govinda
-
ఎన్నికల ప్రచారంలో నటుడు గోవిందాకు అస్వస్థత
ముంబయి: మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న నటుడు గోవిందా అస్వస్థతకు గురయ్యాయి. జల్గావ్లోని ముక్తైనగర్, బోద్వాడ్, పచోరా, చోప్రాలలో మహాయుతి అభ్యర్థుల తరపున ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు. మీడియాకు అందిన వివరాల ప్రకారం పచోరాలో రోడ్ షో నిర్వహిస్తుండగా గోవిందా ఛాతీ నొప్పితో బాధపడ్డారు. వెంటనే ఇతర నేతలు గోవిందాను ఆస్పత్రికి తరలించారు.మహాయుతిలోని శివసేన (షిండే వర్గం) నేత గోవిందా పచోరాలో రోడ్ షో నిర్వహిస్తున్న సమయంలో అనారోగ్యం పాలవడంతో మధ్యలోనే ప్రచార కార్యక్రమాన్ని నిలిపివేశారు. ఈ రోడ్ షోలో గోవిందా మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మద్దతు ఇవ్వాలని, బీజేపీ, శివసేన, ఎన్సీపీతో కూడిన అధికార కూటమికి ఓటు వేయాలని ప్రజలను కోరారు.ఇటీవల ముంబైలోని తన ఇంట్లో ప్రమాదవశాత్తూ తుపాకీ పేలడం వల్ల గోవిందా కాలికి గాయమైంది. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గోవిందా త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. నాడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత గోవింద తొలుత వీల్ చైర్ లో కనిపించారు. తన ఆరోగ్యం కోసం ప్రార్థనను చేసిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.నవంబర్ 20న మహారాష్ట్రలోని అన్ని స్థానాలకు ఓటింగ్ జరిగనుంది. ఓట్ల లెక్కింపు నవంబర్ 23న నిర్వహించనున్నారు. నవంబర్ 18తో ఎన్నికల ప్రచారం ముగియకముందే అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారంలో తమ సత్తా చాటాయి. ఈ క్రమంలో గోవిందా శివసేన, మహాయుతిల ప్రచారానికి వెళ్లారు. గోవిందా పాల్గొన్న రోడ్ షోను తిలకించేందుకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు.ఇది కూడా చదవండి: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్ -
బుల్లెట్ గాయంతో కోలుకున్న గోవిందా.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్
బాలీవుడ్ సీనియర్ నటుడు, శివసేన నాయకుడు గోవిందా బుల్లెట్ గాయంతో కోలుకున్నారు. తన వ్యక్తిగత గన్ మిస్‌ఫైర్ కావడంతో రెండురోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని వైద్యులు తెలిపారు. దీంతో ఆసుపత్రి నుంచి కూడా డిశ్చార్జ్ అయ్యారు. అక్టోబర్ 1న ముంబైలో ఇంటి నుంచి బయలుదేరే సమయంలో తన రివాల్వర్‌ను శుభ్రం చేస్తుండగా గన్ మిస్‌ఫైర్ అయింది. దీంతో బుల్లెట్ అతని కాలిలోకి దూసుకెళ్లిడంతో తీవ్రంగానే రక్తస్రావమైంది.ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి నుంచి వీల్‌ఛైర్‌లో గోవిందా బయటకు వస్తున్న సమయంలో పలువురు అభిమానులు, ఫొటోగ్రాఫర్లు చుట్టుముట్టారు. తన ఆరోగ్యం గురించి పలు విషయాలను తెలుసుకొని పరామర్శించారు. దీంతో ఆయన కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు. తాను క్షేమంగా ఉన్నానని బదులిచ్చారు. తన కోసం ప్రార్థించిన అభిమానులకు ఆయన ధన్యవాదాలు చెప్పారు. -
తుపాకీ పేలి.. గోవిందా కాలికి గాయం
ముంబై: బాలీవుడ్ నటుడు గోవిందా(60) కాలికి బుల్లెట్ గాయమైంది. ముంబైలోని జుహూ ప్రాంతంలోని ఆయన నివాసంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఎయిర్‌పోర్టుకు బయలుదేరుతుండగా ఉదయం 4.45 గంటల సమయంలో చేతిలో ఉన్న లైసెన్సుడ్ రివాల్వర్ అనుకోకుండా పేలిందని పోలీసులు తెలిపారు. ‘వైద్యులు గోవిందా కాలిలోని బుల్లెట్‌ను తొలగించారు. ఎడమ మోకాలి దిగువన 8–10 కుట్లు పడ్డాయి. ఆయన కోలుకుంటున్నారు’అని పోలీసులు తెలిపారు.ఘటనపై ఎవరూ ఫిర్యాదు చేయలేదు. రివాల్వర్‌ను స్వాధీనం చేసుకుని, దర్యాప్తు చేపట్టామన్నారు. ‘అభిమానులు, తల్లిదండ్రులు, ఆ దేవుని ఆశీర్వాదంతో గాయం నుంచి కోలుకుంటున్నాను. నాకు తగిలిన బుల్లెట్‌ను వైద్యులు తొలగించారు’అంటూ గోవిందా ఒక ఆడియో సందేశం విడుదల చేశారు.మంగళవారం కోల్‌కతాలో జరిగే ఓ షోలో గోవిందా పాల్గొనాల్సి ఉందని ఆయన మేనేజర్ శశి సిన్హా తెలిపారు. రివాల్వర్‌ను కప్‌బోర్డులో ఉంచే సమయంలో పొరపాటున ట్రిగ్గర్‌పై వేలు పడి, పేలి కాలికి తగిలిందని సిన్హా వివరించారు. రివాల్వర్‌ను చెక్ చేస్తుండగా చేతుల్లో జారి అనుకోకుండా పేలిందని గోవిందా సోదరుడు కృతి కుమార్ చెప్పారు. -
Actor Govinda: ఆసుపత్రిలో నటుడు గోవింద..
-
బాలీవుడ్ నటుడు గోవిందాకు బుల్లెట్ గాయాలు
బాలీవుడ్ సీనియర్ నటుడు, శివసేన నాయకుడు గోవిందా బుల్లెట్ గాయంతో ఆస్పత్రిలో చేరారు. మంగళవారం తెల్లవారుజామున 4.45 గంటలకు ప్రమాదం జరిగింది. ముంబైలో ఇంటి నుంచి బయలుదేరే సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రాథమిక నివేదికల ప్రకారం తనకు సంబంధించిన రివాల్వర్‌ను శుభ్రం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బుల్లెట్ కాలిలోకి దూసుకెళ్లడంతో అధిక మొత్తంలో రక్తస్రావం అవుతుండటం వల్ల తక్షణమే ఆయన్ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వెంటనే వైద్యులు ఆయనకు చికిత్స అందించి బుల్లెట్‌ను తొలగించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని గోవిందా మేజేజర్ తెలిపారు. అయితే, కొన్ని రోజులపాటు ఆసుపత్రిలో ఉండాల్సి ఉందన్నారు.గోవిందా అసలు పేరు 'గోవింద్ అర్జున్ అహుజా'. ఆయన నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు, డ్యాన్సర్, కమెడీయన్‌గా అందరికీ పరిచయమే. గోవిందా 165కు పైగా చిత్రాల్లో నటించారు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర ముంబయి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గోవిందా విజయం సాధించారు. అయితే, 2009 వరకు ఎంపీగా కొనసాగిన ఆయన ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీతో పాటు రాజకీయాలకు దూరంగానే ఉంటూ వచ్చారు. 2009 సహా తర్వాతి ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. సుమారు 15 ఏళ్ల తర్వాత గోవిందా మళ్లీ రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఈ ఏడాది మార్చిలో శివసేన పార్టీలో ఆయన చేరారు. -
పుట్టిన మూడు నెలలకే కూతురు చనిపోయింది: స్టార్ హీరో భార్య
బాలీవుడ్ నటుడు గోవిందా బీటౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. లవ్ 86 మూవీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరోగా ఎదిగారు. తన సినీ కెరీర్లో పలు అవార్డులను అందుకున్నారు. అంతేకాకుండా రాజ్యసభ ఎంపీగా కూడా పనిచేశారు. సినిమా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన గోవిందా.. 1987లోనే సునీత అహుజాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన గోవిందా భార్య సునీతా అహుజా ఓ షాకింగ్ విషయాన్ని అభిమానులతో పంచుకుంది. అయితే తమకు పెళ్లైన ఏడాదికే టీనా జన్మించిందని వెల్లడించింది. కానీ.. టీనా తర్వాత మరో కూతురు కూడా పుట్టిందని సునీత తెలిపింది. కానీ నెలలు నిండకముందే బిడ్డ జన్మించడంతో ఊపిరితిత్తులు అభివృద్ధి చెందక మూడు నెలలకే చనిపోయిందని బాధాకర సంఘటనను గుర్తు చేసుకుంది.అందువల్లే తన కొడుకు యశ్‌వర్ధన్‌ను చాలా జాగ్రత్తగా పెంచుకున్నట్లు సునీత వెల్లడించింది. అంతే కాదు తన పిల్లలను ఒంటరిగా వదిలిపెట్టి ఎక్కడికి వెళ్లనని వివరించింది. టీనా కంటే యశ్ ఎనిమిదేళ్లు చిన్నవాడు కావడంతో చాలా గారాబంగా పెంచుకుంటున్నట్లు పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది. తన పిల్లలను పాఠశాల నుంచి నేనే తీసుకువస్తానని సునీత తెలిపింది. -
హీరో ఇంట్లో పనిమనిషిగా మంత్రి కూతురు.. ఏకంగా 20 రోజులు
అభిమానం వెర్రితలలు వేయడం అనే మాట వినే ఉంటారు. ప్రముఖ హీరోహీరోయిన్లపై ఇష్టంతో కొందరు ఫ్యాన్స్ వింత వింత పనులన్నీ చేస్తుంటారు. ఇలానే ఓ అమ్మాయి ఎవరూ ఊహించని పనిచేసింది. ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరో గోవిందా ఇంట్లో ఏకంగా పనిమనిషిగా చేరిపోయింది. తాజాగా ఈ విషయాన్ని సదరు నటుడి భార్య బయటపెట్టింది.అప్పట్లో హిందీలో తనదైన డ్యాన్సులతో గోవిందా గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్ ఇలా ఎన్నో సినిమాలు చేశాడు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇతడి భార్య సునీత రీసెంట్గా ఓ పాడ్ కాస్ట్లో మాట్లాడుతూ.. అప్పట్లో గోవిందా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉండేదోనని ఓ సంఘటన చెప్పి అందరూ అవాక్కయ్యేలా చేసింది.(ఇదీ చదవండి: ఓటీటీ రిలీజ్‌కి ముందే 'తంగలాన్'కి ఎదురుదెబ్బ)'ఆయనకు చాలామంది అభిమానులున్నారు. కానీ అప్పట్లో జరిగిన సంఘటనని అంత సులువుగా మర్చిపోలేను. మాకు పెళ్లయిన కొత్తలో ఓ అమ్మాయి మా ఇంటికి వచ్చింది. ఇంటి పనుల్లో సాయం చేస్తానని పనిమనిషిగా చేరింది. 20 రోజులు మాతోనే ఉంది. ఆమెకు ఇల్లు తుడవడం, గిన్నెలు తోమడం అస్సలు రాదు. షూటింగ్ నుంచి ఆలస్యంగా వచ్చే మా ఆయన కోసం నిద్ర మానుకుని మరీ ఎదురుచూసేది. ఎందుకో అనుమానమొచ్చి ఆమెని కాస్త గట్టిగా అడగ్గా అసలు సంగతి బయటపెట్టింది. నా భర్తకు వీరాభిమాని అని చెప్పింది. దీంతో ఆమె ఇంట్లో వాళ్లకు సమాచారం ఇచ్చాం. ఆమె తండ్రి నాలుగు ఖరీదైన కార్లలో మా ఇంటికి వచ్చారు. ఆయన మంత్రి అని తెలిసి షాకయ్యాం' అని చెప్పారు.ఇక సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న గోవిందా.. కెరీర్ పీక్ దశలో ఉండగానే రాజకీయాల్లోకి వచ్చారు. 2009 వరకు కాంగ్రెస్‌లో ఉన్నారు. ఆ తర్వాత బీజేపీలో చేరిపోయారు.(ఇదీ చదవండి: రూ. 2 వేల కోట్ల భారీ స్కామ్‌లో సినీ నటి అరెస్ట్) -
ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బాలీవుడ్ హీరో గోవిందా తళుక్కున మెరిశారు. దశాబ్దకాలం తర్వాత రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్న ఆయన మహారాష్ట్రలోని శివసేన పార్టీలో చేరారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్నారు. శివసేన స్టార్ క్యాంపెయినర్‌గా పార్టీ ప్రచారాల్లో పాల్గొంటున్నారు. గోవిందా ఎన్నికల ప్రచార వేదికపై డ్యాన్స్ చేస్తూ అందరినీ అలరిస్తున్నారు.ఆయన డ్యాన్స్‌ను చూసిన శివసేన నేతలు కూడా ఉత్పాహంగా ఆయనతోపాటు కాలు కదుపుతున్నారు. గోవిందా స్టైల్, ఉత్సాహం మునుపటిలానే ఉన్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 2004లో ముంబై నార్త్ లోక్‌సభ స్థానం నుంచి గోవిందా కాంగ్రెస్ టిక్కెట్‌పై లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి, బీజేపీ సీనియర్ నేత రామ్ నాయక్‌ను ఓడించారు. అయితే ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.चुनाव प्रचार के बीच गोविंदा का जोरदार डांस◆ एक्टर को डांस करता देखकर वहां मौजूद जनता और बाकी नेता भी झूम उठे#Govinda #ActorGovinda #Maharashtra pic.twitter.com/Zdugpko9Zp— News24 (@news24tvchannel) May 9, 2024Video Credits: News24తాజాగా గోవిందా గత మార్చి లో శివసేనలో చేరారు. ఏక్నాథ్ షిండే సమక్షంలో శివసేనలో చేరినప్పటి నుంచి ఆయన ఎన్నికల ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ప్రస్తుతానికి గోవిందా లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేస్తారా లేదా అనేది ఖరారు కాలేదు. అయితే ముంబై నార్త్‌వెస్ట్ నుంచి ఆయనను శివసేన ఎన్నికల బరిలోకి దింపవచ్చనే టాక్ వినిపిస్తోంది. -
బరిలో ‘హీరో నెం 1’.. అక్కడి నుంచే పోటీ?
లోక్‌సభ ఎన్నికలు దగ్గరకొస్తున్నకొద్దీ మహారాష్ట్రలో రోజుకో కొత్త అభ్యర్థి పేరు తెరమీదకు వస్తోంది. తాజాగా బాలీవుడ్ నటుడు గోవింద ముంబై నార్త్-వెస్ట్ స్థానం నుంచి శివసేన (ఏక్నాథ్ షిండే) టిక్కెట్‌పై లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయవచ్చని ప్రచారం సాగుతోంది. నటుడు గోవిందా ఐదు రోజుల క్రితం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేను కలిశారు. ఈసారి ముంబై వాయువ్య స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ గజానన్ కీర్తికర్‌కు టికెట్ ఇవ్వడానికి షిండే వర్గం సుముఖంగా లేదు. ఈ నేపథ్యంలో గోవిందా ఇక్కడి నుంచి పోటీ చేస్తారని భావిస్తున్నారు. ‘హీరో నెం 1’గా ప్రసిద్ధి చెందిన గోవిందా అసలు పేరు గోవింద్ అర్జున్ అహుజా. 2004లో ఆయన కాంగ్రెస్ టిక్కెట్‌పై ఉత్తర ముంబై నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. మహారాష్ట్రలో మొత్తం 48 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో సీట్ల పంపకంపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. -
వంద కోట్ల సినిమాలో ఆఫర్.. అంత ఈజీగా ఒప్పుకోనంటున్న నటుడు
కొందరు సినిమా ఛాన్స్ వస్తే చాలనుకుంటారు, మరికొందరు మంచి రోల్ వస్తేనే చేస్తామంటారు. బాలీవుడ్ నటుడు గోవింద రెండో కేటగిరీకి చెందినవాడు. వచ్చిన అవకాశాలన్నీ చేసుకుంటూ పోయే రకం కాదు. చిన్న చిత్రమైనా, పెద్ద సినిమా అయినా తన మనసుకు నచ్చితేనే అందులో నటిస్తాడు. ఈమాటకు కట్టుబడి నాలుగేళ్లగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'నేను దేన్నీ అంత సులువుగా అంగీకరించను. జనాలేమో నాకు అవకాశాలు రావడం లేదనుకుంటారు. కానీ వినాయకుడి ఆశీర్వాదాలు నాకెప్పుడూ ఉన్నాయి. నాకు ఛాన్సులు వస్తున్నాయి. గతేడాది నేను.. వంద కోట్లతో తెరకెక్కిన ప్రాజెక్టులను రిజెక్ట్ చేశాను. అసలు ఏ సినిమాకూ సంతకం చేయలేదు. దీంతో అద్దం ముందు నిల్చుని నన్ను నేను కొట్టుకున్నాను. నిజానికి వాళ్లు చాలా డబ్బు ఇస్తామన్నారు, కానీ నాకు ఏదిపడితే అది, పెద్దగా ప్రాముఖ్యత లేని పాత్రలు చేయడం ఇష్టం లేకపోవడంతో వదిలేసుకున్నాను. ప్రాధాన్యత ఉన్న పాత్రలే చేస్తాను' అని చెప్పుకొచ్చాడు. కాగా గోవింద 1986లో వెండితెరపై తన ప్రయాణం మొదలుపెట్టాడు. 170కు పైగా చిత్రాల్లో నటించాడు. హీరో నెం.1, షోలా ఔర్ షబ్నం, పార్ట్నర్ వంటి అనేక హిట్ చిత్రాల్లో యాక్ట్ చేశాడు. ఈయన చివరగా 2019లో వచ్చిన రంగీలా రాజా సినిమాలో నటించాడు. అప్పటినుంచి మరే చిత్రంలోనూ కనిపించలేదు. చదవండి: 6 ఏళ్ల తర్వాత సడన్‌గా ఫోటోలు లీక్.. అంటే ముందే ప్లాన్.. ఇలాంటి పనులు చేసేముందు ఆలోచించాలి.. రాహుల్ ఫైర్ -
ఆ సినిమా దెబ్బకు ఉన్న ఇల్లు కూడా అమ్మేశా: మహేశ్
బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత మహేష్ కొఠారే మరాఠీ, హిందీలో పలు చిత్రాలను తెరకెక్కించారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన నటనా జీవితాన్ని ప్రారంభించిన ఆయన పలు సినిమాలు నిర్మించారు. కొఠారే రాజా ఔర్ రంక్, ఛోటా భాయ్, మేరే లాల్, ఘర్ ఘర్ కి కహానీ వంటి చిత్రాలలో నటించారు. ఆ తర్వాత ధూమ్ ధడకా (1985) సినిమాతో దర్శకత్వం ప్రారంభించారు. అయితే ఆయన తాజాగా తన జీవితంలోని అనుభవాలను వివరిస్తూ ఓ పుస్తకాన్ని రచించారు. గతవారమే ఆ పుస్తకాన్ని విడుదల చేశారు. తన జీవితంలో ఎదురైన అత్యంత క్లిష్ట పరిస్థితులను మహేశ్ కొఠారి వివరించారు. హిందీ, మరాఠీలో పలు హిట్ చిత్రాలు నిర్మించిన మహేశ్ 'యామ్ ఇట్ ఆనీ బరాచ్ కహి' పేరుతో గతవారం పుస్తకం విడుదల చేశారు. తన జీవితంలోని అత్యంత కష్టతరమైన దశ గురించి పుస్తకంలో వివరించారు. తన 60 ఏళ్ల సినీ ప్రయాణంలో ఎదురైన అనుభవాలను ప్రస్తావించారు. మహేశ్ పుస్తకంలో వివరిస్తూ..' నేను 1962లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టా. బ్లాక్ అండ్ వైట్ సినిమా, కలర్ వన్, ఇప్పుడు డిజిటల్ సినిమాలు చేశా. నా జీవితంలో చాలా ఎత్తుపల్లాలు చూశా. నాకు చాలా కష్టాలు ఎదురయ్యాయి. ఆ సమయంలో నేను చాలా అవమానానాలు ఎదుర్కొన్నా. నేను 1999లో లో మైన్ ఆగయా అనే హిందీ సినిమా తీశా. ఈ చిత్రంలో గోవింద మేనల్లుడు విజయ్ ఆనంద్ హీరో. అది నేను చేసిన పెద్ద తప్పు. ఆ సినిమా పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఆ ప్రభావం నాపై దాదాపు 15 ఏళ్లు కొనసాగింది. ఆ కష్టకాలాన్ని అధిగమించేందుకు ఎన్ని ఇబ్బందులు పడ్డానో నాకు మాత్రమే తెలుసు. ఆ దెబ్బకు మా ఇంటిని కూడా అమ్మేశాం. నా కొడుకు ఎంబీఏ అడ్మిషన్ కోసం ఫీజు చెల్లించలేని పరిస్థితి. కానీ నా పరిస్థితిని కొడుకు అర్థం చేసుకుని డబ్బులు అడగలేదు. కానీ ఈ ప్రభావం నా కుటుంబంపై పడకుండా ఉండేందుకు నేను నా వంతు ప్రయత్నం చేశా.' అని వివరించారు. -
మీ వల్లే నటుడినయ్యా, మీకు పెద్ద ఫ్యాన్‌ను: పాకిస్తాన్ యాక్టర్
దుబాయ్‌లో జరిగిన ఫిలింఫేర్ మిడిల్ ఈస్ట్ అచీవర్స్ నైట్ వేడుకలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. పాకిస్తాన్ నటుడు ఫహద్ ముస్తఫా బాలీవుడ్ నటుడు గోవిందా కాళ్లు తాకి ఆయన ఆశీర్వాదం తీసుకున్నాడు. మీరే నా ఇన్స్పిరేషన్ అంటూ ఎమోషనలయ్యాడు. దీంతో గోవిందా వెంటనే అతడిని మనసారా హత్తుకుని షేక్ హ్యాండ్ ఇచ్చాడు. పక్కనే ఉన్న హీరో రణ్వీర్ సింగ్‌తో సైతం ఫహద్ మాట కలిపాడు. ఈ అవార్డుల ఫంక్షన్లో ఫహద్ ముస్తఫా మాట్లాడుతూ.. 'గోవిందా సర్ వల్లే నేను యాక్టింగ్ చేయడం మొదలుపెట్టాను. ఆయనకు నేను పెద్ద అభిమానిని. ఎప్పటికీ ఆ అభిమానం అలాగే ఉంటుంది. మా దేశంలో మీలాగా యాక్టింగ్ చేయాలనుకునేవాళ్లు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మీ ఎదుట వేదికపై నిలబడటం అదృష్టంగా భావిస్తున్నాను. కానీ ఇప్పటికీ ఇదంతా నమ్మలేకపోతున్నాను. రానున్న రోజుల్లో ఇండియా, పాకిస్తాన్ కలిసి పని చేయాలని ఆశిస్తున్నాను' అని చెప్పుకొచ్చాడు. View this post on Instagram A post shared by 𝙈𝙖𝙧𝙮𝙖𝙢 𝘽𝙡𝙤𝙜𝙨 (@maryam__blogs4) చదవండి: మహేశ్‌బాబు తప్పు చేశాడా? -
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది బాలీవుడ్ ప్రముఖ సీనియర్ దర్శకుడు ఇస్మాయిల్ ష్రాఫ్ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని కోకిలా బెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో అర్థరాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి బి-టౌన్లో విషాదం నెలకొంది. ఆయన మృతిపై బాలీవుడ్ సినీ ప్రముఖులు, నటీనటులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు. బాలీవుడ్ హీరో, సీనియర్ నటుడు గోవిందా స్పందిస్తూ.. ‘డైరెక్టర్ ఇస్మాయిల్ మరణం నాకెంతో బాధను కలిగిస్తోంది. నా సినీ కెరీర్ ఆయనతోనే మొదలైంది. చదవండి: నిర్మాత నిర్వాకం.. మరో మహిళతో షికారు.. భార్య రెడ్ హ్యండెడ్‌గా పట్టుకోవడంతో.. నా మీద నమ్మకం ఉంచిన మొదటి వ్యక్తి ఆయనే. ఓ సామాన్యుడైన గోవింద్‌ను స్టార్ హీరో గోవిందగా మారటంలో ఇస్మాయిల్ ష్రాఫ్ సార్ ప్రముఖ పాత్ర పోషించారు. దేవుడు ఆయన ఆత్మకు శాంతి కలిగించాలని కోరుకుంటున్నా’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా ఇస్మాయిల్ ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో పుట్టారు. బాలీవుడ్ దర్శకుడు భీమ్ సింగ్ దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసిన ఆయన ఆ తర్వాత ‘అగర్’ సినిమాతో దర్శకుడిగా మారారు. తోడీసీ బేవఫాయ్, బులంది, అహిస్ట అహిస్ట వంటి హిట్టు సినిమాలకు దర్శకత్వం వహించారు. తన కెరీర్లో దాదాపు 20 సినిమాలకు దర్శకత్వం వహించిన ఆయన 2004లో చివరిగా ‘తోడా తుమ్ బద్లో తోడా హమ్’ అనే సినిమా దర్శకుడిగా పనిచేశారు. చదవండి: ఓటీటీకి వచ్చేస్తోన్న ‘పొన్నియన్ సెల్వన్’! స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే.. -
బాలీవుడ్ నటుడితో పుష్ప భామ స్టెప్పులు.. వీడియో వైరల్
పుష్ప బ్యూటీ రష్మిక మందన్నా మరోసారి వార్తల్లో నిలిచింది. టాలీవుడ్లో పుష్పతో ఒక్కసారిగా స్టార్డమ్ పొందిన ఈ అమ్మడు బాలీవుడ్‌లోని ఓ టీవీ షోలో తనదైన స్టెప్పులతో అదరగొట్టింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవిందతో కలిసి కాలు కదిపింది. పుష్ప సినిమాలో సూపర్ హిట్ సాంగ్' రా రా సామీ బంగారు సామీ' అంటూ తన డ్యాన్స్‌తో ప్రేక్షకులను ఊర్రూతలూగించింది. హిందీలో ప్రసారమవుతున్న సూపర్ మామ్స్-3 షో గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ప్రోమోలో ఈ అమ్మడు తన స్టెప్పులతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. (చదవండి: ఆ రోజు 'గుడ్ బై' చెప్పనున్న రష్మిక మందన్నా!) సూపర్ మామ్స్- 3 గ్రాండ్ ఫినాలేలో రష్మిక మందన్నా కనిపించనుంది. ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ప్రోమో వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది జీ టీవీ. 15 సెకన్ల వీడియోలో బాలీవుడ్ నటుడు గోవిందతో కలిసి వేదికపై సామీ సామీ స్టెప్పులతో దుమ్ము రేపింది. ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రసారం కానున్న సూపర్ మామ్స్ గ్రాండ్ ఫినాలే ఫుల్ ఎపిసోడ్లో ఈ బ్యూటీ కనిపించనుంది. ఆమె బాలీవుడ్లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించిన చిత్రం 'గుడ్‌బై' విడుదలకు సిద్ధమవుతోంది. కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన్నా వరుస సినిమాలు చేస్తూ తగ్గేదే లే అంటోంది. టాలీవుడ్‌తో స్టార్డమ్ సంపాందించుకున్న ఈ అమ్మడు కోలీవుడ్, బాలీవుడ్లో ఫుల్ బిజీగా ఉంది. 'పుష్ప' మూవీతో తెలుగు, తమిళం, హిందీ ఆడియెన్స్‌ల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ్లో విజయ్ నటిస్తున్న 'వారీసు' (వారసుడు) చిత్రంలో నటిస్తోంది. అలాగే 'పుష్ప 2'తోపాటు మరికొన్ని హిందీ, కోలీవుడ్ ప్రాజెక్టులు చేస్తోంది. -
కొండమీదరాయా.. గోవిందా
బుక్కరాయసముద్రం: గోవింద నామస్మరణతో బుక్కరాయసముద్రం మార్మోగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తజనం శ్రీదేవి, భూదేవి సమేత కొండమీదరాయుడి దివ్యమంగళరూపం దర్శనంతో పులకించిపోయింది. భక్తుల జయజయ ధ్వానాలు..అర్చకుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ దేవరకొండపై వెలసిన వెంకటరమణుడు భక్తుల చెంతకే చేరేందుకు కొండ దిగిరాగా... బుక్కరాయసముద్రం ఆధ్యాత్మిక సాగరమైంది. మాఘ శుద్ధ పౌర్ణమి సందర్భంగా బుధవారం కొండమీద రాయుని రథోత్సవం రమణీయంగా సాగింది. కమనీయం... కల్యాణం రథోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం తెల్లవారుజాము 4 గంటలకే అర్చకులు బుక్కరాయసముద్రంలోని లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో కొండమీదరాయునికి, శ్రీదేవి భూదేవికి కల్యాణ మహోత్సవం జరిపించారు. 10.30 గంటలకు కొండమీదరాయుడిని భూదేవి, శ్రీదేవిని సూర్య ప్రభ వాహనంపై కొలువుదీర్చారు. రథం ముందర బ్రాహ్మణులు హోమాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. 11.30 గంటలకు రథోత్సవం ప్రారంభం కాగా, జిల్లా నలుమూలల నుంచే కాక కర్ణాటక నుంచి తరలివచ్చిన భక్తులు ‘‘కొండమీదరాయా...గోవిందా’ అంటూ దేవదేవున్ని కీర్తించారు. వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయం నుంచి ప్రారంభమైన రథోత్సవం పాత పంచాయతీ కార్యాలయం వరకూ సాగింది. అనంతరం సాయంత్రం వేళ పాత పంచాయతీ కార్యాలయం నుంచి ప్రారంభమై బ్రాహ్మణవీధి మీదుగా వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయం దగ్గరకు చేరింది. అనంతరం భక్తులు గుమ్మడికాయలు, టెంకాయలు కొట్టి స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. కొండపై వెలసిన కొండమీద వెంకటరమణస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఆలయ కమిటీవారు, దాతలు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. -
ఇలా పరువు తీసుకోకండి.. నటుడిపై ట్రోలింగ్
కమెడియన్, డైరెక్టర్, నిర్మాత, నటీనటులు, డ్యాన్సర్లు, సింగర్లు.. దాదాపు అందరూ ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నవారే. కొద్దోగొప్పో పాపులారిటీ వచ్చిందంటే చాలు సొంతంగా ఛానల్ పెట్టి అభిమానులను ఎంటర్టైన్ చేస్తున్నారు సెలబ్రిటీలు. అయితే కొన్నిసార్లు వారు చేసే వీడియోలు ఫ్యాన్స్‌కు తలనొప్పిగా మారుతున్నాయి. తాజాగా ఇదే కోవలోకి వచ్చాడు బాలీవుడ్ సీనియర్ నటుడు, కమెడియన్ గోవింద. 'ఆంఖెన్', 'రాజా బాబు', 'కూలీ నంబర్ 1', 'హీరో నంబర్ 1', 'దుల్హె రాజా' సినిమాల్లో నటించి కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న గోవింద గతేడాది గోవింద రాయల్స్ పేరిట యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు. ఇందులో ఇప్పటివరకు రెండు పాటలు రిలీజ్ చేసిన ఆయన తాజాగా మూడో మ్యూజిక్ వీడియోను రిలీజ్ చేశాడు. హల్లో అంటూ సాగే ఈ పాటను పాడింది, డైరెక్ట్ చేసింది ఆయనే కావడం విశేషం. అంతేకాదు, నిషా శర్మతో కలిసి డ్యాన్స్ చేశాడు గోవింద. ఇక ఇది చూసిన జనాలు ఇదేందయ్యా ఇది అని ఉలిక్కిపడుతున్నారు. ఈ పిచ్చిపాటలతో మమ్మల్ని చంపుకుతినొద్దంటూ ట్రోల్ చేస్తున్నారు. 'అతడి యాక్టింగ్‌కు పెద్ద ఫ్యాన్‌ను.. కానీ ఇలాంటి పిచ్చిపిచ్చి కంటెంట్‌తో వస్తుంటే చిరాకేస్తోంది. సైకియాట్రిస్ట్‌కు చూపిస్తే మంచిదేమో..', 'నిన్ను నువ్వు ఆత్మపరిశీలన చేసుకో.. జనాలు ఇప్పటికీ మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నారు. మీరింకా మంచి పాత్రలు చేయాలనుకుంటున్నారు', 'ఇలా పరువు తీసుకోకుండా మీరు రిటైర్మెంట్ తీసుకోవచ్చు కదా, మీ ఫ్యాన్స్ అని చెప్పుకోవడానికే సిగ్గుపడేలా చేస్తున్నారు', 'ఇది 2022, ఇంకా 90లో ఉండకండి' అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొందరు మాత్రం 'మీ డ్యాన్స్ అదిరిపోయింది సర్', 'లెజెండ్ ఎప్పటికీ లెజెండే' అంటూ పాజిటివ్‌గా మాట్లాడుతున్నారు. -
ఆయన్ని చూసి రణ్వీర్ సింగ్ కంటతడి.. దేవుడంటూ ఎమోషనల్
Ranveer Singh Breaks Down Tears After Met Govinda: బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ మాజీ క్రికెటర్ హర్యానా హరికేన్ కపిల్ దేవ్ పాత్రలో మెప్పించి ఆకట్టుకుంటున్న చిత్రం '83'. 1983 వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం అశేష ప్రేక్షాదరణ పొందుతుంది. ముఖ్యంగా కపిల్ దేవ్లా డిట్టు దింపేసినా రణ్వీర్ సింగ్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా రణ్వీర్ సింగ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇటీవల కలర్స్ అందిస్తున్న 'ది బిగ్ పిక్చర్' రియాలిటీ షోను హోస్ట్ చేశాడు రణ్వీర్. ఈ షోకు హాజరైన ప్రముఖ నటుడు గోవిందాను చూసి ఉద్వేగానికి లోనయ్యాడు రణ్వీర్ సింగ్. తర్వాత రణ్వీర్ను ఓదార్చాడు గోవిందా. ఈ షోలో ప్రేక్షకులకు గోవిందాను పరిచయం చేస్తూ 'ఈ శుభ దినాన నా దేవుడే మిమ్మల్ని కలవడానికి వస్తున్నాడు. ది వన్ అండ్ ఓన్లీ , హీరో నెంబర్ వన్ గోవిందా' అంటూ స్టేజిపైకి ఆహ్వానించాడు. అనంతరం రణ్వీర్ సింగ్.. గోవిందా కాళ్లపై పడి సాష్టాంగ నమస్కారం చేశాడు. రణ్వీర్ సింగ్ అభిమానాన్ని చూసిన గోవిందా సంతోషపడ్డాడు. తర్వాత వీరిద్దరూ కలిసి ఇష్క్ హై సుహానా, యూపీ వాలా తుమ్కా వంటి గోవిందా హిట్ సాంగ్స్‌కు డ్యాన్స్ చేసి సందడి చేశారు. ఈ పోగ్రామ్‌లో గోవిందా భార్య సునీత, కుమార్తె టీనా, కుమారుడు యశ్వర్ధన్ అహుజా వీడియో కాల్ ద్వారా పాల్గొన్నారు. View this post on Instagram A post shared by ColorsTV (@colorstv) ఇదీ చదవండి: 83 చిత్రంపై రజనీ కాంత్ రియాక్షన్.. పొగడ్తలతో బౌండరీలు -
భార్యకు కాస్ట్లీ కారు బహుమతిగా ఇచ్చిన నటుడు
Actor Govinda Gifted Costly BMW Car To His Wife Sunith Ahuja On Karwa Chauth: బాలీవుడ్ సీనియర్ నటుడు గోవింద ఆయన భార్య సునీత ఆహుజాకు ఓ బహుమతి ఇచ్చాడు. కర్వాచౌత్ పండుగ వేడుకలో భాగంగా సతీమణికి ఖరీదైన బీఎండబ్ల్యూ కారును కానుకగా అందించాడు. ఈ మేరకు భార్యకు గిఫ్ట్‌గా ఇచ్చిన బీఎండబ్ల్యూ కారుతో దిగిన ఫొటోను షేర్ చేశాడు. ఈ సందర్భంగా.. ‘నా ప్రాణ స్నేహితురాలు.. నా జీవిత భాగస్వామి. నా ఇద్దరు అందమైన పిల్లలకు తల్లి.. నీపై నాకున్న ప్రేమ వెలకట్టలేనిది. అయినా కర్వాచౌత్‌ను పురస్కరించుకుని ఒక చిన్న బహుమతిని అందిస్తున్నాను’ అంటూ తన ప్రేమను ఈ చిన్న గిఫ్ట్‌లో చూడమంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ షేర్ చేశాడు గోవింద. కాగా ఆయనతో పాటు పలువురు బాలీవుడ్ సినీ సెలబ్రెటీలు కూడా కర్వాచౌత్ పండుగను జరుపుకున్న ఫొటోలను షేర్ చేశారు. అందులో బిగ్‌బి అమితాబ్ బచ్చన్, శిల్పా శెట్టి, వరుణ్ ధావన్, పంకజ్ త్రిపాఠి, యామీ గౌతమ్, మీరా కపూర్, కమెడియన్ కపిల్ శర్మ ఇతర నటీనటులు ఈ పండగ సెలబ్రెషన్స్ ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. View this post on Instagram A post shared by Govinda (@govinda_herono1) కర్వాచౌత్ అనగా.. ప్రతి ఏటా దీపావళికి పది రోజులు ముందు ఈ పండగ వస్తుంది. ఈ పండగను దక్షిణ భారతంలో కంటే ఉత్తర భారతదేశ ప్రజలు ఎక్కువగా జరపుకుంటారు. కర్వాచౌత్‌ను పురస్కరించుకుని మహిళలు తమ జీవిత భాగస్వామి, కుటుంబ క్షేమాన్ని ఆకాంక్షిస్తూ ఉపవాస దీక్షకు పూనుకుంటారు. అలాగే భర్త కలకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని, కుటుంబ సభ్యులంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ రోజంతా మహిళలు ఏం తినకుండా ఉపవాసం ఉంటారు. పెళ్లికాని అమ్మాయిలు కూడా మంచి భర్త రావాలని పూజలు చేస్తారు. అలా ఏడాదిలో రెండు రోజులు కర్వాచౌత్ పండగను జరుపుకుంటారు. ఈ ఏడాది అక్టోబర్ 24, 25 తేదీల్లో ఉత్తరాది మహిళలంత కర్వాచౌత్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) View this post on Instagram A post shared by VarunDhawan (@varundvn) View this post on Instagram A post shared by Yami Gautam Dhar (@yamigautam) -
అది అఫైర్ కాదు, ఆమె మీద నాకున్న ప్రేమ!
గోవిందా మనసారా ఇష్టపడ్డ అమ్మాయి నీలమ్. కానీ సునీతతో జీవితాన్ని పంచుకోవాల్సి వచ్చింది. ఆమెతో పెళ్లయిన ఏడాదికి గానీ ఆ విషయాన్ని నీలమ్‌తో చెప్పలేదు గోవిందా. ‘నేను చేసింది తప్పే. సునీతతో పెళ్లి విషయం నేను నీలమ్‌కు చెప్పి ఉండాల్సింది’ అని తప్పు ఒప్పుకుంటాడు గోవిందా. అయితే నీలమ్‌ను ఇష్టపడ్డం, పెళ్లి చేసుకోవాలనుకోవడంలో తప్పేం లేదు అనీ అంటాడు. ‘అవును.. నీలమ్ అంటే నాకు చచ్చేంత ఇష్టం. సునీతతో నిశ్చితార్థాన్ని తెంచుకునైనా నీలమ్‌ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. నాకెలాంటి అమ్మాయి భార్యగా రావాలని కోరుకున్నానో అలాంటి అమ్మాయే నీలమ్. అలాగని సునీతను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు.. పెట్టను. భర్తగా నా బాధ్యతనెప్పుడూ విస్మరించలేదు. నీలమ్ మీద ఇష్టమూ చావలేదు. ఇప్పటికీ ఆమె ఎక్కడ కనపడ్డా నా గుండె లయ తప్పుతుంది. కానీ ఎందుకో నీలమే నాతో సినిమాలు చేయడం మానేసింది. బహుశా అదే డాన్స్, అదే డైలాగ్ డెలివరీ తనకు బోర్ కొట్టి ఉండొచ్చు. తనతో మళ్లీ సినిమాలు చేయాలనుంది’ అని చెప్పాడు గోవిందా ఒక ఇంటర్వ్యూలో. ఇంకో మాటా గట్టిగా చెప్పాడు.. ‘దయచేసి మాది అఫైర్ అని కామెంట్ చేయొద్దు. అది అఫైర్ కాదు.. నీలమ్ మీద నాకున్న ప్రేమ’ అని. గోవిందా పెళ్లి విషయం తనకు తెలిసినప్పటి నుంచి అతనితో స్నేహాన్నే కాదు.. సినిమాలనూ మానేసింది. అలాగని గోవిందా పట్ల ఎన్నడూ కోపాన్ని, దురుసుతనాన్నీ ప్రదర్శించలేదు. బహుశా.. తను ఆ వ్యవహారాన్ని అంత సీరియస్‌గా తీసుకోలేదేమో అంటారు నీలమ్ సన్నిహితులు. ఆమె సినిమాల్లో రాణించాలనే లక్ష్యం వల్లా అది నిర్లక్ష్యం అయిండొచ్చు అంటారు. నీలమ్ కూడా ప్రేమలో పడింది. బాబీ డియోల్‌తో. అతనూ నీలమ్‌ను మనసులో నింపుకున్నాడు. ఆ ప్రేమను పెళ్లితో భద్రం చేసుకోవాలనీ అనుకున్నాడు. నీలమ్, బాబీ కలసి తిరుగుతున్నారు అన్న విషయం మొదట్లో ధర్మేంద్రకు తెలిసినా ఇండస్ట్రీలో అది మామూలే అని ఊరుకున్నాడ్లు. కానీ ఎప్పుడైతే కొడుకు ఆలోచన పెళ్లి దాకా వెళ్లిందని తెలిసిందో అప్పుడు సీరియస్ అయ్యాడు ఆ తండ్రి. నీలమ్ అంటే ఇష్టం లేక కాదు.. సినిమా హీరోయిన్లు తనింటి కోడళ్లుగా రావడం ఇష్టంలేక. ఆ మాటే బాబీ డియోల్కూ చెప్పాడు ధర్మేంద్ర. హతాశుడయ్యాడు బాబీ డియోల్. ఆ విషయంలో తండ్రిది మొండిపట్టే అని సన్నీ కూడా చూచాయగా మందలించాడు. అందుకు సన్నీ జీవితమే పెద్ద ఉదాహరణ. సినిమాల్లోకి వచ్చి అలాంటి ఆకర్షణలకు లోనవుతాడని తెలిసే పెళ్లి చేశాకే సన్నీని వెండితెర మీదకు తెచ్చాడు. తండ్రి ఆ ఆచరణంతా బాబీకి తెలియందేం కాదు. తండ్రి కోసం నీలమ్‌ను వదులుకోవాలనీ లేదు. తండ్రి తత్వం తెలిసీ మొండి పట్టూ పట్టలేదు. భారమైన హృదయంతోనే ఒకరోజు నీలమ్‌ను కలిశాడు బాబీ డియోల్. తండ్రికి, తనకు మధ్య జరిగిన చర్చ గురించి చెప్పాడు. మొత్తం సీన్ అర్థమైపోయింది ఆమెకు. అందుకే ఎదురు ప్రశ్నలేం వేయకుండానే ‘సరే.. ఇక్కడితో ఆపేద్దాం’ అంది. ఆ మాట అంటున్నప్పుడు నీలమ్ కళ్లల్లో నిండిన నీళ్లు బాబీ దృష్టి దాటి పోలేదు. నిస్సహాయంగా ఇద్దరూ గుడ్ బై చెప్పుకున్నారు అయిదేళ్ల ఆ అనుబంధానికి. వదంతులు.. చెక్ ఆ ఇద్దరి బ్రేకప్ మీద చాలా వదంతులు ప్రచారమయ్యాయి. ఒకసారి నీలమ్ స్టార్‌డస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ వదంతులకు చెక్ పెట్టింది. ‘వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడ్డం నాకిష్టం ఉండదు. నా లవ్ అండ్ బ్రేకప్ గురించి వస్తున్న రూమర్స్ వింటూంటే నా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడక తప్పట్లేదు. నాకు, బాబీకి బ్రేకప్ అయిన మాట నిజమే. అయితే పూజాభట్ ఇన్వాల్వ్మెంట్ వల్లే మా బ్రేకప్ అయిందన్నది శుద్ధ అబద్ధం. పూజానే కాదు ఇంకే అమ్మాయి వల్లా మా బ్రేకప్ కాలేదు. మా పరస్పర అవగాహనతోనే విడిపోయాం’ అంటూ స్పష్టం చేసింది. ‘సెపరేషన్ బాధాకరమే. దాదాపు ఎమోషన్స్‌కి సర్జరీ చేసినట్టే. ఒక ఎమోషన్‌ను తీసేసి ఇంకో ఎమోషన్‌ను అనుభవించడమే. చుట్టూ ఆరోగ్యకర వాతావరణం ఉంటే ఆ గాయం నుంచి త్వరగా కోలుకోగలం. అయితే ఆ విడిపోవడం, ఎడబాటు నిజాయితీగా జరిగితేనే త్వరగా కోలుకోగలుతాం. మా బ్రేకప్ అలాంటిదే. విడిపోవాలని ఒక్కసారి నిర్ణయించుకున్నాక వెనక్కి తిరిగి ఆలోచించలేదు. కన్నీళ్లు పెట్టలేదు. ముందుకే వెళ్లాను’ అని బ్రేకప్ తర్వాత తన మానసిక స్థితినీ వివరించింది నీలమ్. తర్వాత.. బ్యాంకాక్‌కు చెందిన రిషి సేథియా అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. కాని ఆ బంధం ఎన్నాళ్లో నిలువలేదు. ఆ విడాకుల తర్వాత జ్యుయెలరీ డిజైన్ మీద మనసు పెట్టింది. ఓ వైపు ఈ కొత్త వృత్తి ఇంకోవైపు సినిమాలతో బిజీగా ఉంటున్న టైమ్‌లోనే నటుడు సమీర్ సోనీతో స్నేహం కుదిరింది. ప్రేమగా మారింది. పెళ్లీ చేసుకుంది. ఒక అమ్మాయి (ఆహనా)ని దత్తత కూడా తీసుకుంది ఆ జంట. ‘కదిలిపోయిన గతం పట్ల రిగ్రెట్స్ లేవు. వర్థమానమంతా సంతోషమే. భవిష్యత్ గురించి బెంగలేదు’ అంటుంది నీలమ్. - ఎస్సార్ చదవండి: ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకున్న గోవిందా -
ఆమెను చూడగానే మతి పోయింది: నటుడి లవ్ స్టోరీ
డాన్స్.. మాస్ అప్పీల్‌తో దేశమంతా అభిమానులను సంపాదించుకున్న నటుడు గోవిందా.. పసితనం వీడని మోము..నాజూకు మేనితో తెరమీద మెరిసిపోయిన అందాల నటి.. నీలం. మేకప్ తీసేశాక నటించడం మరిచిపోయే గోవిందా అంటే గౌరవం పెంచుకుంది ఆమె. స్థాయీభేదాల్లేకుండా మనిషిని మనిషిగానే చూసే నీలం వ్యక్తిత్వాన్ని ఇష్టపడ్డాడు అతను. అది వన్‌సైడ్ లవ్‌గా గోవిందా మనసులోనే ఉండిపోయి.. విఫల్యగాథగా మిగిలిపోయింది. అది ఎలా మొదలైందంటే... గోవిందా, నీలం జంటగా నటించిన తొలి సినిమా ‘ఇల్జామ్’. వీళ్లద్దరూ మొదటిసారి కలిసింది ప్రాణ్‌లాల్ మెహతా ఆఫీస్ (ముంబై)లో. గోవిందాను చూడగానే నవ్వుతూ ‘హలో’ అంది నీలం. బదులు చెప్పడానికి గోవిందా భయపడ్డాడు. న్యూనతగా ఫీలయ్యాడు. ఎందుకూ? ‘నా ఇంగ్లిష్ విని ఆమె నవ్వుకుంటుందేమోనని’ చెప్పాడు గోవిందా ఓ ఇంటర్వ్యూలో. ‘ఆమె ఫారిన్ రిటర్డ్న్ (హాంకాంగ్‌లో పుట్టిపెరిగింది). నేను శుద్ధ దేశీ.. పక్కా మాస్. ఆమెను చూడగానే నా మతి పోయింది. ఆ రోజు నాకింకా గుర్తు.. వైట్ డ్రెస్.. జడకాని, పోనీ కాని వేయకుండా అలా వదిలేసిన లాంగ్ హెయిర్‌తో నాకు దేవకన్యలా కనిపించింది. అంతకుముందే ఆమె యాక్ట్ చేసిన ‘జవానీ’ చూశాను. ఒక్కసారి కాదు ఎన్నిసార్లో.. కేవలం నీలం కోసమే చూశా. మర్యాదకు పోతపోసినట్టుంటుంది’ అంటూ నీలంను తలచుకున్నాడు గోవిందా అదే ఇంటర్వ్యూలో. ఇల్జామ్ విడుదలైంది. భిన్న నేపథ్యాలు, పెంపకాల గ్యాప్‌ను అధిగమించి వాళ్ల మధ్య స్నేహం కుదురుకుంది. తనకున్న హాస్య చతురతనూ బయటపెట్టేంత చనువు సాధించాడు గోవిందా.. నీలం దగ్గర. షూటింగ్లో ఏ కొంచెం టైమ్ దొరికినా తన జోక్స్‌తో తెగ నవ్వించేవాడు ఆమెను. ఆ నవ్వును చూస్తూ తన ఒత్తిడిని మరిచిపోయేవాడు. ప్రశాంతతలో మైమరిచిపోయేవాడు. ఎప్పుడూ అలా నీలం సాంగత్యంలోనే ఉంటే బాగుండు అనే భావన ప్రారంభమైంది అతనిలో. అది ప్రేమ అనీ అర్థమైంది. ఆ భావం మెదలగానే గోవిందా ఒక్కసారిగా అలెర్ట్ అయ్యేవాడు. సునీత కారణం.. అప్పటికే అతని జీవితంలో సునీత ఉంది. భార్యగా కాదు.. చిన్ననాటి స్నేహితురాలిగా.. కాబోయే జీవిత భాగస్వామిగా. నిశ్చితార్థం అయింది. గోవిందా, నీలం కాంబినేషన్లో మరిన్ని సినిమాలు సెట్స్ మీదకు వచ్చాయి. కొన్ని థియేటర్లకూ వెళ్లి మంచి కలెక్షన్స్ తెచ్చిపెడ్తున్నాయి. ప్రేక్షకుల్లోనూ బెస్ట్ పెయిర్ అనే పేరు వచ్చింది ఈ జంటకు. షూటింగ్స్ లేకపోయినా నీలంను కలవసాగాడు గోవిందా. ఆమె గురించి తెలుసుకున్న కొద్దీ ఆమె మీద ప్రేమ, గౌరవం పెరగసాగాయి అతనికి. ‘ఆమె స్ట్రెంత్ ఆఫ్ క్యారెక్టర్ ఎలాంటిదంటే.. నన్నూ చాలా మార్చేసింది. ఆమెను చూసిన ఏ మగవాడైనా ఇలాంటి స్త్రీ తన జీవితభాగస్వామి అయితే బాగుండని అనుకునేంత గ్రేట్ ఉమన్ నీలం’ అంటాడు గోవిందా. ‘నేనూ అనుకున్నాను జీవితమంతా ఆమె చేయిపట్టుకొని నడవాలని’ అని నిట్టూరుస్తాడు. అమ్మ వద్దంది.. నీలం అతని మీద ఎంత ప్రభావం చూపిందంటే గోవిందా.. సునీతను నీలంలా మారమని పోరు పెట్టేంతగా. వినీవినీ విసిగివేసారిపోయిన సునీత ఒకసారి ‘నేను నేనులా ఉండడాన్ని చూసే నన్ను ఇష్టపడ్డావన్న నిజాన్ని మరిచిపోయావా?’అంటూ హెచ్చరించిందట. అయినా తన మనసులోంచి నీలంను తప్పించలేకపోయాడు గోవిందా. ఇంట్లో వాళ్లతో ఎప్పుడూ నీలం గురించిన కబుర్లే... ‘నీలం అలా.. నీలం ఇలా.. నీలం ఇలా అంది.. అలా చూసింది.. నీలం .. నీలం’ అంటూ. ఒకసారి ఆమెను ఇంటికి పిలిచి ఇంటిల్లిపాదికీ పరిచయం చేశాడు. గోవిందా వాళ్ల నాన్న ఆమెలోని వినయానికి ముచ్చటపడ్డాడు. ‘నిశ్చితార్థం మరిచిపో.. ఈ అమ్మాయినే పెళ్లి చేసుకో’ అని సలహా కూడా ఇచ్చాడట. కానీ.. గోవిందా వాళ్లమ్మకు తండ్రీకొడుకుల తీరు నచ్చలేదు. కొడుకు నీలం మీద పెంచుకుంటున్న ప్రేమను మొగ్గలోనే తుంచేయాలనుకుంది. సమయం చూసి గోవిందాకు చెప్పింది.. ‘పెళ్లి చేసుకుంటానని సునీతకు మాటిచ్చావ్. నీలంతో ఈ వ్యవహారం ఏంటీ? మాట తప్పకు. సునీత మనసు కష్టపెట్టకు. ఆ అమ్మాయి కంటతడి పెడితే నేను ఊరుకోను. ఈ జన్మకు సునీతే నీ భార్య. నీలంతో నీ హద్దుల్లో నువ్వుండు’ అంటూ. అమ్మ మాట నెమ్మదిగానే ఉన్నా ఆ స్వరంలోని తీవ్రతను గ్రహించాడు గోవిందా. ‘అప్పుడు అనుకున్నాను సునీతకు మాటిచ్చి తప్పు చేశాను అని. నిజానికి ఆమెతో రిలేషన్ అంత సీరియస్‌గా ఉంటుందని.. పెళ్లిదాకా వస్తుందని ఊహించలేదు. జస్ట్ క్యాజువల్ ఫ్రెండ్షిప్గా మొదలైంది అంతే’ అంటూ కన్ఫెస్ చేశాడు గోవిందా. పెళ్లి.. నీలం మాత్రం తన కెరీర్‌కే ప్రాధాన్యం ఇచ్చింది. నంబర్ వన్ హీరోయిన్ కావాలన్నదే ఆమె లక్ష్యం. ఆ దిశగానే ఆమె ప్రయాణం ఉండింది. పెళ్లి గురించి గోవిందా ఎప్పుడు టాపిక్ తెచ్చినా పెద్దగా నవ్వేసేదట. అనుకున్నట్టుగానే నీలం కెరీర్ మలుపు తిరిగింది. సన్నీ డియోల్, మిథున్ చక్రవర్తి, చుంకీ పాండే వంటి హీరోల పక్కనా అవకాశాలు వచ్చాయి. గోవిందాలో అసూయ పుట్టింది. అది అణిగివున్న ఆత్మన్యూనతను ఉనికిలోకి తెచ్చింది. ఈలోపు గోవిందా వాళ్లమ్మ ఒత్తిడీ పెంచింది సునీతతో పెళ్లి గురించి. ఒప్పుకోక తప్పలేదు గోవిందాకు. చాలా నిరాడంబరంగా గుడిలో సునీతను పెళ్లి చేసేసుకున్నాడు కనీసం నీలంకూ సమాచారమివ్వకుండా. (తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే మార్చి 14న వచ్చే ఫండేలో తెలుసుకోండి) చదవండి: సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన టాలీవుడ్ దర్శకుడు ఓర చూపుతో చంపేస్తున్న రష్మీ.. మైండ్ బ్లాక్ చేస్తున్న కాజల్ -
16 పాటలు రాశావా గోవిందా.. ఏంటో అవి?!
ఒకప్పటి బాలీవుడ్ హీరో గోవింద తెగ నవ్విస్తాడు... అనేదాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ‘ఆయన పాటలు ఏమైనా రాస్తాడా?’ అనే కొచ్చెనుకు మాత్రం డౌట్ల మీద డౌట్లు వస్తాయి. పాటలకు డ్యాన్స్‌లు చేసే హీరో పాటలెందుకు రాస్తాడు? మరీ అంతగా అయితే పాటలు పాడుతాడు గానీ....అనేవాళ్లు కూడా ఉన్నారు. ఇటీవల ఒక రియాల్టీ షోకు గెస్ట్‌గా వచ్చాడు గోవింద. ఆ షోలో 90’లలో తన సినిమాలలోని హిట్‌సాంగ్స్‌ను సింగర్స్ గానం చేస్తున్నప్పుడు గోవింద గత జ్ఞాపకాల్లోకి వెళ్లిపోవడమే కాదు... ‘నేను పీక్ స్టేజీలో ఉన్నప్పుడు 15–16 హిట్‌సాంగ్స్ స్వయంగా రాశాను’ అని చెప్పాడు. అప్పట్లో బాగా పాపులర్ అయిన ‘దీవాన మస్తానా’ అనే డైలాగ్ కూడా ఆయన రాసినదేనట. ఇంతకీ ఆ 16 సాంగ్స్ ఏమిటంటారు? కాస్త పరిశోధించాల్సిందే సుమీ! చదవండి: ఆ సినిమాలు, వెబ్ సిరీస్‌లన్నీ నెట్‌ఫ్లిక్స్‌లోనే! -
అందుకే నేను నెపో-కిడ్ కాదు: టీనా
ముంబై: బి-టౌన్లో స్టార్ కిడ్స్ హవా ఎక్కువ. అందుకే బాలీవుడ్‌ను నెపోటిజానికి కేరాఫ్‌గా చెబుతుంటారు. తల్లిదండ్రుల సపోర్టుతో సినిమాల్లోకి వచ్చి స్టార్స్‌గా ఎదిగిన అలియా భట్, రణ్‌బిర్ కపూర్, జాన్వి కపూర్, వరుణ్ దావన్, అర్జున్ కపూర్ తదితరులను టాలీవుడ్ నెపో-కిడ్స్(నెపోటిజం)గా పిలుస్తుంటారు. అయితే వీరిలో ప్రముఖ సినీయర్ నటుడు, హీరో గోవిందా గారాల పట్టి, హీరోయిన్ టీనా అహుజా పేరు మాత్రం వినిపించదు. దీనిపై ఆమె ఇటీవల ఓ ఇంటర్య్వూలో మాట్లాడారు. తాను ఎప్పుడూ నెపో-కిడ్ని కాదని, ఎందుకంటే తన సినిమాలను ప్రమోట్ చేయాలని ఆమె తండ్రి(గోవిందా) ఎప్పుడూ ఏ నిర్మాతను కోరలేదని వెల్లడించారు. మీ తండ్రి ఎప్పుడైన మీకు సినిమాల్లో సహాయం చేశారా? అని అడగ్గా ఆమె ‘ఎప్పుడు చేయలేదు. ఒకవేళ అలా చేసుంటే ఇప్పటికే నేను 30 నుంచి 40 సినిమాలకు సంతకం చేసేదాన్ని. కానీ ఆయన నాకు ఎప్పుడు సాయం చేయలేదు. నేను కూడా ఆయనను ఎప్పుడు అడగలేదు. ఒకవేళ నాకు అవసరమని భావించి ఆయనను అడిగేతే.. సహాయం చేయడానికి ఆయన సిద్దంగా ఉన్నారు. కానీ నెపో-కిడ్‌గా ముద్ర వేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు నా సొంత గుర్తింపుతోనే సినిమా అవకాశాలు పొందాను. అయితే నేను ఏం చేస్తున్నాను, నా నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటనే రిపొర్టులను మాత్రం ఆయన పరిశీలిస్తూంటారు. అలా అని నా ప్రతి విషయంలో ఆయన జోక్యం చేసుకుంటారని కాదు. సినిమాల ఎంపికలో నా సొంత నిర్ణయాలను నాకే వదిలేస్తారు. అందుకే ఆయన నన్ను సినిమాల్లో ప్రమోట్ చేయమని ఇప్పటి వరకూ ఏ నిర్మాతను అడగలేదు. అందుకే నాకు నెపో-కిడ్(నెపోటిజం) అనే పేరు రాలేదు’ అంటూ చెప్పుకొచ్చారు. కాగా టీనా అహుజా 2015 స్మిప్ కాంగ్ దర్శకత్వంలో వచ్చిన 'సెకండ్ హ్యాండ్ హస్బెండ్'లో హీరోయిన్గా నటించి బాలీవుడ్ అరంగేట్రం చేశారు. (చదవండి: ఆ రెండు లేకుండానే పెళ్లి: ఎందుకో చెప్పిన దియా) (నటుడి ఆత్మహత్య: భార్య, అత్తపై ఎఫ్ఐఆర్) -
గోవిందా కుమారుడికి కారు ప్రమాదం
ముంబై: బాలీవుడ్ నటుడు గోవింద కుమారుడు యశ్వర్ధన్ ఇటీవల ముంబైలోని జుహులో కారు ప్రమాదానికి గురైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రమాద సమయంలో కారులో యశ్వర్ధన్తో పాటు అతడి డ్రైవర్ ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ నెల 2వ తేదీ రాత్రి ఓ పార్టీ నుంచి తిరిగి వెళ్తుండగా జూహు వద్ద యశ్‌రాజ్ ఫిలింస్ (వైఆర్ఎఫ్)కు చెందిన ఫ్యార్చ్యున్ కారు ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. దీనిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని జూహు పొలీసులు తెలిపారు. (ఇది అన్యాయం) కాగా ప్రమాదంలో ఎవరూ గాయపడకపోవడంతో సంఘటన స్థలంలోనే ఇరువర్గాలు చర్చించుకుని పరిష్కరించుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. గోవింద, సునీతా అహుజాకు కూమార్తె టీనా, కుమారుడు యశ్వవర్థన్‌లు ఉన్నారు. కాగా గోవింద 2018లో విడుదలైన ‘ఫ్రైడే’, ‘రంగీలా రాజా’ చిత్రాలలో నటించారు. అలాగే పలు టీవీ కార్యక్రమాల్లో అతిథిగా పాల్గొన్నారు. -
అందుకే అవతార్ ఆఫర్ తిరస్కరించా!!
ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయం సాధించిన హాలీవుడ్ విజువల్ వండర్ అవతార్ సినిమాకు టైటిల్‌ను తానే సూచించానంటున్నాడు బాలీవుడ్ నటుడు గోవిందా. తనకు ఆ సినిమాలో ఆఫర్ వచ్చినప్పటికీ తిరస్కరించానని పేర్కొన్నాడు. పండోరా గ్రహంలోని వింత జీవులు మానవులతో చేసిన పోరాటాలు నేపథ్యంగా తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. అయితే ఇంతటి భారీ చిత్రంలో నటించాలని దర్శకుడు కోరినప్పటికీ ఆ సినిమాకు సైన్ చేయలేదన్నాడు గోవిందా . మంగళవారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ...‘ జేమ్స్ కామెరూన్‌కు అవతార్ టైటిల్‌ను నేనే సూచించా. కానీ అందులో ఆఫర్‌ను తిరస్కరించా. ఈ సినిమా కచ్చితంగా హిట్టవుతుందని జేమ్స్ కామెరూన్‌కు ముందే చెప్పా. అయితే విజువల్ వండర్ తెరకెక్కాలంటే సుమారు ఏడేళ్లు పడుతుందని అనగానే తనకు కోపం వచ్చింది. ఎవరూ చూడని ప్రపంచాన్ని చూపిస్తానని చెప్పి ఏలియన్స్‌తో సినిమా తీశాడు. సినిమా కోసం 410 రోజులు షూటింగ్ చేయాల్సి ఉంటుంది అన్నాడు. అయితే ఒంటి నిండా రంగులు పూసుకుని అన్ని రోజులు నేను ఉండలేను కాబట్టి నన్ను క్షమించాలని కోరాను’ అని వ్యాఖ్యానించాడు. కాగా అవతార్ బ్యాక్ ఇన్ 2012 అనే పేరుతో గోవిందా, సన్నీ డియోల్ ప్రధాన పాత్రల్లో బాలీవుడ్లో ఓ సినిమా తెరకెక్కింది. అయితే ఆ సినిమా కనీస ప్రచారానికి కూడా నోచుకోలేదు. ఈ సినిమాతో తిరిగి ఫామ్‌లోకి వద్దామనుకున్న గోవిందాకు చేదు అనుభవమే మిగిలింది. ఈ క్రమంలో గోవిందా మాత్రం అవతార్ టైటిల్‌ను తానే సూచించానని చెప్పడంపై ప్రస్తుతం జోకులు పేలుతున్నాయి. ఇక జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో తెరకెక్కిన అవతార్ 2009లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అవతార్ తొలి సీక్వెల్ అవతార్ 2 2021 డిసెంబర్ 17న ఈ సినిమా రిలీజ్ అవుతుందంటూ అవతార్ టీం ఇటీవలే ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ముందుగా ఈ సినిమా సీక్వెల్ 2020 డిసెంబర్లోనే రిలీజ్ అవుతుందని భావించినా నిర్మాణం ఆలస్యం కావటంతో ఏడాది పాడు వాయిదా పడింది. 3,4,5 భాగాలను కూడా రెండేళ్ల విరామంతో వరుసగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. -
‘మా ఇద్దరినీ అంతం చేయాలని చూస్తున్నారు’
గ్లామరస్ మాఫియా కారణంగానే తమ సినిమాకు థియేటర్లు దొరకలేదని, అందుకే పరాజయం చవిచూడాల్సి వచ్చిందని బాలీవుడ్ మూవీ ‘రంగీలా రాజా’ నిర్మాత, సెంట్రల్ బోర్డు ఫిల్మ్ సర్టిఫికేషన్(సీబీఎఫ్సీ) మాజీ చైర్మన్ పహ్లజ్ నిహలానీ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘ సెన్సార్ బోర్డు చైర్మన్‌గా ఉన్న సమయంలో కఠినంగా వ్యవహరించినందు వల్లే కొంతమంది నన్ను టార్గెట్ చేశారు. నా కారణంగా హీరో గోవిందాను ఇబ్బంది పెడుతున్నారు. నన్ను, గోవిందాను అంతం చేయాలని చూస్తున్న ఆ వ్యక్తులు ఎవరో నాకు తెలుసు. ఇండస్ట్రీ మొత్తం కొంతమంది చేతుల్లో చిక్కుకుపోయింది. కార్పోరైటేజషన్ పేరుతో నా వంటి నిర్మాతలను అణగదొక్కాలని చూస్తున్నారు. అయినా భయపడేది లేదు. మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయం సాధిస్తా’ అని వ్యాఖ్యానించారు. ఇక ఈ విషయం గురించి మాట్లాడిన గోవిందా.. ‘ గత తొమ్మిదేళ్లుగా పరిస్థితి ఇలాగే ఉంది. నా సినిమాలకు థియేటర్లు దొరకకుండా కొంతమంది అడ్డుతగులుతున్నారు. నేనేమీ రాజకీయాల్లో లేనుకదా. దయచేసి నా పనిని సక్రమంగా చేసుకోనివ్వండి’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా గోవిందా ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘రంగీలా రాజా’ సినిమా శుక్రవారం విడుదలైంది.