high court
-
తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై హైకోర్టు తీర్పు
-
హైకోర్టులో వర్రా రవీందర్ రెడ్డి హెబియస్ కార్పస్ పిటిషన్ పై విచారణ
-
రాజ్ తరుణ్‌పై లావణ్య కేసు.. హైకోర్టు కీలక నిర్ణయం!
టాలీవుడ్లో సంచలనంగా మారిన లావణ్య కేసులో టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్‌కు బిగ్ రిలీఫ్ దక్కింది. ఈ కేసులో రాజ్ తరుణ్‌కు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. లావణ్యతో రాజ్ తరుణ్‌కు పెళ్లి జరిగినట్లు ఆధారాలు లేక పోవడంతో బెయిలిచ్చింది. ఆధారాలు లేకుండా కేసు నమోదు చేశారని రాజ్ తరుణ్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.కాగా.. తనను పెళ్లి చేసుకుని మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి హైదరాబాద్‌లోని నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్‌తో దాదాపు 11 ఏళ్ల పాటు రిలేషన్లో ఉన్నట్లు వెల్లడించింది. రాజ్ తరుణ్ తన భర్త అని చాలాసార్లు మీడియా ముందు మాట్లాడింది. నాకు భర్త కావాలి అంటూ ఇటీవల ప్రసాద్ ల్యాబ్ వద్ద హల్చల్ చేసింది. అయితే రాజ్ తరుణ్ సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తోందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా.. రాజ్ తరుణ్ ఇటీవలే ‘పురుషోత్తముడు’, ‘తిరగబడరసామీ’ చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. -
కేసీఆర్ పిటిషన్‌పై ‘సుప్రీం’లో విచారణ..పాస్ ఓవర్ కోరిన న్యాయవాది
సాక్షి,ఢిల్లీ: కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన విద్యుత్ కమిషన్ రద్దు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఇవాళ (జులై 15) విచారణ చేపట్టింది. అయితే విచారణ సందర్భంగా సీనియర్ న్యాయవాది అందుబాటులో లేకపోవడంతో కేసీఆర్ తరుపు న్యాయవాది మోహిత్ రావు పాస్ ఓవర్ కోరారు. దీంతో ఇతర కేసులు ముగిసిన తర్వాత కేసీఆర్ పిటిషన్‌ను అత్యున్నత న్యాయ స్థానం విచారణ చేపట్టనుంది.గతంలో ఈ విద్యుత్ కమిషన్‌ను రద్దు చేయాలని కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. దీంతో తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ అత్యున్నత న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు మాజీ సీఎం కేసీఆర్. మాజీ సీఎం కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై.చంద్ర చూడ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేసీఆర్ తరుపు న్యాయవాది మోహిత్ రావు పాస్ ఓవర్ కోరారు. -
ఏడేళ్ల తర్వాత సవాల్ చేస్తారా?
సాక్షి, హైదరాబాద్: పలు ఫిల్మ్ సిటీలకు ప్రభుత్వ భూ కేటాయింపు సమర్థనీయమైనప్పుడు.. ఆనంద్ సినీ సర్వీసెస్‌కు ఇవ్వడం తప్పెలా అవుతుందని పిటిషనర్, మాజీ మంత్రి హరీశ్‌రావును హైకోర్టు ప్రశ్నించింది. అలాగే 2001లో తొలిసారి జీవో జారీ చేస్తే.. 2008లో సవాల్ చేయడం సరికాదని, ఆలస్యానికి కారణాలు కూడా తెలుపలేదని వ్యాఖ్యానించింది. ఈ పిటిషన్లో ఎలాంటి మెరిట్స్ కనిపించనందున కొట్టివేస్తున్నామని స్పష్టం చేసింది. 2001, ఆగస్టు 21న సాధారణ పరిపాలన (ఐఅండ్‌పీఆర్) విభాగం జీవో 355ను జారీ చేసింది. హైదరాబాద్ షేక్‌పేట్‌లోని సర్వే నంబర్ 403లో 5 ఎకరాల భూమిని ఆనంద్ సినీ సర్వీసెస్‌కు ఎకరం రూ.8,500లకు కేటాయించాలని ఏపీ రాష్ట్ర ఫిల్మ్, టీవీ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్ఎఫ్డీసీ)కు ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత ఎందుకో భూమి అప్పగింతను నిలిపివేస్తూ ప్రభుత్వం ఏపీఎస్‌ఎఫ్‌డీసీకి లేఖ రాసింది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం వచ్చాక డిసెంబర్, 2008లో మరో జీవో 744ను జారీ చేసి.. భూమిని అప్పగించింది. ఈ రెండు జీవోలను సవాల్ చేస్తూ మాజీ మంత్రి హరీశ్‌రావు 2008లో పిటిషన్ దాఖలు చేశారు. భూ కేటాయింపు చట్టవిరుద్ధమని, జీవోలను కొట్టివేయడంతో పాటు ఈ అంశంపై విచారణ జరిపించాలని కోరారు.ఈ పిటిషన్‌పై జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ఏపీఎస్‌ఎఫ్‌డీసీకి 1982లో ప్రభుత్వం 50 ఎకరాలు కేటాయించింది. అలాగే పద్మాలయా స్టూడియోకు 9.5 ఎకరాలు, సురేశ్ ప్రొడక్షన్స్‌కు 5 ఎకరాలతో పాటు ఆనంద్ సర్వీసెస్‌కు కూడా 5 ఎకరాలు కేటాయించారు. దీన్ని సవాల్ చేస్తూ 2004లో దాఖలైన పిల్‌ను హైకోర్టు కొట్టివేసింది.ఇది సినీ రంగ అభివృద్ధికి 1982లో ప్రభుత్వం తీసుకువచ్చిన ఓ అద్భుతమైన పాలసీ. 2011లోనూ పలు పిటిషన్లు డిస్మిస్ అయ్యాయి. సుప్రీంకోర్టు కూడా ఈ పిటిషన్లను కొట్టివేసింది. అంతేకాదు దర్శకుడు ఎన్.శంకర్‌కు 5 ఎకరాల కేటాయింపును ఇదే హైకోర్టు సమర్థించింది’ అని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. జీవో ఇచ్చిన ఏడేళ్ల తర్వాత పిటిషన్ వేయడం సరికాదని స్పష్టం చేసింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 ప్రకారం విచక్షణాధికారాన్ని వినియోగించుకుని జాప్యానికి కారణం లేనందున ఈ పిటిషన్‌ను కొట్టివేస్తున్నామని తెలిపింది. -
‘కీచక న్యాయం’పై కొరడా!
ఎన్ని చట్టాలున్నా, ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటున్నా మహిళలకు వేధింపులు తప్పడం లేదని తరచు రుజువవుతూనే వుంది. ఆఖరికి న్యాయదేవత కొలువుదీరే పవిత్ర స్థలం కూడా అందుకు మినహాయింపు కాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు ఉత్తర ప్రదేశ్‌లోని బాందా జిల్లా మహిళా సివిల్ జడ్జి రాసిన బహిరంగ లేఖ స్పష్టం చేస్తోంది. జిల్లా జడ్జి, ఆయన అనుచరుల నుంచి ఆమె ఎదుర్కుంటున్న వేధింపులు ఎలాంటివో, అవి ఎంత ఆత్మ న్యూనతకు లోనయ్యేలా చేశాయో మహిళా జడ్జి వాడిన పదజాలమే పట్టిచూపుతోంది. ‘నన్నొక వ్యర్థపదార్థంగా చూస్తున్నారు. పురుగుకన్నా హీనంగా పరిగణిస్తున్నారు’ అని అన్నారంటే ఆమె వేదనను అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు... ‘గత ఏడాదిన్నరగా నడిచే శవంగా బతుకీడుస్తున్నాను. ఇక జీవరహితమైన ఈ కాయాన్ని కొనసాగించలేను. ఆత్మహత్యకు అనుమతించండి’ అని కూడా ఆమె రాశారు. ‘మీరంతా ఆటబొమ్మగా, ప్రాణరహిత పదార్థంగా మారటం నేర్చుకోండి’ అని మహి ళలనుద్దేశించి ఆమె వ్యాఖ్యానించారు. తనను రాత్రిపూట ఒంటరిగా కలవమంటూ వేధిస్తున్నారని మొన్న జూలైలో ఆమె చేసిన ఫిర్యాదుపై హైకోర్టులోని అంతర్గత ఫిర్యాదుల కమిటీ విచారించింది. కానీ కింది ఉద్యోగులు ధైర్యంగా సాక్ష్యం చెప్పాలంటే ఆ జడ్జిని విచారణ సమయంలో బదిలీ చేయాలన్న వినతిని పట్టించుకున్నవారు లేరు. దీనిపై సుప్రీంకోర్టులో రిట్ దాఖలు చేస్తే ఈ దశలో జోక్యం చేసుకోలేమంటూ ధర్మాసనం తోసిపుచ్చటం ఆమె తట్టుకోలేక పోయారు. నిరుడు దేశవ్యాప్తంగా మహిళలపై 4.45 లక్షల నేరాలు చోటు చేసుకున్నాయని జాతీయ క్రైం రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక చెబుతోంది. లైంగిక నేరాలకు సంబంధించి సగటున ప్రతి 51 నిమిషాలకూ ఒక ఎఫ్ఐఆర్ నమోదవుతున్నదని ఆ నివేదిక వెల్లడించింది. ఉత్తరప్రదేశ్ 65,473 కేసులతో మొదటి స్థానంలో వుంటే మహారాష్ట్ర, రాజస్థాన్, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్ ఆ తర్వాత స్థానాల్లో వున్నాయి. పనిచేసే చోట మహిళలను వేధించటంలో ఢిల్లీ అగ్రస్థానంలో వుంది. నిజానికి వాస్తవ ఘటనలతో పోలిస్తే కేసుల వరకూ వెళ్లే ఉదంతాలు తక్కువనే చెప్పాలి. అందరి దృష్టిలో పడతామని, ఉపాధి కోల్పోతామని, ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు ప్రతీకారానికి దిగొచ్చని భయపడి చాలామంది ఫిర్యాదు చేయటానికి వెనకాడతారు. ఈ వేధింపుల పర్యవసానంగా చాలామంది మహిళలు ఆత్మాభిమానం దెబ్బతిని, మానసిక క్షోభకు లోనయి వృత్తిపరంగా ఎదగలేని నిస్సహా యస్థితిలో పడుతున్నారు. ఇలాంటì కేసులు తమముందు విచారణకొచ్చినప్పుడు నేరగాళ్లను కఠి నంగా శిక్షించి, బాధితులకు ఉపశమనం కలగజేయాల్సిన చోటే... మహిళా న్యాయమూర్తులకు వేధింపులుంటే ఇంతకన్నా ఘోరమైన స్థితి ఉంటుందా? నిజానికి న్యాయవ్యవస్థలో లైంగిక వేధింపులుంటున్నాయని ఆరోపణలు రావటం ఇది మొదటిసారేమీ కాదు. సాక్షాత్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులపైనే ఫిర్యాదులొచ్చిన సందర్భా లున్నాయి. ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తరుణ్ గొగోయ్‌పై 2019లో ఒక మహిళా ఉద్యోగి ఫిర్యాదు చేసినప్పుడు ఆమెను మొదట బదిలీ చేసి,ఆ తర్వాత సర్వీసునుంచి తొలగించి చివరకు చీటింగ్ కేసు కూడా పెట్టారు. గొగోయ్ పదవీ విరమణ చేశాక ఆ మహిళకు తిరిగి ఉద్యోగం లభించింది. జస్టిస్ గొగోయ్‌కి మాత్రం ఏం కాలేదు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లా అదనపు సెషన్స్ జడ్జిగా పనిచేసిన మహిళ కూడా ఇలాంటిస్థితినే ఎదుర్కొన్నారు. మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి తనను వేధించిన తీరు గురించి ఆమె ఫిర్యాదు చేశారు. తన గోడు అరణ్యరోదన కావటంతో గత్యంతరం లేక 2014లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆయన వేధింపులు ఎలావుండేవో సోదాహరణంగా వివరించారు కూడా. ‘నీ పని తీరు చాలా బాగుంది. నీ అందం మరింత బాగుంది’ అనటం, ఒక శుభకార్యంలో నృత్యం చేయాలంటూ భార్యతో ఫోన్ చేయించటం, ‘ఒంటరిగా ఓసారి నా బంగ్లాకు రా’ అని ఫోన్ చేయటం తేలిగ్గా కొట్టిపారేయదగ్గ ఆరోపణలు కాదు. కానీ విషాదమేమంటే ఆ ఫిర్యాదుకు అతీగతీ లేక పోయింది. ఆ న్యాయమూర్తి నిక్షేపంగా తన పదవీకాలం పూర్తిచేసుకున్నారు. ఆయన రిటైర్ కావటంతో తిరిగి ఉద్యోగం ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో ఆమె 2018లో పిటిషన్ పెట్టుకున్నారు. చివరకు ఆ మహిళా జడ్జి స్వచ్ఛందంగా రాజీనామా చేయలేదని సర్వోన్నత న్యాయస్థానం నిర్ధారించుకుని నిరుడు ఉద్యోగంలో చేరడానికి అనుమతించింది. చదువూ సంస్కారం లేనివాళ్లూ, జులాయిలుగా తిరిగేవాళ్లూ మహిళలపై, బాలికలపై వేధింపులకు దిగుతారనే అపోహ వుంది. కానీ పెద్ద చదువులు చదువుకుని, ఉన్నత పదవులు వెలగబెడు తున్న వారిలో కొందరు ఆ తోవలోనే ఉంటున్నారని అప్పుడప్పుడు వెల్లడవుతూనే వుంది. ఇలాంటి కేసుల్లో అసహాయ మహిళలకు ఆసరాగా నిలవాల్సిన మహిళా న్యాయమూర్తులకు సైతం వేధింపులుంటే ఇక దిక్కెవరు? కాలం మారింది. యువతులు చదువుల్లో ఎంతో ముందుంటున్నారు. ప్రతిభాపాటవాలు ప్రదర్శిస్తున్నారు. వేరే వృత్తి ఉద్యోగాలను కాదనుకుని న్యాయవ్యవస్థ వైపు వచ్చే వారిలో చాలామంది సమాజానికి ఏదో చేద్దామన్న సంకల్పంతో వస్తారు. అలాంటి వారికి సమస్య లుండటం దురదృష్టకరం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ ఆ మహిళా జడ్జి లేఖపై వెనువెంటనే స్పందించటం, అలహాబాద్ హైకోర్టు నుంచి నివేదిక కోరటం హర్షించదగ్గ అంశం. గతంలో మాదిరి కాక దోషులపై కఠిన చర్యలకు ఉపక్రమిస్తే తప్ప ఈ కీచకపర్వం ఆగదు. -
ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ల పై ఏపీ హైకోర్టు సీజే ధర్మాసనం తీర్పు
-
'టైగర్ నాగేశ్వరరావు' రియల్ స్టోరీ.. ఇంతకీ అతడెవరో తెలుసా?
'టైగర్ నాగేశ్వరరావు'.. ఇప్పటి జనరేషన్‌కి పెద్దగా తెలియని పేరు. మహా అయితే స్టువర్టుపురం గజదొంగ అని తెలిసి ఉంటుందేమో! ఇతడి జీవితం ఆధారంగా తెలుగులో ఓ సినిమా తీశారు. రవితేజ హీరోగా 'టైగర్ నాగేశ్వరరావు' పేరుతోనే దీన్ని థియేటర్లలో రిలీజ్ చేశారు. పాజిటివ్ టాక్ కూడా వచ్చింది. ఇంతకీ 'టైగర్ నాగేశ్వరరావు' ఎవరు? ఆయన మంచోడా? చెడ్డోడా? ఎవరీ నాగేశ్వరరావు? విజయవాడ-చెన్నై రూట్లో బాపట్లకు దగ్గర్లో స్టువర్టుపురం అనే ఊరు ఉంటుంది. అప్పట్లో అంటే 1874 టైంలో దొంగల్ని, ఇతర నేరాలు చేసే వాళ్లపై నిఘా పెట్టేందుకు.. వాళ్లందరినీ తీసుకొచ్చి ఈ ఊరిలో నివాసం కల్పించారు. అలా దొంగతనాలు చేసుకునే కుటుంబంలో 1953-56 మధ్యలో నాగేశ్వరరావు పుట్టాడు. ఇతడికి ఇద్దరు అన్నలు ప్రసాద్, ప్రభాకర్. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో ప్రసాద్, ప్రభాకర్ దొంగతనాలు చేసేవారు. (ఇదీ చదవండి: టైగర్ నాగేశ్వరరావు టీజర్‌పై హైకోర్టు అసహనం) అలా దొంగగా మారి అయితే ఓ సారి ప్రభాకర్ ఆచూకీ కోసం ప్రయత్నించి విఫలమైన పోలీసులు.. నాగేశ్వరరావుని స్టేషన్‌కి తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టారు. చేయని నేరానికి చిత్రవధ అనుభవించిన ఇతడు.. తండ్రి, అన్నల బాటలో అది కూడా 15 ఏళ్లకే దొంగగా మారాడు. 1970లో తమిళనాడుకు వెళ్లిపోయి మారుపేర్లతో దొంగతనాలు చేశాడు. అన్న ప్రభాకర్ జైలు నుంచి బయటకొచ్చాక, అతడి గ్యాంగ్‌లో చేరిపోయాడు. చెప్పి మరీ దొంగతనాలు ఓసారి ఈ అన్నదమ్ముల్ని తమిళనాడులో తిరువళ్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. తనని చిత్రహింసలు పెడితే రెండు రోజుల్లో జైలు నుంచి పారిపోతానని.. నాగేశ్వరరావు సవాలు విసిరాడు. అన్న చెప్పినా సరే వినకుండా అలానే రెండు రోజుల తర్వాత జైలులో పోలీసులని కొట్టి మరీ పరారయ్యాడు. 'వచ్చే నెల మద్రాసులో దొంగతనం చేస్తాను, దమ్ముంటే పట్టుకోండి' అని సవాలు విసిరి మరీ దొంగతనాలు చేశాడు. దీంతో నాగేశ్వరరావు కాస్త టైగర్ నాగేశ్వరరావుగా మార్మోగిపోయాడు. (ఇదీ చదవండి: 'జైలర్' విలన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు) 15 ఏళ్లపాటు దొంగతనాలు పోలీసుల తీరు వల్ల దొంగగా మారిన టైగర్ నాగేశ్వరరావు.. దాదాపు 15 ఏళ్లపాటు ఆంధ్రా, తమిళనాడు, కర్ణాటకలో దొంగతనాలు, దోపీడీలకు పాల్పడ్డాడు. పోలీసులని ముప్పతిప్పలు పెట్టాడు. 1974లో బనగానపల్లె బ్యాంకు దోపీడీ అయితే వేరే లెవల్. పోలీసు స్టేషన్ దగ్గరే ఉన్న ఆ బ్యాంక్‌ని నాగేశ్వరరావు ముఠా కొల్లగొట్టింది. మత్తు మందు ఇచ్చి అయితే నాగేశ్వరరావు వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డ పోలీసులు.. అతడిని ఎలా అయినాసరే మట్టుబెట్టాలని ఓ మహిళతో కలిసి అతడిని చంపడానికి ప్లాన్ చేశారు. అలా 1980 మార్చి 24న తెల్లవారుజామున.. ఆ మహిళ ఇంటికి వచ్చిన నాగేశ్వరరావు మత్తుమందు కలిపిన పాలు తాగాడు. అలా నిద్రపోతుండగా పోలీసులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. తర్వాత దాన్ని ఎన్‌కౌంటర్‌గా మార్చేశారు. (ఇదీ చదవండి: మెగాస్టార్ చిరంజీవి రాఖీ సెలబ్రేషన్స్) దొంగనే కానీ మంచోడు అయితే స్టువర్టుపురం గజదొంగగా పేరు మోసిన టైగర్ నాగేశ్వరరావు.. పెద్దోళ్ల దోచుకున్నదంతా పేదలకు పంచిపెట్టేవాడు. చదువు, పెళ్లి, వైద్యం లాంటిది ఏదైనా సరే అవసరానికి మించిన సహాయం చేసేవాడు. అయితే ఎన్ని దొంగతనాలు, దోపీడీలు చేసినా సరే మహిళల పట్ల ఏనాడు అసభ్యంగా ప్రవర్తించలేదు. ఈ విషయాన్ని స్వయంగా అతడి అన్నయ్య ప్రభాకర్.. ఓ సందర్భంలో చెప్పాడు. (ఇదీ చదవండి: హీరోయిన్‌తో ఐఆర్ఎస్ అధికారి రిలేషన్.. గిఫ్ట్‌గా బంగారం, భవనాలు) -
అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలపై హైకోర్టులో విచారణ
-
ట్రాన్స్జెండర్లను గౌరవించాలి
ఖలీల్‌వాడి: ట్రాన్స్జెండర్లను గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీసుధ అన్నారు. శనివారం జిల్లా కోర్టు భవన సముదాయంలో న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ట్రాన్స్జెండర్లు, సెక్స్ వర్కర్లకు పోస్టల్ శాఖ ద్వారా అమలవుతున్న గ్రూప్ యాక్సిడెంటల్ పాలసీ బాండ్లను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడారు. ట్రాన్స్జెండర్ల సమస్యలను చిత్రీకరిస్తూ అష్ట గంగాధర్ రూపొందించిన వీడియోతో కూడిన పాటను ఆవిష్కరించారు. జస్టిస్ శ్రీసుధ మాట్లాడుతూ ట్రాన్స్జెండర్ల పట్ల వివక్ష చూపడం తగదన్నారు. వారికి అన్ని రంగాల్లో అవకాశాలు లభించేలా కృషి చేయాలన్నారు. పోస్టల్ శాఖ ద్వారా కేవలం రూ.399 ప్రీమియంతో రూ.10 లక్షల ప్రమాద బీమాతో పాటు అనేక ప్రయోజనాలు ఉంటాయన్నారు. గ్రూప్ యాక్సిడెంటల్ పాలసీ గార్డ్‌ను ట్రాన్స్జెండర్లు, సెక్స్ వర్కర్లకు అందించడం అభినందనీయమన్నారు. దీనికి సహకరించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రతినిధులను ప్రశంసించారు. తక్కువ ప్రీమియంతో ఎక్కువ ప్రయోజనాలు అందిస్తున్న పోస్టల్ ప్రమాద బీమా గురించి ప్రచారం కల్పించాలన్నారు. జిల్లా జడ్జి సునీత మాట్లాడుతూ ట్రాన్స్ జెండర్లు, సెక్స్ వర్కర్లకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. దాతలు ముందుకు వచ్చి రూ.30 వేలు విరాళం అందించినట్లు తెలిపారు. దీనిని 50 మందికి ప్రీమియం కోసం ఖర్చు చేసినట్లు చెప్పా రు. ఈ కార్యక్రమం అనంతరం హైకోర్టు జడ్జి, న్యాయాధికారులతో భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించారు. హైకోర్టు జడ్జికి స్వాగతం పలికిన జిల్లా జడ్జి, కలెక్టర్ హైకోర్టు జడ్జి శ్రీసుధ జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా జిల్లా ఉన్నతాధికారులు ఆమెకు ఘన స్వా గతం పలికారు. ఆర్అండ్బీ అతిథి గృహం వద్ద జిల్లా జడ్జి సునీత, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, ట్రెయినీ కలెక్టర్ కిరణ్మయి, నిజామాబాద్ ఆర్డీవో రవి, డీసీపీ(అడ్మిన్)మధుసూదన్ రావు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పద్మావతి తదితరులు స్వాగతం పలికారు. ఆమె పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. -
12 మంది ఐఏఎస్, ఐపీఎస్ ల కేటాయింపులపై నేడు హైకోర్టులో విచారణ
-
IAS,IPS బదిలీల విచారణ అత్యవసరంగా చేపట్టాలని తెలంగాణ హైకోర్టును కోరిన కేంద్రం
-
కోర్ట్ లో టిప్పులు.. యూనిఫామ్ పై QR కోడ్..
-
బీజేపీ నేత బీఎల్ సంతోష్ కు ఊరట
-
అమరావతి పాదయాత్రపై సవరణ పిటిషన్లు కొట్టివేత
-
అమరావతి పాదయాత్రపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
సైబరాబాద్ పోలీసుల పిటిషన్ పై హైకోర్టు లో విచారణ
-
జనసేనకు హైకోర్టు షాక్...
-
నవయుగ సంస్థకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ
-
జస్టిస్ ఫర్ శ్రీమతి: పోస్ట్‌మార్టం పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: తమిళనాడులో సంచలనం సృష్టించిన పాఠశాల విద్యార్థి ఆత్మహత్య కేసుకి సంబంధించి ఘటన జరిగిన మరుసటి రోజే మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థి మృతి నిరశిసిస్తూ మరోసారి పోస్ట్‌మార్టం నిర్వహించాలని ఆదేశించింది. అంతేగాక అల్లర్లకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవల్సిందిగా కోర్టు తీర్పు ఇచ్చింది. ఐతే మెడికల్ ప్యానెల్లో తమకు తెలిసిన వైద్యుడిని చేర్చాలన్న తల్లిదండ్రుల అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. దీంతో వారు తమకు తెలిసిన వైద్యుడితోనే శవపరీక్షలు నిర్వహించాలంటూ బాలిక తండ్రి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అంతేగాదు ఈ కేసును అత్యవసరంగా విచారించాలంటూ సుప్రీంకోర్టుని బాలిక కుటుంబం పట్టుబట్టింది. ఐతే ధర్మాసనం రెండోసారి నిర్వహించే పోస్ట్‌మార్టం పై స్టే ఇచ్చేందుకు నిరాకరిచడమే కాకుండా రేపు విచారణ జరుపుతామని సుప్రీం కోర్టు తెలిపింది. ఐతే బాలిక తండ్రి తరపు న్యాయవాది రాష్ట్రంలో ఈ విషయమై చాలా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది, పైగా ఈ రోజే పోస్ట్‌మార్టం ప్రారంభమవుతుంది కాబట్టి దయచేసి దానిపై స్టే విధించండి అంటూ పట్టుబట్టారు. దీనికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ స్పందిస్తూ...‘ఈ అంశాన్ని ఇప్పటికే హైకోర్టు సీజ్ చేసింది. మీకు హైకోర్టుపై నమ్మకం లేదా? అని మందలించడమే కాకుండా వారి అభ్యర్థనను తిరస్కరించారు. అదీగాక మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు అల్లర్లకు సంబంధించి దాదాపు 300 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. (చదవండి: జస్టిస్ ఫర్ శ్రీమతి: టీచర్లు హరిప్రియ, కృతిక అరెస్ట్) -
అనధికార భవనాలను కూల్చేయండి! కీలక వ్యాఖ్యలు చేసిన హైకోర్టు
ముంబై: అనధికార భవనాలు కారణంగా ఒక్క అమాయకుడి ప్రాణాలు పోయిన ఉరుకోమని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. అటువంటి నిర్మాణాల వల్ల కలిగే ప్రమాదాలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పేర్కొంది. ముంబైలో అనేక కుటుంబాలు నివశిస్తున్న తొమ్మిది అనధికార భవనాలను కూల్చివేయాలంటూ... ధానేకి చెందిన ముగ్గురు నివాశితులు పిటిషిన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చీఫ్ జస్టీస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఎంఎస్ కార్నిక్‌లతో కూడిన ధర్మాసనం విచారించిన సందర్భంగా ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. 1998 నాటి ప్రభుత్వ తీర్మానం ఇప్పటికీ అమలులో ఉందన్న విషయాన్ని ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తుచేసింది. అయినా వర్షాల సమయంలో అనధికార నిర్మాణాలను పౌర అధికారులు ఎందుకు కూల్చివేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఐతే థానే మునిసిపల్ కార్పొరేషన్ (టిఎంసీ) అనధికార నిర్మాణాలకు అనేక కూల్చివేత నోటీసులు అందించినప్పటికీ, నివాసితులు అక్కడ నివశిస్తున్నారని పిటిషనర్ల తరుపు న్యాయవాది నీతా కర్ణిక్ పేర్కొన్నారు. ఈ మేరకు టీఎంసీ తరుఫు న్యాయవాది రామ్ ఆప్టే, తొమ్మిది భవనాలను కూల్చివేతలకు పౌర సంఘం అనేక నోటీసులు పంపిందని, అయితే నివాసితులు ఖాళీ చేయడానికి నిరాకరించారని ధర్మాసనానికి తెలిపారు. ఇదిలా ఉండగా సంబంధిత భవనాల తరుఫు న్యాయవాది సుహాస్ ఓక్ మానవతా దృక్పథంతో వ్యవహరించి కనీసం వర్షాకాలం ముగిసే వరకు భవనాలను కూల్చివేయకుండా టీఎంసీని ఆపాలని కోర్టును కోరారు. దీనికి ప్రతి స్పందనగా ధర్మాసనం ..." మేము మానవతా దృక్పథంతో వ్యవహరించే అనధికారిక భవనాల వల్ల ఒక్క అమాయకుడి ప్రాణం పోకూడదని అనుకుంటున్నాం. వారంతా సురక్షిత ప్రదేశంలో ఉండాలని ఆశిస్తున్నాం. అంతేకాదు ఒక్క భవనం కూలిపోతే అనేక ప్రాణాలు పోవడమే కాదు, పక్కనున్న భవనాలను కూడా నేలమట్టం చేయవచ్చు అని వెల్లడించింది. అదీగాక డిసెంబరు 2021లోనే ఈ కేసుని సుమోటాగా తీసుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ భూముల్లో ఉన్న అనధికార భవనాలన్నింటినీ కూల్చివేయాలని..ఒక ఉత్తర్వును కూడా జారీ చేసినట్లు ధర్మాసనం పేర్కొంది. అయినప్పటికీ నివాసితులు దీన్ని అర్థం చేసుకోవడం లేదంటూ చివాట్లు పెట్టింది. అంతేకాదు సంబంధిత భవనాల్లో ఉంటున్న నివాసితులందరూ ఆగస్టు 31లోగా ఖాళీ చేస్తామని హామీ ఇవ్వాలని కూడా స్పష్టం చేసింది. మరోవైపు టీఎంసీని కూడా ఆగస్టు 31 దాక భవనాలను కూల్చివేయద్దని ధర్మాసనం ఆదేశించింది. సాధ్యమైనంతవరకు ఈ ఉత్తర్వును త్వరితగతిన అమలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఐతే ఇలాంటి అనధికార భవనాలు ముంబైలో సుమారు 30 దాక ఉన్నట్లు సమాచారం. (చదవండి: ఆ కారు రిజిస్ట్రేషన్ నెంబర్ చూసి షాక్ అయిన పోలీసులు: ఫోటోలు వైరల్) -
హఠాత్తుగా వాహనం దిగి.. హోంగార్డును అభినందించి.
సాక్షి, హైదరాబాద్: అది ఎల్బీ స్టేడియం పక్కన ఉన్న బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహం చౌరస్తా... రోజూ మాదిరిగానే శుక్రవారం కూడా అబిడ్స్ ట్రాఫిక్ ఠాణా హోంగార్డు అష్రఫ్ అలీ ఖాన్ విధుల్లో ఉన్నారు. ఉదయం 9.20 గంటలకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ వాహనం ఆ దారిలో వెళ్తోంది. హఠాత్తుగా సీజే తన వాహనాన్ని స్లో చేయించి అలీని దగ్గరకు పిలిచారు. వాహనం నుంచి కిందికి దిగిన జస్టిస్ సతీశ్‌చంద్ర.. అలీని ‘వెల్డన్ ఆఫీసర్’ అంటూ అభినందించి పుష్పగుచ్ఛం ఇచ్చారు. దీంతో అలీఖాన్‌తోపాటు అక్కడున్న వాళ్లూ ఆశ్చర్యపోయారు. విజయ్‌నగర్ కాలనీకి చెందిన అష్రఫ్ 24 ఏళ్ల క్రితం హోంగార్డుగా అడుగుపెట్టారు. రెండున్నరేళ్లుగా అబిడ్స్ ట్రాఫిక్ పోలీసుస్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నారు. అలీ నిత్యం బీజేఆర్ స్టాట్యూ చౌరస్తాలోని పాయింట్లో డ్యూటీ చేస్తుంటారు. జస్టిస్ సతీష్ చంద్ర శర్మ రాకపోకలు సాగించేది ఈ చౌరస్తా మీదుగానే. అత్యంత ప్రముఖుల జాబితాలో ఉండే ఆయనకు ట్రాఫిక్ పోలీసులు గ్రీన్‌చానల్ ఇస్తుంటారు. సీజే ప్రయాణించే సమయంలో, ఆ మార్గంలో మిగిలిన వాహనాలను ఆపి, ఆయన వాహనాన్ని ముందుకు పంపిస్తారు. బీజేఆర్ స్టాట్యూ వద్ద అలీ ఒక్క రోజు కూడా చిన్న ఇబ్బందీ రానీయలేదు. అంకితభావంతో విధులు నిర్వర్తిస్తున్న అలీని కొన్నాళ్లుగా గమనిస్తున్న సీజే శుక్రవారం అభినందించారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. హోంగార్డు అలీ ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘ఇన్నేళ్లల్లో ఒక్కసారి కూడా సీజే స్థాయి వారిని దగ్గర నుంచి కూడా చూడలేదు. అలాంటిది సీజే నా వద్దకు వచ్చి అభినందించడంతో షాకయ్యా’ అని ఉబ్బితబ్బిబ్బయ్యారు. సీజే ఇచ్చిన స్ఫూర్తిని అలీ జీవితకాలమంతా గుర్తుపెట్టుకుంటారని డీజీపీ మహేందర్‌రెడ్డి ట్టిట్టర్లో పేర్కొన్నారు. -
‘ఐదు ఎకరాల్లోపే’ రైతుబంధు ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: ఐదు ఎకరాలలోపు భూమి ఉన్న వారికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయంగా రైతుబంధు పథకాన్ని వర్తింపజేసేలా ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ, వ్యవసాయ, ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శులతోపాటు వ్యవసాయ శాఖ కమిషనర్లను ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి గతంలో రెండు పిటిషన్లు దాఖలయ్యాయని ప్రభుత్వ న్యాయవాది నివేదించారు. దీంతో ఈ వ్యాజ్యాన్ని వాటితో కలిపి విచారిస్తామని ధర్మాసనం స్పష్టం చేస్తూ తదుపరి విచారణను మార్చి 25కు వాయిదా వేసింది. హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది తల్లాడ నందకిశోర్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని (పిల్) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావలితో కూడిన ధర్మాసనం ఇటీవల విచారించింది. ‘రాష్ట్రవ్యాప్తంగా 1.43 కోట్ల ఎకరాల భూమి సాగులో ఉంది. ఇందులో మెజారిటీ వ్యవసాయ భూములను కౌలుదారులే సాగుచేస్తున్నారు. వారికి ప్రభుత్వం ఎటువంటి పరిహారం ఇవ్వడం లేదు. కొందరు రాజకీయ నాయకులకు వందలాది ఎకరాల వ్యవసాయ భూములున్నాయి. వీరికీ రైతుబంధు కింద ఆర్థికసాయం అందుతోంది. అర్హులైన ఐదెకరాలలోపు ఉన్న రైతులకు మాత్రమే ఆర్థిక సాయం అందేలా ఆదేశాలు జారీ చేయండి’ అని పిటిషన్లో కోరారు. -
రాజధాని ఎక్కడ ఉండాలనే అంశం జోలికెళ్లం: హైకోర్టు
సాక్షి, అమరావతి: రాజధాని ఏ ప్రాంతంలో ఉండాలన్న అంశం జోలికి తాము వెళ్లబోవడం లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకున్న నేపథ్యంలో ఇక ఆ అంశంపై వాదనలు అవసరం లేదని స్పష్టం చేసింది. పాలనా వికేంద్రీకరణ చట్టంతో పాటు సీఆర్డీఏ రద్దు చట్టాన్ని కూడా ప్రభుత్వం ఉపసంహరించుకున్న నేపథ్యంలో ఈ వ్యవహారంలో ఇప్పటికే దాఖలైన వ్యాజ్యాల్లో ఏ అభ్యర్థనలు మనుగడలో ఉంటాయి? వాటి విషయంలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వాలన్న అంశంపైనే తాము ప్రధానంగా దృష్టి సారించామని వెల్లడించింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు, ప్రభుత్వ న్యాయవాదులు వాద ప్రతివాదనలను శుక్రవారం పూర్తి చేయడంతో ఈ వ్యాజ్యాలన్నింటిపై తీర్పును వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రాంతంలో వద్దని చట్టబద్ధ కమిటీనే చెప్పింది.. విచారణ సందర్భంగా సీఆర్డీఏ తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) కాసా జగన్మోహన్రెడ్డి వాదనలు వినిపిస్తూ అత్యంత సారవంతమైన భూములున్న కృష్ణా–గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేయడం సరికాదని కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ స్పష్టంగా చెప్పిందన్నారు. అంతేకాకుండా అది వరద, భూకంప ప్రభావిత ప్రాంతమని కూడా కమిటీ నివేదికలో ప్రస్తావించిందన్నారు. ఈ పరిస్థితులన్నీ పరిగణనలోకి తీసుకున్న తరువాత అమరావతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసిందన్నారు. అందులో భాగంగానే అమరావతి మాస్టర్ ప్లాన్‌ను సవరించాలని నిర్ణయం తీసుకుందని వివరించారు. గత ప్రభుత్వం ఈ–బ్రిక్స్, గ్రాఫిక్స్ చూపించి రాజధాని విషయంలో ప్రజలను మభ్యపెట్టిందన్నారు. పాలనా వికేంద్రీకరణ చట్టాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకున్న నేపథ్యంలో ఈ అంశంపై దాఖలైన వ్యాజ్యాలన్నీ నిరర్థకమే అవుతాయని, వాటిపై ఎలాంటి విచారణ అవసరం లేదని తెలిపారు. హోదా హామీని కూడా నెరవేర్చాలి శాసన మండలి తరఫు న్యాయవాది మెట్టా చంద్రశేఖరరావు వాదనలు వినిపిస్తూ రాజధానిగా అమరావతి ఉండటంపై తమకు అభ్యంతరం లేదని అప్పటి ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి శాసనసభ సాక్షిగా చెప్పారని, ఆ మాటకు కట్టుబడి ఉండాల్సిన బాధ్యత ఆయనపై ఉందని పిటిషనర్లు చెబుతున్నారన్నారు. ఆ మాటను అమలు చేయాల్సి వస్తే పార్లమెంట్ సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామంటూ ప్రధానమంత్రి హోదాలో నాడు మన్మోహన్సింగ్ ఇచ్చిన హామీని కూడా అమలు చేయాల్సి ఉంటుందన్నారు. సీఆర్డీఏ ఏర్పాటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరిగిందని తెలిపారు. ప్రజాస్వామ్యంలో మెజారిటీ ప్రజలదే అంతిమ నిర్ణయమన్నారు. మెజారిటీ ప్రజలు ప్రస్తుత ప్రభుత్వానికి అధికారాన్ని అప్పగించారని, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు మెజారిటీ ప్రజల నిర్ణయాలే అవుతాయన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అమరావతిని రాజధానిగా నిర్ణయించారని చెప్పారు. ఆ నివేదికలను కొట్టివేయండి... ప్రభుత్వం తరఫున బుధవారం నాడు అడ్వొకేట్ జనరల్, సీఆర్డీఏ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి, శాసనమండలి తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.ఎస్ ప్రసాద్ వినిపించిన వాదనలపై పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ఉన్నం మురళీధరరావు, వాసిరెడ్డి ప్రభునాథ్ తదితరులు తిరుగు సమాధానం ఇచ్చారు. రైతుల వాదనలు వినకుండానే హైవర్ కమిటీ, బోస్టన్, జీఆర్ఎన్ రావు కమిటీలు నివేదికలు ఇచ్చాయని, అవేమీ చట్టబద్ధ నివేదికలు కాదని, అందువల్ల వాటిని కొట్టి వేయాలని అభ్యర్థించారు. చట్ట నిబంధనలకు లోబడే అమరావతిని రాజధానిగా నిర్ణయించారన్నారు.ల్యాండ్ పూలింగ్ పథకం కింద కల్పించాల్సిన ప్రయోజనాలన్నింటినీ రైతులకు అందించడంతోపాటు ఇతర మౌలిక సదుపాయాలన్నింటినీ పూర్తి చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. నిధుల కొరతను కారణంగా చూపి అభివృద్ధిని ఆపడానికి వీల్లేదన్నారు. ఇప్పటి వరకు శాశ్వత హైకోర్టును నిర్మించలేదని, ఇది న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బ తీయటమేనన్నారు. -
వారి విడుదలకు చర్యలు తీసుకోండి: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: హత్యలాంటి తీవ్రమైన నేరాల్లో కాకుండా ఇతర నేరాల్లో న్యాయ స్థానాలు బెయిల్ మంజూరు చేసినా పూచీకత్తు మొత్తాన్ని చెల్లించలేక జైళ్లలోనే మగ్గిపోతున్న విచారణ ఖైదీల విడుదలకు చర్యలు తీసుకోవాలని జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీలను హైకోర్టు ఆదేశించింది. ఆయా కోర్టుల్లో పిటిషన్లు వేయాలంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావలిల ధర్మాసనం శుక్రవారం తీర్పునిచ్చింది. తమ ఆదేశాల అమలుకు తీసుకున్న చర్యలను వివరిస్తూ నివేదిక సమర్పించాలని పేర్కొంటూ తదుపరి విచారణను ఏప్రిల్ 22కు వాయిదా వేసింది. బెయిల్ మంజూరైనా పేదరికంతో పూచీకత్తు మొత్తాన్ని చెల్లించలేక రాష్ట్రవ్యాప్తంగా 180 మంది కొన్ని నెలలుగా జైళ్లలో మగ్గుతున్నారని హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ మురళి కరణం దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం విచారించింది. పూచీకత్తు చెల్లించలేని కారణంగా విచారణ ఖైదీలు జైళ్లలో మగ్గిపోవడానికి వీల్లేదని సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చిందని పిటిషనర్ తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. సొంత పూచీకత్తుపై వీరిని విడుదల చేసేలా ఆదేశించాలని అభ్యర్థించారు. పూచీకత్తు చెల్లించలేని విచారణ ఖైదీలను గుర్తించి వారి విడుదలకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర లీగల్ సర్వీస్ అథారిటీ తరఫున న్యాయవాది అనిల్‌కుమార్ నివేదించారు. స్పందించిన ధర్మాసనం.. జిల్లాల లీగల్ సర్వీస్ అథారిటీల సహకారంతో ఇలాంటి వారి విడుదలకు చర్యలు తీసుకోవాలలని ఆదేశించింది.