indian metrological department
-
తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని పలు జిల్లాల్లో రాగల మూడురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రానున్న మూడు రోజులు ఉరుములు మెరుపులతోపాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది.పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని అల్పపీడనం, దక్షిణ కోస్తా మయన్మార్‌లోని ఉపరితల ఆవర్తనం తూర్పు, పశ్చిమ ద్రోణితో కలిసిపోయి.. సగటు సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని.. ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశగా వంగి ఉంటుందని.. దీని ప్రభావంతో రాగల 24గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేందుకు అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.ఈ క్రమంలో మంగళవారం నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్క భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.SEVERE STORMS WARNING ⚠️ As peak convergence is expected, today will be WIDESPREAD powerful storms, lightining in RED marked districts next 24hrs. Multiple storms are expected ⚠️HYD - Multiple spells of powerful storms (2-3 strong ones) expected next 24hrs ⚠️⚡ pic.twitter.com/ySeub3wSdC— Telangana Weatherman (@balaji25_t) September 23, 2024 మంగళవారం కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షాలుపడే అవకాశం ఉందని హెచ్చరించింది. బుధవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలుపడుతాయని వివరించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. -
ముంబైను వణికించిన భారీ వర్షాలు.. 6 గంటల్లో 300 మి. మీ వర్షం
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో ముంబైతోపాటు పక్కనే ఉండే థానే, పాల్ఘర్, రాయ్ గడ్ ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లపై భారీగా వరద నీరు చేరింది. నడుములోతు నీళ్లలో పలువురు ప్రయాణిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కేవలం ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంట నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు ఏకధాటిగా 300 మిల్లీమీటర్ల మేర వర్షం కురిసింది. దీంతో భారత వాతావరణ శాఖ ముంబై,, థానే, పాల్ఘర్, కొంకణ్ బెల్ట్‌కు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ముంబైలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ము, న్సిపల్ పాఠశాలలతోపాటు కళాశాలలకు సెలవులు ప్రకటించారు.#WATCH | Maharashtra: The traffic slows down on Western Express Highway near Vile Parle as heavy rain lashes Mumbai city. pic.twitter.com/aAzQaayTqO— ANI (@ANI) July 8, 2024 భారీ వర్షాలు, వరదల కారణంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, కుర్లా–విక్రోలీ, బంధూప్ స్టేషన్లలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు సెంట్రల్ రైల్వే పేర్కొంది. డోంబివిలీ స్టేషన్లో ప్రజలు నీట మునిగిన ట్రాక్‌లపై రైళ్ల కోసం వేచి ఉన్నారు. వర్లీ, బుంటారా భవన్, కుర్లా ఈస్ట్, ముంబైలోని కింగ్స్ సర్కిల్ ప్రాంతం, దాదర్, విద్యావిహార్ రైల్వే స్టేషన్లలో నీరు నిలిచిపోయింది. కాగా ముంబై, థానే, పాల్ఘర్, రాయ్‌గడ్‌లలో ప్రతిరోజూ 30 లక్షల మంది ప్రయాణికులు సబర్బన్ లోకల్ రైలు సేవలను ఉపయోగిస్తుంటారు.'బెస్ట్' బస్ ట్రాన్స్ పోర్ట్ సైతం భారీ వర్షాల కారణంగా ముంబైలోని వివిధ ప్రాంతాల్లో బస్సులను దారిమళ్లించినట్లు ప్రకటించింది. ఈ మేరకు ఒక జాబితాను సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఇక థానే, వసాయ్ (పాల్ఘర్), మహద్ (రాయ్ గడ్), చిప్లున్ (రత్నగిరి), కొల్హాపూర్, సంగ్లీ, సటారా, ఘట్కోపర్, కుర్లా, సింధుదుర్గ్ లలో వరద సహాయ చర్యలను చేపట్టేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ప్రభుత్వం మోహరించింది. ముంబైలోని అంధేరీలో మూడు బృందాలతోపాటు నాగ్ పూర్ లో అదనపు బృందాలను సిద్ధంగా ఉంచింది.ఒక్క రోజు వర్షానికే ముంబై వణికిపోగా.. వచ్చే మూడు రోజులపాటు ముంబైతోపాటు మహారాష్ర్టలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముంబైలో సోమవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో 4.4 మీటర్ల ఎత్తులో సముద్రపు అలలు ఎగసిపడే అవకాశం ఉందని తెలిపింది. -
తెలంగాణలో మరో రెండు రోజులు వానలే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వివరించింది.శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, మహబూబ్‌నగర్, హన్మకొండ, జనగామ, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడే సూచనలున్నాయని చెప్పింది. ఈ రెండు రోజుల్లో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30- 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. శనివారం రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది.పశ్చిమ మధ్య, దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతుందని, శుక్రవారం నాటికి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం వాతావరశాఖ తెలిపింది. ఈ నెల 25న తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశాలున్నాయని.. 26 నాటికి బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీరానికి తుఫాను చేరుతుందని పేర్కొంది. బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవుల్లో రుతుపవనాలు విస్తరించాయి. -
తెలంగాణలో మూడురోజులు వడగాలులు.. వాతావరణశాఖ హెచ్చరిక
కాస్తా తగ్గుముఖం పట్టాయనుకున్న ఉష్ణోగ్రతలు.. ఒక్కసారిగా మండిపోతున్నాయి. చల్లబడిందనుకున్న వాతావరణం మళ్లీ.. నిప్పులు వర్షం గుమ్మరిస్తుంది. వాతావరణ శాఖ ముందస్తుగానే హెచ్చరించినట్లు భానుడు భగభగ మండుతున్నాడు. అయితే రానున్న రోజుల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు అవకాశముందని, 50 డిగ్రీల వరకు నమోదయ్యే ఛాన్స్ ఉందని వాతావరణశాఖ వర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణలో వచ్చే మూడురోజులు వడగాలులు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాబోయే రెండు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. బుధవారం కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. గురువారం ఉమ్మడి ఆదిలాబాద్‌తో పాటు రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ వడగాలులు వీస్తాయని పేర్కొంది. శుక్రవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ వడగాలులు వీస్తాయని చెప్పింది. అలాగే రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అవకాశం ఉందని వివరించింది. -
హైదరాబాద్‌లో చల్లబడిన వాతావరణం.. నాలుగు రోజులు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కొన్ని రోజులుగా మండుతున్న ఎండలతో ప్రజలు అల్లాడిపోగా.. తాజాగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. ఆకాశం మేఘావృతమై ఉండగా.. చల్లటి గాలులు వీస్తుండడంతో నగరవాసులకు ఊరట కలిగించినట్లయ్యింది. త్వరలోనే తెలంగాణలో వానలు పలుకరించనున్నాయి. రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వానలు పడే అవకాశాలున్నాయని పేర్కొంది.ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. గురువారం నుంచి ఆదివారం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 36-26 డిగ్రీల మధ్య ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఉపరితల గాలులు ఆగ్నేయ దిశ నుంచి వీచే అవకాశం ఉందని తెలిపింది. -
తెలంగాణకు హెచ్చరిక.. బయటకు రావొద్దు..
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటుతున్నాయి. ఎండ తీవ్రతకు జనం అల్లాడుతున్నారు. అనూహ్యంగా పెరిగిన ఉష్ణోగ్రతలు.. ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అడుగు తీసి బయట పెట్టాలంటే జంకుతున్నారు. శుక్రవారం నల్గొండ జిల్లాలోని ఇబ్రహీంపేటలో 43.5, కనగల్‌లో 43.4, మాడుగులపల్లిలో 43.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఏప్రిల్ మొదటి వారంలోనే 43 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు ముందుముందు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో వచ్చే రెండురోజులు(శని, ఆది) వడగాలులు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అదే సమయంలో ఎండల తీవ్రత సైతం రెండు, మూడు డిగ్రీలు అధికంగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలో ఎండలు 43 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయని.. ఉదయం 11 నుంచి సాయంత్రం 4.30 గంటలకు ప్రజలు బయటకు రావొద్దని పేర్కొంది.. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లే జాగ్రత్తలు తీసుకోవాలని.. ఆదివారం తర్వాత ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలిపింది. శనివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ జిల్లాల్లో వడగాలులు వీస్తాయని పేర్కొంది. ఆదివారం ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ వడగాలులు వీస్తాయని తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. అలాగే, ఆదివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. చదవండి: కరీంనగర్లో కేసీఆర్ పొలంబాట.. రైతులకు పరామర్శ -
మళ్లీ అలర్ట్.. నేడు, రేపు తెలంగాణలో భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లోని కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. ఈ మేరకు రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రానికి పశ్చిమ దిశ నుంచి బలంగా గాలులు వీస్తున్నాయని వివరించింది. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా 0.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 35.31 సెంటీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా... 55.91 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చదవండి: భద్రాచలం వద్ద తగ్గిన వరద ఉధృతి కాగా ఆదివారం సంగారెడ్డి జిల్లా జన్నారంలో 40.3 మిల్లీమీటర్లు, మేడ్చల్ 37.5, మెదక్ జిల్లా కాగజ్ మద్దూర్ 35, యాదాద్రి జిల్లా బీబీనగర్ 27.5, నిర్మల్ జిల్లా విశ్వనాథ్‌పూర్ 27, సంగారెడ్డి జిల్లా లక్ష్మిసాగర్ 26.8, మేడ్చల్ జిల్లా కేశవరం 26, ఆలియాబాద్ 25, బండ మాదారంలో 24.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. -
Telangana Rains: మరో 24 గంటలు భారీ నుంచి అతి భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కురుస్తున్న కుండపోత వర్షాలు ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గతకొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా పడుతున్న వానలతో రాష్ట్రమంతా తడిసి ముద్దవుతోంది. ఇప్పటికే పలు జిల్లాలు జల దిగ్భంధంలోకి వెళ్లిపోయాయి. వరదలతో ముప్పు తిప్పలు పడుతున్న రాష్ట్ర ప్రజలకు భారత వాతావరణ శాఖ తాజాగా మరో హెచ్చరిక చేసింది. నిన్నటి తీవ్ర అల్ప పీడనం నేడు అల్పపీడనంగా బలహీనపడినట్లు తెలిపింది. ప్రస్తుతం దక్షిణ ఒడిశా, పరిసరాల్లోని ఉత్తర ఆంధ్రప్రదేశ్ వద్ద అల్పపీడనం కొనసాగుతోందని పేర్కొంది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతోందని తెలిపింది. ఈ ప్రభావంతో తెలంగాణలో గురువారం భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని, అసాధారణమైన వర్షపాతం 24 సెంటీమీటర్లకు పైగా నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. శుక్రవారం కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. దీంతో రాష్ట్రలోని 8 జిల్లాలకు ఆరెంజ్, 14 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులు, గంటకు 40 నుండి 50కిమీ వేగంతో వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. చదవండి: వరద బీభత్సం.. తెగిపోయిన వరంగల్-హన్మకొండ కనెక్టివిటీ భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఆదిలాబాద్, కుమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. సోమవారం తెరుచుకోనున్న విద్యాసంస్థలు రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు రేపు సెలవు ప్రకటించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఆదేశించారు. శనివారం మొహర్రం సెలవు కావడంతో ప్రభుత్వ విద్యాసంస్థలు అన్నీ ఇక సోమవారం తెరుచుకోనున్నాయి. చదవండి: తెలంగాణ చరిత్రలోనే రికార్డు వర్షపాతం.. నీట మునిగిన మేడారం -
AP: రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు పడనున్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా. బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. రేపు అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, ఎల్లుండి భారీవర్షాలు పడే అవకాశం ఉందన్నారు. భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం పశ్చిమ మధ్య ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉత్తరాంధ్ర -దక్షిణ ఒడిశా మీదుగా ఆవర్తనం కొనసాగుతుందని, దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు ఏర్పడనున్నట్లు తెలిపారు. బుధవారం నాటికి అదే ప్రాంతంలో వాయుగుండంగా బలపడనున్నట్లు ఆయన తెలిపారు. ఆ తర్వాత ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాల మీదుగా పశ్చిమ-వాయువ్య దిశగా నెమ్మదిగా కదిలే అవకాశం ఉందని వెల్లడించారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజులు విస్తార వర్షాలు, మిగిలిన చోట్ల విస్తారంగా వర్షాలు పడనున్నట్లు వివరించారు. రేపు కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు,పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్నిచోట్ల మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. చదవండి: వాతావరణ శాఖ గుడ్‌న్యూస్.. ఈ నెలంతా వానలే! ఎల్లుండి అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో కొన్నిచోట్ల మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. భారీ వర్షాలు నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉరుములతో కూడిన వర్షం కురిసేపుడు వ్యవసాయ పనుల్లోని రైతులు, పొలాల్లో పనిచేసే కూలీలు, గొర్రెల కాపరులు చెట్ల క్రింద ఉండరాదన్నారు. సోమవారం రాత్రి 7 గంటల నాటికి జిల్లా వారీగా విశాఖ జిల్లా ఆనందపురంలో 96 మి.మీ, పెందుర్తి 84, పద్మనాభం 76 మి.మీ, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ లో 61.5మి.మీ ,అల్లూరి జిల్లా అనంతగిరిలో 61.5 మి.మీ , శ్రీకాకుళం జిల్లా లక్ష్మీనర్సుపేట 56.5 మి.మీ, విజయనగరం జిల్లా పూసపాటిరేగలో 55.7 మి.మీ, నెల్లూరుజిల్లా అనుమసముద్రంపేటలో 55.5 మి.మీ, అనకాపల్లి జిల్లా సబ్బవరంలో 49.7 మి.మీ, మన్యంజిల్లా సాలూరులో 47.5 మి.మీ అధిక వర్షపాతం నమోదైందని చెప్పారు. సోమవరం రాత్రి 7 గంటలకు గోదావరి వరద ప్రవాహం భద్రాచలం వద్ద 36.3 అడుగులు, పొలవరం వద్ద నీటిమట్టం 11.8 మీటర్లు ధవళేశ్వరం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 9.12 లక్షల క్యూసెక్కులు ఉందని విపత్తుల సంస్థ ఎండి డా.బిఆర్ అంబేద్కర్ తెలిపారు. విపత్తుల సంస్థలోని స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ సంబంధిత జిల్లాల యంత్రాంగానికి సూచనలు జారీ చేస్తున్నామన్నారు. చదవండి: Orange Alert to Hyderabad: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. ఆరెంజ్ అలెర్ట్ జారీ అత్యవసర సహాయక చర్యల కోసం కూనవరం ,పి.గన్నవరంలో 2ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, మామిడికుదురు, అయినవిల్లి, కుకునూర్, వేలేర్పాడులో 4ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండి తెలిపారు. వరద ఉధృతి హెచ్చుతగ్గులుగా ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో తగ్గే వరకు గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ~ డా. బి.ఆర్ అంబేద్కర్, మేనేజింగ్ డైరెక్టర్, విపత్తుల సంస్థ. -
ముంచుకొస్తున్న 'బిపర్ జోయ్' తుఫాను..అలర్ట్ చేసిన వాతావరణ శాఖ!
అరేబియా సముద్రంలో అత్యంత తీవ్రమవుతున్న బిపర్ జోయ్ తుపాను రానున్న 36 గంటల్లో మరింత తీవ్రం కానుందని వాతావరణ శాఖ(ఐఎండీ) పేర్కొంది. మరో రెండు రోజుల్లో ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తుందని ఐఎండీ ట్వీట్ చేసింది. జూన్ 08 రాత్రి 11.30 గంటలకు గోవాకిమ నైరుతి దిశలో 840 కిలోమీటర్లు, ముంబైకి పశ్చిమ నైరుతి దిశలో 870 కిలోమీటర్లు, ముంబైకి నైరుతిగా 901 కిలోమీటలర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు పేర్కొంది. నిజానికి ఈ బిపర్ జోయ్ తుపాను తూర్పు మధ్య అరేబియా సముద్రం మీదుగా ఏర్పడి..నెమ్మది నెమ్మదిగా బలపడుతూ..రానున్న 36 గంటల్లో క్రమక్రమంగా తీవ్ర రూపం దాల్చనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆ తర్వాత రెండు రోజుల్లో ఉత్తర వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉన్నట్లు ఐఎండీ ట్విట్టర్లో తెలిపింది. ఈ తుపాను కారణంగా దక్షిణ గుజరాత్, సౌరాష్ట్ర సహా తీర ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇదిలా ఉండగా ఈ తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ సూచించింది. అలాగే సముద్రంలోకి వెళ్లిన వారు వెంటనే తిరిగి రావాలని హెచ్చరించడమే గాక జూన్ 14 వరకు సముద్రంలో చేపల వేటను నిలిపేయాలని కోరింది. (చదవండి: వాతావరణ శాఖ చల్లటి కబురు.. మరో 48 గంటల్లో కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు) -
తెలంగాణకు భారీ వర్ష సూచన.. మరో మూడు గంటల్లో
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని పలు జిల్లాల్లో మరో మూడు గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈదురు గాలులతో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, సంగారెడ్డి, వరంగల్, భద్రాద్రి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెల్లడించింది. గంటకు 41-61 కిమీ వేగంతో గాలులు వీస్తాయని, అక్కడక్కడ పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. వర్షాల కంటే ఈదురు గాలుల ప్రభావం అధికంగా ఉంటుందని తెలిపింది. శనివారం ఉదయం ఆగ్నేయ బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, ఇది సముద్ర మట్టం నుంచి మధ్య ట్రోపోస్పియర్ స్థాయి వరకు కొనసాగుతుందని పేర్కొంది. -
IMD: మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు, వడగళ్ల వానలు..
సాక్షి, న్యూఢిల్లీ: రానున్న మరో మూడు రోజుల పాటు దేశంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, వడగళ్ల వానలు కురుస్తాయని ఢిల్లీలోని వాతావరణ విభాగం అంచనా వేసింది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటక, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, రాజస్తాన్, పశ్చిమ హిమాలయ ప్రాంతం, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో మే 3 వరకు భారీ వర్షాలు , వడగళ్ల వానలు కురుస్తాయని వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. మే 5 నుంచి వర్షాలు తగ్గుముఖం పడతాయని, దీనికి ముందుకు దేశవ్యాప్తంగా మరో మూడు రోజుల పాటు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బుధవారం వరకు అనేక రాష్ట్రాల్లో ఉరుములు, బలమైన గాలులతో కూడిన వర్షాలు వస్తాయని తెలిపింది. మే 3 వరకు ఇలానే ఉంటుందని, మే4 నుంచి క్రమంగా తగ్గుముఖం పడుతుందని ఐఎండీ తెలిపింది. ఈ వర్షాలకు వాయువ్య భారతదేశం ఎక్కువగా ప్రభావితమవుతుందని ఐఎండీ శాస్త్రవేత్త నరేష్ కుమార్ పేర్కొన్నారు. గతనెలలో వాతావరణ విభాగం వార్షిక సూచనలో సాధారణ వర్షపాతాన్ని అంచనా వేయగా, ప్రస్తుతం సాధారణం కంటే.. దాదాపు 67% పైగా వర్షపాతాన్ని నమోదు చేసే అవకాశం ఉందని అంచనా వేసింది. కాగా, ఈ అకాల వర్షాలకు ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ తదితర రాష్ట్రాల్లోని పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఇదిలాఉండగా.. దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. రోడ్లు జలమయమవడంతో సెంట్రల్ ఢిల్లీలోని పలు మార్గాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. (చదవండి: బ్యానెట్‌పై మనిషిని ఈడ్చుకెళ్లి..ఎంపీ డ్రైవర్ దారుణం!) -
Hyderabad: నగరవాసులకు ఎల్లో అలర్ట్.. పడిపోనున్న ఉష్టోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలను చలి పులి గజ గజ వణికిస్తోంది. పలు చోట్ల ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీలకు పడిపోతున్నాయి. రోజు రోజుకూ రాత్రి , పగలు తేడా లేకుండా దారుణంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. కొండ ప్రాంతాల్లో విపరీతమైన మంచు కురుస్తుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాసులకు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 26 నుంచి ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని పేర్కొంది. సుమారు 11 డిగ్రీల సెంటిగ్రేడ్ కనిష్ట ఉష్ణోగ్రతకు పడిపోయే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు హైదరాబాద్ వాసులకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 26 నుంచి విపరీతమైన పొగమంచు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అలాగే హైదరాబాద్‌లోని సికింద్రాబాద్, ఖైరతాబాద్, చార్మినార్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, వంటి ఐదు జోన్లలో విపరితమైన మంచు కురిసే అవకాశ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పొగమంచు వల్ల ఎదురుగా వచ్చే వాహనాలు స్పష్టంగా కనిపించకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున్న వాహనదారులను అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అత్యవసరమైతేనే ఉదయం వేళ బయటకు వెళ్లాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ వెల్లడించింది. (చదవండి: డెక్కన్ మాల్ కూల్చివేతకు జీహెచ్ఎంసీ గ్రీన్ సిగ్నల్) -
Hyderabad Alert: రాగల 24 గంటల్లో భారీ వర్షసూచన..
సాక్షి, హైదరాబాద్: ఆవర్తనం, అల్పపీడన ప్రభావంతో నగరంలో రాగల 24 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ ప్రకటించింది. వర్షాల కారణంగా ఆరెంజ్ అలర్ట్‌ను జారీచేసింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో జీహెచ్ఎంసీ, జలమండలి, రెవెన్యూ, పోలీసు విభాగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వర్షం కురిసే సమయంలో అత్యవసరమైతేనే బయటకు రావాలని హెచ్చరికలు జారీచేసింది. ఆవర్తనం ప్రభావంతో బుధవారం నగరంలో మళ్లీ కురిసిన జడివాన బీభత్సం సృష్టించింది. సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షం కురిసింది. వందలాది బస్తీలు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ముంపు సమస్యలపై బల్దియా కాల్ సెంటర్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. పలుచోట్ల ఇళ్లలోకి చేరిన వరద నీటిని తొలగించేందుకు జనం నానా అవస్థలు పడ్డారు. ప్రధాన రహదారులపై మోకాళ్ల లోతున వరద నీరు పోటెత్తింది. రాత్రి 10 గంటల వరకు అత్యధికంగా మచ్చబొల్లారంలో 9.3, ఎల్బీనగర్లో 8.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా జియాగూడ, రాజేంద్రనగర్‌లలో 4.8 సెం.మీ చొప్పున నమోదైంది. వాహనదారులు, ప్రయాణికుల కష్టాలు.. సాయంత్రం ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థల నుంచి బయలుదేరిన వాహనదారులు, ప్రయాణికులు ట్రాఫిక్‌లో చిక్కుకొని ఆలస్యంగా ఇళ్లకు చేరుకున్నారు. భారీ వర్షానికి మూసీ నదికి వరద పోటెత్తింది. మూసారాంబాగ్ బ్రిడ్జి వద్ద మూసీ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. భారీగా వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ను వేరే మార్గాల్లో మళ్లించారు. చాదర్‌ఘాట్ బ్రిడ్జి నుంచి నల్లగొండ క్రాస్ రోడ్డు వరకు భారీగా ట్రాఫిక్‌జాం ఏర్పడింది. వర్షం సమయంలో అవసరమైతేనే బయటకు రావాలని నగరవాసులకు పోలీసులు హెచ్చరించారు. ఈ ప్రాంతాల్లో దంచికొట్టింది.. మచ్చబొల్లారం, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, మలక్‌పేట, మెహిదీపట్నం, గోషామహల్, మంగళ్‌హాట్, ఆసిఫ్‌నగర్, జియాగూడ, పురానాపూల్, బహదూర్ పురా, ఫలక్‌నూమా, చాంద్రాయణగుట్ట, అఫ్జల్‌గంజ్, లక్డీకాపూల్, నాంపల్లి, పంజాగుట్ట, అమీర్‌పేట, ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్, సికింద్రాబాద్, కూకట్పల్లి, బాలానగర్, బోయిన్పల్లి, శేరిలింగంపల్లి, చిలకలగూడ, తిరుమలగిరి, మారేడుపల్లి, ప్యాట్నీ సెంటర్, బేగంపేట్, సోమాజిగూడ, రాంనగర్, తార్నాక, ఓయూ, అంబర్‌పేటలతో పాటు పలు ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. చదవండి: ఎంజీఎం ఘటనపై ప్రభుత్వం సీరియస్ గంటల తరబడి ట్రాఫిక్‌జాం జడివాన కారణంగా నగరంలో ట్రాఫిక్‌జాం సిటీజన్లకు చుక్కలు చూపించింది. వరద నీరు పోటెత్తడంతో సాయంత్రం 6 నుంచి రాత్రి పొద్దుపోయే వరకు పలు ప్రధాన రహదారులపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. గంటల తరబడి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. రహదారులపై నిలిచిన వరద నీటిని తొలగించేందుకు, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు ట్రాఫిక్ పోలీసులు, బల్దియా అత్యవసర బృందాలు నానా కష్టాలు పడ్డాయి. -
రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ వానలు.. రెండు రోజులు ఇదే పరిస్థితులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. చాలాచోట్ల ఓ మోస్తరు వర్షం కురియగా.. పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడ్డాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో అయితే బుధవారం మధ్యాహ్నం నుంచి రాత్రిదాకా వర్షం పడుతూనే ఉంది. పలుచోట్ల నాలుగు నుంచి ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులు జలమయం అయ్యాయి. దాదాపు వంద కూడళ్ల వద్ద ట్రాఫిక్ స్తంభించిపోయింది. మూసీలో వరద పోటెత్తడంతో మూసారాంబాగ్ బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేశారు. భారీగా పిడుగుపాటు ఘటనలు కుమురంభీం జిల్లా కౌటాల మండలం పార్డి గ్రామానికి చెందిన నౌగడే మాయబాయి (41), మంచిర్యాల జిల్లా వెంకట్రావుపేట గ్రామానికి చెందిన రైతు సత్తయ్య ఇద్దరూ చేనులో పనిచేస్తూ పిడుగుపాటుకు గురై మరణించారు. ఇక కౌటాల మండలం కనికి గ్రామంలో మందడే నానుబాయి, ఆమె ఇద్దరు కుమారులు పిడుగుపాటుకు గురై గాయపడ్డారు. వీరిలో నానుబాయి పరిస్థితి విషమంగా ఉంది. కుమురంభీం జిల్లా చింతలమానెపల్లి మండలం బాలాజీ అనుకోడ గ్రామంలో పిడుగుపాటు మేకల కాపరి లక్ష్మణ్ గాయపడ్డాడు. చదవండి: హైదరాబాద్‌లో రాగల 24 గంటల్లో భారీ వర్షం మంజీర నది ఆవతలి ఒడ్డున చిక్కుకున్న గొర్రెలకాపరులు నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం ఇత్వార్పేట్కు చెందిన సయ్యద్ గౌసొద్దీన్ (35) సమీపంలో పిడుగు పడటంతో శబ్ధానికి భయపడి పరుగెత్తి కాల్వలో పడి మృతి చెందాడు. కాగా.. మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రానికి చెందిన ఎల్లాపురం ఆశయ్య, పోతంశెట్టిపల్లి గ్రామానికి చెందిన చాకలి దుర్గయ్య మేకలు మేపేందుకు హనుమాన్ బండల్ సమీపంలోని కుర్వగడ్డకు వెళ్లి మంజీరా నది మధ్యలో చిక్కుకున్నారు. మరో రెండు రోజులు వానలు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో గురువారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. దాని ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా వచ్చే రెండు రోజులు వానలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలొచ్చే అవకాశం ఉందంది. గురు, శుక్రవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను ప్రకటించింది. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. -
Telangana: భారీ నుంచి అతి భారీవర్షాలు.. అయిదు జిల్లాలకు రెడ్ అలర్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అయిదు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఉత్తర తెలంగాణలో మిగతా జిల్లాలకు అరెంజ్ అలర్ట్ ప్రకటించింది. వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో, దక్షిణ ఒడిశా, ఉత్తర ఏపీ తీరాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీనికితోడు ఉపరితల ఆవర్తనం విస్తరించి నైరుతి వైపునకు వంగి ఉంది. వచ్చే 24 గంట ల్లో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశముంది. ఇది ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మీదుగా పశ్చిమ–వాయవ్య దిశగా కదులుతోంది. రుతుపవనాల ద్రోణి ఇప్పుడు సముద్రమట్టం వద్ద జైసల్మేర్ నుంచి వాయవ్యకు ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై అల్పపీడన ప్రాంతతీరం, ఆగ్నేయదిశ గా ఉత్తర అండమాన్ సముద్రం వరకూ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో మంగళవారం ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వచ్చే రెండ్రోజులు రాష్ట్రంలో ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు వచ్చే అవకాశం ఉంది. చదవండి: hyderabad: మట్టిగణపతుల తయారీ.. సగానికి తగ్గిన వ్యయం గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. అనేకచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 24 గంటల్లో కొము రంభీం జిల్లా బెజ్జూరులో 11 సెం.మీ. భారీ వర్షం కురిసింది. జూలూరుపాడు, ఆసిఫాబాద్, పేరూరులలో 9 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. వెంకటాపురం, పెద్దపల్లి, సత్తుపల్లిలో 8 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. -
TS: రానున్న 2 రోజుల్లో అతి భారీ వర్షాలు.. 11 జిల్లాలకు రెడ్ అలర్ట్
సాక్షి, హైదరాబాద్: వదలని వాన వణికిస్తోంది. రాష్ట్రంలో రెండ్రోజులుగా నమోదవుతున్న వర్షాలతో ఇప్పటికే జనజీవనం అస్తవ్యస్తమవుతుండగా.. మరో రెండ్రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పది జిల్లాలకు రెడ్ అలర్ట్, మరో 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. శనివారం ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా 5.16 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైనట్లు రాష్ట్ర ప్రణాళిక విభాగం వెల్లడించింది. అత్యధికంగా మెదక్ జిల్లాలో 16.76 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లో శనివా రం వరకు రాష్ట్రంలో 30.46 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, రెట్టింపునకు పైగా 63.66 సెంటీమీ టర్ల వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ తెలి పింది. సాధారణ వర్షపాతం కంటే 109% అధిక వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 24 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం, 9 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. కొనసాగుతున్న ఉపరితలద్రోణి రాష్ట్రంపై ఉపరితల ద్రోణి ప్రభావం కొనసా గుతోంది. దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక నుంచి కొమరన్ ప్రదేశం వరకు కొనసాగుతున్న ఉపరితల ద్రోణి సముద్ర మట్టం నుంచి 0.9 కి.మీ ఎత్తు వరకు విస్తరించి స్థిరంగా కొనసా గుతోంది. ఉత్తర ఒడిశా దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరి తల అవర్తనం ఈ రోజు ఇంటీరియర్ ఒడిశా దాని పరిసర ప్రాంతాలు, ఛత్తీస్‌గఢ్‌లలో కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టం నుంచి 7.6 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి ఉంది. దీని ప్రబావంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో రానున్న రెండ్రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆది, సోమవారాల్లో పలు జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుండి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించింది. రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాల్లో సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. నిరంతరం అప్రమత్తం: సీఎస్ వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు అప్రమత్తతతో ఉండాలని సీఎస్ సోమేశ్‌కుమార్ ఆదేశించారు. శనివా రం ఆయన విపత్తుల నిర్వహణ శాఖ కార్య దర్శి రాహుల్ బొజ్జతో కలసి జిల్లా కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరసగా వస్తున్న రెండురోజుల సెలవులను ఉపయో గించుకోకుండా పునరావాస కార్యక్రమాల్లో పాల్గొనాలని సీఎస్ ఆదేశించారు. రెడ్ అలర్ట్ జిల్లాలు: ఆదిలాబాద్, ఆసిఫాబాద్, వరంగల్, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, హనుమకొండ ఆరెంజ్ అలర్ట్ జిల్లాలు: నల్లగొండ, జనగామ, మంచిర్యాల, ములుగు, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ చదవండి: భారీ వర్షాలు, వరదలపై ప్రజలకు సీఎం కేసీఆర్ హెచ్చరిక -
Telangana: మరో మూడు రోజులు భారీ వర్షాలు.. 11 జిల్లాలకు రెడ్ అలెర్ట్
సాక్షి, హైదరాబాద్: గత అయిదు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న తెలంగాణ ప్రజలకు మరో షాక్ తగిలినట్లైంది. రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు పడనున్నట్లు వాతావారణ విభాగం తెలిపింది. దాంతోపాటు ఉత్తర తెలంగాణలోని 11 జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. అసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, వరంగల్ అర్బన్, రూరల్, మహబూబాబాద్, జనగామ జిల్లాల్లో వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. అయితే రానున్న మూడు రోజులు కూడా భారీ వర్షాలు పడనున్న క్రమంలో తెలంగాణలో విద్యాసంస్థల సెలవుల పొడిగింపుపై విద్యాశాఖ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో రాష్ట్రం తడిసి ముద్దయింది. ఊరూ వాడా.. వాగూ వంకా.. ఏరులై పారుతున్నాయి. నది పరివాహక ప్రాంతాలు, ప్రాజెక్టుల వద్ద వరద ఉదృతి ఎక్కువగా ఉండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అనేకచోట్ల జనజీవనం స్తంభించింది. కొన్నిచోట్ల అలుగు దుంకుతున్న చెరువులతో అందాలు జాలువారుతున్నాయి. మరికొన్ని కట్టలు తెగి ఊళ్లను, చేలను ముంచెత్తుతున్నాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మంగళవారం నాటికి రాష్ట్రంలో 49 చెరువులు పూర్తిగా తెగిపోయాయి. మరో 43 చెరువులకు గండ్లు పడ్డాయని అధికారులు చెబుతున్నారు. అలాగే, 25 కాల్వలకు సైతం గండ్లు పడ్డాయి. చదవండి: Photo Feature: దంచికొట్టిన వానలు.. స్తంభించిన రాకపోకలు -
Heavy Rains Forecast: కుండపోత వర్షాలు.. ఈ నగరాలకు రెడ్ అలెర్ట్ జారీ
సాక్షి, బెంగళూరు, ముంబై: నైరుతి రుతుపవనాల ప్రారంభంతో రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ముంబైతో సహా కర్ణాటకలోని కొన్నిజిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. అలాగే తెలంగాణలోనూ శని, ఆది వారాల్లో రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ వర్షాలు గుజరాత్, ఢిల్లీని కూడా తాకనున్నాయని అంచనా వేసింది. మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, కేరళ, మధ్యప్రదేశ్‌లో శనివారం కూడా భారీ వర్షాలు కురవనున్నాయని, అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి భారీ వర్షాలతో నదులు పోటెత్తుతున్నాయి. జలాశయాలు నిండుకుండల్లా మారాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ముంబైలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. జూలై 11 వరకు రాష్ట్రంలోని కొంకణ్ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ సంస్థ హెచ్చరించింది. ఈ సమయంలో కొంకణ్ ప్రాంతంలోని అన్ని జిల్లాలు కుండపోతగా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. చదవండి: సిటీలో రోజంతా వర్షం.. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదు రెడ్ అలెర్ట్ కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ తీరప్రాంతాల్లో కుంభవృష్టి వర్షాలు పడనున్నాయని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. కరావళి(కోస్తా), మలెనాడు, దక్షిణ కన్నడ, కొడగు, శివమొగ్గ, ఉత్తర కన్నడ జిల్లాల్లో వరుణుడు ఉగ్రరూపం దాల్చాడు. ఏడు జిల్లాల పరిధిలో పాఠశాలలకు సెలవులు కొనసాగుతున్నాయి. ఉత్తర కన్నడ జిల్లాలో 91 ఇళ్లకు హాని జరిగింది. కుమటా, హొన్నావర తాలూకాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామ పంచాయతీలో నోడల్ అధికారిని నియమించి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఇన్చార్జ్ మంత్రి కోటా శ్రీనివాసపూజారి తెలిపారు. #Karnataka: Visuals of a hillock slide at Jasoor in Sullia taluk of Dakshina Kannada district.#KarnatakaRains pic.twitter.com/dSZ87i6Fll — TOI Bengaluru (@TOIBengaluru) July 8, 2022 ఉడుపి జిల్లా వ్యాప్తంగా వానలు ఎడతెరిపిలేకుండా కురుస్తున్నాయి. సౌపర్ణిక నది నిండుగా పారుతోంది. బైందూరు తాలూకాలో అధికంగా ఇళ్లు దెబ్బతిన్నాయి. మరవంతె తీర ప్రాంతంలో సముద్రం కోసుకుపోతోంది. పొలాల్లో ఉన్న టెంకాయ చెట్లు సముద్రంలోకి కొట్టుకుపోయాయి. బ్రహ్మావర తాలూకా మడిసాలు హొళె నది ఉగ్రరూపం దాల్చింది. ఉప్పూరు, బెళ్మారులోకి నీరు చేరింది. నీలావర, బావలికుద్రు, కోరాడి, చాక్రోరు ప్రాంతాలలో సీతానది పొంగి ప్రవహిస్తోంది. Effort made by Delivery boys under BPCL Mangalore LPG Territory to deliver LPG cylinders at door step of flood effected area Byndoor Udupi District. #Karnatakarains #Udupi #Mangaluru #HeavyRains #Monsoon2022 pic.twitter.com/A3KRsqQ5Ne — Karnataka Rains⛈️ (@Karnatakarains) July 8, 2022 ఉత్తర కర్ణాటక వాసుల్లో భయం మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో ఉత్తర కర్ణాటక జిల్లావాసుల్లో ఆందోళన నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయం వెంటాడుతోంది. కృష్ణ, భద్రా, కావేరి, నేత్రావతి, తుంగ, వేదగంగ, దూద్గంగ, ఘటప్రభ, మలప్రభ నదీతీర ప్రాంతాల ప్రజల్లో వరద భీతి నెలకొంది. ముంపు పొంచి ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 200 సెంటీమీటర్ల వర్షం కురిసే అవకాశం కార్వార, అంకోలా, హొన్నావర, కుమటా, భట్కళ, శిరసి, సిద్ధాపుర, జోయ్యా తాలూకాల పరిధిలో అంగనవాడీ, పాఠశాల, కాలేజీలకు సెలవు ప్రకటించారు. వచ్చే ఐదు రోజుల్లో 200 సెంటీమీటర్ల వాన కురిసే అవకాశం ఉన్నట్లు కర్ణాటక నైసర్గిక వికోప కేంద్రం విశ్రాంత విశేష డైరెక్టర్ వీఎస్ ప్రకాశ్ తెలిపారు. మలెనాడు భాగంలో 150 సెంటీమీటర్లకు పైగా వానలు పడ్డాయని తెలిపారు. కల్యాణ కర్ణాటక భాగంలో ఐదు రోజుల్లో 40 సెంటీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నీటిలో కొట్టుకుపోయిన కారు బెళగావి జిల్లాలో భారీగా పడుతున్న వానలతో అథణి తాలూకా రెడ్డికట్టి గ్రామం వద్ద ప్రవాహిస్తున్న కాలువలో కారు పడింది. కారులోని ఇద్దరు మహదేవ చిగరి (26), సురేశ్ బడచ (27) మృతి చెందగా, శ్రీకాంత్ అనేవ్యక్తి గాయపడి బయటపడ్డారు. అదనంగా రూ.55 కోట్ల విడుదల:మంత్రి అశోక్ వరదలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రెవెన్యూ మంత్రి, విపత్తు నిర్వహణా ప్రాధికార ఉపాధ్యక్షుడు ఆర్.అశోక్ తెలిపారు. వర్షాలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో పరిహారం, పునరావాసం తదితర పనులకు అదనంగా రూ.55 కోట్లు విడుదల చేశామన్నారు. మడికేరి, దక్షిణ కన్నడ జిల్లాల్లో ఆయన పర్యటించి వర్షంతో దెబ్బతిన్న ప్రాంతాలను, భూకంపం జరిగిన ప్రాంతాలను పరిశీలించారు. సహాయక చర్యలు చేపట్టండి∙: సీఎం బొమ్మై వర్ష ప్రభావిత ప్రాంతాల్లో తక్షణం సహాయక చర్యలు తీసుకోవాలని సీఎం బొమ్మై అధికారులను ఆదేశించారు. శుక్రవారం ముఖ్యమంత్రి నివాస కార్యాలయం కృష్ణా నుంచి ఆయన కలెక్టర్లు, జెడ్పీ సీఈఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రాణహాని జరగకుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపాలన్నారు. మంత్రులు వారి వారి జిల్లాల్లో మకాం వేసి పరిస్థితిని సమీక్షించాలన్నారు. -
మహారాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు.. మూడు రోజులపాటు ఇలాగే
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో నేటి (జూలై 6) నుంచి 8 వరకు భారీ వర్షాలు కురవనున్నట్లు భారత వాతావరణ శాఖ బుధవారం వెల్లడించింది. దీంతో ఐఎండీ శుక్రవారం వరకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.ఇప్పటికే ముంబై సహా రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక పట్టణాలు, గ్రామాలు, పల్లెలు, లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ముంబై రహదారులపై, సబ్ వేలలో వర్షపు నీరు చేరడంతో వాహనాలను దారిమళ్లించాల్సి వస్తోంది. సోమవారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమైన వర్షాలు తెరిపిలేకుండా కురుస్తున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైసహా తూర్పు, పశ్చిమ ఉప నగరాలలో గత 24 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ఇరుకు రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అంధేరీ, సైన్, చెంబూర్, కుర్లా తదితర ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు చేరడంతో అనేక చోట్ల వాహనాలను దారి మళ్లించారు. న్యూ ముంబైలోని ఖాందేశ్వర్ రైల్వే స్టేషన్ టికెట్ బుకింగ్ కౌంటర్ జలమయమైంది. సాన్‌పాడా రైల్వే స్టేషన్ దిశగా వెళ్లే రోడ్డుపై వర్షపు నీరు చేరడంతో ఆటోలు ముందుకు వెళ్లలేకపోయాయి. దీంతో ప్రయాణికులు కాలినడకన ముందుసాగారు. ముంబై, థానే, ఉప నగరాల్లో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించడంతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే సూచించారు. నదులు, చెరువులు, నాలాల పరీవాహక ప్రాంతాలపై నిఘా వేయాలని అధికారులను ఆదేశించారు. ఐఎండీ హెచ్చరికల ప్రకారం సముద్రంలో మూడు రోజులపాటు హై టైడ్ ఉంటుంది. పెద్దపెద్ద అలలు ఉవ్వెత్తున ఎగసిపడే ప్రమాదముంది. దీంతో జనాలు సముద్ర తీరాలకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. పర్యాటకుల కష్టాలు.. 24 గంటల నుంచి తెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పంచ్గంగాలో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోయింది. సోమవారం సాయంత్రం వరకు ఈ నదిపై ఉన్న రాజారాం డ్యాంలో నీటి మట్టం 16 అడుగుల మేర పెరిగింది. కాని మంగళవారం ఉదయం ఈ నీటి మట్టం ఏకంగా 24 అడుగులకు చేరింది. డ్యాంలో నీటి మట్టం ఒక్కసారిగా పెరిగిపోవడంతో తిలకించేందుకు వచ్చే పర్యాటకుల సంఖ్య పెరిగింది. కాని భారీవర్షం కారణంగా అనేక మంది పర్యాటకులు డ్యాం పరిసరాల్లో చిక్కుకున్నారు. రెస్క్యు టీం పర్యాటకులందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా కొల్హాపూర్ సిటీసహా జిల్లా లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొల్హాపూర్ వాసులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. మరఠ్వాడాలోనూ వానలే వానలు.. మరఠ్వాడలోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఔరంగాబాద్, జాల్నా, పర్భణీ, నాందేడ్, హింగోళి, లాతూర్, బీడ్, ఉస్మానాబాద్ జిల్లాలో భారీ వర్షాలతోపాటు గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నా యి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఈదురు గాలుల వల్ల అనేక చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. విద్యుత్ వైర్లు తెగిపోవడంతో అనేక గ్రామాల్లో కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఒకపక్క వర్షం, మరోపక్క విద్యుత్ సరఫరాలేక ప్రజలు అంధకారంలోనే గడుపుతున్నారు. అయితే జూన్‌లో పత్తాలేకుండా పోయిన వర్షాలు జూలై ఆరంభంలోనే కురుస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దుక్కిదున్ని, విత్తనాలు నాటేందుకు సిద్ధమవుతున్నారు. వాగులు ఉధృతంగా ప్రవహించడంతో అనేక చోట్ల చెక్ డ్యాంలు కనిపించకుండా పోయాయి. చిన్న చిన్న వంతెనల మీదుగా నీరు ప్రవహిస్తోంది. దీంతో కొన్ని గ్రామాలకు బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయా యి. రవాణా సౌకర్యాలు లేక ఎక్కడివారు అక్కడే ఉండిపోయారు. అయితే ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. భారీ వర్షాల కారణంగా మంగళవారం సీఎస్ఎంటీలో రైళ్లు ఆలస్యం కావడంతో ఫ్లాట్‌ఫాంకు అటూఇటూ భారీగా నిలిచిపోయిన ప్రజలు -
పగలూ రాత్రీ సెగలే..వాతావరణశాఖ హెచ్చరిక..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండటానికి తోడు వడగాడ్పులు, తీవ్ర ఉక్కపోతతో జనం కుతకుతలాడుతున్నారు. రాత్రిపూట కూడా ఉక్కపోతగా ఉంటుండటంతో ఇబ్బందిపడుతున్నారు. సాధారణంగా మే నెలలో మధ్యలో ఉష్ణోగ్రతలు అధిక స్థాయికి చేరుతాయి. కానీ నెల ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. శనివారం నల్లగొండ, మెదక్, ఆదిలాబాద్‌లలో 43 డిగ్రీలకుపైనే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడం గమనార్హం. రాష్ట్రంలో పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయని.. మరో ఐదు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. వడగాడ్పులతో జాగ్రత్త..: ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతుండటంతో పలు ప్రాంతాల్లో వడగాడ్పులు వీస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. మరో ఐదు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలకు తోడు వడగాడ్పుల తీవ్రత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. జనం పగటి పూట దూరప్రయాణాలు మానుకోవాలని.. వృద్ధులు, పిల్లలు బయటికి రాకపోవడమే మంచిదని సూచించింది. వడగాడ్పులు, ఎండ వేడిమి కారణంగా తలెత్తే అనారోగ్యాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. దీనికి సంబంధించి వైద్యారోగ్యశాఖ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తూ ఇప్పటికే ఎన్సీడీసీ (నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్) ఏప్రిల్‌లోనే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు పంపింది. ఉష్ణోగ్రతల కారణంగా ఎదురయ్యే అనారోగ్యాలకు సంబంధించిన జాతీయ కార్యాచరణ (నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ హీట్ రిలేటెడ్ ఇల్నెస్)లోని అంశాలపై ప్రభుత్వ శాఖలు విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించింది. పలుచోట్ల ఈదురుగాలుల వానలు తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి స్థిరంగా కొనసాగుతోందని.. దాని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూడు రోజులపాటు అక్కడక్కడా తేలికపాటి వానలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆయాచోట్ల ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలులు వీస్తాయని వివరించింది. -
భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ!
ముంబై : భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ముంబై, థానే, రత్నగిరి జిల్లాలకు రెడ్ అలెర్టు జారీ చేసింది. ముంబైలో శుక్రవారం ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే పలు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. తాజాగా ముంబై పరిసర ప్రాంతాల్లో శనివారం కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే 24 గంటల్లో పాల్గఢ్, ముంబై, రత్నగిరి, రాయ్‌గఢ్, థానేలలో నేడు కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని, మరికొన్ని చోట్ల కూడా అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. (ముంబైకి భారీ వర్ష సూచన) అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించింది. కనీసం రెండు రోజులు ట్రాఫిక్, విద్యుత్ సరాఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. కాగా శుక్రవారం కురిసిన వర్షాలకే ముంబై మహా నగరం అతలాకుతలం అయింది. ఉదయం 8.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు కుండపోత వాన పడటంతో 161.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంతేగాక కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై నీరు చేరడంతో ట్రాఫిక్ స్తంభించడంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. (పిడుగుల బీభత్సం.. 31 మంది మృతి) -
పిడుగుపాటుకు గురై 22 మంది మృతి
పాట్నా : బిహార్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు గత 24 గంటల వ్యవధిలో పిడుగుపాటుకు గురై 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం ప్రకటన విడుదల చేసింది. వేర్వేరు ప్రాంతాల్లో పిడుగులు పడిన ఘటనల్లో వీరు మృతి చెందినట్లు పేర్కొంది. రానున్న మూడు రోజుల్లో అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేసింది. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయే అవకాశం ఉందని ఐఎండీ సీనియర్ శాస్త్రవేత్త ఆర్కె జెనమని అన్నారు. భారీ వర్ష సూచన నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అధికారులను ఆదేశించారు. (పెరిగిన అసోం వరదల మృతులు ) Over the next 3 days, heavy to very heavy rainfall warning has been given to Assam, Meghalaya, Arunachal Pradesh, Bihar, Sub-Himalayan West Bengal and Sikkim. There are also chances of flooding so we have informed State and the central govt: RK Jenamani, Senior Scientist, IMD pic.twitter.com/dP2BGAzUbI — ANI (@ANI) June 25, 2020 -
హెచ్చరిక : భారీ నుంచి అతిభారీ వర్షాలు..!
సాక్షి, అమరావతి : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో.. రానున్న మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ బంగాళాఖాతానికి ఆనుకుని నైరుతి బంగాళాఖాతం ప్రాంతంలో 5.8 కిలోమీటర్ల ఎత్తులో అల్పపీడన ద్రోణి విస్తరించి ఉందని పేర్కొంది. రానున్న 24 గంటల్లో వాయువ్యం దిశగా కదిలి ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరంలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ముఖ్యంగా ఈరోజు (మంగళవారం), రేపు (బుధవారం) భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. (చదవండి : ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలు) కర్ణాటక కోస్తా ప్రాంతంలో కూడా దీని ప్రభావం ఉంటుందని, 23, 24 తేదీల్లో అక్కడ కూడా ఉరుములు, మెరుపులతో వర్షాలు కురస్తాయని ఐఎండీ అధికారులు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండీ సూచించింది. ఇక వచ్చే నాలుగు రోజులపాటు ద్వీపకల్ప భారతంలో కూడా వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. తూర్పు, ఈశాన్య భారతంలో ఈనెల 24 25న వర్షాలు కురుస్తాయని తెలిపింది. మధ్య భారతంలో వచే మూడు రోజులు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరోవైపు బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీయ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తాయని ఆర్టీజీఎస్ హెచ్చరించింది. మంగళవారం నుంచి చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. మిగిలిన జిల్లాలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది. (చదవండి : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు) -
ఉత్తరాదిన ఉప్పొంగుతున్న నదులు
సిమ్లా/డెహ్రాడూన్/చండీగఢ్:/న్యూఢిల్లీ: ఉత్తరాదిన వానలు దంచికొడుతున్నాయి. గంగా, యమున, సట్లెజ్ నదులు పొంగి ప్రవహిస్తుండటంతో జలాశయాలు కళకళలాడుతున్నాయి. హిమాచల్, ఉత్తరాఖండ్, పంజాబ్, హరియాణాల్లో వర్షాల కారణంగా జరిగిన వివిధ ఘటనల్లో 37 మంది చనిపోయారు. అత్యధికంగా హిమాచల్‌లో 25 మంది మృతి చెందారు. మరో 24 గంటలపాటు వానలు కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రక్షణ, సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, వైమానిక దళం చురుగ్గా పాల్గొంటున్నాయి. ఎన్నడూలేని విధంగా భాక్రా జలాశయం ఈ ఏడాది ముందుగానే నిండింది. హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా, కంగ్రా, కుల్లు జిల్లాల్లో సోమవారం మరో ముగ్గురు చనిపోవడంతో భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో జరిగిన వివిధ ఘటనల్లో మృతి చెందిన వారి సంఖ్య 25కు చేరుకుంది. శనివారం నుంచి కురుస్తున్న వానలతో పెద్ద సంఖ్యలో ఇళ్లు కూలడంతోపాటు, కొండచరియలు విరిగిపడటంతో చిక్కుకుపోయిన 500 మందిని ఎన్డీఆర్ఎఫ్ సురక్షిత ప్రాంతాలకు తరలించింది.. పంజాబ్ ప్రభుత్వం హైఅలర్ట్ విడవని వానల కారణంగా యమునా నది ఉప్పొంగడంతో పంజాబ్, హరియాణాల్లోనూ వరద ప్రమాదం పొంచి ఉండటంతో యంత్రాంగం అప్రమత్తమయింది. కర్నాల్ జిల్లాలో వరదల్లో చిక్కుకుపోయిన స్త్రీలు, చిన్నారులు సహా 9 మందిని ఐఏఎఫ్ బృందాలు కాపాడాయి. రోపార్ ప్రాజెక్టు నుంచి వరదను విడుదల చేయడంతో దిగువన ఉన్న షాకోట్, నకోదర్, ఫిల్లౌర్ జిల్లాల యంత్రాంగాలను అప్రమత్తం చేశారు. అలాగే, సట్లెజ్ నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో జలంధర్ జిల్లాలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు. వచ్చే 48 నుంచి 72 గంటల వరకు భారీ వర్ష సూచన ఉండటంతో పంజాబ్ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ఉత్తరాఖండ్‌లో ఆగిన వాన హిమాచల్‌ప్రదేశ్– ఉత్తరాఖండ్ సరిహద్దుల్లోని ఉత్తరకాశీ జిల్లాలో సోమవారం ఒక్కరోజే 9 మృతదేహాలు బయటపడటంతో రాష్ట్రంలో వానల కారణంగా జరిగిన సంఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన వారిసంఖ్య 12కు చేరుకుంది. హరిద్వార్ వద్ద ప్రమాదస్థాయిని మించి, రిషికేశ్ వద్ద ప్రమాదస్థాయికి చేరువలో గంగ ప్రవహిస్తోంది. వరదల్లో పదుల సంఖ్యలో గ్రామాలు చిక్కుకుపోగా వరి, చెరకు పంటలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. నదీ తీరం వెంట ఉన్న 30 గ్రామాల వారిని అప్రమత్తం చేశామని, వరద తీవ్రత పెరిగితే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని యంత్రాంగం తెలిపింది. ఢిల్లీకి వరద ముప్పు యమునా నది హెచ్చరిక స్థాయిని మించి ప్రవహిస్తుండటంతో దేశ రాజధాని ఢిల్లీ యంత్రాంగం అప్రమత్తమయింది. వరద పరిస్థితిని అంచనా వేసేందుకు, ఏర్పాట్లను సమీక్షించేందుకు సీఎం కేజ్రీవాల్ అన్ని శాఖల అధికారులతో భేటీ అయ్యారు. సోమవారం యమునా నీటి మట్టం 204.7 మీటర్లకు చేరుకుంది. హరియాణాలోని హతినికుండ్ జలాశయం నుంచి 8.28 క్యూసెక్కుల నీటిని సోమవారం విడుదల చేయనుండటంతో మంగళవారం ఉదయానికి నీటిమట్టం 207 మీటర్లకు పెరిగే అవకాశం ఉంది. ముంపు ప్రాంతాల ప్రజలను పోలీసులు, పౌర రక్షక దళాల సాయంతో ఖాళీ చేయించాలని సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్లకు ఆదేశాలు జారీ చేసింది. యమున ఉధృతంగా ప్రవహిస్తుండటంతో దిగువ ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఢిల్లీ ప్రభుత్వం ప్రజలను కోరింది.