Arvind
-
ఆరో రౌండ్లో అరవింద్ చేతిలో అర్జున్ ఓటమి
చెన్నై గ్రాండ్‌మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో భారత నంబర్‌వన్, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్‌కు తొలి ఓటమి ఎదురైంది. చెన్నైలో జరుగుతున్న ఈ టోర్నీలో ఆదివారం జరిగిన ఆరో రౌండ్ గేమ్‌లో అర్జున్ 48 ఎత్తుల్లో భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ అరవింద్ చిదంబరం చేతిలో అనూహ్యంగా ఓడిపోయాడు. అరవింద్ చేతిలో ఓటమితో అర్జున్ లైవ్ ర్యాంకింగ్స్‌లో 2801.8 పాయింట్లతో ప్రపంచ రెండో ర్యాంక్ నుంచి నాలుగో ర్యాంక్‌కు పడిపోవడం గమనార్హం. అమీన్–పర్హామ్ (ఇరాన్) మధ్య గేమ్ 37 ఎత్తుల్లో...మాక్సిమి వాచిర్ లాగ్రెవ్ (ఫ్రాన్స్)–అలెక్సీ సరానా (సెర్బియా) మధ్య గేమ్ 31 ఎత్తుల్లో... అరోనియన్ (అమెరికా)–విదిత్ (భారత్) మధ్య గేమ్ 64 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిశాయి. ఎనిమిది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య ఏడు రౌండ్లపాటు ఈ టోర్నీ జరుగుతోంది. ఆరో రౌండ్ తర్వాత అర్జున్, అరోనియన్ 4 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలోఉన్నారు. అరవింద్, అమీన్ 3.5 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. ఈరోజు జరిగే చివరిదైన ఏడో రౌండ్ గేముల్లో లాగ్రెవ్‌తో అర్జున్; అరోనియన్‌తో అమీన్; విదిత్‌తో అలెక్సీ; పర్హామ్తో అరవింద్ తలపడతారు. -
తెలంగాణ బీజేపీ అధ్యక్షపదవి.. ఎంపీ అర్వింద్ కీలక వ్యాఖ్యలు
సాక్షి,న్యూఢిల్లీ: తెలంగాణలో బీజేపీని అధికారంలో తెచ్చే వారికే అధ్యక్ష పదవి ఇవ్వాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ఈ విషయమై శుక్రవారం(ఆగస్టు2) ఢిల్లీలో అర్వింద్ మీడియాతో మాాట్లాడారు. నాకు సమర్థత ఉందని నేను అనుకుంటున్నా. కానీ అధిష్టానం గుర్తించాలి. రుణమాఫీ మొత్తం పూర్తయ్యే వరకు ఆగి మాట్లాడితే బాగుంటుంది. కేసీఆర్ పాలనలో అసెంబ్లీ జరగలేదు. ఇప్పుడు అసెంబ్లీలో అందరూ మాట్లాడుతున్నారు.గతంలో కొందరు కన్ను మిన్ను కానకుండా మాట్లాడారు. రేవంత్ రెడ్డిని అనేకసార్లు కేసీఆర్ జైల్లో పెట్టారు. రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఎందుకు కేసీఆర్‌పై చర్యలు తీసుకోవడం లేదు అని అర్వింద్ ప్రశ్నించారు. -
ఎమ్మెల్యే ఇంట్లోనే నన్ను తీవ్రంగా కొట్టారు
గుంటూరు: నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్‌బాబు గృహంలోనే తనపై మారణాయుధాలతో దాడిచేశారని ఆ పార్టీ కార్యకర్త అల్లూరి హరికృష్ణ తెలిపారు. తీవ్రంగా గాయపడిన తనకు కనీసం తాగేందుకు మంచినీళ్లు కూడా ఇవ్వకుండా ఎమ్మెల్యే బయటకు నెట్టేశారని చెప్పారు. 4న నరసరావుపేటలోని ఎమ్మెల్యే అరవింద్‌బాబు గృహంలో తెలుగు తమ్ముళ్లు వర్గాలుగా విడిపోయి తన్నుకున్నారు. ఈ ఘర్షణలో తీవ్రంగా గాయపడిన హరికృష్ణ నరసరావుపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన నుంచి శుక్రవారం రాత్రి వన్‌టౌన్ పోలీసులు ఫిర్యాదు స్వీకరించి 43మందిపై కేసు నమోదు చేశారు.హరికృష్ణ శనివారం ఆస్పత్రిలో మీడియాతో మాట్లాడారు. ‘నా సొంత ఊరు నరసరావుపేట మండలం ఇసప్పాలెం. నరసరావుపేట శ్రీనివాసనగర్‌లో ఉంటూ పల్నాడు రోడ్డులో బ్లడ్ బ్యాంకు నిర్వహిస్తున్నాను. 4న సాయంత్రం ఎమ్మెల్యేతో డీఎంహెచ్‌వోకు ఒక ఫోన్ చేయించుకోవాలనే ఉద్దేశంతో ప్రకాష్‌నగర్‌లోని ఆయన ఇంటికి వెళ్లగా... ప్రసాద్, సురేష్, సాయి, రాజేష్, అంకమ్మరాజు, కాళీ, ప్రేమ్‌కుమార్, నవీన్, బొట్టు సాయితోపాటు మరో 40మంది కర్రలు, కత్తులు, ఇనపరాడ్లు పట్టుకుని బైక్‌లపై ఎమ్మెల్యే గృహంలోకి వచ్చి పూలకుండీలు, కురీ్చలు పగలగొట్టారు.అక్కడే నిలబడి ఉన్న నాపై మారణాయుధాలతో దాడి చేయడంతో నా ఎడమ చేయి మోచేతి కిందభాగంలో ఎముక విరిగింది. తల, వీపుపై గాయాలయ్యాయి. అక్కడకు వచ్చిన వారిలో సురేష్ అనే వ్యక్తి నన్ను గుర్తుపట్టి తెలిసినవాడే అనడంతో వదిలేశారు. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యేను తీవ్రంగా గాయపడిన నేను తాగేందుకు మంచినీళ్లు ఇవ్వాలని అడిగితే బయటకు నెట్టివేసి లోపలికి వెళ్లిపోయారు. మా గ్రామం టీడీపీకి కంచుకోట. నేను కూడా అరవిందబాబు గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశా. అయినా నాకు తాగేందుకు మంచినీళ్లు ఇవ్వలేదు. రెండు రోజులుగా ఆస్పత్రిలో ఉన్నా పరామర్శించేందుకు కూడా ఎమ్మెల్యే రాలేదు.’ అని చెప్పారు. -
ఆకాశమే హద్దుగా..
దేవరకొండ : శ్రమ నీ ఆయుధం అయితే.. విజయం నీ బానిస అవుతుందన్న మాటను వంట బట్టిచ్చుకున్నాడు ఆ యువకుడు. అందరిలా కాకుండా తాను తనలో ఉన్న నైపుణ్యానికి పదును పెట్టి అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు. చిన్నప్పుడే తన తండ్రి దూరమైనా ఏ మాత్రం తన ఆత్మ విశ్వాసాన్ని కోల్పోకుండా 24 ఏళ్ల వయస్సులోనే లెఫ్టినెంట్ పైలెట్ హోదా దక్కించుకొని తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు దేవరకొండ మండలం ఉమ్మడి ముదిగొండ గ్రామం సీతారాంతండాకు చెందిన కొర్ర కుమార్–బుజ్జి దంపతుల మొదటి కుమారుడు అరవింద్ చౌహాన్. శనివారం హైదరాబాద్ దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో నిర్వహించిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ ఫ్లయింగ్ ఆఫీసర్ల పాసింగ్ ఔట్ పరేడ్‌లో అరవింద్ చౌహాన్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఆఫ్ ఇండియా ఎయిర్ ఫోర్స్ విఆర్.చౌదరి చేతుల మీదుగా ఆయన లెఫ్టినెంట్ పైలెట్ హోదా పొందారు. దీంతో గ్రామస్తులు అరవింద్‌ను అభినందిస్తున్నారు.అంచెలంచెలుగా ఎదిగి..అరవింద్ చౌహాన్ 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు దేవరకొండలో పూర్తి చేశారు. 2013లో కోరుకొండ సైనిక్ స్కూల్లో సీటు సంపాదించాడు. 2016లో యూపీఎస్సీ ఆల్ ఇండియా స్థాయిలో నిర్వహించిన నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్డీయే) పరీక్షలో 175వ ర్యాంకు సాధించాడు. అనంతరం మూడేళ్లు పూణేలో శిక్షణ పొందుతూనే బీటెక్ పూర్తి చేశాడు. అనంతరం నావల్ అకాడమీలో శిక్షణ తీసుకొని 2021మేలో ఇండియన్ నేవీలో సబ్ లెఫ్టినెంట్‌గా ఎంపికయ్యాడు. అనంతరం ఇటీవల ఇండియన్ ఏవియేషన్ బ్రాంచిలో నిర్వహించిన పరీక్షలో ఆయన పైలెట్‌గా ఎంపికై లెఫ్టినెంట్ హోదా పొందారు. అరవింద్‌కు 12 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడే తండ్రి దూరమైనా తల్లి అన్నీ తానై చదివించింది. వారికి కుటుంబ సభ్యులైన బాబాయి విజయ్, మేనమామలు నేనావత్ రంగానాయక్, నేనావత్ జైపాల్ తోడ్పాటు అందించారు.పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చుయువత పట్టుదలతో సాధించలేనిది ఏమిలేదు. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి నేడు నేను ఈ స్థాయిలో నిలబడ్డాను. ఇందుకు నా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎనలేనిది. దేవరకొండ ప్రాంతానికి చెందిన యువత ఇండియన్ ఆర్మీ, నేవి, ఎయిర్ ఫోర్స్ వంటి ఉద్యోగాలపై దృష్టి సారించాలి. దేశానికి ఎంతో కొంత సేవ చేయాలన్న తలంపుతో యువత ముందుకు రావాలి. – అరవింద్ చౌహాన్ -
ప్రాణం తీసిన ఒక్క రూపాయి
ఖిలా వరంగల్: వరంగల్‌లో దారుణం జరిగింది. ‘ఆ్రఫ్టాల్ నువ్వు ఒక ఆటోడ్రైవర్వు. ఒక్క రూపాయి ఎక్కువ కొట్టే మొగోడివా’..? అంటూ ఇద్దరి మధ్య జరిగిన చిన్న ఘర్షణ చివరికి ఒకరి ప్రాణం తీసింది. శనివారం వరంగల్ క్రిస్టియన్ కాలనీ గాం«దీనగర్‌లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ మిల్స్‌కాలనీ గరీబ్‌నగర్ గొర్రెకుంటకు చెందిన ఇసంపెల్లి ప్రేమ్‌సాగర్ (38) ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో ప్రేమ్‌సాగర్ గాందీనగర్‌లోని ‘నబీ రూ.59కే చికెన్ బిర్యానీ’సెంటర్‌కు వెళ్లాడు. ఆదే సమయంలో గాందీనగర్‌కు చెందిన జన్ను అరవింద్ అక్కడికి చేరుకున్నాడు. ఇద్దరు స్నేహితులే. ఈ క్రమంలో ప్రేమ్‌సాగర్ బిర్యానీ తీసుకుని రూ.59కి బదులు రూ.60 ఫోన్‌పే ద్వారా చెల్లించాడు. పక్కనే ఉన్న అరవింద్ దీనిపై స్పందించి.. ‘ఒక్క రూపాయి ఎక్కువ కొట్టే మొగోడివి అయ్యావా’అంటూ ప్రేమ్‌సాగర్‌ను హేళన చేస్తూ మాట్లాడాడు. దీంతో ప్రేమ్‌సాగర్ ఒక్కసారిగా ఆవేశానికిలోనై ‘నేను ఏమైనా అడుక్కు తింటున్నానా.. ఏం మాట్లాడుతున్నావు’అంటూ అరవింద్‌ను నిలదీశాడు. మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. తోపులాటలో అరవింద్, బలంగా ప్రేమ్‌సాగర్‌ను నెట్టివేయగా రోడ్డుపై పడిపోయాడు. దీంతో అతని తలకు బలమైన గాయమై చిన్నమెదడు చిట్లి ముక్కు, చెవుల్లోనుంచి రక్తస్రావం కావడంతో స్పృహ కోల్పోయాడు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న ప్రేమ్‌సాగర్ తమ్ముడు విద్యాసాగర్‌తోపాటు అరవింద్ కలసి ఆటోలో ప్రేమ్‌సాగర్‌ను ఎంజీఎంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 1 గంట సమయంలో ప్రేమ్‌సాగర్ మృతిచెందాడు. వెంటనే అరవింద్ ఎంజీఎం నుంచి నేరుగా మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పోలీసులకు లొంగిపోయాడు. మృతుడి సోదరుడు విద్యాసాగర్ ఫిర్యాదు మేరకు శనివారం అరవింద్‌పై హత్యా నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ మల్లయ్య తెలిపారు. -
బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థి ఆత్మహత్య
భైంసా: బాసర ట్రిపుల్‌ఐటీలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పీయూసీ–2 చదువుతున్న బుచ్చుక అరవింద్ హాస్టల్ గదిలో మంగళవా రం ఉరివేసుకున్నాడు. సిద్ది పేట జిల్లా తొగుట మండలం బండారుపల్లి గ్రామానికి చెందిన అరవింద్ ఇటీవలే ఇంటికి వెళ్లి ఈ నెల 12న క్యాంపస్‌కు తిరిగివచ్చాడు. హాజరుశాతం తక్కువగా ఉందని అరవింద్‌ను అధికారులు పరీక్షకు అనుమతించలేదని సమాచారం. దీంతో మన స్తాపం చెందిన అరవింద్..తోటి విద్యార్థులు పరీక్షకు వెళ్లిన కొద్దిసేపటికే ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని నిర్మల్ ఆస్పత్రికి తరలించారు. మృతికి కళాశాల యాజమాన్యమే కారణం తొగుట(దుబ్బాక): తమ కుమారుడు ఆత్మహత్యకు కళాశాల యాజమాన్యమే కారణమని అరవింద్ తల్లిదండ్రులు ఆరోపించారు. అరవింద్‌కు నాలుగు నెలల క్రితం డెంగీ సోకిందని, చికిత్స చేయించుకొని తిరిగి కళాశాలకు వెళ్లాడని వారు చెప్పారు. అయితే హాజరుశాతం తక్కువగా ఉందని, పరీక్షలకు అనుమతించమని చెప్పారని, దీంతో ఫీజు కట్టడానికి తాను డబ్బులు పంపామన్నారు. అయినా తమ కుమారుడిని పరీక్షలకు అనుమతించకపోవడంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్టు వారు కన్నీటిపర్యంతమయ్యారు. ఐదు నెలల్లో ముగ్గురు ♦ బాసర ఆర్జీయూకేటీలో గడిచిన ఐదునెలల్లో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ♦ 2023, నవంబర్ 25న నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన ప్రవీణ్‌కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. ∙2024, ఫిబ్రవరి 22న రంగారెడ్డి జిల్లాకు చెందిన టి.శిరీష ఆత్మహత్య చేసుకుంది. ♦ తాజాగా అరవింద్ ఆత్మహత్య చేసుకున్నాడు. ♦ 2023–24 విద్యాసంవత్సరంలో ఆర్జీయూకేటీలో మొత్తం ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా బాసరలోనే ఎక్కువ మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. క్యాంపస్‌లో ఉండే అధికారులు విద్యార్థుల మానసిక పరిస్థితిని అంచనా వేయలేకపోతున్నారు. 9 వేల మంది విద్యార్థులు చదివే క్యాంపస్‌లో విద్యార్థుల భవిష్యత్‌పై దృష్టి సారించాలని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు. -
పసుపుబోర్డు ఎక్కడుందో చెప్పాలి.. : ఎంపీ బాజిరెడ్డి
నిజామాబాద్: ‘పసుపు బోర్డు తెచ్చానని గొప్పలు చెప్పడం కాదని.. జిల్లాలో బోర్డు ఎక్కడ ఏర్పాటు చేశారో ఎంపీ అర్వింద్ చూపించాలని.. నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఎంపీకి అహంకారంతో ఉన్నారని.. నిజాంషుగర్ ఫ్యాక్టరీ పేరిట మరోసారి బాండ్ పేపర్ డ్రామా ఆడుతున్నారన్నారని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు అర్వింద్‌ను కచ్చితంగా ఓడిస్తారన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో బాజిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ మధ్యే పోటీ ఉంటుందని, కాంగ్రెస్ మూడోస్థానానికి పరిమితం అవుతుందన్నారు. పసుపుబోర్డు పేరుతో ఇప్పటికే ఎంపీ అర్వింద్ ప్రజలను మోసం చేశారన్నారు. ఆయన ఎంపీ కాకముందే పసుపు క్వింటాలుకు రూ. 17వేలు ధర పలికిందన్నారు. పసుపు దిగుబడి తగ్గినందునే ధర పెరిగిందన్నారు. గత ఐదేళ్లలో ఎంపీ అర్వింద్ అహంకారంతో నడుచుకున్నారని.. ఆయన ఓటమి ఖాయమన్నారు. కేంద్రంలో మోదీ గెలవాలని కానీ.. అర్వింద్, బండి సంజయ్ లాంటి వాళ్లు ఓడిపోవాలని ప్రజలు భావిస్తున్నారన్నారు. సీఎం రేవంత్ హామీలు అమలు చేయడం లేదు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్నారని బాజిరెడ్డి విమర్శించారు. రుణమాఫీ చేయలేదని, రైతుబంధు ఇవ్వలేదని, కల్యాణలక్ష్మికి అదనంగా తులం బంగారం హామీలు ఇచ్చి మోసం చేశారన్నారు. అధికారంలో ఉండి కూడా అబద్ధాలు ఆడుతున్నారన్నారు. తాను ఎంపీగా గెలిచి ప్రశ్నించే గొంతునవుతానని పేర్కొన్నారు. బీఆర్ఎస్కు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ఇవి చదవండి: తర్జన భర్జన! తెరపైకి రోజుకో పేరు.. -
దొరల పాలనను అంతం చేయాలి! : ఎంపీ ధర్మపురి అర్వింద్
నిజామాబాద్: తెలంగాణలో కొనసాగుతున్న దొరల పాలనను అంతం చేయాలని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. మండలంలోని రామడుగు గ్రామంలో రూరల్ బీజేపీ అభ్యర్థి కులాచారి దినేశ్‌కు మద్దతుగా శుక్రవారం ప్రచారం నిర్వహించారు. కేసీఆర్ పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి దోచుకున్న వాళ్లను ప్రజలు ఓటుతో జవాబు చెప్పి బుద్ధి చెప్పాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని అని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. 75 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క బీసీ ముఖ్యమంత్రి దొరకలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన బీసీ డిక్లరేషన్ అరచేతిలో వైకుంఠంలాగా ఉందని, మరోసారి బీసీలకు అన్యాయం చేయడానికి రేవంత్ కుట్రపన్నారని పేర్కొన్నారు. ప్రచారంలో నాయకులు గద్దె భూమన్న, రాజేశ్వర్, కర్క గంగారెడ్డి, రామస్వామి, గంగాదాస్ తదితరులు పాల్గొన్నారు. ఇవి కూడా చదవండి: వ్యూహాలకు పదును! ప్రచారానికి మిగిలింది 11 రోజులే.. -
రేవంత్ కంటే కేసీఆరే మంచోడు: ఎంపీ అర్వింద్
సాక్షి, మెట్పల్లి: జగిత్యాల జిల్లా మెట్పల్లిలో నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఆదివారం ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కంటే సీఎం కేసీఆరే మంచోడని అర్వింద్ అన్నారు. రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలో హంగ్ ప్రభుత్వం రానుందని జోస్యం చెప్పారు. ప్రస్తుతం ఎంపీగా ఉన్న ధర్మపురి అర్వింద్ కోరుట్ల నుంచి బీజేపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కోరుట్లలో అర్వింద్ ఇప్పటికే ప్రచారం ప్రారంభించి దూసుకుపోతున్నారు. ఇంట్రస్టింగ్ కామెంట్లతో పాటు తిట్లతో ప్రత్యర్థులపై విరుచుకుపడే అర్వింద్ రేవంత్ కంటే కేసీఆర్ మంచోడని అనడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ పోరు ప్రధానంగా బీఆర్ఎస్, కాంగగ్రెస్ మధ్య జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిని దృష్టిలో ఉంచుకునే రేవంత్ కంటే కేసీఆర్ బెటరని అర్వింద్ అన్నట్లు తెలుస్తోంది. -
రిలయన్స్ రిటైల్ చేతికి అరవింద్ బ్యూటీ బ్రాండ్స్
న్యూఢిల్లీ: వేగంగా వృద్ధి చెందుతున్న సౌందర్య, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల (బీపీసీ) వ్యాపార కార్యకలాపాలను మరింతగా విస్తరించడంపై రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్ఆర్వీఎల్) దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా అరవింద్ ఫ్యాషన్‌కి చెందిన అరవింద్ బ్యూటీ బ్రాండ్స్ రిటైల్‌ను కొనుగోలు చేస్తోంది. ఇందుకు సంబంధించి ఆర్ఆర్వీఎల్ అనుబంధ సంస్థ రిలయన్స్ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్‌తో షేర్ల కొనుగోలు ఒప్పందం (ఎస్పీఏ) కుదిరినట్లు అరవింద్ ఫ్యాషన్ వెల్లడించింది. ఈక్విటీ వాటా విక్రయ విలువ రూ. 99.02 కోట్లుగా ఉండనున్నట్లు పేర్కొంది. చెల్లించాల్సిన రుణాలు, ఈక్విటీ అంతా కలిపి సంస్థ మొత్తం విలువను రూ. 216 కోట్లుగా లెక్కగట్టినట్లు వివరించింది. డీల్‌లో భాగంగా అరవింద్ ఫ్యాషన్స్ నిర్వహిస్తున్న ఫ్రాన్స్ బ్యూటీ రిటైల్ బ్రాండ్ సెఫోరాకు భారత్‌లో ఉన్న 26 స్టోర్స్ కూడా ఆర్‌ఆర్‌వీఎల్‌కు దక్కుతాయి. ఇకపై తాము పూర్తిగా ఫ్యాషన్ (యూఎస్ పోలో, యారో మొదలైన 5 బ్రాండ్స్) పైనే దృష్టి పెట్టనున్నట్లు అరవింద్ ఫ్యాషన్స్ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో అరవింద్ బ్యూటీ బ్రాండ్స్ రిటైల్ టర్నోవరు రూ. 336.70 కోట్లుగా నమోదైంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్‌లోని రిటైల్ కంపెనీలన్నింటికీ ఆర్ఆర్వీఎల్ హోల్డింగ్ సంస్థగా ఉంది. బ్యూటీ రిటైల్ ప్లాట్‌ఫాం ’టిరా’ కొనుగోలుతో సౌందర్య సాధనాల వ్యాపారంలోకి ప్రవేశించింది. నైకా, టాటా, హిందుస్తాన్ యూనిలీవర్‌కి చెందిన లాక్మే మొదలైన దిగ్గజ బ్రాండ్స్‌తో పోటీపడుతోంది. రెడ్‌సీర్ స్ట్రాటెజీ కన్సల్టెంట్, పీక్ 15 సంయుక్త నివేదిక ప్రకారం 2022లో 19 బిలియన్ డాలర్లుగా ఉన్న దేశీ సౌందర్య, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల మార్కెట్ 2027 నాటికి 30 బిలియన్ డాలర్లకు చేరనుంది. -
TS Election 2023: ఎన్నికల్లో ఒక్క రూపాయి పంచం.. : ఎంపీ అర్వింద్
సాక్షి, కరీంనగర్: ‘ఎన్నికల్లో ఓటర్లకు బీజేపీ తరఫున ఒక్క రూపాయి పంచబోము.. కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గం తెలంగాణలో ఆదర్శ రాజకీయాలకు.. పెనుమార్పులకు వేదిక అవుతోంది’ అని కోరుట్ల బీజేపీ అభ్యర్థి, నిజామాబాద్ ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో శుక్రవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. మోదీ కోరుకున్న ఆదర్శపాలనకు కోరుట్ల కేంద్రంగా మారబోతుందన్నారు. సీఎం కేసీఆర్ నుంచి కోరుట్ల సెగ్మెంట్లోని కల్వకుంట్ల కుటుంబం దాకా..పెరిగిన అహంకారాన్ని వంచుతానన్నారు. కేజీ టు పీజీ ఉచిత విద్య అని కేసీఆర్ గొప్పలు చెబుతుంటే రాష్ట్రం అక్షరాస్యతలో 31వ స్థానంలో ఎందుకు ఉందని ప్రశ్నించారు. తెలంగాణ యూనివర్సిటీ షికాగోలా మార్చుతానని చెప్పిన కవిత ఇప్పుడేం సమాధానం చెబుతుందని అడిగారు. మోదీ ప్రభుత్వం వరి, పసుపు, మొక్కజొన్న పంటలకు మద్దతు ధరలు పెంచితే రాష్ట్ర ప్రభుత్వం తరుగు పేరిట రైతులను ఇబ్బందులు పాలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షల కోట్ల అవినీతి జరిగినందుకే మూడేళ్లకే మేడిగడ్డ వంతెన కుంగిందని.. పూర్తిస్థాయి విచారణ నివేదిక వచ్చిన తరువాత ఒక్కొక్కరి సంగతి చెబుతామన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే కోరుట్ల అసెంబ్లీ సెగ్మెంట్ క్లీన్ గవర్నమెంట్‌కు ప్రతీకగా మారుతుందన్నారు. కాంట్రాక్టర్లు, పోలీసులు, వ్యాపారులు ఎవరికి అప్పనంగా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉండబోదని స్పష్టం చేశారు. ఆరోగ్య తెలంగాణ పేరు చెప్పి కంటి వెలుగు అద్దాల్లో కమీషన్లు దండుకుంటున్న ఘనత కేసీఆర్ కుటుంబానికే దక్కుతుందన్నారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకోవడం లేదన్నారు. కొంత మంది బీఆర్ఎస్ బ్రోకర్లు నన్ను నాన్‌లోకల్ అంటున్నారని.. కేసీఆర్ కొడుకు కేటీఆర్‌కు సిరిసిల్ల లోకల్ అయితే.. రాష్ట్ర రాజకీయాలను శాసించిన డీఎస్ కొడుకు అర్వింద్‌కు కోరుట్ల ఎలా నాన్‌లోకల్ అవుతుందని ప్రశ్నించారు. కోరుట్లలో పుట్టిన నాకు కోరుట్ల సొంత సెగ్మెంట్గానే ఉంటుందన్నారు. జగిత్యాలలో బోగ శ్రావణిని గెలిపించే బాధ్యత తనదేనన్నారు. రానున్న కాలంలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల ఆయన అనుచరులు అవినీతి చిట్టా విప్పుతామన్నారు. బీజేపీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు మోరపల్లి సత్యనారాయణ, జగిత్యాల బీఆర్ఎస్ అభ్యర్థి శ్రావణి, నాయకులు సురభి నవీన్, జేఎన్ వెంకట్, డాక్టర్ రఘు, రాజశేఖర్, సుఖేందర్‌గౌడ్ తదితరులున్నారు. -
ఎమ్మెల్సీ కవిత 'వర్సెస్' ఎంపీ అర్వింద్.. మాటల యుద్ధం కాస్త ఫ్లెక్సీల వార్ దాకా..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: 'ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత, ఎంపీ అర్వింద్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. కోరుట్ల నుంచి బీజేపీ తరుపున పోటీ చేస్తున్న ఎంపీ అర్వింద్‌ను బీఆర్ఎస్ కార్యకర్తలు కచ్చితంగా ఓడించనున్నట్లు కవిత వ్యాఖ్యానించారు. కేటీఆర్, కవిత కారణంగానే బీఆర్ఎస్ ఓడనుందని ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు. ఆకుల లలితను ప్రత్యర్థి పార్టీలోకి పంపి కోవర్టు ఆపరేషన్ చేసేందుకు కవిత స్కెచ్ వేశారని ఆరోపించారు.' శాసనసభ ఎన్నికల ప్రచారం స్పీడందుకుంటున్న కొద్దీ నేతల మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. నువ్వా నేనా అనే విధంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్సీ కవిత మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గత పార్లమెంట్ ఎన్నిక ల్లో కవితపై అర్వింద్ విజయం సాధించినప్పటి నుంచీ ఈపోరు నడుస్తూనే వస్తోంది. పసుపు బోర్డు అంశంపై అర్వింద్, కవితతోపాటు ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు సైతం పోటాపోటీ మాటలతో పాటు ఫ్లెక్సీల వార్‌కు దిగారు. మీరొక ఫ్లెక్సీ పెడితే మేము పది ఫ్లెక్సీలు పెడతాం అన్న రీతిలో ఈ వార్ నడిచింది. మాటల యుద్ధం మాత్రం ఎప్పటికప్పుడు కొనసాగుతూనే వచ్చింది. ఇదిలా ఉండగా తాజాగా ఎన్నికల నేపథ్యంలో ఈ మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. ఇది రానురాను మరింత పెరుగుతోంది. కోరుట్ల నుంచి బీజేపీ తరుపున పోటీ చేస్తున్న ఎంపీ అర్వింద్‌ను బీఆర్ఎస్ కార్యకర్తలు కచ్చితంగా ఓడించనున్నట్లు కవిత తాజాగా వ్యాఖ్యానించారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని అన్ని సెగ్మెంట్లలో తిరిగి బీజేపీ, కాంగ్రెస్‌లను ఓడిస్తామన్నారు. మరోవైపు అర్వింద్ మాత్రం బీఆర్ఎస్పై మాటల దాడిని తీవ్రతరం చేశారు. కవిత ప్రచారం చేస్తే బీజేపీకి మరింత మెజారిటీ వస్తుందని అర్వింద్ అన్నారు. బీఆర్‌స్‌కు కార్యకర్తలే ఓట్లు వేయరన్నారు. ఆకుల లలితను ప్రత్యర్థి పార్టీలోకి పంపి కోవర్టు ఆపరేషన్ చేసేందుకు కవిత స్కెచ్ వేశారన్నారు. కేటీఆర్, కవిత కారణంగానే బీఆర్ఎస్ ఓడనుందన్నారు. అభద్రతా భావంతో ఉన్న బీఆర్ఎస్ హిందువులను కులాల వారీగా విభజిస్తోందన్నారు. ఎక్కడా గెలవలేని కవిత ఎమ్మెల్సీ పదవి తీసుకున్నారన్నారు. అలాంటి కవిత వేరేవాళ్లను ఎలా గెలిపిస్తుందని అర్వింద్ అన్నారు. పైడి అంటే ఫ్లవర్ కాదు.. ఫైర్.. ఆర్మూర్ నియోజకవర్గంలో త్రిముఖ పోరు నెలకొంది. సిట్టింగ్ అభ్యర్థి జీవన్‌రెడ్డి ఇప్పటికే ఒక విడత ప్రచారం పూర్తి చేశారు. కులసంఘాల వారీగా ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే బీజేపీ అభ్యర్థి పైడి రాకేష్‌రెడ్డి మాత్రం జీవన్‌రెడ్డిపై మాటల దాడి చేస్తున్నారు. పైడి అంటే ఫ్లవర్ కాదు.. ఫైర్ అని చెబుతున్నారు. జీవన్‌రెడ్డి సర్పంచ్‌లను బెదిరించినట్లు నన్ను బెదిరించాలంటే సాధ్యం కాదన్నారు. తాను గెలిస్తే జీవన్ మాల్ లీజ్‌ను రద్దు చేస్తానని చెబుతున్నారు. ఫాంహౌజ్, పైరవీల ధ్యాస జీవన్రెడ్డిదన్నారు. ఆర్మూర్ అంబేద్కర్ సెంటర్లో లైవ్ చర్చకు రావాలని రాకేష్‌రెడ్డి సవాల్ విసిరారు. ఆస్తుల చిట్టా బహిర్గతం చేసుకుందామన్నారు. ఎవరేమిటో తేల్చుకుందామన్నారు. నిజామాబాద్ అర్బన్‌లో బీఆర్ఎస్ అ భ్యర్థి గణేష్‌గుప్తా, బీజేపీ అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ సైతం మెల్లగా మాటల దాడి పెంచుతున్నారు. ఇవి చదవండి: 'ఓటు' ను కొన్ని సమయాల్లో వేరే పేర్లతో పిలుస్తారు.. అవేంటో తెలుసా..!? -
వ్యక్తిగత విషయాలపై ఇంత విషమా..!
జగిత్యాలటౌన్: ‘తెలంగాణ ప్రజలకు ఒక విజ్ఞప్తి. ఆడబిడ్డనైన నన్ను నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అన్న మాటలు మీ ఆడబిడ్డలను అంటే మీకు సమ్మతమేనా..? నేను రాజకీయాల్లో ఉన్నా కాబట్టి నన్ను ఏమన్నా ఒప్పుకుందా మా..? తెలంగాణలో ఇలాంటి రాజకీయాలను అనుమతిద్దామా..? ’అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర భావోద్వేగంతో ప్రశ్నించారు. ఈ మేరకు కవిత ఒక ప్రకటన విడుదల చేశారు. నిజామాబాద్‌లో తాను ఓడిపోయాక, గెలిచిన వారికి పనిచేసే అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో మౌనంగా ఉంటున్నానని, గెలిచిన వ్యక్తి బాధ్యతలు విస్మరించి ఇష్టమొచ్చినట్లు వ్యక్తి గతంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘నువ్వు చచ్చిపోతే 20 లక్షలు ఇస్తా.. మీ అన్న చచ్చిపోతే పది లక్షలిస్తా.. మీ నాన్న ఇట్లా..’ అంటూ అర్వింద్ మాట్లాడటం.. ఇటువంటి భాషను ప్రయోగించడం ఎంతవరకు కరెక్టో ప్రజలు ఆలోచించాలని కవిత విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఉద్యమం తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు కూడా ఆంధ్రాపాలకులపై మన నేతలు ఇలా అమర్యా దగా మాట్లాడలేదని గుర్తుచేశా రు. అలాంటి మర్యాదకరమైన రాజకీయాలు ఇప్పుడూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. కక్షలకు తెలంగాణలో తావులేదని స్పష్టం చేశారు. ఇలా అడ్డగోలుగా మాట్లాడేవాళ్లు ఉంటారనే అడబిడ్డలను ఉద్యోగాలకు పంపించడానికి తల్లిదండ్రులు సంకోచించే పరిస్థితి ఉందన్నారు. మరీ ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చే ఆడబిడ్డలకు ఏం సందేశం ఇస్తున్నట్లని ప్రశ్నించారు. -
నిజాం షుగర్సే ప్రధాన ప్రచారాస్త్రం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: పసుపు బోర్డు అంశం తరహాలోనే నిజాం షుగర్ ఫ్యాక్టరీల అంశం ఉత్తర తెలంగాణలో రాజకీయ పార్టీలకు ప్రధాన ప్రచారా స్త్రం కానుంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఇందూరు కు పసుపు బోర్డు తీసుకొస్తానని బాండ్ పేపర్ రాసి చ్చిన ధర్మపురి అర్వింద్ అనూహ్యంగా విజయం సాధించారు. ఈనెల 3న ప్రధాని మోదీ ఇక్కడకు వచ్చి పసుపు బోర్డు ఇస్తున్నట్లు ప్రకటించారు. దీంతో బీజేపీకి ఆదరణ పెరిగింది. ఇదే తరహాలో ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీలను తెరి పించడం, చెరుకు పంట విస్తీర్ణాన్ని పెంచడమనే అంశాన్ని ఎజెండాగా తీసుకుని మరొక బాండ్ రాసి చ్చేందుకు అర్వింద్ రంగం సిద్ధంచేస్తున్నారు. ని జాం షుగర్ ఫ్యాక్టరీలు ఉమ్మడి నిజామాబాద్ (బో ధన్), ఉమ్మడి కరీంనగర్ (జగిత్యాల జిల్లా ముత్యంపేట), ఉమ్మడి మెదక్ (ముంబోజిపల్లి) జిల్లాల్లో ఉన్నాయి. దీంతో బీజేపీ ఎంపీ అర్వింద్ పార్టీ అధినాయకత్వం, కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లా డి తగిన కార్యాచరణ సిద్ధం చే స్తున్నారు. ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని చెరుకు పాలసీని స్టడీ చేస్తున్నారు. యూపీలో మాదిరిగా చెరుకు పంట సాగుతో పాటు దాన్ని రెగ్యులేట్ చేసేందుకు షు గర్, బ్రౌన్ షుగర్, ఇథనాల్ అనే మూడు ఉత్పత్తుల తయారీకి ప్లాన్ చేస్తున్నారు. చెరుకుకు మద్దతు ధర ఇస్తున్న నేపథ్యంలో పశ్చిమ దేశాలతో పోలిస్తే భారత్‌లో ఉత్పాదక ఖర్చు 30 శాతం ఎక్కువ ఉంటోంది. దీంతో షుగర్ ఎగుమతులు అంతగా చేయలేని పరిస్థితి. దీంతో ఇథనాల్ ఉత్పత్తి లక్ష్యంగా ఉత్తర తెలంగాణలో చెరుకు సాగు విస్తీర్ణాన్ని ప్రోత్సహించేందుకు ఎంపీ అర్వింద్ ప్రణాళికలు సిద్ధం చేసుకుని పార్టీ నాయకత్వంతో ప్రకటించేందుకు సమాయత్తమవుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సైతం తాము అధికారంలోకి వస్తే నిజాం షుగర్స్ తెరిపిస్తామని హామీ ఇస్తోంది. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మాత్రం కేసీఆర్ ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. -
మంత్రి ప్రశాంత్‌రెడ్డి టార్గెట్‌గా బరిలో అన్నపూర్ణమ్మ
నిజామాబాద్ జిల్లాలోని ఐదు శాసనసభ స్థానాల్లో నాలుగు స్థానాలకు అభ్యర్థులను బీజేపీ మొదటి జాబితాలోనే ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. బాల్కొండ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ మంత్రి ప్రశాంత్‌రెడ్డి టార్గెట్‌గా మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మను ఫైనల్ చేసినట్లు సమాచారం. విలువలు కలిగిన రాజకీయనేతగా ఆమెకు పేరుంది. బోధన్‌లో ఇద్దరు పోటీ పడుతుండగా, మరో మూడు నియోజకవర్గాల్లో ఒక్కొక్కరి పేర్లే వినిపిస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: శాసనసభ ఎన్నికల కోడ్ సమీపిస్తున్న తరుణంలో బీజేపీలో టిక్కెట్ల ప్రకటనకు రంగం సిద్ధం అవుతోంది. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలోని ఐదు శాసనసభ స్థానాల్లో నాలుగు స్థానాలకు సంబంధించి అభ్యర్థులను మొదటి జాబితాలోనే ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. పసుపు రైతులు అధికంగా ఉన్న బాల్కొండ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణమ్మను బరిలోకి దించేందుకు నిర్ణయం ఖరారైనట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఎంపీ ధర్మపురి అర్వింద్ అధిష్టానం పెద్దలతో మాట్లాడి అన్నపూర్ణమ్మ పేరును ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. బాల్కొండ నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర మంత్రి ప్రశాంత్‌రెడ్డి టార్గెట్‌గా ఎంపీ అర్వింద్ అన్నపూర్ణమ్మను రంగంలోకి దింపుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన అన్నపూర్ణమ్మ గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో జిల్లాలో గట్టి పట్టు సంపాదించారు. విలువలతో కూడిన రాజకీయాలు చేసిన అన్నపూర్ణమ్మ లాంటి నాయకురాలిని బరిలోకి దించితే రైతులు, మహిళలు, యువకుల నుంచి తిరుగులేని సహకారం లభిస్తుందనే ఉద్దేశంలో ఎంపీ అర్వింద్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ సీనియర్లు చెబుతున్నారు. దీంతో బాల్కొండ స్థానంలో త్రిముఖ పోటీ జరుగనుంది. ► నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్పాల్ సూర్యనారాయణకు టిక్కెట్టు ఖరారు అయినట్లు తెలుస్తోంది. 2018 ఎన్నికల సమయంలో ధన్పాల్ సూర్యనారాయణకు చివరి నిముషంలో టిక్కెట్టు చేజారిపోయింది. ఈసారి మాత్రం తొలి జాబితాలోనే ధన్పాల్ టిక్కెట్టు ప్రకటించనున్నట్లు సమాచారం. ► నిజామాబాద్ రూరల్ నుంచి డిచ్పల్లి మాజీ జెడ్పీటీసీ సభ్యుడు కులాచారి దినేశ్‌కు ఆర్మూర్ నియోజకవర్గం టిక్కెట్టును అంకాపూర్‌కు చెందిన బడా వ్యాపారి పైడి రాకేష్‌రెడ్డికి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ నాలుగు టిక్కెట్లను మొదటి జాబితాలోనే ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎంపీ అర్వింద్ ఇప్పటికే ఈ విషయమై కేంద్ర నాయకత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ పొందినట్లు తెలుస్తోంది. ► బోధన్ టిక్కెట్టు విషయంలో మాత్రం మేడపాటి ప్రకాష్‌రెడ్డి, వడ్డి మోహన్‌రెడ్డిల మధ్య పోటీ ఉంది. ఈ నేపథ్యంలో ఈ టిక్కెట్టు విషయంలో వివిధ అంశాలను బేరీజు వేసుకుంటున్నారు. మేడపాటి ప్రకాష్‌రెడ్డి వైపు పార్టీ నాయకత్వం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఎంపీఆర్ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న మేడపాటికి మంచి పేరుంది. ఈ నెల 7న ఎంపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎడపల్లిలో జాబ్‌మేళా నిర్వహించనున్నారు. అదేవిధంగా పార్టీ కార్యక్రమాలు సైతం చురుగ్గా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గంలోని 6,500 మంది పార్టీ కార్యకర్తలందరికీ బీమా సౌకర్యం సైతం సొంత ఖర్చుతో మేడపాటి కల్పించారు. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ నాయకులు దొంగ ఓట్లు నమోదు చేశారంటూ మేడపాటి పెద్ద ఎత్తున పోరాటం చేశారు. దీంతో అధికారులు సదరు ఓట్లను గుర్తించి తొలగించారు. ఈ నేపథ్యంలో మేడపాటి వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గత ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా గెలుపొందిన ధర్మపురి అర్వింద్ ఇచ్చిన హామీ మేరకు పసుపు బోర్డు సాధించడంతో బీజేపీ టిక్కెట్లకు డిమాండ్ పెరిగింది. తాజాగా టిక్కెట్ల ఖరారుపై పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
'నేను పడ్డ శ్రమకు ఫలితం వచ్చింది' : ఎంపీ అర్వింద్ ధర్మపురి
నిజామాబాద్: ‘పసుపు బోర్డు ఏర్పాటు ప్రకటనలో సైంటిఫిక్, ఎకనామికల్, ట్రెడిషన్, కల్చర్ ఎమోషనల్ పని చేశాయి. సందర్భానుసారంగా ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాకు రాసిన లేఖలు, నేను పడ్డ శ్రమకు ఫలితం వచ్చింది’ అని ఎంపీ అర్వింద్ ధర్మపురి పేర్కొన్నారు. సోమవారం నగరంలోని బీ జేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పలువురు తనకు రాజకీయాలకు అతీతంగా అభినందనలు తెలియజేస్తున్నారన్నారు. పసుపు నా టిన దగ్గర నుంచి మార్కెటింగ్ వరకూ పసుపు బో ర్డు ఉపయోగపడుతుందని, కోల్డ్ స్టోరేజీలు, గోదా ములు, వేర్‌హౌజ్‌లు నిర్మించుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. రైతుల కోసం అవసరాన్ని బట్టి స్పైసెస్ రీజినల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశామ న్నారు. ఇందుకు రూ.30 కోట్లు ఖర్చు చేశామని, బంగ్లాదేశ్‌కు రైలు ద్వారా పసుపు ఎగుమతి చేశామ న్నారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో ప్రధాని మోదీ పసుపు బోర్డు ప్రకటన చేయడం చాలా సంతో షంగా ఉందన్నారు. పసుపు రైతుల కల నెరవేరిందని, ప్రతీ రైతుకు ఎంపీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందూరు నుంచే మార్పు.. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో కాషాయ జెండా ఎగురవేసి రాజకీయాల్లో మార్పునకు ఇందూరు నుంచే శ్రీకారం చుడతామని ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు. కల్వకుంట్ల కుటుంబం దొరతనం, అహంకారం దించే వరకూ ఇ లాగే మాట్లాడతానన్నారు. ప్రజలను నిత్యం మోసం చేస్తున్న కేసీఆర్, కేటీఆర్.. ప్రధాని మోదీని మోసగా డు అంటారా? అని మండిపడ్డారు. బిడ్డా కేటీఆర్ జా గ్రత్త.. ధాన్యం బ్లాక్‌మార్కెట్ చేస్తూ అవినీతికి పాల్పడుతున్న నీవు కవిత కంటే ముందే జైలు వెళ్తావని హెచ్చరించారు. నరేంద్ర మోదీ వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ మర్యాదపూర్వకంగా స్వాగతం పలకాలని, ఆ నీతి నేర్చుకోవాలని హితవుపలికారు. సభను జయప్రదం చేయండి.. పసుపు రైతుల దశాబ్దాల కల నెరవేర్చిన ప్రధాని నరేంద్ర మోదీ రానున్న ‘ఇందూరు జనగర్జన’ సభకు మంగళవారం రైతులు, ప్రజలు, యువత, మహిళలు పెద్దసంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని అర్వింద్ కోరారు. సమావేశంలో పార్టీ నేత ధన్పాల్ సూర్యనారాయణ పసుపు కొమ్ముల దండతో అర్వింద్‌ను సన్మానించారు. అనంతరం పార్టీ కార్యాలయం బయట ఎంపీ సహా నాయకులు పసుపు చల్లుకుంటూ నృత్యాలు చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, జిల్లాల అధ్యక్షులు బస్వా లక్ష్మీనర్సయ్య, సత్యనారాయణ, తుల ఉమ, రాష్ట్ర కార్యవర్గసభ్యులు పెద్దోళ్ల గంగారెడ్డి, బోగ శ్రావణి, పైడి రాకేశ్ రెడ్డి, దినేశ్ కులాచారి, మోహన్‌రెడ్డి, ప్రకాశ్‌రెడ్డి, నూతుల శ్రీనివాస్‌రెడ్డి, న్యాలం రాజు, స్వామి యాదవ్ పాల్గొన్నారు. ► ‘మన పసుపు రైతులకు ఉజ్వల భవిష్యత్ అందించేందుకు ఎంతవరకైనా వెళ్తాం.. ఏమైనా చేస్తాం’ అని ప్రధాని మోదీ నా ట్వీట్‌కు రీ ట్విట్ చేశారు. ► పసుపు బోర్డు, మాధవనగర్ ఆర్ఓబీ పూర్తయితే నిజామాబాద్‌కు ఎప్పటికీ నీవే ఎంపీవని నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అభినందించారు. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి, రైతుల ప్రశంసలు నన్ను చాలా ఆకట్టుకున్నాయి. ► పసుపు బోర్డు ప్రకటన తర్వాత రాజకీయ నాయకుల మీద మళ్లీ భరోసా ఏర్పడిందని ఓ రైతు కామెంట్ చేశాడు. ► పసుపు బోర్డు కోసం ఓ కేంద్రమంత్రి వెంటబడి సతాయించాను. లెక్కలేనన్ని సార్లు ఆయన కార్యాలయానికి వెళ్లి ఆయనతో పాటు సిబ్బందిని ఇబ్బంది పెట్టాను. చివరకు ఫలితం రావడం ఆనందంగా ఉంది. -
విస్తృత భేటీలు.. ముమ్మర ప్రచారం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గెలుపు ఎత్తుగడల్లో భాగంగా బీజేపీ ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలపై దృష్టి పెట్టింది. రాష్ట్రంలో రిజర్వ్ స్థానాల్లో ఏ పార్టీ అత్యధిక స్థానాలు సాధిస్తుందో ఆ పార్టీయే అధికారంలోకి వస్తుందనే ఉద్దేశంతో ఆ మేరకు కార్యాచరణ సిద్ధం చేసింది. ఈనెల 28 నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు వివిధ కార్యక్రమాల నిర్వహణకు కార్యాచరణ రూపొందించింది.రిజర్వ్డ్ నియోజకవర్గాలకు ఇన్చార్జీలను నియమించడంతోపాటు, ప్రతి నియోజకవర్గంలో ఆరేడు వేల మం ది కార్యకర్తలతో కలిసి సమావేశాలు నిర్వహించనుంది. ఆయా భేటీల్లో బీఆర్ఎస్ ప్రభుత్వ విధానా లను ఎండగట్టాలని, సీఎం కేసీఆర్ దళితులకు, గిరిజనులకు చేస్తున్న అన్యాయంపై విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలకు చెందిన 31 అసెంబ్లీ స్థానాలకు రూపొందించిన ప్రత్యేక కార్యాచరణలో భాగంగా ఇప్పటికే జాతీయ నాయకులు ఆయా నియోజకవ ర్గాల్లోని నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి ప్రకాష్ జవదేకర్, నేతలు అరవింద్ మీనన్, తరుణ్‌ఛుగ్, సునీల్ బన్సల్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్, డీకే అరుణ, ఏపీ జితేందర్‌రెడ్డి తదితర సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఇక ఒక్కో పోలింగ్ కేంద్రం నుంచి 20 నుంచి 30 మంది కార్యకర్తలతో బూత్ స్థాయి సమావేశాలు కూడా నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ పార్టీ దళితులకు ఇచ్చిన హామీలను ఏవిధంగా తుంగలో తొక్కిందన్న అంశాలను వివరించడంతోపాటు, కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు, అదే విధంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులు / గిరిజనులకు అమలు అవుతున్న పథకాల గురించి వివరించేలా కార్యక్రమాలు చేపట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వం దళితుల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన పలు పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా నీరుగార్చిందనే విషయాన్ని కూడా వివరిస్తామని బీజేపీ ముఖ్య నాయకుడు ఒకరు వివరించారు. కాంగ్రెస్ పార్టీ 75 ఏళ్లలో దళితులు, గిరిజనులను ఓట్లు వేయించుకోవడానికి వాడుకోవడం తప్ప.. వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పించని విషయాన్ని కూడా వివరి స్తామని తెలిపారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్న అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్తామని వివరించారు. పార్టీ నేతలతో జవదేకర్ భేటీ తెలంగాణలో పార్టీని మరింత పటిష్టం చేయ డంతో పాటు, ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రకాష్ జవదేకర్ శుక్రవారం మాజీ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డితో పాటు ఏపీ, తెలంగాణకు చెందిన పలువురు నేతలతో సమా వేశమయ్యారు. పార్టీ పటిష్టత, లోపాలకు సంబంధించి అంశాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ కూడా ఇచ్చినట్లు సమాచారం. ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి చేరికలు, ఇతర అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది. -
తెలంగాణ బీజేపీ.. రఘునందన్, అర్వింద్‌కు కీలక బాధ్యతలు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ స్పీడ్ పెంచింది. రానున్న ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. మరోవైపు.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈనెల 29వ తేదీన తెలంగాణకు రానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, అమిత్ షా పర్యటనకు రాష్ట్ర బీజేపీ సన్నాహాలు చేస్తోంది. ఇదిలా ఉండగా.. ఇటీవల పార్టీ నేతల్లో చోటుచేసుకున్న పరిణామాల దృష్ట్యా పరిస్థితిని చక్కదిద్దేపనిలో రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి బిజీగా ఉన్నారు. ఇక, అమిత్ షా పర్యటన సందర్భంగా డాక్టర్స్, లాయర్స్, ఇంజినీర్స్ ప్రతినిధులతో భేటీ కానున్నారు. అలాగే, బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వార్ రూమ్ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో వార్ రూమ్ ఇన్చార్జ్గా ఎవరిని పెడతారనే దానిపై చర్చ జరుగుతోంది. మరోవైపు.. స్ట్రాటజీ టీమ్ ఇన్చార్జ్గా శ్వేతా శాలిని, సోషల్ మీడియా బాధ్యతలు ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యే రఘునందన్, కో ఆర్డినేషన్ కమిటీ బాధ్యతలు నల్లు ఇంద్రసేనారెడ్డి, చింతలకు అప్పగించారు. కాగా, దీనిపై రేపు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. కొద్దిరోజుల క్రితమే బీజేపీ హైకమాండ్‌పై రఘునందన్ ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: తెలంగాణలో కాంగ్రెస్‌కు షాక్.. బీజేపీలోకి సీనియర్ నేతలు! -
నా ముక్కు కాదు..కేసీఆర్ ముక్కునే నేలకు రాయిస్తా
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్/ జగిత్యాల టౌన్: ‘నేను నిరాధార ఆరోపణలు చేస్తున్నానని, నా ముక్కును నేలకు రాయాలని కవిత అంటోంది. నేను ముక్కు కాదు కదా.. కాలు కూడా నేలకు రాయను, కవిత తండ్రి కేసీఆర్ ముక్కునే గజ్వేల్‌లో నేలకు రాయిస్తాను’అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో డబుల్ బెడ్రూం ఇళ్లపై నిర్వహించిన ధర్నాలో అర్వింద్ మాట్లాడుతూ, తెలంగాణకు పట్టిన దరిద్రం కేసీఆర్ అని వ్యాఖ్యానించారు. పేదలకు నాలుగు లక్షల డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తానని భారీగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం, అందుకు విరుద్ధంగా వ్యవహరించిందని విమర్శించారు. డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం వివిధ బడ్జెట్లలో కలిపి రూ.30 వేల కోట్లు కేటాయించినట్లు ప్రభుత్వం చూపించినా ఇళ్లు మాత్రం కట్టించలేదని, ఈ విషయాన్ని రాష్ట్ర ఆడిట్ విభాగమే తేల్చిందన్నారు. ఇక్కడ నొక్కేసిన డబ్బులతోనే కేసీఆర్ కుమార్తె కవిత ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేసిందని, ఐరన్‌లెగ్ కవితను నమ్ముకున్న ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా జైలుపాలయ్యారని అన్నారు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర నిధులకు రాష్ట్ర ప్రభుత్వ వాటా జోడించి పేదలకోసం 8 లక్షల ఇళ్లు కట్టించగా, తెలంగాణలో మాత్రం ఈ ప్రభుత్వం కట్టించిన ఇళ్లు గుండుసున్నా అని అర్వింద్ వ్యాఖ్యానించారు. జీవన్‌రెడ్డి నాకు తండ్రిలాంటి వారు ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి తనకు తండ్రిలాంటి వారని, కానీ, ఆయన సేవలు అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ పని ఖతమైందని అర్వింద్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రం తహసీల్ చౌరస్తాలో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో అరి్వంద్ మాట్లాడుతూ, పేద మహిళలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించి ఇస్తానన్న హామీని కేసీఆర్ తుంగలో తొక్కారన్నారు. -
కాంగ్రెస్‌లో ప్లాన్ మార్చిన మధు యాష్కీ.. వారిద్దరే కారణమా?
తెలంగాణ కాంగ్రెస్‌కు కొన్ని చోట్ల డిమాండ్ బాగా కనిపిస్తోంది. మరికొన్ని చోట్ల అభ్యర్థులే కనిపించడంలేదట. ఎంపీ సీట్ల విషయంలో ఈ అయోమయం కొనసాగుతోందనే టాక్ వినిపిస్తోంది. ఓ సెగ్మెంట్లో నాలుగు సార్లు పోటీ చేసిన నేత ఇప్పుడు సైలెంట్ అయ్యారట. రెండుసార్లు గెలిచి, రెండు సార్లు ఓడిన ఆ నేత వలస వెళ్ళాలని అనుకుంటున్నట్లు టాక్. ఇంతకీ ఆ నేత ఎవరు? ఎక్కడకు వెళ్లబోతున్నారు.. నిజామాబాద్ పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు? 2004 నుంచి 2019 వరకు వరుసగా నాలుగు సార్లు పోటీ చేసి.. రెండు సార్లు లోక్‌సభలో అడుగుపెట్టిన మధుయాష్కీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా? లేదా?. ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చేవారు ఎవరూ కనిపించడంలేదట నిజామాబాద్ కాంగ్రెస్‌లో. అయితే, యాష్కీ పోటీ చేయాలని అక్కడి కేడర్ భావిస్తున్నా.. ఆయన చాలాకాలం నుంచి నిజామాబాద్‌లో పర్యటించకపోవడంతో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు మధుయాష్కీ ఈసారి పోటీ చేస్తారా? లేక వేరే మరెక్కడైనా పోటీ చేయాలనుకుంటున్నారా? కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఏదైనా హామీ లభించిందా? అనే ప్రశ్నలు పార్టీ కేడర్ నుంచి వినిపిస్తున్నాయి. కవిత, అర్వింద్ చేతిలో ఓటమి.. ఇక, డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గాలిలో రెండుసార్లు వరుసగా నిజామాబాద్ నుంచి లోక్‌సభకు ఎన్నికైన మధుయాష్కీ 2014 ఎన్నికల్లో కేసీఆర్ కుమార్తె కవిత చేతిలో ఓటమి చెందారు. అలాగే 2019 ఎన్నికల్లో మరోసారి కాషాయ పార్టీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓడిపోయారు. ఒకనాడు కాంగ్రెస్‌లో కీలకంగా ఉన్న సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ తనయుడైన అరవింద్ విజయం కోసం కాంగ్రెస్ శ్రేణులు కూడా అంతర్గతంగా పనిచేశాయని అప్పుడు ప్రచారం జరిగింది. రెండుసార్లు ఓటమి చెందడంతో కొంతకాలంగా మధు యాష్కీ నిజామాబాద్ జిల్లా వైపు కన్నెత్తి చూడడం లేదు. ఆయనకు నిజామాబాద్ పార్లమెంటు సీటుపై ఆసక్తి తగ్గిందనే ప్రచారం కాంగ్రెస్‌లోనే జరుగుతోంది. రాహుల్ గాంధీకి సన్నిహితుడి పేరున్న మధు యాష్కీకి మరోచోట సీటు హామీ వచ్చిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. నల్గొండ లేదా రంగారెడ్డి జిల్లాల నుంచి పోటీ చేయడానికి ఆయన ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. తెరపైకి ఎన్ఆర్ఐ!.. నిజామాబాద్ పార్లమెంటరీ స్థానం మహారాష్ట్ర బోర్డర్ బోధన్‌లో మొదలై.. జగిత్యాల నియోజక వర్గం వరకూ విస్తరించి ఉంది. మొత్తం పార్లమెంటరీ నియోజకవర్గం అంతా అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, బీజేపీ ఎంపీ అరవింద్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. కానీ, కాంగ్రెస్ నుంచి ఎవరూ ఈ పార్లమెంట్ సీటు గురించి పట్టించుకున్నవారు కనిపించడంలేదు. మధుయాష్కీ పోటీ చేయకపోతే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి లేదా ఎవరైనా ఎన్ఆర్ఐతో పోటీ చేయిస్తారనే టాక్ కాంగ్రెస్ పార్టీలో నడుస్తోంది. మొత్తానికి రెండుసార్లు ఓటమితో మధుయాష్కీ నిజామాబాద్‌ను వదిలేశారనే ప్రచారం అయితే జిల్లాలో జరుగుతోంది. ఇది కూడా చదవండి: ప్లాన్ మార్చిన కేసీఆర్.. కొత్త నేతకు లైన్ క్లియర్! -
స్కూటీలో వెళ్తున్న భార్యను సుమోతో ఢీకొట్టించి...
యశవంతపుర: తల్లిదండ్రులనుంచి తనను వేరు చేసేందనే కసితో భార్యను అంతమొందించేందుకు పన్నిన పథకం బెడిసికొట్టి భర్త కటకటాల పాలయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి అరవింద, ఉదయకుమార్ అనే నిందితులను అరెస్ట్ చేశారు. బెంగళూరుకు చెందిన చైతన్యను అరవింద్ ఏడాదన్నర క్రితం వివాహం చేసుకున్నాడు. ఆమె ఆరు నెలల గర్భిణి. వివాహం అనంతరం చైతన్య వేరు కాపురం పెట్టించింది. తల్లిదండ్రులనుంచి దూరంగా ఉండటంతో అరవింద్ మనోవేదనకు గురయ్యాడు. దీంతో చైతన్యనుంచి విడాకులు తీసుకోవాలని నిర్ణయించగా ఆమె అంగీకరించలేదు. దీంతో చైతన్యను హత్య చేయాలని ప్లాన్ వేసి పాత టాటాసుమోను కోనుగోలు చేసి ఉదయకుమార్ అనే వ్యక్తిని డ్రైవర్‌గా పెట్టుకున్నాడు. చైతన్యను యాక్సిడెంట్ ద్వారా హత్య చేయాలని సుఫారీ ఇచ్చాడు. సీసీ కెమెరాలులేని స్థలాన్ని గుర్తించి అక్కడ యాక్సిడెంట్ చేయాలని ఉదయకుమార్‌కు సూచించాడు. వారం రోజుల క్రితం భరతనాట్యం ముగించుకొని బాగలూరు కెఐడీబి లేఔట్ సమీపంలో స్కూటీతో వెళ్తున్న చైతన్యను సుమోతో ఢీకొన్నారు. స్వల్పంగా గాయపడిన ఆమె బాగలూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారించిన పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీ కేమరాలను పరిశీలించగా అనవాళ్లు దొరకలేదు. అదే మార్గంలో పాత టాటా సుమో తిరిగిన అనవాళ్లను గుర్తించి ఆ వాహనం ఎవరిదనే వివరాలు సేకరించి ఉదయకుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో కుట్ర వెలుగు చూసింది. దీంతో ఉదయ్‌కుమార్, అరవిందను అరెస్ట్ చేశారు. -
మారుతున్న సమీకరణలు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలో కీలకమైన ఆర్మూర్ నియోజకవర్గంలో ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ సమీకరణలు మారుతున్నాయి. అంకాపూర్‌కు చెందిన పారిశ్రామికవేత్త, నైన్ స్టార్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ పైడి రాకేష్‌రెడ్డి గురువారం ఢిల్లీలో ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆధ్వర్యంలో పార్టీ తెలంగాణ ఇన్చార్జి తరుణ్‌ఛుగ్ సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. రాకేష్‌రెడ్డితో పాటు ఆయన సతీమణి రేవతిరెడ్డి, కుమార్తె సుచరితరెడ్డి, నియోజకవర్గ నాయకురాలు విజయభారతి ఉన్నారు. పార్టీ కండువా కప్పుకున్న వెంటనే రాకేష్‌రెడ్డి తన ఉద్దేశాన్ని చాటిన తీరు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆర్మూర్ నియోజకవర్గంలో సామాన్యులను బెదిరింపులకు గురిచేస్తూ, బ్లాక్మెయిల్ చేసే తరహా రాజకీయాలకు చరమగీతం పాడే ఉద్దేశంతోనే తాను బీజేపీలో చేరినట్లు చెప్పడం విశేషం. టిప్పర్లతో గుద్ది చంపే తరహా హత్యారాజకీయాలకు తెరదించేందుకే వస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. ప్రజలకు కావాల్సింది విద్య, వైద్యం, ఉపాధి కానీ బ్లాక్‌మెయిల్‌కు గురిచేసే వ్యవహారాలు కాదన్నారు. అన్ని వర్గాల పోరాటం, అమరవీరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ సాధిస్తే ఒక్క కుటుంబమే లాభం పొందిందన్నారు. పేదలకు మేలు చేసేందుకే బీజేపీలో చేరానన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఆదర్శంగా తీసుకుని ముందుకెళతానన్నారు. ఇప్పటికే పేదలకు ఒక్క రూపాయికే కార్పొరేట్ వైద్యం అందిస్తున్నానన్నారు. ఆపదలో ఉన్నవారికి పైడి రాకేశ్‌రెడ్డి ఫౌండేషన్ ద్వారా ఆర్థికంగా, ఇతర అన్ని రకాలుగా సహాయం చేస్తున్నామన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో తన ముద్ర వేసుకుంటానన్నారు. ఇప్పటికే ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు ప్రత్యామ్నాయం కోసం కళ్లు కాయలు కాచేలా చూస్తున్నారన్నారు. రాకేశ్‌రెడ్డి రూ పంలో ఓ కరుడుగట్టిన, కమిట్మెంట్తో కూడిన కార్యకర్తలాగా తనను బీజేపీ పంపుతోందన్నారు. అందరికీ అందుబాటులో ఉంటూ ఆర్మూర్‌లో ఫ్యా క్షన్ రాజకీయాలను కూకటి వేళ్లతో పెకిలిస్తానన్నా రు. గత కొన్నేళ్లుగా పుట్టిన ఊరికి, చుట్టుపక్కల గ్రా మాలకు నిరంతరం సేవ చేస్తున్నానన్నారు. ప్రస్తు తం ఆర్మూర్ నియోజకవర్గంలో హత్యలు, అక్ర మాలు, కబ్జాలు నడుస్తున్నాయన్నారు. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి లక్ష్యంగా.. రాకేష్‌రెడ్డి ప్రకటనలు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని లక్ష్యంగా చేస్తుండగా, ఇప్పటికే అందుకు అవసరమైన కార్యాచరణ అమలు చేస్తూ ముందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది. ఎంపీ అర్వింద్ ఆధ్వర్యంలో అందుకు తగినవిధంగా ప్రణాళికలు తయారు చేసుకున్నట్లు చర్చ జరుగుతోంది. కల్లెడ సర్పంచ్ దంపతులు లావణ్య, ప్రసాద్‌గౌడ్‌లను ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కుట్ర చేసి కేసుల్లో ఇరికించినట్లు ఆరోపణలు, అదేవిధంగా నందిపేట సర్పంచ్ దంపతులు కలెక్టరేట్లో ఆత్మహత్యాయత్నం చేసిన విషయమై ఇప్పటికే నియోజకవర్గంలోని స్థానిక ప్రజాప్రతినిధులు గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో చాలామంది సర్పంచ్‌లు, ఎంపీటీసీలను రాకేష్‌రెడ్డి కలిసినట్లు తెలుస్తోంది. లక్కంపల్లి మాజీ సర్పంచ్, ప్రస్తుత ఉపసర్పంచ్‌లను హతమార్చేందుకు ఆ గ్రామ సర్పంచ్ భర్త మహేందర్ సుపారీ ఇచ్చిన విషయమై జిల్లాలో సంచలనమైంది. ఎమ్మెల్యే ఇలాంటి వాళ్లను వెనకేసుకురావడం పట్ల రాకేష్‌రెడ్డి ప్రస్తావించారు.రాకేష్‌రెడ్డి క్షేత్రస్థాయిలో ప్రతిఒక్కరితో కలిసేలా ప్లాన్ చేసుకోగా, స్థానిక ప్రజాప్రతినిధులతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతుండడంతో సమీకరణలు మారనున్నట్లు వివిధ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇవన్నీ చూస్తుంటే ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని పకడ్బందీగా ముందుకు కదులుతున్నట్లు తెలుస్తోంది. -
బండి సంజయ్ Vs అరవింద్: తెలంగాణ బీజేపీలో మరోసారి లుకలుకలు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ బీజేపీలో మరోసారి లుకలుకలు మొదలయ్యాయి. తాజాగా బండి సంజయ్- అరవింద్ మధ్య విభేదాలు తెరపైకి వచ్చాయి. కవితపై బండి సంజయ్ వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ అరవింద్ తప్పుబట్టారు. కవితపై బండి సంజయ్ వ్యాఖ్యలను సమర్థించనని అరవింద్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సంజయ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే మంచిదని హితవు పలికారు. సామెతలను ఉపయోగించే సమయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. ‘‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదా పవర్ సెంటర్ కాదు. అందరినీ సమన్వయం చేసే బాధ్యత అది’’ అంటూ అరవింద్ సూచించారు. ‘‘కవిత ఈడీ ఆఫీసులో ఉంటే తెలంగాణ కేబినెట్ అంతా ఢిల్లీలో మకాం వేసింది. ఇదే చిత్తశుద్ధి ప్రజల అభివృద్ధిపై ఉంటే రాష్ట్రం బాగుపడేది’’ అని అరవింద్ పేర్కొన్నారు. ‘‘దర్యాప్తు కు కవిత సహకరించలేదని తెలిసింది. ఎందుకు, ఏమిటి, ఎలా అని ఈడీ అధికారులు అడిగితే.. కవిత ఏమో, తెలవదు, గుర్తు లేదు అని సమాధానం చెప్పినట్టు తెలిసింది. చేతికి 20లక్షల గడియారం, కోట్ల రూపాయల నగలు ఎక్కడి నుంచి వచ్చాయో ప్రజలకు తెలుసు. అవినీతిని అంతం చేయాలని మోదీ కంకణం కట్టుకున్నారు. కల్వకుంట్ల కుటుంబం అవినీతిలో మునిగితేలారు’’ అంటూ ఎంపీ అరవింద్ దుయ్యబట్టారు. చదవండి: ఎమ్మెల్యే రాజయ్య, సర్పంచ్ నవ్య ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్ -
తెలంగాణ రాష్ట్రం నుంచి మరో కేంద్రమంత్రి?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీ నేతలకు జాతీ యస్థాయిలో మరో కీలక పదవి లభించనుందా ? ఈ ప్రశ్నకు ఢిల్లీ పార్టీ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. 2024 ఏప్రిల్‌లో లోక్‌సభ ఎన్నికలతో పాటు, ఈ ఏడాది 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశాలున్నట్టు చెబుతున్నారు.ప్రస్తుతం జాతీయస్థాయిలో రాజకీయ మార్పులు చేర్పులు వేగంగా చోటుచేసుకుంటున్నాయి. ఈ కీలక పరిణా మాల్లో జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో సంస్థాగతంగా కూడా కీలక మార్పులు జరిగే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నెల 16, 17 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న పార్టీ జాతీయకార్యవర్గ భేటీలో పలు అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయని అంటున్నారు. కేంద్రమంత్రివర్గ విస్తరణతో పాటు ఈ ఏడాది ఎన్నికలు జరగాల్సిన కొన్ని రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షుల మార్పు కూడా జరగొచ్చుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కీలకంగా మారిన తెలంగాణ... ప్రస్తుతమున్న పరిస్థితుల్లో కర్ణాటక, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ ఎన్నికలకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. తెలంగాణలో అధికారంలోకి రావడంతోపాటు మధ్యప్రదేశ్, కర్ణాటకలలో అధికారాన్ని నిలబెట్టుకోవడం, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్‌ను ఓడించడం అనేది బీజేపీకి కీలకంగా మారింది. గతంలో బీజేపీ ఎప్పుడూ గెలవని, రెండోస్థానంలో నిలిచిన, మిత్రపక్షాలకు కేటాయించిన 160 ఎంపీ సీట్లను జాతీయనాయకత్వం గుర్తించింది. 2024 ఎన్నికల్లో వీటిలో గణనీయమైన సంఖ్యలో సీట్లు గెలవాలనే లక్ష్యంతో కార్యాచరణ ప్రణాళికను ఇప్పటికే బీజేపీ అమలు చేయడం మొదలుపెట్టింది. వచ్చే లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో... ఇప్పటికే కేంద్రమంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డికి తోడుగా తెలంగాణ నుంచి ఎంపీలుగా ఉన్న బండిసంజయ్, ధర్మపురి అరవింద్, సోయం బాపూరావులలో ఒకరికి కేబినెట్బెర్త్ దక్కే అవకాశాలున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన డా.కె.లక్ష్మణ్ కూడా మంత్రి పదవి రేసులో ఉన్నట్టుగా చెబుతున్నారు. కేసీఆర్ సర్కారు వైఫల్యాలను మరింతగా ఎండగట్టేలా... తెలంగాణలో కచ్ఛితంగా విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్న జాతీయనాయకత్వం ఈ దిశలో కేసీఆర్ సర్కారు వైఫల్యాలను మరింత గట్టిగా ఎండగట్టేందుకు మరో కేబినెట్ పదవి ఇచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. గత 8 ఏళ్లలో మోదీ ప్రభుత్వం అమలుచేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను గురించి తెలంగాణలో విస్తృతంగా ప్రచారం చేయలేకపోయామనే అభిప్రాయంతో జాతీయనాయకత్వం ఉన్నట్టు సమాచారం. మరో పది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున ఇప్పటికైనా మోదీ ప్రభుత్వ విజయాలు, తెలంగాణలో వివిధవర్గాల పేదలకు చేకూరిన ప్రయోజనాలను గురించి ప్రజలకు తెలియచేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలో జరగబోయే కేబినెట్ విస్తరణలో తెలంగాణకు చెందిన నేతకు మంత్రి పదవి దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సంజయ్‌ను కేంద్రమంత్రిని చేస్తే రాష్ట్ర పార్టీలో బీసీవర్గం నుంచి కీలకనేతగా ఉన్న మరో ముఖ్యనేతకు రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీ పగ్గాలు అప్పగించవచ్చునని ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఇప్పటికే సోషల్ మీడియాలోని కొన్ని వెబ్సైట్లలో వార్తలు పెద్దఎత్తున హల్చల్ చేస్తున్నాయి. -
తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం!
సాక్షి, హైదరాబాద్: బెంగాల్ మార్క్ రాజకీయాల దిశగా తెలంగాణ అడుగులు వేస్తోందా ? ఇక్కడా ప్రధాన రాజకీయ పార్టీల మధ్య దాడులు, ప్రతిదాడుల సంస్కృతి పెరగనుందా ? రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీల మధ్య రోజురోజుకూ పెరుగుతున్న ఉద్రిక్తతలు ఈ అనుమానాలకు తావిస్తున్నాయి. ఇటీవలి పరిస్థితులు, అర్వింద్ ఇంటిపై దాడి వంటి తాజా పరిణామాలను బట్టి చూస్తే మాత్రం.. బెంగాల్ తరహా రాజకీయాల వైపు మనం అడుగులు వేస్తున్నట్టేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నందున రెండు పార్టీలు ఇదే ఒరవడిని, మరింత దూకుడును ప్రదర్శించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. గతంలో ధాన్యం కల్లాల పరిశీలనకు వెళ్లినపుడు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కాన్వాయ్‌పై టీఆర్ఎస్ శ్రేణుల దాడిని, ఆ తర్వాత ప్రజా సంగ్రామయాత్ర సందర్భంగా సంజయ్, ఇతర నాయకులపై దాడిని, అదేవిధంగా ఎమ్మెల్సీ కవిత కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు దాడికి ప్రయత్నించడాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఇటీవలి టీఆర్ఎస్ విస్తృ్తత స్థాయి సమావేశంలో బీజేపీకి ఏ మాత్రం భయపడకుండా ధీటుగా బదులివ్వాలని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేయడాన్ని ప్రస్తావిస్తున్నారు. ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామాలు, బీజేపీ విమర్శలకు టీఆర్ఎస్ స్పందనలు దీనినే స్పష్టం చేసేలా ఉన్నాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. పశి్చమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తృణమూల్ కాంగ్రెస్, బీజేపీల మధ్య చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులు, పరిణామాలు పరిశీలకులు గుర్తుచేస్తున్నారు. అక్కడ ఎన్నికల ప్రచా రం మొదలు కావడానికి ఎంతో ముందుగానే రెండు పారీ్టల నేతలు, కార్యకర్తల మధ్య దాడులు, ప్రతి దాడులు తీవ్రస్థాయిలో జరిగాయి. ఆ తర్వాత అవి హత్యా రాజకీయాల వైపు కూడా దారితీసిన సంగతి తెలిసిందే. చదవండి: కాంగ్రెస్ పార్టీ నుంచి మర్రి శశిధర్‌రెడ్డి బహిష్కరణ