Government of Andhra Pradesh
-
సోషల్ మీడియా యాక్టివిస్టులపై థర్డ్ డిగ్రీ
సాక్షి, అమరావతి: సోషల్ మీడియా యాక్టివిస్టులపై చంద్రబాబు ప్రభుత్వం యథేచ్ఛగా అమానుష కాండను కొనసాగిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తుండడమే వారు చేసిన నేరం. వారిపై అక్రమ కేసులు నమోదు చేయడమే కాకుండా ...వారిని అక్రమంగా నిర్బంధించి భౌతికంగా దాడులు చేస్తూ ...కసి తీరిన తరువాతే అరెస్ట్ చూపిస్తోంది. మానవ హక్కులను నిర్భీతిగా ఉల్లంఘిస్తూ ...రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ సాగిస్తున్న ఈ దమనకాండకు ప్రభుత్వ ముఖ్యనేతే ప్రధాన కుట్రదారు కాగా... కీలక పోలీసు అధికారులు పాత్రధారులు, పర్యవేక్షకులు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈ రాక్షస క్రీడ కొనసాగుతోంది. అందులో ప్రధానంగా ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఇందులో బాగా ఆరితేరిపోయారు. అందరికన్నా ముందుండాలన్న తాపత్రయం వారిలో కనిపిస్తోంది. పౌరుల భావప్రకటనా స్వేచ్ఛను దారుణంగా కాలరాస్తున్న సర్కారు దమననీతిపై న్యాయపోరాటానికి ప్రజలు సన్నద్ధమవుతున్నారు. అంతేకాదు తమ విద్యుక్తధర్మాన్ని గాలికొదిలేసి ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లల్లా తలాడిస్తూ సోషల్ మీడియా యాక్టివిస్టులపై దమనకాండను కొనసాగిస్తున్న పోలీసు అధికారులపైనా ఎక్కడికక్కడ ప్రైవేటు కేసులు వేసేందుకు బాధిత కుటుంబాలు సిద్ధమవుతున్నాయి. వీరికి పలువురు మేధావులు, ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమకారులు, పలు పౌరసంఘాల నేతలు మద్దతుగా నిలుస్తున్నారు. త్వరలోనే ‘పచ్చ’పాత పోలీసు అధికారులందరూ న్యాయస్థానం ముందు దోషులుగా నిలబడడం తథ్యమని బాధిత కుటుంబాలు స్పష్టం చేస్తున్నాయి. అంతా ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే... ఈ మొత్తం వ్యవహారం ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో కొనసాగుతోంది. రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో శాంతిభద్రతల విభాగాన్ని పర్యవేక్షించే ఉన్నతాధికారి ఈ వ్యవహారాన్ని స్వయంగా పర్యవేక్షిస్తుండటం గమనార్హం. అంటే ఈ అమానుష కాండను కొనసాగించేందుకు ప్రభుత్వ పెద్దలు రాష్ట్రస్థాయిలో పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారని దీనినిబట్టి స్పష్టమవుతోంది. ప్రభుత్వ పెద్దలు టార్గెట్ చేసిన సోషల్ మీడియా యాక్టివిస్టులను వారు సంతృప్తిచెందే స్థాయిలో భౌతికంగా హింసించారా లేదా అన్నది వీడియో కాల్ ద్వారా పర్యవేక్షిస్తుండటం ప్రభుత్వ కక్షకు పరాకాష్టగా నిలుస్తోంది. ఆ రాక్షసకాండ ఇలా సాగుతోంది... ఎన్ని కేసులు.. ఎక్కడికి తరలిస్తున్నారు? రాష్ట్రంలో సోషల్‌మీడియా యాక్టివిస్టులపై ప్రభుత్వం ఎడాపెడా అక్రమ కేసులు బనాయిస్తోంది. ఒక్కో యాక్టివిస్టుపై ఒకటికి మించిన కేసులు నమోదు చేయడమే కాకుండా... వేర్వేరు జిల్లాల్లో కేసులు నమోదు చేస్తోంది. వారిని పోలీసులు హఠాత్తుగా అదుపులోకి తీసుకుని తమతో పట్టుకుపోతున్నారు. ఏ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకుందీ... ఏ పోలీస్ స్టేషన్‌కు తరలించారన్న కనీస సమాచారాన్ని కూడా కుటుంబ సభ్యులకు చెప్పడం లేదు. దాంతో తమ పరిధిలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వాకబు చేస్తే అసలు తాము ఎవర్నీ అదుపులోకి తీసుకోలేదని అక్కడి పోలీసు అధికారులు చెబుతున్నారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించడానికి కరడుగట్టిన నేరస్తులా? అక్రమంగా అదుపులోకి తీసుకున్న సోషల్ మీడియా యాక్టివిస్టులను పోలీస్ స్టేషన్లు తిప్పుతూ చిత్రహింసలకు గురి చేస్తున్నారు. కరడుగట్టిన నేరస్తులపై ప్రయోగించినట్లు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ భౌతికంగా హింసిస్తున్నారు. తాము చెప్పినట్టుగా వాంగ్మూలం ఇవ్వాలని..లేకపోతే మరిన్ని రోజులు చిత్రవధ తప్పదని హెచ్చరిస్తున్నారు. వీడియో కాల్ ద్వారా నిర్ధారణ సోషల్ మీడియా యాక్టివిస్టులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించామని పోలీసులు మాటలతో చెబితే ఉన్నతాధికారులు సంతృప్తి చెందడం లేదు. పోలీసు అధికారులు రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో శాంతిభద్రతల విభాగాన్ని పర్యవేక్షించే ఓ ఉన్నతాధికారికి వీడియో కాల్ చేసి మరీ చూపిస్తున్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై థర్డ్ డిగ్రీ తాము ఆశించినస్థాయిలో ప్రయోగించారా లేదా అన్నది ఆ ఉన్నతాధికారి వీడియో కాల్ ద్వారా పరిశీలిస్తారు. ఆయన సంతృప్తి చెందితే ఆ విషయాన్ని తన బిగ్ బాస్‌కు నివేదిస్తారు. ఆయన అనుమతి ఇచ్చిన తరువాతే... ఒకే ఇక చాలు... అరెస్ట్ చూపించండి అని ఆ ఉన్నతాధికారి జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు చెబుతారు.చిత్రహింసల తర్వాతే అరెస్ట్..ఆ విధంగా ప్రభుత్వ పెద్దలు ఆదేశించినస్థాయిలో థర్డ్ డిగ్రీని ప్రయోగించారని నిర్ధారించుకున్న తరువాతే సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్ట్ చూపిస్తున్నారు. ఈ ప్రక్రియ అంతా మూడు రోజుల నుంచి వారం రోజులపాటు సాగుతోంది. కుట్రపూరిత, కక్ష పూరిత రాజకీయాలకు పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న తీరుపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. పోలీసు వ్యవస్థను గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంతగా దుర్వినియోగం చేయలేదని పోలీసు అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. పోలీసులను గుండాల మాదిరిగా మార్చి రాజకీయ అరాచకం సాగిస్తుండటం విభ్రాంతికరమని మండిపడుతున్నారు. ఈ పరిణామాలతో పోలీసు అధికారులు భవిష్యత్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు. -
అత్యవసర సేవకుల సమ్మెబాట
సాక్షి నెట్వర్క్: తమ సమస్యల పరిష్కారం కోసం 108 ఉద్యోగులు పోరుబాట పట్టాలని నిర్ణయించుకున్నారు. బాబు ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు అయినా 108 ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోలేదు. పైగా కాంట్రాక్టు సంస్థను మార్చి మరింత గందరగోళానికి గురిచేసింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో తమ సమస్యల పరిష్కారం కోసం 108 ఉద్యోగులు ఈ నెల 25వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్త సమ్మెకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఏపీ 108 సర్వీసెస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ఇటీవల డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ అదనపు సీఈవోకు సమ్మె నోటీసు ఇచ్చారు. మొత్తం 3,600 మంది ఉద్యోగులు (ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లు, పైలెట్లు) సమ్మెలో పాల్గొననున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 768 అంబులెన్స్‌లు నిలిచిపోనున్నాయి. ఆపదలో ప్రాణాలు కాపాడే అపర సంజీవనిగా పేరొందిన 108 అంబులెన్స్ ఉద్యోగుల సమ్మె వల్ల ప్రజలకు తీవ్ర నష్టం కలిగే ప్రమాదం ఉంది. 108 సర్వీస్‌లను ప్రభుత్వమే నిర్వహించాలి.. ఉద్యోగులకు 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలి.. వైద్య, ఆరోగ్య శాఖలో భర్తీ చేసే ఉద్యోగాల్లో 108లో పని చేస్తున్నవారికి వెయిటేజీ ఇవ్వాలి.. మరణించిన 108 ఉద్యోగులకు ఎక్స్‌గ్రేషియా రూ.25 లక్షలు ఇవ్వాలి.. తదితర డిమాండ్లతో సమ్మెకు సిద్ధమయ్యారు. ఈ మేరకు విజయనగరం, అనకాపల్లి, విశాఖ, ఎన్టీఆర్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్, కర్నూలు జిల్లాల డీఎంహెచ్వోలు, డీఆర్వో, మండల స్థాయి అధికారులకు సమ్మె నోటిస్లు ఇచ్చారు. -
హాస్టళ్లలో సం‘క్షేమం’ లేదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్ల దుస్థితిపై హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తరచూ ఆందోళన కలిగించే భయంకర ఘటనలు జరుగుతున్నాయని తెలిపింది. ఇలాంటి ఘటనలపై స్పందించకపోతే భవిష్యత్ తరాలపై అది తీవ్ర ప్రభావం చూపుతుందని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపింది. ‘వివిధ సామాజిక, ఆర్ధిక నేపథ్యాల నుంచి వచ్చిన గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్న ఉద్దేశంతో సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్స్ స్కూళ్లను ఏర్పాటు చేశారు. వీటిలో చదివే విద్యార్థులు భద్రంగా, సురక్షితంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత టీచర్లు, ప్రిన్సిపల్ది. రెసిడెన్షియల్ క్యాంపస్‌లో చదువుకునే అమ్మాయిలతో అక్కడ పనిచేసే సిబ్బంది అసభ్యంగా ప్రవర్తించినా, వారిని లైంగికంగా వేధించినా అది పిల్లల తల్లిదండ్రులను భయాందోళనకు గురి చేస్తుంది. తద్వారా తమ పిల్లలను ఆ క్యాంపస్‌లో చేర్చడానికి వారు విముఖత చూపుతారు. సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ క్యాంపస్‌లలో భద్రమైన, సురక్షిత, పరిశుభ్ర వాతావరణం ఉండేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోతే విద్యా పరంగా గ్రామీణ, పట్టణ పిల్లల మధ్య అసమతుల్యత ఏర్పడుతుంది’ అని పేర్కొంది. అనంతపురం జిల్లా నార్పల మండలం బి.పప్పూరు గ్రామానికి చెందిన కె.శంకరయ్య గుత్తిలోని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్లో వంట మనిషిగా పని చేస్తూ 2011 జూలై 24న ఓ విద్యార్థిని పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. అధికారులు విచారించి అతన్నిసర్వీసు నుంచి తొలగించారు. దీనిని సవాలు చేస్తూ 2014 ఫిబ్రవరిలో అతను హైకోర్టును ఆశ్రయించాడు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ తుది విచారణ జరిపి.. శంకరయ్యపై తీసుకున్న చర్యలు సబబే అని మూడు రోజుల క్రితం తీర్పు వెలువరించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్ల దుస్థితిపై లోతుగా స్పందిస్తూ ప్రాథమిక మార్గదర్శకాలు జారీ చేశారు. వీటి ఆధారంగా రాష్ట్రంలోని అన్ని సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లలో కఠినంగా అమలయ్యే విధంగా ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశించారు. కర్నూలు జిల్లా కోసిగిలో మురుగుతో పందులకు ఆవాసంగా మారిన హాస్టల్ ప్రాంగణం హైకోర్టు సూచించిన ప్రాథమిక మార్గదర్శకాలు ఇలా.. ⇒ హాస్టల్ భవనం చుట్టూ సోలార్ ఎలక్ట్రిక్ ఫెన్సింగ్‌తో ప్రహరీ నిర్మించాలి. తప్పనిసరిగా గేటు ఏర్పాటు చేయాలి. ⇒ హాస్టల్ ప్రాంగణంలో రాకపోకలను పర్యవేక్షించడంతో పాటు వాటిని ఎంట్రీ, ఎగ్జిట్ రిజిస్టర్లో నమోదు చేయాలి. ⇒ హాస్టల్ ప్రవేశ మార్గం, కారిడార్లు, కామన్ ఏరియాలు వంటి చోట్ల విద్యార్థుల వ్యక్తిగత గోపత్యకు భంగం కలగకుండా సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. అనధికారికంగా ఆ కెమెరాలను ఆపరేట్ చేయకుండా చర్యలు తీసుకోవాలి. ⇒ మరుగుదొడ్లను శుభ్రంగా నిర్వహించాలి. తగిన నీటి సదుపాయం కల్పించాలి. ⇒ భద్రతా సిబ్బంది సహా మొత్తం సిబ్బంది నేపథ్యాన్ని సమగ్రంగా పరిశీలన చేయాలి. తరచూ శిక్షణ, అవగాహన సెషన్లు ఏర్పాటు చేయాలి. ⇒ సిబ్బంది ముఖ్యంగా ఆడ పిల్లలతో సన్నిహితంగా మెలిగే వారికి లింగ సమానత్వం గురించి, సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా తగిన శిక్షణ ఇవ్వాలి. తద్వారా సమస్య ఏదైనా ఎదురైనప్పుడు ఆడ పిల్లలు ధైర్యంగా ముందుకు వచ్చే సురక్షిత వాతావరణం కల్పించడం సాధ్యమవుతుంది. ⇒ సిబ్బందికి స్పష్టమైన ప్రవర్తనా నియమావళిని నిర్ధేశించాలి. దుష్ప్రవర్తన, అసభ్య ప్రవర్తన, వేధింపులకు ఆస్కారం లేకుండా చూడాలి. ప్రవర్తనా నియమావళిని అందరికీ కనిపించేలా ఏర్పాటు చేయాలి. ⇒ హాస్టల్ వాతావరణానికి అలవాటు పడేలా, వ్యక్తిగత సమస్యల నుంచి బయట పడేలా ఆడ పిల్లలకు మానసిక వైద్యులను అందుబాటులో ఉంచాలి. ఆత్మరక్షణకు వర్క్‌షాపులు నిర్వహించండి ⇒ హాస్టళ్లన్నీ జాతీయ శిశు సంరక్షణ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. ప్రతి చోట పోక్సో చట్టం అమలయ్యేలా చూడాలి. పోక్సో చట్టం కింద విధించే శిక్షల గురించి అందరికీ కనిపించే చోట పోస్టర్లు ఏర్పాటు చేయాలి. ఎలాంటి భయం, ఆందోళన లేకుండా ఫిర్యాదు చేసేలా వ్యవస్థ ఉండాలి. ⇒ తల్లిదండ్రులు, స్థానిక అధికారులు, విద్యా నిర్వహకులు కలిసి ఆడ పిల్లలకు మద్దతుగా నిలిచే వ్యవస్థను సృష్టించాలి. ఆడ పిల్లలు తమను తాము రక్షించుకునేందుకు వీలుగా ఆత్మ రక్షణకు సంబంధించిన వర్క్‌షాపులను తరచూ నిర్వహించాలి. దీని వల్ల అభద్రతా పరిస్థితుల్లో ఆడ పిల్లలు మనోస్థైర్యంతో ధైర్యంగా ఉండే అవకాశం ఉంటుంది. ⇒ హాస్టళ్లలో సమ వయసు్కలతో బృందాలను ఏర్పాటు చేయాలి. తద్వారా విపత్కర పరిస్థితుల్లో ఒకరి బాగోగులు మరొకరు చూసుకునే అవకాశం ఉంటుంది. భద్రత పరమైన చర్యలు సమర్థవంతంగా అమలవుతున్నాయా లేదా అన్న విషయాన్ని ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఉండాలి. లోపాలు ఉంటే వాటిని గుర్తించి సరిచేయాలి. ⇒ హాస్టళ్లలో ఉండే విద్యార్థులతో పాటు వారి కుటుంబాల నుంచి ఎప్పటికప్పుడు అభిప్రాయాలు తెలుసుకుంటూ ఉండాలి. తద్వారా మరింత మెరుగైన ఏర్పాట్లు చేయడానికి ఆస్కారం ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో సాయం చేసేందుకు వీలుగా చట్టాన్ని అమలు చేసే సంస్థలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఉండాలి. ⇒ ఈ చర్యలన్నింటి ద్వారా రెసిడెన్షియల్ హాస్టళ్లలో ఆడపిల్లల భద్రతకు పెద్దపీట వేసినట్లు అవుతుంది. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా సమగ్ర, ఆదేశ పూర్వక మార్గదర్శకాల రూపకల్పనకు వీలుగా ఈ తీర్పు కాపీని మహిళ, శిశు సంక్షేమ శాఖకు పంపాలని రిజిస్ట్రీని ఆదేశిస్తున్నాం.ఇప్పటికీ హాస్టళ్ల పరిస్థితిలో మార్పు లేదు ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి రికార్డులను కూడా పరిశీలించారు. అనంతరం తీర్పు వెలువరిస్తూ, పిటిషనర్ తీరును తీవ్రంగా ఆక్షేపించారు. శంకరయ్యది తీవ్ర దుష్ప్రవర్తన అని తేల్చారు. హాస్టల్లో నిద్రపోతున్న బాలికల పట్ల శంకరయ్య అనుచిత ప్రవర్తన గురించి ఓ టీచర్ అధికారులకు స్పష్టమైన స్టేట్మెంట్ ఇచ్చారన్నారు. నిద్రపోయే సమయంలో తలుపులేసుకోవడంతో పాటు తాళం కూడా వేసుకోవాలని బాలికలకు ఆ టీచర్ చెప్పారంటే శంకరయ్యది ఎలాంటి అభ్యంతరకర ప్రవర్తనో అర్థం చేసుకోవచ్చన్నారు. శంకరయ్యను సర్వీసు నుంచి తొలగిస్తూ అధికారులు ఇచ్చిన ప్రొసీడింగ్స్‌లో ఎలాంటి తప్పు లేదని, వాటిని సమర్ధిస్తున్నట్లు జస్టిస్ హరినాథ్ తన తీర్పులో పేర్కొన్నారు. ఈ ఘటన జరిగి 13 ఏళ్లు గడిచిపోయినప్పటికీ సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, స్కూళ్ల పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదన్నారు. -
నిబంధనలకు లోబడే గత సర్కారు అప్పులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర అప్పులపై ఇన్ని రోజులు కూటమి నేతలు చేసిన ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలేనని, గత ఐదేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిబంధనలకు లోబడే అప్పులు చేసిందని ‘కాగ్’ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) కుండబద్ధలు కొట్టింది. 2023–24 ఆర్థిక ఏడాది అకౌంట్స్‌ను కాగ్ బుధవారం అసెంబ్లీకి సమర్పించింది. 2023–24లో మార్కెట్ నుంచి రూ.68,414 కోట్లు అప్పు చేయడానికి అనుమతి ఉన్నప్పటికీ గత ప్రభుత్వం రూ.68,400 కోట్లు మాత్రమే అప్పు చేసిందని కాగ్ నివేదిక స్పష్టం చేసింది. ప్రభుత్వం గ్యారెంటీ రుణాలు కూడా నిబంధనలకు లోబడే ఉన్నాయని కాగ్ పేర్కొంది. 2019–20 నుంచి 2023–24 వరకు వైఎస్ జగన్ హయాంలో బడ్జెట్ అప్పులతో పాటు గ్యారెంటీ అప్పులను కూడా కాగ్ తన నివేదికలో వెల్లడించింది. అప్పులు దాచేస్తున్నారంటూ గత ప్రభుత్వంపై సీఎం చంద్రబాబుతో పాటు ఎల్లో మీడియా చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమేనని కాగ్ నివేదిక సాక్షిగా తేటతెల్లమైంది. బడ్జెట్, కాగ్ నివేదిక సాక్షిగా..చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా గత సర్కారు హయాంలో రూ.పది లక్షల కోట్లు అప్పులు చేశారంటూ పచ్చి అబద్ధాలు చెప్పారు. నిన్న బడ్జెట్ సాక్షిగా.. నేడు కాగ్ నివేదిక ద్వారా వైఎస్సార్సీపీ హయాంలో అప్పులకు సంబంధించి ఎల్లో మీడియా, చంద్రబాబు అండ్‌కో చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలనేనని తేలిపోయింది. 2023–24 నాటికి ప్రజా రుణం రూ.4,86,151 కోట్లుగా ఉన్నట్లు కాగ్ స్పష్టం చేసింది. 2023–24 నాటికి ప్రభుత్వ గ్యారెంటీ ద్వారా చేసిన రుణాలు రూ.1,54,797 కోట్లు మాత్రమేనని కాగ్ వెల్లడించింది. ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం (ఎఫ్ఆర్బీఎం) నిబంధనల మేరకు 2023–24లో జీఎస్డీపీలో రెవెన్యూ లోటు 3 శాతం ఉండాల్సి ఉండగా అంతకన్నా తక్కువకే 2.68 శాతానికే పరిమితం అయినట్లు నివేదిక స్పష్టం చేసింది. ద్రవ్యలోటు జీఎస్డీపీలో 4 శాతం ఉండాల్సి ఉండగా స్వల్పంగా పెరిగి 4.35 శాతానికి చేరిందని కాగ్ పేర్కొంది. -
కూటమిపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
-
రూ.2,610 కోట్ల అక్రమ డిపాజిట్లు..18 ఏళ్లుగా జిత్తులు!
చట్టపరమైన చర్యల కోసం కింది కోర్టులో అదీకృత అధికారి ఫిర్యాదు చేస్తే దానిపై పిటిషన్..! వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు కమిషన్‌ను నియమిస్తే పిటిషన్...! అధీకృత అధికారిని నియమిస్తే పిటిషన్..! కేసు వాదించడానికి స్పెషల్ పీపీని నియమిస్తే పిటిషన్! కింది కోర్టు విచారణకు స్వీకరిస్తే పిటిషన్...! వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశిస్తే పిటిషన్..! హైకోర్టు జోక్యానికి నిరాకరిస్తే సుప్రీంకోర్టులో పిటిషన్...!! సాక్షి, అమరావతి: ఇలా పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూ, స్టేల మీద స్టేలు పొందుతూ మార్గదర్శి, రామోజీరావు కాలం వెళ్లదీస్తూ వచ్చారు. దాని ఫలితంగానే గత 18 ఏళ్లుగా కేసు కొనసాగుతూ వస్తోంది. ప్రజల నుంచి ఏకంగా రూ.2,610 కోట్ల మేర డిపాజిట్లను అక్రమంగా వసూలు చేసిన మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని కర్త రామోజీరావు బండారం 2006 నవంబర్ 6న బట్టబయలైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చట్టం సెక్షన్ 45 ఎస్‌కు విరుద్ధంగా అక్రమంగా డిపాజిట్లు వసూలు చేయడంపై ప్రజల ముందు నిలబెట్టిన రోజు అది. ఇంత భారీ మొత్తంలో డిపాజిట్లు వసూలు చేసి అడ్డంగా దొరికిపోయిన మార్గదర్శి, రామోజీరావు చట్టం నుంచి తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తూ వచ్చారు. ప్రతి దశలోనూ విచారణను అడ్డుకుంటూ వచ్చారు. అయితే ఈ కేసులో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు తిరిగి విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు ఈ నెల 7వ తేదీన మరోసారి విచారణ జరపనుంది. ఆర్బీఐ చట్టం సెక్షన్ 45 ఎస్‌కు విరుద్ధంగా మార్గదర్శి డిపాజిట్లు స్వీకరించిందా? లేదా? అనే విషయాన్ని తేల్చనుంది. చట్ట విరుద్ధంగా మార్గదర్శి డిపాజిట్లు సేకరించినట్లు తేలితే వసూలు చేసిన రూ.2,610 కోట్లకు రెట్టింపు మొత్తాన్ని జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. అటు అక్రమ డిపాజిట్లు.. ఇటు నష్టాలంటూ రామోజీరావు 1972లో హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్) కింద మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను ఏర్పాటు చేశారు. 1997 కేంద్ర చట్టం ప్రకారం హెచ్‌యూఎఫ్ లాంటి అన్ ఇన్ కార్పొరేటెడ్ (చట్టపరంగా ఓ కంపెనీగా రిజిష్టర్ కాకుండా వ్యాపారం చేసేవి) సంస్థలు వ్యాపార కార్యకలాపాల కోసం ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడం నిషిద్ధం. అయితే దీన్ని ఖాతరు చేయకుండా మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్బీఐ చట్ట నిబంధనలను ఉల్లంఘించి 1997 నుంచి 2006 మార్చి నాటికి 2.75 లక్షల మంది డిపాజిటర్ల నుంచి దాదాపు రూ.2,610.38 కోట్లు అక్రమంగా వసూలు చేసింది. ఇంత భారీగా డిపాజిట్లు వసూలు చేసిన మార్గదర్శి ఆశ్చర్యకరంగా 2006 మార్చి నాటికి రూ.1,369.47 కోట్లను వృద్ధి చెందుతున్న నష్టాలుగా చూపింది. తద్వారా 50 శాతం మంది డిపాజిటర్లకు డిపాజిట్లు చెల్లించలేని పరిస్థితికి మార్గదర్శి ఫైనాన్షియర్స్ చేరింది. డొంక కదిల్చిన ఉండవల్లి... మార్గదర్శి ఫైనాన్షియర్స్ ద్వారా రామోజీ చట్ట విరుద్ధంగా డిపాజిట్లు స్వీకరించడంపై అప్పటి కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ 2006 నవంబర్ 6న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిర్యాదు చేశారు. మార్గదర్శి అక్రమాల తీరును బహిర్గతం చేశారు. ఇదే సమయంలో ఆ డిపాజిట్ల వివరాలను ఆర్బీఐ అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి పంపడంతోపాటు మార్గదర్శి ఫైనాన్షియర్స్ నుంచి వివరణ కోరింది. వాస్తవానికి 1997లోనే డిపాజిట్ల సేకరణపై మార్గదర్శి స్పష్టత కోరగా ప్రజల నుంచి అలా సేకరించడం చట్ట విరుద్ధమని ఆర్బీఐ అప్పుడే స్పష్టం చేసింది. అయినా సరే పట్టించుకోకుండా మార్గదర్శి చట్ట విరుద్ధంగా డిపాజిట్లు సేకరిస్తూ వచ్చింది. ఎప్పుడైతే ఉండవల్లి అరుణ్ కుమార్ ఫిర్యాదు చేశారో అప్పుడు మళ్లీ ఆర్బీఐ దీనిపై స్పందించింది. డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని ఆర్బీఐ స్పష్టంగా చెప్పింది. రంగాచారి, కృష్ణరాజు నియామకం.. డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకునే అధికారం తమకు లేదని ఆర్బీఐ చేతులెత్తేయడంతో చట్ట ప్రకారం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ముందుగా మార్గదర్శి ఫైనాన్షియర్స్ అక్రమాలపై నిగ్గు తేల్చి నివేదిక ఇచ్చేందుకు అప్పటి ప్రభుత్వ సలహాదారు (ఫైనాన్స్) ఎన్.రంగాచారిని, చట్ట ప్రకారం న్యాయస్థానాల్లో ఫిర్యాదు చేసేందుకు, తదనుగుణంగా చర్యలు తీసుకునేందుకు ఐపీఎస్ టి.కృష్ణరాజును అ«దీకృత అధికారిగా నియమిస్తూ జీవో జారీ చేసింది. ఈ నియామకాలను సవాలు చేస్తూ రామోజీ 2006లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా న్యాయస్థానం కొట్టివేసింది. అనంతరం 2007లో సుప్రీంకోర్టును ఆశ్రయించగా అత్యున్నత న్యాయస్థానం సైతం ఆ పిటిషన్‌ను కొట్టేసింది. ఐటీ శాఖ నుంచి సేకరించిన రంగాచారి.. డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా రంగాచారి నిర్వహించిన విచారణకు రామోజీరావు, మార్గదర్శి సహకరించకుండా కార్యాలయాల్లో తనిఖీలకు అడ్డంకులు సృష్టించారు. తమ పిటిషన్లు కోర్టు ముందు పెండింగ్‌లో ఉన్నాయని, డాక్యుమెంట్లు ఇచ్చేది లేదంటూ మొండికేశారు. దీంతో రంగాచారి ఆ వివరాలను ఆదాయపు పన్ను శాఖ నుంచి తెప్పించుకున్నారు. ఆర్బీఐ చట్టం సెక్షన్ 45(ఎస్)కు విరుద్ధంగా మార్గదర్శి డిపాజిట్లు సేకరించడం నిజమేనని పేర్కొంటూ 2007 ఫిబ్రవరి 19న ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. వడ్డీ చెల్లించే అలవాటే మార్గదర్శికి లేదని, ఒత్తిడి చేస్తేనే చెల్లిస్తుందంటూ ఓ డిపాజిటర్ హైకోర్టుకు నివేదించటాన్ని తన నివేదికలో పొందుపరిచారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్ధిక పరిస్థితి దారుణంగా ఉందని, అది డిపాజిట్లను తిరిగి చెల్లించే స్థితిలో లేదని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. రామోజీ పెట్టుబడి రూపాయైనా లేదు.. మార్గదర్శి ఫైనాన్షియర్స్ ద్వారా ప్రజల నుంచి సేకరించిన డిపాజిట్లను రామోజీ తన అనుబంధ కంపెనీలకు మళ్లించడమే నష్టాలకు ప్రధాన కారణమని రంగాచారి తన విచారణలో తేల్చారు. 2000, ఆ తరువాత బ్యాలెన్స్ షీట్లను గమనిస్తే మార్గదర్శి ఫైనాన్షియర్స్‌లో రామోజీ ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టలేదన్నారు. ప్రజల నుంచి వసూలు చేసిన డిపాజిట్లతోనే మార్గదర్శిని నడిపారని నిగ్గు తేల్చారు. కోర్టు అనుమతితో తనిఖీలు.. మరోవైపు ఈ కేసులో అదీకృత అధికారిగా నియమితులైన కృష్ణరాజు కోర్టు అనుమతితో మార్గదర్శి ఫైనాన్షియర్స్‌లో తనిఖీలు చేశారు. దీన్ని సవాలు చేస్తూ మార్గదర్శి, రామోజీరావు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ 14.3.2007న కోర్టు ఉత్తర్వులిచ్చింది. దీనిపై రామోజీ హైకోర్టును ఆశ్రయించగా కింది కోర్టు ఇచ్చిన సెర్చ్ వారెంట్‌ను నిలుపుదల చేసింది. ఈ క్రమంలో చట్ట ఉల్లంఘనలకు పాల్పడినందుకు మార్గదర్శి ఫైనాన్షియర్స్, రామోజీరావులను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ అ«దీకృత అధికారి టి.కృష్ణరాజు 2008 జనవరి 23న నాంపల్లి మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు (సీసీ నెంబర్ 540) చేశారు. దీన్ని కొట్టి వేయాలంటూ అదే ఏడాది రామోజీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. జస్టిస్ రజనీ స్టేతో మూలపడిన కేసు.. దీంతో దిక్కుతోచని రామోజీ 2010లో ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. అ«దీకృత అధికారి ఇచ్చిన ఫిర్యాదులో విచారణను సెక్షన్ 45(ఎస్)(1), 45(ఎస్)(2), 58బీ(5ఏ) రెడ్ విత్ సెక్షన్ 58(ఈ)లకే పరిమితం చేయాలన్న అభ్యర్థనను తోసిపుచ్చుతూ నాంపల్లి కోర్టు 2011లో ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులపై మార్గదర్శి, రామోజీ హైకోర్టును ఆశ్రయించారు. ఆర్బీఐ చట్టం పరిధిలోకి మార్గదర్శి ఫైనాన్షియర్స్ రాదంటూ వాదించారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన అప్పటి న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజనీ మార్గదర్శిపై కృష్ణరాజు దాఖలు చేసిన ఫిర్యాదులో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ 20.7. 2011న మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.‘‘స్టే’’ వల్ల కేసు అప్పటి నుంచి మూలనపడిపోయింది. అటు తరువాత వచ్చిన ప్రభుత్వాలు రామోజీ గుప్పిట్లో ఉండటంతో మార్గదర్శి అక్రమాలను పట్టించుకోలేదు. విచారణ.. తీర్పు.. ఒకే రోజు ఉమ్మడి హైకోర్టు విభజన 1.1.2019న జరిగింది. 31.12.2018 ఉమ్మడి హైకోర్టుకు చివరి రోజు. అటు న్యాయవాదులు ఇటు న్యాయమూర్తులు అందరూ భావోద్వేగ వాతావరణంలో ఉన్నారు. కేసుల విచారణపై దృష్టి సారించలేని పరిస్థితిని రామోజీరావు తనకు అనుకూలంగా మలచుకున్నారు. నాంపల్లి కోర్టులో అ«దీకృత కృష్ణరాజు చేసిన ఫిర్యాదును కొట్టేయాలంటూ 2011లో తాము దాఖలు చేసిన వ్యాజ్యాలను రామోజీ విచారణకు తెప్పించారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజనీ విచారణ జరిపారు. రామోజీరావు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రాను రంగంలోకి దించారు. లూథ్రా వాదనలు విన్న జస్టిస్ రజనీ ఇంత పెద్ద కేసులో అదే రోజు అంటే 31వతేదీన తీర్పు కూడా ఇచ్చేశారు. రామోజీ, మార్గదర్శి వాదనను సమర్ధించారు. హెచ్‌యూఎఫ్.. ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45ఎస్ పరిధిలోకి రాదని జస్టిస్ రజనీ తన తీర్పులో తేల్చేశారు. మార్గదర్శి, రామోజీరావులను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ నాంపల్లి కోర్టులో అధీకృత అధికారి కృష్ణరాజు దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టేస్తూ తీర్పునిచ్చారు. ఇంత పెద్ద కేసులో ఒకే రోజు విచారణ జరిపి అదే రోజు తీర్పునివ్వడం అరుదైన ఘటన. అసలు ఈ కేసు విచారణకు వచ్చినట్లు గానీ, న్యాయమూర్తి ఈ విధంగా తీర్పునిచ్చినట్లుగానీ ఎవరూ గుర్తించలేదు. అటు తరువాత కొద్ది నెలలకు ఈ తీర్పు వెలుగు చూసింది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. జస్టిస్ రజనీ తీర్పుపై మార్గదర్శి, రామోజీరావు సుప్రీంకోర్టును ఆశ్రయించడం. అటు తరువాత మార్గదర్శి ఫైనాన్షియర్స్ కుంభకోణాన్ని బయటపెట్టిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అప్రమత్తమై హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ 2019 డిసెంబర్ 17న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంలో ఆంధప్రదేశ్ ప్రభుత్వం ఇంప్లీడ్ అయింది. హైకోర్టు తీర్పును రద్దు చేసిన సుప్రీం.. హైకోర్టు తీర్పులో కొంత భాగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మార్గదర్శి, రామోజీరావు 19.9.2020న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసును కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం17.8.2022న సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అటు ఉండవల్లి అరుణ్ కుమార్, ఏపీ ప్రభుత్వం, ఇటు మార్గదర్శి, రామోజీరావు వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు 2020 నుంచి విచారిస్తూ వచ్చింది. మార్గదర్శి, రామోజీరావు చట్ట ఉల్లంఘనలకు పాల్పడినట్లు విచారణ సందర్భంగా ఆర్బీఐ న్యాయవాది మౌఖికంగా కోర్టుకు తెలిపారు. చివరగా ఈ ఏడాది ఏప్రిల్ 9న సుప్రీంకోర్టు ఈ వ్యాజ్యాలన్నింటిపై విచారణ జరిపింది. చట్ట ఉల్లంఘనలకు పాల్పడినందుకు రామోజీరావు, మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ అదీకృత అధికారి కృష్ణరాజు నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజనీ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేసింది. కేసుల కొట్టివేతకు సుప్రీం నిరాకరణ.. డిపాజిట్లు తిరిగి ఇచ్చేశాం కాబట్టి తనపై కేసులు కొట్టేయాలంటూ ఇదే సమయంలో రామోజీ, మార్గర్శి ఫైనాన్షియర్స్ చేసిన అభ్యర్థనలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. చట్ట విరుద్ధంగా సేకరించిన డిపాజిట్లపై నిగ్గు తేలాల్సిందేనని.. మార్గదర్శి, రామోజీకి అనుకూలంగా హైకోర్టు ఏకపక్షంగా ఇచ్చిన తీర్పును పక్కనపెడుతున్నామని స్పష్టం చేసింది. కేసు లోతుల్లోకి వెళ్లి అందరి వాదనలు వినాలని, సీనియర్ న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. తాజాగా విచారణ జరిపి ఆరు నెలల్లో విచారణను ముగించాలని, సేకరించిన డిపాజిట్లకు సంబంధించి పబ్లిక్ నోటీసు ఇవ్వాలని తెలిపింది. తిరిగి విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు... సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు ఈ ఏడాది జూన్‌లో తిరిగి విచారణ ప్రారంభించింది. విచారణ జరుగుతుండగానే రామోజీరావు మరణించగా ఆయన స్థానంలో హెచ్‌యూఎఫ్ కర్తగా తనను చేర్చాలని రామోజీ కుమారుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పలు దఫాలు వాయిదాల అనంతరం పూర్తిస్థాయి వాదనల నిమిత్తం ఈ నెల 7న విచారణ చేపట్టనున్నట్లు న్యాయస్థానం పేర్కొంది. -
రాశులకొద్దీ ధాన్యం.. కొనేవారేరీ?
సాక్షి, హైదరాబాద్: పలు జిల్లాల్లో ఈసారి పంట దిగుబడి పెరగడంతో ధాన్యం రాశులతో పల్లెలన్నీ కళకళలాడుతున్నాయి. అయితే ధాన్యం విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకు వెళ్లిన రైతులకు మాత్రం నిరాశే ఎదురవుతోంది. మంత్రి ఉత్తమ్ ప్రతిరోజూ అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నా, క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోళ్లు ముందుకు సాగడం లేదు. కొనుగోలు కేంద్రాలు తెరిచినా, కాంటా వేయడం లేదు. దీంతో రైతులకు పడిగాపులు తప్పడం లేదు. నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లోని కొన్ని మండలాల్లో పండిన మేలురకం సన్న ధాన్యాన్ని ఇప్పటికే బహిరంగ మార్కెట్లో రైతులు విక్రయించారు. క్వింటాల్‌కు రూ.500 బోనస్ వచ్చే సన్న ధాన్యాన్ని, ఎక్కువగా సాగయ్యే దొడ్డు ధాన్యాన్ని విక్రయించేందుకు వీలుగా రాష్ట్రంలో 7,572 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో ఇప్పటి వరకు 4,600 కేంద్రాలను తెరిచినా, అందులో సగం కేంద్రాల్లో కూడా ధాన్యం కొనుగోళ్లు సాగడం లేదు. బ్యాంకు గ్యారంటీలు ఇచ్చిన మిల్లర్లకే కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కోసం ధాన్యం కేటాయిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో నాలుగు రోజుల క్రితం వరకు మిల్లర్లు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆ బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించడంతో పౌరసరఫరాల శాఖ అధికారులు నయానో, భయానో మిల్లర్లను ఒప్పించి 15 రోజుల్లో బ్యాంకు గ్యారంటీలు ఇస్తామని రాతపూర్వకంగా ‘అండర్‌టేకింగ్’తీసుకుంటూ మిల్లులకు ధాన్యం కేటాయిస్తున్నారు. దీంతో చాలా జిల్లాల్లో సోమవారం నుంచి కొనుగోళ్ల ప్రక్రియ కొంత మెరుగైంది. అయినా, అనేక జిల్లాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు కుప్పలుకుప్పలుగా దర్శనమిస్తున్నాయి. బ్యాంక్ గ్యారంటీలిస్తేనే... ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ , నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో ఎక్కువగా ఉన్న ఈ డిఫాల్ట్ రైస్‌మిల్లర్ల నుంచి అండర్ టేకింగ్ తీసుకుంటూ బ్యాంక్ గార్యంటీలు, సెక్యూరిటీ డిపాజిట్లు ఇస్తామని కాగితాలు రాయించుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు ఏ ఒక్క మిల్లర్ అవి ఇవ్వలేదని తెలుస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా: ఈ జిల్లాలో 615 ధాన్యం కొనుగోలు కేంద్రాలుండగా, 404 సన్నరకాలకు 211 దొడ్డు రకాల కొనుగోళ్లకు కేటాయించారు. వీటిల్లో కేవలం 121 కేంద్రాల్లో సన్న రకం, 86 కేంద్రాల్లో దొడ్డు రకం కొనుగోళ్లు సాగుతున్నాయి. మంగళవారం నాటికి 18,320 టన్నుల సన్నరకం, 11,334 టన్నుల దొడ్డురకం ధాన్యం సేకరించారు. బ్యాంకు గ్యారంటీలు ఇస్తామని 190 మంది రైస్‌మిల్లర్లు అండర్ టేకింగ్ ఇచ్చారు. – కామారెడ్డి జిల్లాలో 423 కేంద్రాలకుగాను 150 కేంద్రాల్లో కొనుగోలు మొదలయ్యాయి. ఇందులో సన్నారకాలకు 63 కేంద్రాలే తెరిచారు. కేవలం 4,250 క్వింటాళ్ల సన్నరకం ధాన్యం కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా : ఉమ్మడి వరంగల్‌లో ఆయా జిల్లాల వారీగా చూస్తే..వరంగల్‌లో 203 కేంద్రాలకుగాను 24 కేంద్రాలే తెరుచుకోగా, అక్కడ కొనుగోళ్లు జరుగుతున్నాయి. హనుమకొండలో మొత్తంగా 149 కేంద్రాలు, జనగామలో మొత్తంగా 180, ములుగులో మొత్తంగా 178 కేంద్రాలు తెరుచుకున్నాయి. మహబూబాబాద్‌లో 234 కేంద్రాలకుగాను 59, భూపాలపల్లిలో 189గాను 79 కేంద్రాలే మొదలయ్యాయి. – జనగామ జిల్లాలో 33,336 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసి 30 రా రైస్, బాయిల్డ్ రైస్‌మిల్లులకు సరఫరా చేశారు. మరో 19 రైస్‌మిల్లులకు ధాన్యం తరలించేందుకు 10 శాతం గ్యారంటీపై చర్చలు జరుగుతున్నాయి. – జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో ఇంకా ధాన్యం కొనుగోళ్లు మొదలు కాలేదు. హనుమకొండ జిల్లాలో ఇప్పుడిప్పుడే కొనుగోళ్లు మొదలయ్యాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా: నల్లగొండ జిల్లాలో బ్యాంకు గ్యారంటీలు ఇస్తామని అగ్రిమెంట్ చేసుకున్న 145 మిల్లులకు సోమవారం ధాన్యం కేటాయింపులు షురూ చేశారు. 345 కేంద్రాలను ప్రారంభించినట్టు అధికారులు చెబుతున్నా, సగం కేంద్రాల్లో కూడా కొనుగోళ్లు సక్రమంగా సాగడం లేదు. మంగళవారం వరకు జిల్లాలో కేవలం 15 వేల మెట్రిక్ టన్నులు కొనుగోళ్లు జరిగాయి. అయితే ఇంతవరకు సన్నాల కొనుగోళ్లు మొదలే కాలేదు. – సూర్యాపేట జిల్లాలో ఇప్పటి వరకు కొనుగోళ్లను ప్రారంభించలేదు. కేవలం కేంద్రాలను మాత్రమే ప్రారంభించి కాంటాలను మరిచారు. గ్యారంటీ ఇచ్చిన 15 మిల్లులకు ధాన్యం కేటాయించారు. – యాదాద్రి జిల్లాలో అఫిడవిట్లు ఇచ్చిన 50 మిల్లులకు ధాన్యం అలాట్ చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా : మెదక్ జిల్లాలో 490 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, సన్నధాన్యం కొనుగోలుకు కేవలం 91 కేంద్రాలే కేటాయించారు. ఈ జిల్లాలోని 104 మిల్లుల్లో 60 మిల్లులు డిఫాల్ట్ జాబితాలో ఉండగా, 54 మిల్లులకే ధాన్యం కేటాయించాలని నిర్ణయించారు. వీరిలోనూ 30 మంది మిల్లర్లు మాత్రమే అండర్ టేకింగ్ ఇచ్చారు. దీంతో మంగళవారం నుంచి కొనుగోళ్లు ప్రారంభించారు. – సిద్దిపేట జిల్లాలో 417 కొనుగోలు కేంద్రాలకుగాను ఇప్పటి వరకు 348 కేంద్రాలను ప్రారంభించారు. బ్యాంక్ గ్యారంటీ ఇస్తామని అండర్ టేకింగ్ ఇచ్చిన 25 మిల్లులకు ధాన్యం కేటాయించారు. – సంగారెడ్డి జిల్లాలో 183 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినా, ఇప్పుటి వరకు కనీసం 50 సెంటర్లలో కూడా సేకరణ షురూ కాలేదు. – ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో ఇంకా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. కోతలు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. కాంటా ఎప్పుడేస్తరో తెల్వదు నా పేరు చందు మల్లయ్య, నాది వరంగల్ జిల్లా రాయపర్తి. 8 ఎకరాల్లో వరి సాగుచేశా. అందులో పండిన వడ్లను రాగన్నగూడెం కొనుగోలు కేంద్రంలో పోశా. ఇప్పటివరకు కొనుగోళ్లు మొదలుకాలేదు. 15 రోజుల నుంచి కాంటా కోసం రైతులం ఎదురుచూస్తున్నం. పరదాలు అద్దెకు తెచ్చి వడ్లు పోశాం. కేంద్రం ఎప్పుడు తెరుస్తారో, కాంటా ఎప్పుడేస్తరో తెల్వదు. సాయంత్రం అయితే వర్షం ఎప్పుడు పడుతుందోనని భయంతో ఆకాశం వైపు చూస్తున్నాం. – చందు మల్లయ్యతేమ పేరుతో కొనడం లేదు నల్లగొండ జిల్లా డిండి మండల కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తీసుకొచ్చి పది రోజులువుతోంది. అధికారులు తేమ పేరుతో వడ్లు కొనడం లేదు. పది రోజులుగా కేంద్రం వద్దే పడిగాపులు కాస్తున్నాం. వానొస్తే వడ్లు తడిసి ఇంకా నష్టపోయే ప్రమాదముంది. – మూఢావత్ శంకర్, డిండి మిల్లుల కేటాయింపు జరగాలి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రానికి వెంటనే రైస్ మిల్లులు కేటాయించాలి. కొనుగోలు కేంద్రంలో ధాన్యం రాశులు పెరిగిపోతున్నాయి. కాంటాలు ప్రారంభించకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. – లలిత, కొనుగోలు కేంద్రం నిర్వాహకురాలు, సింగారెడ్డి పాలెం,(సూర్యాపేట జిల్లా) -
Andhra Pradesh: ఉల్లి రైతు గుల్ల!
సాక్షి, అమరావతి: ఉల్లి రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. వర్షాభావ పరిస్థితులకు తోడు వరదలు, భారీ వర్షాలు లాంటి వైపరీత్యాలకు ఎదురొడ్డి సాగు చేసిన పంటను దళారులు అడిగిన రేటుకు విక్రయించాల్సి రావడం... ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో హతాశులవుతున్నారు. ఒకపక్క బయట మార్కెట్లో ఉల్లి ధరలు దిగి రావడం లేదు. మరోపక్క రైతన్నలు గిట్టుబాటు ధర లభించక అల్లాడుతున్నాడు. వెరసి అటు వినియోగదారులకు ఇటు అన్నదాతలకు ఉల్లి కన్నీళ్లు తెప్పిస్తోంది. ఉల్లి పంటకు పేరుపొందిన కర్నూలు జిల్లాలో సౌకర్యాలు లేక నష్టపోతుంటే వైఎస్సార్ కడప జిల్లాలో గిట్టుబాటు ధర లభించక నష్టాల పాలవుతున్నారు.1.72 లక్షల ఎకరాల్లో సాగు..రాష్ట్రంలో ఉల్లి సాధారణ విస్తీర్ణం లక్ష ఎకరాలు కాగా, ఈ ఏడాది 1.72 లక్షల ఎకరాల్లో సాగైంది. ఇందులో 70 శాతానికి పైగా కర్నూలు జిల్లాలోనే సాగవుతోంది. ఈ ఒక్క జిల్లాలోనే ఈ ఏడాది 1.12 లక్షల ఎకరాల్లో ఉల్లి సాగైంది. ఆ తర్వాత వైఎస్సార్, అనంతపురం, విజయనగరం జిల్లాల్లో ఎక్కువగా సాగులో ఉంది. మూడు నెలల్లో చేతికొచ్చే పంటకు ఎకరాకు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు పెట్టుబడి వ్యయం అవుతుంది. ఖరీఫ్‌లో 8–10 టన్నులు, రబీలో 10–20 టన్నుల వరకు దిగుబడులొస్తాయి. కనీసం 3–6 నెలలు నిల్వ చేసే అవకాశం ఉన్నప్పటికీ సదుపాయాల్లేక పంట చేతికి రాగానే అయినకాడికి అమ్ముకోవాల్సిన పరిస్థితి దాపురించింది. ఖరీఫ్ సీజన్లో కర్నూలు, అనంతపురం జిల్లాలలో మినహా మిగిలిన చోట్ల అధిక వర్షాలు, వరదలతో తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఒక్క కర్నూలు జిల్లాలో మాత్రమే కాస్త ఆశాజనకంగా ఎకరాకు 100 క్వింటాళ్ల దిగుబడులొచ్చాయి. అలాగే ఎన్నడూ లేని విధంగా మార్కెట్లో కిలో రూ.50 నుంచి రూ.80 వరకు పలుకుతోంది. దీంతో రైతులు తమకు మంచి ధర వస్తుందని ఆశగా ఖరీఫ్‌లో ఎక్కువ విస్తీర్ణంలో ఉల్లి సాగుచేశారు. తీరా పంట మంచిగా ఎదిగే సమయంలో వర్షాభావంతోపాటు భారీ వర్షాలు, వరదల ప్రభావానికి గురై 30 నుంచి 40 శాతం వరకు దెబ్బతిన్నది. అయినా మార్కెట్లో రికార్డు స్థాయిలో ధర ఉండటంతో మిగిలిన పంటకు కనీసం గిట్టుబాటు ధర లభిస్తుందని ఆశగా ఎదురు చూశారు. పంట చేతికొచ్చే సమయంలో దళారులు ధర తగ్గించి కొనుగోలు చేస్తుండటం, సౌకర్యాల లేమితో మార్కెట్‌కు తీసుకువెళ్లిన పంట దెబ్బతినడంతో ఉల్లి రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. కోతలు మొదలైనప్పటి నుంచి కష్టాలుకోతకొచ్చిన పంట మార్కెట్‌కు రావడం మొదలైన దగ్గర నుంచి ఉల్లి రైతుకు కష్టాలు మొదలయ్యాయి. పెరిగిన విస్తీర్ణం, దిగుబడులను దృష్టిలో పెట్టుకుని సౌకర్యాలు కల్పించడంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఈనామ్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యలకు తోడు కాటాలు, కూలీల కొరత ఉల్లి రైతుల ఆశలను దెబ్బతీసింది. కర్నూలు మార్కెట్ యార్డుకు రోజుకు 26 వేల క్వింటాళ్ల పంట వస్తుండగా ఆ స్థాయిలో సౌకర్యాలు లేకపోవడంతో రైతులు రోజుల తరబడి మార్కెట్లో పడిగాపులు పడాల్సిన దుస్థితి ఏర్పడింది. సర్వర్ సమస్యల కారణంగా టెండర్లలో తీవ్ర జాప్యం చోటు చేసుకోవడంతో టన్నుకు 50–100 కేజీల వరకు ఉల్లి దెబ్బతినడంతో ఆ మేరకు నష్టపోయారు. కర్నూలు యార్డు పరిధిలో ఈ సీజన్లో గరిష్టంగా క్వింటాకు రూ.4,300 ధర లభించగా, సగటున రూ.1,500 నుంచి రూ.3 వేల చొప్పున ధర లభించింది.రోజు విడిచి రోజు విక్రయాలుఈనామ్లో సాంకేతిక సమస్యను అధిగమించేందుకు వారం పట్టింది. అదేవిధంగా వాహనాలు, కాటాలు సమకూర్చలేక తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రోజు విడిచి రోజు ఉల్లి విక్రయాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక వైఎస్సార్ జిల్లాలో 15 వేల ఎకరాలకు పైగా ఉల్లి సాగవుతోంది. వర్షాల వల్ల పంట దెబ్బతింది. క్వాలిటీ లేదనే సాకుతో ఇక్కడ క్వింటాకు గరిష్టంగా రూ.1,500 ధర లభించగా, సగటున రూ.వెయ్యికి మించి దక్కడం లేదు.ఉల్లి రైతుకు అండగా జగన్ సర్కారుఒక జిల్లాలో ఒక పంట పథకం కింద ఉల్లి ఎక్కువగా సాగయ్యే జిల్లాల్లో వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో 25 టన్నుల సామర్థ్యంతో ఒక్కొక్కటి రూ.1.75 లక్షల అంచనా వ్యయంతో మల్టీ యుటిలిటీ కేంద్రాలను నిర్మించారు. ఒక్క కర్నూలు జిల్లాలోనే 600కి పైగా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉల్లి ఉత్పత్తిదారుల సంఘాలకు 75% సబ్సిడీతో సోలార్ పాలీ డ్రయర్లు, వాహనాలు, 50% సబ్సిడీపై ఉల్లి డీ టాపింగ్ మిషన్లు, ఉల్లి సీడ్ డిబ్లర్స్తో 40% సబ్సిడీపై సోలార్ డీ హైడ్రేషన్ యూనిట్లను గత ప్రభుత్వం సమకూర్చింది. దేశంలో ఎక్కడా లేని విధంగా క్వింటాకు రూ.770 కనీస మద్దతు ధర ప్రకటించింది. ధర తగ్గిన సందర్భాల్లో మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద రైతులకు మద్దతు ధర దక్కేలా చర్యలు తీసుకుంది. ధరలు పెరిగిన సందర్భాల్లో షోలాపూర్ మార్కెట్ నుంచి ఉల్లిని కొనుగోలు చేసి సబ్సిడీపై రూ.50కే సరఫరా చేసి వినియోగదారులపై భారం పడకుండా అండగా నిలిచింది. గత ప్రభుత్వ హయాంలో క్వింటాకు రికార్డు స్థాయిలో రూ.13 వేలకు పైగా ధర లభించింది. కిలో రూ.2 నుంచి రూ.4 మించి ధర లేని సమయంలో కిలో రూ.6 నుంచి రూ.10 మధ్య ధర చెల్లించి రైతుల నుంచి కొనుగోలు చేసింది. ఆ లెక్కన టన్నుకు రూ.6 వేల నుంచి రూ.10 వేల దాకా వెచ్చించింది. ఇలా ఐదేళ్లలో రూ.64 కోట్ల విలువైన 9,025 టన్నుల ఉల్లిని కొనుగోలు చేయగా, 2014–19 మధ్య టీడీపీ హయాంలో కేవలం రూ.6.38 కోట్లు వెచ్చించి 4,900 టన్నుల ఉల్లిని మాత్రమే కొన్నారు. -
పోలవరానికి 'చంద్రబాబు కూటమి' ఉరి!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు కూటమి ప్రభుత్వమే ఉరి వేసి.. ఊపిరి తీసేసిందా? ప్రాజెక్టు ఎత్తును 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గిస్తామని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు అంగీకరించిందా? 41.15 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అంచనా వ్యయాన్ని సవరిస్తూ గత ఆగస్టు 28న కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసినప్పుడు.. ఆ సమావేశంలో పాల్గొన్న టీడీపీకి చెందిన కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు అభ్యంతరం చెప్పనిది అందుకేనా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నాయి కేంద్ర, రాష్ట్ర అధికారవర్గాలు! సాధారణంగా కేంద్ర కేబినెట్ తీసుకునే నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి అదే రోజు మీడియాకు వెల్లడిస్తారు. కానీ.. 41.15 మీటర్ల వరకూ పోలవరం పూర్తి చేయడానికి రూ.12,157.53 కోట్లు ఇచ్చేందుకు ఆమోదముద్ర వేస్తూ ఆగస్టు 28న కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని మంత్రి అశ్విని వైష్ణవ్ ఆ రోజు మీడియాకు వెల్లడించలేదు. ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు అంశం బహిర్గతమవుతుందనే పోలవరానికి నిధులు మంజూరు చేసిన అంశాన్ని మంత్రి ఆ రోజు ప్రస్తావించలేదని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే చంద్రబాబు చేసిన చారిత్రక తప్పిదాలతోపాటు ఎత్తు తగ్గించడం వల్ల ప్రాజెక్టు నిర్మాణ లక్ష్యం నీరుగారిపోయిందని నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు.రాష్ట్ర సమగ్రాభివృద్ధికి చుక్కాని..⇒ పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల (150 అడుగులు) గరిష్ట నీటి మట్టంతో.. 194.6 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో.. 322 టీఎంసీలు వినియోగించుకునేలా నిర్మించుకోవడానికి గోదావరి ట్రిబ్యునల్ 1980లో అనుమతి ఇచ్చింది.⇒ అయితే దాదాపు 25 ఏళ్లపాటు ప్రాజెక్టు నిర్మాణంపై ఏ ముఖ్యమంత్రీ కనీసం ఆలోచన చేసిన పాపాన పోలేదు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా 2005లో అన్ని అనుమతులు సాధించి పోలవరం నిర్మాణాన్ని ప్రారంభించారు.⇒ పోలవరం కుడి, ఎడమ కాలువల ద్వారా 7.20 లక్షల ఎకరాలు.. కృష్ణా, గోదావరి డెల్టాల్లో 23.31 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ.. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా 8 లక్షల ఎకరాలు వెరసి 38.51 లక్షల ఎకరాలకు నీళ్లందించవచ్చు. విశాఖ పారిశ్రామిక, తాగునీటి అవసరాల కోసం 23.44 టీఎంసీలను సరఫరా చేయవచ్చు. అంతేకాకుండా 960 మెగావాట్ల జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చు.⇒ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి పోలవరం చుక్కానిలా నిలుస్తుంది. అందుకే ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్ర ముఖచిత్రమే మారిపోతుందని నీటిపారుదల రంగ నిపుణులు స్పష్టం చేస్తూ వస్తున్నారు.జీవనాడి కాదు జీవచ్ఛవమే..!⇒ పోలవరం ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు 35.5 మీటర్ల నుంచి నీటిని సరఫరా చేయవచ్చు. ఎడమ కాలువ పూర్తి సామర్థ్యం 17,580 క్యూసెక్కులు కాగా కుడి కాలువ పూర్తి సామర్థ్యం 17,560 క్యూసెక్కులు.⇒ పోలవరం ప్రాజెక్టును 41.15 మీటర్లకు తగ్గించడం వల్ల జలాశయంలో గరిష్టంగా 115.44 టీఎంసీలు మాత్రమే ఉంటాయి. గోదావరికి గరిష్టంగా వరద వచ్చే రోజుల్లో ఆయకట్టుకు నీటిని సరఫరా చేయగలిగినా.. వరద లేని రోజుల్లో ఆయకట్టుకు నీళ్లందించడం సాధ్యం కాదని అధికారవర్గాలు చెబుతున్నాయి.⇒ కాలువల ద్వారా పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తరలించాలంటే ప్రాజెక్టులో 41.15 మీటర్ల కంటే ఎగువన నీటి మట్టం ఉండాలి. అప్పుడే ఎడమ కాలువ కింద 4 లక్షలు.. కుడి కాలువ కింద 3.20 లక్షల ఎకరాలకు నీళ్లందించడడంతోపాటు కృష్ణా డెల్టాకు 80 టీఎంసీలను మళ్లించడానికి అవకాశం ఉంటుంది.⇒ పోలవరం ఆయకట్టు 7.20 లక్షల ఎకరాలతోపాటు కృష్ణా, గోదావరి డెల్టాల ఆయకట్టు స్థిరీకరణ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, విశాఖకు పారిశ్రామిక, తాగునీటి అవసరాలు తీర్చడం అసాధ్యమని స్పష్టం చేస్తున్నారు. 960 మెగావాట్ల జలవిద్యుత్ కూడా ఉత్పత్తి చేయడం సాధ్యం కాదని తేల్చిచెబుతున్నారు.⇒ ఎత్తు తగ్గించడం వల్ల జీవనాడి పోలవరం ప్రాజెక్టును జీవచ్ఛవంగా మార్చేశారని నీటిపారుదలరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.తగ్గించేందుకు తలూపడం వల్లే..పోలవరం ప్రాజెక్టును కనీస నీటిమట్టం 41.15 మీటర్ల వరకూ పూర్తి చేసేందుకు అంచనా వ్యయాన్ని రూ.30,436.95 కోట్లకు సవరిస్తూ ఆగస్టు 28న కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసిందని.. ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా చేసిన వ్యయం పోనూ మిగతా రూ.12,157.53 కోట్లు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర జల్ శక్తి శాఖ సీనియర్ జాయింట్ కమిషనర్ దీపక్ చంద్ర భట్ లేఖ రాశారు. ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని... ఈ క్రమంలో 2024–25లో ఏ మేరకు నిధులు కావాలో ప్రతిపాదనలు పంపాలని ఆ లేఖలో కోరారు. ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేస్తున్నట్లు ఈ లేఖలో కేంద్రం స్పష్టం చేసినా రాష్ట్ర ప్రభుత్వం నోరుమెదపలేదు. అంటే.. ప్రాజెక్టు ఎత్తును తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందన్నది స్పష్టమవుతోంది. ప్రాజెక్టుకు రూ.2,348 కోట్లను అడ్వాన్సుగా విడుదల చేస్తూ ఈనెల 9న రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలోనూ దీపక్ చంద్ర భట్ అదే అంశాన్ని పునరుద్ఘాటించారు. ప్రాజెక్టును పూర్తి చేయడానికి కేంద్ర కేబినెట్ ఆమోదించిన సవరించిన షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని.. ఆ మేరకు ఎంవోయూ కుదుర్చుకుందని ఆ లేఖలో పేర్కొన్నారు.కేంద్రానికి రూ.23,622 కోట్లకుపైగా మిగులు..కేంద్ర జలసంఘం టీఏసీ ఆమోదించిన ప్రకారం పోలవరం అంచనా వ్యయం 2017–18 ధరల ప్రకారం రూ.55,656.87 కోట్లు. రివైజ్డ్ కాస్ట్ కమిటీ ఖరారు చేసిన దాని ప్రకారం రూ.47,725.74 కోట్లుగా ఉంది. పోలవరానికి ఇప్పటివరకూ కేంద్రం రూ.15,146.28 కోట్లను రీయింబర్స్ చేసింది. 2014 ఏప్రిల్ 1కి ముందు ప్రాజెక్టుకు రూ.4,730.71 కోట్లు ఖర్చు చేశారు. అంటే.. ఇప్పటిదాకా ప్రాజెక్టు కోసం రూ.19,876.99 కోట్లు ఖర్చు చేసినట్లు లెక్క. సీడబ్ల్యూసీ టీఏసీ ఆమోదించిన అంచనా వ్యయం ప్రకారం చూస్తే పోలవరానికి ఇంకా రూ.35,779.88 కోట్లు రావాలి. ప్రస్తుతం రూ.12,157.53 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. అంటే ఇంకా రూ.23,622.35 కోట్లు విభజన చట్టం ప్రకారం కేంద్రం ఇవ్వాలి. ఆ నిధులు ఇస్తేనే 41.15 మీటర్ల కాంటూరు నుంచి 45.72 మీటర్ల వరకూ నీటిని నిల్వ చేయడానికి అవసరమైన ముంపు గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించవచ్చు. భూమిని సేకరించవచ్చు. కానీ.. పోలవరం ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేయడంతో కేంద్రానికి రూ.23,622.35 కోట్లు మిగిలినట్లైంది. -
ఇసుక దందాను అడ్డుకుంటే అంతే..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రాష్ట్రంలో ఇసుక మాఫియా ఆగడాలకు అంతులేకుండా పోతోంది. అడ్డొస్తే ఎంతకైనా తెగిస్తున్నారనడానికి శ్రీకాకుళంలో తాజాగా చోటుచేసుకున్న ఘటనే ఉదాహరణ. నగరం నడిబొడ్డున ఈనెల 16న టీడీపీ నాయకుల దాడిలో ఆమదాలవలస నియోజకవర్గానికి చెందిన సనపల సురేష్ తీవ్రంగా గాయపడ్డారు. దాడి చేసిన వారిని అరెస్టు చేయలేదుగానీ సురేష్‌ను మాత్రం అరెస్టు మీద అరెస్టు చేస్తున్నారు. దాడికి తెగబడడమే కాక.. టీడీపీ అతనిపై ఎదురు కేసు పెట్టి శనివారం అరెస్టు చేయించింది. అలాగే, వారం రోజుల క్రితం ఓ పాత కేసులోనూ అరెస్టుచేశారు. దీంతో ఆ పార్టీ నేతల వేధింపులు భరించలేక సురేష్ టీడీపీ సభ్యత్వం తీసుకున్నా పచ్చమూకలు వదిలిపెట్టలేదు. పైగా.. ఇసుక దోపిడీకి అడ్డుతగిలితే ఎవరికైనా ఇదేగతి అని ఆ పార్టీ సంకేతాలిచ్చింది. అసలేం జరిగిందంటే.. జిల్లాలోని ఆమదాలవలస మండలం దూసి గ్రామం ఎస్సీ కాలనీ సమీపంలోని నాగావళి నదిలో ఇసుక అక్రమార్కులు ఇసుక తవ్వి బావాజీపేట రబ్బర్ తయారీ ఇండస్ట్రియల్ యార్డులో నిల్వచేసి ఉంచారు. ఇది చూసి బూర్జ మండలం గుత్తావెల్లికి చెందిన సనపల సురేష్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆమదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవి అనుచరుడైన తొగరాం వాసి రవికాంత్ నేతృత్వంలోనే ఈ తంతు జరుగుతున్నట్లు శ్రీకాకుళం తహసీల్దారు గణపతి కూడా తేల్చారు. ఈ నేపథ్యంలో.. ఈనెల 16న ఇసుక నిల్వలను మీడియాకు చూపించడానికి సురేష్ వెళ్తుండగా ఆయనపై కొందరు దాడికి యత్నించారు. అక్కడి నుంచి సురేష్ తప్పించుకుని వస్తుంటే.. శ్రీకాకుళంలోని బలగ మెట్టు కూడలి వద్ద మళ్లీ అటకాయించి ఆయనను కారు నుంచి బయటకు లాగి మరీ దాడిచేశారు. సురేష్‌తో పాటు వచ్చిన చంద్రరావు అనే వ్యక్తిపైనా దాడిచేశారు. అంతకుముందు.. సెప్టెంబరు 27న కూడా కాఖండ్యాం ఇసుక ర్యాంపులో అక్రమాలను అడ్డుకున్నారని నారాయణపురం వద్ద సురేష్ కారును అడ్డగించి దాడిచేశారు. డీఎస్పీ వద్ద విచారణకని పిలిచి అరెస్టు..ఇసుక మాఫియాకు కొరకరాని కొయ్యగా తయారైన సురేష్‌ను శ్రీకాకుళంలో తనపై దాడి ఘటనకు సంబంధించి విచారణకని పోలీసులు పిలిచారు. టూటౌన్ పోలీసుస్టేషన్‌కు సురేష్ వచ్చారు. విచారణ పూర్తయ్యాక స్టేషన్ నుంచి బయటికి రాగానే రూరల్ పోలీసులొచ్చి అరెస్టుచేశారు. ఈనెల 16న జరిగిన ఘటనలో కారుతో గుద్దేసి ఇద్దరి ప్రమాదానికి కారణమయ్యాడనే కేసు కింద అరెస్టుచేసినట్లు ఎస్ఐ కె. రాము తెలిపారు.కక్షపూరితంగా అరెస్టు చేశారు..పోలీసులు నా భర్తను కక్షపూరితంగా అరెస్టుచేశారు. విచారణకని పిలిచి అరెస్టుచేశారు. ఈనెల 25వ తేదీ సాయంత్రం రెండో పట్టణ పోలీసులు ఫోన్ చేశారు. 26న డీఎస్పీ విచారణ ఉందని రమ్మన్నారు. దీంతో శనివారం మధ్యాహ్నం 12.30కు రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు సురేష్‌తో కలిసి వెళ్లాం. అక్కడ స్టేట్మెంట్ రాసుకుంటామని చెప్పి సాకు‡్ష్యలు ఎవరైనా ఉన్నారా అని అడిగారు. అక్కడే వందలాది మంది చూశారని చెప్పాం. సరే.. మీరు వెళ్లిపోండని సీఐ అనగానే బయటకు వచ్చేశాం. ఇంతలో రూరల్ ఎస్ఐ కె. రాము తమ సిబ్బందితో కలిసి నా భర్తను జీపులో ఎక్కించుకుని తీసుకుపోయారు. – మౌనిక , సనపల సురేష్ భార్య కక్షపూరితంగానే అరెస్టు.. పోలీసులు నా భర్తను కక్షపూరితంగా అరెస్టు చేశారు. విచారణకని పిలిచి అరెస్టుచేశారు. ఈనెల 25వ తేదీ సాయంత్రం రెండో పట్టణ పోలీసులు ఫోన్ చేశారు. 26న డీఎస్పీ విచారణ ఉందని రమ్మన్నారు. దీంతో శనివారం మ«ధ్యాహ్నం 12.30కు రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు సురేష్‌తో కలిసి వెళ్లాం. అక్కడ స్టేట్మెంట్ రాసుకుంటామని చెప్పి సాక్షులు ఎవరైనా ఉన్నారా అని అడిగారు. అక్కడే వందలాది మంది చూశారని చెప్పాం. సరే.. మీరు వెళ్లిపోండని సీఐ అనగానే బయటకు వచ్చేశాం. ఇంతలో రూరల్ ఎస్ఐ కె. రాము తమ సిబ్బందితో కలిసి నా భర్తను జీపులో ఎక్కించుకుని తీసుకుపోయారు. – మౌనిక, సనపల సురేష్ భార్య -
కేసులు నీరుగార్చే కుట్ర
ఈ కేసులకు సంబంధించి సీఎం చంద్రబాబు ఎదుట ప్రదర్శించేందుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎలా రూపొందించాలో దర్యాప్తు అధికారులకు కొందరు సీనియర్ ఉన్నతాధికారులు నిర్దేశించారు. ప్రధాన నిందితుడికి తనపై ఉన్న కేసులకు సంబంధించిన దర్యాప్తు వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించడం దేశంలో ఇదే తొలిసారి. ఆ కేసులను ఎప్పటిలోగా నీరుగార్చాలో దర్యాప్తు అధికారులకు గడువు కూడా విధించారు.ఇప్పటికే స్కిల్ స్కామ్‌లో దర్యాప్తును ముమ్మరం చేసిన ఈడీ.. చంద్రబాబుతోపాటు ఆయన మంత్రివర్గ సహచరుల పాత్రపై దర్యాప్తు మొదలు పెట్టాల్సి ఉంది. ఈ కీలక తరుణంలో ఈ కేసులకు సంబంధించిన కీలక రికార్డులు చంద్రబాబుతోపాటు ఇతర నిందితులకు అందుబాటులో ఉన్నాయి. దాంతో రికార్డులను తారుమారు చేసే అవకాశం ఉంది. – ఆధారాలు, న్యాయపరమైన అంశాలతో డీజీపీకి పొన్నవోలు లేఖ ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు ప్రస్తుత ప్రభుత్వంలో నలుగురు మంత్రులు పలు కేసుల్లో నిందితులుగా ఉన్నారు. వారిపై అవినీతి నిరోధక చట్టం కింద దర్యాప్తునకు అనుమతించాలని గవర్నర్‌ను కోరే ప్రతిపాదన పెండింగ్‌లో ఉంది. ఆ ప్రతిపాదనను మంత్రివర్గం అజెండాలో చేర్చే సాహసం అధికారులు చేయగలరా? అలాంటప్పుడు వారి అవినీతిపై దర్యాప్తు ఎలా ముందుకు సాగుతుంది?– ఆధారాలు, న్యాయపరమైన అంశాలతో డీజీపీకి పొన్నవోలు లేఖసాక్షి, అమరావతి: ‘ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉన్న అవినీతి కేసులను నీరుగార్చేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. 2014–19 మధ్య టీడీపీ హయాంలో యథేచ్ఛగా సాగించిన కుంభకోణాలపై నమోదైన ఏడు కేసుల నుంచి ఆయన పేరు తొలగించేందుకు ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నారు..’ అని మాజీ అదనపు అడ్వకేట్ జనరల్, సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి... డీజీపీ సీహెచ్.ద్వారకా తిరుమలరావు దృష్టికి తెచ్చారు. ‘ప్రభుత్వ ఒత్తిడితో ప్రస్తుత పోలీస్, సీఐడీ ఉన్నతాధికారులు ఆ కేసుల విచారణలో న్యాయస్థానానికి సహాయ నిరాకరణ చేస్తున్నారు. చార్జ్షీట్లను న్యాయస్థానానికి పునఃసమర్పించకుండా ఉద్దేశపూర్వకంగా తొక్కిపెడుతున్నారు. తద్వారా కేసుల దర్యాప్తు సాగకుండా అడ్డుకుంటున్నారు’ అని వెల్లడించారు. ‘చంద్రబాబుపై అవినీతి కేసులకు సంబంధించి దర్యాప్తు అధికారులను వేధిస్తున్నారు. అప్పటి సీఐడీ అదనపు డీజీ సంజయ్, సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇన్చార్జ్ కె.రఘురామ్‌రెడ్డిని హఠాత్తుగా బదిలీ చేసి ఎక్కడా పోస్టింగులు ఇవ్వకుండా జీతాలు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు’ అని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు, పలువురు మంత్రులు నిందితులుగా ఉన్న ఈ కేసుల విచారణను సీబీఐకి అప్పగించాలని అభ్యర్థిస్తూ ఓ సామాజిక కార్యకర్త హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయాన్ని కూడా పొన్నవోలు తన లేఖలో ప్రస్తావించారు. ఈ మేరకు డీజీపీకి ఆయన లేఖ రాశారు. కేసుల దర్యాప్తులో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ న్యాయస్థానానికి పూర్తిగా సహకరించాలని... దర్యాప్తు అధికారులకు రక్షణగా నిలవాలని అందులో డీజీపీని కోరారు. పూర్తి ఆధారాలతో, న్యాయపరమైన అంశాలను ఉటంకిస్తూ డీజీపీకి రాసిన లేఖలో ప్రధానాంశాలు ఇవీ..చంద్రబాబు పేరు తొలగించే కుట్ర.. ఉన్నతాధికారులకు బెదిరింపులురాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కేసు సహా దర్యాప్తులో ఉన్న ఏడు కేసుల్లో నిందితుల జాబితా నుంచి ప్రధాన నిందితుడు చంద్రబాబు పేరు తొలగించాలని టీడీపీ కూటమి ప్రభుత్వం కుట్ర పన్నింది. అందుకోసం సీఐడీ, పోలీసు ఉన్నతాధికారులను తీవ్రంగా ఒత్తిడి చేస్తోంది. ఆ కేసుల తుది దర్యాప్తు నివేదికను న్యాయస్థానానికి సమర్పించే ముందు నిందితుల జాబితా నుంచి చంద్రబాబు పేరు తొలగించాల్సిందేనని దర్యాప్తు అధికారులను ఒత్తిడి చేస్తూ బెదిరిస్తోంది. దర్యాప్తు నివేదికలను తారుమారు చేయాల్సిందేనని అధికారులను వేధిస్తున్నారు. తద్వారా ప్రధాన నిందితుడైన చంద్రబాబును ఈ కేసుల నుంచి సులువుగా బయటపడేయవచ్చన్నది అసలు ఉద్దేశం. సాక్షులుగా న్యాయస్థానం ఎదుట 164 సీఆర్పీసీ కింద వాంగ్మూలం ఇచ్చిన అధికారులపై ఈ కేసులను నెట్టేయాలని కుట్ర పన్నింది.చార్జిషీట్లను తొక్కిపెట్టారుచంద్రబాబుపై ఉన్న కేసులను నీరుగార్చేందుకు ప్రభుత్వం మరో కుట్రకు పాల్పడింది. స్కిల్ స్కామ్, ఇన్నర్ రింగ్‌రోడ్ అలైన్మెంట్, ఫైబర్ నెట్, అసైన్డ్ భూముల కుంభకోణం కేసులకు సంబంధించిన చార్జిషీట్లను సీఐడీ గతంలోనే న్యాయస్థానానికి సమర్పించింది. దీనిపై కొంత వివరణ కోరుతూ న్యాయస్థానం వాటిని ఈ ఏడాది ఏప్రిల్–జూన్ మధ్య సీఐడీకి పంపింది. అప్పటి పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఆ అంశాలకు సంబంధించి కేస్ స్టడీలతో వివరాలను సీఐడీ అధికారులకు నివేదించారు. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తరువాత ఆ కేసులను నీరుగార్చేలా సీఐడీపై ఒత్తిడి చేస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే. ఆ చార్జ్షీట్లను ఈ రోజు వరకూ న్యాయస్థానానికి సమర్పించలేదు. ఆ కేసుల దర్యాప్తును పూర్తి చేసేందుకు ఎలాంటి ప్రయత్నం కూడా చేయడం లేదు. టీడీపీ ప్రధాన కార్యాలయానికి నిధులుఏడు కుంభకోణాల ద్వారా కొల్లగొట్టిన నిధులు అక్రమ మార్గంలో టీడీపీ ప్రధాన కార్యాలయానికి చెందిన బ్యాంకు ఖాతాలకు చేరాయని సీఐడీ అధికారులు ఇప్పటికే ఆధారాలతో సహా గుర్తించారు. కానీ ఆ కేసుల దర్యాప్తునకు టీడీపీ ప్రధాన కార్యాలయం సహకరించడం లేదని సీఐడీ న్యాయస్థానం దృష్టికి తెచ్చింది. అంటే ఈ కేసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతోందన్నది సుస్పష్టం. ప్రస్తుతం చంద్రబాబు సీఎంగా ఉండటంతో ఆ కేసుల దర్యాప్తు ముందుకు సాగకుండా అడ్డుకుంటున్నారు. దర్యాప్తు అధికారులను వేధిస్తున్నారుఆ ఏడు కేసుల దర్యాప్తు వేర్వేరు దశల్లో ఉంది. ఆ కేసులను దర్యాప్తు చేస్తున్న సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కార్యాలయాన్ని 2024 జూన్ నుంచి ఆగస్టు 14 వరకు మూసివేశారు. డీజీపీ ఆదేశాలతో సిట్ అధికారులు ఆ కార్యాలయానికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఆ కేసులను దర్యాప్తు చేస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారులు అదనపు డీజీ (సీఐడీ) ఎన్.సంజయ్, సిట్ ఇన్చార్జ్గా ఉన్న ఐజీ కె.రఘురామ్‌రెడ్డిని హఠాత్తుగా బదిలీ చేశారు. వారికి ఎక్కడా పోస్టింగులు ఇవ్వకుండా, జీతాలు చెల్లించకుండా ప్రభుత్వం వేధిస్తోంది. నిందితులుగా చంద్రబాబు, మంత్రులు.. అందుకే కేసులు నీరుగార్చే కుట్రఈ ఏడు కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న చంద్రబాబు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు. సాధారణ పరిపాలన శాఖ, శాంతి–భద్రతల శాఖలను స్వయంగా నిర్వహిస్తున్న ఆయన ఈ కేసుల దర్యాప్తును నియంత్రిస్తున్నారు. ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల పనితీరుపై వార్షిక నివేదికలను ఆమోదించే స్థానంలో ఆయనే ఉన్నారు. దాంతో నాలుగు చార్జ్షీట్లపై న్యాయస్థానం కోరిన వివరణలను ఐపీఎస్ అధికారులు సమర్పించలేకపోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబే కాకుండా ఇతర నిందితులు కూడా ఈ కేసుల సాక్షులను ప్రభావితం చేసే కీలక స్థానాల్లో ఉన్నారు. ఈ కేసుల్లో ఫిర్యాదుదారులు, సాక్షులపై వేధింపులు కొనసాగుతున్నాయి. చంద్రబాబు, మరో నలుగురు మంత్రులు ఈ ఏడు కేసుల్లో నిందితులుగా ఉన్నారు. అందుకే అవినీతి నిరోధక చట్టం కింద దర్యాప్తునకు గవర్నర్ అనుమతి కోరడం లేదు. కక్ష సాధింపు చర్యలకు తార్కాణం.. ఫిర్యాదు చేశారనే మధుసూదన్‌రెడ్డిపై వేధింపులు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంత కక్షపూరితంగా అధికారులను వేధిస్తున్నారో చెప్పేందుకు ఐఆర్ఏఎస్ అధికారి ఎం. మధుసూదన్‌రెడ్డి ఉదంతమే తార్కాణం. టీడీపీ హయాంలో చోటు చేసుకున్న ఫైబర్‌నెట్ కుంభకోణంపై సంస్థ ఎండీ హోదాలో ఆయన సీఐడీకి ఫిర్యాదు చేశారు. చంద్రబాబు ప్రధాన నిందితుడిగా సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఆ పిటిషన్ పెండింగ్‌లో ఉంది. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు దీన్ని దృష్టిలో పెట్టుకుని కక్షపూరితంగా ఎం.మధుసూదన్‌రెడ్డిని సస్పెండ్ చేయించారు. డిప్యుటేషన్ పూర్తయి ఆయన తన మాతృశాఖకు వెళ్లడానికి మూడు రోజుల ముందు సస్పెండ్ చేయడం గమనార్హం. దీనిపై ఆయన పరిపాలన ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా సస్పెన్షన్‌పై స్టే విధించింది. ఈ కేసుల దర్యాప్తు అధికారులకు ప్రస్తుత ప్రభుత్వం పోస్టింగులు ఇవ్వకుండా, జీతాలు చెల్లించకుండా వేధిస్తోంది. గవర్నర్ అనుమతి ప్రక్రియకు మోకాలడ్డుఈ కేసులో నిందితులపై అవినీతి నిరోధక చట్టం కింద విచారణకు గవర్నర్ అనుమతి కోరే ప్రక్రియను గతంలో డీజీపీ, సీఐడీ అదనపు డీజీ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి చేపట్టారు. కానీ ఈ కేసుల్లో నిందితులుగా ఉన్న చంద్రబాబు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉండగా మరో నలుగురు మంత్రులుగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గవర్నర్ అనుమతి కోరే ప్రక్రియను ప్రస్తుత సీఐడీ అదనపు డీజీ, డీజీపీ కొనసాగిస్తారనే నమ్మకం లేదు. గవర్నర్ అనుమతి కోరే ప్రతిపాదనను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మంత్రివర్గం ముందు ఉంచాలి. కానీ ముఖ్యమంత్రి నియంత్రణలో విధులు నిర్వర్తించే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆ ప్రతిపాదనను మంత్రివర్గం పరిశీలనకు తెస్తారనే నమ్మకం లేదు. మళ్లీ అదే పదవుల్లో నిందితులు.. కీలక రికార్డుల తారుమారుకు అవకాశంగతంలో టీడీపీ ప్రభుత్వంలో సీఆర్డీఏ చైర్మన్‌గా ఉన్న చంద్రబాబు, వైస్ చైర్మన్ పి.నారాయణ అసైన్డ్ భూములు, ఇన్నర్‌రింగ్ రోడ్డు కుంభకోణాలకు పాల్పడ్డారు. ప్రస్తుతం వారిద్దరూ మళ్లీ అదే పదవుల్లో ఉన్నారు. ఆ కేసుల్లో న్యాయస్థానం ఎదుట సీఆర్పీసీ 164 కింద సాక్ష్యం ఇచ్చిన అధికారులు ప్రస్తుతం చంద్రబాబు, నారాయణ నియంత్రణలో ఉన్నారు. ఈ కేసుల్లో మరికొందరు సాక్షులను విచారించాల్సి ఉంది. మరోవైపు ఈ కేసులకు సంబంధించిన ఎఫ్ఐఆర్, చార్జ్షీట్లు, రిమాండ్ రిపోర్టులు, కొల్లగొట్టిన భూములకు సంబంధించిన కీలక రికార్డులన్నీ చంద్రబాబు, నారాయణకు అందుబాటులో ఉన్నాయి. దీంతో ఈ కేసుల్లో సాక్షులను బెదిరించేందుకు, రికార్డులను తారుమారు చేసేందుకు వారిద్దరికీ పూర్తి అవకాశం ఉంది. ఈడీ దర్యాప్తు భయంతో..మనీ లాండరింగ్‌కు కూడా పాల్పడిన ఈ కేసుల వివరాలను కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి గతంలోనే సీఐడీ నివేదించింది. స్కిల్ స్కామ్ కేసులో సీఐడీ ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఈడీ ఇప్పటివరకు పరిమిత స్థాయిలో దర్యాప్తు నిర్వహించింది. స్కిల్ స్కామ్ కేసులో షెల్ కంపెనీ డిజైన్‌టెక్‌కు చెందిన ఆస్తులను జప్తు చేయడంతోపాటు నలుగురు నిందితులను అరెస్ట్ కూడా చేసింది. స్కిల్ స్కామ్ కేసులో సీఐడీ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను ఈడీకి సమర్పించింది. ఆ కేసులో ప్రధాన నిందితుడు చంద్రబాబు బ్యాంకు ఖాతాల్లో భారీగా నిధులు డిపాజిట్ అయినట్లు సీఐడీ గుర్తించింది. పెద్ద నోట్ల రద్దు సమయంలో కొందరు బ్యాంకు అధికారులు నిబంధనలకు విరుద్ధంగా కేవైసీ వివరాలు తీసుకోకుండానే నోట్ల మార్పిడి చేసినట్లు కూడా ఆధారాలు సేకరించింది. ఆ వివరాలతో పాటు స్కిల్ స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణం, ఫైబర్ నెట్ కుంభకోణం, అసైన్డ్ భూముల కుంభకోణం కేసులకు సంబంధించి న్యాయస్థానంలో సమర్పించిన చార్జ్షీట్లను ఈడీకి ఇప్పటికే సీఐడీ సమర్పించింది. వాటి ఆధారంగా చంద్రబాబుతోపాటు ఇతర ప్రధాన నిందితులపై ఈడీ ఇంకా దర్యాప్తు మొదలు పెట్టాల్సి ఉంది. దీంతో ఈ కేసులను నీరుగార్చేందుకు ప్రభుత్వం సీఐడీపై ఒత్తిడి తెస్తోంది. దర్యాప్తు అధికారులకు రక్షణగా ఉండండి.. నిష్పక్షపాత విచారణకు సహకరించండిఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో సీఎం చంద్రబాబుతోపాటు మరో నలుగురు మంత్రులు నిందితులుగా ఉన్న ఆ ఏడు కేసుల దర్యాప్తు సమగ్రంగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత డీజీపీపై ఉంది. ఆ కేసుల్లో దర్యాప్తు అధికారులపై ఎలాంటి వేధింపులకు పాల్పడకుండా, బలవంతపు చర్యలు తీసుకోకుండా వారికి డీజీపీ రక్షణ కవచంలా నిలవాలి. తమ అధికారిక హోదాను దుర్వినియోగం చేస్తూ నిందితులకు కొమ్ముకాయడం అంటే నేరానికి పాల్పడినట్టేనని వేరే గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో ఈ కేసులకు సంబంధించి వాస్తవాలను న్యాయస్థానానికి సమర్పించాల్సిన బాధ్యత డీజీపీపై ఉంది. కేసుల విచారణలో న్యాయస్థానానికి డీజీపీ పూర్తిగా సహకరించాలి.బాబు బరితెగింపు బెయిల్ నిబంధనల ఉల్లంఘన స్కిల్ స్కామ్‌తోసహా తనపై ఉన్న అవినీతి కేసుల దర్యాప్తును ప్రభావితం చేస్తున్న సీఎం చంద్రబాబు న్యాయస్థానం ఆదేశాలను నిర్భీతిగా ఉల్లంఘిస్తున్నారు. స్కిల్‌స్కామ్ కేసులో ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టమైన షరతులు విధించింది. ఈ కేసుకు సంబంధించిన అంశాలను మీడియా ఎదుటగానీ మరెక్కడాగానీ మాట్లాడకూడదని స్పష్టం చేసింది. అనంతరం పూర్తిస్థాయి బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు కూడా షరతులు విధించింది. అయితే చంద్రబాబు తాను న్యాయస్థానాలకు అతీతమన్నట్టు వ్యవహరిస్తూ కేసు దర్యాప్తును ప్రభావితం చేసే రీతిలో వ్యవహరిస్తుండటం విస్మయపరుస్తోంది. తాజాగా ‘ఆహా’లో నందమూరి బాలకృష్ణ నిర్వహిస్తున్న ‘అన్ స్టాపబుల్’ షోలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ప్రోమోను మంగళవారం విడుదల చేశారు. అందులో స్కిల్ స్కామ్ కేసు గురించి చంద్రబాబు పలు అంశాలను ప్రస్తావించడం గమనార్హం. తనను అకారణంగా అరెస్ట్ చేశారని.. తాను ఏ తప్పూ చేయలేదని వ్యాఖ్యలు చేశారు. కేసు ఇంకా విచారణలో ఉండగానే తనకు తానే తీర్పు ఇచ్చేశారు! తద్వారా స్కిల్ స్కామ్ కేసు గురించి మాట్లాడవద్దన్న న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరించారు. అంతేకాదు.. తాను ఎవరినీ విడిచిపెట్టబోనంటూ దర్యాప్తు అధికారులను బెదిరించే రీతిలో చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.కేసుల్లో నిందితుల వివరాలు⇒ నారా చంద్రబాబు (ముఖ్యమంత్రి): ఏడు కేసుల్లో నిందితుడు⇒ పొంగూరు నారాయణ (మున్సిపల్ శాఖ మంత్రి): ఇన్నర్‌రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణం, అసైన్డ్ భూముల కుంభకోణం కేసుల్లో నిందితుడు⇒ నారా లోకేశ్ (విద్యా శాఖ మంత్రి): ఇన్నర్‌రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణం కేసులో నిందితుడు⇒ కె.అచ్చెన్నాయుడు (వ్యవసాయ శాఖ మంత్రి): స్కిల్ స్కామ్ కేసులో నిందితుడు⇒ కొల్లు రవీంద్ర (ఎక్సైజ్, గనుల శాఖ మంత్రి): మద్యం కుంభకోణం కేసులో నిందితుడు -
మా మకుటం... సత్యమేవ జయతే!
మీరు గుడ్లురిమితే గుండెలు జారిపోవడానికి ఇక్కడ భీరువులెవరూ లేరు. మీరంతటి వీర వరేణ్యులు కూడా కారు! మీరు కళ్లెర్రజేస్తే కాలి బూడిదయ్యే కొంగలేమీ ఇక్కడ లేవు. తమరు తపోధనులైన కౌశికులు ఎంతమాత్రం కారు. మీ అధికారం సర్వంసహాధికారం కాదు. మీరు థామస్ హాబ్స్ ప్రతిపాదించిన ‘లెవయధాన్’ వంటివారు కారు. భారత రాజ్యాంగం ప్రసాదించిన పరిమితులతో కూడిన అధికారం మాత్రమే మీ చేతిలో ఉన్నది. అదే రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులు మాకు అండగా ఉన్నవి. ఆ హక్కుల్ని రక్షించడానికి న్యాయస్థానాలు దన్నుగా ఉన్నవి.రెండు వారాల కిందనే సర్వోన్నత న్యాయస్థానం ఏం చెప్పిందో ఒకసారి గమనించండి. అచ్చం మీ సర్కారుకు మల్లేనే యూపీలోని యోగీబాబా సర్కార్ కూడా ఓ జర్నలిస్టుపై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించింది. కేసు సుప్రీంకోర్టు తలుపు తట్టింది. జస్టిస్ హృషీకేశ్ రాయ్, జస్టిస్ ఎస్విఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం చేసిన వ్యాఖ్యానమేమిటో మళ్లీ ఒకసారి పరిశీలించండి. ‘‘ప్రజల భావ ప్రకటనా స్వాతంత్య్రాన్ని ప్రజాస్వామ్య దేశాలు గౌరవించాలి. భారత రాజ్యాంగంలోని 19 (1) (ఏ) అధికరణం పాత్రికేయుల హక్కులకు రక్షణ కల్పి స్తున్నది. పాత్రికేయుడు రాసిన వార్తా కథనం విమర్శనాత్మకంగా ఉన్నదనే నెపంతో అతడిపై క్రిమినల్ కేసులు పెట్టడానికి వీల్లేదు.’’సర్వోన్నత న్యాయస్థానం ఇంత స్పష్టంగా తేటతెల్లం చేసిన అంశంపై ఏపీ ప్రభుత్వ యంత్రాంగం కళ్లు మూసుకొని వ్యవహరిస్తున్నది. విజయవాడలో వరద సహాయక చర్యల్లో జరిగిన అవకతవకలను ‘సాక్షి’ పత్రిక ఎత్తిచూపింది. బాధ్యత గల ఫోర్త్ ఎస్టేట్‌గా అది దాని విద్యుక్త ధర్మం. ‘ముంపులోనూ మేసేశారు’ అనే శీర్షికతో ఏలినవారి ఆగ్రహానికి గురైన కథనాన్ని ప్రచురించాము. దానికి కట్టుబడి ఉన్నాము. మీ ప్రభుత్వ అధి కార నివేదికల ఆధారంగానే మేమా కథనాన్ని రాశాము. మేము స్వయంగా వండి వార్చిన కథనం కాదు. వరద సహాయ కార్య క్రమాల సమీక్ష పేరుతో ముఖ్యమంత్రి నిర్వహించిన సమావేశం సందర్భంగా రెవెన్యూ శాఖ ఇచ్చిన ప్రెజెంటేషన్‌లో పేర్కొన్న విషయాల్నే ‘సాక్షి’ ఉటంకించింది.కోటిమంది భోజనాల కోసం 368 కోట్లు ఖర్చు చేశామనీ, అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులు వగైరాలకు 23 కోట్లు ఖర్చయ్యాయనీ, వాటర్ బాటిల్స్‌కు 26 కోట్లు వెచ్చించామనీ, మొత్తం 534 కోట్లు పునరావాస సహాయ శిబిరం కోసం ఖర్చయినట్టు ఆ ప్రెజెంటేషన్‌లో ఉన్నది. ఈ లెక్కల్లోని అనౌచిత్యాన్ని ప్రజలు ప్రశ్నించారు. ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. సీపీఎం నేత బాబూ రావు ప్రజల సమక్షంలోనే ప్రభుత్వాన్ని నిలదీసిన వీడియో విస్తృతంగా సర్క్యులేషన్లో ఉన్నది. సరిగ్గా ఆ గణాంకాలనే పేర్కొంటూ, అవే ప్రశ్నల్ని ‘సాక్షి’ కూడా వేసింది.రెవెన్యూ శాఖ అధికారులు ప్రజంటేషన్ ఇచ్చినప్పుడు ఇవే అంకెల్ని చూసిన పెద్దలకు కోపం రాలేదు. జనంలో చర్చ జరుగు తున్నప్పుడు కూడా అంత కోపం రాలేదు. కానీ, ‘సాక్షి’లో కథనం రాగానే సుర్రున ప్రకోపించింది. ఆ కథనాన్ని ఖండ ఖండాలుగా ఖండించే బాధ్యతను ఇద్దరు మంత్రులకు అప్పగించారు. ఆ కార్యనిర్వహణ వారి వశం కాలేదు. వెంటనే కూటమిలోని ఒకటో నెంబరు పత్రిక రంగంలోకి దిగింది. అబ్బెబ్బే... సహాయ పునరావాస కార్యక్రమాలకు 139 కోట్లు మాత్రమే ఖర్చయింది. 534 కోట్లు అనే మాట అబద్ధమని ఆ పత్రిక తేల్చేసింది. అదే నిజమైతే కేంద్ర పరిశీలక బృందానికి రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన నివేదికలో రిలీఫ్ క్యాంప్ ఖర్చు పేరుతో 534 కోట్లు ఎందుకు చూపెట్టారు? సదరు పత్రిక ఈ నివేదికను చూడలేదా? ప్రజల కళ్లకు గంతలు కట్టడ మనేది వారికి పెన్నుతో పెట్టిన విద్యగా చాలాసార్లు నిరూపణ అయింది.ఏ కొద్దిమందికో పులిహోర పొట్లాలు పంచి, కోటిమందికి పైగా పంచినట్టు లెక్క చూపడమేమిటి? ఆ పులిహోరకు ఒక్కో ప్లేటుకు 370 రూపాయల ఖర్చేమిటి? ఇటువంటి దగుల్బాజీ లెక్కలు చూసిన జనంలో ప్రభుత్వ ప్రతిష్ఠ బాగా పలుచబారింది. ఈ ప్రభుత్వ వ్యతిరేక వరదను ప్రతిపక్షంపైకి మళ్లించాలనే ఉద్దేశంతోనే తిరుపతి లడ్డూ వివా దాన్ని ముఖ్యమంత్రి తెరపైకి తెచ్చారనే అభిప్రాయం రాజకీయ పరిశీలకుల్లో అప్పుడే పొడసూపింది. కానీ, ఈ డైవర్షన్ స్కీమ్ ఫలితమివ్వకపోగా సర్కారుపైకే ఎదురు తిరిగింది.ఐదేళ్లు పరిపాలించడం కోసం గద్దెనెక్కిన ప్రభుత్వం ఐదు మాసాలు కూడా నిండకముందే ఒక ‘విఫల ప్రభుత్వం’గా ముద్ర వేయించుకోవడం ఒక అరుదైన సందర్భం. ఇటువంటి అప్రతిష్ఠను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూటగట్టుకున్నది. ఏ గడ్డి కరిచైనా అధికారంలోకి రావాలనే సంకల్పంతోనే ఎన్డీఏ కూటమి అలవికాని హామీలను ఇచ్చిందనే అభిప్రాయం ఆ రోజుల్లోనే రాజకీయ వర్గాల్లో వ్యక్తమైంది. అందువల్లనే మేనిఫెస్టో విడుదల రోజున బీజేపీ ప్రతినిధి దాని ప్రతిని పట్టుకోవడానికి నిరాకరించారనే వార్తలు వచ్చాయి. అటువంటి అంచనాలకు తగి నట్టుగానే ఈ నాలుగు నెలల పైచిలుకు కాలాన్ని కూటమి సర్కార్ నెట్టుకొచ్చింది.మేనిఫెస్టోలో హైలైట్‌గా వారు చెప్పుకున్న ‘సూపర్ సిక్స్’లో ఒక్క పథకం జోలికి ప్రభుత్వం వెళ్లలేకపోయింది. ఖజానాపై పెద్దగా భారం పడని ఉచిత గ్యాస్ సిలిండర్ల (ఏడాదికి మూడు) పంపిణీని ఈ దీపావళి నుంచి ప్రారంభించబోతున్నట్టు ప్రకటించారు. మిగిలిన ఐదు పథకాల అమలు సంగతి దేవుడెరుగు. ఫలానా రోజు నుంచి వాటిని ప్రారంభిస్తామనే ఒక కనీస షెడ్యూల్‌ను కూడా ప్రభుత్వం విడుదల చేయలేకపోయింది.బుడమేరు వరదల సందర్భంగా ప్రభుత్వ నిష్క్రియా పరత్వం కొట్టొచ్చినట్టు కనబడింది. ముందుచూపు లేకపోవడం, వ్యూహరాహిత్యం వల్ల నలభై నిండు ప్రాణాలను బలి పెట్టవలసి వచ్చింది. మూడు లక్షలమంది తమ సర్వస్వాన్ని కోల్పోయారు. తమ యావజ్జీవిత ఆర్జితాన్ని గంగపాలు చేసు కోవలసి వచ్చింది. వారి జీవిత చక్రాన్ని వెనక్కు తిప్పడం సాధ్యమయ్యే పనేనా? ముందుగా హెచ్చరికలు జారీ చేసి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, వారి విలువైన సామగ్రిని భద్రపరచుకునేందుకు దోహదపడి వుంటే ఇంత దుఃస్థితి ఏర్పడేది కాదు. అందుకే దీన్ని ‘విఫల ప్రభుత్వం’అంటున్నారు. రెగ్యులర్ బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టలేక ఇంత కాలం నెట్టుకొచ్చిన ఏకైక ప్రభుత్వం కూడా ఈ దేశంలో ఏపీ కూటమి ప్రభుత్వమే! నాలుగున్నర నెలల కాలంలో 32 వేల కోట్లు అప్పు తెచ్చినందుకు, ప్రపంచ బ్యాంకు వాళ్లు నేడో రేపో విడుదల చేస్తారని చకోర పక్షుల్లా 15 వేల కోట్ల అప్పు కోసం ఎదురు చూస్తున్నందుకు ‘అప్పుల సర్కార్’ అని కూడా అనవచ్చు. ఇసుక రీచుల్లో, మద్యం షాపుల వేలాల్లో, ఉద్యోగుల బదిలీల్లో లంచాల దుర్గంధాన్ని వెదజల్లుతున్నందుకు ‘అవినీతి సర్కా ర్’గా పరిగణించాలి. తమ సంఖ్యా బలంపై ఆధారపడిన ప్రభుత్వమే కేంద్రంలో ఉన్నా, ఆ సర్కార్‌లో తమకూ భాగ మున్నా సొంత రాష్ట్రానికి కించిత్ మేలును కూడా చేసుకోలేక పోయినందుకు ‘అసమర్థ ప్రభుత్వం’గా భావించాలి.సాధారణంగా కొత్త ప్రభుత్వాలపై ఇంత త్వరగా జనంలో వ్యతిరేకత వ్యక్తం కాదు. ఏపీ పరిణామం మాత్రం అసాధా రణమైనదే. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత బహిరంగంగా కనిపి స్తున్నది. కొత్త సర్కార్ తన హామీలు అమలు చేయకపోగా, జగన్ సర్కార్ అందిస్తున్న పథకాలను చేజార్చుకొని మోస పోయామన్న ఆవేదన ప్రజల్లో కనిపిస్తున్నది. హామీలు, స్కీముల సంగతి పక్కనబెట్టినా సాధారణ పరిపాలన, శాంతి భద్రతలు కూడా దిగజారాయి. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిన విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను కొత్త ప్రభుత్వం గాలికొదిలేసింది. గ్రామీణ ఆరోగ్యం పడకేసింది. ప్రభుత్వ స్కూళ్ల నుంచి మళ్లీ ప్రైవేట్ బడులకు విద్యార్థుల వలస మొదలైంది. ఐదేళ్ల తర్వాత ఎరువుల కోసం, విత్తనాల కోసం రైతులు క్యూలైన్లలో నిలబడవలసి రావడాన్ని చూస్తున్నాము. ఇటువంటి అనేక కారణాలు ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తున్నాయి.క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవాలన్నీ బయటికొస్తే అసంతృప్తి మరింత పరివ్యాప్తమవుతుంది. అందుకే మాట వినని మీడియాను దండోపాయంతో దారిలోకి తెచ్చుకోవాలని భావిస్తున్నట్టుంది. ఆ ఉపాయంతోనే ‘సాక్షి’ మీద విజయవాడ పోలీస్ స్టేషన్లో ఒక అక్రమ కేసును బనాయించారు. మీడియాలో వచ్చిన వార్తలపై అభ్యంతరాలు ఉండటంలో తప్పులేదు. దాని మీద వివరణ ఇవ్వవచ్చు. దాన్ని ప్రచురించక పోతే అప్పుడు న్యాయస్థానానికి వెళ్లడం సదరు వ్యక్తులు లేదా వ్యవస్థలు చేయవలసిన పని. కానీ ఎకాయెకిన పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేయడం భావ వ్యక్తీకరణ హక్కుపై జరిగిన దాడిగానే పరిగణిస్తారు. రోజులు గడుస్తున్నకొద్దీ పరిణతి సాధించవలసిన ప్రజాస్వామ్యంలో ఇటువంటి దండనాథులు తలెత్తడం ఒక విషాదం.‘‘నీ అభిప్రాయంతో నేను ఏకీభవించకపోవచ్చు. కానీ,నీ అభిప్రాయం వెల్లడించే హక్కు కోసం నా ప్రాణాలైనా ఇస్తా’’ అనేది మూడు శతాబ్దాల కిందటి ఫ్రెంచ్ ప్రజాస్వామిక నినాదం. ఇంత చరిత్ర ఉన్నది కనుకనే ప్రజాస్వామిక ‘హక్కు’ను ఏ పాలకుడూ చిరకాలం అణచిపెట్టి ఉంచలేడు. ‘‘కుటిలాత్ముల కూటమికొక త్రుటికాలపు విజయమొస్తే, విశ్వసృష్టి పరిణామం విచ్ఛిన్నం అవుతుందా?’’ అన్నారు గుంటూరు శేషేంద్రశర్మ. ఏమీ కాదు! ఈ దాదాగిరి త్రుటికాలమే. అక్రమ కేసులకు భయ పడేది లేదు. ప్రజల పక్షాన నిలబడకుండా కాడి వదిలేసేదీ లేదు. నిశ్చయంగా, నిర్భయంగా జనం గుండె గొంతుకై ‘సాక్షి’ ప్రతిధ్వనిస్తుంది. ‘సాక్షి’ పత్రిక మీద కనిపించే మకుటమే ‘సత్యమేవ జయతే’!వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ఇసుక, మద్యం విషయంలో కూటమి ప్రభుత్వం అవినీతికి పాల్పడింది
-
దౌర్జన్యంగా అగ్రిమెంట్లు!
సాక్షి నెట్వర్క్: మద్యం దుకాణాల లాటరీ తంతు ముగియడంతో అక్కడక్కడా స్వల్పంగా షాపులు దక్కించుకున్న ఇతరులకు టీడీపీ సిండికేట్ చుక్కలు చూపిస్తోంది. రాష్ట్రంలో 3,396 మద్యం దుకాణాలకుగానూ లాటరీ ముసుగులో 80 శాతం షాపులను ఏకపక్షంగా దక్కించుకున్న టీడీపీ సిండికేట్ మిగిలిన 20 శాతం షాపుల లైసెన్సులు పొందిన వారిని నయాన భయాన దారికి తెచ్చుకుంటోంది. తమను ధిక్కరించి వ్యాపారం చేయలేరని.. వాటాలు చెల్లిస్తారో, దుకాణాలు అప్పగిస్తారో తేల్చుకోవాలని లేదంటే ఎక్సైజ్, పోలీసు దాడులు తప్పవని తీవ్ర బెదిరింపులకు గురి చేస్తోంది. టీడీపీ మద్యం సిండికేట్ దందాకు అధికార యంత్రాంగం జీ హుజూర్ అనడంతో రాష్ట్రంలోని 26 జిల్లా కేంద్రాల్లో సోమవారం నిర్వహించిన లాటరీ ప్రక్రియ ఓ ప్రహసనంగా ముగిసిన విషయం తెలిసిందే. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు టీడీపీ ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే ఈ ప్రక్రియ కొనసాగింది. మంత్రి జనార్ధన్‌రెడ్డి వర్గం బెదిరింపులు..⇒ బనగానపల్లె నియోజకవర్గంలో మద్యం దుకాణాలను దక్కించుకున్న ఇతరులు గుడ్‌విల్ తీసుకుని తమకు అప్పగించాలని లేదంటే 25 శాతం వాటా ఇవ్వాలని టీడీపీ నేతలు బెదిరిస్తున్నారు. తమ మాట వినకుంటే అద్దెకు గదులు కూడా దక్కకుండా చేస్తామని మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి వర్గం హెచ్చరిస్తోంది. ⇒ డోన్‌లో 16 దుకాణాలు ఉండగా ధర్మవరం సుబ్బారెడ్డికి 3, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ వర్గానికి 2, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత వర్గానికి రెండు, ఎస్సీవై రెడ్డి కుమారైకు ఒకటి, మిగతా 8 దుకాణాలను ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి వర్గం దక్కించుకుంది. ⇒ కోడుమూరులో టీడీపీ ఇన్చార్జీ విష్ణువర్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో సిండికేట్‌గా ఏర్పడి తమ వర్గంలో చేరాలని ఇతరులను ఒత్తిడి చేస్తున్నారు. ⇒ నంద్యాలలో 30 శాతం కమీషన్ ఇవ్వాలని మంత్రి ఫరూక్ కుమారుడు ఫిరోజ్ బెదిరిస్తున్నారు. దీంతో ఇద్దరు వ్యక్తులు దుకాణాలను టీడీపీకే గుడ్‌విల్‌కు ఇచ్చేశారు. ఒక్కో షాపు రూ.20 లక్షల చొప్పున విక్రయించినట్లు సమాచారం. ⇒ శ్రీశైలంలో 25 శాతం వాటా లేదంటే గుడ్‌విల్‌కు దుకాణాలు తమకు ఇవ్వాలని ఎమ్మెల్యే బుడ్డా వర్గీయులు చెబుతున్నారు. ⇒ పత్తికొండలో దుకాణాలు దక్కించుకున్న వారికి ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు వర్గీయులు ఫోన్ చేసి వాటిని తమకు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. లేదంటే తమతో ఉండాలని చెబుతున్నారు. కప్పం కట్టలేక షాపు వదిలేసి..చిత్తూరు జిల్లా పలమనేరులో వైఎస్సార్సీపీకి చెందిన కల్లు బాల, కృష్ణారెడ్డి, కర్ణాటకకు చెందిన దుర్గాప్రసాద్‌కు లక్కీడిప్‌లో మద్యం దుకాణాలు దక్కాయి. అయితే ఎమ్మెల్యే అమరనాథ్‌రెడ్డి సోదరుడు విష్ణువర్థన్‌రెడ్డి బెదిరించి వారి నుంచి వాటిని లాక్కున్నారు. కల్లు బాల సతీమణి ఎస్ భారతి పేరున బైరెడ్డిపల్లి మద్యం దుకాణం లాటరీ ద్వారా వచ్చింది. షాపును దక్కించుకున్న కల్లు బాలను ఎమ్మెల్యే సోదరుడు ఇంటికి పిలిపించుకుని అనుచరులతో దాడి చేశాడు. తమను కాదని మరెవరూ షాపు నడపటానికి వీల్లేదని, స్థలం ఎవరు ఇస్తారో చూస్తామంటూ హెచ్చరించాడు. రూ.కోటి కప్పం కట్టాలని ఆదేశించడంతో లాటరీ ద్వారా వచ్చిన దుకాణాన్ని కల్లు బాల వదులుకున్నారు. కృష్ణారెడ్డి తనకు లాటరీలో వచ్చిన మద్యం దుకాణాన్ని వదిలేసుకున్నారు. వారిని బెదిరించి మద్యం దుకాణం పర్మిట్ అమ్ముకున్నట్లు బలవంతంగా అగ్రిమెంట్ రాయించుకున్నారు. కర్ణాటకకు చెందిన దుర్గాప్రసాద్ ఆచూకీ తెలియరాలేదు. ⇒ పూతలపట్టులో ఎమ్మెల్యే మురళీమోహన్ వర్గీయులు స్థానిక సీఐ ద్వారా టెండర్లు దక్కించుకున్న మద్యం వ్యాపారులతో మంతనాలు నెరిపారు. దుకాణాలను వదులు కోవాలని లేదంటే వాటా ఇవ్వాల్సిందేనని హుకుం జారీ చేశారు. మరో నలుగురు ఎమ్మెల్యేలు లక్కీ డిప్ తీసే రోజు నేరుగా కలెక్టర్‌కే ఫోన్ చేసి తమ వారికే దుకాణాలు దక్కేలా చూడాలని కోరినట్లు తెలిసింది. కలెక్టర్ స్పందించకపోవటంతో టెండర్లు దక్కించుకున్న వారిని ఎక్సైజ్ పోలీసుల ద్వారా బెదిరిస్తున్నారు. ⇒ తిరుపతిలో 32 దుకాణాలకు జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు బినామీ పేర్లతో 350 దరఖాస్తులు చేయగా ఆరు షాపులు దక్కాయి. దుకాణాలు నడవాలంటే తమకు వాటా ఇవ్వాల్సిందేనని ఇతరులను బెదిరిస్తున్నారు. శ్రీకాళహస్తి, గూడూరులో దరఖాస్తు దారులను ముందే పిలిచి ఎమ్మెల్యేలు అడిగినంత వాటా ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. కడపలో నేరుగా బేరసారాలు..⇒ వైఎస్సార్ కడప జిల్లాలో మద్యం షాపు సవ్యంగా నిర్వహించుకోవాలంటే 50 శాతం భాగస్వామ్యం ఇవ్వాలని కొందరు హెచ్చరిస్తుండగా పూర్తిగా తమకే అప్పగించాలని మరికొందరు అల్టిమేటం జారీ చేస్తున్నారు. కడపలో టీడీపీయేతర వర్గీయులకు చెందిన మద్యం షాపులల్లో 50 శాతం వాటా ఇవ్వాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి బేరసారాలకు దిగారు. జనసేన వర్గీయులకు మూడు మద్యం దుకాణాలు లభించగా ఒక్కొక్కటి రూ.15 లక్షలు చొప్పున గుడ్‌విల్‌కు అప్పగించారని సమాచారం. జమ్మలమడుగులో ప్రతి షాపులో 30 శాతం వాటా ఇవ్వాలంటూ టీడీపీ ఇన్చార్జీ దేవగుడి భూపేష్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ముద్దనూరు షాపు పూర్తిగా తమకే ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారు. కమలాపురంలో పునీత్ బార్ అండ్ రెస్టారెంట్‌ను ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యరెడ్డి మూసివేయించారు. తాము వారించినా వినకుండా చెన్నూరు మద్యం షాపు కోసం దరఖాస్తు చేశారంటూ దౌర్జన్యానికి దిగినట్లు సమాచారం. ధర్మవరంలో పరిటాల వర్గం పర్యవేక్షణ.. ⇒ శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో మద్యం దుకాణాలను దక్కించుకున్న తటస్థులు కూటమి నాయకుల బెదిరింపులతో షాపులను అప్పగించినట్లు సమాచారం. ఈ సిండికేట్ టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరాం ఆధ్వర్యంలో జరుగుతోంది. సోమందేపల్లిలో లైసెన్స్‌దారు దీక్షితను బెదిరించి గుడ్‌విల్‌కు షాపు దక్కించుకున్నారు. సీకే పల్లి స్టేషన్, కదిరి పరిధిలో దుకాణాలకు సంబంధించి పంచాయితీ కొనసాగుతోంది. హిందూపురం నియోజకవర్గం లేపాక్షిలో షాపు దక్కించుకుని ఆన్లైన్లో డబ్బులు చెల్లించిన రంగనాథ్ నుంచి దుకాణం లాక్కునేందుకు టీడీపీ నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ⇒ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో 127వ మద్యం షాపును దక్కించుకున్న హోటల్ నిర్వాహకుడు దినేష్ కుమార్ నాయుడు లొంగకపోవడంతో టీడీపీ నేతలు మునిసిపల్ అధికారులను ఉసిగొల్పి హోటల్లో తనిఖీలు జరిపి నోటీసులు ఇప్పించారు. చేయి కలిపితేనే సహకారం..⇒ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురం కొత్తపేట, ముమ్మిడివరం పరిధిలో సిండికేట్ ప్రాబల్యం అధికంగా ఉంది. దుకాణాలు దక్కించుకున్నవారు ఇతరులు తమతో చేయి కలపాలని ఒత్తిడి చేస్తున్నారు. రావులపాలెం మండలం ఈతకోటలో మద్యం షాపు ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న ఇతరులను సిండికేట్ ఒత్తిడితో స్థానికులు అభ్యంతరం చెబుతున్నారు. ముమ్మిడివరంలో దుకాణాలు పొందిన మిగిలినవారిని తమ సిండికేట్‌లోకి తెచ్చుకునేందుకు టీడీపీ ముఖ్య ప్రజాప్రతినిధి అనుచరులు సామ, దాన, భేద, దండోపాయాలు ప్రదర్శిస్తున్నారు. ⇒ పశ్చిమ గోదావరి జిల్లాలో 20 మండలాలకు గాను ఒక్కో చోట నాలుగు నుంచి తొమ్మిది వరకు షాపులు ఏర్పాటు అవుతున్నాయి. కొత్త పాలసీ ప్రకారం షాపులు దక్కినవారు మండలంలో ఎక్కడైనా షాపు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. దీంతో అమ్మకాలు ఎక్కువగా జరిగే మండల కేంద్రాలు, మేజర్ పంచాయతీల్లో షాపుల ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ⇒ రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వర్గానికి 11 దుకాణాలు దక్కాయి. మిగిలిన షాపులు పొందిన వారు 25 శాతం కమీషన్ ఇవ్వాలని పట్టుబడుతున్నట్టు సమాచారం. నిడదవోలులో మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, మంత్రి కందుల దుర్గేష్ వర్గం ఇతరుల నుంచి 25 శాతం కమీషన్ డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ⇒ కాకినాడ జిల్లాలో కొత్తగా మద్యం వ్యాపారంలోకి ప్రవేశించిన వారిని సిండికేట్ నయానా భయానా దారిలోకి తెచ్చుకుంటోంది. తొండంగి, కోటనందూరు, తునిలో ఏడు షాపులు దక్కించుకున్న వారు కౌన్సెలింగ్‌లో మాట వినకపోవడంతో వ్యాపారాలు ఎలా చేస్తారో చూస్తామంటూ బెదిరింపులకు దిగారు. ఎక్సైజ్ పోలీసులు మీకు ఎలా సహకరిస్తారో చూస్తామంటూ హెచ్చరిస్తున్నారు. కాకినాడ సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో ఒక్కో షాపులో 20 శాతం వాటా ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. వెనిగండ్ల వర్గం వార్నింగ్‌లు⇒ కృష్ణా జిల్లా పామర్రులో 75 శాతం షాపులను దక్కించుకున్న టీడీపీ నేతలు మిగిలిన వారిని వాటాలు ఇవ్వాలని ఫోన్లు చేస్తున్నారు. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సోదరుడు షాపులు దక్కించుకున్న వారిని తన అనుచరులతో కలసి బెదిరింపులకు గురి చేస్తున్నట్లు సొంత పార్టీ నాయకులే చెబుతున్నారు. వంగవీటి రాధా, కాజ రాజ్‌కుమార్ వర్గీయులు గుడివాడలో ఐదు షాపులు దక్కించుకున్నారు. ఎమ్మెల్యే వర్గానికి వారు ఎదురు తిరిగినట్లు సమాచారం. ఉదయభాను వర్గం ఒప్పందాలు.. గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు మండలాల్లో టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సిండికేట్ 11 షాపులను దక్కించుకుంది. మిగిలిన 12 దుకాణాలను టీడీపీ నేతలు, గతంలో మద్యం వ్యాపారంలో ఉన్న వ్యక్తులు దక్కించుకున్నారు. పెనుగంచిప్రోలులో విజయవాడకు చెందిన ఓ వ్యక్తి దుకాణాన్ని దక్కించుకోగా గుడ్ విల్ కింద జనసేన నేత ఉదయభాను వర్గం రూ.90 లక్షలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. జగ్గయ్యపేటలో దుకాణం పొందిన తెలంగాణ వాసితో ఎమ్మెల్యే సోదరుడు గుడ్‌విల్ చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. తిరువూరులో తెలంగాణ వ్యాపారులే ఎక్కువ షాపులు దక్కించుకున్నారు. మైలవరంలో 15 షాపులకుగానూ టీడీపీ సిండికేట్‌కే 14 దక్కాయి. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ బావమరిది పోసాని కోటేశ్వరరావు కనుసన్నల్లో టీడీపీ నాయకులు సిండికేట్‌గా ఏర్పడ్డారు. నందిగామలో షాపులన్నీ ఎంపీ, ఎమ్మెల్యే అనుచరులకే దక్కాయి. పల్నాడులో డబ్బులు కడితేనే..⇒ పల్నాడు జిల్లాలో తాము చెప్పిన మొత్తం తీసుకొని దుకాణాలు అప్పగించాలని లేదంటే 50 శాతం వాటా ఇవ్వాలని సిండికేట్ బెదిరిస్తోంది. నరసరావుపేట నియోజకవర్గంలో మద్యం పంచాయితీ ఇంకా తేలలేదు. సత్తెనపల్లిలో రూ.30 లక్షలు కట్టిన తరువాతే దుకాణాలు తెరుచుకోవాలని ఓ టీడీపీ నేత అల్టిమేటం జారీ చేశారు. పెదకూరపాడులో ప్రతి దుకాణంలో 20 వాటా ఇవ్వాలని లెక్క తేల్చారు. ⇒ బాపట్ల జిల్లాలో టెండర్లకు ముందే రేపల్లె, వేమూరు, పర్చూరు, అద్దంకి నియోజకవర్గాల్లో సిండికేట్ ఏర్పాటైంది. తమతో కలవకుంటే షాపులు నిర్వహించలేరంటూ బెదిరింపులకు దిగుతున్నారు. టెక్కలిలో ఏకఛత్రాధిపత్యం⇒ టెక్కలి నియోజకవర్గంలో ప్రత్యర్థులే లేకుండా పోవడంతో కీలక నేత సోదరుడి కనుసన్నల్లోనే షాపులన్నీ నడుస్తున్నాయి. ⇒ నరసన్నపేట నియోజకవర్గం పోలాకి మండలంలో నాలుగు షాపులు దక్కించుకున్న ఇతరులకు ఫోన్ చేసిన ఓ ఎమ్మెల్యే ఒక్కో దుకాణానికి రూ.25 లక్షలు చొప్పున ఇస్తానంటూ ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ⇒ నరసన్నపేటలో 76వ నెంబర్ షాపు అప్పగించినందుకు ఏడాదికి రూ.20 లక్షలు చెల్లిస్తామన్న టీడీపీ ప్రజాప్రతినిధి ఆఫర్‌కు అంగీకరించినట్లు తెలుస్తోంది. ⇒ పాతపట్నంలో పలు దుకాణాలు ఒడిశాకు చెందిన వ్యాపారులకు దక్కడంతో వారికి ఎమ్మెల్యే అనుచరులు ఫోన్ చేసి గుడ్‌విల్‌కు ఇచ్చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. పలాస, ఇచ్ఛాపురం, ఆమదాలవలసలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. -
దోచుకోవడంలో ‘స్కిల్’ నిజమే
సాక్షి, అమరావతి: ప్రజాధనాన్ని కొల్లగొట్టి అరెస్ట్ అయిన చంద్రబాబుకు సంబంధించిన ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా మరోసారి కొరఢా ఝుళిపించింది. ఈ కేసులో ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకు చంద్రబాబు ముఠాకు సహకరించిన షెల్ కంపెనీ డిజైన్ టెక్ ఎండీ వికాస్ వినాయక్ కన్విల్కర్, సీమెన్స్ కంపెనీ అప్పటి ఎండీ సుమన్ బోస్‌కు చెందిన రూ.23.54 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను అటాచ్ చేసింది. ఢిల్లీ, ముంబయి, పూణేల్లోని స్థిరాస్తులతోపాటు వారి పేరిట ఉన్న షేర్లు, బ్యాంకు ఖాతాల్లోని నిధులను అటాచ్ చేసినట్టు ఈడీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇదే కేసులో గతంలో డిజైన్ టెక్కు చెందిన రూ.31.20 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో మొత్తంగా రూ.54.74 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లయింది. తద్వారా 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం బరితెగించి సాగించిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం మరోసారి చర్చనీయాంశంగా మారింది. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అవినీతికి పాల్పడినట్టు మరోసారి జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సిట్ చంద్రబాబును అరెస్ట్ చేయడం రాజకీయ కక్ష సాధింపు చర్య కాదన్నది స్పష్టమైంది. ఎందుకంటే కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ కూడా టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్‌లో అవినీతి జరిగినట్టు.. షెల్ కంపెనీల ద్వారా నిధులు అక్రమంగా తరలించినట్టు ఆధారాలతో సహా నిర్ధారించి కఠిన చర్యలను వేగవంతం చేయడమే అందుకు నిదర్శమని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. ఈ కేసు దర్యాప్తులో ఈడీ దూకుడు పెంచడంతో ‘స్కిల్’ క్రిమినల్స్‌లో గుబులు మొదలైంది.గత ఏడాది డిజైన్ టెక్ సిస్టమ్స్ ఎండీ, సీమెన్స్ ఎండీలను అరెస్టు చేసినట్లు ఈడీ చేసిన ట్వీట్ ప్రజాధనం కొల్లగొట్టడమే లక్ష్యంగా అడుగులు⇒ 2014లో అధికారంలోకి రాగానే ప్రజాధనాన్ని కొల్లగొట్టడమే చంద్రబాబు లక్ష్యంగా చేసుకున్నారు. జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీకి తెలియకుండానే ఆ కంపెనీ పేరిట ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్‌ను తెరపైకి తెచ్చారు. భారత్‌లో ఆ కంపెనీ ఎండీగా ఉన్న సుమన్ బోస్, డిజైన్ టెక్ ఎండీ వికాస్ వినాయక్ కన్విల్కర్ సహకారంతో చంద్రబాబు అక్రమాలకు తెర తీశారు. ఏపీఎస్ఎస్డీసీ ద్వారా డిజైన్ టెక్ కంపెనీకి డబ్బు ఇచ్చేందుకు 2016లో సీఎంగా చంద్రబాబు చేసిన డిజిటల్ సంతకం ⇒ కేబినెట్ ఆమోదం లేకుండానే చంద్రబాబు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏపీఎస్ఎస్డీసీ) ఏర్పాటు చేసి, అనంతరం ఏపీఎస్ఎస్డీసీతో సీమెన్స్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకున్నట్టు మభ్యపుచ్చారు. సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్, ఇతర అంశాలకు సంబంధించిన ఇన్వాయిస్లు, ప్రాథమిక నివేదిక ప్రకారం రూ.370 కోట్లు మాత్రమే ఉన్న ప్రాజెక్ట్ విలువను అమాంతం రూ.3,300 కోట్లకు పెంచేశారు. ⇒ ప్రభుత్వం పది శాతం నిధులు సమకూరిస్తే సీమెన్స్, డిజైన్ టెక్ 90 శాతం నిధులు పెట్టుబడి పెట్టేలా ఒప్పందం కుదుర్చుకున్నట్టు 2015 జూన్ 30న ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం సీమెన్స్–డిజైన్ టెక్ కంపెనీలు ప్రాజెక్ట్ వ్యయంలో 90 శాతాన్ని గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా సమకూరుస్తాయంటూ త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నారు. ⇒ ప్రాజెక్టు వ్యయంగా చెప్పుకున్న రూ.3,300 కోట్లలో 90 శాతం కాదు కదా కనీసం ఒక్క రూపాయి విలువైన ఆర్ధిక సహకారంగానీ, వస్తు సహాయాన్ని గానీ అందించ లేదు. కానీ ఏపీఎస్ఎస్డీసీ తన 10 శాతం వాటాను జీఎస్టీతో కలిపి రూ.371 కోట్లు డిజైన్ టెక్ కంపెనీకి చెల్లించేసింది. దీనిపై అప్పటి ఆర్ధిక శాఖ అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ మరీ నిధులు విడుదల చేయాలని సీఎం హోదాలో చంద్రబాబు ఆదేశించారు. దీంతో నిబంధనలకు విరుద్ధంగా ఏపీఎస్ఎస్డీసీ ద్వారా డిజైన్ టెక్ కంపెనీకి రూ.371 కోట్లు మంజూరు చేశారు. ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్ నిధులు కొల్లగొట్టేందుకుగాను చంద్రబాబు ఏకంగా మొత్తం 13 నోట్ ఫైళ్లలో సంతకాలు చేశారు. ⇒ డిజైన్ టెక్కు చెల్లించిన రూ.371 కోట్లలో సాఫ్ట్వేర్ కొనుగోలు కోసం రూ.56 కోట్లు చెల్లించారు. మిగతా రూ.315 కోట్లను షెల్ కంపెనీల ద్వారా బోగస్ ఇన్వాయిస్లు సమర్పించి వివిధ దశల్లో అక్రమంగా తరలించారు. షెల్ కంపెనీల సృష్టికర్తలు, దళారుల కమీషన్లు పోనూ రూ.241 కోట్లు హవాలా మార్గంలో హైదరాబాద్‌లోని చంద్రబాబు బంగ్లాకు తరలించారు.కడిగిపారేసిన కాగ్రాజ్యాంగబద్ధ సంస్థ కాగ్ కూడా చంద్రబాబు హయాంలో స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నిర్ధారించింది. ఆ ప్రాజెక్టులో రూ.355 కోట్ల మేర ఖజానాకు గండి పడిందని నిగ్గు తేల్చింది. వాస్తవ లెక్కల ప్రకారం ప్రాజెక్ట్ విలువను రూ.370 కోట్లుగా చూపించి ఉంటే ప్రభుత్వం తన వాటాగా రూ.33 కోట్లు మాత్రమే విడుదల చేయాలి. అయితే అంచనాలను అమాంతం పెంచేసి రూ.3,300 కోట్లుగా చూపించి ప్రభుత్వ వాటా 10 శాతంతోపాటు జీఎస్టీ, ఇతర అంశాలను కలిపి ఏకంగా రూ.371 కోట్లు విడుదల చేశారు. రూ.333 కోట్లు కొల్లగొట్టారు. ప్రాజెక్టు మొదలు కాకుండానే నిధులు విడుదల చేయడంతో ప్రభుత్వం రూ.22 కోట్లు వడ్డీ రూపంలో రావాల్సిన ఆదాయాన్ని కోల్పోయింది. వెరసి ప్రభుత్వ ఖజానాకు రూ.355 కోట్ల నష్టం వాటిల్లిందని కాగ్ తెలిపింది.ఏ–1గా తేలడంతో బాబు అరెస్ట్⇒ 2018లోనే కేంద్ర జీఎస్టీ అధికారులు షెల్ కంపెనీల్లో నిర్వహించిన తనిఖీల్లో ఈ వ్యవహారం బయట పడింది. దీనిపై అప్పట్లోనే జీఎస్టీ అధికారులు రాష్టఏసీబీకి సమాచారం ఇచ్చారు. కానీ చంద్రబాబు ఒత్తిడితో ఆ అంశాన్ని తొక్కిపెట్టారు. ఆ వెంటనే ఏపీఎస్ఎస్డీసీ ఆఫీసులో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఫైళ్లను మాయం చేశారు. ⇒ 2019లో పూణెకు చెందిన ఓ సామాజిక కార్యకర్త ఈ కుంభకోణం గురించి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. దీంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్కిల్ స్కామ్‌పై విచారణకు సీఐడీ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించింది. సిట్ దర్యాప్తులో చంద్రబాబు అవినీతి బాగోతం అంతా బట్టబయలైంది. ఈ కుంభకోణానికి కర్త, కర్మ, క్రియ అంతా చంద్రబాబే అన్నది నిర్ధారణ అయింది. ఈ కేసు విచారణ కోసం చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, షెల్ కంపెనీల ప్రతినిధి మనోజ్ పార్థసానిలకు సిట్ నోటీసులు జారీ చేయగానే వారిద్దరూ విదేశాలకు పరారయ్యారు. దాంతో ఈ కేసులో సాక్షులను ప్రభావితం చేస్తున్నారని భావించి ఆయన్ను గత ఏడాది సెపె్టంబర్ 9న అరెస్ట్ చేసింది. ఈ కేసులో చంద్రబాబును ఏ–1గా పేర్కొంటూ ఆయనతోపాటు 9 మంది నిందితులను అరెస్ట్ చేసినట్టైంది. ⇒ సిట్ రిమాండ్ రిపోర్ట్‌తో ఏకీభవించిన విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానం చంద్రబాబుకు రిమాండ్ విధించింది. దాంతో చంద్రబాబు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో 52 రోజులపాటు రిమాండ్ ఖైదీగా ఉన్న అనంతరం బెయిల్‌పై విడుదల అయ్యారు.పరికరాలు సరఫరా చేయకుండానే చేసినట్టుగా..యువతకు ఉపాధి నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తామనే ప్రాజెక్ట్ పేరిట నిధులు కొల్లగొట్టినట్టు తమ దర్యాప్తులో వెల్లడైందని ఈడీ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో స్పష్టంగా వెల్లడించింది. ఈడీ తెలిపిన వివరాల ప్రకారం.. సీమెన్స్ కంపెనీకి అప్పటి ఎండీ సుమన్ బోస్, డిజైన్ టెక్ కంపెనీ ఎండీ వికాస్ వినాయక్ కన్విల్కర్ తమ సన్నిహితులు ముకుల్ చంద్ర అగర్వాల్ (స్కిల్లర్ కంపెనీ ప్రతినిధి), సురేశ్ గోయల్ (చార్టెడ్ అకౌంటెంట్) ద్వారా ప్రజాధనాన్ని అక్రమంగా దారి మళ్లించారు. ఏపీ ప్రభుత్వానికి ఎటువంటి పరికరాలు సరఫరా చేయకుండానే చేసినట్టుగా బోగస్ ఇన్వాయిస్లు సమర్పించి నిధులు విడుదల చేశారు. ఆ నిధులను షెల్ కంపెనీల బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించి, ఏయే బ్యాంకు ఖాతాల నుంచి సింగపూర్‌కు తరలించారు.. తిరిగి ఆ నిధులు దేశంలోని ఏయే ఖాతాలకు వచ్చాయన్న విషయాన్ని ఈడీ గుర్తించింది. ఇప్పటికే రూ.70 కోట్లు హవాలా మార్గంలో తరలించినట్టు నిర్ధారించింది. చంద్రబాబుకు సన్నిహితులు, ఆ కుంభకోణంతో ప్రమేయమున్న షెల్ కంపెనీల ప్రతినిధులు మొత్తం 26 మందికి నోటీసులు జారీ చేసి పలువురిని విచారించింది. ఈ కేసులో నిందితులు సుమన్ బోస్, వికాస్ ఖన్విల్కర్, ముకుల్‌చంద్ర అగర్వాల్, సురేశ్ గోయల్‌లను అరెస్టు చేయడంతోపాటు విశాఖపట్నంలోని పీఎంఎల్ఏ న్యాయస్థానంలో చార్జ్‌షీట్ దాఖలు చేసింది.ఇక టీడీపీ ప్రభుత్వ పెద్దల పాత్రపై ఈడీ కన్నుస్కిల్ స్కాం కేసులో ప్రధాన నిందితుడి (ఏ1)గా చంద్రబాబును పేర్కొంటూ న్యాయస్థానంలో దాఖలు చేసిన చార్జ్‌షీట్ కాపీని సిట్ ఈ ఏడాది మార్చిలోనే ఈడీకి పంపింది. ఇప్పటికే షెల్ కంపెనీ అక్రమాలను వెలికి తీసి, కఠిన చర్యలు చేపట్టిన ఈడీ.. ఈ కుంభకోణం సూత్రధారులు, అంతిమ లబ్ధిదారులు అయిన టీడీపీ ప్రభుత్వ పెద్దల పాత్రపై దర్యాఫ్తు వేగవంతం చేస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. దాంతో ఫేక్ న్యూస్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకు ఈడీ క్లీన్ చిట్ ఇచ్చినట్టు ప్రచారం చేస్తున్నారు. అయితే ఈడీ మంగళవారం జారీ చేసిన అధికారిక ప్రకటనలో చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చినట్టు ప్రకటించ లేదు. షెల్ కంపెనీల ప్రతినిధులపై తీసుకున్న చర్యలను తెలిపింది. సీబీఐకి అప్పగించాలి రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో గతంలో చంద్రబాబుపై సిట్ నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న కేసులను సీబీఐకి అప్పగించాలని కోరుతూ సామాజిక కార్యకర్త తిలక్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుల్లో ప్రధాన నిందితుడు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉండటంతో సిట్ దర్యాప్తు పారదర్శకంగా సాగదని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. కాబట్టి సీబీఐకి అప్పగించాలని కోరారు. ఈ పిటిషన్ న్యాయస్థానంలో విచారణలో ఉంది. -
‘ముఖ్య’ నేత మాటే ఫైనల్.. మాఫియాదే రాజ్యం
సాక్షి, అమరావతి: టీడీపీ మద్యం మాఫియా దోపిడీకి కూటమి ప్రభుత్వం అధికారికంగా పచ్చజెండా ఊపింది. ఐదేళ్ల క్రితం వైఎస్సార్ సీపీ హయాంలో సీసాలో బంధించి బిరడా బిగించి పాతరేసిన సిండికేట్ భూతాన్ని వెలికితీసి మళ్లీ రాష్ట్రంపైకి వదిలిపెట్టింది. ప్రైవేట్ మద్యం దుకాణాల ముసుగులో టీడీపీ సిండికేట్ దోపిడీకి తలుపులు బార్లా తెరిచింది. ప్రభుత్వ ‘ముఖ్య’నేత పక్కా పన్నాగంతో టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు స్వయంగా రంగంలోకి దిగి సిండికేట్ దందాను యథేచ్ఛగా సాగించారు. లాటరీ ప్రక్రియ ద్వారా లైసెన్సుల కేటాయింపు విధానాన్ని ప్రహసనంగా మార్చేసి ఇతరులెవరూ దరఖాస్తు చేయకుండా బెదిరింపులతో బెంబేలెత్తించారు. లాటరీ ముసుగులో 80 శాతం దుకాణాలను ఏకపక్షంగా దక్కించుకున్న టీడీపీ సిండికేట్.. మిగిలిన 20 శాతం దుకాణాల లైసెన్సులు పొందిన వారిని తీవ్ర బెదిరింపులకు గురి చేసి వాటిని సైతం హస్తగతం చేసుకునేందుకు దౌర్జన్యాలకు తెగబడుతోంది.80 శాతం ఏకపక్షం.. 20 శాతం కబ్జా– ఇదీ టీడీపీ సిండికేట్ దందా...ఊహించిందే జరిగింది..! రాష్ట్రంలో 3,396 మద్యం దుకాణాలను టీడీపీ సిండికేటే దక్కించుకుంది. 80 శాతం దుకాణాలకు ఇతరుల నుంచి పోటీ లేకుండా అడ్డుకుని ‘లాటరీ’ ముసుగులో ఏకపక్షంగా హస్తగతం చేసుకోగా.. మిగిలిన 20 శాతం దుకాణాల లైసెన్సులు పొందినవారిని బెదిరించి మరీ కబ్జా చేశారు. టీడీపీ మద్యం సిండికేట్ దందాకు అధికార యంత్రాంగం జీ హుజూర్ అనడంతో రాష్ట్రంలోని 26 జిల్లా కేంద్రాల్లో సోమవారం నిర్వహించిన లాటరీ ప్రక్రియ ఓ ప్రహసనంగా మారింది. టీడీపీ ప్రజాప్రతినిధుల సిండికేట్ మొత్తం లాటరీ ప్రక్రియను తమకు అనుకూలంగా హైజాక్ చేసింది. శ్రీకాకుళం నుంచి అనంతపురం జిల్లా వరకు టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు నామినేట్ చేసిన వారి కనుసన్నల్లోనే అధికారులు లాటరీ ప్రక్రియను నిర్వహించి తతంగాన్ని ముగించారు. కూటమి ఎమ్మెల్యేల వర్గీయులు ముందుగానే లాటరీ నిర్వహించే ప్రాంగణాల్లో భారీ సంఖ్యలోతిష్ట వేసి అంతా తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఎక్సైజ్ అధికారులు ఎమ్మెల్యే వర్గీయులు చెప్పింది చేసే కీలుబొమ్మలుగా మిగిలిపోయారు. దాంతో ‘లాటరీ విధానం’లో 80 శాతం మద్యం దుకాణాలు టీడీపీ సిండికేట్‌కు దక్కాయి. కొన్ని చోట్ల ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసిన ఇతరులు చివరి నిమిషం వరకు అజ్ఞాతంలో ఉండి లాటరీ సమయానికి వచ్చారు. అలాంటి వారికి 20 శాతం మద్యం దుకాణాల లైసెన్సులు దక్కాయి. దాంతో ఉలిక్కిపడ్డ టీడీపీ సిండికేట్ వారి గురించి ఆరా తీసి లాటరీ ప్రాంగణంలోనే బహిరంగంగా బెదిరించింది. మద్యం దుకాణాలను వదిలేసి వెళ్లిపోవాలని హెచ్చరించింది. కాదు కూడదు.. నిర్వహిస్తామంటే తమకు 50 శాతం వాటాగానీ ఆదాయంలో 30 శాతం కమీషన్‌గానీ ఇవ్వాలని స్పష్టం చేసింది. అందుకు సమ్మతించకుంటే మద్యం దుకాణం కూడా తెరవలేరని.. తరువాత పరిణామాలతో తమకు సంబంధం లేదని హెచ్చరికలు జారీ చేసింది. ఇలా మొత్తం 3,396 మద్యం దుకాణాలను టీడీపీ సిండికేట్ గుప్పిట పట్టింది.డీల్ సెట్.. సిండికేట్‌కు పచ్చజెండాప్రభుత్వ ‘ముఖ్య’నేతతో డీల్ కుదరడంతోనే టీడీపీ మద్యం సిండికేట్‌కు ఏకపక్షంగా లైసెన్సులు దక్కాయి. అందుకే యావత్ అధికార యంత్రాంగం సిండికేట్‌కు సహకరించింది. రాష్ట్రంలో 3,396 మద్యం దుకాణాల్లో ఎంఆర్పీ కంటే రూ.10 అధికంగా... వాటికి అనుబంధంగా నెలకొల్పనున్న బెల్ట్ దుకాణాల్లో ఎంఆర్పీ కంటే రూ.25 చొప్పున అధికంగా విక్రయించేందుకు ‘ముఖ్య’నేత అనుమతించారు. అందుకుగాను ఒక్కో బాటిల్‌పై ఆయనకు రూ.3 చొప్పున కమీషన్ చెల్లించేందుకు సిండికేట్ సమ్మతించింది. మరోవైపు డిస్టిలరీలు కూడా ‘ముఖ్య’నేతకు 20 శాతం కమీషన్ ఇచ్చేలా డీల్ కుదుర్చుకున్నాయి. రాష్ట్రంలో మద్యం తయారు చేసే డిస్టిలరీలన్నీ టీడీపీ నేతలవే కావడం గమనార్హం. మొత్తం 20 డిస్టిలరీల్లో 14 డిస్టిలరీలకు గతంలో 1995–2004, 2014–2019 మధ్య చంద్రబాబు ప్రభుత్వంలోనే అనుమతులు ఇచ్చారు. మిగిలిన ఆరు డిస్టిలరీలకు అంతకుముందు ప్రభుత్వాలు అనుమతులు జారీ చేశాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఒక్కటంటే ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. ఈ క్రమంలో టీడీపీ నేతలకు చెందిన డిస్టిలరీలకు భారీ లాభాలు తెచ్చిపెట్టేందుకు, రాష్ట్రంలో మద్యం అమ్మకాలు విపరీతంగా పెంచేందుకు చంద్రబాబు ప్రభుత్వం సన్నద్ధమైంది. అందుకోసం త్వరలో పర్మిట్ రూమ్‌లకు అనుమతించడంతోపాటు అనధికారికంగా దాదాపు 50 వేల బెల్ట్ దుకాణాల ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. తద్వారా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగి డిస్టిలరీ యాజమాన్యాలకు లాభాల పంట పండనుంది. అందుకు ప్రతిఫలంగా డిస్టిలరీలు తమ ఆదాయంలో 20 శాతం ‘ముఖ్య’నేతకు కమీషన్ రూపంలో కప్పం చెల్లించేందుకు సమ్మతించాయి. అందుకే ప్రభుత్వ యంత్రాంగం అడ్డగోలుగా వ్యవహరించి టీడీపీ మద్యం సిండికేట్‌కు ఏకపక్షంగా మద్యం దుకాణాల లైసెన్సులు దక్కేలా చేసింది.345 దుకాణాలు మహిళలకే...రాష్ట్రంలో 345 దుకాణాల లైసెన్సులు మహిళల పేరిట దక్కించుకున్నారు. మొత్తం మద్యం దుకాణాల్లో 10.2 శాతం మహిళలకు దక్కాయి. అత్యధికంగా విశాఖ జిల్లాలో 31 మంది మహిళలకు లైసెన్సులు కేటాయించగా అనకాపల్లి జిల్లాలో 25 మందికి, విజయనగరం, పార్వతీపురం మన్యం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాల్లో 24 మంది చొప్పున మహిళలకు లైసెన్సులు లభించాయి.రెండేళ్లలో రూ.6,384 కోట్ల ఆదాయం రాష్ట్రంలో 3,396 మద్యం దుకాణాలకు లైసెన్సుల ప్రక్రియను ఎక్సైజ్ శాఖ సోమవారం ముగించింది. ఈ నెల 16వతేదీ నుంచి కొత్త మద్యం దుకాణాలు తెరుచుకోనున్నాయి. మద్యం కొత్త విధానం ద్వారా ప్రభుత్వానికి 2024–26లో ఏకంగా రూ.6,384 కోట్ల ఆదాయం లభించనుంది. గతంలో టీడీపీ అధికారంలో ఉండగా 2017–19లో వచ్చిన ఆదాయం కంటే ఇది 349 శాతం అధికం కావడం గమనార్హం. 2017–19లో రూ.1,422 కోట్లు ఆదాయం రాగా 2024–26లో రూ.6,384 కోట్ల ఆదాయం సమకూరుతుందని ఎకైŠస్జ్ శాఖ తాజాగా ప్రకటించింది. అందులో రూ.1,798 కోట్లు కేవలం దరఖాస్తు ఫీజుల రూపంలోనే వచ్చింది.ఇతర రాష్ట్రాలవారికీ లైసెన్సులు..శ్రీకాకుళం జిల్లాలో ఐదు మద్యం దుకాణాల లైసెన్సులను ఒడిశాకు చెందినవారు దక్కించుకున్నారు. మరోవైపు ఢిల్లీకి చెందిన నందినీ గోయల్, సారికా గోయల్, సౌరబ్ గోయల్ విశాఖపట్నం జిల్లాలో 155 షాపులకు దరఖాస్తులు చేయగా వారికి ఆరు మద్యం దుకాణాల లైసెన్సులు దక్కాయి. కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌కు చెందినవారికి మచిలీపట్నంలో రెండు దుకాణాల లైసెన్సులు లభించాయి. యూపీకి చెందిన ఇద్దరు మహిళలు నందిని, మంజు రాణికి రాజధాని ప్రాంతమైన మంగళగిరిలో రెండు షాపులు లాటరీలో దక్కాయి. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాకు చెందిన బొగ్గవరపు సరస్వతికి గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలో ఒక షాపు లాటరీలో తగిలింది.అంతా సిండికేట్ ఇష్టారాజ్యం..రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్సులన్నీ టీడీపీ ఎమ్మెల్యేలు, సిండికేట్ సభ్యులే ఏకపక్షంగా హస్తగతం చేసుకున్నారు. అందుకు కొన్ని ఉదాహరణలు ఇవీ..అచ్చెన్నదే హవా..మంత్రి అచ్చెన్నాయుడు సోదరుడు శ్రీకాకుళం జిల్లాలో మద్యం దుకాణాల టెండర్లలో చక్రం తిప్పారు. జిల్లాలో దాదాపు అన్ని లైసెన్సులు అచ్చెన్న వర్గం చెప్పినవారికే దక్కడం గమనార్హం. మంత్రి అచ్చెన్నాయుడు సమీప బంధువు కింజరాపు పుష్పలతకు పోలాకిలోని 81 నెంబర్ దుకాణం, కోటబొమ్మాళిలోని 113 నెంబర్ దుకాణం, జలుమూరులోని 121 నెంబర్ దుకాణం దక్కాయి. మరికొన్ని దుకాణాలను అచ్చెన్నాయుడు సోదరుడు హరివరప్రసాద్ అనుచరులు సదాశివుని రాంబాబు(120), సాహుకారి ఝాన్సీరాణి(122), మెండ మోహనరావు(123), అంధవరపు బాలరాజు(98), రత్నాల గణేష్ చౌదరి(99), కె.కె.రామయ్య(101,102), మండల రమణబాబు(104), డొంకాన మోహన్‌రావు(103), బొడ్డేపల్లి నాగవల్లి(116), పల్లి శ్రీనివాసరావు(115), బొంగు అప్పారావు(118), బొంగు దేవి(119), కూశెట్టి మోహనరావు(105), పైడిశెట్టి సంతోష్‌కుమార్(109), బెండి అరుణ్‌కుమార్(110), పులి గణపతి(111), టి.వీరాంజనేయులు(112), కొట్టి మల్లేష్(114)లకు మద్యం దుకాణాలు కేటాయించారు. ⇒ నరసన్నపేట టీడీపీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కోడలు భైరి మోహినికి 74 నెంబర్ దుకాణం, మరదలి కుమారుడు ధర్మాన రామప్రసాద్కు 71,72 నెంబర్ల దుకాణాలు దక్కగా... వియ్యంకుడు గుండ ఏలేశ్వరరావుకు 77, 78 నెంబర్ల దుకాణాలు లభించాయి.⇒ జనసేన నేత డాక్టర్ దానేటి శ్రీధర్ భార్య రాధారాణికి బూర్జ మండలంలోని 40వ నెంబర్ దుకాణం దక్కింది.విశాఖలో పచ్చదండు పాగా..విశాఖపట్నం జిల్లాలో టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ, పల్లా శ్రీనివాసరావు, వంశీకృష్ణ యాదవ్ మద్యం సిండికేట్‌కు నేతృత్వం వహించారు. వారి ఆధ్వర్యంలోని జనప్రియ, పుష్కరిణి సిండికేట్లకే దాదాపు అన్ని మద్యం దుకాణాల లైసెన్సులు దక్కడం గమనార్హం.⇒ అనకాపల్లి జిల్లాలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్, ఆయన వియ్యంకుడు, జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ సోదరుడు, యలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ నేతృత్వంలోని సిండికేట్ ఏకపక్షంగా మద్యం దుకాణాల లైసెన్సులను దక్కించుకుంది. నర్సీపట్నం, అనకాపల్లి, యలమంచిలి, పాయకారావుపేట, చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో మద్యం దుకాణాలను ఈ సిండికేట్ హస్తగతం చేసుకుంది. ⇒ అల్లూరి సీతారామరాజు జిల్లాలో టీడీపీకి చెందిన గిరిజనేతర నేతలు గిరిజనుల హక్కులను కాలరాశారు. జిల్లాలో 40 మద్యం దుకాణాలను గిరిజనులకే కేటాయించగా... గిరిజనులను బినామీలుగా చేసి టీడీపీ గిరిజనేతర నేతలు మద్యం దుకాణాలను దక్కించుకున్నారు. నర్సీపట్నం కేంద్రంగా టీడీపీ వర్గీయులే ఆ 40 మద్యం దుకాణాలను హస్తగతం చేసుకోవడం గమనార్హం. ⇒ విజయనగరం జిల్లాలో నోటిఫై చేసిన 153 మద్యం దుకాణాలకు 5,237 దరఖాస్తులు దాఖలయ్యాయి. టీడీపీ నాయకులు, వారి బినామీలే షాపులను దక్కించుకున్నారు.అధికార పార్టీ అరాచకాలు⇒ వైఎస్సార్ కడప జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలు బరితెగించి బెదిరింపులకు పాల్పడ్డారు. ఓ ప్రైవేట్ చానల్ అధిపతికి లాటరీ ద్వారా కమలాపురం నియోజకవర్గంలో నాలుగు మద్యం దుకాణాల లైసెన్సులు దక్కాయి. దీనిపై టీడీపీ ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి వర్గీయులు మండిపడ్డారు. ఆ చానల్ ప్రతినిధులను పిలిపించి బెదిరించారు. తమకు 50 శాతం వాటా ఇస్తేనే దుకాణాలు నిర్వహించుకోగలరని హెచ్చరించారు. ఇక జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి స్వయంగా పలువురికి ఫోన్లు చేసి బెదిరించినట్లు సమాచారం. కడపలో లాటరీ ద్వారా దుకాణాలు దక్కించుకున్న వారంతా తన వద్దకు రావాలని.. తనకు 50 శాతం వాటాగానీ 30 శాతం కమీషన్‌గానీ ఇవ్వాలని తేల్చిచెప్పారు. లేదంటే ఒక్కరు కూడా మద్యం దుకాణాన్ని నిర్వహించలేరని బెదిరించినట్లు తెలుస్తోంది.⇒ అన్నమయ్య జిల్లాలో మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి సోదరుడు రాహుల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథ్‌రెడ్డి బంధువు కిరణ్, మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డి కుమార్తె సానపురెడ్డి సుజతోపాటు టీడీపీ సిండికేట్ సభ్యులే ఏకపక్షంగా లైసెన్సులు దక్కించుకున్నారు. సంబేపల్లి, కోడూరు, తంబళ్లపలత్లి, పీలేరు తదితర ప్రాంతాల్లో లాటరీ ద్వారా లైసెన్సులు పొందినవారిని పిలిపించి బెదిరిస్తున్నారు. ⇒ అనంతపురం జిల్లాల్లో టీడీపీ సిండికేట్ బెదిరింపులు యథేచ్ఛగా సాగాయి. ఆత్మకూరులో షాపు నెంబర్ 35 లైసెన్స్ స్వాతి అనే యువతికి లాటరీలో దక్కడంతో పరిటాల సునీత వర్గీయులు ఆమెను తీవ్రంగా బెదిరించారు. ఆమె డబ్బులు చెల్లించేందుకు ప్రయత్నించినా అధికారులు స్వీకరించేందుకు నిరాకరించడం గమనార్హం. దాంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం పరిటాల వర్గీయులకు ఆ లైసెన్సును కేటాయించారు. ⇒ శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గ పరిధిలోని ఐదు మద్యం షాపులు బీజేపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులుకు దక్కాయి. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌కు ఆయన సన్నిహితుడు. ⇒ కర్నూలు జిల్లాలో 99 దుకాణాలకు 3,046 దరఖాస్తులు అందాయి. కోడుమూరు, పత్తికొండ, పాణ్యం నియోజకవర్గాల్లో కొత్తగా దుకాణాలు దక్కించుకున్న వారిని అధికార పార్టీ నేతలు బెదిరిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ⇒ తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా 125 షాపులకు లాటరీ నిర్వహించగా సింహభాగం టీడీపీ, జనసేన సిండికేట్ దక్కించుకుంది. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో 17 షాపులు సిండికేట్‌కు దక్కాయి. ⇒ పశ్చిమ గోదావరి జిల్లాలో 175 మద్యం షాపులకు 5,627 దరఖాస్తులు రాగా లాటరీలో మొదట షాపు దక్కిన దరఖాస్తుదారుడు డ్రాప్ అవడంతో మరో రెండు రిజర్వు టోకెన్లు తీశారు.⇒ ఏలూరు జిల్లాలో 144 షాపులకు 5,499 దరఖాస్తులు అందాయి. ఆగిరిపల్లిలో మూడు షాపులను మంత్రి అనుచరుల సిండికేట్ దక్కించుకుంది. పోలవరం నియోజకవర్గం కుక్కునూరులో ఎస్టీ రిజర్వుడ్ కేటగిరీలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్‌కు షాపు దక్కింది. ఏలూరు జిల్లా వ్యాప్తంగా 8 మంది మహిళలకు వైన్‌షాపులు దక్కాయి. ⇒ కాకినాడ జిల్లాలో 155 మద్యం షాపులకు 3,332 దరఖాస్తులు వచ్చాయి. ప్రత్తిపాడు స్టేషన్ పరిధిలోని ఒక దుకాణానికి 37 మంది పోటీ పడ్డారు. విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి దరఖాస్తు చేసిన వారిలో 20 మంది షాపులు దక్కించుకున్నారు. ⇒ శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 182 మద్యం దుకాణాలకు 3,890 దరఖాస్తులు అందాయి. 24 దుకాణాలను మహిళలు దక్కించుకున్నారు. ⇒ గుంటూరు జిల్లాలో 127 మద్యం షాపులకు 4,448 టెండర్లు దాఖలయ్యాయి. సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ప్రధాన అనుచరుడు ప్రత్తిపాడు నియోజకవర్గంలో షాపు దక్కించుకున్నారు. ⇒ బాపట్ల జిల్లాలో మద్యం దుకాణాలను మంత్రులు అనగాని సత్య ప్రసాద్, గొట్టిపాటి రవికుమార్ నేతృత్వంలోని సిండికేట్ ఏకపక్షంగా దక్కించుకుంది. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పీఏకి రెండు దుకాణాలు దక్కాయి. కొండపిలో మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య పీఏకి ఒక దుకాణం లభించింది. మార్కాపురంలో టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అనుచరులు రెండు దుకాణాలు, జనసేన నేత ఒక దుకాణాన్ని దక్కించుకున్నారు. దర్శి టీడీపీ ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మి 50 శాతం కప్పం చెల్లించాలని హుకుం జారీ చేసినట్లు చెబుతున్నారు.మాచర్లలో తెలంగాణ వ్యాపారి తిప్పలుతెలంగాణకు చెందిన ఓ వ్యాపారికి పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో రెండు మద్యం దుకాణాల లైసెన్సులు దక్కాయి. టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి వర్గీయులు ఆయన్ని బెదిరించడంతో తెలంగాణలోని ప్రజాప్రతినిధి ద్వారా సిఫార్సు చేయించుకోవాల్సి వచ్చింది. అయినా సరే 50 శాతం వాటా ఇస్తేనే సమ్మతిస్తామని జూలకంటి వర్గీయులు చెప్పడంతో ఆ వ్యాపారి సమ్మతించక తప్పలేదు. ఆ రెండు మినహా మాచర్ల నియోజకవర్గంలోని అన్ని మద్యం దుకాణాలను ఎమ్మెల్యే జూలకంటి వర్గమే ఏకపక్షంగా దక్కించుకుంది.హిందూపురంలో కిడ్నాప్.. ధర్నాసాక్షి, పుట్టపర్తి: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం లేపాక్షిలో మద్యం షాపు (నం.57) లాటరీలో దక్కించుకున్న రంగనాథ్‌ను కిడ్నాప్ చేసినట్లు ఆయన కుటుంబ సభ్యులు సోమవారం పుట్టపర్తిలోని సాయి ఆరామం వద్ద ఆందోళన నిర్వహించారు. దీనిపై పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు సైతం చేశారు. రూ.15 లక్షలు ఇస్తామని.. షాపు వదిలిపెట్టాలని రంగనాథ్‌ను బెదిరింపులకు గురి చేసినట్లు సమాచారం. అయితే ఆడియో రికార్డింగ్ లీక్ కావడంతో వెనక్కి తగ్గిన కిడ్నాపర్లు రంగనాథ్‌ను వదిలేశారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని అనంతరం రంగనాథ్ పోలీసులతో పేర్కొన్నాడు. ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏల కనుసన్నల్లోనే మద్యం దరఖాస్తుల ప్రక్రియ సాగినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
PV సునీల్ కుమార్ పై ఏపీ ప్రభుత్వ చర్యలను తప్పు బట్టిన RS ప్రవీణ్ కుమార్
-
ఆకాశమే హద్దుగా.. 'ధరాభారం'
‘‘నిత్యావసర వస్తువులన్నీ పెరిగిపోయాయా లేదా అని మిమ్మల్నందరినీ అడుగుతున్నా.. బియ్యం రూ.55 అయిపోయింది.. కందిపప్పు 160.. వంట నూనె 120.. ఇలా కడాన ఇంటికి అదనంగా ఐదేళ్లలో రూ.8 లక్షల భారం పడింది. నా ఆడపడుచులందరికీ ఈ ఎనిమిది లక్షలు ఇచ్చాడా ఈ ముఖ్యమంత్రీ?’’. మొన్న ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఊరూవాడా మైకు పట్టుకుని ఇలా హోరెత్తించారు. సీన్ కట్‌చేస్తే.. ఆయన సీఎం పీఠమెక్కారు. ఇప్పుడు రాష్ట్రంలో ఏం జరగాలి? నిజానికి.. ధరలు దిగిరావాలి. కానీ ఏం జరుగుతోంది? ఆకాశమే హద్దుగా పైపైకి పోతున్నాయి. ప్రజలను ఏదో ఉద్ధరిస్తామంటూ జట్టు కట్టిన టీడీపీ–జనసేన–బీజేపీ చోద్యం చూస్తూ సామాన్య జనం నడ్డి విరుస్తున్నాయి. దీంతో.. ‘వాటిజ్ దిస్ బాబుగారు.. వీ ఆర్ ఆస్కింగ్ స్ట్రెయిట్ క్వశ్చన్’.. అని ప్రజలు ఇప్పుడు సూటిగా ప్రశ్నిస్తున్నారు.రాష్ట్రంలో రోజురోజుకూ నింగినంటుతున్న నిత్యావసరాలు, కూరగాయల ధరలను చూసి సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. మేలో ఉన్న ధరలతో పోలిస్తే కనీసం 30–100 శాతం మేర ధరలు పెరిగాయి. ఎంతలా అంటే.. రాష్ట్రంలో ధరలు జాతీయ సగటును మించిపోయాయి. కారణం.. ‘కూటమి’ పార్టీల్లాగే వ్యాపారులందరూ ఒక్కటయ్యారు. వరదలు, వర్షాల సాకుతో కూరగాయల వ్యాపారులు.. సుంకాలు పెరిగాయంటూ నిత్యావసరాల వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి అడ్డగోలుగా ధరలు పెంచేశారు. అయితే.. మార్కెట్‌ను నియంత్రించి, ధరలు అందుబాటులో ఉండేలా చూడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కష్టాలేవీ పట్టకుండా మద్యం, ఇసుక దందాలో మునిగితేలుతోంది. – సాక్షి, అమరావతి కాటేస్తున్న కూరగాయలు.. రిటైల్ మార్కెట్లో నాలుగు నెలల క్రితం కిలో రూ.28 ఉన్న టమోటాల ధర ప్రస్తుతం సెంచరీ దాటింది. విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ వంటి ప్రధాన నగరాల్లో రిటైల్ మార్కెట్లో రూ.100 నుంచి రూ.110 మధ్య పలుకుతోంది. గతేడాది ఇదే సీజన్లో మహారాష్ట్రలో కురిసిన వర్షాలతో టమోటా ధరలు ఒక్కసారిగా వంద దాటిపోయాయి. ఆ సమయంలో నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతుల నుంచి ఓ దశలో కిలో రూ.150 చొప్పున సేకరించింది. ఇలా రూ.14.66కోట్లు వెచ్చించి రూ.1,364.55 టన్నుల టమోటాలు సేకరించి రూ.50 చొప్పున సబ్సిడీపై వినియోగదారులకు సరఫరా చేశారు. ప్రస్తుతం అనంతపురం, గుంటూరు, విశాఖపట్నం, ఎన్టీఆర్ జిల్లాల్లోని ఎంపిక చేసిన కొన్ని రైతుబజార్లలో మాత్రమే సరఫరా చేస్తున్నారు. అది కూడా రూ.70కి పైగానే. ఇక కిలో రూ.25 ఉన్న ఉల్లి ప్రస్తుతం రూ.70–80 వరకు విక్రయిస్తున్నారు. బంగాళదుంపలు మినహా మిగిలిన కూరగాయలన్నీ కిలో రూ.70 పైమాటగానే ఉన్నాయి. రూ.10కు దొరికే కొత్తిమీర కట్ట సైతం రూ.50–60 ఉంది. ఐదు కట్టలు రూ.20కు దొరికే ఆకుకూర ఏదైనాసరే కట్ట రూ.10కు తక్కువకు దొరకడంలేదు. పైగా.. కొందామంటే మార్కెట్లో దొరకని పరిస్థితి ఉంది. మొత్తం మీద రూ.150–200 పెడితే బ్యాగ్ నిండే కూరగాయల కోసం ఇప్పుడు రూ.500–600 పెట్టాల్సి వస్తోంది. మరుగుతున్న నూనె ధరలు.. కేంద్రం దిగుమతి సుంకం పెంచిందన్న సాకుతో కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచేస్తున్నారు. ఫలితంగా దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలో వంట నూనెల ధరలూ విపరీతంగా పెరిగాయి. ప్రియా, ఫ్రీడం, రుచి ఇలా ప్రధాన బ్రాండ్ నూనెల ధరలన్నీ కిలోకి రూ.25–30 వరకు పెరిగిపోయాయి. దిగుమతి సుంకంతో సంబంధంలేని కొబ్బరి నూనె కిలోకి రూ.18, వేరుశనగ నూనెపై రూ.10, పూజాదికాలకు ఉపయోగించే నూనెలపై రూ.10 నుంచి రూ.30 చొప్పున పెంచేశారు. ప్రియా ఆయిల్స్ అయితే ఇతర బ్రాండ్ ధరల కంటే రూ.10 అదనంగా ఉన్నాయి. ధరలు పెంచిన తర్వాత మొక్కబడి తంతుగా నాలుగైదు రోజులు విజిలెన్స్ అధికారులు హడావుడి చేశారు. ఆ తర్వాత పత్తా లేకుండాపోయారు. ఆ మూడింటి తర్వాత ఏపీలోనే పప్పుల ధరలు ఎక్కువ.. ఇక మేలో కిలో రూ.166.12 ఉన్న కందిపప్పు ప్రస్తుతం రూ.180–220 మధ్య ఉంది. పెసర పప్పు రూ.120.85 నుంచి రూ.139కి పెరిగింది. గోవా, అండమాన్ నికోబార్ దీవులు, మహారాష్ట్ర తర్వాత పప్పుల ధరలు ఏపీలోనే ఎక్కువ. కూటమి ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు దాటినా కందిపప్పు కాదు కదా కనీసం అర కిలో పంచదార కూడా సక్రమంగా ఇవ్వలేకపోతోంది. బహిరంగ మార్కెట్లో కిలోకి రూ.10–20 తగ్గించామని గొప్పలు చెబుతున్నప్పటికీ అవన్నీ నాసిరకం పప్పులే. గోధుమ పిండి సైతం కిలో రూ.45 నుంచి రూ.76కు పైగా పెరిగింది. బాబోయ్ బియ్యం.. మరోవైపు.. రోజువారీ మెనూలో ముఖ్యభూమిక పోషించే బియ్యం ధరలూ ప్రజలను వణికిస్తున్నాయి. పంజాబ్‌లో కిలో బియ్యం ధర రూ.39.58 మాత్రమే. కానీ, అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రాలో మాత్రం వీటి ధరలకు అసాధారణంగా రెక్కలొస్తున్నాయి. సాధారణ రకం బియ్యమే ప్రస్తుతం కిలో రూ.57 ఉండగా, సూపర్ ఫైన్ బియ్యం (సోనా మసూరి, హెచ్ఎంటీ, బీపీటీ రకాలు) కిలో రూ.65 నుంచి రూ.76కి పైనే పలుకుతున్నాయి. లూజ్ బాస్మతి బియ్యం కిలో రూ.119కి పైగా ఉంది. వాస్తవానికి బియ్యం రేట్లు సహజంగా పెరగట్లేదు. దేశవ్యాప్తంగా బియ్యం నిల్వలకూ లోటులేదు. కానీ, వ్యాపారులు, మిల్లర్లు సిండికేట్‌గా మారి బ్లాక్ చేస్తుండడంతో రేట్లు పెరుగుతున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే, బాస్మతియేతర బియ్యం ఎగుమతులపై కేంద్రం నిషేధం ఎత్తేసింది. అలాగే, పారాబాయిల్డ్, బ్రౌన్ రైస్ ఎగుమతి సుంకాన్ని 20 నుంచి 10 శాతానికి తగ్గింది. దీంతో ధరలకు రెక్కలొచ్చాయి.ధరల స్థిరీకరణ నిధి ఏది.. గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి పరిస్థితుల్లో ధరల స్థిరీకరణ నిధి ద్వారా మార్కెట్లో జోక్యం చేసుకుని రైతుల నుంచి మార్కెట్ ధరకు కొనుగోలు చేసి సబ్సిడీపై వినియోగదారులకు విక్రయించేవారు. ఐదేళ్లలో రూ.18 కోట్ల విలువైన 8,460 టన్నుల టమోటాలను రైతుల నుంచి మార్కెట్ ధరకే కొనుగోలు చేసి సబ్సిడీపై కిలో రూ.50కే విక్రయించే వారు. అలాగే, రూ.69 కోట్ల విలువైన 94,335 క్వింటాళ్ల ఉల్లిని కొనుగోలు చేశారు. ఇలా ఐదేళ్లలో మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద రూ.7,758 కోట్ల విలువైన 21.60 లక్షల టన్నులను 6.17 లక్షల మంది రైతుల నుంచి సేకరించారు. అలాగే, వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఫోర్టిఫైడ్ గోధుమ పిండిని ప్యాకెట్ల రూపంలో కిలో రూ.11కే పంపిణీ చేసేవారు. కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. అధికారులను అడిగితే బడ్జెట్లేదని తేల్చి చెప్పేస్తున్నారు. గడిచిన నెలరోజులుగా స్థానిక హోల్‌సేల్ మార్కెట్లో టమోటాలు సేకరించి రవాణా ఖర్చులు కలుపుకుని రైతుబజార్లలో విక్రయిస్తున్నారు.ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.. కూరగాయలు కొందామంటే భయమేస్తోంది. టమోటా రూ.100 దాటిపోయింది. రైతుబజార్లలో కూడా కిలో రూ.75కు తక్కువగా ఇవ్వడంలేదు. పైగా ఎక్కడా సరుకు ఉండడంలేదు. బహిరంగ మార్కెట్లో ఉల్లి నుంచి కొత్తిమీర వరకు అన్ని ధరలు చుక్కలనంటుతున్నాయి. బియ్యం, నూనె ధరలు అమాంతం పెరిగిపోయాయి. ధరల నియంత్రణను ప్రభుత్వం గాలికొదిలేసినట్లుంది. – జే.సోమేశ్వరరావు, ప్రైవేటు ఉద్యోగి, విశాఖపట్నం ధరలను నియంత్రించాలి.. బహిరంగ మార్కెట్లో కూరగాయలు, నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి. కిలో రూ.20–30లకు వచ్చే బెండ, వంకాయలకు సైతం నేడు రూ.కిలో రూ.80కు పైగా పెట్టాల్సి వస్తోంది. టమోటాలైతే కిలో రూ.100 దాటింది. రైతుబజార్లలో నాణ్యతలేనివి కిలో రూ.70కు పైగానే పలుకుతున్నాయి. – వన్నెంరెడ్డి సురేష్, విజయవాడ సబ్సిడీ ధరకే విక్రయించాలి.. గతంలో ఇలా టమోటాలు పెరిగినప్పుడు కిలో రూ.50లకే రైతుబజార్ల ద్వారా విక్రయించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితిలేదు. ప్రభుత్వం రైతుల నుంచి సేకరించి అన్ని రైతుబజార్లలో కిలో రూ.50కే టమోటాలు సరఫరా చేయాలి. కూరగాయలతో పాటు నిత్యావసర ధరలనూ నియంత్రించాలి. – సీహెచ్ శివపార్వతి, కొల్లూరు, బాపట్ల ఇలా అయితే బతికేదెలా.. మార్కెట్లో కూరగాయలే కాదు.. నిత్యావసరాల ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గడిచిన నాలుగు నెలలుగా విపరీతంగా పెరిగాయి. కిలో రూ.25–40 మధ్య దొరికే కూరగాయలు ప్రస్తుతం రూ.80కుపైగా పలుకుతున్నాయి. నూనెలు, బియ్యం ధరలూ అంతే. సామాన్య, మధ్యతరగతి ప్రజలు బతకడం కష్టంగా ఉంది. – శ్రీలక్ష్మి, వెంగళాయపాలెం, గుంటూరు నూనె ధరలు పెరిగిపోయాయి.. ఆయిల్, పప్పుల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. సన్‌ఫ్లవర్ ఆయిల్స్ లీటర్‌కు రూ.25కు పైగా పెరిగాయి. పప్పుల ధరలు కూడా నాణ్యతను బట్టి కిలోకు రూ.30 వరకు పెరిగిపోయాయి. కూరగాయ ఏదైనాసరే రూ.80కి తక్కువలేదు. చికెన్ కూడా కిలో రూ.240 దాటిపోయింది. ధరలు పెరిగిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. – పి. దేవీకృష్ణవేణి, కాకినాడ -
బాబు మోసాలపై ప్రజాగ్రహం: వైఎస్ జగన్
వైఎస్సార్సీపీ – టీడీపీ పాలన మధ్య తేడాను ప్రజలు గమనించారు. రెండు ప్రభుత్వాల్లో ఎవరి వల్ల మంచి జరిగిందన్నది ప్రతి కుటుంబంలోనూ చర్చ జరుగుతోంది. చంద్రబాబు చెప్పిన అబద్ధాలు మోసాలవుతాయి.. ఆ మోసాలపై ప్రజలకు రోజురోజుకూ ఆగ్రహం పెరుగుతుంది. అది ఎంత తీవ్రంగా ఉంటుందంటే.. ఇప్పటి ఫలితాలు పూర్తిగా తారుమారు అవుతాయి. – వైఎస్ జగన్సాక్షి, అమరావతి: అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్నా సీఎం చంద్రబాబు కనీసం వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోతున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. దేశం, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా, ఎన్నడూ జరగని విధంగా ఈ ప్రభుత్వం ఇంతవరకు రెగ్యులర్ బడ్జెట్ పెట్టలేదని, ఇంకా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌పైనే కాలం గడుపుతోందని విమర్శించారు. రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెడితే ఏయే స్కీమ్‌కు ఎంత కేటాయించారన్నది చెప్పాల్సి ఉంటుందని.. అలా చెప్పకుంటే ప్రజలు తిడతారనే భయంతో బడ్జెట్ ప్రవేశపెట్టకుండా చంద్రబాబు కాలయాపన చేస్తున్నారని దుయ్యబట్టారు. గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల పార్టీ నాయకులు, జెడ్పీటీసీలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జెడ్పీ చైర్పర్సన్ పార్టీ మారినా, జెడ్పీటీసీలు కలసికట్టుగా నిలబడ్డారని ప్రశంసించారు. జెడ్పీటీసీల పోరాట స్ఫూర్తికి అభినందనలు తెలిపారు. ‘రాజకీయాల్లో మీరు విలువలు, విశ్వసనీయత చూపారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 48 జెడ్పీటీసీల్లో మన పార్టీ తరఫున 46 మంది గెలిచాం. అందులో ఒకరు ఎమ్మెల్సీ కావడంతో 45 మంది మిగిలారు. కలసికట్టుగా నిలిచిన జెడ్పీటీసీలందరికీ ధన్యవాదాలు. మీ వ్యక్తిత్వం చాలా మందికి ఆదర్శంగా నిలిచింది..’ అని అభినందించారు. సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే... సమావేశానికి హాజరైన పశ్చిమ గోదావరి జిల్లా ప్రజాప్రతినిధులు, నాయకులు సమస్యలున్నా మేం వెనక్కి తగ్గలేదు మన ఐదేళ్ల పాలనలో ప్రజలకు చెప్పిన ప్రతి మాట నెరవేర్చాం. రాజకీయాల్లో మేనిఫెస్టో అన్నదానికి ఒక నిర్వచనం ఇచ్చాం. మేనిఫెస్టోను ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావించి తు.చ. తప్పకుండా తొలి రోజు నుంచే అమలు చేశాం. ఎలాంటి సాకులు వెతుక్కోలేదు. రెండేళ్లు కోవిడ్ లాంటి సమస్యలు ఎదుర్కొన్నా.. రాష్ట్రానికి ఆదాయాలు తగ్గినా ఎక్కడా ప్రజలకు చేయాల్సిన పనుల్లో మనం వెనక్కి తగ్గలేదు. అదే కారణాలు చెప్పాల్సి వస్తే.. మన ప్రభుత్వంలో వచ్చినన్ని కష్టాలు ఎక్కడా, ఎవరూ చూసి ఉండరు. చాలా మంది నా దగ్గరకు వచ్చి.. ఇన్ని కష్టాలున్నప్పుడు, ఆ కారణాలు చెప్పొచ్చు కదా? అని అన్నారు. అన్నీ సవ్యంగా ఉన్నప్పుడే మేనిఫెస్టోను అమలు చేయవచ్చని కూడా చెప్పారు. అయితే మనం ఎన్నికలప్పుడు మేనిఫెస్టోను ఇచ్చాం. ప్రజలు మనకు ఓటేశారు. మనం ప్రజలకిచ్చిన మాట మరో 30 ఏళ్ల పాటు మన బాటను నిర్దేశిస్తుంది. ఎన్ని కష్టాలున్నా మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని చిరునవ్వుతో నెరవేర్చాం. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా బడ్జెట్ కన్నా ముందే ప్రతి పథకానికి సంబంధించి క్యాలెండర్ విడుదల చేశాం. ఏ నెలలో ఏ పథకం ఇస్తామో ముందే చెప్పాం. చెప్పినట్లుగా ఆ నెలలో బటన్ నొక్కి నేరుగా డబ్బులు విడుదల చేయడం బహుశా దేశ చరిత్రలో ఎప్పుడూ జరిగి ఉండదు. సమావేశానికి హాజరైన ఏలూరు జిల్లా ప్రజాప్రతినిధులు, నాయకులు అబద్ధాల్లో అస్సలు పోటీ పడలేదుఐదేళ్ల పాలనా కాలంలో మనం చేసిన మంచి ఎక్కడికీ పోలేదు. ఆ మంచి ఇంకా బతికే ఉంది. ‘జగన్ మంచే చేశాడు... ఎక్కడా చెడు చేయలేదు’ అన్న మాటే ప్రతి చోటా వినిపిస్తోంది. గత ఎన్నికల్లో అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబుతో మనం అస్సలు పోటీ పడలేదు. ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసేటప్పుడు చంద్రబాబులా జగన్ కూడా హామీలు ఇవ్వాలని చాలా మంది ఆశించారు. పిల్లలు కనిపిస్తే చంద్రబాబులా.. నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు అని.. చెల్లెమ్మలు కనిపిస్తే నీకు రూ.18 వేలు అని, 50 ఏళ్లు నిండిన పెద్దమ్మలు కనిపిస్తే నీకు రూ.48 వేలు అని జగన్ కూడా చెబుతాడని ఆశించారు. మెడలో కండువాలతో రైతులు కనిపిస్తే.. నీకు రూ.20 వేలు అని జగన్ చెబుతాడని ఆశించారు. 20 ఏళ్లు దాటిన యువత కనిపిస్తే నీకు రూ.36వేలు అని చంద్రబాబు మాదిరిగా జగన్ కూడా చెబుతాడని ఆశించారు. కానీ జగన్ అలా చెప్పలేకపోయాడు. ఎప్పుడూ తలెత్తుకునేలా రాజకీయాలు చేశాం.. ఒకవేళ జగన్ అవే మాటలు చెప్పి ఉంటే.. అధికారంలోకి వచ్చి ఉండే వాళ్లమేమో! కానీ ఇవాళ పరిస్థితులను మీరంతా చూస్తూనే ఉన్నారు. చంద్రబాబు కనీసం బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని పరిస్థితి ఉంది. ప్రజలను దారుణంగా మోసం చేశారు. ఇచ్చిన మాట ఏ ఒక్కటీ నెరవేర్చని పరిస్థితి కనిపిస్తోంది. మరి నేను కూడా అదే మాదిరిగా చేసి ఉంటే.. మీలో ఏ ఒక్కరైనా తలెత్తుకుని గ్రామాల్లోకి వెళ్లగలిగేవారా? మా జగన్ ఇది చెప్పాడు..! కానీ మా ప్రభుత్వంలో ఇది చేయలేకపోతున్నామనే మాట చెప్పాల్సి వస్తే.. మిమ్మల్ని ప్రజలు ప్రశ్నిస్తే తట్టుకునేవారా? అందుకే.. రాజకీయాల్లో వ్యక్తిత్వం, విశ్వసనీయత, విలువలు లేకపోతే ప్రజల్లో చులకన అవుతాం. మనం ఎప్పుడూ తలెత్తుకునేలా రాజకీయాలు చేశాం. ఇకపై కూడా అలాంటి రాజకీయాలే చేస్తాం. కష్ట కాలంలోనే వ్యక్తిత్వం బయట పడుతుంది రాష్ట్రంలో అధికార దుర్వినియోగం తీవ్రంగా ఉంది. రాజకీయాల్లో వ్యక్తిత్వం చాలా ముఖ్యం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసులు నమోదు అవుతాయి. వేధింపులు ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో కార్యకర్తలకు తోడుగా, అండగా ఉండాలి. నియోజకవర్గంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా న్యాయపరమైన సహాయం చేయడంతో పాటు ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను ప్రశ్నించాలి. రాజకీయాల్లోనూ చీకటి తర్వాత మళ్లీ పగలు వస్తుంది. కష్టకాలం వచ్చినప్పుడు మనం ఎలా ప్రవర్తించామన్నది రాజకీయాల్లో మన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది. కష్ట కాలంలోనే ఒక మనిషి వ్యక్తిత్వం బయట పడుతుంది. కష్టం వచ్చినప్పుడు ఒక మనిషి గట్టిగా నిలబడగలిగితే తనకు దేవుడి ఆశీస్సులు, ప్రజల దీవెనలు ఉంటాయి. అప్పుడే తను ఒక నాయకుడిగా ఎదుగుతాడు. ఇది రాజకీయాల్లో చాలా ముఖ్యమైన అంశం. వచ్చేది కచ్చితంగా మన ప్రభుత్వమేప్రజల తరపున మనం ఉద్యమించాలి. ప్రజల కష్టాల్లో భాగస్వాములు కావాలి. కేసులు పెడతారని భయపడొద్దు. కేసులు పెడితే ఏమవుతుంది? నన్ను 16 నెలలు జైలుకు పంపించారు. నన్ను వేధించినట్టుగా ఎవరినీ వేధించి ఉండరు. అయినా ప్రజల ఆశీస్సులతో ముందుకు సాగాం. మళ్లీ బయటకు వచ్చి ప్రజలకు అండగా నిలబడ్డాం. ముఖ్యమంత్రిని కూడా అయ్యా. కేసులు పెట్టడం మినహా ఇంతకన్నా ఏం చేయగలుగుతారు? రెడ్ బుక్ పెట్టడం ఏమన్నా పెద్ద పనా? అదేమన్నా గొప్ప విషయమా? న్యాయం, ధర్మం కచ్చితంగా ఉండాలని మన ప్రభుత్వంలో తాపత్రయ పడ్డాం. అందుకే ఈ మాదిరిగా పరిపాలన చేయలేదు. ఇవాళ రాష్ట్రంలో అన్యాయమైన పాలన సాగుతోంది. ధైర్యంగా, కలిసికట్టుగా పోరాడుతూ ఉద్యమిద్దాం. కచ్చితంగా.. వచ్చేది మన ప్రభుత్వమే. అంతులేని అవినీతి.. పచ్చ నేతలకే మద్యం షాపులు ఇక ప్రభుత్వ అవినీతి గురించి వేరే చెప్పాల్సిన పని లేదు. పేరుకు ఉచిత ఇసుక అంటూ వైఎస్సార్ సీపీ హయాంలో కంటే ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు. అప్పుడు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. ఇప్పుడు ప్రభుత్వానికి ఆదాయం రాకపోగా మనం అమ్మిన రేటు కన్నా అధిక ధరకు అమ్ముతున్నారు. స్టాక్ పాయింట్లలో ఇసుక మాయం అవుతోంది. ఇక మద్యం పరిస్థితి కూడా అంతే. ప్రజలు బాగు పడాలని, వాళ్ల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని.. వినియోగం తగ్గాలని మనం తాపత్రయ పడ్డాం. ఈ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బ తీసేలా వ్యవహరిస్తోంది. ఎక్కువ లిక్కర్ అమ్మాలి అనే ధోరణితో వెళ్తోంది. 120 రూపాయల మద్యం క్వాలిటీ బాగుంటుందా?. లేక 99 రూపాయల మద్యం బాగుంటుందా? రూ.99కే మద్యం సరఫరా చేసి అమ్మకాలు పెంచుతామంటున్నారు. అలా అమ్మకాలు పెంచితే డిస్టిలరీస్ చంద్రబాబుకు డబ్బులిస్తాయి. ప్రతి దాంట్లోనూ స్కామే. అధికార పార్టీ నేతలకే మద్యం షాపులు కట్టబెడుతున్నారు. ఈ షాపుల నుంచి అధికార పార్టీ ఎమ్మెల్యేలకు వాటాలు సరేసరి. ఇక ప్రతి గ్రామంలోనూ బెల్టు షాపులు వస్తున్నాయి. ప్రతి నియోజకవర్గంలోనూ పేకాట క్లబ్బులు కనిపిస్తున్నాయి. మట్కా లాంటి వ్యవహారాలు జోరుగా సాగుతున్నాయి. దీన్ని ప్రశ్నిస్తూ ఎవరైనా పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే రివర్స్‌లో వారి మీదే దొంగ కేసులు పెడుతున్నారు. కేవలం నాలుగు నెలల్లోనే ప్రతి వ్యవస్ధ పూర్తిగా దిగజారి పోయింది. ప్రజా వ్యతిరేక ప్రభుత్వ పాలన సాగుతోంది.వేధింపులు అడ్డుకోలేవు.. పార్టీ అండగా ఉంటుంది రాజకీయాలలో ఎప్పుడూ చీకటే ఉండదు. వెలుగు కూడా వస్తుంది. ప్రజల తరపున పోరాటాలు చేయండి. ఇందులో వెనుకడుగు వేయాల్సిన పనిలేదు. చంద్రబాబు వేధింపులు మనల్ని ఏమీ చేయలేవు. ఈ వేధింపులు, కేసులు తాత్కాలికం మాత్రమే. ప్రతి ఒక్కరికీ పార్టీ అండగా ఉంటుంది. ఇంత వేగంగా వ్యతిరేకత మూట గట్టుకుంటున్న ప్రభుత్వం మీద ప్రజల తరపున పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. కేసులు పెడతారని ఎవరూ భయపడొద్దు. దేవుడు పైనుంచి అన్నీ చూస్తున్నాడు అనేందుకు తిరుపతి లడ్డూ వ్యవహారమే ఒక ఉదాహరణ. దారుణమైన అబద్ధాలతో విష ప్రచారం చేశారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, పవన్ కళ్యాణ్.. అంతా కలిసి గోబెల్స్ ప్రచారం చేశారు. చంద్రబాబు ఒక అబద్ధాన్ని సృష్టించి, దాన్ని మార్కెటింగ్ కూడా చేసి అమ్మేయగల సమర్ధుడు. అందుకే దేవుడు చంద్రబాబు పాపాలకు మొట్టికాయలు వేశాడు.సూపర్ సిక్స్, సెవన్ ఏమయ్యాయి?జగన్ పలావు పెడితే చంద్రబాబు బిర్యానీ పెడతానన్నారు. బిర్యానీ లేదు కదా.. చివరకు ఉన్న పలావు కూడా పోయింది. ఇవాళ ప్రతి ఒక్కరూ సూపర్ సిక్స్, సూపర్ సెవన్ ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారు. చదువులు పూర్తిగా దెబ్బతిన్నాయి. విద్యాదీవెన, వసతి దీవెన పోయింది. పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ అందని దుస్థితి. మూడు క్వార్టర్లు గడిచిపోయినా ఫీజుల్లేవు. డిగ్రీ, ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లల తల్లిదండ్రులు నరకయాతన పడుతున్నారు. ఇంగ్లీషు మీడియం చదువులు అటకెక్కాయి. టోఫెల్ గాలికెగిరిపోయింది. రోజుకొక మెనూతో అమలయ్యే గోరుముద్ద కార్యక్రమాన్ని నీరు గార్చారు. వైద్య రంగం పూర్తిగా దెబ్బతింది. ఆరోగ్యశ్రీ బిల్లులు రూ.2 వేల కోట్లకు పైగా పెండింగ్‌లో ఉండగా ఆరోగ్య ఆసరా అటకెక్కింది. ప్రభుత్వ రంగంలో శ్రీకారం చుట్టిన 17 కొత్త మెడికల్ కాలేజీల్లో మన హయాంలో ఐదు వచ్చాయి. మరో 5 కొత్త మెడికల్ కాలేజీలకు సీట్లు వస్తే వద్దని ఇప్పుడు అడ్డుకున్నారు. కడుతున్న కొత్త కాలేజీల నిర్మాణాన్ని ఆపేశారు. అవి కూడా అమ్మేస్తామంటున్నారు. 104, 108 ఉద్యోగులకు చంద్రబాబు వచ్చిన తర్వాత జీతాల్లేవు. వైఎస్సార్సీపీ హయాంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో జీఎంపీ (గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్), డబ్ల్యూహెచ్ఓ (ప్రపంచ ఆరోగ్య సంస్థ) ప్రమాణాలతో మందులు సరఫరా చేస్తే ఇప్పుడు అవి ఏమయ్యాయో తెలియదు. మనం స్పెషలిస్టు డాక్టర్ల కొరత లేకుండా చర్యలు తీసుకుంటే.. ఇవాళ ప్రభుత్వ ఆస్పత్రుల్లో వారి కొరత స్పష్టంగా కనిపిస్తోంది. వ్యవసాయ రంగంలో పెట్టుబడి సాయం దేవుడెరుగు.. ఉచిత ఇన్సూరెన్స్ కూడా లేదు. ఆర్బీకేలు అటకెక్కాయి. ఈ–క్రాప్ సక్రమంగా నమోదు చేయలేదు. మన హయాంలో పథకాలు డోర్ డెలివరీ జరిగితే ఇవాళ అది గాలికెగిరిపోయింది. ఇప్పుడు అధికారులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఇళ్లకు వెళ్లి అక్క నుంచి పంపిణీ చేస్తున్నారు. ప్రజలు అక్కడికే వెళ్లాలట. రెండు నెలలు అక్కడికి వెళ్లకపోతే పథకాలు నిలిపివేస్తున్నారు. ఇప్పటికే 1.50 లక్షల పెన్షన్లు నిలిపివేశారు. ప్రతి అడుగులోనూ ఇదే జరుగుతోంది. -
ఫర్నీచర్ సంగతి ఏదో ఒకటి తేల్చండి: వైఎస్సార్సీపీ
గుంటూరు, సాక్షి: తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలోని ఫర్నీచర్ అంశంపై వైఎస్సార్సీపీ.. మూడు నెలల వ్యవధితో ఇప్పుడు ఐదోసారి ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఫర్నీచర్ వీలైనంత త్వరగా వచ్చి తీసుకెళ్లాలని ఆ లేఖలో సాధారణ పరిపాలన విభాగాన్ని(GAD) కోరింది.‘‘గతంలో సీఎం క్యాంప్ కార్యాలయంగా ఉన్నది ఇప్పుడు పార్టీ కార్యాలయంగా మారింది. కాబట్టి.. వెంటనే ఫర్నీచర్‌ను తీసుకెళ్లండి. ఎప్పుడు తీసుకెళ్తారో సమయం చెప్పండి. ఒకవేళ తీసుకుని వెళ్లకపోతే గనుక ఆ ఫర్నీచర్ ఖర్చులు చెబితే.. వాటిని చెల్లిస్తాం’’ అని పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి లేఖ రాశారు. ఈ మేరకు ఐదుసార్లు విషయాన్ని జీఏడీ దృష్టికి తీసుకెళ్లిన అంశాన్ని తేదీలతో సహా ఆయన తన లేఖలో ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్ జగన్ సీఎంగా పని చేసిన క్యాంప్ ఆఫీస్‌లోని ఫర్నీచర్ అంశంపై అనుకూల మీడియాతో రాద్ధాంతం చేయాలని ప్రయత్నించింది. అయితే అప్పటికే జీఏడీకి వైస్సార్సీపీ లేఖ రాసింది. ఇప్పటిదాకా నాలుగుసార్లు లేఖ, మెయిల్ ద్వారా కబురు పంపినా జీడీఏ నుంచి ఉలుకు పలుకు లేదు. దీంతో కేవలం నిందలు మోపడానికే దీనిపై స్పందించడం లేదా? అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఏపీ వ్యాప్తంగా ప్రభుత్వ మద్యం దుకాణాల ఉద్యోగుల నిరసన
-
ఉద్యోగ భద్రత కల్పించాలి
సాక్షి, అమరావతి/పాడేరు: ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు వలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు రూ.10 వేల చొప్పున గౌరవ వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ వివిధ జిల్లా కేంద్రాల్లో వలంటీర్లు సోమవారం నిరసన ర్యాలీలు నిర్వహించారు. పెండింగ్ బకాయిలతో సహా వలంటీర్ల గౌరవ వేతనాలు అక్టోబరు 25లోగా చెల్లించకుంటే నిరసన దీక్షలు చేపడతామని.. రాబోయే కేబినెట్ సమావేశంలోగా తమకు న్యాయం చేయకుంటే ‘చలో సీఎం క్యాంపు కార్యాలయం’ చేపట్టనున్నట్లు వలంటీర్ల సంఘాలు హెచ్చరించాయి. ఇక వీరి ఆందోళనలకు సీపీఐ అనుబంధ ఏఐవైఎఫ్ ప్రతినిధులు తమ సంఘీభావం ప్రకటించారు. ఇదిలా ఉంటే.. అల్లూరు సీతారామరాజు జిల్లాలో 11 మండలాలకు సంబంధించిన దాదాపు రెండువేల మంది వలంటీర్లు పాడేరులో సుమారు మూడు కిలోమీటర్ల మేర భారీ ప్రదర్శన నిర్వహించారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో పలువురు వలంటీర్లు చంటి పిల్లలతో పాల్గొన్నారు. అనంతరం గంటసేపు కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ వలంటీర్లతో మాట్లాడి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అనంతరం వలంటీర్లు ఆయనకు వినతిపత్రాన్ని ఇచ్చారు. అలాగే, కర్నూలు కలెక్టరేట్ ఎదుట కూడా వలంటీర్లు భారీఎత్తున ఆందోళన నిర్వహించి, ర్యాలీ నిర్వహించారు. ఇక ఈ ఏడాది జూన్‌లో రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం వీరికి గౌరవ వేతనాలు చెల్లించలేదు. -
రాయలసీమకు తీవ్ర అన్యాయం
సాక్షి, అమరావతి: వెనుకబడిన రాయలసీమకు చంద్రబాబు సర్కారు మొండి చెయ్యి చూపింది. కర్నూలులో ఏర్పాటు కావాల్సిన నేషనల్ లా యూనివర్సిటీని అమరావతికి తరలిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించి.. 24 గంటలు గడవకుండానే మరో కేంద్రాన్నీ అమరావతికే తరలించారు. వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఎంఎస్ఎంఈ టెక్నాలజీ కేంద్రాన్ని చంద్రబాబు సర్కారు అమరావతికి తరలించేసింది. అన్నీ అమరావతిలోనే ఏర్పాటు కావాలని, ఒక్క అమరావతి మాత్రమే అభివృద్ధి చెందాలన్న దిశగా ప్రతి అడుగూ పడుతోంది. విశాఖపట్నంలో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్‌ను కేంద్రం మంజూరు చేయడంతో పాటు గత ప్రభుత్వ సూచనతో ప్రాంతీయ సమతుల్యతలో భాగంగా వెనుకబడిన వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో కూడా మరో కేంద్రాన్ని మంజూరు చేసింది. కొప్పర్తిలో మెగా ఇండ్రస్టియల్ హబ్ వద్ద 19.5 ఎకరాల భూమిలో రూ.250 కోట్లతో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటునకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. అయితే ఇప్పుడు చంద్రబాబు సర్కారు కొప్పర్తిలోని ఎంఎస్ఎంఈ సెంటర్‌ను సీఆర్డీఏ పరిధిలోని అమరావతికి తరలించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం సమ్మతించడంతో ఈ కేంద్రాన్ని అమరావతికి తరలించేందుకు రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అమరావతిలో మరో ఎంఎస్ఎంఈ సెంటర్ ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరాల్సిన చంద్రబాబు ప్రభుత్వం.. అందుకు భిన్నంగా కొప్పర్తిలో ఏర్పాటయ్యే కేంద్రాన్ని తరలించడం సమంజసంగా లేదని అధికార వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. రూ.100 కోట్లతో ఎంఎస్ఎంఈ క్రెడిట్ గ్యారెంటీ నిధి పరిశ్రమల శాఖ ప్రతిపాదనల మేరకు 2024–25 ఆర్ధిక సంవత్సరానికి రూ.100 కోట్లతో ఎంఎస్ఎంఈ క్రెడిట్ గ్యారెంటీ నిధిని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎంఎస్ఎంఈలకు ఈ నిధి ద్వారా క్రెడిట్ సహకారాన్ని అందించనున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఏపీఐఐసీ భూముల కేటాయింపులకు ఆమోదం గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు పరిశ్రమల ఏర్పాటుకు 50 ఎకరాల్లోపు భూములను కేటాయించే అధికారాన్ని ఏపీఐఐసీకి అప్పగించారు. అందుకు అనుగుణంగా ఏపీఐఐసీ 203 పరిశ్రమల ఏర్పాటుకు 50 ఎకరాల్లోపు భూములను కేటాయించింది. ఆ కేటాయింపులకు రాష్ట్ర భూ కేటాయింపుల కమిటీ ఆమోదం తెలిపిందని పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. -
‘పంతం’ నెగ్గింది.. నిందితుల వైపే కూటమి సర్కారు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడలో దళిత వైద్యుడిపై దాడి ఘటనలో కూటమి పెద్దలు పంతం నెగ్గించుకున్నారు. దళిత సమాజాన్ని చిన్నబుచ్చి నోరెత్తకుండా కట్టడి చేశారు. రంగరాయ మెడికల్ కాలేజీ దళిత ప్రొఫెసర్ వివాదాన్ని కంచికి చేర్చారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన కాకినాడ రంగరాయ కళాశాల ప్రొఫెసర్, ఫోరెన్సిక్ హెచ్ఓడీ డాక్టర్ పి.ఉమామహేశ్వరరావుపై జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ దాడికి తెగబడిన వ్యవహారంలో కూటమి ప్రభుత్వం నిందితుల పక్షానే నిలిచింది. ఈ ఘటనపై నాలుగు రోజుల్లో నాలుగు మలుపులు తిరుగుతూ వచ్చింది. ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావుపై ఎమ్మెల్యే నానాజీ బూతు పురాణం విప్పి దాడి చేయడం, అనుచరుల దౌర్జన్యం వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు, ప్రభుత్వ వైద్యులు, ప్రభుత్వ ఉద్యోగులు, దళిత సంఘాలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నాయి. దళిత వైద్యుడిపై బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఎమ్మెల్యే వ్యవహరించిన తీరును అన్నివర్గాలూ ముక్తకంఠంతో ఖండించాయి. ఆదినుంచీ అదే ప్రయత్నం వివిధ వర్గాలు చేపట్టిన ఆందోళనలు తీవ్రరూపం దాల్చడంతో కూటమి పెద్దలు తెరవెనుక చక్రం తిప్పి కేసును రాజీ చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఘటన జరిగిన రోజున కలెక్టర్ షణ్మోహన్ సగిలి, ఎస్పీ విక్రాంతపాటిల్ నేరుగా రంగంలోకి దిగారు. శాంతిభద్రతల సమస్య ఉత్పన్నం కాకూడదనే వారు చొరవ తీసుకున్నారని అంతా భావించారు. కానీ.. ఈ వ్యవహారంలో దగ్గరుండి రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. ఘటన జరిగిన రోజు రాత్రి వైద్య కళాశాల ప్రిన్సిపాల్, అదనపు డీఎంఈ డాక్టర్ నరసింహం ఎమ్మెల్యే నానాజీ, అతని అనుచరులపై ఇచ్చిన ఫిర్యాదును ప్రభుత్వం నుంచి వచ్చిన తీవ్రమైన ఒత్తిళ్లతో జిల్లా పోలీస్ యంత్రాంగం తొక్కిపెట్టడం విమర్శల పాలైంది. ప్రిన్సిపాల్ ఇచ్చిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకోకుండా నేరుగా వైద్యుడు ఉమామహేశ్వరరావు ఫిర్యాదు ఇస్తేనే దర్యాప్తు చేస్తామంటూ పోలీసులు కొత్త వాదనను తెరమీదకు తీసుకొచ్చారు. కేసు తీవ్రతను తగ్గించేందుకు పోలీస్ యంత్రాంగం మొదటినుంచీ చేస్తున్న ప్రయత్నంగానే కనిపించింది. ప్రాయశ్చిత దీక్ష చేస్తే సరిపోతుందా? అధికారం ఉంది కదా అని అన్యాయంగా ఒక దళిత వైద్యుడిని బూతు పురాణంతో దారుణంగా అవమానించి చంపేస్తానంటూ దాడికి దిగిన ఎమ్మెల్యే నానాజీ నాటకీయంగా క్షమాపణలు చెప్పి.. ప్రాయశ్చితమంటూ దీక్ష చేస్తే సరిపోతుందా అని వైద్య వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఘటనకు బాధ్యుడైన ఎమ్మెల్యే తీరును ఖండిస్తూ జనసేన పార్టీ అధ్యక్షుడైన డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ కనీసం ఒక ప్రకటన కూడా విడుదల చేయకపోవడాన్ని వైద్యవర్గాలు ఆక్షేపిస్తున్నాయి. చివరకు కూటమి ప్రభుత్వ పెద్దల డైరెక్షన్లో పోలీస్ యంత్రాంగం కేసు తీవ్రతను తగ్గించి ఎమ్మెల్యే నానాజీ, అతని అనుచరులకు కొమ్ముకాసిందని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. బెయిల్‌బుల్ సెక్షన్లతో సరి చివరకు ఎమ్మెల్యే నానాజీ, అతని అనుచరులపై కూటమి ప్రభుత్వం బెయిల్‌బుల్ సెక్షన్లతో కేసు నమోదు చేసి తీవ్రతను తగ్గించేసింది. సెక్షన్ 292 బీఎన్ఎస్ (భారత న్యాయసంహిత) పబ్లిక్ న్యూసెన్స్ (రూ.200 జరిమానా), 115(2) బీఎన్ఎస్ స్వల్ప గాయాలు, చేతులతో కొట్టడం (ఏడాది జైలు, రూ.1,000 జరిమానా) 351 బీఎన్ఎస్ వ్యక్తి పరువు తీయడం, శారీరకంగా, మానసికంగా బెదిరించడం (126(2) రెడ్‌విత్ 3(5) బీఎన్ఎస్ ప్రకారం నెల జైలు, రూ.500 జరిమానా) వంటి సెక్షన్లతో సరిపెట్టారు. ఎమ్మెల్యే నానాజీ మరో 10 మందిపై నమోదు చేసిన ఈ సెక్షన్లన్నీ బెయిల్‌కు అవకాశం ఉన్నవే కావడం గమనార్హం. దళితుడైన వైద్యుడిని తీవ్రంగా అవమానించి.. చంపేస్తానని బెదిరించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసినా ప్రభుత్వ ఒత్తిడితో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయకుండా బెయిల్‌కు అవకాశం ఉన్న సెక్షన్లతో కేసును నీరుగార్చేశారు. -
సిట్.. బాబు స్కిట్
శ్రీవారి లడ్డూపై దుష్ప్రచారం తన మెడకే చుట్టుకుంటుండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. దాన్నుంచి తప్పించుకోవడానికి తన నమ్మకస్తులతో కూడిన సొంత టీమ్‌కు తూతూ మంత్ర దర్యాప్తు బాధ్యతలు అప్పగించడం చర్చ నీయాంశమైంది. చంద్రబాబు అండ్ గ్యాంగ్ ఆరోపిస్తున్నట్లు తిరుమల లడ్డూ తయారీలో నిజంగానే కల్తీ నెయ్యి వాడి ఉంటే అత్యున్నత స్థాయి దర్యాప్తు జరిపించడానికి ఎందుకు వెనకాడుతున్నారనే ప్రశ్నలకు వారి వద్ద సమాధానం లేదు. ఈ వ్యవహారంపై సీబీఐ లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ప్రపంచ వ్యాప్తంగా యావత్ హిందూ భక్తులందరూ ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదు. ప్రభుత్వ పెద్దల తీరు పట్ల, టీటీడీ ఈవో రెండు నాల్కల ధోరణిపై సర్వత్రా అనుమానాలు పెల్లుబుకుతుండటంతో చంద్రబాబు నష్ట నివారణలో భాగంగా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ బృందానికి నాయకత్వం వహించే ఐజీ.. సర్వం భ్రష్టు పట్టించే అధికారిగా ఇప్పటికే పేరుగాంచారు.ఇప్పుడు ఈ అధికారి టీడీపీ కేంద్ర కార్యాలయంలో తయారయ్యే నివేదికపై సంతకం మాత్రమే చేయాల్సి ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.సాక్షి, అమరావతి: అనుకున్నంతా అయ్యింది.. తిరుమల లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీసిన ముఖ్యమంత్రి చంద్రబాబు మరో కుట్రకు తెరతీశారు. లడ్డూ ప్రసాదం వివాదంపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ పేరిట తిమ్మిని బమ్మిని చేసే కుతంత్రానికి తెరతీశారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన ఈ అంశంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీతోపాటు పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల డిమాండ్‌ను బేఖాతరు చేస్తూ.. తాము చెప్పినట్టుగా దర్యాప్తును ప్రభావితం చేయాలన్న లక్ష్యంతోనే సిట్‌ను నియమించారు. తానే కర్త, కర్మ, క్రియగా మారి తిరుమల లడ్డూ ప్రసాదంపై దు్రష్పచారం చేసిన చంద్రబాబు.. ఆ కుట్రను కప్పిపుచ్చడమే లక్ష్యంగా ఈ సిట్‌ను ఏర్పాటు చేసినట్టు స్పష్టమవుతోంది. ఎందుకంటే అవాస్తవ ఆరోపణలతో తిరుమల పవిత్రతను టీడీపీ కూటమి ప్రభుత్వం దెబ్బ తీసిందన్నది బట్టబయలైంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై చేసిన ఏ ఆరోపణకు కూడా ఆధారం చూపించలేకపోయారు. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసినట్టు ఎన్డీడీబీ నివేదికలో ఎక్కడా పేర్కొనలేదన్నది స్పష్టమైంది. ఇక కర్ణాటక సహకార పాడి రైతుల సమాఖ్య డెయిరీ (నందిని నెయ్యి)కి ఎందుకు కాంట్రాక్టు ఇవ్వలేదని నిలదీసేందుకు చంద్రబాబు వేసిన ఎత్తుగడ బెడిసికొట్టింది. ఎందుకంటే 2015లో అప్పటి టీడీపీ ప్రభుత్వమే తొలిసారిగా నందిని డెయిరీకి కాంట్రాక్టు ఇవ్వకుండా మహారాష్ట్రలోని ప్రైవేటు డెయిరీకి కాంట్రాక్టు కట్టబెట్టిందన్నది వెల్లడైంది. జంతువుల కొవ్వు కలిపిన నెయ్యి విపరీతమైన దుర్వాసన వస్తుందని ఆహార శాస్త్రవేత్తలు సైతం స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో తిరుమల లడ్డూ ప్రసాదంపై అటువంటి ఫిర్యాదులు రాని విషయాన్ని గుర్తు చేశారు. అన్నింటికంటే ప్రధానంగా.. నెయ్యి కల్తీ జరిగినట్టు నివేదిక వస్తే టీడీపీ ప్రభుత్వం ఆహార భద్రతా చట్టం కింద కేసు ఎందుకు నమోదు చేయలేదని నిపుణుల ప్రశ్నకు చంద్రబాబు ప్రభుత్వం ఖంగుతింది. దాంతో రాజకీయ ప్రయోజనాల కోసం తిరుమల లడ్డూ ప్రసాదానికి కళంకం ఆపాదించే కుట్ర పన్నారని సర్వత్రా ఏకాభిప్రాయం వ్యక్తమవుతోంది. లడ్డూ ప్రసాదం అంశంపై నిష్పక్షపాతంగా దర్యాప్తు నిర్వహించాలని దేశ వ్యాప్తంగా డిమాండ్ వ్యక్తమవుతోంది. మరోవైపు టీడీపీ దుష్ప్రచారాన్ని వైఎస్సార్సీపీ సమర్థవంతంగా తిప్పికొట్టింది. లడ్డూ ప్రసాదం అంశంపై హైకోర్టుగానీ సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితోగానీ విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. రాజ్యసభ మాజీ సభ్యుడు, తిరుమల వ్యవహారాలపై సాధికారికత ఉన్న సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు వ్యాఖ్యలపై విచారించాలని కోరారు. దేశ వ్యాప్తంగా హిందూ సంస్థలు, రిటైర్డ్ బ్యూరోక్రాట్లు కూడా ఈ అంశంపై నిష్పక్షపాతంగా విచారించాలని డిమాండ్ చేస్తున్నారు. దాంతో చంద్రబాబు బెంబేలెత్తారు. సిట్టింగ్ న్యాయమూర్తి ద్వారానో మరో దర్యాప్తు సంస్థ ద్వారానో విచారణ నిర్వహిస్తే తమ కుట్ర బట్టబయలవుతుందని ఆందోళన చెందారు. ఎందుకంటే చంద్రబాబు చేసిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను సిట్టింగ్ న్యాయమూర్తిగానీ ఇతర దర్యాప్తు సంస్థకు గానీ సమర్పించాలి. కానీ రాజకీయ ప్రయోజనాల కోసం లడ్డూ ప్రసాదంపై దు్రష్పచారం చేసిన చంద్రబాబు ఎటువంటి ఆధారాలు చూపించ లేరు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండేట్టుగా.. తాను చెప్పింది చేసేలా సిట్ ఏర్పాటు చేశారు. సిట్ ఇన్చార్జ్గా బాబు జేబులో మనిషి అత్యంత వివాదాస్పద అధికారి, ఇటీవల ఎన్నికల్లో టీడీపీ కూటమి అక్రమాలకు కొమ్ము కాశారని ఆరోపణలు ఎదుర్కొన్న గుంటూరు ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిని సిట్ ఇన్చార్జ్గా నియమించడం పట్ల సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ బృందంలో విశాఖపట్నం డీఐజీ గోపీనాథ్ జెట్టీ, కడప ఎస్పీ హర్షవర్దన్ రాజులను సభ్యులుగా నియమించారు. కాగా, ఎన్నికల్లో అక్రమాలకు చంద్రబాబు, దగ్గుబాటి పురందేశ్వరి పక్కా పన్నాగంతో వ్యవహరించి రాష్ట్రంలో కీలక స్థానాల్లో ఉన్న పోలీసు అధికారులపై దు్రష్పచారం చేశారు. ఎవరెవర్ని బదిలీ చేయాలి.. ఆ స్థానాల్లో ఎవర్ని నియమించాలనే జాబితాను కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్‌కు సమర్పించడం గమనార్హం. టీడీపీ కూటమి ఒత్తిడికి లొంగి ఎన్నికల కమిషన్ అప్పటి గుంటూరు రేంజ్ ఐజీగా ఉన్న పాలరాజును హఠాత్తుగా బదిలీ చేసింది. ఆ స్థానంలో చంద్రబాబు ఆదేశాలతో దగ్గుబాటి పురందేశ్వరి సూచించిన జాబితాలోని సర్వశ్రేష్ఠ త్రిపాఠిని ఐజీగా నియమించింది. అనంతరం ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీ రౌడీమూకలు చెలరేగిపోయి విధ్వంసకాండ సృష్టించడం తెలిసిందే. ప్రధానంగా పల్నాడులో టీడీపీ కూటమి గూండాలు దాడులు, దౌర్జన్యాలతో బెంబేలెత్తించారు. మాచర్లలో వైఎస్సార్సీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై టీడీపీ రౌడీలు దాడులు చేశారు. అప్పటి గురజాల ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ అభ్యర్థి కాసు మహేశ్ రెడ్డిపై దాడికి పాల్పడ్డారు. గురజాలలో బాంబు దాడులకు పాల్పడ్డారు. పల్నాడు వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఓట్లు వేయకుండా పచ్చ రౌడీలు దాడులతో విధ్వంసం సృష్టించారు. టీడీపీ ఎన్నికల అక్రమాలకు పాల్పడుతోందని వైఎస్సార్సీపీ నేతలు ఎంతగా ఫిర్యాదులు చేసినా సరే.. సర్వశ్రేష్ఠ త్రిపాఠి పట్టించుకోలేదు. పోలింగ్ రోజున కనీసం ఫోన్లకు కూడా స్పందించ లేదు. అదీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ట్రాక్ రికార్డ్. అంతటి వివాదాస్పద అధికారిని చంద్రబాబు ప్రస్తుతం తిరుమల లడ్డూ ప్రసాదం అంశంపై ఏర్పాటు చేసిన సిట్‌కు ఇన్చార్జ్గా నియమించడం గమనార్హం. అంటే ఇక సిట్ దర్యాప్తు ఎలా సాగుతుందో.. నివేదిక ఎలా ఉండనుందో ఊహించుకోవచ్చని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. నిబద్ధులైన అధికారులను కాదని.. సిట్ ఇన్చార్జ్గా నియమించేందుకు ఐజీలు వినీత్‌బ్రిజ్‌లాల్, పీహెచ్డీ రామకృష్ణ, ఆకే రవి కృష్ణల పేర్లను పరిశీలిస్తున్నట్టుగా టీడీపీ కూటమి ప్రభుత్వం మీడియాకు లీకులు ఇచ్చింది. కానీ వినీత్ బ్రిజ్‌లాల్ నిజాయితీపరుడు, ముక్కుసూటి అధికారిగా గుర్తింపు పొందారు. ఆయన తాము చెప్పినట్టుగా తప్పుడు నివేదిక ఇవ్వరని చంద్రబాబు భావించారు. టీడీపీ కూటమి ప్రభుత్వ అడ్డగోలు వ్యవహార శైలితో విసిగిపోయిన ఆయన డెప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసులకు వెళ్లాలని కూడా భావిస్తున్నారు. ఇక పీహెచ్డీ రామకృష్ణ కూడా తాము చెప్పినట్టుగా నివేదిక ఇస్తారని చంద్రబాబుకు నమ్మకం లేదు. ఆకే రవికృష్ణ పేరు పరిశీలించారు గానీ పూర్తి నమ్మకం లేకపోవడంతో పక్కన పెట్టేశారు. అందుకే ఇటీవల ఎన్నికల్లో టీడీపీ అక్రమాలకు వత్తాసు పలికిన ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠినే సిట్ ఇన్చార్జ్గా నియమించారు. లడ్డూ ప్రసాదంపై తాము వ్యాప్తిలోకి తెచ్చిన దు్రష్పచారానికి అధికారిక ముద్ర వేసేలా.. తిరుమల పవిత్రతకు భంగకరంగా నివేదిక ఇచ్చి సర్వభ్రష్ఠత్వం పట్టించాలన్న చంద్రబాబు పన్నాగంలో భాగంగానే సర్వ శ్రేష్ఠ త్రిపాఠిని సిట్ ఇన్చార్జ్గా నియమించారన్నది స్పష్టమవుతోంది.