Bollywood
-
పవర్ఫుల్ యాక్షన్
బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘జాత్’ అనే టైటిల్ ఖరారైంది. ఈ పవర్ఫుల్ యాక్షన్ ఫ్యాక్డ్ మూవీకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్, సయామీ ఖేర్, రెజీనా కీలకపాత్రల్లో నటిస్తున్నారు.మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శనివారం (అక్టోబరు 19) సన్నీ డియోల్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘జాత్’ టైటిల్‌ను ప్రకటించి, ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్. -
ప్రియాంక చోప్రా స్టైలిష్ లుక్ : విలువ రూ. 20 లక్షలు!
గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా గురించిప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ పోటీనుంచి బాలీవుడ్లో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరిగా ఎదిగింది. తరువాత హాలీవుడ్ దాకాఎదిగి అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణులలో ఒకరిగా తనను తాను నిలబెట్టుకుంది. తాజాగా ముంబై ఈవెంట్లో స్టైలిష్ లుక్‌లో తళుక్కున మెరిసింది ప్రియాంక చోప్రా. ఆమె మొత్తం ఔట్ఫిట్ ధర ఏకంగా రూ. 20 లక్షలట. దీంతో ధరించిన డ్రెస్, నగలు, హీల్ ఇలా ప్రతీదీ హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఈవెంట్లో కాస్త సన్నగా తయారైన ఆమె అందరినీ ఆకర్షించడమే కాకుండా ఫ్యాషన్ ప్రపంచంలో కొత్త ట్రెండ్‌ను సెట్ చేసింది. ప్రియాంక చోప్రా ధరించిన అంతర్జాతీయ లగ్జరీ బ్రాండ్ వివియన్ వెస్ట్వుడ్కు చెందిన డ్రెస్ ఖరీదు ధర రూ. 2.26 లక్షలు. అలాగే ఆమె ధరించిన క్రిస్టియన్ లౌబౌటిన్ హీల్ ధర 71 వేల రూపాయలు. ఆగండి ఆగండి ఇంకా ఉంది. ప్రియాంక చోప్రా Bvlgari బ్రాండ్‌కి అంబాసిడర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్లో ఆమె ధరించిన Bvlgari బ్రాండ్, రోజ్ గోల్డ్ అండ్ డైమండ్ నెక్లెస్ ధర రూ. 7.6 లక్షలు. ఇక డైమండ్ చెవిపోగులు ధర తొమ్మిది లక్షలని ఫ్యాన్స్ అంచనా.ఇదీ చదవండి: అపుడు కటిక పేదరికం : ఇపుడు పూలసాగుతో కోట్ల ఆదాయంవిదేశాల్లో నివసిస్తున్నప్పటికీ, ప్రియాంకకు దేశంపై ఉన్న ప్రేమ పాత్ర అపారం. తన కిష్టమైన గేట్‌వే అంటూ ఒక వీడియోను కూడా ఇన్‌స్టాలో షేర్ చేసింది. అలాగే తన నిర్మాణ సంస్థ పర్పుల్ పెబుల్ పిక్చర్స్ ద్వారా ప్రాంతీయ సినిమాల్లో ముఖ్యమైన చిత్రాలకు సపోర్ట్ చేస్తోంది. నిర్మాతగా మరాఠీ-భాషా డ్రామా చిత్రం పానీకి సంబంధించిన ప్రచార కార్యక్రమానికి స్టైల్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సందర్భంగా తన తల్లి మధు చోప్రా , కొత్త పెళ్లికొడుకు, సోదరుడు సిద్ధార్థ్ చోప్రాతో కలిసి పోజులిచ్చింది. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
నటుడిని చూసి భయపడ్డ సింగర్.. దగ్గరికి రావొద్దంటూ..
నెగెటివ్ రోల్స్ చేసే నటీనటులను కొందరు నిజంగానే ద్వేషిస్తారు. వాళ్లు పోషించేవి రీల్ పాత్రలు మాత్రమే అని అర్థం చేసుకోలేక నిజ జీవితంలోనూ ఇంతే కాబోలు అన్నట్లుగా వాళ్లను చూస్తేనే భయపడిపోతారు. తన విషయంలోనూ ఇదే జరిగిందంటున్నాడు బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ.నన్ను చూస్తేనే భయంతాజాగా ఓ ఈవెంట్‌కు వెళ్లిన విజయ్ వర్మ ఈ విషయం గురించి మాట్లాడుతూ.. అందమైన అమ్మాయిలు.. వారి తల్లులు ఎందరో నన్ను చూస్తేనే భయపడిపోతారు. ఈ విషయంలో నేను చాలా బాధగా ఫీల్ అవుతాను. పింక్ సినిమాలో క్రూరమైన వ్యక్తిగా నటించాను. అది చిన్న పాత్రే.. అయినా సరే చాలా సీరియస్‌గా తీసుకున్నారు. మహిళల కోసం స్పెషల్ స్క్రీనింగ్ వేసినప్పుడు అందరూ సినిమా చూసి చలించిపోయారు. కొందరైతే ఏడ్చేశారు. నేనేం చేశా?ఈ క్రమంలో సింగర్ సునిధి చౌహాన్ దగ్గరకు వెళ్లి ఆమెను ఓదార్చేందుకు ప్రయత్నించాను. కానీ ఆమె.. నా దగ్గరకు రావొద్దు.. నిన్ను చూస్తేనే భయంగా ఉంది అనేసింది. నేను నోరెళ్లబెట్టాను.. దేవుడా, నేనేం చేశాను అనుకున్నాను. ఇంతలో డైరెక్టర్ నన్ను పిలిచి.. నీ పని సక్రమంగా నిర్వర్తించావు అని మెచ్చుకున్నాడు అని గుర్తు చేశాడు.సినిమా..విజయ్ వర్మ.. గల్లీ బాయ్ (2019) సినిమాతో పేరు సంపాదించుకున్నాడు. డార్లింగ్స్, షి, మీర్జాపూర్, దాహడ్ వంటి ప్రాజెక్టులతో అలరించాడు. ఐసీ 814: ద కాందహర్ హైజాక్ అనే వెబ్ సిరీస్‌లో చివరగా నటించాడు.చదవండి: ఓటీటీలోకి కార్తీ ఫీల్ గుడ్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా? -
'స్త్రీ 3' ప్రాజెక్ట్‌పై శ్రద్ధా కపూర్ వ్యాఖ్యలు
శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించిన స్త్రీ2 చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అయితే, ఈ సినిమాకు సీక్వెల్‌గా పార్ట్ 3 రానుంది. ఈమేరకు శ్రద్ధా కపూర్ పలు విషయాలను పంచుకుంది. ఆగష్టు 15న విడుదలైన స్త్రీ2 కేవలం రూ.50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కితే.. సుమారు రూ. 700 కోట్లకు పైగానే కలెక్షన్లు సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది.స్త్రీ2 విజయం పట్ల శ్రద్ధా కపూర్ ఇలా చెప్పుకొచ్చారు. స్త్రీ సినిమా చూసిన ప్రతిసారి ఇలాంటి సినిమా ఇప్పటి వరకు చూడలేదనే ఫీల్ ఉంటుంది. అలాంటి సమయంలో దానికి సీక్వెల్ చేయాలని నన్ను కోరినప్పుడు చాలా సంతోషించాను. పార్ట్1 మించిన విజయాన్ని స్త్రీ2 చిత్రం ద్వారా ప్రేక్షకులు అందించారు. ఈ ప్రాజెక్ట్‌ను ఇంత అద్భుతంగా తెరకెక్కించిన దర్శక నిర్మాతలను అభినందించాలి. ఈ చిత్రం ప్రాంచైజీలో భాగంగా మూడో పార్ట్ కూడా రానుంది. అయితే, అందులో మొదటి రెండు భాగాలకు మించిన ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇప్పటికే మేకర్స్ ఆ పనులను ప్రారంభించారు.' అని ఆమె చెప్పారు.2018లో స్త్రీ సినిమా విడుదలైంది. ఆ చిత్రం భారీ విజయం అందుకోవడంతో ఈ ఏడాది రెండో పార్ట్ తెరకెక్కించారు. ఇందులో భాగంగానే మూడో పార్ట్‌ను కూడా నిర్మించాలని మేకర్స్ ప్లాన్ చేశారు. హారర్ కామెడీగా వచ్చిన ఈ రెండు సినిమాలు అభిమానులను మెప్పించాయి. -
ప్రాణభయం.. బుల్లెట్ ప్రూఫ్ కారు కొన్న సల్మాన్ ఖాన్
మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీని నడిరోడ్డుపై దుండగులు కాల్చి చంపడం కొన్నిరోజుల క్రితం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కి ఇతడు ఆప్తుడు కావడం వల్లే.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సిద్దిఖీని చంపేశారనే టాక్ వినిపించింది. రెండు రోజుల క్రితం సల్మాన్‌ని చంపేస్తామని ముంబై ట్రాఫిక్ పోలీసులకు వాట్సాప్ మెసేజ్ రావడం కలకలం రేపిందని చెప్పొచ్చు. ఇలా వరస సంఘటన కారణంగా సల్మాన్‌లో ప్రాణభయం మరింత పెరిగింది. ఈ క్రమంలోనే కొత్త కారు కొన్నారట.(ఇదీ చదవండి: ఓటీటీలోకి కార్తీ ఫీల్ గుడ్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?)1999లో కృష్ణ జింకలు వేటాడిన కేసులో సల్మాన్‌పై అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఈ విషయాన్ని చాలామంది మర్చిపోయారు కానీ బిష్ణోయ్ తెగకు చెందిన లారెన్స్ అనే కుర్రాడు మాత్రం మర్చిపోలేదు. ఎప్పటికప్పుడు సల్మాన్‌ని చంపేందుకు కుట్ర పన్నుతూనే ఉన్నాడు. గత రెండేళ్లలోనూ ఆ ప్రయత్నాలు చేశారు. బాబా సిద్దిఖీ మర్డర్, రూ.5 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామని తాజాగా బెదిరింపు మెసేజ్.. ఇలా బోలెడన్ని కారణాల వల్ల సల్మాన్ అప్రమత్తమయ్యాడు.సుమారు రూ.2 కోట్ల విలువైన బుల్లెట్ ప్రూఫ్ కారును దుబాయ్ నుంచి ఆయన దిగుమతి చేసుకోనున్నాడట. త్వరలోనే ఇది సల్మాన్ గ్యారేజ్‌లో చేరనుందని బాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. ఆయన ఎంపిక చేసుకున్న ఆ మోడల్ కారు మన దేశంలో దొరకదని సమాచారం. అందుకే అక్కడి నుంచి ఇక్కడికి తెప్పించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రూ.6 కోట్ల విలువైన మరో బుల్లెట్ ప్రూఫ్ కారు సల్మాన్ దగ్గరుంది. కానీ లేటెస్ట్ మోడల్లో ఎక్కువ ఫీచర్స్ ఉండటంతో ఈ కొత్త కారును కొనుగోలు చేశాడని సమాచారం.ఈ కారులో ఎవరున్నారనేది బయట నుంచి చూస్తే కనిపించదు. అలానే ఎలాంటి బులెట్‌ని అయినా సరే ఈ కారుకి ఉన్న గ్లాస్ అడ్డుకుంటుంది. ఈ కారుకు సంబంధించిన మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: అరెస్ట్ న్యూస్.. వీడియో రిలీజ్ చేసిన బిగ్ బాస్ శేఖర్ భాషా) -
సెట్లోనే కన్ను మూయాలనుంది
‘‘జీవితాంతం నేను నటుడిగానే ఉంటాను. సినిమా సెట్లో కన్ను మూయాలన్నదే నా సంకల్పం’’ అని పేర్కొన్నారు షారుక్ ఖాన్. భారతీయ చిత్ర పరిశ్రమకు తాను చేసిన సేవలకుగాను ‘లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్’లో జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు షారుక్. ఈ సందర్భంగా ఆయన అక్కడి మీడియాతో ముచ్చటించారు. అందులో భాగంగా ‘జీవితాంతం మీరు నటుడిగానే కొనసాగుతారా?’ అని ఓ విలేకరి ప్రశ్నించారు.ఇందుకు షారుక్ బదులిస్తూ... ‘‘చనిపోయే వరకూ సినిమాల్లోనే ఉంటాను. ఏదైనా సినిమా సెట్లో యాక్షన్ చెప్పగానే నేను చనిపోవాలి. వాళ్లు కట్ చె΄్పాక కూడా పైకి లేవకూడదు. ఇదే నా కోరిక’’ అన్నారు. అలాగే స్టార్‌డమ్‌ని మీరు ఎలా ఫీలవుతారు? అనే మరో ప్రశ్నకు స్పందిస్తూ... ‘‘స్టార్‌డమ్‌ను చాలా గౌరవిస్తాను. ఎందుకంటే దానివల్లే ఫ్యాన్స్ ప్రేమ, ఆదరణ, గుర్తింపు, డబ్బు లభించాయి. ఇక నాకు సెన్సాఫ్ హ్యూమర్ ఎక్కువ. అయితే ప్రస్తుతం ప్రజలు చాలా సున్నితమనసున్నవారయ్యారు. ఏం చెప్పినా డిస్టర్బ్ అవుతున్నారు. కాబట్టి సెన్సాఫ్ హ్యూమర్ లేకపోవడమే మంచిది’’ అన్నారు షారుక్ ఖాన్. -
పేర్లు మర్చిపోయా!
జోరుగా, జోష్‌గా సినిమాలు చేసుకుంటూ వచ్చిన సమంత ‘మయోసైటిస్’ వ్యాధి కారణంగా ఏడాదికి పైగా షూటింగ్స్‌కి దూరంగా ఉన్నారనే సంగతి తెలిసిందే. ఈ వ్యాధి వల్ల తాను ఎదుర్కొన్న సమస్యల గురించి పలు సందర్భాల్లో పంచుకున్నారామె. తాజాగా ‘సిటాడెల్: హనీ బన్నీ’ వెబ్ సిరీస్ ప్రచార కార్యక్రమాల్లోనూ ఈ వ్యాధి గురించి ప్రస్తావించారు. ముఖ్యంగా అనారోగ్యంతో పోరాడుతున్న సమయంలో తాను ఒకరోజు జ్ఞాపక శక్తి కోల్పోయానని సమంత చెప్పిన విషయం వైరల్‌గా మారింది. ‘‘సిటాడెల్: హనీ బన్నీ’ షూటింగ్లో ఉన్నప్పుడు సడన్‌గా అంతా మర్చిపోయా. చాలామంది పేర్లు మర్చిపోయాను. ఆ షూటింగ్ కోసం ఉపయోగించిన సెట్ టైమ్ ఇంకా ఒకే ఒక్క రోజు మాత్రమే ఉంది. ఆ పరిస్థితిలో నేను అన్నీ మర్చిపోయాను. ఎవరో మనుషులు వస్తున్నారు... వెళుతున్నారు.. ఓ స్టంట్ మాస్టర్ నా ముందు ఉన్నాడు... నేనేం చేస్తున్నానో తెలియలేదు. ఇలా అయోమయ స్థితిలో పడిపోయాను. ఇప్పుడు ఆ విషయాన్ని గుర్తు చేసుకున్నా... ఆ టైమ్‌లో నన్నెవరూ ఆస్పత్రికి తీసుకెళ్లలేదని, నా ఆరోగ్యం గురించి ఎవరూ అడగలేదని అనుకుంటుంటాను. కానీ ‘సిటాడెల్: హనీ బన్నీ’ యూనిట్ సహకరించింది.నేను కోలుకున్నాక షూటింగ్ చేశారు’’ అని పేర్కొన్నారు సమంత. అయితే సమంత ఇలా మర్చిపోయిన తర్వాత ఈ యూనిట్ డాక్టర్ని సంప్రదించిందట. ఆ విషయం సమంతకు గుర్తు లేదు. అందుకే ఎవరూ ఆస్పత్రికి తీసుకెళ్లలేదని ఆమె అనుకుంటున్నారు. ఇక రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రూపొందిన ‘సిటాడెల్: హనీ బన్నీ’ నవంబరు 7 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ కానుంది. -
సినిమాలు మానేద్దామని అనుకున్నా.. అంతా షారూఖ్ వల్లే: కాజోల్
బాలీవుడ్ నటి కాజోల్ ప్రస్తుతం దో పట్టి మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కూడా రిలీజైంది. ఈ చిత్రంలో కాజోల్ తొలిసారిగా పోలీస్ అధికారి పాత్రలో కనిపించనుంది. ఇందులో ఆదిపురుష్ భామ కృతి సనన్ కూడా నటిస్తోంది. తన మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్న కాజోల్ అలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఈ సందర్భంగా షారూఖ్ ఖాన్‌తో తనతో చెప్పిన అనుభవాన్ని వివరించింది.సినీ ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలోనే నటనను విడిచి పెట్టాలనుకున్నట్లు కాజోల్ తెలిపింది. నా మూడో సినిమాకే చాలా అలసిపోయినట్లు అనిపించింది.. దీంతో నటనకు గుడ్ బై చెప్పాలనుకున్నా అని వెల్లడించింది. కానీ షారూఖ్ ఖాన్ మాటల వల్లే ఇండస్ట్రీలో ఇప్పటికీ కొనసాగుతున్నానని పేర్కొంది.కాజోల్ మాట్లాడుతూ..' చాలా ఏళ్ల క్రితం ఉధార్ కి జిందగీ అనే సినిమా చేశా. అదే నా మూడో సినిమా. ఆ సమయంలో ఇండస్ట్రీ చాలా కొత్తగా అనిపించింది. అప్పుడు నా వయసు దాదాపు 18 ఏళ్లు ఉంటుంది. నేను ఆ సినిమాను పూర్తి చేశా. ఇప్పటికీ నాకు గుర్తుంది. నీకు నటన తెలుసు.. కానీ మీరు ఇంకా నేర్చుకోవాలి' అని సలహా ఇచ్చారని తెలిపింది.కాగా.. కాజోల్ 1992లో బేఖుడి మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత బాజీగర్ , కరణ్ అర్జున్ , దిల్వాలే దుల్హనియా లే జాయేంగే , గుప్త్ , ఇష్క్ , కుచ్ కుచ్ హోతా హై, కభీ ఖుషీ కభీ ఘమ్ వంటి హిందీ చిత్రాలలో నటించింది. ప్రస్తుతం దోపట్టి మూవీతో కనిపించనుంది. శశాంక చతుర్వేది దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 25న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. -
అతనితో లిప్‌లాక్ సీన్.. చాలా చిన్న విషయం అన్నాడు: సీనియర్ నటి
రణ్వీర్ సింగ్, అలియా భట్ జంటగా నటించిన చిత్రం రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ. బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా గతేడాది విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ చిత్రం సీనియర్ నటి షబానా అజ్మీ కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాలో ఓ ఇంటిమేట్ సీన్లో నటించింది. నటుడు ధర్మేంద్రతో చేసిన లిప్‌లాక్ సీన్ గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. తన భర్త అనుమతి తీసుకునే ఆ సీన్ చేసినట్లు వెల్లడించారు.షాబానా అజ్మీ మాట్లాడుతూ..' నాకు ఈ సినిమా కథ నచ్చడంతో అంగీకరించా. అయితే ఇందులో లిప్‌లాక్ సీన్ గురించి డైరెక్టర్ కరణ్ చెప్పాడు. నా భర్త అనుమతి తీసుకొని చెబుతా అని అన్నా. ఇదే విషయంపై నా భర్తను అనుమతి అడిగా. ఆయన చాలా చిన్న విషయం.. దీనికి నా అనుమతి ఎందుకు' అని అన్నారు. ఈ చిత్రంలో నా రోల్ ఎప్పటికీ గుర్తుంటుందని షాబానా తెలిపారు.అయితే రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ హిట్ కావడంతో ఈ మూవీ సీక్వెల్ తెరకెక్కించేపనిలో బిజీగా ఉన్నాడు కరణ్ జోహార్. అయితే సీక్వెల్లో మరికొందరు కొత్తవాళ్లు ఉంటారని కరణ్ చెప్పారు. కాగా.. ఈ చిత్రంలో ధర్మేంద్ర, జయాబచ్చన్, షబానా అజ్మీ లాంటి సీనియర్ నటీనటులు కీలకపాత్రలు పోషించారు. -
బిగ్ బాస్ సెట్ చుట్టూ కట్టుదిట్టమైన భద్రత.. కారణం ఇదే
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు రావడంతో ఆయన కట్టుదిట్టమైన భద్రతా సిబ్బంది నడుమ ఉన్నారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో ఉన్న వైరానికి ఫుల్స్టాప్ పడాలంటే తమకు రూ.5 కోట్లు ఇవ్వాలని బెదిరింపులు వచ్చాయి. దీంతో ముంబై పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. అయితే, ఇలాంటి సమయంలో హిందీ బిగ్ బాస్ 18 సెట్లో ఆయన పాల్గొంటారా..? లేదా..? అనే సందేహాలు వచ్చాయి. ఇక ఈ సీజన్‌కు హోస్ట్‌గా సల్మాన్ వైదొలగనున్నారని వార్తలు వచ్చాయి. అయితే, ఇలాంటి వాటికి ఆయన ఫుల్స్టాప్ పెట్టినట్లు తెలుస్తోంది.బిగ్ బాస్ 18 వీకెండ్ కోసం సల్మాన్ హజరుకానున్నట్లు తెలుస్తోంది. అయితే, చాలా కట్టుదిట్టమైన భద్రతా సిబ్బంది మధ్య ఆయన ఇప్పటికే సెట్లో ఎంట్రీ ఇచ్చారని సమాచారం. శుక్రవారమే 'వీకెండ్ కా వార్' ఎపిసోడ్‌ను యూనిట్ పూర్తి చేయనుంది. సల్మాన్‌కు రక్షణగా సుమారు 50మందికి పైగానే సెక్యూరిటీని ఏర్పాటు చేశారని, వారందరూ సల్మాన్ పర్యవేక్షణలో ఉండనున్నారు. ఎట్టిపరిస్థితిలో ఇతరులను హోస్‌లోకి అనుమతించరట. బిగ్ బాస్ యూనిట్ సభ్యులను కూడా పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే వారిని సెట్స్‌లోకి అనుమతించనున్నారు. సల్మాన్‌కు సంబంధించిన షూటింగ్ పూర్తి అయ్యాకే అక్కడున్న వారిని బయటకు పంపనున్నారు. సెట్లోని ఇతరుల వద్ద కనీసం ఫోన్ కూడా ఉంచకుండా జాగ్రత్తపడుతున్నారట. 1998లో జరిగిన ఘటన1998లో ఒక సినిమా షూటింగ్ సమయంలో సల్మాన్ ఖాన్ కృష్ణ జింకలను వేటాడారు. దీంతో ఆయనపై కేసు కూడా నమోదైంది. అయితే, కృష్ణజింకలను బిష్ణోయ్ తెగ ప్రజలు చాలా పవిత్రంగా చూస్తారు. వీటిని సల్మాన్ వేటాడటం ఆ వర్గానికి చెందిన లారెన్స్‌కు నచ్చలేదు. అయితే, ఈ ఘటన జరిగిన సమయానికి అతని వయసు సరిగ్గా 5 ఏళ్లు మాత్రమే. అప్పటి నుంచే సల్మాన్‌పై పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలో 2018 సమయం నుంచే సల్మాన్ ఖాన్‌ను లక్ష్యంగా చేసుకొని ఒక గ్యాంగ్‌ను తయారు చేశాడు. అతన్ని అంతం చేసేందుకే ఉన్నామంటూ పలుమార్లు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ క్రమంలో ఇప్పటికే కొన్నిసార్లు సల్మాన్‌పై హత్యాయత్నం కూడా చేశాడు. -
సల్మాన్ ఖాన్‌కి మరోసారి బెదిరింపులు.. రూ.5 కోట్లు ఇస్తేనే
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కి మరోసారి బెదిరింపులు వచ్చాయి. ఇప్పటివరకు చంపుతామని బెదిరించిన బిష్ణోయ్ గ్యాంగ్ కాస్త ఇప్పుడు డబ్బులు డిమాండ్ చేస్తోంది. ఓ రకంగా చెప్పాలంటే ఇది కొత్త ట్విస్ట్ అని చెప్పాలి. ఇంతకీ అసలేం జరుగుతోంది?కొన్నిరోజుల క్రితం మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ దారుణానికి పాల్పడింది లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ అని తేలింది. సల్మాన్‌కి స్నేహితుడు అయినందుకే ఇలా చేసినట్లు అనుమానిస్తున్నారు. తాజాగా సల్మాన్‌కి మరోసారి బెదిరింపులు వచ్చాయి. రూ.5 కోట్లు ఇవ్వకపోతే సల్మాన్‌ను చంపేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఈ మెసేజ్‌ను తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరించారు. బిష్ణోయ్‌తో శతృత్వం ఆగాలన్నా, సల్మాన్ బతికుండాలన్నా ఐదు కోట్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తూ ముంబై ట్రాఫిక్ పోలీసులకు వాట్సాప్‌లో మెసేజ్ వచ్చింది.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)ఈ మెసేజ్ ఎవరు పంపించారా? అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పనే అని పోలీసులు అనుమానిస్తున్నారు. 1999లో కృష్ణ జింకల్ని వేటాడిన తర్వాత కొన్నాళ్ల పాటు సల్మాన్ జైలు జీవితం గడిపాడు. ఈ సంఘటనతో సల్మాన్‌పై బిష్ణోయ్ తెగకు చెందిన లారెన్స్ పగ పెంచుకున్నాడు. చాన్నాళ్ల నుంచి బెదిరింపులు వస్తూనే ఉన్నాయి.2022లోనూ బాంద్రాలోని సల్మాన్ ఇంటి దగ్గర అనుమానాస్పద రీతిలో ఉత్తరం దొరికింది. 2023లో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి స్వయంగా సల్మాన్‌కే మెయిల్ వచ్చింది. ఈ ఏడాది ప్రారంభంలో ఇద్దరు వ్యక్తులు.. ఏకంగా సల్మాన్ ఫామ్ హౌస్‌లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా బాబా సిద్దిఖీని చంపేయడంతో సల్మాన్‌కి పోలీసులు మరింత భద్రత పెంచారు.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8 ఎలిమినేషన్.. డేంజర్ జోన్లో ఆ ఇద్దరు కానీ!) -
అత్యంత అందమైన శాకాహార సెలబ్రిటీలు వీరే!
బాలీవుడ్ తారలు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, రితీష్ దేశ్‌ముఖ్‌లను పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ (పెటా) ఇండియా 2024కి గాను భారతదేశపు ’అత్యంత అందమైన శాకాహార సెలబ్రిటీలు’ గా ఎంపిక చేసింది. జంతు సంక్షేమం పట్ల గల అంకితభావానికి, కారుణ్య జీవనశైలి నిబద్ధతకు గుర్తింపుగా వారికి ఈ గౌరవం లభించింది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ‘పనితో సంబంధం లేకుండా కూడా వెలుగులోకి రావడం ఆనందంగా ఉంది’ని ఈ సందర్భంగా తెలియజేసింది. గతంలో హాటెస్ట్ వెజిటేరియన్ సెలబ్రిటీ అవార్డు టైటిల్ విజేతలలో జీనత్ అమన్, జాకీ ష్రాఫ్, ఫాతిమా సనా షేక్, రాజ్‌కుమార్ రావు, అలియా భట్, అక్షయ్ కుమార్, భూమి పెడ్నేకర్, శ్రద్ధా కపూర్, సోనూసూద్, మానుషి చిల్లర్ .. వంటి సెలబ్రిటీల పేర్లు ఉన్నాయి. మానుషి చిల్లర్, సునీల్ ఛెత్రి, అనుష్క శర్మ, కార్తీక్ ఆర్యన్, విద్యుత్ జమ్వాల్, షాహిద్ కపూర్, రేఖ, అమితాబ్ బచ్చన్ లు కూడా అత్యంత అందమైన శాకా హారులుగా గుర్తింపు పొందారు. ఈ యేడాది జాక్వెలిన్ తన స్టార్ పవర్‌ను అన్ని జంతువుల రక్షణ కోసం ఉపయోగించడంలో పేరొందింది. 50 ఏళ్లకు పైగా సంకెళ్లలో ఉంచిన ఏనుగును రక్షించిన #Freegajraj ప్రచారంతో సహా అనేక మార్గాల్లో పెటా ఇండియా పనికి మద్దతుగా తన అభిమానులను సమీకరించింది.రితేష్ శాకాహారి. శాకాహారాన్ని ప్రోత్సహిస్తున్నాడు. భార్య జెనీలియాతో కలిసి శాకాహార మాంసం కంపెనీని కూడా స్థాపించాడు. ‘నటన నుంచి జంతు సంరక్షణ వరకు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, రితీష్ దేశ్‌ముఖ్ నిజమైన సూపర్ స్టార్లుగా నిరూపితమయ్యారు’ అని పెటా ఇండియా సెలబ్రిటీ, పబ్లిక్ రిలేషన్స్ వైస్ ప్రెసిడెంట్ సచిన్ బంగేరా తెలిపారు. ‘ఈ విధంగా దయను ప్రపంచానికి చూపినందుకు పెటా ఇండియా వారిని గౌరవించడం ఆనందంగా ఉంది. అన్నింటికన్నా వీరిది నాణ్యమైన అందం’ అని ప్రశంసించారు. -
ఎమర్జెన్సీకి లైన్ క్లియర్.. విడుదల తేదీపై ఉత్కంఠ!
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన పొలిటికల్ డ్రామా 'ఎమర్జెన్సీ'. ఇప్పటికే జూలైలోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడుతూ వస్తోంది. గతనెల సెప్టెంబర్ 6న థియేటర్లలోకి వస్తుందని భావించినప్పటికీ.. ఊహించని విధంగా మరోసారి పోస్ట్‌పోన్ అయింది. దీంతో ఇప్పట్లో విడుదలయ్యే అవకాశం లేదని ఫ్యాన్స్ అంతా ఫిక్స్ అయిపోయారు.తాజాగా తన అభిమానులకు కంగనా రనౌత్ గుడ్ న్యూస్ చెప్పింది. ఎమర్జెన్సీ చిత్రానికి సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ జారీ చేసినట్లు ట్విటర్ ద్వారా ప్రకటించింది. మా చిత్రబృందం సెన్సార్ పూర్తి చేసుకుందని.. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపింది. ఈ విషయంలో మీ సహనానికి, మద్దతుకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేసింది.(ఇది చదవండి: కంగనా ఎమర్జెన్సీ.. రిలీజ్‌కు మోక్షం అప్పుడేనా?)కాగా.. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో విధించిన ఎమర్జన్సీ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. దీంతో ఈ మూవీపై ఓ వర్గం సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమను చెడుగా చిత్రీకరించారంటూ ఈ చిత్రంపై ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా సెన్సార్ బోర్డ్ సైతం కొన్ని సీన్స్ కట్ చేయాలని చిత్రబృందానికి సూచించింది. అందువల్లే ఎమర్జెన్సీ వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకోవడంతో త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. We are glad to announce we have received the censor certificate for our movie Emergency, we will be announcing the release date soon. Thank you for your patience and support 🇮🇳— Kangana Ranaut (@KanganaTeam) October 17, 2024 -
సల్మాన్ ఖాన్ హత్యకు ప్లాన్.. షార్ప్ షూటర్ అరెస్ట్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి ముందు ఏప్రిల్ 14న కాల్పులు జరిపిన వారిలో మరోకరిని తాజాగా ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. హరియాణాలోని పానిపట్‌లో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన ఒక షార్ప్ షూటర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేడు అతన్ని కోర్టులో హజరుపరచనున్నారు.ఈ ఏడాది ఏప్రిల్‌లో ముంబైలోని సల్మాన్ గెలాక్సీ అపార్ట్మెంట్స్ వద్ద ఇద్దరు దుండగులు ఆరు రౌండ్ల కాల్పులు జరిపి ఆపై మోటార్ సైకిల్ ద్వారా పారిపోయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కేసు నమోదు చేసిన పోలీసులు నాటి నుంచి ఆ గ్యాంగ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలో జూన్‌లో కూడా మరోసారి సల్మాన్ హత్యకు కుట్ర జరిగిందని పోలీసులు తెలిపారు. సల్మాన్‌కు సంబంధించిన పన్వేల్ ఫామ్‌హౌస్ నుంచి ఇంటికి వెళ్తున్న మార్గంలో ఆయనపై దాడి చేయాలని ఈ గ్యాంగ్ ప్లాన్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే, ఈ కేసులో తాజాగా అరెస్ట్ అయిన వ్యక్తి షార్ప్ షూటర్ అని తెలుస్తోంది. అతను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌లో చాలా కీలకంగా ఉన్నట్లు సమాచారం. సల్మాన్‌ను అంతం చేసేందుకు ఆయన కదలికలను పర్యవేక్షించడానికి దాదాపు 60 నుండి 70 మంది ఈ గ్యాంగ్‌లో భాగం అయ్యారని పోలీసులు తెలిపారు. పంజాబీ సింగర్ సిద్ధూమూసేవాలా హత్య మాదిరే.. కారులోనే సల్మాన్‌ను హత్య చేయాలని ఈ గ్యాంగ్ స్కెచ్ వేసినట్లు పోలీసులు గుర్తించారు. -
పెళ్లైన 12 ఏళ్లకు గుడ్‌న్యూస్ చెప్పిన స్టార్ హీరోయిన్
బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే (39) బేబీ బంప్ ఫోటోతో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. తన కొత్త సినిమా 'సిస్టర్ మిడ్నైట్' లండన్‌లో ప్రీమియర్ షో జరుగుతుండగా రాధికా ఆప్టే కూడా పాల్గొంది. కరణ్ కంధారి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 19న డైరెక్టర్స్ ఫోర్ట్‌నైట్ కేన్స్‌లో ప్రదర్శించబడింది. 2024 కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ఈ చిత్రం రెండు విభాగాల్లో నామినేషన్ దక్కించుకుంది. అయితే, ఈ చిత్రం ఈ ఏడాది అక్టోబర్ 20న విడుదల కానుంది.రాధికా ఆప్టే అమ్మ కాబోతుంది. బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. అయితే, తల్లి కాబోతున్న విషయాన్ని ఇప్పటివరకు ఆమె గోప్యంగానే ఉంచింది. నవంబర్ నెలలో పండంటి బిడ్డకు ఈ బ్యూటీ జన్మనివ్వనుంది. కెరీర్ పీక్‌స్టేజ్‌లో ఉన్న సమయంలోనే బ్రిటీష్ వయొలినిస్ట్ బెండిక్ట్ టేలర్‌ను పెళ్లాడింది. 2012లో వీరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. సుమారు 12 ఏళ్ల తర్వాత ఆమె తల్లి కానున్నడంతో ఆభిమానులు సంతోషంతో శుభాకాంక్షలు చెబుతున్నారు.థియేటర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలు పెట్టి హిందీ, మరాఠి, తమిళం, తెలుగు, మలయాళం, బెంగాలీ భాషలతో పాటు ఇంగ్లిష్ సినిమాల్లోనూ నటించింది. బద్లాపూర్, హంటర్, మాంఝీ తదితర సినిమాలతో గుర్తింపు పొందిన రాధిక.. లెజెండ్, లయన్, రక్త చరిత్ర వంటి సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా చేరువైంది. ఇటీవల కాలంలో న్యూడ్, సెమీ న్యూడ్ చిత్రాల్లో ఆమె నటించడం గమనార్హం. View this post on Instagram A post shared by Radhika (@radhikaofficial) -
సడన్‌గా పెళ్లి వాయిదా.. ఫ్రెండ్స్ కోసం ఏడ్చేసిన నటుడు
జైదీప్ అహ్లావత్.. మహారాజ వెబ్ సిరీస్‌తో ఈ ఏడాది ట్రెండింగ్‌లోకి వచ్చాడీ నటుడు. ఇతడు విజయ్ వర్మకు క్లోజ్ ఫ్రెండ్ కూడా! వీరిద్దరూ పుణెలోని ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో కలిసి చదువుకున్నారు. సినిమాల్లో సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తున్న ఈఫ్రెండ్స్ భాగీ 3, జానె జాన్ వంటి చిత్రాల్లో కలిసి నటించారు.సడన్‌గా పెళ్లి వాయిదాతాజాగా ఈ మిత్రులిద్దరూ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ముందుగా జైదీప్ మాట్లాడుతూ.. నా జూనియర్ జ్యోతి హుడాతో 2009లో నా పెళ్లి జరిగింది. ఈ వివాహానికి హాజరయ్యేందుకు విజయ్ తన ఫ్రెండ్స్‌తో కలిసి ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నాడు. కొత్త బట్టలు తీసుకున్నాడు. అయితే అక్షయ్ కుమార్ 'కట్టా మీటా' సినిమా కోసం చివరి నిమిషంలో పెళ్లి వాయిదా వేసుకోవాల్సి వచ్చింది అన్నాడు. అంత స్థోమత లేదుఇంతలో విజయ్ వర్మ అందుకుంటూ.. అప్పుడు మా టికెట్లు ఏం చేయాలో అర్థం కాలేదు. మళ్లీ టికెట్లు కొనేంత స్థోమత కూడా లేదు. అందుకే వాయిదా పడ్డ పెళ్లికి వెళ్లలేకపోయాం. అందుకు చాలా బాధపడ్డాం. దాదాపు ఆరు నుంచి ఎనిమిది నెలలపాటు మేమెవరం అతడితో మాట్లాడలేదు.దుఃఖం ఆపుకోలేకపోయాంకొన్ని నెలల తర్వాత ఫ్రెండ్స్ అందరం కలుసుకున్నాం. అప్పుడు జైదీప్ ఒక్కసారిగా ఏడ్చేశాడు. స్నేహితుల్లో ఏ ఒక్కరూ పెళ్లికి రాలేదంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతడిని అలా చూడగానే మా అందరికీ దుఃఖం ఆగలేదు అని చెప్పుకొచ్చాడు.చదవండి: బిగ్‌బాస్ 8లో 'కమ్యూనిటీ' ఓటింగ్? మెహబూబ్ షాకింగ్ వీడియో -
ఎలక్ట్రిక్ కారు కొన్న అమితాబ్.. ఎన్ని కోట్లంటే?
బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తన గ్యారేజీలోకి కొత్త కారు తీసుకొచ్చాడు. ఈ మధ్యే 82వ పుట్టినరోజు జరుపుకున్న ఈయన బీఎమ్‌డబ్ల్యూ ఐ7 బ్రాండెడ్ లగ్జరీ కారు కొనుగోలు చేశాడు. ఇది ఎలక్ట్రిక్ వాహనం. అద్భుతమైన డిజైన్‌తో ఆకట్టుకుంటున్న ఈ కారు ధర రూ.2.03 కోట్లు విలువ చేస్తోంది. ఇకపోతే బచ్చన్‌కు కార్ల మీద మక్కువ ఎక్కువ. ఈయన తొలిసారి కొన్న కారు ఫియాట్ 1100. కార్ల కలెక్షన్..తన తొలి సినిమా 'సాట్ హిందుస్తానీ (1969)' సక్సెస్ తర్వాత ఫియాట్ కారు కొన్నాడు.. అది కూడా సెకండ్ హ్యాండ్లో! అప్పటినుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఇండియన్ సినిమా గర్వించే స్థాయికి చేరుకున్నాడు. ఈయన గ్యారేజీలో ల్యాండ్ రోవర్ డిఫెండర్, రోల్స్ రాయిస్ ఫాంటమ్ సెవన్, లెక్సస్ ఎల్ఎక్స్ 570 కార్లు ఉన్నాయి. ఇవే కాకుండా మినీ కూపర్ కూడా ఉంది.చదవండి: పుష్ప క్రేజ్ మామూలుగా లేదుగా.. ఏకంగా 1600 కిలోమీటర్లు! -
కంగనా ఎమర్జెన్సీ.. రిలీజ్‌కు మోక్షం అప్పుడేనా?
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ లీడ్ రోల్లో నటించిన పొలిటికల్ డ్రామా ఎమర్జెన్సీ. గతంలో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో విధించిన ఎమర్జెన్సీ ఆధారంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం రాజకీయ కారణాలతో పలుసార్లు వాయిదా పడింది. మొదట ఈ సినిమాను సెప్టెంబర్ 6న విడుదల చేయాలని నిర్ణయించినప్పటికీ సాధ్యం కాలేదు.తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా పంజాబ్ ఎన్నికల తర్వాత విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఈ సినిమాపై మొదటి నుంచి వివాదాలు నడుస్తున్నాయి. సెన్సార్ బోర్డు నిబంధనలకు అనుగుణంగా ఈ మూవీని విడుదల చేసేందుకు మేకర్స్ నిర్ణయించారు. ఇప్పటికే ఎమర్జెన్సీ చిత్రానికి యూఏ సర్టిఫికేట్ జారీ చేసింది. అయితే కొన్ని సీన్స్ మాత్రం మార్పులు చేయాలని సూచించింది. కొందరు తమను టార్గెట్ చేసి చెడుగా చూపిస్తున్నారని ఓ వర్గం ఆరోపిస్తోంది. దీంతో సినిమా విడుదల వాయిదా వేయాల్సి వచ్చింది. అందువల్లే పంజాబ్ ఎలక్షన్స్ తర్వాతే ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. -
ఓ సీక్రెట్ చెప్పనా..!
వరుణ్ ధావన్, సమంత లీడ్ రోల్స్‌లో నటించిన వెబ్ సిరీస్ ‘సిటాడెల్: హనీబన్నీ’. ‘ది ఫ్యామిలీమేన్’ సిరీస్ ఫేమ్ రాజ్ అండ్ డీకే ఈ సిరీస్‌ను రూపొందించారు. అమెరికన్ సిరీస్ ‘సిటాడెల్’ ఇండియన్ వెర్షన్‌గా ‘సిటాడెల్: హనీ బన్నీ’ రానుంది. ఈ సిరీస్ ట్రైలర్ విడుదలైంది. ‘ప్రతి రోజూ ఓ ప్రమాదం ముంచుకొస్తుంది.ఒకదాని వెంట మరొకటి వస్తూనే ఉంటుంది. సవాల్ ఏంటంటే... ఈ ప్రమాదాలను మనం అంతం చేస్తామా? లేక అవి మనల్ని అంతం చేస్తాయా? అన్నది, నాడియా... నీకొక సీక్రెట్ చెప్పనా.. నేనొక ఏజెంట్’ వంటి డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నాయి. ఈ సిరీస్‌లో సినీ నటి హనీగా సమంత, స్టంట్ కొరియోగ్రాఫర్ బన్నీగా వరుణ్ ధావన్ కనిపిస్తారు. కానీ ఈ ఇద్దరూ ఏజెంట్స్. ఈ ఇద్దరూ ఓ మిషన్ కోసం ఎలాంటి పోరాటాలు చేశారన్నది సిరీస్‌లో ఆసక్తికరమైన అంశం. అమెజాన్ ఓటీటీలో నవంబరు 7 నుంచి ఈ సిరీస్ స్ట్రీమ్ కానుంది. -
బిగ్‌బాస్ నుంచి బయటకొచ్చేసిన కంటెస్టెంట్.. అదే కారణం!
బాలీవుడ్లో ప్రస్తుతం బిగ్‌బాస్ సీజన్-18 నడుస్తోంది. ఈ రియాలిటీ షోకు స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్ ఊహించని విధంగా బయటకొచ్చేశాడు. అడ్వకేట్ అయిన గుణరత్న సదావర్తే బిగ్ బాస్ హౌస్‌కు గుడ్ బై చెప్పారు. కారణమిదే...తాజా సమాచారం ప్రకారం అడ్వకేట్ గుణరత్న సదావర్తే సోమవారం కోర్టు విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ అతను రాలేదు. దీంతో న్యాయమూర్తులు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో గుణరత్న సదావర్తే బిగ్‌బాస్ షో నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. అయితే అతను మళ్లీ బిగ్‌బాస్ హౌస్‌లోకి తిరిగి వస్తాడా? లేదా అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు.న్యాయవాది గుణరత్న కేసుఅంతకుముందు బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నందున గుణరత్న సదావర్తే కోర్టుకు హాజరు కాలేకపోయాడు. ప్రస్తుతం మహారాష్ట్రలో ముఖ్యమైన సమస్య అయిన మరాఠా రిజర్వేషన్‌ను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను కోర్టు విచారిస్తోంది. కాగా.. సదావర్తే తన సతీమణి జైశ్రీ పాటిల్‌తో కలిసి రిజర్వేషన్‌పై పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు తదుపరి విచారణను నవంబర్ 19కి కోర్టు వాయిదా వేసింది. -
అందుకు భిన్నంగా ఈ సిరీస్‌లో చేశా: సమంత కామెంట్స్
సమంత రూత్ ప్రభు, వరుణ్ ధావన్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా వెబ్‌సిరీస్ ‘సిటాడెల్: హనీ- బన్నీ. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ముంబయిలో జరిగిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో హీరోయిన్ సమంత పాల్గొన్నారు. ఈవెంట్లో సమంత ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న టాలెంటెడ్ నటులతో కలిసి పనిచేసే అవకాశం రావడం ఆనందంగా ఉందని తెలిపింది. ఇండస్ట్రీలో మహిళల భవిష్యత్తు ఎలా ఉంటుందన్న ప్రశ్నపై సామ్ ఈ విధంగా స్పందించింది.సమంత మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో అందరికీ అవకాశాలు రావాలని కోరుకుంటున్నా. ఇప్పటికే కొంత మార్పులు వచ్చాయి. అందులో నేనూ భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. అప్పుడే మన ప్రతిభ ఏంటో మనకు తెలుస్తుంది. స్పై జానర్లో సిరీస్, సినిమా అయినా సరే ఎప్పటికీ పురుషులకే అధిక ప్రాధాన్యం ఉంటుంది. వారికే యాక్షన్, డైలాగ్స్ ఉంటాయి. అయితే దానికి భిన్నంగా ఈ సిరీస్‌లో నేను కూడా యాక్షన్ చేశా అని తెలిపింది.కాగా.. ప్రియాంక చోప్రా, రిచర్డ్ మ్యాడెన్ కీలక పాత్రల్లో నటించిన హాలీవుడ్ సిరీస్ సిటాడెల్. దీనికి ఇండియన్ వెర్షన్ సిటాడెల్: హనీ -బన్నీ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సిరీస్‌కు రాజ్, డీకే దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో నవంబరు 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది. -
బరిలోకి మహేశ్, చరణ్, సమంత.. అయినా ఫ్లాప్ తప్పలేదు!
సినీ ప్రేక్షకుడు మారాడు. ఒకప్పుడు తన అభిమాన నటీనటుల సినిమా ఎలా ఉన్నా సరే థియేటర్‌కి వెళ్లి చూసేవాడు. కానీ ఇప్పుడు హీరోహీరోయిన్ల మొఖం చూడట్లేదు. కథలో దమ్ముంటేనే సినిమా చూస్తున్నారు. స్టార్ హీరో సినిమా అయినా సరే.. టికెట్ తెగాలంటే మంచి కంటెంట్ ఉండాల్సిందే. లేదంటే అపజయం తప్పదు. దీనికి ఇటీవల విడుదలైన ‘జిగ్రా’ సినిమానే మంచి ఉదాహరణ.బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జిగ్రా’. వేదాంగ్ రైనా, మనోజ్ పవా, రాహుల్ రవీంద్రన్ కీలక పాత్రలు పోషించారు. వాసన్ బాలా దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ దసరా కానుకగా అక్టోబర్ 11న విడుదలై తొలి రోజే ఫ్లాప్ టాక్ని మూటగట్టుకుంది. ఫలితంగా ఈ సినిమా కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. వీకెండ్ మొత్తంలో రూ. 20 కోట్ల కలెక్షన్స్‌ని కూడా రాబట్టలేకపోయిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. వారం మొత్తంలో హిందీలోనే కేవలం రూ. 18 కోట్ల మాత్రమే వసూలు చేసిందంటే..ఇక మిగతా భాషల్లో కలెక్షన్స్ ఎంత దారుణంగా ఉంటాయో ఊహించుకోవచ్చు.అపజయాన్ని ఆపలేకపోయినా స్టార్స్ఆలియా భట్ క్రేజ్ దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ చేశారు. తెలుగులో హీరో రానా రిలీజ్ చేశాడు. వాస్తవానికి హిందీ తర్వాత ఈ చిత్రాన్ని బాగా ప్రమోట్ చేసింది తెలుగులోనే అనే చెప్పాలి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రం ట్రైలర్‌ని విడుదల చేశాడు. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు సోషల్ మీడియా వేదికగా తన మద్దతును ప్రకటించాడు. ఇక ఈ సినిమా ప్రిరిలీజ్ ఈవెంట్‌కి స్టార్ హీరోయిన్ సమంత, త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్యఅతిథులుగా హాజరై.. తన వంతు సాయం అందించారు. ఇలా స్టార్స్ అంతా తమకు తోచిన సహాయం అందించినా.. జిగ్రాకు విజయం అందించలేకపోయారు. తెలుగులో మూడు రోజుల్లో కేవలం 18 లక్షల వసూళ్లు మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. యావరేజ్ టాక్ వచ్చిన ఓ చిన్న సినిమాకు కూడా ఇంతకంటే ఎక్కువే వస్తాయని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. అయితే కథలో దమ్ము లేనప్పడు ఏ హీరో అయినా ఏం చేయగలడు? కాస్త బాగున్న సినిమాను ప్రచారం చేస్తే ఎంతో కొంత ఉపయోగపడుతుంది. కానీ కంటెంట్‌లేని సినిమాకు ఎంత ప్రచారం చేసిన బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. విషయం వీక్‌గా ఉన్నప్పుడు పబ్లిసిటీ పీక్స్‌లో ఉంటుందనడానికి ‘జీగ్రా’ మూవీ బెస్ట్ ఎగ్జాంపుల్. -
రెండేళ్ల క్రితమే షూటింగ్.. ఇప్పుడు ఓటీటీకి వస్తోన్న స్పోర్ట్స్ డ్రామా!
ఇటీవల థియేటర్లలో రిలీజైన తర్వాత ఓటీటీ రావడం సహజం. ఎక్కువశాతం సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆడిన తర్వాత నెల రోజుల తర్వాతే ఓటీటీకి వచ్చేస్తుంటాయి. అయితే షూటింగ్ పూర్తయిన దాదాపు రెండేళ్ల తర్వాత ఓటీటీకి రావడం చాలా అరుదు. కానీ హిందీలో తెరకెక్కించిన స్పోర్ట్స్ డ్రామా ది మిరిండా బ్రదర్స్ రెండేళ్ల అనంతరం డైరెక్ట్‌గా ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది.తాజాగా ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ జియో సినిమా వెల్లడించింది. థియేటర్లలో రిలీజ్ కాకుండా నేరుగా ఓటీటీకి వస్తోన్న ఈ మూవీలో హర్షవర్దన్ రాణే, మీజాన్ జాఫెరీ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు సంజయ్ గుప్తా దర్శకత్వం వహించారు. ది మిరిండా బ్రదర్స్ సినిమా అక్టోబర్ 25వ తేదీ నుంచి స్ట్రీమింగ్కు రానుంది.ఆతిష్, కాబిల్, షూటౌట్ అట్ లోఖంద్వాలా, కాంటే లాంటి బాలీవుడ్ సినిమాలతో పాపులర్ అయిన సంజయ్ గుప్తా.. ది మిరండా బ్రదర్స్ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇద్దరు సోదరులు రెండు వేర్వేరు ఫుట్‌బాల్ జట్లకు ఆడుతూ పోటీపడడం చుట్టూ తిరిగే కథే ఈ మూవీ. ఈ సినిమా షూటింగ్ రెండేళ్ల క్రితమే జరిగింది. 2022లో గోవాలోనే ఈ మూవీ ఎక్కువ భాగం షూటింగ్ నిర్వహించారు. చిత్రీకరణ పూర్తయినప్పటికీ సినిమా విడుదల ఆలస్యమైంది. దీంతో ఇప్పుడు నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు.Football in their hearts… vengeance in their souls.#TheMirandaBrothers, streaming 25 October onwards, only on JioCinema Premium.@MeezaanLifeLine #HarshvardhanRane @_SanjayGupta #AnuradhaLekhiGupta #WhiteFeatherFilms @TSeries#TheMirandaBrothersOnJioCinema #JioCinemaPremium pic.twitter.com/tVWHoEWCi4— JioCinema (@JioCinema) October 15, 2024