mexico
-
న్యూజిలాండ్ మళ్లీ సాధించింది.. ఇది మూడోసారి
ఆక్లాండ్: మరో అవకాశం కోసం వేచి చూడకుండా... అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని... న్యూజిలాండ్ పురుషుల ఫుట్‌బాల్ జట్టు దర్జాగా ప్రపంచకప్ ప్రధాన టోర్నమెంట్కుఅర్హత సాధించింది. పది దేశాలు పోటీపడ్డ ఓసియానియా జోన్ నుంచి 2026 ప్రపంచకప్ టోర్నీ (FIFA 2026 World Cup)కి అర్హత పొందిన తొలి జట్టుగా న్యూజిలాండ్ నిలిచింది. సోమవారం జరిగిన ఓసియానియా జోన్ ఫైనల్లో న్యూజిలాండ్ 3–0 గోల్స్ తేడాతో న్యూ కాలడోనియా జట్టుపై గెలిచింది.న్యూజిలాండ్ తరఫున మైకేల్ జోసెఫ్ బాక్సల్ (61వ నిమిషంలో), బార్సరూసెస్ (66వ నిమిషంలో), హెన్రీ జస్ట్ (80వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. ఫైనల్లో ఓడిపోయిన న్యూ కాలడోనియా జట్టుకు ప్రపంచకప్ బెర్త్ దక్కించుకునే మరో అవకాశం మిగిలి ఉంది. ఆసియా, ఆఫ్రికా, ఉత్తర, మధ్య, దక్షిణా అమెరికా జోన్లకు చెందిన ఆరు జట్లు పోటీపడే ఇంటర్ కాంటినెంటల్ ప్లే ఆఫ్ టోర్నీలో విజేతగా నిలిస్తే న్యూ కాలడోనియా జట్టు కూడా ప్రపంచకప్‌కు అర్హత పొందుతుంది. 2026లో ప్రపంచకప్ టోర్నీకి అమెరికా, మెక్సికో, కెనడా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. ఆతిథ్య దేశాల హోదాలో అమెరికా, కెనడా, మెక్సికో ఇప్పటికే ప్రపంచకప్‌కు అర్హత పొందగా... జపాన్, న్యూజిలాండ్ ఈ మూడు జట్లతో చేరాయి. వందేళ్ల చరిత్ర కలిగిన ప్రపంచకప్ టోర్నీలో న్యూజిలాండ్ పోటీపడనుండటం ఇది మూడోసారి. తొలిసారి 1982లో వరల్డ్‌కప్‌లో ఆడిన న్యూజిలాండ్ రెండోసారి 2010 ప్రపంచకప్‌లో పోటీపడింది. ఆ తర్వాత 2014, 2018, 2022 ప్రపంచకప్ టోరీ్నలకు న్యూజిలాండ్ అర్హత సాధించడంలో విఫలమైంది. సెమీస్‌లో పోర్చుగల్ లిస్బన్: నేషన్స్ లీగ్ టోర్నమెంట్లో పోర్చుగల్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. డెన్మార్క్‌తో జరిగిన రెండో అంచె క్వార్టర్ ఫైనల్లో పోర్చుగల్ 5–2 గోల్స్ తేడాతో గెలిచింది. తొలి అంచె క్వార్టర్ ఫైనల్లో డెన్మార్క్ చేతిలో ఒక గోల్ తేడాతో ఓడిన పోర్చుగల్ ఈ మ్యాచ్‌లో స్పష్టమైన విజయాన్ని అందుకుంది. నిరీ్ణత సమయం ముగిసేసరికి పోర్చుగల్ 3–2తో గెలిచింది. అయితే గోల్స్ సగటు 3–3తో సమం కావడంతో విజేతను నిర్ణయించేందుకు అదనపు సమయం ఆడించారు. అదనపు సమయంలో పోర్చుగల్ మరో రెండు గోల్స్ సాధించింది. -
స్మగ్లింగ్.. కోడి గుడ్డేం కాదు!
కెనడా, మెక్సికో నుంచి అమెరికాలోకి అక్రమంగా తరలిస్తూ సరిహద్దుల్లో భారీగా పట్టుబడుతున్న ఉత్పత్తుల సంఖ్య కొద్ది నెలలుగా భారీగా పెరిగిపోయింది. అయితే అవేమిటో తెలుసా? ఎప్పట్లా ఫెంటానిలో, ఇతరేతర డ్రగ్సో కాదు. పౌల్ట్రీ ఉత్పత్తులు! ఆశ్చర్యంగా ఉన్నా నిజమిది. పైగా వాటిలోనూ సింహ భాగం గుడ్లే కావడం విశేషం!! నానాకష్టాలూ పడి డ్రగ్స్‌ను దేశం దాటించేకంటే స్మగ్లింగ్ నెట్వర్కులకు ఇదే మాంచి లాభసాటి బేరంగా కన్పిస్తోందట. అమెరికాను అతలాకుతలం చేస్తున్న గుడ్ల కొరత తీవ్రతకు ఈ ఉదంతం అద్దం పడుతోంది. కెనడా, మెక్సికోల నుంచి అమెరికాలోకి ఫెంటానిల్ తదితర డ్రగ్స్ విచ్చలవిడిగా స్మగ్లింగ్ అవుతుండటం పరిపాటి. అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఇది డొనాల్డ్ ట్రంప్‌కు పెద్ద ప్రచారాస్త్రంగా మారింది కూడా. కెనడాపై టారిఫ్‌ల యుద్ధానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా కూడా ఫెంటానిల్ నిలిచింది. కానీ కొద్ది నెలలుగా కెనడా నుంచి గుడ్లు తదితర పౌల్ట్రీ ఉత్పత్తుల స్మగ్లింగ్ డ్రగ్స్‌ను కూడా మించిపోయిందంటూ అమెరికా అధికారులే ముక్కున వేలేసుకుంటున్నారు. గుడ్లే అమెరికన్లకు ప్రధానమైన బ్రేక్‌ఫాస్ట్. ఉదయాన్నే ఆమ్లెట్లుగానో, మరో రూపంలో గుడ్లు తిన్నాకే వారికి రోజు మొదలవుతుంది. వారి బ్రేక్‌ఫాస్ట్ అవసరాలు కాస్తా బ్లాక్మార్కెటర్లకు కాసుల పంటగా మారుతుండటం విశేషం!డ్రగ్స్ కంటే 10 రెట్లు! 2024 అక్టోబర్‌తో పోలిస్తే ప్రస్తుతం కెనడా నుంచి డెట్రాయిట్ గుండా అమెరికాలోకి అక్రమంగా గుడ్లు తరలిస్తున్న వారి సంఖ్య 36 శాతం పెరిగినట్టు అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ గణాంకాలు చెబుతున్నాయి. ఇక మెక్సికో సరిహద్దులకు అతి సమీపంలో ఉండే శాన్‌డీగో వద్ద ఈ ఉదంతాలు ఏకంగా 158 శాతం పెరిగిపోవడం విశేషం. 2024 అక్టోబర్ నుంచి అమెరికా సరిహద్దులను దాటించే ప్రయత్నంలో పౌల్ట్రీ ఉత్పత్తులు పట్టుబడ్డ ఉదంతాలు 3,768కి పైగా నమోదయ్యాయి. ఇదే సమయంలో ఫెంటానిల్ పట్టుబడ్డ ఉదంతాలు కేవలం 352 మాత్రమే కావడం విశేషం. పెరుగుతున్న ఫ్లూ రిస్క్! బర్డ్ ఫ్లూ దెబ్బకు కొన్నేళ్లుగా ఉత్తర అమెరికా ఖండమంతా అతలాకుతలమవుతోంది. కెనడాలో దీని తీవ్రత తక్కువగా ఉన్నా అమెరికా బాగా ప్రభావితమైంది. అక్కడ రెండు మూడేళ్లుగా కోట్లాది కోళ్లను హతమార్చాల్సి వచ్చింది. ఇది క్రమంగా దేశవ్యాప్తంగా తీవ్ర గుడ్ల కొరతకు దారితీసింది. దాంతో గుడ్ల ధరలు చుక్కలనంటుతున్నాయి. డజనుకు 5 డాలర్ల మార్కును దాటేసి ఆల్‌టైం రికార్డు సృష్టించాయి. షికాగో, శాన్ఫ్రాన్సిస్కో వంటి పలు ప్రధాన నగరాల్లోనైతే డజను గుడ్లు ఏకంగా 9 నుంచి 10 డాలర్ల దాకా పలుకుతున్న పరిస్థితి! గుడ్ల సంక్షోభం చేయి దాటిపోయిందని స్వయానా అధ్యక్షుడు ట్రంపే అంగీకరించారు! ఈ ఏడాది చివరకల్లా గుడ్ల ధరలు కనీసం మరో 50 శాతం దాకా పెరగవచ్చని అంచనా. దాంతో కొద్ది నెలలుగా స్మగ్లర్ల కన్ను గుడ్లపై పడింది. కెనడా నుంచి అమెరికాలోకి వాటి అక్రమ రవాణా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతోంది. అయితే దీనివల్ల బర్డ్ ఫ్లూతో పాటు ఇతరత్రా రోగాల రిస్కు పెరిగిపోతోందని అమెరికా ఆందోళన చెందుతోంది. కోళ్లు, గుడ్ల స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం మోపేందుకు కెనడా, మెక్సికో సరిహద్దుల వద్ద నిఘాను మరింత కఠినతరం చేయాలంటూ ట్రంప్ సర్కారు తాజాగా ఆదేశాలు జారీచేసింది!అమెరికాలో అద్దెకు కోళ్లు గుడ్ల సంక్షోభం పుణ్యమా అని అమెరికాలో ఇప్పుడు కోడి పెట్టలను అద్దెకిచ్చే సరికొత్త వ్యాపారం పుట్టుకొచి్చంది. అది ఇప్పుడక్కడ యమా జోరుగా సాగుతుండటం విశేషం. డజను గుడ్లకు 5 నుంచి 10 డాలర్ల దాకా పెట్టాల్సి రావడం అమెరికన్లను కలవరపరుస్తోంది. దీనికి బదులు ఇంటి పెరళ్లలో కోడిపెట్టలను సాకేందుకు వాళ్లు మొగ్గుచూపుతున్నారు. దాంతో దేశవ్యాప్తంగా కోడిపెట్టలకు చెప్పలేనంత డిమాండ్ ఏర్పడింది. దీన్ని సొమ్ము చేసుకునేందుకు రెంట్ ద చికెన్ వంటి పేర్లతో ఏకంగా కంపెనీలే పుట్టుకొచ్చాయి. ఆర్నెల్ల ప్రాతిపదికన కోడిపెట్టలను అద్దెకిస్తున్నాయి. కనీస అద్దె ప్యాకేజీలు 300 డాలర్ల నుంచి మొదలవుతున్నాయి. ఇందులో భాగంగా రెండు పెట్టలతో పాటు వాటికి ఆర్నెల్ల పాటు కావాల్సిన దాణాను కూడా కంపెనీలే ఇస్తాయి. కోళ్ల గూడు కూడా సమకూరుస్తాయి. ఆరోగ్యకరమైన పెట్ట వారానికి ఐదారు దాకా గుడ్లు పెడుతుంది. ఆ లెక్కన రెండు కోళ్లు ఆర్నెల్లకు కనీసం 250 గుడ్లు పెడతాయన్నమాట. వాటిని మార్కెట్లో కొనాలంటే ప్రస్తుత రేట్లను బట్టి కనీసం 80 నుంచి 160 డాలర్లకు పైనే పెట్టాల్సి ఉంటుంది. కోళ్లను సాకడం ద్వారా ఏ రోజుకు ఆ రోజు తాజా గుడ్లు దొరుకుతుండటం అమెరికన్లను బాగా ఆకర్షిస్తోంది. అంతేగాక గుడ్లను పొదిగించి కోళ్ల సంఖ్యను ఇబ్బడిముబ్బడిగా పెంచుకుంటున్నారు. కాంట్రాక్టు ముగిశాక అవి వారికే సొంతమవుతున్నాయి. వాటిని అద్దెకిస్తూ సైడ్ వ్యాపారం చేస్తున్న వారికి కూడా కొదవ లేదు. దొరికితే జరిమానాలుఅమెరికాలోకి గుడ్లు, ఇతర ప్రాసెస్ చేయని పౌల్ట్రీ ఉత్పత్తుల రవాణా చట్టవిరుద్ధం. ఫ్లూ తదితర ఆందోళనలే ఇందుకు కారణం. వీటిని దేశంలోకి తరలించే ప్రయత్నంలో పట్టుబడితే 300 డాలర్ల దాకా జరిమానా విధిస్తారు. ‘‘ఇరు దేశాలకూ కొన్నేళ్లుగా నిద్ర లేకుండా చేస్తున్న ఫెంటానిల్ వంటి డ్రగ్స్ కంటే కూడా కెనడా నుంచి అమెరికాలోకి గుడ్ల అక్రమ రవాణాయే పెరిగిపోతోందంటే ఆశ్చర్యంగానే ఉంది. కానీ కళ్లెదుట కన్పిస్తున్న వాస్తవమిది’’ అన్నారు కెనడా చాంబర్ ఆఫ్ కామర్స్ పాలసీ చీఫ్ మాథ్యూ హోమ్స్. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Mr Trump: టారిఫ్ వార్‌లో వెనక్కి తగ్గినట్లే తగ్గి..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) టారిఫ్ వార్‌లో కాస్త వెనక్కి తగ్గారు. మెక్సికోతో పాటు కెనడాపై విధించిన దిగుమతి సుంకాలను ఏప్రిల్ 2వ తేదీ దాకా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే కొన్ని ఉత్పత్తులపై మాత్రం ఈ నిర్ణయం యధావిధిగా కొనసాగుతుందని, ప్రతీకార సుంకాలు విధించే ప్రణాళికలో ఎటువంటి మార్పు లేదని అన్నారాయన.కెనడా, మెక్సికోతోపాటు చైనాపై డొనాల్డ్ ట్రంప్ సుంకాలు విధించడం ఆయా దేశాలతో వాణిజ్య యుద్ధానికి కారణమైంది. ఈ ప్రభావం.. అమెరికా ఆర్థిక వ్యవస్థ, ద్రవ్యోల్బణంపైనా ప్రతికూల ప్రభావం చూపెట్టవచ్చనే హెచ్చరికలు జారీ అయ్యాయి. అయితే తన నిర్ణయంపై మార్కెట్ కుదేలు ప్రభావమేమీ లేదని ఆయన అంటున్నారు. కేవలం అమెరికా కార్ల తయారీదారుల కోసమేనని చెప్పారాయన. అయితే ఒకవైపు కెనడా వాణిజ్య ప్రతినిధులతో చర్చలు.. మరోవైపు మెక్సికో ప్రెసిడెంట్‌తో మాట్లాడిన తర్వాతే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.ఉత్తర అమెరికా వాణిజ్య ఒప్పందాల్లో భాగంగా.. అమెరికా-మెక్సికో-కెనడా మధ్య ఒప్పందం(USMCA) అమలులో ఉంది. తాజా నిర్ణయంతో ప్రస్తుతానికి ఆ రెండు దేశాల ఆటోమేకర్స్‌కు ట్రంప్ ఊరట ఇచ్చారు. మరోవైపు కెనడా నుంచి దిగుమతి అయ్యే 62 శాతం ఉత్పత్తులు కొత్త సుంకాలను ఎదుర్కొనాల్సిందేనని వైట్‌హౌజ్ ప్రతినిధి ఒకరు చెప్పారు. అయితే ఎనర్జీ ప్రొడక్ట్స్‌కు మాత్రం 10 శాతమే వర్తిస్తుందని తెలిపారు.కెనడా కూడా అమెరికాపై విధించిన సుంకాల విషయంలో వెనక్కి తగ్గింది. సుమారు 125 బిలియన్ డాలర్ల అమెరికా ఉత్పత్తులపై విధించిన రెండో దశ సుంకాల అమలును ఏప్రిల్ 2వ తేదీ దాకా వాయిదా ేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే.. అన్ని టారిఫ్‌లను ఎత్తేసే దిశగా ప్రయత్నాలుకొనసాగిస్తామని తెలిపింది.రాజకీయ దుమారంఅధికారంలోకి వచ్చిన వెంటనే.. ట్రంప్ పలు దేశాలపై భారీ స్థాయిలో సుంకాలు విధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పొరుగు దేశాలతో ట్రేడ్వార్కు బీజం వేశారు. అయితే ఇది క్రమంగా రాజకీయ మలుపు తిరిగింది. ట్రంప్‌తో చర్చలు నిర్మాణాత్మకంగా జరిగినప్పటికీ.. కెనడా-అమెరికాలు భవిష్యత్తులో వాణిజ్య యుద్ధంలో ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాన్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ట్రూడోకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కౌంటర్ ఇచ్చారు.అధికారంలో కొనసాగడానికి సుంకాల వివాదాన్ని ట్రూడో వినియోగించుకుంటున్నారని ఆరోపించారు. కెనడా ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్న విషయాన్ని తెలుసుకోవాలని తాను ప్రయత్నించినప్పటికీ.. అక్కడ నుంచి ఎటువంటి సమాధానం రాలేదన్నారు. అయితే ఈ క్రమంలో ఆయన వ్యాఖ్యలు మళ్లీ దుమారం రేపాయి. 51వ రాష్ట్ర గవర్నర్‌గా కొనసాగేందుకు ట్రూడో తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని అన్నారాయన. దీంతో కెనడా మండిపడింది. కెనడా ఏనాటికీ అమెరికాలో కలవబోదని కౌంటర్ ఇచ్చింది. కెనడాను అమెరికాలో విలీనం చేసి.. 51వ అమెరికా రాష్ట్రంగా మార్చకుంటామని.. అవసరమైతే ఆర్థిక-సైనిక శక్తులను ఉపయోగిస్తామని ట్రంప్ గతకొంతకాలంగా చెబుతున్న సంగతి తెలిసిందే. -
అమెరికాపై టారిఫ్ యుద్ధం!
వాషింగ్టన్/బీజింగ్/మెక్సికో సిటీ/టొరంటో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన టారిఫ్‌ల యుద్ధం మరింత విస్తరిస్తోంది. ట్రంప్ సోమవారం వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడారు. కెనడా, మెక్సికో ఉత్పత్తులపై 25 శాతం చొప్పున, చైనా ఉత్పత్తులపై అదనంగా 10 శాతం సుంకాలు విధించబోతున్నామని, మంగళవారం నుంచే ఇది అమల్లోకి వస్తుందని ప్రకటించారు. అమెరికాకు వస్తువులను ఎగుమతి చేసే దేశాలు సుంకాలు చెల్లించాల్సిందేనని తెలిపారు. ఫెంటానిల్ వంటి సింథటిక్ డ్రగ్స్‌కు అడ్డుకట్ట వేయడానికి, అక్రమ వలసలను నియంత్రించడానికి ఇలాంటి చర్యలు తప్పనిసరిగా అవసరమని సమర్థించుకున్నారు. చైనా ఉత్పత్తులపై ట్రంప్ ఇప్పటికే 10 శాతం సుంకాలు విధించారు. మరోవైపు చైనా, కెనడా, మెక్సికో సైతం ధీటుగా బదులిస్తున్నాయి. ప్రతీకార సుంకాలపై సై అంటున్నాయి. అమెరికాపై టారిఫ్‌ల యుద్ధం మొదలుపెట్టాయి. ఫలితంగా వాణిజ్యపరమైన ఉద్రిక్తతలు తలెత్తడంతోపాటు ఆయా దేశాల్లో ఆర్థిక వ్యవస్థలు అస్తవ్యస్తంగా మారిపోయి అంతిమంగా ప్రజలు కష్టాలపాలయ్యే ప్రమాదం కనిపిస్తోందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ట్రంప్ నిర్ణయంలో న్యాయం లేదు: కెనడా ప్రధాని ట్రంప్ ప్రారంభించిన సుంకాలయుద్ధంలో ఎంతమాత్రం న్యాయం లేదని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో అన్నారు. ట్రంప్ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. తమ ఉత్పత్తులపై అన్యాయంగా సుంకాల విధిస్తే, అమెరికాకు తగిన సమాధానం చెప్పక తప్పదని స్పష్టంచేశారు. కౌంటర్–టారిఫ్ చర్యలను ప్రకటించారు. మొదటి దశలో అమెరికా ఉత్పత్తులపై 25 శాతం సుంకాల విధిస్తామని పేర్కొన్నారు. అమెరికా ఎగుమతిదారులు 20.6 బిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఒకవేళ ట్రంప్ ప్రభుత్వం గనుక వెనక్కి తగ్గకపోతే తాము విధించే సుంకాలు స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం నుంచే అమల్లోకి వస్తాయని తేల్చిచెప్పారు. ఇక రెండో దశలో భాగంగా మరో 25 శాతం టారిఫ్‌లు విధిస్తామన్నారు. మూడు వారాల్లో 125 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా ఉత్పత్తులపై టారిఫ్‌లు వసూలు చేస్తామని జస్టిన్ ట్రూడో వెల్లడించారు. అమెరికా నుంచి దిగుమతి అయ్యే అటోమొబైల్స్, స్టీల్, అల్యూమినియంపై మున్ముందు మరిన్ని సుంకాలు విధిస్తామని తెలియజేశారు. అమెరికా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొనే దాకా టారిఫ్‌ల విషయంలో తమ నిర్ణయంలో మార్పు ఉండదని సంకేతాలిచ్చారు. అమెరికా మనసు మార్చుకొంటే తాము కూడా అదేబాటలో నడుస్తామని పరోక్షంగా సూచించారు. అనవసరమైన వాణిజ్య యుద్ధం ప్రజలకు మేలు చేయదని అభిప్రాయపడ్డారు. చైనా అదనపు సుంకాలు ట్రంప్ ప్రకటనపై చైనా ఘాటుగా స్పందించింది. తమ దేశంలోకి దిగుమతి అయ్యే అమెరికా వస్తువులపై అదనంగా 15 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించింది. చికెన్, గోధుమలు, మొక్కజొన్న, పత్తి తదితర దిగుమతులపై ఈ టారిఫ్ వసూలు చేస్తామని, అలాగే జొన్న, సోయాబిన్, పోర్క్, బీఫ్, సముద్ర ఉత్పత్తులు, పండ్లు, కూరగాయాలు, పాడి ఉత్పత్తులపై అదనంగా 10 శాతం సుంకాలు విధించనున్నట్లు వెల్లడించింది. అదనపు సుంకాలు ఇది ఈ నెల 10వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని చైనా కస్టమ్స్ టారిఫ్ కమిషన్ మంగళవారం పేర్కొంది. తమ ఉత్పత్తులపై విచ్చలవిడిగా టారిఫ్‌ల మోత మోగిస్తున్న అమెరికాపై ప్రపంచ వాణిజ్య సంస్థకు(డబ్ల్యూటీఓ)కు ఫిర్యాదు చేస్తామని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేసింది. మరోవైపు సుంకాల విషయంలో అమెరికాతో చర్చలకు తలుపులు తెరిచే ఉన్నాయని తెలియజేసింది. ఇదిలా ఉండగా, 10 అమెరికా సంస్థలను విశ్వసనీయం కాని సంస్థల జాబితాలో చేర్చాలని చైనా నిర్ణయించింది. ఇందులో రక్షణ, ఏఐ, విమానయానం, ఐటీ రంగాలకు సంబంధించిన సంస్థలు ఉన్నాయి. చైనా ఉత్పత్తులపై అమెరికా ప్రభుత్వం రెండో దశలో భాగంగా అదనంగా 10 శాతం సుంకం విధించింది. ఇది మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. చైనా ఎగుమతి చేసే మొత్తం ఉత్పత్తుల్లో 15 శాతం అమెరికాకే వెళ్తుంటాయి. 2023లో ఇరుదేశాల మధ్య 575 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగింది. ఇందులో చైనా నుంచి అమెరికాకు 427.2 బిలియన్ డాలర్ల ఎగమతులు, అమెరికా నుంచి చైనాకు 147.8 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగాయి. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తొలినాళ్లలోనే చైనా ఉత్పత్తులపై 10 శాతం సుంకాలు విధించారు. తాజాగా మరో 10 శాతం వడ్డించారు. దీంతో ఇప్పటిదాకా సుంకాలు 20 శాతానికి చేరాయి. దీనిపై చైనా ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. చైనా ఉత్పత్తులపై 60 శాతం సుంకాలు విధిస్తానని ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పదేపదే ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్లాన్ బి, సి, డి ఉన్నాయి: మెక్సికో ప్రెసిడెంట్ అమెరికా చర్యలకు ప్రతిచర్య కచ్చితంగా ఉంటుందని మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ పేర్కొన్నారు. తమ వద్ద ప్లాన్ బి, సి, డి ఉన్నాయని ప్రకటించారు. తమ దేశ ఉత్పత్తులపై అమెరికా ప్రభుత్వం గనుక టారిఫ్‌లు పెంచితే ఏం చేయాలన్నదానిపై స్పష్టమైన ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు. అమెరికా, మెక్సికో మధ్య సహకారం ఇప్పటివరకైతే అద్భుతంగా ఉందని చెప్పారు. వాణిజ్యం, భద్రతాపరమైన అంశాలపై ఇటీవల ఇరుదేశాల అధికారుల మధ్య చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయని అన్నారు. తమ ఉత్పత్తులపై అమెరికాలో సుంకాలు విధించే పరిస్థితి ఉండదని అంచనా వేస్తున్నామని, ఒకవేళ అదే జరిగితే తాము కూడా తగిన రీతిలో ప్రతిస్పందిస్తామని స్పష్టంచేశారు. -
డ్రగ్ లార్డ్ క్వింటెరో అమెరికాకు తరలింపు
మెక్సికో సిటీ: డ్రగ్స్ ముఠాలపై ఉక్కుపాదం మోపా లన్న ట్రంప్ యంత్రాంగం ఒత్తిళ్లు మెక్సికో ప్రభుత్వంపై పనిచేశాయి. యూఎస్ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ(డీఈఏ) అధికారి హత్య కేసులో ఆరోపణలున్న కరడుగట్టిన డ్రగ్స్ ముఠా నాయకుడు రఫేల్ కారో క్వింటెరో సహా 29 మంది మాఫియా ముఖ్యులను మెక్సికో ప్రభుత్వం అమెరికాకు అప్పగించింది. మాదక ద్రవ్యాల మాఫియా ముఖ్యులను తమకు అప్పగించకుంటే మంగళవారం నుంచి అన్ని రకాల మెక్సికో దిగుమతులపై 25 శాతం సుంకాలను విధించక తప్పదన్న ట్రంప్ ప్రభుత్వం హెచ్చరికలతో మెక్సికో ప్రభుత్వ యంత్రాంగం మునుపెన్నడూ లేని విధంగా సహకరించేందుకు ముందుకు రావడం గమనార్హం. మెక్సికోలోని వే ర్వేరు జైళ్లలో ఉన్న డ్రగ్ మాఫి యా పెద్దతలలను గురు వారం రాజధాని మెక్సికో సిటీ లో విమానాలకు ఎక్కించారు. మొత్తం 29 మందిని అమెరికా వ్యాప్తంగా ఉన్న ఎనిమిది నగరాల్లోని జైళ్లకు తరలించారు. వీరిలో అమెరికా ప్రభుత్వం ఇటీవల విదేశీ ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించిన ఆరు గ్రూపులకు గాను ఐదు గ్రూపులకు చెందిన వారున్నారు. కారో క్వింటెరోతోపాటు సినలోలా కార్టెల్లోని రెండు గ్రూపులకు చెందిన ముఖ్యులు, 2022లో నార్త్ కరోలినాలో పోలీసు అధికారి హత్య కేసులో నిందితుడొకరు ఇందులో ఉన్నారని మెక్సికో అధికారులు వెల్లడించారు. డ్రగ్స్ అక్రమ రవాణా, హత్య తదితర నేరారోపణల కింద వీరిపై విచారణ జరపనున్నామని అమెరికా అటార్నీ జనరల్ పమేలా బోండి చెప్పారు. డ్రగ్స్ ముఠాలపై ఉక్కుపాదం మోపడం, అక్రమ వలసదా రులను నిలువరించడం, ప్రమాదకరమైన డ్రగ్ ఫెంటానిల్ ఉత్పత్తిని నిలిపివేయడం వంటివి మానుకో కుంటే టారిఫ్‌లు తప్పవని, సానుకూలంగా స్పందించిన పక్షంలో టారిఫ్‌ల అమలును వాయిదా వేస్తామని గతంలో ట్రంప్ హెచ్చరికలు చేశారు. -
ట్రంప్ బెదిరిస్తే భయపడలా?: మెక్సికో అధ్యక్షురాలు
పరస్పర సుంకాలు, వలసదారుల బహిష్కరణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేస్తున్న బెదిరింపులపై మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్‌బామ్ (Claudia Sheinbaum) తీవ్రంగా స్పందించారు. ట్రంప్ హెచ్చరికలకు భయపడుతున్నారా? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు.. అలాంటి వాటికి భయపడేది లేదని స్పష్టంచేశారామె. ‘‘ట్రంప్ చేసే డ్రగ్స్ ముఠాల కట్టడికి మిలిటరీ జోక్యం, వలసదారుల బహిష్కరణ, పరస్పర సుంకాల బెదిరింపులకు నేను భయపడను. నేను ప్రజల మనిషిని. మెక్సికన్ ప్రజల మద్దతు ఉంది. మెక్సికో (Mexico) సార్వభౌమత్వానికి భంగం కలిగించే ప్రయత్నాన్ని ఎలాగైనా అడ్డుకుంటా’’ అని అన్నారామె. వైట్‌హౌజ్‌లోకి అడుగుపెట్టగానే.. అగ్రరాజ్యంలోకి ఫెంటానిల్ డ్రగ్ అక్రమ రవాణా, వలసదారుల చొరబాట్లను అడ్డుకోవడంలో కెనడా, మెక్సికోలు విఫలమయ్యాయని ట్రంప్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఆయా దేశాలపై 25 శాతం సుంకం విధిస్తానంటూ హెచ్చరించారు కూడా. అలాగే.. అధికారం చేపట్టిన కొన్ని రోజుల్లోనే సుంకాలు విధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. అయితే.. మెక్సికోపై ట్రంప్ విధించిన 25 శాతం సుంకాలను నెలరోజుల పాటు నిలిపివేసిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై చర్చలు జరిపేందుకు ఇరుదేశాల అధికారులు ఈ వారం వాషింగ్టన్లో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. -
మార్కో ఫినిష్డ్
అతనో కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్. పాతికపైగా దేశాలకు మోస్ట్‌వాంటెడ్ కూడా. అలాంటోడు.. కిందటి ఏడాది జరిగిన గ్యాంగ్ వార్‌లో చచ్చాడని కథనాలు వచ్చాయి. అతని ప్రేయసి కూడా బోరుమనడంతో అందరూ అది నిజమేనని నమ్మారు. కట్ చేస్తే.. ఇప్పుడు నిజంగానే ఆ క్రిమినల్ ఓ ఆగంతకు కాల్పుల్లో హతమయ్యాడు!.డచ్ డ్రగ్ డీలర్.. మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్ మార్కో ఎబ్బెన్(Marco Ebben) ఎట్టకేలకు హతమయ్యాడు. మెక్సికోలో గురువారం గుర్తు తెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో అతను చనిపోయినట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. నెదర్లాండ్స్‌కు చెందిన మార్కో ఎబ్బెన్ యూరప్ దేశాలకు మోస్ట్‌వాంటెడ్‌గా ఉన్నాడు. 2014-15 మధ్యకాలంలో మార్కో, అతని అనుచరులు 400 కేజీల కొకైన్‌ను పైనాపిల్స్(Pineapples)లో స్మగ్లింగ్ చేయడం వార్తల్లోకి ఎక్కింది. బ్రెజిల్(Brazil) నుంచి నెదర్లాండ్స్‌కు, ఇతర యూరోపియన్ దేశాలకు మాదక ద్రవ్యాలు, ఆయుధాలను అక్రమ రవాణా చేసినట్లు అభియోగాలున్నాయి. 2020లో డచ్ కోర్టు అతనికి ఏడేళ్ల శిక్ష విధించగా.. పోలీసుల చెర నుంచి పరారయ్యాడు. అయితే అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు కిందటి ఏడాది అక్టోబర్‌లో మార్కో పెద్దడ్రామానే ఆడాడు. క్యూలికాన్లో జరిగిన గ్రూప్వార్లో అతను చనిపోయినట్లు ప్రచారం చేయించాడు.పైగా అతని ప్రేయసి మార్కో డెడ్‌బాడీని గుర్తు పట్టినట్లు ఆ డ్రామాలో భాగమైంది కూడా. అయితే ప్రస్తుతం అతన్ని కాల్చి చంపింది ఎవరనేదానిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.ఇదీ చదవండి: డాలర్‌తో గేమ్స్ వద్దు! -
గూగుల్‌లో ‘గల్ఫ్ ఆఫ్ అమెరికా’
శాన్ ఫ్రాన్సిస్కో: అమెరికా ప్రభుత్వ ఆదేశాల మేరకు అమెరికా తీరప్రాంతమైన చరిత్రాత్మక ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో(Gulf of Mexico)’పేరును సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్.. ‘గల్ఫ్ ఆఫ్ అమెరికా’(Gulf of America)గా పేర్కొంది. అయితే ఈ పేరు మార్పును కేవలం అమెరికా ఇంటర్నెట్ వినియోగదారులకు పరిమితం చేసింది. మెక్సికోలో ఇంటర్నెట్ వినియోగదారులు ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’అని టైప్ చేస్తే అదే పాత పేరుతోనే సెర్చ్ రిజల్ట్ వస్తుంది. మిగతా ప్రపంచానికి గల్ఫ్ ఆఫ్ మెక్సికో(గల్ఫ్ ఆఫ్ అమెరికా) అని కనిపిస్తుంది. ఈ విషయాన్ని తమ ‘గూగుల్ మ్యాప్స్(Google Maps)’బ్లాగ్‌లో గూగుల్ పోస్ట్ చేసింది.ఇలా ఒకేప్రాంతానికి మూడు పేర్లతో పిలవనున్నట్లు గూగుల్ తన వెబ్మ్యాపింగ్ ప్లాట్ఫామ్లో పేర్కొంది. అంటే ప్రపంచంలోని ఒకే భౌగోళిక ప్రాంత మ్యాప్ అమెరికాలో ఒక పేరుతో, మెక్సికోలో ఇంకో పేరుతో, మిగతా దేశాలకు రెండూ కలిపి కనిపిస్తుందన్నమాట. ‘‘అమెరికాలో జియోగ్రాఫిక్ నేమ్స్ ఇన్ఫర్మేషన్ సిస్టం (జీఎన్ఐఎస్) అధికారికంగా ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’ను ‘గల్ఫ్ ఆఫ్ అమెరికా’గా మార్చేసింది. మేము రెండు వారాల క్రితం ప్రకటించినట్లుగా, మేం అనుసరిస్తున్న విధానాలకు అనుగుణంగా ఈ మార్పులను చేశాం’’అని బ్లాగ్‌లో గూగుల్ పేర్కొంది. ‘‘అమెరికాలో గూగుల్ మ్యాప్‌ను ఉపయోగించే వినియోగదారులకు ఆ భౌగోళిక ప్రాంతం ‘గల్ఫ్ ఆఫ్ అమెరికా’గా కనిపిస్తుంది. మెక్సికో ప్రజలకు ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’గా కనిపిస్తుంది. ప్రపంచంలోని మిగతా దేశాల్లో యూజర్లకు గల్ఫ్ ఆఫ్ మెక్సికో(గల్ఫ్ ఆఫ్ అమెరికా) అని కనిపిస్తుంది.‘గల్ఫ్ ఆఫ్ అమెరికా డే’పేరు మార్పు కోసం కార్యనిర్వాహక ఉత్తర్వు జారీ చేసిన తరువాత ఫిబ్రవరి 9వ తేదీని ‘గల్ఫ్ ఆఫ్ అమెరికా దినోత్సవం’గా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. గల్ఫ్‌లో ఉన్న న్యూ ఓర్లీన్స్‌లోని సూపర్»ౌల్కు వెళ్తూ ఫిబ్రవరి 10న డిక్లరేషన్‌పై ఆయన సంతకం చేశారు. ‘‘గల్ఫ్ ఆఫ్ అమెరికా పేరు మార్చిన తర్వాత ఈ రోజు నేను తొలిసారి సందర్శిస్తున్నాను’’అని వైట్‌హౌస్ వెబ్సైట్లో ప్రచురించిన డిక్లరేషన్‌లో ట్రంప్ పేర్కొన్నారు. ఫిబ్రవరి 9న వేడుకలు జరుపుకోవాలని, పలు కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన ప్రభుత్వ అధికారులకు, అమెరికా ప్రజలకు పిలుపునిచ్చారు.ప్రమాణ స్వీకారం రోజే పేరు మార్పు జనవరి 20న అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’పేరు మార్పుకు అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఇంటీరియర్ డిపార్ట్మెంట్కు 30 రోజుల గడువు ఇస్తూ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ట్రంప్ ప్రభుత్వంలోని అంతర్గత విభాగం అధికారికంగా పేరు మార్పును అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. వెంటనే, యూఎస్ కోస్ట్‌గార్డ్ సైతం గల్ఫ్ ఆఫ్ అమెరికాను ఉపయోగించడం ప్రారంభించింది. అధ్యక్షుడి ఆదేశాల మేరకు గల్ఫ్ ఆఫ్ మెక్సికోను అధికారికంగా గల్ఫ్ ఆఫ్ అమెరికాగా, ఉత్తర అమెరికాలోని ఎత్తైన శిఖరం డెనాలీ పేరును దాని పూర్వపు పేరు ‘మౌంట్ మెక్ కిన్లీ’గా మారుస్తున్నట్లు అంతర్గత విభాగం తెలిపింది. 2015లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా అలాస్కా పర్వతాన్ని డెనాలీగా అధికారికంగా గుర్తించారు. ఈ పేరును శతాబ్దాలుగా అలాస్కా స్థానికులు ఉపయోగిస్తున్నారు. అయితే ట్రంప్ పేరు మార్పును అలాస్కాలోని స్థానిక సమూహాలు విమర్శిస్తున్నాయి. -
మెక్సికో ప్రమాదంలో 41 మంది మృతి
మెక్సికో సిటీ: మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దక్షిణ ప్రాంతంలోని టబాస్కోలో శనివారం తెల్లవారుజామున బస్సు ట్రక్కును ఢీకొనడంతో 41 మంది మృతి చెందారు. మరణించిన వారిలో 38 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. బస్సు 48 మంది ప్రయాణికులతో దక్షిణ మెక్సికోలోని కాన్కున్ నుంచి టబాస్కోకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు ట్రక్కును ఢీకొనడంతో తీవ్రమైన మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో బస్సు పూర్తిగా కాలిపోయింది. మెటల్ ఫ్రేమ్ మాత్రమే మిగిలిపోయింది. 41 మంది సజీవ దహనమయ్యారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో వారిని గుర్తించడం కష్టమవుతోంది. 18 మందిని మాత్రమే గుర్తించగలిగామని టబాస్కో రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. -
దక్షిణ మెక్సికోలో ఘోర ప్రమాదం.. 41 మంది సజీవ దహనం
దక్షిణ మెక్సికోలో ఘోర ప్రమాదం జరిగింది. బస్సును ట్రక్కు ఢీకొట్టడంతో మంటలు చెలరేగి 41 మంది సజీవ దహనమయ్యారు. ఈ సమయంలో బస్సులో 48 మంది ప్రయాణిస్తున్నారు. ఈ ఘటన టబాస్కో రాష్ట్రంలో శనివారం తెల్లవారుజామున ఈఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్లూ ప్రాణాలు కోల్పోగా.. ట్రక్కు డ్రైవర్ కూడా మృతి చెందారు. ఘటనా స్థలంలో ఇప్పటి వరకు 18 మందికి చెందిన అవశేషాలను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదంపై పోలీసులు విచారణ చేపట్టారు. -
వాణిజ్య యుద్ధంతో అందరికీ నష్టమే!
స్వేచ్ఛా వాణిజ్య సిద్ధాంతాన్ని ప్రపంచంపై బలవంతంగా రుద్దిన అమెరికా, దాన్ని తమకు లాభం కలిగినంత కాలం ఉపయోగించుకుని ఇపుడు లాభం లేదనిపించటంతో ఎదురు తిరుగుతున్నది. ఆ విషయం బయ టకు ఒప్పుకోకుండా అధ్యక్షుడు ట్రంప్ సాకులు వెతుకుతున్నారు. కెనడా, మెక్సికో, చైనాలపై సుంకాలు పెంచిన ఆయన తన చర్యకు పేర్కొన్న కారణాలను గమనించండి: అక్రమ వలసలు, ఫెంటానిల్ అనే మాదక ద్రవ్యం రవాణా. అక్రమ వలసలు మెక్సికో నుంచే గాక, ఆ దేశం మీదుగా ఇతర లాటిన్ అమెరికన్ దేశాల నుంచి, చివరకు ఇండియా వంటి సుదూర దేశాల నుంచి కూడా సాగుతున్న మాట నిజం. వాటి నిరోధానికి మెక్సికో సరిహద్దులలో గోడల నిర్మాణం, వేలాది సైన్యాల మోహరింపు ఇప్పటికే మొదలు పెట్టారు. కెనడా, చైనా నుంచి అక్రమ వలసలు అత్యల్పం. మాదక ద్రవ్యాల తయారీ, రవాణాను ఈ మూడు దేశా లలో ఏదీ అధికారికంగా ప్రోత్సహించటం లేదు. స్వేచ్ఛా వాణిజ్యానికి భంగంఅమెరికా, కెనడా, మెక్సికోల మధ్య వాణిజ్యానికి ఒక ప్రత్యేక ఒప్పందం ఉంది. అది ట్రంప్ మొదటి హయాం (2017–21)లో జరి గిందే. దానిని ట్రంప్ స్వయంగా ఉల్లంఘిస్తున్నారు. అమెరికా పట్టు బట్టి చేయించిన గాట్స్ ఒప్పందానికీ, అందుకు రూపాంతరమైన ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) నిబంధనలకూ, ఇంకా చెప్పా లంటే అమెరికా పెట్టుబడిదారీ, స్వేచ్ఛా వాణిజ్య సిద్ధాంతాలకూ ఈ చర్యలు విరుద్ధమైనవి. వాస్తవానికి తదనంతర కాలంలో ఇందుకు అనుగుణంగానే పాశ్చాత్య ప్రపంచంతో సహా అనేక దేశాలు పర స్పరమో, లేక ప్రాంతీయ బృందాలు గానో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటూ వస్తున్నాయి. ఆ విధంగా ప్రపంచం ఒక కొత్త దశలోకి ప్రవేశించింది. పెట్టుబడులు, వాణిజ్యంలో పరస్పర చర్చల ద్వారా జరిగే ఈ ఒప్పందాలు సాధారణంగా అన్ని పక్షాలకూ ప్రయో జనకరమవుతున్నాయనే భావన ఏర్పడింది కూడా. అటువంటిది, ఈ పరిణామాలన్నింటికీ మాతృదేశమనదగ్గ అమెరికాయే అందుకు భంగం కలిగించే చర్యలకు పాల్పడుతుండటం ఆశ్చర్యకరం. అనేక దేశాల వలెనే అమెరికాలోనూ మాదక ద్రవ్యాల విని యోగం పెద్ద ఎత్తున ఉంది. ఈ వినియోగం ఎప్పటినుంచి ఎందువల్ల మొదలై కొనసాగుతున్నదనే విషయం ప్రచారంలోకి రావటం లేదు. వియత్నాం యుద్ధంలో అమెరికా 1960ల నుంచి 1970ల వరకు ఉధృతంగా పాల్గొని భయంకరమైన హత్యాకాండ సాగించి ఆఖరుకు ఓటమిపాలైంది. ఆ కాలమంతా వారి యుద్ధ విమానాల రవాణా నైజీరియా మీదుగా జరిగినపుడు, యుద్ధం వల్ల వ్యథకు గురైన సైనికులు దానిని మరిచిపోయేందుకు స్థానికంగా లభించే మాదక ద్రవ్యా లకు అలవాటుపడ్డారు. అది యుద్ధం తర్వాత మాజీలు అయిన సైనికులకు కొనసాగి వారి ద్వారా, ఇతరత్రా వ్యాపించి స్థిరపడింది. ఆ కాలంలో లాటిన్ అమెరికా నుంచి డ్రగ్ కార్టెల్స్ ఎట్లా పని చేశాయన్న చర్చ అప్రస్తుతం. అయితే ఇందుకు సుంకాల హెచ్చింపు ఎట్లా పరిష్కారమవుతుందన్నది ట్రంప్ సైతం వివరించని ప్రశ్న. ఆ పని చేయటానికి బదులు, అంతర్జాతీయ ఆర్థిక అత్యవసరాల చట్టం ఒక దానిని అడ్డు పెట్టుకుని మెక్సికో, కెనడా వంటి అతి సన్నిహిత మిత్ర దేశాలపై 25 శాతం సుంకాలు పెంచారు.కృత్రిమ ఆధిపత్యంఅమెరికా వంటి అగ్రస్థాయి సంపన్న దేశానికి ఇటువంటి చర్యల అగత్యం ఎందుకు ఏర్పడింది? తమ వద్ద ఉత్పత్తుల ఖర్చు పెరుగు తున్నందున, వెనుకబడిన దేశాలలో వేతనాలు, ముడిసరుకులు, మౌలిక సదుపాయాల ఖర్చు తక్కువ గనుక, అక్కడ ఉత్పత్తులు చేయించి, అక్కడి నుంచి చవకగా దిగుమతి చేసుకోవచ్చుననే వ్యూహంలో దీనికంతా మూలాలు ఉన్నాయి. ఇది కొంతకాలం సజా వుగా సాగినా, ఆయా దేశాలు సాంకేతికంగా, పారిశ్రామికంగా బల పడటం, తొలి దశలో అమెరికా నుంచి యూరప్ నుంచి తరలి వెళ్లిన ప్రైవేట్ కంపెనీలు అక్కడి లాభాలకు అలవాటుపడటంతో ఈ పాశ్చాత్య దేశాలకు పలు సమస్యలు మొదలయ్యాయి. అక్కడి పారి శ్రామికత, ఆదాయాలు, ఉపాధి అవకాశాలు తగ్గసాగాయి. మిగులు బడ్జెట్లు లోటు బడ్జెట్లుగా మారాయి. అమెరికా అయితే సుమారు 30 ట్రిలియన్ డాలర్ల లోటు, అప్పుల భారానికి చేరి, బంగారం నిల్వల మద్దతు లేకపోయినా డాలర్లను యథేచ్ఛగా ముద్రించి ప్రపంచం పైకి వదలటం, డాలర్ ఆధిపత్యాన్ని కృత్రిమంగా నిలబెట్టడం వంటి దశకు చేరుకుంది. మామూలుగానైతే ఆర్థికంగా ఇది దివాళా స్థితి అవుతుంది. కానీ ఆ కృత్రిమతను నిలబెట్టేందుకు, ఒకవేళ బ్రిక్స్ కూటమి డాలర్‌ను బలహీనపరిచే చర్యలు తీసుకునే పక్షంలో ఆ కూటమి దేశాలపై 100 శాతం సుంకాలు పెంచగలమంటూ పదేపదే బెదిరించవలసిన బలహీన స్థితిని అమెరికా ఎదుర్కొంటున్నది. ఇంతకూ ట్రంప్ సుంకాల హెచ్చింపు అమెరికాకు ఎంతవరకు ఉపయోగపడవచ్చునన్నది ప్రశ్న. ఈ తరహా చర్యలు ఆయన తన మొదటి పాలనా కాలంలోనూ తీసుకున్నారు. అపుడు ఆయన వాణిజ్య యుద్ధం కేవలం చైనాపై. అది చైనాకు కొంత నష్టం కలిగించినా అమెరికాకు అంతకన్న ఎక్కువ నష్టం కలిగిందన్నది అమెరికన్ ఆర్థిక వేత్తల దాదాపు ఏకాభిప్రాయం. అందుకు కారణాలను విశ్లేషించుకోవడానికి బదులు, తన వాణిజ్య యుద్ధాన్ని మిత్ర దేశాల పైకి కూడా విస్తరించటం నమ్మశక్యం కాకుండా ఉంది. రానున్న రోజులలో యూరోపియన్ దేశాలపై కూడా సుంకాల పెరుగుదల ఉండగలదని సూచించారు. అమెరికా దిగుమతులలో ఈ మూడు దేశాల ఉత్ప త్తులు కలిపి 40 శాతం ఉంటాయని అంచనా. అమెరికాకు ఎగుమతులు చేసే మొదటి 10 దేశాలలో చైనా తప్ప మిగిలినవన్నీ వారి మిత్ర దేశాలే. ఇండియా పదవ స్థానంలో ఉంది. ఇండియా పైనా సుంకాలు పెంచగలమని ట్రంప్ ఇప్పటికే అన్నారు. తమ ఆధునిక మోటార్ వాహనాలపై ఇండియా సుంకాలు తగ్గించాలని మొదటి పాలనా కాలంలో కోరగా అందుకు అంగీకరించని మోదీ ప్రభుత్వం ఇప్పుడు కొత్త బడ్జెట్లో అటువంటి ప్రతిపాదనలు చేయటం గమనించదగ్గది. ఆ చర్య ట్రంప్‌ను మెత్తబరచగలదేమో చూడాలి.ట్రంప్ చర్యకు ప్రతిగా, కెనడా ప్రధాని ట్రూడో కొద్ది గంటల లోనే, అదే 25 శాతం స్థాయిలో ఎదురు సుంకాలు ప్రకటించారు. మెక్సికో అధ్యక్షురాలు క్లౌడియా షెన్బామ్ కూడా తాము సుంకాలను పెంచి తీరగలమన్నారు. ఈ రెండు దేశాల నుంచి వివిధ వినియోగ వస్తువులపైనే గాక యంత్ర పరికరాలు, చమురు, విద్యుత్ దిగుమతు లపై అమెరికా చాలా ఆధారపడి ఉంది. మరొక వైపు చైనా ఈ సుంకాలు వివక్షాపూరితం అంటూ డబ్ల్యూటీవోకు ఫిర్యాదు చేసింది. వాణిజ్య యుద్ధాలను అమెరికా గతంలోనూ చేసింది. కాకపోతే దౌత్యపరమైన లక్ష్యం కోసం ఇతరులను లొంగదీయటానికి. ట్రంప్ అట్లాగాక ఈ యుద్ధంతో తమ ఆర్థిక వ్యవస్థకు లాభం చేస్తామంటున్నారు. ఇతరులు లొంగి రావటంవల్ల అమెరికా లాభపడగలదనీ, దానితో ప్రజలపై ఆదాయ పన్ను మొత్తంగా రద్దు చేయవచ్చుననీ ఆశపెడుతున్నారు. అమెరికా మార్కెట్లు ఎంత పెద్దవి అయినా ఈ సుంకాల ఒత్తిడితో ఇతరులు కూడా సుంకాలు పెంచటం, వారి ముడి వస్తువులు అమెరికా పరిశ్రమలకు లభించకపోవటం, ఆయా దేశాలు ఇతర మార్కెట్లను వెదుక్కోవటం వంటివి జరిగితే పరిస్థితి ఏమిటి? ఇవిగాక రెండు ముఖ్యమైన ప్రశ్నలున్నాయి. ఇటువంటి యుద్ధాలతో స్వేచ్ఛా వాణిజ్య సిద్ధాంతపు భవిష్యత్తు ఏమిటన్నది ఒకటైతే, ఈ ప్రభావాలు రాజకీయంగా, భౌగోళికంగా ఏ విధంగా ఉండవచ్చు ననేది రెండవది. టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
మార్కెట్‌కు ట్రంప్ సుంకాల పోటు
ముంబై: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడా, మెక్సికో, చైనాలపై దిగుమతి సుంకాలు పెంచుతూ ఆదేశాలు జారీ చేయడంతో సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్ అరశాతం నష్టపోయింది. దేశీయ కరెన్సీ రూపాయి భారీ కోత, అధిక వెయిటేజీ రిలయన్స్ (–1.50%), ఎల్అండ్టీ (–4.50%) క్షీణతలూ ప్రతికూల ప్రభావం చూపాయి. సెన్సెక్స్ 319 పాయింట్లు నష్టపోయి 77,186 వద్ద నిలిచింది. దీంతో ఈ సూచీ 5 రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడినట్లైంది. నిఫ్టీ 121 పాయింట్లు క్షీణించి 23,361 వద్ద నిలిచింది. వాణిజ్య యుద్ధ భయాలతో ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయమే నష్టాల్లో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 750 పాయింట్లు క్షీణించి 76,756 వద్ద, నిఫ్టీ 260 పాయింట్లు కుప్పకూలి 23,222 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. అయితే మిడ్ సెషన్ నుంచి కన్జూమర్ డ్యూరబుల్, ఐటీ, ఫార్మా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. దీంతో సూచీలు కొంతమేర నష్టాలు భర్తీ చేసుకోగలిగాయి. → క్యాపిటల్ గూడ్స్, ఇండ్రస్టియల్స్, విద్యుత్, యుటిలిటీస్, ఆయిల్‌అండ్‌గ్యాస్, మెటల్ షేర్లు భారీ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్ఈ స్మాల్‌క్యాప్ సూచీ 2%, మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఒకశాతం చొప్పున నష్టపోయాయి. → మార్కెట్ పతనంతో రూ.4.29 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. బీఎస్ఈలో మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ.419 లక్షల కోట్లకు తగ్గింది. ప్రపంచ మార్కెట్లూ డీలా ట్రంప్ టారిఫ్ దాడికి ప్రతిగా తాము కూడా టారిఫ్‌లు పెంచుతామని కెనడా, మెక్సికో ప్రకటించడంతో వాణిజ్య యుద్ధ భయాలు మరింత తీవ్రమయ్యాయి. ఆసియాలో జపాన్, తైవాన్, కొరియా సూచీలు 3.50% క్షీణించాయి. ఇండోనేషియా, సింగపూర్, హాంగ్‌కాంగ్ దేశాలు 2–0.5% పతనమయ్యాయి. యూరప్ మార్కెట్లు 1% నష్టపోయాయి. అమెరికా సూచీలు నాస్డాక్ 1%, ఎస్అండ్పీ అరశాతం, డోజోన్ పావుశాతం నష్టాలతో ట్రేడవుతున్నాయి. -
టారిఫ్ వార్.. బొమ్మాబొరుసు!
సాక్షి, బిజినెస్ డెస్క్: ట్రంప్ దూకుడు చూస్తుంటే.. ఇతర దేశాలను కాళ్లబేరానికి తెచ్చుకునే వ్యూహంతో వెళ్తున్నట్లు కనిపిస్తోంది. రేపోమాపో మనకూ సుంక‘దండన’తప్పకపోవచ్చు. ఇప్పటికే పలుమార్లు భారత్‌ను ‘అమెరికాకు అతిపెద్ద టారిఫ్ ముప్పు’గా అభివర్ణించారు కూడా. డీ–డాలరైజేషన్ చర్యల నుంచి వెనక్కతగ్గకపోతే బ్రిక్స్ దేశాలపై 100 శాతం సుంకాలు విధిస్తానని కూడా హెచ్చరించారు. అయితే, అమెరికా టారిఫ్‌లు రెండు వైపులా పదునున్న కత్తిలాంటివని స్వయంగా ఆ దేశ ఆర్థిక వేత్తలు, నిపుణులే హెచ్చరిస్తున్నారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థలు కకావికలం అవుతాయని, దీంతో ఉత్పత్తుల రేట్లు పెరిగిపోయి.. ద్రవ్యోల్బణం ఎగబాకేందుకు దారితీస్తుందని చెబుతున్నారు. సుంకాల విధింపుతో ఎగుమతిదారులు ఆమేరకు రేట్లు పెంచుతారు. అమెరికా ప్రజలు కూడా ఆయా దేశాల ఉత్పత్తులను అధిక ధరలకు కొనుక్కోవాల్సిందేనని తేల్చి చెబుతున్నారు.మన ఎగుమతులకు లాభమేనా?ట్రంప్ టారిప్ వార్తో ప్రస్తుతానికి కొన్ని రంగాల్లో ఎగుమతిదారులకు కొంత లాభమేనని పరిశ్రమవర్గాలు ఆశాభావంతో ఉన్నాయి. ప్రస్తుతానికి మనపై సుంకాలు విధించకపోవడంతో చైనా ఉత్పత్తులతో పోలిస్తే మన ఎగుమతులకు పోటీతత్వం పెరుగుతుందని భారతీయ ఎగుమతిదారుల సంఘం (ఫియో) డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ పేర్కొన్నారు. అయితే, భారత్‌లోకి చైనా సహా పలు దేశాల నుంచి చౌక దిగుమతులు పోటెత్తే అవకాశం ఉందని, ఇది మన పరిశ్రమలకు ముప్పుగా మారొచ్చని మరికొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. సుంకాల విషయంలో తీవ్ర విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉండాలని కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ ప్రొఫెసర్ బిశ్వజిత్ ధార్ సూచించారు.ఆటోమొబైల్: భారత వాహన విడిభాగాల సంస్థలకు అమెరికా అతిపెద్ద ఎగుమతి మార్కెట్‌గా ఉంది. పరిశ్రమ అసోసియేషన్ (ఏసీఎంఏ) ప్రకారం 2024–25లో భారత్ 11.1 బిలియన్ డాలర్ల విలువైన విడిభాగాలను ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేసింది. ఇందులో 3.67 బిలియన్ డాలర్లు, అంటే 28 శాతం అమెరికాకే వెళ్లాయి. తాజాగా ఇతర దేశాలపై టారిఫ్‌ల పెంపుతో యూఎస్‌లో మన వాటా పెంచుకోవడానికి సదవకాశమని కొంతమంది పరిశ్రమవర్గాలు చెబుతున్నారు. ‘ఆహార, వ్యవసాయ రంగాలతో పాటు వాహన విడిభాగాల రంగాలు తక్షణం ప్రయోజనం పొందుతాయి. దాదాపు 20 బిలియన్ డాలర్ల విలువైన మార్కెట్ అవకాశాలకు ద్వారాలు తెరుచుకుంటాయి’అని వాణిజ్య విధాన విశ్లేషకుడు ఎస్.చంద్రశేఖరన్ పేర్కొన్నారు.టెక్స్టైల్స్: ట్రంప్ తాజా టారిఫ్‌లు భారత టెక్స్టైల్ రంగానికి బూస్ట్ ఇస్తాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ‘భారతీయ కంపెనీలకు సమీప భవిష్యత్తులో ఆర్డర్లు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది’అని తిరుపూర్ ఎగుమతిదారుల సంఘం (టీఈఏ) అధ్యక్షుడు కె.ఎం. చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు.ఫార్మా: భారత ఫార్మా రంగం అప్రమత్తతతో పాటు ఆశావహ ధోరణితో వేచిచూస్తోంది. ‘జెనరిక్స్‌లో చైనా చాలా పటిష్టంగానే ఉన్నప్పటికీ, అమెరికాకు పెద్దగా ఎగుమతి చేయడం లేదు. ప్రధానంగా యాక్టివ్ ఫార్మా ఇన్‌గ్రీడియెంట్స్ (ఏపీఐ), కెమికల్స్ వంటివి ఎగుమతి చేస్తోంది. ఇప్పుడు మనకు వీటిని కూడా అమెరికాకు ఎగుమతి చేసే అవకాశం లభిస్తుంది. అయితే, మనం వాటి కోసం చైనాపైనే ఆధారపడాల్సిన పరిస్థితి’అని ఫార్మా ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఫార్మెక్సిల్) మాజీ డైరెక్టర్ జనరల్ ఉదయ్ భాస్కర్ అభిప్రాయపడ్డారు.స్టీల్: ట్రేడ్ వార్ మరింత ముదిరితే సరఫరా వ్యవస్థల్లో తీవ్ర కుదుపులకు ఆస్కారం ఉంది. వివిధ దేశాల నుంచి భారత్‌కు దిగుమతులు పోటెత్తే అవకాశం ఉందని, పరిస్థితులను నిశితంగా గమనించి చర్యలు చేపట్టాలని జేఎస్‌డబ్ల్యూ స్టీల్ సీఈఓ జయంత్ ఆచార్య పేర్కొన్నారు. చైనా స్టీల్ ఉత్పత్తి భారీగానే కొనసాగనున్న నేపథ్యంలో యూఎస్ దెబ్బకు ఇతరత్రా అందుబాటులో ఉన్న దేశాలకు ఎగుమతులను మళ్లించవచ్చని ఆర్సెలర్ మిట్టల్ వైస్–ప్రెసిడెంట్ రంజన్ ధార్ తెలిపారు.ఎలక్ట్రానిక్స్: చైనా ఉత్పత్తులపై అదనపు సుంకాలతో తక్షణం ప్రయోజనం పొందే రంగాల్లో ఇదొకటి. అయితే, తక్షణం దీని ప్రయోజనం పొందేలా పాలసీ రూపకర్తలు, పరిశ్రమ వర్గాలు చర్యలు తీసుకోవాలని భారతీయ సెల్యులర్, ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) చైర్మన్ పంకజ్ మొహింద్రూ వ్యాఖ్యానించారు. భారత్‌ను ఎగుమతి హబ్‌గా చేసుకుంటున్న యాపిల్‌తో పాటు మోటరోలా వంటి చైనా బ్రాండ్లు మన దగ్గరున్న టాటా ఎలక్ట్రానిక్స్, ఫాక్స్‌కాన్, డిక్సన్ వంటి తయారీదారుల నుంచి అమెరికాకు ఎగుమతులను మరింత పెంచే అవకాశం ఉంది. యాపిల్, శాంసంగ్ దన్నుతో 2024లో భారత్ నుంచి మొబైల్ ఫోన్ ఎగుమతులు రికార్డు స్థాయిలో 20.4 బిలియన్ డాలర్లకు దూసుకెళ్లాయి. ఇందులో యాపిల్ వాటా 65 శాతం కాగా (12.8 బిలియన్ డాలర్లు), శాంసంగ్ వాటా 20 శాతంగా (4 బిలియన్ డాలర్లు) ఉంది.దిగుమతులు, రూపాయి, స్టాక్ మార్కెట్‌కు దెబ్బ...ట్రేడ్ వార్ 2.0... ప్రపంచ దేశాల కరెన్సీ మార్కెట్లను సైతం కుదిపేస్తోంది. అనేక దేశాల కరెన్సీలతో డాలర్ విలువ మరింత బలపడుతోంది. డాలర్ ఇండెక్స్ ఇప్పటికే 110 స్థాయికి చేరింది. దీంతో మన రూపాయి విలువ కూడా అంతకంతకూ బక్కచిక్కిపోతోంది. తాజాగా డాలరు మారకంలో 87 కిందికి పడిపోయింది. ఒకపక్క, ఎగుమతిదారులకు కాస్త ఊరట లభించినప్పటికీ.. మన వాణిజ్యం ఇప్పటికీ లోటులోనే ఉన్న నేపథ్యంలో దిగుమతులు గుదిబండగా మారుతున్నాయి. ఇక అమెరికా టారిఫ్‌ల ప్రభావంతో ద్రవ్యోల్బణం పెంపు భయాలు పెరిగాయి.యూఎస్‌లోని సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్ల కోతకు బ్రేక్ ఇవ్వడంతో డాలర్ జోరుకు ఆజ్యం పోసినట్లయింది. ఈ ప్రభావంతో విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) మన స్టాక్ మార్కెట్ నుండి పొలోమంటూ నిధులను వెనక్కి తీసేసుకుంటున్నారు. అక్టోబర్ నుంచి రివర్స్ గేర్‌లో ఉన్న ఎఫ్‌పీఐలు ట్రంప్ విజయం తర్వాత ఇంకాస్త జోరు పెంచారు. ఈ ఏడాది జనవరిలోనే రూ.87,000 కోట్ల విలువైన షేర్లను భారత్ మార్కెట్లలో విక్రయించడం విశేషం. దీంతో స్టాక్ సూచీలు ఇటీవలి గరిష్ట స్థాయిల నుంచి 10 శాతం పైగానే కుప్పకూలాయి. వెరసి టారిఫ్ వార్ దేశీ స్టాక్ మార్కెట్లకూ అతిపెద్ద ముప్పుగా మారుతోంది.భారత్–అమెరికా వాణిజ్య బంధం ఇలా...2023–24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశానికి అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. గతేడాది అమెరికాకు భారత ఎగుమతులు 77.51 బిలియన్ డాలర్లుగా ఉండగా, దిగుమతులు 42.2 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 35.31 బిలియన్ డాలర్ల వాణిజ్య మిగులు ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) ఏప్రిల్–అక్టోబర్ కాలంలో అమెరికాకు మన ఎగుమతులు 6.31 శాతం పెరిగి 47.24 బిలియన్ డాలర్లకు చేరుకోగా, దిగుమతులు 2.46 శాతం పెరిగి 26 బిలియన్ డాలర్లకు ఎగశాయి.అనుకూలం⇒ ఫార్మా – చైనాపై టారిఫ్‌ల నేపథ్యంలో మన జెనరిక్ కంపెనీలకు అవకాశాలు పెరుగుతాయి.⇒ టెలికం పరికరాలు – ఇతర దేశాలతో పోలిస్తే మన ఎగుమతులు జోరందుకుంటాయి.⇒ ఎలక్ట్రానిక్స్ – దేశీ తయారీ కంపెనీలకు అమెరికా మార్కెట్ మరింత అందుబాటులోకి వస్తుంది.⇒ టెక్స్టైల్స్ – భారతీయ కంపెనీలకు సమీప భవిష్యత్తులో ఆర్డర్లు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.⇒ ఫుడ్–అగ్రి ప్రోడక్టŠస్ – ఆహార, వ్యవసాయ రంగాలకు తక్షణ ప్రయోజనం.⇒ ఆటోమొబైల్ విడిభాగాలు – యూఎస్‌లో మన కంపెనీల ఎగుమతుల వాటా పెంచుకోవడానికి సదవకాశం.⇒ పెట్రోలియం ఉత్పత్తులు – ఎగుమతులు పుంజుకోవడానికి చాన్స్.⇒ ఐటీ సేవలు – రూపాయి పతనంతో మరింత ఆదాయం సమకూరుతుంది.ప్రతికూలం⇒ రూపాయి – డాలర్ భారీగా బలపడటంతో దేశీ కరెన్సీ విలువ మరింత పడిపోవచ్చు.⇒ స్టాక్ మార్కెట్ – విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలతో పెట్టబడులు తరలిపోయి.. మార్కెట్ ఇంకా పడిపోవచ్చు.⇒ ముడిచమురు – దిగుమతులు మరింత భారమై.. విదేశీ మారక నిల్వలు తగ్గిపోతాయి. ⇒ బంగారం – రూపాయి పతనంతో విదేశీ మార్కెట్‌తో పోలిస్తే ధరలు కొండెక్కవచ్చు.⇒ యంత్రపరికరాలు – దేశీ కంపెనీలు దిగుమతి చేసుకునే పరికరాలు, సామగ్రి ధరలు మరింత పెరుగుతాయి.⇒ వంటనూనెలు – భారత్ ఎక్కువగా దిగుమతులపై ఆధారపడటం వల్ల నూనె ధర మరింత హీటెక్కవచ్చు.⇒ ఎరువులు – వ్యవసాయానికి అవసరమైన ఎరువుల దిగుమతి భారమవుతుంది. -
ట్రంప్ సంచలన నిర్ణయాలు.. అమెరికన్లకు కొత్త టెన్షన్!
వాషింగ్టన్: అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలు అమెరికా ప్రజలకు శాపంగా మారే అవకాశం ఉంది. కెనడా, మెక్సికో, చైనా నుంచి దిగుమతులపై సుంకాలు విధించిన నేపథ్యంలో అమెరికాలో కొన్ని వస్తువుల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అమెరికన్లను ట్రంప్ హెచ్చరించారు. తాజాగా ట్రంప్.. వాణిజ్య భాగస్వామ్య దేశాలపై సుంకాల పెంపుదలతో అమెరికన్లు ఆర్థిక భారం మోయాల్సి రావచ్చని అన్నారు. అయినప్పటికీ ఈ విషయంలో తప్పక ప్రతిఫలం లభిస్తుందని చెప్పుకొచ్చారు.కెనడా, మెక్సికో, చైనా నుంచి దిగుమతులపై సుంకాలు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కెనడా, మెక్సికో దేశాలపై 25 శాతం, చైనాపై 10 శాతం సుంకాలు విధించారు. ఈ నేపథ్యంలో ఆయా దేశాలు ప్రతీకార చర్యలకు నిర్ణయాలు తీసుకుంటున్న క్రమంలో అమెరికాలో ధరలు కూడా పెరిగే ప్రమాదముందనే హెచ్చరికల నేపథ్యంలో అధ్యక్షుడు స్పందించారు. ఈ సందర్బంగా ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికన్లను రక్షించాల్సిన అవసరం నాపై ఉంది. అందరికీ భద్రత కల్పించడం అధ్యక్షుడిగా నా బాధ్యత. చట్టవిరుద్ధ వలసదారులను, మాదక ద్రవ్యాలు తమ సరిహద్దుల్లోకి రాకుండా చేస్తానని ఎన్నికల ప్రచారంలో మాట ఇచ్చాను. దానికి కట్టుబడి ఉన్నాను. వాణిజ్య భాగస్వామ్య దేశాలపై సుంకాల పెంపుదలతో అమెరికన్లు ఆర్థిక భారం మోయాల్సి రావచ్చు. అయినప్పటికీ విషయంలో తప్పక ప్రతిఫలం లభిస్తుంది. అమెరికాను మళ్లీ గొప్పగా మారుస్తాను అంటూ కామెంట్స్ చేశారు.Donald Trump campaigned on lowering the price of goods.He's now saying we will feel "pain" and understand it.His policies are disastrous.pic.twitter.com/Qyt77io44l— Art Candee 🍿🥤 (@ArtCandee) February 3, 2025ఇదిలా ఉండగా.. మూడు దేశాలపై ట్రంప్ సుంకాలు విధించడంతో ఆయా దేశాలు అమెరికాపై ప్రతీకార చర్యలకు దిగాయి. అందులో భాగంగా 155 బిలియన్ కెనడియన్ డాలర్ల విలువైన అమెరికా దిగుమతులపై 25 శాతం సుంకం విధిస్తునట్లు జస్టిన్ ట్రూడో ప్రకటించారు. మెక్సికో సైతం ఇలాంటి చర్యలకు సిద్ధమైంది. తాము కూడా అమెరికా దిగుమతులపై టారిఫ్‌లు విధిస్తామని ఆ దేశ అధ్యక్షురాలు క్లాడియా షేన్‌బామ్ పేర్కొన్నారు. చైనాకు కూడా స్పందిస్తూ ప్రపంచ వాణిజ్య సంస్థలో ట్రంప్ నిర్ణయాన్ని సవాలు చేస్తామని హెచ్చరికలు జారీ చేసింది. తప్పుడు పద్ధతులను సరిచేసుకోవాలని అమెరికాను కోరుతున్నాం అంటూ హితవు పలికింది. -
ట్రంప్‌కు ఎదురుదెబ్బ.. బెడిసికొట్టిన ప్లాన్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. కెనడా, మెక్సికోపై 25 శాతం, చైనాపై 10 శాతం సుంకాలు విధించడంపై ఆయా దేశాలు మండిపడుతున్నాయి. ట్రంప్ తప్పుడు పద్దతుల్లో వెళ్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఇదే సమయంలో, అమెరికాపై ప్రతీకార చర్యలు తీసుకునేందుకు కెనడా, మెక్సికో దేశాలు సిద్ధమయ్యాయి. అలాగే, ట్రంప్ నిర్ణయాన్ని డబ్ల్యూటీవో సవాల్ చేస్తానని చైనా హెచ్చరించింది.డొనాల్డ్ ట్రంప్.. కెనడా, మెక్సికో, చైనాపై సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్‌కు ఆ దేశాలు కౌంటరిస్తున్నారు. ఈ క్రమంలో కెనడా కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ప్రధాని జస్టిన్ ట్రూడో మాట్లాడుతూ.. ‘155 బిలియన్ కెనడియన్ డాలర్ల అమెరికా దిగుమతులపై 25 శాతం టారిఫ్‌లు విధిస్తున్నాం. వాషింగ్టన్ చర్యలకు ఇది కె‘నడా ప్రతిస్పందన. ఇందులో 30 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులపై విధించే సుంకం మంగళవారం నుంచి అమల్లోకి వస్తుంది. మిగిలినవి 21 రోజుల తర్వాత అమలవుతాయి. అమెరికాను స్వర్ణయుగంలా మార్చాలని అధ్యక్షుడు ట్రంప్ అనుకుంటే.. మాతో భాగస్వామ్యాన్ని కోరుకోవాలి. అదే వారికే మంచింది’ అంటూ కామెంట్స్ చేశారు.Breaking!🚨PM of Canada Trudeau imposes 25% tariffs on $155 billion worth of American goodsEven China also told it will take retaliatory steps against Tariff thre@t of TrumpOnly our Farzi Vishwaguru Modi surrendered to Trump. Sp!neless 🤡pic.twitter.com/rJbjAAhaX8— Veena Jain (@DrJain21) February 2, 2025 మరోవైపు.. మెక్సికో కూడా ఇలాంటి ఆదేశాలే జారీ చేసింది. తాజాగా మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్‌బామ్ మాట్లాడుతూ.. ‘మెక్సికో పొరుగు దేశాలతో సహకారం కోరుకుంటుంది. మేము ఎప్పుడూ ఘర్షణలు కోరుకోము. డ్రగ్స్ అక్రమ రవాణా గ్రూపులతో తమ ప్రభుత్వానికి సంబంధాలు ఉన్నాయంటూ అమెరికా చేసిన ఆరోపణలను ఖండిస్తున్నాం. మా ప్రభుత్వం నాలుగు నెలల్లో 20 మిలియన్ డోస్ ఫెంటనిల్ సహా 40 టన్నులకు పైగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నాం. పదివేల మందిని అరెస్టు చేశాం. మాదకద్రవ్యాలను అరికట్టాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించుకుంటే.. అందుకు కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం. టారిఫ్‌లు విధిస్తే సమస్యలు పరిష్కారం కావు. మెక్సికన్ల ప్రయోజనాలకు అనుగుణంగా మేము చర్యలు తీసుకుంటాం. ప్లాన్ బీని అమలు చేయాలనుకుంటున్నాం’ అని తెలిపారు.ఇదిలా ఉండగా.. ట్రంప్ చర్యలపై చైనా కూడా మండిపడింది. తాజాగా చైనా వాణిజ్య మంత్రిత్వశాఖ స్పందిస్తూ.. చైనా ప్రయోజనాలు, హక్కులను కాపాడుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకుంటాం. అమెరికా తప్పుడు పద్ధతులు అనుసరిస్తోంది. ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం. ప్రపంచ వాణిజ్య సంస్థలో ట్రంప్ నిర్ణయాన్ని సవాలు చేస్తాం. చర్యలతో అమెరికా సమస్యలు తీరకపోగా.. సాధారణ ఆర్థిక వ్యవస్థ, వాణిజ్య సహకారాలు దెబ్బతింటాయి. ఇతర దేశాలను సుంకాలతో ప్రతిసారి బెదిరించకుండా.. తన దేశంలో ఫెంటనిల్ వంటి సమస్యలను సొంతగా పరిష్కరించుకోవాలి. తప్పుడు పద్ధతులను సరిచేసుకోవాలని అమెరికాను కోరుతున్నాం అంటూ హితవు పలికింది.China's Ministry of Commerce:#China strongly deplores and firmly opposes the #US's additional 10% #tariff on Chinese goods. China will file a case with @wto and take corresponding countermeasures to safeguard its interests. pic.twitter.com/kBxNVjHG8Z— Liu Pengyu 刘鹏宇 (@SpoxCHNinUS) February 2, 2025 -
ట్రంప్ సంచలన నిర్ణయం.. మూడు దేశాలకు షాక్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. మూడు దేశాలపై సుంకాలు విధించి అందరికీ ఝలక్ ఇచ్చారు. మెక్సికో, కెనడా, చైనా దేశాలపై టారిఫ్‌లు విధించారు. ఈ క్రమంలో దేశీయ తయారీని పెంచడానికి, ఫెడరల్ ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచుకునేందుకు ఆ సుంకాలను ఉపయోగిస్తామని ట్రంప్ హామీ ఇచ్చారు. దీంతో, ఆయన నిర్ణయంపై చర్చ నడుస్తోంది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశారు. అధికారం చేపట్టిన తర్వాత దూకుడు పెంచారు. ఈ క్రమంలో ఒకేసారి మూడు దేశాలపై సుంకాలను విధించారు. కెనడా, మెక్సికన్ దిగుమతులపై 25 శాతం, చైనా నుంచి వచ్చే వస్తువులపై 10 శాతం సుంకం విధించినట్లు వైట్‌హౌస్ అధికారులు తెలిపారు. ఈ మేరకు సుంకాలను విధించే ఉత్తర్వుపై ట్రంప్ సంతకం చేశారు.ఈ సందర్భంగా ట్రంప్.. ‘మెక్సికో, కెనడా దిగుమతులపై 25% సుంకం (కెనడియన్ ఎనర్జీపై 10%), చైనాపై 10% అదనపు సుంకాన్ని అమలు చేశాను. ఫెంటానిల్ సహా మన దేశంలోకి వస్తున్న అక్రమ విదేశీయులు, ప్రాణాంతక మాదకద్రవ్యాలను అరికట్టేందుకు అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (ఐఈఈపీఏ) ద్వారా ఈ సుంకాలు విధించాను. మనం అమెరికన్లను రక్షించాల్సిన అవసరం ఉంది. అందరి భద్రతను నిర్ధారించడం అధ్యక్షుడిగా నా కర్తవ్యం. అక్రమ విదేశీయులు, మాదకద్రవ్యాల వరద మన సరిహద్దుల గుండా ప్రవహించకుండా నిరోధించడానికి నేను నా ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేశాను. అమెరికన్లు దీనికి అనుకూలంగా ఓటు వేశారు’ అని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. టారిఫ్‌ల విషయంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో అమెరికా వృద్ధి తగ్గడమే కాదు.. కెనడా, మెక్సికో దేశాల్లో ఆర్థిక మాంద్యం సంభవించే ప్రమాదం ఏర్పడింది. అలాగే, ఈ ఏడాది అమెరికా ఆర్థిక వృద్ధి 1.5% తగ్గుతుందని పలువురు నిపుణులు చెబుతున్నారు. ఇక, ట్రంప్ ఆదేశాల ప్రకారం మంగళవారం అర్ధరాత్రి 12:01 గంటలకు (భారత కాలమానం ప్రకారం 05:01 గంటలకు) సుంకాలు అమల్లోకి వస్తాయి. రవాణాలో ఉన్న వస్తువులు, కటాఫ్ సమయానికి ముందే అమెరికా సరిహద్దులోకి ప్రవేశించే వారికి సుంకాల నుంచి మినహాయింపు ఉండనుంది. సరిహద్దు వెంబడి సంక్షోభం తగ్గే వరకు సుంకాలు అమలు చేస్తామని ట్రంప్ తెలిపారు. -
కెనడా, మెక్సికోలపై టారిఫ్‌లు నేటి నుంచే
వాషింగ్టన్: పొరుగుదేశాలైన కెనడా, మెక్సికోలపై ప్రకటించిన 25 శాతం టారిఫ్ పెంపు శనివారం నుంచే అమలవుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ప్రకటించారు. వైట్‌హౌస్‌లోని ఓవల్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. టారిఫ్‌లు విధించే కెనడా, మెక్సికో వస్తువుల జాబితాలో చమురును చేర్చాలా వద్దా అనేది కూడా త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఈ రెండు దేశాల నుంచి దిగుమతయ్యే ఆయిల్ ధర సరిగ్గా ఉందని భావిస్తే టారిఫ్ ఉండదని చెప్పారు. కెనడా, మెక్సికోలపై టారిఫ్ విధింపునకు ఎన్నో కారణాలు ఉన్నాయన్నారు. ఈ రెండు దేశాల నుంచి అక్రమ వలసలు, డ్రగ్స్ స్మగ్లింగ్ ఎక్కువన్నారు. ఈ రెండు దేశాలతో అమెరికా వాణిజ్యం భారీ లోటు ఉందని చెప్పారు. వాణిజ్యం విషయంలో ఈ రెండూ అమెరికాతో చాలా అన్యాయంగా వ్యవహరించాయన్నారు. ఇవి ఎగుమతి చేసే వస్తువులు ఆయిల్, కలప వంటి వాటి అవసరం తమకు లేదన్నారు. ప్రస్తుతం ఏడాదికి కెనడాకు 175 బిలియన్ డాలర్లు, మెక్సికోకు 300 బిలియన్ డాలర్ల వరకు అమెరికా సబ్సిడీల రూపంలో అందిస్తోందని ట్రంప్ వివరించారు. చైనా పైనా టారిఫ్ఫెంటానిల్ వంటి ప్రమాదకరమైన డ్రగ్‌ను తమ దేశంలోకి దొంగచాటుగా పంపుతున్న చైనా వస్తువులపైనా టారిఫ్‌లు విధించే విషయాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు. ‘ఫెంటానిల్ కారణంగా వేలాదిగా అమెరికన్లు చనిపోతున్నారు. ఇందుకు బదులుగా చైనా టారిఫ్‌తో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంది. ఈ విషయంలో స్పష్టతతో ఉన్నాం’అని ఆయన అన్నారు.బ్రిక్స్‌కు ట్రంప్ మళ్లీ వార్నింగ్అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్‌కు బదులుగా ప్రత్యామ్నాయం తీసుకురావాలనుకుంటే తీవ్ర చర్యలు తప్పవని బ్రిక్స్ దేశాలకు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. అలాంటి పరిస్థితే వస్తే సభ్యదేశాలపై వంద శాతం టారిఫ్ తప్పదన్నారు. అమెరికాకు బదులు మరో దేశాన్ని చూసుకోవాలని సలహా ఇచ్చారు. ‘ఇప్పటి వరకు చూస్తూ ఊరుకున్నాం, ఇకపై సహించేది లేద’అంటూ సొంత సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్‌లో పేర్కొన్నారు. ‘కొత్తగా బ్రిక్స్ కరెన్సీని తేవడం లేదా డాలర్‌కు ప్రత్యామ్నాయంగా మరో కరెన్సీకి మద్దతివ్వడం వంటివి మానుకోవాలి. అలా చేస్తే 100 శాతం టారిఫ్‌లు తప్పవు. అమెరికాలో ఉత్పత్తుల విక్రయానికి గుడ్ బై చెప్పుకోవాల్సిందే’అన్నారు. గత డిసెంబర్‌లోనూ బ్రిక్స్‌కు ట్రంప్ ఇటువంటి హెచ్చరికే చేశారు. అయితే, డాలర్ రహిత బ్రిక్స్ దేశాల వాణిజ్యానికి సంబంధించి ఎలాంటి ప్రతిపాదనా లేదని విదేశాంగ మంత్రి జై శంకర్ స్పష్టం చేశారు. బ్రిక్స్‌లో రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్టు, ఇథియోపియా, ఇండోనేసియా, ఇరాన్ దేశాలకు సభ్యత్వముంది. -
చూసేందుకు చిన్నదే..కానీ ఆదరణ పెద్దది..!
ఆభరణాల పెట్టెలో భారీ విశ్వం, నాలుగు అంగుళాలకు మించని మినీ బీచ్‌లో బృందాల జలకాలాటలు, అతి పెద్ద గొడపై నిలిచిన అతి చిన్ని డబుల్ థ్రెషోల్డ్... అబ్బురం అనిపించే ఈ సూక్ష్మ చిత్ర కళ ఇప్పుడు ప్రపంచంలో పెద్దగా ప్రజాదరణ పొందుతోంది. ఆర్ట్ గ్యాలరీలు, ఆర్ట్ ఫెయిర్స్లో ఈ కళ కొత్తగా ఆకట్టుకుంటుంది. ప్రపంచ ఆర్ట్ ప్రియులు కళ ఇలా రూపు మారడానికి కారణాలను అన్వేషిస్తున్నారు. ఆర్ట్ మార్కెట్‌ను మినియేచర్ ఆర్టిస్టులు ఏలేస్తున్నారు అని ప్రశంసిస్తున్నారు. దేశీయ మినియేచర్ఇటీవల కాలంలో భారతదేశంలో అనేక మినీయేచర్ పెయింటింగ్ స్కూళ్లు పుట్టుకువచ్చాయి. ప్రతి ఒక్కటి దాని సాంస్కృతిక, ప్రాంతీయ, చారిత్రక సందర్భాన్ని ప్రతిబింబిస్తున్నాయి. వాటిలో ప్రధానంగా ఆకట్టుకుంటున్నది మొఘల్ స్కూల్ ఆఫ్ మినియేచర్. దీనిలో కిషన్‌గఢ్ శైలి, రాధా కృష్ణుల దైవిక ప్రేమలు మరింత ప్రత్యేకమైనవి. పహారీ స్కూల్ హిమాచల్ ప్రదేశ్, జమ్మూలోని కొండ ప్రాంతాలలో అభివృద్ధి చెందింది. దక్కన్ స్కూల్ పర్షియన్, టర్కిష్, భారతీయ అంశాల కలయికను ప్రదర్శిస్తుంది. సూక్ష్మ చిత్రాలలో వెలసిన పచ్చని ప్రకృతి దృశ్యాలు, అద్భుతమైన థీమ్‌లో ఇవన్నీ విభిన్నంగా ఉంటాయి. విదేశాలలో సూక్ష్మ కళసంవత్సరాల క్రితం కెనడియన్ మినియేచర్ ఆర్టిస్ట్ శాంటియాగో తనదైన పనితనంతో ఇంట్లోనే చిన్న చిన్న పెయింటింగ్స్ వేస్తూ, శిల్పాలు చెక్కుతూ ఉండేవాడు. కెనడియన్ కలెక్టర్ బ్రూస్ బెయిలీ శాంటియోగోను కలిసినప్పుడు అతని కళా నైపుణ్యాన్ని చూసి కొంతకాలం ‘ఓపికపట్టండి’ అని చెప్పాడట. శాంటియాగో నవ్వుతూనే కాలక్రమంలో అందరూ వదిలేసిన వుస్తవులను అతి చిన్న నమూనా బొమ్మలను తయారుచేశాడు. ఒక జత కఫ్లింగ్లకు సరిపోయేంత పెట్టెలో ఒక సముద్రాన్నే సృష్టించాడు. కాలక్రమంలో కళాభిరుచిగలవారు ఈ సూక్ష్మ కళ ప్రాముఖ్యతను గుర్తిస్తారని అతను నమ్మాడు. ఈ విషయాన్ని బెయిలీ ప్రస్తావిస్తూ ‘2018లో శాంటియాగో పని తనాన్ని చూసినప్పుడు, నాకు చాలా ప్రత్యేకంగా అనిపించింది. ఇన్నాళ్లకు నిజమయ్యింది’ అంటాడు. ఇటీవల గ్యాలరీలలో అతి చిన్న కళాకృతులు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి. ‘మనుషుల ఆలోచనలు ఎలా మారతాయో చూడటం ఆసక్తికరంగా ఉంది’ అంటాడు శాంటియాగో. 2010 చివర 2020ల ప్రారంభంలో సూక్ష్మ కళ అత్యున్నత శిఖరాలకు వెళ్ళిన సమయంగా చెప్పుకోవచ్చు. దీనిని యువ చిత్రకారులు చాలా ముందుకు తీసుకెళ్లారు. ఈవిషయం గురించి శాంటియోగో వివరిస్తూ ‘నేను ఇంతటి ఆదరణను ఊహించలేదు. ఆర్ట్నెట్ ప్రైస్ డేటాబేస్ ద్వారా సెకండరీ మార్కెట్లో ప్రదర్శించిన ఆర్ట్‌ను పరిశీలిస్తే కిందటి సంవత్సరం దాదాపు 2 మిలియన్లకు అమ్ముడైన పెయింటింగ్ ఉంది. అదేవిధంగా డిజిటల్ పెయింటింగ్‌లు, సైక్లాడిక్ మాస్క్, జపనీస్ హెల్మెట్ స్టాండ్ వంటివి ఉన్నాయి. మెక్సికోలో సూక్ష్మ ఆర్ట్ గ్యాలరీమహమ్మారి సమయంలో ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉన్నారు. అప్పుడు వారి చూపు తమ ఇంటీరీయర్ వైపు మళ్లింది. అప్పుడే తమలోని సృజనకు పదును పెట్టినవారు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది. షార్ప్ టైలర్ అనే కళాకారుడు మెక్సికో నగరంలో ‘లులు’ అనే సూక్ష్మ ఆర్ట్ గ్యాలరీని నడిపేవాడు. ఆ తరువాత లాస్ ఏంజిల్స్‌లోని పెద్ద స్టూడియోకు తన చిత్రకళను మార్చాడు. ప్రపంచంలోని చాలా దేశాల్లో తమ దేశీయ సంస్కృతికి కళాకారులు అద్దం పడుతూనే ఉన్నారు. సోషల్ మీడియా ప్రభావంపరిమాణంతో సంబంధం లేకుండానే సోషల్ మీడియాలో ఈ చిత్రకళా ప్రదర్శన నిత్యం జరుగుతూనే ఉంది. అతి పెద్ద గోడలపైన అతి చిన్న కళాకృతి ఆసక్తిని రేపుతుంది.‘ చిత్రాలలో అంతర్లీనంగా ఉన్న సున్నితత్వం తోపాటు రహస్యం దాగుంటుంది. దానిని కనుక్కోవడంలో చేసే ప్రయత్నం అత్యంత మనోహరంగా ఉంటుంది’ అంటున్నారీ కళాకారులు. (చదవండి: భారత్ యువకుడిని పెళ్లాడిన గ్రీకు అమ్మాయి) -
వెనక్కి పంపేస్తున్నాం.. మాకు వద్దే వద్దు
మెక్సికో గుండా శరణార్థులుగా చొరబడిన వారందరినీ వెనక్కి పంపేస్తామంటూ అమెరికన్లకు ఇచ్చిన వాగ్దానాన్ని డొనాల్డ్ ట్రంప్ నెరవేర్చాలని చూస్తుంటే అందుకు మెక్సికో ససేమిరా అంటోంది. మా గడ్డ మీదుగా వచ్చినంత మాత్రాన వాళ్లంతా మెక్సికన్లుకాబోరని తెగేసి చెబుతోంది. అయినాసరే విమానాల్లో తరలిస్తామంటే ఆ విమానాలను ల్యాండింగ్ కానివ్వబోమని స్పష్టంచేసింది. దీంతో ఈ శరణార్థులను ఎక్కడి పంపాలో, వీళ్లని ఏం చేయాలా అని అమెరికా తల పట్టుకుంది. అసలేం జరిగింది? చాన్నాళ్లుగా శరణార్థులుగా అమెరికాలోకి అక్రమంగా వలసవస్తున్న వారిని గత అమెరికా ప్రభుత్వాలు అనుమతించాయి. కానీ ట్రంప్ అధ్యక్షుడయ్యాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. డాక్యుమెంట్లు లేకుండా శరణు కోరుతూ అక్రమంగా వస్తే ఎవ్వరినీ అనుమతించబోమని ట్రంప్ ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఇప్పటికే వచ్చిన వారినీ పంపేస్తామని ప్రకటించింది. గ్వాటెమాల నుంచి వచ్చిన వాళ్లను ఇటీవలే వెనక్కి పంపింది. ఒక్కోదాంట్లో 80 మంది శరణార్థులున్న రెండు సైనిక విమానాలు శుక్రవారమే గ్వాటెమాలకు వెళ్లి అక్కడ వదిలేసి వచ్చాయి. ఇదే తరహాలో ‘‘మెక్సికో వాళ్లు మెక్సికోలోనే ఉండాలి. అమెరికాలో కాదు’’అనే అర్థంలో గతంలో అమలుచేసిన ‘రిమేన్ ఇన్ మెక్సికో’విధానాన్ని ట్రంప్ యంత్రాంగం తెరమీదకు తెచ్చింది. మెక్సికో వెళ్లి శరణార్థులను వదిలేసి రావాలని ట్రంప్ ప్రభుత్వం గత వారం నిర్ణయించింది. సీ–17 భారీ సైనిక సంబంధ సరకు రవాణా విమానంలో వారిని మీ దేశానికి తీసుకొస్తున్నట్లు మెక్సికోకు అమెరికా సమాచారమిచ్చింది. ఇది తెల్సిన వెంటనే మెక్సికో ఘాటుగా స్పందించింది. ‘‘మా దేశం గుండా మీ దేశంలోకి వచ్చినంత మాత్రాన వాళ్లంతా మెక్సికన్లు అయిపోరు. వాళ్లలో అక్రమంగా మెక్సికోకు వచ్చి చివరకు అమెరికా సరిహద్దుదాకా వచ్చి శరణు కోరిన వారు ఉన్నారు. ఒకవేళ వాళ్లందరినీ విమానంలో మా దేశానికి పంపిస్తే ఆ విమానాన్ని ల్యాండ్ కానివ్వం. అమెరికాతో మాకు సత్సంబంధాలున్నాయి. వలస విషయంలోనూ అంతే. అయినా తప్పదనుకుంటే ఆ శరణార్థుల్లో మెక్సికో జాతీయులను మాత్రం తిరిగి పంపడానికి అనుమతిస్తాం’’అని మెక్సికో విదేశాంగ శాఖ స్పష్టంచేసింది. క్షీణించిన సత్సంబంధాలు మెక్సికో సరిహద్దు వద్ద భద్రతను కట్టుదిట్టంచేస్తానని, ఓ యాప్ ద్వారా స్లాట్ బుక్‌చేసుకుని ఇంటర్వ్యూ తర్వాత శరణార్థి హోదాలో అమెరికాలోకి వచ్చే విధానానికి చరమగీతం పాడుతున్నట్లు ట్రంప్ అధికారంలోకి రాగానే ప్రకటించారు. అందుకు తగ్గట్లే సరిహద్దు వద్ద వేలాది మందిగా అదనపు బలగాలను మొహరించారు. మెక్సికో గుండా అత్యంత ప్రమాదకర కొత్తరకం మాదకద్రవ్యాలు అమెరికాలోకి స్మగ్లింగ్ చేస్తున్నారంటూ అక్కడి డ్రగ్ ముఠాలను ఉగ్రసంస్థలుగా ప్రకటించారు. మెక్సికో వస్తూత్పత్తులపై ఫిబ్రవరి నుంచి అదనంగా 25 శాతం పన్నులు విధిస్తానని ట్రంప్ ప్రకటించారు. వెనక్కి పంపిస్తామన్న ట్రంప్ ప్రభుత్వ అభ్యర్థనను మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ తిరస్కరించారు. మూకుమ్మడి తిరుగుటపాలు ఒప్పకోబోమని, అయినా ప్రతిభ గల మెక్సికన్ శరణార్థులు అమెరికా ఆర్థికాభివృద్ధికి దోహదపడతారని ఆమె హితవు పలికారు. దీంతో అమెరికా, మెక్సికో సత్సంబంధాలు క్షీణించాయి. 2021లోనూ అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా సేనలు నిష్క్రమించినప్పుడు అక్కడి వేర్వేరు దేశస్తులను తమ తమ దేశాలకు అమెరికా తమ సైనిక విమానాల్లో తరలించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ట్రంప్ మాటకు హిల్లరీ నవ్విన వేళ..
అమెరికాలో స్వర్ణయుగం తెస్తానని ట్రంప్ ప్రమాణస్వీకార ప్రసంగంలో పలు ప్రతిజ్ఞలు చేస్తున్నవేళ విపక్ష నాయకురాలు, అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ కిసుక్కున నవ్వారు. ఓవైపు ట్రంప్ సీరియస్‌గా మాట్లాడుతుంటే హిల్లరీ ఎందుకలా నవ్వారన్న అంశం ఇప్పుడు అమెరికాలో చర్చనీయాంశమైంది. హిల్లరీ నవ్విన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అయితే ఇందుకు కారణం లేకపోలేదు. దశాబ్దాలుగా స్థిరపడిపోయిన ఒక భౌగోళిక స్వరూపం పేరును ఊరకే ఒక దేశాధ్యక్షుడు ఇష్టమొచ్చినట్లు మార్చితే ఇబ్బందులు రావా? అనేది ఇక్కడ అసలు ప్రశ్న. ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’ అనే పేరు శతాబ్దాల క్రితమే స్ధిరపడిపోయింది. ఇప్పుడు హఠాత్తుగా అమెరికాలాంటి ఏదో ఒక్క దేశం తాము ఈ ప్రాంతాన్ని మరోలా పిల్చుకుంటామంటే కుదరదు. కొత్త పేరును తగిలించడానికి అంతర్జాతీయంగా మ్యాప్‌లలో పేర్లు మార్చాలి. ఈ మార్గంలో వెళ్లే భారీనౌకల సాఫ్ట్వేర్లలో, సముద్ర సంబంధ ఉపగ్రహాల్లోల డేటాల్లో, చమురు, వాణిజ్య సంస్థల ఒప్పందాల్లో.. ఇలా ఎన్నింటిలోనూ ఈ ప్రాంతం పాత పేరును చెరిపేసి కొత్తపేరును రాయాల్సి ఉంటుంది. ఇదంతా ఎంతో శ్రమతో కూడిన వ్యవహారం. అన్ని దేశాల ∙ఏకాభిప్రాయంతో జరగాల్సిన సుదీర్ఘ ప్రక్రియ ఇది. When Donald Trump starts talking the Gulf of America, the entire sane world is Hillary Clinton. pic.twitter.com/Yp3gp61Wka— Brad Bo 🇺🇸 (@BradBeauregardJ) January 21, 2025 -
‘చాలా చెడ్డ దేశం’.. రాగానే ట్రంప్ చర్యలు షురూ
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. వచ్చీరాగానే దాయాది దేశాలైన కెనడా, మెక్సికోలపై భారీ సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఫిబ్రవరి 1 నుంచి కెనడా, మెక్సికో దిగుమతులపై 25 శాతం సుంకం విధిస్తామని ట్రంప్ తెలిపారు. అక్రమ వలసలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాను కట్టడి చేసేందుకు ట్రంప్ విస్తృత వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.కెనడా ‘చాలా చెడ్డ దేశం’ట్రంప్ ప్రమాణ స్వీకార ప్రసంగంలో మాట్లాడుతూ అమెరికన్ పౌరులకు ప్రయోజనం చేకూర్చడానికి విదేశాంగ విధానంలో భాగంగా సుంకాలను ఉపయోగించనున్నట్లు చెప్పారు. కెనడా, మెక్సికో పెద్ద సంఖ్యలో వలసదారులను, ఫెంటానిల్(డగ్స్) అమెరికాలోకి సరఫరా చేస్తున్నాయని ఆరోపించారు. కెనడాను ‘చాలా చెడ్డ దేశం’గా ముద్రవేశారు. ట్రంప్ ఇంత తీవ్రంగా స్పందించడంతో మరిన్ని దేశాల్లో అమెరికా సుంకాల విధానాలపై ఆందోళనలను రేకెత్తించింది. ఫిబ్రవరి 1 చివరితేది సమీపిస్తుండటంతో అమెరికాతో సరిహద్దు పంచుకుంటున్న ఇరుదేశాలకు ఇరువైపులా వ్యాపారం సాగిస్తున్నవారు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ పరిస్థితి ఎలా ఉంటుందో, ట్రంప్ పాలనలో అమెరికా వాణిజ్య సంబంధాల భవిష్యత్తు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.చర్చలకు సిద్ధంఈ ప్రకటనపై కెనడా, మెక్సికో దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కెనడియన్ విదేశాంగ మంత్రి మెలానీ జోలీ మాట్లాడుతూ.. కెనడా యూఎస్ వాణిజ్య విధానాలపై ప్రతిస్పందించడానికి సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. మెక్సికన్ అధికారులు సుంకాల ప్రభావాన్ని తగ్గించడానికి అమెరికాతో చర్చల్లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కానీ, దీనిపై ట్రంప్ అంత తేలికగా అంగీకరించరనే వాదనలున్నాయి. దాంతో మరికొంత కాలం ఈ దేశాలకు సుంకాల ఇబ్బందులు తప్పవని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.ఇదీ చదవండి: ఈ–త్రీవీలర్స్‌లోకి టీవీఎస్..సుంకాల పెంపుతో వినియోగదారులపైనే భారంట్రంప్ ప్రవేశపెడుతున్న సుంకాల విధింపు విధానాలపై విమర్శలు వస్తున్నాయి. ఇలా ఇష్టారీతినా టారిఫ్‌లను పెంచడంవల్ల తుదకు వినియోగదారులపైనే ఆ భారం పడుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది ఆర్థిక వృద్ధిని దెబ్బతీస్తుందని వాదిస్తున్నారు. అయితే ట్రంప్ మద్దతుదారులు కొన్ని వస్తువులపై భవిష్యత్తులో తీసుకోబోయే పన్నుల కోతలు, వాటి క్రమబద్ధీకరణ వంటి ఇతర ప్రతిపాదనల వల్ల ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. -
Christmas 2024 ముల్లంగి సంబరం
ప్రపంచంలోనే ఇదొక అరుదైన సంబరం. మెక్సికోలోని వాహాకా నగరంలో జరిగే వేడుక ఇది. ఈ సంబరం జరిగే రోజున వాహాకా నగర వీథుల్లో ఎటు చూసినా ముల్లంగి దుంపలే కనిపిస్తాయి. స్థానిక కళాకారులు ముల్లంగి దుంపలను శిల్పాలుగా తీర్చిదిద్ది ప్రదర్శనలు నిర్వహిస్తారు. ఈ సంబరం ఏటా డిసెంబర్ 23న జరుగుతుంది. ఇది ప్రధానంగా రాత్రివేళ జరిగే వేడుకే అయినా, ఉదయం నుంచి వాహాకా నగర వీథుల్లో సందడి కనిపిస్తుంది. స్పానిష్ వలసదారులు అడుగుపెట్టే వరకు మెక్సికన్ ప్రజలకు, ఇతర లాటిన్ అమెరికా దేశాల ప్రజలకు ముల్లంగి తెలీదు. స్పానిష్ వర్తకులు చైనా నుంచి ముల్లంగిని తీసుకువచ్చి, దక్షిణ అమెరికాలోని తమ వలస రాజ్యాల్లో సాగు చేయడం ప్రారంభించారు. అప్పటి నుంచి ముల్లంగి లాటిన్ అమెరికన్ ప్రజల అభిమాన కూరగాయల్లో ఒకటిగా మారింది. ముల్లంగి సంబరం ఆచారం మొదలవడానికి ముందు వాక్సాకా నగరంలోని క్రిస్మస్ బజారులో కలపతో శిల్పాలు మలచే పోటీలు జరిగేవి. కొందరు ఔత్సాహిక రైతులు 1897 డిసెంబర్ 23న ముల్లంగి దుంపలతో చిత్రవిచిత్రమైన శిల్పాలను మలచి, ప్రదర్శనకు పెట్టారు. దాదాపు వందమంది రైతులు ఆనాటి ప్రదర్శనలో ముల్లంగి శిల్పాలను ప్రదర్శించారు. ఇవి సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దేశ విదేశాల నుంచి వచ్చిన సందర్శకులు వీటిని ఎగబడి కొనుక్కున్నారు. అప్పటి నుంచి ఏటా డిసెంబర్ 23న ‘నోషే డి రబానోస్’ (నైట్ ఆఫ్ రాడిషెస్) సంబరం జరుపుకోవడం ప్రారంభించారు. (కేవలం రూ. 500తో మొదలై, కష్టాలను ‘పచ్చడి’ చేసింది! )మొదట్లో ఈ వ్యవహారం కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికే మొదలైనా, తర్వాత ఇది వాహాకా నగరంలో ఒక పెద్ద సాంస్కృతిక వేడుకలా మారింది. ఈ ముల్లంగి సంబరంలో ముల్లంగి శిల్పాల పోటీలు జరుగుతాయి. విజేతలకు వాహాకా నగర పాలక సంస్థ బహుమతులు అందించి, ఘనంగా సత్కరిస్తుంది. ఈ పోటీల్లో పాల్గొనే శిల్పులు క్రీస్తు జననం, శిలువ, చర్చి వంటి ఆకృతులతో పాటు పక్షులు, జంతువులు, మనుషుల బొమ్మలను కూడా ముల్లంగి దుంపలపై మలచి, తమ ప్రతిభను ప్రదర్శిస్తారు. ఈ వేడుకకు విదేశీ పర్యాటకులు వస్తుండటం వల్ల మెక్సికోకు పర్యాటక ఆదాయం కూడా బాగా లభిస్తోంది. -
అమెరికా వస్తువులపై ప్రతీకార సుంకాలు
ఒట్టావా: కెనడా దిగుమతులపై అధిక పన్నుల భారం వేస్తానని కాబోయే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో కెనడా సైతం దీటుగా స్పందించడంపై దృష్టి సారించింది. అమెరికా వస్తువులపై ప్రతీకార సుంకాలు విధించాలనే విషయాన్ని పరిశీలిస్తోంది. దక్షిణ, ఉత్తర సరిహద్దుల గుండా మాదకద్రవ్యాలు, వలసదారుల అక్రమచొరబాట్లను నిలువరించకపోతే అటు మెక్సికో, అటు కెనడా దిగుమతులపై ఏకంగా 25 శాతం సుంకాలు విధిస్తామని ట్రంప్ అమెరికా ఎన్నికల ప్రచారంవేళ ఓటర్లకు వాగ్దానాలు చేయడం తెల్సిందే. ఈ నేపథ్యంలో అమెరికాతో వాణిజ్యం బలోపేతంపై ఉపప్రధాని, ఆర్థిక శాఖ మంత్రి క్రిస్టినా ఫ్రీలాండ్, అంతర్గత వ్యవహారాలు, ఇతర శాఖల మంత్రులు, అమెరికాలో కెనడా రాయబారి కిస్టెన్ హిల్మ్యాన్లతో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గురువారం అత్యవసరంగా సమావేశమయ్యారు. అమెరికాతో వాణిజ్యాన్ని కొనసాగిస్తూ అధిక పన్నులు మోపడంపై చర్చించారు. ఐక్య ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాల్సి ఉందని ఆయన నొక్కి చెప్పారు. అయితే కెనడాను మెక్సికోను ఒకే గాటిన కట్టడం అన్యాయమని మంత్రులు జస్టిన్ వద్ద ప్రస్తావించారు. కెనడా నుంచి వలసలను తగ్గించడానికి, వనరులను అందించడానికి, ట్రంప్ పరిపాలనతో కలిసి పనిచేయడానికి సిద్దమేనని ఈ సందర్భంగా ట్రూడో అన్నారు. మాదక ద్రవ్యాలు తమ దేశం సమస్య కాదని, సుంకాలు రెండు దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని కెనడా మంత్రులు అభిప్రాయపడ్డారు. అమెరికాకు దిగుమతి అవుతున్న చాలా ఉత్పత్తులు కెనడా నుంచే వస్తున్నాయి. ప్రతిరోజూ దాదాపు రూ.22,000 కోట్ల విలువైన వస్తుసేవలు కెనడా నుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. అమెరికా ముడిచమురు అవసరాల్లో 60 శాతం కెనడానే తీరుస్తోంది. 85 శాతం అమెరికా విద్యుత్ ఉపకరణాలు కెనడా నుంచే వస్తున్నాయి. 34 అత్యంత విలువైన ఖనిజధాతువులు, లోహాలు కెనడా నుంచి దిగుమతి అవుతున్నాయి. ప్రతీకార సుంకాల పరిశీలన.. అమెరికా నుంచి దిగుమతి అయ్యే కొన్ని రకాల ఉత్పత్తులపై ప్రతీకార సుంకాలను విధించే అవకాశాలను కెనడా పరిశీలిస్తోందని సీనియర్ అధికారి ఒకరు గురువారం వెల్లడించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి కెనడా సిద్ధమవుతోందని, ప్రతీకారంగా ఏ వస్తువులపై సుంకాలు విధించాలనే విషయంపై చర్చిస్తోందని ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. అయితే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ట్రంప్ తన మొదటి పదవీకాలంలో అధిక సుంకాలు విధించినప్పుడు, ఇతర దేశాలు ప్రతీకార సుంకాలతో ప్రతిస్పందించాయి. గతంలోనూ 2018లో కెనడా నుంచి దిగుమతి అయిన స్టీల్, అల్యూమినియంపై అమెరికా అదనపు పన్నలు విధించింది. దీనికి ప్రతికా కెనడా సైతం అమెరికా నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై వేలకోట్ల పన్నులను ముక్కుపిండి వసూలుచేసింది. మెక్సికోతో ట్రంప్ చర్చలు మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్తో అద్భుతమైన చర్చ జరిగిందని ట్రంప్ బుధవారం చెప్పారు. ‘‘వలసదారులు అమెరికా దక్షిణ సరిహద్దు గుండా లోపలికి అక్రమంగా చొరబడకుండా ఇకపై మెక్సికో సమర్థవంతంగా అడ్డుకోనుంది. ఈ చర్యలు తక్షణం అమల్లోకి వస్తాయి. ఈ చర్యలు అమెరికా చేపడుతున్న అక్రమ ఆక్రమణ నిరోధక కార్యక్రమాలకు ఎంతగానో దోహదపడుతుంది. క్లాడియా షీన్‌బామ్‌కు ధన్యవాదాలు’’అని ట్రంప్ పోస్ట్‌చేశారు. ‘‘అమెరికాలోకి భారీగా మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు చేపట్టాల్సిన ఉమ్మడి చర్యలపై క్లాడియాతో చర్చించా’’అని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఈ భేటీ తర్వాత అమెరికా అధిక పన్నుల భారం నుంచి మెక్సికోకు ఉపశమనం లభిస్తుందో లేదో తెలియరాలేదు. ట్రంప్ అధ్యక్షుడయ్యాక తీసుకునే నిర్ణయాలపై ఇది ఆధారపడి ఉంటుంది. -
పన్నుకు పన్ను ట్రంప్ ప్రతిపాదనలపై మెక్సికో!
మెక్సికో: మెక్సికో నుంచి దిగుమతులపై 25 శాతం పన్ను విధిస్తామన్న అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికకు ఆ దేశం తీవ్రంగా స్పందించింది. అదే జరిగితే మెక్సికో కూడా సుంకాలతో బదులిస్తుందని మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్‌బామ్ హెచ్చరించారు. అమెరికా సరిహద్దుల వెంబడి మాదకద్రవ్యాలు, వలసదారుల ప్రవాహాన్ని ఆపకపోతే మెక్సికో వస్తువులపై 25% దిగుమతి సుంకాలు తప్పవని ట్రంప్ ప్రకటించడం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలను క్లాడియా తీవ్రంగా దుయ్యబట్టారు. అమెరికా నుంచి అక్రమంగా ప్రవాహంలా వచ్చిపడుతున్న ఆయుధాలతో మెక్సికో బాధపడుతోందన్నారు. ఇక మాదకద్రవ్యాలు అమెరికా సొంత సమస్యేనన్నారు. వలస సమస్యకు అడ్డుకట్ట వేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేసిందని చెప్పారు. సమస్యలపై చర్చలకు సిద్ధమన్నారు. వలసదారుల కారవాన్లు ఇకపై సరిహద్దుకు చేరవని స్పష్టం చేశారు. ఆయుధాలపై పెట్టే ఖర్చును వలస సమస్యను పరిష్కారానికి వెచ్చిస్తే మంచిదని అమెరికాకు హితవు పలికారు. యుద్ధానికి ఖర్చు చేసే మొత్తంలో కొంత శాంతి, అభివృద్ధిపై కేటాయిస్తే సమస్యను సులువుగా పరిష్కరించవచ్చన్నారు. అమెరికా, మెక్సికో పలు అంశాల్లో పరస్పరం ఆధారపడతాయి. భారీ పన్నులు ఇరు దేశాల్లో ద్రవ్యోల్బణానికి, నిరుద్యోగానికి కారణమవుతాయి. ఇరు దేశాల మధ్య అవగాహన, శాంతి సాధనకు చర్చలే మార్గం’’అన్నారు. అవి త్వరలోనే జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. -
అందం అర్థం మారుతోంది..!
‘మిస్ యూనివర్స్’ పోటీలు ఎప్పుడూ ఆసక్తికరమే. అయితే తాజాగా మెక్సికోలో జరిగిన ‘మిస్ యూనివర్స్–2024’కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ పోటీ నేపథ్యంలో కేవలం విజేత గురించి మాత్రమే కాదు ఈ పోటీలోపాల్గొన్న ఎంతోమంది గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు. అందానికి సంబం«ధించిన సంప్రదాయ కొలమానాలను సవాలు చేసి వేదిక మీద నిలిచిన వారి మొదలు గృహహింస, లైంగిక హింస బాధితులుగా చీకట్లో మగ్గి ఆ చీకటి నుంచి బయటికి వచ్చి ప్రపంచ వేదికపై వెలిగిపోయిన వారు ఉన్నారు.నలభైలలో...40 ఏళ్ల వయసులో మిస్ యూనివర్స్ పోటీలోపాల్గొన్న మహిళగా బియాట్రిస్ నజోయా తన ప్రత్యేకతను చాటుకుంది. ఎన్నో అడ్డంకులను అధిగమించిన ‘మిస్ యూనివర్స్ మాల్టా’ నజోయా ఎంతోమందికి స్ఫూర్తిని ఇస్తోంది. నజోయా ముగ్గురు పిల్లలకు తల్లి. సింగిల్ మదర్.‘శారీరకంగా, మానసికంగా ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నాను. హీనమైన పరిస్థితులను చూశాను. మనకు తప్ప మన సంతోషానికి తెర వేసే శక్తి ఎవరికీ లేదని నిరూపించాలనుకున్నాను. ఆత్మగౌరవంతో ముందుకు వెళ్లాను. మనం బయటికి ఎలా కనిపించినా లోపల అందంగా ఉంటాం. ఆ అందాన్ని చూడగలగాలి’ అంటుంది నజోయా. ‘నిజానికి ఆమె ఎప్పటికీ విజేత. కంటికి కనిపించని కిరీటం ఆమె తలపై కనిపిస్తుంది’ అంటారు నజోయా అభిమానులు. ఎత్తు ఎంతైనా... అంతెత్తున!ష్యానే మెకింతోష్ అందాల పోటీలో పోటీపడిన వారిలో ఎత్తు తక్కువగా ఉన్న కంటెస్టెంట్‌గా చరిత్ర సృష్టించింది. ఆమె ఎత్తు 5 అడుగుల 1 అంగుళం. ‘మిస్ యూనివర్స్ జిబ్రాల్టర్’ ఫైనల్లో మెకింతోష్ ఇచ్చిన సమాధానం న్యాయ నిర్ణేతల హృదయాలను గెలుచుకుంది. ‘నేను చిన్నగా కనిపించవచ్చు... కానీ ఆత్మవిశ్వాసంతో అంతెత్తున కనిపిస్తాను’ ‘మిస్ యూనివర్స్ జిబ్రాల్టర్ 2024’ అందాల కిరీటాన్ని గెల్చుకున్న విజేతగా అందరి దృష్టిని ఆకర్షించింది ష్యానే మెకింతోష్. 34 ఏళ్ల తరువాత ‘మిస్ యూనివర్స్’ పోటీలో జిబ్రాల్టర్కుప్రాతినిధ్యం వహించిన తొలి మహిళగా రికార్డ్ సృష్టించింది. హిజాబ్‌తో...‘మిస్ యూనివర్స్’ పోటీలోపాల్గొన్న తొలి హిజాబీ (ముస్లిం సంప్రదాయ వస్త్రం హిజాబ్‌తో) మహిళగా ఖదీజా ఒమర్ చరిత్ర సృష్టించింది. 23 సంవత్సరాల ఖదీజా సోమాలియ నుంచి ‘మిస్ యూనివర్స్’ పోటీలోపాల్గొన్న తొలి మహిళ.కెన్యాలోని శరణార్థి శిబిరంలో జన్మించింది. యార్క్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేట్ అయిన ఖదీజా కమ్యూనిటీ బిల్డింగ్, బ్రాండ్ డెవలప్మెంట్లోప్రావీణ్యం సాధించింది. బ్యూటీ ఇన్ఫ్లూయెన్సర్, మోడల్, ఫొటోగ్రాఫర్‌గా రాణిస్తోంది. స్ఫూర్తిదాయకమైన కథలను చెప్పడంలో నేర్పరి. ‘మిస్ వరల్డ్ 2021’ కిరీటాన్ని గెలుచుకున్న మొదటి హిజాబీగా చరిత్ర సృష్టించింది. బార్బీ బొమ్మకు అందాల కిరీటం!‘ఈసారి విశ్వసుందరి కిరీటాన్ని బార్బీ బొమ్మ గెలుచుకుంది’ అనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ‘బార్బీ బొమ్మకు అందాల కిరీటం ఏమిటీ?!’ అనే ఆశ్చర్యంలో ఉండగానే అసలు విషయం తెలిసిపోయింది. ‘మిస్ యూనివర్స్–2024’ అందాల కిరీటాన్ని గెలుచుకున్న 21 సంవత్సరాల విక్టోరియా కెజార్ ముద్దు పేరు... బార్బీ డాల్. కెజార్ అచ్చం ‘బార్బీ’లా ఉంటుందని ఆలా పిలుస్తారు. బ్యూటీ స్పాట్...ఈసారి విశ్వసుందరి పోటీ విజేత కంటే ఎక్కువమంది దృష్టిని ఆకర్షించింది ఈజిప్ట్‌కు చెందిన లోగినా సలాహ్. చర్మంపై తెల్లటి మచ్చలు (బొల్లి) వల్ల ఎనిమిది సంవత్సరాల వయసు నుంచే ఎన్నో రకాల అవమానాలు ఎదుర్కొంది. సలాహ్ మిస్ యూనివర్స్ పోటీలోకి అడుగుపెట్టడం అనేది ఊహకు కూడా అందని విషయం. సంప్రదాయ సౌందర్య ప్రమాణాలను బ్రేక్ చేసిన వ్యక్తిగా ఎందరికో స్ఫూర్తినిచ్చే చారిత్రక సందర్భం కూడా. బ్లాగర్, ఇన్ఫ్లూయెన్సర్, మోడల్, మేకప్–ఆర్టిస్ట్‌గా రాణిస్తున్న సలాహ్‌కు సోషల్ మీడియాలో లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నారు.‘స్కిన్పాజిటివిటీ’ని ప్రచార అంశంగా తన ప్రయాణాన్నిప్రారంభించి ఎంతోమంది యువతుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపింది సలాహ్. సలాహ్ సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమన్ మాత్రమే కాదు సానుకూల మార్పు, ఆత్మవిశ్వాసం... మొదలైన అంశాలలో వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి గొప్ప వక్తగా పేరు తెచ్చుకుంది. న్యూయార్క్‌లోని బెవర్లీ హిల్స్ ఇంటర్నేషనల్ బ్యూటీ స్కూల్ నుంచి లైసెన్స్ పొందిన సలాహ్ తన సోషల్ మీడియా ΄్లాట్ఫామ్లలో క్రియేటివ్ లుక్స్‌పై ట్యుటోరియల్స్‌ను నిర్వహించేది. 2023లో దుబాయ్ ఫ్యాషన్ వీక్లోపాల్గొనడం ద్వారా గ్లామర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.‘బియాండ్ ది సర్ఫేస్ మూమెంట్’ వేదిక ద్వారా బాలికలు, యువతులలో సామాజిక స్పృహ కలిగిస్తోంది. దుబాయ్‌లో నివసిస్తున్న 34 సంవత్సరాల సలాహ్ ఒక బిడ్డకు తల్లి. సింగిల్ మదర్.‘మిస్ యూనివర్స్ 2024’లో లోగినా సలాహ్ టాప్ 30లో చోటు సాధించింది. బంగారు పక్షి‘మిస్ యూనివర్స్’ కిరీటం మిస్ అయిపోయినా ‘గోల్డెన్ బర్డ్’ కాస్ట్యూమ్‌తో ఎంతోమంది హృదయాలను గెల్చుకుంది రియా సింఘా. ‘మిస్ యూనివర్స్’కు మన దేశం నుంచిప్రాతినిధ్యం వహించిన రియా సింఘా ధరించిన ‘ది గోల్టెన్ బర్డ్’ దుస్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ ఏడాదిప్రారంభంలో ‘మిస్ యూనివర్స్ ఇండియా’ కిరీటాన్ని గెల్చుకున్న సింఘా సింబాలిక్ దుస్తుల్లో రన్‌వేపై నడుస్తూ ప్రేక్షకులను మంత్రముగ్థుల్ని చేసింది. శ్రేయస్సు, సంపదకు బంగారు పక్షి చిహ్నం. ఈ డ్రెస్‌ను వియత్నాం డిజైనర్ గుయెన్ ఎన్లోక్ డిజైన్ చేశారు. -
వలసలకు ఇక బ్రేకే!
అగ్రరాజ్యాధిపతిగా డొనాల్డ్ ట్రంప్ మరోసారి పగ్గాలు చేపట్టబోతున్నారు. ఈసారి ఆయన ఎలాంటి విధానాలు అమలు చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అమెరికా అధ్యక్షుడు తీసుకొనే నిర్ణయాలు, చేపట్టే చర్యలు ప్రపంచమంతటా ప్రభావం చూపిస్తాయనడంలో సందేహం లేదు. ట్రంప్ రెండో దఫా పాలనపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. గత ఏడాది కాలంగా ట్రంప్ చేసిన ప్రసంగాలు, వచ్చిన ప్రకటనలను బట్టి కొన్ని కీలకమైన అంశాల్లో ఆయన వైఖరి ఎలా ఉండబోతోందో కొంతవరకు అంచనా వేయొచ్చు. అదేమిటో చూద్దాం.. వలసలపై కఠిన వైఖరే అమెరికాలోకి వలసల పట్ల ట్రంప్ మొదటి నుంచీ వ్యతిరేకమే. 2016లో ఆయన ‘గోడ కట్టండి’అని పిలుపునిచ్చారు. అమెరికా–మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మించారు. అమెరికా అక్రమంగా నివసిస్తున్న వారిని బయటకు తరిమేయడానికి నేషనల్ గార్డు, పోలీసు దళాలను బలోపేతంపై దృష్టి పెట్టారు. అక్రమంగా వలస వచ్చిన వారికి, చట్టవిరుద్ధంగా నివసిస్తున్నవారికి ఇకపై ట్రంప్ రూపంలో కష్టాలు తప్పకపోవచ్చు. అమెరికా గడ్డపై జన్మిస్తే అమెరికా పౌరసత్వం ఇచ్చే విధానాన్ని ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీన్ని మార్చాలంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరి. కొన్ని ఇస్లామిక్ దేశాల నుంచి వలసలకు ట్రంప్ వ్యతిరేకమే. మొత్తంమీద ఇకపైన చట్టబద్ధంగా కూడా ఎక్కువ మందిని అమెరికాలోకి అనుమతించకపోవచ్చు. విదేశీయులు అమెరికా కలను వాయిదా వేసుకోవాల్సి రావొచ్చు. గర్భస్రావాలపై మహిళలకు హక్కులు తొలి దఫాలో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మహిళల పునరుత్పత్తి హక్కులను ట్రంప్ వ్యతిరేంచారు. గర్భాన్ని తొలగించుకొనేందుకు మహిళలకు ఉన్న హక్కును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ తీర్పు తమ వల్లే సాధ్యమైందని ట్రంప్ చెప్పారు. కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ పునరుత్పత్తి హక్కుల కోసం మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్ వారికి మద్దతు పలికారు. అయితే, ఈసారి ట్రంప్ మహిళల గర్భస్రావ హక్కుల విషయంలో జోక్యం చేసుకోకపోవచ్చు. అంటే మహిళలకు స్వేచ్ఛనిచ్చే అవకాశం ఉంది. ట్రాన్స్జెండర్లకు రక్షణ లింగమారి్పడి చేయించుకున్నవారిపై ట్రంప్‌కు సానుభూతి ఉంది. లెస్పియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్, ఇంటర్‌సెక్స్ వర్గాలకు చట్టపరమైన రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. వారి పట్ల సమాజం దృక్పథం మారాలని ఎన్నోసార్లు చెప్పారు. ట్రంప్ పాలనలపై వృద్ధులు సైతం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వారికి సామాజిక భద్రత, వైద్య సంరక్షణ కల్పిస్తామంటూ ట్రంప్ హామీ ఇచ్చారు. -
స్టీల్ ప్లాంట్‌లో పేలుడు.. 12 మంది మృతి
మెక్సికో సిటీ: మెక్సికోలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి స్టీల్ ప్లాంట్‌లో జరిగిన పేలుడులో 12 మంది మృతి చెందగా, ఒకరు గాయపడ్డారు. స్థానిక అధికారులు ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలను మీడియాకు అందించారు.మెక్సికో నగరానికి తూర్పున 140 కిలోమీటర్ల దూరంలోని అక్లోజ్టోక్లో ఈ పేలుడు సంభవించినట్లు త్లాక్స్‌కాలా స్టేట్ సివిల్ ప్రొటెక్షన్ తెలిపింది. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. కార్మికుల నుండి వచ్చిన ప్రాథమిక సమాచారం ప్రకారం కరిగిన ఉక్కు.. నీటి పరిధిలోకి రావడంతో పేలుడు సంభవించి, మంటలు చెలరేగాయి. బాధిత కుటుంబాలను త్లాక్స్కలా గవర్నర్ లోరెనా క్యూల్లార్ పరామర్శించారు. ఈ ఉదంతం దర్యాప్తు పూర్తయ్యేంతవరకూ ప్లాంట్‌ను మూసివేయనున్నారని సమాచారం. ఇది కూడా చదవండి: కలలో ఏనుగు కనిపిస్తే..? ఏమవుతుంది? -
మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం.. 19 మంది మృతి
మెక్సికో సిటీ: మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 19 మంది మృతి చెందారు. మెక్సికోలోని సెంట్రల్ స్టేట్ జకాటెకాస్లోని హైవేపై ఒక బస్సు ప్రమాదానికి గురైందని స్థానిక అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో 19 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ప్రయాణికులతో వెళుతున్నఈ బస్సు మక్కా వెళుతున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీకొంది. వెంటనే బస్సు, ట్రాక్టర్ రెండూ కాలువలో పడిపోయాయి.జకాటెకాస్ గవర్నర్ డేవిడ్ మాన్రియల్ తొలుత ఈ ప్రమాదంలో 24 మంది మృతిచెందారని తెలిపారు. అయితే రాష్ట్ర అటార్నీ జనరల్ కార్యాలయం తరువాత ఒక ప్రకటనలో మృతుల సంఖ్యను సవరించింది. ఈ ఘటనలో 19 మంది మరణించారని, ఆరుగురు గాయపడ్డారని స్పష్టం చేసింది.స్థానిక ప్రభుత్వ అధికారి ఒకరు మాట్లాడుతూ ప్రమాదం దరిమిలా కాలువలో నుంచి మృతదేహాలను వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. అటార్నీ జనరల్ కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం ప్రమాదానికి గురైన బస్సు యూఎస్-మెక్సికో సరిహద్దులోని చివావా రాష్ట్రంలోని క్యూడాడ్ జువార్జ్ అనే నగరానికి వెళుతోంది. ఇది కూడా చదవండి: ఈసారి 33 విమానాలకు బెదిరింపులు -
ప్రపంచ విప్లవ జ్వాల
ప్రజల కోసం సర్వస్వం త్యజించిన విప్లవ నేత చే గువేరా! ఆయన అసలు పేరు ఎర్నెస్టో గెవారా! ఆయన పెట్టుబడిదారీ వ్యవస్థతో పాటు సామ్యవాదంలోని సంప్రదాయ వాదాన్ని కూడా వ్యతిరేకించాడు. అర్జెంటీనాలోని రొసారియా అనే పట్టణంలో 1928 జూన్ 14న ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు. 1953లో బ్యూనస్ ఎయిర్స్ విశ్వవిద్యాలయం నుండి వైద్య విద్యలో పట్టా పొందాడు. ఆ తదుపరి మోటారు సైకిల్‌పై దక్షిణ అమెరికా ఖండమంతటా పర్యటిస్తున్న సమయంలో ప్రజల జీవన స్థితిగతుల గురించి తెలుసుకున్నాడు. విప్లవమొక్కటే సామాజిక అసమానతలను తొలగించగలదని భావించాడు. 1954లో గౌటెమాలలో ప్రజాబాహుళ్యపు అభ్యున్నతికి కృషి చేస్తున్న సామ్యవాద అనుకూల ప్రభుత్వంతో కలిసి పనిచేశాడు. కానీ అదే సంవత్సరం అమెరికా సాయంతో జరిగిన కుట్ర మూలంగా ఆ ప్రభుత్వం కూలి పోయింది. అక్కడి నుంచి మెక్సికో వెళ్ళిపోయాడు. ఈ ఘటనతో అతని విప్లవ దృక్పథం మరింత బలపడింది. మెక్సికోలో ఫిడెల్ క్యాస్ట్రో నాయకత్వంలో అక్కడికి ప్రవాసం వచ్చిన క్యూబా విప్లవకారులతో చేతులు కలిపాడు. 1950వ దశకం చివరలో అప్పటి క్యూబా నియంత బాటిస్టాకు వ్యతిరేకంగా కాస్ట్రో ఆధ్వర్యంలో జరిగిన గెరిల్లా పోరాటం (1956–1959)లో చే గువేరా ముఖ్య పాత్ర పోషించాడు. డాక్టర్‌గా, మిలిటరీ కమాండర్‌గా అంకిత భావంతో సేవలందించాడు. పోరాటం విజయవంతమైన తరువాత, కాస్ట్రో 1959 జనవరిలో క్యూబా ప్రభు త్వాధికారాన్ని చేపట్టాడు. ఆ ప్రభుత్వంలో చే పరిశ్రమల మంత్రిగా, క్యూబా జాతీయ బ్యాంకు అధ్యక్షునిగా పనిచేశాడు. క్యూబా ప్రతినిధిగా అనేక దేశాలు పర్యటించాడు. ఈ పర్యటనలలో భాగంగానే 1959 జూలై నెలలో భారతదేశంలో కూడా పర్యటించాడు. తన రచనలలో వర్ధమాన దేశాలలో రైతాంగ విప్లవోద్యమాలు నిర్మింపబడాలని కోరుకున్నాడు! పేద దేశాలలో విప్లవాన్ని వ్యాప్తిచేయ తలపెట్టి ఆయన 1965లో క్యూబాలో తన అత్యున్నత స్థానాన్ని, పలుకుబడిని వదలి పెట్టి కాస్ట్రో వారిస్తున్నా వినకుండా దేశం నుండి అదృశ్యమయ్యాడు. కొద్దిమంది అనుచరులతో రహస్యంగా ఆఫ్రికా దేశమైన కాంగోలో కొంతకాలం గడిపాడు. ఆ సమయంలో ఆ దేశం తూర్పు ప్రాంతంలో గెరిల్లా తిరుగుబాటుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. 1966 చివరిలో మళ్ళీ దక్షిణ అమెరికాకు వచ్చాడు! బొలీవియా దేశంలో మిలిటరీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడు తున్న విప్లవకారులకు నాయకత్వం వహించాడు! ఈ సమయంలోనే బొలీవియన్ సైన్యానికి చిక్కాడు! 1967 అక్టోబర్ 9న వల్లెగ్రాండె అనే ప్రాంతంలో ఆ సైన్యం ఆయన్ని చంపివేసింది. అలా ఓ ప్రపంచ విప్లవ జ్వాల ఆరిపోయింది!– ఎమ్డీ మునీర్, సీనియర్ జర్నలిస్ట్(నేడు చే గువేరా వర్ధంతి) -
దక్షిణాఫ్రికా పొమ్మంది.. నైజీరియా పట్టం కట్టింది
లాగోస్: దక్షిణాఫ్రికాలో విదేశీయురాలని తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్న చిడిమా అడెత్సీనా మిస్ యూనివర్స్ నైజీరియాగా ఎన్నికైంది. నవంబరులో మెక్సికోలో జరిగే మిస్ యూనివర్స్ అందాల పోటీల్లో నైజీరియాకు ప్రాతినిధ్యం వహించనుంది. జాతీయతకు సంబంధించి ఆన్లైన్లో తీవ్రదాడి జరగడంతో అడెత్సీనా కిందటి నెల మిస్ సౌతాఫ్రికా పోటీ నుంచి వైదొలిగింది. నైజిరియాలో పోటీపడాల్సిందిగా వచి్చన ఆహ్వానాన్ని మన్నించింది. నైజీరియా తండ్రి, మొజాంబిక్ మూలాలున్న దక్షిణాఫ్రికా తల్లికి జని్మంచిందనే కారణంతో మిస్ సౌతాఫ్రికా పోటీల్లో పాల్గొనడానికి అడెత్సీనాకు అర్హత లేదనే వాదన మొదలైంది. ఆమె జాతీయతను దక్షిణాఫ్రికన్లు పశి్నంచారు. దాంతో అంతర్జాతీయ వేదికపై తండ్రి పుట్టినగడ్డకు ప్రాతినిధ్యం వహించే అవకాశంగా నైజీరియా అడెత్సీనాకు తమ ఆహ్వానాన్ని అభివరి్ణంచింది. చివరకు అదే నిజమైంది. ‘నా కల నిజమైంది. ఇదో అందాల కిరీటం కాదు. ఆఫ్రికా ఐక్యతకు పిలుపు’ అని అడెత్సీనా ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించింది. -
డౌన్ సిండ్రోమ్‌తో లాయర్‌గా చరిత్ర సృష్టించింది! ఎవరీమె..?
అన్ని సక్రమంగా ఉన్నా.. అనుకున్న లక్ష్యాన్ని సాధించలేక తిప్పలు పడుతుంటారు. అందుకు ఏవేవో సాకులు కూడా చెబుతుంటారు. కానొ కొందరూ భయానక సవాళ్లును దాటుకుంటూ అసాధ్యం అనే దాన్ని కూడా సాధించి చూపిస్తారు. అలాంటి కోవకు చెందిదే అనా విక్టోరియా. మెక్సికోలోని జకాటెకాస్‌కు చెందిన అనా విక్టోరియా ఎస్పినో డి శాంటియోగా డౌన్ సిండ్రోమ్‌తో న్యాయ పట్టా పొందిన తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టించింది. 25 ఏళ్ల అనా జూలై 2024లో యూనివర్సిడాడ్ అటోనోమా డి జకాటెకస్ నుంచి పట్టభద్రురాలైంది. ఆమె విద్యాభ్యాసంలో అనేక సవాళ్ల ఎదుర్కొన్నప్పటికీ..ఒక ప్రొఫెసర్ సాయంతో తన కలను సాకారం చేస్తుకుంది. ఆయన మార్గనిర్దేశంలో డౌన్ సిండ్రోమ్‌తో న్యాయ విద్యలో డిగ్రీని సాధించిన అరుదైన వ్యక్తిగా నిలిచింది. జనవరి 30, 1999న జన్మించిన అనా ఓచోవా, ఎస్పినో జపాటాల కుమార్తె. ఆమె తన విద్యను ఆన్లైన్లోనే పూర్తి చేసింది. తరువాత న్యాయశాస్త్రం అభ్యసించేందుకు యూనివర్సిడాడ్ ఆటోనోమా డి జకాటెకాస్లో చేరింది. అయితే అక్కడ నిర్థిష్ట అవసరాలున్న తనలాంటి వ్యక్తులకు పాఠాలు భోధించే విధానం లేక చాలా ఇబ్బందులు పడింది. అయినప్పటికీ ఆమె దృఢ సంకల్పమే సాయం చేసే మంచి ప్రొఫెసర్ చెంతకు చేరేలా చేసింది. ఆయన అండదండలతో న్యాయపరమైన అధ్యయనంలో ఎదురయ్యే సవాళ్లన్నింటిని అధిగమించగలిగింది. అనా న్యాయవాదిగా అవ్వడానికి ముందు తనలాంటి వికలాంగుల హక్కుల కోసం వాదించే శాసనఫోరమ్లలో పనిచేసేది. ఇది తనకు న్యాయరంగ పట్ల అవగాహనను ఇవ్వడమే గాక భవిష్యత్తు అవకాశాలకు మార్గం సుగమం చేసింది. అలాగే అనా లాయర్‌గా వివక్షకు వ్యతిరేకంగా పోరాడాలని, సమానత్వం కోసం వాదించాలని చూస్తోంది. ఇంతటి స్థితిలో కూడా అంకితభావంతో అనితరసాధ్యమైన తన కలను సాకారం చేసుకుని అందిరిచేత ప్రశంసలందుకోవడమే గాక విదేశాల నుంచి ఉద్యోగా ఆఫర్లు కూడా వచ్చాయి. ఇక అనాకి పెయింటింగ్ కళలో కూడా మంచి ప్రావిణ్యం ఉంది. 2014 నుంచి అనే పెయింటింగ్ ఎగ్జిబిషన్లను నిర్వహించింది. తన పెయింటింగ్‌లను 'డెస్టే మి సీ'లో పేరుతో ప్రదర్శించింది.(చదవండి: హోటల్ వ్యాపారం నుంచి ఏకంగా దేశ ప్రధాని స్థాయికి..!) -
ఈ టూ డెడ్లీ మమ్మీల మ్యూజియం గురించి ఎప్పుడైనా విన్నారా! ఇదొక..?
ఇది మమ్మీల మ్యూజియం. మెక్సికోలోని గ్వానాజ్వాటో పట్టణంలో ఉంది. పలు దేశాల్లో 1870 నుంచి 1958 కాలంలో జరిపిన తవ్వకాల్లో బయటపడ్డ మమ్మీలను సేకరించి, జాగ్రత్తగా తీసుకొచ్చి ఈ మ్యూజియంలో భద్రపరచారు. ప్రపంచంలోని భీతిగొలిపే మ్యూజియంలలో ఒకటిగా ఈ మమ్మీల మ్యూజియం పేరుమోసింది. ‘ఎల మ్యూజో డి లాస్ మోమియాస్’ పేరుతో ఈ మమ్మీల మ్యూజియంను 1969లో ఇక్కడ నెలకొల్పారు.ఈ మ్యూజియం సేకరణలో మొత్తం 111 మమ్మీలు ఉన్నాయి. వాటిలో కొన్ని మరీ శిథిలంగా మారడంతో, ప్రస్తుతం వాటిలోని 59 మమ్మీలను మాత్రమే సందర్శకులకు ప్రదర్శిస్తున్నారు. గ్వానాజాటో మునిసిపాలిటీకి, మెక్సికో జాతీయ చరిత్ర పురాతత్త్వ పరిశోధన సంస్థకు మధ్య మమ్మీల నిర్వహణపై వివాదం నడుస్తుండటంతో ఇవి కొంత నిర్లక్ష్యానికి లోనయ్యాయి. స్థానిక సంస్థ నిర్లక్ష్యం వల్లనే మమ్మీలపై ఫంగస్ పెరిగి, అవి పాడైపోతున్నాయనేది జాతీయ చరిత్ర పురాతత్త్వ పరిశోధన సంస్థ ఆరోపణ. -
Mexico: కూలిన పిరమిడ్.. వినాశానికి సంకేతమా?
మెక్సికోలో తుఫాను కారణంగా అత్యంత పురాతన తెగకు చెందిన ఒక పిరమిడ్ కూలిపోయింది. ఈ నేపధ్యంలో ఇది పెనువిపత్తుకు, వినాశనానికి నాంది అంటూ పలు వదంతులు వ్యాపిస్తున్నాయి. ఆ పురాతన తెగకు చెందిన వారసులు పిరమిడ్లు కూలడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కూలిన పిరమిడ్లకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పిరమిడ్ పాక్షికంగా కూలిపోయి ఉండటం, దానిలో కొంత భాగం కొట్టుకుపోయినట్లు ఉండటాన్ని ఈ ఫొటోలలో చూడవచ్చు. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం, పురాతన పురేపెచా తెగ వారు తమ దేవతకు మానవ బలులు అర్పించడానికి యకాటా పిరమిడ్‌ను ఉపయోగించేవారని తెలుస్తోంది. యకాటా పిరమిడ్లు మిచోకాన్ రాష్ట్రంలోని ఇహుట్జోలో ఉన్నాయి.ఇప్పడు వచ్చిన తుఫాను పెను విధ్వంసాన్ని సూచిస్తుందని స్థానికుడు తరియాక్విరి అల్వారెజ్ మీడియా ముందు పేర్కొన్నారు. ఇది మా పూర్వీకులకు సంబంధించిన చేదువార్త. ఇది విపత్కర సంఘటనను సూచిస్తోందని ఆయన అన్నారు. 1519లో స్పానిష్ దండయాత్రకు ముందు పురేపెచా తెగలు అజ్టెక్లను ఓడించి 400 సంవత్సరాలు పాలించాయి.మెక్సికన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆంత్రోపాలజీ అండ్ హిస్టరీ (ఐఎన్ఏహెచ్) ఒక ప్రకటనలో.. ఇహుట్జోలో ఒక పిరమిడ్ కూలిపోయింది. భారీ వర్షాల కారణంగా ఇది జరిగింది. ఈ ప్రాంతంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా పలుప్రాంతాల్లో భూమిలో పగుళ్లు ఏర్పడ్డాయని పేర్కొంది. పిరమిడ్ బయటి గోడ, లోపలి భాగం దెబ్బతిన్నట్లు సర్వేలో వెల్లడైంది. దీనికి మరమ్మతు చేయడంపై అధికారులు దృష్టి సారించారని తెలిపింది. -
USA: ఇరవై ఏళ్ల తర్వాత చిక్కిన మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్
న్యూయార్క్: అమెరికా మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్, 20 ఏళ్ల నుంచి పరారీలో ఉన్న కరుడుగట్టిన నేరస్తుడు ఒకరిని ఫేస్బుక్ పట్టిచ్చింది. 2004లో ఎల్డియాబ్లో రియానో అనే క్రిమినల్ ఒహియోలోని బార్లో ఓ వ్యక్తిపై కాల్పులు జరిపి పారిపోయాడు. అప్పటి నుంచి రియానో పోలీసుల మోస్ట్‌వాంటెడ్ జాబితాలో ఉన్నాడు.తాజాగా ఫేస్బుక్ చూస్తున్న అమెరికా పోలీసులకు మెక్సికోలో విధులు నిర్వహిస్తున్న ఓ పోలీసు అధికారి రియానో పోలికలకు దగ్గరగా ఉండటాన్ని గమనించారు. ఇంకేముంది వెళ్లి చూస్తే ఆ పోలీసు అధికారి రియానో అని తేలింది. దీంతో వెంటనే అతడిని అరెస్టు చేసి అమెరికాకు తీసుకువచ్చారు. ప్రస్తుతం అతడిని సిన్సినాటిలోని బట్లర్ కౌంటీ జైలులో ఉంచారు. -
మెక్సికో డ్రగ్ లార్డ్ అరెస్ట్
వాషింగ్టన్: మెక్సికోలో మాదకద్రవ్యాల వ్యాపారంతో వేలకోట్ల రూపాయల నేరసామ్రాజ్యాన్ని విస్తరించిన డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడా గార్షియా ఎట్టకేలకు అమెరికా పోలీసులకు చిక్కాడు. 76 ఏళ్ల జంబాడా వాస్తవానికి విమానంలో వేరే ప్రాంతానికి వెళ్లాల్సి ఉండగా అతనికి తెలీకుండా చాకచక్యంగా ప్రైవేట్ విమానాన్ని అమెరికాలో ల్యాండ్ చేశారు. గురువారం టెక్సాస్ రాష్ట్రంలోని ఎల్ పాసో సిటీ శివారులోని చిన్న ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయిన అదే విమానంలో ఉన్న డ్రగ్ లార్డ్ ఎల్‌చాపో కుమారుడు జోక్విన్ ‘ఎల్ చాపో’ గుజ్మాన్(38)నూ పోలీసులు అరెస్ట్‌చేసి గుర్తుతెలియని ప్రాంతానికి తీసుకెళ్లి విచారిస్తున్నారు. దశాబ్దాలుగా జంబాడా అరెస్ట్‌కోసం అమెరికా ప్రయతి్నస్తోంది. అతని జాడ చెప్తే రూ.125 కోట్ల నజరానా ఇస్తామని గతంలో ప్రకటించింది. ‘అమెరికాలోకి వందల కోట్ల డాలర్ల విలువైన ఫెంటానిల్, మెథాంఫెటమైన్ డ్రగ్స్‌ను సరఫరా చేస్తూ అమెరికా యువతను మాదకద్రవ్యాల మత్తులో ముంచేసిన నేరానికి వీరికి కఠిన శిక్ష పడనుంది’ అని ఎఫ్‌బీఐ డైరెక్టర్ క్రిస్టఫర్ అన్నారు. రియల్ఎస్టేట్ వ్యాపార నిమిత్తం వెళ్తున్నామని అబద్దం చెప్పి జంబాడాను జోక్విన్ గుజ్మానే విమానం ఎక్కించాడని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అత్యంత హింసాత్మక, శక్తివంత ‘ సినోలా కార్టెల్’ మాదకద్రవ్యాల అక్రమ తయారీ, ఎగుమతికి ప్రపంచ కేంద్రస్థానంగా నిలిచే మెక్సికోలో అత్యంత హింసాత్మక, శక్తివంతమైన డ్రగ్స్ ముఠాల్లో సినోలా కార్టెల్ కూడా ఒకటి. దీనిని ఎల్ చాపో గుజ్మాన్, జంబాడా, మరొకరు సంయుక్తంగా స్థాపించి డ్రగ్స్‌ను విచ్చలవిడిగా అమ్మడం మొదలెట్టారు. వందల కోట్ల డ్రగ్స్ సామ్రాజ్యానికి అధిపతిగా కొనసాగిన జాక్విన్ అర్చివాల్డో గుజ్మాన్ లోయెరా (ఎల్‌చాపో)ను 2019లో మెక్సికో ప్రభుత్వం అరెస్ట్‌చేసి అమెరికాకు అప్పగించడంతో అక్కడే జీవితకాలకారాగార శిక్ష అనుభవిస్తున్నారు. దీంతో ఎల్ చాపో కుమారులు రంగంలోకి దిగి అక్రమ వ్యాపారాన్ని మరింత విస్తరించారు. అమెరికా సహా విదేశాలకు సరకు అక్రమ రవాణా మొత్తం జంబాడా కనుసన్నల్లో జరుగుతోంది. ప్రత్యర్థి డ్రగ్స్ ముఠా సభ్యులు చిక్కితే వారి తల నరకడం, చర్మం ఒలిచేయడం, శరీరాన్ని ముక్కలుగా నరకడం వంటి హేయమైన నేరాలకు పాల్పడటం అక్కడి ముఠాలకు మామూలు విషయం. -
మోస్ట్ వాంటెడ్ డ్రగ్ లార్డ్ ‘ఎల్ మయో’ అరెస్ట్
ఆస్టిన్: అమెరికా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, మెక్సికో డ్రగ్ లార్డ్ ఇజ్మాయెల్ ‘ఎల్ మయో’ జాంబాదా(76) ఎట్టకేలకు అరెస్ట్ అయ్యాడు. టెక్సాస్ ఎల్‌పాసోలో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు అమెరికా న్యాయ విభాగం అధికారికంగా ప్రకటించింది. ఎల్ మయోతో పాటు మరో డ్రగ్ కింగ్‌పిన్ అయిన ఎల్ చాపో కొడుకు లిటిల్ చాపోస్ను సైతం అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.ప్రైవేట్ విమానంలో దిగిన వెంటనే ఈ ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఎల్ మయోతో పాటు వాకిన్ ‘‘ఎల్ చాపో’’ గుజ్మన్ కొడుకు, సినాలోవా కార్టెల్ డ్రగ్స్ మాఫియాకే చెందిన మరో ఇద్దరిని సైతం అదుపులోకి తీసుకున్నారు. ఎల్ చాపోతో కలిసి మెక్సికో కులియాకాన్ సిటీలో డ్రగ్స్ సామ్రాజ్యం సినాలోవా కార్టెల్ స్థాపించాడు జాంబాదా. ఇది తర్వాతి కాలంలో ప్రపంచంలోనే అతిపెద్ద నేరసామ్రాజ్యంగా మారింది. అత్యంత ప్రమాదకరమైన ‘ఫెంటానిల్’ డ్రగ్స్ తయారీ, ఇతర దేశాలకు అక్రమ రవాణా, మరణాలకు కారణమయ్యాడనే తీవ్ర ఆరోపణలు జాంబాదాపై ఉన్నాయి.మరోవైపు.. అమెరికాలో 18-45 మధ్య వయస్కులు వందల సంఖ్యలో ‘ఫెంటానిల్’ బారినపడి మరణించారు. అమెరికా లక్ష్యంగా జాంబాదా డ్రగ్స్ రాకెట్ నడిపించాడని, తమ దేశ పౌరుల మరణాలకు కారణమయ్యాడని ఆ దేశ ఫెడరల్ ప్రాసిక్యూటర్స్ ఈ ఏడాది ఫిబ్రవరిలో నేరాభియోగాలు చేశారు. ఇప్పటికే ఎల్ చాపో(67) కొలరాడో జైల్లో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతని నలుగురు వారసులు లిటిల్ చాపోస్(నలుగురికీ ఒకే పేరు) ఆ డ్రగ్స్ దందాను కొనసాగిస్తున్నారు. ఎల్ మయో, ఎల్ చాపో కొడుకు అరెస్ట్ కావడంతో అల్లర్లు జరగవచ్చని అమెరికా అప్రమత్తం చేయడంతో.. కులియాకాన్ అధికార యంత్రాంగం భద్రతను కట్టుదిట్టం చేసింది. -
మెక్సికోలో అగ్ని ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం
మెక్సికోలోని ఓ మద్యం ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. జాలిస్కోలో ఈ ఘటన చోటుచేసుకుంది. ముందుగా పేలుడు సంభవించి, తరువాత ఫ్యాక్టరీ అంతటా మంటలు చెలరేగాయి. రెస్క్యూ సిబ్బంది మంటలను ఆర్పేందుకు, బాధితులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.ఈ ఘటనలో గాయపడిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాష్ట్ర పౌర రక్షణ సంస్థ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో ప్రమాద వివరాలను తెలియజేసింది. గాయపడినవారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులు, క్షతగాత్రులంతా ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారని ఏజెన్సీ తెలిపింది. ముందుజాగ్రత్తగా ఫ్యాక్టరీ చుట్టుపక్కల ప్రాంతాన్ని అధికారులు ఖాళీ చేయించారు. పేలుడుకు గల కారణాలను తెలుసుకునే ప్రయత్నంలో నిపుణులు ఉన్నారని రాష్ట్ర పౌర రక్షణ శాఖ డైరెక్టర్ విక్టర్ హ్యూగో రోల్డాన్ తెలిపారు. -
జైలులో క్రికెట్.. ఐసీసీ అవార్డు
క్రికెట్ వ్యాప్తికి చొరవ చూపడంతో పాటు గతేడాది (2023) అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఐసీసీ అసోసియేట్ సభ్య దేశాలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ "డెవలెప్మెంట్ అవార్డులతో" సత్కరించింది. ఈ అవార్డులను వివిధ విభాగాల్లో మెక్సికో, ఒమన్, నెదర్లాండ్స్, యూఏఈ, నేపాల్, స్కాట్లాండ్ దేశాలు గెలుచుకున్నాయి. ఈ అవార్డుల కోసం మొత్తం 21 జట్లు షార్ట్ లిస్ట్ కాగా.. ఐసీసీ ప్యానెల్ పైన పేర్కొన్న జట్లను ఎంపిక చేసింది.వంద శాతం మహిళల క్రికెట్‌ను ప్రోత్సహించినందుకు గాను ఒమన్..పురుషుల క్రికెట్లో గతేడాది అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడంతో పాటు వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించినందుకు గాను నెదర్లాండ్స్..మహిళల క్రికెట్లో గతేడాది అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినందుకు గాను యూఏఈ..డిజిటల్ మీడియాలో అభిమానులను ఎంగేజ్ చేయడంలో సఫలీకృతమైనందుకు గాను నేపాల్..క్రికెట్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టినందుకు గాను స్కాట్లాండ్..జైలులో ఖైదీల మధ్య క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించినందుకు గాను మెక్సికో దేశాలు ఐసీసీ డెవలప్మెంట్ అవార్డులకు ఎంపికయ్యాయి. -
మెక్సికో నగరాల్లో మొసళ్ల సంచారం
మెక్సికో సిటీ: మెక్సికో దేశంలోని తీర ప్రాంత నగరాల్లో ఇటీవల మొసళ్ల సంచారం ఒక్కసారిగా పెరిగింది. సముద్ర తీరాల వెంబడి తక్కువ లోతు నీళ్లలో ఉండే మొసళ్లు ఇటీవలి వరుస తుపాన్లు, వరదలతో జనారణ్యంలోకి వచి్చపడుతున్నాయి. టాంపికో, సియుడాడ్ మడెరో, అల్టమిరా నగరాల్లో తిరుగుతూ ప్రజలను భయకంపితుల్ని చేసిన కనీసం 200 మొసళ్లను పట్టుకుని, వాటి ఆవాసాలకు తీసుకెళ్లి వదిలేసినట్లు అధికారులు తెలిపారు. నీటి కొరత ఏర్పడినా, వరదలు వచి్చనా అవి ఇలా జనం మధ్యకు వచ్చేస్తుంటాయని, ఇదో సమస్యగా మారిందని అధికారులు అంటున్నారు. మెక్సికోలో మొసళ్లు రక్షిత జీవులు. అందుకే ప్రజలు చంపడానికి బదులుగా బంధించి అధికారులకు సమాచారమిస్తుంటారు. -
కీకారణ్యంలో.. మాయన్ నగర శిథిలాలు! అక్కడేం జరిగిందంటే?
దట్టమైన కీకారణ్యంలో పురాతన నగరం బయటపడింది. మెక్సికోలోని బాలంకు అభయారణ్యంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంత్రపాలజీ అండ్ హిస్టరీ శాస్త్రవేత్తలు అన్వేషణ జరుపుతుండగా, ఈ పురాతన మాయన్ నాగరికతకు చెందిన నగర శిథిలాలు బయటపడ్డాయి.ఇక్కడ ‘ఓకోమ్టున్’ అనే పురాతన శిలా స్థూపాలు, భారీ రాతి భవంతులు కనిపించాయి. చుట్టూ దట్టంగా భారీ వృక్షాలతో కూడిన అడవి ఉండటంతో ఈ నగరం ఇన్నాళ్లూ ఎవరికీ కనిపించలేదు. ఇది క్రీస్తుశకం 250–800 సంవత్సరాల మధ్య కాలానికి చెందినదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఈ నగరం 123 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇక్కడ 50 అడుగుల ఎత్తున పిరమిడ్ నిర్మాణాలు, నివాస భవనాలు, బహిరంగ వేదికలు వంటివి ఉన్నాయి. ఈ వేదికలను మతపరమైన వేడుకల కోసం నిర్మించి ఉంటారని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.ఇవి చదవండి: వానల్లో వార్మ్‌గా, బ్రైట్‌గా.. ఉండాలంటే ఇలా చేయండి.. -
బర్డ్‌ఫ్లూ వేరియంట్‌తో తొలిమరణం.. డబ్ల్యూహెచ్ఓ యూటర్న్
బర్డ్‌ఫ్లూ హెచ్5ఎన్2 వేరియంట్‌తో ఓ వ్యక్తి మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది. అంతలోనే యూటర్న్ తీసుకుంది. మరణించిన సదరు వ్యక్తిలో ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయని, పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించి, త్వరలో స్పష్టత ఇస్తామని వెల్లడించింది.ఇటీవల హెచ్5ఎన్2 బర్డ్‌ఫ్లూ వేరియంట్‌తో మెక్సికోకు చెందిన ఓ వ్యక్తి మరణించారని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది. ఈ వైరస్ వల్ల ప్రపంచంలో నమోదైన తొలి మరణం ఇదే అని తెలిపింది.అయితే, మెక్సికో ఆరోగ్య మంత్రిత్వ శాఖ 59 ఏళ్ల వ్యక్తికి దీర్ఘకాలిక కిడ్నీ సమస్య, టైప్ 2 డయాబెటిస్, దీర్ఘకాలిక రక్తపోటు సమస్య ఉందని అధికారిక ప్రకటన చేసింది.బాధితుడిలో ఇతర అనారోగ్య సమస్యలు ఏప్రిల్ 17న జ్వరం, శ్వాస ఆడకపోవడం, విరేచనాలు, వికారం, సాధారణ అస్వస్థత వంటి తీవ్రమైన లక్షణాలు కనిపించడానికి మూడు వారాల ముందు అనారోగ్యానికి గురయ్యాడు. అత్యవసర చికిత్స కోసం బాధితుడిని ఏప్రిల్ 24న మెక్సికోలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత రోజు మరణించాడు.బర్డ్ ఫ్లూ మరణం కాదుఈ తరుణంలో శుక్రవారం జెనీవాలో జరిగిన మీడియా సమావేశంలో డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధి క్రిస్టియన్ లిండ్‌మీర్ మాట్లాడుతూ..ఈ మరణం పలు రకాల అనారోగ్య సమస్యల వల్ల మరణించారని, హెచ్5ఎన్2కి సంబంధించిన మరణం కాదని చెప్పారు. బర్డ్‌ఫ్లూ గుర్తించాం.. అంతేవైద్యం నిమిత్తం ఆస్పత్రికి వచ్చిన వైద్యులు బర్డ్ ఫ్లూ, ఇతర వైరస్ల కోసం పరీక్షలు చేయగా.. బాధితుడిలో హెచ్5 ఎన్2 వేరియంట్ గుర్తించామని లిండ్‌మీర్ చెప్పారు. అతనితో పరిచయం ఉన్న 17 మందికి టెస్ట్‌లు చేయగా నెగిటివ్‌గా తేలిందిత్వరలోనే స్పష్టత ఇస్తాంపరిశోధనలు కొనసాగుతున్నాయి. సెరోలజీ కొనసాగుతోంది. అంటే ముందుగా ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని చూడటానికి రక్త పరీక్ష అని లిండ్‌మీర్ చెప్పారు. అతనిలో ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయని, వాటిపై విచారణ జరుపుతున్నామని, పూర్తి స్థాయిలో నిర్ధారించిన వెంటనే.. మరణంపై స్పష్టత ఇస్తామని డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధి లిండ్‌మీర్ పేర్కొన్నారు. -
మెక్సికో పీఠంపై మహిళ!
అపారమైన వనరులున్నా ఏనాడూ కంటి నిండా కునుకు లేని మెక్సికో ప్రజానీకం అధ్యక్ష ఎన్నికల్లో వరసగా రెండోసారి సైతం వామపక్ష మొరెనా పార్టీకి పట్టంగట్టారు. ఆరుపదుల వయసుగల యూదు మహిళ క్లాడియా షీన్బామ్ను అధ్యక్ష పీఠానికి ఎన్నుకున్నారు. రెండు శతాబ్దాల రిపబ్లిక్ చరిత్రలో మహిళ దేశాధినేత కావటం ఇదే ప్రథమం. జనాభాలో యూదులు అత్యల్ప సంఖ్యాకులు కావటం గమనించదగ్గది. వచ్చే అక్టోబర్‌లో ఆమె పదవీబాధ్యతలు చేపడతారు. ఆకలి,నిరుద్యోగం, డ్రగ్స్ విజృంభణ, వ్యక్తుల అదృశ్యం... ఒకటి కాదు, మెక్సికోను సవాలక్ష సమస్యలు పీడిస్తున్నాయి. అంతటా నిరాశా నిస్పృహలు అలుముకున్న తరుణంలో అంతవరకూవున్న రెండు పార్టీల వ్యవస్థను బద్దలుకొడుతూ మొరెనా పార్టీ రంగంలోకొచ్చింది. 2018లో ఆరేళ్లకాలానికి అధ్యక్షుడైన ఆండ్రస్ మ్యాన్యువల్ లొపెజ్ అబ్రడార్ (ఆమ్లో) ఆశించిన స్థాయిలో పాలించకపోయినా శాంతిభద్రతలను కాస్త అదుపు చేయగలిగారు. అదే సమయంలో సంక్షేమపథకాలు అందించటం, మౌలిక సదుపాయాలు పెంచటం మొరెనా పార్టీని రెండోసారి అందలం ఎక్కించింది. అలాగని అంతా సవ్యంగా ఉందని కాదు. ఏడాదికి సగటున 30,000 హత్యలు జరగటం, అందులో 90 శాతం మిస్టరీగా మిగిలిపోవటం మెక్సికో ప్రత్యేకత. ఈ హత్యల్లో డ్రగ్స్ మాఫియాల వాటాతోపాటు, వాటిని అదుపు చేసే సాకుతో పారా మిలిటరీ దళాలు సాగించే నరమేధమూ ఉంటుంది. మారుమూల పల్లెల్లో ఏదో ఒకచోట హఠాత్తుగా ఖననం చేసిన శవాల గుట్టలు లేదా మాదకద్రవ్యాల డంప్‌లు బయటపడతాయి. అమెరికాకు చాటుగా వలసదారుల తరలింపు మరో పెద్ద వ్యాపారం. మూడునెలలక్రితం అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కొండ ప్రాంత ఆవాసాలపై మాదకద్రవ్య ముఠాలు డ్రోన్లతో బాంబుల వర్షం కురిపించి వందలాది పౌరులను హతమార్చటంతోపాటు ఇళ్లను దహనం చేశారు. గ్రామస్థులు తమ సమాచారం పారా మిలిటరీ దళాలకు చేరేస్తున్నారన్నది వారి అనుమానం. ఈ అధ్యక్ష ఎన్నిక సందర్భంగా దాదాపు డజనుమంది అభ్యర్థుల్ని మాదకద్రవ్యాల ముఠా కాల్చిచంపింది. ఇన్ని సమస్యలతో సతమతమయ్యే దేశానికి అధ్యక్షురాలు కావటం నిజానికి కత్తి మీద సామే. చిత్రమేమంటే అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఆమె శాంతిభద్రతల అదుపు కోసం ఏం చేస్తానన్నది చెప్పలేదు. కానీ మెక్సికో నగర మేయర్‌గా పనిచేసిన అనుభవం ఆమెకు అక్కరకొస్తుందన్న ఆశ జనానికి ఉంది. నగరాన్ని సీసీ కెమెరాలతో నింపడం, నేరాలు తరచూ జరిగే ప్రాంతాల్లో నిరంతరం పోలీసు బలగాలను మోహరించటం వంటివి హత్యలను గణనీయంగా తగ్గించాయని గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఈ సంఖ్య వాస్తవాలను ప్రతిబింబించటం లేదన్నది విపక్షాల ఆరోపణ. నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన 1968 నాటి విద్యార్థి ఉద్యమంతో సహా అనేక సామాజికోద్యమాల్లో పాల్గొన్న యూదు కుటుంబంలో జన్మించటం వల్ల అటు రాజకీయాలపైనా, ఇటు పర్యావరణంపైనా ఆమెకు ఆది నుంచీ ఆసక్తి. అందుకే ఆ రంగంలో ఆమె పీహెచ్డీ చేయటంతోపాటు క్యాలిఫోర్నియా యూనివర్సిటీలో తన అధ్యయనాన్ని కొనసాగించి నైపుణ్యానికి పదును పెట్టుకున్నారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేసినందుకు 2007లో నోబెల్ పురస్కారాన్ని గెల్చుకున్న శాస్త్రవేత్తల బృందంలో క్లాడియా ఒకరు. 2018లో తెరపైకొచ్చిన మొరెనా పార్టీ ఆమెను సహజంగానే ఆకర్షించింది. వెంటనే మెక్సికో మేయర్ పదవి కూడా వరించింది. ఆ పదవికి మహిళ ఎన్నిక కావటం కూడా అదే ప్రథమం. 31 రాష్ట్రాలూ, 13 కోట్ల జనాభాగల దేశంలో నేరాలను అరికట్టడం మెక్సికో నగరాన్ని దారికి తెచ్చినంత సులభం కాదు. చాలా రాష్ట్రాల్లో మాదకద్రవ్య ముఠాలు వాహన సముదాయాల్లో ఏకే–47 తుపాకులతో సంచరించటం, పోలీసులు సమాచారం అందుకుని వచ్చేలోపే హత్యాకాండ ముగించి నిష్క్రమించటం తరచు కనబడే దృశ్యాలు. తల్లిదండ్రుల ఆలనా పాలనాలేని పిల్లల్ని, యువతను చేరదీస్తామని వారిలో అమాయకంగా కనబడేవారికి ప్రాధాన్యమిచ్చి ఏళ్లతరబడి ఆయుధ శిక్షణ ఇచ్చి మాదకద్రవ్యాల పంపిణీకీ హత్యలకూ వినియోగిస్తామని మాదకద్రవ్య ముఠా నాయకుడొకరు చెప్పాడు. ఆ కోణంలో దృష్టి సారించి పాఠశాల విద్య నుంచే స్కాలర్షిప్లిచ్చే పథకాన్ని ఆమ్లో అమలుచేశారు. కానీ పెద్దగా ఫలించలేదు. ఇవన్నీ అంతర్గత సమస్యలు. పొరుగునున్న అమెరికాతో అనేక పేచీలున్నాయి. ఆ దేశంలో ట్రంప్ తిరిగి అధికారంలోకి రాబోతున్నారన్న కథనాలు మెక్సికోకు ఇబ్బందిగానే ఉన్నాయి. ఆ దేశంనుంచి వలసలను అరికట్టడానికీ, మాదకద్రవ్యాలను కట్టడి చేయటానికీ సరిహద్దుల్లో గోడ నిర్మిస్తానని గతంలో ట్రంప్ ప్రకటించి పని మొదలెట్టినా బైడెన్ వచ్చాక ఆగిపోయింది. మరోపక్క లాటిన్ అమెరికా దేశాల్లో అమెరికాతో వాణిజ్యం నెరపే దేశాల్లో మెక్సికోయే నంబర్ వన్. అందువల్ల ఆ దేశాన్ని అంత సులభంగా అమెరికా వదులుకోలేదు. పైగా మెక్సికో పరిశ్రమల్లో ఉత్పత్తయ్యే కార్ల విడిభాగాల వల్లే అమెరికాలోని డెట్రాయిట్లో కార్ల పరిశ్రమలు సజావుగా సాగుతున్నాయి. మెక్సికో పవన విద్యుత్‌తోనే అమెరికా తయారీరంగ పరిశ్రమలు లక్షలమంది అమెరికన్లకు ఉపాధినిస్తున్నాయి. హృద్రోగులకు వాడే పేస్మేకర్లు మొదలుకొని పండ్లు, కూరగాయలు, ఆహారధాన్యాల వరకూ చాలా భాగం మెక్సికో నుంచి రావాల్సిందే. అందుకే ఇరుదేశాల వాణిజ్యమూ నిరుడు 80 వేల కోట్ల డాలర్ల వరకూ సాగింది. కనుక నేరస్థముఠాలను అరికట్టి శాంతిభద్రతలు తీసుకురాగలిగితే మెక్సికో సుసంపన్న దేశాల్లో ఒకటై నిలుస్తుంది. క్లాడియా ఆ పని చేయగలరా అన్నదే పెద్ద ప్రశ్న. -
రైలుతో సెల్ఫీకి యత్నం.. చూస్తుండగానే ప్రాణం పోయింది
ఫొటోలు దిగడం సరదాకే అయినా.. ఒక్కోసారి ఆ సరదానే ఏమరపాటులో ప్రాణాలు పోయేందుకు కారణం అవుతోంది. స్మార్ట్ఫోన్లు వచ్చాక సెల్ఫీల మోజుతో ప్రాణాలు పొగొట్టుకున్న వాళ్లెందరినో చూస్తున్నాం. అలాంటి ఘటనలు చూశాక కూడా.. అత్యుత్సాహం ప్రదర్శించడం ఆపడం లేదు చాలామంది. తాజాగా.. మెక్సికోలో ఓ యువతి అంతా చూస్తుండగానే.. సెకన్ల వ్యవధిలో ప్రాణం పొగొట్టుకుంది. కెనడా నుంచి బయల్దేరి ఎంప్రెస్ అనే రైలు.. సుదీర్ఘ ప్రయాణం తర్వాత మెక్సికో సిటీకి చేరుకుంటుంది. ఒక స్పెషల్ ఈవెంట్ నిర్వహణ కోసం ఈ రైలును నడిపిస్తున్నారు. దీనికి ఏడు దశాబ్దాల చరిత్ర ఉంది. పైగా అందుకే అది వెళ్లే దారిలో చాలామంది ఫొటోలు, సెల్ఫీలు, వీడియోల కోసం ప్రయత్నిస్తుంటారు. సోమవారం రైలు వెళ్తున్న టైంలో హిడాల్గో వద్ద ఓ యువతి పట్టాలకు అతి దగ్గరగా వెళ్లి మోకాళ్ల మీద కూర్చుని సెల్ఫీ కోసం యత్నించింది. అంతే.. రైలు ఢీ కొట్టడంతో స్పాట్లోనే ఆమె మృతి చెందింది. ఘటనపై రైలు యాత్రను నిర్వహించిన కెనడియన్ ఫసిఫిక్ కానాస్ సిటీ కంపెనీ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. MEXICO - In Hidalgo, a famous train that comes from Canada and travels all the way to Mexico City, attracting locals, struck a woman who was trying to take a selfie as the train approached. She passed at the scene. Article in comments. pic.twitter.com/32XdsCehEB— The Many Faces of Death (@ManyFaces_Death) June 5, 2024 -
మెక్సికోలో కొత్త చరిత్ర
మెక్సికో సిటీ: మెక్సికో చరిత్ర సృష్టించింది. ఆదివారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అంతా ఊహించినట్టుగానే అధికార మోరెనా వామపక్ష కూటమి అభ్యర్థి క్లాడియా షేన్‌బామ్ (61) ఘనవిజయం సాధించారు. 200 ఏళ్ల స్వతంత్ర మెక్సికో చరిత్రలో దేశ అధ్యక్ష పీఠమెక్కనున్న తొలి మహిళగా రికార్డు సృష్టించారు. యూదు మూలాలున్న తొలి ప్రెసిడెంట్ కూడా ఆమే కానున్నారు! షేన్‌బామ్‌కు ఇప్పటికే దాదాపు 60 శాతం ఓట్లు లభించినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రత్యర్థులిద్దరూ నాకిప్పటికే ఫోన్ చేసి అభినందించారు. ఓటమిని అంగీకరించారు. దేశానికి తొలి అధ్యక్షురాలిని కాబోతున్నా’’ అంటూ చిరునవ్వులు చిందించారు. ‘‘ఇది నేను ఒంటరిగా సాధించిన విజయం కాదు. తల్లులు మొదలుకుని కూతుళ్లు, మనవరాళ్ల దాకా దేశ మహిళలందరి విజయమిది’’ అన్నారు. విపక్ష కూటమి మహిళకే అవకాశమిచి్చంది. రెండు ప్రధాన పారీ్టల నుంచీ మహిళలే తలపడటమూ మెక్సికో చరిత్రలో ఇదే తొలిసారి. విపక్ష కూటమి అభ్యర్థి సోచిల్ గాల్వెజ్కు 28 శాతం, మరో ప్రత్యర్థి జార్జ్ అల్వారిజ్ మైనేజ్‌కు 10 శాతం ఓట్లు వచి్చనట్టు ఈసీ పేర్కొంది. షేన్‌బామ్ నూతన చరిత్ర లిఖిస్తున్నారంటూ అధ్యక్షుడు ఆంద్రెజ్ మాన్యుయెల్ లోపెజ్ అబ్రేడర్ అభినందించారు. ఆరేళ్ల పదవీకాలంలో ఆయన పలు చరిత్రాత్మక నిర్ణయాలతో ప్రజల మనసు గెలుచుకున్నారు. షేన్‌బామ్ విజయంలో లోపెజ్ పాపులారిటీదే ప్రధాన పాత్ర. ఒకసారికి మించి అధ్యక్ష పదవిలో కొనసాగేందుకు మెక్సికో రాజ్యాంగం అనుమతించదు. దాంతో ఆయన రెండోసారి బరిలో దిగలేకపోయారు. 2018లో లోపెజ్ గెలిచినప్పటి మాదిరిగా ఈసారి ప్రజల్లో పెద్దగా హర్షాతిరేకాలు వ్యక్తం కాకపోవడం విశేషం. అధ్యక్ష పదవితో పాటు పాటు 9 రాష్ట్రాల గవర్నర్లు, 128 మంది సెనేటర్లు, 500 మంది కాంగ్రెస్ ప్రతినిధులు, వేలాది మేయర్లు, స్థానిక సంస్థల ప్రతినిధి పదవులకు కూడా ఎన్నికలు జరిగాయి. వాటి ఫలితాలపై ఆసక్తి నెలకొంది. మొత్తం 32 గవర్నర్ పదవుల్లో మెరేనా పార్టీకి 23 ఉన్నాయి. షేన్‌బామ్‌కు సవాళ్లెన్నో... షేన్‌బామ్ అక్టోబర్ 1న అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు. ఆమెకు సవాళ్ల స్వాగతమే లభించనుంది. మహిళలపై హింసకు మెక్సికో ప్రపంచంలోనే పెట్టింది పేరు. ఈ సమస్యను రూపుమాపాల్సి ఉంది. సంక్షేమ పథకాలతో లోపెజ్ బాగా ఆకట్టుకున్నా అడ్డూ అదుపూ లేదని వ్యవస్థీకృత హింస, గ్యాంగ్ వార్లు, డ్రగ్ ట్రాఫికింగ్, పెట్రో ధరల పెరుగుదల తదితరాల కట్టడికి పెద్దగా చేసిందేమీ లేదన్న అసంతృప్తి ప్రజల్లో బాగా ఉంది. వీటిపై కొత్త అధ్యక్షురాలు దృష్టి పెట్టాలని వారు భావిస్తున్నారు. ప్రస్తుత పథకాలన్నింటినీ కొనసాగిస్తూనే దేశాన్ని పీడిస్తున్న అన్ని సమస్యలనూ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తానని షేన్‌బామ్ ప్రకటించారు. ఏ తారతమ్యాలూ లేకుండా ప్రజలందరినీ ఒకేలా చూస్తానన్నారు.లా డాక్టోరా... షేన్‌బామ్ విద్యార్హతలు అన్నీ ఇన్నీ కావు. ఎనర్జీ ఇంజనీరింగ్‌లో పీహెచ్డీ చేవారు. అందుకే ఆమెను అభిమానులు ముద్దుగా ‘లా డాక్టోరా’ అని పిలుచుకుంటారు. పర్యావరణవేత్తగా చాలా పేరుంది. నోబెల్ శాంతి బహుమతి పొందిన ఐరాస పర్యావరణ శాస్త్రవేత్తల బృందంలో షేన్‌బామ్ సభ్యురాలు. రాజధాని మెక్సికో సిటీ మేయర్‌గా చేసిన తొలి మహిళ కూడా ఆమే. షేన్‌బామ్ తాత, అమ్మమ్మ హిట్లర్ హోలోకాస్ట్ హింసాకాండను తప్పించుకోవడానికి యూరప్ నుంచి మెక్సికో వలస వచ్చారు. షేన్‌బామ్ మెక్సికో సిటీలోనే పుట్టారు. 2000లో రాజకీయ అరంగేట్రం చేశారు. -
చలో మెక్సికో
మెక్సికోలో యాక్షన్ చేయనున్నారట ఎన్టీఆర్. ఆయన హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రష్మికా మందన్న హీరోయిన్గా నటించనున్నారనే టాక్ వినిపిస్తోంది. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించనున్న ఈ సినిమా చిత్రీకరణ ఆగస్టులో ప్రారంభం కానుంది.ప్రస్తుతం ఈ సినిమాకు చెందిన ప్రీప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. కాగా ఈ సినిమా తొలి షెడ్యూల్ మెక్సిక్‌లో ప్రారంభం కానుందని సమాచారం. ఈ షెడ్యూల్లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తారట. అంతేకాదు.. ఈ సినిమాకి సంబంధించిన ఎక్కువ శాతం షూటింగ్ విదేశాల్లోనే జరుగుతుందని, దాదాపు పదిహేను దేశాల్లో చిత్రీకరణ జరిపేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. -
Mexico 2024 elections: మెక్సికో పీఠంపై తొలిసారి మహిళ!
మెక్సికో. లాటిన్ అమెరికాలో రెండో అతి పెద్ద దేశం. పురుషాధిపత్య భావజాలానికి పెట్టింది పేరు. మహిళలపై హింస, హత్య, యాసిడ్ దాడులు నిత్యకృత్యం. మెక్సికోలో ఇదే అతి పెద్ద సమస్య కూడా. అలాంటి దేశంలో తొలిసారి ఓ మహిళ అధ్యక్ష పదవి చేపట్టనున్నారు! ఆదివారం జరిగే ఎన్నికల్లో అధ్యక్ష పదవితో పాటు 128 మంది సెనేటర్, 500 మంది కాంగ్రెస్ ప్రతినిధులతో పాటు దాదాపు 20 వేల స్థానిక సంస్థల స్థానాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి పాలక, ప్రధాన సంకీర్ణాలు రెండింటి నుంచీ మహిళలే బరిలో ఉండటం విశేషం. పాలక ‘మోరెనా’ సంకీర్ణం తరఫున పోటీ చేస్తున్న క్లాడియా షేన్‌బామ్ గెలుపు ఖాయమేనని పరిశీలకులు చెబుతున్నారు. నేషనల్ యాక్షన్ పార్టీ సారథ్యంలోని విపక్ష కూటమి అభ్యర్థి సోచిల్ గాల్వెజ్పై ఆమె కనీసం 20 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నట్టు అన్ని సర్వేల్లోనూ తేలింది. మహిళలపై మితిమీరిన హింసకు పెట్టింది పేరైన ఆ దేశంలో వారికి రాజకీయ ప్రాతినిధ్యం కూడా నానాటికీ బాగా పెరుగుతుండటం విశేషం. దిగువ సభ (కాంగ్రెస్)లో అన్ని పారీ్టలూ మహిళలకు కనీసం 50 శాతం టికెట్లివ్వడాన్ని ఇప్పటికే తప్పనిసరి చేశారు. ఫలితంగా కాంగ్రెస్‌లో సగం మంది సభ్యులు మహిళలే ఉన్నారు. మెM్సకో జనాభా 13 కోట్లు కాగా దాదాపు 10 కోట్ల మంది ఓటర్లున్నారు. ఆదివారం పోలింగ్ ముగిశాక రాత్రికల్లా ఫలితాలు వెలవడే అవకాశముంది.సోచిల్ గాల్వెజ్61 ఏళ్ల గాల్వెజ్ సెనేట్ సభ్యురాలు. పారిశ్రామికవేత్త. ఎన్ఏపీ, పీఆర్ఐ, పీఏఎన్, ఆర్పీడీ సహా పలు పారీ్టలతో కూడిన విపక్ష కూటమి తరఫున బరిలో ఉన్నారు. లోపెజ్ ప్రవేశపెట్టిన పెన్షన్ పథకం వంటివాటిని తాను కూడా కొనసాగిస్తానని చెబుతూ పలు వర్గాలను ఆకట్టుకున్నారు. దాంతోపాటు మధ్య, దిగువ తరగతి ప్రజల కోసం సార్వత్రిక సామాజిక రక్షణ వ్యవస్థ తెస్తానంటున్నారు. పోలీస్ వ్యవస్థను పటిష్టపరిచి నేరాలపై ఉక్కుపాదం మోపుతానని చెబుతున్నారు.క్లాడియా షేన్‌బామ్ ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త. 2007లో నోబెల్ గ్రహీత. మెక్సికో సిటీ మాజీ మేయర్. గెలిస్తే తొలి అధ్యక్షురాలిగానే గాక యూదు మూలాలున్న తొలి వ్యక్తిగా కూడా రికార్డు సృష్టించే అవకాశముంది. అధ్యక్షుడు ఆంద్రెజ్ మాన్యుయెల్ లోపెజ్ అబ్రేడర్కున్న విశేషమైన జనాదరణ ఉన్నా రెండోసారి పదవి చేపట్టేందుకు మెక్సికో రాజ్యాంగ ప్రకారం అనుమతించని కారణంగా పాలక సంకీర్ణ అభ్యరి్థగా షేన్‌బామ్ బరిలో దిగారు. కనీస వేతనాలను రెట్టింపు చేయడం, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల పెంపు, రైతులకు సబ్సిడీ, వర్సిటీ విద్యార్థులకు ప్రోత్సాహకాలు, నిరుద్యోగులకు భృతి వంటివి నేరుగా నగదు రూపంలో చెల్లించడం, సీనియర్ సిటిజన్లకు సార్వత్రిక పెన్షన్ సదుపాయం వంటివాటితో లోపెజ్ తన ఆరేళ్ల పదవీకాలంలో అందరి మన్ననలు పొందారు. ఇదంతా 61 ఏళ్ల షేన్‌బామ్‌కు బాగా కలిసి రానుంది. డ్రగ్ మాఫియా, వ్యవస్థీకృత నేరాలు మెక్సికో ఎదుర్కొంటున్న సమస్యల్లో ముఖ్యమైనవి. వీటి కట్టడికి లోపెజ్ పెద్దగా ప్రయత్నాలు చేయలేదన్న ఆరోపణలున్నాయి. తాను వాటిపైనా ప్రధానంగా దృష్టి సారిస్తానని ఆమె చెబుతున్నారు. లోపెజ్ సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే ఆయన ప్రభావానికి అతీతంగా పాలిస్తానంటున్నారు.జార్జే అల్వారిజ్ మైనేజ్ రాజకీయాలకు కొత్త ముఖం. స్మాల్ సిటిజన్ మూవ్మెంట్ పార్టీ తరఫున బరిలో ఉన్నారు. నేరాలపై ఉక్కుపాదం మోపుతానని హామీ ఇచ్చారు. డ్రగ్స్‌ను నిర్మూలించడం అసాధ్యమని, వాటిని బాగా కట్టడి చేస్తానని చెబుతున్నారు. 38 ఏళ్ల మైనేజ్ ప్రతిపాదించిన పలు ఆర్థిక సంస్కరణలపై ప్రజల నుంచి మంచి స్పందన రావడం విశేషం. ఈసారి గెలవకపోయినా మున్ముందు మెక్సికో రాజకీయాల్లో ఆయన ప్రబల శక్తిగా ఎదగడం ఖాయమంటున్నారు. -
అమెరికా ‘సాంత ఫె’లో విహారయాత్ర !
మా మనమడు మొదటిసారి కాలేజీలో చేరుతున్న సందర్భంగా కుటుంబంతో కలిసి నేనూ జనవరి మొదటి వారంలో లబ్బాక్ ( Lubbock )లోని టెక్సస్ టెక్ ( Texas Tech ) యూనివర్సిటీకి కారులో షికారులాగా బయలుదేరాం. లబ్బాక్ ఏమిటీ అందం చందం లేని పేరు అన్నాను మా మనవరాలితో. ఆమె వెంటనే పొంగిపోతూ చెప్పిన సమాధానం ‘ తాతా ఇట్ ఈస్ బర్త్ ప్లేస్ అఫ్ ఫేమస్ రాక్ ఎన్ రోల్ లెజెండ్ బడ్డీ హోలీ ( Buddy Holly )’ అని. ఏమిటో ఏది అడిగినా మ్యూజిక్ భాషలోనే జవాబు చెబుతుంది అనుకున్నాను మనసులోనే. ఎటు చూసినా అంతా హిస్పానిక్భూమి కొరత లేని దేశం యూఎస్. టెక్సస్ టెక్ నేషనల్ యూనివర్సిటీ ప్రాంగణమే దాదాపు రెండువేల ఎకరాల్లో ఉంది. అయినా ఓపిక చేసుకొని కొన్ని ముఖ్యమైన భవనాలు తిరిగి చూసాము. ఎటు చూసినా అంతా హిస్పానిక్ వాతావరణం, ఇందులో చదువుకునే అండర్ గ్రాడ్యుయేట్స్ విద్యార్థుల్లో దాదాపు 25 శాతం మంది హిస్పానిక్స్నేట. అందుకే దీన్ని హిస్పానిక్ సర్వీసింగ్ ఇన్స్టిట్యూషన్ అన్నారు. మా వాడు చేరింది ఓ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ కానీ రోజంతా ప్రాక్టీస్ చేసేది మాత్రం చెస్. క్రియేటివ్ సిటీగా..మరునాడు మా కారు న్యూ మెక్సికో రాజధాని ‘సాంత ఫె ( Santa fe )’ వెళ్ళింది. అక్కడి మారియేట్ హోటల్లో మా బస. సాంత ఫె ఒకప్పటి ( 1610 ) స్పానిష్ వాళ్ళ కాలనీ , సాంగ్రెడ్ క్రిస్టో పర్వతాల దగ్గరున్న 400 సంవత్సరాల నాటి పట్టణం. అన్నీ పూబ్లో స్టైల్ నిర్మాణాలు. అవి కళాసంస్కృతులకు ప్రసిద్ధి గాంచినవి. అందుకేనేమో యునెస్కో దీన్ని ఒక ‘ ప్రపంచ స్థాయి క్రియేటివ్ సిటీ ’ గా గుర్తించింది. ఇక్కడికి సందర్శకులు ఎక్కువగా మార్చ్ నెలలో వస్తారట.మేము కొంచెం ముందే వెళ్ళాం. ఎంతైనా మంచు ప్రాంతం కదా చలి ఎక్కువగానే ఉంది. నాలాంటి వాళ్ళు తట్టుకోవడం కష్టమే. అయినా ఆ చలిని లెక్కచేయకుండా 5 వ తేదీ నాడు అందరితోకలిసి సాంత ఫె సమీపంలో నేనూ స్కీయింగ్ చేశాను. మావాళ్లు హెచ్చరిస్తున్నా పర్వాలేదు అని ప్రత్యేక పొడుగు చెక్క పాదుకలు ( Long flat runners అవే skis ) షూతో కలిపి వేసుకొని రెండుసార్లు జారిపడ్డా ఏమీ కానట్టు నవ్వుతూ, పడిలేచిన కెరటంలా లేచి, ఆ ఐస్ మీద చిన్నప్పుడు బడిలో జారుడు బండ ఆడినట్టు సరదాగా జారుతూ పిల్లలతో ఔరా! అనిపించుకున్నా. చిత్ర విచిత్రమైన ఎగ్జిబిషన్మా విహారయాత్ర చివరి రోజు మేము సాంత ఫెలో చూసింది ఓ చిత్ర విచిత్రమైన ఎగ్జిబిషన్ ‘మియో వోల్ఫ్ ’ ( Meo wolf ). ఇక్కడ అడుగు పెట్టగానే మాకు స్వాగతం చెప్పింది ఓ రాక్షసాకార రోబోట్. ఈ మ్యూజియంలోకి ప్రవేశించిన వారు ఈ భూలోకాన్ని మరిచి ‘మరో ప్రపంచం’లోకి ( శ్రీ శ్రీ చెప్పింది కాదు సుమా ! ) వెళ్ళిపోతారన్నారు. దాదాపు వంద మంది కళాకారులు సృష్టించిన విద్యుత్ వెలుగుల వింత ప్రపంచం ఇది. ఆర్ట్ & టెక్నాలజీ రెండూ కలిస్తే ఎలా ఉంటుందో ఈ ప్రదర్శనశాలను చూస్తే అర్థమౌతుంది. మన హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ నిర్వాహకులు ఇలాంటిది పెడితే సంవత్సరం పొడుగునా జనం వచ్చి చూసి ఆనందిస్తారు కదా! అనిపించింది. House of Eternal Returnగా వర్ణించిన ఈ రంగుల ప్రపంచంలో ఒక పూట గడిపి ఎట్లాగయితేనేం బయటపడ్డాం. నాలుగు రోజులకే లాడ్జింగ్, హోటల్ లతో విసుగెత్తి , ఇంటిమీద బెంగ పెట్టుకొని డాలస్ బాట పట్టాం ! వేముల ప్రభాకర్(చదవండి: మేడం టుస్సాడ్.. మన శిల్పసంపద కంటే ఎక్కువా?) -
Lok sabha elections 2024: ఎన్నికల భారతం చూసొద్దాం!
ప్రపంచ ప్రజాస్వామ్య జాతరలో పూనకాలు లోడింగ్... అని చెప్పేందుకు ఈ అంకెలు చాలు! 1952 నుంచి ఇప్పటిదాకా ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా క్రమం తప్పకుండా ఎన్నికలు జరిగిన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ ట్రాక్ రికార్డు ఇది. అంతేకాదండోయ్... యూరప్ మొత్తం జనాభా (75 కోట్లు) కంటే ఈ ఎన్నికల్లో మన ఓటర్లే ఎక్కువ! అందుకే ఇప్పుడు ప్రపంచమంతా మన ఓట్ల పండుగ వైపు చూస్తోంది. విదేశీ టూరిస్టులు కూడా ఈ కోలాహలాన్ని కళ్లారా చూసేందుకు ఉవి్వళ్లూరుతున్నారు. ఈ ఆసక్తిని గమనించిన పలు భారతీయ ట్రావెల్ కంపెనీలు వినూత్న ఐడియాతో వారికి ‘ద గ్రేట్ ఇండియన్ ఎలక్షన్ మేజిక్’ను చూపించేందుకు ప్లాన్ చేశాయి. అదే ‘ఎన్నికల టూరిజం’. దేశంలో ఇప్పుడిది నయా ట్రెండ్! ‘కోడ్’ కూతతో 7 విడతల్లో 44 రోజుల పాటు ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మెగా సార్వత్రిక సమరంలో పారీ్టల ప్రచారం జోరందుకుంది. ఇసుకేస్తే రాలనంత జనంతో భారీ సభలు.. పోటీ చేసే అభ్యర్థులు చేసే విన్యాసాలు... ప్రసంగాల్లో నేతల వాగ్దాటి... రాత్రికిరాత్రే పారీ్టలు మార్చే ఆయారాంలు, గయారాంలు.. హోరెత్తించే ర్యాలీలు.. కార్యకర్తల సందడితో దేశమంతా ఎన్నికల జ్వరం ఆవహించింది. మనకు ఇవేమీ కొత్తకాదు. అయితే, ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల క్రతువును ప్రత్యక్షంగా చూడాలనుకునే విదేశీయుల కోసం దేశంలోని పలు ట్రావెల్ ఏజెన్సీలు ఎన్నికల టూరిజం పేరుతో ప్రత్యేక ప్యాకేజీలను అందిస్తున్నాయి. 2019లో ప్రత్యేకంగా పార్లమెంట్ ఎన్నికలను చూసేందుకు దాదాపు 8,000 మంది విదేశీ టూరిస్టులు వచి్చనట్లు అంచనా. ముఖ్యంగా అమెరికా, చైనా, నేపాల్, యూఏఈ, ఉక్రెయిన్, ఆ్రస్టేలియా, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్ దేశాలకు చెందిన వారు ఇందులో ఉన్నారు. విద్యార్థులు, జర్నలిస్టులు, రీసెర్చ్ స్కాలర్లు, మహిళా బృందాలు, చరిత్ర–సంస్కృతి, రాజకీయాల పట్ల మక్కువ చూపేవారు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. ఈసారి ఎన్నికల టూరిజం కోసం 25,000 మందికి పైగానే విదేశీ పర్యాటకులు రావచ్చని ట్రావెల్ కంపెనీలు లెక్కలేస్తున్నాయి. మెక్సికో స్ఫూర్తి 2005లో మెక్సికోలో బాగా విజయవంతమైన పోల్ టూరిజం స్ఫూర్తితో అహ్మదాబాద్‌కు చెందిన అక్షర్ ట్రావెల్స్ అనే సంస్థ ఈ కాన్సెప్టును తొలిసారి దేశంలో ప్రవేశపెట్టింది. 2012 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రత్యేక ప్యాకేజీలతో ఆకట్టుకుంది. వణ్యప్రాణుల టూరిజం... మెడికల్ టూరిజం... విలేజ్ టూరిజం... హిమాలయన్ ట్రెక్కింగ్ టూరిజం... తీర్థయాత్రల టూరిజం... దేవాలయాలు–ఆధ్యాతి్మక టూరిజం.. యోగా టూరిజం.. ఇలా విదేశీ టూరిస్టులను ఆకర్షిస్తున్న జాబితాలోకి ఎన్నికల టూరిజాన్ని కూడా చేర్చింది. గుజరాత్లో సక్సెస్ కావడంతో 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ దేశవ్యాప్తంగా దీన్ని కొనసాగించినట్లు ఆ సంస్థ చైర్మన్ మనీష్ శర్మ చెప్పారు. ‘ఎన్నికల సమయంలో భారత్‌ను సందర్శించేందుకు ఆసక్తి చూపుతున్న విదేశీ టూరిస్టుల్లో యూరోపియన్లు, మధ్య ప్రాచ్యం, పశి్చమాసియాకు చెందిన వారు ఎక్కువ. ర్యాలీల్లో లక్షలాది మంది పాల్గొనడం వారికి సరికొత్త అనుభూతిని అందిస్తోంది’ అని ఆయన వివరించారు. ప్రస్తుతం దేశంలో 20కి పైగానే ట్రావెల్ ఏజెన్సీలు ఎలక్షన్ టూరిజం ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నాయి. 6 రోజులకు ప్రారంభ ధర రూ. 40,000 కాగా, 2 వారాల ప్యాకేజీకి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. ప్యాకేజీల ప్రత్యేకతేంటి? అటు పర్యాటకంగా, ఇటు రాజకీయంగా ఆసక్తి రేకెత్తించే కీలక ప్రాంతాలు, రాష్ట్రాలను ఏజెన్సీలు ప్రధానంగా ఎంచుకుంటున్నాయి. వారణాసి, ఢిల్లీతో సహా కేరళ, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటివి ఎన్నికల టూరిజం ప్యాకేజీల్లో ప్రధానంగా చోటు దక్కించుకుంటున్నాయి. భారీ ఎన్నికల ర్యాలీలు, సభల్లో పాల్గొనడంతో పాటు స్థానిక రాజకీయ నాయకులతో మాటామంతీ, కలిసి భోజనం చేయడం, గ్రామ పంచాయతీలను సందర్శించడం వంటివన్నీ ప్యాకేజీల్లో చేరుస్తున్నారు. పోటీ చేసే అభ్యర్థులను కలుసుకునే అవకాశాన్ని కూడా టూరిస్టులకు కలి్పస్తున్నారు. దీనివల్ల వారి ప్రచార వ్యూహాలు, ఇతరత్రా ఎన్నికల సంబంధ విషయాలను నేరుగా తెలుసుకోవడానికి వీలవుతుంది. కేవలం ఎన్నికల కార్యక్రమాలనే కాకుండా చుట్టుపక్కల గుళ్లూ గోపురాలు, కోటలు, బీచ్‌ల వంటి ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలను చుట్టేసే విధంగా ప్యాకేజీలను రూపొందిస్తున్నామని శర్మ వివరించారు. అంతేకాదు ధాబాల్లో భోజనం, స్థానికంగా నోరూరించే వంటకాలను రుచి చూపించడం, ఆ ప్రాంతంలోని సంస్కృతి, సాంప్రదాయాలతో పర్యాటకులు మమేకం కావడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. కాగా, ఢిల్లీకి చెందిన ఇన్క్రెడిబుల్ హాలిడేస్ అనే సంస్థ విదేశీ టూరిస్టులతో పాటు దేశీ పర్యాటకులకు కూడా ఇలాంటి ప్యాకేజీలను అందిస్తోంది. సందర్శనీయ ప్రదేశాలను చూపడంతో పాటు ఎన్నికల సంబంధ కార్యక్రమాల్లో కూడా పాల్గొనే విధంగా పర్యాటకుల అభిరుచిని బట్టి ప్యాకేజీలను రూపొందిస్తున్నామని ఈ కంపెనీ కన్సల్టింగ్ పార్ట్నర్ సుదేశ్ రాజ్‌పుత్ పేర్కన్నారు. ఒక్కో వ్యక్తికి ప్యాకేజీ రూ.25,000 నుంచి ప్రారంభమవుతుందని ఆయన వివరించారు. ట్రావెబ్రేట్.కామ్ ప్యాకేజీ కూడా ఇలాంటిదే. ఢిల్లీలోని ఎలక్షన్ మ్యూజియం సందర్శనలో మన ఎన్నికల చరిత్ర, చిరస్మరణీయ నాయకుల గురించి తెలుసుకోవడం, పోలింగ్‌ను తీరును చూపించడం, ఫలితాల రోజు కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉత్కంఠ, విజేతల సంబరాలను ప్రత్యక్షంగా చూసే అవకాశం వంటి పలు ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Texas: యూఎస్, మెక్సికో సరిహద్దులో హెలికాప్టర్ క్రాష్
టెక్సాస్: అమెరికా, మెక్సికో సరిహద్దులో యూఎస్ నేషనల్ గార్డ్‌కు చెందిన ఒక హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. టెక్సాస్‌లోని లా గ్రుల్లా పట్టణంలో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. కూలిన సమయంలో హెలికాప్టర్లో నలుగురు ప్రయాణిస్తున్నారు. హెలికాప్టర్ క్రాష్ ఘటనపై స్టార్ కౌంటీ షరీఫ్ కార్యాలయం దర్యాప్తు ప్రారంభించింది. ప్రమాదానికి గురైన హెలికాప్టర్ లకోటా యూహెచ్-72 రకానికి చెందినదని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. ఇదీ చదవండి.. గాజాలో దారుణం.. తిండి కోసం ఎదరు చూస్తున్న వారిపై పడ్డ పారాచూట్ -
ధగధగ..సెగసెగ.. అతిపెద్ద స్ఫటికాల గుహ ఎక్కడంటే?
ఇది ప్రపంచంలోనే అతిపెద్ద స్ఫటికాల గుహ. బయటి నుంచి లోపలకు చూస్తే, భారీ స్ఫటిక శిలలు ధగధగలాడుతూ కనిపిస్తాయి. గుహ లోలోపలికి వెళుతుంటే మాత్రం తాళలేనంత వేడిసెగలు, ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఈ స్ఫటికాల గుహ మెక్సికోలోని చిహువాహువా సమీపంలో ఉంది. నైకా గనితో ఈ గుహను అనుసంధానించారు. ఇందులో జిప్సమ్, క్యాల్షియమ్ ఖనిజాల వల్ల ఏర్పడిన స్ఫటిక శిలలు భారీ పరిమాణంలో కనిపిస్తాయి. ఈ గుహను పూర్తిగా పరిశీలించడం ఎవరికీ సాధ్యం కాదు. లోలోపలకు వెళితే, అక్కడి ఉష్ణోగ్రతలు 58 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయి. లోపలి గాలిలో తేమ 90–99 శాతం మేరకు ఉంటుంది. గని కార్మికులైన జువాన్, పెడ్రో అనే సోదరులు తవ్వకాలు జరుపుతున్న సమయంలో పాతికేళ్ల కిందట ఈ గుహను గుర్తించారు. గుహలోని నేలకు అడుగు భాగంలో కరిగే స్థితిలో ఉన్న లావా కారణంగానే ఈ గుహలో విపరీతమైన వేడి, ఉక్కపోత వాతావరణం ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
‘మీ ఎట్ 21’ వైరల్ ట్రెండ్
ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పుడు ‘మీ ఎట్ 21’ వైరల్ ట్రెండ్ నడుస్తోంది. ఈ ట్రెండ్‌లో భాగంగా 21 ఏళ్ల వయసులోని తమ ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో యూజర్లు పోస్ట్ చేస్తున్నారు. ఆ వయసులో తమ తీపి, చేదు జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటున్నారు. అరిజోనా (యూఎస్) కు చెందిన 43 ఏళ్ల డామిన్ రఫ్ ఈ ట్రెండ్‌కు కారణం. మెక్సికోలో జరిగిన తన 21 వ బర్త్‌డే ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.ఈ ఫోటో ‘ఇంతింతై... అంతంతై’ చివరికి వైరల్ ట్రెండ్‌గా మారింది. కరీనా కపూర్, ప్రియాంక చోప్రా, కాజల్‌లు కూడా ఈ వైరల్ ట్రెండ్‌లో భాగం అయ్యారు. కరీనా కపూర్ తన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ‘అశోక’ సినిమాలో షారుఖ్‌ఖాన్ పక్కన ఉన్న ఫోటోను షేర్ చేస్తూ ‘ఫీలింగ్ 21 దిస్ మార్నింగ్’ అనే కాప్షన్ ఇచ్చింది. మరో ఫోటోకు ‘21’ అని కాప్షన్ ఇచ్చి రెడ్ హార్ట్ ఇమోజీ జోడించింది. ప్రియాంక చోప్రా మోడలింగ్ రోజుల నాటి ఫోటోలను షేర్ చేసి ‘లెర్న్ ఏ లాట్ సిన్స్ దెన్’ అని కాప్షన్ ఇచ్చింది. బైక్‌పై కూర్చున్న తన ఫోటో షేర్ చేస్తూ ‘ఉయ్ డిడ్ వెల్. ప్యాట్ ఆన్ ది బ్యాక్ ఫర్ ది యంగర్ మీ’ అని కాప్షన్ ఇచ్చింది కాజల్. -
Mexico: బస్సు, ట్రక్కు ఢీ.. 19 మంది మృతి
మెక్సికో: మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఓ బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో 19 మంది మరణించారు. మరో 18 మంది గాయపడ్డారు. దీంతో, గాయపడిన వారికి వెంటనే ఆసుపత్రికి తరలించారు. lవివరాల ప్రకారం.. ఉత్తర మెక్సికోలోని సినలోవాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, ట్రక్కు ఢీకొనడం వల్ల 19 మంది మృతి చెందగా, మరో 22 మంది గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 43 మంది ప్రయాణికులు ఉన్నారు. కాగా, పసిఫిక్ తీర రాష్ట్రం సినాలోవాలోని జాతీయ రహదారిపై సరుకులను రవాణా చేసే ట్రక్కు, బస్సు ఢీ కొనడం వల్ల ఈ ప్రమాదం జరగిందని స్థానిక అధికారులు పేర్కొన్నారు. ఇక, ఈ ప్రమాద ఘటనకు సంబంధించి సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. 🚨 No es un choque sino un intento de rebase, posible causa del accidente en la maxipista, en #Elota Lee la nota completa 🔗 https://t.co/kyhrySHYci#Accidente #Vialidad #LDNoticias #Carretera #Sinaloa pic.twitter.com/R75emSD0Gp — Línea Directa Portal (@linea_directa) January 31, 2024 -
2024: ఎన్నికల ఏడాది
2024ను ఎన్నికల ఏడాదిగా పిలవాలేమో. ఎందుకంటే ఈ ఏడాది ఏకంగా 50కి పైగా దేశాల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి! ఒక్క ఏడాదిలో ఇన్ని దేశాల్లో ఎన్నికలు జరగడం చరిత్రలో ఇదే తొలిసారి. అలా 2024 రికార్డులకెక్కబోతోంది. పైగా అత్యధిక జనాభా ఉన్న టాప్ 10 దేశాల్లో ఏకంగా ఏడు ఈసారి ఎన్నికల పోరుకు సిద్ధమవుతుండటం విశేషం. ఆ లెక్కన ప్రపంచ జనాభాలో దాదాపు సగం మంది ఈ ఏడు ఓటు హక్కును వినియోగించుకోనుండటం ఇంకో విశేషం! ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న భారత్ మొదలుకుని అగ్ర రాజ్యం అమెరికా దాకా ఈ జాబితాలో ఉన్న ముఖ్యమైన దేశాలను ఓసారి చూద్దాం... బంగ్లాదేశ్ 17 కోట్ల జనాభా ఉన్న బంగ్లాదేశ్ ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న తొలి దేశం. జనవరి 7న అక్కడ సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అయితే విపక్షాలన్నింటినీ నిరీ్వర్యం చేసి ఏకపక్ష ఎన్నికల ప్రహసనానికి తెర తీశారంటూ ప్రధాని షేక్ హసీనా ఇంటా బయటా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ అణచివేతను తట్టుకోలేక పలువురు విపక్ష నేతలు ప్రవాసంలో గడుపుతున్నారు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పారీ్టతో పాటు విపక్షాలన్నీ బాయ్‌కాట్ చేసిన ఈ ఎన్నికల్లో హసీనా మరోసారి నెగ్గడం, వరుసగా ఐదోసారి అధికారంలోకి రావడం లాంఛనమే కానుంది. ప్రజాస్వామ్యానికి చెల్లుచీటీ పాడి చైనా మాదిరిగా దేశంలో హసీనా ఏక పార్టీ వ్యవస్థను నెలకొల్పేలా ఉన్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తైవాన్ చైనా పడగ నీడన తన స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుకునేందుకు ఆపసోపాలు పడుతున్న తైవాన్‌లో జనవరి 13న అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. అధికార డీపీపీ తరఫున ప్రస్తుత అధ్యక్షుడు సై ఇంగ్ వెన్కు బదులుగా లై చింగ్ టే బరిలో ఉన్నారు. ఆయనకు వెన్కు మించిన స్వాతంత్య్ర ప్రియునిగా పేరుంది. ఉదారవాద క్యోమింటాంగ్ నేత హో యూ యీ, తైవాన్ పీపుల్స్ పార్టీ తరఫున కో వెన్ జే ఆయనను సవాలు చేస్తున్నారు. డీపీపీ 2016 నుంచీ అధికారంలో కొనసాగుతోంది. ఈసారి కూడా అది అధికారంలోకి వస్తే యుద్ధానికి దిగైనా తైవాన్ను విలీనం చేసుకుంటానంటూ చైనా ఇప్పటికే బెదిరిస్తోంది. దాంతో ఈ ఎన్నికలు తైవాన్‌కు ఒకరకంగా జీవన్మరణ సమస్యగా పరిణమించాయి. పాకిస్తాన్ 24 కోట్ల జనాభా ఉన్న పాక్ అనిశి్చతికి మారుపేరు. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 8న సార్వత్రిక ఎన్నికలు జరగాలి. కానీ అవి వాయిదా పడే సూచనలే ఎక్కువగా కని్పస్తున్నాయి. సైన్యాన్ని ఎదిరించి ప్రధాని పదవి కోల్పోయి అవినీతి కేసుల్లో జైలు పాలైన పీటీఐ చీఫ్ ఇమ్రాన్‌ఖాన్ పోటీకి దారులు మూసుకుపోయినట్టు కని్పస్తున్నాయి. ఆయన నామినేషన్లు ఇప్పటికే తిరస్కరణకు గురయ్యాయి. ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగడం అనుమానంగా మారింది. సైన్యం దన్నుతో పాకిస్తాన్ ముస్లిం లీగ్ (పీఎంఎల్) విజయం, ప్రవాసం నుంచి తిరిగొచి్చన ఆ పార్టీ నేత నవాజ్ షరీఫ్ మరోసారి ప్రధాని కావడం లాంఛనమేనని అక్కడి రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఇండొనేసియా 27 కోట్ల పై చిలుకు జనాభా ఉన్న ఇండొనేసియాలో కూడా ఫిబ్రవరిలో ఎన్నికలున్నాయి. అధ్యక్షుడు, ఉపాధ్యక్షునితో పాటు జిల్లా, రాష్ట్ర, జాతీయ పార్లమెంటు సభ్యులకు ఫిబ్రవరి 14న ఒకే రోజున ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే రెండు టర్ములు పూర్తి చేసుకున్న అధ్యక్షుడు జొకో విడొడొ స్థానంలో రక్షణ మంత్రి 72 ఏళ్ల ప్రాబొవో సుబియంటో బరిలో ఉన్నారు. గంజర్ ప్రనోవో, అనీస్ బస్వేదన్ గట్టి పోటీ ఇస్తున్నారు. భారత్ 140 కోట్లకు పైగా జనాభా, 90 కోట్ల పై చిలుకు ఓటర్లతో ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ప్రజాస్వామ్యంగా అలరారుతున్న భారత్ ఏప్రిల్, మే నెలల్లో సార్వత్రిక ఎన్నికల సమరానికి సన్నద్ధమవుతోంది. ఇన్ని కోట్ల మంది ఓటర్లు అత్యంత శాంతియుతంగా, ప్రజాస్వామికంగా ఓటు హక్కును వినియోగించుకోవడాన్ని ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ప్రపంచమంతా అబ్బురపాటుతో వీక్షించడం పరిపాటిగా మారింది. ఈ ఎన్నికల్లో ప్రధానిగా నరేంద్ర మోదీ హ్యాట్రిక్ ఖాయమని అత్యధిక రాజకీయ అంచనాలు చెబుతున్నాయి. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమిని 2014లో ఆయన ఒంటి చేత్తో అధికారంలోకి తేవడం తెలిసిందే. 2019లోనూ మోదీ మేజిక్ రిపీటైంది. ఈసారి దానికి ఎలాగైనా అడ్డుకట్ట వేయాలని కాంగ్రెస్ సారథ్యంలో 28 విపక్ష పారీ్టలతో కూడిన విపక్ష ఇండియా కూటమి ప్రయతి్నస్తోంది. మెక్సికో జూన్ 2న ఎన్నికలకు మెక్సికో సిద్ధమవుతోంది. 13 కోట్ల జనాభా ఉన్న ఈ దేశ చరిత్రలోనే తొలిసారిగా అధ్యక్ష పదవితో పాటు మొత్తం 32 రాష్ట్రాల గవర్నర్లు, జాతీయ కాంగ్రెస్, స్థానిక సంస్థల స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. క్లాడియా షేన్‌బామ్ రూపంలో ఈసారి తొలిసారిగా ఓ మహిళ అధ్యక్ష పదవి చేపట్టే ఆస్కారం కనిపిస్తుండటంతో ఈ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. సైంటిస్టు, మెక్సికో సిటీ మాజీ మేయర్ అయిన ఆమె అధికార మొరేనా పార్టీ తరఫున బరిలో దిగుతున్నారు. యూరోపియన్ యూనియన్ యూరోపియన్ యూనియన్‌లోని మొత్తం 27 దేశాల ప్రజలూ కీలకమైన ప్రతి ఐదేళ్లకోసారి యూరప్ పార్లమెంటులో తమ ప్రతినిధులను ప్రత్యక్ష ఓటింగ్ పద్ధతిలో ఎన్నుకుంటారు. విద్య, వైద్యం మొదలుకుని ఉపాధి దాకా ఆ దేశాలను తీవ్రంగా ప్రభావితం చేసే పలు కీలక రంగాలకు సంబంధించి నిర్ణాయక చట్టాలు చేయడంలో పార్లమెంటుదే కీలక పాత్ర. దాంతో జూన్ 6 నుంచి 9 దాకా జరగనున్న ఈ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొత్తం 720 మంది పార్లమెంటు సభ్యులు ఎన్నికవుతారు. దక్షిణాఫ్రికా 6 కోట్ల పై చిలుకు జనాభా ఉన్న ఈ దేశంలో మే–ఆగస్టు మధ్య సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. 1994లో దేశంలో వర్ణ వివక్ష అంతమయ్యాక జరుగుతున్న ఏడో ఎన్నికలివి. అప్పటినుంచీ అధికారంలో కొనసాగుతున్న ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ఏఎన్సీ) ఈసారి విజయానికి కావాల్సిన 50 శాతం మార్కును దాటడం కష్టకాలమేనంటున్నారు. గత అక్టోబర్‌లో జరిగిన సర్వేలో ఆ పారీ్టకి మద్దతు 45 శాతానికి పడిపోయింది. అవినీతి మకిలి అధ్యక్షుడు సిరిల్ రామాఫోసాకు ఈసారి ప్రధాన అడ్డంకిగా మారేలా కని్పస్తోంది. అధికారంలోకి వస్తూనే పూర్వ అధ్యక్షుడు జాకబ్ జుమా అవినీతిని క్షమించడం తీవ్ర వ్యతిరేకతకు దారి తీసింది. అధికారుల్లో పెచ్చరిల్లిన అవినీతి పరిస్థితిని ఏఎన్‌సీకి మరింత ప్రతికూలంగా మార్చిందంటున్నారు. విపక్ష డెమొక్రటిక్ అలయెన్స్ దానికి గట్టిపోటీ ఇచ్చేలా కని్పస్తోంది. అమెరికా 33 కోట్ల పై చిలుకు జనాభా ఉన్న అగ్ర రాజ్యంలో అధ్యక్ష ఎన్నికలు ఎప్పుడూ ప్రపంచాన్ని ఆకర్షించేవే. అధ్యక్షున్ని ఎన్నుకోవడంతో పాటు ప్రతినిధుల సభలో మొత్తం స్థానాలతో పాటు సెనేట్‌లో మూడో వంతు సీట్లకు కూడా పోలింగ్ జరుగుతుంది. అయితే ఈసారి నవంబర్ 5న జరగనున్న ఎన్నికలపై మరింత ఆసక్తి నెలకొనేలా ఉంది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెంపరితనమే అందుకు ఏకైక కారణం! 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని ఒప్పుకునేందుకు ఆయన ససేమిరా అనడం, తననే విజేతగా ప్రకటించాలంటూ మొండికేయడం తెలిసిందే. డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్‌ను అధ్యక్షునిగా ప్రకటించకుండా అడ్డుకునేందుకు ఏకంగా క్యాపిటల్ భవనంపైకి తన మద్దతుదారులను దాడికి ఉసిగొల్పారు ట్రంప్. ఆ కేసులో ఆయన దోషిగా తేలడం, ఈసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి అనర్హునిగా మారే ప్రమాదంలో పడటం విశేషం! ఈ గండం గట్టెక్కితే ట్రంప్ మరోసారి బైడెన్‌తోనే తలపడతారు. ఘనా 3 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో డిసెంబర్ 7న ఎన్నికలు జరగనున్నాయి. వరుసగా రెండోసారి అధ్యక్షునిగా కొనసాగుతున్న ననా అకుఫో అడో స్థానంలో కొత్త నేతను ఎన్నుకునేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. అధికార న్యూ పేట్రియాటిక్ పార్టీ, విపక్ష నేషనల్ డెమొక్రటిక్ కాంగ్రెస్ మధ్య ఈసారి హోరాహోరీ ఖాయమంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
క్రిస్మస్ ముందస్తు వేడుకల్లో కాల్పులు.. 16 మంది మృతి
మెక్సికోలో దారుణం జరిగింది. క్రిస్మస్ ముందస్తు వేడుకల్లో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మెక్సికోలోని గ్వానాజువాటో రాష్ట్రాంలోని సాల్వటియెర్రా నగరంలో జరిగింది. నగరంలో కిస్మస్ ముందస్తు వేడుకలు నిర్వహించారు. వేడుకల్లో హాజరైన వ్యక్తులపై ఆరుగురు వ్యక్తులు కాల్పులు జరిపారు. విచక్షణారహితంగా కాల్పులు జరపగా.. 16 మంది అక్కడికక్కడే మృతి చెందారు. అయితే.. కాల్పులు జరిపిన వ్యక్తులను వేడుకకు ఆహ్వానించలేదని, అయినప్పటికీ పార్టీకి వచ్చిన వారిని ప్రశ్నించడంతో కాల్పులు జరిపినట్లు సమాచారం. నిందితుల కోసం పోలీసులు కాల్పులు జరిపారు. ఇదీ చదవండి: కరాచీ ఆస్పత్రిలో దావూద్ ఇబ్రహీం? -
నేరస్తుల చేతికి ప్రభుత్వ డేటా? మెక్సికోలో ఏం జరుగుతోంది?
నేరాలకు, హత్యలకు, దోపిడీలకు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు మెక్సికో దేశం కేంద్రంగా మారింది. ఇప్పుడు ఇక్కడి నేరస్తులు ప్రభుత్వం ఉపయోగించే డేటాబేస్‌ను వినియోగించి మరీ నేరాల్లో మరో ముందడుగు వేశారని వైస్ న్యూస్ నివేదిక వెల్లడించింది. మెక్సికన్ నేరస్తులు తాము టార్గెట్ చేసుకున్న వారి వివరాలను, చివరికి వారి లైవ్ లొకేషన్‌ను తెలుసుకునేందుకు ప్రభుత్వ సంస్థలు ఉపయోగించే ఇంటెలిజెన్స్ , సెక్యూరిటీ డేటాబేస్‌ను యాక్సెస్ చేస్తున్నాయని నిఘా వర్గాలు తమకు తెలియజేశామని వైస్ న్యూస్ పేర్కొంది. నేరస్తులు తాము టార్గెట్ చేసుకున్న వారి వివరాలను జియోలొకేట్ ద్వారా తెలుసుకునేందుకు వారు టైటాన్ అనే సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నారు. తద్వారా తాము టార్గెట్ చేసిన వారి ప్రైవేట్ సమాచారంతోపాటు వారికి సంబంధించిన పత్రాలను పొందుతూ అక్రమాలకు, నేరాలకు పాల్పడుతున్నారు. 10 వేల మెక్సికన్ పెసోలు (రూ. 600) నుండి 1,80 వేల పెసోలు (రూ. 9,000) చెల్లించి నేరస్తులు వివిధ టైటాన్ సేవలను పొందుతున్నారని వైస్ న్యూస్ తెలియజేసింది. ఈ విధంగా నేరస్తులు అధికారికంగా టైటాన్ సేవల సొంత లాగిన్ పొందుతూ, ఆధునిక మార్గాల్లో తమ నేరాలను కొనసాగిస్తున్నారు. నిజానిక్ టైటాన్ సేవలను ఉపయోగించేందుకు పోలీసు బలగాలు సంబంధిత లైసెన్స్‌లను కొనుగోలు చేస్తుంటాయి. అయితే ఆ లైసెన్స్ అక్రమమార్గంలో తిరిగి బ్లాక్ మార్కెట్లోనూ అందుబాటులోకి వస్తున్నదని నిఘా వర్గాలు కనుగొన్నాయి. చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలే ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నాయని నిఘా వర్గాల పరిశోధనలో తేలింది. మెక్సికన్ ఓటర్ ఐడీ డేటాబేస్, క్రెడిట్ బ్యూరోలు, బ్యాంక్ స్టేట్మెంట్లు, ఫోన్ యాప్‌ల లాగ్‌లు, ఇమెయిల్‌లు, ఇలాంటి సమాచారాల ఆధారంగా టైటాన్ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలు సులభంగా నేరస్తులను గుర్తించడానికి ఈ సాఫ్ట్వేర్ రూపొందించినట్లు కంపెనీ ప్రచారం చేస్తుంది. అయినప్పటికీ మెక్సికో, సౌదీ అరేబియా, స్పెయిన్‌తో సహా అనేక ప్రభుత్వాలు, రిపోర్టర్లు, రాజకీయ ప్రత్యర్థులు, ప్రతిపక్ష సమూహాలపై గూఢచర్యం చేయడానికి ఈ సాఫ్ట్వేర్ ఉపయోగిస్తున్నట్లు వాషింగ్టన్ పోస్ట్ పరిశోధనలో తేలింది. అయితే ఈ టైటాన్ సాఫ్ట్వేర్ అక్రమ వినియోగం వెనుక ఎవరు ఉన్నారనేది స్పష్టంగా వెల్లడికాలేదని వైస్ న్యూస్ తెలిపింది. ఈ సాఫ్ట్వేర్ ప్లాట్‌ఫారమ్ లాగిన్ పేజీలోని ఎబౌట్లో ఎటువంటి సమాచారం ఉండదు. అలాగే ఈ సంస్థ సర్వర్లను తరచూ మారుస్తూ ఉంటుంది. బహుశా ఎవరూ ట్రాక్ చేయకుండా ఉండేందుకే ఇటువంటి విధానం అనుసరిస్తుంటుందని తేలింది. నేరస్తులు ఎక్కడ దాక్కున్నారో తెలుసుకునేందుకు కూడా ఉపయోగపడే ఈ టైటాన్ సాఫ్ట్వేర్ సేవలను చట్టాన్ని అమలు చేసే వారి కన్నా.. నేరస్తులే అధికంగా ఉపయోగిస్తున్నారని నిఘా వర్గాల పరిశోధనలో తేలింది. కాగా ఈ వివరాలపై మెక్సికన్ ప్రభుత్వం ఇంతవరకూ స్పందించలేదు. ఇది కూడా చదవండి: దావూద్ ఇబ్రహీంకు సీరియస్? -
సూపర్ స్వియాటెక్...
మహిళల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నీ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) తొలిసారి విజేతగా నిలిచి మళ్లీ ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. మెక్సికోలో మంగళవారం జరిగిన ఫైనల్లో స్వియాటెక్ 6–1, 6–0తో ఐదో ర్యాంకర్ జెస్సికా పెగూలా (అమెరికా)ను ఓడించింది. స్వియాటెక్ కు ట్రోఫీతోపాటు 30,78,000 డాలర్ల (రూ. 25 కోట్ల 62 లక్షలు) ప్రైజ్‌మనీ, రన్నరప్ పెగూలాకు 16,02,000 డాలర్ల (రూ. 13 కోట్ల 33 లక్షలు) ప్రైజ్‌మనీ దక్కింది. -
‘ఫినిషింగ్ టచ్’ ఎవరిదో?
కాన్కున్ (మెక్సికో): మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) సీజన్ ముగింపు టోర్నమెంట్ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌కు రంగం సిద్ధమైంది. ఈ ఏడాది జరిగిన టోర్నీల్లో సాధించిన పాయింట్ల ఆధారంగా టాప్–8లో నిలిచిన క్రీడాకారిణులు ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి అర్హత సాధించారు. నవంబర్ ఐదో తేదీ వరకు జరిగే ఈ టోర్నీకి మెక్సికోలోని కాన్కున్ నగరం ఆతిథ్యమిస్తోంది. ప్రస్తుత ప్రపంచ నంబర్‌వన్ సబలెంకా (బెలారస్), రెండో ర్యాంకర్ ఇగా స్వియాటెక్ (పోలాండ్), మూడో ర్యాంకర్ కోకో గాఫ్ (అమెరికా), నాలుగో ర్యాంకర్ రిబాకినా (కజకిస్తాన్), ఐదో ర్యాంకర్ జెస్సికా పెగూలా (అమెరికా), ఆరో ర్యాంకర్ మర్కెటా వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్), ఏడో ర్యాంకర్ ఆన్స్ జబర్ (ట్యూనిషియా), తొమ్మిదో ర్యాంకర్ మరియా సాకరి (గ్రీస్) ఈ టోర్నీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఎనిమిదో ర్యాంకర్ కరోలినా ముకోవా (చెక్ రిపబ్లిక్) గాయం కారణంగా వైదొలగడంతో సాకరికి ఈ టోర్నీలో ఆడే అవకాశం లభించింది. ‘బాకలార్ గ్రూప్’లో సబలెంకా, రిబాకినా, పెగూలా, సాకరి... ‘చెటుమల్ గ్రూప్’లో స్వియాటెక్, కోకో గాఫ్, జబర్, వొండ్రుసోవా ఉన్నారు. గ్రూప్ దశ మ్యాచ్‌లు ముగిశాక రెండు గ్రూప్‌ల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తారు. గత ఏడాది రన్నరప్ సబలెంకా ఈసారి ఫైనల్ చేరితే ఆమె ఈ ఏడాదిని నంబర్‌వన్ ర్యాంక్‌తో ముగిస్తుంది. ఈ సంవత్సరం సబలెంకా ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచి, యూఎస్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచింది. వింబుల్డన్, ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీల్లో సెమీఫైనల్ చేరుకుంది. స్వియాటెక్ ఫ్రెంచ్ ఓపెన్‌లో, వొండ్రుసోవా వింబుల్డన్ టోర్నీలో, కోకో గాఫ్ యూఎస్ ఓపెన్‌లో టైటిల్స్ సాధించారు. మొత్తం టోర్నీ ప్రైజ్‌మనీ 90 లక్షల డాలర్లు (రూ. 75 కోట్లు). పార్టిసిపేషన్ ఫీజు రూపంలో ఎనిమిది మందికి 1,98,000 డాలర్ల (రూ. కోటీ 65 లక్షలు) చొప్పున లభిస్తాయి. లీగ్ దశలో ఒక్కో విజయానికి అదనంగా 1,98,000 డాలర్లు (రూ. కోటీ 65 లక్షలు) అందజేస్తారు. ఈ టోర్నీలో అజేయంగా విజేతగా నిలిచిన క్రీడాకారిణి 30,24,000 డాలర్లు (రూ. 25 కోట్ల 21 లక్షలు) ప్రైజ్‌మనీగా అందుకుంటుంది. -
పోలీసు కాన్వాయ్‌పై దుండగుల కాల్పుల వర్షం.. 16 మంది మృతి
మెక్సికోలో ఘోరం జరిగింది. పోలీసులు ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 12 మంది పోలీసులు సహా 16 మంది ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ రాష్ట్రమైన గురెరోలోని కోయుక డీ బెనిటేజ్ నగరంలో సోమవారం ఈ దారుణం చోటుచేసుకున్నట్లు పోలీసులు ధృవీకరించారు. దాడి జరిగిన సమయంలో జాతీయ భదత్ర విభాగానికి చెందిన సీనియర్ అధికారి ప్రయాణిస్తున్నట్లు, అతన్ని లక్ష్యంగా చేసుకొని కాల్పులకు పాల్పడినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ కాల్పుల్లో సదరు అధికారితోపాటు, మొత్తం 16 మంది మరణించినట్లు చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాల్పులకు గల కారణాలపై విచారిస్తున్నారు. ఈ ఘటనపై అలెజాండ్రో హెర్నాండెజ్ అనే అధికారి మాట్లాడుతూ.. ప్రాథమిక విచారణ ప్రకారం.. గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడంతో 13 మంది మున్సిపల్ పోలీసులు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. దాడి చేసిన వారిని డ్రగ్ సరాఫరా చేసే ముఠాగా అనుమానిస్తున్నట్లు తెలిపారు. చదవండి:బంగ్లాదేశ్‌లో రెండు రైళ్లు ఢీ.. 20 మంది మృతి -
వలసదారుల ట్రక్కు బోల్తా.. 10 మంది దుర్మరణం
దక్షిణ మెక్సికోలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. 25 మందికి పైగా గాయపడ్డారు. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం దక్షిణ మెక్సికో రాష్ట్రమైన చియాపాస్‌లో అక్రమ వలసదారులను తీసుకెళ్తున్న ట్రక్కు హైవేపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది వలసదారులు మరణించారు 25 మందికి పైగా వలసదారులు గాయాలపాలయ్యారు. మృతులంతా మహిళలేనని అధికారులు తెలిపారు. వారిలో ఒకరు 18 ఏళ్లలోపు వయస్సు గలవారున్నారన్నారు. గ్వాటెమాల సరిహద్దులో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. వారం రోజుల వ్యవధిలో వలసదారులకు సంబంధించి ఇది రెండవ ప్రమాదం అని తెలుస్తోంది. ప్రమాద బాధితులంతా క్యూబన్లు అని ఒక అధికారి వార్తాసంస్థకు వెల్లడించారు. దక్షిణ రాష్ట్రమైన చియాపాస్‌లోని పిజ్జియాపాన్-టోన్లా హైవేపై ట్రక్కు 27 మంది క్యూబా వలసదారులను తీసుకువెళుతున్నారు. పిజిజియాపాన్-టోన్లా హైవేపై ట్రక్కు ప్రమాదానికి గురైంది. ట్రక్కు డ్రైవర్ అతివేగంతో వాహనాన్ని నడిపినట్లు ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయని అధికారులు తెలిపారు. లారీ బోల్తా పడిన వెంటనే డ్రైవర్ పరారయ్యాడు. ప్రస్తుతం క్షతగాత్రులంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో ట్రక్కు తునాతునకలయ్యింది. వలసదారులు తరచూ రష్యా నుండి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంటారు. కాగా వలసదారులతో వెళ్తున్న వాహనం ప్రమాదానికి గురికావడం ఇది మొదటిసారి కాదు. గత గురువారం తెల్లవారుజామున చియాపాస్ రాష్ట్రంలోని మెజ్కలాపా మున్సిపాలిటీ పరిధిలో ఒక ట్రక్కు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వలసదారులు మరణించారు. అమెరికా వెళ్లేందుకు వివిధ దేశాల నుంచి వేలాది మంది వలసదారులు మెక్సికో నుంచి బస్సులు, ట్రక్కులు, గూడ్స్ రైళ్లలో సైతం ప్రయాణిస్తుంటారు. 2021లో జరిగిన ఇటువంటి ప్రమాదంలో 55 మంది వలసదారులు మరణించగా, 100 మందికి పైగా గాయపడ్డారు. ఇది కూడా చదవండి: జపనీస్ కుర్రాళ్లు గడ్డం ఎందుకు పెంచుకోరు? -
తల్లీకొడుకులను భయపెట్టి వారి ఆహారం తిసేసిన ఎలుగు
మెక్సికోలోని చిపింక్యూ ఎకోలాజికల్ పార్క్‌లో చోటుచేసుకున్న ఒక ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పిక్నిక్ పార్టీలోకి చొరబడిన ఒక ఎలుగుబంటి అక్కడి ఆహార పదార్థాలన్నింటినీ ఆనందంగా ఆరగించింది. ఆ ఎలుగుబంటి ఎటువంటి బెరుకు లేకుండా, టేబుల్‌పైకి ఎక్కి అక్కడి ఆహారాలను ఆనందంగా ఆస్వాదించింది. పిక్నిక్ చేసుకునేందుకు వచ్చిన తల్లీకొడుకులు ఆ సీన్ చూసి భయంతో నిశ్శబ్దంగా కూర్చుండిపోయారు. ఎలుగుబంటి నుండి తన కుమారుడిని రక్షించడానికి ఆ మహిళ ప్రయత్నించడం వీడియోలో కనిపిస్తుంది. ఈ వైరల్ వీడియో టిక్‌టాక్‌లో 10 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కించుకుంది. అటవీ జంతువుల చేష్టలను చూసేందుకు ఇష్టడేవారు ఈ వీడియోను మళ్లీ మళ్లీ చూస్తున్నారు. బీబీసీ తెలిపిన వివరాల ప్రకారం చిపింక్ ఎకోలాజికల్ పార్క్ నిర్వాహకులు మాంటెర్రీ మెట్రోపాలిటన్ ప్రాంతంలో పెరుగుతున్న ఎలుగుబంటి దాడుల గురించి ఇటీవల హెచ్చరికను జారీ చేశారు. పార్క్ సందర్శకుల కోసం పలు సూచనలు చేశారు. ఫొటోలు, వీడియోల కోసం ఈ జంతువులకు దగ్గరగా వెళ్లవద్దని హెచ్చరించారు. పార్క్‌లో ఇలాంటి దాడి జరగడం ఇదేమీ తొలిసారి కాదు. 2020లో ఒక ఎలుగుబంటి సందర్శకునిపై దాడి చేసింది. అప్పుడు కూడా ఇలాంటి వీడియో వైరల్‌గా మారింది. ఇది కూడా చదవండి: ‘జో నెహ్రూ’ ఎవరు? ఇందిర, సోనియా, ప్రియాంకలకు ఏమి బహూకరించారు? A family was stunned when an intruding bear hopped onto their table to devour their food. The eldest daughter captured the scene as the bear continued munching away in Parque Ecológico Chipinque in San Pedro, Mexico 🇲🇽. The mother, as seen in the video, remained calm, shielding… pic.twitter.com/o47OkJQsNr — Voyage Feelings (@VoyageFeelings) September 27, 2023 -
గ్రహాంతరవాసీ... నీవున్నావా?
విశ్వాంతరాళాల్లో గ్రహాంతరవాసుల ఉనికి, గుర్తుతెలియని ఎగిరే వస్తువు (యూఎఫ్‌వో)ల జాడకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా దశాబ్దాలుగా చర్చలు, వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి. గ్రహాంతరవాసులకు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వాలు దాచిపెడుతున్నాయని కొందరు ఔత్సాహికులు ఆరోపిస్తుంటే తమ దగ్గర ఎలాంటి సమాచారం లేదని, ఈ విషయంలో పారదర్శకత అవసరమని ప్రభుత్వాలు చెబుతున్నాయి. వివిధ దేశాల పార్లమెంటరీ కమిటీలూ ఈ విషయమై ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గ్రహాంతరవాసులు, యూఎఫ్‌వోలకు సంబంధించి మన దగ్గర ఉన్న సమాచారం ఏమిటి, వాటి నిజానిజాలు ఎంత అన్నది పరిశీలిద్దాం. గ్రహాంతరవాసుల ఉనికికి సంబంధించి ఇటీవల మెక్సికో కాంగ్రెస్‌లో ఓ ప్రత్యేక సమావేశం జరిగింది. అయితే అనూహ్యంగా సమావేశ మందిరంలో ప్రదర్శించిన వింత ఆకారంలోని రెండు భౌతికకాయాలు యావత్ ప్రపంచాన్ని నివ్వెరపరిచాయి. ప్రముఖ జర్నలిస్టు, యూఎఫ్‌వో పరిశోధకుడు జైమీ మౌసాన్ ప్రదర్శనకు పెట్టిన ఆ భౌతికకాయాలు 45 ఏళ్ల క్రితం ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు స్పీల్బర్గ్ గ్రహాంతరవాసులపై కల్పిత కథ ఆధారంగా నిర్మించిన చిత్రం ఈటీ (ఎక్స్ట్రా టెరె్రస్టియల్)లో చూపిన గ్రహాంతరవాసిని పోలినట్లుగా ఉన్నాయి. అవి పెరు దేశంలోని కుస్కో ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో బయటపడ్డాయని, వాటిని కార్బన్ డేటా ద్వారా పరీక్షించగా దాదాపు వెయ్యేళ్ల క్రితం నాటివిగా తేలిందని జైమీ మౌసాన్ చెప్పారు. డీఎన్ఏ పరీక్షలోనూ ఈ దేహాల్లో 30 శాతానికిపైగా గుర్తుతెలియని పదార్థాలు ఉన్నట్లు తేలిందని, ఆ భౌతికకాయాలు భూమిపై జన్మించిన జీవులు కాదని, ఇతర గ్రహాల నుంచి వచ్చిన వారివేనని ఆయన వాదించారు. అయితే ఈ వాదనపై ‘నాసా’అనుమానాలు వ్యక్తం చేసింది. తమ వద్ద ఉన్న అపారమైన సమాచారం మేరకు ఇంతవరకు గ్రహాంతరవాసుల ఉనికికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదని, ఏమైనా అనుమానాస్పద విషయాలు వెలుగులోకి వస్తే వాటిని శాస్త్రవేత్తల పరిశీలనకు అందుబాటులో ఉంచాలని కోరింది. అమెరికాలోనూఇదే తంతు... యూఎఫ్‌వోలకు సంబంధించి అమెరికా కాంగ్రెస్ కూడా ఇటీవల ప్రత్యేక సమావేశం నిర్వహించింది. అందులో అమెరికా మాజీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ డేవిడ్గ్రుస్ అమెరికా ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేశారు. గ్రహాంతరవాసులకు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వం రహస్యంగా ఉంచుతోందని, కూలిపోయిన యూఎఫ్‌వోలు వాటితోపాటు వచ్చిన గ్రహాంతరవాసుల భౌతికకాయాలు అమెరికా అదీనంలో ఉన్నాయని ఆయన ఆరోపించారు. అంతేకాదు.. అమెరికా ప్రభుత్వం ఈ గ్రహాంతర వాహనాలను రివర్స్ ఇంజనీరింగ్ ద్వారా మళ్లీ నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తన పరిశోధనలో తెలిసిందని కూడా డేవిడ్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న అమెరికా నౌకాదళ మాజీ పైలట్ ర్యాన్గ్రేవ్స్ మాట్లాడుతూ గతంలో తాను విమానం నడుపుతున్నప్పుడు రెండు సందర్భాల్లో యూఎఫ్వోలను చూశా నని వాంగ్మూలం ఇచ్చారు. అయితే అమెరికా రక్షణశాఖ ఈ వాదనలను తిరస్కరించింది. గ్రహాంతరవాసులు, వాహనాలకు సంబంధించి తమ వద్ద ఎలాంటి కచ్చితమైన సమాచారం లేదని పెంటగాన్ ప్రతినిధి సూగ్రౌఫ్ ప్రకటన విడుదల చేశారు. ఊహాగానాలకు నెలవుగా ఏరియా 51 అమెరికాలోని నెవడా రాష్ట్రంలో ఉన్న నిషేధిత ఏరియా 51 ప్రాంతం అనాదిగా వాదవివాదాలకు, ఊహాగానాలకు కేంద్రంగా నిలిచింది. ఈ నిషేధిత ప్రాంతంలో గ్రహాంతరవాసులు, వాహనాలకు సంబంధించిన అవశేషాలు ఉన్నట్లు విపరీతమైన ప్రచారం జరిగింది. దీనిపై అనేక పుస్తకాలు, టీవీ సీరియల్స్ సైతం వచ్చాయి. కొందరు ఔత్సాహికులు ఈ ప్రాంతంలోకి అడుగుపెట్టేందుకు విఫలయత్నాలు చేశారు. గ్రహాంతరవాసుల కథనాలతోపాటు అమెరికా చంద్రునిపై కాలుపెట్టిన ఉదంతం వాస్తవానికి ఏరియా 51లో కృత్రిమంగా రూపొందించారన్న ప్రచారం కూడా ఉంది. యాభైయ్యవ దశకంలో ఈ ప్రాంతంలో గ్రహాంతర వాహనాలు తరచూ కనిపించడం వల్లే ఏరియా 51కి అమెరికా అంతటా ఆసక్తి రేకెత్తింది. 2013లో సీఐఏ బహిర్గతం చేసిన రహస్య పత్రాల్లో అసలు విషయం బయటపడింది. యాభైయ్యవ దశకంలో ప్రయాణికుల విమానాలు 10 వేల నుంచి 20 వేల అడుగుల ఎత్తులో మాత్రమే పయనించగలిగేవి. కొన్ని రకాల యుద్ధవిమానాలు 40 వేల అడుగుల ఎత్తు వరకు పయనించేవి. 1955లో అప్పటి అధ్యక్షుడు ఐసెన్‌హోవర్ మరింత ఎత్తులో ఎగిరే యుద్ధవిమానాలు యు–2ల నిర్మాణ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపారు. ఈ విమానాలు 60 వేల అడుగుల ఎత్తులో పయనించగలిగేవి. సాధారణ విమాన ప్రయాణికులకు ఈ విషయం తెలియక వాటిని గ్రహాంతర వాహనాలుగా ప్రచారం చేశారు. అయితే ఈ విషయం తెలిసిన వైమానికదళ అధికారులు వాటిని పెద్దగా పట్టించుకోలేదు. తరువాతి కాలంలో అత్యాధునిక యుద్ధవిమానాలను ఏరియా 51లో పరీక్షించేవారు. అల్లంత దూరాన చిగురిస్తున్న ఆశలు... జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ పంపిన సమాచారాన్ని విశ్లేíÙంచిన ‘నాసా’భూమికి సుదూరంగా ఉన్న కే2–18బీ అనే గ్రహంలో నీటితో నిండిన సముద్రాలు, అందులో జీవచరాలు ఉండే అవకాశం ఉందని ఇటీవల వెల్లడించింది. భూమికి కనీసం 8.6 రెట్లు పెద్దదైన ఈ గ్రహం మనకు 120 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఈ గ్రహం వాతావరణంలో అత్యధిక స్థాయిలో హైడ్రోజన్ ఉండటమే కాకుండా అదే స్థాయిలో మీథేన్, కార్బన్ డయాక్సైడ్, స్వల్ప పరిమాణంలో అమ్మోనియా వాయువులు ఉండటం వల్ల అక్కడ సముద్రజలాలు ఉండే అవకాశం ఉందని నాసా అంచనా వేసింది. అంతకుమించి కే2–18బీ గ్రహ వాతావరణంలో డిమిౖథెల్ సల్ఫైడ్ (డీఎంఎస్) అణువులు కూడా ఉన్నట్లు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కనుగొంది. భూమిపై ఈ డీఎంఎస్ను సముద్రంలో వృక్షజాతికి చెందిన నాచులాంటి మొక్కలు మాత్రమే ఉత్పత్తి చేయగలవు. దాంతో కే2–18బీపై కూడా జీవం ఉండే ఆస్కారం మెండుగా ఉందని నాసా భావిస్తోంది. శుక్రుడిపైనా జాడలు... తాజాగా శుక్రగ్రహంపై జీవం ఉండే ఆస్కారం ఉందనడానికి తగిన ఆధారాలు లభించాయి. యూకేలోని వేల్స్లో ఉన్న కార్డిఫ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం చేపట్టిన పరిశోధనల్లో శుక్రుడిపై వాతావరణంలో ఫాస్ఫైన్ వాయువులు ఉన్నట్లు బయటపడింది. కార్టిఫ్ బృందానికి చెందిన గ్రీవ్స్ అనే శాస్త్రవేత్త ఇటీవల రాయల్ ఆ్రస్టానామికల్ సొసైటీ జాతీయ సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఫాసై్పన్ వాయువుపై ఇంత ఆసక్తి ఎందుకంటే భూమిపై ఈ వాయువు కేవలం జీవజాలాల నుంచే వెలువడుతుంది. భూమిపై స్వచ్ఛమైన హైడ్రోజన్ తక్కువ పరిమాణంలో ఉన్న చోట జీవజాలం గుండా ఫాస్పైన్ ఉత్పత్తి జరు గుతుంది. శుక్రుడు వాతావరణంలో దిగువ భాగంలోనే ఈ ఫాసై్పన్ మేఘాలు ఆవరించి ఉండటంతో అక్కడ జీవం ఉండే ఆస్కారం అత్యధికంగా ఉందనేది కార్డిఫ్ బృందం అభిప్రాయం. మూడేళ్ల క్రితం ఈ విషయం బయటపడ్డా అప్పట్లో శాస్త్రవేత్తలు అంతగా ఆసక్తి చూపలేదు. కేవలం ఫాస్పైన్ ఉన్నంత మాత్రాన జీవం ఉందని కచ్చితంగా చెప్పలేమని అన్నారు. కానీ ఇటీవల జరిగిన మరిన్ని పరిశోధనల ఫలితంగా ఇప్పుడు శుక్రుడిపై జీవం జాడలు కనుగొనేందుకు ఆసక్తి పెరిగింది. ఆధారాలను కనుగొనే దిశగా... గ్రహాంతరవాసులపట్ల మనిషికి అనాదిగా ఆసక్తి ఉంది. వాటి కోసం నిరంతర అన్వేషణ జరుగుతూనే ఉంది. రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా రోదసిలో ఈ గ్రహాంతర జీవుల కోసం వెదుకుతూనే ఉన్నాం. అయినా ఇంతవరకూ కచ్చితమైన ఆధారాలేమీ దొరకలేదు. మెక్సికో కాంగ్రెస్‌లో ప్రదర్శించిన భౌతికకాయాలపై జరుగుతున్న పరీక్షలు వాటిని గ్రహాంతరవాసులుగా తేలిస్తే అవే మనకు మొదటి ఆధారాలు కాగలవు. అంగారకుడిపై ఎప్పుడైనా జీవం ఉన్న దాఖలాలు ఏమైనా ఉన్నాయా అనే విషయంతోపాటు అంగారకుడిపై జీవం మనుగడకు అవకాశం ఉందా అనే విషయాన్ని పరిశీలించడానికి నాసా ఒక బృహత్తర కార్యక్రమం చేపట్టింది. నాసాకు చెందిన ప్రిసర్వేరన్స్ రోవర్ గత జనవరిలో అంగారకుడిపై అనేక ట్యూబ్ లను వదిలింది. ఇవి అక్కడి మట్టి, రాళ్లను సేకరిస్తాయి. వాటిని తిరిగి భూమిపైకి తేవడానికి మార్స్ శాంపిల్ రిటర్న్ (ఎంఎస్ఆర్) కార్యక్రమాన్ని ప్రారంభించింది. నాసా అంచనా ప్రకా రం ఇది 2030 నాటికి పూర్తవుతుంది. విశ్వంలో జీవానికిమెండుగా అవకాశాలు... అసలు గ్రహాంతరవాసులు ఉన్నాయా లేక కేవలం భూమిపైనే జీవం ఉందా అనే ప్రశ్నకు శాస్త్ర ప్రపంచం ఇచ్చే సమాధానం ఒక్కటే. అనంతకోటి విశ్వంలో భూమిని పోలిన పరిస్థితులు ఉన్న గ్రహాలు ఇంకా ఉండేందుకు అవకాశం మెండుగా ఉంది. విశ్వం మొత్తంలో కోటానుకోట్ల గెలాక్సీలు ఉన్నాయి. ఒక్క మన పాలపుంత (మిల్కివే) గెలాక్సీలోనే 10,000 కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. ఇన్నింటి మధ్య భూమిలాంటి వాతావరణం ఉన్న గ్రహాలు అనేకం ఉండే ఆస్కారం ఉంది. అలాంటిచోట జీవం ఆవిర్భవించే అవకాశాలూ ఉన్నాయి. ఏమో ఏదో రోజు మనకు ఈ గ్రహాంతర వాసులతో ములాఖత్ జరిగే అవకాశమూ ఉంది. -దొడ్డ శ్రీనివాసరెడ్డి -
ఏలియన్ అవశేషాల పరిశోధనలో సంచలన విషయాలు
మెక్సికో సిటీ: మెక్సికో పార్లమెంట్లో మానవేతర అవశేషాల(ఏలియన్)ను ప్రదర్శించిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా వైద్యుల పరిశోధనలో వీటిపై ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఈ ఏలియన్లు భూమిపై జీవించి ఉన్నవేనని పరిశోధనల్లో తేలింది. అంతేకాకుండా ఓ ఆడ ఏలియన్ కడుపులో గుడ్లు కూడా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. దాదాపు వెయ్యి ఏళ్ల క్రితంనాటి అవశేషాలుగా కార్బన్ డేటింగ్ విధానంలో కనుగొన్నారు. మెక్సికో శాస్త్రవేత్తలు గ్రహాంతర శవాలపై ప్రయోగశాలలో విస్తృతమైన అధ్యయనాలు నిర్వహించారు. సోమవారం నూర్ క్లినిక్‌లో నౌకాదళానికి చెందిన ఫోరెన్సిక్ వైద్యుడు జోస్ డి జీసస్ జల్సే బెనితేజ్ పరీక్షలు పూర్తి చేశారు. ఈ ఏలియన్ల పుర్రెలు అతికించినట్లు ఎలాంటి ఆధారాలు కనిపించలేదని చెప్పారు. భూమిపై ఏ ఇతర జంతువుతో పోలి లేవని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఒకదాని కడుపులో గుడ్లు ఉన్నట్లు కనుగొన్నారు. ఆ రెండు అవశేషాలు ఒకే అస్థిపంజరానికి చెందినవని మెక్సికన్ జర్నలిస్ట్ ధీర్ఘకాల UFO ఔత్సాహికుడు జైమ్ మౌసన్ పేర్కొన్నారు. ఒక్కోదాని చేతికి మూడు వేళ్లు ఉన్నట్లు వెల్లడించారు. Mexico's Congress just unveiled two dead aliens estimated to be around 1,000 years old. What do you think? pic.twitter.com/Zr7z4FKenS — Kage Spatz (@KageSpatz) September 13, 2023 నేషనల్ అటానమస్ యూనివర్శిటీ ఆఫ్ మెక్సికోలోని శాస్త్రవేత్తలు ఆ అవశేషాలపై కార్బన్ డేటింగ్ విధానంలో పరిశోధనలు చేశారు. అవి 1000 ఏళ్లనాటివని తేలినట్లు తమ పరిశోధనలో తేలినట్లు వెల్లడించారు. భూమిపై ఒకప్పుడు జీవం ఉన్న, జీవ సంబంధమైన, గర్భధారణ కలిగి ఉన్నాయని తమ పరిశోధనలో తేలినట్లు పరిశోధకులు తెలిపారు. ఇదీ చదవండి: ఏలియన్ అవశేషాలు.. నాసా స్పందన ఇది -
ఏలియన్ అవశేషాలు.. నాసా స్పందన ఇది
మెక్సికో సిటీ: మెక్సికో పార్లమెంటు సమావేశాల్లో తాజాగా చోటు చేసుకున్న విచిత్ర పరిణామం.. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మానవేతర అవశేషాలుగా పేర్కొంటూ రెండు వింత ఆకారాలను మంగళవారం ఏకంగా చట్టసభలోనే ప్రదర్శించారు కొందరు పరిశోధకులు. అలాగే.. తమ పరిశోధనల్లో ఇప్పటివరకూ వెలుగుచూసిన అంశాలను చట్టసభ్యులకు నివేదించారు. అయితే ఈ పరిణామంపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా స్పందించింది. మెక్సికో పార్లమెంట్ ఏలియన్ల బాడీ వ్యవహారంలో పాదర్శకత అవసరమని నాసా అభిప్రాయపడింది. ‘‘ఇది ట్విటర్లోనే నేను చూశా. వాటి గురించి మా వద్ద ఎలాంటి సమాచారం లేదు. అయితే.. ఈ విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలి. మీదగ్గర అసాధారణమైనవి కనిపించినప్పుడు.. అందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని బయటపెట్టాలి. అది నిజంగా వింతదే అయితే.. శాంపిల్స్‌ని శాస్త్రీయ సమాజానికి అందుబాటులో ఉంచండి అంటూ మెక్సికన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు డేవిడ్ స్పెర్గెల్. డేవిడ్ స్పెర్గెల్ ప్రిన్స్టన్ యూనివర్సిటీ ఆస్ట్రోఫిజిక్స్ విభాగానికి మాజీ అధిపతి. ప్రస్తుతం యూఏపీకి అధ్యక్షత వహిస్తున్నారు.యూఏపీ అంటే unidentified anomalous phenomeno. గాల్లో ఎగిరే వింత వస్తువులు, పల్లెలు, ఆకారాలుగా ఇంతకు ముందు యూఎఫ్‌వో UFO(Unidentified Flying Objects) పేరుతో ఇది జనాలకు పరిచయం. అయితే యూఎఫ్వోనే ఇప్పుడు యూఏపీగా వ్యవహరిస్తున్నారు. నాసా కూడా.. మానవేతర జీవుల మనగడ వాస్తవమా? కదా? అనేవిషయంపై అధ్యయనం కోసం UAP పేరుతో ఓ అధ్యయన బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇది ఎప్పటికప్పుడు తమ నివేదికలను అమెరికా ప్రభుత్వానికి నివేదిస్తుంటుంది. ప్రస్తుతానికి స్పెర్గెల్ యూఏపీకి గౌరవ అధ్యక్షుడిగా వ్యవహరిస్తుండగా.. త్వరలోనే ఆ బృందానికి పూర్థిస్థాయి డైరెక్టర్ నియామకం ఉంటుందని నాసా తాజాగా ప్రకటించింది. మరోవైపు మెక్సికో పార్లమెంట్లో ప్రదర్శించిన వింత ఆకారాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. పెరూలోని నజ్కా ఎడారిలో కుస్కోలో గల డయాటమ్ గనుల్లో జరిపిన తవ్వకాల్లో 2017లో రెండు విచిత్ర ఆకారాలు బయటపడ్డాయని, వెయ్యి సంవత్సరాల కిందటివని, గ్రహాంతరవాసులవేనని సదరు పరిశోధకులు చెబుతున్నారు. ఈ పరిశోధకుల్లో.. మెక్సికోతో పాటు అమెరికా, జపాన్, బ్రెజిల్ పరిశోధకులూ ఉన్నారు. గ్రహాంతరవాసుల ఉనికి నిజమే అయ్యుండొచ్చని వారు అభిప్రాయపడుతుండడం గమనార్హం. మరోవైపు మెక్సికో పాత్రికేయుడు జోస్ జైమ్ మౌసాన్ స్పందిస్తూ.. ‘‘ఆ వింత ఆకారాలు మానవేతరులవని డీఎన్ఏ పరీక్షల్లో స్పష్టమైందన్నారు. భూ ప్రపంచంలో వేటికీ అవి సరిపోలడం లేదు. కాబట్టే.. గ్రహాంతరవాసుల ఉనికి వాస్తవమని నమ్మాల్సి ఉంటుంది. అని పేర్కొన్నారు. మెక్సికో కాంగ్రెస్‌లో ప్రదర్శించిన ఏలియన్ అవశేషాల వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండగా.. వాటికి కౌంటర్ మీమ్స్ సైతం విపరీతంగా వైరల్ అవుతున్నాయి. -
అమ్మాయి శవాన్ని తీస్తానంటూ..వికృత బొమ్మల్ని తీశాడు అంతే...
నిశ్శబ్దం మాటున ఊహించని అలజడులు, నిర్మానుష్యం చాటున నిరాధార ఆనవాళ్లు.. ధీరులకు సైతం నిస్సందేహంగా ప్రాణభయాన్ని సృష్టిస్తాయి. అలాంటిదే ఆ దీవి. ఆక్కడ ఒంటరిగా అడుగు పెడితే తిరిగి రావడం కష్టమే అంటారు మెక్సికన్స్. సుమారు అరవై మూడేళ్ల క్రితమే.. గగుర్పొడిచే ఆ భీతికి బీజం పడింది. దాని సృష్టికర్త డాన్ జూలియన్ బరేరా! మెక్సికో నగరానికి దక్షిణంగా 17 మైళ్ల దూరంలో షోచిమిల్కో సమీపాన భార్యపిల్లలతో సంతోషంగా జీవించేవాడు బరేరా. తన నలభయ్యో ఏట.. ఒకరోజు దగ్గర్లోని ‘ఇస్లా డి లాస్ మునెకాస్’ అనే ద్వీపానికి ఒంటరిగా వెళ్లాడు. తిరిగి రాగానే.. ‘ఆ ద్వీపంలోని సరస్సులో ఒక అమ్మాయి మునిగిపోవడం చూశా. కాపాడటానికి ప్రయత్నించా. కానీ కాపాడలేకపోయా’నని చెప్పాడు. మరునాడే కొందరు స్థానికుల్ని వెంటతీసుకెళ్లి.. ఆ సరసులోకి దిగి ‘అమ్మాయి శవాన్ని తీస్తా’ అంటూ అందులోంచి కొన్ని భయంకరమైన బొమ్మల్ని బయటికి తీశాడు. అవన్నీ దుష్ట ఆత్మ నుంచి వచ్చిన సంకేతాలని ప్రకటించాడు. ఆ చెడు నుంచి తనను తాను రక్షించుకోవడానికి, చనిపోయిన అమ్మాయి ఆత్మను శాంతింపజేయడానికి వాటిని చెట్లకు వేలాడదీయడం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి అక్కడికి క్రమం తప్పకుండా వెళ్లేవాడు. అలా సుమారు నలభై ఏళ్ల పాటు అదే ద్వీపంలో ఒంటరిగా జీవిస్తూ.. భయానకమైన బొమ్మల్ని పోగుచేసి.. మొక్కలకు, చెట్లకు, షెడ్లకు వేలాడదీశాడు. అప్పుడప్పుడు మనుషుల ఆవాసాలకు వచ్చిపోతూ ఉండేవాడు. అయితే తన 80వ ఏట 2001లో అదే సరస్సులో శవమై తేలాడు బరేరా. దాంతో ఆ ద్వీపం మిస్టీరియస్ హాంటింగ్ ప్లేస్‌లా ప్రపంచానికి పరిచయమైంది. ఇక్కడ కొన్ని వందల వికృతమైన బొమ్మలు భీకరమైన ముఖాలతో, హడలెత్తించే చూపులతో అటూ ఇటూ ఊగుతూ చెట్లకు దెయ్యాల్లా వేలాడుతూ ఉంటాయి. కొన్నింటికి చేతులు, కాళ్లు, మొండెం, తలలు ఊడిపోయి మరింత వణికిస్తుంటాయి. కొన్ని చెట్లు, మొక్కలు చనిపోయి ఎండు మోడుల్లా ఆ వాతావరణాన్ని ఇంకా హడలెత్తిస్తుంటాయి. ఈ బొమ్మలలో ఆత్మలు నివసిస్తాయని అక్కడ స్థానికులు బలంగా నమ్ముతారు. రాత్రిపూట వింత వింత శబ్దాలు వినిపిస్తుంటాయని సమీప వాసులు చెబుతుంటారు. దాంతో అంతా ఈ దీవిని ‘డెడ్ డాల్స్ ఐఆలాండ్’ అని పిలవడం మొదలుపెట్టారు. అయితే ఇది ప్రస్తుతం పర్యాటక కేంద్రంగా మారింది. దాంతో ఔత్సాహికులు ఈ ద్వీపాన్ని సందర్శించి, ఈ బొమ్మలతో సెల్ఫీలు దిగుతుంటారు. ఏదేమైనా సరస్సులో చనిపోయిన ఆ అమ్మాయి ఎవరు? బరేరా ఎలా చనిపోయాడు? అసలు అమ్మాయి మరణం గురించి అతడు నిజం చెప్పాడా? లేక కల్పించి చెప్పాడా? లేదంటే ఏదైనా దుష్టశక్తి మాయలో అతడు చిక్కాడా? నిజంగానే ఆ బొమ్మల్లో ఆత్మలు ఉన్నాయా? ఇలా అన్నీ మిస్టరీలే! --సంహిత నిమ్మన (చదవండి: ఓ అమాయకురాలి విషాద గాథ! చంపింది స్నేహితుడా?.. ప్రేమికుడా?..ఆ రోజు ఏం జరిగింది?) -
పసిడి పోరుకు భారత జట్లు
పారిస్: ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్‌లో కనబరిచిన జోరును భారత ఆర్చర్లు ప్రపంచకప్ స్టేజ్–4 టోర్నీలోనూ కొనసాగించారు. బుధవారం జరిగిన కాంపౌండ్ విభాగం టీమ్ ఈవెంట్స్‌లో భారత మహిళల, పురుషుల జట్లు స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించాయి. ఆంధ్రప్రదేశ్ స్టార్ ప్లేయర్ వెన్నం జ్యోతి సురేఖ, ప్రపంచ చాంపియన్ అదితి స్వామి, పర్ణీత్ కౌర్‌లతో కూడిన భారత మహిళల జట్టు సెమీఫైనల్లో 234–233తో ఎల్లా గిబ్సన్, లేలా అనిసన్, ఇసాబెల్ కార్పెంటర్లతో కూడిన బ్రిటన్ జట్టును ఓడించింది. శనివారం జరిగే ఫైనల్లో మెక్సికో జట్టుతో భారత్ బృందం తలపడుతుంది. రెండో సెమీఫైనల్లో మెక్సికో 234–233తో దక్షిణ కొరియాపై గెలిచింది. క్వాలిఫయింగ్‌లో అగ్రస్థానంలో నిలిచి టాప్ సీడ్ హోదాలో నేరుగా క్వార్టర్ ఫైనల్ ఆడిన భారత జట్టు 233–230 ఎస్తోనియా జట్టును ఓడించింది. మరోవైపు ప్రపంచ చాంపియన్ ఓజస్ దేవ్‌తలే, అభిషేక్ వర్మ, ప్రథమేశ్‌లతో కూడిన భారత పురుషుల జట్టు కూడా బంగారు పతకంపై గురి పెట్టింది. తొలి రౌండ్లో భారత జట్టు 239–235తో ఇటలీపై గెలిచింది. క్వార్టర్ ఫైనల్లో టీమిండియా 237–235తో మెక్సికో జట్టును ఓడించింది. భారత్, టాప్ సీడ్ దక్షిణ కొరియా జట్ల మధ్య జరిగిన సెమీఫైనల్లో నాలుగు సిరీస్‌ల తర్వాత రెండు జట్లు 235–235తో సమంగా నిలిచాయి. దాంతో విజేతను నిర్ణయించేందుకు ‘షూట్ ఆఫ్’ అనివార్యమైంది. ‘షూట్ ఆఫ్’లోనూ రెండు జట్లు 30–30తో సమంగా నిలిచాయి. అయితే కొరియా ఆర్చర్లతో పోలిస్తే భారత ఆర్చర్ ఓజస్ దేవ్‌తలే కొట్టిన బాణం కేంద్ర బిందువుకు అతి సమీపంలో ఉండటంతో భారత జట్టును విజేతగా ప్రకటించారు. రెండో సెమీఫైనల్లో అమెరికా 238–234తో డెన్మార్క్‌పై గెలిచి శనివారం జరిగే స్వర్ణ పతక మ్యాచ్‌లో భారత్‌తో పోటీపడేందుకు సిద్ధమైంది. రెండో రౌండ్లో ధీరజ్ బుధవారం జరిగిన పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్‌తోపాటు అతాను దాస్ రెండో రౌండ్లోకి అడుగు పెట్టారు. తొలి రౌండ్లో ధీరజ్ 6–2తో ఇమాదిద్దీన్ బాక్రి (అల్జీరియా)పై, అతాను దాస్ 6–0తో ఎలైన్ వాన్ స్టీన్ (బెల్జియం)పై గెలుపొందారు. భారత్‌కే చెందిన మృణాల్ చౌహాన్ 3–7తో ఫ్లోరియన్ ఫాబెర్ (స్విట్జర్లాండ్) చేతిలో, తుషార్ ప్రభాకర్ 2–6తో పీటర్ బుకువాలస్ (ఆ్రస్టేలియా) చేతిలో ఓడిపోయారు. రికర్వ్ క్వాలిఫయింగ్ టీమ్ ర్యాంకింగ్ రౌండ్లో భారత జట్టు 2034 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. దాంతో భారత జట్టుకు నేరుగా రెండో రౌండ్లోకి ‘బై’ లభించింది. -
మెక్సికోలో ఘోరం.. లోయలో పడిన బస్సు.. మృతుల్లో భారతీయులు
మెక్సికో సిటీ: దక్షిణ మెక్సికోలో గురువారం తెల్లవారుజామున ప్యాసింజర్లతో హైవేపై వెళ్తోన్న ఎలైట్ బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 18 మంది మృతి చెందగా అందులో ఆరుగురు భారతీయులున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించామని తెలిపారు మెక్సికో అధికారులు. బస్సులో ప్రయాణిస్తున్న వారిలో వేర్వేరు దేశాలకు చెందిన వారితో పాటు కొంతమంది అమెరికా సరిహద్దు ప్రాంతానికి చెందిన వారు కూడా ఉన్నారని తెలిపారు అధికారులు. మెక్సికో అధికారులు తెలిపిన వివరాల ప్రకారం సరిహద్దులోని తెపిక్ ప్రాంతంలో బారాంకా బ్లాంకా హైవేపై టిజువానా ఉత్తర సరిహద్దు వద్ద వేగంగా వెళ్తున్న బస్సు అదే స్పీడులో టర్నింగ్ తిరగడంతో ఒక్కసారిగా అదుపుతప్పి లోయలో పడిపోయిందని.. అందులో డామినిక్ రిపబ్లిక్, భారత్, ఆఫ్రికా దేశాలకు చెందిన 42 మంది ప్రయాణిస్తున్నారని అన్నారు. వీరిలో 18 మంది అక్కడికక్కడే మృతి చెందగా 20 మందిని మాత్రం చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించమని వారిలో ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిపారు నయారిట్ అధికారులు. నయారిట్ భద్రతా, పౌర రక్షణ కార్యదర్శి జార్జ్ బెనిటో రోడ్రిగ్జ్ మాట్లాడుతూ బస్సు లోయలో సుమారు 40 మీటర్లు(131 అడుగులు) లోతుకు వెళ్లిపోవడంతో సహాయక చర్యలు కష్టతరంగానే సాగుతున్నాయన్నారు. ఎలైట్ బస్సు కంపెనీ వారి నుంచి కానీ, మెక్సికో మైగ్రేషన్ వారి నుంచి కానీ సంఘటనపై ఇంతవరకు ఎటువంటి స్పందన రాలేదని అన్నారు. 🚍Autobús de pasajeros cayó aun profundo barranco, de la línea Elite numero económico 4726 ruta México -Tijuana escala en Guadalajara, Jalisco Más de 20 decesos y 20 lesionados ⚠️Estará cerrado el paso ambos sentidos. Ruta alterna por autopista Guadalajara-Tepic hacia Mazatlán pic.twitter.com/BjJxuOmtQ9 — Reportes de Tráfico Vallarta Tepic Guadalajara 🚧 (@ClarabellaDra) August 3, 2023 ఈ ఏడాది మెక్సికోలో జరిగిన ఘోర బస్సు ప్రమాదాల్లో ఇది మూడోది. ఫిబ్రవరిలో సెంట్రల్ మెక్సికోలో ఓ బస్సు ప్రమాదానికి గురైంది. అందులో 17 మంది మృతిచెందగా గత నెల దక్షిణ రాష్ట్రమైన ఒక్సాకాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 29 మంది మృతి చెందారు. ఇది కూడా చదవండి: యుద్ధ మృతులు 10 వేలు.. ఓ రక్తపిపాసీ... నీకిదే జలాభిషేకం...! -
మూడు నెలలపాటు నడిసంద్రంలో..
మెక్సికో సిటీ: సుమారు మూడు నెలల పాటు సముద్రంలో నిస్సహాయ స్థితిలో పెంపుడు కుక్కతో గడిపిన ఓ వ్యక్తి ఎట్టకేలకు సురక్షితంగా ఒడ్డుకు చేరారు. నమ్మశక్యంకాని ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. తిమోతీ లిండ్సే షడ్డక్(54) అనే ఆ్రస్టేలియా వాసి పెంపుడు కుక్క బెల్లాతో కేటమారన్ రకం పడవలో పసిఫిక్ సముద్రంలో విహరిస్తున్నాడు. ఆ సమయంలో ఆ పడవ మరమ్మతుకు గురయింది. అలా సముద్ర జలాల్లో తీరానికి 1,200 మైళ్ల దూరంలో ఆ ఇద్దరూ మూడు నెలలుగా ఉండిపోయారు. అనూహ్యంగా ఇటీవల అటుగా టునా చేపల వేటకు వెళ్లిన మెక్సికో వాసుల కంట పడ్డారు. -
భార్యను చంపి, ఆమె పుర్రెని యాష్ ట్రేగా..
కోపంలోనో లేదా క్షణికావేశంలోనే నేరాలు చేయడం ఒకరకం. లేనిపోని అపార్థాలు, అపోహాలు కాస్త చివరికి కడతేర్చే స్థాయికి దారితీయడం మరోరకం. కానీ ఇప్పుడూ జరుగుతున్న నేరాల తీరు చూస్తే ఒక రకమైన విధంగా వొళ్లు జలదరిస్తుంది. పూర్తి కాన్షియస్‌లో ఉండే అత్యంత పాశవికంగా కడతేర్చడం వంటి ఘోరాలకు పాల్పడటం బాధకరం. అక్కడితో ఆగక చనిపోయాడన్న జాలి గానీ బాధగాని కొంచెం కూడా లేకపోగ విగతజీవిగా పడి ఉన్న ఆ మనిషి శరరంపై అతనిలో ఉన్నఘోరమైన శాడిజాన్ని, పైశాచికాన్ని వెళ్లగక్కలే దారుణాతి చర్యలకు పాల్పడటం జుగుప్సకరం. అచ్చం అలాంటి తరహాలోనే దారుణమైన అకృత్యానికి పాల్పడ్డాడో ఓ వ్యక్తి. ఈ ఘటన యూఎస్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..యూఎస్‌లోని మెక్సికోలో 32 ఏళ్ల అల్వారో అనే వ్యక్తి జులై 2న ప్యూబ్లోని తన ఇంటిలోనే అరెస్టు అయ్యాడు. ఒక ఏడాది క్రితమే 38 ఏళ్ల మరియా మోంట్సెరాట్ అనే ఆమెని పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు 12 నుంచి 23 సంవత్సరాల గల ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. ఏమైందో ఏమో గానీ వృతిరీత్యా బిల్డర్ అయిన అల్వారో జూన్ 29న తన భార్య మరియాను హతమార్చాడు. ఆ తర్వాత రెండు రోజులకే మీ అమ్మను తీసుకెళ్లాల్సిందిగా ఆమె కూతళ్లకే ఫోన్ చేసి చెప్పాడు. దీంతో ఆందోళనకు గురైన ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. అతడు విచారణలో చెప్పిన విషయాలు విని పోలీసులే విస్తుపోయారు. తమ కుల దేవత, ఓ దెయ్యం తనను ఈ హత్యకు ప్రేరేపించినట్లు కట్టుకథలు చెప్పాడు. మరియాను చంపి ఆమె మెదడను కూడా తిన్నానని, ఆమె పుర్రెని యాష్ ట్రైగా వాడినట్లు చెప్పుకొచ్చాడు. ఆమె మృతదేహాన్ని ముక్కలుగా కోసి ప్లాస్టిక్ సంచిలో ఉంచినట్లు తెలిపాడు. ఐతే అల్వారో డ్రగ్స్ వాడుతుంటాడని, అతడికి ఏవో మానసిక సమస్యలు కూడా ఉన్నాయని బాధితురాలి తల్లి పోలీసుల వద్ద వాపోయింది. తన కూతురుని కొడవలి, సుత్తితో అతి కిరాతకంగా చంపినట్లు ఆరోపించింది. అలాగే తన మనవారాళ్లను లైంగికంగా వేధించినట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా అతడి ఇంట్లో చేతబడి చేసే ఓ బలిపీఠాన్ని పోలీసులు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేయడమే గాక హత్య చేసేందుకు దారితీసిన పరిస్థితులపై పూర్తి స్తాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు మెక్సికో పోలీసులు. (చదవండి: గోయింగ్ సోలో! ఇద్దరు విజేతల అరుదైన కథ) -
ఎయిర్‌పోర్టులో వీరంగం.. కంప్యూటర్లను నేలకేసి కొట్టి..
మెక్సికో: మెక్సికో సిటీ ఎయిర్‌పోర్టులో ఒక మహిళ ప్రయాణానికి సంబంధించి తాను రిజర్వేషన్ చేసుకున్న టికెట్ వివరాలు కంప్యూటర్లో కనిపించకపోయే సరికి కోపంతో అక్కడి సిబ్బందిపై వీరంగం చేసి ఆఫీసులోని పరికరాలను ధ్వంసం చేసింది. వివరాల్లోకి వెళ్తే మరియ గువాడులూపే(56) అనే మహిళ , మెక్సికో సిటీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ప్రయాణానికి ముందుగానే ఒక ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా టికెట్ బుక్ చేసుకుంది. యధాలాపంగా చెకిన్ అవడానికి బోర్డింగ్ పాస్ కోసం కౌంటర్ వద్దకు వెళ్లగా ఆమె వివరాలు కంప్యూటర్లో ఎంత వెతికినా కనిపించక ఆమె ప్రయాణం చేయడానికి కుదరదని చెప్పారు వోలారిస్ ఎయిర్ లైన్స్ ప్రతినిధి. దీంతో ఆమె.. నా టికెట్ డబ్బులు నాకు తిరిగి వాపసు ఇవ్వమని అడిగింది. అందుకు వోలారిస్ ప్రతినిధి స్పందిస్తూ.. డబ్బులు కావాలంటే మీరు బుక్ చేసిన ఏజెన్సీకి వెళ్లి అడగాలని కోరారు. అంతే కోపంతో ఊగిపోయిన ఆ మహిళ ఆఫీసులోకి చొరబడి అక్కడి ఉద్యోగులను నానా మాటలంటూ.. నా డబ్బులు నాకు ఇవ్వకపోతే మీరంతా అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అరుస్తూ అక్కడి పరికరాలను ఇష్టమొచ్చినట్టు విసిరేస్తూ విధ్వంసం చేసింది. ఆమె కోపానికి నాలుగు కంప్యూటర్ మానిటర్లు నాలుగు బార్ కోడ్ స్కానర్లు ధ్వంసమయ్యాయి. చేసిందంతా చేసి గువాడులూపే తనదారిన తాను వెళ్లిపోయే ప్రయత్నం చేయగా అక్కడి పోలీసులు ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు. Pierde vuelo y el autocontrol: Es María Guadalupe (56). Exigió reembolso a @viajaVolaris, se lo negaron y arremetió contra empleados en @AICM_mx. Destrozó 4 monitores y escaners, por lo cual fue detenida. pic.twitter.com/hZHa5NDd1n — Antonio Nieto (@siete_letras) July 5, 2023 ఇది కూడా చదవండి: మణిపూర్ అల్లర్లు: పాఠశాల ఎదుటే మహిళ దారుణ హత్య -
మొసలిని పెళ్లి చేసుక్ను మేయర్! ఎందుకో తెలుసా!
మొసలిని పెళ్లి చేసుకున్నాడు ఓ మేయర్. తన ఊరికి మంచి జరగాలనే ఉద్దేశ్యంతో ఆ మొసలిని పరిణయమాడేందుకు సిద్ధయ్యాడు. ఆ పెళ్లి కూడా ఏదో తూతూ మంత్రంగా చేయారు. పెద్ద ఊరేగింపుగా ఊరు ఊరంతా ఉత్సాహంగా పాల్గొని మరీ చేస్తారు. ఈ వింత ఘటన మెక్సికోలో చోటు చేసుకుంది. ఎందుకిలా చేస్తున్నారు. దీని వెనకున్న రీజన్ ఏమిటంటే.. మెక్సికోలోని శాన్ పెడ్రో హువామెలులా మేయర్ విక్టర్ హ్యూగో సోసా తన ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశ్యంతో అలిసియా అడ్రియానా అనే మొసలిని పెళ్లి చేసుకున్నాడు. మధ్య అమెరికాలోని మెక్సికోలో అనాదిగా వస్తున్న ఆచారం ఇది. రెండు స్వదేశీ సముహాలు శాంతికి వచ్చిన రోజుకి గుర్తుగా మనిషి మొసలిని పరిణయమాడటం అనేది అక్కడి ఆచారం. ఇలా చేస్తే తమకు మంచి జరుగుతుందని అక్కడి వారి విశ్వాసం. ఇది 230 సంత్సరాల నాటి నుంచి వస్తున్న ఆచారం. దీన్ని అక్కడి ప్రజలు ఇప్పటికి కొనసాగిస్తూ వస్తుండటం విశేషం. అందులో భాగంగానే మేయర్ హ్యూగో సోసా ఈ మొసలిని పెళ్లిచేసుకున్నాడు.. భూమాత సస్యమాలంగా ఉండేలా సకాలంలో మంచిగా వర్షాలు పడతాయనేది చరిత్రకారుల నమ్మకమని, అందుకే తాము ఇలా చేస్తుంటామని మేయర్ హ్యూగో సోసా చెబుతున్నాడు. వివాహ వేడుకకు ముందుగా ఈ మొసలిని ఇంటి ఇంటికి ఊరేగింపుగా తిప్పుతారు. ఆ తర్వాత ఆ మొసలిని కూడా అందమైన పెళ్లి కూతురు మాదిరిగా రెడీ చేస్తారు. అలాగే ఆ మొసలి ఆ తంతులో ఎవరిపైన దాడి చేయకుండా ఉండేలా దాని నోటికి తాళం వేస్తారు. ఆ తంతులో మేయర్ ఇరువురం ఒకరినొకరం ప్రేమించుకుంటున్నాం కాబట్టి ఆమె బాధ్యతను తాను స్వీకరిస్తున్నట్లు ప్రమాణం చేసి మరీ మొసలిని పరిణయమాడతాడు. ఆ తర్వాత మేయర్ ఆ మొసలితో కలిసి నృత్యం చేయడమే గాక చివరిగా దాని ముద్దాడటంతో పెళ్లి తంతు ముగుస్తుంది. స్థానిక జాలర్లు తమ మేయర్ ఇలా చేయడం కారణంగా తమ వలకు అధిక సంఖ్యలో చేపలు పడతాయని, తమ జీవితాలు మంచిగా మారతాయని ఆనందంగా చెబుతున్నారు. 👰🐊 Como parte de una #tradición, el alcalde de San Pedro Huamelula, #Oaxaca, Víctor Hugo Sosa, se casó con un lagarto llamado princesa Alicia, esto para simbolizar la unión del hombre con lo divino. #México pic.twitter.com/Us8COaHYeL — Luis Gabriel Velázquez (@soyluisgabriel1) July 2, 2023 (చదవండి: 600 ఏళ్ల నాటి నృత్యం..రెప్పవాల్చడం మర్చిపోవాల్సిందే!) -
600 ఏళ్ల నాటి నృత్యం..రెప్పవాల్చడం మర్చిపోవాల్సిందే!
ఒక్కో దేశంలో ఒక్కో రకరమైన సాంస్కృతిక సంప్రదాయాలు ఉంటాయి. కొన్ని విభిన్న సంప్రదాయాలు, కళలు ఆయా ప్రాంతాలకే పెట్టింది పేరుగా కూడా ఉంటాయి. ఆయా దేశాల్లో ఉన్న విద్య, వైజ్ఞానికి సాంస్కృతకి కళలు, శాస్త్రలను ప్రోత్సహింస్తూ కనుమరుగవ్వకుండా కాపాడేందుకు కృషి చేస్తున్న యునెస్కో 600 ఏళ్ల నాటి ఓ అద్భుత అనితర సాధ్యమైన నృత్య కళకు సంబంధించిన వీడియోని నెటిజన్లతో పంచుకుంది. ఆ నృత్యకళ మన కళ్లను ఆర్పడమే మర్చిపోయాలా కట్టిపడేస్తుంది. ఈ కళను ప్లయింగ్ మెన్ డ్యాన్స్‌గా వ్యవహరిస్తారు. ఇది మెక్సికో, మధ్య అమెరికాలో తూర్పు రాష్ట్రమైన వెరాక్రూజ్‌లోని టోటోనాక్ సముహ ప్రజలు ఈ నృత్యాన్ని చేస్తుంటారు. దీన్ని వారు సంతానోత్పత్తి డ్యాన్స్‌గా పిలుస్తారు. ఆచార వ్యవహారాలు, ప్రకృతి పట్ల తమకున్న గౌరవం, సామరస్యతను తెలియజేసేందుకు చేసే ఫెర్టిలిటీ డ్యాన్స్ ఇది. ఈ నృత్యం చేసేటప్పడూ కొంతమంది పురుషులు బృందం ఓ పొడవాటి స్థంభంపై గుంపుగా కూర్చొంటారు. అందులో వ్యక్తి స్థంభంపై బ్యాలెన్స్ చేసుకుంటూ..ఒక విధమైన సాధనంతో ఊదుతూ.. గాల్లో డ్యాన్స్ చేస్తాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి సెంటర్ పొజిషన్ని ఆక్రమించి కూర్చోగానే మిగతా వ్యక్తులు తలకిందులుగా..ఆ స్థంభం చుట్టూ వేలాడుతూ..నలు దిశల్లో తిరుగుతారు. ఆ తర్వాత క్రమంగా కిందకి దిగిపోతారు. అద్భతంగా కనిపిస్తుంది ఆ దృశ్యం. ఈ మేరకు యునెస్క్ ఇన్‌స్టాగ్రాంలో అందుకు సంబందించిన వీడియోని షేర్ చేస్తూ..వారు ఏవిధంగా నృత్యం చేశారో వివరించింది. View this post on Instagram A post shared by UNESCO (@unesco) (చదవండి: టీవి స్టార్‌గా పేరు తెచ్చుకుంటూనే.. ఎంట్రపెన్యూర్‌గా రాణిస్తున్న ఆష్క) -
40 మీటర్ల ఎత్తులో రోప్ ర్యాక్.. అమాంతం పడిపోయిన బాలుడు..
మెక్సికోలో ఓ భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. రోప్స్ ర్యాక్‌లో ఆరేళ్ల పిల్లాడు 40 మీటర్ల ఎత్తు నుంచి అమాంతం కిందపడిపోయాడు. అదృష్టవశాత్తు పిల్లాడు పడిపోయే ప్రదేశంలో చిన్న సరస్సు ఉండటంతో ప్రమాదం తప్పింది. మాంటెర్రేలోని ఫండిడోరా అమెజాన్ ఎక్స్‌పెడిషన్‌లో ఈ ఘటన జరిగింది. ఫండిడోరా అమెజాన్ ఎక్స్‌పెడిషన్‌లో కుటుంబంతో అందరూ కలిసి వచ్చారు. ఈ క్రమంలో రోప్స్ ర్యాక్ సాహస క్రీడలో పాల్గొనడానికి పిల్లలు వెళ్లారు. అందులో ఆరేళ్ల పిల్లాడు ముందుగా రోప్‌పై ప్రయాణించాడు. ఆ తర్వాత మరో వ్యక్తి రోప్‌పై వెళ్లాడు. ఇద్దరు ఒకే చోటుకు రావడంతో పిల్లాడు ఆందోళనకు గురయ్యాడు. అయినప్పటికీ తాడును పట్టుకుని వేలాడే ప్రయత్నం చేశాడు. అందరూ చూస్తుండగానే అబ్బాయి ఒక్కసారిగా కిందపడిపోయాడు. అక్కడ కింద చిన్న సరస్సు ఉండటంతో ప్రమాదం తప్పిపోయింది. 🇲🇽 • A six-year-old boy falls from a height of 12 meters while on a ropes rack at Fundidora Park in Monterrey, Mexico pic.twitter.com/DAysWyikiA — Around the world (@1Around_theworl) June 26, 2023 స్వల్ప గాయాలతో బయటపడిన బాధితున్ని అతని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. రోప్ ర్యాక్ నిర్వహణలో యాజమాన్యం సరిగా స్పందించలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. బాలుడు ప్రదర్శించిన ధైర్యానికి అందరూ మెచ్చుకున్నారు. పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదీ చదవండి: యుద్ధ వాతావరణంలో ప్రశాంతంగా సాండ్ విచ్ తింటూ.. -
అభిమానుల డిమాండ్; అశ్లీల వెబ్సైట్లో జాయిన్ అయిన ఫుట్‌బాలర్
మెక్సికో చెందిన మహిళా ఫుట్‌బాలర్ నిక్కోల్ తేజ తన అభిమానుల కోసం ఎవరు చేయని సాహసం చేసింది. అభిమానుల డిమాండ్ మేరకు ఆమె అశ్లీల వెబ్సైట్ అయిన ఓన్లీ ఫ్యాన్స్(OnlyFans)లో జాయిన్ అయింది. ఈ విషయాన్ని నిక్కోల్ తేజ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ''అభిమానుల డిమాండ్ మేరకు ఓన్లీఫ్యాన్స్‌లో జాయిన్ అయ్యాను..ఇదే ముఖ్య కారణం.. నా పిక్స్ చూసేయండి'' అంటూ పేర్కొంది. ఇక నిక్కోల్ తేజ ఫోటోలను ఓన్లీఫ్యాన్స్‌లో చూడాలనుకుంటే 17.50 డాలర్లతో సబ్స్క్రిప్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. తన అందంతో కట్టిపడేసే నిక్కోల్ తేజకు ఇన్‌స్టాగ్రామ్‌లో 358,000 ఫాలోవర్స్ ఉన్నారు. కాగా సియాటెల్‌లో పుట్టిన ఆమె మెక్సికోలో స్థిరపడింది. చిన్న వయసులోనే ఫుట్‌బాల్‌లోకి అడుగుపెట్టిన నిక్కోల్ తేజ మెక్సికోకు చెందిన పలు ఫుట్‌బాల్ క్లబ్స్‌లో ఆడింది. ప్రస్తుతం టోర్నియో క్లాసురా క్లబ్‌కు ఆడుతున్న ఆమె ర్యాంకింగ్స్‌లో ఆఖరి స్థానంలో ఉంది. గత ఏడాది కాలంలో కేవలం రెండు గోల్స్ మాత్రమే కొట్టింది. చెత్త ప్రదర్శన కారణంగా టోర్నియో క్లబ్ ఈ జనవరిలో నిక్కోల్ తేజతో కాంట్రాక్ట్‌ను టర్మినేట్ చేసుకుంది. ఓన్లీఫ్యాన్స్(OnlyFans).. చూడాలంటే డబ్బులు కట్టాల్సిందే ఓన్లీఫ్యాన్స్ అనేది సబ్స్క్రిప్షన్ బేస్డ్ కంటెంట్ ప్లాట్‌ఫామ్‌గా ఉంది. 2016లో ఇది ప్రారంభమైంది. అభిమానులు తమకిష్టమైన సెలబ్రిటీల అశ్లీల ఫోటోలను డబ్బులు కట్టి ఈ వెబ్సైట్లో చూసే అవకాశం ఉంటుంది. గతంలో ఈ వెబ్సైట్లో అశ్లీలత అధికంగా ఉండేది. అయితే ఓన్లీఫ్యాన్స్ ప్లాట్‌ఫార్మ్‌లో ముందు నుంచి సబ్‌స్క్రిప్షన్‌కు డబ్బులు కట్టాల్సి ఉండడంతో ఇది లీగ్‌ల్ వెబ్‌సైట్‌గానే కొనసాగింది. మధ్యలో కొంతమంది అశ్లీలత మరీ ఎక్కువగా ఉందని ఆందోళన చేయడంతో ఆగస్టు 2021లో ఓన్లీఫ్యాన్స్‌లో ఇకపై అశ్లీలత ఫోటోలు, వీడియోలు షేర్ చేసే అవకాశం లేదని ప్రభుత్వం పేర్కొంది. కానీ ఇది మూన్నాళ్ల ముచ్చటగా మారింది. తీవ్ర వ్యతిరేఖత రావడంతో కేవలం ఆరు రోజుల వ్యవధిలోనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. View this post on Instagram A post shared by Nikkole Teja (@nikkoleteja_) View this post on Instagram A post shared by Nikkole Teja (@nikkoleteja_) చదవండి: #SteveSmith: టెస్టుల్లో 32వ సెంచరీ.. ఆస్ట్రేలియన్ దిగ్గజం సరసన బాల్‌గర్ల్‌గా బ్రిటన్ యువరాణి.. మెళుకువలు నేర్పిన ఫెదరర్ -
Kiss Street In Mexico: ఇక్కడ భాగస్వామికి ఒక్కసారైనా కిస్ పెట్టాల్సిందే!
ప్రపంచంలో వింత ఆచారాలకు కొదవేలేదు. ఈ ప్రపంచంలో మనిషి పుట్టిన దగ్గర నుంచి మరణించేవరకూ ఏదో ఒక ఆచారానికి కట్టుబడి ఉంటాడని అనడంలో అతిశయోక్తి లేదు. ఇదేవిధంగా కొన్ని విచిత్రమైన ఆచారాలు కొనసాగే ప్రాంతాలను కూడా అప్పుడప్పుడు చూసి ఉంటాం. లేదా విని ఉంటాం. అటువంటిదే.. ‘కిస్’తో ముడిపడి ఉన్న ఆచారాన్ని పాటించే ప్రాంతం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జీవితంలో ఒక్కసారైనా కపుల్స్ ఆ ప్రాంతానికి వెళ్లి ముద్దుల వర్షం కురిపించుకోవాలనుకుంటారు. అయితే ఈ ప్రాంతం ఎక్కడుంది? ముద్దులతో కూడిన నమ్మకాల వెనుక ఆధారమేమిటి? ఈ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వింత ప్రాంతం ఎలా ఉంటుందంటే.. ఈ ప్రాంతం ఒక బిల్డింగ్ లేదా ఏదో ధార్మిక స్థలమో కాదు. అది ఒక గల్లీ. దానిని కిస్ స్ట్రీట్ అని అంటారు. అది ఎంత ఇరుకైనదంటే ఒక జంట మాత్రమే దానిలోకి వెళ్లే వీలుంటుంది. ఒక్కొక్క జంటమాత్రమే వెళ్లేందుకు అవకాశం ఉన్నందున ఇక్కడ వేల జంటల క్యూ కనిపిస్తుంది. వీరంతా ఒక జంట తరువాత మరొక జంట ఈ గల్లీలోకి వెళుతుంటారు. అక్కడ కిస్ చేసుకుని తిరగివస్తారు. ఈ గల్లీ ఎక్కడుందంటే.. ఈ గల్లీ మెక్సికోలోని గువానాజువాటోలో ఉంది. దీనిని ‘ఎలో ఆఫ్ ది కిస్’ అని అంటారు. ఇంటర్నెట్లో ఈ గల్లీకి సంబంధించిన వివరాలు, ఫొటోలు విరివిగా కనిపిస్తాయి. మన దేశంలో కనిపించే అత్యంత ఇరుకైన గల్లీ మాదిరిగా ఇది ఉంటుంది. ఇక్కడి కిస్ వెనుక నమ్మకమిదే.. ఈ గల్లీకి సంబంధించిన ఒక కథ ప్రచారంలో ఉంది. ఒకానొకప్పుడు ఒక జంట పరస్పరం ఎంతో ప్రేమ కలిగివుండేది. ఈ జంటలోని యువతి ధనవంతురాలు. యువకుడు పేద ఇంటికి చెందినవాడు. వారు రహస్యంగా ఇక్కడికి వచ్చి, కిస్ చేసుకునేవారు. అయితే ఆ యువతి ఇంటిలోని వారు వీరి ప్రేమను వ్యతిరేకించారు. అయినా ఆ యువతి ఈ స్ట్రీట్‌కు వచ్చి అతనిని కలుసుకునేది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను హత్య చేశారు. ఫలితంగా వారి ప్రేమ అక్కడితో ముగిసిపోయింది. అయితే వారి ప్రేమ గాథను కలకాలం జీవింపజేసేందుకు వేల జంటలు ఇక్కడికి వచ్చి ముద్దులు పెట్టుకుంటాయి. ఈ గల్లీలో కిస్ చేసుకుంటే జంటల మధ్య ప్రేమ పెరుగుతుందని స్థానికంగా ప్రచారంలో ఉంది. ఇది కూడా చదవండి: ఏది ఇంపు?.. ఏది కంపు?.. సీక్రెట్ వెనుక సింపుల్ లాజిక్! -
ఆటిజం ఉన్నా ఐక్యూలో ఘనం! 12 ఏళ్లకే మాస్టర్స్ డిగ్రీ
మెక్సికోకు చెందిన ఈ పన్నెండేళ్ల బాలికకు చిన్నప్పటి నుంచి ఆటిజం సమస్య ఉంది. మూడేళ్ల వయసులో స్కూల్లో చేరిన తొలి నాళ్లలో తోటి పిల్లలు ఏడిపించేవారు. టీచర్లు కూడా ఈమె పట్ల పెద్దగా శ్రద్ధ చూపేవారు కాదు. నవ్విన నాప చేనే పండుతుంది అన్నట్లుగా ఇప్పుడు ఈమె ఏకంగా గణితంలో మాస్టర్స్ డిగ్రీ పరీక్షలకు సిద్ధమవుతోంది. ఈమె పేరు ఆధరా పెరెజ్ సాన్షెజ్. మెక్సికో సిటీలో పుట్టి పెరుగుతోంది. ఇప్పుడామె ఒకవైపు మాస్టర్స్ డిగ్రీ కోసం పాఠాలను చదువుకుంటూనే, తన తోటి పిల్లలకు, తన కంటే పెద్దవారికి కూడా లెక్కల్లో పాఠాలు చెబుతోంది. మరోవైపు మెక్సికన్ స్పేస్ ఏజెన్సీ కోసం కూడా సేవలందిస్తోంది. ఏనాటికైనా అమెరికన్ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’తో కలసి పనిచేయాలనేదే తన లక్ష్యమని చెబుతోంది. ఐదేళ్ల వయసులో ప్రాథమిక విద్య పూర్తి చేసుకున్న ఆధరా, మరుసటి ఏడాదిలోనే మిడిల్ స్కూల్, హైస్కూల్ పరీక్షలను ఒకే ఊపులో గట్టెక్కింది. ఐదేళ్ల వయసులోనే పిరియాడిక్ టేబుల్ కంఠస్థం చేయడమే కాకుండా, కఠినమైన ఆల్జీబ్రా సమస్యలను అలవోకగా పరిష్కరిస్తుండటం చూసి, ఆధరా తల్లి ఆమెను థెరపిస్ట్ వద్దకు తీసుకువెళ్లింది. చికిత్సతో ఆమె పరిస్థితి మెరుగుపడింది. వయసుకు మించిన పరీక్షల్లో వరుస ఉత్తీర్ణతలు సాధిస్తూ, గత ఏడాది మాస్టర్స్ డిగ్రీ కోర్సులో ప్రవేశం సాధించింది. ఆధరాకు చికిత్స చేసిన థెరపిస్ట్ ఆమెలోని ప్రతిభను గుర్తించి, ఆమెను ‘సెంటర్ ఫర్ అటెన్షన్ టు టాలెంట్’ (సీఈడీఏటీ)కు పంపారు. అక్కడ జరిపిన పరీక్షల్లో ఆమె ఐక్యూ 160 అని నిపుణులు తేల్చారు. అంటే, ఆమె ఐక్యూ ఐన్‌స్టీన్, స్టీఫెన్ హాకింగ్‌ల కంటే ఎక్కువే! ప్రస్తుతం అరిజోనా యూనివర్సిటీ ఆమెకు స్కాలర్షిప్ ప్రకటించినా, వీసా ఆలస్యం కావడంతో అక్కడ చేరడం వాయిదా పడింది. ప్రస్తుతం చదువుకుంటున్న మాస్టర్స్ డిగ్రీ పూర్తయితే, అరిజోనా యూనివర్సిటీలో ఆస్ట్రోఫిజిక్స్ కోర్సులో చేరనుంది. (చదవండి: 'అమ్మా నన్ను మన్నించు'.. హాకీ దిగ్గజం ధనరాజ్ పిళ్లై) -
మెక్సికోలో పెను భూకంపం..
మెక్సికో: మెక్సికోలో మరోసారి పెను భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.3గా నమోదైంది. ప్రస్తుతానికైతే ఎలాంటి ప్రాణ నష్టంగానీ ఆస్తి నష్టంగానీ జరిగినట్లు ఎటువంటి సమాచారం లేదు. మెక్సికో నేషనల్ సెంటర్ ఫార్ సీస్మాలజీ తెలిపిన వివరాల ప్రకారం భూకంపం సెంట్రల్ మెక్సికోలో తెల్లవారుజాము 2.00 గంటలకు భూమి కంపించింది. ఈ భూకంపం భూమి ఉపరితలానికి సుమారు 10 కి.మీ లోతున సంభవించి ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు. మళ్ళీ మళ్ళీ.. మెక్సికోలో భూకంపాలు సంభవించడం, అగ్నిపర్వతాలు బద్దలవ్వడం వంటివి సర్వసాధారణంగానే జరుగుతుంటాయి. గత నెలలోనే పరిసర ప్రాంతాల్లో రెండు సార్లు భూకంపం వచ్చింది. మే 18న గ్వాటెమాల, దక్షిణ మెక్సికో ప్రాంతాల్లో సంభవించిన భూకంపం తీవ్రత 6.6గా నమోదవ్వగా మే 25న పనామా-కొలంబియా సరిహద్దులో వచ్చిన భూకంపం తీవ్రత 6.4గా నమోదైంది. ఈ రెండు సందర్భాల్లో కూడా ఎటువంటి ప్రాణ నష్టం గానీ ఆస్తి నష్టం గానీ జరగలేదు. ఇది కూడా చదవండి: గ్రీస్ పడవ విషాదం.. 500 మందికి పైగా గల్లంతు! -
షాకింగ్ ఘటన: ఏకంగా 45 బ్యాగుల్లో మానవ అవశేషాలు!
అమెరికాలోని పశ్చిమ మెక్సికో రాష్ట్రంలో ఒళ్లు గగ్గుర్పొడిచే భయానక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ మేరకు జాలిస్కోలోని ఓ లోయలో మానవ శరీర భాగాలతో కూడిన దాదాపు 45 బ్యాగులు లభించాయని అధికారులు తెలిపారు. అందులో స్త్రీ, పురుషులకు సంబంధించిన అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు. పెద్ద పారిశ్రామిక కేంద్రమైన గ్వాడలజారా శివారు ప్రాంతమైన జపోపాన్ మున్సిపాలిటీ వద్ద ఓ 40 మీటర్ల లోయలో ఈ భయానక ఘటన వెలుగు చూసిందని తెలిపారు. 30 ఏళ్ల వయసుగల ఇద్దరు మహిళలు, ఐదుగురు పురుషులు తప్పిపోయినట్లు ఫిర్యాదు రావడంతో వారి ఆచూకి కోసం వెతుకుతుండగా..ఈ ఘటన బయటపడింది. ఆయా వ్యక్తుల మిస్సింగ్ కేసులు వేర్వేరు రోజుల్లో వేర్వేరుగా అందినట్లు చెప్పుకొచ్చారు. అయితే వారందరూ ఒకే కాల్ సెంటర్లో పనిచేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. మానవ అవశేషాలను గుర్తించిన ప్రాంతంలోనే కాల్‌సెంటర్ కూడా ఉంది. పోరెన్సిక్ నిపుణులు భాదితులు సంఖ్య, గుర్తింపును వెల్లడించాల్సి ఉంది. కాల్ సెంటర్లో చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు జరిగి ఉండవచ్చిని అనుమానిస్తున్నారు. ఆ కాల్ సెటర్ వద్ద మాదక ద్రవ్యాలు, రక్తపు మరకలతో కూడిన వస్తువులు, వాణిజ్య కార్యకలాపాలకు సంబంధించిన పత్రాలు లభించినట్లు తెలిపారు. ఐతే బాధితుల కుటుంబ సభ్యులు మాత్రం వారిని నేరస్తులుగా చిత్రీకరించేందుకు యత్రిస్తున్నారని మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా, జాలిస్కాలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం తొలిసారి కాదు. 2021లో, జాలిస్కోలోని తోనాలా మునిసిపాలిటీలో, 11 మంది మానవ అవశేషాలతో 70 బ్యాగులు బయటపడ్డాయి. అంతకుమునుపు 2019లో జపోపాన్‌లోని జనావాసాలు లేని ప్రాంతంలో 119 బ్యాగుల్లో 29 మంది మానవ అవశేషాలను కనుగొన్నారు. కానీ 2018లో ముగ్గురు చలన చిత్ర విద్యార్థులు మిస్సింగ్ కేసులో.. వారి అవశేషాలు యాసిడ్‌లో కరిగిపోవడం అత్యంత వివాదాస్పదంగా మారి నిరసనలకు దారితీసింది. (చదవండి: ఉక్రెయిన్ యుద్ధాన్ని నిరసిస్తూ.. నగ్నంగా నిలబడి..) -
ప్రపంచంలోని టాప్ 10 అతిపెద్ద నగరాలు
-
ట్రాక్టర్, వ్యాను ఢీ.. చెలరేగిన మంటలు.. 26 మంది సజీవదహనం
మెక్సికోలో ఘోర ప్రమాదం జరిగింది. ట్రాక్టర్, వ్యాను ఢీకొన్న ఘటనలో 26 మంది దుర్మరణం చెందారు. రెండు వాహనాలు ఢీకొని మంటలు చెలరేగడంతో వీరంతా సజీవ దహనమయ్యారు. టమౌలిపాస్‌లో ఆదివారం ఈ విషాద ఘటన జరిగింది. మృతుల్లో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు. మృతదేహాలు కాలిపోవడంతో వారిని అధికారులు గుర్తించలేకపోతున్నారు. అయితే వారి నేషనల్ ఐడీలు లభించడంతో వీరంతా మెక్సికన్లే అని ధ్రువీకరించారు. ఈ ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్ మరణించాడా లేదా పరారయ్యాడా అనే విషయంపై స్పష్టత లేదని అధికారులు తెలిపారు. ట్రాక్టర్ కూడా ఘటన స్థలంలో లేదని వెల్లడించారు. చదవండి: నర్సు నిర్వాకం..పేషెంట్ నుంచి రక్తం తీసుకునే టైంలో.. -
మెక్సికోకు 'కుక్కపిల్ల'ను గిఫ్ట్‌గా ఇచ్చిన టర్కీ!..అదే ఎందుకంటే?..
మెక్సికోకు టర్కీ మూడు నెలల వయసున్న జర్మనీ షెపర్డ్ కుక్కపిల్లను ఇచ్చించి. ఈ మేరకు మెక్సికో సైన్యం బుధవారం టర్కీ గిఫ్ట్‌గా ఇచ్చిన ఆ కుక్క పిల్లను స్వాగతించింది. అసలు టర్కీ ఎందుకు ఆ కుక్కపిల్లనే గిఫ్ట్‌గా ఇచ్చిందంటే..ఈ ఏడాది ప్రారంభంలో ఫిబ్రవరి నెలలో టర్కీ, సిరియాలలో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఆ ప్రకృతి విలయతాండవానికి వేలాదిగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. నాటి ఘటనలో భూకంప శిథిలాల కింద చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు మెక్సికో రెస్క్యూ డాగ్‌లతో మోహరించింది. ఆ టర్కీ రెస్క్యూ ఆపరేషన్‌లో ప్రొటీయో అనే జర్మన్ షెషర్డ్ జాతికి చెందిన కుక్క చాలా చురుకుగా సేవలందించింది. ఐతే అది విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయింది. ఈ జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన కుక్క భూకంపాలు, ప్రకృతి వైపరిత్యాలకు గురయ్యే ప్రదేశంలో చిక్కుకుపోయిన వారిని గుర్తించడంలో ప్రత్యేకత కలిగి ఉంది. ఆయా ప్రదేశంలోని శిథిలాల కింద ప్రాణాలతో ఉన్నవారి ఆచూకిని కనిపెట్టడంలో ప్రసిద్ధి చెందింది. దీంతో టర్కీ ఆ జాతికి చెందిని మూడు నెలల వయసున్న కుక్క పిల్లను విధి నిర్వహణలో ప్రాణాలొదిలేసిన కుక్క పిల్లకు బదులుగా మెక్కికోకు గిఫ్ట్‌గా ఇచ్చింది. ఆ కుక్కపిల్లకు 'ఆర్కాదాస్గా' నామకరణం ఈ కుక్కపిల్లకు మెక్కికో సైన్యం స్వాగతం పలకడమే గాక ఆర్కాదాస్ అని పేరుపెట్టింది. టర్కిష్‌లో ఆర్కాదాస్ అంటే స్నేహితుడు అని అర్థం. మృతి చెందిన ప్రోటియోని సంరక్షించిన ట్రెయినరే ఆర్కాదాస్కి కూడా శిక్షణ ఇస్తారని మెక్సికో సైన్యం తెలిపింది. ఈ మేరకు సదరు కుక్కపిల్ల గ్రీన్‌కలర్ సైనిక యూనిఫాం ధరించి బుధవారం మెక్సికో సైనిక స్థావరంలో జరుగుతున్న అధికారిక వేడుకలో పాల్గొంది. సరిగ్గా మెక్కికో జాతీయ గీతం స్పీకర్ల నుంచి వస్తుండగా.. ఒక్కసారిగా ఆ కుక్కపిల్ల ఉద్వేగభరితంగా మొరిగి తన విశ్వాసాన్ని చాటుకుంది. ఈ నేపథ్యంలో మెక్కికో రక్షణ మంత్రిత్వ శాఖ ఆర్కాదాస్ తరుఫున ఒక ట్వీట్ కూడా చేసింది. ఆ ట్వీట్లో.."నన్ను ఎంతో ఆప్యాయంగా స్వాగతించిన మెక్సికోకు చెందిన స్నేహితులకు ధన్యవాదాలు. రెస్క్యూ డాగ్‌గా ఉండేందుకు నావంతుగా కృషి చేస్తానని వాగ్దానం చేస్తున్నాను ". అని పేర్కొంది రక్షణ శాఖ. కాగా, టర్కీ రెస్క్యూ ఆపరేషన్‌లో మరణించిన ప్రోటీయో కుక్కుకు మెక్కికో ఘనంగా సైనిక అంత్యక్రియలు నిర్వహించి నివాళులర్పించింది. (చదవండి: మరో ఆప్షన్ లేదు.. లొంగిపోతానన్నా వినొద్దు.. జెలెన్స్కీని మట్టుబెట్టాల్సిందే!) -
సంస్కారవంతమైన నగరం!
మెక్సికో దేశపు రాజధాని మెక్సికో నగరం. కిక్కిరిసిన కాంక్రీట్ జంగిల్. అధిక జనసాంద్రత. మెట్రోపాలిటన్ ప్రాంత జనాభా 2.3 కోట్లు. సుదీర్ఘ చరిత్ర కలిగిన పురాతన నగరం. వలస పాలనకు ముందు ఇది అజ్టెక్ సామ్రాజ్యపు రాజధాని. నగరం చుట్టూతా లోతు తక్కువ మంచినీటి సరస్సులు, చిత్తడి నేలలు ఉన్నాయి. వీటి మధ్యలో మానవ నిర్మిత ద్వీపాలలో అనాదిగా సంప్రదాయ వ్యవసాయం జరుగుతోంది. ఈ వ్యవసాయక ద్వీప క్షేత్రాలను ‘చినాంపాస్’ అని పిలుస్తారు. వీటిని 2014లో మెక్సికో మెట్రోపాలిటన్ నగర పరిధిలోకి చేర్చారు. నగరం మొత్తం భూభాగంలో సుమారు 27.7%లో వ్యవసాయం విస్తరించింది. ఇందులో 99% విస్తీర్ణం చినాంపాస్లే ఆక్రమిస్తాయి. 5.10 లక్షల టన్నుల ఆహారోత్పత్తులను రైతులు పండిస్తున్నారు. నగరం లోపల జనావాసాల మధ్య ఇంటిపంటలు, కమ్యూనిటీ గార్డెన్లు, గ్రీన్ హౌస్‌లు, హైడ్రోపోనిక్ వ్యవస్థలు, మిద్దె తోటలు, నిలువు తోట(వర్టికల్ గార్డెన్స్)లు సాగవుతున్నాయి. వీటిలో నగరవాసులు 24.7 టన్నుల కూరగాయలు, పండ్లను ఏటా ఉత్పత్తి చేస్తున్నట్లు గత ఏడాది జరిగిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ, ఈస్ట్ చైనా యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గ్వాటెమాలా స్కూల్ ఆఫ్ సోషల్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ నిపుణులు ఉమ్మడిగా గత ఏడాది 75 అర్బన్ గార్డెన్లపై విస్తృత అధ్యయనం చేశారు. అర్బన్ గార్డెన్లలో పండించిన సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులు ప్రజల ఆహారాన్ని మెరుగుపరచి ఆహార భద్రతను పెంపొందించాయి. ఆరోగ్యాన్ని మెరుగుపరచాయి. కొందరు అర్బన్ రైతులకు ఈ పంటల అమ్మకాలే జీవనాధారంగా మారాయి. ఔషధ, సుగంధ మూలికలు మెక్సికో ప్రజల సంప్రదాయ వైద్యంలో, ఆహార సంస్కృతిలో అంతర్భాగం. ఇప్పటి ఇంటిపంటల్లోనూ వీటికి పెద్ద పీట ఉందని అధ్యయనవేత్తలు తెలిపారు. సేంద్రియ ఇంటిపంటల సాగును వ్యాప్తిలోకి తేవటంలో ఇతర దేశాల్లో మాదిరిగానే మెక్సికో నగరంలో కూడా దశాబ్దాలుగా అనేక స్వచ్ఛంద సంస్థలు, సేవా సంస్థలు ముందంజలో ఉన్నాయి. ఈ కోవలోకి చెందినదే ‘కల్టివా సియుడాడ్’ కూడా. ఈ స్పానిష్ మాటలకు అర్థం ‘సంస్కారవంతమైన నగరం’. పేరుకు తగ్గట్టుగానే ఇది పనిచేస్తోంది. సేంద్రియ ఇంటిపంటలు, సామూహిక ఇంటిపంటల సంస్కృతిని వ్యాపింపజేయడానికి కృషి చేస్తోంది. ఆకాశ హర్మ్యాల నడుమ 1,650 చదరపు మీటర్ల స్థలంలో కల్టివా సియుడాడ్ కమ్యూనిటీ కిచెన్ గార్డెన్ పచ్చగా అలరారుతోంది. పట్టణ వ్యవసాయాన్ని విద్య, ఉత్పత్తి/ఉత్పాదక, చికిత్సా సాధనంగా ఉపయోగించడం దీని లక్ష్యం. సృజనాత్మకత ఉట్టిపడే ఎతైన మడుల్లో ఆకుకూరలు, కూరగాయలతో పాటు 135 జాతుల పండ్లు, ఇతర చెట్లతో ఈ ఆహారపు అడవి నిర్మితమైంది. పండించిన ఉత్తత్తుల్లో.. తోట పనిలో సాయపడిన వాలంటీర్లకు 30% ఇచ్చారు. 28% పొరుగువారికి తక్కువ ధరకే అమ్మారు. 34% రెస్టారెంట్లకు అమ్మారు. పేదలకు ఆహారాన్నందించే కమ్యూనిటీ సూప్ కిచెన్లకు కూడా కొంత భాగాన్ని విరాళంగా ఇచ్చారు. ఈ విధంగా స్వీయ సహాయక ఉద్యాన తోటల పెంపకం ద్వారా మెక్సికో ‘సంస్కారవంతమైన నగరం’గా రూపుదాల్చింది! సామాజిక పరివర్తన సాధనం అర్బన్ అగ్రికల్చర్ ప్రభావశీలమైన సామాజిక పరివర్తన సాధనం. ఆహార సార్వభౌమాధికారం, ఆహార భద్రతల సాధనకు.. అలాగే వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికీ ఇదొక వ్యూహం. 12 ఏళ్లుగా మా కమ్యూనిటీ కిచెన్ గార్డెనింగ్ అనుభవం చెబుతోంది ఇదే. వ్యర్థాలను సేంద్రియ ఎరువుగా మార్చి సారవంతమైన మట్టిని ఉత్పత్తి చేయడానికి, పోషకాల సాంద్రత కలిగిన కూరగాయలను పండించడం.. పంటలు, జంతువులు, పక్షుల జీవవైవిధ్యాన్ని పరిరక్షించడం, ఉష్ణోగ్రతలను తగ్గించడంతో పాటు అంతస్తులకు అతీతంగా భుజం భుజం కలిపి పనిచేసేందుకు నగరవాసులకు సేంద్రియ ఇంటిపంటలు ఉపయోగపడుతున్నాయి. – గాబ్రిలా వర్గాస్ రొమెరో, ‘కల్టి సియుడాడ్’ డైరెక్టర్, మెక్సికో నగరం -
గాల్లో ఉండగానే హాట్ ఎయిర్ బెలూన్‌లో ఎగిసిపడ్డ మంటలు..ప్రయాణికులు..
హాట్ ఎయిర్ బెలూన్లలో పయనిస్తూ ఆకాశపు వీధిని చూడటం అనేది ఒక త్రిల్. సాహస క్రీడలంటే ఇష్టపడే వారు ఈ బెలుస్లలో పయనించడానికి ఎంతో ఇష్టపడతారు. అచ్చం అలానే కొందరు పర్యాటకులు ఒక హాట్ ఎయిర్ బెలూన్‌లో పయనిస్తుండగా విషాదం చోటు చేసుకుంది. ఏమోందో ఏమో! ఒక్కసారి మంటలు చుట్టుముట్టాయి. దీంతో బెలూన్ గోండోలాలో ఉన్న ప్రయాణికులు భయంతో దూకేయగా..మరికొందరూ ఆ మంటల్లో చిక్కుకుపోయారు. ఈ ఘటనలో ఒక చిన్నారి ముఖానికి తీవ్ర గాయాలు కాగా, దూకేయడంతో తొడ ఎముక ఫ్రాక్చర్ అయ్యింది. భాదితులను 39 ఏళ్ల మహిళ, 50 ఏళ్ల వృద్ధురాలిగా గుర్తించారు. ఇంకా ఇతర ప్రయాణకులెవరైనా ఆ బెలున్ గోండోలాలో ఉన్నారనే తెలియాల్సి ఉంది. మెక్సికో నగరానికి ఈశాన్యంగా ఉన్న టియోటిహుకాన్ అనే ప్రసిద్ధ పర్యాటక కేంద్రం వద్ద ఈ హాట్ హెయిర్ బెలూన్లను టూరిస్టుల కోసం ఏర్పాటు చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. Mexico 🇲🇽 ! Breaking news!🚨🚨 Saturday, April 01, 2023, in the morning hours. a hot air balloon catches fire and collapses in Teotihuacan, 2 people are reportedly dead. The events occurred this morning in the vicinity of the Pyramid of the Sun and the area was cordoned off. pic.twitter.com/DlzJdv2oHH — Lenar (@Lerpc75) April 1, 2023 (చదవండి: అమెరికాలో టోర్నడో బీభత్సం) -
ఘోర అగ్నిప్రమాదం.. 39 మంది శరణార్థులు మృతి.. 29 మందికి గాయాలు..
మెక్సికోలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ విషాద ఘటనలో 39 మంది దుర్మరణం చెందారు. మరో 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఓ శరణార్థి కేంద్రంలో పరుపులకు నిప్పంటించడం వల్లే ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అమెరికా-మెక్సికో సరిహద్దులోని చిహువాహువా రాష్ట్రం సియుడాడ్ జువారెజ్‌లో ఈ శరణార్థి కేంద్రం ఉంది. ఇతర దేశాల నుంచి మెక్సికోకు వచ్చే వలసదారులు అమెరికాలోకి ప్రవేశించేందుకు ఈ ప్రాంతం ముఖ్యమైంది. అమెరికా ఆశ్రయం కోరేవారు అధికారిక ప్రక్రియ పూర్తయ్యేవరకు ఇక్కడే ఉంటారు. అయితే వలసదారులందరినీ వెనక్కి పంపిస్తున్నారని ఎవరో ప్రచారం చేయడంతో శరణార్థి కేంద్రంలో ఉన్నవారంతా సోమవారం రాత్రి నిరసనలకు దిగారు. ఇందులో భాగంగానే కొందరు పరుపులకు నిప్పు అంటించడంతో ఆ మంటలు క్షణాల్లోనే వ్యాపించి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో అగ్నికీలలకు 39 మంది బలయ్యారు. చదవండి: వామ్మో.. ప్రపంచంలోనే అతిపెద్ద పాము.. చూస్తే గుండె గుభేల్..! -
మెక్సికోలో కాల్పులు.. 8 మంది మృతి
మెక్సికో సిటీ: మెక్సికోలో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. జెరెజ్ టౌన్‌లోని ఓ నైట్‌క్లబ్‌లో సాయుధ దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. దుండగులు పెద్ద సంఖ్యలో ఆయుధాలతో రెండు వాహనాల్లో ఎల్‌వానాడిటో నైట్‌క్లబ్‌కు చేరుకొని, అక్కడున్న జనంపై కాల్పులు జరిపారని పోలీసులు వెల్లడించారు. ఈ కాల్పుల్లో ఆరుగురు అక్కడికక్కడే మరణించారని, ఆసుపత్రి చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారని పేర్కొన్నారు. మృతులు, క్షతగాత్రుల్లో క్లబ్ ఉద్యోగులు, సంగీత కళాకారులు, వినియోగదారులు ఉన్నారని తెలిపారు -
ఎయిర్‌పోర్ట్‌లో మానవ పుర్రెల కలకలం.. షాక్‌లో అధికారులు
మెక్సికో విమానాశ్రయంలో యునైటెడ్స్టేట్స్కు వెళ్లే ప్యాకేజీలో మానవ పుర్రెలు ఉన్నాయంటూ కలకలం రేగింది. ఈ మేరకు సెంట్రల్ మెక్సికోలోని క్వెరెటారో ఇంటర్కాంటినెంటల్ ఎయిర్‌పోర్ట్‌లో ఒక కార్డ్బోర్డ్ పెట్టేలో అల్యూమినియం ఫాయిల్‌తో చుట్టబడిన పుర్రెలు కనుగొన్నారు అధికారులు. ఎయిర్‌పోర్ట్‌లోని సెక్యూరిటీ చెక్‌పాయింట్ వద్ద ఈ ప్యాకేజిని అధికారులు గుర్తించారు. దేశంలో అత్యంత హింసాత్మకమైన ప్రాంతాలలో ఒకటైన పశ్చిమ తీర రాష్ట్రమైన మిచోకాన్ నుంచి ప్యాకేజి వచ్చిందని అధికారులు తెలిపారు. ఇది సౌత్ కరోలినాలోని మన్నింగ్‌లోని చిరునామకు వెళ్లనుందని తెలిపారు. ఆ మానవ అవశేషాలు ఏ వయసు వారివి? ఎవరివీ? అనే వివరాలు తెలియాల్సి ఉందని చెబుతున్నారు. వాస్తవానికి మానవ అవశేషాలను పంపించాలంటే హెల్త్ అధికారుల నుంచి ప్రత్యేక అనుమతి తప్పనిసరి. ఐతే ఈ ప్యాకేజి ఆ అనుమతిని పొందలేదని ఎయిర్పోర్ట్ అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఇలానే కెన్యా నుంచి అమెరికాకు జిరాఫీ, జీబ్రా ఎముకలను తీసుకురావడానికి ప్రయత్నించినందుకు వాషింగ్టన్ డల్లెస్ అంతర్జాతీయ విమానాశ్రయ సిబ్బంది ఒక మహిళను అడ్డుకున్నారని కస్టమ్స్ బోర్డర్ ప్రొటెక్షన్(సీబీపీ) తన నివేదికలో పేర్కొంది. (చదవండి: చైనాకు చేయి అందించి సాయం చేస్తానన్న తైవాన్.. షాక్‌లో బీజింగ్) -
జైలుపై డ్రగ్స్ ముఠా కాల్పులు..10 మంది పోలీసులు మృతి!
మెక్సికన్ సిటీ: సరిహద్దు జైలుపై దుండగులు ఆయుధాలతో విరుచుకుపడి జరిపిన కాల్పుల్లో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ సంఘటన మెక్సికోలోని జుయారెజ్ నగరంలో ఆదివారం జరిగింది. మృతుల్లో 10 మంది భద్రతా సిబ్బంది కాగా.. నలుగురు ఖైదీలు ఉన్నట్లు మెక్సిన్ అధికారులు తెలిపారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారని, 24 మంది తప్పించుకోగలిగారని వెల్లడించారు. ఈ దారుణానికి ఒడిగట్టింది డ్రగ్స్ ముఠాగా అనుమానిస్తున్నారు. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 7 గంటలకు ఆయుధాలతో వచ్చిన దుండగులు జైలుపై కాల్పులు జరిపారు. సమచారం అందుకున్న బలగాలు హుటాహుటిన అక్కడికి చేరుకుని పరిస్థితులను తమ అధీనంలోకి తెచ్చుకున్నాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. అయితే, ఈ దాడికి పాల్పడింది ఎవరనే విషయంపై స్పష్టత లేదని వెల్లడించారు. గతంలోనూ ఇలాంటి సంఘటనలు మెక్సికో సరిహద్దు జైళ్లలో జరిగాయి. పలు కారాగారాల వద్ద భద్రత తక్కువ గా ఉండటం వల్లే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. డ్రగ్స్ ముఠాల సభ్యులు ఖైదీలుగా ఉండటం వల్ల వారి మధ్య ప్రతీకార దాడులే ప్రధానంగా జరుగుతున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: పట్టాలు తప్పిన ముంబై-జోధ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ -
Tiger Cub: కారు డిక్కీలో పులి పిల్ల.. పోలీసులు షాక్..
మెక్సికో సిటీ: పోలీసులు రోడ్డుపై సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఓ కారు వచ్చింది. వీళ్లను చూసి ఆపకుండా అది అలానే ముందుకుపోయిది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు తమ వాహనంతో వెంబడించి ఆపారు. అనంతరం కారు డిక్కీ ఒపెన్ చేసి చూసి షాక్ అయ్యారు. డిక్కీలో సూట్‌కేస్, బ్యాగుల మధ్యన పులిపిల్లను చూసి అవాక్కయ్యారు. కారు డిక్కీలో పులి పిల్లతో పాటు తుపాకులు, బుల్లెట్లు కూడా ఉన్నాయి. దీంతో వెంటనే కారులోని దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. ఆ పులి పిల్లను వన్యప్రాణుల సంరక్షణ కేంద్రానికి తరలించారు. మెక్సికోలో డ్రగ్ ట్రాఫికర్లకు పులులు పెంచుకోవడం అంటే సరదా. అక్రమంగా వాటిని కొనగోలు చేసి పెంపుడు జంతువుల్లా ఇళ్లలో పెంచుకుంటారు. అయితే పులులు, సింహాలను పెంచుకోవడం అక్కడ నేరమేమీ కాదు. కాకపోతే అధికారిక డీలర్లు, బందిఖానాలో జన్మించిన వాటిని మాత్రమే కొనుగోలు చేసే వెసులుబాటు ఉంది. 2020లోనూ రోడ్డుపై తిరిగుతున్న ఓ బెంగాల్ టైగర్‌ను పోలీసులు సీజ్ చేశారు. 2019లో ఓ ఇంట్లో సింహాలను స్వాధీనం చేసుకున్నారు. సింహాల గర్జనకు బెంబేలెత్తిపోయిన పొరుగింటివారు ఫోన్ చేయడంతో అక్కడకు వెళ్లి వాటిని తరలించారు. చదవండి: Viral: జారిపోతున్న కార్లు.. అమెరికా మంచు తుఫాన్ వీడియోలు వైరల్.. -
FIFA WC: 1986 తర్వాత తొలిసారి నాకౌట్ దశకు మొరాకో.. గ్రూప్ టాపర్‌గా!
FIFA World Cup Qatar 2022: ఫిఫా వరల్డ్‌కప్-2022లో భాగంగా గ్రూప్ ‘ఎఫ్’లో ఆఫ్రికా ఖండానికి చెందిన మొరాకో జట్టు చివరి లీగ్ మ్యాచ్‌లో విజయం సాధించింది. కెనడా జట్టును 2–1తో ఓడించి 1986 తర్వాత ప్రపంచగకప్లో నాకౌట్ దశకు అర్హత సాధించింది. ఇక ప్రస్తుత ప్రపంచకప్ టోర్నీలో ఏడు పాయింట్లు సాధించిన మొరాకో గ్రూప్ ‘ఎఫ్’ టాపర్‌గా నిలిచింది. కెనడాతో మ్యాచ్‌లో మొరాకో తరఫున హకీమ్ జియెచ్ (4వ ని.లో), యుసెఫ్ ఎన్ నెస్రి (23వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... 40వ నిమిషంలో మొరాకో డిఫెండర్ నాయెఫ్ సెల్ఫ్ గోల్‌తో కెనడా ఖాతాలో గోల్ చేరింది. మెక్సికోకు నిరాశ... గ్రూప్ ‘సి’ చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో అర్జెంటీనా 2–0తో పోలాండ్‌పై... మెక్సికో 2–1తో సౌదీ అరేబియాపై గెలిచాయి. రెండో విజయంతో మెస్సీ కెప్టెన్సీలోని అర్జెంటీనా ఆరు పాయింట్లతో గ్రూప్ టాపర్‌గా నిలిచి నాకౌట్ దశకు అర్హత సాధించింది. అర్జెంటీనా తరఫున అలెక్సిస్ (46వ ని.), అల్వరెజ్ (67వ ని.) గోల్ చేశారు. సౌదీ అరేబియాపై మెక్సికో జట్టు గెలిచినా ముందంజ వేయలేకపోయింది. మెక్సికో జట్టులో మార్టిన్ (47వ ని.లో), చావెజ్ (52వ ని.లో) గోల్ చేయగా, సౌదీ తరఫున సాలెమ్ (95+5వ ని. ఇంజ్యూరీ టైమ్) గోల్ చేసి ఓటమిలో ఓదార్పునిచ్చాడు. పోలాండ్, మెక్సికో నాలుగు పాయింట్లతో సమంగా నిలిచినా... గోల్స్ అంతరంతో పోలాండ్ నాకౌట్‌కు అర్హత సంపాదించింది. 1994 తర్వాత మెక్సికో గ్రూప్ దశలోనే అవుటైంది. చదవండి: BCCI Chief Selector:టీమిండియా చీఫ్ సెలక్టర్ రేసులో మాజీ స్పీడ్‌స్టర్..! Pak Vs Eng: పాక్‌కు దిమ్మతిరిగేలా ఇంగ్లండ్ ప్రపంచ రికార్డు! టీమిండియాను వెనక్కినెట్టి.. -
మెస్సీకి అగ్ని పరీక్ష.. పోలాండ్ చేతిలో ఓడితే!
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిపా వరల్డ్‌కప్‌లో మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా బుధవారం అగ్నిపరీక్ష ఎదుర్కోనుంది. ఇవాళ అర్థరాత్రి దాటిన తర్వాత పోలాండ్‌తో జరగనున్న మ్యాచ్‌లో అర్జెంటీనా కచ్చితంగా గెలిచి తీరాల్సిందే. ఒకవేళ ఓడితే మాత్రం ఇంటికి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మెస్సీకి ఇదే చివరి ఫిఫా వరల్డ్‌కప్ అని భావిస్తున్న తరుణంలో అర్జెంటీనా ప్రీ క్వార్టర్స్‌కు చేరాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. అయితే గ్రూప్-సిలో అర్జెంటీనా సహా మిగతా అన్ని జట్లకు కూడా రౌండ్ ఆఫ్-16 అవకాశాలున్నాయి. అయితే చివరకు రెండు జట్లు మాత్రమే ప్రీ క్వార్టర్స్‌కు చేరుకుంటాయి. మరి ఆ రెండు జట్లు ఏవి అవుతాయనేది ఆసక్తికరంగా మారింది. అర్జెంటీనా, పోలాండ్‌కు ఎంత అవకాశం? ►బుధవారం జరగబోయే మ్యాచ్‌లలో అందరి కళ్లూ అర్జెంటీనా, మెస్సీపైనే ఉన్నాయి. ఆ టీమ్ తర్వాతి రౌండ్‌కు అర్హత సాధిస్తుందా లేక తొలి రౌండ్లోనే ఇంటిదారి పడుతుందా అన్నది తేలనుంది. గ్రూప్ సిలో టాపర్‌గా ఉన్న పోలాండ్‌తో చివరి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలిస్తేనే అర్జెంటీనా రౌండ్ ఆఫ్ 16కు వెళ్తుంది. ►ఒకవేళ ఈ మ్యాచ్ డ్రా అయితే రాబర్ట్ లెండోవాస్కీ నేతృత్వంలోని పోలాండ్ రౌండ్ ఆఫ్ 16కు వెళ్తుంది. అటు అర్జెంటీనా మాత్రం మరో మ్యాచ్ ఫలితంపై ఆధారపడాల్సి ఉంటుంది. సౌదీ అరేబియాను మెక్సికో ఓడించాలి. అదే సమయంలో గోల్ డిఫరెన్స్‌తో అర్జెంటీనా కంటే మెక్సికో వెనుక ఉండాలి. లేదంటే ఈ ఇద్దరి మ్యాచ్ డ్రా కావాలి. సౌదీ అరేబియా, మెక్సికో ►సౌదీ అరేబియా నాకౌట్‌కు చేరాలంటే కచ్చితంగా మెక్సికోను ఓడించాలి. మెక్సికో రౌండ్ ఆఫ్ 16 చేరాలంటే సౌదీని ఓడించడంతోపాటు అటు అర్జెంటీనాను పోలాండ్ ఓడించాల్సి ఉంటుంది. అదే సమయంలో అర్జెంటీనా కంటే గోల్స్ డిఫరెన్స్‌లో పైచేయి సాధించాలి. అయితే సౌదీ అరేబియాతో పోలిస్తే మెక్సికోకు నాకౌట్ చేరే అవకాశాలు తక్కువే అని చెప్పొచ్చు. ఆ లెక్కన చూస్తే అర్జెంటీనాకు ఇది అగ్ని పరీక్షే. ఎలాంటి సమీకరణాలు అవసరం లేకుండా ప్రీ క్వార్టర్స్ చేరాలంటే పోలాండ్‌ను కచ్చితంగా ఓడించాల్సిందే. ఇక తొలి మ్యాచ్‌లో సౌదీ అరేబియా చేతుల్లో ఓడడం అర్జెంటీనా అవకాశాలను సంక్లిష్టం చేసింది. ఇక ఫిఫా వరల్డ్‌కప్‌లో ఇప్పటికే బ్రెజిల్, ఫ్రాన్స్, పోర్చుగల్‌లాంటి జట్లు రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించాయి. అటు గ్రూప్-ఏ నుంచి నెదర్లాండ్స్, సెనెగల్.. గ్రూప్-బి నుంచి ఇంగ్లండ్, అమెరికాలు ప్రీ క్వార్టర్స్‌లో అడుగుపెట్టాయి. చదవండి: Lionel Messi: ఒక్క మ్యాచ్.. మూడు రికార్డులు బద్దలు కొట్టే అవకాశం FIFA WC: దేశాల మధ్య మాత్రమే యుద్ధం.. ఆటగాళ్లకు కాదు పంత్‌కు గాయం.. బంగ్లా టూర్‌కు దూరం! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5091503545.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
భార్యను చంపేశా! అంటూ స్నేహితుడికి వాయిస్ మెయిల్..షాక్‌లో పోలీసులు
ఏమైందో ఏమో ఒక మహిళా జడ్జి, ఆమె భర్త, వారి పెంపుడు జంతువులతో సహా ఇంట్లోనే విగతజీవులుగా పడి ఉన్నారు. ఈ ఘటన న్యూమెక్సికోలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న బెర్నాలిల్లో కౌంటీ షెరీఫ్ కార్యాలయం అధికారులు(పోలీసులు) అల్బుకెర్కీలోని రాంచిటోస్ రోడ్లో ఉన్న ఆ జడ్జీ ఇంటి వద్దకు వచ్చి తనిఖీలు నిర్వహించారు. ఆ ఇంట్లో పనిచేసే వాళ్లు తాము పనికి వచ్చేటప్పటికే ఆ భార్యభర్తలిద్దరు, వారి పెంపుడు జంతువులు చనిపోయి ఉన్నట్లు తెలిపారు. మృతి చెందిన మహిళ లాస్ రాంచోస్ మున్సిపల్ న్యాయమూర్తిగా పనిచేస్తున్న 65 ఏళ్ల డయాన్ ఆల్బర్ట్‌గా గుర్తించారు. ఐతే పోలీసులు జడ్జీ భర్త ఎరిక్ పింక్‌టరన్ తన భార్య ఆల్బర్ట్తోపాటు వారి పెంపుడు జంతువులను తుపాకీతో కాల్చి చంపి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ తర్వాత పింక్‌టరన్ కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. ఎందుకంటే బాధితుడు పింక్‌టరన్ తన స్నేహితుడుకి తన భార్యను పెంపుడు జంతువులను తుపాకీతో కాల్చి చంపినట్లు వాయిస్ మెసేజ్ పంపాడు. ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నట్లు మెయిల్లో వెల్లడించాడు. దీంతో ఒక్కసారిగా షాక్‌కి గురయ్యి అతను కౌంటీ షరీఫ్ కార్యాలయానికి సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగు చూసింది. ప్రస్తుతం కౌంటీ షెరీఫ్ కార్యాలయం అధికారులు కేసు నమోదు చేసుకుని పలుకోణాల్లో దర్యాప్తు చేయడం ప్రారంభించారు. (చదవండి: ఢిల్లీలో శ్రద్ధ తరహా ఘటన.. కుమారుడితో కలిసి భర్తను చంపిన భార్య.. శవాన్ని ముక్కలుగా చేసి ఫ్రిజ్‌లో..) -
FIFA World Cup Qatar 2022: అర్జెంటీనా నిలిచింది
తొలి మ్యాచ్‌లో సౌదీ అరేబియా చేతిలో ఎదురైన అనూహ్య ఓటమి నుంచి అర్జెంటీనా వెంటనే తేరుకుంది. ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీ లో నాకౌట్ దశకు అర్హత పొందే అవకాశాలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఈ మాజీ చాంపియన్ జట్టు సమష్టి ప్రదర్శనతో రాణించింది. తనదైన రోజున ఎంతటి మేటి జట్టునైనా ఓడించే సత్తాగల మెక్సికోను ఏమాత్రం తేలిగ్గా తీసుకోకుండా ఆడిన అర్జెంటీనా రెండు గోల్స్ తేడాతో విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది. పోలాండ్‌తో జరిగే చివరి మ్యాచ్‌లో అర్జెంటీనా గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా ప్రిక్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంటే సౌదీ అరేబియా–మెక్సికో మ్యాచ్ ఫలితంపై అర్జెంటీనా జట్టు నాకౌట్ అవకాశాలు ఆధారపడి ఉంటాయి. పోలాండ్ చేతిలో ఓడితే మాత్రం అర్జెంటీనా లీగ్ దశలోనే ఇంటిముఖం పడుతుంది. దోహా: టైటిల్ ఫేవరెట్స్‌లో ఒక జట్టుగా ఖతర్‌కు వచ్చిన అర్జెంటీనా తొలి మ్యాచ్‌లో సౌదీ అరేబియా చేతిలో ఓడిపోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. కానీ తొలి మ్యాచ్‌లో ఎదురైన పరాభవం నుంచి తేరుకున్న అర్జెంటీనా రెండో మ్యాచ్‌లో స్థాయికి తగ్గట్టు ఆడింది. గ్రూప్ ‘సి’లో భాగంగా మెక్సికోతో భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా 2–0 గోల్స్ తేడాతో విజయం సాధించింది. ఆట 64వ నిమిషంలో కెప్టెన్ లయనెల్ మెస్సీ గోల్‌తో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లిన అర్జెంటీనా... 87వ నిమిషంలో ఎంజో ఫెర్నాండెజ్ గోల్‌తో విజయాన్ని ఖాయం చేసుకుంది. నాకౌట్ చేరే అవకాశాలు సజీవంగా ఉండాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో అర్జెంటీనా జాగ్రత్తగా ఆడింది. మరోవైపు మెక్సికో ఫార్వర్డ్ అలెక్సిక్ వెగా అవకాశం వచ్చినపుడల్లా అర్జెంటీనా రక్షణ శ్రేణి ఆటగాళ్లకు ఇబ్బంది పెట్టాడు. 45వ నిమిషంలో వెగా కొట్టిన షాట్‌ను అర్జెంటీనా గోల్‌కీపర్ సమర్థంగా అడ్డుకున్నాడు. రెండో అర్ధభాగంలో అర్జెంటీనా ఆటగాళ్లు తమ దాడుల్లో పదును పెంచారు. చివరకు 64వ నిమిషంలో కుడివైపు నుంచి డిమారియా ఇచ్చిన పాస్‌ను అందుకున్న మెస్సీ 25 గజాల దూరం నుంచి షాట్ కొట్టగా మెక్సికో గోల్‌కీపర్ డైవ్ చేసినా బంతిని గోల్‌పోస్ట్‌లోనికి పోకుండా అడ్డుకోలేకపోయాడు. దాంతో అర్జెంటీనా బోణీ కొట్టింది. ఖాతా తెరిచిన ఉత్సాహంతో అర్జెంటీనా మరింత జోరు పెంచింది. మెస్సీ అందించిన పాస్‌ను ఎంజో ఫెర్నాండెజ్ అందుకొని షాట్ కొట్టగా బంతి మెక్సికో గోల్‌పోస్ట్‌లోనికి వెళ్లింది. దాంతో ప్రపంచకప్ చరిత్రలో అర్జెంటీనా చేతిలో మెక్సికోకు నాలుగో ఓటమి ఎదురైంది. ప్రపంచకప్‌లో నేడు కామెరూన్ X సెర్బియా మధ్యాహ్నం గం. 3:30 నుంచి దక్షిణ కొరియా X ఘనా సాయంత్రం గం. 6:30 నుంచి బ్రెజిల్ X స్విట్జర్లాండ్ రాత్రి గం. 9:30 నుంచి పోర్చుగల్ X ఉరుగ్వే అర్ధరాత్రి గం. 12:30 నుంచి స్పోర్ట్స్ 18, జియో సినిమా చానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
షాకింగ్.. తోకతో జన్మించిన చిన్నారి.. ఫొటో వైరల్..
మెక్సికోలో ఓ శిశువు తోకతో జన్మించింది. దాని పొడవు రెండు అంగుళాలు(5.7 సెంటీమీటర్లు) ఉంది. తమ దేశంలో ఇప్పటివరకు ఇలాంటి కేసు నమోదు కాలేదని వైద్యులు తెలిపారు. పాప తోక ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అయితే తల్లిదండ్రులు, పాప ఆరోగ్యంగా ఉన్నారు. ఎవరికీ ఎలాంటి సమస్యలు లేవు. తోకను సూదితో తాకినప్పుడు చిన్నారి ఏడ్చిందని వైద్యులు చెప్పారు. రెండు నెలల తర్వాత దాన్ని చిన్న సర్జరీ చేసి తొలగించినట్లు తెలిపారు. అదే రోజు పాపను డిశ్చార్జ్ చేసినట్లు వెల్లడించారు. ఆమె ఆరోగ్యంగానే ఉన్నట్లు పేర్కొన్నారు. తల్లిగర్భంలో ఉన్నప్పుడే శిశవుల్లో తోక వంటి ఆకృతి ఏర్పడుతుందని, అయితే 9 నెలలు నిండేసరికి అది ఎముకగా మారి లొపలికి వెళ్లిపోతుందని వైద్య నిపుణులు చెప్పారు. అత్యంత అరుదైన సందర్భాల్లోనే ఇలా తోకలతో శిశువులు జన్మిస్తారని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా 2017 నాటికి ఇలా తోకతో జన్మించిన శిశువుల సంఖ్య 195గా ఉంది. అయితే మెక్సిలో మాత్రం ఇదే తొలి కేసు. ఎక్కువగా మగ శిశువులకు ఇలా జరుగుతుంది. మెదడు, పుర్రె వృద్ధి సమస్యల ప్రభావంతోనే చిన్నారులు ఇలా తోకతో జన్మిస్తారని ఓ అధ్యయనం పేర్కొంది. కానీ వైద్యులు మాత్రం దీనికి కచ్చితమైన కారణాలు వెల్లడించలేదు. చదవండి: కరోనా తర్వాత ప్రపంచానికి మరో ఉపద్రవం.. అన్నింటికంటే డేంజర్..? -
మెక్సికోపై గెలుపు.. షర్ట్ విప్పి రచ్చ చేసిన మెస్సీ
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత మెక్సికోతో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా అద్భుత విజయం సాధించింది. ఈ విజయం తర్వాత వారి డ్రెస్సింగ్ రూమ్‌లో సంబరాలు ఘనంగా జరిగాయి. జట్టు మేనేజర్ సమా ఆటగాళ్లంతా ఒకరినొకరు అభినందించుకుంటూ సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక వేడుకల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మెస్సీనే నిలిచాడు. షర్ట్ విప్పి రచ్చ చేసిన మెస్సీ తన సంతోషాన్ని పంచుకున్నాడు. దీనిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా వీడియో వైరల్‌గా మారింది. ఈ సంతోషం వెనుక ఒక కారణం ఉంది. సౌదీ అరేబియా చేతిలో అనూహ్యంగా ఓటమి పాలైన అర్జెంటీనా ప్రి క్వార్టర్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే మెక్సికోతో మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిందే. అందుకే కీలక మ్యాచ్‌లో మెస్సీ బృందం తమ జూలు విదిల్చింది. జట్టు కెప్టెన్‌గా మెస్సీ అన్నీ తానై జట్టును ముందుండి నడిపించాడు. అయితే ఆటలో 67వ నిమిషం వరకు కూడా ఒక్క గోల్ నమోదు కాలేదు. ఈ నేపథ్యంలోనే మెస్సీ తనకు మత్రమే సాధ్యమైన గోల్‌తో మెరిసి అర్జెంటీనాకు తొలి గోల్ అందించాడు. ఆ తర్వాత ఆట 87వ నిమిషంలో ఎంజో ఫెర్నాండేజ్ రెండో గోల్ కొట్టడంతో అర్జెంటీనా 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక నిర్ణీత సమయంలో సౌదీ అరేబియా గోల్ కొట్టడంలో విఫలం కావడంతో అర్జెంటీనా విజేతగా నిలిచింది. View this post on Instagram A post shared by 433 (@433) చదవండి: ఒక్క మ్యాచ్‌కే పక్కనబెట్టారు.. సౌత్ ప్లేయర్ అనేగా వివక్ష FIFA WC: నువ్వయ్యా అసలు సిసలైన అభిమానివి! -
మెస్సీ గురి అదిరింది.. అర్జెంటీనా ప్రీక్వార్టర్స్ ఆశలు సజీవం
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా తన ప్రి క్వార్టర్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో అర్జెంటీనా జూలు విదిల్చింది. గ్రూప్-సిలో భాగంగా శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత మెక్సికోతో జరిగిన మ్యాచ్‌లో 2-0 తేడాతో అర్జెంటీనా ఘన విజయం సాధించింది. తొలి అర్థభాగంలో ఇరుజట్లు ఒక్క గోల్ కూడా చేయలేకపోయాయి. అయితే రెండో అర్థభాగంలో మాత్రం అర్జెంటీనా మెక్సికోపై అటాకింగ్ గేమ్ ఆడి ఫలితాలను సాధించింది. ముందు ఆట 64వ నిమిషంలో లియోనల్ మెస్సీ జట్టుకు తొలి గోల్ అందించగా.. ఆ తర్వాత ఆట 87వ నిమిషంలో ఎంజో ఫెర్నాండేజ్ రెండో గోల్ కొట్టాడు. ఇక మెస్సీకి ఈ ప్రపంచకప్‌లో ఇది రెండో గోల్ కావడం విశేషం. సౌదీ అరేబియాతో మ్యాచ్‌లోనూ మెస్సీ ఫెనాల్టీని గోల్‌గా మలిచిన సంగతి తెలిసిందే. తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైనప్పటికి మెక్సికోపై విజయంతో అర్జెంటీనా ప్రిక్వార్టర్స్ ఆశలు సజీవంగా ఉన్నాయి. Cometh the ⌛ Cometh the 🐐 💯 ▶ Relive Messi's heroics against #ElTri that kept @Argentina in the #FIFAWorldCup 🙌 Keep watching the #WorldsGreatestShow, only on #JioCinema & @Sports18 📲📺#Qatar2022 #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/KQHjSrSDTY — JioCinema (@JioCinema) November 27, 2022 -
FIFA WC: డెన్మార్క్‌కు చెక్ పెట్టిన ట్యునీషియా.. మెక్సికో- పోలాండ్ మ్యాచ్ కూడా
FIFA World Cup 2022- దోహా: పట్టుదలతో ఆడితే ప్రపంచకప్‌లాంటి గొప్ప ఈవెంట్లోనూ తమకంటే ఎంతో మెరుగైన జట్టుపై మంచి ఫలితం సాధించవచ్చని ట్యునీషియా జట్టు నిరూపించింది. ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో భాగంగా మంగళవారం జరిగిన గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లో ప్రపంచ 30వ ర్యాంకర్ ట్యునీషియా 0–0తో ప్రపంచ 10వ ర్యాంకర్ డెన్మార్క్జట్టును నిలువరించింది. రెండు జట్లు గోల్ చేయడంలో విఫలమయ్యాయి. ట్యునీషియా గోల్‌పోస్ట్ లక్ష్యంగా డెన్మార్క్ జట్టు ఐదుసార్లు షాట్లు కొట్టినా ఫలితం లేకపోయింది. డెన్మార్క్ ఆటగాళ్లు బంతిని తమ ఆధీనంలో 62 శాతం ఉంచుకున్నా ట్యునీషియా రక్షణ శ్రేణిని ఛేదించి గోల్ చేయలేకపోయారు. మ్యాచ్ ‘డ్రా’గా ముగియడంతో రెండు జట్లకు ఒక్కో పాయింట్ లభించింది. మరో ‘డ్రా’ దోహా: ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీలో మరో ‘డ్రా’ నమోదైంది. పోలాండ్, మెక్సికో జట్ల మధ్య మంగళవారం జరిగిన గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో రెండు జట్లు గోల్ చేయడంలో విఫలమయ్యాయి. దాంతో మ్యాచ్ 0–0తో ‘డ్రా’గా ముగిసింది. మెక్సికో జట్టు పోలాండ్ గోల్‌పోస్ట్ లక్ష్యంగా నాలుగు సార్లు షాట్లు సంధించగా ఒక్కటీ లక్ష్యానికి చేరలేదు. పోలాండ్ స్టార్ ప్లేయర్ లెవన్డౌస్కీను మెక్సికో జట్టు వ్యూహత్మకంగా కట్టడి చేసింది. మ్యాచ్ ‘డ్రా’గా ముగియడంతో రెండు జట్లకు ఒక్కో పాయింట్ లభించింది. వేల్స్‌ను గట్టెక్కించిన బేల్ 64 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీకి అర్హత సాధించిన వేల్స్ జట్టు తొలి మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంది. అమెరికాతో సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌ను వేల్స్ 1–1తో ‘డ్రా’గా ముగించింది. ఆట 82వ నిమిషంలో వేల్స్ జట్టుకు లభించిన పెనాల్టీని గ్యారెత్ బేల్ గోల్‌గా మలిచి స్కోరును 1–1తో సమం చేశాడు. 36వ నిమిషంలో టిమోతి చేసిన గోల్‌తో అమెరికా ఖాతా తెరిచింది. మ్యాచ్ ‘డ్రా’ కావడంతో రెండు జట్లుకు ఒక్కో పాయింట్ దక్కింది. చదవండి: FIFA World Cup: ప్రపంచకప్‌లో సంచలనాల జాబితా.. ఇప్పుడు సౌదీ.. అప్పట్లో -
FIFA World Cup 2022: అర్జెంటీనా జోరు కనబర్చేనా!
‘ఫిఫా’ ఫుట్‌బాల్ ప్రపంచకప్ అంటే గుర్తొచ్చేది అర్జెంటీనా. దివంగత దిగ్గజం మారడోనా నుంచి నేటి తరం మెస్సీ దాకా అర్జెంటీనాను అందలంలో నిలిపిన వారే! ఇలాంటి జట్టు ఉన్న గ్రూప్‌లో మిగతా ప్రత్యర్థులకు గుండె హడల్ గ్యారంటీ. గ్రూప్ ‘సి’లో ఈ మేటి జట్టును ఎదుర్కొనేందుకు మెక్సికో, పోలాండ్, సౌదీ అరేబియా సర్వశక్తులు ఒడ్డాల్సిందే. ఓడించలేకపోయినా... కనీసం నిలువరించినా ఆయా జట్లకు గెలిచినంత సంబరం. ఈ నేపథ్యంలో ఏ జట్టు అర్జెంటీనాను ‘ఢీ’కొంటుందనేది అసక్తికరం! అర్జెంటీనా ప్రపంచకప్‌లో శక్తిమంతమైన జట్లలో అర్జెంటీనా ఒకటి. ఖతర్ ఈవెంట్లో తన బలాన్ని ప్రపంచానికి చాటేందుకు సిద్ధమైంది. తమ ఆల్ టైమ్ గ్రేటెస్టు ఫుట్‌బాలర్ లయెనల్ మెస్సీకి ఘనమైన వీడ్కోలు పలకాలనే పట్టుదలతో ఉంది. 35 ఏళ్ల మెస్సీ ప్రపంచకప్ మెరుపులకు ఖతరే ఆఖరి వేదిక. ఆ తర్వాత ఆటకు టాటా చెప్పడమే తరువాయి. గతేడాది గట్టి ప్రత్యర్థి బ్రెజిల్‌ను ఓడించి ‘కోపా అమెరికా కప్’ను గెలిచింది. ఆ టోర్నీలో మెస్సీతో పాటు ఏంజెల్ డి మరియా అద్భుతంగా రాణించారు. ఫిఫా ర్యాంక్: 3 ప్రపంచకప్‌లో అత్యుత్తమ ప్రదర్శన: రెండుసార్లు విజేత (1978, 1986). ఇతర ఘనతలు: 15 సార్లు ‘కోపా అమెరికా కప్’ టైటిళ్లు. అర్హత: దక్షిణ అమెరికా క్వాలిఫయింగ్ టోర్నీలో రన్నరప్ ద్వారా. కీలక ఆటగాళ్లు: మెస్సీ, డి మరియా, లో సెల్సో. మెక్సికో ఈ గ్రూప్‌లో అర్జెంటీనా తర్వాత మరో మంచి జట్టు మెక్సికో. గత ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్ జర్మనీని కంగుతినిపించి గ్రూప్ దశను ఆరంభించిన మెక్సికో తదుపరి రౌండ్ ప్రిక్వార్టర్స్‌లోనే వెనుదిరిగింది. ఈసారి మాత్రం మెరుగైన ప్రదర్శన ఇచ్చేందుకు చెమటోడ్చింది. అర్జెంటీనాకు చెందిన కోచ్ గెరార్డో మార్టినో 2019 నుంచి మూడున్నరేళ్లుగా జట్టును సానబెడుతున్నారు. స్టార్ ఆటగాళ్లు రాల్ జిమెనెజ్, హెక్టర్ హెరెరా, హిర్వింగ్ లొజానోలపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఫిఫా ర్యాంక్: 13. ప్రపంచకప్‌లో అత్యుత్తమ ప్రదర్శన: క్వార్టర్ ఫైనల్ (1986). ఇతర ఘనతలు: కాన్ఫెడరేషన్ కప్ విజేత (1999). అర్హత: ఉత్తర, మధ్య అమెరికా క్వాలిఫయింగ్ టోర్నీ రన్నరప్‌తో. కీలక ఆటగాళ్లు: జిమినెజ్, హిరెరా. పోలాండ్ అర్జెంటీనా, మెక్సికోలతో పోల్చితే గట్టి ప్రత్యర్థి కాదు కానీ... ఈ గ్రూప్‌లో ‘డార్క్ హార్స్’ అని చెప్పొచ్చు. తనదైన రోజున ఒక్క గోల్‌తో పైచేయి సాధించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. స్టార్ ఆటగాళ్లు ఫామ్‌లో ఉండటం జట్టుకు కలిసొచ్చే అంశం. స్ట్రయికర్లు రాబర్ట్ లెవండోస్కీ, పీటర్ జెలిన్స్కీ, మాటీ కాష్లు ఇటీవల బాగా ఆకట్టుకుంటున్నారు. ఇంగ్లండ్, స్పెయిన్ లీగ్‌లలో సత్తా చాటుకున్నారు. ఈ ఏడాది ఆరంభంలోనే కోచ్ బాధ్యతలు చేపట్టిన చెస్లా మిచ్నివిక్ (పోలాండ్) సొంత జట్టును ప్రపంచకప్‌కు సిద్ధం చేస్తున్నారు. అయితే మేటి జట్లను దాటుకుని నాకౌట్ చేరడం అంత సులువేమీ కాదు. ఫిఫా ర్యాంక్: 26. ప్రపంచకప్‌లో అత్యుత్తమ ప్రదర్శన: మూడో స్థానం (1982). ఇతర ఘనతలు: ‘యూరో కప్’లో క్వార్టర్స్ (2016). అర్హత: యూరోపియన్ క్వాలిఫయింగ్ ప్లేఆఫ్ విన్నర్. కీలక ఆటగాళ్లు: లెవండోస్కీ, జెలిన్స్కీ. సౌదీ అరేబియా గ్రూప్‌లోని మిగతా జట్లకంటే తక్కువ ర్యాంక్ జట్టు. పైగా గత నాలుగు ప్రపంచకప్‌లలో గ్రూప్ దశనే దాటలేకపోయింది. ఇలాంటి జట్టు గ్రూప్ ‘సి’ నుంచి ప్రిక్వార్టర్స్ చేరితే అది సంచలనమే అవుతుంది. అయితే గల్ఫ్ దేశంలోనే మెగా ఈవెంట్ జరగడం కాస్త కలిసొచ్చే అంశం కానీ... ముందడుగు వేయడం కష్టమే! కీలక ఆటగాళ్లు సలేహ్ అల్ శెహ్రి, సలిమ్, సాల్మన్ అల్ ఫరాజ్ తమ ప్రదర్శనతో గల్ఫ్ సాకర్ ప్రియుల్ని అలరించడం ఖాయం. ఫ్రాన్స్‌కు చెందిన కోచ్ హెర్వ్ రినార్డ్ 2019 నుంచి జట్టును తీర్చిదిద్దుతున్నాడు. ఫిఫా ర్యాంక్: 51. ప్రపంచకప్‌లో అత్యుత్తమ ప్రదర్శన: ప్రిక్వార్టర్స్ (1994). ఇతర ఘనతలు: ఆసియా చాంపియన్ (1984, 1988, 1996). అర్హత: ఆసియా క్వాలిఫయింగ్‌లో గ్రూప్ ‘బి’ రన్నరప్. కీలక ఆటగాళ్లు: సలేహ్ అల్ శెహ్రి, అల్ ఫరాజ్. –సాక్షి క్రీడా విభాగం -
ఫ్రస్ట్రేషన్ పీక్స్‌కి వెళ్తే ఇలా ఉంటుందా! వీడియో వైరల్
అనుకున్నది జరగకపోతే పిచ్చ కోపం వస్తుంది. మహా అయితే ఆ రోజంతా మన మూడ్ బాగోక ఎవరితోనూ మాట్లాడకుండా డల్ ఉంటాం. కానీ కొందరూ మాత్రం తమకు నచ్చినట్టు జరగకపోతే కోపంతో ఘోరంగా ప్రవర్తిస్తుంటారు. ఇక్కడొక మహిళ కూడా అచ్చం అలానే ఫ్లైట్ మిస్సయ్యానన్న కోపంతో ఎంత దారుణంగా ప్రవర్తించిందో వింటే షాక్ అవుతారు. వివరాల్లోకెళ్తే...మెక్సికోలో ఎమిరేట్స్ అనే అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌లో ఒక మహిళను అధికారులు తనిఖీ చేసే నిమిత్తం ఫ్లైట్ ఎక్కనివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో ఆమె ఫ్లైట్ మిస్సైయ్యింది. అంతే పట్టరాని కోపంతో అక్కడ ఉన్న మహిళా అధికారిపై పిడి గుద్దులతో దాడి చేసి...అక్కడ ఉన్న కంప్యూటర్లను అన్నింటి విసిరేస్తూ పెద్ద వీరంగం సృష్టించింది. అయితే ఆమె గడువు ముగిసిన పాస్‌పోర్ట్‌తో ఎక్కేందుకు యత్నించడంతో ఆమెను ఫ్లైట్ ఎక్కనివ్వకుండా అడ్డుకున్నామని ఎయిర్ పోర్ట్ అదికారులు తెలిపారు. తాము అడ్డుకున్నమన్న కోపంతో ఆమె తమను దుర్భాషలాడి, దాడి చేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఎయిర్పోర్ట్ పోలీసులు రంగంలోకి ఆమెను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా అక్కడ ఉన్న వస్తువులన్నింటిని కింద పడేసి పెద్ద హంగామా సృష్టించిందన్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. (చదవండి: చూస్తుండగానే...హఠాత్తుగా కుర్చిలోంచి కుప్పకూలిపోయాడు) -
కుక్క నోట్లో మనిషి తల.. అక్కడంతే!
చిమ్మ చీకట్లో.. మనిషి తల నోట కర్చుకుని రోడ్ల వెంట పరిగెడుతున్న ఓ కుక్క. సడన్‌గా ఆ దృశ్యం చూసిన ఎవరికైనా ఒళ్ళు జలదరించడం ఖాయం. అయితే ఆ వీడియోనే ట్విట్టర్ ద్వారా విపరీతంగా వైరల్ అవుతోంది. చివరికి.. రంగంలోకి దిగిన పోలీసులు దాని వెంటపడ్డారు. ఓ పోలీస్ అధికారి బలవంతంగా దాని నోటి నుంచి ఆ తలను బయటకు తీశాడు. అయితే.. ఆ వీడియో ఎక్కడిది అనే విషయంపై ఇప్పుడొక స్పష్టత వచ్చింది. మెక్సికో దేశంలోని జకాటెకాస్ స్టేట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. గత బుధవారం ఈ ఘటన జరిగిందని ఫాక్స్ న్యూస్ వెల్లడించింది. క్రైమ్ సీన్ నుంచి తల తీసుకుని ఆ వీధి కుక్క పరిగెత్తిన్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మోంటే ఎస్కోబెడో టౌన్‌లోని ఓ బూత్‌లో ఆ తలను దుండగులు ఉంచినట్లు నిర్ధారించారు. అంతేకాదు.. అక్కడ ‘తర్వాతి తల నీదే’ అనే హెచ్చరికను సైతం గుర్తించారు. అయితే.. ఇలాంటి వ్యవహారాలను అక్కడి ప్రజలు పెద్దగా పట్టించుకోరు. కారణం.. అది అక్కడ సర్వసాధారణం కాబట్టి. కార్టెల్ జలిస్కో న్యుయెవ జెనెరసియాన్.. ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన డ్రగ్స్ ముఠాలకు అడ్డా. సినాలోవా, జలిస్కో డ్రగ్ కార్టెల్స్ అక్కడ అత్యంత శక్తివంతమైన గ్యాంగ్‌లను నడిపిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రత్యర్థుల దాడిలోనే సదరు మొండెం లేని తల పడి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. తాజాగా.. కిందటి నెలలో గుర్రెరో స్టేట్‌లో రెండు ముఠాలు.. భారీ ఎత్తున హింసకు పాల్పడ్డాయి. ఈ ముఠా కక్షలో పద్దెనిమిది మంది మృతి చెందగా.. అందులో ఓ మేయర్, మాజీ మేయర్ కూడా ఉన్నారు. warning: some viewers may find the following video disturbing Dog running down the street with a human head. #dogs #head #mexico #running #crazyvideos #wtfvideos #lookatthis💩 #huemongrind pic.twitter.com/vob1vUAfKM — the HUEMON GRIND (@SuperHuemon) October 28, 2022 -
బార్లోకి చొరబడి కాల్పులు.. 12 మంది మృతి!
మెక్సికో సిటీ: గుర్తు తెలియని కొందరు దుండగులు బారులోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డారు. ఈ దారుణ ఘటనలో ఆరుగురు మహిళలు, ఆరుగురు పురుషులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన సెంట్రల్ మెక్సికో ఇరాపుటో నగరంలో శనివారం రాత్రి జరిగింది. గ్వానాజువాటో రాష్ట్రంలో నెల రోజుల వ్యవధిలోనే కాల్పుల ఘటన జరగటం ఇది రెండోది కావటం గమనార్హం. ఈ దాడిలో ముగ్గురు గాయపడినట్లు సిటీ ప్రభుత్వం తెలిపింది. నరమేధానికి పాల్పడిన దుండగుల కోసం భారీగా బలగాలను మోహరించినట్లు వెల్లడించింది. బార్లోకి చొరబడి కాల్పులు జరిపేందుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని ఉన్నతాధికారులు తెలిపారు. గ్వానాజువాటో ప్రధానంగా ప్రపంచస్థాయి కార్ మేకర్స్‌కు తయారీ హబ్‌గా ఉంది. అయితే.. కొద్ది సంవత్సరాలుగా డ్రగ్స్ గ్యాంగ్స్ మధ్య భీకర పోరు జరుగుతుండటంతో భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 21న గ్వానాజువాటోలోని ఓ బార్లో కాల్పులు జరగటం వల్ల 10 మంది మరణించారు. 2018లో అధికారం చేపట్టిన అధ్యక్షుడు అండ్రెస్ మన్యూయెల్ లోపేజ్ ఒబ్రేడర్.. గ్యాంగ్ హింసలను తగ్గించారు. అయితే.. డ్రగ్స్ ముఠాలను పూర్తిస్థాయిలో నియంత్రించలేకపోతున్నారు. ఇదీ చదవండి: రష్యా సైనిక శిక్షణ కేంద్రంపై కాల్పులు.. 11 మంది మృతి -
57 మంది విద్యార్థులపై విష ప్రయోగం!
మెక్సికో సిటీ: పాఠశాలలో 57 మంది విద్యార్థులపై విష ప్రయోగం జరిగిన దారుణ సంఘటన మెక్సికోలో వెలుగు చూసింది. దక్షిణ మెక్సికన్ రాష్ట్రమైన చియాపాస్‌లో గ్రామీణ మాధ్యమిక పాఠశాలలో విద్యార్థులపై గుర్తు తెలియని పదార్థంతో విష ప్రయోగం చేశారని స్థానిక మీడియాలు వెల్లడించారు. ఈ ఘటన తర్వాత ప్రైవేటు ప్రయోగశాల పరిశోధనల్లో విద్యార్థులకు కొకైన్ పాజిటివ్‌గా తేలినట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి. మరోవైపు.. కలుషితమైన ఆహారం, నీటిని తీసుకోవటం వల్లే తమ పిల్లల ఆరోగ్యం దెబ్బతిందని.. విద్యార్థుల తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విష ప్రయోగం జరిగిన వారిలో ఒక విద్యార్థి పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన వారి పరిస్థితి నిలకడగా ఉందని స్థానిక అధికారులు వెల్లడించారు. విద్యార్థులపై విష ప్రయోగం జరగటం రెండు వారాల్లో ఇది మూడో సంఘటన కావటం ఆందోళన కలిగిస్తోంది. బోచిన్ ప్రాంతానికి చెందిన 57 మంది చిన్నారులు విష ప్రయోగం జరిగిన లక్షణాలతో స్థానిక ఆస్పత్రిలో చేరారని.. ఒక విద్యార్థిని ఉన్నతాసుపత్రికి తరలించగా..మిగిలిన విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని మెక్సికన్ సోషల్ సెక్యూరిటీ ఇన్స్టిట్యూట్ తెలిపింది. శనివారం 15 మందిపై విష నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. నెగెటివ్‌గా తేలాయి. అయితే చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదీ చదవండి: దోపిడి చేసేందుకు వచ్చి కాల్పుల వీరంగం -
డ్రగ్స్ ముఠా కాల్పులు.. మేయర్ సహా 18 మంది మృతి
మెక్సికో సిటీ: మెక్సికోలో మరోసారి తుపాకీ మోతలతో అట్టుడికింది. శాన్ మిగ్యుల్ టోటోలాపాన్ పట్టణంలోని సిటీ హాల్లో దుండగులు జరిపిన కాల్పుల్లో మొత్తం 18 మంది మృతి చెందారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో పట్టణ మేయర్ కాన్రాడో మెండోజా, ఆయన తండ్రి జువాన్ కూడా ఉన్నారని స్థానిక మీడియాలు తెలిపాయి. కాల్పుల్లో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మేయర్ హత్య కోసమే.. కాల్పులకు పాల్పడి దుండగులు ‘లాస్ టెకిలెరోస్’ డ్రగ్స్ ముఠాకు చెందినవారిగా అధికారులు భావిస్తున్నారు. మేయర్‌ను హతమార్చాలనే లక్ష్యంతోనే వారు భవనం లోపలికి ప్రవేశించి, ముందస్తు ప్రణాళిక ప్రకారం వరుస దాడులు చేసినట్లు పేర్కొన్నారు. భద్రతా బలగాలు నగరంలోకి ప్రవేశించకుండా అడ్డుకునేందుకుగానూ అంతకుముందే భారీ వాహనాలతో రహదారులను బ్లాక్ చేసినట్లు అధికారులు తెలిపారు. మేయర్ మృతిపై గెరెరో గవర్నర్ ఎవెలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పీఆర్డీ పార్టీ సైతం ఈ ఘటనను ఖండించింది. పిరికిపంద చర్యగా అభివర్ణించింది. మరోవైపు.. నిందితులను పట్టుకునేందుకు మెక్సికో ప్రభుత్వం సైన్యాన్ని దించింది. ఇదీ చదవండి: రష్యాకు షాక్.. విలీన ప్రాంతాలను తిరిగి చేజిక్కించుకుంటున్న ఉక్రెయిన్! -
Elizabeth-2: అంత్యక్రియలకు వెళ్లి సెల్ఫీకి పోజులా? అదేమైనా బర్త్‌డే పార్టీనా?
లండన్: మెక్సీకో విదేశాంగ మంత్రి మార్సెలో ఇబ్రార్డ్ను నేటిజన్లు ఏకిపారేశారు. బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియలకు వెళ్లిన ఆయన.. భార్యతో కలిసి సెల్ఫీకి పోజులివ్వడంపై మండిపడ్డారు. దేశం తరఫున ప్రతినిధిగా వెళ్లి రాణి అంత్యక్రియల్లో ఇంత అమర్యాదగా ప్రవర్తిస్తారా? అని విమర్శలు గుప్పించారు. 'మీరు భార్యతో కలిసి సెల్ఫీలు తీసుకోవడానికి అదేం బర్త్‌డే పార్టీ కాదు. మెక్సీకో ప్రతినిధిగా వెళ్లారు. అది గుర్తుపెట్టుకోండి' అని ఓ నెటిజన్ ఇబ్రార్డ్కు చురకలు అంటించాడు. 'ఈయన లండన్ పర్యటనకు వెళ్లిన వింత సందర్శకుడిలా ప్రవర్తించారు. ఇతరులను ఇబ్బందిపెట్టి అందరూ తనవైపు చూడాలనుకుంటున్నారమో?' అని మరో యూజర్ విమర్శించాడు. బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియలు సోమవారం జరిగాయి. 2,000 మంది విదేశీ ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అందులో ఇబ్రార్డ్ ఒకరు. అయితే అంత్యక్రియలకు ముందు ఆయన భార్యతో కలిసి దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఇరకాటంలో పడ్డారు. En el Funeral de Estado de S.M. la Reina Isabel II pic.twitter.com/GUiNPtJrSo — Marcelo Ebrard C. (@m_ebrard) September 19, 2022 చదవండి: ఎలిజబెత్-2 అంత్యక్రియల్లో ప్రిన్స్ హ్యరీ తీరుపై నెటిజన్ల ఫైర్ -
మళ్లీ అదే తేదీ.. ఊగిపోయి కుప్పకూలిన బిల్డింగులు
మెక్సికో సిటీ: దక్షిణ అమెరికా దేశం మెక్సికో అతిభారీ ప్రకంపనలతో చిగురుటాకులా వణికిపోయింది. భారత కాలమానం ప్రకారం.. సోమవారం రాత్రి పదకొండున్నర గంటల ప్రాంతంలో అక్కడ భారీ భూకంపం సంభవించింది. మరోవైపు మూడు నుంచి తొమ్మిది అడుగుల ఎత్తు సముద్ర అలలు ఎగిసిపడడంతో.. సునామీ హెచ్చరికలు జారీ చేసింది యూఎస్-ఫసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం. రిక్టర్ స్కేల్‌పై 7.6 తీవ్రతతో పశ్చిమ మెక్సికో ప్రాంతంలో ఒక్కసారిగా ప్రకంపనలు సంభవించాయి. శక్తివంతమైన ప్రకంపనల ధాటిగా చెట్లు, భవనాలు కూలి విధ్వంసం చోటు చేసుకుంది. అయితే.. అదృష్టవశాత్తూ తక్కువ ప్రాణ నష్టం వాటిల్లిందని అధికారులు వెల్లడించారు. కాకపోతే భారీగా భవనాలు కూలిపోగా.. దారిపొడవునా చెట్లు వేళ్లతో సహా రోడ్ల మీద కుప్పకూలాయి. En varias partes de nuestro pais estuvo bastante fuerte el #temblor #sismo #mexico #19septiembre pic.twitter.com/ga7LeMRWRn — Tapatio Tradi (@tapatiotrad) September 19, 2022 విశేషం ఏంటంటే.. సెప్టెంబర్ 19వ తేదీ మెక్సికో చరిత్రలో పెనువిషాదాలను నింపిన రోజు కావడం. 1985 సెప్టెంబర్ 19వ తేదీన రిక్టర్‌స్కేల్‌పై 8.0 తీవ్రతతో భూకంపం, పది అడుగుల ఎత్తు అలలతో సునామీ సంభవించగా.. ఐదువేల మందికిపైగా మరణించారు. ఇక.. 2017 సెప్టెంబర్ 19వ తేదీన మెక్సికో మున్సిపాలిటీ పరిధిలోని ప్యూబ్లాలో 7.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఆ దాటికి సుమారు 400 మంది ప్రాణాలు కోల్పోగా.. ఆరు వేల మందికిపైగా గాయపడ్డారు. అయితే తాజా భూకంపంలో.. మాత్రం కేవలం ఒకే ఒక్క ప్రాణం పోయింది. మాంజానిలో లోని ఓ డిపార్ట్మెంట్స్టోర్ పైకప్పు కూలి ఒక వ్యక్తి మరణించాడు. గ్లాస్ పడి మరో వ్యక్తికి గాయాలు అయ్యాయి. కాకపోతే భారీ ప్రకంపనల ధాటికి భవనాలు, చెట్లు ఊగిపోయాయి. జనాలు భయంతో బయటకు పరుగులు తీశారు. ఆస్పత్రులు, ప్రయాణాల్లో ఉన్నవాళ్లు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేత పట్టుకుని గడిపారు. మొత్తానికి సెప్టెంబర్ 19 భూకంపం సెంటిమెంట్ మెక్సికోను వణికిపోయేలా చేసింది. సునామీ హెచ్చరికలను ఇంకా ఉపసంహరించాల్సి ఉంది అక్కడ. ఇదీ చదవండి: కంటికి కనిపించని అద్భుతాలను ‘ఆ’ కంటితో చూడొచ్చు.. -
ఆ ఊళ్లో దెయ్యం భయం... రాత్రివేళల్లో వింత వింత శబ్దాలు!
కొన్నేళ్ల కిందట తెలుగునాట కొన్ని ప్రాంతాల్లో ‘ఓ స్త్రీ రేపు రా’ అనే రాతలు ఇళ్ల గోడల మీద కనిపించేవి. స్త్రీ రూపంలో ఒక దెయ్యం హడలెత్తిస్తోందనే ప్రచారం కారణంగా, ఆ దెయ్యం నుంచి తప్పించుకోవడానికి ఇళ్ల గోడల మీద అలా రాసేవారు. ఇప్పుడు మన ప్రాంతాల్లో ఎలాంటి దెయ్యం భయాలూ లేవు, అలాంటి రాతలూ లేవు. అయితే, కొద్దిరోజుల కిందట మెక్సికోలోని కోకోయోక్ పట్టణంలో దెయ్యం తిరుగుతోందనే ప్రచారం మొదలైంది. రాత్రి పదిగంటల తర్వాత ఆ దెయ్యం వీథుల్లో తిరుగుతోందని కథలు కథలుగా ప్రచారం సాగడంతో ఆ ఊళ్లోని జనాలు రాత్రి పదిగంటల తర్వాత బయటకు రావాలంటేనే భయంతో వణికిపోతున్నారు. కోకోయోక్ పట్టణం, ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ‘నహువా’ తెగకు చెందిన ప్రజలు ఉంటుంటారు. వారికి అతీంద్రియ శక్తులపైన, క్షుద్రప్రయోగాలపైన నమ్మకాలు ఎక్కువ. కొద్దిరోజుల కిందట రాత్రివేళల్లో వింత వింత శబ్దాలు విన్నట్లు స్థానికులు చెప్పుకోవడం మొదలైంది. మెల్లగా ఈ ప్రచారం ఊరంతా వ్యాపించింది. ఇది దెయ్యాల పనే అయి ఉంటుందని కొందరు వృద్ధులు చెప్పడంతో జనాల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఊళ్లో తిరిగే దెయ్యం ఇంట్లో చొరబడకుండా ఉండటానికి ఊళ్లోని ప్రతి ఇంటికీ వీధి తలుపులపై శిలువ గుర్తులు వేయించుకున్నారు. అయినా సరే భయం తీరక రాత్రివేళల్లో పదిగంటలకు లోపే ఇళ్లకు చేరుకుని, తలుపులు బిడాయించేసుకుంటున్నారు. చదవండి: వీడియో: సూపర్ టైపూన్ హిన్నమ్నోర్.. గంటకు 314 కిలోమీటర్ల ప్రచండ గాలులు.. చిగురుటాకులా వణుకు -
మిరాకిల్: అంత్యక్రియలు చేస్తుండగా కళ్లు తెరిచిన 3 ఏళ్ల చిన్నారి
మెక్సికో సిటీ: చనిపోయిన వ్యక్తులు మళ్లీ ప్రాణంతో తిరిగిరావటం సినిమాల్లో చూసే ఉంటాం. అయితే.. నిజ జీవితంలో అలా జరగటం దాదాపుగా అసాధ్యం. కానీ, డాక్టర్లు చనిపోయిందని ప్రకటించిన ఓ మూడేళ్ల పాప అంత్యక్రియలు చేస్తుండగా లేచింది. నేను బతికే ఉన్నాను అంటూ కళ్లు తెరిచింది. ఈ అరుదైన సంఘటన ఆగస్టు 17న మెక్సికోలో జరిగింది. ఆసుపత్రి వర్గాల నిర్లక్ష్యంతో తన పాపను చనిపోయిందని ప్రకటించారని ఆరోపించారు తల్లి మారీ జాన్ మెండోజా. ఏం జరిగింది? విల్లా డీ రమోస్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు కమిలా రోక్సానా అనే మహిళ. ఆమె 3 ఏళ్ల కూతురు కమిలా రోక్సానా మార్టినెజ్ మెన్డోజా.. కడుపు నొప్పి, వాంతులు, జ్వరంతో బాధపడుతుండగా స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, మరో పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు చెప్పారు. అప్పటిలోపు పారాసిటమల్ ట్యాబ్లెట్స్ వేయాలని ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు. మరో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లేలోపు పాప ఆరోగ్యం మరింత విషమించింది. అక్కడి వైద్యులు మందులు ఇచ్చి, చిన్నారికి పండ్లు, వాటర్ ఇవ్వాలని సూచించారు. అయినప్పటికీ ఆమె పరిస్థితిలో ఎలాంటి పురోగతి కనిపించలేదు. దీంతో ఎమర్జెన్సీ రూమ్‌కు తరలించి చికిత్స అందించారు. ఆసుపత్రి సిబ్బంది పాపకు ఎక్కువ సమయం ఆక్సిజన్ పెట్టి ఉంచారని తల్లి ఆరోపించారు. 10 నిమిషాల పాటు ఇంట్రావీనస్ ద్రవాలను ఎక్కించిన తర్వాత వాటిని తొలగించి చనిపోయినట్లు వెల్లడించారని తెలిపారు. డీహైడ్రేషన్ కారణంగా చనిపోయిందని వైద్యులు పేర్కొననారు. ఆ తర్వాతి రోజు అంత్యక్రియలు చేసేందుకు సిద్ధమయ్యారు కుటుంబ సభ్యులు. ఈ క్రమంలో చిన్నారిని ఉంచిన శవ పేటికలో ఓ గాజు ముక్క గాలిలో తెలుతుండటాన్ని గమనించింది ఆమె తల్లి. పక్కవారికి చెప్పగా వారు కొట్టిపారేశారు. ఆ తర్వాత కమిలా కళ్లు కదిలించినట్లు ఆమె బామ్మ గమనించింది. వెంటనే తెరిచి చూడగా నాడి కొట్టుకుంటుంది. హుటాహుటిన అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. అయితే, వైద్యులు తీవ్రంగా శ్రమించినప్పటికీ కొద్ది సేపటికే పాప మరణించింది. పాప చనిపోయిందని నిర్లక్ష్యంతో ప్రకటించిన డాక్టర్లపై బాధితురాలి తల్లి మెండోజా కేసు నమోదు చేశారు. వైద్యులపై తనకు ఎలాంటి పగ లేదని, అయితే, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. అప్పుడే ఇలాంటివి మళ్లీ జరగకుండా ఉంటాయన్నారు. ఇదీ చదవండి: ప్యాంటులో దాచి 60 పాములు, బల్లుల స్మగ్లింగ్.. అధికారులే షాక్! -
శాంతి కమిషన్‌లో మోదీ పేరు... ప్రతిపాదించిన మెక్సికో
ప్రపంచ శాంతి కోసం ఐదేళ్ల కాలానికి ఆయా దేశాల మధ్య సంధిని ప్రోత్సహించేలా ముగ్గురు ప్రపంచ నాయకులతో కూడిన అత్యున్నత కమిషన్ని రూపొందించనున్నారు. ఐతే మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ ఆ కమిషన్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉండాలని ప్రతిపాదించారు. ఈ మేరకు ముగ్గురు ప్రపంచ నాయకులతో కూడిన కమిషన్‌లో భారత ప్రధాని పేరుని ప్రతిపాదించినట్లు తెలిపారు. తాను రాత పూర్వకంగా ఒక ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితికి అందజేస్తానని కూడా చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలను ఆపేలా ఐదేళ్ల సంధి కాలానికి ఒక ఒప్పందం కుదుర్చునేలా ప్రతిపాదన సమర్పించడం ఈ కమిషన్ లక్ష్యం. ఈ అత్యున్నత కమిషన్‌లో పోప్ ఫ్రాన్సిస్, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ తోపాటు భారత ప్రధాని మోదీ ఉండాలని మెక్సికో అధ్యక్షుడు ప్రతిపాదించారు. ఆ ముగ్గురు నాయకులు ప్రతి చోట యుద్ధాన్ని ఆపేసేలా ఒక ప్రతిపాదనను అందజేయడమే కాకుండా ఐదేళ్ల యుద్ధాన్ని నిలిపేసేలా ఐదేళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకుంటారు. తద్వారా ప్రపంచం వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు తమ ప్రజలను ఆదుకోవడమే కాకుండా ఉద్రిక్తతలు తలెత్తకుండా శాంతిగా ఉంటాయని అన్నారు. యుద్ధ ప్రాతిపదిక చర్యలకు స్వస్తి పలకాలని పిలుపునిస్తూ మెక్సికో అధ్యక్షుడు.. రష్యా, చైనా, అమెరికా వంటి దేశాలను శాంతిని కోరేందుకు ఆహ్వానించారు. ఈ మూడు దేశాలు తాము ప్రతిపాదిస్తున్న మధ్యవర్తిత్వాన్ని అంగీకరిస్తాయని ఆశిస్తున్నామని అన్నారు. ఈ ప్రతిపాదిత సంధి తైవాన్, ఇజ్రాయోల్, పాలస్తీనా వంటి దేశాలతో కూడా ఒప్పందం చేసుకునేలా మార్గం సుగమం అవుతుందని చెప్పారు. అదీగాక ఈ ఒక్క ఏడాదిలోనే ఎన్నో ఘర్ణణలతో కూడిన ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయని, ఎంతోమంది ప్రజలు చనిపోవడం, నిరాశ్రయులవ్వడం జరిగిందని చెప్పారు. (చదవండి: 'తగ్గేదే లే' అని తెగేసి చెబుతున్న చైనా! ఎనీ టైం రెడీ!) -
హెలికాప్టర్ కూలి 14 మంది మృతి: నార్కో టెర్రరిస్టు అరెస్టే కారణమా?
మెక్సికో : సినాలోవాలో మెక్సికన్ నేవీ హెలికాప్టర్ కూలిన ఘటన విషాదాన్ని నింపింది. ఉత్తర రాష్ట్రమైన సినాలోవాలో బ్లాక్ హాక్ మిలిటరీ హెలికాప్టర్ కూలిపోవడంతో 14 మంది మరణించారని, మరొకరు గాయపడ్డారని మెక్సికన్ నేవీ శుక్రవారం తెలిపింది. ఈ దుర్ఘటనపై దర్యాప్తు జరుగుతోందని తెలిపింది. నావీ మోస్ట్ వాంటెడ్ నార్కో టెర్రరిస్టును అదుపులోకి తీసుకున్న నేపథ్యంలోనే ఈ క్రాష్ జరిగి ఉంటుందా అనే అనుమానాలు వెల్లువెత్తాయి. సినాలోవాలో 69 ఏళ్లడ్రగ్ లార్డ్ రాఫెల్ కారో క్వింటెరో మాక్స్ అనే మిలిటరీ-శిక్షణ పొందిన ఫీమేల్ బ్లడ్హౌండ్కి పట్టుబడ్డాడని నేవీ శుక్రవారం తెలిపింది. అతని అరెస్టు తరువాత హెలికాప్టర్ క్రాష్ కావడం చర్చకు దారితీసింది. అయితే అతని అరెస్టకు ఈ ప్రమాదానికి సంబంధం ఉందన్న సమాచారం ఏమీ లేదని నేవీ ఒక ప్రకటనలో తెలిపింది. 1985లో అమెరికాలోడ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మి నిస్ట్రేషన్ ఏజెంట్ "కికి" కమరేనాను కిడ్నాప్ చేసి. చిత్ర హింసలకు గురిచేసి, హత్య చేసిన కేసులో దోషిగా తేలిన కరుడుగట్టిన డ్రగ్ లార్డ్ రాఫెల్ కారో క్వింటెరోను నావికాదళం అరెస్ట్ చేసింది. కమరేనా హత్యకు క్వింటెరోకు 40 సంవత్సరాల జైలు శిక్ష విధించగా, 28 ఏళ్ల శిక్ష తరువాత 2013లో, మెక్సికన్ న్యాయస్థానం అతనిని విడుదల చేయాలని ఆదేశించింది. ఇది అమెరికా అధికారులకు ఆగ్రహాన్ని తెప్పించింది. మెక్సికో సుప్రీంకోర్టు ఈ నిర్ణయాన్ని రద్దు చేసే సమయానికి, కారో క్వింటెరో అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఇరు దేశ దౌత్య సంబంధాలను దెబ్బ తీసింది. ఆ తరువాత సినాలోవా కార్టెల్‌కు తిరిగి వచ్చి డ్రగ్ దందా మొదలు పెట్టాడు క్వింటెరో. ఎఫ్‌బీఐ టాప్ 10 మోస్ట్ వాంటెడ్ ఫ్యుజిటివ్ల జాబితాలో ఉన్న అతనిపై 20 మిలియన్ల యూఎస్ డాలర్ల బహుమతికూడా ఉంది. ఇది డ్రగ్ ట్రాఫికర్‌గా రికార్డు. మరోవైపు క్వింటెరో అరెస్టును అమెరికా ప్రభుత్వం ప్రశంసించింది. అమెరికా అటార్నీ జనరల్ మెరిక్ గార్లాండ్, కారో క్వింటెరోను తక్షణమే అప్పగించాలని కోరనున్నట్లు తెలిపారు."ఇది చాలా పెద్దవిషయం" అని వైట్ హౌస్ సీనియర్ లాటిన్ అమెరికా సలహాదారు జువాన్ గొంజాలెజ్ ట్వీట్ చేశారు. క్వింటెరో కారో అరెస్ట్‌తో మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవడంలో అమెరికా, మెక్సికో మధ్య సంబంధాలు మెరుగుపడనున్నాయని అధికారులు భావిస్తున్నారు. -
విద్యార్థిపై జాత్యహంకార దాడి.. పక్కాగా ప్లాన్ చేసి, సీట్లో ఆల్కహాల్ పోసి నిప్పు
మెక్సికో: స్థానిక భాష మాట్లాడినందుకు 14 ఏళ్ల విద్యార్థికి తరగతి గదిలోనే నిప్పంటించారు తోటి విద్యార్థులు. ఈ దారుణ ఘటన మెక్సికో క్వెరెటరో రాష్ట్రంలో జూన్‌లో జరిగింది. తీవ్ర గాయాలపాలైన అతడ్ని ఆస్పత్రికి తరలించగా.. చాలా రోజుల చికిత్స అనంతరం ఈ వారమే డిశ్ఛార్జి అయ్యాడు. జాతి వివక్ష వల్లే తన కుమారుడిపై దాడి జరిగిందని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఘటనకు బాధ్యులైన ఇద్దరు విద్యార్థులు సహా పాఠశాల సిబ్బందిపై ఫిర్యాదు చేశారు. దాడి జరిగిన ఈ విద్యార్థి పేరు జువాన్ జమొరానో. క్వెరెటరోలోని హైస్కూళ్లో చదవుతున్నాడు. అయితే ఇతను మెక్సికో సంప్రదాయ తెగ అయిన ఒటోమి కుటుంబం నుంచి వచ్చాడు. ఈ విషయం తెలిసి తోటి విద్యార్థులు అతడ్ని వివక్షపూరితంగా చూస్తున్నారు. ఓ రోజు ఇద్దరు విద్యార్థులు జువాన్ కూర్చొనే సీట్లో ఆల్కహాల్ పోశారు. అది చూసుకోకుండా అతను అలానే కూర్చుకున్నాడు. ప్యాంట్ తడిచాక విషయాన్ని గమినించి వెంటనే పైకి లేచాడు. ఆ సమయంలో ఇద్దరు విద్యార్థుల్లో ఒకరు జూవన్కు నిప్పంటించారు. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. టీచర్ కూడా వేధిస్తోంది పాఠాలు చెప్పే టీచర్ కూడా తమ బిడ్డను వేధించిందని ఆవేదన వ్యక్తం చేశారు జువాన్ తల్లిదండ్రులు. ఒటోమి భాష మాట్లాడితే తోటి విద్యార్థులు జువాన్‌తో గొడవపడేవారని, అతడ్ని వేధించేవారని తెలిపారు. అందుకే స్కూళ్లో ఆ భాష మాట్లాడాలంటేనే అతను భయంతో వణికిపోయేవాడని వివరించారు. అధ్యక్షుడి రియాక్షన్ మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుల్ లోపెజ్ కూడా ఈ ఘటనపై స్పందించారు. అవసరమైతే ఈ కేసును దేశ అటార్నీ జరనల్ కార్యాలయం తమ చేతుల్లోకి తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఒటోమి భాష మాట్లాడటమే జువాన్ చేసిన నేరమా అని, జాతివివక్షను అంతం చేయడం అందరి బాధ్యత అని లోపెజ్ అధికార ప్రతినిధి ట్వీట్ చేశారు. 12.6కోట్ల జనాభా ఉన్న మెక్సికోలో జాతి వివక్ష దాడులు సాధారణం అయిపోయాయి. ఈ దేశంలో దాదాపు 2.3 కోట్ల మంది సంప్రదాయ తెగలకు చెందినవారున్నారు. వీరిలో 73లక్షల మంది స్థానిక భాషే మాట్లాడుతారు. దాదాపు 40 శాతం మంది సంప్రదాయ తెగలు తమను వివక్షతో చూస్తున్నారని ఫిర్యాదు చేశారంటే అక్కడి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. చదవండి: ప్రధాని నివాసం వద్ద వేల మంది నిరసనకారులు.. ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం -
అమెరికా పౌరసత్వాల్లో భారత్‌కు రెండో స్థానం
వాషింగ్టన్: అమెరికా పౌరసత్వాల్లో భారతీయుల జోరు కొనసాగుతోంది. ఈ ఏడాది జూన్ 15 వరకు 6,61,500 మందికి పౌరసత్వం మంజూరు చేస్తే వారిలో మెక్సికో తర్వాత భారతీయులు రెండో స్థానంలో ఉన్నారు. మనవారికి 12,928 మందికి పౌరసత్వం లభించింది. మెక్సికో నుంచి అత్యధికంగా 24,508 మందికి అమెరికా పౌరసత్వం దక్కింది. ఫిలిప్పీన్స్(11,316), క్యూబా(10,689), డొమినికస్ రిపబ్లిక్(7,046) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. 2021 ఆర్థిక సంవత్సరంలో 8,55,000 మందికి అమెరికా పౌరసత్వం దక్కింది. గతేడాది మొదటి ఐదు స్థానాల్లో మెక్సికో, భారత్, క్యూబా, ఫిలిప్పీన్స్, చైనా దేశాలు నిలిచాయి. కాగా, అప్లికేషన్లను త్వరితగతిన క్లియర్ చేస్తున్నట్టు అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం తెలిపింది. (క్లిక్: కోటీశ్వరుల వలస.. మళ్లీ మొదలైంది.. వీరంతా ఎక్కడికి వెళ్తున్నారు?) -
మొసలిని పెళ్లాడిన మేయర్.. దాన్ని ముద్దుపెట్టుకుంటూ ఫోటోకు పోజులు
శని ఉందని చెట్టుతోనో, పుట్టతోనో ముందు పెళ్లి చేస్తే... అది పోతుందనే సంప్రదాయం మనదగ్గరా ఉంది. కానీ మొసలిని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? అని అనుమానంతో చూడకండి. ఈ మెక్సికన్ మేయర్ చేసుకున్నాడు. వందల ఏళ్ల పాత సంప్రదాయంలో భాగంగా అతను మొసలిని పెళ్లి చేసుకోవడమే కాదు... దాన్ని ముద్దుపెట్టుకుంటూ ఫొటోలకు పోజులు కూడా ఇచ్చాడు. వివరాల్లోకి వెళ్తే.. కప్పల పెళ్లిళ్లు చేస్తే, వరదపాశం వండి బండమీదపోసి తింటే.. వరదలు పారే వర్షాలు కురుస్తాయని మన దగ్గర కొన్ని నమ్మకాలున్నాయి కదా! అలా మెక్సికోలోనూ ఓ పాత పద్ధతి ఉంది. అక్కడ గ్రామ పెద్ద మొసలిని పెళ్లి చేసుకుంటే... వర్షాలు బాగా కురిసి, పంటలు బాగా పండుతాయని, చేపలు సమృద్ధిగా దొరుకుతాయని నమ్మకం. ఇంకేముంది.. ఈ ఏడు కూడా అలాగే జరగాలని సాన్ పెడ్రో హామెలుల గ్రామస్తులు నిర్ణయించుకున్నారు. మేయర్ విక్టర్ హ్యూగో సోసాకు కూడా మొసలితో పెళ్లి చేయాలనుకున్నారు. పెళ్లి కూతురు మొసలిని... పెళ్లి దుస్తుల్లో అందంగా అలంకరించారు. తెల్లని ముసుగును కూడా కప్పారు. సంప్రదాయ సంగీతం, మేళ తాళాలు, నృత్యాల మధ్య వధువును వీధుల గుండా ఊరేగింపుగా తీసుకెళ్లారు. అనంతరం వరుడు మేయర్, వధువు మొసలిని పెళ్లి చేసుకున్నాడు. ఈ గ్రామం అన్నింటా సమృద్ధిగా ఉండాలని ప్రార్థనలు కూడా చేశాడు. ఇక వేడుక మొత్తం ఆ మొసలి పెళ్లికూతురిని ముద్దు పెడుతూనే ఉన్నాడు ఆ మేయర్. మరి ముద్దులు పెడుతుంటే ఆ మొసలి అతడిని ఏమీ అనలేదా అన్న అనుమానం వస్తోంది కదూ! ఫొటో జాగ్రత్తగా చూడండి దాని మూతిని తాడుతో కట్టేశారు. చదవండి: పాకిస్తాన్లో ఘోరం.. లోయలో పడిన బస్సు..19 మంది మృతి In an age-old ritual, a Mexican mayor married his alligator bride to secure abundance. Victor Hugo Sosa sealed the nuptials by kissing the alligator's snout https://t.co/jwKquOPg93 pic.twitter.com/Vmqh4GpEJu — Reuters (@Reuters) July 1, 2022 -
సినిమా సెట్లో ఇద్దరు నటులు మృతి.. ఆరుగురికి గాయాలు
సినిమా సెట్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అప్పుడప్పుడు అనుకోని ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇలాంటి ప్రమాదమే తాజగా మెక్సికోలోని బాజా కాలిఫోర్నియా సుర్ ద్వీపకల్పంలో జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు నటులు చనిపోగా, ఆరుగురు గాయాల పాలయ్యారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ తెరకెక్కిస్తున్న ఒరిజినల్ సిరీస్ 'ది చూసెన్ వన్'. ఈ సిరీస్ చిత్రీకరణకు సంబంధించిన పనులు బాజా కాలిఫోర్నియా సమీపంలోని శాంటా రోసాలియా ప్రాంతంలో జరుగుతున్నాయి. అయితే ఎడారి ప్రాంతంలో రోడ్డుపై వెళ్తున్న వ్యాన్ పల్టీలు కొడుతూ షూటింగ్ స్పాట్‌లోకి దూసుకువెళ్లింది. దీంతో ఇద్దరు నటులు రేముండో గుర్డానో, జువాన్ ఫ్రాన్సిస్కో అగ్యిలర్ మరణించగా, అక్కడ పని చేస్తున్న ఆరుగురికి గాయాలైనట్లు బాజా కాలిఫోర్నియా డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ తెలిపింది. ఈ సంఘటన గురువారం (జూన్ 16) జరిగిందని వాల్ స్ట్రీట్ జర్నల్ శనివారం (జూన్ 18) వెల్లడించింది. అయితే ఈ ప్రమాదంపై నెట్‌ఫ్లిక్స్ ఇంకా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. చదవండి:👇 వికటించిన సర్జరీ.. గుర్తుపట్టలేని స్థితిలో హీరోయిన్ చెత్త ఏరిన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్ థియేటర్లో అందరిముందే ఏడ్చేసిన సదా.. వీడియో వైరల్ కాగా 'ది చూసెన్ వన్' బ్రెజిలియన్ థ్రిల్లర్ సిరీస్. ఈ సిరీస్ మొదటి సీజన్ 2019లో విడుదలైంది. ఇప్పటివరకు రెండు సీజన్లు రిలీజ్ అవ్వగా, ప్రస్తుతం మూడో సీజన్ షూటింగ్ జరుగుతోంది. ఈ సిరీస్ అమెరికన్ జీసస్ కామిక్ బుక్ ఆధారంగా తెరకెక్కింది. ఈ సిరీస్ తాను తిరిగి వచ్చిన యేసు క్రీస్తు అని, మానవజాతిని రక్షించడానికి పుట్టినవాడుగా భావిస్తున్న 12 ఏళ్ల బాలుడి కథగా తెలుస్తోంది. చదవండి:👇 సైలెంట్‌గా తమిళ హీరోను పెళ్లాడిన తెలుగు హీరోయిన్.. ఆ హీరోలా ఎఫైర్స్ లేవు.. కానీ ప్రేమలో దెబ్బతిన్నా: అడవి శేష్ డేటింగ్ సైట్లో తల్లి పేరు ఉంచిన కూతురు.. అసభ్యకరంగా మెసేజ్‌లు -
జోష్‌లో వంతెన ఓపెనింగ్.. పాపం బొక్కలు విరగ్గొట్టుకున్నారు
Mexican Footbridge Collapses: నేటీకి కొన్ని దేశాల్లో పురాతన కట్టడాలు, బ్రిడ్జీలు, భవనాలు చక్కుచెదరకుండా ఉన్నాయి. కానీ, నేటి ఇంజనీర్లు కట్టిన కట్టడాలు, బ్రిడ్జీలకు గ్యారెంటీ లేకుండా పోతోంది. తాజాగా ఓ బ్రిడ్జీ కట్టి.. ఓపెనింగ్ చేసిన కాసేపటికే కూలిపోయింది. దీంతో అధికారులకు చేదు అనుభవం ఎదురైంది. ఈ ఘటన మెక్సికోలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. క్యూర్నావాకా నగరం కట్టిన ఓ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం రోజునే కూలిపోయింది. ఫుట్ బ్రిడ్జ్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మేయర్ జోస్ లాయిస్ ఉరియో స్టెగుయ్కు ఊహించని షాక్ తగిలింది. వంతెన ప్రారంభం తర్వాత మేయర్ సహా సిటి కౌన్సిల్ సభ్యులు బ్రిడ్జీపై నడుచుకుంటూ వెళ్లారు. ఇంతో వంతెన ఒక్కసారిగా కూలిపోవడంతో వారందరూ కింద పడిపోయారు. Footbridge collapse during reopening ceremony in Mexico pic.twitter.com/Kn4X554Ydk — Adrian Slabbert (@adrian_slabbert) June 9, 2022 సుమారు 10 అడుగుల ఎత్తులో ఉండే ఆ ఫుట్ బ్రిడ్జి ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో బ్రిడ్జీ మీద ఉన్నవారంతా కింద నీటిలో ఉన్న రాళ్లపై పడిపోయారు. ఈ ఘటనలో మేయర్, 20 మంది సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఎనిమిది మందికి ఎముకలు విరిగిపోయాయినట్టు స్థానిక మీడియో తెలిపింది. వంతెన ప్రారంభం రోజునే ఇలా జరగడంతో ఇంజనీర్‌పై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
మెక్సికోలో పేలిన తుపాకీ.. ఆరుగురి దుర్మరణం
అమెరికాలో తుపాకీ నరమేధం శాంతించడం లేదు. తాజాగా మెక్సికో వీధుల్లో దుండగుల కాల్పుల్లో ఆరుగురు మృతి చెందారు. ఇందులో ఐదుగురు స్కూల్ పిల్లలే కావడం గమనార్హం. మధ్య మెక్సికోలో సాయుధులైన దుండగులు.. గువానాజువాటో వీధుల్లో తెగపడ్డారు. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఐదుగురు స్టూడెంట్స్‌తో(16 నుంచి 18 ఏళ్ల మధ్య వాళ్లు) పాటు ఓ వృద్ధురాలు మృతి చెందింది. చనిపోయిన వాళ్లంతా బారోన్ కమ్యూనిటీకి చెందిన వాళ్లేనని గువానాజువాటో మేయర్ నిర్ధారించారు. ఇదిలా ఉంటే.. రెండు వారాల కిందట గువానాజువాటోలోని సెలాయా నగరంలో జరిగిన ప్రతీకార దాడుల్లో పదకొండు మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఎనిమిది మంది మహిళలు ఉన్నారు. డ్రగ్స్, చమురు దొంగతనాల నేపథ్యంలోనే ఇక్కడ గ్యాంగ్ వార్లు జరుగుతున్నాయి. 2006 డిసెంబర్ నుంచి ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పదన మిలిటరీ యాంటీ డ్రగ్ ఆపరేషన్ వల్ల మెక్సికోలో ఇప్పటిదాకా మూడున్నర లక్షల హత్యలు జరిగాయి. చదవండి: అవమానాలు-కుటుంబ పరిస్థితులతో కిరాతకుడిగా.. -
వైరల్ వీడియో: ఎయిర్‌పోర్టు అధికారులను ముప్పుతిప్పలు పెట్టిన శునకం
ప్రయాణాల్లో కొంతమంది తమ పెంపుడు జంతువులను కూడా తీసుకెళ్తుంటారు. సొంత వాహనాల్లో పెంపుడు జంతువులను తీసుకెళ్లడం సులువే కానీ.. ట్రైన్, విమానం వంటి వాటిల్లో తీసుకెళ్లడం కొంచెం కష్టం. అవి ఎదుటి వారికి ఎలాంటి హానీ చేయకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఓ ఎయిర్‌పోర్టులో ఒక శునకం అధికారులు ముప్పుతిప్పలు పెట్టింది. విమానాశ్రయం రన్‌వే అంతా పరుగులు పెట్టించింది. ఈ సంఘటన మెక్సిలో చోటుచేసుకుంది. గ్వడలాజరలో గల మిగ్వుల్ హిడాల్గొ వై కాస్టిల్లా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు ఓ కుటుంబం తమ పెంపుడు కుక్కను తీసుకొచ్చింది. సరిగ్గా బోర్డిండ్ సమయానికి కుక్కకు కట్టిన తాడు తెగిపోయింది. ఇంకేముంది ఆ కుక్క యాజమాని నుంచి తప్పించుకొని విమానం నుంచి బయటకు వచ్చేసింది. విమానం కింద నుంచి. రన్ వైపే మొత్తం కలియ తిరిగింది. ఉరుకులు పరుగులు తీసింది. దీంతో కుక్క వెంబడి అధికారులు పరుగులు తీశారు. అయినా ఎంతకూ అది దొరకలేదు. అయితే ఆ సమయంలో రన్‌వే పైకి వాహనాలు రాకుండా అధికారలు జాగ్రత్తలు తీసుకున్నారు. చివరికి తిరిగి తిరిగి అలసిపోయిన సిబ్బంది ఎలాగోలా ఆ కుక్కను పట్టుకోవడంతో అందరూ హమ్మాయ్యా అంటూ ఊపిరి పీల్చుకున్నారు. దీనిని ప్రత్యక్ష సాక్షి ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ఆ వీడియోలో శునకం పరుగు పెట్టించే అంశం స్పష్టంగా కనిపిస్తోంది. కాగా కుక్క ఎలా తప్పించుకుందనేదానిపై క్లారిటీ లేదు. ఇక పప్పీని పట్టుకునే క్మంలో వారికి ఎలాంటి గాయం కాలేదని తెలిసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇప్పటికే 2 లక్షల మంది వీక్షించారు. దీనిని చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. అధికారులకు శునకం మంచి వ్యాయామం చేయించిందని కామెంట్ చేస్తున్నారు. -
సెమీ ఫైనల్లో అడుగు పెట్టిన సాకేత్ జంట
న్యూఢిల్లీ: మొరెలోస్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్) జంట సెమీ ఫైనల్లో అడుగు పెట్టింది. మెక్సికోలో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాకేత్–యూకీ బాంబ్రీ జంట 6–3, 7–6తో మైఖైల్ పెర్వోలారకిస్ – మన్సూరి (గ్రీస్) జోడీపై నెగ్గి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. చదవండి: హైదరాబాద్‌లో ఆసియా క్లబ్ లీగ్ హ్యాండ్‌బాల్ టోర్నీ -
మెక్సికో మార్కెట్లోకి కోవాగ్జిన్
న్యూఢిల్లీ: కోవిడ్–19 టీకా కోవాగ్జిన్‌ను మెక్సికో మార్కెట్లో కూడా సరఫరా చేసే దిశగా బయోటెక్నాలజీ సంస్థలు భారత్ బయోటెక్, ఆక్యుజెన్ తమ ఒప్పందంలో మార్పులు చేశాయి. దీనితో మొత్తం ఉత్తర అమెరికాలో కోవాగ్జిన్ విక్రయానికి సంబంధించి ఆక్యుజెన్‌కు హక్కు లభిస్తుంది. అమెరికా మార్కెట్ తరహాలోనే లాభాల్లో వాటాల పంపకం రూపంలో ఈ ఒప్పందం ఉంటుందని ఆక్యుజెన్ తెలిపింది. అమెరికా, కెనడా మార్కెట్లలో కోవాక్సిన్‌ను సంయుక్తంగా అభివృద్ధి చేయడం, సరఫరా, విక్రయాల కోసం ఆక్యుజెన్, భారత్ బయోటెక్ మధ్య ఒప్పందం ఉంది. ప్రస్తుతం 2–18 ఏళ్ల బాలలకు అత్యవసర వినియోగం కింద కోవాగ్జిన్‌ను ఉపయోగించే అంశాన్ని మెక్సికో నియంత్రణ సంస్థ పరిశీలిస్తోందని ఆక్యుజెన్ చైర్మన్ శంకర్ ముసునూరి తెలిపారు. ఉత్తర అమెరికా మార్కెట్లో కోవాగ్జిన్‌ను వాణిజ్యావసరాలకు ఉత్పత్తి చేసేందుకు ఆక్యుజెన్‌కు పూర్తి తోడ్పాటు అందిస్తామని భారత్ బయో చైర్మన్ కృష్ణ ఎల్లా పేర్కొన్నారు. -
ప్రేయసి ముద్దే.. పోలీసులకు పట్టించింది
అతనొక భయంకరమైన నేరస్తుడు. సుమారు 200 దేశాల మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్నాడు. 196 దేశాల్లో ఇంటర్‌పోల్ అతని అరెస్ట్ కోసం రెడ్ వారెంట్ జారీ చేసింది. ఏళ్ల తరబడి తప్పించుకుని తిరుగుతున్నాడు. అయితే ప్రియురాలి అత్యుత్సాహంతో ఎట్టకేలకు బుక్కైపోయాడు. ఆమెకు ముద్దు పెట్టి పోలీసులకు దొరికిపోయాడు. అదెలాగంటే.. మెక్సికన్ డ్రగ్ లార్డ్, సినాలోవా కార్టెల్ మాఫియా ముఖ్యనేత జోవాక్విన్ గుజ్మన్ అలియాస్ ఎల్ చాపో గుర్తున్నాడా? ప్రస్తుతం అతను జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. అతని ముఖ్య అనుచరుడు, ఎల్ పిట్ గా పేరొందిన ‘బ్రియాన్ డొనాసియానో ఒలుగ్విన్ వెర్డుగో’ మాత్రం పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. అంతేకాదు ఇప్పటికీ డ్రగ్స్లావాదేవీలు, అక్రమ రవాణా కొనసాగిస్తూ.. ఎల్ చాపోనే మించిపోయాడు. అలా 39 ఏళ్ల ఎల్ పిట్‌పై.. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్ పోల్ వారెంట్లు జారీ అయ్యాయి. చివరికి.. అతగాడి గాళ్ ఫ్రెండ్ అత్యుత్సాహమే అతన్ని పట్టించింది. కొన్నిరోజుల కిందట ఫేస్ బుక్ లో అమెరికా డ్రగ్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీ అధికారులకు ఓ ఫొటో కంటబడింది. ఓ పర్యాటక ప్రాంతంలో ఓ జంట ముద్దు పెట్టుకుంటున్న ఫొటో అది. ఆ ఫొటోలో ఉన్నది ఎల్ పిట్ అని గుర్తించిన అమెరికా డ్రగ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అతడు కొలంబియాలో ఉన్నట్టు కనిపెట్టారు. పక్కా స్కెచ్‌తో.. వెంటనే కొలంబియా అధికారులకు సమాచారం అందించారు. దాంతో పక్కా ప్లాన్ వేసిన కొలంబియా పోలీసులు క్యాలీ నగరంలోని ఓ విలాసవంతమైన అపార్ట్ మెంట్ లో ఎల్ పిట్ ను అదుపులోకి తీసుకున్నాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి అతడు కొలంబియాలోనే ఉంటున్నాడట. మెక్సికో, అమెరికా దేశాలకు వేల కోట్ల విలువైన కొకైన్ ను తరలించేందుకు కొలంబియాలోని (రివల్యూషనరీ ఆర్మ్ డ్ ఫోర్సెస్ ఆఫ్ కొలంబియా) 'ఫార్క్' గెరిల్లా దళాల సాయం కోరేందుకు అతడు కొలంబియాలో మకాం వేసినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. ఈ క్రమంలో.. మెక్సికోలో మోడల్ అయిన తన గర్ల్‌ఫ్రెండ్‌తో క్యాలీలో ఓ లగ్జరీ అపార్ట్మెంట్లో దిగినట్లు తెలిసింది. ఆపై ఆమె ప్రఖ్యాత టూరిస్టు కేంద్రం లాస్ క్రిస్టాలెస్ కు తీసుకువచ్చింది. అక్కడ పర్వతంపై ముద్దు పెట్టుకుంటూ ఇద్దరూ సెల్ఫీ దిగారు. ఆ ఫొటోను ఆమె సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా.. దొరికిపోయాడు. ఇదే మెక్సికోలో అయి ఉంటేనా? అయితే దాడుల సమయంలో తనను అరెస్ట్ చేయవద్దంటూ ఎల్ పిట్ కొలంబియా పోలీసులకు 2,65,000 డాలర్ల లంచం ఇచ్చే ప్రయత్నం చేశాడట. అంతేకాదు, ఇదే ఘటన మెక్సికోలో జరిగుంటే తన సాయుధ దళాలు కొద్దిసేపట్లోనే తనను విడిపించి ఉండేవని పోలీసులతో చెప్పాడట. గట్టి భద్రత మధ్య అతడిని పలు కేసుల విచారణ నిమిత్తం అమెరికాలోని కాలిఫోర్నియాకు తరలించనున్నారు. -
సెంట్రల్ మెక్సికోలో కాల్పులు.. 19 మంది మృతి
మెక్సికో: మెక్సికో దేశంలో ఆదివారం కాల్పుల కలకలం చోటుచేసుకుంది. సెంట్రల్ మెక్సికోలో గుర్తు తెలియని వ్యక్తులు జరిగిన కాల్పుల్లో 19 మంది ప్రాణాలు కోల్పోయారని స్టేట్ అటార్నీ జనరల్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. మిచోకాన్ రాష్ట్రంలోని లాస్ టినాజాస్ పట్టణంలో ఆదివారం రాత్రి 10:30 గంటల సమయంలో ఓ ఉత్సవంలో గుమిగూడిన వారిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్లు తమకు సమాచారం అందిందని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలో 19 మంది మృతదేహాలను గుర్తించినట్లు, వీరిలో 16 మంది పురుషులు ముగ్గురు మహిళలు ఉన్నట్లు తెలిపారు. మృతదేహాలపై తుపాకీ గాయాలు ఉన్నట్లు గుర్తించారు. మరికొంతమంది గాయపడగా, వారిని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. కాల్పులకు గల కారణాలను అధికారులు వెల్లడించలేదు. అయితే ఈ హింసాత్మక చర్యలకు పాల్పడిన నిందితులను పట్టుకునేందుకు ఫెడరల్ అధికారులు పనిచేస్తున్నారని మిచోకాన్ పబ్లిక్ సెక్యూరిటీ సెక్రటరీ కార్యాలయం ట్విటర్లో తెలిపింది. చదవండి: Ukraine: న్యూక్లియర్ పవర్ ప్లాంట్ దగ్గర తగలబడుతున్న అడవి.. పెను ముప్పు తప్పదా? కాగా మిచోకాన్ దాని పరిసర ప్రాంతం గునజుటో మెక్సికోలోనే అత్యంత హింససాత్మక ఘటనలు చోటుచేసుకునే రాష్ట్రాలుగా గుర్తింపు పొందాయి. ఇక్కడ రెండు వర్గాలు ఒకరిపై ఒకరు నిత్యం కాల్పులు జరుపుతూ ఉంటాయి. డ్రగ్స్ స్మగ్లింగ్, ఆయిల్ దొంగతనం సహా అక్రమ కార్యకలాపాలకు పాల్పడే ముఠాల మధ్య ఆధిపత్య పోరుతో కాల్పుల్లో ప్రతి ఏడాది వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. చదవండి: మహిళను అడ్డుకున్న సిబ్బంది.. ఇండియన్ రెస్టారెంట్ మూసివేత -
Hanami In Japan: లీ హోలీ.. జపాన్‌లో హనామి, థాయ్‌లాండ్‌లో సోంక్రాన్, ఇంకా...
మనదేశంలోనే కాకుండా, నేపాల్, బంగ్లాదేశ్లలోను, భారతీయ సంతతివారు ఎక్కువగా నివసించే ఆఫ్రికా, అమెరికా, యూరోప్ దేశాల్లోనూ హోలీ వేడుకలు ఘనంగా జరుగుతాయి. హోలీ మాదిరిగానే వసంతానికి స్వాగతం పలుకుతూ వివిధ దేశాల్లో జరిగే వేడుకల గురించి తెలుసుకుందాం. హనామి జపాన్ జపాన్‌లో జరుపుకొనే వసంతోత్సవాన్ని ‘హనామి’ అంటారు. ‘హనామి’ అంటే పుష్పసందర్శనం. ఈ కాలంలోనే జపాన్‌లో చెర్రీ చెట్లు నిండా పూలతో విరగబూసి కనువిందు చేస్తాయి. ప్లమ్ వృక్షాలు కూడా ఇలాగే విరగబూస్తాయి గాని, జపాన్‌లో చెర్రీ వృక్షాలే విరివిగా కనిపిస్తాయి. చెర్రీ పూలను జపానీస్ భాషలో ‘సకురా’ అంటారు. హనామి వేడుకలు ఏటా మార్చి నెలలో ఆఖరి వారం నుంచి మే తొలివారం వరకు జరుగుతాయి. ఏటా ఫిబ్రవరిలో జపాన్ వాతావరణ శాఖ ఆ ఏడాది చెర్రీవృక్షాలు ఏ సమయంలో పుష్పించడం ప్రారంభిస్తాయో అంచనా వేసి, తేదీని ప్రకటిస్తుంది. అప్పటి నుంచి వేడుకలు మొదలవుతాయి. తొలుతగా ఒకినావా దీవి నుంచి ఈ వేడుకలు మొదలవుతాయి. మన కార్తీక వనభోజనాలను ఉసిరిచెట్ల కింద చేసుకునే పద్ధతిలోనే జపాన్ ప్రజలు వసంతకాలంలో ఆరుబయట విరగబూసిన చెర్రీచెట్ల కింద, ప్లమ్ చెట్ల కింద ఉల్లాసంగా ఉత్సాహంగా విందు వినోదాలు చేసుకుంటారు. చాలాచోట్ల రాత్రివేళ కూడా చెట్లకు పేపర్లాంతర్లు వేలాడదీసి, ఆరుబయటే ఆటపాటలతో విందు వినోదాలతో గడుపుతారు. టోక్యోలోని ఉయెనో పార్కులో ‘హనామి’ వేడుకలు చాలా సందడిగా జరుగుతాయి. ‘హనామి’ వేడుకల సంప్రదాయం క్రీస్తుశకం ఎనిమిదో శతాబ్దిలో గెన్మెయి మహారాణి కాలం నుంచి మొదలైనట్లు ఆధారాలు ఉన్నాయి. జపాన్‌లో మృతుల కళేబరాలను చెర్రీ చెట్ల కింద సమాధి చేసే ఆచారం కూడా ఉంది. ‘హనామి’ వేడుకల్లో పెద్దలను స్మరించుకుంటూ ప్రార్థనలు జరుపుతారు. వసంతానికి స్వాగతం పలుకుతూ ఆరుబయట ప్రకృతి ఒడిలో గడుపుతారు. హనామి తరహా వేడుకలు తైవాన్, కొరియా, ఫిలిప్పీన్స్, చైనాలలోనూ జరుగుతాయి. జపాన్ 1912లో అమెరికాకు మైత్రీచిహ్నంగా మూడువేల చెర్రీ మొక్కలను కానుకగా ఇచ్చింది. అప్పటి నుంచి అమెరికాలోనూ పలుచోట్ల ఈ వేడుకను ‘చెర్రీ బ్లోసమ్ ఫెస్టివల్’గా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. సోంక్రాన్– థాయ్‌లాండ్ నూతన సంవత్సరానికి స్వాగతం పలకడంతోనే థాయ్‌లాండ్‌లో వసంతోత్సవాలు మొదలవుతాయి. థాయ్‌లాండ్ వాసులు ఏటా ఏప్రిల్ 13న నూతన సంవత్సర వేడుకలు జరుపుకొంటారు. ఆ రోజు నుంచి మొదలయ్యే వసంత స్వాగతోత్సవాలు మాత్రం మూడు రోజుల పాటు– ఏప్రిల్ 15 వరకు చాలా సందడిగా కొనసాగుతాయి. ఈ వేడుకల కోసం అక్కడి ప్రభుత్వం ఏప్రిల్ 12 నుంచి 16 వరకు సెలవు దినాలను ప్రకటిస్తుంది. బంధుమిత్రులతో ఈ వేడుకలు జరుపుకోవడానికి ఉపాధి కోసం నగరాల్లో పనిచేసుకునే వారంతా స్వస్థలాలకు పయనమవుతారు. థాయ్‌లాండ్ ప్రజలు నూతన సంవత్సరాన్ని ‘సోంక్రాన్’ అంటారు. ‘సోంక్రాన్’కు మూలం సంస్కృతంలోని ‘సంక్రాంతి’ పదమే. సౌరమానం ప్రకారం తొలి సంక్రాంతి అయిన మేష సంక్రాంతినే థాయ్‌లాండ్ వాసులు నూతన సంవత్సరంగా పాటిస్తారు. భారత్‌లో కూడా సౌరమానం పాటించేవారు మేష సంక్రాంతినే నూతన సంవత్సరంగా పాటిస్తారు. థాయ్‌లాండ్ వాసులు మిగిలిన వారికి భిన్నంగా వరుసగా మూడురోజుల పాటు వసంతోత్సవాలను జరుపుకోవడం విశేషం. ఈ సందర్భంగా థాయ్ ప్రజలు బౌద్ధారామాలను దర్శించుకుని ప్రార్థనలు చేస్తారు. నగరాలు, పట్టణాల్లోని కూడళ్లలో ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేసి, జనాలంతా కూడళ్లలోకి చేరుకుని ఒకరిపై ఒకరు నీళ్లు చిమ్ముకుంటూ సందడి చేస్తారు. నీళ్లు చిమ్ముకునే ఆచారం వల్ల ఈ వేడుకలను ‘వాటర్ ఫెస్టివల్’ అని కూడా అంటారు. ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన వేదికల వరకు సంప్రదాయ దుస్తులు ధరించి, చక్కగా అలంకరించుకున్న మహిళలు, యువతులు సంగీతవాద్యాలతో పాటలు పాడుతూ ఊరేగింపుగా వెళతారు. కొన్నిచోట్ల అందాల పోటీలు కూడా నిర్వహిస్తారు. ఊరేగింపులో పాల్గొన్న అందమైన మహిళలను, యువతులను ‘లేడీ సోంక్రాన్’, ‘మిస్ సోంక్రాన్’ బిరుదులిచ్చి, కిరీటాలతో వారిని ఘనంగా సత్కరిస్తారు. ఈ సందర్భంగా కొందరు ఆలయాల పునరుద్ధరణ కోసం ఇసుకను దానం చేస్తారు. పెద్దలను స్మరించుకుంటూ, బౌద్ధ భిక్షువులకు అన్నసంతర్పణలు చేస్తారు. మెక్సికోలో భారీ ఎత్తున కార్నివాల్ వసంతకాలం అడుగుపెట్టే తొలిరోజు మెక్సికోలో భారీ ఎత్తున కార్నివాల్ నిర్వహిస్తారు. మెక్సికోలోని తీరప్రాంత పట్టణాల్లో ఈ వేడుకలు మరింత అట్టహాసంగా జరుగుతాయి. ఏటా మార్చి నెలలో వసంతారంభంగా వాతావరణ నిపుణులు ప్రకటించిన రోజున ఈ సంబరాలను జరుపుకొంటారు. సాధారణంగా మార్చి 19–22 తేదీల మధ్య వసంత రుతువు మొదలవుతుంది. సంగీత వాద్యాలతో దారిపొడవునా పాటలు పాడుతూ, నవ్వుతూ తుళ్లుతూ, కేరింతలు కొడుతూ, నృత్యాలు చేస్తూ విచిత్ర వేషధారణలతో ఉత్సాహంగా ఊరేగింపులు జరుపుతారు. ఊరేగింపులో తినుబండారాలు, పానీయాలు విరివిగా దొరుకుతాయి. ఈ వేడుకలు కొన్నిచోట్ల వారంరోజుల వరకు, మరికొన్ని చోట్ల దాదాపు రెండు వారాల వరకు కూడా కొనసాగుతాయి. కార్నివాల్ వేడుకలను తిలకించేందుకు విదేశీ పర్యాటకులు పెద్దసంఖ్యలో మెక్సికోకు వస్తుంటారు. శాషిల్యూటెన్– స్విట్జర్లాండ్ స్విట్జర్లాండ్‌లో వసంతోత్సవాన్ని ఏప్రిల్‌లో జరుపుకుంటారు. చలిదేశం కావడం వల్ల అక్కడ వసంతకాలం కాస్త ఆలస్యంగా మొదలవుతుంది. మధ్యయుగాల నుంచే స్విట్జర్లాండ్‌లో ఈ వేడుకలు జరుపుకొనే ఆచారం ఉంది. అప్పట్లో వేసవిలోని మొదటి పనిదినాన ఈ వేడుకలను జరుపుకొనేవారు. గత శతాబ్దం నుంచి ఈ వేడుకలను ఏప్రిల్ మూడో సోమవారం రోజున జరుపుకోవడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. విద్యుత్తు లేని మధ్యయుగాల కాలంలో శీతాకాలంలో పగటి వెలుతురు ఉన్నంత సేపే పనిగంటలు నడిచేవి. వేసవిలోని తొలి పనిదినాన కాలానికి తగినట్లు పనివేళలను నిర్ణయించుకునే వారు. సాయంత్రం ఆరుగంటలకు చర్చిగంటలు మోగగానే పనివేళలను ముగించుకోవాలని అప్పట్లో శాసనం కూడా తెచ్చారు. శీతాకాలం వెళ్లిపోతూ వసంతం ప్రారంభమైదనడానికి సూచనగా స్విస్ ప్రజలు నగరాలు, పట్టణాల కూడళ్లలో పెద్దసంఖ్యలో గుమిగూడి, గోనెపట్టాలు, ఇతర వ్యర్థాలతో తయారుచేసే శీతాకాలం దిష్టిబొమ్మను తగులబెడతారు. దీని తలభాగంలో మందుగుండు కూడా దట్టిస్తారు. బొమ్మ కొంత కాలిన తర్వాత మంటలు తలవరకు వ్యాపించి, మందుగుండుకు నిప్పు తాకగానే పేలుడు సంభవిస్తుంది. ఈ ఆచారం మనదేశంలో జరిగే హోలికాదహనం, కామదహనం మాదిరిగానే కనిపిస్తుంది. శీతాకాలం దిష్టిబొమ్మను ‘బోగీ’ అంటారు. మనం భోగిమంటలు వేసుకుంటాం, వాళ్లు ‘బోగీ’కి మంట పెడతారు. గమ్మత్తుగా లేదూ! సెమానా శాంటా– గ్వాటెమాలా గ్వాటెమాలాలో ‘సెమానా శాంటా’ పేరిట వసంతోత్సవాలను జరుపుకొంటారు. ‘సెమానా శాంటా’ అంటే పవిత్ర వారం అని అర్థం. ఈ వారాన్ని ‘సెమానా మేయర్’ (ప్రధానవారం) అని కూడా అంటారు. ఈ వారం రోజులూ గ్వాటెమాలా నలుమూలలా చర్చ్‌లలో ప్రార్థనలు, వీథివీథినా ఊరేగింపులు జరుగుతాయి. ‘శాంటా హెర్మన్డాడ్’ అనే శాంతిపరిరక్షక దళాల నాయకత్వంలో పిల్లా పెద్దా అందరూ క్రీస్తు, మేరీమాతల చిత్రపటాలు ధరించి, పాటలు పాడుతూ ఊరేగింపుల్లో పాల్గొంటారు. ఈస్టర్ ఆదివారంతో ఈ వేడుకలు ముగుస్తాయి. ఈ పవిత్రవారానికి సన్నాహాలు ఫిబ్రవరి చివరివారంలో మొదలయ్యే లా క్యుయారెస్మా (లెంట్)తో ప్రారంభమవుతాయి. ‘లెంట్’ రోజుల్లో క్యాథలిక్‌లు ఉపవాసాలు, ప్రార్థనలతో కాలం గడుపుతారు. ప్రపంచవ్యాప్తంగా కేథలిక్‌లు ఈ ఆచారాలను పాటించినా, గ్వాటెమాలాలో మాత్రం మరింత విశేషంగా కార్యక్రమాలు జరుగుతాయి. పవిత్రవారంలో ఊరేగింపు జరిపే దారుల్లో ‘లాస్ ఆంఫ్రోబాస్’ అనే రంగురంగుల తివాచీలను పరుస్తారు. ఈ తివాచీల హస్తకళా నైపుణ్యం చూసి తీరాల్సిందే! గ్వాటెమాలా ప్రజలు ఈ వేడుకల కోసం స్వయంగా ఈ తివాచీలను తయారు చేస్తారు. వీటి తయారీలో సహజసిద్ధమైన రంగులనే వాడతారు. రంపపుపొట్టు, ఎండిపోయిన పూలు, ఆకులు, పండ్లు, చెట్ల బెరళ్ల నుంచి అత్యంత ఆకర్షణీయమైన రంగులను తయారు చేయడం ఇక్కడి విశేషం. ట్యూలిప్ టైమ్ ఫెస్టివల్: హాలండ్, మిషిగాన్ అమెరికాలో మిషిగాన్ రాష్ట్రంలోని హాలండ్ నగరంలో ఏటా ‘ట్యూలిప్ టైమ్ ఫెస్టివల్’ పేరిట వసంతోత్సవ సంబరాలు జరుగుతాయి. ఇక్కడ పెద్దసంఖ్యలో ఉండే డచ్ ప్రజలు ఈ వేడుకలను అత్యంత వైభవోపేతంగా జరుపుకొంటారు. ‘ట్యూలిప్ టైమ్ ఫెస్టివల్’ ఏటా మే నెల రెండోవారంలో వారం రోజుల పాటు జరుగుతాయి. ఈ రుతువులో ట్యూలిప్ మొక్కలు విరగబూస్తాయి. గత శతాబ్దకాలంగా మిషిగాన్‌లోని హాలండ్ నగరంలో ఈ వేడుకలు జరుగుతున్నాయి. ఇక్కడ స్థిరపడ్డ డచ్ ప్రజల కోరిక మేరకు 1928లో హాలండ్ నగరపాలక సంస్థ నెదర్లాండ్స్ నుంచి లక్ష ట్యూలిప్ మొక్కల దిగుమతికి అనుమతించింది. వాటిని స్థానిక పార్కులకు పంపిణీ చేసింది. మరుసటి సంవత్సరం ఆ మొక్కలు విరగబూయడంతో చిన్నస్థాయిలో వేడుక జరుపుకొన్నారు. హాలండ్ నగర శతవార్షిక సంవత్సరమైన 1947 నుంచి క్రమం తప్పకుండా ఈ వేడుకలను ప్రతియేటా నిర్వహించడం ఆనవాయితీగా మారింది. ఈ వేడుకల సందర్భంగా ట్యూలిప్ పూలను ప్రదర్శిస్తూ ఊరేగింపులు, బాణసంచా ప్రదర్శనలు వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు. ట్యూలిప్ టైమ్ ఫెస్టివల్లో పాల్గొనడానికి విదేశీ పర్యాటకులు కూడా ఇక్కడకు వస్తుంటారు. మార్జానా– పోలండ్ పోలండ్‌లో వసంతోత్సవాలను ‘మార్జానా’ పేరిట జరుపుకొంటారు. ‘మార్జానా’ అనేది పురాతన స్లావిక్ మతానికి చెందిన శీతాకాల మృత్యుదేవత. చెక్, స్లోవేనియా, క్రొయేషియా, బోస్నియా, సెర్బియా దేశాలలో ఈ దేవతను ‘మోరానా’ అని, రష్యాలో ‘మారెనా’ అని, ఉక్రేనియాలో ‘మారా’ అని, బల్గేరియాలో ‘మొరా’ అని పిలుస్తారు. పునర్జన్మల విశ్వాసంతో ముడిపడి ఉన్న వేడుక ఇది. శీతకాలం ముగిసే సమయంలో జనాలు పాటలు పాడుకుంటూ, వాయిద్యాలను మోగిస్తూ భారీ ఊరేగింపు జరిపి, ‘మార్జానా’ దేవత దిష్టిబొమ్మను దగ్గర్లోని నదుల్లోను, జలాశయాల్లోను నిమజ్జనం చేస్తారు. నిమజ్జనంతో మరణించిన ‘మార్జానా’ తిరిగి ‘కోస్త్రోమా’– అంటే వసంత దేవతగా జన్మిస్తుందని విశ్వసిస్తారు. నిమజ్జనానికి ముందు కొన్నిచోట్ల మార్జానా దిష్టిబొమ్మలకు నిప్పుపెట్టడం లేదా, దిష్టిబొమ్మకు చుట్టిన దుస్తులను చించేయడం వంటి పనులు చేస్తారు. ఏటా మార్చి 21న జరిగే ఈ వేడుకల్లో ఎక్కువగా పిల్లలు, యువతీ యువకులు పాల్గొంటారు. ‘మార్జానా’ను నిమజ్జనం చేసి, విందు వినోదాలతో వేడుకలు జరుపుకొంటే పంటలు బాగా పండుతాయని అక్కడి ప్రజలు విశ్వసిస్తారు. సింబురిజాదా – బోస్నియా బోస్నియాలో వసంతోత్సవమంటే ఆహారోత్సవమే! ‘సింబురిజాదా’ పేరిట ఏటా మార్చి 21న జరిగే ఈ వేడుకలు విలక్షణంగా ఉంటాయి. ఈ వేడుకలను జనాలు ఆరుబయట జరుపుకొంటారు. నదులు, తటాకాల ఒడ్డున, ఉద్యానవనాల్లోను గుంపులు గుంపులుగా చేరి, ఆటపాటలతో సంబరాలు చేసుకుంటారు. ఆరుబయట పొయ్యిలు ఏర్పాటు చేసుకుని, భారీస్థాయిలో గుడ్లను గిలకొట్టి వాటితో సామూహికంగా తయారుచేసే వంటకాలను అందరూ ఆరగిస్తారు. వేడుకలను తిలకించడానికి వచ్చే పర్యాటకులకు ఉచితంగా ఈ గుడ్ల వంటకాలను వడ్డిస్తారు. వసంత స్వాగతోత్సవ వేడుకల్లో గుడ్లు మాత్రమే ఎందుకు? వేరేవి ఏవైనా వండుకుంటే కుదరదా? అంటే, కుదరనే కుదరంటారు బోస్నియా వాసులు. జీవావిర్భవానికి మూలం గుడ్డు. ఎక్కడైనా గుడ్డు నుంచే పిల్ల పుడుతుంది. వసంతంతోనే కొత్త రుతువు మొదలవుతుంది. అందువల్ల కొత్త జీవానికి సంకేతంగా గుడ్లతోనే సంప్రదాయ వంటకాలు చేసుకుంటామని చెబుతారు. ఫాలెస్– స్పెయిన్ స్పెయిన్‌లో ‘ఫాలెస్’ పేరిట వసంతారంభంలో వేడుకలు జరుపుకొంటారు. ఈ వేడుకలను సెయింట్ జోసెఫ్ సంస్మరణార్థం ఘనంగా నిర్వహిస్తారు. ఏటా మార్చి 1 నుంచి 19వ తేదీ వరకు భారీ ఎత్తున జరుపుకొనే సంబరాల్లో పెద్దసంఖ్యలో జనాలు పాల్గొంటారు. ‘ఫాలెస్’ అంటే కాగడా అని, నిప్పుపెట్టడం అని అర్థాలు ఉన్నాయి. ‘ఫాలెస్’ వేడుకల్లో ఊరేగింపులు, విందు వినోదాలు, గానాభజానాలు అట్టహాసంగా జరుగుతాయి. విందుల్లో గుమ్మడికాయ, చాక్లెట్‌తో తయారుచేసే ప్రత్యేక సాంప్రదాయక వంటకాలను వడ్డిస్తారు. ఈ వేడుకల్లో ప్రజలు కొత్తదనానికి స్వాగతం పలికే క్రమంలో పాతవాటన్నింటినీ వదులుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇందులో భాగంగానే పాత వస్తువులన్నిటినీ కూడళ్లలో గుట్టలుగా పోసి, వాటికి నిప్పంటిస్తారు. ఈ తతంగం మన భోగిమంటల మాదిరిగా ఉంటుంది. పెద్దసైజులో తయారు చేసే దిష్టిబొమ్మలను కూడా ఈ మంటల్లో వేసి తగులబెడతారు. స్పెయిన్‌లోని వాలెన్షియా నగరంలో ఈ వేడుకలు మరింత ఘనంగా జరుగుతాయి. చదవండి: Cricketers Holy Celebrations: రోహిత్‌ది తిండిగోల.. కోహ్లీ, ధోని ఎకో ఫ్రెండ్లీ బాటలో -
డ్రైవర్ వింత ప్రవర్తన.. ప్యాంటు, జాకెట్‌ను చెక్ చేస్తే 9 పాములు, 43 బల్లులు
కాలిఫోర్నియాలోని అమెరికా సరిహద్దును దాటేందుకు ప్రయత్నించిన వ్యక్తి దుస్తుల్లో ఏకంగా 52 బల్లులు, పాములు బయటపడటంతో బోర్డర్ అధికారులు షాక్‌కి గురయ్యారు. వివరాల ప్రకారం.. మెక్సికో సరిహద్దుల్లో ఉన్న శాన్సిడ్రో సరిహద్దు వద్దకు ఓ వ్యక్తి ట్రక్కుతో వచ్చాడు. అయితే తనిఖీల్లో భాగంగా అధికారులు అతన్ని బయటకు పిలిచారు. ఈ క్రమంలో అతని ప్రవర్తన వింతగా ఉండేసరికి అధికారులకు అనుమానం వచ్చి క్షుణ్ణంగా తనిఖీ చేసేసరికి అసలు బాగోతమంతా బయటపడింది. (చదవండి: యుద్దం ఎఫెక్ట్.. దేశం వీడుతున్న ప్రేయసి.. లవ్ ప్రపోజ్ చేసిన ఉక్రెయిన్ సైనికుడు.. వీడియో వైరల్ ) అతను ఏకంగా 52 సరీసృపాలను చిన్న చిన్న సంచుల్లో దాచి సరఫరా చేసేందుకు ప్రయత్నించాడు. 9 పాములు, 43 అరుదైన బల్లులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సదరు వ్యక్తి వేసుకున్న జాకెట్, ప్యాంటు పాకెట్లు, ఇలా ఎక్కడ కుదిరితే అక్కడ వాటిని దాచిపెట్టుకుని సరిహద్దు దాటేందుకు ప్రయత్నించబోయాడు. అతను తరలిస్తున్న వాటిలో కొన్ని జాతులు అంతరించిపోతున్న జాబితాలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. "స్మగ్లర్లు ఇలాంటి వాటిని సరఫరా చేసేందుకు రకరకాల దారులు ఎంచుకుంటున్నారని అధికారులు తెలిపారు. -
రణరంగాన్ని తలపించిన ఫుట్‌బాల్ మ్యాచ్.. ముష్టి యుద్ధానికి దిగిన అభిమానులు
Rival Fans Clash At Mexico Football Match: మెక్సికోలోని లా కొర్రెగిడోరా స్టేడియంలో జరిగిన ఓ ఫుట్‌బాల్ మ్యాచ్ రణరంగాన్ని తలపించింది. క్వెరెటారో, అట్లాజ్ జట్ల మధ్య శనివారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల అభిమానులు భీకరమైన ముష్టి యుద్ధానికి దిగారు. మ్యాచ్ ప్రారంభంమైన కొద్ది నిమిషాలకే ఇరు జట్ల అభిమానులు దాడులకు దిగడంతో స్టేడియంలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. కుర్చీలు, పిడిగుద్దులతో అభిమానులు ఒకరిపై ఒకరు విచక్షణారాహిత్యంగా విరుచుకుపడ్డారు. కుటుంబాలు, చిన్న పిల్లలతో మ్యాచ్ చూసేందుకు వచ్చిన కొందరు పరిస్థితి చూసి భయాందోళనలకు గురై చెల్లాచెదురైపోయారు. దీంతో చేసేదేమీ లేక నిర్వహకులు మ్యాచ్‌ను నిలిపేశారు. ఈ గొడవలో 22 మంది గాయపడగా, 13 మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. గాయపడిన వారి సంఖ్యపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇరు జట్ల అభిమానుల మధ్య మొదలైన చిన్న గొడవ తన్నులాటకు దారితీసిందని తెలుస్తోంది. కాగా ఈ ఘటనపై అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య( ఫిఫా) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని స్టేడియం నిర్వాహకులకు ఆదేశించింది. చదవండి: సంచలనం సృష్టిస్తున్న రొనాల్డో బహిరంగ స్నానం -
రష్యాపై ఆంక్షలు.. అమెరికాకు గట్టి షాక్!
ఉక్రెయిన్ పరిణామాల్లో ఆర్థిక, ఇతర ఆంక్షలతో రష్యాను ఇరుకున పెడుతున్నామని అమెరికా సహా పాశ్చాత్య దేశాలన్నీ సంబుర పడుతున్నాయి. ఈ తరుణంలో అగ్రరాజ్యానికి ఊహించని షాక్ తగిలింది. ఊహించని మద్దతు రష్యాకు లభించింది. ఉత్తర అమెరికా దేశం మెక్సికో.. రష్యాపై ఆర్థిక ఆంక్షలను తీవ్రంగా ఖండించింది. అంతేకాదు ఉక్రెయిన్‌పై దాడులకుగానూ రష్యాపై తమ ప్రభుత్వం ఎలాంటి ఆర్థిక ఆంక్షలు విధించబోదని మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్, మంగళవారం ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. ‘‘ప్రపంచంలోని అన్ని ప్రభుత్వాలతో మేం(మెక్సికో) మంచి సంబంధాలను కొనసాగించాలని అనుకుంటోంది. ఈ సంక్షోభానికి సంబంధించి అందరితో చర్చించే స్థితిలో మేం ఉన్నాం’’ అని లోపెజ్ తెలిపారు. అంతేకాదు రష్యా మీడియా ఉక్రెయిన్ దాడుల విషయంలో అసత్య కథనాలు ప్రసారం చేస్తోందన్న ఆరోపణలను సైతం మెక్సికో అధ్యక్షుడు తోసిపుచ్చారు. ఆ వాదనతో నేను అంగీకరించను. రష్యానే కాదు.. ఏ దేశం అలా చేయదు. మీడియా స్వేచ్ఛను గొంతు నొక్కే అధికారం ఏ ప్రభుత్వానికి లేదు అని లోబెజ్ బబ్రాడోర్ స్పష్టం చేశారు. అంతేకాదు అమెరికా, యూరోపియన్ దేశాలు తీసుకుంటున్న పలు నిర్ణయాలపైనా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశాడు. తద్వారా మెక్సికో వాణిజ్యానికి తీవ్ర అవాంతరం ఎదురవుతోందని ఆయన అంటున్నారు. ఇక ఉక్రెయిన్‌లో బలప్రయోగాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించిన మెక్సికో.. రాజకీయ పరిష్కారానికి పిలుపునిస్తోంది. ఇదిలా ఉండగా.. మెక్సికోలో రష్యా పెట్టుబడి దాదాపు 132 మిలియన్ డాలర్లుగా ఒక అంచనా. ఇక ద్వైపాక్షిక వాణిజ్యం విలువ 2.4 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువే అని అంచనా. చదవండి: జనాల్ని చంపేస్తున్నాం.. భయంగా ఉందమ్మా! -
వందలాది పక్షలు ఆకాశంలో విహరిస్తూ ఒకేసారి భూమిపై పడి చివరికి..: షాకింగ్ వీడియో
Hundreds Of Yellow Headed Blackbirds Falling From The Sky: ఇంతవరకు మనం జంతువులకు, పక్షులకు సంబంధించిన రకరకాల వైరల్ వీడియోలను చూశాం. అంతేకాదు వివిధ రకాల అందమైన పక్షులు సందడి చేసి అలరించిన వీడియోలను వీక్షించాం. గానీ ఒకేసారి పక్షలు మంద ఆకాశంలో విహరిస్తూ చనిపోవడం వీడియోల్లో చూసి ఉండం. అలాంటి సంఘటన మెక్సికోలో చోటు చేసుకుంది. అసలు విషయంలోకెళ్తే...మెక్సికోలో పసుపు రంగు తలతో ఉన్న ఒకే రకమైన వందలాది పక్షలు ఆకాశంలో విహరిస్తూ చనిపోయాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఆ వీడియోలో వందలాది పక్షలు మందగా ఆకాశంలో విహరిస్తూ ఉన్నట్టుండి ఒకేసారి భూమి మీద పడి విగత జీవులుగా మారిపోయాయి. అందులో కొన్ని నెమ్మదిగా తేరుకుని ఎగిపోయాయి కూడా. నిపుణలు మాత్రం బహుశా ఒక వేటాడే పక్షి ఈ పక్షలు మందను వేటాడి ఉండవచ్చు. అప్పుడు ఒకేసారి ఎగిరే క్రమంలో ఒక్కసారిగా కింద పడి చనిపోయి ఉండవచ్చని చెబుతున్నారు. ఈ మేరకు యూకే సెంటర్ ఫర్ ఎకాలజీ అండ్ హైడ్రాలజీకి చెందిన పర్యావరణ శాస్త్రవేత్త డాక్టర్ రిచర్డ్ బ్రౌటన్ మాట్లాడుతూ.. "పెరెగ్రైన్ లేదా హాక్ వంటి రాప్టర్ పక్షుల మందను వెంబడిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ క్రమంలో ఆ పక్షలు మంద బలవంతంగా కిందకు వెళ్లడంతో అవి చనిపోయాయి" అని అన్నారు. అంతేకాదు వీడియో ఫుటేజ్‌లో వందలాది పక్షలు వీధుల్లో హఠాత్తుగా పడిపోయినట్లు కనిపించింది. పైగా అందులో చాలా వరకు ఎగిరిపోగా...కొన్ని చెల్లాచెదురుగా పడిపోయి చనిపోయి ఉన్నాయి. అయితే ఈ వీడియోని వీక్షించిన నెటిజన్లు ఈ వీడియో వెనుక 5 జీ సాంకేతికత ఉందని కొందరు , మరికొందరేమో షార్ట్ సర్యూట్ జరడంతోనే అవి అలా పడిపోయాయి అంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు. WARNING: GRAPHIC CONTENT Security footage shows a flock of yellow-headed blackbirds drop dead in the northern Mexican state of Chihuahua pic.twitter.com/mR4Zhh979K — Reuters (@Reuters) February 14, 2022 (చదవండి: తొలిసారిగా పైలెట్ లేకుండానే దూసుకెళ్లిన హెలికాప్టర్.. ఎలాగో తెలుసా!!) -
Electric Tractor: తయారీ హైదరాబాద్‌లో అమ్మేది మెక్సికోలో
ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో హైదరాబాద్ హవా కొనసాగుతోంది. గత రెండు మూడేళ్లుగా ఈవీ సెగ్మెంట్లో పని చేస్తున్న కంపెనీలు ఇప్పుడు ఫలితాలను అందిస్తున్నాయి. తాజాగా సెలెస్టియల్ ఈ మొబిలిటీ సంస్థ తమ ఈ ట్రాక్టర్లను మెక్సికన్ మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు రెడీ అయ్యింది. సెలెస్టియల్ ఈ మొబిలిటీ కంపెనీ 2019లో హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలు ప్రారంభించింది. ఈ కంపెనీ మొత్తం 35 రకాల వాహనాలను రూపొందిస్తోంది. దేశవ్యాప్తంగా 2500 డీలర్షిప్ కేంద్రాలతో పాటు 800 సర్వీస్ సెంటర్లు ఉన్నాయి. 2020 మార్చిలో ఇ ట్రాక్టర్‌ను ప్రవేశపెట్టగా మంచి స్పందన వచ్చింది. దేశవ్యాప్తంగా ఇప్పటికే 1800 ట్రాక్టర్లు బుక్ అయ్యాయి. ఇ ట్రాక్టరులో 150 ఏఎహెచ్ లిథియం ఐయాన్ బ్యాటరీ అమర్చారు. ఇ ట్రాక్టర్లో 18 బీహెచ్పీ, 15 ఎన్ఎం టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇండియన్ మార్కెట్లో మంచి స్పందన రావడంతో విదేశాలకు తమ ట్రాక్టర్లను ఎగుమతి చేసే యత్నంలో ఉంది సెలెస్టియల్ సంస్థ. అందులో భాగంగా మెక్సికన్ కంపెనీ గ్రూపో మార్వెల్సా కంపెనీతో ఒప్పందం చేసుకుంది. రాబోయే మూడేళ్లలో మెక్సికో మార్కెట్లో 4000 ఇ ట్రాక్టర్లు విక్రయించడం ఈ ఒప్పందం లక్ష్యం. త్వరలోనే అమెరికా మార్కెట్లోనూ అడుగు పెడతామని సెలెస్టియల ఈ మొబిలిటీ ఫౌండర్, సీఈవో సిద్ధార్థ దురైరాజ్ తెలిపారు. చదవండి: ప్రారంభానికి ప్రైవేట్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ రెడీ -
మ్యాజిక్ ట్రిక్ని చూసి నోరెళ్ల బెట్టిన కోతి: వైరల్ వీడియో
Monkeys Reaction To Zoo Visitors Magic Trick: మ్యాజిక్ అంటే పెద్దలు పిల్లలు అనే తారతమ్యం లేకుండా అందరూ సరదాగా ఎంజాయ్ చేస్తారు. అంతేకాదు కొంతమందికి రకరకాల మ్యాజిక్‌లు గురించి తెలుసుకోవడమే కాక నేర్చుకుంటుంటారు కూడా. అయితే ఇక్కడోక జూలోని కోతి మ్యాజిక్‌ని చూసి ఏ చేసిందో తెలుసా!. అసలు విషయంలోకెళ్తే... మెక్సికోలోని చాపుల్టెపెక్ జూని సందర్శించడానికి వచ్చిన మాక్సిమిలియానో ఇబర్రా అనే వ్యక్తి ఆ జూలో కోతి ముందు సరదాగా ఒక మ్యాజిక్ ట్రిక్ ప్లే చేయాలని అనుకున్నాడు. అయితే ఆ కోతి మొదటగా ఆ మ్యాజిక్‌ని అంతగా పట్టించుకోకుండా తన ఆహారాన్ని వెతుకుతున్నట్లుగా అటు ఇటూ చూస్తోంది. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆ వ్యక్తి చేస్తున్న మ్యాజిక్‌ని ఆసక్తిగా తిలకించడం మొదలు పెట్టింది. అంతే ఆ వ్యక్తి ఆ ఆకుని ఎలా మాయం చేస్తున్నాడో అర్థం కాక మనుషులు ఎలా అయితే తెల్లబోయి చూస్తుంటారో అలానే ఆశ్చర్యంగా చూసింది. పైగా ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడో ఏంటో అన్నట్లుగా విచిత్రమైన హావాభావాలను ఇచ్చింది. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మీరు ఓ లుక్కేయండి. (చదవండి: ఎలుగుబంటి బోనులోకి బిడ్డను విసిరేసిన తల్లి!! ఆపై ఏం జరిగిందో చూడండి..) -
ప్రేయసి కోసం కిడ్నీ దానం చేసిన ప్రియుడు.. ట్విస్ట్ ఏంటంటే
మెక్సికో సిటి: ప్రేమ అనేది ఒక అనిర్వచనీయ అనుభూతి. తమ ప్రేమ చరిత్రలో నిలిచిపోయేందుకు.. కొందరు చారిత్రక కట్టడాలు నిర్మిస్తే.. మరికొందరు అదే ప్రేమను పొందడానికి యుద్ధాలుసైతం చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే, ప్రస్తుత సమాజంలో నిజమైన ప్రేమ దొరకడం అనేది ఒక మిథ్య మాదిరిగానే అనే ఉంటుంది. కొందరు యువతీ యువకులు పాశ్చాత్యధోరణులకు అలవాటుపడి.. తమకు బాయ్‌ఫ్రెండ్ లేదా గర్ల్‌ఫ్రెండ్ ఉండటం ఒక స్టెటస్ సింబల్‌గా భావిస్తున్నారు. మరికొందరు ఒక అడుగుముందుకు వేసి.. ఒకరికి తెలవకుండా మరి కొందరితో ప్రేమాయణాలు నడిపిస్తున్నారు. కొందరు పవిత్రమైన ప్రేమను తమ అవసరాలకోసం వాడుకుంటూ.. దిగజారీ ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు ప్రేమముసుగులో విచ్చలవిడిగా తిరిగి.. ఆ తర్వాత ఏవో కారణాలతో విడిపోయి.. ప్రేమకున్న పరువును బజారుకిడుస్తున్నారు. ఇలాంటి ఘటనలు ప్రతిరోజు మనం వార్తల్లో చదువుతునే ఉన్నాం. ప్రేమను వాడుకోవడంలో అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరూ అతీతులు కారు. కొన్నిచోట్ల అబ్బాయిలు.. అమ్మాయిలను మోసం చేస్తే.. మరికొన్ని చోట్ల అమ్మాయిలు.. అబ్బాయిలను మోసం చేస్తున్నారు. కొందరు నిజమైన ప్రేమికులు తమ ప్రేమ కోసం.. తాము ప్రేమించిన వారి కళ్లలో ఆనందం కోసం ఎలాంటి త్యాగాలు చేయడానికైన వెనుకాడటం లేదు. ఈ కోవకు చెందిన ఒక ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. బాజా కాలిఫోర్నియాకు చెందిన ఉజీల్ మార్టినేస్ అనే వ్యక్తి ఒక యువతిని ప్రేమించాడు. చాలా సంవత్సరాల పాటు వీరి ప్రేమ బాగానే కొనసాగింది. ఈ క్రమంలో ఉజీల్.. ప్రియురాలి తల్లి కిడ్నీసమస్యతో ఆసుపత్రిలో చేరింది. ఆమెను పరిక్షీంచిన వైద్యులు వెంటనే కిడ్నీని మార్చాలన్నారు. ఆమె ప్రియురాలు ఎంతోగానో బాధపడింది. తన ప్రియురాలి బాధను చూడలేక.. ఉజీల్ తన కిడ్నిని దానం చేయడానికి సిద్ధపడ్డాడు. ఈ క్రమంలో ఉజీల్కు శస్త్రచికిత్స చేసి అతని కిడ్నీని ప్రియురాలి తల్లికి అమరుస్తారు. ఒకనెల రోజులు గడచిపోయింది. ఉజీల్, ప్రియురాలి తల్లి ఇద్దరు కూడా ఆరోగ్యంతో కొలుకున్నారు. ఈ క్రమంలో శస్త్రచికిత్స తర్వాత ఉజీల్ ప్రియురాలు అతడినితో మాట్లాడటం మానేసింది. ఈ విధంగా ఒకనెల రోజులు గడిచిపోయాయి. కొన్ని రోజుల తర్వాత.. తన ప్రియురాలికి మరో వ్యక్తితో పెళ్లి నిశ్చయమైన విషయం ఉజీల్కు తెలుస్తుంది. దీంతో ఉజీల్ తీవ్ర మానసిక వేదనకు గురౌతాడు. తన ప్రియురాలి చేతిలో మోసపోయాయని తెలుసుకుని కుంగిపోయాడు. కాగా, తన మానసిక క్షోభను టిక్‌టాక్ వీడియో రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఇది కాస్త వైరల్‌గా మారింది. ‘తన ప్రేయసి కళ్లలో ఆనందం కోసం ఇంతటి త్యాగం చేశాను.. ఇలా మోసం చేస్తుందని ఊహించలేకపోయాయని కన్నీటి పర్యంతమయ్యాడు.’ ప్రస్తుతం తాము.. మాట్లాడుకోవట్లేదని.. అలాగని తనను.. వ్యతిరేకించడం కానీ, ద్వేషించడంగానీ చేయట్లేదని చెప్పుకొచ్చాడు. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘నీలాంటి గొప్ప వ్యక్తితో ఉండే అర్హత ఆ అమ్మాయికి లేదు..’, ‘ఆ అమ్మాయి దురదృష్టవంతురాలు..’, ‘నువ్వు ఏం బాధపడకంటూ’ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: ఎన్నికల ప్రచారంతో చీరల వ్యాపారానికి పెరిగిన డిమాండ్!! -
మెక్సికోలో కాల్పులు .. ఇద్దరు చిన్నారులు సహా 8 మంది మృతి
మెక్సికోసిటి: మెక్సికోలో దారుణం చోటుచేసుకుంది. గ్వానాజుటావో రాష్ట్రం సిలావో గ్రామంలో ఇద్దరు గుర్తుతెలియని దుండగులు బైక్ మీద వచ్చి కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పులలో ఎనిమిది మంది అమాయకులు మృతి చెందారు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా భయానకంగా మారిపోయింది. దీంతో ఆగ్రహించిన స్థానికులు.. ఆగంతకులను పట్టుకోని వారిపై దాడిచేశారు. దీంతో వారు కూడా మరణించారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఇద్దరు దుండగులతో సహా, మరో 8 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే స్థానికులు క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రులకు తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా, ఈ దాడులు నిర్వహించిన వారు డ్రగ్స్ ముఠాకు చెందిన వారిగా భావిస్తున్నారు. శాంటా రోసాడి లిమా, జాలిస్కో న్యూజనరేషన్ల మధ్య పోరాటం కారణంగా గ్వానాజువాటో అత్యంత హింసాత్మక ప్రదేశంగా మారింది. 2006లో మెక్సికో మాదక ద్రవ్యాల అక్రమరవాణాపై నియంత్రణ విధించినప్పటి నుంచి ఈ దాడులు అధికమయ్యాయి. కొన్ని డ్రగ్స్ గ్యాంగ్‌లు ఆధీపత్యం కోసం పరస్పరం దాడులు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. గత నవంబరులో జరిగిన దాడిలో 11 మంది అమాయకులు మృతి చెందిన విషయం తెలిసిందే. 2006 నుంచి ఇప్పటి వరకు దాదాపు మూడు లక్షల మంది అమాయకులు మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు. చదవండి: మరో రైల్వే స్టేషన్ పేరు మార్చేసిన యోగి ప్రభుత్వం.. ఇక నుంచి -
Mystery: ‘ఆ వాసన భరించలేక 15 మంది చనిపోయారు! ఇంకొంత మంది..’
Mystery: ఏదేశంలోనైనా.. అక్రమార్కులకు అధికారపు అండదండలు ఉన్నంతవరకూ అభాగ్యుల జీవితాలన్నీ అపశృతులే. ఉద్యమించే గళాలన్నీ నిస్సహాయపు ఆర్తనాదాలే. ఆ ఊచకోతల తాలూకు రక్తపు ఛాయలన్నీ ఆధారాలుగా భ్రమింపజేసే ఎండమావులే! దానికి ఉదాహరణే మెక్సికో నరమేధం!! అక్కడో మాఫియా గ్యాంగ్.. స్థానిక అధికారులతో కలసి 43 మంది విద్యార్థులను సజీవదహనం చేసింది. ఈ కేసులో అనుమానితులుగా ఉన్న 80 మంది నిందితుల్లో 44 మందికి పైగా పోలీసులే ఉండటం గమనార్హం. ఒక పోలీస్ ఉన్నతాధికారి, నగర మేయర్, అతడి భార్యా ఈ కేసులో పాత్రధారులే. ఘటన జరిగి ఏడేళ్లు గడిచినా.. నేటికీ నేరనిర్ధారణ జరగలేదు. శిక్షలు అమలుకాలేదు. తవ్వేకొద్దీ మిస్టరీగా మారిపోయిన ఈ ఘటనలో 43 మంది విద్యార్థులు ఏమయ్యారు? ఒక ఊచకోతపై పోరాటం చేస్తూ వాళ్లూ ఊచకోతకు గురయ్యారా? నేటికీ ప్రశ్నలుగానే మిగిలిపోయిన సత్యాలు. 24 సెప్టెంబర్ 2014, దక్షిణ మెక్సికోలోని టీచర్ ట్రైనింగ్ స్కూల్‌కు చెందిన 43 మంది విద్యార్థులు కనిపించకుండా పోయిన రోజది. 1968 నాటి విద్యార్థుల ఊచకోతల వార్షిక నిరసన ప్రదర్శనలో పాల్గొనేందుకు.. 19 ఏళ్ల నుంచి 20 ఏళ్ల మధ్య వయసున్న విద్యార్థులు.. భారీ సంఖ్యలో అయిదు బస్సుల్లో బయలుదేరారు. అయితే కొకులా, ఇగౌలా ప్రాంతానికి చేరుకునేసరికి పోలీసులు రోడ్లకు అడ్డంగా బారీకేడ్లను పెట్టి ఆ బస్సులను అడ్డుకున్నారు. ఉన్నట్టుండి మొదలైన పోలీసు కాల్పులు, దానివల్ల జరిగిన తొక్కిసలాట కారణంగా అప్పటికే ఆరుగురు విద్యార్థులు చనిపోయారు. చాలామంది గాయపడ్డారు. ఆ ఘర్షణల నుంచి తప్పించుకున్న కొందరు విద్యార్థులు దగ్గర్లోని కొండల వెనక్కి పారిపోయారు. అయితే పోలీసులు దొరికినవారిని దొరికినట్లుగా పట్టుకుని, రెండు బస్సుల్లో ఎక్కించి వేరే ప్రాంతానికి తరలించారనేది నాటి స్థానిక కథనం. ఆ మరునాడు నుంచే 43 మంది విద్యార్థులు కనిపించకుండా పోయారు. పోలీసులే విద్యార్థుల్ని మాయం చేశారని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు పోరాటం చెయ్యడంతో.. ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. వారు కొందరు పోలీసులతో పాటు స్థానిక మేయర్ హోస్ లూయీస్ అబార్కా, అతడి భార్య మారియాను అదుపులోకి తీసుకుని విచారించారు. కానీ, ఫలితం లేదు. అయితే పోలీసులు ఆ రాత్రి పట్టుకున్న విద్యార్థులను ఓ డ్రగ్ మాఫియాకు అప్పగించారనేది అప్పటికే అందిన రహస్య సమాచారం. దాన్ని బలపరచే ఓ మెసేజ్.. ఈ కేసుకి కీలక ఆధారంగా మారింది. ఆ డ్రగ్ మాఫియా గ్యాంగ్‌లోని ఒక వ్యక్తి.. ఆ మాఫియా నేతకు మొబైల్లో పంపిన మెసేజ్ ఏంటంటే.. ‘వారిని బస్సుల్లోంచి చెత్తను తరలించే లారీల్లో ఎక్కించి డంప్‌యార్డుకు తీసుకెళ్లాం. ఆ వాసన భరించలేక 15 మంది చనిపోయారు. మిగిలిన వారంతా కొన ఊపిరితో ఉన్నారు. అందరినీ లారీలోంచి దింపి, ఓ గుట్టగా వేసి, డీజిల్, పెట్రోల్ పోసి నిప్పంటించాం. తెల్లవారేదాకా ఆ దేహాలు దహనమవుతూనే ఉన్నాయి. పూర్తిగా బూడిద అయిన తర్వాత అస్థికలను ఎనిమిది ప్లాస్టిక్ బ్యాగుల్లోకి ఎత్తి, కొకులా సమీపంలో ఉన్న ఓ నదిలో పడేశాం. ఇక ఎవరూ గుర్తుపట్టలేరు’ అని! ఈ మెసేజ్.. విచారణాధికారులకు చిక్కింది. దీంతో పోలీసులే ఆ విద్యార్థులను డ్రగ్ మాఫియాకు అప్పగించారని, ఆ విద్యార్థుల్లో ఆ మాఫియా గ్రూప్‌కు చెందని ప్రత్యర్థులు ఉన్నారనే అనుమానంతోనే అందరినీ సజీవదహనం చేసుంటారని అంచనాకు వచ్చారు. అనాబెల్ హెర్నాండెజ్ అనే జర్నలిస్ట్ తన ప్రాణాలకు తెగించి పలు కీలక ఆధారాలు సంపాదించింది. ఆ వివరాలతో (మెక్సికోలో నరమేధం) పేరుతో 2016లో ఓ పుస్తకాన్ని విడుదల చేసింది. అసలు నిజానిజాలు తేల్చేందుకు ఆ మాఫియా గ్యాంగ్‌లో కొందరు వ్యక్తులను రహస్యంగా కలుసుకుంది అనాబెల్. ‘విద్యార్థులను మాఫియాకు అప్పగించింది పోలీసులే. దీని వెనుక రాజకీయ ప్రముఖుల హస్తముంది. ఆ రోజు విద్యార్థులు ప్రయాణిస్తున్న అయిదు బస్సుల్లో రెండు బస్సులు మాఫియా స్మగ్లింగ్‌కు ఉపయోగించే బస్సులు కావడమే ఈ దుర్ఘటనకు అసలు కారణం. ఆ బస్సుల్లో అప్పటికే మాఫియా రెండు మిలియన్ డాలర్ల (రూ.15,33,90,000) విలువ చేసే హెరాయిన్‌ను రహస్యంగా దాచిపెట్టింది. బస్సులు గనుక మెక్సికోకు చేరితే అందులోని మత్తుమందు డ్రగ్ కంట్రోల్ టీమ్‌కు చిక్కుతుందనే భయంతోనే ఆ మాఫియా డాన్.. స్థానిక నాయకులతో, పోలీసులతో అప్పటికప్పుడు మాట్లాడి బస్సులను దారి మళ్లించారు’ అని అనాబెల్ తన పుస్తకంలో రాసింది. ఆమె కథనం ప్రకారం ఆ రోజు డ్రగ్ డీలర్స్ నుంచి, మాఫియా డాన్ నుంచి.. చాలామంది ప్రముఖులకు ఫోన్ కాల్స్ వచ్చాయని.. మొదటి ఫోన్ కాల్ ఇగౌలాలోని 27వ బెటాలియన్ కల్నల్‌కు వచ్చిందని పలు ఆధారాలు అందించింది. అయితే పుస్తకం మార్కెట్లోకి రాగానే ఆమెకు బెదిరింపు కాల్స్ రావడం మొదలయ్యాయి. ఆమెకు సమాచారం ఇచ్చిన మాఫియా వ్యక్తిని కిరాతకంగా హత్య చెశారు. అతడి భార్యను అపహరించారు. ఇదంతా ఓ ఘోరమైన కుట్ర. ఇప్పటి వరకూ ఆ 43 మందిలో ముగ్గురు విద్యార్థుల అవశేషాలు మాత్రమే లభిచడం ఈ కేసులో కనిపించిన పురోగతి. 2014లో 19 ఏళ్ల అలెగ్జాండర్ మోరా అనే విద్యార్థి అవశేషాలను.. కొకులాలోని డంప్‌యార్డ్ దగ్గర ఉన్న ఒక ప్రవాహంలో కనుగొన్నారు. 2020లో క్రిస్టియన్ అల్ఫోన్సో రోడ్రిజ్(19) అనే విద్యార్థి అవశేషాలు, 2021లో హోసివానీ గురేరో (20) అనే విద్యార్థి అవశేషాలు లా కార్నిసెరియా లోయలో లభించాయి. మిగిలిన 40 మంది ఏమయ్యారనేది నేటికీ మిస్టరీనే. విద్యార్థులకు చెందిన పలు నమూనాలు లభించినా ఫోరెన్సిక్ రిపోర్ట్‌లో మ్యాచ్ కాకపోవడం కూడా ఓ కుట్రే. మెక్సికోలో డ్రగ్స్ మాఫియాదే పెత్తనం. ఇక్కడ ఇలాంటి ఘటనలు కోకొల్లలు. అందులో ఇది కూడా ఒకటి అంటుంటారు కొందరు. కానీ బాధిత కుటుంబాలు మాత్రం నేటికీ పిడికిలి బిగించే నిలబడ్డాయి న్యాయం కోసం. -సంహిత నిమ్మన -
శ్రీవేద్యకు మహిళల డబుల్స్ టైటిల్..
మెక్సికో ఇంటర్నేషనల్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన హైదరాబాద్ అమ్మాయి గురజాడ శ్రీవేద్య డబుల్స్ విభాగంలో టైటిల్ సాధించింది. మెక్సికోలోని గ్వాడలహారా నగరంలో జరిగిన ఈ టోర్నీ మహిళల డబుల్స్ ఫైనల్లో శ్రీవేద్య (భారత్)–ఇషికా జైస్వాల్ (అమెరికా) జోడీ 20–22, 21–17, 21–16తో క్రిస్టల్ లాయ్–అలెగ్జాండ్రా మొకాను (కెనడా) జంటపై నెగ్గింది. 19 ఏళ్ల శ్రీవేద్య హైదరాబాద్‌లోని చేతన్ ఆనంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ పొందుతోంది. చదవండి: Rohit Sharma- Virat Kohli: టెస్టులకు రోహిత్ దూరం.. వన్డే సిరీస్ నుంచి కోహ్లి అవుట్.. అసలేం జరుగుతోంది? -
ట్రక్ యాక్సిడెంట్.. 53 మంది దుర్మరణం
మెక్సికో: ప్రాణాలను పణంగా పెట్టి యునైటెడ్ స్టేట్స్ సరిహద్దుకు చేరుకోవడానికి ప్రయత్నించారా వలసదారులు. కానీ ట్రక్కు తిరగబడటంతో వారిని మృత్యువు కబలించింది. దక్షిణ మెక్సికోలో గురువారం చోటుచేసుకున్న ఈ హృదయవిదారక దుర్ఘటనలో దాదాపు 53 మంది అమెరికన్ వలసదారులు మరణించారు. మృతుల్లో పురుషులు, మహిళలు, పిల్లలు ఉన్నారని చియాపాస్ సివిల్ ప్రొడక్షన్ తెలిపింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.చియాపాస్ రాష్ట్రంలోని టక్స్ట్లా గుటిరెజ్ నగరం వెలుపల ఒక పదునైన వంపులో ట్రక్కు క్రాష్ కావడంతో ఈ ప్రమాదం జరిగిందని చియాపాస్ సివిల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అధిపతి లూయిస్ మాన్యువల్ గార్సియా తెలిపారు. వాహనంలో కనీసం 107 మంది ఉంటారని ప్రాధమిక అంచనా. దక్షిణ మెక్సికోలో వారిని రవాణా చేస్తున్న ట్రక్కు ఓవర్‌లోడ్, అతివేగం కారణంగా ఫుట్‌పాత్‌ను ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. కాగా మెక్సికో నుంచి అమెరికాకు అక్రమంగా వలస వెళ్లడం సాధారణంగా జరుగుతుంది. గత నెలలో 652 మందితో అక్రమ వలసదారులతో వెళ్తున్న 6 ట్రక్కులను పట్టుకున్నారు. మానవ అక్రమ రవాణా సంఘటనలు తరచూ జరుగుతూ ఉంటాయి. ఇరుగు పొరుగు దేశాల నుంచి మెక్సికో నుంచి అమెరికాలో ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ ట్రక్కు కూడా అలాంటిదే. కాగా మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రాడోర్ ట్విటర్ ద్వారా సంఘటనపై సంతాపం తెలిపారు. చదవండి: ప్రేమ వివాహం చేసుకున్నాడు.. బలవంతంగా సూసైడ్‌నోట్ రాయించి.. -
ఘోర బస్సు ప్రమాదం...19 మంది దుర్మరణం
Massive Bus Accident In Mexico: సెంట్రల్ మెక్సికోలో యాత్రికులను తీసుకువెళ్తున్న ఓ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 19 మంది మృతి చెందగా మరో 32 మందికి గాయలైయ్యాయి. అయితే బస్సు బ్రేకులు కోల్పోయి మెక్సికో రాష్ట్రంలోని ఒక భవనంపైకి దూసుకెళ్లడంతోనే ఈ ఘోర ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. అంతేకాదు ఈ ప్రమాదం మెక్సికో సిటీకి నైరుతి దిశలో ఉన్న జోక్విసింగో టౌన్షిప్లో జరిగిందని రాష్ట్ర అంతర్గత కార్యదర్శి రికార్డో డి లా క్రూజ్ వెల్లడించారు. (చదవండి: ఆ పిల్లాడి కంటే ఈ కుక్క పిల్లే భలే మాట్లాడేస్తోంది!!!) ఈ మేరకు ఆయన ఈ బస్సు పశ్చిమ రాష్ట్రమైన మిచోకాన్ నుండి శతాబ్దాలుగా రోమన్ క్యాథలిక్ యాత్రికులు సందర్శించే ఛల్మా పట్టణానికి వెళ్తోండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని చెప్పారు. అయితే గాయపడిన ప్రయాణికుల పరిస్థితిపై ఎటువంటి తక్షణ సమాచారం లేదన్నారు. పైగా చాలా మంది మెక్సికన్లు డిసెంబర్ 12, వర్జిన్ ఆఫ్ గ్వాడాలుపే రోజు సమీపిస్తున్న కొద్దీ మతపరమైన తీర్థయాత్రలకు వెళ్తుంటారని చెబుతున్నారు. అంతేకాదు వారు తరచుగా ఇరుకైన రోడ్లపై నడవడం, కాలం చెల్లిన బస్సులలో ప్రయాణించడం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే 1521 ఆక్రమణకు ముందు హిస్పానిక్ పూర్వ కాలంలో ఛల్మా ఒక పవిత్ర ప్రదేశం. అంతేకాక స్పానిష్కు స్వాతంత్య్రం వచ్చిన తరువాత అజ్టెక్ దేవుడికి అంకితం చేయబడిన ఒక గుహలో ఒక శిలువ అద్భుతంగా కనిపించింది. దీంతో అప్పటి నుంచి ఈ ఛల్మా పేరుగాంచిన క్రైస్తవ తీర్థయాత్ర మారింది. అంతేకాదు పెద్ద ఎత్తున భక్తులు భక్తులు చల్మాను దర్శించుకునేందుకు తరలివస్తుంటారు. (చదవండి: కరోనా కొత్త వేరియంట్.. జర్మనీలో తీవ్రరూపం..రంగంలోకి వైమానిక దళం) -
టోల్‌బూత్‌లోకి దూసుకెళ్లిన ట్రక్కు.. 20 మంది దుర్మరణం
మెక్సికో సిటీ: మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సెంట్రల్ మెక్సికోలోని రహదారిపై ఉన్న టోల్‌బూత్‌లోకి ఒక ట్రక్కు దూసుకురావడంతో 20 మంది మృత్యువాత పడగా, పలువురు గాయపడ్డారు. టోల్‌బూత్ వద్ద ఆపి ఉంచిన వాహనాలపైకి ఓ రవాణా ట్రక్కు దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో మంటలు చెలరేగడంతో పలు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ మంటల్లో చిక్కుకుని 20 మంది సజీవ దహనమయ్యారు. ట్రక్కు బ్రేకులు ఫెయిల్ కావడంతో ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మెక్సికోలోని చాల్కో ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్ కూడా మంటల్లో చిక్కుకుని మృతిచెందాడు. నవంబర్ 1వ తేదీ నుంచి చూస్తే సెంట్రల్ మెక్సికోలో వరుస అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడం కలవర పరుస్తున్నాయి. ఆయిల్ కోసం ఎగబడ్డ జనాలు.. ఒక్కసారిగా పేలుడు.. -
పెళ్లి వేడుకలో ఎలుగుబంటి.. జనం హడల్!
మెక్సికో: వేడుకల్లో లేదా ఏదైనా ఉత్సవంలో ఏదైనా అనుకోని సంఘటన జరిగితే అది మనకు ఎప్పటి మర్చిపోని జ్ఞాపకంలా ఉంటుంది. పైగా ఆ ఘటనకు కారణమైన మనుష్యులను చూసినప్పుడు వెంటనే ఆ సంఘటన గుర్తకు వచ్చి నవ్వుతుంటాం. అచ్చం అలాంటి ఘటన మెక్సికో వివాహ వేడుకలో చేటుచేసుకుంది. (చదవండి: రబ్బరు ష్యూస్ వల్లే బ్రతికాను) వివరాల్లోకెళ్లితే.....మెక్సికోలోని వన్యప్రాణులు సంచరించే పర్వత ప్రాంతమైన న్యూవో లియోన్ వేడుడకగా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ తర్వాత అతిథులంతా భోజనం చేసే రిసెప్షన్ హాలులో భోజనం చేస్తుండగా అనుకోని అతిథలా ఒక ఎలుగుబంటి పిల్ల వస్తుంది. దీంతో పెళ్లికి వచ్చిన జనంలో ఒకటే ఆందోళన. అయితే ఆ ఎలుగుబంటి పిల్ల మాత్రం అక్కడ ఉన్న ఆహారపదార్థాలను వాసన చూస్తూ అక్కడ ఉన్న టేబుల్‌పై ఉన్న వాటిన్నంటిని పడేస్తు దానికి కావలసిని ఆహారం కోసం వెతుకుతుంది. కానీ అక్కడ ఉన్న ఒక అతిథి మాత్రం ఇది ఏమి పట్టనట్టు ఉంటాడు. ఆ తర్వాత కాసేపటికి తనదారిని తన నివాసానికి వెళ్లిపోతుంది. అయితే అదృష్టమేమిటంటే ఆ పెళ్లిలో అతిథులను ఎవర్నీ గాయపర్చలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు పెళ్లివేడుకల్లో ఉండే రకరకాల ఆహార పదార్థాల వాసనకు ఆగలేక వచ్చి ఉంటుందంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: కోవిడ్ పేరు చెప్పి రుణం తీసుకున్నాడు...కటకటాల పాలయ్యాడు) -
మెక్సికోలో భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్ దారుణ హత్య
లాస్ఏంజిల్స్: మెక్సికోలో మాదక ద్రవ్యాల ముఠాల మధ్య జరిగిన కాల్పుల్లో ప్రమాదవశాత్తూ భారత సంతతి మహిళ సహా ఇద్దరు మృత్యువాతపడ్డారు. హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన టెకీ, ట్రావెల్ బ్లాగర్ అయిన అంజలి రియోట్(25) ప్రస్తుతం కాలిఫోర్నియాలోని శాన్‌జోస్‌లో ఉంటున్నారు. ఈ నెల 22వ తేదీన తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకునేందుకు భర్త ఉత్కర్ష్ శ్రీవాస్తవతో కలిసి సోమవారం ఆమె మెక్సికోలోని తీరప్రాంత రిసార్ట్ టులుమ్కు వెళ్లారు. బుధవారం రాత్రి అంజలి మరో నలుగురు కలిసి అక్కడి రెస్టారెంట్‌లోని టెర్రస్‌పై ఉండగా, సాయుధ దుండగులు ప్రవేశించి వారున్న ప్రాంతంలో యథేచ్ఛగా కాల్పులు ప్రారంభించారు. ఈ కాల్పుల్లో అంజలి, మరో మహిళ చనిపోగా, ముగ్గురు గాయపడ్డారు. డ్రగ్స్ నేరగాళ్ల ముఠాల మధ్య జరిగిన కాల్పుల్లో ప్రమాదవశాత్తూ వీరు బలయ్యారని అధికారులు తెలిపారు. ఈ ఏడాది జూన్ నుంచి లింక్డ్ ఇన్‌లో ఆమె సీనియర్ సైట్ రిలయబిలిటీ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. అంజలి మరణ వార్తను నమ్మలేకపోతున్నామని సిమ్లాలో ఉంటున్న ఆమె తల్లిదండ్రులు కె.డి.రియోట్, నిర్మల కన్నీటి పర్యంతమయ్యారు. అంజలి భర్త ఉత్కర్ష్ది మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్. నెట్‌ఫ్లిక్స్‌లో సీనియర్ మేనేజర్‌గా ఉన్నారు. చదవండి: (పెళ్లి చేసుకుంటానని గర్భవతిని చేసి.. ఇప్పుడు శ్రీజతో మరో పెళ్లి..) -
వలసదారుల ఇక్కట్లు.. బైడెన్ ప్రభుత్వ కీలక ప్రకటన
Migrants Stranded At Texas Bridge: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ టెక్సాస్ సరిహద్దు ప్రాంతంలోని డెల్రియోలో వరదల్లో చిక్కుకున్న వేలాది మంది వలసదారులను తరలించడానికీ విమానాలను ఏర్పాటు చేశామని చెప్పారు. వలసలు, కరోనా పరిస్థితుల దృష్ట్యా అమెరికా ప్రభుత్వం హైతీ, మెక్సికో, ఈక్వెడార్ మరియు మధ్య అమెరికాలోని విమానాలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) నియంత్రణలోని ప్రాంతమైన డెల్ రియో బ్రిడ్జ్ కింద ఉన్న గ్రాండ్ నదిని దాటి మెక్సికో నగరానికీ వలసదారులు పెద్ద ఎత్తున సముహాలుగా పయనమవుతున్నారు. (చదవండి: అఫ్గనిస్తాన్‌కి తక్షణ సాయం కావాలి) ఈ సందర్బంగా డెల్ రియో మేయర్ బ్రూనో లోజానో మాట్లాడుతూ..." 14 వేల మంది వలసదారులు నిర్భంధంలోకి వెళ్లడానికి సుముఖంగా ఉన్నారు. అంతేకాదు వలసదారులను తరలించే ఆపరేషన్‌లో భాగంగా స్థానిక , ఫెడరేషన్ అధికారులు బస్సులు, విమానాల పంపించారు. డెల్ రియో ప్రవేశ ద్వారాన్ని తాత్కాలికంగా మూసివేసి రియో బ్రిడ్జి పై రద్దీ దృష్ట్య వేరే మార్గం గుండా తరలించే ఏర్పాటు చేశాం" అని పేర్కొన్నారు. హోంల్యాండ్ సెక్యూరిటీ హైతి, సంబంధిత ప్రాంతాల్లో నిషేధించిన విమానాలను పునరుద్ధరించి త్వరితగతిన వలసదారులను తరలించేందుకు మరిన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. యూఎస్ నేలపై వలసల ఉధృతిని తగ్గించి, పరిస్థితిని తిరిగి మెరుగుపరిచేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని బైడెన్ పరిపాలనా యంత్రాంగం పేర్కొంది. హైతి అధ్యక్షుడి మరణం, తాలిబన్లు అఫ్గనిస్తాన్ ఆక్రమించుకోవడం.. తదనంతర పరిణామాల నేపథ్యంలో అమెరికాలోని మెక్సికో సరిహద్దు ప్రాంతంలోకి అధిక సంఖ్యలో వసలదారులు తాకిడి ఎక్కువైంది. దీంతో యూఎస్ ప్రభుత్వం 2 లక్షలకు మించి వలసదారులకు అనుమతి లేదంటూ ఆంక్షలు విధించింది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు వలసలను మొదటగా బహిష్కరించినప్పటికీ రాజకీయ ఒత్తిడి నేపథ్యంలో వారికీ ఆశ్రయం కల్పించి, తరలించే చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. (చదవండి: పది కోట్ల ప్రైజ్‌మనీ రేసులో మన బిడ్డ) -
ఐన్‌స్టీన్, హాకింగ్‌లకన్నా ఈ చిన్నారి బుర్ర మరింత స్మార్ట్
మెక్సికో సిటీ: ఇంటెలిజెన్స్ కోషెంట్.. దీన్నే షార్ట్‌కట్‌లో ఐక్యూ అంటారు. ఇది ఎవరైనా ఒక వ్యక్తి తెలివితేటల స్థాయిని చెప్పే ఓ కొలమానం అనొచ్చు. సమస్యలను విశ్లేషించగల, పరిష్కరించగల సామర్థ్యానికి కొలమానం ఇది. అయితే ఇప్పటి వరకు అత్యధిక ఐక్యూ ఉన్న వారి జాబితాలో ప్రముఖ శాస్త్రవేత్తలు అల్బర్ట్ ఐన్‌స్టీన్, స్టీఫేన్ హాకింగ్‌లు ప్రథమ స్థానంలో ఉన్నారు. వీరి ఐక్యూ లెవల్స్ 160 వరకు ఉన్నట్లు ప్రచారం ఉంది. ఐక్యూ విషయంలో వీరిని మించిపోయింది మెక్సికన్‌కు చెందిన ఎనిమిదేళ్ల బాలిక. ఈ చిన్నారి ఐక్యూ ఏకంగా 162గా గుర్తించారు. ఆ వివరాలు.. మెక్సికోకు చెందిన అధారా పెరెజ్ (8) అనే చిన్నారి మెక్సికోలోని తలాహుక్ మురికివాడ ప్రాంతంలో నివసిస్తూ ఉండేది. అయితే మూడేళ్ల ప్రాయంలో ఉండగా అధారా అస్పెర్జర్ సిండ్రోమ్ (ఆటిజం కోవకు చెందిన వ్యాధి)బారిన పడింది. ఫలితంగా డిప్రెషన్‌తో బాధపడుతుండేది. స్కూల్‌కు వెళ్లడానికి కూడా ఇష్టపడేది కాదు. ఈ క్రమంలో అధారా తల్లిదండ్రులు ఆమెను థెరపీ కోసం సైక్రియాట్రిస్ట్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ అధారాను పరీక్షించిన వైద్యులు చిన్నారిలో అసమాన తెలివితేటలు ఉండటం గమనించారు. (చదవండి: నో స్వెట్ సర్జరీ: గుండెపోటుతో యంగ్ బాడీ బిల్డర్ మృతి) ఈ క్రమంలో అధారాను టాలెంట్ కేర్ సెంటర్‌కు తీసుకెళ్లమని సూచించారు. అక్కడ అధారా ఐక్యూని పరీక్షించగా.. 162గా తేలింది. ఇక టాలెంట్ కేంద్రంలో ఒకే రకమైన స్కిల్స్ ఉన్న విద్యార్థులను చేర్చుకుని వారికి చదువు చెప్తారు. ఈ క్రమంలో అధారాను అక్కడ చేర్చుకున్నారు. (చదవండి: Albert Einstein Birth Anniversary: విశ్వనరుడు ఐన్‌స్టీన్) టాలెంట్ కేర్ సెంటర్లో చేరిన అధారా ఎనిమిదేళ్ల వయసు వచ్చే సరికే ఎలిమెంటరీ, మిడిల్, హై స్కూల్ విద్యాభ్యాసాన్ని పూర్తి చేసింది. అంతేకాక రెండు ఆన్లైన్ డిగ్రీలు పొందింది అధారా. తన అనుభవాల గురించి తెలియజేస్తూ.. ‘డు నాట్ గివ్ అప్’ పేరుతో పుస్తకం కూడా రాసింది. ఇక మానసిక వైకల్యం ఉన్న వారి ఎమోషన్స్‌ని నిత్యం పరిశీలించేందుకు గాను ఓ స్మార్ట్ బ్రాస్లెట్ని అభివృద్ధి చేసింది. ఆస్ట్రోనాట్ అయి అంతరిక్షం వెళ్లాలని.. అంగారకుడిపై వలస రాజ్యం స్థాపించాలనేది అధారా కోరిక. (చదవండి: ఖగోళ అద్భుతం: బ్లాక్ హోల్ వెనుక ఫస్ట్ టైం వెలుగులు) తన ప్రతిభ ఆధారంగా అధారా ఫోర్బ్స్ మెక్సికో 100 అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో చోటు దక్కించుకుంది. ఈ సందర్భంగా అధారా తల్లి మాట్లాడుతూ ‘‘అస్పెర్జర్ సిండ్రోమ్ కారణంగా బాల్యంలో నా కుమార్తె ఎవరితో త్వరగా కలిసేది కాదు. ఓ సారి తను ఓ చిన్న ఇంట్లో స్నేహితులతో కలిసి ఆడుకుంటుండగా.. ఫ్రెండ్స్ అధారాను గదిలో పెట్టి బంధించారు. బయట నుంచి తనను హేళన చేయసాగారు. ఆ రోజు నా కుమార్తె పడిన బాధ చూసి.. తనను ఒంటరిగా వదిలిపెట్టకూడదని నిర్ణయించుకున్నాను. ఈరోజు తన తెలివితేటలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడం చాలా సంతోషంగా ఉంది’’ అని తెలిపారు. -
మెక్సికోలో భారీ భూకంపం
-
మెక్సికోలో భారీ భూకంపం..
-
మెక్సికోలో భారీ భూకంపం, వణికిపోయిన జనం
మెక్సికోలో మంగళవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. పసిఫిక్ తీరానికి సమీపంలో 7.1 తీవ్రతతో భూమి కంపించినట్టు నేషనల్ సీస్మోలాజికల్ సర్వీస్ తెలిపింది. భూకంప కేంద్రం గెరెరో రాష్ట్రంలోని అకాపుల్కో బీచ్ రిసార్ట్‌కి ఆగ్నేయంగా 11 కిలోమీటర్లు (ఏడు మైళ్లు) దూరంలో కేందద్రీకృతమై ఉన్నట్టు వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోలను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతున్నాయి. ప్రధానంగా రాజధాని నగరంలో భారీ భూకంపంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు లోనయ్యారు. ఇళ్లల్లోనుంచి పరుగులు తీశారు. వరుస ప్రకంపనలతో పర్యాటకులు హోటళ్లను ఖాళీ చేశారు. కంపన తీవ్రతకు వందలాది కిలోమీటర్ల దూరంలో పలు భవనాలు కొన్ని సెకన్ల పాటు కదిలిపోయాయి. ముందుగా నైరుతి మెక్సికోలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.9గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఆస్తి, ప్రాణ నష్టంపై జరిగినట్లు ఎలాంటి నివేదికలు లేవని మెక్సికో సిటీ మేయర్ క్లాడియా షీన్బామ్ తెలిపారు. ఒక వ్యక్తి మరణించినట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రాడోర్ ఎలాంటి అధికారిక సమాచారం లేదని ఒక వీడియో సందేశంలో తెలిపారు. కొయుకా డి బెనిటెజ్ నగరంలో యుటిలిటీ పోల్ పడి ఒక వ్యక్తి మరణించాడని, గెరెరో రాష్ట్ర గవర్నర్ హెక్టర్ అస్తుడిల్లో మిలెనియో టీవీకి చెప్పారు. అకాపుల్క్ మేయర్ అదెలా రోమన్ మాట్లాడుతూ ప్రజలు ఆందోళన చెందుతున్నారనీ, చాలా ప్రాంతాలలో గ్యాస్ లీకేజీలు వార్తలు వచ్చినట్టు తెలిపారు. భూకంపం మెక్సికో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్ర ప్రభావం చూపింది. స్నానం చేస్తుండగా, చాలా బలమైన కంపనలు రావడంతో చాలా భయపడిపోయా.. గట్టిగా అరిచాను.. చివరికి బాత్ టవల్‌తో మాత్రమే బయటపడ్డానంటూ ఒక పర్యాటకుడు తన అనుభవాన్ని పంచుకున్నారు. "నేను మా అమ్మతో వచ్చాను. హోటల్ 11 వ అంతస్తులో మేముండగా ఒక్కసారిగా కంపించింది. అమ్మ భయపడిపోయింది అంటూ ఏడుస్తున్న తన 86 ఏళ్ల తల్లిని అక్కున చేర్చుకున్నారు. కాగా ప్రపంచంలో అత్యధికంగా భూకంపాలు సంభవించే ప్రాంతాల్లో అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాల సరిహద్దులో ఉన్న మెక్సికో ఒకటి. 1985, సెప్టెంబర్ 19 న మెక్సికో నగరంలో 8.1 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా 10వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వందలాది భవనాలను ధ్వంసమయ్యాయి. మళ్లీ 2017, సెప్టెంబర్‌లో వచ్చిన 7.1 భూకంపం కారణంగా 370 మంది మరణించారు. Power flashes from the earthquake in #Mexico. 🎥 @franz_gomez pic.twitter.com/ESXPpIgmSE — Michael Armstrong (@KOCOMichael) September 8, 2021 This is how #earthquakes look in the sky from an 11th floor ⚡ What you hear is the building crashing against the one next to it 🤯#earthquakeinthesky #Mexico #surreal pic.twitter.com/XNJESUdOew — elian huesca 🌋⚡ (@elianhuesca) September 8, 2021 A powerful earthquake struck southwestern Mexico near the beach resort of #Acapulco on Tuesday night, causing rock falls and damaging buildings, though there were no immediate reports of casualties. M7.0 #earthquake (#Sismo) strikes 18 km NE of Acapulco de Juárez (#Mexico) pic.twitter.com/f8LisWFmfx — DailyNews/BreakingNews (@DailyNe25683877) September 8, 2021 -
మెక్సికో వరద బాధితుల కన్నీటి కష్టాలు
-
క్రాష్ అయిన నావీ హెలికాప్టర్: వీడియో వైరల్
మెక్సికో సిటీ: మెక్సికోలో ఓ నావీ హెలికాప్టర్ కుప్పకూలింది. లాండింగ్ సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో హెలికాప్టర్ క్రాష్ అయ్యింది. హారికెన్ ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు పర్యటనకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అదృష్టవశాత్తూ హెలికాప్టర్లో ఉన్న వాళ్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారని నావికాదళ అధికారులు తెలిపారు. హెలికాప్టర్ క్రాష్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చదవండి:VIRAL VIDEO: ఇదేం సరదా? ప్రాణాంతకంగా మారిన ఛాలెంజ్ -
ఫ్రాన్స్‌కు షాకిచ్చిన మెక్సికో.. డ్రాతో గట్టెక్కిన స్పెయిన్
టోక్యో: ఒలింపిక్స్ పోటీలు అధికారికంగా ప్రారంభం కావడానికి ముందే ఫుట్‌బాల్ లీగ్ మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. గ్రూప్-సిలో భాగంగా గురువారం స్పెయిన్-ఈజిప్ట్‌ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రా(0-0) కాగా, గ్రూప్-ఏలో భాగంగా మెక్సికో-ఫ్రాన్స్‌ల మధ్య జరిగిన మరో మ్యాచ్‌లో మెక్సికో.. బలమైన ఫ్రెంచ్ జట్టుకు షాకిచ్చింది. ఫ్రాన్స్‌పై మెక్సికో 4-1 తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ సెకండాఫ్‌లో అలెక్సిస్ వెగా, సెబాస్టియన్ కార్డోవా, యూరియల్ ఆంటునా, ఎరిక్ అగిర్లు తలో గోల్ చేయడంతో మెక్సికో ఫ్రాన్స్‌కు ఊహించని షాక్ ఇచ్చింది. మరోవైపు యూరో కప్ 2020 సెమీ ఫైనలిస్ట్ స్పెయిన్ జట్టుకు తొలి మ్యాచ్‌లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఈజిప్ట్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇద్దరు ఆటగాళ్లు గాయపడంతో ఆ జట్టు పేలవ ప్రదర్శనతో అతికష్టం మీద డ్రాతో గట్టెక్కింది. కాగా, స్పెయిన్ జట్టు చివరిసారిగా 1992 ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించింది. ఇక గ్రూప్ బిలో న్యూజిలాండ్-దక్షిణ కొరియా మధ్య జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌కు చెందిన క్రిస్ వుడ్ గోల్ వేయడంతో ఆ జట్టు 1-0తో విజయం సాధించింది. ఇక తదుపరి మ్యాచ్‌లో ఆతిథ్య జపాన్ జట్టు దక్షిణాఫ్రికాను ఢీకొనాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా ఈ మ్యాచ్ రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. టోక్యోకు బయలుదేరే ముందు దక్షిణాఫ్రికా జట్టులోని కొందరు కరోనా బారిన పడ్డారు. వారి బృందం టోక్యోకు చేరుకోగానే ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా తేలింది. -
నో స్వెట్ సర్జరీ: గుండెపోటుతో యంగ్ బాడీ బిల్డర్ మృతి
Mexican Influencer Odalis Santos Mena: మెక్సికన్ ఇన్‌ఫ్ల్యూయెన్సర్, యంగ్ బాడీ బిల్డర్ ఒడాలిస్ సాంటోస్ మీనా శస్త్ర చికిత్స వికటించి మృత్యువాతపడింది. 23 ఏళ్ల ఒడాలిస్ తన శరీరంలోని చెమటను నివారించేందుకు చేసుకున్న సర్జరీ వికటించి జూలై7న ప్రాణాలు కోల్పోయింది. ఇటీవల మెక్సికోలోని గ్వాడాలజారాలోని స్కిన్పీల్ క్లినిక్ అండర్ ఆర్మ్(బాహువుల కింద) చెమటను తగ్గించడానికి చేసే చికిత్స ‘నో స్వెట్’ను ప్రోత్సహించడానికి ఓడాలిస్ను ప్రమోటర్‌గా నియమించుకుంది. ఇందులో చెమట గ్రంథులను తొలగించడానికి హీట్ ఎనర్జీని ఉపయోగిస్తూ చికిత్స చేస్తారు. ఇది శరీరంలోని దుర్వాసన, అండర్ ఆర్మ్ జుట్టును తగ్గించడానికి దోహదపడుతుంది. తాజాగా ఒడాలిస్ ‘నో స్వెట్’ చికిత్సను చేయించుకున్నారు. అయితే శస్త్రచికిత్సలో భాగంగా అధిక అండర్ ఆర్మ్ చెమటను నిరోధించేందుకు ఒడాలిస్ చెమట గ్రంథులను పూర్తిగా తొలగించారు. ఈ క్రమంలో మత్తుమందు ఇంజక్షన్ తీసుకున్న తర్వాత ఆమె గుండెపోటుకు గురయ్యారు. అయితే క్లినిక్‌లోని హెల్త్‌కేర్ వర్కర్స్ ఆమెను కాపాడేందుకు ఎంత ప్రయత్నించినప్పటికీ ఒడాలిస్ చనిపోయారు. కాగా ఒడాలిస్ మృతిపై విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఆమెకు అందించిన మత్తుమందు, స్టెరాయిడ్ ప్రభావం వల్లే మరణించినట్లు పోలుసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే క్లినిక్‌లో శిక్షణ లేని వ్యక్తి మత్తుమందు ఇవ్వడం వల్లే ఆమె చనిపోయిందని అక్కడి మరో మీడియా పేర్కొంది. ఇక సాంటోస్ మీనాకు ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. పలు బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొంది. అలాగే 2019లో మిస్ మరియు మిస్టర్ హెర్క్యులస్ టైటిల్‌తో పాటు వెల్నెస్ ఫిట్నెస్ జువెనైల్ పోటీల్లో కూడా గెలిచింది View this post on Instagram A post shared by Odalis Santos Mena (@odalis_sm) View this post on Instagram A post shared by Odalis Santos Mena (@odalis_sm) -
వైరల్: నడిసంద్రంలో భారీ అగ్నిప్రమాదం..
వాషింగ్టన్/మెక్సికో: చుట్టూ ఎక్కడ చూసిన తీరం కనిపించనంత విశాలంగా విస్తరించిన సముద్రం. నట్ట నడిమిలో ఎగసిపడుతున్న మంటలు. చూడటానికి ఆ దృశ్యం ఎంత అందంగా ఉందో.. అంతే భయంకరంగా కూడా ఉంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. నడిసముద్రంలో అండర్‌వాటర్ పైప్‌లైన్ లీక్ కావడంతో ఇలా మంటలు ఎగసి పడుతున్నాయి. ఈ సంఘటన మెక్సికోలోని యుకాటన్ ద్వీపకల్పానికి పశ్చిమాన సముద్రపు ఉపరితలంపై చోటు చేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయని రాష్ట్ర చమురు సంస్థ పెమెక్స్ తెలిపింది. నీటి అడుగున పైప్‌లైన్ నుంచి గ్యాస్ లీక్ కావడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పెమెక్స్ వెల్లడించింది. నీటి నుంచి ఎగసిపడుతున్న ముదురు నారింజ వర్ణం మంటలు చూపరులను భయపెడుతున్నాయి. పెమిక్స్ కంపెనీకి అతి సమీపంలోని అండర్ వాటర్ పైప్‌లైన్ లీక్ కావడం వలన ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ పైప్‌లైన్ పెమిక్స్కు చెందిన అతి ముఖ్యమైన ‘కు మలూబ్ జాప్’ ఆయిల్ డెవలమెంట్ని పెమిక్స్ ప్లాట్‌ఫాంతో కలుపుతుంది. ఈ సందర్భంగా పెమిక్స్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘‘ఉదయం 5.15 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీనిలో ఎవరు గాయపడలేదు.. ఉత్పత్తి కూడా నిలిచిపోలేదు. సుమారు ఐదుగంటల పాటు కష్టపడి మంటలను ఆర్పేశాము. ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నాం’’ అన్నారు. -
ఆర్చరీ ప్రపంచకప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం
పారిస్: ఆర్చరీ ప్రపంచకప్‌లో భారత మహిళల ఆర్చరీ బృందం ఆదివారం సత్తా చాటింది. ఆర్చరీ ప్రపంచకప్‌లో రికర్వ్ టీమ్ భారత్‌కు రెండో స్వర్ణం అందించింది. రికర్వ్ టీమ్‌లో దీపికా కుమారి, కోమలిక బరి, అంకిత భాకట్‌లతో కూడిన భారత ఆర్చరీ బృందం మెక్సికోపై 5-1 తేడాతో విజయం సాధించి స్వర్ణ పతకం గెలిచింది. కాగా ఆరేళ్ల విరామం తర్వాత ప్రపంచకప్ ఆర్చరీ టోర్నమెంట్లో భారత ఆర్చర్ అభిషేక్ వర్మ వ్యక్తిగత విభాగంలో శనివారం పసిడి పతకం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక్కడ వరల్డ్‌కప్ స్టేజ్–3 టోర్నీలో 32 ఏళ్ల అభిషేక్ పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నాడు. క్రిస్ షాఫ్ (అమెరికా)తో శనివారం జరిగిన ఫైనల్లో అభిషేక్ వర్మ ‘షూట్ ఆఫ్’లో బంగారు పతకాన్ని దక్కించుకున్నాడు. చదవండి: చరిత్ర సృష్టించిన భారత్ బాక్సర్.. ప్రపంచ నంబర్ వన్ స్థానం కైవసం -
అటు కాదురా బాబూ.. ఇటూ..
పొలోమని వెళ్లిందేమో.. బెంగాల్ టైగర్‌ను చూడటానికి.. కనిపిస్తే.. వెంటనే కెమెరాతో క్లిక్మనిపించేయడానికి.. ఇక్కడ చూడండి.. పులి వచ్చి ఎదురుగా నిల్చుంటే.. వీళ్లంతా ఎటు చూస్తున్నారో.. రాజస్తాన్‌లోని రణతంబోర్ జాతీయ పార్కులో ఈ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ‘పార్కుకు వచ్చిన జనమంతా ఏదో పొదల వెనుక పులి ఉన్నట్లు అనిపిస్తే.. అటు చూస్తూ ఉండిపోయారు.. ఇటేమో.. ఈ పులి అకస్మాత్తుగా వాహనం ముందుకు వచ్చింది. చివరికి అది కూడా ఆశ్చర్యపోయినట్లుంది.. అందుకే నేనిక్కడ ఉంటే.. వీళ్లంతా ఎటు చూస్తున్నారబ్బా అంటూ.. వెనక్కి ఓసారి లుక్కిచ్చుకుని ముందుకు సాగింది’ అని ఈ చిత్రాన్ని తీసిన వన్యప్రాణి ఫొటోగ్రాఫర్ అర్పిత్ సరదాగా వ్యాఖ్యానించారు. ఈ మధ్య మెక్సికోలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.. తిమింగలాలను చూడ్డానికి బయల్దేరిన కొందరు.. మనోళ్లలాగే.. ఎటో దిక్కులు చూస్తూ ఉండిపోయారు.. ఆ తర్వాత ఏం జరిగింది అంటే.. ఫొటో చూడండి.. మీకు అర్థమవుతుంది.. -
మొసలి నుంచి తప్పించుకొని కోమాలోకి ; ఆ తర్వాత
సాధారణంగా మొసలి నీళ్లలో ఉంటే వెయ్యి ఎనుగులంత బలం అంటారు. నీళ్లలో మొసలికి చిక్కామంటే మన ప్రాణాలు పోవడం ఖాయం. ఒక యువతి మాత్రం తన కవల సోదరి సాయంతో మొసలి పంజా నుంచి తప్పించుకోవడంతో ప్రాణాపాయం తప్పింది.. కానీ పదిరోజుల పాటు కోమాలో ఉంది. తాజాగా కోమాలో నుంచి లేచిన ఆమె తన కుటుంబాన్ని మళ్లీ చూస్తానని అనుకోలేదంటూ సంతోషాన్ని వ్యక్తం చేసింది. వివరాలు.. లండన్‌కు చెందిన 28 ఏళ్ల మెలిస్సా లౌరి, జార్జియా లౌరిలు కవలలు. ఇద్దరికి బోటింగ్ అంటే మహాప్రాణం. పదిరోజల కిందట మెక్సికోలోని మానియాల్టెపెక్ లగూన్ తీర ప్రాంతానికి బోటింగ్ వెళ్లారు. ప్యూర్టో ఎస్కాండిడో ఐలాండ్‌లో రాత్రికి బస చేశారు. ఆ రాత్రి సరదాగా ఐలాండ్ నుంచి పది మైళ్ల దూరంపాటు స్విమ్మింగ్ చేసుకుంటూ వెళ్లారు. అయితే కొద్దిసేపటి తర్వాత మెలిస్సా ఉన్నట్టుండి నీళ్లలో మునిగిపోయింది. ఆమెకు కొంచెం దూరంలో ఉన్న జార్జియా మెలిస్సా కనిపించకపోవడంతో గట్టిగా కేకలు వేసింది. ఏ రెస్పాన్స్ రాకపోవడంతో ఆమె ప్రమాదంలో పడిందని గ్రహించిన జార్జియా ఆమె దగ్గరికి వెళ్లింది. అప్పటికే మెలిస్సా కాలును బలంగా పట్టుకున్న మొసలి ఆమెను నీటి అడుగుభాగంలోకి లాగడానికి ప్రయత్నిస్తుంది. అయితే జార్జియా చాకచక్యంగా వ్యవహరించి రక్షణ కోసం తనతో పాటు తెచ్చుకున్న వస్తువును మొసలిపై పదేపదే దాడికి పాల్పడంతో మొసలి తన పట్టును విడవడంతో వారిద్దరు నీటిపైకి వచ్చారు. అయితే మొసలి మరోసారి దాడిచేయడంతో ఈసారి ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. జార్జియా ఎలాగోలా మెలిస్సాను మొసలి బారీ నుంచి కాపాడి బయటకు తీసుకువచ్చింది. కానీ మెలిస్సా అప్పటికే సృహ కోల్పోయి కోయాలోకి వెళ్లిపోయింది. అక్కడి నుంచి బయటపడిన వీరిద్దరు ఆసుపత్రిలో చేరారు. జార్జియా గాయాలనుంచి కోలుకోగా.. పది రోజల పాటు కోమాలో ఉండిపోయిన మెలిస్సా రెండు రోజుల క్రితం కళ్లు తెరవడంతో ఆమె కుటుంబసభ్యుల్లో ఆందోళన తగ్గింది. కోమా నుంచి బయటపడినా ఊపిరి తీసుకోవడంలో మెలిస్సాకు ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో మరోసారి ఆమెను ఐసీయూకి షిఫ్ట్ చేసి ఆక్సిజన్ అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం కుదుటపడుతుంది. అయితే ఇప్పడిప్పుడే తనంతట తాను ఊపిరి తీసుకోవడానికి ప్రయత్నిస్తుండడంతో డాక్టర్లు ఆక్సిజన్ పైప్‌ను తీసేశారు. ఈ వార్త ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది. కాగా 2019లో 54 ఏళ్ల వ్యక్తి తన బొటనవేలితో మొసలి కంట్లో పొడిచి తన ప్రాణాలను దక్కించుకోవడం సంచలనంగా మారింది. చదవండి: ఒత్తిడి తగ్గించుకోవడానికి 365 రోజులుగా అదే పనిలో ఉన్నాడు -
వామ్మో.. ఇది ఇంటిని మింగేసేలా ఉందిగా
కొన్ని చోట్ల ఆకస్మాత్తుగా భూమి కుంగిపోవడం మనం చూస్తూనే ఉంటాం. దీనినే సింక్ హోల్ అని పిలుస్తారు. కానీ ఇక్కడ ఏకంగా ఓ పుట్ బాల్ గ్రౌండంతా భూమి కుంగిపోయింది. ఎక్కడంటే? మెక్సికోలోని శాంటా మారియా జాకాటెపెక్లోని ఓ పొలంలో భూమి ఉన్నట్లుండి కుంగిపోయింది. ప్రస్తుతం ఆ సింక్ హోల్ అక్కడే ఉన్న ఇంటిని త్వరలోనే మింగేసేంతలా కనపడుతోంది. సింక్ హోల్ ఏర్పడిన మొదట్లో ఆ ఇంటికి చాలా దూరంలో ఇది ఏర్పడినా.. తర్వాత మెల్లగా పెరుగుతూ ఇంటి వరకూ వచ్చేసింది. కాగా సింక్‌హోల్ చుట్టుపక్కల ఉన్న పొలంలో కుక్కలు నాలుగు రోజుల క్రితం పడిపోయాయి. వాటిని కాపాడాలని జంతుప్రేమికలు అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇలాంటి సింక్ హోల్ నుంచి ఆ కుక్కలను రక్షించడం ప్రమాదకరమని అధికారులు తెలిపారు. ఇది సుమారు 125 మీటర్లు, 45 మీటర్ల లోతు ఉండవచ్చని అధికారలు చెప్తున్నారు. ప్రస్తుతం ఆ చుట్టు పక్కల 600 మీటర్ల వరకు ప్రజలను అనుమతించకూడదని మెక్సికన్ ప్రభుత్వం తెలిపింది. మట్టి వదులుగా ఉన్న ప్రాంతాల్లో భూమి ఇలా ఉన్నట్టుండి కుంగిపోతుంది. VIDEO: A sinkhole that has been growing dozens of meters daily since last weekend is worrying the residents of a rural area in the Mexican state of Puebla pic.twitter.com/CJlsRjCiOP — AFP News Agency (@AFP) June 2, 2021 చదవండి: వైరల్: అమెరికా అధ్యక్షుడికి భార్య కౌంటర్.. దెబ్బకు సైలంట్ -
‘అవును.. నేరాలు చేశా, ఘోరాలకు పాల్పడ్డా’
వాషింగ్టన్ : మెక్సికన్ డ్రగ్ బాస్(మాజీ) వాకిన్ ‘ఎల్ చాపో’ గుజ్మన్ భార్య ఎమ్మా కరోనెల్ ఎస్పూరో ఎట్టకేలకు నేరాల్ని అంగీకరించింది. జీవిత ఖైదు, పది మిలియన్ల డాలర్ల జరిమానా విధించే అవకాశం ఉందన్న నేపథ్యంలో వాషింగ్టన్ కోర్టు ముందు గురువారం ఆమె తలవంచింది. ఈ తరుణంలో ఆమె శిక్షను పదేళ్ల కాలానికి తగ్గించే అవకాశం ఉండొచ్చనేది న్యాయ నిపుణుల మాట. కాగా, ఆమె భర్తైన 63 ఏళ్ల గుజ్మన్ మనీ లాండరింగ్, డ్రగ్ అక్రమ రవాణా ఆరోపణ, హత్యలు-అత్యాచారాల నేరాలపై కొలరాడో జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఇక సినాలోవా డ్రగ్ కార్టెల్.. అమెరికాలో అతిపెద్ద డ్రగ్ సప్లయర్. దాని ఆర్థిక వ్యవహారాలన్నీ కరోనెల్ చూసుకున్నట్లు, మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు, అక్రమంగా మాదకద్రవ్యాలు సరఫరా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటితోపాటు 2015లో మెక్సికో జైలు నుంచి పారిపోవడానికి గుజ్మన్ ప్రయత్నించినప్పుడు కరోనెల్ సహకరించిందనే ఆరోపణలన్నీ ఆమె చిరునవ్వుతో ఒప్పుకుంది. ‘ఆమె జైలుకు వెళ్లడానికి సంతోషంగా సిద్ధమైంది. ఎల్‌చాపో అరెస్ట్ అయ్యాక.. తనను అరెస్ట్ చేయరని ఆమె అనుకుంది. కానీ, ఆమె బ్యాడ్‌లక్’ అని ఆమె అటార్నీ లిట్చ్‌మన్ మీడియాకు వెల్లడించాడు. అయితే శిక్ష తగ్గింపు ఒప్పందం మేరకే ఆమె నేరాల్ని అంగీకరించినట్లు తెలుస్తోంది. అప్సరసలాంటి కరోనెల్ ఎమ్మా కరోనెల్ ఎస్పూరోకి యూఎస్-మెక్సికన్ పౌరసత్వం ఉంది. ఆమె చాలా అందగత్తె. అంతేకాదు మాజీ బ్యూటీ క్వీన్ కూడా. జర్నలిజం చదివిన కరోనెల్.. పదిహేడేళ్ల వయసులో ఓ డ్యాన్స్ ప్రోగ్రాంలో ఎల్ చాపోని కలిసింది. ఆ తర్వాత అతనితో సహజీవనం చేస్తూ కవలల్ని కనింది. ఆ తర్వాతే వాళ్ల పెళ్లి జరిగింది. అయితే డ్రగ్స్ దందాలో భార్య కరోనెల్ అందాల్ని ప్రత్యర్థులకు ఎరగా వేసి హతమార్చేవాడని ఎల్ చాపోపై ఒక అపవాదు ఉంది. గుజ్మన్ న్యూయార్క్ జైల్లో ఉన్నప్పుడు మూడు నెలలపాటు రోజూ ఆమె అతన్ని కలిసింది. ఆ తర్వాత 31 ఏళ్ల వయసున్న కరొనెల్ను డలాస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డ్రగ్స్ రవాణా ఆరోపణలపై అరెస్ట్ చేసి.. వర్జీనియా జైలుకు తరలించారు. ఫ్యాషన్ ఇండస్ట్రీలో.. సినాలోవా రాష్ట్రం(మెక్సికో)లో ఓ పేద కుటుంబంలో పుట్టిన ఎల్‌చాపో గుజ్మన్.. డ్రగ్స్ దందాతో ప్రపంచ కుబేరుల జాబితాకు చేరిన విషయం తెలిసిందే. డబ్బు, పరపతి మోజులో ఎమ్మా కరోనెల్ అతనితో చేతులు కలిపింది. ఈ ఇద్దరూ కలిపి చేసిన నేరాలు ఒళ్లు గగ్గురు పొడిచే విధంగా ఉంటాయని చెప్తుంటారు. అంతేకాదు ఎల్ చాపో, ఎమ్మా కరొనెల్ జంటను స్టయిల్ ఐకాన్స్‌గా భావిస్తారు. 'ఎల్ చాపో గుజ్మన్' బ్రాండ్‌తో బిజినెస్ చేస్తున్నారు కూడా. అలాగే ఎల్‌చాపో మరో కూతురు(వేరే భార్య కూతురు) అలెగ్జాండ్రినా గుజ్మన్ కూడా తండ్రి పేరు మీద బట్టల వ్యాపారం చేస్తోంది. అంతేకాదు ఈ కరోనా టైంలో తండ్రి పేరు మీదుగా ఆమె సహాయక కార్యక్రమాలు చేస్తుండడం విశేషం. చదవండి: ఇంటర్వ్యూతో దొరికాడా? -
Miss Universe: ఏంటీ ఆండ్రియాకు పెళ్లైందా?!
మెక్సికో సిటీ: మిస్ యూనివర్స్-2020 విజేత, మిస్ మెక్సికో ఆండ్రియా మెజాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆమెకు ఇది వరకే పెళ్లి అయ్యిందని, భర్తతో కలిసి దిగిన ఫొటోలే ఇందుకు నిదర్శనమంటూ వదంతులు వ్యాపిస్తున్నాయి. అయితే ఈ వార్తలను ఆండ్రియా మెజా ఖండించారు. తనకు వివాహం కాలేదని స్పష్టం చేశారు. కాగా మెక్సికోని చిహువాకు చెందిన ఆండ్రియా... సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. మోడలింగ్‌పై ఆసక్తి గల ఆమె.. చిహువా టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యారు. అప్పటి నుంచి తమ ప్రాంత సంస్కృతీ సంప్రదాయాల గురించి ప్రపంచానికి చాటిచెప్పే కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యారు. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం.. మెజా ఓ ఫొటోను షేర్ చేశారు. ఇందులో.. తెల్లటి వెడ్డింగ్ గౌనులో మెరిసిపోతున్న ఆమె.. సూటులో ఉన్న ఓ పురుషుడిని హత్తుకుని ఉన్నారు. ‘‘ఇందుకు 3-09-2019’’ అనే క్యాప్షన్‌తో పాటు ఉంగరం ఎమోజీని జతచేశారు. ఇక ఆదివారం అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన అందాల పోటీల్లో మిస్ యూనివర్స్‌గా ఆండ్రియా మెజా కిరీటం దక్కించుకున్న క్రమంలో ఈ ఫొటో నెట్టింట వైరల్ అయ్యింది. దీంతో.. కొంతమంది ఆమెకు పెళ్లైందని, నిర్వాహకులను మోసం చేసి పోటీ చేసిందని కొంతమంది కామెంట్లు చేశారు. ఈ విషయంపై స్పందించిన ఆండ్రియా మెజా... ఈ వ్యాఖ్యలను కొట్టిపడేశారు. చిహువా టూరిజం డెవలప్మెంట్లో భాగంగా కాపర్ కెనన్ వద్ద చేసిన ఫొటోషూట్‌కు సంబంధించిన దృశ్యం అది అని వివరణ ఇచ్చారు. అంతేగాక ఆ ఫొటోలో ఉన్నది తన బెస్ట్‌ఫ్రెండ్ వాళ్ల తమ్ముడు అని, స్నేహితులను ఆటపట్టించేందుకు డేట్ వేసి, వెడ్డింగ్ రింగ్ ఎమోజీ పెట్టామని పేర్కొన్నారు. అయితే, ఈ ఫొటో విషయం ఇంత గందరగోళం సృష్టిస్తుందని ఊహించలేకపోయానని వాపోయారు. అయినా తను అసత్య ప్రచారాలకు భయపడేదానిని కాదని, కెరీర్‌పై దృష్టిసారిస్తానని చెప్పుకొచ్చారు. అది అవాస్తవం ఇక మిస్ యూనివర్స్ పోటీల అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ‘‘చాలా మంది ఈ ఫొటో గురించి మాకు మెసేజ్‌లు పంపిస్తున్నారు. కానీ మేం అన్ని పరిశీలించిన తర్వాతే పోటీకి అర్హురాలిగా పరిగణిస్తాం. మెజా వివాహిత అన్న ప్రచారం అవాస్తవం’’ అని స్పష్టం చేశారు. కాగా విశ్వ సుందరి పోటీల నియమం ప్రకారం... అందులో పాల్గొనే వారు అవివాహుతులై ఉండాలన్న సంగతి తెలిసిందే. చదవండి: Miss Universe: ఎవరీ ఆండ్రియా మెజా? The new Miss Universe is Mexico!!!! #MISSUNIVERSE pic.twitter.com/Mmb6l7tK8I — Miss Universe (@MissUniverse) May 17, 2021