Sports
-
IND vs AUS: అమ్మో పెర్తా? భారత్‌ను భయపెడుతున్న గత రికార్డులు
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 ఆరంభానికి సమయం అసన్నమైంది. శుక్రవారం(నవంబర్ 22) పెర్త్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే తొలి టెస్టుతో ఈ సిరీస్ మొదలుకానుంది.ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను విజయంతో ఆరంభించాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. పటిష్టమైన ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై దెబ్బ కొట్టాలంటే భారత్ కచ్చితంగా అసాధారణ ప్రదర్శన చేయాల్సి ఉంది. న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్ అయ్యి ఆస్ట్రేలియాకు వెళ్లిన భారత జట్టు.. కంగారుల దూకుడుకు ఎలా అడ్డుకుంటుందోనని అభిమానులు అతృతగా ఎదుచూస్తున్నారు. ముఖ్యంగా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు భారత్ ఆర్హత సాధించాలంటే ఈ సిరీస్ కీలకం. ఈ సిరీస్‌లో 4-0 తేడాతో ఆసీస్‌ను ఓడిస్తేనే భారత్ నేరుగా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు క్వాలిఫై అవుతోంది. ఇక తొలి టెస్టు జరిగే పెర్త్‌లో భారత్ రికార్డు ఎలా ఉందో ఓ లుక్కేద్దాం.ఆసీస్‌దే పై చేయి..?పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో టీమిండియాకు పేలవ రికార్డు ఉంది. ఈ మైదానంలో ఇప్పటివరకు భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టులు జరిగాయి. అందులో టీమిండియా కేవలం ఒక్కసారి మాత్రమే విజయం సాధించగా.. ఆస్ట్రేలియా 4 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. చివరగా భారత్ 2018 పర్యటనలో ఈ స్టేడియంలో టెస్టు మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో 146 పరుగుల తేడాతో భారత్ ఓటమి చవిచూసింది.బ్యాటింగ్ రికార్డులు ఎలా ఉన్నాయంటే?ఈ ఆప్టస్ స్టేడియంలో టీమిండియా సాధించిన అత్యధిక స్కోర్ 402 పరుగులు. 1977లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో టీమిండియా తమ మొదటి ఇన్నింగ్స్‌లో 402 పరుగులు నమోదు చేసింది. ఈ వేదికలో భారత్ అత్యల్ప స్కోర్ 141 పరుగులగా ఉంది. 2018లో ఆసీస్‌తో జరిగిన టెస్టు సెకెండ్ ఇన్నింగ్స్‌లో 141 పరుగులకు మెన్ ఇన్ బ్లూ ఆలౌటైంది.విరాట్ ఒక్కడే..ఈ వేదికలో భారత్ నుంచి విరాట్ కోహ్లికి ఒక్కడికే మంచి రికార్డు ఉంది. పెర్త్‌లో ఇప్పటివరకు కేవలం రెండు టెస్టులు మాత్రమే ఆడిన కోహ్లి.. 259 పరుగులు చేసి లీడింగ్ రన్‌స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఈ మైదానంలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ప్లేయర్‌గా సునీల్ గవాస్కర్(127 పరుగులు, 1977లో) ఉన్నారు. అదేవిధంగా ఈ వేదికలో అత్యధిక వికెట్ల తీసిన జాబితాలో భారత్ నుంచి దిగ్గజం బిషన్ సింగ్ బేడీ(10 వికెట్లు) అగ్రస్ధానంలో ఉన్నారు.చదవండి: విధ్వంసం.. డబుల్ సెంచరీతో చెలరేగిన సెహ్వాగ్ కొడుకు -
విధ్వంసం.. డబుల్ సెంచరీతో చెలరేగిన సెహ్వాగ్ కొడుకు
టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ సెహ్వాగ్ తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నాడు. తండ్రికి తగ్గ తనయుడుగా నిరూపించుకుంటున్నాడు. కూచ్ బెహార్ ట్రోఫీ-2024లో ఢిల్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆర్యవీర్..మేఘాలయతో జరుగుతున్న మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో చెలరేగాడు.తండ్రిలానే ప్రత్యర్ధి బౌలర్లను ఆర్యవీర్ ఊచకోత కోశాడు. తనదైన స్టైల్లో కేవలం 229 బంతుల్లోనే తన డబుల్ సెంచరీ మార్క్‌ను జూనియర్ సెహ్వాగ్ అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో 34 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. ఆర్యవీర్ సరిగ్గా 200 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ల్లీ తమ తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 468 పరుగులు చేసింది. అతడితో పాటు ధన్యా నక్ర(98) పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఇక ఢిల్లీ ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్‌లో 208 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.అరంగేట్రంలోనే అదుర్స్..ఈ ఏడాది అక్టోబర్‌లో ఆర్యవీర్ వినూ మన్కడ్ ట్రోఫీలో ఢిల్లీ తరపున ప్రొఫెషనల్ క్రికెట్లో అడుగు పెట్టాడు. తన డెబ్యూ మ్యాచ్‌లోనే ఆర్యవీర్ అదరగొట్టాడు. మణిపూర్‌తో జరిగిన మ్యాచ్‌లో 49 పరుగులు చేసిన తన జట్టుకు అద్భుతమైన విజయాన్ని ఈ ఢిల్లీ చిచ్చరపిడుగు అందించాడు. ఆ తర్వాత ఆర్యవీర్ సెహ్వాగ్ తన ప్రతిభను చాటుకుంటూ వస్తున్నాడు. మరోవైపు ఆర్యవీర్ ఐపీఎల్లో ఆడితే చూడాలన్న తన కోరికను సెహ్వాగ్ ఇప్పటికే వెల్లడించాడు.చదవండి: IND vs AUS: టీమిండియాకు గుడ్ న్యూస్.. రోహిత్ శర్మ వచ్చేస్తున్నాడు! -
టీమిండియాకు గుడ్ న్యూస్.. రోహిత్ శర్మ వచ్చేస్తున్నాడు!
పెర్త్ వేదికగా నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న తొలి టెస్టుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూరమైన విషయం తెలిసిందే. తన భార్య రితికా రెండో బిడ్డకు జన్మనివ్వడంతో రోహిత్ భారత్‌లోనే ఉండిపోయాడు. ఈ క్రమంలోనే ఈ ముంబైకర్ పెర్త్ టెస్టుకు అందుబాటులో లేడు.అయితే ఇప్పుడు రోహిత్ ఆస్ట్రేలియాకు పయనమయ్యేందుకు సిద్దమయ్యాడు. తొలుత డిసెంబర్ 6న ఆడిలైడ్ వేదికగా ప్రారంభం కానున్న రెండో టెస్టుకు ముందు హిట్‌మ్యాన్ జట్టుతో కలవనున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు భారత కెప్టెన్ తన మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. తొలి టెస్టు జరుగుతున్న సమయంలోనే రోహిత్ జట్టుతో కలవనున్నట్లు సమాచారం. నవంబర్ 24న రోహిత్ ఆస్ట్రేలియాకు చేరుకోనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. తొలి టెస్టు మూడో రోజు ఆట సమయానికి భారత డ్రెస్సింగ్ రూమ్‌లో రోహిత్ ఉండనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి."రోహిత్ శర్మ ఈ నెల 23 తేదీన ముంబై నుంచి ప్రత్యేక విమానంలో 24న పెర్త్ చేరుకోనున్నారు. ఆ తర్వాత అతడు జట్టుతో కలిసి తన సలహాలు, సూచనలు ఇవ్వనున్నాడు. అదే విధంగా అడిలైడ్‌లో జరిగే డే-నైట్ టెస్ట్ ప్రాక్టీస్ కోసం కోచింగ్ సిబ్బందితో చర్చించనున్నాడు.అదే విధంగా కాన్బెర్రాలో ప్రాక్టీస్ గేమ్‌కు రోహిత్ అందుబాటులో ఉంటాడు" అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇక తొలి టెస్టులో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను శుభారంభం చేయాలని భారత్ భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్‌గా జస్ప్రీత్ బుమ్రా వ్యవహరించనున్నాడు.చదవండి: మైదానంలో ఫ్రెండ్స్ ఉండరు.. గంభీర్ దూకుడు సరైనదే: ఆసీస్ లెజెండ్ -
మైదానంలో ఫ్రెండ్స్ ఉండరు.. గంభీర్ దూకుడు సరైనదే: ఆసీస్ లెజెండ్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు శుక్రవారం(నవంబర్ 22) నుంచి పెర్త్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు తమ అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకున్నాయి. న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్ అయిన భారత్ జట్టు ఈ సిరీస్‌ను ఎలా ఆరంభిస్తుందోనని అందరూ అతృతగా ఎదురుచూస్తున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు టీమిండియా నేరుగా ఆర్హత సాధించాలంటే ఈ సిరీస్‌లో ఆతిథ్య ఆసీస్‌ను 4-1తో ఓడించాలి. మరోవైపు ఈ సిరీస్‌తో భారత సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ టెస్టు భవితవ్యం తేలిపోనుంది. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు క్వాలిఫై కాకపోతే ఈ సీనియర్ ద్వయం టెస్టులకు విడ్కోలు పలికే అవకాశముంది.వీరిద్దరిపైనే కాకుండా భారత హెడ్‌కోచ్‌పై కూడా అందరి కళ్లు ఉన్నాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ వంటి ప్రతిష్టాత్మక సిరీస్‌లో గంభీర్ కోచింగ్ వ్యూహాలు ఎలా ఉంటాయో అని భారత ప్యాన్స్ వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో గంభీర్‌పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ కీలక వ్యాఖ్యలు చేశాడు. మైదానంలో గంభీర్ వైఖరిని క్లార్క్ సమర్థించాడు. ఐపీఎల్ వంటి ఫ్రాంచైజీ లీగ్‌ల వల్ల ఆటగాళ్ల మధ్య స్నేహం ఏర్పడి, పోటీతత్వం తగ్గిపోయిందని క్లార్క్ వ్యాఖ్యనించాడు."ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్ వంటి ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్‌లు చాలా వచ్చాయి. కాబట్టి వేర్వేరు దేశాల ఆటగాళ్లు ఆయా ఫ్రాంచైజీలకు ఆడేటప్పుడు ఎక్కువ సమయం కలిసి ఉంటున్నారు. దీంతో ఆటగాళ్ల మధ్య స్నేహం ఏర్పడి, అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడేటప్పడు ప్రత్యర్ధి ఆటగాళ్లపై దూకుడు చూపలేకపోతున్నారు. గతంలో మేము ఆడేటప్పుడు ప్రత్యర్ధిలుగానే చూసేవాళ్లం. ఎందుకంటే మేము ఆడేటప్పుడు ఐపీఎల్ వంటి లీగ్‌లు లేవు. ఒకరికొకరు బాగా పరిచయం ఉన్నప్పటకి దేశం కోసం ఆడేటప్పుడు ఫీల్డ్‌లో దూకుడుగా ఉండాల్సిందే. మైదానంలో మనకు ఎవరూ స్నేహితులు ఉండరు.ఆఫ్‌ది ఫీల్డ్ ఎలా ఉన్నా పర్వాలేదు, ఆన్ది ఫీల్డ్‌లో మాత్రం ప్రత్యర్థులుగానే చూడాలి. మీరు దేశం కోసం ఆడుతున్నారు, ఒకే ఐపీఎల్ జట్టులో ఆడటం లేదనే సంగతిని గుర్తుంచుకోవాలి. గతంలో భారత జట్టు ఇదే దూకుడు కనబరిచింది. అందుకే గత రెండు పర్యటనలలో ఆస్ట్రేలియాలో భారత్ విజయం సాధించింది. హెడ్ కోచ్ గంభీర్ దూకుడు భారత జట్టుకు మంచిదే. ఆస్ట్రేలియా కూడా అదే మైండ్ సెట్‌తో ఉంది. కాబట్టి ఈ సిరీస్ మరోసారి అభిమానులను మునివేళ్లపై నిలబెట్టనుంది" అని క్లార్క్ పేర్కొన్నాడు.చదవండి: టాలెంటెడ్ కిడ్.. ఇక్కడ కూడా.. : నితీశ్ రెడ్డిపై కమిన్స్ కామెంట్స్ -
ఇషాన్ కాదు!.. అత్యధిక ధరకు అమ్ముడుపోయే వికెట్ కీపర్లు వీరే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 మెగా వేలానికి సమయం ఆసన్నమైంది. సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఇప్పటికే నిర్ణయించింది. రెండురోజుల పాటు ఈ వేలం పాట జరుగనుండగా.. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ నవంబరు 24, 25 తేదీల్లో ఖరారు చేసింది.ఇక ఈసారి వేలంలో టీమిండియా స్టార్లు రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ తదితరులు హైలెట్‌గా నిలవనున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్లు ఎవరు ఎంత ధర పలుకుతారనే అంశం మీద తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు.ఈ క్రమంలో టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ రాబిన్ ఊతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈసారి వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయే వికెట్ కీపర్లు వీరేనంటూ ఐదుగురి పేర్లు చెప్పాడు. అయితే, ఇందులో మాత్రం ఇషాన్ కిషన్‌కు చోటు దక్కలేదు.కాగా వేలానికి ముందే వికెట్ కీపర్లు భారీ ధర పలికిన విషయం తెలిసిందే. అదేనండీ రిటెన్షన్స్‌లో భాగంగా వికెట్ కీపర్ బ్యాటర్లకు ఆయా ఫ్రాంఛైజీలు భారీ మొత్తం ముట్టజెప్పాయి. అతడికి ఏకంగా రూ. 23 కోట్లుసన్‌రైజర్స్ హైదరాబాద్ హెన్రిచ్ క్లాసెన్ కోసం రూ. 23 కోట్లు, లక్నో సూపర్ జెయింట్స్ నికోలస్ పూరన్ కోసం రూ. 21 కోట్లు, రాజస్తాన్ రాయల్స్ సంజూ శాంసన్ కోసం రూ. 18 కోట్లు, ధ్రువ్ జురెల్ కోసం రూ. 14 కోట్లు ఖర్చు చేశాయి.ఆ ఐదుగురికే అధిక ధరఈ నేపథ్యంలో రాబిన్ ఊతప్ప స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ఈసారి వికెట్ కీపర్ల కోటాలో రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, జోస్ బట్లర్, క్వింటన్ డికాక్, ఫిల్ సాల్ట్ అత్యధిక మొత్తానికి అమ్ముడుపోతారని అంచనా వేశాడు. ముఖ్యంగా కేఎల్ రాహుల్‌ను సొంతం చేసుకునేందుకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కచ్చితంగా ఇతర ఫ్రాంఛైజీలతో పోటీకి వస్తుందని అభిప్రాయపడ్డాడు. ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ కూడా కేఎల్ వైపు చూసే అవకాశం లేకపోలేదని ఊతప్ప చెప్పుకొచ్చాడు.చదవండి: టాలెంటెడ్ కిడ్.. ఇక్కడ కూడా.. : నితీశ్ రెడ్డిపై కమిన్స్ కామెంట్స్ -
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..! 'ఐరెన్ లెగ్' అంపైర్ వచ్చేశాడు
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25కు సర్వం సిద్దమైంది. మరి కొన్ని గంటల్లో ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌కు తెర లేవనుంది. ఈ సిరీస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను శుభారంభం చేయాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.అందుకు తగ్గట్టే ఇరు జట్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాయి. ఇక పెర్త్ వేదికగా జరిగే ఈ తొలి టెస్టుకు అంపైర్లను ఐసీసీ ప్రకటించింది. రిచర్డ్ కెటిల్‌బరో, క్రిస్ గాఫ్నీలు ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనున్నారు. అదేవిధంగా రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ థర్డ్ అంపైర్‌గా, సామ్ నోగాజ్స్కీ నాలుగో అంపైర్‌గా, రంజన్ మదుగల్లె మ్యాచ్ రిఫరీగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.అయితే ఈ జాబితాలో రిచర్డ్ కెటిల్‌బరో ఉండడంతో భారత అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారు. గతంలో భారత్ ఓడిపోయిన ప్రతీ కీలక మ్యాచ్‌లోనూ రిచర్డ్ కెటిల్‌బరోనే అంపైర్ కావడం గమనార్హం. ముఖ్యంగా అతడు అంపైర్‌గా ఉన్న ఒక్క ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌లోనూ భారత్ విజయం సాధించలేదు. దీంతో ఫ్యాన్స్ అతడిని ఐరెన్ లెగ్ అంపైర్‌గా పిలుస్తుంటారు. ఈసారి మరి ఫలితం ఏవిధంగా ఉంటుందో ఎదురు చూడాలి.చదవండి: ఇదంతా విరాట్ భాయ్ వల్లే.. అతడే నాకు ఆదర్శం: యశస్వీ జైశ్వాల్ -
టాలెంటెడ్ కిడ్.. కానీ.. : నితీశ్ రెడ్డిపై ప్యాట్ కమిన్స్ కామెంట్స్
టీమిండియా యువ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డిపై ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ప్రశంసలు కురిపించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అతడితో కలిసి ఆడిన జ్ఞాపకాలు మధురమైనవని.. ఆట పట్ల నితీశ్ అంకితభావం అమోఘమని కొనియాడాడు. ఆసీస్ గడ్డపై కూడా అతడు బంతిని స్వింగ్ చేసే అవకాశం ఉందని పేర్కొన్నాడు.ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఇరుజట్లు ఐదు టెస్టుల్లో తలపడబోతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం పెర్త్ వేదికగా తొలి మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ గురువారం మీడియాతో మాట్లాడాడు.మాకు ఎంతో కీలకంబోర్డర్- గావస్కర్ ట్రోఫీ తమకు ఎంతో కీలకమైన సిరీస్ అన్న కమిన్స్.. టీమిండియా వంటి పటిష్ట జట్టుతో తలపడటం కఠినమైన సవాలు అని పేర్కొన్నాడు. ఇక సొంతగడ్డపై ఆడటం ఎల్లప్పుడూ ఒత్తిడికి గురిచేస్తుందని.. అయితే, తాము అన్ని రకాలుగా ఈ సిరీస్‌కు సిద్ధమయ్యాం కాబట్టి ఆందోళన చెందడం లేదని తెలిపాడు.టాలెంటెడ్ కిడ్ కానీ..ఈ సందర్భంగా నితీశ్ కుమార్ రెడ్డి ప్రస్తావన రాగా.. ‘‘ఎంతో ప్రతిభావంతుడైన కుర్రాడు. కానీ.. సన్‌రైజర్స్ తరఫున అతడికి పెద్దగా బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. ఏదేమైనా అతడు టాలెంటెడ్ కిడ్. తన ఆట తీరుతో నన్ను ఇంప్రెస్ చేశాడు. ఇక్కడ కూడా బంతిని కాస్త స్వింగ్ చేయగలడనే అనుకుంటున్నా’’ అని కమిన్స్ కితాబులిచ్చాడు.సన్‌రైజర్స్ గెలుపులోకాగా ఐపీఎల్-2024లో కమిన్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. గత వైఫల్యాలను మరిపించేలా జట్టును ఏకంగా ఫైనల్స్‌కు చేర్చాడు. ఇక కమిన్స్ కెప్టెన్సీలో ఆంధ్ర క్రికెటర్ నితీశ్ రెడ్డి తన ప్రతిభను నిరూపించుకున్నాడు.ఈ ఏడాది రైజర్స్ తరఫున 303 పరుగులు చేయడంతో పాటు.. మూడు వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే.. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కోటాలో ఆస్ట్రేలియాతో టెస్టులకు నితీశ్ కుమార్ రెడ్డి ఎంపికయ్యాడు. పెర్త్‌లో అతడు అరంగేట్రం చేసే అవకాశం ఉంది.చదవండి: పేసర్లకు కెప్టెన్సీ ఇవ్వాలి.. విరాట్, రోహిత్ వేరు.. నేను వేరు.. తుదిజట్టు ఖరారైంది: బుమ్రా -
ఇదంతా విరాట్ భాయ్ వల్లే.. అతడే నాకు ఆదర్శం: యశస్వీ జైశ్వాల్
టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ తొలిసారి ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్ ఆడేందుకు సిద్దమయ్యాడు. గత కొంత కాలంగా భారత టెస్టు జట్టులో కీలక సభ్యునిగా ఉన్న జైశ్వాల్ ఇప్పుడు ఆస్ట్రేలియా పిచ్‌లలో ఎలా రాణిస్తాడో అని అందరూ అతృతగా ఎదురు చూస్తున్నారు.బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా ప్రారంభం కానున్న తొలి టెస్టులో సత్తా చాటేందుకు యశస్వీ సైతం ఉవ్విళ్లూరుతున్నాడు. ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్‌తో కలిసి భారత ఇన్నింగ్స్‌ను ఈ ముంబైకర్ ప్రారంభించే అవకాశముంది.అయితే ఈ మ్యాచ్‌కు ముందు అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ జైశ్వాల్ మాట్లాడాడు. ఈ సందర్భంగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఇచ్చిన సలహా తన కెరీర్ ఎదుగుదలలో ఎలా సహాయపడిందో జైశ్వాల్ చెప్పుకొచ్చాడు."విరాట్ కోహ్లితో నాకు మంచి అనుబంధం ఉంది. క్రికెట్‌ను కెరీర్‌గా ఎక్కువ కాలం కొనసాగించాలంటే క్రమశిక్షణతో ఉండాలని, ఆటను గౌరవించడం చాలా ముఖ్యమని కోహ్లి నాతో చెప్పాడు. విరాట్ భాయ్ సలహా నా కెరీర్ ఎదుగుదలలో ఎంతగానో సహాయపడింది. అతడి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. అతడిలా కష్టపడి పనిచేసేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తున్నాను అని యశస్వీ పేర్కొన్నాడు. తన కెరీర్లో ఇప్పటివరకు 14 టెస్టులు ఆడిన జైశ్వాల్.. 56.28 సగటుతో 1407 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో రెండు డబుల్ సెంచరీలతో పాటు 3 శతకాలు, 8 హాఫ్ సెంచరీల ఉన్నాయి. తన తొలి టెస్టు సిరీస్‌లోనే యశస్వీ డబుల్ సెంచరీ సాధించడం గమనార్హం.చదవండి: బాబాకీ జై! : మంజ్రేకర్‌పై మండిపడ్డ మహ్మద్ షమీ.. పోస్ట్ వైరల్ -
మంజ్రేకర్‌పై మండిపడ్డ మహ్మద్ షమీ.. పోస్ట్ వైరల్
భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ తీరుపై టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ మండిపడ్డాడు. ఇతరుల కోసం జ్ఞానం వృథా చేసుకుని.. తమ గురించి ఆలోచించుకోవడం మర్చిపోవద్దంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. జోస్యం చెప్పడమే లక్ష్యంగా పెట్టుకుంటే బాబా అవతారం ఎత్తితే బాగుంటుందంటూ చురకలు అంటించాడు.నవంబరు 24, 25 తేదీల్లోఐపీఎల్-2025 మెగా వేలం నవంబరు 24, 25 తేదీల్లో జరుగనున్న విషయం తెలిసిందే. సౌదీ అరేబియాలోని జెద్దా నగరం వేదికగా జరిగే వేలంపాటకు ముందే పది ఫ్రాంఛైజీలు తమ రిటెన్షన్ జాబితాను ఇప్పటికే విడుదల చేశాయి. ఆ ఐదుగురు మాత్రమేఈ క్రమంలో గుజరాత్ టైటాన్స్ రషీద్ ఖాన్(రూ. 18 కోట్లు ), శుబ్‌మన్ గిల్(రూ. 16.50 కోట్లు), సాయి సుదర్శన్(రూ. 8.50 కోట్లు), రాహుల్ తెవాటియా(రూ. 4 కోట్లు), షారుఖ్ ఖాన్(రూ. 4 కోట్లు)లను మాత్రమే అట్టిపెట్టుకుని.. షమీని విడిచిపెట్టింది.ఏడాది తర్వాత రీ ఎంట్రీకాగా వన్డే వరల్డ్‌కప్-2023లో సత్తా చాటిన షమీ.. ఆ తర్వాత చీలమండ గాయంతో ఆటకు దూరమయ్యాడు. శస్త్ర చికిత్స తర్వాత పూర్తిగా కోలుకోలేకపోయిన షమీ దాదాపు ఏడాది తర్వాత ఇటీవలే బెంగాల్ తరఫున రంజీ ట్రోఫీ బరిలో దిగాడు. బాల్తోనే గాకుండా బ్యాట్‌తోనూ సత్తా చాటాడు.షమీ ధర పడిపోవచ్చుఈ పరిణామాల నేపథ్యంలో మెగా వేలానికి ముందు షమీని ఉద్దేశించి కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యలు చేశాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘షమీపై ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపుతాయనడంలో సందేమం లేదు. కానీ.. అతడిని గాయాల బెడద వేధిస్తోందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి.అతడు కోలుకోవడానికి ఎంత సమయం పట్టిందో మనం చూశాం. కాబట్టి ఇలాంటి ఆటగాడిని కొనుగోలు చేయాలంటే.. ఫ్రాంఛైజీలు కాస్త ఆలోచిస్తాయి. ఒకవేళ ఎవరైనా షమీపై భారీగా పెట్టుబడి పెట్టిన తర్వాత.. మధ్యలోనే అతడు జట్టుకు దూరమైతే..వారికి సరైన ఆప్షన్లు కూడా అందుబాటులో ఉండవు. అందుకే.. షమీ ధర పడిపోవచ్చు’’ అని సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు.బాబాజీని సంప్రదించండిఇందుకు ఘాటుగా స్పందించిన షమీ ఇన్‌స్టా స్టోరీలో మంజ్రేకర్ వ్యాఖ్యలను షేర్ చేస్తూ.. ‘‘బాబాకీ జై! మీ భవిష్యత్తు కోసం కూడా కాస్త జ్ఞానాన్ని దాచిపెట్టుకోండి. ఒకవేళ ఎవరైనా తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనుకుంటే బాబాజీని సంప్రదించండి’’ అంటూ సెటైర్లు వేశాడు.రూ. 6.25 కోట్లకు కొనుగోలుకాగా ఐపీఎల్-2022లో గుజరాత్ టైటాన్స్ షమీని రూ. 6.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ ఎడిషన్‌లో షమీ 16 వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే.. భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ సైతం ఐపీఎల్ మెగా వేలం నేపథ్యంలో.. రిషభ్ పంత్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. డబ్బు విషయంలో సయోధ్య కుదరకపోవడంతోనే పంత్ ఢిల్లీ క్యాపిటల్స్‌ను విడిచిపెట్టాడని సన్నీ అంచనా వేశాడు. అయితే, పంత్ ఎక్స్ వేదికగా గావస్కర్ వ్యాఖ్యలను ఖండించాడు. తాజాగా షమీ సైతం అదే పంథాను అనుసరించాడు.చదవండి: IPL 2025 Mega Auction: అతడికి రూ. 25- 28 కోట్లు.. ఆ ఫ్రాంఛైజీ సొంతం చేసుకోవడం ఖాయం!పేసర్లకు కెప్టెన్సీ ఇవ్వాలి.. విరాట్, రోహిత్ వేరు.. నేను వేరు.. తుదిజట్టు ఖరారైంది: బుమ్రా -
IPL 2025: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. తొలి మ్యాచ్‌కు ముందే కెప్టెన్‌పై నిషేధం
ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందే ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్ తగిలింది. గత ఐపీఎల్ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆడిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ మెయిన్‌టెయిన్ చేసినందుకుగానూ కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై ఓ మ్యాచ్ నిషేధం విధించారు. గత సీజన్లో అదే చివరి మ్యాచ్ కావడంతో ఈ సీజన్ తొలి మ్యాచ్‌లోనే నిషేధాన్ని అమలు చేస్తున్నట్లు ఐపీఎల్ మేనేజ్మెంట్ తెలిపింది. నిషేధంతో పాటు హార్దిక్‌కు రూ. 30 లక్షల జరిమానా విధిస్తున్నట్లు ఐపీఎల్ పేర్కొంది. తదుపరి మ్యాచ్‌లో హార్దిక్ ఇంపాక్ట్ ప్లేయర్‌గానూ బరిలోకి దిగకూడదు. హార్దిక్‌తో పాటు నాటి మ్యాచ్‌లోని సభ్యులైన ప్రతి ఆటగాడికి రూ. 12 లక్షలు, లేదంటే మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా వర్తిస్తుంది.కాగా, గత సీజన్లో కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన హార్దిక్‌ను ముంబై ఇండియన్స్ యాజమాన్యం తదుపరి సీజన్‌కు కూడా కెప్టెన్‌గా కొనసాగించింది. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ రిటెన్షన్ ప్రక్రియలో భాగంగా ఐదుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకుంది. తదుపరి సీజన్ కోసం ముంబై రిటైన్ చేసుకున్న ఆటగాళ్లలో హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మ ఉన్నారు. ముంబై ఇండియన్స్‌కు ఆర్టీఎం ద్వారా తాము రిలీజ్ చేసిన ఓ ఆటగాడిని తిరిగి దక్కించుకునే అవకాశం ఉంది. ఐపీఎల్ 2025 మెగా వేలం సౌదీ అరేబియాలోని జెద్దా నగరం వేదికగా నవంబర్ 24, 25 తేదీల్లో జరుగనుంది. కాగా, గత కొన్ని సీజన్లుగా పేలవ ప్రదర్శన కనబరుస్తున్న ముంబై ఇండియన్స్ గత సీజన్‌ను చివరి స్థానంతో ముగించిన విషయం తెలిసిందే. ముంబై ఇండియన్స్ చివరిసారిగా 2020లో టైటిల్ సాధించింది. -
ఆసీస్‌తో తొలి టెస్ట్.. టీమిండియా ఆటగాళ్ల ముందున్న భారీ రికార్డులు ఇవే..!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య రేపటి నుంచి తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. పెర్త్ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఉదయం 7:50 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ఈ మ్యాచ్ యొక్క లైవ్ స్ట్రీమింగ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఉంటుంది.మూడో స్థానానికి చేరనున్న విరాట్ఇదిలా ఉంటే, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా ఆటగాళ్లను పలు భారీ రికార్డులు ఊరిస్తున్నాయి. ఈ సిరీస్‌లో విరాట్ మరో 350 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్లో (అన్ని ఫార్మాట్లు) అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకతాడు. ప్రస్తుతం సచిన్, సంగక్కర, పాంటింగ్ విరాట్ కంటే ముందున్నారు. ఈ సిరీస్‌లో విరాట్ 350 పరుగులు చేస్తే పాంటింగ్ అధిగమించి మూడో స్థానాన్ని ఆక్రమిస్తాడు.బుమ్రా మరో 27 వికెట్లు తీస్తే..!బీజీటీలో బుమ్రా మరో 27 వికెట్లు తీస్తే టెస్ట్‌ల్లో 200 వికెట్ల మైలురాయిని చేరుకుంటాడు. తద్వారా ఈ ఘనత సాధించిన ఆరో భారత్ పేసర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. ప్రస్తుతం భారత్ తరఫున కపిల్ దేవ్, జవగల్ శ్రీనాథ్, ఇషాంత్ శర్మ, జహీర్ ఖాన్, మొహమ్మద్ షమీ 200 వికెట్ల క్లబ్లో ఉన్నారు.బుమ్రా ఈ సిరీస్‌లో 27 వికెట్లు తీస్తే వేగంగా 200 వికెట్ల మైలురాయిని తాకిన భారత పేసర్‌గానూ రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు కపిల్ దేవ్ పేరిట ఉంది. కపిల్ 50 టెస్ట్‌ల్లో 200 వికెట్లు తీయగా.. బుమ్రా ప్రస్తుతం 40 టెస్ట్‌లు మాత్రమే ఆడాడు.కోచ్ రికార్డునే గురి పెట్టిన జైస్వాల్టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ రికార్డుకే గురి పెట్టాడు. బీజీటీలో జైస్వాల్ మరో 15 పరుగులు చేస్తే ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన భారత లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు గంభీర్ (1134 పరుగులు) పేరిట ఉంది.బీజీటీలో యశస్వి మరో 444 పరుగులు చేస్తే ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు సచిన్ పేరిట ఉంది. సచిన్ 2010లో 1562 పరుగులు చేశాడు. -
విరాట్, రోహిత్ వేరు.. నా స్టైల్ వేరు.. తుదిజట్టు ఖరారైంది: బుమ్రా
ఆస్ట్రేలియా గడ్డ మీద టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం రావడం తనకు దక్కిన గొప్ప గౌరవమని జస్ప్రీత్ బుమ్రా అన్నాడు. తనదైన శైలిలో జట్టును ముందుకు నడిపించి విజయపథంలో నిలుపుతానని పేర్కొన్నాడు. పేసర్లు కెప్టెన్సీలో అత్యుత్తమంగా రాణిస్తారన్న బుమ్రా.. అందుకు ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ నిదర్శనమని కొనియాడాడు.ఆ పరాభవాన్ని మోసుకురాలేదుఇక న్యూజిలాండ్ చేతిలో పరాభవాన్ని తాము ఆస్ట్రేలియాకు మోసుకురాలేదని.. ఇక్కడ గెలుపే ఏకైక లక్ష్యంగా ముందుకు సాగుతామని బుమ్రా పేర్కొన్నాడు. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత జట్టు కంగారూ గడ్డపై అడుగుపెట్టింది. ఇరుజట్ల మధ్య శుక్రవారం పెర్త్ వేదికగా ఈ సిరీస్ మొదలుకానుంది.అయితే, వ్యక్తిగత కారణాల వల్ల టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టెస్టుకు దూరంగా ఉండగా.. ప్రధాన పేసర్ బుమ్రా జట్టుకు తాత్కాలిక సారథిగా వ్యవహరించనున్నాడు. ఈ క్రమంలో గురువారం మీడియాతో మాట్లాడిన బుమ్రా కెప్టెన్సీ, మొదటి టెస్టులో తొలి టెస్టు కూర్పు తదితర అంశాల గురించి తన మనసులోని భావాలు వెల్లడించాడు.విరాట్, రోహిత్ వేరు.. నేను వేరు‘‘కెప్టెన్‌గా పనిచేసే అవకాశం రావడం నాకు దక్కిన గౌరవం. విరాట్, రోహిత్.. భిన్నమైన కెప్టెన్లు. నాకు కూడా నాదైన ప్రత్యేక శైలి ఉంది. నా స్టైల్లో జట్టును ముందుకు నడిపిస్తా. దీనిని నేను భారంగా భావించను. బాధ్యతలు తీసుకోవడం నాకెంతో ఇష్టమైన పని.ఇంతకు ముందు రోహిత్‌తో కూడా మాట్లాడాను. ఇక్కడ ఎలా జట్టును ముందుకు నడిపించాలో నాకు కాస్త స్పష్టత వచ్చింది. పేసర్లను కెప్టెన్లు చేయాలని నేను తరచూ చెబుతూ ఉంటాను. వ్యూహాత్మకంగా వాళ్లెంతో బెటర్. ప్యాట్ సారథిగా అద్భుతంగా రాణిస్తున్నాడు.ఇదొక కొత్త సంప్రదాయానికి తెరతీస్తుందిగతంలో కపిల్ దేవ్‌తో పాటు చాలా మంది పేసర్లు సూపర్‌గా కెప్టెన్సీ చేశారు. ఇదొక కొత్త సంప్రదాయానికి తెరతీస్తుందని నేను భావిస్తున్నా’’ అని బుమ్రా పేర్కొన్నాడు. ఇక సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో 3-0తో టెస్టుల్లో క్లీన్‌స్వీప్ కావడం ప్రస్తావనకు రాగా.. ‘‘మనం గెలిచినపుడు సున్నా నుంచి మొదలుపెడతాం. మరి ఓడినపుడు కూడా అలాగే చేయాలి కదా!న్యూజిలాండ్‌తో సిరీస్ ఓటమి నుంచి మేము పాఠాలు నేర్చుకున్నాం. అయితే, అక్కడికీ.. ఇక్కడికీ పిచ్ పరిస్థితులు వేరు. ఫలితాలు కూడా వేరుగా ఉంటాయి’’ అని బుమ్రా చెప్పుకొచ్చాడు. తుదిజట్టు ఖరారైంది.. కానీఇక ఇప్పటికే తాము తొలి టెస్టుకు తుదిజట్టును ఖరారు చేశామని.. శుక్రవారం ఉదయమే ఈ విషయం గురించి అందరికీ తెలుస్తుందంటూ బుమ్రా అభిమానులను ఊరించాడు.చదవండి: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా: షెడ్యూల్, టైమింగ్స్, జట్లు, పూర్తి వివరాలు -
IND VS AUS 1st Test: హర్షిత్ రాణానా.. ఆకాశ్దీపా..?
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే ఐదు టెస్ట్ మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ రేపటి నుంచి (నవంబర్ 22) ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ పెర్త్ వేదికగా జరుగనుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ ఉదయం 7:50 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం ఈ మ్యాచ్ ప్రారంబానికి ముందు తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. టాస్ ఆలస్యమైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే మ్యాచ్ మిగతా రోజుల్లో మాత్రం వర్షం పడే అవకాశం లేదని తెలుస్తుంది. ఈ సిరీస్‌లోని మ్యాచ్‌లన్నీ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతాయి. ఈ సిరీస్ యొక్క లైవ్ స్ట్రీమింగ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఉంటుంది.ఇదిలా ఉంటే, తొలి టెస్ట్‌లో టీమిండియాకు తుది జట్టు కూర్పు పెద్ద సమస్యగా మారింది. ఫైనల్ ఎలెవెన్‌లో ఎవరిని ఉంచాలో అర్దం కాక భారత మేనేజ్మెంట్ తలలు పట్టుకుని కూర్చుకుంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ స్థానాన్ని కేఎల్ రాహుల్‌తో భర్తీ చేయాలని ఆలోచిస్తున్నా, అది కాస్త మిస్ ఫైర్ అవుతుందేమోనని ఆందోళన చెందుతుంది. అభిమన్యు ఈశ్వరన్ వైపు మొగ్గు చూపుదామా అంటే అతనికి అనుభవం లేదు. మరోవైపు వన్‌డౌన్ ఆటగాడు శుభ్‌మన్ గిల్ సైతం గాయపడిన విషయం తెలిసిందే. చివరి నిమిషం వరకు అతని విషయంలో ఏమీ చెప్పలేమని మేనేజ్మెంట్ గోప్యత మెయిన్టైన్ చేస్తుంది. అతనికి ప్రత్యామ్నాయంగా దేవ్‌దత్ పడిక్కల్‌ను ఆడిస్తే బాగుంటుందా అని పరిశీలిస్తుంది.టీమిండియాకు ఉన్న మరో సమస్య మూడో స్పెషలిస్ట్ పేసర్. ఈ స్థానానికి ఆకాశ్‌దీప్‌ను ఎంపిక చేయాలా లేక యువ పేసర్ హర్షిత్ రాణాకు అవకాశం ఇవ్వాలా అనే విషయంలో యాజమాన్యం తీవ్రమైన కసరత్తు చేస్తుంది. కెప్టెన్ బుమ్రా, బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ హర్షిత్ రాణావైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. చివరి నిమిషంలో ఆకాశ్‌దీప్ తుది జట్టులోకి తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ముగ్గురు పేసర్లు, ఓ స్పిన్నర్ ఫార్ములాతో బరిలోకి దిగాలని యోచిస్తుంది. పేస్ విభాగంలో తొలి రెండు స్థానాలకు బుమ్రా, సిరాజ్ సెట్ కాగా.. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా అశ్విన్ పేరు ఖరారైనట్లు తెలుస్తుంది. ఆసీస్ జట్టులో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు చాలామంది ఉండటంతో మేనేజ్మెంట్ రైట్ ఆర్మ ఆఫ్ స్పిన్నర్ అయిన అశ్విన్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. ఆల్‌రౌండర్ కోటాలో నితీశ్‌కుమార్ రెడ్డి పేరు కూడా ఖరారైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.తొలి టెస్ట్‌కు భారత తుది జట్టు (అంచనా)..యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవ్‌దత్ పడిక్కల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, ధృవ్ జురెల్, నితీశ్ కుమార్ రెడ్డి, అశ్విన్, బుమ్రా, హర్షిత్ రాణా, సిరాజ్ -
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా: షెడ్యూల్, టైమింగ్స్, జట్లు, పూర్తి వివరాలు
క్రికెట్ ప్రపంచంలో యాషెస్ సిరీస్ తర్వాత అంతే స్థాయిలో అభిమానులను ఆకట్టుకునే రైవలరీ టెస్టు సిరీస్ బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(బీజీటీ). ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకుంటే.. బీజీటీలో టీమిండియాతో తలపడుతుంది. 1996లో మొదలైన ఈ ప్రతిష్టాత్మక సిరీస్.. నేటికీ విజయవంతంగా కొనసాగుతోంది.బీజీటీలో మనదే పైచేయి.. కానీఇప్పటి వరకు ఈ సిరీస్‌లో టీమిండియాదే పైచేయి. ఇప్పటికి 16 సార్లు జరిగిన బీజీటీలో భారత్ 10 సార్లు ట్రోఫీ కైవసం చేసుకుంది. ఒక్కసారి డ్రాగా ముగియగా.. ఆస్ట్రేలియా ఐదుసార్లు గెలిచింది. ఇక పెర్త్ వేదికగా నవంబరు 22న మరోసారి టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య హోరాహోరీ సమరానికి తెరలేవనుంది. భారత జట్టు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టెస్టుకు దూరంగా ఉండగా.. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా సారథ్యం వహిస్తాడు. మరి ఈ ప్రతిష్టాత్మక సిరీస్ షెడ్యూల్, వేదికలు, మ్యాచ్ ఆరంభ సమయం, జట్లు, లైవ్ స్ట్రీమింగ్ తదితర విశేషాలు గమనిద్దాం.ఓవరాల్‌గా టెస్టుల్లో టీమిండియా- ఆస్ట్రేలియా ముఖాముఖి రికార్డులుఇప్పటి వరకు తలపడిన 107 మ్యాచ్‌లలో ఇండియా 32, ఆస్ట్రేలియా 45 గెలవగా.. 29 డ్రాగా ముగిశాయి.అత్యధిక పరుగుల, వికెట్ల వీరుడు ఎవరంటే?టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ టెండుల్కర్ కొనసాగుతున్నాడు. 39 మ్యాచ్‌లలో అతడు 3630 రన్స్ సాధించాడు. ఇక ఈ భారత్- ఆసీస్ టెస్టు పోరులో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నాథన్ లయన్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఇప్పటి వరకు టీమిండియాతో 27 మ్యాచ్‌లు ఆడిన ఈ వెటరన్ స్పిన్నర్ 121 వికెట్లు కూల్చాడు.ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా 2024-25షెడ్యూల్, వేదికలు, మ్యాచ్ ఆరంభ సమయం👉తొలి టెస్టు👉పెర్త్ స్టేడియం, పెర్త్👉తేదీలు: నవంబర్ 22-26👉సమయం: భారత కాలమానం ప్రకారం ఉదయం 7:50 గంటలకు ఆరంభం👉రెండో టెస్టు👉ఓవల్ మైదానం, అడిలైడ్(డే, నైట్- పింక్‌బాల్ టెస్టు)👉తేదీలు: డిసెంబరు 6- 10👉సమయం: భారత కాలమానం ప్రకారం ఉదయం 9.30 నిమిషాలకు ఆరంభంమూడో టెస్టు👉ది గాబా స్టేడియం, బ్రిస్బేన్👉తేదీలు: డిసెంబరు 14- 18👉సమయం: భారత కాలమానం ప్రకారం ఉదయం 5.50 నిమిషాలకు ఆరంభంనాలుగో టెస్టు(బాక్సింగ్ డే టెస్టు)👉మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్, మెల్బోర్న్👉తేదీలు: డిసెంబరు 26- 30👉సమయం: భారత కాలమానం ప్రకారం ఉదయం 5 గంటలకు ఆరంభంఐదో టెస్టు👉సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ👉తేదీలు: జనవరి 3- 7👉సమయం: భారత కాలమానం ప్రకారం ఉదయం 5 గంటలకు ఆరంభంవార్మప్ మ్యాచ్👉నవంబరు 30- డిసెంబరు 1👉ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్ వర్సెస్ ఇండియా-‘ఎ’ మధ్య వార్మప్ మ్యాచ్- మనుకా ఓవల్, కాన్బెర్రా.ఎక్కడ వీక్షించవచ్చు?👉టీవీ బ్రాడ్‌కాస్టర్: స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్👉లైవ్ స్ట్రీమింగ్: డిస్నీ+హాట్స్టార్జట్లుఆస్ట్రేలియాతో ఐదు టెస్టులకు టీమిండియారోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్‌కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్,ఆకాశ్ దీప్, ప్రసిద్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.ట్రావెలింగ్ రిజర్వ్స్: ముకేశ్ కుమార్, నవదీప్ సైనీ, యశ్ దయాళ్టీమిండియాతో తొలి టెస్టుకు ఆస్ట్రేలియా జట్టుప్యాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ(వికెట్ కీపర్), జోష్ హాజిల్‌వుడ్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లయన్, మిచెల్ మార్ష్, నాథన్ మెక్‌స్వీనీ, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్.చదవండి: ఆసీస్‌తో తొలి టెస్టు.. టీమిండియాకు గుడ్‌న్యూస్?! -
బంతి తగిలి అంపైర్ ముఖంపై తీవ్ర గాయాలు..!
క్రికెట్ మైదానంలో ఓ విషాదకర ఘటన చోటు చేసుకుంది. బంతి తగిలి ఫీల్డ్ అంపైర్ ముఖం వాచిపోయింది. ఆస్ట్రేలియాలోని ఛార్లెస్ వెర్యార్డ్ రిజర్వ్ క్రికెట్ మైదనంలో ఇది జరిగింది. ఓ స్థానిక మ్యాచ్ సందర్భంగా టోనీ డినోబ్రెగా అనే వ్యక్తి వికెట్ల వద్ద అంపైరింగ్ చేస్తున్నాడు. బ్యాటర్ కొట్టిన బంతి (స్ట్రయిట్ డ్రైవ్) నేరుగా డినోబ్రెగా ముఖంపై తాకింది. బంతి బలంగా తాకడంతో డినోబ్రెగా ముఖం గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. కుడి కన్ను, కుడి వైపు ముఖం అంతా కమిలిపోయి, వాచిపోయింది.అదృష్టవశాత్తు డినోబ్రెగా ముఖంపై ఎలాంటి ఫ్రాక్చర్స్ లేవు. ప్రస్తుతం అతను అసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. డినోబ్రెగా త్వరగా కోలుకోవాలని స్థానిక అంపైర్ల సంఘం ఆకాంక్షించింది. గాయపడక ముందు డినోబ్రెగా ముఖం.. గాయపడిన తర్వాత డినోబ్రెగా ముఖాన్ని అంపైర్ల సంఘం సోషల్‌మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి. క్రికెట్ మైదానంలో ఇలాంటి ఘటనలు జరగడం ఇది తొలిసారి కాదు. ఇటీవలికాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువయ్యాయి. అందుకే అంపైర్లు కూడా హెల్మెట్లు ధరించి బరిలోకి దిగుతున్నారు. గతంలో ఆస్ట్రేలియాలోనే ఓ ఫీల్డ్ అంపైర్ ఇలానే బంతి ముఖంపై తాకడం వల్ల ప్రాణాలు కోల్పోయాడు. 2014లో ఆస్ట్రేలియా ఆటగాడు ఫిలిప్ హ్యూస్ బంతి తలకు తాకడంతో తొలుత కోమాలోని వెళ్లి, ఆతర్వాత ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన యావత్ క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. -
శార్దూల్ ఎక్కడ?.. నితీశ్‌ను ఆడిస్తారా? అతడు కూడా గంగూలీలా..
ఆస్ట్రేలియతో టెస్టులకు ఎంపిక చేసిన భారత జట్టుపై టీమిండియా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్ వంటి సీనియర్ పేస్ ఆల్రౌండర్లను ఈ సిరీస్‌లో ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నించాడు. ఐదు టెస్టులుటీమిండియాకు ఎంతో కీలకమైన ఈ పర్యటనలో యువకుడైన నితీశ్ కుమార్ రెడ్డిపై భారం మోపడం సరైన నిర్ణయం కాదని భజ్జీ అభిప్రాయపడ్డాడు. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 3-0తో క్లీన్‌స్వీప్‌నకు గురైన టీమిండియా.. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉంది. ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా అక్కడ ఐదు టెస్టులు ఆడనుంది. పెర్త్ వేదికగా శుక్రవారం నుంచి ఈ సిరీస్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో బుధవారం మీడియాతో మాట్లాడిన టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీ20లలో మెరుపులు మెరిపిస్తున్న ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి అరంగేట్రం చేయడం ఖాయమనే సంకేతాలు ఇచ్చాడు.నితీశ్ రెడ్డి ఆట చూడాల్సిందేనితీశ్ గురించి మోర్కెల్ ప్రస్తావిస్తూ.. ‘అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ చేయగల సామర్థ్యం నితీశ్ సొంతం. ఈ పర్యటనలో అతడి ఆట చూసేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఉన్నారు. నితీశ్ కుమార్ రెడ్డిలో ప్రతిభకు కొదవలేదు. అతడు ఆల్‌రౌండ్ సామర్థ్యం గల ఆటగాడు. అతడి బౌలింగ్‌లో పదును ఉంది.మనం ఊహించిన దానికంటే ఎక్కువ వేగంగా అతడి బంతి బ్యాట్‌ను తాకుతుంది. ఆస్ట్రేలియా పిచ్‌లపై అతడి బౌలింగ్ బాగా ఉపయోగపడుతుంది. స్వింగ్ బౌలింగ్‌కు అనుకూలమైన ఆసీస్ పిచ్‌లపై నితీశ్ మరింత ప్రమాదకారి కాగలడు. సరైన దిశలో వినియోగిస్తే అతడు ఉపయుక్త బౌలర్ అవుతాడు. ప్రతి బంతిని వికెట్ లక్ష్యంగా సంధించడం అతడి నైపుణ్యం.పేస్ ఆల్‌రౌండర్ స్థానాన్ని భర్తీ చేయడానికి నితీశ్‌కు ఇది చక్కటి అవకాశం. ప్రపంచంలోని ఏ జట్టయినా మంచి పేస్ ఆల్‌రౌండర్ ఉండాలని కోరుకుంటుంది. తమ పేసర్లకు మరింత విశ్రాంతి నివ్వగల ఆల్‌రౌండర్ లభిస్తే అంతకుమించి ఇంకేం కావాలి’ అని అన్నాడు.మరి శార్దూల్ ఠాకూర్ ఎక్కడికి వెళ్లాడు?ఈ నేపథ్యంలో మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘టీమిండియాకు ప్రస్తుతం హార్దిక్ పాండ్యా వంటి ఆల్‌రౌండర్ అవసరం ఉంది. కానీ.. అతడిని జట్టులోకి తీసుకునే పరిస్థితి లేదు కాబట్టి.. నితీశ్ కుమార్ రెడ్డి రూపంలో ఆప్షన్ వెదుక్కున్నారు. మరి శార్దూల్ ఠాకూర్ ఎక్కడికి వెళ్లాడు?హార్దిక్ పాండ్యా ఏమయ్యాడు? వాళ్లిద్దరిని పరిమిత ఓవర్ల క్రికెట్‌కే పరిమితం చేద్దామనుకుంటున్నారు కదా! గత రెండు, మూడేళ్లుగా శార్దూల్‌పై మీరు నమ్మకం ఉంచారు. అతడికి అవకాశాలు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఏమైంది? అకస్మాత్తుగా నితీశ్‌ను బౌలింగ్ చేయమంటూ తెరమీదకు తీసుకువచ్చారు’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.నితీశ్ కూడా గంగూలీలాఇక నితీశ్ రెడ్డికి ఇదొక సువర్ణావకాశమన్న భజ్జీ.. మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మాదిరి పేస్ దళానికి అదనపు బలంగా మారితే బాగుంటుందని సూచించాడు. పేసర్లకు విశ్రాంతినిచ్చేలా బౌలింగ్ చేయడంతో పాటు.. బ్యాటింగ్‌లోనూ సత్తా చాటితే ఉపయుక్తమని పేర్కొన్నాడు. ‘‘గంగూలీ మాదిరి.. కొన్ని ఓవర్లపాటు బౌలింగ్ చేసి.. నితీశ్ 1-2 వికెట్లు తీస్తే.. జట్టుకు అది ఒకరంగా బోనస్‌లా మారుతుంది’’ అని హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు.టెస్టు అరంగేట్రం చేయడం ఖాయంకాగా ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చి... టీ20ల్లో మెరుపుల ద్వారా టెస్టు జట్టులో స్థానం దక్కించుకున్న నితీశ్ కుమార్ రెడ్డి... ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్‌లో అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేయడం దాదాపు ఖాయమైంది. షమీ వంటి సీనియర్ పేసర్ లేకపోవడంతో అతడి స్థానంలో సీమ్, బౌన్స్‌ను వినియోగించుకోగలగడంతో పాటు లోయర్ ఆర్డర్లో ధాటిగా బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్నా నితీశ్‌ను తుది జట్టులోకి ఎంపిక చేసే చాన్స్ ఉంది. ఇదిలా ఉంటే.. టీమిండియా దిగ్గజ బ్యాటర్ గంగూలీ రైటార్మ్ మీడియం పేసర్ కూడా! తన కెరీర్లో గంగూలీ టెస్టుల్లో 32, వన్డేల్లో 100 వికెట్లు తీశాడు. ఇక హార్దిక్ ఫిట్నెస్ లేమి వల్ల కేవలం వన్డే, టీ20లకు పరిమితం కాగా.. శార్దూల్ ఇటీవలే గాయం నుంచి కోలుకుని రంజీల్లో ముంబై తరఫున ఆడుతున్నాడు.చదవండి: ICC: వరల్డ్ నంబర్ వన్‌గా హార్దిక్ పాండ్యా.. దూసుకువచ్చిన తిలక్ వర్మ.. ఏకంగా.. -
ఆసీస్‌తో తొలి టెస్టు.. టీమిండియాకు శుభవార్త?!
ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా గాయపడ్డ యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ రోజురోజుకు మెరుగు అవుతున్నాడని టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ తెలిపాడు. పెర్త్ టెస్టుకు అతడు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందంటూ అభిమానులకు శుభవార్త అందించాడు.కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులు ఆడనుంది. శుక్రవారం నుంచి ఈ మెగా సిరీస్ మొదలుకానుంది. ఇందుకోసం ఇప్పటికే ఆసీస్‌కు చేరుకున్న భారత జట్టు ప్రాక్టీస్‌లో బిజీబిజీగా గడుపుతోంది.ఈ క్రమంలో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో గిల్ ఎడమ బొటన వేలికి గాయం అయింది. అయితే, బౌలింగ్ కోచ్ మోర్కెల్ అందించిన సమాచారం ప్రకారం.. గిల్ వేగంగా కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. బలహీనంగా టాపార్డర్ఇదిలా ఉంటే.. ఇప్పటికే వ్యక్తిగత కారణాల వల్ల రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు దూరం కావడంతో... టాపార్డర్ కాస్త బలహీనంగా కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో గిల్ కూడా మ్యాచ్ ఆడకపోతే జట్టుకు ఇబ్బందులు తప్పకపోవచ్చు.మ్యాచ్ ప్రారంభానికి ముందుఈ నేపథ్యంలో చివరి వరకు వేచి చూసే ధోరణి అవలభించాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. మ్యాచ్ రోజు వరకు గిల్ ఫిట్నెస్ సాధించాలని కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో బుధవారం మీడియా సమావేశంలో పాల్గొన్న ‘గిల్ రోజు రోజుకు మెరుగవుతున్నాడు. టెస్టు మ్యాచ్ ప్రారంభానికి ముందు అతడిపై నిర్ణయం తీసుకుంటాం’ అని పేర్కొన్నాడు.ఇక రోహిత్ శర్మ గైర్హాజరీలో కెప్టెన్సీ చేయబోతున్న బుమ్రా గురించి మోర్కెల్ మాట్లాడుతూ.. ‘ఆస్ట్రేలియా పిచ్‌లపై బుమ్రాకు మంచి అనుభవం ఉంది. నాయకత్వ బృందంలో బుమ్రా కూడా భాగం. అతడు గతంలో ఇక్కడ చాలా మంచి ప్రదర్శనలు చేశాడు. జట్టును ముందుండి నడిపించడాన్ని ఇష్టపడే బౌలర్ అతడు. మిగిలిన వాళ్లు అతడిని అనుసరిస్తారు’ అని తెలిపాడు.ఒత్తిడిని దరిచేరనివ్వం... ఇక స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 0–3తో టెస్టు సిరీస్ కోల్పోయిన నేపథ్యంలో భారత జట్టు ఒత్తిడిలో ఉందని అంతా అనుకుంటున్నారని... అయితే దాన్ని మార్చి వేసుకునేందుకు ఆస్ట్రేలియా పర్యటనకు మించింది లేదని మోర్కెల్ అన్నాడు. ప్రపంచ క్రికెట్లో ఆస్ట్రేలియాలో రాణిస్తే వచ్చే పేరు ప్రఖ్యాతులు వేరని పేర్కొన్నాడు. ‘ప్రతి ఒక్కరు ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటారు అని అడుగుతున్నారు. మా వరకు దాన్ని పక్కన పెట్టేసి మెరుగైన ప్రదర్శనపైనే దృష్టి పెట్టాం’ అని మోర్కెల్ అన్నాడు. చదవండి: సంజూ శాంసన్ తండ్రి క్షమాపణ చెప్పాల్సిందే.. లేదంటే! -
పతకాల పందెం.. 12 ఏళ్ల తర్వాత మళ్లీ ఇలా..
మొనాకో: లండన్ ఒలింపిక్స్ (2012) జరిగి ఓ పుష్కర కాలం పూర్తయ్యింది. ఈలోపు రియో (2016), టోక్యో (2020), పారిస్ (2024) ఒలింపిక్స్ క్రీడలు కూడా ముగిశాయి. అయితే లండన్ విశ్వక్రీడల్లో మహిళల 1500 మీటర్ల పరుగు పందెంలో పతకాల పందెం ఇంకా.. ఇంకా కొనసాగుతోంది.ఈసారి డోపీగా తేలిన రష్యా రన్నర్ తాత్యానా తొమషోవా పతకం (కాంస్యం) కోల్పోతే, అమెరికా రన్నర్ షానన్ రోబెరి అందుకోనుంది. ఈ ఈవెంట్లో మూడు రంగులు (స్వర్ణం, రజతం, కాంస్యం) మారడం మరో విశేషం. అలా ఒలింపిక్స్ చరిత్రలో ఇప్పుడిదీ నిలిచిపోనుంది. 12 ఏళ్ల క్రితం టర్కీ అథ్లెట్లు అస్లి కాకిర్ అల్ప్టెకిన్, గమ్జే బులుట్ వరుసగా స్వర్ణం, రజతం గెలుపొందారు.కానీ వీరిద్దరు ఇదివరకే డోపీలుగా తేలి అనర్హత వేటుకు గురయ్యారు. ఈ క్రమంలో ఇథియోపియాలో జన్మించిన బహ్రైనీ మరియం యూసఫ్ జమాల్‌కు గోల్డ్(మూడో స్థానం), ఇథియోపియాకే చెందిన అబెబా అరెగవీకి సిల్వర్(ఐదో స్థానం) మెడల్ దక్కాయి.అదేవిధంగా.. ఐదో స్థానంలో ఉన్న తొమషొవాకు కాంస్యం లభించింది. అయితే, ఇప్పుడు ఆమె కూడా డోపీ కావడంతో ఆరో స్థానంలో ఉన్న అమెరికన్ రోబెరి కాంస్య పతకం అందుకోనుంది. టర్కీ, రష్యా అథ్లెట్లపై ప్రపంచ అథ్లెటిక్స్ నిషేధం విధించింది. మారిన పతకాలను ప్రపంచ చాంపియన్‌షిప్ లేదంటే భవిష్యత్‌లో జరిగే ఒలింపిక్స్‌లో ప్రదానం చేస్తారు. క్వార్టర్ ఫైనల్లో రిత్విక్ జోడీసాక్షి, హైదరాబాద్: రొవరెటో ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ శుభారంభం చేశాడు. ఇటలీలో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో రిత్విక్–శ్రీరామ్ బాలాజీ (భారత్) జోడీ 6–4, 6–3తో డానియల్ మసూర్–అలెక్సీ వటుటిన్ (జర్మనీ) జంటపై విజయం సాధించింది. 63 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో రిత్విక్–బాలాజీ జోడీ ఏడు ఏస్‌లు సంధించింది. మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తమ సర్వీస్‌లో నాలుగుసార్లు బ్రేక్ పాయింట్లను కాపాడుకొని... ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసింది. -
IND Vs AUS: ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా హీరోలు వీరే..!
భారత్, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 రేపటి (నవంబర్ 22) నుంచి ప్రారంభం కానుంది. ఐదు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో తొలి మ్యాచ్ పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియం వేదికగా జరుగనుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ ఉదయం 7:50 గంటలకు ప్రారంభం కానుంది.తొలి టెస్ట్ ప్రారంభం నేపథ్యంలో ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 భారత బ్యాటర్లు.. అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 భారత బౌలర్లపై ఓ లుక్కేద్దాం.టాప్-5 బ్యాటర్లు..5. చతేశ్వర్ పుజరా- 11 మ్యాచ్‌ల్లో 47.28 సగటున 993 పరుగులు (3 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు)4. రాహుల్ ద్రవిడ్- 16 మ్యాచ్‌ల్లో 41.64 సగటున 1166 పరుగులు (సెంచరీ, 6 హాఫ్ సెంచరీలు)3. వీవీఎస్ లక్ష్మణ్- 15 మ్యాచ్‌ల్లో 44.14 సగటున 1236 పరుగులు (4 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు)2. విరాట్ కోహ్లి- 13 మ్యాచ్‌ల్లో 54.08 సగటున 1352 పరుగులు (6 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు)1. సచిన్ టెండూల్కర్- 20 మ్యాచ్‌ల్లో 43.20 సగటున 1809 పరుగులు (6 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు)టాప్-5 బౌలర్లు..5. జస్ప్రీత్ బుమ్రా- 7 టెస్ట్‌ల్లో 32 వికెట్లు4. బిషన్ సింగ్ బేడీ- 7 టెస్ట్‌ల్లో 35 వికెట్లు3. రవిచంద్రన్ అశ్విన్- 10 టెస్ట్‌ల్లో 39 వికెట్లు2. అనిల్ కుంబ్లే- 10 టెస్ట్‌ల్లో 49 వికెట్లు1. కపిల్ దేవ్- 11 టెస్ట్‌ల్లో 51 వికెట్లు -
సంచలనం.. 8 బంతుల్లో 8 సిక్సర్లు.. వీడియో
స్పెయిన్ టీ10 క్రికెట్లో సంచలనం నమోదైంది. యునైటెడ్ సీసీ గిరోనాతో జరిగిన మ్యాచ్‌లో పాక్ బార్సిలోనా ఆటగాడు అలీ హసన్ 8 బంతుల్లో 8 సిక్సర్లు బాదాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బార్సిలోనాకు మెరుపు ఆరంభం లభించింది. అయితే ఆ జట్టు స్వల్ప వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. pic.twitter.com/Mpq9PeLddD— Sunil Gavaskar (@gavaskar_theman) November 20, 2024ఈ దశలో బరిలోకి దిగిన అలీ హసన్ ప్రత్యర్థి బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. ఏడో ఓవర్ రెండో బంతి నుంచి వరుసగా ఐదు సిక్సర్లు.. ఆతర్వాత ఎనిమిదో ఓవర్ రెండో బంతి నుంచి వరుసగా మూడు సిక్సర్లు బాదాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 16 బంతులు ఎదుర్కొన్న అలీ హసన్ 8 సిక్సర్లు, బౌండరీ సాయంతో 55 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కడపటి వార్తలు అందేసరికి ఛేదనలో గిరోనా జట్టు ఎదురీదుతుంది. ఆ జట్టు కేవలం 19 పరుగులు మాత్రమే చేసి మూడు వికెట్లు కోల్పోయింది. ఈ టోర్నీ పాయింట్ల పట్టికలో బార్సిలోనా చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓ గెలుపు, మరో పరాజయాన్ని ఎదుర్కొంది. ఐపీఎల్ 2025 మెగా వేలానికి షార్ట్ లిస్ట్ అయిన పేర్లలో అల్ హసన్ పేరు లేకపోవడం విచారకరం. -
చరిత్ర సృష్టించిన 15 ఏళ్ల యువ బ్యాటర్.. 152 బంతుల్లో 419 నాటౌట్
ముంబైలో జరిగే హ్యారిస్ షీల్డ్ టోర్నీలో సంచలనం నమోదైంది. 15 ఏళ్ల యువ బ్యాటర్ ఆయుశ్ షిండే చరిత్ర సృష్టించాడు. కేవలం 152 బంతుల్లో 43 ఫోర్లు, 24 సిక్సర్ల సాయంతో 419 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. హ్యారిస్ షీల్డ్ టోర్నీ చరిత్రలో ఇది నాలుగో అత్యధిక స్కోర్. జనరల్ ఎడ్యుకేషన్ అకాడమీ జట్టు తరఫున ఆడిన ఆయుశ్.. పార్లే తిలక్ విద్యామందిర్తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఆయుశ్ క్వాడ్రాపుల్ సెంచరీతో చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన జనరల్ ఎడ్యుకేషన్ అకాడమీ నిర్ణీత 45 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 648 పరుగులు చేసింది. జనరల్ ఎడ్యుకేషన్ అకాడమీ ఇన్నింగ్స్‌లో ఆర్య కార్లే 78, ఇషాన్ పాథక్ 62 (నాటౌట్) పరుగులు చేశారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన తిలక్ విద్యామందిర్ 39.4 ఓవర్లలో 184 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా జనరల్ ఎడ్యుకేషన్ అకాడమీ 464 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. తిలక్ విద్యామందిర్ తరఫున ఆధేశ్ తవడే (41), దేవరాయ సావంత్ (34) టప్ స్కోరర్లుగా నిలిచారు. మ్యాచ్ అనంతరం క్వాడ్రాపుల్ సెంచరీ హీరో ఆయుశ్ మాట్లాడుతూ.. ఈ మ్యాచ్‌లో తాను 500 పరుగులు స్కోర్ చేయాలని అనుకున్నానని చెప్పాడు. అయితే ఓవర్లు ముగియడంతో సాధ్యపడలేదని తెలిపాడు. ముంబై తరఫున ఆడాలంటే తాను ఇలానే భారీ స్కోర్లు చేస్తూ ఉండాలని పేర్కొన్నాడు. ఏదో ఒక రోజు టీమిండియాకు ఆడటమే తన కల అని తెలిపాడు. ఆయుశ్ క్రికెటింగ్ జర్నీ ధృడ నిశ్చయం మరియు త్యాగాల మధ్య సాగింది. ఆయుశ్ తండ్రి సునీల్ షిండే తన కొడుకుకు క్రికెట్ పట్ల ఉన్న మక్కువ చూసి తన కుటుంబాన్ని సతారా నుంచి ముంబైకి మార్చాడు. ప్రస్తుతం సునీల్ నవీ ముంబైలో ఓ చిన్న కిరాణా షాప్ నడుపుతూ ఆయుశ్ క్రికెట్ ఎదుగుదలకు తోడ్పడుతున్నాడు. ఆయుశ్ ఆరేళ్ల వయసు నుంచి బ్యాట్ పట్టినట్లు సునీల్ గుర్తు చేసుకున్నాడు. -
తెలుగు టైటాన్స్ దూకుడు
నోయిడా: సమష్టి ప్రదర్శనతో సత్తా చాటిన తెలుగు టైటాన్స్ ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో ఏడో విజయం నమోదు చేసుకుంది. గత మ్యాచ్‌లో ‘టేబుల్ టాపర్’ హరియాణా స్టీలర్స్‌ను మట్టికరిపించిన టైటాన్స్... తాజాగా పట్టికలో రెండో స్థానంలో ఉన్న యు ముంబాను బోల్తా కొట్టించింది. బుధవారం జరిగిన హోరాహోరీ పోరులో తెలుగు టైటాన్స్ 31–29 పాయింట్ల తేడాతో మాజీ చాంపియన్ యు ముంబాపై గెలుపొందింది. చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో టైటాన్స్ జట్టు రెయిడింగ్‌లో విఫలమైనా... డిఫెన్స్‌లో రాణించింది. టైటాన్స్ తరఫున ఆశిష్ నర్వాల్ 8 పాయింట్లు సాధించగా... సాగర్ నర్వాల్, అజిత్ పవార్, మన్జీత్ తలా 4 పాయింట్లు సాధించారు. యు ముంబా తరఫున రోహిత్ 8 పాయింట్లు, మన్జీత్ 7 పాయింట్లతో పోరాడారు. ఓవరాల్‌గా మ్యాచ్‌లో టైటాన్స్ 12 రెయిడ్ పాయింట్లు సాధించగా... యు ముంబా 18 పాయింట్లు సాధించింది. లీగ్‌లో 11 మ్యాచ్‌లాడిన తెలుగు టైటాన్స్ 7 విజయాలు, 4 పరాజయాలతో 37 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. మరోవైపు యు ముంబా 12 మ్యాచ్‌లాడి 7 విజయాలు, 4 పరాజయాలు, ఒక ‘టై’తో 40 పాయింట్లు సాధించి పట్టికలో రెండో స్థానంలో ఉంది. దబంగ్ ఢిల్లీ, గుజరాత్ జెయింట్స్ మధ్య జరిగిన మరో మ్యాచ్ 39–39తో ‘టై’గా ముగిసింది. నేడు బెంగాల్ వారియర్స్‌తో తెలుగు టైటాన్స్ (రాత్రి 8 గంటలకు), బెంగళూరు బుల్స్‌తో హరియాణా స్టీలర్స్ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి. -
తిలక్ @3
దుబాయ్: దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్‌లో రెండు సెంచరీలతో విజృంభించిన భారత యువ ఆటగాడు ఠాకూర్ తిలక్ వర్మ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టి20 ర్యాంకింగ్స్‌లో అదరగొట్టాడు. సఫారీలపై ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచిన తిలక్ వర్మ ఐసీసీ బుధవారం విడుదల చేసిన టి20 బ్యాటింగ్ తాజా ర్యాంకింగ్స్‌లో తొలిసారి టాప్–10లోకి ప్రవేశించడమే కాకుండా... కెరీర్ అత్యుత్తమంగా 3వ స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో తిలక్ 69 స్థానాలు ఎగబాకడం విశేషం. ఈ జాబితాలో ఆ్రస్టేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ (855 పాయింట్లు) తొలి స్థానంలో ఉండగా... ఇంగ్లండ్ ప్లేయర్ ఫిల్ సాల్ట్ (828 పాయింట్లు) రెండో ర్యాంక్‌లో ఉన్నాడు. ప్రస్తుతం భారత్ నుంచి అత్యుత్తమ ర్యాంక్ గల ఆటగాడిగా తిలక్ వర్మ (806 పాయింట్లు) నిలవగా... సూర్యకుమార్ (788 పాయింట్లు) ఒక స్థానం కోల్పోయి నాలుగో ర్యాంక్‌కు పరిమితమయ్యాడు. భారత్ నుంచి యశస్వి జైస్వాల్ (8వ ర్యాంక్) కూడా టాప్–10లో చోటు దక్కించుకున్నాడు. ఇదే సిరీస్‌లో రెండు సెంచరీలతో సత్తా చాటిన ఓపెనర్ సంజూ సామ్సన్ 22వ ర్యాంక్‌కు చేరాడు.నాలుగు నెలల తర్వాత... ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా నాలుగు నెలల తర్వాత మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ ఏడాది జూన్ 29న తొలిసారి నంబర్‌వన్ ర్యాంక్ కు ఎగబాకిని పాండ్యా ఆ తర్వాత తన టాప్ ర్యాంక్‌ను కోల్పోయాడు.అయితే దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో అటు బ్యాట్‌తో ఇటు బంతితో రాణించిన హార్దిక్ 244 పాయింట్లతో మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచాడు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారత్ నుంచి అత్యుత్తమంగా రవి బిష్ణోయ్ ఎనిమిదో ర్యాంక్‌లో ఉన్నాడు. -
సింధు శుభారంభం
షెన్జెన్: చైనా ఓపెన్ మాస్టర్స్ వరల్డ్ టూర్సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో రెండో రోజు భారత షట్లర్లు మెరిశారు. బరిలోకి దిగిన వారందరూ విజయాన్ని అందుకున్నారు. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ పీవీ సింధు, రైజింగ్ స్టార్ మాళవిక బన్సోద్... పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ లక్ష్య సేన్ శుభారంభం చేసి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. పురుషుల డబుల్స్‌లో సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ... మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం కూడా గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాయి. మళ్లీ సింధుదే పైచేయి... ప్రపంచ 11వ ర్యాంకర్ బుసానన్ ఒంగ్‌బమ్‌రుంగ్‌ఫన్ (థాయ్‌లాండ్)తో 21వసారి ఆడిన సింధు ఈసారీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 19వ ర్యాంక్‌లో ఉన్న సింధు 21–17, 21–19తో బుసానన్ను ఓడించింది. బుసానన్‌పై సింధుకిది 20వ విజయం కావడం విశేషం. 50 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధుకు గట్టిపోటీ లభించినా కీలకదశలో ఆమె పాయింట్లు గెలిచి విజయాన్ని ఖరారు చేసుకుంది. గతవారం జపాన్ మాస్టర్స్ టోర్నీలోనూ తొలి రౌండ్లో బుసానన్పైనే సింధు గెలిచింది. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో సింగపూర్ ప్లేయర్ యో జియా మిన్తో సింధు ఆడుతుంది. మరోవైపు ప్రపంచ 36వ ర్యాంకర్, భారత రైజింగ్ స్టార్ మాళవిక బన్సోద్ సంచలన విజయంతో శుభారంభం చేసింది. ప్రపంచ 21వ ర్యాంకర్ లైన్ హొమార్క్ జార్స్‌ఫెల్డ్ (డెన్మార్క్)తో జరిగిన మ్యాచ్‌లో మాళవిక 20–22, 23–21, 21–16తో విజయాన్ని అందుకుంది. 74 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో మాళవిక తొలి గేమ్‌ను కోల్పోయినా ఆందోళన చెందకుడా ఆడి ఆ తర్వాతి రెండు గేముల్లో నెగ్గి ముందంజ వేసింది. ఈ గెలుపుతో ఈ ఏడాది కొరియా ఓపెన్‌లో జార్స్‌ఫెల్డ్ చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకుంది. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో సుపనిద (థాయ్‌లాండ్)తో మాళవిక తలపడుతుంది. ఏడో ర్యాంకర్‌కు షాక్ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ లక్ష్య సేన్ సంచలన విజయంతో బోణీ చేశాడు. ప్రపంచ 7వ ర్యాంకర్ లీ జి జియా (మలేసియా)తో జరిగిన తొలి రౌండ్లో ప్రపంచ 17వ ర్యాంకర్ లక్ష్య సేన్ 21–14, 13–21, 21–13తో గెలిచాడు. లీ జి జియాపై లక్ష్య సేన్‌కిది ఐదో విజయం కావడం విశేషం. 57 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో లక్ష్య సేన్ ఆటలో నిలకడ లోపించింది. అయితే కీలకదశలో అతడు గాడిలో పడటంతో విజయం దక్కింది. నిర్ణాయక మూడో గేమ్‌లో స్కోరు 15–11 వద్ద లక్ష్య సేన్ వరుసగా ఐదు పాయింట్లు గెలిచి 20–11తో విజయానికి చేరువయ్యాడు. ఆ తర్వాత అతను రెండు పాయింట్లు కోల్పోయాక మరో పాయింట్ నెగ్గి విజయాన్ని ఖరారు చేసుకున్నాడు. గాయత్రి జోడీ ముందుకు.... మహిళల డబుల్స్ తొలి రౌండ్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీ 21–15, 21–14తో హు లింగ్ ఫాంగ్–జెంగ్ యు చియె (చైనీస్ తైపీ) జంటను ఓడించింది. ఈ గెలుపుతో భారత జంట సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు అర్హత సాధించే అవకాశాన్ని మెరుగుపర్చుకుంది. మరోవైపు పురుషుల డబుల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ జోడీ సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ 12–21, 21–19, 21–18తో లీ జె హుయె–యాంగ్ పో సువాన్ (చైనీస్ తైపీ) జంటను ఓడించింది. పారిస్ ఒలింపిక్స్ తర్వాత సాతి్వక్–చిరాగ్ ఆడుతున్న తొలి టోర్నీ ఇదే కావడం గమనార్హం.