Automobile
-
91 శాతం వాహనాలు బీమాకు దూరం
బీమా నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ 2018లో తీసుకు వచ్చిన నిబంధనల ప్రకారం షోరూం నుంచి కొత్త కారు రోడ్డెక్కాలంటే ఒక ఏడాది ఓన్ డ్యామేజ్ ఇన్సూరెన్స్, మూడేళ్ల థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి. ఐఆర్డీఏఐ 2019లో తెచ్చిన రూల్స్ ప్రకారం ద్విచక్ర వాహనాల విషయంలో ఇది 1+5 ఏళ్లు ఉంది. ఇదంతా సరే. మరి రెన్యువల్స్ సంగతి ఏంటి? తొలి పాలసీ గడువు ముగిసిన తర్వాత భారత్‌లో ఎంత మంది తమ వాహనాలను రెన్యువల్ చేస్తున్నారో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. 19 శాతం టూ వీలర్లు, 47 శాతం కార్లు మాత్రమే రెన్యువల్ అవుతున్నాయట. మొత్తంగా దేశంలో అన్ని వాహనాలకు కలిపి బీమా విస్తృతి 9 శాతమే ఉంది. అంటే రోడ్డుమీద తిరుగుతున్న 100 వాహనాల్లో తొమ్మిదికి మాత్రమే ఇన్సూరెన్స్ ఉన్నట్టు లెక్క. 2015కు ముందు ఇది కేవలం 3 శాతమే. వాహనానికి ఏమీ కాదు.. అనవసరంగా డబ్బులు ఖర్చు అన్న నిర్లక్ష్యపు భావనే ఇందుకు కారణమని బీమా కంపెనీలు అంటున్నాయి. బీమా లేకుంటే వాహనానికి జరగరానిది జరిగితే జేబులోంచి ఖర్చు చేయాల్సిందే. కొన్ని సందర్భాల్లో తీవ్ర నష్టమూ తప్పదు. సమగ్ర బీమా ఉంటే ప్రకృతి విపత్తుల నుంచీ వాహనానికి రక్షణ లభిస్తుంది.డిజిటల్ పాలసీలదే హవా.. వ్యయాలను తగ్గించుకోవడానికి, పాలసీల జారీని వేగవంతం చేయడానికి బీమా కంపెనీలు డిజిటల్ వైపు మళ్లుతున్నాయి. 10 నిమిషాల్లోనే పాలసీలను కస్టమర్ల చేతుల్లో పెడుతున్నాయి. ఆన్లైన్లో జారీ అవుతున్న పాలసీల సంఖ్య ఏకంగా 65 శాతం ఉందంటే డిజిటల్ వేగాన్ని అర్థం చేసుకోవచ్చు. పాయింట్ ఆఫ్ సేల్స్ పర్సన్స్ (పీవోఎస్‌పీ) అడ్వైజర్లు సైతం కస్టమర్లను నేరుగా చేరుకుని డిజిటల్ రూపంలో పాలసీలను అందిస్తున్నారు. 2029–30 నాటికి జారీ అవుతున్న పాలసీల్లో డిజిటల్ వాటా 75 శాతానికి చేరుతుందని పరిశ్రమ భావిస్తోంది. కస్టమర్లలో 15 శాతం మంది జీరో డిప్రీసియేషన్ కోరుకుంటున్నారు. నడిపే దూరానికి బీమా చెల్లించే ‘పే యాజ్ యూ డ్రైవ్’ ప్లాన్స్‌ను 6 శాతం మంది ఎంచుకుంటున్నారని పాలసీబజార్‌కు చెందిన పీబీపార్ట్నర్స్ మోటార్ ఇన్సూరెన్స్ అసోసియేట్ డైరెక్టర్, సేల్స్ హెడ్ అమిత్ భడోరియా సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. కంపెనీల మధ్య పోటీ కారణంగానే ప్రీమియంలో వ్యత్యాసం ఉంటోందని అన్నారు. రూ.1.60 లక్షల కోట్లకు.. దేశంలో వాహన బీమాను 27 సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. పాలసీల జారీలో 57 బ్రోకింగ్ కంపెనీలు పాలుపంచుకుంటున్నాయి. భారత్‌లో మోటార్ ఇన్సూరెన్స్ మార్కెట్ 2023–24లో 12.9 శాతం దూసుకెళ్లి రూ.91,781 కోట్లు నమోదు చేసింది. 2029 నాటికి ఇది సుమారు రూ.1.6 లక్షల కోట్లకు చేరుకుంటుందని మార్కెట్ అంచనా. వాహనాలన్నింటికీ బీమా కలిగి ఉండాలన్నదే ఐఆర్డీఏఐ లక్ష్యం. అంతేగాక బీమా ప్రీమియం వినియోగదార్లకు అందుబాటులో ఉంచేందుకు ఐఆర్డీఏఐ కృషి చేస్తోంది. బీమా పాలసీలను విస్తృతం చేసే లక్ష్యంతో 2015లో పాయింట్ ఆఫ్ సేల్స్ పర్సన్స్ (పీవోఎస్‌పీ) కాన్సెప్ట్‌కు ఐఆర్డీఏఐ శ్రీకారం చుట్టడం పరిశ్రమ వృద్ధికి ఆజ్యం పోసింది. జారీ అవుతున్న పాలసీల్లో 60 శాతం బ్రోకింగ్ కంపెనీల నుంచే ఉండడం గమనార్హం. 40 శాతం పాలసీలు నేరుగా బీమా కంపెనీల నుంచి జారీ చేస్తున్నారు. 75 శాతం చౌక ప్రీమియం పాలసీలే..దేశంలో 2018కి ముందు రెన్యువల్స్ ద్విచక్ర వాహనాలకు 31 శాతం, కార్లకు 37 శాతం నమోదైంది. ఐఆర్డీఏఐ చొరవతో ఇన్సూరెన్స్ విస్తృతి పెరిగింది. పాలసీబజార్.కామ్ ప్రకారం టాప్–20 నగరాల్లో 50 శాతం టూ వీలర్స్, 60 శాతం కార్లకు బీమా ఉంది. తృతీయ, ఆపై తరగతి నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో 40 శాతం ద్విచక్ర వాహనాలు, 45 శాతం ఫోర్ వీలర్స్‌కు ఇన్సూరెన్స్ ఉంది. టాప్–20 నగరాల్లో సమగ్ర బీమా (కాంప్రహెన్సివ్) పాలసీని 55 శాతం మంది, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ 70 శాతం మంది ఎంచుకుంటున్నారు. ఈ నగరాల వెలుపల 30 శాతం మంది సమగ్ర పాలసీ, 50 శాతం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కొనుగోలు చేస్తున్నారు. తక్కువ ప్రీమియంలో లభించే పాలసీలను 75 శాతం మంది తీసుకుంటున్నారు. ఇక ప్రమాదానికి గురైన వాహనాల్లో 40 శాతం వాటికి బీమా ఉండడం లేదట. -
Nitin Gadkari: కస్టమర్ సర్విసులపై మరింతగా దృష్టి పెట్టండి
న్యూఢిల్లీ: దేశీ ఆటో రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడంపై మరింతగా దృష్టి పెట్టాలని వాహన సంస్థలకు కేంద్ర రహదారి రవాణా, హైవేస్ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సూచించారు. నాణ్యతకు భరోసానిస్తూ, విక్రయానంతర సేవలను మెరుగుపర్చుకునే విధంగా కొత్త ఆవిష్కరణలపై ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య ఫాడా కార్యక్రమానికి పంపిన వీడియో సందేశంలో మంత్రి ఈ విషయాలు తెలిపారు. స్వయం సమృద్ధి సాధించాలన్న భారత లక్ష్యాన్ని సాకారం చేసుకోవడంలో ఆటోమోటివ్ డీలర్లు ప్రధాన పాత్ర పోషించగలరని ఆయన తెలిపారు. దేశ ఎకానమీలో కీలకంగా ఉంటున్న ఆటో రిటైల్ పరిశ్రమకు ప్రభుత్వం అన్ని విధాలుగా మద్దతునిస్తుందని గడ్కరీ హామీ ఇచ్చారు. పర్యావరణహిత మొబిలిటీ సొల్యూషన్స్ విషయంలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదిగేందుకు భారత్ కృషి చేస్తోందని ఆయన చెప్పారు. -
గుడ్‌న్యూస్.. 20 కిలోమీటర్ల వరకు టోల్ ఫీజు లేదు
ఫంక్షనల్ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (జీఎన్ఎస్ఎస్) ఉన్న వాహనాలు హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలలో రోజుకు 20 కిలోమీటర్ల వరకు టోల్ ఫీజు లేకుండా ప్రయాణించడానికి ప్రభుత్వం అనుమతిస్తోంది. ఈ మేరకు జాతీయ రహదారుల రుసుము (రేట్ల నిర్ణయం, వసూళ్లు) నిబంధనలు- 2008ని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ సవరించింది. కొత్త నిబంధనలు మంగళవారం నుండి అమలులోకి వచ్చినట్లు ప్రభుత్వం నోటిఫికేషన్లో తెలిపింది.కొత్త నిబంధనల ప్రకారం.. జీఎన్ఎస్ఎస్ వాహనాలు 20 కిలోమీటర్లు దాటి ఎంత దూరం ప్రయాణిస్తాయో అంత దూరంపై మాత్రమే ఇప్పుడు రుసుము వసూలు చేస్తారు. గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఆన్-బోర్డ్ యూనిట్ అమర్చిన వాహనాల కోసం ప్రత్యేకమైన లేన్‌ను కేటాయిస్తారు. ఇతర వాహనాలు ఈ లేన్‌లోకి ప్రవేశించినట్లయితే రెండు రెట్ల రుసుమును చెల్లించాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.ఇదీ చదవండి: టోల్ ఫీజు మినహాయింపు ఉంటుందా?ఎంపిక చేసిన జాతీయ రహదారులలో ఫాస్ట్‌ట్యాగ్‌తో పాటు జీఎన్ఎస్ఎస్ ఆధారిత టోల్ వసూలు విధానాన్ని పైలట్ ప్రాతిపదికన అమలు చేయాలని నిర్ణయించినట్లు జూలైలో హైవే మంత్రిత్వ శాఖ తెలిపింది. కర్ణాటకలోని ఎన్‌హెచ్-275లోని బెంగళూరు-మైసూర్ సెక్షన్, హర్యానాలోని ఎన్‌హెచ్-709లోని పానిపట్-హిసార్ సెక్షన్లో జీఎన్ఎస్ఎస్ ఆధారిత వినియోగదారు రుసుము వసూలు వ్యవస్థకు సంబంధించి పైలట్ అధ్యయనం జరిగిందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. -
మారుతీ ఈవీ రేంజ్ 500 కిలోమీటర్లు
న్యూఢిల్లీ: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా తొలి ఎలక్ట్రిక్ మిడ్‌సైజ్ ఎస్యూవీ వచ్చే ఏడాది ప్రారంభంలో రోడ్లపై పరుగుతీయనుంది. ఒకసారి చార్జింగ్‌తో 500 కిలోమీటర్లు ప్రయాణించే సామర్థ్యంతో ఈ కారును రూపొందిస్తున్నట్టు సంస్థ ఎండీ, సీఈవో హిసాటీ టాకేయూచీ వెల్లడించారు. 60 కిలోవాట్ అవర్ బ్యాటరీని పొందుపరుస్తున్నట్టు సియామ్ సమావేశంలో చెప్పారు. ఇలాంటి పలు ఈవీ మోడళ్లను ప్రవేశపెడతామని తెలిపారు. యూరప్, జపాన్ తదితర దేశాలకు ఈ ఈవీని ఎగుమతి చేయనున్నట్టు పేర్కొన్నారు. దేశీయ విపణిలో కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి ఎలక్ట్రిక్, బలమైన హైబ్రిడ్ కార్లతోపాటు మారుతీ తన కార్లలో అన్ని రకాల సాంకేతికతలను ఉపయోగించాలని భావిస్తోంది. 2030 నాటికి ఎగుమతులను మూడు రెట్లు పెంచుకునే యోచనలో ఉన్నట్లు టాకేయూచీ తెలిపారు. కంపెనీ ఇప్పటికే కొన్ని వాహనాలను జపాన్‌కి కూడా ఎగుమతి చేస్తున్నట్లు చెప్పారు. 2025 జనవరిలో జరిగే భారత్ మొబిలిటీ షో సందర్భంగా తొలి ఈవీని ఆవిష్కరిస్తామని మారుతీ మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ తెలిపారు. దేశవ్యాప్తంగా చార్జింగ్ మౌలిక వసతుల ఏ ర్పాటు, రీసేల్ మార్గాలను కలిగి ఉండటం వంటి ఇతర కీలక అంశాలపై కూడా దృష్టి సారించామన్నారు. -
ఈవీ విక్రయాలు.. ఏటా కోటి!
న్యూఢిల్లీ: దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) మార్కెట్ 2030 నాటికి ఏటా ఒక కోటి యూనిట్ల స్థాయికి చేరగలదన్న అంచనాలు నెలకొన్నాయని కేంద్ర రహదారి రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. అలాగే 5 కోట్ల ఉద్యోగాల కల్పన కూడా జరగగలదని వాహనాల తయారీ సంస్థల సమాఖ్య సియామ్ 64వ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. ఆటోమోటివ్లకు సంబంధించి భవిష్యత్తులో భారత్ నంబర్‌వన్ తయారీ హబ్‌గా ఎదగగలదని తెలిపారు. 2030 నాటికి దేశీయంగా మొత్తం ఈవీ వ్యవస్థ రూ. 20 లక్షల కోట్ల స్థాయికి, ఈవీ ఫైనాన్స్ మార్కెట్ రూ. 4 లక్షల కోట్ల స్థాయికి చేరే అవకాశాలు ఉన్నాయని గడ్కరీ పేర్కొన్నారు.రాబోయే రోజుల్లో లిథియం అయాన్ బ్యాటరీల ఖరీదు మరింత తగ్గి ఎలక్ట్రిక్ వాహనాల ధరలు దిగి వస్తాయని, ఈవీల వినియోగం గణనీయంగా పెరిగేందుకు ఇది దోహదపడగలదని ఆయన చెప్పారు. 2023–24లో ఈవీల అమ్మకాలు 45 శాతం పెరిగాయని, 400 స్టార్టప్‌లు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ఉత్పత్తి ప్రారంభించాయని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం దేశీయంగా సుమారు 30 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు రిజిస్టర్ అయి ఉన్నాయని, మొత్తం అమ్మకాల్లో టూ–వీలర్ల వాటా 56 శాతంగా ఉందని పేర్కొన్నారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకంతో (పీఎల్ఐ) బ్యాటరీ సెల్ తయారీకి ఊతం లభించగలదని ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయి పరిశ్రమగా ఎదిగేందుకు పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై ఆటోమొబైల్ సంస్థలు మరింత ఇన్వెస్ట్ చేయాలని ప్రధాన ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ సూచించారు. ఎగుమతులను పెంచుకునే దిశగా తమ ఉత్పత్తులకు గ్లోబల్ ఎన్‌క్యాప్ (న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రాం) రేటింగ్స్‌ను మెరుగుపర్చుకోవడంపై దృష్టి పెట్టాలని చెప్పారు. పీఎల్ఐ కింద రూ. 75 వేల కోట్ల ప్రతిపాదనలు.. పీఎల్ఐ కింద రూ. 75,000 కోట్ల మేర పెట్టుబడుల ప్రతిపాదనలు వచి్చనట్లు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి తెలిపారు. కంపెనీలు ఇప్పటికే సుమారు రూ. 18,000 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు ఆయన చెప్పారు. సుమారు 30,000 ఉద్యోగాల కల్పనకు స్కీము తోడ్పడిందని మంత్రి వివరించారు. మరోవైపు, వాహనాల వయస్సును బట్టి కాకుండా వాటి నుంచి వచ్చే కాలుష్యాన్ని బట్టి స్క్రాపేజీ విధానం ఉండేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోందని కేంద్ర రహదారి రవాణా, హైవేస్ శాఖ కార్యదర్శి తెలిపారు. ‘విశ్వసనీయమైన‘ పొల్యూషన్ పరీక్షల విధానాన్ని రూపొందించడంలో ప్రభుత్వానికి వాహన పరిశ్రమ దన్నుగా నిలవాలన్నారు.ఆర్థిక వృద్ధికి ఆటోమోటివ్ దన్నుభారత్ అధిక స్థాయిలో వృద్ధిని సాధించేందుకు ఆటోమోటివ్ రంగం చోదకంగా ఉంటుంది. ఇందుకు కొత్త ఆవిష్కరణలు తదితర అంశాలు తోడ్పడతాయి. ఈ క్రమంలో పెరిగే డిమాండ్‌తో పరిశ్రమ కూడా లబ్ధి పొందుతుంది. దేశీయ ఆటోమోటివ్ పరిశ్రమ గత దశాబ్దకాలంలో గణనీయమైన స్థాయిలో, గతంలో ఎన్నడూ చూడనంత వృద్ధిని సాధించింది. రాబోయే రోజుల్లో దేశ పురోగతి వేగవంతంగా మాత్రమే కాకుండా పర్యావరణహితంగా కూడా ఉండాలి. – ప్రధాని మోదీ -
గిన్నిస్ రికార్డుల్లోకి బెంజ్ కారు.. ఫుల్ చార్జింగ్‌తో 949 కిమీ
సింగిల్ చార్జితో 949 కిలోమీటర్ల ప్రయాణం. ఇంకేముంది గతంలో ఉన్న రికార్డును తిరగరాసి గిన్నిస్ రికార్డు సొంతం చేసుకుంది మెర్సిడెస్ బెంజ్ ఇండియా. ఆటోకార్ ఇండియా సహకారంతో మెర్సిడెస్ బెంజ్ బ్యాటరీ ఎలక్ట్రిక్ లగ్జరీ సెడాన్ వెహికిల్ అయిన ఈక్యూఎస్ 580 4మేటిక్ బెంగళూరు నుంచి నవీ ముంబై వరకు ప్రయాణించి ఈ ఘనతను సాధించింది.ఒక వైపు భారీ వర్షాలు, రోడ్డు విస్తరణ పనులు.. మరోవైపు నగరాలు, పట్టణాల ట్రాఫిక్‌ను చేధించుకుంటూ ఏకధాటిగా ప్రయాణం సాగిందని మెర్సిడెస్ బెంజ్ తెలిపింది. ఈ ప్రయాణినికి ఉపయోగించిన కారు మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 580 4మ్యాటిక్. ఇది 107.8 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది.ఇదీ చదవండి: వైకల్యాన్ని జయించి.. బిలియనీర్‌గా నిలిచి: జీవితాన్ని మార్చే స్టోరీసింగిల్ చార్జితో 916.74 కిమీ ప్రయాణించిన యూకేలో ‘ఫోర్డ్ మస్టాంగ్ మ్యాక్ ఈ’ కారు పేరిట ఈ గిన్నిస్ రికార్డు ఉంది. ఇప్పుడు ఈ రికార్డ్ మెర్సిడెస్ బెంజ్ సొంతం చేసుకుంది. ఈ రికార్డ్ పొందిన సందర్భంగా మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ సంతోష్ అయ్యర్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. దీనికి కారణమైన ఆటోకార్ ఇండియా బృందానికి అభినందించారు. -
ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ కార్లు ఇవే..
ఆటోమొబైల్ రంగం రోజు రోజుకి కొత్త పుంతలు తొక్కుతోంది. ఎలక్ట్రిక్ కార్ల హవా జోరుగా సాగుతోంది. 1888లో జర్మన్ ఆండ్రియాస్ ఫ్లాకెన్ 'ఫ్లాకెన్ ఎలెక్ట్రోవాగన్' రూపొందించారు. ఆ తరువాత 1890లో ఆండ్రూ మారిసన్ మొదటి ఎలక్ట్రిక్ కారును యునైటెడ్ స్టేట్స్కు పరిచయం చేశారు. ఆ తరువాత ఈ వాహనాలను తయారు చేసే కంపెనీలు ఎక్కువయ్యాయి. అయితే ఇప్పుడు ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయడంలో కొన్ని కంపెనీలు నిమగ్నమై ఉన్నాయి. మరికొన్ని కంపెనీలు ఇప్పటికే ఎక్కువ రేంజ్ అందించే కార్లను లాంచ్ చేశాయి.ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ కార్లలో కొన్ని సింగిల్ చార్జితో ఏకంగా 1000 కిమీ రేంజ్ అందించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ జాబితాలో టెస్లా, మెర్సిడెస్ బెంజ్ కంపెనీలు ఉన్నాయి. ఆ తరువాత జాబితాలో పోర్స్చే, హ్యుందాయ్ మొదలైన కంపెనీలు ఉన్నాయి.ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ కార్లు👉టెస్లా రోడ్‌స్టర్: 1000కిమీ👉విషన్ ఈక్యూఎక్స్ఎక్స్: 1000 కిమీ👉లుసిడ్ ఎయిర్: 830 కిమీ👉మెర్సిడెస్ ఈక్యూఎస్: 727 కిమీ👉కియా ఈవీ6: 708 కిమీ👉ఫోక్స్‌వ్యాగన్ ఐడీ: 703 కిమీ👉పోర్స్చే టైకాన్: 677 కిమీ👉పోలెస్టర్ 2: 653 కిమీ👉పోర్స్చే మకాన్ ఎలక్ట్రిక్: 640 కిమీ👉ఆడి క్యూ6 ఈ ట్రాన్: 637 కిమీ👉టెస్లా మోడల్ ఎస్: 634 కిమీ👉హ్యుందాయ్ ఐయోనిక్ 5: 631👉బీవైడీ సీల్: 630 కిమీ👉టెస్లా మోడల్ 3: 627 కిమీ👉హ్యుందాయ్ ఐయోనిక్ 6: 580 -
ఈవీ సబ్సిడీపై కీలక వ్యాఖ్యలు.. మంత్రి స్పష్టత
ఎలక్ట్రిక్ వాహనాలకు అందించే సబ్సిడీలకు తాను వ్యతిరేకం కాదని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. రానున్న రెండేళ్లలో ఈవీ ధర పెట్రోల్, డీజిల్ వాహనాలకు సమానంగా ఉంటుందన్నారు. భారత ఆటోమోటివ్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ 64వ వార్షిక సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు.ఇటీవల జరిగిన ఓ సమావేశంలో మంత్రి ఈవీలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై ఈవీలకు ప్రభుత్వం అందించే రాయితీ అవసరం లేదని తెలిపినట్లు కొన్ని మీడియా సంస్థల్లో కథనాలు వెలువడ్డాయి. అవికాస్తా వైరల్‌గా మారడంతో మంత్రి దీనిపై తాజాగా స్పష్టతనిచ్చారు. ‘ఈవీలకు సంబంధించి ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలకు నేను వ్యతిరేకం కాదు. దీనికి భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా నన్ను బాధ్యత వహించాలని, ఈవీలకు మరిన్ని ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరితే ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఈవీలు ప్రారంభమైనప్పుడు ఒక కిలోవాట్ అవర్ సామర్థ్యం కలిగిన లిథియం అయాన్ బ్యాటరీ ధర 150 డాలర్లు(రూ.12,500)గా ఉండేది. ప్రస్తుతం దాని ధర 108-110 డాలర్లుగా(రూ.9,100) ఉంది. ఇది రానున్న రోజుల్లో రూ.8,300కు తగ్గుతుందని విశ్వసిస్తున్నాను. ఉత్పత్తి ఖర్చులు తగ్గినందున సబ్సిడీ లేకుండా కూడా కంపెనీలు వాటి ఖర్చులను నిర్వహించవచ్చని అంచనా వేశాను’ అని తెలిపారు.ఇదీ చదవండి: భారత్‌లో ట్యాబ్లెట్ పీసీల జోరు‘వచ్చే రెండేళ్లలో ఈవీ ధర పెట్రోల్, డీజిల్ వాహనాలకు సమానంగా ఉంటుంది. కంపెనీల నిర్వహణ ఖర్చులు తగ్గుతున్నాయి. భవిష్యత్తులో సబ్సిడీల అవసరం ఉండకపోవచ్చు. ఒకవేళ ఆర్థిక మంత్రిత్వశాఖ, భారీ పరిశ్రమల శాఖ ఈ విభాగానికి మరింత రాయితీలు అవసరమని భావిస్తే, నేను దాన్ని వ్యతిరేకించను’ అని స్పష్టం చేశారు. -
వాహన పరిశ్రమ @ రూ. 20 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: దేశీయ ఆటోమోటివ్ పరిశ్రమ టర్నోవర్ 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 20 లక్షల కోట్ల మార్కును దాటిందని వాహన తయారీదారుల సమాఖ్య సియామ్ ప్రెసిడెంట్ వినోద్ అగర్వాల్ వెల్లడించారు. మొత్తం వస్తు, సేవల పన్నుల్లో (జీఎస్టీ) 14–15 శాతం వాటా ఆటో పరిశ్రమదే ఉంటోందని ఆయన చెప్పారు. అలాగే దేశీయంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా గణనీయంగా ఉపాధి కలి్పస్తోందని ఆటో విడిభాగాల సంస్థల సమాఖ్య ఏసీఎంఏ 64వ వార్షిక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అగర్వాల్ పేర్కొన్నారు. ప్రస్తుతం స్థూల దేశీయోత్పత్తిలో పరిశ్రమ వాటా 6.8 శాతంగా ఉండగా ఇది మరింత పెరగగలదని వివరించారు. అంతర్జాతీయంగా భారతీయ ఆటో రంగం పరపతి పెరిగిందని అగర్వాల్ చెప్పారు. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకునే దిశగా దేశీయంగా ఉత్పత్తి చేయగలిగే 50 క్రిటికల్ విడిభాగాలను పరిశ్రమ గుర్తించిందని ఆయన వివరించారు. 100 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యం: కేంద్ర మంత్రి గోయల్ భారతీయ వాహన సంస్థలు 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకోవాలని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఏసీఎంఏ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సూచించారు. ఇందులో భాగంగా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని, స్థానికంగా ఉత్పత్తిని మరింతగా పెంచాలని పేర్కొన్నారు. ప్రస్తుతం వాహన ఎగుమతులు 21.5 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. పరిశ్రమలకు ఉపయోగపడేలా ప్రభుత్వం 20 స్మార్ట్ ఇండస్ట్రియల్ నగరాలను అభివృద్ధి చేస్తోందని, వాహనాల విడిభాగాల పరిశ్రమ ఈ టౌన్íÙప్ల రూపంలో వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవాలని మంత్రి చెప్పారు. మరోవైపు, లోకలైజేషన్‌ను పెంచేందుకు సియామ్, ఏసీఎంఏ స్వచ్ఛందంగా లక్ష్యాలను నిర్దేశించుకున్నట్లు అగర్వాల్ పేర్కొన్నారు. -
హ్యుందాయ్ అల్కాజార్ నయా అవతార్..
కొత్త ఫీచర్లతో సరికొత్తగా అప్డేట్ చేసిన 7-సీటర్ ఎస్యూవీ హ్యుందాయ్ అల్కాజార్ నయా అవతార్‌ను హ్యుందాయ్ ఇండియా విడుదల చేసింది. 2024 హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్ పెట్రోల్ వేరియంట్‌ను రూ. 14.99 లక్షలు, డీజిల్ వేరియంట్‌ను రూ.15.99 లక్షల ప్రత్యేక ప్రారంభ ధరతో లాంచ్ చేసింది.హ్యుందాయ్ అల్కాజార్ అమ్మకాలు గత కొన్ని నెలలుగా నిస్తేజంగా ఉన్నాయి. ఇప్పుడొచ్చిన అప్డేట్తోనైనా ఈ ఎస్యూవీ నెలవారీ విక్రయాల సంఖ్య మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ విభాగంలో టాటా సఫారి, మహీంద్రా ఎక్స్‌యూవీ700, ఎంజీ హెక్టర్, సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్, కియా కారెన్స్ వంటివి దీనికి పోటీగా ఉన్నాయి.2024 హ్యుందాయ్ అల్కాజార్ లుక్స్ పరంగా క్రెటాను సాగదీసినట్లుగా ఉంటుంది. హెచ్-ఆకారంలో కనెక్ట్ చేసిన ఎల్ఈడీ డీఆర్ఎల్లు, పెద్ద రేడియేటర్ గ్రిల్ , విశాలమైన స్కఫ్ ప్లేట్‌తో బచ్-లుకింగ్ ఫ్రంట్ ఫేస్‌తో కూడిన బోల్డ్-లుకింగ్ డిజైన్ థీమ్ ఇందులో ఇచ్చారు. ఇక వాహనం ఇరువైపులా చేసిన పెద్ద మార్పులు ఏంటంటే.. కొత్త 18-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, పెద్ద రియర్ క్వార్టర్ విండోస్, బ్లాక్-పెయింటెడ్ క్లాడింగ్, బ్రిడ్జ్-టైప్ రూఫ్ రెయిల్స్.ఆల్కాజర్ రియర్ ఫేస్ కూడా కొత్త స్పాయిలర్, రీవర్క్ చేసిన బంపర్, స్కిడ్ ప్లేట్ కోసం కొత్త డిజైన్‌తో భారీగా సర్దుబాట్లు చేశారు. సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్లతో కనెక్ట్ చేసిన ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్‌లను కూడా దీనికి ఇచ్చారు. కొలతల విషయానికొస్తే, అల్కాజర్ అవుట్గోయింగ్ మోడల్‌తో పోల్చితే 2024 ఆల్కాజర్ 60 మిమీ పొడవు, 10 మిమీ వెడల్పు, 35 మిమీ పొడవు అధికంగా ఉంటాయి. 2,760 ఎంఎం వీల్‌బేస్‌లో మాత్రం ఎటువంటి మార్పు లేదు. ఇక ఇంటీరియర్‌లోనూ డ్యాష్బోర్డ్తోపాటు మరికొన్ని మార్పులు చేశారు.అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్‌లో 1.5లీటర్ డీజిల్, 1.5లీటర్ టర్బో-పెట్రోల్ ఎంపికలు, మూడు డ్రైవ్ మోడ్లు (నార్మల్, ఎకో, స్పోర్ట్), మూడు ట్రాక్షన్ మోడ్లు (స్నో, మడ్, శాండ్) ఉన్నాయి. కొత్త బోల్డ్ హ్యుందాయ్ అల్కాజర్ 9 రంగులలో లభిస్తుంది. వీటిలో 8 మోనో-టోన్ ఎంపికలు అవి కొత్త రోబస్ట్ ఎమరాల్డ్ మ్యాటీ, టైటాన్ గ్రే మ్యాటీ, రోబస్ట్ ఎమరాల్డ్, స్టార్రీ నైట్, రేంజర్ ఖాఖీ, ఫైరీ రెడ్, అబిస్ బ్లాక్, అట్లాస్ వైట్, ఒక డ్యూయల్- బ్లాక్ రూఫ్‌తో అట్లాస్ వైట్‌లో టోన్ కలర్ ఆప్షన్ అందుబాటులో ఉంది. -
దూసుకెళ్తున్న ఆటో రంగం.. మహారాష్ట్రలో వేలకోట్ల పెట్టుబడులు
స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చకాన్‌లో తయారీ కేంద్రాన్ని స్థాపించడానికి ఏకంగా రూ. 15,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. దీనికి మహారాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేసింది. ఈ విషయాన్ని క్యాబినెట్ మంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా వెల్లడించారు.స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్ ఇండియా చకాన్ తయారీ కేంద్రంలో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్లను తయారు చేయనుంది. కంపెనీలో వెయ్యి కంటే ఎక్కువ ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. ఇదే సమయంలో టయోటా కిర్లోస్కర్ కూడా రాష్ట్రంలో రూ. 21273 కోట్ల పెట్టుబడి పెట్టింది. ఈ కంపెనీ 8800 ఉద్యోగాలను కల్పించనుంది.మహారాష్ట్రలో తన కొత్త ఉత్పత్తి యూనిట్ ద్వారా తమ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరిస్తామని, మెరుగైన హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తామని స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్ ఇండియా అధికారులు వెల్లడించారు.టయోటా కంపెనీ తమ ఛత్రపతి శంభాజీనగర్‌లో కొత్త ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఇక్కడ కంపెనీ హైబ్రిడ్ వెహికల్స్, ప్లగ్ఇన్ హైబ్రిడ్ వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేయనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.One more BIG news for Maharashtra !Huge investments of total₹ 1,20,220 crore approved in today’s Cabinet Sub-Committee Meeting, with CM Eknath Shinde ji !The detailed list of approved investments is as follows:✅Tower Semiconductor with Adani Group at Taloja MIDC, Panvel… pic.twitter.com/DVI9z94WyU— Devendra Fadnavis (@Dev_Fadnavis) September 5, 2024 -
భారత్‌లో జపనీస్ బ్రాండ్ కారు లాంచ్: ధర రూ. 69.70 లక్షలు
ప్రముఖ కార్ల తయారీ సంస్థ లెక్సస్ ఇండియా.. భారతీయ మార్కెట్లో 'ఈఎస్ లగ్జరీ ప్లస్ ఎడిషన్' లాంచ్ చేసింది. ఈ కారు ధర రూ. 69.70 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది సెల్ఫ్ ఛార్జింగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ పొందుతుంది.లెక్సస్ ఈఎస్ లగ్జరీ ప్లస్ ఎడిషన్ కొత్త సిల్వర్ గ్రిల్, రియర్ ల్యాంప్ క్రోమ్ గార్నిష్, ఎల్ఈడీ లైట్ లెక్సస్ లోగోతో కూడిన ఇల్యూమినేటెడ్ స్కఫ్ ప్లేట్, లోగో ల్యాంప్, రియర్ సీట్ పిల్లో వంటి ఫీచర్స్ పొందుతుంది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కారు మీద 8 సంవత్సరాలు / 160000 కిమీ వారంటీ అందిస్తుంది. కస్టమర్లు 5 సంవత్సరాల వరకు రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కూడా పొందవచ్చు.లెక్సస్ కొత్త కారు లాంచ్ చేసిన సందర్భంగా కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ తన్మయ్ భట్టాచార్య మాట్లాడుతూ.. రాబోయే పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని కొత్త ఎడిషన్ లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. ఇది లేటెస్ట్ డిజైన్, ఫీచర్స్ పొందుతుంది. పనితీరు కూడా చాలా ఉత్తమంగా ఉంటుందని ఆయన అన్నారు.2024 ప్రథమార్థంలో, జపనీస్ కార్ల తయారీ కంపెనీ లెక్సస్ భారతదేశంలో 55 శాతం ఈఎస్ కార్లను విక్రయించింది. ఇప్పుడు ఇందులో లగ్జరీ ప్లస్ ఎడిషన్ లాంచ్ చేసింది. ఇది కూడా మనషి మంచి అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నారు. -
Hyundai Venue E+: ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో అదిరిపోతున్న కొత్త వేరియంట్
హ్యుందాయ్ మోటార్ ఇండియా తమ అప్డేట్ చేసిన ‘వెన్యూ ఈప్లస్’ (Hyundai Venue E+) వేరియంట్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర రూ. 8.23 లక్షలతో ప్రారంభమవుతుంది. కొత్త వేరియంట్ జోడింపుతో ఈ లైనప్‌లో మొత్తం వెన్యూ వేరియంట్ల సంఖ్య పదికి చేరింది.‘వెన్యూ ఈప్లస్’ మోడల్‌ను ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్, అడ్జస్టబుల్ ఫ్రంట్, రియర్ హెడ్రెస్ట్ వంటి సరికొత్త ఫీచర్లతో అప్డేట్ చేశారు. ఇక కార్ ఇంటీరియర్ విషయానికి వస్తే 60:40 స్ప్లిట్ వెనుక సీట్లు, వీటికి టూస్టెప్ రిక్లైన్ ఫంక్షన్ ఇచ్చారు. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ప్రయాణికులకు భద్రత కల్పిస్తాయి. డే అండ్ నైట్ అడ్జస్టబుల్ ఇన్సైడ్ రియర్ వ్యూ మిర్రర్, ప్యాసింజర్లు అందరికీ త్రీ-పాయింట్ సీట్ బెల్ట్, ఈఎస్సీ, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.ఇక ఇంజిన్ గురించి చెప్పుకోవాలంటే ‘వెన్యూ ఈప్లస్’ 1.2-లీటర్ ఎన్ఏ పెట్రోల్ ఇంజన్‌తో ఐదు-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇంజిన్ కాన్ఫిగరేషన్ విషయానికి వస్తే.. 82 బీహెచ్పీ, 114 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. హ్యుందాయ్ వెన్యూలో ఇప్పటికే ఈ, ఎస్, ఎస్ ప్లస్, ఎస్ (O), ఎగ్జిక్యూటివ్, ఎస్ (O) ప్లస్, ఎస్ఎక్స్, నైట్ ఎడిషన్, ఎస్ఎక్స్ ( O) వేరియంట్లు ఉన్నాయి. కొత్త ఈప్లస్ మోడల్ కావాలంటే ‘వెన్యూ ఈ’ వేరియంట్‌పై రూ. 29,000 అదనంగా ఖర్చవుతుంది. -
కైనెటిక్ ఫ్యామిలీ ఈ-స్కూటర్.. త్వరలో లాంచ్
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. ఈ తరుణంలో పూణే ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ కైనెటిక్ గ్రీన్ ఏడాదిన్నరలో ఫ్యామిలీ ఈ-స్కూటర్‌ను మార్కెట్లోకి తేనున్నట్టు ప్రకటించింది. 2025 మార్చిలోగా ఎల్5 విభాగంలో ప్యాసింజర్ త్రీ–వీలర్‌ను ప్రవేశపెట్టనున్నట్టు తెలిపింది. 2030 నాటికి రూ.10,000 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా చేసుకున్నట్టు సంస్థ ఫౌండర్, సీఈవో సులజ్జ ఫిరోదియా మోత్వానీ వెల్లడించారు. ఇందులో 60 శాతం ద్విచక్ర వాహన విభాగం, 35 శాతం త్రిచక్ర వాహనాల నుంచి సమకూరాలన్నది ఆలోచనగా చెప్పారు.మోటార్‌సైకిల్స్ విభాగంలోకి ఎంట్రీ ఇవ్వబోమని స్పష్టం చేశారు. ద్విచక్ర వాహన విభాగంలో ఈ–స్కూటర్స్, ఈ–లూనాకు పరిమితం అవుతామని తెలిపారు. కైనెటిక్ గ్రీన్ గత నెలలో గ్రేటర్ పసిఫిక్ క్యాపిటల్ (జీపీసీ) నుంచి 25 మిలియన్ డాలర్ల పెట్టుబడి అందుకుంది. ఎలక్ట్రిక్ టూ, త్రీ వీలర్ల వ్యాపార విస్తరణకు ఈ నిధులకు కంపెనీ ఖర్చు చేయనుంది.లంబోర్గీని భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన ప్రీమియం గోల్ఫ్ కార్ట్ శ్రేణి ద్వారా విదేశాల్లో విస్తరించాలని సంస్థ నిర్ణయించింది. సిరీస్–ఏ నిధుల సమీకరణలో భాగంగా మరో 15 మిలియన్ డాలర్లను ఈ ఏడాది డిసెంబర్ కల్లా స్వీకరించే అవకాశం ఉందని సులజ్జ వెల్లడించారు. 16 గంటలపాటు కార్యకలాపాలు సాగించే కార్గో ఈ–త్రీ వీలర్స్ కోసం అల్ట్రా ఫాస్ట్ చార్జింగ్ సొల్యూషన్‌ను కంపెనీ అభివృద్ధి చేసింది. -
బీఎండబ్ల్యూ మరో ఈ-స్కూటర్.. ప్రీలాంచ్ బుకింగ్స్ రేపే..
అంతర్జాతీయ ప్రీమియం మోటర్‌సైకిల్స్ కంపెనీ బీఎండబ్ల్యూ మోటరాడ్ (BMW Motorrad) మరో ఎలక్ట్రిక్ టూవీలర్‌ను భారత్ మార్కెట్లోకి తీసుకొస్తోంది. సీఈ 02 (CE 02) పేరుతో వచ్చే ఈ ఈ-స్కూటర్ రానున్న పండుగ సీజన్లో లాంచ్ కానుందని భావిస్తున్నారు. బీఎండబ్ల్యూ మోటరాడ్ సీఈ 02 ప్రీ-లాంచ్ బుకింగ్ శనివారం ప్రారంభమవుతున్నాయి.బీఎండబ్ల్యూ మోటరాడ్ సీఈ 02 ఈ-స్కూటర్‌ను స్థానికంగా భారత్‌లోనే అసెంబుల్ చేస్తారు. దీని ధర సుమారు రూ. 4.5 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండవచ్చు. ఈ ఏడాది ప్రారంభంలో బీఎండబ్ల్యూ భారత్‌లో తన ఫ్లాగ్షిప్ ఎలక్ట్రిక్ టూ-వీలర్ సీఈ 04ని విడుదల చేసింది. దీని ధర 14.90 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది 31 kW మోటార్‌ను పొందుతుంది మరియు 130 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది.బీఎండబ్ల్యూ సీఈ 02లో గరిష్టంగా 55 ఎన్ఎం శక్తిని ఉత్పత్తి చేసే 11 కిలోవాట్ల (15 హార్స్ పవర్) మోటర్ ఉంటుంది. దీని రేంజ్ 90 కి.మీ, గరిష్ట వేగం గంటకు 95 కి.మీ. సీటు ఎత్తు 750 మి.మీ. ఉంటుంది. ఇక టీనేజర్ల కోసం 4 కిలోవాట్ల వెర్షన్ కూడా ఉంటుంది. "ఫ్లో", "సర్ఫ్" అనే స్టాండర్డ్ రైడింగ్ మోడ్లతో వస్తుంది. వీటితోపాటు "ఫ్లాష్" డ్రైవింగ్ మోడ్ ఆప్షన్ కూడా ఉంటుంది. -
రూ.65 లక్షల బీఎండబ్ల్యూ కొత్త కారు: పూర్తి వివరాలు
బీఎండబ్ల్యూ కంపెనీ ఇండియన్ మార్కెట్లో ఎట్టకేలకు '320ఎల్‌డబ్ల్యు ఎమ్ స్పోర్ట్ ప్రో' లాంచ్ చేసింది. ఈ సెడాన్ ధర రూ.65 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా అప్డేటెడ్ డిజైన్, ఫీచర్స్ పొందుతుంది.బీఎండబ్ల్యూ 320ఎల్‌డబ్ల్యు ఎమ్ స్పోర్ట్ ప్రో మోడల్ బ్లాక్ కిడ్నీ గ్రిల్, స్మోక్డ్ అవుట్ ఎఫెక్ట్ అడాప్టివ్ ఎల్ఈడీ హెడ్లైట్లు, గ్లోస్ బ్లాక్ రియర్ డిఫ్యూజర్ వంటివి పొందుతుంది. అంతే కాకుండా బ్లైండ్ స్పాట్ అసిస్టెంట్, లేన్ చేంజ్ అసిస్టెంట్, పార్కింగ్ అసిస్టెంట్ ప్లస్ వంటి అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్ట్ సిస్టం ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి.కొత్త బీఎండబ్ల్యూ కారు మినరల్ వైట్, స్కైస్క్రాపర్ గ్రే, కార్బన్ బ్లాక్, పోర్టిమావో బ్లూ అనే నాలుగు రంగులలో లభిస్తుంది. యాంబియంట్ లైటింగ్‌లో భాగంగా ఫ్రంట్ సీట్స్ వెనుక భాగంలో కొత్త ఇల్యూమినేటెడ్ కాంటౌర్ స్ట్రిప్ కూడా ఉంది.బీఎండబ్ల్యూ 320ఎల్‌డబ్ల్యు ఎమ్ స్పోర్ట్ ప్రో 12.3 ఇంచెస్ డ్రైవర్ డిస్ప్లే, 14.9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, త్రీ జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, 16 స్పీకర్లతో హర్మాన్ కార్డాన్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, 360 డిగ్రీ కెమెరా మొదలైన ఫీచర్స్ ఉన్నాయి.ఇదీ చదవండి: సింగిల్ ఛార్జీతో 611 కిమీ రేంజ్.. కొత్త బెంజ్ కారు వచ్చేసిందిబీఎండబ్ల్యూ 320ఎల్‌డబ్ల్యు ఎమ్ స్పోర్ట్ ప్రో మోడల్ 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ ద్వారా 190 హార్స్ పవర్, 400 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 7.6 సెకన్లలో 0 - 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పొందిన ఈ కారు 19.61 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. ఇందులో ఎకో ప్రో, కంఫర్ట్, స్పోర్ట్ అనే మూడు డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. -
బంపర్ డిస్కౌంట్.. ఈ ఎలక్ట్రిక్ కారుపై రూ.2 లక్షల తగ్గింపు!
ఎలక్ట్రిక్ కార్ కొనాలనుకుంటున్నవారికి ఇది నిజంగా భారీ శుభవార్త. ప్రముఖ దేశీయ కార్ మేకర్ టాటా మోటర్స్ '2 మిలియన్ ఎస్యూవీ వేడుక'లో భాగంగా తమ ఈవీ పోర్ట్‌ఫోలియోలోని పలు వాహనాలపై బంపర్ డిస్కౌంట్లు ప్రకటించింది. పాపులర్ టాటా నెక్సాన్ ఈవీపై గరిష్టంగా రూ. 2.05 లక్షల వరకూ తగ్గింపు అందిస్తోంది.ఈ సెప్టెంబర్ నెలలో టాటా ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారికి భారీగా డబ్బు ఆదా కానుంది. టాటా మోటర్స్ ఈవీ పోర్ట్‌ఫోలియోలోని టాటా నెక్సాన్ ఈవీ (Tata Nexon EV), పంచ్ ఈవీ (Punch EV), టియాగో ఈవీ (Tiago EV)లపై గ్రీన్ బోనస్‌లో భాగంగా క్యాష్ డిస్కౌంట్లు అందిస్తోంది. 2023 మోడల్లను ఎంచుకునే వారికి అదనపు తగ్గింపు లభిస్తుంది.టాటా నెక్సాన్ ఈవీపై భారీ డిస్కౌంట్టాప్ స్పెక్స్ ఉండే టాటా నెక్సాన్ ఈవీ ఎంపవర్డ్+ లాంగ్ రేంజ్ వేరియంట్లపై ఈ నెలలో రూ. 1.80 లక్షల వరకు తగ్గింపును అందిస్తోంది టాటా మోటర్స్. రూ. 20,000 తగ్గింపుతో లభించే ఎంట్రీ-లెవల్ క్రియేటివ్ + ఎంఆర్ వేరియంట్ తప్ప మిగిలిన అన్ని వేరియంట్లు రూ. 1 లక్ష నుండి రూ. 1.2 లక్షల వరకూ తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి.2023లో తయారైన అన్ని మోడల్‌లపై అయితే రూ. 25,000 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. టాటా నెక్సాన్ ఈవీ ధర రూ. 14.49 లక్షల నుండి రూ. 19.49 లక్షల మధ్య ఉంటుంది. ఇది రెండు బ్యాటరీ ఆప్షన్లతో వస్తుంది. కంపెనీ పేర్కొన్నదాని ప్రకారం.. 30kWh వేరియంట్ 275 కి.మీ, 40.5kWh యూనిట్ 390 కి.మీ. రేంజ్ ఇస్తాయి.ఇతర ఈవీలపైనా..ఇక టాటా మోటర్స్ డిస్కౌంట్ అందిస్తున్న ఇతర ఈవీలలో టాటా టియాగో ఈవీ, టాటా పంచ్ ఈవీ ఉన్నాయి. వీటిలో టాటా టియాగో ఈవీలపై గరిష్టంగా రూ.65,000, అలాగే టాటా పంచ్ ఈవీలపై రూ.30,000 వరకూ డిస్కౌంట్ లభిస్తోంది. -
ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీ.. గడ్కరీ కీలక వ్యాఖ్యలు
ఎలక్ట్రిక్ వాహనాలకు అందించే సబ్సిడీ విషయమై కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా పెరుగుతోందని, వినియోగదారులు స్వచ్ఛమైన ఇంధనాలతో నడిచే వాహనాల కొనుగోలు వైపు మొగ్ చూపుతున్న క్రమంలో విక్రయాలను ప్రోత్సహించడానికి ఇక ప్రోత్సాహకాలు అవసరం లేదని అభిప్రాయపడ్డారు."నా అభిప్రాయం ప్రకారం.. ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ఇకపై ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం లేదు" అని న్యూఢిల్లీలో జరిగిన బ్లూమ్‌బెర్గ్ ఎన్ఈఎఫ్ సమ్మిట్‌లో వ్యాఖ్యానించారు. ఎలక్ట్రిక్, సీఎన్జీ వాహనాలు కొనుగోలు చేయడానికే వినియోగదారులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని అన్నారాయన.శిలాజ ఇంధన వాహనాలతో పోల్చితే ఎలక్ట్రిక్ వాహనాలపై తక్కువ జీఎస్టీ విధించడం వల్ల ఆ ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులకు ఇప్పటికే ప్రయోజనాన్ని అందిస్తోందన్నారు. ఇక భారీగా జరుగుతన్న పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధన దిగుమతులకు కేంద్ర ప్రభుత్వం ఒక పరిష్కారాన్ని కనుగొనవలసిన అవసరం ఉందన్నారు.అయితే ఇది పెట్రోల్, డీజిల్ కార్లపై అధిక పన్నులకు దారితీయదని స్పష్టం గడ్కరీ చేశారు.త్వరలో ఇంటర్ సిటీ ఎలక్ట్రిక్ బస్సులు"ప్రజా రవాణాలో ఎలక్ట్రిక్ వాహనాలను, ముఖ్యంగా ఎలక్ట్రిక్ బస్సులను ఉపయోగించడం కాలుష్య స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.శిలాజ ఇంధన దిగుమతులను తగ్గించడానికి దోహదపడుతుంది" అన్నారు. త్వరలో ఇంటర్ సిటీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించేందుకు ప్రభుత్వం యోచిస్తోందని కూడా మంత్రి తెలిపారు. -
సింగిల్ ఛార్జీతో 611 కిమీ రేంజ్.. కొత్త బెంజ్ కారు వచ్చేసింది
మెర్సిడెస్ బెంజ్ ఇండియా భారతీయ మార్కెట్లో కొత్త 'మేబ్యాచ్ ఈక్యూఎస్' ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు ధర రూ.2.25 కోట్లు (ఎక్స్ షోరూమ్). 'లోటస్ ఎలెట్రే' ఎలక్ట్రిక్ కారు తరువాత అత్యంత ఖరీదైన కారుగా మెర్సిడెస్ మేబ్యాచ్ ఈక్యూఎస్ నిలిచింది.కొత్త మెర్సిడెస్ బెంజ్ మేబ్యాచ్ ఈక్యూఎస్ ఎలక్ట్రిక్ కారు.. బ్లాక్ గ్రిల్ ప్యానెల్ పొందుతుంది. బానెట్ మీద బ్రాండ్ లోగో, డ్యూయల్ టోన్ పెయింట్ స్కీమ్ అన్నీ కూడా ఇక్కడ చూడవచ్చు. హెడ్ లైట్, టెయిల్ లైట్ అన్నీ కూడా స్టాండర్డ్ మోడల్స్ మాదిరిగా ఉన్నాయి. 11.6 ఇంచెస్ ట్రిపుల్ స్క్రీన్ డిస్ప్లే కలిగిన బెంజ్ ఈక్యూఎస్.. ముందు సీట్ల వెనుక భాగంలో కూడా 11.6 ఇంచెస్ డిస్ప్లే కూడా ఉంది. కప్ హోల్డర్లు, నాలుగు యూఎస్బీ-సీ పోర్ట్స్, కూలింగ్ కంపార్ట్మెంట్స్ మొదలైనవన్నీ ఇందులో చూడవచ్చు.మెర్సిడెస్ బెంజ్ మేబ్యాచ్ ఈక్యూఎస్ 680 ట్రిమ్‌లో మాత్రమే లభిస్తుంది. ఇది డ్యూయెల్ ఎలక్ట్రిక్ మోటార్ సెటప్ పొందుతుంది. ఇది 658 హార్స్ పవర్, 950 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ కారు 4.4 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ 210 కిమీ. ఇది ఒక ఫుల్ చార్జితో 611 కిమీ రేంజ్ అందిస్తుంది.ఇదీ చదవండి: ట్యాక్స్ తక్కువ, నిరుద్యోగ నిధి.. చిన్న దేశంలో బెంగళూరు జంటమెర్సిడెస్ బెంజ్ మేబ్యాచ్ ఈక్యూఎస్ కారులోని 122 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ 31 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం ఛార్జ్ అవుతుంది. ఈ కారు 20 నిమిషాల చార్జితో 300 కిమీ ప్రయాణించడానికి కావాల్సిన ఛార్జ్ చేసుకుంటుంది. ఈ కారుకు ప్రస్తుతం దేశీయ విఫణిలో ప్రధాన ప్రత్యర్థులు లేదు. -
‘డిస్కౌంట్ ధరకు హెల్మెట్’
ద్విచక్ర వాహన తయారీదారులు తమ కస్టమర్లకు డిస్కౌంట్ ధరకు హెల్మెట్ అందించాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సూచించారు. హెల్మెట్ ధరించకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాల్లో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. 2022లో దేశంలో జరిగిన ప్రమాదాల్లో హెల్మెట్ లేకపోవడం వల్ల 50,029 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.‘ఏటా రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. వాటిలో ద్విచక్ర వాహనదారులు ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించేవారు అధికంగా మృత్యువాత పడుతున్నారు. ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసే సమయంలోనే తయారీదారులను డిస్కౌంట్ ధరకు హెల్మెట్లు ఇవ్వమని అడగండి. తయారీ కంపెనీలు కూడా కొంత తగ్గింపుతో వాహనదారులకు హెల్మెట్లు ఇస్తే చాలా మంది ప్రాణాలు కాపాడే అవకాశం ఉంది. ఏటా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో గాయపడుతున్న ద్విచక్రవాహనదారుల్లో దాదాపు 43 శాతం మంది మరణిస్తున్నారు’ అని మంత్రి అన్నారు.ఇదీ చదవండి: జీవిత పాఠాలు నేర్పిన గురువులుపాఠశాల బస్సులు నిలిపేందుకు సరైన పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేసుకోవాలని మంత్రి సూచించారు. మోటారు వాహనాల (సవరణ) చట్టం, 2019 ట్రాఫిక్ నేరాలపై భారీ జరిమానాలు విధించిందని చెప్పారు. దేశంలోని ప్రతి టౌన్లో డ్రైవింగ్ స్కూల్ ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. -
తళుక్కున మెరిసే హ్యుందాయ్ క్రెటా కొత్త ఎడిషన్
హ్యుందాయ్ ఇండియా క్రెటా నైట్ (Creta Knight) ఎడిషన్‌ను విడుదల చేసింది. ఇప్పటికే ఉన్న కొన్ని క్రెటా వేరియంట్లకు ఇది కాస్మెటిక్ అప్‌గ్రేడ్. హ్యుందాయ్ క్రెటా నైట్ ఎడిషన్ ధరలు రూ.14.51 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతాయి. ఇందులో 1.5 ఎంపీఐ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో పలు వేరియంట్లు ఉన్నాయి.బ్లాక్ కలర్ ఎక్స్టీరియర్, కాంట్రాస్ట్ రెడ్ బ్రేక్ కాలిపర్లతో బ్లాక్ అల్లాయ్ వీల్స్, మ్యాటీ లోగో, బ్లాక్ అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్, బ్లాక్ స్పాయిలర్ వంటివి క్రెటా నైట్ ఎడిషన్ అప్డేట్లలో ప్రధానంగా ఉన్నాయి. ఇంటీరియర్స్ పూర్తిగా బ్లాక్ అప్హోల్స్స్టరీ, స్టీరింగ్ వీల్‌పై లెదర్-ర్యాప్, గేర్ నాబ్‌తో అప్డేట్ చేశారు. మెటల్ పెడల్స్‌తో పాటు బ్రాస్ కలర్ ఇన్సర్ట్లు ఉన్నాయి.సాధారణ కలర్ ఆప్షన్స్ మాత్రమే కాకుండా, కొనుగోలుదారులు రూ.5,000 అదనంగా చెల్లించి టైటాన్ గ్రే మ్యాటీ కలర్ వాహనాన్ని, రూ. 15,000 చెల్లించి డ్యూయల్ టోన్ కలర్స్‌ను ఎంచుకునే అవకాశం కూడా ఉంది.కొత్త ఎడిషన్ ధరలుహ్యుందాయ్ క్రెటా 1.5 పెట్రోల్CRETA Knight S(O) MT: రూ. 14.51 లక్షలుCRETA Knight S(O) CVT: రూ. 16.01 లక్షలుCRETA Knight SX (O) MT: రూ. 17.42 లక్షలుCRETA Knight SX (O) CVT: రూ. 18.88 లక్షలుహ్యుందాయ్ క్రెటా 1.5 డీజిల్CRETA Knight S(O) MT: రూ. 16.08 లక్షలుCRETA Knight S(O) AT: రూ. 17.58 లక్షలుCRETA Knight SX (O) MT: రూ. 19 లక్షలుCRETA Knight SX (O) AT: రూ. 20.15 లక్షలు -
ఈవీలకు రూ.10,000 కోట్ల ప్రోత్సాహం
ఎలక్ట్రిక్ వాహనాలకు మరో విడత కేంద్ర సర్కారు ప్రోత్సాహకాలను ప్రకటించనుంది. ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఫేమ్)–3 పథకం కింద రూ.10,000 కోట్లను కేటాయించనున్నట్టు తెలుస్తోంది. ఈ పథకం సెప్టెంబర్ నుంచి అమల్లోకి రానున్నట్టు ఈ వ్యవహారం తెలిసిన వర్గాలు వెల్లడించాయి.ద్విచక్ర, త్రిచక్ర వాహనాలతోపాటు, ప్రభుత్వం కొనుగోలు చేసే ఎలక్ట్రిక్ బస్సులకు ప్రోత్సాహకాలు అందనున్నాయి. ఆరంభంలో రెండేళ్ల కాలానికి దీన్ని అమలు చేయనున్నట్టు తెలిసింది. ఫేమ్ –2 కింద 7,000 ఎలక్ట్రిక్ బస్సులకు సబ్సిడీ ఇవ్వగా.. ఫేమ్–3లో ఇంతకంటే అధిక సంఖ్యలో బస్సులకు ప్రోత్సాహకాలు అందించనున్నట్టు సమాచారం. ఫేమ్–2లో ఎలక్ట్రిక్ కార్లకు సైతం ప్రోత్సాహకాలు లభించగా.. ఫేమ్–3లో వీటి ప్రోత్సాహకాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ పథకం నుంచి కార్లను మినహాయించనున్నట్టు తెలుస్తోంది. ఫేమ్ –2 పథకం గడువు 2024 మార్చితో ముగిసింది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు విక్రయ ధరపై 15 శాతం సబ్సిడీ లభించడం గమనార్హం. ఏప్రిల్ నుంచి ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ (ఈఎంపీఎస్)ను తాత్కాలికంగా అమల్లోకి తీసుకొచ్చారు.ఇదీ చదవండి: అగ్రిటెక్ స్టార్టప్‌లకు బూస్ట్ఈఎంపీఎస్ఈ పథకం కింద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలకు ఈ ఏడాది జూలై వరకు ప్రోత్సాహకాల కింద రూ.500 కోట్లను కేంద్రం కేటాయించింది. ప్రతి ద్విచక్ర ఈవీపై రూ.10,000 చొప్పున సబ్సిడీ కేటాయించింది. కానీ ఫేమ్–2లో ఇది రూ.22,500గా ఉంది. ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనంపై రూ.50,000 సబ్సిడీని ఈఎంపీఎస్ కింద ఇచ్చారు. ఫేమ్–2లో ఇది రూ.1,11,505గా ఉంది. కిలోవాట్ హవర్‌కు రూ.5,000 చొప్పున ద్విచక్ర, త్రి చక్ర వాహనాలకు సబ్సిడీని కేంద్రం ప్రకటించింది. -
జావా కొత్త బైక్ 42 ఎఫ్‌జే
ముంబై: మహీంద్రా గ్రూప్‌నకు చెందిన క్లాసిక్ లెజెండ్స్ తాజాగా సరికొత్త జావా 42 ఎఫ్‌జే బైక్‌ను భారత్‌లో ప్రవేశపెట్టింది. ఎక్స్‌షోరూం ధర రూ.1.99 లక్షల నుంచి రూ.2.2 లక్షల వరకు ఉంది. ఆరు వేరియంట్లలో లభిస్తుంది. 42 సిరీస్‌లో ఇది మూడవ మోడల్. 334 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ 350 ఆల్ఫా2 ఇంజన్‌తో తయారైంది. స్లిప్, అసిస్ట్ క్లచ్‌తో 6 స్పీడ్ గేర్‌బాక్స్ పొందుపరిచారు. ఎల్ఈడీ లైటింగ్, పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, యూఎస్బీ చార్జింగ్ పాయింట్ వంటి హంగులు జోడించారు. అక్టోబర్ 2 నుంచి డెలివరీలు ప్రారంభం అవుతాయి. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350, హోండా సీబీ350 ఆర్ఎస్కు పోటీనిస్తుంది. 2018 నవంబర్‌లో జావా బ్రాండ్ భారత్‌లో రీఎంట్రీ ఇచ్చింది. దేశవ్యాప్తంగా 450 డీలర్íÙప్స్ ఉన్నాయి. పండుగల సీజన్ నాటికి మరో 100 జావా కేఫ్స్ రానున్నాయి. జావా వంటి పునరుత్థాన బ్రాండ్ల పునర్నిర్మాణంలో ఎలాంటి సవాళ్లనైనా క్లాసిక్ లెజెండ్స్ ఎదుర్కొంటుందని ఈ సందర్భంగా మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తెలిపారు. -
ఈ బైక్స్ కొనుగోలుపై గొప్ప బెనిఫీట్స్
కవాసకి తన నింజా లైనప్‌లోని మూడు మోడళ్లపై గొప్ప డిస్కౌంట్స్ ప్రకటించింది. ఈ డిస్కౌంట్స్ ఆన్-రోడ్ ధరకు వర్తించే వోచర్ల రూపంలో లేదా డీలర్‌షిప్‌ల వద్ద యాక్ససరీస్, సర్వీస్ ప్యాకేజీలను కొనుగోలు చేయడానికి ఉపయోగించవచ్చు.నింజా 300, నింజా 500 కొనుగోలుపైన వినియోగదారుడు రూ. 10000 వోచర్ పొందవచ్చు. అయితే నింజా 650 కొనుగోలుపైన రూ. 25000 వోచర్ పొందవచ్చు. కవాసకి తన బైకులపై డిస్కౌంట్స్ లేదా ఆఫర్స్ అందించడం ఇదే మొదటిసారి కాదు. గత నెలలో కూడా ఇలాబీటి ఆఫర్స్ ప్రకటించింది.కవాసకి నింజా 650 బైక్ ధర రూ.7.16 లక్షలు. నింజా 300, నింజా 500 ధరలు వరుసగా రూ.3.43 లక్షలు, రూ.5.24 లక్షలు. ఆకర్షణీయమైన డిజైన్ కలిగిన ఈ బైక్స్.. అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతాయి. పర్ఫామెన్స్ పరంగా కూడా ఇవి చాలా ఉత్తమంగా ఉంటాయని తెలుస్తోంది. కవాసకి అందిస్తున్న ఈ ఆఫర్స్ సెప్టెంబర్ 1 నుండి 30 వరకు మాత్రమే చెల్లుతాయి. -
భారత్‌లో టాటా కర్వ్ లాంచ్: ధర & వివరాలు
టాటా మోటార్స్ దేశీయ మార్కెట్లో కర్వ్ పెట్రోల్, డీజిల్ వేరియంట్లను లాంచ్ చేసింది. ఇవి మొత్తం ఎనిమిది వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. పెట్రోల్ వేరియంట్స్ ప్రారంభ ధర రూ. 10 లక్షల నుంచి రూ. 17.5 లక్షలు. డీజిల్ వేరియంట్స్ ధరలు రూ. 11.5 లక్షల నుంచి రూ. 17.7 లక్షల (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి.కొత్త టాటా కర్వ్ 1.2 లీటర్ త్రీ సిలిండర్ టర్బో పెట్రల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్, 1.2 లీటర్ టర్బో పెట్రోల్ అనే మూడు ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. మూడు ఇంజన్లు 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ఆప్షన్‌తో పాటు 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో స్టాండర్డ్‌గా వస్తాయి. ఇది భారతదేశంలో డ్యూయల్-క్లచ్ గేర్‌బాక్స్ పొందిన ఏకైక డీజిల్ కారుగా నిలిచింది.టాటా కర్వ్ కారు లేటెస్ట్ డిజైన్ పొందుతుంది. ఇందులో ఫోర్ స్పోక్ స్టీరింగ్ వీల్ ఉంటుంది. ఇది 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఫుల్లీ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, పనోరమిక్ సన్‌రూఫ్, రిక్లైనింగ్ రియర్ సీటు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటివి పొందుతుంది.సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే.. టాటా కర్వ్ ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, లెవెల్ 2 ఏడీఏఎస్, ఈసీఎస్, డిస్క్ బ్రేక్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, 360 డిగ్రీ కెమెరా, ఆటో-హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటివన్నీ పొందుతుంది. ఈ కొత్త కారు సిట్రోయెన్ బసాల్ట్ కారుకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.