Facial
-
‘నేనే ఇలా ఎందుకమ్మా..’ అని అమ్మని పట్టుకుని ఏడ్చేదాన్ని: హీరోయిన్
ట్రోల్ చేసి మనల్ని వెనక్కు లాగేవాళ్లు ఉన్నట్లే, మోటివేట్ చేసి ముందుకు నడిపించే వాళ్ళూ ఉంటారు. సోనమ్ కపూర్‌ను అలా ముందుకు నడిపించిన వ్యక్తి కాజోల్. అయితే కాజోల్ కు సోనమ్ ఆ సంగతి నేరుగా ఎప్పుడూ చెప్పలేదు. మనసులోనే ఉన్న కాజోల్ నుంచి ప్రేరణను పొందారు సోనమ్. సినిమాల్లో కాజోల్ పీక్ దశను కూడా దాటేసి ఉన్నప్పుడు సోనమ్ వయసు 16. పదహారు అంటే పుస్తకాల్లో రాసినట్లు స్వీట్ సిక్స్ టీనే కానీ, అందరి విషయంలోనూ స్వీట్ కాక΄ోవచ్చు. ఆ వయసులో సోనమ్ అందమైన, లేత ముఖం మీద వెంట్రుకలు కనిపించేవి. పెద్ద పెద్ద మొటిమలు ఉండేవి. బరువు కూడా పెరిగింది. తనకు పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్) ఉందనీ, ముఖంపై వెంట్రుకలు రావటం, బరువు పెరగటం, మొటిమలు.. ఇవన్నీ పీసీఓఎస్వల్లనేనని ఫ్యామిలీ డాక్టర్ తొలిసారి చెప్పినప్పుడు సోనమ్ కుంగి పోయింది. తల్లిని చుట్టేసుకుని బావురుమంది. అయితే సోనమ్‌కు అంతకన్నా పెద్ద కష్టం వచ్చి పడింది! అందరూ ఆమెను చూసి, ‘అనిల్ కపూర్ కూతురు కదా..’ అనేవాళ్లట.. ‘ఇలా ఉందేమిటి!!’ అనే అర్థంలో! (యువతుల డ్రీమ్ బాయ్ అని అనిల్ కపూర్‌కు పేరు). పాపం నాన్న పేరు పోతోందే నా కారణంగా..’ అని సోనమ్ బాధపడుతుండేది. ‘నేనే ఇలా ఎందుకు ఉన్నానమ్మా..’ అని తల్లిని పట్టుకుని కంటతడి పెట్టుకునేది.ఓరోజు తల్లి ఆమెకు కాజోల్ ఫొటో చూపించి, ‘తను స్టార్ హీరోయిన్ కదా. అయితే ఆ కనుబొమలు చూడు. రెండూ కలిసిపోయి ఉన్నాయి. కొందరికి ఇలానే ‘యూనిబ్రో’ ఉంటుంది. అయినా సరే ఆమె ఎప్పుడూ తన కనుబొమలు షేప్ చేయించుకోలేదు. అలాగే ఉంచేసుకున్నారు. అందమంటే అది బంగారం, ఆమెలోని ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని చెప్పారు. తల్లి మాటలు సోనమ్‌లో బాగా నాటుకుపోయాయి. ఆమె ముఖం సంతోషంతో వెలిగిపోయింది. కాజోల్కు మనసులోనే థాంక్స్ చెప్పుకుంది. తనను ట్రోల్ చేసే వాళ్లను పట్టించుకోవటం మానేసింది. సోనమ్‌కు పదహారు దాటి 17 లోకి రాగానే దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ దగ్గర అవకాశం వచ్చింది. ఆయన ‘బ్లాక్’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశారు సోనమ్. తర్వాత 2007 లో నటిగా తన తొలి చిత్రం ‘సావరియా’ తో బాలీవుడ్ లోకి ప్రవేశించారు. ఆ తర్వాత తన తండ్రితో కలిసి ఒక చిత్రంలో కూడా కనిపించారు. తన పీసీఓఎస్ఎప్పుడు మాయమై΄ోయిందో కూడా సోనమ్‌కి గుర్తులేదు. ట్రోల్స్ కూడా అంతే. వస్తాయి. పోతాయి. ‘అంత పెద్ద స్టార్ అయిండీ కాజోల్ తన యూనిబ్రోని ఒక సమస్యగా తీసుకోకపోవటం అన్నది నాలో అంతర్లీనంగా పని చేసి, స్ఫూర్తిని నింపింది..’ అని తాజాగా బర్ఖాదత్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు సోనమ్ కపూర్. ఇదీ చదవండి: ఐపీఎల్ వేలం 2025 : అదిరే డ్రెస్‌లో నీతా అంబానీ, ధర ఎంతో తెలుసా? -
SmilePay: నగదు చెల్లింపునకు ఓ ‘నవ్వు’ చాలు!
ప్రైవేట్ రంగ బ్యాంక్ ఫెడరల్ బ్యాంక్ సరికొత్త డిజిటల్ చెల్లింపు వ్యవస్థను తీసుకొచ్చింది. ‘స్మైల్ పే’ అనే ఫేషియల్ పేమెంట్ సిస్టమ్‌ను ప్రారంభించింది. దీంతో కస్టమర్లు కేవలం కెమెరాను చూసి నవ్వుతూ చెల్లింపులు జరపవచ్చు. ఈ సేవతో డబ్బు లావాదేవీల కోసం మీకు నగదు, కార్డ్ లేదా మొబైల్ అవసరం ఉండదు. రిలయన్స్ రిటైల్, అనన్య బిర్లాకు చెందిన ఇండిపెండెంట్ మైక్రో ఫైనాన్స్ ద్వారా కొన్ని ఎంపిక చేసిన శాఖలలో దీని వినియోగం ఇప్పటికే ప్రారంభమైంది.పైలట్ ప్రాజెక్టుప్రస్తుతం ఈ సదుపాయాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. ఈ చెల్లింపు వ్యవస్థ 'భీమ్ ఆధార్ పే'పై ఆధారపడి ఉంటుంది. దీనిపై నిర్మించిన అప్‌గ్రేడెడ్ ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని ఇది ఉపయోగించుకుంటుంది. యూజర్లు తమ ఫేస్‌ను స్కాన్ చేయడం ద్వారా చెల్లింపులు చేయడానికి వీలు కల్పిస్తుంది. దీంతో కార్డు లేదా మొబైల్ లేకుండా కూడా వ్యాపారులకు చెల్లింపులు చేయగలరు. మొత్తం లావాదేవీ ప్రక్రియ రెండు దశల్లో పూర్తవుతుంది.స్మైల్‌పే ఫీచర్లుస్మైల్పే ద్వారా నగదు, కార్డ్ లేదా ఫోన్‌ని తీసుకెళ్లకుండానే మీ లావాదేవీని పూర్తి చేయవచ్చు. దీనితో పాటు, ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టడం వల్ల కౌంటర్ వద్ద రద్దీ నుండి ఉపశమనం లభిస్తుంది. సురక్షితమైన ఆధార్ ఫేస్ రికగ్నిషన్ సర్వీస్ ఆధారంగా చేసే లావాదేవీలతో భద్రత చింత ఉండదు. స్మైల్‌పే ఫీచర్ ఫెడరల్ బ్యాంక్ కస్టమర్లకు మాత్రమే ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుంది. దీని కోసం వ్యాపారులు, వినియోగదారులు ఇద్దరూ ఆ బ్యాంకులో ఖాతాలను కలిగి ఉండాలి. రాబోయే రోజుల్లో ఈ వ్యవస్థను మరింత విస్తరించాలని ఫెడరల్ బ్యాంక్ యోచిస్తోంది.ఎలా పనిచేస్తుందంటే..స్మైల్పేను వినియోగించాంటే మొబైల్లో ఫెడ్ మర్చెంట్ (FED MERCHANT) అనే యాప్ ఉండాలి.ఫెడరల్ బ్యాంక్‌తో అనుసంధానమైన దుకాణాల్లో షాపింగ్ చేసి బిల్లు చెల్లింపు సమయంలో స్మైల్ పే ఎంచుకోవాలి. తర్వాత దుకాణదారు.. కస్టమర్ ఆధార్ నంబర్‌ను నమోదు చేసి యాప్ ద్వారా చెల్లింపును ప్రారంభిస్తారు. దుకాణదారు మొబైల్ కెమెరా కస్టమర్ ఫేస్‌ను స్కాన్ చేస్తుంది. ఆధార్ సిస్టమ్ ఆధారంగా ఫేస్ రికగ్నిషన్ డేటాతో సరిపోల్చుకుని చెల్లింపు పూర్తవుతుంది. కస్టమర్ ఖాతా నుండి డబ్బు దుకాణదారుడి ఖాతాలో జమవుతుంది. -
ఫేషియల్ పెరాలసిస్ అని భయపడొద్దు..!
ముఖంలో ఒక పక్క పక్షవాతం వచ్చినట్లుగా వాలిపోయే కండిషన్‌ను ఫేషియల్ పెరాలసిస్ అంటారు. పక్షవాతంలో ఒకవైపు దేహభాగం అచేతనమై పోయినట్టే... ఫేషియల్ పెరాలసిస్లో కేవలం ముఖం వరకే చచ్చుబడినట్లుగా అయిపోతుంది. నిజానికి లక్షణాల పరంగా ఇది చాలా ఆందోళనకరంగా అనిపించినా ..చాలా వరకు సాధారణ సమస్యగానే పరిగణించవచ్చు.కారణాలు: మెదడు నుంచి బయల్దేరిన వెన్నుపాము నుంచి 12 నరాలు బయటకు వస్తాయి. అవి పుర్రె భాగం నుంచి బయటకు వస్తాయి కాబట్టి వాటిని క్రేనియల్ నర్వ్స్ అంటారు. ఇందులో ఏడవ నరం దెబ్బతినడం వల్ల ఒకవైపున ముఖం కండరాలు పనిచేయవు. దీనివల్ల ముఖం వంకరగా కనపడుతుంది. నవ్వినప్పుడు, మాట్లాడినప్పుడు ఈ వంకర దనం ఎక్కువగా కనిపిస్తుంది. ఇది కూడా హెర్పిస్ సింప్లెక్స్ లాంటి ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చాక, ఆ పరిణామం వల్ల ఉత్పన్నమైన యాంటీబాడీస్ ఫేషియల్ నర్వ్ అనే ముఖానికి సంబంధించిన నరాన్ని దెబ్బతీస్తాయి. దాంతో ఆ నరంతో కనెక్ట్ అయిన ముఖ భాగాలు చచ్చుబడి΄ోయినట్లు కనిపిస్తాయి. వచ్చే లక్షణాలు: మూతి, ముఖం వంకరపోవడం, ఆ వైపు కంట్లోంచి నీరు కారడం, నీళ్లు ఒకవైపు నుంచే పుక్కిలించగలగడం... దాంతో నోటికి ఒకవైపు నుంచే నీళ్లు బయటకు రావడం, ఒకవైపు కనురెప్ప వాలిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చికిత్స: డాక్టర్లు అవసరాన్ని బట్టి ప్రెడ్నిసలోన్ వంటి స్టెరాయిడ్స్‌తో చికిత్స చేస్తారు. ఇది కేవలం కొద్ది రోజుల్లోనే తగ్గుతుంది. పూర్తిగా తగ్గిపోయే ఈ సమస్యతో ఆందోళన అవసరం లేదు. (చదవండి: టెర్మినల్ కేన్సర్ ఇంత ప్రమాదకరమా..? పాపం ఓ మహిళ..!) -
ఇది ఫేస్ డీప్ క్లీనింగ్ డివైస్..! ప్రయాణాల్లో..
స్కిన్ కేర్‌లో డీప్ క్లీనింగ్ అనేది బెస్ట్ ప్రాసెస్ అంటారు నిపుణులు. వేసుకున్న మేకప్ పూర్తిగా చర్మాన్ని వదలకపోయినా, ప్రయాణాల్లో దుమ్మూధూళి నుంచి ముఖాన్ని సంరక్షించుకోవాలన్నా డీప్ క్లీనింగ్ అవసరం. అందుకు ఈ ఫేషియల్ స్టీమర్ సహకరిస్తుంది. 360 డిగ్రీలలో తిరిగే రొటేటబుల్ స్ప్రేయర్ నాజిల్‌తో కూడిన వార్మ్ మిస్ట్ ఫేస్ స్టీమర్ ముఖానికి పట్టిన మురికిని, జిడ్డును ఇట్టే పోగొడుతుంది. చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. ఈ స్టీమర్ నుంచి విడుదలయ్యే ఆవిరి చర్మపు లోలోపలి పొరల్లోకి చొచ్చుకుపోయి, క్లీన్ చేస్తుంది.ముందుగా ముఖాన్ని చల్లటి నీళ్లతో కడిగి, మెత్తటి క్లాత్‌తో తుడిచి, ఆపైన అరోమాథెరపీ కాటన్ ప్యాడ్‌పైన ఆయిల్ చుక్కలు వేసుకుని, ముఖానికి అప్లై చేసుకోవాలి. అనంతరం ఈ స్టీమర్‌తో ఆవిరి పట్టుకుంటే, ఇంట్లోనే స్పా చేయించుకున్న ఫీలింగ్ కలుగుతుంది. దీని వల్ల మృతకణాలు తొలగిపోతాయి. ముడతలు, మచ్చలు, పిగ్మెంటేషన్ వంటి సమస్యలు నెమ్మదిగా ఒక్కొక్కటిగా తగ్గిపోతాయి. ఈ స్టీమర్‌ని క్రమం తప్పకుండా వినియోగిస్తే, యవ్వనకాంతితో కళకళలాడవచ్చు. వారానికి 2–3 సార్లు, ఒక సెషన్‌కు 10 నిమిషాల చొప్పున ఫేషియల్ స్టీమర్‌ని ఉపయోగించడం మంచిది. కాలిన గాయాలను నివారించడానికి కూడా ఫేస్ స్టీమర్‌ని వాడుకోవచ్చు.ఇందులో నీళ్లు నింపుకుని, బటన్ ఆన్ చేసుకుని ఆవిరి విడుదల అయ్యే రాడ్‌ని మనకు అనుకూలంగా అమర్చుకుంటే సరిపోతుంది. అవసరాన్ని బట్టి దాని పొడవు పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. అనువైన విధంగా సెట్ చేసుకోవచ్చు. దాంతో ఆవిరి పట్టుకునేటప్పుడు, మన వీలుని బట్టి కూర్చుని లేదా పడుకుని కూడా డీప్ క్లీనింగ్ చేసుకోవచ్చు. దీన్ని ఎక్కడికైనా సులభంగా తీసుకుని వెళ్లొచ్చు. దీని ధర 27 డాలర్లు. అంటే 2,266 రూపాయలు. ఈ స్టీమర్స్ చాలా కలర్స్‌లో అందుబాటులో ఉన్నాయి. -
సెలబ్రిటీలు ఇష్టపడే ఫేషియల్ మాస్క్...ఎన్ని ప్రయోజాలో తెలుసా..!
బాలీవుడ్ నటి ప్రయాంక చోప్రా దగ్గర నుంచి పలువురు ప్రముఖ సెలబ్రిటీలంతా ఇష్టపడే షేషియల్ రోజ్ గోల్డ్ ఫేషియల్. మూడు పదులు వయసు దాటిని యవ్వనపు కాంతితో మేను ప్రకాశవంతంగా ఉంటుంది. ముడతలు లేని చక్కటి చర్మం, వృద్ధాప్య లక్షణాలు దాచేసి గ్లామరస్ కనిపించేలా చేస్తుంది. బహుశా అందువల్లే ఇంతలా సెలబ్రిటీలు ఈ ఫేషియల్‌ని లైక్ చేస్తున్నారు. ఈ ఫేషియల్‌తో ఎన్ని లాభాలో చూద్దామా..!చాలామంది సెలబ్రిటీలు గ్లామరస్ ఇచ్చే ప్రాముఖ్యత అంత ఇంత కాదు. అందుకోసం ఎంత డభైనా ఖర్చు చేసేందుకు వెనకాడరు కూడా. వాళ్లంతా రోజ్ గోల్డ్ ఫేస్ మాస్క్కి ప్రాధాన్యత ఇస్తారు. రోజ్ గోల్డ్ ఆయిల్‌తో చేసిన రోజ్ గోల్డ్ ఆయిల్ ఫేషియల్ మాస్క్ వారి చర్మ సంరక్షణకు ఎంతలా ఉపయోగపడుతుందో వింటే ఆశ్చర్యపోతారు. కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. అలాగే పర్యవారణానికి ప్రభావితం కాకుండా ఉండేలా యాంటీ-ఆక్సిడెంట్ ప్రయోజనాలను కూడా అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు.ఇందులో ఉపయోగించే బంగారు పదార్దాలు లేదా అందులో ఉండే బంగారు రేణువులు చర్మంపై వచ్చే గీతలు, ముడతలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇందులో హైలురోనిక్ యాసిడ్, విటమిన్ సీ, బొటానికల్ ఆయిల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ప్రకాశవంతంగా, పునరుజ్జీవింపజేయడంలో సహాయపడతాయి.ఇక రోజ్ గోల్డ్ ఆయిల్.. చర్మాన్ని ఆరోగ్యంగా, హైడ్రేటెడ్‌గా ఉంచడానికి మాయిశ్చరైజర్‌గా పనిచేయడం నుంచి మేకప్‌కి సిద్దమయ్యేలా అందంగా మారుస్తుంది. ముఖ్యంగా పెదాలను హైడ్రేట్ చేయడానికి చక్కగా ఉపయోగపడుతుంది. కంటి కింద పొడి ప్రాంతాల్లో అప్లై చేస్తే మృదువుగా కనిపిస్తాయి. దేనితో తయారు చేస్తారంటే..గుమ్మడికాయ గింజల నూన, ఇతర నూనెలతో కలిసి ఉంటుంది. గుమ్మడికాయ గింజల నూనె కణజాలాన్ని పునరుత్పత్తి చేస్తుంది. హైపర్పిగ్మెంటేషన్ రూపాన్ని తగ్గిస్తుంది. తేమను నిలుపుకోవడంలో సహాయపడుతుంది. ఇది ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది, యవ్వన రూపాన్ని ప్రోత్సహిస్తుంది.ఇందులో జింక్, విటమిన్ సీ ఉంటాయి. ఇవి చర్మాన్ని దృఢంగా, బిగుతుగా ఉంచడంలో సహాయపడతాయి. యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నప్పటికీ, ఈ నూనె దాని ప్రత్యేకమైన ఫార్ములా కారణంగా జిడ్డుగల చర్మానికి అనుకూలంగా ఉంటుంది.ప్రధాన పదార్థాలు బంగారు రేకులు, రోజ్‌షిప్ సీడ్ ఆయిల్..బంగారు రేకులు కొల్లాజెన్ క్షీణతను నెమ్మదిస్తాయి. చర్మ స్థితిస్థాపకతను పెంచుతాయి. మేని ఛాయను కాంతివంతం చేయడమే గాక దృఢంగా ఉంచేలా కణాలను ప్రేరేపిస్తాయి. రోజ్‌షిప్ సీడ్ ఆయిల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్‌గానూ, టిష్యూ రీజెనరేటర్గా పనిచేస్తుంది. వాపును తగ్గించడానికి, ఒత్తిడిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. రక్తప్రసరణలో మంచిగా ఉంటుంది. అలాగే రోజ్‌గోల్డ్ ఆయిల్ మాస్క్లోనారింజ తొక్కలు ఉంటాయి.ఇవి చనిపోయిన చర్మ కణాలను ఎక్స్ఫోలియేట్ చేస్తాయి. ఇందులో విటమిన్ సీ సమృద్ధిగా ఉంటుంది. పైగా చర్మాన్ని బిగుతుగా చేసి మెరిసేలా చేస్తుంది. ప్రయోజనాలుఇది యాంటీ ఏజింగ్ ప్రయోజనాలను, తేమను అందిస్తుంది.అన్ని రకాల చర్మాలకు తగినదిఇది కణజాలాన్ని పునరుత్పత్తి చేయడం, ఫైన్ లైన్లు, హైపర్పిగ్మెంటేషన్ను తగ్గించడం వంటివి చేస్తుంది. ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటమే గాక యవ్వన రూపాన్ని కొనసాగించడంలో సహాయపడుతుంది.రోజ్ ఆయిల్ ఫేషియల్, షీట్ మాస్క్ లేదా మరేదైనా వారికి చర్మ అలెర్జీలు లేదా ఇతర చర్మ సమస్యలు ఉన్నట్లయితే వాటిని ఉపయోగించే ముందు జాగ్రత్తగా ఉండండి. వ్యక్తి గత చర్మ నిపుణుడి సలహాలు సూచనలు మేరకు ఉపయోగించటం మంచిది.(చదవండి: ఒక హంతకుడి బాధితులు!) -
ఈ డివైజ్‌తో అందమైన ముఖ ఆకృతి మీ సొంతం!
ముఖాన్ని కాస్టీ కాస్మెటిక్స్‌తో, మేకప్‌తో తీర్చిదిద్దడం కంటే.. ఇలాంటి డివైస్ల సాయంతో తీర్చిదిద్దితే ఆ అందం ఎక్కువ కాలం నిలుస్తుంది. చిత్రంలోని ఈ మైక్రోకరెంట్ ఫేషియల్ మసాజర్‌ను ఉపయోగించి.. డబుల్ చిన్ను తగ్గించుకోవచ్చు. ముడతలు, గీతలు లేకుండా మృదువుగా మార్చుకోవచ్చు. ఈ స్కిన్ లిఫ్ట్ పరికరం.. హీటింగ్, వైబ్రేషన్‌తో పనిచేస్తుంది. ఇది కళ్లు, పెదవులు, బుగ్గలు ఇలా ప్రతి భాగంలోనూ ముడతలు, మచ్చలు, మొటిమలు, సన్‌స్పాట్‌లను పూర్తిగా మాయం చేస్తుంది. అలాగే ముఖ ఆకృతిని మార్చి.. డార్క్ సర్కిల్స్‌ని తగ్గిస్తుంది. ప్రత్యేకమైన గ్లోను అందిస్తుంది. ఎలక్ట్రిక్ డివైస్ అయిన ఈ మసాజర్.. ఎలాంటి ప్రమాదాలను కలిగించదు. స్కిన్ రిజువనేషన్ స్కిన్ కేర్ టూల్‌గా గుర్తింపు పొందిన ఈ మెషిన్‌కి చిత్రంలో చూపిన విధంగా చార్జింగ్ పెట్టుకోవడానికి ఒక ప్రత్యేకమైన బేస్ లభిస్తుంది. దానిమీద ఈ టూల్‌ని అమర్చుకుని చార్జింగ్ పెట్టుకోవాలి. ఇందులో మొత్తం నాలుగు రంగుల ప్రత్యేకమైన మోడ్స్ ఉంటాయి. రెడ్, పర్పుల్‌తో పాటు బ్లూ కలర్లో రెండు మోడ్స్ ఉంటాయి. ఈ డివైస్‌ని ఎలా వాడాలో తెలుపుతూ ఒక బుక్లెట్ కూడా లభిస్తుంది. దీనికి రెండు హెడ్స్ ఉంటాయి. ఒకటి క్లీనింగ్ బ్రష్ హెడ్, రెండు మసాజింగ్ హెడ్. వాటిని మార్చుకుంటూ చర్మాన్ని మొదట శుభ్రం చేసుకుని.. తర్వాత మసాజ్ చేసుకుంటే మంచి ఫలితం అందుతుంది. (చదవండి: 'ఇంగువ'ని ఇలా తీసుకుంటే ఈజీగా బరువు తగ్గుతారు!) -
ఫ్రూట్ ఫేషియల్: పార్లర్ అవసరం లేకుండా ఇంట్లోనే..
బ్యూటీ టిప్స్ రెండు స్పూన్ల క్యారెట్ జ్యూస్‌లో బొప్పాయి జ్యూస్, శనగపిండి, తేనె కలిపి ముఖానికి పట్టించాలి. అరగంట తర్వాత చల్లటి నీళ్లతో కడిగేస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది. యాపిల్ పండును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి స్మాష్ చేసుకోండి. ఇందులో తేనె, రోజ్ వాటర్ కలుపుకొని ఫేస్‌ప్యాక్ వేసుకోండి. ఇలా తరచూ చేస్తుంటే నల్లటి మచ్చలు తొలగిపోయి చర్మం మంచి నిగారింపును సంతరించుకుంటుంది. ఆరెంజ్ పండ్ల తొక్కలను పొడి చేసుకొని అందులో గంధం, చిటికెడు పసుపు కలిసి ముఖానికి రాసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే జిడ్డుతనం పోయి యవ్వనంగా తయారవుతారు. చర్మ సౌందర్యానికి బొప్పాయి బెస్ట్ ఛాయిస్. మొటిమలు, మచ్చలు వంటి చర్మ వ్యాధులను తగ్గించేందుకు కూడా ఇది చక్కగా పనిచేస్తుంది. బొప్పాయి పండులో కాసిన్ని పాలు, తేనె కలపుకొని ఫేస్‌ప్యాక్ వేసుకుంటే చర్మం తాజాగా, బ్రైట్‌గా కనిపిస్తుంది. మామిడి, ఓట్స్‌ను కలిపిన ఈ స్క్రబ్ ముఖం మీద మృతకణాలు, దుమ్మూధూళిని తొలగించి చర్మానికి నిగారింపునిస్తుంది. పుచ్చకాయ రసాన్ని ముఖానికి రాసుకుని ఇరవై నిమిషాల తరువాత కడిగేయాలి. ఇది చర్మానికి టోనర్‌గా పనిచేసి పొడిబారడాన్ని తగ్గిస్తుంది. ∙అరటి, యాపిల్, బొప్పాయి, నారింజ పళ్ల గుజ్జును సమపాళ్లల్లో తీసుకుని పేస్టు చేయాలి. ఈపేస్టుని ముఖానికి పూతలా వేయాలి. అరగంట తరవాత కడిగేయాలి. ఈ ప్యాక్ ముఖం మీద పేరుకుపోయిన మృతకణాలు, ట్యాన్‌ను తొలగించి కాంతిమంతంగా మారుస్తుంది. -
ఎలాంటి చర్మ సమస్యలు ఉన్నా వేపాకులతో చెక్ పెట్టొచ్చు
వేప చెట్టు ఇంటి దగ్గర్లో ఉంటే వేరే సౌందర్యసాధనాలతో పనే ఉండదు. వేపాకులు, బెరడు, వేపనూనె ఔషధాలుగానే కాదు, సౌందర్య సాధనాలుగానూ ఉపయోగపడతాయి. ఎలాంటి చర్మ సమస్యలకైనా వేపతో ఇట్టే చెక్ పెట్టేయవచ్చు. ► ముఖంపై మొటిమలు, నల్లమచ్చలు ఏర్పడుతుంటే వేపాకులతో చక్కని విరుగుడు ఉంది. గుప్పెడు వేపాకులను అరలీటరు నీటిలో వేయాలి. వేపాకులు పూర్తిగా మెత్తగా మారిపోయేంత వరకు ఆ నీటిని మరిగించాలి. కాసేపటికి నీరు ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. అప్పుడు వడగట్టి ఆ కషాయాన్ని సీసాలో భద్రపరచుకోవాలి. ►ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఆ నీటితో కాస్త దూదిని తడిపి ముఖాన్ని రుద్దుకుంటే చాలు. మొటిమలు, మచ్చలు మటుమాయం అవుతాయి. ∙చర్మం పొడిబారి, తరచు దురదలు పెడుతున్నట్లయితే, పైన చెప్పుకున్నట్లే వేపాకులతో కషాయం చేసి, బకెట్ నీటిలో ఒకకప్పు కషాయాన్ని పోసి ఆ నీటిని స్నానానికి ఉపయోగిస్తే చాలు, కొద్దిరోజుల్లోనే చర్మం ఆరోగ్యకరంగా మారుతుంది. ► ముఖం తరచు జిడ్డుగా మారుతుంటే, వేపాకుల పొడి, గంధం పొడి, గులాబి రేకుల పొడి సమభాగాలుగా తీసుకుని కలుపుకోవాలి. చెంచాడు పొడిలో మూడు నాలుగు చుక్కల వేపనూనె, కొద్దిగా తేనె, నిమ్మరసం పిండుకుని ముద్దలా కలుపుకోవాలి. దానిని ముఖానికి పట్టించి, అరగంటసేపు ఆరనివ్వాలి. పూర్తిగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే ముఖం తాజాగా మారుతుంది. -
రూ. 17,500తో ఫేషియల్.. ఉన్న అందం పోయి, చర్మం కాలిపోయి..
అందంగా కనిపించాలని ఎవరికి మాత్రం ఉండదు. అందుకే వేలకు వేలు వెచ్చించి మరి అందంగా కనిపించాలని తాపత్రయపడుతుంటారు. దానికోసం రకరకాల క్రీములు, లోషన్లు, ట్రీట్మెంట్ల పేరుతో డబ్బులన్నీ తగలేస్తుంటారు. ఇక పెళ్లిళ్లు, బర్త్‌డే పార్టీలు.. ఇలా సందర్భం ఏదైనా వెంటనే పార్లర్‌కి వెళ్లి ఫేషియల్ చేయించుకునే అలవాటు చాలామందికి ఉంటుంది. ముంబైకి చెందిన ఓ మహిళ అందంగా కనిపించాలని పార్లర్‌కు వెళితే మొదటికే మోసం జరిగింది. కాలిన గాయాలతో ఉన్న అందం కూడా పోయింది. వివరాల్లోకి వెళితే.. జూన్ 17న ముంబైలోని ఓ మహిళ అందం కోసం హైడ్రా ఫేషియల్ చేయించుకుంది. దీనికోసం అంధేరిలోని కామధేను షాపింగ్ సెంటర్లోని గ్లో లక్స్ సెలూన్‌కు వెళ్లి రూ. 17,500 విలువైన ఫేషియల్ ట్రీట్మెంట్ చేయించుకుంది. సెలూన్ సిబ్బంది ఆమె ముఖంపై కొన్ని క్రీములు రాయడం ప్రారంభించగానే ముఖంపై మంట మొదలైంది. ఇదే విషయాన్ని సెలూన్ వాళ్లతో చెప్పినా బ్లీచింగ్ వల్ల ఇలా జరుగుతుందని, ఇది చాలా సాధరణం అని చెప్పారు. ఒకటి-రెండు రోజుల్లో తగ్గిపోతుందని మిగతా ట్రీట్మెంట్ను పూర్తి చేశారు. అయితే అప్పటికే మంటగా ఉండటం, రెండు రోజులైనా తీవ్రత తగ్గకపోవడంతో డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించింది. హైడ్రాఫేషియల్ ట్రీట్మెంట్ వల్ల ఆమె ముఖంపై పలు చేట్ల కాలిన గాయాలు అయ్యాయని,చర్మం పలు చోట్ల శాశ్వతంగా దెబ్బతిందని డెర్మటాలజిస్ట్ వివరించడంతో ఒక్కసారిగా షాక్‌కి గురైంది. నాసీరకం ఉత్పత్తులు వాడటం వల్ల ఇలా జరిగిందని, పార్లర్ యజమానిపై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలిసులకు ఫిర్యాదు చేసింది. -
ఫేషియల్ పేరుతో వరుడు జంప్.. తరువాత జరిగిందిదే..
పెళ్లికి ముందురోజు వరుడు ఫేషియల్ చేయించుకుంటానని బయటకు వెళ్లి ఇంటికి తిరిగిరాలేదు. కుటుంబ సభ్యులు ఫోను చేసేందుకు ప్రయత్నించగా స్విచ్ఆఫ్ అని వచ్చింది. విషయం వధువు తరపువారికి తెలియడంతో నానా హంగామా జరిగింది. అనంతరం వధువు తరపువారు వరుని తండ్రి నుంచి కట్నం డబ్బులను తిరిగి తీసుకోవడంతోపాటు పెళ్లిని రద్దు చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని దేవరియా జిల్లాలో ఒక ఆసక్తికర ఉదంతం చోటుచేసుకుంది. పెళ్లికి సరిగ్గా ఒకరోజు ముందు వరుడు ఫేషియల్ చేయించుకుంటాననే నెపంతో బయటకు వెళ్లి ఇక తిరిగి రాలేదు. తరువాత ఈ వ్యవహారం వివాహం రద్దు చేసుకునేవరకూ దారితీసింది. ఈ ఉదంతం బఘౌచ్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఒక యువకునికి వివాహం నిశ్చయమయ్యింది. జూన్ ఆరున వరుడిని పెళ్లి కొడుకును చేసే కార్యక్రమం జరిగింది. జూన్ 11 వివాహ వేడుకలో భాగంగా కుషీనగర్ జిల్లాలోని ఫాజిలా నగర్ పరిధిలోని ఒక గ్రామానికి వరునితో పాటు అతని బంధువర్గమంతా చేరుకోవాల్సి ఉంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. బ్యాండు మేళం వారు కూడా వచ్చేశారు. ఇంతలో వరుడు ఫేషియల్ చేయించుకుంటానని బయటకు వెళ్లాడు. ఎంతసేపటికీ వరుడు రాకపోవడంతో కుటుంబ సభ్యులలో ఆందోళన మొదలయ్యింది. ఎన్నిచోట్ల వెదికినా అతని ఆచూకీ తెలియలేదు. చిన్న కుమారునితో వివాహం చేయిస్తామన్నా... ఈ విషయం వధువు ఇంటిలోని వారికి తెలిసింది. వారు పరుగుపరుగున వరుని ఇంటికి చేరుకున్నారు. కొద్దిసేపు వాగ్వాదం తరువాత వరుని తండ్రి వధువు తరపువారితో తన చిన్న కుమారునితో ఈ వివాహం జరిపిస్తానని మాట ఇచ్చాడు. అయితే ఇది వధువు తరపువారికి ఎంతమాత్రం నచ్చలేదు. తాము ఈ వివాహాన్ని రద్దు చేసుకుంటున్నామని చెబుతూ తాము ఇచ్చిన కట్నం సొమ్ముతోపాటు కానుకలను కూడా తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై గ్రామంలో పంచాయితీ జరిగింది. పంచాయతీ పెద్దల తీర్మానం మేరకు వరుని తరపు వారు తాము తీసుకున్న కట్న కానుకలను తిరిగి ఇచ్చేశారు. దీంతో ఈ పెళ్లి రద్దయ్యింది. కాగా వరుడు ఒక ఫుడ్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి వేరే యువతితో సంబంధం ఉన్న కారణంగానే పెళ్లి వేడుక ముందురోజు ఇంటి నుంచి పరారయ్యాడని స్థానికులు చెప్పుకుంటున్నారు. ఇది కూడా చదవండి: గుర్రం మీద రావాల్సిన వరుడు అలా వచ్చేసరికి.. -
Beauty: మృత కణాలు, దుమ్ము, ధూళి మాయం.. ఈ డివైజ్ ధర ఎంతంటే!
Facial Brush Benefits: ముఖం కాంతిమంతంగా కనిపించాలంటే.. ఎప్పటికప్పుడు ముఖాన్ని మంచినీటితో శుభ్రంగా కడుక్కుంటూ ఉండాలనేది నిపుణుల మాట. అందుకు.. ఇలాంటి బ్రష్ (అయాన్ ఫేషియల్ బ్రష్)ని వినియోగిస్తే.. మంచి ఫలితముంటుంది. ఇది చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది. నిమిషానికి 9వేల వైబ్రెషన్స్(భ్రమణాల)తో.. 42 డిగ్రీల సెల్సియస్ వెచ్చదనంతో చర్మ రంధ్రాల్లోంచి మృత కణాలను, దుమ్ము, ధూళిని సమూలంగా తొలగిస్తుంది. ఈ డివైజ్.. వాటర్ ప్రూఫ్ కావడంతో వాష్ రూమ్‌లోనే దీన్ని సులభంగా, సౌకర్యవంతంగా వినియోగించుకోవచ్చు. అవసరమైతే ఎల్లప్పుడూ అదే రూమ్‌లో భద్రపరచుకోవచ్చు కూడా. ముందుగానే చార్జింగ్ పెట్టుకునే వీలుంటుంది కాబట్టి.. వైర్‌లెస్‌గా పనిచేస్తుంది. అడాప్టర్ లేదా కంప్యూటర్ సాయంతో కూడా దీనికి చార్జింగ్ పెట్టుకోవచ్చు. దాంతో ప్రయాణాల్లో కూడా దీన్ని ఈజీగా వెంట తీసుకెళ్లొచ్చు. ఈ బ్రష్.. సబ్బు లేదా క్రీమ్‌తో చక్కగా చర్మాన్ని క్లీన్ చేస్తుంది. ఇదే కంపెనీకి చెందిన క్రీమ్..ఈ డివైజ్‌తో పాటు లభిస్తుంది. అభిరుచిని బట్టి ఆ తర్వాత కూడా ఈ క్రీమ్‌ని ఆర్డర్ చేసుకోవచ్చు. లేదంటే సాధారణ క్రీమ్స్ లేదా సబ్బులనూ వినియోగించుకోవచ్చు. దీని ధర సుమారుగా 194 డాలర్లు. అంటే రూ. పదిహేనువేలకు పైనే. అయితే ఇలాంటి మోడల్ బ్రష్‌లు ఆన్లైన్లో చాలానే ఉన్నాయి. తక్కువ ధరలో కూడా అందుబాటులో ఉన్నాయి. కొనుగోలు చేసేముందు వినియోగదారుల రివ్యూస్‌ని ఫాలో అవ్వడమనేది తప్పనిసరి. చదవండి: Unwanted Hair: పై పెదవి మీద, చుబుకం కింద డార్క్ హెయిర్.. పీసీఓఎస్ వల్లేనా? పరిష్కారం? Sara Ali Khan: పండ్లే కాదు.. వాటి తొక్కలు కూడా వదలను! నా బ్యూటీ సీక్రెట్ ఇదే -
నటికి వికటించిన ట్రీట్మెంట్: స్పందించిన డాక్టర్!
అందానికి నిగారింపు కోసం వెళ్తే అందవిహీనంగా మార్చారంటూ తమిళ నటి రైజా విల్సన్ ఆ మధ్య సోషల్ మీడియాలో గోడు వెల్లబోసుకున్న విషయం తెలిసిందే. ఫేషియల్ చేయమంటే మరేదో చికిత్సను బలవంతంగా ట్రై చేసిందని, దీంతో తన ముఖం పాడైందని ఫొటోలు కూడా షేర్ చేసింది. కంటి కింద వాపు కూడా వచ్చిందని పేర్కొంది. దీనికి కారణమైన చెన్నై చర్మనిపుణులు భైరవి సెంతిల్ మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెను కలవడానికి ప్రయత్నించినప్పటికీ ఆమె క్లినిక్‌కు రాకుండా తప్పించుకు తిరుగుతోందని సైతం ఆరోపించింది. ఈ వ్యవహారం అప్పట్లో హాట్‌టాపిక్‌గా మారింది. తాజాగా దీనిపై సదరు డాక్టర్ భైరవి స్పందించినట్లు సమాచారం. ఆమె అనుమతితోనే చికిత్స అందించానని పేర్కొందట. కళ్ల కింద వచ్చిన వాపు కూడా కొన్నిరోజులకే దానంతటదే తగ్గిపోతుందని చెప్పినట్లు తెలుస్తోంది. అంతే కానీ తనేమీ బలవంతంగా ఆమెకు ఏ చికిత్సా చేయలేదని స్పష్టం చేసినట్లు వినికిడి. అటు రైజా మాత్రం ఈ డాక్టర్ వల్ల తన పని కూడా ఆగిపోయిందని చెప్తోంది. ఆమె చేసిన పనికి మానసికంగానూ బాధను అనుభవించానంటోంది. ముఖం మీద వచ్చిన మార్పుల వల్ల ఇప్పుడప్పుడే సినిమాల్లోనూ నటించలేనని అంటోంది. దీనివల్ల ఆదాయం కూడా కోల్పోతున్నానని చెప్తోంది. ఆమె నిర్లక్ష్యానికి తాను మూల్యం చెల్లించుకుంటానని వాపోయింది. తనకు జరిగిన నష్టానికి గానూ డాక్టర్ భైరవి నుంచి కోటి రూపాయల నష్ట పరిహారం ఇప్పించాలని తమిళనాడు మెడికల్ కౌన్సిల్‌తోపాటు నేషనల్ మెడికల్ కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది. View this post on Instagram A post shared by Raiza Wilson (@raizawilson) చదవండి: ఫేషియల్ చేయమంటే నటిని అందవిహీనంగా మార్చిన డాక్టర్ -
నటికి వికటించిన ట్రీట్మెంట్, డాక్టర్ పరారీ!
ఆడవాళ్లు అందానికి ఎంతో ప్రాధాన్యతనిస్తారు. అందులోనూ నటీమణుల సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫేషియల్స్ అని, సర్జరీలు అని అందాన్ని రెట్టింపు చేసుకునేందుకు నానాతంటాలు పడుతుంటారు. ఈ క్రమంలో ముఖం మీద చిన్న గీత పడినా విలవిల్లాడిపోతుంటారు.. అయితే తాజాగా ఫేషియల్కు వెళ్లిన ఓ నటికి చేదు అనుభవం ఎదురైంది. తన ముఖ సౌందర్యాన్ని రెట్టింపు చేయడం కాదు కదా, ఉన్న సహజత్వాన్ని నాశనం చేస్తూ ఆమెను అందవికారంగా మార్చిందో డాక్టర్. తమిళ నటి రైజా విల్సన్ సాధారణ ఫేషియల్ కోసం ఓ క్లినిక్‌కు వెళ్లింది. కానీ అక్కడి మహిళా డాక్టర్ చర్మానికి మరింత నిగారింపు తీసుకొస్తానంటూ బలవంతంగా ఆమెకు చర్మ చికిత్స చేసింది. దీంతో అది వికటించి నటి కన్ను కింద వాచిపోయింది. అది ఉబ్బిపోయి ముఖారవిందాన్ని దెబ్బ తీస్తోంది. దీంతో భంగపాటుకు గురైన నటి.. "నాకు అవసరం లేకపోయినా డాక్టర్ భైరవి నాకేదో ట్రై చేసింది. చివరికి ఫలితం ఇదిగో ఇలా వచ్చింది.. దీని గురించి నిలదీద్దాం అంటే ఆమె నాతో మాట్లాడటానికి, కలవడానికి కూడా నిరాకరిస్తోంది. సిబ్బందిని అడిగితే ఆమె అసలు నగరంలోనే లేదని జవాబిస్తున్నారు" అంటూ ఓ ఫొటోను ఇన్‌స్టా స్టోరీలో యాడ్ చేసింది. 'డా.భైరవి తనదగ్గరకు వచ్చే కస్టమర్లపై వారికి ఇష్టం ఉన్నా లేకపోయినా బలవంతంగా ప్రయోగాలు చేస్తుంది' అంటూ పలువురు నెటిజన్లు వాపోయారు. దీంతో తనలాంటి బాధితులు చాలామంది ఉన్నారని తెలిసి నటి షాక్‌కు గురైంది. కాగా రైజా 2017లో 'వెలయ్యిలా పట్టధారి 2' సినిమాలోని ఓ చిన్నపాత్రతో ఇండస్ట్రీకి పరిచయమైంది. అనంతరం తమిళ బిగ్‌బాస్ మొదటి సీజన్లోనూ పాల్గొంది. 2018లో 'ప్యార్ ప్రేమ కాదల్' సినిమాతో హీరోయిన్గా మారింది. దీనికిగానూ ఫిల్మ్‌ఫేర్ అవార్డును సైతం అందుకుంది. ప్రస్తుతం ఆమె 'అలైస్', 'కాదలిక్క యారుమిల్లై', 'హ్యాష్‌ట్యాగ్ లవ్' అనే సినిమాలు చేస్తోంది. చదవండి: ఎన్టీఆర్ పుట్టిన రోజుకి కొత్త కబురు మెగాస్టార్ సినిమాను రిజెక్ట్ చేసిన బాలీవుడ్ దర్శకుడు -
పక్షి రెట్టతో ఫేషియల్..చర్మసమస్యలు మాయం
పూర్వం చర్మం అందంగా కనిపించాలంటే ఒంటికి సగ్గుపిండి, పసుపు .. వంటివి రాసుకుని నలుగుపెట్టుకుని స్నానం చేసేవారు. కానీ నేడు పరిస్థితి అలా లేదు. బ్యూటీపార్లర్లు, స్పాలకు వెళ్తున్నారు. అక్కడ రకరకాల సౌందర్యం చికిత్సలు చేయించుకుంటున్నారు. అయితే ఈ మధ్య ఈ సౌందర్య చికిత్సలు వింతగా తయారయ్యాయి. ఎంతలా అంటే ..మన ఊహకు అందనంత. జలగలు రక్తాన్ని పీల్చుతాయని తెలుసు. అలాంటిది శరీరంపై పాకించుకుంటే.. ! అమ్మో! అనకుండా ఉండగలమా? కానీ వివిధ దేశాల్లో కొన్ని బ్యూటీ స్పాలలో ఈ తరహా థెరపీ ఉంది. దీనిని లీచ్ థెరపీ అంటారు. ఈ చికిత్సలో పదుల సంఖ్యలో ముఖంపై జలగల్ని వదులుతారట. జలగలు చర్మం పై పొరల్లో ఉండే చెడు రక్తాన్ని పీల్చేస్తాయిట. ఇవి కొన్ని మాత్రమే.. తేనెటీగలతో కుట్టించుకోవడం, మనిషి రక్తాన్ని ముఖానికి రాసుకోవడం, పాములు, తేళ్ల నుంచి తీసే విషంతో ఫేషియల్స్, బీరు, వైనూ, కాఫీ, టీ .. స్నానాలు ఇలా ఎన్నో రకాల సౌందర్య చికిత్సలు పాశ్చాత్య దేశాల్లో అందుబాటులో ఉన్నాయి. జపాన్‌లో నైటింగేల్ పక్షి వేసే రెట్టలు ఎండాక, ఆ పొడిని బియ్యం కడిగిన నీటిలో కలిపి ముఖానికి రాసుకుంటారు. చర్మ సమస్యలని దూరం చేసుకొనేందుకు ఈ రకం ఫేషియల్ వేసుకుంటారట. జపాన్‌తో పాటు మరికొన్ని దేశాల్లో స్నెయిల్ ఫేషియల్స్ అనే కొత్త రకం చికిత్స చేస్తున్నారు. అంటే నత్తను ముఖంపై పాకించుకోవడం. నత్త పాకేటప్పుడు జిగట పదార్థాన్ని విడుదల చేస్తుందన్న విషయం తెలిసిందే. ఆ ద్రవంలో చర్మంపై ముడుతలు పడకుండా చెయ్యగల ఔషధ గుణాలు ఉన్నాయట. ఫిలిప్పీన్స్, ఇతర దేశాల్లో కోరలు పీకిన పాములు, కొండ చిలువల్ని శరీరంపై పాకించి మసాజ్ చేస్తున్నాయి కొన్ని స్పాలు. దీనివల్ల ఒత్తిడి దూరమవుతుంది. శరీరానికి విశ్రాంతి కూడా అందుతుందట. -
ముఖానికి ఆవిరి ఎంత సేపు?
బ్యూటీపార్లర్లలో ఫేసియల్ చేసేటప్పుడు ముఖానికి ఆవిరిపట్టడం (స్టీమ్) చూస్తుంటాం. అయితే ఆవిరి ఎంత సమయం పట్టాలి? ఎలా పట్టాలి? అసలు ఆవిరిపట్టడం వల్ల ఉపయోగాలేమిటో తెలుసుకోవడం అవసరం. ♦ మరీ ముఖచర్మానికి దగ్గరగా ఆవిరి వేడి తగలకూడదు. షవర్‌బాత్ చేసేటప్పుడు నీరు ఎంత దూరం నుంచి పడతాయో, సుమారు అంత దూరం నుంచి ఆవిరి చర్మానికి తగలాలి. లేదంటే చర్మం తన సహజత్వాన్ని కోల్పోతుంది. ♦ ఐదు నిమిషాలకు మించి ఆవిరి పట్టకూడదు. అన్ని చర్మతత్వాలూ ఒకేలా ఉండవు కాబట్టి అందరికీ ఒకేవిధంగా ఆవిరిపట్ట రాదు. దీని వల్ల చర్మంలోని పోర్స్ తెరుచుకుని, సహజసిద్ధంగా నూనె స్రవించే గ్రంథులు పొడిబారుతాయి. దీనివల్ల చర్మం త్వరగా ముడతలు రావడానికి ఆస్కారం అవుతుంది. ♦ ఆవిరి పట్టిన తర్వాత క్లెన్సర్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల పోర్స్‌లో ఉన్న మలినాలు తొలగిపోతాయి. ♦ తర్వాత పొడిగా ఉన్న మెత్తని టవల్‌తో ముఖాన్ని తుడుచుకోవాలి. ఒకవేళ చర్మం పొడిబారినట్టుగా అనిపిస్తే గనక ముఖాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ వాడాలి. ♦ చర్మతత్వానికి తగిన విధంగా ట్రీట్మెంట్ ఇచ్చే నిపుణుల చేతనే ఫేసియల్ చేయించుకోవడం, స్టీమ్ పట్టడం చేయడం మేలు. -
బ్యూటిప్స్
యాంటీ ఏజింగ్ ఫేషియల్ మాస్క్ పెరిగే వయసును అద్దంలా ప్రతిబింబింపజేసేది చర్మం. అందులోనూ చలికాలంలో మరీ ఎక్కువ ముడతలు పడుతుంది. అందుకే ఈ కాలంలో వార్ధక్య లక్షణాలకు చెక్‌పెట్టే హోమ్మేడ్ ఫేషియల్ మాస్క్ఒక నిమ్మకాయను తీసుకుని, గింజలు వేరుచేసి, అందులో ఒక స్పూను మీగడ వేసి గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని పలుచటి పొరలా ముఖానికి రాయాలి. ఆరిన తర్వాత తీసేసి ముఖానికి ఫేషియల్ క్రీమ్ రాసి మర్దన చేయాలి. ముడతలు పడిన చర్మానికి ఈ ప్యాక్ బాగా పనిచేస్తుంది. -
బ్యూటిప్స్
హెయిర్ డై జుట్టుకు రంగు వేసుకునేటప్పుడు చర్మానికి తగలకూడదు. ముందుగా ముఖానికి, చెవులకు మాయిశ్చరైజర్ రాసుకొని తర్వాత డై వేసుకోవాలి. డై ఎంపికలో నాణ్యత విషయంలో రాజీపడకూడదు. జుట్టు సువాసనలు వెదజల్లాలంటే హెయిర్ సీరమ్ లేదా హెయిర్ స్ప్రే వాడచ్చు. జుట్టు సిల్కీగా మారాలనుకుంటే స్ట్రెయిటనింగ్ షాంపూ, కండిషనర్ వాడితే కొంతవరకు ఫలితం ఉంటుంది. స్టీమ్ ఫేషియల్ చేసే సమయంలో ముఖానికి ఆవిరి పట్టడం చూస్తుంటాం. అధికంగా ఆవిరిపట్టడం వల్ల చర్మంలోని పోర్స్ ఓపెన్ అయ్యి, చర్మం వదులయ్యే అవకాశాలు ఉన్నాయి. అమితంగా స్క్రబ్ చేయడం, స్టీమ్ పట్టడం వంటివి చర్మంలోని సహజతేమను పోగొడతాయి. అప్పటికి కాంతిగానే అనిపించినా, తర్వాత చర్మం జీవం కోల్పోయినట్టు తయారవుతుంది. అందుకని వీలైనంత వరకు స్టీమ్‌ను తగ్గించడం మేలు. -
బంగారు దుంప
నెలరోజులకు ఒకసారైనా పార్లర్‌కి వెళ్లి ఫేసియల్ చేయించుకోవడం సాధారణమైన విషయం. మృతకణాలు, ట్యాన్, జిడ్డు తగ్గిపోయి ముఖ చర్మం తాజాగా ఉండాలంటే నేచురల్ పద్ధతిలో ఇంట్లోనే ఫేసియల్ చేసుకోవచ్చు. పచ్చి బంగాళదుంప రసాన్ని ఉపయోగించి చేసే ఈ పద్ధతి వల్ల ముఖం మీద మచ్చలు, పిగ్మెంటేషన్ తగ్గడమే కాకుండా చర్మం బంగారంలా మెరుస్తుంది. తయారీ ►2 బంగాళదుంపలు (తురమాలి) ► ఈ తరుగును మిక్సీలో వేసి బ్లెండ్ చేయాలి. ►పిడికి ట్లో బంగాళదుంప గుజ్జు పట్టుకొని గట్టిగా వత్తితే రసం వస్తుంది. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత ఈ రసాన్ని వడకట్టుకోవాలి. స్టెప్:01 క్లెన్సింగ్ ►ఒక గిన్నెలో టీ స్పూన్ బంగాళదుంప రసాన్ని తీసుకోవాలి. టీ స్పూన్ రోజ్ వాటర్ వేసి కలపాలి. ►దూది ఉండను పై మిశ్రమంలో ముంచి బుగ్గలు, చుబుకం, కనుల కింద, నుదురుభాగం, మెడ భాగం.. ఇలా ముఖమంతా తుడవాలి. ►2 నిమిషాలు వదిలేసి చల్లని నీళ్లతో కడిగేయాలి. ► 5 నిమిషాలు ఆవిరి పట్టాలి. దీంతో పోర్స్‌లో మురికి, జిడ్డు వదిలిపోతాయి. స్టెప్ :02 మలినాల తొలగింపుకు పోర్స్‌ని అలాగే వదిలేయకుండా సహజపద్ధతిలో ముఖకాంతి పెంచాలంటే..టీ స్పూన్ బియ్యప్పిండి, టీ స్పూన్ తేనె, టీ స్పూన్ బంగాళదుంప రసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 3 నుంచి 4 నిమిషాలు మృదువుగా వేళ్లతో వలయాకారంగా స్ట్రోక్స్ ఇస్తూ మసాజ్ చేయాలి. తర్వాత మళ్లీ ముఖాన్ని నీటితో కడిగేయాలి. దీని వల్ల చర్మంపై మలినాలు తొలగిపోతాయి. స్టెప్: 03 ఫేసియల్ మసాజ్ కలబంద రసం, బంగాళదుంప రసం సమపాళ్లలో తీసుకొని దీంట్లో ఏదైనా మసాజ్ క్రీమ్ కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి కిందనుంచి పైకి వేళ్లతో గుండ్రంగా మసాజ్ చేయాలి. ఇలా 5 నిమిషాలు చేసిన తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. దీని వల్ల చర్మం మృదువుగా అవుతుంది. స్టెప్:04 ఫేస్ ప్యాక్ ∙టీ స్పూన్ బంగాళదుంప రసంలో 4–5 చుక్కల నిమ్మరసం, 2 టీ స్పూన్ల పాలు, టీ స్పూన్ గంధంపొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఫేసియల్ బ్రష్‌తో అద్దుకుంటూ ముఖమంతా రాయాలి. 20 నిమిషాలు వదిలేయాలి. తర్వాత కడిగేయాలి. బంగాⶠదుంపలో ఉండే ‘సి’ విటమిన్ చర్మం మలినాలను తొలగిస్తుంది. జీవం లేని చర్మానికి కాంతిని తెస్తుంది. వయసు కారణంగా వచ్చే ముడతలను నివారిస్తుంది. పొడిబారడం వంటి సమస్య కూడా తగ్గిపోతుంది. 15 రోజులకు ఒకసారి ఇలా చేస్తూ ఉంటే చర్మం తాజాదనం కోల్పోదు. -
పక్షవాతానికి ఫేస్ టర్నింగ్
ఫేషియల్ పాల్సీ పక్షవాతం అనిపిస్తుంది కానీ... అది పక్షవాతం కాదు. స్ట్రోక్ లాంటి షాక్‌నిస్తుంది అయినా... భయపడాల్సిన పనిలేదు. ధైర్యంగా ఫేస్ టర్నింగ్ ఇవ్వండి నార్మల్ ఫేస్‌కు టర్న్ అవ్వండి. ‘అమ్మా! కన్ను ఎర్రగా ఉందేమిటి?’ కంగారుగా అడిగింది కావ్య.‘‘తలస్నానం చేసేటప్పుడు షాంపూ కంట్లోకి వెళ్లింది. అప్పటికీ కళ్లు గట్టిగా మూసుకున్నాను. అయినా ఎలా వెళ్లిందో’’ అంది రమాదేవి చాలా మామూలుగా. అంతలోనే...‘‘నిన్నటి నుంచి చెవి వెనుక నొప్పిగా ఉంది. పట్టించుకోకుండా తలస్నానం చేశాను. నొప్పి పెరుగుతుందో ఏమో’’ టవల్ అంచును సన్నగా చేసి చెవిలో దూరుస్తూ అన్నదామె. ‘‘అసలే చలికాలం. చెవి నొప్పెడుతుంటే తలస్నానం చేశావా? అయినా చెవి నొప్పి ఎందుకు వస్తోంది. ఓసారి ఈఎన్టికిచూపించుకుందామా’’ అన్నది కావ్య. ‘‘ఈ రోజూ, రేపు చూద్దాం. తగ్గకపోతే డాక్టర్ దగ్గరకు పోదాం’’ అని టాపిక్‌కి ఫుల్స్టాప్ పెట్టేసిందామె. తల్లీకూతుళ్లిద్దరూ డాక్టర్ ఎదురుగా ఉన్నారు. వాళ్ల ముఖంలో కంగారు. రమాదేవి ముఖం పూర్తిగా మారిపోయింది. ఆమె ఏదో చెప్పడానికి నోరు తెరుస్తోంది. కానీ మాట్లాడిన మాటకు, బయటకు వచ్చే శబ్దానికి పొంతన కుదరడం లేదు. పదాలు స్పష్టంగా పలకలేకపోతోంది. నోరు తెరిస్తే మూతి ఓ పక్కకు లాగేస్తోంది. పెదవులు అదుపు తప్పుతున్నాయి. తన ఇబ్బందిని వ్యక్తం చేయలేకపోతున్నాననే బాధ, తనకు వైద్యం అందేదెలా అనే భయం ఆమె ముఖంలో కనిపిస్తోంది.ఆమె ఆందోళనను అర్థం చేసుకున్న డాక్టరు మెల్లగా చెప్పారు. ‘‘ఇది ఫేషియల్ పెరాలసిస్. కంగారేం లేదు. ఒకటి – రెండు వారాల్లో మామూలవుతారు’’ అని ధైర్యం చెప్పారు. పెరాలసిస్ అనే పదం వినగానే రమాదేవి, కావ్య భయంతో బిగుసుకుపోయారు. అది గమనించిన డాక్టరు ‘‘ఇది పెరాలసిస్ కాదు, పెరాలసిస్కీ దీనికీ సంబంధమే లేదు’’ అని ధైర్యం చెబుతూ పరీక్షలు, మందులు రాశారు. ‘‘నిజం అమ్మా! మాటలో స్పష్టతే కాదు, ముఖం కూడా బాగయిపోయింది. పూర్తిగా మామూలయ్యావ్. కావాలంటే అద్దంలో చూసుకో’’ అంటూ రమాదేవి భుజం పట్టుకుని లాగి అద్దం ముందు నిలబెట్టింది కావ్య.‘‘అవును నిజమే’’ అంటూ చెంప నిమురుకున్నదామె. నాలుగు వారాలుగా తనను తాను అద్దంలో చూసుకోవడానికే భయపడింది రమాదేవి. రెండు కళ్లను మూస్తూ తెరుస్తూ అద్దంలో చూసుకుంది. నుదుటిని కదిలించి చూసుకుంది. ఆందోళన, భయం స్థానంలో సంతోషం నిండిపోయింది. కావ్య వైపు చూస్తూ ‘‘మందులు ఇంకా వాడాలా? డాక్టర్ గారు ఇంకా ఎన్ని రోజులకు రాశారు’’ అంటూ ప్రిస్కిప్షన్ చేతిలోకి తీసుకుంది.‘‘మళ్లీ చెకప్ వరకు డాక్టర్ రాసిన మందులు రాసినట్లు వేసుకో, నీ సందేహాలన్నీ డాక్టర్నే అడుగు. సొంత వైద్యాలు చేయకు. నేను లేను కదా అని ఫిజియోథెరపీని నిర్లక్ష్యం చేయకు’’ అని మందలించింది కావ్య చిరుకోపంగా. సర్జరీ ఎప్పుడు? మందులు, ఫిజియోథెరపీతో నూటికి ఎనభై మందిలో చక్కటి ఫలితాలు వస్తుంటాయి. మూడు నెలల్లో ఫలితం కనిపిస్తుంది, కొందరిలో ఆరు నెలలపాటు ఫిజియోథెరపీ కొనసాగించాల్సి ఉంటుంది. అప్పటికీ ఫలితం కనిపించనప్పుడు ఏడాది– రెండేళ్ల పాటు నిరీక్షించి ఆ తర్వాత ప్లాస్టిక్ సర్జరీ ద్వారా ముఖాకృతిని సరి చేయాల్సి ఉంటుంది. ఇది కాకుండా ఫేషియల్ పాల్సీ రావడానికి కారణం ప్రమాదవశాత్తూ ఫ్రాక్చర్ కావడం, నరం నొక్కుకుపోవడం వంటివైతే దానికి సర్జరీ చేయడం ఒక్కటే చికిత్స. చెవి వెనుకభాగంలో నరాన్ని సరి చేయడం ద్వారా పరిస్థితి చక్కబడుతుంది. నిర్ధారణ... చికిత్స! నూటికి 90 – 95 మందిలో పేషెంట్ హిస్టరీ (డాక్టరు ప్రశ్నలకు పేషెంటు ఇచ్చే జవాబులతో అందిన సమాచారం) ద్వారానే నిర్ధారణకు రావచ్చు. కొన్ని సందర్భాలలో ఎంఆర్ఐ, ఫేషియల్ నర్వ్ కండక్షన్ స్టడీ వంటి పరీక్షలు అవసరం కావచ్చు. ఇక చికిత్స విషయానికి వస్తే... వ్యాధి కారణాన్ని బట్టి ఉంటుంది. అలాగే పేషెంటు వ్యాధి నిరోధక శక్తిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. మొదటి మూడు రోజుల్లో స్టిరాయిడ్స్ ద్వారా ఫాస్ట్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఒకటి – రెండు వారాలు సాధారణ మందులు వాడితే సరిపోతుంది. హెర్పిస్ వంటి వైరల్ ఇన్ఫెక్షన్కి యాంటీ వైరల్ డ్రగ్స్ వాడాలి ∙కనురెప్ప మూతపడక కన్ను తేమ కోల్పోతుంటుంది. దాంతో ఇన్ఫెక్షన్ వస్తుంది. దీనిని నివారించడానికి ఐ డ్రాప్స్ సూచిస్తారు. కళ్లలో దుమ్ము, అతి వెలుతురు పడకుండా ఉండడానికి గాగుల్స్ పెట్టుకోవాలి ∙మందుల వాడకం ఎంత ముఖ్యమో ఫిజియోథెరపీ కూడా అంతే ముఖ్యం. ముఖం కండరాలు మామూలు స్థితికి రావడానికి కొన్ని ఎక్సర్‌సైజ్‌లను సూచిస్తారు. అవి బెలూన్‌లో గాలి ఊదడం, కొవ్వొత్తిని నోటితో ఊది ఆర్పడం, బబుల్గమ్ నమలడం (కండరం బలహీనపడిన వైపు దవడతో), ముఖం కండరాలకు మసాజ్ చేయడం, కంటిని మూసి తెరవడం వంటి వ్యాయామాలు చేయాలి ∙ఇటీవలి వరకు... ముఖం కండరాలకు కరెంట్ స్టిములేషన్ ద్వారా సత్వర ఫలితాలను సాధించవచ్చనే అభిప్రాయం ఉండేది. కానీ దాని ద్వారా అదనంగా పొందే ప్రయోజనం ఏదీ లేదని పరిశోధనల్లో తేలింది. సాధారణ ఫిజియోథెరపీని కచ్చితంగా పాటించడం ద్వారానే మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎందుకు వస్తుందో? ఫేషియల్ పెరాలసిస్ రావడానికి స్పష్టమైన, ప్రత్యక్ష కారణాలేవీ లేవు. కానీ ఎక్కువ సందర్భాలలో బెల్స్ పాల్సీ కారణమై ఉంటుంది. హెర్పిస్ వైరస్ కారణంగా నరంలో వాపు రావడం కూడా ఉంటుంది. ఫేషియల్ నర్వ్ చిన్న మెదడు నుంచి చెవి వెనుక ఎముక రంధ్రం నుంచి ముఖంలోకి వస్తుంది. దీనికి ఎక్కడ ఇబ్బంది కలిగినా ముఖం కండరాలు బలహీనపడతాయి. ఆ పరిస్థితి ఫేషియల్ పెరాలసిస్‌కి దారి తీస్తుంది. వీటితోపాటు... తలకు గాయం కావడం, తలలో ట్యూమర్, ఏదైనా సర్జరీ చేసేటప్పుడు నరం దెబ్బతినడం, మధుమేహం, సార్క్ ఐడోసిస్, జిబి సిండ్రోమ్‌లు కూడా కారణమవుతుంటాయి. మాట్లాడబోయినప్పుడు మూతి ఒక పక్కకు లాగుతుంది. ఈ లక్షణం కనిపించే వరకు దీని గురించి పట్టించుకోవడం జరగదు. ఈ లక్షణం బయటపడడానికి ఒకటి – రెండు రోజుల ముందు... చెవి వెనుక ఒక మోస్తరుగా నొప్పి వస్తుంది. అది తీవ్రమైన నొప్పి కాకపోవడంతో పెద్దగా పట్టించుకోరు n నుదుటి కండరాలు కదలికలు మందగిస్తాయి. అయితే అది పరిశీలనగా చూస్తే తప్ప గుర్తించడం కష్టం. కాబట్టి దానిని సామాన్యంగా గుర్తించలేరు n కనురెప్ప మూత పడదు. దీనిని కూడా ఎవరికి వారు వెంటనే తెలుసుకోలేరు. నిద్రపోతున్నప్పుడు చూసినవాళ్లు గుర్తించగలుగుతారు. సబ్బుతో ముఖం కడిగినప్పుడు రెప్ప మూతపడక కన్ను మంట పుట్టినప్పుడు తెలుస్తుంది. అయినా సీరియెస్‌గా తీసుకోవడం జరగదు n నాలుక ముందు భాగం రుచిని గుర్తించలేదు. లాలాజల ఉత్పత్తి తగ్గడంతో ఆహారం నమిలి తినడం కష్టమవుతుంది n అతి కొద్ది మందిలో చెవి దగ్గర చిన్న శబ్దం కూడా పెద్దగా వినిపిస్తుంది n ఈ సమస్య1–3వ రోజు వరకు ఒక్కొక్క లక్షణం తోడవుతూ తీవ్రస్థాయికి చేరి ఆగిపోతుంది n సాధారణంగా ఇది ముఖంలో ఒక వైపే వస్తుంది. రెండువైపులా రావడం అనేది నూటికి ఒక్క కేసుకు మించదు n మెదడులో రక్తనాళం బ్లాక్ అయినా కూడా మాటలు తడబడతాయి. అలాంటప్పుడు ఒక వస్తువు రెండుగా కనిపించడం వంటి లక్షణాలుంటాయి. బ్రెయిన్ స్ట్రోక్‌లో భాగంగా కూడా ముఖం కండరాలు బలహీనపడి పక్కకు లాగుతాయి. అది ముఖం కిందిభాగంలో మాత్రమే ఉంటుంది. డా. బి. చంద్రశేఖర్ రెడ్డి సీనియర్ న్యూరాలజిస్ట్ సిటీ న్యూరో సెంటర్, రోడ్ నెం.12 బంజారాహిల్స్, హైదరాబాద్ – వాకా మంజుల -
అడుగుపెడితే.. అరెస్టే!
-
అడుగుపెడితే.. అరెస్టే!
- ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టంకు ఆధునిక హంగులు - ‘పొరుగు రాష్ట్రాల’ నేరగాళ్ల ఫొటోలూ నిక్షిప్తం - సిటీలో ‘వలస దుండగుల’ బెడద తగ్గించేందుకే - కసరత్తు చేస్తున్న నగర ఐటీ సెల్ అధికారులు దృష్టి మళ్ళించి దోపిడీలు చేయడంలో బివాండీ ముఠా దిట్ట. ఈ ముఠాను ఇటీవలే నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా చెన్నై, ముంబై, అజ్మీర్, బెంగళూరు, జల్గాం పోలీసులకూ సుపరిచితమే.. అటు బ్యాంకు ఖాతాదారుల్ని టార్గెట్‌గా చేసుకుని అటెన్షన్ డైవర్షన్‌తో కొల్లగొడుతున్న బిహార్ ముఠా కూడా అబిడ్స్ పోలీసులకు చిక్కింది. వీరిపై అక్కడా కేసులున్నాయి. ఇవే కాదు.. పొరుగు, ఉత్తరాది రాష్ట్రాల నుంచి నగరానికి వచ్చి కొల్లగొడుతున్న ఘరానా గ్యాంగ్స్ ఎన్నో ఉన్నాయి. వీటికి చెక్ చెప్పడానికి సన్నాహాలు చేస్తున్న నగర పోలీసులు ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టంకు ఆధునిక హంగులు అద్దుతున్నారు. దీంతో నగరంలో అడుగుపెట్టగానే నేరస్తులను పట్టుకునేలా వ్యూహం రచిస్తున్నారు. - సాక్షి, హైదరాబాద్ ‘పని’ పూర్తయ్యాకే చిక్కుతున్నారు.. మహానగరం అనేక రాష్ట్రాలకు చెందిన వలస దొంగలకు విలాస కేంద్రంగా మారుతోంది. ఏపీ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశాకు చెందిన ముఠాలు తరచూ సిటీకి ‘వచ్చి వెళ్తుంటాయి’. వీరంతా పంజా విసిరిన తర్వాతే పోలీసులకు చిక్కుతున్నారు. కొన్ని సందర్భాల్లో నిందితుల్ని పట్టుకోవడం కష్టంగా మారుతోంది. ఇలాంటి అంతరాష్ట్ర ముఠాలు హైదరాబాద్‌లో అడుగుపెట్టిన వెంటనే గుర్తించి, కట్టడి చేయగలిగితే నగరవాసికి నష్టం లేకుండా చేయవచ్చు. ఇదే ఆలోచన నగర కొత్వాల్ ఎం.మహేందర్‌రెడ్డికి వచ్చింది. దీంతో ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టంలో మార్పులకు నాంది పడింది. ప్రస్తుతం వినియోగిస్తున్న విధానమిలా.. నగర పోలీసు విభాగం ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టం సాఫ్ట్‌వేర్‌ను నెక్ సంస్థ నుంచి ఖరీదు చేసింది. దీన్ని ఐటీ సెల్ అధికారులు ఆఫ్‌లైన్ విధానంలో వినియోగిస్తున్నారు. నగరంలోని వివిధ ఠాణాల పరిధితో పాటు ఇతర ప్రాంతాల్లోనూ అరెస్టు అయిన నిందితుల ఫొటోల డేటాబేస్‌ను రూపొందించారు. ఇవి నిక్షిప్తమై ఉన్న సర్వర్‌తో ఈ సాఫ్ట్‌వేర్‌ను అనుసంధానించారు. దీంతో నగరంలోని ఏ పోలీసుస్టేషన్, ప్రత్యేక విభాగానికి చెందిన అధికారులైనా ఓ వ్యక్తి ఫొటోను పంపి, గతంలో ఎక్కడైనా అరెస్టు అయ్యాడా? అనేది తెలపాలని ఐటీ సెల్‌ను కోరుతున్నారు. ఈ ఫొటోను సాఫ్ట్వేర్ ఆధారంగా సర్వర్‌లో సెర్చ్ చేసి అలాంటి వివరాలుంటే గుర్తిస్తున్నారు. ‘పొరుగు వారి’ వివరాలూ చేరుస్తూ.. ఈ సిస్టంలో హైదరాబాద్‌లో అరెస్టయిన నేరగాళ్ల ఫొటోలతో పాటు పొరుగు రాష్ట్రాల్లో పట్టుబడిన వారి ఫొటోలు, వివరాలను నిక్షిప్తం చేయనున్నారు. ఈ మార్పుల నేపథ్యంలో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లతో ప్రధాన ప్రాంతాల్లోని సర్వైలెన్స్ కెమెరాలను పరిపుష్టం చేస్తారు. దీనికోసం ఫేషియల్ రికగ్నైజేషన్ సాఫ్ట్‌వేర్‌ను ఆన్లైన్లో ఉంచి లైవ్ సెర్చ్‌లు చేయడానికి ఐటీ సెల్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. నగర వ్యాప్తంగా ఉండే సీసీ కెమెరాలన్నీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానించి ఉంటాయి. ఈ సాఫ్ట్‌వేర్‌కు సర్వర్ ద్వారా సీసీ కెమెరాలను అనుసంధానిస్తారు. ఇదే సర్వర్‌లో వాంటెడ్ వ్యక్తులు, పాత నేరగాళ్లు, మిస్సింగ్ కేసులకు సంబంధించి అదృశ్యమైన వారి ఫొటోలను నిక్షిప్తం చేస్తారు. ఫలితంగా నగరంలో ఏ సీసీ కెమెరా ముందు నుంచైనా ఆ వ్యక్తి కదలికలు ఉంటే సాఫ్ట్వేర్ ద్వారా గుర్తించే సర్వర్ తక్షణం కంట్రోల్ రూమ్ సిబ్బందిని అప్రమత్తం చేస్తుంది. వాహనాల నంబర్ ప్లేట్లను గుర్తించే ఆటోమేటిక్ నంబర్‌ప్లేట్ రికగ్నైజేషన్ సిస్టం ట్రాఫిక్ విభాగం ఏర్పాటు చేస్తున్న ఐటీఎంఎస్ ప్రాజెక్టు ద్వారా సమకూరుతుండగా ఫేషియల్ రికగ్నైజేషన్ను ప్రభుత్వం అందించే నిధులతో సమీకరించుకుని అభివృద్ధి చేస్తున్నారు. -
హోంమేడ్ ఫేషియల్
న్యూ ఫేస్ ఇంట్లో అందుబాటులో ఉండే పదార్థాలతోనే ఇకపై ఫేషియల్ చేసుకోవచ్చు. దాంతో ఏదైనా పార్టీకి వెళ్లాలనుకున్నప్పుడు... అప్పటికప్పుడు ఫేషియల్ చేసుకొని ఆకర్షణీయంగా తయారై వెళ్లొచ్చు. దీనికి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. అదెలాగో తెలుసుకుందాం.. క్లెంజింగ్: ఫేషియల్‌లో మొదటి స్టెప్ క్లెంజింగ్. అంటే క్లీనింగ్. ముందుగా ముఖానికి కాస్తంత కొబ్బరి నూనె రాసుకొని అరనిమిషం పాటు మర్దనా చేసుకోవాలి. తర్వాత వేడి నీళ్లలో ముంచిన క్లాత్‌ను ముఖంపై పెట్టుకొని, రెండు నిమిషాల తర్వాత పొడి క్లాత్‌తో ముఖాన్ని తుడుచుకోవాలి. స్టీమింగ్: ముందుగా వేడి నీళ్లలో నిమ్మగడ్డి లేదా లావెండర్ ఆయిల్‌ను వేయాలి. ఆ నీటి ఆవిరి తగిలేలా, ముఖాన్ని గిన్నెకు కాస్తంత దగ్గరగా పెట్టాలి. ఆవిరి బయటికి పోకుండా తల మీద ఏదైనా టవల్ కప్పుకోవాలి. అలా అయిదు నిమిషాలు ఉన్న తర్వాత ముఖాన్ని మెత్తటి క్లాత్‌తో సున్నితంగా తుడుచుకోవాలి. ఎక్స్ఫోలియేషన్: దీన్నే ఫేషియల్ స్క్రబ్ అని కూడా అంటారు. ఈ స్క్రబ్ కోసం ఓ గిన్నెలో 1 టేబుల్ స్పూన్ ఓట్స్, 1 టీ స్పూన్ బాదం నూనె, 1 టీ స్పూన్ రోజ్‌వాటర్ వేసి కలపాలి. ఆ మిశ్రమంతో రెండు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. ఫేస్‌ప్యాక్: ఇప్పుడు ఓ గిన్నెలో 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ తేనె వేసి బాగా కలపాలి. మిశ్రమం లూజ్ కావడానికి కొద్దిగా రోజ్‌వాటర్‌ను వాడాలి. ముఖానికి ఈ మిశ్రమంతో ప్యాక్ వేసుకొని 10-15 నిమిషాల తర్వాత పచ్చి పాలు లేదా గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. టోనింగ్: ఈ స్టెప్‌లో నిమ్మరసం లేదా రోజ్‌వాటర్‌లో దూది ఉండను ముంచి ముఖాన్ని తుడుచుకోవాలి. దాంతో ముఖంపై జిడ్డుతనం పూర్తిగా పోతుంది. మాయిశ్చరైజర్: జిడ్డుచర్మం వారు 1 టేబుల్ స్పూన్ పాలలో పావు టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, అర టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి ముఖం, మెడ భాగాలకు రాసుకొని 10 నిమిషాలు మర్దనా చేసుకోవాలి. (మర్దనా ఎప్పుడూ కింది నుంచి మీదకు చేసుకోవాలి. పై నుంచి కిందకు చేస్తే చర్మం సాగుతుంది). పొడి చర్మం వారు మాయిశ్చరైజర్‌గా కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ రాసుకోవచ్చు. -
నిమిషాల్లో నిగారింపు
బ్యూటిప్స్ రసాయనాలతో తయారు చేసిన క్రీమ్స్, కండీషనర్స్ లాంటివి ఉపయోగించకుండా, ఇంటి చిట్కాలు వాడితే అందంతో పాటు ఆరోగ్యమూ మీ సొంతం అవుతుంది.అనుకోకుండా ఏదైనా ఫంక్షన్‌కు వెళ్లాల్సి వస్తే ఇంట్లో చక్కటి ఫేషియల్ తయారు చేసుకోవచ్చు. ఒక గిన్నెలో రెండు టీ స్పూన్ల నారింజ రసం, ఒక టీ స్పూన్ నిమ్మరసం, ఒక టీ స్పూన్ పెరుగు తీసుకొని బాగా కలపాలి. ఆ మిశ్రమంతో ముఖానికి ప్యాక్ వేసుకొని, 15 నిమిషాల తర్వాత తడి గుడ్డతో తుడిచేసుకోవాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే చర్మం కాంతిమంతంగా తయారవుతుంది. ఇంట్లోనే జుట్టుకు కండీషనర్ తయారు చేసుకోవడం చాలా సులువు. ఒక ఇనుప పాత్రలో అరకప్పు కాఫీ పొడి, అరకప్పు హెన్నా పౌడర్ తీసుకొని వాటికి నిమ్మరసం కానీ పెరుగు కానీ కలుపుకొని పేస్ట్‌లా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని తలంటు స్నానం చేసిన మరుసటి రోజు మాడుకు, జుట్టుకు అప్లై చేసుకొని, అది పూర్తిగా ఆరిపోయాక కడిగేసుకోవాలి. అలా చేస్తే చుండ్రు సమస్య పోవడంతో పాటు జుట్టు ముదురు రంగులో నిగారిస్తుంది. తరచూ పెదాలు పగులుతూ, అందంగా కనిపించట్లేదని బాధపడే వారికి ఈ చిట్కాతో మంచి ఫలితం దక్కుతుంది. చిన్న పాత్రలో అర టీస్పూన్ నిమ్మరసం, అర టీస్పూన్ ఆముదం, అర టీస్పూన్ గ్లిజరిన్ వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని చిన్న డబ్బాలోకి తీసుకొని ప్రతి రోజూ పెదాలకు రాసుకుంటే పగలకుండా ఉంటాయి. దాంతో మీ పెదాలు అందంగా తయారవుతాయి. -
నాచురల్ ఫేస్‌మాస్క్
పది మిల్లీలీటర్ల తేనెలో ఒక కోడిగుడ్డు సొన, ఐదు గ్రాముల పాలపొడి లేదా టేబుల్ స్పూన్ తాజా పాలు ఒక పాత్రలో వేసి బాగా చిలికి ఆ మిశ్రమాన్ని ఫేషియల్ బ్రష్‌తో కళ్ల చుట్టూ, పెదవులను మినహాయించి ముఖానికి పట్టించాలి. ఇరవై నిమిషాల తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి. కోడిగుడ్డుసొన చర్మానికి పోషణనిస్తుంది. తేనె చక్కని నిగారింపునిస్తుంది. ఇది నాచురల్ స్కిన్‌కూ పొడిచర్మానికి కూడా చక్కగా పని చేస్తుంది. ఆయిలీ స్కిన్ అయితే పది మిల్లీలీటర్ల తేనెలో ఒక కోడిగుడ్డులోని తెల్లసొన, ఐదు మిల్లీలీటర్ల నిమ్మరసం, ఐదు గ్రాముల ఈస్ట్ పౌడర్ లేదా పుల్లటి పెరుగు కలిపి ముఖానికి పట్టించి ఆరిన తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి. నిమ్మరసం చర్మగ్రంథుల నుంచి విడుదలైన అదనపు జిడ్డును తొలగిస్తుంది. తెల్లసొన డీప్ క్లెన్సర్‌గా పని చేసి చర్మాన్ని బాగా శుభ్రపరుస్తుంది. వీటికి తేనె తెచ్చే నిగారింపు కలిసి ముఖం తాజాగా, కాంతివంతంగా మారుతుంది. ముఖం మీద నల్ల మచ్చలు పోవాలంటే... నిమ్మరసంలో కోడిగుడ్డు తెల్లసొన కలిపి ముఖానికి పట్టించి రాత్రంతా అలాగే ఉంచి ఉదయం కడగాలి. రాత్రంతా ఉంచడం సాధ్యం కాకపోతే ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత గోరు వెచ్చటి నీటితో కడగాలి. ఇలా ఇలా వారానికి రెండు - మూడు సార్లు చేస్తుంటే ముఖం మీద ఉన్న మచ్చలు తొలగిపోయి ముఖం తెలుపుదనం సంతరించుకుంటుంది. -
ముఖానికి ఆవిరి ఎంత సేపు?
బ్యూటిప్స్ బ్యూటీపార్లర్లలో ఫేసియల్ చేసేటప్పుడు ముఖానికి ఆవిరిపట్టడం (స్టీమ్) చూస్తుంటాం. అయితే ఆవిరి ఎంత సమయం పట్టాలి? ఎలా పట్టాలి? అసలు ఆవిరిపట్టడం వల్ల ఉపయోగాలేమిటో ముందు తెలుసుకుంటే మనకు ఉన్న సందేహాలన్నీ తొలగిపోతాయి. మరీ ముఖచర్మానికి దగ్గరగా ఆవిరి వేడి తగలకూడదు. షవర్ బాత్ చేసేటప్పుడు నీరు ఎంత దూరం నుంచి పడుతున్నాయో అంత దూరం నుంచి ఆవిరి చర్మానికి తగలాలి. లేదంటే చర్మం తన సహజత్వాన్ని కోల్పోవడానికి ఆవిరి ప్రధాన కారణం అవుతుంది.ఐదు నిమిషాలకు మించి ఆవిరి పట్టకూడదు. అన్ని చర్మతత్వాలూ ఒకేలా ఉండవు. అందుకని అందరికీ ఒకేవిధంగా ఆవిరిపట్టడం సరైన విధానం కాదు. దీని వల్ల చర్మంలోని పోర్స్ తెరుచుకుని, సహజసిద్ధంగా నూనె స్రవించే గ్రంథులు పొడిబారుతాయి. దీనివల్ల చర్మం త్వరగా ముడతలు రావడానికి ఆస్కారం అవుతుంది. ఆవిరి పట్టిన తర్వాత క్లెన్సర్‌తో ముఖాన్ని ఒకసారి శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల పోర్స్‌లో ఉన్న మలినాలు తొలగిపోతాయి. తర్వాత... పొడిగా ఉన్న మెత్తని టవల్‌తో ముఖాన్ని తుడుచుకోవాలి. ఆవిరిపట్టిన తర్వాత కొంతమంది చర్మం మరీ పొడిబారినట్టుగా అనిపిస్తుంది. అందుకని ముఖాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ వాడాలి. ఆవిరిపట్టడం అనేది సున్నితమైన ప్రక్రియ. ముందుగా చర్మతత్వాన్ని తెలుసుకుని, దానికి తగిన విధంగా ట్రీట్మెంట్ ఇచ్చే నిపుణుల చేతనే ఫేసియల్ చేయించుకోవడం, స్టీమ్ పట్టడం మేలు.