IPL 2025
-
వేలంలోకి లేటుగా వచ్చేశాడు.. కట్ చేస్తే! రూ. 12.50 కోట్లు కొట్టేశాడు
ఐపీఎల్-2025 మెగా వేలంలో ఇంగ్లండ్ స్టార్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌పై కాసుల వర్షం కురిసింది. వేలానికి ఒక్క రోజు ముందు ఎంట్రీ ఇచ్చిన ఆర్చర్ అనూహ్యంగా భారీ ధరకు అమ్ముడుపోయాడు. ఆర్చర్‌ను రూ. 12.50 కోట్ల భారీ ధరకు రాజస్తాన్ కొనుగోలు చేసింది.రూ. 2 కోట్ల కనీస ధరతో వచ్చిన జోఫ్రా కోసం తొలుత లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ పోటీ పడ్డాయి. ఆ తర్వాత పోటీలోకి రాజస్తాన్ రాయల్స్ ఎంట్రీ ఇచ్చింది. ఆఖరికి ముంబై ఇడియన్స్, ఎల్ఎస్జీ పోటీ నుంచి తప్పుకోవడంతో ఆర్చర్‌ను రాజస్తాన్ సొంతం చేసుకుంది.ఆర్చర్ గత సీజన్లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. కాగా ఈ ఆక్షన్ కోసం బీసీసీఐ తొలుత షార్ట్ లిస్ట్ చేసిన జాబితాలో ఆర్చర్‌కు చోటు దక్కలేదు. ఆ తర్వాత ఇంగ్లండ్ నుంచి ఎన్వోసీ మంజారు కావడంతో ఆఖరినిమిషంలో ఆర్చర్ పేరును వేలంలోకి బీసీసీఐ చేర్చింది. ఐపీఎల్లో ఇప్పటివరకు 40 మ్యాచ్‌లు ఆడిన ఆర్చర్ 48 వికెట్లు పడగొట్టాడు. -
వెంకటేష్ అయ్యర్‌కు జాక్ పాట్.. ఏకంగా రూ. 23.75 కోట్లు
ఐపీఎల్-2025 మెగా వేలంలో టీమిండియా ఆల్‌రౌండర్ వెంకటేష్ అయ్యర్ ఊహించని ధర పలికాడు. అయ్యర్‌ను ఏకంగా రూ. 23.75 కోట్ల భారీ ధరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ కొనుగోలు చేసింది. రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అయ్యర్ కోసం కేకేఆర్, ఆర్సీబీ నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డాయి. ఆఖరికి ఆర్సీబీ పోటీ నుంచి తప్పుకోవడంతో అయ్యర్‌ను కోల్‌కతా సొంతం చేసుకుంది. గత సీజన్లో కూడా వెంకటేష్ అయ్యర్ కేకేఆర్కే ప్రాతినిథ్యం వహించాడు. అయితే వేలానికి ముందు అతడిని కేకేఆర్ రిటైన్ చేసుకోలేదు.కాగా వెంకటేష్ అయ్యర్ ఐపీఎల్-2021 సీజన్లో కేకేఆర్ తరపునే అరంగేట్రం చేశాడు. తొలుత అతడిని రూ.20లక్షలకు కేకేఆర్ కొనుగోలు చేసింది. అద్బుతంగా రాణించడంతో 2022 వేలానికి ముందు రూ. 8 కోట్లకు అయ్యర్‌ను రిటైన్ చేసుకుంది.ఆ తర్వాత రెండు సీజన్ల పాటు తమ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన వెంకటేష్‌ను ఐపీఎల్-2025 వేలంలోకి కేకేఆర్ విడిచిపెట్టింది. మళ్లీ ఇప్పుడు ఏకంగా 23.75 కోట్లు వెచ్చించి మరి కొనుగోలు చేసింది. ఐపీఎల్లో వెంకటేష్ ఇప్పటివరకు 50 మ్యాచ్‌లు ఆడి 1326 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఓసెంచరీ, 11 అర్ధ సెంచరీలు ఉన్నాయి, -
IPL 2025: కేఎల్ రాహుల్‌కు భారీ షాక్..
ఐపీఎల్-2025 మెగా వేలంలో టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్‌కు షాక్ తగిలింది. భారీ ధరకు అమ్ముడుపోతాడనుకున్న రాహుల్‌ను నామమాత్రపు ధరకే ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. రూ. 14 కోట్లకు రాహుల్‌ను ఢిల్లీ సొంతం చేసుకుంది.రూ. 2 కోట్ల కనీస ధరతో ఈ వేలంలో వచ్చిన రాహుల్ కోసం తొలుత రాయల్ ఛాలెంజర్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ పోటీ పడ్డాయి. ఈ రెండు ఫ్రాంచైజీలు అతడిని దక్కించుకోవడానికి ప్రయత్నించాయి. అయితే మధ్యలో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఎంట్రీ ఇచ్చాయి. దీంతో ఆర్సీబీ, కేకేఆర్ వెనక్కి తగ్గాయి. అయితే ఆఖరికి సీఎస్కే కూడా పోటీ నుంచి తప్పుకోవడంతో రాహుల్ ఢిల్లీ సొంతమయ్యాడు. అతడికి ఢిల్లీ క్యాపిటల్స్ తమ జట్టు పగ్గాలను అప్పగించే అవకాశముంది. కాగా ఈ వేలంలో ఆర్సీబీ రాహుల్‌ను కొనుగోలు చేస్తుందని జోరుగా ప్రచారం సాగింది. కానీ వేలంలో మాత్రం అతడికి కోసం ఆర్సీబీ ప్రయత్నించలేదు.కాగా ఐపీఎల్-2022 నుంచి 2024 వరకు రాహుల్ లక్నో కెప్టెన్‌గా వ్యవహరించాడు. రెండుసార్లు ఆ జట్టును ప్లే ఆఫ్స్చేర్చాడు. కానీ అతడిని ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు లక్నో రిటైన్ చేసుకోలేదు. అందుకు జట్టు యాజమాని సంజీవ్ గోయెంకాతో విభేదాలే కారణమని వార్తలు వినిపించాయి.కాగా ఐపీఎల్లో రాహుల్‌కు మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు 132 మ్యాచ్‌లు ఆడిన రాహుల్.. 45.47 సగటుతో 4683 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 37 హాఫ్ సెంచరీలు, 4 సెంచరీలు ఉన్నాయి.చదవండి: Yuzvendra Chahal: వేలంలో చహల్‌కు కళ్లు చెదిరే ధర.. జాక్‌పాట్ కొట్టేశాడు -
ఎస్ఆర్హెచ్లోకి మహ్మద్ షమీ.. రూ.10 కోట్లకు సొంతం
ఐపీఎల్-2025 మెగా వేలంలో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీపై కాసుల వర్షం కురిసింది. మహ్మద్ షమీని రూ. 10 కోట్ల భారీ ధరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. రూ.2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన షమీ కోసం తొలుత కోల్‌కతా నైట్‌రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ పోటీ పడ్డాయి. అయితే ఆఖరికి కేకేఆర్, సీఎస్కే పోటీ నుంచి తప్పుకోవడంతో ఈ స్టార్ బౌలర్‌ను ఎస్ఆర్హెచ్ సొంతం చేసుకుంది. కాగా షమీ గతంలో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. అయితే అతడిని ఈ మెగా వేలానికి ముందు గుజరాత్ రిటైన్ చేసుకోలేదు.ఈ మెగా వేలంలో అతడిని తిరిగి సొంతం చేసుకోవడానికి ఆర్‌టీమ్ ఆప్షన్ ఉన్నప్పటకి గుజరాత్ సముఖత చూపలేదు. దీంతో అతడు సన్‌రైజర్స్ సొంతంమయ్యాడు. ఇక దాదాపు ఏడాది తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన షమీ అదరగొడుతున్నాడు. ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బెంగాల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. -
ఐపీఎల్-2025 మెగా వేలం లైవ్ అప్డేట్స్..
-
చరిత్ర సృష్టించిన భువనేశ్వర్.. బుమ్రాకు కూడా సాధ్యం కాలేదు
టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్లో 300 వికెట్ల మైలు రాయిని అందుకున్న తొలి భారత ఫాస్ట్ బౌలర్‌గా భువీ రికార్డు సృష్టించాడు. భువీ ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో ఉత్తరప్రదేశ్‌కు సారథ్యం వహిస్తున్నాడు.ఈ క్రమంలో శనివారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్ యష్ ధుల్‌ను ఔట్ చేసిన భువీ.. ఈ అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు 287 టీ20 మ్యాచ్‌లు ఈ వెటరన్ ఫాస్ట్ బౌలర్ మొత్తం 300 వికెట్లు పడగొట్టాడు. ఇక ఓవరాల్‌గా ఈ ఘనత అందుకున్న మూడో భారత బౌలర్‌గా భువనేశ్వర్ నిలిచాడు.టీ20 ఫార్మాట్లో భువీ కంటే ముందు భారత స్పిన్నర్లు యుజ్వేంద్ర చాహల్ (354), పీయూష్ చావ్లా (314), ఆర్ అశ్విన్ (310)లు ఈ ఫీట్‌ను సాధించారు. కానీ ఫాస్ట్ బౌలర్లలో మాత్రం భువీ తప్ప మిగితా ఎవరూ ఈ ఫీట్ సాధించలేకపోయారు.అయితే భువీ తర్వాతి స్ధానంలో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఉన్నాడు. 300 వికెట్ల మైలు రాయిని చేరుకోవడానికి బుమ్రా 5 వికెట్ల దూరంలో ఉన్నాడు. బమ్రా ఇప్పటివరకు 233 మ్యాచ్‌లు ఆడి 295 వికెట్లు పడగొట్టాడు.చదవండి: IPL 2025: సచిన్ కొడుకుకు చుక్కలు చూపించారు? వేలంలో ఎవరైనా కొంటారా? -
సన్‌రైజర్స్ వదిలేసింది. . కట్ చేస్తే! అక్కడ సిక్సర్ల వర్షం
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో జమ్మూ కాశ్మీర్ శుభరంభం చేసింది. ఈ టోర్నీలో భాగంగా ముంబై వేదికగా జార్ఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 25 పరుగుల తేడాతో జమ్మూ కాశ్మీర్ విజయం సాధించింది. 225 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జార్ఖండ్ 9 వికెట్లు కోల్పోయి 199 పరుగుల మాత్రమే చేయగల్గింది.జమ్మూ బౌలర్లలో అబిడ్ ముస్తాక్ 4 వికెట్లతో సత్తాచాటాడు. అతడితో పాటు రషీక్ ధార్ సలీం, మురగన్ అశ్విన్ తలా రెండు వికెట్లు సాధించారు. జార్ఖండ్ బ్యాటర్లలో ఉత్క్రాష్ సింగ్(54), పంకజ్ కిషోర్ కుమార్(56) హాఫ్ సెంచరీలతో మెరిశారు. అయితే మిగితా ఆటగాళ్లు రాణించకపోవడంతో జార్ఖండ్ ఓటమి చవిచూసింది.అబ్దుల్ సమద్ విధ్వంసం..ఇక తొలుత బ్యాటింగ్ చేసిన జమ్మూ కాశ్మీర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 224 పరుగుల భారీ స్కోర్ సాధించాడు. జమ్మూ బ్యాటర్లలో ఆల్‌రౌండర్ అబ్దుల్ సమద్ విధ్వంసం సృష్టించాడు. ఆరో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సమద్ అద్బుతమైన ఫినిషింగ్ ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 29 బంతులు మాత్రమే ఎదుర్కొన్న సమద్ 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 74 పరుగులు చేశాడు. అతడితో పాటు కమ్రాన్ ఇక్బాల్(61) హాఫ్ సెంచరీతో రాణించాడు.సమద్‌ను వదిలేసిన సన్‌రైజర్స్..కాగా ఐపీఎల్లో అబ్దుల్ సమద్ గత కొన్ని సీజన్లగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించాడు. కానీ ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు అతడిని ఎస్ఆర్హెచ్ రిటైన్ చేసుకోలేదు. దీంతో అతడు వేలంలోకి వచ్చాడు. అయితే అతడికి అద్బుతమైన హిట్టింగ్ స్కిల్స్ ఉండడంతో వేలంలో భారీ ధర దక్కినా ఆశ్చర్యపోనక్కర్లలేదు.చదవండి: IND vs AUS: చరిత్ర సృష్టించిన జైశ్వాల్.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా -
రిషబ్ పంత్‌కు రూ.33 కోట్లు.. సొంతం చేసుకున్న పంజాబ్ కింగ్స్!?
ఐపీఎల్-2025 సీజన్ మెగా వేలానికి సర్వం సిద్దమైంది. నవంబర్ 24, 25వ తేదీల్లో సౌథీ అరేబియాలోని జెడ్డా నగరంలో ఈ క్యాష్ రిచ్ లీగ్ మెగా వేలం జరగనుంది. ఈ మెగా వేలం కోసం మొత్తం అన్ని ఫ్రాంచైజీలు ఇప్పటికే జెడ్డాకు చేరుకున్నాయి. ఈ ఆక్షన్‌లో అనుసరించాల్సిన వ్యూహాలను ఆయా ఫ్రాంచైజీలు సిద్దం చేసుకున్నాయి. మరోవైపు రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, జోస్ బట్లర్, శ్రేయస్ అయ్యర్ వంటి స్టార్ క్రికెటర్లు ఈ వేలంలో భాగం కావడంతో అభిమానులు సైతం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ మెగా వేలానికి ఒక్క రోజు ముందు అధికారిక బ్రాడ్‌కాస్టర్ జియో సినిమా "మెగా వేలం వార్ రూమ్" పేరిట ఓ కార్యక్రమం నిర్వహించింది. "మెగా వేలం వార్ రూమ్‌లో క్రికెట్ ఎక్స్పర్ట్స్ సంజయ్ బంగర్, ఆకాష్ చోప్రా, సురేష్ రైనా, రాబిన్ ఉతప్ప, ఇయాన్ మోర్గాన్, దీప్ దాస్ గుప్తా, ఎస్ బద్రీనాథ్, హనుమా విహారీ, అభినవ్ ముకుంద్,మైక్ హెస్సన్‌లు మొత్తం పాల్గోనున్నారు. ఒక్కొక్కరు ఒక్కో ఫ్రాంచైజీ ప్రతినిధులగా వ్యవహరించారు.రిషబ్ పంత్‌కు రూ.33 కోట్లు!ఇక "మెగా వేలం వార్ రూమ్"లో టీమిండియా స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ భారీ ధర పలికాడు. పంత్‌ను పంజాబ్ కింగ్స్ ఏకంగా రూ.33 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకుంది. పంత్ కోసం కేకేఆర్, పంజాబ్ కింగ్స్ ఆఖరి వరకు తీవ్రంగా పోటీ పడ్డాయి. కానీ పంజాబ్‌కు ప్రతినిథిగా వ్యహరించిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఏ మాత్రం వెనక్కుతగ్గలేదు. చివరికి కేకేఆర్ పోటీ నుంచి తప్పుకోవడంతో పంత్ పంజాబ్ సొంతమయ్యాడు. కాగా రియల్ వేలంలో పంత్ తన కనీస ధరను రూ. 2 కోట్లగా నమోదు చేసుకున్నాడు. అయితే పంత్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉండడంతో ఈ వేలంలో కాసుల వర్షం కురిసే అవకాశముంది. పంత్‌కు ఐపీఎల్లో మెరుగైన రికార్డు ఉంది. ఐపీఎల్లో ఇప్పటివరకు 111 మ్యాచ్‌లు ఆడిన ఈ ఢిల్లీ చిచ్చర పిడుగు 148.93 స్ట్రైక్ రేట్‌తో 3284 పరుగులు చేశాడు. ఈ ఏడాది సీజన్లో కూడా పంత్ సత్తాచాటాడు. 13 మ్యాచ్‌ల్లో 40 సగటుతో 446 పరుగులు చేశాడు.చదవండి: IND vs AUS: చరిత్ర సృష్టించిన జైశ్వాల్.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా -
సచిన్ కొడుకుకు చుక్కలు చూపించారు? వేలంలో ఎవరైనా కొంటారా?
ఈ ఏడాది రంజీ ట్రోఫీలో అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన సచిన్ టెండూల్కర్ తనయుడు, గోవా ఆల్‌రౌండర్ అర్జున్ టెండూల్కర్.. టీ20ల్లో మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోతున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ-2024 ట్రోఫీలో భాగంగా హైదరాబాద్ వేదికగా ముంబైతో జరిగిన మ్యాచ్‌లో అర్జున్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. అతడి బౌలింగ్‌ను ముంబై బ్యాటర్లు ఊతికారేశారు. ముఖ్యంగా ముంబై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అయితే అర్జున్ను ఊచకోత కోశాడు. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌలింగ్ చేసిన జూనియర్ టెండూల్కర్.. 12.00 ఏకానమీతో ఏకంగా 48 పరుగులు సమర్పించుకున్నాడు. కనీసం ఒక్క వికెట్ కూడా అర్జున్ సాధించలేకపోయాడు.అర్జున్ అమ్ముడుపోతాడా?ఈ క్రమంలో నవంబర్ 24, 25వ తేదీల్లో జరిగే ఐపీఎల్-2025 మెగా వేలంలో అర్జున్ అస్సలు అమ్ముడు పోతాడా అన్నది ప్రశ్నర్ధాకంగా మారింది. అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్-2023, 2024 సీజనల్లో ముంబై ఇండియన్స్ ప్రాతినిథ్యం వహించాడు. ఈ రెండు సీజన్లలో మొత్తంగా ఐదు మ్యాచ్‌లు ఆడిన అర్జున్.. కేవలం మూడు వికెట్లు మాత్రమే సాధించగలిగాడు.దీంతో ఈసారి అతడిని ముంబై కూడా కొనుగోలు చేసే సూచనలు కన్పించడం లేదు. ఈ వేలంలో రూ. 30 లక్షల కనీస ధరగా నమోదు చేసుకున్న అర్జున్.. ఈసారి అమ్ముడుపోకపోయినా ఆశ్చర్యపోన్కర్లేదు.శ్రేయస్ అయ్యర్ ఊచకోత.. ఇక ఈ మ్యాచ్‌లో గోవాపై 26 పరుగుల తేడాతో ముంబై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 250 పరుగులు చేసింది. ముంబై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(130) సెంచరీతో మెరిశాడు. అనంతరం లక్ష్య చేధనలో గోవా 8 వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసింది. గోవా బ్యాటర్లలో సుయాష్ ప్రభుదేశాయ్(52) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ముంబై బౌలర్లలో రాయ్స్టన్ ద్యాస్, సూర్యన్ష్ షెడ్గే తలా రెండు వికెట్లు పడగొట్టగా.. ములానీ, శార్ధూల్ ఠాకూర్, మొహిత్ తలా వికెట్ సాధించారు.చదవండి: IND vs AUS: చరిత్ర సృష్టించిన జైశ్వాల్.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా -
ఆఖరి నిమిషంలో వేలంలోకి ఎంట్రీ ఇచ్చిన డేంజరస్ బౌలర్
ఐపీఎల్-2025 మెగా వేలానికి సర్వం సిద్దమైంది. సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో నవంబర్ 24, 25 తేదీల్లో ఈ క్యాష్ రిచ్ లీగ్ వేలాన్ని నిర్వహించనున్నారు. అయితే ఆఖరి నిమిషంలో ఈ మెగా వేలంలోకి ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ జోఫ్రా ఆర్చర్ ఎంట్రీ ఇచ్చాడు.ఈ ఆక్షన్ కోసం బీసీసీఐ తొలుత షార్ట్ లిస్ట్ చేసిన జాబితాలో ఆర్చర్‌కు చోటు దక్కలేదు. గత కొంత కాలంగా గాయాలతో సతమతవుతున్న ఆర్చర్‌కి ఐపీఎల్లో ఆడేందుకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తొలుత అనుమతి ఇవ్వలేదు. దీంతో అతడిని బీసీసీఐ పరిగణలోకి తీసుకోలేదు.కానీ ఇప్పుడు ఆర్చర్ ఈసీబీతో చర్చించినట్లు తెలుస్తుంది. అతడికి ఐపీఎల్లో ఆడేందుకు ఈసీబీ ఎన్వోసీ మంజారు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఐపీఎల్ మెగా వేలంలో 576వ ఆటగాడిగా ఆర్చర్‌ను బీసీసీఐ చేర్చింది.అయితే భారత క్రికెట్ బోర్డు అతడి బేస్ ప్రైస్‌ను మాత్రం వెల్లడించలేదు. అతడు రూ. 2 కోట్ల కనీస ధర ఉన్న సెట్లో ఉండే అవకాశముంది. ఈ ఇంగ్లండ్ ప్రీమియర్ బౌలర్ గత సీజన్లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు.ఇక ఆర్చర్‌తో పాటు యూఎస్ఎ స్టార్ బౌలర్ సౌరభ్ నేత్రావల్కర్, బరోడా ఆల్‌రౌండర్ హార్దిక్ తమోర్ కూడా వేలం జాబితాలోకి బీసీసీఐ చేర్చింది. మరోవైపు భారత ఆల్‌రౌండర్ దీపక్ హుడాను అనుమానిత బౌలింగ్ జాబితాలో బీసీసీఐ చేర్చింది.చదవండి: IND vs AUS: బ్రో అక్కడ ఉన్నది డీఎస్పీ.. లబుషేన్‌కు ఇచ్చిపడేసిన సిరాజ్! వీడియో -
ఐపీఎల్ 2025 స్టార్టింగ్ డేట్ వచ్చేసింది..!
ఐపీఎల్లో రాబోయే మూడు సీజన్లకు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ (నవంబర్ 22) విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఫ్రాంఛైజీలు వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఐపీఎల్ 2025 సీజన్ మార్చి 14న (శుక్రవారం) మొదలై మే 25న (ఆదివారం) ముగుస్తుంది. 2026 సీజన్ మార్చి 15న (ఆదివారం) మొదలై మే 31న (ఆదివారం) ముగుస్తుంది. 2027 సీజన్ మార్చి 14న (ఆదివారం) మొదలై మే 30న (ఆదివారం) ముగుస్తుంది. కాగా, గతంలో ఐపీఎల్ షెడ్యూల్‌లను చివరి నిమిషంలో విడుదల చేసే వారు. అయితే ఆ ఆనవాయితీకి బీసీసీఐ స్వస్తి పలికి, ఒకేసారి మూడు సీజన్ల షెడ్యూల్‌ను ప్రకటించింది. అంతర్జాతీయ షెడ్యూల్‌తో ఐపీఎల్ షెడ్యూల్ క్లాష్ కాకుండా ఇది తోడ్పడుతుందని బీసీసీఐ తెలిపింది.మెగా వేలంలో జోఫ్రా ఆర్చర్..ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఐపీఎల్ 2025 మెగా వేలానికి అందుబాటులో ఉంటాడని బీసీసీఐ తెలిపింది. ఆర్చర్ 2025 సీజన్‌తో పాటు రానున్న మూడు సీజన్లకు అందుబాటులో ఉంటానని ప్రకటించినట్లు తెలుస్తుంది. మెగా వేలంలో ఆర్చర్ 575వ ఆటగాడిగా జాయిన్ అవుతాడు. ఆర్చర్ రూ. 2 కోట్ల బేస్‌ప్రైజ్ విభాగంలో తన పేరును నమోదు చేసుకున్నట్లు తెలుస్తుంది. మెగా వేలంలో ఆర్చర్‌తో పాటు మరో ఇద్దరు కూడా జాయిన్ అయ్యారు. అమెరికాకు చెందిన సౌరభ్ నేత్రావల్కర్, భారత్‌కు చెందిన హార్దిక్ తమోర్ వేలంలో తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు. వీరిద్దరు 576, 577 నంబర్ ఆటగాళ్లుగా వేలం బరిలో ఉంటారు. -
మంజ్రేకర్‌పై మండిపడ్డ మహ్మద్ షమీ.. పోస్ట్ వైరల్
భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ తీరుపై టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ మండిపడ్డాడు. ఇతరుల కోసం జ్ఞానం వృథా చేసుకుని.. తమ గురించి ఆలోచించుకోవడం మర్చిపోవద్దంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. జోస్యం చెప్పడమే లక్ష్యంగా పెట్టుకుంటే బాబా అవతారం ఎత్తితే బాగుంటుందంటూ చురకలు అంటించాడు.నవంబరు 24, 25 తేదీల్లోఐపీఎల్-2025 మెగా వేలం నవంబరు 24, 25 తేదీల్లో జరుగనున్న విషయం తెలిసిందే. సౌదీ అరేబియాలోని జెద్దా నగరం వేదికగా జరిగే వేలంపాటకు ముందే పది ఫ్రాంఛైజీలు తమ రిటెన్షన్ జాబితాను ఇప్పటికే విడుదల చేశాయి. ఆ ఐదుగురు మాత్రమేఈ క్రమంలో గుజరాత్ టైటాన్స్ రషీద్ ఖాన్(రూ. 18 కోట్లు ), శుబ్‌మన్ గిల్(రూ. 16.50 కోట్లు), సాయి సుదర్శన్(రూ. 8.50 కోట్లు), రాహుల్ తెవాటియా(రూ. 4 కోట్లు), షారుఖ్ ఖాన్(రూ. 4 కోట్లు)లను మాత్రమే అట్టిపెట్టుకుని.. షమీని విడిచిపెట్టింది.ఏడాది తర్వాత రీ ఎంట్రీకాగా వన్డే వరల్డ్‌కప్-2023లో సత్తా చాటిన షమీ.. ఆ తర్వాత చీలమండ గాయంతో ఆటకు దూరమయ్యాడు. శస్త్ర చికిత్స తర్వాత పూర్తిగా కోలుకోలేకపోయిన షమీ దాదాపు ఏడాది తర్వాత ఇటీవలే బెంగాల్ తరఫున రంజీ ట్రోఫీ బరిలో దిగాడు. బాల్తోనే గాకుండా బ్యాట్‌తోనూ సత్తా చాటాడు.షమీ ధర పడిపోవచ్చుఈ పరిణామాల నేపథ్యంలో మెగా వేలానికి ముందు షమీని ఉద్దేశించి కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యలు చేశాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘షమీపై ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపుతాయనడంలో సందేమం లేదు. కానీ.. అతడిని గాయాల బెడద వేధిస్తోందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి.అతడు కోలుకోవడానికి ఎంత సమయం పట్టిందో మనం చూశాం. కాబట్టి ఇలాంటి ఆటగాడిని కొనుగోలు చేయాలంటే.. ఫ్రాంఛైజీలు కాస్త ఆలోచిస్తాయి. ఒకవేళ ఎవరైనా షమీపై భారీగా పెట్టుబడి పెట్టిన తర్వాత.. మధ్యలోనే అతడు జట్టుకు దూరమైతే..వారికి సరైన ఆప్షన్లు కూడా అందుబాటులో ఉండవు. అందుకే.. షమీ ధర పడిపోవచ్చు’’ అని సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు.బాబాజీని సంప్రదించండిఇందుకు ఘాటుగా స్పందించిన షమీ ఇన్‌స్టా స్టోరీలో మంజ్రేకర్ వ్యాఖ్యలను షేర్ చేస్తూ.. ‘‘బాబాకీ జై! మీ భవిష్యత్తు కోసం కూడా కాస్త జ్ఞానాన్ని దాచిపెట్టుకోండి. ఒకవేళ ఎవరైనా తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనుకుంటే బాబాజీని సంప్రదించండి’’ అంటూ సెటైర్లు వేశాడు.రూ. 6.25 కోట్లకు కొనుగోలుకాగా ఐపీఎల్-2022లో గుజరాత్ టైటాన్స్ షమీని రూ. 6.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ ఎడిషన్‌లో షమీ 16 వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే.. భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ సైతం ఐపీఎల్ మెగా వేలం నేపథ్యంలో.. రిషభ్ పంత్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. డబ్బు విషయంలో సయోధ్య కుదరకపోవడంతోనే పంత్ ఢిల్లీ క్యాపిటల్స్‌ను విడిచిపెట్టాడని సన్నీ అంచనా వేశాడు. అయితే, పంత్ ఎక్స్ వేదికగా గావస్కర్ వ్యాఖ్యలను ఖండించాడు. తాజాగా షమీ సైతం అదే పంథాను అనుసరించాడు.చదవండి: IPL 2025 Mega Auction: అతడికి రూ. 25- 28 కోట్లు.. ఆ ఫ్రాంఛైజీ సొంతం చేసుకోవడం ఖాయం!పేసర్లకు కెప్టెన్సీ ఇవ్వాలి.. విరాట్, రోహిత్ వేరు.. నేను వేరు.. తుదిజట్టు ఖరారైంది: బుమ్రా -
IPL 2025: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. తొలి మ్యాచ్‌కు ముందే కెప్టెన్‌పై నిషేధం
ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందే ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్ తగిలింది. గత ఐపీఎల్ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆడిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ మెయిన్‌టెయిన్ చేసినందుకుగానూ కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై ఓ మ్యాచ్ నిషేధం విధించారు. గత సీజన్లో అదే చివరి మ్యాచ్ కావడంతో ఈ సీజన్ తొలి మ్యాచ్‌లోనే నిషేధాన్ని అమలు చేస్తున్నట్లు ఐపీఎల్ మేనేజ్మెంట్ తెలిపింది. నిషేధంతో పాటు హార్దిక్‌కు రూ. 30 లక్షల జరిమానా విధిస్తున్నట్లు ఐపీఎల్ పేర్కొంది. తదుపరి మ్యాచ్‌లో హార్దిక్ ఇంపాక్ట్ ప్లేయర్‌గానూ బరిలోకి దిగకూడదు. హార్దిక్‌తో పాటు నాటి మ్యాచ్‌లోని సభ్యులైన ప్రతి ఆటగాడికి రూ. 12 లక్షలు, లేదంటే మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా వర్తిస్తుంది.కాగా, గత సీజన్లో కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన హార్దిక్‌ను ముంబై ఇండియన్స్ యాజమాన్యం తదుపరి సీజన్‌కు కూడా కెప్టెన్‌గా కొనసాగించింది. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ రిటెన్షన్ ప్రక్రియలో భాగంగా ఐదుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకుంది. తదుపరి సీజన్ కోసం ముంబై రిటైన్ చేసుకున్న ఆటగాళ్లలో హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మ ఉన్నారు. ముంబై ఇండియన్స్‌కు ఆర్టీఎం ద్వారా తాము రిలీజ్ చేసిన ఓ ఆటగాడిని తిరిగి దక్కించుకునే అవకాశం ఉంది. ఐపీఎల్ 2025 మెగా వేలం సౌదీ అరేబియాలోని జెద్దా నగరం వేదికగా నవంబర్ 24, 25 తేదీల్లో జరుగనుంది. కాగా, గత కొన్ని సీజన్లుగా పేలవ ప్రదర్శన కనబరుస్తున్న ముంబై ఇండియన్స్ గత సీజన్‌ను చివరి స్థానంతో ముగించిన విషయం తెలిసిందే. ముంబై ఇండియన్స్ చివరిసారిగా 2020లో టైటిల్ సాధించింది. -
నన్ను రిటైన్ చేసుకోకపోవడానికి అది కారణం కాదు: రిషబ్ పంత్
ఐపీఎల్-2025 మెగా వేలంలో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ తనను రిటైన్ చేసుకోకపోవడంతో రిషబ్ వేలంలోకి వచ్చాడు.ఈ వేలంలో రూ. 2 కోట్ల కనీస ధరగా పంత్ తన పేరును నమోదు చేసుకున్నాడు. రిషబ్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉండడంతో ఈ మెగా వేలంలో కాసుల వర్షం కురిసే అవకాశముంది.క్లారిటీ ఇచ్చిన పంత్..అయితే ఈ ఏడాది సీజన్లో పంత్ అద్బుతంగా రాణించినప్పటికి ఢిల్లీ ఎందుకు వేలంలోకి విడిచిపెట్టిందో ఎవరికి ఆర్ధం కావడం లేదు. ఢిల్లీ మేనెజ్మెంట్తో విభేదాల కారణంగానే పంత్ బయటకు వచ్చాడని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.అతడు ఎక్కువ డబ్బు అడిగిన కారణంగానే ఢిల్లీ విడిచిపెట్టిందని మరి కొన్ని రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. తాజాగా ఇదే విషయంపై రిషబ్ పంత్ క్లారిటీ ఇచ్చాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తనను జట్టులో ఉంచుకోకపోవడానికి డబ్బు కారణం కాదని కచ్చితంగా నేను చెప్పగలను అని ఎక్స్‌లో రిషబ్ పోస్ట్ చేశాడు.కాగా ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ తమ సపోర్ట్ స్టాప్‌లో సమూల మార్పులు చేసింది. ఢిల్లీ తమ హెడ్‌కోచ్‌గా రికీ పాంటింగ్ స్థానంలో హేమంగ్ బదానీని, సౌరవ్ గంగూలీ ప్లేస్‌లో వేణుగోపాల్ రావును క్రికెట్ డైరెక్టర్‌గా నియమించింది. ఇక ఐపీఎల్ మెగా వేలం నవంబర్ 24, 25వ తేదీల్లో జెడ్డా వేదికగా జరగనుంది.చదవండి: BGT 2024: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్‌దే పైచేయి.. ఆసీస్‌కు మరోసారి సవాల్? The curious case of Rishabh Pant & Delhi! 🧐🗣 Hear it from #SunilGavaskar as he talks about the possibility of @RishabhPant17 returning to the Delhi Capitals!📺 Watch #IPLAuction 👉 NOV 24th & 25th, 2:30 PM onwards on Star Sports Network & JioCinema! pic.twitter.com/ugrlilKj96— Star Sports (@StarSportsIndia) November 19, 2024 -
IPL 2025: ఆర్సీబీ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా..!
ఐపీఎల్ 2025 సీజన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా ఓంకార్ సాల్వి నియమితుడయ్యాడని తెలుస్తుంది. సాల్వి ప్రస్తుతం రంజీ ట్రోఫీలో ముంబై జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుత (2024-25) రంజీ సీజన్ ముగిసిన అనంతరం సాల్వి ఆర్సీబీ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపడతాడని సమాచారం.దేశవాలీ క్రికెట్లో సాల్వికి లో ప్రొఫైల్ మరియు ప్లేయర్ ఫేవరెట్ కోచ్‌గా పేరుంది. సాల్వికి ఐపీఎల్లో ఇది రెండో కమిట్మెంట్. గతంలో సాల్వి కోల్‌కతా నైట్‌రైడర్స్ అసిస్టెంట్ బౌలింగ్ కోచ్‌గా పని చేశాడు.కాగా, సాల్వి ఆథ్వర్యంలో ముంబై జట్టు 2023-24 రంజీ సీజన్ ఛాంపియన్‌గా నిలిచింది. ఇది రంజీల్లో ముంబైకు 42వ టైటిల్. ఈ సీజన్ ఫైనల్లో ముంబై విదర్భపై 102 పరుగుల తేడాతో గెలుపొందింది. ముంబైకు ఎనిమిదేళ్ల తర్వాత లభించిన తొలి రంజీ టైటిల్ ఇది.సాల్వి హెడ్ కోచ్‌గా ఉండగా ముంబై ఈ ఏడాది ఇరానీ ట్రోఫీని కూడా కైవసం చేసుకుంది. ముంబై ఇరానీ కప్ గెలవడం 27 తర్వాత ఇది తొలిసారి. ఇరానీ కప్ ఫైనల్లో ముంబై రెస్ట్ ఆఫ్ ఇండియాపై గెలిచింది. ముంబై ఒకే సీజన్లో రంజీ ట్రోఫీ, ఇరానీ కప్ గెలవడం చాలాకాలం తర్వాత ఇదే మొదలు.ఓంకార్ సాల్వి సోదరుడు ఆవిష్కార్ సాల్వి భారత్ మహిళల క్రికెట్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఆవిష్కార్ సాల్వి హెడ్ కోచ్‌గా ఉండగా పంజాబ్ క్రికెట్ జట్టు గత సీజన్ సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ కైవసం చేసుకుంది.ప్రస్తుతం 40ల్లో ఉన్న ఓంకార్ సాల్వి టీమిండియా తరఫున ఎప్పుడూ ఆడలేదు. సాల్వికి దేశవాలీ క్రికెట్లో కూడా అనుభవం తక్కువే. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సాల్వి కేవలం ఒకే ఒక మ్యాచ్ (2005లో రైల్వేస్ తరఫున) ఆడాడు. సాల్వి ఆథ్వర్యంలో ముంబై జట్టు ప్రస్తుత రంజీ సీజన్లో అద్బుత ప్రదర్శన చేస్తుంది. ఈ సీజన్లో ముంబై ఐదు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించి ఎలైట్ గ్రూప్-ఏ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. -
ఇషాన్ కిషన్‌కు కళ్లు చెదిరే ధర.. రూ. 14.5 కోట్లకు వారి సొంతం!
టీమిండియాకు దూరమైన ఇషాన్ కిషన్‌కు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ ఈ ఏడాది కలిసి రాలేదు. ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్-2024లో ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. పద్నాలుగు మ్యాచ్‌లలో కలిపి 320 పరుగులు చేయగలిగాడు. అయితే, మెగా వేలానికి ముందు ముంబై ఫ్రాంఛైజీ మాత్రం అతడిని వదిలేసింది.జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మలతో పాటు యువ క్రికెటర్ తిలక్ వర్మను రీటైన్ చేసుకున్న ముంబై.. ఇషాన్ పేరును మాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. నిజానికి 2018లో ముంబై తరఫునే క్యాచ్ రిచ్ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చాడు ఈ లెఫ్టాండర్ బ్యాటర్. ఆరంభం నుంచే మెరుగ్గా రాణించిన ఇషాన్ కిషన్ కోసం ఐపీఎల్-2022లో ముంబై భారీ మొత్తం వెచ్చించింది.నాడు రూ. 15.25 కోట్ల ధరకు ముంబై సొంతంనాటి మెగా వేలంలో అతడిని ఏకంగా రూ. 15.25 కోట్ల ధరకు సొంతం చేసుకుంది. కానీ.. అప్పటి నుంచి నేటి దాకా ఇషాన్ కిషన్ అందుకు తగ్గ పైసా వసూల్ ప్రదర్శన మాత్రం ఇవ్వలేకపోయాడు. అంతేకాదు.. దేశవాళీ క్రికెట్ ఆడాలన్న బీసీసీఐ ఆదేశాలను ధిక్కరించి సెంట్రల్ కాంట్రాక్టు కోల్పోయి.. జాతీయ జట్టుకూ దూరమయ్యాడు.అయితే, ఇటీవలే రంజీల్లో సెంచరీలు చేయడంతో రీ ఎంట్రీ ఇచ్చిన ఇషాన్ కిషన్.. భారత్-‘ఎ’ జట్టుకు సెలక్ట్ అయ్యాడు. కానీ.. ఆస్ట్రేలియా గడ్డపై కంగారూ జట్టుతో జరిగిన అనధికారిక టెస్టు సిరీస్‌లో పూర్తిగా విఫలమయ్యాడు. ఇలాంటి పరిస్థితుల నడుమ ఇషాన్ కిషన్ ఐపీఎల్-2025 మెగా వేలంలోకి రాబోతున్నాడు.వికెట్ కీపర్ కోటాలో కళ్లు చెదిరే మొత్తంఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నిర్వహించిన ‘మాక్ వేలం’లో మాత్రం ఇషాన్ కిషన్ భారీ ధర పలకడం విశేషం. మెగా వేలంలో ఇషాన్ రూ. 2 కోట్ల కనీస ధరతో పేరును నమోదు చేసుకున్నాడు. అయితే, అశ్విన్ మాత్రం తన వేలంలో.. వికెట్ కీపర్ కోటాలో ఇషాన్ కోసం బిడ్ వేసే ఫ్రాంఛైజీలు రూ. 5 కోట్ల నుంచి మొదలుపెట్టాలని సూచించాడు.ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ రూ. 5 కోట్లకు బిడ్ వేయగా.. క్రమక్రమంగా ఇషాన్ ధర రూ. 10 కోట్లకు పెంచింది. దీంతో పంజాబ్ కింగ్స్ రేసు నుంచి తప్పుకోగా.. లక్నో సూపర్ జెయింట్స్ మాత్రం వికెట్ కీపర్ కోసం ఏకంగా రూ. 14.5 కోట్లు వెచ్చించి దక్కించుకుంది.ఏకంగా రూ. 21 కోట్ల మొత్తానికి అతడు ఉన్నా కూడాఅయితే, అశ్విన్ నిర్వహించిన ఈ మాక్వేలంలో ఇషాన్ కిషన్‌కు కళ్లు చెదిరే మొత్తం దక్కడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫామ్‌లో లేని ఇషాన్ కోసం.. మెగా వేలంలో ఏ ఫ్రాంఛైజీ అంతగా ఆసక్తి చూపదని.. మహా అయితే, అతడికి రూ. ఐదు కోట్లు దక్కవచ్చని క్రికెట్ ప్రేమికులు అంటున్నారు.అంతేకాదు.. లక్నో ఇప్పటికే వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్‌ను ఏకంగా రూ. 21 కోట్ల మొత్తానికి అట్టిపెట్టుకుంది. అలాంటిది.. ఇషాన్‌ను ఆ ఫ్రాంఛైజీ కొనుక్కోవడం ఏమిటంటూ అశూ మాక్ వేలంలో లక్నో తరఫున పాల్గొన్న అభిమానులను ట్రోల్ చేస్తున్నారు. కాగా సౌదీ అరేబియాలోని జెద్దా వేదికగా నవంబరు 24, 25 తేదీల్లో మెగా వేలం జరుగనుంది.చదవండి: BGT 2024: టీమిండియాకు గుడ్‌న్యూస్ -
ఐపీఎల్-2025 వేలంలో పాల్గొనని ఇద్దరు స్టార్లు..!
ఐపీఎల్ 2025 మెగా వేలం సెప్టెంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెద్దా నగరం వేదికగా జరుగనున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 24వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు వేలం ప్రారంభంకానుంది. ఈసారి వేలంలో మొత్తం 574 మంది ఆటగాళ్లు పాల్గొననున్నారు. ఇందులో 366 మంది భారతీయ ఆటగాళ్లు కాగా.. 208 మంది విదేశీ ఆటగాళ్లు. మరో ముగ్గురు అసోసియేట్ దేశాలకు చెందిన వారు. ఈసారి వేలం మొత్తం 204 స్లాట్లకు జరుగనుండగా.. 70 మంది విదేశీ ఆటగాళ్లకు అవకాశం దక్కనుంది.ఈసారి మెగా వేలంలో ఇద్దరు స్టార్ ప్లేయర్ల పేర్లు కనిపించలేదు. ఇంగ్లండ్‌కు చెందిన జోఫ్రా ఆర్చర్, ఆస్ట్రేలియాకు చెందిన కెమరూన్ గ్రీన్ వేలంలో తమ పేర్లు నమోదు చేసుకోలేదు. ఆర్చర్ జాతీయ జట్టుకు సేవలందించేందుకు వేలానికి దూరంగా ఉండగా.. గ్రీన్ సర్జరీ కారణంగా వేలంలో పాల్గొనడం లేదు. ఆర్చర్‌ను ముంబై ఇండియన్స్ 2023 మెగా వేలంలో రూ. 8 కోట్లకు సొంతం చేసుకోగా.. గ్రీన్‌ను ఆర్సీబీ 2024 వేలంలో రూ. 17.5 కోట్లకు దక్కించుకుంది. ఈ ఇద్దరు ఆటగాళ్లు ఈసారి వేలంలో పాల్గొని ఉంటే మరోసారి భారీ మొత్తం దక్కేది.మెగా వేలంలో పాల్గొనని మరో ముగ్గురు స్లార్లు..బెన్ స్టోక్స్జేసన్ రాయ్శిఖర్ ధవన్అత్యంత పిన్నవయస్కుడు..ఐపీఎల్ 2025 మెగా వేలంలో పాల్గొనబోయే ఆటగాళ్లలో అత్యంత పిన్న వయస్కుడు వైభవ్ సూర్యవంశీ. 13 ఏళ్ల ఈ బీహార్ చిన్నోడు జూనియర్ క్రికెట్లో సత్తా చాటి అందరి దృష్టిని ఆకర్శించాడు. ఇక వేలంలో పాల్గొనబోయే అత్యంత పెద్ద వయస్కుడిగా జిమ్మీ ఆండర్సన్ ఉన్నాడు. ఆండర్సన్ 41 ఏళ్ల వయసులో వేలంలో పాల్గొని తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.వేలంలో పాల్గొనబోయే ఆసోసియేట్ దేశాలకు చెందిన ఆటగాళ్లు..ఉన్ముక్త్ చంద్ (యూఎస్ఏ)అలీ ఖాన్ (యూఎస్ఏ)బ్రాండన్ మెక్‌ముల్లెన్ (స్కాట్లాండ్)ఈ ముగ్గురు 30 లక్షల బేస్‌ప్రైజ్ విభాగంలో తమ పేర్లు నమోదు చేసుకున్నారు.క్యాప్డ్, అన్క్యాప్డ్ ప్లేయర్ల వివరాలు..భారతీయ క్యాప్డ్ ప్లేయర్లు- 48విదేశీ క్యాప్డ్ ప్లేయర్లు- 193అసోసియేట్ దేశాలకు చెందిన ప్లేయర్లు- 3భారతీయ అన్క్యాప్డ్ ప్లేయర్లు- 318విదేశీ అన్క్యాప్డ్ ప్లేయర్లు- 12మొత్తం- 574వివిధ బేస్ ధర విభాగాల్లో పాల్గొననున్న ఆటగాళ్లు..రూ. 2 కోట్లు- 81 మంది ఆటగాళ్లురూ. 1.5 కోట్లు- 27రూ. 1.25 కోట్లు- 18రూ. కోటి- 23రూ. 75 లక్షలు- 92రూ. 50 లక్షలు- 8రూ. 40 లక్షలు- 5రూ. 30 లక్షలు- 320మొత్తం- 574 -
ఐపీఎల్ మెగా వేలంలో లిస్ట్ అయిన ఆటగాళ్ల జాబితా విడుదల
మెగా వేలంలో లిస్ట్ అయిన ఆటగాళ్ల జాబితాను ఐపీఎల్ యాజమాన్యం ఇవాళ (నవంబర్ 15) విడుదల చేసింది. వేలంలో మొత్తం 574 మంది ఆటగాళ్లు లిస్ట్ అయ్యారు. ఇందులో 366 మంది భారతీయ ఆటగాళ్లు కాగా.. 208 మంది విదేశీ ఆటగాళ్లు. మరో ముగ్గురు అసోసియేట్ దేశాలకు చెందిన వారు.వేలంలో 318 మంది భారత అన్క్యాప్డ్ ప్లేయర్లు.. 12 మంది విదేశీ అన్క్యాప్డ్ ప్లేయర్లు పాల్గొననున్నారు. మొత్తం 204 స్లాట్లకు వేలం జరుగనుండగా.. 70 మంది విదేశీ ఆటగాళ్లకు అవకాశం దక్కనుంది. రూ. 2 కోట్ల బేస్ ప్రైజ్ విభాగంలో మొత్తం 81 మంది ఆటగాళ్లు పాల్గొననున్నారు.క్యాప్డ్, అన్క్యాప్డ్ ప్లేయర్ల వివరాలు..భారతీయ క్యాప్డ్ ప్లేయర్లు- 48విదేశీ క్యాప్డ్ ప్లేయర్లు- 193అసోసియేట్ దేశాలకు చెందిన ప్లేయర్లు- 3భారతీయ అన్క్యాప్డ్ ప్లేయర్లు- 318విదేశీ అన్క్యాప్డ్ ప్లేయర్లు- 12మొత్తం- 574వివిధ బేస్ ధర విభాగాల్లో పాల్గొననున్న ఆటగాళ్లు..రూ. 2 కోట్లు- 81 మంది ఆటగాళ్లురూ. 1.5 కోట్లు- 27రూ. 1.25 కోట్లు- 18రూ. కోటి- 23రూ. 75 లక్షలు- 92రూ. 50 లక్షలు- 8రూ. 40 లక్షలు- 5రూ. 30 లక్షలు- 320మొత్తం- 574సెట్-1..జోస్ బట్లర్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, కగిసో రబాడ, మిచెల్ స్టార్క్, అర్షదీప్ సింగ్సెట్-2..యుజ్వేంద్ర చహల్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మిల్లర్, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్సెట్-3..హ్యారీ బ్రూక్, డెవాన్ కాన్వే, జేక్ ఫ్రేజర్, ఎయిడెన్ మార్క్రమ్, దేవ్‌దత్ పడిక్కల్, రాహుల్ త్రిపాఠి, డేవిడ్ వార్నర్సెట్-4..అశ్విన్, వెంకటేశ్ అయ్యర్ మిచెల్ మార్ష్, మ్యాక్స్‌వెల్, హర్షల్ పటేల్, రచిన్ రవీంద్ర, సోయినిస్సెట్-5..బెయిర్‌స్టో, డికాక్, గుర్బాజ్, ఇషాన్‌కిషన్, ఫిల్ సాల్ట్, జితేశ్ శర్మసెట్-6..బౌల్ట్, హాజిల్‌వుడ్, ఆవేశ్ ఖాన్, ప్రసిద్ద్ కృష్ణ, నటరాజన్, నోర్జే, ఖలీల్ అహ్మద్సెట్-7..నూర్ అహ్మద్, రాహుల్ చాహర్, హసరంగ, సలామ్‌ఖీల్, తీక్షణ, ఆడమ్ జంపాకాగా, జెద్దా వేదికగా ఐపీఎల్ 2025 మెగా వేలం సెప్టెంబర్ 24, 25 తేదీల్లో జరుగనుంది. సెప్టెంబర్ 24వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు వేలం ప్రారంభంకానుంది. -
IPL 2025: సీఎస్కే కన్నేసిన చిన్నోడు శతక్కొట్టాడు..!
ఐపీఎల్ 2025 సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ 17 ఏళ్ల ముంబై బ్యాటర్ ఆయుశ్ మాత్రేపై కన్నేసినట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. సీఎస్కే మేనేజ్మెంట్ అతి త్వరలోనే మాత్రేను సెలెక్షన్ ట్రయిల్ రమ్మని పిలిచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అన్నీ కుదిరితే మాత్రే వచ్చే సీజన్లో సీఎస్కే తరఫున అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది. మాత్రే బ్యాటింగ్ స్కిల్స్‌పై సీఎస్కే స్టార్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని ప్రత్యేక నిఘా పెట్టినట్లు సమాచారం. సీఎస్కే మేనేజ్మెంట్ వేలంలో మాత్రేను సొంతం చేసుకుని రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు ఓపెనర్‌గా పంపాలని భావిస్తుందట.సీఎస్కే దృష్టిలో పడ్డ తర్వాత మాత్రే రంజీ ట్రోఫీలో ఓ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. సర్వీసెస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మాత్రే అద్భుతమై సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో మాత్రే 127 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 107 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. టీమిండియా బ్యాటర్లు అజింక్య రహానే (19), శ్రేయస్ అయ్యర్ (47) తక్కువ స్కోర్లకే ఔటైన వేళ మాత్రే మెరుపు సెంచరీతో అలరించాడు. రెండో రోజు టీ విరామం సమయానికి ముంబై 4 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. మాత్రేతో పాటు ఆకాశ్ ఆనంద్ (1) క్రీజ్‌లో ఉన్నాడు. సర్వీసెస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ముంబై ఇంకా 52 పరుగులు వెనుకపడి ఉంది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సర్వీసెస్ 240 పరుగులకు ఆలౌటైంది. సర్వీసెస్ ఇన్నింగ్స్‌లో మోహిత్ అహ్లావత్ (76), రోహిల్లా (56) అర్ద సెంచరీలతో రాణించారు. ముంబై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. మోహిత్ అవస్తి, షమ్స్ ములానీ తలో రెండు వికెట్లు, జునెద్ ఖాన్, హిమాన్షు సింగ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.ఇరానీ కప్‌తో అరంగేట్రం..17 ఏళ్ల మాత్రే ఈ ఏడాది అక్టోబర్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియాతో జరిగిన ఇరానీ కప్ మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు. మాత్రే ముంబై తరఫున ఇప్పటివరకు 10 ఇన్నింగ్స్‌లు ఆడి రెండు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 400 పైచిలుకు పరుగులు చేశాడు. -
ఆర్సీబీ వదిలేసింది.. ట్రిపుల్ సెంచరీతో విరుచుకుపడ్డాడు..!
రంజీ ట్రోఫీలో భాగంగా ఉత్తరాఖండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ ఆటగాడు మహిపాల్ లోమ్రార్ అజేయ ట్రిపుల్ సెంచరీతో (360 బంతుల్లో 300; 25 ఫోర్లు, 13 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగింది. రెండో రోజు టీ విరామం సమయానికి రాజస్థాన్ స్కోర్ 660/7గా ఉంది. లోమ్రార్‌తో పాటు కుక్నా అజయ్ సింగ్ (40) క్రీజ్‌లో ఉన్నాడు. రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో లోమ్రార్‌కు జతగా మరో ఆటగాడు సెంచరీ చేశాడు. కార్తీక్ శర్మ 115 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 113 పరుగులు చేశాడు. టెయిలెండర్లు భరత్ శర్మ 54, దీపక్ చాహర్ 35 పరుగులు చేయగా.. అభిజిత్ తోమర్ 20, రామ్మోహన్ చౌహాన్ 29, జుబైర్ అలీ ఖాన్ 26, దీపక్ హూడా 10 పరుగులు చేశాడు. ఉత్తరాఖండ్ బౌలర్లలో దీపక్ దాపోలా, స్వప్నిల్ సింగ్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. అంకిత్ మనోర్, అభయ్ నేగి, అవనీశ్ సుధ తలో వికెట్ దక్కించుకున్నారు.ఆర్సీబీ వదిలేసింది.. ట్రిపుల్ సెంచరీతో విరుచుకుపడ్డాడు..!24 ఏళ్ల మహిపాల్ లోమ్రార్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇటీవల వదిలేసింది. 2025 ఐపీఎల్ సీజన్ కోసం ఆర్సీబీ అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాలో లోమ్రార్‌కు చోటు దక్కలేదు. ఆర్సీబీ వదిలేసిందన్న కసితో చెలరేగిపోయిన లోమ్రార్ ఉత్తరాఖండ్‌తో మ్యాచ్‌లో ట్రిపుల్ సెంచరీతో కదంతొక్కాడు. ఈ మ్యాచ్‌లో లోమ్రార్ మరెన్ని పరుగులు చేస్తాడో వేచి చూడాలి. లోమ్రార్ ఆర్సీబీ వదిలేసిన నాటి నుంచి కసితో రగిలిపోతున్నాడు. తాజా ట్రిపుల్ సెంచరీకి ముందు మ్యాచ్‌లో లోమ్రార్ సెంచరీ చేశాడు. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 111 పరుగులు చేశాడు. ఇదే రంజీ సీజన్లో హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ లోమ్రార్ చెలరేగి ఆడాడు. ఆ మ్యాచ్‌లో అతను ఒక్క పరుగు తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. లోమ్రార్ అరివీర భయంకర ఫామ్‌ను చూసి ఆర్సీబీ అతన్ని తిరిగి దక్కించుకునే ప్రయత్నం చేస్తుందేమో వేచి చూడాలి. లోమ్రార్‌ను ఆర్సీబీ 2022 సీజన్లో 95 లక్షలకు దక్కించుకుంది. లోమ్రార్ 2018లో ఐపీఎల్ అరంగేట్రం చేసి వివిధ ఫ్రాంచైజీల తరఫున ఆడాడు. -
గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ కోచ్‌గా టీమిండియా మాజీ ప్లేయర్
గుజరాత్ టైటాన్స్ నూతన అసిస్టెంట్ మరియు బ్యాటింగ్ కోచ్‌గా టీమిండియా మాజీ వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ పార్థివ్ పటేల్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని టైటాన్స్ యాజమాన్యం ఇవాళ (నవంబర్ 13) అధికారికంగా ప్రకటించింది. భారత్ వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్‌గా పార్థివ్‌కు ఉన్న సుదీర్ఘ అనుభవం తమ జట్టుకు మేలు చేస్తుందని జీటీ మేనేజ్మెంట్ అభిప్రాయపడింది. ప్రస్తుతం గుజరాత్ హెడ్ కోచ్‌గా ఆశిష్ నెహ్రా వ్యవహరిస్తున్నాడు. ఆ జట్టుకు సారధిగా శుభ్‌మన్ గిల్ ఉన్నాడు. ఫ్రాంచైజీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా విక్రమ్ సోలంకి పని చేస్తున్నాడు. వీరందరితో కలిసి పార్థివ్ పని చేస్తాడు.కాగా, పార్థివ్ పటేల్ గతంలో ముంబై ఇండియన్స్ టాలెంట్ స్కౌట్లో సభ్యుడిగా పని చేశాడు. దేశవాలీ క్రికెట్ నుంచి యువ ఆటగాళ్లను ఎంపిక చేసే విషయంలో పార్థివ్ కీలకంగా వ్యవహరించేవాడు. పార్థివ్ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించకముందు ముంబై ఇండియన్స్‌లో సభ్యుడిగా ఉన్నాడు. పార్థివ్ జట్టులో ఉన్నప్పుడు ముంబై ఇండియన్స్ 2020 ఎడిషన్ టైటిల్ నెగ్గింది.గుజరాత్ టైటాన్స్ 2022 ఎడిషన్‌తో ఐపీఎల్ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. నెహ్రా ఆథ్వర్యంలో, హార్దిక్ నేతృత్వంలో ఆ జట్టు తొలి ఎడిషన్‌లోనే విజేతగా నిలిచింది. ఆ తర్వాతి సీజన్లో గుజరాత్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. అనంతరం 2024 ఎడిషన్‌లో గిల్ సారథ్యంలో ఎనిమిదో స్థానంలో నిలిచింది.39 ఏళ్ల పార్థివ్ పటేల్ 2002-2018 మధ్యలో టీమిండియా తరఫున 25 టెస్ట్‌లు, 38 వన్డేలు, 2 టీ20లు ఆడి 1700 పైచిలుకు పరుగులు చేశాడు. ఇందులో 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ అయిన పార్థివ్ టెస్ట్‌ల్లో 73, వన్డేల్లో 41, టీ20ల్లో ఒక్కరిని ఔట్ చేయడంలో భాగమయ్యాడు. 2008-2020 వరకు ఐపీఎల్ ఆడిన పార్థివ్ 139 మ్యాచ్‌ల్లో 2848 పరుగులు చేశాడు. ఇందులో 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్లో పార్థివ్ 95 మంది ఔట్ చేయడంలో భాగమయ్యాడు. -
ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్‌గా టీమిండియా మాజీ బౌలర్
ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్‌గా టీమిండియా మాజీ పేసర్ మునాఫ్ పటేల్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ యాజమాన్యం ఇవాళ (నవంబర్ 12) అధికారికంగా ప్రకటించింది. మునాఫ్ వచ్చే సీజన్ నుంచి హెడ్ కోచ్ హేమంగ్ బదాని, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ వేణుగోపాల్ రావుతో కలిసి పని చేస్తాడు. మునాఫ్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్‌గా జేమ్స్ హోప్స్ పని చేశాడు. ఢిల్లీ యాజమాన్యం ఇటీవలే రికీ పాంటింగ్‌ను హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తొలగించింది. పాంటింగ్‌తో పాటు హోప్స్ తదితరులు తమ పదవులు కోల్పోయారు. పాంటింగ్, సౌరవ్ గంగూలీ స్థానాల్లో హేమంగ్ బదాని, వేణుగోపాల్ రావు హెడ్ కోచ్, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా బాధ్యతలు చేపట్టారు. సపోర్టింగ్ స్టాఫ్‌కు ఎంపిక చేసుకునే బాధ్యతను ఢిల్లీ యాజమాన్యం హెడ్ కోచ్, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌కే వదిలేసింది. ఈ క్రమంలో బదాని, వేణు మునాఫ్‌ను బౌలింగ్ కోచ్‌గా ఎంపిక చేసుకున్నారు.41 ఏళ్ల మునాఫ్ పటేల్ 2013లో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ టైటిల్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. మునాఫ్ 2008-17 మధ్యలో రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ లయన్స్ ఫ్రాంచైజీల తరఫున 63 మ్యాచ్‌లు ఆడి 74 వికెట్లు పడగొట్టాడు. మునాఫ్ టీమిండియా తరఫున 2006-2011 మధ్యలో మూడు ఫార్మాట్లలో కలిపి 86 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 125 వికెట్లు పడగొట్టాడు. మునాఫ్ 2011లో భారత్ వన్డే ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. -
17 ఏళ్ల యువ సంచలనంపై కన్నేసిన సీఎస్కే.. రుతురాజ్ జోడీగా?
ఐపీఎల్-2025 సీజన్ మెగా వేలానికి సమయం అసన్నమవుతోంది. నవంబర్ 24, 25 తేదీల్లో జెడ్డా వేదికగా ఈ క్యాష్ రిచ్ లీగ్ వేలం జరగనుంది. ఈ మెగా వేలంలో ముంబై యువ ఆటగాడు ఆయుష్ మహాత్రేపై 5 సార్లు ఛాపింయన్ చెన్నై సూపర్ కింగ్స్ కన్నేసినట్లు తెలుస్తోంది.మెగా వేలానికి ముందు మహాత్రేని సెలక్షన్ ట్రయల్ కోసం సీఎస్కే పిలిచినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం.. మహాత్రే సీఎస్కే టాలెంట్ స్కౌట్‌లతో పాటు మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ ఎంఎస్ ధోని దృష్టిని కూడా ఆకర్షించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ క్రమంలోనే అతడికి ఈ నెలఖారులో హై పెర్ఫార్మెన్స్ సెంటర్లో సెలక్షన్ ట్రయల్‌కు హాజరు అవ్వమని సీఎస్కే పిలుపునిచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 17 ఏళ్ల మహాత్రే ప్రస్తుతం రంజీ ట్రోఫీ 2024-25 సీజన్లో ముంబై తరపున ఆడుతున్నాడు.ఈ టోర్నీలో భాగంగా ముంబై బుధవారం ప్రారంభం కానున్న తమ ఐదవ-రౌండ్ మ్యాచ్‌లో సర్వీసెస్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే మహాత్రేని సీఎస్కే సెలక్షన్ ట్రయల్‌కు హాజరు కానున్నాడు. ఆ తర్వాత నవంబర్ 23న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబైకు ఈ యువ ఓపెనర్ ప్రాతినిథ్యం వహించనున్నాడు.ఇరానీ కప్‌తో అరంగేట్రం..మహాత్రే ఈ ఏడాది అక్టోబర్‌లో ఇరానీ కప్‌లో లక్నో వేదికగా రెస్ట్ ఆఫ్ ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో ముంబై తరఫున ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు (తొమ్మిది ఇన్నింగ్స్‌లు) ఆడిన అతను 35.66 సగటుతో 321 పరుగులు చేశాడు.అతడి ఇన్నింగ్స్‌లలో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. అయితే మహాత్రేకి అద్బుతమైన బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయి. అతడిని వేలంలో సొంతం చేసుకుని రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు ఓపెనర్‌గా పంపాలని సీఎస్కే యోచిస్తుందంట.చదవండి: BGT: పంత్ కాదు!.. అతడే ‘కొత్త రాజు’ అంటున్న ఆస్ట్రేలియా మీడియా! -
IPL 2025: అందుకే లక్నోకు గుడ్‌బై.. కారణం వెల్లడించిన కేఎల్ రాహుల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్‌తో తాను కొత్త ప్రయాణం మొదలుపెట్టాలనుకుంటున్నానని టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ తెలిపాడు. స్వేచ్ఛాయుత వాతావరణంలో తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తానన్నాడు. కాగా ఈ ఏడాది ఐపీఎల్ మెగా వేలం జరుగనున్న విషయం తెలిసిందే.లక్నో సూపర్ జెయింట్స్‌ను వీడిన కేఎల్ రాహుల్సౌదీ అరేబియాలోని జిద్దా నగరం వేదికగా నవంబరు 24, 25 తేదీల్లో వేలంపాట నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పది ఫ్రాంఛైజీలు తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి.ఈ సందర్భంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో కేఎల్ రాహుల్ బంధం తెంచుకున్నట్లు వెల్లడైంది. అయితే, ఇందుకు గల కారణాన్ని ఈ టీమిండియా స్టార్ తాజాగా బయటపెట్టాడు. ‘‘నా ప్రయాణాన్ని సరికొత్తగా మొదలుపెట్టాలనుకుంటున్నాను. నాకు ఉన్న ఆప్షన్లను పరిశీలించాలని భావిస్తున్నా. ముఖ్యంగా ఎక్కడైతే నాకు స్వేచ్ఛగా ఆడే వీలు ఉంటుందో అక్కడికి వెళ్లాలనుకుంటున్నాను.కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పదుఅక్కడి వాతావరణం కాస్త తేలికగా, ప్రశాంతంగా ఉండగలగాలి. అందుకే మన మంచి కోసం మనమే కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పదు’’ అని కేఎల్ రాహుల్ ఇండియా టుడేతో పేర్కొన్నాడు. కాగా 2022లో లక్నో ఫ్రాంఛైజీ ఐపీఎల్లో అడుగుపెట్టింది. తమ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌ను నియమించుకుంది.కెప్టెన్‌గా రాణించినాఅయితే, యాజమాన్యం అంచనాలకు తగ్గట్లుగానే రాహుల్.. లక్నోను అరంగేట్ర సీజన్లోనే ప్లే ఆఫ్స్‌నకు చేర్చాడు. ఆ తర్వాతి ఎడిషన్‌లోనూ టాప్-4లో నిలిపాడు. అయితే, ఐపీఎల్-2024లో మాత్రం లక్నో ప్లే ఆఫ్స్‌నకు అర్హత సాధించలేకపోయింది. పద్నాలుగు మ్యాచ్‌లకు గానూ.. ఏడే గెలిచి పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది.ఇదిలా ఉంటే.. లక్నో జట్టు యజమాని, ప్రముఖ వ్యాపారవేత్త సంజీవ్ గోయెంకా ఐపీఎల్ 2024లో ఓ మ్యాచ్ సందర్భంగా.. రాహుల్‌ను అందరి ముందే తిట్టాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఘోర ఓటమిని జీర్ణించుకోలేక కెప్టెన్‌పై బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశాడు.రాహుల్‌కు ఘోర అవమానంఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ కాగా.. సంజీవ్ గోయెంకాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అయితే, ఆ తర్వాత అతడు నష్టనివారణ చర్యలే చేపట్టి.. రాహుల్‌ను తన ఇంటికి ఆహ్వానించి ఫొటోలు విడుదల చేశాడు. కానీ.. అందరి ముందు జరిగిన అవమానాన్ని మర్చిపోలేకపోయిన రాహుల్ ఆ జట్టును వీడినట్లు అతడి తాజా వ్యాఖ్యల ద్వారా స్పష్టమైంది. ఇక టీమిండియా టీ20 జట్టులో పునరాగమనమే లక్ష్యంగా తాను ఇకపై అడుగులు వేస్తానని కేఎల్ రాహుల్ ఈ సందర్భంగా తన మనసులోని మాటను వెల్లడించాడు. కాగా లక్నో తరఫున కేఎల్ రాహుల్ 2022లో 616 పరుగులు చేశాడు. గత రెండు సీజన్లలో కలిపి 23 మ్యాచ్‌లు ఆడి 800 రన్స్ స్కోరు చేశాడు. ఇక మొత్తంగా అంతర్జాతీయ టీ20లలో రాహుల్ ఇప్పటి వరకు 72 మ్యాచ్‌లు ఆడి 2265 పరుగులు సాధించాడు.చదవండి: CT 2025: పాకిస్తాన్ కాదు... సౌతాఫ్రికా వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ!? -
IPL 2025 Mega Auction: కేఎల్ రాహుల్‌కు రూ.20 కోట్లు! ఆర్సీబీ కెప్టెన్‌గా?
ఐపీఎల్-2025 సీజన్ మెగా వేలానికి ముందు టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ను లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. గత మూడు సీజన్లలో తమ సారథిగా వ్యవహరించిన రాహుల్‌ను లక్నో ఈసారి రిటైన్ చేసుకోలేదు.దీంతో ఈ కర్ణాటక బ్యాటర్-కీపర్ నవంబర్ 24-25 తేదీలలో జెడ్డాలో వేదికగా జరగనున్న మెగా వేలంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. అయితే చాలా మంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) అభిమానులు రాహుల్ తన సొంత గూటికి చేరాలని కోరుకుంటున్నారు. ఐపీఎల్-2025లో సీజన్లో కేఎల్ ఆర్సీబీ తరపున ఆడితే చూడాలని ఆశపడుతున్నారు. కాగా గతంలో రాహుల్ ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించాడు. రాహుల్‌కు రూ.20 కోట్లు!ఈ క్రమంలో ఆర్సీబీ ఫ్రాంచైజీ అభిమానుల కోసం తాజాగా బెంగళూరులో మాక్ వేలం నిర్వహించింది. ఈ వేలంలో చాలా మంది అభిమానులు పాల్గోన్నారు. కేఎల్ రాహుల్‌ను సొంతం చేసుకోవడానికి రూ. 20 కోట్లు వెచ్చిందేందుకు ఫ్యాన్స్ సిద్దమయ్యారు. మరికొంతమంది ఫ్యాన్స్ రిషబ్ పంత్ కోసం పోటీ పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.ఆర్సీబీ కెప్టెన్‌గా రాహుల్?అయితే ఆర్సీబీ యాజమాన్యం కూడా రాహుల్‌పై ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అతడిని సొంతం చేసుకుని తమ జట్టు పగ్గాలు అప్పగించాలని ఆర్సీబీ భావిస్తున్నట్లు సమాచారం. తమ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్‌ను వేలంలోకి ఆర్సీబీ విడిచిపెట్టింది. విరాట్ కోహ్లి,యశ్ దయాల్, పాటిదార్‌ను మాత్రం బెంగళూరు రిటైన్ చేసుకుంది. ఆర్సీబీ పర్స్‌లో ప్రస్తుతం రూ. 83 కోట్లు ఉన్నాయి.చదవండి: అమ్మాయిగా మారిన టీమిండియా మాజీ కోచ్ కొడుకు.. ఎమోషనల్ వీడియో! స్త్రీగా మారినందు వల్ల