Personal Finance
-
అకౌంట్లో ఇంతకు మించి క్యాష్ జమైతే అంతే..
మనలో చాలా మంది బ్యాంకు ఖాతాల ఆధారంగా లావాదేవీలు చేస్తూంటారు. ఎఫ్డీలో డబ్బు దాచుకుంటారు. సేల్ డీడ్ ద్వారా చెల్లింపులు చేస్తూంటారు. బిజినెస్ చేస్తున్నవారు కరెంట్ అకౌంట్ ద్వారా లావాదేవీలు చేస్తుంటారు. అయితే ఏ ఖాతాకైనా లావాదేవీల పరంగా నిబంధనల ప్రకారం కొన్ని అవధులుంటాయి. వాటిని పాటించకుండా ఇష్టారీతిగా వ్యవహరిస్తే ఆదాయపన్ను అధికారుల నుంచి నోటీసులు అందుకోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఏయే ఖాతాలకు నిబంధనల ప్రకారం ఎంతమొత్తంలో లిమిట్స్ ఉన్నాయో తెలుసుకుందాం.సేవింగ్స్, కరెంట్ ఖాతాలో లావాదేవీలుభారతీయ ఆదాయపు పన్ను చట్టంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం పొదుపు ఖాతాలో జమ చేసే నగదు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలు లేదా అంతకు మించితే ఐటీ శాఖకు తెలియజేయాలి. అదే కరెంట్ అకౌంట్ల విషయంలో ఈ పరిమితి ప్రాథమికంగా రూ.50 లక్షలు ఉంటుంది. కొన్నిసార్లు కరెంట్ అకౌంట్‌కు సంబంధించి లేవాదేవీలు ఆయా బ్యాంకు నిబంధనలపై ఆధారపడి ఉంటాయి. ఈ డిపాజిట్లు తక్షణ పన్నుకు లోబడి ఉండనప్పటికీ, పరిమితులను మించిన లావాదేవీలను ఆదాయపు పన్ను శాఖకు తెలియజేయాలి.నగదు ఉపసంహరణనగదు ఉపసంహరణల విషయానికి వస్తే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 194ఎన్లో టీడీఎస్ నిబంధనలు ఉంటాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో నగదు ఉపసంహరణలు రూ.1 కోటికి మించితే 2% టీడీఎస్ చెల్లించాలి. గడిచిన మూడు సంవత్సరాలుగా ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయని వ్యక్తులకు విత్‌డ్రావల్స్ రూ.20 లక్షలు దాటితే 2% టీడీఎస్ వర్తిస్తుంది. అదే రూ.1 కోటికి మించితే 5% టీడీఎస్ అమలవుతుంది.నగదు బహుమతినగదు బహుమతులపై ఆదాయపు పన్నుశాఖ నిబంధనలు విధించింది. పన్ను విధించదగిన ఆదాయాన్ని దాచిపెట్టి పన్నులను ఎగవేసేందుకు ప్రయత్నిస్తుంటారు. నగదు బహుమతులకు సంబంధించి దీన్ని నిరోధించడానికి కొన్ని నిబంధనలు తీసుకొచ్చారు. సంబంధీకులు కానివారి నుంచి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50,000 లేదా అంతకంటే తక్కువ మొత్తంలో నగదు బహుమతులు స్వీకరించినట్లయితే ఎటువంటి గిఫ్ట్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. మీ తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, తోబుట్టువులు, అత్తమామలతో సహా ఇతర బంధువుల నుంచి బహుమతులను స్వీకరిస్తే పన్ను మినహాయింపు ఉంటుంది.ఫిక్స్డ్ డిపాజిట్ పరిమితిఫిక్స్డ్ డిపాజిట్ల ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసి సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొందాలనుకుంటే కనీసం రూ.100 నుంచి రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయాలి. ఆపై చేసిన ఎఫ్డీపై ట్యాక్స్ ఉంటుంది. అయితే ఎఫ్‌డీల్లో రూ.రెండు కోట్లు కంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లు ఉంటే బల్క్ డిపాజిట్ల రూపంలోకి మారుతాయి. ఎఫ్డీపై వచ్చే వడ్డీ ఏటా రూ.10 వేలు దాటితో టీడీఎస్ 10 శాతం కట్ అవుతుంది.‘రియల్’ లావాదేవీలుపూర్తి నగదును ఉపయోగించి స్థలం లేదా, ఇల్లు కొనుగోలు చేసేందుకు నిబంధనలు అనుమతించవు. రియల్ ఎస్టేట్ లావాదేవీలు నగదు లావాదేవీల పరిమితికి లోబడి ఉంటాయి. నగదు రూపంలో రూ.2,00,000 కంటే ఎక్కువ లావాదేవీలు చేయకూడదు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 269ఎస్ఎస్ ప్రకారం నగదు రూపంలో రూ.రెండు లక్షల కంటే ఎక్కువ చెల్లింపులు స్వీకరిస్తే విక్రేత 100% పెనాల్టీ రుసుమును చెల్లించవలసి ఉంటుంది.ఇదీ చదవండి: పాన్ కార్డ్‌తో గేమ్స్ వద్దుసేల్ డీడ్‌లో నగదు చెల్లింపులను రికార్డ్ చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. రిజిస్టర్డ్ టైటిల్ డీడ్‌లో రుజువులు రికార్డు చేసే క్రమంలో రూ.రెండు లక్షలు గరిష్ట పరిమితి మాత్రమే ఉండాలి. అది కూడా బ్యాంకు డ్రాఫ్ట్, చెక్, ఈసీఎస్ వంటి ఎలక్ట్రానిక్ రూపంలో ఉండడం మేలు. -
పాన్ కార్డ్‌తో గేమ్స్ వద్దు
పర్మినెంట్ అకౌంట్ నెంబర్ లేదా పాన్ (పాన్ కార్డు) అనేది ఆర్థిక వ్యవస్థలో చాలా కీలకం. సంస్థలు, వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు అందరూ కూడా ఆర్ధిక కార్యకలాపాలలో దీని ద్వారానే భాగస్వాములవుతారు. టెక్నాలజీ పెరుగుతున్న క్రమంలో పాన్ కార్డును కూడా డిజిటలైజ్ చేయదలచి, కేంద్రం పాన్ 2.0 ప్రకటించింది. ఇది మరింత సేఫ్ అని పేర్కొంది.మన దేశంలో ఒక వ్యక్తికి ఒకే పాన్ కార్డు ఉండాలి. అలా కాకుండా ఒక వ్యక్తికి, ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఉంటే.. అది చట్టరీత్యా నేరం. అలాంటి వారు జరిమానా కట్టాల్సి ఉంటుంది.మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు, ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులను తీసుకుంటారు. తప్పుడు వివరాలతో.. ఫేక్ పాన్ కార్డులను పొందటం నేరం. ఈ నేరానికి సెక్షన్ 272 బీ ప్రకారం.. రూ.10,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అంతే కాకుండా జైలు శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: పాన్ 2.0: అప్లై విధానం.. ఫీజు వివరాలుఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఉండటం మాత్రమే కాకుండా.. అవసరమైన ఆర్ధిక కార్యకలాపాలకు పాన్ కార్డును ఉపయోగించకపోవడం కూడా నేరమే. అలాంటి వారు కూడా శిక్షార్హులే. కాబట్టి ఎక్కువ పాన్ కార్డులు ఉన్న వారు వెంటనే డీ-యాక్టివేట్ చేసుకోవాలి. అసలు పాన్ కార్డు లేనివారు వెంటనే.. పాన్ కార్డు కోసం అప్లై చేసుకోవాలి.పాన్ 2.0పాన్ 2.0 అనేది రూ. 1,435 కోట్ల బడ్జెట్‌తో క్యాబినెట్ ఆమోదించిన ప్రతిష్టాత్మక కార్యక్రమం. దీని ద్వారా క్యూఆర్ కోడ్ పాన్ కార్డును పొందవచ్చు. ఈ కార్డు ద్వారా వేగవంతమైన, సమర్థవంతమైన ప్రక్రియలను నిర్ధారించడం లక్ష్యం. PAN 2.0 పన్ను చెల్లింపుదారులకు సున్నితమైన, సురక్షితమైన అనుభవాన్ని అందిస్తుంది. -
సిబిల్ స్కోర్ తగ్గిందా?.. ఇలా చేస్తే రాకెట్లా దూసుకెళ్తుంది
డెబిట్ కార్డు వినియోగం కంటే.. క్రెడిట్ కార్డు వినియోగం బాగా పెరిగిపోయింది. వేల రూపాయల జీతం తీసుకునే ఉద్యోగుల దగ్గర నుంచి లక్షల శాలరీ తీసుకునే ఉద్యోగుల వరకు, అందరూ క్రెడిట్ కార్డును ఉపయోగిస్తున్నారు. అవసరానికి క్రెడిట్ కార్డును వాడుకోవడం మంచిదే.. సకాలంలో బిల్లులు చెల్లించకపోతే సిబిల్ స్కోర్ పడిపోయే అవకాశం ఉంది. ఈ స్కోర్ పెంచుకోవడానికి ఐదు ఉత్తమ మార్గాలను ఈ కథనంలో చూసేద్దాం..సిబిల్ స్కోర్ అంటే ఏమిటి?సిబిల్ స్కోర్ అనే పదాన్ని ఎప్పుడూ వినేవారికి కూడా.. బహుశా సిబిల్ స్కోర్ అంటే ఏమిటో తెలిసుండకపోవచ్చు. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్(CIBIL) అనే క్రెడిట్ బ్యూరో.. మీ ఆర్థిక పరిస్థితి ఏంటని తెలుసుకుని మీకు ఇచ్చే రేటింగ్‌నే సిబిల్ స్కోర్ అంటారు.సిబిల్ స్కోర్ అనేది 300 నుంచి 900 వరకు ఉంటుంది. ఈ స్కోర్ అనేది 900కి దగ్గరగా ఉంటె మంచి సిబిల్ స్కోర్ అంటారు. 750 కంటే తక్కువ ఉంటే మంచి సిబిల్ స్కోర్ కాదని చెబుతారు. సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉంటే.. కొంత తక్కువ వడ్డీకి బ్యాంకులు లోన్ ఇస్తాయి. తక్కువ స్కోర్ ఉంటే.. కొన్ని బ్యాంకులు లోన్ ఇవ్వవు. ఒకవేళా ఇచ్చినా.. వడ్డీ రేటు భారీగా ఉంటుంది.సిబిల్ స్కోర్ పెంచుకోవడానికి ఐదు మార్గాలు➤క్రెడిట్ కార్డు బిల్స్, ఈఎంఐ వంటివి సకాలంలో చెల్లించాలి. ఇది మీ సిబిల్ స్కోరును పెంచడంలో సహాయపడుతుంది. బిల్స్, ఈఎంఐ చెల్లింపులు ఆలస్యమైతే సిబిల్ స్కోర్ మీద ప్రతికూల ప్రభావం పడుతుంది. దీంతో స్కోర్ తగ్గిపోతుంది. కాబట్టి ఈ విషయంలో ఎప్పుడూ జాగ్రత్తగా ఉంటూ.. గడువుకు ముందే చెల్లింపులు పూర్తి చేయాలి.➤లోన్ కోసం మళ్ళీ మళ్ళీ వెంట వెంటనే అప్లై చేయడం మానుకోవాలి. తక్కువ వ్యవధిలో ఎక్కువ రుణాల కోసం దరఖాస్తు చేయడం ఆర్థిక ఒత్తిడిని సూచిస్తుంది. ఇది మీ సిబిల్ స్కోర్‌ను తగ్గిస్తుంది.➤మీ పేరుతో లేదా మీ డాక్యుమెంట్స్ ఉపయోగించి ఎవరికైనా లోన్ తీసి ఇవ్వడం వంటివి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఎందుకంటే లోన్ తీసుకున్న వ్యక్తి సకాలంలో ఈఎంఐ చెల్లించకపోతే.. ఆ ప్రభావం మీ క్రెడిట్ స్కోర్ మీద చూపిస్తుంది. రుణగ్రహీత తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని మీరు విశ్వసిస్తే మాత్రమే.. హామీదారుగా ఉండటానికి అంగీకరించండి.➤క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచుకున్నప్పటికీ.. ఖర్చులను కొంత ఆచితూచి చేయాల్సి. ఖర్చులు పెరిగితే.. మీ ఆర్థిక పరిస్థితి మీద ప్రభావం చూపుతుంది. ఇది మీ సిబిల్ స్కోర్ మీద ప్రభావం చూపుతుంది.➤సిబిల్ స్కోరును పెంచుకోవడానికి సరైన మార్గం.. క్రెడిట్ కార్డును ఉపయోగించడం మాత్రమే కాదు. సకాలంలో తిరిగి చెల్లించడం. ఇవన్నీ సరిగ్గా పాటిస్తే మీరు ఉత్తమ సిబిల్ స్కోర్ తప్పకుండా పొందుతారు. -
ఏటీఎం నుంచి ఈపీఎఫ్‌వో సొమ్ము!
ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఈపీఎఫ్‌వో 3.0 అనే కొత్త వెర్షన్‌కి అప్‌గ్రేడ్ అయ్యే ప్రణాళికలో ఉంది. ఏటీఎం నుండి పీఎఫ్ సొమ్ము ఉపసంహరణ, ఉద్యోగి ప్రస్తుత 12 శాతం చందా పరిమితి పెంపు, పీఎఫ్ సొమ్మును పెన్షన్‌గా మార్చుకునే అవకాశం వంటి కొత్త సంస్కరణలు ఇందులో ఉండవచ్చని భావిస్తున్నారు.ఏటీఎం తరహా కార్డుఈటీ నౌ రిపోర్ట్ ప్రకారం.. ఈపీఎఫ్‌వో 3.0 అనే కొత్త వెర్షన్లో అతి ముఖ్యమైన అంశం ఏమిటంటే, పీఎఫ్ సొమ్ము ఉపసంహరణల కోసం ఒక కార్డును జారీ చేయాలని కార్మిక మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. ఈ కార్డును ఉపయోగించి ఏటీఎం ద్వారా పీఎఫ్ డబ్బును విత్‌డ్రా చేయవచ్చు. అయితే, పీఎఫ్ మొత్తంలో గరిష్టంగా 50 శాతం మాత్రమే ఇలా విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్ వచ్చే ఏడాది మే నుంచి జూన్ నెలల మధ్య ఎప్పుడైనా అమలు చేయవచ్చు.ఇక మరొక పరిణామం ఏమిటంటే, ఉద్యోగులు తమ జీతంలో ఈపీఎఫ్‌కు జమ చేసే కాంట్రిబ్యూషన్లపై ప్రస్తుతం ఉన్న 12% పరిమితిని తొలగించవచ్చు. ఉద్యోగులు తమకు నచ్చినంత మొత్తాన్ని పీఎఫ్‌కు జమ చేసుకునే అవకాశాన్ని ఇది కల్పిస్తుంది. అయితే, యజమాన్యం కాంట్రిబ్యూషన్ మాత్రం ఉద్యోగి జీతం ఆధారంగా ఉంటుంది. అలాగే ఉద్యోగి సమ్మతితో పీఎఫ్ మొత్తాన్ని పెన్షన్‌గా మార్చాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది. -
ప్రైవేట్ సంస్థ చేతిలో ‘సిబిల్’.. వ్యవస్థపై ఆందోళన
సిబిల్ స్కోర్ విశ్వసనీయతపై రాజకీయ రంగంలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో సిబిల్ స్కోర్ వ్యవస్థపై ఆందోళన వ్యక్తం చేశారు. ట్రాన్స్ యూనియన్ అనే ప్రైవేట్ సంస్థ నిర్వహించే సిబిల్ స్కోర్ల విశ్వసనీయత, జవాబుదారీతనంపై ప్రశ్నలొస్తున్నాయని తెలిపారు. వ్యవస్థ పారదర్శకత, నిష్పాక్షికతపై అనుమానం వ్యక్తం చేశారు. సిబిల్ స్కోర్ నిర్వహణకు మెరుగైన యంత్రాంగం లేకపోవడాన్ని చిదంబరం నొక్కిచెప్పారు. ప్రస్తుతం అమలవుతున్న సిబిల్ నిర్వహణ చాలా మంది భారతీయులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను మరింత తీవ్రతరం చేస్తుందని అభిప్రాయపడ్డారు.అసలు సిబిల్ అంటే ఏమిటి? ప్రభుత్వ నిబంధనల ప్రకారం అది ఎంత ఉండాలి? దాన్ని మెరుగుపరుచుకోవాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి.. అనే అంశాల గురించి తెలుసుకుందాం.సిబిల్ స్కోర్సిబిల్ స్కోర్ అనేది క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్(సిబిల్) వారిచే ఇవ్వబడే మూడంకెల సంఖ్య. ఇది 300 నుంచి 900 వరకు ఉంటుంది. ఒక వ్యక్తికి సంబంధించిన రుణాలు వాటికి సంబంధించిన చెల్లింపుల వివరాలను పరిగణలోకి తీసుకుని సిబిల్ స్కోర్ ఇస్తారు. క్రెడిట్ బ్యూరో దగ్గర వ్యక్తులు తీసుకున్న రుణాలు వాటి చెల్లింపుల వివరాలు అన్నీ ఉంటాయి. ఒక వ్యక్తి ఎంత లోన్ తీసుకున్నాడు? తీసుకున్న లోన్‌ను తిరిగి సకాలంలో చెల్లిస్తున్నాడా లేదా? అతనికి సంబంధించిన క్రెడిట్ కార్డు లావాదేవీలు ఇవన్నీ సిబిల్లో రికార్డు అవుతాయి. ఈ స్కోర్ 750-900 మధ్య ఉంటే మంచి రికార్డు ఉందని అర్థం.ఎక్కువగా ఉంటే..సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉంటే త్వరగా లోన్ పొందే వీలుంటుంది. మనం కోరుకున్న రుణం మొత్తాన్ని ఇచ్చే అవకాశం ఉంది. సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే రుణం రాదని కాదు. ఒక బ్యాంకులో లోన్ ఇవ్వకయినా మరో బ్యాంకు లోన్ ఇవ్వొచ్చు. అది ఆయా బ్యాంకుల పాలసీల మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ తక్కువ స్కోర్ ఉన్నవారికి బ్యాంకులు అప్పు ఇచ్చినా ఎక్కువ వడ్డీ రేటుతో లోన్ ఇస్తాయి.సిబిల్ 750-900: సిబిల్ స్కోర్ 750 నుంచి 900 మధ్యలో ఉంటే ఎటువంటి లోన్ అయినా సులభంగా పొందవచ్చు. అది కూడా తక్కువ వడ్డీరేటుతో పొందే అవకాశం ఉంటుంది.స్కోర్ పెరగాలంటే..గతంలో తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లించాలి.సమయానికి ఈఎంఐ చెల్లించకపోతే క్రెడిట్ స్కోర్ తగ్గే అవకాశం ఉంటుంది.రుణాలు తీసుకునే ముందు అన్ని తరహా లోన్స్‌కు ప్రాధాన్యమివ్వాలి. సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ రుణాల మధ్య బ్యాలెన్స్ పాటించాలి. హోమ్ లోన్స్, కారు లోన్స్‌ను సెక్యూర్డ్ లోన్స్గా పరిగణిస్తారు. పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ లోన్స్‌ను అన్సెక్యూర్డ్ లోన్స్గా భావిస్తారు. ఇలా మీరు సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ లోన్స్‌కు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల బ్యాంకులు మంచి క్రెడిట్ రేటింగ్ ఇస్తాయి.క్రెడిట్ కార్డు లిమిట్‌ను పూర్తిగా ఉపయోగించొద్దు. కార్డు లిమిట్లో కేవలం 30 శాతం మాత్రమే ఉపయోగించాలి. ఈ లిమిట్ కన్నా ఎక్కువగా ఉపయోగిస్తే క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం పడుతుంది.ఎదుటివారు తీసుకునే రుణాలకు గ్యారెంటీగా ఉండకూడదు. ఎందుకంటే అవతలి వ్యక్తి ఏదైనా పరిస్థితుల్లో రుణం చెల్లించకుండా డీఫాల్ట్ అయితే గ్యారెంటీ మీరు కాబట్టి మిమ్మల్ని చెల్లించమంటారు. ఆ సమయానికి డబ్బు సమకూరకపోతే అది మీ సిబిల్ స్కోర్‌పై ప్రభావం చూపిస్తుంది.క్రెడిట్‌కార్డు బిల్లు చెల్లించేప్పుడు వీలైతే రెండు దఫాలుగా పే చేయండి. ఉదాహరణకు మీ బిల్లు రూ.12000 అనుకుందాం. పేమెంట్ తేదీ 15 నుంచి 30వ తేదీ వరకు ఉందనుకుందాం. ఈ 15 రోజుల్లో ఒకసారి రూ.6000 మరోసారి మిగిలిన రూ.6000 చెల్లించండి. దాంతో మీ పేమెంట్ రెండుసార్లు రికార్డు అవుతుంది. ఫలితంగా క్రెడిట్స్కోర్ పెరిగే అవకాశం ఉంటుంది.ఇదీ చదవండి: ఎయిర్టెల్, జియో పరస్పరం విరుద్ధ వాదనలుస్కోర్ తెలుసుకోవడం ఎలా?క్రెడిట్ స్కోర్ లేదా సిబిల్ స్కోర్ తెలుసుకోవాలనుకుంటే ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. దానికోసం సిబిల్‌కు సంబందించిన అధికారక వెబ్సైట్ www.cibil.comలోకి వెళ్లాలి. ఆన్లైన్లో ఫారం పూర్తి చేయాలి. వ్యక్తిగత వివరాలు, పాన్ కార్డు, బ్యాంకుకు సంబందించిన వివరాలను ఇవ్వాలి. అన్ని వివరాలు ఇచ్చి సబ్మిట్ చేస్తే క్రెడిట్ రిపోర్ట్ మెయిల్ ద్వారా పంపిస్తారు. -
ఎస్బీఐలో అకౌంట్ ఉందా..?
న్యూఢిల్లీ: ఎలాంటి లావాదేవీలు లేకుండా ఇనాపరేటివ్‌గా మారిన ఖాతాలను పునరుద్ధరించేందుకు ఎస్బీఐ దేశవ్యాప్త ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. వరుసగా రెండేళ్ల పాటు ఎలాంటి లావాదేవీ లేని సేవింగ్స్, కరెంట్ ఖాతాలను ఇనాపరేటివ్‌గా (నిర్వహణలో లేని) బ్యాంకులు పరిగణిస్తుంటాయి. ఈ ఖాతాలను తిరిగి యాక్టివేట్ చేసుకోవాలంటే తాజా కేవైసీ పూర్తి చేయాలి.లావాదేవీల నిర్వహణతో ఖాతాలు ఇనాపరేటివ్‌గా మారకుండా చూసుకోవచ్చన్నది ఈ కార్యక్రమం ద్వారా తాము ఇచ్చే కీలక సందేశమని ఎస్బీఐ తెలిపింది. జన్‌ధన్ ఖాతాలను యాక్టివ్‌గా ఉంచడం, కస్టమర్లు నిరంతరం లావాదేవీలు నిర్వహించేలా చూసేందుకు మళ్లీ కేవైసీ చేయాల్సిన అవసరాన్ని ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి ప్రస్తావించారు. ఈ కార్యక్రమానికి ముందు ఎస్బీఐ తమ బిజినెస్ కరస్పాండెంట్లకు గురుగ్రామ్‌లో ఒక రోజు వర్క్‌షాప్ నిర్వహించింది. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (PMJDY) ఖాతాలపై ప్రత్యేక దృష్టి సారించి, ఇన్ ఆపరేటివ్ అకౌంట్ యాక్టివేషన్ ప్రాముఖ్యత గురించి పాల్గొనేవారికి అవగాహన కల్పించడంపై ఈ వర్క్‌షాప్ దృష్టి సారించింది. -
మీకు ఆర్థిక స్వేచ్ఛ ఉందా..?
సౌకర్యవంతమైన జీవితాన్ని గడిపేందుకు అవసరమైన డబ్బు సంపాదించడమే ఆర్థిక స్వేచ్ఛ అని చాలామంది భావిస్తుంటారు. కొందరు అప్పులు లేకుండా ఉండడమే ఆర్థిక స్వేచ్ఛగా పరిగణిస్తారు. ఇంకొందరు లక్షల రూపాయలు బ్యాంకు బ్యాలెన్స్ ఉండడమే ఆర్థిక స్వేచ్ఛగా భావిస్తారు. మంచి ఇల్లును సొంతం చేసుకోవడం, ఇంటి నుంచి బయటకు వెళితే ఖర్చుల గురించి ఆలోచించకుండా ఉండే డబ్బు.. ఇందంతా ఒకింత ఆర్థిక స్వేచ్ఛేనని నిపుణులు చెబుతున్నారు. అయితే వ్యక్తుల వ్యక్తిగత ఆదాయం, వయసు, జీవన శైలి, కోరికలు, అలవాట్లు ఇలా విభిన్న అంశాలపై ఆర్థిక స్వేచ్ఛ ఆధారపడుతుందని చెబుతున్నారు. మీరు ఆర్థికంగా ఏమేరకు స్వేచ్ఛగా ఉన్నారో నిత్యం బేరీజు వేసుకోవాలని సూచిస్తున్నారు.వీటిపై ఓ కన్నేయండి..ఆదాయంలో ఎలాంటి పెరుగుదల లేకుండా ఖర్చులు అధికమవుతుంటే మీరు ఆర్థిక స్వేచ్ఛకు దూరమవుతున్నారనే సంకేతాలు వస్తున్నట్లు గ్రహించాలి. నెలవారీ బడ్జెట్‌ను మించి చిన్న అత్యవసరం వచ్చినా తట్టుకోలేని పరిస్థితి ఉందంటే కచ్చితంగా ఆలోచించాల్సిందే. దీనివల్ల మీరు అనుకుంటున్న ఆర్థిక స్వేచ్ఛ కలగానే మిగిలిపోతుంది. ఇలాంటి సంకేతాలు వస్తున్న సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించి తిరిగి ఆర్థిక పరిస్థితిని గాడినపడేలా చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.అప్పులతో జాగ్రత్తప్రతి చిన్న కొనుగోలుకు అప్పు చేస్తుంటే మాత్రం పరిస్థితి దిగజారి పోతుందని గ్రహించాలి. అప్పులు ఉండకూడదు. ఒకవేళ తప్పని పరిస్థితిలో అప్పు చేయాల్సి వచ్చినా చాలా తక్కువగానే ఉండాలి. ప్రస్తుతకాలంలో ఈఎంఐ లేకుండా ఏదీ కొనుగోలు చేయలేకపోతున్నారు. అన్ని ఈఎంఐలు కలిపి ఆదాయంలో 30 శాతానికి మించకూడదు. బయట అప్పులు తీసుకొస్తే మాత్రం వెంటనే వాటిని తీర్చేయాలి. ఎందుకంటే అప్పు చెల్లింపులు జాప్యం చేస్తున్న కొద్దీ వడ్డీ భారం పెరుగుతుంది.అత్యవసర నిధి ఉందా..?ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఇంటి ఖర్చులు, అప్పుల వాయిదాలు, ఈఎంఐలు.. వంటి వాటిని భరించడం కష్టం. కాబట్టి ముందుగానే దాదాపు ఆరు నెలలకు సరిపడా ఖర్చులను అత్యవసర నిధిగా సమకూర్చుకోవాలి. ఒకేసారి పెద్ద మొత్తంలో దాచుకోవడం ఎవరికీ సాధ్యం కాకపోవచ్చు. కానీ, చిన్న మొత్తంతోనైనా ప్రారంభించి, అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకునే ప్రయత్నం సాగాలి.ఇదీ చదవండి: సినిమా టికెట్లు ఎందుకంత ఖరీదు..?కుటుంబానికి ఆర్థిక భరోసాప్రమాదం ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పలేం. మీ కుటుంబం మీపైనే ఆధారపడి ఉంటే మీ తదనంతరం వారికి ఆర్థిక భారం మోపకుండా మంచి టర్మ్పాలసీను ఎంచుకోవాలి. మీరులేని లోటును ఎవరూ మీ కుటుంబానికి తీర్చలేరు. కనీసం కొంతవరకు ఆర్థిక వెసులుబాటు కల్పించి రోడ్డునపడే పరిస్థితి రాకుండా ఉండాలంటే జీవితబీమా తప్పనిసరి. -
మిడ్‌క్యాప్‌లో మెరుగైన రాబడి
ఈక్విటీల్లో దీర్ఘకాలానికి పెట్టుబడులు పెట్టాలని భావించే వారు లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌కు పోర్ట్‌ఫోలియోలో చోటు కల్పించుకోవచ్చు. తమ రిస్క్, రాబడుల ఆకాంక్షలకు అనుగుణంగా ఏ విభాగానికి ఎంత కేటాయింపులన్నవి తేల్చుకోవాలి. లార్జ్‌క్యాప్‌తో పోల్చిచూసినప్పుడు కొంత రిస్క్ అధికంగా ఉన్నప్పటికీ 10–20 ఏళ్ల కాలంలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఫండ్స్ అధిక రాబడులు ఇవ్వగలవు. మిడ్‌క్యాప్ విభాగంలో మంచి పనితీరు చూపిస్తున్న వాటిల్లో కోటక్ ఎమర్జింగ్ ఈక్విటీస్ ఒకటి. దీర్ఘకాల లక్ష్యాల కోసం రిస్క్ భరించే సామర్థ్యం ఉన్నవారు ఈ పథకాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు. మిడ్క్యాప్తోపాటు లార్జ్‌క్యాప్ పెట్టుబడులకూ ఈ పథకం ప్రాధాన్యం ఇస్తుంటుంది.రాబడులు ఈ పథకం దీర్ఘకాల పనితీరును గమనించినట్టయితే రాబడులు మెరుగ్గా కనిపిస్తున్నాయి. ఏడాది కాలంలో ఈ పథకంలో రాబడులు 38 శాతానికి పైగా ఉన్నాయంటే పనితీరు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గడిచిన ఐదేళ్లలో 27 శాతం, ఏడేళ్లలో 18.47 శాతం, పదేళ్లలో 18.84 శాతం చొప్పున వార్షిక రాబడులను ఇచ్చి.. మిడ్‌క్యాప్ విభాగంలోని మెరుగైన పథకాల్లో ఒకటిగా నిలిచింది. ముఖ్యంగా ఏడాది, ఏడేళ్లు, పదేళ్ల కాలాల్లో బెంచ్‌మార్క్ సూచీ ‘బీఎస్ఈ 150 మిడ్‌క్యాప్ టీఆర్ఐ’ కంటే ఈ పథకం పనితీరే మెరుగ్గా ఉంది. 2007 మే నెలలో ఈ పథకం మొదలు కాగా, నాటి నుంచి చూస్తే వార్షిక సగటు రాబడి 15.75 శాతంగా ఉంది. ఈ పథకంలో ఇన్వెస్టర్ల నుంచి వసూలు చేసే చార్జీ (ఎక్స్పెన్స్ రేషియో) 1.43 శాతంగా ఉంది.పెట్టుబడుల విధానం కనీసం 65 శాతం నుంచి గరిష్టంగా 100 శాతం వరకు పెట్టుబడులను మిడ్‌క్యాప్ కంపెనీలకు కేటాయించడం ఈ పథకం పెట్టుబడుల విధానంలో భాగం. 2018, 2020 మార్కెట్ కరెక్షన్లలో ఈ పథకం నష్టాలను పరిమితం చేసింది. ఆ తర్వాతి ర్యాలీల్లో మెరుగైన రాబడులను ఇచ్చింది. వృద్ధికి అవకాశం ఉండి, అంతగా వెలుగులోకి రాని పటిష్టమైన కంపెనీలను గుర్తించి ఇన్వెస్ట్ చేస్తుంటుంది. పోర్ట్‌ఫోలియోలో వ్యాల్యూ స్టాక్స్‌కు ప్రాధాన్యం ఇస్తుంది. మంచి స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడమే కాదు.. తగిన రాబడులు ఇచ్చే వరకు ఆ పెట్టుబడులు కొనసాగిస్తుంటుంది.ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో 50,627 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇందులో 96 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసింది. డెట్ పెట్టుబడులు 0.21 శాతంగా ఉన్నాయి. నగదు, నగదు సమానాలు 3.7 శాతంగా ఉన్నాయి. ఈక్విటీల్లో 40 శాతం మేర లార్జ్‌క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసింది. 58 శాతం పెట్టుబడులను మిడ్‌క్యాప్‌లకు కేటాయించింది. స్మాల్‌క్యాప్ పెట్టుబడులు 1.44 శాతంగా ఉన్నాయి. పోర్ట్‌ఫోలియోలో 66 స్టాక్స్ ఉన్నాయి. ఇందులో టాప్–10 కంపెనీల్లో పెట్టుబడులు 29 శాతంగా ఉన్నాయి. పోర్ట్‌ఫోలియో కాన్సంట్రేషన్ తక్కువ అని అర్థమవుతోంది. పెట్టుబడుల పరంగా టెక్నాలజీ, మెటీరియల్స్, ఇండస్ట్రియల్స్, కన్జ్యూమర్ డిస్క్రీషినరీ, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. 78 శాతం పెట్టుబడులు ఈ రంగాల కంపెనీల్లోనే ఉన్నాయి.టాప్ ఈక్విటీ హోల్డింగ్స్కంపెనీ పెట్టుబడులు శాతంపర్సిస్టెంట్ సిస్టమ్స్ 4.16 ఒరాకిల్ ఫిన్ 3.51 ఎంఫసిస్ 3.31 ఒబెరాయ్ రియల్టీ 3.11 ఫోర్టిస్ హల్త్‌కేర్ 3.05 ఇప్కా ల్యాబ్ 3.01 కోరమాండల్ 2.49 పీఐ ఇండస్ట్రీస్ 2.39 సోలార్ ఇండస్ట్రీస్ 2.23 సుప్రీమ్ ఇండస్ట్రీస్ 2.19 -
సిప్‌తో మూడేళ్లలో రూ.10 లక్షలు.. సాధ్యమేనా?
డెట్ ఫండ్స్ ఈల్డ్ టు మెచ్యూరిటీ (వైటీఎం), యావరేజ్ మెచ్యూరిటీ అంటే ఏంటి? – చంద్ర గుణ శేఖర్డెట్ ఫండ్స్ విశ్లేషణకు వైటీఎం, యావరేజ్ మెచ్యూరిటీ రెండూ కీలక కొలమానాలు. ఫండ్ పనితీరు సామర్థ్యాలు, రిస్క్‌ను వీటి సాయంతో తెలుసుకోవచ్చు. వైటీఎం: మ్యూచువల్ ఫండ్ పథకం పోర్ట్‌ఫోలియోలో బాండ్లను గడువు తీరే వరకు కొనసాగిస్తే వచ్చే రాబడిని తెలియజేస్తుంది. ఉదాహరణకు ఒక డెట్ ఫండ్ వైటీఎం 8గా ఉంటే.. రాబడులు సుమారుగా ఆ స్థాయిలో ఉంటాయని అర్థం. కానీ, ఫండ్స్ పోర్ట్‌ఫోలియోలో మేనేజర్ చేసే మార్పులతో వాస్తవ రాబడులు వేరుగా ఉండొచ్చు. రోజువారీ ఎక్స్పెన్స్ రేషియో మినహాయింపులు, పెట్టుబడుల రాక, పోక ఇవన్నీ నికర రాబడులను ప్రభావితం చేస్తాయి. ఒక డెట్ ఫండ్‌లో ప్రస్తుత పోర్ట్‌ఫోలియో ప్రకారం ఎంత రాబడులు వస్తాయన్నది వైటీఎం తెలియజేస్తుంది. యావరేజ్ మెచ్యూరిటీ: ఫండ్ పోర్ట్‌ఫోలియోలో వివిధ బాండ్లు వివిధ కాలాలకు మెచ్యూరిటీ అవుతాయి. అన్ని బాండ్ల మెచ్యూరిటీల సగటు మెచ్యూరిటీని ఇది తెలియజేస్తుంది. ఉదాహరణకు ఒక పోర్ట్‌ఫోలియోలో రెండు బాండ్లు ఉండి, ఒకటి 10 ఏళ్లు, మరొకటి 5 ఏళ్లకు మెచ్యూరిటీ తీరుతుందని అనుకుందాం. అప్పుడు వీటి సగటు మెచ్యూరిటీ 7.5 ఏళ్లు అవుతుంది. ఫండ్ పోర్ట్‌ఫోలియో వడ్డీ రేట్ల సున్నితత్వాన్ని ఇది తెలియజేస్తుంది. యావరేజ్ మెచ్యూరిటీ ఎంత దీర్ఘకాలానికి ఉంటే అంతగా వడ్డీ రేట్ల మార్పుల ప్రభావం ఉంటుందని అర్థం చేసుకోవాలి. యావరేజ్ మెచ్యూరిటీ తక్కువగా ఉంటే ఈ ప్రభావం తక్కువ. వైటీఎం ద్వారా ఫండ్ సగటు రాబడిని, యావరేజ్ మెచ్యూరిటీ ద్వారా ఆ ఫండ్ పోర్ట్‌ఫోలియోపై వడ్డీ రేట్ల మార్పు ప్రభావం ఏ మేరకు ఉంటుందో తెలుసుకోవచ్చు. నా వయసు 35 ఏళ్లు. వచ్చే మూడేళ్లలో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా రూ.10 లక్షలు సమకూర్చుకోవాలని అనుకుంటున్నాను. లార్జ్‌క్యాప్ ఫండ్స్, ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్‌కు ఎక్కువ పెట్టుబడిని కేటాయించాలని అనుకుంటున్నాను. ఇవి ఎక్కువ రాబడులు ఇస్తాయని విన్నాను. నా లక్ష్యానికి ఇది మెరుగైన పెట్టుబడుల వ్యూహమేనా? – జిగ్నేష్మీ లక్ష్యం రాజీపడకూడనిది అయితే, కచ్చితంగా మూడేళ్లలో రూ.10లక్షలు రావాలని కోరుకుంటుంటే.. అందుకు ఈక్విటీ పెట్టుబడుల ఎంపిక సరైనది కాదు. 2000 సంవత్సరం నుంచి చారిత్రక రాబడుల గణాంకాలను పరిశీలిస్తే.. సెన్సెక్స్‌లో మూడేళ్ల సిప్ రాబడి మైనస్ 15 శాతంగా ఉంది. అందుకే స్వల్పకాలానికి ఈక్విటీ పెట్టుబడులు ఎంతో రిస్క్‌తో ఉంటాయి. స్వల్పకాలానికి సంబంధించి ముఖ్యమైన లక్ష్యాల విషయంలో భద్రతతో పాటు, స్థిరమైన రాబడులను ఇచ్చే సాధనాలనే పరిగణనలోకి తీసుకోవాలి. కనుక ఫిక్స్డ్ ఇన్కమ్ విభాగంలో షార్ట్ డ్యురేషన్ డెట్ ఫండ్స్‌ను మీరు పరిశీలించొచ్చు.వీటిల్లో ఎంతో స్థిరత్వం, ఊహించతగిన రాబడులు ఉంటాయి. దీంతో మీ పెట్టుబడులు మార్కెట్ అస్థిరతలకు గురికావు. ఒకవేళ మీ లక్ష్యంలో కొంత వెసులుబాటు ఉండి, రిస్క్ తీసుకునేట్టు అయితే అప్పుడు ఈక్విటీ పెట్టుబడులు పరిశీలించొచ్చు. అది కూడా కనీసం ఐదేళ్లు, అంతకుమించిన కాలానికే ఈక్విటీలు సూచనీయం. దీర్ఘకాలంలో సిప్ రాబడులు ప్రతికూలం నుంచి సానుకూలంలోకి మారి, సంపద సృష్టికి వీలు కల్పిస్తాయి. మార్కెట్ అస్థిరతలను అధిగమించి వృద్ధిని చూపించగలవు. -
పాన్ 2.0 ప్రాజెక్ట్ మంచిదే..
డిజిటల్ ప్రపంచంలో ప్రభంజనం.. మరో ముందడుగు. ఆదాయపు పన్ను శాఖవారు .. అత్యంత ముఖ్యమైనదైన.. అనువైనదైన.. అవసరమైనదైన అడుగువేశారు. ఇక నుంచి పాన్.. అంటే పర్మనెంట్ అకౌంట్ నంబరు, టాన్.. అంటే టాక్స్ నంబరుకి సంబంధించి అన్ని సర్వీసులు ఒకే గూటి కింద ఉంటాయి. వివిధ ప్లాట్‌ఫాంలకు వెళ్లడం ఉండదు.పాత పద్ధతికి స్వస్తి పలికారు. త్వరితగతి విధానం.. పేపర్ సహాయం లేకుండా ఉండటం, ఈ మార్పులన్నీ మనకు అనుగుణంగానే కాకుండా ఫ్రెండ్లీగా కూడా ఉంటాయి. పాన్‌కి దరఖాస్తు చేయడం, వాటిలో సమాచారం అప్డేట్ చేయడం, ఆధార్ కార్డుతో అనుసంధానం చేయడం .. ఈ మూడింటిని మూడు ప్లాట్‌ఫాంల మీద చేయాల్సి వచ్చేది. ఇకనుంచి మూడూ ఒకే ప్లాట్‌ఫాం మీద చేయొచ్చు. అదే.. పాన్ 2.0 ప్రాజెక్టు. వివరాల్లోకి వెళితే..» ఇక నుంచి పాన్, టాన్, రెండూ ఒకే ప్లాట్‌ఫాంలో ఉంటాయి » ఇది వరకులాగా మూడు ప్లాట్‌ఫాంలకు వెళ్లనక్కర్లేదు » అనేక వెబ్సైట్లను సందర్శించనక్కర్లేదు » కాలం వృధా కాదు .. శ్రమ తక్కువ » క్షణాల మీద వేలిడేషన్ జరుగుతుంది » సెక్యూరిటీ పెరుగుతుంది » మోసాలను తగ్గించవచ్చు » అన్ని సర్వీసులు ఉచితం » ఫిజికల్ కార్డు కావాలంటే రూ. 50 చెల్లించాలి » ఈ–పాన్‌ను మీ మెయిల్‌కి పంపుతారు. తక్షణం అందినట్లు లెక్క. లేటు ఉండదు. » వివిధ ఫిర్యాదులకు చెక్ పెట్టినట్లు అవుతుంది » యాక్సెసబిలిటీ .. అంటే .. అందుబాటులో ఉంటుంది » డాక్యుమెంట్లు అవసరం లేదు » ఈ–పాన్ వల్ల డూప్లికేట్ కార్డులను ఏరిపారేయొచ్చు » డూప్లికేట్ కార్డుల వల్ల జరిగే మోసాలను అరికట్టవచ్చు » ఈ–పాన్ ఇక నుంచి యూనివర్సల్ ఐడెంటిటీ కార్డుగా చలామణీ అవుతుంది » అటు అసెసీలకు, ఇటు వృత్తి నిపుణులకు శ్రమ తగ్గుతుంది. కాలం వృధా కాదు » సెంట్రలైజ్డ్, సింగిల్ విండో విధానం వల్ల ఫిర్యాదులను త్వరగా పరిష్కరించగలరుచివరగా ఇప్పుడున్న పద్ధతిలో డూప్లికేట్ కార్డుల వల్ల మోసాలు జరుగుతున్నాయి. రుణ సౌకర్యం, క్రెడిట్ కార్డులు పొందటం, ఒకే వ్యక్తి మరో వ్యక్తిగా చలామణీ అవడం.. వేరే అవతారమెత్తడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. పాన్, ఆధార్ కార్డు అనుసంధానం జరిగినప్పటికీ మోసాల వెల్లువ తగ్గలేదు.ఒక సమాచారం ప్రకారం.. 780 మిలియన్లు అంటే 78 కోట్ల మందికి పాన్ కార్డులున్నాయి. కానీ ఆధార్ కార్డులు దేశంలో 138 కోట్ల మందికి ఉన్నాయి. ఆధార్ కార్డున్న ప్రతి వ్యక్తి అసెస్సీ కానక్కర్లేదు. ఆదాయపు పన్ను పరిధిలోకి రానవసరం లేదు.. రారు. 78 కోట్ల మంది పాన్హోల్డర్లు ఆధార్ కార్డుతో అనుసంధానం అయితే మోసాలు తగ్గుతాయి. అయితే, ఇందులో డూప్లికేట్ కార్డులు ఎన్ని ఉన్నాయో అంచనా తెలీదు.కానీ చాలా ఏజెన్సీలు..ప్రకటనల ద్వారా ఊరించి.. యాప్‌ల ద్వారా జనాలను ఆకట్టుకుని మోసాలకు పాల్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో పాన్ 2.0 ప్రాజెక్టు మోసాలను అరికట్టేలా అడుగువేస్తుందని ఆశిద్దాం . మీరు వెంటనే అప్లై చేయనక్కర్లేదు. పాతవి కూడా కొత్త విధానంలో పని చేస్తాయి. మీరు ఆన్లైన్లో వెబ్సైట్ సెలెక్ట్ చేసుకుంటే కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతుంది ఈ–కార్డు.పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.comకు ఈ–మెయిల్ పంపించగలరు. -
ఆర్థిక లక్ష్యాన్ని చేరేదెలా..?
స్థిరమైన ఆదాయం చాలా మందికి ఒక ముఖ్యమైన ఆర్థిక లక్ష్యం. రిటైర్మెంట్ ప్రణాళిక కావొచ్చు. లేదా ప్యాసివ్ ఆదాయ మార్గం కోరుకోవచ్చు. అప్పటికే వస్తున్న ఆదాయాన్ని మరింత పెంచుకోవాలని అనుకోవచ్చు. క్రమం తప్పకుండా ఆదాయం వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికలో కీలక పాత్ర పోషిస్తుంది. జీవితానికీ స్థిరత్వాన్నిస్తుంది. ముందస్తు పింఛను ప్రణాళికలు లేని వారు రిటైర్మెంట్ తర్వాత క్రమం తప్పకుండా ఆదాయం వచ్చే మార్గాలను ఆశ్రయించాల్సిందే. ఉద్యోగం/వృత్తి/ వ్యాపారాల్లో ఉన్న వారు సైతం తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు ఆసక్తి చూపించొచ్చు. కొన్ని రకాల వృత్తుల్లో, వ్యాపారాల్లో ఉన్న వారికి ప్రతి నెలా స్థిరమైన ఆదాయం ఉండదు. ఈ తరహా వ్యక్తుల ముందు ఎన్నో పెట్టుబడి సాధనాలు అందుబాటులో ఉన్నాయి. రిస్క్, రాబడుల ఆధారంగా తమకు అనువైనవి ఎంపిక చేసుకోవడం ద్వారా తమ ఆర్థిక లక్ష్యాలను సులభంగా సాకారం చేసుకోవచ్చు. పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకం (ఎంఐఎస్) నెలవారీ ఆదాయం కోసం అందుబాటులోని డెట్ సాధనాల్లో ఇది కూడా ఒకటి. ఇందులో పెట్టుబడులకు నూరు శాతం భారత ప్రభుత్వం హామీ ఉంటుంది. కనుక పెట్టుబడులు, రాబడుల విషయంలో ఎలాంటి రిస్క్ ఉండదు. రిస్క్ వద్దనుకునే వారికి అనువైనది. ప్రస్తుతం ఇందులో పెట్టుబడిపై 7.4 శాతం వార్షిక రాబడి అందుబాటులో ఉంది. ఈ ప్రకారం రూ. లక్ష పెట్టుబడిపై ప్రతి నెలా రూ.616 ఆదాయంగా అందుతుంది. ఇందులో డిపాజిట్ కాల వ్యవధి ఐదేళ్లు. గడువు తీరిన తర్వాత మరో ఐదేళ్లకు తిరిగి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఒకరు గరిష్టంగా రూ.9,00,000 వరకు, ఉమ్మడిగా అయితే రూ.15,00,000 ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇందులో పెట్టుబడులకు, వడ్డీ రాబడికి ఎలాంటి పన్ను ప్రయోజనం లేదు. రాబడి పన్ను పరిధిలోకి వస్తుంది. తమ వార్షిక ఆదాయంలో చూపించి పన్ను చెల్లించాల్సిందే. 10 ఏళ్లు నిండిన మైనర్ పేరిట కూడా ఖాతా ప్రారంభించొచ్చు. నెలవారీ వడ్డీని పోస్టల్ సేవింగ్స్ ఖాతాలో జమ చేస్తారు. గడువు కంటే ముందే ఈ పథకం నుంచి వైదొలిగేట్టు అయితే కొంత నష్టపోవాల్సి వస్తుంది. డిపాజిట్ చేసిన ఏడాది నుంచి మూడేళ్లలోపు అయితే పెట్టుబడిలో 2 శాతం, మూడేళ్ల తర్వాత ఒక శాతాన్ని కోత విధిస్తారు. దీర్ఘకాల ప్రభుత్వ బాండ్లు (జీ–సెక్‌లు)5–40 ఏళ్ల కాలంతో ఇవి ఉంటాయి. వీటిపై ఆరు నెలలకు ఒకసారి వడ్డీ ఆదాయం పొందొచ్చు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వ్యయాల కోసం ఈ బాండ్ల ద్వారా నిధులు సమీకరిస్తాయి. వీటిల్లో రిస్క్ లేదనే చెప్పుకోవచ్చు. ఇన్వెస్టర్లు ఆర్బీఐ వద్ద రిటైల్ డైరెక్ట్ ఖాతాను ఉచితంగా తెరిచి, జీసెక్‌లలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ ఖాతా ద్వారా ప్రభుత్వ సెక్యూరిటీలను ప్రైమరీ, సెకండరీ మార్కెట్లో ఎలాంటి చార్జీలు లేకుండా కొనుగోలు చేసుకోవచ్చు. ప్రభుత్వ బాండ్లలో ఫిక్స్డ్, ఫ్లోటింగ్, ఇన్ఫ్లేషన్ ఇండెక్స్డ్ అని పలు రకాలున్నాయి. గడువు ముగిసే వరకు కొనసాగకుండా, మధ్యంతరంగా సెకండరీ మార్కెట్లో విక్రయించాలనుకుంటే అప్పటి వడ్డీ రేట్ల పరంగా చేతికి వచ్చే మొత్తంలో మార్పు ఉండొచ్చు. కేంద్ర ప్రభుత్వం ట్రెజరీ బిల్లులు, డేటెడ్ సెక్యూరిటీలు (జీ–సెక్‌లు) జారీ చేస్తుంటుంది. ఇందులో ట్రెజరీ బిల్లులు అన్నవి 91 రోజులు, 182 రోజులు, 364 రోజుల వ్యవధితో వస్తాయి. వీటిల్లో వడ్డీ చెల్లింపులు ఉండవు. కూపన్ రేటు మేర ముందే ముఖ విలువలో తగ్గించి తీసుకుంటారు. కనుక ఇన్వెస్టర్లు జీసెక్‌లను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీలు జారీ చేస్తుంటాయి.యాన్యుటీ ప్లాన్లుపెట్టుబడిపై మరుసటి నెల నుంచే ఆదాయాన్నిచ్చే ‘ఇమీడియెట్ యాన్యుటీ ప్లాన్’లను జీవిత బీమా కంపెనీలు ఆఫర్ చేస్తుంటాయి. ఎల్ఐసీ నుంచి జీవన్ శాంతి, జీవన్ అక్షయ్ ఇవే తరహా ప్లాన్లు. ఇన్వెస్టర్ల అవసరాలకు అనుగుణంగా ఈ ప్లాన్లలో ఎన్నో ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఎంపిక చేసుకున్న కాలం వరకు స్థిరమైన రాబడులు ఇందులో వస్తాయి. వడ్డీ రేట్లలో అస్థిరతల ప్రభావం వీటి రాబడిపై ఉండవు. నెలవారీ, త్రైమాసికం, ఆరు నెలలు, ఏడాదికోసారి ఆదాయం వచ్చే ఆప్షన్లలో ఒకదాన్ని ఎంపిక చేసుకోవచ్చు. జీవితకాలానికి ఈ యాన్యుటీ ప్లాన్లను తీసుకోవచ్చు. మరణానంతరం పెట్టుబడిని నామీనికి అందిస్తారు. వీటికి పన్ను పరమైన ప్రయోజనాలు లేవు. ఈ ప్లాన్ల నుంచి అందుకునే రాబడిపై 1.8 శాతం జీఎస్టీ చెల్లించాలి. ఈ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్లు అని కూడా ఉంటాయి. అవి ఏక మొత్తంలో ఇన్వెస్ట్ చేసిన వెంటనే కాకుండా.. నిరీ్ణత కాలం తర్వాత నుంచి క్రమం తప్పకుండా చెల్లింపులు చేసేవి.సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్)60 ఏళ్లు నిండిన వారికే ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవడానికి అనుమతి ఉంది. పదవీ విరమణ తర్వాత ఆదాయం కోరుకునే వారు ఈ పథకాన్ని పరిశీలించొచ్చు. ఇందులో ఒకరు రూ.30లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దంపతులు అయితే ఉమ్మడిగా రూ.60 లక్షలు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పథకం కాల వ్యవధి ఐదేళ్లు. దీనిపై 8.2 శాతం వడ్డీ లభిస్తుంది. అన్ని పోస్టాఫీసుల్లోనూ, కొన్ని బ్యాంక్ శాఖల్లో ఎస్సీఎస్ఎస్ ఖాతా తెరవొచ్చు. ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ చెల్లిస్తారు. ఇది ఆదాయపన్ను పరిధిలోకి వస్తుంది. ఇందులో చేసే పెట్టుబడిపై అదే ఆర్థిక సంవత్సరంలో సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనం మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. వడ్డీ రాబడిని ఏ ఏడాదికి ఆ ఏడాదే పన్ను రిటర్నుల్లో చూపించాల్సి ఉంటుంది. ఆదాయ శ్లాబుకు అనుగుణంగా పన్ను రేటు చెల్లించాల్సి వస్తుంది. ముందస్తు పదవీ విరమణ తీసుకున్న వారికి కనీస వయోపరిమితి 55 ఏళ్లుగా ఉంది. రక్షణ దళాల్లో పనిచేసిన మాజీ ఉద్యోగులు 50 ఏళ్లకే ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీలు)బ్యాంకుల్లో దీర్ఘకాల డిపాజిట్లపై వడ్డీ 7–9 శాతం మధ్య ఉంది. ప్రముఖ బ్యాంకుల్లో ఇది 7–8 శాతం మధ్య ఉంటే, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు కొంచెం అదనంగా ఆఫర్ చేస్తున్నాయి. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ (నాన్ క్యుములేటివ్)లపై ప్రతి నెలా వడ్డీ చెల్లింపులు లభిస్తాయి. కాకపోతే మరీ దీర్ఘకాలానికి (పదేళ్లకు మించిన) డిపాజిట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. పైగా ఎలాంటి పన్ను ప్రయోజనం లేదు. వడ్డీ రాబడి ఆదాయ పన్ను పరిధిలోకి వస్తుంది. రిస్క్ పరంగా చూస్తే.. బ్యాంక్ ఎఫ్డీలకు ఆర్బీఐ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద రక్షణ ఉంటుంది. బ్యాంక్ సంక్షోభంలో పడితే ఒక బ్యాంక్ పరిధిలో ఒక ఖాతాదారు పేరిట ఎంత డిపాజిట్ ఉన్నప్పటికీ గరిష్టంగా రూ.5లక్షల వరకు వెనక్కి వస్తుంది. కనుక ఒక బ్యాంక్ పరిధిలో (ఎన్ని శాఖలైనా) రూ.5లక్షలే డిపాజిట్ చేసుకోవడం తెలివైన నిర్ణయం.మంత్లీ ఇన్కమ్ ప్లాన్లుమ్యూచువల్ ఫండ్స్ సంస్థలు మంత్లీ ఇన్కమ్ ప్లాన్లను (ఎంఐపీలు) ఆఫర్ చేస్తుంటాయి. ప్రధానంగా డెట్ సెక్యూరిటీల్లో, స్వల్పంగా (10–20శాతం) ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఇన్వెస్టర్లకు స్థిరాదాయాన్ని అందిస్తాయి. వీటిల్లో రాబడులకు ఎలాంటి హామీ ఉండదు. స్థిరంగానూ ఉండవు. మార్కెట్ ఆధారితంగా రాబడులు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో రాబడులు మరీ తగ్గొచ్చు. వీటిల్లో రిస్క్ తక్కువ. లిక్విడిటీ ఎక్కువ. ఎప్పుడు అవసరమైతే అప్పుడు పెట్టుబడిని వెనక్కి తీసుకోవచ్చు.కార్పొరేట్ డిపాజిట్లునాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్బీఎఫ్సీ)లు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు (హెచ్ఎఫ్సీలు) తమ డిపాజిట్ల ద్వారా నిధులు సమీకరిస్తుంటాయి. ఈ తరహా కార్పొరేట్ ఫిక్స్డ్ డిపాజిట్ల(నాన్ క్యుములేటివ్)లో ఇన్వెస్ట్ చేసుకుని, వీటి నుంచి నెలవారీ/మూడు నెలలు/ఆరు నెలలు/ఏడాదికి ఒకసారి చొప్పున ఆదాయం తీసుకునే వెసులుబాటు ఉంది. వీటిని బ్యాంక్ డిపాజిట్లతో పోల్చి చూడొచ్చు. బ్యాంకుల్లో రూ. 5 లక్షల వరకు డిపాజిట్లకు రక్షణ ఉంటుంది. కానీ కార్పొరేట్ డిపాజిట్లలో ఎలాంటి హామీ ఉండదు. కనుక రిస్క్ తగ్గించుకునేందుకు ఏఏఏ రేటెడ్, ఏఏ మైనస్ రేటెడ్ డిపాజిట్లను ఎంపిక చేసుకోవచ్చు. సంబంధిత ఆర్థిక సంస్థ గత చరిత్రను ఇన్వెస్ట్ చేసే ముందు పరిశీలించాలి. బ్యాంక్ ఎఫ్‌డీల కంటే కాస్త అధిక రాబడులు వీటిల్లో ఉంటాయి. వడ్డీ ఆదాయానికి ఎలాంటి పన్ను ప్రయోజనాల్లేవు. ఉదాహరణకు బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ సంస్థలు డిపాజిట్లపై నిధులు సమీకరిస్తుంటాయి. ఇవి మెరుగైన రేటింగ్ కలిగిన సంస్థలు.సిస్టమ్యాటిక్ విత్ డ్రాయల్ ప్లాన్లు (ఎస్‌డబ్ల్యూపీ)ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్)లు గురించి తెలిసే ఉంటుంది. ఎంపిక చేసుకున్న పథకాల్లో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేసుకునేందుకు వీలు కలి్పంచేదే సిప్. దీనికి విరుద్ధంగా ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసి క్రమంగా కొంత చొప్పున ఉపసంహరించుకోవడమే ఎస్‌డబ్యూపీ. ఎంత మేర ఉపసంహరించుకోవాలన్నది ఇన్వెస్టర్ అభీష్టమే. తమ వద్దనున్న మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసుకునేందుకు అనువైన ఫండ్స్‌ను ముందుగా ఎంపిక చేసుకోవాలి. అందులో ఏకమొత్తంలో కాకుండా, ఆరు నుంచి 12 నెలల సమాన వాయిదాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల కొనుగోలు సగటుగా మారుతుంది. ఆ తర్వాత నుంచి ప్రతి నెలా నిరీ్ణత శాతం మేర ఎస్‌డబ్ల్యూపీ ద్వారా ఉపసంహరించుకోవచ్చు. రాబడుల కంటే మూడు శాతం తక్కువ ఉపసంహరణకు పరిమితం కావాలి. దీనివల్ల ఈ మూడు శాతం తిరిగి పెట్టుబడి వృద్ధికి దోహదపడుతుంది. దీంతో ద్రవ్యోల్బణ ప్రభావాన్ని అధిగమించేందుకు వీలుంటుంది. మోతీలాల్ ఓస్వాల్ అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అఖిల్ చతుర్వేది సూచన ప్రకారం.. ఈక్విటీల్లో 65 శాతం, డెట్‌కు 35 శాతం కేటాయించే అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ లేదా ఈక్విటీలకు 60 శాతం, డెట్‌కు 40 శాతం కేటాయించే బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. వీటిల్లో దీర్ఘకాలంలో రాబడులు 12–13 శాతం మేర ఉంటాయి. కనుక ఉపసంహరణ 6–9 శాతం మించకూడదు. ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు. ఇవి అయితే ఈక్విటీ కేటాయింపులను 35 శాతానికే పరిమితం చేసి మిగిలిన మొత్తాన్ని డెట్‌కు కేటాయిస్తాయి. వీటిల్లో దీర్ఘకాల రాబడి 9–10 శాతం మేర ఉంటుంది. కనుక 6 శాతం ఉపసంహరణకు పరిమితం కావాలి. ఇవే ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసి, డివిడెండ్ ఆప్షన్ ఎంపిక చేసుకున్నా సరిపోతుంది. కానీ, డివిడెండ్ ఎప్పుడు ప్రకటించాలన్నది ఫండ్స్ సంస్థల అభీష్టం. అందుకే ఎస్‌డబ్ల్యూపీ మెరుగైన ఆప్షన్ అవుతుంది. వీటిల్లో పెట్టుబడులకు ఎలాంటి పన్ను ప్రయోజనం లేదు. కానీ, ఏడాదిలోపు విక్రయించిన పెట్టుబడులకు సంబంధించి లాభంపై 20 శాతం పన్ను, ఏడాది మించిన పెట్టుబడులు విక్రయించగా వచి్చన లాభంపై మొదటి రూ.1.25 లక్షల తర్వాతి మొత్తంపై 12.5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. బాండ్ ల్యాడర్ పోర్ట్‌ఫోలియో వివిధ కాల వ్యవధులతో బాండ్లను కొనుగోలు చేయడం. అంటే ఒక్కో బాండ్ మెచ్యూరిటీ ఒకే తేదీతో కాకుండా, వరుస క్రమంలో ఉండేలా చూసుకోవాలి. ఉదాహరణకు ఏడాది కాలానికి ఒకటి తీసుకుంటే, 13 నెలలు, 14 నెలలు, 15 నెలలు ఇలా అనమాట. గడువు తీరి చేతికి వచి్చన ప్రతి బాండ్ మెచ్యూరిటీ మొత్తంలో అసలుతో తిరిగి బాండ్ కొనుగోలు చేయాలి. వడ్డీ భాగాన్ని ఆదాయం కింద వినియోగించుకోవాలి. పీర్ టు పీర్ (పీ2పీ) లెండింగ్ పీ2పీ ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్‌లు ప్రత్యేకంగా ఉన్నాయి. ఇవి రుణం కావాల్సిన వారిని, అదే సమయంలో రుణంపై ఆదాయం కోరుకునే వారిని ఒకే వేదికగా కలుపుతాయి. బాండ్లు, ఎఫ్‌డీల కంటే పీ2పీ ప్లాట్‌ఫామ్‌లు ఎక్కువ రాబడికి మార్గం చూపుతాయి. కాకపోతే రుణం తీసుకునే వ్యక్తికి సంబందించి ఆర్థిక చరిత్ర ఈ సంస్థలకు పెద్దగా తెలియదు. కనుక రుణ ఎగవేతల రిస్క్ వీటిల్లో ఉంటుంది. వడ్డీ ఆదాయంలో కొంత పంచుకునేట్టు అయితే పీ2పీ సంస్థలు రుణం వసూలు బాధ్యతను తీసుకుంటున్నాయి. వీటిని గమనించాలి..→ నెలవారీ లేదా త్రైమాసికంవారీ స్థిరమైన ఆదాయానికి వీలుగా పెట్టుబడి సాధనం ఎంపికలో ఎంతో ఆచితూచి వ్యవహరించాలి. అందరికీ అన్నీ అనుకూలంగా ఉండవు. పెట్టుబడికి అందుబాటులో ఉన్న నిధి, వాటిపై ఆశిస్తున్న రాబడి, ఎంత రిస్క్ తీసుకోగలరు? ఇలాంటివన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. తమ ఆకాంక్షలకు సరిపోలే ఉత్పత్తిని ఎంపిక చేసుకోవాలి. పెట్టుబడుల వృద్ధికి, పెట్టుబడిపై స్థిరమైన రాబడికి మధ్య వ్యత్యాసం ఉంది. స్పష్టత తెచ్చుకోలేకపోతే ఈ విషయంలో నిపుణుల సాయం తీసుకోవడానికి వెనుకాడొద్దు. → రాబడిపై పన్ను బాధ్యతను తప్పకుండా గుర్తించాలి. పన్ను పోను నికర రాబడి ఎంతన్నది చూడాలి. తమ పెట్టుబడుల కాల వ్యవధికి అనుకూలమైన ఉత్పత్తిని ఎంపిక చేసుకోవాలి. → పెట్టుబడి మొత్తాన్ని ఏదో ఒక సాధనంలో కాకుండా, ఒకటికి మించిన సాధనాల మధ్య వైవిధ్యం చేసుకోవడాన్ని పరిశీలించాలి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
బీమా ప్రీమియంపై జీఎస్టీ మినహాయింపు?
బీమా ప్రీమియంపై జీఎస్టీ తొలగించడంతోపాటు బీమా కంపెనీల్లో విదేశీ పెట్టుబడులను పెంచకూడదని ప్రచార కార్యక్రమాలు సాగనున్నాయి. ఈమేరకు దేశవ్యాప్తంగా జీవిత బీమా ఉద్యోగుల సంఘం ప్రచార కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల పార్లమెంటు సభ్యులను కలిసి తమ డిమాండ్లకు మద్దతు ఇవ్వాలని కోరబోతున్నట్లు ఆల్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ వి.నరసింహన్ పేర్కొన్నారు.బీమా ప్రీమియంపై జీఎస్టీ మినహాయింపు, బీమా కంపెనీల్లో ఎఫ్‌డీఐ పెట్టుబడుల పరిమితులను కట్టడి చేయాలనే డిమాండ్‌తోపాటు కొత్త కార్మిక విధానాల (న్యూ లేబర్ కోడ్) ఉపసంహరణకు మద్దతు ఇవ్వాలని కోరనున్నట్లు నరసింహన్ చెప్పారు. 2010 తర్వాత నియమితులైన ఉద్యోగులకు కొత్త పింఛన్ విధానం అమలవుతోంది. దాంతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. ఆ ఉద్యోగులకు పాత పింఛన్ విధానం వర్తింపజేయాలనే డిమాండ్లను కూడా లేవనెత్తనున్నట్లు తెలిపారు.ఇదీ చదవండి: జీడీపీ మందగమనంబీమా ప్రీమియంపై జీఎస్టీ తగ్గిస్తే ఆ మేరకు ప్రీమియం రేట్లు దిగొస్తాయి. ఇది కోట్లాది మంది పాలసీదారులకు ఉపశమనాన్ని కల్పించనుంది. జీఎస్టీకి ముందు బీమా పాలసీల ప్రీమియంపై 12% సర్వీస్ ట్యాక్స్ వసూలు చేసేవారు. ప్రస్తుతం టర్మ్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ల ప్రీమియంపై 18 శాతం జీఎస్టీ అమలవుతోంది. ప్రీమియంపై ట్యాక్స్ మినహాయించాలనే డిమాండ్ ఉంది. ప్రస్తుతం బీమా రంగంలో 74 శాతం వరకు ఎఫ్డీఐకు అనుమతి ఉంది. దీన్ని 100 శాతానికి పెంచే అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇదే జరిగితే దేశీయ బీమా రంగంపై విదేశీ ఇన్వెస్టర్ల విధానాలు అమలవుతాయి. దాంతో తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
EPFO Update: ఆధార్ లేకుండానే ఈపీఎఫ్ క్లెయిమ్!
కొంత మంది ఉద్యోగులకు పెద్ద ఊరటనిస్తూ ఫిజికల్ క్లెయిమ్‌లను సెటిల్ చేయడానికి ఇకపై తమ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)తో ఆధార్‌ను లింక్ చేయాల్సిన అవసరం లేదని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) ప్రకటించింది. ఇటీవలి సర్క్యులర్‌లో పేర్కొన్న కొత్తగా సవరించిన విధానంలో భాగంగా ఈ మార్పు చేసింది.అయితే మినహాయింపు అందరికీ కాదు. భారతదేశంలో తమ అసైన్మెంట్ పూర్తి చేసి, ఆధార్ పొందకుండా స్వదేశానికి తిరిగి వెళ్లిన అంతర్జాతీయ వర్కర్లు, విదేశాలకు వలస వెళ్లి, అక్కడి పౌరసత్వం పొందిన ఆధార్ లేని భారతీయులకు ఈ మినహాయింపు వర్తిస్తుంది. అలాగే ఈపీఎఫ్&ఎంపీ చట్టం ప్రకారం "ఉద్యోగులు"గా అర్హత పొంది ఆధార్ లేకుండా భారత్ వెలుపల నివసిస్తున్న నేపాలీ, భూటాన్ పౌరులు కూడా మినహాయింపును వినియోగించుకోవచ్చు. ఇదీ చదవండి: EPFO 3.0: భారీ సంస్కరణలు.. అధికంగా పీఎఫ్ సొమ్ము!వీరంతా ఆధార్ స్థానంలో పాస్‌పోర్ట్‌లు లేదా పౌరసత్వ గుర్తింపు ధ్రువీకరణ పత్రాలు వంటి పత్రాలను ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రాలుగా ఉపయోగించవచ్చు. "డ్యూ డిలిజెన్స్" ప్రక్రియలో భాగంగా, మినహాయింపులు క్లెయిమ్ చేస్తున్న ఉద్యోగుల బ్యాంక్ ఖాతాలను తనిఖీ చేయాలని, పీఎఫ్ ఖాతా బ్యాలెన్స్ రూ. 5 లక్షలకు మించి ఉంటే సంబంధిత యాజమాన్యాలతో వివరాలను ధ్రువీకరించాలని ఈపీఎఫ్‌వో అధికారులకు సూచించింది. సెటిల్మెంట్ సొమ్మును నెఫ్ట్ ద్వారానే బదిలీ చేయనున్నట్లు పేర్కొంది. -
ఐటీ రిటర్న్స్ దాఖలు గడువు పెంపు
న్యూఢిల్లీ: 2023–24 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు గడువును డిసెంబర్ 15 వరకు పొడిగిస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) ఉత్తర్వులు వెలువరించింది.2024–25 అసెస్మెంట్ సంవత్సరానికిగాను నవంబర్ 30 వరకు ఉన్న గడువును 15 రోజులు పొడిగించింది. అంతర్జాతీయ లావాదేవీలు, సెక్షన్ 92ఈ కింద నివేదికలను సమర్పించాల్సిన పన్ను చెల్లింపుదారుల కోసం సీబీడీటీ ఈ వెసులుబాటు కల్పించింది.CBDT Extends Due Date for furnishing Return of Income for Assessment Year 2024-25.➡️The due date for the assessees referred to in clause (aa) of Explanation 2 to Sub Section (1) of Section 139 has been extended from 30th November, 2024, to 15th December, 2024.➡️ Circular No.… pic.twitter.com/4umO91ELAQ— Income Tax India (@IncomeTaxIndia) November 30, 2024 -
రేపటి నుంచి ఇవన్నీ మారుతాయి: తప్పక తెలుసుకోండి
నవంబర్ నెల ముగిసింది. రేపటి (డిసెంబర్ 1) నుంచి ప్రజల జీవితాలపై ప్రభావం చూపే కొన్ని అంశాలలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ మార్పులు ఎల్పీజీ ధరలు, ఏటీఎం కార్డు, పాన్ ఆధార్ లింక్, పెట్రోల్ ధరలు వంటి వాటిమీద ప్రభావం చూపుతాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఎల్పీజీ ధరలుప్రతి నెల మాదిరిగానే ఆయిల్ మార్కెట్ కంపెనీలు 1వ తేదీ ఎల్పీజీ సిలిండర్ (కమర్షియల్, డొమెస్టిక్) ధరలను సవరిస్తాయి. ప్రతి నెలలోనూ కమర్షియల్ సిలిండర్ ధరలలో మాత్రమే మార్పులు జరుగుతున్నాయి. డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎటువంటి మార్పు లేదు. డిసెంబర్ 1న జరిగే మార్పులు కూడా బహుశా మునుపటి మాదిరిగానే ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము.TRAI గడువుడిసెంబర్ 1, 2024న.. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) స్పామ్ & ఫిషింగ్ సందేశాలను తగ్గించే లక్ష్యంతో కొత్త ట్రేస్బిలిటీ నిబంధనలను అమలు చేస్తుంది. ఈ నిబంధనలు ఓటీపీ సేవలను తాత్కాలికంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత ఓటీపీ డెలివరీలలో ఆలస్యం ఉండదని ట్రాయ్ ధృవీకరించింది.SBI క్రెడిట్ కార్డ్డిసెంబర్ 1 నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డ్ వినియోగదారులు.. డిజిటల్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లకు సంబంధించిన లావాదేవీలపై రివార్డ్ పాయింట్లను పొందలేరు.ఆధార్ కార్డ్ ఉచిత అప్‌డేట్ఆధార్ వివరాలకు ఉచిత అప్డేట్ చేసుకోవడానికి గడువును భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) పొడిగించింది. కాబట్టి కార్డ్ హోల్డర్లు ఇప్పుడు డిసెంబరు 14 వరకు ఆన్లైన్ ప్రాసెస్ ద్వారా ఎటువంటి ఛార్జీలు లేకుండా తమ పేరు, చిరునామా లేదా పుట్టిన తేదీని అప్డేట్ చేసుకోవచ్చు. డిసెంబర్ 14 తర్వాత.. ఆధార్ కార్డులో ఏదైనా మార్పులు చేయాలనంటే ప్రాసెసింగ్ ఫీజు ఉండే అవకాశం ఉంది.ఆలస్యంగా ఐటీఆర్ దాఖలుజూలై 31 గడువులోగా 2023-24 (FY 24) ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్న్‌లను (ITR) ఫైల్ చేయడంలో విఫలమైన వ్యక్తులు.. డిసెంబర్‌లోగా తమ ITRని సమర్పించే అవకాశం ఉంది. ప్రారంభ గడువును కోల్పోయిన వారు ఇప్పుడు డిసెంబర్ 31 వరకు అపరాధ రుసుముతో ఆలస్యంగా ITRని ఫైల్ చేయవచ్చు. -
ఈపీఎఫ్ఓ క్లెయిమ్ తిరస్కరించారా? ఇవి తెలుసుకోండి!
ఉద్యోగ భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) క్లెయిమ్‌లు గత కొంతకాలంగా ఎక్కువగా తిరస్కరణకు గురవుతున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. ఈపీఎఫ్ఓ వార్షిక నివేదిక ప్రకారం 2023లో దాదాపు ఆరు కోట్ల ఉపసంహరణ దరఖాస్తులు నమోదైతే అందులో సుమారు 27 శాతం తిరస్కరణకు గురయ్యాయి. అయితే క్లెయిమ్ రెజక్ట్ అయ్యేందుకు చాలా కారణాలున్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు.వ్యక్తిగత వివరాలు సరిగా లేకపోవడం: క్లెయిమ్ ఫారం, ఈపీఎఫ్ఓ రికార్డుల్లో ఉద్యోగి పేరు, పుట్టిన తేదీ, ఇతర వ్యక్తిగత సమాచారంలో తేడా ఉండడం వల్ల క్లెయిమ్ తిరస్కరించబడుతుంది.కేవైసీ పూర్తి చేయకపోవడం: ఆధార్, పాన్ లేదా బ్యాంక్ వెరిఫికేషన్ వంటి వాటిలో కేవైసీని అప్డేట్ చేయాలి. లేదంటే క్లెయిమ్ నిలిపేసే అవకాశం ఉంటుంది.తప్పుడు బ్యాంకు వివరాలు: బ్యాంకు ఖాతా నంబర్ లేదా ఐఎప్ఎస్సీ కోడ్‌లో తప్పుల వల్ల క్లెయిమ్‌ను తిరస్కరించవచ్చు.యూఏఎన్: ఇన్ యాక్టివ్ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్)తో క్లెయిమ్ నమోదు చేస్తే రెజెక్ట్ అవుతుంది.తగినంత బ్యాలెన్స్ లేకపోవడం: క్లెయిమ్ చేసిన మొత్తాన్ని కవర్ చేయడానికి ఈపీఎఫ్ ఖాతాలో తగినంత బ్యాలెన్స్ లేకపోతే క్లెయిమ్ ఇవ్వరు.పెండింగ్ బకాయిలు: ఈపీఎఫ్ఓకు చెల్లించాల్సిన బకాయిలు క్లియర్ అయ్యే వరకు క్లెయిమ్ అందించరు. కొన్నిసార్లు యాజమాన్యం చెల్లించాల్సిన ఈపీఎఫ్ఓ కాంట్రిబ్యూషన్‌ను జమ చేయడం ఆలస్య అవుతుంది. అలాంటి సందర్భాల్లో క్లెయిమ్ రాదు.కొన్నిసార్లు సాంకేతిక సమస్యలు, నిబంధనల ప్రకారం సర్వీసు లేకుండానే దరఖాస్తు చేస్తుండడం వంటి కారణాల వల్ల క్లెయిమ్ తిరస్కరించే అవకాశం ఉంది. -
ఆరోగ్య బీమా.. పాలసీ సంస్థ మారుతున్నారా?
మారుతున్న ఆహార అలవాట్లు, జీవనశైలి వల్ల ఆరోగ్య పరిస్థితి దిగజారిపోతోంది. ఆసుపత్రుల్లో వైద్య ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. దాంతో చాలా మంది ఆరోగ్య బీమాను ఎంచుకుంటున్నారు. అయితే ఎప్పుడో తీసుకున్న ఆరోగ్య బీమా పాలసీ ప్రస్తుతం మారుతున్న విధానాలకు అనుగుణంగా లేకపోవచ్చు. మార్కెట్లో పోటీ నెలకొని ఇతర కంపెనీలు తక్కువ ప్రీమియంతో మరింత మెరుగైనా సదుపాయాలుండే పాలసీని అందిస్తుండవచ్చు. అలాంటి సందర్భంలో పాలసీను రద్దు చేసుకోకుండా ‘పోర్టబిలిటీ’ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. దీనివల్ల పాలసీను వేరే కంపెనీకి మార్చుకోవచ్చు. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.ఇన్సూరెన్స్ కంపెనీల మధ్య పోటీని పెంచడానికి, పాలసీదారులకు మెరుగైన సేవలను అందించడానికి భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ‘పోర్టబిలిటీ’ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అంటే వెయిటింగ్ పీరియడ్‌ను పరిగణనలోకి తీసుకుని ఆరోగ్య బీమా పాలసీని ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మార్చుకోవచ్చు.ప్రస్తుత పాలసీ నిబంధనలు, షరతులు మీ అంచనాలకు అనుగుణంగా లేనప్పుడు పోర్ట్‌కు ప్రయత్నించాలి.పాలసీ చెల్లించే విలువ తక్కువగా ఉంటూ, ప్రీమియం అధికంగా ఉన్నప్పుడు పోర్ట్‌ను పరిశీలించవచ్చు. అయితే అందులో అధిక క్లెయిమ్ ఇచ్చే సంస్థలను ఎంచుకుంటే ఉత్తమం.స్థానిక ఆసుపత్రులు బీమా సంస్థ నెట్వర్క్ కవరేజ్ జాబితాలో లేనప్పుడు ఈ విధానాన్ని పరిశీలించాలి.ప్రస్తుతం పాలసీ ఉన్న బీమా సంస్థను మార్చుకోవాలని నిర్ణయించుకుంటే పాలసీ రెన్యువల్ చేయడానికి 45 రోజుల ముందే అవసరమైన చర్యలు ప్రారంభించాలి.ప్రస్తుతం చాలా సంస్థలు రెన్యువల్‌కు ఒక రోజు ముందు, పాలసీ గడువు ముగిసిన 15-30 రోజుల వరకూ పోర్ట్ చేసుకునేందుకు అనుమతిస్తున్నాయి.పోర్ట్ చేయాలని నిర్ణయించుకున్నప్పుడు వీలైనంత తొందరగా ఆ ప్రక్రియను పూర్తి చేయడమే మేలు.తీరా పాలసీ పునరుద్ధరణ గడువు ముగిసిన తర్వాత కొత్త సంస్థ పాలసీని ఇవ్వలేమంటే ఇబ్బందులు ఎదురవుతాయి.గమనించాల్సినవి..పాలసీని పోర్ట్ పెట్టాలనుకున్నప్పుడు ప్రధానంగా బీమా మొత్తంపై సరైన అవగాహన కలిగి ఉండాలి. ఉదాహరణకు మీకు ఒక బీమా సంస్థలో రూ.5లక్షల పాలసీ ఉందనుకుందాం. బోనస్‌తో కలిపి ఈ మొత్తం రూ.7.50లక్షలు అయ్యింది. కొత్త బీమా సంస్థకు మారి, రూ.10 లక్షల పాలసీ తీసుకున్నారనుకుందాం. అప్పుడు కొత్త సంస్థ రూ.7.5 లక్షల వరకే పాత పాలసీగా భావిస్తుంది. మిగతా రూ.2.5 లక్షలను కొత్త పాలసీగానే పరిగణిస్తుంది. ఈ మొత్తానికి సంస్థ నిబంధనల మేరకు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. దీనికి ఇతర షరతులూ వర్తిస్తాయి.ఇదీ చదవండి: 13 ఏళ్లలో రూ.75 లక్షలు సమకూరే ప్లాన్వివరాలు అన్నీ తెలపాలి..కొత్త సంస్థకు మారేటప్పుడు ఇప్పటికే ఉన్న పాలసీలో మీరు చేసిన క్లెయిమ్ వివరాలు స్పష్టంగా చెప్పాలి. ఆరోగ్యం, ఇప్పటికే తీసుకున్న చికిత్సల గురించీ వివరించాలి. పాలసీ ఇవ్వరు అనే ఆలోచనతో చాలామంది ఇవన్నీ చెప్పరు. కానీ, పాలసీ వచ్చిన తర్వాత ఇవి బయటపడితే పరిహారం లభించదు. -
13 ఏళ్లలో రూ.75 లక్షలు సమకూరే ప్లాన్
మా అమ్మాయికి మంచి విద్య అందించాలనుంది. ప్రస్తుతం రూ.లక్షల్లో ఫీజులున్నాయి. తన వయసు ఇప్పుడు 10 ఏళ్లు. తన పేరుమీద నెలకు రూ.20వేల వరకూ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం. మంచి రాబడులు వచ్చే పథకాలు ఏవైనా ఉన్నాయా? కనీసం 13 ఏళ్లు ఇన్వెస్ట్ చేస్తే ఎంత రాబడి అంచనా వేయవచ్చు? - విక్రమ్పిల్లలకు మెరుగైన విద్యను అందించాలనే మీ కోరికకు ధన్యవాదాలు. మీరు అన్నట్లు ప్రస్తుతం ఫీజులు భారీగా పెరుగుతున్నాయి. మీ పాప వయసు 10 ఏళ్లు. తాను ఉన్నత చదువులు చదివేటప్పటికీ ద్రవ్యోల్బణం, పెరుగుతున్న ఖర్చులు లెక్కేస్తే చాలా డబ్బు అవసరం అవుతుంది. విద్యా ద్రవ్యోల్బణం ఏటా పెరుగుతూనే ఉంది. పెట్టుబడిపై అధిక రాబడి వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. దీనికి డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లను ఎంచుకోవచ్చు. మీరు నెలకు రూ.20వేలు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు. 13 ఏళ్ల పాటు 12 శాతం రాబడితో మీ ఇన్వెస్ట్మెంట్ దాదాపు రూ.75,18,623 అయ్యే అవకాశం ఉంది. అయితే ముందుగా మీరు అమ్మాయి భవిష్యత్ అవసరాలకు ఆర్థిక రక్షణ కల్పించాలి. అందుకోసం టర్మ్పాలసీను తీసుకోవాలి. మీ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో మీకు ఏదైనా జరిగినా పాలసీ డబ్బు మీ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుస్తుంది.ఇదీ చదవండి: ‘ఎవరికి చెల్లింపులు చేసినా నాకు తెలుస్తుంది’ఇటీవల కాలంలో బంగారం ధరలు తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. ఇప్పుడు ఇందులో ఇన్వెస్ట్ చేయడం సరైన నిర్ణయమేనా? ఎంత సమయం పెట్టుబడి పెట్టాలి? - ప్రకాశ్పెట్టుబడులను డైవెర్సిఫైడ్గా ఉంచుకోవాలి. ఓకే విభాగంలో ఇన్వెస్ట్ చేయకూడదు. బంగారం ధరల్లో ఒడిదొడుకులు సహజం. తాత్కాలికంగా ధరలు పెరుగుతున్నాయని, తగ్గుతున్నాయని ఇన్వెస్ట్ చేయకూడదు. దీర్ఘకాలం కొనసాగితేనే ఇన్వెస్ట్ చేయాలి. మీ పెట్టుబడిలో 10-15 శాతం మేరకే బంగారంలో ఉండేలా చూసుకోవాలి. అంతకుమించి పెట్టుబడి మంచిది కాదు. మిగతా మొత్తాన్ని విభిన్న ఈక్విటీ ఫండ్లలో ఇన్వెస్ట్ చేయండి. కనీసం అయిదేళ్లకు మించి సమయం ఉంటేనే మంచి రాబడులు అందుకోవచ్చు. -
పాన్ 2.0: అప్లై విధానం.. ఫీజు వివరాలు
భారత ప్రభుత్వం పాన్ 2.0 ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం కూడా దీనికి ఆమోదం తెలిపింది. ఇది ఆర్ధిక మోసాలను, గుర్తింపు చౌర్యం వంటి వాటిని నిరోధించడమే కాకుండా.. సమాచారం మరింత భద్రంగా ఉంటుంది. అయితే.. పాన్ 2.0 ఎప్పుడు వస్తుంది అన్నదానికి సంబంధించిన అధికారిక వివరాలు ప్రస్తుతం వెలువడలేదు. అయితే కొత్త పాన్ కార్డులు వస్తే?.. పాత పాన్ కార్డులు ఏమవుతాయి. ఈ కొత్త పాన్ కార్డులు లేదా క్యూఆర్ కోడ్ పాన్ కార్డుల కోసం ఎక్కడ.. ఎలా అప్లై చేసుకోవాలి అనే విషయాలను ఈ కథనంలో చూసేద్దాం.పాత పాన్ కార్డులు రద్దవుతాయా?క్యూర్ కోడ్ పాన్ కార్డులు వస్తే.. పాత పాన్ కార్డులు రద్దవుతాయా? అనే అనుమానం చాలామందికి ఉంటుంది. కానీ పాత పాన్ కార్డులు రద్దు అయ్యే అవకాశం లేదని ఆదాయ పన్ను శాఖ క్లారిటీ ఇచ్చింది.పాన్ 2.0 ప్రవేశపెట్టడంలో ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే.. కొత్త టెక్నాలజీతో ట్యాక్స్ పేయర్లకు మెరుగైన సేవలు అందించడమే. నాణ్యమైన సేవలను సులభంగా, వేగవంతంగా అందించాలనే లక్ష్యంతో కేంద్రం ఈ పాన్ 2.0కు సిద్ధమైంది. కాబట్టి రాబోయే పాన్ కార్డులు క్యూఆర్ కోడ్‌తో రానున్నాయి.పాన్ 2.0 కోసం ఎలా అప్లై చేసుకోవాలి?➤పాన్ 2.0 కోసం అప్లై చేసుకోవాలంటే ముందుగా అధికారిక వెబ్‌సైట్‌లోని పోర్టల్ సందర్శించాలి (పాన్ 2.0 ప్రాజెక్ట్ ఇటీవలే ప్రవేశపెట్టారు, కాబట్టి దీనికి అప్లై చేసుకోవడానికి వెబ్సైట్లో పోర్టల్ ఇంకా అందుబాటులోకి రాలేదు).➤అవసరమైన చోట వ్యక్తిగత వివరాలను నమోదు చేయాలి.➤గుర్తింపు, చిరునామా, పుట్టిన తేదీలకు సంబంధించిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి.➤అవసరమైనన్నీ నమోదు చేసిన తరువాత అప్లికేషన్ సబ్మీట్ చేయాలి.అవసరమైన డాక్యుమెంట్స్➤ఐడెంటిటీ ప్రూఫ్ కోసం.. ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్➤అడ్రస్ ప్రూఫ్ కోసం.. యుటిలిటీ బిల్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్ లేదా రెంటల్ అగ్రిమెంట్➤డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం.. బర్త్ సర్టిఫికెట్, టీసీ, పాస్పోర్ట్పాన్ 2.0 కోసం అప్లై చేయాలంటే డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పాన్ కార్డు.. రిజిస్టర్ మెయిల్‌కు వస్తుంది. అయితే క్యూఆర్ కోడ్‌తో వచ్చే ఫిజికల్ కార్డు కావాలంటే 50 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. క్యూఆర్ కోడ్ కలిగిన పాన్ కార్డును భారతదేశంలో ఎక్కడికైనా డెలివరీ చేసుకోవాలంటే ఈ 50 రూపాయలు చెల్లించాలి. అంతర్జాతీయ డెలివరీలకు ఫీజులు వేరే ఉంటాయి. కాబట్టి దీనికి అదనంగా చెల్లించాల్సి ఉండే అవకాశం ఉంది. -
EPFO 3.0: భారీ సంస్కరణలు.. అధికంగా పీఎఫ్ సొమ్ము!
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) 3.0 వెర్షన్లో మెగా పునరుద్ధరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల ప్రయోజనాలు లక్ష్యంగా కార్యక్రమాలను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. 12 శాతం ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ పరిమితిని తొలగించడంతో సహా ఈపీఎఫ్‌వో సేవల్లో భారీ సంస్కరణలను కార్మిక మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది.ఉద్యోగుల 12 శాతం కాంట్రిబ్యూషన్ పరిమితిని ఈపీఎఫ్ఓ సమీక్షించే అవకాశం ఉందని ఈటీ నౌ మూలాధారాలను ఉటంకిస్తూ రిపోర్ట్ చేసింది. ఉద్యోగులు తమ కాంట్రిబ్యూషన్‌ను పెంచుకోవడం ద్వారా మరింత సొమ్మును పీఎఫ్‌కు జమ చేసుకునేందుకు వీలు కలగనుందని నివేదిక పేర్కొంది. అయితే, యాజమాన్యం వంతుగా జమ చేసే మొత్తం ఉద్యోగి జీతంపై ఆధారపడి ఉంటుంది.మొత్తంమీద, ఈపీఎఫ్‌వో తీసుకుంటున్న చర్యలను ఉద్యోగుల పొదుపును పెంచే ప్రయత్నంగా చూడవచ్చు. అదనంగా ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్‌ను వారి సమ్మతితో పెన్షన్‌గా మార్చడానికి అనుమతించాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది. అంటే ఏ సమయంలోనైనా ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్ మొత్తాన్ని పెన్షన్‌గా మార్చుకునే అవకాశం ఉంటుంది. -
పన్ను లేకుండా ‘దోసె’స్తున్నారు!
నెలకు రూ.6 లక్షలు సంపాదిస్తున్నా ఎలాంటి పన్ను చెల్లించడం లేదు. ‘అదేంటి నెలకు రూ.6 లక్షల చొప్పున వార్షిక ఆదాయం రూ.72 లక్షలు అవుతుంది కదా. 30 శాతం ట్యాక్స్ స్లాబ్‌లోకి వస్తున్నా పన్ను చెల్లించకపోవడం ఏంటి’ అనుకుంటున్నారా? నెలకు అంతలా సంపాదిస్తుంది ప్రముఖ కంపెనీ మేనేజర్ స్థాయి ఉద్యోగో లేదా ఎగ్జిక్యూటివ్ స్థాయి ఆఫీసరో అనుకుంటే పొరపడినట్లే. ఈ సంపాదన ఓ దోసె బండి నిర్వాహకుడిది. అవునండి. వీధి వ్యాపారులు, అసంఘటిత రంగాల్లో పని చేస్తున్నవారు తాము సంపాదిస్తున్న డబ్బుపై ట్యాక్స్ చెల్లించడం లేదు. ఈమేరకు ఇటీవల నవీన్ కొప్పరం అనే వ్యక్తి తన ఎక్స్ ఖాతాలో ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. అదికాస్తా విభిన్న సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.‘మా ఇంటి పక్కన దోసె బండి నిర్వాహకుడు రోజు రూ.20,000 సంపాదిస్తాడు. నెలకు రూ.6 లక్షలు ఆదాయం ఉంటుంది. అందులో సగం వరకు ఖర్చులు తీసేసినా రూ.3 లక్షలు-రూ.3.5 లక్షలు సంపాదన. దానిపై తాను ఎలాంటి ట్యాక్స్ చెల్లించడు. అదే ఉద్యోగం చేస్తున్న వ్యక్తి నెలకు రూ.60,000 సంపాదిస్తే అందులో 10 శాతం ట్యాక్స్ చెల్లించాలి’ అని నవీన్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. దాంతో నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. దేశంలో ఆదాయ వ్యత్యాసాలు, పన్ను హేతబద్ధీకరణ వంటి అంశాలపై కామెంట్లు వస్తున్నాయి.A street food dosa vendor near my home makes 20k on an average daily, totalling up to 6 lakhs a month.exclude all the expenses, he earns 3-3.5 lakhs a month.doesn’t pay single rupee in income tax.but a salaried employee earning 60k a month ends up paying 10% of his earning.— Naveen Kopparam (@naveenkopparam) November 26, 2024ఇదీ చదవండి: తగ్గుతున్న వేతనాలు.. పెరుగుతున్న ఆర్థిక ఒత్తిడి!భారత ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తున్న అనధికారిక రంగాన్ని మరింత క్రమబద్ధీకరించి అందుకు అనుగుణంగా పన్నుల పరిధిని పెంచాలని కొందరు నెటిజన్లు తెలియజేస్తున్నారు. దీనికోసం అనుసరించాల్సిన మార్గాలపై చర్చసాగాలని చెబుతున్నారు. కొందరు వైద్యులు, న్యాయవాదులు, చిన్న వ్యాపార యజమానులు.. వంటి ఇతర స్వయం ఉపాధి పొందేవారి సంపాదన పన్ను రహితంగా ఉండడంపట్ల ప్రభుత్వం స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ‘డాక్టర్లు, లాయర్లు, టీ దుకాణాదారులు, గ్యారేజీ నిర్వహకులు, వాణిజ్య ప్రాంతాల్లోని ఇతర వ్యాపారుల సంగతేంటి? చాలామంది ఎలాంటి ట్యాక్స్ చెల్లించకుండా విదేశీ సెలవులకు వెళుతున్నారు. ఇళ్లు కొంటున్నారు. ఏటా కొత్త వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. ఎందుకు ఇలాంటి పరిస్థితి ఉంది?’ అంటూ ఒకరు కామెంట్ చేశారు. -
అకౌంట్లో క్యాష్.. ఎన్ని లక్షలు ఉండొచ్చు?
మనలో చాలా మందికి బ్యాంకులలో సేవింగ్ ఖాతాలు ఉంటాయి. వివిధ అవసరాల నిమిత్తం వీటిలో లావాదేవీలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈ అకౌంట్లలో లెక్కకు మించి క్యాష్ ఉంచుకునేందుకు వీలు లేదు. ఇందు కోసం ఆదాయపు పన్ను చట్టం ప్రకారం పరిమితి ఉంది.బ్యాంకు, ఇతర పొదుపు ఖాతాలలో నగదు డిపాజిట్ పరిమితి అనేది ఆదాయపు పన్ను శాఖ అధికారుల దృష్టిని ఆకర్షించకుండా ఒక వ్యక్తి నిర్దిష్ట వ్యవధిలో డిపాజిట్ చేయగల గరిష్ట నగదు మొత్తాన్ని సూచిస్తుంది. నగదు లావాదేవీల ప్రవాహాన్ని పర్యవేక్షించడం, నియంత్రించడం, మనీలాండరింగ్, పన్ను ఎగవేత, ఇతర అక్రమ ఆర్థిక కార్యకలాపాలను అరికట్టడం కోసం ఆదాయపు పన్ను నిబంధనల మేరకు ఈ పరిమితిని సెట్ చేశారు.రూ.10 లక్షలు మించితే..భారతీయ ఆదాయపు పన్ను చట్టంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం.. ముఖ్యమైన నగదు డిపాజిట్లతో సహా నగదు లావాదేవీలకు సంబంధించి నిర్దిష్ట నిబంధనలు ఉన్నాయి. పొదుపు ఖాతాలో జమ చేసే నగదు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలు లేదా అంతకు మించితే ఐటీ శాఖకు తెలియజేయాలి. అదే కరెంట్ అకౌంట్ల విషయంలో ఈ పరిమితి రూ.50 లక్షలు ఉంటుంది. ఈ డిపాజిట్లు తక్షణ పన్నుకు లోబడి ఉండనప్పటికీ, పరిమితులను మించిన లావాదేవీలను ఆదాయపు పన్ను శాఖకు నివేదించడానికి ఆర్థిక సంస్థలు బాధ్యత వహిస్తాయని గుర్తించడం అవసరం.ఇదీ చదవండి: మారనున్న ఫిక్స్డ్ డిపాజిట్ రూల్స్?ఇక నగదు ఉపసంహరణల విషయానికి వస్తే.. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 194ఎన్లో టీడీఎస్ నిబంధనలు పేర్కొన్నారు. ఒక ఆర్థిక సంవత్సరంలో నగదు ఉపసంహరణలు రూ. 1 కోటికి మించితే 2% టీడీఎస్ చెల్లించాలి. గడిచిన మూడు సంవత్సరాలుగా ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయని వ్యక్తులకు విత్‌డ్రావల్స్ రూ.20 లక్షలు దాటితే 2% టీడీఎస్ వర్తిస్తుంది. అదే రూ. 1 కోటికి మించితే 5% టీడీఎస్ వర్తిస్తుంది. -
క్రెడిట్ కార్డుల వినియోగం తగ్గిందా?: రిపోర్ట్స్ ఏం చెబుతున్నాయంటే..
క్రెడిట్ కార్డులు వినియోగించేవారి సంఖ్య ఒకప్పటి నుంచి గణనీయంగా పెరుగుతూనే ఉంది. చిన్న స్థాయి ఉద్యోగి దగ్గర నుంచి.. లక్షలు సంపాదించే పెద్ద ఉద్యోగి వరకు అందరూ క్రెడిట్ కార్డులు తీసుకుంటున్నారు. అయితే గత అక్టోబర్ నెలలో 7.8 లక్షల మంది మాత్రమే క్రెడిట్ కార్డులను తీసుకున్నట్లు సమాచారం. ఈ సంఖ్య 2023 అక్టోబర్ (16 లక్షలు) నెలతో పోలిస్తే 45 శాతం తగ్గినట్లు స్పష్టమైంది. దీన్ని బట్టి చూస్తే క్రెడిట్ కార్డుల వినియోగం తగ్గిందా? అనే అనుమానం కూడా వస్తోంది.ఆనంద్ రాతీ నివేదిక ప్రకారం, 2024 మే నెలతో పోలిస్తే.. అక్టోబర్‌లో క్రెడిట్ కార్డులు జారీ కొంత పెరిగిందని తెలుస్తోంది. అక్టోబర్ 2024లో క్రెడిట్ కార్డ్‌ల ద్వారా చేసిన మొత్తం ఖర్చు రూ. 1.78 ట్రిలియన్లకు చేరుకుందని, ఇది 13 శాతం వార్షిక వృద్ధిని ప్రతిబింబిస్తుందని సమాచారం. మొత్తం ఖర్చు విలువలో ఈ కామర్స్ వాటా 61 శాతం ఉన్నట్లు స్పష్టమవుతోంది.గత ఏడాదితో పోలిస్తే.. ఈ అక్టోబర్ నెలలో జారీ అయిన క్రెడిట్ కార్డుల సంఖ్య తక్కువ అయినప్పటికీ.. ఖర్చులు మాత్రం గణనీయంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చాలామంది ఏది కొనాలన్నా.. ఎక్కడ షాపింగ్ వంటివి చేయాలన్నా క్రెడిట్ కార్డులనే వినియోగిస్తున్నారు. ఈ కారణంగానే క్రెడిట్ కార్డుల ద్వారా చేసే ఖర్చులు పెరుగుతున్నాయి. మొత్తం మీద క్రెడిట్ కార్డుల జారీ తగ్గినా.. వినియోగంలో మాత్రం ఎవ్వరూ తగ్గేదేలే అనేది స్పష్టంగా అర్దమైపోతోంది.