Extra
-
పూల కోసమే ప్రత్యేకమైన పండుగ! ఇది ఒకరోజు పండుగ కాదు.. ఏకంగా..
పూలతోటలు పెంచడం, దైవారాధనలోను, గృహాలంకరణలోను పూలను ఉపయోగించడం దాదాపు ప్రతి దేశంలో ఉన్న వ్యవహారమే! మన దేశంలోనైతే మహిళలు పూలను సిగలో కూడా ధరిస్తారు. ప్రాచీన సంస్కృతుల ప్రభావం గల కొన్ని ఇతర దేశాల్లోనూ మహిళలు పూలను తమ అలంకరణలో భాగంగా ఉపయోగిస్తుంటారు. మన దేశంలో పండుగల్లో పూలను విరివిగా వినియోగిస్తారు గాని, పూల కోసం ప్రత్యేకమైన పండుగ ఏదీ లేదు.అయితే, కొలంబియాలో మాత్రం పూల కోసమే ప్రత్యేకమైన పండుగ ఉంది. ఇది ఒకరోజు పండుగ కాదు, ఏకంగా పదిరోజులు జరుపుకొనే భారీ వేడుక. ఏటా ఆగస్టు 2 నుంచి 11 వరకు ఈ పండుగ జరిగినన్ని రోజులూ కొలంబియాలో ఊరూ వాడా ఎటు చూసినా రంగు రంగుల పూల సోయగాలు కనువిందు చేస్తాయి. చిత్రవిచిత్రమైన పుష్పాలంకరణలు చూపరులను కట్టిపడేస్తాయి.కొలంబియా వాసులు ఈ పండుగను ‘ఫెరియా డి లాస్ ఫ్లోరెస్’ అని పిలుచుకుంటారు. కొలంబియాలో అత్యంత ప్రాధాన్యమున్న సాంస్కృతిక వేడుకల్లో ఈ పూల పండుగ ఒకటి. వర్ణ మహోత్సవంలా సాగే ఈ పూల పండుగను తిలకించడానికి పెద్దసంఖ్యలో విదేశీ పర్యాటకులు ఇక్కడకు చేరుకుంటారు. ఈ పండుగలో భాగంగా జరిగే ఆటపాటల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. కొలంబియా రాజధాని బొగోటాలోని చరిత్రాత్మక కట్టడం ‘ఎల్ ఒబెలిస్కో’ వద్ద పూలబుట్టలతో, పూలతో అలంకరించిన వాహనాలతో జనాలు పెద్దసంఖ్యలో చేరుకుని, అక్కడ సంగీత కార్యక్రమం నిర్వహించడంతో ఈ పూల పండుగ సంబరాలు మొదలవుతాయి.ఈ సందర్భంగా వీథుల్లో పూలతో భారీ పరిమాణంలో నిర్మించిన జంతువులు, పక్షుల విగ్రహాలు సందర్శకులకు స్వాగతం పలుకుతాయి. వివిధ సాంస్కృతిక కేంద్రాల్లోను, ప్రధాన కూడళ్లలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వేదికలపైన సంగీత, నృత్య, నాటక ప్రదర్శనలు జరుగుతాయి. ముగింపు రోజు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు పూల రైతులు తమ తమ తోటల్లో పూసిన పూలను బుట్టల్లో నింపుకుని, వాటిని వీపున కట్టుకుని ‘సిలెటరోస్ పరేడ్’ ఊరేగింపును నిర్వహిస్తారు. -
నాన్న మాటల్లోని జీవిత సత్యం.. బోధపడిన ప్రవీణ్ ఆనాటి నుంచి..
వీరయ్య ఒక పేదరైతు. తనకున్న రెండెకరాల పొలంలో రెక్కలు ముక్కలయ్యేలా కష్టపడుతూ కుటుంబాన్ని లాక్కొస్తున్నాడు. అతనికి ఒక్కగానొక్క కొడుకు ప్రవీణ్. కొడుకును బాగా చదివించి, వాడిని ఉన్నతస్థాయిలో చూడాలని వీరయ్య ఆశ. తనలా తన కొడుకు కష్టాలు పడకూడదు అనుకునేవాడు. చదువుకు తన పేదరికం అడ్డుకాకూడదని తల తాకట్టుపెట్టయినా కొడుకును చదివించాలని దృఢనిశ్చయానికి వచ్చాడు వీరయ్య. కొడుకును పట్నంలో మంచి బడిలో చేర్పించాడు. మొదటి సంవత్సరం బాగానే చదువుకుని మంచి మార్కులు సంపాదించాడు ప్రవీణ్. స్నేహితులు కూడా పెరిగారు.వాళ్లంతా చెప్పుల నుంచి బట్టల వరకు ఖరీదైన బ్రాండెడ్ వస్తువులనే వాడేవారు. వారిని చూసి ప్రవీణ్ కూడా తనకూ అలాంటి బ్రాండెడ్ వస్తువులు కావాలని తండ్రిని వేధించసాగాడు. దానికి వీరయ్య ‘చూడు నాయనా.. వారు ధనవంతుల బిడ్డలు. ఎలాగైనా ఖర్చుపెట్టగలరు. నీ చదువుకే నా తలకు మించి ఖర్చుపెడుతున్నాను. మనకు అటువంటి కోరికలు మంచివికావు. మన స్థాయిని బట్టి మనం నడుచుకోవాలి’ అని నచ్చజెప్పాడు. అయినా కొడుకు చెవికెక్కించుకోలేదు. పైపెచ్చు స్నేహితుల తల్లిదండ్రులు.. వాళ్లకేది కావాలంటే అది కొనిస్తున్నారు, పుట్టినరోజులు బ్రహ్మాండంగా జరిపిస్తున్నారు. తనకు మాత్రం తన తండ్రి ఏ సరదా తీర్చడం లేదని అలిగాడు ప్రవీణ్. ఫలితంగా చదువు మీద దృష్టిపెట్టక వెనుకబడిపోయాడు.ఒకసారి.. దసరా సెలవులకు ప్రవీణ్ వాళ్ల అక్క పిల్లలిద్దరూ ఇంటికి వచ్చారు. ఒకరోజు ఆ పిల్లలు మట్టితో బొమ్మరిల్లు కట్టి ఆడుకోసాగారు. ఆ ఇల్లు మీద సూట్‌కేసులు పెద్దపెద్ద బరువైన వస్తువులు పెడదామని చూసింది చిన్నమ్మాయి. పెద్దమ్మాయేమో ‘వద్దు.. మనం అలాచేస్తే బొమ్మరిల్లు కూలిపోతుంది’ అని వారించింది. అయినా చిన్నమ్మాయి వినకుండా ‘ఏమీ కాదు.. తాతగారింటి డాబా మీద పెద్దపెద్ద వస్తువులు పెట్టడం లేదా.. అలాగే ఈ ఇంట్లోనూ పెట్టుకోవచ్చు’ అంటూ మొండికేసింది. ఇదంతా గమనించిన ప్రవీణ్ ‘మీరు కట్టుకుంది బొమ్మరిలు.్ల ఇది ఆడుకోవడానికే కానీ వాడుకోవడానికి కాదు. అందుకే ఇది పెద్ద వస్తువులను మోయలేదు. తాతగారిల్లు రాళ్లు, ఇటుకలు, ఇనుముతో గట్టిగా కట్టినిల్లు. ఆ ఇల్లు మోసే బరువులను ఈ బొమ్మరిల్లు మోయలేదు. కావాలంటే నీకు బొమ్మ సూట్‌కేసులు, బ్యాగులు చేసిస్తాను చూడు..’ అని చెప్పాడు. చెప్పినట్టుగానే వెంటనే మట్టితో ఆ బొమ్మలను చేసిచ్చాడు కూడా! వాటిని చూసి చిన్నపిల్ల భలే ముచ్చటపడింది.ఈ తతంగమంతా చూసిన వీరయ్య.. కొడుకుని మెచ్చుకున్నాడు. తర్వాత కొడుకుతో ‘మన పేద బతుకులు కూడా బొమ్మరిల్లు లాంటివే. ఏమాత్రం బరువెక్కువైనా కూలిపోతాయి. మన స్థాయికి తగ్గట్టు నడుచుకోకపోతే చితికిపోతాం. ఆ చిన్నపిల్ల తెలియక మారాం చేసింది. నీవు తెలిసి తప్పటడుగులు వేస్తున్నావు’ అంటూ జ్ఞానదోయం చేశాడు. నాన్న మాటల్లోని జీవిత సత్యం బోధపడిన ప్రవీణ్ .. ఆనాటి నుంచి బుద్ధిగా చదువుకోసాడు. – జయరామ్ నాయుడు -
Mystery Death: ‘నాన్నా మూర్ .. బాగా చీకటి పడిందిరా ఎక్కడున్నావ్, వింటున్నావా’..?
ఇది ఓ చిట్టి గుండెకు, స్వచ్ఛమైన నవ్వుకు జరిగిన అన్యాయం. కాలం సైతం మాన్చలేని గాయం. మూర్ఖత్వానికి, క్రూరత్వానికి.. నిర్దాక్షిణ్యంగా బలైన నిండు జీవితం. కుయుక్తులు, కుతంత్రాలు తెలిసిన ఈ ప్రపంచానికి ఎదురీదలేక.. నీరుగారిన పోరాటం.1995 ఏప్రిల్ 23 రాత్రి, దగ్గరదగ్గరగా తొమ్మిది కావస్తోంది. ఫ్లోరిడా, న్యూ స్మిర్నా బీచ్ అంతా ఆటుపోట్లతో ఎగసిపడుతోంది. కారుచీకటిని చీల్చుకుంటూ ఓ బ్యాటరీ లైట్.. స్థిమితం లేకుండా అటూ ఇటూ కదలాడుతోంది. ‘మూర్.. మూర్.. మూర్’ అనే అరుపు.. హోరుహోరుమనే సముద్రగాలికి.. గమ్యం లేకుండా ఎదురీదుతోంది. ‘నాన్నా మూర్ .. బాగా చీకటి పడిందిరా ఎక్కడున్నావ్, వింటున్నావా’ అనే కేక.. క్రమక్రమంగా ఆ పరిసరాల్లో అల్లకల్లోలాన్నే సృష్టిస్తోంది. ఆ అలజడంతా ఓ కన్నపేగుది. ఏదో కీడు శంకిస్తున్న ఓ తల్లి మనసుది.‘ఓరా లీ’ తన ఎనిమిదేళ్ల కొడుకు డిమీట్రీక్ మూర్ని.. మూడు నాలుగు గంటలు ఊరంతా వెతికీ వెతికీ.. చివరికి సముద్రతీరానికి చేరుకుంది. అక్కడ కూడా ఏ జాడ లేకపోయేసరికి.. పోలీస్ స్టేషన్ కి పరుగుతీసింది. ‘ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు.. ఆడుకుని వస్తానంటూ బయటికి వెళ్లిన నా కొడుకు మూర్ తిరిగి రాలేదు. ఏమయ్యాడో తెలియదు. నా బిడ్డను ఎలాగైనా వెతికిపెట్టండి సారు’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మరునాడు ఉదయం నుంచి బాబును వెదకడం మొదలుపెట్టారు. స్థానికుల్లో కొందరు మూర్ని వెతకడంలో సాయం చేశారు.ఆ రోజు సాయంత్రం 4 అయ్యేసరికి మూర్.. ఓరా కారు డిక్కీలోనే శవమై కనిపించాడు. ఒంటి మీద బట్టలు కూడా లేవు. మొదట బాబు.. తెలియక ఆ డిక్కీలోకి తనంతట తానే వెళ్లి ఇరుక్కుని చనిపోయాడేమో అనుకున్నారంతా. కానీ పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్‌లో.. హత్య అని తేలింది. బాడీపై వేలిముద్రలు లేకుండా కడిగినట్లు ఆనవాళ్లున్నాయి. ప్రాణం పోయి 18 నుంచి 24 గంటలు కావస్తోందని నిర్ధారించారు. తడిసిన బాబు బట్టలు కూడా ఆ పరిసరల్లోనే దొరికాయి. తెలివిగా.. వాటిని ఉతికి శుభ్రం చేసి పెట్టారని స్పష్టమైంది. శవం.. తల్లి కారులోనే దొరికింది కాబట్టి కేసు ఓరా మెడకే చుట్టుకుంది. ఆమెను పలుమార్లు.. గంటలు గంటలు విచారించారు పోలీసులు. అరెస్ట్ కూడా చేశారు.‘ఆ రోజు 8 లోపే మూర్ ఇంటికి వచ్చేశాడు. అయితే రెండు గంటలకు వెళ్లిన మూర్ అన్ని గంటల తర్వాత.. బట్టల్నీ మురికి చేసుకుని వచ్చేసరికి ఓరా.. మూర్‌పై తీవ్రంగా కోప్పడింది. ఆ ఆవేశంలో బాబుని బాగా కొట్టింది. ఆ అరుపులు, ఏడుపులు మేము విన్నాం.. ఆ సమయంలోనే మూర్ చనిపోయి ఉంటాడు. అందుకే ఓరా.. తెలివిగా కేసుని పక్కదోవ పట్టించడానికి కారులో శవాన్ని దాచి.. ఊరంతా వెతికి ఉంటుంది’ అంటూ కొందరు సాక్షులుగా నిలిచారు. దాన్ని నమ్మిన పోలీసులు.. ఓరాను అరెస్ట్ చేశారు. అయితే ఓరా అలాంటిది కాదని మరికొందరు వాదనకు దిగారు.కేసు కోర్టుదాకా పోయింది. వాద, ప్రతివాదాల మధ్య నలిగిన ఓరా.. 1996 జూన్ కల్లా నిర్దోషిగా విడుదలైంది. ఆ తర్వాత కొన్ని నెలల్లోనే కేసును క్లోస్ చేశారు పోలీసులు. అయినా సరే ఓరా ఆగలేదు. తన బిడ్డ మూర్ మరణానికి కారణమెవరో తేల్చాలంటూ న్యాయపోరాటం మొదలుపెట్టింది. ఆ పోరాట ఫలితంగా 1997 ఫిబ్రవరిలో కేసు రీ ఓపెన్ అయ్యింది. ఈసారి రూట్ మార్చారు అధికారులు. ఆ రోజు మూర్తోపాటు ఆడుకోవడానికి వెళ్లిన ఇరుగుపొరుగు పిల్లలను విచారించారు. అయితే అందులో కొందరు ఆ రోజు మూర్‌ను కలవనేలేదని, చూడనేలేదని చెప్పారు.అప్పుడే మూర్ స్నేహితుడొకడు.. కీలక సాక్ష్యమయ్యాడు. ‘మూర్తో కలసి ఆడుకునే స్థానిక పిల్లలంతా అతని కంటే పెద్దవాళ్లే. దాంతో చాలామంది పిల్లలు మూర్ని చిన్నదానికీ పెద్దదానికీ బెదిరించేవారు. ఏదో ఒక కారణంతో ఏడిపించేవారు. గతంలో ఒకసారి ఒక పెద్ద కుర్రాడు మూర్ని నేలపై పడేసి.. బలవంతంగా మట్టి తినిపించడం నేను కళ్లారా చూశాను’ అని మూర్ స్నేహితుడు చెప్పాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. అప్పటికే విచారణలో ‘మూర్ని ఆరోజు చూడనేలేదు’ అని చెప్పినవారే.. అతని దృష్టిలో నిందితులు. దాంతో పరిశోధకులు.. మూర్ని తోటి స్నేహితులే అనవసరంగా గొడవపడి, ప్రమాదవశాత్తూ చంపేసి ఉంటారని.. కేసు మీదకు రాకుండా తమ తల్లిదండ్రుల సాయం తీసుకుని మూర్ శరీరాన్ని, దుస్తుల్ని శుభ్రం చేసి ఉంటారని అంచనాకొచ్చారు.ఇంతలో ఓరాకు మరో సంగతి గుర్తొచ్చింది. అసలు కారులోకి శవం ఎలా వచ్చింది? అని ఆలోచిస్తే.. ఒక అనుమానాస్పద సన్నివేశం ఆమె కళ్లముందు కదలాడింది. ఓరా ఆ రోజు బాబుని వెతుకుతుంటే.. ఇద్దరు ఆడవాళ్లు వచ్చి.. ‘మూర్ రైలు పట్టాల దగ్గర ఎవరితోనో గొడవ పడుతున్నాడు’ అని చెప్పారు. తీరా ట్రాక్ దగ్గరకు.. ఓరా పరుగుతీస్తే అక్కడంతా ప్రశాంతంగానే కనిపించింది. అంటే.. తను రైలు పట్టాల దగ్గరకు వెళ్లినప్పుడే.. ఎవరో బాబు శవాన్ని లాక్ చేయని తన కారు డిక్కీలో పెట్టి ఉంటారని నమ్మింది ఓరా.మరోవైపు మూర్ కనిపించకుండా పోయిన మరునాడు మధ్యాహ్నం, శవం దొరక్కముందు.. ‘స్టెఫానీ వాషింగ్టన్’ అనే పొరుగు నివాసి.. ఓరాకు ఓ అబద్ధం చెప్పాడట. ‘మూర్తో ఆడుకున్న అబ్బాయిల్లో ఒకరిని.. ఎవరో కొట్టి చంపి.. రైలు పట్టాల దగ్గర వేశార’ని ఆ వ్యక్తి చెప్పడంతో మూర్కు ఏమై ఉంటుందోనని మరింత భయపడిందట ఓరా. నిజానికి.. ఆ సమయంలో మూర్ మృతికి ముందు కానీ తర్వాత కానీ.. ఏ పిల్లలూ మిస్ అవ్వలేదు. మరి ఇరుగుపొరుగు ఎందుకలా అబద్ధం చెప్పారో తెలియదు. ఏది ఏమైనా మూర్ మృతికి.. అతడి తోటి స్నేహితులే కారణమని నమ్మేవాళ్లు ఎక్కువయ్యారు. కానీ, సరైన ఆధారాలు దొరకలేదు.మొత్తానికి మూర్ మృతికి అసలు కారకులు ఎవరు? పొరుగువారైయ్యుండి ఎందుకు ఓరాని తప్పుదారి పట్టించారు? మూర్ బాడీని.. అతని తల్లి ఓరా కారులో ఎవరు పెట్టారు? ఇలా ఎన్నో ప్రశ్నలు నేటికీ మిస్టరీనే! – సంహిత నిమ్మన -
కాని ఈరోజు పొడిచిన సూర్యుడు రోజువారీ కంటే..
ఊరికి దక్షిణాన వున్న మాదిగ గూడెంలో ప్రతిరోజూ సూర్యోదయం ఎర్రగానే వుంటది. కాని ఈరోజు పొడిచిన సూర్యుడు రోజువారీ కంటే కాస్త భిన్నంగా రక్తమోడుతూ పైకి ఎగబాకిండు. దానికి నిశానీగా ఊర్లోని జనమంతా గగ్గోలు పెడుతూ ఆ దిక్కుకే పోతున్నారు. జనం ఆలోచనలు ఒక్కతీర్గ లేవు, కథలు, కథలుగా చెప్పుకుంట గూడెం దారి పట్టింది ఊరు.అది ఊరికి దక్షిణాన వున్న రైతుల చేన్లకు, గూడేనికి పోయే దారి. తెల్లవారు ఝాము నుంచి వచ్చీపోయే జనంతో రద్దీగా వుంది. గూడెంలోని జనం తెల్లారగట్టే లేచి సద్దిమూటలు కట్టుకొని రోజ్‌గార్ (పనికి ఆహార పథకం) మట్టి పనికి వెళ్ళిపోయారు. ఇళ్ళల్లో పిల్లలు, ముసలాళ్ళు మిగిలారు. గూడెం నిశబ్దంగా వుంది. ఆ నిశబ్దాన్ని ఊరి జనం ‘చేసినకాడికి చేసి, ఏమీ ఎరగనట్టే గుంబనంగా’ వుంది అనుకోసాగారు.మాదిగ గూడెంలోని వాళ్లు రోజు లాగానే పొద్దు పొడవక ముందే నిద్రలేచి పక్షుల్లాగా బతుకుతెరువు వెతుక్కుంటూ పనుల్లోకి పోతారు. వారి శరీరాలు సగం చెమటలో తడిశాకే పొద్దు పొడుస్తది. పొద్దు పొడుపును తీరుబడిగా చూసే ఫుర్సత్ ఎక్కడిది వాళ్ళకి! కడుపు మంట ఆర్పుట్లో ద్యాసే వుండదు. బారెడు పొద్దు ఎక్కాక తెచ్చుకున్న సద్దిబువ్వ మూటను కాళ్ళు బార్లచాపి కూర్చుని మూట విప్పిన టైమ్‌లో పొద్దు పొడుపు అందం ఏడ కనిపిస్తది! ఆ దిక్కు చూడబోతే ఎండ చిటపటల్తో కండ్లు మూతలు పడుతయై.మాదిగ గూడెం ఖాళీగా నిర్మానుష్యంగా వుంది. డొక్కలు పీక్కబోయి కాల్లీడ్సుకుంట తిరిగే కుక్కలు ఒకటి, రెండు కనిపిస్తున్నాయి. గూడెంలో వాకిళ్ళు ఊడ్సిన జాడ సుత కనిపిస్తలేదు. కావాలని ఇండ్ల ముంగట ఎవరు ముగ్గులు పెడతారింక! ఇళ్ళల్లో మిగిలిన ముసలీముతక, ఊళ్లో మోతుబరి ఆసాములు.. రిపేరు కోసం ఇచ్చిన వూసిపోయిన చెప్పుల గూడలు సరిచేస్తూ కనిపిస్తున్నారు. అదీ ఒక బతుకుతెరువు పనే! పొద్దు ఎర్రగ పొడిచిందో, సప్పగా పోడిచిందో వాళ్ళకేమవుసరం! కీళ్ళ నొప్పులు, కాళ్ళ పీకుడు మీదే ధ్యాస. నాలుగు అంగలు నడిచి ఊళ్ళోకి పోగలిగిన సత్తువ వుంటే చాలు అనుకునేవాళ్ళే! కుట్టిన చెప్పులు దొరల కాళ్ళ దగ్గరికి చేరిస్తే, నాలుగు డబ్బులో, కొన్ని గింజలు విదిలిస్తే చాలు అనుకునేవాళ్ళు వున్నారు. కడుపు మంటను చల్లార్చగలిగితే ఓ సముద్రం ఈదినంత సంతృప్తి. ఊళ్ళోని వార్తలతోని పనిలేని వాళ్ళే గూడెం గుడిసెల్లో మిగిలి వున్నారు.శవం ఒంటి మీద రక్తం అట్టగట్టి నల్లబడి ఎండిపోయింది. ఈగలు జిబ్బున ముసురుతున్నాయి, శవం దొరదైనా, బిచ్చగాడిదైనా ఒకటే వాటికి.. వ్యత్యాసం చూపవు. ఈ పని జరిగి కనీసం నాలుగైదు గంటలు దాటి వుంటుంది అని జనం ఎవరికి తోచిన విధంగా వాళ్ళు మట్లాడుకుంటున్నారు. ‘ఆ అపరాత్రి ఎందుకు బైటికి వచ్చిండో పాపం’ అంటున్నారు. ‘తన పనికోసమైనా సరే.. కూలోళ్లనే ఇంటికి పిలిపించుకొని మాట్లాడుకునేటోడు.. తనే వెళ్ళాల్సిన పనేం పడిందో’.. అంటూ అనేకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.‘అహే.. నిన్నటి వరకు ఊళ్ళోనే లేడంట, పట్నం పోయిండంట. ఎప్పుడొచ్చిండో మరి.. పొద్దటికల్లా శవమై పోయిండు’, ‘ఎవరన్నా కొట్టిపడేసిన ఆనవాళ్ళు, ఒంటి మీద దెబ్బలు ఏమీ కనిపిస్తలేవు’ అంటూ పోస్ట్‌మార్టం చేయడం మొదలుపెట్టారు. తలో దిక్కు తోచింది మాట్లాడేసుకుంటున్నారు. ‘పోలీసులకు కబురు అందిందో లేదో?’ ఇంకొకళ్ళ అనుమానం.‘నువ్వు పోయి చెప్పిరాపో’ పక్కనున్నాయన కసురుకున్నాడు.. అనుమానపడిన వ్యక్తిని. పెళ్ళాం, పిల్లలు వచ్చినట్టున్నారు. శవం చుట్టూ చేరి ఏడుస్తున్నారు. జనం వాళ్ళ చుట్టూ మూగారు. ఆయనకిద్దరు అమ్మాయిలు. వయసు çపది..పదిహేనేళ్ళలోపే వుంటుంది. ‘పాపం ఏడ్సుడు సుతొస్తలేదు.. ఎట్ల బతుకుతరో.. ఏమో..!’ విచారం వ్యక్తం చేశారెవరో.కొద్దిసేపటికి ఎస్.ఐ, కొందరు కానిస్టేబుళ్ళతో వచ్చిండు. రావడంతోటే.. శవం చుట్టూ మూగి వున్న జనాన్ని దూరంగా తరిమారు కానిస్టేబుళ్ళు. ఇద్దరు పిల్లలు, ఆమె సన్నంగా ఏడుస్తున్నారు. ఏడుస్తూనే ‘పట్నం నుంచి రాత్రే వచ్చినం. మిర్చి తోటలో కాపలాగాల్లు వున్నరో.. లేదో చూసొస్తాని ఆగమాగం బైలెల్లిండు. వద్దని ఎంత మొత్తుకున్నా చెవినపెట్టలేదు. బయటనే ఇడిసి వున్న చెప్పులల్ల కాళ్ళుపెట్టి ఎల్లిపోయిండు’ ఎడుస్తూ చెప్పింది ఇల్లాలు. మళ్లీ తనే కొనసాగిస్తూ ‘ఇది ఆయనకు మామూలే. ఎప్పట్లాగే చేను కాడికి పోయి వస్తడుగదా అనుకొని పిల్లలు, నేను ఇంట్లనే పడుకున్నం. ఇగో తెల్లారేసరికి ఇట్ల శవమై పడున్నడు’ అని ముక్కు చీదుకుంది.పోలీసులు తమ పనిలో మునిగిపోయారు. ఏడుస్తూనే వాళ్లకు వాంగ్మూలం ఇచ్చింది ఆమె. తనకు ఎవరి మీదా అనుమానం లేదని, ఊర్లో వాళ్ళెవరితోనూ కక్షలు, పాత పగలు లేవని చెప్పింది. తొట్రుపాటేమీ లేకుండా, నింపాదిగా.. పోలీసులు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇచ్చింది. ఊరి సర్పంచ్ వచ్చిండు. అన్ని పార్టీల పెద్ద మనుషుల సమక్షంలో పంచనామా చేసి శవాన్ని పోస్టుమార్టం కోసం ట్రాక్టర్లో గవర్నమెంట్ హాస్పిటల్‌కి తరలించారు.మండలస్థాయి అన్ని పార్టీల లీడర్లు, బంధుబలగం తరలి వచ్చారు. అంత్యక్రియలను సజావుగా జరిపించింది. కర్మకాండలు అన్నీ ఘనంగా ముగిశాయి. ఏ నోట విన్నా వాడి పేరే ట్రోల్ అవుతూ వుంది. ‘ఏమిటో విడ్డూరం భర్తను చంపిన వాడు ఎవరో తెల్సికూడా పేరు బయట పెట్టక పోవడం!’ అని ఊరంతా ముక్కున వేలేసుకుంది.రాత్రి చీకటి చిక్కబడుతోంది.. చంద్రుడు లేని రాత్రి. గూడెం వీధిలోనే వున్న వేపచెట్టు అరుగు మీద శేషు ఒక్కడే కూర్చొని వున్నాడు. అదే పగటి పూటైతే ముసలీ, ముతకా పిల్లాజెల్లా గోలీలు, అష్టాచెమ్మ ఆడుకునేవాళ్ళు. చెట్టు నీడ కింద నిండుగా కూర్చునుండే వారు. రాత్రి కావడం చేత ఆ చెట్టు అరుగు మీద శేషు ఒక్కడే.. తోడుగా పైన కోటానుకోట్ల నక్షత్రాలు.. పక్కన నవ్వుతూ చీకటి ‘నేను లేనా’ అంది. ఆ రోజు పైవాళ్ళు, పక్కనే వుండే చీకటి అంతా వున్నారు.‘ఆరోజు ఏం జరిగింది?’ పైవాళ్లే సాక్ష్యం, మరో పురుగంటూ లేదు. శేషులో రీల్ తిరగటం మొదలయింది. ఆరోజు తను గాఢ నిద్రలో వున్నాడు. ఆ నిద్రను చెడగొడుతూ పక్క గది నుండి గుసగుసల శబ్దం చెవున పడుతోంది. తరచుగా అప్పుడప్పుడు వినే శబ్దమే. తనకు వయసు పెరుగుతున్న కొద్ది ఆ శబ్దం చిరాకు పుట్టిస్తోంది. నిద్దర్లోను.. దీర్ఘంగా నిట్టూర్చి కప్పుకున్న దుప్పటిని పక్కన పడేసి, తలుపులు తెరచుకొని బైటికొస్తూ మళ్ళీ తలుపులు దగ్గరికి చేరవేసి, ఎక్కడిదాకో నడక, తెలియక పోయినా కొద్దిదూరం దాకా నడిచి చెట్ల నీడ కింద వున్న కల్వర్ట్ మీద కూర్చున్నాడు.తను గుర్తెరిగిన దగ్గరి నుంచి ఇంట్లో నడుస్తున్న క్రమం. అమ్మని కట్టడిచేయలేని నిస్సహాయత, అమ్మ అంటే ఆమెకు పెళ్ళి కాలేదు. తనని కన్నందుకు తల్లయింది. తన పెంపకం, చదువు, బట్టలు అన్నీ చూసుకుంటోంది. డిగ్రీ వరకు ఏలోటూ రాకుండా చదివించింది. ఇకపైన కూడా చూస్తుంది.. అనుమానమే లేదు. మొన్నటివరకు తాత రూపంలో కొండంత బలం తోడుగా వుండేది. ఆయన పోయాడు.. తను ఏకాకై పోయాడు. ఇక వచ్చిన ఇబ్బంది సమాజంతోటే. తన మానాన తనని బతకనీయడం లేదు. ఎదురౌతున్న అవమానాలు, ఈసడింపులు, అదుపు చేసుకోలేని, ఓర్చుకోలేని ఉక్రోషం రోజురోజుకీ ఎక్కువైపోతోంది.చాలాసేపు ఆ కల్వర్ట్ మీదనే కూర్చున్నాడు శేషు. ఇక లేచి ఏటో ఒక దిక్కుకు వెళ్లిపోదామని లేచే సమయానికి తను ఇంటి నుంచి నడిచి వచ్చిన దారి గుండా ఎవరిదో నీడ ఇటే వస్తూ కనిపించింది. లేచే ప్రయత్నాన్ని ఆపి మళ్ళీ అక్కడే కూర్చున్నాడు. నీడ రానురాను సమీపిస్తున్నది. నీడను పోల్చుకున్నాడు శేషు. అక్కడి నుంచి లేచి వెళదామనుకున్న వాడు అట్లానే కూర్చుండిపోయాడు.‘ఎంత కాలమిది, ఎంత కాలమిట్లా లేచి పరిగెత్తడాలు?’ ఆలోచనల నిండా వేధించే ప్రశ్నలు. సమాధానం రాబట్టాల్సిందిప్పుడే అనుకున్నాడు శేషు.నీడ ఎదురుగా నిలబడి ‘ఎవడ్రా, ఇక్కడ ఈ చీకట్లో కుర్చోని ఏం చేస్తున్నావ్?’ గద్దించింది. ‘నేనే’ అన్నాడు శేషు.‘నేనే అంటే?’ అంది నీడ. ఆ వెంటనే పోల్చుకొని గుర్తుపట్టి ‘నువ్వా, చీకట్లో ఏం పని, ఇంటికి పో’ అంది.‘ఇంకా ఎంత కాలమిలా’? శేషు నిలదీస్తున్నట్టు అడిగాడు. ఎదురుగా మౌనం. ఏం సమాధానమివ్వాలో తెలియక నిల్చుండిపోయాడు.‘ఎన్ని.. ఎన్నిసార్లు అడగాలి? అమ్మని పెళ్లి చేసుకొని, కొడుకుగా నాకు గుర్తింపు ఇవ్వమని! ఇంకా ఎంతకాలం అవమానాలు భరించాలి?’ అని నిలదీశాడు శేషు.‘అర్ధరాత్రివేళ ఈ మాటలొద్దు, ఇంటికి వెళ్ళిపో!’ అని గట్టిగా గదమాయించబోయాడు. శేషు వినే దశలో లేడు.‘ఏంటి.. వెళ్ళి పోయేది? నాకు ఇప్పుడే సమాధానం చెప్పాలి’ అని నిలదీశాడు. ఇట్లా మాటా, మాటా ఇద్దరి మధ్య పెరిగిపోయింది. ఆ మాటల్లోనే అవతలి నుంచి నన్నే నిలదీస్తాడా అనే కోపంలో శేషును అనరాని మాటలెన్నో అన్నాడు. చాలా చాలా అవమానపరచే మాటలనే జారాడు.‘నువ్వు నా కొడుకువని గ్యారంటీ ఏంటి?’ అన్నాడు. ‘నా అమ్మ’ ధీమాగా చెప్పాడు శేషు.‘రుజువు ఏది? మీ అమ్మ ఎక్కడెక్కడ ఎవరెవరితో తిరిగిందో నీకు తెల్సా?’ అన్నాడు.శేషులో కోపం కట్టలు తెగిన ప్రవాహంలా ఉగ్రరూపం దాల్చింది. అంతే ఎదుటి మనిషి భుజాల మీద రెండు చేతులేసి విసురుగా, బలంగా నెట్టి పడేశాడు. ఊహించని దాడిని ప్రతిఘటించి నిలబడలేక వెనక్కి విసిరేసినట్టు వెల్లకిలా పడిపోయాడు. వెనక వున్న మోరీ అంచుకు విసురుగా కొట్టుకుంది తల. వెల్లకిలా పడిపోయిన మనిషి గిలగిలా కాళ్ళు, చేతులు కొట్టుకోవడం చూశాడు శేషు. కాళ్ళు, చేతులు కొట్టుకోవడం ఆగిపోయేంత వరకు నిస్సహాయంగా చూస్తూ నిల్చున్నాడు. నిర్ఘాంతపోయి నిలుచున్నాడు. క్షణాల్లో ఘోరం జరిగిపోయింది. తను ఏమి ఆశించాడు, తన ఆవేశం ఏ మలుపు తిప్పింది, తను ఏం కోరుకున్నాడు, చివరికి ఏమైపోయింది! దుఃఖం ముంచుకొచ్చింది. ఆ దుఃఖంలోనే ఏటో వెళ్ళి పోయాడు శేషు.గాలి విసురుగా వీస్తోంది. ఆ గాలికి వేపచెట్టు పళ్ళు, పూత కలసి నేల రాలుతున్నాయి. జీవితం కూడా నేలరాలిన పళ్ళలా పిగిలి వగరు, చెదు, తీపి, వెగటు వాసన వేస్తోంది. ముక్కు పుటాలు అదిరి జ్ఞాపకాల నుంచి బయటపడ్డాడు శేషు. చంద్రుడు ఎప్పుడు పోడిచాడో చల్లటి తెల్లని వెన్నెల భూమంతా పరచుకొనుంది. శేషు చంద్రుడినే చూస్తున్నాడు.. లోలోన ‘చంద్రుడా అన్నీ చూస్తావ్, భలే మౌనం వహిస్తావ్. నీలోని నిబ్బరాన్ని కాస్త ఈ మనుషులకు కూడా పంచరాదు’ అనుకుంటూ విషాదాన్ని, దిగులును మోసుకుంటూ ఇంట్లోకి వెళ్ళాడు.‘పిలిపిస్తేనే రావాలా?’ అప్పుడు ఇల్లంతా స్వతంత్రంగా తిరిగేదానివి, ఇప్పుడు నా పర్మిషన్ కావాల్సి వచ్చిందా, ఏమిటి?’ నిష్ఠూరంగా అంది. తల్లీ, కొడుకు ఇద్దరూ వచ్చారు. వాకిట్లోనే నిలుచున్నారు. తల్లి, జరిగిందానికి దిగులుతో విచారంగా జీవం చచ్చిన కట్టెలా నిలబడి వుంది. కొడుకు తప్పు చేసిన భావనతో తల దించుకొని నిల్చున్నాడు. ఇంతకు తెగించిన వాడు ఇకముందు ఊరుకుంటాడా? ఆమె ఎందరినో సలహాలు అడిగింది. వారికి తోచిన పరిష్కారాలు సూచించారు. అందరూ తోడుగా వస్తామని, నిలుస్తామని ధైర్యాన్ని నూరిపొశారు. తనకు నమ్మకం కుదురట్లేదు.మళ్ళీ పుండును కెలికినట్టు అవుతుందని అనుకుంది. బజారున పడాల్సి వస్తుంది. పంచాయతీలు, పెద్ద మనుషుల వేడుకోళ్ళు.. ఎదుర్కోగల స్థితిలో వున్నానా అని ఆలోచించింది. అంత శ్రమపడ్డా పరిష్కారం ఏ మలుపు తీసుకుంటుందో.. అనుకూలంగా రాకపోతే? ఇద్దరు పాపల భవిష్యత్తు తన చేతుల్లోవుంది. ఇద్దరినీ చదివించి.. తీర్చిదిద్దాలి. ఈ ఆస్తులన్నీ ఉన్నాయనే ధీమాతో పిల్లల భవిష్యత్తు కోసమే సిటీలో కాపురం పెట్టించాడతను. సంవత్సరం నుంచి భూములు బీళ్ళను తలపిస్తున్నాయి. ఇలా వదిలేస్తే, ఇలానే మిగిలి వుంటాయని గ్యారంటీ లేదు. తనా ఈ వ్యవహారాలన్నీ చక్కదిద్దలేదు. అందుకే రాజీ మార్గాన్ని ఎంచుకుంది. ఈ స్థిరాస్తిని, ఫిక్స్డ్ డిపాజిట్లలోకి మార్చుకోవాలి. అందుకే ఓ నిర్ణయానికి వచ్చి వాళ్ళని పిలిపించింది. ‘ఏమే, పలకవు?’ రెట్టించింది ఆమె. అవతల మౌనమే సమాధానం. ‘ఇట్రారా..’ అని పిలిచింది.కొద్దిగా ముందుకు వచ్చి నిలబడ్డాడు శేషు. దగ్గరికి వచ్చిన వాడి చేతుల్లో కొన్ని కాగితాలు పెట్టింది. ‘ఐదు ఎకరాల మిర్చి చేను, ఈ ఇల్లు నీ పేరున మండల ఆఫీసులో రిజిస్ట్రీ చేయించా. మేము ఇల్లు ఖాళీ చేసి వెళ్ళినంక ఇందులోకి వచ్చి ఉండండి’ అంది. మళ్ళీ తనే మాట్లాడుతూ.. ‘పూర్వాపరాలు నాకు తెల్సు. ఎంతైనా నువ్వు ఆయనకు పుట్టిన బిడ్డవనే ఇదంతా! అతగాడే చేసుంటే ఇక్కడిదాకా వచ్చుండేది కాదు. ప్రతిసారి అడ్డగించి ధైర్యంగా అడుగుతున్నాడు వాడు. ఎదో ఒకటి చేయడం మంచిదని చెప్పేదాన్ని. ఆ మనిషి వినలేదు. సంబంధం పెట్టుకునేప్పుడే పరువు, ప్రతిష్ఠాని ఆలోచించాలి అని కూడా చెప్పిన. చెవినెక్కించుకోలేదు. నష్టం జరిగిపోయింది. ఇప్పుడు నీ జీవితం నాశనం చేస్తే ఏమొస్తదనిపించింది. క్షేమంగా బతుకు’ అని దీవించింది.అంచనాకు చిక్కని పరిణామం. శేషు బుర్రకు అర్థంకాలేదు. ఇప్పట్లో అర్థంకాదు కూడా! తల్లి అయోమయానికి గురయింది. నిప్పు మీద నీళ్ళు చిలకరించిన చర్య అనుకుంది. ‘మొత్తం భూములన్నీ అమ్మేయాలని, ఈ రెండూ నీ పేరున రాయించి. నీ హక్కు కిందనే ఇచ్చిన. వాటా కింద జమకట్టుకుంటావో, మా దయగా అనుకుంటావో.. ఎట్ల లెక్కిస్తావో నీ ఇష్టం’ అని విసురుగా ఇంట్లోకి వెళ్లిపోయింది.కొద్దిసేపు అక్కడే నిల్చున్నారు ఇద్దరూ. ఇంట్లో నుంచి ఏ స్పందన లేదు. చెల్లెళ్ళు ఏమన్నా బైటికి వస్తారేమో చూద్దామని ఆశపడ్డాడు శేషు. ‘తల్లులు వేరైనా, ముగ్గురికీ తండ్రి ఒక్కడే కదా’ తను చేసిన ఘోరానికి క్షమాపణ కోరుదామనుకున్నాడు. ఎదురుచూపు ఫలించక వెనుకకు మళ్ళాడు.. తల్లితో. గుప్పిట్లో కాగితాల్ని బిగించి పట్టుకున్నాడు. అవి బిగి గుప్పిట ఊరిన చెమటలో తడిసిపోయి, సగం వరకు నలిగిపోయాయి. తను అడిగింది నలిగిపోయే కాగితాల్లో ఆస్తి కాదు. తను, అతనికి పుట్టిన బిడ్డగా హక్కు. ఇవ్వలేక పెనుగులాటలోనే పోయాడు మహానుభావుడు. దయ అట.. దయ! భిక్షేం కాదు..! ఇది నా హక్కు. ఇప్పుడు ఈ చిరిగిపోయే కాగితాల రూపంలో నా వారసత్వ హక్కు. ఇది కూడా అవసరమే! దక్కిన హక్కే!’ అనుకున్నాడు శేషు. – హనీఫ్ -
ఉత్తంకోపాఖ్యానం: కృతయుగంలో గులికుడు అనే కిరాతుడు..
కృతయుగంలో గులికుడు అనే కిరాతుడు ఉండేవాడు. అడవిలో జీవించే కిరాతులకు అతడే రాజు. వేటలో ఆరితేరిన గులికుడు పరమ దుర్మార్గుడు. ఇతరులను నిష్కారణంగా హింసించి, వారిని దోచుకునేవాడు. గులికుడి పాపాలను చెప్పుకోవాలంటే ఎంత కాలమూ సరిపోదు. ఒకనాడు గులికుడు సంపదలకు నిలయమైన సౌవీర రాజ్యానికి వెళ్లాడు. ఐశ్వర్యంతో తులతూగే రాజధాని నగరంలో అడుగుపెట్టాడు. అక్కడ బంగారు గోపురాలతో ధగధగలాడే శ్రీహరి మందిరాన్ని చూశాడు. ఎలాగైనా, ఆలయంలోని బంగారాన్ని దక్కించుకోవాలనుకున్నాడు. చీకటి పడిన తర్వాత నెమ్మదిగా ఆలయంలోకి చొరబడ్డాడు.ఆలయంలోకి ప్రవేశించిన గులికుడు ఒక స్తంభం చాటున నక్కి పరిసరాలను పరిశీలించసాగాడు. గర్భగుడిలో శ్రీహరికి పరిచర్యలు చేస్తున్న ఒక మహాముని కనిపించాడు. ఆ మహాముని పేరు ఉత్తంకుడు. గర్భగుడిని ఆశ్రయించుకున్న ఉత్తంకుడు తన చౌర్యానికి అడ్డుగా ఉన్నందున గులికుడికి అసహనం పెరిగింది. ఉత్తంకుడిని చంపి అయినా, ఆలయంలోని సంపదను దోచుకోవాలని నిశ్చయించుకున్నాడు. వెంటనే కత్తి దూసి, ఉత్తంకుడి మీద దాడికి వెళ్లాడు.ఉత్తంకుడు కత్తితో దూసుకొస్తున్న గులికుడిని చూసి, ‘ఓ కిరాతుడా! నీవెందుకు నిష్కారణంగా నా మీద కత్తి దూశావు? నేను నీ పట్ల చేసిన అపరాధమేమిటి? సమర్థులు, వీరులు అపరాధులను శిక్షిస్తారు గాని, నిరపరాధులను కాదు. పరుల సొమ్మును దోచుకుని నువ్వు భార్యాబిడ్డలను పోషించుకుంటున్నా, అవసానకాలంలో నువ్వు ఒంటరిగానే మరణిస్తావు. నువ్వు దోచుకున్న సిరిసంపదలేవీ నీ వెంట రావు. నీ భార్యాబిడ్డలు కూడా నీ వెంట రారు. ఇహపరాలలో తోడుగా నిలిచేవి ధర్మాధర్మాలే తప్ప వేరు కాదు’ అని పలికాడు.ఉత్తంకుడి మాటలతో గులికుడికి జ్ఞానోదయమైంది. కత్తి పట్టుకున్న అతడి చేతులు వణికాయి. ఉత్తంకుడిని చంపుదామని ఎత్తిన చేయిని దించి, కత్తిని జారవిడిచేశాడు. వెంటనే ఉత్తంకుడి పాదాలపై పడి క్షమించమని ప్రార్థించాడు. పశ్చాత్తాపం నిండిన హృదయంతో ఉత్తంకుడికి నమస్కరించి, ‘విప్రోత్తమా! ఇంత వరకు నేను ఎన్నో పాపాలు చేశాను. నేడు నీలాంటి మహాత్ముడి దర్శనంతో నాకు జ్ఞానోదయమైంది. నేను ఎన్నో ఘోరాలు, నేరాలు, అకృత్యాలు చేశాను. పూర్వజన్మలో నేనేదో భయంకరమైన పాపం చేసి ఉంటాను. అందువల్లనే ఈ జన్మలో కిరాతుడిగా పుట్టాను. ఈ జన్మలో కూడా లెక్కలేనన్ని పాపాలు చేశాను. ఇకపై నాకు ఏ గతి పడుతుందో?’అంటూ విలపిస్తూ ఉత్తంకుడి పాదాల మీద పడి గులికుడు ప్రాణాలు విడిచాడు.పశ్చాత్తాపం చెంది మరణించిన గులికుడిని చూసి ఉత్తంకుడు జాలి చెందాడు. పరమదయాళువు అయిన ఆ మహాముని తన కమండలంలోని విష్ణుపాదోదకాన్ని తీసి, గులికుడి కళేబరం మీద చల్లాడు. శ్రీహరి పాదోదకం కళేబరాన్ని తాకగానే, గులికుడి పాపాలన్నీ నశించిపోయాయి. అతడికి ప్రేతశరీరం పోయి, దివ్యశరీరం వచ్చింది. విష్ణులోకం నుంచి వచ్చిన విమానం ఎక్కి, తనకు ఉత్తమగతిని కల్పించిన ఉత్తంకుడితో గులికుడు ఇలా అన్నాడు:‘ఓ మహర్షీ! పాపాత్ముడినైన నా మీద జాలి తలచి, నాకు ఉత్తమగతిని కల్పించిన నీవే నా గురువు. నీ ఉపదేశంతో నాకు జ్ఞానోదయమైంది. దయామయా! నీ అపరిమిత దయ వల్లనే నేను హరిపదానికి చేరుకోగలుగుతున్నాను. దయచేసి, నా అపరాధాలను మన్నించి, ఆశీర్వదించు’ అని కోరి నమస్కరించాడు. వెంటనే విమానం అతడిని విష్ణులోకానికి తీసుకుపోయింది. ఈ అద్భుత దివ్యదృశ్యాన్ని చూసి, ఉత్తంకుడు ఆనంద పరవశంతో శ్రీహరిని స్తుతిస్తూ ఆశువుగా స్తోత్రాన్ని పలికాడు.ఉత్తంకుడి స్తోత్రం పూర్తవుతూనే, శ్రీమహావిష్ణువు గరుడారూఢుడై వచ్చి దివ్యతేజస్సుతో ప్రకాశిస్తూ అతడి ముందు ప్రత్యక్షమయ్యాడు. తన ఎదుట నిలిచిన శ్రీహరిని చూసి, ఉత్తంకుడు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. ఆనందబాష్పాలతో శ్రీహరికి సాష్టాంగ నమస్కారం చేసి, ‘శ్రీమన్నారాయణా! పరంధామా! పురుషోత్తమా! పరమాత్మా! శరణు శరణు’ అని ప్రార్థించాడు.శ్రీమన్నారాయణుడు ఉత్తంకుడిని ఆదరంగా లేవనెత్తాడు. తలపై అభయహస్తముంచి ఆశీర్వదించాడు. ‘వత్సా! ఏమి కావాలో కోరుకో!’ అన్నాడు. ‘స్వామీ! నన్నెందుకు మోహంలో పడేస్తున్నావు? నాకు వేరే వరాలతో పనిలేదు. ఎన్ని జన్మలెత్తినా నీ దివ్య పాదారావిందాలపై నిశ్చల భక్తి నిలిచి ఉండేలా అనుగ్రహించు. అదొక్కటి చాలు నాకు’ అని పలికాడు ఉత్తంకుడు.ఉత్తంకుడి నిష్కల్మష భక్తిని గ్రహించిన శ్రీమన్నారాయణుడు అతడి శిరసును తన శంఖంతో స్పృశించి, పరమయోగులకు కూడా సాధ్యంకాని దివ్యజ్ఞానాన్ని అనుగ్రహించాడు. ‘ఉత్తంకా! నరనారాయణులు తపస్సు చేసిన బదరికాశ్రమానికి వెళ్లి తపస్సు చేయి. నీకు మోక్షం లభిస్తుంది. నీవు పలికిన నా స్తోత్రాన్ని త్రికాలాల్లో పఠించేవారికి నా అనుగ్రహం నిరంతరం లభిస్తుంది’ అని పలికి అంతర్ధానమయ్యాడు. – సాంఖ్యాయన -
మటన్ అంటే పరార్, వీకెండ్ అంటేనే బెంబేలు!
వీకెండ్ వస్తోంది అంటే మస్తీ మజా అన్నట్టు ఉండేది ఒకప్పుడు. కానీ ఇపుడు హెటెల్కి వెళదాం అంటేనే బెంబేలెత్తే పరిస్థితి. గొప్ప గొప్ప పేరున్న హోటల్స్‌లోనూ, ఐస్ క్రీం పార్లర్లలోనూ, బేకరీల్లోనూ ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. ఇటీవలి కాలంలో బ్రాండెడ్ అని చెప్పుకునే హోటల్స్, ఐస్ క్రీం షాపుల్లో అపరిశుభ్రవాతావరణం, పురుగులు పట్టిన వస్తువులు, కాలం తీరిన సరుకులు. తాజాగా బెంగళూరులో మటన్‌కు బదులు కుక్క మాంసం అమ్ముతున్నారనే వార్తలు ఆందోళన రేపాయి. తాజాగా మటన్ తిని ఒకే కుటుంబంలో నలుగురు మృత్యువాత పడటం కలకలం రేపింది.ఇటీవల రాజస్థాన్‌లోని జైపూర్ నుంచి బెంగళూరుకు మటన్ పేరుతో కుక్క మాంసం సరఫరా చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. తాజాగా కర్ణాటకలోని రాయచూర్ జిల్లా, కల్లూరు గ్రామంలో ఒక కుటుంబం కూడా మటన్ తెచ్చుకుని తిన్నారు. వాంతులు విరోచనాలతో ఆస్పత్రిలో చేరిన నలుగురూ ప్రాణాలు కోల్పోవడం విషాదం నింపింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. ఫుడ్ పాయిజన్ అయిందా.. లేక ఆ కుటుంబంపై ఏదైనా విషప్రయోగం జరిగిందా అనే అంశంపై విచారణ జరుపుతున్నారు. దీంతోవీకెండ్ అంటేనే భయమేస్తోందని, మటన్పేరెత్తాలంటేనే వణుకు పుడుతోందంటూ నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు పుకార్లను నమ్మవద్దని కొందరు సూచిస్తోంటే, ఇంటి ఫుడ్డే బెటర్ అంటున్నారు కొంతమంది నెటిజన్లు. కాగా మరోవైపు కుక్కమాసం విక్రయిస్తున్నారన్న పుకార్లపై స్పందించిన ఫుడ్ సెక్యూరిటీ అధికారులు అది కుక్క మాంసం కాదు మేక మాంసమే అని తేల్చిన సంగతి తెలిసిందే. ఇది గుజరాత్‌లోని కచ్-భుజ్ ప్రాంతాలలో కనిపించే సిరోహి అనే మేక జాతికి చెందినది వెల్లడించారు. వాటికి కొద్దిగా పొడుగు తోక, మచ్చలు కూడా ఉంటాయని తేల్చి చెప్పారు. మటన్ ఖరీదు ఎక్కువ కావడంతో తక్కువ రేటులో ఈ మాంసాన్ని విక్రయిస్తారని వివరణ ఇచ్చారు. ఈ ఘటనలో బీజేపీ మాజీఎంపీ ప్రతాప్ సింహ మరికొందరిపై కేసులు నమోదయ్యాయి. -
వయనాడ్ విలయం : ఆ చిన్నారి చెప్పిందే నిజమైంది! కానీ తండ్రి దక్కలేదు
కేరళలోని వయనాడ్ ప్రకృతి ప్రకోపం పెను విధ్వంసాన్ని సృష్టించింది. ఈ ప్రమాదంలో వందల మంది ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది ఆచూకీ తెలుసు కునేందుకు సహాయక బృందం, అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ విపత్తు గురించి ఓ చిన్నారి ముందే ఊహించిందా? గత సంవత్సరం తన పాఠశాల మ్యాగజైన్లో, 8వ తరగతి విద్యార్థిని లయ, జలపాతంలో మునిగిపోయిన బాలిక గురించి ఒక కథ రాసింది. అచ్చం వయనాడ్ విధ్వంసాన్ని పోలిన ఈ కథ బెస్ట్ స్టోరీగా ఎంపికైంది. ప్రస్తుతం ఈ స్టోరీ వైరల్‌గా మారింది.వయనాడ్ జిల్లాలోని గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్లో 8 వ తరగతి చదువుతున్న లయ అనే బాలిక రాసిన కథ ప్రస్తుత విధ్వంసాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించింది. జలపాతంలో మునిగి ఒక అమ్మాయి మరణిస్తుంది. చనిపోయిన తర్వాత ఆ అమ్మాయి పక్షిగా మారి, తిరిగి అదే గ్రామానికి తిరిగి వచ్చి రానున్న పెను ముప్పు గురించి హెచ్చరిస్తుంది. "వర్షం కురిస్తే, కొండచరియలు జలపాతాన్ని తాకుతాయి, ఆ ధాటికి అపుడు మానవ జీవితాలతో సహా మార్గంలో ఉన్న ప్రతిదానిని ముంచెత్తుతాయి" ఇదీ ఆమె కథ సారాంశం. కథలో భాగంగా అనశ్వర, అలంకృత అనే ఇద్దరు స్నేహితులు తల్లిదండ్రులకు చెప్పకుండా జలపాతం చూడటానికి వెళతారు. అపుడు "పిల్లలూ ఈ ఇక్కడి నుంచి పారిపోండి. ఇక్కడ పెద్ద ప్రమాదం జరగబోతోంది" అని వార్నింగ్ ఇస్తుంది. దీంతో ఆ పిల్లలు పారిపోతారు. వెనక్కి తిరిగి చూసేసరికి కొండపై నుంచి భారీగా వర్షపు నీరు, మట్టి, బురద వేగంగా ఆ గ్రామం వైపు దూసుకొస్తూ ఉంటుంది. అలా తనలాగా ఆ పిల్లలు జీవితాలు బలికాకుండా కాపాడుతుంది. ఆ తర్వాత విచిత్రంగా ఆ పక్షి అందమైన అమ్మాయిగా మారిపోతుంది. వయనాడ్ జిల్లాలోని చురల్మల ప్రాంతం ప్రస్తుతం కొండచరియలు సృష్టించిన విధ్వంసంలో లయ తండ్రి లెనిన్‌ను ప్రాణాలు కోల్పోవడం విషాదం. అంతేకాదు లయ చదువుతున్న పాఠశాల పూర్తిగా ధ్వంసమైంది. మొత్తం 497 మంది విద్యార్థుల్లో 32 మంది ప్రకృతి బీభత్సానికి బలయ్యారు. మరో ఇద్దరు విద్యార్థులు వారి తండ్రి, అక్కాచెల్లెళ్లను కోల్పోయారు. అయితే స్కూల్ హెడ్ మాస్టర్ వి ఉన్నికృష్ణన్, ఇతర ఉపాధ్యాయులు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుని బయటపడ్డారు. ఈ ప్రాంతంలోని రెండు పాఠశాలల నుండి నలభై నాలుగు మంది పిల్లలు తప్పిపోయారు. చాలామంది విద్యార్తులు తమ స్నేహితులను కోల్పోయిన షాక్‌లో ఉన్నారు. -
Aarti Kumar Rao: ప్రయాణ దారులలో.. ప్రకృతి గీతాలతో..
థార్‌లోని ఇసుక దిబ్బల గుండె సవ్వడి విన్నది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని పర్వతశ్రేణులతో ఆత్మీయ స్నేహం చేసింది. అస్పాంలోని వరద మైదానాలలో అంతర్లీనంగా ప్రవహిస్తున్న కనీళ్లను చూసింది. కేరళ, గోవా తీరాలలో ఎన్నో కథలు విన్నది. కొద్దిమందికి ప్రయాణం ప్రయాణం కోసం మాత్రమే కాదు. ఆనందమార్గం మాత్రమే కాదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఒక అన్వేషణ. తన అన్వేషణలో అందం నుంచి విధ్వంసం వరకు ప్రకృతికి సంబంధించి ఎన్నో కోణాలను కళ్లారా చూసింది బెంగళూరుకు చెందిన ఎన్విరాన్మెంటల్ ఫొటోగ్రాఫర్, రైటర్, ఆర్టిస్ట్ ఆరతి కుమార్ రావు....రాజస్థాన్‌లో ఒక చిన్న గ్రామానికి చెందిన చత్తర్‌సింగ్ గుక్కెడు నీటి కోసం పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. పశ్చిమబెంగాల్లో ఒక బ్యారేజ్ నిర్మాణం వల్ల నిర్వాసితుడు అయిన తర్కిల్ భాయి నిలదొక్కుకోవడానికి పడ్డ కష్టాలు తక్కువేమీ కాదు. సుందర్బన్ప్రాంతానికి చెందిన ఆశిత్ మండల్ వేట మానుకొని వ్యవసాయం వైపు రావడానికి ఎంతో కథ ఉంది. బంగ్లాదేశ్‌లోని మత్స్యకార్మికుడి పిల్లాడిని సముద్రపు దొంగలు కిడ్నాప్ చేస్తే ఆ తండ్రి గుండెలు బాదుకుంటూ ఏడ్చే దృశ్యం ఎప్పటికీ మరవలేనిది.ఒకటా... రెండా ఆరతి కుమార్ ఎన్నెన్ని జీవితాలను చూసింది! ఆ దృశ్యాలు ఊరకే ΄ోలేదు. అక్షరాలై పుస్తకంలోకి ప్రవహించాయి. ఛాయాచిత్రాలై కళ్లకు కట్టాయి. ఒక్కసారి గతంలోకి వెళితే... ‘ఉద్యోగం మానేస్తున్నావట ఎందుకు?’ అనే ప్రశ్నకు ఆరతి కుమార్ నోట వినిపించిన మాట అక్కడ ఉన్నవాళ్లను ఆశ్చర్యానికి గురి చేసింది.‘ప్రకృతి గురించి రాయాలనుకుంటున్నాను. అందుకే ఉద్యోగం మానేస్తున్నాను’ అని చెప్పింది ఆమె. యూనివర్శిటీ ఆఫ్ పుణెలో ఎంఎస్సీ, థండర్ బర్డ్ స్కూల్ ఆఫ్ గ్లోబల్ మేనేజ్మెంట్–ఆరిజోనాలో ఎంబీఏ, ఆరిజోనా యూనివర్శిటీలో మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేసిన ఆరతి అమెరికన్ టెక్నాలజీ కంపెనీ ఇన్‌టెల్‌లో ఉద్యోగం చేసింది. కొంత కాలం తరువాత తనకు ఉద్యోగం కరెక్ట్ కాదు అనుకుంది. సంచారానికే ప్రాధాన్యత ఇచ్చింది.బ్రహ్మపుత్ర నది పరివాహకప్రాంతాలకు సంబంధించిన అనుభవాలను బ్లాగ్‌లో రాసింది. పంజాబ్ నుంచి రాజస్థాన్ వరకు ఎన్నోప్రాంతాలు తిరిగిన ఆరతి ‘మార్జిన్‌ల్యాండ్స్: ఇండియన్ ల్యాండ్‌స్కేప్స్ ఆన్ ది బ్రింక్’ పేరుతో రాసిన పుస్తకానికి మంచి పేరు వచ్చింది. ప్రకృతి అందాలే కాదు వివిధ రూ΄ాల్లో కొనసాగుతున్న పురా జ్ఞానం వరకు ఎన్నో అంశాల ప్రస్తావన ఈ పుస్తకంలో కనిపిస్తుంది. ప్రకృతికి సంబంధించిన అందం నుంచి వైవిధ్యం వరకు, వైవిధ్యం నుంచి వైరుధ్యం వరకు తన ప్రయాణాలలో ఎన్నో విషయాలను తెలుసుకుంది. తాను తెలుసుకున్న విషయాలను అక్షరాలు, ఛాయాచిత్రాలతో ప్రజలకు చేరువ చేస్తోంది ఆరతి కుమార్ రావు.భూమాత మాట్లాడుతోంది విందామా!ఆరతి కుమార్ రావు రాసిన‘మార్జిన్‌ల్యాండ్స్’ పుస్తకం కాలక్షేప పుస్తకం కాదు. కళ్లు తెరిపించే పుస్తకం. ఇది మనల్ని మనదైన జల సంస్కృతిని, వివిధ సాంస్కృతిక కళారూ΄ాలను పరిచయం చేస్తుంది.– ‘ప్రకృతి దృశ్యాన్ని అర్థం చేసుకోవడానికి మనం తగినంత సమయాన్ని తప్పకుండా వెచ్చించాలి. దానిలో జీవించాలి. దానితో ఏకం కావాలి’ అంటుంది ఆరతి.– ఈ పుస్తకం ద్వారా మన సంస్కృతిలోని అద్భుతాలను మాత్రమే కాదు తెలిసో తెలియకో మనం అనుసరిస్తున్న హానికరమైన విధానాలు, ప్రకృతి విపత్తుల గురించి తెలియజేస్తుంది.– ‘మన సంప్రదాయ జ్ఞానంలో భూమిని వినండి అనే మాట ఉంది. భూమాత చెప్పే మాటలు వింటే ఏం చేయకూడదో, ఏం చేయాలో తెలుస్తుంది’ అంటుంది ఆరతి కుమార్ రావు.ఇవి చదవండి: Aruna Roy: 'ఈ పయనం సామాజికం'! -
Earth Overshoot Day 2024: ఆగస్టు1 నాటికే.. అన్నీ వాడేశాం!
భూగోళం ప్రకృతి వనరులను పునరుత్పత్తి చేసుకోగలిగే వేగం కంటే.. ప్రకృతి వనరులను మనుషులు అధిక వేగంతో వాడుకుంటూ ఉండటం వల్ల ఈ ఏడాదంతా వాడుకోవాల్సిన వనరులు ఆగస్టు1 నాటికే పూర్తిగా వాడేసుకున్నట్లు గ్లోబల్ ఫుట్‌ప్రింట్ నెట్వర్క్ చెబుతోంది. అంటే.. రేపటి (ఆగస్టు 2) నుంచి మనం పీల్చే గాలి, తాగే నీరూ, వాడే వనరులన్నీ ప్రకృతికి పెనుభారమే! అది తెలియజెప్పేదే ‘ఎర్త్ ఓవర్ షూట్ డే’.ఒక విధంగా చెప్పాలంటే.. మనుషులు భూగ్రహంపై పర్యావరణ వ్యవస్థలు పునరుత్పత్తి చేయగల దానికంటే 1.7 రెట్లు వేగంగా ప్రకృతివనరులను ఖర్చు చేస్తున్నారని 2024 ఎర్త్ ఓవర్ షూట్ డే సూచిస్తోంది. ఈ పర్యావరణ లోటు ఎంత ఎక్కువగా ఉంటే.. అడవుల నిర్మూలన, నేలకోత, జీవవైవిధ్య నష్టం అంత వేగంగా జరుగుతున్నట్లు లెక్క.419 పిపిఎంకి పెరిగిన సీఓ2..భూవాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ సాంద్రత 2023 నాటికి 419.3 పార్ట్స్ పర్ మిలియన్(పిపిఎం) స్థాయికి పెరిగింది. 2022 – 2023 మధ్యలో 2.8 పిపిఎం పెరిగింది. ఏడాదికి 2 పిపిఎం కన్నా ఎక్కువగా పెరగటం వరుసగా ఇది 12వ సంవత్సరం. ఈ సాంద్రత వల్లే భూ తాపం పెరిగిపోతోంది. ఫలితంగా పర్యావరణం గతి తప్పి.. వాతావరణం మార్పులకు లోనవుతోంది.ఎవరు లెక్కిస్తున్నారు?కెనడాలోని యోర్క్ యూనివర్సిటీ ‘ఎకలాజికల్ ఫుట్‌ప్రింట్ ఇనీషియేటివ్’ కార్యక్రమంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి పునరుత్పత్తి సామర్థ్యాన్ని, ఏయే దేశాల్లో ప్రకృతి వనరుల వాడకం ఏ తీరులో ఉంటోందో లెక్కగడుతోంది. అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రాల స్థాయిలో ఈ గణాంకాలు అందుబాటులో ఉన్నాయి. 1971లో ప్రపంచ పర్యావరణ బడ్జెట్ డిసెంబర్ ఆఖరి రోజుల వరకు సరిపోతూ ఉండేది. 1973 నుంచి లోటు పెరుగుతూ వచ్చింది. 1997 అక్టోబర్ వరకు ఉండేది. ఆ తర్వాత మరింత వేగంగా పెరుగుతూ 2024 ఆగస్టు 1 నాటికే పర్యావరణ వనరుల ఖాతా ఖాళీ అయే స్థితికి చేరింది.పర్యావరణ పాదముద్ర.. ఎంతమేరకు ప్రకృతి వనరులు వాడుతూ ఉంటే అంత పర్యావరణ పాదముద్ర (ఎకలాజికల్ ఫుట్‌ప్రింట్) ఉంటుందన్నమాట. ఇది ప్రతి మనిషికి, ప్రతి దేశానికీ వేర్వేరుగా ఉంటుంది. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ అమెరికన్లలా ప్రకృతి వనరులు వాడితే 5 భూగోళాలు అవసరం అవుతాయి. అయితే ఆ విధంగా చూసుకుంటే మాత్రం ప్రకృతి వనరుల వాడకంలో భారతీయులు పొదుపరులేనని చెప్పాల్సి ఉంటుంది. ప్రపంచంలో అందరూ మనలా ఉండగలిగితే 30% వనరులు మిగిలే ఉంటాయి.మీ పర్యావరణ పాదముద్ర ఎంత?దైనందిన జీవితంలో మనం చేసే ప్రతిపనికీ ప్రకృతి వనరులు ఎంతోకొంత ఖర్చవుతూనే ఉంటాయి. మనం చేసే పనులు, తినే ఆహారం, వాడే వాహన ఇంధనం, ధరించే వస్త్రాలు.. ఇలాంటివన్నీ మన పర్యావరణ పాదముద్ర స్థాయిని నిర్ణయిస్తాయి.జీవన శైలిని మార్చుకొని సహజ వనరుల వాడకాన్ని తగ్గించుకుంటూ ప్రకృతి పరిరక్షణకు దోహదం చేయొచ్చు.. భూతలమ్మీద వాతావరణంలో కర్బన ఉద్గారాలను పెంపొందించే పనులు తగ్గించే పనులను చేపట్టగలిగితే ఆ మేరకు.. ఎర్త్ ఓవర్ షూట్ డేని వెనక్కి జరపగలం! ఏటేటా పెరిగిపోతున్న పర్యావరణ అప్పు భారాన్ని ఆ మేరకు తగ్గించుకోగలుగుతాం. అయితే, పెరుగుతున్న జనాభా నేపథ్యంలో.. స్థూల జాతీయోత్పత్తి(జిడిపి) ఎలాగైనా ఏటా పెరగాల్సిందే అనే మానవాళి ధోరణితో.. ఇదెంత వరకు సాధ్యం అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న!ఇవి చదవండి: వీడియో: ఆకతాయిల ఓవరాక్షన్.. వరద నీటిలో మహిళపై వేధింపులు! -
ప్యారిస్ ఒలింపిక్స్ : లవ్‌బర్డ్స్ సందడి, వీడియో వైరల్
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతుల చిన్నకుమారుడు, కోడలు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్యారిస్ ఒలింపిక్స్‌లో సందడి చేశారు. గతనెలలో(జూలై 12)న వివాహ బంధంతో ఒక్కటైన లవ్‌బర్డ్స్ వివాహ వేడుకలతరువాత విశ్వక్రీడా సంరంభం ఒలింపిక్స్ గ్యాలరీలో జంటగా మెరిసారు. అనంత్-రాధిక ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. ప్యారిస్ ఒలింపిక్స్ వేడుకల్లో ఆసియా కుబేరుడుముఖేష్ అంబానీ, ఈషా అంబానీ, ఆమె భర్త ఆనంద్ పిరామిల్ పాల్గొంటున్నవీడియో కూడా సందడిగామారింది. రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ అయిన నీతా ఒలింపిక్స్ గేమ్స్ జరుగుతున్న ప్రాంగణంలో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన తొలి ఇండియా హౌజ్ లాంచ్ చేశారు. భారతీయ టెక్స్టైల్స్, హ్యాండీక్రాఫ్ట్స్‌కు చెందిన వస్తువులు, ఇతక కళాఖండాలను ఇక్కడ ప్రదర్శనకు ఉంటాయి. అలాగే భారత స్టార్ షూటర్ సరబ్జోత్ సింగ్, మనుభాకర్‌ను నీతా అంబానీ ప్రత్యేకంగా అభినందించి, వారితో సెల్పీలు దిగి శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Ambani Family (@ambani_update) -
Tree frog శాపం గురించి ఎపుడైనా విన్నారా?! ఆసక్తికర సంగతులు
మా తోటలోని అధ్బుతమైన మర్రివృక్షం కింద కట్టుకున్న రెండంతస్తుల ఇల్లు.. మన మనుషుల కోసం అనుకుని ఎంతో పొరబడ్డాను. మొదటి వేసవికాలంలో, కొన్ని చెట్టుకప్ప(Tree Frog) లు వచ్చి చక్కగా నివసిస్తుంటే, అది చూసి నేను ఎంతో ముచ్చటపడ్డాను. వాటి శరీరం కింద పొందికగా పెట్టిన వాటి నాజూకైన పాదాలతో, పెద్ద జాలిగొన్న కళ్ళతో చూసే వాటికి నేను ఇంత చోటు ఇవ్వడానికి వెనకాడలేదు. కానీ ఈ విషయం స్పష్టంగా మిగిలిన కప్ప వంశానికి తెలిసిపోయి, ముని ముని మనవలు, ముని ముని మేనల్లుళ్లు, మేనకోడలు మరియు అవ్వలూ, అందరూ వచ్చి చేరారు. అతి త్వరలో ప్రతీ చూరు, పుస్తకము, కప్పు, ఇంకా పటములు వాటితో నిండిపోయాయి. కొన్నయితే వాషింగ్ మెషీన్ సబ్బు పెట్టెలో కూడా దూరాయి; కొన్ని వాషబేసిన్ నుంచి బయటకి వెళ్లే పైపులలో, మరికొన్నైతే సుఖంగా ఫ్లష్ ట్యాంక్ గోతిలో, ఇక చాలా అయితే గోడకీ బీరువాకి మధ్యనున్న చిన్న చోటిలో దూరి పడుక్కున్నాయి. ఒక దయ నిండిన ఉద్వేగ క్షణంలో, మా బతుకు మేము బతకటానికి మాకు ఇంత చోటు వదిలాయి.అర దశాబ్దం క్రితం, ఒక ఏడాది నగరంలో గడిపినప్పుడు, నేను ఒక పిల్లిని కానీ, కుక్కని కానీ పెంచుకునే స్థోమత లేకపోయింది. వాటికి బదులుగా నేను ఒక చిన్న చెట్టు కప్పను పెంచుకున్నాను. తను ఉన్న చిన్న గదిలో నిత్యకృత్యాల కోసం ఒక చిన్న బేసిన్ పెట్టి, ఆహారం కోసం పురుగులను ఆకర్షించడానికి లైటు వేసి ఉంచాను. ఇది ఒక బాధ్యతారహిత బంధం: నేను నడిపించడానికి తీసుకువెళ్లాలని కానీ, భోజనం పెట్టాలని కానీ, విద్యలు నేర్పాలని కానీ నా పెంపుడు కప్ప ఆశించలేదు. తన మనుగడ మొత్తం ఆ ఒక చిన్న తేమ నిండిన గదిలో సాగించింది. కిటికీ బయట తనకి బ్రతికి బట్ట కట్టే అవకాశం ఆట్టే లేని ఒక గందరగోళ కాంక్రీట్ అడవి ఉంది. చెప్పడానికి మేము ఒకరినొకరు హత్తుకుని గడపకపోయినా, ఆ కప్ప అక్కడ ఉండడం వల్ల నేను కొంత సేద తీరాను. అంత బాగానే సాగుతున్నంతలో, ఒక పుస్తకం పడి కప్ప ప్రాణం పోయింది. ఈ విపత్తును ఊహించనందుకు నాకు తీరని ఆవేదన కలిగింది.కానీ ఇప్పుడు దాని ఖర్మ ఫలంగా, పురాతన ఈజిప్టు మమ్మీ శాపమంత ఖచ్చితంగా ఈ చెట్టు కప్ప శాపం నాకు చుట్టుకుంది. మా కొత్త ఇంట్లో ఆ కప్పలు కేవలం కాస్త చోటే ఆశిస్తే, నేను శాంతి వహించి ఉండేదాన్ని. కానీ అవి వాటి కింది భాగం ఎంతో వ్యూహాత్మక కోణంలో బయటికి తిప్పి, విచక్షణ లేకుండా వంటగది అరుగులనూ, బల్లలనూ, తువ్వాళ్లనూ, కంచాలనూ ఆక్రమించాయి. కొన్ని గదుల్లో ఎండిపోయిన కప్ప మూత్రం చారలు కట్టాయి. టాయిలెట్ పై కూర్చోవడం ఒక పెద్ద ప్రహసనంగా మారింది. టాయిలెట్ మూత కింద మరిన్ని కప్పలు నక్కి ఉండి, అప్రమత్తంగా లేని అతిధులను అతి సున్నితమైన శరీర భాగాలపై తట్టి ‘భౌ’ మని దాగుడుమూతలు ఆడేవి. ఒక పెద్ద తల్లి కప్ప, బాత్రూంలో లైట్ వేసే దురదృష్టవంతులు ఎవరిపైనైనా సరే మూత్ర జల్లు కురిపించేది. చీకటి బాత్రూములూ, కప్ప మూత్రపు వాసనగొట్టే తువ్వాళ్ళు వాడవలసి వచ్చినందుకూ, పలుమార్లు ప్లేట్లు కడుక్కోవలసి వచినందుకూ అలసి, విసిగి, ఆ గెంతే దౌర్భాగ్యులపై సున్నితమైన యుద్ధం ప్రకటించాము.మొత్తం 289 కప్పలను పట్టి, పొరుగునున్న నూతుల్లో వదలడంలో ఒక ఆదివారం గడిపాము. కానీ అదంతా వ్యర్ధ ప్రయాసే. అవి చిన్న జంతువులే కానీ వాటికి పరిసర జ్ఞానాం ఖచ్చితంగా ఉంది. మేము ఆఖరి కప్పను తొలంగించేలోపే, వాటి ఆరితేరిన ఇంటితోవ తెలుసుకునే నైజం వాటిని ఇంటికి చేర్చింది. అంతేకాదు, ఇరవై నాలుగు గంటలు గడిచేలోపు అవన్నీ వాటికి ఇంట్లో ప్రీతి అయినా స్థలాల్లోకి వచ్చేశాయి; అసల అవి వెళ్లనేలేదు అన్నట్టు. నేను వాటి అత్యుత్తమ ప్రతిభకు వంగి నమస్కరించాను.చాలా కప్పలు వంటగదిలోని మూల బీరువా తలుపు కింద దూరి, బూరెలమూకుళ్లపై, ప్రెషర్ కుక్కర్ పై, ఇంకా మిక్సీ జార్ల పై యాజమాన్యాన్ని ప్రకటించాయి. నిన్న నేను వెల్లుల్లిపాయలు వేయిస్తుండగా మూకుడి నుంచి ఒక ఘాటైన దుర్గంధం వచ్చింది….అది…కాదు… అయి ఉండదు... చెట్టు కప్ప మూత్రం! కాసిన్ని వెల్లుల్లి రెబ్బలు ఒలవడానికే నాకు కొన్ని యుగాలు పట్టింది. మరి కాసిన్ని వలవడానికి మిగిలి ఉన్న జీవితాన్ని వృధా చేయదలచలేదు. అంచేత ఆ వాసన మాపడానికి మరిన్ని మసాలా దినుసులు వేశాను. కానీ తర్వాత వచ్చిన పొగడ్తలు, నా అద్భుతమైన వంట నైపుణ్యానికి వచ్చాయో, లేదా దాగిఉన్న ఆ…. వంటవారి రహస్య దినుసు అందామా … దానివల్ల వచ్చాయో, నేను ఖచ్చితంగా చెప్పలేను.రచయిత : జానకి లెనిన్ఫోటోలు : సచిన్ రాయ్ -
ఈ చిన్నారిని గుర్తుపట్టారా? ఇపుడు రాజ్యసభ ఎంపీ!
రాజ్యసభ, ఎంపీ, రచయిత సుధానారాయణమూర్తి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. అనేక సామాజిక అంశాలపై తన అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటారు. ఒక్కోసారి తన వ్యక్తిగత విషయాలను జోడిస్తూ, మరికొన్ని అవగాహన కల్పించే అంశాలను తన అభిమానులతో కూడా షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా తన చిన్నప్పటి ఫోటో ఒకటి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఇది అభిమానులను ఆకట్టుకుంటోంది.‘‘ఈ ఫోటో నాకు సంవత్సరం వయస్సులో ఉన్నప్పుడు హుబ్లీలోని ఒక స్టూడియోలో తీసింది. ఆ సమయంలో, మేము షిగ్గావ్‌లో ఉండేవాళ్లం, కానీ అక్కడ స్టూడియోలు లేనందున, మేము ఈ ఫోటో కోసం హుబ్లీకి వెళ్లాం’’ అంటూ సుధామూర్తి తన బాల్య స్మృతులను నెమరు వేసుకున్నారు.This picture was taken in a studio in Hubli when I was around 1 year old. At the time, we were living in Shiggaon, but since there were no studios there, we travelled to Hubli for this photograph. pic.twitter.com/YjhjJ3Aw5L— Smt. Sudha Murty (@SmtSudhaMurty) July 30, 2024 -
జాను శీర్షాసనం.. తల నుంచి మోకాలి వరకు!
తల నుంచి మోకాలి వరకు ఉండే ఈ భంగిమను జాను శీర్షాసన అంటారు. ‘జాను’ అంటే మోకాలు ‘శీర్ష’ అంటే తల. ఈ ఆసనాన్ని వేసే ముందు మ్యాట్ పైన సుఖాసనంలో కూర్చోవాలి.ఒక కాలును ముందుకు చాపి, చేతులతో ఆ కాలిపాదాన్ని పట్టుకోవాలి. తలను మోకాలి మీదుగా ఉంచాలి. మడిచి ఉన్న రెండవ కాలుపాదం మరొక కాలును తాకినట్టుగా, ΄÷ట్ట దగ్గరగా ఉండాలి. ఈ ఆసనంలో ఎక్కువ సేపు ఉండటం వల్ల వెన్నెముక సాగినట్టుగా, దిగువ శరీరం అంతా రిలాక్స్ అయినట్టుగా అనిపిస్తుంది. జీర్ణక్రియ, శ్వాసకోశ పనితీరును మెరుగుపరుస్తుంది. నడుము నొప్పి, ఒత్తిడి, నిరాశ, అలసటపై ప్రభావం చూపుతుంది.అధిక బరువుకు:మొదట్లో ఈ ఆసనం వేస్తున్నప్పుడు కొంత సవాల్‌గా అనిపిస్తుంది. ఎక్కువ ఒత్తిడి లేకుండా మెల్లగా ప్రయత్నించడం వల్ల ఈ భంగమను సాధన చేయవచ్చు. ఒక కాలును ఒకసారి రెండవ కాలును మరొకసారి 5 సార్లు మార్చుతూ చేయాలి. రోజూ పరగడపున పది సార్లు ఈ ఆసనం వేయడం వల్ల అధికబరువు, గ్యాస్ట్రిక్, మధుమేహం సమస్యలకు మంచి పరిష్కారం లభిస్తుంది. రోజులో ఉండే ఒత్తిడి నుంచి కూడా త్వరగా రిలాక్స్ అవుతారు.సూచన:గర్భిణులు, హెర్నియా, ఆస్తమా, స్పాండిలోసిస్, స్లిప్డ్ డిస్క్ వంటి సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు లేదా యోగా నిపుణుల ఆధ్వర్యంలో మాత్రమే సాధన చేయాలి.– జి. అనూషా రాకేష్, యోగా ట్రైనర్ఇవి చదవండి: నైట్ బ్రషింగ్ తప్పనిసరి.. లేదంటే ఈ సమస్యలు రావచ్చు! -
తిరుపతిలో 3,4 తేదీల్లో.. ఆర్గానిక్ ఉత్పత్తుల మేళా!
ఆగస్టు 3, 4 తేదీల్లో తిరుపతిలోని తుడా బిల్డింగ్ వెనుక గల కచ్ఛపీ కళాక్షేత్రంలో ప్రకృతి/సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో పండించిన ఆహారోత్పత్తులు, చేనేత వస్త్రాల మేళాను కనెక్ట్ టు ఫార్మర్స్ సంస్థ నిర్వహించనుంది. ఉ. 11 గం. నుంచి రాత్రి 8 వరకు అనేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 3వ తేదీ(శనివారం) ఉ. 11 గం.కు ప్రకృతి వనం వ్యవస్థాపకులు ఎంసీవీ ప్రసాద్ ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పిస్తారు. దేశవాళీ వరి విత్తన ప్రదర్శన ్రపారంభం. 4(ఆదివారం)న ఉ. 10.30 గం.కు దేశవాళీ వరి విత్తన పరిరక్షణ ్రపాముఖ్యతపై అక్బర్, బాపన్న అవగాహన కల్పిస్తారు. మట్టి వినాయక బొమ్మల తయారీపై శిక్షణ ఉంటుంది.హైదరాబాద్‌లో పాలేకర్‌తో చర్చాగోష్టి నేడు..సుభాష్ పాలేకర్ కృషి (ఎస్.పి.కె.) పద్ధతిలో పర్యావరణ హితమైన అల్కలైన్ ఆహారోత్పత్తుల ఉత్పత్తి, మార్కెటింగ్ తదితర అంశాలపై ఈ నెల 30 (మంగళవారం)న హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లో తెలుగు రాష్ట్రాల రైతులు, సామాజిక కార్యకర్తలు, సినీ ప్రముఖులు, రచయితలు, వైద్యులు, పాత్రికేయులతో పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ సుభాష్ పాలేకర్ చర్చాగోష్టి జరగనుంది. ఈ నెల 30(మంగళవారం)న మధ్యాహ్నం 3–6 గంటల మధ్య జూబ్లీహిల్స్ ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్ (ఫిలింనగర్ క్లబ్)లో చర్చాగోష్ఠి జరుగుతుందని నిర్వాహకులు వి.నరసింహారెడ్డి (98662 46111), నరేశ్ (99481 58570), విజయరామ్ (63091 11427) తెలిపారు. పాలేకర్ ఆంగ్ల ప్రసంగాన్ని అప్పటికప్పుడు తెలుగులోకి అనువదిస్తారు. ప్రవేశం ఉచితం.4న మిరప, అపరాల సేంద్రియ సాగుపై శిక్షణ..సేంద్రియ పద్ధతిలో మిరప, అపరాల సాగు, వివిధ రకాల కషాయాలపై ఆగస్టు 4 (ఆదివారం) ఉ. 10 గంటల నుంచి హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఆవరణలో రైతులకు నాగర్‌కర్నూల్‌కు చెందిన సీనియర్ ప్రకృతి వ్యవసాయదారు లావణ్యా రెడ్డి శిక్షణ ఇస్తారని నిర్వాహకులు, రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ డా. వై. వెంకటేశ్వరరావు తెలిపారు. వివరాలకు.. 95538 25532ఇవి చదవండి: 'ఇండ్ గ్యాప్' సాగు బాట.. రసాయనాల్లేని పంట! -
'ఇండ్ గ్యాప్' సాగు బాట.. రసాయనాల్లేని పంట!
రసాయనిక అవశేషాలు లేని నాణ్యమైన పంట దిగుబడులు పండించి ప్రజారోగ్యానికి పెద్దపీట వేసే దిశగా ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఇండియా గుడ్ అగ్రికల్చర్ ్రపాక్టీసెస్ (ఐ.జి.ఎ.పి.– ఇండ్ గ్యాప్) మంచి ఫలితాలనిస్తున్నాయి. అనేక మంది రైతులు గ్యాప్ పద్దతులకు అనుగుణంగా ఆహార పంటలు పండించేందుకు ఆసక్తి చూపుతున్నారు. రసాయనిక ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని దశల వారీగా తగ్గిస్తూ, రసాయనిక అవశేషాల్లేని నాణ్యమైన, అధిక పంట దిగుబడుల ఉత్పత్తి సాధించటం ఇండ్ గ్యాప్ పద్ధతిలో ముఖ్యమైన అంశం.తుంగభద్ర సేంద్రియ వ్యవసాయ ధాన్య విత్తన రైతుల పరస్పర సహాయ సహకార సంఘంలో సభ్యులైన రైతులు గ్యాప్ పద్ధతులను ఆచరిస్తూ ఆదర్శంగా నిలిచారు. 2023–24లో కర్నూలు జిల్లాలోని సీ.బెలగల్ మండలం కొండాపురం (రంగాపురం), గుండ్రేవుల గ్రామాల్లోని 50 మంది రైతులు ఈ సంఘంలో సభ్యులుగా ఉన్నారు. గ్యాప్ పద్ధతులనుపాటిస్తూ బీపీటీ 5204 రకం వరి పంటను సాగు చేశారు. రైతులు ఒక్కొక్కరు అరెకరం నుంచి మూడు ఎకరాల వరకు మొత్తం 24.09 హెక్టార్లలో గ్యాప్ పద్దతులకు అనుగుణంగా వరి పండించారు.గ్యాప్ నిబంధనల ప్రకారం వరి సాగు పూర్తిగా వ్యవసాయ అధికారుల పర్యవేక్షణలో జరిగింది. 10–15 రోజులకోసారి డాక్టర్ వైఎస్ఆర్ పొలంబడి కార్యక్రమాన్ని గ్రామంలో నిర్వహించి రైతులకు గ్యాప్ పద్దతులపై అవగాహన కల్పించారు. కర్నూలు ఏడీఏ సాలురెడ్డి, సి.బెలగల్ ఏవో మల్లేష్ యాదవ్, జిల్లా వనరుల కేంద్రం అధికారులు ప్రతి పొలంబడికి వెళ్లి పంటలను పరిశీలించి రైతులకు సూచనలు ఇస్తూ వచ్చారు.కొండాపురం, గుండ్రేవుల గ్రామాల్లోని 50 మంది రైతుల్లో ప్రతి రైతు 100 శాతం గ్యాప్ పద్దతులుపాటించారు. నాట్లకు ముందు సామూహికంగా పచ్చి రొట్ట ఎరువు పంట సాగు చేసి, పూత దశలో పొలంలో కలిపి దున్నేశారు. ఎకరాకు 3–4 టన్నుల పశువుల ఎరువు వేసుకున్నారు. కొందరు రైతులు వేపచెక్క, వర్మీ కంపోస్టు కలిపి వేసుకున్నారు. పురుగుల బెడదను తగ్గించుకునేందుకు ఎకరాకు 5–6 లింగాకర్షక బుట్టలు, జిగురు అట్టలు ఏర్పాటు చేసుకున్నారు. సాధారణంగా రసాయనిక వ్యవసాయం చేసే రైతులు ఈ ్రపాంతంలో ఎకరానికి 6–8 బస్తాల రసాయనిక ఎరువులు వేస్తూ ఉంటారు.గ్యాప్ పద్ధతిలో 4 బస్తాల వరకు రసాయనిక ఎరువులు, అనుమతించిన కొన్ని పురుగుమందులను తగు మోతాదులో మాత్రమే ఉపయోగిస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. పంట సాగు కాలంలో ఏపీ ఆర్గానిక్ సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీ అధికారుల బృందం మూడు దఫాలు పరిశీలించింది. వరి కోతలు పూర్తి కాగానే మూడు శ్యాంపుల్స్ సేకరించి గుంటూరులోని వ్యవసాయ శాఖ ల్యాబ్‌కు పంపారు. అక్కడ జరిపిన పరీక్షల్లో రసాయనిక అవశేషాల ప్రభావం జీరో ఉన్నట్లు స్పష్టం కావడంతో సర్టిఫికేషన్ అథారిటీ ఈ సొసైటీ రైతులకు ఉమ్మడిగా ఇండ్ గ్యాప్ సర్టిఫికెట్‌ను 2024 జనవరిలో జారీ చేసింది. ఆ తర్వాత రైతులు వరి ధాన్యాన్ని మిల్లింగ్ చేయించి బియ్యాన్ని మంచి ధరకు అమ్ముకున్నారు.దిగుబడితో పాటు ధరా ఎక్కువే!అతిగా రసాయన ఎరువులు, పురుగు మందులు వాడి ధాన్యం పండించిన రైతులు బియ్యం క్వింటాలు రూ.5,500 ప్రకారం విక్రయించుకుంటే, ఇండ్ గ్యాప్ సర్టిఫికెట్ పొందిన సహకార సంఘం రైతుల బియ్యానికి రూ.7,000 ధర లభించింది. మామూలుగా అయితే వరి సాగులో ఎకరాకు సగటున రూ. 45 వేల వరకు పెట్టుబడి వ్యయం అవుతుంది. ఇండ్ గ్యాప్ పద్ధతిలో ఖర్చు రూ.28 వేలు మాత్రమే. సగటున ఎకరాకు ధాన్యం దిగుబడి 2.51 క్వింటాళ్లు అదనంగా వచ్చింది. మొత్తం 50 మంది రైతులు 24.09 హెక్టార్లలో 102.9 టన్నుల దిగుబడి సాధించి రూ. 71 లక్షల ఆదాయం పొందారు. సాధారణ రసాయనిక వ్యవసాయ రైతులతో పోల్చితే ఇది రూ. 14.4 లక్షల అధికం కావటం విశేషం. ఈ స్ఫూర్తితో తుంగభద్ర సహకార సంఘం రైతులు ఈ ఏడాది కూడా గ్యాప్ పద్ధతిలోనే వరి సాగు కొనసాస్తున్నారు. – గవిని శ్రీనివాసులు, సాక్షి, కర్నూలు (అగ్రికల్చర్)నికరాదాయం పెరిగింది..8 ఎకరాల వ్యవసాయం చేస్తున్నా. నేను 2.75 ఎకరాల్లో ఇండ్ గ్యాప్ పద్ధతిలో వరి సాగు చేశాను. మిగతా పొలంలో పత్తి, ఉల్లి, మొక్కజొన్న పంటలు సాధారణ పద్ధతిలోనే పండిస్తున్నాను. సుస్థిర వ్యవసాయ కేంద్రం శాస్త్రవేత్తల సూచనలు చాలా ఏళ్లుగాపాటిస్తుండటంతో గ్యాప్ పద్ధతిని అనుసరించటం నాకు సులువైంది.వేప చెక్కను ఎక్కువగా వినియోగించడం, గో ఆధారిత పద్దతులుపాటించడం వల్ల పంట భూముల్లో సూక్ష్మ జీవులు విశేషంగా అభివృద్ది చెంది వరి పంట ఎదుగుదలకు తోడ్పడుతున్నాయి. కెమికల్స్ వాసన లేకుండా వరి పండించాను.మామూలుగా అయితే ఎకరాకు వరి సాగులో రూ.45–50 వేల వరకు పెట్టుబడి వ్యయం వస్తుంది. గ్యాప్ పద్ధతులుపాటించడం వల్ల ఎకరాకు రూ.28 వేలు చొప్పున 2.75 ఎకరాల్లో రూ. 77 వేలు ఖర్చయింది. 41 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వచ్చింది. మిల్లింగ్ చేయగా 27 క్వింటాళ్ల బియ్యం వచ్చాయి. కర్నూలు తీసుకెళ్లి క్వింటా రూ.7,000కు అమ్మాను. క్వింటాకు రూ. వంద రవాణా ఖర్చు వచ్చింది. రూ.1.09 లక్షల నికరాదాయం వచ్చింది. మా సంఘంలోని 50 మంది రైతుల్లో క్వింటా బియ్యం రూ.7,500కి అమ్మిన వాళ్లూ కొందరు ఉన్నారు. ఈ ఏడాది కూడా గ్యాప్ పద్ధతిలోనే వరి సాగు చేస్తున్నాం. – పి.మధుసూదన్‌రెడ్డి (94900 96333), రైతు, కొండాపురం, సీ.బెలగల్ మండలం, కర్నూలు జిల్లాఇండ్ గ్యాప్ సర్టిఫికేషన్‌కు శ్రీకారం..ఇండ్ గ్యాప్ పద్ధతుల్లో పండించిన ఆహారోత్పత్తులకు దేశంగానే కాదు, అంతర్జాతీయంగా కూడా ప్రత్యేక గుర్తింపు ఉంది. మన దేశంలో అమలయ్యే గ్యాప్ పద్ధతులకు కేంద్ర ప్రభుత్వ సంస్థ క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(క్యు.సి.ఐ.) ‘ఇండ్ గ్యాప్’ సర్టిఫికేషన్‌ను అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వం 2023–24 ఖరీఫ్ నుంచి ఏపీ రాష్ట్ర సేంద్రియ ఉత్పత్తుల ధృవీకరణ సంస్థ ద్వారా ఈ ఇండ్ గ్యాప్ సర్టిఫికేషన్ వ్యవస్థ రైతులకు దేశంలోనే తొలిగా అందుబాటులోకి తెచ్చింది. 2023–24లో ఏపీలోని ప్రతి జిల్లాలో పైలెట్ ్రపాజెక్టు కింద ఒక పంటను గ్యాప్ పద్ధతిలో పొలంబడిలో భాగంగా సాగు చేయించడం విశేషం.ఈ సదుపాయాన్ని ఉపయోగించుకున్న అనేక సహకార సంఘాలు, ఎఫ్.పి.సి.లు వ్యవసాయ శాఖ పొలంబడి కార్యక్రమం ద్వారా ఇండ్ గ్యాప్ పద్ధతులను అనుసరించి లబ్ధిపొందటం విశేషం. విత్తన ధృవీకరణ సంస్థ ద్వారా ఉత్పత్తులపై పరీక్షలు చేయించి రైతులకు ఈ సర్టిఫికేషన్ ఇస్తారు. తద్వారా రైతులు మంచి మార్కెట్ ధరకు విక్రయించి మంచి నికరాదాయాన్ని పొందుతున్నారు. దిగుబడులపై ఎటువంటి ప్రతికూల ప్రభావం పడకుండా క్రమంగా కెమికల్ వాడకాన్ని తగ్గిస్తూ.. అదే సమయంలో సేంద్రియం వైపు మళ్లే విధంగా రైతుల్లో అవగాహన కల్పించడం గమనార్హం.ఇవి చదవండి: పిల్లల నుంచి పోషణ కోసం.. తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించవచ్చా? -
సిక్స్ ప్యాక్ చెఫ్ ’కట్ చేస్తే’ : వరల్డ్ రికార్డ్, వైరల్ వీడియో
కూరగాయలు కట్ చేయడం కూడా ఒక కళే. కళే కాదు వరల్డ్ రికార్డు కూడా అని నిరూపించాడు ఒక నలభీముడు. అదీ కళ్లు మూసుకుని. ‘సిక్స్ ప్యాక్ చెఫ్’గా పేరొందిన కెనడియన్ చెఫ్ వాలెస్ వాంగ్(WallaceWong) కట్ చేయడంలో తన రికార్డుల పరంపరను కొనసాగించాడు. తాజాగా ఏకంగా కళ్లకు గంతలు కట్టుకొని మరీ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. పదునైన కత్తితో, తొమ్మిది టొమాటోలను సమానభాగాలుగా కట్ చేశాడు.చెఫ్ వాంగ్ జూన్ 12న లండన్‌లో కేవలం 60 సెకండ్ల వ్యవధిలో 9 టమోటాలను కోసి ఈ ఘనతను సాధించాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఇన్స్టాగ్రామ్ పేజీ దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది. వాయువేగంతో, అన్ని టొమాటాలను సమానంగా అందంగా కత్తిరించాడని వెల్లడించింది. ఇక్కడ విశేషం ఏంటేంటే ఏమాత్రం చిన్న తేడా వచ్చిన టమాటా ముక్కల స్థానంలో అతని వేళ్లు ఉండేవి. కానీ ప్రయోగాలు,రికార్డులు అతనికి వెన్నతో పెట్టిన విద్య. View this post on Instagram A post shared by Guinness World Records (@guinnessworldrecords)చాలా జాగ్రత్తగా ఒడుపుగా కట్ చేసి రికార్డు సొంతం చేసుకున్నాడు. వాలెస్ వాంగ్ ఈ ఒక రికార్డును మాత్రమే కాదు 2023, ఇటలీలో మరో రికార్డు కూడా క్రియేట్ చేశాడు. తాజా వీడియోపై కొంతమంది నెటిజన్లు సానుకూలంగా స్పందించగా, మా అమ్మ కూడా బాగా కట్ చేస్తుందని ఒకరు, ఇండియాలో ఇంతకంటే వేగంగా కట్ చేసే నిపుణులు చాలామంది ఉన్నారు అంటూ మరొకరు కమెంట్ చేశారు.వాలెస్ వాంగ్ చెఫ్, ఫిట్నెస్ అథ్లెట్, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ మాత్రమే కాదు. ఒక కంపెనీకి సీఈవో కూడా. కేన్సర్ సర్వైవర్. ప్రపంచవ్యాప్తంగా అనేక టాప్ మెస్ట్ రెస్టారెంట్లలో పనిచేశాడు. సోషల్ మీడియాలో లక్షలాది మంది ఫాలోవర్లున్నారు. Can he beat the record? #chef #worldrecord #foodpreparation #canadasgottalent #foodchopper guinessworldrecord Wallace Wong attempts a World Record on Canada's Got Talent! 🥕🔪 pic.twitter.com/FpJPRDJ9WC— Olivia Gran (@GranOlivia) April 21, 2024 -
పచ్చిమిరపమొక్కల్ని ఇలా పెంచితే కాయలే కాయలు!
గార్డెనింగ్ ఒక కళ. కాస్త ఓపిక, మరికాస్త శ్రద్ధపెడితే ఇంట్లోనే చాలారకాల పూల మొక్కల్ని పెంచుకోవచ్చు. కూరగాయలు, ఆకుకూరలు పండించు కోవచ్చు. పైగా వర్షాకాలం కాబట్టి బాల్కనీలోగానీ, ఇంటిముందు ఉన్న చిన్నస్థలంలోగానీ హాయిగా వీటిని పెంచు కోవచ్చు. గార్డెనింగ్‌తో మనసుకు సంతోషం మాత్రమేకాదు ఆర్గానిక్ ఆహారాన్ని తిన్నామన్న ఆనందమూ మిగులుతుంది. కిచెన్‌గార్డెన్‌లో చాలా సులభంగా పెరిగే మొక్కల్లో ఒకటి పచ్చి మిరపకాయ. ఇంట్లోనే పచ్చి మిరపకాయలను ఎలా పండించవచ్చు? తొందరగా పూత, కాపు రావాలంటే పాటించాల్సిన కొన్ని చిట్కాలను తెలుసుకుందాం.పచ్చిమిరపతో చాలా రకాల ప్రయోజనాలున్నాయి. ఆహారంలో రుచిని జోడించడమే కాకుండా, రోగనిరోధక శక్తిని పెంచడానికి ప్రసిద్ధి చెందిన విటమిన్ సి విటమిన్ పుషల్కంగా లభిస్తుంది. మొటిమలు, చర్మం ముడతల్ని నివారిస్తుంది. జుట్టుకు మంచిది , బరువు తగ్గడంలో సహాయ పడుతుంది. ఇది జీర్ణ రసాల ఉత్పత్తికి కూడా చాలా మంచిది. మరి ఇన్ని రకాల లాభాలున్న ఈ చిన్ని మొక్కను ఎలా పెంచుకోవాలి.సరైన విత్తనాలు ఎంచుకోవడం ముఖ్యంగా. సాధారణంగా ఎండుమిరపగింజలు వేసినాసులభంగా మొలకెత్తుతాయి. కానీ మంచి ఫలసాయం రావాలంటే నాణ్యమైన విత్తనాలను తెచ్చుకోవాలి. చిన్ని చిన్న కంటైనర్లు , కుండీలలో కూడా బాగా పెరుగుతాయి. 3-4 అంగుళాల లోతు , సరైన డ్రైనేజీ రంధ్రాలు ఉండేలా చూసుకోండి. తేమ , వెచ్చని వాతావరణం అవసరం కాబట్టి వాటిని పండించడానికి ఇంట్లో సెమీ షేడ్ ఉన్న ప్రాంతాన్ని ఎంచుకోవాలి. కంపోస్ట్ కలిపిన సారవంతమైన మట్టితో కుండీని ఉపయోగించాలి. మంచి నాణ్యమైన పచ్చిమిర్చి విత్తనాలను తీసుకుని, కుండీలో ఒక అంగుళం లోతులో నాటండి. మట్టిని తేమగా ఉంచాలి. అలా అని ఎక్కువ నీరు పోయకూడదు. వాతావరణాన్ని బట్టి ప్రతి రోజు లేదా ప్రతి 2 రోజులకు ఒకసారి నీరు పోయాలి. నీళ్లు ఎక్కువైతే మొక్క కుళ్లిపోతుంది. విత్తనాలను నాటిన 7-10 రోజులలో రెండు చిన్న మొలకలు వస్తాయి. వీటికి ప్రతిరోజూ 5-6 గంటల సూర్యకాంతి తగిలేలా చూసుకోవాలి. కాస్త ఎదిగిన తరువాత ఈ మొక్కలకు ట్రిమ్మింగ్ చాలా కీలకం. పూతకు ముందే చివర్లను కత్తిరిస్తే, మొక్క గుబురుగా వచ్చి, తొందరగా పూత కొస్తుంది. పూత దశలో లిక్విడ్ ఫెర్టిలైజర్ మొక్కకు అందిస్తే పూత నిలబడి, బోలెడన్ని కాయలు వస్తాయి. సరైన రక్షణ, పోషణ అందితే దాదాపు రెండేళ్లయినా కూడా మిరప చెట్టు కాయలు కాస్తుంది. -
ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన..!
తమిళనాడు రాష్ట్రం, కన్యాకుమారికి దగ్గరగా బంగాళాఖాతం సముద్ర తీరం వద్ద ఉన్న కుగ్రామం అది. అక్కడినుంచి ఓ యువకుడు స్వామి వారి దర్శనార్థం తిరుమల బయలుదేరాడు. ఏడు పదుల వయస్సు నిండిన తండ్రి కూడా తిరుమల వస్తానన్నాడు. అయితే, కూర్చుంటే లేవలేని, లేస్తే కూర్చోలేని ఆ వృద్ధుడి శరీరం ప్రయాణానికి సహకరించలేదు. కొండకు రాలేక పోతున్నందులకు తండ్రి చాలా బాధపడ్డాడు. ఇంటిలోని స్వామి వారి పటాన్ని చూస్తూ ‘‘మహిమలున్న స్వామివారి కొండనుంచి ఎన్నాళ్ళయినా చెడనిది, నీటిలో కరగనిది, ఎన్నటికీ వాడనిది ఏదైనా ఒకటి తీసుకుని రా! అయితే అది పవిత్రమైనదిగా ఉండాలి!!’’ అని చెప్పాడు.‘‘అలాగే నాన్నా!’’ అని చెప్పి రైలు ఎక్కాడు ఆ యువకుడు. ఆ రోజు గురువారం కావడంతో అతి నిరాడంబర స్వరూపంతో నొసటన చాలా సన్నని నామం మాత్రమే కలిగి ఉన్నారు స్వామివారు. గురువారం మాత్రమే కనిపించే ‘నేత్ర దర్శనం’ తృప్తిగా చేసుకున్న ఆ యువకుడు ఆనంద నిలయం నుంచి బయటికి వచ్చాడు. లడ్డూ ప్రసాదాలూ, కలకండ, తులసి చెట్టు లాంటివి తీసుకున్నాడు. గబుక్కున తండ్రి చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది. అయితే, తండ్రి చెప్పినట్లు ‘చెడనిది, కరగనిది, వాడనిది, ఏదై ఉంటుందా?’ అని ఆలోచించాడు. తను తీసుకున్న లడ్డూ ప్రసాదం వైపు చూశాడు. ‘ప్రసాదం ఎక్కువ కాలం నిల్వ ఉండదు కదా’ అనుకున్నాడు. కలకండ వైపు చూశాడు. ‘ఇది నీటిలో సులభంగా కరిగి΄ోతుంది కదా’ అని భావించాడు. తులసి చెట్టు వైపు చూశాడు. ‘కొన్నేళ్ళకైనా చెట్టు వాడినొతుంది కదా’ అని తలచాడు. ‘మరి తండ్రి చెప్పినట్లు వేరే ఏదైనా ఇక్కడ దొరుకుతుందా?’ అని మాడ వీధుల్లో వెదికాడు. ఆలాంటి వస్తువు ఏదీ అతడికి కనిపించలేదు. ‘నాన్నకి సులభంగా మాట అయితే ఇచ్చాను కానీ, అది నేరవేర్చలేకపోతున్నానే...’ అని బాధగా నడవటం ప్రారంభించాడు. రైల్లో వెళ్ళడానికి మరింత సమయం ఉండటంతో నామాల మిట్ట వద్దకు వెళ్ళి కూర్చున్నాడు. ‘పరిష్కారం ఏమిటా?’ అని పరిపరి విధాలా ఆలోచించాడు. అయితే పరిష్కారం ఏదీ దొరకలేదు. అక్కడినుంచి శిలా తోరణం వద్దకు నడుచుకుంటూ వెళ్ళాడు. సహజసిద్ధమైన ఆ తోరణాన్ని కన్నార్పకుండా చూస్తూ ఉన్నాడు. ఇంతలో ఓ కారు వచ్చి అక్కడ ఆగింది. అందులో హిందీ భాష మాట్లాడుతూ ఉన్న ఉత్తర భారత దేశీయులు ఉన్నారు. వాళ్ళు కారులో నుంచి దిగిందే ‘గోవిందా గోవిందా’ అని నామస్మరణ చేస్తూ నేలకు నమస్కరించారు. అక్కడే ఉన్న చిన్న రాళ్ళకు కూడా దండాలు పెట్టారు. అప్పుడు అతడి మనసులో మెరుపులాంటి ఆలోచన వచ్చింది.తిరుమల కొండలోని చెట్టూ పుట్టా, రాయీ ర΄్పా... అన్నీ పవిత్రమైనవే! ఈ నేలంతా స్వామి వారి పాద స్పర్శతో పునీతమైనదే. కాబట్టి ఇక్కడి రాయిని తీసుకెళ్ళి నాన్నకి ఇస్తాను. నాన్న చెప్పినట్లు ‘చెడనిది, కరగనిది, వాడనిది... పవిత్రమైనదీ ఇదే’ అని భావించి ఒక గుండ్రటి రాయిని తీసుకుని సంచిలో వేసుకున్నాడు. గోవింద నామ స్మరణలు చేస్తూ ఊరికి ప్రయాణం కట్టాడు. కొడుకు తెచ్చిన రాయిని చేతిలోకి తీసుకున్న ఆ వృద్ధుడి కళ్ళు తన్మయత్వంతో తడి అయ్యాయి. ఆ రాయికి పాలతో, నీళ్ళతో అభిషేకం చేసి, నామాలు పెట్టి, తులసి మాల వేసి దేవుడి గదిలో ఉంచారు. ‘స్వామే మన ఇంటికి నడిచి వచ్చాడు!’’ అనుకుంటూ భక్తిశ్రద్ధలతో పూజ చేసి, కొండ లడ్డును ఊరంతా పంచిపెట్టారు.– ఆర్.సి. కృష్ణస్వామి రాజు -
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆటబొమ్మను ఎప్పుడైనా చూశారా!
ఆటబొమ్మల ఖరీదు ఎంత ఉంటుంది? పది రూపాయల నుంచి కొన్ని వందల రూపాయల్లో రకరకాల ఆటబొమ్మలు దొరుకుతాయి. మరీ ఖరీదైన ఆటబొమ్మలైనా సరే, కొన్ని వేల రూపాయలకు మించి ఉండవు.ఇది మాత్రం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆటబొమ్మ. ఇది అలాంటిలాంటి ఆటబొమ్మ కాదు, టాయ్ రోబో! పిల్లలు ఆడుకునేందుకు వీలుగా జపాన్‌కు చెందిన ప్రముఖ ఆభరణాల తయారీ సంస్థ ‘గింజా తనాకా’, ఆటబొమ్మల తయారీ సంస్థ ‘బందాయి కంపెనీ’ కలసి ఈ టాయ్ రోబోను రూపొందించాయి. జపానీస్ సూపర్‌హిట్ కార్టూన్ సీరియల్ ‘గండామ్’లో కథానాయక పాత్ర పోషించిన రోబో నమూనాను అచ్చంగా పోలి ఉండేలా దీన్ని తీర్చిదిద్దాయి. ఈ రోబో ఎత్తు పదమూడు సెంటీమీటర్లు, బరువు 1.400 కిలోలు ఈ టాయ్ రోబో కూడా అసలు సిసలు రోబోల మాదిరిగా కొన్ని పనులు చేయగలదు. చిత్రవిచిత్రమైన విన్యాసాలతో, ఆటపాటలతో పిల్లలను అలరించగలదు. ఈ టాయ్ రోబో తయారీకి స్వచ్ఛమైన ప్లాటినమ్‌ను ఉపయోగించారు. దీని ఖరీదు 41,468 డాలర్లు (రూ.34.69 లక్షలు)ఇవి చదవండి: కేవలం వాయుభక్షణతో.. పదివేల ఏళ్లు తపస్సు! -
త్వరగా.. మేకప్ వేసుకోవాలనుకుంటున్నారా? అయితే దీనిని వాడండి..
ఈరోజుల్లో చిన్నచిన్న పార్టీలకైనా.. పెద్దపెద్ద ఫంక్షన్స్కైనా వేసుకున్న డ్రెస్‌కి తగ్గట్టుగా.. మేకప్ చేసుకోవడం కామన్ అయిపోయింది. దాన్ని చక్కగా సరిదిద్దుతుంది ఈ న్యూడెస్టిక్స్ కన్సీలర్ పెన్సిల్.వేగంగా మేకప్ వేసుకునేటప్పుడు.. ఐలైనర్స్, మస్కారా, ఐబ్రో పెన్సిల్ వంటివి పక్కకు అంటుకుని.. అందాన్ని చెడగొడుతుంటాయి. దాన్ని సరిచేయడానికి బోలెడు సమయం పడుతుంది. అలాంటి శ్రమను దూరం చేస్తుందీ పెన్సిల్. మేకప్ చెదిరిన చోట ఈ పెన్సిల్‌తో లైట్‌గా రుద్దుకుంటే చాలు.. మెరిసిపోతుంది ముఖం.అంతేకాదు ముఖం మీది చిన్న చిన్న మచ్చల్ని, గీతల్నీ దీంతో పోగొట్టుకోవచ్చు. అలాగే కంటి కిందున్న నల్లటి వలయాలను కనిపించకుండా చేసుకోవచ్చు. ఇందులో స్కిన్ కలర్ షేడ్స్ చాలానే అందుబాటులో ఉన్నాయి. మన స్కిన్ టోన్‌కి సరిపడా పెన్సిల్ని ఎంచుకుంటే సరిపోతుంది. దీనితో అవసరం అయిన చోట.. ముందుకు వెనుకకు రుద్ది, పొడిగా ఉండేలా.. వేలికొనలతో ఒత్తినట్లుగా రుద్దుకోవాలి. ఈ పెన్సిల్‌కి ఒక షార్పెనర్ కూడా లభిస్తుంది. ఇదే మోడల్లో చాలా రంగుల్లో ఈ పెన్సిల్స్ అందుబాటులో ఉన్నాయి.దీని తయారికీ.. విటమిన్ ఈ, నేచురల్ మాయిశ్చరైజర్, యాంటీ ఆక్సిడెంట్, షియా బటర్ వంటివి చాలానే వాడతారు. దాంతో దీన్ని డైరెక్ట్‌గా ఫేస్‌కి మేకప్‌లా అప్లై చేసుకోవచ్చు. ఇదే పెన్సిల్లో లిప్ స్టిక్స్ కలర్స్ కూడా లభిస్తున్నాయి. దీని ధర 24 డాలర్లు. అంటే 2,006 రూపాయలన్న మాట.ఇవి చదవండి: ఈ బీచ్‌బబుల్ టెంట్లకి.. ప్రత్యేకత ఏంటో తెలుసా!? -
ఈ బీచ్‌బబుల్ టెంట్లకి.. ప్రత్యేకత ఏంటో తెలుసా!?
సముద్రం ఒడ్డున పడుకుని, రాత్రివేళ చుక్కలను చూస్తూ నిద్రలోకి జారుకుంటే భలే బాగుంటుంది కదూ! సముద్రం ఒడ్డున పడుకుని, రాత్రివేళ ఆకాశంలోని చుక్కలను చూడటం వరకు సరే, నిద్రలోకి జారుకోవడం అంత తేలిక కాదు. ఆరుబయట పడుకుంటే, చీకటి పడిన తర్వాత దోమల దాడి నిద్రను దూరం చేస్తుంది. దోమల బెడదకు భయపడే ఆరుబయట నిద్రపోవడానికి చాలామంది వెనుకంజ వేస్తారు.అయితే, దోమల బెడద లేకుండా, ప్రశాంతంగా ఆరుబయట ఎదురుగా సముద్రాన్ని, ఆకాశంలోని చుక్కలను చూస్తూ గడిపే అద్భుతమైన అవకాశం మాల్దీవ్స్ పర్యాటకులకు ఇప్పుడు అందుబాటులో ఉంది. మాల్దీవ్స్‌లోని సీసైడ్ ఫినోలు రిసార్ట్స్ సంస్థ పర్యాటకుల కోసం ప్రత్యేకంగా బీచ్‌బబుల్ టెంట్లను అందుబాటులోకి తెచ్చింది. పారదర్శకంగా గోళాకారంలో ఉండే ఈ టెంట్లలో పడుకుంటే, రాత్రివేళ ఆకాశం సుస్పష్టంగా కనిపిస్తుంది.అల్ట్రావయొలెట్ కిరణాలు, నీరు చొరబడకుండా తయారు చేసిన ఈ టెంట్లలోకి దోమలు కూడా చొరబడలేవు. వాతావరణంలోని హెచ్చుతగ్గులను తట్టుకునేలా ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఈ టెంట్లలో బస పర్యాటకులకు అత్యంత సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ టెంట్లలో బసచేసిన వారు మెలకువగా ఉన్నా, నిద్రపోయినా అద్భుతమైన అనుభూతిని సొంతం చేసుకుంటారని ‘ఫినోలు’ సంస్థ నమ్మకంగా చెబుతోంది.మాల్దీవ్స్‌లోని బా అటాల్ బీచ్‌లో ‘ఫినోలు’ సంస్థ ఈ బీచ్‌బబుల్ టెంట్లతో ఇటీవల రిసార్ట్ ప్రారంభించింది. ఈ రిసార్ట్స్‌లో బబుల్ టెంట్లలో బసతో పాటు పర్యాటకులకు స్పా, హైడ్రోథెరపీ, జిమ్, బ్యూటీ పార్లర్, టెన్నిస్ కోర్ట్, గోల్ఫ్ కోర్స్ వంటి సౌకర్యాలు కూడా అందుబాటులో ఉండటం విశేషం. ఈ బీచ్ బబుల్స్‌లో ఒక రాత్రి బస చేయాలంటే, 476 డాలర్లు (రూ. 39,783) చెల్లించాల్సి ఉంటుంది.ఇవి చదవండి: క్షణికం! ట్రైన్లో అడుగు పెట్టి.. బెర్త్ కింద సూట్‌కేసు తోసి.. -
మొక్కలను కాపాడే స్మార్ట్ కుండీ ఇదే!
ఇంట్లో మొక్కలు పెంచుకోవడానికి కుండీలను వాడుతుంటాం. ఇంటి అందం కోసం కుండీలను ఏర్పాటు చేసుకున్నా, వాటిలోని మొక్కల ఆలనా పాలనా మనమే చూసుకోవాల్సి ఉంటుంది. ఒక్కోసారి మొక్కల ఆరోగ్య పరిస్థితి దెబ్బతింటే, అవి ఎండిపోయి, చనిపోతాయి. మొక్కల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు కనిపెట్టి, అందుకు అనుగుణంగా వాటి బాగోగులను చూసుకోవడం కష్టమే!ఈ సమస్యను తొలగించడానికే అమెరికన్ కంపెనీ ‘స్మార్టీ ప్లాంట్’ సంస్థ కుండీల్లోని మొక్కల రక్షణ కోసం స్మార్ట్ సెన్సర్‌ను తయారుచేసింది. సెన్సర్ అమర్చిన ఈ స్మార్ట్ కుండీల్లోని మొక్కలకు సునాయాసంగా రక్షణ కల్పించవచ్చు. అవి నిత్యం పచ్చగా కళకళలాడేలా చూసుకోవచ్చు. ఈ కుండీల్లోని స్మార్ట్ సెన్సర్ యాప్ ద్వారా పనిచేస్తుంది. వాతావరణంలోని ఉష్ణోగ్రత, తేమ, కుండీలోని మట్టిలోని తేమ, మొక్కల వేళ్లు, కాండంలోని పోషకాల పరిస్థితులను ఎప్పటికప్పుడు యాప్ ద్వారా సమాచారం అందిస్తుంది. దీని ధర 45 డాలర్లు (రూ.3,760) మాత్రమే!పిల్లల కోసం ఫిట్నెస్ వాచీ..రక్తపోటు, గుండె పనితీరు, శరీరంలో ఆక్సిజన్ స్థాయి వంటి వివరాలను చెప్పే స్మార్ట్ వాచీలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. అవన్నీ పెద్దల కోసం రూపొందించినవి. అయితే, అమెరికన్ కంపెనీ ‘ఫిట్‌బిట్’ ప్రత్యేకంగా పిల్లల కోసం ‘ఏస్ ఎల్టీఈ’ పేరుతో ఈ ఫిట్నెస్ వాచీని అందుబాటులోకి తెచ్చింది. ఇందులో ఫిట్నెస్ ట్రాకింగ్ సెన్సర్లు పిల్లల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తాయి.ఆ సమాచారాన్ని యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు చేరవేస్తాయి. ఈ వాచీని ఫోన్లా కూడా ఉపయోగించుకునే వీలు ఉంది. ఇందులోని కమ్యూనికేషన్స్ టాబ్ ద్వారా అవసరమైప్పుడు కాల్స్ చేసుకోవడానికి, మెసేజ్‌లు పంపుకోవడానికి కూడా వీలవుతుంది. ఏడేళ్లకు పైబడిన వయసు గల పిల్లలకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని ‘ఫిట్‌బిట్’ కంపెనీ చెబుతోంది. దీని ధర 229 డాలర్లు (రూ.19,126) మాత్రమే!నానోబాక్స్ మినీ డ్రమ్స్..మృదంగం, తబలా, డ్రమ్స్ వంటి తాళ వాయిద్యాలు లేకుండా సంగీత కచేరీలు పరిపూర్ణం కావు. అయితే, ఈ పరికరాలు కొంచెం భారీగా ఉంటాయి. ఆక్టోపాడ్ వంటి ఎలక్ట్రిక్ డ్రమ్స్ అందుబాటులోకి వచ్చినా, అవి కూడా కొంచెం భారీగా ఉండేవి, స్థలాన్ని ఆక్రమించుకునేవే! అమెరికన్ సంగీత పరికరాల తయారీ సంస్థ ‘1010 మ్యూజిక్’ ఇటీవల డ్రమ్స్‌ను అరచేతిలో ఇమిడిపోయే పరిమాణానికి కుదించి, ‘నానోబాక్స్’ను అందుబాటులోకి తెచ్చింది.‘రాజ్మాటాజ్’ పేరుతో రూపొందించిన ఈ మినీ డ్రమ్స్‌ను మిగిలి ఎలక్ట్రానిక్ సంగీత పరికరాల్లాగానే వాడుకోవచ్చు. ఈ ‘నానోబాక్స్’ పొడవు 3.75 అంగుళాలు, మందం 1.5 అంగుళాలు, వెడల్పు 3 అంగుళాలు. ఇందులోని 64 స్టెప్ సీక్వెన్సర్ ఔత్సాహికుల సాధనకు బాగా ఉపయోగపడుతుంది. ఈ నానోబాక్స్కు ఉన్న టచ్‌స్క్రీన్ ద్వారా కోరుకున్న ధ్వనులను, శబ్దాన్ని ఎంపిక చేసుకోవచ్చు. దీని ధర 399 డాలర్లు (రూ.33,327) మాత్రమే! -
కౌరవుల ఆలయాల గురించి విన్నారా? ప్రసాదంగా కల్లు, పొగాకు..!
పంచమహా వేదంగా పిలిచే మహాభారతం గురించి కథకథలుగా చదువుకున్నాం. అదీగాక వింటే భారతం వినాలి తింటే గారెలు తినాలి అన్న నానుడి కూడా ఉంది. ఎందుకంటే భారతం వింటూంటే రసవత్తరంగా ఉంటుంది. కథలో ఏం జరిగింతుందో.. అని చివరి వరకు ఉత్కంఠ రేకెత్తిస్తుంది. పలు ట్విస్ట్‌లు, భావోద్వేగాలు, సంఘర్షణలు,కుటుంబ విలువలతో మిళితమైన గొప్ప పురాణ గ్రంథం. అయితే ఈ పురాణ కథలోని కృష్ణుడికి, పాండవులకు దేవాలయాలు ఉన్నాయి. కానీ కౌరవులకు కూడా దేవాలున్నాయన్న విషయం తెలుసా..!. మొత్తం నూరుగురి కౌరవులకు దేవాలయాలు ఉన్నాయట. ఈ మూర్తులకు పెట్టే ప్రసాదంలో కూడా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అవేంటంటే..కేరళలోని కొల్లాంలో కౌరవుల యువరాజు దుర్యోధునుడి ఆలయం ఉందంట. ఏటా లక్షలాదిమంది ఈ ఆలయాన్ని దర్శించి పూజలు చేస్తుంటారట. అక్కడ ప్రజలు దుర్యోధనుడుని శక్తిమంతమైన దేవత అని, తమ కోరికలను తప్పక నెరవేరుస్తుందని నమ్మకంగా చెబుతున్నారు. ఇక్కడ కేవలం దుర్యోధనుడి ఆలయమే కాదు అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో వందమంది కౌరవులకు, కర్ణుడుకి ఆలయాలు ఉన్నాయట. కేరళలోని కురవ వంశ ప్రజలు కౌరవులను తమ పూర్వీకులుగా భావించి పూజిస్తారట. ఈ కౌరవుల ఆలయాలన్ని కొండల మీదే ఉండటం విశేషం. శుక్రవారమే విడిచిపెట్టడంతో..శుక్రవారంలో మరీ ప్రత్యేక పూజలు చేస్తుంటారట. ఎందుకంటే వనవాసం చేసిన పాండవులును వెంబడిస్తూ అలసిపోయి దాహంతో ఉన్న దుర్యోధనుడు తన వందమంది సోదరులతో కలిసి మలనాడ ప్రాంతానికి చేరుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. అప్పుడు ఒక వృద్ధ మహిళ దుర్యోధనుడికి కల్లు (పామ్ వైన్) ఇచ్చి అతడి దాహాన్ని తీర్చిందట. పైగా అక్కడి గ్రామస్తుల ఆతిథ్యానికి ముగ్ధుడయ్యాడు" పైగా దురోధనుడు శుక్రవారమే ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టాడట. అక్కడి ప్రజలకు మళ్లీ శుక్రవారం ఇక్కడకు వస్తానని హామీ కూడా ఇచ్చాడట. ఒకవేళ రాని పక్షంలో గ్రామస్థులు తాను చనిపోయాడని భావించి అంత్యక్రియలు చేయాలి అని దుర్యోధనుడు చెప్పాడని అక్కడి ప్రజలు చెబుతున్నారు. అయితే దుర్యోధనుడు తిరిగిరాలేదు. కానీ గ్రామస్థులు అతని ఆత్మ అక్కడికి తిరిగి వచ్చి పరబ్రహ్మను ఆరాధించిందని నమ్ముతారట. అందుకే అక్కడి ప్రజలు ఆయన పేరు మీద ఆలయాన్నికట్టి మరీ పూజలు నిర్వహిస్తున్నారు. అంతేగాదు ఈ ఆలయం పేరు మీదుగా చాలా భూములు కూడా ఉన్నాయట. ఒక్క దుర్యోధనునికే కాదు శకుని, దుస్సల, కర్ణునికి కూడా దేవాలయాలు ఉన్నాయట. పవిత్రేశ్వరంలో మలనాడ మహాదేవ శకుని ఆలయం ఉంది. ఈ ఆలయం దుర్యోధన ఆలయానికి 14 కి.మీ దూరం. ఈ పవిత్రేశ్వరంలోననే శకుని, ఇతర కౌరవులు కురుక్షేత్ర యుద్ధానికి సంబంధించిన తమ ఆయుధాగారాన్ని సిద్ధం చేసుకున్నారని స్థానికులు చెబుతున్నారు. వారు తమ బాణాల కొనను పదును పెట్టడానికి ఉపయోగించే ఒక ప్రత్యేకమైన రాయి ఇప్పటికీ ఈ ఆలయం సమీపంలో ఉందంట. అంతేగాదు శకుని మోక్షం కోసం శివుడిని ప్రార్థించిన ప్రదేశంలో ఇప్పటికీ..ఒక నల్లని ఉందని చెబుతారు. మోసపూరిత శకుని ఇక్కడ శుద్ధి పొంది మోక్షాన్ని పొందాడు కాబట్టి ఇది పవిత్రమైన ప్రదేశం అని అక్కడి ప్రజల నమ్మకం. ఇక కున్నతుర్లోని శకుని ఆలయం నుంచి 30 నిమిషాల ప్రయాణంలో ఒక ప్రత్యేకమైన కర్ణ దేవాలయం ఉంది.కర్ణుడు కౌరవుల కోసం పోరాడాడు, దుర్యోధనుని అత్యంత మిత్రుడుగా పేరుగాంచినవాడు.పైగా పాండవులలో పెద్దవాడు. అలాగేశూరనాద్లో, 100 మంది కౌరవ సోదరుల ఏకైక సోదరి అయిన దుస్సలకి కూడా ఆలయం ఉంది. కురుక్షేత్ర యుద్ధం తరువాత, దుస్సల ఇక్కడ ఒక వరి పొలానికి చేరుకుందనిని స్థానికులు నమ్ముతారు. నీటి అవసరం ఉండడంతో తాగునీరు దొరక్క కర్రతో పొలంలో తవ్వి ఆ కర్రను అక్కడే పూడ్చిపెట్టిందని కథలు కథలుగా చెబుతున్నారు. ఈ పొలం నుంచి వచ్చిన వరి ఇప్పటికీ ఈ ఆలయంలో పూజల కోసం ఉపయోగించడం విశేషం. ఇక ఈ దక్షిణ కేరళ అంతటా శకుని, కర్ణుడు కాకుండా 101 మంది కౌరవులకు ఆలయాలు ఉన్నాయట. వాటిలో కొన్నింటి జాడ తెలియాల్సి ఉందని వివరించారు స్థానికులు.ప్రసాదం కూడా ప్రత్యేకమే..దేవాలయాల ప్రత్యేకత మాత్రమే కాదు, పూజా విధానం, నైవేద్యాలు కూడా ప్రత్యేకమైనవి. కేరళలోని కురవలు దుర్యోధనుడు లేదా శకుని వంటి దేవతలను అప్పోప్పన్ (పూర్వీకుడు) గా భావించి పూజిస్తారు.ఇక్కడి ప్రజలు తమ రక్షణ కోసం, మంచి పంటలు కోసం ఈ దేవతలను ప్రార్థిస్తారు.ఇక్కడ ప్రధాన నైవేద్యం కల్లు, పొగాకు ఆకులతో పాటు కోడి, మేక, ఎద్దు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు.2019లో ఇక్కడ ప్రసాదంగా పెట్టిన 101 ఓల్డ్ మాంక్ రమ్ సీసాలు హైలెట్‌గా నిలిచాయి.అంతేగాదు భక్తులకు కూడా ఆ కల్లునే తీర్థంగా పంపిణీ చేయడం మరింత విశేషం. ఈ దేవాలయాలు భారతదేశ విశ్వాసాల వైవిధ్యానికి మరియు భారతీయ సంస్కృతిలో కథల శక్తికి కూడా నిదర్శనం. ఇది ఒక వేద వ్యాసుని మహాభారతమే అయినా.. ఇక్కడ వంద మంది కౌరవులకు మాదిరిగా వారికి సంబంధించిన ఆలయాలు గురించి వంద కథనాలు ఉన్నాయి.(చదవండి: వాల్నట్స్ తింటున్నారా..?ఐతే అలాంటివాళ్లు మాత్రం..!) -
Kalki Bujji: 'బుజ్జి' సందడితో.. యువత సెల్ఫీలు!
కల్కి సినిమాలో హీరో ప్రభాస్ ఉపయోగించిన ‘బుజ్జి’ కారు వరంగల్ నగరంలో సందడి చేసింది. ఇటీవల విడుదలైన కల్కి సినిమా ప్రపంచవ్యాప్తంగా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ నిమిత్తం హనుమకొండలోని ఏషియన్ మాల్లో ‘బుజ్జి’కారును బుధవారం ప్రదర్శనకు ఉంచారు.దీనిని చూసేందుకు యువత పెద్ద ఎత్తున తరలివచ్చింది. బుజ్జితో సెల్ఫీలు దిగి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసుకుని సంబురపడ్డారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, హన్మకొండ -
ఈ యువరైతుకి.. అరుదైన ఘనత!
సిద్ధేశ్ సాకోర్ (28)... ఒక మారుమూల గ్రామంలో ఓ పేద రైతు కుటుంబంలో పుట్టారు. మెకానికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ చదివారు. అయినప్పటికీ, తన తండ్రి వంటి చిన్న, సన్నకారు మెట్ట రైతుల ఆదాయాలు పెంచటం కోసం స్వగ్రామంలోనే ఉంటూ తన వంతుగా ఏదైనా చెయ్యాలన్నదే తపనంతా! ఈ తపనకు తోడైన ఆచరణే సిద్ధేశ్కి గత నెలలో ఓ ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ పురస్కారాన్ని తెచ్చిపెట్టింది! దాని పేరే.. భూమి హీరో!ఐక్యరాజ్య సమితికి చెందిన కన్వెన్షన్ టు కంబాట్ డిసర్టిఫికేషన్ గత నెల 17న బ్రెజిల్లో భూమి పరిరక్షణ కృషిలో క్రియాశీలపాత్ర నిర్వహిస్తున్న పది మంది యువతకు భూమి హీరో పురస్కారాలు అందించింది. ఈ పురస్కార విజేతల్లో సిద్ధేశ్ ఒకరు. మన దేశం నుంచి ఈయనొక్కరికే ఈ గుర్తింపు దక్కింది. ఆయన ప్రయాణం ఆసక్తిదాయకం.. స్ఫూర్తిదాయకం..అతనిది మహారాష్ట్ర పుణే జిల్లా షిరూర్ తాలూకా ధామరి గ్రామం. పేద వ్యవసాయ కుటుంబంలో పెరిగిన సిద్ధేశ్ కరువు పీడిత మెట్ట ్రపాంతాల్లో చిన్న, సన్నకారు రైతులు పడుతున్న కష్టాలను ప్రత్యక్షంగా చూశాడు. తాను వ్యవసాయం చేసి మార్పు తేవాలనుకున్నాడు. కొడుకు వ్యవసాయం చేయటం తండ్రికి ఇష్టం లేదు. కుటుంబ పొలాన్ని ఇవ్వనన్నాడు తండ్రి. మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీ చదవమన్నాడు. ఆ ప్రకారంగానే డిగ్రీ చదివిన సిద్ధేశ్ ఆ తర్వాత తమ జిల్లాలోనే గల విజ్ఞానాశ్రమంలో చేరి అనేక చిన్న యంత్రాలను ఆవిష్కరించాడు.వంటింటి వ్యర్థాలతో తక్కువ సమయంలో కంపోస్టు ఎరువు తయారు చేసే యంత్రాలను రూపొందించి శభాష్ అనిపించుకున్నాడు. ఈలోగా కరోనాతో తండ్రి చనిపోయారు. అప్పటికి తండ్రి బ్యాంకు ఖాతాలో రూ. 3వేలు నిల్వ ఉందని చెబుతూ.. ఇదీ చిన్న రైతుల దుస్థితి అంటారాయన. భూములను సారవంతం చేసుకుంటూ రైతుల ఆదాయం పెంచే పునరుజ్జీవన సేంద్రియ వ్యవసాయంతో రైతుల తలరాత మార్చవచ్చని సిద్ధేశ్ బలంగా నమ్మాడు.ఐదెకరాల్లోపు వర్షాధార వ్యవసాయం చేసే రైతులు తగినంత ఆదాయం లేక అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యల పాలవుతున్నారు. ఆదాయం ఎందుకు రావటం లేదు? వారి భూములు అతిగా రసాయనాలు వాడటం వల్ల నిస్సారమైపోతున్నాయి. సేంద్రియ కర్బనం 0.5% కన్నా తక్కువగానే ఉంది. ఆ నేలల్లో అరకొర దిగుబడులు రావటం, గిట్టుబాటు ధర రాకపోవటం వల్ల బడుగు రైతులు ఆత్మహత్యల పాలవుతున్నారు. ఈ వెతలన్నిటికీ మూలం సాగు భూమి అతిగా నిస్సారమైపోవటం అని గ్రహించిన సిద్ధేశ్ స్వగ్రామంలోనే ఉండి, వారసత్వ చిన్నకమతంలో పునరుజ్జీవన సేంద్రియ వ్యవసాయం చేస్తూ.. తోటి రైతులను కూడా ఆ దిశగా నడిపించే పనిని ్రపారంభించారు. ‘ఆగ్రో రేంజర్స్’ అనే లాభాపేక్ష లేని సంస్థను ఐదేళ్ల క్రితం స్థాపించాడు.సీజనల్ పంటలపైనే ఆధారపడకుండా చిన్న కమతాల రైతులు కూడా కొంత మేరకు పండ్ల తోటలు పండించుకుంటూ.. రసాయన వ్యవసాయం నుంచి స్థిరమైన సేంద్రియ వ్యవసాయానికి మారడానికి ఆగ్రో రేంజర్స్ రైతులకు మద్దతు ఇస్తోంది. బహుళ పంటలు పండించే పండ్ల చెట్ల ఆధారిత ఆగ్రో ఫారెస్ట్రీ నమూనాను ఆగ్రో రేంజర్స్ అభివృద్ధి చేసింది. ఇది రైతులకు స్థిరంగా ఆదాయం వచ్చేలా చేస్తుంది. అదే సమయంలో నేల నాణ్యతను మెరుగుపరుస్తుంది.గత 5 సంవత్సరాలుగా సిద్ధేశ్ బృందం 1,200 మంది రైతులకు శిక్షణ ఇచ్చారు. 23 గ్రామాల్లో వందకు పైగా ఎకరాల్లో రీజనరేటివ్ ఆగ్రో ఫారెస్ట్రీ నమూనాను క్షేత్రస్థాయిలో అమల్లోకి తేగలిగారు. రెండు, మూడు సంస్థల్లో నైపుణ్య శిక్షణ పొందటం ద్వారా, అనేక సంస్థల ఆర్థిక తోడ్పాటుతో ఆగ్రోరేంజర్స్ బృందం లోపాలను సరిదిద్దుకొని పురోగమిస్తోంది.రైతులు శిక్షణ తీసుకున్నప్పటికీ సాగు పద్ధతి మార్చుకోవటానికి ముందుకు రాకపోవటాన్ని గమనించి.. పండ్ల మొక్కలను, డ్రిప్ లేటరల్స్తో పాటు నాణ్యమైన శిక్షణ ఇవ్వటంతో మార్పు క్రమంగా వస్తోందని సిద్ధేశ్ తెలిపారు. వారికి ఎప్పుడు ఏమి అవసరమైతే అది చెబుతూ ముందుకు తీసుకువెళ్తే ఒక్కసారి ఈ పద్ధతి వల్ల ఆదాయం పెరిగితే ఇక వారికి నమ్మకం కుదురుతుంది. నేల క్షీణతను, వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కొనే దిశగా పునరుజ్జీవ ఆగ్రో ఫారెస్ట్రీ నమూనా సాగు పద్ధతిని చిన్న, సన్నకారు రైతులకు అందించే కృషిలో గ్రామీణ యువతను విరివిగా భాగస్వామ్యం చేయాలని సిద్ధేశ్ ఆశిస్తున్నారు.పుణేలోని లఖేవాడికి చెందిన రైతు జలంధర్ చేమాజీ మావ్లే మాటల్లో చె΄్పాలంటే.. ‘భూతాపం పెరిగిపోవటం అనే సమస్యను ఎదుర్కోవడానికి, సాధ్యమైనంత ఎక్కువ చెట్లను పెంచటం ఉత్తమం. అందువల్ల, పండ్ల మొక్కలు, బిందు సేద్యం, విలువైన పాఠాలతో నాకు సహాయం చేసిన ఆగ్రో రేంజర్స్ బృందంతో నేను కనెక్ట్ అయ్యాను. ఇది వాతావరణ మార్పుపై పోరాటంలో మాత్రమే కాదు. నాకు స్థిరమైన ఆదాయం కూడా వస్తోంది. రెండు ఎకరాల భూమి గతంలో పండ్ల మొక్కలు నాటాను. ఈ సంవత్సరం మరో మూడు ఎకరాల భూమి కోసం ప్లాన్ చేస్తున్నాను’.ఇవి చదవండి: కృత్రిమ మేధతో.. ‘గులాబీ’కి స్మార్ట్ వల!