Health
-
Utkatasana: బలాన్ని పెంచే ఉత్కటాసనం
రోజులో ఎక్కువ సేపు కూర్చుని పనిచేసేవారిని తక్కువ సమయంలోనే రిలాక్స్ చేస్తుంది కుర్చీ ఆసనం. ఈ కుర్చీ భంగిమను ఉత్కటాసన అంటారు. ఈ ఆసనాన్ని సాధన చేయడానికి ముందుగా శరీరాన్ని నిలుచున్న స్థానంలో సిద్ధ పరచాలి. సులువైన సాధన⇒ముందు నిటారుగా నిల్చోవాలి. పాదాలు రెండూ దగ్గరగా ఉంచి, చేతులను పైకి ఎత్తాలి. ⇒కుర్చీలో కూర్చున్నట్టుగా మోకాళ్లను ముందుకు వంచాలి. దీంతో హిప్ భాగం వెనక్కి, మోకాళ్లు ముందుకు వచ్చి, చెయిర్ మీద కూర్చున్న భంగిమ వస్తుంది. ⇒చేతులను నమస్కారం చేసినట్టుగా ఒక దగ్గరగా చేర్చాలి. ⇒ఈ భంగిమలో పొట్ట భాగం లోపలికి తీసుకుంటూ, వెన్నెముకను నిటారుగా ఉంచాలి. ∙దీర్ఘ శ్వాసలు తీసుకుంటూ, వదులుతూ వీలైనంత వరకు ఈ ఆసనంలో ఉండచ్చు. ⇒5 నుంచి 6 సార్లు ఈ ఆసనాన్నిప్రాక్టీస్ చేయడం ద్వారా కండరాలు బలపడతాయి. మెరుగైన పనితీరు⇒కాలు, కాలు వెనుక, భుజం కండరాలను బలోపేతం అవుతాయి. ∙రక్తప్రసరణ, గుండెపనితీరు పెరుగుతుంది. శ్వాసక్రియ మెరుగుపడటం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యమూ పెరుగుతుంది. -
ఒంటికి మంచిదే..మరి పంటికి?
ఇటీవల ఆరోగ్య స్పృహ పెరగడంతో ఆరోగ్యకరమైన జీవనశైలి అనుసరిస్తూ అందులో భాగంగా పండ్లూ, పళ్లరసాలు తీసుకోవడం పెరిగింది. అయితే ఇది ఆరోగ్యానికి మంచేదేమోగానీ పంటికి హానికరంగా పరిణమించవచ్చు. అలా ఒంటికి మంచిదైనా, పంటికి హాని చేసేవేమిటో, ఆ హానిని ఎలా అధిగమించవచ్చో తెలుసుకుందాం. పండ్లు / పండ్ల రసాలతో... తాజా పండ్లు, పళ్ల రసాలూ ఆరోగ్యానికి మంచివే. కానీ అవే ఫ్రూట్జ్యూసుల వల్ల పంటికి హాని జరగవచ్చు. ఉదాహరణకు పళ్లరసాల్లోని ఎక్కువగా ఉండే చక్కెర మోతాదులు పళ్లను దెబ్బతీవయచ్చు. అలాగే ఒకింత పుల్లగా ఉండే పండ్లలోని యాసిడ్స్ వల్ల కూడా పళ్లు దెబ్బతింటాయి.ఈ సమస్య అధిగమించడానికి...పండ్లను జ్యూస్ రూపంలో తాగడం కంటే కొరికి తినడం మేలు. ఉదాహరణకు నారింజ/బత్తాయి పండ్లు కొరికి తిన్నప్పటికి కంటే చక్కెర కలిపి ఆరెంజ్‌జ్యూస్ రూపంలో తీసుకున్నప్పుడు పళ్లు పాడయ్యే అవకాశం ఎక్కువ. పళ్లు బలహీనంగా ఉన్నవారు జ్యూస్ తీసుకోవాలనుకున్నప్పుడు అందులో ఎట్టిపరిస్థితుల్లోనూ చక్కెర కలుపుకోవద్దు. జ్యూస్ తాగిన వెంటనే నోరు శుభ్రంగా కడుక్కోవాలి.దగ్గు మందులతో... దగ్గు మందు ఔషధమే అయినా అది కూడా ఫ్రూట్ జ్యూస్‌లాంటి ముప్పునే తెచ్చిపెడుతుంది. దగ్గు మందుల్లోని గాఢత చిక్కదనం), అందులో ఉండే చక్కెర మోతాదులు... అచ్చం జ్యూస్‌లాంటి ప్రభావాన్నే చూపుతాయి. దాంతో పళ్లు దెబ్బతినే అవకాశం ఉంది. ఈ సమస్య అధిగమించడానికి...దగ్గు మందు తాగిన వెంటనే నోరు శుభ్రంగా కడుక్కోవాలి. వేలితో నోరు శుభ్రమయ్యేలా కడుక్కోవాలి. దగ్గుమందు తాగిన ప్రతిసారీ ఇలా నోరు కడుక్కోవాలి. గుండెకు మేలు చేసే డార్క్ చాక్లెట్లతో... పరిమితంగా తీసుకునే డార్క్ చాక్లెట్లు గుండెకు మేలు చేస్తాయి. సాధారణంగా చాక్లెట్లు పళ్లకు చుట్టుకు΄ోయేలా కాస్త జిగురుగా / జారుడుగా ఉంటాయి. అలా చుట్టుకు΄ోవడం వల్ల అవి తమలోని చక్కెరను చాలాసేపు పంటిపైనే అంటిపెట్టుకునే ఉంటాయి. దాంతో పళ్ల ఎనామిల్ ΄పొర దెబ్బతినే అవకాశాల తోపాటు, పళ్లలో రంధ్రాలు (క్యావిటీలు) వచ్చే అవకాశాలెక్కువ. ఫలితంగా పిప్పిపళ్లు వస్తాయి. అలా దంతాలు దెబ్బతింటాయి.ఈ సమస్య అధిగమించడానికి...చాక్లెట్లు తిన్న తర్వాత ఆ జిగురంతా పోయేలా వేలితో లేదా టూత్ బ్రష్‌తో తేలిగ్గా బ్రష్ చేసుకోవాలి. నోరు పూర్తిగా శుభ్రమయ్యేలా పలుమార్లు నీళ్లతో పుక్కిలించాలి. (చదవండి: భారతీయలు-అమెరికన్లు: ఆహారపు అలవాట్లలో ఇంత వ్యత్యాసమా..?) -
చలికాలంలో చుండ్రు బాధ, ఒళ్లు పగులుతుంది ఈ సమస్యలకు చెక్ పెట్టాలంటే!
ఈ ఏడాది నవంబరు మాసం వచ్చినా కూడా సాధారణంగా ఉండేంత చలి వణికించకపోయినా, మిగతా సీజన్లతో పోలిస్తే చలి కాలంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. చలిగాలులు సోకకుండా ఉన్ని,ఊలు దుస్తులను ధరించడంతోపాటు, రోగనిరోధక శక్తిని కాపాడుకునేలా ఆహారం విషయంలో జాగ్రత్తపడాలి.చలికాలంలో శ్వాసకోస వాధులు, ఇన్ఫెక్షన్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధుల ఆరోగ్యం పట్ల మరింత అ ప్రమత్తంగా ఉండాలి. శరీరం వేడిగా ఉండేలా జాగ్రత్తలు పాటించాలి. స్వెట్లర్లు, సాక్సులు, మంకీ క్యాప్‌లు విధింగా ధరించేలా చూడాలి. లేదంటే జలుబు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. తాజా పండ్లు, ఆకుకూరలతో పాటు, తృణధాన్యాలతో కూడిన పోషకాహారాన్ని మన ఆహారంలో చేర్చుకోవాలి. నిల్వచేసిన, ఫ్రిజ్‌లో ఉంచిన ఆహారానికి బదులుగా ఎప్పటికప్పుడు వేడిగా తినడం మంచిది. అలాగే చలిగా ఉంది కదా అని మరీ వేడి నీటితో స్నానం చేయకూడదు. తల స్నానానికి కూడా గోరు వెచ్చని నీరు అయితే మంచిది. చుండ్రు సమస్య రాకుండా ఉండాలంటే, చలికాలంలో జుట్టును శుభ్రంగా ఆరబెట్టుకోవాలి. మైల్డ్ షాంపూ వాడాలి. చలికాలంలో వేడి నీళ్లు తాగితే జీర్ణ సమస్యలు ఉండవు. గొంతు నొప్పి లాంటి సమస్యలకు దూరంగా ఉండొచ్చు.ముఖ్యంగా విటమిన్ సీ, ఏ, లభించేలా చూసుకోవాలి. అలాగే చలికాలంలో ఎండ తక్కువగా ఉంటుంది కాబట్టి విటమిన్ డీ అందేలా చూసుకోవాలి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ఇలా అనేక రకాల సీజనల్ వ్యాధులను, ఇన్ఫెక్షన్ల ప్రమాదం నుంచి ఇది కాపాడతాయి. కొవ్వు చేపలు, కోడిగుడ్డు,మష్రూమ్స్, సోయా మిల్క్ వంటి వాటిలో డీ విటమిన్ పుష్కలంగా ఉంటుంది.రోగనిరోధక శక్తిని పెంచేలా విటమిన్ సీ లభించే సిట్రస్ పండ్లను తీసుకోవాలి. నిమ్మ, నారింజ, బ్రోకలీ, బెర్రీ, వివిధ రకాల సిట్రస్ పండ్లపై దృష్టిపెట్టాలి. నట్స్, సీడ్స్, కోడిగుడ్లు, గుమ్మడి గింజలు, చేపలు వంటివి తీసుకోవాలి.విటమిన్ ఏ ఎక్కువగా లభించే క్యారెట్లు, చిలగడ దుంపలు, పాలకూర, పాలు, చీజ్ బీఫ్ లివర్, క్యాప్సికం, గుమ్మడి కాయ కూరగాయలను తీసుకోవాలి. విటమిన్ ఏ చర్మానికి, కంటి ఆరోగ్యానికి మంచిది. వీటితోపాటు, శరీరానికి అవసరమయ్యే అత్యంత ముఖ్యమైన బీ 12,బీ6ను తీసుకోవాలి. ఇవి వైరల్ ఇన్ఫెక్షన్లు, సీజనల్ వ్యాధులనుంచి రక్షిస్తాయి. సాల్మన్ చేపలు, టునా ఫిష్, చికెన్, కోడిగుడ్లు, పాలు వంటి పదార్థాల్లో విటమిన్ బి 12 లభిస్తుంది. చలికాలంలో చర్మంపై కూడా చాలా ప్రభావం ఉంటుంది. పగలడం, ఎండిపోయినట్టు అవ్వడం చాలా సాధారణంగా కనిపించే సమస్యు. అందుకే దాహంగా అనిపించకపోయినా, సాధ్యమైనన్ని నీళ్లను తాగుతూ ఉండాలి. దీంతో శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా, తేమగా ఉంటుంది. రాగుల జావ, తాజా పండ్ల రసాలు తీసుకోవాలి.డ్రై స్కిన్ ఉన్న వారికి చిట పటలాడం, మంట పెట్టడం, దురద పెట్టడం లాంటి ఇబ్బందులు మరీ ఎక్కువగా వస్తాయి. అలాంటి వారు ఖ వింటర్ సీజన్ లో మాయిశ్చ రైజింగ్ క్రీములు వాడాలి. చర్మ సంరక్షణ కోసం రసాయన సబ్బులకు బదులుగా ప్రకృతిసిద్ధంగా లభించే వాటితో తయారు చేసుకున్న సున్ని పిండి వాడితే ఉత్తమం. లేదా ఆయుర్వేద, లేదా ఇంట్లోనే తయారు చేసుకున్న సబ్బులను వినియోగించాలి. లేదంటే గ్లిసరిన్ సబ్బులను ఎంచుకోవాలి. విటమిన్ ఇ లభించే పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. -
ఈ మోతాదులో ఉప్పు తీసుకుంటే గుండె, కిడ్నీ వ్యాధులను నివారించొచ్చు..!
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సిఫార్సు చేసిన మోతాదులో ఉప్పు తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు పొందొచ్చని మోడలింగ్ అధ్యయనం పేర్కొంది. ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన మోతాదులో ఉప్పు తీసుకోవడం వల్ల పదేళ్లలో గుండె, మూత్రపిండాలకు సంబంధించిన దీర్ఘకాలికి వ్యాధుల కారణంగా సంభవించే..దాదాపు మూడు లక్షల మరణాలను నివారించొచ్చని పేర్కొంది. అధిక స్థాయి సోడియం అనేది ప్రధాన ఆహార ప్రమాదాల్లో ఒకటి. అధిక ఆదాయ దేశాల్లో సోడియంకి సంబంధించిన ప్యాక్ చేసిన ఆహారాలు ప్రధాన వనరు. ఇక తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లో వీటి వినియోగం మరింత ఎక్కువగా ఉండటం బాధకరం. ముఖ్యంగా భారతదేశంలో ఉప్పు తగ్గించి తీసుకునేలా సరైన జాతీయ వ్యూహం లేదని హైదరాబాద్‌లోని ది జార్జ్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ పరిశోధకులు చెబుతున్నారు. ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన ఉప్పు ఒక టీ స్పూన్ లేదా ఐదు గ్రాముల కంటే తక్కువగా ఉంటుందని మోడలింగ్ అధ్యయనం పేర్కొంది. ఈ మోతాదులోనే ప్రతి రోజూ వినియోగించినట్లయైతే దాదాపు 17 లక్షల కార్డియోవాస్కులర్ సంఘటనలు, గుండెపోటులు, స్ట్రోక్‌లతో సహా క్రానిక్ కిడ్న వ్యాధులను నివారించడమే గాక గణనీయమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందగలమని పరిశోధన వెల్లడించింది. ముఖ్యంగా భారతదేశంలో పూర్తిస్థాయిలో ఇది అమలవ్వాలని పేర్కొంది. ఇక్కడి ప్రజలు ఎక్కువగా ప్యాక్ చేసిన ఆహారాలను ఉపయోగిస్తున్నట్లు పరిశోధన వెల్లడించింది. ఈవిషయమై ఆహార తయారీదారులకు అవగాహన కల్పించడం, పాటించేలా చేయడం అత్యంత ముఖ్యమని తెలిపింది. కాగా, అధిక స్థాయిలో సోడియం తీసుకోవడం తగ్గించేలా ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా 2018 నుంచి అవగాహన కార్యక్రమాలు ప్రారంభించింది. అయితే ప్రస్తుతం మాత్రం ఈట్ రైట్ ఇండియా అనే జాతీయ కార్యక్రమం ద్వారా సోడియంను తగ్గించడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం గురించి ప్రజలకు అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకుందని పరిశోధకులు తెలిపారు.(చదవండి: వాట్ ఏ రికార్డ్!..గుమ్మడికాయ పడవతో 26 గంటలు..) -
బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం వారికే ఎక్కువ..!
ప్రపంచవ్యాప్తంగా స్త్రీ, పురుషులందరిలోనూ వైకల్యాలు తెచ్చిపెట్టడంలో లేదా మరణానికి దారితీసే అంశాల్లో పక్షవాతం (బ్రెయిన్ స్ట్రోక్) ప్రధానమైంది. అయితే అమెరికన్ స్ట్రోక్ అసోసియేషన్ లెక్కల ప్రకారం పురుషులతో పోలిస్తే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు మహిళల్లోనే ఎక్కువ. దీనికి గల అనేక కారణాలను నిపుణులు వివరిస్తున్నారు. పురుషులతో పోలిస్తే మహిళల హార్మోన్లలో మార్పులు రావడం చాలా సాధారణంగా జరుగుతుంటుంది. దీనికి అనేక అంశాలు కారణమవుతుంటాయి. అవి... మహిళల్లో తరచూ హార్మోన్లలో మార్పులు రావడం మామూలే. దీంతోపాటు నోటి ద్వారా తీసుకునే గర్భనిరోధక మాత్రల వల్ల కూడా వాళ్లలో తరచూ హార్మోన్లలో మార్పులు వస్తుంటాయి. ఈ హార్మోన్ల మార్పులే పురుషులతో పోలిస్తే మహిళల్లో పక్షవాతం ఎక్కువగా వచ్చేందుకు కారణమవుతుంటాయి. ఇటీవల మానవులందరిలోనూ ఆయుఃప్రమాణాలు బాగా పెరిగాయి. ఇలా చాలాకాలం జీవిçస్తున్న క్రమంలో హైబీపీ, దాంతోపాటు అనేక రకాల గుండె జబ్బుల (ఉదాహరణకు గుండె స్పందనలు దెబ్బతినడం వల్ల వచ్చే గుండెదడ, ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటే గుండె పైగదుల స్పందనల్లో వేగం పెరగడం వల్ల అక్కడ రక్తం గడ్డకట్టి అవి ప్రధాన ధమనుల ద్వారా మెదడుకు చేరడం) వంటి కారణాలు బ్రెయిన్ స్ట్రోక్‌కు దారితీస్తుంటాయి. గర్భనివారణ మాత్రలు వాడేవాళ్లలో పొగతాగే అలవాటు ఉండటం స్ట్రోక్ ముప్పును మరింత పెంచుతుంది. ఇక మహిళల్లో గర్భధారణ సమయంలో రక్తపోటు బాగా పెరిగి΄ోయే ప్రీ–ఎక్లాంప్సియా అనే కండిషన్ కూడా బ్రెయిన్ స్ట్రోక్ ముప్పును పెంచుతుంది. పురుషులతో పోలిస్తే పక్షవాతం వచ్చినప్పుడు లేదా రాబోయే ముందు కనిపించే సాధారణ లక్షణాలైన తీవ్రమైన అలసట, అయోమయం, వికారం లేదా వాంతుల వంటి లక్షణాలు మహిళల్లో అంత ప్రస్ఫుటంగా కనిపించవు. దాంతో సమస్యను గుర్తించడం, సమయానికి చికిత్స అందించడం వంటివి ఆలస్యమయ్యేందుకు అవకాశాలెక్కువ. ఇక పక్షవాతంలో ప్రస్ఫుటంగా కనిపించే లక్షణాలైన... మాటలు ముద్దముద్దగా రావడం, ముఖంలో ఒకవైపు కిందికి జారినట్లుగా అయిపోవడం వంటివి స్త్రీ, పురుషులిద్దరిలోనూ కనిపించినప్పటికీ మహిళలల్లో ఈ లక్షణాలన్నీ తలతిరిగినట్లు ఉండటం, తీవ్రమైన అలసట, ఎక్కిళ్ల వంటి మాటున అంత స్పష్టంగా కనిపించవు. అయితే ఇలా తల తిరిగినట్లుగా ఉండటం, తీవ్రమైన అలసట, నీరసం వంటివి మహిళల్లో అప్పుడప్పుడూ కనిపించేవే కావడంతో ఈ లక్షణాల మాటున పక్షవాతం దాగుండిపోయినట్లుగా అవుతుంది. దాంతో మహిళల్లో చాలాసేపటికి గాని పక్షవాతాన్ని గుర్తించడం సాధ్యపడకపోవడంతో అసలు విషయం బయటపడేసరికి ఆలస్యమయ్యే ప్రమాదం ఎక్కువ.మహిళల చికిత్స విషయంలో మరింత ప్రాధాన్యం అవసరం.. పక్షవాతం (స్ట్రోక్) విషయంలో పురుషులకూ, మహిళలకూ ఇచ్చే చికిత్స అన్నివిధాలా సమానమే. అయితే కోలుకున్న తర్వాత వారి పనులు వారే చేసుకునే విధంగా ఇచ్చే రిహ్యాబిలిటేషన్ ్ర΄ోగ్రామ్ విషయంలో మాత్రం మహిళలపై మరింత శ్రద్ధ చూ΄ాల్సిన అవసరముంటుంది. ఎందుకంటే వారి రీ–హ్యాబ్, వారిలో తరచూ పునరావృతమయ్యే డిప్రెషన్, నైపుణ్యాలు నేర్చుకునే (కాగ్నిటివ్ స్కిల్స్) ప్రక్రియలు ఆలస్యం కావడం, మానసిక ఆరోగ్యం అన్ని విధాలా బాగుపడేలా చేయడం వంటి అంశాలన్నీ... మహిళలకు రీ–హ్యాబ్ సేవలు మరింత ఎక్కువకాలం అవసరమయ్యేలా చేస్తాయంటున్నారు నిపుణులు.నివారణ మార్గాలు అనుసరించండి... హైబీపీని అదుపులో పెట్టుకునేందుకు క్రమం తప్పకుండా మందులు వాడటం, ఆహారంలో కొవ్వులు తక్కువగా తీసుకోవడం, ఒకవేళ రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే వాటిని అదుపు చేసే మందులు వాడటం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం తోపాటు సంతాన నిరోధక మాత్రలు వాడే మహిళలు, గర్భధారణ సమయంలో ప్రీ–ఎక్లాంప్సియా వచ్చిన వారు ఎప్పటికప్పుడు తమ ఆరోగ్యం విషయంలో క్రమం తప్పకుండా డాక్టర్ ఫాలో అప్‌లో ఉండటం, అవసరాన్ని బట్టి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ (హెచ్ఆర్టీ) వంటి చర్యలతో నివారణ మార్గాలు అనుసరిస్తుంటే అది స్ట్రోక్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుందంటున్నారు వైద్య నిపుణులు.(చదవండి: మెల్ల ఉందని తెలుసుకోవడమెలా? ఎలా సరిదిద్దాలి..?) -
ప్రొటీన్ పవర్‌హౌస్ బెండకాయ జిగురుతో మహిమలెన్నో!
బెండకాయతో బెనిఫిట్స్ జుట్టు, చర్మం, మోకాళ్ల నొప్పులు ఇంకా ఎన్నో బెండకాయ ముదిరినా, బ్రహ్మచారి ముదిరినా పనికి రావు అనే సామెతవిన్నవారికి, దాని ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోతారు. బెండకాయతో ఆరోగ్య ప్రయోజనాలు, జుట్టు, చర్మ ఆరోగ్యాన్ని రక్షించడంలో కాపాడటంలో ఎలా పనిచేస్తుంది. తెలుసుకుందాం ఈ కథనంలో.బెండకాయ, భేండీ, లేడీ ఫింగర్ పేరు ఏదైనా లాభాలు మాత్రం మెండు. బెండకాయ జుట్టు, చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాదు బెండకాయ తినడం వల్ల మెదడు బాగా పని చేస్తుంది, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అందుకే పిల్లలకి బెండకాయ ఎక్కువగా పెడుతూ ఉంటారు. బెండకాయలో పోషకాలు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. శరీరానికి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి బెండకాయతో బోలెడన్ని రెసిపీలు చేసుకోవడం మాత్రమే కాదు, అలాగే మోకాళ్ల నొప్పులుతో బాధపడేవారు, వీర్యకణాలు తక్కువగా ఉండేవారు బెండకాయలను తీసుకోవాలని చెబుతారు. కెరటిన్ కూడా ఎక్కువే. అందుకే ఆరోగ్యకరమైన జుట్టుకు చర్మం సంరక్షణలో కూడా బెండకాయ బాగా పనిచేస్తుంది. బెండకాయ బాగా పనిచేస్తుంది. ప్రకృతి సహజంగా లభించే కెరటిన్‌తో జుట్టు సిల్కీగా, హెల్దీగా ఎదుగుతుంది.బెండకాయలో మెగ్నీషియం, ఫోలేట్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు , విటమిన్ కే2సీ, ఏ పుష్కలంగా ఉన్నాయి. ఇది ఆరోగ్యకరమైన గర్భధారణకు, గుండె ఆరోగ్యానికి, రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయ పడుతుంది. ఇది క్యాన్సర్ నిరోధక లక్షణాలను కూడా కలిగి ఉంది.పురాతన ఈజిప్టులోని స్త్రీలు బ్యూటీకోసం వాడేవారట. ఉపయోగించారు. బెండకాయలతో తయారు చేసిన ఫేస్ ప్యాక్‌తో చర్మం మెరిసిపోతుంది. యాంటీ ఏజింగ్ సొల్యూషన్‌లా పనిచేస్తుంది. వీటిల్లోని యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్, అనాల్జేసిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ , రీ-హైడ్రేటింగ్ లక్షణాల మొఖం మీద మొటిమలను విజయవంతంగా నిర్మూలిస్తుంది. బెండకాయ నీరుబెండకాయను ముక్కలుగా కట్ చేసి రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయాన్నే ఆ నీటిని తాగితే, సుగర్వ్యాధి గ్రస్తుల్లో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. సల్యూబుల్ ఫైబర్, శరీరంలోని గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తుంది. వీర్యపుష్టికి పనిచేస్తుంది.బెండకాయలో ఉండే అధిక ఫైబర్ శాతం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అజీర్తిని నివారించి, మలబద్దకానికి మంచి మందులాగా కూడా పనిచేస్తుంది. బెండకాయలో ఉండే మ్యూసిలేజ్ అనే పదార్ధం గ్యాస్, అజీర్ణం, కడుపు సమస్యలకుచెక్ పెబుతుంది. ఓక్రా పౌడర్‌తో ప్యాక్మెరిసే చర్మం కావాలంటే ఫేస్ ప్యాక్‌ను వాడవచ్చు. దీనికి కావాల్సిందల్లా రసాయన ఎరువులు వాడకుండా, సేంద్రీయంగా పండించిన బెండకాయలు. వీడిని ఎండబెట్ట పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్‌లో కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని మీ ముఖానికి అప్లై చేసి కనీసం 15 నిమిషాలు అలాగే ఉండనివ్వండి. దానిని గోరువెచ్చని నీటితో కడిగేయండి. వారానికి రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.బెండకాయలు ముక్కలుగా చేసి 10 నిమిషాలు నీటిలో ఉడకబెట్టండి. ఇందులో కొద్దిగా యోగర్ట్, ఆలివ్ నూనె కలిపి, మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్ముఖానికి రాసుకొని ,15 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఈ ప్యాక్‌ను ఒక వారం పాటు ఫ్రిజ్‌లో ఉంచుకోవచ్చు.ప్రొటీన్ల పవర్‌హౌస్ లేడీఫింగర్‌తో చుండ్రుకు చెక్ పెట్టవచ్చు. స్కాల్ప్‌ను తేమగా ఉంచుతుంది. దురదలు, జుట్టు పొడిబారడాన్ని నివారించడంలో సహాయపడుతుంది. ఫ్రింజీగా ఉండే గిరిజాల జుట్టును మృదువుగా మారుస్తుంది. ఏం చేయాలంటే! కట్ చేసిన బెండకాయలను కాసేపు నీళ్లలో ఉడికించాలి. దీన్ని చల్లారేదాకా అలాగే ఉంచాలి. తరువాత ఈ వాటర్‌ను ఒక గాజు సీసాలోకి వడ బోసుకోవాలి. తలస్నానం చేసిన తరువాత ఈ నీళ్లను జుట్టంతా పట్టించాలి. 25 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇది మంచి కండీషనర్‌గా పనిచేసి ఎలాంటి జిట్ట జుట్టునైనా మృదువుగా మార్చేస్తుంది. -
వాసన కోల్పోవడం..ఏకంగా అన్ని వ్యాధుల రూపంలో..!
వాసన కోల్పోవడానికి ఏకంగా అన్ని వ్యాధుల రూపంలో ముందుగానే సంకేతం ఇస్తుందని తాజా పరిశోధనల్లో తేలింది. ఇది ఒకరకంగా ఘ్రాణ శక్తి ప్రాధాన్యతను హైలెట్ చేసింది. మానసిక ఆరోగ్యాన్ని కాపాడటంలో మన ముక్కు పనితీరు చాలా కీలకమని వెల్లడయ్యింది. ఈ కొత్త అధ్యయనం వాసనం కోల్పోవడాన్ని ఏకంగా 140 వైద్య పరిస్థితుల ద్వారా ముందుగానే హెచ్చరిస్తుందని పేర్కొంది. అది వృద్ధాప్యం, మోనోపాజ్, నరాలు, శారీరక వ్యాధుల రూపంలో సంకేతమిస్తుందని పరిశోధనలో వెల్లడయ్యింది. ఇది ఫ్రాంటియర్స్ ఇన్ మాలిక్యులర్ న్యూరోసైన్స్ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యింది. అంతేగాదు రక్షణ కవచంలా పనిచేసే రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందన కూడా దీనిపై ఆదారపడి ఉంటుందట. మంచి ఘ్రాణ శక్తి ఉంటే వారికి అపారమైన జ్ఞాపక శక్తి ఉందని అర్థమట. అంతేగాదు ఆహ్లదకరమైన సువాసనలు మెదడు ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుతాయట. ఘ్రాణ శక్తిని కోల్పోతున్నట్లుగా ముందుగానే దాదాపు 139 వ్యాధుల రూపంలో తెలియజేస్తుందట.అందువల్ల ముందుగా ఈ ఘ్రాణ శక్తికి మంచి చికిత్సను అందిస్తే ఆ 140 రకాల వ్యాధులు రాకుండా నివారించొచ్చని చెబుతున్నారు పరిశోధకులు. అయితే ఈ పరిశోధనలో కొన్ని కాంప్లీకేషన్స్ కూడా ఉన్నాయని అన్నారు. ఇక ఈ పరిశోధన కోసం శాస్త్రవేత్తల బృందం పలువురిపై అధ్యయనం చేయగా చాలా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏకంగా 9 వేల మంది సుదీర్ఘ కోవిడ్ కారణంగా వాసన కోల్పోగా, దాదాపు మూడు వేల మందికి పైగా మోనోపాజ్ వల్ల వాసనను కోల్పోయారు. మరో మూడు వేలమంది డిప్రెషన్ కారణంగా ఘ్రాణ శక్తిని కోల్పోయారు. అంతేగాదు ఈ వాసన కోల్పోవడానికి పర్యావరణ కారకాలు కూడా కొంత కారణమని వైద్యులు చెబుతున్నారు. ముందుగానే వివిధ రకాల వ్యాధుల రూపంలో సంకేతం ఇచ్చినప్పుడే.. ఘ్రాణ శక్తికి సత్వరమే మంచి చికిత్స ఇస్తే ఎలాంటి వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉండదని చెబుతున్నారు పరిశోధకులు. ఈ అధ్యయనం వాసన ప్రాముఖ్యతను తెలియజేయడమే గాక భవిష్యత్తులో చేసే మరిన్ని పరిశోధనలకు ఇది పునాదిగా ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు పరిశోధకులు. (చదవండి: ఇలాంటి క్రేజీ గ్రౌండ్ఫ్రిడ్జ్ని చూశారా..? కరెంట్‌తో పని లేకుండానే..) -
విద్యాబాలన్ వెయిట్ లాస్ సీక్రెట్..కానీ వర్కౌట్లు మాత్రం..!
బాలీవుడ్ నటి విద్యాబాలన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించడమే గాక విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది. కానీ ఫిట్నెస్ పరంగా విద్యా చాలా ఇబ్బందులు పడింది. ఒక్కోసారి చాలా స్లిమ్‌గా, మరోసారి లావుగా కనిపిస్తూ ఉండేది. అయితే ఇటీవల ఆమె చాలా స్లిమ్‌గా మారడమే గాక బాడీని అదే ఫిట్నెస్తో మెయింటైన్ చేయడంలో విజయవంతమయ్యింది. అందుకోసం తాను ఏం చేసిందో ఓ ఇంటర్యూలో వివరంగా వెల్లడించింది కూడా. ఇంతకీ విద్యా బాలన్ వెయిట్ లాస్ సీక్రెట్ ఏంటంటే..విద్యాబాలన్ తను స్లిమ్‌గా మారేందుకు ఎంతలా కష్టపడిందో చెప్పుకొచ్చింది. తాను నాజుగ్గా ఉండాలని చాలా పిచ్చిగా వర్కౌట్లు చేసినట్లు వెల్లడించింది. అయితే అంతలా చేసినా.. తన బరువులో పెద్ద మార్పు కనిపించక చాలా విసిగిపోయినట్లు తెలిపింది. దాంతో తాను చెన్నైలోని 'అమురా' అనే న్యూట్రిషన్ బృందాన్ని కలిసినట్లు పేర్కొంది. అయితే వాళ్లు నిజంగా ఇది లావు కాదని తేల్చి చెప్పారు. బరువు తగ్గడంలో మంచి మార్పు కనిపించాలంటే సరైన డైట్ పాటించాలని అన్నారు. అలాగే ముందుగా తనని ఇలా విపరీతమైన వ్యాయామాలు చేయడం మానేయమని చెప్పారు నిపుణులు. అలాగే ముందుగా ఇన్ఫ్లమేషన్ని వదిలించుకునేలా ఆహారం తీసుకోవాల్సిందిగా న్యూట్రిషన్లు సూచించారు. అంటే ఇక్కడ శరీరానికి సరిపడని ఆహారాన్ని తొలగించడమే ఇన్ఫ్లమేషన్ డైట్. అయితే ఇదేలా పనిచేస్తుందంటే.. 'ఇన్ఫ్లమేషన్ ఎలిమినేషన్' డైట్ అంటే..ఇది యాంటీ ఆక్సిడెంట్లతో కూడిన ఆహారం. పోషకాలతో నిండిన ఆహారం. ఇవి ఫ్రీ రాడికల్స్‌ని తొలగించి.. వాపుని, మంటని అరికట్టే మంచి ఆహారం. ఇవి తప్పక డైట్లో చేర్చుకోవాల్సిని మంచి ఫుడ్స్‌గా పేర్కొనవచ్చు.కూరగాయలు..బ్రోకలీ, కాలే, బెల్ పెప్పర్స్, బ్రస్సెల్స్ మొలకలు, క్యాబేజీ, కాలీఫ్లవర్ వంటి కూరగాయలను తప్పక డైట్లో ఉండేలా చూసుకోవాలి.పండ్లు..బ్లూబెర్రీస్, దానిమ్మపండ్లు, ద్రాక్ష, చెర్రీస్ వంటి పండ్లను తీసుకోవాలి.ఆరోగ్యకరమైన కొవ్వులుఅవకాడోస్, ఆలివ్ వంటి అధిక కొవ్వు ఉండే వాటిని చేర్చుకోవాలి. మంచి కొవ్వులు ఉండే చేపలుమాంసాహారులు మంచి పోషకాల కోసం సాల్మన్, సార్డినెస్, ఇంగువ వంటి రకాల చేపలను తీసుకోవాలి. సుగంధ ద్రవ్యాలు, నట్స్బాదం, పిస్తా వంటి వాల్నట్ల తోపాటు పసుపు, మెంతులు దాల్చినచెక్క వంటి మసాలా దినుసులను కూడా ఆహారంలో చేర్చుకోవాలి. (చదవండి: సోనమ్ కపూర్ లేటెస్ట్ లెహంగా ..కానీ బ్లౌజ్ మట్టితో..!) -
మోకాళ్లు నొప్పులా? ఎముక పుష్టికోసం ఇలా చేయండి!
వయసు నలభై దాటిందో లేదో చాలామందిలో కీళ్ల నొప్పులు, ఎముకలు బలహీనపడటం లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. జీవన శైలి, ఆధునిక అలవాట్లతో పాటు, ఎండ ఎరగని ఉద్యోగాలు, యుక్తవయసు నుంచీ డైటింగ్ పేరుతో పోషకాహారం తీసుకోకపోవడంతో ఎముకలు బలహీన పడుతున్నాయి. ఫలితగా మోకాళ్ల నొప్పులు రికెట్స్ ,బోలు ఎముకల వ్యాధి వంటి పరిస్థితులకు కారణమవుతుంది. ఇది పెద్ద వయసులో తూలి పడిపోవడం, కాళ్లు చేతులు, ప్రధానంగా తుంటి ఎముక విరిగిపోయే ప్రమాదాన్ని పెంచుతుంది. మరి ఎముకల గట్టిదనం కోసం ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి.మనిషి వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనపడతాయి. అందుకే ఆరోగ్య కరమైన సమతుల్య ఆహారం చిన్న వయస్సు నుండే అలవాటు చేయాలి. ఇది జీవితాంతం ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుందని గుర్తు పెట్టుకోవాలి. పెద్దలకు రోజుకు 700మిల్లీగ్రాముల కాల్షియం అవసరం.మెనోపాజ్ఆడవారిలో మెనోపాజ్ తరువాత ఎముకలు బలహీనపడతాయి. కాబట్టి ఈ విషయాన్ని మరింత అప్రమత్తంగా ఉండాలి. బహిష్టులు ఆగిపోయిన తరువాత ఈస్ట్రోజెన్ ఉత్పత్తి ఆగిపోవడంతో ఇది ఎముకలపై ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే కాల్షియం ఎక్కువగా లభించే ఆహారం తీసుకోవాలి. శరీరం కాల్షియంను గ్రహించాలంటే విటమిన్ డీ చాలా అవసరం. నిరంతరం వ్యాయామం చేయాలి. ముఖ్యంగా 40 దాటిన తరువాత కాళ్లు, చేతులు, కండరాలు, ఎముకలను పటిష్టం చేసే వ్యాయామాలను చేయాలి. మోకాళ్లు నొప్పులొచ్చిన తరువాత కచ్చితంగా నడక, యోగా తదితర తేలికపాటి వ్యాయామాలు చేయాల్సిందే. ఏదైనా ఎముకలకి సంబంధించి ఏదైనా సమస్యను గుర్తిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి, చికిత్స పొందాలి. నిపుణుల సలహా మేరకు సంబంధిత వ్యాయామాలను రెగ్యులర్‌గా చేయాలి. ఎముక పుష్టి కోసం కాల్షియం పుష్కలంగా ఉండే పచ్చని ఆకు కూరలు, పాల ఉత్పత్తులు, తృణధాన్యాలు తీసుకోవాలి.చేపలు, గుడ్లు, పాలు, బాదం, మొలకెత్తిన ధాన్యాలు ఆహారంలో చేర్చుకోవాలి. బలవర్థకమైన సోయా,నువ్వులతోపాటు విటమిన్ సి లభించే సిట్రస్‌పండ్లను తీసుకుంటే మంచిది. అలాగే విటమిన్ డి కోసం ఉదయం ఎండలో కొద్దిసేపు కూర్చోవాలి. తగినంత నిద్రపోవాలి. -
నఖ శిఖం : క్యాన్సర్ మహమ్మారి
ఓ పరిమితి లేకుండా అనారోగ్యకరంగా, అసాధారణంగా పెరుగుతూ, తొలుత ఒక కణంతోనే క్యాన్సర్ తన ప్రస్థానాన్ని ప్రారంభిస్తుంది. ఎప్పటికప్పుడు రెట్టింపు అయ్యే ఈ ప్రక్రియలో 20వ సారి అది ఒక మిలియన్ కణాలుగా వృద్ధి చెందుతుంది. మిలియన్ కణాల సముదాయంగా పెరిగినప్పటికీ ఆ టైమ్‌లోనూ దాన్ని కనుక్కోవడం కష్టసాధ్యం. అదే 30వసారి రెట్టింపు అయ్యే సమయంలో అందులో బిలియన్ కణాలకు పైగా ఉంటాయి. అప్పుడు మాత్రమే అది ఓ గడ్డ (లంప్)లా రూపొంది గుర్తించడానికి వీలయ్యేలా ఉంటుంది. అంటే... చేత్తో గడ్డను తడిమి గుర్తించడానికి వీలయ్యే సమయానికి ఆ క్యాన్సర్ గడ్డలో బిలియన్ కణాలు... వందకోట్ల కణాలకు పైనే ఉంటాయి. ఇక 40వ సారి రెట్టింపయ్యాక అందులో ఒక ట్రిలియన్ కణాలుంటాయి. అప్పటికీ చికిత్స లభించక 42–43వ సారి రెట్టింపయినప్పుడు రోగి ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్తాడు. అన్ని రెట్టింపులు కాకముందే... అంటే కేవలం 20వ సారి రెట్టింపయ్యే లోపు కనుక్కోగలిగితే...? క్యాన్సర్‌ను నయం చేసే అవకాశాలు చాలా ఎక్కువే. మరి ఆ దశలోనే క్యాన్సర్‌ను కనుక్కోవడం ఎలాగో తెలిపేదే ఈ కథనం. క్యాన్సర్ లక్షణాలు అవయవానికీ అవయవానికీ మారి΄ోతున్నప్పటికీ క్యాన్సర్ బాధితులందరికీలోనూ కొన్ని సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. ఆరోగ్యవంతుల్లోనూ అప్పుడప్పుడూ ఆ లక్షణాలు కనిపించేవే కావడంతో వాటిని గుర్తించడం కష్టం.క్యాన్సర్‌ను గుర్తించేందుకు తోడ్పడే కొన్ని సాధారణ అంశాలు... ఆకలి తగ్గడం కారణం తెలియకుండా / ఏ కారణమూ లేకుండానే బరువు తగ్గడం ఎడతెరిపి లేకుండా దగ్గు లింఫ్ గ్లాండ్స్ (చంకల్లో, గజ్జల్లో, గొంతుదగ్గర) వాపు అవయవాలనుంచి రక్తస్రావం... (ఈ లక్షణం కొన్నిసార్లు కొన్ని అవయవాలలో మాత్రమే) ఒక్క చివరిది మినహా ఇక్కడ పేర్కొన్నవన్నీ చాలామందిలో ఏదో ఓ దశలో క్యాన్సర్ లేకపోయినప్పటికీ కనిపించే మామూలు లక్షణాలు. అందుకే ఈ లక్షణాలన్నీ తప్పనిసరిగా క్యాన్సర్‌వే కానక్కర్లేదు. కాబట్టి వీటిలో ఏదో ఒకటి కనిపించిన మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ లక్షణాలకు అవవసరమైన తొలి చికిత్సలు తీసుకున్న తర్వాత కూడా, అవే పునరావృతమవుతుంటే ఒకసారి డాక్టర్ చేత పరీక్ష చేయించుకుని అది క్యాన్సర్ కాదని నిర్ధారణ చేసుకొన్న తర్వాతే నిశ్చింతగా ఉండాలి. తల నుంచి కాలి వేలి వరకు ఆయా అవయవాల్లో క్యాన్సర్ ఉంటే కనిపించేందుకు / తొలి దశలోనే గుర్తించేందుకు ఉపయోగపడే ప్రాథమిక లక్షణాలివి... బ్రెయిన్ క్యాన్సర్ : తలనొప్పి వస్తుంటుంది. అకస్మాత్తుగా మతిమరపు రావడం, కొన్ని సార్లు సామాజిక సభ్యత మరచి ప్రవర్తించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మనిషి మెదడులో మాట్లాడటానికీ, దృష్టికీ, వినికిడికీ, కాళ్లూ, చేతుల కదలికల నియంత్రణకు... ఇలా వేర్వేరు ప్రతిచర్యలకు వేర్వేరు కేంద్రాలు (సెంటర్స్) ఉంటాయి. క్యాన్సర్ అభివృద్ధి చెందిన సెంటర్ దేనికి సంబంధించినదైతే ఆ అవయవం చచ్చుబడటం వంటి లక్షణాలూ కనిపిస్తాయి. ఇవీ ఆయా అవయవాలకు సంబంధించి తొలిదశలో క్యాన్సర్‌కు లక్షణాలు. తల భాగంలో: ఈ క్యాన్సర్స్ నోటిలో, దడవ మీద, నాలుక మీద లేదా చిగుర్లు (జింజివా) మీదా ఇలా తలభాగంలో ఎక్కడైనా రావచ్చు. ఆయా భాగాల్లో ఎరుపు, తెలుపు రంగుల ΄్యాచెస్ ఉన్నా, దీర్ఘకాలంగా మానని పుండు (సాధారణంగా నొప్పి లేని పుండు, కొన్ని సందర్భాల్లో నొప్పి ఉండవచ్చు కూడా) ఉంటే క్యాన్సర్ అయ్యేందుకు అవకాశం ఎక్కువ. అదే నాలుక మీద అయితే నాలుక కదలికలు తగ్గవచ్చు. నాలుక వెనక భాగంలో అయితే స్వరంలో మార్పు వస్తుంది. మరింత వెనకనయితే మింగడంలో ఇబ్బంది కలుగుతుంది. ఇక స్వరపేటిక ్ర΄ాంతంలో అయితే స్వరంలో మార్పు వస్తుంది. మెడ దగ్గర లింఫ్ గ్రంధుల వాపు కనిపిస్తుంది. గొంతు భాగంలో : దీన్ని ఓరో ఫ్యారింజియల్ భాగంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ గొంతులో ఏదో ఇరుక్కుని ఉన్న ఫీలింగ్ ఉంటుంది. అన్నవాహిక మొదటి భాగంలో అయితే మింగడం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఊపిరితిత్తులు : పొగతాగేవాళ్లలో ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ. ఇది ఉన్నవాళ్లలో దగ్గు, కళ్లె (స్ఫుటమ్)లో రక్తం పడటం వంటì లక్షణాలు కనిపిస్తాయి. ఎక్స్–రే, సీటీ స్కాన్ పరీక్ష ద్వారా దీన్ని తెలుసుకోవచ్చు.రొమ్ము క్యాన్సర్ : మహిళల్లో ఎక్కువగా కనిపించే ఈ రకం క్యాన్సర్‌లో... రొమ్ములో ఓ గడ్డ చేతికి తగలడం, రొమ్ము పరిమాణంలో మార్పు, రొమ్ము మీది చర్మం ముడతలు పడటం, రొమ్ము చివర (నిపుల్) నుంచి రక్తంతో కలిసిన స్రావం లాంటివి రొమ్ము క్యాన్సర్ లక్షణాలు.కడుపు (స్టమక్)లో: కడుపు (స్టమక్)లో మంట పుడుతున్నట్లుగా నొప్పి. పొట్టలో మంట. కొన్నిసార్లు పొట్టలో రక్తస్రావం అయినప్పుడు ఆ రక్తం వల్ల విసర్జన సమయంలో మలం నల్లగా కనిపిస్తుంది. రక్తస్రావం వల్ల రక్తహీనత (ఎనీమియా) కూడా కనిపించవచ్చు. దాంతో పాటు కొన్ని సార్లు కొద్దిగా తినగానే కడుపునిండిపోయిన ఫీలింగ్ ఉంటుంది.పేగుల్లో... మలమూత్ర విసర్జన అలవాట్లలో మార్పులు కనిపిస్తాయి.రెక్టమ్ క్యాన్సర్‌లో: మలద్వారం (రెక్టమ్) క్యాన్సర్ విషయంలోనూ మల విసర్జన తర్వాత కూడా ఇంకా లోపల మలం మిగిలే ఉందన్న ఫీలింగ్. దీనికో కారణం ఉంది. విసర్జించాల్సిన పదార్థం మామూలుగా మలద్వారం వద్దకు చేరగానే అక్కడి నాడులు స్పందించి అక్కడ మలం పేరుకుని ఉన్నట్లుగా మెదడుకు సమాచారమిస్తాయి. అప్పుడా పదార్థాల్ని విసర్జించాల్సిందిగా మెదడు ఆదేశాలిస్తుంది. కానీ విసర్జన తర్వాత కూడా అక్కడ క్యాన్సర్ ఓ గడ్డలా ఉండటంతో ఏదో మిగిలే ఉందన్న సమాచారాన్ని నాడులు మెదడుకు మళ్లీ మళ్లీ చేరవేస్తుంటాయి. దాంతో ఇంకా అక్కడేదో ఉందన్న ఫీలింగ్ కలుగుతుంటుంది. ఈ లక్షణంతో పాటు కొందరిలో బంక విరేచనాలు, రక్తంతో పాటు బంక పడటం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.సర్విక్స్ క్యాన్సర్: దక్షిణ భారతదేశంలోని తీర్ర ప్రాంతాల్లోని మహిళల్లో అత్యధికంగా కనిపించే క్యాన్సర్ ఇది. రుతుస్రావం సమయంలో గాక మధ్యలోనూ రక్తం రావడం, రుతుస్రావం ఆగిపోయిన (మెనోపాజ్) మహిళల్లో అసాధారణంగా రక్తస్రావం కావడం, మహిళల్లో సెక్స్ తర్వాత రక్తస్రావం ( పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్), ఎరుపు, తెలుపు డిశ్చార్జ్ వంటివి దీని లక్షణాలు.ఒవేరియన్ క్యాన్సర్ : దాదాపు 50, 60 ఏళ్ల మహిళల్లో పొట్ట కింది భాగంలో నొప్పి రావడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. సాధారణంగా ఈ భాగానికి క్యాన్సర్ వస్తే ఒక్కోసారి ఏ లక్షణాలూ కనిపించకుండానే ప్రమాదకరంగా పరిణమించవచ్చు.టెస్టిస్ క్యాన్సర్ : పురుషుల్లో వచ్చే ఈ క్యాన్సర్‌లో వృషణాల సైజ్ పెరగడం, దాన్ని హైడ్రోసిల్‌గా పొరబాటు పడటం వల్ల పెద్దగా సీరియస్‌గా తీసుకోకపోవడంతో అది సైజ్‌లో పెరిగి ప్రమాదకరంగా పరిణమించే అవకాశాలెక్కువ.ప్రొస్టేట్ క్యాన్సర్ : సాధారణంగా 50, 60 ఏళ్లు దాటిన పురుషుల్లో తరచూ కనిపించే క్యాన్సర్ ఇది. దాదాపు లక్షణాలేవీ పెద్దగా కనిపించకుండా వచ్చే ఈ క్యాన్సర్‌లో రాత్రివేళల్లో మూత్రవిసర్జనకు వెళ్లాల్సిన అవసరం ఎక్కువగా ఉండవచ్చు. పీఎస్ఏ అనే పరీక్ష ద్వారా దీన్ని తేలిగ్గా గుర్తించవచ్చు.కిడ్నీ అండ్ బ్లాడర్ క్యాన్సర్ : మూత్ర విసర్జన సమయంలో రక్తం కనిపించడం, మాటిమాటికీ మూత్రం రావడం మూత్రపిండాలు, మూత్రాశయ క్యాన్సర్లలో కనిపించే సాధారణ లక్షణం.బ్లడ్ క్యాన్సర్స్ : రక్తం కూడా ద్రవరూపంలో ఉండే కణజాలమే కాబట్టి... బ్లడ్ క్యాన్సర్ కూడా రావచ్చు. రక్తహీనత, చర్మం మీద పొడలా (పర్ప్యూరిక్ పాచెస్) రావడం, చిగుళ్లలోంచి రక్తం రావడం, బరువు తగ్గడం, జ్వరం రావడం వంటివి బ్లడ్ క్యాన్సర్ లక్షణాలు. లింఫ్ గ్లాండ్స్ అన్నవి బాహుమూలాల్లో, దవడల కింది భాగంలో మెడకు ఇరువైపులా, గజ్జల్లో ఉండే ఈ గ్రంథులకూ క్యాన్సర్ రావచ్చు. దాన్ని లింఫోమా అంటారు.స్కిన్ క్యాన్సర్: చర్మం క్యాన్సర్‌ను ఏ, బీ, సీ, డీ అనే నాలుగు లక్షణాలతో తేలిగ్గా గుర్తించవచ్చు. శరీరంపై ఏదైనా మచ్చ తాలూకు ఏ– అంటే... ఎసిమెట్రీ (అంటే మచ్చ సౌష్టవం మొదటికంటే మార్పు వచ్చినా, బీ– అంటే... బార్డర్ అంటే అంచులు మారడం, మందంగా మారడం జరిగినా, సీ– అంటే కలర్ రంగు మారినా, డీ అంటే డయామీటర్... అంటే వ్యాసం (సైజు) పెరిగినా దాన్ని చర్మం క్యాన్సర్ లక్షణాలుగా భావించవచ్చు.కొంతమందిలో తమ తాత తండ్రుల్లో, పిన్ని వంటి దగ్గరి సంబంధీకుల్లో క్యాన్సర్ ఉన్నప్పుడూ, అలాగే స్మోకింగ్, ఆల్కహాల్ వంటి అనారోగ్యకరమైన జీవనశైలి ఉన్నవారూ...ఇక జన్యుపరంగా అంటే... జీరోడెర్మా, న్యూరోఫైబ్రమాటోసిస్ వంటి వ్యాధులున్నవారిలో క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి హైరిస్క్ వ్యక్తులంతా మిగతావారికంటే మరింత అప్రమత్తంగా ఉంటూ, మరింత ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలి. గమనించాల్సిన అంశం ఏమిటంటే... ఇక్కడ ప్రస్తావించిన లక్షణాలన్నీ తప్పనిసరిగా క్యాన్సర్‌కు సంబంధించినవే కావచ్చేమోనని ఆందోళన వద్దు. తొలిదశలో తేలిగ్గా గుర్తిస్తే క్యాన్సర్ తగ్గుతుందన్న విషయం గుర్తుంచుకుని, ఏవైనా లక్షణాలు కనిపిస్తే ఆందోళన చెందకుండా ఒకసారి డాక్టర్ల సూచన మేరకు పరీక్షలు చేయించుకోవాలి. అది క్యాన్సర్ కాదని నిర్ధారణ చేసుకున్న తర్వాత నిశ్చింతగా ఉండాలి. -
నిశ్శబ్దంగా మృత్యువుకు కారణమయ్యే ఎల్డీఎల్ కొలెస్ట్రాల్!
డాక్టర్లు చెప్పిన మందులు చెప్పినట్లు వేసుకునేవారు మనదేశంలో తక్కువే ఉంటారు. అమెరికాలో కూడా ఇంతే. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వృద్ధుల్లో దాదాపు 40 శాతం మంది వైద్యులు సూచించిన మందులు వేసుకోరని ‘పాప్యులేషన్ మెడిసిన్’ జర్నల్ అధ్యయనం ఒకటి స్పష్టం చేసింది. ‘లో డెన్సిటీ లిపో ప్రోటీన్’ క్లుప్తంగా ఎల్డీఎల్ అని పిలిచే ఈ రకమైన కొవ్వు గుండె ఆరోగ్యానికి చాలా కీలకం. మందులు సక్రమంగా వేసుకోకపోతే ఈ రకమైన కొవ్వులు ఎక్కువవుతాయి. ఫలితంగా రక్తనాళాల్లో గార పేరుకుపోవడం కూడా పెరిగి పోతుంది. ఇది కాస్తా గుండెజబ్బు లేదా గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని ఎక్కువ చేస్తుంది. సకాలంలో చికిత్స చేయకపోతే సమస్య మరింత జటిలమవుతుంది. మందులు సక్రమంగా వేసుకోకపోయేందుకు కారణాలు చాలానే ఉన్నాయి. వ్యాధి లక్షణాలు కనిపించకపోవడం ఒకటైతే.. ‘‘ఆ..ఏమవుతుంది లే’’ అన్న నిర్లక్ష్యం రెండోది. మందులేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్న ఆందోళన మూడోది. కానీ... ఎల్డీఎల్ మోతాదులు ఆరోగ్యకరంగా ఉండాలంటే దీర్ఘకాలిక విధానం ఒకటి అవసరమవుతుంది. మందులు నిలిపివేయడం వల్ల కొలెస్ట్రాల్ మళ్లీ పెరిగిపోతుంది. కాబట్టి లక్షణాలు ఉన్నా లేకపోయినా వైద్యులు సూచించినట్లుగా మందులు వేసుకోవడం అవసరం.ఎల్డీఎల్ మోతాదులను నియంత్రించుకోవాల్సిన అవసరం గురించి హైదరాబాద్‌లోని కేర్ హాస్పిటల్ క్యాథ్ ల్యాబ్ సీనియర్ కన్సలెట్టంట్, కార్డియాలజిస్ట్ డాక్టర్ పీఎల్ఎన్ కపర్థి మాట్లాడుతూ "LDLC, లేదా "చెడు" కొలెస్ట్రాల్ నియంత్రణ జీవితాంతం కొనసాగాల్సిన ప్రయత్నం. చాలామంది మేము సురక్షితంగానే ఉన్నామని అనుకుంటారు కానీ.. అలా భావించి మందులు అశ్రద్ధ చేయడం వల్ల గుండెపోటుకు గురైన వారూ ఉన్నారు. కొలెస్ట్రాల్ నియంత్రణ అనేది రక్తనాళాల్లోపలి ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. లక్షణాలు కనిపించవు కానీ నెమ్మదిగా తీవ్రమవుతుంది. అందుకే తరచుగా డాక్టర్ చెకప్‌లు చేయించుకోవడం అవసరం. దీనివల్ల ఏదైనా మార్పులు ఉంటే ముందుగానే గుర్తించి తగు చర్యలు తీసుకునే అవకాశం ఏర్పడుతుంది. అలాగే వైద్యులు చెప్పినట్లు మందులు కచ్చితంగా సమయానికి తీసుకోవాలి.”హెల్తియన్స్ అనే సంస్థ ఇటీవల నిర్వహించిన ఒక పోల్ ప్రకారం భారతదేశంలో 31 శాతం మంది అధిక కొలెస్ట్రాల్ కలిగి ఉన్నారు. హైదరాబాదు జనాభాలో ఈ మోతాదు 27.4% కావడం గమనార్హం. ఇది అథెరోస్కెలరోటిక్ కార్డియో వాస్కులర్ డిసీజ్ (ASCVD) పెరుగుదలను సూచిస్తుంది. ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువైనప్పుడు లక్షణాలేవీ కనిపించవని ముందుగానే చెప్పుకున్నాం. అందుకే దీన్ని నిశ్శబ్ధ కిల్లర్ అని పిలుస్తూంటారు. ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ స్థాయి పెరిగితే ధమనులకు హాని జరుగుతుంది. క్రమంగా మూసుకుపోతాయి. పరిస్థితి తీవ్రమయ్యే వరకూ ఎవరూ గుర్తించలేరు. ఒకసారి మందులు తీసుకోవడం ఆపివేసినా సూచించిన విధంగా తీసుకోకపోయినా ఎల్డీఎల్ స్థాయులు మళ్లీ పెరగవచ్చు.కార్డియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం, ఎల్డీఎల్ కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచుకోవడానికి జీవనశైలి మార్పులు, సూచించిన మందులు సక్రమంగా తీసుకోవడం అవసరం. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ముఖ్యం. -
చెవులు, ముక్కు కుట్టించుకుంటున్నారా? ఇవి కచ్చితంగా తెలుసుకోండి!
ఇటీవల కొందరు కనుబొమల దగ్గర, పెదవుల దగ్గర, మరికొందరైతే నాభి దగ్గర కూడా బాడీ పియర్సింగ్ చేయించుకుంటున్నారు. గతంలో సాంప్రదాయికంగా బంగారపు ఆభరణాల తయారీ కళాకారులే ఈ చెవులు కుట్టడాన్ని చేసేవారు. ఇప్పుడైతే చాలాచోట్ల బ్యూటీ సెలూన్లలోనూ పియర్సింగ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడూ చాలామంది నిపుణులైన డాక్టర్ల ఆధ్వర్యంలోనే పియర్సింగ్ చేయిస్తున్నారు.డాక్టర్ల దగ్గరే మేలు... ఇప్పుడు అధునాతన పియర్సింగ్ పరికరాలతో చెవులు, ముక్కు లేదా దేహంలో అవసరమైన చోట్ల పియర్సింగ్ చేస్తున్నారు. ఈ ప్రక్రియలో రింగులుగా వేయదలచిన లేదా స్టడ్స్గా ఉంచదలచిన బంగారు, వెండి తీగలను ముందుగానే డాక్టర్లు స్టెరిలైజ్ చేశాకే ముక్కుచెవులు కుట్టడం చేస్తున్నారు. ఈ కోణంలో చూసినప్పుడు ఆరోగ్యపరంగా డాక్టర్ల ఆధ్వర్యంలోనే పియర్సింగ్ ప్రక్రియ జరగడం ఎంతో మంచిది. డాక్టర్ల ఆధ్వర్యంలో ఇలా స్టెరిలైజ్ చేశాకే బంగారు రింగు తొడగడం లేదా స్టడ్స్ తొడగడం వల్ల ఇన్ఫెక్షన్ల వంటి ప్రమాదాలు తగ్గుతాయి. ఇలా చెవి, ముక్కు కుట్టడం లేదా అలా కుట్టిన చోట తీగ / స్టడ్ వేయాల్సిన ప్రదేశాల్లో చిన్న రంధ్రం వేసే సమయంలో కొన్ని కాంప్లికేషన్స్ రావచ్చు. పియర్సింగ్లో కలిగే అనర్థాలు... ఇన్ఫెక్షన్స్ : కుట్టాల్సిన చోట సెప్టిక్ కాకుండా ఉండేందుకు ప్రక్రియకు ముందూ, ఆ తర్వాతా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోక΄ోతే ఒక్కోసారి ముక్కుకు లేదా చెవికి రంధ్రం వేసిన చోట ఇన్ఫెక్షన్ రావచ్చు. ఆ తర్వాత ఇది మరిన్ని కాంప్లికేషన్లకు దారితీయవచ్చు. సిస్ట్ / గ్రాన్యులోమా ఏర్పడటం : ముక్కు లేదా చర్మంపైన ఇతర ప్రాంతాల్లో కుట్టిన చోట చిన్న బుడిపె వంటి కాయ రావచ్చు. దీన్ని సిస్ట్ లేదా గ్రాన్యులోమా అంటారు. కుట్టగానే చర్మంలో జరిగే ప్రతిస్పందన వల్ల ఈ సిస్ట్ / గ్రాన్యులోమా వస్తుంది. ఇది సాధారణంగా హానికరం కాదు. చాలావరకు దానంతట అదే తగ్గిపోతుంది. ఏదైనా సమస్య వస్తే డాక్టర్‌కు చూపించి తప్పక చికిత్స తీసుకోవాలి. ఇలా సిస్ట్ / గ్రాన్యులోమా / కీలాయిడ్ వచ్చే అవకాశం ఉన్నవారు చిన్నప్పుడే వేసిన రంధ్రం తప్ప మళ్లీ పియర్సింగ్ చేయించు కోపోవడమే మంచిది. మచ్చ ఏర్పడటం : కొన్ని సార్లు కుట్టే ప్రక్రియలో వేసే రంధ్రం వద్ద మచ్చలా రావచ్చు. ఇలా వచ్చినప్పుడు తప్పనిసరిగా డర్మటాలజిస్ట్‌ను సంప్రదించాలి.అలర్జీలు : కొన్ని సందర్భాల్లో కొందరికి కుట్టడానికి ఉపయోగించే బంగారం లేదా వెండి వల్ల అలర్జీ కలగవచ్చు. దీన్ని కాంటాక్ట్ డర్మటైటిస్ అంటారు. కొందరిలో ఆర్టిఫిషియల్ జ్యువెలరీ వల్ల కూడా ఇలాంటి అనర్థం రావచ్చు. ఇలాంటి సందర్భాల్లో కుట్టిన చోట్ల ఇన్ఫెక్షన్ రావడం, దురద, స్రావాలు కారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సందర్భాల్లో తప్పనిసరిగా డర్మటాలజిస్ట్ సలహా మేరకు చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి గుర్తుంచుకోండి... శరీర భాగాలకు కుట్టే సమయంలో ఎలాంటి ఇన్ఫెక్షన్ లేకుండా పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్త పడండి. అంతకు ముందు వైరల్, బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏవీ లేనప్పుడే ముక్కు, చెవులు కుట్టించే ప్రక్రియకు వెళ్లాలి.చెవులు, ముక్కు కుట్టే సమయంలో రంధ్రం పెట్టాల్సిన చోటిని ముందే నిర్ణయించుకోవాలి. తీరా కుట్టే ప్రక్రియ పూర్తయ్యాక రంధ్రం సరైన స్థానంలో లేదని బాధపడటం కంటే ముందే తగిన ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవాలి. ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి. చెవులు లేదా ముక్కు కుట్టేవారికి ఉన్న అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. అంటే అనుభవజ్ఞుల దగ్గరే ఈ ప్రక్రియ జరిగేలా చూసుకోవడం మంచిది. చెవులు లేదా ముక్కు కుట్టించే ముందుగా ప్రీ–స్టెరిలైజ్డ్ స్టడ్స్ ఉపయోగించి చెవులు, ముక్కు కుడతారు. కాబట్టి అందరిలో అంతగా ప్రమాదం ఉండకపోవచ్చు. ఒకవేళ ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. చెవులు లేదా ముక్కు కుట్టడానికి 45 నిమిషాల ముందుగా లోకల్ అనస్థీషియా ఇస్తారు కాబట్టి పెద్దగా నొప్పి అనిపించకపోవచ్చు. తేలిగ్గా మచ్చ పడే చర్మతత్వం ఉన్నవారు ముక్కు కుట్టించుకోకపోవడమే మంచిది. ఇలాంటి వారు చెవులు, ముక్కు కుట్టించుకోడానికి ముందే డర్మటాలజిస్ట్ / డాక్టర్ సలహా తీసుకోవడం మేలు. కీలాయిడ్స్ వచ్చే శరీర స్వభావం (శరీరంపై ఏదైనా గాయం అయినప్పుడు ఆ ప్రదేశంలో ఉబ్బినట్లు గా మచ్చ వచ్చే శరీర తత్వం) ఉన్నవారు బాడీ పియర్సింగ్కు వెళ్లకపోవడమే మంచిది. -
చిక్కే....‘సిస్ట్’ర్స్... జాగ్రత్త!
మహిళల్లో సాధారణంగా గర్భసంచి పక్కనే ఉండే ఓవరీస్‌లో లేదా వారి ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన అవయవాల్లో... రకరకాల సిస్ట్లు కనిపిస్తుంటాయి. సిస్ట్ అంటే నీరు లేదా నీటి వంటి ద్రవపదార్థంతో నిండి ఉన్న సంచి అని అర్థం. మహిళల్లో ఇలా సిస్ట్లు కనిపించడం మామూలే. సాధారణంగా కనిపించే కొన్ని రకాల సిస్ట్ల గురించి ప్రాథమిక అవగాహన కోసం... ఈ కథనం. ఫాలిక్యులర్ సిస్ట్: అండం విడుదల సమయంలో కనపించే సిస్ట్ ఇది. పీరియడ్స్ తరువాత ఐదు లేదా ఆరు రోజుల నుంచి క్రమంగా సైజ్ పెరుగుతూ ΄ోతుంది. సాధారణంగా 2 నుంచి 2.2 సెం.మీ. సైజ్‌కు చేరాక... మహిళల్లో అండం విడుదల జరిగాక కనుమరుగవుతుంది. కార్పస్ ల్యుటియల్ సిస్ట్: అండం విడుదలైన తర్వాత ప్రెగ్నెన్సీ వస్తే... ఆ పిండాన్ని స΄ోర్టు చేయడానికి ఏర్పడే సిస్ట్ ఇది. సాధారణంగా ఈ సిస్ట్లు వాటంతట అవే కనుమరుగవుతాయి.ఎండోమెట్రియల్ సిస్ట్: రక్తంతో నిండి ఉండే ఈ సిస్ట్ ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్లో కనపడుతుంది. ఈ సిస్ట్లు తీవ్రమైన నొప్పి కలిగిస్తాయి. ఇవి క్రమంగా పెద్దదై కొన్నిసార్లు పలిగి΄ోయే అవకాశం ఉన్నందున ఇటువంటి సిస్ట్‌లను ఇంజక్షన్ ద్వారా తాత్కాలికంగా పెరగకుండా చేయడంగానీ లేదా సర్జరీ ద్వారా తీసేవేయడం కానీ చేస్తుంటారు. ఇలా చేయాల్సిన అవసరమూ ఉంటుంది. ఇన్ఫెక్టెడ్ సిస్ట్: ఓవరీస్‌లో ఇది చాలా అరుదుగా కనిపిస్తుంది. ట్యూబ్‌తో కలిసి ట్యూబో–ఒవేరియన్ సిస్ట్ల పెల్విస్ ఇన్ఫెక్షన్స్లో సాధారణంగా ఇది కనిపిస్తుంటుంది. పాలిసిస్టిక్ ఓవరీస్ : సాధారణంగా ప్రతినెలా 20 నుంచి 30 ఫాలికల్స్ ఓవరీస్‌లో పెరగడం ప్రారంభిస్తాయి. వీటన్నింటిలో అత్యంత అనువుగా ఉన్న ఫాలికల్ మాత్రమే అండంగా మారుతుంది. అది... మిగిలిన వాటికన్నా మరింత వేగంగా పెరిగి... పీరియడ్స్ వచ్చిన 12–16 రోజుల మధ్యలో విడుదల అవుతుంది. ఇక మిగిలిన ఫాలికల్స్ అన్నీ వాటంతట అవే మాయమైపోతాయి. కాని ఊబకాయం, హార్మోన్ల అసమతౌల్యత ఉన్న మహిళల్లో ఆ ఫాలికల్స్ అన్నీ ఒకే సైజ్ వరకు పెరుగుతాయిగానీ, ఏ ఒక్కటీ అండంగా మారదు. అలా పెరిగిపోయిన ఈ సిస్ట్ల వల్ల పీరియడ్స్ సక్రమంగా రాక΄ోవడం, బరువు మరింతగా పెరగడం, అవాంఛిత రోమాలు రావడం జరగవచ్చు. స్కానింగ్ చేసి చూసినప్పుడు ఈ ఫాలికల్స్ అన్నీ చిన్న చిన్న నీటి బుడగల్లాగా కనపడతాయి. వీటినే డాక్టర్లు పాలిసిస్టిక్ ఓవరీస్’గా చెబుతారు. ఈ సమస్యను మందులతో, జీవనశైలి మార్పులతో తగ్గించడం సాధ్యమవుతుంది. సీరస్ లేదా మ్యూసినస్ సిస్ట్ : ఇవి కూడా ఓవరీస్‌లో సాధారణంగా కనిపించే సిస్ట్లే. నలభై ఏళ్లకు పైబడినవారిలో కనిపిస్తుంది. సైజును బట్టి చికిత్స నిర్ణయిస్తారు.చాలావరకు వాటంతట అవి తగ్గిపోయేవే... ఇన్ని రకాల సిస్ట్లు ఉన్నా ఫాలిక్యులార్, కార్పస్ ల్యుటియల్, చిన్న సైజ్‌లో ఉన్న సీరస్ సిస్ట్లు వాటంతట అవే తగ్గిపోతాయి. కొన్ని సమయాలలో 6 సెం.మీ సైజ్ కన్నా ఎక్కువగా ఉంటే సిస్ట్లు లేదా నీరులాంటి పదార్థంతోపాటు గట్టిగా ఉన్న సిస్ట్లు, ఎండోమెట్రియాటిక్ సిస్ట్ల వంటికి మాత్రమే శస్త్రచికిత్స అవసరమ వుతుంది.శస్త్రచికిత్స అవసరమయ్యేవి... కొన్ని సిస్ట్లు మెలిక తిరిగి అంటే టార్షన్కు గురై పేషెంట్‌కు విపరీతమైన కడుపు నొప్పి, వాంతులు, కళ్లు తిరగడం, స్పృహ తప్పిపోవడం వంటి సమస్యలను తెచ్చిపెట్టినప్పుడు ఆపరేషన్ తప్పని సరి. చివరగా... మహిళలు తామ ఓవరాల్ ఆరోగ్యం కోసం సరైన ఆహారం, ఎక్సర్సైజ్ చేస్తే బరువు తగ్గడం చాలా మంచిది. దీనివల్ల ఇతరత్రా అనేక సమస్యలతో పాటు కొంతవరకు సిస్ట్లు కూడా నివారితమయ్యే అవకాశం ఉంది. - డా. స్వాతి హెచ్వికన్సల్టెంట్, అబ్‌స్టెట్రీషియన్ – గైనకాలజిస్ట్ -
Clinical Vampirism: ఈ జబ్బు గురించి తెలుసా?
ఇంగ్లిష్ సినిమాల్లో, కథల్లో డ్రాక్యులాలు రక్తం తాగుతాయి. ఇలా రక్తాన్ని రుచి చూసే ఆ పిశాచాల్లాంటి క్యారెక్టర్స్‌ను ఇంగ్లిష్‌లో ‘వాంపైర్స్’ అని పిలుస్తారు. కానీ అలా రక్తం తాగే కోరికతో ఉండే ఒక జబ్బు ఉంటుందనీ, ఆ మెడికల్ కండిషన్ పేరే ‘వాంపైరిజమ్’ అన్న సంగతి చాలా మందికి తెలియదు. ఆ వాంపైరిజమ్ గురించిన కథనమే కాస్త సంక్షిప్తంగా... ప్రతి మనిషీ తనకు తెలియకుండానే ఒక్కోసారి రక్తాన్ని ఎంతో కొంత రుచి చూస్తుంటాడు. దీనికి ఉదాహరణే... వేలు తెగినప్పుడు గబుక్కున అకస్మాత్తుగా చాలామంది ఆ వేలిని నోట్లో పెట్టుకుంటారు. ఇందులో రక్తాన్ని రుచిచూడడానికంటే... అలా కంటిన్యువస్‌గా రక్తస్రావం జరగకుండా నివారించేందుకే ఇలా తెగిన వేలిని నోట్లో పెట్టుకుంటారు. ఎవరికి వారు తమ సొంత రక్తాన్ని రుచి చూసే ఆ ప్రక్రియకు ‘ఆటో వాంపైరిజమ్’ అంటారు. వేలు తెగి రక్తస్రావం అవుతున్నప్పుడు చాలామందిలో కనిపించే ఈ ప్రక్రియ చాలా సాధారణమైన ప్రతిక్రియగా భావించవచ్చు. అయితే కొంతమంది మానసిక రోగుల్లో ఓ అసాధారణమైన కండిషన్ ఉంటుంది. చాలా చాలా అరుదైన ఈ కండిషన్ ఉన్నవారిలో రక్తం తాగాలనే కోరిక కలుగుతుంది. ఈ కోరిక పుట్టడాన్ని ‘క్లినికల్ వాంపైరిజమ్’ అంటారు. మరికొందరిలోనైతే ఇది కాస్త రుగ్మత స్థాయికి చేరుకుంటుంది. అలాంటి ఓ అత్యంత అరుదైన జబ్బే ‘రెన్‌ఫీల్డ్స్ సిండ్రోమ్’. ఈ జబ్బు ఉన్నవారికి రక్తం తాగాలనే కోరిక కలుగుతుంది. ఇది చాలా చాలా అరుదు కావడంతో దీనికి నిర్దిష్టమైన చికిత్స అంటూ లేకపోయినా... ప్రవర్తనకు సంబంధించిన రుగ్మతలకు చికిత్స అందించినట్లే న్యూరోసైకియాట్రిస్టులు దీనికీ ‘బిహేవియరల్ థెరపీ’ అనే చికిత్స చేస్తారు. అన్నట్టు... ఈ జబ్బు ‘రెన్‌ఫీల్డ్స్’ పేరిట 2023లో ఓ అమెరికన్ మూవీ కూడా విడుదలైంది. పేరుకు తగ్గట్టుగానే ఇది ఓ ‘అమెరికన్ యాక్షన్ కామెడీ హారర్’ థీమ్‌తో తయారైన సినిమా. -
కుటుంబ బాధ్యతల్లో బ్యాలెన్స్ అవసరం
అంజలి ఒక సంప్రదాయ కుటుంబంలో పుట్టి, పెరిగింది. తండ్రి ప్రధాన ఆదాయదారుడిగా ఉండగా, తల్లి ఇంటిని నిర్వహిస్తూ, పిల్లలను చూసుకునేవారు. ఇంట్లో ఎవరేం చేయాలనే విషయంలో స్పష్టత ఉండేది. ఈ వాతావరణంలో పుట్టి, పెరిగిన అంజలికి భార్యాభర్తలు ఎవరేం చేయాలనే విషయంపై ఒక బలమైన అభిప్రాయం ఏర్పడింది. డిగ్రీ పూర్తి చేశాక అంజలికి రాజుతో వివాహమైంది. రాజు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తుండగా అంజలి హౌస్ వైఫ్ బాధ్యతలను ఆనందంగా స్వీకరించింది. ఇద్దరూ సంతోషంగా గడిపేవారు. ఒక బిడ్డ పుట్టాక బిడ్డను చూసుకుంటూ ఇంటిపనులు చేయడం అంజలికి కష్టంగా ఉండేది. ఇద్దరు బిడ్డలు పుట్టాక అది మరింత కష్టంగా మారింది. ఉదయాన్నే లేచి రాజుకు బ్రేక్ ఫాస్ట్, లంచ్ సిద్ధం చేయడం, పిల్లల కార్యకలాపాలను నిర్వహించడం, ఇంటి పనులు చూసుకోవడంతో చాలా అలిసిపోయేది. రాజు కొంత సహాయం చేసినప్పటికీ అది అంజలి ఆశించిన స్థాయిలో ఉండేది కాదు. దాంతో అంజలి చాలా ఒత్తిడిని అనుభవించేది. నిరంతర సమస్యలుక్రమక్రమంగా అంజలికి శారీరక శ్రమతో పాటు, మానసిక శ్రమ కూడా పెరిగింది. భర్త, పిల్లల అవసరాలను అర్థం చేసుకుని, సమయానికి అన్నీ మకూర్చే క్రమంలో అంజలి తన అవసరాలను నిర్లక్ష్యం చేసేది. తాను అనుభవిస్తున్న ఒత్తిడిని రాజుకు చెప్పడంలో ఇబ్బంది పడేది. ఆమె తన అవసరాలను చెప్పగానే, రాజు వాటిని నిర్లక్ష్యం చేసేవాడు లేదా తప్పుగా అర్థం చేసుకునేవాడు. లేదంటే తాను ఆఫీసులో ఎంత స్ట్రెస్ అనుభవిస్తున్నాడో చిట్టా విప్పవాడు. అలా మాట్లాడుతుంటే అంజలి మనసు చివుక్కుమనేది. ‘ఇదేంటి ఈ మనిషి నేను చెప్పేది వినడు, నా కష్టం పట్టించుకోడు’ అనిపించేది. కాలం గడిచేకొద్దీ, కుటుంబంకోసం రాజు కష్టపడుతున్నా, అదే కుటుంబంకోసం తాను పడుతున్న కష్టాన్ని గుర్తించడంలేదని బాధపడేది. అది వారిద్దరి అనుబంధం, ఆప్యాయతలపై ప్రభావం చూపించింది. రాజును కేవలం భర్తగా కంటే రూమ్మేట్ గా చూడటం ప్రారంభించింది. మరోవైపు భార్యగా తన బాధ్యతలు సరిగా నిర్వర్తించడం లేదని బాధపడేది. ఇది ఆమెను అపరాధభావనలోకి చెట్టింది. తనలో మరింత నిరాశను, అంతర్గత ఘర్షణను సృష్టించింది.ఇవన్నీ కలిసి అంజలి మానసిక ఆరోగ్యంపై నెగెటివ్ ప్రభావం చూపాయి. ఆందోళన పెరిగింది. ఆత్మవిశ్వాసం తగ్గింది. నేను మంచి భార్యనైతే ఇలా ఆలోచించేదాన్ని కాదనే అపరాధభావం పెరిగి పెద్దదైంది. దాన్నుంచి బయటపడేందుకు ఇంటిపనుల కోసం మరింత సమయం వెచ్చించేంది. అది మళ్లీ ఆమె అలసటను, అసంతృప్తిని పెంచేది. దాంతో అప్పుడప్పుడూ రాజుపై అరిచేది, గొడవపడేది. అది వారి మధ్య దూరాన్ని మరింత పెంచింది. చికిత్స లక్ష్యాలు... పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న అంజలి కౌన్సెలింగ్ కోసం మా క్లినిక్ కు వచ్చింది. తన మానసిక స్థితిని పూర్తిగా వివరించింది. తన ఆందోళనను తగ్గించడంతోపాటు, రాజుతో తన బంధాన్ని బలపరిచేందుకు సహాయం చేయాలని కోరింది. మొదటి సెషన్ లో ఆమెతో మాట్లాడాక, రెండో సెషన్ కు రాజుతో పాటు రావాలని సూచించాను. రెండో సెషన్ లో వారిద్దరితో మాట్లాడాక కౌన్సెలింగ్ లక్ష్యాలను నిర్దేశించుకున్నాం. అంజలి, రాజులు పరస్పర అవసరాలను, భావాలను, ఆందోళనలను వ్యక్తపరచడానికి అవసరమైన వాతావరణాన్ని అభివృద్ధి చేయడం. వైవాహిక బాధ్యతలు, భావోద్వేగాలను పంచుకోవడం ద్వారా బంధాన్ని సరిదిద్దడం, సమాన భాగస్వామ్యాన్ని స్థాపించడం. కుటుంబ రోల్స్, బాధ్యతలు, భాగస్వామ్య భావనలను ప్రభావితం చేసే వ్యక్తిగత విలువలు, అంచనాలు, సామాజిక ప్రభావాలను అన్వేషించడం. •ఒత్తిడి, ఆందోళన, నిరాశను మేనేజ్ చేసేందుకు అవసరమైన స్కిల్స్ ను అభివృద్ధి చేయడం. చికిత్స సాగిన విధానంరాజు, అంజలి మధ్య బంధాన్ని, కమ్యూనికేషన్ ను మెరుగుపరిచేందుకు ప్రొటోకాల్ రూపొందించాను. అందులో మొదటిది I Sentences. అంజలి రాజును బ్లేమ్ చేయడం కాకుండా, తన భావాలను వ్యక్తం చేయడానికి ‘‘నేనిలా అనుకుంటున్నాను, నేనిలా ఫీలవుతున్నాను’’ అని ‘ఐ సెంటెన్సెస్’ ఉపయోగించడం ప్రారంభించింది. దాంతో రాజు తనను బ్లేమ్ చేస్తుందనే భావన లేకుండా ఓపెన్ గా వినడం మొదలుపెట్టాడు. రాజు అలా వినడం అంజలికి సంతృప్తినిచ్చింది. కుటుంబంలో ఏ పనులు ఎవరు చేయాలనే విషయంపై ఇద్దరూ ఒక అంగీకారానికి వచ్చారు. వారానికోసారి ఈ అంశంపై ప్రశాంతంగా మాట్లాడుకోవడానికి అంగీకరించారు. ఇది అంజలిపై పని ఒత్తిడి భారాన్ని, ఒత్తిడికి లోనవుతున్నాననే భావనను అధిగమించడానికి ఉపయోగపడింది. వారానికోసారి ఇద్దరూ కూర్చుని ప్రశాంతంగా మాట్లాడుకోవడం, ఒకరి కష్టాన్ని మరొకరు శ్రద్ధగా ఆలకించడం, సహాయాన్ని ఆఫర్ చేయడం వారిద్దరి మధ్య బంధం, అనుబంధం పెరిగేందుకు సహాయపడింది. దీంతోపాటు మరికొన్ని థెరప్యూటిక్ టెక్నిక్స్ పాటించడం ద్వారా ఆరునెలల్లో వారి మధ్య బంధం బలపడింది. ఇప్పుడు ఇద్దరూ ప్రశాంతంగా, ప్రేమానురాగాలతో జీవిస్తున్నారు. సైకాలజిస్ట్ విశేష్ +91 8019 000066ww.psyvisesh.com -
నూతన ఆరోగ్య సేవా ప్రణాళికను ప్రారంభించనున్న నీతా అంబానీ..ఏకంగా లక్షలాదిమంది..
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ నీతా అంబానీ నూతన ఆరోగ్య సేవా ప్రణాళికను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ 10 సంవత్సరాల వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఈ నూతన ఆరోగ్య సేవా ప్రణాళికను ప్రారంభించారు. అందులో భాగంగా సుమారు 50 వేల మంది పిల్లలకు పుట్టుకతో వచ్చే గుండె జబ్బులకు ఉచిత స్క్రీనింగ్ పరీక్షలు, చికిత్స, 50 వేల మంది మహిళలకు రొమ్ము, గర్భాశయ కేన్సర్లకు ఉచిత స్క్రీనింగ్ పరీకలు, చికిత్స, అలాగే దాదాపు పదివేల మంది బాలికలకు ఉచిత గర్భాశయ కేన్సర్ వ్యాక్సినేషన్ వంటి సేవలను అందజేయనున్నట్లు నీతా అంబానీ ప్రకటించారు.ప్రతి భారతీయుడికి ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణను అందుబాటులోకి తీసుకురావడానికి ఇలా సరసమైన ధరలో తమ రిలయన్స్ ఫౌండేషన్ వైద్యసేవలు అందిస్తోందన్నారు. ఇప్పటి వరకు తమ ఫౌండేషన్ ద్వారా మిలియన్లమందికి జీవితాలను ప్రసాదించి లెక్కలేనన్ని కుటుంబాల్లో కొత్త ఆశను అందించామని అన్నారు. అలాంటి ప్రతిష్టాత్మక సేవలందింస్తోన్న తమ రిలయన్స్ ఫౌండేషన్ సంస్థ పదేళ్ల వార్షికోత్సవం సందర్భంగా అట్టడుగు వర్గాలకు చెందిన పిల్లలు, మహిళలకు మరిన్ని సేవలందించేలా ఇలా కొత్త ఆరోగ్య సేవా ప్రణాళికను ప్రారంబించామని అన్నారు. మంచి ఆరోగ్యం సంపన్న దేశానికి పునాది అని, అలాగే ఆరోగ్యవంతమైన స్త్రీలు, పిల్లలు సమాజానికి పునాది అని తాము విశ్వసిస్తున్నామని అన్నారు. కాగా, రిలయన్స్ పౌండేష్ గత దశాబ్ద కాలంలో 1.5 లక్షల మంది పిల్లలతో సహా 2.75 మిలియన్ల భారతీయులకు వైద్య సేవలను అందించింది. అత్యాధునిక వైద్యం అందించడంలో అత్యుత్తమైన ఆస్పత్రిగా నిలిచింది. అంతేగాదు ఐదు వందలకు పైగా అవయవ మార్పిడి తోపాటు కేవలం 24 గంటల్లో ఏకంగా ఆరు అవయవాల మార్పిడి చేసి బహుళ ప్రాణాలను కాపాడిని ఆస్పత్రిగా రికార్డు సృష్టించింది. ఇది భారతధేశంలోనే నెంబర్ వన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గుర్తింపు పొందింది. (చదవండి: బ్రెయిన్ స్ట్రోక్: ఇన్‌టైంలో వస్తే.. అంతా సేఫ్..!) -
బ్రెయిన్ స్ట్రోక్: ఇన్‌టైంలో వస్తే.. అంతా సేఫ్..!
కాలూ, చేయి చచ్చుపడినపోతే పక్షవాతం అనిపిలిచే సమస్య వస్తే కేవలం మంచానికి పరిమితమైపోవడమనే అనే భావన ఒకప్పుడు ఉండేది. ఇప్పటికీ కొందరిలో ఉంది. కానీ సమయానికి సరైన చికిత్స అందితే ‘స్ట్రోక్’ అని పిలిచే ఈ సమస్య నుంచి బాగుపడటం సాధ్యమే అని చెబుతున్నారు డాక్టర్లు. ఈ నెల (అక్టోబరు) 29న వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా ‘బ్రెయిన్ స్ట్రోక్’పై అవగాహన కోసం...మెదడును రక్షించుకోవడంలో టైమ్ చాలా కీలకం. స్ట్రోక్ వచ్చాక వైద్యం అందడంలో జరిగే ప్రతి నిమిషం జాప్యానికి కోటీ ఇరవై లక్షల న్యూరాన్లు నశించిపోతుంటాయి. అందుకే ‘‘టైమ్ ఈజ్ బ్రెయిన్’’ అంటారు. అందుకే స్ట్రోక్ గురించి మరింతగా తెలుసుకోవడం అవసరం. స్ట్రోక్‌లో రకాలు... 1) ఇస్కిమిక్ స్ట్రోక్ : రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వల్ల మెదడులో ఒక భాగానికి రక్తం అందక ఆ భాగం దెబ్బతినడాన్ని ‘ఇస్కిమిక్ స్ట్రోక్’ అంటారు. 2) హేమరేజిక్ స్ట్రోక్ : మెదడు లోపలి రక్తనాళాలు చిట్లడంతో మెదడులో రక్తస్రావం కావడం వల్ల వచ్చే స్ట్రోక్‌ను ‘హేమరేజిక్ స్ట్రోక్’ అంటారు. ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ అటాక్ (టిఐఏ)... పక్షవాతం లక్షణాలు కనిపించాక అవి ఒకటి నుంచి రెండు గంటలలోపు తగ్గిపోయి బాధితుడు కోలుకుంటే దాన్ని ‘ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ అటాక్’ అని పిలుస్తారు. అంటే... పెద్ద భూకంపానికి ముందు చిన్న చిన్న ప్రకంపనల్లా ఒక పెద్ద స్ట్రోక్ రావడానికి ముందు సూచనలుగా ఇలాంటివి వస్తుంటాయి. ఒకవేళ చిన్న చిన్న లక్షణాలు కనిపించాక 24 గంటల తర్వాత కూడా బాధితుడు వాటి ప్రభావం నుంచి బయటపడకపోతే అప్పుడు దాన్ని పూర్తిస్థాయి స్ట్రోక్‌గా పరిగణిస్తారు. ఎవాల్వింగ్ స్ట్రోక్ : కాళ్లూ చేతులు చచ్చుబడుతూ పూర్తి స్థాయి స్ట్రోక్ క్రమంగా రావడాన్ని ఎవాల్వింగ్ స్ట్రోక్ అంటారు. ఈ టిఐఏ, ఇవాల్వింగ్ స్ట్రోక్‌లను ముందుగానే గుర్తించి తగిన చికిత్స చేయిస్తే పూర్తిస్థాయి స్ట్రోక్ రాకుండా నివారించవచ్చు. అందుకే పైన పేర్కొన్న ఏదైనా లక్షణం లేదా కొన్ని లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను కలిసి చికిత్స చేయించుకుని భవిష్యత్తులో పక్షవాతం రాకుండా నివారించుకోవడం సాధ్యమే. స్ట్రోక్‌కు కారణాలు: నిజానికి బ్రెయిన్ స్ట్రోక్ అన్నది ఎవరికైనా రావచ్చుగానీ సాధారణంగా చాలామందిలో హైబీపీ, డయాబెటిస్, పొగతాగడం, అతిగా మద్యం తాగే అలవాటు, సరైన వ్యాయామం లేక΄ోవడం, స్థూలకాయం, ఒత్తిడికి గురికావడం, రక్తంలో కొవ్వులు (కొలెస్ట్రాల్) ఎక్కువగా ఉండటం అనే అంశాలు స్ట్రోక్‌కు కారణమవుతాయి. అలాగే గుండె జబ్బులు, రక్తం గడ్డకట్టే స్వభావం ఎక్కువగా ఉండటమూ స్ట్రోక్‌కు కారణాలే.చికిత్స మొదటి నాలుగున్నర గంటల్లోపు హాస్పిటల్‌కు తీసుకువస్తే అది ఇస్కిమిక్ స్ట్రోక్ అయితే వాళ్లకు టిష్యూ ప్లాస్మెనోజెన్ యాక్టివేటర్ అనే మందును రక్తనాళంలోకి ఇస్తారు. మొదటి ఆరుగంటలలోపు హాస్పిటల్‌కు తీసుకువస్తే పెద్ద రక్తనాళాలలో అడ్డంకులు (క్లాట్స్) ఏర్పడి స్ట్రోక్ వచ్చినవాళ్లలో స్టెంట్ ద్వారా క్లాట్స్‌ను తొలగించవచ్చు. పై రెండు పద్ధతుల ద్వారా మంచి ఫలితం ఉంటుంది. ఇస్కిమిక్ స్ట్రోక్ వచ్చినవారు రక్తం పలుచబడటానికి వాడే మందులు జీవితాంతం వాడాల్సి ఉంటుంది. లేని పక్షంలో మళ్లీ స్ట్రోక్ రావచ్చు. అలాగే హైబీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఉన్నవాళ్లు వాటిని అదుపులో పెట్టే మందులు వాడాలి. పునరావాస సేవలు (రీహ్యాబిలిటేషన్ సర్వీసెస్): స్ట్రోక్ వచ్చిన మొదటిరోజు నుంచే మొదలుపెట్టి తమ రోజువారీ కార్యక్రమాలను స్వతంత్రంగా చేసుకునేవరకు ఫిజియోథెరపీ, స్పీచ్‌థెరపీ, సరైన రీతిలో నడిచేలా శిక్షణ వైద్యచికిత్సలో ముఖ్యం. స్టోక్ నిర్ధారణ ఇలా... సీటీ స్కాన్ (బ్రెయిన్)తో స్ట్రోక్ వచ్చిందనే నిర్ధారణ తోపాటు... అది ఇస్కిమిక్ స్ట్రోకా లేదా హేమరేజిక్ స్ట్రోకా అన్నది నిర్ధారణ చేయవచ్చు. ఒకవేళ సీటీ స్కాన్ (బ్రెయిన్)లో నిర్ధారణ కాక΄ోతే ఎమ్మారై (బ్రెయిన్), ఎమ్మార్ యాంజియో పరీక్ష చేయించాలి. అలాగే ఈ స్ట్రోక్ ఎందుకు వచ్చిందో తెలుసుకుని, మళ్లీ రాకుండా చూసుకోడానికి టూడీ ఎకో, గొంతు రక్తనాళాల డాప్లర్, లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలు చేయించడం, షుగర్ మోతాదులు తెలుసుకోవడం... ఇవన్నీ రొటీన్‌గా చేయించే పరీక్షలు. చిన్న వయసులో స్ట్రోక్ వచ్చినా లేదా మందులు వాడుతున్నప్పటికీ మళ్లీ స్ట్రోక్ వచ్చినా కొన్ని అరుదైన పరీక్షలు చేయించాల్సి ఉంటుంది.లక్షణాలుపక్షవాతంలో సాధారణంగా ఒక చేయీ, కాలూ చచ్చుపడిపోవడం మూతి వంకరపోవడం / మాట స్పష్టంగా రాకపోవడం కళ్లు తిరిగి పడిపోవడం శరీరం తూలడం మాట పడిపోవడం ఒకవైపు చూపు తగ్గిపోవడం మింగడం కష్టం కావడం ఎదురుగా ఉన్న వస్తువులు, మనుషులు ఒకటి రెండుగా/ఒకరు ఇద్దరుగా కనిపించడంఅరుదుగా పూర్తిగా స్పృహతప్పి పడిపోవడం జరగవచ్చు. పైన పేర్కొన్నవాటిల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ లక్షణాలు కనిపించవచ్చు. నివారణే ప్రధానం... జీవనశైలి (లైఫ్‌స్టైల్)లో, ఆహారంలో మార్పులు లైఫ్ స్టైల్ మార్పులుప్రతిరోజూ వ్యాయామం మానసిక ఒత్తిడికి గురికాకుండా చూసుకోవడం తిండి, నిద్రలలో వేళలు పాటించడం.ఆహారంలో మార్పులివి ఉప్పు తగ్గించడం తాజా కూరగాయలు, ఆకుకూరలు, తాజా పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ సరైన సమయంలో చికిత్స పొందితే స్ట్రోక్ వల్ల మంచానికే పరిమితమైపోతామనే దురభిప్రాయం నుంచి బయటికి రావచ్చు. (చదవండి: పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటే..? మనసులో సునామిలా..) -
పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటే..? మనసులో సునామిలా..
అది ఇటీవల కేరళలో రుతూ ముంచేసిన బురద ప్రవాహమే కావచ్చు... లేదా అప్పట్లో చార్ధామ్ లో తుడిచిపెట్టేసిన వరద ప్రవాహమే కావచ్చు. అలనాటి సునామీ లేదా ఉత్తర కాశీ భూకంపమే కావచ్చు... ఇంకా యుద్ధ ఘటనలు.. దాడి లేదా దౌర్జన్యం, లైంగిక దాడి, ముష్కరులు మూకుమ్మడిగా విరుచుకుపడటం, గాయాలపాలు చేయడం, దోపిడీ... ఇలా ఏదైనా సరే అది మానసికంగా షాక్‌కు గురిచేయవచ్చు. ఇవే కాదు... తుఫాను, భారీ అగ్నిప్రమాదం, భూకంపం వంటి ప్రకృతి విపత్తులు, కుటుంబసభ్యులెవరైనా దూరం కావడం, హత్య, ఆత్మహత్య వంటి ఘటనల్లో షాక్‌కు గురవుతారు. షాక్ తర్వాత బాధితులను నిస్తేజంగా మార్చే పరిస్థితిని పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్’ (పీటీఎస్డీ) అంటారు. ఈ ‘పీటీఎస్డీ’ గురించి అవగాహన కోసమే ఈ కథనం.పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (పీటీఎస్డీ) బారిన పడ్డ వ్యక్తులు సురక్షితంగా ఉన్నప్పుడూ లేదా అలాంటి పరిస్థితులేమీ లేని సమయాల్లో కూడా తీవ్రంగా భయపడుతుంటారు. మిగతావాళ్లతో పోలిస్తే స్త్రీలు, పిల్లలు ఈ షాక్‌కు గురయ్యే ఛాన్స్ ఎక్కువ. పిల్లలైతే... ఎప్పుడో వదిలేసిన పక్క తడపడం వంటి అలవాటు పునరావృతం కావడం మాటలు మరచి΄ోవడం, మాటల కోసం తడుముకోవడం ∙హాయిగా, ఆడుకోలేక΄ోవడం ఆత్మీయులైన పెద్దలను విడవకపోవడం. బాధితులతో వచ్చే ముప్పు... తమను తాము ఎంతో నిస్సహాయులుగా పరిగణించి బాధపడటం తీవ్రమైన భయాలతో ఎవరితోనూ కలవక, ఒంటరిగా ఉండిపోవడం తమను తాము బాధించుకోవడం, ఆత్మహత్యకు పాల్పడటం లేదా ఒక్కోసారి ఎదుటివాళ్లపై దాడికి దిగడం. నిర్ధారణ... బాధితుల లక్షణాలనూ వాళ్ల మెడికల్ హిస్టరీని బట్టి బాధితుల స్నేహితులు, బంధువుల నుంచి వివరాలను రాబట్టడం ద్వారా ∙కొన్ని మానసిక పరీక్షల ద్వారా. మేనేజ్మెంట్ / చికిత్స... సపోర్టివ్ థెరపీ, రీ ఎష్యూరెన్స్, యాక్టివ్ లిజనింగ్, కోపింగ్ స్కిల్స్ నేర్పడం వంటి చికిత్సలు.ఎక్స్పోజర్ థెరపీ : ఒకేసారి ఆ సంఘటనను గుర్తు చేయకుండా మెల్ల మెల్లగా ఆ సంఘటన గురించి వివరిస్తూ, ఆ దుర్ఘటన జరిగిన ప్రదేశానికి మెల్ల మెల్లగా తీసుకెళ్తూ, ఇప్పుడు అక్కడ అలాంటి పరిస్థితి లేదనీ, ఇకపై అక్కడ ఎంతమాత్రమూ హాని జరగదనే భరోసా కల్పించడం. లక్షణాలు... ఆ సంఘటన మళ్లీ మళ్లీ జరుగుతున్నట్లే ఫీల్ కావడం లేదా ఆ సంఘటనలో ఉన్నట్లే ఫీలవుతారు. నిద్రలో పీడకలలు. అందులో అదే సంఘటన జరుగుతున్నట్లుగా కలలు వస్తాయి ఆ సంఘటన గురించి తలచుకోడానికి, మాట్లాడానికి ఇష్టపడకపోవడం ఎంత వద్దనుకున్నా మాటిమాటికీ ఆ సంఘటనల తాలూకు ఆలోచనలే రావడంసంఘటన తాలూకు ప్రదేశాలకు వెళ్లడానికి ఇష్టపడకపోవడం ఆ టైమ్‌లో తమతో ఉన్న వాళ్లను కలవకపోవడం లేదా తప్పించుకుని తిరగడం ∙మూడ్స్ వేగంగా మారిపోవడం ∙ఒక్కోసారి ఆ సంఘటన తాలూకు ఎలాంటి జ్ఞాపకమూ లేకపోవడం ఆ సంఘటన గురించిన భయాలు, విపరీతమైన కోపం, సిగ్గుగా ఫీల్ కావడం ప్రతికూల ఆలోచనలే వస్తుండటం సంఘటన పట్ల తనను తానుగానీ లేదా ఇతరులను గానీ నిందిస్తూ ఉండటం ఎవ్వరితోనూ కలవకుండా ఒంటరి గా ఉండటం ఒకప్పుడు తనకు సంతోషం కలిగించిన అవే పనులు ఇప్పుడు ఏమాత్రం ఆనందం ఇవ్వక΄ోవడం పరిసరాల పట్ల చాలా ఎక్కువ అనుమానాస్పదంగా ఉండటం ఏ విషయంపై దృష్టి పెట్టలేకపోవడం, నిద్ర సమస్యలు (నిద్రపట్టక΄ోవడం లేదా ఎప్పడూ నిద్రలోనే ఉండటం).కాగ్నిటివ్ రీ కన్స్ట్రక్షన్ ఆ సంఘటనలో బాధితుల ప్రమేయం లేదనీ, ఆ సంఘటన గురించి అపరాధభావనతో ఉండాల్సిన అవసరం లేదనీ, అప్పుడున్న మనుషుల నుంచి తప్పించుకుని తిరగాల్సిన పనిలేదనే నమ్మకాన్ని కల్పించడం. ఇలా సైకోథెరపీ చేస్తూ, ఆత్మహత్య ఆలోచనలనుంచి బయటపడేసే మందుల తోపోటు సెలెక్టివ్ సెరిటోనిన్ రీ–ఆప్టేక్ ఇన్హిబిటార్స్, సెరిటోనిన్ నార్ ఎపీనెఫ్రిన్ రీ అప్టేక్ ఇన్హిబిటార్స్, నార్ ఎపీనెఫ్రిన్–డోపమైన్ రీ అప్టేక్ ఇన్హిబిటార్స్ వంటి మందులు, యాంటీ డిప్రెసెంట్స్‌తో చికిత్స అందిస్తారు. డా. శ్రీనివాస్ ఎస్‌ఆర్‌ఆర్‌వై, సీనియర్ సైకియాట్రిస్ట్(చదవండి: బాడీ పోశ్చర్(భంగిమ) కరెక్ట్‌గా ఉందా? హెచ్చరిస్తున్న టెక్ మిలియనీర్) -
జామపండుతో ఎన్నో వ్యాధులు నివారణ..!
విటమిన్–సి అనేక వ్యాధులను నివారిస్తుందన్న విషయం తెలిసిందే. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... చాలామంది అనుకునేదానికి భిన్నంగా నారింజ వంటి పండ్లతో పోలిస్తే జామపండులో ఉండే విటమిన్–సీ మోతాదులు ఇంకా ఎక్కువ. అందుకే జామ అనేక వ్యాధులను సమర్థంగా నివారిస్తుంది. టొమాటోలో ఉన్నట్లుగానే జామపండులోనూ లైకోపిన్ మోతాదులు చాలా ఎక్కువ అనేది యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ మాట. ఈ ‘లైకోపిన్’ అనే పోషకం...ప్రోస్టేట్ క్యాన్సర్ తోపాటు చాలా రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. ఉదాహరణకు ఈసోఫేజియల్ క్యాన్సర్, పెద్దపేగు కేన్సర్లను జామపండు సమర్థంగా నివారిస్తుంది. పచ్చికాయ కంటే కాస్తంత ముగ్గిన జామపండులో పీచు (ఫైబర్) మోతాదులు చాలా ఎక్కువ. దాంతో అది మలబద్ధకాన్ని నివారిస్తుంది. పొద్దున్నే సాఫీగా మల విసర్జన జరగడమనే మంచి శానిటరీ హ్యాబిట్‌తో చాలా రకాల జబ్బులు నివారితమవుతాయన్నది తెలిసిందే. అంతేకాదు జామలో పొటాషియమ్ కూడా ఎక్కువే కావడం వల్ల అది హైబీపీ నివారణకూ తోడ్పడుతుంది. దాదాపు 100 గ్రాముల జామపండులో 300 మి.గ్రా. మేరకు కండర నిర్మాణ సామర్థ్యం ఉండటం వల్ల కండరాలు పెరుగుతూ ఎదిగే వయసు పిల్లలకు ఈ పండు ఎంతో మేలు చేస్తుంది. ఇలా ఏ రకంగా చూసినా జామపండు ఆరోగ్యాన్నిచ్చే నిధి. ఎన్నో వ్యాధుల నివారణకు పనిచేసే పెన్నిధి. (చదవండి: ∙ -
బాడీ పోశ్చర్(భంగిమ) కరెక్ట్‌గా ఉందా? హెచ్చరిస్తున్న టెక్ మిలియనీర్
టెక్ మిలియనీర్ బ్రయాన్ జాన్సన్(46) తన యాంటీ ఏజింగ్ ప్రయోగాలకు సంబంధించి.. మరో ఆసక్తికర విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. అత్యంత కీలకమైన మన బాడీ పోశ్చర్ గురించి చెప్పారు. ఇది శరీర భాగాల తోపాటు ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలిపారు. దాన్ని మెరుగుపరుచుకోకపోతే బ్రెయిన్‌పై ఎఫెక్ట్ పడుతుందంటూ చాలా షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. అందుకోసం ఏం చేయాలో కూడా వివరించారు. అవేంటంటే..తన యాంటీ ఏజింగ్ ప్రక్రియల్లో భాగంగా ప్రతి భాగాన్ని అత్యంత కేర్‌ఫుల్‌గా చూసుకుంటున్నారు బ్రయాన్. నిజానికి మన ఏజ్ పెరిగే కొద్ది ఎలాంటి మార్పులు సంభవించి నెమ్మదిగా వృద్ధాప్యం వస్తుందో కూడా వివరంగా చెప్పారు బ్రయాన్. తాను అనుకున్నట్లుగా వృద్ధాప్యాన్ని తిప్పి కొట్టగలరో లేదో కచ్చితంగా చెప్పలేకపోయినా..ఏ అలవాట్ల వల్ల వేగంగా వృద్ధాప్య లక్షణాలు వస్తాయో ఆయన ప్రయోగాల ద్వారా చాలా క్లియర్‌గా తెలుస్తోంది. ఇక బ్రయాన్ యాంటీ ఏజింగ్ ప్రక్రియలో తెలిసిన మరో ఆసక్తికర విషయం బాడీ పోశ్చర్. ఇది సరిగా లేకపోతే మన ఆరోగ్యంపై ఎలాంటి భయంకరమైన ప్రతికూల ప్రభావం చూపుతుంతో వివరిస్తూ..తన వ్యక్తిగత అనుభవాన్ని షేర్ చేసుకున్నారు. తన బాడీ పోశ్చర్ చాలా భయంకరంగా ఉండేదని, అది నెమ్మదిగా తన బ్రెయిన్‌పై ఎలా ప్రభావం చూపిస్తుందో గమనించలేకపోయానని పోస్ట్‌లో రాసుకొచ్చారు. తన ఎంఆర్ఐలో తన భంగిమ మెదడులోని రక్తాన్ని బంధించి గుండెకు ప్రసరించకుండా ఎలా అడ్డుకుంటుందో తెలిపారు. దీని కారణంగా తనకు మూర్చ, స్ట్రోక్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసిందన్నారు. నిజానికి బాడీ పోశ్చర్ గురించి చాలమందికి సరిగా తెలియదు. ఇదే ప్రాణాంతక వ్యాధుల బారిన పడేలా చేస్తుందన్నారు. ఒక రోజులో మన బాడీని చాలా తప్పుడు భంగిమల్లో ఉంచుతామని అన్నారు. అది కూర్చీలో కూర్చొవడం దగ్గర నుంచి స్క్రీన్‌వైపు చూసే విధానం వరకు సరైన పోశ్చర్‌లో కూర్చొమని అన్నారు.ఈ అలవాట్లే క్రమేణ కండరాల నొప్పి, రక్తప్రసరణ సమస్యలు, జీర్ణ సమస్యలు, ఊపిరితిత్తు పనితీరు బలహీనపడటం, నరాల కుదింపు, వెన్నుముక అమరికలో తేడాలు, మూడ్ మార్పులు, నిద్రాభంగం తదితర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని చెప్పారు. తాను ఐదు ముఖ్యమైన విషయాల్లో తన బాడీ భంగిమను మెరుగుపరిచానని అన్నారు. నిటారుగా ఉండేలా వ్యాయామాలు, ఫోన్‌ని చూడటానికి తలవంచకుండా కంటికి సమాన స్థాయిలో పెట్టుకుని చూడటం వంటి మార్పులు చేయాలని సూచించారు. అలాగే రోజులో ప్రతి 30 నిమిషాల కొకసారి కదలడం, చురుకుగా ఉండటం, మెట్లు ఎక్కడం, స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు, డ్యాన్స్ వంటివి చేయాలని అన్నారు. రక్తప్రసరణ మెరుగ్గా ఉండేలా మన బాడీ పోశ్చర్ ఉండటం అత్యంత ముఖ్యం అని చెప్పారు బ్రయాన్. ఇది మన మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిస్తుందని చెప్పారు. జస్ట్ మన పోశ్చర్ మాత్రమే మెరుగుపరుచుకోవడమే కాదు మీ చుట్టు ఉండే వాతారవణాన్ని కూడా సరైన విధంగా మన భంగిమకు అనుగుణంగా మార్చుకోగలిగితే సత్ఫలితాలు పొందగలమని చెబుతున్నారు బ్రయాన్. కాగా, ఇంతకుమునుపు బ్రయాన్ తాను బట్టతల రాకుండా ఎలా నివారించింది, జుట్టు రాలు సమస్యను అరికట్టే చిట్కాలు వంటి వాటి గురించి షేర్ చేసుకున్నారు.I didn't realize how terrible my posture was until an MRI showed it was slowly killing my brain.A ticking time bomb of a problem that I've now dramatically improved with these five habits. 🧵 pic.twitter.com/qPGKiCsDXc— Bryan Johnson /dd (@bryan_johnson) October 10, 2024 (చదవండి: టెక్ మిలియనీర్ బ్రయాన్ జాన్సన్ జుట్టు సంరక్షణ చిట్కాలు..!) -
సీతాఫల్.. వెరైటీస్ ఫుల్
ఈ సీజన్లో సీతాఫలం రుచి చూడని వాళ్లు అరుదేనేమో... పండ్లలో ఇప్పటికీ పూర్తిస్థాయిలో అమృతం లాంటి రుచిని కోల్పోకుండా అందించే ఏకైక ఫలంగా సీతాఫలాన్ని చెప్పుకోవచ్చు. దాదాపు అందరికీ అందుబాటు ధరల్లోనే ఉండే ఈ ఫలం.. ఇప్పుడు నగర మార్కెట్లో సందడి చేస్తోంది. మరోవైపు ఈ సీజన్లో సీతాఫలాన్ని ఆధారం చేసుకుని రుచులను వడ్డించే రెస్టారెంట్స్, ఐస్‌క్రీమ్ పార్లర్స్ సైతం నగర వాసులకు వెరైటీలను అందించేందుకు సిద్ధమైపోతున్నాయి. కాదే ఫలమూ తినడానికి అనర్హం అన్నట్టే.. కాదే ఫలమూ మేళవింపునకు అనర్హం అంటున్నారు నగరంలోని చెఫ్స్. సీతాకాలంలో విరివిగా లభ్యమయ్యేది సీతాఫలం. ఇది తీపి, క్రీము గుజ్జుతో కూడిన ఉష్ణమండల ఫలం ఇది. ఈ పండులో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉన్నందున గణనీయమైన పోషక విలువలను కలిగి ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన చర్మాన్ని అందిస్తుంది. జీర్ణక్రియను సైతం మెరుగుపరుస్తుంది. అయితే మ్యాంగో సీజన్లో మామిడి పండ్లను వంటకాలలో విరివిగా జత చేసే నగర నలభీములు.. సీతాఫలంతోనూ పలు రకాల వంటకాలు తయారు చేస్తూ నోరూరించడం ఆహార ప్రియులకు సుపరిచితమే.ఆరోగ్యానికి మేలు.. ఉపవాసం సమయంలో ప్రత్యేక ట్రీట్‌గా కూడా దీనిని వడ్డిస్తారు. రబ్దీ పాలలోని కాల్షియం ప్రొటీన్ కంటెంట్ ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది, దీనికి బాదం, పిస్తాలను గారి్న‹Ùగా ఉపయోగిస్తారు. కాబట్టి అవసరమైన కొవ్వు, ఆమ్లాలు, విటమిన్–ఈ లను ఇవి అందిస్తాయి. ఒక లీటరు పాలు, పావు కిలో బెల్లం, అర టీస్పూన్ యాలకుల పొడి, సీతాఫలం గుజ్జు ఒక కప్పుతో చేసిన ఈ రబ్దీని కూల్‌గా సర్వ్ చేసుకోవచ్చు. మరెన్నో రుచులు.. ఇవే కాకుండా పలు రెస్టారెంట్స్‌లో కస్టర్డ్ యాపిల్ ఖీర్, కుల్పీ తదితరాలను కూడా తయారు చేస్తున్నారు. కస్టర్డ్ యాపిల్‌తో ఫుడింగ్ కూడా చేస్తున్నారు. ఫిర్ని అనే నార్త్ ఇండియన్ డిజర్ట్ కూడా దీన్ని జోడిస్తున్నారు. కస్టర్డ్ యాపిల్ పల్ప్‌ను వేడి వేడి జిలేబీ తదితర స్వీట్స్‌పై దీన్ని జతచేసి సర్వ్ చేయడం కూడా కొన్ని రెస్టారెంట్స్‌లో పరిపాటిగా మారింది.స్వీట్ విత్ ఫ్రూట్.. రబ్దీ అనేది భారతీయ వంటకాల్లో ఒక క్లాసిక్ డెజర్ట్, ఇది చాలా కాలం నుంచి వండి వడ్డిస్తున్నారు. సంప్రదాయ పండుగలు లేదా ప్రత్యేక సందర్భాల్లో, విందు వినోదాల చిహ్నంగా దీనిని వడ్డిస్తారు. రబ్దీకి సీతాఫలాన్ని జోడించడం వల్ల ప్రత్యేకమైన రుచిని మాత్రమే కాకుండా మరిన్ని బలవర్ధకాలు సంతరించుకుని ఉత్తమ పోషకాహారంగా మారుతోంది. పండుకు సహజంగా ఉండే తీపి దీనికి చక్కెర అతిగా జత చేయాల్సిన అవసరాన్ని తగ్గిస్తుంది, వంటకాన్ని ఆరోగ్యకరమైనదిగా చేస్తుంది. ఈ సీజన్లో వచ్చే కర్వా చౌత్, దీపావళి తదితర పండుగల సమయాల్లో కుటుంబ సమేతంగా ఆస్వాదించేందుకు ఈ డెజర్ట్ బాగా వినియోగిస్తారు. ఐస్‌క్రీమ్స్ షురూ.. నగరంలో పలు ఐస్‌క్రీమ్ పార్లర్స్ ఈ సీజన్లో సీతాఫల్ ఐస్‌క్రీమ్స్ విక్రయాలకు పేరొందాయి. సీజనల్ పండ్లతో చేసిన ఐస్‌క్రీమ్స్‌ను అందించడంలో పేరొందిన నేచురల్స్‌లో ఇప్పటికే సీతాఫల్ ఐస్‌క్రీమ్స్ అందుబాటులోకి వచ్చాయి. అదే విధంగా క్రీమ్‌స్టోన్ తదితర పేరున్న పార్లర్స్లోనూ ఇవి అందిస్తున్నారు.. ఇక పాతబస్తీలో అచ్చమైన ఆర్గానిక్ ఐస్‌క్రీమ్స్‌కు దశాబ్దాల నాటి నుంచి కేరాఫ్‌గా ఉన్న ఫేమస్ ఐస్‌క్రీమ్స్ కూడా సీతాఫల్ హిమ క్రీముల్ని అందిస్తోంది. నగరంలోని అబిడ్స్‌లో ఉన్న నార్సింగ్ భేల్పురి జ్యూస్ సెంటర్ సైతం ఈ వంటకాలకు పేరొందింది. సీతాఫల్ మలాయ్ పేరుతో ఈ ఫుడ్ అవుట్లెట్ అందించే సీజనల్ రుచి ఫుడ్ లవర్స్‌కి చిరపరిచితమే. ఇలా అనేక రకాలుగా సిటీలోని సీతాఫల ప్రియుల్ని రారమ్మని ఆహా్వనించేందుకు ఓ వైపు రుచిని మరోవైపు ఆరోగ్య ఫలాన్ని అందించేందుకు రెస్టారెంట్స్, ఐస్‌క్రీమ్ పార్లర్స్, కేఫ్స్ పోటీపడుతున్నాయ్. -
చెత్త కుండీలోని పేపరు ముక్కలను కూడా చదవకుండా ఉండలేను..?
డాక్టర్ గారూ! నా సమస్య మీకు వింతగా అనిపించవచ్చు. గత రెండు సంవత్సరాల నుంచి విపరీతంగా నవలలు, వీక్లీలు... ఒకటేమిటి... ఏ పుస్తకం కనబడినా చదవడం అలవాటైంది. క్లాసు పుస్తకాలు చదువుతుంటే నేను చదివిన నవలల్లోని పాత్రలు, సన్నివేశాలు కళ్ళ ముందు మెదిలి చదవలేక΄ోతున్నాను. దానివల్ల ఆ చదువు ముందుకెళ్ళడం లేదు. ఏదైనా కొత్త పుస్తకం కనబడితే, వెంటనే మొత్తం చదవక΄ోతే, ఏదో పోగొట్టుకున్న భావన కలుగుతుంది. ఆఖరుకు చెత్త కుండీలోని పేపరు ముక్కలు కూడా తీసి చదవందే మనసు నిలకడగా ఉండడం లేదు. ఈ అలవాటును ఎంత మానుకుందాం అనుకున్నా మానలేకపోతున్నాను. దీనివల్ల నేను బీటెక్ పూర్తి చేయలేనేమోనని భయంగా ఉంది. సలహా ఇవ్వగలరు. – చందన, విజయనగరంపుస్తకాలు, నవలలు చదవడం మంచి అలవాటే! కానీ ఏ అలవాటైనా అతిగా చేయడం మంచిదికాదు. కొత్త పుస్తకం కనబడిన వెంటనే మొత్తం చదవాలనే తపన, చదవక΄ోతే ఏదో తెలియని అలజడి ఇవన్నీ ఒక ఎత్తైతే, చివరకు చెత్త కుండీలోని పేపరు ముక్కలను కూడా ఏరుకుని చదవందే ఉండలేక΄ోవడమనేది ఖచ్చితంగా ఒక మానసిక రుగ్మతే! ‘ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్’ అనే మానసిక జబ్బుకు లోనైనవారే ఇలా ప్రవర్తిస్తారు. అలా అతిగా చదవాలనే తపన పడటం, ఆ అలవాటును మీరు మానుకోవాలనుకున్నా మానుకోలేకపోవడం ఈ మానసిక సమస్య ముఖ్య లక్షణం. మెదడులోని ‘సెరొటోనిన్’ అనే ప్రత్యేక రసాయనిక పదార్థం సమతుల్యంలో తేడాలొచ్చినప్పుడు, మీరు చెప్పిన లాంటి లక్షణాలు బయటపడతాయి. ‘క్లోమిప్రెమిన్ ప్లూ ఆక్సిటెన్’ అనే మందుల ద్వారాను, ‘కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ’ అనే ప్రత్యేక కౌన్సెలింగ్ ద్వారానూ ఈ సమస్య నుంచి మిమ్మల్ని పూర్తిగా బయట పడేయవచ్చు. మీరు వెంటనే మంచి సైకియాట్రిస్ట్ట్ను కలిస్తే మీ సమస్యకు తగిన చికిత్స చేస్తారు. మీరు మీ బీటెక్ చదువు త్వరలోనే విజయవంతంగా పూర్తి చేయగలరు. ధైర్యంగా ముందుకెళ్ళండి. ఆల్ ది బెస్ట్!ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com(చదవండి: ఇదేం నిరసన..!'గడ్డం తొలగించండి.. ప్రేమను కాపాడండి’) -
అతిగా నీళ్లు తాగుతున్నారా?
నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదని ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. అలాగే ప్రతి సెలబ్రిటీ ప్రకావంతమైన చర్మం వెనుక సీక్రెట్ హైడ్రేషన్. మంచి ఆరోగ్యం, ఫిట్నెస్ కోసం పుష్కలంగా నీళ్లు తాగడం అత్యంత కీలకం. నీళ్లు తాగడం ఎంత ముఖ్యమో అలానే బ్యాలెన్స్‌గా తాగడం అనేది కూడా అత్యంత అవసరమని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే అతిగా నీళ్లు తాగితే అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. చాలమంది నీళ్లు తాగే విషయంలో తప్పులు చేస్తున్నారని చెబుతున్నారు నిపుణులు. మోతాదుకి మించి నీళ్లు తాగితే ఎలాంటి సమస్యలు వస్తాయో నిపుణుల మాటల్లోనే సవివరంగా చూద్దాం..!.అధికంగా నీళ్లు తాగితే..హైపోనాట్రేమియాగా పిలిచే ఇంటాక్సికేషన్ సంభవిస్తుంది. ఇది రక్తంలోని సోడియం సాంద్రతలు పలుచన చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. సోడియం అనేది ఒక కీలకమైన ఎలక్ట్రోలైట్. ఇది కణాల లోపల, వెలుపల ద్రవాల సమతుల్యతను నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే కిడ్నీలు అదనపు నీటిని సమర్థవంతంగా తొలగించకపోతే మిగులు నీరు కణాల్లోకి ప్రవేశిస్తుంది. తద్వారా అవి ఉబ్బుతాయి. ఇక్కడ సోడియం నరాల సిగ్నలింగ్ , కండరాల పనితీరుకి ద్రవ సమతుల్యతకు బాధ్యత వహించే కీలకమైన ఎలక్ట్రోలైట్. తగినంత సోడియం లేకుండా శరీరం సాధారణ సెల్యులార్ పనితీరు నిర్వహించడం కష్టమవుతుంది. ఇది ఒక్కసారిగా బహుళ అవయవాలను ప్రభావితం చేస్తుంది. అలానే మూత్రపిండాలు గంటకు 0.8 నుంచి 1 లీటరు నీటిని మాత్రమే ఫిల్టర్ చేయగలవు. ఎప్పడైతే అధికంగా నీరు తీసుకుంటామో దీని వల్ల రక్తం పలుచబడటానికి దారితీస్తుంది. ఫలితంగా ఎలక్ట్రోలైట్స్ పలుచబడి ద్రవాల మార్పుకి కారణమవుతుంది. ఇది సెల్యూలర్ వాపుకి కారణమయ్యి.. మెదడు వంటి ముఖ్యమైన అవయవాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అయితే ఈ వాపు ఇతర భాగాల్లో అంత ప్రమాదకరం కాదు కానీ మెదడులో సంభవిస్తే ప్రాణాంతకంగా మారిపోతుంది. ఈ పరిస్థితిని సెరిబ్రల్ ఎడెమా అంటారు. సెరిబ్రల్ ఎడెమా లక్షణాలు...వికారం, వాంతులుతలనొప్పులుగందరగోళంఅలసటకండరాల తిమ్మిరిమూర్చకోమా, తలనొప్పిచేతులు, పాదాలు లేదా ముఖంలో వాపు ఈ పరిస్థితి రాకుండా నీటిని తాగడం తగ్గించాలి. అలాగే ఎలక్ట్రోలైట్ సమతుల్యతను పునరుద్ధరించేలా వైద్య సహాయం తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. ఎంత నీరు తాగితే బెటర్..మనం ఉంటున్న వాతారవణం, శారీరక శ్రమ తదితర అంశాల ఆధారంగా నీటిని తీసుకోవడం అనేది ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. సాధారణంగా నిపుణులు సిఫార్సు చేసినవి..పురుషులు: రోజుకు సుమారుగా 3.7 లీటర్లు (125 ఔన్సులు) మొత్తం ద్రవాలు (నీరు, ఇతర పానీయాలు, ఆహారంతో సహా).మహిళలు: రోజుకు సుమారుగా 2.7 లీటర్లు (91 ఔన్సులు) మొత్తం ద్రవాలు.ఇంతకు మించి తీసుకుంటే ఓవర్‌హైడ్రేషన్ సంభవించే అవకాశం ఉంటుంది. అందువల్ల మన శరీరం ఇచ్చే సంకేతాలకు అనుగుణంగా నీటిని తీసుకునే యత్నం చేయమని సూచిస్తున్నారు నిపుణులు. అలాగే ఎక్కువ చెమట పట్టే వ్యాయామాలు చేసేవారు, వేడి లేదా పొడి వాతావరణంలో ఉన్నవారు ద్రవ నష్టాన్ని భర్తీ చేసుకునేలా అధిక నీరు తీసుకోవడం మంచిది. (చదవండి: ఐదుపదుల వయసులోనూ స్లిమ్‌గా మలైకా..శరీరాకృతి కోసం..!) -
ఐదుపదుల వయసులోనూ స్లిమ్‌గా మలైకా..శరీరాకృతి కోసం..!
బాలీవుడ్ నటి, మోడల్ మలైకా అరోరా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఆమె హీరోయిన్గా నటించిన సినిమాల కంటే స్పెషల్ సాంగ్‌లతోనే అభిమానులకు చేరవయ్యిందని చెప్పొచ్చు. తెలుగులో గబ్బర్ సింగ్ మూవీలో కెవ్వు కేక అంటూ ఓ రేంజ్లో టాలీవుడ్‌ని కేకపెట్టించింది. అలాంటి మలైకా వయసును అంచనా వేయలేం. ఎందుకుంటే ఆమె అంతలా యువ హీరోయిన్లకి పోటీ ఇచ్చే రేంజ్లో గ్లామరస్‌గా ఉంటుంది. ఆమె శరీరాకృతి చూస్తే జస్ట్ 20 అనేలా ఉంటుంది. ఇవాళ మలైకా 51వ పుట్టిన రోజు సందర్భంగా ఐదు పదుల వయసులోనూ ఇంతలా మంచి ఫిట్నెస్తో బాడీని ఎలా మెయింటైన్ చేస్తుంది, ఎలాంటి ఆహారం తీసుకుంటుంది సవివరంగా తెలుసుకుందామా..!.మలైకా అరోరా ఫినెస్కి మంచి ప్రేరణ అని చెప్పొచ్చు. మంచి టోన్డ్ ఫిజిక్‌తో ప్రేక్షకులను అలరిస్తుంది. ఆమె తన శరీరాకృతి కోసం ఒక్క రోజు కూడా జిమ్ సెషన్‌ని స్కిప్ చెయ్యదట. అందువల్లనే ఏమో 1998లో షారఖ్ ఖాన్‌తో చేసి ఛైయా ఛైయా అంటూ స్టెప్పులేస్తు కనిపించిన నాటి మలైకాలానే ఇప్పటికీ కనిపిస్తుంది. ఏ మాత్రం ఫిగర్‌ని కోల్పోకుండా అత్యంత ఆకర్షణీయంగా ఉండేలా ఫిజిక్‌ని మెయింటెయిన్ చేస్తుంది. అంతేగాదు శరీరాకృతిని కాపాడుకోవడానికి డంబెల్స్, కెటిల్‌బెల్స్, చీలమండల బరువులకు సంబంధించిన కఠిన వ్యాయామాలన్నింటిని చేస్తుంది. సోషల్ మీడియాలో సైతం తరచుగా తన వ్యాయామాలకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ..అభిమానులకు ఆరోగ్య స్ప్రుహని కూడా కలిగిస్తుంది. ఆమె స్క్వాట్లు, జంపింగ్ జాక్‌లు, హై-కిక్స్, కార్డియో వంటి వ్యాయామాలతో కేలరీలు బర్న్ అయ్యేలా చూసుకుంటుంది. ఎలాగైనా శరీరాన్ని విల్లులా వంచేలా అన్ని రకాల వ్యాయామాలను తప్పనిసరిగా చేస్తుంది. అలాగే ఆమె రోజుని డిటాక్స్ వాటర్‌తో ప్రారంభిస్తుంది. తాగే నీటిలో తప్పనిసరిగా నిమ్మకాయ, జీరా, సోంపు, అజ్వైన్, తేనె, అల్లం, నిమ్మకాయ వంటివి జోడిస్తుంది. బ్రేక్‌ఫాస్ట్‌గా ఆకుపచ్చ స్మూతీ, గుడ్లు, అవోకాడోతో చేసిన బ్రెడ్ శాండ్విచ్లు తీసుకుంటుంది. లంచ్‌లో తప్పనిసరిగా భారీ భోజనమే తీసుకుంటుందట. వాటిలో తప్పనిసరిగా పప్పు, కూరగాయలు, సలాడ్, మాంసం, చేపలు, చికెన్ వంటివి ఉంటాయి. దీంతోపాటు అడపాదడపా ఉపవాసాన్ని కూడా పాటిస్తుంది. తప్పనిసరిగా సాయంత్రం 6.30 కల్లా డిన్నర్ పూర్తి చేసేలా చూసుకుంటుంది. ప్రోటీన్ కోసం మాంసం, పిండి పదార్థాల కోసం చిక్కుళ్లు, ఫైబర్‌తో కూడిన కూరగాయాలతో సమతుల్యంగా ఉండేలా చూసుకుంటుంది. ఇంతలా తినే ఫుడ్ నుంచి చేసే వ్యాయమాలు వరకు ప్రతి విషయంలోనూ చాలా కేర్ తీసుకుంటే మంచి శరీరాకృతి కలిగిన బాడీని మెయింటైన్ చేయడం సాధ్యమవుతుందని చెబుతున్నారు నిపుణులు. ఇంకెందుకు ఆలస్యం మంచి నాజుకైనా బాడీ కావాలంటే మలైకాలా కేర్ తీసుకునేందుకు ప్రయత్నించండి మరీ..!. (చదవండి: ఆఫీస్‌లో తక్కువ స్థాయి పనైతే ఏం చేయాలి..?)