Varalaxmi Sarathkumar
-
కిచ్చా సుదీప్ 'మ్యాక్స్' హంటింగ్ ట్రైలర్ విడుదల
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'మ్యాక్స్' నుంచి ట్రైలర్ విడుదలైంది. రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాతో టాలీవుడ్లో క్రేజ్ తెచ్చుకున్న సుదీప్ ఆపై బాహుబలిలో కూడా ఛాన్స్ దక్కించుకున్నారు. అలా ఆయన పాన్ ఇండియా రేంజ్లో పరిచయం అయ్యాడు. అయితే, ఇప్పుడు మ్యాక్స్ సినిమాతో థియేటర్స్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్ నటిస్తుండగా విలన్‌గా సునీల్ కన్నడలో ఎంట్రీ ఇచ్చాడు. డిసెంబర్ 25న విడుదల కానున్న ఈ చిత్రాన్ని వీ క్రియేషన్స్, కిచ్చా క్రియేషన్స్ బ్యానర్స్‌పై కలైపులి ఎస్ థాను నిర్మించారు. విజయ్ కార్తికేయా దర్శకత్వం వహించారు. తెలుగులో కూడా ఈ మూవీ విడుదల కానున్నడంతో మ్యాక్స్ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.'మ్యాక్స్' చిత్రంలో అర్జున్ మహాక్షయ్ అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కిచ్చా సుదీప్ కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా డేట్ అనౌన్స్ మెంట్ నుంచి అందరినీ ఆకట్టుకునేలా ఈ చిత్రం పోస్టర్స్ ఉన్నాయి. దీంతో తెలుగులో కూడా మ్యాక్స్ సినిమాపై హై ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. క్రిస్మస్ రేసులో ఇప్పటికే సుమారు పదికి పైగా సినిమాలు ఉన్నాయి. అయితే, ఇదే సమయంలో కిచ్చా సుదీప్ కూడా రానున్నడంతో బాక్సాఫీస్ వద్ద పోటీ మరింత గట్టిగానే ఉంది. -
వైరల్ అవుతున్న నటి వరలక్ష్మి బీచ్ వెడ్డింగ్ ఫొటోలు
-
ఒక్క క్షణం కూడా వదలట్లేదు.. భర్త గురించి వరలక్ష్మి
తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్.. ఈ ఏడాది జూలైలో పెళ్లి చేసుకుంది. నికోలయ్ సచ్దేవ్ అనే వ్యక్తితో కొత్త జీవితం ప్రారంభించింది. పెళ్లికి ముందు గానీ తర్వాత గానీ భర్త గురించి పెద్దగా మాట్లాడని వరలక్ష్మి.. ఇప్పుడు అతడి పుట్టినరోజు సందర్భంగా ప్రేమనంతా ఒలకబోసింది. ఓ వీడియో షేర్ చేసి బోలెడన్ని సంగతులు చెప్పింది.(ఇదీ చదవండి: క్షమించాలని కన్నీళ్లు పెట్టుకున్న షణ్ముఖ్ జస్వంత్)'ఈ ఏడాది చాలా వేగంగా చాలా విషయాలు జరిగాయి. వెనక్కి తిరిగి చూసుకుంటే అన్నీ మధుర జ్ఞాపకాలే. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పడం చాలా కష్టం. నీ కంటే నన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నావ్. మగాడు ఎలా ఉండాలనే దానికి నువ్వు ఉదాహరణ. నువ్వు నన్ను భద్రంగా కాపాడుకుంటున్నావ్. ఎంతలా అంటే ఒక్క క్షణం కూడా నన్ను విడిచిపెట్టి ఉండట్లేదు. ఇంకా చాలా చెప్పాలని ఉంది. కానీ ఒక్క మాటలో చెప్పాలంటే నీ లాంటి భర్త దొరకడం నిజంగా నేను చేసుకున్న అదృష్టం. ఇంతకు మించి నిన్నేం అడగనులే. హ్యాపీ బర్త్ డే టూ వరల్డ్స్ బెస్ట్ హస్బెండ్' అని వరలక్ష్మి తన భర్త గురించి చెప్పుకొచ్చింది.ఈ పోస్ట్‌తో పాటు షేర్ చేసిన వీడియోలో వరలక్ష్మి.. బోలెడన్ని ఫొటోలని షేర్ చేసింది. పెళ్లి, టూర్స్ వెళ్లినప్పుడు ఫొటోలు చాలానే ఉన్నాయి. సరే ఇదంతా పక్కనబెడితే ఈ ఏడాది 'హనుమాన్', 'శబరి' సినిమాలు చేసింది. పెళ్లి తర్వాత కొత్త సినిమాలేం చేయట్లేదు. భర్తతో కలిసి ఫ్యామిలీ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తోంది.(ఇదీ చదవండి: మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు.. పోలీసులకు లేఖ రాసిన తల్లి నిర్మల) View this post on Instagram A post shared by Varalaxmi Sarathkumar (@varusarathkumar) -
2024లో ఇంతమంది సెలబ్రిటీలు పెళ్లి చేసుకున్నారా? (ఫొటోలు)
-
స్టార్ హీరో సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్‌కు ఛాన్స్
నటుడు విజయ్ చివరి చిత్రంగా చెప్పుకుంటున్న ఆయన 69వ చిత్రం షూటింగ్ చెన్నైలో శరవేగంగా సాగుతోంది. హెచ్ వినోద్ వహిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కారణం ఇది సమకాలీన రాజకీయ కథా చిత్రం కావడమే. అంతే కాకుండా దర్శకుడు హెచ్ వినోద్ ఈ కథను నటుడు కమలహాసన్ కోసం సిద్ధం చేసిన కథ అనే ప్రచారం కూడా సాగుతోంది. అదేవిధంగా రాజకీయ పార్టీ ప్రారంభించిన నటుడు విజయ్ రాజకీయ భవిష్యత్తుకు ఈ చిత్రం చాలా ప్రయోజనకరంగా ఉంటుందనే భావన కూడా వ్యక్తమవుతోంది. ఇందులో నటి పూజా హెగ్డే నాయకిగా నటిస్తుండగా ప్రకాష్ రాజ్, ప్రియమణి బాలీవుడ్ స్టార్ నటుడు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కె.వి.ఎన్ పిక్చర్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. మరో విషయం ఏమిటంటే నిర్మాత లలిత్‌కుమార్ ఫ్యాన్సీ రేటుకు హక్కులు పొందినట్లు సమాచారం. ఇకపోతే ఈ చిత్రంలో సంచలన నటి వరలక్ష్మి శరత్‌కుమార్ ముఖ్య పాత్రను పోషిస్తున్నట్లు, ఇప్పుడు విజయ్, వరలక్ష్మి మధ్య జరిగే సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్నట్లు తెలిసింది. ఇంతకుముందు విజయ్ కథానాయకుడిగా నటించిన సర్కార్ చిత్రంలో నటి వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రతినాయకి పాత్రను పోషించారు. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. అలాంటిది ఇప్పుడు ఈ చిత్రంలో ఆమె ఎలాంటి పాత్ర పోషిస్తున్నారన్న అంశంపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్‌గా తెరపైకి వచ్చే అవకాశం ఉంది. -
హీరోగా టాలీవుడ్ రచయిత మనవడు.. ఆసక్తిగా ట్రైలర్!
ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు మనవడు సుదర్శన్ పరుచూరి హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం మిస్టర్ సెలెబ్రిటీ. ఈ సినిమాకు రవి కిశోర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్పీ సినిమాస్ బ్యానర్‌పై ఎన్ పాండురంగారావు, చిన్నా రెడ్డి నిర్మించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.(ఇది చదవండి: అతనంటే చిరాకు.. ఆ షో అంతా ఓ చెత్త: సినీయర్ నటుడు ఆగ్రహం)ట్రైలర్ చూస్తే ఒక సెలబ్రిటీగా మారాలనుకునే యువకుడి కథనే సినిమాగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో హనుమాన్ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనుంది. అంతేకాకుండా సీనియర్ నటి ఆమని,శ్రీ దీక్ష, నాజర్, రఘుబాబు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. Wishing best wishes to #ParuchuriSudarshan and the entire team of #MrCelebrity!The trailer looks very promising 👍🏻https://t.co/wxnwA3YIQCIn theatres from October 4th@varusarath5 #ChandinaRaviKishore #NPandurangarao— Rana Daggubati (@RanaDaggubati) October 2, 2024 -
మీ అందరి సపోర్ట్ కి చాలా థాంక్స్: మీడియా ఇంటరాక్షన్ లో వరలక్ష్మి (ఫొటోలు)
-
వరలక్ష్మి శరత్‌కుమార్ ఫస్ట్ లవ్ నేను కాదు: నికోలాయ్ సచ్దేవ్
కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్‌కుమార్, ముంబై గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్దేవ్లు కొద్దిరోజుల క్రితం వివాహబంధంలోకి అడుగుపెట్టారు. జూలై 10న థాయిలాండ్‌లోని క్రాబీ బీచ్ రిసార్ట్‌లో సన్నిహితుల సమక్షంలో వారి వివాహం జరిగింది. పెళ్లి ముగియడంతో ఈరోజు వీరిద్దరూ చెన్నైలో తమ నివాసంలో తొలిసారి మీడియాతో మాట్లాడారు.వరలక్ష్మీ భర్త నికోలాయ్ ఇలా చెప్పుకొచ్చాడు. 'నేను కూడా తమిళం నేర్చుకుంటున్నాను. నాకు ఇప్పుడు తమిళంలో పొంతటి (భార్య) అనే పదం మాత్రమే తెలుసు. ఇకనుంచి నా ఇల్లు ముంబై కాదు.. చెన్నైనే నా ఇల్లు. నన్ను నేను మీకు పరిచయం చేసుకోవాలనుకుంటున్నాను. నా పేరు నికోలాయ్ సచ్దేవ్. నాకు వరలక్ష్మి అనే అందమైన అమ్మాయితో పెళ్లయింది. అందరూ అనుకున్నట్లు పెళ్లి తర్వాత వరలక్ష్మి తన పేరును వరలక్ష్మి శరత్‌కుమార్ సచ్‌దేవ్‌గా మార్చుకోవడం లేదు. నాకు కూడా ఆమె పేరు వరలక్ష్మి శరత్కుమార్గానే నచ్చింది. కానీ, నేను మాత్రం ఆమె పేరును తీసుకుంటున్నాను. ఇకనుంచి నా పేరు 'నికోలాయ్ వరలక్ష్మి శరత్‌కుమార్ సచ్దేవ్'గా మార్చుకుంటున్నాను. శరత్‌కుమార్, వరలక్ష్మిల కీర్తి ఇప్పుడు నా సొంతం. వరలక్ష్మి నన్ను పెళ్లి చేసుకున్నప్పటికీ ఆమె ఫస్ట్ లవ్ మాత్రం నేను కాదు. ఆమె మొదటి ప్రేమ ఎప్పుడూ సినిమాల్లో నటించడమే. పెళ్లి తర్వాత కూడా నటిస్తూనే ఉంటుంది. గతంలో మాదిరే మీ అందరి ప్రేమ,మద్దతు ఆమెకు అవసరం.' అని నికోలాయ్ అన్నారు.నటి వరలక్ష్మి శరత్‌కుమార్ మాట్లాడుతూ.. 'ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నికోలాయ్ చెప్పినట్లు అయన నా ప్రేమ అయితే.. సినిమా నా జీవితం. కాబట్టి పెళ్లి తర్వాత కూడా తప్పకుండా సినిమాల్లో నటిస్తాను. మాకు పెళ్లి శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.' అని ఆమె తెలిపింది. -
థాయ్‌లాండ్‌లో బీచ్ పక్కనే పెళ్లి.. సంతోషం పట్టలేకున్న వరలక్ష్మి (ఫోటోలు)
-
సంప్రదాయబద్ధంగా నటి వరలక్ష్మి వివాహం
కోలీవుడ్ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ తన ప్రేమికుడితో కలిసి వివాహబంధంలోకి అడుగుపెట్టారు. నికోలయ్ సచ్దేవ్ను వరలక్ష్మీ ప్రేమించి వివాహం చేసుకున్నారు. థాయ్‌లాండ్‌లోని ఒక బీచ్ రిసార్ట్‌లో 2024 జులై 10న వారి వివాహం జరిగింది. దక్షిణ భారత సంప్రదాయ పద్ధతుల్లో వారి వివాహం జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే, వరలక్ష్మీ శరత్‌కుమార్ కుటుంబం నుంచి పెళ్లి తేదీ ఎప్పుడు అనేది గతంలో వారు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో అందరూ వారి వివాహం జులై 2 అని భావించారు.జులై 4న చెన్నైలోని తాజ్ హోటల్లో గ్రాండ్‌గా రిసెప్షన్ నిర్వహించారు. దీంతో వారి వివాహం జులై 2న పూర్తి అయిందని అందరూ భావించారు. ఆ కార్యక్రమంలో టాలీవుడ్, కోలీవుడ్ నటీనటులు పాల్గొన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ వధూవరులను ఆశీర్వదించారు. రజనీకాంత్, బాలకృష్, వెంకటేశ్, మంచు లక్ష్మి, సిద్ధార్థ్, ఖుష్బూ, శోభన వంటి స్టార్స్ ఆ రిసెప్షన్లో సందడి చేసిన విషయం తెలిసిందే. పెళ్లితో సమానంగా ఆ కార్యక్రమాన్ని వారు నిర్వహించారు. కానీ, వారి వివాహం జులై 10న థాయ్‌లాండ్‌లో జరిగింది. -
నెట్టింట వైరల్ అవుతున్న వరలక్ష్మీ శరత్ కుమార్ పెళ్లి ఫోటోలు!
-
హనీమూన్ ట్రిప్‌లో కొత్తజంట.. ఎవరో గుర్తుపట్టారా..?
కోలీవుడ్ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్, నికోలయ్ సచ్దేవ్లు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. థాయ్‌లాండ్ వేదికగా జులై 2న వీరి వివాహం ఘనంగా జరిగింది. చెన్నైలో జరిగిన రిసెప్షన్లో తమిళనాడు సీఎం స్టాలిన్‌తో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు.కొన్నిరోజులుగా తమ పెళ్లికి రావాలంటూ చాలామంది ప్రముఖులను ఆహ్వానించే పనిలో వరలక్ష్మీ బిజీగా గడిపేసింది. ఇలా కొద్ది రోజులుగా శుభలేఖలు పంచడం, హల్దీ, మెహీందీ, ఫ్రీ వెడ్డింగ్ పార్టీ, పెళ్లి, రిసెప్షన్, వివాహానరంతరం జరిగే విశేష కార్యక్రమాలతో ఊపిరాడనంత బిజీ బిజీగా గడిపిన నటి వరలక్ష్మీశరత్‌కుమార్ ఇప్పుడు భర్తతో కలిసి హనీమూన్‌కు వెళ్లారు. అయితే, ఈ కొత్తజంట హనీమూన్‌కు ఏ దేశానికి వెళ్లారో మాత్రం చెప్పలేదు.అందమైన ప్రదేశాల్లో వారు తీసుకున్న ఫోటోలను ఇన్‌స్టా స్టోరీస్‌లో వరలక్ష్మీ పంచుకుంది. తుపాన్ తరువాత ప్రశాంతత అంటూ వారు ఆనందంగా ఉన్న ఫోటోలను ఆమె షేర్ చేసింది. ఇప్పుడు ఈ జంట హనీమూన్ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
వరలక్ష్మి శరత్‌కుమార్ - నికోలయ్ సచ్దేవ్ సంగీత్ వేడుకల్లో ప్రముఖులు (ఫోటోలు)
-
గ్రాండ్‌గా వరలక్ష్మి శరత్‌కుమార్ వెడ్డింగ్ రిసెప్షన్.. ప్రముఖుల సందడి (ఫోటోలు)
-
టాలీవుడ్ నటి మెహందీ వేడుక.. డ్యాన్స్‌తో ఇరగదీసిన ఆమె తండ్రి!
హనుమాన్ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ తన ప్రియుడిని పెళ్లాడబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులను కలిసిన తన పెళ్లికి ఆహ్వానించింది. టాలీవుడ్ హీరోలకు సైతం పెళ్లి పత్రికలు అందజేసింది. ఆమె వివాహా వేడుక థాయ్‌లాండ్‌లో జరుగుతోంది. జూలై 2న వీరిద్దరు మూడుముళ్ల బంధంలోకి అడుగు పెట్టనున్నారు.తాజాగా వీరి మెహందీ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఆమె తండ్రి శరత్‌కుమార్ డ్యాన్సు వేస్తూ సందడి చేశారు. మెహందీ వేదిక వద్దే అతిథులతో కలిసి శరత్‌కుమార్ డ్యాన్సుతో అలరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా.. హనుమాన్ చిత్రంలో మెరిసిన వరలక్ష్మి ఈ ఏడాది మార్చిలో ముంబైకి చెందిన గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్దేవ్తో నిశ్చితార్థం చేసుకున్నారు. View this post on Instagram A post shared by Radikaasarath_love❤️ (@virad_15) -
పెళ్లి సందడి షురూ.. ఘనంగా వరలక్ష్మి మెహందీ ఫంక్షన్ (ఫోటోలు)
-
ఏకంగా ప్రధానిని పెళ్లికి ఆహ్వానించిన నటి వరలక్ష్మి (ఫొటోలు)
-
నా పెళ్లికి రండి.. టాలీవుడ్ సెలబ్రిటీలకు వరలక్ష్మి ఆహ్వానం (ఫోటోలు)
-
సమంతను పెళ్లికి ఆహ్వానించిన హనుమాన్ నటి..!
హనుమాన్ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది. ముంబయికి చెందిన గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్దేవ్ను ఆమె వివాహం చేసుకోనున్నారు. ఇప్పటికే వీరిద్దరు ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. వచ్చేనెల 2వ తేదీన థాయ్‌లాండ్‌లో గ్రాండ్ వెడ్డింగ్‌కు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వరలక్ష్మి తన పెళ్లికి అతిథులను ఆహ్వానించే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే కోలీవుడ్ స్టార్స్ రజినీకాంత్, కమల్ హాసన్ లాంటి వాళ్లకు వెడ్డింగ్ కార్డ్స్ అందజేసి ప్రత్యేకంగా అహ్వానించారు.తాజాగా టాలీవుడ్ హీరోయిన్ సమంత, బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్‌ను తన పెళ్లికి ఆహ్వానించింది. వ్యక్తిగతంగా కలిసి వారికి ఆహ్వాన పత్రికలు అందజేసింది. తాజాగా దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది. కాగా... టాలీవుడ్లో ఇప్పటికే రవితేజ, డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు కలిసి పెళ్లికి రావాలని కోరింది. ఇటీవల తన తండ్రి శరత్‌కుమార్, రాధికాతో పాటు కోలీవుడ్ ప్రముఖులను వివాహానికి ఆహ్వానించారు. కాగా.. ఈ ఏడాది మార్చిలో వరలక్ష్మి, నికోలాయ్ల నిశ్చితార్థం జరిగింది. నికోలయ్ సచ్దేవ్తో దాదాపుగా 14 ఏళ్లుగా పరిచయం ఉన్నట్లు వరలక్ష్మి తెలిపింది. మరోవైపు సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, ధనుష్ నటిస్తోన్న రాయన్ చిత్రంలో వరలక్ష్మి కనిపించనుంది. -
నా పెళ్లికి రండి.. సెలబ్రిటీలకు వరలక్ష్మి శరత్‌కుమార్ ఆహ్వానం (ఫోటోలు)
-
'హనుమాన్' నటి పెళ్లి డేట్ ఫిక్సయిందా? ఎప్పుడంటే?
హీరోయిన్ల పెళ్లి అంటే మినిమం హడావుడి గ్యారంటీ. అలా కాకుండా ఎవరైనా చేసుకున్నారా అంటే చాలా తక్కువ మందే ఉంటారు. ఇకపోతే హీరోయిన్లలో చాలామంది ఏజ్ బార్ అయిన తర్వాతే ఏడడుగులు వేస్తుంటారు. ఈ లిస్టులోకి ఇప్పుడు 'హనుమాన్' వరలక్ష్మి శరత్ కుమార్ చేరబోతుంది. ఇదివరకే నిశ్చితార్థం చేసుకోగా, ఇప్పుడు పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టైల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసిందట.(ఇదీ చదవండి: పెళ్లి గురించి హింట్ ఇచ్చేసిన హీరోయిన్ అంజలి.. త్వరలో శుభవార్త)తమిళ నటుడు శరత్ కుమార్ వారసురాలు వరలక్ష్మీ. 2012లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు సినిమాలు చేసింది. కానీ పెద్దగా కలిసి రాలేదు. దీంతో రూట్ మార్చి క్యారెక్టర్ ఆర్టిస్టు అయింది. అప్పటి నుంచి ఈమె దశ తిరిగిపోయింది. తెలుగు, తమిళంలో వరస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. రీసెంట్గా 'హనుమాన్' మూవీతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది.39 ఏళ్లు వచ్చేసినా సరే పెళ్లికి దూరంగా ఉంటూ వచ్చింది. కానీ ఈ ఏడాది మార్చిలో నికోలాయ్ సచ్దేవ్ అనే వ్యక్తితో నిశ్చితార్థం చేసుకుని అందరికీ షాకిచ్చింది. పెళ్లి ఎప్పుడనేది మాత్రం చెప్పలేదు. ఇప్పుడు ఆ డేట్ ఫిక్స్ అయిందని, జూలై 2న థాయ్‌ల్యాండ్‌లో వివాహ వేడుక జరనుందని తెలుస్తోంది. ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టేశారని టాక్. అది అయిన తర్వాత చెన్నైలో రిసెప్షన్ ఉండనుందని సమాచారం.(ఇదీ చదవండి: పెళ్లయిన మూడు నెలలకే విడిపోతున్నారా? అసలు విషయం ఇది) -
మా గురించి మాట్లాడేందుకు మీరెవరు?: వరలక్ష్మి శరత్‌కుమార్
దక్షిణాది నటీమణుల్లో వరలక్ష్మీ శరత్‌కుమార్ రూటే వేరని చెప్పవచ్చు. ఆమె ఎంత సౌమ్యంగా మాట్లాడతారో, తేడా వస్తే అంత రఫ్‌గానూ దులిపేస్తారు. నిర్మొహమాటంగా మాట్లాడే వరలక్ష్మీశరత్‌కుమార్ ఏ భాషలోనైనా.. ఎలాంటి పాత్రనైనా నటించే సత్తా కలిగిన నటి. ఈమె తాజాగా ఉమెన్ సెంట్రిక్ పాత్రలో నటించిన బహుభాషా చిత్రం శబరి ఇటీవలే తెరపైకి వచ్చింది. మరికొన్ని చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి. కాగా ఇటీవల నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు మాట్లాడారు. ముఖ్యంగా తన గురించి మాట్లాడిన నెగిటివ్ కామెంట్స్‌పై ఫైర్ అయ్యారు.అసలు తన గురించి నెగిటివ్‌గా మాట్లాడటానికి మీరెవరు? అని వరలక్ష్మి ప్రశ్నించారు. శరత్‌కుమార్ మొదట్లో ఛాయ అనే మహిళను పెళ్లి చేసుకోవడంతో ఆమెకు వరలక్ష్మీ శరత్‌కుమార్ జన్మించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత మనస్పర్థల కారణంగా వరలక్ష్మీ తల్లిదండ్రులు విడిపోయారు. ఆ తరువాత శరత్‌కుమార్ నటి రాధికను రెండో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ రాహుల్ అనే కుమారుడు ఉన్నాడు.అయితే ప్రస్తుతం శరత్‌కుమార్ మొదటి భార్య ఛాయ, రెండో భార్య రాధిక కుటుంబాలు కలిసి మెలిసే ఉంటున్నాయి. ఇటీవల నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ ఎంగేజ్మెంట్ వేడుకలోనూ అందరూ కలిసి పాల్గొన్నారు. ఈ సంఘటన గురించి రక రకాల కామెంట్స్ దొర్లాయి. వీటిపై స్పందించిన నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ మీరు కామెంట్స్ చేసే వ్యక్తి జీవితం ఏమిటన్నది మీకు తెలుసా? తను ఉన్నత స్థాయికి చేరారంటే అందుకు పడిన కష్టం మీకు తెలుసా? ఈజీగా కామెంట్స్ మాత్రం చేస్తారు అని ఫైరయ్యారు.ఒకరి గురించి నెగిటివ్ కామెంట్స్ చేసే ముందు వారి గురించి మీకేం తెలుసో ఆలోచించుకోవాలని వరలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే నటీనటుల గురించి మీరెందుకు ఇతరులకు సాయం చేయలేదని కామెంట్ చేసేకంటే.. మీరెందుకు సాయం చేయకూడదు అని ప్రశ్నించారు. నిజం చెప్పాలంటే ప్రపంచంలోనే నటీమణులకే పారితోషికం చాలా తక్కువని అన్నారు. ఎందుకంటే తమకు ఎప్పుడు డబ్బు వస్తుందో తెలియదని.. షూటింగ్ లేకపోతే పారితోషికమే రాదని చెప్పారు. అయితే నెగిటివ్ కామెంట్స్ చేసేవారు తాము సౌకర్యవంతమైన జీవితాన్ని అనుభవిస్తుంటామని భావిస్తుంటారన్నారు.కానీ నిజానికి అలాంటి పరిస్థితిలేదని ఆమె తెలిపారు. తాము నెలకు తమ వద్ద పని చేసేవారికి జీతాలు చెల్లించాలని.. అయితే తమకు మాత్రం నెలసరి జీతాలు ఉండవన్నారు. షూటింగ్ ఉంటేనే పారితోషిక ఉంటుందని.. ఒక్కోసారి నిర్మాత ఇంట్లో ఏదైనా సమస్య తలెత్తి.. షూటింగ్ నిలిచిపోతే పారితోషికం ఆగిపోతుందన్నారు. తాము వెళ్లి అడిగే పరిస్థితి ఉండదన్నారు. అలా తమకు పారితోషికం ఎప్పుడు వస్తుందో చెప్పలేని పరిస్థితి అన్నారు. కాబట్టి తమ పని అంత సులభం కాదని నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ పేర్కొన్నారు. -
నాకు కాబోయే వాడికి ఇది రెండో పెళ్లి.. అయితే ఏంటి?: వరలక్ష్మి
వరలక్ష్మి శరత్‌కుమార్... టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ యాక్టర్‌గా మారిపోయింది. క్రాక్, నాంది, యశోద, వీరసింహారెడ్డి, కోటబొమ్మాళి పీఎస్, హనుమాన్.. ఇలా వరుసగా అన్నీ విజయాలే అందుకుంది. ఇటీవలే ఆమె ప్రధాన పాత్రలో నటించిన శబరి చిత్రం రిలీజైంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ మీడియకు ఇంటర్వ్యూ ఇచ్చిన వరలక్ష్మి తనకు కాబోయే భర్త గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది.ఆ క్వాలిటీ నచ్చింది'నికోలయ్‌కు, నాకు మధ్య అనుకోకుండా ప్రేమ పుట్టింది. అతడు నా వృత్తిని గౌరవిస్తాడు. సినిమాలు ఆపేసి ఇంట్లో కూర్చో అని ఎన్నడూ చెప్పలేదు. పైగా తను నన్ను చూసి గర్వపడతాడు. నాతో పాటు షూటింగ్‌కు వచ్చి ఖుషీ అవుతుంటాడు. నేను చేసే పనిని ఎంజాయ్ చేస్తాడు. ఆ క్వాలిటీ నాకు బాగా నచ్చింది. నా జీవితాన్ని అతడితో పంచుకోవాలనిపించింది. ఇద్దరం ఒకరికొకరం సపోర్ట్ చేసుకుంటాం.అదే ఆయన చేసే పనిఅతడు గ్యాలరిస్టు.. అంటే పెద్దపెద్ద కళాకారులు వేసే పెయింటింగ్స్‌ను కొనుక్కుంటూ అమ్ముతుంటాడు. అదే ఆయన చేసే పని! నా భర్తకు ఇదివరకే పెళ్లయిందని వార్తలు రాశారు. అది నిజమే! అయినా తనకు ఆల్రెడీ పెళ్లయితే తప్పేముంది? దీని గురించి మాట్లాడేవారికి ఒకటే చెప్తున్నా.. మీ పని మీరు చూసుకోండి.డబ్బు కోసమే పెళ్లి?అందరూ ఐశ్వర్యరాయ్, బ్రాడ్పిట్లేం కాదు. ముందు మీ ముఖాలు మీరు చూసుకోండి. మీరు ఏం అనుకుంటున్నారనేది నాకవసరమే లేదు. నా లైఫ్ నా ఇష్టం. డబ్బుల కోసమే పెళ్లి చేసుకుంటోందని కూడా అన్నారు. డబ్బు నా దగ్గర కూడా ఉంది. ఆయన దగ్గర తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. మీకు నచ్చింది అనుకోండి.. డోంట్ కేర్' అని వరలక్ష్మి శరత్‌కుమార్ చెప్పుకొచ్చింది. చదవండి: రెండు సార్లు ప్రేమలో విఫలమైన హీరో.. ఆ ఇద్దరి హీరోయిన్ల వల్లే? -
'శబరి' సినిమాలో 'అలిసిన ఊపిరి' పాట రిలీజ్
వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'శబరి'. మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించగా.. అనిల్ కాట్జ్ దర్శకత్వం వహించారు. మే 3న పాన్ ఇండియా వైడ్ థియేటర్లలో రిలీజ్ కానుంది. గత కొన్నాళ్ల నుంచి ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇందులో భాగంగా 'అలిసిన ఊపిరి...' పాటను దర్శకుడు కరుణ కుమార్ చేతుల మీదగా విడుదలైంది.(ఇదీ చదవండి: హీరోయిన్ మెహ్రీన్ షాకింగ్ డెసిషన్.. ఎగ్ ఫ్రీజింగ్ వీడియో వైరల్)'శబరి' నుంచి ఇప్పటివరకు విడుదలైన పాటల్లో తల్లి కూతుళ్ల అనుబంధం, ప్రేమను చూపిస్తే... 'అలిసిన ఊపిరి' పాటలో పోరాటానికి సిద్ధమవుతున్న వరలక్ష్మిని చూపించారు. మధ్యలో కుమార్తె కోసం అన్వేషణలో పడిన తల్లి మనసును సైతం స్పృశించారు. గోపీసుందర్ బాణీ, అనురాగ్ కులకర్ణి గాత్రం, రెహమాన్ సాహిత్యం దీనినొక మోటివేషనల్ సాంగ్ తరహాలో మార్చాయి.(ఇదీ చదవండి: అలాంటి సినిమాలే చేస్తా.. వివాదంపై స్పందించిన నయనతార) -
స్టార్ హీరోకు కూతుర్ని.. నన్నే రూమ్‌కు వస్తావా అన్నాడు: వరలక్ష్మీ శరత్ కుమార్
కోలీవుడ్ హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్ వరుస సినిమాలతో ట్రెండింగ్‌లో కొననసాగుతుంది. ఇండస్ట్రీలో ఒక ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు పొందడమే కాకుండా అందుకు తగ్గట్లుగా.. తన మాట కూడా చాలా స్ట్రైట్‌గా ఉంటుంది. తప్పు చేస్తే ఎదుట ఉన్నది ఎంతటివారైనా సరే ముక్కు సూటిగా హెచ్చరిస్తుంది. తాజాగా ఆమె నటించిన లేడీ ఓరియెంటేడ్ సినిమా 'శబరి' మే 3న విడుదల కానుంది.సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా తన గతంలో జరిగిన ఒక సంఘటన గురించి పంచుకుంది. 'ఒక అమ్మాయి ఇండస్ట్రీలో రాణించడం అంత సులభం కాదు. నాన్నకు ఇష్టం లేకున్నా నేను సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాను. నేను హీరోయిన్గా పేరుపొందుతున్న రోజుల్లో తమళనాడుకు చెందిన ఒక టీవీ ఛానల్ అధినేత నా ఇంటికి వచ్చాడు. ఒక ప్రాజెక్ట్‌లో నటించాలని కోరాడు.. అందుకు నేను కూడా ఒప్పుకున్నాను. కానీ, కొంత సమయం తర్వాత మనం మళ్లీ బయట కలుద్దామా..? అన్నాడు. ఎందుకు సార్ అని నేను అడిగిన వెంటనే.. ఏదైనా మాట్లాడుకుందాం రూమ్ బుక్ చేస్తాను కలుద్దాం అన్నాడు. ఒక స్టార్ హీరో కుటుంబానికి చెందిన నన్నే ఇలా అడిగితే మిగతా అమ్మాయిల పరిస్థితి ఏంటి అని అతని మీద కేసు పెట్టాను. ఈ సంఘటన సుమారు ఆరేళ్ల క్రితం జరిగింది. ఇలాంటి వ్యక్తుల ఆటకట్టించాలని నేను 'సేవ్ శక్తి ఫౌండేషన్' స్థాపించాను.' అని ఆమె చెప్పింది.స్టార్ హీరో కూతురిని అయనంత మాత్రాన నాకు అవకాశాలు రాలేదు.. నన్ను కూడా చాలా సినిమాల్లో నుంచి తొలగించారు. కొంతమంది కమిట్మెంట్ అడగడం వల్ల చాలా సినిమాలను వదులుకోవాల్సి కూడా వచ్చిందని వరలక్ష్మీ తెలిపింది. సేవ్ శక్తి ఫౌండేషన్ ద్వారా చాలామంది ఆడబిడ్డలను రక్షించామని ఆమె చెప్పింది. ఎలాంటి ఆపద అయినా సరే తమ ఫౌండేషన్‌లోకి వచ్చి సాయం అడిగితే తప్పకుండా జరుగుతుందని ఆమె పేర్కొంది.