Corporate
-
ప్రముఖ జ్యువెలర్స్ చొరవ.. ‘హాస్పిటల్ ఆన్ వీల్స్’
త్రిస్సూర్: భారత గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను మెరుగుపరిచే దిశగా ప్రముఖ జ్యువెలరీ సంస్థ జోస్ ఆలుక్కాస్ ముందడుగు వేసింది. చైర్మన్ జోస్ ఆలుక్కా 80వ పుట్టినరోజు సందర్భంగా త్రిస్సూర్ జూబ్లీ మిషన్ హాస్పిటల్ భాగస్వామ్యంతో ‘హాస్పిటల్ ఆన్ వీల్స్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. కోటి రూపాయల ఈ సంచార వైద్య కేంద్రాన్ని ప్రముఖ నటి మంజు వారియర్ ప్రారంభించారు.ఇందులో ఈసీజీ, మల్టీ పారా మోనిటర్లు, మినీ ల్యాబ్ ఉన్నాయి. ఒకేసారి ఆరుగురు రోగులకు చికిత్స చేయవచ్చు. ఆరోగ్య సంరక్షణలో అంతరాన్ని తగ్గించడం, అధునాతన వైద్యాన్ని మారుమూల ప్రజలకు చేర్చడమే ‘హాస్పిటల్ ఆన్ వీల్స్’ ముఖ్య లక్ష్యమని జోస్ ఆలుక్కా తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో సంస్థ ఎండీలు వర్ఘీస్ ఆలుక్కాస్, పాల్ జె ఆలుక్కాస్, జాన్ ఆలుక్కాస్, జూబ్లీ మిషన్ ఆసుపత్రి అసిస్టెంట్ డైరెక్టర్ సింటో కరేపరంబన్, సీఈవో డాక్టర్ బెన్నీ జోసెఫ్ నీలంకవిల్ తదితరులు పాల్గొన్నారు. -
EPFO: 7.66 లక్షల కంపెనీలు.. 7.37 కోట్ల మందికి పీఎఫ్
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో)లో సభ్యత్వం గడిచిన ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా పెరిగింది. ఉద్యోగులకు చందా కట్టే కంపెనీల సంఖ్య 6.6 శాతం మేర పెరిగింది. దీంతో వీటి మొత్తం సంఖ్య 7.66 లక్షలకు చేరింది. అలాగే ఉద్యోగుల చేరికలు సైతం 7.6 శాతం పెరిగి ఈపీఎఫ్‌వో మొత్తం సభ్యుల సంఖ్య 7.37 కోట్లకు చేరినట్టు కేంద్ర కార్మిక శాఖ గణాంకాలు విడుదల చేసింది.2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నివేదికను ఈ నెల 8న జరిగిన ఈపీఎఫ్‌వో సెంట్రల్ బోర్డ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ 109వ సమావేశం పరిగణనలోకి తీసుకున్నట్టు కేంద్ర కార్మిక శాఖ తెలిపింది. ఈపీఎఫ్‌వో కింద చందాలు జమ చేసే సంస్థలు 6.6 శాతం పెరిగి 7.66 లక్షలకు చేరాయి. చందాలు జమ చేసే సభ్యులు 7.6 శాతం పెరిగి 7.37 కోట్లుగా ఉన్నారు. మొత్తం 4.45 కోట్ల క్లెయిమ్‌లకు పరిష్కారం లభించింది.ఇదీ చదవండి: పాన్ కార్డ్ కొత్త రూల్.. డిసెంబర్ 31లోపు తప్పనిసరి!2022–23లో ఇవి 4.13 కోట్లుగా ఉన్నాయి. కొత్త కారుణ్య నియామక ముసాయిదా విధానం, 2024ను సైతం ఎగ్జిక్యూటివ్ కమిటీ పరిగణనలోకి తీసుకున్నట్టు కార్మిక శాఖ ప్రకటించింది. ఐటీ, మెరుగైన పరిపాలనా, ఆర్థిక సంస్కరణలపై చర్చించినట్టు.. వచ్చే కొన్ని నెలల పాటు ప్రతి నెలా సమావేశమైన సంస్కరణల పురోగతిని సమీక్షించాలని నిర్ణయించనట్టు తెలిపింది. -
సెబీకి షాక్.. ముకేశ్ అంబానీకి ఊరట
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్)తో 2009లో విలీనమైన పెట్రోలియం లిమిటెడ్ (ఆర్పీఎల్)కు సంబంధించిన షేర్లలో 2007లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల విషయంలో ముకేశ్ అంబానీ మరో రెండు సంస్థలకు ఊరట లభించింది. ఇందుకు సంబంధించి మార్కెట్ రెగ్యులేటర్ సెబీ విధించిన జరిమానా విధింపును కొట్టివేస్తూ శాట్ (సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్) ఇచ్చిన రూలింగ్‌ను తాజాగా సుప్రీంకోర్టు కూడా సమర్థించింది.ఈ విషయంలో సెబీ దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టివేసింది. శాట్ జారీ చేసిన ఉత్తర్వుపై జోక్యం చేసుకునే ప్రసక్తే లేదని జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘మా జోక్యాన్ని కోరే ఈ అప్పీల్లో చట్టం ప్రమేయం లేదు. మీరు ఒక వ్యక్తిని ఏళ్ల తరబడి వెంబడించలేరు‘ అని బెంచ్ పేర్కొంది. కేసు వివరాలు ఇవీ... » నవంబర్ 2007లో నగదు, ఫ్యూచర్స్ విభాగాల్లో ఆర్పీఎల్ షేర్ల విక్రయం, కొనుగోలులో అవకతవకలు జరిగాయన్నది కేసు సారాంశం. » 2009లో ఆర్ఐఎల్తో విలీనం అయిన లిస్టెడ్ అనుబంధ సంస్థ– ఆర్పీఎల్లో దాదాపు 5 శాతం వాటాను విక్రయించాలని 2007 మార్చిలో ఆర్ఐఎల్ నిర్ణయం తీసుకుంది. » ఈ నేపథ్యంలోనే 2007 నవంబర్‌లో ఆర్పీఎల్ ఫ్యూచర్స్‌లో లావాదేవీలు చేపట్టేందుకు ఆర్ఐఎల్ 12 మంది ఏజెంట్లను నియమించిందని, ఈ 12 మంది ఏజెంట్లు కంపెనీ తరపున ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్అండ్ఓ) సెగ్మెంట్లో షార్ట్ పొజిషన్లు తీసుకున్నారని, అదే సమయంలో కంపెనీ నగదు విభాగంలో ఆర్పీఎల్ షేర్లలో లావాదేవీలు చేపట్టిందని సెబీ ఆరోపించింది.» ఈ కేసు విషయంలో సెబీ 2021 జనవరిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్)పై రూ. 25 కోట్లు, కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీపై రూ. 15 కోట్లు, నవీ ముంబై సెజ్ ప్రైవేట్ లిమిటెడ్‌పై రూ. 20 కోట్లు, ముంబై సెజ్‌పై రూ. 10 కోట్లు జరిమానా విధించింది. నవీ ముంబై సెజ్, అలాగే ముంబై సెజ్‌ను ఒకప్పుడు రిలయన్స్ గ్రూప్‌లో పనిచేసిన ఆనంద్ జైన్ ప్రమోట్ చేయడం గమనార్హం. 12 సంస్థలకు నిధులు సమకూర్చడం ద్వారా మొత్తం మానిప్యులేషన్ స్కీమ్‌కు నవీ ముంబై సెజ్, ముంబై సెజ్ పాత్రధారులుగా మారినట్లు ఆరోపణ.ఇదీ చదవండి: పాన్ కార్డ్ కొత్త రూల్.. డిసెంబర్ 31లోపు తప్పనిసరి!» అంబానీ, నవీ ముంబై సెజ్, ముంబై సెజ్‌లపై 2021లో సెబీ జారీ చేసిన ఉత్తర్వులను శాట్ 2023లో రద్దు చేసింది. జరిమానాకు సంబంధించి డిపాజిట్‌గా ఉంచిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలని శాట్ ఆదేశించింది. కార్పొరేట్ సంస్థలు చట్టాన్ని ఉల్లంఘించే ప్రతి ఆరోపణకు మేనేజింగ్ డైరెక్టర్‌ను బాధ్యునిగా చేయలేవని పేర్కొంది. ఇద్దరు సీనియర్ అధికారులు అక్రమ లావాదేవీలు నిర్వహించారని స్పష్టమవుతోందని, ఈ విషయంలో ముకేశ్ అంబానీ పాత్ర ఉన్నట్లు సెబీ రుజువుచేయలేకపోయిందని పేర్కొంది. ఆర్‌ఐఎల్‌పై ఆరోపణలను మాత్రం శాట్ కొట్టివేయకపోవడం గమనార్హం. » కాగా, శాట్ రూలింగ్‌ను సవాలుచేస్తూ, డిసెంబర్ 2023 డిసెంబర్ 4న సెబీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. -
హైదరాబాద్‌లో రూ.440 కోట్లతో ప్లాంటు విస్తరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంజనీర్డ్ స్టోన్ తయారీలో ఉన్న పోకర్ణ ఇంజనీర్డ్ స్టోన్ హైదరాబాద్ సమీపంలోని ప్లాంటు విస్తరణకు రూ.440 కోట్లు వెచ్చించనున్నట్టు ప్రకటించింది. మేకగూడ ప్లాంటులో ఇటలీకి చెందిన బ్రెటన్ ఎస్పీఏ సాంకేతిక సహకారంతో మూడవ లైన్‌ను జోడిస్తామని పోకర్ణ సీఎండీ గౌతమ్ చంద్ జైన్ తెలిపారు. 2026 మార్చిలో 8.1 లక్షల చదరపు మీటర్ల సామర్థ్యం తోడవనుందని అన్నారు.మేకగూడ కేంద్రంలో 2021 మార్చిలో యూనిట్–2 అందుబాటులోకి వచ్చిందని కంపెనీ సీఈవో పరాస్ కుమార్ జైన్ చెప్పారు. కాగా, సెప్టెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో పోకర్ణ లిమిటెడ్ నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే రూ.33 కోట్ల నుంచి రూ.45 కోట్లకు చేరింది. టర్నోవర్ రూ.197 కోట్ల నుంచి రూ.253 కోట్లకు ఎగసింది. పోకర్ణ షేరు ధర మంగళవారం 1.81% దూసుకెళ్లి రూ.1,103.20 వద్ద ముగిసింది. -
పరిశ్రమ పరుగులు
న్యూఢిల్లీ: భారత్ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) సెప్టెంబర్‌లో 3.1 శాతం వృద్ధిని (2023 ఇదే నెలతో పోల్చి) నమోదుచేసుకుంది. ఆగస్టు సూచీలో వృద్ధిలేకపోగా 0.1 శాతం క్షీణించిన సంగతి తెలిసిందే. తయారీ, మైనింగ్, విద్యుత్ ఉత్పత్తి రంగాలు సూచీని సమీక్షా నెల్లో వృద్ధి బాటన నిలబెట్టాయి. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) విడుదల చేసిన తాజా లెక్కల ప్రకారం... మైనింగ్ రంగం 0.2 శాతం పురోగమించింది. మొత్తం సూచీలో దాదాపు 70 శాతం వాటా ఉన్న తయారీ రంగం 3.9 శాతం వృద్ధిని సాధించింది.విద్యుత్ ఉత్పత్తి 0.5 శాతం ఎగసింది. ఆగస్టులో మైనింగ్ రంగం ఉత్పత్తి 4.3 శాతం, విద్యుత్ ఉత్పత్తి 3.7 శాతం క్షీణించగా, తయారీ రంగం కేవలం 1.1 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. కాగా తాజా సమీక్షా నెల్లో భారీ యంత్ర పరికరాల డిమాండ్‌కు సంబంధించిన క్యాపిటల్ గూడ్స్ విభాగంలో వృద్ధి రేటు 2.8 శాతంగా ఉంది. కన్జూమర్ నాన్ డ్యూరబుల్స్ విభాగంలో వృద్ధి రేటు 2 శాతంగా ఉంది. కన్జూమర్ డ్యూరబుల్స్‌లో వృద్ధి రేటు 6.5 శాతంగా నమోదయ్యింది. ఆరు నెలల్లో 4 శాతం వృద్ధి ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య ఐఐపీ 4 శాతం పురోగమించింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ వృద్ధి రేటు 6.2 శాతం. -
‘డిజిటల్ ఆవిష్కరణల్లో రాష్ట్రం అగ్రగామి’
డిజిటల్ ఆవిష్కరణల్లో తెలంగాణ దూసుకుపోతోందని తెలంగాణ సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. హిటాచీ లిమిటెడ్ ఆధ్వర్యంలోని డిజిటల్ ఇంజినీరింగ్ సేవలందించే గ్లోబల్‌లాజిక్ హైదరాబాద్‌లో డెలివరీ సెంటర్‌ను ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్‌బాబు హాజరై మాట్లాడారు.‘గ్లోబల్‌లాజిక్ కొత్త డెలివరీ సెంటర్ ప్రారంభోత్సవం తెలంగాణ వృద్ధిని సూచిస్తోంది. ఇప్పటికే 220కి పైగా గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు తెలంగాణలో ఉన్నాయి. డిజిటల్ ఇన్నోవేషన్, ట్రాన్స్ఫర్మేషన్లో రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తుంది. ఈ విభాగంలో ఏటా దాదాపు 2.5 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. అందులో 1.5 లక్షల మంది ఇంజినీర్లు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ స్థాయి డిజిటల్ మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. దానివల్ల భవిష్యత్తులో మరింత మందికి స్థానికంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. హైదరాబాద్‌లో డిజిటల్ ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, వాటి కార్యకలాపాలను పెంపొందించడానికి గ్లోబల్‌లాజిక్ వంటి కంపెనీలకు ప్రభుత్వం సహకారం అందిస్తోంది’ అని మంత్రి అన్నారు.ఇదీ చదవండి: నాలుగు లైన్ల పోస్ట్‌కు స్పందించి జాబ్ ఆఫర్!ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్లోబల్‌లాజిక్ ఏపీఏసీ మేనేజింగ్ డైరెక్టర్ పీయూష్ ఝా మాట్లాడుతూ..‘వివిధ రంగాల్లో ఇంజినీరింగ్ సామర్థ్యాలను పెంపొందించడానికి హైదరాబాద్‌ను కేంద్రంగా ఎంచుకోవడం సంతోషంగా ఉంది. కంపెనీకి గ్లోబల్ క్లయింట్లు పెరుగుతున్న నేపథ్యంలో వారి డిమాండ్లు తీర్చడానికి కొత్త కేంద్రంగా హైదరాబాద్‌ను ఎంచుకున్నాం. సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్, డేటా అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్, జనరేటివ్ ఏఐ వంటి న్యూఏజ్ టెక్నాలజీల్లో నైపుణ్యం కలిగిన మానవ వనరులు అవసరం. హైదరాబాద్ వంటి నగరంలో ప్రతిభకు కొరతలేదు. స్థానికంగా జీసీసీను ఏర్పాటు చేయడం వల్ల మా క్లయింట్లకు మెరుగైన సేవలందుతాయని భావిస్తున్నాం’ అన్నారు. -
నాలుగు లైన్ల పోస్ట్‌కు స్పందించి జాబ్ ఆఫర్!
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ఇటీవల తీసుకొచ్చిన కొత్త ఫీచర్ ‘ఫుడ్ రెస్క్యూ’కు సంబంధించి ఓ నెటిజన్ చేసిన పోస్ట్‌పై కంపెనీ సీఈఓ దీపిందర్ గోయల్ స్పందించారు. ఆ నెటిజన్‌కు జాబ్ కూడా ఆఫర్ చేశారు. అసలు ఆ నెటిజన్ పోస్టేంటి.. సీఈఓ ఎందుకు జాబ్ ఆఫర్ చేయాల్సి వచ్చిందో తెలుసుకుందాం.ఆహార వృథాను అరికట్టడానికి జొమాటో కొత్తగా ‘ఫుడ్ రెస్క్యూ’ అనే ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఆర్డర్ క్యాన్సిల్ కారణంగా ఉత్పన్నమయ్యే ఆహార వృథా సమస్యను పరిష్కరించడానికి ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టినట్లు జొమాటో సీఈఓ గోయల్ ఇటీవల ప్రకటించారు. కొత్త ఫీచర్ ద్వారా కస్టమర్లు ఆర్డర్‌ను క్యాన్సిల్ చేసిన తర్వాత నిమిషాల వ్యవధిలో ఫుడ్‌ను తగ్గింపు ధరతో ఇతర కస్టమర్లు పొందవచ్చు. జొమాటోలో నెలకు సగటున దాదాపు నాలుగు లక్షల ఆర్డర్లు క్యాన్సిల్ అవుతున్నాయి.We don't encourage order cancellation at Zomato, because it leads to a tremendous amount of food wastage.Inspite of stringent policies, and and a no-refund policy for cancellations, more than 4 lakh perfectly good orders get canceled on Zomato, for various reasons by customers.… pic.twitter.com/fGFQQNgzGJ— Deepinder Goyal (@deepigoyal) November 10, 2024కొత్త ఫీచర్‌కు సంబంధించిన ప్రకటనపై సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. క్యాన్సిల్ చేసిన ఆర్డర్లను కొనుగోలు చేయడంలో భద్రత ప్రశ్నార్థకంగా ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. చాలా మంది వినియోగదారులు ఆహారం వృథా అవ్వకుండా రాయితీపై భోజన సదుపాయాన్ని కల్పించే విధానాన్ని ప్రశంసిస్తున్నారు. అయితే బెంగళూరుకు చెందిన ప్రోడక్ట్ మేనేజర్ భాను అనే నెటిజన్ ఈ ఫీచర్ దుర్వినియోగాన్ని నిరోధించడానికి మరిన్ని నిబంధనలు అమలు చేయాలని కంపెనీకి సూచిస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.validations1.should not be applicable to COD2.Cancellation should not be allowed if the delivery reaches 500 m to the delivery point 3.Chances of 2 idiots sharing meals ordering and cancelling at the same time getting a discount place 4.< two cancellations are allowed/ month.— Bhanu (@BhanuTasp) November 10, 2024ఇదీ చదవండి: ఏఐని ఎక్కువగా వాడుతున్నది మనమే..‘ఫుడ్ రెస్క్యూ ఫీచర్లో క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్లను మినహాయించాలి. డెలివరీ పార్ట్నర్ వినియోగదారుల లోకేషన్‌కు 500 మీటర్ల పరిధిలో ఉంటే కస్టమర్లు ఆర్డర్లను రద్దు చేసే అవకాశం తక్కువగా ఉంటుంది. ఓకే స్థానంలో ఉన్న ఇద్దరు వినియోగదారుల్లో ఒకరు ఫుడ్ బుక్ చేసి క్యాన్సిల్ చేసిన వెంటనే పక్కనే ఉన్న మరో కస్టమర్ దాన్ని రాయితీతో తిరిగి బుక్ చేసి ఇద్దరూ షేర్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మరిన్ని నిబంధనలు తీసుకురావాలి. ఈ ఫీచర్ దుర్వినియోగాన్ని అరికట్టడానికి కంపెనీ ప్రతి కస్టమర్‌కు క్యాన్సిల్ చేసే ఆర్డర్లలో పరిమితులు విధించాలి. రోజుకు గరిష్ఠంగా రెండు ఆర్డర్లు మాత్రమే రద్దు చేసేందుకు వీలు కల్పించాలి’ అని నెటిజన్ పోస్ట్ చేశారు. దీనికి స్పందించిన జొమాటో సీఈఓ ఈ సూచనలు ఇప్పటికే కొత్త ఫీచర్లో చేర్చబడినట్లు చెప్పారు. నెటిజన్ సలహాలు, ఆలోచనలను మెచ్చుకుంటూ తన వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నించారు. ‘ఎవరు మీరు ఏమి చేస్తారు? మీ గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నాను. మీకు ఇష్టమైతే మనం కలిసి పని చేద్దాం’ అని పోస్ట్ చేశారు. -
డోమినోస్ పిజ్జా కంపెనీ లాభం తగ్గింది..
న్యూఢిల్లీ: ఫాస్ట్ ఫుడ్ చైన్ దిగ్గజం జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం రూ. 67 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 97 కోట్లకుపైగా ఆర్జించింది.డోమినోస్ పిజ్జా, డంకిన్ స్టోర్ల కంపెనీ మొత్తం అమ్మకాలు మాత్రం రూ. 1,955 కోట్లకు ఎగశాయి. గత క్యూ2లో రూ. 1,369 కోట్ల టర్నోవర్ సాధించింది. మొత్తం వ్యయాలు సైతం రూ. 1,290 కోట్ల నుంచి రూ. 1,896 కోట్లకు పెరిగాయి. అయితే ఫలితాలు పోల్చి చూడతగదని కంపెనీ పేర్కొంది. సొంత అనుబంధ సంస్థ జూబిలెంట్ ఫుడ్ నెదర్లాండ్స్ బీవీ.. 2024 మార్చికల్లా డీపీ యూరేషియా ఎన్వీలో మెజారిటీ వాటాను కొనుగోలు చేయడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది.ఈ కాలంలో 139 స్టోర్లను కొత్తగా జత చేసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. దేశీ ఆదాయం 8 శాతం పుంజుకుని రూ. 1,467 కోట్లను తాకింది. అంతర్జాతీయ అమ్మకాలు దాదాపు రూ. 461 కోట్లకు చేరాయి. ఫలితాల నేపథ్యంలో జూబిలెంట్ ఫుడ్ షేరు బీఎస్ఈలో 1 శాతం నీరసించి రూ. 602 వద్ద ముగిసింది. -
ఓఎన్జీసీ లాభం అదుర్స్.. షేరుకి రూ.6 డివిడెండ్
న్యూఢిల్లీ: ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ఓఎన్జీసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 17 శాతం జంప్‌చేసి రూ. 11,948 కోట్లను తాకింది. చమురు ధరలు నీరసించినప్పటికీ విండ్ఫాల్సహా ఇతర పన్నులు తగ్గడం ఇందుకు సహకరించింది.గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 10,238 కోట్లు మాత్రమే ఆర్జించింది. చట్టబద్ధ సుంకాలు రూ. 10,791 కోట్ల నుంచి రూ. 7,830 కోట్లకు క్షీణించాయి. అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు పెరిగితే ప్రభుత్వం విండ్‌ఫాల్ లాభాల పన్ను విధిస్తుంది. వాటాదారులకు షేరుకి రూ. 6 చొప్పున తొలి మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది.78.33 డాలర్లు తాజా సమీక్షా కాలంలో ఓఎన్జీసీ ఒక్కో బ్యారల్ చమురు విక్రయంపై 78.33 డాలర్ల ధరను అందుకుంది. గత క్యూ2లో 84.84 డాలర్లు చొప్పున లభించింది. అయితే కంపెనీ ఉత్పత్తి చేసిన గ్యాస్ ధరలు ఒక్కో ఎంబీటీయూకి 6.5 డాలర్లుగా కొనసాగాయి. చమురు వెలికితీత నామమాత్ర వృద్ధితో 4.576 మిలియన్ టన్నులుగా నమోదైంది. 2 శాతం తక్కువగా 4.912 బిలియన్ ఘనపు మీటర్ల గ్యాస్‌ను ఉత్పత్తి చేసింది.ఇకపై ముడిచమురు ఉత్పత్తి పెరగనున్నట్లు కంపెనీ తెలియజేసింది. కేజీ బేసిన్ బ్లాక్ కేజీ–డీడబ్ల్యూఎన్ 98/2లో ఉత్పత్తి పుంజుకోనుండటం ఇందుకు తోడ్పడనున్నట్లు పేర్కొంది. కాగా.. మొత్తం ఆదాయం రూ. 35,163 కోట్ల నుంచి రూ. 33,881 కోట్లకు క్షీణించింది. అయితే ఇతర ఆదాయం రెట్టింపై రూ. 4,766 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో ఓఎన్జీసీ షేరు బీఎస్ఈలో 2 శాతం క్షీణించి రూ. 257 వద్ద ముగిసింది. -
బ్రిటానియా... తగ్గిన ‘టేస్ట్’
న్యూఢిల్లీ: బేకరీ ఫుడ్ దిగ్గజం బ్రిటానియా ఇండస్ట్రీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 9 శాతం నీరసించి రూ. 532 కోట్లకు పరిమితమైంది. కమోడిటీ ధరల పెరుగుదల కారణంగా కన్జూమర్ డిమాండ్ మందగించడం ప్రభావం చూపింది.గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 587 కోట్లు ఆర్జించింది. మొత్తం అమ్మకాలు మాత్రం 4 శాతం పుంజుకుని రూ. 4,566 కోట్లను దాటాయి. గుడ్డే, మేరీ గోల్డ్, న్యూట్రిచాయిస్ తదితర బ్రాండ్ల కంపెనీ మొత్తం ఆదాయం సైతం 5 శాతంపైగా బలపడి రూ. 4,714 కోట్లకు చేరింది. అయితే మొత్తం వ్యయాలు 8 శాతం పెరిగి రూ. 3,995 కోట్లను తాకాయి. ఫలితాల నేపథ్యంలో బ్రిటానియా షేరు బీఎస్ఈలో 6 శాతం పతనమై ,425 వద్ద ముగిసింది. -
బోనస్ షేర్లు ప్రకటించిన ఎన్ఎండీసీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మైనింగ్ రంగ దిగ్గజం ఎన్ఎండీసీ 2:1 నిష్పత్తిలో బోనస్ షేర్లు ప్రకటించింది. అంటే రూ.1 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రెండు అదనపు షేర్లు జారీ చేస్తారు. అధీకృత మూలధన్నాన్ని రూ.400 కోట్ల నుంచి రూ.1,000 కోట్లకు పెంచాలని సోమవారం సమావేశమైన బోర్డు నిర్ణయించింది.సెప్టెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో ఎన్ఎండీసీ నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 15 శాతం వృద్ధి చెంది రూ.1,030 కోట్ల నుంచి రూ. 1,189 కోట్లకు ఎగసింది. పన్నుకు ముందు లాభం రూ.1,404 కోట్ల నుంచి రూ.1,614 కోట్లుగా ఉంది. వ్యయాలు రూ.2,931 కోట్ల నుంచి రూ.3,665 కోట్లను తాకాయి. ఈపీఎస్ రూ.3.50 నుంచి రూ.4.13కు పెరిగింది. టర్నోవర్ 22% అధికమై రూ.5,280 కోట్లు నమోదైంది. ఫలితాల నేపథ్యంలో ఎన్ఎండీసీ షేరు ధర బీఎస్ఈలో సోమవారం 1.15% క్షీణించి రూ.233 వద్ద స్థిరపడింది. -
ఆరెంజ్ జ్యూస్ కోసం ఆగితే.. కోటీశ్వరురాలు అయింది
ఎవరి జీవితాలు ఎప్పుడు, ఎలా మారుతాయో ఎవ్వరూ ఊహించలేరు. ఇటీవల ఆరెంజ్ జ్యూస్ కోసం ఆగిన మహిళ, లాటరీ టికెట్ కొని కోటీశ్వరురాలు అయిపోయింది.నార్త్ కరోలినాకు చెందిన ఒక మహిళ ఆరెంజ్ జ్యూస్ కొనుక్కోవడం కోసం ఆగింది. అక్కడే కనిపించిన లాటరీ టిక్కెట్‌తో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకుంది. అనుకున్న విధంగానే ఒక లాటరీ టికెట్ కొనుగోలు చేసింది.సరిగ్గా ఆమె కొనుగోలు చేసిన లాటరీ టికెట్టుకు లాటరీ తగిలింది. దీంతో 2,50,000 డాలర్ల విజేతగా నిలిచింది. అనుకోకుండా కొనుగోలు చేసిన లాటరీ టికెట్ వారి జీవితాన్నే మార్చేసిందని ఆ మహిళ చాలా సంతోషపడింది.కొన్ని రోజులకు ముందు అమెరికాకు చెందిన ఒక సాధారణ ఉద్యోగి లంచ్ బాక్స్ మరిచిపోవడమే.. అతన్ని కోటీశ్వరున్ని చేసింది. మధ్యాహ్నం తినడానికి సమీపంలో ఏదైనా దొరుకుతుందేమో చూసాడు. అదే సమయంలో అక్కడే ఉన్న ఓ కిరాణా షాపులో ఓ లాటరీ టికెట్ కొనుగోలు చేసాడు. ఆ వ్యక్తి కొనుగోలు చేసి టికెట్టుకే లాటరీ తగిలింది. దీంతో అతడు ఏకంగా రూ. 25.24 కోట్లు గెలుచుకున్నాడు. -
అదే జరిగితే.. భారత్‌లో భారీగా పెరగనున్న ఐఫోన్ల ఉత్పత్తి
యాపిల్ కంపెనీ తన కార్యకలాపాలను చైనా వెలుపల గణనీయంగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగానే భారతదేశంలో ఉత్పత్తిని పెంచడానికి కావలసిన సన్నాహాలను సిద్ధం చేస్తోంది. చైనా దిగుమతులపై.. అమెరికా సుంకాలను పెంచితే, యాపిల్ తన ఐఫోన్ ఉత్పత్తిని మన దేశంలో రెట్టింపు చేసే అవకాశం ఉందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ చైనీస్ దిగుమతులపై భారీ సుంకాలను విధించాలని నిర్ణయించుకుంటే యాపిల్ భారతదేశంలో ఐఫోన్ ఉత్పత్తిని ఏటా 30 బిలియన్లకు పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతం యాపిల్ ఇండియాలో సుమారు రూ. 1,30,000 కోట్ల నుంచి రూ. 1,36,000 కోట్ల విలువైన పరికరాలను తయారు చేస్తున్నట్లు సమాచారం.ఎన్నికల ప్రచారంలో చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 60 నుంచి 100 శాతం సుంకాలు విధిస్తానని ట్రంప్ వెల్లడించారు. ఇదే నిజమైతే అమెరికా భారతదేశం మీద ఎక్కువ ఆధారపడి అవకాశం ఉంది. కాబట్టి యాపిల్ కంపెనీ కూడా తన కార్యకలాపాలను మరింత విస్తరించనుంది. దీంతో కొత్త ఉద్యోగాలు కూడా పుట్టుకొస్తాయి.గతంలో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా చైనా దిగుమతులపై సుంకాలను విధించారు. కాబట్టి ఇప్పుడు కూడా చైనా దిగుమతులపై సుంకాలను మరింత పెంచే అవకాశం ఉంది. కాబట్టి ట్రంప్ తిరిగి రావడం ఇండో-అమెరికా సంబంధాలను మరింత ప్రభావితం చేయగలదని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇప్పటికే భారతదేశంలో యాపిల్ ఐఫోన్ల తయారీ చాలా వేగంగా సాగుతోంది. ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లోనే ఇండియా నుంచి సుమారు 6 బిలియన్ డాలర్ల (రూ. 50వేల కోట్లు) విలువైన ఐఫోన్లు ఎగుమతి అయినట్లు సమాచారం. దీన్నిబట్టి చూస్తే.. 2024 ఆర్ధిక సంవత్సరంలో కంపెనీ ఏకంగా 10 బిలియన్ డాలర్ల (రూ. 85వేల కోట్లు) విలువైన ఐఫోన్లు ఎగుమతి అయ్యే అవకాశం ఉందని అంచనా. -
డేట్ ఫిక్స్.. ఒప్పో కొత్త ఫోన్ లాంచ్ అప్పుడే
స్మార్ట్‌ఫోన్ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న కొత్త ఒప్పో ఫైండ్ ఎక్స్8 సిరీస్ గ్లోబల్ మార్కెట్లో లాంచ్ కావడానికి సిద్ధమైంది. ఇది నవంబర్ 21న భారతదేశంతో పాటు ఇతర దేశాల్లో కూడా లాంచ్ కానుంది. ఇది ఫైండ్ ఎక్స్8, ఫైండ్ ఎక్స్8 ప్రో అనే రెండు వేరియంట్లలో రానున్నట్లు సమాచారం.ఒప్పో ఫైండ్ ఎక్స్8 సిరీస్ ఫోన్ హాసెల్‌బ్లాడ్ ట్యూన్డ్ కెమెరాలు, మీడియాటెక్ డైమెన్సిటీ 9400 చిప్సెట్ పొందనుంది. ఇది క్వాల్కామ్ లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్‌ను అధిగమించగలదని సమాచారం. గేమింగ్, ఫోటోగ్రఫీ కోసం ఏఐ టెక్నాలజీ ఉంటుందని తెలుస్తోంది.కంపెనీ.. ఫైండ్ ఎక్స్8 సిరీస్ ఫోన్‌ను లాంచ్ చేయడానికి ముందే కొన్ని వివరాలను వెల్లడించింది. ఇందులో కొత్త మొబైల్ హ్యాండ్సెట్లు, పర్ఫామెన్స్ అన్నీ కూడా దాని మునుపటి అన్ని మోడల్స్ కంటే అద్భుతంగా ఉంటుందని పేర్కొంది. ఇది 7.85 మిమీ మందం, 193 గ్రాముల బరువు ఉంటుందని పేర్కొంది.ఒప్పో ఫైండ్ ఎక్స్8 సిరీస్ నాలుగువైపులా 1.45 మిమీ సన్నని బెజెల్స్‌తో 6.59 ఇంచెస్ డిస్ప్లే పొందుతుంది. ఇది స్టార్ గ్రే, స్పేస్ బ్లాక్ అనే రెండు రంగుల్లో మాత్రమే అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. రెండో వేరియంట్.. ఫైండ్ ఎక్స్8 ప్రో విషయానికి వస్తే.. రెండు వైపులా క్వాడ్ కర్వ్డ్ గ్లాస్‌తో పెద్ద 6.78 ఇంచెస్ డిస్ప్లే పొందనుంది. ఇది స్పేస్ బ్లాక్, పెర్ల్ వైట్ అనే రెండు రంగుల్లో లభిస్తుంది.ఇదీ చదవండి: అడిగితే 'జియో హాట్‌స్టార్' ఇచ్చేస్తాం: రిలయన్స్‌కు చిన్నారుల ఆఫర్ఒప్పో ఫైండ్ ఎక్స్8 5630mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీతో రానుంది. ఎక్స్8 ప్రో 5910mAh బ్యాటరీతో వస్తుందని సమాచారం. కాగా కంపెనీ కొత్త మొబైల్ ఫోన్ ధరలను అధికారికంగా వెల్లడించలేదు. అయితే ధరలు నవంబర్ 21న వెల్లడయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాము. -
యూకే కంపెనీ కొనుగోలు చేసిన హైదరాబాద్ సంస్థ
హైదరాబాద్‌కు చెందిన రఘు వంశీ గ్రూప్.. ఆయిల్ అండ్ గ్యాస్ పరిశ్రమకు విడిభాగాలను అందించే యూకేకు చెందిన ప్రముఖ ప్రెసిషన్ మెషినింగ్ కంపెనీ 'పీఎంసీ గ్రూపు'ను కొనుగోలు చేసింది.పీఎంసీ గ్రూపు కొనుగోలుతో.. రఘు వంశీ గ్రూపు కీలకమైన పరిశ్రమలకు ఉత్పత్తులు సరఫరా చేయనుంది. కాబట్టి కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా తన ఉనికిని నిరూపించుకోగలుగుతుంది. అంతే కాకుండా ఆయిల్ & గ్యాస్ రంగంలో లేటెస్ట్ ఇంజనీరింగ్ పరిష్కారాలను అందిస్తుంది.పీఎంసీ గ్రూపు.. తన ప్రిసిషన్ మాన్యుఫ్యాక్చరింగ్ సామర్థ్యాలలో 35 సంవత్సరాలకు పైగా ఉన్న గొప్ప అనుభవం కలిగి ఉంది. ఈ కంపెనీ ఎస్ఎల్బీ, బేకర్ హ్యూస్, హాలీబర్టన్, ఎక్స్‌ప్రో, టెక్ ఎఫ్ఎంసీ, వన్ సబ్ సీ వంటి గ్లోబల్ ఆయిల్ & గ్యాస్ ఓఈఎంలకు కావాల్సిన ఉత్పత్తులను సరఫరా చేస్తుంది. ఈ కంపెనీలో సుమారు 100 మంది ఉద్యోగులను కలిగి ఉన్నట్లు.. ఆదాయం రూ. 180 కోట్లు వరకు ఉంటుందని సమాచారం.పీఎంసీ గ్రూపును.. రఘు వంశీ గ్రూప్ కొనుగోలు చేయడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి యూకే డిప్యూటీ హైకమిషనర్ గారెత్ వైన్ ఓవెన్, తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్య శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, తెలంగాణ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ డైరెక్టర్ ప్రవీణ్ పీఏ, మిధాని సీఎండీ డాక్టర్ ఎస్ కే ఝా, ఏఆర్‌సీఐ సైంటిస్ట్ డాక్టర్ ఎల్.రామకృష్ణ పాల్గొన్నారు.ఈ సందర్భంగా రఘువంశీ గ్రూప్ ఎండీ వంశీ వికాస్ మాట్లాడుతూ.. రఘువంశీ కుటుంబంలోకి పీఎంసీ గ్రూపును స్వాగతించడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కొనుగోలు ఇప్పుడు మా ఉత్పత్తి బలాలను, సునిశిత మెషీనింగ్‌లో పీఎంసీ గ్రూపువారి నైపుణ్యంతో మిళితం చేస్తుంది. దీనివల్ల మా అంతర్జాతీయ ఉనికిని విస్తరించడానికి, అత్యంత సునిశిత ఉత్పత్తుల విస్తృత విభాగాన్ని రూపొందించడానికి సాయపడుతుందని మేము సంతోషిస్తున్నామన్నారు. -
మిశ్రమ ఫలితాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి మిశ్రమంగా ముగిశాయి. సెన్సెక్స్ 9.83 పాయింట్లు లేదా 0.012 శాతం లాభంతో 79,496.15 వద్ద, నిఫ్టీ 6.90 పాయింట్లు లేదా 0.029 శాతం నష్టంతో 24,141.30 వద్ద నిలిచాయి. సెన్సెక్స్ స్వల్ప లాభాలను పొందగా.. నిఫ్టీ స్వల్ప నష్టాల్లో ముగిసింది.పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ట్రెంట్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఏషియన్ పెయింట్స్, బ్రిటానియా, అపోలో హాస్పిటల్, సిప్లా, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) కంపెనీలు నష్టాలను చవి చూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
‘తను నా కోసమే పుట్టిందనిపించింది’
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ ఇటీవల తన భార్య గ్రేసియా మునోజ్‌తో కలిసి ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షో’లో పాల్గొన్నారు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, తన భార్య, రచయిత్రి సుధా మూర్తితో వేదిక పంచుకున్నారు. దీపిందర్ తన భార్యను ముందుగా ఎలా కలుసుకున్నారో ఈ కార్యక్రమంలో తెలిపారు.‘గ్రేసియాను కలవడానికి ముందు చాలా కాలంపాటు ఒంటరిగా ఉన్నాను. స్నేహితులను తరచు కలుస్తుండేవాడిని. అందులో ఒక స్నేహితుడు పెళ్లి చేసుకోకూడదని సలహా ఇచ్చాడు. ఇంకో స్నేహితుడు మాత్రం నాకు గ్రేసియాను పరిచయం చేశాడు. ఆ సమయంలో తాను నాకోసమే పుట్టిందనిపించింది. చాలా కొద్ది కాలంలోనే మేం కలిపిపోయాం’ అని చెప్పారు. మెక్సికోకు చెందిన గ్రేసియాను కపిల్ భారతీయ వంటకాల గురించి అడిగారు. పంజాబీ వంటకాలకు ప్రాధాన్యతనిస్తానని ఆమె చెప్పారు. ‘ఛోలే భతుర్’ తన ఫేవరెట్ డిష్ అని తెలిపారు. ఇంట్లో ‘పంజాబీ రసోయి’ తయారు చేసుకుంటారా అని కపిల్ అడిగినప్పుడు, తాము జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడానికే ఇష్టపడుతామని చెప్పారు.ఇదీ చదవండి: ఒకే సంస్థ.. ఒకే హోదా.. రిటైర్మెంట్ వయసులో తేడా!గ్రేసియా మునోజ్ మోడలింగ్, లగ్జరీ ఫ్యాషన్‌లో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. 2022లో యునైటెడ్ స్టేట్స్లో మెట్రోపాలిటన్ ఫ్యాషన్ వీక్ అవార్డును అందుకున్నారు. పిల్లల పోషణ, మహిళల సాధికారతపై దృష్టి సారించి స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీపిందర్, గ్రేసియా ఈ సంవత్సరం ప్రారంభంలో ఒక ప్రైవేట్ వేడుకలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇది దీపిందర్‌కు రెండో వివాహం. అతను గతంలో ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్ కంచన్ జోషిని వివాహం చేసుకున్నారు. -
ఒకే సంస్థ.. ఒకే హోదా.. రిటైర్మెంట్ వయసులో తేడా!
టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ సంయుక్త యాజమాన్యంలోని విస్తారా నవంబర్ 11 నుంచి ఎయిరిండియా ఎయిర్‌లైన్స్‌లో విలీనం అవుతుంది. ఈ విలీనం వల్ల ఇప్పటివరకు ఎయిరిండియా సర్వీసులో ఉన్న పైలట్లు మాత్రం కొంత అసంతృప్తిగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. విస్తారా, ఎయిరిండియాలో పనిచేస్తున్న పైలట్ల రిటైర్మెంట్ వయసే అందుకు కారణమని తెలియజేశారు.నవంబర్ 11 నుంచి విస్తారా ఎయిర్‌లైన్స్ ఎయిరిండియాలో విలీనం అవుతుంది. ఈమేరకు గతంలోనే ఇరు సంస్థల మధ్య ఒప్పందం జరిగింది. అయితే ఎయిరిండియా పైలట్లు మాత్రం కొంత అసంతృప్తిగా ఉన్నట్లు కొందరు అధికారులు తెలిపారు. ఎయిరిండియా పైలట్ల రిటైర్మెంట్ వయసు 58 ఏళ్లుగా ఉంది. ఇప్పటివరకు విస్తారాలో పని చేసిన పైలట్లు రిటైర్మెంట్ వయసు మాత్రం 60 ఏళ్లుగా ఉంది. ఒకే సంస్థలో, ఒకే స్థానంలో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయసులో తేడా ఉండడంపై ఎయిరిండియా పైలట్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఎయిరిండియా యాజమాన్యం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. డీజీసీఏ నిబంధనల ప్రకారం పైలట్లు తమకు 65 ఏళ్లు వచ్చేవరకు సేవ చేయవచ్చు. ఈ ఏడాది ఆగస్టులో ఎయిరిండియా ఎంపిక చేసిన పైలట్లను కాంట్రాక్ట్ ప్రాతిపదికన పదవీ విరమణ తర్వాత 65 ఏళ్ల వరకు సర్వీసు పొడిగించే పాలసీని ప్రకటించింది.ఇదీ చదవండి: పెళ్లిరోజున భార్యను బాధపెట్టిన నారాయణమూర్తి!రూ.2,058.50 కోట్ల డీల్పదేళ్లుగా కార్యకలాపాలు సాగిస్తున్న విమానయాన సంస్థ విస్తారా ఈరోజు నుంచి కనుమరుగు కానుంది. నవంబర్ 11 నుంచి విస్తారా సేవలు నిలిపేయనుంది. నవంబర్ 12 నుంచి సంస్థ విమానాలు, సిబ్బంది ఎయిరిండియాకు బదిలీ అవుతారని గతంలో కంపెనీ సీఈవో, ఎండీ క్యాంప్‌బెల్ విల్సన్ తెలిపారు. విలీన డీల్‌లో భాగంగా ఎయిరిండియాలో రూ.2,058.50 కోట్ల మేర సింగపూర్ ఎయిర్‌లైన్స్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) పెట్టే ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం గతంలో ఆమోదముద్ర వేసింది. దీనితో విలీనానికి మార్గం సుగమమైంది. విలీనానంతరం ఎయిరిండియాలో సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కి 25.1 శాతం వాటా లభిస్తుంది. -
పెళ్లిరోజున భార్యను బాధపెట్టిన నారాయణమూర్తి!
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, తన భార్య సుధామూర్తి నెట్‌ఫ్లిక్స్ షో ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షో’లో స్టార్ గెస్ట్లుగా పాల్గొన్నారు. అందులో తమ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను పంచుకున్నారు. నారాయణ మూర్తి తన 25వ వివాహ వార్షికోత్సవం రోజున సుధామూర్తికి శుభాకాంక్షలు తెలపడం మరిచిపోయానన్నారు.‘ఒకరోజు నేను ఆఫీస్‌కు బయలుదేరుతుండగా సుధ ఉదయం నా దగ్గరకు వచ్చి ఈ రోజు ఏదైనా ప్రత్యేకత ఉందా? అని అడిగింది. ఏమీలేదు అని జవాబిచ్చాను. ఆఫీస్ నుంచి కారులో ఇంటికి వస్తుండగా మళ్లీ ఈరోజు ప్రత్యేకతేంటో ఆలోచించారా? అని అడిగింది. ఏమీలేదని అదే సమాధానం చెప్పాను. నేను ఆ తర్వాతిరోజు ముంబయిలో ఒక సమావేశానికి హాజరుకావాల్సి ఉంది. నేను ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి విమానం ఎక్కుతుండగా నా కూతురు అక్షత(బ్రిటన్ మాజీ ప్రధాని రిషీసునాక్ భార్య) నుంచి కాల్ వచ్చింది. ఏం చేస్తున్నారు? అని అడిగింది. ఫ్లైట్ ఎక్కుతున్నాను అని సమాధానం ఇచ్చాను. వెంటనే దాన్ని క్యాన్సిల్ చేసుకోండి. వేరే విమానం ఎక్కి బెంగళూరు వెళ్లండని చెప్పింది. అమ్మకు పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్పండని తెలిపింది. మీరు మధ్యాహ్నం 3 గంటలకు సమావేశానికి హాజరు అవ్వాల్సి ఉంది. వీలైతే మీరు ప్రైవేట్ విమానాన్ని అద్దెకు తీసుకోండి. కానీ అమ్మకు పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్పాల్సిందేనని పట్టుపట్టింది’ అని నారాయణమూర్తి చెప్పారు.ఇదీ చదవండి: మస్క్ ‘ఫోరమ్ షాపింగ్’! ట్రంప్‌తో దోస్తీ ఇందుకేనా..?సుధామూర్తి నవ్వుతూ ‘అది మా 25వ వివాహ వార్షికోత్సవం. కొంత ప్రత్యేకంగా ఉండాలనుకున్నాను. నా భర్త ఆ విషయాన్ని మరిచిపోయేసరికి ఐదు-పది నిమిషాల పాటు కొంత బాధ అనిపించింది. కానీ ఆయన పనితీరు నేను అర్థం చేసుకుంటాను. కాబట్టి ఇలాంటి విషయాలు అంతగా పట్టించుకోను. కానీ, ఈ విషయంలో నా కూతురు చాలా కలత చెందింది’ అని చెప్పారు. -
తక్కువ ధరకు ఫుడ్.. జొమాటో కొత్త ఫీచర్
ఆహార వృధాను పూర్తిగా అరికట్టడానికి ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో పూనుకుంది. ఆర్డర్ క్యాన్సిల్ కారణంగా ఉత్పన్నమయ్యే ఆహార వృధా సమస్య పరిష్కారానికి ఫుడ్ రెస్క్యూ అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టినట్లు జొమాటో కోఫౌండర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ దీపిందర్ గోయల్ ప్రకటించారు.కొత్త ఫీచర్ ద్వారా కస్టమర్లు ఆర్డర్‌ను క్యాన్సిల్ చేసిన తర్వాత నిమిషాల వ్యవధిలో ఆ ఫుడ్‌ను తగ్గింపు ధరతో ఇతర కస్టమర్లు పొందవచ్చు. జొమాటోలో నెలకు సగటున దాదాపు 4 లక్షల ఆర్డర్లు క్యాన్సిల్ అవుతున్నాయి. ఈ ఫుడ్ వృధా అయ్యే అవకాశం ఉంటుంది. ఇదే ఈ కొత్త చొరవను ప్రారంభించేలా ప్రేరేపించింది."జొమాటోలో ఆర్డర్ క్యాన్సిల్‌ను ప్రోత్సహించము. ఎందుకంటే ఇది విపరీతమైన ఆహార వృధాకి దారి తీస్తుంది. కఠినమైన విధానాలు, క్యాన్సిల్ కోసం నో-రీఫండ్ పాలసీ ఉన్నప్పటికీ, పలు కారణాలతో కస్టమర్లు 4 లక్షలకు పైగా ఆర్డర్లు క్యాన్సిల్ చేస్తున్నారు" అని గోయల్ ఎక్స్‌లో (ట్విట్టర్) పోస్ట్ చేశారు.కొత్త ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే..ఒక కస్టమర్ ఆర్డర్‌ని క్యాన్సిల్ చేసిన తర్వాత, ఆ ఆర్డర్‌ను తీసుకెళ్తున్న డెలివరీ ఎగ్జిక్యూటివ్‌కు 3 కిలోమీటర్ల పరిధిలో ఉన్న కస్టమర్లకు అది యాప్‌లో పాప్ అప్ అవుతుంది. ఆసక్తి ఉన్న కస్టమర్లు ఈ ఫుడ్‌ను తక్కువ ధరకు తీసుకోవచ్చు. కొత్త కస్టమర్ చెల్లించిన మొత్తాన్ని ఆర్డర్ క్యాన్సిల్ చేసిన కస్టమర్‌కు, రెస్టారెంట్ పార్టనర్‌కు షేర్ చేస్తారు. ఇందులో జొమాటో ఎలాంటి ఆదాయాన్ని తీసుకోదు. అయితే, ఐస్‌క్రీమ్‌లు, షేక్‌లు, స్మూతీస్ వంటి కొన్ని పదార్థాలకు మాత్రం కొత్త ఫీచర్ వర్తించదు. ఆహార వృధా సమస్య పరిష్కారానికి చొరవ చూపిన జొమాటోకు, దీపిందర్ గోయల్‌కు నెటిజన్ల నుంచి ప్రశంసలు కురిశాయి. ఫుడ్ రెస్క్యూ అనేది గొప్ప చొరవ, వినూత్న ఆలోచన అంటూ పలువురు మెచ్చుకున్నారు.We don't encourage order cancellation at Zomato, because it leads to a tremendous amount of food wastage.Inspite of stringent policies, and and a no-refund policy for cancellations, more than 4 lakh perfectly good orders get canceled on Zomato, for various reasons by customers.… pic.twitter.com/fGFQQNgzGJ— Deepinder Goyal (@deepigoyal) November 10, 2024 -
మస్క్ ‘ఫోరమ్ షాపింగ్’! ట్రంప్‌తో దోస్తీ ఇందుకేనా..?
ఇలాన్ మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ (గతంలో ట్విటర్)కు వ్యతిరేకంగా దాఖలైన వ్యాజ్యాలను పరిష్కరించుకోనున్నారు. ఇలాన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి సంస్థపై న్యాయపరంగా కొన్ని కంపెనీలు వ్యాజ్యాలు దాఖలు చేశాయి. ఎక్స్ నిబంధనలకు తగ్గట్లు వ్యవహరించడంలేదని అందులో పేర్కొన్నారు. వాటిని త్వరలో పరిష్కరించుకోనున్నట్లు మస్క్ నిర్ణయం తీసుకున్నారని వాషింగ్టన్పోస్ట్ తెలిపింది.సమస్యలేంటి..ఎక్స్‌లో వెలువరించే యాడ్స్‌కు సంబంధించి సంస్థ యాజమాన్యం వెండర్లకు సరైన విధంగా రెవెన్యూలో షేర్ ఇవ్వడంలేదని కొన్ని కంపెనీలు గతంలో ఫిర్యాదు చేశాయి.కార్పొరేట్ యాడ్ తర్వాత వెంటనే వీక్షకులకు కాంట్రవర్సీ యాడ్ కనిపించేలా ఎక్స్‌లో ఆల్గారిథమ్ను క్రియేట్ చేశారని కొన్ని సంస్థలు గతంలో కోర్టును ఆశ్రయించాయి.ఎక్స్ యాజమాన్యం లేఆఫ్స్ ప్రకటించిన దాదాపు 2,200 మంది మాజీ ఉద్యోగుల నుంచి ఆర్బిట్రేషన్ కేసు ఎదుర్కొంటోంది. వీటితోపాటు మరిన్ని న్యాయపరమైన వ్యాజ్యాలు కంపెనీపై దాఖలయ్యాయి.నార్తర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ టెక్సాస్‌లో వ్యాజ్యాలుకంపెనీపై నమోదైన వ్యాజ్యాలను పరిష్కరించుకునేందుకు నార్తర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ టెక్సాస్‌లో కౌంటర్ వ్యాజ్యాలను దాఖలు చేయాలని మస్క్ నిర్ణయించుకున్నారు. ఈ వ్యవహారాన్ని నిపుణులు ‘ఫోరమ్ షాపింగ్’(అనుకూలమైన తీర్పులు పొందడం)గా అభివర్ణిస్తున్నారు. సాధారణంగా కార్పొరేట్ కంపెనీలు న్యాయపరమైన చిక్కులను పరిష్కరించుకునేందుకు తమ ప్రధాన కార్యాలయానికి అనుసంధానించబడిన జిల్లా కోర్టును ఎంచుకుంటాయి. కానీ ఎక్స్ మాత్రం ట్రంప్‌నకు స్పష్టమైన మెజారిటీ వచ్చాక టెక్సాస్‌లోని నార్తర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో కౌంటర్ వ్యాజ్యాలు దాఖలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో రిపబ్లికన్ పార్టీ నియమించిన న్యాయమూర్తులు అధికంగా ఉన్నారనే వాదనలున్నాయి. ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌నకు మస్క్ మద్దతిచ్చారు.ఇదీ చదవండి: పన్ను ఎగవేత.. పలు రకాలు.. వీటి జోలికి పోవద్దుఎక్స్ను రక్షించే వ్యూహంమస్క్ నిర్ణయం ఎక్స్‌ను రక్షించే వ్యూహంగా నిపుణులు భావిస్తున్నారు. నార్తర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ టెక్సాస్‌లోని 11 మంది న్యాయమూర్తుల్లో 10 మందిని రిపబ్లికన్ అధ్యక్షులు నియమించారని జార్జ్‌టౌన్ న్యాయశాస్త్ర ప్రొఫెసర్ స్టీవ్ వ్లాడెక్ తెలిపారు. ఇది మస్క్‌కు అనుకూలంగా తీర్పులను మార్చగలదని అభిప్రాయపడుతున్నారు. -
పడిపోయిన ఏషియన్ పెయింట్స్ లాభం
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం ఏషియన్ పెయింట్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 44 శాతం క్షీణించి రూ. 694 కోట్లకు పరిమితమైంది.డిమాండ్ మందగించడం, ముడివ్యయాల పెరుగుదల, డెకొరేటివ్, కోటింగ్ బిజినెస్ క్షీణించడం ప్రభావం చూపాయి. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 1,232 కోట్లకుపైగా ఆర్జించింది. వాటాదారులకు షేరుకి రూ. 4.25 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. మొత్తం అమ్మకాలు సైతం 5 శాతం నీరసించి రూ. 8,028 కోట్లకు చేరాయి. గత క్యూ2లో రూ. 8,479 కోట్ల టర్నోవర్ సాధించింది.అయితే మొత్తం వ్యయాలు స్వల్పంగా 1 శాతం పెరిగి రూ. 7,093 కోట్లను దాటాయి. ఇతర వనరులతో కలిపి మొత్తం ఆదాయం 5 శాతం తక్కువగా రూ. 8,201 కోట్లను తాకింది. కాగా.. అంతర్జాతీయ అమ్మకాలు నామమాత్ర క్షీణతతో రూ. 770 కోట్లకు పరిమితమయ్యాయి. గత క్యూ2లో సాధించిన రూ. 40 కోట్ల పన్నుకుముందు లాభం(పీబీటీ)స్థానే రూ. 22 కోట్ల నష్టం ప్రకటించింది. -
కెనడాలో బ్యాంక్ సేవలపై ఎస్బీఐ ప్రకటన
భారత్, కెనడా మధ్య గత కొంత కాలంగా దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే ఇటీవల ఆ దేశంలోని హిందువుల మీద, హిందూ దేవాలయాల మీద దాడులు జరిగాయి. దీంతో హిందువులు పెద్ద ఎత్తున కెనడా రోడ్ల మీదకు వచ్చి నిరసన కార్యక్రమాలను చేపట్టారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తమైంది. ఈ తరుణంలో 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (SBI) అక్కడ బ్యాంకింగ్ సేవలకు సంబంధించి కీలక ప్రకటన చేసింది.కెనడాలో జరుగుతున్న ఉద్రిక్తతలు బ్యాంక్ సేవల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపలేదు. కాబట్టి సంస్థ తన కార్యకలాపాలను ఎప్పటిలాగే నిర్వరిస్తుందని ఎస్బీఐ ఛైర్మన్ సీఎస్ శెట్టి వెల్లడించారు. అంతే కాకుండా రెగ్యులేటరీ రెగ్యులేటర్లు లేదా కస్టమర్ల విధానంలో మేము ఎలాంటి మార్పును చూడలేదని పేర్కొన్నారు.ఎస్బీఐ.. కెనడాలో టొరంటో, బ్రాంప్టన్, వాంకోవర్లతో సహా పూర్తిగా యాజమాన్యంలోని అనుబంధ సంస్థ ద్వారా ఎనిమిది శాఖలను నిర్వహిస్తోంది. ఎస్బీఐను కూడా మేము అక్కడి స్థానిక బ్యాంకులలో ఒకటిగా భావిస్తున్నామని సీఎస్ శెట్టి అన్నారు. 1982 నుంచి ఎస్బీఐ కెనడాలో తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. -
కంపెనీ దురాశే.. ఉద్యోగుల తొలగింపు: శ్రీధర్ వెంబు ట్వీట్ వైరల్
కరోనా సమయంలో చాలా కంపెనీలు ఆర్థికంగా నష్టపోవడంతో.. ఉద్యోగులను తొలగించడం ప్రారంభించాయి. అయితే ఇప్పుడు సంస్థలు ఆర్థికంగా కుదుటపడుతున్నాయి, లాభాలను ఆర్జిస్తున్నాయి. ఇలాంటి సమయంలో కూడా ఉద్యోగుల తొలగింపులు జరుగుతూనే ఉన్నాయి. దీనిపైన మల్టీ నేషనల్ టెక్నాలజీ కంపెనీ.. జోహో ఫౌండర్ 'శ్రీధర్ వెంబు' కీలక వ్యాఖ్యలు చేశారు.100 కోట్ల రూపాయల క్యాష్ ఉన్న కంపెనీకి.. వార్షిక ఆదాయం 1.5 రెట్లు కంటే ఎక్కువ వచ్చింది. ఇప్పటికీ 20 శాతం లాభాలను గడిస్తోంది. మూడో త్రైమాసికంలో ఏకంగా రూ.18 కోట్ల ఆదాయం వచ్చింది. అంతే కాకుండా రూ. 40కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయడానికి కూడా సంస్థ సిద్ధమైంది. ఇంత లాభాలతో ముందుకు సాగుతున్న కంపెనీ.. ఉద్యోగులలో 12 నుంచి 13 శాతం తొలగింపులు చేపట్టడం అంటే.. ఇది పెద్ద దురాశే అని శ్రీధర్ వెంబు తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న 'ప్రెష్‌వర్క్స్' కంపెనీని ఉద్దేశించి శ్రీధర్ వెంబు ఈ వ్యాఖ్యలను చేసినట్లు తెలుస్తోంది. ఈ సంస్థ కొన్ని రోజుల క్రితమే సుమారు 660 మంది ఉద్యోగులను తొలగించింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా తమదైన రీతిలో స్పందిస్తున్నారు.ఇదీ చదవండి: ఏ హామీ లేకుండానే లోన్: నిర్మలా సీతారామన్ కీలక ప్రకటనకంపెనీలు లాభాల్లో ఉన్నప్పటికీ.. ఉద్యోగులను తొలగించే సంస్కృతి కొన్ని అగ్రదేశాల్లో ఉంది. దానిని మనం భారతదేశానికి దిగుమతి చేసుకుంటున్నాము. ఇది ఉద్యోగులకు కంపెనీ మీద ఉన్న నమ్మకాన్ని చెరిపివేస్తుంది. సంస్థలో ఎప్పుడూ.. కస్టమర్లను, ఉద్యోగులను మొదటి స్థానంలో ఉంచాలి. ఆ తరువాత స్థానంలో వాటాదారులు ఉండాలని శ్రీధర్ వెంబు పేర్కొన్నారు.A company that has $1 billion cash, which is about 1.5 times its annual revenue, and is actually still growing at a decent 20% rate and making a cash profit, laying off 12-13% of its workforce should not expect any loyalty from its employees ever. And to add insult to injury,…— Sridhar Vembu (@svembu) November 7, 2024 -
అరబిందో లాభం అదిరింది!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీలో ఉన్న అరబిందో ఫార్మా సెప్టెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 8.6 శాతం ఎగసి రూ.817 కోట్లు సాధించింది. ఎబిటా 11.6 శాతం దూసుకెళ్లి రూ.1,566 కోట్లు నమోదైంది. ఎబిటా మార్జిన్ 65 బేసిస్ పాయింట్లు మెరుగై 20.1 శాతంగా ఉంది. ఈపీఎస్ 9 శాతం వృద్ధి చెంది రూ.14 ఉంది. టర్నోవర్ 8 శాతం అధికమై రూ.7,796 కోట్లకు చేరింది.మొత్తం ఫార్ములేషన్స్ ఆదాయం 11.3 శాతం వృద్ధి చెంది రూ.6,640 కోట్లు సాధించింది. మొత్తం ఏపీఐ టర్నోవర్ 0.9 శాతం క్షీణించి రూ.1,156 కోట్లకు వచ్చి చేరింది. యూఎస్ ఫార్ములేషన్స్ వ్యాపారం 4.3 శాతం పెరిగి రూ.3,530 కోట్లు, యూరప్ ఫార్ములేషన్స్ ఆదాయం 19% ఎగసి రూ.2,105 కోట్లను తాకింది. వృద్ధి మార్కెట్ల నుంచి ఆదాయం 44% దూసుకెళ్లి రూ.812 కోట్లకు చేరింది. పరిశోధన, అభివృద్ధికి చేసిన వ్యయాలు రూ.410 కోట్లు. ఇది ఆదాయంలో 5.3 శాతానికి సమానం.సింహభాగం యూఎస్..మొత్తం వ్యాపారంలో విదేశీ మార్కెట్ల వాటా ఏకంగా 89% ఉంది. టర్నోవర్‌లో యూఎస్ 45.3% తో సింహభాగం వాటా కైవసం చేసుకుంది. యూరప్ 27%, ఏపీఐలు 14.8, వృద్ధి మార్కెట్లు 10.4, ఏఆర్వీ ఫార్ములేషన్స్ 2.5% వాటా దక్కించు కున్నాయి. ‘ఈ త్రైమాసికంలో కీలక వ్యాపార రంగాలలో రాబడుల నిరంతర వృద్ధితో సంతోషి స్తున్నాం. ఇది విభిన్న పోర్ట్‌ఫోలియో స్థితి స్థాపక తను ప్రతిబింబిస్తుంది. ప్రాథమికంగా కొన్ని వ్యా పార కార్యకలాపాల తాత్కాలిక స్వభావం కారణంగా లాభదాయకత స్వల్పంగా తగ్గినప్పటికీ, అంతర్లీన పనితీరు బలంగా ఉంది. బలమైన పునాది, కొనసాగుతున్న కార్యాచరణ మెరుగు దలలతో వృద్ధి పథాన్ని కొనసాగించగలమని, ప్రస్తుత సంవత్సరానికి వ్యూహాత్మక లక్ష్యాలను సాధించగ లమని విశ్వసిస్తున్నాం’ అని అరబిందో ఫార్మా వైస్ చైర్మన్, ఎండీ కె.నిత్యానంద రెడ్డి తెలిపారు.