ICC World Cup 2019
-
ధోని రనౌట్‌తో పోలుస్తున్నారు.. శాంసన్ కెరీర్ ముగిసినట్లా!
వెస్టిండీస్‌తో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో టీమిండియా అనూహ్యంగా ఓటమి పాలైంది. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు విండీస్ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌కు నిర్ణీత 20 ఓవర్లల 9 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసి నాలుగు పరుగుల తేడాతో పరాజయం పాలైంది. టీమిండియా బ్యాటింగ్‌లో ఒక్క బ్యాటర్ కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. దీనికి తోడు సంజూ శాంసన్ బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చడం జట్టును దెబ్బతీసిందని చెప్పొచ్చు. ఇదే అనుకుంటే శాంసన్ రనౌట్ కావడం మరింత ఆశ్చర్యపరిచింది. జాసన్ హోల్డర్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్ మూడో బంతిని అక్షర్ పటేల్ కవర్స్ దిశగా ఆడాడు. అక్షర్ పటేల్ వద్దని చెప్పినా సంజూ శాంసన్ అనవసరంగా సింగిల్‌కు ప్రయత్నించాడు. సంజూ శాంసన్ క్రీజులోకి చేరేలోపే బంతిని అందుకున్న కైల్ మేయర్స్ నేరుగా వికెట్లను గిరాటేయడంతో 12 పరుగులు వద్ద రనౌట్‌గా వెనుదిరిగాడు. అయితే సంజూ శాంసన్ రనౌట్‌ను ఎంఎస్ ధోని రనౌట్‌తో పోలుస్తున్నారు. 2019 వన్డే వరల్డ్‌కప్‌లో సెమీఫైనల్లో ధోని రనౌట్ అయిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్‌లో ధోని అప్పటికే 51 పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఫెర్గూసన్ బౌలింగ్‌లో షాట్ ఆడిన ధోని రెండు పరుగుల కోసం ప్రయత్నించాడు. అయితే సింగిల్‌తో సరిపెట్టుకొని ఉంటే బాగుండేది. కానీ ధోని అనవసరంగా రెండో పరుగు కోసం ప్రయత్నించగా.. మార్టిన్ గప్టిల్ అద్బుతమైన డైరెక్ట్ హిట్‌కు రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. ధోని రనౌట్ కావడంతో అభిమానులు గుండె బరువెక్కిపోయింది. ఈ మ్యాచే ధోనికి అంతర్జాతీయంగా ఆఖరి మ్యాచ్‌గా మారిపోయింది. ఆ తర్వాత ధోని మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. ఇక 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు ధోని రిటైర్మెంట్ ప్రకటించాడు. తాజాగా సంజూ శాంసన్ రనౌట్‌ను ధోని రనౌట్‌తో పోల్చడంతో అభిమానులు వినూత్న కామెంట్స్ చేశారు. ''ధోని రనౌట్‌తో పోలుస్తున్నారు బాగానే ఉంది.. కానీ ధోని అంతర్జాతీయ కెరీర్‌కు ఎండ్‌కార్డ్ పడింది ఇక్కడే.. అలా అయితే సంజూ శాంసన్ కెరీర్ కూడా ముగిసినట్లేనా''.. మీ లాజిక్‌లు తగలయ్యా.. బోలెడు కెరీర్ ఉన్న శాంసన్ ఔట్‌ను ధోని రనౌట్‌తో పోల్చకండి.. అతనికి మంచి భవిష్యత్తు ఉంది'' అంటూ పేర్కొన్నారు. pic.twitter.com/cAl95iDMV7 — No-No-Crix (@Hanji_CricDekho) August 3, 2023 WHAT A MOMENT OF BRILLIANCE! Martin Guptill was 🔛🎯 to run out MS Dhoni and help send New Zealand to their second consecutive @cricketworldcup final! #CWC19 pic.twitter.com/i84pTIrYbk — ICC (@ICC) July 10, 2019 చదవండి: Deodhar Trophy: రియాన్ పరాగ్ మెరుపులు వృథా.. దేవధర్ ట్రోఫీ విజేత సౌత్‌జోన్ -
మిస్టర్ మోర్గాన్.. లార్డ్స్ బయట ధర్నా చేయాల్సింది
Virender Sehwag Knocks Eoin Morgan.. ఐపీఎల్ 2021లో ఢిల్లీ క్యాపిటల్స్, కేకేఆర్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అశ్విన్- మోర్గాన్ మధ్య వివాదం ముదిరి పాకాన పడుతోంది. అశ్విన్‌దే తప్పు అని కొందరు విమర్శిస్తుంటే.. మోర్గాన్‌ది తప్పంటూ మరికొందరు పేర్కొంటున్నారు. తాజాగా టీమిండియా మాజీ విధ్వంసకర ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ అశ్విన్‌కు మద్దతిస్తూ మోర్గాన్‌పై ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత కేకేఆర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ అశ్విన్- మోర్గాన్ విషయంలో జరిగిన గొడవ గురించి ప్రస్తావించాడు. రిషబ్ పంత్- అశ్విన్ జోడి రెండో పరుగు కోసం ప్రయత్నించడమే ఇక్కడ తప్పని.. అందుకే మోర్గాన్ ఆగ్రహం వ్యక్తం చేశాడని చెప్పుకొచ్చాడు. కార్తిక్ కామెంట్స్‌పై సెహ్వాగ్ స్పందించాడు. చదవండి: Ashwin Vs Morgan: మోర్గాన్ తప్పు లేదు.. అశ్విన్‌ను అడ్డుకునే హక్కు ఉంది ''అది జూలై 14.. 2019 ప్రపంచకప్ ఫైనల్. ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ ఫైనల్ ఓవర్లో బెన్ స్టోక్స్ బ్యాట్‌కు తగిలి అదనంగా రెండు పరుగులు వచ్చాయి. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీయడం.. సూపర్ ఓవర్లో ఇంగ్లండ్ విజయం సాధించడం జరిగిపోయాయి. మోర్గాన్ ప్రకారం న్యాయంగా ఉంటే ఓవర్ త్రోకు పరుగులు తీయకూడదు.. కానీ స్టోక్స్ రన్స్ తీశాడు. దీని ప్రకారం మోర్గాన్ స్టోక్స్‌కు వ్యతిరేకంగా లార్డ్స్ బయట ధర్నా చేయాలి.. అంతేగాక మోర్గాన్ ఒక కెప్టెన్‌గా ట్రోఫీని అందుకోవడానికి నిరాకరించాలి.. న్యాయబద్ధంగా న్యూజిలాండ్‌కు ట్రోఫీ అందించాలి. మరి మోర్గాన్ అప్పుడు అలా ఎందుకు చేయలేదు.. పైగా ఇప్పుడేమో అశ్విన్‌ను తప్పుబడుతూ ఆగ్రహం వ్యక్తం చేయడం ఎంతవరకు న్యాయం చెప్పండి'' అంటూ వ్యంగ్యంగా స్పందించాడు. ప్రస్తుతం సెహ్వాగ్ చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: IPL 2021: ఫామ్‌లో లేకపోతే అంతే.. మూలకు కూర్చోవాల్సిందే On July 14th , 2019 when it ricocheted of Ben Stokes bat in the final over, Mr Morgan sat on a Dharna outside Lord’s and refused to hold the World cup trophy and New Zealand won. Haina ? Bade aaye, ‘doesn’t appreciate’ waale 😂 pic.twitter.com/bTZuzfIY4S — Virender Sehwag (@virendersehwag) September 29, 2021 -
భీకరమైన ఫామ్; మెగా టోర్నీలో 5 సెంచరీలు.. నేటితో రెండేళ్లు
సాక్షి, వెబ్‌డెస్క్: టీమిండియా ఓపెనర్.. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఇంగ్లండ్ వేదికగా జరిగిన 2019 ప్రపంచకప్‌లో భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు. సెంచరీలు కాదని డబుల్ సెంచరీలను మంచీనీళ్ల ప్రాయంగా మలిచిన రోహిత్ ఆ మెగా టోర్నీలో ఏకంగా ఐదు సెంచరీలు బాది ఎవరికి అందనంత ఎత్తులో నిలిచాడు. అప్పటివరకు ఒక ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా శ్రీలంక దిగ్గజ క్రికెటర్ కుమార సంగక్కర పేరిట ఉండేది. రోహిత్ ఆ రికార్డును చెరిపేస్తూ కొత్త చరిత్రను సృష్టించాడు. రోహిత్ ఆ రికార్డు సాధించి నేటితో సరిగ్గా రెండేళ్లు. ఈ సందర్భంగా అప్పటి ఆసక్తికర విషయాలను ఒకసారి గుర్తుచేసుకుందాం. లీగ్ దశలో న భూతో భవిష్యత్తు అనేలా రోహిత్ ఆటతీరు సాగింది. కొడితే భారీ స్కోర్లు ఖాయం అనేలా అతని ఇన్నింగ్స్‌లు సాగాయి. లీగ్ దశలో దక్షిణాఫ్రికాపై 122* పరుగులు, చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై 140 పరుగులు, ఇంగ్లండ్‌పై 102, బంగ్లాదేశ్‌పై 104 పరుగులు చేశాడు. ఇక శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 103 పరుగులతో శతకం సాధించిన రోహిత్ ఒక మేజర్ టోర్నీలో అత్యధిక సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు. అయితే ఆఫ్గానిస్తాన్, వెస్టిండీస్‌లపై మాత్రం విఫలమైన రోహిత్ ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 57 పరగులు చేశాడు. రోహిత్ జోరుతో టీమిండియా మరోసారి విజేతగా నిలుస్తుందని అంతా భావించారు. కానీ రోహిత్ ఇదే టెంపోనూ కివీస్‌తో జరిగిన సెమీఫైనల్లో చూపెట్టలేకపోయాడు. ఆ మ్యాచ్‌లో రోహిత్ ఒక్క పరుగుకే వెనుదిరగడంతో అభిమానుల ఆశలు గల్లంతయ్యాయి. అయితే రోహిత్ ఇదే ప్రపంచకప్‌లో మరో రికార్డును కూడా సాధించాడు. ఒక్క ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ మూడో స్థానంలో నిలిచాడు. మొత్తంగా రోహిత్ శర్మ ఐదు సెంచరీల సాయంతో 648 పరుగులు చేశాడు. అంతకముందు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(673 పరుగులు, 2003 ప్రపంచకప్), ఆసీస్ మాజీ ఆటగాడు మాథ్యూ హెడెన్( 659 పరుగులు, 2007 ప్రపంచకప్) తొలి రెండు స్థానాల్లో నిలిచారు. అంతేగాక టీమిండియా తరపున సచిన్ తర్వాత ఒక ప్రపంచకప్‌లో 600 పైచిలుకు పరుగులు చేసిన రెండో ఆటగాడిగా రోహిత్ నిలవడం విశేషం. -
కొత్త జగజ్జేత అవతరించిన రోజు
న్యూఢిల్లీ: నరాలు తెగే ఉత్కంఠభరితమైన పోరు. ఆకాశమే హద్దుగా చెలరేగిన బ్యాట్స్‌మెన్, వికెట్లే లక్ష్యంగా బంతి విసిరిన బౌలర్లు. చివరకు మ్యాచ్ టై. ఓ సూపర్ ఓవర్. అది చాలక బౌండరీల లెక్కింపుతో విజేత నిర్ధారణ. క్రికెట్లో వీటిలో ఏదో ఒకటి అప్పుడప్పుడూ జరగడం సాధారణం. కానీ అన్నీ ఒకేసారి ఒకే మ్యాచ్‌లో కనిపిస్తే.. అది 2019 ప్రపంచకప్ ఫైనల్ అవుతుంది.వన్డేల హిస్టరీలోనే ఓ మైలురాయిగా నిలిచిన ఈ ఫైనల్‌కు నేటితో(జులై 14) ఓ ఏడాది నిండింది. ఈ చారిత్రాక మ్యాచ్ ఇంగ్లండ్ జట్టు బౌండరీ ఆధారంగా న్యూజిలాండ్‌పై నెగ్గి జగజ్జేతగా అవతరించింది. ఛేజింగ్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ బెన్ స్టోక్స్ పోరాటంతో ఆఖరి ఓవర్లో ఆ జట్టు 15 పరుగులు చేయాల్సివుంది. అంతకుముందు డీప్ వద్ద స్టోక్స్ ఇచ్చిన క్యాచ్‌ను ట్రెంట్ బౌల్ట్ జారవిడిచాడు.(‘గంగూలీలా ధోని చేయలేదు’) ఆరు బంతులు.. 15 పరుగులు ఆఖరి ఓవర్లో బంతిని అందుకున్న బౌల్ట్ తొలి రెండు డెలివరీలను డాట్స్‌గా మలిచాడు. స్టైక్‌లో ఉన్న స్టోక్స్ మూడో బంతిని సిక్సర్‌గా మలిచి ఇంగ్లండ్ శిబిరంలో ఆనందం నింపాడు. ఆ తర్వాతి బంతిని ఆడిన స్టోక్స్ పరుగు కోసం డైవ్ చేశాడు. ఫీల్డర్ గప్టిల్ శరవేగంగా బంతిని త్రో చేశాడు. అది స్టోక్స్ బ్యాట్‌ను బలంగా తాకి బౌండరీ దాటింది. దీంతో న్యూజిలాండ్ జట్టు నివ్వెరపోయింది. ఆఖరి బంతికి రెండు పరుగులు చేయాలి. ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ మార్క్ వుడ్ రనౌట్ అయ్యాడు. దీంతో మ్యాచ్ టై అయింది. సూపర్ ఓవర్లో స్టోక్స్, జోస్ బట్లర్ కలిసి న్యూజిలాండ్‌కు 16 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు.న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ జేమ్స్ నీషమ్ ఓ సిక్సర్ బాదాడు. చివరి బంతికి రెండు పరుగులు చేస్తే న్యూజిలాండ్ విశ్వవిజేతగా నిలుస్తుంది. రెండు పరుగుల కోసం ఊపిరి బిగబట్టి చేసిన ప్రయత్నంలో గప్టిల్ రనౌట్ అయ్యాడు. దాంతో న్యూజిలాంట్ టీమ్ నిరాశలో కూరుకుపోయింది.ఇంగ్లండ్ క్రీడాకారుల విజయనాథంతో లార్డ్స్ క్రికెట్ స్టేడియం ఉర్రూతలూగింది. ఈ మ్యాచ్‌లో బౌండరీల సంఖ్య ఆధారంగా ఇంగ్లండ్(26), న్యూజిలాండ్(17)పై గెలుపొందింది. వన్డే వరల్డ్‌కప్ చరిత్రలో క్రికెట్‌కు పుట్టినిల్లు అయిన ఇంగ్లండ్‌కు అదే తొలి కప్. -
భారత అభిమానుల గుండె పగిలిన రోజు
ముంబై : 2019.. జూలై 10వ తేది.. ప్రపంచకప్‌లో భాగంగా ఇండియా, న్యూజిలాండ్ మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్. భారత విజయలక్ష్యం 240 పరుగులు. అప్పటికే టీమిండియా 92 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తోంది. ఈ దశలో క్రీజులో ఉన్న ఎంఎస్ ధోని, రవీంద్ర జడేజాలు జట్టును ఓటమి నుంచి తప్పించే బాధ్యతను భుజానికెత్తుకున్నారు. ఇద్దరు కలిపి 7వ వికెట్‌కు అబేధ్యమైన 116 పరుగులు జోడించారు. కాగా జట్టు స్కోరు 207 పరుగుల వద్ద ఉన్నప్పుడు 77 పరుగులు చేసిన జడేజా క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. అయినా భారత అభిమానులు ఏ మాత్రం బెదరలేదు .. ఎందుకంటే అప్పటికే ధనాదన్ ధోని క్రీజులో పాతుకుపోయాడు. ధోని ఉన్నాడన్న ధైర్యం అభిమానులను కుంగిపోకుండా చేసింది. 2011 ఫైనల్ ప్రదర్శనను మరోసారి పునరావృతం చేస్తాడని, లార్డ్స్‌లో జరిగే ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఉంటుందని అంతా భావించారు.అయితే విజయానికి 24 పరుగుల దూరంలో ఉన్నప్పుడు ధోని రనౌట్ అయ్యాడు. అంతే స్టేడియం మొత్తం ఒక్కసారిగా నిశబ్ధంగా మారిపోయింది. ఇది నిజమా కాదా అని నిర్థారించుకునేలోపే ధోని పెవిలియన్ బాట పట్టాడు. అప్పటిదాకా ధోని ఉన్నాడనే ధైర్యంతో ముందుకు సాగిన అభిమానుల గుండెలు పగిలాయి. టీమిండియాను ఫైనల్లో చూస్తామన్న వారి కలల ఆవిరయ్యాయి. చూస్తుండగానే భారత ఇన్నింగ్స్ కుప్పకూలింది. కేవలం 18 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చేతిలో ఓడి ఇంటిబాట పట్టింది.('కెప్టెన్‌గా నాకు పూర్తి స్వేచ్ఛనివ్వలేదు') అప్పటిదాకా ధోని మీద అభిమానం ఉన్నవాళ్లు కూడా.. ధోని ఎందుకిలా చేశాడు.. ఒక్క పరుగుతో సరిపెట్టుకుంటే ఫలితం వేరేలా వచ్చి ఉండేది అంటూ దుమ్మెత్తిపోశారు. యాదృదశ్చికమె లేక దురదృష్టమో తెలియదు గాని మహీ చివరిసారిగా మైదానంలో కనిపించింది ఆరోజే. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడు బ్లూ జెర్సీ ధరించలేదు.ఈ బాధ భారత్ క్రికెట్‌తో పాటు అభిమానులను కూడా చాలా కాలం వెంటాడింది. సరిగ్గా ఈ ఘటన జరిగి ఈ రోజుకు ఏడాది. ఐసీసీ ఈ విషయాన్ని మరోసారి గుర్తు చేస్తూ ట్విటర్లో ధోని రనౌట్ వీడియోను షేర్ చేసింది. 'భారత అభిమానుల గుండె పగిలిన సన్నివేశం ఇది' అంటూ క్యాప్షన్ జత చేశారు. WHAT A MOMENT OF BRILLIANCE! Martin Guptill was 🔛🎯 to run out MS Dhoni and help send New Zealand to their second consecutive @cricketworldcup final! #CWC19 pic.twitter.com/i84pTIrYbk — ICC (@ICC) July 10, 2019 కాగా అప్పటి 2019 ప్రపంచకప్ సెమీ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రిజర్వ్ డే రోజు కూడా ఆడాల్సి వచ్చింది. జూలై 9, 2019న టాస్ గెలిచి బ్యాటింగ్ ఏంచుకున్న కేన్ విలియమ్సన్ సేనను భూవీ, బుమ్రా జోడి కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ముప్పతిప్పలు పెట్టింది. కివీస్ జట్టులో కెప్టెన్ విలియమ్సన్, రాస్ టేలర్ అర్థసెంచరీలతో రాణించడంతో 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. ఈ దశలో మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలగడంతో మ్యాచ్‌ను రిజర్వ్ డేకు వాయిదా వేసింది. మరుసటి రోజు 240 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ టాప్ ఆర్డర్ విఫలంతో 49.3 ఓవర్లలో 221 పరుగులు వద్ద ఆలౌటైంది. -
'కోపం వచ్చింది.. ఏం చేయలేకపోయా'
ఢిల్లీ : ఇండియా, పాకిస్తాన్ల మధ్య మ్యాచ్ అంటే ఆ మజా ఎలా ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మైదానంలోనే కాదు బయట కూడా ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం తీవ్రంగా ఉంటుందనడంలో సందేహం లేదు. 2019 ప్రపంచకప్ సందర్భంగా జూన్ 16న మాంచెస్టర్‌లో పాకిస్తాన్‌తో లీగ్ మ్యాచ్‌కు ఒకరోజు ముందు జరిగిన ఘటనను తాజాగా విజయ్‌శంకర్ భారత్ ఆర్మీ పోడ్కాస్ట్తో మాట్లాడుతూ గుర్తు చేసుకున్నాడు. ' పాక్‌తో మ్యాచ్‌కు ఒకరోజు ముందు జట్టు మేనేజ్మెంట్ నా దగ్గరకు వచ్చి రేపటి మ్యాచ్‌లో నువ్వు ఆడుతున్నావు. సిద్ధంగా ఉండు అని చెప్పడంతో నేను ఓకే చెప్పాను. ఆ తర్వాత అదే రోజు కొంతమంది ఆటగాళ్లం కాఫీ కోసమని బయటకు వెళ్లాం. అదే సమయానికి అక్కడికి వచ్చిన పాక్ అభిమాని మా వద్దకు వచ్చి ఏవో అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేశాడు. అతను అలా చేస్తుంటే చాలా కోపం వచ్చింది. అయితే చూస్తూ ఊరుకున్నాం తప్ప అతన్ని ఏం చేయలేకపోయాం. భారత్- పాక్‌కు మ్యాచ్ అంటే పరిస్థితి ఎలా ఉంటుందో అప్పుడే నాకు మొదటిసారి తెలిసింది ' అని పేర్కొన్నాడు.(అద్భుతం : 30 ఏళ్ల నిరీక్షణకు తెర) 2019 ప్రపంచకప్‌కు అప్పటికే మంచి ఫామ్‌లో ఉన్న అంబటి రాయుడుని కాదని త్రీ డైమన్షనల్ ప్లేయర్ అంటూ విజయ శంకర్‌ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. దీనిపై అప్పట్లో పెద్ద వివాదమే చెలరేగింది. కాగా శిఖర్ ధావన్ గాయం కారణంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తుది జట్టులో చోటు దక్కించుకున్న విజయ్ శంకర్.. ఆ మ్యాచ్‌లో ఫర్వాలేదనిపించాడు. బౌలింగ్‌లో రెండు వికెట్లు తీయడంతో భారత మేనేజ్మెంట్ సంతృప్తి చెందింది. కండరాల గాయంతో భువనేశ్వర్ ఒక పూర్తి చేయకుండా పెవిలియన్‌కు చేరినప్పుడు మిగతా రెండు బంతుల్ని విజయ్ శంకర్ వేశాడు. తాను వేసిన తొలి బంతికి ఇమాముల్ హక్‌ను వికెట్లు ముందు దొరకబుచ్చుకుని భళా అనిపించాడు. ఆపై మరొక ఓవర్లో సర్ఫరాజ్ వికెట్‌ను కూడా దక్కించుకుని మొత్తంగా రెండు వికెట్లు తీశాడు. దాంతో అఫ్గానిస్తాన్, వెస్టిండీస్‌లతో జరిగిన మ్యాచ్‌ల్లో తుది జట్టుకు ఎంపికైన విజయ్ అఫ్గాన్‌తో మ్యాచ్‌లో 29 పరుగులు, విండీస్‌తో మ్యాచ్‌లో 14 పరుగులు చేసి నిరాశపరిచాడు. అయితే అంతలోనే కాలి బొటనవేలి గాయంతో మిగతా మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అప్పటినుంచి ఒకవన్డే మ్యాచ్ కూడా ఆడలేదు. మొత్తంగా టీమిండియా తరపున 12 వన్డేల్లో 223 పరుగులు, 4 వికెట్లు తీశాడు. -
ప్చ్.. ధోని అలా బ్యాటింగ్ చేసాడేంటి?
హైదరాబాద్: ఐసీసీ వన్డే ప్రపంచకప్-2019లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎంఎస్ ధోని బ్యాటింగ్ తీరును ఇంగ్లీష్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ తప్పుపట్టాడు. భారీ లక్ష్య ఛేదనలో ధోని బ్యాటింగ్ వింతగా అనిపించిందన్నాడు. స్టోక్స్ త్వరలో ఆవిష్కరించనున్న 'ఆన్‌ఫైర్' అనే పుస్తకంలో ఈ ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. అంతేకాకుండా ఆ మ్యాచ్‌లో ధోని, జాదవ్ ఆటలో అసలు ఏ మాత్రం కసి కనిపించలేదన్నాడు. గెలిచే అవకాశం ఉంటే దూకుడుగా ఆడటమై సరైనదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. 'లక్ష్య ఛేదనలో భారత్ విజయానికి 11 ఓవర్లలో 112 పరుగులు అవసరమైనప్పుడు ధోనీ క్రిజులోకి వచ్చాడు. అప్పుడు అతడి ఆటలో కసి కనిపించలేదు. సిక్సర్లు బాదడం కన్నా.. సింగిల్స్‌పైనే ఎక్కువ దృష్టి సారించడం నన్ను ఆశ్చర్యపరిచింది. రెండు ఓవర్లు మిగిలున్నప్పుడు మేం నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని టీమిండియా ఛేదించాలి. కానీ ధోని, జాదవ్‌ల బ్యాటింగ్ మ్యాచ్‌ను మా వైపు టర్న్ చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో రోహిత్, కోహ్లిల బ్యాటింగ్‌కు కూడా విచిత్రంగా అనిపించింది. 27 ఓవర్ల వరకు క్రీజులో ఉండి 138 పరుగుల భాగస్వామ్యమే నమోదు చేశారు. అయితే మేం బాగా బౌలింగ్ చేశామని తెలుసు. కానీ టీమిండియా బ్యాటింగ్ విచిత్రంగా అనిపించింది. ఇలాంటి సమయంలో అటాకింగ్ చేసి మాపై ఒత్తిడి పెంచాలి. కానీ ఆ విషయంలో రోహిత్-కోహ్లిలు విఫలమయ్యారు. దీంతో విజయవకాశాలు మాకు ఎక్కువయ్యాయి’ అని స్టోక్స్ అనాటి మ్యాచ్‌కు సంబంధించిన విషయాలను గుర్తుచేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో టీమిండియా ఓడిపోయిన విషయం తెలిసిందే. చదవండి: టీ20 ప్రపంచకప్ వాయిదా? రేపు క్లారిటీ! 'ఇద్దరూ గొప్పే.. కానీ స్మిత్‌కే నా ఓటు' -
టీమిండియా ‘సూపర్‌ఫ్యాన్’ ఇకలేరు
లండన్: గతేడాది జరిగిన వరల్డ్‌కప్‌లో టీమిండియా ‘సూపర్‌ఫ్యాన్’ చారులతా పటేల్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. భారత్ గెలిచిన ప్రతీ మ్యాచ్‌లోనూ ఆమె సందడి చేస్తూ ప్రేక్షకుల్లో సరికొత్త జోష్‌ను తీసుకొచ్చారు. 87 ఏళ్ల వయసులో చారులా పటేల్ క్రికెట్ మ్యాచ్‌లకు చూడటానికి స్టేడియానికి వచ్చీ మరీ మ్యాచ్‌లను వీక్షించారు. అయితే ఇప్పుడు ఆమె ఇకలేరని వార్త క్రికెట్ అభిమానుల్లో విషాదం నింపింది. జనవరి 13వ తేదీ ఉదయం గం. 5.30.నిలకు ఆమె మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో చారులతా పటేల్ ఒక సెలబ్రెటీగా మారిపోయారు. మ్యాచ్ జరుగుతున్నంతా సేపు అభిమానుల్ని ఉత్సాహ పరుస్తూ ఆమె సందడి చేశారు. ఆ మ్యాచ్ ముగిసిన తర్వాత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు ఆమెతో ముచ్చటించారు. ఈ క్రమంలోనే ఆమె ఆశీర్వాదం కూడా తీసుకున్నారు.ఎనిమిది పదుల వయసు దాటినా భారత క్రికెట్ అభిమానిగా ఆమె అందరిలో ప్రేరణ నింపడం అభినందనీయం. కాగా తాను భారత క్రికెట్ జట్టుకు దశాబ్ధాల నుంచి వీరాభిమానిగా కొనసాగుతున్నారు. 1983లో కపిల్ సేన ప్రపంచ కప్‌ను ముద్దాడిన సమయంలో తాను స్టేడియంలోనే ఉన్నానని విషయాన్ని చారులతా పటేల్ ఇది వరకే తెలపడం ఆమెకు క్రికెట్‌పై ఉన్న ప్రేమకు, ప్రధానంగా భారత జట్టుపై ఉన్న అభిమానానికి నిదర్శనం. భారత సంతతికి చెందిన ఆమె.. పుట్టి పెరిగింది విదేశాల్లోనే. బ్రిటన్‌కు రాకముందు ఆమె దక్షిణాఫ్రికాలో ఉండేవారు. 1975 నుంచి ఆమె బ్రిటన్‌లో ఉన్నారు. చిన్నప్పట్నుంచి క్రికెట్‌కు వీరాభిమాని అయిన చారులతా పటేల్.. భారత్ ఆడే మ్యాచ్‌లను క్రమం తప్పకుండా టీవీల్లో వీక్షించేవారు. కాగా, గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. సోమవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ‘ఈ విషయాన్ని శోకతప్త హృదయాలతో తెలియపరచాల్సి వస్తుంది. మా గ్రాండ్ మదర్ తుది శ్వాస విడిచారు. ఆమె చాలా మంచి మనిషే కాదు.. ఒక అసాధారణమైన వ్యక్తిత్వం కూడా ఆమె సొంతం. ఆమె మా ప్రపంచం’ అని చారులతా పటేల్ ఇన్‌స్టాగ్రామ్‌లో కుటుంబ సభ్యుల్లో ఒకరు పోస్ట్ చేశారు. చారులతా పటేల్ మృతిపై బీసీసీఐ సంతాపం వ్యక్తం చేసింది. చారులతా ఎప్పుడూ భారత జట్టుతోనే ఉంటారని, ఆమె ఆత్మకు శాంతి కలగాలని పేర్కొంది. -
రికార్డు సృష్టించిన భారత్-పాక్ మ్యాచ్
ఇంగ్లండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్-2019లో భాగంగా భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సరికొత్త రికార్డు సృష్టించింది. పుల్వామా ఉగ్రదాడి అనంతరం ఇరుదేశాల మధ్య జరిగిన ఈ ఉద్వేగభరితమైన మ్యాచ్‌ను ప్రపంచ వ్యాప్తంగా 273 మిలియన్ల మంది టీవీల్లో ప్రత్యక్షంగా వీక్షించగా.. డిజిటల్ వేదికగా 50 మిలియన్ల మంది తిలకించారు. ఈ వివరాలు ఐసీసీ మీడియా అధికారికంగా ప్రకటించింది అంతేకాకుండా భారత్- న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన కీలక సెమీఫైనల్‌ను కూడా ప్రేక్షకులు భారీగానే ఆదరించారు. ఈ సెమీఫైనల్ మ్యాచ్‌ను 25.3 మిలియన్ల మంది లైవ్‌స్ట్రీమింగ్‌లో వీక్షించారు. ఓవరాల్‌గా ఈ ప్రపంచకప్‌ను 1.6 బిలియన్లకు(160 కోట్లు)పైగా క్రికెట్ అభిమానులు ఆదరించారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఐసీసీ ప్రపంచకప్ ఈవెంట్స్, లైవ్, హైలెట్స్ 20,000 గంటలకు పైగా ప్రసారం కావడం విశేషం. గత ప్రపంచకప్‌తో పోలిస్తే ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఈ మెగా టోర్నీని 38 శాతం మంది అధికంగా తిలకించారని ఐసీసీ తెలిపింది. దీంతో అన్ని విధాల ఇంగ్లండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్ విజయవంతమైనట్లు ఐసీసీ ఆనందం వ్యక్తం చేసింది. టోర్నీ ఆరంభంలో పలు మ్యాచ్‌లకు వర్షం అడ్డంకిగా నిలవడంతో అభిమానులకు ప్రపంచకప్‌పై ఆసక్తి పోయిందని వార్తలు వచ్చాయి. కానీ టోర్నీ నడుస్తున్న కొద్దీ మ్యాచ్‌లు రసవత్తరంగా జరగడంతో ప్రపంచకప్‌కు డబుల్ క్రేజ్ ఏర్పడిందని ఐసీసీ అధికారి ఒకరు పేర్కొన్నారు. -
అదే అతి పెద్ద పరాభవం: రవిశాస్త్రి
ఆంటిగ్వా: వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా సెమీస్ రేసు నుంచి నిష్క్రమించడమే తన గత రెండేళ్ల కోచింగ్ పర్యవేక్షణలో అతి పెద్ద పరాభవమని మరొకసారి ప్రధాన కోచ్‌గా ఎంపికైన రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. ఆ మెగా టోర్నీలో వరుస విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచినప్పటికీ సెమీస్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోవడం తీవ్ర నిరాశకు గురి చేసిందన్నాడు. కేవలం 30 నిమిషాల ఆటే తమ నుంచి మ్యాచ్‌ను లాగేసుకుందని రవిశాస్త్రి అన్నాడు. ‘ 2019 వరల్డ్‌కప్ లీగ్ దశలో కేవలం ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయినా టాప్‌లో నిలిచాం. కానీ సెమీస్‌లో న్యూజిలాండ్ చేతిలో పోరాడి ఓడిపోయాం. కేవలం 30 నిమిషాల ఆటే మమ్మల్ని వెనక్కి నెట్టింది. నా గత రెండేళ్ల కోచింగ్ కెరీర్లో అది పెద్ద పరాభవం. ఒక చెడు రోజు, ఒక చెత్త సెషన్ మాకు శాపంగా మారింది’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. ‘తదపరి రెండేళ్లలో రెండు ఐసీసీ టోర్నమెంట్లు ఉన్నాయి. ఇప్పటికే టెస్టు చాంపియన్‌షిప్ మొదలైంది. 2021లో టీ20 వరల్డ్‌కప్ జరుగనుంది. ఈ రెండింటికే తొలి ప్రాధాన్యత ఉంటుంది. ఆ మేరకు సన్నద్ధం కావడమే నా ముందున్న లక్ష్యం’ అని తెలిపాడు. గత వారం టీమిండియా ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రిని తిరిగి ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. -
కెప్టెన్సీకి గుడ్ బై చెప్పనున్నాడా?
లండన్: ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్సీ పదవికి ఇయాన్ మోర్గాన్ గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నాడు. వరల్డ్‌కప్‌లో వెన్నునొప్పి బాధతో సతమతమైన మోర్గాన్.. సారథ్య బాధ్యతల నుంచి తప్పుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లే కనబడుతోంది. తాజాగా మోర్గాన్ చేసిన వ్యాఖ్యలు అందుకు బలాన్ని ఇస్తున్నాయి. కెప్టెన్‌గా కొనసాగాలా.. వద్దా అనేది గత కొన్ని రోజులుగా తనకు ఒక ప్రశ్నగా వేధిస్తుందని, దీనిపై త్వరలోనే కచ్చితమైన నిర్ణయం వెలువరిస్తారనని పేర్కొన్నాడు. ‘నేను పూర్తి ఫిట్నెస్ సాధించడానికి కాస్త సమయం పడుతుంది. ఇంగ్లండ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం పెద్ద బాధ్యత. నాకు తప్పుకోవాలని ఉన్నా.. అది చాలా పెద్ద నిర్ణయంగా మారింది. ప్రస్తుత కాలం త్వరగా గడిస్తే పూర్తిగా కోలుకుంటాను. అప్పుడు ఏదైనా నిర్ణయం తీసుకునేందుకు అవకాశం ఉంది. 2021 టీ20 వరల్డ్‌కప్ వరకూ కెప్టెన్‌గా కొనసాగితే అది చాలా పెద్ద నిర్ణయమే అవుతుంది. చూద్దాం.. ఏమి జరుగుతుందో?’ అని మోర్గాన్ పేర్కొన్నాడు. ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో మోర్గాన్ నాయకత్వంలోని ఇంగ్లండ్ విశ్వవిజేతగా నిలిచింది. ఫలితంగా నాలుగు దశాబ్దాల ఇంగ్లండ్ కలను మోర్గాన్ నిజం చేసినట్లయ్యింది. -
ఆ ‘ఓవర్ త్రో’పై కుండబద్దలు కొట్టిన స్టోక్స్
ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చివరి ఓవర్లో ‘ఓవర్ త్రో’కు ఆరు పరుగులు కేటాయించడం వివాదం రేపిన సంగతి తెలిసిందే. అయితే, ఆ ‘ఓవర్ త్రో’కు ఇచ్చిన అదనపు పరుగులు అవసరం లేదని తాను ఎంపైర్‌తో చెప్పినట్టు వచ్చిన కథనాలపై తాజాగా ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ స్పందించాడు. అంపైర్ వద్దకు వెళ్లి.. అదనపు నాలుగు పరుగులు వద్దని కోరినట్టు వచ్చిన కథనాలన్నీ వదంతులేనని అతను తేల్చిచెప్పాడు. బీబీసీ పొడ్‌క్యాస్ట్‌లో మాట్లాడిన స్టోక్స్.. గుండెల మీద చేయి వేసుకొని నిజాయితీగా చెప్తున్నా. నేను ఎంపైర్ వద్దకు వెళ్లి.. అలాంటిదేమీ చెప్పలేదని స్పష్టం చేశాడు. న్యూజిలాండ్ బౌలర్ టామ్ లాథమ్ వద్దకు వెళ్లి క్షమాపణ అడిగానని, అలాగే కివీస్ సారథి కేన్ విలియమ్సన్‌ను క్షమించమని కోరానని వెల్లడించాడు. ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్ విజయంలో ‘6 పరుగుల ఓవర్‌త్రో’ పాత్ర కూడా ఉన్న సంగతి తెలిసిందే. చివరి ఓవర్లో మార్టిన్ గప్టిల్ విసిరిన త్రో బెన్ స్టోక్స్ బ్యాట్‌కు తగిలి బౌండరీ దాటగా.. అంపైర్ ధర్మసేన ఆరు పరుగులు ప్రకటించడం, బ్యాటింగ్ కొనసాగించిన స్టోక్స్ ఆ తర్వాత మ్యాచ్‌ను ‘టై’ వరకు తీసుకురావడం జరిగాయి. వాస్తవానికి దానికి 5 పరుగులు ఇవ్వాల్సిందని మాజీ అంపైర్లు విమర్శించారు కూడా. అయితే, నిజానికి స్టోక్స్.. ఆ ఓవర్‌త్రో ద్వారా వచ్చిన 4 అదనపు పరుగులు తమకు వద్దని అంపైర్లకు చెప్పినట్లుగా అండర్సన్ వెల్లడించడంతోపాటు.. అసలు అదనపు పరుగులు వద్దని స్టోక్స్ వేడుకున్నా అంపైర్లు వినిపించుకోలేదని సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో స్టోక్స్ ఈ కథనాలన్నింటినీ కొట్టిపారేస్తూ.. క్లారిటీ ఇచ్చారు. -
‘బౌండరీ రూల్’ మారుతుందా?
దుబాయ్: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా ఫైనల్లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌండరీల ఆధారంగా ఇంగ్లండ్‌ను విశ్వ విజేతగా ప్రకటించడంతో ఐసీసీపై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. సూపర్ ఓవర్లో పరుగులు కూడా సమం అయిన పక్షంలో బౌండరీల లెక్కింపుతో గెలుపును నిర్ణయించడం సరికాదని పలువురు క్రికెట్ విశ్లేషకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దీనిపై ఎట్టకేలకు ఐసీసీ దిగివచ్చింది. ఈ రూల్ ఎంతవరకూ సమంజసం అనే దానిపై సమీక్ష సమావేశం నిర్వహించనుంది.దీనిలో భాగంగా బౌండరీల లెక్కించే నిబంధనపై సమీక్షించేందుకు భారత మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఐసీసీ నిర్వహించే తదుపరి సమావేశంలో ఈ నిబంధనపై చర్చించనున్నారు. సమావేశం వచ్చే ఏడాది త్రైమాసికంలో జరగుతుందని ఐసీసీ జనరల్ మేనేజర్ జియోఫ్ అలార్డెస్ తెలిపారు. ‘మ్యాచ్ టైగా ముగిస్తే సూపర్ ఓవర్‌తో విజేతను నిర్ణయించే పద్ధతిని 2009 నుంచి పాటిస్తున్నారు. సూపర్ ఓవర్లో కూడా పరుగులు సమం అయితే బౌండరీల లెక్కతో గెలుపును ప్రకటిస్తారు. ప్రపంచకప్ ఫైనల్లోనూ అదే జరిగింది. ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న టీ20లీగ్‌ల్లోనూ దాదాపుగా ఇదే ప్రక్రియను నిర్వహిస్తున్నారు. అంతర్జాతీ క్రికెట్లో ఒకే తరహాలో సూపర్ ఓవర్ నిబంధనలు ఉండాలి. దీనిపై ప్రత్యామ్నాయాలు ఉంటే అనిల్ కుంబ్లే నేతృత్వంలోని క్రికెట్ కమిటీ పరిశీలిస్తుంది’ అని జియోఫ్ పేర్కొన్నారు. మరి బౌండరీ రూల్ మారుతుందో.. లేదో చూడాలి. -
ఆ విషయంలో ధర్మసేనది తప్పులేదు : ఐసీసీ
దుబాయ్ : ప్రపంచకప్ ఫైనల్లో చోటుచేసుకున్న ఓవర్‌త్రో వివాదాస్పదంపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) స్పందించింది. ఈ విషయంలో అంపైర్ కుమార ధర్మసేనది ఏ మాత్రం తప్పులేదని వెనకేసుకొచ్చింది. ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య జరిగిన ఉత్కంఠకర ఫైనల్ మ్యాచ్‌లో చోటుచేసుకున్న ఓవర్‌త్రో ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. ఆఖరి ఓవర్లో మార్టిన్ గప్టిల్ విసిరిన బంతి బెన్‌స్టోక్స్ బ్యాట్‌కు తగిలి బౌండరీకి వెళ్లడం.. ఫీల్డ్ అంపైర్ ధర్మసేన 6 పరుగులివ్వడం తెలిసిందే. అయితే నిబంధనల ప్రకారం ఐదు పరుగులు ఇవ్వాలని ధర్మసేన అత్యుత్సాహంతో 6 పరుగులిచ్చి న్యూజిలాండ్ ఓటమికి కారణమయ్యాడని అతనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ విషయంలో ధర్మసేన తన తప్పును అంగీకరించాడు. కానీ తన నిర్ణయం పట్ల పశ్చాతాపం మాత్రం వ్యక్తం చేయనన్నాడు. ఇక తాజాగా ఈ వివాదంపై ఐసీసీ జనరల్ మేనేజర్ (క్రికెట్) జియోఫ్ అలార్డిస్ స్పందించాడు. ఈ విషయంలో ఫీల్డ్ అంపైర్ల తప్పేం లేదన్నాడు. ‘ ఆ రోజు ఫీల్డ్ అంపైర్లు సరైన విధానంలోనే నిర్ణయం ప్రకటించారు. ఫీల్డర్ త్రో వేసే సమయానికి బ్యాట్స్‌మన్ ఇద్దరు ఒకరినొకరు దాటారని భావించి, పద్దతి ప్రకారం చర్చించుకునే ఆ నిర్ణయాన్ని ప్రకటించారు. ఆ సమయంలో బ్యాట్స్‌మెన్ ఒకరినొకరు దాటారా? లేరా? అనే నిబంధనపై వారికి అవగాహన ఉండటం గొప్ప విషయం. కానీ ఆ పరిస్థితులు థర్డ్ అంపైర్‌ను సమీక్ష కోరే అవకాశాన్ని ఇవ్వవు. ఇక ఫీల్డ్ అంపైర్లు తుది నిర్ణయం ప్రకటించాక, అది తప్పని మ్యాచ్ రిఫరీ జోక్యం చేసుకోలేడు’ అని చెప్పుకొచ్చారు. -
‘పెయిన్ కిల్లర్స్‌తోనే ప్రపంచకప్ ఆడాను’
లండన్ : ఇంగ్లండ్ విశ్వవిజేతగా నిలవడంలో ఆ జట్టు పేసర్ జోఫ్రా ఆర్చర్ కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని తలపించిన ఫైనల్ మ్యాచ్‌లో సూపర్ ఓవర్లో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసి ఇంగ్లండ్‌కు విజయాన్నందించాడు. ఆడిన తొలి ప్రపంచకప్‌లోనే జట్టుకు అందని ద్రాక్షగా మిగిలిన మెగా టైటిల్‌ను అందించాడు. అయితే ఈ టోర్నీ ఆద్యాంతం పక్కటెముకల నొప్పితో విలపించినట్లు ఆర్చర్ ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. పెయిన్ కిల్లర్లు లేనిదే ఆడలేని పరిస్థితి ఏర్పడిందని తన బాధను వెల్లడించాడు. విశ్రాంతి తీసుకునే పరిస్థితి కూడా లేదని, జట్టు తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పుకొచ్చాడు. అఫ్గానిస్తాన్ మ్యాచ్‌లో ఈ నొప్పి మరింత తీవ్రమైందని కానీ అప్పటికే జట్టు క్లిష్ట పరిస్థితిలో ఉందన్నాడు. ‘తీవ్ర నొప్పితో విలవిలలాడాను. అదృష్టవశాత్తు ఆ నొప్పి నుంచి త్వరగానే కోలుకున్నాను. కానీ అది వర్ణించలేని బాధ. అఫ్గాన్ మ్యాచ్ అనంతరం పెయిన్ కిల్లర్స్ లేనిదే ఆడలేని పరిస్థితి నెలకొంది. కనీసం విశ్రాంతి తీసుకునే పరిస్థితి కూడా లేదు.’ అని ఆర్చర్ చెప్పుకొచ్చాడు. ప్రపంచకప్ అద్భుత ప్రదర్శనతో యాషెస్ టెస్ట్ సిరీస్ ఎంపికైన ఈ యువ పేసర్.. ఈ సిరీస్ ద్వారా అంతర్జాతీయ టెస్టుల్లోకి అరంగేట్రం చేయనున్నాడు. -
‘సారథిగా తప్పుకుంటే నీకే మంచిది’
రావల్పిండి : తాజా ప్రపంచకప్‌లో పాకిస్తాన్ ఓటమిని ఆ దేశ అభిమానులు, మాజీ క్రికెటర్లు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆటగాళ్ల ప్రదర్శనను, కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ వైఫల్యాలను వేలెత్తి చూపుతూ నిందిస్తున్నారు. తాజాగా రావల్పిండి ఎక్స్ ప్రెస్ షోయబ్ అక్తర్ పాక్ సారథి సర్ఫరాజ్‌పై మరోసారి నిప్పులు చెరిగాడు. బుధవారం తన యూట్యూబ్ చానల్లో ఓ వీడియో పోస్ట్ చేసిన అక్తర్.. పాక్ జట్టుకు సారథిని మార్చే సమయం వచ్చిందంటూ పేర్కొన్నాడు. అయితే సర్ఫరాజ్‌ను జట్టు నుంచి తప్పించాల్సిన అవసరం లేదన్నాడు. అతడి కీపింగ్, బ్యాటింగ్ పాక్‌కు ఎంతగానో ఉపయోగపడుతుందన్నాడు. సర్ఫరాజ్ స్థానంలో వన్డే, టీ20లకు హారీస్ సోహైల్‌ను, టెస్టులకు బాబర్ అజమ్‌ను సారథులుగా ఎంపిక చేయాలని సూచించాడు. ‘సర్ఫరాజ్ స్వతహాగా సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగితే బెటర్. కెప్టెన్సీ నుంచి తప్పుకొని బ్యాటింగ్, కీపింగ్‌పై దృష్టి పెడితే అతడికి, పాక్ క్రికెట్‌కు ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రపంచకప్‌లో పాక్ సారథిగా సర్ఫరాజ్ తేలిపోయాడు. యువకులకు సారథ్య బాధ్యతలను అప్పగిస్తే బెటర్. హారీస్ సోహైల్(వన్డే, టీ20), బాబర్ అజమ్(టెస్టు)లకు సారథ్య బాధ్యతలను అప్పంగించాలి’అంటూ అక్తర్ పేర్కొన్నాడు. ఇక గతంలో కూడా సర్ఫరాజ్ ‘తెలివితక్కువ సారథి’అంటూ వ్యాఖ్యానించాడు. ఇక పాక్ జట్టును త్వరలోనే అన్ని విధాల సెట్ చేస్తానని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. -
ఆర్చర్.. టైమ్ మిషన్ ఉందా ఏందీ?
ప్రపంచకప్ ఫైనల్ అనంతరం ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ పాత ట్వీట్లు అభిమానుల్లో ఆసక్తిని రేకిత్తించాయి. అతనికి సూపర్ నేచురల్ పవర్స్ ఏమైనా ఉన్నాయా? అనే సందేహాన్ని కలిగించాయి. తాజాగా ఐర్లాండ్‌తో నాలుగు రోజుల టెస్ట్ సందర్భంగా కూడా మరోసారి అతని పాత ట్వీట్లు చర్చనీయాంశమయ్యాయి. 2013లో చేసిన ట్వీట్లలో ఆర్చర్ చెప్పినట్లు ఇప్పుడు జరుగుతుండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ‘6 బంతులు16 పరుగులు’ అని చేసిన ట్వీట్ ప్రపంచకప్ అనంతరం చర్చకు దారీ తీసింది. వరల్డ్‌కప్ ఫైనల్లో ఇంగ్లండ్ సూపర్ ఓవర్లో 15 పరుగులు చేసింది.. న్యూజిలాండ్ లక్ష్యం ఆరు బంతుల్లో 16 పరుగులు. మరి దీన్ని ముందే ఊహించే ఆర్చర్ ట్వీట్ చేశాడా అనేది అభిమానులకు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. అలాగే 2014లో లార్డ్స్‌కు వెళ్తున్నాం.. 2015లో సూపర్ ఓవర్‌ను పట్టించుకోవడం లేదని ట్వీట్ చేశాడు. ఇవి కూడా ప్రపంచకప్ ఫైనల్ పరిస్థితులనే తలపించాయి. 2015లో ‘ఐర్లాండ్ లుకింగ్ గుడ్’ అని చేసిన ట్వీట్ మరోసారి ఈ తరహా చర్చకు దారితీసింది. బుధవారం నుంచి ప్రారంభమైన నాలుగు రోజుల టెస్ట్‌లో ఐర్లాండ్ అద్భుత ప్రదర్శనతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌ను 85 పరుగులకే కుప్పకూల్చింది. అయితే ఇది ఊహించే ఆర్చర్ 2015లో ట్వీట్ చేశాడా? అని అభిమానులు మళ్లీ సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ట్వీట్‌ను క్రికెట్ ఐర్లాండ్ రీట్వీట్ చేయడం గమనార్హం. దీంతో ఆర్చర్ నీ దగ్గర ఏమైనా టైం మిషన్ ఉందా? అని ఒకరు.. ‘ఆర్చర్ జ్యోతిష్యం చెప్పరాదు’ అని మరొకరు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. (చదవండి: ఇంగ్లండ్‌కు షాకిచ్చిన ఐర్లాండ్) :) https://t.co/hSPNT9iv9v — Cricket Ireland (@Irelandcricket) July 24, 2019 -
అవే నన్ను రాటుదేలేలా చేసాయి : కోహ్లి
న్యూఢిల్లీ : కెరీర్‌లోని వైఫల్యాలు, ఎదురుదెబ్బలే తనను మరింత రాటుదేలేలా చేసాయని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తెలిపాడు. ప్రపంచకప్ ఓటమి అనంతరం టైమ్స్ నౌకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కోహ్లి మాట్లాడుతూ.. వైఫల్యాలే తనను మనిషిగా మెరుగుపర్చాయని చెప్పుకొచ్చాడు. ‘నా జీవితంలోనే వైఫల్యాలు, ఎదురుదెబ్బలతోనే చాలా నేర్చుకున్నాను. వీటి నుంచి స్పూర్తిపొందడమే కాకుండా ఓ మనిషిగా కూడా మెరుగయ్యాను. విజయాల కంటే వైఫల్యాల ప్రాముఖ్యతను నాకు అర్థమయ్యేలా చేసిన సందర్భాలు కూడా ఇవే. కావాల్సిందేదో తెలుసుకునేలా.. ప్రణాళికలు రచించుకునేలా చేసాయి. అలాగే మద్దతుగా ఉండే వ్యక్తులు ఎవరు? తప్పుకునేవారు ఎవరని కూడా తెలియజేసాయి. మనం ఎదుగుతున్న సమయంలో అకస్మాత్తుగా జరిగిన కొన్ని సంఘటనలు మనల్ని కుంగదీస్తాయి. ప్రతీ ఒక్కరు బాగా ఆడుతున్నా మనం ఆడలేకపోతాం. మనం ఏ తప్పు చేయలేదని మనకు తెలుస్తోంది. కానీ తోటి ఆటగాళ్లు మాత్రం మనల్ని మించిపోతారు. ఇలాంటి విషయాలు జీర్ణించుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. మనం ఎలాంటి తప్పులు చేయకపోయినా.. ఒకొక్కసారి ఓడిపోవడం జరుగుతుంది. సాధారణంగా మనం పొరపాట్లు చేసినప్పుడు.. దాన్ని ఎత్తి చూపితే.. పెద్దగా పట్టించుకోం. కానీ మనం ఒక మంచి ప్లేయర్ అయ్యాక ఏమైనా తప్పులు ఎత్తి చూపితే వాటిని తట్టుకోలేం. అలాంటివాటికోసం ఆలోచిస్తూ... వాటి నుంచి తొందరగా బయటపడలేం’ అని కోహ్లి చెప్పుకొచ్చాడు. ప్రపంచకప్‌లో వరుస 5 హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్న కోహ్లి కీలక సెమీస్‌లో చేతులెత్తేయడం.. మిగతా బ్యాట్స్‌మెన్ కూడా రాణించకపోవడంతో భారత్ ప్రపంచకప్ నుంచి నిష్క్రమించక తప్పలేదు. ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటకు సిద్ధమైన భారత్.. ప్రపంచకప్ ఓటమి నుంచి కోలుకోని ఈ సిరీస్‌లో రాణించాలని భావిస్తోంది. -
నా జీవితంలో ఆ రోజే చెడ్డది.. మంచిది : గప్టిల్
ఇంగ్లండ్‌తో జరిగిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ తన జీవితంలోనే ఓ దుర్దినమని, అద్భుతం కూడా అని న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ తెలిపాడు. యాక్షన్ థ్రిల్లర్‌ను తలపించిన మెగా ఫైనల్ టై కావడం... అనంతరం నిర్వహించిన సూపర్ ఓవర్ కూడా టై కావడం.. బౌండరీల సంఖ్య ఆధారంగా ఇంగ్లండ్ విశ్వవిజేతగా నిలవడం తెలిసిందే. అయితే గెలుపు ముంగిట నిలిచి దురదృష్టంతో కివీస్ టైటిల్ అందుకోకపోవడంలో గప్టిల్‌ది కాదనలేని పరోక్షపాత్ర. ఆద్యాంతం ఆకట్టుకున్న ఈ ఫైనల్ అనంతరం ఎక్కడా మాట్లాడని గప్టిల్ ఎట్టకేలకు మౌనం వీడాడు. మంగళవారం ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించాడు. ‘లార్డ్స్‌లో ఫైనల్ మ్యాచ్ జరిగి వారం పూర్తైందని నమ్మడానికి చాలా కష్టంగా ఉంది. నా క్రికెట్ జీవితంలో అది ఓ అద్భుతమైన దినం, అత్యంత దుర్దినంగా కూడా భావిస్తున్నాను. ఎన్నో విభిన్నమైన భావోద్వేగాలకు వేదికగా ఆ మ్యాచ్ నిలిచింది. కానీ న్యూజిలాండ్ తరఫున, గొప్ప సహచరులతో ఆడటాన్ని గర్వంగా ఫీలవుతున్నా. మద్దతు పలికిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇదో అద్భుతం.’ అని గప్టిల్ మంగళవారం ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నాడు. View this post on Instagram Hard to believe it’s been a week since that incredible Final at Lords. I think it was both the best and worst day of my cricketing life! So many different emotions, but mainly proud to represent New Zealand and play for the @blackcapsnz alongside a great group of mates. Thank you to everyone for all your support, it has been amazing. 🇳🇿 A post shared by Martin Guptill (@martyguptill31) on Jul 22, 2019 at 1:11pm PDT టైటిల్ అందకుండా న్యూజిలాండ్‌ను దురదృష్టం గప్టిల్ రూపంలో వెంటాడింది. కివీస్ డెత్ బౌలర్లు ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్‌ను భారీ షాట్లు కొట్టకుండా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి మ్యాచ్ చేతుల్లోకి తెచ్చుకున్నారు. ఆఖరి ఓవర్లో ఇంగ్లండ్ విజయానికి 3 బంతుల్లో 9 పరుగులు కావాలి. ఈ సమయంలో గప్టిల్ విసిరిన బంతి నేరుగా బెన్ స్టోక్స్ బ్యాట్‌కు తగిలి బౌండరీ వెళ్లింది. దీంతో అంపైర్లు ఇంగ్లండ్‌కు 6 పరుగులు ఇచ్చారు. ఇది మ్యాచ్ టై కి దారితీసింది. వాస్తవానికి ఇందులో గప్టిల్, స్టోక్స్ తప్పేం లేదు. ఇక సూపర్ ఓవర్లో కూడా మళ్లీ గప్టిల్ రూపంలోనే న్యూజిలాండ్ దురదృష్టం వెంటాడింది. చివరి బంతికి రెండు పరుగుల చేయాల్సిన సమయంలో గప్టిల్ రనౌట్ కావడం.. సూపర్ ఓవర్ కూడా టై కావడం.. బౌండరీల సంఖ్య ఆధారంగా ఇంగ్లండ్ జగజ్జేతగా నిలవడం అలా జరిగిపోయింది. ఈ రెండింటిలోను గప్టిల్ ప్రత్యక్ష పాత్ర లేకపోయినప్పటికి పరోక్ష పాత్ర కాదనలేనిది. ఇక ఈ మెగాటోర్నీలో గప్టిల్ తనస్థాయి దగ్గ ప్రదర్శన ఇవ్వలేదు. 10 మ్యాచ్‌ల్లో కేవలం 186 పరుగులు మాత్రమే చేసి దారుణంగా విఫలమయ్యాడు. -
‘ఇక పాక్ క్రికెట్ జట్టును నేను సెట్ చేస్తా’
వాషింగ్టన్: ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు లీగ్ దశ నుంచే నిష్క్రమించిన నేపథ్యంలో ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రక్షాళనకు నడుంబిగించారు. స్వతహాగా క్రికెటర్ అయిన ఇమ్రాన్ ఖాన్.. వచ్చే వరల్డ్‌కప్ నాటికి పాక్ జట్టును మేటి జట్టుగా తయారు చేయడమే లక్ష్యంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.అమెరికా పర్యటనలో ఉన్న ఇమ్రాన్ ఖాన్ పాక్ క్రికెట్ జట్టు వరల్డ్‌కప్ ప్రదర్శనను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘ నా వ్యాఖ్యలు గుర్తుంచుకోండి. వచ్చే వరల్డ్‌కప్‌కు పాక్ జట్టు ఒక ప్రొఫెషనల్ జట్టుగా మారుస్తా. అత్యుత్తమ ఆటగాళ్ల ఎంపికే లక్ష్యంగా ముందుకెళతాం. ఇందుకోసం క్షేత్ర స్థాయిలో చర్యలకు శ్రీకారం చుడతాం. ఎక్కడైతే టాలెంట్ ఉందో వారిని కచ్చితంగా సానబెడతాం. ఇక నుంచి పాక్ క్రికెట్ జట్టు ఎలా ఉండాలనేది నేను సెట్ చేస్తా. పాక్ జట్టు ఉన్నత శిఖరాలు తీసుకు వెళ్లాలని నేను డిసైడ్ అయ్యా’ అని పేర్కొన్నారు. వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్ జట్టు ఐదో స్థానంలో నిలిచి లీగ్ దశలోనే తన ప్రస్థానాన్ని ముగించింది. గ్రూప్ దశలో పాకిస్తాన్ నిలకడలేమి ఆ జట్టు నాకౌట్ ఆశల్నిదూరం చేసింది. కివీస్‌తో సమానంగా 11 పాయింట్లు సాధించినప్పటికీ రన్‌రేట్ ఆధారంగా పాక్ వెనుకబడిపోయింది. ప్రధానంగా వెస్టిండీస్ చేతిలో పాకిస్తాన్ ఘోర ఓటమి ఎదుర్కోవడం ఆ జట్టు సెమీస్ అవకాశాల్ని దూరం చేసింది. -
ఓడితే బ్యాట్ పట్టుకునే వాడిని కాదు: ఇంగ్లండ్ క్రికెటర్
లండన్ : ప్రపంచకప్ ఫైనల్లో ఓడితే మళ్లీ క్రికెట్ ఆడకపోయేవాడినని, బ్యాట్ పట్టుకోవడానికి కూడా ధైర్యం చేయకపోయేవాడినని ఇంగ్లండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ తెలిపాడు. మ్యాచ్‌కు ముందు ఓటమి భయం తనని వెంటాడిందని, ఓడితే మళ్లీ ఏ ముఖం పెట్టుకొని క్రికెట్ ఆడాలని తనలో తాను కుమిలిపోయానన్నాడు. ఈ పరిస్థితిని ఇంగ్లండ్ జట్టు సైకాలజిస్ట్ డేవిడ్ యంగ్‌కు వివరించి సమాధానాలు తెలుసుకున్నానని డైలీమెయిల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఆ బాధ నాకు తెలుసు.. ‘ప్రపంచకప్ ఫైనల్ ముందు మొత్తం 8 ఫైనల్ మ్యాచ్‌లు ఆడాను. ఇందులో 7 మ్యాచ్‌ల్లో ఓటమే ఎదురైంది. ఈ ఓడిన మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ తరఫున ఆడిన ఛాంపియన్స్ ట్రోఫీ-2013, టీ20 ప్రపంచకప్-2016 ఫైనల్ మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. ఇతర జట్టు టైటిల్ అందుకుంటుంటే చూస్తు ఉండటం ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. ఆ బాధ వర్ణాతీతం. అలాంటిది మళ్లీ పునరావృతం కావద్దని, పశ్చాతాపానికి గురికావద్దని గట్టిగా అనునుకున్నా. ఆ దేవుడిని ప్రార్థించా. భయమెందుకంటే.. ఓటమి భయం ఎందుకు వెంటాడిందంటే.. మళ్లీ క్రికెట్ ఎలా ఆడాలో నాకు తెలియదు. జీవితంలో ఒక్కసారి మాత్రమే ప్రపంచకప్ ఫైనల్ ఆడే అవకాశం వస్తుంది. విధిరాత ఎలా ఉంటే అలా జరుగుతుందని ఎంత అనుకున్నా.. ఆ క్షణం భయపడుతూనే ఉన్నా. ఒకవేళ ఓటమి ఎదురైతే మాత్రం తట్టుకోలేకపోయేవాడిని. చాలా రోజుల వరకు బ్యాట్ కూడా పట్టుకోకపోదును. అద్భుత ప్రదర్శన కనబరుస్తామని, జట్టును గెలిపించే సత్తా ఉందని మాకు తెలుసు. కానీ ఏదైనా జరగకూడనిది జరిగితేనే ఎలా? అనే సందేహమే నన్ను తీవ్రంగా వేధించింది.’ అని బట్లర్ చెప్పుకొచ్చాడు. ఇక టోర్నీ మధ్యలో వరుస ఓటములు ఎదురైనప్పుడు కూడా ఇలాంటి ఫీలింగే కలిగిందన్నాడు. హాట్ ఫేవరేట్‌కు దిగిన తమ జట్టు వరుస ఓటములతో సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంటుందా? లేదా? అనే సందిగ్ధం నెలకొన్నప్పుడు కూడా భయమేసిందన్నాడు. బెయిర్‌స్టో గాయం కూడా కలవరపాటుకు గురిచేసిందని, గప్టిల్‌ను రనౌట్ చేయడం.. సూపర్ ఓవర్ టై కావడం.. తమ విజయం ఖాయామని తెలవడం.. మేం వేసిన గంతులు.. ఆస్వాదించిన ఆ క్షణాలు.. అద్భుతమని బట్లర్ చెప్పుకొచ్చాడు. -
సచిన్ సూచనకు ఓటేసిన బౌలింగ్ కోచ్
న్యూఢిల్లీ: ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో ‘బౌండరీలు’ ఆధారంగా ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటించడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. దీనిపై దిగ్గజ క్రికెటర్లు సైతం విమర్శలు గుప్పించారు. దీనిలో భాగంగా ఈ రూల్‌ను పునః పరిశీలించాల్సిన అవసరముందంటూ సూచనలు కూడా చేశారు. మెగా ఫైట్‌లో విజేతను తేల్చేక్రమంలో సూపర్ ఓవర్ సైతం టైగా ముగిస్తే, మరొక సూపర్ ఓవర్‌ను వేయిస్తే బాగుంటుందని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. దీనికి తాజాగా భారత క్రికెట్ జట్టు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ మద్దతు ప్రకటించాడు. వరల్డ్‌కప్ వంటి మెగా ఈవెంట్లో బౌండరీల లెక్కన విజేతను నిర్ణయించడం ఎంతమాత్రం సమంజసం కాదన్నాడు. సచిన్ సూచించిన మరొక సూపర్ ఓవర్ సూచనతో తాను ఏకీభవిస్తున్నానని తెలిపాడు. ‘ అసలు అత్యధిక బౌండరీల గెలిచిన జట్టు విజేత అనే నిబంధనను ఎందుకు ప్రవేశపెట్టారో తెలియదు. విజేతను నిర్ణయించడానికి చాలా పద్ధతులు ఉన్నాయి. ఇక్కడ బౌండరీల ఆధారంగా జట్టును గెలిచినట్లు ప్రకటించేకంటే, వికెట్ల ఆధారంగా విజేతను నిర్ణయించడం సమంజసంగా ఉంటుందనేది నా అభిప్రాయం. అదే సమయంలో మరొక సూపర్ ఓవర్‌తో విజేతను తేల్చినా ఫర్వాలేదు’ అని భరత్ అరుణ్ తెలిపాడు. ఇక ప్రపంచకప్‌లో గ్రూప్ స్టేజ్‌లో ‘టాప్’లో నిలిచిన జట్టుకు మరొక అవకాశం ఉంటే బాగుంటుందన్నాడు. ఇందుకు ఐపీఎల్ తరహా నిబంధనను తీసుకురావాలని పేర్కొన్నాడు. -
నాది నిర్ణయలోపమే
కొలంబో: ప్రపంచకప్ ఫైనల్ ఫలితాన్ని ప్రభావితం చేసిన ఓవర్‌త్రోకు ఆరు పరుగులు ఇవ్వడంపై తానేమీ చింతించట్లేదని ఆ మ్యాచ్‌కు అంపైర్‌గా వ్యవహరించిన కుమార్ ధర్మసేన (శ్రీలంక) స్పష్టం చేశారు. ఇంగ్లండ్ జట్టుకు ఆరు పరుగులు కేటాయించడం తన నిర్ణయ లోపమేనని ఒప్పుకున్న ధర్మసేన ఆ సమయంలో అదే సరైనదిగా తోచిందని అన్నారు. ‘ఓవర్‌త్రోకు ఐదుకు బదులు ఆరు పరుగులు ఇవ్వడం నా నిర్ణయ లోపమే. అది ఇప్పుడు టీవీ రీప్లేలు చూస్తే తెలుస్తోంది. కానీ ఆ సమయంలో మైదానంలో ఉన్నపుడు అది సముచితంగా అనిపించింది. నిర్ణీత సమయంలో తీసుకున్న నా నిర్ణయాన్ని ఐసీసీ అప్పుడు ప్రశంసించింది కూడా. ఇప్పుడు దాని గురించి నాకు చింత లేదు’ అని ధర్మసేన వివరించారు. లైగ్ అంపైర్ మారిస్ ఎరాస్మస్‌తో చర్చించాకే ఆరు పరుగులు కేటాయించానని ధర్మసేన తెలిపారు. -
నేను పొరపాటు చేశా: వరల్డ్‌కప్ ఫైనల్ అంపైర్
దుబాయ్: వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఓవర్ త్రో విషయంలో తాను పొరపాటు చేశానని ఆ మ్యాచ్‌కు అంపైర్‌గా వ్యవహరించిన కుమార్ ధర్మసేన ఒప్పుకున్నాడు. బెన్ స్టోక్స్ బ్యాట్‌కు తగిలిన బంతి ఓవర్ త్రోగా బౌండరీకి వెళ్లడంతో దానికి ఆరు పరుగులు ఇవ్వడం తాను చేసిన పొరపాటని, ఇందుకు చింతిస్తున్నానని అన్నాడు. దీనిపై మ్యాచ్ అధికారులతో పాటు ఫీల్డ్‌లోనే ఉన్న మరొక అంపైర్ ఎరాస్మస్‌తో చర్చించిన తర్వాతే ఆరు పరగులు ఇచ్చానంటూ తెలిపాడు. ఇది తాను చేసిన అతి పెద్ద తప్పిదమని టీవీ రిప్లేలో చూసిన తర్వాత కానీ అర్థం కాలేదన్నాడు. ‘నేను తప్పిదం చేసిన విషయాన్ని అంగీకరిస్తున్నా. మ్యాచ్ ముగిసిన తర్వాత టీవీ రిప్లేలో చూస్తే నేను చేసిన పొరపాటు తెలిసింది. ఇందుకు నేను చాలా చింతిస్తున్నా. ఇక్కడ క్షమాపణలు కోరడానికి కూడా అర్హుడిని కానేమో. ఆ మ్యాచ్‌కు సంబంధించిన అధికారులతో చర్చించిన తర్వాత అది ఆరు పరుగులుగా ప్రకటించా. లెగ్ అంపైర్ ఎరాస్మస్‌తో కూడా చర్చించా. బ్యాట్స్‌మన్ రెండో పరుగును పూర్తి చేశాడని అంతా భ్రమపడి ఆ త్రోకు అదనంగా మరో నాలుగు పరుగులు ఇవ్వాల్సి వచ్చింది. ఆ సమయంలోనే దాన్ని మ్యాచ్ అధికారులు రిప్లేలో చూడకపోవడంతో పొరపాటు జరిగింది’ అని ధర్మసేన పేర్కొన్నాడు. వరల్డ్‌కప్ తుది సమరంలో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ఎనిమిది వికెట్ల నష్టానికి 241 పరుగులు చేయగా, లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఇంగ్లండ్ కూడా 50 ఓవర్లలో 241 పరుగులే చేసింది. గప్టిల్ విసిరిన త్రో బెన్ స్టోక్స్ బ్యాట్‌కు తగిలి బౌండరీ దాటగా అంపైర్ ధర్మసేన ఆరు పరుగులు ప్రకటించడం, బ్యాటింగ్ కొనసాగించిన స్టోక్స్ ఆ తర్వాత మ్యాచ్‌ను ‘టై’ వరకు తీసుకురావడం జరిగాయి. స్టోక్స్ రెండు పరుగు పూర్తి చేయకుండానే బంతి అతని బ్యాట్ తగిలి బౌండరీకి వెళ్లింది. వాస్తవానికి దానికి 5 పరుగులే ఇవ్వాలి. అయితే ఆ బౌండరీతో కలిపి మొత్తంగా ఆరు పరుగులు ఇచ్చారు. దాంతో మ్యాచ్ టైగా ముగిసి సూపర్ ఓవర్‌కు దారి తీసింది. కాగా, సూపర్ ఓవర్ కూడా టై కావడంతో అధిక బౌండరీల ఆధారంగా ఇంగ్లండ్‌ను చాంపియన్‌గా ప్రకటించారు. -
ఓవర్‌త్రో నిబంధనలపై సమీక్ష!
ప్రపంచకప్ ఫైనల్లో చోటుచేసుకున్న అనూహ్య ఘటనతో ఓవర్‌త్రో నిబంధనలపై సమీక్ష జరిపే యోచనలో మరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎమ్‌సీసీ) ఉన్నట్లు ‘దిసండే టైమ్స్’ అనే పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో ఆఖరి ఓవర్లో అనూహ్యంగా ఓవర్‌త్రో ద్వారా లభించిన పరుగులు మ్యాచ్ ఫలితాన్ని మార్చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ నిబంధనలపై సమీక్ష జరిపి అవసరమైతే మార్చాలని క్రికెట్ నిబంధనలు రూపొందించే ఎమ్‌సీసీ సబ్ కమిటీ భావిస్తోందని ఆ కథనం వెల్లడించింది. ఆఖరి ఓవర్లో గప్టిల్ విసిరిన బంతి అనూహ్యంగా బెన్‌స్టోక్స్ బ్యాట్‌కు తగిలి బౌండరీ వెళ్లిన విషయం తెలిసిందే. అయితే అంపైర్లు ఇంగ్లండ్‌కు 6 పరుగులు కేటాయిచడం వివాదాస్పదమైంది. నిబంధనల ప్రకారం 5 పరుగులివ్వాల్సి ఉండగా అంపైర్లు ఆరు పరుగులిచ్చారని, మాజీ అంపైర్లు, ఆటగాళ్లు మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఓవర్‌త్రో నిబంధనలపై సమీక్ష జరపాల్సిన అవసరం ఉందని ఎమ్‌సీసీ భావిస్తోంది. -
ఆ విజయం.. మాక్కూడా కష్టంగానే ఉంది: మోర్గాన్
ఇటీవల ముగిసిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఫలితాన్ని న్యూజిలాండ్ జట్టు దిగమింగుకోలేకపోయింది. తమ శక్తివంచన లేకుండా పోరాడి.. అద్భుతంగా ఆడినా.. ఆ జట్టును పరాజయం వెక్కిరించింది. దీనిని ఓటమి అనడం కంటే.. ఐసీసీ చెత్త రూల్స్ వల్లే ఇలా జరిగిందని పేర్కొనడం మంచిదని, ఫైనల్ మ్యాచ్‌లో ఇరు జట్లూ విజయం సాధించాయని చాలా మంది మాజీ క్రికెటర్లు పేర్కొన్నారు. తాజాగా ప్రపంచకప్ విజేత ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఫైనల్ మ్యాచ్ ఫలితంపై స్పందించాడు. టైమ్స్ మ్యాగజీన్‌తో ఆయన మాట్లాడుతూ.. ఫైనల్ ఫలితం తమకు కూడా కష్టంగానే అనిపించిందని పేర్కొన్నాడు. సూపర్ ఓవర్లోనూ ఇరు జట్ల స్కోరు సమం అయిన నేపథ్యంలో బౌండరీ సంఖ్య ఆధారంగా ఇంగ్లండ్ జట్టును టెక్నికల్‌గా విజేతగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇరు జట్ల స్కోరు సమమైనప్పుడు.. ఇలా బౌండరీల నిబంధన ప్రకారం మ్యాచ్ ఫలితాన్ని తేల్చడం తన దృష్టిలో సబబు కాదని మోర్గాన్ తేల్చి చెప్పాడు. ’ ఇరు జట్లు సమంగా పోరాడిన సమయంలో ఇలాంటి ఫలితాన్ని ప్రకటించడం నాకు సమంజసంగా అనిపించలేదు. నేను ఉన్నప్పుడు ఇది జరిగిన విషయం వాస్తవమే కానీ, ఎక్కడ మేం గెలిచామో.. ఎక్కడ ఓడామో నేను చెప్పలేను. ఇలా గెలువడం మంచిదేనని నేను అనను. ఇక, ఓడిపోవడమనేది చాలా కష్టమైన విషయం’ అని చెప్పాడు. ఫైనల్ తర్వాత న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్తో అనేక సార్లు మాట్లాడానని, కానీ ఇది ఎలా జరిగిందో తమకు ఇప్పటికీ అర్థం కాలేదని, ఈ ఫలితంపై తాము ఓ నిర్ధారణకు రాలేకపోయామని చెప్పారు. -
ఆ విషయంలో సచిన్ లాగే ధోనికి కూడా..
న్యూఢిల్లీ : ప్రస్తుతం టీమిండియాలో ధోని స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు లేడని బీసీసీఐ మాజీ కార్యదర్శి, మాజీ సెలెక్టర్ సంజయ్ జగ్దాలే అభిప్రాయపడ్డాడు. జట్టు ప్రయోజనాల కోసం నిస్వార్థంగా ఆడిన ధోనికి రిటైర్మెంట్ విషయంలో పూర్తి స్వేచ్చనివ్వాలని పేర్కొన్నాడు. ప్రపంచకప్ సెమీస్‌లో టీమిండియా ఓటమి తర్వాత ధోనిపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. స్లో బ్యాటింగ్‌తో జట్టుకు భారంగా మారుతున్న ధోని ఇక ఆటకు స్వస్తి పలకాల్సిన సమయం వచ్చిందంటూ అన్ని వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో సంజయ్ మాట్లాడుతూ...‘ నా దృష్టిలో ధోని గొప్ప ఆటగాడు. తను దేశం కోసం ఆడాడు. ఒక వికెట్‌కీపర్ బ్యాట్స్‌మెన్‌గా ధోని స్థానాన్ని భర్తీ చేయగల, అతడికి ప్రత్యామ్నాయం కాగల ఆటగాడు ప్రస్తుత జట్టులో లేడు. ఇక రిటైర్మెంట్ గురించి సరైన సమయంలో నిర్ణయం తీసుకోగల పరిణతి ధోనికి ఉంది. తన భవిష్యత్ ప్రణాళికల గురించి సెలక్టర్లు అతడితో మాట్లాడితే బాగుంటుంది. రిటైర్మెంట్కు ముందు సచిన్ టెండూల్కర్ విషయంలో సెలక్టర్లు ఎలా వ్యవహరించారో ధోని విషయంలో కూడా అదే పంథా అనుసరించాలి. ధోని నుంచి ఎటువంటి ప్రదర్శన ఆశిస్తున్నారో అతడికి వివరించాలి’ అని అభిప్రాయపడ్డాడు. ఇప్పుడు కూడా అలాగే అంటే ఎలా? వరల్డ్‌కప్ సెమీస్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని రనౌట్ కావడం గురించి సంజయ్ ప్రస్తావిస్తూ...‘ జట్టు ప్రయోజనాలకు, పరిస్థితులకు అనుగుణంగా ప్రపంచకప్‌లో ధోని శక్తి మేరకు రాణించాడు. సెమీ ఫైనల్లో కూడా అతడు వ్యూహాత్మకంగానే మైదానంలోకి దిగాడు. అయితే దురదృష్టవశాత్తూ రనౌట్ అయ్యాడు. దీంతో తమ కెరీర్లో కనీస స్థాయి ప్రదర్శన కనబరచలేని ఆటగాళ్లు కూడా అతడిని విమర్శిస్తున్నారు. ఈ ఒక్క కారణంగా ధోని ఆట ముగియాలనుకోవడం సరైంది కాదు. అయినా ధోని విలువ వారికి తెలియకపోయినా భవిష్యత్ తరం ఆటగాళ్లు మాత్రం ఈ విషయాన్ని తప్పక గుర్తిస్తారు. నిజానికి 38 ఏళ్ల వయస్సులో కూడా కెరీర్ అత్యున్నత స్థాయి ప్రదర్శన అతడి నుంచి ఆశించడం సరైంది కాదేమో. ఇక యువ ఆటగాడు రిషభ్ పంత్ ప్రపంచకప్ మొదటి మ్యాచ్ నుంచి జట్టుతో ఉండి ఉంటే బాగుండేది. ధోని నుంచి వికెట్ కీపింగ్ పాఠాలు నేర్చుకునేవాడు’ అని చెప్పుకొచ్చాడు. కాగా ఇక ఆదివారం వెస్టిండీస్ పర్యటన కోసం భారత జట్టును ఎంపిక చేయడానికి సెలక్టర్లు సమావేశమవుతున్నారు. దీంతో ధోనిని ఎంపిక చేస్తారా లేదా పక్కకుపెడతారా అనేది అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మరి కొంత కాలం క్రికెట్ ఆడటానికి ధోని ఇష్టపడుతుండటంతో అతడిపై సెలక్టర్లు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే. -
‘మా వాడు క్రికెట్‌ను ఏలుతాడు’
లండన్ : జోఫ్రా ఆర్చర్.. ఐపీఎల్ అభిమానులకు తప్ప మిగతా ప్రపంచానికి అంతగా తెలియని వ్యక్తి. కానీ ఇప్పుడు అతడి పేరు విశ్వమంతా మారుమోగుతోంది. అదృష్టం కొద్ది జట్టులోకి వచ్చి ఏకంగా తన జట్టుకు తొలిసారి ప్రపంచకప్‌నే అందించాడు. ప్రపంచకప్‌లో భాగంగా ఫైనల్ మ్యాచ్‌లో అనూహ్యంగా సూపర్ ఓవర్ వేసి ఇంగ్లండ్‌కు ప్రపంచకప్ అందించిన ఆర్చర్‌పై అతడి తండ్రి ఫ్రాంక్ ఆర్చర్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఏదో ఒక రోజు ఆర్చర్ క్రికెట్‌ను ఏలుతాడని పేర్నొన్నాడు. ఇక తన కొడుకుపై నమ్మకంతో సూపర్ ఓవర్ అవకాశం ఇచ్చిన సారథి ఇయాన్ మోర్గాన్‌ను కృతజ్ఞతలు తెలిపాడు. ‘ఆడేది తొలి ప్రపంచకప్, అంతకుముందు ఎక్కువగా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అనుభవం లేదు. అయినా సూపర్ ఓవర్లో ఎలాంటి ఒత్తిడికి లోనవకుండా జట్టును జగజ్జేతగా నిలిపాడు. దేశం గర్వించేలా చేశాడు. జట్టు సభ్యులు, కుటుంబ సభ్యులు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. సూపర్ ఓవర్లో నీషమ్ సిక్సర్ కొట్టిన వెంటనే ఏ బౌలర్ అయినా ఆత్మరక్షణలోకి పడతాడు. కానీ, ఆర్చర్ మాత్రం దానిని అధిగమించాడు. గొప్ప ఆటగాళ్ళు మాత్రమే అలా చేయగలరు. క్రెడిట్ మొత్తం కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌కే దక్కుతుంది. అతడిపై పెట్టుకున్న విశ్వాసాన్ని తిరిగి చెల్లించాడు. ఆర్చర్ ఆట ఇప్పుడే ప్రారంభమైంది. క్రికెట్‌కు మైఖెల్ జోర్డాన్(దిగ్గజ బాస్కెట్ బాల్ ఆటగాడు) అవుతావని అనేవాడిని. బాస్కెట్ బాల్‌ను జోర్డాన్ శాసించినట్టు.. ఆర్చర్ ఏదో ఒక రోజు క్రికెట్‌ను ఏలుతాడు’అంటూ ఫ్రాంక్ ఆర్చర్ ఉద్వేగంగా పేర్కొన్నాడు. -
‘ధోనికి ఇప్పుడే ఆ ఆలోచన లేదు’
ముంబై : టీమిండియా సీనియర్ ఆటగాడు ఎంఎస్ ధోనికి ఇప్పట్లో రిటైర్మెంట్ తీసుకునే ఆలోచనే లేదని అతడి అత్యంత సన్నిహితుడు, వ్యాపార భాగస్వామి అరుణ్ పాండే స్పష్టం చేశాడు. ప్రపంచకప్ అనంతరం ధోని రిటైర్మెంట్పై తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో అరుణ్ వ్యాఖ్యలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. శుక్రవారం అరుణ్ మాట్లాడుతూ.. ‘ఇప్పట్లో రిటైర్మెంట్ తీసుకోవాలనే ఆలోచన ధోనికి లేదు. అతడు వ్యక్తిగతంగా కంటే జట్టు ప్రయోజనాల కోసం ఎక్కువగా ఆలోచిస్తాడు. కానీ ఓ గొప్ప ఆటగాడి భవిష్యత్‌పై ఇలాంటి వార్తలు రావడం దురదృష్టకరం’అంటూ పేర్కొన్నాడు. ఇక ఆదివారం వెస్టిండీస్ పర్యటన కోసం భారత జట్టును ఎంపిక చేయడానికి సెలక్టర్లు సమావేశమవుతున్నారు. దీంతో ధోనిని ఎంపిక చేస్తారా లేదా పక్కకుపెడతారా అనేది అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మరి కొంత కాలం క్రికెట్ ఆడటానికి ధోని ఇష్టపడుతుండటంతో అతడిపై సెలక్టర్లు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. ఇక ప్రపంచకప్‌లో బెస్ట్ ఫినిషర్‌గా విఫలమైన ధోనిపై అన్ని వైపులా విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఇక క్రికెట్‌కు ధోని వీడ్కోలు పలకాల్సిన సమయం వచ్చిందని మాజీ క్రికెటర్లు, క్రీడా పండితులు పేర్కొంటున్న విషయం తెలిసిందే. -
యువీ చాలెంజ్.. బ్యాట్ పట్టిన ధావన్
ముంబై: గాయం కారణంగా ప్రపంచకప్ నుంచి అర్దంతరంగా తప్పుకున్న టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ చాలా రోజుల తర్వాత మళ్లీ బ్యాట్ పట్టాడు. ఇప్పటికీ గాయం నుంచి పూర్తిగా కోలుకోని ధావన్.. యువరాజ్ సింగ్ విసిరిన చాలెంజ్ కోసం బ్యాట్ పట్టి విజయం సాధించాడు. యువీ విసిరిన ‘బాటిల్ క్యాప్ చాలెంజ్’ను ధావన్ స్వీకరించాడు. చాలెంజ్‌లో భాగంగా తనదైన శైలిలో బ్యాట్‌తో బంతిని బాటిల్‌ను కొట్టి క్యాప్‌ను కిందపడేశాడు. ఈ వీడియోను తన అధికారిక ట్విటర్లో షేర్ చేశాడు. ‘యువీ.. ఇది నా బాటిల్ క్యాప్ చాలెంజ్. గాయం తర్వాత తొలిసారి బ్యాట్ పట్టాను. చాలా ఆనందంగా ఉంది’అంటూ వీడియో కింద పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది. గబ్బర్ ఈజ్ బ్యాక్ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ధావన్ బ్యాటింగ్ చేస్తుండగా చేతి వేలికి గాయమైన విషయం తెలిసిందే. గాయాన్ని లెక్క చేయకుండా శతకాన్ని సాధించి జట్టుకు విజయాన్ని అందించాడు. అయితే గాయం నుంచి కోలుకోవడానికి ఐదారు వారాల సమయం పట్టే అవకాశం ఉందని వైద్యులు తెలపడంతో టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఇది జట్టుపై తీవ్ర ప్రభావం చూపించింది. ఐసీసీ వంటి మెగా టోర్నీల్లో రెచ్చిపోయే ధావన్ ప్రపంచకప్‌లో లేకపోవడం టీమిండియాను దెబ్బతీసింది. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో జట్టులో సీనియర్ లెఫ్టాండ్ బ్యాట్స్‌మన్ లేని లోటు స్పష్టంగా తెలిసింది. గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో వెస్టిండీస్ పర్యటనకు కూడా ధావన్‌కు విశ్రాంతినిచ్చారు. -
ఐసీసీకి కివీస్ కోచ్ విన్నపం
లండన్ : ప్రపంచకప్ ఫైనల్ ఓటమిని న్యూజిలాండ్ ఇప్పట్లో మరిచిపోయేలా లేదు. ఆటగాళ్లతో పాటు అభిమానులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఐసీసీ నిబంధనలే ఇంగ్లండ్‌కు ప్రపంచకప్‌ను అందించిందని క్రికెట్ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. అంతేకాకుండా బౌండరీల ఆధారంగా విజేతను ప్రకటించడంపై ఐసీసీని తప్పుపడుతున్నారు. సచిన్ టెండూల్కర్ వంటి దిగ్గజం కూడా మరో సూపర్ ఓవర్ ఆడించాల్సి ఉండేదని అభిప్రాయపడ్డాడు. తాజాగా కివీస్ కోచ్ గ్యారీ స్టీడ్ ఐసీసీ ముందుకు ఓ ప్రతిపాదనను తీసుకొచ్చాడు. ‘ప్రపంచకప్ వంటి మెగాటోర్నీల్లో విజేతను బౌండరీల ఆధారంగా ప్రకటించడం సమంజసం కాదు. ఫైనల్ మ్యాచ్, సూపర్ ఓవర్ రెండూ టై అయితే ఇరుజట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించండి. ఏడు వారాలుగా ప్రపంచకప్ కోసం మా ఆటగాళ్లు తీవ్రంగా కష్టపడ్డారు. కానీ ఫైనల్ మ్యాచ్‌లో ఇలా ఓడిపోవడం మా ఆటగాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఐసీసీ తన నిబంధనలను మార్చుకుంటే మంచిది’అంటూ స్టీడ్ ఐసీసీకి విన్నవించాడు. ఫైనల్ మ్యాచ్ అనంతరం బౌండరీల ఆధారంగా విజేతను ప్రకటించడం చెత్త నిర్ణయం అంటూ మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ మండిపడిన విషయం తెలిసిందే. -
సూపర్ ఓవర్ టెన్షన్.. ప్రాణాలు వదిలిన కోచ్
ఆక్లాండ్: వన్డే ప్రపంచకప్‌లో ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ జేమ్స్ నీషమ్ అత్యంత కీలక ఇన్నింగ్స్ ఆడుతుండగా విషాదం చోటుచేసుకుంది. అతడి చిన్ననాటి కోచ్, ఆక్లాండ్ గ్రామర్ స్కూల్ మాజీ టీచర్ డేవిడ్ జేమ్స్ గొర్డాన్ మరణించాడు. మ్యాచ్ ఫలితాన్ని తేల్చే సూపర్ ఓవర్లో రెండో బంతిని నీషమ్ సిక్సర్ కొట్టిన సమయంలోనే జేమ్స్ గొర్డాన్ కన్నుమూసినట్టు ఆయన కుమార్తె లియోనీ వెల్లడించారని స్థానిక మీడియా తెలిపింది. ‘గొర్డాన్ తుదిశ్వాస విడిచారని సూపర్ ఓవర్ జరుగుతుండగా నర్స్ వచ్చి మాతో చెప్పారు. నీషమ్ సిక్సర్ బాదిన క్షణంలోనే ఆయన చనిపోయివుండొచ్చని అన్నారు. మా నాన్న హాస్యప్రియుడు. మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి. అందరితో ప్రేమగా ఉండేవార’ని లియోనీ గుర్తు చేసుకున్నారు. గొర్డాన్ మృతికి నీషమ్ ట్విటర్ ద్వారా సంతాపం తెలిపాడు. ‘డేవిడ్ జేమ్స్ గొర్డాన్.. నా హైస్కూల్ టీచర్, కోచ్, స్నేహితుడు. క్రికెట్ అంటే ఆయనకు ఎంతో ఇష్టం. ఆయన దగ్గర మేమంతా ఆట నేర్చుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. ఉత్కంఠభరితంగా జరిగిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో మా ఆటతీరును ఆయన గర్వించే ఉంటారు. మాకు ప్రతిదీ నేర్పినందుకు ధన్యవాదాలు. సంతాపం’ అంటూ నీషమ్ ట్వీట్ చేశాడు. నీషమ్‌ను తన తండ్రి ఎంతగానో అభిమానించేవారని లియోనీ పేర్కొన్నారు. ఆక్లాండ్ గ్రామర్ స్కూల్లో 25 ఏళ్లుపైగా టీచర్‌గా పనిచేసిన డేవిడ్ జేమ్స్ గొర్డాన్ ఎంతో మంది విద్యార్థులకు క్రికెట్, హాకీ నేర్పించారు. నీషమ్, ఫెర్గూసన్‌లతో పాటు చాలా మంది హైస్కూల్ విద్యార్థులకు కోచింగ్ ఇచ్చారు. (చదవండి: విశ్వవిజేతగా ఇంగ్లండ్) -
స్టోక్స్ ఆ పరుగులు వద్దన్నాడట!
లండన్: ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్ విజయంలో ‘6 పరుగుల ఓవర్‌త్రో’ పాత్ర కూడా ఉంది. గప్టిల్ విసిరిన త్రో బెన్ స్టోక్స్ బ్యాట్‌కు తగిలి బౌండరీ దాటగా అంపైర్ ధర్మసేన ఆరు పరుగులు ప్రకటించడం, బ్యాటింగ్ కొనసాగించిన స్టోక్స్ ఆ తర్వాత మ్యాచ్‌ను ‘టై’ వరకు తీసుకురావడం జరిగాయి. వాస్తవానికి దానికి 5 పరుగులు ఇవ్వాల్సిందని మాజీ అంపైర్లు దీనిపై విమర్శించారు కూడా. అయితే ఇప్పుడు స్టోక్స్ టెస్టు జట్టు సహచరుడు, సీనియర్ బౌలర్ జేమ్స్ అండర్సన్ కొత్త అంశాన్ని ముందుకు తెచ్చాడు. ఓవర్‌త్రో ద్వారా వచ్చిన 4 అదనపు పరుగులు తమకు వద్దని స్టోక్స్ అంపైర్లకు చెప్పినట్లుగా అండర్సన్ వెల్లడించాడు. ‘బ్యాట్స్‌మన్ పరుగు తీసే సమయంలో త్రో అతనికి తగిలి మైదానంలో బంతి ఎక్కడికైనా వెళితే పరుగు తీయకుండా ఆగిపోవడం క్రికెట్లో నైతిక నియమం. కానీ బంతి బౌండరీ దాటితే ఎవరేమీ చేయలేరు. నాలుగు పరుగులు ఇవ్వాల్సిందే. నిజానికి మ్యాచ్ తర్వాత స్టోక్స్ అంపైర్ వద్దకు వెళ్లి ఆ నాలుగు పరుగులు తీసేయండి. మాకు అవసరం లేదని చెప్పాడు. తాను తప్పు చేసినట్లు కూడా అతను మైకేల్ వాన్తో అన్నట్లు తెలిసింది. అయితే అదంతా నిబంధనల ప్రకారమే జరిగింది’ అని అండర్సన్ మద్దతు పలికాడు. ఓవర్ త్రో బౌండరీ చేరగానే తన తప్పేమీ లేదన్నట్లుగా చేతులెత్తి చూపించిన స్టోక్స్... దీనిపై విలియమ్సన్కు క్షమాపణ చెప్పానని మాత్రం మ్యాచ్ తర్వాత వ్యాఖ్యానించాడు. అందులో అంపైర్ల ప్రస్తావన లేదు కాబట్టి అండర్సన్ వ్యాఖ్యలో నిజమెంత అనేది సందేహమే! -
ప్రపంచకప్ ఎఫెక్ట్: రాయ్ తొలిసారి
లండన్ : ప్రపంచకప్-2019లో తన విధ్వంసకర ఆటతీరుతో విమర్శకులచే ప్రశంసలు అందుకున్నాడు ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ జేసన్ రాయ్. అంతేకాకుండా ఇంగ్లండ్ జగజ్జేతగా నిలవడంలో రాయ్ కీలక పాత్ర పోషించాడు. ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేయడంతో రాయ్ తొలిసారి ఇంగ్లండ్ టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు. బుధవారం ఐర్లాండ్‌తో జరగబోయే ఏకైక టెస్టు కోసం ప్రకటించిన జాబితాలో 28 ఏళ్ల రాయ్‌ను సెలక్టర్లు ఎంపిక చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. అన్నీ కుదిరితే ఐర్లాండ్‌పై టెస్టు అరంగేట్రం చేసే అవకాశం ఉంది. తొలి సారి ప్రపంచకప్ అందుకోవడంతో సంబరాల్లో మునిగితేలుతున్న ఇంగ్లండ్.. ఈ అపూర్వ విజయానికి యాషెస్ కూడా తోడుకావాలని భావిస్తోంది. దీంతో యాషెస్‌కు ముందు ఈ టెస్టును వార్మప్‌గా ఉపయోగించుకోవాలని ఇంగ్లండ్ ఆరాటపడుతోంది. దానిలో భాగంగా రాయ్ టెస్టు ప్రదర్శనను పరిశీలించాలని అనుకుంటున్నారు. ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్న ఈ టెస్టు మ్యాచ్‌కు బెన్ స్టోక్స్, జోస్ బట్లర్లకు సెలక్టర్లు విశ్రాంతినివ్వగా.. బౌలర్లు జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్‌లను పరిగణలోకి తీసుకోలేదు. ఇంగ్లండ్ టెస్టు జట్టు: జోయ్ రూట్(కెప్టెన్), మొయిన్ అలీ, జేమ్స్ అండర్సన్, బెయిర్ స్టో, స్టువార్ట్ బ్రాడ్, బర్న్స్, స్యామ్ కరన్, జోయ్ డెన్లీ, లూయిస్ గ్రెగొరీ, లీచ్, జేసన్ రాయ్, స్టోన్, క్రిస్ వోక్స్. -
‘ఇక ఆడింది చాలు.. వెళ్లిపోండి’
ఇస్లామాబాద్ : ప్రపంచకప్ టోర్నీలో లీగ్ నుంచే పాకిస్తాన్ నిష్క్రమించడాన్ని ఆ దేశ అభిమానులు, మాజీ ఆటగాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే తమ దేశ ఆటగాళ్ల తీరు, ప్రదర్శనపై దుమ్మెత్తిపోస్తున్నారు. తాజాగా పాక్ మాజీ సారథి వకార్ యూనిస్ పలువురు సీనియర్ ఆటగాళ్లను టార్గెట్ చేస్తూనే మరోవైపు బోర్డు నిర్ణయాలపై నిప్పులు చెరిగాడు. కొందరు సీనియర్ ఆటగాళ్లు వారి స్వార్థం కోసం ఇంకా క్రికెట్ ఆడుతున్నారని విమర్శించాడు. ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై బోర్డు ఎందుకు ఉపేక్షిస్తుందో అర్థం కావటం లేదని మండిపడ్డాడు. ‘ప్రపంచకప్‌లో పాక్ ఓటమికి ప్రధాన కారణం మెరుగైన ఆటగాళ్లను ఎంపిక చేయకపోవడం. ఫిట్నెస్, ఫామ్, ఇతర విషయాల్లో రాజీ పడటం సెలక్టర్లు చేసే పెద్ద పొరపాటు. తాజాగా ప్రపంచకప్‌కు పాక్ జట్టు ఎంపికే గందరగోళంగా ఉంది. ఈ మెగా టోర్నీ ఆడాలనే కోరికతో కొందరు సీనియర్ ఆటగాళ్లు ఎలాంటి అర్హత లేకున్నా రాజకీయాలు చేసి జట్టులో చోటు దక్కించుకున్నారు. వాళ్లను వాళ్లు మోసం చేసుకోవడమే కాదు పాక్ క్రికెట్ జట్టును నాశనం చేశారు. ఇప్పటివరకు మీరు ఆడింది చాలు వెళ్లిపోతే మంచిది. ప్రపంచకప్ వంటి మెగా టోర్నీల్లో ఓడిపోయిన ప్రతీసారి పాక్ క్రికెట్ బోర్డు ఒకే ఫార్ములాను పాటిస్తుంది. కోచింగ్ బృందాన్ని, సెలక్టర్లను మార్చుతుంది. అంతేకానీ దేశవాళీ క్రికెట్లో మార్పులు తీసుకరావడం, ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టాలనే కనీస ఆలోచన చేయదు. బోర్డు ఆలోచన మారనంత వరకు.. ప్రపంచకప్‌లో పాక్ ప్రదర్శన మారదు. అవసరమనుకుంటే సీనియర్ ఆటగాళ్ల సూచనలను తీసుకుని పాక్ క్రికెట్‌ను బతికించండి’అంటూ వకార్ యూనిస్ పేర్కొన్నాడు. -
స్టోక్స్ వద్దన్నా.. అంపైర్లు వింటేగా
లండన్: ప్రపంచకప్ ఫైనల్లో చోటు చేసుకున్న ‘బెన్ స్టోక్స్.. ఓవర్‌త్రో’పై పెద్ద చర్చే జరుగుతోంది. ఈ అదనపు పరుగులతోనే ఇంగ్లండ్ గెలిచిందని లేకుంటే న్యూజిలాండ్ చేతిలో ప్రపంచకప్ ఉండేదని పలువురు విమర్శిస్తున్నారు. అయితే తాజాగా ఈ ఓవర్‌త్రోపై ఇంగ్లండ్ సీనియర్ ఆటగాడు జేమ్స్ అండర్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఆఖరి ఓవర్లో మార్టిన్ గప్టిల్ విసిరిన బంతి సరిగ్గా బెన్‌స్టోక్స్ బ్యాట్‌కు తగిలి బౌండరీకి వెళ్లడంతో అంపైర్లు ఆరు పరుగులు ఇచ్చారు. అయితే స్టోక్స్ అంపైర్ల దగ్గరికి వెళ్లి అదనపు పరుగులు ఇంగ్లండ్‌కు అవసరం లేదని వారించాడు. అయితే నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సిందే అంటూ వారు సర్దిచెప్పారు. అంపైర్ల నిర్ణయంపై స్టోక్స్ కూడా అసహనం వ్యక్తం చేశాడు’అంటూ అండర్సన్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ‘ఆరు’ఇవ్వడం తప్పే.. ఇక అంపైర్లు 6 పరుగులు ఇవ్వడం పెద్ద వివాదస్పదమైంది. స్టోక్స్ ఉద్దేశపూర్వకంగా చేయనప్పటికి అంపైర్లు ధర్మసేన, ఎరాస్మస్ చేసిన ఘోర తప్పిదం మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపింది. ఐసీసీ నిబంధనల మేరకు ఆతిథ్య జట్టుకు లభించాల్సింది కేవలం 5 పరుగులే. 19.8 నిబంధన మేరకు ఓవర్‌త్రో ద్వారా బౌండరీ లభించినప్పుడు ఆ పరుగులతో పాటు ఫీల్డర్ యాక్షన్ పూర్తయ్యే సమయానికి బ్యాట్స్‌మెన్ తీసిన పరుగులను కూడా కలిపి ఇవ్వాలి. అయితే ఇక్కడ బెన్‌స్టోక్స్, ఆదిల్ రషీద్‌లు రెండో పరుగు పూర్తి చేయకుండానే బంతి స్టోక్స్ బ్యాట్ తాకి బౌండరీకి వెళ్లింది. బౌండరీ ద్వారా లభించిన 4 పరుగులకు.. వారు చేసిన ఒక్క పరుగును జోడించి ఐదు పరుగులు ఇవ్వాలి. కానీ అంపైర్లు ఇది గుర్తించకుండా 6 పరుగులిచ్చి కివీస్ ఓటమికి పరోక్షంగా కారణమయ్యారు. కాగా, ఓవర్‌త్రోపై న్యూజిలాండ్ ఆటగాళ్లకు, సారథి విలియమ్సన్కు బెన్ స్టోక్స్ క్షమాపణలు తెలిపిన విషయం తెలిసిందే. కావాలని చేయలేదని, అనుకోకుండా జరిగిందని పేర్కొన్నాడు. -
‘బౌండరీ’కి బదులు రెండో సూపర్
న్యూఢిల్లీ: బౌండరీ విధానంతో వన్డే ప్రపంచకప్ విజేతను ప్రకటించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతునూ ఉన్నాయి. తాజాగా ముగిసిన వరల్డ్‌కప్ ఫైనల్లో న్యూజిలాండ్, ఇంగ్లండ్ సమానంగా ఆడినప్పటికీ ఇంగ్లీషు టీమ్‌ను విజేతగా ప్రకటించడాన్ని క్రికెట్ అభిమానులే కాదు మాజీ ఆటగాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాంటి మ్యాచ్‌ల్లో ఫలితం రాబట్టేందుకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కొత్త ప్రతిపాదన తెచ్చారు. సూపర్ ఓవర్లోనూ స్కోర్లు సమం కావడంతో ఎక్కువ బౌండరీలు కొట్టిన ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటించిన సంగతి తెలిసిందే. బౌండరీ విధానంతో ఫలితం తేల్చకుండా మరో సూపర్ ఓవర్ ఆడించివుంటే బాగుండేదని సచిన్ అభిప్రాయపడ్డాడు. ప్రపంచకప్ ఫైనల్ మాత్రమే కాదు ప్రతి మ్యాచ్ కీలకమేనని, ఫుట్‌బాల్‌లో ఫలితం తేలకపోతే అదనపు సమయం ఇస్తారని గుర్తుచేశాడు. బౌండరీ నింబధనను రోహిత్ శర్మ, గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్ కూడా తప్పుబట్టారు. ప్రపంచకప్‌లో నాకౌట్ విధానంలోనూ మార్పులు చేయాల్సిన అవసరముందని సచిన్ అభిప్రాపడ్డాడు. ఐపీఎల్ తరహాలో టాప్ నిలిచిన జట్టుకు నాకౌట్లో ఓడితే మరొక అవకాశం కల్పించాలని సూచించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో ఎంఎస్ ధోనిని బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు పంపిస్తే బాగుందని సచిన్ అభిప్రాయపడ్డాడు. ధోని ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి.. హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్ తర్వాత క్రీజ్‌లో రావాల్సిందని పేర్కొన్నాడు. -
విలియమ్సన్‌పై రవిశాస్త్రి ప్రశంసలు
న్యూఢిల్లీ: న్యూజిలాండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్‌పై టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. విలియమ్సన్ నాయకత్వాన్ని, హుందాతనాన్ని మెచ్చుకున్నాడు. దురదృష్టవశాత్తు ప్రపంచకప్ చేజారినప్పటికీ కివీస్ కెప్టెన్ గౌరవంగా ఫలితాన్ని అంగీకరించి క్రీడాస్ఫూర్తిని చాటాడని పేర్కొన్నాడు. ‘క్లిష్టపరిస్థితుల్లోనూ నువ్వు చూపిన సహనం, గౌరవం ప్రశంసాయోగ్యం. తుది సమరం ముగిసిన తర్వాత 48 గంటల పాటు నువ్వు పాటించిన మౌనం అపూర్వం. ప్రపంచకప్ టైటిల్ తృటిలో చేజారినప్పటికీ మా దృష్టిలో మీరు కూడా విజేతలే. నువ్వు సమర్థుడైన ఆటగాడివి’ అంటూ రవిశాస్త్రి ట్వీట్ చేశాడు. ‘బౌండరీ’ నిబంధనతో ప్రపంచకప్ విజేతగా నిలిచే అవకాశాన్ని కోల్పోయినా విలియమ్సన్ ఒక్క మాట కూడా తూలకుండా క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాడు. పీడకల కన్నట్లుగా అనిపించిందని, ఈ తరహాలో పరాజయం పాలవుతామని ఊహించలేదని అన్నాడే తప్పా ఆగ్రహించలేదు. బౌండరీ లెక్క ప్రకారం ఫలితం రావడం జీర్ణించుకోలేకపోతున్నామని నిరాశ వ్యక్తం చేశాడు. మ్యాచ్ అద్భుతంగా జరిగిందని, అందరూ దానిని బాగా ఆస్వాదించారని పేర్కొన్నాడు. ఫలితం తమకు ప్రతికూలంగా వచ్చినప్పటికీ ఎవరిపైనా విమర్శలు చేయకుండా హుందాగా ప్రవర్తించాడు. -
ఆ ‘స్పెషల్’ జాబితాలో రోహిత్‌శర్మ
టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇటీవల ముగిసిన ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచిన రోహిత్.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మంగళవారం ప్రకటించిన స్పెషల్-5 బ్యాట్స్‌మెన్ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ప్రపంచకప్‌లో ఐదు సెంచరీలతో రోహిత్ శర్మ 648 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్లో అద్భుతంగా రాణించిన హిట్‌మ్యాన్ 81 సగటుతో పరుగులు చేశాడు. అయితే, సెమీస్‌లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓడిపోవడంతో రోహిత్ కృషి వృధా అయింది. తాజాగా ఐసీసీ.. తన ట్విటర్ పేజీలో టాప్-5 స్పెషల్ బ్యాట్స్‌మెన్ జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో రోహిత్ మొదటిస్థానంలో ఉండగా.. రెండో స్థానంలో డేవిడ్ వార్నర్, మూడోస్థానంలో షకీబుల్ హసన్, నాలుగో స్థానంలో కేన్ విలియమ్సన్, ఐదో స్థానంలో జోయి రూట్ ఉన్నారు. ఇక పరుగుల ప్రకారం చూసుకుంటే.. రోహిత్ కన్నా ఒక్క పరుగు తక్కువ చేసిన డేవిడ్ వార్నర్ 647 పరుగులతో, 71.89 సగటుతో రెండో స్థానాన్ని సాధించాడు. బంగ్లాదేశ్ లీగ్ దశలోనే తన పోరాటాన్ని ముగించినప్పటికీ.. ఆ జట్టు తరఫున అద్భుతంగా ఆడిన షకీబుల్ 86.57 సగటుతో 606 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 578 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ జోయి రూట్ 556 పరుగులు చేశాడు. -
ఓ 50 ఏళ్లు దాటాక వీళ్లు ఎలా ఉంటారంటే..!
ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘ఫేస్ యాప్’ విపరీతంగా ట్రెండ్ అవుతోంది. భవిష్యత్తులో, ముఖ్యంగా వృద్ధాప్యంలో వ్యక్తులు ఎలా ఉంటారో ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఓ ఔత్సాహిక నెటిజన్.. భారత క్రికెట్ జట్టు సభ్యులు కడు వృద్ధాప్యంలో ఎలా ఉంటారో.. ఈ యాప్ ద్వారా రూపొందించి.. ట్విటర్లో షేర్ చేశాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, ఎంఎస్ ధోని, రవీంద్ర జడేజా, దినేశ్ కార్తీక్, యజువేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్ తదితరులు వృద్ధాప్యంలోనూ విభిన్నమైన లుక్‌తో కనిపించి.. నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. ఫేస్‌యాప్ ద్వారా టీమిండియా క్రికెటర్ల రూపురేఖల్ని మార్చి.. వయోవృద్ధులుగా మలిచిన ఈ ఫొటోలు ఇప్పుడు నెటిజన్లను కితకితలు పెట్టిస్తున్నాయి. ఇటీవల ముగిసిన వరల్డ్ కప్ భారత జట్టుకు, టీమిండియా అభిమానులకు ఒకింత నిరాశనే మిగిల్చింది. లీగ్ దశలో అద్భుతంగా ఆడిన టీమిండియా.. సెమీఫైనల్లో చేతులెత్తేసింది. న్యూజిలాండ్‌తో జరిగిన నాకౌట్ మ్యాచ్‌లో ధోనీ, రవీంద్ర జడేజాలు రాణించినా.. చివరిదశలో ధోనీ రన్నౌట్ కావడంతో భారత్ ఇంటిదారి పట్టింది. ఈ నేపథ్యంలో ఒకింత బాధలో ఉన్న భారత క్రికెట్ ప్రేమికుల్ని.. టీమిండియా క్రికెటర్ల ఓల్డ్ మేకోవర్ ఆకట్టుకుంటోంది. ఆ బాధను దూరం చేసి.. కొంత ఆనందాన్ని పంచుతోంది. Ladies and Gentlemen presenting you the some faces of 2053 World Cup Winning Team 🥇 😏🤣🤣#FaceApp #faceappchallenge #MSDhoni #DhoniForever #TeamIndia #CWC19 #worldcup pic.twitter.com/RQM15a15qN — Mansi Singh (@MansiSingh99) July 16, 2019 -
ప్రధానితో ప్రపంచకప్ విజేత
లండన్ : సొంతగడ్డపై వన్డే ప్రపంచ కప్‌ను గెలుచుకున్న ఇంగ్లండ్ విజయ సంబరాలు కొనసాగుతూనే ఉన్నాయి. తొలిసారి తమ దేశానికి టైటిల్ గెలిచిన మోర్గాన్ సేన మంగళవారం దేశ ప్రధాని థెరెసా మే ను మర్యాదపూర్వకంగా కలిశారు. 10 డౌనింగ్ స్ట్రీట్‌లోని ప్రధాని అధికారిక కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆటగాళ్లంతా పాల్గొన్నారు. ‘ఇంగ్లండ్ ప్రజలు క్రికెట్‌పై మళ్లీ ప్రేమను పెంచుకునేలా మీరు చేశారు. ఫైనల్ మ్యాచ్‌ను అత్యుత్తమ క్రీడా ఘట్టాల్లో ఒకటిగా చెప్పగలను. ఇరు జట్ల అద్భుతమైన ఆటతో పాటు కొంత అదృష్టం కూడా కలగలిసి ఒక థ్రిల్లర్‌ను మనకు అందించాయి. ఇంత గొప్ప టోర్నీకి ఇది సరైన ముగింపు. మన దేశాన్ని క్రీడల్లో ప్రముఖంగా నిలిపిన అందరికీ అభినందనలు’ అని ఈ సందర్భంగా ప్రధాని థెరెసా వ్యాఖ్యానించారు. కార్యాలయ గార్డెన్స్‌లో జరిగిన ‘షాంపేన్ రిసెప్షన్’లో క్రికెటర్లు ప్రధానితో సరదాగా కబుర్లు చెబుతూ తమ గెలుపును ఆస్వాదించడం విశేషం. -
‘అప్పుడు సిక్స్‌తోనే సమాధానం ఉండేది’
లండన్: వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ ఆఖరి ఓవర్లో ఓవర్ త్రో అయిన బంతికి ఇంగ్లండ్‌కు ఆరు పరగులు కాకుండా ఐదు పరుగులే రావాల్సి ఉందని, ఆ విషయంలో అంపైర్లు తప్పు చేశారని మాజీ అంపైర్ సైమన్ టఫెల్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఫీల్డర్ బంతి విసరకముందే బ్యాట్స్‌మెన్ ఒకరినొకరు దాటితే ఆ పరుగును లెక్కించాలని, కానీ బెన్‌స్టోక్స్, అదిల్ రషీద్ రెండో పరుగు తీయకముందే ఫీల్డర్ బంతిని విసిరాడని తెలిపారు. అప్పుడు ఐదు పరుగులే లెక్కించి అదిల్ రషీద్‌ను బ్యాటింగ్ చెయ్యాల్సి ఉండేదని ఫీల్డ్ అంపైర్ల నిర్ణయాన్ని టఫెల్ తప్పుబట్టారు. ఈ విషయంపై ఇంగ్లండ్ క్రికెట్ డైరెక్టర్ ఆష్లీ గిల్స్ మీడియాతో మాట్లాడుతూ.. టఫెల్ వ్యాఖ్యలను తోసిపుచ్చారు. ‘మీరొక విషయంపై చర్చించాలి.. ఆఖరి ఓవర్లో ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్ చేస్తుండగా బెన్‌స్టోక్స్ చివరి బంతి ఆడేటప్పుడు బంతి లెగ్ స్టంప్ మీద ఫుల్‌టాస్ పడింది. ఆ సమయంలో స్టోక్స్ రెండు పరుగుల కోసం ఆలోచించకుండా ఉంటే బంతిని స్టేడియం బయటకు పంపేవాడు. అవి మాకు అవసరమైన పరుగులు కాబట్టి స్టోక్స్ కూల్‌గానే ఆడాడు. ఒకవేళ ఆఖరి బంతి లక్ష్యం ఇంకా ఎక్కువ ఉంటే స్టోక్స్ సిక్స్‌తోనే సమాధానం చెప్పేవాడు. మేం ఇప్పుడు వరల్డ్ చాంపియన్స్. కప్పు మాకే వచ్చింది’ అని ఈ ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ వ్యాఖ్యానించారు. -
వారి నిర్ణయమే ఫైనల్: ఐసీసీ
దుబాయ్: ప్రపంచకప్ ఫైనల్లో చోటుచేసుకున్న ఓవర్ త్రో వివాదంపై మాట్లాడటానికి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిరాకరించింది. మైదానంలో అంపైర్లు తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అని స్పష్టం చేసింది. ఆదివారం ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్ సస్పన్స్ థ్రిల్లర్ సినిమాను తలపించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో ఓవర్ త్రో ద్వారా ఇంగ్లండ్‌కు ఆరు పరుగులు రావడం ప్రపంచకప్ ఫైనల్ డ్రామాలో కీలక ఘట్టం. 50వ ఓవర్లో విజయం కోసం ఇంగ్లండ్ 3 బంతుల్లో 9 పరుగులు చేయాల్సి ఉండగా నాలుగో బంతికి ఆరు పరుగులు లభించడంతో సమీకరణం 2 బంతుల్లో 3 పరుగులుగా మారిపోయింది. బౌల్ట్ వేసిన ఫుల్‌టాస్‌ను డీప్ మిడ్‌వికెట్ వైపు కొట్టిన స్టోక్స్ సింగిల్‌ను పూర్తి చేసి రెండో పరుగు కోసం పరుగెత్తాడు. ఫీల్డర్ గప్టిల్ విసిరిన త్రో నేరుగా స్టోక్స్ పరుగెడుతున్న వైపే దూసుకొచ్చి అతని బ్యాట్‌కే తగిలి బౌండరీని దాటింది. స్టోక్స్, రషీద్ చేసిన 2 పరుగులతో కలిపి అంపైర్ ధర్మసేన దానిని ‘6’గా ప్రకటించాడు. స్టోక్స్ ఉద్దేశపూర్వకంగా అడ్డు రాలేదు కాబట్టి తప్పు లేదు కానీ ఆరు పరుగులు ఇవ్వడాన్ని ప్రఖ్యాత మాజీ అంపైర్ సైమన్ టఫెల్ తప్పు పట్టారు. ‘నిబంధన 19.8 ప్రకారం ఫీల్డర్ త్రో సంధించిన సమయంలో ఇద్దరు బ్యాట్స్‌మెన్ పిచ్‌పై ఒకరిని మరొకరు దాటితేనే రెండో పరుగును లెక్కించాలి. వీడియో రీప్లేలో చూస్తే ఫీల్డర్ బంతిని విసిరినప్పుడు వీరిద్దరు ఒకరిని మరొకరు దాటలేదు. కాబట్టి బౌండరీతో పాటు సింగిల్‌నే అనుమతించాల్సింది. అప్పుడు ఒక పరుగు తగ్గడంతో పాటు రషీద్ స్ట్రయికింగ్ తీసుకోవాల్సి వచ్చేది’ అని టఫెల్ వివరించారు. అయితే తాను అంపైర్‌ను విమర్శించడం లేదని, అదంతా ఆ సమయంలో మైదానంలో ఉండే ఉద్వేగాలు, వేడిలో అలాంటిది జరిగిపోయిందని అన్నారు. ‘స్టోక్స్ పరుగు పూర్తి చేసే స్థితిలో ఉన్నాడని అంపైర్ భావించి ఉండవచ్చు. ఈ నిర్ణయం ప్రభావం మ్యాచ్‌పై కొంత మేరకు ఉన్నా, తుది ఫలితానికి ఇది మాత్రం కారణం కాదు’ అని టఫెల్ అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని ఐసీసీ ముందు మీడియా ప్రస్తావించగా.. మాట్లాడటానికి నిరాకరించింది.‘ నిబంధనలపై అంపైర్లుకు ఉన్న అవగాహన మేరకు మైదానంలో వారు నిర్ణయాలు తీసుకుంటారు. అలా తీసుకున్న ఏ నిర్ణయాలపైనా అయినా నిబంధనల ప్రకారం మేం మాట్లాడలేం’ అని ఐసీసీ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. -
సచిన్ వరల్డ్‌కప్ జట్టు ఇదే..
న్యూఢిల్లీ: క్రికెటర్ల ప్రదర్శన ఆధారంగా తమ అత్యుత్తమ జట్టును ప్రకటించడం దిగ్గజ క్రికెటర్ల ఆనవాయితీ. వరల్డ్‌కప్‌కు ముందు పలువురు దిగ్గజ క్రికెటర్లు తమ ఎలెవన్ జట్లను ప్రకటించగా, తాజాగా తన వరల్డ్‌కప్ ఎలెవన్ జట్టు ఇదేనంటూ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వెల్లడించాడు. ఇందులో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్కు తన జట్టు సారథిగా ఎంపిక చేసిన సచిన్.. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, బుమ్రాలకు భారత్ నుంచి చోటు కల్పించాడు. ఇక ఇంగ్లండ్ నుంచి బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, బెయిర్ స్టోలను ఎంపిక చేసిన సచిన్.. బంగ్లాదేశ్ నుంచి షకీబుల్ హసన్‌కు తన జట్టులో అవకాశం ఇచ్చాడు. ఆసీస్ నుంచి మిచెల్ స్టార్క్‌ను మాత్రమే తన అత్యుత్తమ వరల్డ్‌కప్ ఎలెవన్ జట్టులో చోటిచ్చాడు. కాగా, సచిన్ జట్టులో ఎంఎస్ ధోనికి చోటు దక్కకపోవడం గమనార్హం. 2019 క్రికెట్ వరల్డ్‌కప్ సచిన్ ఎలెవన్ ఇదే.. కేన్ విలియమ్సన్(కెప్టెన్), రోహిత్ శర్మ, బెయిర్ స్టో(వికెట్ కీపర్), విరాట్ కోహ్లి, షకీబుల్ హసన్, బెన్ స్టోక్స్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మిచెల్ స్టార్క్, బుమ్రా, జోఫ్రా ఆర్చర్ -
ఐసీసీ రూల్‌పై ‘బిగ్’ పంచ్!
న్యూఢిల్లీ: వరల్డ్‌కప్ వంటి మెగా టోర్నీలో అందులోనూ విజేతను ప్రకటించే క్రమంలో ‘బౌండరీ రూల్’ ను పాటించడంపై బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ పంచ్‌ల వర్షం కురిపించారు. ఇప్పటికే ఈ విధానంపై పలువురు విస్మయం వ్యక్తం చేయగా, ఆ జాబితాలో ఇప్పుడు బిగ్ బీ కూడా చేరిపోయారు. తన ట్వీటర్ అకౌంట్లో ఐసీసీ అవలంభించిన విధానాన్ని కడిగిపారేశారు. ‘నీ వద్ద రెండు వేల రూపాయిలు ఉన్నాయనుకుందాం. నా వద్ద రెండు వేల రూపాయిలు నోటు ఒకటే ఉంటే, అప్పుడు నీ దగ్గర నాలుగు ఐదు వందల నోట్లు ఉన్నాయి. అప్పుడు ఎవరు ధనికులు అవుతారు ఐసీసీ. మీ లెక్కన నాలుగు ఐదు వందల నోట్లు ఉన్న వాడే ధనికుడు అవుతాడా? అంటూ సెటైర్లు వేశారు. ఐసీసీ రూల్స్‌పై బాలీవుడ్ విలక్షణ నటుడు పరేష్ రావల్ సైతం ఘాటైన కౌంటర్ ఇచ్చారు. ‘ఎంఎస్ ధోని గ్లౌవ్స్ మార్చాలంటూ గగ్గోలు చేసిన ఐసీసీ, ముందు సూపర్ ఓవర్ రూల్స్ మార్చుకుంటే బాగుంటుంది’ అని చురకలంటించారు. న్యూజిలాండ్‌తో జరిగిన వరల్డ్‌కప్ ఫైనల్లో ఇంగ్లండ్ అత్యధిక బౌండరీల ఆధారంగా చాంపియన్‌గా నిలిచింది. మ్యాచ్, సూపర్ ఓవర్ రెండు టై కావడంతో విజేతను తేల్చేందుకు బౌండరీ రూల్‌ను అవలంభించారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. T 3227 - आपके पास 2000 रूपये, मेरे पास भी 2000 रुपये, आपके पास 2000 का एक नोट, मेरे पास 500 के 4 ... कौन ज्यादा अमीर??? ICC - जिसके पास 500 के 4 नोट वो ज्यादा रईस.. #Iccrules😂😂🤣🤣 प्रणाम गुरुदेव Ef~NS — Amitabh Bachchan (@SrBachchan) 15 July 2019 -
ఓవర్‌త్రోను చూసి ఎగిరి గంతులేశాడు!
లండన్: అత్యంత నాటకీయ పరిణామాల మధ్య జరిగిన వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ చాంపియన్‌గా నిలిచింది. ఆద్యంతం ఉత్కంఠం రేపిన తుది పోరులో ఇంగ్లండ్ బౌండరీల ఆధారంగా విశ్వ విజేత అయ్యింది. సూపర్ ఓవర్‌కు ముందు ఇంగ్లండ్ టార్గెట్‌ను ఛేదించే క్రమంలో ఆఖరి ఓవర్లో నాల్గో బంతి ఓవర్‌త్రో రూపంలో బౌండరీని దాటింది. ఆ బంతి స్టోక్స్ బ్యాట్‌కు తగిలి మరీ ‘ఫోర్’గా మల్లడంతో ఇంగ్లండ్‌కు మొత్తంగా ఆరు పరుగులు వచ్చాయి. దాంతోనే మ్యాచ్ సూపర్ ఓవర్‌కు వెళ్లింది.. లేకపోతే కివీసే కప్‌ను సాధించే అవకాశం ఉండేది. ఇది పెద్ద చర్చకే దారి తీసినా యావత్ ఇంగ్లండ్ క్రికెట్ అభిమానులకు, క్రికెటర్లకు కొత్త పండగనే తెచ్చింది. ఇంగ్లండ్ టెస్టు స్పెషలిస్టు బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ ఆనందానికైతే అవధుల్లేకుండా పోయింది. మ్యాచ్‌ను నాటింగ్‌హామ్ షైర్ కౌంటీ జట్టు సభ్యులతో కలిస వీక్షిస్తున్న బ్రాడ్ ఉబ్బితబ్బి అయిపోయాడు. చిన్నపిల్లాడిలా ఎగిరి గంతులేస్తూ మురిసిపోయాడు. ఈ ఘటనను నాటింగ్‌హామ్ షైర్ సభ్యుడైన భారత క్రికెటర్ రవి చంద్రన్ అశ్విన్ వీడియో తీశాడు. దీన్ని తన ట్వీటర్ పేజీలో పోస్ట్ చేసిన బ్రాడ్.. మ్యాచ్‌కు ఇదే అత్యంత కీలకమైన క్షణం అంటూ పేర్కొన్నాడు. ఆ ఓవర్ త్రో కారణంగా ఆరు పరుగులు రావడంతో ఎట్టకేలకు ఊపిరి తీసుకున్నాం. ఈ తరహా సందర్భాన్ని ఎప్పుడూ చూడలేదు’ అని తెలిపాడు. Videos of emotion from #CWC19Final, we all must have them?! @ashwinravi99 captured the @TrentBridge changing room when, at the most crucial point of the match, a 1 in a million deflection went for ‘6’. Breathtaking, never seen anything like it. I ♥️ Cricket @englandcricket pic.twitter.com/dYBetXKzyX — Stuart Broad (@StuartBroad8) 15 July 2019 -
ఆ సలహానే పని చేసింది: ఆర్చర్
లండన్: వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో న్యూజిలాండ్ కప్ అంచుల వరకూ వెళ్లి చతికిలబడటం వెనుక ఆ జట్టు ఆటగాళ్ల తప్పిదాలు ఒకటైతే, అంపైరింగ్ నిర్ణయాలు కూడా కీలక పాత్ర పోషించాయనే చెప్పాలి. కివీస్ నిర్దేశించిన లక్ష్య ఛేదనలో భాగంగా 49 ఓవర్ నాల్గో బంతిని స్టోక్స్ లాంగాన్ మీదుగా భారీ షాట్ కొట్టగా బౌండరీకి కొన్ని అంగుళాల ముందు బౌల్ట్ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. అయితే తనను తాను నియంత్రించుకోవడంలో విఫలమై బౌండరీ లైన్ తొక్కాడు. దాంతో ఔట్ కాస్తా సిక్స్ అయిపోయింది. ఇక చివరి ఓవర్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా ఓవర్ త్రో రూపంలో ఇంగ్లండ్‌కు ఆరు పరుగులు రావడంతో మ్యాచ్ టై అయ్యింది. ఫలితంగా సూపర్ ఓవర్ ఇంగ్లండ్ 15 పరుగులు చేస్తే, కివీస్ కూడా అన్నే పరుగులు స్కోరును సమం చేసింది. కాకపోతే బౌండరీల ఆధారంగా ఇంగ్లండ్‌ను విశ్వవిజేతగా ప్రకటించారు. ఇదిలా ఉంచితే, సూపర్ ఓవర్‌ను తనకు ఇవ్వడంపై ఒకింత ఆందోళనకు గురైనట్లు జోఫ్రా ఆర్చర్ తెలిపాడు. ‘ నేను సూపర్ ఓవర్ వేయడానికి వెళ్లే ముందు స్టోక్స్ వచ్చి కూల్‌గా ఉండమని చెప్పాడు. నువ్వు గెలుపు-ఓటములు గురించి పట్టించుకోకు. అదేమే నీ ప్రతిభను తగ్గించదు అని ధైర్యం ఇచ్చాడు. ఆ సలహాతోనే నేను స్వేచ్ఛగా బౌలింగ్ వేశా. అదే సమయంలో జో రూట్ కూడా వచ్చి కొన్ని స్ఫూర్తిదాయకమైన మాటలు చెప్పాడు. నాపై ప్రతీ ఒక్కరూ నమ్మకం ఉంచడంతోనే నేను బౌలింగ్‌ను నియంత్రణతో వేశా. నేను ఒకటే అనుకున్నా. ఒకవేళ మేము ఓటమి పాలైతే ప్రపంచం అక్కడితో ఆగిపోదు అనే విషయం నాకు తెలుసు’ ఆర్చర్ తెలిపాడు. ఇక నా రెండు నెలల ఇంగ్లండ్ కెరీర్లో ఇదే అత్యుత్తమమని పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌కు జట్టుకు ప్రాతినిథ్యం వహించడం ఒకటైతే, వరల్డ్‌కప్‌లో జట్టులోకి రావడం, వరల్డ్‌కప్‌లో ఆడటం తన జీవితంలో ఎంతో ప్రత్యేకమన్నాడు. -
అంతా పీడకలలా అనిపిస్తోంది
లండన్: ప్రపంచ కప్ విజేతగా నిలిచే అవకాశాన్ని త్రుటిలో చేజార్చుకున్న న్యూజిలాండ్ క్రికెట్ జట్టు మొత్తం తీవ్ర నిరాశకు గురైంది. ఫైనల్ మరుసటి రోజు దీనిపై కెప్టెన్ కేన్ విలియమ్సన్ భారంగా స్పందించాడు. ‘నిరాశ మమ్మల్ని ఉప్పెనలా ముంచెత్తింది. ఉదయం లేచి చూస్తే పీడకల కన్నట్లుగా అనిపించింది. మా ఆటగాళ్లంతా నిజంగా చాలా బాధపడుతున్నారు. మ్యాచ్‌లో ఈ తరహాలో ఓడటం ఏదోలా ఉంది’ అని విలియమ్సన్ తన బాధను వ్యక్తీకరించాడు. ఆదివారం మ్యాచ్ ముగిసిన తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడిన కివీస్ కెప్టెన్... బౌండరీల లెక్క నిబంధనపై ఆచితూచి స్పందించాడు. ‘బౌండరీలను బట్టి విజేతను నిర్ణయించడం సరైందా అంటే నేను ఎప్పటికీ సమాధానం ఇవ్వలేను. నిజానికి ఇలాంటి ప్రశ్న మీరు అడుగుతారని గానీ నేను జవాబు ఇవ్వాల్సి వస్తుందని గానీ అసలెప్పుడూ ఊహించలేదు. ఇంకా ఓటమి బాధలోనే ఉన్నాం. ఇరు జట్లు ఇంత కష్టపడిన తర్వాత బౌండరీ లెక్క ప్రకారం ఫలితం రావడం జీర్ణించుకోలేకపోతున్నాం. ఇది సిగ్గుచేటు’ అని అతను వ్యాఖ్యానించాడు. అయితే ఇంత జరిగినా అతను ఈ నిబంధనను విమర్శించడానికి ఇష్టపడకుండా క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాడు. ‘నిబంధనలు మొదటి నుంచి ఉన్నాయనేది వాస్తవం. కానీ ఇలాంటి నిబంధనతో మ్యాచ్ ఫలితం తేల్చాల్సి వస్తుందని బహుశా ఎవరూ ఊహించకపోవచ్చు. స్టోక్స్ బ్యాట్‌కు తగిలి ఓవర్‌త్రో వెళ్లడం కూడా అలాంటిదే. ఒక అద్భుతమైన మ్యాచ్ జరిగింది. అందరూ దానిని బాగా ఆస్వాదించారు’ అని విలియమ్సన్ చెప్పడం విశేషం. ఫైనల్ ఫలితం తర్వాత భావోద్వేగాలు ఎలా ఉన్నాయనే ప్రశ్నకు స్పందిస్తూ విలియమ్సన్... ‘ఇలాంటి స్థితిలో నవ్వడమో లేదా ఏడవడమో అనే ఒకే ఒక అనుభూతి ఉంటుంది. అయితే కొంత నిరాశ ఉన్నా నాకు కోపం మాత్రం లేదు’ అని విలియమ్సన్ స్పష్టం చేశాడు. -
వీధి రౌడీలా కాదు హీరోలా...
లండన్: బెన్ స్టోక్స్ అంటే అందరికీ రెండే రెండు విషయాలు గుర్తుకొస్తాయి. 2016 టి20 ప్రపంచకప్ ఫైనల్ చివరి ఓవర్లో వరుసగా నాలుగు సిక్సర్లు ఇచ్చి మ్యాచ్‌ను చేజార్చిన వైనం... ఆ తర్వాత నైట్ క్లబ్ వద్ద ఒక వ్యక్తిని చితక్కొట్టిన ఘటన... కానీ ఇప్పుడు అతను ఒకేసారి ఈ రెండింటినీ మరచిపోయే ఘనతను సాధించాడు. ‘వీధిలో రౌడీలా గొడవకు దిగిన వ్యక్తిగా నేను గుర్తుండిపోదల్చుకోలేదు. మైదానంలో ఏదైనా సాధించిన వాడిగా ఉండాలనుకుంటున్నా. ప్రపంచ కప్ గెలిస్తే నా బయోడేటాలో అదే ముందుంటుంది’ అని మెగా టోర్నీకి ముందు చెప్పిన స్టోక్స్ చివరకు దానిని నిజం చేసి చూపించాడు. ఇంగ్లండ్‌కు ప్రపంచకప్ అందించడంలో కీలక పాత్ర పోషించి ఒకరకంగా అతను పాపపరిహారం చేసుకున్నాడు. టోర్నీలో ఐదు అర్ధ సెంచరీలు చేసిన స్టోక్స్... ఫైనల్లో ఆడిన ఇన్నింగ్స్ అపూర్వం. క్లిష్టపరిస్థితుల్లో అజేయంగా 84 పరుగులు చేసిన స్టోక్స్ చరిత్రలో నిలిచిపోయాడు. ‘నాకు మాటలు రావడం లేదు. ఇక్కడికి చేరేందుకు గత నాలుగేళ్లుగా పడ్డ శ్రమ, ఇప్పుడు ప్రపంచ చాంపియన్లుగా నిలవడం అద్భుతంగా అనిపిస్తోంది’ అని ఫైనల్ అనంతరం స్టోక్స్ వ్యాఖ్యానించాడు. న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌లో పుట్టి 12 ఏళ్ల వయసులో ఇంగ్లండ్‌కు వలస వెళ్లిన స్టోక్స్... ఇప్పుడు ఫైనల్లో కివీస్‌పైనే చెలరేగడం విశేషం. ‘న్యూజిలాండ్‌తో మ్యాచ్ అంటే ఎప్పుడైనా ప్రత్యేకమే. అది గొప్ప జట్టు మాత్రమే కాదు. అందులో చాలా మంది మంచివాళ్లున్నారు. నా ఓవర్‌త్రో సిక్సర్ తర్వాత విలియమ్సన్కు నేను క్షమాపణ చెప్పా’ అని మ్యాచ్ అనంతరం స్టోక్స్ వ్యాఖ్యానించాడు. కష్టకాలంలో జట్టు సహచరులు తనకు, తన కుటుంబానికి అండగా నిలవడం వల్లే మళ్లీ కోలుకొని ఇక్కడి వరకు రాగలిగాలని 28 ఏళ్ల స్టోక్స్ భావోద్వేగంతో చెప్పాడు. ఇప్పుడెవరికీ అతని నాలుగు సిక్సర్లు గానీ బ్రిస్టల్‌లో గొడవ కానీ గుర్తుకు రావు. ఇంగ్లండ్ చరిత్రలో గొప్ప ఆల్‌రౌండర్‌గా నిలిచిపోయిన ఇయాన్ బోథమ్ సహా మరెందరికో సాధ్యం కాని రీతిలో విశ్వ విజయంలో భాగమైన స్టోక్స్ ఇప్పుడు వారందరికీ సూపర్ హీరో మాత్రమే. -
అదృష్టం మా వైపు ఉంది!
లండన్: ప్రపంచ కప్‌ను గెలుచుకున్నామన్న ఆనందం నుంచి తాము ఇంకా బయటకు రాలేకపోతున్నట్లు ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ చెప్పాడు. నాలుగేళ్ల శ్రమకు దక్కిన ఫలితమిదని మ్యాచ్ తర్వాత అతను వ్యాఖ్యానించాడు. ‘మేం గెలుపు గీత దాటడం ఇంకా నమ్మశక్యంగా అనిపించడం లేదు. నాతో పాటు జట్టు సభ్యులందరూ ఒక ప్రణాళిక ప్రకారం అంకితభావంతో కష్టపడ్డాం. ఈ గెలుపు ప్రయాణం అద్భుతంగా సాగింది. టోర్నీ ఆరంభం నుంచి కూడా మాపై అంచనాలు ఉన్నాయి. వాటిని నిజం చేయడం సంతోషంగా ఉంది’ అని మోర్గాన్ అన్నాడు. బౌండరీల ఆధారంగా విజేతను నిర్ణయించిన నిబంధనపై మోర్గాన్ జాగ్రత్తగా స్పందించాడు. ‘ఇప్పుడు అమలు చేసిన పద్ధతి కాకుండా ఇంకా వేరే ఏదైనా ప్రత్యామ్నాయం ఉంటే చెప్పండి. అప్పుడు ఈ రెండింటినీ పోల్చి ఏది మెరుగైందో నిర్ణయించవచ్చు. టోర్నీ నిబంధనలు చాలా కాలం క్రితమే రూపొందించారు. వాటిపై మన నియంత్రణ ఉండదు’ అని ఇంగ్లండ్ కెప్టెన్ స్పష్టీకరించాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన బెన్ స్టోక్స్‌పై మోర్గాన్ ప్రశంసలు కురిపించాడు. ‘స్టోక్స్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అతను మానవాతీతుడిలా ఆడి జట్టు గెలుపు భారాన్ని సమర్థంగా మోశాడు. బట్లర్ ఔటైన తర్వాత చివరి వరుస బ్యాట్స్‌మెన్‌తో అతను ఇన్నింగ్స్ నడిపించడం అసాధారణం’ అని మోర్గాన్ చెప్పాడు. ‘అల్లా కూడా మాతోనే’... మోర్గాన్ స్వదేశం ఐర్లాండ్ కాగా... అన్ని కలిసి రావడంపై అక్కడ ‘ఐరిష్ లక్’ పేరుతో బాగా ప్రాచుర్యంలో సామెత ఉంది. ‘ఐరిష్ లక్’ వెంట నడిచిందా అంటూ అడిగిన ప్రశ్నపై మోర్గాన్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ‘నా సహచరుడు ఆదిల్ రషీద్‌తో మాట్లాడినప్పుడు అల్లా ఈ రోజు మనతో ఉన్నాడని చెప్పాడు. కాబట్టి నేను కూడా అల్లా మా జట్టుకు అండగా నిలిచాడని నమ్ముతున్నా. సరిగ్గా చెప్పాలంటే మా జట్టులో వేర్వేరు సంప్రదాయాలు, నేపథ్యాలకు చెందిన ఆటగాళ్లు ఉన్నారు. భిన్నత్వంలో ఏకత్వం కనిపిస్తుంది. కానీ ఆటకు వచ్చేసరికి అంతా కలిసికట్టుగా ఆడి విజయం సాధించాం’ అని అతను విశ్లేషించాడు. భారత్‌లో జరిగే 2023 ప్రపంచకప్ గురించి ఏమాత్రం ఆలోచించడం లేదని, ప్రస్తుతం విశ్వ విజేతగా ఆనందాన్ని ఆస్వాదించడంపైనే దృష్టి పెట్టినట్లు మోర్గాన్ చెప్పాడు. 6 కాదు 5 పరుగులు ఇవ్వాల్సింది! ఓవర్‌త్రోపై మాజీ అంపైర్ టఫెల్ అభిప్రాయం లండన్: ఓవర్ త్రో ద్వారా ఇంగ్లండ్‌కు ఆరు పరుగులు రావడం ప్రపంచకప్ ఫైనల్ డ్రామాలో కీలక ఘట్టం. 50వ ఓవర్లో విజయం కోసం ఇంగ్లండ్ 3 బంతుల్లో 9 పరుగులు చేయాల్సి ఉండగా నాలుగో బంతికి ఆరు పరుగులు లభించడంతో సమీకరణం 2 బంతుల్లో 3 పరుగులుగా మారిపోయింది. బౌల్ట్ వేసిన ఫుల్‌టాస్‌ను డీప్ మిడ్‌వికెట్ వైపు కొట్టిన స్టోక్స్ సింగిల్‌ను పూర్తి చేసి రెండో పరుగు కోసం పరుగెత్తాడు. ఫీల్డర్ గప్టిల్ విసిరిన త్రో నేరుగా స్టోక్స్ పరుగెడుతున్న వైపే దూసుకొచ్చినా... అతని బ్యాట్‌కే తగిలి బౌండరీని దాటింది. స్టోక్స్, రషీద్ చేసిన 2 పరుగులతో కలిపి ధర్మసేన దానిని ‘6’గా ప్రకటించాడు. స్టోక్స్ ఉద్దేశపూర్వకంగా అడ్డు రాలేదు కాబట్టి తప్పు లేదు కానీ ఆరు పరుగులు ఇవ్వడాన్ని ప్రఖ్యాత మాజీ అంపైర్ సైమన్ టఫెల్ తప్పు పట్టారు. ‘నిబంధన 19.8 ప్రకారం ఫీల్డర్ త్రో సంధించిన సమయంలో ఇద్దరు బ్యాట్స్‌మెన్ పిచ్‌పై ఒకరిని మరొకరు దాటితేనే రెండో పరుగును లెక్కించాలి. వీడియో రీప్లేలో చూస్తే ఫీల్డర్ బంతిని విసిరినప్పుడు వీరిద్దరు ఒకరిని మరొకరు దాటలేదు. కాబట్టి బౌండరీతో పాటు సింగిల్‌నే అనుమతించాల్సింది. అప్పుడు ఒక పరుగు తగ్గడంతో పాటు రషీద్ స్ట్రయికింగ్ తీసుకోవాల్సి వచ్చేది’ అని టఫెల్ వివరించారు. అయితే తాను అంపైర్‌ను విమర్శించడం లేదని, అదంతా ఆ సమయంలో మైదానంలో ఉండే ఉద్వేగాలు, వేడిలో అలాంటిది జరిగిపోయిందని అన్నారు. ‘స్టోక్స్ పరుగు పూర్తి చేసే స్థితిలో ఉన్నాడని అంపైర్ భావించి ఉండవచ్చు. ఈ నిర్ణయం ప్రభావం మ్యాచ్‌పై కొంత మేరకు ఉన్నా, తుది ఫలితానికి ఇది మాత్రం కారణం కాదు’ అని టఫెల్ అభిప్రాయపడ్డారు. ‘బౌండరీ’పై విమర్శల బాదుడు! ప్రపంచ కప్ ఫైనల్ ఫలితాన్ని బౌండరీల లెక్కతో తేల్చడంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. దీనిని అత్యంత చెత్త నిబంధనగా పేర్కొంటూ మాజీ క్రికెటర్లు ఐసీసీపై విరుచుకుపడ్డారు. దీనికంటే ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించాల్సిందని కొందరు అభిప్రాయ పడగా, ఇలాంటి నిబంధనలు మార్చేయాలని మరికొందరు సూచించారు. ఫైనల్ మ్యాచ్‌లో బౌండరీ పరంగా చూస్తే 26–17 తేడాతో న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్ నెగ్గింది. ‘క్రికెట్లో కొన్ని నిబంధనలపై తీవ్రంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది’ –రోహిత్ శర్మ ‘అద్భుతంగా సాగిన మ్యాచ్‌లో ఫలితాన్ని బౌండరీల తేడాతో నిర్ణయించడం ఏమిటో అర్థం కాలేదు. అతి చెత్త నిబంధన ఇది. ‘టై’గా ప్రకటిస్తే బాగుండేది’ –గౌతం గంభీర్ ‘బౌండరీ నిబంధనకు నేను కూడా మద్దతివ్వను. కానీ రూల్స్ అంటే రూల్సే. ఎట్టకేలకు కప్ గెలిచిన ఇంగ్లండ్‌కు అభినందనలు’ –యువరాజ్ సింగ్ ‘అసలు ఎంత బాగా పని చేస్తున్నారో...అసలు ఐసీసీ అనేదే పెద్ద జోక్’ –స్కాట్ స్టయిరిస్ ‘ఐసీసీ నిబంధన వల్ల ఇంగ్లండ్ కప్ గెలవడం అసలే మాత్రం ఊహించలేనిది. ఇద్దరినీ సంయుక్త విజేతలుగా ప్రకటిస్తే బాగుండేది’ –బిషన్ సింగ్ బేడి ‘డక్‌వర్త్ లూయిస్ నిబంధన పరుగులు, వికెట్లపై ఆధారపడి ఉంది. కానీ ఫైనల్ ఫలితం మాత్రం బౌండరీల లెక్క ప్రకారం తీసుకుంటారా’ –డీన్ జోన్స్ ‘నా దృష్టిలో ఇలా విజేతను నిర్ణయించడం దుర్మార్గమైన పద్ధతి. ఇది మారాల్సిందే’ –బ్రెట్ లీ ‘చాలా బాధగా ఉంది. మేం మోసపోయినట్లనిపిస్తోంది. పిచ్చి నిబంధన. ఇది కూడా టాస్ వేసి విజేతను నిర్ణయించడంలాంటిదే’ –డియాన్ నాష్ ‘క్రూరత్వం’ –స్టీఫెన్ ఫ్లెమింగ్ -
ప్రపంచకప్ ఫైనల్‌పై స్పందించిన కోహ్లి
న్యూఢిల్లీ : క్రికెట్ చరిత్రలోనే అద్భుతంగా నిలిచిపోయిన ఇంగ్లండ్-న్యూజిలాండ్ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌పై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి స్పందించాడు. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిచ్చిన ఈ మ్యాచ్ ఫలితంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కాగా.. కోహ్లి మాత్రం నిబంధనల జోలికి పోకుండా ఇరు జట్ల పోరాటాన్ని కొనియాడుతూ ట్వీట్ చేశాడు. ‘ప్రపంచకప్ ఫైనల్లో ఇరు జట్లు అద్బుత పోరాటాన్ని కనబర్చాయి. ఇంగ్లండ్ జట్టుకు అభినందనలు’ అంటూ సాధాసీధాగా ట్వీట్ చేశాడు. ఈ ఫైనల్ మ్యాచ్, సూపర్ ఓవర్ రెండూ టై కావడంతో అత్యధిక బౌండరీలు సాధించిన ఇంగ్లండ్‌ను విశ్వవిజేతగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ బౌండరీల నిబంధనపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. టీమిండియా మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, గంభీర్‌లు ఈ నిబంధనను తప్పుబట్టగా.. వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ తరహా నిబంధనలపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. Great show by both the teams in the #CWC19Finals yesterday. Congratulations @englandcricket. 👍🏼 — Virat Kohli (@imVkohli) July 15, 2019 I don’t agree with that rule ! But rules are rules congratulations to England on finally winning the World Cup , my heart goes out for the kiwis they fought till the end 😥. Great game an epic final !!!! #CWC19Final — yuvraj singh (@YUVSTRONG12) July 14, 2019 -
వన్డేలకు రోహిత్.. టెస్ట్‌లకు కోహ్లి!
ముంబై : చెత్త బ్యాటింగ్ సెలక్షన్, మిడిలార్డర్ వైఫల్యం, ఎప్పటి నుంచో వెంటాడిన ‘నాలుగో’ సమస్య సమస్యగానే మిగలడం ప్రపంచకప్‌లో భారత్ నిష్క్రమణకు కారణమయ్యాయి. టోర్నీ ఆసాంతం ఆధిపత్యం కనబర్చిన కోహ్లిసేన.. న్యూజిలాండ్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో తడబడి కోట్లాది ప్రజల ఆశలను సమాధి చేసింది. అయితే ఈ ఓటమి నేపథ్యంలో భారత జట్టులో గ్రూప్ తగదాలు నెలకొన్నాయని, కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య గ్యాంగ్ వార్ నడుస్తోందనే వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ పుకార్లను సీరియస్‌గా తీసుకున్న బీసీసీఐ దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. కోహ్లి కెప్టెన్సీని టెస్ట్ ఫార్మట్‌కు పరిమితం చేసి.. లిమిటెడ్ ఓవర్స్ ఫార్మాట్ సారథ్య బాధ్యతలను రోహిత్‌శర్మకు అప్పగించే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ ప్రపంచకప్ నేర్పిన గుణపాఠాలతో భారత్ తదుపరి ప్రపంచకప్ సమాయత్తం కావాల్సిన అవసరం ఉందని, ఈ నేపథ్యంలోనే రోహిత్ శర్మకు లిమిటెడ్ ఓవర్స్ ఫార్మాట్ సారథ్య బాధ్యతలు అప్పగించి, టెస్టుల్లో కోహ్లిని కొనసాగించే యోచనలో మేనేజ్మెంట్ ఉన్నట్లు బోర్డు అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. ‘వన్డే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడానికి రోహిత్‌కిదే సరైన సమయం. ప్రస్తుత కెప్టెన్, మేనేజ్మెంట్కు అందరి మద్దతు ఉంది. కానీ, తదుపరి ప్రపంచకప్‌కు ప్రణాళికలు రచించుకోవాలి. అందుకోసం పాత వ్యూహాలు, ప్రణాళికలను పక్కన పెట్టాలి. జట్టులో కొన్ని విషయాల్లో మార్పు అవసరమని మనందరికి తెలుసు. లిమిటెడ్ ఓవర్స్ కెప్టెన్సీకి రోహితే సరైనవాడు’ అని ఆ అధికారి అభిప్రాయపడ్డాడు. తాజాగా భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ సైతం రోహిత్ శర్మకే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని సూచించాడు. ‘ఇక పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు రోహిత్ శర్మకు అప్పగించే సమయం వచ్చేసిందా? నేనైతే.. రోహితే 2023 ప్రపంచకప్‌కు సారథ్యం వహించాలనుకుంటున్నాను’ అని ట్వీట్ చేశాడు. ఇక ఇద్దరు కెప్టెన్ల డిమాండ్ ఇప్పుడే రాలేదు. ఆసియాకప్, నిదహాస్ టోర్నీల్లో రోహిత్‌సేన విజయం సాధించినప్పుడే ఈ వాదన తెరపైకి వచ్చింది. రోహిత్ సారథ్య రికార్డు కోహ్లి కన్నా మెరుగ్గా ఉండటంతో ఈ డిమాండ్ వ్యక్తమైంది. ప్రపంచకప్‌లో భారత జట్టు ప్రదర్శనను సమీక్షించాలని క్రికెట్ పరిపాలకుల కమిటీ (సీఓఏ) నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి త్వరలోనే జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రిలతో సీఓఏ ప్రత్యేకంగా సమావేశంకానుంది. ఈ సమావేశంలో ఇద్దరు కెప్టెన్ల అంశం చర్చకు రానుంది. -
ఐసీసీ టీమ్ ఆఫ్ ది టోర్నీ.. కోహ్లికి దక్కని చోటు
దుబాయ్ : ఐసీసీ ప్రపంచకప్ 2019 టీమ్ ఆఫ్ ది టోర్నీలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి చోటుదక్కలేదు. ప్రపంచకప్ సంగ్రామం ముగియడంతో 12 మంది సభ్యులతో కూడిన టోర్నీ ఉత్తమ జట్టును సోమవారం ఐసీసీ ప్రకటించింది. ఈ జట్టులో భారత్ నుంచి కేవలం ఇద్దరు ఆటగాళ్లే అవకాశం దక్కించుకోగా.. అత్యధికంగా ఇంగ్లండ్ నుంచి నలుగురికి చోటు దక్కింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ నుంచి ఇద్దరు, బంగ్లాదేశ్ తరఫున ఒక్కరు ఎంపికయ్యారు. భారత్ నుంచి ఓపెనర్ రోహిత్ శర్మ, యార్కర్ల కింగ్ జస్ప్రిత్ బుమ్రాకుల మాత్రమే చోటుదక్కింది. ఇక ఈ మెగా జట్టు కెప్టెన్‌గా న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్‌ను ఎంపిక చేయగా.. వికెట్ కీపర్‌గా ఆసీస్ ఆటగాడు అలెక్స్ క్యారీకి అవకాశం ఇచ్చారు. ప్రపంచకప్ టోర్నీ ప్రదర్శన ఆధారంగానే ఈ జట్టును ఎంపిక చేయడంతో భారత కెప్టెన్‌కు చోటు దక్కలేదు. రోహిత్ శర్మ 5 సెంచరీలతో చెలరేగి పరుగుల జాబితాలో టోర్నీ టాపర్‌గా నిలవగా.. 18 వికెట్లతో బుమ్రా రాణించాడు. ఇక 12వ ఆటగాడిగా న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్‌బౌల్ట్‌ను ఎంపిక చేశారు. ఐసీసీ టీమ్ ఆఫ్ ది టోర్నీ విలియమ్సన్(కెప్టెన్), రోహిత్ శర్మ, జాసన్ రాయ్ (ఓపెనర్స్), జోరూట్, షకీబ్ అల్ హసన్, బెన్ స్టోక్స్, అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, జోఫ్రా ఆర్చర్, ఫెర్గ్సన్, జస్ప్రిత్ బుమ్రా. 12వ ఆటగాడు: ట్రెంట్ బౌల్ట్ -
క్రికెట్ రూల్స్‌పై దృష్టి సారించాల్సిందే: రోహిత్
ముంబై : ప్రపంచకప్ ఫైనల్ ఫలితంతో యావత్ క్రికెట్ ప్రపంచం ఐసీసీ నిబంధనలపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. క్రీడాస్పూర్తికి విరుద్దంగా ఉన్న ఈ రూల్స్‌ను మార్చాల్సిందేనని పట్టుబడుతోంది. ఇప్పటికే డక్‌వర్త్ లూయిస్ పద్దతిపై తీవ్ర విమర్శలు వ్యక్తం కాగా.. తాజా ప్రపంచకప్ ఫైనల్ ఫలితంతో సూపర్ ఓవర్ నిబంధన చర్చనీయాంశమైంది. న్యూజిలాండ్-ఇంగ్లండ్ ఫైనల్ మ్యాచ్, సూపర్ ఓవర్ టై కావడంతో సూపర్ ఓవర్ నిబంధన ప్రకారం బౌండరీలు ఎక్కువ సాధించిన ఇంగ్లండ్ జట్టును విశ్వవిజేతగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆఖరి బంతి వరకు ఇరు జట్లు సమాన పోరాట ప్రతిభను కనబర్చని స్థితిలో కేవలం బౌండరీలనే ప్రతిపాదికగా తీసుకొని విజేతగా ఎలా ప్రకటిస్తారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. బౌండరీలకన్నా సింగిల్స్ తీస్తూ పరుగులు చేయడమే అసలైన క్రికెట్ అని, అలాంటిది ఎక్కువ బౌండరీలు చేసిన జట్టును ఎలా విజేతగా ప్రకటిస్తారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సంయుక్త విజేతలుగా ప్రకటించే గత నిబంధనను మార్చి బౌండరీల ద్వారా విజేతను ప్రకటించడం ఏ మాత్రం సరైంది కాదనే వాదన వినిపిస్తోంది. ఈ వాదనకు మద్దతుగా టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్, వైస్ కెప్టెన్ రోహిత్‌శర్మలు ట్వీట్ చేశారు. ఈ బౌండరీల నిబందన చెత్తదని గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేయగా.. క్రికెట్లోని కొన్ని రూల్స్‌పై సీరియస్‌గా దృష్టిసారించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. Some rules in cricket definitely needs a serious look in. — Rohit Sharma (@ImRo45) July 15, 2019 -
‘ధోని రనౌట్ పాపమే చుట్టుకుంది’
విశ్వవేదికపై గెలుపు ముంగిట న్యూజిలాండ్ బొక్కబోర్లపడటానికి ఆ జట్టు చేసుకున్న కర్మే కారణమని భారత అభిమానులు కామెంట్ చేస్తున్నారు. భారత్‌తో జరిగిన సెమీస్ పోరులో కివీస్ చేసిన తప్పుకు ఫలితమే ప్రపంచకప్ ఫైనల్ ఓటమని సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా భారత సీనియర్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని రనౌట్‌ను ప్రస్తావిస్తూ ట్రోలింగ్‌కు పాల్పడుతున్నారు. ఆ మ్యాచ్‌లో మార్టిన్ గప్టిల్ విసిరిన బంతి నేరుగా వికెట్లను తాకి, ధోని రనౌట్‌తో భారత పోరాటం ముగిసిన విషయం తెలిసిందే. అయితే తుది సమరంలో మ్యాచ్ టై కావడం.. ఆ తర్వాత నిర్వహించిన సూపర్ ఓవర్ ఆఖరు బంతికి రెండో పరుగు తీస్తూ గప్టిల్ రనౌటవ్వడం అంతా కర్మ సిద్దాంత ఫలితమేనని #Karma యాష్‌ట్యాగ్‌తో నిందిస్తున్నారు. అయితే ధోని రనౌట్ విషయంలో కివీస్ నిబంధనలకు విరుద్ధంగా ఫీల్డింగ్ పెట్టిందని ఆరోపణలు వచ్చాయి. మూడో పవర్ ప్లేలో నిబంధనల ప్రకారం 30యార్డ్ సర్కిల్ బయట ఐదుగురు ఫీల్డర్లు మాత్రమే ఉండాలి. కానీ ఆ సమయంలో కివీస్ ఆరుగురు ఫీల్డర్లను పెట్టిందని ప్రచారం జరిగింది. దీన్ని అంపైర్లు గుర్తించి ఉంటే అది నోబాల్ అయ్యేది. ఆ తరువాత బంతికి ఫ్రీ హిట్ వచ్చే అవకాశం ఉండటంతో.. ధోని కూడా పరుగు కోసం ప్రయత్నించివాడు కాదన్నది అభిమానుల ఉద్దేశం. ఇదే విషయాన్ని ప్రస్తవిస్తూ ఈ పాపమే గప్టిల్, కివీస్‌కు చుట్టుకుందని మండిపడుతున్నారు. What's active on twitter?#Karma Seriously...... Seems kindergartners active on twiiter!!!!!!!!!! pic.twitter.com/qfYhxirhzN — Bivek Chandak (@ChandakBivek) July 15, 2019 -
ట్రోఫీ చేజార్చుకోవడం సిగ్గుచేటు : స్టోక్స్ తండ్రి
ఓ తండ్రిగా గర్వపడుతున్నప్పటికీ.. న్యూజిలాండ్ ఓటమి తనను తీవ్రంగా నిరాశపరించిందని వరల్డ్‌కప్ మ్యాచ్ ఫైనల్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బెన్‌స్టోక్స్ తండ్రి గెరార్డ్ వ్యాఖ్యానించాడు. నరాలు తెగే ఉత్కంఠ పోరులో క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లండ్ తొలిసారి కప్‌ను ముద్దాడటంలో ఆ జట్టు ఆల్ రౌండర్ స్టోక్స్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. రెండేళ్ల క్రితం తన కారణంగా జట్టు టీ 20 వరల్డ్‌కప్‌లో ట్రోఫీని చేజార్చుకుందన్న అపరాధ భావనను ఆదివారం నాటి మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన ద్వారా స్టోక్స్ చెరిపేసుకున్నాడు. న్యూజిలాండ్ బౌలర్ల దాటికి సహచరులు వెనుదిరుగుతున్నా క్రీజులో పాతుకుపోవడమే కాక సూపర్ ఓవర్లో సైతం సమయోచితంగా బ్యాటింగ్ చేసి జట్టును చాంపియన్‌గా నిలపడంలో తన వంతు బాధ్యతను నిర్వర్తించాడు. ఇంగ్లండ్ విశ్వవిజేతగా అవతరించిన లార్డ్స్ మైదానంలో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచి చెరిగిపోని ఙ్ఞాపకాలు సొంతం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో స్టోక్స్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. బెన్ స్టోక్స్‌ను ఆల్ టైమ్ గ్రేటస్ట్ క్రికెటర్‌గా పేర్కొంటూ ఐసీసీ తన క్రికెట్ వరల్డ్‌కప్ ట్విటర్ అకౌంట్లో అతడిని ఆకాశానికి ఎత్తేసింది. ఈ క్రమంలో స్టోక్స్ తండ్రి గెరార్డ్ మాత్రం కాస్త భిన్నంగా స్పందించాడు. ఓ వైపు పుత్రోత్సాహంతో ఉప్పొంగిపోతూనే.. మరోవైపు కివీస్ ఓటమి తనను కలచివేసిందని విచారం వ్యక్తం చేశాడు. ‘ న్యూజిలాండ్‌లో అత్యధిక మంది చేత ద్వేషింపబడే తండ్రిని నేనేమో. బ్లాక్ క్యాప్స్ ఓటమి నన్నెంతో నిరాశకు గురిచేసింది. ట్రోఫీ లేకుండా వెనుదిరగడం నిజంగా సిగ్గుచేటు. గుండె మీద చేయి వేసుకుని చెబుతున్నా తన జట్టును గెలిపించిన స్టోక్స్ తండ్రిగా ఆనందంలో తేలియాడుతున్నా.ఏదేమైనా స్టోక్స్ కఠిన శ్రమకు ఈ మ్యాచ్‌తో ప్రతిఫలం లభించినట్లైంది. కానీ న్యూజిలాండ్ సపోర్టర్‌గా తీవ్ర నైరాశ్యంలో ఉన్నా’ అని వ్యాఖ్యానించాడు. కాగా స్టోక్స్ న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌లో జన్మించాడన్న సంగతి తెలిసిందే. అతడికి పన్నెండేళ్లు వచ్చేనాటికి స్టోక్స్ కుటుంబం నార్తర్న్ ఇంగ్లండ్‌కు షిఫ్ట్ అయ్యింది. రగ్బీ లీగ్ కోచింగ్ కాంట్రాక్ట్ నిమిత్తం అతడి తండ్రి గెరార్డ్ కుటుంబంతో సహా కంబ్రియాకు వచ్చి స్థిరపడ్డారు. ఇక అక్కడే క్రికెట్లో ఓనమాలు దిద్దిన స్టోక్స్ ఆల్ రౌండర్‌గా ఎదిగాడు. -
ఆర్చర్‌కు సూపర్ పవర్ ఉందా?
లండన్: నాటకీయ పరిణామాల మధ్య ఇంగ్లండ్ వరల్డ్‌కప్ గెలవడం ఒకటైతే, ఆ దేశ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఎప్పుడో ఆరేళ్ల క్రితం చేసిన ట్వీట్ ఇప్పడు హాట్ టాపిక్‌గా మారడం మరొకటి. అది కూడా ఎంతలా అంటే ఆర్చర్‌కు సూపర్ నేచురల్ పవర్స్ ఏమైనా ఉన్నాయా అనేంతగా అభిమానుల్లో ఆసక్తికి దారి తీసింది. 2013లో ఆర్చర్ ఒక ట్వీట్ చేశాడు. అందులో 16 పరుగులు, 6 బంతులు అని ఉండటమే చర్చనీయాంశమైంది. తాజా వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన తుది పోరులో భాగంగా ఇంగ్లండ్ సూపర్ ఓవర్లో 15 పరుగులు చేసింది. అంటే న్యూజిలాండ్ లక్ష్యం ఆరు బంతుల్లో 16 పరుగులు. మరి దీన్ని ముందే ఊహించే ఆర్చర్ ట్వీట్ చేశాడా అనేది అభిమానులకు మిలియన్ డాలర్ల ప్రశ్న. మరొక సందర్భంలో అంటే ఏడాది వ్యవధిలో ఆర్చర్ మరో ట్వీట్ చేశాడు. ‘ మేము లార్డ్స్‌కు వెళ్లాలనుకుంటున్నా’ అని పోస్ట్ చేశాడు. 2015లో మరొక ట్వీట్ చేస్తూ అందులో ‘సూపర్ ఓవర్‌ను పట్టించుకోవడం లేదు’ అని పేర్కొన్నాడు. ఆర్చర్ చేసిన ఒకనాటి ట్వీట్లు ఇప్పటి వరల్డ్‌కప్‌కు దాదాపు సరిపోలడంతో నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ‘ ఆర్చర్ భవిష్యత్తుకు అతనే జ్యోతిష్కుడు’ అని ఒకరు ట్వీట్ చేయగా, ‘కాలజ్ఞాని, నిజమైన దేవుడు’ అంటూ మరొకరు ట్వీట్ చేశారు. ‘కలలు నిజం అంటే ఇదే. అందుకు సంబంధించిన ఆధారాలు ఇక్కడ ఉన్నాయి. నీలో సూపర్ నేచురల్ పవర్ ఉంది’ అని మరొకరు పేర్కొన్నారు. ఇలా ఆర్చర్ చేసిన ట్వీట్లు తాజా సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారడం, అందుకు అభిమానుల్ని అనూహ్య మద్దతు లభించడం విశేషం. ఒక ఈ వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా నిలిచాడు ఆర్చర్. 2019 వరల్డ్‌కప్ సీజన్లో 20 వికెట్లతో సత్తాచాటాడు. ఇది ఒక వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్ తరఫున అత్యధికంగా నమోదైంది. -
ఎట్లిస్తరయ్యా 6 పరుగులు?
లార్డ్స్: విశ్వవేదికపై ఇంగ్లండ్ విజయం సాధించింది అనకంటే న్యూజిలాండ్ దురదృష్టమే గెలిపించిందని చెప్పాలి. ఎందుకంటే క్రికెట్ చరిత్రలోనే ఇప్పటి వరకు ఈ తరహా ఫలితం వెలువడలేదు. న్యూజిలాండ్ దురదృష్టం కాకపోతే.. మ్యాచ్, సూపర్ ఓవర్ రెండు టై కావడం ఏంటి.. గప్టిల్ విసిరిన బంతి సరిగ్గా బ్యాట్‌కు తగిలి బౌండరీకి వెళ్లడం ఏంటి.. బౌల్ట్ క్యాచ్ పట్టుకోని బౌండరీ లైన్ తొక్కడం ఏంటి. ఇదంతా చూస్తే ఈసారి కప్ ఇంగ్లండ్‌కే రాసినట్టుంది. ఆఖరి ఓవర్లో మార్టిన్ గప్టిల్ విసిరిన బంతి సరిగ్గా బెన్‌స్టోక్స్ బ్యాట్‌కు తగిలి బౌండరీకి వెళ్లడం.. అంపైర్లు 6 పరుగులు ఇవ్వడం ఇప్పుడు వివాదస్పదమైంది. స్టోక్స్ ఉద్దేశపూర్వకంగా చేయనప్పటికి అంపైర్లు ధర్మసేన, ఎరాస్మస్ చేసిన ఘోర తప్పిదం మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపింది. ఐసీసీ నిబంధనల మేరకు ఆతిథ్య జట్టుకు లభించాల్సింది కేవలం 5 పరుగులే. 19.8 నిబంధన మేరకు ఓవర్‌త్రో ద్వారా బౌండరీ లభించినప్పుడు ఆ పరుగులతో పాటు ఫీల్డర్ యాక్షన్ పూర్తయ్యే సమయానికి బ్యాట్స్‌మెన్ తీసిన పరుగులను కూడా కలిపి ఇవ్వాలి. అయితే ఇక్కడ బెన్‌స్టోక్స్, ఆదిల్ రషీద్‌లు రెండో పరుగు పూర్తి చేయకుండానే బంతి స్టోక్స్ బ్యాట్ తాకి బౌండరీకి వెళ్లింది. బౌండరీ ద్వారా లభించిన 4 పరుగులకు.. వారు చేసిన ఒక్క పరుగును జోడించి ఐదు పరుగులు ఇవ్వాలి. కానీ అంపైర్లు ఇది గుర్తించకుండా 6 పరుగులిచ్చి కివీస్ ఓటమికి పరోక్షంగా కారణమయ్యారు. వాస్తవానికి ఈ పరుగులే మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్ అయ్యాయి. 5 పరుగులు కనుక ఇచ్చి ఉంటే ఇంగ్లండ్ విజయానికి రెండు బంతుల్లో 4 పరుగలు చేయాల్సి వచ్చేది. న్యూజిలాండ్ విశ్వవిజేతగా నిలిచేంది. ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ అంపైర్లు ఘోర తప్పిదం చేశారని ఆస్ట్రేలియా మాజీ అంపైర్, ఐదు సార్లు ఐసీసీ బెస్ట్ అంపైర్‌గా నిచిన సైమన్ టఫెల్ అన్నారు. ‘ఇది అంపైర్ల తప్పని స్పష్టంగా తెలుస్తోంది. ఇంగ్లండ్‌కు ఇవ్వాల్సింది ఐదు పరుగులే. ఆ ఉత్కంఠ స్థితిల్లో బ్యాట్స్‌మెన్ పరుగును పూర్తిచేశారని అంపైర్లు భావించారు. కానీ రెండో పరుగు పూర్తి కాలేదు. టీవీ రిప్లేలో ఈ విషయం స్పష్టమైంది’ అని తెలిపారు. -
బౌండరీలు కూడా సమానమైతే?
లార్డ్స్ : నరాలు తెగే ఉత్కంఠ మధ్య ప్రపంచకప్ మహాసంగ్రామం ముగిసింది. క్రికెట్ పుట్టినింటికే విశ్వకానుక చేరింది. 45 రోజుల ఆట ఏడున్నర గంటల్లో తేలకపోయినా 4 నిమిషాల్లో మెరిసి మురిసింది. తృటిలో టైటిల్ చేజార్చుకున్న న్యూజిలాండ్ మాత్రం అభిమానుల మనుసులను గెలుచుకుంది. ప్రపంచకప్ ఫైనల్ టై కావడమే విశేషం అంటే.. తర్వాత జరిగిన సూపర్ ఓవర్ సైతం టై కావడం సగటు క్రికెట్ అభిమానిని సంభ్రమాశ్చర్యానికి గురిచేసింది. అయితే చివరకు బౌండరీలు మ్యాచ్ ఫలితం తేల్చగా.. కివీస్‌ను మాత్రం నిరాశ పరిచాయి. ఈ తుదిపోరులో ఇంగ్లండ్ సూపర్ ఓవర్‌తో కలుపుకొని 26 బౌండరీలు బాదగా.. కివీస్ మాత్రం 17 బౌండరీలే సాధించింది. దీంతో విశ్వవిజేతగా క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లండ్ నిలిచింది. సూపర్ ఓవర్ టై అయితే ప్రధానమ్యాచ్, సూపర్ ఓవర్ మొత్తం బౌండరీలు లెక్కించి.. ఎక్కవ బౌండరీలు చేసిన జట్టును విజేతగా ప్రకటించారు. మరీ ఆ బౌండరీలు కూడా టై అయితే ఏం చేస్తారు? ఇప్పుడు ప్రతి అభిమాని మదిలో మెదులుతున్న ప్రశ్న. అయితే సూపర్ ఓవర్ నిబంధనల ప్రకారం ఈ పరిస్థితి కనుక ఏర్పడితే.. కేవలం ప్రధాన మ్యాచ్ బౌండరీలను మాత్రమే లెక్కిస్తారు. ఒకవేళ అవి కూడా సమానమైతే.. సూపర్ ఓవర్ చివరి బంతి నుంచి ఇరు జట్లు సాధించిన పరుగులను పరిగణలోకి తీసుకొని ఎక్కువ రన్స్ చేసిన జట్టును విజేతగా ప్రకటిస్తారు. ఊదాహారణకు... బంతులు తొలి జట్టు రెండో జట్టు 6వ బంతి 4 4 5వ బంతి 3 2 4వ బంతి 6 4 3వ బంతి 1 2 2వ బంతి 1 2 1వ బంతి 1 2 ఇక్కడ తొలి జట్టు చివరి బంతికి 4 పరుగులు సాధించగా.. రెండో జట్టు కూడా అంతే పరుగులు చేసింది. ఐదో బంతికి తొలి జట్టు 3 పరుగులు చేయగా.. రెండో జట్టు మాత్రం 2 పరుగులే చేసింది. రెండో జట్టు కన్నా ఒక పరుగు ఎక్కువ చేసింది కనుక సూపర్ ఓవర్ నిబంధనల ప్రకారం తొలి జట్టే విజేత అవుతోంది. -
అనూహ్యంగా వచ్చాడు.. టాప్ లేపాడు!
లండన్: జోఫ్రా ఆర్చర్.. వరల్డ్‌కప్‌కు ఇంగ్లండ్ ముందుగా ప్రకటించిన జాబితాలో ఈ పేరు లేదు. ఇంగ్లండ్ లెఫ్టార్మ్ పేసర్ డేవిడ్ విల్లే గాయపడితే ఆర్చర్‌కు అనూహ్యంగా చోటు దక్కింది. వెస్టిండీస్ తరఫున అండర్-19 క్రికెట్ ఆడి, ఆపై ఇంగ్లండ్‌కు ప్రాతినిథ్యం వహించడం ఇక్కడ ప్రధానంగా చెప్పాల్సిన విషయం. ప్రధానంగా ఇంగ్లిష్ కౌంటీల్లో సత్తాచాటడంతో ఆర్చర్ పేరు ఒక్కసారిగా తెరపైకి వచ్చింది. ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించే వరకూ ఈ క్రికెటర్ పేరు ఎవరికీ పెద్దగా కూడా తెలియదు. అయితే ఐపీఎల్లో ఫర్వాలేదనిపించినా, ఇంగ్లండ్ వంటి పటిష్టమైన జట్టులో చోటు దక్కించుకోవడం అంత ఈజీ కాదు. అందులోనూ వరల్డ్‌కప్‌కు ఎంపిక చేసిన జట్టులో స్థానం సంపాదించడమంటే మాటలు కాదు. ఏది ఏమైనా ఇంగ్లండ్ వరల్డ్‌కప్ జట్టులో అనూహ్యంగా చోటు దక్కించుకున్నా ఆ జట్టు అంచనాల్ని నిజం చేశాడు. ఇంగ్లండ్ జట్టులో ప్రధాన పేసర్ పాత్ర పోషిస్తూ వరల్డ్‌కప్ సాధించడంలో ముఖ్య పాత్ర పోషించాడు. అదే సమయంలో ఒక వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా నిలిచాడు. 2019 సీజన్లో 20 వికెట్లతో సత్తాచాటాడు. ఇది ఒక వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్ తరఫున అత్యధికం. అదే సమయంలో మార్క్ వుడ్(18) రెండో స్థానంలో నిలిచాడు. ఒక వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్ తరఫున అత్యధి వికెట్లు సాధించిన జాబితాలో ఆర్చర్, మార్క్ వుడ్‌ల తర్వాత స్థానాల్లో క్రిస్ వోక్స్(16 వికెట్లు, 2019 వరల్డ్‌కప్), ఇయాన్ బోథమ్(16 వికెట్లు, 1992 వరల్డ్‌కప్), ఆండ్రూ ఫ్లింటాఫ్(14 వికెట్లు, 2007 వరల్డ్‌కప్)లు ఉన్నారు. -
బెన్ స్టోక్స్‌కు అంత సీన్ లేదు!
లండన్: ఇంగ్లండ్ తొలిసారి వరల్డ్‌కప్ విజేతగా నిలవడంలో ఆ జట్టు ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ప్రధాన పాత్ర పోషించాడు. మెగా ఫైట్‌లో న్యూజిలాండ్ నిర్దేశించిన 242 లక్ష్య ఛేదనలో స్టోక్స్ అజేయంగా 84 పరుగులు సాధించడంతో మ్యాచ్ టై అయ్యింది. ఆ తర్వాత ఫలితాన్ని తేల్చేందుకు నిర్వహించిన సూపర్ ఓవర్లో కూడా స్టోక్స్ ఒక ఫోర్ సాయంతో 8 పరుగులు చేశాడు. మరొకవైపు బట్లర్ 7 పరుగులు చేశాడు. కాగా, సూపర్ ఓవర్లో న్యూజిలాండ్ కూడా 15 పరుగులే చేయగా మళ్లీ మ్యాచ్ టై అయ్యింది. అయితే మ్యాచ్ మొత్తంలో ఎక్కువ బౌండరీలు కొట్టిన ఇంగ్లండ్ విశ్వ విజేతగా అవతరించింది. అయితే బెన్ స్టోక్స్‌ను ఆల్ టైమ్ గ్రేటస్ట్ క్రికెటర్‌గా పేర్కొంటూ ఐసీసీ తన క్రికెట్ వరల్డ్‌కప్ ట్వీటర్ అకౌంట్లో పేర్కొంది. ఇంతవరకూ బాగానే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో స్టోక్స్ కలిసి ఉన్న ఫొటోను పోస్ట్ చేసింది. ఇది భారత అభిమానులకు కోపం తెప్పించింది. ప్రధానంగా ఈ ట్వీట్‌పై సచిన్ అభిమానులు మండిపడుతున్నారు. అసలు బెన్ స్టోక్స్‌కు అంత సీన్ లేదంటూ విమర్శిస్తున్నారు. ‘ గాడ్ ఆఫ్ క్రికెట్ ఎవరో తెలుసా’ అంటూ ఒక అభిమాని ట్వీట్ చేయగా, ‘ సచిన్‌తో ఇంకొకరికి పోలిక.. అతనొక క్రికెట్ లెజెండ్, ఎవరు ఎన్ని చేసినా సచిన్ ఎప్పటికీ గ్రేట్. ఇది చాలా అవమానకరం’ అంటూ మరొకరూ విమర్శించారు. ‘ ఒకసారి ఆ ఇద్దరి గణాంకాలు చూస్తే ఎవరు ఆల్ టైమ్ గ్రేట్ అనేది అర్థమవుతుంది కదా’ అని మరొక అభిమాని ట్వీట్ చేశాడు. అసలు బెన్ స్టోక్స్‌కు అంత సీన్ లేదు. ఇలా పోస్ట్ చేసిన వాడ్ని చెప్పుతో కొట్టాలి’ అంటూ మరొక అభిమాని మండిపడ్డాఢు. -
మీరెవరూ క్రీడల్లోకి రాకండి: నీషమ్ ఆవేదన
లండన్: వన్డే వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్ విశ్వ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. .ఆదివారం అర్థరాత్రి వరకు కొనసాగిన ఉత్కంఠ పోరులో మ్యాచ్ టై కాగా, ఆపై నిర్వహించిన సూపర్ ఓవర్ కూడా టైగానే ముగిసింది. దీంతో బౌండరీలను( సూపర్ ఓవర్‌తో సహా ఫోర్లు, సిక్సర్లు) లెక్కలోకి తీసుకున్న ఇంగ్లండ్‌నే వరల్డ్ చాంపియన్‌గా ప్రకటించారు. ఇది ఆతిథ్య ఇంగ్లండ్‌కు అనుకూలంగా మారగా, గెలుపు తలుపు వరకు వెళ్లి వచ్చిన న్యూజిలాండ్ జట్టు ఆవేదన మాత్రం వర్ణనాతీతం. కప్పు ఇంగ్లండ్ గెలుచుకున్నా... న్యూజిలాండ్ మాత్రం అందరి మనసు గెలుచుకుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ పుట్టెడు దుఖంలో న్యూజిలాండ్ క్రికెటర్ జేమ్స్ నీషమ్( జిమ్మీ నీషమ్‌గా కూడా పిలుస్తారు) ట్వీటర్లో పోస్ట్ చేసిన ఓ మెసేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘పిల్లలూ మీరెవరూ క్రీడల్లోకి రావొద్దు. మరి ఎదైనా ప్రొఫెషన్ తీసుకోండి. 60 ఏళ్లకే హ్యాపీగా ఆరోగ్యంగా చనిపోండి’ అంటూ జిమ్మీ పోస్ట్ చేశాడు. ఈ క్రమంలోనే ఇంగ్లండ్‌కు అభినందనలు తెలియజేశాడు నీషమ్. జిమ్మీ నీషమ్ పెట్టిన ఈ పోస్టులకు నెటిజన్ల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. న్యూజిలాండ్ అభిమానులే కాదు.. భారత క్రికెట్ అభిమానులు సైతం నీషమ్‌ను ఓదార్చుతున్నారు. మీరు ఆడిన తీరు... ఎవరూ మరిచిపోలేరని అండగా నిలుస్తున్నారు. Kids, don’t take up sport. Take up baking or something. Die at 60 really fat and happy. — Jimmy Neesham (@JimmyNeesh) 15 July 2019 -
డీఆర్ఎస్ లేకుంటే బలైపోయేవారే..!
లండన్: ప్రపంచ క్రికెట్లో డీఆర్ఎస్(అంపైర్ నిర్ణయ సమీక్ష పద్ధతి)ని ప్రవేశపెట్టి ఇప్పటికే చాలా ఏళ్లే అయ్యింది. ఈ విధానంపై కొన్ని అభ్యంతరాలు నేటికీ ఉన్నప్పటికీ దీని వల్ల క్రికెటర్లు అంపైర్ల నిర్ణయాలకు బలయ్యే సందర్భాలు తగ్గాయనే చెప్పాలి. డీఆర్ఎస్లో హాక్ ఐ (బాల్ ట్రాకింట్ టెక్నాలజీ), హాట్ స్పాట్(బ్యాట్‌కు బంతి ఎడ్జ్ తీసుకుందా అనే కోణాన్ని పరిశీలించడం), స్నికో మీటర్(బంతి బ్యాట్‌కు లేదా ప్యాడ్‌కు తగిలిందా గుర్తించడానికి వాడే టెక్నాలజీ)లు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. వీటి సాయంతో అసలు క్రికెటర్ ఔటా, కాదా అనే విషయంపై థర్డ్ అంపైర్ నిర్ణయానికి వచ్చిన తర్వాత ఫీల్డ్ అంపైర్‌కు సూచిస్తాడు. ఆ క్రమంలోనే ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని సరి చేసుకునే అవకాశం ఉంది. వన్డే ఫార్మాట్లో ఒక జట్టు తమ ఇన్నింగ్స్‌ను ఆరంభించిన క్రమంలో ఒక రివ్యూనే ఉంటుంది. దాన్ని ఎక్కడ, ఎలా వాడుకోవాలనేది అక్కడ ఉండే పరిస్థితిపైనే ఉంటుంది. ఒకసారి రివ్యూకు కోల్పోతే మళ్లీ చాన్స్ ఉండదు. అదే సమయంలో రివ్యూకు సక్సెస్ అయితే అది అలానే ఉంటుంది. మరొకవైపు థర్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని ఫీల్డ్ అంపైర్‌కే వదిలేసిన క్రమంలో కూడా రివ్యూకు వెళ్లిన జట్టు దాన్ని నిలబెట్టుకుంటుంది. కాగా, ఆదివారంతో ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో డీఆర్ఎస్ది కూడా ప్రముఖ పాత్రనే చెప్పాలి. నిజంగా డీఆర్ఎస్ లేకుంటే మెగా టోర్నీ కూడా పేలవంగా ముగిసే అవకాశంతో పాటు ఎన్నో వివాదాలకు ఆజ్యం పోసేది. ఈ వరల్డ్‌కప్‌లో ఫీల్డ్ అంపైర్లు ప్రకటించిన నిర్ణయాలు డీఆర్ఎస్లో తప్పుగా తేలిన సందర్భాల్లో చాలానే ఉన్నాయి. ఇలా అత్యధికంగా తప్పుడు నిర్ణయాలు ప్రకటించిన జాబితాలో రిచర్డ్ అలన్ కెటల్‌బారో(ఇంగ్లండ్ అంపైర్) మొదటి స్థానంలో ఉన్నాడు. 2019 వరల్డ్‌కప్‌లో రిచర్డ్ అలన్ ప్రకటించిన ఐదు నిర్ణయాలు డీఆర్ఎస్లో తప్పుగా తేలగా, ఆ తర్వాత వరుసలో క్రిస్టోఫర్ గాఫనీ(న్యూజిలాండ్ అంపైర్), పాల్ విల్సన్(ఆస్ట్రేలియా అంపైర్), రుచిర పలియాగురుజే( శ్రీలంక అంపైర్), కుమార ధర్మసేన(శ్రీలంక అంపైర్)లు సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. వీరు తలో నాలుగు అంపైరింగ్ తప్పిదాలు చేశారు. ఆసీస్‌తో సెమీస్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ జేసన్ రాయ్ ఇలానే బలైపోయాడు. కుమార ధర్మసేన ఇచ్చిన తప్పుడు నిర్ణయం కారణంగా రాయ్ పెవిలియన్ వీడాల్సి వచ్చింది. ఆ సమయంలో ఇంగ్లండ్‌కు రివ్యూ లేకపోవడంతో రాయ్ ఇక చేసేదేమీ లేకపోయింది. ఇదొక ఉదాహరణే అయినా, ఇంకా ఇటువంటివి చాలనే ఉన్నాయి. డీఆర్ఎస్ విధానం ఉండగానే ఇన్ని తప్పిదాలు జరిగితే.. అసలు అంపైర్ నిర్ణయ పునః సమీక్ష పద్ధతి లేకుంటే మాత్రం అధిక సంఖ్యలో ఆటగాళ్లు కచ్చితంగా ఫీల్డ్ అంపైర్ల నిర్ణయాలకు బలైపోయేవారనేది కాదనలేని సత్యం. -
ఆ విషయంలో ఇండియాదే పైచేయి.. కానీ!
క్రికెట్‌కు పుట్టినిల్లుగా భావించే ఇంగ్లండ్ జట్టు సుదీర్ఘ కల నెరవేరింది. ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి ఇంగ్లండ్ జట్టు తొలిసారి విశ్వవిజేతగా ఆవిర్భవించింది. 44 ఏళ్ల వరల్డ్‌కప్ చరిత్రలో తొలిసారి టైటిల్‌ను సాధించింది. వరుసగా రెండోసారి ప్రపంచకప్ ఫైనల్‌కు చేరిన కివీస్ జట్టుకు మరోసారి నిరాశే మిగిలింది. సెమీస్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలై.. ఇంటిదారి పట్టిన భారత జట్టు కూడా ఫైనల్ ఫలితాల అనంతరం ఒకింత నిరాశ చెంది ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రపంచకప్‌లో అతి తక్కువ పరాజయాలు చవిచూసిన జట్టు భారత్ మాత్రమే. ఇంగ్లండ్ తొలిసారి వరల్డ్ కప్‌ను కైవసం చేసుకున్నప్పటికీ.. ఆ జట్టు ప్రస్తుత టోర్నమెంటులో మూడు పరాజయాలు చవిచూసింది. లీగ్ దశలో ఒక ఓటమితో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఇండియా నాకౌట్ దశలో కివీస్ చేతిలో ఓడి.. ఫైనల్‌కు చేరకుండానే తన ప్రస్థానం ముగించిన సంగతి తెలిసిందే. ఈ ప్రపంచకప్‌లో ఈ రెండు పరాజయాలు మినహా కోహ్లి సేన ఏడు విజయాలు సాధించింది. ఇక, విశ్వవిజేతగా నిలిచిన ఇంగ్లండ్ జట్టు ఎనిమిది విజయాలు సాధించగా.. మూడు ఓటములు చవిచూసింది. ఆస్ట్రేలియా ఏడు విజయాలు, మూడు పరాజయాలు చవిచూడగా.. రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్ ఆరు విజయాలు, నాలుగు పరాజయాలు తన ఖాతాలో వేసుకుంది. పాకిస్థాన్ ఐదు విజయాలు, మూడు పరాజయాలు, శ్రీలంక మూడు విజయాలు, నాలుగు పరాజయాలు, దక్షిణాఫ్రికా మూడు విజయాలు, ఐదు పరాజయాలు, బంగ్లాదేశ్ మూడు విజయాలు, ఐదు పరాజయాలు నమోదుచేసుకోగా.. పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న వెస్టిండీస్ రెండు విజయాలు మాత్రమే సాధించి.. ఆరు పరాజయాలు మూటగట్టుకుంది. ఇక, అండర్‌డాగ్‌గా బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్థాన్ ఒక్క విజయాన్ని కూడా నమోదుచేయకుండా.. మొత్తం 9 పరాజయాలు మూటగట్టుకొని.. చిట్టచివరి స్థానంలో నిలిచింది. -
టామ్ లాథమ్ నయా రికార్డు
లండన్: న్యూజిలాండ్ వికెట్ కీపర్ టామ్ లాథమ్ నయా రికార్డు నెలకొల్పాడు. ఒక వరల్డ్‌కప్‌లో అత్యధిక ఔట్లలో భాగస్వామ్యమైన వికెట్ కీపర్‌గా నిలిచాడు. వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మెగా ఫైట్‌లో లాథమ్ మూడు క్యాచ్‌లను అందుకున్నాడు. ఫలితంగా ఒకే వరల్డ్‌కప్‌లో అత్యధిక మందిని పెవిలియన్‌కు పంపిన కీపర్‌గా ఆడమ్ గిల్ క్రిస్ట్(ఆస్ట్రేలియా) సరసన చేరిపోయాడు. ఈ వరల్డ్‌కప్‌లో లాథమ్ 21 ఔట్లలో భాగస్వామ్యమైతే, అంతకుముందు 2003 వరల్డ్‌కప్‌లో గిల్ క్రిస్ట్ కూడా సరిగ్గా 21 ఔట్లలో భాగస్వామ్యం అయ్యాడు. ఈ జాబితాలో గిల్ క్రిస్ట్, లాథమ్‌ల తర్వాత స్థానాల్లో అలెక్స్ క్యారీ(20, 2019 వరల్డ్‌కప్), కుమార సంగక్కరా(17, 2003 వరల్డ్‌కప్)లు ఉన్నారు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో జేసన్ రాయ్, జో రూట్, క్రిస్ వోక్స్ క్యాచ్‌లను లాథమ్ అందుకున్నాడు.ఇరు జట్ల మధ్య జరిగిన తుది పోరులో ఇంగ్లండ్ విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. మ్యాచ్‌తో పాటు, సూపర్ ఓవర్ కూడా టై కావడంతో ఓవరాల్ మ్యాచ్‌లో అత్యధిక బౌండరీలు కొట్టిన ఇంగ్లండ్ విజేతగా అవతరించింది. -
హీరో.. విలన్.. గప్టిలే!
లండన్: మూడు రోజుల క్రితం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో ఎంఎస్ ధోనీని రనౌట్ చేయడం ద్వారా పూర్తిగా మ్యాచ్ గతినే మార్చేశాడు కివీస్ ఆటగాడు మార్టిన్ గఫ్టిల్. ధోనీ క్రీజులో ఉన్నంతసేపూ మ్యాచ్ టీమిండియా గెలుస్తుందని అభిమానులు భావించారు. కానీ, మార్టిన్ గప్టిల్ విసిరిన బుల్లెట్ త్రోకు సీన్ అంతా మారిపోయింది. అతడి మెరుపు ఫీల్డింగ్‌కు ధోని రనౌట్‌గా వెనుదిరిగాడు. టీమిండియా ఓడిపోయింది. అయితే, ఇది ఇక్కడితో ముగియలేదు. సేమ్ సీన్ ఫైనల్ మ్యాచ్‌లోనూ పునరావృతమైంది. అదీ కూడా గఫ్టిల్కే. సెమీఫైనల్ మ్యాచ్‌లో రెండు పరుగు తీయబోయిన ధోనీ.. గఫ్టిల్ సూపర్ త్రోకు రన్నౌట్ అయ్యాడు. అదేవిధంగా ఫైనల్ మ్యాచ్‌లో సూపర్ ఓవర్ చివరి బంతికి రెండో పరుగు తీయబోయి గఫ్టిల్ రనౌట్‌గా వెనుదిరగడంతో విశ్వకప్ ఇంగ్లండ్ వశమైంది. ఆర్చర్ వేసిన సూపర్ ఓవర్ చివరి బంతిని బాదిన గఫ్టిల్ మొదటి పరుగును సురక్షితంగా పూర్తి చేశాడు. విజయం కోసం కావాల్సిన రెండో బంతి కోసం.. అతను ప్రయత్నించాడు. దీంతో ఫీల్డర్ నుంచి నేరుగా బంతిని అందుకున్న జోస్ బట్లర్ వికెట్లను గిరాటేశాడు. దీంతో గఫ్టిల్ రన్నౌట్ అయ్యాడు. ధోనీ రన్నౌట్ భారత్ ఫైనల్‌కు చేరకుండా అడ్డుకోగా.. గఫ్టిల్ రనౌట్ కివీస్ జట్టుకు వరల్డ్ కప్‌ను దూరం చేసింది. అంతేకాకుండా ఫైనల్ మ్యాచ్ చివరి ఓవర్లో అతను విసిరిన బంతి అనుకోకుండా స్టోక్స్ బ్యాటుకు తగిలి బౌండరీకి దూసుకుపోవడంతో ఇంగ్లండ్ జట్టుకు అదనంగా నాలుగు పరుగులు వచ్చాయి. ఇదీ కూడా ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించింది. (చదవండి: నమ్మశక్యం కానిరీతిలో.. మ్యాచ్‌లో కీలక మలుపు) గప్టిల్ హీరో... విలన్... న్యూజిలాండ్‌ను టోర్నీలో దెబ్బకొట్టింది ఓపెనింగ్ వైఫల్యమే. సీనియర్ మార్టిన్ గప్టిల్ ఏమాత్రం రాణించలేక విమర్శల పాలయ్యాడు. అయితే, సెమీఫైనల్లో టీమిండియా వెటరన్ ధోనిని అద్భుత త్రో ద్వారా రనౌట్ చేసి వాటికి కొంతవరకు సమాధానమిచ్చాడు. ఫైనల్లో మళ్లీ విమర్శల పాలయ్యే ప్రదర్శన చేశాడు. బ్యాటింగ్‌లో విఫలమైన అతడు... 50వ ఓవర్ నాలుగో బంతిని ఓవర్ త్రో చేసి ప్రత్యర్థికి నాలుగు పరుగులు సునాయాసంగా ఇచ్చాడు. ఇందులో గప్టిల్ పాత్ర పరోక్షమే అని, కివీస్ దురదృష్టమని అనుకుని సరిపెట్టుకున్నా... సూపర్ ఓవర్ చివరి బంతికి ప్రపంచ కప్ సాధించి పెట్టే రెండు పరుగులు చేయలేకపోయాడు. దీనిని తలుచుకునే ఏమో మ్యాచ్ అనంతరం గప్టిల్ కన్నీటి పర్యంతమయ్యాడు. -
జీవితాంతం కేన్‌కు క్షమాపణలు చెప్తాను : స్టోక్స్
లండన్ : వరల్డ్‌కప్ 2019 ఫైనల్ మ్యాచ్ క్రికెట్ చరిత్రలోనే ఒక అత్యద్భుత పోరు. ప్రపంచకప్ ఫైనల్ టై కావడమే విశేషం అంటే.. తర్వాత జరిగిన సూపర్ ఓవర్ సైతం టై కావడం సగటు క్రికెట్ అభిమాని ఊహకందని విషయం. అయితే మ్యాచ్‌ను టైగా మార్చింది మాత్రం ఇంగ్లండ్ ఆటగాడు బెన్ స్టోక్స్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. లాస్ట్ ఓవర్లో ఇంగ్లాండ్ మూడు బంతుల్లో 9 పరుగులు చేయాలి. కప్పు గెలవడానికి న్యూజిలాండ్‌కే ఎక్కువ అవకాశాలని అందరూ భావించారు. ఆ బంతిని స్టోక్స్ ఫోర్ కొట్టాలని చూశాడు. బంతి గప్తిల్‌కు దొరికింది. త్రో విసిరాడు.. క్రీజును అందుకునేందుకు దూకిన స్టోక్స్ బ్యాటును తాకి బంతి ఓవర్ త్రో రూపంలో బౌండరీకి వెళ్లిపోయింది. ఆరు పరుగులొచ్చాయి. ఆ బంతి అలా స్టోక్స్ బ్యాటుకు తాకకపోయి ఉంటే.. ఫలితం మరోలా ఉండేది. కప్పు న్యూజిలాండ్‌ను వరించేదేమో. కానీ త్రో రూపంలో వచ్చిన ఆరు పరుగులు ఇంగ్లండ్‌కు కలిసి వచ్చాయి. ఇంగ్లండ్ విజయం తర్వాత బెన్ స్టోక్స్‌ను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ప్రకటించారు. అనంతరం స్టోక్స్ మాట్లాడుతూ.. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్కు తాను జీవితాంతం క్షమాపణలు చెప్తూనే ఉంటాను అన్నాడు . ఇది తాను కావాలని చేసింది కాదని.. బాల్ అలా అనుకోకుండా తన బ్యాట్‌ను తాకిందన్నాడు. అయితే అదే తమ గెలుపులో కీలకంగా మారిందన్నాడు. ఇందుకు కేన్‌కు క్షమాపణలు చెప్తున్నాను అన్నాడు. అయితే ఈ గెలుపు కోసమే తమ జట్టు నాలుగేళ్లుగా ఎంతో కష్ట పడిందని.. ఎన్నో మాటలు పడిందన్నాడు స్టోక్స్. చివరకూ తాము అనుకున్నది సాధించామని తెలిపాడు. ఇలాంటి మ్యాచ్ క్రికెట్ చరిత్రలో మరోటి ఉంటుందని తాను భావించడం లేదన్నాడు స్టోక్స్. -
‘ఓటమి మమ్మల్ని తీవ్రంగా కలిచి వేస్తోంది’
లండన్ : నరాలు తెగే ఉత్కంఠత మధ్య.. క్రికెట్ పుట్టినింటికే ప్రపంచకప్ చేరింది. మ్యాచ్, సూపర్ ఓవర్ టైగా మారినప్పటికి.. సూపర్ ఓవర్లో అత్యధిక బౌండరీలు కొట్టడంతో ఇంగ్లండ్ విజేతగా నిలిచింది. న్యూజిలాండ్ వరుసగా రెండో సారి రన్నరప్‌గా నిలిచింది. న్యూజిలాండ్ ఓటమితో కివీస్ ఆటగాళ్లు తీవ్రంగా నిరాశ చెందారు. ఓటమిపై న్యూజిలాండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ స్పందిస్తూ.. ‘విజేతగా నిలిచిన ఇంగ్లండ్ జట్టుకు అభినందనలు. ఈ మ్యాచ్‌లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన న్యూజిలాండ్ టీంకు ధన్యవాదాలు. మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా సాగింది. పిచ్‌లు మేం అనుకున్నదాని కంటే భిన్నంగా ఉన్నాయి. ఫైనల్ మ్యాచ్ టైగా మారడం వెనక చాలా కారణాలున్నాయి. ఇది నిజంగా దురదృష్టకరం. మ్యాచ్ టైగా మారటంతో మా ఆటగాళ్లు తీవ్రంగా కలత చెందారు. కానీ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు’ అన్నారు. ‘ఇది కేవలం ఒక్క ఎక్స్ట్రా పరుగుకు సంబంధించిన విషయం కాదు. మ్యాచ్ మొత్తం మీద జరిగిన ప్రతి చిన్న విషయం కూడా ఈ గెలుపులో కీలక పాత్ర పోషించింది. మ్యాచ్‌లో చోటు చేసుకున్న కొన్ని అంశాలు న్యూజిలాండ్‌కు దురదృష్టకర పరిణామాలుగా మారాయి. స్టోక్స్ ఫోర్ ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి గప్టిల్ త్రో విసిరాడు. అయితే క్రీజును అందుకునేందుకు దూకిన స్టోక్స్ బ్యాటును తాకి ఓవర్ త్రో రూపంలో బౌండరీకి వెళ్లిపోయి ఆరు పరుగులు రావడం ఇంగ్లండ్‌కు కలిసివచ్చింది. ఇలాంటి సంఘటనలు జరిగి ఉండాల్సింది కాదు. ఏది ఏమైనా ఈ ఓటమి మమ్మల్ని తీవ్రంగా కలిచి వేస్తోంది’ అన్నారు విలియమ్సన్. -
నమ్మశక్యం కానిరీతిలో.. మ్యాచ్‌లో కీలక మలుపు
క్రికెట్ వరల్డ్ కప్ చరిత్రలోనే ఇంగ్లండ్-న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ ఒక అద్భుతంగా నిలిచిపోతుంది. ఒక అరుదైన ఘట్టానికి వేదికగా క్రికెట్ ప్రేమికుల హృదయాల్లో నిలిచి ఉంటుంది. విశ్వకప్ ఫైనల్ మ్యాచ్ టై కావడం.. సూపర్ ఓవర్‌కు వెళ్లడం.. సూపర్ కూడా టై కావడం ఇదే తొలిసారి. చివరి బంతి వరకు ఉత్కంఠ రేపుతూ.. చూసే ప్రేక్షకులను మునివేళ్ల మీద నిలబెట్టి.. ఎప్పుడేం జరుగుతుందోనన్న టెన్షన్‌కు గురిచేసిన ఫైనల్ మ్యాచ్.. ఆద్యంతం రోమాంఛితంగా సాగింది. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలా వీక్షకులకు సరికొత్త అనుభూతి ఇచ్చింది. నిజానికి ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్-న్యూజిలాండ్.. ఇరుజట్లు వీరోచితంగా పోరాడాయి. ప్రపంచకప్‌ను ఒడిసిపట్టేందుకు తమ శాయశక్తులు ఒడ్డాయి. సమ ఉజ్జీలుగా కనిపించిన ఇరుజట్లు చివరి బంతి వరకు సింహాల్లా పోరాడాయి. ఫలితం మ్యాచ్ టై కావడమే.. కాకుండా సూపర్ ఓవర్ కూడా టై అయింది. ఫైనల్ మ్యాచ్‌లో కివీస్ జట్టు వీరోచితంగా పోరాడినా.. ఆ జట్టుకు అదృష్టం కలిసిరాలేదని చెప్పాలి. ముఖ్యంగా 50 ఓవర్లో జరిగిన ఓ అరుదైన, అద్భుత ఘటన కివీస్ జట్టుకు విజయాన్ని దూరం చేసింది. చివరి ఓవర్లో ఇంగ్లండ్ విజయానికి 15 పరుగులు అవసరం. ఈ దశలో కివీస్ విజయానికి అడ్డుగోడలా ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ నిలబడ్డాడు. చివరి ఓవర్లో మొదటి రెండు బంతులు పరుగులేమీ రాలేదు. మూడో బంతిని స్టోక్స్ సిక్సర్‌గా మలిచాడు. మరో మూడు బంతుల్లో 9 పరుగులు చేయాల్సిన దశలో నాలుగో బంతికి ఓ అద్భుతం చోటుచేసుకొని.. మ్యాచ్‌ను మలుపు తిప్పింది. నాలుగో బంతిని డీప్‌లోకి తరలించిన స్టోక్స్.. రెండు పరుగులు తీశాడు. అయితే, రెండో పరుగు తీస్తున్న సమయంలో మార్టిన్ గఫ్టిల్ విసిరిన బంతి.. నేరుగా స్టోక్స్ బ్యాట్‌కు తగిలి.. బౌండరీ దిశగా దూసుకుపోయింది. నమ్మశక్యం కాని ఈ పరిణామంతో కివీస్ ఆటగాళ్లు షాక్ తిన్నారు. నిజానికి ఇందులో స్టోక్స్ ఉద్దేశపూర్వకంగా చేసిందేమీ లేదు. రెండో పరుగు తీస్తున్న సమయంలో అతను బంతిని చూడనేలేదు. కానీ గఫ్టిల్ విసిరిన బంతి నేరుగా వచ్చి స్టోక్స్ బ్యాటుకు తగిలింది. ఇలా ఈ బంతికి అనూహ్యంగా ఆరు పరుగులు వచ్చాయి. దీంతో ఇంగ్లండ్ చివరి రెండు బంతుల్లో మూడు పరుగులు చేస్తే విజయం వరించేది. కానీ, అయితే చివరి రెండు బంతుల్లో రెండు పరుగులు చేసి.. ఇద్దరు రన్నౌట్ కావడంతో ఇంగ్లండ్ 241 పరుగుల వద్ద నిలిచిపోయింది. మ్యాచ్ టై అయింది. ఆ తర్వాత సూపర్ ఓవర్ కూడా కావడం.. దీంతో ఎక్కువ బౌండరీలు సాధించిన ఇంగ్లండ్ జట్టును విశ్వవిజేతగా ప్రకటించడం తెలిసిందే. -
ఇంగ్లాండ్ అలా గెలిచిందట.!
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్-న్యూజిలాండ్ జట్ల మధ్య, ఊహించని ట్విస్టులతో ఉత్కంఠభరితంగా సాగిన ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్‌ను ఉర్రూత లూగించింది. న్యూజిలాండ్‌కు గెలుపు ఖాయమనుకుంటున్న దశలో 49వ ఓవర్ మొత్తం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. ముఖ్యంగా ఓవర్ త్రో ఇంగ్లాండ్ జట్టుకు అనూహ్యంగా పరుగులు తోడవడం కీలక పరిణామం. చివరికి టై అవ్వడం, సూపర్ ఓవర్, రెండోసారి కూడా టై అయినా కూడా ఇంగ్లాండ్ విజేతగా నిలవడం తెలిసిన సంగతే. ప్రపంచ కప్ వీక్షిస్తున్న కోట్లాది ప్రేక్షకులు ఇంకా అమోమయం తేరుకోకముందే ఐసీసీ అందరికీ షాక్ ఇచ్చింది. ఏం జరుగుతోందో అర్ధమయ్యలోపే ఇంగ్లాండ్‌ను విజేతగా ప్రకటించింది. క్రికెట్ చరిత్రలో ఇదో కొత్త చరిత్రగా విశ్లేషకులు భావిస్తుండగా, సోషల్ మీడియాలో పలు సందేహాలు, న్యూజిలాండ్‌పై తీవ్ర సానుభూతి వ్యక్తమైంది. నైతికంగా న్యూజిలాండ్‌దే గెలుపు అని కొందరు వ్యాఖ్యానిస్తే.. ఏ రన్ అవుట్‌తో అయితే ధోనిని పెవిలియన్‌కు పంపారో.. న్యూజిలాండ్ కూడా అదే రనౌట్‌తో రన్నరప్‌గా నిలిచిందని మరికొందరు కమెంట్ చేశారు. ముఖ్యంగా టాలీవుడ్ నటుడు వెన్నెల కిషోర్ షేర్ చేసిన వీడియో వైరలవుతోంది. రెండుసార్లు టై అయిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ విజేత ఎలా అయిందో తెలుపుతూ వెన్నెల కిశోర్, బాలాజీ కలిపి ఒక వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు. నితిన్ హీరోగా 'ఛలో' ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో 'భీష్మ' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో పరిమళగా నటిస్తున్న వెన్నెల కిషోర్ షూటింగ్ బ్రేక్‌లో ఈ వీడియోను తీసినట్టు ట్వీట్ చేశారు. In the mean time #Bheeshma Night shoot on hold for a moment.. pic.twitter.com/hrhvhRf6PP — vennela kishore (@vennelakishore) July 14, 2019 కాగా ఆదివారం జరిగిన ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 241 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ కూడా 50 ఓవర్లలో 241 రన్స్ చేసి అల్ ఔట్ అయింది. అయినా కూడా ఆఖరి బంతికి ఒక పరుగు రావడంతో మ్యాచ్ టై అయింది. దీంతో ఐసీసీ నిబంధనల ప్రకారం సూపర్ ఓవర్ నిర్ణయం తీసుకోగా ఈ సూపర్ ఓవర్లో ఫస్ట్ ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేసింది. ఆరు బంతుల్లో 15 పరుగులు చేసింది. దీనికి ప్రతిగా న్యూజిలాండ్.. కూడా ఆరు బంతుల్లో 15 పరుగులు చేసింది. అయితే, ఇంగ్లాండ్ ప్రపంచకప్ విజేత అంటూ ఐసీసీ ప్రకటించింది. ఐసీసీ నిబంధనల ప్రకారం సూపర్ ఓవర్లో అత్యధిక బౌండరీలు కొట్టిన జట్టుని విజేతగా ప్రకటిస్తారు. అయితే సూపర్ ఓవర్లో ఇంగ్లండ్ జట్టు రెండు బౌండరీలు కొట్టింది. కానీ, న్యూజిలాండ్ కేవలం ఒక సిక్స్ (సూపర్ ఓవర్)మాత్రమే కొట్టింది. దీంతో బౌండరీల లెక్కన ఇంగ్లండ్ గెలిచినట్టు ప్రకటించారు. చదవండి :ప్రపంచ కల నెరవేరింది -
సారీ న్యూజిలాండ్...
సాక్షి క్రీడావిభాగం: ప్రపంచకప్ ఫైనల్లో పాత రూల్స్ అమల్లో ఉంటే ఇంగ్లండ్–న్యూజిలాండ్‌లు సంయుక్త విజేతలుగా నిలిచేవి. కానీ ఈ మ్యాచ్‌లో కివీస్ ఓడిపోయిందంటే సగటు క్రికెట్ అభిమాని కూడా దానిని తమ పరాజయంగా భావిస్తున్నాడు. స్టోక్స్ బ్యాట్‌ను తాకి పోయిన 6 పరుగుల ఓవర్‌త్రో దురదృష్టమో, గప్టిల్ గ్రహచారం బాగా లేని రోజు కావడమో కానీ విలియమ్సన్ సేన విలపించాల్సి వచ్చింది. ఇంత అద్భుతమైన ఆట తర్వాత కూడా బౌండరీ లెక్కల త్రాసుతో ఇంగ్లండ్ పైచేయి కావడం బలవంతంగా కివీ రెక్కలు విరిచేసినట్లయింది. వరుసగా రెండోసారి కూడా న్యూజిలాండ్‌ను ఫైనల్ మ్యాచ్‌లో ఓటమి వెంటాడింది. అయితే ఆ జట్టు గొప్పతనాన్ని ఈ మ్యాచ్ ఫలితం తగ్గించలేదు. ప్రత్యర్థులపై మాటల దాడి చేయకుండా, దూషణలకు పాల్పడకుండా కూడా ప్రపంచ కప్‌లో గొప్ప విజయాలు సాధించవచ్చని ఆ జట్టు నిరూపించింది. కివీస్ క్రికెట్ అనగానే అందరికీ గుర్తొచ్చేది మైదానంలో వారి ప్రవర్తన. తమదైన ఆటను ఆడుకుంటూ గెలుపోటములతో నిమిత్తం లేకుండా క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించడంలో వారికి వారే సాటి. ఫెయిర్ ప్లే అవార్డు అంటూ ఎప్పుడిచ్చినా ఈ మర్యాద రామన్నల బృందానికే దక్కడం పరమ రొటీన్. ఆటగాళ్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు 2016లో ఐసీసీ డీమెరిట్ పాయింట్ సిస్టంను మొదలు పెట్టింది. అప్పటినుంచి ఇప్పటి వరకు అందరికంటే అతి తక్కువగా ఒకే ఒకసారి శిక్షకు గురైన జట్టు న్యూజిలాండ్. వారి ఆట ఎలా ఉంటుందో చెప్పేందుకు ఇది చాలు. ఏ టోర్నీలో బరిలోకి దిగినా వారిని ‘అండర్డాగ్’గానే చూడడం అందరికీ అలవాటైపోయింది. డాగ్ ఏదైనా అసలైన రోజు కరవడం ముఖ్యం అని స్వయంగా విలియమ్సన్ చెప్పినట్లు రెండు అసలు మ్యాచ్‌లలో కివీస్ సత్తా చాటింది. సెమీస్‌లోనే భారత్ ముందు అసలు కివీస్‌ను ఎవరూ పెద్దగా లెక్క చేయలేదు. కానీ అద్భుత వ్యూహంతో ఆ జట్టు అనూహ్య విజయాన్ని అందుకుంది. స్వల్ప స్కోరుకే పరిమితమైనా... పట్టుదలతో ఆడి టీమిండియాను నిలవరించగలిగింది. ఫైనల్లో కూడా నాలుగు ఇంగ్లండ్ వికెట్లు తీసిన తర్వాత విజయానికి బాటలు వేసుకున్న ఆ జట్టు అదే ఒత్తిడిని కొనసాగించలేకపోయింది. కెప్టెన్‌గా తొలి ప్రపంచ కప్‌లో బ్యాట్స్‌మన్‌గానూ తనదైన ముద్ర వేసిన విలియమ్సన్కు దురదృష్టవశాత్తూ ఇతర ఆటగాళ్ల నుంచి ఎక్కువ మద్దతు లభించలేదు. అదే చివరి పోరులో తక్కువ స్కోరుకే పరిమితమయ్యేందుకు కారణమైంది. విలియమ్సన్ 82.57 సగటుతో ఏకంగా 578 పరుగులు చేయగా... రెండో స్థానంలో నిలిచిన టేలర్ మూడు అర్ధ సెంచరీలతో 350 పరుగులకే పరిమితమయ్యాడు. గత వరల్డ్‌కప్‌లో డబుల్ సెంచరీ సహా హీరోగా నిలిచిన గప్టిల్ ఘోర వైఫల్యం జట్టును దెబ్బ తీసింది. 10 ఇన్నింగ్స్‌లలో కలిపి అతను 186 పరుగులు మాత్రమే చేయగలిగాడు. కివీస్ ఇక్కడి వరకు రాగలిగిందంటే పేస్ బౌలింగ్ త్రయమే కారణం. ఫెర్గూసన్ (21), బౌల్ట్ (17), హెన్రీ (14) కలిపి 52 వికెట్లు పడగొట్టారు. ఈ ముగ్గురిలో ఒక్కరు కూడా ఓవర్‌కు ఐదుకు మించి పరుగులు ఇవ్వలేదంటే ఎంత నియంత్రణతో బౌలింగ్ చేశారో అర్థమవుతుంది. 232 పరుగులు చేసిన నీషమ్ కూడా 15 వికెట్లతో అండగా నిలిచాడు. అయితే చివరకు బ్యాటింగ్ వైఫల్యమే కివీస్‌కు గొప్ప అవకాశాన్ని దూరం చేసింది. అఫ్గానిస్తాన్ మినహా టోర్నీలో 300 దాటని ఏకైక జట్టు న్యూజిలాండే. ఫలితంగా కివీస్ బృందం టైటిల్ కాకుండా మరోసారి హృదయాలు గెలుచుకోవడంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. -
లార్డ్స్ నుంచి లార్డ్స్ వరకు...
సాక్షి క్రీడా విభాగం: గత నాలుగేళ్లలో ఇంగ్లండ్ అద్భుతమైన వన్డే క్రికెట్ ఆడింది. ఎన్నో రికార్డులు ఆ జట్టు పాదాక్రాంతమయ్యాయి. ఏ దశలోనూ భయం, బెరుకు లేకుండా ప్రత్యర్థులపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతూ ఆ జట్టు ప్రదర్శించిన జోరు ప్రపంచకప్ గెలుపుపై ఆశలు రేపింది. ఇంగ్లండ్ జట్టు టాప్–20 వన్డే అత్యధిక స్కోర్ల జాబితాలో (అన్ని 350 పరుగులకు మించి) రెండు మినహా మిగిలిన 18 స్కోర్లు 2015 వరల్డ్ కప్ వైఫల్యం తర్వాతే వచ్చాయంటే ఆ జట్టు సాధించిన పురోగతి ఏమిటో అర్థమవుతుంది. ఇందులో 481 పరుగుల ప్రపంచ రికార్డు స్కోరు కూడా ఉంది. ఇదంతా అంత సులువుగా జరగలేదు. కెప్టెన్ మోర్గాన్, కోచ్ ట్రెవర్ బేలిస్ కలిసి మూలాల నుంచి పరిస్థితి మార్చేందుకు సంకల్పించారు. ముందుగా సాంప్రదాయ ముద్ర నుంచి జట్టును బయట పడేసే ప్రయత్నం చేశారు. టెస్టుల్లో దిగ్గజాలే అయినా వన్డే క్రికెట్‌కు పనికి రారంటూ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, బెల్‌లాంటి వారిని బయటకు పంపించడంతో జట్టు ప్రక్షాళన మొదలైంది. వారి స్థానాల్లో ఆల్‌రౌండర్లతో జట్టును నింపేశారు. అవసరమైతే పదో నంబర్ ఆటగాడు కూడా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుందనే ఆలోచన నిజంగానే చాలా బాగా పని చేసింది. వరుస విజయాలు వచ్చి చేరడంతో గత ఏడాది మేలో తొలిసారి ఇంగ్లండ్ వన్డేల్లో నంబర్‌వన్‌గా నిలిచింది. ఇక అక్కడి నుంచి తదుపరి లక్ష్యం ప్రపంచ కప్ విజయమే. ఆ దారిలో దూసుకుపోయిన మోర్గాన్ సేన తమ దేశంలో సంబరాలు పంచింది. ఇంగ్లండ్ ఆటగాళ్లకు, అభిమానులకు, బోర్డుకు, ప్రసారకర్తలకు, ప్రకటనదారులకు అందరికీ తెలుసు ఈసారి సాధ్యం కాకపోతే ఇంకెప్పటికీ ఇంగ్లండ్ వన్డే ప్రపంచ కప్ గెలవలేదని. పేరుకే క్రికెట్ ఇంగ్లండ్‌లో పుట్టినా, వన్డే వరల్డ్ కప్ అక్కడే తొలి అడుగు వేసినా... ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేని జట్టుగా అవమాన భారాన్ని ఆ జట్టు ఇంత కాలంగా మోస్తూనే వచ్చింది. ఇంగ్లండ్ ప్రదర్శనపై ఎన్నో విమర్శలు, మరెన్నో జోక్‌లు ప్రచారంలో ఉన్న సంగతీ వారికి తెలియనిది కాదు. గత వరల్డ్‌కప్‌లో ఘోర వైఫల్యం తర్వాతనైతే అసలు ఇంగ్లండ్ టీమ్‌ను ఎవరూ లెక్కలోకి తీసుకోని పరిస్థితి. కానీ కొత్త ఇంగ్లండ్ జట్టు చరిత్రను తిరగరాసింది. అసమాన ఆటతీరుతో సత్తా చాటి ఇన్నేళ్ల ప్రశ్నలకు ఒకేసారి సమాధానం ఇచ్చింది. పాత గాయాలు అంత తొందరగా మానేవి కావు. 1992లో పాకిస్తాన్ బౌలర్ వసీమ్ అక్రమ్ వేసిన రెండు అద్భుత బంతులతో ప్రపంచ కప్ కల చెల్లాచెదురైన తర్వాత మళ్లీ కోలుకునేందుకు ఇంగ్లండ్‌కు 27 ఏళ్లు పట్టింది. న్యూజిలాండ్ కంటే కూడా ఇంగ్లండ్‌కు ఈ విజయం ఎంతో అవసరం. ఒక్కసారి కూడా విశ్వ విజేతగా నిలవలేదన్న పేరును తొలగించుకునేందుకు స్వదేశంలో ఇంతకంటే మంచి అవకాశం వారికి రాదు. దానిని ఒడిసిపట్టుకొని మోర్గాన్ సేన తమ దేశం మొత్తాన్ని ఆనందంలో ముంచెత్తింది. దాదాపు ఏడాది కాలంగా ఇంగ్లండ్ అభిమానులు ‘ఇట్స్ కమింగ్ హోమ్’ అంటూ గొంతు చించుకుంటూ హోరెత్తిస్తుండగా మోర్గాన్ సేన కోటి ఆశలతో మైదానంలో తమ ఆట మొదలుపెట్టింది. తొలి మ్యాచ్‌లో 100 పరుగులకు పైగా తేడాతో గెలవగానే ఇంగ్లిష్ సేన సంబరపడిపోయింది. కానీ పాకిస్తాన్‌తో మ్యాచ్ జట్టును నేలకు దించింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా కూడా చితక్కొట్టగా, శ్రీలంక చేతిలో ఓటమి పాత ఇంగ్లండ్‌ను గుర్తుకు తెచ్చింది. నిజంగా ఇంగ్లండ్ సెమీస్ చేరకపోయి ఉంటే ఆ క్షణాన ఎన్ని గుండెలు బద్దలయ్యేవో... కానీ భారత్‌పై గెలుపు మళ్లీ ఆశలు నిలబెట్టింది. ఈ విజయం ఇచ్చిన ఆత్మవిశ్వాసమే కివీస్‌నూ ఓడించి దర్జాగా సెమీస్ చేరేలా చేసింది. ఇక ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్ చేరడం జట్టు ఆనందాన్ని రెట్టింపు చేసింది. లీగ్‌లో తమ చేతిలో చిత్తయిన కివీస్‌పై ఫైనల్ అనగానే సహజంగానే అందరిలో అంచనాలు పెరిగిపోయాయి. భారత్‌నే ఓడించిన న్యూజిలాండ్‌ను తక్కువగా అంచనా వేస్తే మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ఇంగ్లండ్‌కు తెలుసు. రసవత్తర ఫైనల్ దానిని నిజం చేసింది. చివరకు అశేష అభిమానుల జయజయధ్వానాలతో సగర్వంగా ట్రోఫీని ఎత్తుకుంది. ఇంగ్లండ్ విజయంలో అందరికీ సమష్టి పాత్ర ఉంది. ఓపెనర్లుగా బెయిర్‌స్టో (532 పరుగులు), జేసన్ రాయ్ (443 పరుగులు) అద్భుత ఆరంభాలు అందిస్తే, జో రూట్ (556 పరుగులు), స్టోక్స్ (465 పరుగులు), బట్లర్ (312 పరుగులు) మధ్యలో దానిని కొనసాగించారు. మోర్గాన్ (371 పరుగులు) బ్యాట్స్‌మన్‌గా కంటే కెప్టెన్‌గా తనదైన ముద్ర చూపించగలిగాడు. ఫైనల్లో స్టోక్స్, బట్లర్ ఆడిన ఆట గురించి ఎంత చెప్పినా తక్కువే. లోతైన బ్యాటింగ్ వనరులు ఉండటం కూడా జట్టుకు కలిసొచ్చింది. ఇక బౌలింగ్‌లో ఆర్చర్ (20 వికెట్లు) అత్యధిక వికెట్లతో చెలరేగితే వుడ్ (18 వికెట్లు), వోక్స్ (16 వికెట్లు) ప్రత్యర్థులను కట్టిపడేశారు. ప్లంకెట్ 11 వికెట్లే తీసినా అవి కీలక సమయంలో జట్టుకు అవసరమైనప్పుడు వచ్చాయి. అందరిలోకి స్టోక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. 2016 టి20 ఫైనల్ చివరి ఓవర్లో వరుసగా నాలుగు సిక్సర్లు ఇచ్చి కప్ కోల్పోవడానికి కారణమైన అతనికి ఇది పాపపరిహారంగా చెప్పుకోవచ్చు. ఫైనల్లో చివరి వరకు నిలబడి అతను జట్టును గెలిపించాడు. అయితే ఐదు అర్ధసెంచరీలు ఇంగ్లండ్ విజయ యాత్రలో కీలక పాత్ర పోషించాయి. 1975, జూన్ 7: ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో జరిగిన ప్రపంచ కప్ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ బరిలోకి దిగింది. క్రికెట్‌ను కనుగొన్న దేశం వరల్డ్ కప్ గెలవాలనే కలతో, ఆశలు అడుగుపెట్టిన రోజది. 2019, జూలై 14: లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్ విశ్వ విజేతగా నిలిచి సగర్వంగా ట్రోఫీని సొంతం చేసుకున్న రోజు... నాటి కల నెరవేరేందుకు ఇంగ్లండ్‌కు ఏకంగా 44 ఏళ్లు పట్టింది. -
ప్రపంచ కల నెరవేరింది
ఒకప్పుడు సగం ప్రపంచాన్ని ఏలినా... ఇన్నాళ్లూ ప్రపంచ కప్ మాత్రం వారికి కలే... మూడుసార్లు కడపటి మెట్టుపై బోల్తా... ఆపై దరిదాపులకూ రాలేని దీన స్థితి... నాలుగోసారి మాత్రం ఆ కల నెరవేరింది... ఓ దశలో కల్లగా మారేలా ఉన్నా కాలం కలిసొచ్చింది... ఒత్తిడిని పక్కకు నెడుతూ, ఉత్కంఠను తట్టుకుని... విశ్వ విజేత కిరీటం వారిని వరించింది. ఔను...! ఇంగ్లండ్ సాధించింది... ఎట్టకేలకు వన్డే చాంపియన్ అయింది... వీడని నీడలాంటి వారి ఆశయం నెరవేరింది... ఎన్నాళ్లో వేచిన విజయం పలకరించింది... చాలావరకు సాదాసీదాగా సాగిన ఫైనల్... ఆఖర్లో అదిరిపోయే హై డ్రామా సృష్టించింది... మైదానంలో అభిమానులను మునివేళ్లపై నిలిపింది... టీవీల ముందు ప్రేక్షకులను కన్నార్పకుండా చేసింది... ప్రపంచ కప్ తుది సమరం ‘టై’ అవడమే అరుదంటే... వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి సూపర్ ఓవర్ ఆడిస్తే... అందులోనూ ఇరు జట్ల స్కోర్లు సమమైతే... ఇంతకంటే మజా మజా ఏదైనా ఏముంటుంది? ఏదేమైనా క్రికెట్ పుట్టిల్లు పండుగ చేసుకుంది... వారి ‘ప్రపంచ కల’ సొంతగడ్డపైనే నెరవేరింది... నాలుగేళ్ల వారి శ్రమకు ఫలితం దక్కింది... రాబోయే నాలుగేళ్లు వారే రారాజని తీర్పొచ్చింది... లండన్ : ఇంగ్లండ్ కల నెరవేరింది. 44 ఏళ్ల వారి సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఆ దేశ జట్టు ఎట్టకేలకు వన్డే క్రికెట్ ప్రపంచ చాంపియన్‌గా అవతరించింది. క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఉత్కంఠతో సాగినదిగా పేర్కొనదగిన వరల్డ్ కప్ ఫైనల్లో వన్ ఓవర్ ఎలిమినేటర్ పద్ధతిలో ఇంగ్లండ్ విజేతగా ఆవిర్భవించింది. ఇక్కడి ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. అర్ధ సెంచరీ సాధించిన ఓపెనర్ హెన్రీ నికోల్స్ (77 బంతుల్లో 55; 4 ఫోర్లు) టాప్ స్కోరర్. వికెట్ కీపర్ టామ్ లాథమ్ (56 బంతుల్లో 47; 2 ఫోర్లు, సిక్స్) రాణించాడు. కివీస్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ విలియమ్సన్ (53 బంతుల్లో 30; 2 ఫోర్లు) స్కోరుకు సమానంగా అదనపు పరుగులు రావడం గమనార్హం. వోక్స్ (3/37), ప్లంకెట్ (3/42)లకు చెరో మూడు వికెట్లు దక్కాయి. చివర్లో హై డ్రామా నడుమ ఇంగ్లండ్ సరిగ్గా 50 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. సూపర్ ఓవర్లోనూ స్కోర్లు (15) సమం కాగా... ఇరు జట్ల ఇన్నింగ్స్‌లో నమోదైన బౌండరీల ఆధారంగా ఇంగ్లండ్‌ను జగజ్జేతగా ప్రకటించారు. ప్రత్యర్థి బౌలర్లు నీషమ్ (3/43), ఫెర్గూసన్ (3/50) వరుసగా వికెట్లు పడగొట్టడం, గ్రాండ్‌హోమ్ (1/25) పొదుపుగా బంతులే యడంతో ఛేదనలో ఇంగ్లండ్ కష్టాలు ఎదుర్కొంది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ (98 బంతుల్లో 84 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అద్భుత పోరాటం, బట్లర్ (60 బంతుల్లో 59; 6 ఫోర్లు) చక్కటి ఇన్నింగ్స్‌తో తేరుకుంది. నికోల్స్ నిలిచాడు... లాథమ్ ఆడాడు కివీస్ ఓపెనింగ్ జంట నికోల్స్, గప్టిల్ (18 బంతుల్లో 19, 2 ఫోర్లు, సిక్స్) ఫైనల్లో కాసేపు నిలిచింది. ఆర్చర్ ఓవర్లో సిక్స్, ఫోర్‌తో దూకుడు చూపిన గప్టిల్‌ను వోక్స్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. విలియమ్సన్ జాగ్రత్తగా ఆడాడు. ఎదుర్కొన్న 12వ బంతికి గానీ పరుగు తీయలేకపోయాడు. పవర్ ప్లే అనంతరం ఇద్దరూ వేగం పెంచడంతో కదలిక వచ్చింది. స్వల్ప వ్యవధిలో వీరిని ఔట్ చేసి కివీస్‌కు ప్లంకెట్ షాకిచ్చాడు. అతడి గుడ్ లెంగ్త్ బంతి విలియమ్సన్ బ్యాట్‌ను తాకుతూ కీపర్ బట్లర్ చేతిలో పడింది. అంపైర్ ధర్మసేన ఔటివ్వకున్నా మోర్గాన్ రివ్యూ కోరి ప్రత్యర్థి కెప్టెన్‌ను సాగనంపాడు. అంపైర్ ఎరాస్మస్ తప్పుడు నిర్ణయానికి రాస్ టేలర్ (15) బలయ్యాడు. ఆల్‌రౌండర్ నీషమ్ (25 బంతుల్లో 19; 3 ఫోర్లు) మిడాన్‌లో రూట్‌కు క్యాచ్ ఇచ్చాడు. గ్రాండ్‌హోమ్ (16) అండగా లాథమ్ బండి లాగించాడు. వోక్స్ ఈ ఇద్దరినీ ఔట్ చేసి దెబ్బకొట్టాడు. హెన్రీ (4), సాన్‌ట్నర్ (5 నాటౌట్) చివర్లో భారీ షాట్లు ఆడలేకపోయారు. ఇంగ్లండ్ కష్టంగానైనా అందుకుంది... ఇంగ్లండ్ ఛేదన సులువుగా సాగలేదు. బౌల్ట్ వేసిన ఇన్నింగ్స్ మొదటి బంతే ఓపెనర్ జేసన్ రాయ్ (20 బంతుల్లో 17; 3 ఫోర్లు) ప్యాడ్లను తాకింది. అంపైర్ ఎరాస్మస్ ఔటివ్వకపోవడంతో కివీస్ సమీక్ష కోరింది. బంతి లెగ్ స్టంప్ మీదుగా వెళ్తున్నట్లు తేలడంతో ఎరాస్మస్ నిర్ణయానికి కట్టుబడ్డాడు. హెన్రీ... రాయ్‌ను ఊగిసలాటలో పడేసి వికెట్ దక్కించుకున్నాడు. రూట్ (30 బంతుల్లో 7) స్వేచ్ఛగా ఆడలేకపోయాడు. గ్రాండ్హోమ్పై ప్రతాపం చూపబోయి వికెట్ ఇచ్చేశాడు. బెయిర్ స్టో (55 బంతుల్లో 36; 7 ఫోర్లు) వికెట్లను ఫెర్గూసన్ గిరాటేశాడు. ఆ వెంటనే మోర్గాన్ (9) పేలవ షాట్‌కు ఔటయ్యాడు. అప్పటికి 23.1 ఓవర్లలో జట్టు స్కోరు 86/4. స్టోక్స్–బట్లర్ ఐదో వికెట్‌కు 130 బంతుల్లో 110 పరుగులు జోడించి మలుపు తిప్పారు. 53 బంతుల్లో బట్లర్, స్టోక్స్ 81 బంతుల్లో అర్ధసెంచరీలు అందుకున్నారు. సమీకరణం 32 బంతుల్లో 46 పరుగులుగా మారి విజయావకాశాలు మెరుగైన స్థితిలో ఫెర్గూసన్ ఓవర్లో బట్లర్ షాట్‌కు యత్నించి ఔటవడం ఉత్కంఠ పెంచింది. స్టోక్స్ పోరాడుతున్నా... వోక్స్ (2)ను పెవిలియన్ చేర్చి కివీస్ మళ్లీ మ్యాచ్‌లోకి వచ్చింది. 49వ ఓవర్లో ప్లంకెట్ (10), ఆర్చర్ (0)లను నాలుగు బంతుల వ్యవధిలో ఔట్ చేసి నీషమ్ ఒత్తిడిని ఆతిథ్య జట్టు మీదకు నెట్టాడు. చివరి ఓవర్లో 15 పరుగులు అవసరం కాగా... బౌల్ట్ తొలి రెండు బంతులకు స్టోక్స్ పరుగులు చేయలేకపోయాడు. మూడో బంతిని సిక్స్ కొట్టాడు. నాలుగో బంతిని డీప్ మిడ్ వికెట్‌లోకి పంపి రెండో పరుగుకు యత్నిస్తుండగా గప్టిల్ త్రో స్టోక్స్‌కు తగిలి 6 పరుగులు వచ్చాయి. లక్ష్యం రెండు బంతుల్లో 3 పరుగులుగా మారింది. రషీద్ (0), వుడ్ (0) రనౌట్లయినా పరుగు వచ్చి మ్యాచ్ టై అయింది. చివరి ఐదు ఓవర్లు హైడ్రామా... ఫైనల్లో చివరి ఐదు ఓవర్ల హైడ్రామా ఇరు జట్ల పోరాటాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లింది. అప్పటికి ఇంగ్లండ్ 30 బంతుల్లో 46 పరుగులు చేయాలి. బట్లర్ రెండు బంతుల ముందే ఔటయ్యాడు. వోక్స్ (46.1), ప్లంకెట్ (48.3), ఆర్చర్ (48.6) ఔటవ డంతో కప్ న్యూజిలాండ్‌దే అనిపించింది. కానీ, అటు పరుగులూ రావడంతో ఉత్కంఠ పెరిగింది. చివరి ఓవర్లో స్టోక్స్ సిక్స్, ఓవర్ త్రో రూపంలో 2 ప్లస్ 4 పరుగులు రావడంతో తలకిందులైంది. బౌల్ట్ క్యాచ్... సిక్స్... మ్యాచ్‌లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన టర్నింగ్ పాయింట్ నీషమ్ ఓవర్లో స్టోక్స్ కొట్టిన సిక్స్ షాట్. 9 బంతుల్లో 22 పరుగులు కావాల్సిన స్థితిలో జరిగిందీ ఘటన. స్టోక్స్ మిడ్ వికెట్‌లోకి భారీ షాట్ ఆడగా... బౌండరీ లైన్ వద్ద బౌల్ట్ చేసిన తప్పిదం దెబ్బకొట్టింది. లైన్‌కు కొన్ని అంగుళాల ముందే బంతిని అందుకున్న బౌల్ట్... అలాఅలా వెనక్కువెళ్తూ బౌండరీ రోప్‌ను తొక్కేశాడు. ఎదురుగా ఫీల్డర్ గప్టిల్ ఉన్నా అతడికి విసిరే ప్రయత్నం చేయలేకపోయాడు. పోనీ, బంతిని లోపలకు విసిరేసినా ఆరు పరుగులు బదులుగా రెండో, మూడో వచ్చేవి. అవేవీ కాకపోగా ఏకంగా సిక్స్ నమోదైంది. బోనస్‌గా స్టోక్స్‌కు లైఫ్ వచ్చింది. ప్రధాన పేసర్ అయిన బౌల్ట్ బౌలింగ్‌లోనూ (10 ఓవర్లలో 67 పరుగులు; సూపర్ ఓవర్లో 15 పరుగులు) ఆకట్టుకోలేకపోవడం కివీస్‌కు వేదన మిగిల్చింది. స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: గప్టిల్ (ఎల్బీడబ్ల్యూ) వోక్స్ 19; నికోల్స్ (బి) ప్లంకెట్ 55; విలియమ్సన్ (సి) బట్లర్ (బి) ప్లంకెట్ 30; టేలర్ (ఎల్బీడబ్ల్యూ) వుడ్ 15; లాథమ్ (సి) సబ్ (విన్స్) (బి) వోక్స్ 47; నీషమ్ (సి) రూట్ (బి) ప్లంకెట్ 19; గ్రాండ్‌హోమ్ (సి) సబ్ (విన్స్) (బి) వోక్స్ 16; సాన్‌ట్నర్ (నాటౌట్) 5; హెన్రీ (బి) ఆర్చర్ 4; బౌల్ట్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 30; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 241 వికెట్ల పతనం: 1–29, 2–103, 3–118, 4–141, 5–173, 6–219, 7–232, 8–240. బౌలింగ్: వోక్స్ 9–0–37–3; ఆర్చర్ 10–0–42–1; ప్లంకెట్ 10–0–42–3; వుడ్ 10–1–49–1; రషీద్ 8–0–39–0; స్టోక్స్ 3–0–20–0. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: జేసన్ రాయ్ (సి) లాథమ్ (బి) హెన్రీ 17; బెయిర్‌స్టో (బి) ఫెర్గూసన్ 36; రూట్ (సి) లాథమ్ (బి) గ్రాండ్‌హోమ్ 7; మోర్గాన్ (సి) ఫెర్గూసన్ (బి) నీషమ్ 9, స్టోక్స్ (నాటౌట్) 84; బట్లర్ (సి) సబ్ (సౌతీ) (బి) ఫెర్గూసన్ 59; వోక్స్ (సి) లాథమ్ (బి) ఫెర్గూసన్ 2; ప్లంకెట్ (సి) బౌల్ట్ (బి) నీషమ్ 10; ఆర్చర్ (బి) నీషమ్ 0; రషీద్ (రనౌట్) 0; మార్క్ వుడ్ (రనౌట్) 0; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (50 ఓవర్లలో ఆలౌట్) 241. వికెట్ల పతనం: 1–28, 2–59, 3–71, 4–86, 5–196, 6–203, 7–220, 8–227, 9–240, 10–241. బౌలింగ్: బౌల్ట్ 10–0–67–0, హెన్రీ 10–2–40–1, గ్రాండ్‌హోమ్ 10–2–25–1, ఫెర్గూసన్ 10–0–50–3, నీషమ్ 7–0–43–3, సాన్‌ట్నర్ 3–0–11–0. సూపర్ ఓవర్ సాగిందిలా... నోట్: సూపర్ ఓవర్లోనూ స్కోర్లు ‘టై’ కావడంతో మ్యాచ్ మొత్తంలో ఎక్కువ బౌండరీలు కొట్టిన ఇంగ్లండ్ విజేతగా నిలిచింది. ఇంగ్లండ్ 26 బౌండరీలు కొట్టగా... న్యూజిలాండ్ 17 బౌండరీలు సాధించింది. స్టోక్స్... మాస్టర్ స్ట్రోక్... ప్రపంచ కప్ నెగ్గడం జట్టుగా ఇంగ్లండ్‌కు ఎంత సంబరమో, అంతకుమించి బెన్ స్టోక్స్‌కు వ్యక్తిగతంగా ఆనందదాయకం. ఎందుకంటే అతడి చేతుల మీదుగానే ఇంగ్లండ్‌కు ఒక కప్ (2017 టి20 ప్రపంచ కప్) చేజారింది. భారత్ వేదికగా జరిగిన నాటి కప్ ఫైనల్లో స్టోక్స్ వేసిన చివరి ఓవర్లో కార్లొస్ బ్రాత్‌వైట్ వరుసగా నాలుగు సిక్స్‌లు బాది వెస్టిండీస్‌కు కప్‌ను సాధించి పెట్టాడు. అప్పుడు స్టోక్స్ పిచ్ పైనే కుప్పకూలి రోదించాడు. ఆదివారం నాటి ఫైనల్లో ఆ చేదు అనుభవాన్ని అతడు తన చేతులతోనే చెరిపేసుకున్నాడు. ఇంగ్లండ్ ఓటమికి దగ్గరగా ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన స్టోక్స్ తన స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్‌తో ఒడ్డునపడేశాడు. సహచరులు వెనుదిరుగుతున్నా పట్టు వదలకుండా ఆఖరి వరకు క్రీజులో నిలిచాడు. సూపర్ ఓవర్లోనూ బ్యాటింగ్‌కు వచ్చి బాధ్యతను సంపూర్తిగా నెరవేర్చాడు. టోర్నీలో స్టోక్స్ ఆస్ట్రేలియాపై (89), శ్రీలంకపై (82 నాటౌట్) ఆడిన ఇన్నింగ్స్‌లు ఓటముల కారణంగా వెలుగులోకి రాలేకపోయాయి. ఫైనల్లో మాత్రం అతడి శ్రమకు అత్యద్భుత రీతిలో ఫలితం దక్కింది. గప్టిల్ హీరో... విలన్... న్యూజిలాండ్‌ను టోర్నీలో దెబ్బకొట్టింది ఓపెనింగ్ వైఫల్యమే. సీనియర్ మార్టిన్ గప్టిల్ ఏమాత్రం రాణించలేక విమర్శల పాలయ్యాడు. అయితే, సెమీఫైనల్లో టీమిండియా వెటరన్ ధోనిని అద్భుత త్రో ద్వారా రనౌట్ చేసి వాటికి కొంతవరకు సమాధానమిచ్చాడు. ఫైనల్లో మళ్లీ విమర్శల పాలయ్యే ప్రదర్శన చేశాడు. బ్యాటింగ్‌లో విఫలమైన అతడు... 50వ ఓవర్ నాలుగో బంతిని ఓవర్ త్రో చేసి ప్రత్యర్థికి నాలుగు పరుగులు సునాయాసంగా ఇచ్చాడు. ఇందులో గప్టిల్ పాత్ర పరోక్షమే అని, కివీస్ దురదృష్టమని అనుకుని సరిపెట్టుకున్నా... సూపర్ ఓవర్ చివరి బంతికి ప్రపంచ కప్ సాధించి పెట్టే రెండు పరుగులు చేయలేకపోయాడు. దీనిని తలుచుకునే ఏమో మ్యాచ్ అనంతరం గప్టిల్ కన్నీటి పర్యంతమయ్యాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) గప్టిల్‌ను ఓదార్చుతున్న నీషమ్ -
ప్రపంచకప్ 2019: పుట్టినింటికే చేరింది
ప్రపంచకప్ ఫైనల్ పోరు ఎలా ఉండాలని అభిమాని కోరకుంటాడో అంతకుమించి జరిగింది. నరాలు తెగే ఉత్కంఠ. ఇరుజట్ల మధ్య దోబుచులాడిన విజయం. చివరికి క్రికెట్ పుట్టినింటికే ప్రపంచకప్ చేరింది. కాదు ఇంగ్లండ్ గెలుచుకుంది. మొదట ఇరు జట్ల స్కోర్లు సమం. అనంతరం నిర్వహించిన సూపర్ ఓవర్లోనూ అదే ఫలితం. అయితే సూపర్ ఓవర్లో ఇంగ్లండ్ రెండు బౌండరీలు కొట్టగా.. కివీస్ ఒకే ఒక సిక్సర్ కొట్టింది. దీంతో జగజ్జేతగా ఇంగ్లండ్ నిలిచింది. పాపం వరుసగా రెండో సారి కూడా న్యూజిలాండ్‌కు రిక్త హస్తమే మిగిలింది. ఇంగ్లండ్ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ గెలిచిందంటే ఏకైక కారణం బెన్ స్టోక్స్. మిడిలార్డర్ బలంగా ఉంటేనే ఏ మెగా టోర్నీనైనా గెలువచ్చని తాజా ప్రపంచకప్ మరోసారి నిరూపించింది. 2011 ప్రపంచకప్‌లో యువరాజ్, రైనా.. 2015 ప్రపంచకప్‌లో స్టీవ్ స్మిత్, క్లార్క్.. 2019 ప్రపంచకప్‌లో బెన్ స్టోక్స్, జోస్ బట్లర్లు తమ జట్లు విశ్వవిజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించారు. తాజాగా జరిగిన ప్రపంచకప్‌లో బెన్ స్టోక్స్ అద్వితీయమైన ఆటతో జట్టుకు అపూర్వ విజయాలను అందించాడు. కీలక ఫైనల్ మ్యాచ్‌లో అందరూ విఫలమైనా తానోక్కడే చివరి వరకు ఉండి జట్టును విజయతీరాలకు చేర్చాడు. లండన్ : తొలుత ఇరుజట్ల స్కోర్లు సమం. అనంతరం సూపర్ ఓవర్లోనూ స్కోర్లు సమం అయ్యాయి. అయితే సూపర్ ఓవర్లో అత్యధిక బౌండరీలు కొట్టడంతో ఇంగ్లండ్ విజేతగా నిలిచింది. దీంతో తొలిసారి ప్రపంచకప్‌ను ఇంగ్లండ్ కైవసం చేసుకుంది. దీంతో న్యూజిలాండ్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి ఫైనల్ మ్యాచ్ ఇంత థ్రిల్లింగ్‌గా సాగింది. తొలుత కివీస్ నిర్దేశించిన 242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 241 పరుగులకే ఆలౌటైంది. అనంతరం ఫలితం కోసం సూపర్ ఓవర్ నిర్వహించగా ఇరు జట్లు సమంగానే స్కోర్లు నమోదు చేశాయి. ఇంగ్లండ్ గెలుపులో కీలక పాత్ర పోషించిన బెన్ స్టోక్స్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. సిరీస్ ఆసాంతం జట్టుకు అద్భుత విజయాలను అందించిన కేన్ విలియమ్సన్‌కే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ లభించింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ తడబడింది. ఎంతటి భారీ స్కోర్లనైనా అవలీలగా ఛేదించిన ఇంగ్లండ్ ఫైనల్ మ్యాచ్‌లో 242 పరుగులు సాధించడానికి ఆపసోపాలు పడింద. కివీస్ అద్భుత బౌలింగ్‌తో పాటు కీలక సమయాలలో వికెట్లు పడగొట్టడంతో ఆతిథ్య జట్టు కష్టాల్లో పడింది. ఈ తరుణంలో బెన్ స్టోక్స్ (84 నాటౌట్; 98 బంతుల్లో, 5ఫోర్లు, 2 సిక్సర్లు)లు చివరి వరకు ఉండి కివీస్‌ను ప్రతిఘటించాడు. స్టోక్స్‌కు తోడుగా బట్లర్(59; 60 బంతుల్లో 6ఫోర్లు) అర్దసెంచరీతో రాణించాడు. కివీస్ బౌలర్లలో నీషమ్, ఫెర్గుసన్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. కివీస్ ఆటగాళ్లలో నికోలస్(55), లాథమ్(47) మినహా ఎవరూ అంతగా ఆకట్టుకోలేదు. విలియమ్సన్(30) ఫర్వాలేదనిపించాడు. కీలక సమయాలలో వికెట్లు పడగొట్టి కివీస్‌ను ఇంగ్లండ్ బౌలర్లు కట్టడి చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్, ఫ్లంకెట్‌లు తలో మూడు వికెట్లు పడగొట్టారు. -
ఫైనల్ అప్డేట్స్: విశ్వవిజేతగా ఇంగ్లండ్
లండన్ : నరాలు తెగే ఉత్కంఠ పోరులో చివరికి ఇంగ్లండ్‌నే విజయం వరించింది. తొలుత స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ టై అయింది. అనంతరం సూపర్ ఓవర్లో కూడా ఇరుజట్ల స్కోర్ సమం కావడంతో బౌండరీల ఆధారంగా ఇంగ్లండ్ కప్ కైవసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్‌తో ఫలితం తేలనుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ బౌల్ వేసిన ఓవర్లో 15 పరుగులు సాధించింది. స్టోక్స్, బట్లర్లు బౌల్ట్ బౌలింగ్‌ల్ ఎదురుదాడికి దిగారు. దీంతో అవలీలగా 15 పరుగులు రాబట్టారు. ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ టై అయింది. దీంతో సూపర్ ఓవర్‌తో ఫలితం తేలనుంది. కివీస్ నిర్దేశించిన 242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 241 పరుగులకే ఆలౌటైంది. చివరి ఓవర్లో ఇంగ్లండ్ విజయానికి 15 పరుగులు అవసరం కాగా.. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో ఇంగ్లండ్ 14 పరుగులు మాత్రమే సాధించింది. దీంతో స్కోర్లు సమం అయ్యాయి. నరాలు తెగే ఉత్కంఠ. విజయం ఇరువురి జట్ల మధ్య దోబుచూలాడుతోంది. ఇంగ్లండ్ విజయం సాధించాలంటే 6 బంతుల్లో 15 పరుగులు సాధించాలి. క్రీజులో బెన్ స్టోక్స్(70), రషీద్(0)లు ఉన్నారు. విజయం ఇరువురి మధ్య దోబుచులాడుతోంది. ఇంగ్లండ్ ఆశలన్నీ స్టోక్స్‌పైనే ఉన్నాయి. కీలకసమయంలో స్వల్ప వ్యవధిలో ఇంగ్లండ్ రెండు వికెట్లను చేజార్చుకుంది. బట్లర్(55), వోక్స్(2)లు వెంటవెంటే ఔటయ్యారు. దీంతో ఇంగ్లండ్ విజయావకాశాలు ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌పైనే ఉన్నాయి. ఇంగ్లండ్‌కు షాక్. కీలక సమయంలో జోస్ బట్లర్(59) ఔటయ్యాడు. ఫెర్గుసన్ బౌలింగ్‌లో బట్లర్ భారీ షాట్ ఆడాడు. అయితే టిమ్ సౌథీ కళ్లుచెదిరే రీతిలో క్యాచ్ అందుకోవడంతో బట్లర్ వెనుదిరిగాడు. దీంతో ఐదో వికెట్‌కు 110 పరుగుల భాగస్మామ్యానికి తెరపడింది. స్టోక్స్(51), వోక్స్(1) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్, వికెట్ కీపర్ బట్లర్లు కీలక సమయంలో తామేంటో నిరూపించుకున్నారు ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో వీర్దిదరూ అర్దసెంచరీలతో ఆకట్టుకున్నారు. 86 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన ఇంగ్లండ్‌ను బట్లర్-స్టోక్స్‌లు ఆదుకున్నారు. ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ వికెట్ కీపర్ బట్లర్‌ల సూపర్ ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్ విజయం వైపు అడుగులు వేస్తోంది. 86 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన ఇంగ్లండ్‌ను ఈ జంట ఆదుకుంది. వీరిద్దరూ ఐదో వికెట్‌కు ఇప్పటికే 84 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ప్రస్తుతం ఇంగ్లండ్ విజయం సాధించాలంటే 60 బంతుల్లో 72 పరుగులు సాధించాలి. ఇప్పటికైతే ఇరుజట్లకు విజయావకాశాలు ఉన్నాయి. న్యూజిలాండ్ బౌలర్ ఫెర్గుసన్ కళ్లు చెదిరే రీతిలో క్యాచ్ అందుకోవడంతో ఇయాన్ మోర్గాన్(9) వెనుదిరిగాడు. దీంతో ఇంగ్లండ్ 86 పరుగులకే నాలుగు కీలక వికెట్లను చేజార్చుకుంది. ప్రస్తుతం ఇంగ్లండ్ 24 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. క్రీజులో స్టోక్స్(5), బట్లర్(2) లు క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఈ భాగస్వామ్యంపైనే ఇంగ్లండ్ విజయావకాశాలు ఉన్నాయి. ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ మూడో వికెట్‌ను చేజార్చుకుంది. ఫెర్గుసన్ బౌలింగ్‌లో నిలకడగా రాణిస్తున్న బెయిర్ స్టో(36) దురదృష్టవశాత్తు ఔటయ్యాడు. దీంతో 71 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. రాయ్(17), రూట్(7)లు తీవ్రంగా నిరాశపరిచారు. ప్రస్తుతం ఇంగ్లండ్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది. క్రీజులో మోర్గాన్(8), స్టోక్స్(1)లు ఉన్నారు. ఆరంభంలోనే జాసన్ రాయ్ వికెట్ కోల్పోవడంతో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ జోయ్ రూట్, బెయిర్ స్టోలు మరో వికెట్ పడకుండా ఆచితూచి ఆడుతున్నారు. 13 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ వికెట్ నష్టపోయి 41 పరుగులు చేసింది. బెయిర్ స్టో (20; 36 బంతుల్లో), రూట్(3; 22 బంతుల్లో)లు క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్‌కు షాక్.. రాయ్ ఔట్ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాట్స్‌మన్ జేసన్ రాయ్(17)ను మ్యాట్ హెన్రీ ఔట్ చేశాడు. దీంతో 28 పరుగులకే ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. రాయ్ అవుటవ్వడంతో రూట్ క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం బెయిర్ స్టో 14 పరుగులతో, రూట్ పరుగులేమి చేయకుండా క్రీజులో ఉన్నారు. తొలి బంతికే రివ్యూ తీసుకున్న కివీస్ తొలి బంతికే రివ్యూ తీసుకుని న్యూజిలాండ్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కివీస్ నిర్దేశించిన 242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే అదృష్టం కలిసొచ్చింది. ట్రెంట్బోల్ట్ వేసిన తొలి ఓవర్ తొలి బంతి జాసన్ రాయ్ వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు. దీంతో కివీస్ ఆటగాళ్లు అప్పీల్ చేయగా అంపైర్ నాటౌట్ ప్రకటించాడు. కివీస్ రివ్యూకి వెళ్లగా అంపైర్ కాల్ వచ్చింది. దీంతో రాయ్ బతికిపోయాడు. ఇంగ్లండ్ లక్ష్యం 242 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్.. బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో సాదారణ స్కోర్‌కే పరిమితమైంది. హెన్రీ నికోలస్(55), టామ్ లాథమ్(47) మినహా ఎవరూ అంతగా రాణించలేదు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, ఫ్లంకెట్‌లు తలో మూడు వికెట్లు పడగొట్టారు. ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఏడో వికెట్‌ను కోల్పోయింది. టామ్ లాథమ్(47)ను క్రిస్ వోక్స్ స్లోబాల్‌తో బోల్తా కొట్టించాడు. దీంతో చివరి వరకు ఉండి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందిస్తాడునుకున్న లాథమ్ కూడా ఔట్ కావడంతో కివీస్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. న్యూజిలాండ్ ఆరో వికెట్‌ను చేజార్చుకుంది. ప్రధాన బ్యాట్స్‌మెన్ దారిలోనే గ్రాండ్‌హోమ్(16)కూడా పెవిలియన్ బాట పట్టాడు. ఆరో వికెట్‌కు 46 పరుగులు జోడించిన అనంతరం గ్రాండ్‌హోమ్‌ను క్రిస్ వోక్స్ అవుట్ చేశాడు. పోరాడుతున్న లాథమ్ ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ టామ్ లాథమ్ ఆకట్టుకుంటున్నాడు. హెన్నీ నికోలస్ మినహా ప్రధాన బ్యాట్స్‌మెన్ విఫలమైన చోట లాథమ్ ఒంటరి పోరాటం చేస్తున్నాడు. లాథమ్(41)తో పాటు గ్రాండ్‌హోమ్(13) క్రీజులో ఉన్నారు. 46 ఓవర్లు ముగిసే సరికి కివీస్ ఐదు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. ఐదో వికెట్ కోల్పోయిన కివీస్ ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఐదో వికెట్‌ను కోల్పోయింది. జేమ్స్ నీషమ్(19)ను ఫ్లంకెట్ ఔట్ చేయడంతో 173 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన కివీస్ పీకల్లోతు కష్టాల్లో పడింది. 70 పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లను పడగొట్టిన ఇంగ్లండ్ ప్రత్యర్థి జట్టును ఒత్తిడిలోకి నెట్టింది. ప్రస్తుతం టామ్ లాథమ్(23)తో పాటు గ్రాండ్ హోమ్(4) క్రీజులో ఉన్నారు. 40 ఓవర్లు ముగిసే సరికి కివీస్ 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఫ్లంకెట్ మూడు వికెట్లతో రాణించగా..వుడ్, వోక్స్‌లు తలో వికెట్ పడగొట్టారు. టేలర్ ఔట్ ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఫైనల్ పోరులో న్యూజిలాండ్ నాల్గో వికెట్‌ను కోల్పోయింది. కివీస్ స్కోరు 141 పరుగుల వద్ద ఉండగా రాస్ టేలర్(15) పెవిలియన్ చేరాడు. ఇన్నింగ్స్ 34 ఓవర్ తొలి బంతికి టేలర్ ఔటయ్యాడు. మార్క్ వుడ్ బౌలింగ్‌లో టేలర్ ఎల్బీగా పెవిలియన్ బాట పట్టాడు. లాథమ్(11), జేమ్స్ నీషమ్(0)లు క్రీజ్‌లో ఉన్నారు. నికోలస్ ఔట్ ఇంగ్లండ్‌తో జరుగుతున్న ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ మూడో వికెట్ కోల్పోయింది. అర్దసెంచరీ సాధించి మంచి ఊపుమీదున్న నికోలస్(55)ను ప్లంకెట్ బౌల్డ్ చేశాడు. ఇప్పటికే విలియమ్సన్‌ను ఔట్ చేసిన ప్లంకెట్.. నికోలస్‌ను కూడా ఔట్‌చేసి కివీస్‌ను మరింత కష్టాల్లోకి నెట్టాడు. ప్రస్తుతం కివీస్ 27 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. క్రీజులో టేలర్(6), లాథమ్(0)లు ఉన్నారు. నికోలస్ హాఫ్ సెంచరీ ఇంగ్లండ్‌తో జరుగుతున్న ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో హెన్రీ నికోలస్ అర్దసెంచరీ సాధించాడు. 71 బంతుల్లో నాలుగు ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మార్టిన్ గప్టిల్(19), విలియమ్సన్(30)లు నిరాశపరిచినప్పటికీ నికోలస్ బాధ్యతాయుతంగా ఆడాడు. తొలి వికెట్‌కు 29, పరుగులు రెండో వికెట్‌కు 74 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. విలియమ్సన్ ఔట్ ఇంగ్లండ్‌తో జరుగుతున్న ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌కు భారీ షాక్ తగిలింది. సారథి విలియమ్సన్(30)ను ఫ్లంకెట్ను ఔట్ చేసి కివీస్‌ను కష్టాల్లో పడేశాడు. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో కివీస్ బ్యాటింగ్‌కు వెన్నెముకలా నిలిచిన విలియమ్సన్ స్వల్పస్కోర్‌కే వెనుదిరగడం కివీస్ ఎదురుదెబ్బే. ఇక సీనియర్ ఆటగాడు రాస్ టేలర్ ఇన్నింగ్స్‌పైనే కివీస్ ఆధారపడి ఉంది. ప్రస్తుతం కివీస్ 23 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. నికోలస్ 46 పరుగులతో, టేలర్ పరుగులేమి చేయకుండా క్రీజులో ఉన్నారు. అర్దసెంచరీ భాగస్వామ్యం ఓపెనర్ హెన్రీ నికోలస్‌తో కలిసి కేన్ విలియమ్సన్ రెండో వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. 29 పరుగులకే మార్టిన్ గప్టిల్(19) వికెట్ కోల్పోవడంతో కివీస్ కష్టాల్లో పడింది. అయితే ఈ తరుణంలో నికోలస్‌తో కలిసి విలియమ్సన్ బాధ్యతాయుతంగా ఆడుతున్నాడు. ప్రస్తుతం కివీస్ 20 ఓవర్లకు వికెట్ నష్టానికి 91 పరుగులు చేసింది. నికోలస్ 40 పరుగులతో, విలియమ్సన్ 24పరుగులతో క్రీజులో ఉన్నారు. విలియమ్సన్ రికార్డు ఫైనల్ మ్యాచ్‌లో కివీస్ సారథి కేన్ విలియమ్సన్ రికార్డు సాధించాడు. ఒక ప్రపంచకప్‌లో కెప్టెన్‌గా అత్యధిక పరుగులు సాధించిన శ్రీలంక మాజీ సారథి మహేళ జయవర్దనే(548, 2007 ప్రపంచకప్‌లో) రికార్డును విలియమ్సన్ తాజాగా బద్దలుకొట్టాడు. కివీస్ 15 ఓవర్లు 63/1 ఇంగ్లండ్‌తో జరుగుతున్న ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 15 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది. ప్రస్తుతం నికోలస్ 27 పరుగులతో, విలియమ్సన్ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆరంభంలోనే క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో మార్టిన్ గప్టిల్(19) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో విలియమ్సన్, నికోలస్లు ఆచితూచి ఆడుతున్నారు. కివీస్ 10 ఓవర్లలో 33/1 ఇంగ్లండ్‌తో జరుగుతున్న ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో పది ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ వికెట్ నష్టానికి 33 పరుగులు చేసింది. ప్రస్తుతం నికోలస్ 10 పరుగులతో, విలియమ్సన్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. ఆరంభంలోనే క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో మార్టిన్ గప్టిల్(19) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో 29 పరుగులకే కివీస్ కీలక వికెట్‌ను కోల్పోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్‌కు ఓపెనర్లు ఆదిరే ఆరంభాన్ని అందించలేదు. గప్టిల్ ఔట్.. ఇంగ్లండ్‌తో జరుగుతున్న ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో మార్టిన్ గప్టిల్(19) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో 29 పరుగులకే కివీస్ కీలక వికెట్‌ను కోల్పోయింది. గప్టిల్ ఔటవ్వడంతో విలియమ్సన్ క్రీజులోకి వచ్చాడు. సిక్సర్, ఫోర్‌తో మెరిసిన గప్టిల్ ఇప్పటివరకు ప్రపంచకప్‌లో మెరవని మార్టన్ గప్టిల్ ఫైనల్ మ్యాచ్‌లో చాలా ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నాడు. జోఫ్రా ఆర్చర్ వేసిన నాలుగో ఓవర్లో ఒక సిక్సర్, ఒక ఫోర్‌తో ఆకట్టుకున్నాడు. దీంతో గప్టిల్ ఫామ్‌లోకి వచ్చాడని కివీస్ అభిమానులు ఆనందపడుతున్నారు. రివ్యూతో బతికిపోయిన నికోలస్ ఇంగ్లండ్‌తో జరుగుతున్న ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో రివ్యూతో న్యూజిలాండ్ ఓపెనర్ నికోలస్ బతికిపోయాడు. వోక్స్ వేసిన మూడో ఓవర్ మూడో బంతి నికోలస్ ప్యాడ్లకు తగిలడంతో ఇంగ్లండ్ ఆటగాళ్లు అప్పీల్ చేయగా అంపైర్ ధర్మసేన ఔట్‌గా ప్రకటించాడు. దీంతో నికోలస్ రివ్యూకు వెళ్లాడు. బంతి వికెట్‌ను మిస్ అవుతుండటంతో థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. వైడ్‌తో ఫైనల్ మ్యాచ్ పారంభం వైడ్‌తో ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది. క్రిస్ వోక్స్ వేసిన తొలి ఓవర్ తొలి బంతి వైడ్ కావడంతో న్యూజిలాండ్‌కు అదనంగా ఒక పరుగు లభించింది. ఇక టాస్ గెలిచి కివీస్ బ్యాటింగ్ ఎంచుకోవడంతో మార్టిన్ గప్టిల్, నికోలస్లు ఓపెనర్లుగా బరిలోకి దిగారు. కప్ కొట్టాల్సిన మ్యాచ్‌లో మార్గిన్ గప్టిల్ రాణించాలని కివీస్ కోరుకుంటుంది. అతడి రాణిస్తే ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించాలని కివీస్ ఆరాటపడుతోంది. ఈసారి వన్డే వరల్డ్‌కప్‌లో కొత్త చాంపియన్ అవతరించబోతోంది. ఒకటి అందరూ టైటిల్ ఫేవరెట్‌గా పేర్కొన్న జట్టు ఇంగ్లండ్ కాగా టోర్నీ మధ్యలో కొంత తడబాటుకు గురైనా.. ఆ తర్వాత అంచనాలకు తగ్గ ఆటతో ఫైనల్లోకి దూసుకొచ్చిన న్యూజిలాండ్. ఈ రెండు జట్లు మెగా టైటిల్ పోరులో తలపడుతున్నాయి. క్రికెట్‌కు పుట్టినిల్లయినా.. ఒకటికి మూడు సార్లు ఫైనల్ చేరినా.. ఇప్పటిదాకా ప్రపంచకప్ కల తీరని జట్టు ఇంగ్లండ్‌ది. ఇంకొకటి పెద్దగా అంచనాల్లే కుండా బరిలోకి దిగి.. లీగ్ దశలో డక్కామొక్కీలు తిని.. కష్టం మీద నాకౌట్‌కు చేరి.. సెమీస్‌లో బలమైన భారత జట్టుకు షాకిచ్చి ఫైనల్లో అడుగుపెట్టిన కివీస్. ప్రపంచ కప్‌లో ఎప్పుడూ మెరుగైన ప్రదర్శనే చేసే ఆ జట్టుకు.. టైటిల్ మాత్రం అందని ద్రాక్షే. ఒకసారి ఫైనల్ ఆడింది. కానీ కప్పు అందలేదు. మరికొద్ది గంటల్లో ఇరు జట్ల దశాబ్దాల నిరీక్షణకు ఆదివారం తెరపడబోతోంది. లార్డ్స్ మైదానంలో జరుగుతున్న తుది సమరంలో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ముందుగా బ్యాటింగ్ చేసేందుకు మొగ్గుచూపాడు. ఇరు జట్లు ఎటువంటి మార్పులు చేయకుండా బరిలోకి దిగుతున్నాయి. ఇరు జట్ల బలాబలాలు చూస్తే న్యూజిలాండ్ కన్నా ఇంగ్లండ్ కొన్ని మెట్లు పైనే ఉంది. బ్యాటింగ్ ఆ జట్టుకు ప్రధాన బలం. జేసన్ రాయ్, బెయిర్‌స్టో, రూట్, మోర్గాన్, స్టోక్స్, బట్లర్.. ఇలా భీకరమైన లైనప్ ఉందా జట్టుకు. లీగ్ దశ మధ్యలో తడబాటుకు గురైనప్పటికీ.. నాకౌట్ అవకాశాలు ప్రమాదంలో పడ్డ స్థితిలో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ బాధ్యత తీసుకున్నారు. చివరి మూడు మ్యాచ్‌ల్లో అదరగొట్టారు. న్యూజిలాండ్‌కు బ్యాటింగే సమస్యగా ఉంది. ఓపెనర్ల వైఫల్యం ఆ జట్టుకు పెద్ద తలనొప్పిగా మారింది. స్టార్ బ్యాట్స్‌మన్ గప్తిల్ టోర్నీ మొత్తంలో 167 పరుగులే చేశాడు. కివీస్ ఫైనల్ వరకు వచ్చిందంటే అది కెప్టెన్ విలియమ్సన్ పోరాట ఫలితమే. మిడిలార్డర్లో టేలర్, నీషమ్ ఓ మోస్తరుగా రాణిస్తున్నారు. బౌలింగ్‌లో న్యూజిలాండ్‌దే పైచేయి. బౌల్ట్, హెన్రీ, ఫెర్గూసన్, శాంట్నర్ నిలకడగా రాణిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. సెమీస్‌లో హెన్రీ, బౌల్ట్, శాంట్నర్ ఎలా విజృంభించారో తెలిసిందే. ఇంగ్లండ్ బౌలర్లు టోర్నీ ఆరంభంలో సాధారణంగా కనిపించారు కానీ.. తర్వాత పుంజుకున్నారు. ఆర్చర్, వోక్స్, రషీద్ మంచి ఫామ్‌లోనే ఉన్నారు. ఏది ఏమైనా ఇరు జట్లు తొలిసారి వరల్డ్‌కప్‌ను సాధించడానికి శాయశక్తుల పోరాడతారనడంలో ఎటువంటి సందేహం లేదు. దాంతో ఆసక్తికర సమరం ఖాయం. -
మ్యాట్ హెన్రీ అరుదైన ఘనత
లండన్: న్యూజిలాండ్ పేసర్ మ్యాట్ హెన్రీ అరుదైన ఘనతను సాధించాడు. తాజా వరల్డ్‌కప్‌లో తొలి పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా నిలిచాడు. ప్రస్తుతం వరల్డ్‌కప్‌లో హెన్రీ మొదటి పవర్ ప్లేలో 8 వికెట్లను తీశాడు. దాంతో ఈ మెగా టోర్నీలో పది ఓవర్లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా గుర్తింపు సాధించాడు. వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ పోరులో భాగంగా జేసన్ రాయ్ వికెట్‌ను సాధించడం ద్వారా హెన్రీ ఈ ఫీట్ నమోదు చేశాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో భాగంగా ఆరో ఓవర్ నాల్గో బంతికి రాయ్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఈ జాబితాలో కాట్రెల్(వెస్టిండీస్), జోఫ్రా ఆర్చర్( ఇంగ్లండ్), క్రిస్ వోక్స్( ఇంగ్లండ్)లు సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. వీరు తలో ఏడు వికెట్లతో రెండో స్థానంలో ఉన్నారు. ( ఇక్కడ చదవండి: కేన్ విలియమ్సన్ వరల్డ్ రికార్డు) కివీస్ నిర్దేశించిన 242 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ 28 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. ఆరంభం నుంచి కివీస్ పేసర్లను ఎదుర్కోవడానికి ఇబ్బంది పడిన రాయ్.. హెన్రీకి చిక్కాడు. ఆపై జానీ బెయిర్ స్టోకు లైఫ్ లభించింది. బెయిర్ స్టో ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను గ్రాండ్ హోమ్ వదిలేశాడు. -
ఇంగ్లండ్ ఛేదిస్తుందా.. చతికిలబడుతుందా?
లండన్: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా ఆతిథ్య ఇంగ్లండ్‌తో జరుగుతున్న తుది పోరులో న్యూజిలాండ్ 242 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. హెన్రీ నికోలస్(55; 77 బంతుల్లో 4 ఫోర్లు) హాఫ్ సెంచరీ సాధించగా, టామ్ లాథమ్(47; 56 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్) ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత కేన్ విలియమ్సన్(30; 53 బంతుల్లో 2 ఫోర్లు) కాస్త ఫర్వాలేదనిపించగా, మిగతా వారు విఫలమయ్యారు.టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ గప్టిల్(19) మరోసారి నిరాశపరిచాడు. ఆ తరుణంలో నికోలస్‌తో కెప్టెన్ విలియమ్సన్ జత కలిశాడు. వీరిద్దరూ 74 పరుగులు సాధించిన తర్వాత విలియమ్సన్ రెండో వికెట్‌గా ఔటయ్యాడు. ప్లంకెట్ బౌలింగ్‌లో కీపర్ జోస్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. (ఇక్కడ చదవండి: కేన్ విలియమ్సన్ వరల్డ్ రికార్డు) దాంతో 103 పరుగుల వద్ద రెండో వికెట్‌ను నష్టపోయింది. ఆపై మరో 15 పరుగుల వ్యవధిలో నికోలస్ మూడో వికెట్‌గా ఔట్ కాగా, రాస్ టేలర్(15) విఫలమయ్యాడు. కాగా, లాథమ్ ఆదుకోవడంతో కివీస్ గాడిలో పడింది. ఈ క్రమంలోనే నీషమ్‌తో కలిసి 32 పరుగులు జత చేసిన లాథమ్.. గ్రాండ్ హోమ్‌తో కలిసి 46 పరుగులు భాగస్వామ్యం సాధించాడు. కాగా, 48.3 ఓవర్లలో కివీస్ స్కోరు 232 పరుగుల వద్ద లాథమ్ ఏడో వికెట్‌గా ఔట్ కాగా, ఆ తర్వాత 9 పరుగుల్ని మాత్రమే వచ్చాయి. దాంతో కివీస్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్, ప్లంకెట్లు తలో మూడు వికెట్లు సాధించగా, జోఫ్రా ఆర్చర్, మార్క్‌వుడ్‌లు చెరో వికెట్ తీశారు. మరి కివీస్ నిర్దేశించిన సాధారణ టార్గెట్‌ను ఇంగ్లండ్ ఛేదిస్తుందా.. లేక చతికిలబడుతుందా అనేది చూడాలి. -
కేన్ విలియమ్సన్ వరల్డ్ రికార్డు
లండన్: న్యూజిలాండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ సరికొత్త వరల్డ్ రికార్డు సాధించాడు. ఒక వరల్డ్‌కప్‌లో అత్యధిక పరుగులు సాధించిన కెప్టెన్‌గా విలియమ్సన్ చరిత్ర సృష్టించాడు. వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో తుది పోరులో విలియమ్సన్ ఈ ఫీట్ నమోదు చేశాడు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో తన పరుగుల ఖాతాను తెరవడం ద్వారా విలియమ్సన్ అత్యధిక పరుగులు సాధించిన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే శ్రీలంక మాజీ కెప్టెన్ మహేలా జయవర్థనే రికార్డును విలియమ్సన్ బ్రేక్ చేశాడు. 2007 వరల్డ్‌కప్‌లో జయవర్థనే 548 పరుగులు సాధించాడు. ఇదే ఇప్పటివరకూ వన్డే వరల్డ్‌కప్‌లో అత్యధిక పరుగులు సాధించిన కెప్టెన్సీ రికార్డు. దాన్ని తాజాగా విలియమ్సన్ సవరిస్తూ నూతన అధ్యాయాన్ని లిఖించాడు. 2019 వరల్డ్‌కప్‌లో విలియమ్సన్ సాధించిన పరుగులు 578. ఈ జాబితాలో విలియమ్సన్, జయవర్థనే తర్వాత స్థానాల్లో రికీ పాంటింగ్(539 పరుగులు, 2007), అరోన్ ఫించ్(507 పరుగులు, 2019), ఏబీ డివిలియర్స్( 482 పరుగులు, 2015)లు ఉన్నారు. ఇక టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ 465 పరుగులతో ఆరో స్థానంలో ఉన్నాడు. 2003 వరల్డ్‌కప్‌లో భారత్ ఫైనల్‌కు చేరే క్రమంలో గంగూలీ ఈ పరుగులు చేశాడు. -
ఇంకా ధోని గురించి ఎందుకు?
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని తన రిటైర్మెంట్కు సంబంధించి ఏమైనా ఆలోచన ఉంటే దాన్ని మానుకోవాలని ఇప్పటికే ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కోరగా, తాజాగా రచయిత జావెద్ అక్తర్ కూడా దాదాపు అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వరల్డ్‌కప్ సెమీస్‌లో టీమిండియా ఓటమితో ధోని రిటైర్మెంట్ వార్తలు మళ్లీ ఊపందుకున్నాయి. ఈ ప్రపంచకప్ అనంతరం ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కోహ్లీసేన సైతం కప్ గెలిచి ధోనికి ఘనంగా వీడ్కోలు పలకాలని భావించింది. అయితే, అనూహ్యంగా సెమీస్‌లోనే భారత్ ఇంటిదారి పట్టింది. ఈ నేపథ్యంలో ధోని రిటైర్మెంట్ వార్తలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు ధోనికి మద్దతుగా నిలుస్తున్నారు. ‘ ధోని గేమ్‌ను అర్థం చేసుకునే తీరు భారత్‌కు ఎంతో ఉపయోగం. ధోని ఒక నమ్మదగిన ఆటగాడు. భారత క్రికెట్ జట్టుకు ధోని ఎంతో విలువైన ఆటగాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇంకా అతను ఆడాల్సిన క్రికెట్ చాలా ఉంది. ఇంకా ధోని గురించి, అతని రిటైర్మెంట్ గురించి మాట్లాడతారెందుకు’ అని జావెద్ అక్తర్ ప్రశ్నించారు. అంతకుముందు లతా మంగేష్కర్ కూడా ధోని రిటైర్మెంట్కు సంబంధించి వస్తున్న వార్తలపై స్పందిస్తూ..‘ధోని జీ. మీరు రిటైర్ కాబోతున్నారనే వార్తలు వింటున్నాను. దయచేసి అలాంటి ఆలోచనలు చేయకండి. దేశానికి మీ అవసరం ఎంతో ఉంది. దేశం కోసం మీరు మరేన్నొ మ్యాచ్‌లు ఆడాలి. మీ మనసులోంచి రిటైర్మెంట్ ఆలోచనను తీసేయాల్సిందిగా నా విన్నపం’ అని ట్వీట్ చేశారు. -
ఇలా అయితే ఎలా?: యువరాజ్ సింగ్
న్యూఢిల్లీ: వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా తన ప్రస్థానాన్ని సెమీస్‌లోనే ముగించడంపై మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ పెదవి విప్పాడు. భారత జట్టు బ్యాటింగ్ ఆర్డర్ సరిగా లేకపోవడం వల్లే టైటిల్ పోరుకు అర్హత సాధించడంలో విఫలమైందన్నాడు. ప్రధానంగా నాల్గో స్థానంలో నాణ్యమైన బ్యాట్స్‌మన్ లేకపోవడం వల్లే ఈ ఓటమి ఎదురైందని తాను భావిస్తున్నానని అన్నాడు. ఈ స్థానాన్ని ఎంత త్వరగా భర్తీ చేస్తే.. అంత మంచిదని చెప్పారు. ఓ మంచి బ్యాట్స్‌మెన్‌తో ఈ స్థానాన్ని భర్తీ చేయకపోతే.. బ్యాటింగ్ లైనప్ మరింత బలహీనపడే ప్రమదం ఉందన్నాడు. సీనియర్ క్రికెటర్ అంబటి రాయుడు అంతర్జాతీయ క్రికెట్ నుంచి అర్ధాంతరంగా తప్పుకోవడం పట్ల యువరాజ్ సింగ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాడు. ప్రపంచకప్ టోర్నమెంట్ కోసం ఎంపిక చేసిన జట్టులో అంబటి రాయుడిని తీసుకోకపోవడం వ్యూహాత్మక తప్పిదమని యువీ వ్యాఖ్యానించాడు. టీమిండియా బ్యాటింగ్ లైనప్‌లో నాలుగో స్థానం అత్యంత కీలకమైనదని యువరాజ్ సింగ్ అన్నాడు. దీన్ని భర్తీ చేసుకోకపోతే.. దాని ప్రభావం బ్యాటింగ్ లైనప్ మొత్తంపై పడుతుందని అభిప్రాయపడ్డాడు. అంబటి రాయుడిని జట్టులోకి తీసుకుని- నాలుగో నంబర్ స్థానాన్ని అతనితో భర్తీ చేయించి ఉండాల్సిందని చెప్పాడు. ప్రపంచకప్ టోర్నమెంట్లో అంబటి రాయుడికి చోటు దక్కకపోవడం తనను షాక్‌కు గురి చేసిందని అన్నాడు. ఏ ఒక్క బ్యాట్స్‌మెన్ అయినా ఈ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి విఫలమైతే.. అతణ్ని పక్కనపెడుతున్నారని, అది సరైన పద్ధతి కాదన్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాల్గో స్థానాన్ని ఎలా భర్తీ చేస్తారని ప్రశ్నించాడు. టీమిండియాలో నాలుగో నంబర్ స్థానం మ్యూజికల్ ఛైర్‌లా మారిందని యువరాజ్ సింగ్ విమర్శించాడు. నాలుగైదు మ్యాచ్‌ల్లో విఫలమైన తరువాత అంబటి రాయుడు న్యూజిలాండ్‌పై జరిగిన మ్యాచ్‌లో రాణించాడని, మళ్లీ అతణ్ని తప్పించారని మండిపడ్డాడు. తాజాగా రిషబ్ పంత్‌ను నాలుగో స్థానంలో ఆడిస్తున్నప్పటికీ.. అతను ఎన్నాళ్లు ఆ స్థానంలో ఉంటాడో తెలియదని అన్నాడు. నాలుగో స్థానంలో ఆడగలడన్న నమ్మకం ఉంచిన ఓ ఆటగాడిని మళ్లీ, మళ్లీ తొలగించడం వల్ల ఉపయోగం ఉండదని చెప్పాడు. దీనివల్ల ఆ ఆటగాడు తనపై తాను విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు.