graveyard
-
ఆ ఊర్లో చచ్చినా చావే.... !
కంభం: ఆ గ్రామంలో వాగు పారుతుంటే ఊరి చివర ఉన్న శ్మశాన వాటికకు వెళ్లాలన్నా, రైతుల పొలాలకు వెళ్లాలన్నా, వ్యవసాయ కూలీలు కూలి పనులకు వెళ్లాలన్నా నానా తిప్పలు పడుతున్నారు. ఎన్నో ఎళ్లుగా ఇబ్బందులు పడుతున్నా ఎవరూ తమ సమస్యను పట్టించుకోవడం లేదని అక్కడి ప్రజలు వాపోతున్నారు. మండలంలోని రావిపాడు గ్రామంలో ఎవరైనా చనిపోతే శవాన్ని శ్మశాన వాటికకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించాలన్నా నానా తంటాలు పడాల్సి వస్తోంది. కంభం చెరువు నుంచి మార్కాపురం వైపునకు వెళ్లే గుండ్లకమ్మ వాగు రావిపాడు గ్రామం పొలిమేరల్లో నుంచి వెళ్తుంది. చెరువులో నీళ్లు లేని సమయంలో వాగు ఎండి ప్రజలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దాటుతుంటారు. చెరువులో నీళ్లు ఉన్న సమయంలో ఈ వాగు ఎప్పుడూ పారుతూనే ఉంటుంది. ఎప్పుడైనా పెద్ద పెద్ద వానలు కురిస్తే వాగు ఇంకా ఉధృతంగా పారుతూ రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది.చచ్చినా చావే:వాగు అవతల హిందువుల శ్మశాన వాటిక ఉంది. గ్రామంలో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలకు శ్మశాన వాటికకు వెళ్లాలంటే నానా తంటాలు పడాల్సి వస్తుందని గ్రామస్తులు వాపోతున్నారు. వాగులో నీళ్లు పారుతున్న సమయంలో భుజాల లోతు నీళ్లలో తంటాలు పడుతూ శవాన్ని మోస్తూ వాగు దాటాల్సిన దుస్థితి. చనిపోయిన వ్యక్తికి సంబంధించిన వారి బంధువుల్లో వృద్ధులు, వికలాంగులు ఉంటే అంత్యక్రియలకు కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఎన్నో ఏళ్లుగా గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నా ఎవరూ స్పందించడం లేదు.రైతులకు తప్పని తిప్పలు:రావిపాడుతో పాటు పక్కనే ఉన్న కందులాపురం, నడింపల్లి, సైదాపురం, ఔరంగబాదు గ్రామాలకు చెంది రైతులకు గుండ్లకమ్మ అవతల పొలాలు ఉన్నాయి. సుమారు వెయ్యి ఎకరాలకు పైగా పొలాలు ఉండటంతో రైతులు నిత్యం ఈ మార్గం గుండా పంటపొలాలకు, కూలి పనులకు వెళ్తుంటారు. వాగు పారుతున్న సమయంలో పంటపొలాలకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. పంటలు పండిన తర్వాత పంటను, ధాన్యాన్ని ఇంటికి చేర్చుకోవాలన్నా ఇబ్బందులు తప్పడం లేదు. మరో మార్గంలో పంటను ఇంటికి చేర్చుకోవాలంటే మూడు కిలోమీటర్లు చుట్టూ తిరిగి రావాల్సి వస్తుందని రైతులు చెబుతున్నారు. -
పంజాగుట్టలోని శ్మశానవాటికలో జరగనున్న చంద్రమోహన్ అంత్యక్రియలు
-
నడి రోడ్డుపై సమాధి!
శ్రీ సత్యసాయి: కొన్నేళ్ల పాటు పోరాటాలు సాగించినా శ్మశాన వాటికకు అనువైన స్థలాన్ని కేటాయించకపోవడంతో ఓ మృతదేహాన్ని నడిరోడ్డుపై ఖననం చేసి గ్రామస్తులు వినూత్న నిరసన వ్యక్తం చేశారు. వివరాలు... పావగడ తాలూకా నిడుగల్ హోబళికి చెందిన క్యాతగానహళ్లిలో గతంలో ప్రభుత్వ పొరంబోకు భూమిని శవ సంస్కారాలకు వినియోగించుకునేవారు. కొన్నేల్ల క్రితం ఆ భూమిని ఇతరులు ఆక్రమించుకున్నారు. దీంతో మృతదేహాలను ఖననం చేసేందుకు స్థలం లేక గ్రామస్తులు పలుదఫాలుగా అధికారులకు విన్నవించారు. అయినా ఫలితం దక్కలేదు. దీంతో గ్రామస్తులు విసిగిపోయారు. ఇటీవల ఆ గ్రామానికి చెందిన ఈరణ్ణ మృతి చెందడంతో ఆయన దేహాన్ని తీసుకెళ్లి గ్రామ శివారున నడిరోడ్డుపై ఖననం చేశారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ వరదరాజు ఆగమేఘాలపై ఆ గ్రామానికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. ప్రభుత్వ భూమిని సర్వే చేయించి శ్మశాన వాటికకు స్థలాన్ని కేటాయిస్తామని గ్రామస్తులకు హామీనిచ్చారు. -
స్మశానంలో పెళ్లి బంధువుల ఫీలింగ్ చూడాలి
-
స్మశానంలో కూతురికి ప్రేమపెళ్లి జరిపించిన తండ్రి
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైన ఘట్టం. అందుకే తమ వివాహ వేడుకను ఎప్పటికి గుర్తుండేలా అంగరంగ వైభవంగా జరుపుకోవాలని వధూవరులు ఆశపడుతుంటారు. కొందరు డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకుంటే, మరికొందరు రిచ్ ప్యాలెస్‌లోనో, సముద్రానికి దగ్గరగా ఇలా ఎవరి టేస్ట్‌కి తగ్గట్లు వాళ్లుపెళ్లి వేడుకను ప్లాన్ చేస్తుంటారు. అయితే మహారాష్ట్రలో మాత్రం ఓ పెళ్లి వేడుక స్మశానంలో జరిగింది. సంప్రదాయబద్దంగా బంధువుల సమక్షంలో ఈ తంతు పూర్తైంది. పైగా ఇది ప్రేమ పెళ్లి కావడం గమనార్హం. ఇంతకీ స్మశానంలో పెళ్లి చేసుకోవడం కొత్త కాన్సెప్టా? దీని వెనుక ఇంకేమైనా కారణం ఉందా అన్నది ఇప్పుడు చూద్దాం. స్మశానంలో ప్రేమికుల పెళ్లి. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజంగానే జరిగింది. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా రహతా పట్టణానికి చెందిన గంగాధర్ గైక్వాడ్.. స్మశాన వాటికలో కాటికాపరిగా పనిచేస్తూ ఉండేవాడు. కుటుంబంతో కలిసి ఎన్నో ఏళ్లుగా స్మశానవాటికలోనే నివాసం ఉండేవారు. ఆయనకు మయూరి అనే కూతురు ఉంది. 12 తరగతి వరకు చదువుకున్న ఆమె ఉద్యోగం కోసం షిర్డీకి వెళ్లింది. ఈ క్రమంలో ఆమె పని చేస్తున్న సంస్థలో మనోజ్ అనే యువకుడు ఉద్యోగం చేసేవాడు. వీరిద్దరి పరిచయం స్నేహం నుంచి ప్రేమగా మారింది. వీరి ప్రేమను ఇరు కుటుంబ వర్గాలు కూడా అంగీకరించాయి. అయితే తనకు జీవనాధారాన్ని ఇచ్చిన స్మశాన వాటికలోనే కూతురి పెళ్లి చేయాలని గంగాధర్ ఎప్పట్నుంచో భావించాడట. ఈ విషయాన్నే అబ్బాయి కుటుంబసభ్యులకు తెలియజేశాడు. ఇక ఆయన కోరికను కాదనలేక మయూరి పెరిగిన స్మశానంలోనే బంధువుల సమక్షంలో సాంప్రదాయబద్దంగా పెళ్లిని జరిపించారు. ప్రస్తుతం ఈ వేడుక గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. -
Hyderabad: శ్మశానవాటికలో యువతిపై లైంగికదాడి
సాక్షి, హైదరాబాద్(చాంద్రాయణగుట్ట): శ్మశానవాటికలో యువతిపై లైంగికదాడికి పాల్పడిన ఇద్దరిని ఛత్రినాక పోలీసులు అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. జీఎం చావునీకి చెందని ఇబ్రహీంబేగ్ (24), ఉమర్ బేగ్(20) అన్నదమ్ముల పిల్లలు. స్థానికంగానే ఉండే మతిస్థిమితం లేని ఓ మహిళ (30)తో ఇబ్రహీంకు ఉన్న సాన్నిహిత్యాన్ని ఆసరాగా చేసుకొని ఆమెపై లైంగిక దాడి చేద్దామని అన్నదమ్ములు పథకం పన్నారు. ఈ క్రమంలోనే ఇబ్రహీం శనివారం యువతిని పిలిపించుకొని బైక్‌పై తిప్పుతూ జీఎం చావునీలో ఓ శ్మశాన వాటికలోకి తీసుకెళ్లి లైంగికదాడి చేశాడు. అనంతరం ఉమర్‌కూడా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఘటనపై యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. చదవండి: (జూనియర్ ఆర్టిస్ట్‌ల ప్రేమాయణం.. నాలుగేళ్లు ఒకరితో.. నాలుగు నెలలు మరొకరితో..) -
అదో అధోజగత్తు.. శ్మశానసదృశ ప్రాంతం.. మృతప్రాయ నక్షత్రాల అడ్డా!
కాలం తీరి మృతప్రాయంగా మారి రాలిపడ్డ పురాతన నక్షత్రాలతో కూడిన మరుభూమి వంటి ప్రదేశాన్ని పాలపుంతలో ఓ మూలన వ్యోమగాములు తొలిసారిగా గుర్తించారు! మన పాలపుంత వైశాల్యాన్ని మథిస్తున్న క్రమంలో ఈ శ్మశానసదృశ ప్రాంతం యాదృచ్ఛికంగా వారి కంటపడటం విశేషం! పదులు వందలూ కాదు, లెక్కకు మిక్కిలి సంఖ్యలో మృత నక్షత్రాలు అక్కడున్నాయట. ఇవన్నీ ఒక్కొక్కటిగా బ్లాక్‌హోల్స్‌లోకి అంతర్ధానమవుతున్నాయట. అంతరిక్షంలో దీన్ని ఒకరకంగా అధోజగత్తుగా చెప్పవచ్చని సైంటిస్టులు అంటున్నారు. దీని ఎత్తు పాలపుంతతో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువగా ఉందట! పాలపుంతలోని ద్రవ్యరాశిలో ఇవే కనీసం మూడో వంతు ఉంటాయట. ఈ మృత నక్షత్రాలన్నీ చాలా పురాతనమైనవని, ఎప్పుడో మన పాలపుంత పాలబుగ్గల ప్రాయంలో ఉన్నప్పుడు ఏర్పడ్డ బాపతని నాసా పేర్కొంది. మారుమూల చీకట్లలో దాగుండటం వల్ల ఇంతకాలం కంటపడలేదని చెప్పుకొచ్చింది. అన్నట్టూ, ఈ అధోజగత్తు తాలూకు ఒక కొస మనకు 65 కాంతి సంవత్సరాల కంటే దూరం ఉండదట! -
వెర్రి తలకెక్కి.. శ్మశానంలో బర్త్‌డే పార్టీ.. చివరికి ట్విస్ట్
అమలాపురం రూరల్(కోనసీమ జిల్లా): ఆ ఐదుగురూ స్నేహితులు.. వారిలో ఒకరి పుట్టిన రోజు.. వెర్రి తలకెక్కిన వారు.. ఆ వేడుకలను వెరైటీగా వల్లకాటిలో ఏర్పాటు చేసుకున్నారు. పూటుగా తాగారు. కేక్ కట్ చేసి, వేడుకలు జరుపుకొంటున్న సమయంలో వారి మధ్య మాటామాటా పెరిగింది. తన్నులాటకు దారి తీసింది. ఈ నేపథ్యంలో నలుగురు మిత్రులు కలిసి మరొకరిని చాకుతో తీవ్రంగా గాయపరిచారు. చదవండి: రంగు మారిన విశాఖ సాగర తీరం.. ఎందుకిలా? అమలాపురం రూరల్ మండలం కామనగరువులో గురువారం రాత్రి జరిగిన ఈ ఘర్షణ వివరాలను పట్టణ సీఐ ఎస్‌సీహెచ్ కొండలరావు శుక్రవారం తెలిపారు. కామనగరువుకు చెందిన పందిరి శివశంకర్, బొంతు నవీన్, మరో ముగ్గురు స్నేహితులు. నవీన్ పుట్టిన రోజు వేడుకలను అమలాపురం నల్ల వంతెన సమీపంలోని శ్మశానంలో గురువారం రాత్రి ఏర్పాటు చేసుకున్నారు. మద్యం తాగి, వేడుకలు జరుపుకొంటున్న సమయంలో వారి మధ్య మొదలైన వాగ్వాదం.. తీవ్ర రూపు దాల్చింది. శ్మశానంలోనే కొద్దిపాటి ఘర్షణకు దిగిన వారు.. తరువాత ఎవరిళ్లకు వారు వెళ్లిపోయారు. శివశంకర్ కామనగరువులోని తన ఇంటికి వెళ్లి నిద్రకు ఉపక్రమించాడు. ఇంతలో మిగిలిన నలుగురు స్నేహితులూ అతడి ఇంటికి వచ్చి, శివశంకర్‌ను బయటకు తీసుకు వెళ్లి దాడి చేశారు. అతడి శరీరంపై పలుచోట్ల చాకుతో పొడిచి, పరారయ్యారు. గాయపడిన శివశంకర్ కేకలు వేయడంతో అక్కడకు వచ్చిన కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడిన అతడిని స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో బొంతు నవీన్‌తో పాటు మిగిలిన ముగ్గురు స్నేహితులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ కొండలరావు తెలిపారు. -
స్మశానంలో పుట్టినరోజును జరుపుకున్న హీరోయిన్.. ఎందుకో తెలుసా?
సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో పుట్టినరోజు చాలా స్పెషల్. తమ పుట్టినరోజుని ఎంతో సంతోషంగా జరుకుంటారు. ఇక సెలబ్రిటీల విషయానికి వస్తే స్టార్ హోటల్స్, రిసార్ట్స్,పబ్స్‌లో బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే ఇందుకు విభిన్నంగా ఓ హీరోయిన్ మాత్రం తన పుట్టినరోజుని స్మశానవాటికలో జరుపుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ నటి ఆర్యా ఘారే మంగళవారం తన పుట్టినరోజు వేడులను స్నేహితులతో కలిసి స్మశానంలో జరుపుకంది. స్మశానవాటికలోనే కేక్ కట్ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇలా బర్త్‌డేను స్మశనాంలో జరుపుకోవడంపై నటి ఆర్యా ఘారే స్పందిస్తూ.. మూఢనమ్మకాలపై వ్యతిరేక ప్రచారంలో భాగంగా ఇలా పుట్టినరోజును జరుపుకున్నట్లు తెలిపింది. కాగా ఈ బర్త్‌డే వేడుకలకు ఆమె తల్లి కూడా హాజరుకావడం విశేషం. ఇక సినిమాల విషయానికి వస్తే డ్యూల్ బంద్, భిర్గీత్, అబా, బ్యాక్ టూ స్కూల్ వంటి చిత్రాలతో హిందీ, మరాఠీ చిత్ర పరిశ్రమల్లో ఆర్య ఘారే తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. -
ఇళ్ల మధ్యే సమాధులు.. మంచమే వాడని వింత ప్రపంచం
సాక్షి, కర్నూలు(రాజ్‌విహార్): ఏ ఊరిలోనైనా సాధారణంగా సమాధులు ఊరికి దూరంగా ఉంటాయి. ఇంట్లో గతించిన వారిని స్మశానవాటికకు తీసుకెళ్లి అంత్యక్రియలు జరిపి, కొన్నాళ్ల తరువాత సమాధి కడుతారు. ప్రపంచంలోని ఏ ఊరిలోనైనా ఈ ఆచారం కొనసాగుతుంది. చనిపోయిన వారి కోసం ఊరి చివర ఒక ప్రత్యేక స్మశాన వాటిక ఉండడం సాంప్రదాయం. కానీ ఇంటికి ముందే గతించిన వారి సమాధి ఉండడం, వారం వారం వాటికి పూజలు చేయడం ఆ ఒక్క ఊరిలోనే కనిపించే ఆచారం. గతించిన వారి ఆత్మల సన్నిధిలో తాము నివసించాలని, ఆ ఆత్మల ఆశీస్సులే తమకు అపురూపమని భావిస్తారు ఆ గ్రామ ప్రజలు. అంతేకాదు.. తమ చింతలన్నింటినీ రూపుమాపి, తమ బ్రతుకులకు ఉత్సాహాన్ని నింపే స్వామి ‘చింతల మునిస్వామి’ అని భావిస్తూ తమ ఇంట్లో వండిన ప్రతి వంటకాన్ని ముందుగా ఆ స్వామికి నైవేధ్యంగా అందిస్తారు ఆ గ్రామస్తులు. తమ ఊరికి సమీపంలో ఉండే గంజిహళ్లి గ్రామ బడేసాహెబ్ వలి తాత పెట్టిన శాపంతో ఆ ఊరు మంచం లేని వింత ప్రపంచంగా మారింది. చిత్రం ఏమిటంటే ఏ ఇంటిలోనూ మనకు మంచమే అగుపించదు. నేలనే పాన్పుగా భావించి, నేలపై నిదురించే ఆ గ్రామవాసులు తమ ఇంటి ముందున్న సమాధులే తమకు శ్రీరామ రక్షగా భావిస్తుంటారు. స్మశానవాటిక లేని, మంచం వాడని, వింత ఆచారాలు కలిగి, సమాధులే అండదండగా భావిస్తోంది అయ్యకొండ గ్రామం. ఏడు తరాలుగా నిరంతరాయంగా, క్రమం తప్పకుండా ఈ ఆచారాలు పాటిస్తున్న ఆ గ్రామ వాసులను పలుకరిస్తే.. తాము నమ్మిన ఆచారాలను పాటించడంలోని ఒక చిత్తశుద్ధి, ఒక నియమపాలన కనిపిస్తుంది. వాటిపై ప్రత్యేక కథనం... గ్రామం గురించి.. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలో ఉంది అయ్యకొండ గ్రామం. కర్నూలుకు 61కిలో మీటర్లు దూరం ఉన్న ఈ గ్రామంలో 254 కుటుంబాలుండగా 1426 జనాభ ఉంటుంది. పురుషులు–768, స్త్రీలు–658 ఉన్నారు. ఊరంతా మాల దాసరి (ఒకే) కులం. గ్రామస్తులు చెప్పే చరిత్ర జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో ఉన్న అయ్యకొండ గ్రామంలో ‘శ్రీ చింతల మునిస్వామి’ ఆలయం ఉంది. అక్కడి పెద్దల అభిప్రాయాల ప్రకారం... మూడున్నర శతాబ్ధాల క్రితం అయ్యకొండపై (అప్పట్లో ఊరు లేదు) చింతల మునిస్వామి తాత ఉండేవారు. ఇక్కడికి ఐదు కిలో మీటర్ల దూరంలో ఉన్న గంజిహళ్లి గ్రామంలో పెద్ద భూస్వామి ఇంట్లో ఎల్లప్ప అనే వ్యక్తి పశువుల కాపరిగా ఉండేవారు. ఓ రోజు యజమాని ఒక ఆవును తీసుకెళ్లి తన కూతురుకు ఇచ్చిరావాల్సిందిగా ఎల్లప్పను ఆదేశించారు. దీంతో ఆవును తీసుళ్తుండగా అది తప్పించుకొని వెళ్లిపోడంతో యజమాని ఆగ్రహించి, ఆవును వెతుక్కొని తేవాలని ఆదేశిస్తారు. దీంతో ఎల్లప్ప అడవిలో వెతుక్కుంటూ కొండపైకి వెళ్తారు. అక్కడ రాళ్ల గుహలో శబ్ధం రాగా రాళ్ల చాటు నుంచి తొంగి చూస్తారు. అక్కడ కూర్చున్న చింతల మునిస్వామికి తప్పించుకుపోయిన ఆవు పితకకుండానే పాలు ఇస్తుండడం, మునిస్వామి తాత దోసిలి పట్టి పాలు తాగుతూ ఉండడం చూసి ఆశ్చర్యపోతారు ఎల్లప్ప. ఇది చూసి తాత శక్తులు కలిగిన స్వామిగా భావించి భూస్వామి వద్ద పని మానేసి.. మునిస్వామి చెంతకు చేరి సేవలు చేసుకుంటూ ఉండిపోతారు. ఇళ్ల మధ్యే సమాధులు చింతల మునిస్వామి వద్ద సేవలు చేస్తూ జీవిస్తున్న ఎల్లప్ప కుమారుడు బాల మునిస్వామి చనిపోయిన తరువాత తన ఇంటి ముందే సమాధి చేస్తారు. ప్రతి శనివారం ఆ సమాధికి ఆవు పేడతో అలికి, అగరొత్తులు వెలిగించి పూజించారట. కుటుంబాలు పెరుగుతూ పోవడం, ఆయుష్షు తీరి చనిపోయిన వారిని ఇళ్ల ముందే అంత్యక్రియలు చేయడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఈ ఆచారం ఇప్పటికీ కొనసాగుతూ వస్తోంది. వండిన వంట మునిస్వామి చెంత ఆ రోజుల్లో చింతల మునిస్వామి తాత వద్ద సేవలు చేస్తూ ఉండిపోయిన ఎల్లప్ప తినడానికి సమీపంలోని గ్రామాలకు వెళ్లి అక్కడ అడిగి తెచ్చుకున్న ఆహారాన్ని ముందుగా స్వామి చెంత ఉంచి, పూజించిన తరువాతే భుజించేవారట. అన్నంతో పాటు ఏ వంట అయినా ఇలా చేసేవారట. దీంతో ఆయన కుటుంబ సభ్యులు, వంశీయులు ఆ ఆనవాయితీని కొనసాగిస్తూ వస్తున్నారు. అన్నం, పప్పు, కూరగాయలు, ఆకుకూరలు, మాంసాహారం, తీపి వంటలు.. ఇలా ఏ వంట వండినా ముందుగా చింతల మునిస్వామి ముందు పూజించిన తరువాతే నోటిలో పెట్టుకుంటున్నారు. అత్త ఇంటి నుంచి బయటకు వెళ్తే ఆమెకు తెలియకుండా కోడలు చేసుకున్న వంట సైతం ఆలయంలోకి తీసుకెళ్లాలి. ఆమె వెళ్లలేని పరిస్థితుల్లో ఉంటే ఎవరితోనైనా పంపించి, పూజ చేయించిన తరువాతే తినాలి. చివరకు మద్యం, సారా, కల్లు ఇలా ఏమి తాగాలన్నా తాత ముందు పూజ చేయాల్సిందే. మంచం వాడని వింత ప్రపంచం మంచం వాడని వింత ఊరుగా అయ్యకొండకు పేరు. గంజిహళ్లి బడేసాహెబ్ తాత, చింతల మునిస్వామి తాత ఇద్దరు స్నేహితులు. గంజిహళ్లి ఉరుసుకు వెళ్లిన మునిస్వామి తన తిరుణాలకు ఆహ్వానించగా బల్లి రూపంలో వస్తారు బడేసాహెబ్ తాత. ఇది గ్రహించని మునిస్వామి తాత మంచంపై కూర్చొని ఉండి తిరుణాలకు రాలేదని బడేసాహెబ్ తాతపై కోప్పడుతారట. అప్పుడు ప్రత్యక్షమైన బడేసాహెబ్ తాత మంచంపై కూర్చున్న నువ్వు.. నేను వచ్చినా గ్రహించకుండా కోపగించుకుంటావా అని ఆగ్రహించి ‘మాల వాడికి మంచం లేదు.. నువ్వు మంచం వాడరాదని’ శపించారట. తాత మంచం వాడలేదని ఆ గ్రామస్తులు ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. మనిషి పుట్టిన తరువాతే ఆచారాలు పుట్టాయి. అయితే వాటి ప్రభావం మనుషులపై ఎంతో ఉంటుంది. ఆనాదిగా వస్తున్న ఆచారాలు, నమ్మకాలు, సాంప్రదాయాలను మనిషి ఎంతో విశ్వాసం కలిగి ఉంటాడు అనడానికి ఇవే నిదర్శనం. ఏడు తరాలుగా ఇవే ఆచారాలు : పెద్ద రంగన్న, అయ్యకొండ. ఏడు తరాలుగా మా కులదైవం శ్రీ చింతల మునిస్వామి తాతను ఆరాధిస్తూనే వస్తున్నాం. అప్పటి నుంచి ఏ వంట చేసినా ముందుగా తాత పాదాల చెంత ఉంచి పూజ చేయనిదే నోట్లో పెట్టుకోం. తరాలు మారినా మా ఆచారాలు మాత్రం ఇప్పటికీ కొనసాగుతున్నాయి. వాటిని కాదనే ఇళ్లు, మనిషి మా గ్రామంలోనే లేరు. స్మశానం ఉండదు.. ఇంటి ముందు సమాదులు : చిట్టెమ్మ గ్రామానికి ప్రత్యేకంగా స్మశానం ఉండదు. ఎవరు చనిపోయినా ఇంటి ముందు లేదా పక్కన ఖాళీ స్థలంలోనే అంత్యక్రియలు జరుపుతారు. వాటి మధ్యే మా జీవనం. ప్రతి శనివారం వాటిని శుభ్రం చేసి అగరొత్తులు వెలిగించి పూజించడం తరాలుగా వస్తున్న ఆచారాన్ని ప్రతి ఒక్కరూ కొనసాగిస్తున్నారు. చిన్న పిల్లలు సైతం వాటి మధ్యే ఆడుకోవడం చేస్తుంటారు. ఏ వంట చేసినా తాతకు ముందుగా నైవేద్యం : నాగమ్మ మా గ్రామంలో వస్తున్న ఆచారాలను ఇప్పటికీ ఎవరూ కాదని వెళ్లరు. ఏ వంట చేసినా ముందుగా చింతల మునిస్వామి తాత చెంత పెట్టాలి. అన్నం, పప్పు, ఆకుకూరలు, కూరగాయలు, మాంసం, పిండి వంటలు, చివరకు గుడ్డుతో ఆమ్లెట్ వేసుకున్నా నైవేధ్యంగా పెట్టి పూజ చేయనిదే నోట్లో పెట్టుకోము. రోజుకు పది రకాల వంటలు, పది సార్లు వండినా తాతకు పెట్టాల్సిందే. కటిక నేలపైనే కాన్పు : శంకరమ్మ మా గ్రామంలో మంచం వాడరాదనే శాపం ఉంది. దీంతో ఊరిలోని ఏ ఇంట్లో చూసినా మంచం ఉండదు. నేలపైనే నిద్రిస్తాము. చివరకు కాన్పు జరిగినా కటిక నేలపైనే. పచ్చి బాలింత అయినా బొంత పరుచుకొని తల్లి, పిల్లలు కింద పడుకోవాలి తప్ప ఏ మంచాన్ని వాడరు. దీనిని ఎవరూ కాదనరు. -
వల్లకాడే ఊరు.. శ్మశానంలో కాపురాలు.. సమాధులే పట్టు పరుపులు
నెల్లూరు(అర్బన్): అక్షరం ముక్క రాని అభాగ్యులు. దారిద్ర్యంలో అతి దరిద్రులు. నిత్యం శవాల కాలే చమురు వాసనలే వారికి సువాసనలు. మనిషి పుర్రెలతోనే పసిబిడ్డలు ఆటలాడుకుంటారు. సమాధులే వారికి పట్టు పరుపులు.. ఉండేందుకు జానెడు జాగా లేక వల్లకాడు(శ్మశానం)లోనే దశాబ్ధాల తరబడి కాపురాలు ఉంటున్నారు. ఇదంతా ఎక్కడో కాదు. విక్రమసింహపురిగా ఖ్యాతి గాంచిన నెల్లూరు బోడిగాడితోట శ్మశానంలో కాపురాలుంటున్న నిరుపేదల దయనీయ స్థితి. నెల్లూరు పెన్నానది ఒడ్డున విశాలమైన బోడిగాడితోట హిందువుల అతిపెద్ద శ్మశాన వాటిక. సుమారు 8 లక్షల జనాభ ఉండే నగరంలో మనిషి మరణిస్తే ఎక్కువ భాగం బోడిగాడితోటలోనే ఖననం చేస్తారు. ఆ శ్మశాన వాటికను ఆనుకుని ఒక వైపు పెద్ద, పెద్ద భవంతులున్నాయి. ఎంతో అభివృద్ది చెందిన ప్రాంతాలున్నాయి. శ్రీమంతులున్నారు. మరో వైపు నివాస స్థలం లేకపోవడంతో శ్మశానంలో సమాధులనే ఇళ్లుగా చేసుకుని పట్టలు కట్టుకుని, పూరి కప్పు వేసుకుని నివసించే వందలాది కుటుంబాలున్నాయి. వీరి బాధలు చూసిన వారి మనస్సు చివుక్కు మనిపించక మానదు. జానెడు పొట్ట నింపుకునేందుకు ఇన్ని బాధలా.. ఇంత దుర్భరమైన బతుకా అని మనస్సు కలత చెందడం ఖాయం. (చదవండి: బతికుండగానే సమాధి.. దానికో కిటికి.. ఏమా రహస్యం) బతుకు దుర్భరం ఈ శ్మశానంలో సుమారు 500 కుటుంబాల వరకు నివసిస్తున్నాయి. చిన్న పూరింట్లోనే నలుగురైదుగురు నివాసం ఉంటున్నారు. ఇక్కడ ఉంటున్న వీరు వారి తాత, ముత్తాతల కాలంలో ఇక్కడికి వలస వచ్చారు. అందరూ తమిళం మాట్లాడుతారు. వీరిలో ఎక్కువ భాగం చిత్తుకాగితాలు, ప్లాస్టిక్ వ్యర్ధాలు ఏరుకోవడం వాటిని అమ్ముకోవడం ద్వారానే బతుకు బండి లాగిస్తున్నారు. మరికొంతమంది మంది మహిళలు వీధి, వీధి తిరుగుతూ చిక్కు వెంట్రుకలు సేకరించి వాటిని అమ్మడం చేస్తారు. ఇంకొంతమంది ఇళ్లలో పాచి పని చేసి బతుకీడిస్తున్నారు. వచ్చే అరకొర సంపాదనతో ఏపూటకాపూట బతుకుతున్నారు. (చదవండి: శ్మశానాన్ని కాపాడలేని ఈ బతుకు ఎందుకు!!) ఇది చాలదన్నట్టు చదువు సంధ్య లేని వారు కావడంతో మద్యం లాంటి అలవాట్లతో ఎదుగూ బొదుగూ లేకుండా జీవిస్తున్నారు. వర్షం వస్తే వారి బాధలు వర్ణనాతీతం. ఒక వైపు తడుస్తూ.. మరో వైపు పనులు లేక పస్తులతో గడుపుతుంటారు. జబ్బు చేస్తే దవాఖానాకు పోయేందుకు పైసలు లేక అల్లాడి పోతుంటారు. స్వాతంత్య్రం వచ్చి ఏడున్నర దశాబ్ధాలు అవుతున్నా వారికి చీకటి బతుకుల్లో వెలుగు రావడం లేదు. (చదవండి: కర్రకు ప్రాణం.. కళకు రూపం) తమ ఓట్లు పొందుతున్న నాయకులు తమకు పక్కా ఇళ్లు కల్పించడంలో విఫలమయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరి బాధలు స్వయంగా పరిశీలించిన నెల్లూరు సిటి నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వారికి టిడ్కో ఇళ్లు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో పలువురికి ప్రభుత్వం ద్వారా హౌసింగ్‌బోర్డు కాలని వద్ద టిడ్కో ఇళ్లు కట్టించి ఇవ్వడంతో కొంతమంది ఆ ఇళ్లలోకి కాపురం మార్చారు. త్వరగా పక్కా ఇల్లు కట్టించి ఇవ్వాలి: శాంతి, స్థానికురాలు మాతాత, ముత్తాతల నుంచి తాము ఇక్కడే నివాసం ఉంటున్నాం. మా బిడ్డలకు కూడా పెళ్లిళ్లు చేశాం. ఘోరిల మధ్యనే ఉంటున్నాం. కడుబీదరికంలో బతుకుతున్నాం. ప్రభుత్వం కొంతమందికి ఇళ్లు కట్టించింది. వారు వెళ్లారు. మిగతా వారికి కూడా ఇళ్లు కట్టిస్తామంటున్నారు. త్వరగా ఇళ్లు కట్టించి ఇస్తే మేము కూడా ఇక్కడ నుంచి వెళ్తాం. చదవండి: విధి ఆట.. గెలుపు బాట -
శ్మశాన వాటికలో చిన్నారి మృతదేహం మాయం
సాక్షి, హైదరాబాద్: పహాడీషరీఫ్ శ్మశాన వాటికలో ఓ చిన్నారి మృతదేహం మాయమైన ఘటన కలకలం రేపుతోంది. శ్మశానవాటిలో పూడ్చిపెట్టిన చిన్నారి మృతదేహాన్ని గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. మృతదేహం మాయంపై చిన్నారి బంధవులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎవరు ఎత్తుకెళ్లారు? ఎందుకు ఎత్తుకెళ్లారనే విషయం మిస్టరీగా మారింది. మృతదేహం మాయం ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు. -
బతికుండగానే సమాధి.. దానికో కిటికి.. ఏమా రహస్యం
వాషింగ్టన్: ఇటీవల కాలంలో కొన్ని సార్లు స్మశానానికి చేరుకున్న తర్వాతో, అంత్యక్రియలు జరుగుతున్నప్పుడో సడెన్‌గా మృతదేహాలు లేచి కూర్చుంటున్న ఘటనలు చూశాం. బతికున్న వ్యక్తులను కూడా చనిపోయారని వైద్యులు చెప్పడం వల్లే ఇలా జరుగుతోంది. అయితే ఇలాంటి సంఘటనను ఓ వ్యక్తి వందల ఏళ్ల క్రితమే ఊహించాడు. ఒకవేళ తనను బతికుండానే సమాధి చేస్తే.. ఆ తర్వాత తనకు స్పృహ వస్తే.. ఏంటి పరిస్థితి అని ఆలోచించాడు. ఒకవేళ ఇదే జరిగితే తాను చావలేదని ప్రపంచానికి తెలపడం కోసం ఓ ఆలోచన చేశాడు. దానిలో భాగంగా మరణించడానికి ముందే సమాధి కట్టించుకున్నాడు. దానికి ప్రత్యేకంగా కిటికీ, గంట కూడా పెట్టించుకున్నాడు. చదవడానికి.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఈ సంఘటన అమెరికాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. అమెరికాలోని వెర్మాంట్‌కు చెందిన డాక్టర్ తిమోతీ క్లార్క్ స్మిత్ అనే వ్యక్తి.. ముందు చూపుతో తన సమాధి తానే కట్టించుకున్నాడు. దానికి ప్రత్యేకంగా ఒక కిటికీ, గంటను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఒక వేళ బతికుండగానే తనని ఖననం చేస్తే.. అవి పనికొస్తాయని, ప్రాణాలతో ఉంటే ఆ గంటను కొట్టి బయట ఉన్న వ్యక్తులను అప్రమత్తం చేయవచ్చనేది అతడి ఆలోచన. అయితే ఈ ఘటన ఇప్పుడు జరిగింది కాదు. 18వ శతాబ్దంలో చోటు చేసుకుంది. మరణించడానికి ముందే సమాధిని ఏర్పాటు చేసుకున్న డాక్టర్ తిమోతీ 1893లోనే చనిపోయాడు. ఆ సమాధిలోనే తిమోతీని ఖననం చేశారు. వందల ఏళ్లు గడుస్తున్నప్పటికి ఆ సమాధి ఇప్పటికి ఇంకా చెక్కుచెదరలేదు. పైగా, ఇది ప్రముఖ పర్యాటక కేంద్రంగా వెలుగొందుతుంది. వందల ఏళ్ల క్రితం నాటి ఈ విషయం ఓ టిక్‌టాక్ యూజర్ వల్ల మరోసారి తెర మీదకు వచ్చింది. ఈ విషయాన్ని బాబీకర్టిస్లీ(@bobbiecurtislee) అనే టిక్‌టాక్ యూజర్ ఈ వింత సమాధి గురించి వివరించింది. ‘‘తిమోతీ మరణానికి ముందు తన సమాధికి సంబంధించిన మోడల్ తయారు చేయించుకున్నాడు. దీనికి ప్రత్యేకంగా పేటెంట్ కూడా తీసుకున్నాడు. మరణించకుండానే తనని ఖననం చేస్తే అప్పుడు సమాధికి ఏర్పాటు చేసిన బెల్, కిటికీలు ఉపయోగపడతాయనేది అతడి ఉద్దేశం’’ అని పేర్కొంది. ఆ తర్వాత తిమోతీని ఆ సమాధిలోనే పెట్టి ఖననం చేశారని ఆమె తెలిపింది. కానీ అతడు ఊహించినట్లు గంట కొట్టి.. సాయం కోరే అవకాశం తిమోతీకి లభించలేదని పేర్కొంది. అయితే, సమాధి లోపల చీకటిగా ఉండటం వల్ల ప్రస్తుతం అతడి శవాన్ని చూడటం కష్టమేనని తెలిపింది. వెర్మాంట్‌లోని న్యూ హెవెన్‌లోని ఎవర్గ్రీన్ స్మశానవాటికలో ఈ సమాధి ఉందని వెల్లడించింది. అయితే అప్పట్లో చాలా మంది ఈ సాంప్రదాయాన్ని పాటించేవారట. మరణం తర్వాత జీవితం ఉందని నమ్మేవాళ్లు సైతం ఇలా తమకు తోచిన విధంగా సమాధిలో ఏర్పాట్లు చేసుకొనేవారట. ఈజిప్టులోని మమ్మీలు కూడా ఈ కోవలోకే వస్తాయి. చదవండి: శ్మశానాన్ని కాపాడలేని ఈ బతుకు ఎందుకు!! -
శ్మశానాన్ని కాపాడలేని ఈ బతుకు ఎందుకు!!
లక్నో : శ్మశాన స్థలాన్ని కబ్జాదారులనుంచి రక్షించలేకపోతున్నానన్న బాధతో ఓ వ్యక్తి తనతో పాటు కుటుంబ సభ్యుల ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేశాడు. కుటుంబంతో కలిసి మూకుమ్మడి ఆత్మహత్యలకు ప్రయత్నించాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో గురువారం చోటుచేసుకుంది. బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్న వివరాల మేరకు... కాన్పూర్ దేహత్, మూసా నగర్‌కు చెందిన గుల్ఫమ్(35) ఊర్లోని శ్మశాన వాటిక స్థలానికి కాపలాగా ఉంటున్నాడు. అయితే ఆ స్థలాన్ని ఆక్రమించుకున్న కొందరు నిర్మాణాన్ని చేపట్టారు. గుల్ఫమ్ దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయినప్పటికి లాభం లేకపోయింది. దీంతో భార్య, బిడ్డలతో కలిసి చచ్చిపోవటానికి సిద్ధపడ్డాడు. గురువారం ఉదయం కుటుంబసభ్యులతో కలిసి నిర్మాణం జరుగుతున్న ప్రదేశానికి చేరుకున్నాడు. అనంతరం తనపై, వారిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. మంటల్లో కాలుతున్న వారి అరుపులు విన్న దారినపోయేవారు ఆసుపత్రికి తరలించారు. ప్రసుత్తం వారి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు. సంఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేట్టారు. ( లేడీ డాక్టర్‌ను కాల్చిచంపిన ఇండియన్ డాక్టర్) -
మచిలీపట్నంలో విషాద ఘటన
సాక్షి, మచిలీపట్నం: అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె తనువు చాలించడంతో ఓ తండ్రి ఆమెనే తలుచుకుంటూ ప్రాణాలు విడిచాడు. తీవ్ర దుఃఖంలో ఆమె సమాధి వద్దే కుప్పకూలాడు. ఈ విషాద సంఘటన మచిలీపట్నంలో చోటుచేసుకుంది. సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలు ప్రకారం.. జలాల్పేటకు చెందిన లక్కోజి గిరిబాబు (52) రోల్డ్ గోల్డ్ పనులు చేస్తుంటాడు. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు. పిల్లలను ప్రేమగా పెంచుకున్న గిరిబాబు కొంతకాలం క్రితం పెద్ద కుమార్తె రేణుకా దేవికి వివాహం చేశాడు. ప్రసవం నిమిత్తం ఆస్పతిలో చేరిన ఆమె అస్వస్థతకు గురై ఇటీవల మృతి చెందింది. అప్పటి నుంచి కుమార్తెను తలచుకుంటూ గిరిబాబు పదేపదే రేణుకాదేవి సమాధి వద్దకు వెళ్లి వస్తుండేవాడు. సోమవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన అతడు రాత్రికి తిరిగి రాలేదు. మంగళవారం ఉదయం అనుమానం వచ్చిన బంధువులు శ్మశానం వద్దకు వెళ్లి చూడగా కుమార్తె సమాధి వద్ద గిరిబాబు విగతజీవిగా కనిపించాడు. పోలీసులు మృతదేహాన్ని బందరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. (చదవండి: అనుమానిస్తోందని.. హతమార్చాడు) -
కరోనా శవాల బాధ్యత కూడా వారిదే
విష్ణు గుర్జార్.. అతను జైపూర్‌లోని స్వారీ మాన్ సింగ్(ఎస్ఎమ్ఎస్) ఆసుపత్రిలో మార్చురీ గదిలో పనిచేస్తాడు. శవాల మధ్యలో పని చేసినప్పటికీ ఎప్పుడూ శ్మశానం వైపు వెళ్లేవాడు కాదు. కానీ కరోనా వైరస్ వ్యాప్తి తర్వాత ఇప్పుడు అతను తరచూ శ్మశానానికి వెళ్తున్నాడు. అనాథలా మిగిలిపోతున్న శవాలకు అన్నీ తానై దహన సంస్కారాలు చేస్తున్నాడు. హిందువులైనా ముస్లింలైనా తనకు అందరూ సమానమేనంటూ అంతిమ సంస్కారాలు చేస్తున్నాడీ యువకుడు. కరోనాతో చనిపోయిన వారి దహన సంస్కారాల బాధ్యత మార్చురీ వర్కర్ల మీద పెట్టింది రాజస్థాన్ ప్రభుత్వం. దీనికోసం ప్రత్యేకంగా ఆరు గంటల షిఫ్ట్ కేటాయిస్తూ కరోనా శవాల అంతిమ సంస్కారాలకు సాయం చేయాల్సి ఉంటుందని ఆదేశించింది. వైరస్ సోకుతుందన్న భయం వెంటాడుతుంది ఈ నిర్ణయం గురించి గురించి విష్ణు గుర్జార్ మాట్లాడుతూ.. "నా జీవితంలో శ్మశానానికి వెళ్తానని ఎప్పుడూ అనుకోలేదు. పైగా ఆ ప్రదేశమంటే నాకు భయం కూడా. అంతేకాకుండా ఇస్లామిక్ ఆచారాల గురించి ఏమీ తెలీదు. కానీ ఇప్పుడు హిందువులైనా, ముస్లింలైనా నాకు అందరూ సమానమే. ఎందుకంటే నాకు ఎలాంటి మతం లేదు. ఎవరూ లేని వారికీ నేనున్నా" అని చెప్పుకొస్తున్నాడు. ఇతనితోపాటు తోటి వర్కర్లు పంకజ్, మనీశ్, మంగళ్, అర్జున్, సూరజ్‌లు కూడా ఇలాంటి పనుల్లో భాగస్వామ్యం అవుతున్నారు. అయితే వైరస్ ఎక్కడ సోకుతుందోనని భయం గుప్పిట్లో బతుకుతున్నారు. (ఇలాంటి కష్టం పగవాడికి కూడా వద్దు) మమ్మల్ని ఎవరూ గుర్తించరు.. ఆరు నెలల పాప, మూడేళ్ల కొడుకు ఉన్న విష్ణు గత 40 రోజులుగా ఇంటికే వెళ్లలేదు. మరోవైపు పంకజ్ తన వివాహాన్ని వాయిదా వేసుకున్నాడు. వీరి శ్రమను, సేవలను ప్రజలు, ప్రభుత్వాలు ఏమాత్రం గుర్తించట్లేదని విచారం వ్యక్తం చేస్తున్నారు. గుర్జార్ మాట్లాడుతూ.. "ఇళ్లకు వెళ్లినప్పుడు కాలనీ వాసులు ప్రశంసించడం మాని తిరిగి భయపెడతారు. మమ్మల్ని, మా సేవలను గుర్తించరు. కనీసం మాకు మంచి భోజనం వంటి సరైన సదుపాయాలు కూడా లభించవు" అని ఆవేదన వ్యక్తం చేశారు. జైపూర్‌లో ఇప్పటివరకు కరోనా వల్ల 63 మంది మరణించగా ఇందులో 36 శవాలను శ్మశానానికి తీసుకెళ్లి మరీ మార్చురీ వర్కర్లు అంత్యక్రియలు నిర్వహించారు. (హెల్మెట్ ధరిస్తే.. శానిటైజర్ ఫ్రీ) -
ఇప్పట్లో ఈ సమస్యకు పరిష్కారం ఉందా!
సాక్షి, న్యూఢిల్లీ : ‘సమాజంలో మంచితనం పరిఢవిల్లితే తప్ప ఈ సమస్యకు పరిష్కారం లేదు’ అని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ ఆదివారం ఢిల్లీలో జరిగిన ఓ సభలో మాట్లాడుతూ చెప్పారు. ఆయన మాట్లాడిందీ దళితులు, బీసీలకు కల్పిస్తున్న రిజర్వేషన్లు రద్దు చేయడం గురించి. ‘చట్టాన్ని మార్చకుండానే రిజర్వేషన్లపై కొనసాగుతున్న సామాజిక సంఘర్షణను ఒక్క నిమిషంలో పరిష్కరించవచ్చు. వీటిని వ్యతిరేకిస్తున్నవారు, సమర్థిస్తున్న వారి మధ్య సామరస్య భావన ఏర్పడితే చాలు’ అని ఆయన వ్యాఖ్యానించారు. అది ఇప్పట్లో సాధ్యమా ? అది సాధ్యమయ్యే పని కాదని గత శనివారం తమిళనాడులోని వెల్లూరి జిల్లాలో ఓ దళితుడి అంత్యక్రియల విషయంలో జరిగిన పరాభవమే అందుకు కారణం. వెల్లూరు జిల్లాలోని వనియంబమ్‌కు 20 కిలోమీటర్ల దూరంలోని నట్రంపల్లి గ్రామంలో 55 ఏళ్ల కుప్పన్ అనే దళితుడు మరణించాడు. ఊరి శ్మశానంలో దళితుల అంత్యక్రియలకు అనుమతి లేదు. దాంతో వారు పాలర్ నది అవతలి ఒడ్డున అంత్యక్రియలు నిర్వహించడం అలవాటు. అవతల ఒడ్డుకు వెళ్లాలంటే ఓ అగ్రవర్ణ కులస్థుడి పొలం బాట గుండా వెళ్లాలి. దళితులకు ఆ స్థలం గుండా కూడా ప్రవేశం లేదు. అందుకని దళితులు ఆగస్టు 17న పాలం నది వంతెనపైకి కుప్పన్ మృతదేహాన్ని తీసుకెళ్లారు. 45 అడుగుల ఎత్తున ఉన్న ఆ వంతెన మధ్య నుంచి తాళ్ల సహాయంతో మృతదేహాన్ని కిందకు దించారు. అక్కడి నుంచి నిర్దేశిత చోటుకు మోసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. అక్కడి దళిత కుటుంబాల్లో ఇంటి పెద్ద కుమారుడిని పూడ్చి పెట్టడం, మిగతా కుటుంబ సభ్యులను తగులబెట్టడం సంప్రదాయమట. అది వేరే విషయం. ఇలా వంతెన మీది నుంచి మృత దేహాన్ని దించడం, అక్కడి నుంచి అంత్యక్రియలకు తీసుకెళ్లడంకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. దీంతో వెల్లూరు జిల్లా ప్రభుత్వ యంత్రాంగమంతా ఒక్కసారిగా కదిలిపోయింది. తిరుపత్తూర్ సబ్ కలెక్టర్ ప్రియాంక మరుసటి రోజే హుటాహుటిన నట్రంపల్లి గ్రామాన్ని సందర్శించి ఊరవతల అర ఎకరం పోరంబోకు స్థలాన్ని దళితుల అంత్యక్రియల కోసం కేటాయించారు. సామాజిక న్యాయం చేశామనిపించుకున్నారు. హిందువులందరికి ఒకే శ్మశాన వాటిక ఉండాల్సిన చోట వేరు స్థలం కేటాయించడంతోపాటు అందుకు దారితీసిన పరిణామాలన్నీ సమాజంలోని వివక్షతను, వైషమ్యాలను స్పష్టం చేస్తున్నాయి. కుల వివక్షత పోయే వరకు రిజర్వేషన్లు తప్పవనే విషయం విజ్ఞులందరికి తెల్సిందే. హిందువులంతా ఒక్కటే దళితులందరు తమ వెంటే ఉన్నారని గత ఎన్నికల్లో పాలకపక్ష బీజేపీ ప్రకటించుకుంది. అవును దళితుల మద్దతు లేకపోయినట్లయితే ఆ పార్టీకి లోక్‌సభలో అన్ని సీట్లు వచ్చి ఉండేవి కావు. అయినా కేంద్ర కేబినెట్లో అగ్రవర్ణాలకే ఎక్కువ సీట్లు లభించాయి. కులాల పేరిట ఎక్కువనో, తక్కువనో మంత్రి పదవులు కట్టబెట్టారు. ప్రభుత్వంలోనే ఇలా రిజర్వేషన్లు కొనసాగితే విద్యా, ఉపాధి అవకాశాల్లో వెనకబడిన వర్గాల వారికి రిజర్వేషన్లు కొనసాగడం తప్పా!? -
శ్మశానంలో వరద నీరు చేరడంతో పడవలో..
సాక్షి, కొల్లూరు(గుంటూరు): కొల్లూరు మండలంలోని ఆవులవారిపాలెం శివారు క్రీస్తులంకలో గడ్డం ధర్మారావు అనే వ్యక్తి మృతి చెందడంతో ఖననం చేసేందుకు బంధువులు, స్థానికులు గురువారం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శ్మశానం చుట్టూ వరద నీరు చేరడంతో మృతదేహాన్ని పడవ ద్వారా తరలించి ఖనన కార్యక్రమాలు ముగించారు. -
తల్లిని చంపి.. శ్మశానంలో పాతి పెట్టి
బరంపురం : జిల్లాలోని రంబాలో అనారోగ్యం తో బాధపడుతున్న తల్లిని సొంత కొడుకు హత్య చేసి శ్మశానంలో పాతి పెట్టిన సంఘటన స్థానికంగా సంచలనం రేపింది. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న రంబా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పాతిపెట్టిన వృద్ధురాలి మృతదేహాన్ని బయటకి తీసి నిందితుడైన కొడుకును అరెస్ట్ చేశారు. ఐఐసీ అధికారి అందించిన సమచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. గంజాం జిల్లాలోని రంబా పోలీస్ స్టేషన్ పరిధి సంతోష్‌పూర్ గ్రామంలో నివాసం ఉంటున్న విక్రమ్ దాస్ తల్లి కొద్ది రోజులుగా తీవ్ర ఆనారోగ్యంతో బాధ పడుతోంది. ఆమెకు ఎన్ని ఆరోగ్యచికిత్సలు చేయించినప్పటికీ నయం కాలేదు. ఇటువంటి పరిస్థితిలో కొడుకు విక్రమ్ దాస్ విసుగు చెంది తల్లిని హత్య చేసి గోనె సంచిలో మృతదేహాన్ని చుట్టి దగ్గరలో ఉన్న శ్మశానంలో పాతిపెట్టాడు. ఈ విషయం గ్రామంలో అనోట ఈ నోట చర్చనీయాంశంగా మారడంతో గ్రామపెద్ద పోలీసులకు గురువారం సమచారం చేరవేశాడు. దీంతో రంబా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పాతిపెట్టిన వృద్ధురాలి మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం నిందితుడైన కొడుకు విక్రమ్ దాస్‌ను అరెస్ట్‌చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
శ్మశానంలో సాహసం : దెయ్యం రాకతో హడల్
హాంట్స్, ఇంగ్లండ్ : 800 ఏళ్ల పురాతన శ్మశానంలో సాహసయాత్రకు వెళ్లిన ఫిట్నెస్ ట్రైనర్‌కు షాక్ తగిలింది. ఓ దెయ్యం వెంబడించటంతో అతను హడలిపోయాడు. దెయ్యం తనపై దాడికి వస్తున్న ఘటనను టోని ఫెర్గూసన్ వీడియో తీశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. హాంట్స్లో సెయింట్ మెరీ చర్చ్ వద్ద ఏదో ఉందని పుకార్లు వస్తుండటంతో ఫెర్గూసన్ అక్కడకు వెళ్లాడు. శ్మశాన పరిసర ప్రాంతాలను చిత్రీకరిస్తుండగా ఉన్నట్లు ఉండి ఓ ఆత్మ అతనిపైకి వచ్చింది. ఈ ఘటనతో ఫెర్గూసన్ నిర్ఘాంతపోయాడు. వెంటనే అక్కడి నుంచి వచ్చేశాడు. పూర్వీకులకు శ్రద్ధాంజలి ఘటించడానికి వచ్చే వారిని ఈ దెయ్యమే భయపెడుతున్నట్లు చెప్పాడు. అయితే, ఫెర్గూసన్ పోస్టు చేసిన వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇది ఎడిటెడ్ వీడియో అంటూ కామెంట్లు పెడుతున్నారు. -
దెయ్యం దెబ్బకు ఫిట్నెస్ ట్రైనర్‌కు షాక్
-
మేయర్ వెళ్లేసరికి మందేస్తూ యువకులు.. షాక్
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని ఓ ప్రముఖ శ్మశాన వాటికలో దూరి మందు కొడుతున్న యువకులను చూసి నగర మేయర్ బొంతు రామ్మోహన్ షాకయ్యారు. అనంతరం వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అరెస్టు చేయించి వారికి షాకిచ్చారు. ఈ సంఘటన గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పంజాగుట్ట హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి పనులు పరిశీలించేందుకు నగర మేయర్ బొంతు రామ్మోహన్ అక్కడికి వచ్చారు. ఆ సమయంలో కొంతమంది యువకులు సమాధులను టేబుళ్లుగా మార్చుకొని దర్జాగా మందుకొడుతూ కనిపించి మేయర్‌ను అవాక్కయ్యేలా చేశారు. వారిని చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన వెంటనే వారిని అదుపులోకి తీసుకోని స్టేషన్‌కు తరలించి కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఇంత జరుగుతుంటే ఏం చేస్తున్నారని పోలీసులను ప్రశ్నించారు. కాగా, మందు కొడుతున్న యువకుల్లో ఒకరు ఆ వార్డు సభ్యురాలు జయలక్ష్మీ కుమారుడు కూడా ఉండటం గమనార్హం. 21 ఏళ్ల లోపు వారికి వైన్స్లలో మద్యం ఇవ్వకపోవడం, మద్యం షాపుల్లో కూర్చొనివ్వకపోవడం చేస్తున్న కారణంగా కొంతమంది యువకులు ఇలా స్మశానాలను సైతం ఆశ్రయించి మందుకొడుతున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు శ్మశానాల భద్రతలోపం కూడా ఇందుకు కారణంగా చెప్పవచ్చు. -
జటిలంగా ‘శ్మశాన వివాదం’
∙పుష్కరఘాట్‌పై గుడిసెలు వేసేందుకు సిద్ధమైన గ్రామస్తులు ∙సానుకూలంగా పరిష్కరించుకోవాలంటూ అధికారుల బుజ్జగింపులు ∙అధికారులు, గ్రామస్తుల మధ్య వాగ్వాదం రేపల్లె: పెనుమూడిలో శ్మశాన వాటిక సమస్య జఠిలంగా మారింది. కృష్ణా పుష్కరాలకు ముందు వరకు పుష్కరఘాట్ వద్ద దహన కార్యక్రమాలు నిర్వహించవద్దని వ్యతిరేకించిన వర్గం ఘాట్‌పైనే మృతదేహాలను దహనం చేసేందుకు సిద్ధమైంది. స్థానికుల కథనం ప్రకారం పుష్కరాల సమయంలో శ్మశనా వాటికను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. పుష్కరాల అనంతరం ఓ వర్గానికి చెందిన వ్యక్తి మృతి చెంది మృతదేహాన్ని ఖననం చేసేందుకు ఇక్కడికి తీసుకువస్తే వేరే వర్గం ప్రజలు, అధికారులు ఇక్కడ దహనం చేసేందుకు వీలులేదంటూ వేరే ప్రాంతంలో దహనం చేసుకోవాలంటూ ఆదేశించారన్నారు. ఈ ప్రాంతం సమీపంలో ప్రజలు నివస్తున్నారన్న ఉద్దేశంతో మృతదేహాలు వేరే ప్రాంతంలో దహనం చేయడం జరిగుతోందని వివరించారు. నాడు వద్దు అన్నవారు.. నాడు దహన కార్యక్రమాలు చేయరాదం టూ వివాదం చేసిన వారే ఇక్కడ దహన సంస్కారాలకు పాల్పడటం శోచనీయమన్నారు. ఈ ప్రాంతంలో మృతదేహాలను దహనం చేయడానికి వీలేదంటూ, దహనం చేస్తే శిక్షార్హులంటూ తహసీల్దార్ నోటీసు బోర్డు ఏర్పాటు చేశారు. దీనిని దిక్కరిస్తు మృతదేహం దహన ప్రక్రియలు నిర్వహించడంతో ఇబ్బందికర వాతా వరణం నెలకొల్పుతుందన్నారు. మృతదేహం దహనం చేస్తుంటే వాసన రావటంతో పాటు చితి నుంచి బూడిద గాలికి నివాసాల వైపు వస్తుందని చెప్పారు. ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అనుమతి ఇచ్చారని, గ్రామ కార్యదర్శి శ్రీనివాసరావు సహాయంతో దహన సంస్కారాలకు పాల్పడటం దారుణమన్నారు. టెంట్లు వేసి ఆందోళనకు దిగిన మహిళలు.. సమీపంలో ప్రజలు నివసిస్తూంటే ఇక్కడ దహన ప్రక్రియలు ఏ విధంగా నిర్వహిస్తారంటూ సమీపంలో నివసిస్తున్న ప్రజలు చిన్నపాటి గుడిసెలు వేసి నిరసన తెలిపారు. ఇక్కడ మేమంతా నివాసం ఉంటే మృతదేహాలను ఏవిధంగా దహ నం చేస్తారో చూస్తామని హెచ్చరించారు. దీంతో అధికారులకు, గ్రామస్తులకు వాగ్వాదం తలెత్తగా తహసీల్దార్ ఎస్వీ రమణకుమారి, సీఐ పెంచలరెడ్డి గ్రామస్తులను బుజ్జగించినప్పటికి ఫలితం లేకపోయింది. తహసీల్దార్, సీఐలు మాట్లాడుతూ సమస్యను పరిష్కరించేందుకు ఉన్నతాధికారులు రానున్నారని అప్పటి వరకు గ్రామస్తులు శాంతియుతంగా ఉండాలని కోరారు. -
చచ్చినా తీరని కష్టం
- శ్మశానానికి వెళ్లేందుకు రహదారి కష్టం - తీవ్ర అవస్థలు పడుతున్న కౌలూరు ఎస్సీ కాలనీవాసులు పాణ్యం: శ్మశాన స్థలం ఉన్నా అక్కడకు వెళ్లేందుకు సరైన దారి సౌకర్యం లేక మండల పరిధిలోని కౌలూరు ఎస్సీ కాలనీ వాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సోమవారం గ్రామంలోని ప్రేమ్‌కర్ ఆనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన మృతదేహాన్ని ప్రధాన రోడ్డు నుంచి కానుగల వాగును దాటి శ్మశానానికి తీసుకెళ్లాల్సి రావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వేసవిలో తప్ప వాగు నిత్యం పారుతుండడంతో దాటి ఎగువగడ్డకు ఎక్కి మృతదేహలను ఖననం చేసేందుకు నానా తిప్పలు పడ్డారు. ఈ వాగు దగ్గరకు వచ్చే సరికి మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు కనీసం పది మంది తప్పనిసరి. అదమరిస్తే వాగులో మృతదేహం పడిపోతుంది. చచ్చిన వాడిని తీసుకువెళ్లాలంటే చచ్చేంత పని అవుతోందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానుగల వాగుపై బ్రిడ్జి నిర్మాణం కోసం కొన్నేళ్లుగా ప్రజాప్రతినిధులు, అధికారులకు విన్నవిస్తున్నా ఫలితం లేదని వాపోతున్నారు. -
ప్రపంచంలోనే పెద్ద శ్మశానంగా మారనున్న ఫేస్బుక్!
లండన్ః సామాజిక మాధ్యమం ఫేస్ బుక్ కొన్నాళ్ళకు శ్మశానంగా మారనుందట. వినియోగదారుల సంఖ్య రోజురోజకూ పెరిగిపోతుండటంతో ఇంటర్నెట్ నిపుణులు ఇదే విషయంపై ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కోటిమందికి దాటిపోయిన యూజర్ల సంఖ్యపై అంచనాకు వచ్చిన నిపుణులు... 2098 సంవత్సరం నాటికి ఫేస్ బుక్ లో ఖాతాదారులకంటే మృతుల సంఖ్యే ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. ఫేస్ బుక్ పేజీల్లో స్మృతుల పేజీలు దర్శనమివ్వడాన్ని బట్టి నిపుణులు ఓ అంచనాకు వచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఖాతాదారులు మరణిస్తే ఆ పేజీని తొలగించే అవకాశం పెద్దగా కనిపించడం లేదు. ఎందుకంటే ఆ ఖాతాదారుడి వివరాలు తెలిసినవారు మరొకరుంటే తప్పించి దాన్ని ఎవ్వరూ లాగిన్ చేసే అవకాశం లేదు. దీంతో ఆ సామాజిక మాధ్యమంలో మరణించిన ఖాతాదారుడి పేజీని స్మృతుల పేజీగా మారుస్తున్న సంప్రదాయం కొనసాగుతోంది. అయితే అతడి కుటుంబ సభ్యులుగాని, స్నేహితులుగాని ఖాతాను కొనసాగిస్తుంటేమాత్రం ఆపేజీ బతికే ఉంటోంది. అమెరికా మసాచుసెట్స్ విశ్వవిద్యాలయంలో పరిశోధన విద్యార్థి హచెమ్ సాధిక్కి అదే నిర్థారించారు. ఫేస్ బుక్ లో వినియోగదారుల సంఖ్య ఇదే రీతిలో కొనసాగితే 2098 నాటికల్లా అదో శ్మశానంగా మారుతుందని అధ్యయనాలు చెప్తున్నట్లు పేర్కొన్నారు. మరణించినవారి ఖాతాలను సైతం ఆ నెట్వర్క్ ఇదే విధంగా కొనసాగిస్తే సంస్థ వృద్ధి రేటు సైతం భారీగా తగ్గే అవకాశం ఉందంటున్నారు. అయితే ఆన్లైన్ లెగసీ ప్లానింగ్ కంపెనీ 'డిజిటల్ బియాండ్' లెక్కల ప్రకారం చూస్తే ఈ ఏడు ప్రపంచంలో ఫేస్ బుక్ వినియోగదారులు 9,70,000 మంది మరణించనున్నట్లు తెలుస్తోంది. అదే 2010 లో 3,85,368 మంది, 2012 లో 5,80,000 మరరణించినట్లు లెక్కలు చెప్తున్నాయి. దీంతో కొనసాగించని ఖాతాలనుగాని, మరణించినవారి ఖాతాలను గాని ఫేస్ బుక్ స్వచ్ఛందంగా తొలగించేందుకు ముందుకు రాకపోవడంతో కొంతకాలానికి బతికున్నఖాతాదారులకంటే మరణించినవారి సంఖ్యే పెరిగిపోతుందని అధ్యయనాలద్వారా తెలుస్తోంది. అందుకే ప్రస్తుతం ఈ సమస్యకు పరిష్కారం దిశగా ఫేస్ బుక్ యోచిస్తోంది. ఈ నేపథ్యంలో ఆస్తులు, డబ్బులకు సంబంధించిన డాక్యుమెంట్లలో నామినీలను నియమించినట్లు... తమ ఖాతా వివరాలు తెలిసిన మరొకరిని నియమించుకోవాలని ఫేస్ బుక్ యూజర్లకు సూచించే ఉద్దేశ్యంలో ఉంది. ఈ పద్ధతిలో మరణించినవారి లెక్కల పెరుగుదలకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుందని భావిస్తోంది.