ధి పనులకు చెయ్యాలని ఆమోదం తెలిపింది పాలకమండలి. ఇటీవల ఘాట్ రోడ్డులో మరణించిన శ్రీవారి ఆలయ అర్చకుడు యతిరాజు నరసింహులు కుటుంబానికి రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. తిరుమలను నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించడం కుదరదని కేంద్ర విమానాయన మంత్రిత్వశాఖ తెలిపిందని భూమన చెప్పారు. -
AP : సమాచార హక్కు కొత్త కమిషనర్ల ప్రమాణం
విజయవాడ, 11 మార్చి: రాష్ట్ర సమాచార కమీషన్‌కు నియమించబడిన ముగ్గురు నూతన కమీషనర్లు చావలి సునీల్, రెహానా బేగం, అల్లారెడ్డి ఉదయ భాస్కర్ రెడ్డిలచే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కేఎస్. జవహర్ రెడ్డి ప్రమాణం చేయించారు. ఈ మేరకు విజయవాడ సీఎస్ క్యాంపు కార్యాలయంలో నూతన సమాచార కమీషనర్లచే ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమాచార కమీషన్ ముఖ్య సమాచార కమీషనర్ మెహబూబ్ భాషా, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్, సమాచార కమీషనర్లు ఐలాపురం రాజా, శామ్యూల్ జొనాతన్, కాకర్ల చెన్నారెడ్డి, సమాచార కమీషన్ లా సెక్రటరీ జీ. శ్రీనివాసులు, ప్రభుత్వ సలహాదారు నేమాని భాస్కర్, నూతన సమాచార కమీషనర్ల కుటుంబ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రెహానా గురించి.. రెహానా స్వస్థలం కృష్ణా జిల్లా, ఉయ్యూరు. జర్నలిస్టుగా 20 ఏళ్ళ అనుభవం. జర్నలిజంలో పరిశోధనాత్మక కథనాలు, సాహసోపేత ప్రయాణాలతో ఆమె ప్రత్యేక గుర్తింపు పొందారు. హైదరాబాద్ పాతబస్తీలో మైనర్ బాలికలతో అరబ్ షేకుల కాంట్రాక్ట్ వివాహాలు, 2008 ముంబాయి మారణహోమం లైవ్ కవరేజ్, ఉత్తరాఖండ్ వరదల రిపోర్టింగ్, సర్జికల్ స్ట్రైక్స్, పుల్వామా ఉగ్రదాడి కవరేజ్ వంటివి వీటిలో కొన్ని.. దక్షిణాన తమిళనాడు మొదలు ఉత్తరాన జమ్ము-కాశ్మీర్, పశ్చిమాన గుజరాత్ మొదలు తూర్పున త్రిపుర వరకు 17 రాష్ట్రల నుంచి వివిధ అంశాలపై రిపోర్ట్ చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా రెండోసారి గెలిచినప్పుడు నరేంద్ర మోదీతో సహా వివిధ రాష్ట్రాలకు చెందిన 10 మంది ముఖ్యమంత్రుల ఇంటర్వ్యూలు రెహానా ఖాతాలో ఉన్నాయి. భారత భూభాగంలో భారత-పాక్, భారత-బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి ప్రయాణం చేసి ప్రత్యేక కథనాలు అందించారు. గత ఏడాది టర్కీలో జరిగిన భూకంప ప్రళయాన్ని సాహసోపేతంగా కవర్ చేశారు రెహాన. రెహానా రాసిన పుస్తకాలు అంతర్జాతీయ సరిహద్దుల్లో చేసిన పాత్రికేయ ప్రయాణ అనుభవాలతో "సరిహద్దుల్లో.." పేరుతో పుస్తకం తెచ్చారు. ఈ పుస్తకం "ఫ్రాంటియర్" పేరుతో ఇంగ్లీషులో అనువాదం అయ్యింది. జాతీయ, అంతర్జాతీయ అంశాలపై రాసిన వ్యాసాల సంకలనాన్ని "పెన్ డ్రైవ్" పేరుతో వెలువరించారు. టర్కీ భూకంప కవరేజ్ అనుభవాలతో టర్కీ @7.8 టైటిల్ తో పుస్తకం తెచ్చారు. అవార్డులు-రివార్డులు.. తెలంగాణ ప్రభుత్వ బెస్ట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అవార్డు, తెలంగాణా ప్రెస్ అకాడమీ అరుణ్ సాగర్ ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు, వివిధ సంస్థల పురస్కారాలు, అవార్డులు ఆమె ఖాతాలో ఉన్నాయి. గత ఏడాది మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఉత్తమ మహిళా జర్నలిస్టు పురస్కారంతో సత్కరించింది. ఏపీ మీడియా అకాడమీ కూడా బెస్ట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా పురస్కారం అందజేసింది. నిర్వర్తించిన ఇతర బాధ్యతలు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మీడియా అడ్వైజరీ కమిటీ సభ్యురాలు, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్, జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ జాయింట్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఏపీ అసెంబ్లీ మీడియా అడ్వైజరీ సభ్యురాలిగా, ఏపీ మీడియా అక్రిడేషన్ కమిటీ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇవి చదవండి: మనబడి ‘ఐబీ’కి అనుకూలం! -
మనబడి ‘ఐబీ’కి అనుకూలం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధన, బహు భాషలు మాట్లాడే విద్యార్థులు, చదువులో తమ అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు తొట్రుపాటు లేకుండా ఆత్మవిశ్వాసంతో ఉపాధ్యాయులను ప్రశ్నించే తీరు.. ఎదుటివారితో మర్యాదగా మాట్లాడేతత్వం, పిల్లల్లో సహకార గుణం, క్లాస్‌రూమ్‌లో విద్యార్థులు –టీచర్ల మధ్యనున్న అన్యోన్యత తదితర అంశాలు అంతర్జాతీయ విద్యావేత్తలను ఆశ్చర్యపరిచాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2025 జూన్ మొదలు ఐబీ సిలబస్‌ను ఒకటో తరగతి నుంచి ప్రభుత్వం అమలుచేయనున్న నేపథ్యంలో.. ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ) ప్రతినిధులు ఫిబ్రవరి 26 నుంచి ఈనెల ఏడో తేదీ వరకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా.. ఇప్పటికే రాష్ట్రంలో అమలుచేస్తున్న ఏపీ విద్యా సంస్కరణలు, విద్యార్థుల్లో నేర్చుకునే తత్వం వారిని ఆశ్చర్యపరిచాయి. తాము పరిశీలించిన పాఠశాలల్లో చక్కటి వాతావరణం, మెరుగైన మౌలిక వసతులు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, పాఠశాల పరిశుభ్రతపై కేంద్రీకృత పరిశీలన, పాఠశాలల పనితీరు.. సమీక్షలో రోజువారి యాప్స్ వినియోగం, కేంద్రీకృత మానిటరింగ్ సిస్టం, టోఫెల్ శిక్షణ, కంటెంట్ అనుసంధానం, అటల్ టింకరింగ్ ల్యాబ్స్, గ్రంథాలయాల వినియోగం, మెరుగైన అసెస్మెంట్, యూనిఫారం, ద్విభాషా పాఠ్యపుస్తకాలు, పోషకాలతో కూడిన నాణ్యమైన మధ్యాహ్న భోజనం, టాయిలెట్ల నిర్వహణపై ఆ ప్రతినిధులు ప్రభుత్వాన్ని, విద్యాశాఖను అభినందించారు. విద్యార్థుల్లో నేర్చుకునే తత్వంపై అభినందన.. ఇంటర్నేషనల్ బాకలారియెట్ సిలబస్ అమలుచేసే స్కూళ్లల్లో విద్యార్థుల వ్యక్తిగత ప్రొఫైల్‌కు అధిక ప్రాధాన్యతనిస్తారు. బహు భాషలు, విద్యేతర అంశాలపై దృష్టిపెడతారు. వివిధ రకాల భాషలు మాట్లాడే పిల్లలు ఒకేచోట కలిసి ఉన్నప్పుడు ఒకరికొకరు సహకరించుకునే గుణం తప్పనిసరిగా ఉండేలా చూస్తారు. ఇలాంటి వాతావరణాన్ని ఏపీ ప్రభుత్వ స్కూళ్లల్లో గుర్తించినట్లు వారు తెలిపారు. తెలుగు, ఉర్దూ, తమిళం, కన్నడ, ఒరియాతో పాటు సవర, కొండ, కోయ, సుగాలి, ఆదివాసి, కువి వంటి గిరిజన భాషలు మాట్లాడే పిల్లలు కలిసి ఉన్నప్పుడు వారివారి భాషలను గౌరవించుకోవడం, ఇతర భాషలను నేర్చుకునేందుకు ఆసక్తి చూపడాన్ని ఐబీ ప్రతినిధులు గమనించి అభినందించారు. తరగతి గదులలో బహుభాషావాదం, ఉపాధ్యాయ–విద్యార్థి సంబంధం, విద్యార్థుల మధ్య ఆత్మవిశ్వాసం, పాఠశాల విద్యా వ్యవస్థపై సమాచారాన్ని పంచుకోవడంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇతరులు ఆసక్తి చూపిన తీరు ఐబీ విద్యా విధానానికి దగ్గరగా ఉన్నట్లు ఆ ప్రతినిధులు తెలిపారు. ఇక ఐబీ అమలు విషయంలో ఏపీ పాఠశాల విద్యాశాఖకు అవసరమైన మౌలిక సదుపాయాలున్నాయని, ఉపాధ్యాయులకూ తగిన అర్హతలు ఉన్నాయన్నారు. ఇక్కడి విద్యార్థులు ప్రపంచ పోకడలను అర్థంచేసుకునేందుకు, అవకాశాలను అందుకునేందుకు ఐబీ పాఠ్యాంశాలను సులభంగా అనుసరించగలరన్న నమ్మకాన్ని వారు వ్యక్తంచేశారు. మరోవైపు.. ఐబీ బృందం పర్యటనకు సంబంధించిన పూర్తి నివేదికను జూన్‌లో ప్రభుత్వానికి అందజేయనుంది. నివేదిక ఆధారంగా ఉపాధ్యాయులకు, విద్యాశాఖ సిబ్బంది శిక్షణనివ్వాలని అధికారులు నిర్ణయించారు. -
సోషల్ మీడియాలో ‘సిద్ధం’ సంచలనం
సాక్షి, అమరావతి: బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద ఆదివారం సీఎం జగన్ నిర్వహించిన ‘సిద్ధం’ సభ సామాజిక మాధ్యమాలను ఊపేసింది. ఎక్స్ (ట్విట్టర్)లో వైఎస్ జగన్ ఎగైన్, వైనాట్ 175, సిద్ధం హ్యాష్ ట్యాగ్లు ట్రెండింగ్‌లో దేశంలో అగ్రస్థానంలో నిలిచాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తదితర సామాజిక మాధ్యమాల్లో సిద్ధం సభ వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ అభిమానులు భారీగా పోస్టులు చేశారు. జన సముద్రాన్ని తలపించిన సభా ప్రాంగణం.. సీఎం జగన్ ర్యాంప్‌పై నడుస్తున్న ఫొటోలు.. ప్రసంగిస్తుండగా జనం నీరాజనాలు పలుకుతున్న ఫొటోలతో ఎక్స్,Cలు నిండిపోయాయి. సాధారణంగా ఎక్స్‌లో పోస్టులు చేయడం, వాటిపై స్పందించడానికే అధిక ప్రాధాన్యం ఇస్తారు. ప్రత్యక్ష ప్రసారాలను తక్కువగా చూస్తారు. ‘సిద్ధం’ సభలో సీఎం జగన్ ప్రసంగాన్ని ‘ఎక్స్’లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా 11 వేల మంది వీక్షించడం సంచలనం రేపింది. అదే సమయంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ నిర్వహించిన సభను ఎక్స్ ద్వారా 2,400 మంది ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించగా, టీఎంసీ లోక్‌సభ అభ్యర్థులను పరిచయం చేస్తూ పశ్చిమ బంగా సీఎం మమతా బెనర్జీ నిర్వహించిన సభను 1,200 మంది తిలకించారు. లైవ్ సభల్లో టాప్.. ‘ఎక్స్’ చరిత్రలో అత్యధిక మంది ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించిన రాజకీయ సభల్లో సీఎం జగన్ మేదరమెట్ల సభ అగ్రస్థానంలో ఉందని నెటిజన్లు స్పష్టం చేస్తున్నారు. మరో సామాజిక మాధ్యమం యూట్యూబ్‌లో సాక్షి టీవీ ద్వారా మేదరమెట్ల సభను 56 వేల మంది ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. ఇదే రీతిలో యూట్యూబ్‌లో ఎన్టీవీ, టీవీ 9 లాంటి ఛానళ్లలో భారీ ఎత్తున సిద్ధం సభను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. ఇటు సామాజిక మాధ్యమాలు.. అటు వివిధ టీవీ ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా లక్షలాది మంది ‘సిద్ధం’ సభను తిలకించారు. సీఎం జగన్‌పై వివిధ వర్గాల ప్రజల్లో ఉన్న ఆదరణ, విశ్వసనీయతకు నిదర్శనంగా ఈ సభ నిలిచిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మనవడి కోసం వచ్చాను మేదరమెట్ల వద్ద ఆదివారం నిర్వహించిన సిద్ధం సభలో సీఎం వైఎస్ జగన్ పాల్గొంటారని తెలుసుకున్న 70 ఏళ్లు పైబడిన ఓ వృద్ధురాలు ఉదయం 7గంటలకే సభా ప్రాంగణానికి చేరుకుంది. ఉదయాన్నే సభావేదిక వద్ద వృద్ధురాలు కలియతిరగడం చూసిన వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇప్పుడే ‘ఎందుకు వచ్చావ్ అవ్వా’ అని అడిగిన వారందరికీ ‘మా ఆలన పాలన చూస్తున్న నా మనవడిని చూసిపోయేందుకు వచ్చా’నని బదులిచ్చింది. సభా ప్రాంగణంలో ఉన్న ఈ వృద్ధురాలి ఫొటో సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతోంది. – అద్దంకి వేదిక వద్ద ప్రైవేట్ డ్రోన్ ‘సిద్ధం’ సభా వేదిక వద్ద కుడి వైపు ఓ ప్రైవేట్ డ్రోన్ ఎగరటాన్ని గుర్తించిన మంత్రి అంబటి రాంబాబు దాన్ని స్వాధీనం చేసుకోవాలని పోలీసులకు సూచించారు. అనుమతి లేకుండా ఇక్కడ డ్రోన్ ఎలా ఎగరవేస్తున్నారు? ఎవరు ఆపరేట్ చేస్తున్నారు? అని ప్రశ్నించారు. నారా లోకేష్ ఇలా దొంగచాటుగా డ్రోన్లను పంపడం కాకుండా ధైర్యముంటే నేరుగా రావాలని నరసరావుపేట పార్లమెంట్ వైఎస్సార్సీపీ సమన్వయకర్త అనిల్ కుమార్ యాదవ్ సవాల్ చేశారు. -
ఆరోగ్యశ్రీతో క్యాన్సర్‌ను జయించా
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. ఆరోగ్యశ్రీతో క్యాన్సర్‌ను జయించా మాది పేద కుటుంబం. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని కలివరపుపేటలో ఉంటున్నాం. రెక్కాడితే గాని పూట గడవని పరిస్థితి. ఇద్దరు పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడే నా భర్త మృతి చెందారు. కాయ కష్టం చేసి పిల్లలను పెంచాను. అమ్మయికి వివాహం చేశాను. కుమారుడు చేతికందొచ్చి కూలి పనులకు వెళుతున్నాడు. ఇక హాయిగా జీవనం సాగించవచ్చని అనుకుంటున్న పరిస్థితుల్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. వైద్యులను సంప్రదిస్తే లక్షల్లో ఖర్చవుతుందని అన్నారు. పూట గడవడమే కష్టంగా ఉన్న మాకు అంత డబ్బు సమకూర్చలేక చతికల పడ్డాం. ప్రాణాల మీద ఆశలు వదులుకున్నా. ఇంతలో మా వీధి వలంటీరు వచ్చి క్యాన్సర్ చికిత్సను కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చారని చల్లని కబురు చెప్పారు. వెంటనే వైద్యులను సంప్రదిస్తే విశాఖ నగరంలోని మహాత్మా గాంధీ ఆసుపత్రికి రిఫర్‌చేశారు. అక్కడ ఉచితంగా అన్ని తనిఖీలు చేసి కీమోథెరఫీ చేశారు. ఆరు నెలల క్రితం ఆపరేషన్ చేశారు. ఇప్పుడు ప్రతి నెలా ఇంజక్షన్లు ఇస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్నాను. నా కోసం ప్రభుత్వం లక్షల రూపాయలు వెచ్చించి ఆరోగ్యశ్రీ లో వైద్యం అందించింది. నేను ఇప్పుడు ఇలా ప్రాణాలతో ఉన్నానంటే దీనికి కారణం జగనన్న పుణ్యమే. జీవితాంతం ఆయన మేలు మరిచి పోలేను. ఇల్లు కూడా మంజూరు చేశారు. నాకు వితంతు పింఛన్ కూడా వస్తోంది. హాయిగా జీవిస్తున్నాము. – వైశ్యరాజు శాంత లక్ష్మి, కలివరపుపేట, నరసన్నపేట (మామిడి రవి, విలేకరి, నరసన్నపేట) మా బతుకుల్లో ఎంతో మార్పు నా పేరు గుడివాడ వెంకటరత్నం. మాది విజయనగరం. ఉపాధి నిమిత్తం పది సంవత్సరాల క్రితం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు వలస వచ్చాం. నా భర్త గౌరినాయుడు మేస్త్రీగా పనిచేస్తున్నాడు. చంద్రబాబు ప్రభుత్వంలో మాకు ఏ లబ్ధీ రాలేదు. సీఎం జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక ఇంటి స్థలం వచ్చింది. రిజి్రస్టేషన్ చేసి పట్టా నాకు అందజేశారు. వైఎస్సార్ ఆసరాలో రుణమాఫీ కింద రూ.15 వేలు చొప్పున లబ్ధి పొందాను. నాకు త్రివేణి, నవీన్ ఇద్దరు సంతానం. కూతురు త్రివేణి ఎంఎంకేఎన్ మున్సిపల్ హైస్కూల్లో నాలుగో తరగతి చదువుతోంది. అమ్మఒడి పథకం కింద ఏటా రూ.15 వేలు వస్తోంది. మా అత్త రమణమ్మ వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా పథకాల ద్వారా లబ్ధి పొందింది. మా లాంటి పేదలకు నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, దుస్తులు, బూట్లు కొనాలంటే భారమే. పాఠశాలలు తెరవగానే విద్యాకానుక కిట్టులో ఇవన్నీ అందజేస్తున్నారు. దీంతో మాకు భారం తగ్గింది. పాఠశాలల్లో గోరుముద్ద పథకం కింద పిల్లలకు మధ్యాహ్న భోజనం ఎంతో రుచికరంగా అందిస్తున్నారు. ఈ ప్రభుత్వ పాలనలో హాయిగా జీవిస్తున్నాం. మళ్లీ సీఎంగా జగనే రావాలని కోరుకుంటున్నాం. – గుడివాడ వెంకటరత్నం, లక్ష్మినగర్, పాలకొల్లు పట్టణం (కె శాంతారావు, విలేకరి, పాలకొల్లు అర్బన్) మా ఇంట్లో ఇద్దరికి దివ్యాంగ పింఛన్లు ఒకప్పుడు సాధారణంగా బతికిన ఉమ్మడి కుటుంబం మాది. చాలా కాలం కిందటే విడిపోయి ఎవరి బతుకు వారు బతుకుతున్నాం. కాలక్రమేణా ఉన్న కొద్ది ఆస్తి కరిగిపోయింది. మాది డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట. ప్రస్తుతం భర్త, కుమారునితో కలిసి జీవనం సాగిస్తున్నాం. భర్త పళ్లంరాజు, కుమారుడు సాయిరామ్ పుట్టుకతోనే దివ్యాంగులు. వారు ఏ పనీ చేయలేరు. వారి ఆలనా పాలనా అన్నీ నేనే చూసుకోవాలి. ఈ పరిస్థితుల్లో ఉన్న మా కుటుంబానికి నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా పింఛన్ మంజూరు చేయగా నేడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం దివ్యాంగ పింఛన్‌ను రూ.3 వేలకు పెంచి ఇవ్వడంతో ఇబ్బంది లేకుండా జీవనం సాగిస్తున్నాం. భర్త, కుమారుడికి ఒక్కొక్కరికి రూ.3 వేల చొప్పున ఇద్దరికీ రూ.6 వేలు వికలాంగ పింఛన్ ప్రతి నెలా వస్తోంది. నేను చిన్నచిన్న పనులు చేసుకుంటుండడంతో ఇంటి భత్యం గడిచిపోతోంది. ఉన్న కొద్దిపాటి ఇంటి స్థలంలో చిన్న ఇల్లు కట్టుకొని జీవిస్తున్నాం. – బచ్చు మంగతాయారు, కొత్తపేట (జగత శ్రీరామచంద్రమూర్తి,విలేకరి, కొత్తపేట) -
రూ.266 కోట్లతో కడప విమానాశ్రయం అభివృద్ధి
కడప కోటిరెడ్డిసర్కిల్/కడప కార్పొరేషన్: వైఎస్సార్ జిల్లా కేంద్రం కడపలోని విమానాశ్రయంలో రూ.266 కోట్లతో నిర్మించనున్న నూతన టెర్మినల్ భవనానికి ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఈ విమానాశ్రయం 25 లక్షల మంది ప్రయాణికుల వార్షిక సామర్థ్యం మేరకు ఆధునిక సొబగులద్దుకుంటోంది. ఇక్కడి రన్‌వేని 45 మీటర్ల వెడల్పున 2,515 మీటర్ల పొడవున విస్తరించనున్నారు. పనులు పూర్తయిన తరువాత ఈ విమానాశ్రయం పీక్ అవర్ సరి్వంగ్ కెపాసిటీ 1,800 మంది ప్రయాణికులుగా ఉంటుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషితో విమానాశ్రయం విస్తరణకు రూ.75 కోట్లతో స్థలం సేకరించారు. దీంతో రన్‌వే పొడిగిస్తున్న నేపథ్యంలో విమానాల నైట్ ల్యాండింగ్‌కు కూడా అవకాశం లభిస్తుంది. ఇప్పటికే ఇక్కడి నుంచి నిరంతరాయ సర్విసుల కోసం రాష్ట్ర ప్రభుత్వం వయబులిటీ గ్యాప్ ఫండింగ్ కూడా భరించింది. 2015లో ప్రారంభమైన ఈ విమానాశ్రయం నుంచి 2017లో ట్రూ జెట్ సంస్థ ఉడాన్ స్కీమ్ కింద ఆర్సీఎస్ (రీజినల్ కనెక్టివిటీ స్కీమ్) అమలు చేసింది. 2021లో ఆ సంస్థ తన విమానాలను ఉపసంహరించుకుంది. 2022 మార్చి నుంచి ఇండిగోసంస్థ విమానాలను ప్రారంభించింది. ప్రధాని వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన కార్యక్రమంలో పాల్గొన్న కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి ఎస్.బి.అంజద్‌బాషా, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ విమానాశ్రయంలో అభివృద్ధి పనులతోపాటు టెర్మినల్ నిర్మాణంతో రూపురేఖలు మారిపోయి మహర్దశ పట్టనుందని చెప్పారు. ఈ విమానాశ్రయం ఏర్పాటుకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కృషిచేయగా, ఎయిర్‌పోర్టు అభివృద్ధికి ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో కృషిచేస్తున్నారని పేర్కొన్నారు. ఎయిర్‌పోర్టు సుందరీకరణలోను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోందన్నారు. ఎయిర్‌పోర్టుకు అతి సమీపంలో అటవీప్రాంతం ఉండడంతో అటవీశాఖ అనుమతులు తీసుకుని భూసేకరణ చేసినట్లు తెలిపారు. ఎయిర్‌పోర్టు అభివృద్ధి పనులు చేపట్టిన ప్రధాని నరేంద్రమోదీకి, కేంద్ర విమానయానశాఖ మంత్రి జ్యోతిరావు సిందియాకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ విజయరామరాజు, ఎయిర్‌పోర్టు డైరెక్టర్ సుజిత్‌కుమార్ పోదార్, ›ప్రొటోకాల్ ఆఫీసర్ సురేష్‌బాబు, టెర్మినల్ మేనేజర్ జోసెఫ్ పాల్గొన్నారు. ముసుగు తొలగించారంతే: ఎంపీ అవినాశ్‌రెడ్డి అనంతరం ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎప్పటినుంచో పొత్తులో ఉన్న టీడీపీ, పవన్‌కళ్యాణ్, బీజేపీ ఇప్పుడు ముసుగు తొలగించారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు పొత్తులు కొత్తేమీ కాదని, ఎన్నికలు వచ్చాయంటే ఆయనకు పొత్తులు గుర్తొస్తాయని చెప్పారు. 2019లో టీడీపీ ఓటమి పాలుకాగానే చంద్రబాబు తన అనుచరులైన సుజనాచౌదరి, సీఎం రమేశ్‌లను బీజేపీలోకి పంపారని గుర్తుచేశారు. అప్పటి నుంచి ప్రత్యక్షంగా పొత్తులో ఉన్న టీడీపీ, వవన్‌కళ్యాణ్, బీజేపీ.. పరోక్షంగా కాంగ్రెస్, ఇతర పార్టీలతో కూడా కలిసే ఉన్నట్లు చెప్పారు. ఎంతమంది కలిసొచి్చనా, ఎల్లో మీడియా వారికి ఎంత మద్దతు ఇచ్చినా గెలిచేది వైఎస్సార్సీపీయేనని ఆయన తెలిపారు. కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ బీజేపీతో పొత్తుకోసం టీడీపీ వెంపర్లాడిందని ఎద్దేవా చేశారు. సింహం సింగిల్‌గానే వస్తుందని, జగన్ సింగిల్‌గా పోటీచేసి మళ్లీ సీఎం కావడం తథ్యమని చెప్పారు. -
వైఎస్ జగన్ పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎంతో మేలు
పి.గన్నవరం: సీఎం వైఎస్ జగన్ పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎంతో మేలు జరిగిందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి అన్నారు. ఆయన అధికారం చేపట్టిన మూడు నెలల్లోనే గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి 1.36 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారని కొనియాడారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య (ఏపీజీఈఎఫ్) వైస్ చైర్మన్ విప్పర్తి నిఖిల్ కృష్ణ ఆధ్వర్యాన ఆదివారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో మూడు రోడ్ల సెంటర్ నుంచి దుర్గమ్మ గుడి వరకూ వివిధ శాఖల ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఉద్యోగులకు అండగా నిలిచి, గ్రామ స్వరాజ్యానికి బాటలు వేసినందుకు ‘థాంక్యూ సీఎం సార్’ అంటూ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులకు ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. కరోనా వంటి కష్టకాలంలో ఆర్థిక శాఖ అధికారులు వద్దన్నా కొత్త పీఆర్సీ ప్రకారం పే స్కేల్ అమలు చేశారన్నారు. అధికారంలోకి వచి్చన మూడు నెలల్లోనే 50 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను సీఎం జగన్ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారన్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంతోపాటు రాష్ట్రాభివృద్ధికి పాటు పడుతున్న ప్రభుత్వంపై ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తోందని వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రజలకు వాస్తవాలు చెప్పడానికి ‘మన ప్రభుత్వం – మన ప్రగతి’ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. -
కడప ఎయిర్‌పోర్టు కొత్త టెర్మినల్‌కు ప్రధాని మోదీ శంకుస్థాపన
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కడప ఎయిర్‌పోర్టు కొత్త టెర్మినల్‌కు ప్రధాని మోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. రూ.265 కోట్ల రూపాయల వ్యయంతో నూతన టర్మీనల్ భవన నిర్మాణం చేపట్టారు. ఢిల్లీ నుండి వర్చువల్ విధానంలో ప్రధాని పాల్గొన్నారు. కడప నుంచి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ, కడప ప్రజల కల నెరవేరుతున్న వేళ సంతోషంగా ఉందన్నారు. కడప విమానాశ్రయ అభివృద్ధి కోసం దివంగత మహానేత వైఎస్సార్ చేసిన కృషి అందరికి తెలిసిందే.. రూ. 75 కోట్ల రూపాయలతో స్థల సేకరణ పూర్తి చేశామని తెలిపారు. ఉడాన్ పథకం ద్వారా హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, వైజాగ్, చెన్నైకు తక్కువ ధరకు విమాన సర్వీసులు నడపడం జరిగిందన్నారు. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో నైట్ ల్యాండింగ్, రన్ వే పొడిగింపు, పెద్ద విమానాలు ల్యాండ్ అయ్యేలా చర్యలు తీసుకున్నామన్నారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరావు సిందియా, ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇదీ చదవండి: స్నేహం కాదు, దాసోహం! -
అరకు కాఫీ ఘుమఘుమలు.. ఐరాస ప్రశంసలు
సాక్షి, విశాఖపట్నం: అరకు కాఫీ ఘుమఘుమలు మరోసారి అంతర్జాతీయంగా ఖ్యాతికెక్కింది. ఐక్యరాజ్యసమితిలో ప్రశంసలు అందుకుంది. ఏపీలోనీ అరకు లోయలో మహిళలు పండిస్తున్న కాఫీలో చక్కటి పరిమళం ఉందని ఐరాస ప్రతినిధులు ప్రశంసలు కురిపించారు. కాఫీ సాగు ద్వారా ఆర్థిక సామాజిక విప్లవాన్ని తీసుకురావడంలో అరకు మహిళల కీలక పాత్ర ఉందని, అరకు మహిళలు భారత నారీశక్తికి చిహ్నాలని ఐకాస ప్రతినిధులు అన్నారు. ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ సందర్భంగా ఐరాసలో భారత శాశ్వత మిషన్ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. మహిళల సారథ్యంలో ప్రగతి సాధనపై భారత నిబద్ధత ప్రపంచ దేశాలకు స్ఫూర్తిదాయకమని ఐరాస జనరల్ అసెంబ్లీ 78వ సభ అధ్యక్షుడు డెన్నిస్ ఫ్రాన్సిస్ అన్నారు. ఈ ఏడాది జనవరిలో తాను భారత్‌లో పర్యటించినపుడు అక్కడి ‘నారీశక్తి’ పరివర్తన ఫలాలను ప్రత్యక్షంగా చూసినట్లు వివరించారు. సుస్థిర వ్యవసాయ పద్ధతులను భారత మహిళలకు అనుసంధానం చేసిన విధానం గొప్పగా ఉందని ఐరాస డిప్యూటీ సెక్రటరీ జనరల్ అమీనా మొహమ్మద్ అన్నారు. -
Bapatla: జైత్ర యాత్రకు సిద్ధం
సాక్షి ప్రతినిధి, గుంటూరు, సాక్షి, నరసరావుపేట: సిద్ధం... ఈ మాట వింటేనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సమరోత్సాహంతో ఎన్నికల యుద్ధానికి కదం తొక్కుతున్నారు.. మరోవైపు ఈ సభలకు వస్తున్న ప్రతిస్పందన చూసి ప్రతిపక్ష నేతలు మాత్రం ఓటమి భయంతో వణికిపోతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సిద్ధం పేరిట ఇప్పటికే మూడు సభలు నిర్వహించి గడచిన నాలుగేళ్ల పది నెలల కాలంలో ప్రజలకు చేసిన మేలును వివరించడంతో పాటు ప్రజలకోసం పనిచేస్తున్న ప్రజా ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న మూకుమ్మడి కుట్రను వివరిస్తున్నారు. ► అందులో భాగంగా నేడు చివరి సిద్ధం సభ బాపట్ల జిల్లా మేదరమెట్ల సమీపంలోని పి.గుడిపాడులో జరగనుంది. ఇందులో పల్నాడు, గుంటూరు, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు జిల్లాల నుంచి పెద్దఎత్తున పార్టీ కార్యకర్తలు, అభిమానులు, సామాన్య ప్రజలు హాజరుకానున్నారు. ► చరిత్రలో నిలిచేపోయే ఈ సభలో పాల్గొనాలని పల్నాడు జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు. జననేత సందేశం వినాలని ఆత్రుతతో ఉన్నారు. సీఎం వైఎస్ జగన్ ప్రసంగాన్ని ప్రతి ఇంటికీ చేర్చి మరోసారి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడేలా చూడటమే లక్ష్యంగా నేడు వీరు సిద్ధం సభకు వెళ్లనున్నారు. ► గుంటూరు జిల్లాలో గుంటూరు పశ్చిమ నుంచి మంత్రి విడదల రజని, తూర్పు నుంచి నూరి ఫాతిమా, తాడికొండ నుంచి మేకతోటి సుచరిత, ప్రత్తిపాడు నుంచి బలసాని కిరణ్‌కుమార్, తెనాలి నుంచి అన్నాబత్తుని శివకుమార్, మంగళగిరి నుంచి ఎమ్మెల్యే ఆర్కే, సమన్వయకర్త మురుగుడు లావణ్య, పొన్నూరు నుంచి అంబటి మురళీకృష్ణ, గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలారు రోశయ్య నేతృత్వంలో జన సమీకరణకు సన్నాహాలు పూర్తి అయ్యాయి. ఇప్పటికే వాహనాలు సిద్ధం చేశారు. ►పల్నాడు జిల్లాలో సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు, మాచర్ల నుంచి ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గురజాల నుంచి ఎమ్మెల్యే కాసు మహే‹Ùరెడ్డి, నరసరావుపేట నుంచి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పెదకూరపాడు నుంచి ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, వినుకొండ నుంచి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, చిలకలూరిపేట నుంచి సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు ఆధ్వర్యంలో శ్రేణులు పెద్ద ఎత్తున సభకు తరలి వెళ్లడానికి సన్నద్ధం అవుతున్నారు. ► బాపట్ల జిల్లాలో బాపట్ల నుంచి ఎమ్మెల్యే కోన రఘుపతి, అద్దంకి నుంచి సమన్వయకర్త పానెం చిన హనిమిరెడ్డి, రేపల్లె నుంచి సమన్వయకర్త ఈవూరి గణే‹Ù, ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు, చీరాల నుంచి ఎమ్మెల్యే కరణం బలరాం, సమన్వయకర్త వెంకటేష్, పర్చూరు నుంచి సమన్వయకర్త ఎడం బాలాజీ, వేమూరు నుంచి సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు నేతృత్వంలో శ్రేణులు కదం తొక్కనున్నాయి. సొంత వాహనాల్లో ప్రయాణం పల్నాడు జిల్లాలోని ఏడు నియోజకవర్గాలలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు ఇప్పటికే పలు మార్లు సిద్ధం సభ సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసి భారీ సంఖ్యలో ప్రజలు సభకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్సార్ సీపీ అభిమానుల కోరిక మేరకు సభకు వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో వాహనాలు ఏర్పాటు చేశారు. మరికొంత మంది కార్యకర్తలు తాము సొంతగా వాహనాలు ఏర్పాటు చేసుకొని సభకు వెళ్లనున్నారు. వీటితో నేడు దారులన్నీ సిద్ధం సభ వైపునకు మళ్లాయి. ఇప్పటికే మంచి జోష్ మీద ఉన్న వైఎస్సార్ సీపీ క్యాడర్ నేడు సిద్ధం సభ వేదికగా సీఎం వైఎస్ జగన్ ఇచ్చే సందేశంతో మరింత పెరిగిన ఉత్సాహంతో రానున్న ఎన్నికల్లో పనిచేసి, పార్టీ అఖండ విజయానికి కృషి చేయనున్నారు. ట్రాఫిక్ మళ్లింపు ఇలా.. నగరంపాలెం: బాపట్ల జిల్లా కొరిశపాడు మండలంలో ఆదివారం జరగనున్న ‘సిద్ధం’ సభకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరుకానున్నారు. సభకు ప్రజలు భారీగా తరలిరానున్నారు. అటుగా రాకపోకలు సాగించే ప్రయాణికులు/ వాహనచోదకులకు ఇబ్బందులు తలెత్తకుండా వాహనాలను దారి మళ్లించినట్లు జిల్లా ఎస్పీ తుషార్ డూడీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇలా వెళ్లాలి.. ► విజయవాడ, గుంటూరు నుంచి జాతీయ రహదారిపై ఒంగోలు, చెన్నై వైపు వెళ్లే వాహనాలు బుడంపాడు అడ్డరోడ్ మీదగా పొన్నూరు, బాపట్ల, చీరాల, త్రోవగుంట వైపుగా వెళ్లాలి. ► గుంటూరు నగరం నుంచి ఒంగోలు వెళ్లే వాహనాలు ఏటుకూరు జంక్షన్ నుంచి ప్రత్తిపాడు, పర్చురు, ఇంకొల్లు, నాగులుప్పలపాడు, త్రోవగుంట వైపు వెళ్లాలి. ► గుంటూరు నుంచి నరసరావుపేట మీదుగా ఒంగోలు వెళ్లే వాహనాలు చుట్టుగుంట, పేరేచర్ల, ఫిరంగిపురం, నరసరావుపేట, సంతమాగులూరు అడ్డరోడ్డు జంక్షన్, అద్దంకి, మేదరమెట్ల మీదుగా వెళ్లాలి. ► 16వ నంబర్ జాతీయ రహదారిపై బొల్లాపల్లి టోల్ ప్లాజా నుంచి బొల్లాపల్లి, మేదరమెట్ల వరకు ఎటువంటి వాహనాలకు అనుమతిలేదు. సిద్ధం సభ వాహనాలకు మాత్రమే అనుమతి. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి వాహనాల దారి మళ్లింపు అమల్లోకి వస్తోందని జిల్లా ఎస్పీ తెలిపారు. -
డీఎస్సీ పరీక్షల షెడ్యూలు మార్పు
సాక్షి, అమరావతి: హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఉపాధ్యాయుల నియామకం కోసం నిర్వహిస్తున్న డీఎస్సీ–2024 పరీక్షల షెడ్యూలును రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. ఈనెల 30 నుంచి ఏప్రిల్ 30 వరకు ఈ పరీక్షలు నిర్వహించేలా నూతన షెడ్యూలును రూపొందించినట్లు పాఠశాల విద్య కమిషనర్ ఎస్. సురేష్‌కుమార్ శనివారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 6,100 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి గతంలో నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనితోపాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. టెట్ పరీక్షలు నిర్వహించింది. ఈనెల 15 నుంచి ఉపాధ్యాయ నియామకం కోసం డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కావలసి ఉంది. కానీ, టెట్ పరీక్షకు.. డీఎస్సీ పరీక్షకు నాలుగు వారాల సమయం ఉండాలని హైకోర్టు ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. ఈ నేపథ్యంలో డీఎస్సీ పరీక్ష షెడ్యూల్లో మార్పులుచేస్తూ నూతన షెడ్యూల్ రూపొందించామని సురేష్‌కుమార్ వెల్లడించారు. ఏప్రిల్‌లో ఐఐటి జేఈఈ తదితర ఎంట్రన్స్ పరీక్షలు ఉండటంతో పరీక్ష కేంద్రాలు అందుబాటులో లేకపోవడంవల్ల మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకూ ఉపాధ్యాయ నియామక పరీక్షలు నిర్వహించేలా షెడ్యూలు రూపొందించామని చెప్పారు. అభ్యర్థులు పరీక్షలకు సిద్ధం కావడానికి తగినంత సమయమిస్తూ నూతన షెడ్యూల్ రూపొందించామని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. డీఎస్సీ నూతన షెడ్యూల్ వివరాలు.. ► మార్చి 30 నుంచి ఏప్రిల్ 3 వరకూ రోజుకు రెండు సెషన్ల చొప్పున 10 సెషన్లలో సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష నిర్వహిస్తారు. ► ఏప్రిల్ 7న టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్ పోస్టులకు ప్రాథమిక పరీక్ష అయిన ఇంగ్లీష్ ప్రొఫీషియన్సీ టెస్టు నిర్వహిస్తారు. ► ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 30 వరకూ స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజిటి, ఫిజికల్ డైరెక్టర్, ప్రిన్సిపల్ పరీక్షలను నిర్వహిస్తారు. ► మార్చి 20 నుంచి పరీక్షా రాయటానికి అభ్యర్థులకు సెంటర్లు ఎంచుకోవడానికి వెబ్ ఆప్షన్స్ ఇస్తారు. ► మార్చి 25 నుంచి అభ్యర్థులు తమ హాల్–టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ► బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అర్హత కలిగిన అభ్యర్థులు సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు అర్హులు కారని హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో గతంలో ప్రకటించిన జీఓ–11లో అర్హతలు మారుస్తూ కొత్తగా జీఓ–22ను గురువారం నుంచి అమల్లోకి తెచ్చారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఈ DSC https:// apdsc. apcfss. in/ వెబ్సైట్లో చూసుకోవచ్చునని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. -
రేపు వైఎస్సార్ జిల్లాలో సీఎం పర్యటన
సాక్షి, అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 11వ తేదీన వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. పులివెందులలో పలు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. సీఎం జగన్ 11వ తేదీ ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి పులివెందుల చేరుకుంటారు. ముందుగా డాక్టర్ వైఎస్సార్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత బనాన ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ ప్రారంభిస్తారు. అక్కడి నుంచి బయలుదేరి డాక్టర్ వైఎస్సార్ మినీ సెక్రటేరియట్ కాంప్లెక్స్‌కు చేరుకుని ప్రారంభిస్తారు. అనంతరం డాక్టర్ వైఎస్సార్ జంక్షన్‌కు వెళ్లి ప్రారంభిస్తారు. అక్కడే సెంట్రల్ బౌల్ వార్డ్ ప్రారంభించిన తర్వాత వైఎస్ జయమ్మ షాపింగ్ కాంప్లెక్స్‌కు చేరుకుని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి గాంధీ జంక్షన్‌కు చేరుకుని ప్రారంభించిన అనంతరం డాక్టర్ వైఎస్సార్ ఉలిమెల్ల లేక్ ఫ్రంట్ వద్దకు చేరుకుని ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఆదిత్యా బిర్లా యూనిట్‌కు చేరుకుని ఫేజ్–1 ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అక్కడి నుంచి బయలుదేరి సంయూ గ్లాస్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం ఇడుపులపాయకు వెళ్లి వైఎస్సార్ మెమోరియల్ పార్కు ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం వైఎస్సార్ ఎస్టేట్‌లోని గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం తాడేపల్లికి చేరుకుంటారు. -
ఎంబ్రాయిడరీ మెషీన్‌తో స్వయం ఉపాధి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. ఎంబ్రాయిడరీ మెషీన్‌తో స్వయం ఉపాధి మా ఆయన సెక్యూరిటీ ఏజెన్సీలో పని చేస్తున్నారు. మేము గతంలో విశాఖ నగరంలోని పూర్ణా మార్కెట్ ప్రాంతంలో ఉండేవారం. పదేళ్ల క్రితం బతుకు తెరువు కోసం 92వ వార్డులోని పద్మనాభనగర్ వచ్చేశాం. ఆయనకొచ్చే అరకొర జీతంతో బతుకు దుర్భరంగా ఉండేది. తప్పనిసరి పరిస్థితుల్లో నేను ఇంట్లోనే టైలరింగ్ చేసేదాన్ని. పెద్దగా ఆదాయం ఉండేదికాదు. జగనన్న ప్రభుత్వం వచ్చాక నవరత్నాల పథకాల ద్వారా మా బతుకుల్లో చాలా మార్పు వచ్చింది. వైఎస్సార్ చేయూత ద్వారా ఏడాదికి రూ.18,750 వంతున వచ్చింది. ఆ మొత్తంతోపాటు జగనన్న తోడు ద్వారా రూ.10 వేలు వచ్చాయి. దానికి మరికొంత కలిపి ఎంబ్రాయిడరీ మెషీన్ కొనుక్కున్నాం. దీంతో నా వ్యాపారం అభివృద్ధి చెందింది. నా అవసరాలతో పాటు స్థానికంగా ఉన్న టైలర్లకు కావలసిన మెటీరియల్ తీసుకు వచ్చి అందిస్తున్నా. అంతేకాకుండా మాకు టిడ్కో ఇల్లు మంజూరైంది. నాకు ఇద్దరు కొడుకులు. భువన తేజ పదో తరగతి, చిన్నబాబు ధావన్ 5వ తరగతి చదువుతున్నాడు. అమ్మ ఒడి పథకం ద్వారా ఏడాదికి రూ.15 వేలు వంతున వస్తోంది. ప్రభుత్వ పథకాలు మా కుటుంబ ఆదాయానికి ఎంతో దోహదపడ్డాయి. ఇప్పుడు ఇల్లు బాగానే గడుస్తోంది. చాలా సంతోషంగా ఉన్నాము. ఈ ప్రభుత్వం చేసిన మేలు ఎప్పటికీ మరువలేము. – సిలుకోటి మాధురి, పద్మనాభనగర్, విశాఖపట్నం (చింతాడ వెంకటరమణ, విలేకరి, గోపాలపట్నం) ఒక ఇంటివారమయ్యాం వృత్తి రీత్యా ఎలక్ట్రీషియన్‌ను. బతుకు తెరువుకోసం విజయనగరం జిల్లా తెర్లాం మండలం ఎం.బి.వలస నుంచి రాజాం వచ్చి అక్కడి వస్త్రపురికాలనీలో కాపురం ఉండేవాళ్లం. అద్దె ఇంట్లో ఉంటూ ప్రతి నెల రూ.2 వేలు చెల్లించేవాళ్లం. రాజాంలో కనీసం రూ.8 లక్షలు ఇంటి స్థలానికే వెచ్చించాలి. గత ప్రభుత్వ హయాంలో మాలాంటి వారికి ఎలాంటి సహకారం అందలేదు. జగన్ మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టి, సచివాలయ వ్యవస్థ వచ్చిన వెంటనే మాకు సకాలంలో రేషన్ కార్డు వచ్చింది. పేదలందరికీ ఇళ్లు పథకం ద్వారా కంచరాం జగనన్నకాలనీ వద్ద స్థలం ఇచ్చారు. ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు ఆరి్థక సహాయం అందింది. ఆ మొత్తంతో ఇల్లు కట్టుకున్నాం. ఇటీవలే గృహ ప్రవేశం చేసి, ఓ ఇంటివారమయ్యాం. మాకు ఇద్దరు పిల్లలున్నారు. అమ్మ ఒడి పథకం ద్వారా ఏడాదికి రూ.15 వేలు వంతున వస్తోంది. ఇప్పుడు వారి చదువుల బెంగలేదు. మేము ఈ రోజు ఈ స్థితిలో ఉండటానికి కారణమైన జగనన్న మేలు మరచిపోలేం. – చింతా సత్యన్నారాయణ, రాజాం (దుర్గారావు, విలేకరి, రాజాం) పైసా ఖర్చు లేకుండా ఇద్దరికి శస్త్రచికిత్స మాది నిరుపేద కుటుంబం. నా భర్త మూడెడ్ల రామకృష్ణ పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో నాలుగు చక్రాల తోపుడు బండి మీద ఫ్యాన్సీ వస్తువులు అమ్మేవారు. నేను ఇంటి వద్ద పాలు, పెరుగు, కూల్‌డ్రింక్స్ అమ్మి అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్నాం. మా అబ్బాయి రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, కుమార్తెకు వివాహం కావడంతో ఆమె తన భర్తతో వేరేగా ఉంటోంది. నా భర్తకు బొడ్డు పెరిగింది. పొట్టమీద కుడి, ఎడమ వైపు ఎత్తుగా రావడంతో కంగారు పడ్డాం. ఫ్యామిలీ ఫిజీషియన్ క్యాంపులో ప్రభుత్వ వైద్యులకు చూపిస్తే శస్త్రచికిత్స చేయాలన్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని మాకు శస్త్ర చికిత్స అంటే భయపడ్డాం. ఆరోగ్యశ్రీలో ఉచితంగా ఆపరేషన్ చేస్తామంటే విజయవాడలోని రామవరప్పాడులో గల ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లాం. అక్కడ గత ఫిబ్రవరిలో శస్త్ర చికిత్స చేశారు. బొడ్డు చుట్టూ మెస్ వేశారు. ఆ మెస్ రెండు సంవత్సరాలపాటు కడుపులోనే ఉంటుందన్నారు. ఆరోగ్యం బాగా కుదుట పడింది. ఇప్పుడిప్పుడే లేచి అటూ ఇటూ తిరగగలుగుతున్నారు. నాకు గర్భసంచిలో కణితి ఉండింది. తొమ్మిది నెలల క్రితం విజయవాడలోని అదే ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీలో శస్త్ర చికిత్స చేయించుకున్నా. నా భర్తను, నన్ను ఆరోగ్యశ్రీ బతికించింది. నా భర్త రామకృష్ణకు వృద్ధాప్య పింఛన్ వస్తోంది. పేదలందరికీ ఇళ్లు పథకంలో మాకు ఇంటి స్థలం ఇచ్చారు. ఇల్లు నిర్మించాల్సి ఉంది. మళ్లీ సీఎంగా జగనే రావాలని దేవుడిని కోరుకుంటున్నాం. – మూడెడ్ల కుమారి, పాలకొల్లు (కె శాంతారావు, విలేకరి. పాలకొల్లు అర్బన్) -
Fact Check: కళ్లకు చత్వారం... చెవులకు బధిరత్వం
రామోజీ పచ్చ కళ్లద్దాలు పెట్టుకుని అదేపనిగా రోత రాతలు రాస్తూనే ఉన్నారు. ఆ కళ్లకు చత్వారం, చెవులకు బధిరత్వం వచ్చింది. అందుకే ఈనాడుకు నిజాలు కనిపించవు.. వినిపించవు. సీఎం జగన్ ప్రభుత్వం పేదలకు ఎంత మంచి చేసినా ఆ కళ్లకు చెడుగా కనిపిస్తోంది. ముదనష్టపు రాతలతో పచ్చకామెర్ల రోగి సామెతను దఫదఫాలుగా గుర్తు చేస్తూనే ఉన్నారు. చంద్రబాబు దగా పాలనలో 5 లక్షల మంది పేదలకు ఇళ్లు కట్టిస్తానని దాదాపు రూ.9 వేల కోట్ల అవినీతికి పాల్పడితే అదేదీ ఆనలేదు.. కానరాలేదు. 2019 మొదలు ఇప్పటి వరకు సీఎం జగన్ 1,24,680 టిడ్కో ఇళ్లను పేదలకు అందించినా, అసలు ఏమీ చేయనట్లుగా అబద్ధాలు అచ్చేయడం పరిపాటిగా మారింది. సాక్షి, అమరావతి : పట్టణ పేదలకు మెరుగైన జీవనానికి ఏపీ టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీ టిడ్కో) ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఇళ్లపైనా ఈనాడుకే ఏడుపే. ఏడుపుతో పాటు అబద్ధాల విషాన్నీ చిమ్ముతోంది. ఈ ప్రాజెక్టు కింద అన్ని సదుపాయాలతో ఇప్పటి దాకా 1,24,680 యూనిట్లను లబ్దిదారులకు అందించినా, అట్టహాసంగా ప్రారంభోత్సవాలు జరుగుతున్నా రామోజీకి కనిపించడం లేదు. లబ్ధిదారులు ఆనందంగా సొంతింట్లో నివాసమున్నా చూడలేకపోతున్నారు. గత చంద్రబాబు బృందం టిడ్కో ఇళ్ల పేరుతో రూ.8,929.81 కోట్ల దోపిడీకి పాల్పడింది. చ.అడుగు నిర్మాణ ధర రూ.1000 కంటే తక్కువే ఉండగా.. బాబు మాత్రం కంపెనీలు ఇచ్ఛిన ముడుపుల స్థాయిని బట్టి రూ.2,534.75 నుంచి రూ.2034.59గా నిర్ణయించి, సగటున చ.అ నిర్మాణ ధర రూ.2,203.45గా చెల్లించారు. అప్పటి మార్కెట్ ధరతో పోలిస్తే రూ.1203.45 అదనంగా నిరుపేదల నుంచి వసూలు చేసినా, ఇప్పటి దాకా ఒక్కసారి చంద్రబాబును ఇదేం అక్రమమని రామోజీ ప్రశ్నించిందే లేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వ తప్పిదాలను సరిచేసింది. టీడీపీ ప్రభుత్వం నిరుపేదలపై మోపిన అధిక ధరల భారాన్ని పక్కనబెట్టి 1,43,600 మంది నిరుపేదలకు ఉచితంగానే ప్లాట్లను కేటాయించింది. మరో 1,18,616 మంది తక్కువ ఆదాయ వర్గాలకు ఫ్లాట్ ధరను సగానికి తగ్గించి ఇళ్లను అందిస్తోంది. అదీ తాగునీరు, విద్యుత్తు సదుపాయం, డ్రైనేజీ వంటి సకల సదుపాయాలు కల్పించిన తర్వాతే ప్లాట్లను కేటాయిస్తోంది. బ్యాంకు రుణాలు మంజూరైనా రెండేళ్ల మారటోరియం ఇచ్చింది. గడువులోగా ఇల్లు ఇవ్వకుంటే ప్రభుత్వమే లబ్దిదారుల ఈఎంఐ చెల్లిస్తోంది. అన్ని వసతులతో పేదలకు ఆధునిక ఇళ్లు రాష్ట్రంలోని 88 పట్టణ స్థానిక సంస్థల (యూఎల్బీ) పరిధిలోని 163 ప్రాంతాల్లో జీ+3 విధానంలో 2,62,212 టిడ్కో ఇళ్లను ప్రభుత్వం నిర్మిస్తోంది. ఇందులో 300 చ.అ. విస్తీర్ణంలో 1,43,600 యూనిట్లు, 365 చ.అ విస్తీర్ణంలో 44,304 యూనిట్లు, 430 చ.అ విస్తీర్ణంలో 74,312 యూనిట్లు ఉన్నాయి. మొత్తం ఇళ్లలో ఫేజ్–1 కింద 1,51,298 ఇళ్లు వంద శాతం నిర్మాణం పూర్తయింది. ఈనెల 7 వరకు 1,24,680 ఇళ్లను లబ్దిదారులకు అందించారు. ముఖ్యంగా 300 చ.అ. విస్తీర్ణంలో నిర్మించిన 1,43,600 యూనిట్లలో ఒక్కో ఇంటికి రూ.6.55 లక్షలు ఖర్చవగా, వీటిని నిరుపేదలకు ప్రభుత్వం ఉచితంగానే అందించింది. 365 చ.అ. ఇంటికి రూ.7.55 లక్షలు ఖర్చవగా, ప్రభుత్వం రూ.4.15 లక్షలు, లబ్దిదారులు తమ వాటాగా రూ.3.40 లక్షలు చెల్లించాలి. రూ.8.55 లక్షలతో నిర్మించిన 430 చ.అ. ఇళ్లకు ప్రభుత్వం రూ.4.15 లక్షలు, లబ్దిదారుల వాటాగా రూ.4.40 లక్షలు చెల్లించాలి. రెండు, మూడో కేటగిరీ ఇళ్ల లబ్దిదారులు, రుణాలు మంజూరు చేసిన బ్యాంకులు, సంబంధిత మున్సిపాలిటీల మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. రుణ వాయిదాల (ఈఏంఐ) చెల్లింపునకు 24 నెలల మారటోరియం ఉంది. 20 ఏళ్ల పాటు రుణ వాయిదాలు చెల్లించాలి. మారటోరియం గడువు లోగా లబ్దిదారులకు ఇళ్లు అప్పగిస్తే అప్పటి నుంచి రుణ వాయిదాలు వారే కట్టాలి. ఒకవేళ గడువులోగా ఇంటిని లబ్ధిదారులకు అప్పగించకపోతే రుణ వాయిదాలను ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఇదంతా బహిరంగంగానే కనిపిస్తున్నా, బాబు భజనలో తరిస్తున్న ఎల్లో మీడియాకు వాస్తవాలు చెప్పే ధైర్యం లేదు. పేదల ఇళ్లలో చంద్రబాబు రూ.8,929.81 కోట్ల అవినీతి ♦ వెన్నుపోటు రాజకీయాల్లో ఆరితేరిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన అక్రమాలకు, అవినీతికీ పట్టణాల్లో ఇల్లు లేని నిరుపేదల జీవితాలను సైతం ‘తాకట్టు’ పెట్టారు. ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు కట్టించి ఇచ్చేందుకు 2016–17లో రాష్ట్రంలో లేనంత అధికంగా నిర్మాణ వ్యయాన్ని చూపి లబ్ధిదారులను దోచుకున్నారు. ♦ ఏపీ టిడ్కో ద్వారా రాష్ట్రంలోని పట్టణాల్లో నివశిస్తున్న ఇళ్లు లేని పేదలు 5 లక్షల మందికి ప్రభుత్వ స్థలాల్లో 300, 365, 415 చ.అ విస్తీర్ణంలో జీ+3 విధానంలో ఫ్లాట్లు కట్టిస్తామని నమ్మబలికారు. ♦ 300 చ.గ విస్తీర్ణం గల ఫ్లాట్‌కు రూ.2.60 లక్షల ధర నిర్ణయించి బ్యాంకు రుణాలు ఇప్పించి, నెలకు రూ.3 వేల చొప్పున 20 ఏళ్లు చెల్లించాలని (రూ.7.20 లక్షలు) షరతు పెట్టారు. ♦ ఇక్కడే చంద్రబాబు బృందం నిర్మాణ కంపెనీల నుంచి ముడుపులు తీసుకుని, అధికంగా ముడుపులు ఇచ్చుకున్న కంపెనీకి అధిక ధరకు, తక్కువగా ఇచ్ఛిన కంపెనీకి తక్కువ ధరకు నిర్మాణ అనుమతులు కట్టబెట్టారు. ♦ ఈ అవినీతి లోతు ఎంతంటే.. ఆనాడు మార్కెట్లో ఏ ప్రైవేటు బిల్డర్ వసూలు చేయనంతగా ధర నిర్ణయించారు. 2016–17లో మార్కెట్లో చ.అడుగు నిర్మాణ ధర రూ.900 నుంచి రూ.1000 మధ్య ఉండగా.. చంద్రబాబు మాత్రం కంపెనీలకు రూ.2,534.75 నుంచి రూ.2034.59గా నిర్ణయించి సగటు చ.అ నిర్మాణ ధర రూ.2,203.45గా చెల్లించారు. ♦ అప్పటి మార్కెట్ ధరతో పోలిస్తే రూ.1203.45 అదనంగా నిరుపేదల నుంచి వసూలు చేశారు. వాస్తవానికి ప్రభుత్వం చేపట్టే నిర్మాణాలకు మార్కెట్ ధర కంటే ఇంకా తగ్గాల్సింది పోయి భారీగా పెంచేశారు. ♦ టీడీపీ ప్రభుత్వం తలపెట్టిన 5 లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణానికి ప్లాన్ చేసిన చంద్రబాబు ప్రభుత్వం 3.15 లక్షల ఇళ్ల నిర్మాణం మొదలెట్టింది. ♦ తొలి విడతగా 2,08,160 యూనిట్లను 7,42,01,820 చ.అ. విస్తీర్ణంలో నిర్మాణ అనుమతులిచ్ఛిన చంద్రబాబు బృందం రూ.8,929.81 కోట్ల అవినీతికి పాల్పడింది. ♦ పేదలు 300 చ.అ. ఇంటికి బాబు ప్రభుత్వం రూ.7.20 లక్షలు భారం మోపి, 20 ఏళ్ల పాటు ప్రతినెలా వాయిదాలు కట్టాలని షరతుపెట్టింది. ♦ దీని ప్రకారం లబ్ధిదారులపై రూ.3,805 భారం మోపింది. 365 చ.అ. ఇంటికి రూ.50 వేలు, 430 చ.అ. ఇంటికి రూ.లక్ష వసూలు చేసింది. బాబు అక్రమాలకు జగన్ చెక్...ప్రజాధనం ఆదా... బాబు హయాంలో టిడ్కో ఇళ్ల నిర్మాణంలో జరిగిన అక్రమాలను గుర్తించిన ప్రస్తుత జగన్ సర్కారు రివర్స్ టెండరింగ్ ద్వారా నిర్మాణ వ్యయాన్ని రూ.2,840 కోట్లకు తగ్గించించి. రూ.392 కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేసింది. ♦ రివర్స్ టెండరింగ్‌లో చ.అడుగు నిర్మాణ వ్యయాన్ని రూ.1692 తగ్గించి, రూ.4,368 కోట్ల ప్రజా ధనాన్ని ఆదా చేసింది. ♦ నిరుపేదలకు కేటాయించిన 300 చ.అ. ఇంటిని ఉచితంగా (రూ.1కి) ఇవ్వడంతో 1,43,600 మంది లబ్ధిదారులకు ఈఎంఐ రూపంలో చెల్లించే రూ.10,339 కోట్ల భారం లేకుండా పోయింది. ♦ 365 చ.అ ఇళ్లలో 44,304 మంది లబ్దిదారులు రూ.50 వేలు, 430 చ.అ. ఇళ్లలో 74,312 మంది లబ్దిదారులు రూ.లక్ష చొప్పున వాటా చెల్లించాలని గత ప్రభుత్వం నిబంధన పెడితే, దాన్ని సగానికి తగ్గించి, మిగతా సగం వాటా నగదు రూ.482.32 కోట్లను ప్రస్తుత ప్రభుత్వమే చెల్లించింది. ♦ జగన్ ప్రభుత్వం ఉదారత ఫలితంగా రెండు, మూడు కేటగిరీల లబ్దిదారులకు గత ధరల ప్రకారం రూ.10,797 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఆ మొత్తం రూ.4,590 కోట్లకు జగన్ సర్కారు తగ్గించింది.