coffee
-
హీరోయిన్ రకుల్ ప్రీత్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదేనట!
టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్నెస్ మీద ఎక్కువ శ్రద్ధపెడుతోంది. ముఖ్యంగా జాకీ భగ్నాన్తో పెళ్లి తరువాత జంటగా అనేక ఆసనాలు, వ్యాయామాలు చేస్తూ సోషల్ మీడియాలో అనేక వర్కౌట్ వీడియోలుపోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా ప్రముఖ పోడ్కాస్టర్ , యూట్యూబర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, బాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ తన వివరణాత్మక డైట్ ప్లాన్ గురించి వివరించింది.రకుల్ ప్రీత్ సింగ్ డైట్ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడి నీళ్లు తాగుతుందిట. ఆ తరువాత దాల్చినచెక్క నీరు లేదా పసుపు నీటిని తీసుకుంటుందట. ఆపై నానబెట్టిన బాదం గింజలు ఐదు, వాల్నట్ తీసుకుంటుందట. ఆ తరువాత ఘీ కాఫీ తాగుతానని చెప్పుకొచ్చింది రకుల్. వర్కవుట్ పూర్తి చేసిన తరువాత అల్పాహారం మాత్రం భారీగా తీసుకుంటుందట. ముఖ్యంగా ప్రోటీన్ స్మూతీలోగా పోహా (అటుకులు) లేదా మొలకలు లేదా గుడ్లని తీసుకుంటుందట. తన డైట్ గురించి రకుల్ ఇంకా ఇలా వివరించింది. భోజనం సాధారణంగా అన్నం లేదా జొన్న రొట్టె, కూర ,చేపలు లేదా చికెన్ వంటి కొన్ని రకాల ప్రోటీన్లు, సాయంత్రం 4:35 గంటలకు స్నాక్స్‌గా ప్రోటీన్ చియా సీడ్స్ పుడ్డింగ్, పండు, పెరుగు, పీనట్ బటర్ వంటివి తీసుకుంటుందట. డిన్నర్‌ను ఏడు గంటలకు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తానని కూడా తెలిపింది. అది కూడా మధ్యాహ్నం తినే దాని కంటే కాస్త తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండేలా డిన్నర్‌ను ప్లాన్ చేసుకుంటుంది. -
కాఫీ తాగుతూ చిల్ అవుతోన్న నభా నటేశ్... ఫోటోలు వైరల్
-
ఇంటెల్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆ సౌకర్యాలు మళ్లీ..
ప్రముఖ మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ ఇంటెల్ తమ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. సిబ్బందికి ఉచితంగా కాఫీ, టీ వంటి పానీయాలు అందించే సౌకర్యాన్ని తిరిగి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. శ్రామికశక్తిని ఉత్తేజపరిచే ఈ నిర్ణయం అంతర్గత సందేశాల ద్వారా షేర్ చేసినట్లు తెలుస్తోంది.వ్యయ నియంత్రణ, నిర్వహణ సమస్యలతో సతమవుతున్న ఇంటెల్ దాదాపు ఏడాది తర్వాత తమ కార్యాలయ సంస్కృతిని మెరుగుపరచడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల రోజువారీ జీవితంలో చిన్న సౌకర్యాల ప్రాముఖ్యతను గుర్తిస్తున్నట్లు అంతర్గత సందేశంలో ఇంటెల్ పేర్కొంది."ఇంటెల్ ఇప్పటికీ ఖర్చు సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, చిన్న సౌకర్యాలు మన దినచర్యలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని మేము అర్థం చేసుకున్నాము. ఇది ఒక చిన్న అడుగు అని మాకు తెలుసు, కానీ మన కార్యాలయ సంస్కృతికి మద్దతు ఇవ్వడంలో ఇది అర్ధవంతమైనదని మేము ఆశిస్తున్నాము." అని వివరించింది.ఫ్రీ ఫ్రూట్స్‌కు నోఉచిత పానీయాల సౌకర్యాన్ని తిరిగి ప్రారంభిస్తున్నప్పటికీ, ఒకప్పుడు ఉద్యోగులకు అందుబాటులో ఉన్న ఉచితంగా పండ్లు అందించే సౌలభ్యాన్ని మాత్రం కంపెనీ పునఃప్రారంభించడం లేదు. కంపెనీ నిరంతర వ్యయ-తగ్గింపు ప్రయత్నాలలో భాగంగా ఈ వసతిని మళ్లీ కల్పించేందుకు ఇంటెల్ సిద్ధపడలేదు. -
ఉద్యోగులకు టీ, కాఫీ నిలిపివేత!
ప్రముఖ సెమీకండక్టర్ చిప్ తయారీ సంస్థ ఇంటెల్ తమ ఉద్యోగులకు అందిస్తున్న ఉచిత సర్వీసులను నిలిపేసినట్లు ప్రకటించింది. పని ప్రదేశాల్లో సిబ్బందికి అందించే టీ, కాఫీ సేవలను ఉపసంహరించుకుంటున్నట్లు పేర్కొంది. ఈ పరిణామంతో సంస్థలో పని చేస్తున్న మరింత మంది తమ కొలువులను కోల్పోయే ప్రమాదం ఉందని ఐటీ నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇజ్రాయెల్‌లోని ఇంటెల్ కంపెనీ కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగులకు టీ, కాఫీ, పండ్లు వంటి సర్వీసులను నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. కాస్ట్‌కటింగ్ పేరిట ఇప్పటికే దాదాపు 15 వేల మంది ఉద్యోగులకు కొలువుల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ప్రస్తుత ప్రకటనతో కంపెనీ పరిస్థితిపై ఆందోళనలు ఎక్కువవుతున్నాయి. ఉద్యోగులకు కాంప్లిమెంటరీగా అందించే కాఫీ, టీ, పండ్లకు పెద్దగా ఖర్చవ్వదు. అలాంటిది సంస్థ వాటిని అందించేందుకు కూడా ఇంతలా ఆలోచిస్తుందంటే పరిస్థితి ఎలా ఉందనే విషయంపై ఉద్యోగులు ఆలోచనలో పడ్డారు. రానున్న రోజుల్లో మరింత మందికి లేఆఫ్స్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు కొందరు చెబుతున్నారు. ఇప్పటికే కంపెనీలోని మొత్తం శ్రామికశక్తిలో 15 శాతానికిపైగా ఉద్యోగులను కాస్టకటింగ్ పేరిట లేఆఫ్స్ పేరుతో తొలగించారు.కొత్తగా మళ్లీ ఉద్యోగుల తొలగింపునకు సంబంధించిన లేఖలను జారీ చేయడానికి మేనేజర్లు సమావేశాలను షెడ్యూల్ చేసినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. ఈ వారం నుంచి తొలగింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని చెబుతున్నారు. ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ ప్యాకేజీలను సైతం అందించే యోచనలో ఉన్నట్లు చెప్పారు.ఇదీ చదవండి: గూగుల్ ‘షాడో క్యాంపెయిన్’!ఇదిలా ఉండగా, సిస్కో కంపెనీ సుమారు 6000 మంది ఉద్యోగులను తొలగించే పనిలో ఉంది. ఈ సంఖ్య కంపెనీ మొత్తం ఉద్యోగులలో 7శాతంగా ఉంది. సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), సైబర్ సెక్యూరిటీ మీద దృష్టిపెట్టాలని యోచిస్తోంది. ఇది కంపెనీని అభివృద్ధి మార్గంలో నడిపించడానికి సహాయపడుతుందని సంస్థ సీఈఓ చక్ రాబిన్స్ గతంలో వెల్లడించారు. ఐబీఎం కంపెనీ రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ కార్యకలాపాలను చైనా నుంచి ఉపసంహరించుకున్న తరువాత సుమారు 1000 మంది కంటే ఎక్కువ ఉద్యోగులను తొలగించింది. జర్మన్ చిప్ తయారీ సంస్థ ఇన్ఫినియన్ కూడా 14000 మందిని తొలగించనున్నట్లు సమాచారం. ఇదే బాటలు డెల్, షేర్‌చాట్ వంటి దిగ్గజాలు కూడా అడుగులు వేస్తున్నాయి. -
కార్స్ 'ఎన్' కాఫీలో ఆకట్టుకున్న వింటేజ్ కార్లు (ఫొటోలు)
-
ఏవండీ.. కొంచెం కాఫీ తాగరు!
ఏవండీ.. కొంచెం కాఫీ తాగరు! -
రెండు 'టీ' లకు మించొద్దు..! లేదంటే ఆ సమస్య తప్పదు..!
రోజూ రెండు కప్పుల టీ, మరో రెండు కప్పుల కాఫీ తాగేవారిలో మతిమరపు సమస్య అంత తేలిగ్గా రాదని అంటున్నారు చైనా పరిశోధకులు. టీ, కాఫీలను చాలా పరిమితంగా అంటే రోజూ రెండు కప్పులకు మించకుండా తాగేవారిలో కేవలం మతిమరపు (డిమెన్షియా) నివారితం కావడమే కాదు... పక్షవాతం వచ్చే అవకాశాలూ తక్కువే అంటున్నారు ఈ పరిశోధన నిర్వహించిన పరిశోధకులు. టీ కాఫీలు తాగని వారితో పోల్చినప్పుడు... రోజూ రెండు కప్పుల చొప్పున టీ, కాఫీ తాగేవారిలో మతిమరపు రావడమన్నది దాదాపు 28 శాతం తక్కువని పేర్కొంటున్నారు చైనాకు చెందిన టియాంజిన్ మెడికల్ యూనివర్సిటీ అధ్యయనవేత్తలు డాక్టర్ యువాన్ ఝాంగ్, ఆయన బృందం. దాదాపు 5,00,000 మందిపై పదేళ్ల పాటు వారు బ్రిటన్‌లో సుదీర్ఘ పరిశోధన చేశారు. కాఫీ, టీల మీద ఇలా పరిశోధనలు జరగడం మొదటిసారి కాదు. గతంలోనూ జరిగాయి. ఈ ఫలితాల మీద కొన్ని భిన్నాభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. రీడింగ్ యూనివర్సిటీకి చెందిన ప్రయుఖ న్యూట్రిషనల్ సైన్సెస్ నిపుణురాలు డాక్టర్ కార్లోట్ మిల్స్ మాట్లాడుతూ... ‘‘మతిమరపు నివారణకు కేవలం కాఫీ, టీలు మాత్రమే కారణం కాకపోవచ్చు. ఇతర అంశాలూ కారణమయ్యే అవకాశాలూ లేక΄ోలేద’’న్న అభి్ప్రాయం వ్యక్తం చేశారు. ఇంకొందరు అధ్యయనవేత్తలు సైతం ఈ పరిశోధనపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాఫీ, టీలలో మెదడు, నాడీ వ్యవస్థను ఉత్తేజపరిచే పదార్థాలుంటాయి. వాటిని పరిమితికి మించి తీసుకుంటే కలిగే ప్రమాదాల గురించి వారు హెచ్చరిస్తున్నారు. ఉదాహరణకు గతంలో ఆస్ట్రేలియాలో నిర్వహించిన ఒక అధ్యయనంలో రోజుకు ఆరు కప్పులకు మించి కాఫీ/టీ తాగేవారిలో 53% మందికి డిమెన్షియా వస్తుందని తెలిసిన విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. అందుకే ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ‘‘కేవలం రెండే’’ అన్న పరిమితికి గట్టిగా కట్టుబడి ఉండాలంటున్నారు. ఈ పరిశోధన పలితాలు ప్రముఖ మెడికల్ జర్నల్ ప్లాలస్ మెడిసిన్’ (PLos Medicine)లో ప్రచురితమయ్యాయి.(చదవండి: కిస్మిస్ని నీళ్లల్లో నానబెట్టే ఎందుకు తినాలో తెలుసా..!) -
నో స్ట్రింగ్స్ కాఫీ ఫెస్టివల్..
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన నో స్ట్రింగ్స్ హైదరాబాద్ సంస్థ ఆధ్వర్యంలో కాఫీ ప్రియుల కోసం నగరంలో తొలిసారిగా ది ఇండియన్ కాఫీ ఫెస్టివల్ కొలువుదీరింది. జూబ్లీహిల్స్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటైన ఈ ఫెస్ట్ శుక్రవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఆసియాలోనే తొలి కాఫీ మహిళగా పేరొందిన సునాలిని మీనన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఫెస్టివల్లో భాగంగా కాఫీ ఆర్ట్ సెషన్స్, బరిస్తా డిస్ప్లే, నిపుణుల చర్చలు.. తదితర విశేషాంశాలకు చోటు కల్పించారు. అదే విధంగా కుటుంబాలు, చిన్నారులు, పెట్స్ కోసం విభిన్న రకాల ఈవెంట్స్ కూడా ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. కరాఫా కాఫీ, ట్రూ బ్లాక్ కాఫీ, బిగ్ స్టార్ కేఫ్, అరకు కాఫీ, ఎంఎస్పీ హిల్ రోస్టర్స్.. తదితర ప్రముఖ బ్రాండ్లన్నీ కొలువుదీరాయి. ఈ ఫెస్టివల్ ఈ నెల 15 వరకూ కొనసాగుతుంది. -
ఏపీ కాఫీకి ‘భలే’ డిమాండ్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సాగు చేసే కాఫీ పంట నాణ్యతతో పాటు మంచి రుచికరంగా ఉంటుండడంతో ఏటేటా ఎగుమతులు పెంచుకుంటూ.. తన సత్తా చాటుకుంటోంది. కాఫీ పంట ఉత్పత్తిలో దేశంలోనే నాలుగో స్థానంలో ఏపీ ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో 1,00,963 హెక్టార్లలో కాఫీ సాగవుతుండగా 2022–23 ఆరి్థక సంవత్సరంలో 12,265 మెట్రిక్ టన్నుల కాఫీని ఉత్పత్తి చేసినట్లు తెలిపింది. దేశంలో ఆరు రాష్ట్రాలు, ఈశాన్య ప్రాంతాల్లోనే కాఫీ సాగు అవుతోందని, కాఫీ ఉత్పత్తుల ఎగుమతులు దేశవ్యాప్తంగానూ ఏటేటా పెరుగుతున్నాయని వెల్లడించింది.దేశంలో 2020–21లో కాఫీ ఉత్పత్తుల ఎగుమతులు విలువ రూ.6,027 కోట్లు ఉండగా 2022–23 నాటికి రూ.9,397 కోట్లకు పెరిగిందని కేంద్ర మంత్రిత్వ శాఖ వివరించింది. భారతీయ కాఫీ రంగం అభివృద్ధికి కాఫీ బోర్డు వాణిజ్య విభాగం సంపూర్ణ మద్దతు అందిస్తోందని తెలిపింది. ఇంటిగ్రేటెడ్ కాఫీ డెవలప్మెంట్ ప్రాజెక్టు ద్వారా రీఫ్లాంటేషన్కు, కాఫీ సాగు విస్తీర్ణం పెంచేందుకు చర్యలు తీసుకుంటోందని వివరించింది.కాఫీ సాగు చేసే స్వయం సహాయక సంఘాలు, రైతు ఉత్పత్తిదారులను ప్రోత్సహించడంతో పాటు ఉత్పత్తిని పెంచడానికి అవసరమైన కాఫీ రకాలను అందిస్తున్నట్లు తెలిపింది. అలాగే ఎగుమతి మార్కెట్లో భారతీయ కాఫీని ప్రోత్సహించేలా చర్యలు చేపడుతుందని పేర్కొంది. సాంకేతిక సహాయం అందించడంతో పాటు, కాఫీ తోటల పెంపకం దారులకు క్షేత్రస్థాయి నిర్వహణ, పద్ధతులపై అవసరమైన శిక్షణను వర్క్‌షాపుల ద్వారా కాఫీ బోర్డు వాణిజ్య విభాగం అందిస్తున్నదని వివరించింది. 2022–23 ఆరి్థక సంవత్సరంలో కాఫీ సాగు విస్తీర్ణం, ఉత్పత్తి ఇలారాష్ట్రం పేరు విస్తీర్ణం సాగు (హెక్టార్లు) ఉత్పత్తి (మెట్రిక్ టన్నులు) కర్ణాటక 2,46,550 2,48,020 కేరళ 85,957 72,425 తమిళనాడు 35,685 18,700 ఆంధ్రప్రదేశ్ 1,00,963 12,265 ఒడిశా 4,868 465 ఈశాన్య ప్రాంతాలు 5,647 125 -
ఆఫీసులో బాస్ కొత్త రూల్: పనివేళల్లో..
ఆఫీసులో పని చేసి అలసిపోయినప్పుడు ఉద్యోగులు మధ్యలో విరామం తీసుకోవడంలో భాగంగా కాఫీ కోసం బయటకు వెళ్లారు. ఉద్యోగి ఆఫీసుకు వచ్చిన తరువాత కాఫీ కోసం బయటకు వెళ్ళకూడదు ఆస్ట్రేలియన్ మైనింగ్ బాస్ & మినరల్ రిసోర్సెస్ మేనేజింగ్ డైరెక్టర్ 'క్రిస్ ఎల్లిసన్' ఓ కొత్త రూల్ ప్రవేశపెట్టారు.ఉద్యోగి ఆఫీసుకు వచ్చిన తరువాత కాఫీ తాగాలని బయటకు వెళ్తే, కంపెనీకి నష్టం వాటిల్లుతుందని భావించిన ఎల్లిసన్.. రోజంతా ఉద్యోగులను ఆఫీసులోనే ఉంచడానికి కొత్త రూల్ పాస్ చేశారు. ఇందులో భాగంగానే ఆఫీసులోనే ఉద్యోగులకు కావలసిన సకల సౌకర్యాలు అందించడానికి సన్నద్ధమయ్యారు.ఉద్యోగుల కోసం ఆఫీసులోనే రెస్టారెంట్, జిమ్, స్టాఫ్ సైకాలజిస్ట్‌లు, క్రెచ్ వంటి సౌకర్యాలను ఏపాటు చేయడానికి ఎల్లిసన్ పెట్టుబడి కూడా పెట్టారు. ఇవన్నీ ఆఫీసులోనే ఉంటే ఉద్యోగి బయటకు వెళ్లాల్సిన అవసరం లేదని ఆయన చెబుతున్నారు. ఉద్యోగులు ఓ కప్పు కాఫీ కోసం రోడ్డుపైకి (బయటకు) వెళ్లడం నాకు ఏ మాత్రం ఇష్టం లేదని ఆయన అన్నారు.ఇదీ చదవండి: నన్ను పిచ్చివాడిగా భావించారు.. అంతా అదృశ్యమైంది: అనుపమ్ మిట్టల్ఉద్యోగులు బయటకు వెళ్లడమే కాకుండా.. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం కూడా సరైనది కాదని వెల్లడించారు. కోవిడ్ 19 తరువాత రిమోట్ వర్క్ విధానానికి అనుమతి ఇచ్చిన కంపెనీలను కూడా అయన విమర్శించారు. ఎల్లిసన్ గత ఏడాది వర్క్-ఫ్రమ్-హోమ్ విధానానికి మంగళం పాడేసారు. -
అతిగా కాఫీ తాగడం కూడా ఒక వ్యసనమేనని మీకు తెలుసా!?
రవికుమార్ సాఫ్ట్వేర్ ఇంజినీర్. 29 సంవత్సరాలు. కాలేజీ రోజుల్లో అర్ధరాత్రి చదువుల కోసం కాఫీ తాగడం మొదలుపెట్టాడు. క్రమంగా అది అలవాటుగా మారింది. ఉద్యోగంలో చేరాక పనిలో ఒత్తిడి తట్టుకోవడానికి కాఫీ తీసుకోవడం ఎక్కువైంది. మొదట్లో రోజూ ఒకటి లేదా రెండు కప్పుల కాఫీ తాగేవాడు. కొన్ని సంవత్సరాలుగా అది రోజుకు ఐదారు కప్పులకు పెరిగింది.ప్రతి కప్పులో సుమారు 100–150 మి. గ్రా. కెఫీన్ ఉంటుంది. కాఫీతో పాటు కోలా, ఎనర్జీ డ్రింక్స్ కూడా తాగడం వల్ల అతను రోజూ 600 మి. గ్రా. కంటే ఎక్కువ కెఫీన్ తీసుకుంటున్నాడు. ఇది రోజువారీ పరిమితి కంటే 400 మి. గ్రా. ఎక్కువ. ఇప్పుడు కాఫీ లేదా సాఫ్ట్ డ్రింక్ తాగకుండా ఉండలేని పరిస్థితికి వచ్చాడు. మానాలని ప్రయత్నించినా సాధ్యంకావట్లేదు. కాఫీ మానేస్తే విపరీతంగా తలనొప్పి. నిద్ర పట్టట్లేదు. డాక్టర్‌ను కలిశాడు. అతను కాఫీకి అడిక్ట్ అయ్యాడని, మానేయమని చెప్పాడు. మానేశాడు. మళ్లీ తలనొప్పి, నిద్ర పట్టకపోవడం మామూలయ్యాయి. దాంతో డాక్టర్ సలహా మేరకు సైకాలజిస్ట్‌ని సంప్రదించాడు. సైకాలజీ అనగానే ఆశ్చర్యపోయాడు రవికుమార్. ‘ఏంటి సర్, కాఫీ తాగడమేమైనా మెంటల్ ఇల్నెసా? దానికి కూడా సైకాలజిస్ట్‌ను కలవాలా?’ అని అడిగాడు.‘అతిగా ఏ పని చేసినా అది వ్యసనమే. కాఫీ వ్యసనంగా మారడం, దాన్నుంచి బయటపడలేకపోవడం కూడా ఒక మానసిక సమస్యే. ఒక పద్ధతి ప్రకారం దాన్నుంచి బయటపడాలి. అందుకు సైకోథెరపీ అవసరం’ అని డాక్టర్ చెప్పారు. దాంతో సైకాలజిస్ట్‌ని సంప్రదించాడు రవికుమార్.మూడు నెలల చికిత్స తర్వాత, రవి విజయవంతంగా రోజుకు ఒక కప్పు కాఫీకి మాత్రమే పరిమితమయ్యాడు. విత్ డ్రాయల్ లక్షణాలేవీ కనిపించలేదు. కెఫీన్ పై ఆధారపడకుండానే పని చేయగలుగుతున్నాడు. ఇప్పుడు మరింత ఎనర్జిటిక్‌గా, కంట్రోల్డ్‌గా ఉంటున్నాడు.కెఫీన్ వ్యసనం లక్షణాలు..– కాఫీ లేదా ఎనర్జీ డ్రింక్ తాగనప్పుడు తలనొప్పి.– పని ముగించుకుని అలసిపోయినప్పటికీ, రాత్రి నిద్ర పట్టకపోవడం, దీర్ఘకాలిక నిద్ర లేమి.– తక్కువ వ్యవధిలో ఎక్కువ కాఫీ తాగినప్పుడు విశ్రాంతి లేకపోవడం, ఆత్రుత, చికాకు. – స్ట్రాంగ్ కప్ కాఫీ లేకుండా దినచర్య మొదలుపెట్టలేకపోవడం. పని, మీటింగ్స్ అన్నీ కెఫీన్పై ఆధారపడటం. – కెఫీన్ తీసుకోవడం తగ్గించడానికి ప్రయత్నించినప్పుడు, పనితీరు పేలవంగా మారడం. – ఉద్యోగంలో పని ఒత్తిడిని, డిమాండ్స్‌ను ఎదుర్కోవడానికి ఎక్కువ కెఫీన్ తీసుకోవడం. – సరైన ఆహారం, వ్యాయామం వంటి వాటిని వదిలేయడం. శక్తి కోసం కెఫీన్ పై మాత్రమే ఆధారపడటం.విత్ డ్రాయల్ లక్షణాలు..– కాఫీ మానేసిన 24 గంటల్లో తీవ్రమైన తలనొప్పి.– విపరీతమైన అలసట, మామూలు పనులు కూడా చేయలేకపోవడం.– ఆందోళన, కుంగుబాటు.. ఏదో కోల్పోయిన ఫీలింగ్, ఏదో జరుగుతుందన్న భయం. – పనిపై ఏమాత్రం దృష్టి పెట్టలేకపోవడం, గడువులోపు పూర్తి చేయలేకపోవడం, చేసిన పనిలో తప్పులు.నిదానంగా, పద్ధతిగా..హఠాత్తుగా కాఫీ మానేయడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని గుర్తించిన రవి, వైద్యుని సలహా మేరకు మొదట రోజుకు నాలుగు కప్పులు మాత్రమే తీసుకున్నాడు. ఆ తర్వాత మూడు, ఆ తర్వాత రెండు కప్పులకు పరిమితమయ్యాడు. – నెమ్మదిగా కెఫీన్ లేని కాఫీ, హెర్బల్ టీలకు మారాడు. ఒత్తిడిని తట్టుకునేందుకు కాఫీపై ఆధారపడకుండా ఉండటానికి కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (సీబీటీ) చికిత్స తీసుకున్నాడు. – కెఫీన్ పై ఆధారపడకుండా పని సంబంధిత ఒత్తిడిని నిర్వహించడానికి మెలకువలను నేర్చుకున్నాడు. – మైండ్‌ఫుల్‌నెస్, శ్వాస వ్యాయామాలు, పని సమయంలో విరామాల ద్వారా ఒత్తిడిని అధిగమించాడు. సమతుల ఆహారం, క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం, స్థిరమైన నిద్రతో కూడిన ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాడు. కెఫీన్ నుంచి వచ్చే శక్తిని సరైన పోషకాహారం, శారీరక శ్రమ ద్వారా వచ్చే సహజ శక్తితో భర్తీ చేశాడు.– అతను కాఫీ లేదా సాఫ్ట్ డ్రింక్ వైపు వెళ్లినప్పుడు వారిస్తూ కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా మద్దతుగా నిలిచారు.– సైకాలజిస్ట్ విశేష్ -
హెల్దీ తిండి.. కొత్త ట్రెండీ
వీలైతే నాలుగు రకాల స్నాక్స్.. కుదిరితే కప్పు కాఫీ.. సాయంత్రమైతే చాలు. విశాఖ వాసి మదిలో మెదిలో మొదటి ఆలోచన ఇదే. చిరుతిండి.. మన జీవితాల్లో భాగమైపోయింది. టీ తాగుతూ స్నాక్స్.. సాయంత్రం సరదాగా స్నాక్స్.. ఇంటికి చుట్టాలొస్తే స్నాక్స్.. చినుకుపడినా.. సమయమేదైనా.. స్నాక్స్ తిందాం మిత్రమా అన్నట్లుగా చిరుతిళ్లపై మనసు మళ్లిస్తున్నారు. అయితే.. ఈ మధ్య కాలంలో చిరుతిళ్లలోనూ ఆరోగ్యాన్ని వెదుకుతున్నారు. విశాఖ సహా 30 నగరాల్లో స్నాక్స్ విక్రయాలు, ప్రజల ఇష్టాయిష్టాలపై ప్రముఖ స్నాక్స్ తయారీ సంస్థ ఫార్మ్‌లే విడుదల చేసిన ది హెల్దీ స్నాకింగ్–2024 నివేదిక పలు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది. చిరుతిళ్లలో పోషకాల స్నాక్స్ వేరయా.. అవే మాకు ఇష్టమయా అంటూ 73 శాతం మంది చూసి మరీ తింటున్నారంట. మార్కెట్లోకి బెస్ట్ స్నాక్స్ ఏమొచ్చాయో అని ప్రతి 10 మందిలో తొమ్మిది మంది వెతుకుతున్నారని నివేదిక చెబుతోంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చిరుతిళ్లకు గిరాకీ పెరుగుతోంది. టీ, కాఫీ తాగుతున్నప్పుడు వేడి వేడి సమోసా లేదంటే.. బిస్కెట్లు ఉండాల్సిందే. లంచ్, డిన్నర్‌కి మధ్య స్నాక్స్ టైమ్ ఫిక్సయిపోయింది. అందుకే భారతీయులకు చిరుతిండి ఇష్టంగా మారిపోయింది. అయితే ఇటీవల ఆహార పదార్థాల కల్తీపై ఆందోళనల నేపథ్యంలో.. స్నాక్స్ ఎంపికలోనూ జాగ్రత్త పడుతున్నారు. భారతీయులు ఎలాంటి స్నాక్స్ ఇష్టపడుతున్నారనే వివరాలను తెలుసుకునేందుకు ఫార్మ్‌లే దేశవ్యాప్తంగా 30 నగరాల్లో సర్వే చేసింది.ఈ వివరాలతో ది హెల్దీ స్నాకింగ్–2024 అనే నివేదికను విడుదల చేసింది. నగరంలోనూ సర్వే నిర్వహించగా.. ఆకలేస్తే పక్కనే ఉన్న దుకాణానికి వెళ్లి రెండు బంగాళాదుంప చిప్స్ ప్యాకెట్లు లేదా బేకరీకి వెళ్లి సమోసా తినే రోజులు పోయాయని విశాఖ వాసులు చెప్పారంట.! కొనేది చిన్న ప్యాకెట్ అయినా.. అందులో ఏం ఇంగ్రిడియంట్స్ ఉన్నాయి? వాటిలో పోషకాల విలువెంత? అవి తింటే వచ్చే అనర్థాలేమైనా ఉన్నాయా? ఇలా ప్రతి విషయంలోనూ మిస్టర్ పర్ఫెక్ట్లమని తెగేసి చెబుతున్నారు. మార్కెట్ ట్రెండ్.. మారిపోయిందండోయ్.. ప్రస్తుతం ఫుడ్ ప్యాకేజీ మార్కెట్‌ని స్నాక్స్ సంస్థలే శాసిస్తున్నాయి. దేశవ్యాప్తంగా రూ.3.75 ట్రిలియన్ల ఫుడ్ ప్యాకేజీ ఇండస్ట్రీ ఉండగా.. ఇందులో 33.4 శాతం వరకూ స్నాక్స్, స్వీట్స్ పరిశ్రమలు ఆక్రమించేసుకున్నాయి. ఆరోగ్యకరమైన స్నాక్స్‌ని ఇష్టపడుతున్నారని తెలిసి.. వాటి తయారీ పైనే ఆసక్తి చూపిస్తున్నాయి. శరీరంలో తక్కువ కొవ్వు ఉత్పత్తి చేసే పాపింగ్, బేకింగ్, ఎయిర్ఫ్రైయింగ్, వాక్యూమ్ ఫ్రైయింగ్ మొదలైన ప్రాసెస్ విధానంలో తయారు చేసే స్నాక్స్ ఎక్కువగా మార్కెట్లో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా డీప్ ఫ్రై చేసిన స్నాక్స్‌తో పోలిస్తే 75 శాతం కేలరీలను తగ్గిస్తాయనే ఉద్దేశంతో ఎయిర్ ఫ్రయర్ స్నాక్స్‌కే మొగ్గు చూపుతున్నారు.బ్రాండెడ్ స్నాక్స్ కావాలి ఒకప్పుడు స్నాక్స్ ప్యాకెట్ తీసుకుంటే కేవలం ఎక్స్పైరీ డేట్ మాత్రమే చూసేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. స్నాక్స్ కొనుగోలు చేసినప్పుడు ఫస్ట్ అవి బ్రాండెడ్ సంస్థలు తయారు చేస్తున్నాయా లేదా అని చూస్తున్నారు. అంతేకాదండోయ్.. ప్రతి 100 మందిలో 73 మంది మాత్రం అందులో పోషకాలు ఏం ఉన్నాయి.? సోడియం కంటెంట్ ఎంత ఉంది.? అవి తినడం వల్ల కొవ్వు శరీరంలో పెరుగుతుందా లేదా.? ఆరోగ్యానికి హానికరమైన ముడిపదార్థాలేమైనా ఉన్నాయా అనేది కచ్చితంగా చెక్ చేస్తున్నారు.మిల్లెట్ల వైపు దృష్టి.. ఇప్పుడిప్పుడే స్నాక్స్ ప్లేస్‌లో మిల్లెట్స్ వినియోగిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. సాయంత్రం సమయంలో బిస్కెట్, సమోసా, బజ్జీ, ఆలూ చిప్స్ మొదలైన వాటి స్థానాలను బాదం, పిస్తా, ఖర్జూరం, జీడిపప్పు, తృణధాన్యాలు, మొలకలు ఆక్రమించేస్తున్నాయి. కొన్ని సంస్థలు ఈ మిల్లెట్స్‌ను ప్యాకేజింగ్ ఫుడ్‌గా మార్చేసి మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. 2025 నాటికి మిల్లెట్ స్నాక్స్ 20 శాతానికి చేరుతాయని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ అంచనా వేస్తోంది.స్నాక్స్ ప్లేస్‌ను పప్పుగింజలు ఆక్రమించుకుంటున్నాయి ఒకప్పుడు ఇంట్లో స్నాక్స్ తయారు చేసి.. వాటినే తినేవారు. ఇప్పుడు కాలం మారిపోయింది. ప్యాకేజ్డ్ స్నాక్స్ రావడంతో వాటిపైనే మొగ్గు చూపుతున్నారు. ఇవి ఆరోగ్యానికి హానికరమని తెలుసుకున్నారు. దీంతో స్నాక్స్ స్థానాన్ని పప్పుగింజలు ఆక్రమించేసుకున్నాయి. ముఖ్యంగా బాదం, పిస్తా వంటివాటికే ఓటేస్తున్నారు. ప్రోటీన్, కాంప్లెక్స్, కార్బొహైడ్రేట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు తగినంతగా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. యాంటీఆక్సిడెంట్, విటమిన్ ఈ వంటివి ఉండే బాదంను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. తృణధాన్యాలు, పప్పుగింజలు పోషకాలు అవసరమైన విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటాయి. అందుకే చిరుతిళ్లలో పప్పుగింజలు తీసుకునేవారి సంఖ్య పెరుగుతోంది. – షీలా కృష్ణస్వామి, పోషకాహార నిపుణురాలు -
'మష్రూమ్ కాఫీ'ని ఎప్పుడైనా తాగారా! కొందరికి ఇదీ..?
మష్రూమ్ వంటకాల గురించి తెలిసిన చాలామందికి ‘మష్రూమ్ కాఫీ’ గురించి తెలియకపోవచ్చు. నిజానికి ఇది లేటెస్ట్ కాఫీ ఏమీ కాదు. 1930 నుంచే ఆహా అనిపిస్తోంది. ఔషధ పుట్టగొడుగుల నుంచి దీన్ని తయారు చేస్తారు.ఈ కాఫీ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి...– మంచి నిద్రకు ఉపయోగపడుతుంది.– మష్రూమ్ కాఫీలోని అడా΄్టోజెనిక్ శరీరానికి మేలు చేస్తుంది. ఒత్తిడి నుంచి బయటపడడానికి ఉపయోగపడుతుంది.– రోగనిరోధక శక్తి పెరుగుతుంది.– ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది.– గొంతు కండరాలను రిలాక్స్ చేస్తుంది. యాంటీ యాక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.– పుట్ట గొడుగులలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ మెరుగుపడడానికి ఉపయోగపడుతుంది.– వీటిలో అధికంగా ఉండే విటమిన్ బి అలసట తగ్గిస్తుంది. ఎనర్జీ లెవెల్స్ పెంచుతుంది.– మామూలు కాఫీలో కంటే కెఫిన్ తక్కువగా ఉంటుంది.– ఏకాగ్రతను పెంచుతుంది.ఈ కాఫీని మామూలు కాఫీలాగే తయారు చేస్తారు. అయితే మష్రూమ్ పౌడర్ కలుపుతారు. ‘మామూలు కాఫీకి ప్రత్యామ్నాయ కాఫీకి’గా మష్రూమ్ కాఫీ గురించి చెబుతున్నటికి దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా మష్రూమ్ అలెర్జీ ఉన్నవారు ఈ కాఫీకి దూరంగా ఉండాలి. దద్దుర్లు, చాతీలో నొప్పి, కడుపులో నొప్పి, వాంతి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది... మొదలైనవి మష్రూమ్ అలర్జీ లక్షణాలు. మూత్రపిండాల సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ఈ కాఫీ సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తుందని అంటున్నారు నిపుణులు. జీర్ణ సమస్యలు ఉన్నవారు కూడా మష్రూమ్ కాఫీని సేవించాలనుకోవడానికి ముందు డైటీషియన్‌ను సంప్రదించడం మంచిది. -
ఈ మందులు ఉదయం కాఫీతో తీసుకుంటున్నారా..?
చాలామంది తమ ఉదయాన్ని కప్పు కాఫీతో ప్రారంభిస్తారు. అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవాళ్లు మార్నింగ్ కాఫీతోనే పరగడుపు మాత్రలు తీసుకుంటుంటారు. చాలావరకు కప్పు కాఫీతో మందులు మిక్స్ చేసి తీసుకుంటారు. అయితే ఇలా తీసుకోవడం మంచిది కాదని, వివిధ దుష్ప్రభావాలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇంతకీ ఏఏ మందులు కాఫీతో కలిపి తీసుకోకూడదో సవివరంగా తెలుసుకుందామా..!కాఫీ కడుపుని ప్రేరేపించి జీర్ణవ్యవస్థ ఆహారాన్ని తీసుకునే సమయాన్ని మారుస్తుంది. మందులు మింగే వారికి ఈ కాఫీ వాటితో రియాక్షన్ చెంది రక్తప్రవహంలోకి శోషించటానికి ఎక్కువ వ్వవధి తీసుకునేలా చేస్తుంది. ఇది మానువుల జీవక్రియ, విసర్జనపై గణనీయమైన ప్రభావం చూపి అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు నిపుణులు. కాఫీతో తీసుకోవడం నివారించాల్సిన మందులు..యాంటీబయాటిక్స్ కేంద్ర నాడీ వ్యవస్థను ప్రేరేపించి.. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ని నిరోధించడంలో సహాయపడతాయి. ఇక్కడ కాఫీ కూడా ఒక ఉద్దీపన కాబట్టి ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల అశాంతి, నిద్రలేమి దారితీస్తుంది లేదా దీర్ఘకాలంలో నిద్రలేమికి కారణమవుతుంది.ఫెక్సోఫెనాడిన్ వంటి అనేక ఇతర అలెర్జీ ఔషధాలను కాఫీతో తీసుకోకూడదు. ఎందుకంటే ఇది మీ కేంద్ర నాడీ వ్యవస్థను ఎక్కువగా ప్రేరేపిస్తుంది - విశ్రాంతి లేకపోవడం వంటి లక్షణాలను పెంచుతుంది.థైరాయిడ్ మందులుహైపో థైరాయిడిజం ఉన్నవారికి - తగినంత థైరాయిడ్ హార్మోన్‌ను ఉత్పత్తి అవ్వదు. దీంతో బరువు పెరగడం, పొడి చర్మం, కీళ్ల నొప్పులు, తీవ్రమైన జుట్టు రాలడం మహిళల్లో క్రమరహిత రుతుక్రమాలు వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి, హార్మోన్లను సమతుల్యం చేయడం కోసం థైరాయిడ్ మందులు తీసుకునేవారు కాఫీతో తీసుకుంటే గనుకు ఆ మందులు తక్కువ ప్రభావవంతంగా ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. కాఫీ థైరాయిడ్ మందుల శోషణను సగానికి పైగా తగ్గిస్తుంది అని వైద్యులు చెబుతున్నారు.ఆస్తమా మందులుఆస్తమా మందులు ఊపిరితిత్తులలోని కండరాలను సడలించి, వాయు వాయుమార్గాలను విస్తరించేలా చేసి..సులభంగా శ్వాస తీసుకునేలా చేస్తాయి. ఇక్కడ కెఫీన్ ఒక తేలికపాటి బ్రోంకోడైలేటర్. ఇది ఈ ఔషధాల ప్రభావాన్ని తగ్గిస్తుంది. అంతేగాదు ఈ బ్రోంకోడైలేటర్లను మందులతో కలిపి తీసుకోవడం వల్ల తలనొప్పి, విశ్రాంతి లేకపోవడం, కడుపు నొప్పి, చిరాకు వంటివి కూడా ముఖ్యంగా పిల్లలలో కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు.మధుమేహం మందులుకాఫీని చక్కెర లేదా పాలతో కలపడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తక్షణమే పెరుగుతాయి. అందువల్ల మధుమేహం మందులు అంతబాగా ప్రభావితంగా పనిచెయ్యవు. పైగా మధుమేహం ఉన్నవారికి కెఫీన్ లక్షణాలను కూడా తీవ్రతరం చేస్తుందని వైద్యులు చెబుతున్నారు.అల్జీమర్స్ ఔషధంఅల్జీమర్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణాలలో ఒకటి. ఎక్కువగా 65 ఏళ్లు పైబడిన వారిని ప్రభావితం చేస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది ఒకరకమైన మెదడు రుగ్మత లేదా అభిజ్ఞా పనితీరును కోల్పోవడం. దీనివల్ల రోజువారీ పనులను ఆలోచించడం, గుర్తుంచుకోవడం లేదా చేయడం చాలా కష్టం.అల్జీమర్స్‌తో నివసించే మిలియన్ల మంది ప్రజలు ఈ పరిస్థితికి మందులు తీసుకుంటారు. అయినప్పటికీ, డోపెజిల్, రివాస్టిగ్మైన్, గెలాంటమైన్ వంటి మందులు కెఫిన్ ద్వారా ఎక్కువగా ప్రభావితమవుతాయని వైద్యులు చెబుతున్నారు. కెఫిన్ రక్తం, మెదడు మధ్య అవరోధాన్ని బిగించి, ఔషధ ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఈ అల్జీమర్స్ మందులు న్యూరోట్రాన్స్మిటర్, ఎసిటైల్కోలిన్ను రక్షించడం ద్వారా పని చేస్తాయి. ఇక్కడ ఎప్పుడైతే అధిక మొత్తంలో కాఫీ తీసుకుంటామో అప్పుడు ఈ కెఫీన్ ఆ రక్షణ ప్రభావాన్ని దెబ్బతీస్తుందని పరిశోధనలో తేలిందని వివరించారు ఆరోగ్య నిపుణులు. (చదవండి: మార్నింగ్ టైం అనేక అలారాలు సెట్ చేస్తున్నారా?) -
తప్పు చేశాం.. కప్పు కాఫీ తాగండి..!
మైక్రోసాఫ్ట్ విండోస్‌లో ఇటీవల తలెత్తిన్న అంతరాయానికి కారణమైన క్రౌడ్‌స్ట్రైక్ తన వినియోగదారులకు ఉబర్ ఈట్స్ కూపన్కార్డు ఇచ్చి క్షమాపణలు కోరింది. విండోస్ యూజర్లకు ఇటీవల ‘బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్’ మేసేజ్ రావడంతో వారి విధులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అంతర్జాతీయ విమానరంగం, ఆరోగ్య సంరక్షణ రంగంతో పాటు అత్యవసర సేవలకు తీవ్ర ఆటంకం కలిగింది. దాదాపు ప్రపంచ వ్యాప్తంగా 85 లక్షల కంప్యూటర్లు క్రాష్ అయినట్లు అంచనా. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు సెక్యూరిటీ సేవలందించే క్రౌడ్‌స్ట్రైక్ సంస్థ ఈ ఘటన వల్ల ప్రభావితమైన యూజర్లకు 10 డాలర్ల (రూ.830) విలువ చేసే ఉబర్ ఈట్స్ కూపన్‌ను ఇచ్చి క్షమాపణలు కోరింది. ఈ మేరకు ఈమెయిల్లో కూపన్ వివరాలు పంపించింది.క్రౌడ్‌స్ట్రైక్ పంపించిన ఈమెయిల్లో..‘జులై 19న ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సర్వీసుల్లో కలిగిన అంతరాయానికి చింతిస్తున్నాం. వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నాం. సాంకేతిక సమస్యను గుర్తించి దాన్ని పరిష్కరించేలా సహకరించినందుకు ధన్యవాదాలు. ఓ కప్పు కాఫీ లేదా స్నాక్స్‌తో మీకు కృతజ్ఞతలు తెలపాలనుకుంటున్నాం. కూపన్ కోడ్‌ని ఉపయోగించడం ద్వారా ఉబర్ ఈట్స్ క్రెడిట్‌ని యాక్సెస్ చేసుకోవచ్చు’ అని తెలిపింది. ఇదిలాఉండగా, వోచర్‌ను రెడీమ్ చేయడంలో కొందరు వినియోగదారులు సమస్యలను ఎదుర్కొంటున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.ఇదీ చదవండి: జీఎస్టీ శ్లాబులు తగ్గింపు..?మైక్రోసాఫ్ట్ అంతరాయం వెనుక ఉన్న సైబర్ సెక్యూరిటీ సంస్థ క్రౌడ్‌స్ట్రైక్ భారీ నష్టాన్నే మూటకట్టుకుంది. విండోస్‌కు సెక్యూరిటీ సేవలు అందించే ఈ సంస్థ చేసిన ఫాల్కన్ సెన్సార్ సాఫ్ట్వేర్ అప్డేట్లో లోపం కారణంగా చాలా దేశాల్లోని కంప్యూటర్లలో అంతరాయం ఏర్పడింది. దీంతో పలు విమానయాన, బ్యాంకింగ్, మీడియా సంస్థలు సహా రైల్వే, టీవీ, రేడియో, ఆస్పత్రి సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి. -
మంకీ స్పిట్ కాఫీ: ఛీ..యాక్ అలానా తయారీ..!
కాఫీ ఘమఘములుకు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. తాగే అలవాటు లేనివారైన సైతం నోరూరించేలా చేస్తుంది. అలాంటి కాఫీ పొద్దుపొద్దునే పడకపోతే రోజు మొదలవ్వుదు చాలమందికి. అటువంటి కాఫీలో రకరకాల వెరైటీలు ఉన్నాయి. అయితే కొన్ని రకాల కాఫీలు పేర్లు మనకు తెలిసి ఉండే అవకాశమే లేదు. అవి అత్యంత ఖరీదు కూడా. ఈ ఖరీదైన కాపీలలో ఒకటిగా పేరగాంచిందే మంకీ స్పిట్ కాఫీ. ఏంటీ కోతి పేరుతో పిలిచే కాఫీనా అనే కదా..!. దీని తయారీ విధానం కూడా అత్యంత విచిత్రంగా ఉంటుంది. బాబాయ్..! ఎలా తాగుతారురా దీన్ని అనిపిస్తుంది కూడా. అయితే ఈ కాఫీ మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుందట.భారతదేశంలోని చిక్‌మగళూరు నుంచి అరకు వరకు అరబికా, రోబస్టా బీన్స్‌తో చేసే కాఫీలు ఫేమస్. ఇవే ప్రపంచంలోనే అత్యుత్తమమైనవిగా పరిగణిస్తారు. కానీ వీటికి మించి అత్యత్తుమమైన రుచితో కూడిన ఖరీదైన కాఫీ మరొకటి ఉంది. అదే మంకీ స్పిట్ కాఫీ. భారతదేశంలోని తైవాన్‌లో లభించే అరుదైన కాఫీ గింజలు ఇవి. ఇవి మంకీల సాయంతో సేకరిస్తారు. వాటి కారణంగానే ఈ కాఫీ గింజలకు అంత రుచి వస్తుందట. ఎలా తయారు చేస్తారంటే..ఈ కాఫీ అరబిక్ కాఫీ పండ్లతోనే తయారు చేస్తారు. అయితే ఇక్కడ ప్రాసెస్ చేసే విధానం కాస్త అసాధారణంగా ఉంటుంది. ముందుగా ఈ కాఫీ గింజలను చిక్మగళూరులోని రీసస్ కోతులు తిని ఉమ్మి వేస్తాయి. ఇవి కాఫీ తోటల చుట్టూ తిరుగుతూ బాగా పండిన రుచికరమైన కాఫీ బెర్రీలను తింటాయట. ది బెస్ట్ కాఫీ గింజలు వాటికే తెలుస్తాయట. అవి కాఫీ గింజల బయట పొర, గుజ్జును తినేసి లోపలి గింజలను ఉమ్మివేస్తాయి. అవి అలా కాఫీ గింజలను ఉమ్మివేయడంతో ఒక రకమైన రసాయన చర్యకు గురవ్వుతాయట. కోతి నోటిలోని అమైలేస్ అనే ఎంజైమ్ ఈ గింజలకు ప్రత్యేక రుచిని ఇస్తాయట. ఇలా కోతులు ఉమ్మివేసిన కాఫీ గింజలను సేకరించి శుభ్రం చేసి గ్రైండ్ చేస్తారట. సాధారణం ఈ కాఫీ గింజలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. దాని పంటి కింద పడి బయటకు ఉమ్మి రూపంలో వచ్చినప్పుడూ బూడిదరంగులో ఉంటాయట. వాటిని ఎండబెట్టి, కాల్చి ప్రాసెస్ చేస్తారట. ఇది ఎంతో తియ్యగా సుగంధభరితంగా ఉంటుందట. చెప్పాలంటే చాక్లెట్ ఫ్లేవర్‌తో కూడిన చేదుతో ఉంటుందట. అందువల్ల దీన్ని మంకీ కాఫీ లేదా మంకీ పార్చ్మెంట్ కాఫీ అని కూడా పిలుస్తారు. నిజానికి ఇలా కోతులు కాఫీ తోటల్లో చిందర వందరగా పడేసిన కాఫీ గింజలను వ్యర్థాలుగా భావించేవారు. 2000 ప్రారంభం నుంచి జంతు సహాయక కాఫీ గింజలతో లాభాలు ఆర్జించడం మొదులు పెట్టాక కోతులను పంటల్లోకి వచ్చేలా రైతులే ఆహ్వానించడం ప్రారంభించారు. వాటి సాయంతోనే మంచి కాఫీని తయారు చేయడం ప్రారంభించారు. కోతులు పసిగట్టినట్లుగా మంచి కాఫీ గింజలను సేకరించడం మనుషుల వల్ల కాదని అక్కడి ప్రజలు చెబుతుండటం విశేషం. ఈ కాఫీ సాధారణ కాఫీలన్నింటి కంటే అత్యంత ఖరీదైనది కూడా.(చదవండి: కమలా హారిస్ ఇష్టపడే సౌత్ ఇండియన్ వంటకం ఇదే..!) -
Filter Coffee: అటు ప్రిపరేషన్.. ఇటు ఫిల్టరేషన్
హైదరాబాద్ అనగానే మనకు గుర్తొచ్చేది ఒకటి బిర్యానీ అయితే మరొకటి ఇరానీ చాయ్.. సాయంత్రం అయ్యిందంటే చాలు.. నలుగురూ ఒకచోట చేరి చాయ్ తాగుతూ ముచ్చట్లు పెడుతుంటారు. ఇక పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారు రోజంతా పుస్తకాలతో కుస్తీ పట్టి సాయంత్రం కాస్త సేదతీరుతుంటారు. ఓ కప్పు టీ తాగితే ఉంటుంది భయ్యా.. శిరోభారం హుష్ కాకి అన్నట్టే.. అయితే..చాయ్ మాత్రమే కాదు.. చాలా మంది కాఫీ ప్రియులు కూడా ఉంటారు.. అలా గ్లాసులో కాఫీ పట్టుకొస్తుంటే.. ఆ రంగు.. ఆ అరోమా చూస్తే చాలు ఏదో తెలియని అనుభూతి. అలాంటి కాఫీ కోసం ఎక్కడికో వెళ్లనక్కర్లేదు.. జస్ట్ అలా అశోక్‌నగర్ వెళ్తే చాలు. ⇒ పర్ఫెక్ట్ ఫిల్టర్ కాఫీకి కేరాఫ్ అడ్రస్..⇒ ఇద్దరు అభ్యర్థుల వినూత్న ప్రయత్నం⇒ అశోక్‌నగర్‌లో ప్రత్యేక ఆకర్షణగా ⇒ మీమ్స్‌తో ఆకట్టుకుంటున్న యువత దక్షిణాదిలో ముఖ్యంగా తమిళనాడు, కేరళ, కర్ణాటకలో కాఫీకి ఫ్యాన్స్ ఎక్కువ. ముఖ్యంగా ఫిల్టర్ కాఫీ ప్రియులు చాలా మంది ఉంటారు. మన దగ్గర కూడా ఫిల్టర్ కాఫీ ప్రియులు చాలా మందే ఉన్నారు. కాకపోతే ఫిల్టర్ కాఫీ అంత సులువుగా దొరకదు. చాలా ప్రాంతాల్లో ఇన్స్టంట్ కాఫీయే దొరుకుతుంది. అందుకే ఆ ఖాళీని భర్తీ చేసేందుకు ఫిల్టర్ కాఫీ ప్రియుల కోసం కాఫీపురం పేరుతో చిన్న కేఫ్‌ను స్థాపించారు.అడుగడుగునా మీమ్స్.. ఇప్పుడు ఇన్‌స్టా, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో మీమ్స్ తెగ వైరల్ అవుతున్నాయి. యువతను చాలా ఆకట్టుకుంటున్నాయి. ఈ ట్రెండ్‌ను వీరు ఒడిసి పట్టుకున్నారు. కేఫ్‌లో ఎక్కడ చూసినా కామెడీ మీమ్స్‌తో కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. పేమెంట్ క్యూఆర్ కోడ్ వద్ద, సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పేందుకు కూడా మీమ్స్‌నే వాడుతున్నారు. చిక్కమగళూరు కాఫీ, కూర్గ్ కాఫీ, అరకు కాఫీ, బీఆర్ హిల్స్ కాఫీ వంటి కాఫీ వెరైటీలను ప్రత్యేకంగా గ్రేడింగ్ చేయించి తెప్పిస్తున్నారు. జస్ట్ అలా షాప్‌లోకి అడుగు పెడితే చాలు కాఫీ అరోమాతో ముక్కుపుటాలు అదిరిపోతాయనడంలో అతిశయోక్తి లేదు.యూపీఎస్సీ అభ్యర్థుల వినూత్న ప్రయత్నం..వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతూ.. కిశోర్ సంకీర్త్, కె.అభినయ్ అనే అభ్యర్థులు ఈ కేఫ్‌ను స్థాపించారు. కాస్త వినూత్నంగా ఆలోచించి దీనికి కాఫీపురం అని పెట్టారు. కాఫీ గింజలను ప్రత్యేకంగా పశ్చిమ కనుమలు, అరకు నుంచి తెప్పించి మరీ కాఫీ తయారు చేస్తున్నారు. మరో ప్రత్యేకత ఏమిటంటే కచ్చితంగా అందరికీ స్టీలు గ్లాసుల్లోనే అందిస్తున్నారు. వాడిన గ్లాసులను స్టీమ్ ద్వారా స్టెరిలైజ్ చేస్తారు. పరిశుభ్రతతో పాటు మంచి ఫిల్టర్ కాఫీ అనుభూతిని అందించడమే తమ ప్రథమ లక్ష్యమని చెబుతున్నారు.అథెంటిక్ కాఫీ ఇవ్వాలని..హైదరాబాద్‌లో అథెంటిక్ ఫిల్టర్ కాఫీ చాలా అరుదుగా దొరుకుతుంది. పుస్తకాలతో కుస్తీ పట్టి అలా సేదతీరాలనుకునే వారి కోసం ఈ కేఫ్ పెట్టాను. ఫ్రెండ్స్‌తో కలిసి మాట్లాడుతుంటే ఈ ఆలోచన వచి్చంది. – కిశోర్ సంకీర్త్, వ్యవస్థాపకుడుఫిల్టర్ కాఫీ కోసమే వస్తాను.. యూపీఎస్సీ ప్రిపరేషన్ కోసం ఇక్కడికి వచ్చాను. మాది కర్ణాటక. ఎక్కువగా ఫిల్టర్ కాఫీ తాగుతాను. చాలాచోట్ల ఫిల్టర్ కాఫీ కోసం వెతికాను. చివరకు కాఫీపురం గురించి తెలుసుకుని, ప్రతిరోజూ ఇక్కడికి వచ్చి కాఫీ తాగనిదే రోజు గడవదు. –స్ఫూర్తి, బెంగళూరు, యూపీఎస్సీ అభ్యర్థిప్రభుత్వ ఉద్యోగం నా కల.. కేఫ్ నిర్వహణ నా చదువుకు ఇబ్బంది కాకుండా ప్లాన్ చేసుకుంటాను. పకడ్బందీగా షెడ్యూల్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాను. ప్రభుత్వ ఉద్యోగం సాధించడం నా కల. అలాగే భవిష్యత్తులో కాఫీ షాప్‌ను మరింత ముందుకు తీసుకెళ్లాలనేదే నా కోరిక. – కపాడం అభినయ్, కాఫీపురం కో–ఫౌండర్ -
మోదీ ఇష్టపడే అరకు వ్యాలీ కాఫీ..ప్రత్యేకత ఇదే..!
కాఫీ ఘుమఘుమలకు వహ్..! అని కితాబిస్తు ఒక్క సిప్ చేసేందుకు తహతహలాడుతుంటాం. అలాంటి టేస్టీ కాఫీ మన ప్రధాని మోదీ మనసును కూడా దోచుకుంది. ఆయన ప్రత్యేకంగా ఇష్టపడే అరకు వ్యాలీ కాఫీ గురించి తరుచుగా చెబుతుంటారు. ఆంధ్రప్రదేశ్‌లోని అరకులోయలో ప్రసిద్ధి గాంచిని కాఫీ రుచికి మోదీ సైతం పిదా అయ్యారు. మన్‌కీ బాత్ 111వ ఎపిసోడ్లో ఆ కాఫీ గురించి ప్రస్తావిస్తూ ప్రశంసలు కురిపించారు. గతేడాది సెప్టెంబర్ 2023లో భారతదేశం నిర్వహించిన జీ20 సదస్సులో కూడా అరకు కాఫీ గురించి హైలెట్ చేస్తూ మాట్లాడారు. అంతేగాదు మన అరకు కాఫీకి దేశ ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు. అవకాశం దొరికినప్పుడల్లా అరకు కాఫీని గుర్తు తెచ్చుకుంటారు ఆయన. ముచ్చటగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలి మన్ కీ బాత్‌లో మరోమారు అరకు కాఫీని ప్రశంసించడం విశేషం. కేవలం ప్రశంసలు మాత్రమే కాదు.. అరకు కాఫీ రుచిని ఆస్వాధించమని మన్ కి బాత్ శ్రోతలను కూడా కోరారు. అసలేంటి అరకు కాఫీ ప్రత్యేకతలు అంటే..అరకు కాఫీ అంటే..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు లోయలో కాఫీ సాగు దాదాపు వంద ఏళ్ల నాటిది. అయితే అది 1947 తర్వాత నెమ్మదిగా క్షీణించింది. మళ్లీ 2000లలో వాణిజ్యాన్ని పునరుద్ధరించే ప్రయత్నంలో భాగంగా లాభాప్రేక్షలేని నంది ఫౌండేషన్ సంస్థ ముందుకు కొచ్చి స్థానిక రైతులను ప్రోత్సహించింది. అందుకు అవసరమైన వనరులను కూడా అందించింది. ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థను పెంపొందించడానికి సహాయపడింది. అలాగే అనేక మంది స్థానికులకు ఉపాధిని కూడా అందించింది. ఒకరకంగా ఈ ప్రాంతం ప్రత్యేక వాతావరణం ద్వారా పండించిన ప్రసిద్ధ కాఫీ గింజలకు పేరుగాంచేందుకు దారితీసింది. అరకులోయలో పగలు వేడిగా, రాత్రుళ్లు చల్లగా ఉండి, నేలలో అధికంగా ఐరన్ ఉండటం తదితర కారణాల వల్ల కాఫీ మొక్కలు నెమ్మదిగా పండటం మొదలయ్యింది. ఆ వాతావరణమే కాఫీ గింజలకు ప్రత్యేకమైన అరోమా రుచిని తెచ్చిపెట్టాయి కూడా. ఆ తర్వతా ఆ అరుకు వ్యాలీ కాఫీకి విశేష ప్రజాధరణ లభించి, అందరి మన్నలను అందుకుంది. అలా 2019లో, అరకు కాఫీకి భౌగోళిక సూచిక (GI) హోదా లభించింది. ప్రస్తుతం అరకు కాఫీకి దేశవ్యాప్తంగా విశేషమైన ఆధరణ ఉంది. దీనికి సంబంధించి ఫ్లాగ్షిప్ బ్రాండ్‌తో వచ్చిన బ్రూ కాఫీ మరితం ఫేమస్.(చదవండి: తప్పనిసరిగా ఉడికించే తినాల్సిన కూరగాయలివే..!) -
అరకు కాఫీకి సలాం.!
సాక్షి, విశాఖపట్నం : ‘‘మన దేశంలో స్థానిక ఉత్పత్తులు ప్రపంచ స్థాయి గుర్తింపును సాధిస్తుండడం భారతీయులంతా గర్వించదగ్గ విషయం. అలాంటి ఉత్పత్తుల్లో అరకువ్యాలీ కాఫీ ప్రథమ శ్రేణిలో ఉంటుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అరకు కాఫీని గిరిజనులు అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. శ్రేష్టమైన అరోమా రుచి గల ఇక్కడ పండే అరకు కాఫీ మంచి గుర్తింపు ఉంది. లక్షా 50 వేల మంది ఆదివాసీ కుటుంబాలు అరకు కాఫీ సాగు, ఉత్పత్తి, విక్రయాలతో ఆర్ధిక సాధికారత సాధిస్తున్నారు. కాఫీకి గ్లోబల్ గుర్తింపు తీసుకురావడంలో విశేషమైన కృషి చేస్తున్న జీసీసీ.. ఆదివాసీ రైతు సోదర,సోదరీమణుల్ని ఒక తాటిపైకి తీసుకువచ్చి, కాఫీ సాగుకు ప్రోత్సహిస్తోంది.ఈ ప్రక్రియలో గిరిజనుల ఆదాయం గణనీయంగా పెరగడంతో పాటు గౌరవనీయమైన జీవనాన్ని సాగిస్తున్నారు. అరకు కాఫీ రుచి గురించి చెప్పాల్సిన అవసరంలేదు..అద్భుతంగా ఉంటుంది. అరకు కాఫీకి ప్రపంచస్థాయి అవార్డులు ఎన్నో వచ్చాయి. గతేడాది సెప్టెంబర్‌లో ఢిల్లీలో జరిగిన జి 20 సమ్మిట్ లో కూడా అరకువ్యాలీ కాఫీకి ప్రాచుర్యం లభించింది. మీకు ఎప్పుడు వీలు దొరికినా అరకువ్యాలీ కాఫీ రుచిని ఆస్వాదించండి’’ఆదివారం నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఏపీలో గిరిజనులు సాగు చేస్తున్న అరకువ్యాలీ కాఫీ గురించి ప్రధాని మోదీ ప్రస్తావించిన మాటలివీ. ప్రధాని ప్రశంసల వెనుక కాఫీకి రుచి తీసుకొచ్చి.. ప్రపంచ గుర్తింపు తీసుకురావడంలో గత ఐదేళ్లలో అనేక కృషి సల్పింది వైఎస్సార్సీపీ ప్రభుత్వం.2014–19 కాలంలో రాష్ట్రంలోని ప్రతి విభాగాన్ని నిర్వీర్యం చేసిన చంద్రబాబు.. గిరిజన సహకార సంస్థ (జీసీసీ)కీ అదే దుస్థితి పట్టించారు. ఇక కోలుకోలేదనుకున్న సంస్థకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొత్త ఊపిరి పోసింది. జీసీసీనే నమ్ముకున్న గిరిజనుల జీవితాలకు కొత్త వెలుగులు తీసుకొచ్చింది. ఉత్పత్తుల కొనుగోలు దగ్గర నుంచి.. విక్రయాల వరకూ తిరుగులేని శక్తిగా అభివృద్ధి పథంలోకి దూసుకుపోయింది. కాఫీ తోటలకు పునరుజ్జీవం పోశారు. ఫలితంగా చంద్రబాబు కాలంలో టర్నోవర్ కంటే.. ఈ ఐదేళ్లలో రెట్టింపు టర్నోవర్‌ని జీసీసీ సొంతం చేసుకుంది.తొలిసారిగా కాఫీతోటలకు సేంద్రీయ ధృవీకరణ లభించడంతో పాటు.. ఐదు జాతీయ అవార్డులు సొంతం చేసుకుంది. త్వరలోనే విదేశాలకు కాఫీని సొంతంగా ఎగుమతి చేసేందుకూ సిద్ధమవుతోంది. 2014–15 నుంచి 2018–19 వరకూ రూ.1209 కోట్లు మాత్రమే ఉన్న జీసీసీ టర్నోవర్ ఒక్కసారిగా గేర్ మార్చింది. గత సీఎం వైఎస్ జగన్ జీసీసీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించడంతో 2019–20 నుంచి 2023–24 మధ్య కాలంలో రెట్టింపై ఏకంగా టర్నోవర్ రూ.2,303 కోట్లకు చేరుకుంది.మేడిన్ ఆంధ్రా పేరుతో...ఓ వైపు అరకు కాఫీ టేస్టీగా ఉండటమే కాకుండా.. ఆర్గానిక్‌గా పండించడం వల్ల గిరాకీ సొంతం చేసుకుంది. అల్లూరి జిల్లాలో మొత్తం 2.27 లక్షల ఎకరాల్లో కాఫీ తోటలు విస్తరించాయి. ఈ తోటల్లో ఏడాదికి 71, 258 మెట్రిక్ టన్నుల కాఫీపండ్లు ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో ప్రస్తుతానికి రెండు క్లస్టర్లలో 2,258.55 హెక్టార్ల విస్తీర్ణంలో ఆర్గానిక్ పద్ధతుల్లో కాఫీని పండిస్తున్నారు. చింతపల్లి క్లస్టర్ వరుసగా మూడో ఏడాది కూడా నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ (ఎన్‌పీవోపీ) స్టాండర్డ్స్ సర్టిఫికెట్ తీసుకోగా.. జీకేవీధి క్లస్టర్ ఇప్పటికే రెండుసార్లు స్కోప్ సర్టిఫికెట్ దక్కించుకుంది. మూడో ఏడాదీ సేంద్రీయ సాగుకు సంబంధించి స్కోప్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకుంది. ప్రస్తుతం కాఫీ గింజల క్యూరింగ్, ప్రాసెసింగ్ అంతా బెంగళూరులోని అవుట్ సోర్సింగ్ ఏజెన్సీతో టై–అప్ కారణంగా కాఫీ ప్రాసెసింగ్ వ్యయం పెరుగుతూ వస్తోంది. డౌనూరులో క్యూరింగ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటైతే ఈ ఖర్చులు తగ్గే అవకాశం ఉంటుంది. పాడేరు ఏజెన్సీలోని 11 మండలాల్లో 2,27,021 ఎకరాల విస్తీర్ణంలో కాఫీ తోటలున్నాయి. మొత్తం 93,521 మంది గిరిజనులు కాఫీ సాగులో పాల్గొంటున్నారు, వీరిలో 2,600 మంది రైతులు టాప్ గ్రేడ్ రకాన్ని సాగు చేస్తున్నారు. వీరి వద్ద నుంచి సేకరించిన బీన్స్‌ని ఫిల్టర్ కాఫీ ఉత్పత్తి కోసం బెంగళూరుకు, ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ఉత్పత్తి, రిటైల్ మార్కెటింగ్ కోసం ఏలూరుకు పంపిస్తుంటారు. ఇకపై ఇక్కడి నుంచే చేసేలా క్యూరింగ్ వ్యవస్థ సిద్ధమవుతోంది. త్వరలోనే మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పేరుతో అరకు కాఫీ ఉత్పత్తుల్ని మార్కెట్లోకి పంపించేందుకు అవకాశం ఉంది.తొలిసారిగా భారీగా ధరలు పెంపుగిరిజన రైతుల జీవనోపాధి, ఆదాయ స్థాయిల్ని కాఫీ తోటల పెంపకం ద్వారా మెరుగుపరచడమే ప్రధాన లక్ష్యంగా సీఎంగా ఉన్న సమయంలో వైఎస్ జగన్ పాడేరు ఏజెన్సీ పరిధిలోని 11 మండలాల్లో సుమారు లక్షకు పైగా ఎకరాల్లో కాఫీ ప్లాంటేషన్ ఏర్పాటు చేశారు. గిరిజనులు పండించిన కాఫీకి జీసీసీ ద్వారా మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించారు. ఎన్నడూ లేని విధంగా గిరిజన రైతు పండించిన కాఫీని జీసీసీ భారీ మద్దతు ధరకు కొనుగోలు చేసింది. పార్చ్మెంట్ కాఫీ కిలోకి రూ.285, చెర్రీ కాఫీ కిలోకి రూ.145 మార్కెట్ ధరగా ప్రకటించి కొనుగోలు చేయడంతో మధ్యవర్తుల దోపిడిని నిరోధించింది. 2023–24లో ఇప్పటి వరకూ 564.48 మెట్రిక్ టన్నుల ముడి కాఫీని రైతుల నుంచి జీసీసీ కొనుగోలు చేసి రూ.13.39 కోట్లు కాఫీ రైతు బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ చేసింది.2019–24 మధ్యలో అరకు కాఫీ ఎదిగిందిలా..⇒ 2018–19 కాలంలో రూ.799.58 లక్షల కాఫీ కొనుగోలు చేయగా.. 2023–24 నాటికి రూ.1339.05 లక్షల కాఫీ కొనుగోలు చేసింది.⇒ డౌనూరులో ఇంటిగ్రేటెడ్ కాఫీ ప్రాసెసింగ్ యూనిట్‌ని స్థాపించేందుకు రూ.3 కోట్లుని ప్రభుత్వం మంజూరు చేయగా 2023 అక్టోబర్ 20న అప్పటి మంత్రులు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం పనులు చురుగ్గా సాగుతున్నాయి. ⇒ కాఫీ తోటల నిర్వహణకు జీసీసీ ద్వారా గిరిజన రైతులకు ఏటా రూ.1.05 కోట్ల రుణాల్ని, వ్యవసాయ కార్యక్రమాల అమలుకు రూ.1.06 కోట్ల క్రెడిట్ రుణాల్ని పంపిణీ చేశారు.⇒ వివిధ నగరాలు, పట్టణాల్లో అరకు కాఫీ పేరుతో అవుట్‌లెట్స్ ఏర్పాటు చేశారు. ⇒ దేశానికి వచ్చే వివిధ దేశాల అతిథులకు, రాష్ట్రానికి వచ్చే ప్రముఖులకు అరకు కాఫీతో పాటు జీసీసీ ఉత్పత్తులు బహుమతులుగా అందించేలా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రోత్సహించింది. విశాఖ వేదికగా నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు హాజరైన దేశ, విదేశీ పెట్టుబడిదారులకు అరకు కాఫీతో పాటు జీసీసీ ఉత్పత్తులతో కూడిన కిట్స్ అందించారు.⇒ సేంద్రీయ పద్ధతుల్లో పండుతున్న కాఫీ ఘుమఘుమలకు విదేశీయులు ఫిదా అవుతోంది. విదేశీ విపణిలో పెరుగుతున్న డిమాండ్‌ని దృష్టిలో పెట్టుకొని ఇకపై సొంతంగా ఎగుమతులు చేపట్టాలని జీసీసీ భావిస్తోంది. ఇప్పటికే ఎక్స్పోర్ట్ సంస్థలతో అధికారులు సంప్రదింపులు జరిపారు.గిరిజనుల ఆర్ధిక సాధికారతకు ఊతమిస్తున్న అరకు కాఫీఅల్లూరి జిల్లాలో అరకు వ్యాలీ సాగు, గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం, జీసీసీ అందిస్తున్న ప్రోత్సాహాన్ని ప్రధానినరేంద్ర మోడి మన్ కి బాత్ లో ప్రత్యేకంగా ప్రస్తావించడం గర్వంగా ఉంది. సీఎం చంద్రబాబుతో కలిసి అరకు కాఫీ తాగానని చెప్పారు. ప్రధాని స్ఫూర్తివంతమైన వ్యాఖ్యలు, ప్రశంస గిరిజన కాఫీ రైతులకు, జీసీసీ సిబ్బందికి, కాఫీ సాగుతో ముడిపడి వున్న అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బంది, వర్గాల వారికీ ఎంతగానో ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చింది. గిరిజనుల ఆర్ధిక సాధికారతకు అరకు కాఫీ ఎంతగానో ఊతమిస్తోంది. –జి. సురేష్ కుమార్, జీసీసీ ఉపాద్యక్షుడు, ఎండీ -
అలాంటి మరణాలకు కాఫీతో చెక్ : ఎగిరి గంతేసే విషయం!
కదలకుండా ఒకేచోట గంటల తరబడి కూర్చోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలొస్తాయని, ప్రాణానికే ముప్పు అని గతంలో అనేక పరిశోధనలు తేల్చి చెప్పాయి. అయితే తాజా అధ్యయనం మాత్రం దీనికి ఒక పరిష్కారాన్ని సూచిస్తోంది. అదేంటో తెలిస్తే ఎగిరి గంతేస్తారు. నిజానికి ఇలాంటి అధ్యయనం చేయడం ఇదే తొలిసారి. విషయమం ఏమిటంటే.కూర్చోవడం వల్ల మరణ ప్రమాదాన్ని కాఫీ తగ్గిస్తుందట. నిశ్చల జీవనశైలి వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాలకు కాఫీ ఆశ్చర్యకరమైన ఆయుధంగా ఉంటుందని కొత్త అధ్యయనం సూచిస్తుంది. కాఫీ తాగని వారితో పోలిస్తే ఎక్కువ సేపు కూర్చుని రోజూ కాఫీ తాగే వారు వివిధ కారణాల వల్ల చనిపోయే అవకాశం తక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు. కూర్చోవడం వల్ల కలిగే ప్రమాదాలను కాఫీ ఎలా ఎదుర్కొంటుంది అనే అంశంపై 10 వేల మందిపై ఈ అధ్యయనం సాగింది. ఆసక్తికరంగా, ఎక్కువసేపు కూర్చొనే వ్యక్తుల్లో ఎంత కాఫీ తాగినా గుండె జబ్బులతో మరణించే ప్రమాదం తక్కువట. ఎక్కువసేపు కూర్చున్న కాఫీ తాగని వారితో పోలిస్తే ఎక్కువ కాఫీ (రోజుకు 2.5 కప్పుల కంటే ఎక్కువ) తీసుకునే వారు కూడా మొత్తం మరణాల ప్రమాదాన్ని తగ్గిందని ఈ స్టడీ ద్వారా తెలుస్తోంది. ఇదే అధ్యయనంలో మరో ఆసక్తికరమైన విషయమం ఏమిటంటే తీసుకోవాల్సిన లిమిట్ 3-5 కప్పులు. ఐదు కప్పులు దాటితే ప్రయోజనాలు తగ్గి పోతాయట. ఈ పరిశోధనలు ఆశాజనకంగా ఉన్నాయని అయితే సరైన ఆరోగ్య ప్రయోజనాల కోసం ఎంత మోతాదు తీసుకోవాలనేదానిపై మరింత పరిశోధనఅవసరం అంటున్నారు పరిశోధకులు.ఈ అధ్యయనం బీఎంసీ పబ్లిక్ హెల్త్ జర్నల్‌లో ప్రచురించబడింది.గతంలో కూడా కాఫీ ద్వారా సుదీర్ఘ, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడవపచ్చని అధ్యయనాలు చెప్పాయి. అలాగే కెఫీన్ ద్వారా టైప్ -2 మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చని పేర్కొన్నాయి. కొలొరెక్టల్ కేన్సర్‌తో బాధపడుతున్న వ్యక్తులు ప్రతిరోజూ కనీసం ఐదు కప్పులు తాగేవారు తక్కువ తాగే వారితో పోలిస్తే పునరావృతమయ్యే అవకాశం గణనీయంగా తగ్గింది. కాఫీలో కూడా యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి, ఇవి జీవక్రియను మెరుగుపరుస్తాయి వాపును తగ్గిస్తాయి. కొన్ని కాఫీ భాగాలు మెదడును క్షీణించిన వ్యాధుల నుండి కూడా రక్షిస్తాయని కూడా తెలిపాయి. -
ప్రెగ్నెన్సీలో కాఫీ తాగడం.. ఎంతవరకూ మంచిదంటే?
నాకిప్పుడు 4వ నెల. రోజుకు అయిదారుసార్లు కాఫీ తాగుతాను. ప్రెగ్నెన్సీలో కాఫీ అంత మంచిది కాదు మానేయమని మా ఫ్రెండ్స్ చెబుతున్నారు. కానీ కాఫీ తాగకపోతే నాకు తలనొప్పి వచ్చేస్తుంది. నిజంగానే ప్రెగ్నెన్సీ టైమ్‌లో కాఫీ మంచిది కాదా? – సంగీత కృష్ణ, హైదరాబాద్కెఫీన్ అనేది చాలా ఫుడ్ అండ్ బేవరేజెస్లో ఉంటుంది. కాఫీ, టీ, చాకోలెట్, కోకో ప్రొడక్ట్స్, కోలాస్, సాఫ్ట్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, జలుబు, జ్వరానికి సంబంధించిన కొన్ని మందుల్లో, ఎలర్జీ, డైట్ పిల్స్, డైటరీ సప్లిమెంట్స్‌లో కూడా కొంత శాతం కలుస్తుంది. ప్రత్యేకించి కాఫీలో అయితే 50 నుంచి 70 శాతం కెఫీన్ ఉంటుంది. కెఫీన్ వల్ల గర్భిణీల్లో వచ్చే మార్పుల మీద చాలా థియరీలే ఉన్నాయి.కానీ వంద శాతం ఏదీ నిర్ధారణ కాలేదు. అయితే కాఫీ తీసుకోవడం వల్ల అందులోని కెఫీన్ ప్లసెంటా ద్వారా పొట్టలోని బిడ్డకూ చేరుతుంది. ఈ క్రమంలో బిడ్డ ఎదుగుదల మీద ఏదైనా ప్రభావం కనపడితే దానికి చాలా రకాల కారణాలూ తోడవుతాయి తప్ప ఆ ప్రభావానికి కెఫీనే ప్రధాన కారణమని ప్రూవ్ చేయడం కష్టం. సాధారణంగా ఒక కప్పు కాఫీలో వంద మిల్లీగ్రాముల దాకా కెఫీన్ ఉండవచ్చు. కెఫీన్ మెటబాలైట్స్ని గర్భిణీ రక్తంలో మాత్రమే చెక్ చేయగలం. కానీ అలా ప్రతిరోజూ టెస్ట్ చేయడం ప్రాక్టికల్‌గా అసాధ్యం.కెఫీన్ మీద ఇప్పటివరకు జరిగిన అన్నిరకాల అధ్యయనాల్లో .. తక్కువ నుంచి ఓ మోస్తరు వరకు కాఫీ సేవనం వల్ల గర్భిణీలకు పెద్ద హాని ఏమీ ఉండకపోవచ్చనే తేలింది. అధిక మోతాదులో అంటే రోజుకు 300 మిల్లీగ్రాముల కన్నా ఎక్కువ కెఫీన్‌ని తీసుకునే వారిలో గర్భస్రావాలు, తక్కువ బరువుతో శిశు జననం వంటి ప్రమాదాలు ఉండవచ్చు. ఏదేమైనా ప్రెగ్నెన్సీ సమయంలో కెఫీన్‌తో పాటు పొగాకు, సిగరెట్ , మద్యం లాంటి వాటికి దూరంగా ఉండటమే క్షేమం. – డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
కాఫీ పరిమళం..! ఎంతో పరవశం..!!
ఒక సిప్ గొంతులోకి వెళ్తే ఎంత ఆస్వాదిస్తామో.. పొగలు కక్కే కప్పులోంచి ఆ పరిమళం నాసికకు సోకినా అంతే గొప్పగా ఆఘ్రాణిస్తామంటారు కాఫీ ప్రియులు. అలాంటి కాఫీ ప్రియుల నాసికలకు పరీక్ష పెట్టిన కప్పా సెషన్ ఆకట్టుకుంది. ఓ వైపు కాఫీల ఘుమఘుమలు.. మరోవైపు కాఫీ గింజల ఉత్పత్తి దారులతో చర్చలు.. వెరసి నిర్వహించిన క్రాఫ్టింగ్ కాఫీ కల్చర్ ఈవెంట్ నవాబుల నగరంలో పెరుగుతున్న కాఫీ సంస్కృతికి అద్దం పట్టింది. – సాక్షి, సిటీబ్యూరోకాఫీ ప్రియులు, కాఫీ గింజల పెంపకందారులు, కేఫ్ యజమానులు స్పెషాలిటీ కాఫీ కమ్యూనిటీకి చెందిన నిపుణులను ఒకేచోట చేర్చి నిర్వహించిన కార్యక్రమం ఆకట్టుకుంది. నగరానికి చెందిన ఫస్ట్ క్రాక్ స్పెషాలిటీ రోస్టర్స్ ఆధ్వర్యంలో మాదాపూర్‌లో ఉన్న కోరమ్‌లో బుధవారం సాయంత్రం నిర్వహించిన ఈ ఈవెంట్లో రత్నగిరి ఎస్టేట్ నుంచి తీసుకువచ్చిన సరికొత్త స్పెషాలిటీ కాఫీలను ప్రదర్శించారు.ఆకట్టుకున్న పరిమళాల గుర్తింపు..ఈ ఈవెంట్లో భాగంగా కప్పా సెషన్ పేరిట కాఫీ ఫ్లేవర్లను గుర్తించేందుకు కాఫీ ప్రియులకు అవకాశం ఇచ్చారు. విభిన్న రకాల కాఫీలను కప్పులలో అందజేసి వాటిని నాసిక ద్వారా ఆఘ్రానించడం ద్వారా ఫ్లేవర్లను గుర్తించడం, రేటింగ్ ఇవ్వడం వంటివి చేయడంలో కాఫీ లవర్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా రత్నగిరి ఇంటర్నేషనల్ మేనేజింగ్ పార్టనర్ అశోక్ పాత్రే, ఫస్ట్ క్రాక్ స్పెషాలిటీ రోస్టర్స్ నిర్వాహకురాలు ఎస్ఆర్కె చాందినీలతో ఆహుతులకు ముఖాముఖి సెషన్ నిర్వహించారు.ఇవి చవవండి: టేస్ట్ 'బ్లాగుం'ది..! హాబీగా ఫుడ్ బ్లాగింగ్.. -
కాఫీ, టీలకు బ్రేక్: ఇలా ట్రై చేద్దామా..!
ఉదయం లేవగానే ఓ కప్పు వేడి వేడి కాఫీగానీ, టీగానీ పడకపోతే కాలకృత్యాల దగ్గర్నించి ఏ పని కాదు చాలామందికి. ఖాళీ కడుపుతో ఇలాంటి వాటివల్ల దీర్ఘకాలంలో ఆరోగ్యానికి చాలా హాని చేస్తాయి. నిజానికి ఉదయం బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి. తద్వారా రోజు చురుకుగా ఉండటానికికావాల్సిన పోషకాలు అందుతాయి. మరి అవేంటో ఒకసారి చూద్దాం.కాఫీ, టీ అయినా అదొక సెంటిమెంట్‌లాగా మనకి అలవాటు అయిపోయింది. కానీ మంచి ఆరోగ్యం కోసం మంచి డైట్ ,కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను చేసుకోవాలి.టీ లేదా కాఫీ ఉదయం పూట టీ, కాఫీలు అలవాటు మానలేని వారు చక్కెరను బాగా తగ్గించేస్తే బెటర్. మధుమేహ వ్యాధిగ్రస్తులు పూర్తిగా మానేయాలి. తాజా పండ్లను, పళ్లతో చేసిన రసాన్ని తీసుకోవచ్చు. క్యారెట్, కీరా, యాపిల్, బీట్రూట్ లాంటివాటితో జ్యూస్ చేసుకోవచ్చు. అయితే ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూస్ జోలికి వెళ్లవద్దు. వీటిల్లో ఫైబర్ ఉండదు,పైగా అధిక మొత్తంలో చక్కెర ఉంటుంది. జింజర్ టీ, హెర్బల్ టీపొద్దున్నే గోరు వెచ్చని నీళ్లు తాగాలి. అలాగే గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, తేనె కూడా కలుపు కోవచ్చు. ఇందులోని విటమిన్ సీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.అల్లం, తులసి, పుదీనా ఆకులు, తేనెతో చేసిన హెర్బల్. జింజర్ టీతాగవచ్చు. కొబ్బరి నీళ్లు: కొబ్బరి నీళ్లలో అవసరమైన పోషకాలు, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, సోడియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలు లభిస్తాయి., అలాగే ఫ్రీ-రాడికల్‌తో పోరాడే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. షుగర్ లెవల్స్‌ను బట్టి దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది.కాఫీ, టీలు రోజులో రెండుసార్లు తీసుకోవడం పెద్ద ప్రమాదం ఏమీకాదు. అయితే ఖాళీ కడుపుతో కాకుండా అల్పాహారం తరువాత తీసుకుంటే మంచిది. అలాగే షుగర్ వ్యాధిగ్రస్తులు చక్కెర వాడకంలో జాగ్రత్త పడాలి. తాగకూడనివిసోడా, కార్బోనేటేడ్ పానీయాలు వీటిల్లో అధిక మొత్తంలో చక్కెర, కెఫిన్ కలిసి ఉంటాయి. ఇంకా వీటిలో ఉండే కార్బన్ డయాక్సైడ్ కడుపులో గ్యాస్, ఉబ్బరం సమస్యలను కలిగిస్తుంది. ఎనర్జీ డ్రింక్స్‌లో అధిక మొత్తంలో కెఫిన్, షుగర్ ఉంటాయి. ఉదయాన్నే వీటిని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి. దీని కారణంగా రోజంతా శక్తి లేకపోవడం అలసటగా అనిపిస్తుంది. ఇది కాకుండా ఎనర్జీ డ్రింక్స్ గుండె వేగాన్ని, రక్తపోటును పెంచుతాయనేది గమనించాలి. -
గ్రీన్ కాఫీని తయారు చేసిన విద్యార్థులు!ఐతే టేస్ట్‌లో..
గ్రీన్‌టీ ఆరోగ్యానికి ఎంతో మంచిదని విన్నాం. పైగా దీన్ని తాగడం వల్ల బరువు అదుపులో ఉంటుంది, ఎన్నో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు కూడా. ఐతే గ్రీన్ టీ ఉన్నట్లే..గ్రీన్ కాఫీ కూడా ఉందని విన్నారా..?. కాఫీ అంటే ఇష్టపడని వాళ్లు ఉండరు. అందుకని టీ ఉన్నట్లే కాఫ్లీ కూడా ఉంటే బాగుండనన్న ఆ ఆలోచనకు రూపం ఇచ్చారు ఈ కేరళ విద్యార్థులు. అలానే గ్రీన్ టీ మాదిరిగానే ఈ గ్రీన్ కాఫీ కూడా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాల అందించేదిగా ఉండాలని భావించారు. అందుకోసం వాళ్లు ఏం చేశారు. ఎలాంటి ప్రయోగాలు చేశారు? విజయవంతమయ్యారా తదితరాల గురించి చూద్దాం.!లారస్ ఇన్స్టిట్యూట్ ఫర్ లాజిస్టిక్స్‌కు చెందిన పది మంది సభ్యుల విద్యార్థి బృందం ఈ గ్రీన్ కాఫీని తయారు చేసే ప్రయోగాలకు నాంది పలికారు. వాళ్లు మంచి ఆరోగ్యకరమైన కాఫీని తయారు చేయడం, ఉత్పత్తులు మంచిగా కొనగోలు అయ్యేలా ప్యాకింగ్ వంటి వాటిపై దృష్టి సారించారు. ముఖ్యంగా ఇలాంటి కొత్త ప్రయోగాల్లో కంపెనీలు తమవంత సహాయ సహకారాలు అందిస్తుంది. అలానే కలమ్‌సేరి ఆధారిత ప్రైవేటు కంపెనీ ఒకటి ఈ బృందానికి సహాయం చేసేందుకు ముందుకు వచ్చింది. ఇక ఈ బృందం ఇన్స్టిట్యూట్ ఛైర్మన్ డాక్టర్ అజయ్ శంకర్ సలహాలు, సూచనలతో మంచి గ్రీన్ కాఫీని తయారు చేశారు. అయితే రుచి మాత్రం తాగేలా టేస్టీగా లేదు. ప్రజలు ఆసక్తిచూపి తాగే విధంగా అస్సలు లేదు. దీంతో విద్యార్థుల బృందం తీవ్ర ఆందోళనకు లోనయ్యింది. అయితే దీనికి రోజ్ ఫ్లేవర్, యాలకులు వంటి సుగంధ ద్రవ్యాలు జోడించి చూశారు. అవి జోడిస్తే ప్రొడక్ట్ నిల్వ ఉండే వ్యవధి కాలం తగ్గిపోవడంతో ఇక ఆ ప్రయత్నం మానేశారు. దీంతో ఈ అరబికా కాఫీ గింజలను చిన్న చిన్న ఉండలుగా చేసి ప్యాక్ చేయాలని నిర్ణయించారు. తీరా మార్కెట్లోకి రిలీజ్ చేశాక పూర్తిగా నష్టాల ఎదురయ్యాయి. దీంతో ప్రతి కస్టమర్‌కి గ్రీన్ కాఫీ వల్ల కలిగే ప్రయోజనాల వివరించి అమ్మడం ప్రారంభించారు. కొద్ది రోజుల్లో వారిలో కూడా ఈ ప్రోడక్ట్‌పై నమ్మకం ఏర్పడి కొనుగోలు చేసేందుకు ఆసక్తికనబర్చారు.ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..గ్రీన్ కాఫీ గింజలు బరువు తగ్గడంలో సహాయపడతాయి. క్లోరోజెనిక్ యాసిడ్ ఉండటం వల్ల కొవ్వును బర్న్ చేయడంలో సహాయపడుతుంది. గ్రీన్ కాఫీని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల జీవక్రియ వేగవంతం అవుతుంది. అందువలన, ఇది బరువు తగ్గడానికి, ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి సహాయపడుతుంది.గ్రీన్ కాఫీ గింజల్లో క్లోరోజెనిక్ యాసిడ్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, గ్రీన్ కాఫీ వంటి ఆరోగ్యకరమైన పానీయాలు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను చాలా వరకు బ్యాలెన్స్ చేయవచ్చు.గ్రీన్ కాఫీ అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది రక్త నాళాలను విస్తరిస్తుంది. రక్తపోటును పెంచే కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ స్థాయిని తగ్గిస్తుంది. రోజూ గ్రీన్ కాఫీ తాగడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.గ్రీన్ కాఫీ గింజలలో అవసరమైన పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని ఎదుర్కోవడంలో సహాయపడతాయి. ఫ్రీ రాడికల్స్ క్యాన్సర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. అధ్యయనాల ప్రకారం, గ్రీన్ కాఫీ గింజలలోని క్లోరోజెనిక్ యాసిడ్ ట్యూమర్ సెల్స్ ఏర్పడకుండా.. క్యాన్సర్ ప్రమాదాన్ని నివారిస్తుంది.గ్రీన్ కాఫీ గింజలు సహజమైన డిటాక్సిఫైయర్‌గా పనిచేస్తాయి. ఇవి శరీరం నుంచి టాక్సిన్స్, అదనపు కొవ్వు, కొలెస్ట్రాల్‌ను బయటకు పంపడంలో సహాయపడతాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.(చదవండి: ఆ బామ్మ అమ్మే ఇడ్లీల ధర తెలిస్తే షాకవ్వుతారు! ఈ వయసులో..) -
మేకల వల్లే కాఫీ గురించి తెలిసిందా? ఆ స్టోరీ తెలిస్తే షాకవ్వుతారు!
ఎర్లీ మార్నింగ్ కాస్త కాఫీ తాగితే ఆ ఫీలింగే వేరు. పొద్దుపొద్దునే కాఫీ గుమాళింపుతో ముక్కుపుటలకు తాకుతుంటే అబ్బా ప్రాణం లేచించింది అనిపిస్తుంది. చాలా మందికి ఇది తాగితే చాలు టిఫిన్లతో కూడా పనిలేదు. అలాంటి కాఫీ ఎలా మన దైన జీవితంలో భాగమయ్యింది?. ఎక్కడ నుంచి వచ్చింది? ఎవరు తయారు చేశారు అనే వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా!. మనం ఎంతో ఇష్టంగా తాగే కాఫీని ఎనిమిదవ శతాబ్దంలో ఆఫ్రికాలో కనిపెట్టారట. దీన్ని కనిపెట్టింది ఒక మేకల కాపరి అట. మేకల కాపరి కాఫీని తయారు చేయడమేమిటి? అనే కదా..!. ఆఫ్రికాకి చెందిన ఆ మేకల కాపరి ప్రతిరోజు మేకలను మేపుకుంటూ బయటకు వెళ్తుండేవాడు. ఒకరోజు ఎప్పటిలా మేకలను బయట మేపుకుని పొద్దుపోయాక ఇంటికి వచ్చాడు. అందులో ఓ మేకపిల్ల చాలా డల్‌గా ఉండేదట. అయితే మరుసటి రోజు కూడా యథాలాపంగా మేతకు వెళ్లి వచ్చిన తర్వాత చూస్తే..అదే మేకపిల్ల చురుకుగా ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. ఇక ఆ తర్వాత రోజు కూడా.. అదే మేకపిల్ల మరింత ఉత్సాహంగా గంతులు వేయడం చూసి ఏంటిదీ అని విస్తుపోతాడు. అసలు ఏం చేస్తుంది..? ఈ మేకపిల్ల. మాములుగా మేతకు వెళ్లి ఇంటికి వచ్చాక కాస్త చలాకితనం తక్కువుగా ఉంటుంది. కానీ ఈ మేకపిల్ల మొదట్లో చాలా డల్‌గా అయిపోయి రాను రాను ఎలా ఉత్సాహంతో ఉరకలేస్తోంది?.. అసలు ఇది ఏం తింటుంది..?, ఏం చేస్తుంది..? తెలసుకోవాలన్న ఆరాటంతో.. దాన్ని గమినించడం మొదలు పెట్టాడు. ఆ మేక అడవిలో ఉండే ఓ మొక్క గింజలను ఎక్కువుగా తినడం చూశాడు. దీన్ని తినడం వల్లే ఈ మేకపిల్ల యాక్టివ్‌గా ఉంటుందేమో..! అన్న అనుమానంతో ఆ మేకల కాపరి ఆ గింజలను కోసుకుని ఇంటికి తీసుకొచ్చాడు. అతడు వాటిని పౌడర్ చేసుకుని నీటిలో కలుపుకుని తాగాడు. ఎంతో రుచిగాను, పైగా తాగాక ఏదో ఉత్సాహం ఉరకలేస్తున్నట్లు ఉండటం గమనించాడు. దీంతో ఈ విషయాన్ని గ్రామస్తులకు ఈ గింజలు చూపించి అసలు విషయం చెబుతాడు. అయితే ఎవ్వరూ ఈ గింజలను తినేందుకు మొదట్లో సాహసం చేయలేదు. అయితే అతను తాగినా ఏం కాలేదు, పైగా హుషారుగా ఉంటున్నాడు కదా! అని నెమ్మదిగా వాళ్లు కూడా తాగడం ప్రారంభిస్తారు. అలా క్రమక్రమంగా కాఫీగా తయారయ్యింది. అలా మొదలైన కాఫీ ప్రయాణం ప్రపంచ దేశాలన్నింటికీ చేరింది. ఇంతకీ ఈ మేక తిన్న గింజలు ఏంటంటే..కాఫీ బీన్స్ గింజలట. అలా మేక నుంచి కాఫీ గురించి మానవులకు తెలిసిందిట. ఆ తర్వాతా ఆ కాఫీ మన దైనందిన జీవితంలో భాగమైపోయిందట. (చదవండి: ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లకు దేశీ భోజనం..హయిగా పప్పు, అన్నం..!)