AP Special
-
మాకు ఇదేమి ఖర్మ నారాయణా..!
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: భారీగా ఫీజులు చెల్లించి తమ విద్యా సంస్థల్లో పిల్లలకు మంచి విద్యను అందించాల్సిన టీడీపీ నేత, మాజీ మంత్రి పొంగూరు నారాయణ తన స్కూళ్లు, కాలేజీలను రాజకీయాలకు వేదికగా మార్చేశారు. చంద్రబాబు బినామీగా, టీడీపీ నేతగా, మాజీ మంత్రిగా చిరపరిచితుడైన నారాయణ ఈసారి ఎన్నికల్లో టీడీపీ తరపున నెల్లూరు నగర అభ్యర్థిగా పోటీకి సిద్ధమవుతున్నారు. దీంతో నారాయణ విద్యా సంస్థల్లోనే రాజకీయ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నారు. సంస్థలో ఉద్యోగులు, ఉపాధ్యాయులతో ఎన్నికల పనులు చేయిస్తున్నారు. ఉన్నత చదువులు చదువుకుని పిల్లలకు పాఠాలు చెప్పడానికి వచ్ఛిన ఉపాధ్యాయులను ఎన్నికల ప్రచారం కోసం విద్యార్థుల ఇళ్లకు పంపుతున్నారు. ఈ దఫా ఓటు టీడీపీకే వెయ్యాలని ప్రాథేయపడేలా చేస్తున్నారు. బలవంతంగా ఎన్నికల ఉచ్చులోకి.. 2019 ఎన్నికల్లో నెల్లూరు నగర నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా ఓడిపోయిన నారాయణ నాలుగున్నరేళ్లపాటు నెల్లూరుకు ముఖం చాటేశారు. ఆయనపై టీడీపీ కేడర్‌లో తీవ్ర అసంతృప్తి ఉంది. దీంతో ఈసారి టీడీపీకి ప్రచారం చేయడం కోసం తన విద్యాసంస్థల ఉద్యోగులు, ఉపాధ్యాయులను బలవంతంగా ఎన్నికల ఉచ్చులోకి లాగారు. ఇప్పటికే కొందరు ఉపాధ్యాయులు, ఉద్యోగులను రోజువారీ విధుల నుంచి తప్పించి ఎన్నికల విధులు అప్పజెప్పినట్లు సమాచారం. దాదాపు 500 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులను కలిపి నారాయణ టీం (ఎన్ టీం)గా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఆ బృందంతో గతంలో నెల్లూరు నగర నియోజకవర్గంలో ఓటర్ల వెరిఫికేషన్ చేయించారు. ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్ల ఆధార్ కార్డులు, బ్యాంకు ఖాతా సమాచారం, వారి మొబైల్కొచ్చే ఓటీపీ అడగడంతో ప్రజలు వారికి దేహశుద్ధి చేసిన ఘటనలు ఉన్నాయి. అయినా, నారాయణ ఇప్పుడు ఎన్నికల ప్రచారం కోసం వారిని ఉపయోగిస్తున్నారు. ప్రధానంగా నెల్లూరు నగర, రూరల్ నియోజకవర్గాల్లో ప్రచారం చేయిస్తున్నారు. ప్రతి రోజూ విద్యార్థుల ఇళ్లకు వెళ్లి.. ఎంపిక చేసిన ఉపాధ్యాయులు ఆ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థుల అడ్రెస్లు సేకరించి, ఒక్కొక్కరూ రోజుకు ముగ్గురు విద్యార్థుల ఇళ్లకు వెళుతున్నారు. తల్లిదండ్రులతో ఎన్నికలపై చర్చిస్తున్నారు. ఈ దఫా ఓట్లు టీడీపీకే వేయాలని వారిపై ఒత్తిడి తెస్తున్నారు. ఎవరైనా ఎదురు తిరిగితే తమ యాజమాన్యం ఒత్తిడిపై వచ్చామని, ఏమీ అనుకోవద్దని ప్రాధేయపడుతున్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల ఇళ్లను సందర్శించినట్లు ఫొటోలు దిగి విద్యా సంస్థల వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేస్తున్నారు. మాట వినకపోతే డిస్మిస్ లేదా బదిలీ ఉన్నత చదువులు చదివిన తమకు వేతనం తక్కువైనప్పటికీ గౌరవప్రదమైన ఉద్యోగం అని చెప్పుకునేందుకు ఎక్కువ మంది నారాయణ విద్యా సంస్థల్లో చేరుతున్నారు. ఏళ్ల తరబడి అదే సంస్థలో పని చేస్తున్నారు. నారాయణ ప్రత్యక్ష ఎన్నికల్లోకి వచ్ఛిన 2019 నుంచి నారాయణ సంస్థల ఉద్యోగులు, ఉపాధ్యాయులను రాజకీయ పనులకు వాడుకుంటున్నారు. ఉద్యోగులను భయపెట్టి మరీ ఎన్నికల పనులు చేయిస్తున్నారని విద్యాసంస్థ ఉద్యోగులు, ఉపా«ద్యాయులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు తిరస్కరించిన ఉద్యోగులను పలు సాకులతోఉద్యోగం నుంచి తొలగించడమో, సుదూర ప్రాంతాలకు బదిలీ చేయడమో చేస్తున్నారని ఓ ఉద్యోగి వాపోయారు. -
యురేనియంపై 'పచ్చ' విషం
ఉన్నది లేనట్టు... లేనిది ఉన్నట్టు... భ్రమింపజేయడం పచ్చపత్రికల లక్ష్యం.ప్రతి అంశాన్నీ సర్కారుకు ముడిపెట్టి ప్రజలను తప్పుదారి పెట్టించాలన్నది వారి వ్యూహం. ఎలాగైనా జగన్ సర్కారును అప్రదిష్టపాలు చేయాలన్నది వారి సంకల్పం. కానీ వాస్తవాలు తెలిసిన ప్రజల విజ్ఞత ముందు వారికుట్రలు ఎన్నైనా కొట్టుకుపోవడం ఖాయం. పులివెందుల ప్రాంతంలోని యురేనియం కార్పొరేషన్ ప్రాజెక్టుపై వండివార్చిన అడ్డగోలు కథనాన్ని అందరూ ఛీదరించుకుంటున్నారు. అక్కడి ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలు తెలిసిన జనాలు ఆ అబద్ధాలను నిర్ద్వందంగా ఖండిస్తున్నారు. సాక్షి రాయచోటి/వేముల : పులివెందుల ప్రాంత నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించాలన్న సంకల్పంతో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నెలకొల్పిన యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(యూసీఐఎల్) ప్రాజెక్టుపై ఇప్పుడు పచ్చ పత్రికలు విషం చిమ్ముతున్నాయి. వైఎస్సార్ కుటుంబంపై దుమ్మెత్తి పోయడమే లక్ష్యంగా ఎల్లో మీడియా ప్రతి అంశాన్నీ వక్రీకరిస్తోంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి యురేనియం బాధిత గ్రామాల ప్రజలకు శాశ్వత పరిష్కారాన్ని చూపాలని సంకల్పించారు. అంతేగాకుండా గ్రామాల్లో పూర్తి స్థాయిలో సమస్యలు పరిష్కరిస్తేనే మరోపక్క తాగు, సాగునీటికోసం ప్రత్యేక రిజర్వాయర్ నిర్మాణం మొదలుకొని పైపులైన్ల ద్వారా తుంగభద్ర, కృష్ణా నీటిని తీసుకొచ్చేందుకు శ్రీకారం చుట్టారు. ప్రాజెక్టు నిర్మాణానికి నిధులను కేటాయించి...నిర్మాణ పనులు చరుగ్గా సాగేలా చర్యలు తీసుకున్నారు. కేవలం 15 నెలల వ్యవధిలోనే సగానికి పైగా ప్రాజెక్టు పనులు పూర్త యినా మార్చి వచ్ఛినా ఏమార్చారంటూ తప్పుడు కథనాన్ని ప్రచురించారు. శర వేగంగా రిజర్వాయర్ పనులు వేముల మండలంలోని యురేనియం బాధిత గ్రామాలైన కేకే కొట్టాల, కణంపల్లె, మబ్బుచింతలపల్లె, తుమ్మలపల్లె, రాచకుంటపల్లె, భూమయ్యగారిపల్లె గ్రామ ప్రజల శాశ్వత పరిష్కారానికి రిజర్వాయర్ నిర్మాణమే ప్రధానమని భావించిన ప్రభుత్వం వేగంగా పనులు జరిగేలా చూస్తోంది. వైద్య శిబిరాలు, ఇతర ప్రత్యేక చర్యలు తీసుకుని వారి ఆరోగ్యంపై పత్యేక శ్రద్ధ తీసుకున్నారు. భూములు కోల్పొయిన రైతుల కుటంబాల్లో ఉద్యోగావకాశాలు కల్పించారు. స్వచ్చమైన నీటిని అందించాలన్న లక్ష్యంతో ప్రత్యేకంగా రిజర్వాయర్, భూ సేకరణ, చిత్రావతి నుంచి రూ. 1113 కోట్లు అంచనా వ్యయంతో రిజర్వాయర్ రూపొందించారు. వేంపల్లె మండలం గిడ్డంగివారిపల్లె వద్ద 2022 నవంబర్‌లో పనులకు భూమి పూజ చేశారు. యురేనియం బాధిత గ్రామాల్లో 10వేల ఎకరాలకు సాగునీటితో పాటు 6 గ్రామాల ప్రజలకు తాగునీటిని అందించేందుకు చేపట్టిన పనులు చురుగ్గా సాగుతున్నాయి. నిర్మాణ పనులు 53శాతం పూర్తయ్యాయి. అలాగే కాలువల పనులు కూడా వేగవంతంగా చేస్తున్నారు. లింగాల మండలం పార్నపల్లె వద్దనున్న చిత్రా వతి ప్రాజెక్టు నుంచి పైపులకు నీటిని ఎత్తిపోతల ద్వారా తరలించనున్నారు. సాగునీటికి ప్రత్యేక చర్యలు యురేనియం బాధిత గ్రామాల్లో తోటల్లోని బోరు బావుల్లో నీరు సైతం కలు షితం అవుతుందన్న శాస్త్రవేత్తల నివేదికల మేరకు ఆయా గ్రామాల పొలాలకు కూడా సూక్ష్మ సేద్యం ద్వారా సాగునీరు అందించాలని సంకల్పించారు. పైపులైన్లతోపాటు తోటలకు నీరు అందించేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అందుకు అనుగుణంగా పనులు కూడా చేస్తున్నారు. సుమారు 10 వేల ఎకరాలకు సూక్ష్మ సేద్యంతోపాటు ఐదు వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కింద సాగునీటిని అందించనున్నారు. త్వరలోనే సమస్యల పరిష్కారం యురేనియం బాధిత గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి కూడా యూసీఐఎల్ చర్యలు చేపట్టింది. తుమ్మలపల్లె సమీపంలో 2007 నవంబర్‌లో యురేనియం తవ్వకాలు చేపట్టేందుకు రూ.1106కోట్లతో కర్మాగారాన్ని నిర్మించింది. ♦ 2013లో యూసీఐఎల్ యురేనియం ఉత్పత్తి ప్రారంభించింది. ముడిపదార్థాన్ని శుద్ధి చేయగా వచ్చే వ్యర్థాలను కె.కె.కొట్టాల సమీపంలోని టెయిలింగ్ పాండ్‌కు తరలిస్తున్నారు. ♦ 2016లో భారీ వర్షాలతో వ్యర్థజలాలు భూగర్భజలాల్లో కలు షితమయ్యాయని, బోర్లలో కలు షిత నీరు వస్తోందని, పంటలు దెబ్బతింటున్నాయని రైతులు ఆందోళన చేశారు. అప్పట్లో రైతులు ఈ విషయాన్ని ఎంపీ వైఎస్ అవినా‹Ùరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, యూసీఐఎల్ సీఎండీతో మాట్లాడి పరిష్కారానికి చొరవ చూపుతూ వస్తున్నారు. ♦సంస్థ టెయిలింగ్ పాండ్‌లో 1.5 మీటర్ల మట్టి వేసి దానిపై 1.5 ఎం.ఎం హెచ్‌డీపీ షీట్ వేసి యురేనియం వ్యర్థాలను నింపుతోంది. ఇందుకోసం యూసీఐఎల్ రూ.39కోట్లు ఖర్చు చేసింది. ♦యురేనియం పరిసర గ్రామాల్లో యూసీఐఎల్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఈ గ్రామాలకు వైద్య బృందాలు వెళ్లి పరీక్షలు చేసి మందులను పంపిణీ చేస్తున్నారు. గ్రామాల్లో రూ.60లక్షలతో మినరల్ వాటర్ ప్లాంట్‌ను యూసీఐఎల్ నిరి్మంచింది. చురుగ్గా సాగుతున్న పనులు పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లె మండలం గిడ్డంగివారిపల్లె సమీపంలో రిజర్వాయర్ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. యురేనియం గ్రామాలకు సాగు, తాగునీరు అందించేందుకు రూ.198కోట్లతో 1.05 టీఎంసీల సామర్థ్యంతో నిర్మాణ పనులు చేపట్టాం. ఇప్పటికే 53 శాతం పనులు పూర్తయ్యాయి. రూ. 103 కోట్లతో సకాలంలో పనులు పూర్తయ్యేలా కాంట్రాక్టర్ల ద్వారా చేయిస్తున్నాం. – వాసుదేవరెడ్డి, నీటిపారుదలశాఖ అధికారి బాబుకు మేలు చేకూర్చేందుకు రామోజీ తాపత్రయం ప్రతి అంశాన్నీ బాబుకు మేలు చేసే విధంగా కట్టుకథలతో తప్పుదారి పట్టించేందుకు రామోజీ తెగ తాపత్రయపడుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2021లో శంకుస్థాపన చేసి 2022 నవంబర్‌లో పనులకు భూమి పూజ చేయగా 32 నెలల కిందటే పనులు ప్రారంభించినట్లు ఈనాడులో తప్పుడు కథనాలు అల్లడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రూ. 650 కోట్లతో చేపట్టిన ఎత్తిపోతలతోపాటు పైపులైన్ల పనులకు సుమారు రూ. 135 కోట్లు ఖర్చు చేశారు. 48 కిలోమీటర్ల మేర తవ్వాల్సిన కాలువ పనులకు సంబంధించి దాదాపు 20 కిలోమీటర్లకు పైగా పూర్తి చేశారు. మరో 13 కిలోమీటర్ల వరకు పైపులను కూడా అమర్చారు. కొన్నిచోట్ల అటవీశాఖ భూముల పరిధిలో పైపులైన్ పనులు చేయాల్సి ఉన్నందున అనుమతుల కోసం నిరీక్షిస్తున్నారు. దానినీ రాజకీయం చేయాలని ఈనాడు చూస్తోంది. -
కొల్లేరమ్మ జాతర చూసొద్దాం రండి!
కైకలూరు: చుట్టూనీరు.. మధ్యన ద్వీపకల్పం.. పద్మాసన భంగిమలో ఆశీనులైన పెద్దింట్లమ్మ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు ఈ నెల 11 నుంచి 24వ తేదీ వరకు జరగనున్నాయి. వేంగి రాజుల కాలంలో నిర్మించిన పురాతన క్షేత్రంలో జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కొల్లేటి గ్రామాల ఆరాధ్య దేవత పెద్దింట్లమ్మ క్షేత్రంలో అనేక విశేషాలున్నాయి. ఏటా జాతర (తీర్థం) నిర్వహిస్తారు. ఆ సమయంలో కొల్లేటికోట జనారణ్యంగా మారుతుంది. జాతరలో ప్రధాన ఘట్టమైన జలదుర్గ, గోకర్ణేశ్వరస్వామి కల్యాణం రోజున ప్రభల ఊరేగింపు, బోనాల సమర్పణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. చరిత్రలో కొల్లేటికోట ‘దండకారణ్య మధ్యమున మహా సరస్సొకటి కలదు. అది జల విహంగములతో అత్యంత రమణీయమైనది’ అని అగస్త్యుడు శ్రీరామచంద్రునితో చెప్పినట్టు రామాయణంలోని అరణ్య కాండంలో పేర్కొనబడింది. చైనా యాత్రికుడు హ్యుయాన్‌త్సాంగ్ కొల్లేరు సరస్సును ఒక మహత్తర మంచినీటి సరస్సుగా అభివర్ణించారు. దండి మహాకవి ‘దశకుమార చరిత్ర’లో కొల్లేరు సరస్సుతోపాటు బహు సాహసిగా పేరు గడించిన తెలుగు భీముడు (భుజబలపట్నం ఆ«దీశుడు) గురించి రాశారు. విజయాదిత్య చక్రవర్తి పార్వతీదేవి రూపంలో కొలువైన అమ్మవారిని మొదటిసారిగా పెద్దమ్మగా సంబోధించారు. కమలాకరపుర వల్లభుల శాసనాల ప్రకారం వేంగి–చాళుక్య రాజులకు వైవాహిక బాంధవ్యాలు ఉండేవి. వీరికి ప్రధాన పురాలుగా కమలాకరపురం (ఏలూరు), పద్మినీపురం (గణపవరం), కొలనువీడు (కొల్లేటికోట)ను వ్యవహరించారు. కోస్తా జిల్లాల్లో ఎక్కడా లేనివిధంగా అతిపెద్ద అనివేటి మండపాన్ని దాతల విరాళం రూ.4.50 కోట్లతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) నిర్మించారు. కొల్లేటికోట పెద్దింట్లమ్మ క్షేత్రానికి చేరుకోవడానికి సర్కారు కాలువపై ఇనుప వంతెన మాత్రమే ఆధారంగా ఉండేది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.14.70 కోట్ల నిధులు మంజూరు చేయడంతో పెద్దింట్లమ్మ వారధి నిర్మాణం అందుబాటులోకి వచ్చింది. ఏర్పాట్లు పూర్తి పెద్దింట్లమ్మ జాతర మార్చి 11 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాం. 21న జలదుర్గ, గోకర్ణేశ్వర స్వామి కల్యాణం నిర్వహిస్తాం. కల్యాణం రోజునే ప్రభ బండి, బోనాలు, కలువమ్మల గ్రామోత్సవం జరుగుతుంది. చివరి రోజున కోనేరులో తెప్పోత్సవం ఉంటుంది. కొల్లేరు వారధి పూర్తికావడంతో ఈ ఏడాది భక్తుల తాకిడి మరింతగా పెరుగుతుందని భావిస్తున్నాం. – కందుల వేణుగోపాలరావు, ఈవో -
Fact Check: బాబు ధ్యానంలో పడి ‘అధ్వాన’ రాతలు
రాష్ట్రాన్ని ఉద్యాన హబ్‌గా తీర్చిదిద్దాలన్నది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం. పంటల మార్పిడి ద్వారా పెద్ద ఎత్తున దిగుబడి సాధించాలన్నది లక్ష్యం. ఆ దిశగానే నాలుగేళ్లుగా సాగుతోంది ప్రగతి ప్రయాణం. ఇప్పటికే దిగుబడి సాధనలో... ఎగుమతుల్లో పురోగతి సాధిస్తూనే ఉన్నాం. సకాలంలో రైతులకు బిల్లులు చెల్లిస్తూ వారి కళ్లల్లో ఆనందం చూస్తున్నాం. అయినా నిరంతరం బాబు ధ్యానంలోనే గడుపుతున్న రామోజీకి గానీ... ఆయన పచ్చకళ్లకు గానీ అవేవీ కనిపించడం లేదు. ఇంకా ఆ మత్తులోనే జోగుతున్న ఈనాడు పత్రికలో నిత్యం అసత్యాలు వల్లెవేయడం అలవాటైంది. అడ్డగోలు కథనాలు వండివార్చడం నిత్యకృత్యమైంది. గత పాలనలో ఎంతగా వెనుకబడినా వారికి మాత్రం పచ్చగానే కనిపించింది. ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధిని చూడలేక ఇంకా అధ్వానంగానే ఆలోచిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్లుగా ఉద్యానాభివృద్ధికి అనేక సంస్కరణలు చేపట్టింది. ప్రభుత్వ చర్యల ఫలితంగా ఏటా విస్తీర్ణంతో పాటు దిగుబడులు, ఎగుమతులు పెరుగుతున్నాయి. కానీ ఇవేవీ పట్టించుకోని ఈనాడు పత్రికలో ఓ అబద్ధాన్ని అందంగా అచ్చేసింది. అందులో వాస్తవాలు ఒక్కసారి పరిశీలిద్దాం. – సాక్షి, అమరావతి ఆరోపణ: ప్రోత్సాహం కరువై...తగ్గిన తోటల విస్తీర్ణం వాస్తవం: ఉద్యాన పంటలు 2018–19లో 42.5 లక్షల ఎకరాల్లో సాగవుతుండగా, సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ కృషి ఫలితంగా 2022–23 నాటికి ఏకంగా 45.61 లక్షల ఎకరాలకు పెరిగింది. ఈ ఐదేళ్లలో 7.49లక్షల ఎకరాల్లో కొత్తగా ఉద్యాన పంటలు సాగులోకి వచ్చాయి. వీటిలో 4.23లక్షల ఎకరాల్లో పాత తోటలను పునరుద్ధరించగా, 3.25లక్షల ఎకరాల్లో కొత్తగా సాగవుతోంది. ప్రధానంగా 1.69లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్, 1.26లక్షల ఎకరాల్లో మామిడి, 84వేల ఎకరాల్లో బత్తాయిపంటలు కొత్తగా సాగవుతున్నాయి. 2018–19 నాటికి 305 లక్షల టన్నులున్న దిగుబడులు 2022–23 నాటికి 368.89 లక్షల టన్నులకు చేరింది. 2018–19 నాటికి ఉద్యాన రంగానికి రూ.43,101 కోట్లు ఉన్న జీవీఏ 2022–23 నాటికి రూ.54,550కు పెరిగింది. సాగులో 15 శాతం, దిగుబడుల్లో 20.9 శాతం, జీవీఏలో 26 శాతం వృద్ధి రేటు సాధించింది. ఆరోపణ: గణనీయంగా తగ్గిన ఎగుమతులు వాస్తవం: టీడీపీ హయాంలోని ఐదేళ్లలో నాలుగైదు లక్షల టన్నులు కూడా ఎగుమతయ్యేవి కాదు. గడచిన ఐదేళ్లలో వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో 23.99 లక్షల టన్నులు ఎగుమతులు జరిగాయి. దేశంలోనే ప్రప్రథమంగా అరటి కోసం ప్రత్యేకంగా కిసాన్ రైళ్లను నడిపిన ఘనత ఈ ప్రభుత్వానిది. తాడిపత్రి నుంచి ముంబాయి ఓడరేవు ద్వారా ఏటా కిసాన్ రైళ్లు నడుపుతున్నారు. అక్కడి నుంచి విదేశాలకు అరటి ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నారు. 2014–18 మధ్య కేవలం 24 వేల టన్నుల అరటి ఎగుమతులు చేరగా, కేవలం నాలుగేళ్లలోనే 1.62 లక్షల టన్నుల అరటి ఎగుమతయ్యింది. మన రాష్ట్రం నుంచి కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలకు టమాటా ఎగుమతి చేస్తూ ఆదర్శంగా నిలిచింది. ఇంకా వంగ, బీర, సొర, దొండ, బెండ వంటి కూరగాయలు సైతం దేశంలోని వివిధ నగరాలకు సరఫరా చేస్తున్నారు. ఆరోపణ: మాటల్లో తీపి.. రాయితీలకు కత్తెర వాస్తవం:2019–20 నుంచి ఇప్పటి వరకు రక్షిత సేద్యం కింద ప్రభుత్వం 15,490.53 హెక్టార్లకు రూ.41.30 కోట్లు సాయం అందించింది. కొత్తగా 29.83 ఎకరాల్లో అధిక విలువ కలిగిన కూరగాయల సాగుకోసం రూ.75.70 లక్షలు, 172.65 ఎకరాల్లో అధిక విలువ కలిగిన పూల సాగు కోసం రూ.5.85 కోట్లు ఆరి్థక సాయం చేసింది. అలాగే 478 సేకరణ కేంద్రాలు, 91 శీతల గిడ్డంగుల నిర్మాణం ద్వారా 2.44 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం పెంచారు. వీటి ద్వారా 3 లక్షల మంది రైతులు లబ్ధి పొందగా, సబ్సిడీ రూపంలో రూ.138.56 కోట్లు వారి ఖాతాలకు జమ చేశారు. కొత్తగా 200 రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేసింది. ఆరోపణ: ఉద్యాన రైతుకు కానరాని సాయం వాస్తవం: వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా 3 విడతల్లో రూ.13,500ల చొప్పున ఐదేళ్లలో 53.58లక్షల మందికి రూ.34,288 కోట్లు పెట్టుబడి సాయం అందించారు. దాంట్లో ఉద్యాన రైతులకు రూ.10వేల కోట్లకు పైగా అందించారు. పైసా భారం పడకుండా ఈ–క్రాప్ నమోదు ప్రామాణికంగా 2019 నుంచి ఇప్పటి వరకు 5,35,554 ఉద్యాన రైతులకు రూ.1,409.5 కోట్ల బీమా పరిహారాన్ని అందించారు. వైపరీత్యాల వేళ 2014–15 నుంచి 2018–19 మధ్య పంట నష్టపోయిన రైతులకు రూ.387 కోట్ల పెట్టుబడి రాయితీ చెల్లిస్తే ఈ ప్రభుత్వం గత ఐదేళ్లలో 4.92 లక్షల మందికి రూ.563.03 కోట్ల పెట్టుబడి రాయితీని జమ చేసింది. ఆరోపణ: సూక్ష్మసేద్యం, ఆయిల్‌పామ్ రైతులకు మొండిచేయి వాస్తవం: బిందు, తుంపర సేద్య పరికరాలకు సంబంధించి గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.969.40 కోట్ల బకాయిలను చెల్లించడమే గాకుండా ఈ ఐదేళ్లలో 7.22 లక్షల ఎకరాల్లో కొత్తగా సూక్ష్మ సేద్యం అమలు చేసి 3.55లక్షల మంది రైతులకు సబ్సిడీ రూ.2,050 కోట్లు జమ చేశారు. ఫలితంగా 2023–24లో ఏపీ దేశంలోనే నాలుగో స్థానంలో నిలిచింది. జాతీయస్థాయిలో అత్యుత్తమ దిగుబడి సాధించిన 20 జిల్లాల్లో ఏపీకి చెందిన ప్రకాశం, అనంతపురం, వైఎస్సార్, అన్నమయ్య, శ్రీసత్యసాయి జిల్లాలు ఉండటం విశేషం. గత ప్రభుత్వం రూ.162 కోట్లు ఖర్చు చేసి 83వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ను ప్రోత్సహిస్తే ఈ ప్రభుత్వం ఐదేళ్లలో రూ.171.87 కోట్లు ఖర్చు చేసి 1.02 లక్షల ఎకరాల్లో ప్రోత్సహించింది. ఓఈఆర్ కింద గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.80 కోట్లను జగన్ ప్రభుత్వం చెల్లించగా, 32వేల మంది రైతులు లబ్ధి పొందారు. ఆరోపణ: ఉద్యాన రైతుకు చేయూత ఏదీ? వాస్తవం: గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన ఆర్బీకేల ద్వారా ఉద్యాన రైతులకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా నిలుస్తోంది. నాణ్యమైన దిగుబడులే లక్ష్యంగా ఐదేళ్లలో 8757 తోటబడుల ద్వారా 2.63లక్షల మంది రైతులకు శిక్షణ ఇచ్ఛింది. గత ఐదేళ్లలో రూ.2 కోట్ల రాయితీతో ఫ్రూట్ కవర్లను పండ్ల రైతులకు పంపిణీ చేసింది. దేశంలోనే ప్రప్రథమంగా ఉద్యాన పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించిన ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను నిలిపింది. క్వింటా అరటికి రూ.800, పసుపునకు రూ.6,850, ఉల్లికి రూ.770, బత్తాయికి రూ.1,400, మిర్చికి రూ. 7.000 చొప్పున కనీస మద్దతు ధరలు ప్రకటించింది. ఆరోపణ: ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలెక్కడ? వాస్తవం: టీడీపీ ఐదేళ్లలో 360 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పితే ఈ ఐదేళ్లలో రూ.460 కోట్లతో 3,843 మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటయ్యాయి. వీటితోపాటు రూ.3,600 కోట్లతో పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిలో సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుచేశారు. రూ.58.57 కోట్లతో వేరుశనగ ప్రాసెసింగ్ యూనిట్‌తోపాటు జిల్లాకు ఒకటి చొప్పున రూ.57 కోట్లతో 13 మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటయ్యాయి. కర్నూలు జిల్లా పత్తికొండలో రూ.12.05 కోట్లతో టమాటా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నారు. రూ.15.50 కోట్లతో రాయలసీమ ప్రాంతంలో 20 ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్లు, 20 పాలీ హౌస్‌లు, షేడ్నెట్లు నిర్మిస్తున్నారు. ఇప్పటికే 4 యూనిట్లు వినియోగంలోకి వచ్చాయి. 500 టన్నుల సామర్థ్యంతో 3వేల టమాటా, ఉల్లి సోలార్ డీ హైడ్రేషన్ యూనిట్స్ ఏర్పాటు లక్ష్యం కాగా, ఇప్పటికే కర్నూలు జిల్లాలో 250 యూనిట్లు వినియోగంలోకి వచ్చాయి. పులివెందులలో రూ.4 కోట్లతో బనానా క్లస్టర్, ఎల్.కోటలో రూ.2.5కోట్లతో నువ్వుల ఆయిల్, చిక్కీల క్లస్టర్ యూనిట్ ఏర్పాటయింది. రాజంపేటలో రూ.290 కోట్లతో, నంద్యాలలో రూ.165 కోట్లతో టమాటా, పండ్ల గుజ్జు, విలువ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు. జీఐఎస్–2023లో ఉద్యనవన రంగానికి సంబంధించి రూ.5,765 కోట్లతో 33 ఒప్పందాలు చేసుకోగా, ఇప్పటికే రూ.3,921 కోట్ల పెట్టుబడులు రాగా, మరో 455 కోట్ల పెట్టుబడులు పురోగతిలో ఉన్నాయి. -
కంది రైతుకు ‘మద్దతు’కు మించి ధర
సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రైతుల నుంచి నేరుగా కందులు కొనుగోలు చేసేందుకు శ్రీకారం చుట్టింది. అదీ.. మద్దతు ధరకు మించి.. మార్కెట్ రేటుతో సమానంగా చెల్లిస్తోంది. దీంతో కంది రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యాన ఈ సీజన్లో దాదాపు 20వేల టన్నుల కందులు సేకరించనుంది. ఇప్పటికే అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కొనుగోళ్లు ప్రారంభించింది.కేంద్రం క్వింటా కందుల మద్దతు ధర రూ.7 వేలుగా ప్రకటించింది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు మార్కెట్లో ఉన్న రేటుకే రూ. 9,500 నుంచి రూ.10 వేలు చెల్లించి కొంటోంది. రెండు మూడు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తోంది. రైతుకు ఈ ఖర్చులూ మిగులు ఇప్పటివరకు రైతులు కందులను మార్కెట్‌కు తీసుకువెళ్లి విక్రయించాల్సి వచ్చేది. ఇందుకోసం గోనె సంచులు, హమాలీలు, రవాణాకు (జీఎల్టీ) పెద్ద మొత్తంలో రైతుకు ఖర్చయ్యేది. రైతుకు ఈ బాధలన్నీ తప్పిస్తూ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే గ్రామాల్లోనే ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేస్తోంది. గోనె సంచులు, రవాణా, హమాలీ సౌకర్యాలను కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేస్తోంది. దీంతో రైతుకు వ్యయప్రయాసలు తగ్గిపోయాయి. ఒకవేళ రైతులే సొంతంగా జీఎల్టీని సమకూర్చుకుంటే టన్నుకు రూ.746 అదనంగా వారి ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది. పొలం నుంచి పీడీఎస్‌లోకి ప్రస్తుతం మార్కెట్లో కిలో కందిపప్పు రూ.140కిపైగా ఉంది. పౌర సరఫరాల శాఖ రేషన్ లబ్దిదారులకు సబ్సిడీపై కిలో రూ.67కే అందిస్తోంది. కిలో రూ.170కిపైగా ఉన్నప్పుడు కూడా ఇదే ధరకు ఇచ్ఛింది. ఇటీవల మార్కెట్లో కందిపప్పుకు డిమాండ్ పెరగడంతో భారీగా వెచ్చించి కొనాల్సిన పరిస్థితి. జాతీయ స్థాయి నోడల్ ఏజెన్సీ అయిన హైదరాబాద్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ అసోసియేషన్ (హాకా) వద్ద కూడా నిల్వలు లేకపోవడంతో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా నేరుగా రైతుల నుంచే కొని, ప్రాసెసింగ్, మిల్లింగ్ చేసి రేషన్ లబ్దిదారులకు ఇచ్చేందుకు పౌరసరఫరాల సంస్థ చర్యలు చేపట్టింది. ఈ సీజన్లో ఇప్పటివరకు 2,500 టన్నులు కందులు సేకరించింది. ఇందులో 600 టన్నులకు పైగా కందిపప్పును ప్రాసెసింగ్, మిల్లింగ్ చేసి వినియోగదారులకు సరఫరా చేస్తోంది. ఊర్లోనే కొన్నారు.. మూడు రోజుల్లో డబ్బు జమ చేశారు నా పేరు చేజాల పెద్దరాజు. అనంతపురం జిల్లా ఉరవకొండ. కొంత సొంత భూమి, మరికొంత కౌలుకు తీసుకుని 27 ఎకరాల్లో కంది సాగు చేశాను. గతంలో పంట కోత పూర్తయిన తర్వాత బళ్లారి, రాయచూర్ మార్కెట్‌కు తీసుకెళ్లి అమ్మేవాళ్లం. ఈ మార్కెట్లు మా ప్రాంతం నుంచి 50 నుంచి 120 కిలో మీటర్లకు పైగా దూరం ఉండటంతో రవాణాకు ఎక్కువ ఖర్చయ్యేది. ఈసారి రాష్ట్ర ప్రభుత్వమే మా ఊర్లో ఆర్బీకేలో కొనుగోలు కేంద్రం పెట్టింది. క్వింటాకు రూ.9,370 చొప్పున చెల్లించింది. సుమారు 80 క్వింటాళ్లు విక్రయించా. మూడు రోజుల్లోనే నాకు రూ.7 లక్షలకుపైగా నగదు జమైంది. ప్రభుత్వమే రవాణా, గోనె సంచులు సమకూర్చింది. ఒకప్పుడు మేము ఎంతో కష్టపడి మార్కెట్ వరకు తీసుకెళ్తే వచ్చే ధర ఇప్పుడు అధికారులు మా దగ్గరకే వచ్చి మరీ కొని, డబ్బులు జమ చేయడం సంతోషంగా ఉంది. నిరంతరం సరఫరా చేసేలా ప్రభుత్వం నేరుగా రైతుల నుంచి మద్దతు ధరకు మించి ధర ఇచ్చి కందులు కొనడం ఇదే ప్రథమం. దీనివ్లల రైతుకు, రేషన్ లబ్ధిదారులకు ఎంతో మేలు జరుగుతుంది. స్థానికంగా పండించిన పంటను స్థానిక అవసరాలకు వినియోగిస్తే సమయం, అదనపు భారం తగ్గుతాయి. బయట మార్కెట్లపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉండదు. నిరంతరాయంగా వినియోగదారులకు పంపిణీ చేయొచ్చు. – హెచ్.అరుణ్‌కుమార్, ఎక్స్అఫీషియో సెక్రటరీ, ఏపీ పౌరసరఫరాల శాఖ మార్కెట్ రేటు ప్రకారమే.. ఈ సీజన్లో 20వేల టన్నులకు పైగా కందుల సేకరణపై దృష్టిపెట్టాం. పంట దిగుబడి ఎక్కువగా వచ్చే ప్రకాశం, పల్నాడు ప్రాంతాల్లో కొనుగోళ్లు వేగంగా ఉన్నాయి. ఈ–క్రాప్ ప్రామాణికంగా వాస్తవ రైతులకు మార్కెట్ రేటు ప్రకారం ధర ఇస్తున్నాం. జీఎల్టీ సైతం వారి ఖాతాల్లోనే జమ చేస్తున్నాం. – జి.వీరపాండియన్, ఎండీ, ఏపీ పౌరసరఫరాల సంస్థ -
Fact Check: మీ రాతలే కల్తీ
సాక్షి ప్రతినిధి, ఏలూరు: పాడిందే పాడరా పాచిపళ్ల దాసరా అన్న చందంగా ఒక అబద్ధాన్ని పదేపదే రాసి నిజం చేయాలనే రామోజీ తాపత్రయం ఈనాడులో అడుగడుగునా కొట్టొచ్ఛినట్లు కనిపిస్తుంది. రెండేళ్ల క్రితం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో అనారోగ్యం, ఇతర కారణాలతో కొంతమంది మృతిచెందారు. టీడీపీ అనుకూల సోషల్ మీడియాలో కల్తీ సారా మరణాలని విష ప్రచారం మొదలుపెట్టారు. జిల్లా కలెక్టర్, ఆర్డీవో, ఇతర అధికారులు ప్రతి మరణంపై సమగ్ర విచారణ చేపట్టారు. కుటుంబసభ్యులతో మాట్లాడిన అనంతరం సాధారణ మరణాలని, కల్తీ సారా మరణాలు కావని తేల్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా అసెంబ్లీలో స్పష్టంగా మాట్లాడి అనారోగ్య మరణాలను చిల్లర రాజకీయాల కోసం వాడుకోవడం సరికాదని పచ్చ మీడియా గోబెల్స్‌ను తిప్పికొట్టారు. అయినా తన ఎల్లో మీడియా ‘ఈనాడు’లో కల్తీ రాతలు రామోజీ ఆపలేదు. ‘సారాక్షసి మింగినా సాయం అందలేదు’ అంటూ విషపు కథనాన్ని వండివార్చారు. ఆరోపణ: కల్తీ సారా వల్ల మరణాలు. వాస్తవం: 2022 మార్చి 6 నుంచి 12 మధ్య అనారోగ్య కారణాలు, వృద్ధాప్య కారణాలతో జంగారెడ్డిగూడెంలోని నాలుగు శ్మశాన వాటికల పరిధిలో 18 మంది మృతిచెందారు. మృతుల్లో కొందరికి మద్యం అలవాటు ఉంది. అనారోగ్య కారణాలు కూడా ఉండటంతో మరణాలు సంభవించాయి. 25 వేల మందికి పైగా జనాభా ఉన్న జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో నెలకు సగటున 20 నుంచి 25 మరణాలు అధికారిక లెక్కల్లో నమోదవుతున్నాయి. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలు అత్యుత్సాహంతో కల్తీ సారా తాగి ఇద్దరు మరణించారంటూ 2022 మార్చి 4న సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. 12న 25 మందికి పైగా మృతి.. అంటూ పోస్టులు పెట్టారు. అప్పటి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహించి జంగారెడ్డిగూడెం, బుట్టాయగూడెం సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో డోర్ టు డోర్ హెల్త్ సర్వే నిర్వహించాలని ఆదేశించారు. జంగారెడ్డిగూడెం, బుట్టాయగూడెంలో ప్రత్యేక వైద్యశిబిరాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వాసుపత్రిలో మృతిచెందిన నలుగురు కుటుంబ సభ్యులతో ప్రత్యేకంగా మాట్లాడి మృతికి కారణాలు తెలుసుకోవడంతోపాటు వైద్యుల నివేదికలు పరిశీలించారు. ఈ విచారణలో అన్నీ అనారోగ్య కారణాలతో సంభవించిన మరణాలేనని, మరణించిన వారిలో కొందరికి మద్యం అలవాటు ఉందని, అయితే మృతికి మద్యం కారణం కాదని తేలింది. చంద్రబాబు వెంటనే శవ రాజకీయాలకు తెరతీశారు. 2022 మార్చి 14న చంద్రబాబు జంగారెడ్డిగూడెంలో పరామర్శ యాత్ర పేరుతో రాజకీయ యాత్ర నిర్వహించారు. 26 మంది చనిపోయారని ప్రతి ఇంటికీ వెళ్లి పరామర్శిస్తానని నానా యాగీ చేశారు. చివరకు సెంటర్లో సభ పెట్టి సభా వేదిక వద్దకే మృతుల కుటుంబాలను పిలిచి చేతిలో కొంత డబ్బు పెట్టి.. సారా తాగి చనిపోయారని చెప్పమని కోరినా.. వారినుంచి స్పందన రాలేదు. బుట్టాయగూడెంలో సత్యనారాయణ (73) పదేళ్ల నుంచి ఆస్తమాతో బాధపడుతూ మృతి చెందితే జంగారెడ్డిగూడెంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆ మరణాన్ని కూడా సారా మరణమని ప్రచారం చేశారు. దీనిపై సత్యనారాయణ కుటుంబ సభ్యులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆరోపణ: ఇంతవరకూ సంక్షేమం అందలేదు. వాస్తవం: మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి కనీస సాయం గాని, ఎలాంటి సంక్షేమ పథకాలు గాని అందలేదని, వారు బాగా ఇబ్బందిపడుతున్నారంటూ అడ్డగోలు కథనం ప్రచురించారు. దీనిపై మృతుల కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీమా పరిహారంతో పాటు పలు సంక్షేమ పథకాలు తమకు అందాయని వారు తెలిపారు. రూ. లక్ష బీమాతో పాటుపింఛన్ నా భర్త చింతపల్లి సూరిబాబు మృతిచెందాక బీమా రూ.లక్ష ఇచ్చారు. నాకు వితంతు పింఛన్ రూ.3 వేలు వస్తోంది. పట్టణంలో జగనన్న లేఅవుట్లో ఇచ్చిన ఇంటి స్థలంలో ఇంటి నిర్మాణం పూర్తయి ఫినిషింగ్ పనులు జరుగుతున్నాయి. మా పెద్దబ్బాయి రమేష్ ఐటీఐ చదివాడు. రెండేళ్లు జగనన్న విద్యాదీవెన అందింది. చిన్న కొడుకు కౌశిక్‌కి గతేడాది 10వ తరగతి పూర్తయ్యే వరకు ఏటా రూ.15 వేల చొప్పున అమ్మ ఒడి అందించారు. – చింతపల్లి రత్నకుమారి, జంగారెడ్డిగూడెం అన్ని విధాలా ‘చేయూత’ నా భర్త బంకూరు రాంబాబు మృతిచెందాక నాకు రూ.3 వేలు పింఛను వస్తోంది. చేయూత పథకంలో నాలుగు విడతలుగా ఏటా రూ.18,750 చొప్పున వస్తోంది. డ్వాక్రా రుణం రూ.27 వేలు మాఫీ అయ్యింది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు. – బంకూరి నాగేశ్వరమ్మ, జంగారెడ్డిగూడెం పథకాలతో ఆదుకున్నారు నా భర్త మృతిచెందే నాటికి నేను, నా భర్త విడిగా ఉంటున్నాం. అప్పటి నుంచి నాకు ఒంటరి మహిళ పింఛన్ వస్తోంది. నా తండ్రి బంకూరి రాంబాబు, నా భర్త ఆనంద్ అదే సమయంలో మృతిచెందారు. నాకు ప్రస్తుతం రూ.3 వేలు పింఛన్ వస్తోంది. నా కొడుకు బీటెక్ చదువుకుంటున్నాడు. మూడేళ్లుగా వరుసగా విద్యా దీవెన అందుతోంది. నాకు డ్వాక్రా రుణం రూ.27 వేలు మాఫీ అయ్యింది. – తలారి రామలక్ష్మి, జంగారెడ్డిగూడెం -
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుపతి: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ కొనసాగుతోంది. 15 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారని ఆలయ అధికారులు వెల్లడించారు. టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 18గంటల సమయం పడుతుందని టిటిడి పేర్కొంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 63,831 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,367 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 7 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 5 గంటల సమయం పడుతోంది. శ్రీవారి హుండీ ఆదాయం 3.36 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. -
నాడు బతుకు భయం..నేడు కొండంత ధైర్యం..
అర్చకత్వం వారి వృత్తి. గ్రామంలో ఉన్న శివాలయాన్నే నమ్ముకుని ఓ కుటుంబం జీవిస్తోంది. సొంత భూమి లేదు. కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసే శక్తి లేదు. ఆలయానికి చెందిన రెండెకరాల భూమి వేరేవారి ఆదీనంలో ఉంది. దానిపై వచ్చే ఆదాయం అంతంతమాత్రమే. భూమి సొంతం చేసుకునేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. చివరకు వారు ఎంతిస్తే అంత తీసుకుని బతుకు గడిచిపోతే చాలనుకున్న స్థితికి చేరుకున్నారు. దేవాలయానికి వచ్చే భక్తులు ఇచ్చిన దక్షిణలతోనే వారి కుటుంబపోషణ సాగుతోంది. దీనికి తోడు పుట్టిన కొడుకు, కూతురు ఇద్దరూ బధిరులే. ఇద్దరిలో కొడుక్కు అతికష్టమ్మీద పెళ్లి చేసినా... కూతురుకు పెళ్లికాక జీవితాంతం తమతోనే గడపాల్సి వస్తోంది. కట్టుకునేందుకు సరైన బట్టలే లేని వారికి ఉండే ఇల్లు ఎలా ఉంటుందో వేరే చెప్పనవసరం లేదు. ఆదుకోవాల్సిన గత ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోలేదు. ప్రస్తుత ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ఆ కుటుంబాన్ని ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులనుంచి గట్టెక్కించింది. బతుకుపై మళ్లీ ఆశలు కల్పించింది. ఇదీ శ్రీకాకుళం జిల్లా బూర్జ గ్రామానికి చెందిన వారణాసి కుమార స్వామి, శ్యామలాంబ కుటుంబ గాథ. (ఎ.చంద్రశేఖరరావు, విలేకరి, బూర్జ) అడగకుండానే.. అన్నీఇచ్చిన జగనన్న ప్రభుత్వం 2019లో రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక పరిస్థితులన్నీ చక్కబడ్డాయి. కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకుంది. ఏదో రకంగా ఏడాది పొడవునా ప్రభుత్వం నుంచి సహాయం అందుతోంది. ఇంటి ఇల్లాలు శ్యామలాంబకు వైఎస్సార్ఆసరా(రుణమాఫీ), వైఎస్సార్ సున్నా వడ్డీ, కుమార స్వామికి పింఛన్, కొడుకు, కూతురుకు దివ్యాంగ పింఛన్లు, కొడుకు చంద్రశేఖర్ కుట్టు పని నేర్చుకోవడంతో మెషీన్ ఉన్నందున జగనన్న చేదోడు అందుతున్నాయి. అతని భార్య పేరున కాలనీలో ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సాయం అందింది. ఇప్పుడు పనులు పురోగతిలో ఉన్నాయి. వారి పిల్లలు బడికి వెళ్తున్నందున అమ్మ ఒడి నిధులు జమవుతున్నాయి. తమకు ఎలాంటి కష్టం వచ్చినా ఈ ప్రభుత్వం ఆదుకోగలదన్న నమ్మకం ఏర్పడింది. ఇప్పుడు ఆ కుటుంబం ఎంతో దర్జాగా బతికేస్తోంది. మా ఆర్థిక సమస్యలన్నీ తీరాయి మా ఆర్థిక సమస్యలన్నీ తీరాయి వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక మా ఆర్థిక సమస్యలన్నీ తీరాయి. టీడీపీ ప్రభుత్వం హయాంలో ఒక్క నయాపైసా సహాయం అందలేదు. కుటుంబ ఖర్చులకు కూడా నానా అవస్థలు పడేవాళ్లం. చిన్నపాటి అవసరాలకూ అప్పులు చేయాల్సి వచ్చేది. మా ఇద్దరు పిల్లలూ బధిరులే అయినా ఎలాంటి సాయమూ అందలేదు. ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతీ నెల పండగే. ఏదో ఒక పథకం ద్వారా ఆర్థిక సహాయం అందుతోంది. తద్వారా మేము నిశ్చింతగా జీవిస్తున్నాం. మా కుటుంబానికి ఈ ఐదేళ్ల కాలంలో సుమారు రూ. ఏడు లక్షలకు పైబడి లబ్ధి చేకూరింది. ప్రస్తుత ప్రభుత్వంలో ఏ కష్టం వచ్చినా దానిని ప్రభుత్వం సాయంతో ఎదుర్కోగలమనే నమ్మకం ఏర్పడింది. మా అబ్బాయి చంద్రశేఖర్‌కు ప్రభుత్వం అందజేసిన ప్రోత్సాహంతో కొత్త కుట్టుమెïÙన్ కొన్నాం. బట్టలు కుట్టుకుంటూ వచ్చిన కుట్టుకూలితో ఆనందంగా బతుకు తున్నాం. రూ. 10 లక్షలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. – వారణాసి కుమార స్వామి సుస్థిర ఆర్థిక వ్యవస్థకు దోహదం వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక అమలు చేస్తున్న వివిధ రకాల సంక్షేమ పథకాల వల్ల ప్రతీ కుటుంబంలోనూ ఆర్థిక సమస్యలు పరిష్కారం అయ్యాయి. రైతులకు వైఎస్సార్ రైతుభరోసా వల్ల వ్యవసాయం కోసం అప్పు చేయాల్సిన బాధ తప్పింది. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ వల్ల నిరుపేదలకు అత్యవసర వేళ కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందుతోంది. పిల్లల చదువు తల్లి దండ్రులకు భారం కాకుండా అమ్మ ఒడి, బతుకుపై భరోసా కల్పించేందుకు పింఛన్లు అందుతున్నాయి. ఇంకా ఉన్నత విద్యకోసం విద్యాదీవెన, వసతి దీవెన, నిరుపేదలకు ఇళ్లు వంటివి ఎంతోమందికి అందాయి. దీనివల్ల ఆర్థిక లావాదేవీలు విస్తృతంగా జరిగి వారిలో కొనుగోలు శక్తి పెరుగుతోంది. దీనివల్ల వ్యాపారుల ఆర్థిక పరిస్థితి మెరుగు పడింది. ప్రభుత్వం చేసిన ఆర్థిక సహాయం వల్ల పరోక్షంగా రాష్ట్రంలో సుస్థిర ఆర్థిక వ్యవస్థ ఏర్పడటానికి ఎందో ఉపయోగపడుతోంది. – కె.కె.కామేశ్వరరావునాయుడు, ఎకనమిక్స్ లెక్చరర్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, బూర్జ గత ప్రభుత్వ హామీలు నీటిమీద రాతలు 2014లో లెక్కలేనన్ని హామీలతో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం వాటిని అమలు చేయలేదు. ఫలితంగా కమారస్వామి లాంటి వారి ఆశలు అడియాసలయ్యాయి. డ్వాక్రా రుణమాఫీ కాకపోవడం... కొత్తగా పింఛన్లు మంజూరు కాకపోవ డం... మరే ఇతర సౌకర్యాలు అందకపోవడంతో ఆ కుటుంబం అల్లాడిపోయింది. ఏనాటికైనా ప్రభుత్వ సహాయం అందకుండా పోతుందా... అని నెలల తరబడి నిరీక్షించినా ఎలాంటి ఫలితం లేకపోయింది. పిల్లల పోషణకు తోడ్పాటు అందక, కుటుంబ అవసరాలు తీర్చే ఆధారం లేక, ఒంటికి కష్టం వస్తే నయం చేయించుకునే శక్తి లేక, పెరిగిన కుటుంబానికి తగినంత ఇల్లు లేక రోజు వారీ బతుకులు భారమై పో యాయి. అప్పుడప్పుడు పస్తులు ఉండాల్సి వచ్చేది. -
ఇంగ్లిష్.. భవిత భేష్
మన పిల్లలు ఇంగ్లిష్ చదువులు చదివి పెద్ద ఉద్యోగాలు చేయాలి.. ఐఐటీ, ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో చదివి తమ ప్రతిభను చాటాలి.. కేవలం కార్పొరేట్ కళాశాలల విద్యార్థులకే ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాలా? ప్రభుత్వ బడుల్లో చదివే మన పిల్లలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో ప్రవేశాలు కలేనా.. ఎన్నో ఏళ్ల నుంచి సామాన్య, పేద వర్గాల తల్లిదండ్రులను తొలిచే ఈ ప్రశ్నలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యా సంస్కరణలతో సమాధానమిచ్చారు. మన పిల్లలకు ఇంగ్లిష్ మీడియం చదువుల్ని అందుబాటులోకి తెచ్చారు. ‘‘ఒకటో తరగతి నుంచే ఇంగ్లిష్ మీడియం బోధన.. 3వ తరగతి నుంచి సబ్జెక్టు టీచర్ విధానం.. 1000 ప్రభుత్వ స్కూళల్లో సీబీఎస్ఈ సిలబస్ 2025 జూన్ నుంచి ఐబీ సిలబస్ మన చిన్నారులకు ట్యాబ్‌లతో డిజిటల్ బోధన’’ – సాక్షి, అమరావతి ♦ డిజిటల్ విద్య కోసం 8వ తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులకు రూ.1,306 కోట్లతో 9,52,925 ఉచిత బైజూస్ కంటెంట్ ట్యాబ్‌ల పంపిణీ ♦ ఆరో తరగతి నుంచి ఆపైన రూ.838 కోట్లతో ప్రతి తరగతిలోను 62 వేల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్(ఐఎఫ్‌పీ), ప్రాథమిక పాఠశాలల్లో 45 వేల స్మార్ట్ టీవీల ఏర్పాట మూడో తరగతి నుంచే టోఫెల్ శిక్షణ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేదింటి పిల్లలు ఉన్నత చదవులకు వచ్చేసరికి ఇంగ్లిష్ భాషపై పట్టు అవసరమని ప్రభుత్వం భావించి తెలుగు, ఇంగ్లిష్‌లో పాఠాలు మిర్రర్ ఇమేజ్ విధానంలో ముద్రించి బైలింగ్వుల్ పాఠ్యపుస్తకాలను ప్రభుత్వం అందించింది. ఒకటో తరగతి నుంచే ఇంగ్లిషు బోధనను అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థులు ప్రాథమిక స్థాయి నుంచే ఇంగ్లిష్ పై పట్టు సాధించేలా, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచేందుకు అమెరికాకు చెందిన ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్విసెస్ (ఈటీఎస్)తో టోఫెల్ శిక్షణ అందిస్తోంది. టోఫెల్ ప్రైమరీలో 3 నుంచి 5 తరగతులకు, టోఫెల్ జూనియర్లో 6 నుంచి 9 తరగతుల విద్యార్థులకు శిక్షణనిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మంది ప్రభుత్వ పాఠశాల పిల్లలకు ఈ సదుపాయం లభించింది. మన ఇంగ్లిష్ విద్యపై ప్రసంశలజల్లు ♦ ‘‘ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బైలింగువల్ పాఠ్యపుస్తకాలను అందించడం గొప్ప పరిణామం– కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ కితాబు..’’ ♦ ‘‘ప్రాథమిక స్థాయి నుంచి నాణ్యమైన విద్య అందించడంలో పనితీరు అద్భుతంగా ఉంది: కేంద్ర పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖ కార్యదర్శి సంజయ్ కుమార్’’ ♦ ‘‘మహారాష్ట్ర, ఒడిశా, అసోం, హరియాణా, ఛత్తీస్‌గఢ్, మిజోరాం, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, నాగాలాండ్, గుజరాత్, పుదుచ్చేరి, కేరళ, తెలంగాణ, అండమాన్ –నికోబార్, డామన్ డయ్యూ, దాద్రానగర్ హవేలీ విద్యాశాఖాధికారులు మన సంస్కరణలు తమ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలుకు సిద్ధం’’ ♦ ‘‘అమెరికాలోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై జరిగిన ఉన్నత స్థాయి సదస్సులో 140 దేశాల దేశాల విద్యావేత్తలు మన విద్యా సంస్కరణలపై ప్రశంసలు’’ విద్యార్థుల చెంతకు డిజిటల్ పాఠాలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 4 నుంచి 10 తరగతుల విద్యార్థులకు ఉత్తమ కంటెంట్‌ను ఉచితంగా అందించేందుకు దేశంలోనే అతిపెద్ద ఎడ్ టెక్ కంపెనీ అయిన బైజూస్‌తో ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు ఈ కంటెంట్‌ను ఇంటర్ విద్యార్థులకు కూడా అందించడం విశేషం. ఎనిమిదో తరగతి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కలిపి 2021–22, 2022–23 విద్యా సంవత్సరాల్లో 9.53 లక్షల మందికి బైజూస్ కంటెంట్‌తో ఉచితంగా ట్యాబ్‌లు ఇచ్చి, విద్యార్థులు ఇంటి వద్ద కూడా డిజిటల్ పాఠాలు నేర్చుకునేలా చర్యలు తీసుకుంది. డిజిటల్ పాఠాలు ట్యాబ్స్‌తో పాటు 16 లక్షల మంది విద్యార్థులు తమ తల్లిదండ్రుల మొబైల్స్‌లో కూడా చూడడం విశేషం. ఏపీ ఈ పాఠశాల మొబైల్ యాప్, దీక్ష వెబ్సైట్, డీటీహెచ్ చానెళ్లు, యూట్యూబ్ చానెల్ వంటి వాటి ద్వారా నిరంతరం ప్రభుత్వం పాఠాలను అందిస్తోంది. దీంతో విద్యార్థులు ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా చదువుకునే ఏర్పాటు చేసింది. సబ్జెక్టుల్లో సందేహాలను నివృత్తి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘ఏఐ’ టెక్నాలజీతో పనిచేసే ‘డౌట్ క్లియరెన్స్ బాట్’ యాప్‌ను రూపొందించింది. ఇది ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్, టోఫెల్ శిక్షణలో ఎదురయ్యే క్లిష్టమైన సందేహాలను నివృత్తి చేస్తుంది. సీబీఎస్ఈ బోధన రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలు జాతీయ, అంతర్జాతీయంగా పోటీపడేలా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. అందుకు అనువైన బోధన కోసం మొదటి విడతగా ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వం 1,000 పాఠశాలల్లో సీబీఎస్ఈ బోధన ప్రారంభించింది. ఇప్పుడు తొమ్మిదో తరగతి చదువుతున్న ఈ స్కూళ్లలోని విద్యార్థులు 2024–25 విద్యా సంవత్సరంలో తొలిసారి పదో తరగతి పరీక్షలు సీబీఎస్ఈ విధానంలో రాయనున్నారు. హైస్కూల్ లో ఉత్తీర్ణులైన బాలికలు చదువు మానేయకుండా ప్రభుత్వం ప్రతి మండలంలో బాలికల కోసం ఒక జూనియర్ కళాశాల ఏర్పాటు చేసింది. 292 ఉన్నత పాఠశాలలు బాలికల కోసం హైస్కూల్ ప్లస్‌గా అప్‌గ్రేడ్ చేశారు. మొత్తం 352 కేజీబీవీల్లో ఇంటర్మీడియట్ ప్రవేశపెట్టారు. 2022–23 నుంచి 14 కో–ఎడ్ జూనియర్ కళాశాలలను బాలికల జూనియర్ కళాశాలలుగా మార్చారు. దీంతో మొత్తం 679 మండలాల్లో బాలికల కోసం ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల చొప్పున అందుబాటులోకి వచ్చింది. బోధన, పాఠ్యాంశాల్లో సంస్కరణలు విద్యార్థుల్లో నేర్చుకునే తత్వం, జిజ్ఞాస పెంచేలా ప్రభుత్వం పాఠ్యాంశాల్లో సంస్కరణలు తీసుకొచ్చింది. 21వ శతాబ్దపు నైపుణ్యాలు అందిపుచ్చుకునేలా, ఫౌండేషనల్ అక్షరాస్యత ప్రోత్సాహం కోసం క్లాస్రూమ్ బేస్డ్ అసెస్మెంట్ అమలు చేస్తోంది. 3 నుంచి 10 తరగతుల విద్యార్థులకు సబ్జెక్ట్ టీచర్లను అందించారు. అన్ని పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయుల అవసరాలు తీర్చేందుకు దాదాపు 25 వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించారు. ఉపాధ్యాయుల్లో బోధనా సామర్థ్యాలు పెంచేందుకు, సీబీఎస్ఈ బోధనకు అనగుణంగా ‘టీచర్ కెపాసిటీ బిల్డింగ్’ శిక్షణ ఇచ్చారు. ఇందుకోసం ఇఫ్లూ, రివర్సైడ్ లెర్నింగ్ సెంటర్లలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఐబీ సిలబస్ బోధన ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ఏడాది ఉపాధ్యాయులకు ఐబీ సిలబస్ బోధనపై శిక్షణకు చర్యలు ప్రారంభించారు. ప్రపంచ వేదికలపై మెరిసేలా ఐబీ విద్య మన పేదింటి పిల్లలు ప్రపంచానికి దిక్సూచిగా మారాలన్న సీఎం జగన్ ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువులు సమున్నతంగా మారాయి. ఇంగ్లిష్ మీడియం బోధన, సీబీఎస్ఈ సిలబస్ అమలుతో ఆగిపోకుండా ప్రభుత్వ బడుల్లోకి ఇప్పుడు ‘ఇంటర్నేషనల్ బాకలారియేట్(ఐబీ) బోధనను కూడా తేస్తోంది. ఇప్పటిదాకా దేశంలో 210 వరల్ట్ క్లాస్ కార్పొరేట్ స్కూళ్లలో సంపన్నుల పిల్లలకు మాత్రమే చదువుకొనగలిగే ఐబీ బోధన 2025 జూన్ నుంచి ప్రారంభం కానుంది. తొలి ఏడాది ఒకటో తరగతి నుంచి ప్రారంభమై ఏటా ఒక తరగతి చొప్పున ఐబీ బోధన పెంచుతూ 2037 నాటికి +2 వరకు విద్యనందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. విద్యార్థులకు క్రిటికల్. లేటరల్, డిజైన్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ వంటి నైపుణ్యాలు అందించడంతో పాటు భవిష్యత్ రంగాల్లో రాణించేలా, ప్రపంచ వ్యాప్తంగా ఉపాధి పొందేలా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. -
మళ్లీ రెడీ.. మోసం గ్యారంటీ
రైతాంగానికి చంద్రబాబు చేసిన దగా అంతా ఇంతా కాదు. అసలు వ్యవసాయమే దండగ అని చెప్పిన ఘనుడు. నేల తల్లిని నమ్ముకున్న రైతుల్ని నిట్టనిలువునా ముంచేశారు. రైతులు తీసుకున్న వ్యవసాయ రుణాలన్నింటినీ బేషరతుగా మాఫీ చేస్తానని పీఠంపైకి ఎక్కిన తర్వాత అన్నదాతల పీక నులిమేశారు. చివరికి అధికారంలోకి రావడానికి వక్రమార్గాలన్నీ ఎంచుకుని అబద్ధాలతో ఐదేళ్లపాటు రైతుల జీవితాలతో ఆడుకున్నారు. ఆయన జీవితమంతా అబద్ధాలతోనే గడిచిపోయింది. ‘పులి–బంగారు కడియం’ కథలో మాదిరిగా బాబు గద్దెనెక్కడానికి చేయని వాగ్దానం లేదు. కుర్చీ ఎక్కగానే వ్యవసాయ రుణాల మాఫీలో కోతలకు కోటయ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఫలితంగా రూ.87,612 కోట్ల రుణాలను రూ.25 వేల కోట్లకు కుదించి, చివరికి రూ.15 వేల కోట్ల లోపే మాఫీ చేసిన జిత్తులమారి ‘నారా’ కపట నాటకానికి రైతులు ఆత్మార్పణం చేసుకోవలసి వచి్చంది. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వకుండా కూడా ఎగ్గొట్టిన మోసకారి చంద్రబాబు. అలాంటాయన ఇప్పుడు మళ్లీ మన ముందుకు సరికొత్త కపట హామీలతో వస్తున్నారు. సాక్షి, అమరావతి: వ్యవసాయ రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానంటూ 2014 ఎన్నికల సభల్లో హామీలు గుప్పించిన చంద్రబాబు తీరా అధికారంలోకి వచ్చాక మాట మార్చేశారు. వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తానని తాను చెప్పలేదన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో వ్యవసాయ రుణాల మాఫీ ఫైలుపై తొలి సంతకం చేస్తానని పేర్కొన్న చంద్రబాబు తీరా ప్రమాణం స్వీకారం చేసిన తరువాత ఫైలుపై సంతకం చేయకపోగా, రుణ మాఫీలో ఎలా కోతలు పెట్టాలనే అలోచనతో కోటయ్య కమిటీ ఏర్పాటు చేస్తూ తొలి సంతకం చేశారు. అదీ పంట రుణాల మాఫీకి మా త్రమే లబ్ధిని పరిమితం చేశారు. కోటయ్య కమిటీ లో చంద్రబాబు తనకు అత్యంత ఇషు్టడైన కుటుంబరావును చేర్చారు. అప్పటి నుంచి వ్యవసాయ రు ణాల మాఫీని ఎలా కుదించాలనే దానిపై కసరత్తు చేశారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటూ కొత్త విధానా న్ని తీసుకువచ్చి రైతాంగాన్ని ఇబ్బంది పెట్టారు. షరతులతో కత్తెరలు రైతులకు బ్యాంకులు నిర్ధారించిన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కన్నా ఎక్కువ పంట రుణాలిస్తే ఆ రుణాలు మాఫీ పరిధిలోకి రావంటూ కత్తెర పెట్టారు. ఆ తరువాత వ్యవసాయ అవసరాలకు రైతులు బ్యాంకుల్లో బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలపై ఆంక్షలు విధించారు. ఒక కుటుంబంలో ఎంత మంది ఎంత రుణం తీసుకున్నా ఆ కుటుంబం మొత్తానికి రూ.1.50 లక్షల వరకే మాఫీ అని షరతు విధించారు. బ్యాంకుల్లో బంగారాన్ని తాకట్టు పెట్టుకునే సమయంలో పంట రుణాలని రాయకపోతే వాటిని రుణ మాఫీ నుంచి తొలగించేశారు. రైతులు ఆధార్, రేషన్ కార్డులు ఇస్తేనే మాఫీ వర్తిస్తుందని షరతు విధించారు. తొలుత 2014 మార్చి వరకు ఉన్న రుణాలు, వడ్డీ మాఫీ చేస్తామని చెప్పి తరువాత 2013 డిసెంబర్ నెలాఖరు వరకు ఉన్న రుణాలు, వడ్డీ మా త్రమే మాఫీ చేస్తామని ప్రకటించారు. ఒకే సారి రుణ మాఫీ సాధ్యం కాదని, దశల వారీగా చేస్తామ ని ఎక్కువ మంది రైతుల ఖాతాలను తప్పించేశారు. మాట మార్చి.. రైతులను ఏమార్చి 2014 జూన్ 29న చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో వ్యవసాయ రుణాలు రూ.87,612 కో ట్లు, డ్వాక్రా సంఘాల రుణాలు రూ.14,204 కోట్లు ఉన్నాయ ని బ్యాంకర్ల కమిటీ స్పష్టం చేసింది. ఒకే సారి రైతులు, డ్వాక్రా సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తే అభ్యంతరం లేదని ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రభుత్వానికి తెలిపారు. అయితే రుణాల మాఫీ తరువాత చూద్దమని ముందుగా గత ఖరీఫ్‌లో కరువు, తుఫాను ప్రభావం గల 575 మండలాల్లో రైతుల రుణాలను రీ షెడ్యూల్‌పై ఆర్బీఐతో మాట్లాడాల్సిందిగా చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆర్బీఐ మొత్తం మండలాల్లో రైతు ల రుణాల రీ షెడ్యూల్ సాధ్యం కాదని స్పష్టం చేసింది. వడపోతలు, ఏరివేతలు తరువాత మొత్తం రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాల్లో కేవలం 25 వేల కోట్లకు రుణ మాఫీని కుదించేసి నాలుగు దశల్లో చెల్లిస్తామని షరతులు విధించింది. తొలుత రూ.50 వేలలోపు చెల్లిస్తామని, రూ.50 వేలు దాటిన రుణాలకు రైతు ధ్రువీకరణ పత్రాలను చెల్లిస్తామని మోసం చేశారు. నమ్మక ద్రోహానికి ఫలితంగా ఆత్మహత్యలు 2019 ఎన్నికల ముందు నాటికి కేవలం రూ.15 వేల కోట్ల లోపు మాత్రమే రుణ మాఫీకి చంద్రబాబు సర్కారు హామీ ఇచ్చింది. అరకొర రుణ మాఫీతో రైతులు మరింత అప్పులు ఊబిలోకి కూరుకుపోయారు. వడ్డీ భారం అమాంతం పెరిగిపోయింది. మరో పక్క 2015 ఏడాది నుంచి 2016 వరకు వ్యవసాయ రుణాల కోసం బంగారం బ్యాంకుల్లో కుదువ పెట్టి 35,24,549 మంది రైతులు రూ.26,055.18 కోట్లు పంట రుణాలు తీసుకుంటే అందులో సవాలక్ష షరతులు విధించి కేవలం రూ.3,366.80 కోట్లకు మాఫీని కుదించారు. దీంతో బంగారంపై రుణాల తీసుకున్న రైతుల పేర్లతో బ్యాంకులు వేలం నోటీసులు ఇవ్వడమే కాకుండా వాటిపై పత్రికల్లో ప్రకటనలు వేశాయి. దీంతో చాలా మంది రైతుల ఆత్మాభిమానం కోల్పోయి అవమాన భారాన్ని తట్టుకోలేక ఆవేదనతో ఆత్మహత్యలు చేసుకున్నారు. -
తీరాన్ని శోధించేందుకు సిద్ధం
సాక్షి, విశాఖపట్నం: ఉష్ణమండల తుపానులు... రుతుపవన సీజన్లో వచ్చే వరదలు... సముద్రమట్టాల పెరుగుదల... మడ అడవుల విస్తీర్ణం తగ్గుదల... పెరుగుతున్న కాలుష్య కారకాల కారణంగా సాగర తీరంలో సంభవిస్తున్న పెను మార్పులు... కోతకు గురవుతున్న తీరప్రాంతాలు... ఇటువంటి విపత్తులన్నింటినీ నియంత్రించేందుకు తీసుకోవాల్సి న ముందుజాగ్రత్త చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పరిశోధిస్తోంది. ఈ తరుణంలో మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అనుబంధ సంస్థ నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్(ఎన్‌సీసీఆర్) ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంత పరిరక్షణకు నడుం బిగించింది. తీరంలో తలెత్తుతున్న అలజడులపై రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పరిశోధనలు నిర్వహిస్తూ, సమస్యల పరిష్కారానికి ముందస్తు చర్యలు తీసుకునేలా పక్కా ప్రణాళికలతో అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా విశాఖపట్నంలోని డాల్ఫిన్ నోస్‌పై రీసెర్చ్ సెంటర్‌ను నిర్మించింది. రూ.62 కోట్ల వ్యయంతో 5.5 ఎకరాల విస్తీర్ణంలో ఎన్‌సీసీఆర్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. పరిశోధన కేంద్రంతోపాటు ఎర్త్ సైన్స్ విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణ కేంద్రాన్ని కూడా సిద్ధం చేసింది. లేబొరేటరీ, పరిశోధన భవనం, వర్క్‌షాప్, ఆడిటోరియం, సెమినార్ హాల్, గెస్ట్ హౌస్, హాస్టల్, ఇతర భవనాలు కూడా నిర్మించింది. దీనిని ఈ నెల 14న కేంద్ర ఎర్త్ సైన్స్ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రారంభించనున్నారు. ప్రస్తుతం ఎన్‌సీసీఆర్ తాత్కలిక కేంద్రం ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఎన్విరాన్మెంట్ విభాగం భవనంలో నిర్వహిస్తున్నారు. దీన్ని డాల్ఫిన్నోస్లో నిర్మించిన నూతన భవనంలోకి నెల రోజుల్లో తరలిస్తారు. ఎన్‌సీసీఆర్ ఏం చేస్తుందంటే... ♦ ఆంధ్రప్రదేశ్ తీరంలో ఉన్న సమస్యలపై విశాఖలోని ఎన్‌సీసీఆర్ కేంద్రం పరిశోధనలు నిర్వహించనుంది. ♦ మొత్తం 972 కిలో మీటర్ల తీరం వెంబడి ఏయే సమస్యలు ఉన్నాయనేది ఎన్‌సీసీఆర్ స్వయంగా పరిశీలించనుంది. ప్రతి అంశంపై పరిశోధనలు నిర్వహించి వాటి పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కృషిచేస్తుంది. ♦ సముద్ర తీరంలో ఎక్కడ, ఎంత మేర కాలుష్యమవుతోంది. దీనివల్ల మత్స్య సంపద, జీవరాశులకు ఎలాంటి విఘాతం కలుగుతోంది. కాలుష్యం వల్ల సముద్రంలో వస్తున్న మార్పులు, మడ అడవుల విస్తీర్ణం తగ్గడం వల్ల తలెత్తుతున్న ప్రమాదాలు వంటి వాటిపై నిరంతరం పరిశోధనలు నిర్వహిస్తుంది. ♦ ఇప్పటికే దేశవ్యాప్తంగా షోర్లైన్ మేనేజ్మెంట్ అట్లాస్ సిద్ధం చేసిన ఎన్‌సీసీఆర్... త్వరలోనే ఆంధ్రప్రదేశ్ షోర్లైన్ మేనేజ్మెంట్ ప్లాన్‌ను కూడా తయారు చేయనుంది. దీనిద్వారా ఏయే తీర ప్రాంతాలు కోతకు గురవుతున్నాయి.. వాటిని ఎలా పరిష్కరించాలనే విషయంపై స్పష్టత ఇవ్వనుంది. దానిప్రకారం ముందు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. ♦ సముద్రజలాల నాణ్యతను పర్యవేక్షిస్తుంది. ప్రిడిక్షన్ ఆఫ్ కోస్టల్ వాటర్ క్వాలిటీ(పీడబ్ల్యూక్యూ), ఎకో సిస్టం సర్వీస్, సముద్ర తీర ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు వంటి అంశాలపై కూడా పరిశోధనలు చేస్తుంది. ♦సముద్రంలో చేరుతున్న కాలుష్య కారకాలు, పెరుగుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలపైనా దృష్టి సారిస్తుంది. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ఏం చర్యలు చేపట్టాలనే అంశంపై పరిశోధనలు చేసి నివేదికను రూపొందిస్తుంది. దాని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి తగిన చర్యలు చేపడతారు. -
అక్కచెల్లెమ్మల జీవితాల్లో వెలుగులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మల జీవితాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెలుగులు నింపారని వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత తెలిపారు. జగనన్న గెలుపు.. ఈ రాష్ట్రంలోని మహిళల గెలుపు.. అని ఆమె అన్నారు. సంక్షేమ పథకాల్లో లబ్ధిపొందిన వారిలో బీసీ మహిళలే అధికమని.. అన్ని రంగాల్లో మహిళలకు సీఎం జగన్ అగ్రస్థానం కల్పించారని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తొలుత పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాళ్లు, ఎమ్మెల్సీలు పోతుల సునీత, వరుదు కల్యాణి, పార్టీ సీనియర్ నాయకురాలు వాసిరెడ్డి పద్మ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పోతుల సునీత మాట్లాడుతూ ‘అమ్మఒడి, ఆసరా, సున్నా వడ్డీ, చేయూత, 31 లక్షల ఇళ్ల పట్టాలు, 22 లక్షల ఇళ్ల నిర్మాణం, దిశ యాప్, మహిళా పోలీసు.. ఇవన్నీ గతంలో ఎప్పుడూ జరగని విధంగా మన పార్టీ అధ్యక్షుడు సీఎం అయ్యాకే తీసుకొచ్చారు. ఇవన్నీ ప్రతి అక్కచెల్లెమ్మకు కొనసాగాలంటే జగనన్న ప్రభుత్వానికి అండగా ఉండాలని, ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని ప్రతి ఓటరుకు చెప్పాలి.’ అని పేర్కొన్నారు. ప్రతీ మహిళా స్టార్ క్యాంపెయినర్‌గా పనిచేయాలి: వరుదు కళ్యాణి వరుదు కళ్యాణి మాట్లాడుతూ ‘ఈ ఐదేళ్లలో డీబీటీ ద్వారా రూ.2.55లక్షల కోట్లు పేదల ఖాతాల్లో సీఎం జగన్ జమచేశారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఇలా ఎప్పుడైనా చేశారా? సీఎం జగన్ మహిళా పక్షపాతి. ఇవాళ రాష్ట్రంలోని ఏ గ్రామానికి వెళ్లినా ఓ విలేజ్ సెక్రటేరియట్, విలేజ్ క్లినిక్, నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు కనిపిస్తాయి. వీటన్నింటిలో ఎక్కువ ఉద్యోగాలు పొందింది మహిళలే. నాడు–నేడుతో కొత్తరూపు సంతరించుకున్న బడులు, ఆస్పత్రులూ కనిపిస్తాయి. ఇవన్నీ ఈ 57 నెలల కాలంలోనే సీఎం వైఎస్ జగన్ చేశారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికే దక్కుతుంది. ప్రతి మహిళ ఒక స్టార్ క్యాంపెయినర్ అయి వచ్చే ఎన్నికల్లో పనిచేయాలి.’ కోరారు. ఎన్నికల్లో ప్రచారం కోసం రాజీనామా చేశా: వాసిరెడ్డి పద్మ వైఎస్సార్సీపీ సీనియర్ నాయకురాలు వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని కోట్లాదిమంది మహిళలు హారతి పడుతూ సీఎం వైఎస్ జగన్‌కు బిగ్ థాంక్స్ చెబుతున్నాం. కుటుంబంలో ఎవరూ ఇవ్వని సమానత్వం సీఎం జగన్ ఇచ్చారు. మహిళల పేరిట ఇళ్ల పట్టాలిచ్చి ఇళ్లు నిర్మిస్తున్నారు. ఇలా ప్రతి పథకంలోనూ మహిళలకు ఇచ్చిన ప్రాధాన్యతతో వారికి గుర్తింపు, సమానత్వం వచ్చింది. ‘వై నాట్ 175’ అనే సీఎం జగన్ నినాదాన్ని నిజంచేసే శక్తి మహిళలకు ఉంది. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ ప్రభుత్వానికి మద్దతుగా ప్రచారం చేయడానికి మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేశాను.’ అని వివరించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో రాణించిన మహిళలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మహిళా విభాగం నాయకురాళ్లు అమ్మాజీ, బండి పుణ్యశీల, బెందాళం పద్మావతి, డాక్టర్ శశికళ, భవానీ, నాగమణి, సంపత్ విజితా, ఏబీ రాణి, రజనీ, డాక్టర్ షమా సుల్తానా, మాధవీ వర్మ, రాజేశ్వరి, పార్టీ ఉపాధ్యక్షులు, జోనల్ కమిటీ చైర్మన్లు, మహిళా అడ్వొకేట్లు తదితరులు పాల్గొన్నారు. -
మనకు లక్షల ఉద్యోగాలిచ్చిన జగన్ ప్రభుత్వ ప్రతిష్టను పెంచుదాం
సాక్షి, అమరావతి: ‘వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మూడు నెలల్లోనే మారుమూల గ్రామీణ ప్రజలకు సైతం సొంత గ్రామాల్లోనే సంపూర్ణంగా ప్రభుత్వ సేవలందించే లక్ష్యంతో రాష్ట్రంలో కొత్తగా గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థ ద్వారా 1.36 లక్షల మందికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలిచ్చారు. మరో 2.66 లక్షల మందిని వలంటీర్లగా నియమించారు. తద్వారా లక్షలాది మంది నిరుద్యోగ యువత ఉపాధి పొందారు. అందువల్ల మనకు లక్షల ఉద్యోగాలిచ్చిన సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ ప్రతిష్టను మనమూ పెంచుదాం’ అంటూ ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి సచివాలయాల ఉద్యోగులకు ఒక బహిరంగ లేఖలో విజ్ఞప్తి చేశారు. ఏపీజీఈఎఫ్ సెక్రటరీ జనరల్ అరవ పాల్, సచివాలయాల ఉద్యోగుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ సుధాకర్, వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ, ట్రెజరర్ మధుబాబు తదితరులతో కలిసి శుక్రవారం అనంతపురంలో ఈ లేఖను విడుదల చేశారు. బహిరంగ లేఖలోని ముఖ్యాంశాలు.. ఇచ్చిన మాట ప్రకారం.. ‘వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర సందర్భంగా ప్రతి గ్రామంలో సచివాలయాన్ని ఏర్పాటు చేసి 10 మంది ఉద్యోగులను నియమించి ప్రజలు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగే అవసరం రాకుండా అన్ని సేవలూ గ్రామంలో వారి ఇంటి దగ్గర అందిస్తామని చెప్పినప్పుడు కొందరు హేళన చేశారు. కానీ ప్రజలు నమ్మారు. బ్రహ్మరథం పట్టారు. చెప్పిన మాట ప్రకారమే వైఎస్ జగన్ సీఎం అయిన మూడు నెలల్లోనే పాలనా వ్యవస్థలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించారు. కొన్ని సమస్యలు ఉండొచ్చు.. కానీ.. సచివాలయాల ఉద్యోగులకు సమస్యల్లేవని, అందరూ సంతోషంగా ఉన్నారని చెప్పడం నా ఉద్దేశం కాదు. సమస్యలు ఒకటి పోతే ఒకటి రిటైరయ్యే వరకు వస్తూనే ఉంటాయి. వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించుకుందాం. సీఎం వైఎస్ జగన్ ఎన్నో కష్టనష్టాలకోర్చి సచివాలయాల వ్యవస్థను రూపుదిద్దుతుంటే ఓర్చుకోలేని కొందరు ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారు. ప్రొబేషన్ ఖరారు కాకముందు ఎంత మంది హేళన చేశారో అందరికీ తెలుసు. ఒక మాజీ మంత్రి మేం అధికారంలోకి వస్తే సచివాలయాల ఉద్యోగులను తొలగిస్తామని అన్నట్టు వార్తలు వచ్చాయి. మరో ముఖ్య నాయకుడు ఈ వ్యవస్థ పనికిమాలినదని అన్నాడు. ఇంకో నాయకుడు ఈ వ్యవస్థలో భాగమైన వలంటీర్ల గురించి నీచంగా మాట్లాడాడు. కానీ ఈరోజు ఎవరైనా మన సచివాలయ వ్యవస్థను టచ్ చేయగలరా? ఒకవైపు ఈ వ్యవస్థ గురించి అవమానకరంగా మాట్లాడుతూ ఉద్యోగుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని కొందరు చూస్తుంటే.. సీఎం జగన్ సచివాలయాల ఉద్యోగులపై నమ్మకముంచి కీలకమైన స్థానం కల్పించారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. రాజకీయ, వ్యాపార ప్రయోజనాల కోసం ప్రజలను రెచ్చగొట్టడానికి కొన్ని చానళ్లు, పత్రికలు విషపు రాతలతో అసత్యాలు ప్రచారం చేస్తూ మానసిక దాడి చేస్తున్నాయి. ఈ దుష్ప్రచారాలను అడ్డుకోవాల్సిన బాధ్యత సచివాలయ ఉద్యోగులపైనే ఉంది. ప్రజలకు వాస్తవాలు వివరించడానికి ఉద్యోగులందరూ ప్రతి ఒక్కరూ రోజుకు ఇద్దరిని చైతన్యం చేయాలి. ఇలా రాబోయే 50 రోజుల్లో కనీసం వంద మందిని చైతన్యం చేయాలని కోరుతున్నా’ అనివెంకట్రామిరెడ్డి ఆ బహిరంగ లేఖలో పేర్కొన్నారు. ఇంకెవరన్నా అయితేనా.. ‘వైఎస్ జగన్ కాకుండా వేరే ఎవరైనా సచివాలయాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి, అమలు చేయాలనుకుంటే.. ఈ వ్యవస్థ ఏర్పాటుకు సంవత్సరం పట్టేది. ఆ తర్వాత ఉద్యోగాల నియామక నోటిఫికేషన్‌కు మరో సంవత్సరం, పరీక్షలకు ఇంకో సంవత్సరం, నియామకాలకు మరో సంవత్సరం తీసుకొనేవారు. 2024 ఎన్నికలకు నియామకాలు చేపట్టి, ఆ తర్వాత ఎన్నికల్లో గెలిపిస్తేనే ప్రొబేషన్ ఇస్తామని ఓట్ల రాజకీయం చేసేవారు. కానీ, మన ముఖ్యమంత్రి అవేమీ ఆలోచించకుండా ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే మూడు నెలల్లోనే ఇంత పెద్ద వ్యవస్థకు ప్రాణం పోశారు. తర్వాత 010 పద్దు కింద జీతాలు ఇచ్చారు. ప్రసూతి సెలవులు ఇచ్చారు. ప్రొబేషన్ ఖరారులో ఇబ్బంది లేకుండా శాఖాపరమైన పరీక్షల్లో నెగెటివ్ మార్కులు తొలగించారు. సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు చేసిన తర్వాత కరోనా రూపంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవడంతో సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్ వాయిదా వేయాలని అధికారులు ఎంత ఒత్తిడి తెచ్చినా సీఎం జగన్మోహన్రెడ్డి పట్టించుకోలేదు. ప్రొబేషన్ డిక్లేర్ చేసి, కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ఇచ్చారు.’ అని వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. -
‘ఏఐ’ బడి
చీపురుపల్లి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) శకం ఆరంభమైంది. ఇప్పటి వరకు రాష్ట్రంలోని కార్పొరేట్ స్కూళ్లలో సైతం ఎక్కడా లేని విధంగా విజయనగరం జిల్లా చీపురుపల్లిలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇంటెల్ ఇండియా సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ అధునాతన ఏఐ ల్యాబ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది రాష్ట్రంలోనే తొలి ఏఐ ల్యాబ్ కావడం విశేషం. ఈ ల్యాబ్ పేద పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయనుంది. రానున్న రోజుల్లో మరిన్ని అధునాతన ల్యాబ్‌ల ఏర్పాటుకు మార్గదర్శి కానుంది. సమాజానికి ఉపయోగపడే ఆధునిక ఆవిష్కరణలకు దోహదపడనుంది. ‘ఏఐ ఫర్ యూత్’ పేరుతో నాలుగు సెషన్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్‌లలో ‘ఏఐ ఫర్ యూత్’ అనే పేరుతో నాలుగు సెషన్లలో 8, 9 తరగతుల విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. మొదటి సెషన్లో ఇన్‌సై్పర్, రెండో సెషన్లో ఎక్వయర్, మూడో సెషన్లో ఎక్స్పీరియన్స్, నాలుగో సెషన్లో ఎంపవర్ అనే అంశాలపై శిక్షణ ఇస్తారు. ఈ నాలుగు సెషన్లు పూర్తయిన తర్వాత సమాజంలో ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులను విద్యార్థులు తయారు చేయాల్సి ఉంటుంది. రూ.15 లక్షలతో ల్యాబ్ ఏర్పాటు రాష్ట్రంలో తొలిసారిగా రూ.15 లక్షలతో చీపురుపల్లి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. ఈ ల్యాబ్‌లో తొమ్మిది అత్యాధునిక కంప్యూటర్లు, డిజిటల్ బోర్డులు, ఏసీలు ఉన్నాయి. దీనికోసం బాలుర ఉన్నత పాఠశాలలో ఒక గదిని కేటాయించారు. విద్యార్థులకు వరం ఏఐ ల్యాబ్ ఏర్పాటు చేయడం విద్యార్థులకు వరం. రాష్ట్రానికి ఒక ల్యాబ్ కేటాయిస్తే దానిని చీపురుపల్లిలో ఏర్పాటు చేయడం ఇక్కడి విద్యార్థులు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం. విద్యార్థులు ఈ ల్యాబ్‌ను సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్‌లో ఎంతో అవసరమైన అద్భుత నైపుణ్యాలు సొంతం చేసుకోవచ్చు. – ఏవీఆర్‌డీ ప్రసాద్, ఏఐ ల్యాబ్ కన్సల్టేటర్ -
శివోహం..
శ్రీశైలంటెంపుల్/సాక్షి, నరసరావుపేట/రేణిగుంట(తిరుపతి జిల్లా)/నెల్లిమర్ల రూరల్/బీచ్‌రోడ్డు (విశాఖ జిల్లా): మహాశివరాత్రిని పురస్కరించుకుని రాష్ట్రంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. ప్రముఖ శైవక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగాయి. శ్రీశైలంలో మల్లన్నకు సంప్రదాయబద్ధంగా తల పాగాలంకరణ, కోటప్పకొండలో భారీ విద్యుత్ ప్రభల ఉత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. శ్రీకాళహస్తీశ్వరాలయంలో విశేష అభిషేకాలు జరిపారు. వివిధ వాహనాలపై కొలువుతీరిన ఆది దంపతులు లక్షలాదిగా తరలివచ్చిన భక్తులను అనుగ్రహించారు... నంద్యాల జిల్లా శ్రీశైలంలో శ్రీభ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వార్ల బ్రహ్మోత్సవాలు శుక్రవారం వైభవంగా జరిగాయి. స్వామి వారు నంది వాహనంపై ఊరేగారు. వివిధ జానపద కళాకారుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. రాత్రి 10 గంటల నుంచి స్వామివారికి లింగోద్భవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరిపించారు. ఆ వెంటనే మరో వైపు పాగాలంకరణ ప్రారంభమైంది. ఆలయంలోని విద్యుత్ దీపాలను ఆర్పి వేయగా.. బాపట్ల జిల్లా హస్తినాపురానికి చెందిన పృథ్వీ వెంకటేశ్వర్లు దిగంబరుడై పాగాను అలంకరించారు. పాగాలంకరణ జరుగుతున్నంత సేపు ఆలయంలో ఓం నమఃశివాయ అంటూ శివనామస్మరణ మారుమోగింది. రాత్రి 12 గంటల సమయంలో స్వామివారి కల్యాణోత్సవం కనుల పండువగా జరిగింది. పూజా కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం, దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు, శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి దంపతులు, జిల్లా కలెక్టర్ కె.శ్రీనివాసులు, జేసీ టీ.రాహుల్ కుమార్‌రెడ్డి, రాయలసీమ జోన్ డీఐజీ సీహెచ్.విజయరావు, ఎస్పీ కె.రఘువీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంద్ర విమానం, చప్పరంపై స్వామివారి దర్శనం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వరాలయం శివనామస్మరణతో మార్మోగింది. తెల్లవారు జామున స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. పెద్దసంఖ్యలోభక్తులు దర్శించుకున్నారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి, ఆలయ ఈవో నాగేశ్వరరావు క్యూలైన్లను పర్యవేక్షించారు. కాగా ఉదయం స్వామి, అమ్మవార్లు ఇంద్ర విమానం, చప్పరంపై పురవీధుల్లో విహరించారు. రాత్రి శ్రీకాళహస్తీశ్వరుడు నంది వాహనంపై, జ్ఞానప్రసూనాంబదేవి సింహ వాహనంపై విహరిస్తూ భక్తకోటిని కటాక్షించారు. అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత ఆలయంలో స్వామి, అమ్మవార్ల లింగోద్భవ దర్శనం(నిజరూప దర్శనం) ప్రారంభం కావడంతో భక్తులు పెద్దసంఖ్యలో దర్శనానికి బారులుతీరారు. రామతీర్థంలో శివనామస్మరణ విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని వైష్ణవ పుణ్యక్షేత్రం రామతీర్థానికి శుక్రవారం ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశా రాష్టం నుంచి భక్తులు పోటెత్తారు. సాక్షాత్తు శ్రీరాముడు రామక్షేత్రంలో శివుని మంత్రాన్ని జపించారన్నది భక్తుల విశ్వాసం. రామకోనేరు గట్టు, కల్యాణ మండపం, నీలాచలగిరి పరిసర ప్రాంతాల్లో కాగడాలు వెలిగించి రాత్రంతా జాగారం చేశారు. భోగాపురం, పూసపాటిరేగ, లావేరు, రణస్థలం, భీమిలి, విశాఖపట్నం ప్రాంతాల నుంచి మత్స్యకారులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి ప్రతిమను మధ్యలో ఉంచి చుట్టూ వృత్తంలా ఏర్పడి సంప్రదాయ బద్ధంగా నృత్యాలు చేశారు. ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు బోడికొండ పర్వతంపై శిఖర జ్యోతిని వెలిగించారు. ఎస్పీ దీపిక పాటిల్, దేవదాయశాఖ కమిషనర్ రామ సత్యనారాయణ, తదితరులు ఉత్సవాలను పర్యవేక్షించారు. సాగర తీరంలో మహా కుంభాభిషేకం శివ నామస్మరణతో విశాఖ సాగరతీరం హోరెత్తింది. కేంద్ర మాజీ మంత్రి టి.సుబ్బరామిరెడ్డి కళాపీఠం ఆధ్వర్యంలో 39వ మహా కుంభాభిషేకం ఆర్కే బీచ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కుంభాభిషేకాన్ని శ్రీశారదపీఠం పీఠాధిపతులు శ్రీస్వరూపానందేంద్ర సరస్వతి, శ్రీస్వాత్మానందేంద్ర సరస్వతి, టి.సుబ్బరామిరెడ్డి ప్రారంభించారు. అంతకు ముందు వీరభద్రస్వామి పూజ నిర్వహించారు. భక్తులకు రుద్రాక్షలు, పసుపుతాళ్లు పంపిణీ చేశారు. కోటప్పకొండలో ప్రభల ఉత్సవం పల్నాడు జిల్లా నరసరావుపేట సమీపంలోని ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండ మహాశివరాత్రిని పురస్కరించుకుని శుక్రవారం భక్తజనసంద్రంగా మారింది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు శ్రీత్రికోటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున రెండు గంటలకు బిందె తీర్థంతో స్వామి వారికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులను దర్శనానికి అనుమతించారు. కోటప్పకొండ ప్రత్యేకతను చాటే ప్రభల ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. 20 భారీ విద్యుత్ ప్రభలతో పాటు చిన్న చిన్న ప్రభలు ప్రభల నిధికి చేరాయి. ప్రభల వద్ద భక్తుల సందడితో కోలాహలం నెలకొంది. రాత్రి స్థానిక ఎమ్యెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. శ్రీత్రికోటేశ్వరస్వామిని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కంచిరెడ్డి సురే‹Ùరెడ్డి, బి.కృష్ణమోహన్, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, ప్రభుత్వ విప్‌లు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నరసరావుపేట పార్లమెంట్ సమన్వయకర్త అనిల్‌కుమార్ యాదవ్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు, ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, మాజీ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్, ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, మురుగుడు హనుమంతురావు, వెంపాడ చిరంజివి దర్శించుకున్నారు. గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు, పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి, ఎస్పీ రవిశంకర్‌రెడ్డి, జేసీ శ్యాంప్రసాద్ స్వామి వారి సేవలో పాల్గొన్నారు. -
విద్యుత్ కనెక్షన్ మూడు రోజుల్లోనే..
సాక్షి, అమరావతి : కొత్త ఇంటికి విద్యుత్ కనెక్షన్ ఇకపై మరింత వేగంగా రానుంది. ఇప్పటి వరకూ అమల్లో ఉన్న నిబంధనల మేరకు ఉన్న గడువును కేంద్రం తగ్గించింది. సగానికి పైగా రోజులను కుదిస్తూ తాజాగా ఉత్తర్వులిచ్చింది. ఇందు కోసం విద్యుత్ చట్టం, 2003లోని సెక్షన్ 176 ప్రకారం విద్యుత్ (వినియోగదారుల హక్కులు) రూల్స్, 2020లో సవరణలు చేసింది. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఈ కొత్త నిబంధన ప్రకారం.. మహా నగరాల్లో(మెట్రోపాలిటన్) నివసించే వారు మూడు రోజుల నుంచి గరిష్టంగా ఏడు రోజుల్లోనే విద్యుత్ కనెక్షన్లు పొందొచ్చు. మున్సిపల్ పట్టణ ప్రాంతాల్లో 15 రోజుల నుంచి ఏడు రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 30 రోజుల నుంచి 15 రోజులకు గడువు తగ్గిస్తూ మార్పులు చేశారు. ఇక కొండ ప్రాంతాలున్న గ్రామీణ ప్రాంతాలు కొత్త కనెక్షన్లు గానీ, ఇప్పటికే ఉన్న కనెక్షన్లలో మార్పులుగానీ చేసుకోవడానికి కనీస వ్యవధి 30 రోజులుగా నిర్ణయించారు. తాజా నిబంధనల మేరకు ఎలక్ట్రిక్ వాహనాలకు(ఈవీ) ఇంటి వద్దే చార్జింగ్ పెట్టుకోవడానికి ప్రత్యేక విద్యుత్ కనెక్షన్ పొందొచ్చు. పీఎం సూర్య ఘర్ పథకంలో భాగంగా ఏడాదిలో కోటి గృహాలకు రూఫ్‌టాప్ సోలార్‌ను ఏర్పాటు చేస్తామని, ప్రతి నెలా 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందిస్తామని కేంద్రం ఇటీవల ప్రకటించింది. దీనికి తోడ్పాటుగా భవనాలపై రూఫ్‌టాప్ సోలార్ పీవీ సిస్టంల ఏర్పాటుకు డిస్ట్రిబ్యూషన్ లైసెన్సీ కాల పరిమితినీ 30 నుంచి 15 రోజులకు తగ్గించారు. నాణ్యమైన సేవలు.. వినియోగదారుల హక్కు కనెక్షన్ కోసం దరఖాస్తు చేసిన వారికి విద్యుత్ సరఫరా చేయడం ప్రతి డిస్కం ప్రాథమిక విధిగా కొత్త నిబంధనలో స్పష్టం చేశారు. అలాగే డిస్కంల నుంచి నాణ్యమైన సేవలను పొందడం వినియోగదారుల హక్కుగా నిబంధనల్లో పేర్కొన్నారు. వినియోగదారుల నుంచి ఫిర్యాదులొస్తే ఫిర్యాదు అందిన తేదీ నుంచి ఐదు రోజుల్లోపు అదనపు మీటర్ ఏర్పాటు చేయాల్సి ఉంటుందని కేంద్రం ఇచ్చిన నిబంధనల్లో స్పష్టం చేశారు. కో–ఆపరేటివ్ గ్రూప్ హౌసింగ్ సొసైటీలు, బహుళ అంతస్థుల భవనాలు, కాలనీల్లో నివసిస్తున్న వారు విద్యుత్ పంపిణీ సంస్థ నుంచి వ్యక్తిగత విద్యుత్ సర్విసులు పొందొచ్చు.. లేదా మొత్తం ప్రాంగణానికి సింగిల్ పాయింట్ కనెక్షన్ తీసుకోవచ్చు. అయితే మీటర్ లేకుండా కనెక్షన్ ఇవ్వకూడదని షరతు విధించారు. సాధ్యమైనంత వరకూ స్మార్ట్ ప్రీ పెయిడ్ మీటర్లు పెట్టాలని, బిల్లులు ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో ముందుగా కూడా చెల్లించొచ్చని పేర్కొన్నారు. -
ముందే హీటెక్కిన సీమ
సాక్షి, విశాఖపట్నం: ఈ ఏడాది రాయలసీమలో వేసవి సెగలు ముందే మొదలయ్యాయి. ఫిబ్రవరి నెలాఖరు నుంచే ఎండల తీవ్రత పెరుగుతోంది. మార్చి మొదటి వారం నుంచి మరింతగా విజృంభిస్తున్నాయి. ఏప్రిల్ నెలారంభంలో నమోదు కావాల్సిన పగటి (గరిష్ట) ఉష్ణోగ్రతలు ఇప్పటినుంచే రికార్డవుతున్నాయి. ప్రస్తుత ఉష్ణతాపాన్ని చూసి మున్ముందు ఇంకెంత తీవ్రతను చవి చూడాల్సి వస్తుందోనన్న ఆందోళన ఆ ప్రాంత వాసుల్లో నెలకొంటోంది. సాధారణంగా ఏప్రిల్ ప్రారంభం నుంచి 40 డిగ్రీలు, అంతకుమించి పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కానీ.. ఈ ఏడాది అందుకు భిన్నంగా మార్చి ఆరంభంలోనే 41 డిగ్రీలకు పైగా చేరుకుంటున్నాయి. ఈ నెల 2న శనివారం అనంతపురంలో 41, కర్నూలు 39, నంద్యాల, కడపలో 38 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 3న అనంతపురంలో 39, కర్నూలులో 39, నంద్యాల, కడపలో 38, 4న అనంతపురంలో 40, కర్నూలులో 39, నంద్యాల, కడపల్లో 38 డిగ్రీలు, 5న 4న అనంతపురంలో 40, కర్నూలులో 39, నంద్యాల, కడపల్లో 38 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొన్నాళ్లుగా రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలకంటే రాయలసీమలోనే ఉష్ణతాపం అధికంగా కనిపిస్తోంది. అక్కడ సాధారణం కంటే 3–4 డిగ్రీలు అధికంగా ఉంటోంది. రాష్ట్రంలో విశాఖపట్నం, కళింగపట్నం మినహా అన్ని ప్రాంతాల్లో 33 నుంచి 37 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దక్షిణ, ఉత్తర కోస్తాల్లో రాయలసీమ కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు రికార్డవుతుండటం ఆ ప్రాంత వాసులకు ఒకింత ఊరటనిస్తోంది. సెగలకు ఇదీ కారణం కోస్తాంధ్ర కంటే రాయలసీమలో పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవడానికి గాలిలో తేమ తక్కువగా ఉండటమే కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా గాలిలో తేమ తక్కువగా ఉంటే ఉష్ణతాపం పెరగడానికి దోహదపడుతుంది. ఈ తేమ 50 శాతం కన్నా తగ్గే కొద్దీ వేడి అధికమవుతుంది. కొద్ది రోజులుగా రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, కడప, నంద్యాలలో తేమ 19 నుంచి 26 శాతం మాత్రమే ఉంటోంది. అందువల్ల అక్కడ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల కంటే అధిక ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. వారంలో మరింత భగభగ రానున్న వారం రోజుల్లో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం కొన్నిచోట్ల సాధారణంకంటే 2–3 డిగ్రీలు అధికంగా నమోదవుతుండగా.. వారం పది రోజుల్లో అవి 4–5 డిగ్రీలకు ఎగబాకే అవకాశం ఉందని చెబుతున్నారు. -
పప్పు ధాన్యాల సేకరణ షురూ
సాక్షి, అమరావతి: రబీ పంట ఉత్పత్తుల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గత నెలలో శనగల కొనుగోలుకు అనుమతి ఇచ్చి న ప్రభుత్వం.. తాజాగా మినుము, పెసలు, వేరుశనగ సేకరణకూ అనుమతి ఇవ్వడంతో ఆర్బీకేల ద్వారా కొనుగోలుకు ఏపీ మార్క్‌ఫెడ్ ఏర్పాట్లు చేసింది. రబీ 2023–24 సీజన్లో 7 లక్షల ఎకరాల్లో శనగ, 7.50 లక్షల ఎకరాల్లో మినుము, 1.92 లక్షల ఎకరాల్లో పెసలు, 1.61 లక్షల ఎకరాల్లో వేరుశనగ పంటలు సాగయ్యాయి. శనగ 5.26 లక్షల టన్నులు, మినుము 3.89 లక్షల టన్నులు, వేరుశనగ 1.86 లక్షల టన్నులు, పెసలు 84 వేల టన్నుల దిగుబడులొస్తాయని అంచనా వేశారు. క్వింటాల్ శనగలకు రూ.5,440, పెసలుకు రూ.8,558, మినుముకు రూ.6,950, వేరుశనగకు రూ.5,850 చొప్పున ప్రభుత్వం కనీస మద్దతు ధర నిర్ణయించింది. 2.75 లక్షల టన్నుల సేకరణకు అనుమతి కనీస మద్దతు ధరకు శనగలు 1,14,163 టన్నుల సేకరణకు గత నెలాఖరున ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తాజాగా 97,185 టన్నుల మినుము, 46,463 టన్నుల వేరుశనగ, 17,505 టన్నుల పెసలు సేకరణకు అనుమతి ఇవ్వడంతో ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేసేందుకు ఏపీ మార్క్‌ఫెడ్ ఏర్పాట్లు చేసింది. పంట నమోదు (ఈ–క్రాప్) ఆధారంగానే ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. పంట కోతల తేదీ ఆధారంగా కొనుగోలు తేదీని నిర్ధారిస్తారు. దళారుల బెడద లేకుండా బయోమెట్రిక్ తప్పనిసరి చేశారు. సేకరించిన ఉత్పత్తులను సులభంగా ట్రాక్ చేయడానికి వీలుగా సంచులకు క్యూఆర్ కోడ్/ఆర్ఎఫ్ ఐడీ ట్యాగ్ వేస్తున్నారు. మార్కెట్లో ధరలు పెరిగే అవకాశం రబీ పంట ఉత్పత్తుల సేకరణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. శనగలు, మినుము, పెసలు, వేరుశనగ సేకరిస్తున్నాం. మార్కెట్లో కనీస మద్దతు ధర దక్కని వారు ఆర్బీకేల్లో తమ పంట వివరాలను నమోదు చేసుకోవాలి. మార్కెట్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. తొందరపడి ఏ ఒక్క రైతు తమ పంట ఉత్పత్తులను ఎమ్మెస్పీ కంటే తక్కువ ధరకు అమ్ముకోవద్దు. – డాక్టర్ గెడ్డం శేఖర్‌బాబు ఎండీ, ఏపీ మార్క్‌ఫెడ్ -
రికార్డు స్థాయిలో పసుపు ధర
సాక్షి, అమరావతి: ప్రభుత్వ చర్యలు ఫలించాయి. పసుపు ధర అమాంతం పెరిగింది. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో రికార్డుస్థాయి ధర లభిస్తుండడంతో రైతుల ఆనందానికి అవధుల్లేకుండా ఉంది. క్వింటా పసుపు గరిష్టంగా కడప మార్కెట్ యార్డులో రూ.13,712 పలకగా, దుగ్గిరాల పసుపు యార్డులో రూ.13,600 పలికింది. ఈ స్థాయి ధర చరిత్రలో ఎన్నడూ లభించలేదని రైతులు చెబుతున్నారు. క్వింటా రూ.15 వేలు దాటే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. నెల తిరక్కుండానే పెరిగిన ధర రాష్ట్రంలో 2022–23 సీజన్లో 83,540 ఎకరాల్లో పసుపు సాగవగా.. 3.68 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. 2023–24 సీజన్లో వర్షాభావ పరిస్థితుల ప్రభావం వల్ల 78 వేల ఎకరాల్లో సాగైంది. హెక్టార్‌కు సగటున 11 టన్నుల దిగుబడి వచ్చింది. కేంద్రం మద్దతు ధరలు ప్రకటించే పంటల జాబితాలో లేని పసుపునకు రాష్ట్ర ప్రభుత్వం రూ.6,850 మద్దతు ధర ప్రకటించింది. మరోవైపు ధర తగ్గినప్పుడు మార్కెట్లో జోక్యం చేసుకుని రైతులకు మద్దతు ధర దక్కేలా చేస్తోంది. గతేడాది జూన్, జూలైల్లో క్వింటా రూ.5,300 నుంచి రూ.6,250 మధ్య పలకడంతో వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని రూ.36 కోట్లు వెచ్చించి 5,020 టన్నుల పసుపును మద్దతుధరకు సేకరించింది. ఫలితంగా ఆగస్టు, సెప్టెంబర్లలో క్వింటా రూ.8 వేల నుంచి రూ.11,750 పలికింది. ఆ తర్వాత ఏ దశలోను మార్కెట్లో ధర తగ్గలేదు. ప్రస్తుతం ఎమ్మెస్పీ కంటే రెట్టింపు ధర పలుకుతుండడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గురువారం కడప మార్కెట్లో కనిష్టంగా రూ.11,555, గరిష్టంగా రూ.13,712 పలికింది. దుగ్గిరాల మార్కెట్ యార్డులో కనిష్టంగా రూ.12,300, గరిష్టంగా రూ.13,600 పలికింది. బాబు హయాంలో క్వింటా రూ.6,358 మించని ధర టీడీపీ హయాంలో అసలు మద్దతు ధర ప్రస్తావనే లేదు. మార్కెట్లో వ్యాపారులు చెప్పిందే «ధర.. చెల్లించిందే సొమ్ము అన్నట్టుగా ఉండేది. ఆ ఐదేళ్లలో సగటున క్వింటాకు రూ.6,358 మించి ధర లభించిన పరిస్థితి లేదు. ఆ ఐదేళ్లలో గరిష్ట ధరలు 2014–15లో రూ.5,335, 2015–16లో రూ.7 వేలు, 2016–17లో రూ.5,755, 2017–18లో రూ.7,200, 2018–19లో రూ.6,500 ఉన్నాయి. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ ఐదేళ్లలో ఒకటి రెండు సీజన్లలో అదీ ఒకటిరెండు నెలలు మాత్రమే అంతర్జాతీయ పరిస్థితులకు తోడు దేశీయంగా పసుపు పంట ఒకేసారి మార్కెట్‌కు రావడంతో ధరలో కాస్త తగ్గుదల కనిపించింది. మిగిలిన అన్ని సీజన్లలో ప్రభుత్వ చర్యల ఫలితంగా ఎమ్మెస్పీకి మించే ధరలు పలికాయి. రెండేళ్ల పాటు గరిష్టంగా క్వింటా రూ.10 వేలకు పైనే పలికింది. టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో రూ.305 కోట్ల విలువైన 48,540 టన్నుల పసుపును సేకరిస్తే, ఈ ప్రభుత్వం 2019–20 నుంచి ఇప్పటివరకు రూ.449 కోట్ల విలువైన 57,973 టన్నుల పసుపును సేకరించింది. ప్రభుత్వ జోక్యం వల్లే.. ఐదేళ్లుగా కేంద్రం మద్దతు ధర ప్రకటించని పంట ఉత్పత్తులకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా మద్దతు ధరలను ప్రకటిస్తోంది. మార్కెట్లో ధరలు తగ్గిన ప్రతిసారి సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో ప్రభుత్వం ప్రభుత్వం జోక్యం చేసుకుని మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద రైతుల నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేస్తూ అండగా నిలుస్తోంది. ప్రతి రైతుకు ప్రతి పంటకు మద్దతు ధర దక్కేలా చేస్తోంది. ప్రస్తుతం పసుపు క్వింటా ధర గరిష్టంగా రూ.14 వేలకు చేరుకోగా, మిగిలిన పంట ఉత్పత్తులకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మార్కెట్లో రికార్డుస్థాయి ధరలు లభిస్తున్నాయి. – కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వ్యవసాయ శాఖమంత్రి ఈ రైతు పేరు ఆవుల వెంకటచినసుబ్బయ్య. వైఎస్సార్ జిల్లా పోరుమామిళ్ల మండలం బుచ్చంపల్లి గ్రామానికి చెందిన ఈయనకు పదెకరాల వ్యవసాయ భూమి ఉంది. పసుపుతో పాటు ఇతర పంటలు సాగు చేస్తుంటారు. ఇటీవలే 70 క్వింటాళ్ల పసుపును మార్కెట్ యార్డులో విక్రయించారు. క్వింటా గరిష్టంగా రూ.12,700కు పైగా అమ్ముడుపోయింది. ప్రస్తుతం క్వింటా నాణ్యతను బట్టి రూ.14 వేల వరకు కొనుగోలు చేస్తున్నారు. ఈ స్థాయిధర ఎప్పుడూ చూడలేదని వెంకటచినసుబ్బయ్య సాక్షి వద్ద తన ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వ జోక్యం వల్ల ఒక్క పసుపే కాదు.. దాదాపు ఇతర పంట ఉత్పత్తులకు మార్కెట్లో రికార్డు స్థాయిలోనే ధరలు పలుకుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. -
బాబు.. బిల్లీ.. లక్ష కోట్లు!
సాక్షి, అమరావతి: చంద్రబాబు నిజంగా విజనరీయే. 20 ఏళ్ల కిందటే రూ. లక్ష కోట్లు కొట్టేయడానికి పన్నాగం పన్నారంటే... అందుకోసం ఎవ్వరి దృష్టీ పడని క్రీడా రంగాన్ని ఎంచుకున్నారంటే ఏమనుకోవాలి. 2004లో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో తన బినామీ బిల్లీరావు అలియాస్ అహోబిలరావు చేత ‘ఐఎంజీ అకాడెమీస్ భారత్’ అనే కంపెనీని పెట్టించి... అది అమెరికాలో ఉన్న ఐఎంజీ అకాడెమీకి చెందిన కంపెనీ అని నమ్మించి... హడావుడిగా దానికి గచ్చిబౌలిలోని 400 ఎకరాలు కేటాయించి, సేల్‌డీడ్ కూడా చేసేశారంటే ఏమనుకోవాలి? శంషాబాద్ పక్కన మరో 450 ఎకరాలు కూడా కేటాయించటంతో పాటు... హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని అన్ని స్టేడియాలనూ ఆ కంపెనీకి 45 ఏళ్ల పాటు లీజుకిచ్చేసి... వాటి నిర్వహణ ఛార్జీలను కూడా ప్రభుత్వమే ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారంటే ఏమనుకోవాలి? క్రీడల ద్వారా, వాటి అడ్వర్టయిజ్మెంట్లు, స్పాన్సర్‌షిప్‌ల ద్వారా వచ్చే డబ్బులన్నీ ఐఎంజీ అకాడెమీస్కే చెందేలా భారీ దోపిడీకి పథకం వెయ్యగలిగారంటే ఆయన విజనరీయే కదా? ఇప్పటి విలువల ప్రకారం చూస్తే ఈ స్కామ్ విలువ లక్ష కోట్లపైనే. స్పై కెమెరాకు పట్టుబడిన బిల్లీ... ఈ రాష్ట్ర ప్రజల అదృష్టం బాగుంది కాబట్టే 2004 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి గెలిచారు. బాబు ఓడిపోయారు. వైఎస్సార్ ప్రభుత్వం ఐఎంజీ కేటాయింపుల్ని సమీక్షించినపుడు మొత్తం బోగస్ కంపెనీలేనని తేలటంతో ఒప్పందాన్ని రద్దు చేసి, భూమిని వెనక్కి తీసుకుంది. కానీ బాబు గారి ముఠా ఊరుకోలేదు. తమకు కోర్టుల్లో బలం ఉంది కనక... న్యాయస్థానంలో సవాల్ చేశారు. 2009 ఎన్నికల ముందు... ఈ కేసులో తీర్పు వెలువడవచ్చని బిల్లీరావు భావించారు. ఆ సమయంలో ఆయన సన్నిహితుడొకరు ఆయన్ను కలిసి.. తమ సంభాషణను స్పై కెమెరాతో రికార్డు చేశారు. వ్యవస్థ నిర్ఘాంతపోయే నిజాల్ని అప్పట్లో బిల్లీరావు వెల్లడించారు. వాటిని ‘సాక్షి’ ప్రచురించింది కూడా. అప్పట్లో అది సంచలనం కావటంతో... తీర్పు వాయిదా పడింది. న్యాయమూర్తులు మారటంతో సుదీర్ఘకాలం కొనసాగింది. తాజాగా గురువారంనాడు బిల్లీరావు తమకే కేటాయించిన భూముల్ని తమకు ఇవ్వాలంటూ వేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. అంతేకాదు... అది మొత్తం వ్యవస్థ నివ్వెరపోయే కుంభకోణమని తేల్చింది. చంద్రబాబు దోపిడీని బయటపెట్టింది. దీనిపై వైఎస్సార్ ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించగా... అప్పట్లో ఇన్ఛార్జిగా ఉన్న సీబీఐ అధికారి లక్ష్మీనారాయణ... తమకు తగిన సిబ్బంది లేరన్న సాకుతో దాన్ని చేపట్టలేదు. తాజాగా గురువారంనాడు హైకోర్టు ఈ వ్యవహారంపై వ్యాఖ్యానిస్తూ... దీనిపై సీబీఐ విచారణ ఎందుకు జరిపించలేదో చెప్పాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. లేదంటే తామే ఆదేశిస్తామని కూడా స్పష్టంచేసింది. ఈ అంశంపై సమాధానమివ్వాలంటూ అక్కడి ప్రభుత్వానికి వారం రోజుల గడువునిచ్చింది. నిజానికి అప్పట్లోనే సీబీఐ దర్యాప్తు జరిపి ఉంటే.. ఈ పాటికే బాబు దోపిడీ బయటపడి, చంద్రబాబు జైల్లో ఊచలు లెక్కబెడుతుండేవారని స్పష్టంగా చెప్పొచ్చు. బాబు... నా జేబులో ఉంటారన్న బిల్లీ తాజా పరిణామాల నేపథ్యంలో... అప్పట్లో బిల్లీరావు స్పై కెమెరాల సాక్షిగా ఏమన్నారు... బాబు ఎంత ఎంత పెద్ద దోపిడీకి స్కెచ్ వేశారు? వ్యవస్థలో ఎంతమందిని వాడేశారు? వంటి వివరాలు మరొక్కసారి చూద్దాం. ‘‘ఇదిగో తీర్పు ...ఇదే మనకు అనుకూలంగా రాబోతున్న కోర్టు తీర్పు కాపి. ఈ తీర్పును నేనే రాశాను. నేను ఏది రాస్తే అదే తీర్పుగా వస్తుంది. ఈ విషయం చంద్రబాబుకు కూడా తెలుసు. ––– కు ఎంత డబ్బులు ఇవ్వాలో చంద్రబాబే చెప్పారు. అసలు ఆయనకు ఉన్న జ్ఞాపక శక్తి అలాంటిది. ఆయనే అన్నీ చూస్తున్నారు. అర్ధరాత్రి 2 గంటలకు నిద్రలేపి అడిగినా ఈ కేసుకు సంబంధించిన అన్ని విషయాలను ఆయన చెప్పేస్తారు. నేను ఏం చెబితే చంద్రబాబు అది చేస్తారు’’. వాస్తవానికి నాటి వీడియోలో న్యాయ వ్యవస్థలోని పలువురి పేర్లను బిల్లీ వాడేశారు. ‘సాక్షి’ వాటిని ప్రచురించలేదు. ఆ వీడియో కాపీని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పంపింది కూడా. క్రీడా వ్యవస్థను చెరబట్టేందుకు పన్నాగం కేవలం కాగితాలకే పరిమితమైన ఐంఎంజీ భారత్ కంపెనీకి ఉమ్మిడి ఆంధ్ర ప్రదేశ్‌లోని యావత్ క్రీడా వ్యవస్థను ధారాదత్తం చేసేందుకు చంద్రబాబు కుతంతం్ర పన్నారు. 2004 ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం గెలిచినా, వైఎస్సార్ ప్రభుత్వం నాటి ఒప్పందాన్ని రద్దు చేయకపోయినా... రాష్ట్రంలో క్రీడా వ్యవస్థ మొత్తం ఓ మాఫియా గుప్పిట్లోకి వెళ్లిపోయేది. సామాన్యులెవ్వరూ క్రీడల్లోకి ప్రవేశించే ఆలోచన కూడా చేయలేకపోయేవారు. ఎందుకంటే ఐఎంజీ భారత్ కంపెనీతో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం అలాంటిది. కేవలం హైదరాబాద్ గచ్చిబౌలిలోని 850 ఎకరాలను కేటాయించడమే కాదు. 16 స్టేడియంలు సహా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని యావత్ క్రీడా వ్యవస్థను తన బినామీ బిల్లీ రావుకు 45 ఏళ్లపాటు లీజు పేరిట కట్టబెట్టేశారు. ఆ సమయంలో ఆ స్టేడియంలు, వాటి ఆస్తుల నిర్వహణ అంతా ఐంఎంజీ భారత్ పెత్తనం కిందకే వస్తాయి. కానీ ఏటా నిర్వహణ వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. బీమా ప్రీమియాన్నీ చెల్లిస్తుంది. స్టేడియాల నిర్వహణ కోసం ఆ కంపెనీకి ఉచిత నీరు, ఉచిత విద్యుత్, వినోద పన్ను రాయితీ, విదేశీ సుంకం రాయితీలు అన్ని వెసులుబాట్లు కల్పిస్తుంది. టీవీ ప్రసార హక్కుల ఆదాయం ఆ కంపెనీకే దక్కుతుంది. అంతేకాదు.. మరో ప్రమాదకరమైన నిబంధననూ చేర్చారు. స్టేడియంలు, వాటి ఆస్తులను ఐఎంజీ భారత్ తన విచక్షణ మేరకు నిర్ణయించిన ధరకు కొనుగోలు చేసుకోవచ్చనే క్లాజును చేర్చారు. రాష్ట్ర ప్రభుత్వం సహాయ నిరాకరణ చేస్తే ఆ క్లాజు కింద ఆ స్టేడియంలను ఐఎంజీ భారత్ తన సొంతం చేసుకునే హక్కు కల్పించడమన్న మాట. అంటే రాష్ట్రంలో 45 ఏళ్ల పాటు క్రీడా వ్యవస్థ అంతా ఐఎంజీ భారత్ కంపెనీ ముసుగులో చంద్రబాబు గుత్తాధిపత్యం కింద ఉంటుంది. ఏదో ఒక సాకు చూపించి స్టేడియంలు, వాటి ఆస్తులన కూడా ఆ కంపెనీ తాను నిర్ణయించిన నామమాత్రపు ధర కింద కొనుగోలు చేసేసుకోవచ్చు. అంటే ప్రస్తుతం చంద్రబాబు భాషలో చెప్పాలంటే... రాష్ట్రంలో క్రీడా వ్యవస్థను చంద్రబాబు కుర్చీ మాదిరి మడతపెట్టేస్తారన్నది సుస్పష్టం. కాగా న్యాయ వ్యవస్థ తన నిబద్ధతను, విశ్వసనీయతను మరోసారి చాటిచెప్పింది. చంద్రబాబు, ఐఎంజీ భారత్ కంపెనీ కుతంత్రాలను తిప్పికొట్టింది. ఐంఎంజీ భారత్‌కు అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం హైదరాబాద్‌లో 850 ఎకరాలను కేటాయించడాన్ని రద్దు చేస్తూ వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. ఆ భూకేటాయింపులు సరైన నిర్ణయమేనని తీర్పునిచ్చింది. దాంతో చంద్రబాబు భూబాగోతం బెడిసికొట్టింది. ఇపుడు సీబీఐ దర్యాప్తునకు కూడా ఆదేశిస్తే... చంద్రబాబు ఊచలు లెక్కబెట్టడం ఖాయమనేది న్యాయవర్గాల మాట. -
సీఎం జగన్ మహాశివరాత్రి శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: మహాశివరాత్రి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు అంటూ ఆయన ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రజలందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు. — YS Jagan Mohan Reddy (@ysjagan) March 8, 2024 తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శైవక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. శుక్రవార ఉదయం నుంచే భక్తులు శివాలయాలకు పోటెత్తారు. ప్రధాన ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. లింగాకార రూపుడైన శివునికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇదీ చదవండి: మహాశివరాత్రి : "శివ శివ" అంటూ తలచుకుంటే..! -
చేనేతలకు గుర్తింపు జగనన్న చలవే
పద్మశాలీయులకు జగనన్న ప్రభుత్వంలోనే ప్రత్యేక గుర్తింపు వచ్చిందని ఆంధ్రప్రదేశ్ పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ జింకా విజయలక్ష్మి అభిప్రాయపడ్డారు. గతంలో శాలీలుగా పిలిపించుకున్న తాము కార్పొరేషన్ ఏర్పాటుతో ఆ పిలుపునుంచి ఉపశమనం లభించిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 30 నుంచి 40 లక్షల వరకు ఉన్న తమ సామాజిక వర్గాలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జరిగిన మేలు, అందిస్తున్న ప్రోత్సాహంపై ఆమె సాక్షితో మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... కార్పొరేషన్‌తో అభివృద్ధికి అవకాశం చేనేత వృత్తిలో ఉన్న పద్మశాలీయుల అభివృద్ధికి గత ప్రభుత్వం ప్రత్యేకంగా చేసిందేమి లేదు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక 2020 అక్టోబర్ 18న కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. తనతోపాటు రాష్ట్రంలోని 12 జిల్లాలకు చెందిన 12 మందిని డైరెక్టర్లుగా నియమించారు. రాష్ట్రంలోని ప్రొద్దుటూరు, మంగళగిరి, విశాఖపట్నం, చీరాల, వెంకటగిరి, ధర్మవరం, తణుకు, రాజమండ్రి, పెడన, ఉప్పాడ, పొందూరు, అరకు, పాడేరు, లంబసింగి, ఎమ్మిగనూరు, ఆదోని, పత్తికొండ, నగరి, పుత్తూరు, మదనపల్లి, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో ఎక్కువగా మా సామాజికవర్గానికి చెందినవారున్నారు. పద్మశాలీయుల్లో సేనాపతులు, కైకాల, కర్ణభక్తులు, స్వకులశాలి, పట్టుశాలి వంటి ఉప కులాలున్నాయి. కార్పొరేషన్ ఏర్పాటు ద్వారానే గుర్తింపు వచ్చింది. చట్టసభల్లోనూ అవకాశం 2014 టీడీపీ ప్రభుత్వంలో పద్మశాలీయులు చట్టసభలో లేరు. 2019 వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కర్నూలు ఎంపీగా డాక్టర్ సంజీవకుమార్, ఎమ్మెల్సీగా మురుగుడ హనుమంతరావు ఉన్నారు. ఆప్కో చైర్మన్లుగా చల్లపల్లి మోహన్‌రావు, ప్రస్తుతం గంజి చిరంజీవి ఉన్నారు. రాష్ట్రంలోని ప్రొద్దుటూరు, రాయదుర్గం, వెంకటగిరి, చీరాల మున్సిపల్ చైర్పర్సన్లుగా పద్మశాలీయులే ఉన్నారు. 2024 ఎన్నికలకు సంబంధించి ఎమ్మిగనూరు నియోజకవర్గానికి బుట్టా రేణుక, మంగళగిరికి మురుగుడు లావణ్యను ఎంపిక చేశారు. విదేశీ విద్యకు ప్రోత్సాహం నేను చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యాక అనేక మందిని విదేశీ విద్య పథకంపై అవగాహన కల్పించి పంపించా. హ్యాండ్లూం టె క్స్‌టైల్స్ కార్పొరేషన్ ద్వారా జాకార్డ్, లిఫ్టింగ్ మెషీన్‌తోపాటు మగ్గం పరికరాలను సబ్సిడీపై చా లా మందికి అందించా. – ప్రొద్దుటూరు సైకత మగువ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తీరప్రాంతంలో సైకత శిల్పి మంచాల సనత్‌కుమార్ సిలికా దిబ్బలవద్ద సైకత శిల్పాన్ని రూపొందించారు. గ్రామానికి చెందిన యువతులతో కలిపి ఈ శిల్పాన్ని ప్రదర్శించారు. – చిల్లకూరు తిరుచానూరు అమ్మవారికి మా ఇంటి చీర సారె.. ఏటా తిరుచానూరులో జరిగే కార్తీక బ్రహ్మోత్సవాల్లో సింహవాహన సేవ రోజున పద్మశాలీయుల ఇంటి నుంచి చీర, సారె సమర్పించేలా ప్రభుత్వం జీఓ జారీ చేసింది. అమ్మవారికి కుట్టు బార్డర్‌తో కలిగిన 9 ఇంచుల కంచిపట్టు చీరను సమర్పిస్తున్నాం. రాష్ట్రంలోని తమ సామాజికవర్గంవారందరికీ తిరుచానూరు నుంచి ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందుతోంది. ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ రోజున స్వామివారికి చీర, సారె ఇస్తున్నాం. చేనేతల కష్టాలను గుర్తించిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని అమలు చేశారు. ఈ పథకం ద్వారా మగ్గం నేసే ప్రతి కార్మికుడి కుటుంబానికి ఏటా రూ.24వేలు చెల్లిస్తున్నారు. ఈ పథకం వచ్చాక చాలా మంది తిరిగి వృత్తిలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. పల్లెలుప్రగతిపట్టాలెక్కిపరుగులు పెడుతున్నాయి. గ్రామ సీమల స్వరూపం మారుతోంది. బాపూజీ కన్న గ్రామ స్వరాజ్యం సీఎం జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల పాలనలో సుసాధ్యమైంది. పాలకొల్లు మండలంలోని వెలివెల గ్రామంలో రూ.8.60 కోట్లతో పలు అభివృద్ధి పనులు ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలిచాయి. ఈ గ్రామంలో 817 కుటుంబాల దరికి సంక్షేమ పథకాలు చేరాయి. వివిధ ప్రభుత్వ కార్యాలయాలన్నీ మీ పల్లెకు తీసుకురావడం సీఎం జగన్ సర్కారుకే చెల్లిందని గ్రామస్తులు చెబుతున్నారు. గతంలో చిన్నచిన్న పనులకు కూడా కిలోమీటర్ల దూరం వెళ్లాల్సివచ్చిందని, ఇప్పుడు పదడుగులు దూరంలోనే సమకూర్చడంతో సమయం కలిసివస్తోందని ఆ గ్రామ పెద్దలు అంటున్నారు. – పాలకొల్లు -
సుస్థిర ప్రగతే లక్ష్యం ఆపొద్దు ఈ పయనం
‘సమాజ పురోగతిని ఆ సమాజంలో మహిళలు సాధించిన పురోగతి స్థాయిని బట్టి నేను కొలుస్తాను’ అన్న రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ మాటలను జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అక్షరాల అమలు చేస్తూ రాష్ట్రాభివృద్దికి బాటలు వేసింది. పేద, మధ్య తరగతి వారికి మంచి జరగాలంటే పాలకుడికి అనుభవం ఉంటే సరిపోదు. మంచి మనస్సు, వారి కోసం ఏదైనా చేయాలన్న తపన ఉండాలి. ఐదేళ్లలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పాలన ద్వారా పేద, మధ్య తరగతి ప్రజల జీవితాల్లో అద్భుతాలే జరిగాయి. సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయం, సామాజికం, ఆర్థికంగా ఎదిగేందుకు మహిళలకు అనేక అవకాశాలను కల్పించారు. సమాజంలో పేదరికాన్ని తొలగించాలనే లక్ష్యంతో ‘జగనన్న అమ్మ ఒడి’ పథకాన్ని ప్రభుత్వం వినూత్నంగా ప్రవేశపెట్టింది. 45–60 ఏళ్ల మధ్య వయస్సు ఉండే పేద మహిళా కుటుంబాలు అభివృద్ధి చెందడం కోసం ‘వైఎస్సార్ చేయూత పథకం’ అమలు చేసింది. ఈ రెండు పథకాలు లక్షలాది కుటుంబాల వ్యవస్థ స్వరూపాన్ని పూర్తిగా మార్చేశాయి. పొదుపు సంఘాల మహిళలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం మొత్తం సొమ్మును నాలుగు ధపాలుగా వారికి అందిస్తామ’ని వైఎస్సార్సీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది. గత అసెంబ్లీ ఎన్నికల పొలింగ్ జరిగిన 2019 ఏప్రిల్ 11వ తేదీ నాటికి మహిళలకు బ్యాంకుల్లో ఉన్న అప్పు మొత్తాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తిరిగి ఎన్నికల జరిగే సమయానికల్లా ఆక్షరాల అమలు చేసి చూపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నూటికి నూరు శాతం బ్యాంకులకు తమ అప్పును సకాలంలో చెల్లిస్తున్నారు. ఈ దశలో దేశంలో ఇతర రాష్ట్రాల పొదుపు సంఘాలన్నింటికీ ఆదర్శంగా నిలిచాయి. అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు ♦ ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా మహిళలకు ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) నాన్ డీబీటీ ద్వారా రూ. 2,72,811 కోట్లు సాయం అందించింది. ♦ ఇంతకు ముందు దేశంలో మరే రాష్ట్రంలోనూ ఐదేళ్ల కాలంలో ఒక ప్రభుత్వం అంత భారీగా స్థాయిలో పేద మహిళల సంక్షేమం కోసం ఖర్చు చేయలేదు. ♦ ప్రముఖ అంతర్జాతీయ వ్యాపార దిగ్గజ సంస్థలైన అమూల్, హిందూస్తాన్ లివర్, ఐటీసీ, ప్రొక్టర్ అండ్ గ్యాంబల్, అల్లానా, అజియో రిలయన్స్, గ్రామీణ వికాస కేంద్రం, టేనేజర్, కాల్ గుడి, జియాన్, నినె, ఇర్మా, అయేకార్ట్, మహేంద్ర అండ్ ఖేతి సంస్థలతో బ్యాంకులతో ఒప్పందాలు చే సుకొని వారికి వ్యాపార మార్గాలు చూపించింది. ♦ ఈ కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఆయా అంతర్జాతీయ సంస్థలు, పేద మహిళల మధ్య సమన్వయం చేసేందుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్త (సెర్ప్) కార్యాలయంలో ప్రత్యేక విభాగం కొనసాగిస్తున్నారు. అతివలను అందలం ఎక్కించాలనే.. ♦ 57 నెలల కాలంలో ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా అందించిన సహాయం, వారి కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కువడానికి అందించిన తోడ్పాటుతో రాష్ట్రంలోని 18,37,568 మహిళలు కొత్తగా వ్యాపారాలు ప్రారంభించి స్థిరమైన ఆదాయం పొందుతున్నారు. ♦ అంతకు ముందు లేనివి, ఇప్పుడు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కొత్తగా పొదుపు సంఘాలకు అందించిన తోడ్పాటుతో 54 శాతం మంది రూ. 5 వేలకు పైనే అంటే ఏడాదికి రూ. 60 వేలకు పైబడి ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు. ♦ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 14,01,519 మంది పొదుపు సంఘాల మహిళలు ఏటా రూ. లక్ష చొప్పున ఆదాయం పొందుతూ కుటుంబాల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకున్నారు. ♦ మరో 31,04,314 మంది ‘పొదుపు’ మహిళలు నెలవారీ రూ. 5 వేల నుంచి రూ. 8 వేల మధ్య ఆదాయం పొందుతూ ఏడాదికి రూ. 60 వేల నుంచి రూ. లక్ష మధ్య ఆదాయం పొందుతున్నారు ♦ 2021–2023 ఆర్థిక సంవత్సరంలో 1,126 మంది పొదుపు సంఘాల మహిళలు చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ)లు ఏర్పాటు చేసుకుని భావి పారిశ్రామికవేత్తలుగా ఎదిగారు. ♦ పొదుపు సంఘాల్లో సభ్యులుగా ఉండే ఎస్సీ,ఎస్టీ మహిళలు తమ స్వశక్తితో ఎదిగేందుకు ముందుకొస్తే ప్రత్యేకంగా ‘ఉన్నతి’ కార్యక్రమం ద్వారా ఆయా రంగాల్లో నైపుణ్యాలపై శిక్షణతో పాటు ఆర్థిక తోడ్పాటు అందజేస్తోంది. స్వయం కృషి ‘వనిత’ర సాధ్యం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణంలో 250 స్వయం సహాయ సంఘాల మహిళలంతా కలిసి కార్పొరేట్‌కు దీటుగా చేయూత మహిళా మార్ట్ పేరిట షాపింగ్ మాల్ ఏర్పాటు చేశారు. ఒక్కో మహిళ కేవలం రూ.210 పెట్టుబడితో దీనిలో భాగస్తులయ్యారు. కేవలం పది నెలల్లోనే ఈ మార్ట్ మూడు కోట్ల రూపాయల టర్నోవర్‌కు చేరుకుంది. గత సంక్రాంతి సీజన్లో రూ.రెండులక్షల వరకు అమ్మకాలు జరిపి అందరినీ అబ్బురపరిచింది. డాంబికాల ‘డప్పు’తో సరి ♦ 2014 ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ♦ ఎన్నికలకు ఏడాది ముందు నుంచే డ్వాక్రా అప్పులు మహిళలు బ్యాంకులకు కట్టొద్దని గొప్పగా డప్పు కొట్టారు. ♦ ఆయన చెప్పిన మాటలు నమ్మి రాష్ట్రంలో దాదాపు 75 లక్షల మందికి పైగా తమ అప్పులు కట్టలేదు. ♦ తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ హామీని ఐదేళ్ల కాలంలో అమలు చేయలేదు. దీనివల్ల ఏకంగా 18.36 శాతం పొదుపు సంఘాలు (అంటే దాదాపు 14 లక్షల మందికి సంబందించిన సంఘాలు) ఎన్పీఏ (బ్యాంకుల వద్ద రుణ ఎగవేతదారు)లుగా ముద్రవేయించుకున్నాయి. నూరుశాతం మహిళా సాధికారత మహిళా సాధికారత అనే మాట గతంలో వినడం తప్ప సాధించింది లేదు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల పాలనలో మహిళా సాధికారత నూటికి నూరుశాతం అమలవుతోంది. మహిళలు సంక్షేమ పరంగా, రాజకీయంగా చైతన్యవంతులయ్యారు. రాజకీయ ప దవుల్లో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడం గొప్ప విషయం. ఈ ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కింది. – తానేటి వనిత, రాష్ట్ర హోంశాఖ మంత్రి రాజకీయంగా ఇంకా చైతన్యం రావాలి మహిళలు రాజకీయంగా ఇంకా చైతన్యవంతులు కావాలి. గృహిణిగా పరిమితం కాక సమాజంలో అన్ని రంగాల్లో ఆమె పాత్ర ఉండాలి. నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పాలనలో సంక్షేమంతోపాటు రాజకీయంగా మహిళలకు పురుషులతోపాటు సమభాగం కల్పిస్తున్నారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవి మహిళకు కేటాయించడం అభినందనీయం. –ఘంటా పద్మశ్రీ, చైర్పర్సన్, పశ్చిమగోదావరి జెడ్పీ ధైర్యంగా ముందడుగు వేయాలి మహిళలు ధైర్యంగా ముందడుగు వేసి ఎంచుకున్న రంగాల్లో విజయం సాధించాలి. మహిళలు మానసికంగా, ఆరోగ్యంగా పటిష్టంగా ఉండాలి. అప్పుడే సమాజం బలంగా ఉంటుంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆపదలో ఉన్నవారికి, అన్యాయం జరిగిన మహిళలకు మహిళా కమిషన్ ద్వారా అండగా నిలుస్తున్నారు. – బూసి వినీత, మహిళా కమిషన్ సభ్యురాలు -
యురేనియంపై ‘పచ్చ’ విషం
ఉన్నది లేనట్టు... లేనిది ఉన్నట్టు... భ్రమింపజేయడం పచ్చపత్రికల లక్ష్యం. ప్రతి అంశాన్నీ సర్కారుకు ముడిపెట్టి ప్రజలను తప్పుదారి పెట్టించాలన్నది వారి వ్యూహం. ఎలాగైనా జగన్ సర్కారును అప్రదిష్టపాలు చేయాలన్నది వారి సంకల్పం. కానీ వాస్తవాలు తెలిసిన ప్రజల విజ్ఞత ముందు వారికుట్రలు ఎన్నైనా కొట్టుకుపోవడం ఖాయం. పులివెందుల ప్రాంతంలోని యురేనియం కార్పొరేషన్ ప్రాజెక్టుపై వండివార్చిన అడ్డగోలు కథనాన్ని అందరూ ఛీదరించుకుంటున్నారు. అక్కడి ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలు తెలిసిన జనాలు ఆ అబద్ధాలను నిర్ద్వందంగా ఖండిస్తున్నారు. సాక్షి రాయచోటి/వేముల: పులివెందుల ప్రాంత నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించాలన్న సంకల్పంతో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నెలకొల్పిన యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(యూసీఐఎల్) ప్రాజెక్టుపై ఇప్పుడు పచ్చ పత్రికలు విషం చిమ్ముతున్నాయి. వైఎస్సార్ కుటుంబంపై దుమ్మెత్తి పోయడమే లక్ష్యంగా ఎల్లో మీడియా ప్రతి అంశాన్నీ వక్రీకరిస్తోంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి యురేనియం బాధిత గ్రామాల ప్రజలకు శాశ్వత పరిష్కారాన్ని చూపాలని సంకల్పించారు. అంతేగాకుండా గ్రామాల్లో పూర్తి స్థాయిలో సమస్యలు పరిష్కరిస్తేనే మరోపక్క తాగు, సాగునీటికోసం ప్రత్యేక రిజర్వాయర్ నిర్మాణం మొదలుకొని పైపులైన్ల ద్వారా తుంగభద్ర, కృష్ణా నీటిని తీసుకొచ్చేందుకు శ్రీకారం చుట్టారు. ప్రాజెక్టు నిర్మాణానికి నిధులను కేటాయించి...నిర్మాణ పనులు చరుగ్గా సాగేలా చర్యలు తీసుకున్నారు. కేవలం 15 నెలల వ్యవధిలోనే సగానికి పైగా ప్రాజెక్టు పనులు పూర్తయినా మార్చి వచ్చినా ఏమార్చారంటూ తప్పుడు కథనాన్ని ప్రచురించారు. శర వేగంగా రిజర్వాయర్ పనులు వేముల మండలంలోని యురేనియం బాధిత గ్రామాలైన కేకే కొట్టాల, కణంపల్లె, మబ్బుచింతలపల్లె, తుమ్మలపల్లె, రాచకుంటపల్లె, భూమయ్యగారిపల్లె గ్రామ ప్రజల శాశ్వత పరిష్కారానికి రిజర్వాయర్ నిర్మాణమే ప్రధానమని భావించిన ప్రభుత్వం వేగంగా పనులు జరిగేలా చూస్తోంది. వైద్య శిబిరాలు, ఇతర ప్రత్యేక చర్యలు తీసుకుని వారి ఆరోగ్యంపై పత్యేక శ్రద్ధ తీసుకున్నారు. భూములు కోల్పొయిన రైతుల కుటంబాల్లో ఉద్యోగావకాశాలు కల్పించారు. స్వచ్చమైన నీటిని అందించాలన్న లక్ష్యంతో ప్రత్యేకంగా రిజర్వాయర్, భూ సేకరణ, చిత్రావతి నుంచి రూ. 1113 కోట్లు అంచనా వ్యయంతో రిజర్వాయర్ రూపొందించారు. వేంపల్లె మండలం గిడ్డంగివారిపల్లె వద్ద 2022 నవంబర్‌లో పనులకు భూమి పూజ చేశారు. యురేనియం బాధిత గ్రామాల్లో 10వేల ఎకరాలకు సాగునీటితో పాటు 6 గ్రామాల ప్రజలకు తాగునీటిని అందించేందుకు చేపట్టిన పనులు చురుగ్గా సాగుతున్నాయి. నిర్మాణ పనులు 53శాతం పూర్తయ్యాయి. అలాగే కాలువల పనులు కూడా వేగవంతంగా చేస్తున్నారు. లింగాల మండలం పార్నపల్లె వద్దనున్న చిత్రావతి ప్రాజెక్టు నుంచి పైపులకు నీటిని ఎత్తిపోతల ద్వారా తరలించనున్నారు. బాబుకు మేలు చేకూర్చేందుకు రామోజీ తాపత్రయం ప్రతి అంశాన్నీ బాబుకు మేలు చేసే విధంగా కట్టుకథలతో తప్పుదారి పట్టించేందుకు రామోజీ తెగ తాపత్రయపడుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2021లో శంకుస్థాపన చేసి 2022 నవంబర్‌లో పనులకు భూమి పూజ చేయగా 32 నెలల కిందటే పనులు ప్రారంభించినట్లు ఈనాడులో తప్పుడు కథనాలు అల్లడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రూ. 650 కోట్లతో చేపట్టిన ఎత్తిపోతలతోపాటు పైపులైన్ల పనులకు సుమారు రూ. 135 కోట్లు ఖర్చు చేశారు. కాలువ పనులకు సంబంధించి దాదాపు 20 కిలోమీటర్లకు పైగా పూర్తి చేశారు. మరో 13 కిలోమీటర్ల వరకు పైపులను కూడా అమర్చారు. కొన్నిచోట్ల అటవీ శాఖ భూముల పరిధిలో పైపులైన్ పనులు చేయాల్సి ఉన్నందున అనుమతుల కోసం నిరీక్షిస్తున్నారు. దానినీ రాజకీయం చేయాలని ఈనాడు చూస్తోంది. త్వరలోనే సమస్యల పరిష్కారం ♦ యురేనియం బాధిత గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి కూడా యూసీఐఎల్ చర్యలు చేపట్టింది. తుమ్మలపల్లె సమీపంలో 2007 నవంబర్‌లో యురేనియం తవ్వకా లు చేపట్టేందుకు రూ.1106కోట్లతో కర్మాగారాన్ని నిరి్మంచింది. ♦ 2013లో యూసీఐఎల్ యురేనియం ఉత్పత్తి ప్రారంభించింది. ముడిపదార్థాన్ని శుద్ధి చేయగా వచ్చే వ్యర్థాలను కె.కె.కొట్టాల సమీపంలోని టెయిలింగ్ పాండ్‌కు తరలిస్తున్నారు. ♦ 2016లో భారీ వర్షాలతో వ్యర్థజలాలు భూగర్భజలాల్లో కలుషితమయ్యాయని, బోర్లలో కలుషిత నీరు వస్తోందని, పంటలు దెబ్బతింటున్నాయని రైతులు ఆందోళన చేశారు. అప్పట్లో రైతులు ఈ విషయాన్ని ఎంపీ వైఎస్ అవినా ష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, యూసీఐఎల్ సీఎండీతో మాట్లాడి పరిష్కారానికి చొరవ చూపుతూ వస్తున్నారు. ♦ సంస్థ టెయిలింగ్ పాండ్‌లో 1.5 మీటర్ల మట్టి వేసి దానిపై 1.5 ఎం.ఎం హెచ్‌డీపీ షీట్ వేసి యురేనియం వ్యర్థాలను నింపుతోంది. ఇందుకోసం యూసీఐఎల్ రూ.39కోట్లు ఖర్చు చేసింది. ♦ యురేనియం పరిసర గ్రామాల్లో యూసీఐఎల్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఈ గ్రామాలకు వైద్య బృందాలు వెళ్లి పరీక్షలు చేసి మందులను పంపిణీ చేస్తున్నారు. గ్రామాల్లో రూ.60లక్షలతో మినరల్ వాటర్ ప్లాంట్‌ను యూసీఐఎల్ నిర్మించింది. సాగునీటికి ప్రత్యేక చర్యలు యురేనియం బాధిత గ్రామాల్లో తోటల్లోని బోరు బావుల్లో నీరు సైతం కలుషితం అవుతుందన్న శాస్త్రవేత్తల నివేదికల మేరకు ఆయా గ్రామాల పొలాలకు కూడా సూక్ష్మ సేద్యం ద్వారా సాగునీరు అందించాలని సంకల్పించారు. పైపులైన్లతోపాటు తోటలకు నీరు అందించేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అందుకు అనుగుణంగా పనులు కూడా చేస్తున్నారు. సుమారు 10 వేల ఎకరాలకు సూక్ష్మ సేద్యంతోపాటు ఐదు వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కింద సాగునీటిని అందించనున్నారు. -
అండగా ఆదిశక్తి
మహిళలపై గృహ హింస, లైంగిక వేధింపులు.. అమ్మాయిల పట్ల ఆకతాయిల ఆగడాలు, ర్యాగింగ్ భూతం బాలికలపై వికృత చేష్టలు.. ఇలాంటి వాటికి చాలా వరకు మహిళలు బలయ్యాకగానీ స్పందన, న్యాయం జరిగేది కాదు. ఇదంతా గతం. మగువలు బాధితులుగా మారక ముందేరక్షణ ఛత్రంగా నిలవాలని సీఎం జగన్మోహన్రెడ్డి ఆకాంక్ష. ఆ ఆలోచనల్లో నుంచే అలాంటి అకృత్యాలకు అడ్డుకట్ట వేస్తూ ఆయన సంధించిన పాశుపతాస్త్రం ‘దిశ’ అన్ని సమస్యలకూ ఒక్కచోటే పరిష్కారం లభించేలా రూపొందించిన ఈ యాప్ మన ఆడపిల్లల రక్షణ ‘దిశ’గా ప్రయోగించిన ఆగ్నేయాస్త్రం. అక్కచెల్లెమ్మలు ఆపదలో ఉన్నప్పుడు ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు.. వారికి తక్షణ భరోసాగా పోలీసుల అభయహస్తం.. ఆపత్కాలంలో దిశ యాప్‌లోని బటన్ నొక్కితే.. మహిళలకు నిశ్చింతే.. సత్వర సాయమే కాదు.. దిశ పోలీసు స్టేషన్లతో సత్వర న్యాయమూ.. –సాక్షి, అమరావతి సీఎం జగన్ మది నుంచి పుట్టిన ‘దిశ’ అక్కచెల్లెమ్మలు ఆపదలో ఉన్నామంటే చాలు క్షణాల్లో పోలీసులు చేరుకుని భద్రత కల్పించే వ్యవస్థ ఏర్పడాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచన. అందులో నుంచి పుట్టిందే దిశ మొబైల్ యాప్. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ప్రవేశపెట్టిన దిశ మొబైల్ యాప్ మహిళల భద్రతకు పర్యాయపదంగా మారింది. మగువలకు అనుక్షణం రక్షణగా నిలిచే దిశ యాప్, దిశ పోలీసు స్టేషన్లు ఒక నూతన విప్లవానికి శ్రీకారం చుట్టాయి. యావత్ దేశానికి ఇవి దిక్సూచిగా నిలిచాయి. ఆపత్కాలంలో ఉన్నప్పుడు దిశ యాప్‌లోని ఎస్ఓఎస్ బటన్ నొక్కితే చాలు... నిమిషాల్లోనే పోలీసులు అక్కడికి చేరు కుని రక్షణ కవచంలా నిలుస్తున్నారు. నిందితులను అరెస్టు చేసి కఠిన శిక్షలు పడేలా చేస్తున్నారు. ఈ క్రమంలో ‘దిశ’కు జాతీయస్థాయిలో ఎన్నో ప్రశంసలు దక్కాయి. అవార్డులు వరించాయి. ఎన్నో రాష్ట్రాలు ఈ వ్యవస్థను ప్రారంభించడానికి సిద్ధమవుతున్నాయి. రికార్డు స్థాయిలో 1.50 కోట్ల డౌన్లోడ్లు 2020 డిసెంబర్ 15న అందుబాటులోకి వచ్చిన దిశ యాప్ ఫోన్లో ఉందంటే మహిళలు నిశ్చింతగా ఉన్నట్టే. ఈ యాప్‌ను ఇంతవరకు కోటీ 50 లక్షల 10 వేల 15 మంది డౌన్లోడ్ చేసుకున్నారు. కేవలం డౌన్‌లోడ్‌తోనే ఆగిపోకుండా కోటీ 29 లక్షల 8 వేల 530 మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఓ మొబైల్ యాప్ డౌన్లోడ్, రిజిస్ట్రేషన్లలో దేశంలో దిశ యాప్‌దే రికార్డు కావడం విశేషం. ఆపదలో ఉన్నామని దిశ యాప్‌కు సమాచారం ఇస్తే పట్టణాలు, నగరాల పరిధిలోనైతే 5 నిమిషాల్లో, గ్రామీణ ప్రాంతాలైతే 10 నిమిషాల్లోపే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. దిశ యాప్ ద్వారా ఇంతవరకు 10 లక్షల 80 వేల 454 ఎస్ఓఎస్ కాల్ రిక్వెస్ట్‌లు వచ్చాయి. కొత్తగా యాప్‌ను డౌన్లోడ్ చేసుకునేటప్పుడు పరీక్షించడానికి ఒకటి, రెండుసార్లు ఎస్ఓఎస్ బటన్ నొక్కి చూస్తారు. వాటిని మినహాయిస్తే పోలీసు చర్యలు తీసుకునే కాల్స్ 31,607 ఉన్నాయి. వీటన్నింటికీ పోలీసులు తక్షణం స్పందించి ఘటన స్థలానికి చేరుకుని తగిన న్యాయం అందించారు. దిశ యాప్‌లో సగటున రోజుకు 250 కాల్స్ వస్తున్నాయి. దశ‘దిశ’లా నిఘా లైంగిక వేధింపులకు అవకాశం ఉన్న సున్నిత ప్రాంతాలను జియో మ్యాపింగ్ చేశారు. లైంగిక దాడులకు పాల్పడిన నేర చరిత్ర ఉన్న 2 లక్షల 17 వేల 467 మంది నేర చరితుల డేటా బేస్ రూపొందించి వారి కదలికలపై నిఘా పెట్టారు. ఆన్లైన్ వేధింపులకు గురి చేస్తున్న 1,531 మందిపై సైబర్ బుల్లీయింగ్ షీట్లు, లైంగిక వేధింపులకు పాల్పడిన 2,134 మందిపై షీట్లు తెరిచారు. నేర నిరూపణకు అవసరమైన సాక్ష్యాధారాలు సత్వరం సేకరించేందుకు అనంతపురం, రాజమహేంద్రవరం, తిరుపతి, విశాఖపట్నం, గుంటూరు, విజయవాడలలో ఫోరెన్సిక్ లాŠయ్బ్లు ఏర్పాటు చేశారు. తిరుపతి, విశాఖపట్నంలో ప్రాంతీయ ఫోరెన్సిక్ సైన్స్ లే»ొరేటరీలు నిర్మిస్తున్నారు. గతంలో ఫోరెన్సిక్ నివేదికకు మూడు నాలుగు నెలలు పడితే.. ప్రస్తుతం 48 గంటల్లోనే వస్తున్నాయి. చార్జ్షీట్ల నమోదులో దేశంలోనే ప్రథమం దిశ యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల్లో ఇంతవరకు 3,009 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. పోలీస్ స్టేషన్ పరిధితో నిమిత్తం లేకుండా ఏ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా సరే.. జీరో ఎఫ్ఐఆర్ నమోదు విధానాన్ని 2019 డిసెంబర్లో ప్రవేశపెట్టారు. దిశ యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల్లో 60 రోజుల్లోపే ఏకంగా 96.07 శాతం కేసుల్లో చార్జ్షీట్లు దాఖలు చేశారు. కేంద్ర హోం శాఖ నిర్దేశించిన మేరకు 60 రోజుల్లో చార్జ్షీట్ల నమోదులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. అక్కచెల్లెమ్మల రక్షణకు దిశ పోలీస్ స్టేషన్లు ♦ దిశ యాప్‌ను ప్రవేశపెట్టడమే కాకుండా ప్రభుత్వం 18 దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. మరో 8 పోలీస్ స్టేషన్లను త్వరలో ఏర్పాటు చేయనుంది. ♦ మహిళలకు హెల్ప్ డెస్క్, వెయిటింగ్ హాల్, కౌన్సెలింగ్ రూమ్, వాష్ రూమ్స్, క్రచ్–ఫీడింగ్ రూమ్‌లతో ఈ పోలీస్ స్టేషన్లను ఏర్పాటుచేశారు. ఈ క్రమంలో దిశ పోలీస్ స్టేషన్లకు ఐఎస్వో సర్టిఫికెట్ లభించింది. ♦ ప్రత్యేకంగా 13 పోక్సో కోర్టులు, 12 మహిళా కోర్టులు ఏర్పాటు చేశారు. ♦ పోక్సో కేసుల విచారణకు 19 మంది ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం ♦ పెట్రోలింగ్ కోసం 900 ద్విచక్ర వాహనాలు, 163 బొలెరో వాహనాలు ♦ 18 దిశ క్రైమ్ మేనేజ్మెంట్ వాహనాలను ప్రభుత్వం సమకూర్చింది. నేరం సంభవించిన ప్రాంతానికి తక్షణం చేరుకోవడానికి వీటిని అందుబాటులోకి తెచ్చారు. 60 రోజుల్లోనే దర్యాప్తు 2020 నుంచి ఇప్పటివరకు 7,070 పోక్సో కేసులకు సంబంధించి 96 శాతం కేసుల్లో 60 రోజుల్లోనే దర్యాప్తు పూర్తయ్యింది. ఈ విషయంలో జాతీయ సగటు కేవలం 40 శాతం మాత్రమే. జాతీయ స్థాయిలో ప్రశంసలు దిశ వ్యవస్థకు ఇంతవరకు 19 జాతీయస్థాయి అవార్డులు లభించాయి. నీతి ఆయోగ్, జాతీయ మహిళా పార్లమెంటరీ సదస్సు, జాతీయ మహిళా కమిషన్, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్, జాతీయ బాలల కమిషన్ తదితర సంస్థలు దిశ వ్యవస్థను కొనియాడాయి. నేరం చేస్తే శిక్ష ఖాయం మహిళలు, బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడేవారిపై పోక్సో కేసులు నమోదు చేయడమే కాకుండా దోషులకు సత్వరమే శిక్షలు పడేలా చేస్తున్నారు. ఇంతవరకు 85 కేసుల్లో దోషులకు కోర్టులు శిక్షలు విధించాయి. మరో 10 కేసుల్లో న్యాయస్థానాల్లో విచారణ కొనసాగుతోంది. ఇంకో 27 కేసుల్లో దర్యాప్తు జరుగుతోంది.