PG course
-
నీట్ ఎగ్జామ్ పాసైన 62 ఏళ్ల డాక్టర్.. స్టూడెంట్‌గా కాలేజ్‌లో..!
గతంలో చదువుకోవడానికి వయసుతో సంబంధం లేదని చాలామంది నిరూపించారు. అలా కాకుండా ఉన్నతమైన వృత్తిలో స్థిరపడి పదవీవిరమణ చేసే సమయంలో మరిన్ని విద్యా అర్హతలు సంపాదించాలనుకోవడం మాములు విషయం కాదు !. పైగా ఆ వయసులో కఠినతరమైన ఎంట్రెన్స్ ఎగ్జామ్ చదివి పాసవ్వడం అంటే ఆషామాషి కాదు. కానీ ఈ పెద్దాయన చాలా అలవోకగా సక్సస్ అయ్యి.. చదవాలంటేనే భారంగా భావించే విద్యార్థలందరికీ స్ఫూర్తిగా నిలిచాడు. ఇంతకీ అతడెవరో వింటే మాత్రం కంగుతినడం గ్యారంటీ. అంతటి బిజీ వృత్తి చేపట్టి కూడా ఆ వయసులో చదువుకోవాలనుకుంటున్నాడా..? అని నోరెళ్లబెడతారు. ఎవరంటే..62 ఏళ్ల వయసులో పీడియాట్రిక్ వైద్యుడు డాక్టర్ నీలి రాంచందర్ నీట్ పీజీ 2024 పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఇప్పుడాయన ప్రభుత్వ వైద్య కళాశాలలో అడ్మిషన్ తీసుకోనున్నారు. ఆయనకు సుదీర్ఘ కెరీర్ ఉన్నప్పటికీ..అత్యంత కఠినతరమైన పరీక్షలలో ఒకటైన నీట్ పీజీ 2024 ఎగ్జామ్ ప్రిపేరై పాసవ్వడం చాలామంది విద్యార్థులకు ప్రేరణగా నిలిచింది. ఈ వయసులో కూడా నేర్చుకునేందుకు మక్కువ చూపించడం అనేది విశేషం. సుదీర్ఘ కల సాకారం కోసం..నిజామాబాద్‌కు చెందిన నీలి రాంచందర్ ప్రముఖ శిశు వైద్యుడుగా 30 ఏళ్లకు పైగా సేవలందించారు. తన కెరీర్‌ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి, కొత్త వైద్య అర్హతలను పొందడానికి నీట్ పీజీ 2024 పరీక్షకు హాజరయ్యారు. ఇప్పుడు ఆయన నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలోని ఎండీ(ఫార్మకాలజీ) కోర్సులో చేరి విద్యార్థిగా మారడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన 2014లో ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ జాతీయ ఉపాధ్యక్షుడు, తెలంగాణ పీడియాట్రిక్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడితో సహా ప్రతిష్టాత్మక పదవులను అలంకరించారు. అతను నేషనల్ రెడ్ క్రాస్ గోల్డ్ మెడల్ (2017-2018)తో సహా అనేక అవార్డులను కూడా అందుకున్నారు. ఎండీ కోర్సును అభ్యసించాలనే అతని దీర్ఘకాల కోరిక అతన్ని NEET PG 2024కి హాజరు కావడానికి ప్రేరేపించింది.వైద్యుడిగా ప్రస్థానం..డాక్టర్ రాంచందర్ ప్రారంభంలో 1982లో బీ. ఫార్మా కోర్సును వదిలి కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎంబీబీఎస్‌లో చేరారు. అతను 1991, 1993ల మధ్య పీడియాట్రిక్స్‌లో సేవ చేయడానికి డిప్లొమా ఇన్ చైల్డ్ హెల్త్ (DCH) పూర్తి చేశారు. ఆ తర్వాత వెంటనే ప్రాక్టీస్ చేపట్టి వైద్యుడిగా బిజీ అయిపోయారు. ఈ నేపథ్యంలో ఎండీ పూర్తి చేయలేకపోయారు. సరిగ్గా 62 ఏళ్లకు తన చివరి కలను సాకారం చేసుకునే అవకాశం చిక్కింది. ఆయన ఏమాత్రం సంశయించకుండా ఈ వయసులో ఉన్నత చదువు చదవాలనుకోవడం ప్రశంసించనదగ్గ విషయం. సాకులు చెప్పే ఎందరో విద్యార్థులకు స్ఫూర్తి ఈ శిశు వైద్యుడు.(చదవండి: దటీజ్ సుధీర్..! దూషించే పదాన్నే లగ్జరీ బ్రాండ్‌గా మార్చి..) -
ఇన్సర్విస్ డాక్టర్ల ‘పీజీ’ ఆశలు అడియాసలేనా?
సాక్షి, హైదరాబాద్: నీట్– పీజీ వైద్య ప్రవేశాలకు సంబంధించిన గందరగోళానికి తెరపడడం లేదు. స్టేట్‌పూల్ కోటాలోని పీజీ సీట్లు పూర్తిస్థాయిలో తెలంగాణ వాళ్లకే చెందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తెచ్చిన జీవోలు 148, 149పై మొదలైన అలజడి ఆగడం లేదు. జీవో 148(అల్లోపతి), 149 (ఆయుర్వేదం, హోమియోపతి) ద్వారా మెడికల్ పీజీలో అడ్మిషన్లు పొందేందుకు నిర్ణయించిన స్థానికత అంశంపై పలువురు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ‘తెలంగాణలో ఎంబీబీఎస్, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్ చదివిన వారంతా ప్రెసిడెన్షియల్ ఆర్డర్–1974 ప్రకారం ‘లోకల్ ఏరియా’ పరిధిలోకి వస్తారని, వారు పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు పొందేందుకు అర్హులేనని హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పును ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయగా, జనవరి 7న విచారణకు రానుంది.ఈ వివాదం కొనసాగుతుండగానే... తెలంగాణ స్థానికులుగా ఉండి ఇతర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ చదివి... ఇన్‌సర్వీస్ డాక్టర్లుగా రాష్ట్రంలో సేవలందిస్తున్న డాక్టర్ల అంశం తెరపైకి వచ్చింది. తెలంగాణలో పుట్టి పెరిగి ఇంటర్మీడియెట్ వరకు సొంత ప్రాంతంలో చదివినప్పటికీ... ఎంసెట్ ర్యాంకు ద్వారా ఇతర రాష్ట్రాల్లోనో, వేరే దేశంలోనో వైద్యవిద్య అభ్యసించి, సొంత రాష్ట్రంలో పనిచేస్తున్న డాక్టర్లు పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు పొందేందుకు అనర్హులుగా మారడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. తెలంగాణలో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు వరుసగా నాలుగేళ్లు చదివి, అనంతరం రాష్ట్రంలోనే ఎంబీబీఎస్/ బీఏఎంఎస్/ బీహెచ్ఎంఎస్ చదివిన వారే పీజీ అడ్మిషన్లలో స్టేట్ పూల్‌లో రాష్ట్రంలో చదివేందుకు అర్హులని ప్రభుత్వం 148, 149 జీవోల్లో స్పష్టం చేసింది. ఈ అంశంపై హైకోర్టు తన తీర్పులో ప్రస్తావించలేదు.దీంతో ఇంటర్ వరకు ఏపీ లేదా ఇతర రాష్ట్రాల్లో చదివి తెలంగాణలో ఎంబీబీఎస్ చేసిన వారు ప్రెసిడెన్షియల్ ఆర్డర్–1974 ప్రకారం ‘లోకల్ ఏరియా’ కిందికి వచ్చి పీజీ కోర్సులకు అర్హులవుతుండగా... ఇంటర్ వరకు తెలంగాణలో చదివినప్పటికీ... వైద్య విద్యను ఇతర రాష్ట్రాల్లో అభ్యసించి సొంత రాష్ట్రంలో పనిచేస్తున్న వారు అనర్హులుగా మారారు. ప్రభుత్వం ఎంబీబీఎస్ తెలంగాణలో చదివిన వారంతా స్థానికులే అన్న హైకోర్టు తీర్పును మాత్రమే సవాల్ చేసిన నేపథ్యంలో.. ఇతర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ చదివి ఇన్సర్విస్ డాక్టర్లుగా ఉన్న వారి పరిస్థితి ఎటూ తేలకుండా పోతోంది. దీంతో వారు తమ స్థానికత అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. బలయ్యేది ఇన్సర్విస్ డాక్టర్లే.. తెలంగాణ ఏర్పాటయ్యేంత వరకు ఎంసెట్‌లో వచ్చిన ర్యాంకును బట్టి నాన్‌లోకల్ కేటగిరీలో మెరిట్ ఆధారంగా ఆంధ్ర, రాయలసీమలోని కళాశాలల్లో ఎంబీబీఎస్ విద్యనభ్యసించిన రాష్ట్రానికి చెందిన వారు వందలాది మంది ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణేతర ప్రాంతాల్లో వైద్యవిద్య పూర్తి చేసినప్పటికీ... ప్రభుత్వ సర్విసులో చేరి గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగం చేసి, స్టేట్ పూల్ కింద 15 శాతం నాన్‌లోకల్ కోటాలో పీజీ అడ్మిషన్లు పొందేవారు.148, 149 జీవోల ప్రకారం తెలంగాణలో వైద్యవిద్య అభ్యసించిన స్థానికులకే స్టేట్పూల్లో పీజీలో అడ్మిషన్లకు అర్హులని ప్రభుత్వం స్పష్టం చేయడంతో... ఇతర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్, ఇతర కోర్సులు చదివి ఇన్సర్విస్లో ఉన్న వైద్యులకు పీజీకి అర్హత లేకుండా పోయింది. ఈ సంవత్సరం కాళోజీ యూనివర్సిటీ విడుదల చేసిన నోటిఫికేషన్లోనూ వీరికి దరఖాస్తు చేసుకునే ఆప్షన్ కూడా ఇవ్వలేదు. పట్టించుకోని ప్రభుత్వం ఇన్సర్విస్ కోటాలో తెలంగాణలో ఉద్యోగం చేస్తున్న వైద్యులు తమకు జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. హైకోర్టును కూడా ఆశ్రయించారు. కానీ హైకోర్టు ఇచ్చిన 106 పేజీల తీర్పులో ఇన్సర్విస్ డాక్టర్ల అంశాన్ని ప్రస్తావించలేదు. దీంతో తమకు సర్వీస్ మొత్తం ఎంబీబీఎస్ అర్హతతోనే పదవీ విరమణ వరకు ఉద్యోగం చేసే పరిస్థితి తలెత్తిందని వైద్యులు వాపోతున్నారు. ఇన్సర్విస్ డాక్టర్లకు న్యాయం జరిగేలా పీజీ అడ్మిషన్లలో అవకాశం లభించేలా కృషి చేయాలని, న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాలని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ కత్తి జనార్ధన్, డాక్టర్ పూర్ణచందర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
యూజీసీ సిఫార్సులు ఆచరణ సాధ్యమేనా?
సాక్షి, ఎడ్యుకేషన్: ఉన్నత విద్యలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రతిపాదించిన సంస్కరణలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డిగ్రీ, పీజీలో ప్రవేశాలు మొదలు.. కోర్సుల వ్యవధి వరకు యూజీసీ సిఫార్సులు ఆచరణలోకి వస్తే ఉన్నత విద్యా రంగంలో కీలక మార్పులు చోటుచేసుకొంటాయి. అయితే ఈ సిఫార్సులపై నిపుణులు భిన్నంగా స్పందిస్తున్నారు. మన దేశ పరిస్థితులకు అనుగుణంగా ఈ మార్పులు సత్ఫలితాల నివ్వడానికి కనీసం పదేళ్ల సమయం పడుతుందని అంటు న్నారు. ఉన్నత విద్యలో సంస్కరణల కోసం ‘మినిమమ్ స్టాండర్డ్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఫర్ ద గ్రాంట్ ఆఫ్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ రెగ్యులేషన్స్–2024’ పేరుతో యూజీసీ ఈ నెల ఐదో తేదీన ముసాయిదాను విడుదల చేసింది. దీనిని అన్ని రాష్ట్రాలకు పంపి, ఈ నెల 23వ తేదీలోగా అభిప్రాయాలు తెలపాలని లేఖలు రాసింది. యూజీసీ సిఫార్సులపై అధ్యయనం చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఉన్నత విద్యామండలిని ఆదేశించింది. ఏటా రెండు సార్లు ప్రవేశం..యూజీసీ సిఫార్సుల్లో ముఖ్యమైనది.. బ్యాచిలర్, పీజీ స్థాయిలో ఏటా రెండు సార్లు (జూలై / ఆగస్ట్, జన వరి/ఫిబ్రవరి) ప్రవేశ ప్రక్రియ నిర్వహించటం. ఇది విద్యా ర్థులకు కొంత మేలు చేసే అంశమేనని విద్యావేత్తలు అంటున్నారు. వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత పొందని.. సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి ఉన్నత విద్య అభ్యసించే విషయంలో సమయం వృథా కాకుండా ఈ ప్రతిపాదన మేలు చేస్తుందని చెబుతున్నారు. అయితే..ఈ ప్రతిపాదన అమలుచేయాలంటే ఫ్యాకల్టీ, ఇతర బోధన సదుపాయా లను రెట్టింపు చేయాల్సి ఉంటుందని అంటున్నారు. ఇప్ప టికిప్పుడు అది సాధ్యం కాకపోవచ్చని పేర్కొంటున్నారు. హెచ్‌ఈసీతో బీటెక్ చదవగలరా?యూజీసీ మరో సిఫార్సు.. అకడమిక్ నేపథ్యం ఏదైనా.. విద్యార్థులు ఉన్నత విద్యలో తమకు నచ్చిన కోర్సులో చేరే అవకాశం కల్పించడం. ఉదాహరణకు.. ఇంటర్మీడియెట్‌లో హెచ్ఈసీ చదివిన విద్యార్థి.. బీటెక్ ప్రవేశాలకు నిర్వహించే ఎంట్రన్స్‌లలో (జేఈఈ, ఈఏపీసెట్ తదితర) ఉత్తీర్ణత సాధించి బీటెక్‌లో చేరొచ్చు. దీనిపై వ్యతిరేక అభిప్రాయా లు వ్యక్తమవుతున్నాయి. ఆర్ట్స్, హ్యుమానిటీస్ విద్యా ర్థులు.. గణితం, సైన్స్, ఇంజనీరింగ్ సబ్జెక్ట్‌ల సమ్మేళనంగా ఉండే బీటెక్‌లో రాణించడం సాధ్యం కాదని అంటున్నారు. బహుళ ప్రవేశ, నిష్క్రమణ అవకాశంయూజీసీ ప్రతిపాదనల్లో మరో కీలకమైన అంశం బహుళ ప్రవేశ, నిష్క్రమణ (మల్టిపుల్ ఎంట్రీ, ఎగ్జిట్) విధానం. బ్యాచిలర్, పీజీ ప్రోగ్రామ్‌లలో చేరిన విద్యార్థులు తమకు నచ్చిన సమయంలో కోర్సు నుంచి వైదొలగే అవకాశం, ఆ తర్వాత మళ్లీ అదే కోర్సులో.. తదుపరి తరగతిలో ప్రవేశం పొందే అవకాశం కల్పించటం ఈ ప్రతిపాదన ముఖ్య ఉద్దేశం. కానీ.. ఇలాంటి విధానం ఫలితంగా విద్యార్థుల్లో ఉన్నత విద్య స్ఫూర్తి కొరవడే ప్రమాదం ఉందని, ఇది జాబ్ మార్కెట్‌పై ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. స్కిల్ కోర్సులు, అప్రెంటిస్షిప్స్ఉన్నత విద్యలో స్కిల్ కోర్సులను, అప్రెంటిస్షిప్స్ను సమీకృతం చేసేలా మరో ప్రతిపాదన చేశారు. బ్యాచిలర్ డిగ్రీలో మొత్తం క్రెడిట్స్‌లో 50 శాతం పూర్తి చేసుకున్న వారు.. మరో 50 శాతం క్రెడిట్స్ కోసం స్కిల్ కోర్సులను, అప్రెంటిస్‌షిప్‌ను, మల్టీ డిసిప్లినరీ సబ్జెక్ట్‌లను ఎంచుకోవచ్చని పేర్కొన్నారు. అయితే స్కిల్ కోర్సులను అందించే క్రమంలో.. రాష్ట్రాల స్థాయిలో యూనివర్సిటీలకు మౌలిక సదుపాయాల కొరత సమస్యగా మారుతుందని విద్యావేత్తలు పేర్కొంటున్నారు.ఒకే సమయంలో రెండు డిగ్రీలుఅకడమిక్ ఫ్లెక్సిబిలిటీ విధానంలో ఒకే సమయంలో రెండు డిగ్రీ ప్రోగ్రామ్స్‌ను అభ్యసించే విధానాన్ని కూడా యూజీసీ ప్రతిపాదించింది. విద్యార్థులు తాము చేరిన కోర్సు/విద్యా సంస్థతోపాటు మరో ఇన్స్టిట్యూట్లో లేదా మరో అభ్యసన విధానంలో అర్హత మేరకు మరేదైనా బ్యాచిలర్ లేదా పీజీ డిగ్రీలో చేరొచ్చు. అయితే ఈ ప్రతిపాదనలు ప్రస్తుతం మన విద్యా వ్యవస్థకు సరితూగేలా లేవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.రెండున్నరేళ్లకే బ్యాచిలర్ డిగ్రీరెండున్నరేళ్లకే డిగ్రీ పూర్తి చేసుకునేలా యూజీసీ ప్రతి పాదన చేసింది. యాక్సెలెరేటెడ్ డిగ్రీ ప్రోగామ్ పేరుతో ప్రతి విద్యా సంస్థలోని మొత్తం విద్యార్థుల్లో పది శాతం మందికి ఈ అవకాశం కల్పించాలని సూచించింది. నాలుగేళ్ల డిగ్రీ ప్రోగామ్స్ విషయంలో మూడేళ్లలో వాటిని పూర్తి చేసుకునే అవకాశం కల్పించాలి. కానీ యాక్సలెరేటెడ్ డిగ్రీ ప్రోగ్రామ్ విధానంలో.. టీచింగ్–లర్నింగ్ కోణంలో సమస్య ఉత్పన్నమవుతుందని, విద్యార్థులు ఒత్తిడికి గుర వుతారని నిపుణులు అంటున్నారు. బ్యాచిలర్ డిగ్రీని రెండున్నరేళ్లలో పూర్తి చేసుకునే అవకాశం కల్పించిన యూ జీసీ.. పీజీ విషయంలో మాత్రం మూడేళ్లు లేదా నాలుగేళ్ల డిగ్రీ పూర్తి చేసుకున్న వారినే అర్హులుగా నిర్దేశించాలని సూచించింది. దీంతో.. రెండున్నరేళ్లకు లేదా మూడేళ్లకే బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసుకున్న వారికి పీజీ ప్రవేశాల అర్హతపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.తక్షణ అమలు సాధ్యం కాదు..యూజీసీ ప్రతిపాదనలు, సిఫార్సులను తక్షణం అమలు చేసే పరిస్థితి ప్రస్తుతం మన దేశంలో లేదు. ఇవి పూర్తి స్థాయిలో అమలు కావాలంటే అయిదు నుంచి పదేళ్ల సమయం పట్టొచ్చు. ముఖ్యంగా ప్రభు త్వ విద్యా సంస్థలు ఈ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటాయి. ప్రైవేట్, డీమ్డ్ యూనివర్సిటీల్లో కొంత మేర వీటిని వెంటనే అమలు చేసే వీలుంది. – ప్రొఫెసర్. డి.ఎన్. రెడ్డి, యూజీసీ మాజీ సభ్యుడు, జేఎన్టీయూ మాజీ వీసీఆహ్వానించదగ్గ పరిణామంయూజీసీ తాజా సిఫార్సులను ఆహ్వానించదగ్గ పరిణామంగా చెప్పొచ్చు. విద్యార్థులు ఫ్లెక్సిబుల్ లర్నింగ్ విషయంలో అదనపు కసరత్తు చేయాల్సి ఉంటుంది. కొంత మానసిక ఒత్తిడిని కూడా తట్టుకునే సామర్థ్యం ఉండాలి. ఇందుకోసం అవసరమైన వనరులను ఉన్నత విద్యా సంస్థలు కల్పించాలి. – ప్రొఫెసర్. వి.ఎస్.రావు, ప్రొ వైస్ ఛాన్స్లర్ అడ్వయిజర్, ఎస్ఆర్ఎం యూనివర్సిటీదశల వారీగా అమలు చేయాలిగ్లోబలైజేషన్ నేపథ్యంలో ఈ సంస్కరణలు అవస రమే.. కానీ అమలు విషయంలో ఫ్యాకల్టీ కొరత సమస్యగా మారుతోంది. ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ కోణంలో పలు చర్యలు తీసుకుంటున్నాం. ఆర్ట్స్, హ్యుమానిటీస్ విద్యార్థులు ఫ్లెక్సిబుల్ లర్నింగ్ విధానంలో బీటెక్, సైన్స్ కోర్సుల్లో రాణించడం కష్టంగానే ఉంటుంది. – ప్రొఫెసర్. వి. బాలకిష్టారెడ్డి, చైర్మన్, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి -
విదేశీ విద్యానిధికి మరింత ప్రోత్సాహం!
సాక్షి, హైదరాబాద్: ‘విదేశీ విద్యానిధి పథకం’లబ్ధిదారుల సంఖ్య పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. సంక్షేమ పథకాల్లో అత్యంత ఎక్కువ ఆర్థికసాయం అందుతున్న పథకం కూడా ఇదే కావడంతో డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. అత్యంత పరిమిత సంఖ్యలో అర్హులను గుర్తిస్తుండటంతో విదేశాల్లో ఉన్నత చదువులు చదవాలన్న విద్యార్థులు తీవ్ర నిరాశ పడుతున్నారు. గత ఆరేళ్లుగా సంక్షేమశాఖల వారీగా వస్తున్న దరఖాస్తుల సంఖ్యను విశ్లేషిస్తూ విద్యార్థుల సంఖ్య పెంపు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు నివేదించగా...ఆ ఫైలు ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరినట్టు సమాచారం. అతి త్వరలో ఈ ఫైలుకు మోక్షం కలుగుతుందని, ఎక్కువ మందికి లబ్ధి కలిగించాలని సంక్షేమశాఖలు భావిస్తున్నాయి.పూలే విద్యానిధికి అత్యధిక దరఖాస్తులు విదేశీ విద్యానిధి పథకం కింద అర్హత సాధించిన విద్యార్థికి నిర్దేశించిన దేశాల్లో పీజీ కోర్సు చదివేందుకు గరిష్టంగా రూ.20లక్షల ఆర్థిక సాయం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ఈ మొత్తాన్ని విద్యార్థి తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. పీజీ మొదటి సంవత్సరం పూర్తి చేసిన వెంటనే రూ.10 లక్షలు, రెండో సంవత్సరం పూర్తి చేసిన తర్వాత మరో రూ.10 లక్షల సాయాన్ని సంబంధిత సంక్షేమ శాఖలు నేరుగా విద్యార్థి ఖాతాలో జమ చేస్తాయి. ఈ పథకం కింద అర్హత సాధించిన విద్యార్థులకు రూ.20లక్షల సాయంతో పాటుగా ప్రయాణ ఖర్చుల కింద కోర్సు ప్రారంభ సమయంలో ఫ్లైట్ చార్జీని కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది.ప్రస్తుతం బీసీ సంక్షేమశాఖ ద్వారా అమలు చేస్తున్న మహాత్మా జ్యోతిబా పూలే విదేశీ విద్యా నిధి పథకం కింద 300 మందికి మాత్రమే అవకాశం కలి్పస్తున్నారు. ఇందులో బీసీ కేటగిరీలోని కులాల ప్రాధాన్యత క్రమంలో 285 మంది విద్యార్థులకు, ఈబీసీల నుంచి 15 మందికి అవకాశం ఇస్తున్నారు. వాస్తవానికి బీసీ సంక్షేమ శాఖకు ఏటా 5 వేలకు పైబడి దరఖాస్తులు వస్తున్నాయి. కానీ అందులో 5 నుంచి 7శాతం మందికే అవకాశం లభిస్తుండగా, మిగిలిన విద్యార్థులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. దీంతో లబ్ధిదారుల సంఖ్య పెంచాలని పెద్ద సంఖ్యలో వినతులు రావడంతో బీసీ సంక్షేమశాఖ ఈ దిశగా ప్రతిపాదనలు తయారు చేసింది.ప్రస్తుతమున్న 300 పరిమితిని కనీసం వెయ్యి వరకు పెంచాలని కోరింది. ఒకేసారి ఇంతపెద్ద సంఖ్యలో పెంచే అవకాశం లేదని ఉన్నతాధికారులు సూచించడంతో కనీసం 800లకు పెంచాలని కోరుతూ ప్రతిపాదనలు సమర్పించింది. మరోవైపు ఎస్సీ అభివృద్ధి శాఖ పరిధిలో 210 పరిమితిని 500కు, ఎస్టీ సంక్షేమ శాఖ పరిధిలో 100 పరిమితిని 300 నుంచి 500 వరకు పెంచాలంటూ ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి పంపినట్టు సమాచారం. ఈ అంశంపై ఇటీవల సంక్షేమ శాఖల అధికారులతో జరిగిన సమావేశంలోనూ చర్చించారు. సీఎం రేవంత్‌రెడ్డి సానుకూలంగా ఉండటంతో ఈ ప్రతిపాదనలు ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించినట్టు తెలిసింది. అతి త్వరలో ఈ ప్రతిపాదనలు ఆమోదించిన తర్వాత ఉత్తర్వులు వెలువడతాయని విశ్వసనీయ సమాచారం. -
వైద్య విద్య పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: 2024–25 విద్యా సంవత్సరానికి పీజీ వైద్య విద్య కోర్సుల్లో కన్వీనర్ ఇన్‌సర్వీస్, నాన్ సర్వీస్ కోటా, యాజమాన్య కోటా ప్రవేశాల కోసం ఆరోగ్య విశ్వవిద్యాలయం శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. నీట్ పీజీ–2024 అర్హత సాధించిన వైద్యులు వచ్చే నెల 4వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆలస్య రుసుముతో అక్టోబర్ ఐదు నుంచి ఏడో తేదీల మధ్య దరఖాస్తుకు అవకాశం కల్పించారు. https:// drntr.uhsap.in వెబ్సైట్లో నోటిఫికేషన్ పూర్తి వివరాలు అందుబాటులో ఉంచారు. దరఖాస్తు సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లైతే 9000780707, 8008250 842 ఫోన్ నంబర్లను సంప్రదించాలి్సందిగా రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి వెల్లడించారు. -
పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్షలో 94.57 శాతం పాస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఎనిమిది విశ్వవిద్యాలయాలు, వాటి పరిధిలోని పోస్టు–గ్రాడ్యుయేట్ కాలేజీల్లో వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీపీగేట్) ఫలితాలను శుక్రవారం ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి విడుదల చేశారు. సెట్లో 94.57 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించినట్టు ఆయన వెల్లడించారు. మొత్తం 45 కోర్సులకు సంబంధించిన ఈ సెట్‌ను గత నెల 6 నుంచి 16వ తేదీ వరకూ నిర్వహించారు. 73,342 మంది పరీక్షకు దరఖాస్తు చేస్తే, 64,765 మంది పరీక్షకు హాజరయ్యారు.వీరిలో 61,246 మంది (94.57 శాతం) ఉత్తీర్ణులయ్యారు. పీజీ సెట్ పరీక్ష రాసిన వారు, అర్హత సాధించిన వారిలో బాలికలే ఎక్కువగా ఉన్నారు. బాలురు 21,757 మంది పరీక్ష రాస్తే, 20,569 మంది పాసయ్యారు. బాలికలు 43,008 మంది రాస్తే 40,677 మంది పాసయ్యారు. ఫలితాల విడుదల కార్యక్రమంలో వైస్ చైర్మన్ ప్రొఫెసర్ మహమూద్, ఉస్మానియా యూనివర్సిటీ రిజి్రస్టార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, మండలి కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్, సెట్ కనీ్వనర్ పాండు రంగారెడ్డి పాల్గొన్నారు. 12 నుంచి కౌన్సెలింగ్: ఉమ్మడి ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు ఈ నెల 12 నుంచి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్టు సెట్ కనీ్వనర్ పాండురంగారెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేశారు. విద్యార్థులు సరి్టఫికెట్లను ఆన్లైన్లో వెరిఫికేషన్ కోసం అప్లోడ్ చేయాలని సూచించారు. కాలేజీల్లో చేరేటప్పుడు మాత్రమే ఒరిజినల్ సరి్టఫికెట్లు ఇవ్వాలని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 42,192 పీజీ సీట్లున్నాయని, ఈ సంవత్సరం మరో 2 వేల సీట్లు అదనంగా వచ్చే వీలుందని తెలిపారు. 278 కాలేజీలు కౌన్సెలింగ్ పరిధిలోకి వస్తాయని వెల్లడించారు. -
పోటీ పరీక్షలు.. ప్రమాణాలు పాతాళంలో
దేశంలో ఇంజనీరింగ్, మెడికల్, లా తదితర కోర్సుల్లో సీట్ల భర్తీ కోసం కటాఫ్ మార్కులు తగ్గించుకుంటూపోతున్నారు. నాణ్యత ప్రమాణాలతో రాజీ పడుతున్నారు. జీరో మార్కులు వచ్చిన వారు కూడా ఇంజనీరింగ్, మెడికల్, లా కోర్సుల్లో అడ్మిషన్ పొందే పరిస్థితి ఉంది. సీట్ల భర్తీ కోసం కటాఫ్‌లు తగ్గించుకుంటూ పోవడం వల్ల ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రమాణాలు పడిపోతాయి. ఇది దీర్ఘకాలంలో ప్రతికూల పరిణామాలకు దారితీస్తుంది. కాబట్టి ప్రొఫెషనల్ విద్య కోర్సుల్లో ప్రవేశాలకు కనీస ప్రమాణాలు పాటించాలని చెబుతున్నారు.. కెరీర్స్360 ఫౌండర్ చైర్మన్ మహేశ్వర్ పెరి. ప్రస్తుతం ప్రొఫెషనల్ కోర్సుల్లో పడిపోతున్న ప్రమాణాలపై ఆయన అందిస్తున్న విశ్లేషణాత్మక కథనం.. దేశ అత్యున్నత న్యాయస్థానం.. సుప్రీంకోర్టు ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ (ఏఐబీఈ) కటాఫ్‌ను తగ్గించేందుకు నిరాకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఏఐబీఈ కటాఫ్‌ను తగ్గించడం వల్ల న్యాయ విద్యలో ప్రమాణాలు పడిపోతాయని పేర్కొంది. ‘‘పరీక్ష నిర్వాహకులు.. ఏఐబీఈ జనరల్ కేటగిరీ కటాఫ్ 45 మార్కులు, ఎస్సీ/ఎస్టీలకు కటాఫ్ 40 మార్కులుగా నిర్ణయించారు.ఆ మాత్రం కూడా స్కోర్ చేయకుంటే లాయరుగా ఎలా రాణించగలరు. మీరు దాన్ని ఇంకా 40, 35కు తగ్గించాలని కోరుతున్నారు.. దయచేసి చదవండి’’ అంటూ ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ప్రధాన న్యాయమూర్తి మనందరి తరఫున మాట్లాడుతున్నారు. దేశవ్యాప్తంగా ప్రవేశ పరీక్షల్లో పడిపోతున్న ప్రమాణాలు, అర్హత మార్కులు, తగ్గుతున్న ఉత్తీర్ణత ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. నేషనల్ లా యూనివర్సిటీలు2022 సర్క్యులర్‌లో నేషనల్ లా యూనివర్సిటీల కన్సారి్టయం ప్రతి కే టగిరీలో అందుబాటులో ఉన్న సీట్లకు ఐదు రెట్ల మంది విద్యార్థులను కౌన్సెలింగ్‌కు పిలవాలని నిర్ణయించింది. దీని అర్థమేమిటంటే.. వారు కనీస ప్రమాణాలను కూడా వదిలేసి ప్రతి సీటుకు ఐదుగురిని పిలవాలని నిర్దేశించారు. ప్రవేశానికి కనీస మార్కులు నిర్దేశించకపోవడం వల్ల కనీసం నాణ్యత లేని విద్యార్థి కూడా అడ్మిషన్ పొందే అవకాశం ఉంటుంది. 2023లో 40 వేల కంటే ఎక్కువ ర్యాంకు వచి్చన విద్యార్థులు సైతం ఎన్ఆర్ఐ కోటాలో నేషనల్ లా యూనివర్సిటీల్లో ప్రవేశం పొందే వీలు కలిగింది. 150కు 15–17 మార్కుల(10 శాతం మార్కులు)మధ్య వచి్చన విద్యార్థులు కూడా జాతీయ లా వర్సిటీల్లో ఎన్ఆర్ఐ కోటా ద్వారా అడ్మిషన్ పొంది.. ఈ దేశంలో లాయర్‌గా మారే అవకాశం ఏర్పడింది. నీట్ పీజీ 2023 2023లో నీట్ పీజీకి హాజరైన మొత్తం విద్యార్థుల సంఖ్య.. 2,00,517. ఆ ఏడాది అందుబాటులో ఉన్న మొత్తం సీట్లు 47,526. మొత్తం 800 మార్కులకు పరీక్ష జరిగింది. 2023లో తొలుత కటాఫ్ 291 మార్కులు(36 శాతం). ఆ తర్వాత కౌన్సెలింగ్ కొనసాగుతున్న కొద్దీ కటాఫ్‌ను తగ్గించుకుంటూ వచ్చి.. చివరకు జీరోగా నిర్ణయించారు. అంటే.. పరీక్షకు హాజరైతే చాలు.. మెడికల్ పీజీలో ప్రవేశం పొందొచ్చన్నమాట! ఇది ఒకరకంగా ప్రవేశ పరీక్షను చంపివేయడంలాంటిదే!! ప్రస్తుతం పలు మెడికల్ కాలేజీల్లో పీజీ చదువుతున్న విద్యార్థుల్లో జీరో మార్కులు వచి్చన వారుకూడా ఉండొచ్చు. నీట్ యూజీ ⇒ 2020లో మొత్తం 13,66,945 మంది విద్యార్థులు నీట్ యూజీ పరీక్షకు హాజరైతే.. కటాఫ్ 147( మొత్తం 720 మార్కులకు(20.4 శాతం)గా నిర్ణయించారు. ఆ సంవత్సరం మొత్తం మెడికల్ సీట్ల సంఖ్య 93,470. కానీ డెంటల్ సీట్లు భర్తీ కాకపోవడంతో డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆ ఏడాది కటాఫ్‌ను 113కు తగ్గించింది. దీంతో 15.7 శాతం మార్కులు వచి్చన వారికి కూడా సీటు లభించింది. ⇒ అదే విధంగా 2021లో మొత్తం 15,44,273 మంది విద్యార్థులు నీట్ యూజీ పరీక్ష రాశారు. మొత్తం మెడికల్ సీట్లు 99,695 ఉన్నాయి. ఆ ఏడాది కటాఫ్ 138(19.2 శాతం). కాని ఆయుష్ సీట్లు భర్తీ కాకపోవడంతో ఆయుష్ అడ్మిషన్స్ సెంట్రల్ కౌన్సిలింగ్ కమిటీ కటాఫ్‌ను 122కు తగ్గించింది. అంటే 17% మార్కులు సాధించిన విద్యార్థులు కూడా సీటు పొందొచ్చు. ఇలా సీట్లు భర్తీ చేయడం కోసం కటాఫ్ తగ్గిస్తూ నాణ్యత విషయంలో రాజీపడుతున్నారు. నీట్ ఎండీఎస్ 2023ఈ పరీక్షను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ మెడికల్ సైన్సెస్.. ఎండీఎస్ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహిస్తుంది. ఈ పరీక్షకు కేటాయించిన మొత్తం మార్కులు 960. మొత్తం సీట్లు 6,937. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సంఖ్య 23,847. దీనికి కూడా సీట్ల భర్తీ కోసం 2021 నుంచి కటాఫ్ తగ్గించుకుంటూ వస్తున్నారు. నీట్ సూపర్ స్పెషాలిటీదేశంలో నీట్ సూపర్ స్పెషాలిటీలో మొత్తం సీట్ల సంఖ్య 4,243. ఈ పరీక్షకు 2023లో వచ్చిన దరఖాస్తులు 19,944. 2023లో మొదటి రౌండ్లో కటాఫ్ 50 పర్సంటైల్‌గా నిర్ణయించారు. సీట్లు భర్తీకాలేదు. దీంతో రెండో రౌండ్లో కటాఫ్‌ను 20 పర్సంటైల్‌కు తగ్గించారు. అయినా సీట్లు నిండలేదు. ఇక చివరగా స్పెషల్ రౌండ్లో అర్హతను జీరో పర్సంటైల్‌గా నిర్ణయించారు.మెడికల్, లాకే పరిమితం కాలేదు..వాస్తవానికి ఈ అర్హత మార్కులు తగ్గింపు అనేది లా, మెడికల్‌కే పరిమితం కాలేదు. 2018 జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు సంబంధించి కేంద్ర విద్యాశాఖ ఐఐటీల్లో ప్రతి విభాగం, ప్రతి కేటగిరీకి సంబంధించి సీట్ల సంఖ్యకు రెట్టింపు సంఖ్యలో విద్యార్థులు అందుబాటులో ఉండేలా కటాఫ్‌ను తగ్గించాలని ఆదేశించింది. అంటే.. ఐఐటీల్లో అందుబాటులో ఉన్న మొత్తం 10వేల సీట్లకు 20 వేలమంది విద్యార్థులను జోసా కౌన్సెలింగ్ పిలుస్తారు. దీనికోసం అడ్మిషన్ బోర్డు అర్హత మార్కులను 35 శాతం నుంచి 25 శాతానికి తగ్గించింది. ఏకంగా 10 శాతం తగ్గించారు. దీంతో తొలుత మెరిట్ లిస్ట్‌లో 18,138 మంది మాత్రమే ఉండగా.. కొత్తగా 13,842 మంది విద్యార్థులను అర్హులుగా ప్రకటించారు. ఇలా మొత్తంగా పదివేల సీట్ల కోసం 31,980 మంది విద్యార్థులు జోసా కౌన్సెలింగ్‌లో పాల్గొన్నారు. -
నీట్ పీజీ పరీక్ష ఖరారు.. లీకేజీ దెబ్బకు రెండుగంటల ముందే క్వశ్చన్ పేపర్ తయారు
సాక్షి,న్యూఢిల్లీ : నీట్ యూజీ, యూజీసీ నెట్ ప్రశ్నపత్రాల లీకేజీపై నెలకొన్న వివాదాల నేపథ్యంలో కేంద్రం నీట్ పీజీ పరీక్షను వాయిదా వేసింది.అయితే వాయిదా వేసిన ఆ పరీక్షను జులై నెలలో నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆ ప్రశ్నాపత్రాన్ని రెండు గంటల ముందు తయారు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.నీట్ యూజీ పేపర్ లీకేజీతో జూన్ 23న జరగాల్సిన నీట్ పీజీ పరీక్షను కేంద్రం వాయిదా వేసింది. తాజాగా,నీట్ పీజీ పరీక్షను కేంద్రం నిర్వహించనుందని పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.అంతేకాదు ఈ పరీక్షలను ఆరోగ్య,కుంటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ నిర్వహించనుందని తెలుస్తోంది. -
Dharmendra Pradhan: రెండు రోజుల్లో నీట్–పీజీ పరీక్ష షెడ్యూల్
న్యూఢిల్లీ: నీట్–పీజీ పరీక్షల కొత్త షెడ్యూల్‌ను నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్స్(ఎన్బీఈ) ఒకటి రెండ్రోజుల్లో ప్రకటిస్తుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. నీట్–పీజీ పరీక్ష ప్రశ్నపత్నం డార్క్‌నెట్‌లో లీకైందని, టెలిగ్రామ్ యాప్‌లో షేర్ చేశారని తెలిపారు. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేస్తోందన్నారు. కీలకమైన పోటీ పరీక్షల్లో పేపర్ లీకవుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో గతవారం జరగాల్సిన నీట్–పీజీ పరీక్షను ముందు జాగ్రత్తగా రద్దు చేసిన సంగతి తెలిసిందే. అలాగే జూన్ 18న జరిగిన యూజీసీ–నెట్ పరీక్ష సైతం రద్దయ్యింది. -
పీజీపై తగ్గుతున్న క్రేజ్
సాక్షి, హైదరాబాద్: సంప్రదాయ పోస్టు–గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలు క్రమంగా తగ్గుతున్నాయి. ఉన్న సీట్లలో కనీసం సగం భర్తీ అవ్వడం కూడా కష్టంగా ఉంది. డిగ్రీలో బీకాం వరకూ అత్యధిక ప్రాధాన్యతనిచ్చే విద్యార్థులు ఎంకామ్‌కు వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. పీహెచ్డీ స్థాయి వరకూ వెళ్ళాలనుకునే వాళ్లు ఎంఎస్సీ కోర్సును ఎంచుకుంటున్నారు. ఇక బీఏ కోర్సుల్లో చేరే వాళ్ళే తక్కువగా ఉంటుంటే, ఎంఏ వరకూ వెళ్ళాలనుకునే వాళ్ళు ఇంకా తక్కువ. గ్రూప్స్, సివిల్స్ రాయాలనుకునే విద్యార్థులు మాత్రమే ఇటువైపు వెళ్తున్నారు. ఈ మూడు ప్రధాన కోర్సులకు కలిపి రాష్ట్రంలో 50 వేల కన్వినర్ కోటా సీట్లు ఉంటే, గడచిన విద్యా సంవత్సరంలో చేరిన విద్యార్థులు కేవలం 20,484 మంది మాత్రమే. అంటే కేవలం 40.96 శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఈ పరిస్థితికి కారణమేంటి? ఇంటర్ తర్వాత ఎక్కువ శాతం ఇంజనీరింగ్ వైపు వెళ్ళాలనే భావిస్తున్నారు. ఇంజనీరింగ్ తర్వాత ఏదైనా ప్రైవేటు కంపెనీల్లో స్థిరపడొచ్చని, లేదా విదేశీ విద్యకు వెళ్లచ్చని ఆలోచిస్తున్నారు. దాదాపు 4 లక్షల మంది ఇంటర్ పాసవుతుంటే, వీరిలో 90 వేల మంది ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరుతున్నారు. మరో 20 వేల మంది ఇతర రాష్ట్రాల్లోని డీమ్డ్ వర్శిటీల్లోకి వెళ్తున్నారు. 40 వేల మంది వరకూ ఇంటర్‌తో విద్య ముగించి ఏదో ఒక వృత్తి, ఉద్యోగంలో స్ధిరపడుతున్నారు. ఇక బీఏ, బీకాం, బీఎస్సీ సహా ఇతర డిగ్రీ కోర్సుల్లో చేరే వారి సంఖ్య ఏటా 2.20 లక్షల వరకూ ఉంటోంది. ఇందులోనూ కంప్యూటర్ నేపథ్యం ఉన్న బీకాం, ఆనర్స్ బీఏ వంటి కోర్సులకే ప్రాధాన్యమిస్తున్నారు. డిగ్రీ తర్వాత ఉన్న పరిజ్ఞానంతో ఏదో ఒక ఉద్యోగంలోకి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. బీఎస్సీ చేసిన విద్యార్థులు కూడా ఫార్మా కంపెనీల్లో ఉద్యోగాల వైపు చూస్తున్నారు. పోస్టు–గ్రాడ్యుయేట్ చేసినా పెద్దగా ఉద్యోగాలు ఉండవనేది యువతలో ఉన్న అభిప్రాయం. లెక్చరర్‌గా వెళ్ళేందుకు మాత్రమే ఇది తోడ్పడుతుందనే భావన ఉంది. దీంతో డిగ్రీ చేసినా పీజీకి వెళ్ళడం లేదని ఇటీవల యూజీసీ జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. పీజీలోని ప్రధాన కోర్సుల్లో విద్యార్థుల ప్రవేశాలు ... కొత్త కోర్సులైనా అంతేనా? పీజీ కోర్సులు నిర్వీర్యం అవ్వడం వల్ల దేశంలో పరిశోధన శక్తి పడిపోతోందని యూజీసీ హెచ్చరిస్తోంది. పీజీ వరకూ విద్యార్థులు వెళ్ళేలా అవసరమైన ప్రోత్సాహం ఇవ్వాలని పేర్కొంటోంది. ఇందులో భాగంగానే ఎంఎస్సీ డేటా సైన్స్, ఫుడ్ సైన్స్, న్యూట్రిషన్ వంటి కోర్సుల్లో మార్పులు చేశారు. సరికొత్త సిలబస్‌ను జోడించారు. పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా తీర్చిదిద్దుతున్నారు. అయినప్పటికీ పెద్దగా విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. పీజీలో మొత్తం 48 కోర్సులుంటే, వాటిలో జాగ్రఫీ, ఎంపీఎడ్, టూరిజం, లైబ్రరీ సైన్స్, ఇస్లామిక్ స్టడీస్, లింగ్విస్టిక్స్, ఫిలాసఫీ కోర్సుల్లో ప్రవేశాలు నామమాత్రంగానే ఉన్నాయి. ఎంకాం, ఎమ్సెస్సీ స్టాటిస్టిక్స్, ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో ఎన్ని మార్పులు చేసినా ఫలితం ఉండటం లేదు. స్టాటిస్టిక్స్‌లో గత ఏడది 417 సీట్లుంటే, కేవలం 358 మంది చేరారు. ఏంఏ రాజనీతి శాస్త్రంలో 639 మంది చేరారు. ఎమ్మెస్సీ మేథ్స్‌లో 1445కు మించి చేరలేదు. పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరే వాళ్ళల్లో అమ్మాయిలే ఎక్కువ మంది ఉంటున్నారు. దీంతో పరిశ్రమల భాగస్వామ్యంతో పీజీ కోర్సులు నిర్వహించాలని యూజీసీ సూచిస్తోంది. పీజీ తర్వాత పరిశోధన రంగానికి పీజీ విద్యార్థులు వెళ్ళే సరికొత్త విధానంపై కసరత్తు చేయాలని సూచించింది. దీనిపై వచ్చే విద్యా సంవత్సరంలోగా సరికొత్త ప్రణాళిక సిద్ధం చేయాలని యూజీసీ భావిస్తోంది. ఉపాధి వైపే యువత మొగ్గు డిగ్రీ లేదా ఇంజనీరింగ్‌తోనే ఏదో ఒక ఉపాధి వైపు వెళ్ళాలని యువత భావిస్తోంది. పీజీ కోర్సుల తర్వాత ఉద్యోగాలు పెద్దగా ఉండవనే భావన కూడా పీజీ ప్రవేశాలు తగ్గడానికి కారణం. పీజీలో అనేక మార్పులకు అడుగులు పడుతున్నాయి. భవిష్యత్‌లో పీజీ అవసరం అన్న భావన విద్యార్థుల్లో తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. – ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి (ఉన్నత విద్యా మండలి చైర్మన్) -
ఏడాది పీజీ కోర్సులు
సాక్షి, అమరావతి: దేశంలో తొలిసారిగా ఏడాది పీజీ కోర్సును పీజీ డిప్లొమా పేరుతో అందించేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రతిపాదించింది. నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా పీజీ కోర్సుల కాలపరిమితి, క్రెడిట్స్, కరిక్యులమ్‌తో కూడిన కొత్త నిబంధనల ముసాయిదాను రూపొందించింది. ఇందులో పీజీ కోర్సులను మూడు విధాలుగా డిజైన్ చేసింది. ఏడాది, రెండేళ్ల పీజీ, సమీకృత ఐదేళ్ల పీజీ ప్రోగ్రామ్‌లను తీసుకొస్తోంది. ఆనర్స్–రీసెర్చ్ కాంపోనెంట్‌తో నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు ఏడాది మాస్టర్స్ ప్రోగ్రామ్ చేయొచ్చు. మూడేళ్ల బ్యాచిలర్ డిగ్రీ చేసిన విద్యార్థులు రెండేళ్ల పీజీ ప్రోగ్రామ్‌ను కొనసాగించవచ్చు. ఇక్కడ పీజీలో రెండో సంవత్సరం పూర్తిగా పరిశోధనపై దృష్టి సారించేలా కరిక్యులమ్‌లో మార్పులు చేసింది. పీజీ మొదటి సంవత్సరం తర్వాత ప్రోగ్రామ్ నుంచి విద్యార్థులు వైదొలగాలి అనుకుంటే వారికి పీజీ డిప్లొమా అందిస్తుంది. ఇక సమీకృత ఐదేళ్ల బ్యాచిలర్, మాస్టర్స్ ప్రోగ్రామ్ పెట్టాలని యూడా యూజీసీ సూచించింది. నచ్చిన సబ్జెక్ట్‌లో పీజీ నాలుగేళ్ల యూజీ ప్రోగ్రామ్‌లో ఒక విద్యార్థి భౌతికశాస్త్రం మేజర్‌గా, ఆర్థిక శాస్త్రం మైనర్ సబ్జెక్టుగా తీసుకుంటే.. కొత్త విధానం ప్రకారం ఈ విద్యార్థి మేజర్, మైనర్లో దేనిలోనైనా పీజీలో చేరవచ్చు. మరోవైపు ఒకేసారి రెండు పీజీ కోర్సులు అభ్యసించే సౌలభ్యాన్ని కూడా యూజీసీ కలి్పస్తోంది. ఇందు కోసం ఆన్లైన్/ఆఫ్‌లైన్/దూరవిద్య లేదా ఆన్లైన్, ఆఫ్‌లైన్ మోడ్లతో ఏర్పడిన హైబ్రీడ్ విధానాల్లో చదువుకునేలా ప్రతిపాదించింది. మెషిన్ లెర్నింగ్, మల్టిడిసిప్లినరీ ఫీల్డ్ వంటి కోర్ ఏరియాలలో కృత్రిమ మేధ కాంబినేషన్లో వ్యవసాయం, వైద్యం, న్యాయ విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లను అందించాలని సిఫార్సు చేసింది. ఇక స్టెమ్ సబ్జెక్టులు అభ్యసించిన విద్యార్థులు సైతం ఎంఈ, ఎంటెక్ వంటి సాంకేతిక డిగ్రీల్లో ‘ఏడాది పీజీ’లో చేరేందుకు అర్హులని ప్రకటించింది. ఈ అంశాలపై వివిధ వర్గాలు, పౌరుల నుంచి అభిప్రాయం సేకరిస్తున్నట్టు యూజీసీ తెలిపింది. -
సీఎం జగన్ విద్యార్థులుకు మరో శుభవార్త
-
పీజీ మెడికల్ యాజమాన్య కోటా సీట్లకు మరోసారి కౌన్సెలింగ్
సాక్షి, అమరావతి: 2023–24 విద్యా సంవత్సరానికి పీజీ మెడికల్ యాజమాన్య కోటా సీట్ల భర్తీకి ఇటీవల నిర్వహించిన రివైజ్డ్ కౌన్సెలింగ్‌ను రద్దు చేసినట్టు డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం గురువారం ప్రకటించింది. యాజమాన్య కోటా సీట్ల ప్రవేశాల కోసం మళ్లీ వెబ్ఆప్షన్లు స్వీకరిస్తూ గురువారం రాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది. నీట్ పీజీ అర్హత సాధించిన అభ్యర్థులు 24 గంటల్లోగా ఆప్షన్లు నమో దు చేసుకోవాలని సూచించింది. అనివార్య కారణాలతో ఎవరైనా అభ్యర్థులు ఆప్షన్లు నమోదు చేసుకోకపోతే గతంలో నిర్వహించిన కౌన్సెలింగ్‌కు వారు నమోదు చేసుకున్న ఆప్షన్లను పరిగణనలోకి తీసుకుంటామని రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి తెలిపారు. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) పేరిట శాంతీరామ్, జీఎస్ఎల్, మహారాజా కళాశాలల్లో పీజీ సీట్ల పెంపునకు నకిలీ అనుమతులు వెలువడిన నేపథ్యంలో తొలుత నిర్వహించిన కౌన్సెలింగ్‌ను యూనివర్సిటీ రద్దు చేసి, రివైజ్డ్ కౌన్సెలింగ్ నిర్వహించింది. ఆ తర్వాత రాజమండ్రి జీఎస్ఎల్ కళాశాలలో రేడియో డయగ్నోసిస్‌లో 14 పీజీ సీట్లకు నకిలీ అనుమతులు వెలువడినట్టు ఎన్ఎంసీ మంగళవారం ప్రకటించింది. ఇదే కళాశాలలో ఎమర్జెన్సీ మెడిసిన్‌లో మరో రెండు సీట్లకు నకిలీ అనుమతులు వచ్చినట్లు గురువారం తెలిపింది. దీంతో యాజమాన్య కోటా రివైజ్డ్ ఫేజ్–1 కౌన్సెలింగ్‌ను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని ప్రభుత్వం విశ్వవిద్యాలయాన్ని ఆదేశించింది. -
వైద్యవిద్య పీజీ ప్రవేశాల వెబ్ ఆప్షన్ల నమోదుకు నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: 2023–24 విద్యాసంవత్సరానికి రాష్ట్ర కోటా పీజీ వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం వెబ్ ఆప్షన్ల నమోదుకు శుక్రవారం డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ జారీచేసింది. ఇన్ సర్వీస్, నాన్ సర్వీస్ అభ్యర్థులు https:// pgcq.ysruhs.com వెబ్సైట్లో ఆదివారం ఉదయం 10 గంటలలోపు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించింది. ఆప్షన్ల నమో దు సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తితే 7416563063, 7416253073, 9063400829 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని వీసీ డాక్టర్ బాబ్జీ సూచించారు. పలు కళాశాలల్లో పీజీ సీట్ల పెంపుదలపై ఎన్ఎంసీ పేరిట ఫేక్/ఫోర్జరీ అనుమతి పత్రాలు వెలుగులోకి రావడంతో తొలిదశ కౌన్సెలింగ్‌ను రద్దుచేసినట్లు తెలిపారు. ఎన్ఎంసీ నుంచి స్పష్టత తీసుకుని రివైజ్డ్ సీట్ మ్యాట్రిక్స్‌ను వెబ్సైట్లో ఉంచినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో విద్యార్థులు మళ్లీ వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. తొలిదశలో కేటాయించిన సీట్లు రద్దుచేసిన విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలని కోరారు. జీఎస్ఎల్, మహారాజాల్లోను ఫేక్ అనుమతులు శాంతీరామ్ వైద్యకళాశాలలో ఫేక్ అనుమతుల వ్యవహారం బయటపడటంతో అప్రమత్తమైన విశ్వవిద్యాలయం అధికారులు మిగిలిన కళాశాలల్లో సీట్లను పరిశీలించారు. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలోని జీఎస్ఎల్, విజయనగరం జిల్లాలోని మహారాజా ప్రైవేట్ వైద్యకళాశాలల్లోని పీజీ సీట్లకు, ఎన్ఎంసీ వెబ్సైట్లో చూపిస్తున్న సీట్లకు మధ్య వ్యత్యాసం గుర్తించారు. దీంతో ఎన్ఎంసీకి ఈ వ్యవహారంపై లేఖ రాశారు. ఆయా కళాశాలల్లో పీజీ సీట్ల పెంపుదలకు తాము అనుమతులు ఇవ్వలేదని ఎన్ఎంసీ శుక్రవారం స్పష్టం చేసింది. సీట్లు పెంచుతూ వెలువడిన అనుమతులు ఫేక్/ఫోర్జరీవని తెలిపింది. మరోవైపు 2023–24 విద్యాసంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా అన్ని రాష్ట్రాల డీఎంఈలు ఎన్ఎంసీ వెబ్సైట్లో ఉన్న సమాచారాన్నే పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. సాధారణ ప్రజలు సైతం ఇతర మాధ్యమాల్లో పొందుపరిచే సమాచారాన్ని నమ్మవద్దని సూచించింది. -
వైద్యవిద్య పీజీ ప్రవేశాల వెబ్ ఆప్షన్ల నమోదుకు నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: 2023–24 విద్యాసంవత్సరానికి రాష్ట్ర కోటా పీజీ వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం వెబ్ ఆప్షన్ల నమోదుకు శుక్రవారం డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ జారీచేసింది. ఇన్ సర్వీస్, నాన్ సర్వీస్ అభ్యర్థులు https:// pgcq.ysruhs.com వెబ్సైట్లో ఆదివారం ఉదయం 10 గంటలలోపు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించింది. ఆప్షన్ల నమోదు సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తితే 7416563063, 7416253073, 9063400829 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని వీసీ డాక్టర్ బాబ్జీ సూచించారు. పలు కళాశాలల్లో పీజీ సీట్ల పెంపుదలపై ఎన్ఎంసీ పేరిట ఫేక్/ఫోర్జరీ అనుమతి పత్రాలు వెలుగులోకి రావడంతో తొలిదశ కౌన్సెలింగ్‌ను రద్దుచేసినట్లు తెలిపారు. ఎన్ఎంసీ నుంచి స్పష్టత తీసుకుని రివైజ్డ్ సీట్ మ్యాట్రిక్స్‌ను వెబ్సైట్లో ఉంచినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో విద్యార్థులు మళ్లీ వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. తొలిదశలో కేటాయించిన సీట్లు రద్దుచేసిన విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలని కోరారు. జీఎస్ఎల్, మహారాజాల్లోను ఫేక్ అనుమతులుశాంతీరామ్ వైద్యకళాశాలలో ఫేక్ అనుమతుల వ్యవహారం బయటపడటంతో అప్రమత్తమైన విశ్వవిద్యాలయం అధికారులు మిగిలిన కళాశాలల్లో సీట్లను పరిశీలించారు. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలోని జీఎస్ఎల్, విజయనగరం జిల్లాలోని మహారాజా ప్రైవేట్ వైద్యకళాశాలల్లోని పీజీ సీట్లకు, ఎన్ఎంసీ వెబ్సైట్లో చూపిస్తున్న సీట్లకు మధ్య వ్యత్యాసం గుర్తించారు. దీంతో ఎన్ఎంసీకి ఈ వ్యవహారంపై లేఖ రాశారు. ఆయా కళాశాలల్లో పీజీ సీట్ల పెంపుదలకు తాము అనుమతులు ఇవ్వలేదని ఎన్ఎంసీ శుక్రవారం స్పష్టం చేసింది. సీట్లు పెంచుతూ వెలువడిన అనుమతులు ఫేక్/ఫోర్జరీవని తెలిపింది. మరోవైపు 2023–24 విద్యాసంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా అన్ని రాష్ట్రాల డీఎంఈలు ఎన్ఎంసీ వెబ్సైట్లో ఉన్న సమాచారాన్నే పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. సాధారణ ప్రజలు సైతం ఇతర మాధ్యమాల్లో పొందుపరిచే సమాచారాన్ని నమ్మవద్దని సూచించింది. -
వైద్య విద్య పీజీ ప్రవేశాల కౌన్సెలింగ్ రద్దు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైద్య విద్య పీజీ కోర్సుల్లో ఇప్పటికే నిర్వహించిన కౌన్సెలింగ్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. ప్రవేశాల ప్రక్రియను మళ్లీ మొదటి నుంచి నిర్వహించాలని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే కన్వినర్, యాజమాన్య కోటా సీట్లకు తొలి దశలో నిర్వహించిన కౌన్సెలింగ్‌ను రద్దు చేసినట్టు గురువారం వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి ఉత్తర్వులిచ్చారు. కర్నూలు జిల్లా శాంతిరామ్ వైద్య కళాశాలలోని పలు కోర్సుల్లో పీజీ సీట్ల పెంపుదలకు సంబంధించి నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) పేరిట ఫేక్/ఫోర్జరీ అనుమతులు వెలువడ్డాయి. ఈ అంశంపై ఎన్ఎంసీ ప్రకటన నేపథ్యంలో ఇప్పటివరకు నిర్వహించిన కౌన్సెలింగ్‌ను హెల్త్ యూనివర్సిటీ అధికారులు రద్దు చేశారు. ఫోర్జరీ అనుమతుల ఘటన వెలుగు చూడటంతో అప్రమత్తమైన అధికారులు మిగిలిన వైద్య కళాశాలల్లో పీజీ సీట్ల అనుమతులు సరిగా ఉన్నాయో, లేదో పరిశీలిస్తున్నారు. ఆయా కళాశాలలకు మంజూరైన సీట్లను, ఎన్ఎంసీ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచిన సీట్లతో సబ్జెక్టుల వారీగా తనిఖీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జీఎస్ఎల్, శాంతిరామ్, మహారాజా కళాశాలల్లో అనుమతించిన పీజీ సీట్లకు, ఎన్ఎంసీ వెబ్సైట్లో చూపిస్తున్న సీట్ల సంఖ్య మధ్య వ్యత్యాసం ఉన్నట్టు గుర్తించారు. దీంతో ఈ అంశంపై వివరణ కోరుతూ అధికారులు ఎన్ఎంసీకి లేఖ రాశారు. ఎన్ఎంసీ నుంచి పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చాక కొత్తగా సీట్ మ్యాట్రిక్స్‌ను రూపొందించనున్నారు. ఆ తర్వాత వెబ్ ఆప్షన్ల నమోదుకు నోటిఫికేషన్ ఇస్తామని రిజిస్ట్రార్ రాధికారెడ్డి తెలిపారు. -
ఉన్నతప్రమాణాలు..మరింత ప్రశాంతత
సాక్షి, హైదరాబాద్: మరింత ప్రశాంతతకు, ఉన్నత విద్యా ప్రమాణాలకు ఉస్మానియా విశ్వవిద్యాలయం వేదిక కాబోతోందని వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ డి.రవీందర్ తెలిపారు. యూనివర్సిటీలు ప్రశాంత వాతావరణంలో ఉండేలా దేశవ్యాప్తంగా క్లోజ్డ్ క్యాంపస్‌ల ఏర్పాటు జరుగుతోందని చెప్పారు. ఇందులో భాగంగా ఓయూకు ప్రభుత్వం రూ.16 కోట్లు మంజూరు చేసిందని, బయటి వ్యక్తులు క్యాంపస్ నుంచి ప్రయాణించకుండా బైపాస్ రోడ్డు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. దీనివల్ల కేవలం విద్యార్థులే ప్రాంగణంలో తిరుగుతారన్నారు. ఓయూలో మహిళా విద్యార్థినుల సంఖ్య పెరుగుతోందని, క్లోజ్డ్ క్యాంపస్ ఏర్పాటు వల్ల వారికి మరింత పటిష్టమైన భద్రత చేకూరుతుందని చెప్పారు. మరోవైపు వర్సిటీలో మౌలిక వసతుల కల్పనకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్టు వివరించారు. రెండేళ్లుగా మౌలిక వసతులకు రూ.145 కోట్లు ఖర్చు చేశామన్నారు. శుక్రవారం యూనివర్సిటీ ప్రాంగణంలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. హాస్టళ్లు.. సరికొత్త క్లాస్‌రూమ్‌లు సైఫాబాద్‌లోని యూనివర్సిటీ కాలేజీలో 300 మందికి సరిపడా బాలుర హాస్టల్ నిర్మాణం. నిజాం కాలేజీలో 284 మంది బాలికల కోసం హాస్టల్ ఏర్పాటు. సెంటినరీ హాస్టల్‌ను 500 మందికి సరిపడేలా నిర్మాణం. ఓయూ ప్రాంగణంలో స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్టుల ఏర్పాటు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో సరికొత్త క్లాస్ రూంల ఏర్పాటుకు శ్రీకారం. పరిశోధనలకు వీలు కల్పించేలా పూర్తి స్థాయి సాంకేతిక విద్యా విధానం అందుబాటులోకి తెచ్చేందుకు వ్యూహరచన. కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యతలో భాగంగా పలు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఓయూకు నిధులు సమకూరాయి. అమెరికాలోని 12 నగరాలను ప్రొఫెసర్ రవీంద్ర సందర్శించారు. అక్కడ పూర్వ విద్యార్థులతో భేటీ అయ్యారు. ఓయూలో వారి అనుభవాలు వివరించేందుకు అంగీకారం కుదిరింది. మారుతున్న విద్యా విధానంలో భాగంగా ఈ ఏడాది నుంచి ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీసెస్ అమలు. ఇందులో భాగంగా వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారు వర్సిటీ విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించేందుకు అనుమతి. ఈ ఏడాది నుంచి నిరంతర పరీక్షా విధానం అమలు. ఎప్పటికప్పుడు మధ్యంతర పరీక్షలు నిర్వహిస్తారు. ప్రిన్సిపల్స్, ప్రొఫెసర్లతో సమీక్ష ఉస్మానియా యూనివర్సిటీ: నిరంతర పరీక్షా విధానంపై ప్రొఫెసర్ రవీందర్ వివిధ కాలేజీల ప్రిన్సిపల్స్, ప్రొఫెసర్లతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు డిగ్రీ, పీజీ, డిప్లొమా, ఇతర కోర్సులకు ఇంటర్నల్ పరీక్షలు, ప్రాక్టికల్స్‌తో పాటు ప్రతి ఆరు నెలలకు ఒక సెమిస్టర్ పరీక్షను నిర్వహిస్తున్నారు. యూజీసీ ప్రవేశ పెట్టిన కొత్త నిబంధనల ప్రకారం సెమిస్టర్ పరీక్షలతో పాటు 15 రోజులకు ఒకసారి పరీక్షలను నిర్వహించేందుకు వర్సిటీ సమాయత్తం అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ల అభిప్రాయాలు, అభ్యంతరాలు, సందేహాలను వీసీ తెలుసుకున్నారు. -
వైద్యవిద్య పీజీ సీట్ల భర్తీ ప్రక్రియ ప్రారంభం
సాక్షి, అమరావతి: 2023–24 విద్యాసంవత్సరానికి వైద్యవిద్య పీజీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ప్రవేశాలకు సంబంధించి మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) షెడ్యూల్ విడుదల చేసింది. 50 శాతం ఆల్ ఇండియా కోటా సీట్లు, డీమ్డ్, కేంద్ర విశ్వవిద్యాలయాల్లో 100 శాతం సీట్లకు ఈ నెల 27 నుంచి ఆగస్టు ఒకటో తేదీ మధ్య నీట్–పీజీ అర్హత సాధించిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 28 నుంచి ఆగస్టు రెండో తేదీ మధ్య వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పిస్తారు. ఆగస్టు మూడు, నాలుగు తేదీల్లో సీట్లు కేటాయిస్తారు. ఏడో తేదీ నుంచి 13వ తేదీలోగా కేటాయించిన కాలేజీల్లో అభ్యర్థులు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 16వ తేదీకి తొలివిడత కౌన్సెలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. 17వ తేదీ నుంచి సెప్టెంబర్ 6వ తేదీ వరకు రెండోవిడత, 7వ తేదీ నుంచి 27వ తేదీ మధ్య మూడోవిడత కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. మిగిలిపోయిన సీట్ల భర్తీకి స్ట్రే వేకెన్సీ రౌండ్ కౌన్సెలింగ్ సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 10వ తేదీ మధ్య ఉంటుంది. రాష్ట్రంలో సీట్లకు 31లోగా దరఖాస్తు చేసుకోవాలి 2023–24 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య, డెంటల్ కళాశాలలు, స్విమ్స్ తిరుపతిలో రాష్ట్ర కోటా పీజీ, ఎండీఎస్ సీట్ల భర్తీకి డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. మెడికల్ పీజీ ప్రవేశాల కోసం http://pgcq.ysruhs.com/ ఎండీఎస్ ప్రవేశాల కోసం https://mdscq. ysruhs.com/ వెబ్సైట్లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకో వాలి. శనివారం (నేడు) ఉదయం 11 గంటల నుంచి ఈ నెల 31వ తేదీ సాయంత్రం ఆరు గంటల్లోగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నీట్ పీజీ–2023, ఎండీఎస్–2023లో అర్హులైన వారంతా దరఖాస్తు చేసుకోవచ్చు. నియమ, నిబంధనల్లో సందేహాల నివృత్తికి 8978780501, 7997710168, 9391805238, 9391805239, సాంకేతిక సమస్యలపై 7416563063, 7416253073, 90634 00829, పేమెంట్ గేట్‌వేపై స్పష్టత కోసం 8333883934 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని రిజిస్ట్ర్రార్ డాక్టర్ రాధికారెడ్డి తెలి పారు. అభ్యర్థనలను appgadmissions2021 @gmail. comM మెయిల్ కూడా చేయవచ్చని పేర్కొన్నారు. -
తుది కేటాయింపులు చేయొద్దు
సాక్షి, హైదరాబాద్: నీట్–పీజీ కన్వీనర్ కోటా సీట్లకు సంబంధించి తుది కేటాయింపును ఖరారు చేయవద్దని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని హైకోర్టు ఆదేశించింది. వచ్చే సోమవారం వరకు ఎంపిక ప్రక్రియను నిలుపుదల చేయాలని స్పష్టం చేసింది. ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, కాళోజీ వర్సిటీని ఆదేశించింది. రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాలు, గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న వైద్యులకు వైద్యవిధాన పరిషత్ సర్వీస్ సర్టిఫికెట్లు ఇచ్చింది. వారికి ఆ ప్రకారం పీజీ సీట్ల కేటాయింపులో కోటా వర్తిస్తుంది. నల్లగొండ జిల్లా చౌటుప్ప ల్లోని పంతంగికి చెందిన డాక్టర్ దిండు మల్లికార్జున్ సహా మరో ముగ్గురు ఈ సర్వీస్ సర్టిఫికెట్‌ను నీట్–పీజీ కౌన్సెలింగ్ సందర్భంగా ఇచ్చినా.. వర్సిటీ వాటిని పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించి లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. గురువారం ఉదయంతో వెబ్ ఆప్షన్లు ముగియనుండటంతో కోర్టు ఉత్తర్వుల తర్వాత తమకు ఆప్షన్ల అవకాశం కూడా ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ సీహెచ్.సుమలతలతో కూడిన వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సామ సందీప్‌రెడ్డి వాదనలు వినిపించారు. గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న వైద్యులకు పీజీ కౌన్సెలింగ్‌లో సర్వీస్ కోటా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సరిగ్గా అమలు చేయట్లేదన్నారు. తెలంగాణ వైద్యవిధాన పరిషత్ సర్వీస్ తొలుత సర్టిఫికెట్లు జారీ చేసి ఆ తర్వాత అవి చెల్లవంటూ వర్సిటీ అధికారులకు చెప్పడంతో పిటిషనర్ల భవిష్యత్తు గందరగోళంగా మారిందన్నారు. చాలా మందికి సర్వీస్ సర్టిఫికెట్లు ఇచ్చారని.. అందరివీ పరిగణనలోకి తీసుకున్నప్పుడు, కేవలం పిటిషనర్ల సర్టిఫికెట్లు చెల్లవని చెప్పడం చట్టవిరుద్ధమని నివేదించారు. వాదనలు విన్న ధర్మాసనం... వైద్య విధాన పరిషత్ తీరును తప్పుబట్టింది. సీట్ల కేటాయింపును ఖరారు చేయవద్దని ఆదేశిస్తూ.. విచారణను వాయిదా వేసింది. -
ప్రత్యక్ష బోధన, హాస్టల్ వసతి కావాలి
కేయూ క్యాంపస్ (వరంగల్): కాకతీయ యూనివర్సిటీలో పీజీ కోర్సుల రెండో సెమిస్టర్ విద్యార్థులకు ప్రత్యక్ష విద్యాబోధన, హాస్టల్ వసతి కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ, బీఎస్ఎఫ్, ఏబీఎస్ఎఫ్, ఏబీవీపీ, పీడీఎస్‌యూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సోమవారం విద్యార్థులు ఆందోళనకు దిగారు. విద్యార్థుల ఆందోళన విషయం తెలుసుకున్న వర్సిటీ అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. హాస్టళ్ల మరమ్మతులు పూర్తికాగానే హాస్టల్ సౌకర్యంతోపాటు ప్రత్యక్ష విద్యాబోధన ఉంటుందని రిజిస్ట్రార్ విద్యార్థులను సముదాయించే ప్రయత్నం చేశారు. మరమ్మతులు తొలుత ఈ నెల 7నాటికి పూర్తి చేస్తామని, ఆ తర్వాత 16వరకు అని చెప్పారని, ఇంకా ఎన్నిరోజులు చేస్తారని రిజిస్ట్రార్‌తో విద్యార్థులు వాగ్వాదానికి దిగారు. ఈ దశలో విద్యార్థులు పరిపాలనా భవనంలోనికి చొచ్చుకెళ్లేయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థులు ఆగ్రహంతో మొక్కల కుండీలను పగలగొట్టారు. రిజిస్ట్రార్ చాంబర్‌లోని కుర్చీలను ఎత్తిపడేశారు. చివరికి జూలై 4వతేదీ వరకు మరమ్మతులు పూర్తిచేసి హాస్టల్ వసతి కల్పిస్తామని, లేకుంటే తన పదవికి రాజీనామా చేస్తానని రిజిస్ట్రార్ హామీనివ్వడంతో విద్యార్థులు అక్కడినుంచి వెళ్లిపోయారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నేతలు పాల్గొన్నారు. -
జూలై 20న ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల పరిధిలో పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీపీజీఈటీ–2022) నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి సోమవారం విడుదల చేశారు. జూలై 20న ఈ పరీక్ష ఉస్మానియా వర్సిటీ పర్యవేక్షణలో జరుగుతుంది. ఆన్లైన్ ద్వారా ఎలాంటి అపరాధ రుసుము లేకుండా జూలై 7వ తేదీ వరకూ దరఖాస్తు చేసు కోవచ్చు. ప్రవేశ పరీక్ష కంప్యూటర్ ఆధారితంగానే ఉంటుంది. ప్రవేశ పరీక్షలో ర్యాంకును బట్టి ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, కొత్తగా ఏర్పడబో తున్న తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం, జేఎన్ టీయూహెచ్ పరిధిలోని 320 కాలేజీల్లో ప్రవేశాలు పొందవచ్చు. మొత్తం 50 కోర్సుల్లో 112 విభాగాలకు విద్యార్థులు ఒకే ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశాలు పొందే వీలుంది. పరీక్ష ఫీజును ఓసీ, బీసీ విద్యార్థులకు రూ.800, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.600గా నిర్ణయించారు. అదనపు సబ్జెక్టులకు ఒక్కో దానికి రూ.450 చెల్లించాలి. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో లింబాద్రితో పాటు ఓయూ ఇన్చార్జి వీసీ సీతారామారావు, రిజి స్ట్రార్ పి. లక్ష్మీనారాయణ, ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ వి. వెంకటరమణ, సెక్రటరీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లింబాద్రి సెట్ వివరాలు వెల్లడించారు. డిగ్రీ ఏదైనా పీజీలో నచ్చిన కోర్సు.. ►రాష్ట్రవ్యాప్తంగా 44,604 పీజీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. గత ఏడాది ఇంతే సంఖ్యలో సీట్లున్నా, చేరిన వారి సంఖ్య 22,812 మాత్రమే. వీరిలోనూ 16,163 (71%) మహిళలు, 6,649 (29%) పురుషులు చేశారు. ►ఈసారి పీజీ కోర్సుల ప్రవేశాల ప్రక్రియలో గుణాత్మక మార్పులు తెచ్చారు. డిగ్రీలో ఏ సబ్జెక్టు చేసినా, పీజీలో ఇష్టమొచ్చిన సామాజిక కోర్సుల్లో చేరేందుకు వీలు కల్పిస్తున్నారు. ఆఖరుకు ఎంబీబీఎస్, బీటెక్ విద్యార్థులు కూడా ఎంఏ, ఎంకామ్ వంటి కోర్సుల్లో చేరే వీలుంది. ఎంఏ తెలుగు, ఇంగ్లిష్ కోర్సులకు ఏ గ్రూపుతో డిగ్రీ చేసినా అర్హులే. ►నేషనల్ ఇంటిగ్రేషన్ కోటాను 5% నుంచి 20%కి పెంచారు. ఇతర రాష్ట్రాల విద్యార్థులు చేరేందుకు ముందుకొస్తే సూపర్ న్యూమరరీ పోస్టులు క్రియేట్ చేస్తారు. ఆన్లైన్, డిస్టెన్స్మోడ్లోనూ వర్సిటీ నుంచి పీజీ కోర్సులు చేసే అవకాశం కల్పిస్తున్నారు. ►పీజీ సెట్ రాయాలనుకునే వారు తాజాగా తీసుకున్న ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని జతచేయాలి. కుల ధ్రువీకరణ, ఇతర సర్టిఫికెట్లను ఆన్లైన్లో పొందుపర్చాలి. మిగిలిపోతున్న సీట్లు.. ప్రతీ ఏటా సీట్లు మిగిలిపోతున్నాయి. కొన్ని సబ్జెక్టుల్లో మరీ తక్కువ ప్రవేశాలుంటున్నాయి. గతేడాది గజ్వేల్ కాలేజీలో పీజీ కెమిస్ట్రీలో ఐదుగురే చేరారు. వాళ్లను వేరే కాలేజీలకు పంపాల్సి వచ్చింది. దీనిపై ఉన్నత విద్యా మండలి సరైన విధానం అనుసరించాలి. ఈ ఏడాది కూడా 44 వేల సీట్లున్నాయి. కొత్త కోర్సులకు అనుమతిస్తే మరో వెయ్యి సీట్లు పెరిగే వీలుంది. – ప్రొఫెసర్ ఐ. పాండురంగారెడ్డి (సీపీజీఈటీ–2022 కన్వీనర్) -
డిగ్రీలో కోర్సు ఏదైనా.. పీజీలో నచ్చిన కోర్సు
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యలో సంస్కరణలకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి శ్రీకారం చుట్టింది. డిగ్రీలో ఏ కోర్సు చేసినా పీజీలో ఇష్టమైన సామాజిక కోర్సు ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పించాలని నిర్ణయించింది. గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ఇతర రాష్ట్ర విద్యార్థుల భాగస్వామ్యాన్ని పెంచాలని తీర్మానించింది. సోమవారం రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల వీసీలతో ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో సమావేశం జరిగింది. ఇందులో తీసుకున్న నిర్ణయాలను ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి మీడియాకు వివరించారు. బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్‌కు సరికొత్త విధానం ఇప్పటివరకు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ఏ సబ్జెక్టు తీసుకుంటే పోస్టు గ్రాడ్యుయేషన్‌లోనూ అదే కోర్సు చేయాల్సి ఉండేది. దీని వల్ల చాలా మంది విద్యార్థులు ఇష్టమైన సబ్జెక్టులు చదివేందుకు వేరే రాష్ట్రాలు, దేశాలకు వెళ్తున్నారు. అందుకే ఉమ్మడి పోస్టు గ్రాడ్యుయేట్ అర్హత పరీక్ష నిబంధనలు సడలించారు. ఇక సోషల్ సైన్స్ గ్రూపులైన ఎంఏ పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హిస్టరీ, ఎకనామిక్స్ వంటి కోర్సులు ఇంగ్లిష్, తెలుగులో చేయాలంటే డిగ్రీలో ఏ కోర్సు చేసినా సరిపోతుంది. ఉన్నత విద్యలో విద్యార్థులకు ఇచ్చే బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్‌పై కూడా సరికొత్త విధానం తీసుకొచ్చేందుకు అధ్యయనం చేయాలని ఉస్మానియా వర్సిటీ వీసీకి ఉన్నత విద్యా మండలి సూచించింది. రాష్ట్రంలో మూడేళ్లుగా దాదాపు 50 కాలేజీల్లో పలు కోర్సుల్లో జీరో ప్రవేశాలు ఉంటున్నాయి. వీటిని రద్దు చేయడమే మంచిదని మండలి భావిస్తోంది. అయితే డిమాండ్ ఉన్న కోర్సులను కాలేజీలు నిర్వహించుకునేందుకు అనుమతించడంపై కసరత్తు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. విద్యార్థుల్లేని గ్రూపుల స్థానంలో విద్యార్థులు కోరుకునే గ్రూపులకు కాలేజీలు ముందుకొస్తే పరిశీలించాలని నిర్ణయం తీసుకున్నారు. పీజీ ఎంట్రన్స్‌లో నేషనల్ ఇంటిగ్రేషన్ కోటా 20 శాతం పీజీ ఎంట్రన్స్‌లో నేషనల్ ఇంటిగ్రేషన్ కోటాను 20 శాతం పెంచాలని సమావేశం తీర్మానించింది. ప్రస్తుతం ఈ కోటా 5 శాతమే ఉంది. తాజా నిర్ణయంతో కొత్తగా ఇతర రాష్ట్రాల విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు. దీనికోసం సూపర్ న్యూమరరీ సీట్లు కేటాయించాలని నిర్ణయించారు. స్పానిష్, ఫ్రెంచ్, జపనీస్ వంటి విదేశీ భాషల కోర్సులను కాలేజీల్లో ప్రవేశపెట్టేందుకు విద్యా మండలి సుముఖత వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన పాఠ్య ప్రణాళిక, బోధన విధానంపై సమగ్ర నివేదిక రూపొందించే బాధ్యతను ఉస్మానియా వర్సిటీ వీసీ రవీందర్‌కు అప్పగించింది. సమావేశంలో రాష్ట్ర కాలేజీ విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్, విద్యా మండలి వైఎస్ చైర్మన్ వెంకటరమణ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. -
NEET PG Exam 2022: నీట్ పీజీ వాయిదా కుదరదు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: వైద్య విద్య పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన నీట్ పీజీ–22 పరీక్ష వాయిదా కుదరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్‌ను కొట్టే సింది. ఇలా వాయిదా వేసుకుంటూ పోతే వైద్యులు అందుబాటులోకి రాక ఆరోగ్య వ్యవస్థ తీవ్రంగా దెబ్బ తింటుందని వ్యాఖ్యానించింది. ‘‘పరీక్ష వాయిదా 2.6 లక్షల మందికిపైగా విద్యార్థులపై వ్యతిరేక ప్రభావం చూపిస్తుంది. రెండేళ్లుగా కరోనా సంక్షోభంతో దెబ్బతిన్న పరీక్షల షెడ్యూల్‌ను ప్రభుత్వం గాడిలో పెడుతోంది. ఇలాంటప్పుడు పరీక్ష వాయిదా కుదరదు’’ అని పేర్కొంది. పరీక్ష ఈ నెల 21న జరగనుంది. అప్పుడే నీట్–పీజీ–2021 కౌన్సెలింగ్ ఉండటంతో పరీక్షను వాయిదా వేయాలంటూ కొందరు వైద్యులు కోర్టుకెక్కారు. -
మెడికల్ పీజీ ‘బ్లాక్’ దందా!
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్యలో స్పెషలైజేషన్ చేసే పీజీ సీట్లకు ‘బ్లాక్’ దందా నడుస్తోంది. ప్రైవే టు మెడికల్ కాలేజీల యాజమాన్యాలు కోట్లకు కోట్లు దండుకోవడానికి అక్రమ మార్గం పట్టాయి. ‘నీట్’లో మంచి ర్యాంకు వచ్చిన ఇతర రాష్ట్రాల విద్యార్థులతో ఇక్కడ దరఖాస్తు చేయించడం.. వారికి మేనేజ్మెంట్ కోటా సీటు అలాట్ అయ్యాక దానిని వదులుకుని వెళ్లిపోతున్నట్టు చెప్పించడం.. తర్వాత ఎన్నారై కోటా కింద ఆ సీటును అడ్డగోలు ‘రేటు’కు అమ్ముకుని భారీగా వెనకేసుకోవడం పరిపాటిగా మారింది. దీనివల్ల మంచి ర్యాంకు వచ్చినా స్థానికంగా సీటు దొరక్క రాష్ట్ర విద్యార్థులకు అన్యాయం జరుగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై విద్యార్థుల ఒత్తిడితో కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం పోలీసులకు ఫిర్యాదు చేసింది. లొసుగును వాడుకుని.. మెడికల్ కాలేజీల్లో దందాలకు చెక్ పెట్టేందుకు దేశంలో ‘నీట్’ పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పి స్తున్నారు. అయినా నిబంధనల్లో ఉన్న లొసుగులను వాడు కుని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు మెడికల్ పీజీ సీట్లను అమ్ముకుంటున్నాయి. ఇందుకోసం పక్కా ప్లాన్‌తో వ్యవహరిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో మెడికల్ పీజీ సీట్ల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ‘నీట్’ పరీక్ష వల్ల దేశవ్యాప్తంగా ఏ రాష్ట్ర విద్యార్థులైనా మేనేజ్మెంట్ సీట్లకు పోటీపడొచ్చు. ఈ క్రమంలో రాష్ట్రంలోని మేనేజ్మెంట్ సీట్ల కోసం తెలంగాణతోపాటు, ఇతర రాష్ట్రాల విద్యార్థులు కూడా దరఖాస్తు చేశారు. కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నీట్ ర్యాంకుల ఆధారంగా మెరిట్ జాబితాలను విడుదల చేసింది. అయితే ప్రైవేటు కాలేజీలు కొందరు విద్యార్థుల తోడ్పాటుతో ఉద్దేశపూర్వకంగా సీట్లను బ్లాక్ చేస్తున్నట్టుగా కాళోజీ వర్సిటీ గుర్తించింది. ఇప్పటివరకు జరిగిన మూడు దశల కౌన్సెలింగ్‌లో 40 మంది దరఖాస్తులు అనుమానాస్పదంగా ఉన్నట్టు తేల్చింది. ఈ 40 మందీ మంచి ర్యాంకులు సాధించినవారే. వారికి సొంత రాష్ట్రాల్లోనే సీటు పొందే అవకాశం ఉన్నా.. మన రాష్ట్రంలో, అదీ యాజమాన్య కోటాలో దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. వర్సిటీ దీనిపై వివరణ కోరుతూ వారందరికీ లేఖ రాసింది. అందులో కొందరు తదుపరి దశల కౌన్సెలింగ్ తప్పుకోగా, ఏడుగురు విద్యార్థులైతే మేనేజ్మెంట్ కోటా కింద దరఖాస్తే చేసుకోలేదని వర్సిటీకి తెలిపారు. ఈ వ్యవహారంలో అక్రమాలున్నట్టు గుర్తించిన కాళోజీ వర్సిటీ రిజిస్ట్రార్ ప్రవీణ్ కుమార్.. లోతుగా దర్యాప్తు చేయాల్సిందిగా వరంగల్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషికి సోమవారం ఫిర్యాదు చేశారు. సీట్ల భర్తీ ఇలా.. ప్రైవేట్ కాలేజీల్లోని మొత్తం పీజీ సీట్లలో సగం కన్వీనర్ కోటాలో ప్రభుత్వమే నేరుగా భర్తీ చేస్తుంది. వాటికి అతితక్కువ ఫీజు ఉంటుంది. మిగతా సగం మేనేజ్మెంట్ కోటా సీట్లలో తిరిగి మూడు (1, 2, 3) కేటగిరీలు ఉంటాయి. ఇందులో కేటగిరీ–1 సీట్లు సగం (మొత్తం సీట్లలో 25శాతం) ఉంటాయి. వార్షిక ఫీజు రూ.24 లక్షలు ఉండే ఈ సీట్లను కూడా ప్రభుత్వ కౌన్సెలింగ్ ద్వారానే భర్తీ చేస్తారు. ఇక కేటగిరీ–2 సీట్లు 30శాతం (మొత్తం సీట్లలో 15శాతం), కేటగిరీ–3 సీట్లు 20శాతం (మొత్తం సీట్లలో 10శాతం) ఉంటాయి. కేటగిరీ–2 సీట్లలో ఎన్నారై/ఎన్నారై స్పాన్సర్డ్ విద్యార్థులకు.. కేటగిరీ–3 సీట్లను మెడికల్ కాలేజీల యాజమాన్యాలు తమకు ఇష్టమొచ్చినవారికి కేటాయించుకోవచ్చు. ఈ రెండింటికీ అధికారికంగా రూ.72 లక్షలు ఫీజు ఉన్నా.. రూ.రెండు కోట్ల వరకు వసూలు చేస్తున్నట్టు సమాచారం. నిబంధనల ప్రకారం.. కేటగిరీ–1 సీట్లలో చేరిన ఏ విద్యార్థి అయినా తమ అడ్మిషన్‌ను వదులుకుంటే, కాలేజీలు ఆ సీటును కేటగిరీ–2 (ఎన్నారై కోటా) కింద భర్తీ చేసుకోవచ్చు. అంతమేర భారీగా ఫీజులు వసూలు చేసుకోవచ్చు. దీనినే ప్రైవేటు మెడికల్ కాలేజీలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. రాష్ట్ర విద్యార్థులకు అన్యాయం రాష్ట్రంలో మెడికల్ పీజీ సీటు వచ్చేందుకు సరిపడా మెరిట్ ఉన్నా.. ఇతర రాష్ట్రాల ర్యాంకర్లు రావడంతో మనవాళ్లకు సీట్లు దక్కడం లేదు. ఇతర రాష్ట్రాలవారు వచ్చి వదిలేసి వెళ్లిపోతుండటం.. ఆ సీట్లను మేనేజ్మెంట్లు అమ్మేసుకుంటుండటంతో.. రాష్ట్ర విద్యార్థులకు అన్యాయం జరుగుతోందన్న విమర్శలు వస్తున్నాయి. ఈ దందాతో పలుకాలేజీలు రూ.100 కోట్ల దాకా అక్రమంగా వెనకేసుకుంటున్నట్టు ఆరోపణలున్నాయి. కొందరు మెడికల్ కాలేజీల యాజమాన్యాలు రాజకీయంగా పలుకుబడి కలిగినవారు కావడంతో అధికారులు కూడా నోరు మెదపడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. బ్లాక్ చేసేది ఎలాగంటే..? సాధారణంగా ఎక్కువ ర్యాంకు ఉన్నవారికి కౌన్సెలింగ్‌లో మొదట సీట్లు కేటాయిస్తారు. దీనితో టాప్ ర్యాంకులు వచ్చిన ఇతర రాష్ట్రాల విద్యార్థులకు మెడికల్ కాలేజీలు డబ్బులతో గాలం వేస్తున్నాయి. తమ కాలేజీలో మేనేజ్మెంట్ కోటా (కేటగిరీ–1) సీటుకు దరఖాస్తు చేసుకుని, అలాట్మెంట్ అయ్యాక వదిలి వెళ్లిపోయేలా ఒప్పందం కుదుర్చుకుంటున్నాయి. దీనివల్ల ఆ సీటు ఎన్నారై కోటా (కేటగిరీ–2) కిందికి మారుతుంది. దానిని కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నాయి. ► ఇక్కడ దరఖాస్తు చేయిస్తున్న ఇతర రాష్ట్రాల విద్యార్థుల్లో చాలా వరకు వారి రాష్ట్రాల్లోని మెడికల్ కోర్సుల్లో చేరినవారే ఉంటున్నారు. అయితే అక్కడి కాలేజీల యాజమాన్యాలతో కుమ్మక్కై ఒరిజినల్ సర్టిఫికెట్లు తెచ్చుకుని.. మన రాష్ట్రంలో దరఖాస్తు చేసుకుంటున్నారు. సీటు వచ్చాక క్యాన్సిల్ చేసుకుని వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలో తమకు భారీగా లాభం వస్తుండటంతో మేనేజ్మెంట్లు వారికి ఐదారు లక్షలదాకా ముట్టజెపుతున్నట్టు సమాచారం. ► ఎవరైనా విద్యార్థి అడ్మిషన్ అయ్యాక సీటును వదులుకుంటే.. హెల్త్ వర్సిటీకి జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఆ సొమ్మును కూడా కాలేజీల యాజమాన్యాలే వారి పేరిట కట్టేస్తున్నట్టు తెలిసింది. ► మన రాష్ట్రంలోని కొందరు టాప్ ర్యాంకర్లలో కొందరు ఇప్పటికే జాతీయ స్థాయి కాలేజీల్లో చేరినా.. ఇక్కడ మేనేజ్మెంట్ కోటా సీట్లకు దరఖాస్తులు చేసినట్టు తెలిసింది. ఇదంతా కేవలం పీజీ సీటును బ్లాక్ చేసే ఎత్తుగడలో భాగమేనని తెలుస్తోంది. -
81 ఏళ్ల వయసులో పీజీ పట్టా !
సాక్షి, బళ్లారి: చదువుకు వయసుతో పనిలేదు. చదువుకోవాలనే కోరిక ఉంటే చాలు వయసుతో నిమిత్తం లేదు. వృద్ధాప్యంలో ఉన్న కొందరు యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. విజయపుర జిల్లా జేఎస్ఎస్ మహా విద్యాలయంలో 81 ఏళ్ల వయసులో నింగయ్య బసయ్య ఎంఏ ఇంగ్లిషులో పట్టా పొందారు. అదే విధంగా విశ్రాంత ఉపాధ్యాయుడు పరసప్ప ఇప్పటికే పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీలు సాధించాడు. తాజాగా ఎంఏ ఇంగ్లిషు పరీక్షలు రాయడం విశేషం. -
పీజీ సీట్ల భర్తీకి ప్రత్యేక కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఈ మేరకు అన్ని యూనివర్సిటీల నుంచి వివరాలను కోరినట్లు మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. వివిధ కారణాల వల్ల గతంలో కౌన్సెలింగ్‌కు హాజరుకాలేకపోయిన విద్యార్థులకు దీనివల్ల ప్రయోజనం ఉంటుందని చెప్పారు. 2022లో రాష్ట్ర వ్యాప్తంగా పీజీ కోర్సులకు సంబంధించిన 52 వేల సీట్లు అందుబాటులో ఉండగా.. ఇప్ప టివరకు మూడు దశల్లో కౌన్సెలింగ్ చేపట్టారు. అయితే అందులో 24 వేలమంది ప్రవేశాలు పొందగా.. ఇంకా 28 వేల సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఆర్ట్స్ గ్రూపుల్లో తక్కువ సంఖ్యలో చేరారన్నారు. అయితే, గ్రాడ్యుయేట్ కోర్సులు చేసిన కొంతమందికి బ్యాక్‌లాగ్స్ ఉండటంతో వీటిని ఇటీవల జరిగిన పరీక్షల్లో పూర్తిచేశారు. కానీ ఫలితాలు వచ్చే నాటికి పీజీ కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో పలు విద్యార్థి సంఘాలు ఉన్నత విద్యా మండలి దృష్టికి ఈ అంశాన్ని తీసుకొచ్చాయి. ఫలితంగా అధికారులు చర్చించి చివరి దశ కౌన్సెలింగ్ చేపట్టాలని నిర్ణయించారు. -
‘ప్రవేశ పరీక్ష రాయకున్నా పీజీ ప్రవేశాలు’
ఉస్మానియా యూనివర్సిటీ: టీఎస్‌సీపీజీఈటీ–2021 మూడు విడతల వెబ్ కౌన్సెలింగ్ అనంతరం మిగిలిన సీట్లను ఆయా విశ్వవిద్యాలయాల పరిధిలోని కళాశాలలు భర్తీ చేసుకోవాలని కన్వీనియర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి శనివారం పేర్కొన్నారు. ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు వివిధ పీజీ కోర్సుల సీట్లను భర్తీ చేసి 14న ఓయూలోని పీజీ అడ్మిషన్స్ కార్యాలయంలో సమర్పించాలని కోరారు. ప్రవేశ పరీక్షను రాయని అభ్యర్థులు, సీపీజీఈటీ–2021లో అర్హత సాధించని విద్యార్థులకు సైతం పీజీ కోర్సుల్లో ప్రవేశం కల్పించవచ్చని తెలిపారు. -
8 నుంచి ఓయూ హాస్టళ్ల మూసివేత
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలోని హాస్టళ్లను ఈనెల 8 నుంచి మూసివేయనున్నట్లు చీఫ్ వార్డెన్ శ్రీనివాస్‌రావు బుధవారం తెలిపారు. యూనివర్సిటీ అధికారుల ఆదేశాల మేరకు 8న మధ్యాహ్న భోజనం తర్వాత మెస్‌లను కూడా మూసివేస్తామని చెప్పారు. విద్యార్థులు హాస్టల్ గదుల్లోని తమ సామాన్లను వెంటతీసుకెళ్లాలని సూచించారు. హాస్టళ్లను తిరిగి ప్రారంభించే తేదీలను తర్వాత ప్రకటిస్తామన్నారు. పీజీఈసెట్ ప్రత్యేక కౌన్సెలింగ్ సాక్షి, హైదరాబాద్: ఎంఈ, ఎంటెక్, ఎంఆర్క్, ఎం ఫార్మసీ, ఫార్మా డీ కోర్సుల్లో ప్రవేశానికి టీఎస్ పీజీఈసెట్ ఈ నెల 6 నుంచి స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్టు సెట్ కన్వీనర్ పి.రమేష్‌బాబు ఓ ప్రకటనలో తెలిపారు. 7వ తేదీ వరకూ ఆన్లైన్ రిజిష్ట్రేషన్ చేసుకోవచ్చని, 9 నుంచి 11 వరకూ వెబ్ ఆప్షన్లు ఉంటాయని తెలిపారు. 16వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుందని, 19వ తేదీ వరకూ సెల్ఫ్ రిపోర్టింగ్‌కు గడువుంటుందని వెల్లడించారు. ‘డిగ్రీ వన్‌టైమ్ చాన్స్’ ఫలితాలు విడుదల ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో గతేడాది అక్టోబర్‌లో జరిగిన డిగ్రీ కోర్సుల వన్‌టైమ్ చాన్స్, బ్యాక్లాగ్ పరీక్షల ఫలితాలను బుధవారం విడుదల చేశారు. బీఏ, బీబీఏ కోర్సుల బ్యాక్లాగ్, వన్‌టైమ్ చాన్స్ ఫలితాలు.. బీఎస్సీ, బీఏ ఒకేషనల్, బీకాం ఆనర్స్, వార్షిక పరీక్షల ఫలితాలను ప్రకటించినట్లు కంట్రోలర్ శ్రీనగేశ్ తెలిపారు. (తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. వైద్య సిబ్బందికి సెలవులు రద్దు) పీజీ ప్రవేశాల చివరి విడత వెబ్ కౌన్సెలింగ్ ఉస్మానియా యూనివర్సిటీ: రాష్ట్రంలోని ఏడు వర్సిటీల్లో వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు చివరి విడత కౌన్సెలింగ్ షెడ్యూలును బుధవారం విడుదల చేశారు. సీపీజీఈటీ–2021లో భాగంగా ఈ నెల 6 నుంచి ఈ నెల 10వరకు చివరి విడత వెబ్‌కౌన్సెలింగ్ జరగనున్నట్లు కన్వీనర్ ప్రొ.పాండురంగారెడ్డి పేర్కొన్నారు. ఎన్సీసీ, దివ్యాంగులు, సీఏపీ అభ్య ర్థులు ఈ నెల 10న నేరుగా ఓయూ క్యాంపస్‌లోని పీజీ అడ్మిషన్స్ కార్యాలయంలో జరిగే సర్టిఫికెట్ల వెరి ఫికేషన్‌కు హాజరు కావాలన్నారు. ఈ నెల 12నుంచి 15వరకు వెబ్ ఆప్షన్ ఇవ్వాలని, 16న ఎడిటింగ్, 19న వివిధ పీజీ కోర్సుల్లో సీట్లు సాధించిన అభ్యర్థుల చివరి జాబితాను ప్రకటిస్తామని తెలిపారు. సీట్లు లభించిన విద్యార్థులు 20 నుంచి 25 వరకు ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలన్నారు. ఎస్టీ గురుకుల సొసైటీ అదనపు కార్యదర్శిగా సర్వేశ్వర్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీటీడ బ్ల్యూఆర్‌ఈఐఎస్) అదనపు కార్యదర్శిగా వి.సర్వేశ్వర్‌రెడ్డి నియమితులయ్యారు. ఈమేరకు గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తూ ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం సర్వేశ్వర్‌రెడ్డి గిరిజన సంక్షేమ శాఖలో అదనపు సంచాలకుడిగా, టీసీఆర్టీఐ (గిరిజన సంస్కృతి పరిశోధన, శిక్షణ సంస్థ) సంచాలకుడిగా కొనసాగుతున్నారు. గిరిజన గురుకుల సొసైటీ అదనపు కార్యదర్శిగా పనిచేసిన నవీన్ నికోలస్ కేంద్ర సర్వీసులకు డిప్యుటేషన్‌పై వెళ్లడంతో మంగళవారం రిలీవ్ అయ్యారు. ఈ నేపథ్యంలో అదనపు కార్యదర్శిగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు సర్వేశ్వర్రెడ్డికి ప్రభుత్వం అప్పగించింది. -
ఓయూ పీజీ కోర్సుల ఫీజు పెంపు
ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీ పీజీ కోర్సుల ఫీజులను పెంచింది. పదేళ్ల తరువాత పెంచిన ఈ ఫీజులకు పాలక మండలి ఆమోదం లభించిందని, ఈ విద్యా సంవత్సరం(2021–22) నుంచి అమలు కానున్నాయని ఓయూ అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. పెంచిన ఫీజుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి... ఎంఏ(ఆర్ట్స్, సోషల్ సైన్సెస్) రెగ్యులర్ కోర్సులకు గతంలో ఏడాదికి రూ.2,800 ఉండగా ఈ సంవత్సరం నుంచి స్పెషల్ ఫీ, ట్యూషన్ ఫీజుతో కలిపి ఏడాదికి రూ.14 వేలకు పెంచారు. సెల్ఫ్‌ఫైనాన్స్ కోర్సులకు రూ.21 వేలు చేశారు. ఎమ్‌కాం రెగ్యులర్ కోర్సుకు రూ.30వేలు, సెల్ఫ్‌ఫైనాన్స్‌కు రూ.35 వేలు, ఎంసీజే రెగ్యులర్ కోర్సులకు రూ.20 వేలు, సెల్ప్‌ఫైనాన్స్‌కు రూ.30 వేలుగా నిర్ణయించారు. ఎమ్మెస్సీ (సైన్స్, మ్యాథ్స్, ఇతర) రెగ్యులర్ కోర్సులకు గతంలో రూ.3,800 ఉండగా ఈ ఏడాది నుంచి రూ.20,240 వరకు పెంచారు. సెల్ఫ్‌ఫైనాన్స్ ఎమ్మెస్సీ కోర్సులకు రూ.35వేల వరకు చెల్లించాలి. ఓయూ అనుబంధ ప్రవేటు కాలేజీల్లో సెల్ఫ్‌ఫైనాన్స్ ఎంఏ కోర్సులకు రూ.23,100, ఎమ్మెస్సీ కోర్సులకు రూ.33,000, ఎంఈడీ కోర్సుకు ఏడాదికి రూ.66 వేలు కాగా ఇప్పుడు రెండు సంవత్సరాలకు కలిపి రూ.1.36 లక్షలుగా నిర్ణయించారు. విద్యార్థులపై భారం పడకుండా, ప్రభుత్వం నుంచి లభించే ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అనుకూలంగా ఫీజులు పెంచినట్లు అధికారులు పేర్కొన్నారు. -
22 నుంచి 26 వరకు ఏపీ పీజీసెట్
వైవీయూ: రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే ఏపీ పీజీసెట్–2021కు సర్వం సిద్ధమైంది. ఈ నెల 22 నుంచి 26 వరకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో ప్రవేశపరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఏపీ పీజీసెట్ కన్వీనర్ ఆచార్య వై.నజీర్ అహ్మద్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 43,632 సీట్లకు పీజీసెట్ నిర్వహిస్తున్నామన్నారు. వివిధ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం కోసం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 42,082 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల కేంద్రాలు, ప్రధాన నగరాలతోపాటు హైదరాబాద్‌లో సైతం పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 20 ప్రాంతాల్లో 53 కేంద్రాల్లో పరీక్షలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షలకు హాజరుకావాలని కోరారు. -
పీజీ ప్రవేశ పరీక్షకు వేళాయె
కర్నూలు కల్చరల్: ఏపీ పీజీ సెట్–2021కు మొత్తం 42,082 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రంలోని 15 విశ్వవిద్యాలయాలు, అనుబంధ పీజీ కళాశాలల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఏపీ పీజీ సెట్–2021)ను నిర్వహిస్తున్నారు. ఒకే పరీక్షతో విద్యార్థులు తమకు ఇష్టమైన వర్సిటీలో తమకు నచ్చిన కోర్సులో చేరేందుకు, ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్‌ను ప్రవేశపెట్టింది. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలతో పాటు అనుబంధ కళాశాలల్లో 145 కోర్సులకు 43,632 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో 13 పరీక్ష కేంద్రాలతో పాటు హైదరాబాద్‌లోని ఒక కేంద్రంలో పరీక్షలను నిర్వహించనున్నారు. మొత్తం 42,082 దరఖాస్తుల్లో అమ్మాయిలు అత్యధికంగా 23,684 మంది దరఖాస్తు చేసుకోగా, అబ్బాయిలు 18,561 మంది, ట్రాన్స్‌జెండర్స్ ముగ్గురు ఉన్నారు. ఓసీలు 7,769, బీసీ–ఏ 5,557, బీసీ–బీ 5,969, బీసీ–సీ 406, బీసీ–డీ 9,580, బీసీ–ఈ 1,511, ఎస్సీ 9,363, ఎస్టీ 2,093, పీహెచ్ 342 మంది ఉన్నారు. విశాఖపట్నంలో 5,895, తూర్పు గోదావరిలో 4,677, కర్నూలులో 4,019, కృష్ణాలో 3,431, అనంతపురంలో 3,420, విజయనగరంలో 3,355, పశ్చిమ గోదావరిలో 3,158, చిత్తూరులో 2,816, గుంటూరులో 2,666, వైఎస్సార్ కడపలో 2,321, శ్రీకాకుళంలో 2,304, నెల్లూరులో 1,837, ప్రకాశంలో 1,647, హైదరాబాద్‌లో 540 మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు కేంద్రాలను ఎంచుకున్నారు. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని ఏపీ పీజీ సెట్–2021 కన్వీనర్ ప్రొఫెసర్ వై.నజీర్అహ్మద్ పేర్కొన్నారు. ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు సబ్జెక్టుల వారీగా షెడ్యూల్ ప్రకారం ఆన్లైన్లో పరీక్ష జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు ముందస్తుగా ఎంపిక చేసుకున్న కేంద్రాల్లో పరీక్షలు రాసేందుకు ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. కోవిడ్–19 నిబంధనలను అనుసరించి పరీక్షల నిర్వహణ ఉంటుందని తెలిపారు. -
బోగస్ పేర్లతో ఫీజురీయింబర్స్‌మెంట్ స్వాహా
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీల్లో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. డిగ్రీ కళాశాలల్లో పీజీ తరగతులను నిర్వహిస్తున్నవి కొన్ని కాగా... విద్యార్థుల నుంచి వసూలు చేసిన ఫీజులను యూనివర్సిటీలకు చెల్లించకుండా తమ ఖాతాల్లోనే దాచుకున్న కళాశాలలు మరికొన్ని. ఇక అసలు విద్యార్థులు లేకుండానే ఉన్నట్లుగా చూపిస్తూ బోగస్ పేర్లతో ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు కాజేస్తున్న కాలేజీలు మరికొన్ని ఉన్నట్లు ప్రాథమిక విచారణలో అధికారులు గుర్తించినట్లు సమాచారం. ప్రధానంగా ప్రైవేట్ కాలేజీల్లో వసతులతో పాటు రికార్డులను అధికారులు క్షుణ్నంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. తనిఖీలను మరో రెండు రోజుల్లో పూర్తి చేసి పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి అందించనున్నట్లు తెలుస్తోంది. ప్రైవేట్ కాలేజీల్లో జరుగుతున్న ఈ అవకతవకలను అరికట్టేందుకే ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను కాలేజీల ఖాతాల్లో కాకుండా జవాబుదారీతనం, పారదర్శకత కోసం నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకే క్యాంపస్‌లో డిగ్రీ, పీజీ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న తనిఖీల్లో పలు కాలేజీల్లో అవకతవకలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధానంగా డిగ్రీ కాలేజీకి అనుమతి పొందిన కొన్నేళ్ల తర్వాత పీజీ కాలేజీకి అనుమతి తీసుకుంటున్నారు. ఒకటో, రెండో తరగతి గదులను పెంచి అదే క్యాంపస్‌లో పీజీ కాలేజీ నిర్వహిస్తున్నారు. ల్యాబ్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం లేదు. బోధనా సిబ్బందిని నియమించకుండా డిగ్రీ అధ్యాపకులతోనే సరిపెడుతున్నారు. ప్రత్యేకంగా తరగతి గదులు, ల్యాబ్, స్టాఫ్ ఉన్నారని తప్పుడు పత్రాలు సృష్టించినట్టు విజిలెన్స్ తనిఖీల్లో బయటపడుతున్నాయి. విద్యార్థుల సంఖ్యల్లోనూ తేడాలు కొన్ని కాలేజీలు యూనివర్సిటీకి, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం సమర్పిస్తున్న విద్యార్థుల సంఖ్యకు, వాస్తవ సంఖ్యకు తేడా ఉన్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. బినామీ విద్యార్థుల ఫీజులను కాలేజీ యాజమాన్యాలు తమ జేబులో వేసుకుంటున్నట్లు వెల్లడవుతోంది. కొన్ని కాలేజీల్లో ఇలాంటి అవకతవకలు గుర్తించినట్లు సమాచారం. మరోవైపు కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు యూనివర్సిటీలకు ఫీజులు చెల్లించకుండా ఏళ్ల తరబడి తమ వద్దే ఉంచుకుంటున్నాయి. అయితే ఆ ఫీజులను మాత్రం విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్నాయి. విశాఖ జిల్లాలోని ఇంజనీరింగ్ కాలేజీ ఏకంగా రూ.10 కోట్ల మేర జేఎన్టీయూ (కాకినాడ)కు చెల్లించాల్సి ఉందని తెలుస్తోంది. -
వచ్చే నెల 18 నుంచి పీజీ ప్రవేశ పరీక్షలు
ఉస్మానియా యూనివర్సిటీ: రాష్ట్రంలో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష(సీపీజీఈటీ)–2021ను వచ్చే నెల 18 నుంచి 27 వరకు ఆన్లైన్లో నిర్వహించనున్నట్లు సీపీజీఈటీ కన్వీనర్ ప్రొ.పాండురంగారెడ్డి ఆదివారం తెలిపారు. 84 సబ్జెక్టులకు రాష్ట్రంలోని 12 జోన్లలో ఈ పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్షల షెడ్యూలును ఉస్మానియా, పీజీ అడ్మిషన్స్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ఉదయం 9.30 నుంచి 11 వరకు, మధ్యాహ్నం ఒటి గంట నుంచి 2.30 వరకు, సాయంత్రం 4.30 నుంచి 6 గంటల వరకు మూడు విభాగాలుగా పరీక్షల సమయాన్ని నిర్ణయించినట్లు తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 14 నుంచి వెబ్సైట్ ద్వారా హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. 40 వేలకు చేరిన మొత్తం సీట్లు రాష్ట్రంలోని పలు వర్సిటీల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో కొత్తగా 7 వేల సీట్లు పెరగడంతో మొత్తం పీజీ కోర్సుల్లో సీట్ల సంఖ్య 40 వేలకు చేరిందని పాండు రంగారెడ్డి తెలిపారు. సీపీజీఈటీకు ఈ నెల 28తో దరఖాస్తు గడువు ముగిసిందని, ఇప్పటివరకు 75 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు ఆయన వివరించారు. పరీక్షకు రూ.500 అపరాధ రుసుముతో సెప్టెంబర్ 6 వరకు, రూ.2000 అపరాధ రుసుముతో 12వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. -
పిజి లా సెట్ ప్రవేశ పరీక్ష
-
ఒక్క పరీక్షతో.. ఏడు వర్సిటీల్లో ప్రవేశం
దేశంలోనే పురాతన యూనివర్సిటీల్లో ఒకటి ఉస్మానియా యూనివర్సిటీ. దీనితోపాటు రాష్ట్రంలోని కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీలు వివిధ కోర్సులు అందిస్తున్నాయి. ఈ ఏడు యూనివర్సిటీల్లో పీజీ, పీజీ డిప్లొమా, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే.. కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్(సీపీజీఈటీ)–2021కు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షను ఈ ఏడాది ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తోంది. కోర్సులు ► సీపీజీఈటీ2021 పరీక్ష ద్వారా ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, పీజీ డిప్లొమా కోర్సులతోపాటు, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఏ, ఎంఎస్సీ, ఎంబీఏ తదితర కోర్సుల్లోనూ ప్రవేశం లభిస్తుంది. ► ఈ పరీక్ష ద్వారా ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ విభాగంలో..పలు ఎంఏ కోర్సులు, జర్నలిజం /లైబ్రరీ సైన్స్/సోషల్ వెల్ఫేర్/ డెవలప్మెం ట్ స్టడీస్ /హెచ్ఆర్ఎం/టూరిజం మేనేజ్మెంట్ కోర్సుల్లో అడ్మిషన్ పొందొచ్చు. ► ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ విభాగంలో.. పురాతన భారతీయ చరిత్ర–సంస్కృతి, పురావస్తు శాస్త్రం(ఏఐహెచ్‌సీఏ), హిందీ, ఇస్లామిక్ స్టడీస్, పర్షియన్, తెలుగు, ఉర్దూ, అరబిక్, ఇంగ్లిష్, కన్నడ, మరాఠీ, సంస్కృతం, తమిళ సబ్జెక్టులు, థియేటర్ ఆర్ట్స్ కోర్సులు ఉన్నాయి. ► ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్‌లో.. ఎంకామ్, ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యు కేషన్లో ఎంఈడీ, ఎంపీఈడీ; ► ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ విభాగంలో.. బోటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రాని క్స్, జియో ఇన్ఫర్మేటిక్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, జువాలజీ, బయోకెమిస్ట్రీ /బయోటెక్నాలజీ/ఎన్విరాన్మెంటల్ సైన్స్/ఫోరెన్సిక్ సైన్స్/ మైక్రోబయాలజీ/ జెనెటి క్స్, న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ వంటి సబ్జెక్టులు ఉన్నాయి. అర్హతలు ► సీపీజీఈటీ–2021కు సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్(బీఏ/బీకామ్/బీఎస్సీ తత్సమాన కోర్సులు) పూర్తిచేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫైనల్ ఇయర్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తుకు అర్హులే. ► బీఏ/బీఎస్సీ/బీకామ్/బీఈ/బీటెక్/బీఫార్మసీ/ ఎల్ఎల్బీ(ఐదేళ్లు)/బీసీఏ వంటి కోర్సులు చదివినవారు ఏయే కోర్సులకు తమ విద్యార్హతలు సరిపోతాయో దరఖాస్తు చేసుకునే ముందు సరిచూసుకోవాలి. ► ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులైన ఎమ్మెస్సీ/ఎంబీఏ/ఎంఏ కోర్సులకు ఇంటర్మీడియట్ (10+2) పూర్తి చేసినవారు అర్హులు. ∙పీజీ డిప్లొమా కోర్సులకు గ్రాడ్యుయేషన్ (ఆయా కోర్సులను బట్టి) పూర్తిచేసి ఉండాలి. ► ఓపెన్/దూర విద్య విధానంలో ఒకే సబ్జెక్టుతో గ్రాడ్యుయేట్ కోర్సు పూర్తి చేసినవారు పీజీ కోర్సులకు అర్హులు కారు. ► బీకామ్ అభ్యర్థులు ఎంఏ ఎకనామిక్స్ చేసేందుకు అనర్హులు. ∙ఎంఏ లాంగ్వేజెస్ కోర్సులకు బీఈ/బీటెక్ వంటి కోర్సులు చేసినవారు అనర్హులు. ► బీఎస్సీ(ఎంఎల్టీ)/బీఎస్సీ(నర్సింగ్)/బీఎస్సీ (అగ్రికల్చర్)/బీఫార్మసీ/బీఎస్సీ(హోమ్‌సైన్స్) /బీటెక్/బీఈ వారు ఎమ్మెస్సీ కోర్సులకు అనర్హులు. ► బీఈ/బీటెక్ అభ్యర్థులు ఎమ్మెస్సీ జియో ఇన్ఫర్మేటిక్స్ , ఫుడ్‌సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో పరీక్ష ఉస్మానియా యూనివర్సిటీ టీఎస్ సీపీజీఈటీను మొత్తం 94 సబ్జెక్టుల్లో నిర్వహిస్తుంది. అభ్యర్థి తన అర్హతలను బట్టి ఆయా కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంట్రన్స్ ఆన్లైన్ విధానంలో(కంప్యూటర్ ఆధారిత పరీక్ష) జరుగుతుంది. 100 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకు జవాబులు గుర్తించాల్సి ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 100 ప్రశ్నలకు 100 మార్కులుంటాయి. అభ్యర్థుల అర్హత, ఎంచుకునే కోర్సులను బట్టి పరీక్ష పేపర్లలో తేడాలుంటాయి. పరీక్ష సమయం 90 నిమిషాలు. ముఖ్య సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ► ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: 25.08.2021 ► రూ.500 ఆలస్య రుసుంతో చివరి తేది: 30.08.2021 ► రూ.2000 ఆలస్య రుసుంతో చివరి తేది: 03.09.2021 ► సీపీజీఈటీ– 2021 పరీక్ష తేది: 08.09.2021 ► వివరాలకు వెబ్సైట్: www.tscpget.com -
వారంలో పీజీ!.. లాడ్జీల్లో పరీక్షలు
సాక్షి,అనంతపురం: రెండేళ్ల పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సు వారం రోజుల్లో పూర్తి చేయడం సాధ్యమా?.. తాము తలచుకుంటే సాధ్యమేనని నిరూపించారు జిల్లాలోని కొందరు ఉపాధ్యాయులు. పైగా ఆ సర్టిఫికెట్లతో పదోన్నతులు కూడా పొందారు. 2009 ఫిబ్రవరిలో ఇంగ్లిష్ స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి దక్కించుకున్న వారిలో ఎక్కువ మంది ఇలా నకిలీ పీజీ సర్టిఫికెట్లతోనే కథ నడిపించినట్లు తెలుస్తోంది. నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంపై తాజాగా ‘సాక్షి’ కథనాలు ప్రచురిస్తుండగా..అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. లాడ్జీల్లో పరీక్షలు ఇంగ్లిష్ స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు ఎంఏ ఇంగ్లిష్ చదివి ఉండాలన్నది నిబంధన. దీంతో కొందరు ఎస్జీటీలు అడ్డదారుల్లో సర్టిఫికెట్లు పుట్టించారు. ఇతర రాష్ట్రాల్లోని యూనివర్సిటీల అధికారులకు కాసులు సమర్పించారు. వారి సహకారంతో రాత్రిళ్లు లాడ్జీల్లో పరీక్షలు రాసేశారు. వారంలో సర్టిఫికెట్లు తెచ్చేసుకుని.. విద్యాశాఖ అధికారులకు సమర్పించారు. ఇలా 77 మంది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) గుర్తింపు లేని రాజస్థాన్‌లోని విహబ్ యూనివర్సిటీ సర్టిఫికెట్లు సమర్పించి పదోన్నతులు పొందినట్లు సమాచారం. గుడ్డిగా పదోన్నతులిచ్చిన విద్యాశాఖ పదోన్నతి కోసం సదరు ఉపాధ్యాయులు ఇచ్చిన సర్టిఫికెట్లు నిజమైనవా..కావా అన్న అంశాన్ని జిల్లా విద్యాశాఖ అధికారులు ధ్రువీకరించుకోవాలి. ఇందుకోసం సదరు యూనివర్సిటీల అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది. కానీ ఎస్ఏ ఇంగ్లిష్ పోస్టు కోసం సమర్పించిన సర్టిఫికెట్ల గురించి ఏ అధికారీ ఆరా తీయలేదు. అసలు సదరు యూనివర్సిటీ దేశంలో ఉందా..లేదా అని కూడా నిర్ధారించుకోలేదు. తీరా ఇప్పుడు ఈ వ్యవహారం వివాదాస్పదం కావడంతో జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఏ సెక్షన్, బీ సెక్షన్ అధికారులు ఒకరిపై మరొకరు నెపం నెట్టుకుంటున్నారు. మరోవైపు వారం రోజుల్లోనే పీజీ సర్టిఫికెట్లు తెప్పించుకుని సర్వీసు రిజిష్టర్ (ఎస్ఆర్)లో నమోదు చేయించుకున్న కొందరు ఉపాధ్యాయులు.. ఈ వ్యవహారం రచ్చ కావడంతో అదే సబ్జెక్టుకు సంబంధించి మరో వర్సిటీ నుంచి పీజీ పూర్తి చేశారు. తిరిగి ఆ సర్టిఫికెట్ ఆధారంగా ఎస్‌ఆర్‌లో నమోదు చేయించుకున్నారు. అయినా విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడంపై తెరవెనుక భారీగానే మంత్రాంగం నడిచినట్లు తెలుస్తోంది. -
విద్యార్థుల ప్రాణాలు పణంగా పెడతారా?
సాక్షి, హైదరాబాద్: ‘నగరంలో కోవిడ్ కేసులు నిత్యం వేలల్లో పెరుగుతున్నాయి. పరిస్థితి దారుణంగా ఉంది. ఇలాంటి సమయంలో విద్యార్థుల ప్రాణాలు పణంగా పెట్టి పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారా?’అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కోవిడ్‌తో సొంతూర్లకు వెళ్లిన విద్యార్థులు హైదరాబాద్‌కు ఎలా రావాలని, ఒకవేళ వచ్చినా వసతి గృహాల్లోకి ప్రవేశం లేదని, అందువల్ల వారు ఎక్కడుండాలని నిలదీసింది. అలాగే సిటీ బస్సు సర్వీసులు లేవని, అలాంటప్పుడు వారు పరీక్షా కేంద్రాలకు ఎలా చేరుకోవాలని ఏజీని ప్రశ్నించింది. కోవిడ్ విజృంభిస్తున్నందున ఎంట్రన్స్ టెస్ట్‌లతోపాటు యూజీ, పీజీ పరీక్షలనూ ఆన్లైన్లో నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్యూఐ–తెలంగాణ శాఖ అధ్యక్షుడు బల్మూరి వెంకట నరసింగరావు, గరీబ్ గైడ్ స్వచ్ఛంద సంస్థ వేర్వేరుగా దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డితో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. లాక్డౌన్ నేపథ్యంలో విద్యార్థులు సొంతూర్లకు వెళ్లిపోయారని, ఇప్పుడు పరీక్షలు రాసేందుకు తిరిగి హైదరాబాద్‌కు రావాలనుకున్నా.. రవాణా సౌకర్యాలు లేవని పిటిషనర్ తరఫు న్యాయవాది సి.దామోదర్ రెడ్డి వాదనలు వినిపించారు. నగరంలోని హాస్టల్స్‌లోకి ప్రవేశం లేదని, ఇటీవల కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం కూడా ఈ నెల 30 వరకు కళాశాలలు, పాఠశాలలు తెరవడానికి వీల్లేదని గుర్తుచేశారు. యూనివర్సిటీ గ్రాం ట్స్ కమిషన్ (యూజీసీ) ఇచ్చిన సమాచారం ప్రకారం ఇప్పటికే 194 విశ్వవిద్యాలయాలు పరీక్షలు నిర్వహించాయని, మెజారిటీ వర్సిటీలు ఆన్లైన్లోనే వాటిని జరిపాయని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. రాష్ట్రంలో ఇటీవల వరకు పరీక్షలు ఉంటాయో లేదో అనే సందే హం ఉందని, అకస్మాత్తుగా పరీక్షలు అంటే వి ద్యార్థులు ఇబ్బందులు పడతారని చెప్పారు. గ్రామాల్లో ఇంటర్నెట్ సౌకర్యం లేక చాలా మంది విద్యార్థులు ఆన్లైన్ తరగతులకే హాజరుకాలేకపోతున్నారని వివరించారు. మరి ఆన్లైన్లో పరీక్షలు ఎలా రాస్తారని ధర్మాస నం దామోదర్‌రెడ్డిని ప్రశ్నించింది. దీనికి ఆయన వివరణ ఇస్తూ అందుకే పరీక్షలను మూడు వారాలు వాయిదా వేసి, విద్యార్థులకు గడువు ఇస్తే పరీక్షలకు సమాయత్తం అవుతారని చెప్పారు. ఆన్లైన్ పరీక్షలు రాసేందుకు సమీపంలోని పట్టణాల్లో ఏర్పాట్లు చేసుకుంటారని నివేదించారు. దీనిపై అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ మాట్లాడుతూ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేసిందని ధర్మాసనానికి నివేదించారు. అలా గే ప్రశ్నలకు వివరణాత్మకంగా సమాధానాలు రాయాల్సి ఉంటుంది కాబట్టి ఆన్లైన్లో పరీ క్షలు నిర్వహించడం సాధ్యం కాదని తెలిపా రు. ఈ నెల 16 నుంచి ఇంజనీరింగ్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నారని, వీటిని ఆపే లా ఆదేశించాలని మరో పిటిషనర్ తరఫు న్యాయవాది వై.శ్రీనివాసమూర్తి నివేదించా రు. విద్యార్థులు ఒక్క దగ్గర చేరితే వారిని ఆప డం సాధ్యం కాదని, కరచాలనం చేస్తారని, తద్వారా వారికి, వారి తల్లిదండ్రులకు కూడా వైరస్ వ్యాపించే అవకాశం ఉందన్నారు. ఫుట్‌పాత్‌లపై ఎండలో నిలబడుతున్నారు ‘కామన్ ఎంట్రన్స్ ఆన్లైన్ పరీక్షల కోసం విద్యార్థుల వెంట వచ్చే వారి తల్లిదండ్రులు ఫుట్‌పాత్‌ల మీద ఎండలో గంటల తరబడి నిలబడాల్సి వస్తోంది. భౌతిక దూరం పాటించకుండా పక్కపక్కనే నిలబడాల్సిన దుస్థితి. వారికి కనీసం మంచి నీళ్లు కూడా ఇచ్చే అవకాశం లేదు. ఇప్పుడు నిర్వహించబోయే పరీక్షలకు హాజరుకాలేని వారికి మళ్లీ నిర్వహిస్తారా? వాటిని సప్లిమెంటరీ అని కాకుండా మరోసారి నిర్వహిస్తారా? హాస్టల్స్ మూతపడ్డాయి కాబట్టి విద్యార్థులకు వసతి ఎలా కల్పిస్తారు? రవాణా సౌకర్యం ఎలా కల్పిస్తారు? ఇంజనీరింగ్ కోర్సులకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించడానికి అభ్యంతరం ఏంటి?’అని ధర్మాసనం ఏజీని ప్రశ్నించింది. ధర్మాసనం సందేహాలపై ప్రభుత్వం నుంచి సమాచారం తీసుకొని తెలియజేస్తానని, దీనికి గడువు కావాలని ఏజీ కోరడంతో అనుమతిస్తూ విచారణను ఈ నెల 14కు వాయిదా వేసింది. -
21 నుంచి పద్మావతి వర్సిటీ పీజీ, బీటెక్ పరీక్షలు
సాక్షి, యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): శ్రీ పద్మావతి మహిళా వర్సిటీలో పీజీ, బీటెక్ చివరి సెమిస్టర్ విద్యార్థులకు ఈ నెల 21 నుంచి 26 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు వర్సిటీ వీసీ ప్రొఫెసర్ డి.జమున మంగళవారం తెలిపారు. ఇందుకోసం వర్సిటీ దూరవిద్యా అధ్యయన కేంద్రాలతో పాటు మరికొన్ని ఇతర కేంద్రాలు వినియోగించనున్నట్లు చెప్పారు. చిత్తూరు, తిరుపతి, కర్నూలు, కడప, నెల్లూరు, ఒంగోలు, అనంతపురం, విజయవాడ, హైదరాబాద్, రాజమండ్రి, విశాఖ, శ్రీకాకుళం నగరాల్లో ప్రతిరోజూ ఉ.10 నుంచి 1 గంట వరకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు మాస్క్‌లు ధరించాలని, శానిటైజర్ తెచ్చుకోవాలని సూచించారు. ఎస్వీయూ సెట్ దరఖాస్తు గడువు పెంపు: ఎస్వీయూలో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తు గడవును ఈ నెల 15 వరకు పొడిగించినట్లు డైరెక్టరేట్ ఆప్ అడ్మిషన్స్ డైరెక్టర్ ఎం.వెంకటేశ్వర్లు తెలిపారు. రూ.500 అపరాధ రుసుంతో దరఖాస్తు చేసే అవకాశం కల్పించామన్నారు. -
ఒకటి నుంచి ఇంటర్ ఆన్లైన్ తరగతులు
సాక్షి, హైదరాబాద్: సెప్టెంబర్ ఒకటి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు ప్రారంభం అవుతాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. వీరితో పాటు, డిగ్రీ, పీజీ విద్యార్థులకు కూడా అదే రోజు నుంచి ఆన్లైన్ బోధన ప్రారంభం అవుతుందని ఆమె స్పష్టం చేశారు. అలాగే పాఠశాల విద్యార్థులకు కూడా డిజిటల్ బోధన ఉంటుందని తెలిపారు. దీని కోసం అధ్యాపకులు, ఉపాధ్యాయులకు శిక్షణ పూర్తి చేశామని తెలిపారు. అధ్యాపకులు ఈ నెల 27 నుంచే కళాశాలలకు వెళ్ళాలని ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబర్ 5న రాధాకృష్ణ జయంతి కార్యక్రమం, ఉత్తమ ఉపాధ్యాయుల సన్మానం కూడా ఉంటుందని మంత్రి తెలిపారు. ఈ మేరకు విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా వుండగా వచ్చే నెల 1 నుంచి పాఠశాల విద్యార్థులకు కూడా ఆన్లైన్ క్లాసులు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. (చదవండి: ఓపెన్ విద్యార్థులందరూ పాస్) (చదవండి: ఫస్ట్ నుంచి ఆన్లైన్ పాఠాలు) -
ఓయూ డిగ్రీ, పీజీ కోర్సుల పరీక్షా ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ డిగ్రీ, పీజీ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ, బీఎస్‌డబ్ల్యూ తదితర కోర్సుల మొదటి, మూడో, అయిదో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల రివాల్యుయేషన్ ఫలితాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో ఉంచినట్లు ఆయన చెప్పారు. ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, హిస్టరీ, ఇంగ్లీష్, ఆర్కియాలజీ, ఉర్దూ, పర్షియన్, ఫిలాసఫీ, మరాఠీ విభాగాల్లో ఎంఏ, ఎమ్మెస్సీ ఎలక్ట్రానిక్స్, ఎంకాం ప్రధమ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఆయన పేర్కొన్నారు. -
ఫెయిలైనా ' పీజీ' అడ్మిషన్ దొరుకుతుంది ఇక్కడ
సాక్షి, కర్నూలు : రాయలసీమ విశ్వవిద్యాలయం అధికారుల తీరు తీవ్ర విమర్శల పాలు అవుతోంది. పరీక్షల విభాగంలో జరిగే అవకతవకలకు అంతే లేకుండా పోతోంది. ఇక్కడ అధికారులు అనుకుంటే ఏదైనా సాధ్యమే అనేది చాలా సార్లు నిరూపితమైంది. ‘నిబంధనలు వర్తించవు.. ఎన్ని సార్లైనా తప్పులు చేస్తాం..మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు’ అనే ధైర్యంతో చలామణి అవుతున్నారు. గతంలో డిగ్రీ రీవ్యాల్యుయేషన్ సమాధాన పత్రాలు మాయమైనా ఎలాంటి చర్యలు లేవు. గత నాలుగు రోజుల కిత్రం డిగ్రీ సమాధాన పత్రాలు తడిసినా పట్టించుకునే దాఖలాలు లేవు. ఇన్ని తప్పిదాలు జరిగినా ఎలాంటి చర్యలు లేక పోవటంతో తప్పులు చేస్తుండటం పరిపాటిగా మారింది. అలాంటిదే బుధవారం ఒక ఘటన జరిగింది. ఇది గురువారం రోజు బయట పడింది. ఫెయిల్ అయిన డిగ్రీ విద్యార్థినికి ఏకంగా పీజీ కౌన్సెలింగ్‌కు అనుమతి ఇచ్చారు. అయితే ఈ విద్యార్థిని ఫెయిల్ అయిన సబ్జెక్టులకు రీ వ్యాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఫలితాలు విడుదల కాలేదు. అయినా పరీక్షల విభాగం సీఈ డాక్టర్ వెంకటే«శ్వర్లు..‘‘ ఆ విద్యార్థిని ఫెయిల్ కాలేదు. ఉత్తీర్ణత సాధించారు. సీజీపీఏ 7.58 పాయింట్లు వచ్చాయి’’ అని లిఖిత పూర్వకంగా ఒక కాపీ ఇచ్చారు. దీంతో ఆ అమ్మాయిలో పీజీ సెట్ రెండో విడత కౌన్సె లింగ్ హాజరయ్యారు. గాయత్రీ ఎస్టేట్‌లోని శంకరాస్ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ (బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ) డిగ్రీ చదివిన ఒక విద్యార్థిని డిగ్రీ నాలుగోసెమిస్టర్లో జువాలజీ, ఆరో సెమిస్టర్ బాటనీలో ఏడో పేపర్ ఫెయిల్ అయ్యారు. ఈ విద్యార్థిని ఆర్యూ పీజీ సెట్లో బాటనీ కోర్సుకు ప్రవేశ పరీక్ష రాసింది. అందులో 46వ ర్యాంక్ సాధించారు. ఫెయిల్ అయిన సబ్జెక్టులకు రీ వ్యాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. వర్సిటీ పరీక్షల విభాగం సీఈని కలిశారు. అయిన ఏమి ఆలోచన చేశారో కానీ ఆ విద్యార్థిని ఏప్రెల్, 2019లో డిగ్రీ బీఎస్సీ పూర్తి చేసిందని, సీజీపీఏ 7.58 పాయింట్లతో ఉత్తీర్ణత సాధించిందని, ప్రొవిజినల్ సర్టిఫికెట్‌కు దరఖాస్తు చేసుకున్నారని, అది ప్రాసెస్‌లో ఉందని ఒక లిఖిత పూర్వక లేఖను విద్యార్థినికి ఇచ్చారు. ఆ అమ్మాయి కౌన్సెలింగ్ కేంద్రంలోని అధికారులను కలిసి సంబంధిత లేఖను చూపించారు. కౌన్సెలింగ్‌లో ఉన్న వెరిఫికేషన్ అధికారులు సర్టిఫికెట్లు పరిశీలించినట్లు సంతకాలు చేశారు. సీఈ ఇచ్చిన కాపీని కాకుండా వెరిఫికేషన్ అధికారులు డిగ్రీ మార్కుల జాబితాలను జాగ్రత్తగా పరిశీలించి ఉంటే జరిగిన తప్పిదం బయట పడేది. ఇవేమీ పట్టించుకోకుండా సీఈ లేఖను ఆధారంగా చేసుకొని వెరిఫికేషన్ పూర్తి చేసి ఆప్షన్లు నమోదు చేసుకోడానికి అనుమతి ఇచ్చారు. ఇది వర్సిటీ అధికారులు నిర్వాకం. ఈ విషయమై సీఈ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ‘‘ఆ విద్యార్థిని డిగ్రీ ఆరో సెమిస్టర్లో ఒక పేపర్ ఫెయిల్ అయింది. రీ వ్యాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకుంది. వర్సిటీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆ అమ్మాయి ఉత్తీర్ణత సాధించినట్లు బోనఫైడ్ సర్టిఫికెట్ ఇచ్చాను. తరువాత ఆ అమ్మాయి సమాధాన పత్రాలను రీ వ్యాల్యు చేయించాను. పాస్ అయింది. మార్కుల జాబితా రావాల్సి ఉంది.’’ అని పేర్కొన్నారు. -
వేదిక్లో నూతన పీజీ కోర్సులు
సాక్షి, తిరుపతి : శ్రీవేంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీలో ఏడు నూతన పీజీ కోర్సులు ప్రవేశ పెడతున్నట్లు వీసీ ప్రొఫెసర్ ఎస్.సుదర్శన వర్మ వెల్లడించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2019–20 విద్యా సంవత్సరం నుంచి ఎంఎస్సీ బాటనీ, ఎంఎస్సీ గణితం, ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ జువాలజీ, ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ హిందీ, ఎంఏ తెలుగు కోర్సులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. దరఖాస్తు తుది గడువు ఈనెల 6వ తేదీతో ముగుస్తుందని తెలిపారు. తొమ్మిదో తేదీ ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. ఈ ప్రవేశ పరీక్షలో ర్యాంకుల ఆధారంగా అడ్మిషన్లు ఉంటా యని తెలిపారు. కోర్సులో చేరేవారికి ఉచిత వసతి భోజన సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ప్రపంచంలో అనేక విషయాల్లో మార్పులు వచ్చాయని, అయితే మార్పు రానిది వేదం మాత్రమే అన్నారు. అందుకే మన దేశం వేదభూమిగా గుర్తింపు పొందిందని తెలిపారు. ఆధునిక కోర్సులు కూడా వేదిక్ వర్సిటీలో వేదానికి సంబంధించిన కోర్సులే కాకుండా ఆధునిక కోర్సులు కూడా ఉన్నాయన్నారు. డిగ్రీ స్థాయిలో బీఎస్సీ, బీఏ కోర్సులు ఉన్నాయన్నారు. ఈ ఏడాది నుంచి పీజీ కోర్సులు ప్రవేశ పెడుతున్నామని తెలిపారు. సంప్రదాయ వర్సిటీలలోని కోర్సులకు వేద విజ్ఞానాన్ని జోడిం చి ఈ కోర్సులకు రూపకల్పన చేశామన్నారు. మహిళా వర్సిటీ, ఎస్వీయూ, ఇతర వర్సిటీల అధ్యాపకులు, నిపుణులతో సిలబస్ రూపొం దించినట్లు తెలిపారు. ఈ కోర్సుల బోధన సిబ్బం ది నియామకాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని వీసీ వివరించారు. -
పీజీ ప్రవేశాలు..చాలా లేజీ
సాక్షి, ఎచ్చెర్ల(శ్రీకాకుళం) : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం, అఫిలియేషన్ కళాశాలల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ ప్రవేశాలు అరకొరగానే జరిగాయి. కొన్ని కోర్సుల్లో ప్రవేశాలు జరగలేదు. వర్సిటీలో పీజీ సెట్ కౌన్సెలింగ్‌కు 727 మంది హాజరయ్యారు. పీజీ సెట్లో 871 మంది విద్యార్థులకు ర్యాంకులు కేటాయిం చారు. ప్రస్తుతం సీటు లభించిన విద్యార్థులు కళాశాలల్లో రిపోర్టు చేయాలి. నిబంధనల మేరకు ఫీజులు చెల్లిస్తేనే సీటు ఖరారు అవుతుంది. ఈ నెల 19లోపు ఈ ప్రక్రియ ముగుస్తుంది. 20, 21 తేదీల్లో రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. సీట్లు సగానికి పైగా మిగిలిపోయే అవకాశాలు ఉన్నాయి. కనీస ప్రవేశాలు జరగని కోర్సుల్లో ప్రవేశానికి రెండో విడత సెట్ నిర్వహిస్తారా? స్పాట్ ప్రవేశాలు కల్పిస్తారా? ప్రవేశాలతోనే తరగతులు నెట్టుకువస్తారా అన్న అంశం అధికారులు తీసుకునే నిర్ణయంపై ఆధార పడుతుంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో 569 సీట్లు ఉండగా, 252 ప్రవేశాలు జరిగాయి. 317 సీట్లు ఖాళీగా మిగిలి పోయాయి. అఫిలియేషన్ కళాశాలల్లో 544 సీట్లు ఉండగా, 134 ప్రవేశాలు జరిగాయి. 410 సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. వర్సిటీ, అఫిలియేషన్ కళాశాలల్లో 1113 సీట్లు ఉండగా, 386 ప్రవేశాలు జరిగాయి. 727 సీట్లు మిగిలిపోయాయి. మరో పక్క అనుబంధ కళాశాలల్లో సైతం కనీస ప్రవేశాలు లేవు. ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో తెలుగులో రెండు, ఎంకాంలో నాలుగు ప్రవేశాలు జరిగాయి. ప్రభుత్వ మహిళలు కళాశాలల్లో తెలుగులో ఒక్కరూ చేరలేదు. గతంలో తెలుగు పీజీకి డిమాండ్ ఉండేది. ఈ ఏడాది వర్సిటీలో సైతం ప్రవేశాలు మెరుగ్గా జరగలేదు. లైఫ్ సైన్స్‌లో డిమాండ్ ఉన్న జువాలజీ కోర్సు ఒక్క మహిళా డిగ్రీ కళాశాలలో మాత్రమే ఉండగా ఎనిమిది ప్రవేశాలు మాత్రమే జరిగాయి. ఒకప్పుడు డిమాండ్ ఉన్న ఎంఈడీలో ఈ ఏడాది కనీస ప్రవేశాలు జరగ లేదు. డీఎడ్, డిగ్రీ పూర్తిచేసిన వారికి అనుమతి ఇచ్చినా కనీస ప్రవేశాలు జరగ లేదు. వర్సిటీలో ఎంఈడీలో ఆరు ప్రవేశాలు జరగ్గా, రంగముద్రి, బీఎస్‌జేఆర్‌లో కనీసం ఒక్క ప్రవేశం జరగ లేదు. గతంలో ఎంకాంకు డిమాండ్ ఉండేది. వర్సిటీలో 40 సీట్లు ఉన్న కోర్సు 50 సీట్లుగా ఈ ఏడాది పెంచారు. వర్సిటీలో 35 ప్రవేశాలు జరగ్గా, ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో నాలుగు ప్రవేశాలు జరిగాయి. ప్రజ్ఞ కళాశాలలో ఒక్క ప్రవేశం జరగ లేదు. వర్సిటీ క్యాంపస్‌లో... పీజీ కోర్సు సీట్లు ప్రవేశాలు బయోటెక్నాలజీ 30 24 మైక్రోబయోలజీ 20 15 జియోఫిజిక్స్ 15 06 ఫిజిక్స్ 40 27 గణితం 40 31 ఎననాటికల్ కెమిస్ట్రీ 20 15 ఆర్గానిక్ కెమిస్ట్రీ 29 27 జియోలజీ 15 01 ఎకనమిక్స్ 40 06 రూరల్ డెవలప్మెంట్ 40 13 సోషల్ వర్క్ 40 04 ఎంఈడీ 40 06 ఎంజేఎంసీ 30 07 ఎంఎల్ఐఎస్సీ 30 07 ఇంగ్లీష్ 40 11 తెలుగు 40 17 ఎంకాం 50 35 బోధన సిబ్బందే ఎక్కువ! పీజీ ప్రవేశాలను పరిశీలిస్తే కొన్ని కోర్సుల్లో చేరిన విద్యార్థులు కంటే బోధన సిబ్బంది ఎక్కువగా ఉన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిబంధనల మేరకు ప్రతి పీజీ కోర్సులో ప్రొఫెసర్, ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు, నలుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాలి. ఈ మేరకు బోధన ఇబ్బంది ఉంటేనే 12(బి), నాక్, ఎన్బీఏ వంటి గుర్తింపులు వస్తాయి. అందుకే యూజీసీ నిబంధనల మేరకు వర్సిటీల్లో పోస్టులు కొనసాగిస్తారు. మరో వక్క వర్సిటీలో ఐదు ప్రొఫెసర్, 14 అసోసియేట్ ప్రొఫెసర్, రెండు బ్యాక్ లాగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఇంటర్వ్యూలు పూర్తిచేయగా, 33 అసిస్టెంట్ ప్రొఫసర్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించాల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇవి వాయిదా పడ్డాయి. జియాలజీలో నలుగురు బోధన సిబ్బంది ఉండగా ఒక్కరే చేరారు. ఎకనామిక్స్‌లో ఐదుగురు బోధన సిబ్బంది ఉండగా ఆరుగురు చేరారు. సోషల్ వర్క్‌లో ముగ్గురు రెగ్యులర్ సిబ్బంది ఉన్నారు. ఇద్దరు కాంట్రాక్టు సిబ్బంది ఉన్నారు. మరో పక్క ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్ పరిధిలో ఉన్నాయి. ఈ కోర్సుల్లో నలుగురు విద్యార్థులు చేరారు. ఎంఈడీలో ఆరుగురు డాక్టరేట్ చేసిన సిబ్బంది ఉండగా, ఆరుగురు విద్యార్థులు చేరారు. ఎంఎల్ఐఎస్సీ, ఇంగ్లీష్, ఎంజేఎంసీలో కనీస ప్రవేశాలు లేవు. -
పిటీ సెంటర్లు!
ఉస్మానియా యూనివర్సిటీ: గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు ఉన్నత విద్యను అందుబాటులోకి తేవాలనే సంకల్పంతో నెలకొల్పిన ఉస్మానియా విశ్వవిద్యాలయ పీజీ కేంద్రాలు సమస్యల వలయంలో చిక్కుకున్నాయి. ఒకవైపు సిబ్బంది, మరోవైపు మౌలిక వసతుల లేమితో కునారిల్లుతున్నాయి. దీంతో పలు పీజీ కోర్సులను సైతం రద్దు చేసిన స్థితికి దిగజారాయంటే ఇవి ఎంతటి దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. అధ్యాపకుల కొరత, అసౌకర్యాల కారణంగా కోర్సుల్లో విద్యా ర్థులు చేరడం లేదు. పీజీ కేంద్రాల భవనాల అద్దెలు, సిబ్బంది వేతనాల వ్యయం భరించలేని స్థితిలో ఓయూ ఆర్థిక పరిస్థితి దీనంగా మారింది. దీంతో ఓయూ పరిధిలోని ఐదు పీజీ కేంద్రాల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. సిబ్బంది విముఖత.. ఓయూ క్యాంపస్, అనుబంధ కాలేజీలు, కార్యాలయాల్లో పని చేస్తున్న అధ్యాపకులు, ఉద్యోగులు బదిలీలపై విముఖత కనబరుస్తున్నారు. ఒకవేళ బదిలీ జరిగినా జంట నగరాల కాలేజీలు, కార్యాలయాలకు మాత్రమే వెళ్లడానికి మాత్రమే వారు ఆసక్తి చూపుతున్నారు. జంట నగరాలు దాటి వెళ్లడానికి ససేమిరా అంటున్నారు. దీంతో వివిధ జిల్లాల్లోని 5 యూనివర్సిటీ పీజీ కేంద్రాలలో పర్మనెంట్ ఉద్యోగులు కొరత కారణంగా కాంట్రాక్టు సిబ్బందిపై పనిభారం పడుతోంది. ఓయూ ఉన్నతాధికారులు సరిపడా టీచింగ్, నాన్‌టీచింగ్ ఉద్యోగులను భర్తీ చేయకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందనే ఆరోపణలున్నాయి. దీంతో జిల్లాల్లోని పీజీ కేంద్రాలను అరకొర సిబ్బందితో నెట్టుకొస్తున్నారు. గెస్ట్ ఫ్యాకల్టీయే దిక్కు.. పీజీ కేంద్రాలపై అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వం నుంచి అనుమతులు లభించినా అధికారులు మాత్రం సదుపాయాలు కల్పించడంలో విఫలమవుతున్నారనే ఆరోపణలున్నాయి. మౌలిక సదుపాయాలు లేకపోవడంతో విద్యార్థులు పీజీ కేంద్రాల నుంచి వెనుదిరుగుతున్నారు. ఆయా కేంద్రాల్లో అధ్యాపకులు లేక గెస్ట్ ఫ్యాకల్టీతోనే నెట్టుకొస్తున్నారు. విద్యార్థులు చేరకపోవడం, చేరినా ఫ్యాకల్టీ కొరతతో అడ్మిషన్లు రద్దు చేసుకోవడంతో కొన్ని కోర్సులను తొలగించాల్సి వస్తోంది. ఇటీవలే నర్సాపురం పీజీ కేంద్రంలో లైబ్రరీ సైన్స్ కోర్సును ర ద్దు చేశారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉండటం, నాన్ టీచింగ్ సిబ్బంది లేకపోవడం వెరసీ పీజీ కేంద్రాల్లో చేరే విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. ఓయూ అధికారులు పీజీ కేంద్రాలపై దృష్టి సారించి ఉద్యోగ నియామకాలు చేపట్టాలని, సొంత భవనాలను నిర్మించి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నత విద్యను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. అన్నీ సమస్యలే.. ఓయూ పరిధిలోని సిద్దిపేట, మీర్జాపూర్, నర్సాపూర్, జోగిపేట, వికారాబాద్‌లలో పీజీ కోర్సులతో జిల్లా పీజీ కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల్లో ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ (ఇంగ్లిష్), ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ), ఎంఏ జర్నలిజంతో పాటు లైబ్రరీ సైన్స్ కోర్సులు అందిస్తున్నారు. ఆయా కేంద్రాల్లో ఉద్యోగుల కొరతతో పాటు సొంత భవనాలు, మౌలిక వసతుల కొరత వేధిస్తోంది. పర్మనెంట్ ఉద్యోగులు వీటిలో పని చేసేందుకు అంతగా ఆసక్తి చూపడంలేదు. ఉద్యోగులు వివిధ అవసరాలు, సౌకర్యాల కోసం నగరంలోనే తిష్టవేస్తున్నారు. దీన్ని ఓయూ వీసీ కూడా సీరియస్‌గా తీసుకోకపోవడంతో సిబ్బంది కొరతతో పీజీ కేంద్రాల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. వీటిని ప్రారంభించి ఏడేళ్లవుతున్నా ఇప్పటివరకూ వాటికి సొంత భవనాలే లేకుండాపోయాయి. విద్యార్థులకు కనీసం హాస్టల్ సౌకర్యం కూడా లేకపోవడంతో ఇబ్బందుల పాలవుతున్నారు. -
ఈ నెల 7న పీజీ వైద్య, దంత కోర్సులకు కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: పీజీ వైద్య, దంత డిగ్రీ/డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు రెండో విడత ఆన్లైన్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు కాళోజీ హెల్త్ వర్సిటీ రిజిస్ట్రార్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 7న ఉదయం 8.30 గంటల నుంచి ఉస్మానియా క్యాంపస్‌లోని ప్రొ.రామ్‌రెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో కౌన్సెలింగ్ జరుగుతుందన్నారు. మేనేజ్మెంట్ కోటా సీట్లకు దరఖాస్తు చేసుకుని, యూనివర్సిటీ విడుదల చేసిన మెరిట్ జాబితాలోని అభ్యర్థులు మాత్రమే అర్హులన్నారు. అభ్యర్థులందరూ ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని తెలిపారు. అందుబాటులో ఉన్న సీట్ల వివరాలు వర్సిటీ వెబ్సైట్లో పొందుపరిచామన్నారు. మేనేజ్మెంట్ కోటా మొదటి విడత కౌన్సెలింగ్‌లో సీట్లు పొంది కాలేజీల్లో చేరని అభ్యర్థులు రెండో విడత కౌన్సెలింగ్‌కు అనర్హులని తెలిపారు. మరింత సమాచారాన్ని యూనివర్సిటీ వెబ్సైట్ knruhs.in లో చూడవచ్చన్నారు. -
మార్పునకు సంకేతం!
కర్నూలు(అగ్రికల్చర్): ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే కీలకం. వారి ఓటుపైనే నాయకుల భవితవ్యం ఆధారపడి ఉంటుంది. తమకు మేలు చేస్తారన్న ఉద్దేశంతోనే ఎన్నికల్లో నాయకులకు ఓట్లేసి గెలిపిస్తుంటారు. గెలిచిన తర్వాత వారి ఆకాంక్షలు, ఆశలకు అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత నాయకులపై ఉంటుంది. అయితే.. ఆ బాధ్యతను విస్మరించి, సొంత ‘వ్యాపకాల’కే పరిమితమైతే మాత్రం దాని పర్యవసానాలు ఆలస్యంగానైనా ఎదుర్కోక తప్పదు. తమలోని అసంతృప్తిని, ఆగ్రహాన్ని ప్రజలు ఓట్ల రూపంలో చూపెడతారు. సరిగ్గా ఇప్పుడు కూడా అదే జరిగి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పోలింగ్ శాతం పెరిగిందంటే అది ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకతను సూచిస్తోందని విశ్లేషిస్తున్నారు. ఈసారి మండు వేసవిలో ఎన్నికలు జరిగాయి. సూరీడు నిప్పులు కక్కుతున్నప్పటికీ జనం మాత్రం పోలింగ్ కేంద్రాల వద్ద బారులుతీరి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అక్కడక్కడ ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు తలెత్తినా, ఓటింగ్ జాప్యమైనా జనంలో మాత్రం ఓటు వేయాలన్న సంకల్పం సడలలేదు. ఓపికతో వేచివుండి, తమకు ఇష్టమైన అభ్యర్థికి ఈవీఎంలో ఓటేసి..అది కరెక్ట్‌గా పడిందా, లేదా అనే విషయాన్ని వీవీప్యాట్ ద్వారా నిర్ధారించుకుని మరీ వెళ్లారు. ఓటర్లలో ఇంత పెద్దఎత్తున చైతన్యం రావడం స్పష్టమైన ‘మార్పు’నకు సంకేతమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పెరిగిన ఓటింగ్ 2014 సాధారణ ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం భారీగా పెరిగింది. 2014 ఎన్నికల సమయంలో జిల్లాలో 30,56,867 మంది ఓటర్లకు గాను 22,57,975 మంది ఓటు వేశారు. పోలింగ్ శాతం 74గా నమోదైంది. ప్రస్తుత ఎన్నికల్లో 31,72,413 మంది ఓటర్లు ఉండగా.. 24,64,492 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ శాతం 77.73కు పెరిగింది. అంటే 3.73 శాతం పెరుగుదల కన్పించింది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు భారీగా పోల్ కావడం వల్లే ఇది సాధ్యమైందన్న అభిప్రాయం ప్రజలు, మేధావుల్లో వ్యక్తమవుతోంది. కర్నూలు, ఆదోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పెరుగుదల స్వల్పమే అయినప్పటికీ.. మిగిలిన అన్ని నియోజక వర్గాల్లో మాత్రం ఆశాజనకంగానే ఉంది. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో 2014లో కేవలం 58 శాతం పోలింగ్ జరిగింది. ఈసారి దీన్ని 65 శాతానికి పెంచాలనుకున్న అధికారులు.. స్వీప్ కార్యక్రమాలను చేపట్టారు. అయినప్పటికీ పెద్దగా ప్రయోజనం కన్పించలేదు. 59.53 శాతానికే పరిమితమైంది. ఎంపీ అభ్యర్థులకు ఓటేయని వైనం ఈ సారి ఓటర్లు భిన్నంగా వ్యవహరించారు. సాధారణంగా పార్లమెంటు, అసెంబ్లీకి ఒకే విధంగా పోలింగ్ జరుగుతుంది. కానీ ఈ సారి మాత్రం అసెంబ్లీకి ఒక రకంగా, పార్లమెంటుకు మరో రకంగా ఓట్లు పోల్ అయ్యాయి. కర్నూలు పార్లమెంటు పరిధిలోని కోడుమూరు అసెంబ్లీ సెగ్మెంటులో పార్లమెంటు అభ్యర్థులకు ఒక రకంగా, అసెంబ్లీ అభ్యర్థులకు మరో రకంగా ఓట్లు పోల్ కావడం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీకి 79.52 శాతం ఓట్లు పోల్ కాగా.. పార్లమెంటుకు వచ్చేసరికి 78.77 శాతానికి పరిమితం కావడం గమనార్హం. అసెంబ్లీకి సంబంధించి పురుషులు 87,178 మంది ఓటు వేయగా.. పార్లమెంటుకు మాత్రం 86,465 మంది వేశారు. మహిళల్లో అసెంబ్లీకి 84,665 మంది, పార్లమెంటుకు 83,740 మంది మాత్రమే ఓటు వేశారు. దీన్నిబట్టి చూస్తే 1,638 మంది ఓటర్లు కేవలం అసెంబ్లీ అభ్యర్థులకు మాత్రమే ఓట్లు వేసి.. పార్లమెంటు అభ్యర్థులను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. శ్రీశైలం నియోజకవర్గంలోనూ స్వల్పంగా ఈ పరిస్థితి ఉంది. పోలింగ్ సిబ్బంది విధిగా ప్రతి ఓటరుతో ఇటు అసెంబ్లీకి, అటు పార్లమెంటుకు ఓట్లు వేయించాల్సి ఉంది. అయితే.. ఈ విషయాన్ని పట్టించుకున్నట్లుగా లేదు. నంద్యాల పరిధిలో ఓటెత్తారు! నంద్యాల పార్లమెంటు నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 16,00,459 మంది ఉన్నారు. ఇందులో పురుషులు 7,89,553, మహిళలు 8,10,572 మంది, ఇతరులు 334 మంది ఉన్నారు. ఇందులో 80.15 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పురుషులు 6,36,213 మంది, మహిళలు 6,46,432 మంది , ఇతరులు 71 మంది..మొత్తంగా 12,82,716 మంది ఓట్లు వేశారు. 2014లో ఇక్కడ 76 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. ఈసారి ఆళ్లగడ్డ, శ్రీశైలం, పాణ్యం, బనగానపల్లి, డోన్ అసెంబ్లీ నియోజక వర్గాల్లో భారీగా పోలింగ్ నమోదైంది. కర్నూలు పరిధిలోనూ వెల్లువెత్తిన చైతన్యం కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలో 2014 ఎన్నికల్లో 72 శాతం ఓటింగ్ నమోదైంది. ఈ సారి ఇది 75.93 శాతానికి పెరిగింది. పార్లమెంటు పరిధిలో 7,85,694 మంది పురుషులు, 7,86,061 మంది మహిళలు, 199 మంది ఇతరులు ఓటర్లుగా ఉన్నారు. ఇందులో పురుషులు 5,96,991, మహిళలు 5,84,764 మంది, ఇతరులు 21 మంది ఓటు వేశారు. మొత్తం 11,81,776 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. కర్నూలు, ఆదోని అసెంబ్లీ సెగ్మెంట్లు మినహా ఆలూరు, పత్తికొండ, కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం సెగ్మెంట్లలో పోలింగ్ శాతం పెరిగింది. ఓటర్లలో ప్రభుత్వంపై వ్యతిరేకత కారణంగానే పోలింగ్ శాతం పెరిగిందనే విషయం స్పష్టమవుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆర్యూ పీజీ పరీక్షలు వాయిదా కర్నూలు(గాయత్రీ ఎస్టేట్): రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో ఈనెల 16 నుంచి జరగాల్సిన పీజీ రెండో సెమిస్టర్, ఎల్ఎల్బీ 4,6,8,10 సెమిస్టర్, ఎమ్ఎసీఏ 4, పీజీ డిప్లమా ఇన్ యోగా రెండు, ఎమ్బీఏ 2,4,6 సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసినట్లు ఆర్యూ ఎగ్జామినేషన్స్ డీన్ ప్రొఫెసర్ సి.వి. కృష్ణారెడ్డి తెలిపారు. విశ్వవిద్యాలయాన్ని ఎన్నికల కౌంటింగ్ కేంద్రంగా ఎంపిక చేసుకోవడంతో పరీక్షలను వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. ఈ పరీక్షలన్నింటినీ జూన్ 4వ తేదీ నుంచి నిర్వహిస్తామని వెల్లడించారు. పరీక్షల తేదీలను వర్సిటీ వెబ్సైట్లో చూసుకోవచ్చని సూచించారు. -
స్టూడెంట్లకు వల..!
శ్రీకాకుళం , ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాయంలో పీజీ విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షలు దగ్గర పడుతున్నాయి. ఏప్రిల్‌లో రెండు, నాలుగు సెమిస్టర్ పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థుల భవిష్యత్‌కు సెమిస్టర్ పరీక్షలు కీలకం. 2019 సార్వత్రిక ఎన్నికలు కూడా దగ్గర పడుతున్నాయి. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదలకు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో పలు ప్రైవేట్ కన్సల్టెన్సీలు విద్యార్థులను సర్వేల కోసం వినియోగించుకుంటున్నారు. ఈ సమయంలో తాయిళాలకు ఆశ పడితే విద్యార్థుల భవిష్యత్ దారుణంగా దెబ్బ తింటుంది. రోజుకు రూ.700 సైతం ఇచ్చేందుకు కన్సల్టెన్సీలు సిద్ధమవుతుండడంపై చాలా అనుమానాలు రేకెత్తుతున్నాయి. దీనికి తోడు ఇదివరకు ఎప్పుడూ ఇంత ఉద్ధృతంగా విద్యార్థులతో సర్వేలు ఎవరూ జరిపించలేదు. దీంతో ఈ కన్సల్టెన్సీల వెనుక అధికార పార్టీ హస్తం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థుల నివేదిక ఆధారంగా ఎన్నికలకు సిద్ధం కావచ్చన్నది రాజకీయ పార్టీల ప్రధాన వ్యూహం. వర్సిటీలో సర్వే సామర్థ్యం, విషయ పరిజ్ఞానం ఎక్కువగా ఉన్న ఎంబీఏ, ఎంకాం, ఎకనామిక్స్, సోషల్ వర్క్ వంటి విభాగాల విద్యార్థులపై ఎక్కువగా సర్వే కన్సల్టెన్సీలు దృష్టి పెడుతున్నాయి. అధ్యాపకులు కూడా ఈ సర్వేలకు వ్యతిరేకంగానే ఉన్నారు. వర్సిటీ ఆధ్వర్యంలో సామాజిక అనుసంధాన కార్యక్రమాల్లో భాగంగా ప్రతి శనివారం సర్వేలు నిర్వహిస్తుంటారు. వర్సిటీ బోధన సిబ్బంది సమక్షంలో ఈ సర్వేలు జరగుతున్నాయి. ప్రస్తుతం వర్సిటీ అధికారులు మాత్రం ప్రైవేటు సర్వేలకు విద్యార్థులకు ఎలాంటి అనుమతులు ఇవ్వటం లేదు. అధికారులకు సంబంధం లేకుండా సర్వేలకు వెళితే మాత్రం నియంత్రించటం కష్టం. ప్రస్తుతం గ్రామాల్లో సర్వే బృందాలకు, అధికార పార్టీ అనుకుల సర్వేలకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అనవసర కేసుల్లో ఇరుక్కుంటారు సర్వేలకు వెళ్లటం వల్ల విద్యార్థులు అనవసర కేసుల్లో ఇరుక్కుం టారు. అధికార పార్టీ యువతను ఎక్కువగా సర్వేలు పేరుతో వాడుకుంటుంది. ప్రైవేట్ సంస్థలకు సర్వేలు అప్పగిస్తుంది. విద్యార్థులు అప్రమతంగా ఉండాలి. గ్రామాల్లో సమస్యలు ఎదురు కావచ్చు. పోలీస్ కేసులు నమోదు కావచ్చు. భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని సర్వేలకు విద్యార్థులు దూరంగా ఉండాలి.– మొదలవలస చిరంజీవి, హైకోర్టు న్యాయ వాధి, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి విద్యార్థులను పిలుస్తున్నారు విద్యార్థులను ప్రెవేట్ కన్సల్టెన్సీ లు సర్వేల కోసం పిలుస్తున్నాయి. అయితే విద్యార్థులు మాత్రం ఆసక్తి చూపించటం లేదు. విద్యార్థి యూనియన్‌గా విద్యార్థులకు సర్వేలకు వెళ్లవద్దని హెచ్చరిస్తున్నాం. విద్యాసంస్థల్లో విద్యార్థులను సర్వేలకు ఆహ్వానించటం మంచి పద్ధతి కాదు.– బి.నరేంద్ర చక్రవర్తి, ఏబీవీపీ యూనియన్ నాయకులు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం. చదువు పై దృష్టిపెట్టాలి విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి. ప్రైవేట్ కన్సల్టెన్సీలకు ఎలాంటి అనుమతులు ఇవ్వడం లేదు. విద్యార్థులు వారి వద్దకు వెళ్లవద్దు. తరగతులకు హాజరై చదువు ప్రాధాన్యమివ్వాలి. విలువైన సమయం దుర్వినియోగం అవుతుంది. సర్వేల కోసం ప్రైవేట్ సంస్థలు విద్యార్థులను నేరుగా కలిస్తే సమస్య మా దృష్టికి తీసుకురావాలి.– ప్రొఫెసర్ కె.రఘుబాబు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం -
నిట్‌లో ‘నవ’శకం
పశ్చిమగోదావరి, తాడేపల్లిగూడెం: నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో తొమ్మిది పీజీ కోర్సులను ప్రవేశపెట్టడానికి సన్నాహాకాలు జరుగుతున్నాయి. తాడేపల్లిగూడెంలో ఏపీ నిట్ ఏర్పాటుచేసి నాలుగేళ్లు గడిచింది. ఈ ఏడాది తొలి బ్యాచ్ విద్యార్థులు బయటకు వెళ్లనున్నారు. పెదతాడేపల్లి వాసవి ఇంజినీరింగ్ కళాశాలలో నిట్ తాత్కాలిక తరగతులు, ల్యాబ్‌లు, బాలికల హాస్టళ్లు కొనసాగుతున్నాయి. నిట్ శాశ్వత భవనాల నిర్మాణ పనులు ఇటీవల ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది ఆగస్టు 19 నాటికి వీటిని పూర్తి చేసేలా పనులు చేస్తున్నారు. తొలి బ్యాచ్ సర్టిఫికెట్లతో విద్యార్థులు నిట్ సొంత ప్రాంగణం నుంచి బయటకు వెళ్లే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. నిట్‌లో పీజీ కోర్సుల ఏర్పాటుకు గాను సన్నాహాకాలు ప్రారంభమయ్యాయి. దేశంలోని 31 నిట్‌లలో ఏపీ నిట్‌కు తక్కువ కాలంలోనే గుర్తింపు వచ్చింది. ఈ నేపథ్యంలో పీజీ కోర్సులను కూడా ఇక్కడ ప్రారంభిస్తే ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నారు. దీంతో తొమ్మిది కోర్సులకు అనుమతి కోసం కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖకు ఫైల్ చేరినట్టు సమాచారం. బయోటెక్నాలజీ, కెమికల్ , సివిల్ ఇంజినీరింగ్, సీఎస్ఈ, ఈఈఈ, ఈసీఈ, మెటలర్జీ ఇంజినీరింగ్‌తో పాటు మేనేజ్మెంటు కోర్సుల ఏర్పాటుకు అనుమతి కోరుతూ ఫైల్ వెళ్లిందని తెలిసింది. బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ ఆమోదం తెలిపితే, ఈ విద్యాసంవత్సరం నుంచి నిట్ ప్రాంగణంలో పీజీ కోర్సులు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. మూడు కంపెనీలతో ఎంఓయూ హైదరాబాద్‌కు చెందిన మూడు కంపెనీలతో నిట్ ఎంఓయూలను కుదుర్చుకుంది. మెక్లీన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో నెట్ వర్కింగ్ ఫీల్డ్‌కు సంబంధించి గతేడాది అక్టోబర్ 26న ఒప్పందం చేసుకున్నారు. ఫెర్వెంటెజ్ సెమికండక్టర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో నెట్ వర్కింగ్, కమ్యూనికేషన్స్‌కు సంబంధించి అక్టోబర్ 22న ఒప్పందం జరిగింది. హైదరాబాద్‌కు చెందిన ఎనిక్సాట్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అనాలిసిస్‌పై గతేడాది నవంబర్ ఒకటో తేదీన ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందాలు మూడేళ్లు ఉంటాయి. జూలై నాటికి హాస్టళ్లు షిఫ్టింగ్ నిట్ తొలిదశ శాశ్వత భవనాల నిర్మాణ పనులు రూ.202 కోట్లతో ప్రారంభించారు. ఒప్పందం ప్రకారం పూణెకు చెందిన కాంట్రాక్టు కంపెనీ షిర్కే ఈఏడాది ఆగస్టు 19 నాటికి భవన నిర్మాణాలను పూర్తి చేయాల్సి ఉంది. జూలై నాటికి నిట్ కొత్త ప్రాంగణంలో హాస్టళ్లు ప్రారంభించడానికి అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు హాస్టల్ భవనాల నిర్మాణాలు ఊపందుకున్నాయి. బాలికల వసతి గృహాల నిర్మాణం, అకడమిక్ భవనాల నిర్మాణ పనులు, గేట్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ల్యాబ్, స్టాఫ్ క్వార్టర్స్, ఫ్యాకల్టీ క్వార్టర్స్, అకడమిక్ భవనాల నిర్మాణాల పనులు ఊపందుకున్నాయి. తొలిదశ భవనాల నిర్మాణ పనులు పూర్తయితే రెండో దశ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. గడువులోపు నిర్మాణాలు పూర్తవుతాయని డైరెక్టర్ సీఎస్పీ రావు తెలిపారు. -
పీజీ కళాశాల ఎదుట విద్యార్థుల ఆందోళన
గద్వాల అర్బన్: పీజీ కళాశాల ఎదుట సోమవారం విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడారు. పీజీ ఇంగ్లిష్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉన్నా.. వారి అభిప్రాయం తీసుకోకుండా ఇంగ్లిష్ విభాగం ఎత్తివేయడం దుర్మార్గమన్నారు. అర్ధంతరంగా ఇంగ్లిష్ విభాగం ఎత్తివేసి ఇతర ప్రాంతాలకు వెళ్లాలని నిర్ణయించడం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడటమేనన్నారు. ఈ రోజు సెమిస్టర్ ఫీజులు చెల్లించేందుకు చివరి రోజైనా కళాశాలకు ప్రిన్సిపాల్, స్టాప్ రాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై నాలుగు రోజుల క్రితం పాలమూరు వీసీని కలిసినా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండో సంవత్సరం మధ్యలో కోర్స్ ఎత్తివేస్తామంటే ఎక్కడికి వెళ్లాలని ఆక్రోశించారు. వివాహం అయిన మహిళల పరిస్థితి మరింత అధ్వానంగా ఉందన్నారు. ప్రైవేటు పీజీ కళాశాలలను ప్రోత్సహించేందుకు యూనివర్సిటీ యాజమాన్యం ప్రయత్రిస్తుందని ఆరోపించారు. ఇప్పటికైనా పాలమూరు వీసీ, ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో విద్యార్థులు అవినాష్, భరణికుమార్, అనూష, పార్వతి తదితరులు పాల్గొన్నారు. -
22 నుంచి వైవీయూ సెట్ కౌన్సెలింగ్
సాక్షి, వైవీయూ : యోగివేమన విశ్వవిద్యాలయం పీజీ కళాశాల, అనుబంధ కళాశాలల్లోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన వైవీయూ సెట్–2018 ప్రవేశాల ప్రక్రియ ఈ నెల 22 నుంచి నిర్వహించనున్నట్లు వైవీయూ ప్రవేశాల సంచాలకుడు ఆచార్య టి.శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 22 నుంచి 24 వరకు మొదటి దశ సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు తమ అర్హతకు సంబంధించిన అన్ని ధ్రువపత్రాలు, హాల్‌టికెట్, ర్యాంకుకార్డు, ఒరిజినల్స్, రెండు సెట్ల జిరాక్స్ కాపీలను తీసుకుని రావాలని సూచించారు. మరిన్ని వివరాలకు నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. జూన్ 22న ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, అడ్వాన్స్డ్ లైఫ్‌సైన్సెస్, తెలుగు, ఉర్దూ కోర్సులకు సంబంధించిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన చేయనున్నట్లు తెలిపారు. అదే రోజు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు కంప్యూటర్‌సైన్స్, ఆంగ్లం, జియాలజీ, పీజీ డిప్లొమో ఇన్ థియేటర్ ఆర్ట్స్, ఫైన్ఆర్ట్స్, ఫుడ్ టెక్నాలజీ, కంప్యూటేషనల్ డేటా సైన్స్‌కు సంబంధించిన అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు. 23న ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు కామర్స్ కోర్సులకు సంబంధించి 1 నుంచి 450వ ర్యాంకు వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు 450పైన ర్యాంకులు సాధించిన అభ్యర్థులకు, భౌతికశాస్త్రం, మెటీరియల్‌సైన్స్ నానోటెక్నాలజీ, 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు, ఎడ్యుకేషన్ కోర్సుకు సంబంధించిన అన్ని ర్యాంకులు సాధించిన అభ్యర్థులకు సర్టిఫికెట్ల పరిశీలన చేయనున్నట్లు వివరించారు. 24న ఉదయం 9 నుంచి 1 గంట వరకు గణితం, స్టాటిస్టిక్స్, జనరల్ టెస్ట్‌లో ర్యాంకు సాధించిన అభ్యర్థులకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు రసాయనశాస్త్రం, పర్యావరణశాస్త్రం, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఎకనామిక్స్ కోర్సుల్లో ర్యాంకులు సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందని తెలిపారు. -
ఆర్యూ పీజీ సెట్ ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభం
సాక్షి, కర్నూలు(గాయత్రి ఎస్టేట్) : రాయలసీమ యూనివర్సిటీ క్యాంపస్ కళాశాలలు, అనుబంధ కళాశాలల్లో పీజీ ప్రవేశాలకు సంబంధించి విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ సోమవారం ఆర్యూ లైబ్రరీ హాల్లో ప్రారంభమైంది. వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.అమర్నాథ్ ప్రక్రియను ప్రారంభించారు. వర్సిటీ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శ్రీనివాసరావు పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధ్రువపత్రాల పరిశీలన ప్రశాంతంగా సాగింది. అనంతపురం ఎస్కేయూ పరిధిలో డిగ్రీ చదివి ఆర్యూ పీజీ సీట్ రాసి మంచి ర్యాంకులు వచ్చిన విద్యార్థులకు నిరాసే మిగిలింది. ఎస్కేయూ డిగ్రీ ఫలితాలు విడుదల చేయక పోవటంతో విద్యార్థులు డిగ్రీ ధ్రువపత్రాలను తెచ్చుకో లేకపోయారు. మంచి ర్యాంకులు తెచ్చుకున్న ఐదుగురు విద్యార్థులు నిరాశతో వెనుదిరిగారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ సబ్జెక్టుకు 22, బాటనీ సబ్జెక్టుకు 117, కంప్యూటర్ సైన్స్‌కు 113, బయోటెక్నాలజీ సబ్జెక్టుకు 19 మంది మొత్తం 271 మంది విద్యార్థుల ధ్రువపత్రాలను పరిశీలించామని పీజీ సెట్ డైరెక్టర్ ప్రొఫెసర్ విజయకుమార్ పేర్కొన్నారు. ఎంఈడీ కోర్సు విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన తేదీని మార్చినట్లు పేర్కొన్నారు. జూలై 31వ తేదీ ఉదయం 10 నుంచి 1 గంట వరకు పరిశీలించడం జరుగుతుందన్నారు. వెబ్ఆప్షన్లు ఆగస్టు 1వ తేదీన ఇచ్చుకోవచ్చన్నారు. మంగళవారం ఉదయం 8.30 గంటలకు కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, మధ్యాహ్నం 1.30 గంటలకు ఇంగ్లిష్, ఓఆర్ అండ్ ఎస్‌క్యూసీ సబ్జెక్టులకు సంబంధించి అన్ని కేటగిరీల వారు 1 నుంచి చివరి ర్యాంకు వరకు హాజరు కావాలన్నారు. అవకాశం కల్పించండి ఆర్యూ పీజీసెట్ కౌన్సె లింగ్‌కు అవకాశం కల్పించాలి. మాది ప్యాపిలి మండలం నల్లమేకల పల్లి గ్రామం. యాడికి వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదివాను. నాకు ఆర్యూ పీజీసెట్‌లో 27వ ర్యాంకు వచ్చింది. ఎస్కేయూ డిగ్రీ ఫలితాలు విడుదల చేయక పోవటంతో నాకు ఆర్‌యూలో పీజీ చేరే అవకాశం లేకుండా పోతోంది. వర్సిటీ అధికారులు స్పందించి అవకాశం కల్పించి ఉన్నత విద్య చదువుకోడానికి అవకాశం ఇవ్వాలి. – వెంకటకృష్ణారెడ్డి, ఫిజిక్స్ 27వ ర్యాంకు -
సుప్రీంకోర్టులో కర్ణాటకకు ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో బుధవారం ఎదురుదెబ్బ తగిలింది. కర్ణాటకలో మెడికల్, డెంటల్ కోర్సుల్లో పీజీ చేయాలనుకునేవారు రాష్ట్రంలో స్థిరనివాసం కలిగిఉండాలంటూ ప్రభుత్వం జారీచేసిన సమాచార బులెటిన్లోని నిబంధన చెల్లదని జస్టిస్ అరుణ్‌మిశ్రా, జస్టిస్ యుయు లలిత్‌ల ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ నిబంధనను సవరించి బులెటిన్‌ను మళ్లీ విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, కర్ణాటక ఎగ్జామినేషన్స్ అథారిటీలను ఆదేశించింది. అలాగే పరీక్షల క్యాలెండర్‌ను పునఃప్రచురించాలని సూచించింది. -
ఆన్లైన్.. హైరానా!
యూనివర్సిటీక్యాంపస్: ఎస్వీయూ పీ జీ విద్యార్థుల సెమిస్టర్ పరీక్ష దర ఖాస్తులు అప్లోడ్ కాకపోవడంతో వి ద్యార్థులు హైరానా పడుతున్నారు. ఎ స్వీయూలో పీజీ సెమిస్టర్ పరీక్షలకు దరఖాస్తు కోసం ఈ నెల 12న నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్‌లో నిర్వహించనున్నారు. ఈ పరీక్ష దరఖాస్తు తుది గడువు శనివారంతో ముగియనుంది. అయితే దరఖాస్తు చేసుకోవడంలో సాంకేతిక సమస్యలు తలెతా ్తయి. దీంతో దరఖాస్తులు అప్లోడ్ కా వడం లేదు. ఫలితంగా విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. గత విద్యాసంవత్సరం నుంచి అమలులోకి వచ్చిన సీబీసీఎస్ విధానం ప్రకారం విద్యార్థులు మూడు రెగ్యులర్ పేపర్లతో పాటు ఒక జనరల్ ఎలక్టివ్, ఒక ఓపెన్ ఎలక్టివ్ పేపర్ చదవాల్సి ఉం ది. ఆన్లైన్లో దరఖాస్తు చేసే సమయంలో జనరల్ ఎలక్టివ్ పేపర్లు ఎం చుకునే కాలమ్‌లో ఒక పేపర్ మా త్రమే ఎంటర్ చేస్తే అప్లోడ్ కావడం లేదు. రెండో పేపర్ ఎంటర్ చేయమ న్న ఆప్సన్ వస్తుంది. వాస్తవానికి వి ద్యార్థులు చదువుతున్నదీ, పరీక్ష రా యాల్సింది ఒక పేపర్ మాత్రమే. అ యితే రెండు జనరల్ పేపర్లు ఎంచుకొనేలా సాఫ్ట్వేర్ ఉండడంతో విద్యార్థుల దరఖాస్తులు అప్లోడ్ కావడం లేదు. గణితం, ఆక్వాకల్చర్, రసాయ న శాస్త్రం, సాంఖ్యక శాస్త్ర విభాగాల్లో ఈ సమస్యలు ఉన్నాయి. అకడమిక్ విభాగం నిర్లక్ష్య వైఖరి వల్ల ఈ స మస్య తలెత్తిందని కొందరు విద్యార్థి నాయకులు పేర్కొంటున్నారు. ఈ స మస్యను పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు. ఈ అంశంపై రె క్టార్ ఎం.భాస్కర్‌ను వివరణ కోరగా ఈ విషయం తన దృష్టికి వచ్చిందన్నా రు. ఈ అంశాన్ని వివిధ విభాగాల వా రితో చర్చించి, పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులు ఆందోళన చెందవద్దని సూచించారు. -
మే 5 నుంచి మెడికల్ పీజీ తరగతులు
సాక్షి, హైదరాబాద్ : విద్యా ఏడాది 2018–19 వైద్య విద్య పీజీ కోర్సుల తరగతులు మే 5 నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కాలేజీల్లోని పీజీ, డిప్లొమా సీట్ల భర్తీ ప్రక్రియను కాళోజీ నారాయణరావు ఆరోగ్య, విజ్ఞాన విశ్వవిద్యాలయం ప్రారంభించింది. నేషనల్ పూల్ పద్ధతిలో సీట్ల భర్తీ చేయనున్నారు. ఈ ప్రవేశాలకు నీట్–2018లో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్ కేటగిరీ విద్యార్థులకు 321, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు 281, దివ్యాంగులకు 300 మార్కులను కటాఫ్‌గా పేర్కొన్నారు. ఈ నెల 31లోపు ఇంటర్న్‌షిప్ పూర్తి చేసే వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే సంబంధిత ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుల ప్రక్రియ ఆన్లైన్ పద్ధతిలోనే జరగనుంది. శుక్రవారం ఉదయం పది గంటలకు మొదలైన ఈ ప్రక్రియ మార్చి 28 సాయంత్రం ఐదు గంటలకు ముగుస్తుంది. మార్కుల జాబితా ఆధారంగా ఈ నెల 30న మెరిట్ జాబితాను విశ్వవిద్యాలయం వెల్లడించనుంది. మార్చి 31న సర్టిఫికెట్ల పరిశీలన చేస్తారు. అనంతరం అభ్యర్థుల సీట్ల కోసం ఆప్షనల్స్‌కు అవకాశం కల్పిస్తారు. ఆ వైద్యులకు అదనపు మార్కులు రాష్ట్రంలో 14 వైద్య విద్యా సంస్థల్లో మెడికల్, సర్జరీ, గైనకాలజీ, నాన్ క్లినికల్ గ్రూపుల్లో 1,023 పీజీ, డిప్లొమా సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ శాఖలోని గిరిజన ప్రాంత ప్రభుత్వ ఆస్పత్రుల్లో వరుసగా మూడేళ్లు పని చేసిన వారికి ఏడాదికి 10% చొప్పున, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వరుసగా మూడేళ్లు పని చేసిన వారికి ఏడాదికి 8% చొప్పున అదనపు మార్కులు కలుపుతారు. పీజీ కోర్సులో చేరే వారు రూ. 5 లక్షల మొత్తానికి బాండ్ సమర్పించాలి. ఈ మొత్తాన్ని కాళోజీ విశ్వవిద్యాలయం తిరిగి చెల్లిస్తుంది. అలాగే తెలంగాణలోనే వైద్య సేవలు అందిస్తానని అంగీకరిస్తూ మరో బాండ్ సమర్పించాల్సి ఉంటుంది. -
ఇన్ సర్వీసు కోటా చిచ్చు
సాక్షి, హైదరాబాద్ : వైద్య విద్య పీజీ సీట్ల అడ్మిషన్లలో కొత్త విధానం వివాదాస్పదంగా మారింది. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్ధతిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేసేవారికి పీజీ అడ్మిషన్లలో ఉండే ప్రాధాన్యతను తగ్గించడంపై వైద్య సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలోని వైద్య విద్య పీజీ సీట్ల భర్తీలో కొత్త విధానాన్ని ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఆస్పత్రిలో పని చేసే రెగ్యులర్ వైద్యులకు కౌన్సెలింగ్‌లో ప్రాధాన్యత కల్పించారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్ధతిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేసే వారికి గతంలో ఉన్న ప్రాధాన్యతను రద్దు చేశారు. దీంతో వైద్య సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. కాళోజీ నారాయణరావు ఆరోగ్య, విజ్ఞాన విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ కరుణాకర్‌రెడ్డి ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించి మార్గదర్శకాలు రూపొందించారని ఆరోపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వ వైద్యుల కేంద్ర సంఘం ముఖ్యులు బుధవారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. సంఘం అధ్యక్షుడు పుట్ల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో.. పీజీ కౌన్సెలింగ్‌లో గతంలో ఉన్న 30% క్లినికల్, 50% నాన్ క్లినికల్ కోటాను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం వల్ల ఇన్ సర్వీసు కోటాలో పీజీ సీట్లు పొందాలనుకునే వైద్యులకు నష్టం కలుగుతుందన్నారు. ‘ప్రభుత్వం ఆరోగ్య తెలంగాణ దిశగా అడుగులు వేస్తు న్న తరుణంలో వైద్యులు ఎంతో కష్టపడి పని చేస్తూ ప్రభుత్వం ప్రవే శపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూ వైద్య సేవలు అందిస్తూ పీజీలో చేరాలనే వారికి ప్రభుత్వ నిర్ణయం ఇబ్బంది కలిగిస్తోంది. ప్రభుత్వం ఈ విషయంలో పునరాలోచన చేసి పీజీ ఇన్ సర్వీసు కోటాను మార్కులతో ముడిపెట్టకుండా గతంలో మాదిరిగా అమలు చేయాలి. సర్వీసు కోటాలో 30% క్లినికల్, 50% నాన్ క్లినికల్ వాటాగా అమలు చేయాలి’అని డిమాండ్ చేశారు. రేపటి నుంచి దరఖాస్తులు.. రాష్ట్రంలోని వైద్య విద్య పీజీ సీట్ల భర్తీ కోసం కాళోజీ నారాయణరావు ఆరోగ్య, విజ్ఞాన విశ్వవిద్యాలయం బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. నీట్ ర్యాంకుల ఆధారంగా సీట్లు భర్తీ చేయనుంది. మార్చి 23 నుంచి 28 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్)తోపాటు రాష్ట్రంలో ని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కాలేజీల్లోని పీజీ సీట్లలో అడ్మిషన్ పొందాలనుకునే వారు ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పీజీ సీట్ల భర్తీకి సంబంధించిన అర్హతలు, అభ్యర్థుల మెరిట్ జాబితా, కాలేజీల వారీగా సీట్ల వివరాలను యూనివర్సిటీ వెబ్సైట్లో పొందుపరచనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది. -
కొత్తగా 27 పీజీ వైద్య సీట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుత విద్యా సంవత్సరానికి గానూ కొత్తగా 27 పీజీ వైద్య సీట్లు పెరిగాయి. సీట్ల పెంపుపై ఈ మేరకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) వైద్య విద్య సంచాలకుడికి లేఖ రాసింది. గాంధీ వైద్య కళాశాల ఛాతీ విభాగంలో 1, అనస్తీషియా విభాగంలో 2, కాకతీయ వైద్య కళాశాల చర్మ వ్యాధుల విభాగం లో 1, స్త్రీ వ్యాధుల చికిత్స విభాగంలో 5, రేడియాలజీలో 3, ఈఎన్టీలో 1, కంటి విభాగంలో 1, ఉస్మానియా వైద్య కళాశాల స్త్రీ వ్యాధుల విభాగంలో 4, ఈఎన్టీ విభాగంలో 3, నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) అనస్తీషియా విభాగంలో 6 సీట్ల చొప్పున పెరిగాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో్ల పెంచిన సదుపాయాలతోనే 27 సీట్లు పెరిగాయని వైద్యారోగ్య మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. -
పరీక్షలను బహిష్కరించబోం
సాక్షి, హైదరాబాద్: పరీక్షల బహిష్కరణ నిర్ణయాన్ని తెలంగాణ కేజీ టు పీజీ విద్యా సంస్థల జేఏసీ ఉపసంహరించుకుంది. పరీక్షలు యథా విధిగా జరిగేలా ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని పేర్కొంది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంది. ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాలను తక్షణం ఇవ్వకపోతే పరీక్షలను బహిష్కరణకు జేఏసీ పి లుపునివ్వడం తెలిసిందే. ఈ నేపథ్యంలో సో మవారం ఉప ముఖ్యమంత్రి మంత్రి కడియం శ్రీహరి చాంబర్లో విద్యా సంస్థల జేఏసీ నేతలు రమణారెడ్డి, పాపిరెడ్డి, వరదారెడ్డి, నరేందర్, ఇతర నేతలు చర్చించారు. చర్చలు పూర్తిగా సఫలమయ్యాయని అనంతరం వారు మీడియాకు తెలిపారు. ‘‘మా సమస్యలను డిప్యూటీ సీఎం సావధానంగా విన్నారు. పరిష్కారం విషయంలో సానుకూలంగా స్పందించారు. అందుకు మార్చి 5న భేటీ అవుతామనడం హర్షణీయం. విద్యాశాఖ పరిధిలోని సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని, లేని వాటిని సీఎం కేసిఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు’’అంటూ కృతజ్ఞతలు తెలిపారు. ఏటా 10 శాతం ఫీజు పెంపు కోరాం ప్రైవేట్ కాలేజీలలో ఫీజులను ఏటా కనీసం 10 శాతం పెంచాలని కడియాన్ని కోరినట్టు జేఏసీ నేతలు చెప్పారు. ‘‘ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదలలో ఇంజనీరింగ్, ప్రొఫెషనల్ కాలేజీలకు ఒక పద్దు, ఇంటర్, డిగ్రీ, పీజీ కాలేజీలు, పాఠశాలలకు ఒక పద్దుగా వేరుగా నిధు లు విడుదల చేయాలని కోరాం. కాలేజీలకు గుర్తింపునివ్వడంలో సమస్యలను వివరించాం. స్కూళ్లకు, కాలేజీలకు కరెంటు చార్జీలు, ఆస్తి ప న్ను ఎక్కువగా వేస్తున్నారని చెప్పాం. ఫైర్ సేఫ్టీ నిబంధనలను 30 ఏళ్ల నాటి భవనాలకు సరళతరం చేయాలని కోరాం. చాలా సమస్యలు నిజమైనవేనని, వాటి పరిష్కారానికి ఎలాంటి ఇబ్బందీ లేదని కడియం చెప్పారు’’అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా పరీక్షల బహిష్కరణ పిలుపును వెనక్కు తీసుకున్నందుకు జేఏసీ నేతలకు కడియం ధన్యవాదాలు తెలిపారు. విద్యా సంస్థల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం సానుకూల వైఖరితో ఉందన్నారు. నిధుల సంబంధిత అంశాలపై సీఎంతో చర్చించి పరిష్కరించే ప్రయత్నం చేస్తానన్నారు. -
ఐఐటీల్లో పీజీ.. ఉద్యోగం ఈజీ!
సాక్షి, హైదరాబాద్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లలో ఇంజనీరింగ్, మేథమెటిక్స్, హ్యుమానిటీస్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ) చదువుతున్న విద్యార్థులకు ఈ ఏడాది ఉద్యోగాల పంట పండింది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ విద్యార్థులకు కంపెనీలు భారీగా వేతనాలు ఆఫర్ చేశాయి. ఐఐటీల్లో చదివే బీటెక్ విద్యార్థులతో పోలిస్తే.. పీజీ (ఎంటెక్) విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్మెంట్లలో ఉద్యోగావకాశాల శాతం (60–65 శాతం మాత్రమే) తక్కువ. కానీ ఈ ఏడాది కాన్పూర్, రూర్కీ, భువనేశ్వర్, ఖరగ్‌పూర్, హైదరాబాద్, గాంధీనగర్ ఐఐటీల్లో పీజీ చదువుతున్న వారిలో 90 శాతం మందికి ఉద్యోగాలు లభించాయి. ముంబై, చెన్నై, ఢిల్లీ ఐఐటీలోనైతే ప్లేస్‌మెంట్‌కు నమోదు చేసుకున్న విద్యార్థులందరికీ ఉద్యోగాలు రావడం గమనార్హం. అంతేకాదు కంపెనీలు గతేడాదితో పోలిస్తే 50 శాతం మేర ఎక్కువగా వేతనాలు ఆఫర్ చేశాయి. గతేడాదికన్నా ఎక్కువగా... ఐఐటీ ఖరగ్‌పూర్‌లో పీజీ చేస్తున్న విద్యార్థుల్లో 570 మందికి ఆయా కంపెనీలు ఉద్యోగాలు ఆఫర్ చేశాయి. గతేడాది ఉద్యోగాలు పొందిన 342 మందితో పోలిస్తే ఇది 40 శాతం అధికం. ఐఐటీ కాన్పూర్‌లో గత సంవత్సరం 301 మందికి ఉద్యోగాలివ్వగా.. ఈసారి 30 శాతం ఎక్కువగా 432 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఇక గత మూడేళ్లలో ఢిల్లీ, చెన్నై ఐఐటీల్లో పీజీ విద్యార్థుల ప్లేస్మెంట్లు 60–75 శాతానికి మించలేదు. కానీ ఈ ఏడాది ఏకంగా 95 శాతం మంది ఉద్యోగాలు పొందారు. అంతేకాదు కాన్పూర్, చెన్నై, రూర్కీ ఐఐటీల్లో ఈసారి ఉద్యోగాలు పొందిన పీజీ విద్యార్థులకు గత ఐదేళ్ల సగటుతో పోల్చితే 90 శాతం అధికంగా వేతన ఆఫర్లు వచ్చాయి. పీజీ విద్యార్థులకు పెరుగుతున్న డిమాండ్ బీటెక్ చదివినవారు కంపెనీల్లో స్థిరంగా ఉద్యోగాలు చేయకపోవడం, ఏడాది రెండేళ్లు పనిచేశాక పైచదువుల కోసం విదేశాలకు వెళ్లిపోవడం వంటి కారణాలతో ఐటీ కంపెనీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చెన్నై ఐఐటీ ప్లేస్మెంట్ విభాగం ఓ విశ్లేషణలో వెల్లడించింది. అందువల్ల రెండు మూడేళ్లుగా పీజీ విద్యార్థులకు ఆఫర్లు ఎక్కువగా వస్తున్నాయని పేర్కొంది. కంప్యూటర్ సైన్స్ వారికి భారీ వేతనాలు ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్‌లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ప్రధానాంశంగా, మెకానికల్‌లో రోబోటిక్స్ ప్రధానాంశంగా పీజీ చేస్తున్నవారికి డిమాండ్ ఎక్కువగా ఉంది. వారికి కనిష్టంగా రూ. 75 లక్షల నుంచి గరిష్టంగా రూ. 90 లక్షల వరకు వార్షిక వేతనాల ఆఫర్లు రావడం గమనార్హం. అంతేకాదు ఈసారి పీజీ పూర్తి చేసుకుంటున్న విద్యార్థులకు గత ఐదేళ్ల సగటుతో పోల్చితే కనిష్టంగా 50 శాతం నుంచి గరిష్టంగా 90 శాతం వరకు అధికంగా వేతనాల ఆఫర్లు వచ్చాయి. ఇంజనీరింగ్ విద్యార్థులు మాత్రమే కాదు డ్యూయల్ డిగ్రీ (ఐదేళ్ల మాస్టర్ డిగ్రీ) చేసిన విద్యార్థులకు కూడా ప్రతిష్టాత్మక కంపెనీలు మంచి ఆఫర్లు ఇచ్చాయి. ఎక్కువ వేతనం ఆఫర్ చేసిన కంపెనీల్లో సామ్సంగ్ ఆర్అండ్డీ, ఇంటెల్, టాటా మోటార్స్, గోల్డ్‌మన్‌శాక్స్, హ్యూందాయ్, మైక్రోసాఫ్ట్, హెచ్‌పీ వంటి కంపెనీలు ఉన్నాయి. ఎన్ఐటీల్లోనూ ‘పీజీ’డిమాండ్ ఐఐటీలే కాదు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)లలో కూడా పీజీ విద్యార్థులకు ఈసారి భారీగా ఉద్యోగ ఆఫర్లు వచ్చాయని నాస్కామ్ తన తాజా బులెటిన్‌లో వెల్లడించింది. ‘‘పీజీ విద్యార్థులు ప్రత్యేకమైన కోర్సులో స్పెషలైజేషన్ పూర్తి చేస్తారు. ఎంపిక చేసుకున్న సబ్జెక్టు మీద వారికి పూర్తిగా అవగాహన ఉంటుంది. దీంతో కంపెనీలు పీజీ విద్యార్థుల మీద దృష్టి పెట్టాయి..’’అని నాస్కామ్ సీనియర్ డైరెక్టర్ పి.అశోక్ చెప్పారు. ఓ మోస్తరు పేరున్న ఇంజనీరింగ్ కాలేజీల్లో కూడా పీజీ విద్యార్థులకు కంపెనీలు ఉద్యోగాలు ఆఫర్ చేస్తున్నాయని తెలిపారు. ఈ ఏడాది తెలంగాణలోని టాప్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీల్లో పీజీ విద్యార్థులకు ప్లేస్మెంట్లు చేపడుతున్నట్లు పలు కంపెనీలు ఇప్పటికే లేఖలు రాశాయి. ఇతర కాలేజీల్లో బీటెక్ చేసినా ఐఐటీల్లో ఎంటెక్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో బ్యాచిలర్ అఫ్ టెక్నాలజీ (బీటెక్) సీటు కోసం దేశవ్యాప్తంగా లక్షలాది మంది పోటీపడతారు. కానీ పది వేల మందికి మాత్రమే సీట్లు లభిస్తాయి. అదే విద్యా సంస్థల్లో పోస్టు గ్రాడ్యుయేషన్‌కు మాత్రం పోటీ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఐఐటీల్లో బీటెక్ పూర్తికాగానే క్యాంపస్ ప్లేస్మెంట్లలో మంచి ఉద్యోగావకాశాలు వస్తుంటాయి. మరికొందరు పైచదువుల కోసం విదేశాలకు వెళ్లిపోవడం జరుగుతోంది. దీంతో ఇతర కాలేజీల్లో బీటెక్ పూర్తి చేసినవారు ఐఐటీల్లో ఎంటెక్ చేసేందుకు అవకాశం లభిస్తోంది. అలాంటివారు ‘గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్)’పరీక్ష ద్వారా ఐఐటీల్లో పీజీ కోర్సులు చేయవచ్చు. -
ఆర్ట్స్ కళాశాలలో పీజీ సీట్లకు స్పాట్ అడ్మిషన్లు
అనంతపురం ఎడ్యుకేషన్: స్థానిక ఆర్ట్స్ కళాశాలలో 2017–18 విద్యా సంవత్సరానికి మిగిలిపోయిన పీజీ కోర్సు సీట్లకు ఈ నెల 21న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్. రంగస్వామి తెలిపారు. ఎమ్మెస్సీ బాటనీలో 5, జువాలజీలో 3, మైక్రో బయాలజీలో 17, జువాలజీలో 22, ఆర్గానిక్ కెమిస్ట్రీలో 8, ఫిజిక్స్‌లో 12, స్టాటిస్టిక్స్‌లో 7, ఎలక్ట్రానిక్స్‌లో 29, ఎంఏ ఇంగ్లీష్‌లో 23, తెలుగులో 10 సీట్లకు అడ్మిషన్లు ఉంటాయని పేర్కొన్నారు. ఆసక్తిగల విద్యార్థులు ఎస్కేయూ నిర్ణయించిన ఫీజుతో సహ కుల, ఆదాయ ధ్రువీకరణపత్రాలు, టీసీ, స్టడీ, కాండక్ట్ సర్టిఫికెట్ తీసుకురావాలని సూచించారు. స్కూసెట్ ర్యాంకు ఉన్నాలేకపోయినా పర్వాలేదని వివరించారు. -
నేటి నుంచి పీజీ కోర్సుల స్పాట్ అడ్మిషన్లు
ఏయూక్యాంపస్(విశాఖతూర్పు): ఆంధ్ర విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలల్లో మిగులు సీట్లను గురువారం నుంచి స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేసుకోవచ్చని ప్రవేశాల సంచాలకులు ఆచార్య కె.రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ ప్రక్రియ ఈ నెల 12వ తేదీలోగా పూర్తి చేయాలని సూచించారు. స్పాట్ అడ్మిషన్లు సంబంధిత కళాశాలల్లోనే జరుగుతాయని, ప్రవేశాల సంచాలకుల కార్యాలయానికి విద్యార్థులు రానవసరం లేదన్నారు. ఈ నెల 14న విశాఖపట్నం జిల్లా కళాశాలలకు, 15న విజయనగరం జిల్లాల కళాశాలలకు ర్యాటిఫికేషన్ చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటివరకు జరిగిన మూడు కౌన్సెలింగ్‌ల్లో ఇప్పటివరకు ప్రవేశం పొందని వారికి మాత్రమే స్పాట్ అడ్మిషన్లకు అవకాశం కల్పిస్తామన్నారు. సంబంధిత డిగ్రీలో ఓసీ, బీసీలు 50 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 45 శాతం మార్కులు కలిగి ఉండాలన్నారు. 2017లో ఇనిస్టెంట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినవారు సైతం ప్రవేశాలకు అర్హులన్నారు. ఆసెట్ రాసిన అభ్యర్థులు లేని పక్షంలో ఆసెట్ పరీక్ష రాయని వారితో భర్తీ చేయవచ్చునన్నారు. వీరు ప్రత్యేకంగా రూ. 1500 రిజిస్ట్రేషన్ చెల్లించాలి. ప్రవేశాలు పొందేవారు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో సంబంధిత కళాశాలను సంప్రదించాలని సూచించారు. 8న ఆఈట్ ప్రవేశాలు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న సమీకృత ఇంజినీరింగ్ కోర్సుల్లో మిగులు సీట్లను ఈ నెల 8వ తేదీన భర్తీ చేస్తామని సంచాలకులు ఆచార్య కె.రాజేంద్ర ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి ఏయూ ఇఇటి పరీక్ష రాసిన 1–2315 ర్యాంకుల వారికి ప్రవేశాలు కల్పిస్తామన్నారు. మిగిలిన సీట్లకు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఏపీ ఎంసెట్, జేఈఈ ర్యాంకులు సాధించిన వారికి కేటాయించడం జరుగుతుందన్నారు. కౌన్సెలింగ్‌కు హాజరయ్యేవారు తమ వెంట ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకురావాలన్నారు. ఇప్పటికే సర్టిఫికెట్ల పరిశీలన ముగిసిన వారు స్క్రాచ్‌కార్డ్‌ను తీసుకురావాలని సూచించారు. కౌన్సెలింగ్ సమయంలో రుసుముగా ఎస్సీ, ఎస్టీలు రూ. 300, ఇతరులు రూ. 500, చెల్లించాలి. ప్రవేశం పొందిన వెంటనే నిర్ణీత ఫీజు రూ 1,50,000 చెల్లించాల్సి ఉంటుంది. ఖాళాల వివరాలను ఠీఠీఠీ.్చ uఛీ్చౌ.జీ n వెబ్సైట్లో పొందుపరిచారు. ఇంటర్ ఎంపీసీలో 50 శాతం మార్కులు కలిగి ఆఈట్, ఏపీ ఎంసెట్, జేఈఈ(మెయిన్స్) ర్యాంక్ సాధించిన వారు దీనికి అర్హులు. ఆఈట్ పరీక్ష రాయని వారు అదనంగా రూ. 2,500 రిజిస్ట్రేషన్ రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది. నో టెస్ట్ కోర్సులకు 9న ప్రవేశాలు ప్రవేశ పరీక్ష నిర్వహించని కోర్సులకు ఈ నెల 9న ప్రవేశాలు కల్పిస్తారు. ఉదయం ఎమ్మెస్సీ జాగ్రఫీ(బీఎస్సీ విభాగం), జాగ్రఫీ(బీఏ విభాగం), ఎంటెక్ అట్పాస్ఫియరిక్ సైన్స్, ఓషన్ సైన్స్, పెట్రోలియం ఎక్స్‌ప్లోరేషన్, సమీకృత జియాలజీ కోర్సు, సమీకృత అప్లయిడ్ కెమిస్ట్రీ, ఎంపీఈడీ కోర్సులకు ఉదయం 9 గంటల నుంచి, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఎంఏ సంస్కృతం, ఎంఏ సోషల్‌వర్క్, పీజీ డిప్లమో ఇన్ కో ఆపరేషన్–రూరల్ స్టడీస్, ఎంఏ హిందీ, బీఎఫ్ఏ, ఎంఎఫ్ఏ, ఎంఏ డాన్స్, ఎంఏ మ్యూజిక్, ఎంఏ యోగా కాన్షియస్నెస్ కోర్సులలో ప్రవేశాలు కల్పించడం జరుగుతుంది. ప్రశేశాలకు హాజరయ్యేవారు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలి. ప్రవేశాలు పొందిన వారు వెంటనే సంబంధిత ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. కౌన్సెలింగ్ ఫీజుగా ఎస్సీ, ఎస్టీలు రూ. 250, ఇతరులు రూ. 500 చెల్లించాలి. -
ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో పీజీ కోర్సులకు అనుమతి
కర్నూలు సిటీ: స్థానిక బీక్యాంపులోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కాలేజీలో పీజీ కోర్సులు పూర్తి చేసేందుకు రాయలసీమ యూనివర్శిటీ అనుమతులు ఇచ్చినట్లు ఆ కాలేజీ ప్రిన్సిపాల్ అయేషాఖాతూన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఏ ఇంగ్లిషు, ఎంఏ తెలుగు, ఎంఎస్సీ ఫిజిక్స్ కోర్సుల్లో ప్రవేశాలకు అనుమతులు వచ్చాయని, ఆసక్తి ఉన్న విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చన్నారు. -
పీజీ డీఐఎస్ఎంకు దరఖాస్తుల ఆహ్వానం
ఎస్కేయూ : పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమో ఇన్ ఇంటిగ్రేటేడ్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ (పీజీ డీఐఎస్ఎం) కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, రక్షా అకాడమీ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా డిప్లమో కోర్సును సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. కామర్స్, లా, మేనేజ్మెంట్, సైన్సెస్ డిగ్రీలో 50 శాతం ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తుకు అర్హులు. ఈ నెల 15 లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన వారికి కొడికొండ చెక్‌పోస్టు వద్ద గల రక్షా అకాడమీలో ఏడాది పాటు శిక్షణ ఇస్తారు. ఆర్మీ, పోలీసు ఫోర్స్‌లలో ఉద్యోగాలు సాధించడానికి ఈ డిప్లమో కోర్సు దోహదపడుతుంది. -
పీజీ ఆయుష్కు ప్రత్యేక ఎంట్రన్స్
కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నిర్ణయం సాక్షి, హైదరాబాద్: పీజీ ఆయుష్ కోర్సులకు ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నిర్ణయించింది. వర్సిటీ పాలకమండలి సమావేశం సోమవారం వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పీజీ నీట్లో లేనటువంటి పీజీ ఆయుష్, నర్సింగ్, న్యూట్రిషన్, పబ్లిక్ హెల్త్ వంటి కోర్సులకు 2017–18లో అడ్మిషన్లకు ప్రత్యేకంగా వర్సిటీ ఆధ్వర్యంలోనే ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. దాదాపు 500 వరకు సీట్లున్న ఈ కోర్సులకు ప్రత్యేక ప్రవేశ పరీక్ష కోసం పాలకమండలి అనుమతి ఇచ్చింది. వర్సిటీలో పరీక్షలన్నింటినీ డిజిటలైజేషన్ చేయాలని నిర్ణయించారు. దీనివల్ల నిష్పాక్షికంగా వ్యవహరించడానికి వీలుకలగనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న మెడికల్, డెంటల్, నర్సింగ్ కాలేజీలకు చెందిన దాదాపు 250 మంది ప్రిన్సిపల్స్ అందరూ అకడమిక్ సెనెట్‌లో సభ్యులుగా ఉన్నారు. అన్ని కాలేజీలకు ప్రాతినిధ్యం అన్న పద్ధతిని సవరించి కేవలం 20 మంది ప్రిన్సిపల్స్ మాత్రమే సభ్యులుగా ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఎంబీబీఎస్, పీజీ, సూపర్ స్పెషాలిటీ కోర్సులకు బోర్డ్ ఆఫ్ స్టడీస్‌ను నెలకొల్పారు. అందులో వైస్ ఛాన్స్‌లర్‌సహా పలువురు వైద్య నిపుణులు సభ్యులుగా ఉంటారు. ఈ సమావేశంలో వైస్ ఛాన్స్లర్ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి, ఆయుష్ కమిషనర్ రాజేందర్‌రెడ్డి, వైద్య విద్య మాజీ సంచాలకులు డాక్టర్ పుట్టా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
టీయూలో ప్రశ్నాపత్రం లీకేజీ?
నిజామాబాద్: తెలంగాణ యూనివర్సిటీ పీజీ పరీక్షల ప్రశ్నపత్రం లీక్ అయినట్లు సమాచారం. మే 16న జరిగిన ఎంఏ మాస్ కమ్యూనికేషన్ నాలుగో సెమిస్టర్ మొదటి పేపర్లోని ప్రశ్నలు బయటికి పొక్కినట్లు ఆలస్యంగా వెలుగులోకి రావడంతో వర్సిటీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రెండు రోజుల ముందే ఈ ప్రశ్నలు బయటకు పొక్కినట్లు తెలుస్తోంది. యూనివర్సిటీ పీజీ పరీక్షలు మే 16 నుంచి ప్రారంభమయ్యాయి. కాగా, సాధారణంగా పీజీ పరీక్ష పత్రాలను ఇతర యూనివర్సిటీల ప్రొఫెసర్లతో తయారు చేయించి తెప్పిస్తుంటారు. ఎంఏ మాస్ కమ్యూనికేషన్ కోర్సుకు సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ప్రశ్నపత్రాన్ని తెప్పించినట్లు సమాచారం. ఈ పత్రాలు పరీక్షకు కొద్ది రోజుల ముందు యూనివర్సిటీకి చేరుతాయి. ఆ పత్రాల్లో ఏమైన అక్షర దోషాలు, తప్పులు, సవరణలు చేయాల్సిన ప్రక్రియ మోడరేషన్‌ను చేపట్టిన అనంతరం పరీక్ష నిర్వహిస్తారు. మోడరేషన్ సందర్భంగా ఈ పేపర్లోని ప్రశ్నలు బయటకు పొక్కాయా? లేక ఇంకా ఏదైనా సందర్భంలో జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంఏ మాస్ కమ్యూనికేషన్‌కు సంబంధించి ప్రశ్నలు బయటికి పొక్కినట్లు సంభాషణ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నట్లు సమాచారం. పరీక్షలో ఏయే ప్రశ్నలు వస్తాయనే అంశంపై వివరిస్తున్న సంభాషణ వాట్సాప్‌లో తిరుగుతోంది. ఈ విషయమై వర్సిటీ వీసీ ప్రొఫెసర్ సాంబయ్యను సంప్రదించగా, ప్రశ్నపత్రం బయటికి పొక్కిన విషయం తన దృష్టికి రాలేదన్నారు. సాధారణంగా పీజీ పరీక్ష పత్రాలు లీకయ్యే అవకాశాలుండవన్నారు. ఇవన్నీ వదంతులు కావచ్చని, అయినా.. విషయం పరిశీలిస్తానని చెప్పారు. -
ముగిసిన ఆర్యూ సెట్
కర్నూలు(ఆర్యూ) : రాయలసీమ విశ్వవిద్యాలయం పీజీ ప్రవేశ పరీక్షలు శనివారంతో ముగిశాయి. చివరి రోజు పరీక్షల్లో రిజిస్ట్రార్ అమర్నాథ్ ఆదోని ఆర్ట్స్ కాలేజ్ కేంద్రాన్ని పర్యవేక్షించారు. ఈ నెల 25 నుంచి 27 వరకు మూడు రోజులుగా ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించారు. నంద్యాల, ఆదోని, కర్నూలులో మొత్తం 4 సెంటర్లలో పరీక్షలు జరిగాయి. ప్రతిరోజు 4 సెషన్ల ప్రకారం మొత్తం 18 డిపార్ట్మెంట్లకు వర్సిటీ క్యాంపస్‌లో 608 సీట్లు, అనుబంధ కళాశాలల్లో 2,600 సీట్లకు 4,397 మంది దరఖాస్తు చేసుకోగా 3,953 మంది(89.9 శాతం) పరీక్షకు హాజరయ్యారు. ఫలితాలను జూన్ 1వ తేదీ లోగా ప్రకటించి మొదటి వారంలో అడ్మిషన్ల ప్రక్రియ చేపడతామని పీజీ సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ సి.వి.కృష్ణారెడ్డి తెలిపారు. -
పీజీ వైద్య యాజమాన్య సీట్లకు నోటిఫికేషన్
జారీ చేసిన కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం - ఆన్లైన్ దరఖాస్తుకు ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం వరకు గడువు - కన్వీనర్ కోటాలో రెండో దశలో మిగిలిన సీట్లకూ నోటిఫికేషన్ సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని పీజీ యాజమాన్య కోటా సీట్లలో ప్రవేశానికి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ జారీచేసింది. ఆన్లైన్లో దర ఖాస్తు చేసుకునే ప్రక్రియ శనివారం ఉదయం 11 గంటలకే ప్రారంభమైంది. ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు దరఖాస్తుకు చివరి తేదీగా ప్రకటించారు. పీజీ నీట్–2017లో అర్హు లైన విద్యార్థులు ఎవరైనా ఈ ప్రవేశాలకు దర ఖాస్తు చేసుకోవచ్చు. దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఈ సీట్లలో ప్రవేశాలకు అర్హులు. దరఖాస్తు అనంతరం కౌన్సెలింగ్ నిర్వహించి రాష్ట్రంలోని 11 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఉన్న పీజీ, డిప్లొమా వైద్య సీట్లను, 8 డెంటల్ కాలేజీల్లోని ఎండీఎస్ సీట్లను భర్తీ చేస్తారు. దరఖాస్తు చేసుకున్న వారి లో అర్హత సాధించిన విద్యార్థుల జాబితాను 24వ తేదీ సాయంత్రమే వెల్లడిస్తారు. 25న 25 శాతం యాజమాన్య కోటా సీట్లకు అర్హత సాధించిన విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఉస్మానియా యూనివర్సిటీలోని దూరవిద్యా కేంద్రంలో నిర్వహిస్తారు. అనంతరం అప్పటికప్పుడే కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లు కేటా యిస్తారు. ఇక 15 శాతం ఎన్ఆర్ఐ కోటా, 10 శాతం ఇన్స్టిట్యూషన్ కోటా సీట్లకు 26వ తేదీ ఉదయం సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేసి సీట్లను కేటాయిస్తారు. ఇక అదేరోజు మధ్యాహ్నం నుంచి ఎండీఎస్ సీట్ల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తిచేసి సీట్లను కేటాయిస్తారు. 27వ తేదీ నాటికి తమకు కేటాయించిన సీట్లలో విద్యార్థులు చేరాలి. సీట్లు మిగిలితే 28వ తేదీన మరో సారి కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. అందులో సీటొచ్చిన విద్యార్థులు 29వ తేదీన చేరాలి. ఆ తర్వాత కూడా సీట్లు మిగిలితే 30, 31వ తేదీల్లోనూ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఇందులో పాల్గొన్న విద్యార్థులు వెంటవెంటనే కాలేజీల్లో చేరాలి. ఈ నెల 31వ తేదీ నాటికి ఎలాగైనా పీజీ వైద్య అడ్మిషన్ల ప్రక్రియను ముగిస్తారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని సీట్లకు, ప్రైవేటులోని కన్వీ నర్ కోటా సీట్లకు రెండో విడత కౌన్సెలింగ్ పూర్తయిన సంగతి తెలిసిందే. ఆ సీట్లలో చేరేం దుకు శనివారం మధ్యాహ్నంతో గడువు ముగి సింది. రెండో విడత కౌన్సెలింగ్‌లో మిగిలి పోయిన సీట్లను భర్తీ చేసేందుకు విశ్వవిద్యా లయం మరో నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఇన్స్టిట్యూషన్ కోటా అంటే..? తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ఈసారి పీజీ మెడికల్ సీట్లలో ఇన్స్టిట్యూషన్ కోటా అంటూ ప్రత్యేక కేటగిరీని తీసుకొచ్చింది. ఇన్స్టిట్యూషన్ కోటాకు 10 శాతం సీట్లు కేటాయించారు. దీంతో పీజీ వైద్య సీట్లలో నాలుగు కేటగిరీలు అయ్యాయి. ప్రస్తుతం కన్వీనర్, యాజమాన్య, ఎన్ఆర్ఐ కోటా సీట్లు మాత్రమే ఉన్నాయి. ఇన్స్టిట్యూషన్ కోటా ఇప్పటివరకు కర్ణాటకలో తప్ప మరే రాష్ట్రంలోనూ లేదు. ఈ ఏడాది నుంచి ఆంధ్రప్రదేశ్‌లోనూ అమలు చేస్తున్నారు. సంబంధిత ప్రైవేటు మెడికల్ కాలేజీ సొంతంగా ఆ సీట్లను కేటాయించుకోవ డానికి వీలు కల్పించడమే ఈ కేటగిరీ ప్రత్యేకత. ప్రైవేటు మెడికల్ కాలేజీ లేదా అనుబంధ బోధనాసుపత్రిలో పనిచేసే వైద్యులు లేదా వారి పిల్లలు లేదా కాలేజీ యజమానుల పిల్లలకు ఈ కేటగిరీలో సీట్లు ఇచ్చుకోవచ్చు. సీట్లు తక్కువగా ఉండి డిమాండ్ ఎక్కువగా ఉంటే ఆ కాలేజీ యాజమాన్యం నచ్చినవారికి ఇచ్చుకోవచ్చు. కాగా, వచ్చే ఎంబీబీఎస్ సీట్ల భర్తీలోనూ ఇన్స్టిట్యూషన్ కోటాను తీసుకొచ్చే ఆలోచన ఉందని అంటున్నారు. -
సమ్మె ఉధృతం
► క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలు బంద్ ► 16వ రోజుకు చేరిన సమ్మె ► త్వరలో తీర్పు: మంత్రి డిమాండ్ల సాధన కోసం వైద్యులు తలపెట్టిన సమ్మె గురువారం నాటికి ఉధృతం దాల్చింది. వైద్య సేవలు పూర్తిగా స్తంభించిపోగా రాష్ట్రవ్యాప్తంగా ఐదువేల ఆపరేషన్లు నిలిచిపోయాయి. వైద్యం అందించేవారు లేక రోగులు ఆర్తనాదాలు చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: పీజీ కోర్సులో ప్రభుత్వ వైద్యులకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ గత నెల 19వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా వైద్యులు సమ్మె జరుపుతున్నారు. గురువారం నాటికి ఈ సమ్మె 16వ రోజుకు చేరుకోగా, ప్రభుత్వ వైద్యులు, హౌస్సర్జన్లు, వైద్య విద్యార్థులు సైతం భాగస్వాములయ్యారు. మానవహారం, ర్యాలీ, నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుకావ డం, క్యాన్సర్ రోగులకు చికిత్స నివారణ వంటి నిరసనలు పాటించారు. ఈ డిమాండ్‌కు సంబంధించిన కేసు బుధవారం విచారణకు రాగా, ఇద్దరు న్యాయమూర్తులు భిన్నమైన అభిప్రాయాన్ని ప్రకటించారు. దీంతో కేసు త్రిసభ్య కమిటీ బెంచ్‌కు మారింది. కేసు విచారణలో ఉన్నందున సమ్మెను విరమించాల్సిందిగా వైద్య మంత్రి విజయకుమార్ కోరారు. అయితే తమ డిమాండ్లను సాధించే వరకు సమ్మెను విరమించే ప్రసక్తి లేదని వైద్యులు తేల్చి చెప్పారు. వైద్యులు ముందుగా తీసుకున్న నిర్ణయం ప్రకారం బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా మూడువేల మందికి జరగాల్సిన ఆపరేషన్లు అకస్మాత్తుగా ఆగిపోయాయి. దీంతో రోగులు తీవ్రంగా ఇబ్బందులకు గురయ్యారు. చెన్నై రాజీవ్‌గాంధీ ప్రభుత్వ ఆస్పత్రి (జీహెచ్)లో సగటున రోజుకు ఐదు వేల మంది చికిత్స పొందుతుంటారు. వీరిలో రెండువేల మంది ఇన్‌పేషంట్లుగా ఉంటారు. అవుట్ పేషంట్ల సేవలకు పెద్దగా ఇబ్బంది తలెత్తకున్నా ఇన్‌పేషంట్ల ఆపరేషన్లకు మాత్రం తీవ్ర విఘాతం ఏర్పడింది. అలాగే కీల్పాక్, స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో గురువారం మరో రెండువేల ఆపరేషన్లు నిలిచిపోయాయి. స్టాన్లీ ఆసుప్రతి వైద్యులు గురువారం నిరాహారదీక్ష చేశారు. విధుల్లో ఉన్న అరకొర వైద్యులను రోగులు నిలదీయగా, వైద్యులు మరో రెండు మూడు రోజుల్లో సమ్మె విరమించగానే ఆపరేషన్లు చేస్తామని ఓదారుస్తున్నారు. అయితే ఈ మాటలకు శాంతించని రోగులు, వారి కుటుంబీకులు వైద్యులతో వాగ్విదానికి దిగుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలతోపాటూ చెన్నై కార్పొరేషన్ ఆధీనంలోని 150 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని వైద్యులు సైతం సమ్మెలో పాల్గొనడంతో జ్వరం తదితర చిన్నపాటి వ్యా«ధిగ్రస్తులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. దీంతో అనేక ఆస్పత్రిల్లో నర్సులే వైద్యం చేస్తున్నారు. త్వరలో మంచి తీర్పు: మంత్రి విజయభాస్కర్ పీజీ కోర్సులో ప్రభుత్వ వైద్యులకు 50 శాతం రిజర్వేషన్‌ను రద్దు చేయరాదనే∙కోర్కెపై కోర్టు నుండి మంచి తీర్పు వెలువడగలదని వైద్యమంత్రి విజయభాస్కర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిల్లో అమ్మవాటర్ పథకాన్ని గురువారం ఆవిష్కరించిన సందర్బంగా మీడియాతో మాట్లాడారు. పీజీ రిజర్వేషన్ అంశంపై కోర్టులో విచారణ జరుగుతున్న కారణంగా సమ్మెను విరమించడం మంచిదని ఆయన అన్నారు. రోగులు ఇబ్బంది పడకూడదనే కారణంతో సమ్మె విరమణపై తాను చొరవతీసుకుని చర్చలు జరిపాను, వైద్యులు సైతం రోగులకు ఇబ్బందులు తలెత్తకుండా వ్యవహరిస్తామని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. 50 శాతం రిజర్వేషన్లో కోర్టు నుంచి మంచి తీర్పును ఆశిస్తున్నానని అన్నారు. -
15న ఓయూ సెట్ నోటిఫికేషన్
హైదరాబాద్: పలు విశ్వవిద్యాలయాల్లో పీజీ అడ్మిషన్లకోసం నిర్వహించే ఓయూసెట్-2017 నోటిఫికేషన్ విడుదల కానుంది. ఓయూసెట్ నోటిఫికేషన్‌ను ఈ నెల 15న విడుదల చేయనున్నట్లు పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ అశోక్ శనివారం తెలిపారు. ఓయూతోపాటు తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు విశ్వవిద్యాలయాల్లో ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంసీజే, ఎంఎల్ఐసీ తదితర పీజీ కోర్సులతోపాటు పీజీ డిప్లొమా, ఐదేళ్ల పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ పరీక్షల ద్వారా సీట్లను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. -
5 నుంచి పీసీపీ తరగతులు
ఎస్కేయూ: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం దూరవిద్య వి భాగం ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ మొదటి సంవత్సరానికి సం బంధించిన పీసీపీ (పర్సనల్ కాంట్రాక్టు ప్రోగ్రాం ) తరగతులు ఈ నెల 5 నుంచి ప్రారంభం కానున్నాయి. ఎస్కేయూ క్యాంపస్ కళాశాల్లోని ఆయా విభాగాల్లో తరగతులు నిర్వహిస్తారు. ఈ నెల 10న పీసీపీ తరగతులు ముగుస్తాయి. -
డిగ్రీ, పీజీ మొదటి సెమిస్టర్ ఫలితాల విడుదల
ఎస్కేయూ : ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల, అనంతపురం (అటానమస్) డిగ్రీ, పీజీ మొదటి సెమిస్టర్ ఫలితాలను ఎస్కేయూ వీసీ ఆచార్య రాజగోపాల్ తన ఛాంబర్లో సోమవారం విడుదల చేశారు. డిగ్రీ మొదటి సెమిస్టర్లో 1,780 మంది విద్యార్థులు హాజరుకాగా 770 మంది ఉత్తీర్ణులయ్యారు. పీజీ మొదటి సెమిస్టర్లో 321 మంది వి ద్యార్థులు పరీక్షలు రాయగా 240 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ ఫలి తాలను ఠీఠీఠీ.జఛీఛ్చ్టిp.ౌటజ ద్వారా తెలుసుకోవచ్చు. కార్యక్రమం లో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ¯ŒS.రంగస్వామి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేష¯Œ్స డాక్టర్ జానకిరామ్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పద్మ శ్రీ,అడిషనల్ కంట్రోలర్ డాక్టర్ లక్ష్మీకాంత్ పాల్గొన్నారు. -
పీజీఈసెట్–2017 షెడ్యూల్ విడుదల
మే 29 నుంచి జూన్ 1 వరకు పరీక్షలు మార్చి రెండో వారం నుంచి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ సాక్షి, హైదరాబాద్: పీజీఈసెట్–2017 పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. తేదీల వారీగా నిర్వహించే పరీక్షల టైమ్‌టేబుల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో శనివారం సెట్ (కామన్ ఎంట్రెన్స్ టెస్ట్) కమిటీ సమావేశమైంది. ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఎస్.రామచంద్రం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, సంయుక్త కార్యదర్శి విజయ్‌కుమార్, కార్యదర్శి శ్రీనివాసరావు, పీజీఈసెట్–2017 కన్వీనర్ సమీన్ ఫాతిమా, కో కన్వీనర్ రమేశ్‌బాబు తదితరులు పాల్గొన్నారు. 2017–18 విద్యాసంవత్సరంలో ఎంఈ/ఎంటెక్., ఎం.ఫార్మసీ, ఫార్మా–డీ కోర్సుల్లో అడ్మిషన్లకు సంబంధించి ప్రవేశ పరీక్ష తేదీలను ఈ సమావేశంలో ఖరారు చేశారు. ఆన్లైన్ పద్ధతిలో పరీక్ష... పీజీఈసెట్–2017 ప్రవేశ పరీక్షను ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ పరీక్షలను హైదరాబాద్‌తో పాటు వరంగల్ నగరాల్లో నిర్వహించనున్నారు. మార్చి రెండో వారం నుంచి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించనున్నారు. అభ్యర్థులు రూ.800 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు మాత్రం రూ.400 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. ఇతర వివరాలకు www.pgecet.tsche.ac.in లేదా www. osmania.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని పీజీఈసెట్–2017 కన్వీనర్ ఒక ప్రకటనలో తెలిపారు. -
ఏఎన్‌యూ పీజీసెట్ నోటిఫికేషన్ విడుదల
ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో 2017–18 విద్యాసంవత్సరంలో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఏఎన్‌యూ పీజీ సెట్–2017 నోటిఫికేషన్‌ను మంగళవారం రిజిస్ట్రార్ ఆచార్య కె.జాన్‌పాల్ విడుదల చేశారు. డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ ఎం.రామిరెడ్డి మాట్లాడుతూ ఏఎన్‌యూ పీజీ సెట్‌కు బుధవారం నుంచి ఏప్రిల్ 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రూ.500 అపరాధ రుసుంతో ఏప్రిల్ 20 వరకూ, తత్కాల్ విధానంలో రూ.1,000 ఫీజు చెల్లించి మే 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మే 5, 6, 7 తేదీల్లో గుంటూరు, ఒంగోలు, విజయవాడల్లో పరీక్షలు జరుగుతాయన్నారు. వివరాలకు www.anudoa.in,www.anu.ac.in వెబ్సైట్లను చూడొచ్చన్నారు. ఏఎన్‌యూ దూరవిద్యాకేంద్రం గత ఏడాది డిసెంబర్లో నిర్వహించిన ఎంఈడీ, ఎల్ఎల్ఎం, డిప్లొమా ఇన్ యోగా కోర్సుల పరీక్ష ఫలితాలను మంగళవారం విడుదల చేసినట్లు దూరవిద్య పీజీ పరీక్షల విభాగం డిప్యూటీ రిజిస్ట్రార్ భవనం ఆంజనేయరెడ్డి తెలిపారు. ఫలితాలను www.anucde.info లో చూడవచ్చు. -
డిగ్రీ పరీక్షలు బాయ్‌కాట్..
హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై సాక్షాత్తూ ముఖ్యమంత్రి హామీ ఇచ్చినా.. అమలు మాత్రం జరగలేదని తెలంగాణ డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్యం తీవ్ర నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 6 నుంచి అన్ని యూనివర్సిటీల పరిధిలో డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షలను బాయ్‌కాట్ చేస్తున్నాన్నట్లు ప్రకటించింది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారని, అయినప్పటికీ ఇప్పటివరకు బకాయిలు తమకు అందలేదని డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్యం వెల్లడించింది. సిబ్బందికి జీతాలు సైతం ఇవ్వలేని స్థితిలో ఉన్నామని వారు వాపోయారు. తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని కాలేజీల యాజమాన్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. -
నీట్ - పీజీ
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్).. జాతీయ స్థాయిలో గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలో మెడికల్, డెంటల్ కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన పరీక్ష. ఇప్పటికే నీట్‌యూజీ ద్వారా2016 విద్యా సంవత్సరంలో ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లలో ప్రవేశాలు జరుగుతున్నాయి. తాజాగా నీట్-పీజీ 2017 నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో పరీక్ష విధివిధానాలు.. నీట్ పీజీ ఉద్దేశం దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్, డెంటల్ కళాశాలల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నీట్-పీజీ నిర్వహిస్తారు. ఇందులో ర్యాంకు ద్వారా ఎండీ, ఎంఎస్, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. నీట్-పీజీ అర్హత వివరాలు ఎంబీబీఎస్, ఎంసీఐ ప్రొవిజినల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పొంది ఉండాలి. 2017, మార్చి 31 లోపు రొటేటరీ ఇంటర్న్‌షిప్ పూర్తిచేయాలి. తెలుగు రాష్ట్రాల విద్యార్థులు 2017, ఏప్రిల్ 15 లోపు రొటేటరీ ఇంటర్న్‌షిప్ పూర్తిచేసి ఉండాలి. ఆ ఆరు మినహా.. దేశంలోని ఆరు ఇన్స్టిట్యూట్లు నీట్ పీజీ పరిధిలోకి రాకుండా మినహాయింపు ఇచ్చారు. అవి.. ఎయిమ్స్-న్యూఢిల్లీ; పీజీఐఎంఈఆర్-చండీగఢ్, జిప్మర్ -పుదుచ్చేరి, ఎస్జీపీజీఐఎంఎస్-లక్నో, నిమ్హాన్స్-బెంగళూరు, శ్రీ చిత్ర తిరునల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సెన్సైస్ అండ్ టెక్నాలజీ- తిరువనంతపురం. ఈ ఇన్స్టిట్యూట్లు తమ పరిధిలోని సీట్ల భర్తీకి వేర్వేరుగా పరీక్షలు నిర్వహిస్తాయి. అభ్యర్థులు సైతం వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష ఇలా నీట్ పీజీ పరీక్షను 300 మార్కులకు ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారు. నెగెటివ్ మార్కులుండవు. మొత్తం 300 ప్రశ్నలు ఉండే పరీక్షలో ఎంబీబీఎస్ స్థాయిలోని 15 సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఇస్తారు. అవి.. ఫోరెన్సిక్ మెడిసిన్, ఆప్తాల్మాలజీ, సైకియాట్రిక్స్ ఒక్కో విభాగం నుంచి పది ప్రశ్నలు ఠి అనాటమీ, ఫిజియాలజీ, బయో కెమిస్ట్రీ, పీడియాట్రిక్స్ ఒక్కో విభాగం నుంచి 15 ప్రశ్నలు ఠి పాథాలజీ, సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్, ఆబ్స్ట్రెస్ట్రిక్స్ అండ్ గైనకాలజీ ఒక్కో విభాగం నుంచి 25 ప్రశ్నలు ఠి మెడిసిన్, డెర్మటాలజీ, వెరనాలజీ విభాగాల నుంచి 37 ప్రశ్నలు ఠి సర్జరీ, ఈఎన్టీ, ఆర్థోపెడిక్స్, అనస్థీషియా విభాగాల నుంచి 46 ప్రశ్నలు ఠి రేడియో డయాగ్నసిస్, రేడియో థెరపీ విభాగాల నుంచి 12 ప్రశ్నలు ఠి ఫార్మకాలజీ, మైక్రో బయాలజీ ఒక్కో విభాగంలో 20 ప్రశ్నలు. కనీస అర్హత మార్కులు సాధిస్తేనే నీట్ -పీజీలో జనరల్ కేటగిరీ అభ్యర్థులు 50 శాతం; ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు 40 శాతం కనీస మార్కులు సాధించాలి. వీరిని మాత్రమే కౌన్సెలింగ్‌కు పిలుస్తారు. కౌన్సెలింగ్ ఇలా.. ఠి ఆల్ ఇండియా కోటాలో 50 శాతం: దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్, డెంటల్ కళాశాలల్లో ప్రవేశానికి అన్ని రాష్ట్రాల అభ్యర్థులు అర్హులు. వీరు ఆన్లైన్ విధానంలో సెంట్రలైజ్డ్ కౌన్సెలింగ్‌లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. 50 శాతం మేరకు అందుబాటులో ఉండే సీట్లకు ఐదింతలు ఎక్కువగా మాత్రమే అభ్యర్థులకు ర్యాంకులు కేటాయిస్తారు. అంటే ఒక్కో సీటుకు ఐదుగురు చొప్పున కౌన్సెలింగ్‌లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. స్టేట్ కోటాలో 50 శాతం: ఆల్ ఇండియా కోటాకు 50 శాతం సీట్లు పోగా మిగిలిన 50 శాతం సీట్లను ఆయా రాష్ట్రాల ప్రభుత్వాల పరిధిలో ఆన్లైన్ కౌన్సెలింగ్ ద్వారా భర్తీచేస్తారు. ఏపీ, టీఎస్‌లకు వర్తించని ఆల్ ఇండియా కోటా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులకు ఆల్ ఇండియా కోటా సీట్లకు పోటీ పడే అర్హత లేదు. వీరు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని కళాశాలలకు మాత్రమే పోటీపడాల్సి ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ముఖ్య తేదీలు ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 31, 2016. ఆన్లైన్ పరీక్ష తేదీలు: డిసెంబర్ 5 నుంచి 13 వరకు తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం ఉమ్మడి పరీక్ష ప్రయోజనకరం పీజీ స్థాయిలో నీట్ పేరుతో జాతీయ స్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించడం విద్యార్థులకు ప్రయోజనకరం. మన తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఆల్ ఇండియా కోటాలో పోటీ పడే అవకాశం లేకపోయినా.. బహుళ ఎంట్రెన్సులు రాయాల్సిన అవసరం ఉండదు. ఇప్పటి వరకు మన రాష్ట్రంలో పీజీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశించాలంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిర్వహించే ఏపీపీజీమెట్, నిమ్స్ నిర్వహించే పీజీ మెట్లు రాయాల్సి ఉండేది. ఎంబీబీఎస్ స్థాయిలో బేసిక్స్, ప్రివెంటివ్ మెడిసిన్‌పై అవగాహన ఉన్నవారు మెరుగైన మార్కులు సొంతం చేసుకోవచ్చు. - డాక్టర్. నంద కిశోర్, ఎంసీఐ సభ్యులు -
డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షల బహిష్కరణ
హైదరాబాద్: డిగ్రీ, పీజీ సప్లిమెంటరీ పరీక్షలను బహిష్కరిస్తున్నట్లు తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీల యజమాన్యాల సంఘం ఆదివారం ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంటు బకాయిలు చెల్లించేవరకూ డిగ్రీ, పీజీ పరీక్షలకు సహకరించమని తేల్చి చెప్పింది. -
‘జవాబు’దారీతనం ఏదీ?
→ మూల్యాంకన నిబంధనలకు తిలోదకాలు → ఆలస్యం కానున్న దూరవిద్య పీజీ కోర్సుల ఫలితం ఎస్కేయూ : శ్రీకష్ణదేవరాయ విశ్వవిద్యాలయం దూరవిద్య పీజీ కోర్సులకు సంబంధించి జవాబుపత్రాల మూల్యాంకనంలో ఆ విభాగం అధికారులు నిబంధనలకు తిలోదకాలు ఇచ్చారు. పరీక్ష నిర్వహణ, మూల్యాంకన ప్రక్రియ, ఫలితాలు ప్రకటనలో కచ్చితంగా విధానాలు అనుసరించాల్సి ఉంది. కానీ వీటినన్నింటినీ పక్కనబెట్టి నిబంధనలకు విరుద్ధంగా మూల్యాంకనం చేపట్టారు. దూరవిద్య పీజీ మొదటి సంవత్సరం 13 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఒక్కో విద్యార్థి కోర్సుకు సంబంధించి ఐదు టైటిల్స్ రాశారు. అంటే 65 వేలు జవాబు పత్రాలు మూల్యాంకనం చేయించారు. ప్రైవేటు అధ్యాపకులతో.. వాస్తవానికి పీజీ జవాబు పత్రాలు రెండు దఫాలుగా మూల్యాంకనం చేయించాలి. ఇంటర్నల్ (వర్సిటీ ఆచార్యులు, అధ్యాపకులు) ఎక్స్టర్నల్ (బీఓఎస్ గుర్తించిన) అధ్యాపకులతో మూల్యాంకనం నిర్వహించాల్సి ఉంది. పీజీ కోర్సులకు సంబంధించి మొదటి సంవత్సరం జవాబు పత్రాల ఎక్స్టర్నల్ మూల్యాంకనం బోర్డ్ ఆఫ్ స్టడీస్ సూచించిన శాశ్వత అధ్యాపకులతో మూల్యాంకనం చేయించాలని నిబంధనలు ఉన్నాయి. వీటిని పక్కనపెట్టి ప్రైవేటు డిగ్రీ కళాశాల అధ్యాపకులతో పీజీ జవాబు పత్రాల మూల్యాంకనం జరిగిందనే విమర్శలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఎక్స్టర్నల్ మూల్యాంకనం అయిన తరువాత ఇంటర్నల్ మూల్యాంకనం కోసం జవాబు పత్రాలు వర్సిటీ ప్రొఫెసర్ల వద్దకు పంపారు. అనర్హులైన వారితో మూల్యాంకనం చేయించారని ప్రొఫెసర్లు నిర్ధారించి ఇంటర్నల్ మూల్యాంకనం చేయమని కరాఖండిగా స్పష్టం చేస్తున్నారు. దీంతో నిబంధనల అతిక్రమణ బహిర్గతమైంది. ఫలితాలు ప్రకటన ఎలా ? పీజీకి సంబంధించి ఇంటర్నల్, ఎక్స్టర్నల్ మూల్యాంకనాలు నిర్వహిస్తేనే ఫలితాలు ప్రకటించడానికి సాధ్యమవుతుంది. ఎక్స్టర్నల్ మూల్యాంకనంలో తప్పిదాలు చోటు చేసుకోవడంతో ఇంటర్నల్ మూల్యాంకనానికి చిక్కులు ఏర్పడ్డాయి. దీంతో ఫలితాలు ప్రకటన ఆలస్యం కానున్నట్లు తెలిసింది. -
పీజీ వరకూ నాణ్యమైన విద్యనందించాలి
నల్లజర్ల : దేశ విద్యా విధానాన్ని సంస్కరించడం, పునర్నిర్మించడం, పరిపుష్టి చేయడం పేరుతో ప్రభుత్వం బహిరంగ చర్చకు పెట్టిన జాతీయ విద్యావిధానం ముసాయిదాను డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర సదస్సు తిరస్కరించింది. నల్లజర్ల జెడ్పీ హైస్కూల్ ఆవరణలో శనివారం డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పి.కృష్ణయ్య అధ్యక్షతన సమావేశం జరిగింది. అభివృద్ధి నిరోధక బోధనా దుకాణాలకు ఊతమిచ్చే ముసాయిదా స్థానంలో సామాజిక ఉత్పత్తి విధానానికి అనుగుణమైన కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నాణ్యమైన విద్యను కామన్ స్కూల్ రూపంలో సమాజానికి అందించాలని సదస్సు డిమాండ్ చేసింది. ఈ సదస్సులో నూతన విద్యా విధానంపై అఖిల భారత విద్యాహక్కు వేదిక జాతీయ కార్యవర్గ సభ్యుడు సీఎస్ఆర్ ప్రసాద్, ప్రొఫెసర్ ఎం.రవికుమార్, సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్వీ రమణయ్య, సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొణతం నరహరి మాట్లాడారు. డీఈవో డి.మధుసూదనరావు మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో ఎన్రోల్మెంట్ పెరిగే విధంగా చూడాలని సూచించారు. పిల్లల సంఖ్య తగ్గితే ఉపాధ్యాయ వృత్తికే మనుగడ ఉండదన్న విషయం గుర్తించాలన్నారు. ఎమ్మెల్సీ రాము సూర్యారావు మాట్లాడుతూ సమస్యలను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడానికి ఉపాధ్యాయ సంఘాలు కృషి చేయాలన్నారు. కొవ్వూరు ఎమ్మెల్యే కేఎస్ జవహార్, ఎంపీడీవో చిన్నారావు, మండల సర్పంచ్ల ఛాంబర్ అధ్యక్షుడు యలమాటి శ్రీనివాసరావు, ఎంఈవో ఐడీవీ అప్పారావు పాల్గొన్నారు. -
స్పాట్ అడ్మిషన్లు
నిజామాబాద్‌నాగారం: గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో ఎంఏ ఇంగ్లిష్, ఎకనామిక్స్, ఎం.కాం, ఎమ్మెస్సీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలాజీ పీజీ కోర్సులతో పాటు బీఎల్ఐఎస్సీ కోర్సులో ఖాళీగా ఉన్న సీట్లను బుధవారం మధ్నాహ్నం 12 గంటలకు స్పాట్ అడ్మిషన్స్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ రాంమోహన్‌రెడ్డి తెలిపారు. ఓయూసెట్–2016లో ర్యాంక్ పొందిన విద్యార్థులు బుధవారం ఉదయం 11 గంటల్లోపు కళాశాలలో దరఖాస్తు చేసుకొని, స్పాట్ అడ్మిషన్‌కు హాజరు కావాలని సూచించారు. ఓయూసెట్–2016లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా, ఖాళీల సంఖ్య బట్టి సీట్లు కేటాయిస్తామని, అడ్మిషన్ పొందే వారు తక్షణమే ఒరిజినల్ టీసీ సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. అలాగే కోర్సుకు సంబంధించిన మొత్తం ఫీజు, డెవలప్మెంట్ ఫండ్, యూనివర్సిటీ కామన్ సర్వీసు ఫీజును వెంటనే చెల్లించాల్సి ఉంటుందని, వీరు ఫీజు రీయింబెర్సుమెంట్ అర్హులు కారన్నారు. ర్యాంక్ కార్డు, డిగ్రీ టీసీ, విద్యార్హత సర్టిఫికెట్లు ఒరిజినల్‌తో పాటు ఒకసెట్ జిరాక్స్ తీసుకొని రావాలని సూచించారు. -
పీజీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్
– ఎస్వీ యూనివర్సిటీ అధికారుల సాక్షిగా చూచిరాత – పాస్ గ్యారెంటీ పేరుతో ప్రోత్సహిస్తున్న కళాశాల యాజమాన్యం – స్లిప్పులు ఇచ్చి దగ్గరుండి రాయిస్తున్న వైనం – రాసుకుపో అంటూ మీడియాపై ప్రిన్సిపాల్ ఆగ్రహం గాజులపల్లె(మహానంది): ఒకటో తరగతో...రెండో తరగతో కాదు...భవిష్యత్తులో అధ్యాపకులు, ఉన్నత స్థాయి ఉద్యోగులుగా తీర్చిదిద్దే పోస్టుగ్రాడ్యుయేట్ పరీక్షలను ఓ కాలేజీ యాజమాన్యం చూచిరాతగా మార్చేసింది. అభ్యర్థుల నుంచి పాస్ గ్యారంటీ అని రూ.వేలల్లో వసూళ్లు చేసిన కాలేజీ యాజమాన్యం గుట్టుచప్పుడు కాకుండా అభ్యర్థులను పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడేలా చేస్తోంది. మహానంది మండలం గాజులపల్లె గ్రామంలోని ఓ భవనంలో భారతి డిగ్రీ కళాశాలను నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం పోస్టుగ్రాడ్యుయేట్ ఎంఏ, ఎంఎస్సీ ప్రథమ సంవత్సరం పరీక్షలను దూర విద్యా విధానం ద్వారా నిర్వహిస్తున్నారు. ఎస్వీ యూనివర్సిటీ ద్వారా రాయిస్తున్నారు. ఈ నెల 8వ తేదీ నుంచి ఈ పరీక్షలు జరుగుతున్నాయి. 200 మందికి గాను ప్రతి రోజూ 150 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. శనివారం నాలుగో పేపర్ పరీక్షను నిర్వహించారు. మాస్ కాపీయింగ్ జరుగుతున్న విషయం తెలుసుకున్న మీడియా అక్కడికి వెళ్లడంతో వారి బండారం బయటపడింది. పక్కపక్కనే టేబుల్‌కు ఇద్దరు, ముగ్గురు చొప్పున కూర్చోబెట్టి స్లిప్పులు ఇచ్చి మరీ రాయిస్తున్నారు. అక్కడికి వెళ్లిన మీడియాపై ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు దురుసుగా ప్రవర్తించారు. ‘మీ ఇష్టం వచ్చినట్లు రాసుకోండి. ఎలా మేనేజ్ చేసుకోవాలో నాకు తెలుసంటూ ’ పేర్కొన్నారు. ఈ విషయంపై అక్కడే ఉన్న ఎస్సీ యూనివర్సిటీ తరపున వచ్చిన చీఫ్ సూపరింటెండెంట్ శ్రీలక్ష్మి ‘సాక్షి’తో మాట్లాడుతూ పరీక్షలు నిర్వహించే కళాశాలలు ఇలాంటివి ఎంకరేజ్ చేయరాదని, పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పడం గమనార్హం. -
పీజీ రెండవ దశ సీట్ల కేటాయింపు
కమాన్‌చౌరస్తా : కాకతీయ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలో పీజీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు పొందేందుకు రెండవ దశ సీట్లను కేటాయించడం శనివారం జరిగిందని కాకతీయ యూనివర్సీటీ ప్రవేశాల విభాగం అధికారులు డాక్టర్ వెంకయ్య, లక్ష్మీనాయక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీటు పొందిన విద్యార్థులు కోర్సు, సై ్లడింగ్ ఫీజును స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చలాన ద్వారా కానీ, నెట్‌బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చని సూచించారు. సీటు అలాట్మెంట్ను డౌన్లోడ్ చేసుకొని సంబంధిత కళాశాలల్లో రిపోర్టు చేయాలని లేనిచో ప్రవేశాలు రద్దవుతాయని వెల్లడించారు. ప్రత్యేక విభాగాలు ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, స్పోర్ట్స్, ఇతర విభాగాలకు సర్టిపికేట్ల పరిశీలన, సీట్ల కేటాయింపు ఈ నెల 8న కాకతీయ ప్రవేశాల విభాగంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతందని తెలిపారు. చివరి దశ సీట్లను ఈనెల 9న కేటాయిస్తామని తెలిపారు. వెబ్ ఆప్షన్లు 9 నుంచి 11 తేది వరకు ఉంటాయని పేర్కొన్నారు. తుది దశలో సీటు పొందిన విద్యార్థులు తప్పనిసరిగా ఆయా కళాశాలల్లో ప్రవేశాలు తీసుకోవాలని లేనిచో వారి అడ్మిషన్లు రద్దు అవుతాయని సూచించారు. -
మహిళా టెక్కీపై లైంగిక దాడి
బెంగళూరు (బనశంకరి): దొంగతనం కోసం పీజీ హాస్టల్లోకి చొరబడిన దుండగుడు మహిళా టెక్కీపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బెంగళూరులోని పరప్పన అగ్రహార పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. డీసీపీ బోరలింగయ్య కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బెంగళూరులోని పరప్పన అగ్రహారంలో ఉన్న ఓ పీజీ (పేయింగ్ గెస్ట్) హాస్టల్లో తమిళనాడుకు చెందిన ఓ మహిళా టెక్కీ(20) ఉంటోంది. ఈమె నగరంలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తోంది. ఈ నెల 26న రాత్రి విధులు ముగించుకొని హాస్టల్‌కు చేరుకుంది. అర్ధరాత్రి సమయంలో హాస్టల్లోకి చొరబడిన దుండగుడు ఆ యువతి ఉన్న గదిలోకి ప్రవేశించాడు. నగదు, బంగారు ఆభరణాలు ఇవ్వాలని బెదిరించాడు. తన వద్ద అలాంటివి ఏవీ లేవని చెప్పడంతో కత్తితో బెదిరించి లైంగికదాడికి పాల్పడి ఉడాయించాడు. ఘటనపై బాధితురాలు మూడు రోజుల క్రితం పరప్పన అగ్రహార పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆమెను వైద్యపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దుండగుడి కోసం గాలిస్తున్నారు. -
23న పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు చివరి గడువు
కేయూ క్యాంపస్ : కాకతీయ, శాతవాహన యూ నివర్సిటీల పరిధిలోని పీజీ కోర్సుల్లో మొదటిదశలో సీట్లు అలాట్మెంట్ అయిన విద్యార్థులు కళాశాలల్లో చేరే గడువును ఈనెల 20 నుంచి 23 వరకు పొడిగించినట్లు కేయూ అడ్మిషన్ల డైరెక్ట ర్, ప్రొఫెసర్ ఎం. కృష్ణారెడ్డి, జాయింట్ డైరెక్ట ర్లు వెంకయ్య, లక్ష్మణ్‌నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. సీట్లు అలాట్మెంట్ అయిన విద్యార్థులు తమకు కేటాయించిన కళాశాలల్లో 23 వర కు రిపోర్టు చేయా లన్నారు. ముందుగా ఎస్బీఐ ఆన్లైన్ ద్వారా లేకుంటే ఎస్బీఐ బిల్‌డెస్క్ ద్వా రా ఫీజు చెల్లించాలన్నారు. ఫీజు చెల్లించిన 24 గంటల తర్వాత అడ్మిషన్lకార్డును డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. తర్వాత అడ్మిషన్కార్డు, ఒరి జనల్ సర్టిఫికెట్లతో 23లోగా కళాశాలల్లో రిపోర్టు చేయాలన్నారు. గతంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు రానివారు ఈనెల 25, 26 తేదీల్లో హాజరుకావచ్చన్నారు. విద్యార్థులు ఈనెల 25 నుంచి 30 వరకు స్లైడింగ్ వెబ్ ఆప్షన్లు చేసుకోవచ్చన్నారు. సీటు అలాట్మెంట్ రెండో జాబితాను సె ప్టెంబర్ 2న వెల్లడించనున్నట్లు తెలిపారు. మరి న్ని వివరాలకు కేయూ వెబ్సైట్, అడ్మిషన్ల వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు. సంస్కృతం, హిందీ, ఎం ఐటీ, ఉర్దూ, ఫుడ్‌సైన్స్ టెక్నాలజీ, నానో టెక్నాలజీ కోర్సులకు ఈనెల 24న ఉద యం 9 నుంచి సాయంత్రం 5 వరకు సర్టిఫికెట్ల పరిశీలన, సీట్‌అలాట్‌మెంట్ ఉంటుందన్నారు -
కేయూ పీజీ సీట్ల అలాట్మెంట్ జాబితా విడుదల
ఈనెల 20న కళాశాలల్లో రిపోర్టు చేయాలి కేయూ క్యాంపస్ : కాకతీయ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన అభ్యర్థులకు సీట్ అలాట్మెంట్ జాబితాను కేయూ వీసీ ప్రొఫెసర్ ఆర్.సాయన్న సోమవారం విడుదల చేశారు. విద్యార్థులు ఎంచుకున్న వెబ్ ఆప్షన్ల ప్రాధాన్యతలను బట్టి కంప్యూటర్ సహాయంతో జాబితా తయారు చేశారు. అడ్మిషన్లు పొందిన విద్యార్థులు ఈనెల 20వతేదీ వరకు విద్యార్హతలు తదితర ఒరిజనల్ సర్టిఫికెట్లతో కెటాయించిన కళాశాలల్లో రిపోర్ట్ చేయాలని కేయూ అడ్మిషన్ల డైరెక్టర్ ప్రొఫెసర్ ఎం.కృష్ణారెడ్డి, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ వై.వెంకయ్య, డాక్టర్ జె.లక్ష్మణ్‌నాయక్ తెలిపారు. విద్యార్థులకు ఎస్ఎంఎస్ ద్వారా సీట్ల కెటాయింపు సమాచారం తెలియజేశామని, ఏకళాశాలలో సీటు లభించిందో తెలుసుకునేందుకు ఈనెల 16న యూనివర్సిటీ వెబ్సైట్ ద్వారా లేదా అడ్మిషన్ల డైరెక్టరేట్‌లో సంప్రదిచ్చవచ్చని చెప్పారు. సీటు పొందిన విద్యార్థులు ముందుగా ఎస్బీఐ ఆన్లైన్ ద్వారా లేదా ఎస్బీఐ బిల్yð స్క్ ద్వారా ఫీజు చెల్లించాలని, 24 గంటల తరువాత అడ్మిషన్ కార్డును డౌన్లోడు చేసుకోవాలని సూచించారు. అడ్మిషన్కార్డు, ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఈనెల 20న సంబంధిత కళాశాలల్లో రిపోర్ట్ చేయాలన్నారు. గతంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు రాని అభ్యర్థులు ఈనెల 25, 26 తేదీల్లో కేయూ అడ్మిషన్ల డైరెక్టరేట్‌లో వెరిఫికేషన్ చేయించుకోవచ్చని, వీరు ఈనెల 26నుంచి 30 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని వివరించారు. సీటు అలాట్మెంట్ రెండవ జాబితాను సెప్టంబర్ 2న ప్రకటిస్తామని, సెప్టంబర్ 6 వరకు ఫీజు చెల్లించి కళాశాలల్లో చేరవచ్చని, పూర్తివివరాలకు కేయూ వెబ్సైట్, అడ్మిషన్ల వెబ్సైట్లో చూసుకోవచ్చని చెప్పారు. ప్రవేశ పరీక్షలు లేని కోర్సులకు 24న సర్టిఫికెట్ల పరిశీలన కాకతీయ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలో ప్రవేశపరీక్షలులేని సంస్కృతం, హిందీ, ఎంఐటీ, ఉర్దూ, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, నానో టెక్నాలజీ పీజీ కోర్సులకు ఈనెల 24న ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని, సీట్ అలాట్మెంట్ కూడా చేస్తారని సంబంధిత అడ్మిషన్ల డైరెక్టర్ కృష్ణారెడ్డి తెలిపారు. -
రెండో దఫా పీజీఈసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం
జేఎన్టీయూ: ఎంటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిం చే పీజీఈసెట్ రెండో దఫా కౌన్సెలింగ్ శనివారం ప్రారంభమైంది. జేఎన్టీయూ పాలక భవనంలో ప్రారంభమైన కౌన్సెలింగ్ ప్రక్రియను జేఎన్టీయూ రిజిస్ట్రార్ ఆచార్య కృష్ణయ్య, డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ఆచార్య విజయ్‌కుమార్ పరిశీలించారు. మొత్తం 433 మంది విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. -
పీజీ కోర్సుల్లో అడ్మిషన్లకు 20 వరకు గడువు
విద్యారణ్యపురి : డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ ఓపెన్‌వర్సిటీ పీజీ కోర్సుల ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ ఎంబీఏ విత్ ఐసెట్ , బీఎల్ఐఎస్సీ, ఎంఎల్ఐఎస్సీ అడ్మిషన్లకు ఈనెల 20 చివరి గడువు అని ఓపెన్ వర్సిటీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ వై.వెంకటేశ్వర్లు శనివారం తెలిపారు. డిగ్రీలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆయా పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు పొందవచ్చన్నారు. ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ బాటనీ, జూవాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎన్విరాన్మెంట్ సైన్స్, మ్యాథ్్సలలో వరంగల్ రీజినల్ సెంటర్లో అడ్మిషన్లు పొందవచ్చన్నారు. దరఖాస్తుల కోసం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఆర్ఏఓయూ ఆన్లైన్ ఇన్ వెబ్సైట్లో డౌన్లోడు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తుతో పాటు ఒరిజినల్ విద్యార్హతల సర్టిఫికెట్లను స్టడీ సెంటర్లో చూపించాల్సి ఉంటుందన్నారు. -
పీజీ ఈసెట్ కౌన్సెలింగ్ రసాభాస
అంచనాకు మించి వచ్చిన అభ్యర్థులు సౌకర్యాలు కల్పించని జేఎన్టీయూకే అధికారులు ఆగ్రహించిన విద్యార్థులు, తల్లిదండ్రులు నినాదాలతో దద్దరిల్లిన వర్సిటీ ప్రాంగణం అపస్మారక స్థితిలోకి విద్యార్థిని బాలాజీచెరువు (కాకినాడ) : జేఎన్టీయూకేలో శనివారం నిర్వహించిన పీజీ ఈసెట్ రెండో దశ కౌన్సెలింగ్ రసాభాసగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా జేఎన్టీయూ–కాకినాడ, అనంతపురంలలో మాత్రమే కౌన్సెలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దీంతో, కాకినాడ కేంద్రానికి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన విద్యార్థులు వచ్చారు. మొదటి విడత కౌన్సెలింగ్‌కు రాష్ట్రవ్యాప్తంగా ఏడు కేంద్రాలు ఏర్పాటు చేయగా.. రెండో దశలో 200 మందికి మించి హాజరు కారనే ఉద్దేశంతో పెద్దగా ఏర్పాట్లు చేయలేదు. కానీ, ఊహించని రీతిలో 825 మంది విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. ఇందుకు తగినట్టుగా సిబ్బందిని నియమించకపోవడంతో మధ్యాహ్నం 3 గంటలు దాటేసరికి కనీసం 300 మందికి కూడా వెరిఫికేషన్ చేయలేకపోయారు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బందులు పడ్డారు. ఒక్కపక్క ఎండ, మరోపక్క తాగడానికి మంచినీరు కూడా లేని దుస్థితిని ఎదుర్కొన్నారు. వర్సిటీ క్యాంటిన్లో భోజన సౌకర్యం కూడా లేకపోవడంతో ఆకలితో మాడిపోయారు. వెరిఫికేషన్ ఎప్పుడు అవుతుందో తెలియకపోవడంతో ఒక్కసారిగా వారు ఆగ్రహానికి గురై వెరిఫికేషన్ సిబ్బందితో పాటు, సెక్యూరిటీ అధికారుల పైకి కూడా దూసుకువచ్చారు. దీంతో ఆ ప్రాంగణమంతా నినాదాలతో గందరగోళంగా మారింది. 30 మందికి కూడా మించి పట్టని చిన్న గదిలో వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహించడం.. దాదాపు వంద మందికి పైగా ఒకేసారి ఆ గదిలోకి గుంపుగా ప్రవేశించడంతో గాలి ఆడక గుంటూరు చెందిన విద్యార్థిని ప్రసన్న అపస్మాకర స్థితిలోకి వెళ్లింది. ఆమెను స్థానికుడైన ఈదల మూర్తి తన వాహనంలో ఓ ప్రైవేటు వైద్యశాలకు తీసుకువెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో ఉన్న విద్యార్థులను, వారి తల్లిదండ్రులను అదుపు చేయడం ఒక దశలో కష్టతరమైంది. చివరకు సర్పవరం పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు. నేటి సాయంత్రం వరకూ గడువు పెంచాం రెండో దశ పీజీ ఈసెట్ కౌన్సెలింగ్‌కు ఆదివారం సాయంత్రం వరకూ గడువు పెంచాం. అర్ధరాత్రయినా సరే నిరంతరాయంగా ప్రతి విద్యార్థి సర్టిఫికెట్లూ వెరిఫై చేస్తాం. వెరిఫికేషన్‌తోపాటు ఆప్షన్ల మార్పు గడువును సోమవారం సాయంత్రం వరకూ పెంచాం. – డాక్టర్ జీఈఆర్ ప్రసాదరాజు, పీజీ ఈసెట్ కన్వీనర్ మంచినీటి సౌకర్యం కూడా లేదు ఒకపక్క వేసవి తరహాలో విపరీతమైన ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. తాగడానికి మంచినీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేయలేదు. కనీసం కుర్చోవడానికి కుర్చీలు కూడా లేకపోవడంతో చెట్లకిందే ఉండాల్సి వచ్చింది. – మహేష్, కాకినాడ అధికారుల నిర్లక్ష్యంతో ఇబ్బందులు వర్సిటీ అ«ధికారుల నిర్లక్ష్యంతో విద్యార్థులతోపాటు, తల్లిదండ్రులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. వెరిఫికేషన్ ప్రక్రియకు ఒక్క రోజు మాత్రమే సమయమివ్వడం, సాయంత్రం 5 గంటలు దాటినా కనీసం 200 కూడా పూర్తి కాకపోవడంతో విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. మధ్యాహ్నం నుంచైనా కౌంటర్లు పెంచి వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేసి ఉండాల్సింది. రాష్ట్రవ్యాప్తంగా రెండు కేంద్రాలు మాత్రమే ఏర్పాటు చేయడంవల్లే ఈ సమస్య ఏర్పడింది. – పూజిత, విజయవాడ కేంద్రాలు పెంచాలి కౌన్సెలింగ్‌కు వివిధ జిల్లాల నుంచి వచ్చారు. ఏ సమయానికి పూర్తవుతుందో తెలీదు. కనీసం మంచినీటితోపాటు ఉండడానికి వసతి సౌకర్యం కల్పిం చినా సరిపోయేది. క్యాంపస్ క్యాంటిన్లో సరైన భోజన వసతి లేకపోవడం చాలా బాధాకరం. రాష్ట్ర విభజన తరువాత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జేఎన్టీయూకేలో కనీ సం 800 మంది విద్యార్థులు ధ్రువపత్రాలు పరిశీలన చేయలేని పరిస్థితి ఉందంటే ఇక్కడి అధికారులు ఏవిధంగా ఉన్నారో అర్థమవుతుంది. – యామిని, విజయవాడ -
పీజీ సెమిస్టర్ ఫలితాలు విడుదల
ఎచ్చెర్ల: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో ఏప్రిల్‌లో జరిగిన పీజీ రెండు, నాలుగు సెమిస్టర్ ఫలితాలను ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ మిర్యాల చంద్రయ్య శుక్రవారం విడుదల చేశారు. రెండో సెమిస్టర్లో 13 పీజీ కోర్సులకు సంబంధించి 84.43 శాతం ఫలితాలు నమోదయ్యాయి. 546 మంది పరీక్ష రాయగా, 461 మంది ఉత్తీర్ణత సాధించారు. నాలుగో సెమిస్టర్లో 18 కోర్సులకు సంబంధించి 91.75 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 618 మందికి 567 మంది ఉత్తీర్ణత సాధించారు. ఎల్ఎల్బీ, ఎంసీఏ, జీయోటెక్‌కు సంబంధించి నాలుగో సెమిస్టర్లో 92.59 శాతం ఫలితాలు నమోదయ్యాయి. 108కి 100 మంది ఉత్తీర్ణత సాధించారు. ఎంసీఏ, ఎంబీఏ, ఎల్ఎల్ఎంలకు సంబంధించి రెండో సెమిస్టర్లో 98.78 శాతం ఉత్తీర్ణత సాధించారు. 206 మందికి 187 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గుంట తులసీరావు, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పెద్దకోట చిరంజీవులు, ఎగ్జామినేషన్స్ డీన్ ప్రొఫెసర్ తమ్మినేని కామరాజు, చీఫ్ వార్డెన్ ప్రొఫెసర్ బిడ్డిక అడ్డయ్యలు పాల్గొన్నారు. -
హెచ్ఐవీ సోకుతుందనే భయంతోనే..
పీజీ వైద్యురాలి ఆత్మహత్య గుంటూరు మెడికల్: హెచ్ఐవీ పాజిటివ్ రోగికి ఆపరేషన్ చేస్తున్న సమయంలో సూది గుచ్చుకోవటంతో తనకు కూడా హెచ్ఐవీ సోకుందనే భయంతోనే డాక్టర్ రాచమళ్ల విజయలక్ష్మి(24) ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. గుంటూరు వైద్య కళాశాల జనరల్ సర్జరీ పీజీ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని విజయలక్ష్మి గురువారం సాయంత్రం కన్నావారితోట ఐదోలైన్లోని నివాసంలో అనుమానస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. శుక్రవారం పోస్టుమార్టం చేసిన అనంతరం మతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో మూడు వారాల క్రితం హెచ్ఐవీ సోకిన రోగికి ఆపరేషన్ చేస్తున్న సమయంలో సూది గుచ్చుకోవటంతో తనకు కూడా హెచ్ఐవీ సోకుతుందనే భయంతో విజయలక్ష్మి మానసిక ఒత్తిడికి గురైనట్లు తోటి వైద్యులు తెలిపారు. తక్షణమే హెచ్ఐవీ నిరోధక మందులు వాడటం ప్రారంభించినా రెండు రోజులుగా విరోచనాలు అవుతుండటంతో ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని భావిస్తున్నారు. -
3నుంచి పీజీ తరగతులు ప్రారంభం
పాలమూరు యూనివర్సిటీ : పీయూ పరిధిలోని పీజీ కళాశాలతో పాటు పీయూలో పీజీ మొదటి, ద్వితీయ సంవత్సర తరగతులు 3వ తేదీనుంచి ప్రారంభం కానున్నట్లు పీయూ రిజిస్ట్రార్ పాండురంగారెడ్డి ప్రకటనలో తెలిపారు. పీయూలో పీజీ చదువుతున్న అభ్యర్థులు, మొదటి ఏడాదికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ విషయం గమనించి హాజరుకావాలన్నారు. ముఖ్యంగా పీజీ కళాశాల తరగతులు ప్రారంభం అయిన రెండు వారాల తర్వాత హాస్టల్ ప్రారంభం చేస్తాని, ఈ విషయం గమనించి సహకరించాలని కోరారు. -
ఆర్ట్స్ కళాశాలలో పీజీ కోర్సులకు స్పాట్ అడ్మిషన్లు
అనంతపురం ఎడ్యుకేషన్ : ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల పీజీ కోర్సుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈనెల 25, 26 తేదీల్లో స్పాట్ అడ్మిషన్లు చేపట్టనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్. రంగస్వామి ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు పదోతరగతి సర్టిఫికెట్, డిగ్రీ మార్కుల జాబితా, టీసీ తీసుకుని నేరుగా ప్రిన్సిపల్‌ను కలవాలని సూచించారు. ఎంఏ ఎకనామిక్స్, ఇంగ్లిష్, తెలుగు, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఎమ్మెస్సీ గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, మైక్రో బయాలజీ, ఎలక్ట్రానిక్స్, జియాలజీ, కంప్యూటర్ సైన్స్, స్టాటిస్టిక్స్ కోర్సుల్లో సీట్లు ఉన్నాయని వివరించారు. -
పీజీ సీట్ల కేటాయింపులో మరోసారి గందరగోళం
– నాన్‌లోకల్ రిజర్వేషన్ కమ్ రోస్టర్‌పై విద్యార్థి సంఘాల అభ్యంతరం కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ఆర్యూ పీజీసెట్ వెబ్ కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపులో మరోసారి గందరగోళం నెలకొంది. ఈ నెల 12న కేటాయించిన సీట్లలో కేటాయింపులో రెగ్యులర్, సెల్ఫండింగ్ కోర్సుల్లో ఎంపికలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో దానిని రద్దుచేశారు. తిరిగి ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు విద్యార్థులతో వెబ్ ఆప్షన్లను తీసుకున్నారు. అయితే ఈసారి రిజర్వేషన్ల రోస్టర్ పాయింట్ల కేటాయింపులో తప్పులు దొర్లినట్లు విద్యార్థులు ఆరోపణలు చేస్తున్నారు. నాన్‌లోకల్ కోటాలో రిజర్వేషన్ కమ్ రోస్టర్ పాయింట్ల ప్రకారం అ«ధికారులు సీట్లు కేటాయించారు. దీంతో మంచి ర్యాంకులు వచ్చిన కొందరికీ సీటురాలేదు. ఇంగ్లిష్ సబ్జెక్టులో లక్ష్మన్న అనే విద్యార్థికి 30 ర్యాంకు వచ్చింది. అయినా ఇతనికి వర్సిటీలో ర్యాంకు రాలేదు. రిజర్వేషన్ రోస్టర్ పాయింట్‌ను పాటించడంతో 36వ ర్యాంకు విద్యార్థికి సీటు వచ్చింది. అలాగే యూనివర్సిటీలో ఇంగ్లిష్ సబ్జెక్టులో బీసీడీ క్యాటగిరికి ఒక్క సీటు కూడా కేటాయించలేదు. మరోవైపు ఎక్కువమంది విద్యార్థులకు న్యాయం చేయాలని నాన్‌లోకల్‌లో రోస్టర్పాయింట్లను కేటాయించినట్లు వీసీ వై.నరసింహులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు ఇదే విధానాన్ని అమలు చేస్తాయని, కొందరికి అన్యాయం జరిగినా ఎక్కువమందికి లాభం చేకూరుతుందని తనను కలిసిన విద్యార్థి సంఘాలకు వివరించారు. కాగా, ఎవరికైనా మంచి ర్యాంకు వచ్చి వర్సిటీలో సీటు రాకపోతే తనకు దరఖాస్తు చేసుకోవాలని, అలాంటి దరఖాస్తులను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. -
పీజీ.. సీట్లు ఖాళీ!
ఎస్కేయూ అనుబంధ కళాశాలల్లో భర్తీ కాని సీట్లు 2717 క్యాంపస్ కళాశాలల్లో 198 సీట్లు ఖాళీ ఎస్కేయూ: శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం క్యాంపస్ కళాశాలలు, అనుబంధ పీజీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఎస్కేయూ సెట్- 2016 రెండో దఫా కౌన్సెలింగ్ శుక్రవారం ముగిసింది. అనుబంధ పీజీ కళాశాలల్లో 4,683 పీజీ సీట్లు ఉండగా 1,966 మాత్రమే భర్తీ అయ్యాయి. 2,717 సీట్లు మిగిలిపోయాయి. క్యాంపస్ కళాశాలల్లోనూ గతేడాదితో పోలిస్తే మిగులు సీట్ల సంఖ్య పెరిగింది. క్యాంపస్ కళాశాలల్లో 921 సీట్లు అందుబాటులో ఉండగా, రెగ్యులర్ సీట్లు 55, సెల్ఫ్‌ఫైనాన్స్/ పేమెంట్ సీట్లు 143 కలిపి 198 సీట్లు భర్తీ కాలేదు. యాజమాన్యాల్లో నష్ట భయం కొన్ని కళాశాలల్లో 1, 3, 2, 5, 6 , 7, 19 మంది మాత్రమే అడ్మిషన్లు పొందారు. ఇది యాజమాన్యాలకు మరింత భారం కానుంది. 2016-17 విద్యాసంవత్సరం నుంచి హాజరు నమోదుకు బయోమెట్రిక్ ప్రవేశపెట్టనుండడంతో తరగతులు తప్పనిసరిగా నిర్వహించాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఫ్యాకల్టీని విధిగా నియమించుకోవాలి. అడ్మిషన్లు తగ్గుముఖం పట్టడంతో యాజమాన్యాల్లో నష్టభయం నెలకొంది. డిగ్రీలో కొరవడిన విద్యా ప్రమాణాలు : డిగ్రీ కోర్సులో సరైన విద్యా ప్రమాణాలు లేకపోవడంతో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం గణనీయంగా తగ్గింది. డిగ్రీ కళాశాలల స్థితిగతులపై అధ్యయనం చేయాల్సిన యూనివర్సి టీ కళాశాల డెవలప్మెంట్ కౌన్సిల్ (సీడీసీ) ఒక్క రోజు కూడా పర్యవేక్షించిన దాఖలాలు లేవు. డిగ్రీ ఉత్తీర్ణత శాతం పెంచితేనే వర్సిటీలలో విద్యార్థుల నమోదు శాతం పెంచవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. -
ఎస్వీయూలో 9 నుంచి వెబ్ కౌన్సెలింగ్
తొలిసారిగా పీజీ అడ్మిషన్లలో అమలు తిరుపతి సిటీ: శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో పీజీ కోర్సుల ప్రవేశానికి తొలిసారిగా వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఇప్పటివరకు ఇంజనీరింగ్, ఎంబీఎ, ఎంసీఏ, లా, మెడికల్, బీఈడీ కోర్సులకు పరిమితమైన వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియను ఎస్వీయూలో తొలిసారిగా పీజీ కోర్సులకు సైతం ప్రవేశపెట్టా రు. ఈనెల 9వ తేది నుంచి 13వ తేది వరకు ఎస్వీయూ డైరక్టరేట్ ఆడ్మిషన్ల కార్యాలయంలో సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించనున్నారు. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి అయిన మరుసటి రోజు నుంచి అభ్యర్థులు ఆన్లైన్లో లాగిన్అయ్యి తమకు కావాల్సిన కోర్సులను వెబ్ ఆప్షన్ల ద్వారా ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 16 లేదా 17 తేదీల్లో సీట్ల కేటాయింపు జరుగుతుంది. అభ్యర్థులు వెబ్ ఆప్షన్ల ఆధారంగా ఎస్వీయూ అధికారులు సీట్లను కేటాయిస్తారు. సర్టిఫికెట్ల పరిశీలన ఇలా.. 9వ తేదీన కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్ సబ్జెక్టులు, 10న కామర్స్, 11న మ్యా థమెటిక్స్, స్టాటిస్టిక్స్, బాటనీ, కంప్యూటర్ సైన్స్,12న జూవాలజీ, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇంగ్లీష్, జనరల్ టెస్ట్, ఆక్వాకల్చరల్ సబ్జెక్టులు, 13న బయో కెమిస్ట్రీ, ఫుడ్ టెక్నాలజీ, హోమ్ సైన్స్, ఎడ్యుకేషన్, తెలు గు, హిస్టరీ, సైకాలజీ, జీయాలజీ, సోషియల్ వర్క్, ఎకానమిక్స్, ఆంత్రోపాలజీ, ఎన్విరాన్మెంట్ సైన్స్, హిందీ, సీప్ స్టడీస్, ఫెర్మామింగ్ ఆర్ట్స్, సంస్కృతం, సోషియాలజీ, తమిళ్, ఉర్దూ, వైరాల జీ, ఉమెన్ స్టడీస్, టూరిజం సబ్జెక్టుల అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించనున్నారు. ప్రత్యేక కేటగిరి అభ్యర్థుల సర్టిఫికెట్లను మొదటి విడతలోనే పరిశీలించి సీట్లను కేటాయించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. -
పీజీ సీటుకు.. బ్లడ్ డొనేషన్‌కు లింకు!
జైపూర్: పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో చేరడానికి కాలేజీ సీటు కావాలా.. అయితే మీరు ఇంతకు ముందు బ్లడ్ డొనేట్ చేసి ఉంటే బెటర్ అంటున్నారు రాజస్థాన్ విద్యాశాఖ అధికారులు. డిగ్రీ పూర్తయిన విద్యార్థులు పీజీలో చేరేటప్పుడు వారు బ్లడ్ డొనేట్ చేసినట్లు తగిన ఆధారాలు చూపిస్తే అదనంగా ఒక మార్కు కలుపుతామంటున్నారు. దీంతో అక్కడ డిగ్రీ చదువుతున్న విద్యార్థులు ఎప్పుడెప్పుడు బ్లడ్ డొనేట్ చేసి సర్టిఫికేట్ పొందాలా అని ఎదురుచూస్తున్నారట. రాజస్థాన్ ఉన్నత విద్యాశాఖ మంత్రి కాళీ చరణ్ సరఫ్ ఇటీవల మాట్లాడుతూ.. వరుసగా మూడు సంవత్సరాల పాటు బ్లడ్ డొనేట్ చేసినట్లు సర్టిఫికేట్ కలిగి ఉన్న విద్యార్థులకు పీజీ అడ్మిషన్ సమయంలో అదనంగా ఒక బోనస్ మార్కును కలుపుతామని ప్రకటించారు. సమాజంలోని ముగ్గురు నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చిన విద్యార్థులకు కూడా 0.5 బోనస్ మార్కు, అలాగే తాము చదువుకున్న పుస్తకాలను బుక్ బ్యాంక్‌కు ఇచ్చిన వారికి సైతం 0.5 అదనపు మార్కులు పీజీ కాలేజీలో ప్రవేశం సమయంలో కలుపుతామని తెలిపారు. ఇది కొంత ఆశ్చర్యంగా ఉన్నా.. విద్యార్థులలో సామాజిక బాధ్యతను పెంచడానికి ఈ కార్యక్రమం కొంతైనా దోహదం చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
మూడుపూలూ, ఆరు కాయలే..
రాజమహేంద్రవరం వ్యవసాయ కళాశాలకు 22 ఎకరాలు కాతేరు వద్ద కేటాయిస్తూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం పీజీ కోర్సుల ప్రారంభానికి, పరిశోధనలకు అవకాశం సాక్షి ప్రతినిధి, కాకినాడ / రాజానగరం :ఇప్పటివరకూ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్న రాజమహేంద్రవరం వ్యవసాయ కళాశాల దశ తిరిగి సొంత భవనాలు సమకూరనున్నాయి. డిగ్రీ, డిప్లొమా కోర్సుల నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులను నిర్వహించే స్థాయికి చేరే అవకాశం ఉంది. అంతే కాదు.. వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఎక్కువగా ఉన్న జిల్లాలో పరిశోధనలకు ఊతం లభించే అవకాశాలూ పుష్కలం కానున్నాయి. కళాశాలకు రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం పరిధిలో గామన్ బ్రిడ్జి (గోదావరిపై నాలుగో వంతెన) పైకి వెళ్లే బైపాస్ రోడ్డుకు సమీపంలోని కాతేరు వద్ద 22 ఎకరాల భూమి కేటాయింపు ప్రతిపాదనలకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదముద్ర వేసింది. హైదరాబాద్‌లోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో వ్యవసాయ కళాశాలను రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన దీర్ఘకాలంగా ఉంది. వ్యవసాయానికి పెద్దపీట వేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవతో 2008 నవంబరులో ఆ ప్రతిపాదన సాకారమైంది. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలకు చెందిన భవనాల్లోనే వ్యవసాయ కళాశాలను ఏర్పాటు చేశారు. తర్వాత కొద్ది నెలల్లోనే సమీపంలోనే ఉన్న ఎస్‌కేవీటీ కాలేజీ భవనాల్లోకి వ్యవసాయ కళాశాలను మార్చారు. ప్రస్తుతం అక్కడే తరగతులు నిర్వహిస్తున్నారు. అయితే ఇంచుమించు ఈ కళాశాలను ఏర్పాటు చేసిన సమయంలోనే ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం కూడా రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజీలో ప్రారంభమైంది. వైఎస్ చొరవతో విశ్వవిద్యాలయానికి సొంత భవనాలు నిర్మించుకునేలా భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైంది. వెలుగుబందలో 96 ఎకరాల కేటాయింపు, విశ్వవిద్యాలయం తరలింపు చకచకా జరిగిపోయాయి. దీంతో అద్దె భవనాల్లో కొనసాగుతున్న వ్యవసాయ కళాశాలకు కూడా సొంత భవనాలు సమకూర్చాలనే ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. కేంద్రీయ పొగాకు పరిశోధన సంస్థకు కాతేరు వద్ద ఉన్న 22 ఎకరాలను కళాశాలకు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. క్షేత్ర పరిశీలనా సులభతరం.. రాష్ట్ర విభజన తర్వాత ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం గుంటూరుకు మారిన నేపథ్యంలో వ్యవసాయ కోర్సులకు డిమాండు ఏర్పడింది. కానీ రాజమహేంద్రవరం వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ అగ్రికల్చరల్, డిప్లొమా కోర్సులను మాత్రమే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం 210 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తుండగా 20 మంది అధ్యాపకులు, ఇతర సిబ్బంది పని చేస్తున్నారు. రాష్ట్రంలో రాజమహేంద్రవరంతోపాటు తిరుపతి, బాపట్ల, శ్రీకాకుళం జిల్లాలోని నైరా, నంద్యాల సమీప మహానందిలో వ్యవసాయ కళాశాలలున్నాయి. వీటన్నింటిలో కలిపి సీట్లు 650కి మించి లేవు. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం కళాశాలకు భూకేటాయింపు తో విస్తరణకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎమ్మెస్సీ అగ్రికల్చరల్ కోర్సుతో పాటు పీజీ డిప్లొమా కోర్సులను ప్రారంభించే అవకాశం ఉంది. పరిశోధనావకాశాలు కూడా పెరుగుతాయి. వ్యవసాయ ప్రధానమైన జిల్లాలో వారి క్షేత్ర పరిశీలన కూడా సులువవుతుంది. విద్యార్థులకు సౌలభ్యం ప్రస్తుతం కళాశాలకు అనుబంధంగా వసతిగృహాలు లేక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. కాతేరులో కళాశాలకు సొంత భవనాలతో పాటు హాస్టళ్లు నిర్మిస్తారు. దీనివల్ల రోజువారీ వ్యయప్రయాసలు తప్పుతాయి. పొరుగు రాష్ట్రాలకు వెళ్లనక్కర్లేదు.. ఎంసెట్ ర్యాంకు ఆధారంగానే వ్యవసాయ కళాశాలల్లో సీట్లు కేటాయిస్తుంటారు. డిమాండుకు తగినన్ని సీట్లు లేకపోవడంతో చాలామంది విద్యార్థులు పొరుగు రాష్ట్రాలకు వెళ్లి అక్కడ కళాశాలల్లో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం కళాశాలకు భూమి కేటాయించిన ప్రభుత్వం సత్వరమే భవనాల నిర్మాణ ప్రక్రియను ప్రారంభించాలి. ఇది పూర్తయితే డిగ్రీలో సీట్లు పెంచడానికి, పీజీ కోర్సుల ప్రారంభానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులు పొరుగు రాష్ట్రాలకు వెళ్లాల్సిన ఇబ్బంది తప్పుతుంది. - సీతారామయ్య, ప్రిన్సిపాల్, రాజమహేంద్రవరం వ్యవసాయ కళాశాల -
5నుంచి కేయూ పీజీ పరీక్షలు
హైదరాబాద్: కాకతీయ విశ్వవిద్యాలయం పీజీ పరీక్షలు మే నెల 5వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల నియంత్రణాధికారి తెలిపారు. పీజీ నాల్గవ సెమిస్టర్ పరీక్షలు మే 5 నుంచి, రెండో సెమిస్టర్ పరీక్షలు మే 6 నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ నిర్వహిస్తారు. రెండో సెమిస్టర్ పరీక్షలు మే 6, 10, 12, 17, 19, 21 23 తేదీలలో, నాల్గవ సెమిస్టర్ పరీక్షలు మే 5, 7, 9, 11, 13, 16 తేదీలలో జరుగుతాయి. -
ఓయూసెట్‌కు ఆధార్ తప్పనిసరి
♦ దరఖాస్తు విధానంలో సమూల మార్పులు ♦ నేటి నుంచి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ♦ జూన్ మొదటి వారం నుంచి ప్రవేశ పరీక్షలు హైదరాబాద్: ఇకపై ఓయూ సెట్‌కు ఆధార్ నంబర్ తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నామని, ఆన్లైన్ దరఖాస్తులు నేటి నుంచి స్వీకరించనున్నట్లు పీజీ అడ్మిషన్స్ డెరైక్టర్ ప్రొ.గోపాల్‌రెడ్డి తెలిపారు. మంగళవారం క్యాంపస్‌లోని పీజీ అడ్మిషన్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డెరైక్టర్ ఓయూసెట్-2016 వివరాలను వెల్లడించారు. www.ouadmissions.com / www.osmania.ac.in అనే వెబ్సైట్ ద్వారా మే నెల 7 వరకు, రూ.500 అపరాధ రుసుముతో 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అని వివరించారు. ఓయూతో పాటు తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాలలోని పీజీ, పీజీ డిప్లొమా, ఐదేళ్ల పీజీ కోర్సుల్లో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. స్టాటిస్టిక్స్ కోర్సులో ప్రవేశానికి ఎమ్మెస్సీ మ్యాథ్స్ నుంచి విడిదీసి ప్రత్యేకంగా ప్రవేశ పరీక్షను చేపడుతున్నట్లు చెప్పారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఆన్లైన్ దరఖాస్తులో మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి అభ్యర్థి దరఖాస్తు ఫారంలో ఆధార్ నంబర్ తప్పకుండా రాయాలన్నారు. ప్రవేశ పరీక్షలో అక్రమాలు అరికట్టేందుకు బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశ పెట్టినట్లు తెలిపారు. దరఖాస్తులో తాజా ఫొటో మాత్రమే వాడాలి ప్రతి విద్యార్థి తను తాజాగా తీసిన కలర్ పాస్‌ఫొటో మాత్రమే వాడాలన్నారు. ఓయూ సెట్ దరఖాస్తులో వినియోగించే ఫొటోను బహుళ ప్రయోజనాలకు ఉపయోగించనున్నారు. అడ్మిషన్స్ కౌన్సెలింగ్, గుర్తింపు కార్డు, లైబ్రరీ కార్డు, హాస్టల్ ప్రవేశాలు, ఉపకార వేతనాల దరఖాస్తులు, సెమిస్టర్ పరీక్షలకు, డిగ్రీ పట్టా సర్టిఫికెట్ల తదితర అవసరాలకు ఓయూ సెట్లో వాడిన ఫొటోను ఉపయోగించనున్నట్లు గోపాల్‌రెడ్డి చెప్పారు. ఆన్లైన్ దరఖాస్తుతో పాటు కులం, వికలాంగ సర్టిఫికెట్లను స్కాన్‌చేసి పంపించాలన్నారు. అభ్యర్థులు తమ సొంత సెల్‌ఫోన్ నంబర్, సొంత ఈ-మెయిల్ ఐడీని మాత్రమే దరఖాస్తులో వాడాలని సూచించారు. ప్రతి సమాచారాన్ని అభ్యర్థుల సెల్‌ఫోన్‌కు, ఈ-మెయిల్ ఐడీకి పంపించనున్నట్లు చెప్పారు. ఆన్లైన్లో దరఖాస్తు పంపిన తరువాత ప్రింట్‌ను భద్రపరుచుకోవాలన్నారు. ఒక్క దరఖాస్తు రిజిస్ట్రేషన్‌లో నాలుగు సబ్జెక్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు. జూన్ మొదటి వారంలో ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జాయింట్ డెరైక్టర్లు ప్రొ.కిషన్, ప్రొ.సంపత్‌కుమార్, ప్రొ.నిర్మల బాబూరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రియుడి ఇంటి ఎదుట యువతి దీక్ష
భీమదేవరపల్లి : నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నానని చెప్పాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. చివరకు మాట మార్చి మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు. విషయం తెలియడంతో ప్రియుడి ఇంటి ఎదుట ఓ యువతి మౌనదీక్ష చేపట్టింది. ఈ సంఘటన భీమదేవరపల్లిలో శనివారం జరిగింది. భీమదేవరపల్లికి చెందిన యువతి గుండేటి రవీష్ణా (22), ఇదే గ్రామానికి చెందిన పచ్చునూరి సురేందర్(26) నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. రవీష్ణా ప్రస్తుతం పీజీ చదువుతోంది. సురేందర్ ధర్మపురిలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. నాలుగు నెలలుగా తన ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో పోలీసులను ఆశ్రయించి సురేందర్‌పై కేసు పెట్టినట్లు రవీష్ణా తెలిపింది. ఇటీవల ఓ యువతితో పెళ్లి ఖరారైందని, ఈ నెల 10న నిశ్చితార్థం కూడా జరిగిందని పేర్కొంది. గత్యంతరం లేక తాను మౌన దీక్ష చేపట్టినట్లు చెప్పింది. విషయం తెలుసుకున్న హుస్నాబాద్ సీఐ దాసరి భూమయ్య, ముల్కనూర్ ఎస్సై సతీశ్ సంఘటన స్థలానికి చేరుకుని నాలుగు నెలల క్రితమే సురేందర్‌పై కేసు నమోదు అయిందని దీక్ష విరమించాలని సూచించారు. యువతి తల్లిదండ్రులతో మాట్లాడి దీక్ష విరమింపజేశారు. ఈ విషయమై సురేందర్ సోదరుడు సురేశ్ విలేకరులతో మాట్లాడుతూ తన సోదరుడికి సదరు యువతికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. -
ఆన్ లైన్ లో పీజీఈసెట్
విద్యా మండలి చరిత్రలో తొలిసారిగా ఆన్లైన్లో నిర్వహణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఉన్నత విద్యామండలి చరిత్రలోనే తొలిసారిగా ‘పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష(పీజీఈసెట్)’ను ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నామని ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి వెల్లడించారు. ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ ‘పేపర్‌లెస్’గా మార్చాలని ప్రభుత్వం భావిస్తోందని, ఈ నేపథ్యంలోనే పలు ప్రవేశ పరీక్షలను ఆన్లైన్ విధానంలో నిర్వహించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. బుధవారం పీజీఈసెట్‌తో పాటు ఎడ్‌సెట్, పీఈసెట్ కమిటీల సమావేశాలు ఉస్మానియా వర్సిటీలో జరిగాయి. అనంతరం పాపిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆన్లైన్ విధానానికి కాస్త ఖర్చు ఎక్కువ అవుతున్నప్పటికీ.. మాస్ కాపీయింగ్, ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాయడం వంటి వాటిని నియంత్రించేందుకు ఆన్లైన్ విధానమే ఉత్తమమని చెప్పారు. తొలిసారిగా ఆన్లైన్లో నిర్వహిస్తున్న పీజీఈసెట్ పరీక్షలో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఎంసెట్ మెడికల్ విభాగం పరీక్షను కూడా ఆన్లైన్లో నిర్వహించాలని భావించామని.. కానీ భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉండడంతో మౌలిక వసతుల సమస్య ఉత్పన్నమైందని తెలిపారు. అయినా దీనిపై ఈనెల 13న నిపుణుల కమిటీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అనంతరం పీజీఈసెట్, ఎడ్‌సెట్, పీఈసెట్‌ల షెడ్యూల్‌లను విడుదల చేశారు. 14న ఎడ్‌సెట్ నోటిఫికేషన్ బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎడ్‌సెట్ నోటిఫికేషన్ ఈ నెల 14న విడుదల కానుంది. అదేరోజు నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆలస్య రుసుము లేకుండా మే 7 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో మే 14 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. ఎస్సీ, ఎస్టీలకు దరఖాస్తు ఫీజు రూ.150, మిగతావారికి రూ.300. మే 21 నుంచి www.tsedcet.org నుంచి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. మే 27న పరీక్ష జరుగుతుంది. జూన్ 12న ఫలితాలను వెల్లడిస్తారు. పీఈసెట్ షెడ్యూల్ ఇదీ వ్యాయామ విద్యకు సంబంధించి బ్యాచిలర్ (బీపీఈడీ), డిప్లమో(డీపీఈడీ) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ‘ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(పీఈసెట్)’ మే 11న జరగనుం ది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను ఈ నెల 10 లేదా 11న విడుదల చేయనున్నారు. 14వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 25వరకు, రూ.500 ఆలస్య రుసుముతో మే 1 వరకు, రూ.2,000తో మే 5వరకు, రూ.5,000 రుసుముతో మే 8వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీలకు రూ.400, ఇతరులకు రూ.700. ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకున్నవారు మే 2నుంచి, ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకున్నవారు మే 10 నుంచి హాల్‌టికెట్లను www.tspecet.org వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దేహదారుఢ్య పరీక్షలు హైదరాబాద్‌లో మాత్రమే నిర్వహిస్తారు. పీజీఈసెట్ షెడ్యూల్ ఇలా.. ఎంఈ/ఎంటెక్, ఎంఆర్క్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే పీజీఈసెట్-16ను సీబీటీ(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) విధానంలో నిర్వహిస్తారు. పీజీఈసెట్లోని వివిధ విభాగాల పరీక్షలు మే 30 నుంచి జూన్ 3వరకు ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో జరుగుతాయి. ఈ పరీక్షలకు హైదరాబాద్, వరంగల్ ప్రాంతీయ కేంద్రాల్లో మాత్రమే పరీక్షా కేంద్రాలు ఉంటాయి. ఈనెల 11న పీజీఈసెట్ నోటిఫికేషన్ వెలువడనుంది. 14వ తేదీ నుంచి www. tspgecet.acorg, www.osmania. ac.in వెబ్సైట్ల ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. పరీక్ష ఫీజు ఎస్సీ, ఎస్టీలకు రూ.400, ఇతరులకు రూ.800. ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 23 వరకు, రూ.500 ఫైన్‌తో మే 9వరకు, రూ.2,000 తో మే16 వరకు, రూ.5వేలతో మే 23వరకు, రూ.10వేల ఫైన్‌తో మే 28వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 23 నుంచి 28 వర కు హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. జూన్ 24న ఫలితాలను వెల్లడిస్తారు. -
రేపు పీజీ డెంటల్ ఎంట్రన్స్ టెస్ట్
ఏర్పాట్లు పూర్తి: హెల్త్ వర్సిటీ వీసీ విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): పీజీ డెంటల్ (మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ) కోర్సులో అడ్మిషన్లకు ఈ నెల 6న నిర్వహించే ఆన్లైన్ ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ టి.రవిరాజు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడిగా నిర్వహించే ఈ పరీక్ష ఉదయం 11 నుంచి 12.30 గంటల వరకు జరుగుతుందన్నారు. మొత్తం 556 సీట్లలో ప్రభుత్వ కళాశాలల్లోని 23 సీట్లతో పాటు మిగిలిన ప్రైవేటు కళాశాలల్లో కన్వీనర్ కోటా కింద 264(ఏయూ-96), ఓయూ-120, ఎస్వీయూ-48) సీట్లను వర్సిటీ భర్తీ చేయనుంది. ప్రైవేటు మేనేజ్మెంట్ కోటాలో 269 (ఏయూ-93, ఓయూ-132, ఎస్వీయూ-44) సీట్లు ఉన్నాయి. ఏపీలో విజయవాడలోని పొట్టిశ్రీరాములు చలువాది మల్లికార్జునరావు ఇంజనీరింగ్ కళాశాల, ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కళాశాల, విశాఖపట్నంలోని గాయత్రి విద్యాపరిషత్ ఇంజనీరింగ్ కళాశాలల్లో... తెలంగాణలో హైదరాబాద్‌లోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాల, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కళాశాల, వీఎన్ఆర్ విజ్ఞానజ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులు హాల్‌టిక్కెట్టు, ఒరిజినల్ ఐడీ కార్డుతో ఉదయం 10.15 గంటల లోపు హాజరుకావాలి. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని వీసీ తెలిపారు. ఈనెల 7న ప్రాథమిక ‘కీ’, 15లోగా ఫైనల్ కీతో పాటు ఫలితాలు విడుదల చేస్తామని చెప్పారు. -
లేటరల్ ఎంట్రీ ఇవ్వండి !
అర్ధంతరంగా ఉన్నత విద్యను మానేసిన వారికి తమ కోర్సు నిరాటంకంగా కొనసాగించేందుకు దూరవిద్యావిధానాన్ని జాతీయ వ్యాప్తంగా అన్ని వర్శిటీల్లో ప్రవేశపెట్టారు. అయితే డిగ్రీ, పీజీ కోర్సులు అర్ధంతరంగా ఆపిన వారికి ఇతర వర్శిటీల్లోలా ఎస్కేయూలో కూడా లేటరల్ ఎంట్రీకి అనుమతివ్వాలని విద్యార్థులు కోరుతున్నారు. అవకాశం ఉంటే తాజాగా ఇచ్చిన నోటీఫికేషన్లోను అనుమతిచ్చే వెసలుబాటు కల్పించాలంటున్నారు. ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం దూరవిద్య విధానం 2015-16కి నూతన నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల చేశారు. పీజీ, డిగ్రీ కోర్సుల దరఖాస్తుల స్వీకరణకు నూతనంగా ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. అయితే అర్ధంతరంగా ఉన్నత విద్య మానేసిన వారికి తమ కోర్సును నిరాటంకంగా కొనసాగించడం, అలాంటి అవకాశం కల్పించడానికి దూరవిద్య విధానాన్ని జాతీయ వ్యాప్తంగా అన్ని వర్సిటీలలో ప్రవేశపెట్టారు. దూరవిద్య విధానం మొదటి ప్రాధాన్యత ఇదే. కానీ ఎస్కేయూలో కేవలం డిగ్రీ, పీజీ కోర్సులకు సంబంధించి మాత్రమే ప్రవేశాలు కల్పిస్తున్నారు. అర్ధంతరంగా మానేసిన వారికి అండ లేటరల్ ఎంట్రీ : డిగ్రీ, పీజీ కోర్సు చేస్తూ అర్ధంతరంగా ఆర్థిక పరిస్థితుల రీత్యా ఉన్నత విద్యను మధ్యలో ఆపేసిన వారు రాయలసీమ జిల్లాల్లో వేలాదిగా ఉన్నారు. వీరిలో సింహభాగం కోర్సు పూర్తీ చేయాలని ఉన్నా, అవకాశం లేక నిరాశలో కొట్టుమిట్టాడుతున్నారు. అలాంటి వారికి ఆంధ్రా వర్సిటీ, నాగార్జున, వెంకటేశ్వర వర్సిటీల్లో లేటరల్ ఎంట్రీ కింద డిగ్రీ, పీజీ దరఖాస్తులు కల్పిస్తున్నారు. ఇందుకు రాష్ర్ట ఉన్నత విద్యా మండలి సైతం అంగీకరించింది. కానీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 177 అధ్యయన కేంద్రాలు నిర్వహిస్తున్న ఎస్కేయూలో మాత్రం అలాంటి అవకాశం కల్పించలేదు. మొత్తం ఎస్కేయూ అధ్యయన కేంద్రాల్లో 60 వేల మంది డిగ్రీ, పీజీ కోర్సులు అభ్యసిస్తున్నారు. లేటరల్ ఎంట్రీ అంటే.. : రెగ్యులర్ డిగ్రీ కోర్సు చదువుతున్న విద్యార్థి రెండో సంవత్సరం వరకు చదివి అర్ధంతరంగా చదువు ఆపేశాడు. అదే విద్యార్థికి దూరవిద్య విధానం ద్వారా చదివే అవకాశం కల్పించడాన్నే లేటరల్ ఎంట్రీ అంటారు. అలాగే పొరుగు వర్సిటీల్లోని దూరవిద్య విధానం ద్వారా పీజీ, డిగ్రీ కోర్సు అర్ధంతరంగా మానేసిన విద్యార్థికి ఎస్కేయూ దూరవిద్య విధానం ద్వారా ఉన్నత విద్య చదవడానికి తగిన అనుమతి ఇవ్వడం. ఈ తరహా విధానం ఎస్కేయూ దూరవిద్య విధానంలో అమలు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అవకాశం కల్పిస్తే తాజాగా ఇచ్చే నోటిఫికేషన్లోనే అడ్మిషన్ పొందటానికి తగిన వెసలుబాటు కల్పించినట్లు అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. -
సాక్షి జర్నలిజం పరీక్షలు 28న
సాక్షి, హైదరాబాద్: పీజీ డిప్లొమా ఇన్ జర్నలిజం కోర్సు ప్రవేశ పరీక్షలు ఈ నెల 28న ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతాయని సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం ప్రిన్సిపల్ ఆర్.దిలీప్‌రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాల్‌టికెట్లను sakshieducation.com, sakshischoolofjournalism.com వెబ్సైట్ల నుంచి బుధవారం ఉదయం 8 గంటల నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆయన వివరించారు. -
ఓయూలో విద్యార్థుల ఆందోళన..
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వద్ద శుక్రవారం విద్యార్థులు ఆందోళనకు దిగారు. పీజీ పరీక్షలు వాయిదా వేయాలంటూ నినాదాలు చేశారు. పరీక్షలు వాయిదా వేసేవరకు ఆందోళన చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు. -
ఊళ్లనిండా నీళ్లు
జిల్లా అంతటా భారీ వర్షాలు అత్యధికంగా కేవీబీపురం మండలంలో 28.3 సెం.మీ వర్షపాతం లోతట్టు ప్రాంతాలు జలమయం పెద్దవంక వాగులో ఒకరు, బాహుదా ఏటిలో మరొకరు గల్లంతు పలమనేరు నియోజకవర్గంలో చెరువులో పడి విద్యార్థి మృతి ఎస్వీయూలో పీజీ పరీక్షలు వాయిదా పాఠశాలలకు నేడు సెలవు పలు ప్రాంతాలకు రాకపోకలు బంద్ తిరుపతి-గూడూరు మార్గంలో ఆగిన రైళ్ల రాకపోకలు తిరుపతి: జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా తిరుపతిలో కుండపోత వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లోని వెయ్యికి పైగా ఇళ్లలోకి నీరు చేరింది. నగరంలోని రోడ్లు సెలయేళ్లను తలపించాయి. డ్రైన్లు పొంగి ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కల్గింది. వర్షపు నీరు వచ్చి చేరుతోంది. నియోజకవర్గంలోని 70 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. స్వర్ణము ఖి నదిపై నిర్మించిన బ్రిడ్జి దెబ్బతినడంతో ఆ మార్గాన్ని మూసివేశారు. 25 వేల ఎకరాల్లో మినుము పంట దెబ్బతింది. సత్యవేడు నియోజకవర్గంలో అరణియార్ ప్రాజెక్ట్ నిండడంతో నాలుగు గేట్లు ఎత్తేశారు. కాళంగి రిజర్వాయర్‌కు వరద ఉద్ధృతి ఎక్కువగా ఉంది. 18 మినీగేట్లతో పాటు ప్రధాన రెగ్యులేటరీకి ఉన్న మూడుగేట్లను ఎత్తేశారు.చంద్రగిరి నియోజకవర్గంలో కళ్యాణీ డ్యాం నిర్మించాక రెండోసారి గేట్లు ఎత్తివేసే స్థాయికి నీటిమట్టం చేరింది. ప్రస్తుతం 877 అడుగుల నీటిమట్టం ఉంది. మంగళవారం నాటికి ఈ నీటిమట్టం మరిం త పెరిగే అవకాశం ఉంది. తొండవాడ వద్ద స్వర్ణముఖి నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో తిరుపతి, చంద్రగిరి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నగరి నియోజకవర్గంలో ఉయ్యాలకాలువ ఉద్ధృతి ఎక్కువ కావడం తో బిఆర్.కండ్రికలో ఇందిరమ్మ ఇళ్లు జలమయ్యాయి. నగరి చెరువు నిండడంతో ఏకాంబరం కుప్పంలోని రాజీవ్‌గాంధీ కాలనీలోకి నీళ్లు వచ్చి చేరాయి. పుత్తూరులో తహశీల్దార్ కార్యాలయం కూలేస్థితిలో ఉన్నందున కార్యాలయాన్ని మార్చాల ని రెవెన్యూ ఉన్నతాధికారులు నిర్ణ యం తీసుకున్నారు. పుత్తూరులోని గంగమాంబాపురం కాలనీ నీట మునిగింది. పుంగనూరు నియోజకవర్గంలో పులిచెర్ల మండలం కొత్తపేట వద్ద గల పెద్దవాగులో ఓ వ్యక్తి కొట్టుకుపోయా డు. రొంపిచెర్ల మండలంలో తాటిమానుగుంట చెరువు తెగడం, ఏటి చెరువు పొంగడంతో పలు గ్రామాలు జలమయ్యాయి. సోమల మండలంలో వాగు లు పొంగి ప్రవహిస్తుండడంతో పెద్ద ఉప్పరపల్లె, కందూరు, నంజింపేట గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పుంగనూరులో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సోమల మండలం జాండ్రపేట చెరువు తెగడంతో పోలీసులు అధికారులు జాండ్రపేట గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పీలేరు నియోజకవర్గంలో పీలేరు-సదుం మార్గంలో పింఛానది ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలి చిపోయాయి. పింఛానదితోపాటు గా ర్గేయ ప్రాజెక్ట్‌లో భారీగా వర్షపు నీరు చేరుతోంది. కేవీపల్లె మండలంలో రెం డు చెరువులకు గండ్లు పడ్డాయి. కలికిరి మండలంలో చీకటిపల్లె - పల్లవోలు గ్రామాల మధ్య ప్రవహిస్తున్న బాహు దా ఏటిలో సోమవారం రాత్రి పాల వ్యాన్(బొలెరో) కొట్టుకుపోయింది. అ మిలేపల్లికి చెందిన వాహన యజమా ని శేఖర్(25) గల్లంతయ్యాడు. ఆ వా హనంలో ఉన్న అదే గ్రామానికి చెంది న చిన్నమస్తాన్ కుమారుడు పఠాన్షరీఫ్, వెంకట్రమణ కుమారుడు ప్రకాష్‌ను తాళ్ల సహాయంతో పోలీసులు కాపాడారు. పలమనేరు నియోజకవర్గంలో 14 ఏళ్లుగా ప్రవహించని కౌండిన్య నది ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పరవళ్లు తొక్కుతోంది. నియోజకవర్గంలో 14 చెరువులకు గండ్లు పడ్డాయి. తమిళనాడు రూరల్ పరిధిలో నక్కలపల్లె వద్ద జాతీయ రహదారికి గండి పడడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలి గింది. బెరైడ్డిపల్లె మండలంలోని గొల్లచీమలపల్లె సమీపంలోని లక్కన చెరువులో నీటిని చూసేందుకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లిన 10వ తరగతి చదువుతున్న లీనా ప్రమాదవశాత్తూ చెరువులో పడి చనిపోయింది. ఎన్టీఆర్ జలాశయానికి భారీగా వర్షపు నీరు చేరడంతో 10 గే ట్లు ఎత్తివేశారు. కార్వేటినగరం మండలంలోని కృష్ణాపురం జలాశయం నిండడంతో 2 గేట్లు ఎత్తేశారు. సిరిపురంవద్ద గుంజనే రు గట్టుకు రెండుచోట్ల భారీగా గండ్లు పడ్డాయి. ఎస్ఆర్పురం మండలంలో 17 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గంగాధరనెల్లూరులో పూల తోటలకు భారీ నష్టం వాటిల్లింది. పూతలపట్టులో బీమా నది, గొడ్డు వంకలు ఉద్ధృత స్థాయిలో ప్రవహిస్తుం డడంతో పూతలపట్టు-పోలవరం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పూతలపట్టు రంగంపేట క్రాస్ మధ్య రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. గార్గేయవాగు, బీరప్పవాగు చెరువు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. మదనపల్లెలో నిమ్మనపల్లె ప్రాజెక్ట్ నిండింది. 14 చెరువులకు గండ్లు పడ్డా యి. నియోజకవర్గంలోని మదనపల్లెతో పాటు చుట్టు పక్కల చెరువులు నిండాయి. 800 ఎకరాల్లో టమాట, వరిపంట దెబ్బతిన్నాయి. చిత్తూరు పట్టణంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. టమాట, బీన్స్, మిర్చి పంటలకు నష్టం వాటిల్లింది. కట్టమంచి చెరువు తెగిపోయింది. తంబళ్లపల్లె నియోజకవర్గంలో కుషావతి నది దాటే ప్రయత్నంలో వరద ఉద్ధృతికి టాటాసుమో బోల్తాపడింది. ఇందులో ప్రయాణిస్తున్న ముగ్గురిని స్థానికులు కాపాడారు. మరొకరు ప్రవాహంలో కొట్టుకుపోతుండగా లక్ష్మీనగర్ వాసులు రక్షించారు. -
ప్రభుత్వ ‘పథకం’.. చదువుకు దూరం
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో ప్రభుత్వం చేసిన మార్పులు ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు చుక్కలు చూపిస్తున్నాయి. పథకంలో చేసిన మార్పులపై అధికారులకూ స్పష్టత లేకపోవడంతో పీజీ, బీఈడీ విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. పీజీ, బీఈడీ కోర్సులు చదువుతున్న వారు స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకోవడంతోనే అసలు సమస్య మొదలవుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో 2013-14 విద్యా సంవత్సరం వరకు పీజీ చేసి బీఈడీ చేసినా, బీఈడీ చేసి పీజీ చేసినా ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చేది. 2014-15 విద్యా సంవత్సరం ప్రారంభంలోనూ ఇదే విధానం కొనసాగడంతో విద్యార్థులు పీజీ, బీఈడీ కోర్సుల్లో చేరారు. అయితే ఆ తర్వాత కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం పీజీ చేసి బీఈడీ చేసిన వారికి రీయింబర్స్మెంట్ ఇవ్వడం లేదు. ఈ పాస్‌లో ఆ విద్యార్థుల దరఖాస్తులు నమోదు కావడం లేదు. దీంతో ఆందోళనకు గురవుతున్న విద్యార్థులు, గతంలో ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చి ఇప్పుడు ఇవ్వమంటే ఎలా అని వాపోతున్నారు. తాము కోర్సుల్లో చేరే నాటికి పాత పద్ధతి అమల్లో ఉందని, పీజీ చేసి బీఈడీ చేసినా, బీఈడీ చేసి పీజీ చేసినా తమ ఫీజులు చెల్లించాలని కోరుతూ ఫీజు రీయింబర్స్మెంట్ నోడల్ డిపార్ట్మెంట్ ఎస్సీ డెవలప్మెంట్ శాఖ చుట్టూ విద్యార్థులు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ విషయంలో ఎస్సీ శాఖ అధికారులు కూడా విద్యార్థులకు సరైన సమాధానం ఇవ్వలేకపోతున్నారు. దీనిపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్లు, అక్కడి నుంచి వచ్చే వివరణను బట్టి స్పందిస్తామని అధికారులు చెబుతున్నారు. అది ఇస్తేనే.. ఇది.. బీఈడీ చేసి పీజీ చేస్తున్న వారు బీఈడీ రీయింబర్స్‌మెంటును చలాన్ రూపంలో తిరిగి చెల్లిస్తే, పీజీ ఫీజు ఇస్తామని కొన్నిచోట్ల అధికారులు చెబుతున్నట్లు విద్యార్థులు వాపోతున్నారు. పోస్ట్‌మెట్రిక్ స్కాలర్షిప్స్-కోర్సు ఫ్లో అడాప్టెడ్ ఇన్ ఈ పాస్ (కింది నుంచి పైకి కోర్సుల వరుస క్రమం) అంటూ స్కాలర్షిప్స్ దరఖాస్తులను పరిశీలించి, మంజూరు చేసే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ)కు సంబంధిత అధికారులు ఉత్తర్వులు పంపించారు. అందుకు అనుగుణంగా ఈ-పాస్ వెబ్సైట్లో మార్పులు చేయడంతో ఈ విద్యార్థుల దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి. పీజీ తర్వాత డిగ్రీ.. సాధారణంగా బీఈడీ డిగ్రీ స్థాయి కోర్సు. ఆ తరువాత క్రమంలో వచ్చే కోర్సు పీజీ. కాని పీజీ చేసిన విద్యార్థి ఆ తరువాత డిగ్రీతో సమానమైన వృత్తి విద్యా కోర్సు (బీఈడీ) చేసి ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేస్తే అధికారులు తిరస్కరిస్తున్నారు. ఇందులో భాగంగా కోర్సు స్ట్రీమ్, కోర్సు ఫ్లో అంటూ జనరల్, ఎడ్యుకేషన్, లా, ఫిజికల్ ఎడ్యుకేషన్, మెడికల్, ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సులకు సంబంధించి ఆయా విభాగాలు క్రమపద్ధతిలో అంటే ఇంటర్, డిగ్రీ, ఎంఫిల్, పీహెచ్డీ వంటివి వరసగా చదివితేనే రీయింబర్స్మెంట్ వర్తించేలా మార్పులు చేశారు. ఎడ్యుకేషన్ విభాగంగా బీఈడీ, ఎంఈడీ, ఎంఫిల్, పీహెచ్డీ క్రమపద్ధతిలో వరసగా చదివితేనే ఫీజు చెల్లించేలా వెబ్సైట్లో ఏర్పాటు చేశారు. దీనిపై ప్రభుత్వ పరంగా వివరణ వస్తేనే సమస్య పరిష్కారమవుతుందనే అభిప్రాయాన్ని విద్యార్థులు, అధికారులు వెలిబుచ్చుతున్నారు. -
పీజీ వైద్యులకే ప్రభుత్వ సర్వీసు!
వచ్చే ఏడాది నుంచి ఎంబీబీఎస్‌లకు మినహాయింపు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వాసుపత్రుల్లో విధిగా ఏడాదిపాటు పనిచేయాలన్న నిబంధనను పీజీ పూర్తి చేసిన వైద్యులకే పరిమితం చేయనున్నారు. వచ్చే ఏడాది నుంచి ఈ నిబంధనను విధించబోతున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదన రాగా.. దీనిని త్వరలోనే ఆమోదించి ఉత్తర్వులు ఇవ్వబోతున్నారు. ఇకపై ఎంబీబీఎస్ పూర్తి చేసినవారు గ్రామీణ ప్రాంతాల్లో ఏడాది సర్వీసు చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పటివరకు ఎంబీబీఎస్ పూర్తిచేశాక సూపర్ స్పెషాలిటీ వరకూ ఎప్పుడైనా ఒక ఏడాది ప్రభుత్వ సర్వీసు చేయాల్సి ఉంది. అయితే ఎంబీబీఎస్ వైద్యులు ఎక్కువ మంది అందుబాటులో ఉన్నారని, పీజీ వైద్యుల కొరతే వేధిస్తోందన్న కారణంతో పీజీ వైద్యులకే ఈ నిబంధన విధించాలని నిర్ణయించారు. ఉదాహరణకు ఎంబీబీఎస్ పూర్తిచేయగానే ఏడాది గ్రామీణ ప్రాంతంలో సర్వీసు చేసి వెళ్లిపోతారు. ఇలా ఎంబీబీఎస్ స్థాయిలో విధిగా ఏడాది సర్వీసు చేసి.. వెళ్లిపోతే పీజీ చేశాక బోధనాసుపత్రుల్లో పనిచేయడానికి పీజీ వైద్యులు అందుబాటులో ఉండరని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇన్‌సర్వీసు పీజీ కోటా కుదింపు ప్రస్తుతం ఎంబీబీఎస్ పూర్తవగానే ప్రభుత్వ ఉద్యోగం పొందినవారికి పీజీ సీట్లలో 30 శాతం ఇన్‌సర్వీస్ కోటా కింద ఇస్తున్నారు. ఇకపై దీన్ని భారీగా కుదించాలని నిర్ణయించారు. నాన్ క్లినికల్ విభాగంలో మొత్తం సీట్లను ఎత్తేస్తారు. ప్రస్తుతం నాన్ క్లినికల్‌లో అనాటమీ, ఫిజియాలజీ, పెథాలజీ, ఫార్మకాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, మైక్రోబయాలజీ, కమ్యూనిటీ మెడిసిన్ వంటి 9 విభాగాలున్నాయి. ఈ విభాగాల్లో ఇన్‌సర్వీస్ కోటాలో సీట్లు పొందినా బోధనాసుపత్రుల్లో పదోన్నతులు పొందేందుకు పోస్టులు లేవని, అలాగని పీహెచ్‌సీల్లో పనిచేయడానికి ఈ అర్హతలు వృథా అని భావించి.. ఈ విభాగాల్లో సీట్లను ఇన్‌సర్వీస్ కోటా నుంచి తీసేస్తున్నారు. -
ఇక ‘పీజీ’ గందరగోళం!
సాక్షి, హైదరాబాద్: ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ కాలేజీలకు అనుబంధ గుర్తింపు వ్యవహారం గందరగోళంగా మారింది. ఇటు జేఎన్టీయూహెచ్, అటు ఉన్నత విద్యా మండలి ఎవరికి వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో లక్ష మందికి పైగా విద్యార్థులు ఆందోళనలో మునిగిపోయారు. అన్నీబాగున్న కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చేందుకు తాము సిద్ధమేనని, ఉన్నత విద్యా మండలి అడిగితే వెంటనే జాబితాను ఇచ్చేస్తామని జేఎన్టీయూహెచ్ చెబుతుంటే... ప్రవేశాలు చేపట్టేందుకు కాలేజీల జాబితాను ఇవ్వాలని పది రోజులుగా అడుగుతున్నా జేఎన్టీయూహెచ్ స్పందించడం లేదని ఉన్నత విద్యా మండలి వర్గాలు పేర్కొంటున్నాయి. ఇలా ఎవరికి వారు వాదనలు చేస్తున్నారే తప్ప.. విద్యా సంవత్సరం ప్రారంభమై 10 రోజులు కావస్తోందని ఆలోచించడం లేదు. ఫలితంగా లక్ష మంది విద్యార్థులు ఆందోళనలో మునిగిపోయారు. రాష్ట్రంలో గతేడాది దాదాపు 53వేల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు పీజీ (ఎంటెక్) చేసేందుకు పీజీఈసెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. అందులో దాదాపు 47 వేల మంది అర్హత సాధించగా.. జూన్ 17న ఫలితాలను ప్రకటించారు. కానీ ఇప్పటివరకు ఇంకా ప్రవేశాల ప్రక్రియను చేపట్టలేదు. మరోవైపు ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కౌన్సెలింగ్ కోసం మరో 58 వేల మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహించాలంటే యూనివర్సిటీలు (ఉస్మానియా, జేఎన్టీయూహెచ్, కాకతీయ తదితర) అనుబంధ గుర్తింపు ఇచ్చిన కాలేజీల జాబితాను ఉన్నత విద్యా మండలి నేతృత్వంలోని ప్రవేశాల క్యాంపు అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. కానీ జేఎన్టీయూహెచ్ నుంచి రాష్ట్రంలో అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీల జాబితాలు ఉన్నత విద్యా మండలికి అందలేదు. అయితే ఇంజనీరింగ్ బీటెక్ కోర్సుల తరహాలో జేఎన్టీయూహెచ్, ఏఐసీటీఈ సంయుక్త బృందాల తనిఖీల కోసం ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల కోసం పలు కాలేజీలు కోర్టును ఆశ్రయించాయి. కోర్టు వాటిని కూడా పరిశీలిస్తామని పేర్కొంది. అయితే ఎలాంటి లోపాలు, వివాదాలు లేని ఎంటెక్ కాలేజీల జాబితాలనైనా ఉన్నత విద్యా మండలికి జేఎన్టీయూహెచ్ అందజేయలేదు. కోర్టు కేసు తేలాక ఇస్తే ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో ఆపామని పేర్కొంటోంది. ఉన్నత విద్యా మండలి కోరితే వివాదం లేని కాలేజీల జాబితాలను ఇస్తామని చెబుతోంది. మరోవైపు తాము పది రోజులుగా జాబితాలను ఇవ్వాలని అడిగినా జేఎన్టీయూహెచ్ ఇవ్వడం లేదని మండలి వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు అసలు అఫిలియేషన్లు ఇచ్చే అధికారం జేఎన్టీయూహెచ్కు ఉందా? లేదా? అన్న కొత్త వాదన తెరపైకి వచ్చింది. దీనిపై తుది విచారణకు మరో నాలుగు వారాల గడువు ఉంది. అంటే ఇంకా నెల రోజుల వరకు ఈ ప్రవేశాలు జరిగే పరిస్థితి కనిపించడం లేదు. విద్యార్థులకు ఎదురుచూపులు తప్పేలా లేవు. -
ఉరితీసేలోగా పీజీ పట్టా ఇవ్వలేం
నాగ్‌పూర్: ఈ నెల 30న ఉరిశిక్ష అమలు ఖాయమైన నేపథ్యంలో ముంబై పేలుళ్ల దోషి యాకుబ్ మెమన్ చివరి కోరిక తీరకుండానే చనిపోనున్నారు. గడిచిన 21 ఏళ్లుగా జైలులోనే ఉన్న ఆయన.. రెండు పీజీ కోర్సులు పూర్తిచేశారు. అరెస్టుకు ముందు ఛార్టర్డ్ అకౌంటెంట్ గా మెమన్ కు మంచి పేరుండేది. జైలులోనూ తన పఠనాసక్తిని కొనసాగించిన ఆయన ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ పొలిటికల్ సైన్స్ కోర్సులు పాస్ అయ్యారు. చనిపోయేలోగా ఎంఏ ఇంగ్లీష్ పట్టా తీసుకోవాలనుకుంటున్నట్లు మెమన్.. జైలు అధికారులకు చెప్పగా వారు యూనివర్సిటీ అధికారులను సంప్రదించారు. అయితే ఇప్పటికిప్పుడు పీజీ పట్టాలు ఇవ్వలేమని, దానికి కొంత సమయం పడుతుందని, అదికూడా ఈ నెల 30లోగా పట్టా అందించడం అసాధ్యమని ఇగ్నో అధికారులు తేల్చిచెప్పారు. దీంతో ఆఖరి కోరిక తీరకుండానే మెమన్ ఉరి కంబం ఎక్కనున్నారు. -
పీజీ కౌన్సెలింగ్‌లో ప్రైవేటు మాయ
తిరుపతికి చెందిన ఓ విద్యార్థినికి కంప్యూటర్ సైన్స్‌లో 59వ ర్యాంకు సాధించింది. ఈమెకు ఎస్వీయూ క్యాంపస్‌లో సీటు రావాల్సి ఉంది. అయితే ప్రైవేటు కళాశాలల ప్రతినిధులు మాయమాటలు చెప్పడంతో క్యాంపస్‌లో కాదని ప్రైవేటు కళాశాలలో చేరింది. బద్వేలుకు చెందిన మరో యువతి 20వ ర్యాంకు సాధించినప్పటికీ క్యాంపస్‌లో చేరనీయకుండా ప్రైవేటు ప్రతినిధులు మాయ మాటలు చెప్పి తమ కళాశాలలో చేర్చుకున్నారు. ఇలా పలు సంఘటనలు పీజీ కౌన్సెలింగ్‌లో ప్రైవేటు మోసాన్ని బహిర్గతం చేస్తున్నాయి. - విద్యార్థులను మాయ చేస్తున్న ప్రైవేటు ప్రతినిధులు - నష్టపోతున్న ప్రతిభావంతులు యూనివర్సిటీక్యాంపస్: ఎస్వీయూ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి జరుగుతున్న కౌన్సెలింగ్‌పై ప్రైవేటు యాజమాన్యాలు తమ పంజా విసురుతున్నాయి. విద్యార్థులను మభ్యపెట్టి తమ కళాశాలల్లో చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఎస్వీయూ, దాని అనుబంధ కళాశాలల్లో పీజీ కోర్సుల ప్రవేశానికి ఈనెల 6 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభమైంది. ఈ కౌన్సెలింగ్ ద్వారా దాదాపు 5,500 సీట్లకు అడ్మిషన్లు నిర్వహిస్తున్నారు. ఇందులో క్యాంపస్‌లో 1900 సీట్లు ఉండగా ప్రైవేటు కళాశాలల్లో 3,600 సీట్లు అందుబాటులో ఉన్నాయి. క్యాంపస్‌లో నాణ్యమైన, అర్హత కలిగిన అధ్యాపకులతో బోధనతో పాటు అన్ని సౌకర్యాలతో కూడిన లైబ్రరీ ఇతర సౌకర్యాలు ఉన్నాయి. క్యాంపస్‌తో పోల్చితే ప్రైవేటు కళాశాలల్లో సౌకర్యాలు అంతంత మాత్రమే. దీనివల్ల విద్యార్థులు క్యాంపస్‌లో చేరడానికి ఆసక్తి చూపుతారు. ప్రైవేటు కళాశాలల్లో విద్యార్థులు చేరకపోవడంతో యాజమాన్యాలు విద్యార్థులకు గాలం వేసి, చేర్చుకునే ప్రక్రియకు శ్రీకారం చుట్టాయి. ఇందులో భాగంగా కౌన్సెలింగ్ జరుగుతున్న శ్రీనివాస ఆడిటోరియంలో కొంతమంది ప్రైవేటు కళాశాలల ప్రతినిధులు తిష్ట వేసి, విద్యార్థులకు మాయ మాటలు చెబుతున్నారు. తమ కళాశాలల్లో చేరితే తరగతులకు హాజరు కాకపోయినా పట్టించుకోమని, పరీక్షల్లో పాస్ కావడానికి ఏర్పాట్లు చేస్తామని హామీలు గుప్పిస్తున్నారు. అంతేకాకుండా కొన్ని కళాశాలలు విద్యార్థులకు చిన్న చిన్న బహుమతుల పేరిట నజరానాలు అందిస్తున్నాయి. వీటికి ఆకర్షితులై విద్యార్థులు క్యాంపస్‌లో ఖాళీ ఉన్నప్పటికీ ప్రైవేటు కళాశాలల్లో చేరుతున్నారు. అడ్మిషన్స్ వ్యవహారరం చూస్తున్న కొందరు అధ్యాపకులు కూడా ప్రైవేటు యాజమాన్యాలతో కుమ్మక్కై విద్యార్థులకు గాలం వేస్తున్నారు. దీంతో విద్యార్థులు ప్రైవేటు కళాశాలల్లో చేరి నష్టపోతున్నారు. గురువారం తిరుపతికి చెందిన సంధ్య అనే విద్యార్థి ఇలా నష్టపోయారు. ఈ విషయం విద్యార్థి సంఘాలకు తెలియడంతో వారు ఆందోళన చేశారు. దీంతో ప్రైవేటు ప్రతినిధుల వ్యవహారం బయటకు వచ్చింది. అడ్మిషన్స్ డెరైక్టర్ భాస్కర్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసి, వారిని పోలీసులకు అప్పగించారు. ఇప్పటికే నష్టపోయిన విద్యార్థులకు ఎలాంటి న్యాయం చేయలేమని రెండో విడతలో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రైవేటు ప్రతినిధులు విద్యార్థులను ప్రలోభపెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ఎందులో ‘నైనా’ రికార్డే !
15 ఏళ్లకే పీజీ, జాతీయస్థాయి క్రీడాకారిణిగా రాణింపు హైదరాబాద్: జాతీయస్థాయిలో క్రీడల్లో రాణిస్తూనే పిన్న వయసులోనే పెద్ద చదువులు చదువుతూ రికార్డు సృష్టిస్తోంది హైదరాబాద్ కాచిగూడకు చెందిన 15 ఏళ్ల నైనా జైస్వాల్. విభిన్న రంగాల్లో తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్న నైనా కేవలం 8 ఏళ్ల వయసులోనే పదోతరగతి పూర్తి చేసింది. 10 ఏళ్లకు ఇంటర్, 14 ఏళ్లకు డిగ్రీ పాసై శెభాష్ అనిపించుకుంది. అదే సమయంలో మరోవైపు టేబుల్ టెన్నిస్‌లో రాణిస్తూ జాతీయస్థాయిలో అనేక విజయాలు నమోదు చేసింది. ఈ ఏడాది దూరవిద్యా విధానంలో పీజీ (పొలిటికల్ సైన్స్)లో చేరిన నైనా బుధవారం ఎల్బీనగర్ లోని విజయ్‌కరణ్ డిగ్రీ కాలేజ్‌లో ప్రారంభమైన పరీక్షలకు హాజరైంది. ఈ సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడుతూ... భవిష్యత్తులో సివిల్స్ సాధించటమే తన లక్ష్యమని చెప్పింది. పిన్న వయసులోని విభిన్న రంగాల్లో రాణించడం వెనుక తన తండ్రి అశ్విన్‌కుమార్, తల్లి భాగ్యలక్ష్మీల ప్రోత్సాహం ఎంతో ఉందని తెలిపింది. చదువుకోడానికి తాను ప్రత్యేకంగా సమయం కేటాయించనని, రోజూ 8 గంటల పాటు టేబుల్ టెన్నిస్ ప్రాక్టీస్ చేస్తుంటానని పేర్కొంది. సమయం దొరికినప్పుడు రామాయణం, భగవద్గీత వంటి ఆధ్యాత్మిక గ్రంథాలను చదవడానికి ఇష్టపడతానని చెప్పింది. కాగా, నైనా వీటన్నింటితో పాటు రెండు చేతులతో రాయడంలోనూ నేర్పరి. అలాగే, కేవలం రెండు సెకన్లలో ఏ నుంచి జెడ్ వరకు అక్షరాలను టైప్ చేసి మరో రికార్డూ సృష్టించింది. అందరూ వయసు పెరుగుతోందని భావిస్తుంటారు, నేను మాత్రం ఆయుష్షు తగ్గుతున్నట్లుగా భావిస్తా’ అని చెబుతున్న నైనా.. ఎన్ని నేర్చుకున్నా, ఎంత నేర్చుకున్నా చదువు ఉంటేనే ఇతర రంగాలకు మరింత అర్హత తోడవుతుందని అంటోంది. -
ఓయూసెట్‌లో 93.98 శాతం ఉత్తీర్ణత
సాక్షి, హైదరాబాద్: పీజీ, పీజీడిప్లొమా, ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఓయూసెట్-2015 ఫలితాలు వెల్లడయ్యాయి. ఉస్మానియా వర్సిటీలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సురేష్ కుమార్ సోమవారం వీటిని విడుదల చేశారు. ఈ నెల 8 నుంచి 16 వరకు నిర్వహించిన ఓయూసెట్‌కు 88,417 మంది హాజరుకాగా.. ఇందులో 83,098 మంది (93.98 శాతం) అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. 52 సజ్టెక్టులకు గాను 44 సబ్జెక్టులకు మాత్రమే పరీక్ష నిర్వహించి ఫలితాలు వెల్లడించారు. కాగా ఎంపీఈడీ కోర్సు ఫలితాలు వెల్లడించాల్సి ఉంది. కన్నడ, పర్షియన్, తమిళ్, మరాఠి తదితర సబ్జెక్టుల్లో ఉన్న సీట్ల కంటే దరఖాస్తులు తక్కువ సంఖ్యలో రావడంతో పరీక్ష నిర్వహించలేదు. ఆ సబ్జెక్టులకు దరఖాస్తు చేసుకున్న అందరికీ నేరుగా అడ్మిషన్లు కల్పించనున్నట్లు అడ్మిషన్స్ డెరైక్టర్ ప్రొఫెసర్ సీహెచ్ గోపాల్ రెడ్డి తెలిపారు. కౌన్సెలింగ్‌లో భాగంగా వచ్చే నెల 8 లేదా 9 నుంచి అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు. సర్టిఫికెట్ల వెరికేషన్‌కు హాజరయ్యే విద్యార్థులు విద్యార్హత పత్రాలతోపాటు తప్పనిసరిగా ర్యాంకు కార్డు తీసుకెళ్లాలని, లేకుంటే అనుమతించబోమని స్పష్టం చేశారు. -
అర్హత మేరకే కాలేజీలకు పీజీ అడ్మిషన్లు
వచ్చే ఏడాది నుంచి ఇంజనీరింగ్ ప్రవేశాలకూ ఇదే విధానం కాలేజీల పరిస్థితిపై పరిశీలనకు ఏపీ మంత్రి గంటా ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది పీజీ కోర్సుల్లో ప్రవేశాలు పక్కాగా చేపట్టాలని, అడ్డగోలు కాలేజీలను నియంత్రించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. గురువారం ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు దీనిపై సమావేశం నిర్వహించారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాలరెడ్డి, జేఎన్టీయూ రిజిస్ట్రార్ జీవీఆర్ ప్రసాదరాజు ఇతర అధికారులు ఇందులో పాల్గొన్నారు. వర్సిటీ ప్రతినిధులతో ఏర్పాటుచేసిన ఫ్యాక్టుఫైండింగ్ కమిటీలు (ఎఫ్ఎఫ్సీ) ఆయా కాలేజీల్లోని ఏర్పాట్లను పరిశీలించి ఇదివరకు ఇచ్చిన నివేదికలను పరిశీలించేందుకు కమిటీని నియమించింది. ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాలరెడ్డి, సాంకేతిక విద్యాశాఖ మాజీ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంలను ఈ కమిటీలో సభ్యులుగా నియమించారు. ఈ కమిటీ కాలేజీల స్థితిగతులపై ఎఫ్ఎఫ్సీలు అందించిన నివేదికలను కొంతమేర పరిశీలించాయి. ఆయా కాలేజీల్లో సదుపాయాలను పరిశీలించి అర్హత మేరకు కాలేజీలకు సీట్లను కేటాయించాలి. సదుపాయాలు లేకుంటే వాటిని కౌన్సెలింగ్ నుంచి మినహాయించాలి. ఈ కమిటీ పరిశీలన పూర్తికాకముందే ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్ ప్రారం భమవడం, శుక్రవారంతో సీట్లు కేటాయించనుండటంతో ఈ ఏడాదికి ఇంజనీరింగ్ యూజీ కోర్సులను పాతజాబితా మేరకే కొనసాగించాలని నిర్ణయించారు. పీజీ కోర్సుల ప్రవేశాలను పక్కాగా చేపట్టాలని మంత్రి గంటా అధికారులను ఆదేశించారు. ఎఫ్ఎఫ్సీ నివేదికలకు, అంతకు ముందు ఏపీ ఫీజులు, ప్రవేశాల నియంత్రణ మండలి (ఏఎఫ్ఆర్సీ) ఇచ్చిన నివేదికలకు చాలా తేడాలున్నాయని కమిటీ సభ్యులు మంత్రికి వివరించారు. దీంతో కాలేజీలన్నిటిపైనా క్షుణ్ణంగా క్షేత్రస్థాయి తనిఖీలు చేయించాలని ఉన్నత విద్యామండలి చైర్మన్‌ను మంత్రి ఆదేశించారు. ముందుగా పీజీ కాలేజీల్లో ఈ పరిశీలనను చేపట్టించాలని, దాన్ని బట్టి కాలేజీలకు సీట్ల సంఖ్యను నిర్దేశించి అడ్మిషన్లు ఇవ్వాలని సూచించారు. ఫీజు రీయింబర్స్‌మెంటు నిధుల కోసమే ఎక్కువ కాలేజీలు సీట్ల సంఖ్యను పెంచుకొంటున్నాయని రిపోర్టులు వచ్చిన నేపథ్యంలో కాలేజీలన్నిటినీ తనిఖీ చేశాకే అడ్మిషన్లను చేపట్టాలని మంత్రి ఆదేశించారు. అసిస్టెంటు ప్రొఫెసర్లకు ఎంటెక్, అసోసియేట్ ప్రొఫెసర్లకు, ప్రొఫెసర్లకు పీహెచ్డీ తప్పనిసరి చేయాలని నిర్ణయించారు. అధ్యాపకుల ధ్రువపత్రాలు, ఆధార్ కార్డు పరిశీలన చేపట్టాలని నిర్దేశించారు. -
ఇంజనీరింగ్‌లోనూ సీబీసీఎస్!
సాక్షి, హైదరాబాద్: సాధారణ డిగ్రీ, పీజీ కోర్సులతోపాటు ఇంజనీరింగ్ వంటి వృత్తివిద్యా కోర్సుల్లోనూ చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం (సీబీసీఎస్)ను అమలు చేసేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఇందులో భాగంగా జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం-హైదరాబాద్ (జేఎన్టీయూహెచ్) తన పరిధిలోని కాలేజీల్లో సీబీసీఎస్ అమలుకు సంబంధించిన ప్రతిపాదనలను ఇటీవల ప్రభుత్వానికి పంపించింది. దీనిపై ప్రభుత్వం త్వరలోనే చర్చించి నిర్ణయం ప్రకటించనుంది. సీబీసీఎస్ అమల్లోకి వస్తే మార్కుల విధానం ఇకపై ఉండదు. విద్యార్థుల మార్కుల రేంజ్‌నుబట్టి గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్లు, క్రెడిట్ పాయింట్ల విధానం రానుంది. ప్రస్తుతం జేఎన్టీయూహెచ్ పరిధిలో 500కుపైగా ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర కోర్సులను నిర్వహించే డి గ్రీ, పీజీ కాలేజీలు ఉండగా వాటిన్నింటిలోనూ దీన్ని అమలు చేయనున్నారు. అలాగే జేఎన్టీయూహెచ్ ఇన్నాళ్లూ ఇంజనీరింగ్ ప్రథమ సంవత్సరంలో సెమిస్టర్ విధానాన్ని అమలు చేయట్లేదు. తాజా మార్గదర్శకాల ప్రకారం ఇకపై ప్రథమ సంవత్సరంతోపాటు అన్ని సంవత్సరాల్లోనూ సెమిస్టర్ విధానాన్ని అమల్లోకి తేనున్నారు. విద్యార్థికి ఇష్టమైన సబ్జెక్టులు చదువుకునే అవకాశం కల్పించడంతోపాటు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సీబీసీఎస్‌ను 2015-16 విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి తేవాలని స్పష్టం చేసింది. -
ఈసారి అమలు చేయలేం!
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ, పీజీ కోర్సుల్లో చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం (సీబీసీఎస్) 2015-16 విద్యా సంవత్సరంలో అమలు చేయడం సాధ్యం కాదని రాష్ట్రంలోని వర్సీటీలు స్పష్టం చేశాయి. ఫ్యాకల్టీ, సదుపాయాలు లేకుండా సీబీసీఎస్‌ను అమలు చేయలేమని చేతులెత్తేశాయి. సీబీసీఎస్‌కు అనుగుణంగా సిలబస్ విభజన సులభమే అయినా.. 60 శాతానికిపైగా ఖాళీలు ఉండడంతో అమలు చేయడమెలాగని ప్రశ్నిస్తున్నాయి. ఈ విషయాన్నే ఉన్నత విద్యా మండలి వర్గాలకు తెలియజేశాయి. అంతేగాకుండా అనుబంధ కా లేజీలపై నియంత్రణ సరిగ్గా లేని పరిస్థితుల్లో సీబీసీఎస్‌ను ఎలా అమలు చేస్తామని పేర్కొంటున్నాయి. అనుసంధానమెప్పుడు? సాధారణంగా అన్ని కాలేజీల్లో అన్ని రకాల కోర్సులు అందుబాటులో ఉండవు. చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం (సీబీసీఎస్) విధానంలో ఇష్టమైన సబ్జెక్టును ఎంచుకుని, చదువుకోవాలంటే ఆయా కోర్సులు అందుబాటులో ఉండే కాలేజీల మధ్య అనుసంధానం అవసరం. కానీ ఇలాంటి వ్యవస్థను యూనివర్సిటీలు ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. యూనివర్సిటీల్లో సరిపడా సిబ్బంది లేకపోవడమే దీనికి కారణం. అసలు రెగ్యులర్ కోర్సులను బోధించే ఫ్యాకల్టీనే యూనివర్సిటీల్లో లేనపుడు సీబీసీఎస్ ఎలా సాధ్యమన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పాత కోర్సుల్లో సీబీసీఎస్ అమలు చేయాలని భావించినా.. ఫ్యాకల్టీ లేకుండా, పక్కాగా ల్యాబ్ సదుపాయాలు లేకుండా అమలు చేయడం సాధ్యం కాదని వర్సిటీల వర్గాలు తేల్చిచెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారికి సీబీసీఎస్ అమలు నుంచి మినహాయింపు ఇవ్వాలని... ఇందుకోసం యూజీసీ నుంచి అనుమతి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. మరోవైపు యూజీసీ మాత్రం ఈ విద్యా సంవత్సరం నుంచి సీబీసీఎస్ అమలు చేయాల్సిందేనని ఇప్పటికే స్పష్టం చేసింది. అంతేకాదు తాము సూచించిన సిలబస్‌లో 30 శాతం వరకు మాత్రమే మార్పులు చేసుకోవచ్చని, అదికూడా సిలబస్ పరిధిలోనే చేసుకోవాలని స్పష్టం చేసింది. దీనికి అనుగుణంగా 2015-16లోనే సీబీసీఎస్ అమలు చేస్తామని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కూడా యూజీసీకి తెలియజేసింది. కానీ ఫ్యాకల్టీ, వసతులు లేకుండా కుదరదని వర్సిటీలు చెబుతున్నాయి. ఈ సమస్యలను పరిష్కరిస్తే వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయగలమని పేర్కొంటున్నాయి. సీబీసీఎస్ అమలు చేయాలంటే దరఖాస్తు నమూనాలోనూ మార్పు చేయాల్సి ఉంటుందని.. కాని ఇప్పటికే డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు కాలేజీలు, వర్సిటీలు పాత పద్ధతిలోనే దరఖాస్తులను ఆహ్వానించాయని స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని ప్రకటించకపోవడం కూడా గందరగోళానికి కారణం అవుతోంది. -
హోంగార్డు టెక్నికల్... ఏడో తరగతి చాలు..
హోంగార్డు టెక్నికల్ ఉద్యోగాల నోటిఫికేషన్‌కు సవరణ 17 నుంచి 19 వరకు దరఖాస్తులు సాక్షి, హైదరాబాద్: హోంగార్డు టెక్నికల్ (ఫోరెన్సిక్ సెన్సైస్) ఉద్యోగానికి ఏడో తరగతి పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చని హైదరాబాద్ పోలీస్ విభాగం పేర్కొంది. ఈ ఉద్యోగాలకు పీజీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలంటూ గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవరించి సోమవారం కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఏడో తరగతి పూర్తి చేసి, 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. అభ్యర్థులు http://www.hyderabad police.gov.in/ వెబ్సైట్లో దరఖాస్తులను నింపి, ప్రింట్ తీసుకోవాలి. దానితోపాటు విద్యార్హత పత్రాల కాపీలను తీసుకుని ఈనెల 17 నుంచి 19వ తేదీల మధ్య ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య గోషామహల్ స్టేడియానికి రావాలి. అదేరోజున అక్కడ శారీరక దారుఢ్య పరీక్షలను నిర్వహించి, అర్హత పొందినవారికి వెంటనే నాలెడ్జ్ ఆఫ్ కెమికల్ ల్యాబ్, ఫోరెన్సిక్ టూల్స్ క్వాలిఫైయింగ్ పరీక్షకు హల్‌టికెట్లు జారీచేస్తారు. 22 నుంచి 24వ తేదీ మధ్యలో అథారిటీస్ ఆఫ్ సెలెక్షన్ కమిటీ ఆ పరీక్షను నిర్వహించనుంది. అందులో ఎక్కువ మంది అభ్యర్థులు అర్హత సాధిస్తే.. షార్ట్‌లిస్ట్ చేసేందుకు రాతపరీక్షను నిర్వహిస్తామని హైదరాబాద్ పోలీసు విభాగం తెలిపింది. గతంలో దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. -
‘నాగార్జున’లో కొనసాగుతున్న పీజీ కౌన్సెలింగ్
గుంటూరు : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం కళాశాలల్లో పీజీ కోర్సుల ప్రవేశానికి కౌన్సెలింగ్ కొనసాగుతోంది. యూనివర్సిటీ కౌన్సెలింగ్ కేంద్రంలో బుధవారం ఎమ్మెస్సీ కెమికల్ సైన్స్‌లో 1201 ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు కౌన్సెలింగ్ ఉంటుంది. అలాగే, ఫిజికల్ సైన్స్, ఎన్సీసీ, స్పోర్ట్స్, పీహెచ్ కేటగిరీల్లో అన్ని ర్యాంకులకు, జనరల్ కేటగిరీలో 1 నుంచి 200వ ర్యాంకు వరకు కౌన్సెలింగ్ కొనసాగుతోంది. దీంతోపాటు కామర్స్‌లో ఎన్సీసీ, స్పోర్ట్స్, క్యాప్, పీహెచ్ కేటగిరీల్లో అన్ని ర్యాంకులకు, జనరల్ కేటగిరీలో 1 నుంచి 500 ర్యాంకు వరకు ఈరోజు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. -
ప్రారంభమైన పీజీ కౌన్సెలింగ్
ప్రారంభమైన పీజీ కౌన్సెలింగ్ :ఏఎన్‌యూ : యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో 2015-16 విద్యాసంవత్సరంలో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పీజీ కౌన్సెలింగ్ సోమవారం యూనివర్సిటీలో ప్రారంభమైంది. ఇన్చార్జి వీసీ కేఆర్ఎస్ సాంబశివరావు కౌన్సెలింగ్‌ను ప్రారంభించి ఎమ్మెస్సీ కెమిస్ట్రీ కోర్సు మొదటి ర్యాంకర్ పి.భరత్‌కుమార్‌కు, ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్ కోర్సు మొదటి ర్యాంకర్ ఆర్.ఆశామౌనికకు సీటు ఖరారు పత్రాలు అందజేశారు. కౌన్సెలింగ్ ఏర్పాట్లను అడ్మిషన్ల డెరైక్టర్ ఎం.రామిరెడ్డిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ పి.రాజశేఖర్, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ సి.రాంబాబు, డాక్టర్ హరిబాబు తదితరులు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో విద్యార్థులు హాజరు: పీజీ కౌన్సెలింగ్‌కు తొలిరోజు అధిక సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. ఎమ్మెస్సీ కెమిస్ట్రీ కోర్సుకు 232 మంది, ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్ కోర్సుకు 128 మంది హాజరయ్యారు. ఎమ్మెస్సీ కెమిస్ట్రీ కోర్సులో సీట్లు అధికంగా భర్తీ అయ్యాయి. మంగళవారం ఉదయం 9 గంటలకు కెమికల్ సెన్సైస్‌లో 501 నుంచి 800 ర్యాంకు వరకు, ఇంగ్లిష్‌కు ఎన్సీసీ, క్యాప్, స్పోర్ట్స్, పీహెచ్ కేటగీరిల్లో అన్ని ర్యాంకులకు, జనరల్ కేటగిరీలో 1 నుంచి 256 వ ర్యాంకు వరకు మధ్యాహ్నం 2 గంటలకు కెమికల్ సెన్సైస్‌లో 801 నుంచి 1200 వ ర్యాంకు వరకు, తెలుగులో ఎన్సీసీ, క్యాప్, స్పోర్ట్స్, పీహెచ్ కేటగీరిల్లో అన్ని ర్యాంకులకు, జనరల్ కేటగిరీలో 1 నుంచి 161వ ర్యాంకు వరకు, హిందీలో ఎన్సీసీ, క్యాప్, స్పోర్ట్స్, పీహెచ్ కేటగీరిల్లో అన్ని ర్యాంకులకు, జనరల్ కేటగిరీలో 1 నుంచి 35వ ర్యాంకు వరకు కౌన్సెలింగ్ జరుగుతుంది. -
పీజీ.. క్రేజీ
* పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులకు పునర్వైభవం * ఓయూ సెట్‌కు దరఖాస్తుల వెల్లువ * గతేడాది కంటే 25 వేలు అధికం సాక్షి,హైదరాబాద్: పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ) కోర్సుల విషయంలో గత వైభవం పునరావృతం అవుతోంది. పీజీ కోర్సులపై విద్యార్థుల్లో ఏటేటా క్రేజ్ పెరుగుతోంది. తాజాగా ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) నిర్వహిస్తున్న పీజీ ప్రవేశ పరీక్షలకు దరఖాస్తులు వెల్లువెత్తుతుండడమే ఇందుకు నిదర్శనం. ప్రతి ఏటా అందుతున్న దరఖాస్తుల సంఖ్యను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. పదేళ్ల క్రితం వరకు విద్యార్థుల మొదటి ప్రాధాన్యత ఇంజినీరింగ్ విద్యదే. దీనికి అనుగుణంగా రాష్ట్రంలో పుట్టగొడుగుల్లా ఇంజనీరింగ్ కాలేజీలు పుట్టుకొచ్చాయి. లక్షల మంది విద్యార్థులు బీటెక్ డిగ్రీల కోసం ఎంసెట్ రాయడానికి కుస్తీలు పడ్డారు. ఈ ప్రభావం డిగ్రీ, పీజీ కోర్సులపై పడింది. ఫలితంగా పీజీ కోర్సుల్లో ప్రవేశాలు దారుణంగా పడిపోయాయి. ఇంజనీరింగ్‌తో ఉపాధి లేదని... ఒకప్పుడు బీటెక్ చేయడానికి క్యూ కట్టిన యువత మార్కెట్లో ఇంజనీరింగ్ విద్యకు ఆశించిన స్థాయిలో ఉపాధి అవకాశాలు లేకపోవడం, సాఫ్ట్వేర్, ఐటీ బూమ్ నీటి బుడగలా మారడంతో మళ్లీ పీజీ కోర్సులపై దృష్టి సారించింది. సంప్రదాయ పీజీ కోర్సులతో ఇంజనీరింగ్ కంటే మెరుగైన ఉపాధి అవకాశాలు దొరుకుతాయని విద్యార్థులు భావిస్తుండడం వల్లే మళ్లీ పీజీ కోర్సులకు దరఖాస్తులు పెరుగుతున్నాయని విద్యా నిపుణులు పేర్కొంటున్నారు. డిగ్రీ, పీజీ వంటి సంప్రదాయ కోర్సులు చే సి కొంచెం కష్టపడితే సర్కారు కొలువులో సెటిలవ్వొచ్చని నేటి యువత భావిస్తోంది. ముఖ్యంగా సివిల్స్, గ్రూప్స్ లక్ష్యంగా ఉన్న విద్యార్థులు మరో ఆలోచన లే కుండా సాధారణ డిగ్రీ, పీజీ కోర్సులనే ఎంచుకుంటున్నారు. ఈ ఏడాది తీవ్ర పోటీ.. గత మూడేళ్లుగా ఓయూ సెట్‌కు దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య స్వల్పంగా పెరుగుతూ వస్తోంది. ఈ ఏడాది అనూహ్యంగా 25 శాతం పెరిగింది. ఓయూ సెట్లో అర్హత సాధిస్తే మహాత్మాగాంధీ, తెలంగాణ, పాలమూరు వర్సిటీలతోపాటు ఓయూ పరిధిలోని కళాశాలల్లో పీజీ చేసుకోవచ్చు. మొత్తం 52 కోర్సుల్లో ప్రవేశాల్లో చేరేందుకు ఓయూ సెట్ అవకాశం కల్పిస్తోంది. ఇందులో 39 పీజీ ప్రోగ్రాంలు, 10 డిప్లోమా, 3 ఇంటిగ్రేట్ పీజీ ప్రోగ్రాంలు ఉన్నాయి. 2015-16 విద్యా సంవత్సరానికి 1.05 లక్షల ద రఖాస్తులు అందాయి. గతేడాది ఈ సంఖ్య 79,644 లే. అంటే ఒక్క ఏడాదికే దరఖాస్తుల సంఖ్య 25 వేలకు పెరిగింది. ఈ విద్యా సంవత్సరానికి అత్యధికంగా ఎంకాంకు 13 వేలకుపైగా, గణితానికి 9,400, కెమిస్ట్రీకి 7,700, పొలిటికల్ సైన్స్‌కు 6,300 దరఖాస్తులు అందాయి. దరఖాస్తు చేసుకునేందుకు సోమవారం వరకు గడువు ఉండడంతో దరఖాస్తుల సంఖ్య స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని ఓయూ అడ్మినిస్ట్రేటివ్ డెరైక్టర్ ప్రొఫెసర్ సీహెచ్. గోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. -
ఈ నెల 25 నుంచి ఏఎన్‌యూ పీజీ కౌన్సిలింగ్
గుంటూరు (ఏఎన్‌యూ) : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో 2015-16 విద్యా సంవత్సరానికి పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పీజీ కౌన్సెలింగ్ ఈనెల 25వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. కౌన్సిలింగ్ వివరాలు, ఫీజుల వివరాలు, కళాశాలల జాబితాలను www.anudoa.in వెబ్సైట్ ద్వారా పొందవచ్చు. ఏఎన్‌యూ పరిధిలోని కళాశాలల్లో ఆయా కోర్సుల్లో మొత్తం 6 వేలకు పైగా సీట్లు ఉండగా ఏఎన్‌యూ పీజీ సెట్‌కు ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల నుంచి 7,560 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని పీజీ అడ్మిషన్ల డెరైక్టర్ డాక్టర్ ఎం. రామిరెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. -
సాక్షి జర్నలిజం స్కూల్ ఫలితాలు విడుదల
మే 19 నుంచి ఇంటర్వ్యూలు హైదరాబాద్: సాక్షి జర్నలిజం స్కూల్ ప్రింట్, టీవీ, వెబ్ జర్నలిజం విభాగాల్లో పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 19న నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను స్కూల్ ప్రిన్సిపల్ ఆదివారం విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మొత్తం 1,337 మందికి పైగా అభ్యర్ధులు పరీక్షకు హాజరుకాగా వీరిలో 246 మంది బృంద చర్చలు, ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారు. వీరికి ఈ నెల 19వ తేదీ నుంచి 27వ తేదీ వరకు హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని సాక్షి ప్రధాన కార్యాల యంలో బృంద చర్చలు, ఇంటర్వ్యూలు జరుగుతాయి. కాల్ లెటర్లను www.sakshi schoolof journalism.com వెబ్సైట్లో సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు హాల్‌టికె ట్, కాల్ లెటర్, నాలుగు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు , విద్యార్హతల సర్టిఫికెట్లు, వాటి జిరాక్స్‌లతో పాటు వయసు నిర్ధారణ కోసం పదోతరగతి మెమోను తప్పనిసరిగా తీసుకురావాలి. అభ్యర్థులు నిర్దేశిత తేదీన ఉదయం 9 గంటలకు సాక్షి ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలి. -
ఓయూ పీజీ బ్యాక్లాగ్ పరీక్షల ఫీజు గడువు పొడిగింపు
హైదరాబాద్: ఓయూ పలు పీజీ కోర్సుల బ్యాక్‌లా గ్ పరీక్షల ఫీజు గడువును ఈ నెల 6 నుంచి 13 వరకు, రూ.300 అపరాధ రుసుముతో 18 వరకు పొడిగించినట్లు అడిషనల్ కంట్రో లర్ ప్రొఫెసర్ సుధాకర్‌రెడ్డి తెలి పారు. పరీక్షలను జూన్ 10 నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. వివరాలు ఓ యూ వెబ్సైట్లో చూడవచ్చన్నారు. -
టాటా.. వీడుకోలు..
-
విశ్వవిద్యాలయాలు.. పీజీ కోర్సులు
విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ.. ఏయూసెట్, ఏయూఈఈటీ అనే రెండు రకాల పరీక్షలు నిర్వహిస్తోంది. ఏయూసెట్ ద్వారా ఆఫర్ చేస్తున్న కోర్సు లు: ఎంఎస్సీ, ఎంఏ, ఎంకామ్, ఎంహెచ్ఆర్ఎం, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, ఎంఎస్ మాస్ కమ్యూనికేషన్, ఎంఎల్ఐఎస్సీ, ఎంఈడీ, ఎంటెక్ అట్మాస్ఫియరిక్ సైన్స్, ఎంటెక్ ఓషన్ సెన్సైస్, ఎంటెక్ పెట్రోలియం ఎక్స్‌ప్లొరేషన్ అండ్ ప్రొడక్షన్, ఎంపీఈడీ, ఎంఎఫ్ఏ. ఇంటిగ్రేటెడ్ జియాలజీ, ఇంటిగ్రేటెడ్ ఎకనామిక్స్.ఏయూఈఈటీ ద్వారా ఆఫర్ చేస్తున్న కోర్సులు: ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ కోర్సులు: బీటెక్+ఎంటెక్(సీఎస్ఎస్ఈ, కంప్యూటర్ సైన్స్ అండ్ ట్వర్కింగ్,ఈఈఈ,ఈసీఈ, సివిల్, మె కానికల్, కెమికల్, ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ. ట్విన్నింగ్ ప్రోగ్రాములు: బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్-ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజనీరింగ్; బీటెక్ ఎలక్ట్రో మెకానికల్/కెమికల్/ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ (ఏయూసెట్): ఏప్రిల్ 16, 2015. రూ. 1,000 అపరాధ రుసుముతో చివరి తేదీ: ఏప్రిల్ 24, 2015. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ (ఏయూఈఈటీ): ఏప్రిల్ 20, 2015. రూ. 1,000 అపరాధ రుసుముతో చివరి తేదీ: ఏప్రిల్ 28, 2015. వివరాలకు: www.audoa.in రాయలసీమ యూనివర్సిటీ- కర్నూలు (ఆర్యూ పీజీసెట్-2015) కోర్సులు: ఎంఎస్సీ: బోటనీ, బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ ఎన్పీ, కెమిస్ట్రీ ఆర్గానిక్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఓఆర్ అండ్ ఎస్‌క్యూసీ (స్టాటిస్టిక్స్), జువాలజీ. ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ ఇంగ్లిష్, ఎంఏ తెలుగు; ఎంకామ్, ఎంఈడీ. దరఖాస్తుకు చివరి తేదీ (రూ.500 అపరాధ రుసుముతో): ఏప్రిల్ 20, 2015. వెబ్సైట్: టఠఞజఛ్ఛ్టి2015. యోగి వేమన యూనివర్సిటీ ఆఫర్ చేస్తున్న కోర్సులు: ఎంఎస్సీలో బయోకెమిస్ట్రీ, బ యోటెక్నాలజీ, బోటనీ (ప్లాంట్ సైన్స్), కెమిస్ట్రీ (ఆర్గానిక్), జెనిటిక్స్ అండ్ జీనోమిక్స్ వంటి స్పెషలైజేషన్లున్నాయి. ఎంఏలో ఇంగ్లిష్; హిస్టరీ అండ్ ఆర్కియాలజీ; పొలిటికల్‌సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వంటివి ఉన్నాయి.బయోటెక్నాలజీ అండ్ బయోఇన్ఫర్మాటిక్స్, ఎర్త్ సెన్సైస్‌లో ఐదేళ్ల ఎంఎస్సీ ఇంటిగ్రేటెడ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 28, 2015.వెబ్సైట్: www.yvudoa.in కాకతీయ యూనివర్సిటీ- వరంగల్ (కేయూపీజీసెట్-2015) కోర్సులు: ఎంఏ (తెలుగు, ఇంగ్లిష్, హిందీ, సంస్కృతం, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హిస్టరీ, సోషియాలజీ, జండర్ స్టడీస్; ఎంఎస్సీ(బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, అప్లయిడ్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, జియాలజీ, కంప్యూటర్ సైన్స్, సైకాలజీ. మాస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెం ట్, మాస్టర్ ఆఫ్ టూరిజం మేనేజ్మెంట్, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్, ఎంసీజే. ఎంకామ్, ఎంకామ్- ఫైనాన్షియల్ అకౌంటింగ్/బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్/ కంప్యూటర్ అప్లికేషన్స్. ఎంపీఈడీ, ఎంఎల్ఐఎస్సీ, ఎంఈడీ. ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రోగ్రామ్-ఎంఎస్సీ(బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ); ఎంఎస్సీ (ఎంఐటీ). శాతవాహన యూనివర్సిటీ (కరీంనగర్) పరిధిలో: ఎంఏ(ఎకనామిక్స్/సోషియాలజీ/ఇంగ్లిష్/తెలుగు/ఉర్దూ); మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్; ఎంకామ్, ఎంకామ్ (ఫైనాన్షియల్ అకౌంటింగ్);ఎంఎస్సీ(కెమిస్ట్రీ/కంప్యూటర్ సైన్స్/మ్యాథమెటిక్స్/బోటనీ/ జువాలజీ/ మైక్రోబయాలజీ/ఫిజిక్స్/ఇంజనీరింగ్ ఫిజక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్/ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ.దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 21, 2015. రూ.500 అపరాధ రుసుముతో:ఏప్రిల్ 25, 2015వెబ్సైట్: www.kakatiya.ac.in ఆదికవి నన్నయ యూనివర్సిటీ (రాజమండ్రి) ఆఫర్ చేస్తున్న కోర్సులు: ఎంఎస్సీ (బోటనీ, కెమిస్ట్రీ- ఆర్గానిక్, జియాలజీ (పెట్రోలియం ఎక్స్‌ప్లొరేషన్), మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, జువాలజీ.ఎంకామ్, ఎంఏ ఎకనామిక్స్/ఇంగ్లిష్/హిస్టరీ/ ఫిలాసఫీ/ పొలిటికల్ సైన్స్/సైకాలజీ/సోషల్ వర్క్/తెలుగు/ ఎంబీఏ (ఫైనాన్స్, మార్కెటింగ్, హెచ్ఆర్ఎం) తదితర కోర్సులు. దరఖాస్తుకు చివరి తేదీ (రూ.500 అపరాధ రుసుంతో): ఏప్రిల్ 23, 2015. పరీక్షలు ప్రారంభం: మే 1, 2015. వెబ్సైట్: www.nannayauniversity.info ఓయూ సెట్-2015 హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఓయూసెట్-2015 నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా ఉస్మానియా, తెలంగాణ, మహాత్మాగాం ధీ, పాలమూరు యూనివర్సిటీల్లో ప్రవేశించవచ్చు. కోర్సులు: వివిధ స్పెషలైజేషన్లతో ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్ కోర్సులు; ఎంసీజే, బీఎల్ఐఎస్సీ, ఎంఎల్ఐఎస్సీ, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంఈడీ, ఎంపీఈడీలతో పాటు ఐదేళ్ల ఇంటెగ్రేటెడ్ కోర్సులు. ముఖ్య తేదీలు: ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: ఏప్రిల్ 15, 2015. దరఖాస్తుకు చివరి తేదీ: మే 13, 2015. వెబ్సైట్: www.ouadmissions.com, www.osmania.ac.in కృష్ణా యూనివర్సిటీ కోర్సులు: ఎంఎస్సీ కెమిస్ట్రీ (ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ), బయోటెక్నాలజీ, ఆర్గానిక్, ఇనార్గానిక్ కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ తదితర కోర్సులు.ంఏ జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్; ఎంఏ ఇంగ్లిష్, ఎంఏ తెలుగు, ఎంఏ ఎకనామిక్స్ వంటి స్పెషలైజేషన్లు ఉన్నాయి. ఎంఈడీ, ఎంకామ్, ఎంహెచ్ఆర్ఎం వంటి కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 18, 2015. రూ.500 అపరాధ రుసుముతో చివరి తేదీ: ఏప్రిల్ 20, 2015. వెబ్సైట్: www.krishnauniversity.ac.in కృష్ణా యూనివర్సిటీ కోర్సులు: ఎంఎస్సీ కెమిస్ట్రీ (ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ), బయోటెక్నాలజీ, ఆర్గానిక్, ఇనార్గానిక్ కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ తదితర కోర్సులు.ఎంఏ జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్; ఎంఏ ఇంగ్లిష్, ఎంఏ తెలుగు, ఎంఏ ఎకనామిక్స్ వంటి స్పెషలైజేషన్లు ఉన్నాయి.ఎంఈడీ, ఎంకామ్, ఎంహెచ్ఆర్ఎం వంటి కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 18, 2015.రూ.500 అపరాధ రుసుముతో చివరి తేదీ: ఏప్రిల్ 20, 2015.వెబ్సైట్: www.krishnauniversity.ac.in -
మే 11 నుంచి ఓయూ పీజీ పరీక్షలు
హైదరాబాద్ : ఓయూ పరిధిలో మే 11 నుంచి పీజీ రెగ్యులర్ కోర్సుల సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నట్టు అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్ సుధాకర్‌రెడ్డి తెలిపారు. విద్యార్థులు ఆయా కళాశాలల్లో ఏప్రిల్ 17 వరకు ఫీజు చెల్లించవచ్చని సూచించారు. రూ.300 అపరాధ రుసుముతో ఏప్రిల్ 24 వరకు చెల్లించే అవకాశం ఉందన్నారు. పూర్తి వివరాలు ఓయూ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. -
సాక్షి జర్నలిజంలో పీజీ డిప్లొమా.. ప్రవేశం
జర్నలిజంలో ఉజ్వల భవిత కోసం ఎదురు చూస్తున్న ఔత్సాహిక యువతకు ‘సాక్షి’ స్వాగతం పలుకుతోంది. పాత్రికేయ వృత్తిలో స్థిరపడాలనుకునే వారికి సదవకాశం కల్పిస్తోంది. జర్నలిజంలో పీజీ డిప్లొమా ప్రవేశాలకు తాజాగా సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం (ఎస్ఎస్జే). నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ వివరాలు.. అర్హతలు: తెలుగు మీద పట్టు ఆంగ్లంపై అవగాహన డిగ్రీ ఉత్తీర్ణత (గతేడాదికి డిగ్రీ పూర్తిచేసి, సర్టిఫికెట్లు ఉన్నవారే అర్హులు) 01-08-2015 నాటికి 25 ఏళ్లకు మించని వయసు. ఎంపిక విధానం: అభ్యర్థుల ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది. మొదటి దశలో 2 రాతపరీక్షలు ఉంటాయి. మొదటి పేపర్లో తెలుగు, ఇంగ్లిష్, కరెంట్ అఫైర్‌సపై ఆబ్జెక్టివ్ ప్రశ్నలు; రెండో పేపర్లో తెలుగు, ఇంగ్లిష్ పరిజ్ఞానం, అనువాదం, కరెంట్ అఫైర్‌సపై వ్యాసరూప ప్రశ్నలు ఉంటాయి. రాష్ట్రంలోని అన్ని సాక్షి ప్రచురణ కేంద్రాల్లోనూ ఈ పరీక్షలు జరుగుతాయి. నమూనా ప్రశ్నపత్రాలు సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం, సాక్షి ఎడ్యుకేషన్ వెబ్సైట్లలో ఉంటాయి. మొదటి దశలో ఉత్తీర్ణులైనవారికి బృందచర్చ, మౌఖిక పరీక్ష ఉంటాయి. ఇందులోనూ ఉత్తీర్ణులైన వారిని శిక్షణ కోసం ఎంపిక చేస్తారు. నియమావళి: అభ్యర్థులు శిక్షణ కాలంతోపాటు సాక్షిలో నాలుగేళ్లు పనిచేయాలి. ఈ మేరకు కోర్సు ప్రారంభంలోనే ఒప్పంద పత్రం (బాండ్ అగ్రిమెంట్) ఇవ్వాలి. శిక్షణ: అర్హత సాధించిన అభ్యర్థులు ఏడాది పాటు శిక్షణ ఇస్తారు. ఇందులో పత్రికలో పనిచేయడానికి అవసరమైన తెలుగు, ఆంగ్ల భాషా నైపుణ్యాలు, ఎడిటింగ్, రిపోర్టింగ్, అనువాదం, వర్తమాన వ్యవహారాలు నేర్పిస్తారు. చరిత్ర, రాజనీతి శాస్త్రం, అర్థశాస్త్రం, భూగోళశాస్త్రం మొదలైన వాటిపై ప్రాథమిక అవగాహన కల్పిస్తారు. శిక్షణ భృతి: జర్నలిజం స్కూలులో చేరిన విద్యార్థులకు మొదటి ఆరు నెలలు రూ.8,000, తరవాతి ఆరునెలలు రూ.10,000 నెలవారీ భృతి ఉంటుంది. అనంతరం సంస్థలో ఏడాదిపాటు ట్రెయినీగా పనిచేయాలి. అప్పుడు సంస్థ నియమ నిబంధనలకు అనుగుణంగా జీతభత్యాలు ఉంటాయి. సాక్షి ప్రచురణ కేంద్రాల్లో, కార్యక్షేత్రాల్లో ఎక్కడైనా ఉద్యోగం చేయడానికి అభ్యర్థులు సిద్ధంగా ఉండాలి. దరఖాస్తు విధానం: www.sakshieducation.com, www.sakshischoolofjournalism.com వెబ్సైట్లలో దరఖాస్తులు ఉంటాయి. అందులోని సూచనలు క్షుణ్నంగా చదివి, దరఖాస్తును ఆన్‌ైలైన్‌లోనే పూర్తిచేసి, సబ్మిట్ చేయాలి. ఇటీవల తీసుకున్న పాస్‌పోర్టు సైజు కలర్ ఫొటోను తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి. దరఖాస్తు ప్రింటవుట్ తీసుకుని సాక్షి జర్నలిజం స్కూలు చిరునామాకు పోస్టు ద్వారా పంపించాలి. ఆన్లైన్లో దరఖాస్తు నింపే సమయంలోనే రూ. 200 ఫీజు చెల్లించాలి. నెట్ బ్యాంకింగ్/ క్రెడిట్ కార్డు/డెబిట్ కార్డుల్లో దేంతోనైనా చేయొచ్చు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఒక యునిక్ నంబర్ వస్తుంది. దాన్ని వేసి, దరఖాస్తు నింపే ప్రక్రియ పూర్తయ్యాక రిజిస్ట్రేషన్ నంబరు వస్తుంది. ఆ నంబరు సాయంతో హాల్‌టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముఖ్య తేదీలు: దరఖాస్తు చేయడానికి గడువు: 10-04-2015 రాతపరీక్ష: 19-04-2015 ఫలితాలు: 11-05-2015 ఇంటర్వ్యూలు: 18-05-2015 నుంచి తరగతులు ప్రారంభం: 01-06-2015 చిరునామా: ప్రిన్సిపల్, సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం, సితారా గ్రాండ్ హోటల్ పక్కన, రోడ్ నంబర్- 12, బంజారాహిల్స్, హైదరాబాద్- 500034 ఫోన్: 040 23386945 సమయం: ఉ.10 గం. నుంచి సా. 5 గం. వరకు (సెలవులు, ఆదివారాలు మినహా) -
ఈసెట్, పీజీసెట్ల షెడ్యూల్ ఖరారు
హైదరాబాద్: ఈసెట్, పీజీసెట్ల షెడ్యూళ్లు ఖరారయ్యాయి. ఈ రెండు సెట్ల బాధ్యతలు చూస్తున్న కమిటీలు గురువారం ఉన్నత విద్యా మండలిలో సమావేశమై షెడ్యూళ్లను ఖరారు చేశాయి. ఈ నెల 8వ తేదీన ఈ సెట్ల నోటిఫికేషన్లు వెలువడతాయి. ఈసెట్ దరఖాస్తులు 9 నుంచి, పీజీసెట్ దరఖాస్తులు 14 నుంచి ప్రారంభం కానున్నాయి. రెండు సెట్లకు దరఖాస్తులను ఆన్లైన్లోనే సమర్పించాలి. ఈసెట్‌కు దరఖాస్తు రుసుము రూ.250గా నిర్ణయించారు. పీజీసెట్ దరఖాస్తు రుసుము రూ.500గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీలకు రూ.250గా నిర్ణయించారు. ఈసెట్‌కు కొత్తగా ప్రొద్దుటూరులో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పీజీసెట్‌కు కాకినాడ కేంద్రంగా రీజనల్ సెంటర్‌ను ఏర్పాటుచేయనున్నారు. ఈ సమావేశంలో ఈసెట్ చైర్మన్ ప్రొఫెసర్ లాల్ కిషోర్, కన్వీనర్ ప్రొఫెసర్ బి.భానుమూర్తి, పీజీసెట్ చైర్మన్ డాక్టర్ బి.ప్రభాకర్‌రావు, కన్వీనర్ జీవీఆర్ ప్రసాదరాజు, మండలి చైర్మన్ ఎల్.వేణుగోపాలరెడ్డి పాల్గొన్నారు. -
ఓయూ దూరవిద్య పీజీ దరఖాస్తులకు చివరి తేదీ 6
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ దూరవిద్య ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ కోర్సుల్లో ప్రవేశానికి మార్చి 6 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు డెరైక్టర్ ప్రొఫెసర్ హెచ్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచి వివిధ డిగ్రీ, పీజీ కోర్సుల విద్యార్థులకు అసైన్‌మెంట్స్‌కు 20 మార్కులను వేయనున్నట్లు చెప్పారు. డిగ్రీ విద్యార్థులు ఈ నెల 28 వరకు అసైన్మెంట్స్ అందజేయాలన్నారు. ఏప్రిల్ 23 నుంచి ప్రారంభం కానున్న ఎంబీఏ మొదటి సెమిస్టర్ పరీక్షకు మార్చి 20 వరకు అసైన్మెంట్స్ అందజేయాలి. పీజీ కాంటాక్టు క్లాసెస్ మార్చి మొదటి వారం నుంచి ప్రారంభంకానునట్లు డెరైక్టర్ తెలిపారు. -
పరీక్షకు మాత్రమే ఓకే!
ఎన్టీఆర్ వర్సిటీ పాలకమండలి అత్యవసర భేటీలో నిర్ణయం సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సమ్మె చేసిన జూనియర్ వైద్యులు మళ్లీ చిక్కుల్లో పడ్డారు. సమ్మెకాలానికి అనుగుణంగా ప్రభుత్వం కోర్సు కాలపరిమితిని పొడిగించింది. దీంతో పీజీ అడ్మిషన్లకు అనుమతులొస్తాయని అంతా సంబరపడ్డారు. వీటిపై తాజాగా బుధవారం ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పాలక మండలి అత్యవసర సమావేశం నిర్వహించింది. నిజానికి సమ్మె చేసిన విద్యార్థుల హౌస్‌సర్జన్ మార్చి 30 నాటికి పూర్తి కావాలి. అయితే సుమారు 600 మంది వైద్యవిద్యార్థులు 62 రోజులపాటు సమ్మె చేశారు. ఈ సమ్మె కాలంమేరకు కోర్సు పొడిగిస్తే మే 30 నాటికి అది పూర్తవుతుంది. అయితే పీజీ ప్రవేశపరీక్ష మార్చి 1న జరగనుంది. మార్చి 8న పీజీ డెంటల్ ఉంటుంది. భారతీయ వైద్యమండలి షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ రెండో వారంలో కౌన్సిలింగ్ మొదలవుతుంది. మే 2 కల్లా తరగతుల్లో చేరిపోవాలి. పొడిగించిన కోర్సు ప్రకారం మే 30 వరకూ వీళ్లు ఇంటర్న్‌షిప్‌లోనే ఉంటారు. అయితే పాలకమండలి భేటీలో తొలుత పీజీ ప్రవేశ పరీక్షకు అనుమతిద్దామని, ఆ తర్వాత భారతీయ వైద్యమండలికి షెడ్యూల్ మార్చాలని విన్నవిద్దామని తీర్మానించారు. ఈ విషయమై ఎన్టీఆర్ వర్సిటీ వీసీ డా.రవిరాజును అడగ్గా... విద్యార్థులు నష్టపోకుండా ప్రవేశపరీక్షకు అనుమతినిచ్చామని, ఆ తర్వాత ఏం చేయాలనేదానిపై ఆలోచిస్తామన్నారు. -
PG ప్రవేశాలకు లైన్ క్లియర్
-
పీజీ ప్రవేశాలకు లైన్‌క్లియర్
జూడాల విజ్ఞప్తికి అంగీకరించిన సీఎం 600 మంది హౌస్సర్జన్లకు ప్రయోజనం సాక్షి, హైదరాబాద్: వైద్యవిద్యకు సంబంధించి పీజీలో ప్రవేశాలు పొందేందుకు తమకు అవకాశం కల్పించాలన్న జూనియర్ డాక్టర్ల (జూడా) వినతికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సానుకూలంగా స్పందిం చారు. వైద్య ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి, డీఎంఈ శ్రీనివాస్‌తో కలసి జూడాల ప్రతినిధులు ఆదివారం ముఖ్యమంత్రిని కలిశారు. సమ్మె చేసిన రెండు నెలల కాలానికి సరిపడా కోర్సు వ్యవధిని మే 31 వరకు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. జూడాల సమస్యలను పరిష్కరిస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ సమ్మె కొనసాగించారని అసంతృప్తి వ్యక్తం చేశారు. హైకోర్టు చెప్పినా వినకుండా, పర్యవసానాలు ఆలోచించకుండా వ్యవహరించడం వల్ల ఇబ్బందులు వచ్చాయని అన్నారు. భవిష్యత్తులో ఇలా జరగదని, విద్యా సంవత్సరం నష్టపోకుండా కాపాడాలని జూడాలు సీఎంను కోరారు. 600 మంది హౌస్సర్జన్లకు ప్రయోజనం.. సీఎం ఆదేశాల నేపథ్యంలో పీజీ ప్రవేశ పరీక్షకు అర్హత పొందేలా తీసుకోవాల్సిన చర్యలపై స్పష్టమైన అవగాహనకు రావాలని అధికారులను మంత్రి లక్ష్మారెడ్డి ఆదేశించారు. వచ్చే నెల ఒకటో తేదీన పీజీ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ పరీక్ష రాసేందుకు అర్హత కోల్పోతామన్న భయంలో హౌస్సర్జన్లు ఉన్నారు. అయితే, సీఎం తాజా నిర్ణయంతో ఉస్మానియా, గాంధీ, వరంగల్ ఎంజీఎం, ఆదిలాబాద్ రిమ్స్‌కు చెందిన 600 మంది హౌస్సర్జన్లు పీజీ ప్రవేశ పరీక్ష రాసేందుకు అర్హత పొందుతారు. జూడాల మిగతా డిమాండ్లను ప్రభుత్వం ఇదివరకే అంగీకరించిందని వాటిని అమలుచేస్తామని మంత్రి లక్ష్మారెడ్డి ఈ సందర్భంగా ‘సాక్షి’కి తెలిపారు. కాగా, జూడాల భద్రతకు సంబంధించి ప్రభుత్వం స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్)ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. ‘దరఖాస్తుకు రెండు రోజుల గడువు పెంచండి’ వైద్య పీజీ ప్రవేశ పరీక్ష దరఖాస్తుకు మరో రెండ్రోజులు గడువు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయాన్ని కోరింది. దరఖాస్తుకు ఈ నెల 16 (సోమవారం) చివరి తేదీ. పీజీ పరీక్ష రాసి, అడ్మిషన్ పొందేందుకు హౌస్ సర్జన్లకు అనుమతి ఇస్తూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆదివారం సానుకూలత వ్యక్తంచేసిన నేపథ్యంలో అధికారులు ఈ మేరకు గడువు పొడిగించాలని కోరారు. -
చిక్కుల్లో జూనియర్ వైద్యులు
- సాయం చేయలేమని చేతులెత్తేసిన సర్కారు - ఈ ఏడాది పీజీ పరీక్షకూ అనర్హులే సాక్షి, హైదరాబాద్: పట్టువిడుపులు లేకుండా గతేడాది అరవై రెండు రోజుల పాటు సమ్మె చేసిన జూనియర్ డాక్టర్లు చిక్కుల్లో పడ్డారు. హైకోర్టు వద్దని వారించినా.. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకున్నా.. వైద్య ఆరోగ్య మంత్రి, అధికారులు చర్చలకు ఆహ్వానించినా.. పెడచెవిన పెట్టడంతో ఇప్పుడు వాళ్లు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. ఒక విద్యా సంవత్సరాన్ని నష్టపోవడమే కాకుండా ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే పీజీ పరీక్షలకు కూడా అనర్హులు కానున్నారు. మానవతా దృక్పథంతో సమ్మె కాలానికి మినహాయింపునిచ్చి సకాలంలో హౌస్ సర్జన్ కోర్సును పూర్తి చేసేందుకు అవకాశం కల్పించాలని ఇటీవల ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, అధికారులకు జూడాలు విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై విద్యాశాఖ మంత్రి లక్ష్మారెడ్డితో పాటు వైద్య విద్య సంచాలకులు డి.శ్రీనివాస్, న్యాయశాఖ కార్యదర్శి సంతోశ్‌రెడ్డితో సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రత్యేకంగా సమీక్ష జరిపారు. జూడాలకు వెసులుబాటు ఇచ్చే మార్గాలు, ప్రత్యామ్నాయాలపై చర్చించారు. అయితే హైకోర్టు ఆదేశాల ప్రకారం ప్రభుత్వం వీరికి సాయం చేసే పరిస్థితి లేదని న్యాయ శాఖ చేతులెత్తేసింది. కేబినేట్లో చర్చించి ప్రత్యేకంగా జీవో జారీ చేయటం ద్వారా వెసులుబాటు కల్పించే అవకాశాన్ని సైతం చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఇందుకు సీఎం సానుకూలత వ్యక్తం చేసినప్పటికీ, ఇలా చేస్తే హైకోర్టు నుంచి మొట్టికాయలు తప్పవని న్యాయ నిపుణులు హెచ్చరించినట్లు సమాచారం. దీంతో జూనియర్ డాక్టర్లకు సాయం చేసే మార్గాలన్నీ మూసుకుపోయినట్లేనని, తమ వైపు నుంచి ఏమీ చేసే పరిస్థితి లేదని వైద్యారోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. సమ్మె చేసినంత కాలం కోర్సు పొడిగించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దీంతో మార్చి 31న పూర్తి కావాల్సిన జూడాల హౌస్ సర్జన్ కోర్సు మే నెలాఖరుకు పూర్తవుతుంది. దీంతో పాటు ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే మెడికల్ పీజీ పరీక్షకు వీరు అనర్హులవుతారని అధికారులు తెలిపారు. -
మార్కుల విధానానికి స్వస్తి!
ఆదిలాబాద్ టౌన్ : ప్రస్తుతం పదో తరగతి ఫలితాలు గ్రేడింగ్ రూపం లో విడుదలవుతున్న విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఒకే విద్యావిధానం అమలు చేయాలనే ఉద్దేశంతో యూజీసీ (యూనివర్సి టీ గ్రాంట్ క మిషన్) యూనివర్సిటీ వైస్ చాన్సలర్లకు ఈ నెల 12న ఈ విధానంపై ఆదేశాలు జారీ చేసింది. 2008 సంవత్సరంలో గ్రేడింగ్ విధానాన్ని అమలు చేసేందుకు క్రెడిట్, బేస్డ్, చేయిస్ సిస్టంను యూజీసీ తయారు చేసింది. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలో ఈ విధానం అమలులో ఉంది. ఈ కొత్త విధానం అమలైతే దేశంలోని వివిధ రాష్ట్రాలతోపాటు అంతర్జాతీయంగా చదవుకునే విద్యార్థులకు ఒకే విద్యావిధానం అమలులోకి వస్తుంది. వచ్చే ఏడాది నుంచి.. 2015-16 విద్యాసంవత్సరం నుంచి డిగ్రీ, పీజీ డిప్లొ మా, సర్టిఫికెట్ కోర్సులు చదివే విద్యార్థులకు మార్కుల రూపంలో కాకుండా గ్రేడ్ రూపంలో పాయింట్ల విధానాన్ని అమలు చేయనున్నారు. సబ్జెక్టులతోపాటు విద్యార్థులకు గ్రేడింగ్ ఇస్తారు. కోర్సు గ్రేడింగ్, స్టూడెంట్ గ్రేడింగ్ ఉంటాయి. ప్రస్తుతం సంవత్సరానికి ఒకసారి మాత్రమే వార్షిక పరీక్షలు నిర్వహిస్తుండగా గ్రేడింగ్ విధానంలో సెమిస్టర్ విధానంలో తరగతులు ఉంటాయి. 90 రోజుల కు ఒక సెమిస్టర్ విభజి స్తారు. సంవత్సరానికి రెండు సెమిస్టర్లు ఉంటా యి. 450 తరగతుల విద్యబోధన జరుగుతుంది. మూడు రకాల కోర్సులు గ్రేడింగ్ విధానంలో మూడు రకాల కోర్సులు ఉంటాయి. ఇందులో ప్ర ధాన కోర్సు, ఎంపిక కోర్సు, ఫౌండేషన్ కోర్సులు ఉంటాయి. ఫౌండేషన్ కోర్సుల్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి తప్ప నిసరి. మరొకటి ఎంపిక కోర్సు. విద్యార్థికి స్టూడెంట్ గ్రేడింగ్, కోర్సు గ్రేడింగ్ కలిపి మొత్తం గ్రేడింగ్ సర్టిఫికెట్ పాయింట్ల రూపంలో ఫలితాలు ప్రకటిస్తారు. ప్రస్తుతం సైన్స్ విద్యార్థి ఆర్ట్స్ సబ్జెక్టులు తీసుకోవడానికి వీలు లేదు. కానీ గ్రేడింగ్ విధానంలో తనకు నచ్చిన ఏ సబ్జెక్టు అయినా ఎంపిక చేసుకొని చదువుకునే అవకాశం ఉంటుంది. విద్యార్థి పరిజ్ఞానానికి గుర్తింపు గ్రేడింగ్ విధానంలో విద్యార్థి పరిజ్ఞానానికి గుర్తింపు లభిస్తుందని డిగ్రీ కళాశాల లెక్చరర్లు పేర్కొంటున్నారు. ప్రతీ సబ్జెక్టుల్లో విద్యార్థికి గ్రేడింగ్ పాయింట్ కేటాయిస్తారు. నచ్చిన సబ్జెక్టును ఎంపిక చేసుకోవచ్చు. ప్రస్తుతం యూనివర్సిటీలు పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఈ విధానంతో దేశవ్యాప్తంగా ఒకే విద్యావిధానం అమలులో ఉంటుంది. విద్యార్థి దేశవ్యాప్తంగా ఎక్కడికి వెళ్లినా ఈ చదువును కొనసాగించవచ్చు. సర్టిఫికెట్లకు ప్రాధాన్యం లభిస్తుంది. -
అన్ని కోర్సుల్లోనూ గ్రేడ్లు
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ తదితర అన్ని కోర్సుల్లోనూ గ్రేడ్లు, గ్రేడ్ పారుుంట్ల విధానాన్ని అమలు చేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిర్ణరుుంచింది. దేశవ్యాప్తంగా ఒకే రకమైన విద్యా విధానం అవుల్లో భాగంగా ఈ చర్యలు చేపట్టింది. జాతీయు, అంతర్జాతీయు స్థారుు విద్యాసంస్థల్లో అమల్లో ఉన్న ఈ విధానాన్ని ఇకపై అన్ని స్థాయిల్లో అమలు చేయూలని నిర్ణరుుంచింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే దీన్ని అవుల్లోకి తేనుంది. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ), యూజీసీ నిబంధనలకులోబడి ఆయూ రాష్ట్రాల్లో అన్ని వర్సిటీలు ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని వైస్‌చాన్సలర్లకు వుంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనలను కేంద్రీయ, రాష్ట్ర యూనివర్సిటీలతోపాటు ప్రైవేటు, డీమ్డ్ యూనివర్సిటీలు కూడా అవులు చేయూలని యూజీసీ ఆదేశించింది. ప్రస్తుతం ఒక్కో రాష్ట్రంలో వర్సిటీలను బట్టి వేర్వేరు విధానాలు అమల్లో ఉన్నాయి. ఒక కోర్సులో మార్కుల విధానం అవుల్లో ఉంటే, కొన్ని కోర్సుల్లో మార్కులతోపాటు గ్రేడింగ్ విధానం అవుల్లో ఉంది. ఈ నేపథ్యంలో వూర్కుల విధానానికి పూర్తిగా స్వస్తి పలకాలని యుూజీసీ నిర్ణయించింది. ఇకపై అన్ని రాష్ట్రాల్లో, అన్ని కోర్సుల్లో గ్రేడింగ్ విధానమే అవులు చేయునుంది. కోర్సులోని అన్ని సబ్జెక్టుల్లో కలిపి విద్యార్థి ప్రగతిని క్యుములేటివ్ గ్రేడ్ పారుుంట్ యూవరేజ్(సీజీపీఏ) రూపంలో ప్రకటించనుంది. ఇందులో రెండు వరుస సెమిస్టర్లను ఒక విద్యా సంవత్సరంగా పరిగణిస్తారు. ప్రతి కోర్సులో ఫౌండేషన్ కోర్సు ఉంటుంది. ఇక ప్రతి సబ్జెక్టులో విద్యార్థి ప్రగతికి ఇచ్చే ప్రతి గ్రేడ్‌కు ఒక పారుుంట్ ఇస్తారు. మెుత్తం సబ్జెక్టులకు ఇచ్చే పారుుంట్లను కలిపి వాటి సగటుతో సీజీపీఏను నిర్ధారిస్తారు. సెమిస్టర్వారీగా కూడా గ్రేడ్లను, గ్రేడ్ పారుుంట్లను ఇస్తారు. వాటిని సగటును సెమిస్టర్ గ్రేడ్ పారుుంట్ యూవరేజ్(ఎస్‌జీపీఏ)గా పరిగణిస్తారు. అలాగే విద్యార్థులు గణితంతో పాటు ఆర్ట్స్ సబ్జెక్టులను కూడా చదువుకునే వీలు కల్పించాలని యూజీసీ నిర్ణయించింది. గ్రేడింగ్ విధానమిదే.. గ్రేడ్ గ్రేడ్ పారుుంట్ ఓ (ఔట్ స్టాండింగ్) 10 ఎ+ (ఎక్సలెంట్) 9 ఎ (వెరీ గుడ్) 8 బి+ (గుడ్) 7 బి (ఎబోవ్ యావరేజీ) 6 సి (యావరేజీ) 5 పి (పాస్) 4 ఎఫ్ (ఫెయిల్) 0 ఏబీ (ఆబ్సెంట్) 0 -
పీజీ అడ్మిషన్ కోసం జూపల్లి దరఖాస్తు
కొల్లాపూర్: మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు పీజీ చదవాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ఆయన కొల్లాపూర్‌లో ఇటీవల ఏర్పాటు చేసిన పీజీ కళాశాలలో ఎంఏ (ఇంగ్లిష్) కోర్సులో చేరేందుకు మంగళవారం దరఖాస్తు చేశారు. ఫారాన్ని కాలేజీ ప్రిన్సిపాల్ రాములుకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల కోరిక మేరకు కొల్లాపూర్‌లో పీజీ కళాశాలను ఏర్పాటు చేయిస్తే అందులో ఆశించినంతగా విద్యార్థులు చేరడం లేదని ఆందోళన వ్యక్తంచేశారు. పీజీ విద్యార్థులు కాలేజీలో చేరేందుకు స్ఫూర్తినిచ్చేందుకు తాను పీజీ కోర్సుకు దరఖాస్తు చేసుకున్నట్టు చెప్పారు. -
అన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ తనిఖీలు
‘పీజీ’ కౌన్సెలింగ్‌పై హైకోర్టుకు అడ్వొకేట్ జనరల్ వెల్లడి హైదరాబాద్: వెబ్ కౌన్సెలింగ్‌లో స్థానం కల్పించిన 145 ఇంజనీరింగ్ పీజీ కాలేజీల్లోనూ తనిఖీలు నిర్వహించి, నిబంధనల మేర సౌకర్యాలు ఉన్నాయో లేదో తేలుస్తామని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. దాంతోపాటు లోపాలున్న 127 ఇంజనీరింగ్, 40 ఫార్మసీ కాలేజీలు తమ నోటీసులకు సమాధానమిచ్చాయని, ఆ సమాచారాన్ని క్రోడీకరించడంతో పాటు ఈ కాలేజీలను కూడా తనిఖీ చేస్తామని విన్నవిం చింది. అనంతరం ఈ అంశాలకు సంబంధించి పూర్తి వివరాలతో నివేదికలను కోర్టు ముందు ఉంచుతామని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి తెలిపారు. ఇం దుకు నాలుగు వారాల గడువు ఇవ్వాలని అభ్యర్థించారు. దీనికి అంగీకరించిన కోర్టు విచారణను వచ్చే నెల 17వ తేదీకి వాయిదా వేసింది. ఎంసెట్ కౌన్సెలింగ్ సందర్భంగా జేఎన్టీయూహెచ్ అఫిలియేషన్ నిరాకరించిన కాలేజీల ను కౌన్సెలింగ్ జాబితాలో చేర్చాలంటూ గత నెల 4న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అయితే జేఎన్టీయూహెచ్ ఈ ఉత్తర్వులను స వాలు చేస్తూ ప్రధాన న్యాయమూర్తి నేతృత్వం లోని ధర్మాసనానికి అప్పీలు చేసింది. ఈ నేపథ్యంలో కాలేజీల వ్యాజ్యాలపై తుది విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి.. వాటిని గురువారం మరోసారి విచారించారు. పిటిషనర్లు, జేఎన్టీయూ తరఫున ఏజీ రామకృష్ణారెడ్డి వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా జేఎన్టీయూ గుర్తించిన లోపాలను ఆయా కాలేజీలు సరిదిద్దుకున్నాయా? లేదా? అన్న అంశానికే కోర్టు తన విచారణను పరిమితం చేసేందు కు ఇరుపక్షాలూ అంగీకరించాయి. లోపాలున్న ట్లు చెబుతున్న 127 ఇంజనీరింగ్, 40 ఫార్మసీ కా లేజీలతో పాటు వెబ్ కౌన్సెలింగ్‌లో స్థానం కల్పించిన 145 పీజీ కాలేజీల్లోనూ తనిఖీలు నిర్వహించి, నివేదిక సమర్పిస్తామని ఏజీ కోర్టుకు హామీ ఇచ్చారు. నాలుగు వారాల గడువుకు అంగీకరిస్తూ విచారణను వాయిదా వేశారు. -
ఉచిత విద్యంటూనే.. పాఠశాలల మూసివేతా?
ప్రొఫెసర్ హరగోపాల్ హైదరాబాద్: పీజీ వరకూ ఉచితంగా విద్య అందిస్తామని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం ఉన్న పాఠశాలలను మూసేయాలనుకోవడం తగదని సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ప్రస్తుతం విద్యావిధానం కాషాయీకరణతోపాటు ప్రైవేటీకరణలో సంఘ్ పరివార్ భాగస్వామ్యం అవుతోంద ని ఆందోళన వ్యక్త పరిచారు. శుక్రవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో హరగోపాల్ విలేకరులతో మాట్లాడారు. ఫోరం ఫర్ రైట్ టు ఎడ్యుకేషన్ సంస్థ అఖిల భారత శిక్షా సంఘర్ష్ యాత్ర-2014’ తెలంగాణలో నవంబర్ 2 నుంచి 27 వరకు అన్ని డివిజన్లలో సాగుతుందనీ చివరకు ఆదిలాబాద్ జిల్లాలో ముగిసి మహారాష్ట్రలోకి ప్రవేశిస్తుందన్నా రు. సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ అధ్యక్షుడు కె. చక్రధరరావు మాట్లాడుతూ విద్యను ప్రభుత్వాలు వ్యాపారంగా భావిస్తున్నాయన్నారు. -
పీజీ వైద్యుల కౌన్సెలింగ్ అడ్డగింతకు యత్నం
123 మంది జూనియర్ వైద్యుల అరెస్టు...రాణాలకు తరలింపు హైదరాబాద్: పీజీ పూర్తి చేసిన వైద్యులు గ్రామీణ ప్రాంతాలలో ఏడాది పాటు పనిచే సేందుకు నిర్వహించిన కౌన్సెలింగ్ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన జూనియర్ వైద్యులు కోఠి డీఎంఈ ఆడిటోరియంలో బుధవారం నిర్వహిస్తున్న కౌన్సిలింగ్‌ను అడ్డుకోవటం గందరగోళ పరిస్థితులకు దారి తీసింది. ఏడాది పాటు గ్రామాల్లో పనిచేస్తామని కొందరు పీజీ విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరు కాగా వ్యతిరేకిస్తున్న వారు డీఎంఈ కార్యాలయాన్ని ముట్టడించారు. దీంతో వారిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా తీవ్ర వాగ్వాదం, తోపులాటలు జరిగాయి. పోలీసులు 123 మంది జూడాలను అదుపులోకి తీసుకుని మలక్‌పేట్, సైదాబాద్, సుల్తాన్‌బజార్ పోలీసుస్టేషన్లకు తరలించి, కౌన్సెలింగ్‌ను కొనసాగిం చారు. కాగా, జూడాల అరెస్ట్‌ను తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం గౌరవ అధ్యక్షుడు బి.రమేశ్, తెలంగాణ మెడికల్ జేఏసీ కన్వీనర్ జె.రాజేందర్ ఖండించారు. అత్యవసర వైద్య సేవల బంద్.. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జూడాలు సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ఆసుపత్రి, కోఠి ఈఎన్టీ ఆసుపత్రి, ఉస్మానియా తదితర ఆసుపత్రులలో అత్యవసర వైద్య సేవలను బహిష్కరించారు. 561 మంది టు పోస్టింగ్‌లు పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌లో ఎంఎస్, ఎండీ వైద్య కోర్సులను పూర్తిచేసిన 561 మంది వైద్యులకు ఏడాది ప్రభుత్వ సర్వీసు కింద పోస్టింగ్‌లు ఇచ్చినట్టు తెలంగాణ వైద్యవిద్యా సంచాలకుడు డా.పుట్టా శ్రీనివాస్ తెలిపారు. వీరంతా ఉస్మానియా, గాంధీ, కాకతీయ (వరంగల్), ప్రభుత్వ వైద్యకళాశాల (నిజామాబాద్), రిమ్స్(ఆదిలాబాద్)లలో పనిచేస్తారని పేర్కొన్నారు. కాగా, త్వరలోనే డిప్లొమా అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించి వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రుల్లో పోస్టింగ్‌లు ఇస్తామన్నారు. -
ప్రవేశాలు
డీఎన్బీ సెట్ - 2015 నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ‘డిప్లొమేట్ నేషనల్ బోర్డ్ సెంట్రలైజ్డ్ ఎంట్రన్స్ టెస్ట్ (డీఎన్బీ సెట్)- 2015’ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిలో అర్హత సాధించిన వారికి పీజీ మెడికల్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. డిప్లొమేట్ నేషనల్ బోర్డ్ సెంట్రలైజ్డ్ ఎంట్రన్స్ టెస్ట్ - జనవరి 2015 విభాగాలు: అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, ఫార్మకాలజీ, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, సైకియాట్రీ, రేడియో థెరపీ, రేడియో డయాగ్నసిస్, అనెస్తీషియాలజీ, డెర్మటాలజీ అండ్ వెనీరియాలజీ, రెసిపిరేటరీ డిసీజెస్, న్యూక్లియర్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఒబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ, ఆప్తల్మాలజీ, ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్, సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్, హెల్త్ అడ్మినిస్ట్రేషన్, ఫ్యామిలీ మెడిసిన్, రూరల్ సర్జరీ, ఇమ్యునో హెమటాలజీ అండ్ ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్ సర్జరీ, ఎమర్జెన్సీ మెడిసిన్, మెటర్నల్ చైల్డ్ హెల్త్, ఫీల్డ్ ఎపిడిమియాలజీ అర్హతలు: ఎంబీబీఎస్ ఉండాలి. రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: అక్టోబరు 18 వెబ్సైట్: http://cet.natboard.edu.in/ మరిన్ని నోటిఫికేషన్ల కోసం http://sakshieducation.com చూడవచ్చు -
షరతులు వర్తిస్తాయి!
269 ఇంజనీరింగ్, 104 ఫార్మసీ కాలేజీలకు షరతులతో అఫిలియేషన్ పీజీఈసెట్ వెబ్ కౌన్సెలింగ్ అధికారులకు కళాశాలల లిస్టు లోపాలున్న కాలేజీలకు మళ్లీ నోటీసులిచ్చిన జేఎన్టీయూ రేపటిలోగా వివరాలివ్వాలి గేట్, జీప్యాట్ అభ్యర్థులకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ వాయిదా హైదరాబాద్: పీజీ కళాశాలల అఫిలియేషన్ వ్యవహారంపై గత కొన్ని రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. లోపాలను సరిదిద్దుకోని కళాశాలలనూ వెబ్ కౌన్సెలింగ్‌కు అనుమతించాలని జేఎన్టీయూహెచ్ను హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో.. తమ పరిధిలో ఉన్న 269 ఇంజనీరింగ్, 104 ఫార్మసీ కళాశాలలకు వర్సిటీ అధికారులు షరతులతో కూడిన అఫిలియేషన్ మంజూరు చేశారు. అనంతరం సదరు జాబితాను బుధవారం పీజీఈసెట్ వెబ్ కౌన్సెలింగ్ అధికారులకు అందజేశారు. అయితే, మరికొన్ని గంటల్లో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ మొదలు కావాల్సి ఉండగా, చివరి నిమిషంలో అఫిలియేటెడ్ కళాశాలల జాబితా రావడంతో గేట్, జీప్యాట్ అభ్యర్థుల వెబ్ ఆప్షన్ల ప్రక్రియ వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 6, 7 తేదీల్లో సర్టిఫికెట్ల పరిశీలన పూర్తిచేసుకున్న గేట్, జీప్యాట్ ర్యాంకర్లకు బుధ, గురువారాల్లో ఆప్షన్లు ఇచ్చుకునేందుకు అవకాశం కల్పించారు. దీంతో ఆప్షన్లు ఇచ్చుకునేందుకు ఇంటర్నెట్ సెంటర్లకు వెళ్లిన అభ్యర్థులకు వెబ్సైట్లో ఉన్న వాయిదా సమాచారం చూసి నిరాశగా వెనుతిరిగారు. వాయిదా పడిన వెబ్ ఆప్షన్ల ప్రక్రియను తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తారో అధికారులు స్పష్టం చేయలేదు. కాగా, ఈనెల 12 నుంచి ప్రారంభమయ్యే పీజీఈ సెట్ అభ్యర్థుల వెబ్ ఆప్షన్ల షెడ్యూల్లో ఎలాంటీ మార్పూ లేదని అధికారులుపేర్కొన్నారు. ఆ కాలేజీలకు నోటీసులు... జేఎన్టీయూహెచ్ పరిధిలో పీజీ కోర్సులు నిర్వహిస్తున్న 272 ఇంజనీరింగ్ కళాశాలల్లో 145 కాలేజీలు మాత్రమే ప్రమాణాలు పాటిస్తున్నాయని అధికారులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో మిగిలినవాటిలో 124 కళాశాలలకు జేఎన్టీయూహెచ్ బుధవారం మరోసారి నోటీసులు జారీచేసింది. మౌలిక వసతులు, ఫ్యాకల్టీ నిష్పత్తి, బోధనేతర సిబ్బంది తదితర అంశాలపై తాజా సమాచారాన్ని అందజేయాలని అందులో ఆదేశించింది. మూడు కళాశాలల యాజమాన్యాలు మాత్రం తాము పీజీ కోర్సులు నిర్వహించేందుకు సుముఖంగా లేమని జేఎన్టీయూహెచ్కు స్పష్టంచేశాయి. కాగా, ఎంఫార్మసీ నిర్వహిస్తున్న 104 కళాశాలల్లో లోపాలున్నట్లుగా చెబుతున్న 54 కాలేజీలకు కూడా నోటీసులు జారీఅయ్యాయి. నోటీసులు అందుకున్న కాలేజీల యాజమాన్యాలు సదరు సమాచారాన్ని శుక్రవారంలోగా యూనివర్సిటీకి అందజేయాలని అధికారులు స్పష్టంచేశారు. తీర్పునకు లోబడే ప్రవేశాలు.. పీజీఈసెట్‌లో కొన్ని కళాశాలలకు షరతులతో కూడిన అనుమతి లభించినప్పటికీ, హైకోర్టు వెలువరించే తుది తీర్పునకు లోబడే అభ్యర్థులకు అడ్మిషన్లు ఉంటాయని కన్వీనర్ వేణుగోపాలరెడ్డి తెలిపారు. -
అన్ని కాలేజీలనూ చేర్చండి
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం 10వ తేదీ నుంచి జరిగే వెబ్ కౌన్సెలింగ్ జాబితాలో అన్ని ఇంజనీరింగ్ కాలేజీలను చేర్చాలని హైకోర్టు గురువారం జేఎన్టీయూహెచ్ను ఆదేశించింది. లోపాలన్నింటినీ కౌన్సెలింగ్ జాబితాలో చేర్చడానికి ముందే సవరించుకుంటామంటూ జేఎన్టీయూహెచ్కు రాతపూర్వక హామీ ఇవ్వాలని కాలేజీలకు హైకోర్టు స్పష్టం చేసింది. జాబితాలో చేర్చిన తరువాత కాలేజీలు లోపాలను సవరించుకోకుంటే.. నిబంధనల మేరకు వాటిపై చర్యలు తీసుకోవచ్చంటూ వర్సిటీకి స్వేచ్ఛనిచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. కాలేజీల్లో లోపాలను సవరించుకున్నప్పటికీ జేఎన్టీయూహెచ్ అఫిలియేషన్ ఇచ్చే ప్రక్రియను పూర్తి చేయలేదని, దాన్ని పూర్తి చేసిన తరువాతే కౌన్సెలింగ్ నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ దాదాపు 45 ఇంజనీరింగ్ కాలేజీలు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై గురువారం విచారణ జరిగింది. వర్సిటీపై నమ్మకం లేదు..: పిటిషనర్లు ఎంసెట్ కౌన్సెలింగ్ సందర్భంగా కాలేజీలను ఏ విధంగా ఇబ్బందులకు గురి చేశారో.. పీజీ కౌన్సెలింగ్‌కు సంబంధించి కూడా అలానే ఇబ్బంది పెట్టేందుకు జేఎన్టీయూ ప్రయత్నిస్తోందని కాలేజీల తరఫు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో తనిఖీలు నిర్వహించిన వర్సిటీ ఇన్ని నెలలు మౌనంగా ఉండి.. ఇప్పుడు చివరి నిమిషంలో లోపాలు ఉన్నాయంటూ చెప్పడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. వర్సిటీ లేవనెత్తిన లోపాలను సవరించుకున్నామని, ఆ విషయాన్ని చెబుతుంటే పట్టించుకునే అధికారే లేరని కోర్టుకు తెలిపారు. అసలు జేఎన్టీయూను తాము నమ్మే పరిస్థితుల్లో లేమన్నారు. జేఎన్టీయూహెచ్ అరాచకంగా వ్యవహరిస్తోందని.. వర్సిటీ తీరును పరిగణనలోకి తీసుకుని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. నిర్ణయం తీసుకోలేదు: అడ్వొకేట్ జనరల్ పీజీ కౌన్సెలింగ్ జాబితాకు సంబంధించి ఏ నిర్ణయమూ తీసుకోలేదని వర్సిటీ తరఫున అడ్వొకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి కోర్టుకు తెలిపారు. కాలేజీలు బోధనా సిబ్బంది, వారి అర్హతలు, విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తి, ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించిన వివరాలను సమర్పిస్తే... వాటిని పరిశీలించి అఫిలియేషన్‌పై నిర్ణయం తీసుకుంటామని, తర్వాత వెబ్ కౌన్సెలింగ్ జాబితాలో చేరుస్తామని చెప్పారు. కాలేజీలు సమర్పించే వివరాలు సరిగా ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు స్వయంగా కాలేజీలకు వెళ్లి తనిఖీలు నిర్వహిస్తామని.. నిబంధనల మేరకు అఫిలియేషన్‌ను వెంటనే రద్దు చేస్తామని తెలిపారు. అన్నింటినీ ఒకే గాటన కట్టొద్దు.. లోపాల విషయంలో అన్ని కాలేజీలను ఒకే గాటన కట్టడం సరికాదని జస్టిస్ రాజశేఖరరెడ్డి వ్యాఖ్యానించారు. ఎంసెట్ కౌన్సెలింగ్ సమయంలో వర్సిటీ వ్యవహరించిన తీరును చూసి పిటిషనర్లు ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తోం దన్నారు. అన్ని కాలేజీలను కౌన్సెలింగ్ జాబి తాలో చేర్చాలని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వు లు జారీ చేశారు. కాగా.. ఈ మధ్యంతర ఉత్తర్వులపై అప్పీలు చేయాలని జేఎన్టీయూహెచ్ ప్రాథమికంగా నిర్ణయించింది. దీనిపై వర్సిటీ అధికారులు అడ్వొకేట్ జనరల్‌తో చర్చిస్తున్నారు. -
రేపటి నుంచి ‘పీజీ’ సర్టిఫికెట్ల తనిఖీ
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం శనివారం నుంచి సర్టిఫికెట్ల తనిఖీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎంఈ/ ఎంటెక్/ ఎంఆర్క్/ ఎం.ఫార్మసీ/ ఫార్మ్-డి కోర్సుల్లో ప్రవేశాల కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని 349 ఎంటెక్ కాలేజీల్లో 41,178 సీట్లు ఉండగా... 188 ఫార్మసీ కాలేజీల్లో 15,452 సీట్లు ఉన్నాయి. గేట్/జీప్యాట్‌లో అర్హత సాధించిన వారు 6, 7 తేదీల్లో సర్టిఫికెట్ల తనిఖీకి హాజరుకావాలి. అనంతరం నిర్ణీత ర్యాంకుల వారీగా 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఇక పీజీఈసెట్‌లో అర్హత సాధించిన వారికి 9వ తేదీ నుంచి 19వ తేదీ వరకు సర్టిఫికెట్ల తనిఖీ ఉంటుంది. 12వ తేదీ నుంచి 23 వరకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఉంటుంది. అనంతరం సీట్ల కేటాయింపు చేస్తారు. ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్‌పై ఢిల్లీకి అధికారులు.. ఎంసెట్ రెండో దశ కౌన్సెలింగ్‌కు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టుకు విన్నవించేందుకు ఏపీ ఉన్నత విద్యా మండలి న్యాయ విభాగం అధికారులు గురువారం ఢిల్లీకి వెళ్లారు. అడ్వొకేట్ ఆన్ రికార్డ్స్‌తో (ఏఓఆర్) చర్చించి శుక్రవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయనున్నట్లు విద్యా మండలి వర్గాలు వెల్లడించాయి. సుప్రీంకోర్టులో వేసిన ఇంప్లీడ్ పిటిషన్, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఆగస్టు 31లోగా కౌన్సెలింగ్ మొత్తం పూర్తి కావాల్సి ఉందని, అలాంటపుడు రెండో విడత కౌన్సెలింగ్ ఎలా నిర్వహిస్తారంటూ తెలంగాణ ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్ ఏపీ ఉన్నత విద్యా మండలికి నోటీసులు జారీ చేశారు. తెలంగాణ సాంకేతిక విద్యా కమిషనర్ శైలజా రామయ్యార్ కూడా ఇదే అంశాన్ని పేర్కొంటూ లేఖ రాశారు. దీంతో రెండో దశ కౌన్సెలింగ్ కోసం ఏపీ ఉన్నత విద్యా మండలి సుప్రీంకోర్టు అనుమతి తీసుకోవాలని నిర్ణయించింది. -
‘జామ్’ మాట బంగారు బాట..
నచ్చిన సబ్జెక్టుపై పట్టు సాధించి, మెచ్చిన కెరీర్లో ఉన్నతంగా కుదురుకునే అవకాశాన్ని అందుకోవాలన్న ఉద్దేశంతో విద్యార్థులు పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ)కు దగ్గరవుతారు! అలాంటి పీజీని జాతీయ ప్రాధాన్య సంస్థలుగా గుర్తింపు పొందిన ఐఐటీలలో చేసే అవకాశం వస్తే భవిష్యత్తు బంగారుమయమే! అలాంటి అద్భుత అవకాశాన్ని చేజిక్కించుకునేందుకు జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ ఎంఎస్సీ (జామ్) వీలు కల్పిస్తోంది. దీనిద్వారా పరిశోధనలకు పేరుగాంచిన ఐఐఎస్సీలో ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీలోనూ ప్రవేశించొచ్చు. జామ్-2015కు తాజాగా నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా స్పెషల్ ఫోకస్.. జామ్-2015 నిర్వహణ సంస్థ: ఐఐటీ గౌహతి. ‘జామ్’తో ప్రవేశం లభించే కోర్సులు: ఐఐఎస్సీ: బయలాజికల్ సెన్సైస్, కెమికల్ సెన్సైస్, మ్యాథమెటికల్ సెన్సైస్, ఫిజికల్ సెన్సైస్‌లో ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ.ఐఐటీ భువనేశ్వర్: కెమిస్ట్రీ; ఎర్త్ సైన్స; మ్యాథమెటిక్స్; ఫిజిక్స్; అట్మాస్ఫియర్, ఓషన్ సెన్సైస్‌లో జాయింట్ ఎంఎస్సీ-పీహెచ్డీ.ఐఐటీ బాంబే: అప్లైడ్ జియాలజీ, అప్లైడ్ జియోఫిజిక్స్, అప్లైడ్ స్టాటిస్టిక్స్-ఇన్ఫర్మాటిక్స్, బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌లో రెండేళ్ల ఎంఎస్సీ.నానో సైన్స్ అండ్ టెక్నాలజీ స్పెషలైజేషన్‌తో ఎంఎస్సీ (ఫిజిక్స్)-ఎంటెక్ (మెటీరియల్ సైన్స్). ఇది నాలుగేళ్ల డ్యూయల్ డిగ్రీ కోర్సు. అప్లైడ్ జియాలజీ, అప్లైడ్ జియోఫిజిక్స్, బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, ఎనర్జీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆపరేషన్స్ రీసెర్చ్, ఫిజిక్స్‌లో ఎంఎస్సీ-పీహెచ్డీ డ్యూయల్ డిగ్రీ.ఐఐటీ ఢిల్లీ: కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌లో రెండేళ్ల ఎంఎస్సీ. ఐఐటీ గాంధీనగర్: కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌లో రెండేళ్ల ంఎస్సీ.ఐఐటీ గౌహతి: కెమిస్ట్రీ; మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్; ఫిజిక్స్‌లో ఎంఎస్సీ.ఐఐటీ హైదరాబాద్: కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌లో ఎంఎస్సీ.ఐఐటీ ఇండోర్: కెమిస్ట్రీ, ఫిజిక్స్‌లో ఎంఎస్సీ. రెండో ఏడాది తర్వాత అర్హతను బట్టి ఎంఎస్సీ-పీహెచ్డీ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్‌కు మారొచ్చు. ఐఐటీ కాన్పూర్: కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్‌లో ఎంఎస్సీ; ఫిజిక్స్‌లో ఎంఎస్సీ-పీహెచ్డీ డ్యూయల్ డిగ్రీ.ఐఐటీ ఖరగ్‌పూర్: కెమిస్ట్రీ, జియాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్,జియో ఫిజిక్స్‌లో జాయింట్ ఎంఎస్సీ-పీహెచ్డీ.ఐఐటీ మద్రాస్: కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌లో ఎంఎస్సీ.ఐఐటీ రూర్కీ: అప్లైడ్ జియాలజీ, బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌లో ఎంఎస్సీ.ఐఐటీ రూపర్: మ్యాథమెటిక్స్‌లో ఎంఎస్సీ; కెమిస్ట్రీ, ఫిజిక్స్‌లో ఎంఎస్సీ-ఎంఎస్(రీసెర్చ్)/పీహెచ్డీ డ్యూయల్ డిగ్రీ. అర్హతలు: ఐఐఎస్సీ-బెంగళూరులో ప్రవేశాలకు జనరల్ కేటగిరీ, ఓబీసీ విద్యార్థులు సంబంధిత గ్రూపులో 60 శాతం మార్కులు; ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ విద్యార్థులు 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ. ఖరగ్‌పూర్, కాన్పూర్, బాంబే, ఢిల్లీ, మద్రాస్, రూర్కీ, హైదరాబాద్, భువనేశ్వర్, గాంధీనగర్, రూపర్ ఐఐటీల్లో ప్రవేశాలకు సంబంధిత సబ్జెక్టుల్లో జనరల్, ఓబీసీ విద్యార్థులు 55శాతం మార్కులు; ఎస్సీ,ఎస్టీ, పీడబ్ల్యూడీ విద్యార్థులు 50శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ. పరీక్ష విధానం: జామ్-2015 పరీక్షను ఆన్లైన్లో నిర్వహిస్తారు. అభ్యర్థి ప్రవేశించాలనుకుంటున్న కోర్సు సబ్జెక్టును బట్టి పరీక్షకు (టెస్ట్ పేపర్)కు హాజరుకావాలి. ఏడు సబ్జెక్టుల్లో పరీక్ష నిర్వహిస్తున్నారు. అవి.. 1. బయలాజికల్ సెన్సైస్ (బీఎల్); 2. బయోటెక్నాలజీ (బీటీ); 3. కెమిస్ట్రీ (సీవై); 4. జియాలజీ (జీజీ); 5. మ్యాథమెటిక్స్ (ఎంఏ); 6. మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ (ఎంఎస్); 7. ఫిజిక్స్. ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఇందులో మూడు రకాల ప్రశ్నలుంటాయి. అవి.. మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు (ఎంసీక్యూ); మల్టిపుల్ సెలెక్ట్ ప్రశ్నలు (ఎంఎస్క్యూ); న్యూమరికల్ సమాధాన ప్రశ్నలు (ఎన్ఏటీ). మూడు గంటల్లో సమాధానాలు గుర్తించాలి. ఒక్కో పేపర్లో మొత్తం 60 ప్రశ్నలు ఇంగ్లిష్ మాధ్యమంలో ఉంటాయి. వీటికి 100 మార్కులు కేటాయించారు. సెక్షన్ ఏలో 1 మార్కు ప్రశ్నల్లో ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు, రెండు మార్కుల ప్రశ్నల్లో ప్రతి తప్పు సమాధానానికి 2/3 మార్కు కోత విధిస్తారు. సెక్షన్ బీ, సీల్లో నెగిటివ్ మార్కులుండవు. పేపర్ల వారీగా సిలబస్: బయలాజికల్ సెన్సైస్: జనరల్ బయాలజీ; బయో కెమిస్ట్రీ, బయో ఫిజిక్స్, మాలిక్యులర్ బయాలజీ ప్రాథమిక భావనలు; మైక్రో బయాలజీ, సెల్ బయాలజీ, ఇమ్యునాలజీ; మ్యాథమెటికల్ సెన్సైస్. బయో టెక్నాలజీ: ఇందులో బయాలజీకి 44 శాతం వెయిటేజీ, కెమిస్ట్రీకి 20 శాతం, మ్యాథమెటిక్స్‌కు 18 శాతం, ఫిజిక్స్‌కు 18 శాతం వెయిటేజీ ఉంటుంది. సిలబస్‌లో జనరల్ బయాలజీ, బయో కెమిస్ట్రీ, ఫిజియాలజీ, బేసిక్ బయోటెక్నాలజీ, మాలిక్యులర్ బయాలజీ, సెల్ బయాలజీ, మైక్రో బయాలజీ; అటామిక్ స్ట్రక్చర్, సెట్స్-రిలేషన్స్, సర్కిల్స్, పెర్ముటేషన్స్- కాంబినేషన్స్, వర్క్-ఎనర్జీ-పవర్ తదితర అంశాలుంటాయి. కెమిస్ట్రీ: ఫిజికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీలకు సంబంధించిన అంశాలుంటాయి. జియాలజీ: ది ప్లానెట్ ఎర్త్, జియో మార్ఫాలజీ, స్ట్రక్చరల్ జియాలజీ, పేలియంటాలజీ, స్ట్రాటీగ్రఫీ, మినరాలజీ, పెట్రాలజీ, ఎకనమిక్ జియాలజీ, అప్లైడ్ జియాలజీలకు సంబంధించిన అంశాలపై ప్రశ్నలు వస్తాయి. మ్యాథమెటిక్స్: సీక్వెన్సెస్, సిరీస్ ఆఫ్ రియల్ నంబర్స్; ఫంక్షన్స్; ఇంటిగ్రెల్ కాలిక్యులస్; డిఫరెన్షియల్ ఈక్వేషన్స్; వెక్టార్ కాలిక్యులస్; గ్రూప్ థియరీ; లీనియర్ ఆల్జీబ్రా; రియల్ అనాలిసిస్. మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్: మ్యాథమెటిక్స్‌కు సంబంధించి సీక్వెన్సెస్-సిరీస్; డిఫరెన్షియల్ కాలిక్యులస్; ఇంటిగ్రెల్ కాలిక్యులస్; మ్యాట్రిసెస్; డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. స్టాటిస్టిక్స్‌కు సంబంధించి ప్రాబబిలిటీ, ర్యాండమ్ వేరియబుల్స్, స్టాండర్డ్ డిస్ట్రిబ్యూషన్స్, ఎస్టిమేషన్ తదితర అంశాలుంటాయి. ఫిజిక్స్: మ్యాథమెటికల్ మెథడ్స్; మెకానిక్స్ అండ్ జనరల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్; ఆసిలేషన్స్, వేవ్స్, ఆప్టిక్స్; ఎలక్ట్రిసిటీ-మ్యాగ్నటిజం; థర్మోడైనమిక్స్; మోడర్న్ ఫిజిక్స్. ప్రిపరేషన్ టిప్స్: ఐఐటీ-జామ్‌లో ప్రశ్నలు అభ్యర్థిలోని నైపుణ్యాలను పరీక్షించే విధంగా ఉంటాయి. అధిక శాతం ప్రశ్నలు కాన్సెప్ట్, అనాలిసిస్ ఆధారంగా ఇస్తారు. ప్రశ్నపత్రాన్ని శాస్త్రీయ పద్ధతిలో రూపొందిస్తారు. ప్రతిసారి జామ్‌లో ప్రశ్నలు అడిగే విధానం మారుతుంటుంది. కాబట్టి ఏ ఒక్క చాప్టర్‌ను విస్మరించకుండా ప్రిపరేషన్ సాగించాలి.సబ్జెక్టు ఏదైనా మూలాలు, ప్రాథమిక భావనల నుంచి ప్రారంభించి అంచెలంచెలుగా ముందుకు సాగాలి. కాన్సెప్టు ఆధారిత సమస్యలపై దృష్టిసారించాలి.ప్రిపరేషన్ పూర్తయ్యాక చాప్టర్ల వారీగా నమూనా పరీక్షలు రాయాలి. దీని ఆధారంగా ప్రిపరేషన్లో లోటుపాట్లను గుర్తించి, సరిదిద్దుకోవాలి.ప్రిపరేషన్‌కు ప్రామాణిక పుస్తకాలను ఉపయోగించుకోవాలి. ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవడం కూడా ఉపకరిస్తుంది. బీఎస్సీ విద్యార్థులకు ప్రిపరేషన్ కోసం 6 నుంచి 8 నెలల సమయం కావాలి. కాబట్టి బీఎస్సీ మొదటి సంవత్సరం పూర్తయిన తర్వాత.. మిగిలిన రెండేళ్ల కాలంలో ప్రిపరేషన్ ప్రారంభించడం మంచిది. సిలబస్ సమగ్ర పరిశీలన ప్రధానం ఐఐటీలలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తదితర విభాగాల్లో ఎంఎస్సీ కోర్సులో ప్రవేశానికి నిర్వహిస్తున్న జామ్ విషయంలో నిర్వాహక ఐఐటీ.. నిర్దిష్ట సిలబస్‌ను అందుబాటులో ఉంచుతుంది. ఔత్సాహిక అభ్యర్థులు దీన్ని సమగ్రంగా పరిశీలించి ఆయా అంశాలపైనే పట్టు సాధించేందుకు ప్రయత్నించాలి. సిలబస్ పరిధిని దాటి ప్రశ్నలు అడగటం ఎట్టి పరిస్థితుల్లో జరగదు. కానీ ప్రశ్నల క్లిష్టత స్థాయిలో తేడాలుంటాయి. అప్లికేషన్ ఓరియెంటేషన్‌కు ప్రాధాన్యమిచ్చేలా ప్రిపరేషన్ సాగించాలి. గత ప్రశ్న పత్రాలను పరిశీలించడం ద్వారా ఆయా అంశాలకు లభిస్తున్న వెయిటేజీపై అవగాహన ఏర్పరుచుకోవచ్చు. పరీక్షలో స్కోర్ ఆధారంగా ఎంపిక చేసుకునే కోర్సు, ఇన్స్టిట్యూట్ విషయంలో ముందునుంచే స్పష్టత ఉండాలి. కొన్ని ఐఐటీలు ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ (ఎమ్మెస్సీ+పీహెచ్డీ) కోర్సులను అందిస్తున్నాయి. ఇవి పరిశోధనలపై ఆసక్తిగలవారికి ప్రయోజనకరంగా ఉంటాయి. ఐఐటీ హైదరాబాద్‌లో ఎమ్మెస్సీ కోర్సులే అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతమున్న సమయంలో సిలబస్‌లోని అన్ని అంశాలను పూర్తి చేసుకునేలా అభ్యర్థులు తమ వ్యక్తిగత నైపుణ్యాల ఆధారంగా టైం మేనేజ్మెంట్ పాటిస్తే జామ్‌లో సత్ఫలితాలు ఆశించొచ్చు. - ప్రొఫెసర్ ఫయజ్ అహ్మద్ ఖాన్; డీన్, అకడెమిక్ ప్రోగ్రామ్స్, ఐఐటీ-హైదరాబాద్. -
ఇక పీజీ కాలేజీల వంతు!
లోపాలను సరిదిద్దుకునేందుకు రెండు రోజులు గడువు.. లేకపోతే అఫిలియేషన్‌కు నో! సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిబంధనలను ఉల్లంఘిస్తూ, పుట్టెడు లోపాలతో కొనసాగుతున్న ప్రైవేటు పీజీ కళాశాలలపై వేటు వేసేందుకు జేఎన్టీయూహెచ్ సన్నద్ధమైంది. ఇప్పటికే బీటెక్ కోర్సులు నిర ్వహిస్తున్న 174 ప్రైవేటు ఇంజనీరింగ్ క ళాశాలలకు అఫిలియేషన్ నిరాకరించి సంచలనం సృష్టించిన వర్సిటీ అధికారులు.. తాజాగా ఇంజనీరింగ్, ఫార్మసీల్లో పీజీ స్థాయి కోర్సులు నిర్వహిస్తున్న కళాశాలలపై దృష్టిపెట్టారు. ఈ నెల 6నుంచి పీజీఈసెట్ కౌన్సెలింగ్ నిర్వహించేందుకుకు ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వెబ్ కౌన్సెలింగ్‌లో పెట్టాల్సిన అఫిలియేటెడ్ కళాశాలల జాబితాపై జేఎన్టీయూహెచ్ కసరత్తు ప్రారంభించింది. మౌలిక వసతులు, లేబొరేటరీలు, బోధనా సిబ్బంది తదితర అంశాలపై ఇటీవలి తనిఖీల్లో గుర్తించిన లోపాలపై వివరణ కోరుతూ... 370 కళాశాలలకు బుధవారం నోటీసులు జారీచేసింది. ఎంటెక్ కోర్సులు నిర్వహిస్తున్న 250 ఇంజనీరింగ్ కళాశాలలు, 40 ఎంబీఏ, 20 ఎంసీఏ, 60 ఎంఫార్మసీ కళాశాలలు ఈ నోటీసులు అందుకున్న జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. గురువారం సాయంత్రాని కల్లా లోపాలను సరిదిద్దుకొని డెఫిషియెన్సీ కాంప్లెయిన్స్ రిపోర్టులను సమర్పించాలని వర్సిటీ ఆదేశించింది. లేనిపక్షంలో పీజీఈసెట్‌కు అనుమతించేది లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే ఎంసెట్ కౌన్సెలింగ్‌కు అఫిలియేషన్ రాని ప్రైవేటు కళాశాలలకు తాజాగా మరో దెబ్బ తగిలింది. -
ప్రవేశాలు
జామ్ - 2015 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గౌహతి ‘జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ ఎమ్మెస్సీ-2015’ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ద్వారా ఐఐఎస్సీ, ఐఐటీల్లో ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ, జాయింట్ ఎమ్మెస్సీ- పీహెచ్డీ, డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రాముల్లో ప్రవేశాలు కల్పిస్తారు. కోర్సులు: ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ, ఎమ్మెస్సీ (ఐఐఎస్సీ బెంగళూరు), జాయింట్ ఎమ్మెస్సీ- పీహెచ్డీ, ఎమ్మెస్సీ- పీహెచ్డీ డ్యూయల్ డిగ్రీ. అర్హతలు: 55 శాతం మార్కులతో బయాలజీ/ అగ్రికల్చర్/ కెమిస్ట్రీ/ ఫిజిక్స్/ లైఫ్ సెన్సైస్/ ఇంజనీరింగ్/ టెక్నాలజీ విభాగంలో డిగ్రీ ఉండాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్: సెప్టెంబరు 3 - అక్టోబరు 9 వెబ్సైట్:www.iitg.ernet.in/jam2015 పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ కింద పేర్కొన్న కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ (అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్) అర్హతలు: 50 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు క్యాట్-2014 స్కోరు ఉండాలి. దరఖాస్తులకు చివరి తేది: డిసెంబరు 31 వెబ్సైట్: www.manage.gov.in -
పీజీ వరకు ఉచిత విద్య అందిస్తాం
నరసాపురం రూరల్ : ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారని ఎక్సైజ్, బీసీ సంక్షేమ, చేనేత శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఆదివారం లక్ష్మణేశ్వరం గ్రామం నక్కావారిపూటలో మహాత్మా జ్యోతిరావ్ పూలే ఏపీ గురుకుల బాలికల పాఠశాల నూతన ప్రాంగణాన్ని ఆయన డెప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్‌తో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ పేద విద్యార్థులు మంచి విద్యను అభ్యసించేందుకు గురుకుల విద్యాలయాలు తోడ్పడుతున్నాయని చెప్పారు. పతి నిరుపేదకూ చదువును అందుబాటులోకి తీసుకువచ్చి వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు గురుకుల పాఠశాలలను ప్రారంభించినట్టు తెలిపారు. అద్దె భవనంలో నిర్వహిస్తున్న గురుకుల పాఠశాలకు సొంత భవనాన్ని నిర్మించేందుకు కృషిచేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. స్థల సేకరణ చేయాల్సిందిగా స్థానిక ఎమ్యెల్యే బండారు మాధవనాయుడుకు సూచించారు. పాఠశాలలో మినరల్ వాటర్ ప్లాంట్, పూర్తిస్థాయిలో ఫర్నిచర్‌కు అంచనాలు రూపొందిస్తే సమకూర్చేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. విద్యార్థినులకు ప్రభుత్వం అందించిన విద్యాసామగ్రిని మంత్రి అందించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అర్హులైన విద్యార్థులందరికీ ఫీజురీయింబర్స్‌మెంటును ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. డెప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ యువత విలువైన కాలాన్ని వృథా చేయకుండా ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను వినియోగించుకుని దేశానికి మంచి సేవలందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, మునిసిపల్ చైర్పర్సన్ రత్నమాల, ఆర్డీవో జె. ఉదయ భాస్కరరావు పాల్గొన్నారు. -
‘ఉన్నత’ నిర్లక్ష్యం..
►పీజీ విద్యకు దూరమవుతున్న విద్యార్థులు ►కళాశాల మంజూరులో పాలకుల నిర్లక్ష్యం బెల్లంపల్లి : ఉన్నత విద్యపై పాలకులు ఉదాసీన వైఖరి అవలంబిస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో విద్యార్థుల కు అందుబాటులో పోస్టుగ్రాడ్యుయేషన్ (పీజీ) కళాశాలలను ఏర్పాటు చేయాల్సి ఉండగా పట్టింపు లేకుండా ఉన్నారు. ఏళ్ల తరబడి నుంచి విద్యార్థులు పీజీ కళాశాల మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఫలితంగా నిరుపేద విద్యార్థు లు ఇంటర్, డిగ్రీ చదువులతోనే సరిపెట్టుకుంటున్నారు. ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. 26 మండలాల్లో ఏకైక కళాశాల తూర్పు ప్రాంతంలో ఆసిఫాబాద్, సిర్పూర్(టి), బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూర్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటి పరిధిలో 26 మండలాలు ఉండగా ఇందులో కేవలం మంచిర్యాలలో మాత్రమే ప్రభుత్వ పీజీ కళాశాల ఉంది. మిగతా నాలుగు నియోజకవర్గాల్లో పీజీ కళాశాలలు మంజూరుకు నోచుకోలేకపోతున్నాయి. చెన్నూర్, బెల్లంపల్లి, లక్సెట్టిపేట, మంచిర్యాలలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉండగా సిర్పూర్(టి)లో ఎయిడెడ్, ఆసిఫాబాద్‌లో ప్రైవేట్ రంగంలో డిగ్రీ కళాశాలలను నిర్వహిస్తున్నారు. ప్రతి మండలానికొక జూనియర్ కళాశాలను మంజూరు చేస్తామని ప్రభుత్వం చేసిన ప్రకటన ఆచరణలో విఫలమైంది. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఎనిమిది మండలాలు ఉండగా వీటిలో ఐదు మండలాల్లో మాత్రమే జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వాంకిడి, తిర్యాణి, రెబ్బెన మండలాల్లో ప్రభుత్వం జూనియర్ కళాశాలలను ఏర్పాటు చేయలేదు. చెన్నూర్ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో మూడింటిలో మాత్రమే ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఏర్పాటయ్యాయి. కోటపల్లి మండలంలో జూనియర్ కళాశాల మంజూరు కావడం లేదు. సిర్పూర్(టి) నియోజకవర్గంలోని ఐదు మండలాలకు గాను రెండు మండలాల్లో మాత్రమే జూనియర్ కళాశాలలు ఉన్నాయి. బెజ్జూరు, దహెగాం, సిర్పూర్(టి) మండలాల్లో జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నా నిర్లక్ష్యం జరుగుతోంది. బెల్లంపల్లి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో కేవలం రెండింటిలో మాత్రమే ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఏర్పాటయ్యాయి. వేమనపల్లి, నెన్నెల, భీమిని, తాండూర్ మండలాల్లో ఇంత వరకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు మంజూరైన పాపాన పోవడం లేదు. మంచిర్యాల నియోజకవర్గంలో మాత్రం ప్రభుత్వ జూనియర్ కళాశాలలు మండలానికొకటి ఏర్పాటయ్యాయి. పీజీ కోసం... ఐదు నియోజకవర్గాల్లో ప్రతి ఏటా సుమారు 20 వేల నుంచి 25 వేల మంది వరకు విద్యార్థులు పదో తరగతి ఉత్తీర్ణులవుతుండగా ఇందులో సుమారు 15 వేల నుంచి 20 వేల మంది ఇంటర్మీడియెట్‌లో చేరుతున్నారు. 10 వేల నుంచి 15 వేల మంది విద్యార్థులు ఇంటర్మీడియెట్ పూర్తి చేసుకుంటుండగా వీరిలో 4 నుంచి 6 వేల మంది విద్యార్థులు డిగ్రీ చదువుతున్నారు. డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థులు 3 నుంచి 4 వేల మంది పీజీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. నియోజకవర్గాల్లో పీజీ కళాశాలలు లేకపోవడంతో అనేక మంది విద్యార్థులు చదువుపై శ్రద్ధ ఉన్న ఇతర ప్రాంతాలకు వెళ్లి విద్యాభ్యాసం చేసే అవకాశాలు లేక అర్థంతరంగా చదువును ఆపేస్తున్నారు. కొంత మంది విద్యార్థులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. బాలికలు పై చదువులకు నోచుకోలేకపోతున్నారు. పీజీ కళాశాలలు లేక ఆ తీరుగా విద్యార్థులు చదువు ‘కొన’లేకపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నియోజకవర్గానికొక పీజీ కళాశాలను మంజూరు చేసి విద్యార్థుల ఆశను నెరవేర్చాలని పలువురు కోరుతున్నారు. -
వ్యాధులొస్తున్నాయ్.. వైద్యులు వెళ్తున్నారు!
రిమ్స్ క్యాంపస్: వర్షాకాలం వచ్చింది. పెద్దగా వానలు లేకపోయినా.. అప్పుడప్పుడూ కురుస్తున్న చిన్న వర్షాలకే వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఆస్పత్రులు వ్యాధిగ్రస్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ సీజనులో ఇటువంటి ప్రమాదం ఉంటుందన్నది కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అందువల్ల పూర్తిస్థాయిలో సిబ్బంది, మందులు, ఇతరత్రా వనరులతో అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత వైద్య ఆరోగ్యశాఖదే. ఎప్పుడు ఎక్కడ అవసరమొచ్చిన తక్షణమే వైద్య సిబ్బందిని పంపించాలి. వైద్య శిబిరాలు ఏర్పాటు చేయించాలి. కానీ ప్రస్తుతం పరిస్థితి చూస్తే అలా కనిపించడంలేదు. పూర్తిస్థాయిలో వైద్యులే లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. పెద్ద సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉండగా, ఉన్న వారిలో కొందరు వైద్యు లు పీజీ కోర్సులు చేసేందుకు కొద్దిరోజుల్లో వెళ్లిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ఉన్న వైద్యులతోనే సర్దుకుపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వ్యాధులు ప్రబలే కాలంలో అలా సర్దుకుపోవడం సాధ్యమేనా.. పెలైట్ జిల్లాగా ఎంపిక చేసిన చోటే పరిస్థితి ఇలా ఉంటే వ్యా ధులను అదుపు చేయ డం ఎలా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాలో 78 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. వీటికి ప్రభుత్వం 143 వైద్యుల పోస్టులు మంజురు చేసింది. అయితే 101 పోస్టులకే రెగ్యులర్ నియామకాలు జరిగాయి. మరో 35 పోస్టుల కాంట్రాక్టు వైద్యులతో భర్తీ చేశామనిపించారు. అంటే 136 మంది వైద్యు లు ఉన్నట్లు లెక్క.. 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వైద్యులు లేని పీహెచ్‌సీలకు ఇతర చోట్ల నుంచి వైద్యులను పంపించి ఇంతకాలం ఎలాగోలా నెట్టుకొస్తున్నారు. ఇప్పుడు వర్షాకాలం మొదలైంది.. ఇదే సమయంలో సరికొత్త సమస్య ఎదురైంది. రెగ్యులర్ వైద్యుల్లో 12 మంది పీజీ కోర్సు చేసేందుకు ఈ నెలాఖరున వెళ్లిపోతున్నారు. దీంతో ఖాళీల సంఖ్య 19కి పెరుగుతుంది. మరోవైపు కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న 35 మంది వైద్యుల కాల పరిమితి ఈ ఏడాది జూన్ 30నాటికే ముగిసింది. దీన్ని డిసెంబరు 31 వరకు పొడిగిస్తున్నట్లు తెలిసింది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎండార్స్మెంట్ రాలేదు. దీంతో కాంట్రాక్టు వైద్యుల పరిస్థితి త్రిశంకు స్వర్గంలా ఉంది. ఎండార్స్మెంట్ రాకపోయినప్పటికీ డీఎంహెచ్ంవో గీతాంజలి విజ్ఞప్తి మేరకు వీరంతా ఇప్పటివరకు విధులకు హాజరవుతున్నారు. వైద్యులు లేని పీహెచ్‌సీలకు ఇతర పీహెచ్‌సీల నుం చి సర్దుబాటు చేస్తుండగా దూరాభారమైనప్పటికీ వెళుతున్నారు. అయితే వైద్యుల సంఖ్య ఇంకా తగ్గిపోనుండటంతో ఇబ్బం దులు సైతం పెరగనున్నాయి. పెలైట్ జిల్లా అయినా దిక్కు లేదు వైద్య ఆరోగ్యశాఖ పరంగా శ్రీకాకుళాన్ని పెలైట్ జిల్లాగా దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి గతంలోనే ప్రకటిం చారు. ఆ మేరకు అవసరమైన పోస్టులను జిల్లాస్థాయిలోనే నియమించుకునే అధికారం ఉంది. గతంలో వైద్యుల కొరత ఏర్పడగానే ఇదే రీతిలో నియామకాలు చేపట్టేవారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. తమ ఆదేశాలు లేకుండా ఎటువం టి నియామకాలే చేపట్టరాదని ఆరోగ్య శాఖ డెరైక్టర్ నుంచి జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు ఆదేశాలు అందాయి. దీంతో వైద్యుల కొరత ఏర్పడితే సమస్య తప్ప టం లేదు. జిల్లా కలెక్టర్ దీనిపై దృష్టిసారించి పెలైట్ జిల్లా కింద వైద్యుల నియామకాన్ని జిల్లాస్థాయిలోనే చేపట్టేలా చూస్తే తప్ప వైద్యుల కొరత తీరదు. సకాలంలో ప్రజలకు వైద్యం అందదు. -
నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను!
వేదిక మా అమ్మ పల్లెటూరిలో పుట్టి పెరిగింది. వాళ్ల ఊళ్లో ఉన్న బడిలో పదో తరగతి వరకూ చదివింది. కానీ పీజీ చదివినవాళ్లకి ఉన్నంత జ్ఞానం ఉంటుంది తనకి. పత్రికలు, నవలలు చదివి జీవితాన్ని, ప్రపంచాన్ని పూర్తిగా అర్థం చేసుకుంది. అందుకే పెళ్లయిన నాలుగేళ్లకే నాన్న చనిపోయినా... ఒంటరిగా బతికేందుకు సిద్ధపడింది. రెండేళ్ల పిల్లనైన నన్ను పెంచి పెద్ద చేయడం కోసం రెక్కలు ముక్కలు చేసుకుంది.అమ్మ కష్టాలను చూసిన నేను బాగా సంపాదించాలని, అమ్మని సుఖపెట్టాలని అప్పటినుంచే కలలు కనేదాన్ని. పట్టుదలతో చదివాను. ర్యాంకులు సాధించాను. ముప్ఫైవేల జీతంతో మొదలుపెట్టి, రెండేళ్లలో యాభై వేలకు చేరువయ్యాను. కానీ లక్ష్యాలకు చేరువయ్యే క్రమంలో... నన్ను పెంచడమే లక్ష్యంగా బతికిన మా అమ్మకి దూరమయిపోయాను. పనిలో చేరాక అమ్మతో గడపడానికి సమయమే ఉండేది కాదు. పని చేసుకునేటప్పుడు కనీసం పక్కవాళ్లతో టైమ్ పాసయ్యేది తనకి. కానీ నేను సంపాదిస్తున్నాను కదా అని పని మాన్పించేసి ఇంట్లో కూచోబెట్టాను. నా కోసం తను ఎదురు చూస్తుంటే ఏ అర్ధరాత్రికో వెళ్లి పక్కమీద వాలిపోయేదాన్ని. ఏవేవో వంటకాలు చేసి నాకు తినిపించాలని తను అనుకుంటే, క్యాంటీన్లో తినేసి వెళ్లి కడుపు నిండుగా ఉందనేదాన్ని. ఆదివారమైనా తనతో గడపమంటే కాన్ఫరెన్సులు అనేదాన్ని. పండగ పూటయినా తనకోసం కాస్త సమయం కేటాయించమంటే... కార్పొరేట్ ప్రపంచంలో పండుగల కోసం టైమెక్కడివ్వగలం అనేదాన్ని. ఓరోజు ఆఫీసులో ఉండగా పక్కింటావిడ ఫోన్... అమ్మకి హార్ట్ అటాక్ వచ్చిందని, ఆసుపత్రిలో చేర్పించారని. పరుగు పరుగున వెళ్లాను. అప్పటికే ఆలస్యమైంది. నా ప్రపంచం చీకటైపోయింది. అమ్మ వెళ్లిపోయింది. నాకున్న ఒకే ఒక్క తోడు నన్ను వీడిపోయింది. అమ్మ సామాన్లు సర్దుతున్నప్పుడు అమ్మ డైరీ దొరికింది. అందులో ఒకచోట అమ్మ రాసుకుంది... ‘‘నువ్వు అందనంత ఎత్తు ఎదగాలనుకున్నానురా... కానీ నాకే అందకుండా ఉండిపోవాలని కోరుకోలేదు. నాతో కాస్తంత సమయం గడిపే తీరిక కూడా నీకు లేదు. మీ నాన్న పోయినప్పుడు నువ్వున్నావని ధైర్యంగా ఉన్నాను. ఇప్పుడు నువ్వున్నా ఒంటరిగా ఫీలవుతున్నాను.’’ అప్పుడు నాకు అర్థమైంది... జ్వరం కూడా రాని అమ్మకి హార్ట్ అటాక్ ఎందుకొచ్చిందో, మొదటి స్ట్రోక్కే ప్రాణాలు ఎందుకు కోల్పోయిందో. ఇంత చేసినా తను నన్ను క్షమిస్తుందని నాకు తెలుసు. కానీ నన్ను మాత్రం నేను క్షమించుకోలేను. ఎప్పటికీ క్షమించుకోలేను. - సుచిత్ర, చెన్నై -
కొత్త బంగారు లోకం!
క్యాంపస్ ఓ అందమైన ప్రపంచం. సువిశాలమైన పకృతి ఒడిలో నెలకొల్పిన ప్రదేశం. భూలోక స్వర్గంగా అభివర్ణించవచ్చు. ఇక్కడ చదువులో పరిణితి సాధించడంతోపాటు కళలకు సానపెట్టకోవచ్చు. ఎటుచూసినా పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం.. ఇవన్నీ చూస్తే ఎవరికి మాత్రం క్యాంపస్‌లో అడుగుపెట్టాలనిపించదు. ఇది నిజమే. ప్రతి విద్యార్థీ ఈ క్యాంపస్‌ను ఒక్కసారి చూస్తే తాను అందులో చదవాలని, అక్కడ గడపాలని భావించక తప్పదు. అలాంటి సుందరస్వప్నం వచ్చింది. సోమవారం నుంచి పీజీ కోర్సుల్లో చేరిన విద్యార్థులు క్యాంపస్‌లోకి అడుగుపెట్టనున్నారు. ఎన్నో ఆశల్ని, మరెన్నో ఆశయాల్ని, అందమైన ఊహల్ని, తల్లిదండ్రుల కలల్ని మోసుకొని వస్తున్నారు. ఇలాంటి కొత్తబంగారు లోకానికి స్వాగతం పలకడానికి ఎస్వీ యూనివర్సిటీ క్యాంపస్ సిద్ధమైంది. - రేపటి నుంచి పీజీ తరగతులు - తరలిరానున్న విద్యార్థులు యూనివర్సిటీక్యాంపస్ : ఎస్వీ యూనివర్సిటీకి 62 సంవత్సరాల చరిత్ర ఉంది. 1952లో రాయలసీమ ప్రాంతంలో ఉన్నత విద్యను అందించడానికి ఏర్పాటైన విద్యాలయం. జవహర్లాల్ నెహ్రూ స్వయంగా వచ్చి దీన్ని ప్రారంభించారు. సుమారు 1500 ఎకరాల్లో ఏర్పాటైన రాష్ట్రంలోనే రెండో అత్యుత్తమ విశ్వవిద్యాలయం. ప్రవేశం అంత సులువు కాదు ఎస్వీ యూనివర్సిటీ క్యాంపస్‌లో మూడు కళాశాలలున్నాయి. ఆర్ట్స్ కళాశాల్లో 25 సబ్జెక్ట్‌లు, సైన్స్‌లో 33 , కామర్స్‌లో 4 సబ్జెక్టులున్నాయి. వీటి ద్వారా 2305 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రవేశం కోసం సుమారు 12 వేల మంది ప్రవేశపరీక్ష రాశారు. ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు నిర్వహించారు. ఈ నెల 4 నుంచి 11వరకు నిర్వహించిన కౌన్సెలింగ్ ద్వారా 1327 మంది క్యాంపస్ కళాశాలల్లో చేరారు. వీరందరికి సోమవారం నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. అందమైన భవనాలు ఎంతో ఆకర్షణీయమైన, దృఢమైన భవన నిర్మాణాలు ఎస్వీయూ సొంతం. తాజ్‌మహల్‌ను తలపించే గ్రంథాలయం.. దేశం గర్వించే ఇంజనీర్ భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆలోచనతో రూపొందించిన శ్రీని వాస ఆడిటోరియం.. నాలుగువైపులా గడియారాలతో సమయాలను సూచిస్తూ, నిటారుగా, హుందాగా కన్పించే పరిపాలనా భవనం.. ఇవి మతసామరస్యానికి చిహ్నంగా చెప్పవచ్చు. శ్రీనివాస ఆడిటోరియం ఒక్క పిల్లర్ కూడా లేకుండా నిర్మించడం ఎవరి మేథస్సు, అంచనాలకు అందని అద్భుత కట్టడం. దీనిపై శాస్త్రవేత్తల బొమ్మలు అద్భుతంగా చిత్రీకరించారు. పరిపాలనా భవనంలోని సెనేట్హాల్లో ప్రతినిత్యం ఏదో ఒక సదస్సులు జరుగుతుంటాయి. శ్రీనివాస ఆడిటోరియంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఒకేసారి 1500 మంది ఇందులో కార్యక్రమాల్ని తిలకించవచ్చు. కంప్యూటర్ సెంటర్ ఎస్వీయూనివర్సిటీలోని విద్యార్థుల కోసం కంప్యూటర్ సెంటర్ ఉంది. ఇందులో ఇంటర్నెట్ సౌకర్యం కూడా ఉంది. బాలుర వసతిగృహాలవద్ద ఇంటర్నెట్ హబ్ ఉంది. దీన్ని రాత్రి వేళల్లో కూడా వాడవచ్చు. హెల్త్ సెంటర్ ఎస్వీయూ విద్యార్థుల కోసం చక్కటి ఆరోగ్య కేంద్రం ఉంది. ఇందులో ఐదుగురు వైద్యులు ఉన్నారు. క్యాంపస్‌లో చేరిన వెంటనే విద్యార్థులందరికీ ఓపీ కార్డులు ఇస్తారు. అనారోగ్యం కల్గితే చికిత్స కోసం వెళ్లవచ్చు. రక్తపరీక్ష, ఎక్స్‌రేతో పాటు ఇతర పరీక్షలు నిర్వహించుకోవడానికి ఆధునిక పరికరాలు ఉన్నాయి. హెల్త్‌సెంటర్‌లో ఒక వైద్యుడు, ఒక నర్సు 24 గంటలు అందుబాటులో ఉంటారు. అత్యవసర కేసుల్లో వైద్య సేవలందించడానికి వీలుగా రెండు అంబులెన్స్‌లు అందుబాటులో ఉన్నాయి. చక్కటి తరగతి గదులు క్యాంపస్‌లోని విద్యార్థులు విద్యనభ్యసించడం కోసం చక్కటి తరగతి గదులు, పర్నిచర్ ఉన్నాయి. కొన్ని విభాగాల్లో అత్యాధునిక సౌకర్యాలతో సెమినార్ హాళ్లు ఈ-తరగతి గదులు ఉన్నాయి. విద్యార్థులకు బోధించడం కోసం సుమారు 300 మంది నైపుణ్యం, సుదీర్ఘ అనుభవం కల్గిన అధ్యాపకులున్నారు. అధ్యాపకులు లేనిచోట అర్హత కల్గిన తాత్కాలిక అధ్యాపకులు విద్యార్థులకు విద్య అంది స్తున్నారు. ఎస్వీయూ ఆర్ట్స్ కళాశాలకు ప్రకాశం భవన్, వామనరావు భవనాల్లో తరగతి గదులున్నాయి. సైన్స్ కళాశాల రెండు సైన్స్ బ్లాకుల్లో విస్తరించి ఉంది. క్రీడా సదుపాయాలు పలు క్రీడా సౌకర్యాలున్నాయి. సుమారు 50 ఎకరాల్లో స్టేడియం ఉంది. చక్కటి జిమ్, షటిల్ బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, బాస్కెట్‌బాల్, వాలీబాల్ కోర్టులున్నాయి. పలు మైదానాలు అందుబాటులో ఉన్నాయి. అన్నమయ్య భవన్ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల్లో శిక్షణ పొందడానికి అన్నమయ్యభవన్‌లో విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. వ్యక్తిత్వ వికాస శిక్షణ, భావప్రకటన నైపుణ్యాల పెంపుపై ఇక్కడ శిక్షణ ఇస్తారు. మూడు క్యాంటీన్లు విద్యార్థులు సేదతీరడానికి, సరదాగా గడపడానికి పూర్ణ, అన్నపూర్ణ, సంపూర్ణ అనే మూడు క్యాంటీన్లు ఉన్నాయి. లైబ్రరీ చూడచక్కని రూపం, ఎదురుగా కూర్చొని చదవడానికి వీలుగా బల్లలు, హెమాస్లైట్లు, వాటిచుట్టూ వాటర్ ఫౌంటెన్లు, ఇవన్నీ దగ్గరగా పరిశీలిస్తే ఆగ్రాలోని తాజ్‌మహల్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా అనిపిస్తుంది. ఇందులో దా దాపు 4 లక్షల పుస్తకాలున్నాయి. డిజిటల్ లైబ్ర రీ, కాంపిటేటివ్ సెల్, రెఫరెన్స్ సెల్ ఉన్నాయి. అలానే ఎన్నోరకాల దిన, వార, మాస పత్రిక లు, జర్నల్స్, అందుబాటులో ఉంటాయి. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు దీన్ని విద్యార్థులు ఉపయోగించుకోవచ్చు. హాస్టల్ వసతి ఎస్వీయూక్యాంపస్లో చేరిన విద్యార్థులందరికీ హాస్టల్ వసతి కల్పిస్తారు. బాలురు కోసం పది, బాలికల కోసం 8 వసతిగృహాలు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా సుమారు ఐదు వేలమంది విద్యార్థులకు వసతి కల్పిస్తున్నా రు. వీరు భోజనం చేయడానికి వీలుగా అనుబంధ మెస్‌లు ఉన్నాయి. క్యాంపస్‌లో పీజీలో చేరిన విద్యార్థులందరికీ వసతి కల్పిస్తారు. ఇందులో చేరాలంటే ముందుగా దరఖాస్తు చేయాలి. ఓసీ విద్యార్థులు రూ.6,750, బీసీ లైతే రూ.5,750, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.4,750 కాషన్ డిపాజిట్ చెల్లిం చాలి. అలానే మెస్ కార్డుకోసం అదనంగా రూ.2100 చెల్లించి వసతి, మెస్‌లో భోజన సౌకర్యం పొందవచ్చు. లైబ్రరీని ఉపయోగించుకోవాలి ఎస్వీయూనివర్సిటీలో చక్కటి లైబ్రరీ ఉంది. వీటిలో నాలుగు లక్షల పుస్తకాలున్నాయి. దిన, వార, మాస పత్రికలతో పాటు ఎన్నో జర్నల్స్ ఉన్నాయి. అలానే పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న వారికోసం కాంపిటెటివ్ సెల్ ఉంది. ఇందులో అన్నిరకాల పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికోసం అవసరమైన పుస్తకాలున్నాయి. డిజిటల్ లైబ్రరీ ద్వారా ఆన్లైన్ జర్నల్స్ చూసుకోవచ్చు, నూతన విద్యార్థులు లైబ్రరీని బాగా ఉపయోగించుకోవాలి. - వి.షణ్ముగం, లైబ్రరీ ఉద్యోగి సరైన వేదిక డిగ్రీ వరకు ఇంటిపట్టునే ఉండి చదువుకున్న విద్యార్థులు తొలిసారిగా తల్లిదండ్రులను వదలి క్యాంపస్‌లో అడుగు పెడుతున్నారు. యూనివర్సిటీల్లో ఎన్నో వసతులు, సౌకర్యాలున్నాయి. ఇంట్లో ఉన్న వాతావరణాన్ని ఇది తలపిస్తుంది. పీజీలో చేరిన విద్యార్థులు రెండు సంవత్సరాలు ఇక్కడి సౌకర్యాలు వినియోగించుకొని బాగా చదివితే స్థిరపడవచ్చు. జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగవచ్చు. - ప్రొఫెసర్ సీ.ఈశ్వర్‌రెడ్డి, రిటైర్డ్ అధ్యాపకులు ఉన్నత లక్ష్యాలను సాధించొచ్చు ఎస్వీయూనివర్సిటీలో విద్యానభ్యసించిన వారు ఎంతో మంది ఉన్నత స్థానాలకు ఎదిగారు. సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలతో పాటు మరెంతో మంది గొప్పవారు ఇక్కడి విద్యార్థులే. రాష్ట్రంలోని నాలుగు విశ్వవిద్యాలయాల్లో ఎస్వీయూనివర్సిటీ ప్రొఫెసర్లు వైస్‌చాన్స్‌లర్లుగా పనిచేస్తున్నారు. ప్రస్తుత వీసీ రాజేంద్ర కూడా ఇదే విశ్వవిద్యాలయంలో చదివిన వారే. - ప్రొఫెసర్ పి.శ్రీనివాసులరెడ్డి, తెలుగు అధ్యయనశాఖ అధ్యక్షులు ఇక్కడ చదవడం అదృష్టం ఎస్వీయూనివర్సిటీకి 60 సంవత్సరాలు చరిత్ర ఉంది. రాష్టం లోనే రెండో పెద్ద విశ్వవిద్యాల యం. ఇందులో చదవడం ఎంతో అదృష్టం. ఈ విశ్వవిద్యాలయం లో విద్యార్థులకు అన్ని వసతులు ఉన్నాయి. చక్కటి లైబ్రరి ఉంది. వీటి ద్వారా విద్యార్థులు ఎంతో జ్ఞానం పొందవచ్చు. మరెన్నో పరిశోధన సంస్థలు ఉన్నాయి. చదువులో వెనుక బడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి వారి ఎదుగుదలకు తోడ్పడుతున్నాము. - ప్రొఫెసర్ ఉదయగిరి రాజేంద్ర, వైఎస్చాన్స్లర్, ఎస్వీయూ -
ఈ తప్పెవరిది?
‘విద్యార్థులకు పీజీ ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ ఉందనే విషయూన్ని కళాశాలల యూజమాన్యాలు ముందుగా సమాచారం ఇచ్చి ఉంటే బాగుండేది. అప్పటికప్పుడు మార్కుల జాబితా ఇవ ్వడానికి అవి చేతితో రాసిచ్చేవి కావు. విద్యార్థుల అవసర నిమిత్తం మెమోలను ప్రింట్ చేరుుంచడానికి యూనివర్సిటీలోని ఓ అధికారికి బాధ్యతలు అప్పగించాం. దానికంటే ఇంకా మేం చేసేది ఏముంటది. సమాచారాన్ని సకాలంలో అందిస్తే ఏదైనా చర్య తీసుకునే వీలుండేది.’ - కడారు వీరారెడ్డి, శాతవాహన యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ‘పీజీ కౌన్సెలింగ్ గురించి శాతవాహన యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి భరత్‌కు తెలిపాం. ఆయన సరైన సమయంలో స్పందించలేదు. విద్యార్థులు వెళ్లి కలిసినా.. ప్రత్యామ్నాయ మార్గాలు చూపలేదు. చివరి క్షణంలో తాము ఏదో చేశామని చెప్పుకోవడానికి ఓ లెటర్ కౌన్సెలింగ్ రోజు సాయంత్రం 3 గంటలకు ఇస్తే అప్పటికప్పుడు ఒరిజినల్ లెటర్‌ను హైదరాబాద్‌కు ఎలా చేరవేసేది. ముందుగానే మార్కుల మెమోలు ఇస్తే బాగుండేది.’ - గాయత్రీదేవి, రాజరాజేశ్వర సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్, వేములవాడ శాతవాహన యూనివర్సిటీ : జిల్లాలోని వేములవాడ శ్రీరాజరాజేశ్వర సంస్కృత కళాశాలలో పలువురు విద్యార్థులు 2013-14లో డిగ్రీ పూర్తిచేశారు. పీజీలో ప్రవేశం పొందడానికి ఉస్మానియూ వర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రవేశ పరీక్ష రాశారు. దాదాపు అందరు విద్యార్థులు వందలోపు ర్యాంకు సాధించారు. అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని అన్నచందంగా పీజీ సెట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరు కాలేకపోయూరు. సంస్కృత కళాశాలనుంచి విద్యార్థులకు మార్కు లు జాబితా అందకపోవడమే దీనికి కారణం. అధికారుల నిర్లక్ష్యంతో ఉన్నత విద్యకు నోచుకోలేకపోయూమని విద్యార్థులు లబోదిబోమంటున్నారు. నష్టపోయిన విద్యార్థులు వీరే... ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంఏ ప్రవేశపరీక్షలో ర్యాంకులు సాధించి కౌన్సెలింగ్‌కు అర్హత కోల్పోయిన వారి లో నగేశ్(వర్సిటీ 6వ ర్యాంకు), బ్రహ్మచారి (వర్సిటీ 7వ ర్యాంకు), ప్రసాద్ (23వ), రాజేశ్ (45వ ర్యాంకు), సాగర్ (59వ ర్యాంకు), రవి (123వ ర్యాంకు) సాధించారు. కౌన్సెలింగ్ సమ యం వరకు కళాశాల నుంచి వీరికి మార్కుల మెమోలు అందలేదు. ఫలితంగా ఉన్నత విద్య కు దూరమయ్యూరు. మొదటి కౌన్సెలింగ్‌లోనే దాదాపు సీట్లన్నీ భర్తీ కావడంతో కనీసం రెండో కౌన్సెలింగ్‌లోనైనా సీటు దక్కుతుందనే ఆశ లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా జరగాలి... ఫలితాలు ప్రకటించిన నెల రోజుల్లోపు యూనివర్సిటీ అధికారులు మార్కుల జాబితా అందించాల్సి ఉంటుంది. శాతవాహన యూనివర్సిటీ ఆధ్వర్యంలో డిగ్రీ పరీక్షలు ఈ ఏడాది ఏప్రిల్‌లో నిర్వహించారు. జూన్ 25న ఫలితాలు విడుదలచేశారు. వాస్తవానికి ఈనెల 25వ తేదీలోపు మార్కుల జాబితా యూనివర్సిటీ అధికారులు ఆయూ కళాశాలలకు అందించాలి. మార్కుల జాబితా పొందాలంటే కళాశాలల వారు వర్సిటీ సూచించినా నిర్ణీత నమూనాలో విద్యార్థుల సమాచారం అందించాల్సి ఉంటుంది. నామినల్ రోల్స్ విధిగా సమర్పించాలని నిబంధన ఉంది. పరస్పర విరుద్ధ ఆరోపణలు విద్యార్థులకు కౌన్సెలింగ్ ఉందనే విషయాన్ని ముందుగా తమకు సమాచారం ఇచ్చి ఉంటే తప్పనిసరిగా మార్కుల జాబితాను అందించే వాళ్లమని యూనివర్సిటీ అధికారులు అంటున్నారు. వారం క్రితమే శాతవాహన యూనివర్సిటీలో పరీక్షల నియంత్రణ అధికారికి కౌన్సెలింగ్ గురించి తెలిపామని ఆయన సరైన సమయంలో స్పందించలేదని, కౌన్సెలింగ్ రేపు అనగా యూనివర్సిటీకి విద్యార్థులతో వెళ్లినా మార్కుల జాబితాలు లేకున్నా కంట్రోలర్ ప్రత్యామ్నాయ మార్గాలు చూపలేదని వేములవాడ సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్ అంటున్నారు. కౌన్సెలింగ్ రోజు విద్యార్థులకు న్యాయం చేయాలంటూ కంట్రోలర్‌ను అభ్యర్థించడంతో సాయంత్రం 3 గంటలకు కంట్రోలర్ ఓ లెటర్ అందించారని, దానిని హుటాహుటిన మెయిల్ ద్వారా విద్యార్థులకు పంపినా లాభం లేకుండా పోరుుందని పేర్కొంటున్నారు. ఇలా ఎవరికి వారు తమదే కరెక్టు అంటే తమదేనని వాదిస్తున్నారు. వీరి నిర్లక్ష్యానికి విద్యార్థులు ఉజ్వల భవిష్యత్‌కు దూరమయ్యూరు.