communal violence
-
అది రాజకీయ ప్రేరేపిత నివేదిక: భారత్
న్యూఢిల్లీ: అమెరికా ఫెడరల్ కమిషన్ యూఎస్సీఐఆర్ఎఫ్ తాజా నివేదికపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అది పూర్తిగా హానికరమైన.. ప్రేరేపితమైన నివేదికగా పేర్కొంటూ భారత విదేశాంగ శాఖ స్పందించింది.‘యూఎస్సీఐఆర్ఎఫ్’ రాజకీయ ఎజెండాతో కూడిన పక్షపాత సంస్థ. వాస్తవాలను తప్పుగా సూచిస్తోంది. భారత్‌పై ప్రేరేపిత కథనాలను కొనసాగిస్తోంది అని నివేదికపై ఎదురైన ప్రశ్నకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ బదులిచ్చారు.‘అంతర్జాతీయ మతస్వేచ్ఛపై ఈ యూఎస్ కమిషన్ తాజాగా ఓ నివేదిక విడుదల చేసింది. అందులో.. మత స్వేచ్ఛ విషయంలో భారత్ క్రమబద్ధమైన ఉల్లంఘనలు చేస్తోందని పేర్కొంటూ కొలంబియాకు చెందిన విశ్లేషకురాలు సేమా హసన్ ఈ నివేదికను రూపొందించారు. అయితే..‘యూఎస్సీఐఆర్ఎఫ్’ నివేదికను.. భారత్ ఖండించడం ఇదేం తొలిసారి కాదు. గతంలో ఇలాంటి వార్షిక నివేదికలను తోసిపుచ్చుతూ వస్తోంది. -
మణిపూర్ హింస: సీబీఐ దర్యాప్తు బృందంలో 29 మంది మహిళా అధికారులు
మణిపూర్ అల్లర్లలో వెలుగుచూసిన లైంగిక హింస వీడియో కేసును సీబీఐకి కేంద్రం అప్పగించిన విషయం తెలిసిందే. ఈ కేసును విచారించడానికి సీబీఐ దేశవ్యాప్తంగా ఉన్న తన యూనిట్ల నుంచి 53 మంది అధికారులను నియమించింది. వీరిలో 29 మంది మహిళా అధికారులు ఉన్నారు. ముగ్గురు డీఐజీలు లవ్లీ కతియార్, నిర్మలాదేవి, మోహిత్ గుప్తాతోపాటు ఒక ఎస్పీ రాజ్వీర్ సైతం ఉన్నారు. ఇద్దరు అదనపు పోలీసు సూపరింటెండెంట్లు, ఆరుగురు డిప్యూటీ సూపరింటెండెంట్లు ఆఫ్ పోలీస్‌లు 53 మంది సభ్యుల బృందంలో ఉన్నారు. వీరంతా మొత్తం దర్యాప్తును జాయింట్ డైరెక్టర్ ఘనశ్యామ్ ఉపాధ్యాయ్‌కు తమ నివేదికను నివేదించనున్నారు. కాగా కేంద్ర దర్యాప్తు సంస్థ ఒకే కేసులో ఇంత భారీ సంఖ్యలో మహిళా అధికారులను తీసుకోవడం ఇదే తొలిసారని అధికారులు భావిస్తున్నారు. సీబీఐ విచారిస్తున్న ఈ కేసుల్లో చాలా వరకు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నిరోధక) చట్టం, 1989లోని నిబంధనలకు సంబంధించినవని, వీటిని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ అధికారి దర్యాప్తు చేయవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.అయితే ఇలాంటి కేసుల్లో డీఎస్పీలు పర్యవేక్షకులుగా ఉండటం సాధ్యం కానందున దర్యాప్తును పర్యవేక్షించడానికి సీబీఐ ముగ్గురు డీఐజీలను ఒక ఎస్పీని నియమించినట్లు పేర్కొన్నారు. చదవండి: మధ్యప్రదేశ్‌లో హీటెక్కిన పాలి‘ట్రిక్స్’.. దిగ్విజయ్ హాట్ కామెంట్స్ ఈ బృందంలో 16 మంది ఇన్స్పెక్టర్లు, 10 మంది సబ్ ఇన్స్పెక్టర్లు కూడా ఉంటారని అధికారులు తెలిపారు. సాధారణంగా ఇంత పెద్ద సంఖ్యలో కేసులను సీబీఐకి అప్పగించాల్సి వస్తే సిబ్బందిని సమకూర్చేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ సంబంధిత రాష్ట్రంపై ఆధారపడి ఉంటుందని, అయితే కానీ మణిపూర్ విషయంలో దర్యాప్తులో పక్షపాత ఆరోపణలు రాకుండా స్థానిక అధికారుల పాత్రను తగ్గించడానికి సీబీఐ ప్రయత్నిస్తోందని అధికారులు చెప్పారు. ముఖ్యంగా ఇరు వర్గాల వ్యక్తుల ప్రమేయం ఉండకుండా ఉందేందుకు చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. కాగా ఇప్పటికే సీబీఐ ఎనిమిది కేసులు నమోదు చేసింది. ఇందులో రెండు కేసులో మే 4న ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన కేసుకు సంబంధించినవి. మణిపూర్ హింసాకాండకు సంబంధించి మరో తొమ్మిది కేసులను దర్యాప్తు చేసేందుకు సీబీఐ సిద్ధమైంది. దీంతో సంస్థ విచారించనున్న మొత్తం కేసుల సంఖ్య 17కు చేరింది.ఈ కేసులో కాకుండా మహిళలపై నేరాలు, లైంగిక వేధింపులకు సంబంధించిన మరే ఇతర కేసులను కూడా ప్రాధాన్యత ఆధారంగా విచారిస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలో చురచంద్‌పూర్ జిల్లాలో జరిగిన లైంగిక వేధింపుల కేసును కూడా కేంద్ర దర్యాప్తు సంస్థ స్వీకరించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా మార్చి 3న మణిపూర్ హింస మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 160 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడ్డారు.మే 4న కుకి జాతికి చెందిన ఓ గ్రామంపై దాడి చేసిన దుండగులు.. ఇద్దరు మహిళలను నగ్నంగా చేసి, ఊరేగించారు. ఓ ఫేక్ వీడియోను చూసి, కోపంతో ఈ దారుణానికి ఒడిగనట్టు తెలుస్తోంది. బాధితుల్లో ఒకరిపై సామూహిక అత్యాచారం కూడా జరిగింది, ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు జులై 26 వెలుగులోకి రాగా.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చదవండి: కొనసాగుతున్న వర్ష బీభత్సం.. రూ.10 వేల కోట్ల ఆస్తి నష్టం.. -
మణిపూర్ అల్లర్లు.. 3 వేల మందికి రెడీమేడ్ ఇళ్లు
ఇంఫాల్: మణిపూర్ అల్లర్లలో నిరాశ్రయులైన 3 వేల కుటుంబాలకు మొదటి విడతలో ఫ్యాబ్రికేటెడ్ ఇళ్లను సమకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. జూన్ 26వ తేదీ నుంచి రాష్ట్రంలోని అయిదు ప్రాంతాల్లో రెడీమేడ్ ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించించింది. ఈ బాధ్యతను పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌కు అప్పగించింది. గత మూడు నెలలుగా కొనసాగుతున్న అల్లర్లలో ఇళ్లు కోల్పోయిన వేలాదిమంది ప్రభుత్వం నిర్వహిస్తున్న తాత్కాలిక సహాయ శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. మణిపూర్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ సూపరింటెండెంట్ ఇంజినీర్ పి.బ్రోజెంద్రో వివరాలు వెల్లడించారు. ‘రహదారుల దిగ్బంధం కారణంగా ఇంటి సామగ్రి రవాణా కష్టంగా మారింది. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సిబ్బందిని విమానాల ద్వారా అక్కడికి తరలిస్తున్నాం. పశ్చిమ ఇంఫాల్‌లోని సెక్మాయ్, తూర్పు ఇంఫాల్‌లోని సవోంబుగ్ల్లో ఇళ్లు నిర్మిస్తున్నాం. వైరి వర్గాల మధ్య కాల్పుల ఘటనల కారణంగా క్వాక్తా ప్రాంతంలో ఇళ్ల నిర్మాణం ఆగిపోయింది’ అని చెప్పారు. చదవండి: బీజేపీ భారత్ వీడిపో అబద్ధాలు, అతిశయోక్తులు: కాంగ్రెస్ స్వాతంత్య్రదిన వేడుకల్లో ప్రధాని మోదీ ప్రసంగంపై విపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. వక్రీకరణలు, అబద్ధాలు, అతిశయోక్తులు, శుష్కవాగ్దానాలతో కూడిన ఎన్నికల ప్రసంగం చేశారని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. స్వాతంత్య్రదినోత్సవ వేళ దేశ ప్రజలందరినీ ఏకతాటికి పైకి తేవాల్సిన ప్రధాని ప్రసంగంలో తన గొప్పలు, ప్రతిష్ట గురించి చెప్పుకోవడానికే సరిపోయిందని పేర్కొంది. స్వాతంత్య్రదినోత్సవం నాడు ప్రధాని ప్రతిపక్షాలను విమర్శిస్తున్నారంటే భారత్‌ను ఆయన ఎలా తీర్చిదిద్దగలరని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ప్రశ్నించారు. గత తొమ్మిదేళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలకి ఏం చేసిందో చెప్పకుండా ఎన్నికల ప్రసంగంలా మార్చేశారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ ఆరోపించారు. -
హర్యానాలో మత ఘర్షణలు.. ఢిల్లీ హై అలర్ట్
హర్యానాలో మతపరమైన ఊరేగింపు సందర్భంగా జరిగిన హింసలో ఇప్పటి వరకు పోలీసులు 116 మందిని అరెస్ట్ చేశారు. మంగళవారం నాటికి మొత్తం 26 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఈ మత ఘర్షణల్లో ఇద్దరు హోంగార్డులు, ఓ మతాధికారి సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 23 మంది క్షతగాత్రులు కాగా.. వీరిలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ముగ్గురు ఇన్స్పెక్టర్లు సహా పది మంది పోలీసులు ఉన్నారు. హర్యానా అల్లర్లు మంగళవారం రాత్రి గురుగ్రామ్‌ను తాకడంతో తాజాగా ఢిల్లీ అప్రమత్తం అయ్యింది. ఢిల్లీ పోలీసుల అప్రమత్తం గురుగ్రామ్ పరిసర ప్రాంతాలలో మత ఘర్షణల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు మంగళవారం దేశ రాజధానిలో పెట్రోలింగ్‌ను పెంచారు. ఎన్సీఆర్ పరిధిలో ఇలాంటి ఘటనలు జరగడంతో దేశ రాజధానిలో ఎలాంటి పరిస్థితులు తలెత్తినా స్పందించేందుకు సిద్ధంగా ఉన్నామని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. గురుగ్రామ్‌లోని సోహ్నా సబ్-డివిజన్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలను బుధవారం (ఆగస్టు 2) మూసివేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. నిరసనలకు పిలుపు మేవాత్ ప్రాంతంలో జరిగిన ఘర్షణలకు వ్యతిరేకంగా విశ్వహిందూ పరిషత్ నేడు (బుధవారం) నిరసనకు పిలుపునిచ్చింది. వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ కలిసి మనేసర్‌లోని భీసం దాస్ మందిర్‌లో బుధవారం సాయంత్రం 4 గంటలకు మహాపంచాయత్ ఏర్పాటు చేయనున్నాయి. సెక్టార్ 21ఎలోని నోయిడా స్టేడియం నుంచి సెక్టార్ 16లోని రజనిగంధ చౌక్ వైపు నిరసన ప్రదర్శన ప్రారంభమవుతుందని, అక్కడ దిష్టిబొమ్మను దహనం చేస్తామని వీహెచ్‌పీ ప్రచార చీఫ్ రాహుల్ దూబే తెలిపారు. నుహ్‌లో ఘర్షణలు జరిగిన మరుసటి రోజు(మంగళవారం) గురుగ్రామ్‌లోని బాద్షాపూర్లో అల్లరి మూకల గుంపు బైక్‌లపై వచ్చి రెస్టారెంట్‌కు నిప్పుపెట్టింది. పక్కనే ఉన్న దుకాణాలను సైతం ధ్వంసం చేసింది. మసీదు ముందు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ ఓ కమ్యూనిటికీ చెందిన దుకాణాలపై దాడికి పాల్పడింది. ఈ హింసాకాండతో బాద్షాపూర్ మార్కెట్‌ను మూసివేశారు. చదవండి: మణిపూర్ అల్లర్లు: వారంతా ఏమై పోయారు? ఎందుకీ ఘర్షణలు హరియాణాలోని నుహ్ జిల్లాలో సోమవారం అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) చేపట్టిన మతపరమైన ఊరేగింపు సందర్భంగా మరో వర్గం వారు అడ్డుకోవడంతో అక్కడ మత ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఆందోళనకారులు ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్నారు. నిరసనకారులు పలు వాహనాలకు నిప్పు పెట్టారుఈ హింసలో ఇద్దరు హోంగార్డులతో సహా అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు. గోరక్షక, భివానీ హత్య కేసు నిందితుడు మోను మానేసర్.. మేవాత్ ఊరేగింపులో పాల్గొన్న నేపథ్యంలో ఈ అల్లర్లు చెలరేగినట్లు తెలుస్తోంది. మరో మణిపూర్ కాబోతున్న హర్యానా? గత మూడు నెలలుగా బీజేపీ పాలిత మణిపూర్‌లో హింసాకాండ కొనసాగుతున్న విషయం తెలిసిందే. రెండు వర్గాల మధ్య మొదలైన అల్లర్లు రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయి. ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు వందలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దీనిని మరవక ముందే మరో బీజేపీ పాలిత రాష్ట్రం హర్యానాలో మత ఘర్షణలు చెలరేగాయి. పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారడంతో 13 కంపెనీల పారామిలటరీ బలగాలు రంగంలోకి దిగాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గురుగ్రామ్, ఫరీదాబాద్, పల్వాల్ అంతటా 144 సెక్షన్ విధించారు. ఈ క్రమంలో మరో మణిపూర్‌గా హర్యానా మారబోతుందా అనే ఆందోళన వ్యక్తమవుతోంది. -
ద్వేషపూరిత రాజకీయాలకు స్వస్తి పలకాలని మోదీకి లేఖ!
దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇటీవల జరిగిన మత హింస కేసులపై 100 మందికి పైగా మాజీ బ్యూరోక్రాట్లు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఆ లేఖలో వారు..."దేశంలోని రాజకీయ పరిస్థితుల గురించి ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా ద్వేషపూరిత రాజకీయాలకు' స్వస్తి పలకాలని కోరారు. తాము అతి పెద్ద సామాజికి ముప్పును ఎదుర్కుటున్నాం అని, ఇది కేవలం రాజ్యంగ నైతికత, ప్రవర్తనకు సంబంధించినది మాత్రమే కాదని ఆ లేఖలో స్పష్టం చేశారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే మీ వాగ్దానాన్ని హృదయపూర్వకంగా స్వీకరించాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఏడాది 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'లో, పక్షపాత ధోరణికి అతీతంగా వ్యవహరించాలని తాము ఆశిస్తున్నాం. మీ పార్టీ నియంత్రణలో ఉన్న ప్రభుత్వాలు చాలా పట్టుదలతో ద్వేషపూరిత రాజకీయాలకు ముగింపు పలకడానికి కృషి చేస్తున్నాయి. అంతేకాదు మన వ్యవస్థాపక పితామహులు సృష్టించిన రాజ్యాంగ విధానాన్ని నాశనం చేసేలా పరిస్థితి తలెత్తడంతోనే తమ ఆవేదనను, భావనను, వ్యక్తికరీంచేలా ఈ లేఖ రాసేందకు పురికొల్పిందన్నారు. బీజెపీ పాలిత రాష్ట్రాల్లోని ముస్లింలు మతపరమైన ద్వేషానికి ఎక్కువగా గురవుతున్నారని ఆరోపణలు కూడా చేశారు. అంతేకాదు అధికారంలో ఉన్న బీజేపీ శాంతి, సామరస్యాన్ని కాపాడే సాధనంగా కాకుండా, మైనారిటీలను నిత్యం భయాందోళనకు గురిచేసే సాధనంగా మారిందన్నారు." ఈ మేరకు మాజీ జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) శివశంకర్ మీనన్, మాజీ విదేశాంగ కార్యదర్శి సుజాత సింగ్, మాజీ హోం కార్యదర్శి జీకే పిళ్లై, ఢిల్లీ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ టీకేఏ నాయర్‌తో సహా 108 మంది ఆ లేఖపై సంతకాలు చేశారు. (చదవండి: అక్కడ గెలుపే టార్గెట్.. బీజేపీ మాస్టర్ ప్లాన్) -
మైనారిటీలపై మత విద్వేషాగ్ని
అనవసరంగా మతాన్ని లాగి, మనుషుల్ని రెచ్చగొడితే ఏమవుతుంది? బంగ్లాదేశ్‌లో అల్పసంఖ్యా కులపై జరుగుతున్న హింసాకాండలా ఉంటుంది. పవిత్ర ఇస్లామ్ మతగ్రంథాన్ని మరో మతం దేవుడి పాదాల వద్ద దుర్గాపూజ పందిళ్ళలో పెట్టారనే పుకారు ఆ దేశంలో ఆరని చిచ్చు రేపింది. వారం క్రితం అక్టోబర్ 13న ఈ పుకార్లతో బంగ్లాదేశ్‌లోని కుమిల్లా జిల్లాలో మతఘర్షణలు మొదలయ్యాయి. వంగభూమిలో దుర్గాపూజ వేళ ఈ ఘర్షణలు అనేక జిల్లాలకు, రాజధాని ఢాకాకూ పాకాయి. పదికి పైగా ఆలయాలు, 50కి పైగా విగ్రహాలు, అల్పసంఖ్యాకులకు చెందిన వందలాది ఇళ్ళు, దుకాణాలు విధ్వంసానికి, లూఠీకి గురయ్యాయి. పోలీసులు సహా పదుల మంది గాయపడ్డారు. పలువురు మరణించారు. సోషల్ మీడియా గాలివార్త ఇంతటి అనర్థం తేవడం అత్యంత విషాదం. ప్రాంతాలు, దేశాలకు అతీతంగా దక్షిణాసియాలో పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ సహా అనేకచోట్ల అల్పసంఖ్యాక వర్గాలే లక్ష్యంగా పెరుగుతున్న హింస, విధ్వంసాలకు ఇది తాజా తార్కాణం. ఐక్యరాజ్యసమితి (ఐరాస), ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సహా అంతర్జాతీయ వేదికలు బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులను ఖండించాయి. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా హిందువులపై దాడులకు పాల్పడినవారిపై తీవ్ర చర్యలు తీసుకోవాలంటూ ఆ దేశ హోమ్ మంత్రిని తాజాగా ఆదేశించారు. గడచిన గురువారమే ఆమె తొలి ప్రకటన చేస్తూ, కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఆమె హెచ్చరించినా, హింసను అరికట్టడానికి బలగాలను దింపినా సరే, బంగ్లాలో పరిస్థితులు అదుపులోకి రాకపోగా, విధ్వంసం మరిన్ని ప్రాంతాలకు విస్తరించడం విడ్డూరం. కార్యక్షేత్రంలో పోలీసులు తగినంతలేరనీ, సమర్థంగా పనిచేయలేదనీ, నేతలు చూసీచూడనట్టున్నారనీ వార్త. అసలీ విధ్వంసం మునుపెన్నడో పథకం వేసుకొని, బెంగాలీ హిందువుల పెద్ద పండుగ దసరా వేళ చేశారనీ కథనం. ఇదే సందుగా ‘బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రైస్తవ ఐక్యతా మండలి’ అనే ప్రముఖ సంస్థ తాలూకు వాళ్ళమని నమ్మేలా చేస్తూ, అజ్ఞాత వ్యక్తులు రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్నారు. ‘బంగ్లాదేశ్ హిందూ యూనిటీ కౌన్సిల్’ అనే దొంగపేరుతో, అనేక పాత దాడుల ఫోటోలు, వీడియోలను కొత్తవిగా ప్రచారం చేస్తున్నారు. సందట్లో సడేమియాగా దీన్ని అందిపుచ్చుకొని, పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఉప ఎన్నికలకు ఈ హింసాకాండను అస్త్రంగా వాడుకోవాలని హిందూత్వపార్టీలు ప్రయత్నిస్తుండడం శోచనీయం. బంగ్లాదేశ్‌లోని షేక్ హసీనా ప్రభుత్వం సైతం మతాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మత ఛాందసవాదాన్ని నూరిపోస్తున్న మదరసాల పుణ్యమా అని ఆ దేశం ఇప్పుడు ‘జిహాదిస్తాన్’గా మారిపోయిందని రచయిత్రి తస్లీమా నస్రీన్ ఆరోపించారు. పాకిస్తాన్ అనుకూల తీవ్రవాద సంస్థ ‘జమాతే ఇస్లామీ’ ఈ దాడుల వెనుక ఉందని వినిపిస్తోంది. ఖలీదా జియా సారథ్యంలోని ‘బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ’ సంకీర్ణ ప్రభుత్వంలో 2001 –06 మధ్య ఆ సంస్థ కూడా భాగం. దేశంలో కనీసం 10 శాతం మందిపై పట్టున్న ఈ బృందం అధికారంలోకి రాలేకున్నా, హింసనైతే ప్రేరేపించగలదు. జమాత్‌కు కళ్ళెం వేయడం కోసం షేక్ హసీనా ప్రభుత్వం మరో ఇస్లామిస్టు బృందం ‘హెఫాజతే ఇస్లామ్’ (హిమ్)తో దోస్తీ కట్టింది. దాని ఒత్తిడి మేరకే 2017లో సుప్రీంకోర్టులో న్యాయదేవత విగ్రహం తొలగించారు. మదరసా డిగ్రీని పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీగా గుర్తించాల్సి వచ్చింది. ఈ ఏడాది మార్చిలో భారత ప్రధాని మోదీ బంగ్లాదేశ్ పర్యటన వేళ నిరసనలు, హిందువులపై హింసాకాండకూ ‘హిమ్’ కారణమట. హసీనా సారథ్యంలోని అవామీ లీగ్ సర్కార్ తప్పు తెలుసుకొనేసరికే ఆలస్యమైంది. వెరసి, మతాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకొనే వికృత రాజకీయక్రీడ భారత్ నుంచి బంగ్లాదేశ్ దాకా అనేకచోట్లకు పాకింది. జమ్మూ కశ్మీర్లో తీవ్రవాదుల తూటాలకు హిందువులు, సిక్కులు... అఫ్గాన్‌లో మసీదులపై దాడులతో పదుల కొద్దీ షియాలు... బంగ్లాదేశ్ ఘర్షణల్లో హిందువులు! సమయం, సందర్భం, కారణం, కారకులు వేరైనా–ప్రతీచోటా అల్పసంఖ్యాక మతస్థులే లక్ష్యం. దక్షిణాసియాలో మైనారిటీలు అభద్రతలో మునిగిపోయారు. ఉపఖండంలోని ప్రతి దేశం ఇప్పుడొక మతావేశ భూమిగా మారుతోంది. కాశ్మీర్‌లోనూ, బంగ్లాదేశ్‌లోనూ ఛాందసవాద బృందాలకు మద్దతుగా నిలిచి, మతం ఆసరాగా విద్వేషాన్ని రగిలించాలన్న పాకిస్తాన్ ప్రయత్నం జగద్విదితం. అందుకే, మతపరంగా సజాతీయతను రుద్ది, రాజకీయ ఆధిపత్యం సాధించాలనుకొనే శక్తులను కనిపెట్టి ఉండాలి. గతంలో ఉత్తర భారతమంతటా గో సంరక్షణ పేరిట ముస్లిమ్‌ల ఊచకోత జరిగిన ఘట్టాలూ చూశాం. ఇప్పుడు కశ్మీర్లో పండిట్లతో పాటు వలస కార్మికుల ఉసురు తీస్తున్న ఉగ్రమూకల్ని చూస్తున్నాం. సాటిమనిషిని బతకనివ్వని ఛాందసం సిందూరమైతేనేం, హరితవర్ణ బంగారమైతేనేం! 2013 – 16 మధ్య కాలంలో బంగ్లాదేశ్‌లో జరిగిన దారుణమైన ఇస్లామిస్ట్ హింసాకాండను హసీనా మర్చిపోరాదు. దశాబ్దాలుగా హిందువుల సంఖ్య క్షీణించడంపైనా, మానవహక్కుల సంఘం లెక్కల్లో హిందువులపై 3700 పైగా జరిగిన దాడులపైనా ఆమె తక్షణం దృష్టి పెట్టాలి. తీవ్రవాద శక్తులపై ఉక్కుపాదం మోపితేనే, నేటి స్వర్ణోత్సవ స్వతంత్ర బంగ్లాదేశ్ సాధించిన ఆర్థిక పురోగతికి సార్థకత. భారత్ భద్రతకు సానుకూలత. తాజాగా ఢాకా విశ్వవిద్యాలయం బయట నిరసనకారుల చేతిలో ప్రముఖంగా కనిపించిన బ్యానర్లో మాట – ‘దేశంలోని మైనారిటీల భద్రతను కాపాడాలి’. అవును... అది బంగ్లాదేశ్ అయినా, భారత్ అయినా, అఫ్గాన్ అయినా ముందు చేయాల్సింది అదే! -
మణిరత్నంపై రాజద్రోహం కేసు
ముజఫర్‌పూర్/వయనాడ్: మూకదాడులపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఇందుకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాసిన 50 మంది ప్రముఖులపై రాజద్రోహం కింద కేసు నమోదైంది. ప్రధాని మోదీకి రాసిన జూలైలో రాసిన ఆ లేఖపై ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహతోపాటు, సినీ దర్శకులు మణిరత్నం, అదూర్ గోపాలకృష్ణన్, అపర్ణసేన్ తదితర యాభైమంది ప్రము ఖులు సంత కాలు న్నాయి. ము స్లింలు, దళితులు, మైనారిటీలపై మూకదాడులను ఆపాలని వారు తమ లేఖలో కోరారు. అయితే, ‘ఆ లేఖ కారణంగా దేశం ప్రతిష్ట దెబ్బతింది. వేర్పాటు ధోరణులను బలపరచడంతోపాటు ప్రధాని అద్భుత పనితీరును అందులో చులకన చేశారు’అని ఆరోపిస్తూ బిహార్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన సుధీర్ కుమార్ ఓఝా అనే న్యాయవాది చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టుకు ఆగస్టులో ఫిర్యాదు చేశారు. దీనిపై మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు రాజద్రోహం వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయని సదర్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. -
ఎన్నికల ముందు మతఘర్షణలు!
వాషింగ్టన్: సార్వత్రిక ఎన్నికల వేళ ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ హిందుత్వ ఎజెండాతో ముందుకెళితే భారత్‌లో మతఘర్షణలు చెలరేగే అవకాశముందని నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ డాన్ కోట్స్ తెలిపారు. గత ఐదేళ్ల కాలంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మతపరమైన ఉద్రిక్తతలు, విద్వేషం పెరిగాయని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా 2019లో ఎదురుకానున్న విపత్కర పరిస్థితులపై కోట్స్ సెనెట్ సెలక్ట్ కమిటీ ఆన్ ఇంటెలిజెన్స్ ముందు హాజరై నివేదికను సమర్పించారు. ఈ సందర్భంగా కోట్స్ మాట్లాడుతూ..‘మోదీ నేతృత్వంలోని బీజేపీ హిందుత్వ అజెండాను ప్రచారాస్త్రంగా చేసుకుంటే భారత్‌లో సార్వత్రిక ఎన్నికల వేళ మత ఘర్షణలు చోటుచేసుకునే అవకాశముంది. దాంతో, ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలు భారత్‌లో సులభంగా తమ ప్రాబల్యాన్ని విస్తరిస్తాయి’ అని హెచ్చరించారు. భారత్‌పై ఉగ్రదాడులు కొనసాగుతాయి.. అంతేకాకుండా భారత్–పాకిస్తాన్ సంబంధాలు లోక్‌సభ ఎన్నికలు ముగిసేవరకూ మెరుగుపడే అవకాశం లేదని కోట్స్ అభిప్రాయపడ్డారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలు భారత్, అఫ్గానిస్తాన్‌పై 2019లోనూ దాడులు కొనసాగిస్తాయని హెచ్చరించారు. తమకు ప్రమాదకరంగా మారిన ఉగ్రవాదులను మాత్రమే ఏరివేస్తూ, ఇతర ఉగ్రమూకలకు ఆశ్రయమిస్తున్న పాకిస్తాన్ అమెరికా ఆగ్రహానికి గురికాక తప్పదని వ్యాఖ్యానించారు. అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లపై పోరాడుతున్న అమెరికాకు పాక్ వ్యవహారశైలి నిరాశపరుస్తోందన్నారు. భారత్‌లో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మత ఉద్రిక్తతలు, అఫ్గానిస్తాన్‌లో 2019, జూన్–జూలై నెలల్లో అధ్యక్ష ఎన్నికలు సందర్భంగా తాలిబాన్ల దాడులు, ఉగ్రవాదుల పూర్తిస్థాయి ఏరివేతకు పాక్ నిరాకరణ వంటి కారణాల వల్ల ఈ ఏడాది దక్షిణాసియాలో హింసాత్మక ఘటనలు పెరిగే అవకాశముందని హెచ్చరించారు. సెనెట్ సెలక్ట్ కమిటీ ఆన్ ఇంటెలిజెన్స్ ముందు కోట్స్‌తో పాటు సీఐఏ డైరెక్టర్ గినా హాస్పెల్, ఎఫ్‌బీఐ చీఫ్ క్రిస్టోఫర్ రే, రక్షణ నిఘా సంస్థ(డీఐఏ) డైరెక్టర్ రాబర్ట్ అష్లేతో పాటు పలువురు హాజరయ్యారు. -
యోగి ఆదిత్యనాథ్ మాటల్లో నిజానిజాలు
సాక్షి, న్యూఢిల్లీ : ‘మార్చి నెల వస్తే నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి రెండేళ్లు పూర్తవుతాయి. ఇంతవరకు రాష్ట్రంలో అల్లర్లు జరగలేదు’ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జనవరి 3, 2019న చేసిన ట్వీట్ ఇది. ఆ తర్వాత ‘ఫస్ట్‌పోస్ట్’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆయన ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు. मार्च में मेरे शासनकाल के दो वर्ष पूरे होंगे। मेरे अब तक के शासन में, कोई दंगा नहीं हुआ है। — Yogi Adityanath (@myogiadityanath) January 3, 2019 వాస్తవాలు అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. సాక్షాత్తు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారామ్ అహిర్ 2018, ఫిబ్రవరి 6వ తేదీన లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ 2017లో దేశవ్యాప్తంగా 822 మతపరమైన అల్లర్లు చెలరేగాయని, వాటిలో 195 అల్లర్లు ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే జరిగాయని వెల్లడించారు. ఆ 195 అల్లర్లలో 42 మంది మరణించారని, 542 మంది గాయపడ్డారని కూడా తెలిపారు. ఆయన అన్ని రాష్ట్రాల వివరాలు వెల్లడించగా ఉత్తరప్రదేశ్‌లోనే అత్యధికంగా అల్లర్ల సంఘటనలు జరిగాయి. ఆ తర్వాత రెండోస్థానంలో ఉన్న రాజస్థాన్‌లో 91 సంఘటనలు జరిగి, 12 మంది మరణించగా, 175 మంది గాయపడ్డారు. ఇక మూడవ స్థానంలో ఉన్న పశ్చిమ బెంగాల్లో 58 సంఘటనలు జరగ్గా 9 మంది మరణించారు. 230 మంది గాయపడ్డారు. మొదటి రెండు రాష్ట్రాల్లో బీజేపీయే అధికారంలో ఉండగా, బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం గమనార్హం. మూడు ప్రధాన సంఘటనలు కేంద్ర హోంశాఖ వెల్లడించిన వివరాలే కాకుండా మీడియా వార్తల ప్రకారం యోగి ఆదిత్యనాథ్ హయాంలో ఉత్తరప్రదేశ్‌లో అల్లర్లకు సంబంధించి మూడు ప్రధాన సంఘటనలు చోటు చేసుకున్నాయి. సహరాన్పూర్ పరిధిలోని షబ్బీర్‌పూర్ గ్రామంలో 2017, మే 5వ తేదీన ఠాకూర్లు, దళితుల మధ్య అల్లర్లు చెలరేగాయి. రాజ్‌పుత్‌ల రాజు మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా తమ ప్రాంతం నుంచి ఠాకూర్ల ప్రదర్శనను అడ్డుకున్న దళితులపై దాడి చేయడంలో ఒకరు మరణించారు. 15 మంది గాయపడ్డారు. 2018, జనవరి 26వ తేదీన ఇరువర్గాల మధ్య చెలరేగిన అల్లర్లలో ఒకరు మరణించగా, ముగ్గురు గాయపడ్డారు. ఫలితంగా అక్కడ కర్ఫ్యూ విధించాల్సి వచ్చింది. భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మోటారు సైకిళ్ల ర్యాలీ నిర్వహిస్తున్న యువకులు ఆ ప్రాతంలో నివసిస్తున్న ఓ వర్గం ప్రజలకు వ్యతిరేకంగా నినాదాలు ఇవ్వడంతో ఘర్షణ తలెత్తింది. ఫలితంగా ఇరు వర్గాల వారు పరస్పరం రాళ్లు విసురుకొని కాల్పులు కూడా జరుపుకున్నారు. బులంద్‌షహర్‌లో బులంద్‌షహర్ పరిధిలో గత డిసెంబర్ 27వ తేదీన గుర్తుతెలియని వ్యక్తులు ఆవులను చంపారన్న కారణంగా చెలరేగిన హింసాకాండలో పోలీసు ఇన్స్పెక్టర్ సుబోద్ కుమార్, మరో పౌరుడు మరణించారు. ఇన్స్పెక్టర్ హత్య కేసులో నిందితుడైన భజరంగ్ దళ్ నాయకుడిని పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసిన విషయం తెల్సిందే. అన్ని జాతీయ వార్తా పత్రికలు ఈ వార్తను ప్రముఖంగా ప్రచురించాయి. -
సరిగ్గా నెలరోజులకు నిందితుడి అరెస్టు
లక్నో : గోవులను వధించారనే వార్తల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో హింస చెలరేగిన సంగతి తెలిసిందే. ఆందోళనకారుల దాడిలో ఎస్ఐ సుబోధ్ కుమార్, సుమిత్ కుమార్ అనే యువకుడు మృతి చెందారు. ఈ ఘటన డిసెంబర్ 3న జరగగా ప్రధాన నిందితుడిగా భావిస్తున్న యోగేష్రాజ్ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. స్థానికులను రెచ్చగొట్టి హింసాకాండకు కారణమయ్యాడని జిల్లా భజరంగ్‌దళ్ కన్వీనర్ యోగేష్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే, అరెస్టు ముందు అతనొక వీడియోలో.. అల్లర్లు జరిగిన చోట నేను లేను. హింసాకాండ, ఆందోళలనకు నాకు ఏ సంబంధం లేదు. ప్రభుత్వం నన్ను చెడుగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తోంది. చెరుకు తోట సమీపంలో పశువుల కళేబరాలున్నాయని ఎవరో కాల్ చేశారు. దాంతో నేరుగా సియానా పోలీస్ స్టేషన్‌కు వెళ్లాను. ఆందోళన జరుగుతున్న సమయంలో భజరంగ్‌దళ్ మిత్రులతో కలిసి స్టేషన్లోనే ఉన్నాను’ అని చెప్పుకొచ్చాడు. (యూపీలో రెచ్చిపోయిన గోరక్షక ముఠా) ఇదొక కథ..? యోగేష్‌రాజ్ పోలీసులకు ఇచ్చిన నివేదికలో వివరాలు మరోలా ఉన్నాయి. మిత్రులతో కలిసి సోమవారం (డిసెంబర్, 3) ఉదయం 9 గంటల ప్రాంతంలో మార్నింగ్ వాక్‌కి వెళ్లినట్టు చెప్పాడు. పొరుగునున్న మహావ్ గ్రామంలోని చెరుకు తోట సమీపంలో గోవులను వధిస్తున్న ఏడుగురు ముస్లిం యువకులను గుర్తించామని, వారిని పట్టుకుందామనే లోపలే పారిపోయారని వివరించాడు. ఆ యువకులు తమ గ్రామానికి చెందినవారేనని తెలిపాడు. ఇదిలాఉండగా.. హింసాకాండ చెలరేగిన అనంతరరం కొన్ని వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. వాటిల్లో.. పశువధ నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ యోగేష్ రోడ్లను బ్లాక్ చేయించినట్టుగా ఉంది. ఆందోళన సాగుతున్న సమయంలో అతను పోలీసులతో మాట్లాడుతున్న మరో వీడియో కూడా బయటకొచ్చింది. వీడియోల్లో లభ్యమైన ఆధారాలను బట్టి హింసాకాండకు ప్రధాన సూత్రధారి యోగేష్ అనేందుకు బలం చేకూరుతోంది. భజరంగ్‌దళ్ రాష్ట్ర కో-కన్వీనర్ ప్రవీణ్ భాటి మాట్లాడుతూ.. బులంద్‌షహర్ హింసాకాండతో యోగేష్రాజ్కి సంబంధం లేదని అన్నారు. ఆందోళన సమయంలో అతను పోలీసులకు సాయం చేశాడని చెప్పారు. హత్య, హత్యాయత్నం నేరాల కింద యోగేష్‌పై కేసులు నమోదు చేశారు. పబ్లిక్ ప్రాపర్టీని నష్టపరిచారని కూడా కేసు పెట్టారు. -
రాజకీయమా, అసహనమా !?
సాక్షి, న్యూఢిల్లీ : ‘ ఓ పోలీసు అధికారి చావుకన్నా ఆవు చావు చాలా ప్రాముఖ్యమైనది’ అని బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా డిసెంబర్ 17వ తేదీన ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించడంపై ఇప్పుడు రాద్దాంతం జరుగుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో ఆవును చంపారన్న ఆరోపణలపై బజరంగ్ దళ్ కార్యకర్తలు సృష్టించిన హింసాండలో ఓ పోలీసు అధికారి చనిపోయిన ఉదంతం గురించి నసీరుద్దీన్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. పోలీసు అధికారిని కాల్చి చంపిన బజరంగ్ దళ్ నాయకుడు యోగేశ్ రాజ్‌ను ఇంతవరకు అరెస్ట్ చేయలేక పోయిన బులంద్‌షహర్ పోలీసులు ఆవును చంపిన కేసులో నలుగురు ముస్లిం యువకులను అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు ఆ నలుగురు ముస్లింలు ఆవును చంపారనడానికి ఎలాంటి ఆధారాలు పోలీసులు సేకరించలేక పోయారు. ఈ నేపథ్యంలో మతోన్మాద పరిస్థితుల గురించి, నేరం చేసిన తప్పించుకుంటున్న పరిస్థితి గురించి మాట్లాడుతూ నసీరుద్దీన్ ఓ మనిషి చావుకన్నా చావు ముఖ్యంగా మారిందని విమర్శించారు. ఆవును చంపారన్న ఆరోపణలపైనే ఆగ్రహం వ్యక్తం చేసిన యూపీ సీఎం ఆదిత్యనాథ్ యోగి, పోలీసు అధికారి చావును మాత్రం అదొక ‘యాక్సిడెంట్’ అని వ్యాఖ్యానించారు. ఆయన మాటల్లో తప్పుకనిపించని మూకలకు ఇప్పుడు నసీరుద్దీన్ మాటల్లో తప్పు కనిపిస్తోంది. నసీరుద్దీన్‌ను పాకిస్థాన్ ఏజెంట్ అంటూ యూపీ బీజేపీ చీఫ్ మహేంద్ర నాథ్ పాండే విమర్శించగా, దేశద్రోహి అంటూ బీజేపీ మిత్రుడు రాందేవ్ బాబా ఆరోపించారు. మతోన్మాద రాజకీయాల గురించి ఎవరు మాట్లాడినా వారిని పాకిస్తాన్ ఏజెంట్ అనడమో, పాకిస్తాన్ టెర్రరిస్టుతో పోల్చడమో మతోన్మాద నాయకులకు కొత్తకాదు. ఇంతకుముందు ఇదే యోగి ఆదిత్యనాథ్, దేశంలో అసహన పరిస్థితులు నెలకొన్నాయంటూ వ్యాఖ్యానించిన బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్‌ను పాకిస్తాన్ టెర్రరిస్ట్ హఫీద్ సయీద్‌తో పోల్చారు. దేశంలో అసహన పరిస్థితులు పెరుగుతున్నాయన్నందుకు మరో నటుడు ఆమిర్ ఖాన్‌ను కూడా మతోన్మాద మూకలు విమర్శించాయి. పర్యావసానంగా ఆమిర్ ఖాన్ కొన్ని కోట్ల రూపాయల యాడ్ అవకాశాన్ని కోల్పోవాల్సి వచ్చింది. నసీరుద్దీన్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసినందుకు మొన్న శుక్రవారం నాడు ‘అజ్మీర్ సాహిత్య వేడుకల్లో’ నిర్వాహకులు ఆయన పాల్గొనాల్సిన సెషన్‌ను రద్దు చేశారు. ఎంత రాజకీయమైనా ఇంత అసహనం పనికి రాదు! -
మత ఘర్షణలకు దారితీసిన మూకహత్య
ఇంఫాల్: దేశంలో మూక హత్యలు ఆగడం లేదు. తాజగా మణిపూర్‌లో చోటుచేసుకున్న మూకహత్య ఆ ప్రాంతంలో మతఘర్షణలకు దారితీసింది. వివరాల్లోకి వెళ్తే.. తౌబాల్ జిల్లాలో లిలాంగ్కు చెందిన 26 ఏళ్ల ఫరూఖ్ ఖాన్, మరో ఇద్దరు స్నేహితులతో కలిసి కారులో బయటకు వెళ్లాడు. ఫరూఖ్ ప్రయాణిస్తున్న వాహనం గురువారం తెల్లవారుజామున పశ్చిమ ఇంఫాల్ జిల్లాలోని థరోజమ్ గ్రామానికి చేరుకోంది. అయితే ఫరూఖ్‌ను, అతని స్నేహితులను వాహనాల దొంగలుగా భావించిన ఆ గ్రామ ప్రజలు వారిపై దాడికి దిగారు. అంతేకాకుండా వారి కారును కూడా ధ్వంసం చేశారు. ఈ దాడిలో ఫరూఖ్‌తో పాటు ఉన్న ఇద్దరు వ్యక్తులు తప్పించుకోగా.. తీవ్రంగా గాయపడిన ఫరూఖ్ మృతి చెందాడు. ఈ ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు మూకహత్యతో సంబంధం ఉన్న ఐదుగురిని అరెస్ట్ చేశారు. కాగా, ఈ ఘటనలో అరెస్ట్ చేసినవారిని వెంటనే విడుదల చేయాలని థరోజమ్ గ్రామస్తులు పోలీస్ స్టేషన్‌పై దాడికి దిగారు. వారు స్టేషన్‌పై రాళ్లు విసరడంతో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. మరోవైపు ఫరూఖ్ అతని స్నేహితులు వాహనాన్ని దొంగతనం చేసేందుకు ప్రయత్నించడంతోనే తాము దాడికి దిగినట్టు ఆ గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులు స్పందిస్తూ.. ఈ ఘటనతో సంబంధం ఉన్న పదమూడు మందిని గుర్తించామని, మిగిలిన వారిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలిపారు. థరోజమ్ గ్రామస్తుల వాదనను కూడా పరిగణలోకి తీసుకుని దర్యాప్తు చేపడతామని పేర్కొన్నారు. ఫరూఖ్ సామాజిక వర్గానికి చెందిన నేతలు మాట్లాడుతూ.. ఫరూఖ్ చాలా అమాయకుడినని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన మణిపూర్ మానవ హక్కుల సంఘం.. సెప్టెంబర్ 22లోపు ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాల్సిందిగా రాష్ట్ర డీజేపీని ఆదేశించింది. -
వాహనాల దొంగలుగా భావించి..
-
మత ఘర్షణలు.. సంచలన వీడియో
‘ఇస్లాంలో పుట్టడమేనా నేను చేసిన పాపం. హిందువుల ప్రాంతంలోకి వెళ్లటమేనా? నేను చేసిన నేరం’ అంటూ 67 ఏళ్ల అబుల్ బషర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమపై జరిగిన దాడిని ఆయన మీడియాకు వివరిస్తూ కన్నీటి పర్యంతం అయ్యాడు. శ్రీరామనవమి వేడుకల సందర్భంగా పశ్చిమబెంగాల్ వెస్ట్బుర్దవాన్ జిల్లా రాణిగంఝ్, అసన్సోల్ ప్రాంతాల్లో మత ఘర్షణలు చెలరేగిన విషయం తెలిసిందే. ఆ ఘటన జరిగిన మరోసటి రోజే వాటికి పొరుగునే అండల్లో ఓ వృద్ధ అంధ దంపతులతో కొందరు దురుసుగా వ్యవహరించగా.. ఆ వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. పశ్చిమబెంగాల్ తారాపిత్లోని బుద్ధిగ్రామ్కు చెందిన బషర్- బదేనా బీబీ(61) వృద్ధ దంపతులు. ఇద్దరూ అంధులు కావటంతో యాచక వృత్తి చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈ క్రమంలో గత మంగళవారం భిక్షమెత్తుకుంటూ చిటదంగ ప్రాంతంలోకి వెళ్లారు. అక్కడ వారిని గమనించిన కొందరు వారిని అడ్డగించారు. బషర్ తలపై ఉన్న టోపీని తొలగించి.. ఓం గుర్తు ఉన్న కాషాయం జెండాను పట్టుకోవాలంటూ ఆయనపై ఒత్తిడి తెచ్చారు. ఇది హిందువుల ఏరియా.. చెప్పినట్లు చేయకుంటే చంపుతామని చెదిరించారు. దాంతో భయపడ్డ బషర్ జెండాను చేతిలోకి తీసుకున్నారు. ఆ తర్వాత జై శ్రీరామ్, జై మా తారా నినాదాలు చేయాలంటూ వారిపై ఒత్తిడి తెచ్చారు. బషర్ మాటల్లో... ఈ వీడియోపై పలు జాతీయ మీడియా చానెళ్లు బషర్‌ను సంప్రదించాయి. ‘ఆ సమయంలో వణికిపోయాను. నా భయం నా గురించి కాదు. నా భార్యపై దాడి చేస్తారేమోనని. వెంటనే వారితో భగవాన్-అల్లా ఒక్కటేనని.. దేశంలో ఎవరైనా ఎలాంటి మతాన్ని అయినా అనుసరించే స్వేచ్ఛ ఉందని సర్దిచెప్పే యత్నం చేశాను. మేం ఇక్కడికి వచ్చింది బిచ్చమెత్తుకోవటానికి.. ఎవరిని ఇబ్బంది పెట్టటానికి కాదని వివరించాను. కానీ, వాళ్లు నా మాటలు వినలేదు. నినాదాలు చేయాల్సిందేనంటూ నాపై ఒత్తిడి తెచ్చారు. చివరకు వారి స్వరాలు పెరగటంతో భయంతో వాళ్లు చెప్పినట్లే చేయాల్సి వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా చంపుతారేమోనని వెనక్కి తగ్గాం’ అని బషర్ వివరించారు. కాగా, అంతకు ముందు రోజు ఘర్షణలు జరిగిన విషయం కూడా తమకు తెలీదని బషర్ చెబుతున్నారు. విమర్శలు.. ఇక ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్లో వైరల్ అవుతుండటంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వ్యవహారం తమ దాకా రావటంతో అండల్ పోలీస్ స్టేషన్ అధికారి సంజయ్ చక్రవర్తి స్పందించారు. ‘ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదు. అందితే పరిశీలిస్తాం’ అని తెలిపారు. అయితే అది ఏ గ్రూప్ పని అన్నది తేలాల్సి ఉంది. మరోవైపు వెస్ట్‌బెంగాల్, బిహార్ లోని కొన్ని ప్రాంతాల్లో మత ఘర్షణలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. -
జై శ్రీరామ్ అనాలంటూ.. సంచలన వీడియో
-
అర్ధరాత్రి హైడ్రామా.. మంత్రి కొడుకు అరెస్ట్
పట్నా : భగ్లాపూర్ (బిహార్) మత ఘర్షణలకు సంబంధించి శనివారం అర్ధరాత్రి హైడ్రామా నడిచింది. అల్లర్లకు కారణంగా భావిస్తున్న కేంద్ర మంత్రి అశ్విని చౌబే(బీజేపీ) తనయుడు అర్జిత్ షాష్వత్ పోలీసులకు లొంగిపోయారు. అయితే ఆయన లొంగిపోలేదని.. తామే అరెస్ట్ చేసినట్లు భగ్లాపూర్ పోలీసులు ప్రకటించారు. ‘అతని ఆచూకీ కోసం గాలింపు చేపట్టాం. భగ్లాపూర్ పోలీసులు కూడా అతనిపై అరెస్ట్ వారెంట్‌తో వెతుకుతున్నారు. హనుమాన్ మందిర్ సమీపంలో అతన్ని అరెస్ట్ చేశాం. పద్ధతి ప్రకారం ఇప్పుడతని విచారణ చేపట్టాం’ అని అదనపు ఎస్పీ రాశేష్ దుబే మీడియాకు వెల్లడించారు. అర్జిత్ తనంతట తానే లొంగిపోయినట్లు.. మీడియాకు వెల్లడించిన విజువల్స్ స్థానిక మీడియా ఛానెళ్లలో చక్కర్లు కొడుతున్నాయి. ఆరోపణలన్నీ అవాస్తవమని.. ఈ కేసులో తాను ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని షాష్వత్ వెల్లడించారు. మార్చి 17న అర్జిత్ షాష్వత్ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీ సందర్భంగా రెచ్చగొట్టే నినాదాలు చేయటంతో.. ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. రాళ్లు రువ్వుకోవటంతో పోలీసులతోపాటు స్థానికులు కూడా గాయపడ్డారు. అయితే ఆ ఘటనలకు.. అర్జిత్‌కు ఎలాంటి సంబంధం లేదని ఆయన తండ్రి, కేంద్ర మంత్రి అశ్విని చౌబే, పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. మత ఘర్షణల వెనుక ఆర్జేడీ-కాంగ్రెస్ పార్టీల కుట్ర ఉందని చౌబే ఆరోపించారు. ఇక ప్రతిపక్షాల డిమాండ్ మేరకు ఈ కేసులో దర్యాప్తు పారదర్శకంగా చేపట్టాలని సీఎం నితీశ్ కుమార్ ఆదేశించటం.. అర్జిత్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ తిరస్కరణకు గురికావటం.. కొద్ది గంటలకే అర్జిత్ అరెస్ట్.. ఇలా వరుస పరిణామాలు చోటు చేసుకున్నాయి. -
దొందూ దొందే....యోగి బాటలోనే సిద్దూ..
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తనతో సహా పలు అల్లర్ల కేసుల్లో విచారణను ఎదుర్కొంటున్న 20 వేల మంది నిందితులకు జైళ్ల నుంచి విముక్తి కల్పిస్తూ గత డిసెంబర్ 22వ తేదీన సవరణ బిల్లును తీసుకొచ్చారు. అందులో గోరక్‌పూర్‌లోని పీపీ గంజ్ పోలీసు స్టేషన్ పరిధిలో 188వ సెక్షన్ కింద ఆదిత్యనాథ్‌పై దాఖలైన కీలకమైన కేసు కూడా ఉంది. ఇలా వివిధ అల్లర్ల కేసుల్లో అరెస్టై విచారణ ఎదుర్కొంటున్న వారంతా మెజారిటీ హిందువులే. వారంతా ముస్లింలకు వ్యతిరేకంగా జరిగిన దాడుల్లో అరెస్టైన వారే. వారిని కేసుల నుంచి విముక్తి కల్పిస్తూ బిల్లు తేవడం పట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ధ్వజమెత్తింది. ఆదిత్యనాథ్ మతం ప్రాతిపదికన రాజకీయాలు నెరపుతున్నారంటూ విమర్శలు గుప్పించింది. దాదాపు ఇలాంటి పనినే కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య చేశారు. ఆయన ఆదేశాల మేరకు అదే డిసెంబర్ 22వ తేదీన, మళ్లీ జనవరి 2వ తేదీన రాష్ట్ర డీజీపీ 23 జిల్లాల్లోని తన సబార్డినేట్లకు లేఖలు రాశారు. వివిధ అల్లర్ల కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న అమాయక మైనారిటీల(ఇన్నోసెంట్ మైనారిటీస్)పై కేసులు ఉపసంహరించుకోవడం పట్ల అభిప్రాయాలేమిటో తెలియజేయమని ఆ లేఖల్లో తన కింది అధికారులను డీజీపీ అడిగారు. ఆ తర్వాత ఈ లేఖలను పట్టుకున్న రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకులు సిద్దరామయ్య ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ముస్లింల ఓట్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలను మంచి చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. దీంతో దొరికిపోయామనుకున్నకర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ‘ఇన్నోసెంట్ పర్సన్స్’ అన్నదే తమ ఉద్దేశమని, ఇన్నోసెంట్ మైనారిటీస్ అని పొరపాటున వచ్చిందని, అది టైపోగ్రాఫికల్ తప్పిదమేనని సమర్థించుకునేందుకు ప్రయత్నించింది. 2013లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకాలం ఈ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోక ఇప్పుడు, అంటే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మైనారిటీల విడుదలకు ప్రయత్నించడం అంటే ఓట్ల రాజకీయమేనన్నది ఎవరికైనా అర్థం అవుతుంది. ఒకవేళ ‘ఇన్నోసెంట్ పర్సన్స్’ అన్న మాటనే నిజం అనుకుంటే అమాయకులను పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేశారన్న అర్థం వస్తుంది. మరి అన్యాయంగా అమాయకులను అరెస్ట్ చేసిన పోలీసులపై ప్రభుత్వం చర్యలు తీసుకుందా? మున్ముందు తీసుకునే ఉద్దేశం ఉందా? సాధారణంగా అల్లర్ల కేసుల్లో సాక్ష్యాధారాలు లేవన్న కారణంగా కోర్టులు కేసులను కొట్టివేస్తాయితప్పా, పోలీసులు విడుదల చేయరు. ఆదిత్యనాథ్ ఏకంగా బిల్లునే తీసుకరాగా, సిద్దరామయ్య కూడా ఆ దిశగానే ప్రయత్నాలు ప్రారంభించారు. దక్షిణాదిలో అతిపెద్ద రాష్ట్రమైన కర్ణాటకలో ఎలాగైనా పాగా వేయాలని చూస్తున్న బీజేపీ హిందూత్వ పేరిట మత రాజకీయాలను ప్రచారం చేస్తున్నారు. కర్ణాటక తీర ప్రాంతాల్లో ఇప్పటికే బీజేపీ కారణంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎలాగైనా వరుస రాష్ట్ర విజయాలతో ముందుకొస్తున్న బీజేపీ ప్రభంజనాన్ని అడ్డుకొని మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ కూడా మతం ప్రాతిపదికనే వ్యవహరిస్తోంది. ఇది ఆ పార్టీ సిద్ధాంతానికే కాదు, లౌకిక వ్యవస్థ మనుగడకే ముప్పు తెస్తుంది. -
కాస్గంజ్లో అసలేం జరిగింది..?
లక్నో : మతఘర్షణల నేపథ్యంలో చెలరేగిన అల్లర్లతో పశ్చిమ ఉత్తరప్రదేశ్ అట్టుడుకుతోంది. కాస్గంజ్ జిల్లాలో నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పట్టణంలో విద్యార్థి సంఘాలు ర్యాలీ హింస్మాత్మకంగా మారి చందన్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. శనివారం చందన్ అంత్యక్రియల అనంతరం ర్యాలీ చేపట్టిన ఆందోళనకారులు ఒక్కసారిగా తమ ఆగ్రహావేశాలను ప్రదర్శించారు. ఓ బస్సు, మూడు దుకాణాలను, ఇతర వాణిజ్య సముదాయాలను తగలబెట్టారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. శాంతి భద్రతలను అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు 144 సెక్షన్ విధించారు. ప్రస్తుతం అక్కడ కర్ఫ్యూ కొనసాగుతోంది. నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నట్లు అదనపు డీజీ ఆనంద్ ప్రకటించారు. డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టామని, సున్నిత ప్రాంతాలకు అదనపు బలగాలను తరలించామని అన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటిదాకా 49 మందిని పోలీసులు అరెస్టు చేయగా.. ఆదివారం ఉదయం మరో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఘర్షణకు దారి తీసిన పరిస్థితి... గణతంత్ర దినోత్సవం సందర్భంగా కాస్గంజ్ హెడ్‌క్వార్టర్స్‌లో విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ విద్యార్థి సంఘం సంయుక్తంగా తిరంగా ర్యాలీ చేపట్టింది. ఇంతలో మరో వర్గానికి చెందిన కొందరు 'పాకిస్థాన్ జిందాబాద్' అనే నినాదాలు చేయటంతో వివాదం మొదలైంది. ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకోగా.. చందన్‌గుప్తా అనే యువకుడు చనిపోయాడు. మరో ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. అయితే పోలీసు కాల్పుల్లోనే వారు గాయపడ్డారంటూ వదంతులు వ్యాపించటంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అల్లర్లను అదుపు చేసేందుకు భారీ ఎత్తున బలగాలను రంగంలోకి దించిన రాష్ట్ర ప్రభుత్వం, ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. కాజ్గంజ్ జిల్లా కలెక్టర్ ఆర్పీ సింగ్ ను ఫోన్ లో సంప్రదిస్తున్న సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అల్లర్లకు పాల్పడిన వాళ్లపై చట్టపరమైన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. మరోవైపు అల్లర్ల ఘటన దురదృష్టకరమని యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పేర్కొన్నారు. ఈ ఘటనకు బాధ్యులను వదిలిపెట్టబోమని ఆయన చెప్పారు. -
ఫేక్ పోస్ట్ ఫలితం: బీజేపీ నేత అరెస్టు!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు ఆజ్యం పోసేందుకు ఫేస్బుక్లో ఫేక్ వార్తలను పోస్ట్చేసిన వారి అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది. తాజాగా ట్విట్టర్లో తప్పుడు వార్తను పోస్ట్చేసిన భారతీయ జనతా పార్టీ సమాచార, సాంకేతిక (ఐటీ) విభాగం కార్యదర్శి తరుణ్ సేన్ గుప్తాను బుధవారం బెంగాల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 24 పరగణాల జిల్లాలో ఓ మహిళపై నడివీధిలో కీచకపర్వం కొనసాగుతోందంటూ భోజ్‌పురి సినిమాలోని ఓ దశ్యాన్ని పోస్ట్ చేసిన 38 ఏళ్ల యువకుడిని మంగళవారం నాడు పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెల్సిందే. ఆ పోస్ట్‌ను ఫేస్బుక్లో తీవ్రంగా షేర్ చేసిన హర్యానా బీజేపీ నాయకుడు విజేత మాలిక్ కోసం కూడా పోలీసులు వెతుకుతున్నట్లు తెల్సింది. ఒకప్పుడు శాంతి, సౌభ్రాతత్వాలు విరాజిల్లిన బెంగాల్ నేడు అన్ని రంగాల్లో విఫలమైందని ఆరోపిస్తూ 2002 గుజరాత్ అల్లర్ల ఫొటోను షేర్ చేసిన బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మపై మంగళవారం నాడు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిన విషయం తెల్సిందే. మొహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద చిత్రంవేసి రాష్ట్రంలో ప్రస్తుత ఉద్రిక్తతలకు కారణమైన యువకుడి తల్లిదండ్రులకు ఎంత దారుణంగా హింసించారో చూడండంటూ తప్పుడు ఫొటోను ఫేస్బుక్లో పోస్ట్చేసిన యువకుడిని కూడా మంగళవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లర్లకు కారణమైన యువకుడికి అసలు తల్లేలేదని తెల్సింది. -
చెలరేగిన హింస, ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని 24 పరగణాల జిల్లాలో బుధవారం ఇంటర్నెట్ సేవలను అధికారులు నిలివేశారు. బదూరియా ప్రాంతంతో పాటు బంగ్లాదేశ్ సరిహద్దులో మత ఘర్షణలు చెలరేగిన విషయం తెలిసిందే. ఓ మతానికి చెందిన పుణ్యక్షేత్రాన్న్న అగౌరపరుస్తూ అభ్యంతరకరంగా ఫేస్బుక్లో పెట్టిన పోస్ట్‌తో రెండు రోజుల క్రితం గొడవలు మొదలయ్యాయి. శాంతి భద్రతల కోసం రాష్ట్ర పోలీసులకు తోడుగా 400మంది బీఎస్ఎఫ్ జవాన్లను ప్రభుత్వం మోహరించింది. మరోవైపు ఫేస్బుక్లో ఆ పోస్ట్ పెట్టిన ఓ విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా బదూరియా ప్రాంతంలో ఘర్షణలు చెలరేగినట్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. మత ఘర్షణలకు సంబంధించి పశ్చిమ బెంగాల్ గవర్నర్ కేసరీనాథ్ త్రిపాఠి తనను బెదరించారనీ, అవమానపరిచారని ఆమె ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే మమత ఆరోపణలను గవర్నర్ ఖండించారు. తాను సీఎంను అవమానపరచలేదని, ఎలాంటి బెదిరింపులకు పాల్పడలేదని కేసరీనాథ్ పేర్కొన్నారు. -
అలీగఢ్ లో అలజడి
అలీగఢ్: ఉత్తరప్రదేశ్ లోని కైరానా లోని వలసలు, మథురలో చెలరేగిన ఘర్షణలు మరువకముందే అలీగఢ్ మత ఘర్షనలు చోటు చేసుకున్నాయి. అలీగఢ్ లోని బాబ్రి మండిలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఈ ప్రాంతంలో ఉండలేమంటూ మెజారిటీ వర్గానికి చెందిన ప్రజలు వలస బాట పట్టారు. కొన్ని రోజుల క్రితం 19 ఏళ్ల హిందూ యువతిని కొందరు దుండగలు అవమానించారు. ఇది రెండు వర్గాల ప్రజల మధ్య ఘర్షణకు దారి తీసింది. శాంతియుత పరిస్ధితులు నెలకొనేందుకు భద్రతా దళాలు కృషి చేస్తున్నాయి. ఇక్కడ ఆడపిల్లలకి రక్షణ లేదని అందుకే ఈ ప్రాంతం నుంచి వెళ్లిపోతున్నామని సుధా వర్షిణి (38) ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మాయిలు పాఠశాలకు వెలుతుంటే కూడా వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపారు. దీనిపై స్పందించిన జిల్లా మేజిస్టేట్ అవదేశ్ తివారీ వారికి రక్షణ కల్పిస్తామని అన్నారు. -
'మత హింస అంతగా పెరగలేదు'
న్యూ ఢిల్లీ: దేశంలో మతహింస తీవ్రంగా పెరిగిపోతుందన్న ప్రతిపక్షాల ఆరోపణలను తోసిపుచ్చుతూ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజిజు బుధవారం రాజ్యసభలో ఓ ప్రకటనను విడుదల చేశారు. అల్పసంఖ్యాక మతాలవారిపై హింసాత్మక ఘటనలు పెరిగాయన్న వాదన సరైంది కాదన్నారు. 2014లో దేశ వ్యాప్తంగా 644 మత ఘర్షణ సంఘటనలు చోటుచేసుకోగా.. వీటిల్లో 95 మంది మృతి చెంది, 1,921 మంది గాయపడినట్లు తెలిపారు. అయితే ఈ ఏడాది అక్టోబర్ వరకు ఈ తరహా ఘటనలు 650 చోటుచేసుకోగా ఇందులో 84 మంది మృతి చెంది, 1979 మంది గాయపడినట్లు రిజిజు వెల్లడించారు. ప్రతిపక్షాల ఆరోపణల స్థాయిలో మతహింస పెరగలేదని తెలుపుతూ రిజిజు ఈ గణాంకాలను వెల్లడించారు. దాద్రీ ఘటనపై విపక్షాలు అడిగిన ఓ ప్రశ్నకు వివరణ ఇస్తూ.. నిషిద్ధ జంతువును హత్య చేశారన్న ఆరోపణలతో ఓ కుటుంబంపై దాడికి పాల్పడి ఓ వ్యక్తి మృతికి కారణమైన 10 మందిపై కేసులు నమోదుచేసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు. -
బీజేపీ పాలనలో 156 మత ఘర్షణలు
కేంద్రంలో భారతీయ జనతా పార్ట్టీ అధికారంలోకి వచ్చిన తరువాత 156 మత ఘర్షణలు జరిగాయని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రొఫెసర్ పి.ఎల్.విశ్వేశ్వరరావు ఆరోపించారు. ఇప్పటి వరకూ ఒక్క మతఘర్షణ నమోదు కాని.. దాద్రిలో ఘోర ఘటన చోటుచేసుకుందని ఆయన అన్నారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో జరుగుతున్న మత ఘర్షణలకు వ్యతిరేకంగా.. ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో 'భారత రాజకీయాలు, బీఫ్ తినడం పట్ల అభ్యంతరాలు' పేరిట రౌండ్ టేబుల్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అన్ని రాజకీయ పార్టీలతో పాటు.. ప్రజా సంఘాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయని అన్నారు. ప్రజలు ఏం తినాలో.. ఎలాంటి బట్టలు కట్టుకోవాలో.. ఏ పుస్తకం చదవాలో ప్రభుత్వమే నిర్ణయిస్తే ఎలాగని ప్రశ్నించారు. మనది ప్రజాస్వామ్య దేశం అనే సంగతి పాలకులు గుర్తుంచుకోవాలని అన్నారు. -
మతహింసకు పాల్పడితే కఠిన చర్యలు
-
మతహింసపై ఉక్కుపాదం
ప్రధాని మోదీ స్పష్టీకరణ ఏ మతమైనా విద్వేషాలు రెచ్చగొట్టడాన్ని అనుమతించం మతహింసకు పాల్పడితే కఠిన చర్యలు అన్ని మతాలను సమానంగా గౌరవించే ప్రభుత్వం మాది మత సామరస్యం భారతీయులందరి డీఎన్ఏలో ఉండాలన్న ప్రధాని ఏ మత సంస్థ అయినా.. మైనారిటీ కానీ, మెజారిటీ కానీ.. రహస్యంగా కానీ, బహిరంగంగా కానీ..ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొట్టడాన్ని నా ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించదు. అన్ని మతాలను సమానంగా గౌరవించే ప్రభుత్వం నాది. నా ప్రభుత్వంలో ప్రజలందరికీ పూర్తి మత విశ్వాస స్వేచ్ఛ ఉంటుంది. ఎటువంటి ప్రలోభాలకు, బెదిరింపులకు లొంగకుండా తమకు నచ్చిన మతాన్ని ఎంచుకునే, ఆరాధించే తిరుగులేని హక్కు అందరికీ ఉంటుంది. - ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీ: సహచరుల హిందూత్వ వ్యాఖ్యలపై, ఢిల్లీలో చర్చిలపై జరిగిన దాడులపై ఇన్నాళ్లుగా పెదవి విప్పని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎట్టకేలకు మంగళవారం మౌనం వీడారు. విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ఏ మత సంస్థనూ అనుమతించబోమని స్పష్టం చేశారు. ఏ మతం వారైనా మతహింసకు పాల్పడితే అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తమ ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తుందన్నారు. కురియకోస్ అలియాస్ చవర, మదర్ యూఫ్రేసియాలకు సెయింట్ హోదా లభించిన సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన జాతీయ వేడుకలకు ప్రధాని హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ఏ మత సంస్థ అయినా.. మైనారిటీ కానీ, మెజారిటీ కానీ.. రహస్యంగా కానీ, బహిరంగంగా కానీ.. ప్రజల్లో మత విద్వేషాలను రెచ్చగొట్టడాన్ని నా ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించదు. అన్ని మతాలను సమానంగా గౌరవించే ప్రభుత్వం నాది. నా ప్రభుత్వంలో ప్రజలందరికీ పూర్తి మత విశ్వాస స్వేచ్ఛ ఉంటుంది. ఎటువంటి ప్రలోభాలకు, బెదిరింపులకు లొంగకుండా తమకు నచ్చిన మతాన్ని ఎంచుకునే, ఆరాధించే తిరుగులేని హక్కు అందరికీ ఉంటుంది’ అని విస్పష్టంగా పేర్కొన్నారు. ‘ఏ కారణంతో అయినా సరే.. ఏ మతానికి వ్యతిరేకంగా అయినా సరే హింసకు పాల్పడటాన్ని నేను సహించబోను. అలా హింసకు పాల్పడేవారిపై ప్రభుత్వం తీవ్రమైన చర్యలు తీసుకుంటుంది’ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మతం ప్రాతిపదికన విద్వేషాలు చెలరేగుతున్నాయని, ఈ పరిస్థితుల్లో ప్రాచీన కాలం నుంచీ భారత్ అవలంబించిన మత సహనాన్ని, పరమత గౌరవాన్ని అంతర్జాతీయ సమాజం అనుసరించాల్సిన పరిస్థితి నెలకొందని మోదీ వ్యాఖ్యానించారు. ‘ప్రపంచం ఇప్పుడు నాలుగురోడ్ల కూడలిలో ఉంది. దీన్ని సరిగ్గా దాటలేకపోతే.. మత దురభిమానం, మత మౌఢ్యం, రక్తపాతం రాజ్యమేలిన చీకటి రోజుల్లోకి మళ్లీ వెళ్లిపోతాం’ అని హెచ్చరించారు. మహాత్మాగాంధీ, గౌతమ బుద్ధుడి బోధనలను గుర్తు చేస్తూ.. అన్ని మతాలను సమానంగా గౌరవించే లక్షణం ప్రతీ భారతీయుడి డీఎన్ఏలో ఉండాలన్నారు. ప్రాచీన భారత మత విధానం స్ఫూర్తిగా పరమత సహనం అలవర్చుకోవాలని, అన్ని మతాలను గౌరవించి, సామరస్యత పెంపొందేందుకు కృషి చేయాలని అన్ని మతాల సంస్థలకు ప్రధాని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగం, చరిత్రాత్మక హేగ్ ప్రకటనల్లో పేర్కొన్న అంశాలను తన ప్రభుత్వం తు.చ. తప్పకుండా పాటిస్తుందని హామీ ఇచ్చారు. ‘సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్( అందరితో కలసి.. జనులందరి అభివృద్ధి)’ అనే తన ప్రగతి మంత్రాన్ని గురించి ఈ సందర్భంగా మోదీ వివరించారు. ‘ప్రతీ పళ్లెంలో ఆహారం, పాఠశాలలో ప్రతీ చిన్నారి, ప్రతీ ఒక్కరికి ఉద్యోగం, టాయిలెట్, విద్యుత్ సౌకర్యాలతో ప్రతీ కుటుంబానికి ఇల్లు.. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదే సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ లక్ష్యం’ అని విశదీకరించారు. అయితే మనమంతా ఐకమత్యంగా కృషి చేస్తేనే అది సాధ్యమవుతుందన్నారు. ‘ఐక్యంగా ఉంటే బలంగా ఉంటామని, విడిపోతే బలహీనులమవుతామని పేర్కొన్నారు. ఆరెస్సెస్ నేతలు, బీజేపీ ఎంపీలు, హిందూ సంస్థల ప్రతినిధులు ఇటీవల చేస్తున్న హిందూత్వ వ్యాఖ్యలపై ప్రధాని స్పందించకపోవడం, ఢిల్లీలో ఈ మధ్య చోటుచేసుకున్న చర్చిలపై, క్రిస్టియన్ పాఠశాలపై దాడులను ఖండించకపోవడం.. మొదలైనవి మోదీపై విమర్శలకు తావిచ్చాయి. అలాగే, భారత పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సైతం భారత్‌లో మత అసహనం పెరుగుతోందంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఢిల్లీలో చర్చిలపై జరిగిన దాడులను ప్రస్తావిస్తూ.. బాధ్యులను త్వరలోనే పట్టుకుంటామని, అలాంటివారికి భారత్‌లో స్థానం లేదని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్, ఆర్చ్ బిషప్‌లు అండ్య్రూ తాఝా, అనిల్ కౌటొ తదితరులు కూడా పాల్గొన్నారు. క్రిస్టియన్ స్కూళ్లపై దాడులను ఖండించిన అండ్రూ.. మిషనరీ పాఠశాలలు విద్యకే ప్రాధాన్యమిస్తాయి కానీ మత మార్పిడులకు కాదని స్పష్టం చేశారు. బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మిషనరీ స్కూళ్లలో చదువుకున్న వారేనని గుర్తు చేశారు. మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందిస్తూ.. ఇప్పటికైనా ప్రధాని మౌనం వీడడం సంతోషకరమని వ్యాఖ్యానించింది.