Vintalu Visheshalu
-
‘‘గ్రేట్ ఎలిఫెంట్ మైగ్రేషన్ ’’, నూయార్క్‌కు చేరుకున్న గజరాజులు
భారతీయ కళాకారులు రూపొందించిన అపురూపమైన ‘‘గ్రేట్ ఎలిఫెంట్ మైగ్రేషన్ ’’ 100 ఏనుగుల కళాశిల్పాలు న్యూయార్క్ చేరుకున్నాయి. ప్రతి ఏనుగును తమిళనాడులోని నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ నుండి 200 మంది దేశీయ కళాకారులతో కూడిన ది కోఎక్సిస్టెన్స్ కలెక్టివ్ రూపొందించింది. ఈ అద్భుతమైన కళాఖండాల త తయారీకి ఐదేళ్ళు పట్టింది. ఇవి అమెరికా అంతా పర్యటించి సహజీవనం సందేశాన్ని వ్యాప్తి చేయనున్నాయి. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు దీనికి సంబంధించిన వీడియోను ఎక్స్‌లో షేర్ చేశారు.Look ! Indian Elephants have finally arrived in New York. Titled as the 'Great Elephant Migration' a travelling herd of 100 stunning life size elephant sculptures have reached NYC. These elephant sculptures have been made by local tribal artisans from Gudalur in Nilgiris, Tamil… pic.twitter.com/AVolGQLDtJ— Supriya Sahu IAS (@supriyasahuias) September 6, 2024తమిళనాడులోని నీలగిరిలోని గూడలూర్‌కు చెందిన స్థానిక గిరిజన కళాకారులచే లాంటానా జాతికి చెందిన కలుపు మొక్కల చెక్క నుంచి ఈ కళాకృతులను రూపొందించారు. ‘‘మానవ-వన్యప్రాణుల సహజీవన ప్రాజెక్టుల’’ కోసం మిలియన్ల డాలర్లను సేకరించాలనే లక్ష్యంతోపాటు, ‘‘భూమి, నదులు, ఆకాశం మరియు మహాసముద్రాల మీదుగా అద్భుతమైన ప్రయాణాలు చేసే వలస జంతువులను రక్షించడం’’ఈ శిల్పాలను ఎవరు రూపొందించారు?బెట్టకురుంబ, పనియా, కట్టునాయకన్ , సోలిగ కమ్యూనిటీలకు చెందిన కళాకారులు కలిసి ప్రతి జీవం-వంటి, శరీర నిర్మాణపరంగా ఎలాంటి తేడా లేకుండా క్లిష్టమైన ఏనుగు శిల్పాలను రూపొందించారు. అక్టోబర్ 20 వరకు న్యూయార్క్ నగరంలో తర్వాత ఆర్ట్ బాసెల్ మయామికి వెళతాయి. లాస్ ఏంజిల్స్‌లో, బ్లాక్ఫీట్ నేషన్ మధ్య మోంటానాలోని బ్రౌనింగ్లోని బఫెలో ,పరిరక్షణ బృందం హ్యూస్టన్ , గ్లేసియర్ నేషనల్ పార్క్, ఈ శిల్పాలు 13 నెలల పాటు అమెరికా వివిధ ప్రాంతాలలో కొలువుదీరతాయి. -
స్మార్ట్‌ఫోన్ యూజర్లకు ఊరట: బ్రెయిన్ కేన్సర్‌తో సంబంధం లేదు!
స్మార్ట్‌ఫోన్ వాడకంతో బ్రెయిన్ కేన్సర్ వస్తుందని ఇప్పటిదాకా చాలా భయపడ్డాం. సెల్‌ఫోన్ రేడియేషన్ దుష్ర్పభావానికి సంబంధించి పలువురు నిపుణులు హెచ్చరించారు కూడా. అయితే తాజా అధ్యయనం మాత్రం స్మార్ట్ఫోన్లకు, బ్రెయిన్ కేన్సర్ కు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. సాధారణంగా స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వాడినా, ముఖ్యంగా పడుకునేటపుడు దిండుకింద మొబైల్ పెట్టుకుని పడుకున్నా, పసిపిల్లలకు దగ్గరగా ఉంచి, రేడియేషన్ ప్రభావం ఉంటుందిని, తీవ్రమైన ప్రమాదకరమైన జబ్బులొస్తాయనే ఆందోళన ఇప్పటివరకు ఉండేది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక అధ్యయనంలో కొన్ని కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొబైల్ ఫోన్ వినియోగానికి, మెదడు కేన్సర్ ప్రమాదానికి ఎటువంటి సంబంధం లేదని వెల్లడింది. వైర్లెస్ టెక్నాలజీ వినియోగంలో భారీ పెరుగుదల ఉన్నప్పటికీ, మెదడు కేన్సర్‌లో పెరుగుదల లేదని మంగళవారం ప్రచురించిన ఒక రివ్యూలో తెలిపింది. సుదీర్ఘ ఫోన్ కాల్స్ చేసే వ్యక్తులకు లేదా ఒక దశాబ్దం కంటే ఎక్కువ కాలం పాటు మొబైల్ ఫోన్లను ఉపయోగించిన వారికి కూడా ఇది వర్తిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ప్రచురితమైన అనేక రీసెర్చ్ పేపర్లను సైతం అధ్యయనం చేసి ఈ విషయం వెల్లడించినట్లు అధ్యయనం పేర్కొంది. కాగా డబ్ల్యూహెచ్ఓ , ఇతర అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు మొబైల్ ఫోన్లు ఉపయోగించే రేడియేషన్ నుంచి వచ్చే ప్రతికూల ఆరోగ్య ప్రభావాలకు ఖచ్చితమైన ఆధారాలు లేవని గతంలో చెప్పాయి, అయితే మరింత పరిశోధన కోసం పిలుపునిచ్చాయి. ఈ నేపత్యంలో తాజా స్టడీ ఆసక్తికరంగా మారింది. -
ప్రపంచంలోనే అత్యంత సంపన్న పిల్లి ..ఇన్‌స్టాలో ఒక్కో పోస్ట్‌కి ఏకంగా..!
ఎక్కువ సంపాదన కోసం రకరకా మార్గాల్లో అన్వేషిస్తుంటాడు మనిషి. అలా కష్టపడగా..కష్టపడగా.. కొన్నేళ్లకు ధనవంతుడవుతాడు. అదికూడా కొందరికే సాధ్యమవుతుంది. అలా ఓ జంతువు కూడా సంపాదించగలదంటే నమ్ముతారా..!. ఇది చిన్నప్పటి నుంచి దాని విభిన్నమైన లుక్స్‌తో సోషల్ మీడియాలో విస్తృతమైన ప్రజాధరణ పొంది డబ్బులు ఆర్జించడం మొదలుపెట్టింది. అలా ప్రంపచంలోనే అత్యంత ధనవంతురాలైన పిల్లిగా రికార్డు సృష్టించింది. ఇంతకీ ఈ పిల్లి అంతలా ఎలా సంపాదిస్తుంటే..ఆ పిల్లి పేరు నాలా. ఇది కాలిఫోర్నియాకు చెందిన సియామీ టాబీ మిక్స్ క్యాట్. 2010లో వరిసిరి మేతచిట్టిఫాన్ అనే మహిళ ఈ నాలా అనే పిల్లిని జంతు సంరక్షణ కేంద్ర నుంచి దత్తత తీసుకుంది. అప్పుడు దాని వయసు కేవలం ఐదు నెలలే. 2012లో వరిసిరి తన స్నేహితులకు, కుటుంబ సభ్యలతో తన పెంపుడు పిల్లి క్యూట్ ఫోటోలను షేర్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఇన్‌స్టాలో దాని పేరుతో ఒక ప్రొఫెల్ క్రియేట్ చేసింది. కొద్ది కాలంలోనే ఈ పిల్లి వేలాది ప్రజలను ఆకర్షించింది. అలా ఆ పిల్లి ఇన్‌స్టాలో 4.5 మిలియన్ల మంది ఫాలోవర్ల ఉన్న జంతువుగా గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పింది. ఈ పిల్లి అందమైన తలపాగా, నీలికళ్లతో చూపురులను కట్టిపడేస్తుంది. ఇలా నాలాకు పెరిగిన భారీ ఫాలోయింగే..పెంపుడు జంతువుల విభాగంలో ఫోర్బ్స్ టాప్ ఇన్ఫ్లుయెన్సర్ల జాబితాలో చేర్చింది. అంతేగాదు ఈ పిల్లి పేరు మీదుగా లివింగ్ యువర్ బెస్ట్ లైఫ్ అకార్డింగ్ టు నాలా క్యాట్' అనే ఈబుక్‌ను కూడా కలిగి ఉంది. అలాగే ఆమె సొంత వెబ్సైట్ 'లవ్ నాలా' పేరుతో ప్రీమియం క్యాట్ ఫుడ్ బ్రాండ్‌ను కలిగి ఉంది. నివేదికల ప్రకారం ఈ లవ్ నాలా బ్రాండ్ హస్బ్రో, రియల్ వెంచర్స్, సీడ్ క్యాంప్‌ల వంటి పెట్టుబడుదారుల నుంచి వందల కోట్లు ఆర్జిస్తోంది. ఈ పిల్లి సంపాదనలో ఎక్కువ భాగం సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్స్, ప్రొడక్ట్స్ ప్రకటనలు, బ్రాండ్ల ద్వారానే ఎక్కువగా ఆర్జిస్తోంది. ఈ పిల్లి ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు, టిక్‌టాక్, యూట్యూబ్‌తో సహా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కూడా ప్రొఫైల్‌ను కలిగి ఉంది. అయితే ఈ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ల సాయంతో జంతు సంరక్షణ పట్ల అవగాహన కల్పించడం, స్వచ్ఛంద సంస్థలకు నిధులు సేకరించడం వంటివి చేస్తుంది ఆ పిల్లి యజమాని వరిసిరి. కాగా, నాలా తర్వాత ప్రపంచంలోని రెండవ అత్యంత సంపన్న పిల్లి ఒలివియా బెన్సన్. ఈ పిల్లి నికర విలువ రూ. 813 కోట్లు. మూడవ అత్యంత సంపన్న పిల్లి దివంగత జర్మన్ ఫ్యాషన్ డిజైనర్ కార్ల్ ఒట్టో లాగర్ఫెల్డ్కు చెందిన చౌపెట్టే. దీనికి రూ. 109 కోట్లు సంపద ఉంది.(చదవండి: 12 ఏళ్లుగా అతనిది 30 నిమిషాల నిద్రే..!) -
డయానా, గ్రాహం బెల్, సిల్వెస్టర్ స్టాలోన్, వీళ్లంతా ఒకపుడు..!
మన జీవితాల్లో తొలి గురువు అమ్మ. మలిగురువు మన స్కూలు ఉపాధ్యాయుడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. పాఠశాల ఉపాధ్యాయులుగా వారి ప్రేరణ, స్ఫూర్తి జీవితాంతం గుర్తుండిపోయే వ్యక్తుల్లో ప్రముఖంగా నిలుస్తారు. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో కీలక బాధ్యత పాఠశాల ఉపాధ్యాయులదే. వారి అంకితభావం, విజ్ఞానంతో మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంటారు. అంతేకాదు చిన్నపుడు దాదాపు అందరూ ఆడే తొలి ఆట టీచర్ ఆట. అంతగా మన జీవితాల్లో గురువు పాత్ర లీనమై ఉంటుంది. కానీ టీచర్లుగా పిల్లల్ని అదుపు చేయడం, విద్యాబుద్ధులు నేర్పించడం అంత ఆషామాషీకాదు. కత్తి మీద సామే. అయినా అంతులేని నిబద్ధతతో, క్రమశిక్షణతో మెలిగి, తన విద్యార్థులకు ఆదర్శంగా నిలిచే గురువులెందరో...మన దేశంలో సెప్టెంబరు 5న జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పాటిస్తాం. భారతరత్న స్వతంత్ర భారత తొలి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గురువులకే గురువుగా ఆయన చేసిన అపారమైన కృషిని, విజయాలను గుర్తించి, ఆయన జయంతిని (1888, సెప్టెంబరు 5) పురస్కరించుకుని, ప్రతీ సంవత్సరం సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సంగా జరుపుకుంటాం. ఈ సందర్భంగా తొలి నాళ్లలో ఉపాధ్యాయులుగా పనిచేసిన కొంతమంది అంతర్జాతీయ ప్రముఖ వ్యక్తుల గురించి తెలుసుకుందాం.జాన్ ఆడమ్స్: అమెరికా రెండో ప్రెసిడెంట్ కావడానికి ముందు, జాన్ ఆడమ్స్ సెంట్రల్ స్కూల్ ఆఫ్ వోర్సెస్టర్లో ఉపాధ్యాయుడు. కానీ ఆయన ఈ ఉద్యోగం విసుగ్గా ఉండేదిట. అందుకే ఒక్క ఏడాదికే 1756లో న్యాయవాదిగా కొనసాగించడానికి ఈ పదవిని విడిచిపెట్టారట.లిండన్ బి. జాన్సన్: అమెరికా మాజీ అధ్యక్షుడు లిండన్ బి. జాన్సన్ 1928లో మెక్సికో ,యునైటెడ్ స్టేట్స్ సరిహద్దులో ఉన్న టెక్సాస్‌లోని కోటుల్లాలోని వెల్హౌసెన్ పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేశాడు. భాషా సమస్య ఉన్నప్పటికీ (అతని విద్యార్థులు స్పానిష్ మాత్రమే మాట్లాడేవారు ,లిండన్కు ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడేవారు), జాన్సన్ తన విద్యార్థుల ఆంగ్ల భాషను మెరుగుపరిచేందుకు విశేష కృషి చేశాడు. అలా 1965లో ఎలిమెంటరీ మరియు సెకండరీ ఎడ్యుకేషన్ యాక్ట్‌ను ఆమోదించడానికి దారి తీసింది.జిమ్మీ కార్టర్: అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ జార్జియాలోని ప్లెయిన్స్‌లోని మరనాథ బాప్టిస్ట్ చర్చిలో సండే స్కూల్లో బోధించేవాడు. ఈ సందర్బంగా ఆయన బోధనలు చాలా ప్రజాదరణ పొందాయి. ఈ ఉపన్యాసాలు వినడానికి ప్రజలు కూడా వేల మైళ్లు ప్రయాణించి వచ్చేవారట.హిల్లరీ క్లింటన్: హిల్లరీ క్లింటన్ కూడా కొంతకాలం ఉపాధ్యాయురాలిగా ఉన్నారు. 1960వ దశకంలో, క్లింటన్ 1974లో అర్కాన్సాస్‌కు వెళ్లడానికి ముందు వెల్లెస్లీ కాలేజీలో చదువు కున్నారు. అపుడు అర్కాన్సాస్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్ర బోధకులుగా ఉద్యోగం చేశారు. అలాగే హిల్లరీ, బిల్ క్లింటన్ ఇద్దరూ రాజకీయ నాయకులు కాకముందు ఒకే విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయులుగా పనిచేయడం విశేషం. హిల్లరీ తన ఉద్యోగాన్ని ఇష్టపడేవారట. ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకోమని విద్యార్థులను ఎల్లప్పుడూ ప్రోత్సహించేవారు. 2023లో, క్లింటన్ కొలంబియా యూనివర్సిటీ ఫ్యాకల్టీలో ప్రొఫెసర్‌గా , గ్లోబల్ అఫైర్స్‌లో ప్రెసిడెన్షియల్ ఫెలోగా చేరారు.బరాక్ ఒబామా: అమెరికా మాజీ అధ్యక్షుడిగా బరాక్ ఒబామా చికాగో యూనివర్సిటీ లా స్కూల్లో బోధించేవాడు. కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పొలిటికల్ సైన్స్‌లో బీఏ, 1991లో హార్వర్డ్ లా స్కూల్ నుండి పీజీ పట్టా పుచ్చుకున్న తరువాత బోధన ప్రారంభించి, సీనియర్ లెక్చరర్ అయ్యారు దాదాపు పదేళ్లకుపైగా ఒబామా రాజ్యాంగ చట్టం మరియు జాతి సిద్ధాంతాన్ని బోధించారు.ప్రిన్సెస్ డయానా: వేల్స్ యువరాణి కాకముందు డయానా లండన్ నర్సరీ పాఠశాలలో టీచింగ్ అసిస్టెంట్‌గా పనిచేశారు.అలెగ్జాండర్ గ్రాహం బెల్: టెలిఫోన్‌ను కనిపెట్టిన అలెగ్జాండర్ గ్రాహం బెల్ కూడా టీచర్‌గా పనిచేశారు. బోస్టన్ , కనెక్టికట్‌లోని హార్ట్‌ఫోర్డ్‌లో చెవిటివారి కోస ఉపాధ్యాయుడిగా పని చేశారు. ఆ సమయంలోనే టెలిఫోన్‌ను రూపొందించడానికి ప్రేరణ లభించిందట. 1876లో అధికారికంగా టెలిఫోన్‌ను కని పెట్టారు. ప్రముఖ నటుడు సిల్వెస్టర్ స్టాలోన్ జిమ్‌లో ట్రైనర్‌గా పని చేశాడు. 1960లలో అమెరికన్ కాలేజ్ ఆఫ్ స్విట్జర్లాండ్‌లో చదువు తున్నప్పుడు, అదనపు ఆదాయంకోసం జిమ్ టీచర్‌గా పనిచేశాడట. -
12 ఏళ్లుగా అతనిది 30 నిమిషాల నిద్రే!..!
మంచిగా నిద్రపోకపోతే ఉదయం వేళ చురుకుగా పనిచేయడం సాధ్యం కాదు. ఏదో విధమైన చికాకు, కోపం ఎక్కువగా ఉంటాయి. అదీగాక వైద్యులు ఆరోగ్యకరమైన వ్యక్తికి సగటున ఆరు నుంచి 8 గంటలు నిద్ర అవసరమని సిఫార్సు చేస్తుంటారు. అలాంటిది ఓ జపాన్ వ్యక్తి కేవలం 30 నిమిషాల నిద్రపోతున్నాడట. అయినా ఎలాంటి సమస్యలు లేకుండా చాలా చురుగ్గా తన పనులు చేసుకుంటున్నాడు. ఇలా అరంగంట నిద్రతోనే తన పనిసామర్థ్యం మరింత మెరుగుపడిందని చెబుతుండటం విశేషం. వివరాల్లోకెళ్తే..జపాన్‌లో హ్యూగో ప్రిఫెక్చర్‌కు చెందిన డైసుకే హోరీ గత 12 ఏళ్లుగా అరగంటే నిద్రపోతున్నాడట. దీనివల్ల తన పని సామర్థ్యం మెరుగుపడిందని చెబుతున్నాడు. ఇలా 30 నిమిషాలే నిద్రపోయేలా తన శరీరానికి, మెదడుకు శిక్షణ ఇచ్చానని, అందుల్ల తాను అలిసిపోనని చెప్పాడు. తాను 12 ఏళ్ల క్రితం నుంచి ఇలా నిద్రను తగ్గించుకోవడం ప్రారంభించానని అలా ప్రస్తుతం తన నిద్రను రోజుకు 30 నుంచి 45 నిమిషాలకు తగ్గించుకోగలిగానని వెల్లడించాడు. తాను భోజనానికి ఒక గంట ముందు క్రీడలు లేదా కాఫీ తాగడం వంటివి చేసి నిద్ర వస్తుందనే భావన రాదని అంటున్నాడు. అలాగే తమ పని సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలనుకునే వాళ్లు సుదీర్ఘ నిద్రకంటే నాణ్యమైన నిద్రతోనే ఎక్కువ ప్రయోజనం పొందగలరని చెబుతున్నాడు. ఇలాంటి టెక్నీక్తోనే సదా అప్రమత్తంగా ఉండే వైద్యులు, అగ్నిమాపక సిబ్బంది తక్కువసేపు నిద్రపోయినా అధిక సార్థ్యాన్ని కలిగి ఉంటారని చెప్పాడు. జపాన్‌లోని యోమియూరి టీవీ ఛానల్ డైసుకే ఎలా జీవిస్తున్నాడో చూపించే ఒక రియాలిటీ షో చేసింది. ఈ షో పేరు “విల్ యు గో విత్ మీ?”.వారు మూడు రోజుల పాటు డైసుకేని గమనించారు. అయితే ఒక ఎపిసోడ్లో డైసుకే కేవలం 26 నిమిషాలు మాత్రమే నిద్రపోయాడు.ఆ తర్వాత చాలా ఉత్సాహంగా లేచి, బ్రేక్‌ఫాస్ట్ చేసి పనికి వెళ్లడం, జిమ్ చేయడం వంటివి చేశాడు. ఇదంతా నమ్మశక్యంగా అనిపించకపోయినా అదే రియల్‌గా జరిగింది. అంతేగాదు 2016లో హోరీ జపాన్ షార్ట్ స్లీపర్స్ ట్రైనింగ్ అసోసీయేషన్ని స్థాపించాడు. అక్కడ రెండు వేలకు పైగా విద్యార్థులకు తనలాగే తక్కువసేపు నిద్రపోవడం ఎలాగో నేర్పించాడు.అయితే ఈ అల్ట్రా షార్ట్ స్లీపర్స్‌కు ఎందుకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రావడం లేదనేది శాస్త్రవేత్తలకు అర్థకాని చిక్కుప్రశ్నలా ఉంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు నెటిజన్లు ఇది ఎలానో నేర్చుకోవాలనుకుంటున్నామని, మరికొందరూ అందరికీ సరిపోదని, దీని వల్ల పలు సమస్యలు వస్తాయని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. (చదవండి: నటుడు ఆశిష్ విద్యార్థి ఇష్టపడే బెస్ట్ ఫుడ్ ప్లేస్‌లు ఇవే..!) -
అల్టిమేట్ బీచ్ ప్రపోజల్ : తెగ ఫిదా అవుతున్న లవబర్డ్స్, ఫోటోలు వైరల్
బాలీవుడ్ లవబర్డ్స్ తమ రిలేషన్‌ను పక్కా చేసుకున్నారు. మాల్దీవుల్లోని సుందరమైన ప్రదేశంలో అధికారికంగా నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ అల్టిమేట్ బీచ్ వెడ్డింగ్ ప్రపోజల్ నెట్టింట తెగ సందడి చేస్తోంది. ఈ ఫోటోలను చూసిన ఇతర లవబర్డ్స్ తెగ ఖుషీ అయిపోతున్నారు. ఇంతకీ ఎవరా ప్రేమ పక్షులు అంటే.. View this post on Instagram A post shared by Aadar Jain (@aadarjain) ప్రముఖ నటుడు అలేఖా అద్వానీ, మోడల్ ఆదార్ జైన్. గత కొన్నాళ్లుగా చెట్టాపట్టా లేసుకుని తిరుగుతున్న ఈ వీరు నిశ్చితార్థం చేసుకున్నారు. ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌తో నటుడు ‘‘నా ఫస్ట్ లవ్, నా బెస్ట్ ఫ్రెండ్ .. ఇక ఎప్పటకీ నా సొంతం’’ అనే క్యాప్షన్‌తో సంతోషకర వార్తను పంచుకున్నాడు. ప్రియురాలి ముందు మోకరిల్లి ప్రపోజ్ చేయడం, దీంతో అతని లేడీ లవ్ పూర్తిగా పసుపు రంగు దుస్తులలో అద్భుతంగా కనిపించడమే కాదు ఆధార్ తన ప్రియుడు వేలికి ఉంగరం తొడిగి ప్రపోజ్ చేస్తోంటే అలేఖ కన్నీళ్ల పర్యంతమైంది. మరోవైపు ఈ జంటకు స్నేహితులందరూ విషెస్ అందించారు. ముఖ్యంగా " మెహెందీ లగా కే రఖ్నా...డోలీ సాజా కే రఖ్నా.." అంటూ కరీనా కపూర్ స్పందించింది. కాగా ఆధార్ జైన్ ఖైదీ బ్యాండ్,హలో చార్లీలో సినిమాలతో నటుడిగా బాలీవుడ్లో పేరు తెచ్చు కున్నాడు. ముంబైలోని వే వెల్ అనే వెల్నెస్ కమ్యూనిటీ క్రియేటివ్ వ్యవస్థాపకురాలు అలేఖా అద్వానీ, వివిధ దుస్తులు,నగల బ్రాండ్లకు పనిచేసిన మోడల్ కూడా. గతంలో2023లో కరీనా కపూర్ ఖాన్ దీపావళి పార్టీలో మొదటిసారిగా కలిసి కనిపించి లైమ్‌లైట్‌లోకి వచ్చారు. ఆ తరువాత ఇద్దరూ బాలీ వెకేషన్లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను, అలేఖా అద్వానీ పుట్టినరోజు సందర్భంగా మై లైఫ్ ఆఫ్ లైట్ అంటూ కొన్ని బ్యూటిఫుల్ ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
'సూపర్ టాలెంట్ బ్రో.!’ దెబ్బకి ఆనంద్ మహీంద్ర ఫిదా!
టాలెంట్ ఓ ఒక్కరి సొత్తూ కాదు. ఆధునిక ప్రపంచంలో తనకంటూ ఒక స్పెషాల్టీ సాధించాలంటే ఒక ప్రత్యేకమైన ప్రతిభను సొంతం చేసుకోవాలి. అందరికంటే భిన్నంగా ఉన్నతంగా ఉండాలి. అప్పుడు మాత్రమే ప్రతిభకు గుర్తింపు,పాపులారిటీ వస్తుంది. అలాంటి వారిలో ప్రముఖ గాయకుడు, రచయిత ఒకరు రాఘవ్ సచార్. అందుకే ఆయన ఆనంద్‌మహీంద్ర పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర దృష్టిని ఆకర్షించారు. అసమాన ప్రతిభ అంటూ రాఘవ్ సచార్ అద్భుమైన టాలెంట్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఒక్క నిమిషంలో 11 వాయిద్యాలు వాయించాడు అనే కాప్షన్‌తో రాఘవ్ సచార్ వీడియోను షేర్ చేశారు. దీంతో నెటిజన్లు రాఘవ్‌ను ప్రశంసల్లో ముంచెత్తారు. మరోవైపు తన వీడియో షేర్ చేయడంపై స్పందించిన రాఘవ్ ఆనంద్ మహీంద్రకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.Thank you so much sir. Means the world coming from you 🙏. Am truly honoured for your kind words 😊❤️ https://t.co/23AkRAa6y0— Raghav Sachar (@raghavsachar) September 1, 20242001 నాటి హిట్ ‘దిల్ చాహ్తా హై ’ టైటిల్ ట్రాక్‌ను విభిన్న వాయిద్యాలతో వీనుల విందుగా వాయించాడు. శాక్సోఫోన్ ,వేణువు, హ్యాండ్ ప్యాన్ ఇలా పలు రకాల వాయిద్యాలతో మంత్రముగ్ధుల్ని చేశాడు. ఈ వీడియో చూస్తే మీరు కూడా వావ్.. అంటారు.ఎవరీ రాఘవ్ సచార్ మ్యూజిక్ ఫ్యామిలీలో పుట్టిన రాఘవ్ సచార్‌కు చిన్నప్పటినుంచీ సంగీతం మీద ఆసక్తి. ముఖ్యంగా ఒకేసారి పలు వాయిద్యాలను వాయించడంలో ఆరితేరాడు. 2003లో స్పెషల్ ఆల్బబ్తో గాయకుడు పేరు తెచ్చుకున్నాడు. అలాగే కాబూల్ ఎక్స్‌ప్రెస్ (2006)లో బాలీవుడ్ సంగీత దర్శకుడి అరంగేట్రం చేశాడు. ఇంకా బిట్టూ బాస్, వన్‌టూత్రీ లాంటి సినిమాలకు పనిచేశాడు. అలాగే సలామ్ నమస్తే, పరిణీత, ధూమ్, కల్, హమ్ తుమ్, యహాన్, బ్లాక్ ఫ్రైడే, కల్ హో నా హో, డాన్ కొన్నింటిని పేర్కొనవచ్చు. ఇప్పటి వరకు 150కి పైగా సినిమాల్లో తన వాయిద్య ప్రతిభను చాటుకున్నాడు. పలు అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు.ఆస్కార్విన్నర్ ఏఆర్ రెహ్మాన్,విశాల్-శేఖర్, శంకర్-ఎహసాన్-లాయ్, సలీం-సులైమాన్, అను మాలిక్ సహా అనేకమంది సంగీత దర్శకులతో కలిసి పనిచేశాడు. అంతేకాదు ఇంటర్నేషనల్ జాజ్ డ్రమ్మర్ డేవ్ వెక్ల్ , సోను నిగమ్, శ్రేయా ఘోషల్, సునిధి చౌహాన్, కైలాష్ ఖేర్, శంకర్ మహదేవన్, అద్నాన్ సమీ, శుభా ముద్గల్, నీరజ్ శ్రీధర్, కునాల్ గంజావాలా, శివమణి, నిలాద్రి వంటి ప్రముఖ కళాకారులతో కూడా రికార్డ్ చేసి ప్రదర్శించారు. కుమార్, తౌఫిక్ ఖురేషి, లూయిస్ బ్యాంక్స్, రంజిత్ బారోట్, తదితరులో కలిసి అనేక ప్రదర్శనలిచ్చాడు. రాఘవ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దీవి.. కానీ ఇక్కడ ఒక్కరు కూడా..?
ప్రపంచంలోని చూడచక్కని దీవుల్లో ఇదొకటి. ఈ దీవి చుట్టూ అందమైన పగడపు దిబ్బలు కనువిందు చేస్తాయి. దీవి తీరం దాటి లోపలకు వెళితే, పచ్చని చెట్లు, రకరకాల అరుదైన పక్షులు ఆహ్లాదం కలిగిస్తాయి. ఇక్కడ ఎలాంటి కట్టడాలూ కనిపించవు. పసిఫిక్ సముద్రంలో ఉన్న ఈ దీవి పేరు ‘పామీరా’ దీవి.ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దీవి. అయితే, ఇది ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో లేదు. ప్రస్తుతం ఇది అమెరికా అధీనంలో ఉంది. ఈ దీవి గురించి న్యాయపోరాటాలు కూడా జరిగాయి. చివరకు అమెరికా ప్రభుత్వం 2000 సంవత్సరంలో 27.26 మిలియన్ డాలర్లు (రూ.228.49 కోట్లు) చెల్లించి దీనిని సొంతం చేసుకుంది.ఈ దీవి అమెరికా ప్రభుత్వం అధీనంలోకి వచ్చినా, ఇక్కడ మనుషులెవరూ ఉండరు. దీనికి గల చీకటి చరిత్రే అందుకు కారణం. ఈ దీవి అందానికి ముగ్ధులైన కొందరు ఔత్సాహికులు ఇదివరకు అప్పుడప్పుడూ వచ్చేవారు. వారిలో కొందరు అంతుచిక్కని కారణాలతో మరణించారు. మరికొందరు ఎలాంటి ఆచూకీ లేకుండా గల్లంతైపోయారు. అందువల్ల ఈ దీవి ఎంత అందంగా ఉన్నా, ఇక్కడి వాతావరణం ఎంత ఆహ్లాదభరితంగా ఉన్నా ఇక్కడ అడుగుపెట్టాలంటేనే జనాలు భయంతో వణికిపోతారు. అయితే, అప్పుడప్పుడు కొందరు శాస్త్రవేత్తలు బృందాలుగా ఇక్కడకు వచ్చి, పరిశోధనలు జరిపి వెళుతుంటారు. వారు కూడా ఇక్కడ రాత్రివేళల్లో బస చేయరు.ఇది కిరీటం కాదు.. లైటర్!చూడటానికి కిరీటం పైభాగంలా కనిపిస్తోంది గాని, నిజానికి ఇది సిగార్ లైటర్. ఇందులో విశేషమేంటనేగా మీ అనుమానం? ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సిగార్ లైటర్. మిగిలిన లైటర్ల మాదిరిగా ఇదేమీ తేలికపాటి లైటర్ కాదు. దీని బరువు దాదాపు అరకిలో ఉంటుంది. దీని తయారీకి 400 గ్రాముల మేలిమి బంగారం, 41 కేరట్ల బరువు గల 152 అరుదైన నీలాలను ఉపయోగించారు.ఫ్రెంచ్ లగ్జరీ బ్రాండ్ ‘ఎస్.టి.డ్యూపాంట్’ ఈ సిగార్ లైటర్‌ను ‘లూయీ గీఐఐఐ ఫ్లర్ డి పార్మ్’ పేరుతో హాంకాంగ్ వ్యాపారవేత్త స్టీఫెన్ హంగ్ ఆర్డర్‌పై 2013లో ప్రత్యేకంగా తయారు చేసింది. దీని తయారీ కోసం ఎనబై మంది నిపుణులైన స్వర్ణకారులు ఆరునెలల పాటు అహర్నిశలు శ్రమించారు. దీని ధర 5 లక్షల డాలర్లు (సుమారు రూ.4.19 కోట్లు).అయితే, షోకేసులో అలంకరించుకోవడానికే తప్ప తేలికగా వాడుకోవడానికి అనువుగా లేకపోవడం దీని లోపం. అందుకే, ఇదే కంపెనీ వాడుకోవడానికి అనువుగా ఉండే పరిమాణంలో ఇదే నమూనాలో నీలాలు పొదిగిన బంగారంతో తయారు చేసిన చిన్న లైటర్లను కూడా మార్కెట్లోకి విడుదల చేసింది. వీటి ఖరీదు ఒక్కొక్కటి 15,900 డాలర్లు (రూ.13.33 లక్షలు) -
అంత్యక్రియల కాలేజీ..! అవును మీరు విన్నది నిజమే..! అదీ..?
అంత్యక్రియలు నిర్వహించే అంశంపై కోర్సులు అందిస్తోంది ఈ విచిత్రమైన కాలేజీ. ఇది అమెరికాలోని అట్లాంటాలో ఉంది. అంత్యక్రియల సమయంలో పాటించవలసిన ఆచారాలు, అంత్యక్రియలు నిర్వహించే పద్ధతులు, అంత్యక్రియల్లో పాల్గొనేటప్పుడు పాటించవలసిన మర్యాదలు తదితర అంశాలను ఈ కోర్సుల్లో బోధిస్తోంది.‘గుప్టన్ జోన్స్ కాలేజ్ ఆఫ్ ఫ్యూనరల్ సర్వీస్’ వంటి కాలేజీ మరెక్కడా లేదు. ఇది క్యాంపస్ విద్యార్థుల కోసం అసోసియేట్ ఆఫ్ సైన్స్, అసోసియేట్ ఆఫ్ అప్లైడ్ సైన్స్ కోర్సులను అందిస్తోంది. అసోసియేట్ ఆఫ్ అప్లైడ్ సైన్స్ కోర్సును దూరవిద్యా విధానం ద్వారా కూడా అందిస్తోంది. శవయాత్రల కోసం వాహనాల సేవలు, ఇతర సేవలు అందించే వారికి ఉపయోగపడటమే కాకుండా, అంత్యక్రియల నిర్వహణకు సంబంధించిన వ్యాపారాలను స్వయంగా ఏర్పాటు చేసుకునే వారికి కూడా ఉపయోగపడేలా ఈ కోర్సులను తీర్చిదిద్దినట్లు ఈ యూనివర్సిటీ చెబుతోంది. -
అబ్బా.. తొక్కేం కాదు! నారింజ పుట్టగొడుగు!!
నేల మీద ఎవరో నారింజ తొక్కలను పడేసినట్లుగా ఉంది కదూ! నారింజ తొక్కలేమీ కాదు, ఇవి పుట్టగొడుగులు. నారింజ తొక్కల్లా కనిపించడం వల్ల ఈ పుట్టగొడుగులు ‘ఆరెంజ్ పీల్ ఫంగస్’గా పేరు పొందాయి. ఈ పుట్టగొడుగుల శాస్త్రీయ నామం ‘అల్యూరియా ఆరాంటియా’.చక్కని నారింజ రంగులో, అప్పుడే వలిచిన తజా నారింజ తొక్కల్లా కనిపించే ఈ అరుదైన పుట్టగొడుగులు ఉత్తర అమెరికాలోను, యూరోప్‌లోని కొన్ని ప్రాంతాల్లోను, చిలీ దక్షిణ ప్రాంతంలోను ఆగస్టు నుంచి నవంబర్ నెలల మధ్య కాలంలో కనిపిస్తాయి. ఈ పుట్టగొడుగులు కొద్దిపాటి తేమ ఉన్న మట్టి నేలల్లో పెరుగుతాయి. ఈ పుట్టగొడుగులు తినడానికి పనికి వస్తాయి.ఇవి చదవండి: దస్తూరి అయాచిత వరం! -
అసలు.. ఆ ప్యామిలీకి ఏమైంది? ఎక్కడికి వెళ్లినట్లు?
అదంతా పెద్దపెద్ద కొండలుండే ప్రాంతం. అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతున్న ప్రదేశం. ఒకవైపు అడవి, మరోవైపు రహదారి. సుమారు వారం రోజులుగా ఎడతెరిపిలేని వర్షంతో విసిగిపోయిన ఓ గిరిజన బృందం ఆ రోజు వర్షం ఆగడంతో వేటకు బయలుదేరింది. వారంతా నడిచి వెళ్తూ ఉండగా ఓ చిన్న కుక్కపిల్ల మూలుగులు వారి చెవిన పడ్డాయి. ‘ఎక్కడ? ఎటువైపు?’ అన్నట్లు చెవులు రిక్కిస్తూ అటుగా నడిచారు.వారు అడవిలోంచి రోడ్డు మీదకు వెళ్లేసరికి, రోడ్డు పక్కన ఓ ట్రక్ కార్ ఆగి ఉంది. అందులోంచే కుక్కపిల్ల మూలుగుతోంది. దగ్గరకు వెళ్లి, కారు అద్దంలోంచి చూస్తే, అది బక్కచిక్కిపోయి, నీరసంగా ఆయాసపడుతోంది. ఆ కారులో హ్యాండ్ బ్యాగ్, పర్స్, సెల్ ఫోన్స్ కూడా కనిపించాయి. చుట్టుపక్కల ఎవరూలేరు. పైగా డోర్స్ని లాక్ చేయలేదు. కుక్కపిల్ల పరిస్థితి చూస్తే, తిండి లేక చాలా రోజులైనట్లుంది. మరి కారు ఓనర్ ఎక్కడ? విలువైన వాటిని వదిలిపెట్టి లాక్ చేయకుండా, ఇలాంటి ప్రాంతంలో ఎక్కడికి వెళ్లినట్లు? ఇవే ప్రశ్నలు వారిని కుదురుగా ఉండనివ్వలేదు. వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు.ఆ కారు నంబరు చూడగానే పోలీసులకు ‘జామిసన్ ఫ్యామిలీ మిస్సింగ్ కేసు’ గుర్తొచ్చింది. బాబీ జామిసన్, షెరిలిన్ అనే దంపతులు తమ ఆరేళ్ల కూతురు మాడిసన్ తో కలసి సరిగ్గా అప్పటికి ఎనిమిది రోజుల క్రితం అదే కారులో ఇంటి నుంచి బయలుదేరారు. వారి ఇంటి ముందున్న సీసీ కెమెరాలో అది రికార్డ్ అయ్యింది. అయితే వారు తమ ప్రయాణం గురించి సొంతవారికి కూడా చెప్పలేదు. రెండు మూడు రోజులుగా ఫోన్ ్సకి స్పందించడంలేదంటూ షెరిలిన్ తల్లి కోకోటన్ అప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏ క్లూ లేక ఆగిన ఆ కేసుకు ఈ కారే కీలకంగా మారింది. కారు దొరికిన పరిసరాల్లో తప్పిపోయిన ఆ ముగ్గురి కోసం వెతకడం ప్రారంభించారు. అప్పుడే ఆ కారు సీట్ కింద 32 వేల డాలర్లతో ఓ బ్యాగ్ దొరికింది. ‘అంత డబ్బు వారికి ఎక్కడిది?’ అనే ప్రశ్నకు కోకోటన్ కూడా సమాధానం ఇవ్వలేకపోయింది.మొదటి సంతానం కొడుకుతో కలసి దిగిన ఫొటోషెరిలిన్ ఫోన్ లోని చివరి ఫొటో విచారణ సమయంలో పలు అనుమానాలకు దారితీసింది. మాడిసన్ భయపడుతూ, ఏడుపు తన్నుకొస్తున్నట్లుగా చేతులు కట్టుకుని నిలబడిన ఫొటో అది. అసలు ఆ ఫొటోలో మాడిసన్ ఎందుకు అలా ఉంది? ఆ ఫొటో ఎవరు తీశారు? అప్పటికే జామిసన్ దంపతులకు ఏదైనా జరిగిందా? వేరే ఎవరైనా ఆ ఫొటో తీసుంటారా? అనే ప్రశ్నలు ఉత్కంఠను రేపాయి.కారులో దొరికిన మరో ఫోన్ లో జీపీఎస్ లొకేషన్ ఇంకా ఆన్ లోనే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కారు ఆగిన చోటుకు దగ్గర్లో ఓ కొండపైకి వారు చేరుకోవాల్సిన లొకేషన్ ని చూపిస్తోంది. మరి కారు ఎందుకు అక్కడ ఆగింది? వాళ్లెందుకు అక్కడ దిగారు? అనుకుంటూ అధికారులు కారు దొరికిన పరిసరాల్లో మొత్తం వెతికించారు. అయితే అప్పటికే పడిన వర్షాల కారణంగా సాక్ష్యాలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి.సరిగ్గా మూడేళ్ల తర్వాత జామిసన్ కారు దొరికిన ప్రదేశానికి రెండు మైళ్ల దూరంలో అడవి వైపు అసలు దారే లేని చోట కొందరు పర్వతారోహకులకు వారి ముగ్గురి అస్థిపంజరాలు కనిపించాయి. అయితే అప్పటికే కోకోటన్ .. బాబీ ఉపయోగించే పర్సనల్ గన్ తో పాటు ఒక సూట్‌కేస్ కనిపించడం లేదని, అది వారి ఇంట్లోనూ, కారులోనూ దొరకలేదంటే...æ ఆరోజు అడవిలో ఎవరైనా దొంగలు దాడి చేసి తీసుకెళ్లారేమోనని పోలీసులతో చర్చించింది. జామిసన్ దంపతులకు మాడిసన్ కంటే ముందు ఒక కొడుకు కూడా ఉన్నాడు. తన కోకోటన్ దగ్గర పెరిగేవాడు.మరోవైపు అదే కారులో దొరికిన ఒక డైరీలో షెరిలిన్ – బాబీ ప్రవర్తన గురించి రాసుకుంది. బాబీ ఒక్కోసారి ఒక్కోలా ప్రవర్తిస్తున్నాడని, అప్పుడే ప్రేమ, అప్పుడే ద్వేషంతో విచిత్రంగా ప్రవర్తిస్తాడని స్వయంగా షెరిలిన్ రాయడంతో బాబీనే అడవిలోకి తీసుకెళ్లి భార్య, కూతుర్ని చంపేసి, తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడేమోనన్న కథనాలు మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. ఇక వైద్యపరీక్షల్లోనూ అది హత్యా లేక ఆత్మహత్యా అనేది తేలలేదు.కారులో అంత డబ్బు దొరికిందంటే, ఆ దంపతులు డ్రగ్స్ మాఫియాతో మారకద్రవ్యాల డీల్స్ చేసేవారేమో అనే అనుమానాలు మొదలయ్యాయి. అంటే మాఫియానే తమ డీల్‌లో తేడా రావడంతో వారిని కడతేర్చిందా అనే ప్రశ్న పురుడుపోసుకుంది. మరోవైపు జామిసన్ దంపతులు ఆ కొండ ప్రాంతాల్లో 40 ఎకరాల స్థలం కొనడానికి అడ్వాన్స్ ఇచ్చారని, త్వరలోనే అక్కడికి షిప్ట్ అవ్వాలనేది వారి కోరికని, ఆ లొకేషన్ కోసమే ఆ రోజు వాళ్లు అక్కడికి వెళ్లారని కొందరు సన్నిహితులు చెప్పారు. అదలా ఉండగా వారు మిస్ అవ్వడానికి కొన్ని నెలల ముందు బాబీ తమ పొరుగువారితో ‘మా ఇంట్లో చాలా దయ్యాలున్నాయి. అవి మమ్మల్ని బాగా ఇబ్బందిపెడుతున్నాయి.. మా ప్రాణాలకే ప్రమాదంలా ఉంది’ అని చెప్పాడట. ఇదే విషయం కోకోటన్ ని అడిగితే, ‘గతంలో ఒకసారి వారి ఇంటికి వెళ్లినప్పుడు నేను కూడా ఆ దయ్యాల ఉనికి గుర్తించాను, చాలా భయపడ్డాను’ అని గుర్తు చేసుకుంది. దాంతో ఈ క్రైమ్ స్టోరీ ఉన్నపళంగా హారర్ రంగు పులుముకుంది. ఏది ఏమైనా, ఆ ముగ్గురూ ఎలా చనిపోయారు? చివరి ఫొటోలో పాప ఎందుకలా ఉంది? అనే ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానాలు దొరకలేదు.2009 అక్టోబర్ 8న అమెరికా, ఓక్లహోమాలోని యుఫాలాలో నివసించే జామిసన్ కుటుంబం కైమిచ్ పర్వతాల వైపు వెళ్లారు. మూడేళ్ల తర్వాత ఆ సమీపంలోనే అస్థిపంజరాలై దొరకడంతో ఈ ఉదంతం స్థానికంగా సంచలనం రేపింది. నేటికీ మిస్టరీగానే మిగిలింది. – సంహిత నిమ్మనఇవి చదవండి: Armand Duplantis: ఎవరికీ అందనంత ఎత్తుకు.. -
స్మార్ట్‌ఫోనా? టైం బాంబా భయ్యా ఇది! వైరల్ వీడియో
పుస్తకం హస్తభూషణం అన్న రోజులు పోయాయి. పగలూ రాత్రి స్మార్ట్ఫోనే ప్రపంచంగా కాలం గడుపుతున్న రోజులివి. స్మార్ట్ఫోన్ల నుంచి వచ్చే వైర్లెస్ రేడియేషన్ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని తెలిసినా పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఇదే ధోరణి. మితిమీరిన స్మార్ట్‌ఫోన్ వినియోగం పునరుత్పత్తి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందనీ, గర్భిణీ స్త్రీలపై ఒత్తిడి, అలసట, నిద్రకు భంగం వంటి ప్రతికూల ప్రభావాలకు ఈ సెల్ రేడియేషన్ కారణమని అనేక పరిశోధనలు గగ్గోలు పెడుతున్నాయి. అంతేకాదు స్మార్ట్పోన్ఎక్కువగా వాడటం కంటి సమస్యలు, చేతి, మెడ కండరాలు సమస్యలు కూడా వస్తాయి.తాజాగా స్మార్ట్‌ఫోన్‌ను మైక్రోస్కోప్‌లో పరిశీలిస్తున్న వీడియో ఒకటి నెట్టింట సందడి చేస్తోంది. టాయిలెట్ సీట్ కంటే ఎక్కువ బ్యాక్టీరియా మన చేతిలో ఉండే స్మార్ట్‌ఫోన్ మీద ఉంటుందని గతంలో అనేక పరిశోధనలు హెచ్చరించాయి. ఇదే విషయాన్ని ఈ వీడియోలో మనం చూడొచ్చు.Smartphone under a Microscope📹 Rajinder Singhpic.twitter.com/UsHH3AUrvW— Science girl (@gunsnrosesgirl3) August 28, 2024ప్రమాదకరమైన సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియాలకు నిలయమైన మొబైల్ ఫోన్ వాడకంలో తప్పనిసరి జాగ్రత్తలు కొన్ని పాటించాలి. ఫోన్ వాడకాన్ని నియంత్రించడం, అలాగే వాడిన తరువాత, ఆహారం తీనేముందు చేతులను శుభ్రంగా కడుక్కోవడం చేయాలి. స్మార్ట్‌ఫోన్‌ను రోజులో ఒకసారైనా శానిటైజ్‌తో జాగ్రత్తగా తుడవం( తడిచిపోయేలా కాదు) చేయాలి. మరీ ముఖ్యంగా చిన్నపిల్లలకు స్మార్ట్‌ఫోన్‌ను దూరంగా ఉంచాలి. -
గుజరాత్ వరదలు : ‘‘బతకడానికి ఇంకేం మిగల్లేదు’’!
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు గుజరాత్‌ను అతలాకుతలం చేశాయి. వడోదర సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జనజీవితం అస్తవ్యస్తమైంది గాంధీనగర్, ఖేడా, వడోదర తదితర ప్రాంతాల్లో చోటు చేసుకున్న ప్రమాదాల్లో ఇప్పటికే 29 మంది ప్రాణాలు కోల్పోయారు. 18వేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆగస్టు 30 వరకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాదు 15 అడుగుల పొడవైన మొసళ్లు ఇళ్లల్లోకి చొరబడుతున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి. వడోదర నివాసి ఆవేదన గుజరాత్ వర్షభీభత్సానికి అద్దం పట్టింది. వరద ఉదృతికి విలువైన మూడు కార్లు నీళ్లలో మునిగిపోయాయంటూ ఒక వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు.. ఇక బతకడానికి ఏమీ మిగల్లేదు అంటూ తన బాధను పంచుకున్నాడు. దీనికి సంబంధించి నీట మునిగిన తన మూడు కార్ల ఫోటోలను రెడ్డిట్ యాప్‌లో షేర్ చేశాడు. పోస్ట్ ప్రకారం, 50 లక్షల రూపాయల విలువైన ఖరీదైన కారు ఆడి ఏ6,మారుతి సుజుకి సియాజ్, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ భారీ వర్షం కారణంగా దెబ్బతిన్నాయి.అయితే వీధిలో పార్క్ చేయడం వల్లే ఇలా జరగిందన్న నెటిజన్లు వ్యాఖ్యలకు స్పందించిన ఆయన మరింత వివరంగా తన దుస్థితిని వివరించాడు. తాను 5 BHK బంగ్లాలో ఉంటాననీ 85 ఇళ్లు ఉన్న సొసైటీలో, ప్రతీ ఇంటికి 3 కార్ పార్కింగ్లు ఉంటాయని తెలిపారు. చుట్టుపక్కల ప్రాంతాలన్నీ నీట మునిగాయని , తన ఇంట్లోకి 7 అంగుళాలు, బయట దాదాపు 4 అడుగుల నీరు చేరిందని తెలిపారు. దీంతో నెటిజన్లు సానుభూతి ప్రకటించారు.VIDEO | Gujarat Rains: Crocodile spotted at roof of a house as heavy rainfall inundate Akota Stadium area of Vadodara. (Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz)#GujaratRains #GujaratFlood pic.twitter.com/FYQitH7eBK— Press Trust of India (@PTI_News) August 29, 2024 -
విద్యా కుసుమాలు.. వాడిపోతున్నాయి
పరీక్ష పాసవ్వలేదనో, అమ్మ తిట్టిందనో, నాన్న కొట్టాడనో, ప్రేమవిఫలమైందనో.. మరో కారణంగానో చిన్న వయసులోనే జీవితాల్ని చాలిస్తున్న విద్యార్థులు ఆత్యహత్యలు మనసుల్ని పట్టి కుదిపేస్తుంటాయి. కదా.. తాజాగా ఒక అధ్యయనం ఈ తీవ్రతకు నిదర్శనంగా నిలిచింది. భారతదేశంలో జనభా వృద్దిరేటు కన్న విద్యార్థులు ఆత్యహత్యలే ఎక్కువ అని తేలింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) డేటా ఆధారంగా, ఇంటర్నేషనల్ కెరీర్ అండ్ కాలేజ్ కౌన్సెలింగ్ (IC3) కాన్ఫరెన్స్ ,ఎక్స్పో 2024లో బుధవారం సమర్పించిన "విద్యార్థుల ఆత్మహత్యలు: భారత్‌ను వణికిస్తున్న మహమ్మారి(ఎపిడెమిక్ స్వీపింగ్ ఇండియా)" నివేదికలో ఈ విషయాలు వెల్లడైనాయి.ఈ నివేదిక ప్రకారం మొత్తం ఆత్మహత్యల సంఖ్య సంవత్సరానికి 2 శాతం పెరిగింది. 2021- 2022 మధ్య విద్యార్థుల బలవన్మరణాలు 4 శాతం పెరిగాయి. విద్యార్థుల ఆత్మహత్య కేసులు తక్కువగా నమోదయ్యే అవకాశ ఉన్న నేపథ్యంలో ఈ పెరుగుదల ఆందోళన కలిగిస్తోందని పేర్కొంది. అంతేకాదు ఇది మొత్తం ఆత్మహత్యల ట్రెండ్‌ను కూడా ఇది అధిగమించింది. గత దశాబ్దంలో, 0-24 సంవత్సరాల వయస్సున్న జనాభా 582 మిలియన్ల నుండి 581 మిలియన్లకు తగ్గగా, విద్యార్థుల ఆత్మహత్యలు 6,654 నుండి 13,044కి పెరిగింది. ఆందోళనకరంగా విద్యార్థుల ఆత్మహత్యలు!దేశంలో జనాభా వృద్ధి, మొత్తం ఆత్మహత్యల రేట్ల కంటే, విద్యార్థి ఆత్మహత్యలే అధికంగా ఉన్నాయి. గత రెండు దశాబ్దాలుగా వీరి ఆత్మహత్యల వార్షిక రేటు నాలుగు శాతం పెరిగినట్టు ఈ నివేదిక వెల్లడించింది. గత దశాబ్ద కాలంలో విద్యార్థుల ఆత్మహత్యలు అనూహ్యంగా పెరిగాయని, పురుషుల ఆత్మహత్యలు 50 శాతం, మహిళల ఆత్మహత్యలు 61 శాతం పెరిగాయని నివేదిక పేర్కొంది. 2022లో మొత్తం విద్యార్థుల ఆత్మహత్యల్లో 53 శాతం మగ విద్యార్థులే. అయితే, 2021-22 మధ్య, మగ విద్యార్థుల ఆత్మహత్యలు 6 శాతం తగ్గాయి. కానీ ఇదే సమయంలో ఆడపిల్లల ఆత్మహత్యలు 7 శాతం పెరగడం గమనార్హం.మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్‌లో అత్యధిక విద్యార్థుల ఆత్మహత్యలు ఉన్న రాష్ట్రాలుగా తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇది జాతీయ మొత్తంలో మూడింట ఒక వంతు. దక్షిణాది రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలు సమిష్టిగా 29 శాతం వాటా కలిగి ఉన్నాయి. కోటా లాంటి కోచింగ్ కేంద్రాల హబ్ రాజస్థాన్ రాష్ట్రం 10వ స్థానంలో ఉంది. అంతేకాదు కేసులు నమోదైన దాని ప్రకారం గుర్తించిన డేటా మాత్రమేననని, నమోదు కానీ కేసుల సంఖ్య కలిస్తే వాస్తవ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండవచ్చనే ఆందోళన వ్యక్తం చేసింది. 2017 మెంటల్ హెల్త్‌కేర్ యాక్ట్ మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తుల ఆత్మహత్యాయత్నాలను నేరరహితం చేసినప్పటికీ రిపోర్టింగ్ పద్ధతులను ప్రభావితం చేస్తూనే ఉంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో రిపోర్టింగ్ తక్కువగా ఉంటుందని నివేదిక తెలిపింది. విద్యార్థి ఆత్మహత్యలకు కారణాలు- నివారణ మార్గాలుఆర్థిక, సామాజిక ఒత్తిళ్ల ప్రభావం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ర్యాంకుల్లో రేసులో వముందుండాలనే విషయంలో తల్లిదండ్రులు ,సమాజం నుండి తీవ్రమైన పోటీ, భారీ అంచనాలు విద్యార్థులలో అధిక ఒత్తిడికి, ఆందోళనకు కారణమవుతున్నాయి. మానసిక ఆరోగ్య సమస్యలు: డిప్రెషన్, ఆందోళన, ఇతర మానసిక ఆరోగ్య పరిస్థితులు విద్యార్థుల ఒత్తడికి మరింత ఆజ్యం పోస్తున్నాయి. అయితే విద్యార్థుల మానసిక ఆందోళనలో అండగా నిలిచి, తగిన సహాయం, కౌన్సెలింగ్ సదుపాయాలు విద్యాసంస్థల్లో లేకపోవడం దురదృష్టం. ఆత్మహత్య ఆలోచనలు అడ్డుకుని, ఆరోగ్య, కెరీర్ కౌన్సెలింగ్ అందించడం ,అవగాహన కల్పించడం చాలా అవసరం.కుటుంబ సమస్యలు, వివాదాలు, తల్లిదండ్రుల ఘర్షణలు,కుటుంబ సభ్యులనుంచి తగిన ఆప్యాయత, ఆసరా లేకపోవడంతో నిరాశతో కుంగిపోతున్న విద్యార్థులు. అందుకే వారికి మేమున్నామనే భరోసా కల్పించాలి. సమస్యలతో బాధపడుతున్నవారికి మానసిక ఆరోగ్య నిపుణులు లేదా విశ్వసనీయ వ్యక్తులద్వారా కౌన్సెలింగ్ ఇప్పించడం ముఖ్యం. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 309 ప్రకారం ఆత్మహత్యకు ప్రయత్నించడం మరియు సహాయం చేయడం నేరం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
మాయమవుతున్న ‘వై’ క్రోమోజోమ్ : మగజాతి మనుగడకు ముప్పు?
మనిషిలోని ఎక్స్, వై క్రోమోజోములు అనేవి ఆడ, మగ లింగ నిర్ధారణకు మూలం. ప్రధానంగా పురుషుల్లో ఉండే వై క్రోమోజోమ్ మగబిడ్డ జననానికి కారణమవుతుంది. అందుకే దీన్ని మేల్ క్రోమోజోమ్ అని పిలుస్తారు. అయితే ఈ వై క్రోమోజోముకు సంబంధించి షాకింగ్ అధ్యయనం ఒకటి వెలుగులోకి వచ్చింది. ప్రపంచం అభివృద్ధి చెందుతున్న కొద్దీ, మానవులలోని రెండు సెక్స్ క్రోమోజోమ్‌లలో ఒకటైనవై క్రోమోజోమ్ క్రమంగా అంతర్ధాన మవుతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ ప్రొసీడింగ్స్‌లో ఆఅధ్యయన పేపర్ ను ప్రచురించారు.మగవారిలో సాధారణంగా ఒక ఎక్స్, ఒక వై క్రోమోజోమ్ (XY) ఉంటాయి. అదే ఆడవారిలో అయితే రెండు ఎక్స్ క్రోమోజోములు (XX) లుంటాయి. ఈ వై క్రోమోజోమ్ ఎక్స్ క్రోమోజోమ్ కంటే చాలా చిన్నది. తాజా అధ్యయనం ప్రకారం పురుషుల్లో వై క్రోమోజోమ్ క్రమంగా మాయవుతోందని పరిశోధకులు తేల్చారు.ప్రముఖ జెనెటిక్స్ ప్రొఫెసర్ , శాస్త్రవేత్త జెన్నిఫర్ ఎ. మార్షల్ గ్రేవ్స్ ప్రకారం, వై క్రోమోజోమ్ సమయం గతించిపోతోంది ఈ ధోరణి కొనసాగితే, వై క్రోమోజోమ్ 11 మిలియన్ సంవత్సరాలలో పూర్తిగా అదృశ్యమవుతుంది, ఇది మగ సంతానం , మానవ మనుగడ గురించి భయాలను పెంచుతుంది.అయితే అంత భయపడాల్సిన పనిలేదుఅయితే జపాన్‌కు చెందిన ఎలుకల జాతి, దాని అంతర్ధానమైనందున, మరో కొత్త మగ జన్యువును అభివృద్ధి చేసుకుంది. కనుక 1.1 కోట్ల ఏళ్ల కాలంలో వై క్రోమోజోమ్ కనుమరుగైనా, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అవే లక్షణాలతో మరో మేల్ క్రోమోజోమ్ రూపొందే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.మార్షల్ గ్రేవ్స్ వెల్లడించిన అంశాల ప్రకారం గత కొన్ని లక్షల సంవత్సరాలలో ‘వై’ క్రోమోజోములోని జన్యువులు క్రమంగా క్షీణిస్తూ వస్తున్నాయి. వాస్తవానికి ‘Y’ క్రోమోజోములో 1438 జన్యువులుంటాయి. కానీ, గత 300 మిలియన్ సంవత్సరాలలో ‘వై’ క్రోమోజోములోని జన్యువుల (Genes) సంఖ్య భారీగా పడిపోయింది. 1393 జీన్స్ మటుమాయమై, ప్రస్తుతం 45 జన్యువులు మాత్రమే ఉన్నాయి. అంటే మరో 11 మిలియన్ల సంవత్సరాల్లో ఆ మిగిలిన 45 జన్యువులు కూడా అంతర్ధానమయ్యే అవకాశం ఉంది.జపాన్‌లోని హక్కైడో విశ్వవిద్యాలయంలో అసటో కురోయివా నేతృత్వంలోని పరిశోధకులు స్పైనీ ఎలుకలలోని చాలా Y క్రోమోజోమ్ జన్యువులు ఇతర క్రోమోజోమ్‌లకు మారినట్లు కనుగొన్నారు. ముఖ్యంగా, వారు క్రోమోజోమ్ 3పై SOX9 జన్యువు దగ్గర చిన్న DNA ను గుర్తించారు. ఇది మగవారిలో ఉంటుంది కానీ ఆడవారిలో ఉండదు. ఈ డూప్లికేషన్ SOX9ని యాక్టివేట్ చేస్తుంది. ఇది పురుష అభివృద్ధిలో తప్పిపోయిన SRY జన్యువు పాత్రను తీసుకుంటుంది. Y క్రోమోజోమ్ కోల్పోయినప్పుడు క్షీరదాలు ప్రత్యామ్నాయ లింగాన్ని నిర్ణయించే విధానాలను అభివృద్ధి చేయగలవని ఈ అధ్యయనం చెబుతోంది. మరొక చిట్టెలుక జాతి, మోల్ వోల్ కూడా దాని వై క్రోమోజోమ్‌ను కోల్పోయిన తరువాత కూడా మనుగడలో ఉంది.సర్వైవల్ కీలకంమానవ వై క్రోమోజోమ్‌ల క్షీణత అంశం ఆందోళన కలిగిస్తున్నప్పటికీ, కొత్త లింగాన్ని నిర్ణయించే జన్యువును అభివృద్ధితో మగ జాతి ఉనికికి వచ్చే నష్టమేమీ ఉండదంటున్నారు. అయినప్పటికీ, ఇటువంటి పరిణామాత్మక మార్పులు వివిధ మానవ జనాభాలో బహుళ లింగ-నిర్ధారణ వ్యవస్థల ఆవిర్భావానికి దారితీస్తాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు, దీని ఫలితంగా కొత్త జాతులు ఏర్పడతాయని సూచించారు. -
యమపురికి దారి : యమధర్మరాజు లాంగ్ జంప్ పోటీ, వీడియో వైరల్
సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని గొప్పగా చెప్పుకొనే బెంగళూరు నగరంలో రోడ్ల అధ్వాన్న పరిస్థితిపై ఇప్పటికే అనేక కథనాలను చూశాం. ముఖ్యంగా వర్షాకాలంలో రోడ్లపై గుంతల కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ రోడ్లపై వెళ్లాలంటేనే వాహనదారులకు చుక్కలు కనిపిస్తాయి. ఓ మోస్తరు వర్షానికి కూడా రోడ్లపై నరకం చూడాల్సి వస్తోందని ఇప్పటికే సామాన్య జనం సహా, అనేకమంది అసహనం వ్యక్తం చేశారు. ఇవి రహదారులు కాదు, యమపురికి దారులు, రోడ్లపై రక్షణ అనేదే లేకుండా పోయిందంటూ సెలబ్రిటీలు, వ్యాపార వేత్తలు మండిపడిన ఉదంతాలు కూడా ఉన్నాయి. బెంగళూరు రోడ్లపై 5,670 గుంతలు ఉన్నాయని బీబీఎంపీ ఇటీవలి సర్వేలో తేలిందంటే అక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.తాజాగా బెంగళూరు రోడ్ల అధ్వాన్న స్థితిని కళ్లకు కట్టేలా ఉన్న ఒక వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో ద్వారా రోడ్డుపై గుంతల కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకుద్దేశించిన నిరసన ఆసక్తికరంగా మారింది. కర్నాటకలోని ఉడిపిలో చనిపోయిన వారి కోసం యమరాజు లాంగ్ జంప్ పోటీలు నిర్వహిస్తున్నాడు అంటూ కార్తీక్ రెడ్డి అనే యూజర్ ఈ వీడియోను ఎక్స్ పోస్ట్ చేశారు. ఇది నెటిజనులను ఆకట్టుకుంటోంది. యమధర్మరాజు , చిత్రగుప్తుడు రోడ్డు గుంతలను కొలుస్తున్న వైనం పరిస్థితికి అద్దం పడుతోంది. గుంతలు, అధ్వాన్నమైన రహదారుల కారణంగా సామాన్యుడు గాయపడినా, చచ్చిపోయినా రాజకీయనాయకులు పట్టించుకోరంటూ నెటిజనులు విమర్శలు గుప్పించారు.Yamaraja conducts long jump competition for the dead in Udupi, Karnataka. pic.twitter.com/MLBxCuZoZn— Karthik Reddy (@bykarthikreddy) August 27, 2024 -
లవ్ ఈజ్ ఇన్‌ద ఎయర్ : లవ్ ప్రపోజల్ వీడియో వైరల్
తాజ్‌మహల్ ముందే లవ్ ప్రపోజ్ చేయాలా ఏంటి? ఈఫిల్ టవర్ముందు నిలబడే ఐ లవ్ యూ చెప్పాలా? మంచి ఘడియ ముంచుకు రావాలే గానీ ఎక్కడైనా మనసులోని ప్రేమను వ్యక్తం చేయొచ్చు. అందుకే ఇండిగో విమానంలో తన ప్రియుడికి ప్రపోజ్ చేసిందో ప్రేయసి. లవ్ ఈజ్ ఇన్ ది ఎయిర్ అన్నట్టున్న ఈ వీడియో నెట్టింట సందడి చేస్తోంది. "నేను గాలిలో ప్రపోజ్ చేశాను" అంటూ ప్రియురాలు ఐశ్వర్య బన్సల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ అందమైన ఈ వీడియో ప్రేమికుల మనసు దోచుకుంటోంది.బన్సల్, ప్రియుడు అమూల్య గోయల్ ఫ్లైట్ ఎక్కడంతో వీడియో ప్రారంభమవుతుంది. కొన్ని సెకన్ల తర్వాత, బన్సల్ తన బాయ్‌ఫ్రెండ్ వైపు నడుచుకుంటూ వెళ్లి మోకాళ్లపై నిలబడి తన ప్రియుడికి ప్రపోజ్ చేసింది. దీంతో ప్రియుడు ఫుల్ ఖుష్ ఆగి ఆ క్షణంలోనే ఓకే చెప్పేసాడు. అంతే క్షణం ఆలస్యంగా తన బెటర్ హాఫ్ వేలికి ఉంగరాన్ని తొడిగింది. అంతేకాదు దీన్ని ఇండిగో కూడా సెలబ్రేట్ చేసింది. ఫ్లైట్ అటెండెంట్ మైక్రోఫోన్ తీసుకుని, ఇతర ప్రయాణీకుల దృష్టిని ఆకర్షిస్తూ ఈ పెళ్లి ప్రపోజ్ ప్రకటన చేయడం విశేషం. తన జీవితంలో ఎంతో అందమైన ఈ క్షణాలు చాలా ప్రత్యేకంగా ఉండాలని భావించాను. కానీ ఊహించిన దాని కంటే మించి ఇంత అందంగా ఉంటుందని అనుకోలేదు. సిబ్బంది ఒప్పుకుంటారో లేదో అని భయపడ్డా.. అన్నీ అనుకున్నట్టుగాజరిగాయంటూ అంతులేని సంతోషాన్ని వ్యక్తం చేసింది బన్సల్. ఈ ప్రణయ పక్షుల వీడియోను మీరు కూడా చూసేయండి మరి! View this post on Instagram A post shared by Aishwarya Bansal (@aishwaryabansal_) -
గాఢాంధకారంలో ఒక గైడ్, బంగ్లాదేశ్ టాప్ అడ్వైజర్
గాఢాంధకారంలో ఒక వెలుగు రేఖ ఎంతో ఆశను, నమ్మకాన్ని ఇస్తుంది. సంక్షోభపు చీకటి నుంచి వెలుగు దారుల వైపు అడుగులు వేయడానికి సన్నద్ధం అవుతున్న బంగ్లాదేశ్‌కు కనిపిస్తున్న వెలుగు రేఖల్లో షర్మీన్ ఒకరు. ప్రపంచానికి ఆమె పేరు అపరిచితం కావచ్చు. బంగ్లా ప్రజలకు మాత్రం సుపరిచితం. బంగ్లాదేశ్ పునర్నిర్మాణానికి రాళ్లెత్తుతున్న మేధావులు, ఉద్యమకారులలో షర్మీన్ ప్రముఖురాలు. బంగ్లాదేశ్ ఆపద్ధర్మ ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనస్‌కు సహాయపడే ఉన్నత స్థాయి సలహాదారులలో షర్మీన్ ఒకరు....‘శాంతిభద్రతలను పునరుద్ధరించడం, ప్రజాస్వామికంగా ఎన్నికలు జరిపించడం, సాధారణ పరిస్థితులను నెలకొల్పడం, సుపరిపాలన అందించే రోజులను తీసుకురావడానికి ప్రాధాన్యత ఇస్తాం’ అంటోంది షర్మీన్. విద్యావంతుల కుటుంబం, సామాజిక ఉద్యమాల్లో భాగమయ్యే కుటుంబంలో ఢాకాలో పుట్టింది షర్మీన్. ఆమె తండ్రి ఖాన్ సర్వర్ ముర్షీద్ ప్రఖ్యాత విద్యావేత్త. దౌత్యవేత్త, మేధావి. తల్లి నూర్జహాన్ జర్నలిస్ట్, సోషల్ యాక్టివిస్ట్. తల్లిదండ్రుల స్ఫూర్తితో ఎన్నో సంవత్సరాలుగా బంగ్లాదేశ్‌లోని సామాజిక, సాంస్కృతిక ఉద్యమాల్లో భాగం అవుతూ వస్తుంది షర్మీన్.సామాజిక మార్పుల కోసం శ్రమించే ఎన్నో సంస్థలతో కలిసి పనిచేసిన షర్మీన్ ‘బ్రోటీ’ అనే మానవ హక్కుల, ఎన్నికల పర్యవేక్షణ బృందానికి సీయీవోగా పనిచేసింది. పారదర్శకమైన, ప్రలోభాలకు వీలులేని, స్వేచ్ఛాయుత ఎన్నికలు ఈ సంస్థ లక్ష్యం. కళలు, సాంస్కృతిక వారసత్వం కోసం పనిచేసే ‘ఉత్తర్సురీ’ అనే సాంస్కృతిక కేంద్రానికి కార్యదర్శిగా పనిచేసింది.లింగ సమానత్వం నుంచి సామాజిక సమానత్వం వరకు ఎన్నో కార్యక్రమాలతో క్షణం తీరిక లేకుండా ఉన్నప్పటికీ తనకు ఎంతో ఇష్టమైన సంగీతానికి మాత్రం ఎంతో కొంత సమయం కేటాయిస్తుంది షర్మీన్. 1995లో వచ్చిన ‘ముక్తీర్ గాన్’ అనే డాక్యుమెంటరీ గాయకులలో షర్మీన్ ఒకరు.‘ఏ భేదాలు లేకుండా ప్రజలను ఏకం చేసే శక్తి సంగీతానికి ఉంది’ అంటుంది షర్మీన్. సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం మాట ఎలా ఉన్నప్పటికీ సామాజిక ఉద్యమాలకు సంబంధించి షర్మీన్ ఎన్నోసార్లు బెదిరింపులు ఎదుర్కొన్నది. అయితే ఆమె ఎప్పుడూ వెనక్కి తగ్గింది లేదు. తన ధైర్యమే తనకు రక్షగా నిలిచింది.తాజా విషయానికి వస్తే...బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతున్న దాడులను షర్మీన్ ఖండిస్తుంది. ‘ఇవి మత కలహాలు కాదు. రాజకీయ ప్రేరేపిత దాడులు’ అంటున్న షర్మీన్ బాధితుల తరఫున నిలబడుతుంది. వారికి ధైర్యాన్ని ఇస్తోంది. ‘విషాదగతాన్ని మరచి΄ోదాం. బంగారు భవిష్యత్తుపై మాత్రమే దృష్టి పెడదాం’ అని అన్ని వర్గాల ప్రజలకు పిలుపు ఇస్తోంది షర్మీన్. ‘షర్మీన్’ అనే పేరుకు ఉన్న అర్థాలలో ‘గైడ్’ కూడా ఒకటి. ఇప్పుడు బంగ్లాదేశ్‌కు షర్మీన్ ఖచ్చితంగా ఒక గైడ్!‘గత ఏడాది కాలంగా మన దేశ ఆర్థిక వ్యవస్థపై మన అవగాహన తప్పుడు సమాచారంపైనే ఆధారపడి ఉంది. దాని నుంచి బయటికి రావాలి. స్థూల జాతీయ ఉత్పతి (జీడీపి) గురించి గత ΄ాలకులు చెప్పినవి నిజాలు కావు. విదేశీ నిల్వలు తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో మన దేశంలో ప్రాథమిక, మౌలిక మార్పులు జరగబోతున్నాయని మీకు హామీ ఇస్తున్నాను’ అని బంగ్లా ప్రజలను ఉద్దేశించి చెబుతోంది షర్మీన్ ముర్షిద్. -
హృదయాన్ని కదిలించే ఘటన: 19 ఏళ్ల తర్వాత భారత్‌లో తండ్రిని..!
జపాన్‌కి చెందిన ఓ కుర్రాడు తన తండ్రిని వెతుకుతూ భారత్‌లోకి వచ్చాడు. తండ్రి జాడ కోసం అనువణువు గాలించి మరీ వెతికి పట్టుకున్నాడు. అదీకూడా 19 ఏళ్ల తర్వాత తన తండ్రిని కలుసుకుంటే ఆ అనందం వేరేలెవెల్. మాటలకందని ఆ ఆనందం ఊహకందని నమ్మలేని నిజంలా అనిపిస్తుంది. అలాంటి సంఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన సుఖ్‌పాల్ సింగ్ థాయిలాండ్‌లో జపనీస్ మహిళ సాచీని కలుసుకున్నాడు. 2002లో ఆమెను ఇష్టపడి వివాహం చేసుకున్నాడు. టోక్యో సమీపంలో చిబాకెన్లో ఆమెతో కలిసి నివశించాడు. కొన్నాళ్లకే వైవాహిక బంధంలో సమస్యలు వచ్చి విడిపోయారు. అప్పటికే వారికి రెండేళ్ల కుమారుడు రిన్ తకహటా ఉన్నాడు. అయితే రిన్ తన తల్లి సాచీ వద్దే పెరిగాడు. 2007లో భారత్‌కు తిరిగివచ్చిన సుఖ్పాల్కు కొడుకు లేదా భార్యతో ఎలాంటి సంబంధాలు లేవు. ప్రస్తుతం జపాన్‌లో ఉంటున్న రిన్ తన తండ్రిని కలవడానికి ఇటీవలే పంజాబ్ వెళ్లాడు. కేవలం అలనాటి తండ్రి ఫోటో, అడ్రస్ సాయంతో అవిశ్రాంతంగా ఆచూకీ కోసం వెతికాడు. చివరికి తండ్రిని కలిసి భావోద్వేగానికి గురయ్యాడు. ఈ మేరకు సుఖ్‌పాల్ సింగ్ మాట్లాడుతూ..తన ఫోటో సాయంతో ప్రజలందర్ని అడుగుతూ వస్తూ తనని కనుక్కున్నాడని అన్నారు. తన కొడుకుని కలవడం నిజంగా నమ్మలేకున్నా. ఇది ఒక కలలా ఉంది. నా కొడుకుని కలవాలని చాలసార్లు అనుకున్నా కానీ అది సాధ్య పడదని వదిలేశాను. ఇలా తన కొడుకే తనని వెతుక్కుంటూ వస్తాడని ఊహించలేదని కన్నీళ్లు పెట్టుకున్నాడు ." సుఖ్‌పాల్ సింగ్. ఇక రిన్ జపాన్‌లోని ఒసాకా యూనివర్శిటీ ఆఫ్ ఆర్ట్స్‌లో కుటుంబ వృక్షం అనే ప్రాజెక్టులో పనిచేస్తున్నాడు. ఆ సమయంలోనే తన తల్లివైపు కుటుంబసభ్యులే తెలుసు తప్ప తండ్రి గురించి ఏం తెలియదని గ్రహించి..రిఎలాగైనా కలుసుకోవాలనే సంకల్పం మొదలయ్యింది రిన్లో. తన తండ్రి ఆచూకీ కోస గూగుల్ మ్యాప్స్ ఉపయోగించినట్లు వివరించాడు. ఆగస్టు 15 కల్లా తండ్రి ఉన్న ప్రదేశానికి చేరకున్నాడు. చివరికీ ఆగస్టు 18 నాటికి తన తండ్రిని కలుసుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. What a moment ❤️ Sukhpal Singh and his Japanese son Rin Takahata reunited after 19 years when Rin, inspired by a college assignment, traced his father to Amritsar, India. Rin was welcomed warmly by Sukhpal and his current family. pic.twitter.com/KExVBl6wwY— Akashdeep Thind (@thind_akashdeep) August 24, 2024 (చదవండి: నటి ప్రియాంక చోప్రా నెక్లెస్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!) -
ఈ టమాటాలతో సరదా యుద్ధం.. ఎలా మొదలైందో తెలుసా?
దాదాపు ఎనిమిది దశాబ్దాల కిందట కొందరు మిత్రుల మధ్య సరదా వేడుకగా ప్రారంభమైంది. అనతి కాలంలోనే ఇది అతిపెద్ద ఆహార యుద్ధ వేడుకగా పేరు పొందింది. జనాలంతా వీథుల్లోకి చేరి, ఒకరిపై మరొకరు టమాటోలను విసురుకుంటూ, వీథుల్లో మడుగులు కట్టే టమాటో రసంలో మునిగి తేలుతూ సంబరాలు చేసుకునే ఈ వేడుక పేరు ‘లా టమాటినా’. స్పెయిన్‌లోని బునోల్ పట్టణంలో ఏటా ఆగస్టు నెలలో ఆఖరి బుధవారం రోజున ఈ వేడుక జరుగుతుంది. ‘లా టమాటినా’లో పాల్గొనే జనాలు టన్నుల కొద్ది టమాటోలను ఒకరిపై ఒకరు విసురుకోవడంతో, రోడ్లన్నీ టమాటో రసంతో నెత్తుటేర్లను తలపిస్తాయి.ఈ సందర్భంగా దాదాపు 1.50 లక్షల కిలోల టమాటోలను ఒకరిపైకి ఒకరు విసురుకుంటారు. ఈసారి ‘లా టమాటినా’ వేడుకను ఘనంగా నిర్వహించడానికి బునోల్ పట్టణ సంస్థ ఏర్పాట్లు చేసింది. బునోల్ పట్టణ జనాభా దాదాపు తొమ్మిదివేలు మాత్రమే! అయితే, ఏటా జరిగే ఈ టమాటోల సరదా యుద్ధం తిలకించడానికి విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు. ఈ వేడుకలో భాగంగా సంగీత, నృత్య కార్యక్రమాలు, విందు వినోదాలు కూడా జరుగుతాయి. ఈ వేడుక చూడటానికి విదేశాల నుంచి విపరీతంగా జనాలు వచ్చిపడుతుండటంతో బునోల్ పట్టణంలో హోటళ్లు కిటకిటలాడిపోయేవి.స్థానికులకు మంచినీటి సరఫరాకు కూడా ఇబ్బందులు ఎదురయ్యేవి. ఈ పరిస్థితిని నివారించడానికి 2013 నుంచి ఈ వేడుకను తిలకించడానికి వచ్చే సందర్శకుల సంఖ్య ఇరవైవేలకు మించరాదంటూ బునోల్ స్థానిక సంస్థ పరిమితి విధించింది. సందర్శకుల సంఖ్యను కట్టడి చేయడానికి అప్పటి నుంచి టికెట్లు కూడా ప్రవేశపెట్టారు. టికెట్లు పెట్టినా సరే సందర్శకులు ఏమాత్రం వెనుకాడకుండా ఈ వేడుకను చూడటానికి నెలల ముందుగానే బుకింగ్‌లు చేసుకుంటుండటం విశేషం. ‘లా టమాటినా’ స్ఫూర్తితో అమెరికాలోని కొలరడో–టెక్సస్ల మధ్య 1982 నుంచి ‘కొలరడో–టెక్సస్ టమాటో వార్’ వేడుక జరుపుకోవడం ప్రారంభించారు. ఆ తర్వాత కొలంబియా, చైనా తదితర దేశాల్లోనూ ఇలాంటి టమాటో యుద్ధాల నిర్వహణ మొదలు పెట్టారు. మన దేశంలో కర్ణాటకలోని బెంగళూరు, మైసూరు నగరాల్లోను, బిహార్ రాజధాని పట్నాలోను దాదాపు దశాబ్దంగా ఏటా ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. -
దొంగను పట్టించిన పుస్తకం..పాపం చోరికి వచ్చి..!
దొంగతనానికి వచ్చి కొందరు దొంగలు అక్కడ ఏమి లేకపోవడంతో లెటర్ రాసి పెట్టి వెళ్లిన ఘటనలు చూశాం. ఒక దొంగ చోరికి వచ్చి చక్కగా ఏసీ కింద పడుకున్న ఉదంతాన్ని కూడా చూశాం. ఇవన్నీ ఒక ఎత్తైతే పాపం ఈ దొంగను ఓ బుక్ అడ్డంగా బుక్‌చేసింది. తప్పించుకునేందుకు వీల్లేకుండా పోలీసులకు పట్టుబడేలా చేసింది. ఈ విచిత్ర ఘటన ఇటలీలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..ఇటలీ రాజధాని రోమ్‌లోని ఒక ఇంటిలో చోరి చేసేందుకు ఒక దొంగ వచ్చాడు. రాత్రిపూట ఆ ఇంటి బాల్కనీ గుండా లోనికి ప్రవేశించి దొంగతనం చేసేందుకు యత్నిస్తుండగా..అక్కడే ఉన్న పుస్తకం దొంగగారిని తెగ ఆకర్షించింది. చదవకుండా ఉండలేకపోయాడు. ఇక అంతే ఆ పుస్తకం తీసుకుని చదవడం ప్రారంభించాడు. ఎంతలా అంటే అందులో నిమగ్నమైపోయాడు. ఇంతలో తెల్లారిపోయింది. మెలుకువ వచ్చి యజమాని చూడగా..అపరిచిత వ్యక్తి పుస్తకం చదువుతూ కనిపించాడు. వెంటనే అప్రమత్తమై పోలీసులకు కాల్ చేశాడు. అతడిని సమీపించి ఎవరు నువ్వు అని తట్టి అడిగేంత వరకు దొంగ ఈ లోకంలో లేనేలేడు. మనోడుకి దొరికిపోయానని అర్థమై.. తప్పించుకునేందుకు వీలుపడలేదు. ఇంతలో పోలీసులు రావడం దొంగని అరెస్టు చేయడం చకచక జరిగిపోయాయి. అయితే ఈ దొంగను ఆకర్షించిన పుస్తకం ఏంటంటే..గ్రీకు పురాణాలకి సంబంధించిన హుమర్స్ ఇలియాడ్ పుస్తకం. అది ఈ దొంగను తెగ ఆకర్షించింది. దీంతో దొంగ ఆ పుస్తక చదవడంలో మునిగిపోయి చోరీ విషయం మర్చిపోయి పట్టుబడ్డాడు. అయితే ఆ ఇంటి యజమాని మాత్రం పాపం అతడు చదవకుండా మధ్య వదిలేయాల్సి వచ్చిన ఆ పుస్తకం కాపీని ఆ దొంగకు పంపిస్తానని అన్నాడు. ఎందుకంటే ఆ పుస్తకమే కదా దొంగతనాన్ని నిరోధించింది. అలాగే ఇది అతడిలో మార్పు తీసుకొచ్చేందుకు ఉపయోగపడుతుందని నమ్మకంగా చెబుతున్నాడు సదరు యజమాని. (చదవండి: చప్పన్ భోగ్ థాలీ అంటే..? ఏం ఉంటాయంటే..) -
చున్నీ లేదా స్కార్ఫ్‌లతో బైక్ నడిపేటప్పుడూ జాగ్రత్త..! లేదంటే..
అమ్మాయిలు సాధారణంగా చుడీదార్ లేదా స్కార్ఫ్‌లతో బైక్‌లు నడుపుతుంటారు. అలాంటప్పుడూ కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే బైక్‌లు లాంటివి నడిపేటప్పుడూ ఇక్కడ ఈ అమ్మాయికి ఎదురైన చేదు అనుభవమే ఎదురుకావొచ్చు. అయితే ఈ అమ్మాయి భయపడకుండా చాలా తెలివిగా బైక్‌ని హ్యాండిల్ చేయడమే గాక స్థానికులు సహాయంతో విపత్కర పరిస్థితి నుంచి సునాయాసంగా బయటపడింది. అసలేం జరిగిందంటే..సునీతా మనోహార్ తరుచుగా బైక్‌పై వెళ్తుంటుంది. అలానే ఒక రోజు ముంబై వీధుల గుండా వెళ్తుండగా ఆ గాలికి సడెన్‌గా తన ముఖానికి చుట్టుకున్న స్కార్ఫ్ ఊడిపోయి బైక్‌లో చిక్కుకుపోయింది. అది గమనింకపోవడంతో కొద్దిసేపటికి ఆమె మెడ బైక్ ముందు భాగానికి వంగిపోయేలా చేసింది. ఈ హఠాత్పరిణామానికి తత్తరపడకుండా నిధానంగా బైక్ క్లచ్ని లాగి ఆపేసింది. ఆమె బైక్‌పై వెనుక సీటులో ఉన్న మరోక అమ్మాయి సాయం కోసం చుట్టుపక్కల వాళ్లని అభ్యర్థించగా.. అటుగా వెళ్తున్న మరో బైకర్ ఆమెకు సాయం చేశాడు. దీంతో కొద్దిపాటి చిన్న గాయంతో ఆ ఆపద నుంచి బయటపడింది. ఈ మేరకు సునీతా మనోహర్ బైక్‌పై ప్రయాణించేవారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ తను ఫేస్ చేసిన చేదు ఘటనకు సంబంధించిన వీడియోని షేర్ చేసుకుంది. ఇక్కడ సునీతా ముఖం అంతా కవర్ అయ్యేలా స్కార్ఫ్ చుట్టుకునిమరీ హెల్మెట్ ధరించింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే నెటిజన్లు ఆమె అంతటి భయానక స్థితిలో టెన్షన్ పడకుండా బైక్‌ని కంట్రోల్ చేసిన విధానాన్ని ప్రశంసిస్తూ పోస్ట్‌లు పెట్టారు. View this post on Instagram A post shared by Sunita Manohar More (@nusti_bhatkantii) (చదవండి: బిర్యానీ ఆకుతో ఎన్ని లాభాలో తెలుసా..! ఆ సమస్యలు దూరం..!) -
ఈ టూ డెడ్లీ మమ్మీల మ్యూజియం గురించి ఎప్పుడైనా విన్నారా! ఇదొక..?
ఇది మమ్మీల మ్యూజియం. మెక్సికోలోని గ్వానాజ్వాటో పట్టణంలో ఉంది. పలు దేశాల్లో 1870 నుంచి 1958 కాలంలో జరిపిన తవ్వకాల్లో బయటపడ్డ మమ్మీలను సేకరించి, జాగ్రత్తగా తీసుకొచ్చి ఈ మ్యూజియంలో భద్రపరచారు. ప్రపంచంలోని భీతిగొలిపే మ్యూజియంలలో ఒకటిగా ఈ మమ్మీల మ్యూజియం పేరుమోసింది. ‘ఎల మ్యూజో డి లాస్ మోమియాస్’ పేరుతో ఈ మమ్మీల మ్యూజియంను 1969లో ఇక్కడ నెలకొల్పారు.ఈ మ్యూజియం సేకరణలో మొత్తం 111 మమ్మీలు ఉన్నాయి. వాటిలో కొన్ని మరీ శిథిలంగా మారడంతో, ప్రస్తుతం వాటిలోని 59 మమ్మీలను మాత్రమే సందర్శకులకు ప్రదర్శిస్తున్నారు. గ్వానాజాటో మునిసిపాలిటీకి, మెక్సికో జాతీయ చరిత్ర పురాతత్త్వ పరిశోధన సంస్థకు మధ్య మమ్మీల నిర్వహణపై వివాదం నడుస్తుండటంతో ఇవి కొంత నిర్లక్ష్యానికి లోనయ్యాయి. స్థానిక సంస్థ నిర్లక్ష్యం వల్లనే మమ్మీలపై ఫంగస్ పెరిగి, అవి పాడైపోతున్నాయనేది జాతీయ చరిత్ర పురాతత్త్వ పరిశోధన సంస్థ ఆరోపణ. -
సాలీళ్లు బాబోయ్! సాలీళ్లు! ఇళ్లల్లోకి చొరబడుతున్నాయి..
ఒకనాడు రవి అస్తమించని సామ్రాజ్యాన్ని ఏలిన బ్రిటిష్ రాజ్యాన్ని ఇప్పుడు సాలీళ్లు గడగడలాడిస్తున్నాయి. సాలీడు పేరు చెబితేనే బ్రిటిష్ ప్రజలు భయంతో వణుకుతున్నారు. సాలీళ్లలో ‘ఫెన్ రాఫ్ట్ స్పైడర్’ జాతికి చెందిన భారీ సాలీళ్లు ఇళ్లల్లోకి చొరబడి గూళ్లు ఏర్పాటు చేసుకుంటూ, జనాలను బెంబేలెత్తిస్తున్నాయి. మామూలు సాలీళ్లలా ఇవి చిన్నగా ఉండవు. ఏకంగా అరచేతి పరిమాణంలో ఉంటాయి. బ్రిటన్‌లోని సఫోక్, ససెక్స్, నార్ఫోక్ ప్రాంతాల్లో ఈ భారీ సాలీళ్ల బెడద కొద్దిరోజులుగా ఎక్కువైంది. నీటి ఉపరితలంలోను, నేల మీద కూడా జీవించగలిగే ఫెన్ రాఫ్ట్ స్పైడర్ సాలీళ్లలో అరుదైన జాతి. జలాశయాల పర్యావరణాన్ని ఇవి కాపాడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ సాలీళ్లు కీటకాలతో పాటు చిన్న చిన్న చేపలను కూడా తింటాయి. ఇదివరకు ఇవి జలాశయాల పరిసరాల్లోనే కనిపించేవి. ఇప్పుడివి ఇళ్లల్లోకి కూడా చొరబడటమే బెడదగా మారింది.నల్లులతో నానా యాతన..!అగ్రరాజ్యం అమెరికాను నల్లులు హడలెత్తిస్తున్నాయి. అమెరికాలోని దాదాపు ఇరవై రాష్ట్రాల్లో ఇటీవలి కాలంలో నల్లుల బెడద విపరీతంగా పెరిగింది. చాలా చోట్ల ఇళ్లు, హోటళ్లు తదితర ప్రదేశాల్లోని మంచాలు, కుర్చీలు, సోఫాల్లోకి చేరిన నల్లులు జనాలను కుట్టి చంపుతున్నాయి.అమెరికాలో ఎక్కువగా ‘ఆసియన్ లాంగ్హార్న్డ్ టిక్’ జాతికి చెందిన నల్లులు కొద్దికాలంగా విజృంభిస్తున్నాయి. అమెరికాలో ఈ జాతి నల్లులను తొలిసారిగా 2017 సంవత్సరంలో ఓక్లహామాలో గుర్తించారు. వీటి నిర్మూలనకు ఎన్ని చర్యలు తీసుకున్నా, ఇవి అన్నింటినీ తట్టుకుంటూ ఇప్పుడు ఇరవై రాష్ట్రాలకు విస్తరించాయి. ఈ నల్లులు వ్యాప్తి చేసే లైమ్ వ్యాధి ఇప్పటికే పలువురి ప్రాణాలను బలిగొంది. ఈ నల్లులు లైమ్ వ్యాధికి కారణమయ్యే పరాన్నజీవులను వ్యాప్తి చేస్తాయని అమెరికా పర్యావరణ పరిరక్షణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నల్లి కాటుకు గురైన వారిలో లైమ్ వ్యాధికి గురై, దాదాపు 15 శాతం మంది మృతిచెందినట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. -
వండర్బోయ్స్! ఎవర్రా మీరు.. ఇంత టాలెంటెడ్‌గా ఉన్నారు..?
కనిపెట్టాలేగాని పిల్లల్లో వేయి రకాల టాలెంట్స్ఉంటాయి. వాటిని ప్రోత్సహిస్తే వారు వండర్బోయ్స్ అవుతారు. వండర్స్ సృష్టిస్తారు. ఇక్కడ ఉన్నపిల్లలు అలాంటి వారే. వారు చేసిన పని వారిని రికార్డ్ బుక్స్‌లో ఎక్కించింది. ఇలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా ఏదైనా టాలెంట్‌ని ప్రదర్శిద్దామా?ఇక్కడ కనిపిస్తున్న చిరుత పేరు శరణ్ గొరజాల. వయసు ఒక సంవత్సరం 9 నెలల 28 రోజులు (ఏప్రిల్ 30, 2024– రికార్డు సాధించే సమయానికి). ఈ బుడతడు ఏం చేశాడో తెలుసా? ‘పరిగెత్తు’ అనగానే పరిగెత్తాడు. 50 మీటర్ల దూరాన్ని 28 సెకన్లలో పూర్తి చేశాడు. ఇంతకు ముందు ఇదే వయసు బుడతడు ఈ దూరాన్ని 29 సెకన్లలో పూర్తి చేస్తే మనవాడు ఒక సెకను ముందే పూర్తి చేసి రికార్డు సాధించాడు.‘ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో స్థానం సంపాదించాడు. శరణ్ గొరజాలది చిత్తూరు జిల్లా. తండ్రి స్వరూప్, తల్లి ప్రియాంక. చిన్నప్పటి నుంచి బలే హుషారు. ఇంట్లో ఆడుకోమంటే పరిగెత్తడం నేర్చాడు. హాల్లో, వరండాలో, ప్లేగ్రౌండ్‌లో పరిగెత్తడమే పని. అందుకే తల్లిదండ్రులు ఎంకరేజ్ చేశారు. ఏముంది... 50 మీటర్లు లాగించేశాడు. పెద్దయ్యి 100 మీటర్ల పరుగులో రికార్డు సాధించాలని కోరుకుందాం.ఈ గంభీర వదన మహానుభావుని పేరు గోకుల్ పోఖ్రాజ్ పథ్. వయసు 3 సంవత్సరాల 3 నెలలు. కాని మైండు నిండా సమాచారం... ఏదడిగితే అది టక్కున సమాధానం. వీడి మెమొరీ చూసి వీళ్లమ్మ కొన్ని సంగతులు నేర్పింది. వాటిని మర్చి΄ోతేనా? ఎప్పుడు అడిగినా చెబుతాడు. వీడి వయసు పిల్లలు చిట్టి చిలకమ్మా... అమ్మ కొట్టిందా చెప్పమంటే మర్చి΄ోతారు. వీడు? శరీరంలో 33 భాగాల పేర్లు, 23 రకాల వాహనాలు, కంప్యూటర్లో ఉండే 19 రకాల పార్ట్‌ల పేర్లు, 12 పండుగలు, 17 పెంపుతు జంతువుల పేర్లు, 16 జలచరాల పేర్లు, 16 చారిత్రక స్థలాల పేర్లు, 8 మంచి అలవాట్లు, 6 నర్సరీ రైములు కాకుండా ఏబీసీడీలు అన్నీ వాటితో వచ్చే పదాలు చెబుతాడు. ఇంకా ఏమేమి చెబుతాడో మనకెందుకు... ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో ఇతడి పేరు రాసి చల్లగా జారుకోక.హరియాణలోని ఝుజ్జర్కు చెందిన పద్నాలుగు సంవత్సరాల కార్తికేయ జాఖర్ పన్నెండు సంవత్సరాల వయసులోనే ఎవరి గైడెన్స్ లేకుండా మూడు లెర్నింగ్ అప్లికేషన్లను డెవలప్ చేసి ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో చోటు సం΄ాదించాడు. కార్తికేయ నాన్న రైతు. కోవిడ్ మహమ్మారి సమయంలో ఆయన మొబైల్ ఫోన్ కొనుగోలు చేశాడు. తండ్రి దగ్గర ఉన్న ఫోన్ సహాయంతో బడి ΄ాఠాలు వినడమే కాదు టెక్నాలజీకి సంబంధించి ఎన్నో విషయాలు తెలుసుకునేవాడు కార్తికేయ. అలా అని కొత్త విషయాలు తెలుసుకోవడానికే పరిమితం కాలేదు.‘ఒకసారి ట్రై చేసి చూద్దాం’ అంటూ ఏవేవో ప్రయోగాలు చేసేవాడు. అలా చేస్తూ చేస్తూ మూడు యాప్‌లను సొంతంగా డెవలప్ చేశాడు. అవి: 1.జనరల్ నాలెడ్జీ యాప్: లుసెంట్ జీకే2. కోడింగ్ అండ్ గ్రాఫిక్ డిజైనింగ్ యాప్: రామ్ కార్తిక్ లెర్నింగ్ సెంటర్3. డిజిటల్ ఎడ్యుకేషన్ యాప్: శ్రీరామ్ కార్తిక్.‘కార్తికేయలో అద్భుతమైన ప్రతిభ ఉంది. ప్రభుత్వ సహకారం ఉంటే మా అబ్బాయి మరెన్నో సాధించగలడు. డిజిటల్ టెక్నాలజీకి సంబంధించి కార్తికేయ దేశానికి సేవ చేయాలని కోరుకుంటున్నాను’ అంటున్నాడు కార్తికేయ తండ్రి అజిత్.