Orissa
-
సాహిత్య రంగానికి పెద్దపీట వేయాలి
జయపురం:కొరాపుట్ జిల్లా అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా ఉన్నా నేటివరకు పాలకులు చిన్నచూపు వలన వెనుకబడి ఉందన్నారు. అనేక మంది సాహిత్య కారులున్నా రాష్ట్ర స్థాయి సాహిత్య సన్మానం ఒక్కరికీ లభించకపోవటం విచారకరమన్నారు. సాహిత్యరంగానికి పెద్దపీట వేయాలని జయపురం ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహిణీపతి అన్నారు. ఆదివారం దొడ్ర గ్రామం ఆదివాసీ కుటుంబ సంస్థ జయపురం ఎస్.ఎర్.మాల్ లో నిర్వహించిన సాహిత్య హర్షితా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మన జిల్లా సాహిత్యరంగంలో అగ్రగామిగా నిలవాలంటే సాహితీవేత్తలకు, రచయితలను ప్రజలు ఆదరించి, ప్రోత్సహించాలని ప్రజలకు, సాహితీ అభిమానులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్యవక్తగా పాల్గొన్న సరల అవార్డు గ్రహీత డాక్టర్ సరోజినీ సాహు మాట్లాడుతూ కొరాపుట్ జిల్లా సాహిత్య రంగంలో వెనుకబడి లేదని, జయపురం మట్టిలో సత్య మిశ్ర లాంటి ప్రముఖ సాహితీవేత్త పుట్టారని ఉదహరించారు. ఆదివాసీ కుటుంబ సంస్థ అధ్యక్షుడు సయిమన్ బిడిక అధ్యక్షతన జరిగిన సాహితీ చర్చలో చరిత్రలో కొరాపుట్ విముక్త్తి సంగ్రామం, ఆదివాసీ అశ్మిత, పాఠకులు ఏం కోరుతున్నారు, కొరాపుట్ సంగీతం, చలన చిత్ర భవిష్యత్‌పై సాహితీ చర్చ జరిగింది. ఈ చర్చలో ప్రముఖ పరిశోధకుడు శ్రీరంగ నాయక్, కవి బలరాం పూజారి, కళాకారుడు చంద్ర కాంత బిశ్వాల్ పాల్గొన్నారు. శ్యామలేషన్ గుప్త బెంగార్ రచనను ధర్మరాజ్ అనువాదం ‘బాబూలాల్’ కవితా సంకళనాన్ని అతిథులు విడుదల చేసి ప్రజలకు అంకితం చేశారు. కె.వి.విజయలక్ష్మీ పాణిగ్రహి, విమళ దాస్ పట్నాయక్, మనోరంజన్ త్రిపాఠీ, రంజన్ మహురియ, సుజాత మహాపాత్రో, ప్రొఫెసర్ అలోక్ బరాల్, అజిత్ కుమార్ భొయి, రఘునాథ్ బిశ్వాల్, పలువురు రచయితలు సాహితీ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఎమ్మెల్యే బాహిణీపతి -
మధ్యంతర భారం
రాష్ట్ర ఎన్నికల కమిషనరు పదవి భర్తీకి నోచుకోవడం లేదు. ఈ హోదాలో బాధ్యతలు నిర్వహించిన ఆదిత్య ప్రసాద్ పాఢి పదవీ కాలం ఆగస్టు నెలతో పూర్తయ్యింది. ఇంత వరకు ఆయన స్థానంలో ఎన్నికల కమిషనరు నియామకం జరగలేదు. తాత్కాలిక సర్దుబాటు కోసం ఆయన మరికొంత కాలం ఈ హోదాలో కొనసాగేందుకు ఉత్తర్వులు జారీ చేసి పబ్బం గడుపుతున్నారు. ఒడిశా విద్యుత్ నియంత్రణ కమిషను (ఓఈఆర్సి) పరిస్థితి ఇలాగే ఉంది. ఈ సంస్థ కమిషనరుగా బాధ్యతలు నిర్వహించిన సురేష్ చంద్ర మహాపాత్రో మాజీ ముఖ్యమంత్రి సలహాదారునిగా నియామకం కావడంతో ఓఈఆర్‌సీ సారథ్యం కుంటుబడింది. రాష్ట్ర మహిళా కమిషను అధ్యక్ష పదవితో ఇతర సభ్యుల్ని తొలగించి ప్రభుత్వం రద్దు చేసింది. కొత్త కమిషను సభ్యుల నియామకంపై మౌనం వహించింది. ప్రస్తుతం రాష్ట్ర మహిళా కమిషను జీవచ్ఛవంలా ఉనికిని కాపాడుకోవడంలో కొట్టుమిట్టాడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ చర్యని సవాలు చేసి మాజీ సభ్యులు రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు. రాష్ట్ర సమాచార హక్కు కమిషన్‌లో ప్రముఖ సమాచార కమిషనరు (సీఐసీ) పదవితో మరో 5 మంది సభ్యుల పదవులు భర్తీ కావడం లేదు. మహిళా కమిషను తరహాలో ఈ సంస్థ ప్రాధాన్యత మరుగున పడింది. పాక్షిక న్యాయ వ్యవస్థలో ప్రముఖ సారథ్యం వహించాల్సిన అధ్యక్షుడు, కమిషనరు, సభ్యుల పదవులు ఖాళీగా ఉన్నా.. గుమాస్తాలు తదితర అనుబంధ సిబ్బంది యథాతథంగా కొనసాగుతుండడంతో ప్రభుత్వ లెక్కల ప్రకారం సకాలంలో ప్రతి నెల క్రమం తప్పకుండా జీతభత్యాలు చెల్లించడం నిరవధికంగా కొనసాగుతుంది. వృధా వ్యయ భారం పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తుంది. -
8 క్వింటాళ్ల గంజాయి పట్టివేత
జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొరిగుమ్మ సమితి బైరవ సింగపూర్(బి.సింగపూర్) పోలీసు స్టేషన్ పరిధి ముంజకంగారుగుడ గ్రామ సమీపంలోని ఒక ఫాం హౌస్‌లో పోలీసులు 8 క్వింటాళ్ల గంజాయిని పట్టుకున్నారు. అక్కడ ఆరుగురిని అరెస్టు చేసినట్లు బొరిగుమ్మ సబ్‌డివిజన్ పోలీసు అధికారి తపశ్విణీ కొహర్ శనివారం వెల్లడించారు. గంజాయి వ్యవహారంలో ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. బి.సింగపూర్ పోలీసుస్టేషన్ ముంజకంగారుగుడ గ్రామ సమీపంలో గజపతి జిల్లా ఆర్.ఉదయగిరి గ్రామం దీపు బెహరా ఫార్మ్ హౌస్ నిర్వహిస్తున్నారని వెల్లడించారు. ఆ ఫార్మ్ హౌస్‌లో సీజనల్ పంటల వ్యాపారం చేస్తున్నారు. స్థానిక రైతుల నుంచి మొక్క జొన్న, చింతపండు, ధాన్యం, చోళ్లు కొనుగోలు చేస్తున్నట్లు పోలీసు అధికారి వెల్లడించారు. వాటిని ఆయన ఇతర రాష్ట్ర వ్యాపారులకు అమ్ముతున్నారు. వాటితో పాటు గంజాయి ప్యాకెట్లు కూడా సప్లై చేస్తున్నాడని పోలీసు అధికారి వెల్లడించారు. ఈ విషయం తెలుసుకుని ఫార్మ్ హౌస్‌పై దాడి చేశామన్నారు. గంజాయిని మెజిస్ట్రేట్ సమక్షంలో తూయించగా 8 క్వింటాళ్లు ఉన్నట్లు వెల్లడైందని వెల్లడించారు. కానీ దీపు పరారయ్యాడని తెలిపారు. దీపు బెహర తండ్రితో పాటు అక్కడ పనిచేస్తున్న మరో ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ దాడిలో బి.సింగపూర్ పోలీసు అధికారి సంబిత్ కుమార్ స్వయ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
చలో ఢిల్లీ విజయవంతం చేయండి
పర్లాకిమిడి: అఖిల భారత విద్యార్థి పరిషత్ పర్లాకిమిడి పట్టణ సమావేశం స్థానిక రాజవీధిలో శ్రీశైలం ఫంక్షన్ హాల్లో శనివారం ఉదయం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా బినోదినీ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ మనోజ్ కుమార్ పట్నాయక్ విచ్చేసి ప్రారంభించారు. గౌరవ అతిథులుగా సంజయ్ జెన్నా, మహిళా కళాశాల అధ్యాపకురాలు భారతీ పాణిగ్రాహి, జాతీయ క్రీడాకారుడు కిశోర్ చంద్ర రథ్, రాయగడ ఏ.బి.వి.పి ప్రముఖులు శేషసాయి సేనాపతి, సరస్వతీ శిశు విద్యామందిర్ ప్రధాన అచార్యులు సరోజ్పండా తదితరులు విచ్చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, స్వాతంత్య్ర వచ్చి 75 ఏళ్లు గడిచినా ఉన్నత చదువులకు ఫీజు రియింబర్స్‌మెంట్ ఇవ్వడం లేదన్నారు. లక్షలాది ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భర్తీ చేయడం లేదన్నారు. విద్యార్థులు అంతా ఏకమై ఈ నెల 27 నుంచి 29 వరకు ఢిల్లీలో జరుగనున్న దశమ సర్వభారతీయ విద్యార్థి సమ్మేళనానికి కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఏ.బి.వి.పి జిల్లా కార్యదర్శి శుభప్రసాద్ శర్మ, కోఆర్డినేటర్ ముఖలింగ్ పడిక, అధ్యక్షుడు ఉమాచరణ్ దాస్ పాల్గొన్నారు. -
వణికిస్తున్న చలిపులి
ఆదివారం శ్రీ 24 శ్రీ నవంబర్ శ్రీ 2024కొరాపుట్ జిల్లాలు గజగజా వణుకుతున్నాయి. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దమంజోడిలో భారత అల్యూమినియం కేంద్రం (నాల్కో) వద్ద శనివారం 6.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కావడం విశేషం. దీంతో చిన్నారులు, వృద్ధులు వణికిపోతున్నారు. నిత్యం ప్రజాక్షేత్రంలో పర్యటించే రాజకీయ నాయకులు సైతం ఇళ్లకే పరిమితమవుతున్నారు. – కొరాపుట్కొరాపుట్ జిల్లా సిమిలిగుడపై మంచు దుప్పటిన్యూస్రీల్ -
అధ్యక్ష పదవులు ఖాళీ
లోకాయుక్త, రాష్ట్ర ఎన్నికల కమిషను, రాష్ట్ర మహిళా కమిషను, ఒడిశా విద్యుత్ నియంత్రణ కమిషను (ఓఈఆర్సి) అధ్యక్ష పదవులు దీర్ఘకాలంగా ఖాళీగా పడి ఉన్నాయి. దీంతో కార్యకలాపాలు స్తంభించాయి. లోకాయుక్త అధ్యక్ష పదవి ఆగస్టు నెల నుంచి ఖాళీ అయింది. ఈ పదవి భర్తీ కోసం గత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎంపిక కమిటీ ఖరారు చేసినా అభ్యర్థిని భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంత వరకు అనుమతించకపోవడంతో ఈ ప్రక్రియ పూర్తి కాలేదు. అవినీతి నియంత్రణలో కీలక పాత్ర పోషించాల్సిన ప్రతిష్టాత్మక లోకాయుక్త అధ్యక్షుడు లేకపోవడంతో బాధితులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. డాక్టరు రాజేంద్ర ప్రసాద్ శర్మ అధ్యక్ష పదవీ కాలం పూర్తి అయిన నుంచి ఈ పదవి ఖాళీగా పడి ఉంది. -
బాలికపై లైంగికదాడి కేసులో యువకుడు అరెస్టు
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా మత్తిలి సమితి ఉదిలిబేఢ గ్రామంలో సోనియా పరజా అనే యువకుడిని మత్తిలి పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఈ నెల 4వ తేదీన ఉదిలిబేఢ గ్రామానికి చెందిన ఓ బాలిక అడవిలో ప్రాణాపాయ స్థితిలో పడి ఉండడం చూసిన తండ్రి బాలికను మత్తిలి ఆరోగ్య కేంద్రంలో చేర్పించగా అక్కడ వైద్యులు బాలికపై లైంగిక దాడి జరిగినట్లు చెప్పారు. దీంతో ఆయన 5వ తేదీన మత్తిలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా శనివారం నిందితుడు సోనియాను సుగ్రీగూఢ గ్రామంలో అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. చోరీ కేసులో నిందితుడు అరెస్టు మల్కన్‌గిరి: జిల్లాలోని మత్తిలి సమితి పోలీసుస్టేషన్ పరిధి రామలింగేశ్వర్ ఆలయంలో నంది విగ్రహం దొంగలించిన కేసులో శివ బెహర అనే నిందితుడిని మత్తిలి పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఈనెల 19వ తేదీ రాత్రి మందిరంలో నంది విగ్రహం చోరీకి గురయ్యింది. దీంతో 20 తేదీన పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేసి శివను అరెస్టు చేశారు. సోమవారం కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు. -
42 వేల గంజాయి మొక్కలు ధ్వంసం
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో అక్రమంగా 42 ఎకరాల్లో పండిస్తున్న గంజాయి క్షేత్రాలను ఎస్పీ జితేంద్ర నాథ్ పండా ఎకై ్సజ్, అటవీ శాఖ, పోలీసు శాఖల సమన్వయంతో శుక్ర, శనివారం ధ్వంసం చేసి తగులబెట్టారు. ఈ సంఘటన మోహన బ్లాక్‌లో బడసింధిబా గ్రామ పంచాయతీ కుటిమరా గ్రామ సమీపంలో జరిగింది. ఈ జాయింట్ ఆపరేషన్‌లో 192 మంది అబ్కారీ, పోలీసు, ఫారెస్టు శాఖలకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు. మొత్తం 42 ఎకరాల్లో పండిస్తున్న గంజాయి క్షేత్రంలో 42 వేల మొక్కలను యంత్రాలతో ధ్వంసం చేసి తగులబెట్టారు. గంజాయి పంటకు అక్టోబరు నుంచి జనవరి వరకు పంట కోతకు వచ్చే సమయం కావడం వల్ల పోలీసులు ఏజెన్సీలో నిఘా పెట్టారు. గంజాయిపై రానున్న రోజుల్లో ఉక్కుపాదం మోపుతామని ఇదివరకే ప్రెస్మీట్లో ఎస్పీ జితేంద్ర పండా ప్రకటించారు. -
గూడ్స్ ట్రైన్‌పై యువకుని హల్చల్
రాయగడ: ఒక యువకుడు గూడ్స్ ట్రైన్ పైకి ఎక్కి హల్చల్ సృష్టించాడు. సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి విద్యుత్ సరఫరాను కొంత సమయం నిలిపివేసి గూడ్స్ పై ఉన్న యువకుడిని కిందకు దించి పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. శనివారం చోటు చేసుకున్న ఈ ఉదంతానికి సంబంధించి అందిన సమాచారం మేరకు రాయగడ నుంచి విశాఖపట్నం వైపు వెళుతున్న ఒక గూడ్స్ ట్రైన్ కొంత సమయంతో పాత గేటు సమీపంలో నిలిచింది. ఇదే అదనుగా భావించిన ఒక యువకుడు గూడ్స్ భోగీపైకి ఎక్కి పడుకున్నాడు. అక్కడి వారు ఎంత వారించినా పట్టించుకోలేదు. విద్యుత్ తీగలు ఉన్నాయి ప్రాణానికి ముప్పు ఉందని కేకలు పెట్టినా వినలేదు. దీంతో అక్కడి వారు రైల్వే పోలీసులకు సమాచారం అందించడంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే ట్రైన్‌కు విద్యుత్ సరఫరాను నిలిపివేసి సంఘటన స్థలానికి చేరుకుని ఆ యువకుడిని కిందకు దింపారు. అయితే ఆ యువకుడు మతిస్థిమితం లేకపొవడంతోనే ఈ విధంగా ప్రవర్తించాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. అనంతరం అతనికి భోజనం పెట్టి పోలీసులు విడిచిపెట్టారు. -
గోడు ఆలకించేదెవరు..?
● రాష్ట్రంలో మొరాయిస్తున్న పాక్షిక న్యాయ వ్యవస్థ ● పలు సంస్థల్లో అధ్యక్ష పదవులు ఖాళీభువనేశ్వర్: రాష్ట్రంలో పాక్షిక న్యాయ వ్యవస్థ మొరాయిస్తోంది. పీడిత, బాధిత వర్గాలకు సత్వర న్యాయం కల్పించేందుకు ఏర్పాటైన ఈ సంస్థలో కీలకమైన అధికారులు, సభ్యుల నియామకం లేకపోవడంతో పరిస్థితి దారుణంగా మారింది. ప్రభుత ఉదాసీనతతో లోకాయుక్త, ఎన్నికల కమిషను, సమాచార హక్కు కమిషను, మహిళా కమిషను, ఒడిశా మానవ హక్కుల కమిషను (ఓహెచ్ఆర్సి), ఒడిశా విద్యుత్ నియంత్రణ కమిషను (ఓఈఆర్సి) వంటి ప్రముఖ పాక్షిక న్యాయ వ్యవస్థల్లో అధ్యక్షుడు, అనుబంధ సభ్యుల పదవులు ఖాళీగా పడి ఉన్నాయి. పదవీ కాలం పూర్తయ్యి ఆయా అధికారులు వైదొలగిన తర్వాత నియామకం జరగడం లేదు. దీంతో పీడిత సామాన్య ప్రజానీకం చట్టపరమైన సత్వర న్యాయం లబ్ధికి దూరం అవుతున్నారు. వృథా ఖర్చులు దీర్ఘకాలం తర్వాత ఒడిశా మానవ హక్కుల కమిషను అధ్యక్ష పదవి భర్తీ చేసి అనుబంధ సభ్యుల నియామకం విస్మరించారు. అరకొర నియామకంతో న్యాయ విచారణకు వీలు కాని పరిస్థితులు తలెత్తుతున్నాయి. సాధారణ ప్రజానీకం సత్వర న్యాయం పొందలేకపోతున్న తరుణంలో ఆయా సంస్థల ఉన్నత పదవుల్లో అధికారులు, సిబ్బంది జీతభత్యాల కోసం క్రమం తప్పకుండా నిధులు విడుదల చేసి ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేస్తున్నారు. -
పైపుల కార్ఖానాలో అగ్ని ప్రమాదం
భువనేశ్వర్: ఝార్సుగుడ బెహరా పల్లి ప్రాంతంలో శనివారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రాంతంలో పైపుల ఉత్పాదన సంస్థ రియాన్ పాలిటెక్నిక్ ఇండస్ట్రీస్ ఆవరణలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కార్ఖానాకు చెందిన వ్యర్థ పదార్థాల పోగులో నిప్పు రగిలి పొగలు కమ్మాయి. పరిసర ప్రాంతాల్లో పొగ దట్టంగా కమ్మడంతో స్థానికులు బెంబేలెత్తారు. అగ్ని మాపక దళం ఘటనా స్థలం సందర్శించి మంటలు నివారించింది.మంటల్లో స్కూటీ దగ్ధం భువనేశ్వర్: పరుగులు తీస్తున్న స్కూటీ ఆకస్మికంగా మంటల్లో చిక్కుకుంది. త్రిశూలియా వంతెనపై శనివారం ఈ ప్రమాదం సంభవించింది. త్రిశూలియా నుంచి కటక్ వెళ్తున్న స్కూటీ నుంచి అసాధారణ మంటలు రావడంతో దూకేసి స్కూటీని వదిలేశానని డ్రైవరు తెలిపాడు. విద్యుత్ షార్టు సర్క్యుట్‌తో ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని భావిస్తున్నారు. స్థానిక అగ్ని మాపక దళం ఘటనా స్థలానికి చేరి మంటలు ఆర్పింది. ఇదంతా ముగిసే సరికి స్కూటీ కాలిపోయింది. పాత్రోపుట్ మృతుల వివరాలు లభ్యం జయపురం: జయపురం సమితి పాత్రోపుట్ గ్రామ పంచాయతీలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన నలుగురి వివరాలు తెలిశాయి. మరణించిన వారిలో ఇద్దరు విద్యార్థులు మిగతా ఇద్దరు పెద్దవారు. బొయిపరిగుడ సమితి మహుళి గ్రామ పంచాయతీ బితరకోట్ కోలనీ దొబా పొరజ్(30), అతడి సోదరుని కుమారుడు ధనపతి ఉరఫ్ బుటి పొరజ(16)ఆ గ్రామంలో ఘాశీ పొరజ(12), కోకినాథ్ పోరజ(18)లు మృతి చెందారు. ధనపతి పొరజ, ఘాసీ పొరజలు మహుళి ఉన్నత ప్రాథమిక పాఠశాల విద్యార్థులు. ఈ నలుగురు ఒక బైక్‌పై పొలం పనులు చేసేందుకు వెళ్తుండగా 326 విజయవాడ–రాంచీ జాతీయ రహదారిలో ట్రక్కు బైక్‌ను ఢీకొనటంతో ఘోర ప్రమాదం జరిగింది. హృదయ విదారకమైన ఈ ప్రమాదం బితరకోట్ కాలనీలో విషాదం నింపింది. ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు మృతికొరాపుట్: ట్రాక్టర్ బోల్తా పడడంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. శనివారం కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్ సమితి కెల్లార్ జంక్షన్ వద్ద ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ట్రాక్టర్ పై ప్రయాణం చేస్తున్న ప్రశాంత్ ఖోస్లా (30), అరుణ్ టక్రి (32) తీవ్ర గాయాలపాలయ్యారు. వెంటనే స్థానికులు వారిని లక్ష్మీపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వారిద్దరూ మృతి చెందారని వైద్యులు ప్రకటించారు. సంఘటన స్థలానికి వెళ్లి లక్ష్మీపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రెండు ప్రతిపాదనలకు ఆమోదం
భువనేశ్వర్: రాష్ట్ర మంత్రి మండలి కొత్తగా రెండు ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేసింది. రాష్ట్ర పరిశ్రమలు, ఉన్నత విద్యా శాఖ ప్రతిపాదనలకు మంత్రి మండలి ఆమోదం లభించింది. పారిశ్రామిక విధా నం, విశ్వ విద్యాలయాల చట్టం సవరణ ప్రతిపాదనలు మంత్రి మండలి అంగీకారం పొందడం విశేషం. స్థానిక లోక్ సేవా భవన్లో శని వారం ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం జరిగింది. ప్రభుత్వ ప్రముఖ కార్యదర్శి మనోజ్ ఆహుజా ఈ సమావేశంలో తీర్మానాల్ని సంక్షిప్తంగా మీడియాకు వివరించారు. ఒడిశా పారిశ్రామిక విధానం – 2105లో 2 సవరణలు, ఒడిశా విశ్వ విద్యాలయం చట్టం – 1989 చట్టం సవరణకు మంత్రి మండలి ఆమోద ముద్ర వేసింది. పారిశ్రామిక విధానం పారిశ్రామికవేత్తలకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడిదారుల క్లెయిమ్‌లు సరళీకరించిన విధానంలో సకాలంలో పొందగలుగుతారు. ఉన్నత విద్యా వ్యవస్థని మరింత పటిష్టపరిచేందుకు విశ్వ విద్యాలయం చట్టం సవరణకు మంత్రి మండలి అంగీకరించింది. ప్రధానంగా పరిశోధన రంగంలో మేధావంతులైన విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. అత్యధికులు ఉన్నత విద్యాభ్యాసానికి సునాయాసంగా అవకాశం పొందేందుకు తాజా సవరణ దోహదపడుతుందని వివరించారు. పలు కీలకమైన దైనందిన కార్యకలాపాల్లో విశ్వ విద్యాలయాలకు జవాబుదారీతనంతో సాధికారిత విస్తరించారు. అధ్యాపకుల నియామకం, వైస్ ఛాన్సలర్ల ఎంపికలో విద్యావేత్తల పరిశీలన వంటి అంశాల్లో విశ్వ విద్యాలయాలకు స్వేచ్ఛ కల్పించే దిశలో తాజా సవరణ చేపట్టారు. ఉపాధ్యాయ, అధ్యాపక నియామకం సరళీకరించడంతో ఈ వ్యవహారంలో కోర్టు వివాదాల్ని తొలగించేందుకు అనుకూలంగా చట్టం సవరించినట్లు చీఫ్ సెక్రటరీ వివరించారు. ఉద్యోగాల నియామకంలో పారదర్శకతకు పెద్ద పీట వేసేందుకు మంత్రి మండలి ఈ ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేసింది. జాతీయ విద్యా విధానం–2020కి అనుకూలంగా ప్రస్తుత చట్ట సవరణ చేపట్టారు. -
రిటైర్మెంట్ రోజునే పింఛన్
భువనేశ్వర్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయిన రోజునే పింఛన్ ప్రదానం చేయాలని ప్రధాన కార్యదర్శి మనోజ్ ఆహుజా లేఖ జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విభాగాల అదనపు ప్రధాన కార్యదర్శులు, ప్రధాన కార్య నిర్వాహక కార్యదర్శులు, కమిషనర్లకు ఈ లేఖ జారీ చేశారు. ప్రతి నెల విరామం పొందిన సిబ్బందికి అదే రోజున పింఛన్ మంజూరు చేసిన అభ్యర్థుల వివరాల్ని క్రమం తప్పకుండా ప్రధాన కార్యదర్శి కార్యాలయానికి దాఖలు చేయాలని సూచించారు. డిసెంబర్ 7వ తేదీ లోగా ఈ జాబితా దాఖలు చేయాలని స్పష్టం చేశారు. మానవతా దృక్పథంతో దీర్ఘ కాలం సిబ్బందిగా ప్రభుత్వ సేవలు అందించిన వారికి విరామం అనంతరం సుఖమయమైన జీవనం కొనసాగించేందుకు సకాలంలో పింఛన్ మంజూరు ఎంతగానో దోహదపడుతుంది. ఉద్యోగ కాలంలో విజిలెన్సు, క్రమశిక్షణ చర్యలు ఇతరేతర పరిస్థితులు నెలకొని ఉన్న పరిస్థితుల్లో రిటైరయ్యే కాలానికి ముందుగానే పరిష్కరించి సకాలంలో పింఛన్ మంజూరుకు మార్గం సుగమం చేయాలని చీఫ్ సెక్రటరీ జారీ చేసిన లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు 2019 సంవత్సరం డిసెంబరు నెల 12వ తేదీన ప్రభుత్వం జారీ చేసిన ఇంత వరకు వాస్తవ కార్యాచరణకు నోచుకోకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. -
బీజేడీకి సమితి సభ్యుల రాజీనామా
పర్లాకిమిడి: జిల్లాలోని గుమ్మా సమితి అధ్యక్షురాలు సునేమీ మండల్‌పై సమితి సభ్యులు ప్రవేశపెట్టిన ఆవిశ్వాస తీర్మానం వీగిపోవడంతో గుమ్మా సమితి సభ్యులు 14 మంది బీజేడీ సభ్యత్వానికి శనివారం రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను పార్టీ అధ్యక్షుడికి పంపుతున్నామని పేర్కొన్నారు. తదుపరి కార్యాచరణ త్వరలో ప్రకటిస్తామన్నారు. బీజేడీకి రాజీనామా చేసినవారిలో బెర్ని గొమాంగో, అథినియల్ నైకా, గీతాంజలి కండువాలో, యస్ని రయితో, దమన్ గొమాంగో, రియాబో భుయ్యాన్, మైస్రక్ రైయితో, అనితా భుయ్యాన్, కె.సరస్వతి, జలితా మండల్, భాస్కర్ భుయ్యాన్ ఉన్నారు. -
మహతాబ్ బహుముఖ రాజనీతిజ్ఞుడు
భువనేశ్వర్: రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ హరే కృష్ణ మహతాబ్ బహుముఖ రాజనీతిజ్ఞుడని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి అన్నారు. హరే కృష్ణ మహతాబ్ 125వ జయంత్యుత్సవం పురస్కరించుకుని స్థానిక రబీంద్ర మండపంలో శనివారం ప్రసంగించారు. ఒడియా భాష, సాహిత్యం, సాంస్కృతిక విభాగం ఈ కార్యక్రమం నిర్వహించింది. జాతిపిత మహాత్మా గాంధీ ప్రేరణతో 1921లో రెవెన్షా కళాశాలలో చదువు సంధ్యలకు స్వస్తి పలికి దేశ స్వాతంత్ర సమరంలో ముందంజ సేనగా హరే కృష్ణ సారథ్యం వహించారని గుర్తు చేశారు. దేశ స్వాతంత్రానికి ముందు 1946 సంవత్సరం ఏప్రిల్ 23వ తేదీన ప్రత్యేక ఒడిశా ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారని తెలిపారు. మహా నాయకుని 125వ జయంత్యుత్సవాల్ని ఏడాది పాటు నిరవధికంగా జాతీయ స్థాయిలో నిర్వహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ నేపథ్యంలో భారత రాష్ట్రపతి న్యూ ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో ఇటీవల జాతీయ స్థాయిలో ప్రారంభించారు. ఈ ఉత్సవాలు పురస్కరించుకుని హరే కృష్ణ మహతాబ్ జీవిత గాథ ఇతివృత్తంగా బయోపిక్ చిత్రీకరణ కోసం సన్నాహాలు చురుగ్గా సాగుతున్నాయని ముఖ్యమంత్రి ప్రకటించారు. సాహితీవేత్తలకు సత్కారం ఈ సందర్భంగా సాహితీ రంగంలో ఉన్నతంగా రాణించిన ముగ్గురు ప్రముఖులకు మహతాబ్ సాహితీ పురస్కారంతో సత్కరించారు. కార్యక్రమంలో భాగంగా 7 పుస్తకాల్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. వీటిలో మ్యాన్ ఆఫ్ డెస్టినీ, మహా నాయక్ మహతాబ్, శిశు లెఖా (మహతాబ్ రచన), మహతం మహతాబ్, మహతాబ్ ఎబొం అనన్య కృతి, గాంవ్ మజ్లిస్ పుస్తకాలు ఉన్నాయి. సాహితీవేత్తలుగా శంకర్ లాల్ పురోహిత్, నిషామణి కొరొ, గోబింద చంద్ర చాంద్ మహతాబ్ సాహితీ పురస్కారంతో ముఖ్యమంత్రి చేతుల మీదుగా సత్కారం పొందారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా సందర్శించారు. ఆయనతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కనక వర్ధన్ సింగ్ దేవ్, ఒడియా భాష, సాహిత్యం మరియు సంస్కృతి విభాగం మంత్రి సూర్య వంశీ సూరజ్ పాల్గొన్నారు. -
‘బాల వివాహ ముక్త్ భారత్’ను సక్సెస్ చేయాలి : కలెక్టర్
పార్వతీపురం: బాల వివాహ ముక్త్ భారత్ కార్యక్రమాన్ని జిల్లాలో పెద్ద ఎత్తున చేపట్టనున్నట్టు కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ తెలిపారు. బాల వివాహ ముక్త్ భారత్ కార్యక్రమాన్ని నవంబర్ 27న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌న్‌లో కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి ప్రారంభిస్తారని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించేందుకు, అవగాహన కల్పించేందుకు బాల వివాహ ముక్త్ భారత్ ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారని ఆయన వివరించారు. ‘యావత్తు ప్రభుత్వం’ ‘యావత్తు సమాజం’ నినాదంతో ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపడుతుందన్నారు. బాల్య వివాహాలు జరగకూడదన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. బాల్య వివాహాలు మానవ హక్కుల ఉల్లంఘనలో అత్యంత దారుణమైన రూపాలలో ఒకటిగా ప్రభుత్వం భావిస్తోందన్నారు. ప్రధానమంత్రి నిర్దేశించిన వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో ప్రధాన ఆటంకంగా ఉందనే భావన ఉందని ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ బాల్య వివాహాల నిషేధ నియమాలు–2023 ప్రకారం జిల్లా, డివిజనల్, ప్రాజెక్ట్ స్థాయిలో బాల్య వివాహాల నిషేధ అధికారులను నియమిస్తూ నోటిఫై చేసిన మేరకు మండల, గ్రామ, మున్సిపల్ స్థాయిలలోను నియమించడం జరుగుతుందని చెప్పారు. కలెక్టర్ జిల్లా బాల్య వివాహాల నివారణ అధికారిగా వ్యవహరిస్తారని, డివిజనల్ స్థాయిలో రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ /సబ్–కలెక్టర్, ప్రాజెక్ట్ స్థాయిలో చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్లు, మున్సిపాలిటీలు, మునిసిపల్ కమిషనర్లకు, మండల స్థాయిలో తహసీల్దార్లు, ఎంఈఓలు, పంచాయతీరాజ్ శాఖ, ఎంపీడీఓలు, సూపర్వైజర్లు తదితరులు బాల్య వివాహాల నివారణ అధికారిగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. జువైనెల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ, రక్షణ) చట్టం, 2015 నిబంధనల ప్రకారం నియమించిన చైల్డ్ వెల్ఫేర్ పోలీస్ ఆఫీసర్ వారి సంబంధిత పోలీస్‌స్టేషన్ అధికార పరిధిలో బాల్య వివాహాల నివారణ అధికారిగా వ్యవహరిస్తారని తెలిపారు. అన్ని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, పంచాయతీరాజ్ సంస్థలు, పట్టణ స్థానిక సంస్థల నుంచి ఎన్నికై న ప్రతినిధులు, సామాజిక, పౌర సంస్థలు, బార్ కౌన్సిల్ సభ్యులు, లీగల్ సర్వీసెస్ అథారిటీలలో సభ్యులుగా ఉన్న స్థానిక న్యాయవాదులు, ఎన్జీఓలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
రాజ్యాంగ ప్రచార రథానికి ఘన స్వాగతం
జయపురం: రాజ్యాంగంపై ప్రజలను చైత్యన్య పరచేందుకు ఒడిశా రాష్ట్రంలో సంచారం చేస్తున్న రాజ్యాంగ సచేతన ప్రచార రథం శుక్రవారం రాత్రి జయపురం చేరింది. రథానికి కొరాపుట్ జిల్లా మూల ఆదివాసీ మహాసంఘం సభ్యులు ఘన స్వాగతం పలికారు. జయపురం 26వ జాతీయ రహదారిలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద రాజ్యాంగ ప్రచార రథానికి స్వాగతం పలికారు. అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. మూల ఆదివాసీ మహాసంఘ ఆర్గనైజింగ్ కార్యదర్శి ప్రబీర్ పాత్రో మాట్లాడుతూ డాక్టర్ బాబా సాహేబ్ అంబేడ్కర్ దేశ ప్రజల కోసం రచించిన రాజ్యాంగంపై అనేక మంది ప్రజలకు, ముఖ్యంగా గ్రామీణ, ఆదివాసీ ప్రజలకు అంతగా అవగాహన లేదని, అందువల్ల ప్రజలలో అవగాహన కల్పించేందుకు రాజ్యాంగ సచేతన ప్రచార రథం కొరాపుట్ జిల్లాలోని పలు సమితులలో పర్యటించిందని వెల్లడించారు. ఈ నెల 26వ తేదీ నాటికి భారత రాజ్యాంగానికి 75 ఏళ్లు పూర్తవుతాయని, ఆ రోజు రాజ్యాంగ దినోత్సవం దేశమంతా నిర్వహిస్తారని వెల్లడించారు. రాజ్యాంగ 75వ వార్షికోత్సవాలు కొరాపుట్ జిల్లా జయపురంలో జరుపనున్నట్టు తెలిపారు. రాష్ట్ర మూల ఆదివాసీ మహాసంఘం మహిళా విభాగ అధ్యక్షురాలు మనశ్వినీ టక్రి, హిమాంశు భొత్ర తదితరులు పాల్గొన్నారు. -
డిసెంబరు 8 నుంచి చైతీ ఉత్సవాలు
రాయగడ: ఈ ఏడాది డిసెంబర్ 26 నుంచి 30వ తేదీ వరకు జరగనున్న చైతీ ఉత్సవాల్లో భాగంగా డిసెంబరు 8 నుంచి ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నట్లు జిల్లా యంత్రాంగం ప్రకటించింది. జిల్లాలోని పద్మపూర్ సమితి పరిధి మొరిచొగుడ గ్రామంలోని అక్షర బ్రహ్మ మందిరం నుంచి ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఆదివాసీల అభ్యున్నతికి వారి ఆచార, సాంప్రదాయాలు, కళా సంస్కృతిని పరిరక్షించేందుకు ఈ ఏడాది సైతం ఘనంగా నిర్వహించేందుకు నిర్ణయించారు. జిల్లాస్థాయి విజ్ఞాన ప్రదర్శన రాయగడ: జిల్లాలోని కొలనార సమితి పరిధి భుజబల్లో మిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో జిల్లా స్థాయి విజ్ఞాన ప్రదర్శన శనివారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర రైతా మాట్లాడుతూ.. విద్యార్థుల మేధాశక్తిని పదునుపట్టేందుకు ఇటువంటి ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయన్నారు. మిట్స్ కళాశాల ప్రిన్సిపాల్, కన్వీనర్ ఫ్రొఫెసర్ రామానుజ నాయక్ మాట్లాడుతూ తమ కళాశాలలో నిర్వహించిన జిల్లాస్థాయి విజ్ఞాన ప్రదర్శనలో 42 పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. దిల్ సే–24 పేరిట నిర్వహించిన ఈ ప్రదర్శనకు అనూహ్య స్పందన లభించిందన్నారు. లేబర్ కార్డుల రిజిస్ట్రేషన్ మల్కన్‌గిరి: జిల్లాలోని ఖోయిర్‌పూట్ సమితి ఆండ్రాహల్ పంచాయతీలో ఎక్కువగా బోండ తెగకు చెందిన గిరిజనులు ఉన్నారు. దీంతో వారికి ఆండ్రాహల్ పంచాయతీ కార్యాలయం వద్ద బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్క్‌ర్స్ బోర్డు ఆధ్వర్యంలో అవగాహన శిబిరం శనివారం ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా వారికి లేబర్ కార్డుల్లో రిజిస్ట్రేషన్ చేశారు. జిల్లా లేబర్ అధికారి ప్రసన్న పాణిగ్రాహి, అదనపు లేబర్ అధికారి పూర్ణిమ దురుక సమక్షంలో 150 మంది హాజరవ్వగా వారికి రిజిస్ట్రేషన్ చేయించారు. -
దివ్యాంగులకు యంత్రాలు, పరికరాల పంపిణీ
జయపురం: మునిసిపాలిటీ అధికారులు శుక్రవా రం స్థానిక టౌన్ హాలు ప్రాంగణంలో భీమబొయి దివ్యాంగ సహాయ శిభిరం, వయోవృద్ధుల సహాయక మేళా 2024–25ను నిర్వహించారు. వేలాది మంది దివ్యాంగులు, వయోవృద్ధులు పాల్గొన్నారు. ఈ మేళాలో దివ్యాంగులకు 21 రకాల పరీక్షలు చేపట్టి వారికి ధ్రువపత్రాలు, హియరింగ్ యంత్రాలు, ట్రై సైకిళ్లు, కృత్రిమ అవయవాలు, బస్సు, రైలులలో ప్రాయాణానికి పాస్‌లు సమకూర్చారు. డాక్టర్ల బృందం దివ్యాంగులను పరీక్షించి వారికి ధ్రువపత్రాలు అందజేశారు. ఆధార్ కార్డులు, ఇతర ధ్రువపత్రాలను ఉచితంగా జిరాక్స్ తీసేందుకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. రెసిడెన్స్, కుల ధ్రువపత్రాలు సమకూర్చేందుకు రెవెన్యూ విభాగం కౌంటర్ ఏర్పాటు చేసింది. వయోవృద్షుధలకు అవసరమైన సహాయ ధ్రవపత్రాలతోపాటు బస్సు, రైల్ పాస్‌లు సమకూర్చారు. స్థానిక ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి, మున్పిపల్ చైర్మన్ నరేంద్ర కుమార్ మహంతి, వైస్ చైర్పర్సన్ బి.సునీత తదితరులు దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలు అందజేశారు. ఈ మేళాలో 562 మంది దివ్యాంగులను గుర్తించి జాబితాలో నమోదు చేసినట్లు మునిసిపాలిటీ కార్యనిర్వాహక అధికారి కృతిబాస రౌత్ వెల్లడించారు. నిస్సహాయులైన ముగ్గురు దావ్యాంగులకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. 57 మంది దివ్యాంగులు, వృద్ధులకు సామాజిక సురక్ష పథకంలో పెన్షన్లు అందజేసినట్లు వెల్లడించారు. ఏడుగురు దివ్యాంగులకు వీల్ చైర్లు, నలుగురుకి ట్రై సైకిళ్లు, 217 మందికి బస్ పాస్‌లు అందజేశారు. -
జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ ఇవ్వాలి
పార్వతీపురం టౌన్: జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీనివ్వాలని ఏపీయూడబ్ల్యూజె జిల్లా అధ్యక్షుడు కిశోర్ కోరారు. ఏపీయూడబ్ల్యూజే జిల్లా కమిటీ కార్యవర్గ సమావేశం బెలగాం రైతుబజార్ సమీపంలో ఉన్న విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల పిల్లల ఫీజు రాయితీపై సోమవారం కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందిస్తామన్నారు. సమావేశంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యదర్శి జి. శ్రీనివాసరావు, ఆశపు జయంత్‌కుమార్, సాలాపు అనంతరావు, జి.గోపాల్, పాణిగ్రాహి సత్యనారాయణ, ఆర్వీఎస్ కుమార్, ఆర్.సుధాకర్, కోమటి శ్రీనివాసరావు, బి.రాజశేఖర్, ఉమా మహేశ్వరరావు, భగవాన్ దాస్ ప్రశాంత్, జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఏపీయూడబ్ల్యూజే డిమాండ్ -
ధాన్యం మండీలు ప్రారంభించాలి
జయపురం: వరి కోతలు, నూర్పుడిలు పూర్తి కావస్తున్నందన వెంటనే మండీలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌కు కృషక కళ్యాణ మంచ్ డిమాండ్ చేసింది. శనివారం కృషక్ మంచ్ కార్యదర్శి నరేంద్ర కుమార్ ప్రధాన్ నేతృత్వంలో ప్రతినిధులు జయపురం సబ్ కలెక్టర్ ఎ.శొశ్యరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. జిల్లాలో 60 శాతానికి పైగా వరి పంట కోతలు, నూర్పుడిలు పూర్తయ్యాయని వెల్లడించారు. ముఖ్యంగా సాగునీటి సైకర్యం లేని, ఎత్తుపోతల పథకాల భూములలో 80 నుంచి 90 శాతం నూర్పుడిలు పూర్తయ్యాయని వెల్లడించారు. ధాన్యం కొనుగోలు మండీలు ఏర్పాటు చేయకపోవటం వలన, ధాన్యం నిల్వ ఉంచేందుకు సైకర్యాలు లేని రైతులు ఇబ్బంది పడుతున్నారని, అందువల్ల డిసంబర్ 1, 2వ తేదీల్లో మండీలు తెరవాలని డిమాండ్ చేశారు. ఇంజినీర్ల తప్పు కారణంగా తెలంగిరి జలాశయంలో నీరు విడిచిపెట్టారని, అందువలన రబీ పంటకు సాగునీరు లభించదన్నారు. యుద్ధప్రాతిపదిన డ్యామ్ మరమ్మతు పనులు చేపట్టాలన్నారు. రబి పంటలకు సాగునీరు సమకూర్చేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మండీలలో ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం లక్ష్యం కన్నా అధిక ధాన్యం ఉత్పత్తి అయిందని, అందువల్ల రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయకపోతే తక్కువ ధరకు అమ్ముకోవలసిన పరిస్థితి నెలకొంటుందనే భయం వ్యక్తం చేశారు. సాగునీటి వనరుల గల భూములలో ఎకరాకు 25 కేజీల ధాన్యం కొంటారని, అలా కాకుండా పండిన ధాన్యం అంతా కోనుగోలు చేయాలని కోరారు. మండీలలో దళారులు లేకుండా చేయాలని, మండీలు ప్రారంభించే ముందు ఖాళీ సంచులను రైతులకు రిటన్ చేయాలని, మండీలకు రైతులు తెచ్చిన ధాన్యం అంతా అదే రోజున కొనుగోలు చేయాలన్నారు. సబ్‌కలెక్టర్‌కు వినతిపత్రం అందించిన వారిలో రవీంద్రప్రధాన్, విజయ్ పండా, త్రినాథ్ బిశాయి, సింహాచల మల్లిక్, విశ్వనాథ్ గౌడ, ప్రదీప్ ప్రదాన్, గంగాధర షొడంగి, తిల్ నాయక్, ఖొగేశవర సాహు, రాజేంద్ర మఝి, తదితరులు పాల్గొన్నారు. -
వరి పంట పరిశీలనలో అధికారులు
విజయనగరం ఫోర్ట్: రెల్లరాల్చు పురుగు ఆశించడం వల్ల వరి పంట వెన్నులను పురుగు విరిచేయడంతో పంటకు నష్టం వాటిల్లుతుందనే అంశంపై సాక్షిలో శనివారం చి‘వరి’లో తెగుళ్లుదాడి అనే శీర్షికన ప్రచురించిన కథనానికి వ్యవసాయ అధికారులు స్పందించారు. గంట్యాడ మండలం పెదవేమలిలో రైతు శిక్షణ కేంద్రం ఏడీ చంద్రశేఖర్‌బాబు, గాజులరేగలోని ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త తేజేశ్వరావు, మండల వ్యవసాయ అధికారి శ్యామ్‌కుమార్ రెల్లరాల్చు పురుగు అశించిన వరి పంటను పరిశీలించారు. పురుగు నివారణకు తీసుకోవాల్సిన చర్యలు గురించి రైతులకు వివరించారు. రెల్చరాల్చు పురుగు నివారణకు పొలంలో నీరు పెట్టి తీసివేసి వెంటనే క్లోరోఫైరిపాస్ మందు లీటరు నీటికి 2.5 ఎం.ఎల్ మందు కాని ఇమామెక్టిన్ బెంజాయింట్ 80 గ్రాములు కాని, పర్మెత్రిన్ మందు ఎకరానికి 200 లీటర్ల నీటిలో 400 ఎం.ఎల్ మందు పిచికారీ చేసుకోవాలన్నారు. -
జాతీయ స్థాయి పోటీలకు ఏకలవ్య పాఠశాల విద్యార్థినిలు
సాలూరు: జాతీయ స్థాయి క్రీడా పోటీలకు పాచిపెంట మండలంలోని కొటికిపెంట ఏకలవ్య పాఠశాల నుంచి 12 మంది విద్యార్థినిలు ఎంపికై నట్టు ప్రిన్సిపాల్ దేవేందర్‌సింగ్ శనివారం తెలిపారు. ఈ నెల 20, 21, 22న అనంతగిరిలోని ఏకలవ్య పాఠశాలలో 4వ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు జరగ్గా ఈ పోటీల్లో 28 ఏకలవ్య పాఠశాలల నుంచి 1200 మంది విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. తమ పాఠశాలకు చెందిన విద్యార్థినిలు బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్, వాలీబాల్ తదితర విభాగాల్లో 6 గోల్డ్, 6 సిల్వర్, చాంపియన్ ట్రోఫీ గెలుపొందారన్నారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థినిలను ప్రిన్సిపాల్‌తో పాటు పీఈటీ, ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించారు. పూరిపాక దగ్ధం భామిని: చలి తీవ్రత నుంచి రక్షణకు వేసిన చలి మంటతో జరిగిన అగ్ని ప్రమాదం నుంచి వృద్ధ దంపతులు త్రుటిలో తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డారు. పూరిపాక కాలిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. భామిని మండలం కోసలిలో కుప్పిలి రామయ్య, రవణమ్మ వృద్ధ దంపతులు. వీరు నివసిస్తున్న పూరిపాక శుక్రవారం రాత్రి అగ్ని ప్రమాదంలో కాలిపోయింది. అదే సమయంలో పాకలో నిద్రిస్తున్న వృద్ధులు అప్రమత్తమై బయటపడ్డారు. రాత్రి వేసిన చలిమంట ప్రమాదానికి కారణంగా గ్రామస్తులు తెలిపారు. ఎంఆర్ఐ కొట్టుగుమ్మడి కృష్ణారావు, వీఆర్ఓ బిడ్డికి గోపాల్ ప్రమాద స్థలాన్ని సందర్శించి కారణాలు తెలుసుకున్నారు. నష్టం అంచనా వేసి ఉన్నతాధికారులకు అందజేయనున్నట్టు తెలిపారు. ఇద్దరు మైనర్లపై కేసు నమోదు సంతకవిటి: ఇద్దరు మైనర్లపై కేసు నమోదు చేసి శ్రీకాకుళంలోని జువైనల్ కోర్టులో శనివారం హాజరుపరచినట్లు ఎస్ఐ ఆర్.గోపాలరావు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే... పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన కుతీబస్ నాయక్ రాజాంలోని ఓ జ్యూట్ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. ఈయన గురువారం రాత్రి 11 గంటల సమయంలో రాజాం బస్టాండ్‌లో బస్ దిగి డోలపేట వైపు నడుచుకుంటూ వస్తుండగా ఇద్దరు వ్యక్తులు అడ్డగించి తన వద్ద ఉన్న మొబైల్ ఫోన్, 1500 రూపాయలను తీసుకుని పరారైనట్టు శనివారం సంతకవిటిి పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. సీసీ పుటేజ్‌ల ఆధారంగా 24 గంటల్లోనే ముద్దాయిలను పట్టుకున్నామని తెలిపారు. వృద్ధురాలి ఆత్మహత్య బాడంగి: మండలంలోని గొల్లలపేటకు చెందిన రాపాక గౌరమ్మ(55) అనే వృద్ధురాలు విజయనగరంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. తమ పంట కల్లంలో ఈ నెల 14న పురుగుల మందు తాగి గౌరమ్మ ఆత్మహత్యకు పాల్పడగా అపస్మారక స్థితికి చేరడంతో బంధువుల సహాయంతో స్థానిక సీహెచ్‌సీలో ప్రథమ చికిత్స చేసి మెరుగైన చికిత్స కోసం విజయనగరం సర్వజన ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. వరుసకు సోదరుడైన రాపాక గౌరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తారకేశ్వరరావు చెప్పారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించినట్టు తెలిపారు. అంకితభావంతో పని చేయండి : జేసీ సాలూరు: ఉద్యోగులు నిబద్దతతో పని చేయాలని, విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే సహించేది లేదని జాయింట్ కలెక్టర్ శోభిక అన్నారు. పట్టణంలో తహసీల్దార్ కార్యాలయాన్ని ఆమె శనివారం ఆకస్మికంగా తనిఖీ చేసారు. పీజీఆర్ఎస్, రెవెన్యూ సర్వీసులు ,శాఖాపరంగా జరుగుతున్న పనులపై ఆరా తీసారు. అనంతరం పట్టణంలో జీసీసీ గోదాంను పరిశీలించారు. సక్రమంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని ఆదేశించారు. మండలంలో శివరాంపురంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె తనిఖి చేసారు. ట్రక్ షీట్, రికార్డులు పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తహసీల్దార్ వెంకటరమణ, ఏఓ అనురాధ, వీఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డున పడిన రక్తబంధం
చీపురుపల్లి: అండగా నిలవాల్సిన అన్నదమ్ములు శత్రువుల్లా మారారు.. అక్కున చేర్చుకోవాల్సిన కన్నతండ్రి కనికరించలేదు.. ఇద్దరు అన్నదమ్ములు తండ్రితో కలిసి రక్తం పంచుకుపుట్టిన మరో సోదరుడి కుటుంబంపై పగబట్టారు. అర్థరాత్రి సమయంలో ఆ కుటుంబాన్ని ఇంటి నుంచి గెంటేశారు. వారికి సంబంధించిన బట్టలు, సామగ్రి, పిల్లల పుస్తకాలను రోడ్డుపైకి విసిరేశారు. ముక్కుపచ్చలారని ఇద్దరు పిల్లలతో సహా ఆ భార్యభర్తలు రోడ్డున పడ్డారు. తలదాచుకునేందుకు మరో ఇల్లులేక పిల్లలతో సహా రోడ్డుపైనే కాలంగడుపుతున్నారు. కాలనీలో ఎవరో ఒకరు ఇచ్చే ఆహారం తింటూ న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని పోలీసులు దృష్టికి తీసుకెళ్లినా పదిహేను రోజులుగా ఎలాంటి న్యాయ సహాయం అందలేదంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. చీపురుపల్లి మండలం నిమ్మలవలస గ్రామంలో ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించి బాధిత దంపతులు కోడిగుడ్ల బాలకృష్ణ, మంజుల ఆవేదన వారి మాటల్లోనే... నిమ్మలవలస గ్రామానికి చెందిన కోడిగుడ్ల మహేష్‌కు రాజ్‌కుమార్, బాలకృష్ణ, శ్యామ్ అనే ముగ్గురు కొడుకులం. అందులో రెండో వాడిని నేను. భార్య మంజు, ఇద్దరు పిల్లలతో కలిసి చాలా కాలంగా విశాఖపట్టణంలో నివసిస్తూ ఆరు నెలల కిందటే సొంతూరు నిమ్మలవలస వచ్చాం. ఇక్కడ కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాం. మా కుటుంబం అంటే తండ్రికి నచ్చదు. పెద్ద ఇల్లు ఉన్నా వంట ఇంటిని మాకు కేటాయించారు. అందులోనే భార్య, పిల్లలతో కలిసి సర్దుకుపోతున్నాం. అయినా సరే తండ్రి మద్యం మత్తులో వచ్చి నిత్యం వేధిస్తున్నారు. కుటుంబాన్ని దూషిస్తున్నారు. 15 రోజుల కిందట అర్థరాత్రి సమయంలో ఇద్దరు సోదరుల సహాయంతో తమ కుటుంబాన్ని రోడ్డుపైకి గెంటేశారు. బట్టలు, సామాన్లు విసిరేసి, పిల్లలతో సహా తమను రోడ్డుపైకి తోసేశారు. అప్పటి నుంచి రోడ్డుపైనే ఉంటూ స్థానికులు ఇచ్చే ఆహారంతో జీవనం సాగిస్తున్నాం. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. పోలీసులు వచ్చి చూసి వెళ్లారు. ఎలాంటి న్యాయం జరగలేదు. చలిలో పిల్లలతో కలిసి రోడ్డుపై జీవిస్తున్నా... న్యాయం చేయాల్సిన పోలీసులు ఎందుకు పట్టించుకోవడంలేదో అర్థం కావడంలేదు. తమకు న్యాయం చేయకుంటే పిల్లలతో కలిసి ఆత్మహత్యే శరణ్యమంటూ బాలకృష్ణ, మంజు దంపతులు బోరున విలపించారు. నిమ్మలవలస గ్రామానికి చెందిన కోడిగుడ్ల మంజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. మంజు, బాలకృష్ణ కుటుంబాన్ని ఇంటి నుంచి వెల్లగొట్టిన ఫిర్యాదులో కోడిగుడ్ల మహేష్, రాజ్‌కుమార్, శ్యామ్‌లపై కేసు నమోదు చేశాం. – ఎల్.ధామోదరరావు, ఎస్ఐ, చీపురుపలి్ల కేసు నమోదు చేశాం.. తండ్రితో కలిసి ఇద్దరు సోదరుల దుశ్చర్య! మరో సోదరుడి కుటుంబాన్ని రోడ్డుపైకి గెంటివేత దుస్తులు, సామగ్రిని బయటకు విసిరేసిన వైనం పిల్లలతో కలిసి గజగజ వణికిస్తున్న చలిలో 15 రోజులుగా రోడ్డుపైనే నివాసం న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటామంటున్న కుటుంబం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేసినా న్యాయం జరగలేదంటూ ఆవేదన కేసు నమోదు చేశాం: ఎస్ఐ ధామోదరరావు -
వ్యవసాయ చెక్‌పోస్టుల వద్ద...తగ్గిన ఆదాయం!
వ్యవసాయ మార్కెట్ కమిటీ చెక్‌పోస్టుల ద్వారా ప్రభుత్వానికి సమకూరాల్సిన ఆదాయం గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది రూ.లక్షల్లో తగ్గింది. దీంతో మార్కెట్ కమిటీలకు చేకూరాల్సిన ఆదాయం పడిపోయింది. జిల్లాలో 11 చెక్‌పోస్టులు ఉండగా వాటి ద్వారా రావాల్సిన ఆదాయానికి రూ.లక్షల్లో గండి పడడం ఆ శాఖలో చర్చనీయాంశమైంది.● జిల్లాలో 11 చెక్‌పోస్టులు ● 2023 – 24లో రూ.4.98 కోట్లు ఆదాయం ● 2024– 25లో ఆక్టోబర్ నెలకు లక్ష్యం రూ.2.88 కోట్లు ● వచ్చిన ఆదాయం రూ.2.22 కోట్లు ● 184 రకాల నోటిఫైడ్ ఉత్పత్తులపై ఒకశాతం మార్కెట్ ఫీజు వసూలు ● తగ్గిన రూ.66 లక్షల ఆదాయం