Jailer
-
జైలర్ మూవీ కమెడియన్‌తో నటి పెళ్లి.. అదే నాన్న చివరి కోరిక (ఫోటోలు)
-
'జైలర్' పాట విషయంలో ఇప్పటికీ ఆ బాధ ఉంది: తమన్నా
బహుభాషా కథానాయకి తమన్నా భాటియా. అయితే ఐటమ్ సాంగ్స్‌కు కేరాఫ్ అడ్రస్ అంటే ఈ బ్యూటీనే అని చెప్పవచ్చు. చిత్రానికి అవసరం అయితే ఎంత గ్లామరస్గానైనా నటించడానికి ఆమె సై అంటారు. కాగా తమన్న ప్రత్యేక పాటలో నటించిన చిత్రాలన్నీ దాదాపు హిట్టే. అలా తమన్న నటించిన చిత్రాల విజయంలో ఆమె భాగం చాలానే ఉంటుంది. అందుకు నటుడు రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన జైలర్ చిత్రం ఒక ఉదాహరణ. అందులో 'నువ్వు కావాలయ్యా..' అనే పాట కుర్రకారును ఉర్రూతలూరించిందనడం అతిశయోక్తి కాదు. ఇంకా చెప్పాలంటే అనిరుద్ సంగీతాన్ని అందించిన ఆ పాటలో నటుడు రజనీకాంత్ కూడా ఒక సహాయ నటుడిగా కనిపించారు. మరో విషయం ఏమిటంటే ఆ పాటలో నటి తమన్న డ్రస్, ఆమె స్టెప్స్‌కు కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు కూడా. అలాంటి పాటలో తన నటన గురించి తమన్న ఇటీవల తన సోషల్ మీడియాలో పేర్కొంటూ జైలర్ చిత్రంలోని పాటలో తాను పూర్తిగా ఎఫర్ట్ పెట్టలేకపోయాననే బాధ ఇప్పటికీ ఉందన్నారు. ఇంకా కొంచెం బాగా చేయవచ్చుననే ఫీల్ అయ్యానని చెప్పారు. అయితే తాను కొన్ని నెలల క్రితం నటించిన హిందీ చిత్రం స్త్రీ 2 చిత్రంలో 'ఆజ్ కీ రాత్' అనే పాటలో నటించాననీ, ఆ పాటలో నటన సంతృప్తి కలిగించిందని చెప్పారు. ఆ పాటలో నటన గురించి ఆ చిత్ర దర్శకుడు అమర్ కౌశిక్ స్పందిస్తూ ఆజ్ కీ రాత్ పాటకు నటి తమన్నా ఆ పాత్రగానే మారారని చెప్పడమే చాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా ప్రస్తుతం తెలుగు,తమిళం భాషల్లో అవకాశాలు లేకపోయినా హిందీలో అవకాశాలు వస్తూనే ఉన్నాయి. కాగా నటుడు రజనీకాంత్ త్వరలో జైలర్– 2 చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. అందులోనూ తమన్నాకు ఐటమ్ సాంగ్ ఉంటుందేమో చూడాలి. -
జైలర్ 2 సీక్వెల్ లో ధనుష్..?
-
జైలర్ సీక్వెల్ కు లైన్ క్లియర్..
-
జైలర్ డైరెక్టర్ తో బన్నీ డిస్కషన్స్..
-
విషాదం.. ‘జైలర్’ నటుడు మృతి
కోలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు, డైరెక్టర్ జి మారి ముత్తు(57) మరణించాడు. గుండెపోటుతో ఆయన శుక్రవారం ఉదయం మరణించినట్లు కుటుంబ సభ్యులు వెళ్లడించారు. దర్శకుడిగా, నటుడిగా కోలీవుడ్‌లో తనదైన ముద్ర వేసుకున్నాడు మారి ముత్తు. దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించాడు. ఇటీవల విడుదలైన జైలర్ చిత్రంలోనూ కీలక పాత్ర పోషించాడు. ఇందులో విలన్ నమ్మకస్తుడి పాత్రలో నటించాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మారి ముత్తు మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇంటి నుంచి పారిపోయి.. మారిముత్తుకు చిన్నతనం నుంచే సినిమాలపై ప్రేమ కలిగింది. ఇంట్లో చెబితే ఒప్పుకోకపోవడంతో 1990లో సొంతూరు పసుమలైతేరి నుంచి చెన్నైకి పారిపోయాడు. దర్శకుడు కావాలనే కోరికతో గీత రచయిత వైరముత్తు దగ్గర కొన్నాళ్లు అసిస్టెంట్‌గా పనిచేశాడు. తరువాత నటుడు-దర్శకుడు రాజ్ కిరణ్‌లో సహాయ దర్శకునిగా చేరాడు. మణిరత్నం, వసంత్, ఎస్ జే సూర్య లాంటి దర్శకుల దగ్గర పని చేశాడు. 'మన్మధన్'సినిమాకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. ‘కన్నుమ్ కన్నుమ్’సినిమాతో డైరెక్టర్‌గా మారాడు. తొలి సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. ఆ తర్వాత ‘పులివాల్’చిత్రానికి దర్శకత్వం వహించాడు. 2014లో విడుదలైన ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది. (చదవండి: ఈ హీరోల మల్టీ టాలెంట్ గురించి తెలుసా?) -
ప్రియురాలిని పరిచయం చేసిన ' జైలర్' ఫేమ్ జాఫర్ సాదిఖ్.. ఆమె ఎవరంటే
కోలీవుడ్ నటుడు జాఫర్ సాదిఖ్ పేరు జైలర్ సినిమాతో మరోసారి ట్రెండింగ్ అవుతుంది. లోకేష్ కనగరాజ్- కమల్ హాసస్ కాంబోలో వచ్చిన విక్రమ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఈ రెండు సినిమాల్లో మరగుజ్జుగా ఆయన నటించిన తీరు అందరనీ ఆకట్టుకుంటుంది. తాజాగ ఆయన ప్రియురాలు 'సిద్ధికా షెరిన్'ను ఓ ఇంటర్వ్యూ ద్వారా తన అభిమానులకు పరిచయం చేశాడు. ఎక్కడ పరిచయం కోలీవుడ్‌లో విజయ్ టీవీలో ప్రసారం అవుతున్న డ్యాన్స్ రియాలిటీ షోలలో జాఫర్ సాదిఖ్ పాల్గొనేవాడు. అదే టీవీలో ఆమె కింగ్స్ ఆఫ్ డ్యాన్స్, జోడి నంబర్ 1, ఉంజాలిల్ యార్ ప్రభుదేవా-2 వంటి డ్యాన్స్ షోలలో సిద్ధిక పోటీదారురాలిగా కనిపించింది. మొదట ప్రకాశ్‌రాజ్-సాయిపల్లవి కాంబినేషన్లో వచ్చిన పావ కథైగల్ అనే వెబ్ సీరిస్తో జాఫర్ సాదిఖ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సీరిస్ నెట్‌ఫ్లిక్స్‌లో పలు విభాగాలుగా విడుదలైంది. అది చూసి లోకేష్ కనగరాజ్ విక్రమ్ సినిమాలో ఓ పాత్ర ఇచ్చి సినీ రంగానికి పరిచయం చేశారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి గ్యాంగ్‌లో ఒకరిగా జాఫర్ మాస్‌గా నటించాడు. విక్రమ్ సినిమా క్లైమాక్స్ సీన్లో కమల్ కాలు కోసే ప్రయత్నంలో జాఫర్ సాదిఖ్ కనిపిస్తాడు. ఈ సన్నివేశమే ఆతన్ని పాపులర్ చేసింది. మరోవైపు అతను కొరియోగ్రాఫర్‌గా కూడా బిజీగా ఉన్నాడు. అతను తన స్వంత డ్యాన్స్ స్టూడియోను కూడా నడుపుతున్నాడు. విక్రమ్ సినిమా తర్వాత అతనికి శింబుతో సినిమా ఛాన్స్ దక్కింది. ఆ తర్వాత జైలర్ ఇలా వరుసగా ఆయనకు ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పుడు తెలుగు, హిందీ భాషల్లో కూడా జాఫర్ కొన్ని ప్రాజెక్ట్స్‌కు సైన్ చేశాడు. ఇలా సినిమాలతో బిజీగా ఉన్న జాఫర్ తన ప్రియురాలిని అభిమానులకు పరిచయం చేశాడు. జాఫర్ యొక్క ప్రత్యేక లక్షణం అతని పొట్టి పొట్టితనమే. కానీ అతని స్నేహితురాలు జాఫర్ కంటే పెద్దది, అందమైనది కూడా. వీరిద్దరూ స్టైలిష్‌గా పోజులిచ్చిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జాఫర్ ప్రియురాలి పేరు సిద్ధిక అని వెల్లడించారు. ఆమె కోలీవుడ్‌లో మంచి డ్యాన్సర్‌గా రానిస్తుంది. పలు ప్రైవేట్ ఆల్బమ్స్లకు కొరియోగ్రాఫర్‌గా ఆమె వర్క్ చేస్తుంది. (ఇదీ చదవండి; ఆ పార్టీలో నాపై చెయి వేశాడు.. నిలదీస్తే బోరున ఏడ్చాడు: కస్తూరి) జాఫర్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు మూడు మాత్రమే కానీ అతనికి అభిమానుల నుంచి మరింత మద్ధతు అందుతున్నందున మరెన్నో సినిమా ఆఫర్లు వస్తున్నాయి. ఆ ఆనందంలో తన ప్రియురాలు సిద్ధికను కూడా అభిమానులకు పరిచయం చేశాడు. ఈ వార్త చాలా రోజులుగా ప్రచారంలో ఉన్నా తాజాగ ఆయన ప్రకటించాడు. ఇదిలా ఉంటే వీరిద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు అనే సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. View this post on Instagram A post shared by sidhiqa sherin (@sidhiqasherink) -
డిసెంబర్ 12న విడుదల కానున్న రజనీకాంత్ మరో సినిమా
రజనీకాంత్ పేరు ఇప్పుడు సినీ ప్రపంచంలో దద్దరిల్లిపోతోంది. కారణం ఆయన తాజాగా నటించిన జైలర్ చిత్రం కలెక్షన్ల రికార్డులను బద్దలు కొట్టడమే. కాగా తదుపరి 'లాల్‌సలామ్' చిత్రం తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఇందులో రజనీకాంత్ మొయిదీన్ బాబాగా అతిథిపాత్రలో నటిస్తున్నారని ప్రచారం జరిగింది. దీనిని ఆయన పెద్ద కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించడం విశేషం. (ఇదీ చదవండి: ఏళ్ల తరబడి షూటింగ్.. సుజితకు అరకొర పారితోషికం?!) లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విష్ణువిశాల్, విక్రాంత్ హీరోలుగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి కొన్ని కొత్త విషయాలు వినిపిస్తున్నాయి. ముందుగా రజనీకాంత్ గెస్ట్‌గా నటిస్తున్నారన్న ప్రచారం జరగ్గా తాజాగా ఆయనది ఈ చిత్రంలో ఎక్సెంట్ క్యామియో పాత్ర అని తెలిసింది. ఇంతకు ముందు రజనీకాంత్ భాషాలో పోషించిన పాత్రకు 10 రెట్లు పవర్‌ఫుల్‌గా ఉంటుందని సమాచారం. ఈయన పాత్ర చిత్రం విలువ భాగంలో ఫుల్లుగా ఉంటుందని తెలుస్తోంది. కాగా ఈ చిత్రాన్ని రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 12న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. జైలర్ చిత్రం తరువాత విడుదలవుతున్న లాల్‌సలామ్ చిత్రంపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
జైలర్ కంట కన్నీరు.. ఆ డైలాగ్ రజనీ నిజ జీవితానిదే: డైరెక్టర్
రజనీకాంత్ 'జైలర్' సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఒకరకంగా జైలర్ విజయం కోలీవుడ్ పరిశ్రమకు మంచి బూస్ట్‌ను తెచ్చిందనే చెప్పవచ్చు. అక్కడ రజనీకాంత్ స్టార్ డమ్ ఏ మాత్రం తగ్గలేదని జైలర్ సక్సెస్ నిరూపించింది. విడుదలైన 13 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.550 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమాతో ఆయన స్టామినా ఏంటో ప్రపంచానికి తెలిసింది. ఈ సినిమా గురించి తాజాగ కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు ప్రవీణ్ గాంధీ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. రజనీ నిజ జీవితంలో జైలర్ క్లైమాక్స్ సీన్ జైలర్ సినిమాలో తన కుటుంబ సన్నివేశాల్లో వచ్చే చాలా డైలాగులు రజనీ నిజ జీవితానికి సంబంధించినవని ఆయన అన్నారు. క్లైమాక్స్ సీన్లో ఏదైనా చెప్పాలని ఉందా..? అంటూ తన కుమారుడిని పదేపదే రజనీ అడిగే సన్నివేశం ఉంటుంది. అందులో అతని నిజ జీవితంలోని నొప్పిని చూపిస్తుంది. ఇది కేవలం డైలాగ్ కాదు. అది వారి జీవితం. డైలాగ్ మాట్లాడేటప్పుడు అతను ధనుష్, అతని కుమార్తె ఐశ్వర్య గురించి ఆలోచించి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డాడు. ధనుష్ దంపతుల మధ్య ఏదో జరుగుతోందని రజనీకి ముందే అనిపించివుండవచ్చు.. విడాకులు రాత్రికి రాత్రే తీసుకున్న నిర్ణయం కాదు. ఈ విషయం గురించి తన కూతురిని రజనీ నేరుగా అడగలేరు. అందుకే ఆయన నిజ జీవితంలో కూడా 'ఈ నాన్నగారితో ఏదైనా చెప్పాలా అని ఆమెను చాలాసార్లు అడిగారు.' అని ప్రవీణ్ గాంధీ తెలిపాడు. ఆ సినిమాలో రజనీ నవ్వుతున్న టాప్ యాంగిల్ షాట్ ఉంటుంది. అందులో చాలా ఎమోషన్ కనిపిస్తుంది. ఆయన నిజ జీవితంలో జరిగిన సంఘటనలకు ఆ సీన్ చాలా దగ్గరగా ఉంటుందని ఆయన తెలిపాడు. (ఇదీ చదవండి: సినిమాలకు బ్రేక్ తీసుకున్న శ్రీలీల.. కారణం ఇదేనా?) ఆ సమయంలో చాలాసార్లు కన్నీళ్లు పెట్టాడు రజనీకాంత్‌కు ఇద్దరు కూతుళ్లు. ఒక తండ్రిగా, అతను తన కుమార్తెలను చాలా అమితంగా ప్రేమిస్తాడు. వారిని ఆయన చాలా క్రమశిక్షణతోనే పెంచారు. కానీ దేవుడి రాతను ఎవరూ మార్చలేరని ఆయన చెప్పారు. రజనీకి తన ఇద్దరు కూతుళ్ల ప్రాణాలే ముఖ్యం. కానీ వారి జీవితంలో జరిగిన సంఘటనలకు ఇద్దరూ బాధపడ్డారు. ఆ ఇబ్బందులన్నీ ఆ షాట్‌లోనే కనిపిస్తాయని ప్రవీణ్ గాంధీ స్పష్టం చేశారు. రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య గతేడాది ధనుష్ నుంచి విడిపోయింది. వారి పిల్లల యాత్ర, లింగ ఇద్దరూ ధనుష్ వద్దే ఉంటారు. అప్పడప్పుడు రజనీకాంత్ వద్దకు వెళ్తుంటారని ఆయన చెప్పుకొచ్చాడు. ఆ పిల్లలిద్దరినీ చూడగానే చాలా సందర్భాల్లో రజనీ కన్నీళ్లు కూడా పెట్టుకున్నారని ఆయన గుర్తుచేసుకున్నాడు. అంతేకాకుండా వారి విడాకులు ఇరువురి కుటుంబాలను తీవ్రంగా కలవరపరిచాయని చెప్పుకొచ్చాడు. గతంలో రజనీకాంత్ కూడా వీరిద్దరినీ కలిపేందుకు ప్రయత్నించారని తెలిసింది అది ఫలించలేదన్నాడు. సౌందర్య జీవితంలో కూడా ఇబ్బందులే రజనీ చిన్న కూతురు సౌందర్య కూడా మొదటి వివాహం విఫలమైంది. గ్రాఫిక్ డిజైనర్‌గా ఉన్న సౌందర్య 2010లో వ్యాపారవేత్త అశ్విన్ రామ్‌కుమార్‌ను వివాహం చేసుకుంది. 2015లో వీరిద్దరికీ ఒక కొడుకు పుట్టాడు. ఆ తర్వాత విబేదాలు రావడంతో 2017లో ఇద్దరూ విడిపోయారు. 2019లో నటుడు, వ్యాపారవేత్త విశాగన్ వనంగమూడిని సౌందర్య వివాహం చేసుకుంది. గతేడాది ఈ దంపతులకు ఒక కుమారుడు కూడా జన్మించాడని ఆయన పేర్కొన్నాడు. జైలర్‌లో తండ్రీకొడుకుల మధ్య వచ్చే చాలా సన్నివేశాలు రజనీ నిజ జీవితానికి దగ్గరగా ఉంటాయని ప్రవీణ్ గాంధీ తెలుపుతూ ఆ ఇంటర్వ్యూను ముగించారు. (ఇదీ చదవండి: బిగ్ బాస్‌లోకి ఆ స్టార్ హీరో, హీరోయిన్.. ఆఖరి క్షణంలో అదిరిపోయే ట్విస్ట్) -
యోగి ఆదిత్యనాథ్‌ను కలవనున్న రజనీకాంత్.. ఎందుకంటే?
రజనీకాంత్ నటించిన 'జైలర్' సినిమా కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం తగ్గలేదు. ఆగష్టు 10న విడుదలైన ఈ సినిమా ఇప్పటికే పలు రికార్డులను కొల్లగొట్టింది. ఇందులో రజనీకాంత్ స్టైల్‌కు యువ సంచలనం అనిరుధ్ అందించిన మ్యూజిక్, బీజీఎం నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లాయి. సినిమా విడుదలకు ముందు హిమాలయాలకు వెళ్లిన రజనీ.. తన యాత్ర ముగించుకుని తిరిగి వచ్చారు. (ఇదీ చదవండి: మాపై ట్రోల్స్ చేస్తుంది ఆ 'స్నేక్' బ్యాచ్‌నే: మంచు విష్ణు) నేడు ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను రజనీకాంత్ కలవనున్నారు. ఈ విషయాన్ని ఆయనే ప్రకటించారు. యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి జైలర్ సినిమాను తలైవా చూడనున్నారు. అందులో భాగంగా రజనీ ఇప్పటికే లఖ్‌నవ్ చేరుకున్నారు. దేవుడి దయ వల్ల సినిమా మంచి విజయం సాధించిందని ఆయన తెలిపారు. ఇది తనకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. జైలర్ సినిమాను ఇప్పటికే తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా వీక్షించడం జరిగింది. కేరళ ముఖ్యమంత్రి విజయన్ పినరయ్ కూడా ఈ సినిమా చూసిన విషయం తెలిసిందే. నెల్సన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రమ్యకృష్ణ, మోహన్‌లాల్, జాకీ ష్రాఫ్, శివరాజ్‌కుమార్, తమన్నా, సునీల్, కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే 'జైలర్' రూ.450 కోట్లు రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పట్లో పెద్ద సినిమాలు లేవు కాబట్టి ఫైనల్‌గా రూ.600 కోట్ల మార్క్‌ను దాటుతుందని సినీ ట్రేడర్స్ అంచనా వేస్తున్నారు. (ఇదీ చదవండి: లైన్లో నలుగురు.. మెగాస్టార్ దారెటు.. బాసూ బీ కేర్‌ఫుల్!) -
జైలర్‌లో టాలీవుడ్‌కు చెందిన లెజండరీ పర్సన్ వారసుడిని గుర్తించారా?
సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. ఇందులో నటించిన కొంతమంది నటీనటులకు పరిమిత స్క్రీన్ సమయం ఉన్నప్పటికీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించగలిగారు. అలాంటి వారిలో నటుడు సునీల్ రెడ్డి కూడా ఉన్నారు. జైలర్ సినిమా ద్వితీయార్ధంలో కామెడీ ట్రాక్‌లో అతను తమన్నా లవర్‌గా, సినిమా డైరెక్టర్ బాగున్నారా బాలు పాత్రలో కనిపిస్తాడు. ఇప్పుడు అంతటా అతని గురించే చర్చ జరుగుతుంది. ఇంతకు అతను ఎవరో కాదు.. టాలీవుడ్‌కు చెందిన లెజెండరీ ఫిల్మ్ మేకర్ కోదండ రామిరెడ్డి పెద్ద కుమారుడు. ముఖ్యంగా ఆయన మెగాస్టార్ చిరంజీవికి ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలను అందించారు. (ఇదీ చదవండి: Bigg Boss Telugu 7: బిగ్‌బాస్‌లో గ్లామర్ డోస్ పెంచేందుకు హాట్ బ్యూటీస్ ఎంట్రీ ) ఇకపోతే జైలర్‌లో సునీల్ రెడ్డి పాత్ర ఎక్కడొస్తుందటే.. తెలుగు ప్రముఖ నటుడు అయిన సునీల్, తమన్నా పాత్రల మధ్య సునీల్ రెడ్డి మధ్యవర్తిగా వ్యవహరిస్తాడు. సునీల్ ఇస్తున్న గిఫ్ట్‌లను తీసుకుని తమన్నాకు ఇస్తుంటాడు. సునీల్, తమన్నా మధ్య జరిగే సీన్లలో సునీల్ రెడ్డి మెప్పిస్తాడు. సునీల్లాగే విగ్‌తో సహా కామెడీ ఎలిమెంట్స్‌ని వివిధ సన్నివేశాల్లో అతను అలరించాడు. ఈ మధ్యే విడుదలైన మామన్నన్ సినిమాలో కూడా ఫహాద్ ఫాజిల్‌కు అన్నయ్య పాత్రలో కాలేజీ యజమానిగా మెప్పించాడు. (ఇదీ చదవండి: శ్రీహరి చనిపోయాక మమ్మల్ని మోసం చేశారు.. ఆర్థికంగా అన్నీ కోల్పోయాం: డిస్కో శాంతి) సునీల్ రెడ్డి తమ్ముడు వైభవ్ రెడ్డి కూడా తమిళ చిత్రాల్లో హీరోగా నటించారు. తెలుగు ఇండస్ట్రీలో మొదట 'గొడవ' అనే సనిమా తీసినా.. ఇక్కడ కాంపీటేషన్ ఎక్కువ కావడంతో వైభవ్ తమిళ చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకున్నాడు. తన సోదరుడి అడుగుజాడల్లో, సునీల్ రెడ్డి సినీ ప్రపంచంలోకి ప్రవేశించాడు, ప్రధానంగా హాస్య పాత్రలతో ఆయన అక్కడ పేరుగాంచాడు. సునీల్ రెడ్డి ఇప్పటి వరకు మాస్టర్, బీస్ట్, డాక్టర్, మామన్నన్ వంటి భారీ చిత్రాల్లో నటించారు. డాక్టర్ చిత్రంలో సునీల్ రెడ్డి నటనకు ఫిదా అయిన నెల్సన్ జైలర్‌లో మరో అవకాశం ఇచ్చాడు. అలా తమిళనాట సునీల్ రెడ్డి కూడా ట్రెండింగ్ నటుల జాబితాలో చేరిపోయాడు. -
ఆ ఆపజయాల వల్లే తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ: రమ్యకృష్ణ
రమ్యమైన నటి రమ్యకృష్ణ. తొలి రోజుల్లో గ్లామరస్ పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించిన ఈమె ఆ తర్వాత నటనకు ప్రాముఖ్యత కలిగిన పాత్రలో మెప్పించారు. రజినీకాంత్‌తో కలిసి నటించిన 'నరసింహ' చిత్రానికి ముందు వరకు కథానాయకిగా నటించిన రమ్యకృష్ణ ఆ చిత్రంలో ప్రతినాయకి పాత్రలో రజనీకాంత్‌కు దీటుగా నటించి ప్రశంసలు అందుకున్నారు. ఇప్పటికీ ఆ చిత్రంలోని నీలాంబరిగా రమ్యకృష్ణ నటనను ఎవరు మర్చిపోలేరు. ఆ తర్వాత బాహుబలి చిత్రంలో రాజమాత శివగామిగా జీవించారు. (ఇదీ చదవండి: శ్రీహరి కట్టిన తాళి మాత్రమే మిగిలింది.. ప్రస్తుతం మా పరిస్థితి ఇదే: డిస్కో శాంతి) తాజాగా జైలర్ చిత్రంలో రజనీకాంత్‌కు భార్యగా అత్యంత సహజంగా నటించారు. ఈ సందర్భంగా రమ్యకృష్ణ ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ సినీ రంగ ప్రవేశం చేసిన తొలి రోజుల్లో తనకు సరిగ్గా నటించడం తెలియలేదు అన్నారు. నటిగా తన తొలి చిత్రం తమిళంలో 'వైళ్లె మనసు' అని చెప్పారు.1988లో తమిళ్లో నటించిన ముదల్ వసంతం చిత్రాన్ని ఇటీవల చూసిన తన తల్లి నువ్వు ఇలాంటి నటనతో ఎంతకాలం ఎలా నిలబడగలిగావు అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారన్నారు. దీంతో అప్పట్లో తన నటన ఎలా ఉండేది అన్నది అర్థం చేసుకోండి అని అన్నారు. అలా తాను తమిళంలో నటించిన పలు చిత్రాలు అపజయాన్ని చూడడంతో తెలుగు చిత్రంపై దృష్టి సారించానని అన్నారు. అయితే తెలుగులో లభించిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నటిగా కొంచెం కొంచెం ఎదుగుతూ వచ్చానని రమ్యకృష్ణ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈమె ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్న విషయం తెలిసిందే. -
'జైలర్' చూసి రజనీకాంత్ ఎలాంటి కామెంట్ చేశారంటే: నెల్సన్
రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం జైలర్. బాలీవుడ్ స్టార్ జాకీష్రాఫ్, మలయాళం సూపర్‌స్టార్ మోహన్‌లాల్, కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్, తెలుగు నటుడు సునీల్, నటి రమ్యకృష్ణ, తమన్నా, యోగిబాబు, కింగ్స్లీ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి నెల్సన్ కథ ,దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. అనిరుధ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మించింది. కాగా ఈనెల 10న విడుదలైన ఈ చిత్రం విజయఢంకా మోగిస్తూ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తాజాగ చిత్ర సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. దర్శకుడు నెల్సన్ మాట్లాడుతూ జైలర్ చిత్రం ఇంత సంచలన విజయాన్ని సాధిస్తుందని ఊహించలేదన్నారు. ఒక మంచి చిత్రాన్ని చేయాలన్న భావనతోనే చిత్ర షూటింగ్ ప్రారంభించినట్లు చెప్పారు. అయితే ఈ చిత్ర ఘన విజయానికి కారణం కథ, రజనీకాంత్ ఫీవర్, స్లాంగ్, అభిమానుల ఆదరణే ముఖ్యకారణమన్నారు. (ఇదీ చదవండి: ఆ రూమర్స్‌పై 'భోళా శంకర్' నిర్మాత ఆగ్రహం.. చిరు ఎప్పుడూ!) చిత్ర విడుదలకు మూడు రోజుల ముందు రజనీకాంత్ చూశారన్నారు. అప్పుడు మీరు ఊహించిన విధంగా చిత్రం వచ్చిందా అని ఆయన్ని అడిగానని, అందుకు ఆయన ఊహించిన దానికంటే పదిరెట్లు బాగా వచ్చిందని చెప్పారన్నారు. చిత్రం బాగా వస్తుందని తెలుసు కానీ, ఇంత బాగా వస్తుందని ఊహించలేదన్నారు. ఆ ప్రశంసే ఆనందాన్నిచ్చిందన్నారు. ఇప్పటి సంతృప్తే అప్పుడే కలిగిందనే అభిప్రాయాన్ని నెల్సన్ వ్యక్తం చేశారు. చిత్రం బడ్జెట్ ముందుగా అనుకున్న దానికంటే పెరిగిందని అయినా సన్ పిక్చర్స్ నిర్వాహకులు కాదనకుండా ఖర్చు చేశారని చెప్పారు. నిర్మాత కళానిధి చిత్రం ప్రారంభించినప్పటి నుంచి చాలా సపోర్టుగా ఉన్నారన్నారు. జైలర్ చిత్రం ఏడు రోజుల్లో రూ.375.40 కోట్లు వసూలు చేసిందని నిర్మాతల వర్గం గురువారం అధికారికంగా ఒక ప్రకటనను విడుదల చేశారన్నారు. -
రజనీకాంత్‌కు అనిరుధ్ ఏమవుతాడో తెలుసా.. ? జైలర్ సక్సెస్ సీక్రెట్ ఇదే
రజనీకాంత్ నటించిన 'జైలర్' సినిమా కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం తగ్గలేదు.. ఈ మూవీలో 'హుకూం' సాంగ్ విపరీతంగా ట్రెండ్ అవుతుంది. ఇందులో రజనీకాంత్ స్టైల్‌కు యువ సంచలనం అనిరుధ్ అందించిన మ్యూజిక్, బీజీఎం నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లాయి. రజనీ కోసం ఆయన ఇచ్చిన బీజీఎంతో ప్రేక్షకులకు గూస్బమ్స్ తెప్పించాయనడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్లో అనిరుధ్ ఇచ్చిన స్టేజ్ ఫర్మామెన్స్ యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. (ఇదీ చదవండి: పవన్‌తో విడాకుల టైమ్‌లో జరిగింది ఇదే.. రేణుదేశాయ్ వైరల్ కామెంట్స్) స్టేజీపై మ్యూజిక్కు తగ్గట్టుగా ఆతను ఊగిపోతూ పాడుతుంటే ఆడియన్స్‌ను మరో ట్రాన్స్‌లోకి వెళ్తారు. అంతలా రజనీ కోసం పర్ఫామెన్స్ ఇచ్చాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ స్టార్‌డమ్‌ను వివరిస్తూ సాగే ఆ పాట సినీ అభిమానులను ఊపేస్తోంది. జైలర్ సినిమాతో అనిరుధ్ తమిళంలో నెంబర్ వన్ స్టార్ అయ్యాడు. 2012లో ధనుష్ త్రి సినిమా కోసం పాటను కంపోజ్ చేసినప్పుడు కేవలం 21 ఏళ్లు. ఇండస్ట్రీలో అడుగుపెట్టి దశాబ్దపు కాలం గడిచింది. తన కెరియర్లో ఎన్నో అద్బుతమైన పాటలను అందించాడు. రెమ్యునరేషన్ విషయంలో కూడా ఏఆర్ రెహమాన్‌ను మించిపోయాడని సినీ ట్రేడర్స్ తెలుపుతున్నాయి. రజనీకి కుమారుడు లేరనే సమస్య లేదు: విఘ్నేష్ జైలర్ ఆడియో రిలీజ్ కార్యక్రమంలో అనిరుధ్- రజనీకాంత్ బంధం గురించి దర్శకుడు విఘ్నేష్ శివన్ (నయనతార భర్త) చెప్పిన మాటలు బాగా వైరల్ అవుతున్నాయి. 'మనం జీవితంలో కొన్ని అద్భుతమైన క్షణాల కోసం ఎదురుచూస్తాం. నేను తలైవా ముందు నిలబడిన ఈ క్షణం అలాంటిదే. జైలర్‌లో తండ్రీకొడుకుల అనుబంధంపై ఓ పాట రాశాను. దాని గురించి గుర్తుచేసుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది. దానికి కారణం నేను ఇప్పుడు ఇద్దరు అబ్బాయిల తండ్రిని. భవిష్యత్తులో వాళ్లు పెద్దయ్యాక నేను రాసిన పాట రజనీ సినిమాలో ఉందని చెబుతాను. (ఇదీ చదవండి: అతను నా తమ్ముడు.. అవసరమైతే ఎన్నికల్లో ప్రచారం చేస్తా: విష్ణు) అలాగే, తలైవా గురించి నేను ఇంకో విషయం చెప్పాలి. రజనీ సార్ కోసం ఓ పాటను సిద్ధం చేసినప్పుడే తలైవా పట్ల అనిరుధ్‌లోని నిజాయతీ, ప్రేమ కనిపించాయి. రజనీ సర్కి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఆయనకు కొడుకు లేడనే సమస్య అనిరుధ్‌తో తీరిపోయింది. ఎందుకంటే తలైవా పట్ల అతనిలో విపరీతమైన ప్రేమను చూశాను. ఒకవేళ రజనీకి కొడుకు ఉంటే అనిరుద్- రజనీకాంత్ బంధాన్ని చూసి అసూయపడేవాడు.' అని విఘ్నేష్ శివన్ అన్నారు. (అనిరుధ్ ఫ్యామిలీ) రజనీ- అనిరుధ్ మధ్య ఉన్న బంధుత్వం ఇదే ఆడియో లాంచ్ ఫంక్షన్‌కి అనిరుధ్ వచ్చినప్పుడు సూపర్ స్టార్ రజనీ అతన్ని కౌగిలించుకుని ముద్దులు పెట్టుకున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అనిరుధ్ తమిళ నటుడు రవి రాఘవేంద్ర కుమారుడు అనే సంగతి తెలిసిందే. ఆయన రజనీకాంత్‌కు చాలా దగ్గర బంధువు. తలైవా భార్య సతీమణి లతా రజనీకి మేనల్లుడు అవుతాడు. అందుకే రజనీకి అనిరుధ్ అంటే ప్రత్యేక అభిమానం. సుమారు 30 ఏళ్ల క్రితం రజనీ కాంత్ సినిమా షూటింగ్లో ఉండగా అనిరుధ్‌ను తీసుకుని లత వెళ్లారట. ఆ సమయంలో రజనీ-అనిరుధ్ ఫోటో దిగారు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. -
హన్సిక సంగతేంటి నెల్సన్..?
రజనీకాంత్ కథానాయకుడిగా జైలర్ చిత్రం గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై వసూళ్ల వర్షం కురుస్తోంది. దీంతో ఈ చిత్ర దర్శకుడు నెల్సన్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. నయనతార ప్రధాన పాత్ర పోషించిన కోలమావు కోకిల చిత్రంతో దర్శకుడిగా ఈయన పేరు వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత శివకార్తికేయన్ హీరోగా డాక్టర్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ చిత్రం అనూహ్య విజయంతో రూ.100 కోట్ల క్లబ్లో చేరింది. దాని తర్వాత విజయ్ కథానాయకుడిగా బీస్ట్ చిత్రానికి దర్శకత్వం వహించారు. మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ చిత్రం కూడా రూ.200 కోట్లు వసూలు చేసింది. అసలు విషయం ఏమిటంటే ఈయన వీటన్నిటికంటే ముందుగా శింబు కథానాయకుడిగా వేట్టై మన్నన్ అని చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు. నటి హన్సిక నాయకిగా నటించిన ఈ చిత్రం కొంత భాగం షూటింగులు జరుపుకొని ఆ తర్వాత అనివార్య కారణాలతో ఆగిపోయింది. కాగా జైలర్ చిత్ర విజయం ఇచ్చిన ఉత్సాహంతో దర్శకుడు నెల్సన్ తన తొలి చిత్రం వేట్టై మన్నన్‌ను పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై నటుడు శింబు దర్శకుడు నెల్సన్‌తో సంప్రదించినట్లు తెలిసింది. ఇదే కనుక నిజమైతే ఈ చిత్రం కథానాయకి హన్సిక సంగతి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. (ఇదీ చదవండి: ' చావును దగ్గరి నుంచి చూశా'.. విశాల్ కామెంట్స్ వైరల్!) శింబు హన్సికల ప్రేమ వ్యవహారం తెలిసిందే. పెళ్లి చేసుకునే వరకు వెళ్లిన వీరి ప్రేమ చివరిలో ఆగిపోయింది. ఆ తర్వాత హన్సిక కథానాయకిగా ప్రధాన పాత్రలో నటించిన ఆమె 50వ చిత్రం మహాలో శింబు అతిథి పాత్రలో నటించారు. అదేవిధంగా వేట్టై మన్నన్ చిత్రాన్ని ఈ జంట కలిసి పూర్తి చేస్తారా అన్నదే ప్రశ్న. ఇదిలా ఉండగా దర్శకుడు నెల్సన్ తదుపరి ధనుష్ కథానాయకుడిగా చిత్రం చేయనున్నారనే ప్రచారం మరో పక్క జరుగుతోంది. దీంతో ఆయన తదుపరి చిత్రం ఏమిటన్నది క్లారిటీ రావాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. -
ఉద్యోగుల కోసం 7 స్క్రీన్లు బుక్ చేసిన సీఈఓ - తలైవా సినిమా అంటే అట్లుంటది!
మన దేశంలో తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్‌కి ఉన్న ఫ్యాన్స్ పాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తమిళనాడులో ఇది మరింత ఎక్కువగా ఉందన్న విషయం అందరికి తెలిసిందే. కాగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జైలర్ సినిమా ఈ రోజు విడుదలైంది. దీనికోసం తమిళనాట ఒక కంపెనీ సీఈఓ తమ ఎంప్లాయిస్ కోసం 7 స్క్రీన్స్ బుక్ చేసాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, ఫ్రెష్‌వర్క్స్ కంపెనీ ఫౌండర్ అండ్ సీఈఓ గిరీష్ మాతృభూతం తమ కంపెనీలో పనిచేసే ఉద్యోగుల కోసం జైలర్ స్పెషల్ షోలు వేయిస్తున్నట్లు సమాచారం. దీని కోసం ఏకంగా ఏడు స్క్రీన్స్ బుక్ చేసుకున్నాడు. తమ 2200 మంచి ఉద్యోగుల కోసం ఇవి బుక్ చేసినట్లు తానే స్వయంగా ట్విటర్ వేదికగా వెల్లడించాడు. ఇదీ చదవండి: 60 ఏళ్లనాటి పాత బుక్ కోటీశ్వరున్ని చేసింది - ఎలానో తెలిస్తే ఆశ్చర్యపోతారు! ఫ్రెష్‌వర్క్స్ కంపెనీ చెన్నై, హైదరాబాద్, బెంగళూరు కేంద్రాలుగా పనిచేస్తోంది. ఈ సంస్థ సీఈఓ రజినీకాంత్ వీరాభిమాని.. కావున జైలర్ సినిమా రిలీజ్ రోజునే ఉద్యోగులకు సినిమా చూపించాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. కబాలి మూవీ విడుదల సమయంలో కూడా చెన్నైలో ఒక థియేటర్ బుక్ చేసాడు. అంతకు ముందు కొచ్చాడియన్, లింగా, ఎంతిరన్ సినిమాలకు కూడా ఇలాగే చేశారు. గిరీష్ చేస్తున్న పనికి తమళనాడులో అతని పేరు మారుమ్రోగిపోతోంది. రజిని అభిమానులు ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు. 2200 tickets 7 screens Freshworks employees only #thalaivaralaparai #TigerkaHukum #ThalaivarNirandharam #freshworksda pic.twitter.com/shjOumBeaY — Girish Mathrubootham (@mrgirish) August 9, 2023 -
మారకపోతే ఆగిపోతాం.. పెళ్లి ప్లాన్ ఇప్పటికైతే లేదు: –తమన్నా
‘నువ్వు కావాలయ్య...’ అంటూ ‘జైలర్’లో హుషారుగా స్టెప్పులేశారు తమన్నా. ఈ బ్యూటీ కూడా సినిమా ఇండస్ట్రీకి మోస్ట్ వాంటెడ్. అందుకే దాదాపు 20 ఏళ్లయినా ఇంకా ఫుల్ బిజీగా ఉన్నారు. తమిళంలో ‘అరణ్మణై’, మలయాళంలో తొలి చిత్రం ‘బాంద్రా’, ఓ టీవీ షోతో బిజీగా ఉన్నారామె. చిరంజీవి సరసన తమన్నా నటించిన ‘భోళా శంకర్’ ఈ 11న విడుదల కానుంది. అంతకు ఒక్కరోజు ముందు రజనీకాంత్ ‘జైలర్’తో థియేటర్లకు వస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర ‘భోళా శంకర్’ని నిర్మించారు. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో ‘జైలర్’ రూపొందింది. రెండు చిత్రాలతో థియేటర్లకు రానుండటం, ఇతర విశేషాలు తమన్నాతో జరిపిన ఇంటర్వ్యూలో ఈ విధంగా... ► ఈ నెల 10న ‘జైలర్’, 11న ‘భోళా శంకర్’ సినిమాలతో వస్తున్నారు. సో.. వచ్చే వారం మీకు స్పెషల్ అనొచ్చు... విషయం ఏంటంటే.. ఒకటి తమిళ సినిమా, మరొకటి తెలుగు సినిమా అయినా రెండు సినిమాలూ అన్ని భాషల్లో థియేటర్లకు వస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవిగారు, సూపర్ స్టార్ రజనీకాంత్‌గారు.. ఇద్దరూ దేశంలో పెద్ద స్టార్స్. ఇలా ఒక్క రోజు గ్యాప్‌లో ఇద్దరు స్టార్స్‌తో సినిమా అంటే కల నెరవేరినట్లు ఉంది. ఈ రెండు మాత్రమే కాదు.. నేను చేసిన ఇంకో సినిమా కూడా రిలీజ్‌కు రెడీ అవుతోంది. అదొక మంచి ఫీలింగ్. ► చిరంజీవి డ్యాన్స్ మామూలుగా ఉండదు... మీరు డ్యాన్స్‌లో బెస్ట్. అయితే మీ ఇద్దరికీ ‘సైరా’లో డ్యాన్స్ చేసే చాన్స్ రాలేదు.. ‘భోళా శంకర్’లో మీ కాంబో డ్యాన్స్ గురించి... ‘మిల్కీ బ్యూటీ...’ మంచి రొమాంటిక్ మెలోడి సాంగ్. ఈ పాటలో ఒక హుక్ స్టెప్ ఉంటుంది. మిగతా స్టెప్స్ కూడా గ్రేస్‌ఫుల్‌గా ఉంటాయి. చిరంజీవిగారి డ్యాన్స్ చాలా గ్రేస్‌ఫుల్‌గా ఉంటుంది. అందుకే మిగతావారికి ఇన్స్పైరింగ్గా ఉంటుంది. పైగా శేఖర్ మాస్టర్ మంచి స్టెప్స్ డిజైన్ చేశారు. స్విట్జర్లాండ్‌లో ఈ పాట షూట్ జరిగింది. పెద్దగా రిహార్సల్స్ చేయలేదు. అక్కడికి అక్కడే నేర్చుకుని చేసేశాం. అలాగే ఇదే సినిమాలో ‘జామ్ జామ్...’ పాట కూడా నాకు చాలా ఇష్టం. ► సీనియర్ హీరోలతో సినిమాలు చేసినప్పుడు... అంత సీనియర్స్‌తో ఎందుకు? అనే ప్రశ్న ఎదురవుతుంటుంది కదా... ఇప్పుడు నా కెరీర్లో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. అన్ని రకాల యాక్టర్స్‌తో నటిస్తున్నాను. నాకన్నా చిన్నవాళ్లకు జోడీగా, నాకు సమానమైన ఏజ్ ఉన్నవాళ్లతో, సీనియర్లతో సినిమాలు చేస్తున్నాను. ఓటీటీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తున్నాను. నా కెరీర్లో నేనెప్పుడూ ఏజ్ గురించి పట్టించుకోలేదు. నేను యాక్టర్లను యాక్టర్లగా చూస్తాను. నా పాత్ర గురించి మాత్రమే ఆలోచిస్తాను. నా క్యారెక్టర్ ప్రేక్షకులకు నచ్చుతుందా? లేదా అన్నదే నాకు ముఖ్యం. ఏజ్ వల్ల ఈక్వేషన్ ఏం మారదు. ► దాదాపు 20 ఏళ్లుగా సినిమాలు చేస్తున్నారు. ఇంకా బిజీ బిజీగా సినిమాలు చేస్తూ రేస్‌లో దూసుకెళ్లడానికి కారణం? అస్సలు నేను ఇది రేస్ అనుకోను. చాలా చిన్న వయసులో కెరీర్ స్టార్ట్ చేశాను. జయాపజయాలనేవి మన చేతుల్లో ఉండవు. టీమ్ వర్క్ ముఖ్యం. ఒక్కోసారి కొన్ని విజయాలకు నేనూ కారణం అవుతాను. ఆ సంగతి పక్కనపెడితే.. కెరీర్లో ముందుకు వెళ్లాలంటే నిరంతరం హార్డ్‌వర్క్ చేయాలి. ఆ ఫోకస్‌తోనే వెళుతున్నాను. ► ఈ మధ్య కొన్ని హద్దులను దాటి, బోల్డ్ క్యారెక్టర్స్ చేస్తున్నారు.. ఈ మార్పు గురించి? మారకపోతే నేనెక్కడ మొదలయ్యానో అక్కడే ఆగిపోయినట్లే.. అలా ఆగిపోవాలని ఎవరూ అనుకోరు. ఎవరైనా కెరీర్లో ఎదగాలనే అనుకుంటారు. ప్రతీ జాబ్‌లో ప్రమోషన్ ఉన్నట్లే మా జాబ్ కూడా. ప్రమోషన్ కోసం కొంచెం బ్రాడ్‌గా ఆలోచించాలి.. కొత్త ప్రయత్నాలు చేయాలి. అప్పుడు జర్నీ ఇంకా లాంగ్గా, బెటర్‌గా ఉంటుంది. ► ‘లస్ట్ స్టోరీస్ 2’ వెబ్ సిరీస్‌లో నటించిన అనుభవం గురించి? మన చుట్టూ ఇప్పుడు రకరకాల మాటలు దొర్లుతుంటాయి. వాటిలో ఏది మంచో.. చెడో తెలుసుకోలేం. అందుకే ‘లస్ట్ స్టోరీస్ 2’ గురించి నాతో అభిమానులు, ఇంకా వేరేవాళ్లు బాగుందని అన్నప్పుడు కొత్త ప్రయత్నం రీచ్ అయిందనే ఆనందం కలిగింది. ముఖ్యంగా ఉమన్ వచ్చి బాగుందని అభినందించడంతో చాలా హ్యాపీ ఫీలయ్యాను. ► ఇన్నేళ్లల్లో మీ గురించి రానటువంటి వార్తలు ఇప్పుడు వస్తున్నాయి.. ఫర్ ఎగ్జాంపుల్ నటుడు విజయ్ వర్మ, మీ గురించి ఎక్కువ ప్రచారమవుతోంది... ఎవరో ఏదో మాట్లాడతారు. కానీ నేను ఎప్పుడు మీడియాతో మాట్లాడినా హానెస్ట్‌గానే మాట్లాడాను. ఇక ఎవరెవరో రూమర్స్ క్రియేట్ చేస్తే నేనేం చేయలేను. ► పెళ్లి ప్లాన్ ఏమైనా? ఇప్పటికైతే లేదు. ప్లాన్ చేసుకున్నప్పుడు కచ్చితంగా చెబుతాను. -
'ఒక రేంజ్ తర్వాత మనదగ్గర మాటలుండవ్.. కోతలే'.. ఆసక్తి పెంచుతోన్న ట్రైలర్
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నటించిన తాజా చిత్రం జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ, సునీల్, బాలీవుడ్ నటులు సంజయ్ దత్, జాకీష్రాప్, శాండల్‌వుడ్ స్టార్ నటుడు శివరాజ్ కుమార్, మోహన్ లాల్, యోగిబాబు ప్రధానపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్‌కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. (ఇది చదవండి: జైలర్‌కు 'తెలుగు' సెంటిమెంట్.. రజనీకాంత్‌కు అసూయ ఎందుకు?) ట్రైలర్ చూస్తే జైలర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్ ప్రారంభంలోనే కాల్పులు, బాంబు మోతలతో దద్దరిల్లింది. 'ఒక రేంజ్ తర్వాత మనదగ్గర మాటలుండవ్.. కోతలే' అనే రజినీకాంత్ డైలాగ్ మరింత ఆసక్తి పెంచుతోంది. కాగా.. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ పూర్తి కాగా మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. అంతేకాకుండా జైలర్ చిత్రాన్ని ఆగస్టు 10వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కాగా.. ఇకపోతే సాధారణంగా చిత్రాల్లో హీరోలకు ఇంట్రో సాంగ్ ఉంటుంది. అయితే జైలర్ చిత్రంలో నటి తమన్న ఇంట్రో సాంగ్‌లో మెరవబోతుండటం విశేషం. తమన్నా సాంగ్ కచ్చితంగా జైలర్ చిత్రానికి ప్రత్యేక తీసుకొస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. (ఇది చదవండి: 'జైలర్'పై నో బజ్.. వ్యాపారం కూడా అలానే!) -
ఆగస్ట్‌లో ‘మెగా’ సందడి.. వారానికో సినిమా, బరిలో చిన్న చిత్రాలు కూడా!
టాలీవుడ్లో ప్రస్తుతం చిన్న చిత్రాల హవా కొనసాగుతుంది. జులై నెలలో ప్రతివారం రెండు, మూడు చిన్న సినిమాలు థియేటర్స్‌లో సందడి చేశాయి. వాటిల్లో కొన్ని హిట్ టాక్ని సొంతం చేసుకున్నాయి. ఇక ‘బేబీ’ చిత్రం అయితే భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. కంటెంట్ బాగుంటే చిన్న చిత్రాలను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని ‘బేబీ’తో మరోసారి రుజువైంది. అందుకే ఆగస్ట్‌లో కూడా వరుసగా చిన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాయి. మొదటి వారం(ఆగస్ట్ 4) ప్రముఖ క్రికెటర్ ధోనీ నిర్మించిన తొలి సినిమా ‘ఎల్జీఎం’విడుదల కానుంది. దీంతో పాటు కిచ్చా సుదీప్ హీరోగా నటించిన ‘హెబ్బులి’, ‘రాజుగారి కోడి పలావ్’, ‘విక్రమ్ రాథోడ్’, ‘దిల్సే, ‘మిస్టేక్’, ‘మెగ్ 2’ చిత్రాలు విడుదల కాబోతున్నాయి. మెగాస్టార్ Vs సూపర్ స్టార్ ఇక ఆగస్ట్ రెండోవారంలో రెండు పెద్ద చిత్రాలు బాక్సాఫీస్ బరిలోకి దిగబోతున్నాయి. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం ‘జైలర్’. తమన్నా హీరోయిన్గా నటించిన ఈ చిత్రం ఆగస్ట్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఆ తర్వాతి రోజు అంటే ఆగస్ట్ 11న మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘భోళా శంకర్ ’రిలీజ్ కాబోతుంది. మెహర్ రమేశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్గా నటించగా, కీర్తి సురేశ్ కీలక పాత్ర పోషించింది. అటు ‘జైలర్’, ఇటు ‘భోళా శంకర్’ ల మధ్య మరో చిన్న చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శ్రీసింహా హీరోగా నటించిన ‘ఉస్తాద్’ చిత్రం ఆగస్ట్ 12న విడుదల కాబోతుంది. ఇలా ఆగస్ట్ రెండో వారంలో రెండు పెద్ద చిత్రాలతో పాటు ఒక చిన్న చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే హిందీ నుంచి కూడా రెండు ఆసక్తికరమైన చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాయి. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్ర పోషించిన ‘ఓ మై గాడ్ 2’, సన్నీదేఓల్ నటించిన ‘గదర్ 2’ చిత్రాలు ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ రెండు చిత్రాలు కూడా రెండు సూపర్ హిట్ సినిమాల సీక్వెల్స్ కావడం గమనార్హం. మూడో వారంలో నాలు చిన్న చిత్రాలు ఆగస్ట్ మూడో వారంలో అన్ని చిన్న సినిమాలే విడుదల కానున్నాయి. రెండో వారంలో జైలర్, భోళాశంకర్ లాంటి బడా సినిమాలు రావడంతో మూడో వారం ఎలాంటి పెద్ద సినిమాలు ప్రేక్షకులముందుకు వచ్చేందుకు సాహసం చేయలేదు. దీంతో ఈ వారం మళ్లీ చిన్న చిత్రాలే సందడి చేయనున్నాయి. ఆగస్ట్ 18న వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ‘ఆదికేశవ’తో పాటు శ్రీకాంత్ అడ్డాల ‘పెదకాపు 1’, సోహైల్ ‘మిస్టర్ ప్రెగ్నెంట్’, ‘నచ్చినవాడు’ చిత్రాలు విడుదలకానున్నాయి. ‘మెగా’ సందడి ఆగస్ట్‌లో నెలలో వరుసగా మెగా హీరోలు సందడి చేయనున్నారు. రెండో వారం ‘భోళా శంకర్’తో చిరంజీవి వస్తే... మూడో వారం ఆయన మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ‘ఆది కేశవ’అంటూ అలరించడానికి రెడీ అయ్యాడు. ఇక నాలుగో వారం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న స్పై యాక్షన్ ఎంటర్టైనర్ ‘గాంఢీవధారి అర్జున’ విడుదల కాబోతుంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాక్షి వైద్య హీరోయిన్. ఆగస్ట్ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే కార్తికేయ హీరోగా నటించిన ‘బెదురులంక 2012’ చిత్రం కూడా అదే రోజు రిలీజ్ కాబోతుంది. వీటితో పాటు ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించిన హిందీ చిత్రం ‘డ్రీమ్ గర్ల్ 2’ కూడా ఆగస్ట్ 25న విడుదల కాబోతుంది. -
విజయ్ బిగ్గెస్ట్ ఫ్లాప్ సినిమాపై తమన్నా కామెంట్
సౌత్ ఇండియాలో ఫుల్ బిజీగా ఉన్న హీరోయిన్లలో తమన్నా ఒకరు. సినిమాలతో పాటు పలు వెబ్ సీరిస్‌లతో ఆమె మెప్పిస్తుంది. ఆగష్టు నెలలోనే ఆమె నటించిన జైలర్,భోళా శంకర్ రిలీజ్ కానున్నాయి. తాజాగ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా దళపతి విజయ్ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది. (ఇదీ చదవండి: సుమన్ జైలుకు వెళ్లడంపై బయటికొచ్చిన అసలు నిజాలు.. ఇంతమంది ప్రమేయం ఉందా?) విజయ్- తమన్నా కలిసి 2010లో 'సుర' అనే చిత్రంలో నటించారు. ఈ సినిమాలోని పాటలు మాత్రం సూపర్ హిట్ అయ్యాయి. కానీ సినిమా మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. అంతేకాకుండా ఈ సినిమా విజయ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్‌గా నిలిచింది. అలాంటి డిజాస్టార్పై తమన్నా తాజాగా ఇలా మాట్లాడింది. 'నాకు సుర సినిమా అంటే చాలా ఇష్టం. అందులోని పాటలు ఇప్పటికీ చాలా చోట్ల వినిపిస్తూనే ఉన్నాయి. అందులో నటిస్తున్నప్పుడు కొన్ని సన్నివేశాలు నాకు నచ్చలేదు. కొన్ని సీన్స్‌లలో అయితే నా నటన నాకే నచ్చలేదు. ఆ సీన్లు సరిగా రావడంలేదనే విషయాన్ని షూటింగ్ జరుగుతున్న సమయంలోనే గ్రహించాను. సీన్స్ బాగా రావడం లేదని సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే అంచనా వేయొచ్చు. కానీ అప్పుడు సినిమా నుంచి తప్పుకోవడం జరగదు. ఎందుకంటే ఒక సినిమాను అంగీకరించిన తర్వాత కచ్చితంగా దాన్ని పూర్తిచేయాల్సిందే. ఏవో కొన్ని కారణాలు చెప్పి తప్పించుకోకూడదు. ఈ రంగంలో జయాపజయాలు సహజం. నటులందరికి ఇండస్ట్రీ చాలా విలువైనది. కాబట్టి ప్రతివారు బాధ్యతాయుతంగా ఉండాలి.' అని తమన్నా చెప్పింది. -
జైలర్‌కు 'తెలుగు' సెంటిమెంట్.. రజనీకాంత్‌కు అసూయ ఎందుకు?
చిత్ర పరిశ్రమంలో సెంటిమెంట్‌కు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఒక చిత్రం హిట్ అయితే ఆ తరహాలోనే చిత్రాలను నిర్మించడానికి ఆసక్తి చూపుతుంటారు. ఇకపోతే ప్రస్తుతం జైలర్ చిత్రంలో తమన్నా నటించిన కావాలా పాట ట్రెండింగ్‌గా మారింది. రజినీకాంత్ కథానాయకుడిగా నటించిన చిత్రం జైలర్. ఇందులో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, బాలీవుడ్ స్టార్ జాకీ ష్రాఫ్, తెలుగు నటుడు సునీల్, యోగిబాబు, రమ్యకృష్ణ, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తదితరులు ముఖ్యపాత్ర పోషించారు. (ఇదీ చదవండి: తరుణ్ ఎవరింటి అల్లుడు?) అయితే వీటన్నింటినీ తమన్నా నటించిన కావాలా పాట పక్కకు నెట్టేసింది. ఇంతకుముందు ఇదేవిధంగా అల్లు అర్జున్ పుష్పాలో సమంత నటించిన ఐటెం సాంగ్ ఊ అంటావా మామ ట్రెండ్ సెట్టర్‌గా మారింది. పలువురు స్టార్ హీరోయిన్ల నుంచి విదేశీ భామల వరకు ఈ పాటకు డాన్స్ చేసి ముచ్చట తీర్చుకున్నారు. ఇప్పుడు తమన్నా నటించిన కావాలా పాట కూడా కొత్త ట్రెండ్ సెట్ చేస్తోంది. 52 ఏళ్ల రమ్యకృష్ణ కూడా ముచ్చటపడి ఈ పాటకు డాన్స్ చేయడం విశేషం. ఇకపోతే ఈ చిత్ర కథానాయకుడు రజనీకాంత్ కూడా కావాలా పాటపై తన అసూయను వ్యక్తం చేశారు. ఆరు రోజులు చిత్రీకరించిన ఈ పాటలో తనకు ఒక పూట కూడా నటించే అవకాశాన్ని కల్పించలేదనే నిష్టూరాన్ని ఇటీవల జరిగిన ఆడియో వేడుకలో వెలిబుచ్చారు. మరో విషయం ఏమిటంటే ఈ చిత్రంలో కావాలా అంటూ తెలుగు పదాలతో ఈ పాట మొదలవుతుంది. (ఇదీ చదవండి: తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్‌గా దిల్‌రాజు) ఇంతకుముందు కూడా రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన చంద్రముఖి చిత్రంలో దేవుడ దేవుడా అనే పాట తెలుగు పదాలతో మొదలవుతుంది. ఆ పాట సూపర్ హిట్ కావడంతో పాటు చిత్రం కూడా ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఆ సెంటిమెంట్ జైలర్ చిత్రానికి కూడా వర్క్ అవుట్ అవుతుందా..? లేదా..? అనే విషయం త్వరలో తేలిపోనుంది. -
ఇక్కడ నేనే కింగ్!
రజనీకాంత్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘జైలర్’. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 10న రిలీజ్ కానుంది. ఈ సినిమాలోని ‘హుకుమ్..’ అంటూ సాగే పాట తెలుగు వెర్షన్ లిరికల్ వీడియోను హీరో వెంకటేష్ ఆదివారం షేర్ చేశారు. ‘‘హే ఇక్కడ నేనే కింగ్.. నేను పెట్టినవే రూల్స్.. ఆ రూల్స్‌ని నేను అప్పుడప్పుడు ఇష్టానికి మారుస్తుంటాను. అది విని గప్‌చుప్‌గా ఫాలో అవ్వాలి, అది వదిలేసి ఏదైనా పిచ్చిపనులు చేయాలని చూశావో నిన్ను కండకండాలుగా నరికి విసిరిపారేస్తాను.. హుకుమ్.. టైగర్‌గా హుకుమ్..’ అంటూ మొదలై, ‘ఉరుముకి మెరుపుకి పుట్టాడురా.. పిడుగును పిడికిట పట్టాడు రా.. అడుగడుగున గుడి కట్టాలిరా... తర తర తరముల సూపర్ స్టార్ రా..’ అంటూ సాగుతుందీ పాట. అనిరుధ్ రవిచంద్రన్ స్వరాలందించిన ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించగా, డింకర్ కల్వల పాడారు. -
జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు అదే: రజినీకాంత్
Rajnikanth Speech Latest: సూపర్‌స్టార్ రజినీకాంత్ పేరు చెప్పగానే ఆవేశంతో ఊగిపోయే ఫ్యాన్స్, విజిల్స్‌తో దద్దరిల్లే థియేటర్లు గుర్తొస్తాయి. అయితే 'రోబో' తర్వాత ఈయన రేంజ్‌కు తగ్గ మూవీస్ పడలేదు. దీంతో ఆయన ఫ్యాన్స్ ఇప్పుడు 'జైలర్' కోసం ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 10న రాబోతున్న ఈ చిత్ర ప్రమోషన్స్ బాగా జరుగుతున్నాయి. తాజాగా జరిగిన ఈవెంట్ లో మాట్లాడిన తలైవా.. తన జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ విషయంలో పశ్చాత్తాప పడ్డారు. నేను చేసిన పెద్ద తప్పు 'నా జీవితంలో మద్యం అనేది లేకపోయింటే ఈ పాటికి నేను సమాజసేవ చేస్తుండేవాడిని. మందు తాగడం.. జీవితంలో నేను చేసిన అతిపెద్ద తప్పు. 'నువ్వు రాజువి మందు తాగొద్దు' అని నా తమ్ముడు అప్పటికీ చెబుతుండేవాడు. కానీ నేనే వినలేదు. ఒకవేళ నా లైఫ్‌లో ఆల్కహాల్ అనేది లేకపోయింటే.. ఇప్పుడున్న దానికంటే ఎంతో గొప్పస్థాయిలో ఉండేవాడిని, వ్యక్తిగతంగా కూడా' (ఇదీ చదవండి: సమంత మరోసారి ప్రేమలో పడిందా? మరి ఆ ఫొటోలు!) మీ వల్ల వాళ్లకు ఇబ్బంది 'అయితే నేను పూర్తిగా మందు తాగొద్దు అని చెప్పడం లేదు. మీకు సరదాగా అనిపించినప్పుడు ఎప్పుడో ఓసారి తాగండి. కానీ రోజూ మాత్రం డ్రింక్ చేయొద్దు. ఎందుకంటే అది మీ ఆరోగ్యంతోపాటు మీ చుట్టూ వాళ్ల ఆనందాన్ని నాశనం చేస్తుంది. ఒకవేళ మీరు తాగితే మాత్రం మొత్తం జీవితం తలకిందులైపోతుంది. మీ తల్లిదండ్రులు, కుటుంబం, అందరూ మీ తాగుడు వల్ల ఇబ్బంది పడతారు. అందుకే మందు తాగొద్దు' అని రజినీకాంత్ చెప్పుకొచ్చారు. మరి రజినీకాంత్ ఇంతలా చెప్పారు కానీ ఫ్యాన్స్ దీన్ని పాటిస్తారా అనేది సందేహమే. సరే ఇదంతా పక్కనబెడితే 'జైలర్' తెలుగులో పెద్దగా బజ్ లేదు. 'కావాలయ్యా' అనే పాట యూట్యూబ్, ఇన్ స్టాలో ట్రెండింగ్ లో ఉంది కానీ సినిమా ఏ మేరకు హిట్ అవుతుందనేది చూడాలి. తమిళ ఇండస్ట్రీలో వస్తున్న టాక్ ప్రకారం.. ఈసారి సూపర్‌స్టార్ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేయబోతుందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే ఆగస్టు 10 వరకు ఆగాలి. (ఇదీ చదవండి: ధోనీ తొలి సినిమా టాక్ ఏంటి? హిట్టా ఫట్టా?) -
నేను ఆ ఇద్దరికి మాత్రమే భయపడతా: రజనీకాంత్
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం జైలర్. బాలీవుడ్ స్టార్ జాకీష్రాఫ్, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, టాలీవుడ్ నటుడు సునీల్, రమ్యకృష్ణ, తమన్నా తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని నెల్సన్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించింది. అనిరుధ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు 10వ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం చైన్నెలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో నిర్వహించారు. ఈ వేదికపై నటుడు రజనీకాంత్ పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. ముఖ్యంగా ఇటీవల సూపర్ స్టార్ తానే అనే విషయంపై చాలా రచ్చ జరిగిన విషయం తెలిసిందే. ఈ అంశంపై రజనీ స్పందించారు. చిత్రంలోని హుకుమ్ అనే పాటలో సూపర్ స్టార్ అనే పదం చోటుచేసుకుందని, దాన్ని తాను తొలగించాల్సిందిగా చెప్పానన్నారు. నిజానికి సూపర్ స్టార్ అన్న పట్టం పెద్ద తలనొప్పి అని పేర్కొన్నారు. 1977లోనే దీనిపై పెద్ద వివాదం జరిగిందని, అప్పట్లో నటుడు కమలహాసన్, శివాజీ గణేషన్ ప్రముఖ నటులుగా రాణిస్తున్నారని, అలాంటి సమయంలో ఈ సూపర్ స్టార్ పట్టం తనకు ఇవ్వడం పెద్ద వివాదానికి దారితీసిందన్నారు. ఇక్కడ ఒక చిన్న కథ చెప్పాలని అడవిలో ఒక గద్ద, కాకి ఉన్నాయని, అయితే కాకి గద్దకంటే పైకి ఎగరడానికి ప్రయత్నిస్తుందని, కానీ ఎప్పటికీ గద్దను మించి ఎగరలేదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఇప్పుడు విజయ్ గురించే మాట్లాడినట్టు చర్చ జరుగుతోంది. అదేవిధంగా తాను జీవితంలో ఇద్దరికే భయపడతానని అందులో ఒకరు భగవంతుడు, రెండోది మంచి మనుషులకు అని పేర్కొన్నారు. ప్రముఖుడి కొడుకు అని చెప్పటం ఈజీ అని అయితే ఆ పేరును కాపాడుకోవడం చాలా కష్టమని రజనీకాంత్ పేర్కొన్నారు. చదవండి: 87 ఏళ్ల వయసులో లిప్‌లాక్.. రొమాన్స్‌కు వయసుతో పనేంటి? అన్న నటుడు పెట్టుబడి రూ.6 లక్షలు, ఎన్ని వందల కోట్ల కలెక్షన్స్ వచ్చాయంటే? -
వెన్నెల నవ్వితే... ఆ అందం నువ్వే!
రజనీకాంత్ ‘జైలర్’ సినిమాలోని ‘నువ్వు కావాలయ్యా’ పాట సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అనిరుథ్ రవిచందర్ ఈ పాటకు స్వరాలు సమకూర్చి శిల్పారావుతో కలిసి పాడాడు. ఈ పాటకు తమన్నా భాటియా వేసిన స్టెప్లను నెటిజనులు షేర్ చేస్తున్నారు. ఈ క్యాచీ బీట్స్ పాట యూ ట్యూబ్‌లో 74 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఈ పాటలో తమన్నా హుక్ స్టెప్స్‌ను అనుసరిస్తూ మిస్ కేరళ (2017) ప్రియాంక మేనన్ అందమైన వీడియో చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో 47.2 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. కామెంట్ సెక్షన్ హార్ట్ ఇమోజీలతో నిండిపోయింది.